KAILASA Library/గణపతి/గణపతిSign in
గణపతి

గణపతి

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

సర్వకార్య ప్రారంభ దేవుడు, విశ్వమేధోశక్తి

Dancing Ganesha Idol
Paramahamsa Nithyananda

- పరమహంస నిత్యానంద

గణపతి

సర్వకార్య ప్రారంభ దేవుడు, విశ్వమేధోశక్తి

Dancing Ganesha
Nithyananda

ఇంటర్ నేషనల్ వేదిక్ హిందూ
యూనివర్సిటీ ట్రస్ట్ వారి అనుబంధ సంస్థ
ఇండియా ప్రచురణ
కాపీరైట్ 2008

ఈ పుస్తకానికి సంబంధించిన అన్ని హక్కులు నిత్యానంద ధ్యానపీఠం యొక్క సొంతం. నిత్యానంద ధ్యానపీఠం నుంచి వ్రాతపూర్వకంగా అనుమతి తీసుకోకుండా బహిరంగంగా లేదా వ్యక్తిగత వినియోగం కోసం ఇందులోని ఏ భాగాన్ని యాంత్రికంగా, ఫోటోగ్రాఫిక్ లేదా ఫోనోగ్రాఫిక్ ప్రక్రియ లేదా ఏ ఇతర ప్రక్రియ ద్వారా పునర్ముద్రించటం నిషిద్ధం.

ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నిత్యానందా ధ్యానపీఠం వారు చేపట్టే ధర్మకర్తుత్వ కార్యక్రమాల కోసం వినియోగించటం జరుగుతుంది.

నిత్యానంద ధ్యానపీఠం శ్రీఆనందేశ్వరి దేవాలయం నిత్యానందగిరి, పాశంబండ, సాతంరాయ్ విలేజ్, షంషాబాద్, రంగారెడ్డి జిల్లా. ఫోన్ : 93470 65288, 9866500350 www.nithyananda.org

ఓం శ్రీ ఆనంద గణపతియే నమః

ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనం

హంసహంసాయ విద్మహే
పరమహంసాయ ధీమహి
తన్నోహంస ప్రచోదయాత్

అత్యున్నత చేతనస్థితి యొక్క అద్భుతమయిన రూపమే గణపతి. గణపతి చవితినాడు ఈ విశ్వంలో ఉదయించాడు. ఆరోజునే మనం వినాయకచవితిని జరుపుకుంటాము. ఆయన సర్వ ప్రారంభాలకు ఆది దేవుడు. విశ్వమేధస్సుకి ప్రతిరూపం. ఆయన గురించి మనం చాలా విషయాలని, విశేషాలని చెప్పుకోవచ్చు.

ఆయన రూపం, ఏవిధంగా అయితే మనం గణపతిని చూస్తామో, ఏ రూపానికైతే మనం పూజలు చేస్తామో, ఏ రూపం మీద మన ధ్యాస నిలిపి ధ్యానం చేస్తామో, ఆ రూపం అత్యంత శక్తివంతమయినది. మీరు ఆ రూపం యొక్క విశిష్టతని అర్థం చేసుకోగలిగితే, ఆ రూపం ద్వారా వెల్లడి చేసే సత్యాలని తెలుసుకోగలుగుతారు. అలా తెలుసుకున్న సత్యాలని, లక్షణాలని మీరు మీ జీవితాలకి అన్వయించగలుగుతారు. అదే వినాయక పూజ.

వేద సంస్కృతిలో గణపతి రూపం అన్ని రకాల దేవతా రూపాలకన్నా అత్యధికంగా ఆరాధింపబడే రూపం. ఏ దేవతా రూపాన్ని ఎక్కువగా పూజించుతారో, ఏ దేవతా విగ్రహాలని అత్యధికంగా చెక్కుతారో, ఏ రూపాలని ఎక్కువగా రూపొందించుతారో అని ఒక సర్వే నిర్వహించితే అది గణపతి రూపం: ఆ మూర్తి వినాయకుడు అని తెలుసుకోగలుగుతారు. వినాయక చవితి సందర్భంగా ఎన్ని లక్షల వినాయకమూర్తులని తయారుచేస్తారో మనం ఊహించలేము.

అంతేకాకుండా భారతదేశంలో వినాయకుని విగ్రహం, వినాయకుని దేవాలయం లేని వీధి ఉండదు అని చెపితే అది అతిశయోక్తి కాదు. అదే విధంగా వినాయకుని బొమ్మగాని, పటంగాని, విగ్రహం కాని లేని ఇల్లు కూడా మీకు ఎక్కడా కనిపించదు. గణపతి రూపం అత్యధికంగా ప్రేమించే అత్యధికులతో పూజలందుకునే రూపం అనే విషయం సత్యం. ఉంచవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు. అంతిమ సత్యాన్ని తెలుసుకోవటానికి, అంతిమయిన అత్యుత్తమ స్థితిని చేరటానికి ఎవరికి నచ్చిన పద్ధతిని వారు పాటించవచ్చును. అందుకే మనకి ఇన్ని రకాల దేవుళ్ళు. ఇంకా చాలా కొత్త పద్ధతులు కొత్త రూపాలు కొత్త పేర్లు కూడా రావచ్చు. ఇది ఆధ్యాత్మికరంగంలో మనకి ఉన్న స్వేచ్ఛకి, మనం సాధించిన అభివృద్ధికి గుర్తు.

పశ్చిమదేశాలలో బయట ప్రపంచానికి సంబంధించిన గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నట్టే తూర్పుదేశాలలో అంతరంగ ప్రపంచానికి సంబంధించి గొప్పగొప్ప అంతరంగపు శాస్త్రవేత్తలు ఉన్నారు.

మనకి కొన్ని లక్షలమంది రుషులు, జ్ఞానోదయమయిన యోగీశ్వరులు, అవధూతలు, తత్వవేత్తలు ఉన్నారు. మనకి ఉన్న ఆధ్యాత్మిక సాహిత్య సంపద అతి ప్రాచీనమయినది, అత్యంత విలువయినది.

ఈ కారణంగానే మనకి ఇంతమంది దేవతారూపాలు. ఇష్టదేవత అనే సిద్ధాంతం కేవలం మనకి మాత్రమే ఉన్న గొప్ప సాంప్రదాయం.

