KAILASA Library/నిత్యధ్యానం/నిత్యధ్యానంSign in
నిత్యధ్యానం

నిత్యధ్యానం

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

విరామంతో నూతనోత్సాహాన్ని వ్యాపింప చేయండి

నిత్యానంద స్వామి

నిత్యానంద స్థితిని పొందే ఒక పద్ధతి

ఇందులో ఇచ్చిన ధ్యాన పద్దతులని నిత్యానంద ధ్యానపీఠం లేదా నిత్యానంద
వేదిక్ సైన్స్ యూనివర్సిటీలో ఆచార్యుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. ఎవరయినా వారి
వ్యక్తిగతంగా ప్రయత్నించితే దాని వలన జరిగే పరిణామాలకి నిత్యానంద ధ్యానపీఠం కాని
యన్.వి.యస్.యు. కాని ఎటువంటి బాధ్యత వహించదు. అందుకు మీరే పూర్తి బాధ్యత
వహించాలి.

పబ్లిషర్స్ :నిత్యానంద వేదిక్ సైన్స్ యూనివర్సిటీ ప్రెస్
నిత్యానంద వేదిక్ సైన్స్ యూనివర్సిటీ యు.ఎస్.ఎ. వారి అనుబంధ సంస్థ

కాపీరైట్ డిసెంబర్ 2007
Ebook ISBN: 979-8-88572-852-2

ఈ పుస్తకానికి సంబంధించిన అన్ని హక్కులు నిత్యానంద ధ్యానపీఠం యొక్క
సొంతం. నిత్యానంద ధ్యానపీఠం నుంచి వ్రాతపూర్వకంగా అనుమతి తీసుకోకుండా
బహిరంగంగా లేదా వ్యక్తిగత వినియోగం కోసం ఇందులోని ఏ భాగాన్ని యాంత్రికంగా,
ఫోటోగ్రాఫిక్ లేదా ఫోనోగ్రాఫిక్ ప్రక్రియ లేదా ఏ ఇతర ప్రక్రియ ద్వారా పునర్ముద్రించటం
నిషిద్ధం.

ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నిత్యానందా ధ్యానపీఠం వారు
చేపట్టే ధర్మకర్తృత్వ కార్యక్రమాల కోసం వినియోగించటం జరుగుతుంది.

నిత్యధ్యానం

నిత్యధ్యానం గురించి చెప్పేముందు, ఈ ధ్యానానికి సంబంధించి నా అనుభవం, ఈ ధ్యాన పద్ధతి నాకు ఏవిధంగా తెలిసింది అనే విషయాలని మీకు క్లుప్తంగా వివరిస్తాను. నాకు జ్ఞానోదయం జరిగాక చాలా కాలంపాటు, అంటే కొన్ని నెలల పాటు నేను మౌనంలో ఉన్నాను. ఆ సమయంలో నేను ధ్యాన పద్ధతుల మీద చాలా లోతుగా పరిశోధనలు చేసాను. ముఖ్యంగా ఈ ధ్యాన పద్ధతుల ద్వారా నాకు కలిగిన అనుభవాన్ని ఇతరులకు జరిగే విధంగా ఎలా చేయాలి. అలా పరిశోధించే సమయంలో ముందుగా నాకు స్ఫురించినది, నా పరిశోధనల ఫలితంగా ముందుగా బయటికి వచ్చినదే ఆనందస్ఫురణ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని రూపొందించే పనిలో ఉన్నప్పుడు నేను మనలోని ఏడు శక్తి కేంద్రాలయిన, ఏడు ప్రధాన చక్రాల మీద బాగా పని చేసాను. ఈ చక్రాలని శుభ్రపరచగలిగి, తిరిగి వాటిని శక్తివంతం చేయగల ఏడు ధ్యాన పద్ధతులని రూపొందించాను.

ఆనందస్ఫురణ తరువాత, నా పరిశోధనల నుంచి వచ్చిన కార్యక్రమం నిత్యానంద స్ఫురణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనలోని ఏడు శక్తి శరీరాలకి సరిపడే విధంగా, అదేవిధంగా మరణ సమయంలో ప్రశాంతంగా, ఆనందంగా శరీరాన్ని వదలగలిగే విధంగా సహాయం చేయగల ధ్యాన పద్ధతులని రూపొందించాను. ఆ తరువాత ధ్యానస్ఫురణ అని, ఆత్మస్ఫురణ కార్యక్రమం ఇలా చాలా కార్యక్రమాలని తయారు చేసాను. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఆత్మసత్యాన్ని తెలుసుకునే విధంగా, అన్ని మార్గాల ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాలని తయారు చేసాను. ఈ విధంగా నేను వంద రకాలయిన ధ్యాన పద్ధతులని, నా కార్యక్రమాల ద్వారా రూపొందించాను. ఇందులో ప్రతీ ధ్యాన పద్ధతి ప్రతి ఒక్కరిలోని వారి చేతనస్థితిని ఉన్నతస్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా వారి అసలయిన ఉనికికి (ఆత్మ) సంబంధించిన విషయాల మీద ఈ ధ్యాన పద్ధతులు పని చేస్తాయి.

నన్ను చాలామంది చాలాసార్లు, ఒక విషయం అడిగే వారు, ‘మేము ప్రతిరోజు ధ్యానం చేసుకునేందుకు వీలుగా మాకు ఒక ధ్యానపద్ధతిని నేర్పించండి’ అని. వారు పదే పదే అడగగా నేను ఈ విషయం గురించి పని చేయటం మొదలు పెట్టాను.

నేను ఈ విషయం గురించి చాలా లోతుగా ఆలోచించాను. నేను తయారుచేయబోయే ధ్యాన పద్ధతి నా బోధనలకి, నా అనుభవాలకి, నేను నమ్మిన తత్వానికి పూర్తి ప్రతినిధిగా, పూర్తిగా సరిపోయే విధంగా ఉండాలి. నాదృష్టిలో ఈ ధ్యాన పద్ధతి పూర్తిగా ఉండి మన ఉనికికి సంపూర్ణంగా సరిపోయే విధంగా ఉండాలి. అది ఏదో ఒక్క విషయం మీద మాత్రమే ప్రభావం చూపించేదిగా ఉండకూడదు. అది సంపూర్ణంగా ఉండాలి అనేది నా లక్ష్యం. ఆ పద్ధతి మనిషి యొక్క ఉనికిని పూర్తిగా ప్రభావితం చేసి, ఆ వ్యక్తిలో ఆశించిన మార్పుతేగలగాలి. ఒక రోజు నాకు ఒక ధ్యానపద్ధతి స్ఫురణకి వచ్చింది. అదే ఇప్పుడు నేను మీకు నేర్పించబోయే

నిత్యధ్యానం

ధ్యానం. దీనినే నిత్యధ్యానం అంటాను. (మెడిటేషన్ ఫర్ ఎన్టర్నల్ బ్లిస్). ఇది ఒక మెరుపులా నాకు కనిపించింది. ఒక్కసారిగా నేను ఈ ధ్యానంలోని వివిధ భాగాలను చూడగలిగాను. ఇందులో ఒక్కొక్క భాగం మరొక దానితో ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నది, అదే విధంగా అన్ని భాగాలు కలిపి మనలోని చేతనస్థితిని ఏ విధంగా ఉన్నతస్థితికి తీసుకురావచ్చునో నాకు స్పష్టంగా కనిపించినది. నిత్యధ్యానం నేను చేసిన పరిశోధన ఫలితాలన్నింటిలోనికి ఉత్తమమయినది అని చెప్పగలను.

ఇక్కడ మీరు ఒక ముఖ్యమయిన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక రుషిని మంత్ర ద్రష్ట (మంత్రాన్ని చూడగల వ్యక్తి) అని కూడా అంటారు. దీని అర్థం ఏమిటి అంటే, ఆయన సమాధిస్థితిలో ఉన్నప్పుడు ఒక మంత్రాన్ని కాని, ఒక పద్ధతిని కాని తన దృష్టితో చూడగలుగుతాడు. అంటే ఆయన మంత్రాన్ని కాని పద్ధతిని కాని సృష్టించాడు అని అర్థం కాదు. అవి ఆయనకి వెల్లడి అవుతాయి. సర్వాంతర్యామి సంపూర్ణమయిన శక్తి. అందులోనికి కొత్తగా ఏదీ సృష్టించనవసరం లేదు. కాబట్టి ఒక మంత్రం కానీ లేదా ఒక పద్ధతి కానీ ఎవరో ఒక వ్యక్తి యొక్క సృష్టి కాదు. ఈ విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాలి. ఈ పద్ధతిని నేను సృష్టించాను అని చెప్పలేను. అవసరమయినప్పుడు ఆ పద్ధతి దానంతట అదే రూపుదిద్దుకొని మీ ముందుకు వస్తుంది.

ఇప్పుడు మీకు నిత్యధ్యాన పద్ధతి వివరాలు చెబుతాను. ఈ ధ్యానపద్ధతిలో మొత్తం ఐదు భాగాలు ఉంటాయి. మీకు ఒక్కొక్క భాగాన్ని వివరంగా చెబుతాను.

ఒక పద్ధతి లేకుండా శ్వాస తీసుకోవటం (7 నిముషాలు (Chaotic Breathing)

మీరు ముందు ఏడు నిముషాలు కళ్ళు మూసుకొని వజ్రాసనంలో కూర్చోవాలి. చేతులు నడుము మీద ఉంచాలి. ఏడు నిముషాల పాటు మీరు ఒక పద్ధతి లేకుండా శ్వాస తీసుకోవాలి. గాలిని తీసుకోవటం, వదలటం లోతుగా చేయాలి. ఒక పద్ధతిలో కాకుండా గాలి తీసుకోవాలి. మీరు కేవలం మీ శ్వాస మీద మాత్రమే మీ ఏకాగ్రతని నిలపాలి. మీరే ఆ శ్వాస అయిపోవాలి.

Chaotic Breathing posture

సాధారణంగా మన శరీరంలో శక్తి సహస్రార (తలపైన ఉండే) చక్రం నుంచి మూలాధార (వెన్నెముక క్రింద ఉండే) చక్రం వైపుకి ప్రవహిస్తూ ఉంటుంది. వజ్రాసనంలో ఉన్నప్పుడు, ఆ ఆసనం శక్తిని క్రింది నుంచి పైకి వెళ్ళే విధంగా సహాయం చేస్తుంది.

ఎవరైనా సరే ఆధ్యాత్మిక సాధన ప్రారంభించాలి అని అనుకుంటే వారికి శ్వాస చక్కని ప్రారంభం. ఈ విషయంలో చాలా ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఏదైనా ఒక దాని మీద ధ్యాస పెట్టటం, మంత్రాన్ని లేదా ఏదైనా ఒక పదాన్ని జపించటం ఇలా చాలా ఉన్నాయి. కానీ నేను చెబుతున్నాను శ్వాస అనేది ఆధ్యాత్మిక సాధనకి ఒక మంచి పద్ధతి.

