KAILASA Library/పూలమామయ్యసీ శ్రీనిత్యానంద చెప్పిన చిన్న కథలో పెద్ద సత్యము/పోలిక విత్తనం : అసూయ ఆ చెట్టుకు కాసే ఫలం :Sign in
పూలమామయ్యసీ శ్రీనిత్యానంద చెప్పిన చిన్న కథలో పెద్ద సత్యము

పోలిక విత్తనం : అసూయ ఆ చెట్టుకు కాసే ఫలం :

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

మనం మన జీవితంలో చాలా భాగం. ఎదుటివారితో లేదా ఇతరులతో పోల్చుకోవటంలో గడుపుతుంటాము. మనకి తెలిసే విధంగా కొంత, మన అచేతన స్థితిలో కొంత మనం నిరంతరం పోల్చుకుంటూ ఉంటాము. మన మైండ్ ఈ పోల్చుకునే కార్యక్రమంలో ఎంతగా మునిగిపోయిందంటే, మనం అసలు సత్యాన్ని ఆ విధంగా చూడకుండా కేవలం పోలికతో మాత్రమే చూడగలుగుతున్నాము. దీనివలన మనం మన జీవితంలో నాణ్యతని కోల్పోతున్నాము. అసలు జీవితాన్ని యథాతథంగా చూడలేకపోతున్నాము.

పరమహంస నిత్యానంద ఒక చక్కని విషయాన్ని చెబుతారు. మీరు ఎదుటివారిని చూసి కొంత విషయాన్ని, కొత్త సంగతులని, తెలియని జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. అంతవరకు మాత్రమే మీరు ఎదుటివారిలో చూడలగాలి. అది మంచి పద్ధతి. ఇటువంటి దృక్పథం వలన మీరు అభివృద్ధి చెందుతారు. అలా కాకుండా ఎదుటివారు ఇలా చేసారు కాబట్టి నేను కూడా.... ఇలా ఆలోచింటితే మనం జీవితంలో ఏదీ సాధించలేము.

అసలు అందరూ ఎందుకు నిరంతరం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు మీరు అంటే ఏమిటో తెలియదు. మీ లోపల ఉన్న అద్భుతమైన శక్తి కూడా తెలియదు.మీలోని గొప్పశక్తిని మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీలోని శక్తియుక్తులని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మిమ్మలని మీరు నమ్ముతారో ఇక ఎదుటివారితో పోల్చుకోవలసిన అవసరం ఉండదు.

మీ ఏకాగ్రత, మీ దృష్టి మీ మీద లేకపోవటం కూడా ఒక కారణం. మీరు మీతో ఉండగలిగే స్థితిని పొందితే మీరు ఎవరితోనూ పోల్చుకోరు. మీకు మీరు చాలు అని అనుకోగలిగితే, మీతో మీరు ఉండగలిగితే ఎదుటి వారితో పోల్చుకునే అవసరం మీకురాదు.

ఈ ప్రపంచంలో ప్రతీ వ్యక్తి భగవంతుని సృష్టి. భగవంతుడు తనలోని దివ్యశక్తిని అద్భుత మేధస్సుని కలిపి ఈ ప్రపంచంలోనికి మనం ఏ లక్ష్యంతో పంపబడ్డామో ఆ లక్ష్యం సాధించేందుకు అనువుగా మనని తయారుచేస్తాడు. అందుకే ప్రతి మనిషి ఒక ప్రత్యేకతని కలిగి ఉంటాడు. ఎవరి ప్రత్యేకత వారిది. నేను ప్రత్యేక వ్యక్తిని అని అనుకోలేని మనిషి తనని ఎదుటివారితో పోల్చుకుంటాడు. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైనప్పుడు ఇక పోల్చటానికి ఏముంటుంది. గులాబీ పూవు - మల్లెపూవుతో ఏవిధంగా పోల్చుకుంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మనం ఎదుటి వారితో పోల్చుకోవటం మానేస్తాము. నేను ప్రత్యేక వ్యక్తిని, నా ప్రత్యేకత నాది అనుకున్నవారు అసలు ఎవరితోనూ పోల్చుకోరు.

ఎదుటి వారితో పోల్చుకుంటే నష్టం ఏమిటి?

మీరు జాగ్రత్తగా గమనించితే, మన జీవితంలో సగభాగం ఇతరులతో పోల్చుకోవటంతోనే గడిచిపోతుంది. మనం మన కోసం ఉపయోగించే శక్తిలో 60% ఎదుటివారి అభివృద్ధిని లెక్కలు కట్టటానికి, మనం వారితో పోలిస్తే ఎక్కడ ఉన్నామో లెక్క కట్టటానికి ఉపయోగిస్తాము. ఒక్క క్షణం ఆలోచించండి. ఆ అరవైశాతం శక్తిని కూడా మన అభివృద్ధికి ఉపయోగించగలిగితే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో, మనలో ఎంత శాంతి ఆనందం ఉంటాయో ఊహించండి.

ఒక చిన్న కథ :

ఒక వ్యక్తి 1000 మీటర్ల పరుగుపందెంలో పరిగెడుతుంటాడు. 250 మీటర్లు పరిగెత్తాక ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అతను అందరికంటే ముందు ఉంటాడు. మరలా 500 మీటర్లు పరిగెత్తాక ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అతనే ముందు ఉంటాడు. అలాగే 750 మీటర్లు తరువాత వెనక్కి చూస్తే అతనే ముందు ఉంటాడు. చివరికి అతను గెలుస్తాడు.

ఆ వ్యక్తి అసలు వెనక్కి తిరగకుండా, తన పూర్తి శక్తిని ఏకాగ్రతని కేవలం తన లక్ష్యం వైపు మాత్రమే ఉంచి ఉంటే బహుశః అతను ప్రపంచ రికార్డు సాధించి ఉండేవాడు.

ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి జీవిత లక్ష్యం వారిది. అటువంటప్పుడు ఎదుటివారితో పోల్చుకుని మనం ఏమి అర్థం చేసుకోగలం. వారి ఆధారంగా మనం ఏమి సాధించగలం.

ఎదుటివారితో పోల్చుకుంటే నష్టం ఏమిటి?

ఎదుటివారితో పోల్చుకుంటే మనకి మిగిలేది వ్యధ, మానసిక కుంగుబాటు అంతే. మనం అంతకంటే ఇంకా గొప్పవారము కాగలమేమో కానీ ఎదుటివారితో పోల్చుకుంటూ మన చిన్న పరిధిలో ఉండిపోతున్నాము.

ఎదుటివారితో పోల్చుకుంటూ, వారిలా మనం పనులు చేస్తే, మహా సాధించగలిగితే వారి స్థితిని చేరగలం. కానీ మన ప్రత్యేక శక్తియుక్తులని, మన లక్ష్యం వైపు ఉపయోగించి ఉంటే మనం ఇంకా గొప్పవారము అయిఉండే వారం కదా!

ఉదాహరణకి : బిల్ గేట్స్ ఎవరితోనైనా పోల్చుకొని ఉంటే బహుశ ఒక కంపెనీకి మేనేజర్ అయి ఉండేవాడు అంతే. ఐన్స్టీన్ లేదా న్యూటన్ ఒకరితో పోల్చుకొని ఉంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ అయి ఉండేవారు.

అర్థం చేసుకోండి! పోల్చుకోవటం అనే విషయాన్ని వదిలివేస్తే మనం స్వేచ్ఛగా, ఆనందంగా మన పని మనం పూర్తి ఏకాగ్రతతో చేసి మంచి ఫలితాలు సాధించగలం. అప్పుడు మన జీవితం అద్భుతంగా, తృప్తిగా ఉంటుంది.

