KAILASA Library/ఆనంద స్పురణ_తెలుగు (Ananda Spurana Telugu)/ఆనంద స్ఫురణ కార్యక్రమం (ASP)Sign in
ఆనంద స్పురణ_తెలుగు (Ananda Spurana Telugu)

ఆనంద స్ఫురణ కార్యక్రమం (ASP)

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

(రెండురోజుల శిక్షణ కార్యక్రమం)

ఆనంద స్ఫురణ కార్యక్రమం అనేది ఒక అద్భుతమైన శిక్షణ కార్యక్రమం. దీనిని పరమహంస శ్రీ నిత్యానంద, ధ్యానం ఆధారంగా మనలోని ఏడు శక్తి కేంద్రాలయిన ఏడు చక్రాలని శక్తివంతం చేసి వాటిని వికసించేయటానికి రూపొందించారు. ఆధునిక మానవుల అవసరాలకి అనుగుణంగా, నేటి కాలంలోని సాంఘిక ఆర్థిక జీవన సరళికి సరిపడే విధంగా, నేటి మానవుల మానసిక ఆధ్యాత్మిక అవసరాలను వారి పంథాలో తీర్చగలిగే విధంగా ఒక చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పరమహంస ఎంతో నైపుణ్యంతో తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన 'ఆనందస్ఫురణ' అనే పేరు పెట్టారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని అమెరికా, కెనడా మొదలయిన దేశాలలో 'లైఫ్ బ్లిస్ ప్రోగ్రాం' (Life Bliss Program) అంటారు.

సేలమ్ (తమిళనాడు)లో 2004 సం॥లో ఆనంద స్ఫురణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూన్న పరమహంస శ్రీ నిత్యానంద

సేలమ్ (తమిళనాడు)లో 2004 సం॥లో ఆనంద స్ఫురణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూన్న పరమహంస శ్రీ నిత్యానంద

ఆనందస్ఫురణ అంటే ఏమిటి?

ఈ కార్యక్రమానికి ఆనందస్ఫురణ అనేపేరు స్వామి ఎందుకు పెట్టారు అంటే, మన లోపల నిజమైన ఆనందం నిక్షిప్తమయి ఉన్నది. అంటే మనం బయట ప్రపంచంలో ఏ ఆనందం కొరకు వెతుకుతున్నామో అది మనలోనే ఉన్నది. కానీ ఆ విషయం మనకు తెలియదు. మనం ఆనందం అనేది ప్రాపంచిక విషయాలలోనే ఉన్నది అనే తప్పుభావనన మనలో లోతుగా నాటుకుపోయేలా చేసాము. దీనిని ఒక గాఢమయిన నమ్మకంలా ఈ సమాజం మార్చివేసింది.

మనలోని ఆనందాన్ని తెలుసుకోలేకపోవటానికి ఉన్న మరొక కారణం, మనలోపల ఉన్న అసలయిన ఆనందాన్ని మన లోపలికి ప్రవాహంలా వచ్చే భావావేశాలు, వ్యతిరేకపు ఆలోచనలు ఆ ఆనందం పైన ఒక గట్టి పొరలా ఏర్పడిపోయాయి. వయస్సు పెరిగే కొద్ది ఆ ఆనందం, పొరల అడుగుకి అణగద్రొక్కబడినది. చివరికి అది అహంకారం అనే ఒక బలమయినన కవచం క్రిందికి వెళ్ళిపోయింది. ఒక్కసారి మనం మన ఆలోచనలని, మనలోని అహంకారాన్ని ప్రక్కన పెట్టి చిన్న పిల్లలను గమనించితే ఈ విషయం అర్థమవుతుంది. వారి ఆనందానికి కారణం ఉండదు. వారు వారితో సౌకర్యంగా, ఆనందంగా ఉండగలుగుతారు. వారి మీద సమాజపు నిబంధనలు, అహంకారం, భావావేశాలు అనే పొరలు ఇంకా ఏర్పడలేదు. అదే వారి ఆనందానికి కారణం. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి?

మరి మనలోని ఆనందాన్ని మనం కనుగొన లేకపోతే ఏమవుతుంది? దానిని కనుగొనే అవసరం ఉన్నదా?

