పరమహంస శ్రీ నిత్యానంద స్వామి :
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

పరమహంస శ్రీ నిత్యానందస్వామి ఈ రోజు మన మధ్యఉన్న ఒక అద్భుతమయిన మహాయోగి, పరమపావన గురు దేవులు. ఆయన శాశ్వతానంద స్థితిని చేరాలి అనే ఒకే ఒక స్థిర సంకల్పంతో అతి చిన్న వయస్సులోనే తీవ్రమయిన తపస్సు చేశారు. స్వామీజీ భారత దేశమంతా పాదచారియై తిరిగారు. ఆయన భారతదేశం, నేపాల్ లోని గొప్పగొప్ప యోగులు, రుషుల దగ్గర యోగా, తంత్రము, తూర్పుదేశాలకి సంబంధించిన వేదాంతా ఆది భౌతిక తత్వ శాస్త్రాలు మొదలయిన విద్యలని సశాస్త్రీయంగా అభ్యసించారు. ఆయన అద్భుతమయిన ఆధ్యాత్మిక అనుభవాలను లోతుగా, గాఢంగా తెలుసుకున్న గొప్ప యోగీశ్వరుడు
స్వామీజీ యొక్క ప్రత్యేక లక్ష్యం ప్రతీ వ్యక్తి తనలో దాగి ఉన్న అద్భుత శక్తిని తెలుసుకునే విధంగా వారికి సహాయం చేయటం. ఆచరణాత్మకమయిన కరుణతో కూడిన దృక్పథంతో స్వామీజీ ప్రతి వ్యక్తి యొక్క అంతరంగంలోనికి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని కలిగించాలి అని నిరంతరం వారిని తన ఆత్మీయ స్పర్శతో ప్రోత్సహింస్తూ, ప్రపంచ నలుమూలలా లక్షల మందిలో అనూహ్యమయిన మార్పుని తెచ్చి వారి జీవన విధానంలో పెనుమార్పుని తెచ్చారు.
స్వామీజీ, తన దివ్య ఆరోగ్య చికిత్సా స్పర్శతో నిత్య ఆధ్యాత్మిక చికిత్సా పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఇది ఒక సశాస్త్రీయమయిన ఆధ్యాత్మిక చికిత్స పద్ధతి. ధ్యానం ద్వారా అనారోగ్య లక్షణాలని బాగుచేసి ఆరోగ్యమంతులని చేసే పద్ధతి. స్వామి ప్రత్యక్షంగా తన దివ్య స్పర్శతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో ఆరోగ్యవంతులని చేశారు. స్వామీజీ చేత శిక్షణ పొంది ఆయనచే నియమించబడిన హీలర్స్ అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్యవంతులుగా చేసే పుణ్యకార్యంలో నిరంతరం నిమగ్నమయి ఉంటారు. స్వామీజీ, ఆయనచే నియమించబడిన హీలర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో నిమగ్నమయి, తలనొప్పి వంటి చిన్న వ్యాధులు
శాస్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మికతకు మధ్యవారధి
పరమహంస శ్రీ నిత్యానంద స్వామి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వైద్యులు, శాస్త్రజ్ఞులతో కలసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాని ద్వారా మానవాతీత ఆధ్యాత్మిక విషయాలపై ప్రయోగాత్మక విశ్లేషణ చేశారు. ఆయన తన నాడీ వ్యవస్థపై (ముఖ్యంగా మెదడు యొక్క పని తీరు) అధ్యయనం చేసి వాటి ఫలితాలను వైద్యశాస్త్రంలోని రహస్యాలను అధ్యయనం చేయటానికి ఉపయోగించారు. ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా, కొన్ని రకాల వ్యాధులకు, ముఖ్యంగా కాన్సర్, ఆర్ధటీస్, మత్తుపానం వంటి వ్యాధులను తగ్గించే అవకాశం, అది సాధించే మార్గం ఉన్నాయి అని శాస్త్రజ్ఞులు అనుకుంటున్నారు. అంతేకాకుండా, ఈ ప్రయోగాల ఫలితంగా వారు మానవ మెదడుకి తన శరీరంలోని వ్యాధులను బాగుచేయాలి అని నిర్ణయం చేయగల శక్తి ఉన్నది అని చెప్పారు.