మరొక చిన్న కథ :

ఒక అందమయిన చిన్న రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆయన ఎప్పుడూ దిగులుగా, అశాంతిగా, అసంతృప్తితో ఉండేవాడు. ఆయన మంత్రులకి కారణం తెలియదు. ఆయన దిగులుగా ఉండవలసిన పరిస్థితులు ఆ రాజ్యంలో లేవు. దేశ ప్రజలు మంచివారు. దేశంలో అందరూ ధనవంతులు. దేశానికి పెద్దగా శతృభయం లేదు. రాజుగారి కొలువులో అందరూ సమర్థులే. మరి రాజుగారి అసంతృప్తి, దిగులుకి కారణం ఎవరికీ తెలియదు. ఆయనని ఎప్పుడూ ఎవరూ ఆనందంగా ఉండటం చూడలేదు.

రాజు దిగులుకి కారణం ఏమిటంటే, ఆయన ప్రతి క్షణం తన ప్రక్కదేశపు రాజు గురించే ఆలోచిస్తాడు. ఎప్పుడూ ఆ రాజుతో ఆ రాజ్యంతో పోల్చుకుంటూ ఉంటాడు. ఆ రాజ్యాన్ని చూసి అసూయతో మండిపోతుంటాడు. అతనికి ఆ రాజు తనకంటే గొప్పవాడు అనే భావం చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో ఆ రాజ్యం మీద ఆ రాజుమీద ద్వేషం పెరుగుతుంది. కానీ ఆ రాజ్యాన్ని ఏమీ చేయలేడు. కారణం, ఆ రాజ్యం తన రాజ్యానికంటే చాలా రెట్లు పెద్దది. ఆ రాజు ఈయన కంటే చాలా ధనవంతుడు. చాలా మంచి వాడని, తెలివైనవాడని పేరు ఉన్నది. కాబట్టి ఆ రాజుని, రాజ్యాన్ని ఏమీ చేయలేననే దిగులు, అతనిని చూస్తే కలిగే అసూయతో ఆ రాజు కుంగిపోతుంటాడు.

ఒక రోజు ఆయన వాళ్ళ కులగురువు యొక్క ఆశ్రమానికి వెళ్తాతాడు. గురువుగారు రాజుని కుశల ప్రశ్నలు అడిగిన తరువాత ఆశ్రమానికి వచ్చిన కారణం అడుగుతాడు. అప్పుడు రాజు తన మనస్సులోని బాధని చెప్పి గురువుగారితో ఇలా అంటాడు, “గురుదేవా! మీ దగ్గర అద్భుతమయిన మహిమలు, గొప్ప మంత్రాలు ఉంటాయి కదా! నాకు ఏదైనా ఒక మంత్రాన్ని నేర్పించండి. దాని మహిమతో నేను నా ప్రక్కనే ఉన్న రాజుని ఓడించి ఆ రాజ్యాన్ని సాధించుతాను. దయచేసి నాకు ఈ సహాయం చేసి నాలోని దుఃఖాన్ని, వేదనని తొలగించండి” అని ప్రార్థించుతాడు. రాజుగారు చెప్పినదంతా చాలా ఓపికగా విని, రాజుతో, “రాజా! ఈప్రక్కన పూలతోటలో చక్కని గులాబి మొక్క ఉన్నది, దాని ప్రక్కనే ఒక కానగ చెట్టు ఉన్నది. వాటిని జాగ్రత్తగా గమనించు. అవి నీకు కావలసిన విషయాలని నేర్పించుతాయి” అని అంటారు గురువు గారు

గురువు గారు చెప్పిన విధంగా రాజు తోటలో ఉన్న గులాబి చెట్టు దగ్గరకి వెళతాడు. గులాబి చెట్టు ప్రక్కనే ఉన్నకానగ చెట్టుని చాలాసేపు గమనించుతాడు. కానీ అతనికి ఏమీ అర్థం కాదు. కొంచెంసేపు అలా వాటిని చూసి గురువుగారి కుటీరానికి తిరిగి వస్తాడు.

గురువుగారితో రాజు ఇలా అంటాడు “గురుదేవా! ఆ చెట్లని చూసాను కానీ నాకు ఏమి అర్థం కాలేదు. అవి నాకు ఏమి నేర్పించుతాయి” అని అంటాడు.

అప్పుడు గురువుగారు రాజుని తీసుకొని ఆ చెట్ల దగ్గరకి వస్తాడు. ఈ గులాబి మొక్క కానగ చెట్టు చాలా కాలం నుంచి ఇలా ప్రక్కప్రక్కనే ఉన్నాయి. కానగ చెట్టు ఏనాడు తాను గులాబి మొక్కలా ఉండాలి అని కోరుకోలేదు. అదే విధంగా గులాబి యొక్క ఎప్పుడు తాను కానగ మొక్కలా ఉండాలి అని ఆశించలేదు. అవి వాటి బాధ్యతలని నెరవేర్చుతూ ఆనందంగా, హాయిగా పెరిగి పెద్దవుతున్నాయి.

అదే గనక ఒక మనిషి కానగ చెట్టు స్థానంలో ఉండి ఉంటే అతను నిరంతరం ఆ గులాబి చెట్టు వైపు చూస్తూ, దాని అందంతో తనని తాను పోల్చుకుంటూ అసూయతో రగిలిపోయేవాడు. తోటలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి గులాబి మొక్క దగ్గరకే వచ్చి, దాని అందానికి ఆనందిస్తూ ఆ పూలని మాత్రమే కోసుకుంటూ ఉంటే అది చూసి మరింత కుంగిపోయేవాడు. తనకి ఉన్న శక్తిని మొత్తం ఇలా పోల్చుకుని బాధపడటానికి ఉపయోగించేవాడు.

అదే విధంగా గులాబి మొక్క స్థానంలో మనిషి ఉండి ఉంటే, అతను తన ప్రక్కనే బలంగా ఎత్తుగా, పెద్దగా ఉన్న కానగ చెట్టుని చూసి దానితో తనని తాను పోల్చుకుని బాధపడేవాడు. తోటలోనికి ఎవరు వచ్చినా అందరూ నన్నే విసిగిస్తారు. నా పూలు కోసి నన్ను హింసపెడతారు. నన్ను ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండనీయరు. నా బ్రతుకే ఇటువంటిది. అదే కానగ చెట్టు దగ్గరకి ఎవరూరారు. దానిని ఎవరూ బాధించరు. దాని ప్రశాంతతని పాడుచేయరు. అది చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. కానగ ఎంత అదృష్టవంతురాలు అని ఇంకాస్త బాధపడేవాడు.

కానీ రాజా! ఈ మొక్కలు ఏ మాత్రం తన ప్రక్కవాటి మీద దృష్టిపెట్టి ఉండి ఉంటే అవి ఇంత అందంగా, బలంగా పెరగవు కదా. నీకు ఉన్న శక్తీయుక్తులని నీతెలివి తేటలని, నీ సమయాన్ని కేవలం నీ రాజ్యం మీద మాత్రమే పెడితే నీ దేశం మరింత అభివృద్ధి అవుతుంది. నీవు ఆనందంగా తృప్తిగా జీవించగలవు కదా! ఇదే నేను నీకు ఇచ్చే మహిమగల మంత్రం. ఈ మంత్రాన్ని పాటిస్తే త్వరలోనే నీవు చాలా గొప్ప ధనవంతుడిగా అవుతావు, నీ దేశాన్ని స్వర్గంలా తీర్చిదిద్దగలుగుతావు అని అంటాడు. ఈ ప్రపంచంలో ఏదీ నీది కాదు : ఏదీ శాశ్వతం కాదు

ఈ భూమి మీద ఉన్న ప్రాణులు అన్నింటిలోనూ మనిషి అత్యంత తెలివితేటలు కలిగిన ప్రాణి అని అంటారు. కానీ అంత మేధస్సు కలిగిన మనిషి అత్యంత సామాన్యమైనది, ప్రతి నిత్యం తన కళ్ళముందు నిలబడి ఉన్న సత్యాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడు. ఆ సత్యం “ ఈ ప్రపంచంలో ఏదీ తనది కాదు. ఏదీ శాశ్వతం కాదు. మనిషి ఎంత మహాసామ్రాజ్యాలు పొందినా, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా, కొంతకాలం వాటికి సంరక్షకుడిగా ఉండి, వాటిని తిరిగి సర్వాంతర్యామికి అప్పజెప్పి వెళ్ళిపోవలసినదే.

ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించండి. మన చుట్టుపక్కల ఉన్న ఈ స్థలాలు, ఇళ్ళు, పొలాలు వీటికోసం ఎంతమంది రాజులు ఎందరిని చంపి వుంటారో ఎందరు జమిందారులు, భూస్వాములు ఎంతమందికి అన్యాయం చేసి ఉంటారో. కేవలం కొద్దికాలం వాటికి సంరక్షకులుగా ఉండటం కోసం వాళ్ళు ఎన్ని దారుణాలు చేశారో, నిరంతరం ఆ అపరాధ భావంతో ఎంత అశాంతిగా బ్రతికి ఉంటారో మనం ఊహించగలం.

సంపాదించిన ఆస్తులు కాపాడుకోవటంలో మరొకరకమైన క్షోభకి గురిఅవుతారు. శత్రురాజు ఏ క్షణాన తన రాజ్యం మీదకి వస్తాడో అని, తన భూమిని ఆక్రమిస్తాడో అనే భయంతో ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపివుంటాడో. కష్టపడి సంపాదించిన ఆస్తులని కాపాడుకోవటంలో భోజనం చేయకుండా ఎన్నిరోజులు గడిపి ఉంటారో. పరిగెత్తి, పరిగెత్తి సంపాదించిన ఆస్తికి కాపాలా కాస్తూ అమూల్యమైన జీవితాన్ని జీవించటం మర్చిపోయారు. జీవిత కాలంలో కనీసం ఒక్క రోజయినా విరామంగా నిలబడి, తను సంపాదించిన ఆస్తిని కానీ, భగవంతుడు తనకి ఇచ్చిన వరాలని కాని తృప్తిగా చూసుకొని, వాటిని ఆనందంగా అనుభవించి ఉండడు. ఎందుకంటే అలా నిలబడితే తన సంపాదని ఆగిపోతుందని భయం. మరణించే వరకూ పరుగుపెట్టటమే కాని నిలబడి తృప్తిగా ఆనందించటానికి భయం. అలా చేస్తే ఆ తరువాత మరొకటి సంపాదించలేము అని భయం.

ఒక చిన్న కథ :

ఒక రైతు ఏదో కొన్ని కారణాల వలన తనకున్న కొద్దిపాటి పొలాన్ని పోగొట్టుకుంటాడు. అతను చాలా పేదస్థితికి వెళ్ళిపోతాడు. ఏమీ చేయలేని స్థితిలో "భగవంతుడా నీవే నాకు దిక్కు" అని మనస్పూర్తిగా భగవంతుడిని శరణు వేడుతాడు. అతని ప్రార్ధనని ఆలకించిన భగవంతుడు ప్రత్యక్షమై, ఏమికావాలో కోరుకోమని అడుగుతాడు.

రైతు పరమానందభరితుడయ్యి, భగవంతుడికి నమస్కరిస్తూ, "దేవాదిదేవా! కరుణామూర్తి! ఈ పేదవాడి మీద దయ చూపించావా! నీకు వేల వేల కృతజ్ఞతలు. స్వామీ! నాకు కొంచెం భూమి ఇప్పించితే అందులో వ్యవసాయం చేసుకొని నేను నాకుటుంబం హాయిగా ఉంటాము " అని పదే పదే ప్రార్ధించుతాడు.

భగవంతుడు చాలా అందమైన చిరునవ్వు నవ్వి, "తథాస్తు! నీకు ఎంత భూమి కావాలో అంత తీసుకో" అంటాడు.

రైతు కొంచెం అయోమయంగా చూస్తాడు. అప్పుడు భగవంతుడు, "రేపు సూర్యోదయం కాగానే నీవు కాలినడకన సూర్యాస్తమయం వరకూ ఎంత దూరం నడిస్తే ఆ భూమి అంతా నీ సొంతమవుతుంది" అని దేవుడు మాయం అవుతాడు. రైతు ఆనందానికి అవధులు ఉండవు. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తూ ఉంటాడు.

మర్నాడు సూర్యోదయం కాగానే రైతు నడవడం మొదలు పెడతాడు. అలా కొన్ని గంటలు నడిచాక అతను పోగొట్టుకున్న భూమిని సంపాదిస్తాడు. ఇప్పుడు అతనిలో ఆశ మొదలవుతుంది. అప్పుడు అతను, "అదేమిటి, నేను ఎందుకు నడుస్తూ టైం అంతా వృధా చేస్తున్నాను. పరిగెడితే ఇంకా చాలా భూమిని సంపాదించవచ్చు కదా!" అని అనుకొని పరిగెడటం మొదలు పెడతాడు. అలా మధ్యాహ్నం వరకు పరిగెడతాడు. విపరీతమైన దాహం వేస్తుంది. కానీ మంచినీళ్ళు తాగటానికి ఆగితే కొంత భూమి పోతుందేమో అని భయపడి అలాగే పరిగెడతాడు. మరికొంత సేపటికి ఆకలి, నీరసం ఎక్కువ అయిపోతాయి. అయినా లేని ఓపికని తెచ్చుకొని పరిగెడుతుంటాడు. ఇంకా నీరసం వచ్చి పరిగెత్తలేకపోతాడు. అయినా తనకి తాను ఇలా చెప్పుకుంటాడు, “ఈ రోజు ఏమయినా సరే నేను ఒక్కక్షణం కూడా వృథా చేయను. ఒక్కరోజు మరే పనీ చేయను. మంచినీళ్ళ, ఆహారం ఏమీ తీసుకోను. ఒక నిమిషం కూడా విశ్రాంతి తీసుకోను. నేను ఇంకా చాలా భూమిని చుట్టబెట్టాలి. దానికి అధికారినో కావాలి” అని పరిగెడుతుంటాడు. అలా సూర్యాస్తమయం అయ్యే సమయానికి పరిగెత్తి పరిగెత్తి, కిందపడి చనిపోతాడు.

పరిగెత్తి పరిగెత్తి సంపాదించిన భూమిని ఒక్కక్షణం కూడా తృప్తిగా చూసుకోలేదు. అత్యాశకి పోయి అమూల్యమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. మనందరం కూడా ఇంచుమించు అదే స్థితిలో ఉన్నాము. ఎప్పుడూ పరిగెత్తడమే. ఎందుకు పరిగెడుతున్నాము?ఎక్కడికి? ఏమి సాధించటానికి ఈ ఆతృత? ఒక్క క్షణం నిలబడి భగవంతుడు మనకి ఇచ్చిన ఎన్నో అద్భుతవరాలని అనుభవించి తృప్తిపడటం లేదు. ఎంతసేపూ ఆ తరువాత ఏమిటి? ఇంకా ఏమిటి అనుకోవటమే. ఇలా పరిగెత్తటం ఎంత అమాయకత్వమో కదా! ప్రకృతిలో మరే ప్రాణి ఇలా జీవితాన్ని జీవించటం మాని పరిగెత్తటం లేదు. ఏవీ అమాయకంగా జీవితాన్ని బలిపెట్టి ఆస్తులు కూడబెట్టటం లేదు. అవి అందమైన ఈ ప్రపంచంలో, ప్రకృతిలో ఒక భాగంగా జీవిస్తాయి. ప్రతి నిమిషం అత్యంత ఆనందంగా సంబరాలు చేసుకుంటాయి. ప్రతి క్షణం ఒక ఉత్సవంలా జీవిస్తాయి. కేవలం ఆనందం తప్పా మరే భావం లేకుండా చనిపోతాయి. కేవలం మనిషి మాత్రమే నిత్యం వ్యధలు, బాధ, కోపం, నిరాశ, అసంతృప్తి, కుంగుబాటుతనం, అపరాధభావం వీటితో జీవిస్తూ జీవితం అంటే ఉత్సాహం అని, జీవితంలో ప్రతిక్షణం ఒక పండుగలా జీవించాలనే విషయాన్ని మర్చిపోయి, జీవితాన్ని నిరాశతో లాగుతున్నాడు. అది ఎలా ఉంటుందంటే మరణాన్ని వాయిదా వేస్తున్నట్లే ఉంటుంది, కాని మనిషి జీవిస్తున్నట్లుగా ఉండదు.