విగ్రహారాధన :

ఈ సందర్భంలో మీకు మరొక విషయాన్ని కూడా స్పష్టం చేస్తాను. నన్ను చాలామంది ముఖ్యంగా పాశ్చాత్య భక్తులు అడుగుతుంటారు, మీరు హిందూమతంలో విగ్రహారాధన చేస్తారు అది సరియైన పద్ధతి కాదుకదా? అనివిగ్రహారాధన అంటే రాతి విగ్రహాన్ని పూజించటం కాదు. దయచేసి స్పష్టంగా అర్ధం చేసుకోండి. విగ్రహం భగవంతుడు కాదు. విగ్రహం ద్వారా భగవంతుడిని అర్చించుతాము. ఆకాశంలో చంద్రుణ్ణి మన ఇంటిలోని కిటికీ ద్వారా ఎలా చూస్తాము. కిటికీ అనేది ఒక మాధ్యమం, అంతేకాని కిటికీ చంద్రుడు కాదుకదా. విగ్రహం అనే ద్వారం ద్వారా భగవంతుని చేరటానికి ప్రయత్నించటమే విగ్రహారాధన. ఒక విషయం అర్ధం చేసుకోండి. రాతి విగ్రహం ముందు నిలబడి, "ఓ విగ్రహమా! నన్ను రక్షించు. నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు. ఓ రాతి విగ్రహమా! నన్ను దీవించు అని ప్రార్థించం కదా! ఓ దేవా! నన్ను కాపాడు అంటాము. కాబట్టి ఇది విగ్రహాన్ని ఆరాధించటం కాదు విగ్రహం ద్వారా భగవంతుని ఆరాధించటమే. విగ్రహం ద్వారా భగవంతుడిని ఆరాధించటం అంటే ఆధ్యాత్మిక ప్రగతికి ప్రధమ సోపానం.

గణపతి వివాదరహితుడయిన దేవుడు :

అన్ని రకాల సాంప్రదాయాల ఆరాధనలని అందుకునే గణపతి వివాదరహితుడయిన దేవతామూర్తి. ఆయనని అందరూ ప్రేమిస్తారు, గౌరవిస్తారు అత్యంత భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. ఆయన చాలా సామాన్యమయిన అమాయకత్వంతో ఉండే సులభసాధ్యుడయిన దేవతామూర్తిగా పేరుపొందాడు. భక్త సులభుడు, కోరిన కోర్కెలు తీర్చే కరుణామయుడు, విశ్వప్రేమను పంచే ప్రేమమూర్తి.

ఆశుదోష దేవతామూర్తి గౌరీ పుత్రుడు :

గణపతి అని అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చే విషయం ఈయన భక్తసులభుడు. అందుకే ఈయనని ఆశుదోషమూర్తిగా ఆరాధించుతారు. ఆయన అత్యంత సాధారణమయిన స్వామి. చాలా సులభంగా ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. శివుణ్ణి కూడా ఆశుదోషదేవతగా, భక్త సులభునిగా చెబుతారు, కానీ సాధారణ ప్రజలకి మాత్రం గణపతి నిజంగానే భక్త సులభుడు. ఆయనకి దగ్గర అవ్వటం, ఆయన ద్వారా ఆధ్యాత్మికంగానే కాదు లౌకిక ప్రపంచంలో కూడా అభివృద్ధిని పొందటం సాధ్యం. ఈ కారణం వలననే గణపతి అందరి దేవుడు అయ్యాడు. ముఖ్యంగా ఆయన సామాన్యులకి సాధారణ ప్రజలకి ప్రియమయిన దేవుడు.

బొజ్జగణపయ్య పెద్ద ఉదరం : మనందరం గణపతిని 'ఓ బొజ్జ గణపయ్యా' అని ప్రార్థించుతాము. గణపతి రూపంలో ముందుగా మనకి కనిపించేది పెద్దగా ఉండే ఆయన ఉదరం. అది అప్రతిహతమయిన అభివృద్ధికి చిహ్నం. అది అంతులేని దివ్య ఆనందానికి కూడా గుర్తు. అర్ధం చేసుకోండి, ఇది ఉబకాయంతో వచ్చిన పొట్టకాదు. అది గొప్ప ఆనందానికి, అంతులేని అభివృద్ధికి గుర్తు. దీని ద్వారా గణపతి దివ్యమయిన సాధారణత్వాన్ని, ఉన్నతమయిన అమాయకత్వాన్ని ఈ ప్రపంచానికి నిరంతరం తెలియచేస్తుంటాడు.

గణపతి ఉదరాన్ని బ్రహ్మాండం అని కూడా అంటారు. శివుని తలని విశ్వంతో పోల్చుతారు. అందుకే ఆయన తల మీద చంద్రుడు ఉంటాడు. గణపతి ఉదరం బ్రహ్మోండ విశ్వం. సంపూర్ణ విశ్వం అంతా ఆయన ఉదరంలోనే ఉన్నది. ఈ బ్రహ్మోండమే ఆయన పెద్ద ఉదరం అని అంటారు. సర్వ విశ్వాన్ని ఆయన ఉదరంలో నింపుకొని చిద్విలాసంతో ప్రకాశించే వినాయకుడు, అంతిమస్థితి అయిన నిత్యానంద స్థితికి ఒక నిదర్శనం.

పెద్ద చెవులు : గణపతి స్వామి యొక్క పెద్ద పెద్ద చెవులు వినటంలో ఆయనకి ఉండే అద్భుత నైపుణ్యాన్ని తెలియ చేస్తుంది. ఆయన అత్యంత సూక్ష్మ శబ్దాన్ని కూడా అదే విధంగా వినగల శక్తివంతుడు. అత్యంత క్లిష్టమయిన విషయాలని, అత్యంత వేగంగా చెప్పగల విషయాలని కూడా ఆయన జాగ్రత్తగా, నైపుణ్యంతో వినగలడు. వినే సమయంలో ఒక్క అక్షరాన్ని కాని, చిన్న శబ్దాన్ని కానీ వినాయకుడు వదలడు. గణపతికి ఉండే ఈ సునిశిత వినికిడి లక్షణం వలననే వ్యాసుడు మహాభారత రచనకి వినాయకుణ్ణి ఎంచుకున్నాడు. మహాభారతం చాలా పెద్ద గ్రంధం. వ్యాసుడు చెబుతూవుంటే అదే వేగంతో ఎక్కడా

అవి: అంకుశం,పాశం,దంతం,మోదకం. ఈ ఆయుధాలు మనకి నేర్పించే విషయాలు నేటి ఆధునికులకి అత్యవసరమయినవి.అవిఏమిటో చూద్దాము.