మన శరీరంలో రెండు రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి స్వచ్ఛందంగా పనిచేసేది, రెండవది అలా చేయని వ్యవస్థ. కాళ్ళు, చేతులని కదలించగలగటం స్వచ్ఛంద వ్యవస్థకి ఉదాహరణ : మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాళ్ళని, చేతులని కదిలించగలరు. కానీ మీరు మీ మెదడు పనితీరుని మీ ఇష్టం వచ్చినట్టు చేయలేరు. అదే విధంగా శ్వాస వ్యవస్థని, గుండె కొట్టుకోవటాన్ని మీరు నియంత్రించలేరు. అవి స్వచ్ఛందంగా పనిచేయవు. అయితే శ్వాస రెండు వ్యవస్థలకి సంబంధించినది. మీరు తెలుసుకోకపోయినా, పట్టించుకోకపోయినా శ్వాస ఆడుతుంది కాని ఆగదు. మీ ఏకాగ్రత మరొకదాని మీద ఉన్నప్పుడు కూడా శ్వాస మామూలుగానే తన పని తాను చేసుకుపోతుంది. అదేవిధంగా మీరు శ్వాసని నియంత్రించవచ్చు. ప్రాణాయామం మొత్తం చెప్పేది శ్వాస నియంత్రణ గురించే. మీరు లోతుగా, నెమ్మదిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఆ విధంగా శ్వాసించవచ్చు. చాలా సమయం శ్వాసని బంధించవచ్చు. కొన్ని నిముషాల పాటు శ్వాసించకుండా ఉండవచ్చు. అందుకే శ్వాస మీలోని స్వచ్ఛంద వ్యవస్థకి, స్వచ్ఛందం కాని వ్యవస్థకి మధ్య ఉండే బంధం లాంటిది.

అయితే మీరు శ్వాస ఆపి మరణించలేరు. ఎందుకంటే అది జీవించాలనే కాంక్షకి, మీ కోరికకి మధ్య జరిగే పోరాటం. జీవించాలి అనే కోరిక మీ ఆకాంక్ష కంటే బలమయినది. నిజానికి మీలోని స్వచ్ఛందం కాని కదలికలన్నీ జీవించాలి అనే కోరిక ఆధారంగానే జరుగుతాయి. మీరు జీవిస్తున్నారు అంటే అది మీకు జీవించాలి అన్న కోరికవలన మాత్రమే. కాబట్టి మీ ప్రతి శ్వాస కూడా మీరు జీవించాలనే కోరిక వలన మాత్రమే జరుగుతుంది.

మీరు ఒక విషయాన్ని గమనించారో లేదో, మీరు శ్వాసించే పద్ధతి, మీ శ్వాస మీ మానసిక స్థితిని బట్టి మారుతూ ఉంటుంది. మీలోని భావావేశాలు మీ శ్వాస క్రియ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు ఆత్రుతతో ఉన్నప్పుడు మీ శ్వాస ఒక విధంగా ఉంటుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు అది మారుతుంది. మీరు ప్రేమతో ఉన్నప్పుడు మీ శ్వాసలో నాణ్యతతో కూడిన మార్పు ఉంటుంది. కామోద్రేకంలో ఉంటే మరొక విధంగా ఉంటుంది. కాబట్టి మీ శ్వాస అనేది మీ భావావేశాల మీద ఆధారపడి ఉంటుంది. అది మీ మానసిక పరిస్థితికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. మీరు తీవ్రమైన వత్తిడిలో (టెన్షన్) ఉన్నప్పుడు సాధారణంగా ఇచ్చే సలహా, లోతుగా శ్వాస తీసుకోమని. మీరు ఎప్పుడయితే లోతుగా శ్వాస తీసుకుంటారో అప్పుడు తేలికగా అవుతారు. వెంటనే రిలాక్స్ అవుతారు. అప్పుడు మీకు ఉన్న టెన్షన్ (మానసికమైన ఒత్తిడి) తగ్గుతుంది. మైండ్, శ్వాస అనేవి దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. మీరు శ్వాసించనప్పుడు, శ్వాస తీసుకోనప్పుడు ఆలోచించలేరు. మైండ్‌కి శ్వాస శక్తిని ఇస్తుంది. అది ఇంధనంలా పనిచేస్తుంది. శ్వాసని సంస్కృతంలో ‘ప్రాణ’ అంటారు. ప్రాణ అంటే నిజానికి శ్వాస కాదు. దాని అర్థం మనలోపలికి శ్వాసతో ప్రవహించే శక్తి అని అర్థం. ఆ శక్తే జీవశక్తి.

తైత్రేయ ఉపనిషత్తులో ఐదుకోశాలు (పంచకోశాలు) గురించి చెప్పబడినది.

అవి అనామయకోశ (భౌతిక శరీర తొడుగు) ప్రాణామయకోశ (శ్వాస తొడుగు), మానామయకోశ (మనస్సు అనే తొడుగు) విజ్ఞానామయ కోశ (మేధస్సు అనే తొడుగు) చివరిది ఆనందమయ కోశ (పరమానందపు తొడుగు). ఈ ఐదుకోశాలు మనలోని ఆత్మని ఉల్లిపాయలోని పొరలు మూసినట్టుగా మూసి ఉంచుతాయి. ప్రాణాయామ కోశ దగ్గర మీలోని కోరికలకి సంబంధించిన జ్ఞాపకాలు నిలువచేయబడి ఉంటాయి. మీ కోరికలు ఎక్కువగా బలంగా ఉన్నప్పుడు, శ్వాస బరువుగా, చాలా త్వరగా జరుగుతుంది. మీకు కోరికలు లేనప్పుడు శ్వాస నెమ్మదిగా విరామంగా ఉంటుంది.

శ్వాస, మనస్సు (మైండ్) అనేవి కలసి ఉంటాయి. కాబట్టి ఒకదానిలో మార్పు వస్తే రెండవది కూడా మారుతుంది. ఇంతకు ముందు మన భావావేశాల బట్టి శ్వాస ఎలా మారుతుందో తెలుసుకున్నాము. అదేవిధంగా శ్వాసని నియంత్రించాలి అనుకుంటే, శ్వాస క్రమంలో మార్పులు చేస్తే, అవి నేరుగా మన భావావేశాలని ప్రభావితం చేస్తాయి. అదే విధంగా మన మానసిక వ్యవస్థని ప్రభావితం చేస్తాయి.

మనలోని జ్ఞాపకాలన్నీ మన కండరాలలో దాచబడి ఉన్నాయి. నేను ఒక విషయాన్ని నమ్ముతాను. అది ఏమిటి అంటే, మనం మన శరీరంలో ఒక భాగాన్ని కోల్పోతే, దాని తాలుకా జ్ఞాపకాలని కూడా కోల్పోతాం. అంటే మర్చిపోతాం. మీరు ఈ చిన్ని ప్రయోగం చేసి చూడండి. మీరు మీ ఆకారాన్ని గుర్తు తెచ్చుకోకుండా మీకు గతంలో జరిగిన ఏదైనా ఒక సంఘటనని గుర్తు తెచ్చుకోండి. అది అసాధ్యం.

మీ జీవితంలో ఏది గుర్తు తెచ్చుకోవాలి అనుకున్నా మీ ఆకారం అవసరం. ఎందుకంటే మీ జ్ఞాపకాలన్నీ మీ రూపంలో మీ ఆకారంలో నిలవ చేయబడి ఉన్నాయి.

మీరు మీ అంతరంగంలో చాలా భావాలని అణిచివేసి ఉంచారు. ఆ కారణం వలన మీరు సరిగా శ్వాసించలేరు. మీ శ్వాస లోతులేకుండా పైపైనే ఉంటుంది. మీరు అలాపైపైనే శ్వాసిస్తే, మీ లోపల అణచివేయబడిన భావావేశాలు విడుదల కావు. అదే విధంగా కండరాలలో నిలువచేయబడిన మీ జ్ఞాపకాలు బయటికిరావు. అటువంటి శ్వాస మీ శరీరంలోని ప్రతి భాగాన్ని స్పృశించదు.

మీరు అందరూ ఒక క్రమపద్దతిలో శ్వాస తీసుకుంటారు. మనలో అణచివేయబడిన సంస్కారాలు, మన పాత జ్ఞాపకాలు మన శ్వాసను ఒక క్రమ పద్ధతిలో ఉండేలా చేస్తాయి. దాని ఫలితంగా మనం అటువంటి సంస్కారాలు అటువంటి భావావేశాలనే ఆకర్షించుతాము. మన వ్యవస్థలో ఉండే దేనికైనా జీవించాలి అనే తాపత్రయం ఉంటుంది. కాబట్టి మనలో అణచివేయబడినది ఏదయినా, అది తనకి సౌకర్యంగా ఉండే పరిస్థితులని కల్పించుకుని అందులో స్థిరపడి, అభివృద్ధి చెందాలి అని చూస్తుంటుంది. మీరు కోపాన్ని అణచివేస్తే అది మీ వ్యవస్థలో ఉంటూ బయటికి రావటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది తనకి కావలసిన శ్వాసక్రమాన్ని సృష్టించి దాని ద్వారా తన ఉనికిని కాపాడుకుంటుంది. ఇదంతా ఒక ఛేదించలేని చక్రాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మీ శ్వాస అంటే మీలో పేరుకుపోయిన మీ పాత జ్ఞాపకాలే (సంస్కారాలు).

నిత్యధ్యానం

నిత్యధ్యానం ఒక పద్ధతిలేని, ఒక క్రమంలేని శ్వాసతో ప్రారంభమవుతుంది. మీరు ఎంతలోతుగా శ్వాసించగలిగితే అంతలోతుగా శ్వాస తీసుకోండి. ఎంత క్రమంలేకుండా (గడిబిడిగా) శ్వాస తీసుకోగలిగితే అంత క్రమం లేకండా శ్వాస తీసుకోండి. అలా చేస్తూ మీరే శ్వాసగా మారిపోవాలి. స్పష్టంగా అర్ధం చేసుకోండి, మీ శ్వాస లోతుగా ఉండాలి. అది ఎప్పుడూ పైపైన ఉండకూడదు. మీరు లోతుగా, ఒక పద్ధతి లేకుండా శ్వాస తీసుకుంటే అదిమీలోని టెన్షన్ ని బయటికి విడుదల చేస్తుంది. అలా జరగడం వలన మీలోని పాత సంస్కారాలన్నీ బయటికి వచ్చేస్తాయి. సాధారణంగా మన కండరాలన్నీ నిరంతరం ఒత్తిడికి లోనైవుంటాయి. క్రమం లేని లోతయిన శ్వాస ఒత్తిడిలో ఉన్న కండరాలని వదులు చేస్తుంది. అదేవిధంగా సంస్కారాలని శుభ్రపరుస్తుంది.

