KAILASA Library/Untitled - ISBN 979-8-88572-496-8/Sign in
Untitled - ISBN 979-8-88572-496-8

Untitled - ISBN 979-8-88572-496-8

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

Ebook ISBN: 979-8-88572-496-8

పరమహంస శ్రీ నిత్యానంద స్వామి ఈ శతాబ్దంలో
అవతరించిన విప్లవాత్మకమైన ఆధ్యాత్మిక గురువు. స్వామీజీ తన
ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చాలా చిన్న వయస్సులోనే ప్రారంభించారు.
స్వామీజీ కాలినడకన భారతదేశం మొత్తం తిరిగారు. ఆయన భారతదేశం
నేపాల్లోని గొప్ప గొప్ప రుషుల దగ్గర, యోగుల దగ్గర ఆధ్యాత్మిక
సంబంధమైన శాస్త్రాలను నేర్చుకున్నారు. ఆయన చాలా చిన్న
వయస్సులోనే కఠోర తపస్సు చేశారు. ఆయన జనవరి ఒకటి 2000
పవిత్రదినాన జ్ఞానోదయం పొంది నిత్యానంద స్థితికి చేరారు.

జీవితం పట్ల ఆధ్యాత్మికత పట్ల ఆయన కరుణాపూరితమైన
దృక్పథంతో మానవుల అంతరంగములోనికి తన జ్ఞానోదయపు ప్రకాశాన్ని
నింపుతూ, ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది హృదయాలని
స్పృసించగలిగారు.

స్వామీజీ లక్ష్యం మానవునిలో దాగివున్న ఆధ్యాత్మికతను
మేలుకొల్పటం దీనికోసం ఆయన ప్రపంచ వ్యాప్తంగా ధ్యానపీఠం అనే
మహోద్యమాన్ని జనవరి ఒకటి, 2003న ప్రారంభించారు. ధ్యానపీఠం
యొక్క ప్రధాన కార్యాలయం బెంగుళూరు దగ్గర బిదదిలో వున్నది.
ప్రస్తుతం 24 దేశాలలో 800 కేంద్రాల ద్వారా ధ్యానపీఠం తన
కార్యాక్రమాలని జరుపుతున్నది.

మనుషుల అంతరంగాలలో మార్పులు తెస్తూ మానవాళిని
మార్చాలనే గొప్ప లక్ష్యంతో ధ్యానపీఠం ముందుకు వెళుతుంది.
స్వామీజీ తన యొక్క దివ్య చికిత్సా శక్తుల ద్వారా మరియు
సామాన్యంగా, సులభంగా ఉండే ధ్యాన పద్ధతుల ద్వారా మనలని
భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా భావాత్మకంగా మేధోపరంగా
వికసించేలా చేస్తున్నారు.

ఏదయితే సూటిగా ఇవ్వబడినదో అదే సత్యం దేనినైతే అందమయిన కవరులో చాలా అందమయిన పదాలతో ఆధ్యాత్మిక పదాలతో కప్పబడినదో అది అర్థ సత్యం (హాఫ్ ట్రూత్) అర్ధసత్యం అబద్ధ కంటే చెడ్డది. ఎప్పుడయితే ఎవరయినా సత్యాన్ని అనుభవంతో తెలుసుకుంటారో అదే అంతిమమయిన అనుభవం. ఈ రెండూ ఒకటే. అయితే అవి వెల్లడిచేసే పద్ధతులు వేరుగా ఉంటాయి. అది చాలా అయోమయాన్ని సృష్టించుతుంది. ఒక వ్యవస్థకి మరొక వ్యవస్థకి మధ్య చాలా తేడాలని ఇది కల్పించుతుంది.

మీరు లోతుగా చూస్తే, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నన్ని విరుద్ధ భావాలు మరే రంగంలోకాని, శాస్త్రంలో కాని కనిపించవు. అది శాస్త్ర విజ్ఞానం కాని, గణిత శాస్త్రమే కాని, తర్కశాస్త్రము, చరిత్ర, భూగోళ శాస్త్రము, ఇలా ఏ శాస్త్రములో కూడా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నన్ని వ్యతిరేక వాదనలు ఏ శాస్త్రంలో కనిపించవు. అన్ని రంగాలలో కూడా విషయాలని ఒకేవిధంగా చెబుతారు. ఏవో కొన్ని వాస్తవాలు, కొన్ని అంకెలలో చిన్న చిన్న తేడాలు ఉంటాయేమోగాని, వాటిలో ఉండే ప్రధాన విషయం, ముఖ్యమయిన భాగం మాత్రం ఒకేవిధంగా చెప్పబడుతుంది.

శాస్త్రవిజ్ఞానంలో ఒక శాస్త్రజ్ఞుని అభిప్రాయానికి, మరొక

శాస్త్రజ్ఞునికి మధ్య విరుద్ధవాదనలు ఉండవు. అలాగే గణిత శాస్త్రంలో కూడా వ్యతిరేక భావాలు ఉండవు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నన్ని వ్యతిరేక భావాలు, వాదనలు మరే రంగంలో కనిపించవు. ఆధ్యాత్మిక రంగంలో విరుద్ధ భావాలు కనిపించకపోతే అది ఒక కొత్త విషయం అవుతుంది. ఈ సందర్భంలో ఇద్దరు రుషులు కలుసుకొని ఒక విషయం మీద మాట్లాడుకుంటే అనే దానిమీద ఒక చక్కని సామెత ఉన్నది. ఇద్దరు రుషులు ఏవిషయంలోనైన విరుద్ధ భావాలు వెల్లడించకపోతే, కచ్చితంగా అందులో ఒకరు నకిలీ అని మీరు నమ్మవచ్చు.

ఎందుకు ఈ రంగంలో ఇన్ని విరుద్ధ భావాలు ఉన్నాయి? ఎందుకు ఎన్నో కొత్త కొత్త తత్వాలు ఈరంగంలో ఉంటాయి? అందరూ అనుకుంటారు ముఖ్యంగా హిందూమతంలో ఎందుకు ఇన్ని గ్రూపులు, తరగతులు, ఉపతరగతులు, ఇంతమంది దేవతలు ఉంటాయి అని. ఇలా ఎందుకు ఉంటుందంటే ఎక్కడయితే స్వేచ్ఛ ఉంటుందో అక్కడ మీరు విభిన్నమయిన విషయాలని చూడగలుగుతారు.