అంకుశం :

అంకుశం అంటే చిన్న ఇనుప ఊస. అది ఒక అడుగు పొడవు ఉండే చిన్న ఆయుధం. దీనిని ఏనుగుని నియంత్రించే మావటి ఉపయోగిస్తాడు. ఆ చిన్న అంకుశంతో మావటి అంత పెద్ద ఏనుగుని నియంత్రించగలుగుతాడు.

గణపతి చేతిలో ఉండే అంకుశమే బంధాలని ఏర్పరచకుండా ఉండగల శక్తి అనే ఒక చిన్న ఆధ్యాత్మిక సాంకేతిక పద్దతి. ఈ బంధాలు కల్పించకపోవటం అనే ఆధ్యాత్మిక పద్ధతి ద్వారా ఏనుగులా అత్యంత పెద్దదయిన మన మనస్సుని నియంత్రించవచ్చు. 'బంధవిముక్తులవ్వటం' అనే ఈ చిన్న ఆధ్యాత్మిక పద్ధతి ద్వారా అంత పెద్ద మానసిక స్థితిని మనం నియంత్రించగలము. బంధాలు ఏర్పరచకపోవటం అనే ఈ చిన్న పద్ధతి చాలా శక్తివంతమయిన సాంకేతిక పద్ధతి. ఇది చూడటానికి చాలా మామూలుగా చిన్నదిగా అనిపిస్తుంది. అయితే ఈ చిన్న పద్ధతి మనస్సుని నియంత్రించగల గొప్ప సాధన.

బంధాలని ఏర్పరచకపోవటం అంటే ఏమిటి?

అంటే ఇది మానవ సంబంధాలు లేదా వస్తు సంబంధాలు వీటికి సంబంధించినది కాదు.ఈ విషయం కొంచం సూక్ష్మమయినది. కానీ మిమ్ములని, మీ భావాలని సమతుల్యంగా ఉంచటంలో చాలా ఉపయోగపడుతుంది. మానసిక సమతుల్యం మనకి అత్యవసరం. ఎప్పుడయితే మానసిక సమతుల్యత లోపిస్తుందో అది అనేక సమస్యలని సృష్టిస్తుంది. ఈ పద్ధతిని సక్రమమైన విధంగా అర్ధం చేసుకొని సాధన చేస్తే పరమానందాన్ని ఇస్తుంది. బాధపడతాం, సంవత్సరం క్రితం జరిగినప్పుడు బాధపడతాం, నెల క్రితం జరిగినప్పుడు బాధ పడతాం. నిన్న జరిగినప్పుడు బాధపడతాం. ఇవన్నీ స్వతంత్రమయిన ఒకదానితో ఒకటి ఎటువంటి సంబంధం లేని సంఘటనలు. మనం వాటినన్నింటిని కలిపి ఒక బాధల చైను తయారు చేస్తాం. ఇక భవిష్యత్‌లో కూడా ఆ సంఘటన మనకి బాధ కలిగిస్తుంది అని నిర్ణయించుతాము.

అయితే సంతోషమనే గొలుసు, బాధ కలిగించే గొలుసు రెండూ అసత్యాలే. అవి రెండూ ఊహలు మాత్రమే. ఇదంతా ఒకదానితో మరొక దానికి, అసలు సంబంధంలేని విషయాలని కలిపి మనం సృష్టించుకున్న ఒక పరిస్థితి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటమే బంధవిముక్తులవ్వటం అంటే ఇదే బంధాలు కల్పించకుండా ఉండటం అనే పద్ధతి. గణపతి అంటేనే అత్యున్నత చేతనస్థితి. ఆయన చేతిలోని అంకుశం మనకి ఈ బంధవిముక్తి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అది మనకి మన అంతిమ స్థితి అయిన పరమానందం వైపు మన మార్గాన్ని చూపిస్తుంది.

పాశం :

గణపతి మరొక చేతిలో పాశం ఉంటుంది. పాశం అంటే తాడు. చేతిలోని పాశం భావావేశాలన్నీ ఆయన నియంత్రణలో ఉన్నవి అనే విషయాన్ని తెలియచేస్తుంది. ఆయన అన్ని రకాల భావావేశాలకి అతీతుడు. ప్రతిదీ పూర్తిగా ఆయన నియంత్రణలోనే ఉంటుంది. అందుకే గణపతిని సమతుల్యతకి ప్రతి రూపంగా భావిస్తారు. ఆయన అత్యుత్తమ సమతుల్యదశలో ఉంటాడు. భావావేశాల సమతుల్యత అంటే ఏమిటి?

మనలో ఉండే ఏడు ప్రధాన శక్తి కేంద్రాలయిన చక్రాలలో శక్తిప్రవాహాన్ని ఈ భావావేశాలే అడ్డుకుంటాయి. దీని వలన సాధారణ మానవులు బలహీనులుగాను, నైపుణ్యం లేని వారుగా అవుతారు. బంధవిముక్తి అనే పద్ధతి మీ మేధోపరమయిన సమస్యల నుంచి మీకు స్వేచ్ఛని ఇస్తుంది. మీరు మీలోని భావావేశాల మూలంగా, మీ నిశ్చలతని పోగొట్టుకుంటే, మీరు ఆ స్వేచ్ఛని పొందలేకపోతే మీరు జీవితంలో సమతుల్యతని సాధించలేరు. భావావేశాల సమతుల్యత మాత్రమే మీరు బంధవిముక్తులు కాగల పద్ధతికి ఆధారం అవుతుంది. అది మీలోని మేధోపరమయిన సమస్యలని నియంత్రించగలుగుతుంది. అంటే తెలివితేటల దశలో ఉండే సమస్యలని నియంత్రిస్తుంది.

మోదకం :

మోదకం అంటే తీపి పదార్థం. ఎప్పుడయితే మీరు బంధవిముక్తి అనే పద్ధతిని పాటించగలరో, ఎప్పుడయితే మీలోని వ్యతిరేకపు భావాలని నియంత్రించగలరో, అప్పుడు మీ జీవితం ఒక చక్కని తీపి పదార్థంలా ఉంటుంది. గణపతి చేతిలోని మోదకం దీనిని మనకి తెలియచేస్తుంది.