ఈ ప్రశ్నకు సమాధానం 'ఇది చాలా అవసరం' ఆ ఆనందాన్ని తెలుసుకోలేకపోయినందుకే ఎంత సంపాదించినా, ఏమి సాధించినా మనలోని లోతయిన అసంతృప్తి మాత్రమే మనకి మిగులుతున్నది. ఎంత చదువుకున్నా, ఏమి సాధన చేసినా అశాంతి అలానే ఉంటున్నది. మన మీద మనలోని భావావేశాలయిన కోపం, అత్యాశ, కోరిక, అసంతృప్తి, మొదలయినవి దాడి చేసి మనని తమ అదుపులో ఉంచగలుగుతున్నాము. మన మనస్సు, అహంకారం మన మీద అధికారాన్ని చెలాయిస్తున్నాయి. ఏ చిన్న పని చేసినా మన శక్తిలేని వారిగా బలహీనపడిపోతున్నాయి.

మనలోని అశాంతి, అసంతృప్తిని శాశ్వతంగా పొగొట్టగలమా? అసలు మనం తృప్తిగా, ప్రశాంతంగా నిత్యం పరమానందంలోనే ఉండలేమా? అసలు మనకి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఆనందంగా ఎలా ఉండగలం? మన మీద ఒత్తిడి ఏవిధంగా తగ్గుతుంది?

పై ప్రశ్నలకి, అనుమానాలకి సమాధానమే పరమహంస రూపొందించిన ఆనందస్ఫురణ శిక్షణా కార్యక్రమం. ఆనందస్ఫురణ అంటే మనలో ఎక్కడో నిక్షిప్తమయిపోయిన ఆనందాన్ని వికసింపచేసి దానిని మన స్ఫురణకి, మన అందుబాటులోనికి తెచ్చే శిక్షణ కార్యక్రమం ఇది. అందుకే పరమహంస నిత్యానంద దీనిని ఆనందస్ఫురణ అని అంటారు.

ఈ శిక్షణని ఎవరు ఇస్తారు?

ఆనందస్ఫురణ అనే రెండురోజుల కార్యక్రమం నిరంతరం ప్రపంచంలో ప్రతిచోటా జరుగుతుంటాయి. సాధారణంగా పెద్ద పెద్ద ఊళ్ళలో, అమెరికా, కెనడా మొదలయిన దేశాలలో ప్రతి శని, ఆదివారాలలో జరుగుతాయి.

ఈ కార్యక్రమాలు నిత్యానంద ధ్యానపీఠం వారి ఆచార్యులు నిర్వహించుతారు. పరమహంస నిత్యానంద ప్రత్యక్ష పర్యవేక్షణలో, ఆయన చేత శిక్షణ పొంది ఆయనచే నియమించబడిన ఆచార్యులు మాత్రమే ఈ ఆనందస్ఫురణ కార్యక్రమాన్ని నిర్వహించుతారు. ఈ విధంగా స్వామీజీ చేత నియమించబడిన ఆచార్యులు 400పైగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఏమి నేర్పించుతారు :

ఈ కార్యక్రమం మొత్తం రెండు ముఖ్య అంశాల మీద ఎక్కువ ఏకాగ్రతని నిలుపుతుంది. అవి 1) ధ్యానపద్ధతులు 2) మన శరీరంలోని ఏడు ప్రముఖ శక్తి కేంద్రాలు అయిన ఏడు చక్రాలని శుభ్రపరచి, శక్తిని నింపి వాటిని చైతన్యపరచటం. ఈ చక్రాలు వికసించటానికి ఉపయోగపడే విధంగా ఏడు ధ్యానపద్ధతులని నేర్పించుతారు. ఈ ఏడు ధ్యానపద్ధతులు మనదైనందిన జీవితానికి కావలసిన ప్రాధమికమయిన ధ్యానపద్ధతులు.

వీటితో పాటు శిక్షణనిచ్చే ఆచార్యులు, చక్రాలు శక్తి హీనమయినప్పుడు మనలో కలిగే భావావేశాలని, అవి మన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏవిధంగా అవరోధాలని కల్పించుతాయో ఉదాహరణలతో చిన్న చిన్న కథలతో వివరించుతారు. అదేవిధంగా ధ్యానం ద్వారా ఆ శక్తి కేంద్రాలని వికసింపచేస్తే మనలోని ఆధ్యాత్మిక ప్రగతి మన జీవితంలోని నాణ్యతని ఏవిధంగా అభివృద్ధి పరుస్తుందో కూడా వివరించుతారు. ఈ రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న తరువాత మనలో ఉండే చాలా అనుమానాలు నివృతి అవుతాయి. అదేవిధంగా మన శారీరక, మానసిక సమస్యలు చాలా వరకు మాయం అవుతాయి.

