KAILASA Library/చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/రహస్యమయినది ఏదీ కాదు...!Sign in
చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

రహస్యమయినది ఏదీ కాదు...!

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

సంప్రదాయం రహస్యం బహిరంగ పరచబడింది

రూపం

ప్రశ్న: స్వామీజీ మీరు విగ్రహారాధనను అంగీకరిస్తారా?

మొట్టమొదట, బాగా స్పష్టంగా ఉండండి. మనమనే 'విగ్రహారాధన' విగ్రహాల ఆరాధన కాదు!

అవి విగ్రహాల ద్వారా ఆరాధన.

స్పష్టంగా, విగ్రహారాధకుడెవడూ విగ్రహాన్నే ఆరాధించటంలేదు. అతడు దృశ్యరూపంలో ఉన్న విగ్రహాన్ని దైవంగా భావించి ఆరాధిస్తున్నాడు.

అది తెలివి తక్కువ విషయమా?

ఈ విషయాన్ని లోతుగా వీక్షించండి.

మనకు తెలిసినట్లుగా, జీవితమంతా ఒకే మూలం నుండి వస్తుంది. విశ్వంలోని ప్రతి వస్తువు ఒక రకమయిన ముడి పదార్థా నుంచి సృష్టింబడుతుంది. విశ్వానికి సమానమయిన అంతర్నిర్మాణముంది. మనం ఉపరితల వైవిధ్యాలను మాత్రమే చూస్తున్నాము కాబట్టి దీని గురించి మీకు తెలియకపోవచ్చు. విశ్వంలో భాగంగా మనం విశ్వం యొక్క ఖచ్చితమయిన రచనా నిర్మాణాలను ప్రతిబింబించే అద్దాల లాగా ఉంటాము. ఈ భావనను స్పష్టంగా అర్థం చేసుకోండి.

అవనిలోని ప్రతి వస్తువు సంబంధించి ఉంటుంది. విశ్వం అయిదు మహామూలకాల తోను, అయిదు మహాశక్తులతోను - నేల, నీరు, నింగి, నిప్పు, గాలి - కూర్చబడింది.

ఈ మూలకాలన్నీ (సంస్కృతంలో పంచభూతాలని వీటిని వ్యవహరిస్తారు) దైవంగా లేదా పరాశక్తిగా మనం అభిభాషించే విశ్వశక్తి వ్యక్తీకరణలు.

మానవుడు తాను (ఆత్మ) బ్రహ్మ లక్షణాలను ప్రతిబింబిస్తాడు. మనుష్యుడు కూడా ఈ అయిదు మహాశక్తుల నుండి ఏర్పడ్డాడు, అతడు కూడా పంచభూతాల నుండి నిర్మించబడ్డాడు. అతడు ఈ మూలకాల నుండి ఉద్భవించాడు, ఈ మూలకాలలో జీవిస్తున్నాడు, తుదకు ఈ మూలకాలలోకి తిరిగి వెళ్ళిపోతాడు. సహజంగా, జీవిత కాలమంతా మనుష్యుడు తన అసలు ఉత్పత్తి స్థానానికి తిరిగి వెళ్ళటానికి తహతహ లాడుతుంటాడు, కాబట్టి అతడు తాను ఈ మహాశక్తులతో కలిసి సమగానం చేయటానికి ప్రయత్నిస్తాడు.

మతం మనుష్యుడు ఈ కీలక శక్తుల మధ్య జరిగే సమ్మేళన సృజన ప్రక్రియ మాత్రమే.

విశ్వశక్తి సాంద్రరూపం భూమి. మనిషిలో, అది మన శరీరంలో ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. దైవంతో తాను సమైక్యం కావటానికి మొదటి మెట్టుగా మనిషి తన స్వరూపంలో ఉన్న మట్టి విగ్రహ స్వరూపంలో ఉన్న భూమితో సంబంధాన్ని అన్వేషిస్తు న్నాడు. మనిషికి ఈ రూపం దైవంతో సంభాషించటంలో సాయపడటానికి అవసరం.