కొన్ని శతాబ్దాలుగా శాస్త్ర విజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము మానవాళికి అత్యవసరమయిన ఈ విషయాలను వెల్లడి చేయటానికి పోరాడుతున్నాయి. ఆధ్యాత్మిక గురువులు ఎన్నోసార్లు, మైండ్‌లేని స్థితి అనే విషయం సత్యం అని, ప్రతి ఒక్కరు కచ్చితంగా ఆ స్థితిని సాధించగలరు అని చెబుతున్నా, శాస్త్రజ్ఞులు మాత్రం ఆ విషయాన్ని ఆధారాలు లేవు అనే వాదనతో అంగీకరించలేదు.
ఈ శతాబ్దంలో మొట్టమొదటిసారి, అసాధారణమయిన అద్భుతాలు, శాస్త్రీయ వివరణకు అతీతమయిన విషయాలను శాస్త్ర విజ్ఞానానికి నిరూపించగలిగే తాళంచెవి వారికి దొరికింది. ఆధ్యాత్మికంగా అద్భుతాలు సాధించిన వ్యక్తికి చాలా శక్తులు ఏ విధంగా ఉంటాయో వైద్యపరమయిన నిరూపణలతో, సశాస్త్రీయమయిన వివరణ, స్వామీజీ పై చేసిన ప్రయోగాల ద్వారా దొరికినది. స్వామీజీ యొక్క మెదడు పనితీరుపై చేసిన పరిశోధనల ఫలితాలను ఈ క్రింది పేజీలలో వివరించబడినది. స్వామీజీ అమెరికాలో ఉండగా ఈ ప్రయోగాలు జరిగాయి లేవు. ఆ విద్యార్థిని ఎవరూ గురువుగా, హీలర్గా, అద్భుతమైన యోగిగా ప్రపంచంలో అన్ని మూలల నుంచి లక్షల మంది గుర్తించారు.
అద్భుతమైన యోగి అనే మాట స్వామీజీకి సరిగ్గా సరిపోతుంది. ఇటువంటి యోగులు భగవంతునితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటారు, అనే విషయం యోగీ సంస్కృతి తెలియజేస్తుంది. యోగులు అంతిమ సత్యాలని పొంది ఉంటారు అని చెబుతారు. అది ఏవిధంగా ఉంటుంది అనేది తెలియదు. యోగీశ్వరుడు అని మనం అనుకోగానే మన ముందు నిత్యానందం తో నిండుగా ఉండే వ్యక్తి, ఉన్నతమైన, మహత్తరమైన ఆలోచనలతో ఉండి మనలో ఎవరికీ లేని ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తియొక్క చిత్రం మన కళ్ళముందు ఉంటుంది. అటువంటి యోగీశ్వరుని గురించిన ఆలోచన మాత్రం చేత మనలో గొప్పశాంతి సౌఖ్యం కలుగుతుంది.
ఇదంతా కూడా నిత్యానంద స్వామికి పూర్తిగా సరిపడే వివరణ. స్వామి 27 సంవత్సరాల, దక్షిణ భారతదేశపు వ్యక్తి, స్వామీజీ దగ్గరికి ప్రపంచం అన్ని మూలల నుంచి లక్షలాది మంది తమలో ఉన్న వ్యాధుల నివారణ కోసం వస్తుంటారు. ఆధునిక వైద్యం పరిష్కరించలేని సమస్యలతో వారు స్వామీజీ సమక్షానికి వస్తారు. ఆయన తన దివ్య స్పర్శతో వ్యాధులని నిర్మూలించుతారు. స్వామీజీ జీవిత చరిత్ర అంతా అద్భుతాలతో నిండియున్నది. ఆయన చిన్న వయస్సులో ఇల్లువదలి, భారతదేశంలో అనేక ఆశ్రమాలలో ఉండి, వేదాంత విషయాలు, ఆధ్యాత్మిక విద్యలు విసృతంగా చదివి, ధ్యాన పద్ధతులని శాస్త్రీయంగా మలచి ఆ సాధనలో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించారు.
ఈ మధ్య స్వామీజీ ఒక్లాహోమా పట్టణం గుండా ప్రయాణిస్తూ అక్కడ ఆగారు. అప్పుడు నేను ఆయనని కలిసి, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులలో ఆయన ధ్యానం చేసే సమయంలో మెదడుని పరిశీలించి అధ్యయనం చేయటానికి అనుమతి అడిగాను. నా ఉద్దేశం ఏమిటంటే ధ్యానం అనే అద్భుతం జరిగే సమయంలో
మెదడులో జరిగే విషయాలను అర్థం చేసుకొని, వాటి పరిమాణం లెక్కకట్టి తెలుసుకోవాలి. స్వామీజీ ధ్యానం అనేది శాస్త్రీయ ప్రక్రియ అని నమ్ముతారు ఆయన ఈ ప్రయోగానికి వెంటనే ఆనందంగా ఒప్పుకున్నారు.