పశ్చిమదేశాల సమాజంలో వారికి చాలా స్వేచ్ఛ ఉంటుంది. ఈ విషయంలో ఏమి చెబుతారంటే, మూడు నెలలకి ఒకసారి వాళ్ళు కార్లని, ఇళ్ళని చివరికి వారి భార్యలని మారుస్తూ ఉంటారు అని. వీటినన్నింటినీ కూడా మూడునెలలకి ఒకసారి మారుస్తూ ఉంటారు. వారికి బయట ప్రపంచంలో, వారి సమాజంలో అంతులేని స్వేచ్ఛ ఉన్నది. కానీ వాళ్ళకి అంతరంగపు (వారి లోపలి) ప్రపంచంలో అసలు స్వేచ్ఛ లేదు. వారి అంతరంగపు ప్రపంచానికి సంబంధించిన కొన్ని నమ్మకాలని స్పూన్‌తో తినిపించినట్టుగా వారి లోపలికి పంపించుతారు. వారికి ఏమి పెట్టారో అదే తినాలి. దానిని వారి జీర్ణించుకున్నారా లేదా అనేది పూర్తిగా వారి భాధ్యత.

పశ్చిమదేశాల సమాజంలో వారి అంతరంగపు ప్రపంచంలో వారికి అసలు స్వేచ్ఛ ఉండదు. అందుకే ఆ సమాజంలో చాలా గ్రూపులు, వర్గాలు, సంస్కృతులు అనేవి లేవు. వారి సమాజంలో చాలామంది దేవతలు ఉండరు. అదే తూర్పుదేశాల సమాజంలో వారి అంతరంగపు ప్రపంచంలో వారికి అంతులేని స్వేచ్ఛ ఉంటుంది. ఎవరయినా అంతరంగపు జీవితాలలోనికి వెళ్ళవచ్చు. అక్కడ పరిశోధనలు చేయవచ్చు. దానికి సంబంధించిన రిపోర్టులని బయట ప్రపంచానికి వెల్లడి చేయవచ్చు. ఈ ప్రపంచంలోనికి కొత్త తత్వాలని తేవచ్చు. ఈ భూమి మీదకి కొత్త దేవుళ్ళని తీసుకురావచ్చు. మానవాళికి కొత్త ఆదర్శాలను తీసుకురావచ్చు.

తూర్పుదేశాల సమాజంలో, బయట ప్రపంచంలో మనకి అసలు స్వేచ్ఛలేదు. అయితే లోపలి ప్రపంచంలో చాలా స్వేచ్ఛ ఉన్నది. అందుకే మనకి ఇన్ని వర్గాలు, ఇన్ని సంస్కృతులు ఎన్నోరకాల ఆదర్శాలు, ఎందరో గురువులు. ఈ సందర్భంలో స్వామి వివేకానందా ఒక చక్కని వాక్యం చెబుతారు. "ఏ రంగం అయిన అభివృద్ధి చెందాలి అంటే స్వేచ్ఛ ఒక ప్రాథమిక నిబంధన". తూర్పు దేశాలలో మనకి మన అంతరంగపు శాస్త్రాలలో ప్రవేశించటానికి అంతులేని స్వేచ్ఛ ఉన్నది.

పశ్చిమ దేశాలలోఎవరయినా ఒకరు ఆధ్యాత్మిక గురువుగా లేదా ఆధ్యాత్మిక వ్యక్తిగా నిలవాలి అంటే ఏదైన ఒక సంస్థ ఆవ్యక్తిని 'సెయింట్' అంటే ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించాలి. ఆసంస్థ మాత్రమే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక గురువు అవునా, కాదా అని నిర్ణయిస్తుంది. కానీ తూర్పుదేశాలలో ఇటువంటి కార్యక్రమాలు అవసరంలేదు. ఎవరయిన ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాను అని అనుకుంటే ఆవిషయాన్ని అతను ప్రపంచానికి తానే ప్రకటించుతాడు. తూర్పుదేశాలలో ఈ విషయాలు పూర్తిగా వేరేవిధంగా ఉంటాయి. ఇక్కడ మనం మన అంతరంగపు జీవితంలోనికి లోతుగ వెళ్ళి, అక్కడ సత్యాలని పరిశోధించే స్వేచ్ఛ ఉన్నది. అందుకే ఇక్కడ చాలా తత్వాలు, చాలా మంది గురువులు ఉంటారు. సత్యాన్ని చాలా విధాలుగా, ఎన్నో మార్గాలలో వెల్లడి చేస్తారు. ప్రతి గురువు చెప్పినది, వేరు వేరు మార్గాలలో వివరించినవి, అన్నీకూడా చివరికి అంతిమ సత్యం వైపు మాత్రమే వెళతాయి. అయితే ఎన్ని నమ్మకాలు ఉన్నాయో అన్ని దారులు ఉంటాయి. రామకృష్ణ పరమహంస ఈ విధంగా చెప్పారు: "యతోమా తతో పధ్" ఎన్ని నమ్మకాలో అన్ని దారులు.

వేరు వేరు వ్యక్తులు వారి అనుభవాలను వేరువేరు మార్గాలలో వివరించారు. ఉదాహరణకి పతంజలి మన తలలోపల ఉండే చక్రాన్ని సహస్రార చక్రం అని చెప్పారు. సహస్రార అంటే వేయిరేకుల పద్మం. అయితే మీరు ఎవరి తలనైనా తెరచి చూస్తే అందులో నిజంగా వేయిరేకుల పద్మం ఉంటుందా? కచ్చితంగా ఉండదు. అయితే ఆయన వేయిరేకుల పద్మం అని ఎలా అన్నాడు? ఆదిభౌతిక తత్వంలో (Meta-physical experssion) చెప్పే వివరణ ప్రకారం విశ్వ శక్తి సహస్రార చక్రంలో ప్రవేశించినప్పుడు అది వికసించిన వేయిరేకుల పద్మంలా అనుభూతిని ఇస్తుంది. ఎంత అందమయిన అనుభవమో కదా! అదేవిధంగా మీలోపల మీరు ఆవిధంగా వికసించుతారు. మీ అంతరంగంలోని ఉనికి తనను తాను వైభవంగా వెల్లడి చేసుకుంటుంది. ఆధ్యాత్మికమైన, ప్రపంచానికి సంబంధించిన అనుభవాలను భౌతికమయిన ఉదాహరణలు, పదాలతో చెప్పినప్పుడు పరిణితిలేని మనషులు వాటిని అదే అర్ధంలో తీసుకొని అయోమయాన్ని సృష్టించుతారు. దాంతో అసలు జరిగిన విషయం ఒకటి అయితే వాళ్ళు అర్ధం చేసుకున్నది మరొకటి అవుతుంది. ఎప్పుడయితే ఎవరయినా ఇటువంటి అనుభవాను మామూలు భాషలో చెబితే, ఆ మాటలు అసలు అనుభవాలని సమానంగా ఉండవు. దాంతో అది విన్నవాళ్ళు దానిని వక్రీకరించుతారు.