ఆధ్యాత్మిక యాత్రలో ఉన్న ప్రారంభకుడికి, అమూర్తంగా ఉన్న దైవాన్ని ఊహించటం కూడా కష్టం. దానికి రూపాన్నిచ్చినప్పుడు, అతడు అర్థం చేసుకోగలిగే, అన్వయించుకోగలిగే మూర్త పదార్ధ విశేషంగా దైవం రూపొందుతుంది. విగ్రహంతో, అతడు తనకు పరిచయమున్న భాషలో దైవంతో సంభాషించగల్గుతాడు.

వందలకొద్ది ఉన్న హిందూదేవతలు దైవ వ్యక్తీకరణలు మాత్రమే, అయినా ఎవరైనా వాటితో మాట్లాడవచ్చు, వాటితో ఆడుకోవచ్చు, ఓదార్పును అన్వేషించవచ్చు లేదా కృతజ్ఞతలు సమర్పించుకోవచ్చు.

భయమయిన అనిర్వచనీయమయిన మొత్తం దైవ ప్రకృతి శ్రేణి విగ్రహరూపంలో సుఖ నిష్పత్తులలో ఉండేటట్టు తగ్గించబడింది. అది ఈ విధంగా ఉండాలి. సాధారణ మనసుకు నిరాకారుడయిన భగవంతుడు కేవలం భయంకరమయిన భావన.

గాఢతర సూక్ష్మతరస్థాయిలో, ఇంకో సందేశం ఉంది :

మీముందున్న విగ్రహం మీ రూపంలాగానే ఉంది.

అయినా అది దేవుడు.

మీ గురించి అది ఏమి చెప్తోంది? దాని గురించి ఆలోచించండి. కాబట్టి విగ్రహాలు మొదట మెట్టుగా ఖచ్చితంగా అవసరం, సహాయకారులు. విగ్రహం ఆధ్యాత్మికతలో ప్రవేశించటానికి దూకే బల్లలాంటిది.

మీరు ఆధ్యాత్మికంగా వికసించేకొద్దీ, ధ్యాననిమగ్నులుగా మీరు మీముందు ఏ భౌతిక రూపం లేనప్పటికి మీరు దైవంతో చక్కగా సంభాషించగల్గుతారు. పిల్లలు వయసు వచ్చిన తర్వాత ఆట వస్తువులతో ఆడటం మానివేసినట్లు, సమయం వచ్చినప్పుడు, మీ అంతట మీరు విగ్రహారాధన మానివేస్తారు. ఇది మతం యొక్క అంతిమ లక్ష్యం.

* * * *

ప్రశ్న: స్వామీజీ! మీరు కాషాయ వస్త్రాలనెందుకు ధరిస్తారు?

ప్రతిరోజు కనీసం పదిసార్లు నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసి వస్తోంది.

భారతదేశంలో ముఖ్యంగా కాషాయ వర్ణం హిందుత్వంతో గాఢ సంబంధం కలిగి ఉంది.

రహస్యమయినది ఏదీ కాదు ... !

నా కాషాయవస్త్రం (వాస్తవంగా అది జేగురురంగు వస్త్రం) గురించి సంశయాత్ములు ముఖ్యంగా యువతీ యువకులు అనేక ప్రశ్నలను వేస్తున్నారు.

నూతనంగా ఆవిర్భవిస్తున్న వర్ణ చికిత్సా క్షేత్రం గురించి విన్నారా?

రంగులు మీ మానసిక స్థితిపై గాఢ ప్రభావం కలిగించే సూక్ష్మ లక్షణాలను కలిగి ఉంటాయనే వాస్తవంపై ఆధారపడి వర్ణ చికిత్స ఉంది. మీకు తెలిసినా, తెలియక పోయినా, భిన్న భిన్న వర్ణాలు, భిన్న భిన్న ఆలోచనలను, భావోద్రేకాలను పుట్టిస్తాయి.