స్వామీజీ పాల్గొన్న ఈ ప్రయోగంలో ఒక్లాహోమాలోని పేరు, అనుభవం ఉన్న డాక్టరు, శాస్త్రజ్ఞులు కూడా ఉన్నారు. వాళ్ళు డా॥ ఫోర్టీస్, డా॥ రువే, డా॥హిగ్గిన్స్ వీరందరూ జిమ్ తోర్పే రిహాబిలిటేషన్ సెంటర్, న్యూరోసైకాలజీ డిపార్టుమెంట్‌కి సంబంధించిన వారు. డా॥ చాకో, PET సెంటర్, ఒక్లాహోమాకు చెందినవారు వీరంతా ఈ ప్రయోగాన్ని పరిశీలించి అధ్యయనం చేశారు. వారు స్వామీజీని అధ్యయనం చేయటానికి సాధారణంగా పేషెంట్లకి ఉపయోగించే సాంకేతిక పద్ధతులనే ఉపయోగించారు.

అధ్యయన ఫలితాలు "చాలా కచ్చితంగా ఇది అసాధారణ స్థితి అని నిర్ధారించాయి"
మెదడు యొక్క చర్యల చిత్రాలు
స్వామీజీ మెదడు యొక్క మొదటి దృశ్యాలని Positron Emssion Tomography పరికరం సహాయంతో చూసారు. సాంప్రదాయ పరికరాలయిన X-rays, CT స్కానింగ్‌ల కాకుండా MRI, PET పరికరం మెదడులోని కణాల జీవరసాయన క్రియ ద్వారా మెదడులో జరిగే చర్యలని చిత్రాలుగా చూపించుతుంది. గ్లూకోజ్ లాంటి పదార్థాన్ని రేడియో యాక్టివ్ PET ట్రేసరికి అతికించారు. అప్పుడు PET స్కానర్ మెదడులోని జీవరసాయన చర్యలని ఎప్పుడు అవసరమయితే అప్పుడు చూపించేది.
స్వామీజీ విషయంలో దేనిని మెదడులో ఆయన మెలకువగా, తెలివి కలిగిన స్థితిలో ఉన్నప్పుడు మెదడులోని అతి చురుకుగా ఉన్న ప్రాంతాలని గుర్తించటానికి మూడవ కన్ను అనేది ఆత్మ యొక్క స్థానమని, ఇది విశ్వజ్ఞానం అంతరంగ జ్ఞానం యొక్క కలయికతో ఏర్పడే ప్రదేశం అని, ఇది స్పష్టతకి ప్రశాంతతకి నిలయమని అంటారు. లోతైన ధ్యానంలో ఉంటే మెదడులో తెరవబడే భాగం బహుశః సర్వాంతర్యామితో సంబంధం ఏర్పరచవచ్చు. అలాగే విశ్వశక్తితో సంభాషించే అవకాశం కల్పించవచ్చు అని అనుకోవచ్చు. ఈ భాగం ద్వారా యోగి తన అంతరంగ లోతుల్లోనికి, అక్కడ జరిగే అద్భుతాలలోనికి చూడగలుగవచ్చు. PET స్కాన్ చూపించిన ఈ భాగానే నేను మెదడులోని డి ప్రాంతం D-Spot అంటాను. డి అంటే దైవం కావచ్చు. ఆనందం కావచ్చు లేదా డొపామైన్ అనే ఒక పదార్థం కావచ్చు. (డొపామైన్ అనే పదార్థం శరీరానికి ఆనందాన్ని ఇస్తుంది) అంటే ప్రారంభదశలోని గుర్తుల ప్రకారం ధ్యానం ఆ ఆనందాన్ని ప్రేరేపించవచ్చు
మెదడులోని తరంగాలని కొలవటం (QEEG)
స్వామీజీపై చేసిన మరొక అధ్యయనం(QEEG) ని తెలుసుకోండి. QEEG అనేది మెదడులోని విద్యుత్ తరంగాలని లేదా మెదడులోని తరంగాలని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది
మానవ మెదడులో నాలుగురకాల తరంగాలు ఉంటాయి. ఒక్కొక్క తరంగం ఒక్కొక్క వేగాన్ని కలిగి ఉండి మెదడు యొక్క వివిధ స్థితులను సూచిస్తుంది. ఉదాహరణకి బీటా తరంగాలు చిన్నవి, వేగంగా ఉండి అవి మెదడులోని మెలకువ స్థితిని సూచించుతాయి. ఆల్ఫా తరంగాలు నెమ్మదిగా ఉండి పెద్దగా ఉంటాయి. అవి మనం బాగున్నాము. అనే ఆలోచనలకు సంబంధించి ఉంటాయి. తీటా తరంగాలు మన చేతన స్థితిని తెలియజేస్తాయి. అవి నిద్రావస్థకి దగ్గరగా ఉంటాయి. ఈ స్థితిలో నిశ్శబ్దంగా నిశ్చలంగా, ప్రశాంతంగా ఎటువంటి చురుకయిన ఆలోచనలు లేని స్థితిని తెలియజేస్తాయి.