మనలోని ఒక్కొక్క భావావేశం ఒక్కొక్క విధమయిన శ్వాస పద్ధతిని తయారు చేస్తాయి. మీరు చిన్న పిల్లల శ్వాసను గమనించితే, అది చాలా లోతుగాను, పరమానందంతోనూ ఉంటుంది. వాళ్ళు శ్వాసని పైపైన తీసుకోరు. అయితే వారు పెద్దవారయ్యేకొద్దీ, సమాజపు నిబంధనలు, వారిలోని బాధలు, వ్యథలు, సంతోషం, అపరాధభావం, నమ్మకాలు, ఒత్తిడి ఇలా చాలా రకాల భావావేశాలు వారిలోనికి ప్రవేశించి, వారి శ్వాసలోని నాణ్యతని పూర్తిగా మార్చివేస్తాయి. ఇప్పుడు ఈ క్రమపద్ధతిని కదిలించాలి అంటే, అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా మీలో అణచివేయబడిన భావావేశాలని కదిలించాలంటే, మీరు ఆ క్రమపద్ధతిలోనికి కల్లోలాన్ని పంపించాలి. మీరు లోపల గొప్ప సంక్షోభం లేదా గందరగోళాన్ని సృష్టించాలి, అంతేకాని దానిలోనికి మరొక పద్ధతిని ప్రవేశపెట్టటం పరిష్కారం కాదు. పాత భావాలనన్నింటినీ బయటికి తేవాలి అంటే మీలో పెద్ద కల్లోలాన్ని సృష్టించాలి. అందుకే నేను మీకు ఒక పద్ధతిలో ఉండే శ్వాస క్రియ అయిన ప్రాణాయామాన్ని చేయమని ఈ ధ్యానపద్ధతిలో చెప్పను. కేవలం ఒక పద్ధతి లేని శ్వాస సరియైనది. ఇటువంటి శ్వాస పద్ధతి మీలోని పాత సంస్కారాలన్నింటినీ నాశనం చేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే పండిన ఆకులున్న చెట్టుని కదిలించటమే. అప్పుడు పండిపోయిన ఆకులన్నీ రాలిపోతాయి. కల్లోలంగా ఉండే ఈ శ్వాస పద్ధతి మీలో అణచివేయబడిన సంస్కారాల వ్యవస్థని కుదిపివేయటమే. అప్పుడు మీలోని పాత సంస్కారాలన్నీ కూడా బయటకి వెళ్ళిపోతాయి.

లోతుగా శ్వాస తీసుకోవటం వలన, ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ మనలోనికి పంపబడుతుంది. అదేవిధంగా మన శరీరం నుంచి కార్బన్డయాక్సైడ్ బయటికి వచ్చేస్తుంది. అలా ఎప్పుడైతే అధికంగా బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మీరు కొత్త ఉత్సాహంతో ఉంటారు. రక్తంలోనికి ఆక్సిజన్ ఎక్కువగా వెళ్ళటం వలన, మీ శరీరంలోని భాగాలు అన్నీ జీవంతో, ఉత్సాహంగా ఉంటాయి. అప్పుడు మీ శరీరంలో ప్రతి కణం జీవశక్తిని అధికంగా సృష్టిస్తాయి.

సాధారణంగా అందరం చాలా బరువుగా నిర్జీవమైన అణువులతో కూడిన ఒక ఘన పదార్ధంలా అనిపిస్తాము. ఎందుకంటే మన శరీరం జీవశక్తితో ఉండదు.

నిత్యధ్యానం

ఈ శరీరం నిరంతరం వత్తిడి కంగారులతోనే ఉంటుంది. ఏదైతే ఆతృతతో, టెన్సన్ తో ఉంటుందో అది జీవశక్తితో ఉండదు. ఎప్పుడైతే లోపలికి అధికంగా ఆక్సిజన్ పంపించి, శరీరంలోని ప్రతి భాగాన్ని జీవశక్తితో నింపుతామో అప్పుడు మన శరీరం తేలిక అయినట్టు మనం తెలుసుకుంటాము. అప్పుడు మీకు మీరు ఒక పదార్థంలా కాకుండా, ఒక శక్తిగా తెలుసుకోగలుగుతారు. మీలోని పాతజ్ఞాపకాలు, సంస్కారాల వలన మీకు మీరు చాలా బరువుగా అనిపిస్తారు. కొన్ని బౌద్ధ ఆశ్రమాలలో, సన్యాస దీక్షని ఇవ్వటానికి ఈ పద్ధతిని ఉపయోగించుతారు. వాళ్ళు చేయవలసిన కొన్ని ఆధ్యాత్మిక సాధనలు చేసాకా వారిని గడ్డిమీద నడిపించుతారు. అలా నడచినప్పుడు అక్కడ గడ్డి నలిగి దారి ఏర్పడితే, ఆ వ్యక్తికి సన్యాస దీక్షని ఇవ్వరు. ఆ వ్యక్తికి మరికొంత ఆధ్యాత్మిక సాధనలు చేయాలి అని నిర్దేశించుతారు. ఏ వ్యక్తికయితే అతనిలోని సంస్కారాలు అతి తక్కువగా ఉంటాయో అటువంటి వ్యక్తి గడ్డి మీద నడిస్తే గడ్డి నలగదు, దారి ఏర్పడదు. ఎందుకంటే అటువంటి వారు తేలికగా ఉంటారు. వారిలో సంస్కారాల బరువు వుండదు.

ఎప్పుడయితే లోతైన శ్వాస ద్వారా మన శరీరంలోనికి అత్యధికంగా ఆక్సిజన్ వెళుతుందో, అది మనలోని అణచివేయబడిన వ్యవస్థని జీవంతో ఉత్సాహపరుస్తుంది. దానికి ప్రాణం వస్తుంది. అందుకే మీ శ్వాస కల్లోలంగా, లోతుగా, తీవ్రంగా ఉండాలి. మీరే ఆ శ్వాస అయిపోవాలి. అప్పుడు మీలో సృష్టించబడిన జీవశక్తి మీ కండరాలలోని, మీ వ్యవస్థలో నిలువ చేయబడిన సంస్కారాలని కరిగించి వేస్తుంది. ఆ శక్తి సంస్కారాలని శుభ్రం చేస్తుంది. అప్పుడు మీరు శక్తివంతులుగా ఉత్సాహంగా తేలికగా పరమానందంతో ఉంటారు. ఆ తరువాత రెండవ దశ మొదలుపెడతాము.

క్రమబద్ధత లేని శ్వాసకి సంబంధించిన ధ్యాన పద్ధతులు కావాలి అంటే మీరు దుఃఖహరణి సాధన చేయవచ్చు. ఆ ధ్యానాన్ని మీకు ఆనందస్ఫురణ కార్యక్రమంలో నేర్పించుతారు.

తీవ్రంగా హమ్మింగ్ చేయటం

(7 నిమిషాల సమయం)

రెండవ దశలో కూడా మీరు వజ్రాసనంలోనే కూర్చొని, మీ చేతులని చిన్ముద్రలో వుంచి మీ మోకాళ్ళు మీద పెట్టాలి. అలా కూర్చొని మీరు ఎంత బాగా చేయగలిగితే అంత తీవ్రంగా, అంత గట్టిగా అంత ఎక్కువ సేపు హమ్మింగ్ చేయండి.

మీరు మీ తెలుసుకునే తత్త్వాన్ని (అవేర్నెస్ని) పూర్తిగా హమ్మింగ్ పైననే ఉంచాలి. మీరే హమ్మింగ్ అవ్వాలి. అలా హమ్మింగ్ చేస్తే మీలోని అనర్ధపుమాటల ప్రవాహం తగ్గుతుంది. ఎందుకంటే మీ మైండ్లో నిరంతరం మాట్లాడుకోవటం జరుగుతుంది. మనం ఎవరితోనూ బయటకి మాట్లాడకపోవచ్చు కాని మన అంతరంగంలో నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటాము. హమ్మింగ్ అనేది ఈ అంతరంగపు మాటలని తగ్గించటంలో అద్భుతంగా సహాయం చేస్తుంది.

A person sitting in vajrasana meditating

సాధారణంగా ఎవరైనాసరే ఆలోచనలు లేకుండా కూర్చోలేరు. మీరు ఆ విధంగా కూర్చొని ధ్యానం చేయాలి అని ప్రయత్నిస్తే, ముందూగా ఆ ధ్యానాన్ని మీ మైండ్ అడ్డగిస్తుంది. ఇది ముఖ్యంగా మధ్య వయస్సువారిలో అధికంగా ఉంటుంది. మనస్సు వ్యతిరేకిస్తుంది. దానికి నిశ్శబ్దంగా కూర్చోవటం ఇష్టం ఉండదు.

ఎన్నో సంవత్సరాలుగా పరుగులు పెట్టటానికి అలవాటుపడిన మనస్సుని అకస్మాత్గా కూర్చోమని చెబితే, అది వ్యతిరేకిస్తుంది. చాలాసార్లు చాలామంది ఏమంటారంటే, ‘మేము ఆలోచనలు లేకుండా కూర్చోవాలి అని కూర్చున్నప్పుడు మాకు ఎక్కువ ఆలోచనలు వస్తాయి” అని. కొన్ని సంవత్సరాలుగా మనస్సు నిశ్శబ్దం అంటే ఏమిటో తెలియకుండా గడిపింది. ప్రారంభంలో అటువంటి మైండ్ని నిశ్శబ్దంలో ఉంచాలి అంటే ప్రవాహానికి ఎదురు ఈదటమే. అలా ఎదురు ఈదే సమయంలో ప్రవాహం సహజంగానే వ్యతిరేకిస్తుంది.

ఈ సమయంలోనే చాలామంది ధ్యానాన్ని వదిలివేస్తారు. వాళ్ళు చాలా నిరుత్సాహపడి, ధ్యానం నాకు సాధ్యపడే విషయం కాదులే అని నిర్ణయించుకుంటారు. నేను చెపుతున్నాను, అర్ధం చేసుకోండి, సాధకులు అందరికి ప్రారంభదశలో ఈ సమస్య ఉంటుంది. మీరు మీ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాన్నే నేను తపస్సు అంటాను. మీరు ప్రారంభంలో నిరుత్సాహపడితే, ముందుముందు ఈ విషయంలో విజయం సాధించలేరు.

మనకి తెలిసిన పురాణకథ, అమృతం కోసం దేవతలు, అసురులు పాల సముద్రాన్ని చిలుకుతారు. వారు సముద్రాన్ని చిలుకుతుంటే అందులోంచి ముందుగా వచ్చినది భయంకరమైన కాలకూట విషం. ఇది ఎంత ఆశ్చర్యకరమయిన విషయమోకదా! కానీ వాళ్ళు ఆపకుండా అలా చిలుకుతూనే ఉంటారు. అప్పుడు చాలా వస్తువులు వస్తాయి. చివరిగా అమృతం వస్తుంది. ఇదంతా ధ్యానాన్ని వివరిస్తూ చెప్పే ఒక కథ మాత్రమే. ఇదంతా ధ్యానం, అక్కడ జరిగే మొత్తం ధ్యాన క్రమాన్ని

నిత్యధ్యానం

కథ రూపంలో చెప్పటమే. ధ్యానం ద్వారా మనస్సుని జ్ఞానోదయం కోసం చిలికినప్పుడు ముందుగా బయటికి వచ్చేవన్నీ మనలో అణచివేయబడిన వ్యతిరేకపు భావాలు, సంస్కారాలు మాత్రమే. కాబట్టి ముందుగా వచ్చేవి వ్యతిరేకమయినవే. అందుకే మీరు నిరుత్సాహపడకూడదు. ఇలా జరగటం అనేది మీరు చేస్తున్న పనిలో అభివృద్ధిని సూచిస్తుంది. మీరు ఆగకుండా అత్యున్నత స్థితిని చేరేవరకూ ధ్యానాన్ని సాధన చేయండి.

ప్రారంభ దశలో నిరంతరం ఈ లోపలి మాటలు మిమ్ములని చాలా విసిగిస్తాయి. తీవ్రంగా, లోతుగా మీరు హమ్మింగ్ (పెదాలు మూసి మ్..... మ్... అనే శబ్దం) చేస్తే అది ఉపయోగపడుతుంది. అది మీ మైండ్‌ని నిశ్శబ్దంగా చేస్తుంది. మన అంతరంగపు మాటలు అనేవి మణిపూరక, స్వాధిష్టాన చక్రాల మధ్య సృష్టించబడతాయి. ఈ ప్రాంతాన్ని ‘హర’ అంటారు. మనం లోతుగా, తీవ్రంగా హమ్మింగ్ చేసినప్పుడు ఆ హమ్మింగ్ తరంగాలు నాభి ప్రాంతంలో క్రింద వరకూ వ్యాపించిన అనుభూతిని మనం పొందగలం. అప్పుడు మనం నిరంతరంగా జరుగుతుండే అంతరంగపు మాటల ప్రవాహాన్ని ఆపగలం. హమ్మింగ్ అనేది మన ‘హర’ ప్రాంతాన్ని కుదిపినట్టు చేస్తుంది. అందుకే హమ్మింగ్ అనేది మన నాభికి క్రింద నుంచి జరగాలి.