దంతం :

గణపతి మరొక చేతిలో దంతం ఉంటుంది. అది గణపతి దంతమే. మీరు మహాభారతం గురించి ఆ కథ గురించి విని ఉంటారు కదా! వ్యాసమహారుషి ఆ కథని చెబుతుంటే వినాయకుడు రాస్తుంటాడు. అకస్మాత్గా ఆయన చేతిలో కలం విరిగిపోతుంది. ఆయన స్థానంలో మరెవరైనా ఉండి ఉంటే వ్యాసరుషిని ఆగమని కొత్త కలం తెచ్చుకునేవారు లేదా అక్కడ నుంచి నిశ్శబ్దధంగా లేచివెళ్ళి కొత్త కలం తెచ్చుకునే వారు. ఈ కాసేపట్లో పెద్దగా పోయేదేమి లేదులే అని అనుకునేవారు. కాని విఘ్నేశ్వరుడు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా తనదంతాన్ని విరగకొట్టి దానితో వ్రాయటం కొనసాగిస్తాడు. ఈ సంఘటన వినాయకుని గురించి రెండు అద్భుత సత్యాలని తెలియచేస్తుంది. మొదటిది సమయానుకూలంగా నిర్ణయం చేయటం, ఏర్పరచకపోవటం అనే పద్ధతి, పాశాన్ని చక్కగా ఉపయోగించుకునే విధంగా చేస్తుంది. అప్పుడే మనస్సుని మనం సమర్ధవంతంగా నియంత్రించగలుగుతాము. మనస్సు మన బానిస అవుతుంది. మన చేతిలో ఒక పనిముట్టు అవుతుంది.

ఎవరయితే నిరంతరం అంకుశాన్ని తమ చేత ఉంచుకోగలరో అటువంటివారు గణపతిలా ఉండగలరు. అటువంటివారు తమ భావావేశాలని చక్కగా నియంత్రించగలరు. తమ ఆలోచనలకి లింకులు ఏర్పరచకుండా ఉండగలరు. మీరు గనుక అటువంటి స్థితిలో ఉండగలిగితే జీవితం మోదకం అనే ఒక తీపి పదార్ధంలా ఉంటుంది. అటువంటివారి జీవితం సమయస్ఫూర్తిని, అంకిత భావాన్ని నిరంతరం వెల్లడి చేస్తూ ఉంటుంది. అప్పుడు జీవితం, జీవనసరళి ఒక మోదకం అవుతుంది. అటువంటి వారి జీవితం ఒక గొప్ప ఉత్సవం. వారి జీవన సరళి ఒక నాట్యహేల అవుతుంది. మీరు అలా ఉండగలిగితే మీ జీవితంలో ప్రతిక్షణం ఒక ఉత్సవంలా గడచిపోతుంది.

గణపతి వాహనం:

గణపతి వాహనం మూషికం, అంటే ఎలుక. వాహనం అనేది ఆయా దేవతల యొక్క లక్షణాలని వెల్లడిచేసే ఒక పద్ధతి. మూషికం యొక్క ముఖ్య లక్షణం అత్యున్నతమయిన ఉత్సాహం. నిరంతరం చైతన్యంలో ఉత్సాహంతో జీవనకళతో తుళ్ళిపడే శక్తి ఈ మూషికం. గణపతి అత్యున్నత చైతన్యమూర్తి. అత్యుత్సాహపూరితమయిన శక్తి. నూతనోత్సాహానికి ఆయన ప్రతి రూపం. ఆ చైతన్యాన్ని మూషికం ద్వారా వెల్లడి చేస్తారు.

అదేవిధంగా నంది శివుని వాహనం. నంది యొక్క ముఖ్యలక్షణం అద్భుతమయిన ప్రశాంతత. ఆయనలోని అత్యున్నతమయిన శక్తి ప్రశాంతత వీటినే మనం చక్రాలు అంటాము. అవి మనలోని అత్యంత సూక్ష్మ కేంద్రాలు. మనలోని శక్తి ప్రవాహానికి అవి సహాయం చేస్తాయి. అటువంటి ఏడు ప్రధాన శక్తి చక్రాలు ఉన్నాయి అవి.

  1. మూలాధార చక్రం : ఇది వెన్నుముక చివరి భాగంలో ఉంటుంది.
  1. స్వాధిష్టాన చక్రం : ఇది నాభి ప్రాంతానికి రెండు అంగుళాలు క్రింద ఉంటుంది.
  1. మణిపూరక చక్రం : ఇది నాభి ప్రాంతంలో ఉంటుంది.
  1. అనాహత చక్రం : ఇది గుండె ప్రాంతంలో ఉంటుంది.
  1. విశుద్ధి చక్రం : ఇది గొంతు ప్రాంతంలో ఉంటుంది.
  1. ఆజ్ఞ చక్రం : ఇది కనుబొమ్మల మధ్యలో ఉంటుంది.
  1. సహస్రార చక్రం : ఇది తల శీర్ష భాగాన ఉంటుంది.

మూలాధార చక్రం : మూలాధార చక్రం వెన్నుముఖికి చివర ఉంటుంది. సర్వసృష్టికి ఆధారమయిన చక్రం మూలాధార చక్రం. మనలో ఉండే కల్పనలు, ఊహలు ఈ చక్రాన్ని బంధించుతాము. మనిషిలో ఉండే 80% శక్తి ఈ చక్రంలోనే ఉంటుంది. ఈ చక్రాన్ని శక్తివంతం చేయనవసరం లేదు. ఈ చక్రాన్ని వికసింపచేసి, చైతన్యవంతం చేస్తే గొప్ప శక్తి ప్రవాహం మనకి అందుబాటులోనికి వస్తుంది. ఈ శక్తి స్వచ్ఛమయిన దివ్యశక్తి. ఆ శక్తి మన జీవితాన్ని సంపూర్తిగా మార్చగలుగుతుంది. ఈ శక్తి మనని ఉన్నతస్థితికి చేర్చుతుంది.

గణపతి మూలాధారకి ఆది దేవుడు. ఆయన స్వచ్ఛమయిన దివ్యదృష్టికి ప్రతిరూపం. ఎప్పుడయితే స్వచ్ఛమయిన దృష్టి ఊహలతో నింపబడుతుందో అదే అన్ని సమస్యలకి కారణం అవుతుంది. అది మరిన్ని ఊహలకి, కల్పనలకి కారణం అవుతుంది. మన దైనందిన జీవితంలో ఉండే అనేక సమస్యలకి ముఖ్యకారణం ఈ ఊహలు కల్పనలు. కల్పనలు లేని దృష్టి మూలాధార యొక్క స్వచ్ఛమయిన శక్తి.

