Chapter 16

కర్మ ఏమిటి ?

1 sections

కర్మ ఏమిటి ?

న్యాయాన్ని అర్థం చేసుకోవటం

కర్మలు ప్రాచ్య తాత్విక చింతనలలో మిక్కిలి ప్రాచుర్యం కలది, చాలా తక్కువ అర్థం చేసుకోబడేది! నేడు పాశ్చాత్య దేశాలలో కూడా, ప్రతి ఒక్కరికి కర్మ ఏమిటి అన్న దానిపై చక్కని సద్భావన ఉంది (లేదా ఉన్నందుకు కృతజ్ఞతలు).

కాని తత్త్యంపై రచించబడ్డ మహాగ్రంథంగా దీన్ని భావించి దీన్ని చదువుతుంటే, మీరు చాలా ఆశాభంగం చెందుతారు! కర్మ కార్యకారణ సంబంధం కల సామాన్య న్యాయం మాత్రమే.

భూమ్యాకర్షణ శక్తి లేదా విద్యుత్తులా కర్మ ప్రకృతి న్యాయం.

మీరు మీ కాలి మీద ఒక ఇటుకను జారవిడిస్తే, మీకు దెబ్బ తగులుతుంది. కాని ఇటుకను జారవిడిచినందుకు శిక్షగా ఆలోచించారా!

లేదు!

అది కార్యకారణ సంబంధం - సాధారణం.

కర్మ ఖచ్చితంగా ఈ మార్గంలో పనిచేస్తుంది: కర్మపూర్వకాలంలో మీరు నిర్వర్తించిన నిర్దిష్ట కార్యాల ఫలితం.

బైబులు చెప్పినట్లుగా : మీరు నాటి నట్లుగా మీకు ఫలితం వస్తుంది.

తేడా ఏమిటంటే, కర్మ 'ఆలస్యంగా వచ్చే కార్యతా విశేషం'. కర్మ జన్మాంతరంలో కూడా పని చేస్తుంది. అర్హమేమిటంటే ఒక జీవితంలో కారణం ఉండవచ్చు, కాని ఫలితం భవిష్యజ్ఞన్మలో అనుభవించవచ్చు. (ఇది సహజంగా ప్రశ్లను లేవనెత్తుతుంది, పునర్జన్మ ఉందా? కాని మనం దాని గురించి మరోసారి చర్చించుకుందాము!),

మానవమాత్రులము కాబట్టి, పూర్వజన్మ కాలంలో జరిగిన విషయం సహజంగా జ్ఞాపకం పెట్టుకోలేము. మన పరిమిత దృష్టి వల్ల మనం ఫలితాన్ని మాత్రమే అవగతం చేసుకోగలము, ఇది ఎందుకు జరిగిందనే దానిని అర్థం చేసుకోలేము

అనాది నుంచి, మన అవగాహనకు అతీతంగా ఏదైనా ఒక చెడు జరిగినప్పుడు, దేవుళ్ళ శిక్షకు దాన్ని మనం అంటగడతాం. నేడు కూడా, అనేక నాగరిక సమాజాలలో, వరదలు, భూకంపాలు మొదలయిన ప్రకృతి సహజమయిన ఉపదవాలను కోపించిన దేవుళ్ళు మనకు విధించిన శిక్షలుగా చూసున్నాము.

ఆ కారణంగా కర్మకు నైతిక కోణం ఇవ్వబడింది. పూర్వజన్మలో చేసిన పాపాలకు శిక్షగా కర్మను వివరించే పూర్తి సమాజానిది.

ఒక విధంగా, ఇది కూడా ఒక విధమయిన శిక్ష అనుభవించే విధానం. నీవు స్వయంగా పూర్వజన్మలో చేసిన చెడ్డ పనికి బాధ్యత వహిస్తున్నట్లు తలస్తే, మీ జీవితంలో కొంత దురదృష్టాన్ని వహించటం సులభతరమవుతుంది. సమాజం మాత్రమే పాపం అనే భావనను సృష్టించింది. పాక్షికంగా తన సమర్థ నిర్వహణకోసం. ప్రజలు శిక్షకు భయపడకపోతే, సమాజం న్యాయ రాహిత్యస్థితికి దిగజారుతుంది.