మనలోని అంతరంగపు మాటలే మన మనస్సు అనేది ఏర్పడటానికి గల ఒకే ఒక కారణం. కాబట్టి మనస్సు (మైండ్) అంటేనే మన అంతరంగపు మాటలు. హమ్మింగ్ చేయటం ద్వారా మీరు అంతరంగపు మాటలని తగ్గించగలిగితే, మీరు ఆటోమేటిక్‌గా, ఎటువంటి ప్రయత్నం లేకుండా, మైండ్‌లేని స్థితి (ఆలోచనలు లేని లేదా నో మైండ్ స్టేట్)కి చేరగలుగుతారు. అప్పుడు మీ ఉనికిలోని మరొక కోణాన్ని అనుభూతి పొందగలుగుతారు.

ఒక మంచి కారు డ్రయివర్‌కి, తన కారులోని అంతర్గతంగా ఉండే వివరాలన్నీ క్షుణ్ణంగా తెలుస్తాయి. ఉదాహరణకి, వేగం మారినప్పుడు మారే కారు శబ్దం ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా అతనికి అర్థం అవుతుంది. ఇంజను శబ్దంలో చిన్న మార్పు వచ్చినా అతను వెంటనే గుర్తించగలుగుతాడు. ఇంజనులో ఏదయినా తేడా ఉంటే అది తెలుసుకుని వెంటనే దానిని బాగు చేయగలుగుతాడు. అయితే ఈ విషయాలు ఏవీ ఆ కారులో ప్రయాణించే వారికి ఎవరికీ తెలియదు. కేవలం నైపుణ్యంగల డ్రయివర్‌కే తెలుస్తుంది. అదే విధంగా, ఈ ధ్యానం మీరు ప్రతి రోజూ సాధన చేస్తే, మీరు చేసే హమ్మింగ్ శబ్దం, తీవ్రత ఆధారంగా, మీ హమ్మింగ్ లక్షణాలని బట్టి మీరు మీ శరీరంలో జరిగే మార్పులని అర్థం చేసుకోగలుగుతారు. ఉదాహరణకి మీకు పడని పదార్ధాలు తిన్నారనుకోండి. మీకుమీ హమ్మింగ్‌లో తేడా తెలుస్తుంది. అప్పుడు మీరు ఆ తేడాలని సరిచేసుకోవచ్చు. అంతే. మీరు ప్రతి రోజు ఈ ధ్యానం చేసేటప్పుడు అందులో ఉండే తేడాల బట్టి శరీరంలోని మార్పులను మీరు బాగుచేసుకోగలరు. దాంతో హమ్మింగ్ సాధారణంగా ఉండే విధంగా మలచుకోగలరు. హమ్మింగ్ మీ శరీరంలో జరిగే సూక్ష్మ ప్రకంపనలని గమనించగలదు. అదే మీరు శరీర వ్యవస్థని బాగుచేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఇదంతా దానంత అదే జరుగుతుంది. మనం ప్రయత్నపూర్వకంగా ఏమీ చేయనవసరం లేదు.

మన శరీరం, మనస్సు ఎప్పుడూ ఒక దగ్గర ఉండవు. నేనెప్పుడూ అంటుంటాను, శరీరం ఇక్కడ ఉన్నది అంటే మీరు కచ్చితంగా ఇక్కడ లేరు అని అర్థం. మీ మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మన శరీరానికి స్వభావసిద్ధమయిన తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివి నిరంతరం పని చేస్తూ ఉంటుంది. అయితే మనస్సు మాత్రం ఆ విషయాన్ని అసలు ఒప్పుకోదు. అది శరీరాన్ని ఏవో కొన్ని పనులకి పురికొల్పుతుంది. అదే అనారోగ్యాల రూపంలో బయటపడుతుంది. అనారోగ్యం అంటే ఆరోగ్యం లేకపోవటమే. శరీరం మనస్సు సౌకర్యంగా లేకపోవుటమే. శరీరాన్ని బలవంతంగా పరుగులు తీయించితే అది ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా తిరగబడుతుంది.

మీరు ఎన్నోసార్లు అధికంగా తింటారు. మీ శరీరం మీకు ఇక చాలు నిండుగా ఉన్నది అని సూచనలని ఇస్తుంది. కానీ మనస్సుకి తృప్తిలేదు. దానికి ఇంకా కావాలి. అప్పుడు మీరు శరీరంలోనికి ఆహారాన్ని ఇంకా ఇంకా నింపుతూ ఉంటారు. దానితో శరీరానికి జరగవలసిన హాని జరుగుతుంది. దీని ఫలితాన్ని, ఆ దెబ్బని తరువాత తెలుసుకుంటారు. శరీరానికి, మనస్సుకి అతీతంగా వెళ్ళాలి అని అనుకుంటే, ఈ రెండింటిని పరస్పరం సమన్వయపరచాలి. అలా చేయలేకపోతే, మనం మానసిక - శారీరక తత్వంలో చిక్కుకుపోతాము. అప్పుడు మనలో మార్పురావటం కష్టమవుతుంది. హమ్మింగ్ అనేది శరీరానికి మనస్సుకి మధ్యవారధిని నిర్మించే చక్కని పద్ధతి.

హమ్మింగ్ చేస్తే మీ శరీరం ఒక శక్తి అనే భావన కలుగుతుంది. మీరు హమ్మింగ్ చేయటం ప్రారంభించగానే మీ శరీర తేలిక అయిన భావన కలుగుతుంది. శరీరం తేలిపోతున్నట్టు ఉంటుంది. మీ శరీరంలో ఎటువంటి బరువు ఉన్నట్టు అనిపించదు. ఎందుకంటే హమ్మింగ్ అనేది శరీర ప్రకంపనలకి, మనస్సు యొక్క ప్రకంపనలకి సరిపోతుంది. అప్పుడు శరీరం, మనస్సు ఒక పద్దతిలో ఉంటాయి. అప్పుడు మీకు మీరు ఒక శక్తిగా అనుభూతి చెందుతారు. శరీరం అంటే పదార్ధం అని అనిపించదు. ఒక శక్తి అనిపిస్తుంది.

నిత్య ధ్యానంలోని ఈ దశ సాధన చేసేటప్పుడు మీరు పెదాలని దగ్గరగా మూసి మ్... మ్.... అనే శబ్దాన్ని చేయాలి. ఆ శబ్దం లోపలి నుంచి రావాలి. అది ఏ విధంగా ఉంటుందంటే, మీరు మీ తలని ఒక అల్యూమినియం పాత్రలో పెట్టి హమ్మింగ్ చేస్తే ఎటువంటి శబ్దం వస్తుందో ఇది అదే విధంగా ఉంటుంది. ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇది కేవలం పెదాలని దగ్గరగా మూసి మ్ అనే శబ్దాన్ని చేయటమే. ఒక హమ్మింగ్ మీరు ఎంతసేపు చేయగలిగితే అంత తీవ్రంగా చేయండి. అది మీ నాభిప్రాంతం నుంచి వచ్చేదిగా ఉండాలి. అదేవిధంగా ఎంత గట్టిగా చేయగలిగితే అంత గట్టిగా చేయండి. లోతుగా ఊపిరి తీయాలి అని ప్రయత్నపూర్వకముగా మీరు శ్వాస తీసుకోవద్దు. ఎప్పుడు అవసరమయితే అప్పుడు మీ శరీరమే శ్వాస తీసుకుంటుంది. అసలు టెన్షన్ పడవద్దు. విరామంగా, రిలాక్స్డ్గా హమ్మింగ్ చేయండి. మీరు హమ్మింగ్లో నిమగ్నమయిపోవాలి. మీరే హమ్మింగ్ అయిపోవాలి. రెండు హమ్మింగ్ల మధ్య ఖాళీని తగ్గించటానికి ప్రయత్నించండి.

అలా కొంతసేపు చేసాక హమ్మింగ్ అనేది అప్రయత్నంగా జరిగిపోతుంది. మీరు కేవలం దానిని గమనిస్తూ ఉంటారు. మీ మనస్సు, శరీరం ఆ హమ్మింగ్ ప్రకంపనలని ప్రతిధ్వనిస్తుంటాయి.

వజ్రాసనంలో కూర్చొని, మీ చేతి వేళ్ళని "చిన్ముద్ర లోవుంచి చేతులని మోకాళ్ళ మీద పెట్టి హమ్మింగ్ చేయాలి. చిన్ ముద్ర అంటే చేతి వేళ్ళతో ఒక గుర్తు. దీనిలో చూపడువేలు బొటన వేలు చివరలు కలిపి, మిగతా వేళ్ళు పూర్తిగా తెరచి ఉంచాలి. చిన్ ముద్ర మనలోని శక్తిప్రవాహాన్ని నియంత్రిస్తుంది. అదేవిధంగా మనలో సృష్టించబడిన శక్తి మన శరీరంలో ఉండే విధంగా చేస్తుంది. అది శక్తిని మన శరీరం నుంచి పోనీయదు.

చిన్ముద్ర

ఈ విధంగా మొదటి రెండు దశలు, క్రమబద్ధతలేని శ్వాస, హమ్మింగ్ చేసాక, ఆ తరువాత దశకి వెళ్ళాలి. ఇందులో మనం మన శరీరంలోని సూక్ష్మ ప్రాంతాలలోనికి ప్రవేశించుతాము.

హమ్మింగ్ గురించి ఇంకా వివరంగా సాధన చేయాలి అని అనుకుంటే మీరు మహామంత్ర ధ్యాన పద్దతిని సాధన చేయవచ్చు. మహామంత్ర ధ్యానం మీరు ఆనందస్పురణ కార్యక్రమంలో నేర్చుకుంటారు.

చక్రాలు మరియు నాడీ వ్యవస్థ చిత్రపటం

సహస్రార ఆజ్ఞ

విశుద్ధి

అనహత

మణిపూరక

స్వాధిష్ఠాన మూలాధార

చక్రాలని తెలుసుకోవటం (శక్తి కేంద్రాలు)

సమయం : 7 నిముషాలు

ధ్యానం చేస్తున్న మహిళ

నిత్యధ్యానంలోని ఈ దశని మీరు వజ్రాసనంలో కూర్చొని అయినా చేయవచ్చు లేదా పద్మాసనంలోనైనా చేయవచ్చు. ఇప్పుడు మీరు మీ తెలుసుకునే తత్వాన్ని (అవేర్‌నెస్) మూలాధార చక్రం నుంచి సహస్రార వరకు తీసుకువెళ్ళాలి.

మన శరీరంలో ఏడు శక్తి కేంద్రాలు ఉన్నాయి.
ఈ ఏడు శక్తి కేంద్రాల స్థానాల గురించి మనం
తెలుసుకోవాలి.