ఒక సాధకుడు, జ్ఞానోదయం పొందిన జైన్ బౌద్ధ గురువు దగ్గరికి వెళ్ళి "గురుదేవా! జ్ఞానోదయం పొందిన వ్యక్తి మాట్లాడతాడా?" అని అడుగుతాడు.

ఆ ప్రశ్నకి జవాబుగా గురువు, “లేదు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి అసలు మాట్లాడడు. జ్ఞానోదయాన్ని మాటలలో వివరించలేము. జ్ఞానోదయం పొందిన వ్యక్తి అసలు మాట్లాడడు. ఒక వేళ అతను మాట్లాడితే, కచ్చితంగా అతనికి జ్ఞానోదయం కలగలేదు అని అర్థం” అని అంటాడు.

అప్పుడు ఆ సాధకుడు, “అయితే జ్ఞానోదయమయిన వ్యక్తి ఎప్పుడూ మౌనంగానే ఉంటాడు అని అర్థం కదా!" అని గురువుతో అంటాడు.

అతని మాటలకి గురువు, “జ్ఞానోదయమయిన వ్యక్తి అసలు మౌనంగా ఉండలేడు. అతను అలా నిశ్శబ్దంగా ఉంటే స్పష్టంగా తెలిసేది ఏమిటంటే అతను జ్ఞానోదయం పొందిన వ్యక్తి కాదు అని. ఎందుకంటే నీవు జ్ఞానోదయాన్ని కలిగి దానిని నీ ఆధీనంలో ఉంచితే నీవు నిశ్శబ్దంగా ఉండవచ్చు. అయితే జ్ఞానోదయం విషయంలో, నీవు జ్ఞానోదయాన్ని ఆధీనం చేసుకోలేవు. జ్ఞానోదయమే నిన్ను ఆధీనంలోనికి తీసుకుంటుంది. నీవు దేనినైనా ఆధీనంలో ఉంచుకుంటే నీవు దానిని నీ తలగడ కింద పెట్టవచ్చు లేదా నీ ఇనుప బీరువాలో దాచేసి నీవు మౌనంగా ఉండవచ్చు, కానీ జ్ఞానోదయం, అదే భగవంతుడు నిన్ను తన ఆధీనంలో నికి తీసుకున్నప్పుడు నీవు మౌనంగా ఉండలేవు. కాబట్టి ఎవరయినా మౌనంగా ఉంటే కచ్చితంగా అతను జ్ఞానోదయం పొందలేదు అని చెప్పవచ్చు అని జవాబు ఇస్తాడు.

ఈ జవాబుతో శిష్యుడు సహజంగానే అయోమయంలో పడతాడు. అతను గురువుతో , అయితే నిజంము ఏమిటి? మీరు జ్ఞానోదయమయిన వ్యక్తి అసలు మాట్లాడరు అని అన్నారు, మరలా అతను మౌనంగా అసలు ఉండరు అని అన్నారు. అలా అయితే అసలు నిజమేమిటి? అతను ఏమి చేస్తాడు?

శిష్యుని ప్రశ్నకి గురువు చాలా అందమయిన జవాబు ఇస్తాడు: ఆయన పాడతాడు. జ్ఞానోదయాన్ని వివరించడానికి ఒక్కటే దారి ఉన్నది, అది పాడటం. జ్ఞానోదయం పొందిన వ్యక్తి బోలుగా ఉండే వెదురులాంటి వాడు. భగవంతుడు ఆ వెదురుని మురళిగా మలచి మురళీగానంతో సర్వసృష్టిలోని అద్భుత అందాలని ఆధ్యాత్మికతని, అంతిమ సత్యాలని వెల్లడి చేస్తాడు.

పాడటం అంటే అర్ధం ఏమిటి? పాడటం అంటే శరీర కదలికలు, శరీర భాష. జ్ఞానోదయం అంటే ఏమిటో వివరించటానికి శరీర భాష ఒక్కటే సరియైన మార్గం. దానిని మాటల ద్వారా వివరించలేము. మౌనంతో చెప్పలేము. కేవలం నిశ్శబ్దం జీవం లేనిది. పాడటం కూడ ఒక విధమయిన మౌనమే. ఈ మౌనరాగం అందంగా, అద్భుతంగా ప్రతిధ్వనిస్తుంది. ఎప్పుడయితే నిశ్శబ్దం శక్తితో ప్రతిధ్వనిస్తుందో, అది తన వైభవాన్ని అత్యుత్తమంగా వెల్లడి చేయగలుగుతుందో, అప్పుడు అది సంగీతమవుతుంది. అదే పాడటం అంటే. అది మాట్లాడటం కాదు. నిశ్శబ్దం కాదు.

నిశ్శబ్దాన్ని వ్యతిరేక భావంలో ఉపయోగించితే అది మాటలు లేనిది, శబ్దరహిత మయినది అవుతుంది. ఆ మౌనమే అనుకూల భావంతో చూస్తే అమర గానమౌవుతుది. అదే పాడటం అవుతుంది.

ఎవ్యక్తి అయినా జ్ఞానోదయం పొందితే అతని నడకే నాట్యమవుతుంది. అతని ప్రతి కదలిక ప్రేమని వెల్లడి చేస్తుంది. అతని అంతరాత్మ ఆనంద గీతాలు ఆలపిస్తుంది. పరమానంద భరితమవుతుంది. సంతోషాన్ని వెదజల్లుతుంది. అంతిమమయిన సాధారణ సత్యాన్ని సూటిగా వెల్లడి చేయడానికి ఇది ఒకే మార్గం. ఎప్పుడయినా సత్యాన్ని వెల్లడి చేయటానికి మాటలని ఉపయోగించితే, అది కచ్చితంగా సత్యం కాదు అని మీరు నమ్మవచ్చు. అయితే గురువులు నిజాలను మాట్లాడతారు. కానీ ఆ నిజాలని మీరు తీసుకోలేకపోతున్నారు. ఈ సంభాషణ సమయంలో, గురువులు మాట్లాడటం, మీరు వినే ఈ మధ్యలో ఏదో జరుగుతుంది. ఆ క్రమంలో ఏదో కొంత కోల్పోతున్నది. ఎందుకంటే గురువులు ఒక స్థితినుంచి, ఒక దశనుంచి మాట్లాడతారు. మీరు వేరొక స్థితిలో ఉండి దానిని వింటారు. ఎప్పుడయితే వారు వేరు వేరు స్థితులలో ఉంటారో, వారి మధ్య వ్యవహారాలు ఎలా కుదురుతాయి.

