KAILASA Library/పరమహంస శ్రీ నిత్యనంద ఉవాచ - 1/విషయ సూచికSign in
పరమహంస శ్రీ నిత్యనంద ఉవాచ - 1

విషయ సూచిక

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ఉవాచ1
నిత్యానంద ధ్యానపీఠం వారి వివరాలు42
  • నేను భగవంతుడనని నిరూపించుకోవడానికి రాలేదు. మీరే భగవంతుడని నిరూపించటానికి వచ్చాను
  • మనమందరము వెతుకుతున్నది పరమానందము కొరకే
  • ఆనందము మన జన్మహక్కు. ఆనందము మన సహజ లక్షణము
  • పురోగతికి స్వేచ్ఛ ఒక పునాది లాంటిది
  • పరిణితి శక్తినిస్తుంది. శక్తి పరిణితినిస్తుంది.
  • మనలో నిక్షిప్తమయి ఉన్న అన్ని రకములయిన శక్తులను బయటకు తీసుకురాగలిగే కీలకమయిన అంశం, ధ్యానం
  • నాకేమి తెలియదు అని తెలుసుకోవడం, జ్ఞానానికి మొదటి మెట్టు
  • జీవితం విసుగు కలిగించదు; మనస్సు (మైండ్) విసుగు కలిగిస్తుంది

✦ ఎదుటి వారు చెపుతున్నది ఓర్పుతో వినే చాతుర్యము మనము కోల్పోయాము

✦ ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరూ వినడానికి సిద్ధముగా లేరు. వినేవారే కరువయ్యి పోయారు

✦ గంభీరత్వము అనేది ఒక అనారోగ్య లక్షణము

✦ నవ్వు అణుచుకోవడము చాలా అనారోగ్యాలకి కారణము

✦ నిశ్శబ్దము ధ్యానంలోనికి వెళ్ళడానికి ఒక అందమైన మార్గం

✦ ఆనందము సౌభాగ్యాన్ని ఆకర్షిస్తుంది

✦ మనందరి దగ్గర ఖచ్చితముగా ఒకటున్నది, అదే బాధ

✦ నేను ఇక్కడకు మీకు మాటలు చెప్పడానికి రాలేదు. మాటలకు అతీతంగా తీసుకువెళ్ళడానికి వచ్చాను

✦ మన జీవితము మనము ఎంచుకున్నది. మన

జీవితానికి కావలసిన నిర్ణయాలు మనమే తీసుకుంటాము. వేరెవ్వరూ కాదు

✦ ఆధ్యాత్మికత అనేది నేను మీకు నేర్పించలేను. కాని అది మీరు నేర్చుకోగలరు. మీరు అది నేర్చుకునే విధంగా నేను మిమ్మలని చెయ్యగలను

✦ ఆధ్యాత్మికత అనేది మన మనస్సుకు లేక మన
హృదయానికి సంబంధించినది కాదు. అది మన
ఉనికికి మన ఆత్మకి సంబంధించిన విషయం

✦ ఆధ్యాత్మికత అనేది వికసించనంత వరకూ మారణహోమాలు ఆగవు

✦ మన వ్యక్తిత్వాన్ని మరచి పోవడమే ఆధ్యాత్మికత

✦ నిజమైన ఆధ్యాత్మికత అంటే జ్ఞానోదయము
పొందడము కాదు. ఆ జ్ఞానోదయపు ప్రయోజనాలను
అందరకూ నేర్పటమే

✦ ఆధ్యాత్మికత అనేది ప్రతి సమయములోను ప్రతి వయస్సులోను ఉపయోగపడేది

  • అధ్యాత్మికత అంటే ఉదయాన్నే పూజగది లో లక్ష్మీదేవి ముందు గంట కొట్టడం కాదు. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ, మంచితనాన్ని మనలో నింపుకోగలగటం
  • అధ్యాత్మికత అనేది ఒడ్డులేని ఒక మహాసముద్రము లాంటిది
  • అధ్యాత్మికత అంటే మానవునికి విశ్వశక్తికి ఏర్పడే సంబంధమే
  • చేప సముద్రము కోసం ఎలా వెతుకుతుందో అదే విధంగా మనం దైవం గురించి మన వెలుపల వెతుకుతున్నాము
  • అధ్యాత్మికత అంటే మీ చేతన స్థితిని మేల్కొల్పి మీ నిజస్వభావాన్ని మీకు తెలియచేయడమే
  • మంత్రాలు చాలా శక్తివంతమయినవి. మంత్రాలలో శబ్దాన్ని ఒక పద్ధతిలో అమర్చబడి ఉన్నది. శబ్దము విశిష్ట శక్తికి ప్రతిరూపము

✦ శరీరము ద్వారా గాని, మనస్సు ద్వారా గాని, ఆత్మ ద్వారా గాని మీకు ఎదయితే శక్తినిస్తుందో, అదే ఆధ్యాత్మికత

✦ ఎదయితే మిమ్మలని బలహీనపరుస్తుందో అది ఆధ్యాత్మికత కాదు

✦ దైవానికి మూలం ప్రేమ

✦ మీకు కావాలన్నా లేదన్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీకు అర్ధమయినా లేక అర్ధమవ్వకపోయిన మీరు దైవంతో సంభందం ఏర్పరచుకోని ఉన్నారు

✦ మీరు అందరిలో భగవంతుడిని చూడటమే ప్రార్థన అంటే

✦ ప్రార్ధనలో, మీరు దైవాన్ని ప్రార్దిస్తారు. ధ్యానంలో మరే దైవం

✦ మొట్టమొదటిగా చిన్న పిల్లలకు నేర్పవలసినది ఏమంటే, దైవం అంటే ప్రేమ అని

  • భగవంతునికి మీగురించి బాగా తెలుసు. మీగురించి మీకన్నా ఎక్కువగా తెలుసు. దైవం మిమ్మలని అర్థం చేసుకోలేకపోతే మిమ్మలిని ఇంకెవరు అర్థం చేసుకోగలరు.
  • మీ కోరికలను నెరవేర్చనప్పుడు దైవం మరింత గొప్పదని చెప్పాలి. ఎందుకంటే దైవానికి తెలుసు మీ కొన్ని కోరికలు మీకు ఎంత హానిక రమో
  • దైవం, మనం చేసిన ఒక్క మంచి పనిని గుర్తు పెట్టుకుని మనం చేసిన ఎన్నో తప్పులను క్షమిస్తుంది.
  • దైవం ఎంత గొప్పదంటే, ఈప్రపంచం తనదే ఐనా, మనకి ఎంపిక చేసుకొనే స్వేచ్ఛనిస్తాడు.
  • దైవం తర్కానికి అతీతమైనది.
  • దైవం కర్మ, కర్త, మరియు క్రియ.
  • మీ అహంకారం ఎంత తగ్గుతుందో, మీరు భగవంతునికి అంత దగ్గర అయినట్టు.

