Chapter 15

మీకు కృతజ్ఞతలు వద్దు!

1 sections

మీకు కృతజ్ఞతలు వద్దు!

అపేక్షలతో మీరు జీవిస్తున్నప్పుడు, మీ అపేక్షలకు ఫలసిద్ధులకు మధ్య ఎడం తప్పకుండా ఉంటుంది. ఒక కోరిక తీరిన మరుక్షణంలో ఇంకా పది కోరికలు పుడతాయి.

ప్రతి ఒక్కరి జీవితంలోను ఒడిదుడుకులుంటాయి. సదా కొన్ని తీరని కోరికలుంటాయి. అది సాధారణం. వారు చెప్పినట్లుగా ఒక గ్లాసు సగం నిండుగా లేదా సగం ఖాళీగా ఉందా అన్నది కేవలం నీవు దాన్ని చూడటంలోను, ఎంచుకోవటాన్నిబట్టి ఉంటుంది!

మీకు లేని దాని మీాద దృష్టిని కేంద్రీకరించనంత కాలం, మీ జీవితంలో మీరు శూన్యాన్ని అవగతం చేసుకుంటారు. 'నాకు కావాలి' అనే పదాలు బ్లాక్‌హోల్‌లాంటివి. అది మీ జీవితంలో మీకున్న దానినంతటినీ మింగివేస్తుంది, మిమ్మల్ని ఖాళీగా ఉంచుతుంది.

ఒకసారి ఒక మనిషి రమణ మహర్షి దగ్గరకు వెళ్ళి అడిగాడు, భగవంతుడా, నాకు శాంతి కావాలి!

రమణ మహర్షి సమాధానం చెప్పాడు, నీ వాక్యంలోని 'నాకు'పదాన్ని తొలగించు, 'కావాలి' పదాన్ని తొలగించు ఇక మిగిలింది శాంతి!

మీరు శివ, బ్రహ్మ కపిల సంవాదాన్ని విన్నారు. మనందిరిలోపల బ్రహ్మ కపిల ఉన్నాడు. అది మన అహంకారం మాత్రమే.

అహంకారమనేది ఎటువంటిదంటే అది ప్రతిదాన్నీ మింగివేస్తుంది.

మీ సొంత జీవితంలో, ఇప్పుడే మీరు కావాలనుకుంటున్న వస్తువుల గురించి ఆలోచించండి. జాబితాను తయారుచేయండి.

ఇప్పుడు ముందే మీకున్న వస్తువుల జాబితాను తయారు చేసుకోండి. ఏ జాబితా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది, ఏ జాబితా మీకు అసౌకర్యాన్ని కల్గిస్తుంది?

సమాధానం స్పష్టం.

ఏ జాబితాపై మీరు కేంద్రీకరిస్తారు? జీవించి ఉన్న ప్రతి ప్రాణికి తన సంతోషాన్ని రక్షించుకోవటంపై కేంద్రీకరించుకునే వివేకం ఉంది.

మనమెందుకు అలా చేయలేము?

అడుగుతూ లేదా కృతజ్ఞత చూపుతూ మీ జీవితాన్ని గడపాలను కోవటం పూర్తిగా మీ ఇష్టం. ప్రపంచంలో మతాలు రెండు రకాలుగా ఉన్నాయి. ప్రార్థన మీద ఆధారపడిన మతాలు, కృతజ్ఞత మీద ఆధారపడిన మతాలు. అధిక సంఖ్యాకులు ధ్యానమతాన్ని అనుసరిస్తున్నారు. కొద్దిమంది మాత్రమే కృతజ్ఞతా మతాన్ని అనుసరిస్తున్నారు.

ధ్యానంతో యాచన, అపేక్ష లభిస్తాయి. కృతజ్ఞతతో ఆధ్యాత్మికత సిద్దిస్తుంది.

అది సూఫీ మతం, హిందూమతం వెనక ఉన్న సూత్రం. అది కృతజ్ఞతలో జీవించే కళ, ప్రతి వస్తువు పవితమయ్యే మార్గంలో జీవితకళ కృతజ్ఞత. సూఫీలు, బావులులు తమ కృతజ్ఞతను అస్తిత్వానికి కృతజ్ఞతను ప్రకటిస్తూ పాడతారు, నృత్యం చేస్తారు.