సత్యమేమిటంటే, మనం మన పాపాలకు శిక్షించబడటంలేదు.

మనం మన పాపాలచేత శిక్షించబడుతున్నాము! ప్రతి పాపం దానితోపాటు దాని శిక్షను తీసుకువస్తుంది. అది పేకేజి డీల్ !

మీకు కోపం వచ్చిన ప్రతిసారి, సరిగా మీ శరీరాన్ని చూడండి. మీ నాడి వేగవంతమవుతుంది. మీ రక్తపోటు పెరుగుతుంది. మీ శరీరం ఒత్తిడికి లోనవుతుంది, దాని నుంచి కోలుకోవటానికి గంటల సమయం పడుతుంది. అంతేకాదు, తర్వాత దాని గురించి విచారిస్తూ సాధారణంగా దోషభావనతో ముగుస్తారు.

వేరే ఎవ్వరూ మీరు కోపపడుతున్నందుకు మిమ్మల్ని శిక్షించాల్సిన అవసరం లేదు, మీ కోపమే మిమ్మల్ని తగినంత శిక్షిస్తుంది! మీరు ఎక్కువ తాగితే, మీరు కాలేయ సంబంధ వ్యాధితో బాధపడతారు. మీరు ఏదో బయటి శక్తిచేత తాగినందుకు శిక్షించబడటంలేదు, మీరు మీ తాగే అలవాటుచేత శిక్షించబడుతున్నారు - మీరు దానిని శిక్షగా గ్రహిస్తే, వైద్యుడికి అది కేవలం మద్యపానం వల్ల కలిగిన సహ ఫలితం.

అదేవిధంగా కర్మ పనిచేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవటం కష్టమవటానికి కారణం కర్మ భౌతిక ఉపరితలంపై పడే ఇటుకలా పనిచేసేది మాత్రమే కాదు, కర్శ మానసిక, భావోదేక ఆధ్యాత్మిక ఉపరితలంపైనా పని చేస్తుంది.

మీరు ఒక జీవితంలో నిర్ధిష్ట వాంఛను నెరవేర్చుకోలేకపోయినట్లు ఊహించుకోండి… లేదా ఒక పనిని మీరు అసంపూర్ణంగా విడిచి పెట్టవలసి వచ్చిందని ఊహించుకోండి… ఫలసిద్ధి పొందని కోరిక, లేదా పూర్తికాని పని మీ జీవితంలో ఒక రకమయిన భావోద్వేగ సంబంధి లేదా మానసిక సంబంధి శూన్యాన్ని సృష్టిస్తుంది. ఆ శూన్యత చూషణశక్తిగా పనిచేసి తర్వాతి జన్మలో అదే కోరికను నెరవేర్చటానికి, లేదా అదే పనిని మళ్ళీ చేయడానికి మిమ్మల్ని లాగుతుంది. కాబట్టి భావోద్వేగ మానసిక స్థాయిల్లో, కర్మ మీ నెరవేరని కోరికల అసంపూర్ణ కార్యాల మొత్తం -పూర్వజన్మ నుండి ప్రాప్తించిన సామాను. ప్రతి జీవితంలో మీరు పూర్వజన్మకర్మలను నెరవేర్చుతారు. కాని మీ దగ్గరున్న సామానుకు తాజా కోరికలను కలుపుకుంటూ ఉండండి - తర్వాతి జన్మకు అవి కర్మలవుతాయి. ఆ కారణంగానే, కర్మ అనంత చక్రం.

కర్మనుండి తప్పించుకునే మార్గమేది?