అయితే మీరు ఒకటి చేయవచ్చు. మీరు అతని శరీర భాషనుంచి శరీర కదలికలనుంచి కొంత గ్రహించవచ్చు. ఆయన సమక్షం నుంచి మీరు కొంత గ్రహించవచ్చు. గురుదేవుని విషయంలో ఆయన సమక్షంలో ఉండే ఒకే ఒక సత్యం ఇదే. అందుకే నేను అంటాను, సూక్ష్మ సత్యాన్ని సూటిగా చెప్పటం అని. గురువుల సమక్షంలో మీరు ఉన్నప్పుడు ఆ ప్రాథమిక, సూక్ష్మ సత్యం మీ లోపలికి ఒక మెరుపులా ప్రవేశిస్తుంది.

ఒకసారి ఒక దేశపు రాజు బౌద్ధగురువుని తన రాజమందిరానికి ఆహ్వానించి ఆయనని ఆధ్యాత్మికత గురించి అడుగుతాడు. బౌద్ధగురువు రాజభవనానికి వచ్చి గురుపీఠం మీద కూర్చుంటాడు. అలా కొంతసేపు కూర్చొని ఆ తరువాత బయటకి వెళ్ళిపోతాడు.

రాజు చాలా ఆశ్చర్యపోతాడు. ఆయన గురువుగారి శిష్యులని ఈ విధంగా అడుగుతాడు. “ఏమి జరిగింది? మీ గురువుగారు ఏమి మాట్లాడ లేదు. ఆయన వచ్చారు, కూర్చున్నారు వెళ్ళిపోయారు”.

ఆ ప్రశ్నకి ఆయన శిష్యులు ఈ విధంగా జవాబు ఇచ్చారు. “ఓ! లేదు ! ఇంతకు ముందు ఎప్పుడూ ఆయన ఇంత చక్కగా మాట్లాడలేదు. ఆయన మీకు ఏమి వివరించాలనుకున్నాడో, అది ఎంతవరకు అవసరమో అంతవరకూ ఆయన చక్కగా వివరించారు”

అప్పుడు రాజు “అంటే దీని అర్థం ఏమిటి?” అని అడిగాడు.

“ఆయన ఏమి చెప్పదలచుకున్నారో ఆవిషయాన్ని మౌనంగా వివరించారు” అని శిష్యులు వివరంగా చెప్పారు. త

“అలా అయితే ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆయన ఆశ్రమంలోనే ఉండి ఈ పని చేయవచ్చు కదా! అంతదూరం నుంచి అయిన ఇక్కడి వరకూ రావటం ఎందుకు? రాజు శిష్యులని అడిగాడు.

రాజు అడిగిన ప్రశ్నకి శిష్యులు ఇలా వివరణ ఇచ్చారు:” ఆయన మీకు చెప్పదలచిన విషయాలు మాటల రూపంలో వివరించలేరు. ఆయన శరీర భాషతో కూర్చుని ఉండటం ద్వారా ఆయన మీకు చెప్పదలచిన విషయాలను వివరించారు. ఆ విషయాలు మాటలకి అతీతమయినవి.

గురువు సమక్షంలో ఏదో కొంత జరుగుతుంది. మీరు మీ అంతరంగపు నిశ్శబ్దంతో వినగలిగితే, దానిని మీరు వింటారు. మీరు మీమైండ్‌తో వింటే, మీలోపలి మాటలని మాత్రమే వినగలుగుతారు. మీ మైండ్ నేను చెప్పే విషయాలకి విలువలు కట్టటంలో, లెక్కలు వేయడంలో మునిగిపోతుంది. అంతేకానీ నేను ఇచ్చే సందేశాన్ని తీసుకోలేదు.

మీ మైండ్ నేను చెప్పేవిషయాలు విని వాటిని తీసుకొని, ఆ మాటలకి ఈ విధంగా స్పందించుతుంది, ఆహా! స్వామీజీ ఎంత అద్భుతంగా మాట్లాడారు. ఆయన భాష , పదాలు ఉపయోగించే పద్ధతి అమోఘం. ఇలా ఇంకా అంటుంది.

లేదా, నా మాటలని, నేను చెప్పిన విషయాలని తిరస్కరించుతారు. అప్పుడు ఇలా ఆలోచించుతారు, ఈయన చెప్పిన ఒక్క మాటని కూడా నేను నమ్మను. నేను అనుకునేది పూర్తిగా వేరేవిధంగా ఉంటుంది.

మీరు నేను చెప్పే విషయాలు ఒప్పుకోవచ్చు లేదా ఒప్పుకోక పోవచ్చు. మీరు మీ మైండ్‌తో, మీ మేధస్సుతో వింటే మీరు ఈ రెంటిటిలో ఎదో ఒకటి చేస్తారు. మీరు ఏవిధంగా చేసినా నాసమక్షంలో మీకు చేరవలచిన మొత్తం సందేశాన్ని పోగొట్టుకుంటారు. నేను చెప్పే విషయాలు వినాలా వద్దా అనే కార్యక్రమంలో పడిపోయి నేను చెప్పె అసలు సందేశాన్ని మీరు వినటంలేదు. మీరు ఆ విషయాలని ఒప్పుకునేలోపు నేను చెప్పిన సందేశాన్ని మీరు కోల్పోతున్నారు. నేను చెప్పె మాటలని తిరస్కరించేలోపు మీరు అటువంటి మంచి సందేశాలు రెండు మూడింటిని కోల్పోతున్నారు. అప్పుడు మీరు మీతో పూర్తి సత్యాన్ని తీసుకు వెళ్ళలేరు. మీరు మీతో తీసుకు వెళ్ళేది సంపూర్ణ సందేశం కాదు. ఎప్పుడయితే నా సందేశాన్ని పూర్తిగా మీతో తీసుకు వెళ్ళతారో అదే సత్యం. ఏది సంపూర్ణ మయినదో అదే పవిత్రమయినది.