గణపతి స్వచ్ఛమయిన దివ్యదృష్టికి ప్రతిరూపం. అందుకే ఆయనని సర్వకార్యాలకి ప్రారంభదేవుడు అని అంటారు. గణపతితో ఏ పనిని ప్రారంభించినా, విఘ్నాలు లేకుండా ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రారంభించిన పనిని విజయవంతంగా పూర్తి చేయవచ్చు. పని జరుగుతున్న కాలంలో ఎటువంటి అడ్డంకులు రావు. స్పష్టమయిన దూరదృష్టి ఉన్నప్పుడు అడ్డంకులు రావు. అందుకే గణపతిని విఘ్నేశ్వరునిగా పూజించుతారు. ఆయన ఒక శక్తివంతమయిన ప్రణాళికా అధికారి. ఆయన స్వచ్ఛమయిన ఉన్నతమయిన ప్రణాళికా కర్త. స్వచ్ఛమయిన ప్రణాళికకి ఎటువంటి ముందు ప్రణాళికలు అవసరం లేదు. అటువంటి వారికి ప్రణాళిక పని కలసి జరుగుతాయి.

దూర దృష్టికి ఆధారం మేధస్సు. ఎప్పుడయతే మీకు స్పష్టమయిన, స్వచ్ఛమయిన దూరదృష్టి ఉండదో అప్పుడు మీరు ప్రణాళికలు వేయాలి. మీకు ఉన్న శక్తిని ప్రణాళికలు తయారు చేయటానికే సరిపెడతారు. అందుకే స్పష్టమయిన దృష్టి ఉన్నవారికి ప్రణాళికలు అవసరం లేదు. అటువంటి వారికి సమయస్ఫూర్తితో ప్రణాళికలు జరుగుతాయి. చేయవలసిన మార్పులు, అభివృద్ధి అసంకల్పితంగా, వాటంతటఅవే జరుగుతాయి. ఏవైనా కొత్త మార్పులు ఉన్నా, అవి కూడా చాలా చక్కగా సౌకర్యంగా ఇమిడిపోతాయి. స్వచ్ఛమయిన దూరదృష్టి కల వ్యక్తి మాత్రమే నిజమయిన ప్రణాళికని సృష్టించగలరు. దానిని నిరంతరం ఆధునికపరచగలరు. ఇదంతా మేధస్సుతో, సమయస్ఫూర్తితో మాత్రమే చేయగలరు. చెప్పే విషయాన్ని సూక్ష్మంగా గ్రహించి, చెప్పినది చెప్పిన విధంగా ఒక్క శబ్దాంకాని, అక్షరం కానీ తేడా లేకుండా వ్రాయగలగాలి.

వ్యాస మహర్షి చెప్పటం మొదలు పెట్టగానే ఆయన అందులోలీనమయిపోతాడు. ఆయన పూర్తిగా శ్లోకాలని కూర్చి చెప్పటంలో నిమగ్నమయిపోతాడు. ఆయన అత్యంత వేగంగా చెప్పేస్తాడు. ఇటువంటి అన్నివిషయాలు వ్రాసే వ్యక్తి గమనించగలగాలి. అటువంటి వ్యక్తి వ్యాసుడు ఉండే చేతనస్థితిలోనే ఉండాలి. అతను కూడా జ్ఞానోదయమయిన యోగీశ్వరుడు, విశ్వమేధస్సు కలిగిన సర్వోత్తముడు అయి ఉండాలి. అంతేకాదు బహుసూక్ష్మ బుద్ధిశాలి, సూక్ష్మగ్రాహి అయి ఉండాలి. అత్యంత వేగంగా, ఎటువంటి తప్పు లేకుండ వ్రాయగల నేర్పరి అయి ఉండాలి.

అయితే ఈ లక్షణాలు ఉన్నవారు చాలామంది ఉండి ఉండవచ్చు. కాని వ్యాసుడు గణపతినే ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే గణపతిలోని అత్యంత ప్రత్యేకమయిన లక్షణాలు అయిన సమయస్పూర్తి, త్యాగనిరతి, స్పష్టమయిన దృష్టి అందుకు కారణం. అంతేకాదు గణపతి యొక్క భౌతికరూపం కూడా అందుకు అనువుగా ఉన్నది.

ఆయన పెద్ద పెద్ద చెవులు ఎంత సూక్ష్మ శబ్దాన్ని అయినా ఇట్టే పట్టేయగలవు. ఆయన వినికిడి కళ అత్యంత నైపుణ్యమయినది. ఒక్క అక్షరాన్ని కాని ఒక్క శబ్దాన్ని కానీ వదలకుండా వినగల శక్తి ఆ చెవులకి ఉన్నది. వ్యాసుని వేగానికి, తనకి కావలసిన కచ్చితానికి ఈ విధంగా నైపుణ్యంలో వినగల వ్యక్తి కావాలి. ఆ వినికిడి శక్తి వ్యాసునికి అవసరం.

గణపతికి ఉన్న పెద్ద ముక్కు, సూక్ష్మాతి సూక్ష్మమయిన, చెవులకి అతీతమయిన విషయాలని కూడా గ్రహించగలుగుతుంది. వ్యాసుడు మౌనంగా ఇచ్చే వివరాలకి కూడా గ్రహించగల శక్తి వినాయకుని పొడవైన ముక్కుకి ఉన్నది.

వ్యాసగుహ :

ఈ భూమి మీద ఒక అందమయిన, ప్రశాంతమయిన, పవిత్రమయిన స్థలం ఉన్నది. అది బదరినాథ్కి 10కి.మి. దూరంలో హిమాలయాల మధ్య ఉన్న వ్యాసగుహ. ఇక్కడే, ఈ స్థలంలోనే వ్యాసుడు చెబుతుండగా గణపతి మహాభారతాన్ని వ్రాసినట్లు మన ప్రాచీనులు చెబుతుంటారు. ఆ పవిత్ర ప్రదేశం అంతా పవిత్రతతో, జ్ఞానంతో నిండి ఉంటుంది. ఆ స్థలంలోనే వ్యాసగుహ, వినాయకుని గుడి ఉన్నాయి. ఆ గుహని చూడగానే తాళపత్రాలు శిలాజాలుగా మారి గుహగా తయారయినట్టు మనకి కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఆ కొద్దిపాటి రాళ్ళు మాత్రమే ఒకదాని మీద ఒకటి పేర్చబడ్డ తాళపత్రాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది.