✦ పరాశక్తి మీ యోగ క్షేమాలను చూస్తుంది.

✦ జ్ఞానోదయమయిన మన మధ్య గురువులు మన మధ్య ఉన్న భగవంతుని రూపాలు

✦ మీరు భగవంతుని ఆలింగనము చేయలేకపోతే, ఈప్రపంచములో మీరు దేనితోనూ ఆలింగనము చేయలేరు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా దైవమయం

✦ ఈ సృష్టి అంతా ఒక వస్తువు అనుకోవడమే టెర్రరిజానికి, యుద్ధాలకు కారణము

✦ నేను ప్రేమలో గెలిచినందువలనే సన్యాసిగా మారాను. ప్రేమలో ఓడికాదు

✦ స్వామి అంటే, ఎవరయితే తమలోని సర్వశక్తులని వాస్తవం చేసుకోగలిగారో, ఎవరయితే తమని తాముగా వ్యక్తపరుచుకోగలరో, ఎవరయితే తమ ఉనికితో పూర్తిగా అనుగుణంగా ఉంటారో, వారిని స్వామి అని అంటారు

  • ఎవరు పరమానంద స్థితిలో ఉంటారో వారిని స్వామి అని అంటారు
  • దైవంతో ఏర్పడే అత్యున్నతమయిన సంబంధమే సన్యాసం
  • సన్యాసులు ప్రాపంచిక విషయాలకు అతీతంగా అతి సామాన్యమయిన జీవితాన్ని గడుపుతారు
  • మీరు ఎప్పుడయితే యావత్ ప్రపంచాన్ని ప్రేమిస్తారో అప్పుడు మీరు సన్యాసి అయినటు
  • నిజమయిన సన్యాసికి, ప్రార్ధనే ప్రేమ అని, ప్రేమే ప్రార్ధన అని తెలుసు
  • జ్ఞానోదయమయిన గురుదేవుని శక్తిని మీ అంతరంగంలోనికి చొచ్చుకుపోయి, మీ ఆత్మను చేర గలుగుతుంది
  • జ్ఞానోదయం గురించి బాధపడటం మీ అహంకారానికి పరాకాష్ఠ

✦ అహంకారము లేనప్పుడే జ్ఞానోదయము కలుగుతుంది

✦ జ్ఞానోదయమయిన గురుదేవుని వాగ్ధానము వలన వచ్చిన శక్తితో మీరు ఏదయినా సాధించగలరు

✦ గురుదేవులకు మానవాళిపట్ల ఉన్న కరుణ వలననే వారు అవతరించుతారు

✦ ధ్యానం వలన మనసు కుంగుబాటుకు లోనుకాదు

✦ ధ్యానం మన సమయాన్ని మరియు శక్తిని సద్వినియోగం చేసుకోవడానికి దోహదం చేస్తుంది

✦ ధ్యానం మనలో అత్యంత ప్రశాంతతను కలిగిస్తుంది

✦ కృతజ్ఞత భావం అత్యున్నతమయిన ధ్యానం

✦ ధ్యానం మిమ్ముల్ని అంతరాత్మలోనికి తీసుకు వెళ్ళి, మీకు ప్రేమ మీద ఉన్నటువంటి తప్పుఅర్థాలను సరిచేస్తుంది. మీకుప్రేమ మీద మంచి అవగాహన వచ్చేటట్లు చేస్తుంది

✦ ధ్యాన ప్రక్రియ ద్వారా మనము పరాశక్తికి అనుగుణంగా ఉండగలుగుతాము

✦ నిశ్శబ్దము ఒక మహత్తరమైన ధ్యాన ప్రక్రియ. నిశ్శబ్దము మనకు చక్కటి ఉపశమనం కలిగించి మనల్ని ఉత్తేజవంతులని చేస్తుంది

✦ ఈ క్షణంలో పరమానందములో ఉండటమే ధ్యానం

✦ ధ్యానం మిమ్మల్ని భౌతికంగా, మానసికంగా, భావోద్రేకంగా మరియు ఆధ్యాత్మికముగా వికసింప చేయగలుగుతుంది

✦ ధ్యానం మీకు అత్యంత స్వేచ్ఛని ఇస్తుంది. మీ నుంచి మీకు స్వేచ్ఛనిస్తుంది. మీరు సృష్టించుకున్నటువంటి వ్యక్తిత్వము నుంచి మీకు స్వేచ్ఛనిస్తుంది

✦ బాహ్య ప్రపంచం మరియు అంతర ప్రపంచాన్ని జయించడానికి ధ్యానం చాల కీలకమైనది

✦ వర్తమానాన్ని నిరాకరించకుండా ఆస్వాదించడమే ధ్యానం

  • ధ్యానం ద్వారా వచ్చినటువంటి అనుభూతిని అనుభవించవలసిందే కాని వాటిని వివరించలేము
  • ధ్యానం మీ అంతరాత్మలోనికి తీసుకు వెళ్ళడానికి ఒక మంచి మార్గం
  • మీ మౌనాంగీకారము లేకుండా మిమ్ముల్ని ఎవ్వరూ బాధ పెట్టరు
  • ఆనందం ఏవిధంగా మీరు ఎంచుకున్నారో అదే విదంగా బాధకూడా మీరు ఎంచుకున్నదే
  • మీరు భాదపడటానికి అలవాటు పడటము వలన, ఆనందము ఒక ఆటంకముగా కనిపిస్తుంది
  • మనం ఎప్పుడయితే ప్రతిదానిని మనకు కావలసిన విధంగా చూస్తామో అప్పుడు మనం మనకి ప్రతికూలంగా ఉండే నిజాలను సేకరించుతాము. దీనివలన బాధతప్పదు
  • బాధకి మరియు సంతోషానికి మూలం ఒకటే