పాడటం నృత్యం చేయటం వారికి ప్రార్ధన రూపం. మీ కృతజ్ఞతను ప్రదర్శించటం పూజ చేస్తూ గంటల తరబడి గడపటం కాదు, సంతోషంగా ఉండటం, జీవిత బహుమతిని జాగరూకతతో ఎరిగి ఉండటం చాలు. కృతజ్ఞతా ప్రదర్శన మనకు ఆధారంగా విధిగా అయింది. వాస్తవ కృతజ్ఞత ఎలా ఉంటుందో మనం మరణించి పోయాము.

మీ తల్లిదండుకు, మీ అధ్యాపకులకు, స్నేహితులకు, కొత్తవారికి కృతజ్ఞతలో ఉండాలని మీ జీవిత కాలమంతా మీకు నేర్చుతారు. ఇది నియంత్రణ స్థితి! వాస్తవ కృతజ్ఞత ఆవిర్బవించినప్పుడు, ఎంత అద్భుత భేదముందో మీరు చూస్తారు!

కృతజ్ఞత ఆనంద, దయల పొంగు. మీ ఎరుక లేకుండానే మీ నుండి ప్రవహిస్తుంది, దాన్ని మీరేమి చేయలేరు! మీరు అస్తిత్వానికి కృతజ్ఞత చెప్పినప్పుడు మీరు పొందే అనుభూతిని, కృతజ్ఞతామాధుర్యాన్ని, అధిక ఫలప్రాప్తి అవగాహనను మనం చవిచూడలేదు.

చిన్నకథ :

ప్రతిరోజు అయిదుసార్లు సూఫీమత గురువు జున్నా ఇద్ దేవుడికి కృతజ్ఞతలు చెబుతుంటాడు. ఒకసారి అతడు అతడి అనుచరులు సూఫీ తత్వాన్ని అంగీకరించని గ్రామాల గుండా తిరుగుతున్నారు. మొదటి గ్రామంలో, ప్రజలు బిక్షమివ్వటానికి తిరస్కరించారు, కాబట్టి వారు ఆరోజు భోజనం లేకుండా గడపవలసివచ్చింది. మర్నాడు, అట్లాగే జరిగింది. మూడోరోజు, ఇంకో గ్రామం గుండా వెళ్లుతున్నప్పుడు గ్రామస్థలు శత్రుభావంతో వాళ్ళను కథలతో గ్రామం నుండి వెళ్ళగొట్టారు.

కాని ఆ రాత్రి మామూలుగానే, జున్నా ఇద్ మోకరిల్లి దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు. దీన్ని చూచి కొందరు శిష్యులు కోపపడ్డారు.

మూడు రోజులు మనం తిండి లేకుండా గడిపాము, మాస్టర్!

ఈ రోజు గ్రామం నుండి మనల్ని కుక్కల మాదిరి తరిమి వెళ్ళగొట్టారు! దేనికి మీరు కృతజ్ఞతలు తెలుపుతున్నారు? శిష్యులు గురువు గారిని ప్రశ్నించారు.

జున్నా ఇద్ జవాబిచ్చాడు : ప్రత్యేకంగా దేనికోసం అస్తిత్వానికి కృతజ్ఞతలు చెప్పలేదు! ఏ కారణం గాను నేను కృతజ్ఞతలు సమర్పించుకున్నాననే భావంతో లేను. అటువంటప్పుడు ఏ కారణంగానెనా నేను కృతజ్ఞతతో ఉండటాన్ని ఆపివేయాలి? నా కృతజ్ఞతకు కారణాలు అవసరంలేదు, అది కేవలం ప్రవహిస్తుంది. జీవితం అస్తిత్వం నుండి మనకు లభించిన బహుమతి.

జీవించటం కృతజ్ఞతతో ఉండటానికి తగిన కారణం. అస్తిత్వం మన మీద వర్షిస్తుంది! ఎండ, పూలు, మీ శరీరం, మీ జీవితం - వీటిలో ఏ ఒక్కదానినైనా మీరు అడిగారా? జీవితానికి తగి ఉండేటట్లు మీరు చాలా కష్టపడి పని చేశారా?