దీనికి ఖచ్చితంగా శాస్త్రీయ వివరణ ఉంది :

మనం పదార్ధం యొక్క వర్ణం అనేది అది ప్రతిబింబించే కాంతి తరంగ దైర్ఘ్యం మాత్రమే. మన చుట్టూ అదృశ్య విద్యుదయస్కాంత క్షేత్రం ('కాంతి పుంజం' లేదా 'జీవద్రవ్యశరీరం' అని విదితం) మనకు ఉంది కాబట్టి మన సొంత అయస్కాంత క్షేత్రం 'అనుభూతులు' లేదా 'భావోద్రేకాలు'గా మనం అన్వయించే చలనాన్ని లేదా ప్రతిచర్యను సృష్టించటానికి భిన్నవర్ణ తరంగాలతో ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు, ఒక రంగు యొక్క తరంగ దైర్ఘ్యం, వ్యక్తి క్షేత్ర పౌనఃపున్యం పరస్పరం సరిపోతే, అది క్రమబద్ధతా, శాంతి భావాన్ని కల్గిస్తుంది.

వేర్వేరు వ్యక్తులు రంగులకు భిన్న రీతులలో స్పందిస్తారు, కాని చాలా సాధారణ పరిస్థితులున్నాయి. లషర్ వర్ణ పరీక్ష బాసెల్ పటంలో 25 రంగులను చూపింది. ఈ పరీక్ష చాలామంది ఖచ్చితమయిన భిన్న 'వ్యక్తిత్వాలు' కలవారు ఒకే రకమయిన రంగులను ఎంచుకున్నారు. ఈ ప్రతిస్పందనలు భావోద్రేకం కాదు, మనం మానసిక మార్పులుగా కూడా వీటిని చూడవచ్చు. చాలా తరచుగా, అది ఒక రంగు ప్రమాదకరమయినదిగా, ప్రశాంతమయినదిగా, సంతోషమయినదిగా... అన్వయించ టానికి మనల్ని ప్రేరేపించే శరీరంలోని శారీరక పరిణామం.

ఎరుపు రంగుకు గురి చేయబడ్డప్పుడు చాలామందికి శ్వాస క్రియ సూచి పెరగటం, గుండె వేగంగా కొట్టుకోవటం, రక్తపోటు అధికం కావటం జరిగింది - కాబట్టి సహజంగా, మనం ఎరుపు భావోద్రేకsubjectాన్ని లేదా ప్రమాదాన్ని కల్గిస్తుందని భావిస్తాము.

శుద్ధ నీల వర్ణాన్ని చూచినప్పుడు, శరీర ప్రతి క్రియ తద్భిన్నంగా ఉంటుంది - నీలం సామాన్యంగా ప్రశాంత పరిచే రంగుగా మనం అనుభూతి చెందుతుంటాము.