✦ మన బాధలకు మన ఆలోచనలే కారణం

✦ బాధ అనేది మనజీవన స్థితికాదు. అది ఆలోచనాస్థితి. అది ఒక సంఘటన నుంచి వచ్చే స్పందన

✦ మనలోపల ప్రశాంతత లేనప్పుడే, ఎదుటి వారి ప్రశాంతతను భంగపరుస్తాము

✦ ఈ ప్రపంచములో ఉన్న అన్ని సమస్యలకు మన దగ్గర సమాధానము ఉన్నది, మన సమస్యలకి తప్ప. కాని మనం ఇది ఒప్పుకోము

✦ నొప్పి అనేది మన శరీరం, మన మనస్సుకు పెట్టుకున్న ఒక అర్జీ, ‘దయచేసి కొంచెం నాగురించి పట్టించుకో’ అని

✦ సుదీర్ఘమయిన బాధను, వైద్యులు కుంగుబాటు అని అంటారు

✦ మానసిక కలతలు మన శరీరంలో అనారోగ్యాలుగా మారతాయి

✦ బాధ వలన మనము ఒక పరిపూర్ణమయిన మానవునిగా అవుతాము

✦ మనము బాధలని చాలా మామూలుగా, అలవాటుగా ఆహ్వానిస్తాము. అవి వచ్చిన తరువాత వాటి మీద ఫిర్యాదు చేస్తాము

✦ ఎదుటివారి మీద కాని ప్రాపంచిక విషయాల మీదకాని ఎక్కువగా ఆశించడం వలననే మనము బాధకు గురి అవుతాము

✦ అణచి వేయబడిన భావోద్రేకాలు చాల ప్రమాదకరము

✦ మనం వర్తమానాన్ని నిరాకరించడము వలన బాధ కలుగుతుంది

✦ మీ అంతరంగములో కొంచెం చోటు ఉంటే మీరు
నన్ను స్వీకరించగలరు. లేదంటే మీరు నన్ను
స్వీకరించలేరు

✦ నన్నుకాని లేదా నాజ్ఞానోదయం యొక్క అనుభూతి పొందాలంటే విశాలమైన మీ అంతరంగపు ద్వారాలను తెరచి నేను చెప్పినది గ్రహించండి

నేను నాయొక్క అత్యున్నతమైన సత్యము యొక్క
అనుభవము నుంచి మాట్లాడతాను. నేను నా ఉనికి
నుంచి మాట్లాడతాను

మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి నాదగ్గరకు రావద్దు. మీకోసం ఒక మంచి భవిష్యత్తును రూపకల్పన చేయటం కోసం నాదగ్గరకు రండి

నాకు శక్తి నేను ప్రారంభించిన ధ్యానపీఠం అనే ఉద్యమము దానికి సంబంధించిన కార్యక్రమాల నుంచి వస్తుంది. నేను తీసుకునే భోజనం నుంచి కాదు

సంతోషానికి వ్యతిరేకాలు దుఃఖం, వ్యధ ఉంటాయి కాని పరమానందానికి వ్యతిరేకాలు లేవు

పరమానందాన్ని మనలో అనుభవించినప్పుడు మనకు శాంతి కలుగుతుంది

  • మీరునమ్మినా నమ్మకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయిన, మీకు అర్థమయినా అర్థముకాకపోయిన, ఈ విశ్వశక్తి మీ ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది
  • మీ ఆనందానికి 100% మీరే బాధ్యులు
  • మీ అంతర్యంలో అత్యంత లోతుగా పరిశీలిస్తే, మీ ప్రగాఢమయిన అనుమానంలో కొంత విశ్వాసం ఉంటుంది. మీ ప్రగాఢమయిన విశ్వాసంలో కొంత అనుమానం ఉంటుంది.
  • మీరు నరకంలో ఉన్నప్పుడే మీరు ఎదుటి వారికి నరకాన్ని సృష్టిస్తారు. ఎందుకంటే మీలో ఏమైతే ఉన్నదో అదే మీరు ఎదుటి వారికి ఇస్తారు
  • మీరు ప్రతీ క్షణాన్ని పరిపూర్ణంగా జీవిస్తే మీ జీవిత సారాన్ని ఆస్వాదించవచ్చు
  • ఎదుటి వారి నుంచి ఆశించటానికి ఒక అంతం లేదు

✦ మీ వ్యక్తిత్వములో మార్పు రావచ్చు కాని మీ వ్యక్తిగతంలో మార్పురాదు

✦ శక్తి పూరితమయిన మీ ఆలోచనలు మీ శరీరాన్ని, శరీరములోని కణాలను, మీ నిర్ణయాలను, మీ కార్యనిర్వాహక శక్తిని, మీ జీవితములో జరిగే కొన్ని సంఘటనలను ప్రభావితం చేస్తాయి

✦ మీ శరీరంతో ఒక అందమయిన మరియు స్నేహపూర్వకమయిన బాంధవ్యాన్ని ఏర్పరచుకోండి

✦ మీరు ఇంటి దగ్గర బాధపడుతుంటే దానిని 'పని' అంటారు. మీరు మీ ఆఫీసులో బాధపడుతుంటే దానిని 'వృత్తి' అంటారు. మీరు సముద్రము ఒడ్డునకూర్చుని భాదపడతే దానిని 'విశ్రాంతి' అంటారు

✦ మీ ఆలోచనలు చాల శక్తి పూరితమయినవి. అందువలన మీరు బాధరహిత మరియు నిర్మలమయిన మనస్సుతో జీవితాన్ని గడపవలసిన అవసరం ఉన్నది

✦ మీరు పోగోట్టుకోగలిగినది ఏమి లేదు అని తెలుసుకుంటే మీ భయాలన్నీ పోతాయి

⊹ 'భయం' మీద ఉన్న భయమే, అన్ని భయాలకీ కారణం

⊹ మీ భయాల్లోనికి చూడండి, అవి మాయం అయిపోతాయి

⊹ జీవితము ఒక సంతోషభరితమైన ఉత్సవం లాంటిది. దానిని ఆస్వాదించటాన్ని వాయిదా వేయ్యకండి