ఒక రోజులో చాలా మంది వ్యక్తులు ఈ నాలుగురకాల తరంగాలకదలికలని కలిగిఉంటారు. అయితే ఒకదానిలోంచి మరొక తరంగంలోనికి వెళ్ళటం అనేది వరి ఆధీనంలో ఉండదు.
స్వామీజీ (QEEG) ఆధారంగా చూస్తే మెదడులోని తరంగాల కదలిక మీద పూర్తి నియంత్రణ ఉన్నది అని నిరూపణ జరిగింది. స్వామీజీ గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన మెదడు అతి మృదువుగా ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారగలిగింది. ఎటువంటి అడ్డంకు అనుమానం లేకుండా మెదడులోని ద్రవ పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారుతుండేది. అది ఎలా అంటే ఎంతో నైపుణ్యం గల పియానిస్ట్ ఒక శ్రుతి నుంచి మరొక శ్రుతిలోనికి మారినంత అద్భుతంగా మారుతుంది. (QEEG) మెదడులోని తరంగాలని అయిదు రంగులలో చూపిస్తుంది. స్వామీజీని గమనించినప్పుడు ఇంద్రధనుస్సులోని రంగులు ఒక దాని నుంచి మరొకటి కదులుతున్నట్టుగా అనిపించింది.
ముగింపు వాక్యాలు
మానవ శరీరంలో మెదడు అత్యంత క్లిష్టమైన భాగం. దీనిలో 100 బిలియన్లు (100కోట్లు) న్యూరాన్లు ఉంటాయి. ప్రతి న్యూరాన్ మరో 10,000 న్యూరాన్లతో రసాయన విద్యుత్ సంబంధాలు కలిగి ఉంటాయి. విషయాలని నియంత్రించి ముందుకు పంపించే పని చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది.
అంత క్లిష్టమయిన మెదడు పనీతీరుని స్వామీజీ చాలా తేలికగా నియంత్రించగలుగుతున్నారు. స్వామీజీ యొక్క మనస్సు అంటే ఆయన ఆలోచనలు, భావావేశాలు, తెలివితేటలు మెదడుని నియంత్రించగలుగుతున్నాయి. ఆయన ఒక ద్రవ పదార్థంగా ఎంతో సులభంగా మెదడు చేసే పనులని, తరంగాలని ఒక స్థితి నుంచి మరొక స్థితికి మార్చగలుగుతున్నారు.