మనలో మూడు రకాల చేతన స్థితులు ఉంటాయి. అవి : జాగ్రత్ స్థితి, స్వప్న స్థితి, సుషుప్త స్థితి (గాఢమయిన నిద్ర) ఈ శరీరాలకి, చేతనస్థితికి అతీతంగా మన నిజమయిన ఉనికి, మన ఆత్మ ఉంటుంది. దీనిని ఏవిధంగా అయినా పిలవవచ్చు. సంస్కృతంలో ఆ అత్యుత్తమస్థితిని శరీర త్రైవలక్షణ, పంచకోశాతీత, అవస్థత్రియోశక్తి అంటారు. ఈ పదాలకి అర్ధం, మూడు శరీరాలని పరిశీలించేది, కోశాలకి అతీతమయినది, మూడు చేతన స్థితులని గమనించేది.

భౌతిక శరీరం అంటే మనకి తెలిసిన శరీరం. ఈ శరీరంతోనే మనం ఎక్కడకయినా వెళ్ళగలం, తినగలం ఇలా మనకి తెలిసిన అన్ని పనులు చేస్తాము. ఇది జాగృత్ స్థితి. మానసిక శరీరం లేదా సూక్ష్మ శరీరం అనేదానిని మనం కలలో చూస్తాము. మీరు మీ శరీరంతో భారతదేశంలో నిద్రలో ఉండవచ్చు కానీ మీ మనస్సు వేరే దేశాలకి వెళుతుంది. అప్పుడు మీరు ఉపయోగించే శరీరమే సూక్ష్మ శరీరం. ఈ శరీరాన్ని మీరు మేలుకొని ఉన్నప్పుడు కూడా ఉపయోగించుతారు. అందుకే నిరంతరం ఆలోచనలు అనేవి జరుగుతూ ఉంటాయి. కారణ శరీరాన్ని మనం కలలు లేని గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు ఉపయోగించే శరీరం. మనం నిద్రపోయే సమయంలో మొత్తం గాఢమైన నిద్ర ఆలోచనలు లేని నిద్రయొక్క వృత్తాన్ని కొన్నిదశలలో చెప్పవచ్చు. అదే మీరు కారణ శరీరంలో పొందే అనుభూతి.

ఈ మూడు శరీరాలు మనం అనుకున్నట్టు వేరువేరుగా ఉండవు. అవి ఒకదానికొకటి గట్టిగా పట్టుకొని, పెనవేసుకొని ఉంటాయి. ఒక కాగితం మీద మెలికలు తిరిగిన గీతలు ఒకదానిని ఒకటి పెనవేసుకున్నట్టు గీసారనుకోండి, అవి ఏడు చోట్ల ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి. అందులో ఒక గీత భౌతిక శరీరం అయితే, మిగిలిన రెండు గీతలు సూక్ష్మ మరియు కారణ శరీరాలు అనుకోండి. అవి ఒకదానిని ఒకటి కలిసే ఏడు ప్రదేశాలే ఈ ఏడు శక్తి కేంద్రాల స్థానాలు. అదే మనం అనుకునే ఈ ఏడు చక్రాలు, భౌతిక, సూక్ష్మ, కారణ శరీరాలు ఒకదానినిఒకటి కలసే ప్రదేశాలు. అవి భౌతికంగా మనకంటికి కనిపించని స్థితిలో ఉంటాయి. ఈ మధ్యన జరిగిన కొన్ని పరిశోధనలలో ఆరాని ఫోటో తీయగల టెక్నాలజీతో ఈ చక్రాలని కూడా ఫోటో తీయగలిగారు

ఈ ఏడు శక్తి కేంద్రాలు, మనలోని ఏడు భావావేశాలకి సంబంధించి ఉంటాయి. మనలోని భావావేశాలు మనం కొన్ని జన్మలుగా సంతరించుకొని మనలో నిలువచేసిన సంస్కారాలు, అణచివేయబడిన జ్ఞాపకాల వలన వస్తాయి. మనలోని సంస్కారాలు శక్తి కేంద్రాలలోనికి శక్తిని ప్రవేశించనీయకుండా అడ్డుకుంటాయి. దాంతో మన భౌతిక మానసిక వ్యవస్థలలో మార్పులు వస్తాయి.

మనలోని చాలా అనారోగ్యాలు కేవలం మానసికమయినవి. వాటి పేర్లు మన మానసిక వ్యవస్థలో ఉంటాయి. మనం చూసేది వాటి ప్రభావాన్ని మాత్రమే. అయితే మనం నిజానికి శరీర, మానసిక వ్యవస్థని తెలుసుకోము. శరీరానికి మనస్సుకి మధ్యఉన్న సంబంధం మనకి తెలియదు. ఎప్పుడయితే ఒక చక్రం బంధింప బడుతుందో ఆ చక్రం ఉన్న ప్రాంతంలోని శరీరం అనారోగ్యంగా అవుతుంది. మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. మీరు ఎక్కువ బాధపడితే మీకు కడుపులో గడబిడలు వస్తాయి. అందుకే మీరు ఈ శక్తి కేంద్రాలని శుభ్రపరుస్తూ ఉండాలి. అప్పుడే శారీరకంగా, మానసికంగా మీరు ఆరోగ్యంగా ఉండగలరు.

ఈ చక్రాలని ఏ భావావేశం బంధిస్తుంది, ఆ చక్రం ఎలా వికసిస్తుంది అనే పట్టికని ప్రక్కపేజీలో ఇచ్చాను.

ఊహలు, కల్పనలు : భయం, బాధ, శ్రద్ధని ఆశించటం, అసూయ, అహంకారం, అసంతృప్తి ఇలాంటి భావావేశాలు వ్యతిరేకాలు. అవి అసలు ఉండవు.

వాటికి ఉనికి ఉండదు. ఈ గదిలో ఏదైనా ఒక వస్తువు ఉన్నదనుకోండి, దానిని బయట పెట్టాలి అంటే మీరు దానిని మీ చేత్తో తీసుకొని బయటపెడతారు. దానికి ఉనికి ఉన్నది కాబట్టి చేత్తోతీసి బయటపెట్టగలిగారు. కానీ గదిలో ఉన్న చీకటిని మీరు బయటపెట్టగలరా? అలా బయటపెట్టలేరు, ఎందుకంటే దానికి ఉనికి అనేది లేదు. అందుకే దానిని తీసి బయటపెట్టలేము. మీరు దీపం వెలిగేస్తే అప్రయత్నంగా చీకటి పోతుంది.

చీకటి లాగానే భావావేశాలకి కూడా ఉనికి లేదు. వాటిని మీ నుంచి తీసివేయలేరు. మీరు చేయగలిగిన పని ఒక్కటే, అది మీలోపలికి తెలుసుకునే తత్వం అనే వెలుగుని తీసుకురావటమే. అప్పుడు మీలోని వ్యతిరేక భావాలు మాయం అయిపోతాయి.

ఒకసారి బుద్ధుడు ఒకతాడుని ముడివేసి, తన శిష్యులని ఆ తాడు ముడి తీయమని అడుగుతాడు. శిష్యులు చాలామంది దానిని అటులాగి ఇటులాగి మరింత కఠినంగా తయారుచేస్తారు. అప్పుడు ఒక శిష్యుడు వచ్చి ఆ ముడిని జాగ్రత్తగా గమనించుతాడు. ఆ తరువాత నెమ్మదిగా దానిని విప్పుతాడు. అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెబుతాడు, మీలోని అజ్ఞానం అనే ముడిని విడదీయాలి అంటే ముందుగా దానిలోపలకి జాగ్రత్తగా చూడటం నేర్చుకోవాలి. మీ అంతరాత్మలోనికి తెలుసుకునే తత్వాన్ని నింపాలి. అప్పుడు ఆ ముడి ఎలా పడిందో గమనించితే చాలు మీలోని వ్యతిరేకభావాలు మాయం అయిపోతాయి.

కాబట్టి నిత్యధ్యానంలోని ఈ దశలో మనం మన తెలుసుకునే తత్వాన్ని పూర్తిగా ప్రతి చక్రం మీదా, మూలాధార నుంచి సహస్రార వరకూ ఉంచుదాము. ఎప్పుడైతే మిమ్మలని శక్తికేంద్రం మీద మీ తెలుసుకునే తత్వాన్ని పెట్టమంటారో అప్పుడు మీరు ఆ శక్తికేంద్రమయిపోవాలి. ఆ శక్తి కేంద్రాన్ని మీ సర్వం శక్తిమమయిపోయింది అనే అనుభూతితో నింపండి. ఈ దశ తరువాత మీరు పూర్తిగా శక్తివంతులవుతారు. చాలా తేలిక అయిన అనుభూతిని పొందుతారు. ఇప్పుడు మనం తరువాత స్టెప్ లోనికి వెళతాము.

మీకు ఏడు చక్రాల గురించి వివరంగా నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు ఆనందస్ఫురణ అనే కార్యక్రమాలని చేస్తే అందులో ప్రతి చక్రం గురించి చాలా వివరంగా తెలియచేస్తారు. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క భావావేశానికి ఎలా సంబంధించి ఉంటుందో వివరించుతారు. దానికి తగిన ధ్యానపద్ధతిని కూడా నేర్పించుతారు.

శక్తి కేంద్రంబంధింపబడే భావంవికసింపచేసే భావం
1. మూలాధార చక్రంకల్పనలు, ఊహలునిజాన్ని స్వీకరించటం
2. స్వాధిష్టాన చక్రంమరణ భయంమరణాన్ని స్వీకరించటం
3. మణిపూరక చక్రంబాధలు, వ్యధలుబాధపడకుండా ఉండటం
4. అనాహత చక్రంశ్రద్ధని ఆశించటంస్వార్థం లేని ప్రేమ
5. విశుద్ధి చక్రంపోలిక, అసూయవారిలోని ప్రత్యేకతని తెలుసుకోగలగటం
6. ఆజ్ఞ చక్రంగంభీరత, అహంకారంఅమాయకత్వం, సామాన్య జీవితం
7. సహస్రార చక్రంఅసంతృప్తికృతజ్ఞత

బంధవిముక్తులై ఉండటం (సమయం 7 నిమిషాలు)

తరువాత ఏడు నిమిషాలు పూర్తి బంధవిముక్తులుగా ఉండాలి. మనస్సు అంటే ఆలోచనల పోగు, ఆలోచనల ప్రవాహం. ఒక ఆలోచన తరువాత మరొక ఆలోచన వస్తూ ఉంటుంది. సహజంగా ఒక ఆలోచనకి మరొక ఆలోచనతో ఎటువంటి సంబంధం ఉండదు. అవి చెరువులో గాలి బుడగలలా విడివిడిగా ఉంటాయి. చెరువులోని గాలి బుడగలు ఒక దానితో ఇంకొక దానికి ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండవు. అవి దేనికి అదే వేరుగా ఉంటాయి. కానీ చూడటానికి ఒక దానికొకటి ఒక చైనులా కలిసి ఉన్నట్లు కనిపిస్తాయి. అదే విధంగా ఆలోచనలు కూడా ఒకదానికొకటి ఎటువంటి సంబంధం లేకుండా ఉంటాయి. కాకపోతే అలా సంబంధం కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు ఈ చిన్న ఎక్సర్సైజు చేయండి. మీకు వచ్చిన ప్రతి ఆలోచనని అదే విధంగా ఒక పేపరు మీద వ్రాయండి. పదినిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీకు వచ్చిన ఆలోచనలని జాగ్రత్తగా ఒక పేపరు మీద వ్రాయండి. ఆ ఆలోచనలని ఆపటానికి కాని, నియంత్రించటానికి కానీ ప్రయత్నించవద్దు. నిశ్శబ్దంగా కూర్చొని మీకు వస్తున్న ఆలోచనలని జాగ్రత్తగా