మీరు మీ మెదడుతో వింటే, నేను చెప్పే విషయాలని స్వీకరించుతారు లేదా తిరస్కరించుతారు. రెండు పద్ధతులు మీకు ఏవిధముగా కూడా సహాయం చేయవు. మీరు మీ వికసించిన ఉనికితో, తెరవబడిన అంతరంగంతో ఇక్కడ కూర్చున్నప్పుడు, మీరు మీలోపలి వ్యర్థపు మాటలని పూర్తిగా వదిలివేసినప్పుడు, మీరు నా మాటలకి అతీతంగా, నేను చెప్పే విషయాలని వినగలుగుతారు. మీలో జరిగే కొంత మార్పుని గమనించగలుగుతారు. నా మాటలు మీలోపల తేలేని మార్పుని, నా సమక్షం తీసుకువస్తుంది. అప్పుడు మీరు గ్రహించే విషయాన్నే నేను సూక్ష్మమయిన ప్రాథమిక సత్యం అని అంటాను. ఆ సత్యాన్ని మీరు కాసెట్స్లో కానీ, వీడియో టేపుల ద్వారా కానీ గ్రహించలేరు. ఆ సత్యం పుస్తకాలలో చెప్పలేనిది. అది కేవలం గురువులు తన సమక్షంలో సూటిగా మీకు ఇవ్వగలిగే సాధారణ సత్యం.

నిజానికి మీరు ఇటువంటి సత్యాన్ని వేదాలలోకానీ, బైబిల్ లేదా ఖురాన్లోకాని గ్రహించలేరు. కచ్చితంగా ఆ గ్రంధాలలో ఉన్నవి సత్యాలే. అయితే అవన్నీ ఆ గురువులు మాట్లాడినప్పుడు సత్యాలు. కానీ అవి ఇప్పుడు మాటలు మాత్రమే.

గురువులు ఎప్పుడు మాట్లాడినా మీకు ఏదో కొంత జ్ఞానాన్ని బోధించాలనో లేదా ఏదైనా విషయం అర్ధమయ్యేలా చేయలనో మాట్లాడరు. వారు మాట్లాడే ఉద్దేశం పూర్తిగా వేరుగా ఉంటుంది.

వాళ్ళు ఎందుకు మాట్లాడతారంటే, మీరు మీలోపలి మాటలు ఆపుతారని. నేను ఎందుకు మాట్లాడతానంటే, మీరు మాటలు ఆపుతారు అని. మీరు ఎప్పుడయితే మాట్లాడటం మానేస్తారో అప్పుడే మీకు నాకూ మధ్య ఏదోకొంత జరుగుతుంది. అది ఒక రసాయనిక చర్య. ఇంకా సరిగ్గా చెప్పాలంటే రసవాద చర్య. (రసవాద చర్య అంటే తక్కువ లోహాలని బంగారంవంటి అత్యుత్తమ లోహాలుగా మార్చే చర్య) మనమధ్య కొంత రసవాద చర్య జరుగుతుంది. కొంత ప్రకాశం మీలోపలికి పంపబడుతుంది. అది నిజమయిన సత్యం. ఇదంతా ఎందుకంటే, ఆ సందేశాన్ని మీరు అదేవిధంగా గ్రహించలేరు. అందుకే గురువులు మాట్లాడుతూ మీ మైండ్ ని ఒకపక్కకి మళ్ళించుతారు. మీ మైండ్ని ఆ మాటలలో నిమగ్నమయ్యేట్టు చేస్తారు. ఎప్పుడయితే మీ మైండ్ ఆ మాటలలో నిమగ్నమౌతుందో, అప్పుడు మీలోని మీ అసలయిన ఉనికి నాకోసం, నేను చెప్పే విషయాలని తీసుకోవటం కోసం తెరవబడుతుంది. అప్పుడు నేను మీకు ఇచ్చే సత్యం మీ లోపలికి పంపబడుతుంది. ఆ ప్రకాశం మీ లోపలికి చేరుతుంది. అప్పుడు మీ అంతరంగంలోకి, అసలయిన మీలోపలికి నిత్యానందం ప్రవేశించుతుంది. కాబట్టి మీ మైండ్ ని వదిలివేయండి. అంతరంగంలో నిరంతరం మాట్లాడే మాటలని వదిలివేయండి. అలా చేసినప్పుడు మీలో, మీ అంతరంగంలో జరిగే మార్పుని ఇప్పుడే, ఇక్కడే మీరు గమనించ గలుగుతారు.

మనకి రెండు రకాల శరీరాలు ఉంటాయి. ఒకటి బయట శరీరం. ఆ శరీరంతోనే మీరు ఇక్కడ కూర్చున్నారు. రెండవది మీ అంతః శరీరం లేదా లోపలి శరీరం. అది ఇక్కడ కూర్చున్నదో లేదో తెలియదు. మీరు మీ లోపలి శరీరంలో ఏమి జరుగుతున్నదో అనుభవ పూర్వకంగా తెలుసుకోండి. మీ లోపలి శరీరాన్ని మీ బయట శరీరంలో ప్రవేశపెట్టండి. అప్పుడు మీ లోపలి శరీరం బయట శరీరంలో ఉన్న అనుభవాన్ని తెలుసుకోండి. అది చాలు. అప్పుడు మీరు గురువుల శరీర భాష నుంచి ఏమినేర్చుకోవాలో అది నేర్చుకోగలుగుతారు. అలా కాకుండా మీరు ఇక్కడ కేవలం మీ బయట శరీరంతో మాత్రమే కూర్చుంటే, మీరు నా మాటల ద్వారా మాత్రమే వినగలుగుతారు. నా మాటల ద్వారా విన్న విషయాలు పూర్తి సత్యాలు కావు. అవి అర్థసత్యాలు (Half-Truth). మీరు నా దగ్గర నుంచి నా సమక్షంలో ఏదయితే నేర్చుకుంటారో, నా శరీర భాషనుంచి ఏదయితే తెలుసుకుంటారో అదే ప్రాథమిక సత్యం. అదే సూక్ష్మ సత్యం. సూటిగా మీకు ఇవ్వబడే సత్యం. ధన్యవాదములు