తైవాన్‌లో జరిగిన ఒక ఆనందస్ఫురణ కార్యక్రమం

తైవాన్‌లో జరిగిన ఒక ఆనందస్ఫురణ కార్యక్రమం

కెనడాలో జరిగిన ఒక ఆనందస్ఫురణ కార్యక్రమం

కెనడాలో జరిగిన ఒక ఆనందస్ఫురణ కార్యక్రమం

బ్రెజిల్‌లో జరిగిన ఒక ఆనందస్ఫురణ కార్యక్రమం

బ్రెజిల్‌లో జరిగిన ఒక ఆనందస్ఫురణ కార్యక్రమం

ఈ కార్యక్రమం చేయాలి అంటే ఏమి చేయాలి?

ఎవరయినా ఒక ప్రాంతం లేదా ఒక ఊరులో ఉండే 25 లేదా అంతకంటే ఎక్కువమంది ఈ కార్యక్రమం కావాలి అని వారికి దగ్గరలోని ఏ నిత్యానందా ధ్యానపీఠం వారికి ఫోను ద్వారా లేదా మీరు వెళ్ళి చెప్పినా వారు ఆచార్యులని మీ దగ్గరకే పంపించుతారు. ఆచార్యులు మీ దగ్గరకి వచ్చి మీకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని అందించుతారు.

అంతేకాకుండా పెద్ద పెద్ద సంస్థలు, ఆఫీసులు, బ్యాంకులు, కాలేజీలు స్కూల్స్, ధ్యానం ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఏవయినా సంస్థలలో కూడా వారి సమయానికి అనుగుణంగా శిక్షణని ఇస్తారు. ఈ విధంగా ప్రపంచంలోని అన్ని పెద్ద పెద్ద సంస్థలలో వీరి శిక్షణా కార్యక్రమాలు జరిగాయి.

ఆనందస్ఫురణ కార్యక్రమంలో శిక్షణ పొందినవారంతా ఎంతో సంతృప్తిని ఆనందాన్ని పొందుతారు. కార్యక్రమం అయ్యాక వారు అందరూ చెప్పే మాట “మేము ఇంతకాలానికి అసలు ధ్యానం అంటే ఏమిటో తృప్తి కలిగే విధంగా తెలుసుకున్నాము”. అని హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలు గ్రామాలలో కూడా ఈ కార్యక్రమం చేయటానికి నిత్యానంద ధ్యానపీఠం వారు సంకల్పించారు.

ఆనందస్ఫురణ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో కొంతమంది అనుభవాలు :

✦ ఈ కార్యక్రమము నా జీవితాన్ని మార్చివేసింది. దీని వలన వచ్చినంత మార్పు నాకు ఎన్నడూ కలగలేదు. ఒక యోగ టీచర్‌గా నాకు చక్రాలతో పరిచయము ఉంది, కాని ఈ కార్యక్రమములో చక్రాలను శుభ్రపరచి చైతన్యవంతం చేసినంతగా నాకు ఎప్పుడు అనుభవములోకి రాలేదు.

కైసాండ్ర వాలిక్
యోగా టీచర్,
ఫీనిక్స్, అరిజోనా,
అమెరికా.

✦ ఆనందస్ఫురణ శిక్షణా కార్యక్రమం రెండురోజులలో నేను పొందిన అనుభూతి అద్భుతం. ప్రతి ధ్యానం నాలో చాలా ప్రభావాన్ని చూపాయి. ఈ కార్యక్రమం నాకు చక్కటి ప్రశాంతతని ఇచ్చింది. దీనిని నేను తప్పనిసరిగా సాధన చేస్తాను. ఈ శిక్షణా కార్యక్రమం అందరూ చేయాలనేది నా లక్ష్యం.

హరి రామలింగయ్య
రైల్వేస్,
విజయవాడ,

ఇండియా.

✦ ఈ కార్యక్రమంలో నేను మంచి ధ్యానమే కాకుండా జీవితములో ఉపయోగపడే మంచి జ్ఞానాన్ని కూడా నేర్చుకున్నాను. నాట్ నటరాజన్ డైరెక్టర్, మైక్రోసాఫ్ట్ సియాటిల్, వాషింగ్టన్, అమెరికా.

✦ ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న తరువాత నేను ఒక దీర్ఘకాలిక నిద్ర నుంచి మేల్కొనట్టుగా అనిపించింది. కార్మెన్ మురాసావిచ్ గ్రాఫిక్ డిజైనర్, లాస్యాంజిల్స్, కాలిఫోర్నియా, అమెరికా.

✦ ఈ కార్యక్రమంలో నేర్పించిన ధ్యానాలు అత్యంత కొద్ది కాలంలోనే నాలో వినూత్నమైన మార్పును తీసుకువచ్చాయి. ఈ ధ్యానాల వలన నాకు చాలా ఆనందం కలిగి నేను అంధకారంలో నుంచి వెలుతురు లోనికి వచ్చినట్టుగా ఉన్నది. హేమ యాంగిలికా బర్న్స్ ఫీనిక్స్, ఆరిజోనా, అమెరికా.