⊹ మీరు జీవితాన్ని ఆనందించాలంటే ఇప్పుడే దానికి సమయం, మరెప్పుడో కాదు

⊹ అనుమానము మరియు నమ్మకము అనేవి మనస్సు అనే నాణానికి ఉండే బొమ్మ, బొరుసు లాంటివి

⊹ మీకు ఆలోచనలు ఉన్నంతసేపు ఆనందముండదు. మీకు ఆలోచనలు అన్న ఉండాలి లేదా ఆనందమన్నా ఉండాలి

⊹ మిమ్మల్ని మీరు యథావిధిగా స్వీకరించ గలిగితే ఇక ఆలోచనలకి తావులేదు

⊹ మనస్సుకు క్లిష్టమైన విషయాలంటే చాల ఇష్టం

  • మీ ఆలోచనలు మీ అహంకారానికి ప్రాతినిధ్యం వహిస్తాయి
  • బుద్ధి లేకుండా శక్తి రావడం చాలా అపాయకరము
  • మనస్సు మన చేతిలో ఒక పనిముట్టులా ఉండాలి. కాని మనమే మనస్సు చేతిలో ఒక పనిముట్టులా అయిపోయాము
  • మీరు మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు, మీ ఆలోచనలను ఆపలేరు. మీరు నిర్మలంగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు తగ్గుతాయి
  • మీ మీద మీకు ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలను క్రోడీకరిస్తే అదే అహంకారము
  • మీరు సత్యాన్ని అర్థం చేసుకుని సత్యంతో ఉండగలిగితే మీ ఆలోచనలు తగ్గుముఖం పడతాయి
  • మీ అహంకారానికి ఉన్న అత్యంత ప్రమాదకరమయిన ఆయుధం ‘అనుమానం’
  • అహంకారం చీకటి వంటిది. దానికి ఒక ఉనికి అనేది లేదు
  • అహంకారం ఒక మాయవంటిది
  • ప్రేమ, సంతోషము, కరుణ అనేవి దుర్భలమయిన ఒక మానసిక స్థితి
  • ఏదైతే మీ ఉనికి కాదో, దానిని అంతం చెయ్యండి.
  • మీరు అహంకారాన్ని పూర్తిగా విడనాడితే, మీ మీద మీకు ఆధిపత్యం వచ్చినట్టే
  • మీ శరీరాన్ని, ఆలోచనలను, భావోద్రేకాలను గమనించండి, అది ధ్యానానికి ఒక పునాది మరియు గమ్యం వంటిది
  • మానవజాతి ఒక్కటే ప్రకృతితో సంబంధాలను పూర్తిగా కోల్పోయింది
  • మీరు కృతజ్ఞత భావంతో జీవిస్తే మీరు దైవం యొక్క ఆశీర్వచనాలతో జీవిస్తునట్టే
  • మీరు అందరికీ సమయాన్ని కేటాయిస్తారు, మీకు తప్ప
  • మనం ఎవరి మీదనయినా ఆధారపడితే మీరు మానసిక వ్యధకి లోనవడానికి అవకాశము ఉన్నది
  • ఎదుటి వారికి కృతజ్ఞత తెలియచేయడమే కాదు మీరు కృతజ్ఞతగా మారాలి
  • మీ దైనందిన విషయాలలో మీ పరిశోదాత్మకతతో సమయాన్ని వృధా చేయకండి
  • మనలో సంపూర్ణ పరివర్తనకు దోహదం చేసేరీతిలో పని చేయడమే అతికష్టమయిన తపస్సు
  • ప్రేమే మీ జీవితము
  • నిజమయిన ప్రేమ అన్నింటికి అతీతమయినది
  • గౌరవ భావన అనేది ఎదుటి వారిని దూరం చేస్తుంది. ప్రేమ అందరిని దగ్గర చేస్తుంది

నిజమైన కరుణకి ఆకాంక్షలేమి ఉండవు

నిజమైన ప్రేమ ఏమి ఆశించకుండా అందరిని ప్రేమిస్తుంది

Photograph of a woman

సాధారణమైన ప్రేమ, మనల్ని విడకొడుతుంది.
నిజమైన దైవ ప్రేమ ఎటువంటి హద్దులు లేకుండా
అందరినీ కలుపుతుంది

⊹ ప్రేమే ప్రార్థన

⊹ ప్రేమ అనేది ఎప్పుడూ నిజం, అది మాయ కాదు

⊹ ప్రేమని ఏ శక్తి కూడా నాశనం చేయలేదు

⊹ ప్రేమలో మొదటి పాఠం ఏమిటంటే, ఎవ్వరినీ ప్రేమించమని అడగవద్దు

⊹ భయము, ప్రేమ ఎన్నటికీ కలిసి ఉండవు

⊹ మీరు ఎవరినయినా ప్రేమించి నట్లయితే వారిని బంధవిముక్తులు చెయ్యండి

⊹ ప్రేమ అనేది మీ హృదయము నుంచి వచ్చేది. భయం మీ ఆలోచనల నుంచి వస్తుంది

⊹ అహంకారం పూర్తిగా పోయినప్పుడే పరిపూర్ణ ప్రేమ ఏర్పడుతుంది

⊹ కామం నుంచి ప్రేమకు జరిగే పరిణామము ఒక రసాయనిక చర్య లాంటిది

✢ ప్రేమ మరియు కామము కలిసి ఉండవు

✢ శక్తిని వ్యక్తపరచినపుడు అది ప్రేమగా మారుతుంది

✢ నిజమయిన ప్రేమ చాల లోతయిన,
ఉత్తేజకరమయినది. అది మీరు ఆస్వాదిస్తేకాని
తెలియదు

✢ నిజమయిన ప్రేమకి ఏవస్తువుతో కాని, ఏ బాంధవ్యముతో కాని సంబంధము ఉండదు

✢ ఈ జీవితమే మనకు పరాశక్తి ఇచ్చిన ఒక గొప్ప వరం

✢ సాధన చేయడానికి ఒక మంచి సమయం గురించి వేచి ఉండవద్దు

✢ జీవితమనేది నిరంతరము ఒక ఉత్సవము వంటిది

✢ మార్పుకు మీకు స్వాగతం పలకండి; జీవితం మీకు స్వాగతం పలుకుతుంది

✢ మరణం నుండి కాపాడుకోవడము వలన, జీవితానికి ఇంకా కొన్ని సంవత్సరాలు మీరు కలపవచ్చు. మీరు పరాశక్తి మీద నమ్మకము మరియు ప్రేమ చూపడము వలన మీరు జీవించినన్ని రోజులు పరమానందంతో బ్రతుకుతారు