బంధవిముక్తులై ఉండటం - ధ్యాన భంగిమ

గమనించండి. ఎప్పుడయితే ఆలోచన వస్తుందో వెంటనే పేపరు మీద వ్రాయండి. ఆ విధంగా పదినిముషాలపాటు చేయండి. పదినిముషాలు అయ్యాక మీరు వ్రాసినదాన్ని చదవండి. అది ఒక పిచ్చివాళ్ళ డైరీలా ఉంటుంది. అదంతా ఒక పెద్ద గందరగోళంలా ఉంటుంది. మీరు ఒకసారి ఒక కప్పు కాఫీ తాగాలి అని అనుకుంటారు. వెంటనే ఏదో ఆఫీసు విషయం ఆలోచిస్తారు. ఇక్కడ కప్పు కాఫీకి, ఆఫీసులో ఉన్నపనికి ఎటువంటి సంబంధం లేదు. రెండు వేరు వేరు సంఘటనలు. ఒక వేళ ఒక విషయానికే సంబంధించి రెండు ఆలోచనలు వచ్చినా అవి రెండూ పూర్తి స్వతంత్రమయిన ఆలోచనలు. ఒకదానికొకటి సంబంధం లేనివే. కాబట్టి ప్రతి రెండు ఆలోచనల మధ్య ఖాళీ ఉంటుంది. ప్రతి రెండు ఆలోచనల మధ్య కొంత కాలం నిశ్శబ్దం ఉంటుంది. అంటే రెండు ఆలోచనలు దేనికి అదే స్వేచ్ఛగా ఉంటాయి కాని బంధాలలో ఉండవు.

ఎప్పుడయితే మనం ఈ ఆలోచనలకి లింకులు ఏర్పరుస్తామో అప్పుడే సమస్యలు ప్రారంభమవుతాయి. మనం వీటికి ఒక దానికొకటి లింకులు ఏర్పరచి బాధలు పడతాము. ఉదాహరణకి పదిసంత్సరాల క్రితం మీరు ఐస్క్రీం తిని సంతోషించారు. అయిదు సంవత్సరాలక్రితం ఐస్క్రీం తిని సంతోషపడ్డారు సంవత్సరం క్రితం ఐస్క్రీం తిని సంతోషపడ్డారు. రెండు నెలల క్రితం ఐస్క్రీం తిని సంతోషించారు. నిన్న ఐస్క్రీం తిని సంతోషపడ్డారు. ఈ అనుభవాలన్నీ మీరు ఒక చైనులా సంబంధం ఏర్పరచి ఐస్క్రీం తింటే సంతోషంగా ఉంటుంది అని ఒక ఊహా గొలుసుని నిర్మించుకుంటారు. కాబట్టి భవిష్యత్లో కూడా మీరు సంతోషపడటానికి ఈ పనిని తిరిగి చేస్తారు. ఈ విధంగా దగ్గర పోలికలు ఉన్న ఆలోచనలన్నింటినీ కలిపి ఒక కృత్రిమమయిన గొలుసుని తయారు చేసుకుంటారు. దాంతో ఐస్క్రీం తింటే నాకు సంతోషం కలుగుతుంది అని మిమ్ములని మీరు నమ్మించుతారు. ఎందుకంటే ఆలోచనలకి లింకులు పెట్టి దానిని ఒక చైనులా చేయటానికి మీరు అలవాటు పడ్డారు కాబట్టి మీరు అలా అనుకుంటారు. అందుకే మీకు తెలియకుండానే ఐస్క్రీం తింటే నాకు సంతోషం కలుగుతుంది అనే భావనని ఒప్పుకుంటారు.

మనకి బాధకలిగించే అనుభవం కూడా అంతే. పది సంవత్సరాల క్రితం మీరు అనుభవించిన బాధ, ఏడుసంవత్సరాల క్రితం అనుభవించిన బాధ, మూడు సంవత్సరాల క్రితం అనుభవించిన బాధ అన్నీ విడివిడిగా ఉండే ఆలోచనలు. ఒక దానికి ఇంకొకటి సంబంధం లేనివి. కానీ వీటినన్నిటినీ కలిపి వాటికి ఒక దానితో ఇంకొకదానికి లింకులు పెట్టి ఒక ఊహాజనితమయిన గొలుసుని ఏర్పరచుకొని, ‘నా జీవితమే బాధలు మయం' అని ఆలోచిస్తారు. అలాగే మీకు జీవితంలో ఆనందపడిన సంఘటనలు ఎక్కువగా ఉంటే, నా జీవితం ఆనందమయం, అనుకుంటారు. అయితే ఇది కూడా నిజం కాదు. మీ జీవితం సంతోషం కాదు. వృధా భరితం కాదు. ఎందుకంటే విడివిడిగా ఉన్న ఆలోచనలని ఒక దానిలా కలపటమే తప్పు కాబట్టి ఇవి రెండు కూడా తప్పే. ఆలోచనలని కలపటం అనే భావన తప్పు. మనం మనకి గుర్తున్న ఆలోచనలని మాత్రమే ఒక దానికి మరొకటి కలిపి ఒక చైనుని తయారు చేస్తాము. ఇది ఎలా ఉంటుందంటే పూల గుత్తులనుంచి ఒక్కొక్క పూవుని తుంపి ఒక పూలదండని చేసినట్టుగా కొన్ని లక్షల ఆలోచనలనుంచి కేవలం కొన్ని ఆలోచనలని మాత్రం దండలా తయారు చేసి అదే జీవితం అనుకుంటాము. ఇలా దండలు చేసి జీవితానికి అన్వయించుకోవటమే అసలయిన పాపం. ఎప్పుడయితే ఆలోచనలకి లింకులు ఏర్పరచి దండలు తయారు చేస్తామో మనం బాధ పడతాము.

మీరు సంతోషం అనే గొలుసుని తయారుచేస్తే ఆ గొలుసు ఇంకా పొడిగించాలి అని అనుకుంటారు. ఎందుకంటే ఆ సంతోషాన్ని పొందాలి అనుకుంటారు. అదేవిధంగా బాధలతో దండను తయారుచేస్తే దానిని మీరు తెంపాలని చూస్తారు. ఎందుకంటే బాధలు పడటం మీకు ఇష్టం ఉండదు. మీరు అటువంటి దండలని పొడిగించలేరు. అదేవిధంగా దానిని తెంపలేరు. ఎందుకంటే నిజానికి అటువంటి దండ అనేది లేదు కాబట్టి, గొలుసు అనేది ఒక ఊహ. దానిని సృష్టించడం కూడా కేవలం మరొక ఊహ మాత్రమే.

మీ అనుభవాలన్ని ఒక దానితో మరొకటి ఎటువంటి సంబంధం లేని స్వతంత్రమయిన అనుభవాలే. ఎప్పుడయితే మీరు ఈ అనుభవాలని ఒకదానితో ఒకటి కలిపుతారో మీకుమీరు నరకాన్ని సృష్టించుకున్న వారవుతారు. మీకు మీరు బాధలని సృష్టించుకుంటారు. బాధపడటం కూడా ఒక నరకమే అని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదంతాకూడా ఒక ఊహ మీద ఆధారపడినదే. ఇది అలా కనిపిస్తుంది, అంతే. ఆ దండ అసత్యం. దానికి ఎటువంటి ఉనికి లేదు. కాబట్టి ఆ దండ సృష్టించిన వ్యధ కూడా అసత్యమే. ఎప్పుడయితే మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటారో అప్పుడు మీరు స్వేచ్ఛని పొంద గలుగుతారు.

మన ఆలోచనలు చాలా బలమయినవి. అందుకే అవి మరొక ఆలోచనతో బంధం ఏర్పరచుకొని, ఒక ఊహాజనకమైన గొలుసులా తయారవుతాయి. ఈ విధంగా అసత్యమైనవి సృష్టించటం అహం చేసే ముఖ్యమయిన పని. అహంకారం ఆలోచనలు వేరువేరు కాదు. ఆలోనలు లేదా అహం యొక్క లక్షణం ఇటువంటి దండలని లేదా చైనులని తయారు చేయటమే. కాబట్టి నిజానికి అహం అనేది లేదు. ఎందుకంటే అది తయారుచేసిన దండ ఒక ఊహ కాబట్టి. దండ ఒక ఊహ. అహం అనేది ఒక దండని తయారుచేసే ఒక క్రమానికి మనం ఇచ్చిన పేరు. ఒక విధమైన పొడిగింపుని ఇవ్వటం ఈ గొలుసు లక్షణం. అదే ఒక ఊహాజనితమయిన అహంకారం.

ఇప్పుడు ఇక్కడ మన ఆలోచనలు ఒక దానితో ఒకటి బంధం ఏర్పరచు కుంటాయి. మనం మనకి అహం అనేది ఉన్నది అని అనుకుంటాము. కానీ మన ఆలోచనలన్నీ స్వతంత్రమయినవి కాబట్టి అహం అనేది కేవలం ఒక ఊహ మాత్రమే. కాబట్టి సహజసిద్ధంగా మనం స్వతంత్రులం. బంధాలు లేని వారం. మనందరం జ్ఞానోదయం అయినవారమే. కాకపోతే ఆవిషయాన్ని మనం తెలుసుకోగలగాలి.

ఒక సారి ఒక బౌద్ధగురువు దగ్గరకి ఒక శిష్యుడు వచ్చి ఆయనని, ‘ గురుదేవా! నేను ఏవిధంగా బుద్ధాని కాగలను' అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు శిష్యుడికి ఒక గట్టి చెంపదెబ్బ ఇస్తారు. అలా కొట్టి, ‘నీవు బుద్ధావే’ అని చెబుతారు. బుద్ధుడు వచ్చి నేను ఎలా బుద్ధిడిగా కాగలను అంటే ఎలా ఉంటుంది? మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆ బౌద్ధగురువు కూడా అదేవిధంగా స్పందించాడు. కాబట్టి మనందరం, సహజంగా స్వేచ్ఛగల వారమే. కాకపోతే ఆ విషయం మనకి తెలియదు. దానిని మీరు అర్థం చేసుకోవాలి.

ఒక వ్యక్తి అతని గమ్యం ఆధారంగా సంతోషాన్ని కాని, దుఃఖాన్ని గాని, అనుభూతిని పొందుతాడు. మీకు ఆ ఎంపిక లేదు. మీరు సంతోషాన్ని కాని, దుఃఖాన్ని కానీ ఎంచుకోలేరు. అంటే అవి జీవితాలలో ఉంటాయి, జరుగుతాయి. అయితే ఈ అనుభవాలని ఒక దానితో ఒకటి కలిపి ఒక చైనుని తయారు చేయాలా, వద్దా అనేది పూర్తిగా మీ నిర్ణయం, మీ ఎంపిక. మీరు ఒక వ్యక్తికి కానీ లేదా ఒక వస్తువుకి కాని దగ్గర అవ్వటం, వారితో లేదా వాటితో అనుబంధం పెంచుకోవటం అన్నీ కూడా మీరు అనుభవాలని ఒక దండలా చేయటం వలన జరుగుతుంది. ఒక సంబంధ బాంధవ్యంలోని మీ ఐదు సంవత్సరం క్రితం అనుభవం, నిన్నటిది, వాటికి అవే వేరువేరు అనుభవాలు. మీరు ఎప్పుడయితే ఈ అనుభవాలని ఒక దానితో ఒక దానికి బంధాన్ని ఒక దండలా చేస్తారో అప్పుడు మీరు దానిని పొడిగించాలని కానీ లేదా దానిని తెంచాలని కాని ప్రయత్నించుతారు. పాత అనుభవం మీకు సంతోషాన్ని ఇస్తే భవిష్యత్లో కూడా మీరు ఆ అనుబంధంలో సంతోషం ఉన్నది అని అనుకుంటారు. ఆ విధంగా కాకుండా ఆ సంబంధం మంచిది కాదు అని అనుకుంటారు. అయితే ప్రతి ఒక్క అనుభవం కొత్తది అనే విషయం మాత్రం మీకు తెలియదు. ఎందుకంటే ఇద్దరువ్యక్తులు కలసిన ప్రతిసారి కొత్తవ్యక్తులే. దీనికి కారణం మనం సహజసిద్ధంగా స్వేచ్ఛాజీవులం.