ఎప్పుడయితే మనం ఇది నాది, నేను దీనిని పొందాలి, నేను దీనికి అధికారిని అవ్వాలి అనే భావనని వదిలిపెడతామో అప్పుడు మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాము. జీవితం అనేది ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ స్వేచ్ఛలోని ఆనందం ఎంత మధురంగా ఉంటుందో అనుభవించగలుగుతాము. అప్పుడు మనం పొందే ఆనందం ఎన్ని కోట్ల ఆస్తి అయినా మనకి ఇవ్వలేదు. ఎప్పుడయితే నాది అనే దానిని వదిలివేస్తామో, జీవితం తేలికగా, స్వేచ్ఛగా అందంగా ఉంటుంది. ప్రతీ క్షణం ఒక ఉత్సవంలా జీవితాన్ని గడపవచ్చు.

మీ అంతరంగంలో ఎన్నో గాయాలు ఉన్నాయి. అవి మీలోని కోపం, అసూయ, అసంతృప్తి, అత్యాశ, అశాంతి, మానసిక ఒత్తిడి అనే వాటి ద్వారా ఏర్పడ్డాయి. అదే విధంగా మీరు ఇతరులతో పోల్చుకుంటూ, వాళ్ళు పరిగెడుతున్నారు. కాబట్టి మీరూ పరిగెడుతున్నారు. ఆ విధంగా ఇతరుల ద్వారా, సమాజం ద్వారా ఏర్పడిన గాయాలు మరికొన్ని. ఇన్ని గాయాలు అంతరంగం నిండా ఉన్నప్పుడు మీకు ఆనందం ఎక్కడ నుండి వస్తుంది. ఈ గాయాలని మాన్పగల దివ్య మంత్రం ఒకటి ఉన్నది, అది ఈ ప్రపంచంలో ఏదీ నా సొంతం కాదు ప్రతిదీ భగవంతునికి వదిలివేయవలసినదే. ఏదీ శాశ్వతం కాదు. నేను, నాది అనేది కేవలం నా అమాయకత్వం " అని తెలుసుకోవటమే దివ్యమంత్రం. అది గొప్ప మందులా పనిచేసి గాయాలన్నింటినీ ఒక్క క్షణంలో మాన్పగలుగుతుంది. అప్పుడు మీ అంతరంగం అద్భుతమైన ఆనందం, తృప్తి, శాంతితో నిండిపోతుంది. ఆ అనుభూతిని ఆ పరమానందాన్ని ఒక్కసారి అనుభవించినా చాలు, దాని గొప్పదనం మీకు అర్థమవుతుంది.

మీరు మీతో ఉండగలగటం నేర్చుకోవాలి. మీరు మీ మీద ఏకాగ్రతని నిలిపి, మీతో ఉండగలిగితే విశ్రాంతిగా, విరామంగా ఉండగలుగుతారు. అప్పుడు మీకు నిజంగా ఏమి కావాలో తెలుస్తుంది. అప్పుడు మీరు సరియైన నిర్ణయాలు చేయగలుగుతారు. అనవసరంగా పరుగులు పెట్టరు.

ఒక చిన్న కథ : ఒక యోగీశ్వరుడు - అలెగ్జాండరు :

అలెగ్జాండరు గ్రీకుదేశానికి రాజు. అతడు యువకుడు. గొప్ప యోధుడు. అతనికి ప్రపంచాన్ని గెలవాలి, ప్రపంచానికి చక్రవర్తిని కావాలి అనే కోరిక కలిగింది. వెంటనే పెద్ద సైన్యాన్ని తీసుకొని తూర్పుదిశగా ఒక్కొక్క రాజ్యాన్ని జయించుతూ వస్తాడు. చివరిగా అతను భారతదేశం చేరుతాడు. భారతదేశపు సరిహద్దులలోని రాజులని జయించి తన ప్రతినిధులని ఉంచుతాడు.

అతను భారతదేశపు సంస్కృతి, సంప్రదాయాలు, విజ్ఞానము చూసి ఆశ్చర్యపోతాడు. వారి వైభవానికి కారణం వారికి ఉన్న వేదాలు, జ్ఞానోదయమైన యోగీశ్వరులు అని తెలుసుకుంటాడు. అతనికి ఆ విజ్ఞానాన్ని తన దేశానికి తీసుకువెళ్ళాలి అనే కోరిక కలుగుతుంది.

అలెగ్జాండర్ తనతో భారతదేశం నుంచి జ్ఞానోదయం అయిన యోగిని అలాగే వేదాలని తీసుకు వెళ్ళాలి అని అనుకుంటాడు. వాటి సహాయంతో తన దేశాన్ని బాగా అభివృద్ధి చేయగలను అని నిర్ణయించుకుంటాడు. అతను అనుకోకుండా ఒక జ్ఞానోదయమైన యోగిని కలుస్తాడు.

అలెగ్జాండర్, యోగీశ్వరుని చూసి చాలా సంతోషపడతాడు. ఆయన దగ్గరకి వెళ్ళి, “దయచేసి మీరు నాతో మా దేశానికి రండి” అని ఆహ్వానించుతాడు. అలెగ్జాండర్ ఆహ్వానానికి యోగీశ్వరుడు నవ్వి, “ నేను రాను. నాకు ఎక్కడికి రావాలని లేదు. నేను ఇక్కడే ఉంటాను” అని అంటాడు. అప్పుడు అలెగ్జాండరు, “ మీరు అలా అనవద్దు. మీరు మా దేశానికి రండి. మీరు అక్కడికి వస్తే మీకు గొప్ప రాజభవనాన్ని ఇస్తాను. మీరు ఇక్కడ కేవలం ఒక బిక్షగానిలా ఉన్నారు. మీకు కట్టుకోవటానికి సరియైన బట్టలు కూడా లేవు. మీరు మా దేశానికి వస్తే మీకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. దయచేసి నాతో మా దేశానికి రండి” అని అంటాడు.

అప్పుడు యోగి నవ్వి, “ నేను రాను. నేను ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాను. నాకు ఎక్కడికీ వెళ్ళాలని లేదు” అంటాడు.

అప్పుడు ఏమయి ఉంటుందో మీకుతెలుసు : అలెగ్జాండరు ఒక చక్రవర్తి, యోధుడు, బాగా తెలివైనవాడు. అతను ముందుగా యోగికి ఆశలు చూపించి ఆధీనం చేసుకోవాలి అని అనుకుంటాడు. అది పని చేయలేదు ఇప్పుడు భయపెట్టి తనతో తీసుకువెళ్ళాలి అని అనుకుంటాడు. అప్పుడు తన కత్తిని బయటికి తీసి “ నీవు నాతో రాకపోతే నిన్ను చంపేస్తాను” అంటాడు అలెగ్జాండరు.