ఈ జీవితాన్ని ప్రసాదించినందుకుగాను ఎవరయినా తాము దేవుడి పాకశాలలో లేదా దేవుడి ఉద్యానవనంలో పనిచేసినట్లు చెప్పగలరా?

చెప్పలేరు!

జీవితం మనకు కేవలం బహూకరించబడింది.

అందువల్లే మనమందాన్ని చౌకగా చూస్తున్నాము. అందువల్లే జీవితాన్ని మనం ఊరకే వచ్చినట్లు అనుకుంటున్నాము.

మొదట్లో, అన్ని మతాలు, అన్ని సంస్కృతులు జీవితానికి కృతజ్ఞతలు నొక్కి చెప్పతుండేవి. కాని క్రమంగా మనం మరిచిపోయాము. భరత్ లో, మనకు 'అన్నం బ్రహ్మ (ఆహారం దేవుడు) అనే పదబంధం ఉంది. క్రైస్తవులు, యూదులు భుతి భోజనానికి ముందు 'అనుగ్రహం' అంటారు. కాని మనం వాస్తవంగా ఎంత తరచుగా కృతజ్ఞతానుభూతి చెందుతున్నాము? సామాన్యంగా మనం అలవాటు ప్రకారం మాటలను అస్పష్టోచ్చారణతో పలుకుతుంటాము.

నా భక్తులలో ఒకడు ఈ కథ చెప్పాడు: ఇది నిజంగా జరిగింది. అతడు తన భార్యను ప్రతిరోజు మధ్యాహ్న భోజనసమయంలో పిలుస్తుంటాడు. అతడు ఎల్లప్పుడూ ఫోను పెట్టేముందు తన భార్యతో "నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పేవాడు.

ఒక రోజు, మధ్యాహ్న భోజన సమయంలో అతడి యజమానురాలు అతడిని ఫోన్‌లో పిలిచింది. అతడు తన యాజమానితో మాటాడిన తర్వాత అప్రయత్నంగా "నిన్ను ప్రేమిస్తున్నాను" అన్నాడు. దురదృష్ణవశాత్తు ఆయన బాస్ ఆడది కదా! దాని తర్వాత ఏమి జరిగి ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు!

పదాల అర్థాన్ని ఆత్మీయం చేసుకోకుండా అలవాటు ప్రకారం ప్రయోగిస్తే ఇలాగే జరుగుతుంది. వాస్తవంగా ఏ ప్రేమానుభూతి లేకుండా ఈ మనిషి యాదృచ్ఛికంగా 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అని చెప్పినట్లు, వాస్తవంగా ఏ సేమానుభూతి లేకుండా, వాస్తవ కృతజ్ఞతా భావం లేకుండా మనం కూడా 'నీకు కృతజ్ఞతలు' చెప్పతున్నాము.

తంత్రంలో , ప్రేమించటానికి పూర్వం ఇద్దరు వ్యక్తులు పరస్పరం పూజించుకుంటారు! ఎందు వల్లనంటే వారు రెండు దెవిక శక్తుల ఏకీకరణలో ప్రవేశిస్తారు. వారు పరస్సరం భక్తి కృతజ్ఞతలతో ఆహ్వానించుకుంటారు.

అది లైంగిక వాంఛ ప్రేమ దయల మధ్య ఉన్న భేదం. ఇది మీ సంబంధాలకు మాత్రమే అనువర్తించదు. అది మీ జీవితాన్ని గురించిన మీ దృక్పథంయొక్క అంచనా ఆశతో మాత్రమే మీరు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు గౌరవంలేకుండా - జీవితంతోను సంబంధం లైంగిక వాంఛలా ఉంటుంది. అది తప్పక స్వల్పకాలిక సంతోషంగాను తప్పక దీర్ఘకాలిక భంగపాటుగాను పర్యవసిస్తుంది.