మేము చేసిన ఈ ప్రయోగంతో మా ప్రశ్నలకి జవాబులు తెలుసుకోగలగటం కంటే కూడా, మాకు కూతూహలం కలిగించే రహస్యాలు కలిగిన ఎన్నో ప్రశ్నలు మా
లైఫ్ బ్లిస్ ఫౌండేషన్ వారు అందిస్తున్న కార్యక్రమాలు
ప్రపంచ వ్యాప్తంగా ధ్యాన పద్ధతుల మీద కొన్ని ప్రత్యేక కార్యక్రమాలని తయారు చేసి నిరంతరం అందరికీ అందుబాటులోకి తేవడానికి నిత్యానందా ఫౌండేషన్ ప్రయత్నిస్తుంది. ఈ ధ్యాన పద్ధతులు మానవాళికి భౌతిక, మానసిక ఆధ్యాత్మిక స్థితులలో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఫౌండేషన్ అందిస్తున్న ధ్యాన కార్యక్రమాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
1. ఆనంద స్పురణ ప్రోగ్రాం / లైఫ్ బ్లిస్ ప్రోగ్రామ్
(Ananda Spurana Program (ASP)/ Life Bliss Program (LBP) (మిమ్ములని శక్తివంతులుగా చేసుకోవటం)
ASP or LBP అనేది చక్రా ధ్యాన కార్యక్రమం
ఈ కార్యక్రమంలో మనలో ఉండే 7 శక్తి పీఠాలని, వాటినే మనం చక్రాలు అంటాము, వాటి పని తీరు అవి మన శరీరం మీద మానసిక స్థితి మీద ఎలా ప్రభావం చూపుతాయో తెలియజేస్తుంది. ఈ ప్రోగ్రాం చక్రాలకి మన భావావేశాలకి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని వివరించుతుంది. ఈ ప్రోగ్రాంలో సులభమైన ధ్యాన పద్ధతులని నేర్పించుతారు. వాటి ద్వారా మనం మన భావావేశాలని సమర్థవంతంగా నియంత్రించగలుగుతాము. మన మానసిక స్థితి మీద స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. మన మధ్య సత్సంబంధాలు ఏర్పడటానికి సహాయం చేస్తుంది. దీనితో మనం ఆనందమయ జీవితాన్ని సాధించే దిశగా పని చేయగలుగుతాము.
ఇదే ప్రోగ్రాం విద్యార్థుల కోసం తయారుచేయబడినది. అది విద్యార్థుల ASP ప్రోగ్రాం తెలుసుకుంటాము. మనలో అణచివేయబడిన భావావేశాలు, తీరని కోరికలు, అవిశ్రాంతి, సోమరితనం వంటిభావావేశాలని ఈ మూడు శరీరాలతో సంబంధాన్ని నెలకొల్పి వాటి గురించి నేర్చుకుంటాము. మనలో విజ్ఞాన జ్యోతాలు వెలిగించటానికి, మన భావావేశాల నుంచి స్వేచ్ఛ పొందటం నేర్చుకుంటాము.
ఆత్మ స్ఫురణ ప్రోగ్రాం
Atma Spurana Program (ATSP)
(మీతో సంబంధాన్ని నెలకొల్పటం)
ఈ సర్వ విశ్వ సృష్టిలో, సర్వాంతర్యామిలో మానవులు ఒక భాగం ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకుంటే, అతనిలో జ్ఞానోదయమవుతుంది. ఈ ధ్యాన పద్ధతి ద్వారా, అంతిమ సత్యం తెలుసుకోవటంలో మనకి కలిగే అడ్డంకుల విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ ప్రోగ్రాం మనలోనికి 5 శరీరాలయిన కోశాల గురించి తెలియజేస్తుంది. వీటి ద్వారా మనలో తెలుసుకునే తత్వాన్ని బయటకి తీస్తుంది. దానితో మనం మనతో సంబంధాన్ని నెలకొల్పుకోవచ్చు
భక్తి స్ఫురణ ప్రోగ్రాం (BSP) (మనలోని భావావేశాలని సమృద్ధిపరచుకోవటం)
మన జీవితాలలో కొన్ని సంవత్సరాలు గడిచే సరికి మైండ్ మన ఉనికిని అణిచి తానే అన్ని నిర్ణయాలు చేస్తుంది. మానవాళి క్రమంగా నిరుపయోగమైన తెలివితేటల భారిన పడిపోతుంది. దీని ఫలితంగా మనలోని భావాలు బాధలలో ఉండిపోతాయి.
మన అంతరాత్మ యొక్క నిజమైన భాష భక్తి. ఇది భగవంతులని పై మనకుండే అత్యున్నతమయిన ప్రేమ. అది మనలోని క్రిందిస్థాయిలో ఉండే భావావేశాలనుంచి మనని బయటకి తెస్తుంది. అది మన మైండ్‌కి సంపూర్ణ నియమించుతారు. దీనితో ఎదుటివారికి చికిత్స చేయగలిగే దివ్యశక్తి మీద్వారా ప్రహించి ఎదుటివారికి చికిత్స చేయటానికి ఉపయోగపడుతుంది. ఇది శక్తి అంటే బుద్ధికుశలత అనే విషయం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఈ ప్రోగ్రాం పత్యేకత ఏమిటంటే, అది మీరు ఎదుటి వారికి చికిత్స చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. అలాగే మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి సహాయం చేస్తుంది. బయటికి ఇది చికిత్సా పద్ధతి. అంతరంగంలో ఇది ఒక ధ్యాన పద్ధతి.