అలెగ్జాండరుని, అతని కత్తిని చూసి మరింత నవ్వుతాడు ఆయోగి. ఒక మామూలు వ్యక్తి, ఒక సన్యాసి గొప్ప చక్రవర్తిని, అతని కత్తిని చూసి నవ్వటం అంటే సామాన్య విషయం కాదు. రాజు ఏమి చేసినా అడిగేవారు ఉండరు. అయినా సరే ఆ యోగి అతనిని చూసి నవ్వి, అలెగ్జాండరు కళ్ళలోనికి సూటిగా చూస్తూ, “ ఓ! తెలివి తక్కువ వాడా! నీవు అబద్ధాలకోరివి అంటాడు.”

గొప్ప యోధుడయిన అలెగ్జాండరు, జీవితంలో మొదటిసారి భయపడతాడు. అతను యోగిని చూస్తూ, “నీకు భయం వేయటం లేదా?” అని అడుగుతాడు.

అప్పుడు యోగి, “ నీవు నన్ను ఎప్పటికీ చంపలేవు. నీవు నా ఈ శరీరాన్ని నాశనం చేయగలవేమో కాని నన్ను మాత్రం ఏమీ చేయలేవు” అంటాడు.

ఆ యోగికి ఆ ధైర్యం, తనపై తనకి ఆ నమ్మకం అతని అనుభవం ద్వారా వచ్చాయి. ఆధ్యాత్మిక అనుభవం అతనిని ఆ విధంగా నిలబెట్టాయి.

అలెగ్జాండరు ఆశ్చర్యపోతాడు. ఆ యోగీశ్వరుడి వైపు చూస్తూ “నీవు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలిగావు?” అని అడుగుతాడు.

అప్పుడు యోగి అలెగ్జాండర్ని, “నీవు భారతదేశానికి ఎందుకు వచ్చావు” అని అడుగుతాడు. భారతదేశాన్ని జయించటానికి వచ్చాను అని అలెగ్జాండరు జవాబు ఇస్తాడు.

‘ఆ తరువాత ఏమి చేస్తావు’, అని యోగి ప్రశ్నిస్తాడు. మరొక దేశాన్ని జయించుతాను అని జవాబు ఇస్తాడు అలెగ్జాండరు.

“ ఆ తరువాత?” అని అడుగుతాడు యోగి.

“హాయిగా విశ్రాంతిగా ఉంటూ ఆనందంగా ఉంటాను”, అంటాడు అలెగ్జాండరు. అప్పుడు యోగి, “ ఓ తెలివితక్కువ వాడా! నేను ప్రస్తుతం అదే స్థితిలో ఆనందంగా ఉన్నాను” అంటాడు.

అలెగ్జాండరుకి తాను ఎంత మూర్ఖుడినో, ఎంత తెలివిహీనుడో అర్ధమయింది. తాను ప్రపంచాన్ని జయించాడు కానీ అపూర్వపమయిన ఆనందాన్ని, అద్భుతమయిన జీవితాన్ని పోగొట్టుకున్నాను అని తెలుసుకున్నాడు. ఈ రాజ్యాలు, గెలుపు తనతో రావు అని తెలుసుకున్నాడు. అందుకే అతను తన మంత్రులతో ఈ విధంగా చెబుతాడు.

“నేను మరణించాక, నా పార్ధవ శరీరాన్ని తీసుకు వెళ్ళేటప్పుడు నాచేతులు బయటికి పెట్టండి. ప్రజలందరికీ, అలెగ్జాండర్ అంతటివాడు కూడా మరణించాక తనతో ఏమీ తీసుకువెళ్ళటం లేదు అని తెలుసుకోవాలి. ఇది నా కోరిక”.

ఈ కథలో మనకి మూడు విషయాలు అర్ధమవుతాయి. జ్ఞానోదయమయిన యోగీశ్వరులలో ధైర్యం, నమ్మకం స్పష్టంగా కనిపిస్తాయి. ప్రపంచంలోని విషయాల వెనుక పరిగెత్తటం వలన ఉపయోగం లేదు. విశ్రాంతిగా ఉంటూ జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా గడపగలగాలి. ఆ యోగీశ్వరుడికి ఏమీ లేవు కాని గొప్ప పరమానందంలో ఉంటూ జీవితాన్ని ఉత్సవంలా గడుపుతున్నాడు.

మన ఈ ప్రపంచంలో ఎంత సంపాదించినా, మనతో ఏమీ తీసుకువెళ్ళము. మీ కీర్తి ప్రతిష్టలు, ఆస్తి అంతస్తులు ఏవీ మీరు తీసుకువెళ్ళలేరు. ఈ ప్రపంచమంతా మిమ్ములని గొప్ప చక్రవర్తి అని అభిమానించి ఆరాధించినా దానిని మీతో తీసుకువెళ్లలేరు. మీరు ఖాళీ చేతులతోనే వెళ్తారు. సంపాదించినది మొత్తం తిరిగి ఆ సర్వాంతర్యామికి వదిలి మరీ వెళ్తారు. భగవంతుడికి కృతజ్ఞతతో పూజించాలి, ప్రేమతో దరి చేరాలి.

భగవంతుడు, దేవుడు మరే పేరుతో పిలిచినా సరే, ఆయన సర్వాంతర్యామి. ఆయన విశ్వశక్తి, అత్యుత్తమ అత్యున్నత చేతనస్థితి. ఆ విశ్వశక్తే ప్రతి మనిషిలోనూ ప్రతి ప్రాణిలోనూ జీవశక్తిగా ఉంటుంది. అందుకే ప్రతి ప్రాణి దేవుని రూపమే. భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన మహామేధావి, కరుణామూర్తి ప్రేమమూర్తి.

అటువంటి భగవంతుని మనం భయం, భక్తిపేరుతో దూరం చేసుకోకూడదు. గౌరవం అనే భావంతోఎక్కడో పైన పెట్టి మనం దూరం వెళ్ళి పోకూడదు. ఆయనని కృతజ్ఞతతో, ప్రేమతో పూజించాలి. భగవంతునితో ఉండే బంధత్వం, సంబంధమే అన్ని సంబంధ బాంధవ్యాలలోనికి ఉత్తమోత్తమయినది. ఆయనే అన్ని రకాల బంధుత్వాలు.

కష్టకాలంలో రక్షణ ఇచ్చే తండ్రి ఆ దేవుడే. మానసికంగా బలహీనులమయినప్పుడు తన ఒడిలో లాలించే తల్లి ప్రేమ ఆ భగవంతుడే. ఒక ప్రేమికునిగా, ఒక ప్రేయసిగా ఆటలాడి ఆనందపరచే ప్రేమశక్తి ఆ దేవదేవుడే. ఒక స్నేహితునిగా ఆదరించినా, గురువుగా మంచిమార్గంలో పెట్టినా, ఆ శక్తి ఆ భగవంతుడే. మనం ఏ బంధుత్వంతో దగ్గరయితే మనని అలా ఆదరిస్తాడు. ఏమీ లేదు! దేవా నావల్లకాదు. నీవే దిక్కు అని ఆయన పాదాల శరణు వేడితే, తన హృదయానికి హత్తుకునే గొప్ప బంధువు, యజమాని అన్నీ ఆయనే.