ఆశతో మీరు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు గౌరవంతో కూడా - అది ప్రేమ, మనలో చాలామంది ఈ దారిలో జీవిస్తున్నాము. మనం జీవితాన్ని గౌరవిస్తున్నాము, కాని మనకు కావలసిన దానిని జీవితం మనకు ఇవ్వనప్పుడు, మనం కూడా గాయపడతాము.

దయతో అందులో ఆశలేదు - స్వేచ్చాయుతమయిన ఆనందకరమయిన ఇవ్వటం మాత్రమే ఉంది. పుష్పం తన సుగంధాన్ని మీరు ప్రశంసిస్తున్నారా లేదా అని ఆలోచించకుండా వ్యాపింప చేస్తున్నట్లు, దయ పెల్లుబకటంవల్ల మనం ప్రేమనిస్తాము. ఏమీ అపేక్షించకుండా ఇస్తే, మీకు తిరిగి ఏమీరాదని అనుకోవద్దు. అది నిక్కచ్చిగా వ్యతిరేకం. కృతజ్ఞతాభావంతో నీవు జీవిస్తే, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు.

దయతో, ఇతరులు మీరిచ్చిన దానిని అంగీకరించినందుకు మీరు కృతజ్ఞతలుగా ఉంటారు, దాన్ని పంచుకోవటానికి దయ సాయపడుతుంది, మీ ప్రేమ భారాన్ని తగ్గిస్తుంది. దాన్ని గురించి మీరెప్పుడయినా ఆలోచించారా? ప్రేమించబడకపోవటం చాలా కష్టం! కాని ప్రేమించటాన్ని అనుమతించకపోవటం ఇంకా దుర్భరం! ఒకరు మీ ప్రేమను తిరిగి ఇవ్వకపోతే, మీరు దాన్ని సహించవచ్చు. కాని మరొకరు మీ బహుమతిని అంగీకరించకపోతే, మీరు సహించగలరా? మన మందరమూ ఇవ్వటానికే పుట్టాము, మనకు ఆ విషయం తెలియదు.

భారత్‌లో, పాశ్చాత్య దేశాలలో వినని సుందర భావన మనకు ఉంది:

దాత కృతజ్ఞతలు తెలుపుతాడు :

కారణమేమిటంటే ప్రతి గ్రహీత దాతకు దానం చేసే అవకాశాన్ని కల్పించాడు. దానాన్ని అంగీకరించాడు. భారత్‌లో గ్రహించటాన్ని పాపంగాను, ఇవ్వటాన్ని ప్రత్యేకాధికారికంగాను భావిస్తారు. కాబట్టి దాత తనకు ప్రతి గ్రహీత ఉపకారం చేసినందుకు, తన దానాన్ని అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతాడు.

మీరు ఏమీ అపేక్షించకుండా ఇచ్చినపుడు దాన్ని ప్రతిగ్రహీత అంగీకరించినపుడు రెండూ పవిత్ర కార్యాలవుతాయి. దయ గురించి షేక్స్పియర్ సుందరంగా చెప్పినట్లు దాత ప్రతి గ్రహీతలిద్దరూ భగవత్కృపకు పాత్రులు.

వాస్తవంతో అస్తిత్వంతో జీవత్సంబంధాన్ని కల్గి ఉండటానికి ఏకైక మార్గం కృతజ్ఞత ద్వారా, మీరు ప్రేమిస్తున్నప్పుడు, ప్రవహిస్తున్నప్పుడు, కృతజ్ఞతతో నిండి ఉన్నప్పుడు, మీరు ఎల్లప్పుడు మీ ద్వారా కలిగే అస్తిత్వ ప్రవాహ అద్భుతశక్తిని భావిస్తారు.

మీరు కృతజ్ఞతలు చెప్పవద్దు, కృతజ్ఞత కండి.

కృతజ్ఞతకు చెల్లించవద్దు, కృతజ్ఞత అయిపోండి.

ఇది తథాత - జీవితం మీకు ఏది ఇచ్చినా దానిని భక్తి కృతజ్ఞతలతో అంగీకరించటం, జీవితకాలానందానికి కృతజ్ఞత మిక్కిలి అప్రయత్నమార్గం.

మీకు కృతజ్ఞతలు!