మన నిజమయిన సమస్య బాధలవలన లేదా సంతోషం వలన వచ్చినది కాదు. మన సమస్య ఈ విషయాలని మనం తప్పుగా అర్థం చేసుకోవటం దానితోపాటుగా ఊహాజనితమయిన అనుభవాల దండలని తయారు చేయటం. యోగీశ్వరుల విషయంలో ఇది ఎలా ఉంటుందంటే - వాళ్ళు సంతోషం కలిగినప్పుడు సంతోషపడతారు, దానిని మర్చిపోతారు. బాధలు కలిగినప్పుడు బాధపడతారు, దానిని వదిలివేస్తారు. అంటే వారు బాధలని, సంతోషాలని కాలంతోపాటు మోస్తూ ఉండరు. ఎప్పుడయితే మనం అనుభవాలని మోస్తుంటామో, అలా ఎంతకాలం మోస్తుంటామో అంతకాలం మనం బాధలు పడతాము.

ఈ ప్రపంచంలో జీవిస్తూ అన్నిరకాల అనుభవాలని పొందుతూ, మనం ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండగలం. బయట ప్రపంచానికి సంబంధించి మనం దేనిని వదిలివేయPopoverనవసరం లేదు (సన్యసించ నవసరం లేదు). తక్కువ స్థాయిలో ఉండే నాది అనేదానిని వదిలి వేయాలి. ఒక్కసారి మనం అనుభవాల గొలుసులని సృష్టించటం మానివేయగానే మనం దేనినైతే పట్టుకుని వేలాడుతున్నామో అదే మన దుఃఖానికి కారణం అని తెలుసుకోగలుగుతాము. ఎప్పుడయితే నేను అనే ముద్రని మీరు వదిలివేస్తారో, మీరు పరమానందంలోనికి ప్రవేశించుతారు. అప్పుడు బయట జరిగే విషయాలు మీ నిశ్చలతని బంగపరచవు. మీరు ప్రతి సంఘటనని ఒక దానికొకటి కలిపే పద్ధతిని మానివేయండి. అప్పుడు ప్రతి సంఘటన ఒక కొత్త అనుభవం అని తెలుసుకుంటారు. అప్పుడు జీవితాన్ని మరింత అందంగా చూడగలుగుతారు. అప్పుడు ప్రతిదీ ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. మీరు దేనినైనా యధాలాపంగా తీసుకోవటం మానేస్తారు.

ఒకసారి జీవితాన్ని ఏ క్షణంలో జరిగిన దానిని ఆ క్షణంలోనే తీసుకోవటం ప్రారంభించుతారో, మీలో పరమానందం సహజంగా కలుగుతుంది. బయట ప్రపంచంలో జరిగే సంఘటనలు ఏవి అయినా మీరు కావాలి అని అనుమతిస్తేనే మీమీద ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు నిశ్శబ్దంగా అనుమతిని ఇచ్చినప్పుడే ఎవరైనా మీ నిశ్చలతని పాడు చేయగలుగుతారు. కొందరు ఏమని పిర్యాధు చేస్తారంటే, మేము ప్రశాంతంగా, ఆ క్షణంలోనే జీవించేవిధంగా ఉంటాము. కానీ మాచుట్టు ప్రక్కలవారు అది అధనుగా తీసుకొని మమ్ములని బాధించుతారు అని అంటారు. స్పష్టంగా అర్ధం చేసుకోండి, మీరు నిశ్శబ్దంగా అనుమతించకపోతే ఎవరూ మీకు బాధ కలిగించరు, ఎవరూ మీ ప్రశాంతతని భంగపరచలేరు. ఈ విషయాన్ని మీరు ఎప్పుడయితే అర్ధం చేసుకుంటారో, అప్పుడు పరమానందం సహజంగా మీలోనికి వస్తుంది.

ఆది శంకరాచార్యుల వారు నిర్వాణశతకంలో ఈ విధంగా చెబుతారు, ‘సదా మే సమత్వం నముక్తిర్ న బంధం, చిదానందరూప శివోహం శివోహం.’ నేను స్వచ్ఛమయిన చేతన స్థితిని. అదే శివశక్తి. బంధాలు, స్వేచ్ఛ అనేవి కేవలం మనస్సు కల్పించినవే. స్వేచ్ఛ అనేది బంధనాలు ఉన్నప్పుడే ఉంటుంది. ఎప్పుడైతే బంధాలు లేవో, స్వేచ్ఛ తన అర్ధాన్ని కోల్పోతుంది. ఈ విషయాన్ని ఆదిశంకరాచార్యులు ఇక్కడ చెబుతున్నారు.

మీరు అంతరంగంలోనికి వెళ్ళినా, బయట ప్రపంచంలోనికి వచ్చినా, మీరు ఎక్కడికి వెళ్ళటానికి ప్రయత్నించినా మీరు సత్యాన్ని పోగొట్టుకుంటారు. ప్రయాణించటం అనే కార్యక్రమమే మిమ్ములని సత్యం నుంచి వేరు చేస్తుంది. సత్యం ఇక్కడ ఇప్పుడు ఉన్నది. దానికోసం మీరు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు. ఎక్కడికీ ప్రయాణించనవసరం లేదు. మరలా ఈ వెళ్ళటం అనే విషయమే మరొక దండని తయారు చేస్తుంది. మనం ఏదో అభివృద్ధిని చూస్తాము. కాని నిజానికి అసలు అభివృద్ధి అని ఏదీ ఉండదు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి చెందుతూ ఎవరూ లేరు .ప్రతి వ్యక్తీ క్షణ క్షణం కొత్తగా ఉంటారు. ప్రతిక్షణం మరణించి కొత్తగా జీవిస్తారు. మరి అప్పుడు ఎవరు అభివృద్ధి సాధించుతారు. మీరు ఎప్పుడయితే ఈ బంధాలనుంచి స్వేచ్ఛ పొందుతారో అప్పుడు మీరు 360° లో విస్పోటకంలా వ్యాపించుతారు. అటువంటి సందర్భంలో మీరు అప్పుడు బాహ్యప్రపంచానికి చెందిన వారా లేదా ఆధ్యాత్మికలా అనే ప్రశ్న తల ఎత్తదు. అందుకే శంకరాచార్యులు తాను స్వేచ్ఛ కలిగిన వాడిని కాదు బంధాలలోని వాడిని కాదు అని చెబుతారు. ఈ రెండూ కూడా కేవలం విషయాలు. అంతే.

మన ఆత్మ అనేది ఎప్పటికీ అభివృద్ధి చెందదు. కొంతమంది సెల్ఫ్ డెవెలప్ మెంట్ అనే కార్యక్రమాలు చేస్తారు. ఏ సెల్ఫ్ లేదా ఏ ఆత్మని మీరు అభివృద్ధి చేయగలరు. అసలు అటువంటిది ఏమయినా ఉన్నదా? మీరు అంటేనే ఒక దానికి ఒకటి ఎటువంటి సంబంధం లేని ఆలోచనలు మాత్రమే. మీరు ఆత్మాభివృద్ధి (సెల్ఫ్ ఇంప్రూవ్ మెంట్) అంటే తిరిగి మీరు ఒక ఊహాజనితమయిన చైనుని తయారు చేయటమే. అది మీకు బాగుంది అనే భావనని ఇస్తుంది. అంతే. మీకు ఆత్మాభివృద్ధి జరిగింది అనే ఒక ఆలోచన ఉండవచ్చు. కాని అది కేవలం బాగుంది అనే ఒక భావన మాత్రమే. నిజం చెప్పాలి అంటే ఆత్మ అనే దానిని అభివృద్ధి చేయలేరు. కాకపోతే మీలో ఉండే ఊహాజనితమయిన మీరు కాని మిమ్ములని తొలగించవచ్చు. మీరు ఎంతకాలం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, ఆత్మాభివృద్ధి అంటారో అంతకాలం మీరు ఊహాదండని తయారు చేస్తున్నారని అర్థం.

మనస్సు అనేది ఉన్నంత వరకూ అసత్యమైన గుర్తింపుతో మిమ్ములని మీరు తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. శంకరాచార్య ఈ విధంగా చెబుతారు, ‘బ్రహ్మం సత్యం జగత్ మిధ్యా, జీవో బ్రహ్మైవ న అపరా: దీని అర్థం, బ్రహ్మం అంటే సత్యం. కాని ప్రపంచం అసత్యం. వ్యక్తిలోని ఆత్మకి బ్రహ్మంకి తేడా లేదు’ ఆయన మాటలకి అర్థం ఏమిటి అంటే, మనస్సు అనేది ఉన్నంత కాలం

ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు నిరంతరం భవిష్యత్, భూత కాలాల్లో తిరుగుతూ ఉంటాయి. వర్తమానం గురించి అసలు ఆలోచన అనేది ఉండదు. వర్తమానం అంటే ఈ క్షణంలో కేవలం చేతన స్థితి మాత్రమే ఉంటుంది. కాబట్టి మనలో ఆలోచనలు ఉన్నంతకాలం మనం ఊహల ద్వంద్వలని తయారు చేస్తుంటాము. ఈ ఆలోచనలన్నింటినీ ఒక ఊహజనితమయిన సంతోషం లేదా దుఃఖం అనే ద్వంద్వలుగా సృష్టింస్తుంటాము. ఎప్పుడయితే ఈ విధంగా ద్వంద్వలు తయారు చేస్తామో అప్పుడు మనం అసత్యంతోనే మనని చూసుకుంటాము. దీనికి కారణం అనవసరమయిన, అక్కడ లేని బంధాలు తయారు చేయటమే. ఈ విధమైన బంధాలు తయారు చేయటమే మన దుఃఖాలకి కారణం. దీనినే జీవం అంటాము. దీనితో ప్రపంచం ఒక మిధ్యలా కనిపిస్తుంది. ఎప్పుడయితే ఇలా బంధాలు ఏర్పరచటం మానేస్తామో, ఈ అసత్యపు గుర్తింపు మాయం అవుతుంది. బ్రహం అనే విశ్వచేతన స్థితి కనిపిస్తుంది.