కానీ ఆయనని మన నుంచి వేరే చేసే ఒక శక్తివంతమైన అంశం మనలో ఉన్నది. అదే మనలోని అహంకారం. కొందరిలో అహంకారం స్పష్టంగా కనిపిస్తుంది. కొందరిలో వారికే తెలియకుండా అహంకారం ఉంటుంది. ఎవరైతే అహంకారాన్ని పూర్తిగా త్యజించుతారో, ఎవరిలో అయితే అహంకారం అనేది అసలు ఉండదో, ఎవరైతే అహంకారంలేని పూర్తి అమాయకత్వంతో ఉంటారో వారికి భగవంతుడు చాలా దగ్గర చుట్టము. తెలిసి గాని తెలియక గాని అహంకారపు పొరల మధ్య ఉంటుంది. ఆ భగవంతునికి ఎన్ని పూజలు, ఎన్ని యాగాలు ఎన్ని అభిషేకాలు చేసినా వ్యర్థం. ఆయన కోసం అహం తప్పా అన్ని సన్స్యసించి కరోర తపస్సు చేసినా ఆయనదొరకడు. అందుకే ఆయనని భక్త సులభుడు అంటారు కాని జ్ఞాన సులభుడు అనరు. ఈ విషయాన్ని వివరిస్తూ పరమహంస ఒక చిన్నది చక్కని కథని చెబుతారు. చిన్నకథ : గోపికలు - రుషులు :

శ్రీ కృష్ణుడు జన్మించి, పెరిగి పెద్దవాడయిన గోకులం అనబడే బృందావనం చాలా అందమయిన పల్లె. అక్కడి గోపాలురు, గోపికలు అమాయకమయిన పల్లె ప్రజలు. గోవులని మేపుతూ ఆపాలు పెరుగులే వార ఆస్తిపాస్తులుగా జీవించే సామాన్యులు.

బృందావనానికి కొంచం దూరంలో ఉండే అరణ్యంలో చాలా మంది రుషుల తపస్సు చేసుకుంటూ నిరంతరం ధ్యానస్థితిలో ఉండేవారు. వారికి అవసరమయిన పళ్ళూ, పాలు గోకులంలోని గోపాలురు, గోపికలు వారికి భక్తితో ఇస్తుండేవారు.

శ్రీకృష్ణుడు జన్మించాక గోకులంలోని స్త్రీ పురుషులకి, పిల్లలకి పెద్దలకి నిరంతరం శ్రీకృష్ణుదు ధ్యాసే ఉండేది. వారు ఏమాత్రం సమయం దొరికినా శ్రీకృష్ణుని సన్నిధికి చేరేవారు. ఆ పరంధాముని సన్నిధిలో, ఆయన సమక్షంలో అంతులేని పరమానందాన్ని పొందేవారు. ఆయన ఉన్న పరిసరాలలో ఉండి, అద్భుతమయిన ఆధ్యాత్మిక అనుభవాలు పొందేవారు. శ్రీకృష్ణుడు చెలిమిలో నిరంతరం ఆనంద పారవశ్యంలో మునిగి ఉండేవారు. వారికి కృష్ణుడు తప్ప మిగతా విషయాలన్ని మరిచిపోయారు. వారి జీవితం, ధ్యేయం, సుఖం, దుఃఖం, సంతోషం, ఉత్సాహం, సర్వం శ్రీకృష్ణుడే, శ్రీ కృష్ణుని ప్రేమలో, ఆయన ఆటపాటలు లీలలో వారు ప్రపంచాన్నే మరచిపోయారు.

ఈ క్రమంలో రోజులు గడిచే కొద్దీ వారు రుషులకి చేసే మర్యాదలలో లోటు వస్తుండేది. వారు క్రమంగా రుషుల దగ్గరకి వెళ్ళటం తగ్గించారు. గోకుల వాసుల నిర్లక్ష్యం మహా జ్ఞానులు, తపో సంపన్నులు అయిన రుషులకి కోపం తెప్పించింది.

విషయం ఏమిటో తెలుసుకొని గోపాలురికి, గోపికలకి బుద్ధి చెప్పాలని రుషులు గోకులానికి వస్తారు. వారికి ఎక్కడా జన సమూహాలు కనిపించవు. వారు ఇంకా ముందుకి వెళితే అక్కడ కొంతమంది గోపికలు కనిపిస్తారు.

వారు రుషులని చూడగానే భక్తి మర్యాదలతో వారికి నమస్కరించతారు. వారి భక్తిని పట్టించుకోకుండా, రుషులు గోకులవాసుల నిర్లక్ష్యానికి వారి ఆగ్రహాన్ని వెల్లడిస్తారు. వారు కోపంతో “మీ గోకులవాసులు మిమ్మలని నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు తగిన గౌరవ మర్యాదలని ఇవ్వటం లేదు. మాకు కోపం వస్తే మీరు తగిన ఫలితాలు అనుభవిస్తారు” అని గట్టిగా చెబుతారు.

కాని గోపికలు వారి కోపానికి, వారి మాటలకి అసలు భయపడరు. గోపికల ధైర్యానికి రుషుల ఆశ్చర్యపోతారు. “మేము ఎవరో మా గొప్పదనం ఏమిటో మీకు తెలుసా” అని వారిని హంకరిస్తూ అడుగుతారు. గోపికలు తెలియదు అంటారు.

“మేము రుషులము. అడవులలో నిరంతరం తపోదీక్షలో ఉంటాము. మేము వేదవేదాంగాలు చదివిన జ్ఞానులం” అంటారు. అప్పుడు గోపికలు వారివైపు ఆశ్చర్యంగా చూస్తూ “మహాత్ములారా! తపస్సు అంటే ఏమి చేస్తారు” అని అమాయకంగా అడుగుతారు.

వారి అమాయకత్వానికి, అజ్ఞానికి రుషుల జాలిపడి, వారితో ఇలా అంటారు, “మేము నిరంతరం ఆ భగవంతుని ధ్యాసలో ఉంటాము. ఆ దేవదేవుని పాదాలపై ధ్యానం చేస్తుంటాము”.

“అలా ఎందుకు చేస్తారు?” ఇంకా అమాయకంగా ప్రశ్నిస్తారు. గోపికలు. గోపికలని చూస్తూ, “అలా తపస్సు చేస్తే భగవంతుడు మాకు దర్శనాన్ని ఇస్తాడు. మాకు ఆత్మసాక్షాత్కారం కలిగించి జ్ఞానోదయమయ్యేలా చేస్తాడు. ఆ భగవందనుగ్రహం కోసం, భగవత్ సాక్షాత్కారం కోసం ఎన్నో జన్మలుగా ఎందరో మునులు తపస్సు చేస్తున్నారు. అయినా లోకజ్ఞానం లేని అమాయకులయిన మీకు ఈవిషయాలు అర్థం కావు. మీ వారందరూ ఎక్కడ వారికి మేము వచ్చిన విషయం తెలియచేయండి” అంటారు.

“మహాత్ములయిన తపోధనులారా! మీరు భగవంతుని కోసం అరణ్యాలలో తపస్సు చేస్తున్నారు. భగవదనుగ్రహం కోసం ఎన్నో గ్రంథాలు చదివి గొప్ప జ్ఞానాన్ని పొందారు. చాలా గొప్పవిషయం ఇది కానీ అక్షరజ్ఞానం లేని మా గోకులవాసులం భగవంతునితో ఆడుకుంటున్నాము. మీరు అలా యమునానది ఒడ్డుకో వెళితే అక్కడ భగవంతునితో ఆడుపాటలు, నాట్యాలు చేస్తూ పరమానందపు పారవశ్యంలో మునిగి ఉన్న మా గోకుల వాసులు కనిపిస్తారు. ఆ ఆనంద పారవశ్యంలో మైమరచి మావారు మిమ్ములని గమనించకపోతే దయచేసి క్షమించండి” అంటూ వినయంగా, అమాయకంగా చెబుతారు గోపికలు

ఎవరైతే పరిపూర్ణంగా ఆ భగవంతుని అధీనులవుతారో భగవంతుడు వారికి సొంతమవుతారు. అక్షర జ్ఞానం, లోక జ్ఞానం అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లేని గోకులవాసులకి వారికి భగవంతునికి మధ్య నిలబడే జ్ఞానం, హేతువాదం, శాస్త్రీయత, అహంకారం, మేధస్సు ఇలాంటి అడ్డుగోడలు ఉండవు. వారికి సంపూర్ణంగా నమ్మటం సంపూర్ణంగా అధీనులై ప్రేమించటమే తెలుసు. అందుకే భగవంతుడు వారితో నాట్యం చేసాడు. పాటలు పాడాడు. చక్కని ఆటలు ఆడుకున్నాడు. గోకులం వారికి కృష్ణుడితో వాదించటం రాదు, ప్రశ్నలు అడగటం తెలియదు. కేవలం ప్రేమించటమే తెలుసు అందుకే వారు ధన్యులు. భగవంతునికి అధీనులవటం అంటే ఏమిటి?