అక్కడ మహాగణపతిని ఏకదంతాయనమః అని ప్రార్థించి ఆ కథ రాసే సమయంలో ఆయన చేసిన త్యాగాన్ని భక్తితో ప్రేమతో తలుచుకుంటారు. ఆయనలోని సమయస్ఫూర్తికి హృదయ పూర్వకంగా అంజలిగటిస్తారు.

వినాయకుని పూజించటమంటే ఆ సమయస్ఫూర్తిని, త్యాగ నిరతిని, పని పూర్తి చేయాలనే సంకల్పాన్ని భక్తితో గుర్తు చేసుకొని ఆ లక్షణాలని అలవరచుకోవాలి అనుకోవటమే. మనం గణపతిని పూజించి ఆ నైపుణ్యాన్ని అలవరచుకొని మన జీవితాలలో అభివృద్ధి సాధించాలి. చేపట్టిన పనిని విజయవంతంగా ముగించాలి. ఇదే మనం ఈ కథ నుంచి తెలుసుకున్న విశేషం. గణపతి పూజ ద్వారా మనం పొందే పూజా ఫలం ఈ నైపుణ్యాలని అర్థం చేసుకొని మన జీవితాలకి అన్వయించుకోవటమే.

గణపతి అత్యున్నత చేతనస్థితి :

గణపతి అంటే ఏదో సరదాగా చిత్రించిన రూపం కాదు. అది ఒక బొమ్మ కాదు. అదే విధంగా ఆయన ఏదో ఒక విషయం కాదు. ఈయన అన్నింటికీ అతీతుడు. గణపతి భౌతికంగా, దివ్యత్వంతో జీవించిన ఒక అష్టోత్తర శతనామావళి జపం మిమ్ములని గణపతి ధ్యానం లోనికి తీసుకువెళ్ళగలగాలి. ఆ రూపంతో, ఆ శక్తితో ఒక బలమయిన అనుబంధాన్ని ఏర్పరచగలగాలి.

నేను చాలా మందిని చూస్తూంటాను. అష్టోత్తర శతనామావళి, సహస్రనామాలు జపిస్తూ ఉంటారు. అయితే అది ఒక ధ్యానంలా, ఒక భక్తి పూరకమయిన ఆరాధనలా చేయరు. ఒక యంత్రంలా చాలా యాంత్రికంగా చేస్తుంటారు. వారివైపు చూస్తే వారి పెదాలు చాలా స్పీడుగా నామాలు జపం చేస్తుంటాయి. చేతిలోని జపమాల అంతకంటే స్పీడుగా తిరుగుతుంటుంది. రెండు మూడు నిముషాలు కాగానే ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయో చాలా దీనంగా, భయంగా చూస్తారు.

పెదాలు ఇంకాస్త స్పీడు అందుకుంటాయి, జపమాలచేతిలో ఉంటే అది తిరుగుతూ ఉంటుంది. మనస్సు మాత్రం పూజ తరువాత చేయవలసిన పనుల లిస్టులు తయారు చేయటంలో మునిగిపోయి ఉంటుంది. అటువంటివారు నామాలు చదవటం ముగించగానే, ఇంట్లో వారికి వారు చేయవలసిన పనులు చెబుతారు. "ఏయ్! ఇంకా ఇక్కడే ఉన్నవా? ముందు వెళ్ళి పని చూడు. ఓరేయ్ చిన్నోడా, నువ్వు షాపుకి వెళ్ళి ఇవి తీసుకురా. మరి నీవు. ఈవిధంగా ఒక ప్రవాహంలా పనులు అప్పచెబుతుంటారు. దీని అర్థం ఏమిటంటే, జపం చేస్తున్నంత సేపు వాళ్ళు ఈ పనులు ఎవరికి ఎలా చెప్పాలో ఆ కార్యక్రమాన్ని తయారు చేసుకుంటున్నారు అని అర్థం.

ఇది సరియైన పద్ధతి కాదు. దీనిని పూజ అనరు. మీరు అష్టోత్తరం చదివినా, సహస్రం చదివినా, పూజ అయిపోయాకా, లేదా ఆ జపం ముగించాక మీరు ఏ దేవుని పేరు చదువుతారో ఆ రూపంతో మీ అంతరంగం నిండిపోయి ఉండాలి. ఆ రూపం తాలూకా ఆనందపారవశ్యంతో మీ ముఖం ప్రశాంతంగా, అత్యుత్తమ సమయస్ఫూర్తి, విశ్వమేధస్సు మీ జీవితాలలో నింపబడుగాక. ఆనంద గణపతి యొక్క పరమానందస్థితి మీ జీవితాలలో ఉండునుగాక. సరిపడా సమయాన్ని తీసుకొని గణపతి రూపాన్ని మీ అంతరంగంలో నిలుపుకోండి. గణపతి శక్తితో మిమ్మలని మీరు అనుసంధానం చేసుకోండి. ధ్యాన గణపతిని మీలో నిలుపుకోండి.

ఓం శ్రీ ఆనందగణపతయే నమః
ఓం వినాయకాయ నమః
ఓం గౌరీ ప్రియాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణేశ్వరాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం బుద్ధాయ నమః
ఓం దక్షాయ నమః
ఓం అధ్యక్షాయ నమః
ఓం ద్విజప్రియాయ నమః
ఓం అగ్ని గర్భచితే నమః
ఓం ఇంద్రశ్రీ ప్రదాయ నమః
ఓం వాణీప్రదాయ నమః
ఓం సర్వసిద్ధి ప్రదాతాయ నమః
ఓం సర్వనాథాయ నమః

ఓం సర్వారి ప్రియాయ నమః
ఓం సర్వాత్మకాయ నమః
ఓం సృష్టికర్త్రే నమః
ఓం దేవాయ నమః
ఓం అనేకారితాయ నమః
ఓం శివాయ నమః
ఓం సుధాయ నమః
ఓం బుద్ధిప్రియాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం భీత భయాయ నమః
ఓం కపినేనమః
ఓం శక్తినేనమః
ఓం విక్తువార్చహృదినేనమః
ఓం శ్రీకాయ నమః
ఓం అజాయ నమః
ఓం ఉపలక్రాయాయనమః
ఓం శ్రీపతియే నమః
ఓం శృతి వర్ధితాయనమః
ఓం కులాద్రి వేదే నమః
ఓం జరిలాయ నమః
ఓం కాళికాన్యాసకాయ నమః
ఓం చంద్రకూటాయనే నమః
ఓం కాంతాయ నమః