  • మీ జీవితములో కొంత కాలాన్ని నిశ్శబ్దముతో గడపటానికి కేటాయించండి
  • జీవితమంటే ఒక గమ్యం చేరాలి అనే భావనను విడిచి పెట్టాలి
  • మనము జీవితాన్ని తదేకంగా చూడటం మర్చిపోయాము
  • బాధను తొలిగించాలంటే ఒకే ఒక మార్గం, నిరంతరము మంచి ఆలోచనలలతో ఉండటము
  • అపరాధ భావం అనేది ఒక సామాన్యమయిన మరియు తీవ్రమయిన శిక్ష
  • మీ ఉనికితో మీరు ఆనందంగా ఉండటం అలవర్చుకోండి
  • పేదరికం మనల్ని భాధించదు. మనం పేదవాళ్ళం అనే ఆలోచన మనల్ని భాదిస్తుంది
  • మీ ఉనికి యొక్క నాణ్యతను మార్చినప్పుడు మీరు చేసే పనులలో కూడా నాణ్యత పెరుగుతుంది. దీని వలన మీ జీవిత నాణ్యత పెరుగుతుంది
  • మీకు ఎప్పుడయినా మీరు జీవితాన్ని ఆనందించడము లేదు అని అనుకుంటే దానికి కారణం మీ ఆలోచనలు, మీ అహంకారము, అంతేకాని జీవితము ఒక ఉత్సవము లాంటిది
  • మీరు 'వద్దు' లేక 'కాదు' అని చెప్పినప్పుడు, మీరు దృడంగా ఉంటారు. మీరు 'అవును' అన్నప్పుడు ఆనందంలో తేలియాడుతుంటారు
  • మీరు ఆనందించే సామర్ధ్యము మీలోనే ఉన్నది
  • మీ శరీరమే ఒక మానవాతీతమయిన అద్భుతము
  • జీవితము ఒక గమ్యం కాదు. ఒక బాట లాంటిది

ధ్యానం ఆనందమయిన మార్గం. ఆనందానికి మార్గం
కాదు. ఆ మార్గంలో ప్రయాణమే పరమానందదా
యకమైనది

సిగరెట్ కాల్చేవాళ్ళకి పొగవలన ఆనందం రాదు. చట్టాన్ని లేదా ఒక పద్ధతినో ఉల్లంఘిస్తున్నామనే ఆలోచనే ఆనందాన్నిస్తుంది

గమ్యం అనేది లేకపోతే ఈ జీవితమే ఆనందమయమవుతుంది

పరమానందమే మన మార్గము మరియు గమ్యము

మానసికంగా బలహీనమయిన వాళ్ళే జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతుంటారు

అనుభవము ఒక మహాగరువు లాంటిది. ఎప్పుదయినా సరే మొదటి అనుభవము నుంచి నేర్చుకోండి

పేరు ప్రఖ్యాతులు సంపాదించటం అంత గొప్ప విశేషమేమి కాదు. దాన్ని జీర్ణంచుకోవడమే గొప్ప విషయము

పుస్తకాలు మనలోని విజ్ఞానాన్ని మేల్కొలిపేందుకు మంచి ఉపకరణాలు. వాటిని నేర్పుతూ ఉపయోగించాలి

క్రింద పడడానికి సిద్ధంగా ఉంటే, నడవడానికి ధైర్యం వస్తుంది

మీరు బాధ్యతలని స్వీకరిస్తే, మీ ఉనికి విస్తరించి పరాశక్తి మీలోనికి ప్రవహిస్తుంది

ఈ ప్రపంచం ఒక బుద్ధిపూరితమయిన మహాశక్తి అని అర్ధం చేసుకోవడం, శాంతికి మొదటి మెట్టు

మనకు కావలసినవన్ని సమకూరితే, మనకి విజయము వలన కలిగే కుంగుబాటుకు లోనవుతాము

అశాశ్వతము నుంచి శాశ్వతానికి వెళదాము

ఒక్క సత్యాన్ని తీసుకొని, దానిని మీ ఉనికి గ్రహించి, దాన్ని మీ జీవితంలో అనుభవించితే మీ జీవితము పరివర్తన చెందుతుంది

అత్యంత అసామాన్యమయిన విషయం ఏమిటంటే,
మనమందరము చాల సామాన్యమయిన వాళ్ళము అని
అర్థం చేసుకోవడమే

యోగ అంటే ఐక్యత; దైవంతో ఐక్యత చెందడము; పరాశక్తితో ఐక్యత చెందడము

యోగ అంటే చిత్త వృత్తి నిరోదము 7; ఆలోచనలను ఆపుట, మన మనస్సుకు అతీతంగా తీసుకువెళ్ళడము, పరాశక్తితో లీనమైపోవడము

మరణం జ్ఞానోదయమును ప్రసాదించగలిగే ఒక మహాగురువు

ఈ భూమిమీద ఒకే ఒక ఖచ్చితముగా సంభవించేది మరణం. కాని అది సంభవించినప్పుడు మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు. మానవునికి సంబంధించిన విషయాలలో ఇది చాల ఆశ్చర్యకరమైనది

మనము అన్నింటికి సిద్ధంగా ఉంటాము మరణానికి తప్ప. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జీవితంలో ఏ ఒక్కదాని గురించి నిర్దిష్టంగా చెప్పలేము, మరణం గురించి తప్పా.