ఇప్పుడు నేను కొంత సమయం మీ ఆలోచనలని, మీ అనుభవాల గురించి వినాలని అనుకుంటున్నాను. అది మీరు అడిగే ప్రశ్నలకి జవాబులు ద్వారా గాని లేదా మీ జవాబులని ప్రశ్నించటం ద్వారాకాని ఎలా అయినా సరే కొంతసేపు మీతో గడపాలని అనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చేముందు ఎవరో, "స్వామీజీ! ప్రేక్షకులు తక్కువమంది ఉన్నారు" అని నాతో అన్నారు. నాకు సంతోషమనిపించింది. చిన్న సమూహంతో అయితే నేను ఏది చెప్పినా పూర్తి తృప్తినిస్తుంది. రాజకీయ పార్టీ మీటింగులకి పెద్ద సంఖ్యలో జనం కావాలి, కానీ ఆధ్యాత్మిక మీటింగులకి చిన్న గ్రూపు అయితే బాగుంటుంది. సరే మీ మొదటి ప్రశ్న ఏమిటి? ప్ర॥ 1) ప్రియమయిన స్వామీజీ! మేము ప్రపంచంలో ఉన్నామా? లేకపోతే ప్రపంచం మాలో ఉన్నదా? మీరు ప్రపంచంలో లేరు. ప్రపంచం మీలో లేదు. మీరు ప్రపంచంలో ఉన్నారు, అనే భావం మిమ్మలని భౌతికవాదులుగా చేస్తుంది. అలా కాకుండా ప్రపంచం మీలోపల ఉన్నది అనే భావం మిమ్మలని ఆధ్యాత్మిక వ్యక్తులుగా మారుస్తుంది. రెండూ కూడా భావాలే కల్పనలే. స్పష్టంగా అర్థం చేసుకోండి, మీరు ప్రపంచంలో ఉన్నాము అని అనుకుంటే మీరు భౌతికవాదులవుతారు. అప్పుడు ఈ వస్తు ప్రపంచం వెనుక పరుగెడతారు. మీరు కేవలం దానివైపుగానే వెళతారు. దానిని పొందాలి అని అనుకుంటారు. దానిని మీ ఆధీనం చేసుకోవాలని అనుకుంటారు. మీ లోపల ప్రపంచం ఉన్నది అని మీరు అనుకుంటే, మీరు

మీ అంతరంగంలోని మీ ఉనికి వెనుక పరిగెడతారు. దానిని పొందాలి అని అనుకుంటారు. ఇదికూడా పైన చెప్పిన పరుగులాంటిదే, కానీ ఈ పరుగు కొంచెం మార్చబడి, అది మీ అంతరంగం లోపలికి వెళుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధికి లేదా ఏదో కొంత ఆధ్యాత్మికమయిన అనుభవాల కోసం చేసే పరుగు ఇది. దీనినే మనం అద్భుతమయిన వ్యవహారం అని అనవచ్చు. ఈ రెండూ కూడా రెండు రకాల కల్పనలు. రెండు రకాల భావాలు. ఎప్పుడయితే ఈ రెండూ కూడా భావాలు అని మీకు అర్ధమవుతుందో అప్పుడు మీరు మీలో ఆధ్యాత్మిక అనుభవం జరిగేవిధంగా చూస్తారు. అయితే ఆధ్యాత్మిక అనుభవం మాటల వలన జరుగదు. ఉదాహరణకి గంగానదిని చూడండి అందులో చిన్ని వెదురు కర్రని వేస్తే అది నదిలో తేలుతుంది. అప్పుడు ఆ వెదురు కర్రని మధ్యపాయింట్‌గా అనుకొని గంగానది రెండుగా చీలిపోయింది, ఒకటి ఎడమ గంగ, రెండవది కుడి గంగ అని అంటారా? అది సరియైన పద్ధతేనా? గంగానది రెండగా విడిపోయింది అని మీరు చెప్పగలరా? లేదు. నిజానికి గంగానది విడిపోలేదు. మీరు వెదురుకర్రని మధ్యపాయింట్ గా చేసి, మీ అవసరం కోసం, మీరు విషయాన్ని అర్ధం చేసుకోవటం కోసం, గంగానదిని ఎడమ గంగా, కుడిగాంగా అని పేర్లు పెట్టారు. అదే విధంగా, కేవలం ఏదో అవసరానికి మీరు ఈ శరీరాన్ని శరీరమని, బయట దానిని ప్రపంచం అని పిలుస్తున్నారు. ఇది కేవలం ఏదో పేర్లు పెట్టటం మాత్రమే.

మీరు లోపలికి చూడండి. మీ లోపలికి చూడండి. ఎందుకు నేను మిమ్ములని మీ లోపలకి చూడమంటున్నాను? మీరు ఇంతకాలం బయటకి మాత్రమే చూస్తున్నారు అని మీకు తెలుసు. అందుకే మిమ్ములని లోపలకి చూడమంటున్నాను. మీరు ఎప్పుడయితే లోపలకి చూస్తారో, మీకు అక్కడ మీకు, ప్రపంచానికి మధ్య ఎటువంటి హద్దు కనపడదు. మీకు ఇవతల హద్దు బలంగా ఉన్నట్టు అనిపించితే మీరు ప్రపంచంలో ఉన్నట్లుగా అనుకుంటారు. అవతలి హద్దు బలంగా కనిపించితే, ప్రపంచం మీలో ఉన్నది అని అనుకుంటారు.

ఎవరయితే ప్రపంచంలో మేము ఉన్నాము అని అనుకుంటారో, వాళ్ళు లౌకికులు, వస్తుప్రపంచానికి సంబంధించిన భౌతికవాదులు. వాళ్ళు ఎప్పుడూ మేము ప్రపంచంలో ఉన్నాము అని అంటారు. ఎవరయితే కొండగుహలలోనో హిమాలయాలలోనో కళ్ళుమూసుకుని కూర్చుంటారో వాళ్ళు ప్రపంచం మాలో ఉన్నది అని అంటారు. అయితే ఈ రెండూ కూడా కల్పనలే. మీకు ఇవి రెండూ కల్పనలు అని అనిపించటం లేదా? ఈహద్దు బలంగా ఉన్నట్టు మీకు అనిపించితే, మీరు ప్రపంచంలో ఉన్నామని అనుకుంటారు. అవతలి హద్దు బలంగా అనిపించితే మీలోపల ప్రపంచం ఉన్నది అని అనుకుంటారు. అంతే.

మీరు ఒక్కసారి ఈ రెండు విషయాలని వదిలివేస్తే మీరు అక్కడ చూసేది మిమ్ములనే. అక్కడ మీరు ఉంటారు. సాధారణంగా

యోగులు, రుషులు ప్రపంచం మీలో ఉన్నది అని మీకు నేర్పించుతారు. వాళ్ళు అలా ఎందుకు నేర్పుతారో మీకు తెలుసా? ఎందుకంటే, మీరు దీనికి వ్యతిరేక భావానికి బాగా అలవాటు పడిపోయారు. అదే, మీరు ప్రపంచంలో ఉన్నారు అనే భావనకి. మిమ్ములని ఆ భావం నుంచి బయటకి తీసుకురావటానికి వాళ్ళు మీతో ‘ప్రపంచం మీలో ఉన్నది' అని అంటారు.