ఓం కామినే నమః
ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః
ఓం పాశాంకుశ ధరాయ నమః
ఓం చంద్రాయ నమః
ఓం గుణతీతాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం అగన్ మాషాయ నమః
ఓం స్వయం స్థాయ నమః
ఓం సిద్ధి పాదాంభుజాయ నమః
ఓం భీజ బలాస్తకాయ నమః
ఓం వరదాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం హృతినే నమః
ఓం ద్విజప్రియాయ నమః
ఓం దయాయుతాయ నమః
ఓం ధణాయాయ నమః
ఓం బ్రహ్మావేశివర్జితాయ నమః
ఓం ప్రమత్త దైత్యవారాయతాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం విభుదేశ్వరాయ నమః
ఓం రామర్చితాయ నమః
ఓం విధయే నమః
ఓం నాగరాజయజ్ఞోపవీతాయ నమః
ఓం స్థూల కంఠాయ నమః

గణపతి స్తోత్రం :

మనకి ఉన్న ఆధ్యాత్మిక సాహిత్యాన్ని మూడు భాగాలుగా విభజింపవచ్చు. అవి శాస్త్రాలు, సూత్రాలు, స్తోత్రాలు. శాస్త్రాలు అనే గ్రంధాలు మన జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని స్పష్టంగా వివరించతాయి. అవి భగవంతుడు అంటే ఏమిటో మేధోపరంగా వివరణ ఇస్తాయి.

రెండవ రకం సాహిత్యం సూత్రాలు. మనం అంతిమ స్థితికి చేరగాల పద్ధతులని చెబుతాయి. ఉదాహరణకి యోగ సూత్రాలు, శివ సుత్రాలు

మూడవ రకం సాహిత్యం స్తోత్రాలు.ఎవరయితే అంతిమ సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారో, ఎవరయితే భగవంతుని ప్రేమని అనుభవంతో తెలుసుకుంటారో అటువంటివారు వారు పొందిన ఆనందాన్ని స్తోత్రాల రూపంలో వెల్లడి చేస్తారు. అందుకే స్తోత్రాలు అంత అందంగా ఉంటాయి. మన హృదయాలని ఆనందంలో నింపుతాయి.

స్తోత్రం అంటే భగవంతునికి అధీనమటమే. అవి మనకి మన భావావేశాలకి ఎనలేని తృప్తిని ఇస్తాయి. అవి మనని భగవంతుని వశం చేస్తాయి. భగవంతుని వైభవాన్ని ఆనందపారవశ్యంలో పాడటమే స్తోత్రం.

ఎప్పుడయితే మనకి భగవంతునితో దగ్గర అనుబంధం ఏర్పడుతుందో, ఎప్పుడయితే ఆ సంబంధం లోతుగా ఉంటుందో అప్పుడు మనం వెల్లడి చేసే భావాలే స్తోత్రాలు. మన అంతరంగం ఆనంద నాట్యాలు చేయటమే స్తోత్రం. స్తోత్రం యొక్క అంతిమ లక్ష్యం భగవంతుడు

భగవంతుని పట్ల మనకి ఉన్న ప్రేమని, భక్తిని వెల్లడి చేసేదంతా స్తోత్రమే. మనకి భగవంతుని పట్ల ఉన్న లోతయిన అనుబంధమే స్తోత్రం. భగవంతుని ముందు నిలబడి మన హృదయాన్ని వెల్లడి చేస్తే వచ్చే సాహిత్యం సంస్కృత పదాలని ఉచ్చరించినప్పుడు వచ్చే శబ్ద తరంగాలు మీ భౌతిక శరీరాన్ని శుభ్రపరుస్తాయి. ఆ శబ్దాల ద్వారా వచ్చే శక్తి మీ వ్యవస్థని స్వచ్ఛంగా చేస్తుంది. అంతేకాదు అది గొంతుక దగ్గర ఉండే మీ శబ్దతత్వాన్ని నిర్మలంగా ఉంచి, దానిని శక్తివంతంగా చేస్తుంది. అందుకే మీరు సంస్కృత పదాలని పఠించే కొద్దీ, మీ శబ్దతత్వం మరింత స్వచ్ఛంగా తయారవుతుంది, మరింత శక్తివంతమవుతుంది.

అంతే కాదు సంస్కృతభాషకి శబ్దాలకి శక్తిని ఇచ్చే లక్షణం ఉన్నది. అది ఎలా అంటే, సంస్కృతం బాటరీలని రీఛార్జ్ చేస్తే, ఆ బాటరీలు జనరేటర్ పని చేసేలా చేస్తాయి. తిరిగి జనరేటర్ బాటరీలని రీఛార్జ్ చేస్తాయి. ఈ విధంగా సంస్కృతంలో శ్లోకాలు పఠించినా, మాట్లాడినా మనం మరింత శక్తివంతుల మవుతాయి. మీరు ఒకసారి గమనించండి. మీరు ఏ భాషలోనైనా మాట్లాడితే, ఒక్క అరగంటకే నీర్సపడతారు. అదే సంస్కృతంలోనైతే మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. అందుకే మీకు అర్థం తెలిసినా, తెలియకపోయినా ప్రతి రోజు ఉదయం ఒక అరగంటపాటు సంస్కృత స్తోత్రాలు కాని, శ్లోకాలు కానీ, నామాలు కాని పఠించండి. మీ పిల్లలతో కూడ చదివించండి. అది మీ గొంతు నుంచి నాభి ప్రాంతం వరకూ శుభ్రపరుస్తుంది. ఆ ప్రాంతంలో అనారోగ్య సమస్యలు రావు.

అదే స్తోత్రాలని పూర్తిగా ఆ దేవుని రూపంలో నిమగ్నమయ్యి పఠించితే మీకు అందమయిన ఆనందపారవశ్యం కూడా కలుగుతుంది.

గౌరవనీయులయిన స్వామీజీ, కేవలం ఏవో కొన్ని పేర్లు జపించటం వలన మాకు ఆధ్యాత్మిక అనుభవం జరుగుతుందా?