మనం జీవించి ఉన్నంతకాలం, కర్మ నుండి తప్పించుకోవటానికి దారిలేదు. ఎందువల్లనంటే జీవించటం కోరికల్ని కలిగి ఉండటం, మనం ముమ్మాటికి జీవితకాలంలో మన కోరికలన్నిటినీ నెరవేర్చలేము. కాని కర్మ ప్రభావాలను బాగా తగ్గించటం మీ చేతుల్లో ఉంది - మీ చైతన్యాన్ని మేల్కొల్పంటం ద్వారాను, కర్మ వాస్తవ ప్రకృతిని అర్థం చేసుకోవటం ద్వారాను, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవటం ద్వారాను మనం బయటపడే మార్గాన్ని కనుక్కోవచ్చు.

శ్రీరామకృష్ణలు ఈ అంశంపై మీకు మేధా సంబంధి స్పష్టతనిచ్చే మనోహర కథను చెప్పారు. ఎవరూ కర్మ గురించి ఈ కథలా చెప్పలేరు. అస్తిత్వానికి సంబంధించిన ప్రయోగాత్మక మయిన స్పష్టత ఈ కథ మీకు తెలుపుతుంది. ఆ స్పష్టత జ్ఞానోదయంతో మాత్రమే వస్తుంది. మీకు జ్ఞానోదయమయినప్పుడు, మీరు దాన్ని ప్రకటించలేరు!

కర్మ గురించిన కథ!

మనస్థితి పెద్దతాడుతో స్తంభానికి కట్టబడ్డ ఆవులా ఉంది. ఆ పరిధిలో అది కూర్చుంటుంది, కూర్చుంటుంది, గడ్డి తింటుంది, తనకు ఇష్టమయిన దానిని చేస్తుంది. అదే మన స్థితి!

ఇది నిజం : కర్మ నిర్ణీత బంధాన్ని సృష్టిస్తుంది. మన జీవితానికి నిర్ధిష్ట దిశను నిర్దేశిస్తుంది, నిర్దిష్ట మార్గాలలో పనిచేయటానికి బలవంతపెడుతుంది. మనకు పరిమిత స్వాతంత్ర్య ముంటుంది. మిగిలినది అస్తిత్వ హస్తాలలో ఉంటుంది. కాని రామకృష్ణ కూడా ఇంకా కలుపుతున్నారు. మనం మన స్వేచ్ఛను తెలివిగా ఉపయోగిస్తే, అస్తిత్వం మన తాడును పొడిగించవచ్చు, లేదా మనల్ని పూర్తిగా విడిచిపెట్టవచ్చు. ఇది సాధ్యం. బంధంలో ఉండాలో లేదా స్వేచ్ఛగా ఉండటానికి పని చేయాలో మీరు ఎంచుకోవచ్చు. కర్మ సన్నిహితంగా ధర్మానికి సంబంధించినది. ధర్మం ఎక్కువ తప్పగా అర్థం చేసుకోబడ్డ 'మరోపదం'. ధర్మం సామాన్యంగా విధిగా వ్యాఖ్యానించబడుతోంది, కాని అది పూర్తిగా తప్ప.

అది కూడా సామాజిక, నైతిక వ్యాఖ్యానం. ధర్మానికి, అత్యంత సన్నిహితంగా ఉండే అనువాదం వాస్తవ స్వభావం. ఉదాహరణకు, అగ్ని ధర్మం (స్వభావం) కాల్చటం. అదేవిధంగా, నీటి ధర్మం తడిగా ఉండటం, నీరు కాల్చటానికి ప్రయత్సిస్తే - ఏదో అసహజం జరుగుతుంది. మీరు ధర్మానుగుణంగా ఉన్నంతవరకు, మీరు కర్మబద్ధులుకారు.

సాధారణ పదాలలో - సహజంగా ఉండండి. మీ వాస్తవ స్వభావానుగుణంగా నడుచుకోండి. సులువుగా ఉందా? లేదు!

చేయటానికి ఇది కఠినమయిన పని - కారణమేమిటంటే మన స్వభావమేమిటో మనం గుర్తించుకోలేకపోతున్నాము!