✦ మీరు మరణం వలన కలిగే భయాన్ని జయిస్తే మరణాన్ని జయించినట్టే

✦ మన ఆత్మకు మరణం లేదు.. మన శరీరమే చనిపోతుంది

✦ మీరు ప్రతిక్షణము పరిపూర్ణముగా జీవిస్తే, మీకు మరణ భయం పోతుంది

✦ మన మీద మనకి చాల తక్కువ అవగాహన ఉన్నది

✦ మీ మానసిక వయస్సు ఎన్ని సంవత్సరాలు ఉంటే మీ వయస్సు అంతే ఉంటుంది

✦ భారత దేశంలో దానం చేసేవారు కృతజ్ఞత
తెలియచేస్తారు. ఎందువలన అంటే తీసుకునేవారు
ఇచ్చేవారికి ఒక అవకాశం కలిగించారు కాబట్టి

మీలో బాధ్యత తీసుకునే లక్షణం వచ్చిందంటే, ‘వృత్తి’ అనే పదానికి అర్థం ఉండదు

అంధకారం కూడా చాల అందమయినది; అది తల్లి గర్భంలో ఉన్నటువంటి అనుభూతిని కలిగిస్తుంది

పరమానందము కచ్చితమయిన సామరస్యము, సంపూర్ణ ప్రశాంతత, పరిపూర్ణశాంతిని కలిగిస్తుంది

సగంనిజం, అబద్ధం కన్నా ప్రమాదకరమైనది

బాధాకరమయిన విషయం ఏమిటంటే, మనము మనల్ని నమ్మటం మానేసిచాలా కాలమయ్యింది

ఎటువంటి నమ్మకాలు లేకుండా బ్రతకాలంటే చాల ధైర్యం కావాలి

బాధపడటం అనేది ఒక అలవాటు లాంటిది. మనం
అలవాట్లను ఏవిదముగా వదల్గలమో, బాధపడటాన్ని
కూడా అదే విధంగా వదిలి వేయవచ్చు

మంత్రం, మనిషికి మార్గదర్శకం లాంటిది

సలహా అనేది ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉంటారు కాని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు

పరిపూర్ణత్వం అనేది మనిషి యొక్క సహజ లక్షణము

కోపం గురించి అవగాహన, కోపాన్ని తగ్గిస్తుంది

మీరు దేన్నయితే అడ్డుకుంటారో అది కొనసాగుతూ ఉంటుంది

ఆత్మ సాక్షాత్కారము కావాలంటే అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి

కామానికి మూలకారణం అజ్ఞానం

మన బాధలలో 99% బాధలు నిజంకావు

మానసిక కుంగుబాటు అంటే వ్యతిరేకపు ఆలోచనల సమూహమే

మాటలు మరిన్ని మాటలకు దారితీస్తాయి. మాటలు అస్పష్టతను సృష్టిస్తాయి

నిజాయితీతో ఎటువంటి బాధలేదు, అది ఉత్సాహాన్ని సృష్టిస్తుంది

మనస్సుని మనకి రావలసివచ్చినప్పుడు
ఉపయోగించుకోవడం వలన, మనము మనస్సును
వదలడం నేర్చుకుంటాము. ఇది చేయగలిగితే మనం
జ్ఞాని అయినట్టే

శిక్షణ అంటే విధి, నిషేధంగాదు; మీతో మిమ్ములని అనుగుణంగా మార్చేది

ఎప్పుడయితే మీరు పరాశక్తితో కలిసి ఉన్నారు అని అర్థం చేసుకుంటారో అప్పుడు మీలో ఎన్నో భావాలు వ్యక్తమవుతాయి

పోల్చుకోవడం ఒక విత్తనం లాంటిదయితే అసూయ దానికి కాసిన పండు లాంటిది

మీ అవసరాలని తీర్చగలం కాని మీ కోర్కెలని తీర్చలేము

మీ కొలమానంతోనే మిమ్మల్ని కొలుచుకోండి, వేరేవాళ్ళ కొలమానంతో కాదు

పోల్చుకోవడానికి ఒక అంతం లేదు. ఆశించడానికి ఒక అంతం లేదు

తప్పుచేయడం ఎటువంటి తప్పుకాదు. చేసిన తప్పును తిరిగి చేయకూడదు

A photograph of a person in white traditional attire resting against a decorated chair

గతాన్ని, భవిష్యత్తును అనవసరంగా మోసుకుని తిరగవద్దు

✦ నవ్వడం అనేది ఒకగొప్ప ఆధ్యాత్మిక అనుభూతి

✦ నవ్వడము వలన మన ఉనికి నుంచి మన శరీరానికి శక్తి కిరణాలు ప్రసారము అవుతాయి

✦ మీరు నిజాయితీగా ఉన్నప్పుడు, మీరు నవ్వగలరు

✦ నవ్వడానికి ఎటువంటి నియంత్రణా లేదు

✦ సృజనాత్మకత ఉన్న వ్యక్తి హృదయానికి దగ్గరగా ఉంటాడు కాని తన ఆలోచనలకు కాడు

✦ మీరు ఏదయినా సృష్టించినప్పుడు మీరు దైవానికి అత్యంత సన్నిహితంగా ఉన్నట్టు

✦ ఏదయినా మనం ఆనందించకుండా కూడబెట్టు కుందాము అనే భావన అన్ని బాధలకి కారణము

✦ 'ఈరోజు పనిచేసి, రేపు ఆనందిస్తాను' అనే 'ఆలోచనను విడిచిపెట్టండి

  • మీలో అంతరంగ పురోగతి ఉంటేనే మీలో పురోగతి ఉన్నట్టు
  • ప్రాపంచిక విషయాలలో అమితంగా నిమగ్నమవ్వవద్దు
  • ఒక సామాన్యమయిన జీవనాన్ని అలవరుచుకోండి దానితోపాటు స్వేచ్ఛాపూరకమయిన మరియు అమాయకమయిన నడవడికను అలవర్చుకోండి
  • మన నిజమయిన శక్తి మనకు తెలియదు
  • మిమ్మల్ని ఎవరయితే నియంత్రిద్దామనుకుంటారో వారు మొదట మీలో అపరాధ భావాన్ని కలిగిస్తారు
  • అనుమానము మీరు జ్ఞానోదయము పొందడానికి ఒక కాగడాలాంటిది
  • మీలో ఒక అభిప్రాయమనేది కలిగినప్పుడు మీరు సత్యాన్నిచూడరు. మీకు ఏది సత్యం అనిపిస్తుందో దానినే చూస్తారు

† దైవానికి మీ అహంకారాన్ని సమర్పిస్తే, మీకు జ్ఞానోదయము కలుగుతుంది

† మీరు సర్వాంతర్యామి జయించలేరు. సర్వాంతర్యామి మిమ్ములని జయిస్తాడు

† మనము నియంత్రణ చేయడానికి ప్రయత్నిస్తాము, ఎందుకంటే మనచుట్టూ సరిహద్దులున్నాయని మనం అనుకుంటాము. ఒక్కసారి సరిహద్దులను నిర్మూలించండి, మీరు ఇక నియంత్రణ చేయనవసరము లేదు. అప్పుడు మీకు పరమానందమే మిగులుతుంది.