నిజంగా చెప్పాలి అంటే, మీపాదంలో ముల్లు గుచ్చుకుంటే, దానిని మరొక ముల్లుతో తీస్తాము. ఒక్కసారి ముల్లుని బయటకి తీసేసాక ఆ రెండు ముళ్ళని బయట పారేస్తాము. ప్రపంచం మీలో ఉన్నది అనే భావం ఒక ముల్లులా ఉపయోగించేది మీలో ఉన్న ‘ప్రపంచంలో నేను ఉన్నాను' అనే ముల్లుని తీయటానికి మాత్రమే. చివరకి ఈ రెండూ కూడా కేవలం భావాలే. మీరు ఆ హద్దులని వదిలేస్తే, మీకు నిజమేమిటో తెలుస్తుంది. సత్యాన్ని మీరు అర్ధం చేసుకుంటారు. ఆ సత్యాన్ని మీరు ఈ రెండు భావాల ద్వారా వివరించలేరు.

గంగానదిలోని వెదురు కర్రని బయటకి తీసివేసి, ఇప్పుడు గంగానది ఒక్కటిగా అయిపోయింది అని చెప్పగలరా? లేదు. ఎందుకంటే గంగానది ఎప్పుడూ ఒక్కటే. ఎప్పుడయినా ఒకటి ఉన్నది అని మీరు చెప్పారు అంటే, రెండవది తప్పనిసరిగా ఉన్నట్టే. అసలు రెండవది లేదనుకోండి, అప్పుడు మొదటిది అని మీరు ఎలా చెప్పగలరు. మీకు స్పష్టంగా అర్ధమయిందా? బహువచనం ఉంటేనే ఏకవచనం ఉంటుంది. అసలు బహువచనమే లేనప్పుడు, ఇక ఏకవచనం ఎలా ఉంటుంది? అది ఏకవచనం అని మీరు ఎలా చెప్పగలుగుతారు? అలా చెప్పలేరు. అందుకే రుషులు, యోగులు ఈ తత్వాన్ని అద్వైతం అని అన్నారు.

ద్వైత్యం అంటే రెండు. కాని అద్వైతం అనే మాటని ద్వైతానికి ఏకవచనంగా చెప్పలేము. అలా చెబితే ఎక్కడో బహువచనం ఉన్నట్టే. అద్వైతం ఎప్పుడు 'ఒకటి' అని చెప్పలేము. దీనిని కేవలం 'ఎక్కడ అయితే బహుళం లేదో' అది అద్వైతం అని చెప్పగలం. ద్వైతా అంటే రెండు. అద్వైతా అంటే రెండు కానిది. అంతే.

మీరు ఎప్పుడయితే, 'నేను ప్రపంచంలో ఉన్నాను' అని అంటారో అది ద్వైతం. అలాగే ప్రపంచం నాలో ఉన్నది' అన్నప్పుడు కూడా అది ద్వైతం. అలా కాకుండా, ఈ రెండూ కూడా నిజం కాదు అనే విషయాన్ని మీరు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటే, సత్యాన్ని చూడగలుగుతారు. ఆ అనుభూతి తెలుసుకుంటారు. సత్యాన్ని ద్వైత తత్వంతో వివరించలేము. దానిని కేవలం అద్వైత తత్వంతో మాత్రమే వివరించగలం.

ప్ర॥ 2: ప్రియమయిన స్వామీజీ, మాకు ఈ కార్యక్రమంలో కుండలినీ అనే ధ్యాన పద్ధతిని కూడా నేర్పించుతారా?

తప్పకుండా నేర్చుకుంటారు. తరువాత రెండు రోజులలో ప్రయోగాత్మకంగా, జాగ్రత్తగా కుండలి శక్తిని చైతన్యపరచే పద్ధతిని నేర్చుకుంటారు.

మీ జీవితాల నుంచి అత్యుత్తమ ఫలితాలు పొందాలన్నా, జీవితాన్ని ఆహ్లాదంగా, ఆనందమయంగా చేయాలన్నా, ఆధ్యాత్మిక జీవితం పొందాలన్నా, నిజమయిన జీవితం కావాలన్నా, రెండు విషయాలు అవసరం. అందులో మొదటిది పరిణితి ? పరిణితి అంటే మీలోపలి అసలయిన మీ ఉనికిని సర్వాంతర్యామిని అర్ధం చేసుకోవటం. రెండవది ధ్యానం. అర్ధంచేసుకోవడం మీచేతన స్థితిలో మైండ్ని (ఆలోచనలని) స్పష్టం చేస్తుంది. ధ్యానం మీ అచేతన స్థితిలోని మైండ్ని శుభ్రపరచి, స్పష్టం చేస్తుంది.

కేవలం అర్ధంచేసుకోవటం ద్వారా మనం చాలా విషయాలని తెలుసుకోలేము. ప్రతి ఒక్కరు పొగతాగటం ఆరోగ్యానికి హాని అనే మాటని అర్ధం చేసుకోగలరు. ప్రతి సిగరెట్ అడ్వర్టయిజ్మెంటు మీదా హెచ్చరిక ఉంటుంది. అది మనకి తెలుసు. కానీ పొగతాగి బాధలను అనుభవిస్తుంటారు. దీనిని మనం ఆపలేము. ఎందుకు? ఎందుకంటే తెలివితేటలతో అర్ధం చేసుకోవటం కొన్ని విషయాలలో సరిపోదు. అందుకే మన అచేతన వ్యవస్థకి శక్తిని పంపించవలసిన అవసరం ఉంటుంది.

అచేతన ప్రదేశాన్ని మనం స్పష్టమయిన తెలివితేటలతో, పరిణితితో శుభ్రపరచి స్పష్టపరచవచ్చు. స్పష్టమయిన తెలివితేటలతో మనలోని 50% సమస్యలు పరిష్కారమవుతాయి. మన సంతోషకరమయిన జీవితంలో స్పష్టమయిన తెలివికి పాత్రలేదు అని మనం చెప్పలేము. దానికి ఉండే ప్రాముఖ్యత, ప్రత్యేక స్థానం దానికి ఉన్నాయి. అయితే అది చాలదు. అదే అంతిమం కాదు.

