Chapter 6

జ్యోతిశ్ళాస్త్రం & అవతల

1 sections

జ్యోతిశ్ళాస్త్రం & అవతల

ఇది మిక్కిలి కఠినమయిన విధి, కాబట్టి ఈరోజులో చాలామంది జ్యోతిశ్నాస్త్ర వేత్తలు తుదకు ఖచ్చితమయిన ఫలితాలను ఇవ్వని కొన్ని మౌలిక చరరాశులను ఉపయోగిస్తున్నారు. అన్నిటి కంటె మించి, ఫలితాలను ఎవరికి వారు బహిరంగంగా అన్వయించవచ్చు. దీని ఫలితంగా ఈ శాస్త్రం తక్కువ విశ్వసనీయతను పొందుతుంది. ఈనాడు జ్యోతిశ్శాస్త్రం విశ్వసనీయ శాస్త్రంగా చూడబడకపోవటానికి ఇవి కారణాలు.

నేను ఇక్కడ జ్యోతిశ్నాస్తాన్ని నిరూపించటానికి లేదా ఖండించటానికి లేను.

నేను ఇక్కడ దాని రహస్యాన్ని ఛేదించటానికి ఉన్నాను. జ్యోతిశ్నాస్త్రం మీమీద పనిచేసే ప్రభావాల గురించి స్పష్టమయిన భావాన్ని కలగజేస్తుంది. అది మీ సమస్యను తెలియజేస్తుంది కాని పరిష్కారాన్ని చూపించదు.

ధ్యానం పరిష్కారాన్ని చూపించగల్గుతుంది. ధ్యానం సూర్యుడికి, గ్రహాలకు, మీకు దారి చూపించే విశ్వశక్తితో అనుసంధానం చేసేది మాత్రమే. మీరు విశ్వశక్తితో కలిసి సామరస్యంతో పని చేస్తున్నప్పుడు, ఈ ప్రభావాల నుండీ మీకు సహజంగా మంచి రక్షణ లభిస్తుంది. ఏ వ్యక్తి అయినా వర్షంలో తడిసి వెళ్తున్నప్పుడు, ఈ వ్యక్తికి రొంప పట్టటం సహజం, కాని రైన్‌కోటు వేసుకొని వర్షంలో వెళ్ళినప్పుడు, ఆ రైన్‌కోట్ తప్పకుండా సాయపడుతుంది.

పౌర్ణమినాడు ప్రతి వ్యక్తికి పిచ్చిపడుతుందా?

అలాకాదు ! పౌర్ణమి అప్పటికే సమతూకం తప్పిన మనస్సును ప్రభావితం చేస్తుంది. మీ పరిస్థితులు స్థిరంగా ఉంటే, ఈ అంశాలు మిమ్మల్ని కేవలం ప్రభావితం చేయలేవు. ధ్యానం మిమ్మల్ని ఆధ్యాత్మికంగానే కాకుండా శారీరకంగాను, మానసికంగాను భావోదేకంగానూ కూడా బలపరుస్తుంది.

ధ్యాసంతో మీరు జ్యోతిశ్నాస్త్ర పరిధి దాటి వెళ్ళగల్గుతారు.