భగవంతునికి అధీనమవటం అనేది నిబంధనలతో ఉండకూడదు. అది సంపూర్ణంగా జరగాలి. అందులో ‘అయితే’ ‘కానీ’ వంటివి ఉండకూడదు. నీవు నా ఈ కోరిక తీరిస్తే నేను నీకు అధీనమవుతాను లేదా మరొక దేవుడిని చూసుకుంటాను. అనే పద్ధతి భక్తి కాదు వ్యాపారం. స్పష్టంగా అర్థం చేసుకోండి. భగవంతుడు అంటే మేధస్సు ఆయనకి సమస్తం తెలుసు. మనం అడిగేవి అడగబోయేవి కూడా తెలుసు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే మనం చేసే పూజా ప్రార్థనలలో గొప్ప మార్పు వస్తుంది.

భగవంతునికి అధీనమవటం అనేది మూడు విధాలుగా ఉంటుంది.

మొదటి రకం అధీనత అనేది మన మేధస్సుని అధీనపరచటం. ఇది సులభమే. విశ్వశక్తి, భగవంతుడు అనేది చాలా గొప్పశక్తి. ఆ మేధస్సు మన మేధస్సు కంటే గొప్పది అని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆశక్తికి మనం మన అధీనపరుస్తాం. అంటే తెలివితేటల దశలో అధీనులవుతాము. అప్పుడు నిర్ణయాలు భగవంతునికి వదలలుగుతాము. ఆ తరువాత అధీనత భావాత్మక దశలో జరిగేది. అటువంటివారు భగవంతుని స్మరించగానే కరిగిపోతారు. అలా అనుకోగానే ప్రేమ కృతజ్ఞతా భావం వారిలోంచి పొంగి ప్రవహిస్తుంది. కళ్ళ నుండి నీరు ప్రవాహంలా వస్తుంది. అప్పుడు వారు భక్తులుగా మారిపోతారు. ఈ సందర్భంలో రామకృష్ణ పరమహంస ఈవిధంగా చెబుతారు, “మీరు భగవంతుని కానీ గురుదేవులని కానీ స్మరించుకోగానే మీ కళ్ళలో నీరువస్తే, స్పష్టంగా తెలుసుకోండి. ఇది మీకు చివరి జన్మ అని, మీరు స్వేచ్ఛని పొందటానికి సిద్ధంగా ఉన్నారు అని”

ఇక మూడవదశ స్పర్శేంద్రియాలని అధీనపరిచే దశ, ఇది చివరి దశ. రామకృష్ణ పరమహంస చెప్పిన స్వేచ్ఛని రెండవ దశలో పొందలేము. ఆ స్వేచ్ఛ ఈ దశలో పొందగలం. ఈ దశలో మనం మన స్పర్శేంద్రియాలని ఆయనకి అధీన పరుస్తాము. ఇదే సంపూర్ణ అధీనత. ఇది నిబంధనలు లేని అప్రయత్నంగా, సహజంగా జరిగే అధీనత.

కృష్ణార్జునుల కథ :

మహా భారతంలో వ్యాసమహర్షి శ్రీ కృష్ణుదు, అర్జునికి గురించి ఒక చక్కని సంఘటనని వివరిస్తారు. ఒక రోజు సాయంత్రం సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడు అలా నడచి వెళుతుంటారు. వారు ఇద్దరూ మంచి స్నేహితులు, బంధువులు దగ్గర దగ్గర ఒక వయస్సు వారు, చిన్నతనంలో కలసి ఆడుకున్నవారు. అంతే కాదు అర్జునుడు శ్రీ కృష్ణుడు భక్తుడు. నిజానికి వారి మధ్య ఉన్న బంధం భగవంతుడు, భక్తుడు మాత్రమే.

అలా నడుస్తూ ఉండగా అకస్మాత్గా కృష్ణుడు అక్కడ చెట్టు మీద ఉన్న ఒక కాకిని చూపిస్తూ, “అర్జునా! ఆ ఆకుపచ్చని కాకిని చూసావా?” అంటాడు.

అప్పుడు అర్జునుడు, “అవును కృష్ణా! నేను ఆ ఆకుపచ్చని కాకిని చూసాను” అంటాడు.

వాళ్ళు ఇంకా కొంచం ముందుకి వెళ్ళాక, శ్రీకృష్ణుడు మరొక కాకిని చూపించి, “అర్జునా! ఆ నల్లని కాకిని చూడు” అంటాడు. అప్పుడు అర్జునుడు, “ కృష్ణా! నేను నల్లని కాకిని చూసాను” అంటాడు. కృష్ణుడు అర్జునిని వైపు తిరిగి, “అర్జునా! నీవు మూర్ఖుడివిగా ఉన్నావు. నేను నిన్ను తెలివైనవాడివి అని అనుకున్నాను. కాకి ఎలా ఆకుపచ్చగా ఉంటుంది? మొదటి నేను చూపించిన కాకి నల్లగా ఉన్నప్పుడు నీవుఎలా దానిని ఆకుపచ్చ కాకి అని అన్నావు? నీవు నన్ను ఆనందపరచాలని అలా అన్నావా?” అని అడుగుతాడు.

అప్పుడు అర్జునుడు, “కృష్ణా! నీవు చూపించి, ఆకుపచ్చ కాకి ఉన్నప్పుడు నాకు ఆకుపచ్చని కాకి కనిపించింది. నేను ఏమి చేయను. నేను అప్పుడు నల్లటి కాకిని చూడలేకపోయాను. నా కళ్ళు నా స్పర్శేంద్రియాలు నన్ను మోసం చేసాయి” అని జవాబు ఇస్తారు.

అర్జునుని స్పర్శేంద్రియాలు ఆయనని మోసం చేయలేదు. అవి భగవంతునికి అధీనమైపోయాయి. ఒక్కసారి ఆ స్థితికి చేరితే ఇక వెనక్కి వచ్చే ప్రసక్కి ఉండదు. ఇదీ సంపూర్ణమైన అధీనత అంటే

కృష్ణుడు భగవద్గీతలో ఇలా చెబుతాడు, “మీరు నా అధీనులయితే మీకు స్వేచ్ఛని ఇస్తాను” అని ఆయనని చేరటానికి మనం పూర్తి అధీనలమయిపోవాలి. మన స్పర్శేంద్రియాలని అధీనపరచాలి. మన చేతనస్థితి, మన తెలుసుకునే తత్యం సర్వం ఆయనే అయిఉండాలి. అప్పుడే మనం భగవంతుణ్ణి చేరగలం. నిజమైన భక్తుడు భగవంతుని సందేశానికి దాసుడవుతాడు కానీ రూపానికి కాదు :

నన్ను చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు. అది మతం పేరిట, ఆధ్యాత్మిక పేరు మీద లేదా భగవంతుని పేరు మీద ప్రపంచమంతా ఎందుకు ఇంత హింస జరుగుతుంది? ఎందుకు ఇన్ని పోరాటాలు జరుగుతాయి, అని.