ఆనంద యోగం Ananda Yogam (విస్తృతమవ్వండి విస్పోటమవ్వండి) ఆనందయోగం అనే కార్యక్రమమం 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండే యువత కోసం తయారుచేసిన ప్రోగ్రాం. ఇది ఆశ్రమంలో సంవత్సరం పాటు యువతకి ఇచ్చే ఒక ఉచిత ట్రయినింగ్ కోర్సు. ఈ ప్రోగ్రాం తూర్పు దేశాల యోగాతంత్రం, వేదాల ఆధారంగా ఉండి, ఆధునిక యువతని ఈ విషయంలో సాధికారత సాధించేలా చేస్తుంది. ఇందులో
- వృత్తిపరమయిన నైపుణ్యత పెంపొందించటం
- విజయసాధనకి సూత్రం మరియు జీవిత సత్యాలు
- చికిత్సా విధానం, ధ్యానం, యోగా మొ॥ సంపూర్ణ సఫలతకి
- మనలో ఉండే పూర్తి శక్తి యుక్తులని తెలుసుకోగలగటం
- సృజనాత్మకతతో కూడిన బుద్ధి కుశలత, అప్రయత్న సిద్ధత ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో ఒక స్పష్టమయిన, స్థిరమయిన మానసిక స్థితిని ఏర్పరచుతుంది. మనలో ఉండే అంతర్గత శక్తిని తెలుసుకునేలా చేసి మనలని బయట ప్రపంచంలో అత్యున్నతులుగా చేస్తూ మనలో మనం ఏకాగ్రతని నిలిపేలా చేస్తుంది. ఇది మనలో ప్రాచీన వేద సూత్రాలని నింపుతుంది. దానితో పాటు
మీరు చదవటానికి ఇతర గ్రంధాలు:
నమ్మకమైన పరిష్కారాలు : Guaranteed Solutions
నమ్మకమైన పరిష్కారాలు అనే పుస్తకం మనలోని భావావేశాలయిన కామం, భయం, వ్యధ, శ్రద్ధ ఆశించటం, అసూయ, అహంకారం, అసంతృప్తి మొదలయిన వాటిని కూలంకషంగా అర్ధం చేసుకునే ఉద్దేశంతో ప్రచురింపబడినది. ఇందులో ఉండే సమాచారం మొత్తం పరమహంస శ్రీనిత్యానంద ప్రపంచ వ్యాప్తంగా వివిధ ధ్యాన కార్యక్రమాలలో, ఆనంద స్ఫురణ, లైఫ్ బ్లిస్ ప్రోగ్రాం, మొదలయిన వాటిలో ఇచ్చిన ప్రవచనాలు. ఈ పుస్తకం మనలోని ఏడు ప్రధాన శక్తికేంద్రాలు, వీటినే మనం చక్రాలు అంటాము, గురించి, అవి ఏవిధంగా మన భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయో వివరంగా ఇవ్వబడినది.
ఎ.యస్.పి/ఎల్.బి.పి. ధ్యాన కార్యక్రమాలు ఈ శక్తికేంద్రాలకి మనలోని భావావేశాలకి మధ్య ఉండే సంబంధాలని వివరిస్తారు. ఈ భావావేశాలు సూక్ష్మంగా మనపై ఏవిధంగా పనిచేస్తాయో నేర్పించుతారు. భావావేశాలు కేవలం ఆధారంలేని నీడలని మనకి నేర్పించుతారు. ఈ భావావేశాలని సంభాళించటానికి మనకి శక్తివంతమయిన ధ్యాన పద్ధతులని నేర్పించుతారు. ఈ భావావేశాల ప్రభావం లేని స్వేచ్ఛాయుత జీవితాన్ని మనం గడపవచ్చుఅని నేర్పించుతారు. ఈ కార్యక్రమాలు మనం అయోమయం నుంచి, మానసిక కుంగు బాటు నుంచి ఏవిధంగా స్వేచ్ఛని పొందవచ్చునో వివరించుతాయి. ఈ కార్యక్రమాలలో మనని మానసిక బానిసత్వం నుంచి స్వేచ్ఛ పొందేలా నేర్పించుతారు. ఈ కార్యక్రమాలు మన అంతరంగంలో ఒక ప్రదేశాన్ని సృష్టించి, దాని నుంచి మన ఉనికికి ఆత్మకి తిరిగి మనతో సంబంధాన్ని ఏర్పరుచుతారు. అది శరీరానికి మైండ్‌కి అతీతమయినది. అది స్వచ్ఛమయిన, శాశ్వతమయిన పరమానందం. అదే నిత్యానందం. ఈ ధ్యాన కార్యక్రమాలని నిరంతరం శిక్షణ పొందిన ఆచార్యులు ఏర్పాటు చేస్తుంటారు.