జీవితంలో, మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి శీలాన్ని కోరికలను మనం తీసుకుంటున్నాము - తుదకు ఏది నిజంగా మనదో ఏది ఎరువు తెచ్చుకున్నదో తెలుసుకోలేకపోతున్నాము.

అది ఈ విధంగా ఉంది : టి.వి.ని మీరు కొనవలసిన అవసరం వచ్చిందనుకోండి. మీరు సూపర్ మార్కెట్టుకు వెళ్ళినప్పుడు, మరొకరు వాషింగ్ మెషీన్‌ను కొనుక్కుంటూ కనిపిస్తారు. ఇంకొక వ్యక్తి ఫ్రిజ్ కొనుక్కుంటూ కన్పిస్తాడు, ఇంకొకరు సంగీత సిస్టమ్‌సు కొనుక్కుంటూంటాడు. మీరు కొనదలచుకున్న టి.వి.తో పాటు మీరు వీటన్నిటిని కొనుగోలు చేయాలనుకుంటారు! మీకు తెలియకుండానే, మీరు మీ చుట్టూ ఉన్న ప్రజలందరి కోరికలను మీరు గ్రహిస్తున్నారు. ఒక జీవితంలో, మీరు వందలకొద్దీ జనాల కోరికలను నెరవేర్చేటందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కోరికలు మీకు సహజ సిద్ధమయినవికాదు - అవి సంపాదితవాంఛలు. కాబట్టి సహజంగా - అవి కర్మను ఆకరిస్తాయి.

కర్మ అంతా అజ్ఞానం నుంచి ఉద్భవిస్తుంది - మీ వాస్తవ స్వభావ అజ్ఞానం నుంచి. ఆధ్యాత్మికతా పరిభాషలో, ధర్మం మీ జీవిత ప్రధాన లక్షణం.

మీ వాస్తవ స్వభావాన్ని తెలుసుకునేటటువంటి మీ చైతన్యాన్ని మేల్కొలిపే శాస్త్రం మాత్రమే. ఆధ్యాత్మికత, మీ జీవితమంతటిని మీ చైతన్యాన్ని మేల్కొల్పటం వైపు నిర్ధేశిస్తుండగా, సహజంగా మీరు అజ్ఞానం బోనులో పడరు. స్పష్టతతో, జాగృతిలో, మీ వాస్తవ వాంఛలను మీ వాస్తవ స్వభావాన్ని మీరు గుర్తించగల్గుతారు.

మృత్యుక్షణంలో, ఇది ప్రత్యేకంగా ప్రాధాన్యం కలదవుతుంది.

వాస్తవంగా, యోగంలో, జెన్‌లో, ధ్యానం మొత్తం మృత్యు క్షణం కోసం సంసిద్ధత మాత్రమే. మృత్యు సమయంలో మీరు చైతన్య స్థితిలో ఉంటే, మీరు తర్వాతి జన్మలోకి కూడా చేతన మార్గంలో ప్రవేశిస్తారు, అజ్ఞానంలోకాదు. మీరు జాగృతితో జీవితంలోకి ప్రవేశిస్తే, మీరు తప్పకుండా మీ జీవితంలో సాధ్యమయినంత తక్కువ కర్మను చేస్తూ, జాగృతితో జీవిస్తారు.

ఇది నిజం.

నా సొంత అనుభవ అధికారంతో మాట్లాడుతున్నాను!

నాలో కలిగిన జాగృతి విస్ఫోటనం ద్వారా మీతో మాట్లాడుతున్నాను.

ఏదో ఒక రోజు, మీ అంతటమీరు దాన్ని తెలుసుకుంటారు.

మీ చేతనను మేల్కొల్పండి. చిట్టచివరకు మిమ్మల్ని కర్మ నుంచి విడుదల చేసే మొదటి మెట్టును స్వీకరిస్తారు.

మీ మంత్రమేమిటి ?