ముందుకు మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఇదంతా ఆధ్యాత్మికత కాదు. అలాగే ఇది ఏమతం యొక్క ఉద్దేశం కాదు. ఎన్నో సంవత్సరాలుగా అవతార పురుషుల, యోగీశ్వరులూ అంతిమ సత్యమయిన భగవంతుడిని గురించి చెప్పే సత్యం ఒక్కటే అయితే ఆ సత్యాన్ని చెప్పే భాషా, పద్ధతి, మార్గం కాలానుగుణంగా, అప్పటి పరిస్థితులని బట్టి వారు వెల్లడి చేసే మారుతుంటారు అయితే. ఇక్కడ జరిగే పొరపాటం ఏమిటంటే భక్తులు, అనుచరులు గురువులు చెప్పే మాటలు సందేశాలను పట్టించుకోకుండా వారి రూపానికి వారి పేరుకి ప్రాముఖ్యాన్ని ఇస్తారు. గీతలోనికి సందేశాన్ని వదిలివేసి కృష్ణుణ్ణి, అతని మురళిని, నెమలిピンచాన్ని పట్టుకొని వేలాడితే వచ్చే ఫలితమే హింస. ఇది ఏ కాలానికైనా వర్తిస్తుంది. అలాకుండా శ్రీకృష్ణుని సందేశాన్ని గ్రహించి ఆయన రూపానికి పేరుకి ప్రాముఖ్యాన్ని ఇవ్వనప్పుడు వాళ్ళు నిజమైన కృష్ణ భక్తులవుతారు. అటువంటివారు కృష్ణ ప్రేమని, శ్రీకృష్ణుని సేవా మార్గాన్ని ప్రపంచమంతా వెదజల్లగలుగుతారు. ఒక చిన్న కథ:

వారణాసిలో శ్రీకృష్ణుని భక్తుడు :

నేను మీకు వారణాసిలో నివసించే ఒక భక్తుని కథ చెబుతాను. అతను గొప్ప కృష్ణ భక్తుడు. అతని దగ్గర భగవద్గీత పుస్తకం ఉన్నది. అదే ఆయన సర్వస్వం, అదే అతని సర్వసంపద. అతనికి ఎటువంటి ఆస్తులు లేవు.

శ్రీ కృష్ణ భక్తుడు ప్రతి రోజూ గంగానదిలో స్నానం చేసి ఒడ్డునే ఉన్న తన పూరిపాక దగ్గర ఉన్న చెట్టు క్రింద కూర్చొని ఆ గీతనిచదివేవాడు. శ్రీకృష్ణుని సందేశమయిన భగవద్గీతని అతను అత్యంత భక్తి పారవశ్యంతో చదివేవాడు. అలాగే కూర్చొని రోజుంతా కృష్ణుని ధ్యానం చేసేవాడు. అతను నిరంతరం శ్రీకృష్ణుని భక్తి పారవశ్యంలో ఉండేవాడు. అతని ధ్యానం, ధ్యాస సర్వస్వం కృష్ణమయమే. అతను శ్రీకృష్ణుని చేతనస్థితిలో తనను తానులీనమై తాను అనే విషయాన్ని మరిచిపోయే వాడు.

ఆ భక్తుడి సంగతి ఆ ఊరివారందరికీ తెలుసు. అందరూ ఆయనని ఎంతో గౌరవంతో, భక్తితో ఆదరించేవారు. భారతదేశం, అక్కడి ప్రజలు ఈ విషయంలో ఎంతో గొప్పవారు. ఎవరైనా ఒక వ్యక్తి ఎటువంటి పనిపాటు చేయకుండా, ఏ చెట్టుక్రింద అయినా కూర్చొని భక్తిపారవశ్యంలో ఉన్నా లేదా ధ్యానం చేసుకుంటూ ఉన్నా ఎవరూ వారి నిశ్చలతని భంగపరచరు. వారే ఆ వ్యక్తి బాగోగులు చూసుకుంటారు. అదే మరే దేశంలో అయినా అయితే అటువంటివారిని తీసుకెళ్ళి జైలులోనో లేదా ఏదయినా హోమ్లలో వేస్తారు.

ఇలా ఉండగా, ఒక రోజు ఒక భిక్షగాడు అతని దగ్గరకి వచ్చి “స్వామీ! దయచేసి ఏమయినా ఇవ్వండి. నేను భోజనంచేసి మూడు రోజులు అయింది అని దీనంగా అడుగుతాడు”.

ఆ భక్తునికి ఏమిచేయాలో తెలియదు. అతనే ఒక బిక్షగాడు. అతనికి ఉన్న ఏకైక ఆస్తి భగవద్గీత. ఆ సమయంలో బిక్షగాడు వచ్చి తాను మూడురోజుల నుంచీ ఏమీ తినలేదు అని అనగానే, భక్తుడు చాలా బాధపడతాడు. అతను తన పాకలో వెతుకుతాడు. ఆయనకి భగవద్గీత తప్పా ఏమీ కనిపించదు. ఆ పుస్తకమే అతని దైవం, అతని సర్వస్వం.

ఆకస్మాత్గా ఆ భక్తుడు దైర్యాన్ని తెచ్చుకొని,ఆ పుస్తకాన్ని చేత్తో పట్టుకొని,“అయ్యా! నా దగ్గర ఏమీ లేదు, ఈ పుస్తకం నీకు నేను ఇచ్చాను అని చెప్పి ఎవరికైనా అమ్ముకో ఊరిలో చాలామందికి నేనంటే గౌరవభావం ఉన్నది. ఎవరయినా నీకు డబ్బులు ఇచ్చి ఈ పుస్తకాన్ని కొనుక్కుంటారు. ఆ డబ్బులతో నీవు ఆకలి తీర్చుకో అని చెప్పి పుస్తకాన్ని ఆ బిక్షగాడికి ఇస్తాడు.

బిక్షగాడు ఆ పుస్తకాన్ని తీసుకువెళ్ళిపోతాడు. మర్నాడు ఆ భక్తుడు గీత చదివే సమయంలో ఇలా అనుకుంటాడు, “శ్రీకృష్ణా నేను నీ మాటలని నిలబెట్టటానికి నీ మాటలని ఇచ్చివేసాను” అని ఇతను నిజమైన భక్తుడు. అతను సత్యాన్ని చూడగలిగాడు. ఆ సత్యాన్ని అనుభవించాడు. ఆ అనుభూతులని వెల్లడి చేయగలిగాడు. అతను శ్రీకృష్ణుని ప్రేమని, సేవా మార్గాన్ని, భక్తిని అందరికీ తెలియచేయగలిగాడు.

ఇటువంటి భక్తులు ఉన్నప్పుడు గొడవలు, పోరాటాలు హింసలు జరగవు. అలా కాకుండా గీతలోని సందేశాన్ని వదలి గీతనో, కృష్ణుణో పట్టుకొని వేలాడినప్పుడే సమస్యలు వచ్చేది.

Photograph of a person

Our Nithyananda Meditation Acadamies (NMA)

USA:
Nithyananda Dhyanapeetam
9720, Central Avenue,
Montclair, CA 91763 USA
Phone: 626 531 6065
E-mail: [email protected]
URL: www.lifebliss.org

INDIA:
Nithyananda Dhyanapeetam
Nithyanandapuri
Kallugopahalli, Mysore Road, Bidadi
Bangalore - 562 109
Karnataka, INDIA
Phone: 91 +80 65591844 / 27202084
Fax: 91 +80 7288207
Email: [email protected]
URL: www.nithyananda.org

Nithyananda Dhyanapeetam Sri Ananda Rajarajeshwari Temple, Nithyananda Giri Pashambanda Sathamrai Village, Shamshabad Mandal Rangareddy District Andhra Pradesh - 501 218, INDIA Ph.: +91 93470 65288 E-mail: [email protected]

Nithyananda Dhyanapeetam
HYDERABAD CENTRE,
Ph : 93910 35463

Ebook ISBN : 979-8-88572-942-0