† మనకు ఏమైతేకావాలో, దాన్నే చూస్తాము

† ఎప్పుడయితే ఒక విద్యలో నైపుణ్యం సంపాదించామో, అప్పుడు మనము నిరుత్సాహంగా, సంతోషము లేకుండా ఉంటాము

† మాటలలో ఉండేశక్తి మనకు అంతగా తెలియదు. మీరు మంచిమాటలు వింటే మీకు శాంతి కలుగుతుంది. అదే సంతోషం యొక్క ప్రాముఖ్యత

  • మార్పు రావలసినది మనలో, ఎదుటివారిలో కాదు
  • ఆత్మప్రబోధానికి శక్తి లేదు అంతఃప్రేరణ అనేది మన అందరిలో ఉన్నది
  • ఆత్మప్రబోధన అనేది మన ఉనికిలో ఉండే శక్తి
  • చిన్నపిల్లలలో భయాన్ని సృష్టించకండి
  • మనం అడగడంమాని ఇవ్వడం మొదలుపెట్టాలి
  • మీరు ఎదుటి వారితో పోల్చడం అనేది తెలివితక్కువతనం. ఎందుకంటే మీ ప్రత్యేకత మీకు ఉన్నట్టే, ఎదుటి వారికి కూడా ప్రత్యేకత ఉంది
  • కరుణ అనబడే నిఘూడమయిన శక్తి మన అందరిలోను ఉన్నది. ఈ శక్తి అందవికారమైనటువంటి దానిని అందంగా మార్చగలదు
  • మనసమస్యలకు మనమే మూలకారణము అని మనము తెలుసుకోలేము
  • బాధకు సంబంధించిన భాద్యతను మనము ఎదుటి వాళ్ళ మీద తోసేస్తాము
  • ఈ ప్రపంచాన్ని వదిలివెళ్ళిపోవడం అనేది, మరియు ఈప్రపంచాన్ని పట్టుకుని వెళ్ళడటము రెండూ కూడ తెలివితక్కువ పనులు
  • ఆధ్యాత్మికత అనేది జీవితాన్ని ఉత్తేజపరిచేది, అదే జీవితము ఆధ్యాత్మికత అనేది మీరు ఎన్నుకునేదికాదు
  • ఆధ్యాత్మికత అంటే మీరు భౌతికంగా, మానసికంగా ఆరోగ్యముగా ఉండుటము మరియు అందరితో సత్సంబంధాలు కలిగి ఉండటము
  • ఆధ్యాత్మికత అనేది మీలో తెలుసుకునే తత్వాన్ని వికసింప చేయ్యాలి. అది జరగనంతసేపు మీరు ఆధ్యాత్మికంలో లేనట్టే. ఇది జరగనప్పుడు మీ ఆధ్యాత్మికత మీ అహంకారాన్ని సంతృప్తి పరుచుకొనే మరొక మార్గం.
  • ఆధ్యాత్మికత అనేది ఒక ఆచారంలా మారిపోయింది. ఈ ఆచారాలను ప్రజలమీద రుద్దడం జరుగుతుంది.

ప్రజలు ఈ ఆచారాలను భయంవలన కాని లేదంటే
దురాశ వలనకాని పాటిస్తారు, నరకం వలన భయం
మరియు స్వర్గం మీద దురాశ

రేపుకూడా నేటిలాంటిదే

మీ వర్తమానంతా మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలే. మీ భవిష్యత్తు అంతా మీరు వర్తమానంలో తీసుకునే నిర్ణయాలే

బయట ప్రపంచంలో ఆనందం గురించి వెతకటం వృథా అని తెలిసిన వెంటనే మీరు ధ్యానానికి పరిపక్వత చెందినట్టు

మీకు జ్ఞానోదయము కలిగిఉన్నది. దాన్ని వ్యక్తపరచండి

మిమ్మలని మీరు తెలుసుకునేతత్వమే కీలకమైనది

మానవతత్వం ఎటువంటిదంటే, అది నష్టాలనే గుర్తుపెట్టుకుని లాభాలను మర్చిపోతుంది

ఎంచుకోడం అనేది జీవితంలో చాల బలమైనది. ఎందుకంటే మనం ఎంచుకునేటప్పుడు మనకోరికలు, కోపం ద్వారా ఎంచుకుంటాము.

✦ మీలో ఉన్న అనంత శక్తిని గుర్తించండి. ఈ
అనంతమైన శక్తి మీకోసమే ఉందనే విషయాన్ని
గ్రహించండి

✦ మనకు ఏమిరిగినా, ఎదుటి వాళ్ళను నిందిస్తాము. ఎదుటి వారిని నిందించడమనేది. తెలివి తక్కువ తనము. తెలివైనవాళ్ళు తమనితామే నిందించు కుంటారు

✦ మీరు మంచి దృక్పధంలో ఉంటే వృత్తి ప్రార్ధనగా మారుతుంది. మీదృక్పదం సరిగా లేకుంటే ప్రార్ధనే, వృత్తిగా మారుతుంది

✦ ఆనందమనేది మీ ఉనికి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదు

✦ కోరికలనేవి పెరుగుతూ ఉంటాయి. వాటికి ఒక అంతం అనేది లేదు

మీ అంతరంగంలో ఏమయితే ఉంటుందో మీరు దాన్నే
బయట అనుభూతి పొందుతారు. బాహ్య
ప్రపంచములోని విషయాలకు దీనికి ఎటువంటి
సంబంధము లేదు

పరమానందము ఒక చిరుగాలి లాంటిది, మీరు చేతులు తెరిచి స్వాగతం పలికినప్పుడు మీరు దాన్ని ఆస్వాదించగలరు. మీరు ఒక్కసారి దాన్ని సొంతం చేసుకుందాము అనుకుంటే, అది మీదగ్గర నుండి వెళ్ళి పోతుంది!