మీలో స్పష్టమయిన తెలివితేటలు ఉంటే మీరు మీలోపలి ప్రతి చక్రాన్ని అర్ధంచేసుకోగలుగుతారు. చక్రాలు ఎలా పనిచేస్తాయి, ఏవిధంగా ఈ శక్తి కేంద్రాలు వికసించుతాయి? ఇటువంటి విషయాలు మీకు అర్ధమవుతాయి. ఉదాః ఎందుకు మానసిక కుంగుబాటుకు మణిపూరక చక్రానికి దగ్గర సంబంధం ఉంటుంది? మణిపూరక చక్రం నాభిప్రాంతంలో ఉంటుంది. ఎప్పుడయితే మీరు భరించలేని వార్త వింటారో మొదటి దెబ్బ మీ కడుపు భాగంలో తగులుతుంది. అప్పుడు మీకు కడుపులో గడబిడ మొదలవుతుంది, లేదా మీకు డయేరియా వస్తుంది. మీలో ఎవరికయినా ఎప్పుడయినా ఇలా జరిగిందా? మనం ఎప్పుడూ అంటూంటాం ‘నేను జీర్ణించుకోలేను' అని తెలుగులోనే కాదు అన్ని భాషలలో ఈ మాటని వాడతాం. ఎప్పుడయినా మీరు భరించలేని వార్త విన్నప్పుడు, మీరు ‘నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటారు'.

అనహత చక్రం ప్రేమకి సంబంధించినది. అన్ని భాషలలోనూ ప్రేమ, గుండె లేదా హృదయం అనేవి ప్రత్యామ్నాయ పదాలు. అలా అని అన్ని భాషలు ఒకేసారి సృష్టించబడలేదు.

భగవంతుడు వేరు వేరు భాషల సి.డి. పేకేజీలు చేసి అన్ని దేశాలలో ఇవ్వలేదు. దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళం, ఉత్తర భారతదేశంలో హిందీ, ఇంగ్లాండ్‌లో ఇంగ్లీషు, ఇలా వేరు వేరు ప్రాంతాలలో ఎన్నో భాషలు వేరు వేరు సమయాలలో అభివృద్ధి చెందాయి. అయితే అన్ని భాషలలోను ప్రేమ, హృదయం చాలా దగ్గర పదాలుగా వాడతారు. దీని అర్థం ఏమిటంటే మీలోని భావావేశాన్ని ఎలా సంభాళించుకోవాలో తెలిస్తే, దానిని మీ పరిణితితో అర్థంచేసుకోగలిగితే, అది మీలోని 50% సమస్యలని పరిష్కరించుతుంది. ఆ చక్రాన్ని చైతన్యం చేయగల శక్తి మిగతా 50% సమస్యలని పరిష్కరించుతుంది. పరిణితి శక్తిని సృష్టిస్తుంది. శక్తి పరిణితిని పెంచుతుంది. ఇలా బంతి ద్రొల్లగానే మీకు అంతిమమయిన పరమానందం కలిగి, నిత్యానంద అనుభూతిని పొందుతారు.

త్వరలో మనం ప్రతి చక్రం గురించి వివరంగా రాబోయే సెషన్స్‌లో తెలుసుకుంటాము. అప్పుడు చక్రాల గురించి బాగా అర్థమవుతుంది.

పరిణితి మైండ్ లోని చేతన స్థితిని స్పష్టం చేస్తుంది. ధ్యానం అచేతన స్థితిని స్పష్టం చేస్తుంది. ఎప్పుడయితే ఇవి రెండూ శుభ్రపడి స్పష్టమవుతాయో మీ అంతరంగం లోని అసలయిన మీ ఉనికి లో మార్పు వస్తుంది. దానితో మీ ఉనికి, మీ అంతరంగం అద్భుతంగా వికసించటం మీలోపల జరుగుతుంది.

అందుకే నేను ఈ కార్యక్రమాన్ని ఆనందస్ఫురణ అని అంటాను. స్ఫురణ అంటే వికసించటం. మన అంతరంగంలో పరమానందం నిరంతరం వికసిస్తూ ఉంటుంది. కాకపోతే మనం మన లోపలికి చూడం. అక్కడ ఏమి జరుగుతుందో గమనించం. మీరు లోపలికి చూడండి. మీకు అది కనిపిస్తుంది. అదే ఆనంద స్ఫురణ - వికసించే పరమానందం.

ప్ర॥ 3) ప్రియమైన స్వామీజీ, నేను ఆధ్యాత్మికంగా చైతన్యవంతమవటానికి నాకు అర్హత ఉన్నదా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది.?

మంచి ప్రశ్న. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక వికాసానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి అర్హుడా, అనర్హుడా అనే మాటలని పూజారులు లేదా పండితులు సృష్టించారు. మీరు జీవించి ఉన్నారు. అని నిర్ధారణ అయితే అదే మీరు ఆధ్యాత్మిక అభివృద్ధికి అర్హత.

ఒకవ్యక్తి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి "భగవాన్, నేను ఆధ్యాత్మిక ప్రగతికి, ఆధ్యాత్మిక దారిలో నడవటానికి అర్హుడనేనా" అని అడిగాడు.

అప్పుడు రమణ మహర్షి అతనిని ఇలా అడిగాడు “నీవు జీవించి ఉన్నావా?" దానికి ఆ వ్యక్తి ‘అవును’ జీవించి ఉన్నాను.” అని జవాబు ఇచ్చాడు.

"అయితే నీవు పూర్తిగా అర్హుడవే", అని రమణ మహర్షి జవాబు ఇచ్చారు.

ప్రజలని మోసం చేయటానికి పూజారులు సృష్టించినదే ఈ భావం. చూడండి, మీలో అపరాధభావాన్ని నింపకపోతే, మిమ్మలని క్రింది స్థానంలో నిలబెట్టకపోతే, మీరు వాళ్ళకి లోబడి ఉండరు. కేవలం ప్రజలని తమకి అనుగుణంగా మార్చుకోవటానికి మాత్రమే ఈ అర్హత అనే భావాన్ని సృష్టించారు. మనలోని వివేకాన్ని చంపేసి, మనలోని ఆధ్యాత్మికతను నాశనం చేసే ప్రాథమిక విషయం ఈ అర్హత అనే వ్యవహారం.

మీకు నిజం చెప్పాలి అంటే అర్హులయిన వ్యక్తులు మీకు ఎక్కడా కడనపడరు. వందల సంవత్సరాల సాధన తరువాత కూడా, వారు అర్హత పొందారా లేదా అనే విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించే ప్రశ్న అవుతుంది. అలా ఎందుకో తెలియదు. బహుశా మీలో అపరాధ భావాన్ని అంతగా నింపి ఉంటారు. స్పష్టంగా అర్థం చేసుకోండి, బొంబే సిటీలోనే కాదు, మీరు ఎక్కడ ఉన్నా అర్హులే. మీరు జీవించి ఉన్నారు అని అనుకుంటే, అదిచాలు, మీరు అర్హులవుతారు. ఈ అర్హత అనే దానిని మిమ్మలని మానసికంగా వేధించటానికి, మిమ్మలని ఉపయోగించుకోవటానికి మాత్రమే తీసుకువచ్చారు.