పరమానందం మీ మార్గం మీ లక్ష్యం Bliss is the Path and Goal
ఈ పుస్తకంలో స్వామీజీ ప్రవచనాలు ఉంటాయి. అవి చాలా అంశాలకి సంబంధించి ఉన్నాయి. మైండ్ ఎలా పనిచేస్తుంది అనే విషయం నుంచి మనం మన శరీరాన్ని ఏవిధంగా ద్వేషించుతాము అనే విషయం వరకూ, అలాగే సంపూర్ణ అధీనులవటం నుంచి వస్తు ప్రపంచపు జీవితం, ఆధ్యాత్మిక జీవితం వరకూ, ఇలా చాలా అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం మనలో ఉండే అనేక ప్రశ్నలకి జవాబులిస్తుంది. మన అంతరంగపు జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. మన అంతరంగంలోని చేతన స్థితిని తెలుసుకునేలా చేస్తుంది. మన శరీరం, మైండ్ మన ఉనికి విషయాలలో మార్గాన్ని నిర్దేశించే పుస్తకం. ఇది మనం నిత్యానంద స్థితిలో ఎలా జీవించగలమో చెబుతుంది.
జీవన మరణాలకి అతీతంగా Beyond Life and Death
ధ్యానం జీవితాన్ని మరణాన్ని అనుసంధానం చేస్తుంది. ఇది మనకి జీవించే కళని మరణించే కళని నేర్పిస్తుంది. లేకపోతే మనం జీవన మరణాలు అనే వలయంలో చిక్కుకుపోతాము. స్వామీజీ తన ప్రవచనాల ద్వారా మరణ రహస్యాలని ఛేదించి అది అర్ధమయ్యేటట్టుగా మనకి వివరిస్తారు. అయిన ఒక విషయం స్పష్టంగా చెబుతారు. మనం మరణాన్ని అర్ధం చేసుకున్నప్పుడు జీవితాన్ని ఒక ఐశ్వర్యంలా జీవించవచ్చు
Glimpses of my Master
ఒక జ్ఞానోదయం పొందిన యోగీశ్వరులయిన గురుదేవుని సమక్షం అనేది మనిషి జీవితంలో దొరికే ఒక అరుదయిన అపురూప అవకాశం. అటువంటి గురుదేవుని సమక్షంలో మనం పొందే అనుభవాలే మనకు జ్ఞానోదయ మార్గాలు. ఈ పుస్తకంలో
మా ముఖ్యమైన లైఫ్ బ్లిస్ ధ్యాన కేంద్రాలు
యూ.ఎస్.ఏ.
928, హంటింగ్టన్ డిఆర్, డ్యూర్ట్, లాస్ఏంజిల్స్, సిఎ 91010, యూ.ఎస్.ఏ. Ph : 1-626-205 3286 Email : [email protected]
భారతదేశం
నిత్యానంద ధ్యానపీఠం నిత్యానందపురి, కల్లుగోపహళ్ళి, మైసూరు రోడ్, బిదది. బెంగళూర్ - 562109, కర్ణాటక Ph : +91 80 56691844 / 27202085 Fax : +91 80 7288207 Email : [email protected]
నిత్యానంద ధ్యానపీఠం ఆనందేశ్వరి దేవాలయం, నిత్యానందగిరి, పాశంబండ, సాంతరాయ్ గ్రామం, శంషాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ Ph : +91 93470 65288 Email : [email protected]
నిత్యానంద ధ్యానపీఠం 36/1, కామాక్షి అమ్మన్ స్ట్రీట్, పెరమనూర్, సేలం - 636 007. తమిళనాడు Ph : +91 427 3098133