✦ ఈ కార్యక్రమములో నేర్చుకున్న జ్ఞానం వలన నా జీవితంలో ఇప్పటివరకు ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ఈ కార్యక్రమములో పాల్గొన్న తరువాత నా మిత్రులు చాలా మంది నన్ను అడిగారు నేను ఎందుకు ఆనందంగా ఉన్నాను అని. సంధ్య గోడె వ్యాపారవేత్త, విశాఖపట్ణం, ఇండియా.

Our Nithyananda Meditation Acadamies (NMA)

USA:
Nithyananda Dhyanapeetam
928 Huntington Dr,
Duarte, Los Angeles CA 91010, USA
Ph.: 1-626 -205-3286
Email: [email protected]

Nithyananda Dhyanapeetam
4610, N.High Street, Columbus
OH 43214, USA
Ph.: 614-571-8425

INDIA:
Nithyananda Dhyanapeetam
Nithyanandapuri
Kallugopahalli, Mysore Road, Bidadi
Bangalore - 562 109
Karnataka, INDIA
Phone: 91 +80 65591844 / 27202084
Fax: 91 +80 7288207
Email: [email protected]
URL: www.nithyananda.org

Nithyananda Dhyanapeetam
Sri Anandeshwari Temple,
Nithyananda Giri
Sathamrai, Shamshabad Mandal
Rangareddy District
Andhra Pradesh - 501 218, INDIA
Ph.: +91 93470 65288
E-mail: [email protected]

Nithyananda Dhyanapeetam 36/1, Kamakshiamman Street, Peramanur Salem – 636 007 INDIA Ph.: 91 +427 3098133

Nithyananda Dhyanapeetam
Nithyanandapuri
Zamin Pallavaram, Chennai – 600 043
Tamilnadu, INDIA
Ph.: 98404 27966 / 94440 19791
(Directions: Behind Tirusoolam Hill.)

Nithyananda Dhyanapeetam Nithyanandapuri Othaivaadai Street, Pavazhakundru Tiruvannamalai – 606 601 Tamilnadu, INDIA Ph.: 94432 33789 / 94433 26202 (Directions: On Big Street (Peria theru), take the lane opposite Indian Overseas bank. This is Othaivaadai Street.)

Nithyananda Dhyanapeetam Nithyanandapuri 2/200, Tirumangkuruchi Post Namakkal – 637 003, Pavazhakundru Tamilnadu, INDIA Ph.: 94433 88437 / 93447 17629 (Directions: Near the Collector's office)

Nithyananda Dhyanapeetam
Nithyanandapuri
102, Azhagapurampudur, Salem – 636 016
Tamilnadu, INDIA
Ph.: 94433 64644 / 94432 35262
(Directions: Behind Sharada College)

Nithyananda

మనలో ప్రతి ఒక్కరూ నిరంతరం వెతికేది ఆనందం కోసమే. అది ఐశ్వర్యంతో, అధికారంతో సంబంధబాంధవ్యాలతో మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన ద్వారా మనం వెతికేది కేవలం ఆనందం కోసమే. అయితే మనకి ఆ విషయం తెలియదు.

మనం ఎంత అభివృద్ధి సాధించినా, ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా, ఎన్ని అత్యుత్తమ అవార్డులు పొందినా, ఎంత ఐశ్వర్యం సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు పొందినా చివరికి మనలో శూన్యం ఏర్పడుతుంది. ఆనందం ఉండదు. ఎందుకు?

ఎందుకు మన సంతోషం తాత్కాలికంగా, చంచలంగా ఉంటుంది? ఎందుకు మనం ఎప్పటికీ శాశ్వతంగా ఆనందస్థితిలో ఉండలేకపోతున్నాము?

ఇంత విశాలమైన ప్రపంచం, ఇన్ని రకాల వస్తువులు, సౌఖ్యాలు,విలాసాలు, ఐశ్వర్యం, చదువు, జ్ఞానం, మేధస్సు..... ఎందుకు మనని శాశ్వత ఆనందస్థితిలో ఉంచలేకపోతున్నాయి?

Ebook ISBN: 979-8-88572-376-3

నిత్యానంద ధ్యానపీఠం

శ్రీ ఆనందేశ్వరి దేవాలయం

పాశంబండ, సాతంరాయ్ విలేజ్, శంషాబాద్. రంగారెడ్డి జిల్లా, ఫోన్ : 93470 65288, 98665 00350 www.nithyananda.org