ప్రతి తల్లికి తెలుసు - తన బిడ్డకు నిద్రపట్టకపోతే, గదిలో నీలం రంగు బెడ్లైట్తో సుఖనిద్ర తన బిడ్డకు పడుతుంది. (తల్లికి కూడా బాగా నిద్రపడుతుంది!) ఈ కారణంగా కొన్ని నిర్ణీత రంగులు సాంప్రదాయికంగా నిర్ణీత గుణాలతోను భావోద్రేకాలతోను సంబంధం కలిగి ఉన్నాయి. దానికి పేరు పెట్టకుండానే, శతాబ్దాల తరబడి మనం వర్ణ చికిత్సను అభ్యసిస్తున్నాము. భారతదేశంలో, ఆహారం నుంచి మానవ ప్రకృతి వరకు ప్రతి వస్తువును దాని సహజ లక్షణాలను బట్టి మూడు విధాలుగా వర్గీకరించారు: సాత్వికం (ప్రశాంతం), రాజసికం (క్రియాత్మక మయినది), తామసికం (విధ్వంసక మయినది). రంగులను కూడా ఈ విధంగా విభజించవచ్చు: ఉదాహరణకు, ఎరుపు రంగు రాజసికం : ఇది మెదడులోని కార్యకలాపాన్ని ఉత్తేజరుస్తుంది. ఆ కారణంగా ఎరుపురంగు ప్రమాదకరమయిన రంగు - ప్రేమ రంగు! తెలుపు సాత్విక వర్ణం: మీరు తెలుపు ధరించినప్పుడు, శక్తి ప్రసారం బాగుంటుంది. తెలుపు రంగు మిమ్మల్ని ఇతోధికంగా ప్రశాంతంగా గ్రహణశీలిగా ఉంచుతుంది. తెలుపు సమాచారాన్ని అధిక ప్రభావవంతంగా గ్రహించేటట్లు మీకు సాయపడుతుంది. ఆ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా, తెలుపు పాఠశాల దుస్తులుగా ఎంచుకోబడుతుంది!

ఇదే విధంగా కషాయంరంగు (జేగురురంగు)కు మీమనస్సుకు ఓదార్పు కల్గించే శక్తి ఉంది. అది మీ కీలక శక్తిని ఉత్తేజపరుస్తుంది. తెలుపు దుస్తులను ధరించే వారిని

మాత్రమే కాకుండా తెలుపును చూసే వారిని కూడా మనోధ్యాన స్థితిని సృష్టిస్తుంది.

ఈ కారణంచేతనే భారతదేశంలో ఆధ్యాత్మిక ఆచార్యులు సాంప్రదాయికంగా కాషాయ వస్త్రాలను ధరిస్తున్నారు. హిందుత్వానికి దీనికి సంబంధం లేదు!

బాగా స్పష్టంగా ఉండండి: ఈ పురాతన ఆచారాలన్నిటికి వారికి నిర్ణీత శాస్త్రీయ ఆధారం ఉంది. ఆచారాలు వందల వేల సంవత్సరాల వివేకాన్ని జ్ఞానుల తపస్సును కాచి వడపోస్తే లభించాయి. కాలం గడిచేకొద్దీ ఆచారాల వాస్తవ అర్థం జన సామాన్యంలో మరుగుపడిపోయిన కారణంగానే, నేడు ఆచారాలు విశ్వసనీయతను కోల్పోయాయి. ఆచారం గుల్ల మాత్రమే మిగిలి ఉంది. ఆత్మవదిలి వెళ్ళిపోయింది.

ఈ రోజు, నిర్ణీత రంగులు, ధ్వనులు, చర్యలు మీ మానసిక స్థితిపై ప్రభావం చూపగల్గుతాయి, మీ మెదడులోని వాంఛిత ప్రదేశాలను ఉత్తేజపరచగల్గుతాయి, మీ చేతనను వ్యాప్తి పొందిస్తాయి - ఈ విషయాల్ని శాస్త్రం ఒప్పుకొంటుంది. ఆచారాల వెనక ఉన్న శాస్త్రీయత మీకు తెలియనంత మాత్రం చేత వాటి ప్రాముఖ్యాన్ని నిర్లక్ష్యం చేయటం సూక్ష్మక్రిములను మీరు చూడనంత మాత్రం చేత వాటి ఉనికిని నిరాకరించటంలా ఉంటుంది!

నేడు అవి మీకు అసందర్భమనిపించినా ఆచారాల వాస్తవ శక్తిని తక్కువ అంచనా వేయవద్దు. ఆచారాలను సరయిన మార్గంలో నిర్వహించినప్పుడు, వాటి ఉహాథీతమయిన జాగృతి, పరిణామ స్థాయిల్ని కల్పించే అద్భుతశక్తి ఉంది.