భవిష్యత్తు వెనుక పరిగెత్తడము అనేది జీవితం కాదు

Our main Nithyananda Meditation Academies (NMA's)

USA:

Nithyananda Dhyanapeetam
928 Huntington Dr, Duarte,
Los Angeles, CA 91010, USA
Ph.: 1-626 -205-3286
Email: [email protected]

Nithyananda Dhyanapeetam
4610, N.High Street, Columbus
OH 43214, USA
Ph.: 614-571-8425

India:

Nithyananda Dhyanapeetam NithyanandapuriKallugopahalli Mysore Road, Bidadi Bangalore - 562 109, Karnataka, India. Phone: 91 +80 65591844 / 27202084 Fax: 91 +80 7288207 Email: [email protected] URL: www.nithyananda.org Nithyananda Dhyanapeetam

Sri Ananda Rajarajeshwari Temple, Nithyananda Giri, Pashambanda Sathamrai Village Shamshabad Mandal, Rangareddy District Andhra Pradesh - 501 218, INDIA Ph.: +91 93470 65288 E-mail: [email protected]

Nithyananda Dhyanapeetam 36/1, Kamakshiamman Street, Peramanur SALEM – 636 007 INDIA Ph.: 91 +427 3098133 Nithyananda Dhyanapeetam Nithyanandapuri, Zamin Pallavaram CHENNAI – 600 043, TAMILNADU, India Ph.: 98404 27966 / 94440 19791 (Directions: Behind Tirusoolam Hill.)

Nithyananda Dhyanapeetam Nithyanandapuri, Othaivaadai Street Pavazhakundru, Tiruvannamalai – 606 601 TAMILNADU, India Ph.: 94432 33789 / 94433 26202 (Directions· On Big Street (Peria theru), take the lane opposite Indian Overseas bank. This is Othaivaadai Street.)

Nithyananda Dhyanapeetam Nithyanandapuri 2/200, Tirumangkuruchi Post Namakkal – 637 003 Pavazhakundru, TAMILNADU, India. Ph.: 94433 88437 / 93447 17629 (Directions: Near the Collector's office)

Nithyananda Dhyanapeetam
Nithyanandapuri
102, Azhagapurampudur
Salem – 636 016, TAMILNADU, India.
Ph.: 94433 64644 / 94432 35262
(Directions: Behind Sharada College)

Photograph of a smiling man with long hair
నిత్యానంద ధ్యానపీఠం - హైదరాబాదు

నిత్యానంద ధ్యానపీఠం - హైదరాబాదు

నిత్యానందస్వామి దివ్యాశీస్సులతో జనవరి 2006లో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాదులో నిత్యానంద ధ్యానపీఠం ఆవిర్భవించినది. శంషాబాద్ వెళ్ళేదారిలో నాతంరాయిలోని నిత్యానందగిరి పైన శ్రీ ఆనందేశ్వరి దేవాలయ ప్రాంగణంలో ఆశ్రమం నెలకొల్పారు.

హైదరాబాదు ఆశ్రమం చాలా విశాలంగా, అందమయిన ప్రకృతి మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నిత్యం ఆనందేశ్వరి మాత పూజ హారతి, గురుపూజా నిర్వహిం చుతారు. ఆశ్రమంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఆశ్రమంలో విశాలమయిన అందమయిన ధ్యాన మందిరం ఉన్నది. ఇక్కడ ప్రతిరోజూ యోగా, ధ్యాన కార్యక్రమాలు జరుగుతాయి. లిటిల్ ఆనందాస్ అనే చిన్నపిల్లల ప్రత్యేక కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయి. ప్రతి మాసం వైద్య పరీక్షలు జరుగుతాయి.

Paramahamsa Nithyananda

పరమహంస నిత్యానంద 'జ్ఞానోదయం ఐన నిత్యానంద జ్ఞామన మధ్య ఉన్న అద్భుతయోగి, మహా మేధో సంపన్నుడు . ఆధ్యాత్మిక సాగరాన్ని అతి చిన్న వయస్సులో మధించి అందులోంచి మహోద్భుతమయిన 'ధ్యానం' అనే అమృత కలశాన్ని మనకి అందించిన భగవంతుడు. ఆయన విప్లవాత్మక సందేశం ప్రపంచాన్ని జడత్వం నుంచి మేలుకొలిపింది. ఆయన అందించిన 'ఆనందం మీ జన్మహక్కు, నిరంతరం ఆనందలో ఉండండి' అన్న పిలుపు సర్వమానవాళిని అద్భుతంగా చైతన్యపరచినది. మీరు భగవంతుడు అని నిరూపించటానికి నేను ఇక్కడికి వచ్చాను, మీరు దైవాంశులు, సాక్షాత్ భగవంతుని స్వరూ పులు, ఆ విషయం తెలుసుకోండి అని ఆయన చేసిన సింహ ఘర్జన, ఛాందస ప్రపంచాన్ని అధిరపడేలా చేసింది. మానవ మెదడు యొక్క అద్భుత పనితీరుని వైద్య ప్రపంచానికి చూపించి ప్రపంచవ్యాప్తంగా వైద్యశాస్త్రవేత్తలు తపన పడే ఫలితాలని చెప్పారు. ఆయనపై చేసిన ప్రయో గాలు వైద్య శాస్త్రంలో కొత్త అధ్యాయాలని ఏర్పరిచాయి. నీవు సర్వశక్తి సంపన్నుడవి, నీలో అనంతమయిన శక్తి నిక్షిప్తమై ఉన్నది. అది తెలుసుకుని మరింత అద్భుతాలు సాధించగలవు అని మనిషిని వెన్నుతట్టి చైతన్యవంతులని చేస్తున్నారు. లక్షలమంది శిష్యులకి ఆయన గురుదేవులు, కోట్లమందికి ఆయన దేవుడు. కానీ ఆయనకి ప్రతి ఒక్కరూ భగవంతుని రూపాలే. అందరిని నిత్యానందంలో ఉంచాలి అనేది ఆయన లక్ష్యం......

Ebook ISBN: 979-8-88572-371-8

నిత్యానంద ధ్యానపీఠం

శ్రీ ఆనందేశ్వరి దేవాలయం, నిత్యానందగిరి, నౌతంరాయ్, షంషాబాద్ (మండలం), రంగారెడ్డి జిల్లా, ఎ.పి.

ఫోన్ : 9347065288, 9866500350
e-mail : [email protected]
www.nithyananda.org