ఆధ్యాత్మిక అనుభవం పొందటానికి మీకు పేరుతోగాని, రూపంతో కాని అవసరం లేదు. దానిని మీరు కేవలం భక్తితోనే సాధించగలరు. అయితే గుర్తుంచుకోండి. మీ భక్తి కంటే మించిన శక్తివంతమయినది ఎక్కడా లేదు. ప్రియమయిన స్వామీజీ, మరి పూజలు హోమాలు కూడా ఇటువంటివేనా? మతపరమయిన పూజలు, హోమాలు అనేవి ఒక నిర్దిష్టమయిన పద్ధతిలో ఉంటాయి. వాటిని ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి అనే విషయాలు కచ్చితంగా ఉంటాయి. అంతేకాదు అవి చేయటం చాలా కష్టం. అందుకే పూజలు విస్తృతంగా అందరి చేతా చేయబడతాయి. ఇవి వారి అహాన్ని తృప్తి పరుస్తాయి. అదే సులభమయినవి చేయమంటే ఇష్టం ఉండదు. అది వారి అహాన్ని తృప్తిపరచదు. అరగంట ధ్యానం చేయమంటే ఇష్టపడరు కాని ఒక చెట్టు చుట్టూ లేదా గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయమంటే ఆనందంగా చేస్తారు.

అయితే పూజలు అహాన్ని బలపరుస్తున్నంతవరకూ మీకు ఎటువంటి ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు. మీరు పూజించేటప్పుడు ఈ సర్వ చైతన్యాన్ని, విశ్వశక్తిని విగ్రహాలకి అనుసంధానం చేసి, సర్వాంతర్యామితో లోతయిన అనుబంధాన్ని ఏర్పరచుకొని అప్పుడు పూజలు చేయండి. అది మీలో కొంత ఆనంద పారవశ్యాన్ని ఇస్తుంది. అంతేకాని నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, వేయిసార్లు పూజ చేసా, లక్షసార్లు జపించాను, ఇన్ని దేవాలయాలు చూసాను అని ప్రచారం చేసుకునే వారికి, అటువంటి వారితో పోటీపడేవారికి మిగిలేది కేవలం అహాన్ని తృప్తిపరచటమే కాని ఆధ్యాత్మిక అనుభవం కాని, ఆనందపు పారవశ్యం కాని కలగదు. చేసేపూజని పూర్తి కృతజ్ఞతా భావంతో, మీ అంతరంగం నిండా ఆమూర్తిని నింపుకొని చేసే పూజ మీకు ఆనందపు పారవశ్యాన్ని ఇస్తుంది.

యాంత్రికంగా పూజలు చేయవద్దు. భగవంతునితో ఒక వ్యాపార వ్యవహారంలా పూజలు చేయవద్దు. మీరు భగవంతుని సమక్షంలో, అది గుడిలో నిర్ణయించుకుంటారో అది ఒక దినచర్య అయిపోతుంది. అందులో ఆనంద పారవశ్యాన్ని పొందలేరు. అప్పుడే మీరు ఏకాగ్రతని నిలపలేరు.

మరొకసమస్య కూడా ఉన్నది. సహస్రనామాలు కాని, అష్టోత్తర శతనామావళి కాని మీరు ముందు చాలా చక్కగా ప్రారంభిస్తారు. కొద్దిసేపుకాగానే ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయి, ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయో చూసుకోవడం మొదలు పెడతారు. నేనెప్పుడూ ఈ విషయం పదేపదే చెబుతాను. మీరు పూర్తి తన్మయత్వంతో, ఏకాగ్రతతో ఎన్నిపేర్లు చదవగలిగితే అన్ని పేర్లు మాత్రమే జపించండి. మీ పైన ఏదేవతా లేదా దేవుడూ కూర్చొని అకౌంటు పుస్తకం పెట్టుకొని మీరు ఎన్ని పేర్లు జపించారు అని అకౌంట్లు వ్రాయరు. మీకు బోరు అనిపించగానే, ఏకాగ్రత లేదు అనిపించగానే పుస్తకం మూసి, ఒక నమస్కారం చేసి అక్కడినుంచి లేచివెళ్ళండి. అంతే కాని లెక్కలు కడుతూ సమయం వృధా చేయకండి. అది భక్తి కాదు, ఆధ్యాత్మికత కాదు.

మీరు కేవలం లెక్కలు కోసం, అకౌంట్లు బాలన్స్లో ఎన్ని సహస్రాలు చదివాను అని వ్రాసుకోవటానికి భగవంతుని పేర్లు జపించవద్దు. అది తప్పు ఎంత ఏకాగ్రతతో ఎంత తన్మయత్వంతో జపించారో చూసుకొండి. అటువంటి జపం మీకు నిజమయిన ఆనందాన్ని ఇస్తుంది.

గౌరవనీయులైన స్వామీజీ, మనకి ఇంతపది దేవతల రూపాలు ఉన్నాయి కదా! ఏ దేవుడిని ఎంచుకోవాలో అయోమయంగా ఉన్నది?

నేను ఎప్పుడూ ఒక విషయం చెబుతాను, ఏ దేవుని రూపానికి ఏ పద్దతికి మీరు మీ హృదయంలోనుంచి స్పందించతారో, ఏ దేవుని రూపంతో మీరు అనుబంధం ఏర్పరుచుకుంటారో, ఆ రూపమే మీ ఇష్టదేవత. ఆ దేవుని రూపంతో మీరు లోతయిన అనుబంధాన్ని ఏర్పరుచుకోగలుగుతారు. మీరు ఈ విధంగా ఏ దేవుని రూపానికి లేదా ఏ పద్దతికి స్పందించలేనపుడు లోతయిన అనుబంధం ఏర్పడనప్పుడు మీ అన్వేషణ కొనసాగించండి. మీ

Our Nithyananda Meditation Acadamies (NMA)

INDIA:
Nithyananda Dhyanapeetam
Nithyanandapuri
Kallugopahalli, Mysore Road, Bidadi
Bangalore - 562 109
Karnataka, INDIA
Phone: 91 +80 65591844 / 27202084
Fax: 91 +80 7288207
Email: [email protected]
URL: www.nithyananda.org

Nithyananda Dhyanapeetam Sri Ananda Rajarajeshwari Temple, Nithyananda Giri Pashambanda Sathamrai Village, Shamshabad Mandal Rangareddy District Andhra Pradesh - 501 218, INDIA Ph.: +91 93470 65288 E-mail: [email protected]

Nithyananda Dhyanapeetam
HYDERABAD CENTRE,
Ph : 93910 35463

Nithyananda Dhyanapeetam VISKHAPATNAM CENTRE Viskhapatnam District, Andhra Pradesh, INDIA

Nithyananda Dhyanapeetam ELURU CENTRE, West Godavari District, Andhra Pradesh - 534 003, INDIA Ph : 08812 - 250712, Cell : 94908 26692

Nithyananda Dhyanapeetam BHIMAVARAM CENTRE, West Godavari District, Andhra Pradesh, INDIA Ph : 9912144429, 99498 33599