మనకి రెండు రకాల గుర్తింపులు లేదా ముద్రలు (ఐడెంటిటీ) ఉంటాయి. ఒకటి మనం బయట ప్రపంచానికి చూపించేది. రెండవది మన అంతరంపు ప్రపంచానికి చూపించేది. మనం బయటప్రపంచానికి చూపించే దానిని అహంకారం అంటాము. మన అంతరంగానికి చూపించే దానిని మమకారం అంటాము. ఈ రెండు గుర్తింపులు నిరంతరం ఒక దానితో ఒకటి పోరాడుతూ ఉంటాయి. ఉదాహరణకి మనం బయటప్రపంచానికి ఇంత గొప్ప అంత గొప్ప అని చూపించుతాము. కానీ అంతరంగంలో మనలో ఉండే లోపాలు మనకు తెలుసు. ఈ రెండు గుర్తింపులకి మధ్య చాలాంతరం ఉంటుంది. మనం బయట ప్రపంచానికి చూపించే మన ఈ గుర్తింపు ఎప్పుడూ మనకంటే ఎక్కువగా ఉంటుంది. ప్రతి వ్యక్తి ఎదుటివారి ముందు తాను వారికంటే ఎంత గొప్పవాడో చూపిస్తూ ఉంటాడు. మనం మనకి చూపించేది మన స్థాయికంటే చాలా తక్కువగా ఉంటుంది. మీరు చాలా సార్లు గమనించే ఉంటారు. మనతో మనం ఎప్పుడూ తృప్తిని పొందము. అందుకే నిరంతరం మనని మనం అభివృద్ధి చేసుకుంటూ ఉంటాము. మనం ఆధ్యాత్మికంగా కాని లేద వస్తు ప్రపంచం విషయాలలో కానీ ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటాము. కాబట్టి మనం మనకి చూపించే మనంలో ఎప్పుడూ ఏదో లోటు ఉంటుంది. మనం బయట ప్రపంచానికి చూపించే గుర్తింపు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ రెండు గుర్తింపులకి మధ్య నిరంతరం పోరు జరుగుతూ ఉంటుంది.

అయితే ఈ రెండు గుర్తింపులూ అబద్ధపు గుర్తింపులు. ఇది మనం తయారుచేసిన ఆలోచనల బంధాల దండలే. ఈ గుర్తింపులని పట్టుకొని ఉన్నంతకాలం మనం ఈ సంసారం అనే దానిలో చిక్కుకొని ఉంటాము. ఎప్పుడయితే మనం ఈ రెండింటికీ అతీతంగా వెళతామో, అప్పుడు మనకి జ్ఞానోదయం అవుతుంది. నిరంతరం మనం ఆలోచనలని సృష్టిస్తూ, వాటిని పోషిస్తూ, వాటిని నాశనం చేస్తుంటాము. సృష్టి కార్యం (బ్రహ్మ) జీవితాన్ని ఇవ్వటం (విష్ణు) నాశనం చేయటం (శివుడు) అనేది నిరంతరం సాగుతూ ఉంటుంది. ఎప్పుడయితే మనం వీటికి అతీతంగా వెళతామో అప్పుడు మనం పరబ్రహ్మ స్థితికి చేరతాము.

నిత్యధ్యానంలోని ఈ దశలో, మీరు ఆలోచనలు అనేవి ఒకదానికొకటి సంబంధంలేని స్వతంత్రమయినవి అని అర్ధం చేసుకోవాలి. వాటికి ఎటువంటి సంబంధం ఉండదు. మీకు ఆలోచనలు వస్తే, వాటిని అణచవద్దు లేదా వాటికి స్పందించవద్దు. కేవలం వాటిని గమనించండి. అవి స్వతంత్రమయిన వేరువేరు విషయాలు అని అర్ధం చేసుకుంటూ వాటిని గమనించండి. ఇలా గమనించితే క్రమంగా మీలో చేతనస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మీరు ఈ రెండు గుర్తింపులకి అతీతంగా వెళ్ళగలరు. అప్పుడు మీరు బాధల గొలుసుకాదు, సంతోషాల గొలుసుకాదు అని అర్ధంచేసుకుంటారు. మీరు కేవలం వీటికి నేపథ్యం (బాక్గ్రౌండ్) అని మాత్రమే తెలుసుకుంటారు.

ఒక విషయాన్ని అర్ధం చేసుకోండి. మీకు తెలిసినా తెలియకపోయినా, మీకు అర్ధమయినా కాకపోయినా మీరు జ్ఞానోదయమయిన వారే. సహజ సిద్ధంగా మీరు స్వేచ్ఛ కలిగినవారు. మీకు బంధాలు తెలియవు. ఈ సత్యాన్ని మీతోనే ఉంచుకొని నిశ్శబ్దంగా తరువాత ఏడు నిముషాలు కూర్చోండి. బంధాలు లేని స్థితిని అనుభూతి చెందుతూ మీ ఉనికిలో, పరమానందస్థితిలో ఉండండి. ఇదే జ్ఞానోదయం పొందగలిగే అంతిమ పద్ధతి.

మీకు ఈ సత్యం బాగా నచ్చితే మీరు ధ్యానస్ఫురణ కార్యక్రమాన్ని చేయండి. అందులో ఈ విషయాలన్ని చాలా వివరంగా వివరిస్తాను.

ధ్యానస్ఫురణ రెండు రోజుల ధ్యాన కార్యక్రమం. ఈ కార్యక్రమం మనని మన ధ్యానస్థితితో సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ కార్యక్రమం మనని మన మనస్సు అనే బంధాల నుంచి స్వేచ్ఛని ఇస్తుంది. ఇది మన భావావేశాల నుంచి స్వేచ్ఛని ఇస్తుంది. దుఃఖము సంతోషం అనే మన మానసిక వ్యవస్థని విడగొడుతుంది. అది మన అంతరంగంలో ఒక ఖాళీ ప్రదేశాన్ని సృష్టిస్తుంది. అక్కడే ధ్యానం అనేది వికసిస్తుంది.

మంత్రాలని వినండి (సమయం 10 నిముషాలు)

నిత్యధ్యానంలోని చివరి దశ, మీరు నిశ్శబ్దంగా ఆనందంగా కూర్చొని ఇక్కడ పఠించే మంత్రాలని వినండి. సర్వాంతర్యామితో సంబంధాన్ని ఏర్పరచుకున్న అనుభూతితో ఉండండి. మీరు మీ అంతరాత్మ ద్వారా ఈ శక్తిగల మంత్రాల ప్రకంపనలని వినండి. ఇవ్వన్నీ సర్వాంతర్యామికి లేదా గురుదేవులకి మీరు కృతజ్ఞతని చూపించటమే. వారు మనకి ఇచ్చిన గొప్ప జ్ఞానానికి, ఏ జ్ఞానమైతే మనలని అజ్ఞానం నుంచి స్వేచ్ఛని ఇస్తుందో, ఏ జ్ఞానమయితే మనని నిత్యానంద స్థితికి తీసుకువెళుతుందో ఆ జ్ఞానాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలియచేద్దాము.

మీకు పూజ చేయటం ఇష్టమయితే మీరు గురుపూజ చేయవచ్చు. ఈ మంత్రాలన్ని గురుపూజకి సంబంధించినవే. ఇదంతా కూడా గురుదేవులకి లేదా సర్వాంతర్యామికి కృతజ్ఞతలు తెలియచేయటమే.

మీకు పూజలో ఆసక్తి లేకపోతే నిశ్శబ్దంగా కూర్చొని మంత్రాలని వినండి. అదికూడా చాలా మంచిది. మంత్రాలలోని ప్రకంపనలు మీ అంతరంగాన్ని స్వచ్ఛంగా చేయగలుగుతాయి. మిమ్ములని పరమానంద స్థితికి చేర్చుతాయి.

ఈ నిత్యధ్యానాన్ని ప్రతిరోజూ చేయండి. కనీసం రోజుకి ఒకసారి అయినా చేయండి. మీరు మీ ఉనికిలో ఒక కొత్తకోణాన్ని అనుభూతి చెందగలరు. ఈ ధ్యానం మిమ్ములని స్వచ్ఛమయిన చేతనస్థితిని, పరమానందాన్ని పొందే విధంగా సహాయం చేయగలుగుతుంది.

అందరూ నిత్యానంద స్థితిని పొందుదురు గాక. నిత్యానందం.

పరమహంస నిత్యానంద

మనిషి తన జీవిత లక్ష్యంగురించి పడే అంతులేని తపన ఈ వాఖ్యంతో ముగుస్తుంది. పరమానందమే మార్గం, లక్ష్యం. ఇదే పరమహంస నిత్యానంద యొక్క అనుభవము, ఆయన ముఖ్య బోధన. పరమహంస నిత్యానంద ఈ రోజు మన మధ్య ఉన్న జ్ఞానోదయమయిన గురుదేవులు, ఆధునిక యోగీశ్వరుడు.

పరమహంస నిత్యానంద

ఆయన ముఖ్యలక్ష్యం, పరమానందం అంతిమ లక్ష్యం కాదు అది మార్గం అనే విషయాన్ని ప్రయోగాత్మకంగా చెప్పటమే. అంటే 24 గంటలూ పరమానందంలో ఉండటమే. ఇదంతా ప్రతి ఒక్కరికీ సాధ్యమే అనే విషయం ఆయన మనకి అర్థమయ్యేలా చెబుతారు. అది మన అంతరంగంలో పనిచేయటం ద్వారా సాధ్యం చేయవచ్చు.

పరమహంస నిత్యానంద దక్షిణ భారతదేశంలోని ఆధ్యాత్మిక కేంద్రమయిన తిరువణ్ణామలైలో జన్మించారు. తీవ్రమయిన తపస్సు ద్వారా, యోగా తంత్ర మొదలయిన తూర్పుదేశాల ఆధ్యాత్మిక శాస్త్రాలలో తీవ్రమయిన సాధనని చేసి ఆయన పరమానందస్థితికి చేరారు. ఆయన తన అనుభవాలతో, టెక్నాలజీ ఆఫ్ బ్లిస్ని రూపొందించారు. దాని ద్వారా ప్రతి ఒక్కరిలోని చేతనస్థితిని తెలుసుకోగలిగి, ఆధ్యాత్మికంగా శక్తివంతమయిన వ్యక్తులుగా చేయవచ్చు అని నిరూపించారు.

ఆయన రూపొందించిన అద్భుతమయిన కార్యక్రమాలు మనం మన సహజస్థితి ఆయన ధ్యానస్థితిని పొందేవిధంగా చేస్తాయి. ఆయన ఈ విధంగా చెబుతారు. 'బయట వస్తువు ప్రపంచంలోని విజయాలకి, అంతరంగంలోని సంతృప్తిని సాధించగల కీలకమైన తాళం చెవి ధ్యానం.

నిత్యానంద ధ్యానపీఠం : పరమహంస నిత్యానంద యొక్క ప్రపంచ వ్యాప్తంగా జరిగే అంతరంగపు పరమానందం అనే కార్యక్రమమే నిత్యానంద ధ్యాన పీఠం. దీనిని 2003లో స్థాపించారు. ప్రస్తుతం 33 దేశాలలో 1300పైగా సెంటర్లతో తన కార్యక్రమాలు చేస్తున్నది. ఈ సంస్థ కింద ఇంటర్నేషనల్ వేదిక్ హిందూ యూనివర్సిటి, ఫ్లోరిడా, యు.ఎస్.ఎ. కూడా పని చేస్తుంది.

నిత్యానంద మెడిటేషన్ అకాడమీస్ : (ఎన్.ఎమ్.ఎ.) అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రయోగశాలలుగా పని చేస్తున్నాయి. అవి మనలో అంతరంగపు అభివృద్ధికి, బయట ప్రపంచంలో సహజాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. ఈ అకాడమీలు ధ్యానం నుంచి శాస్త్రం వరకూ సంబంధించి వివిధ కార్యక్రమాల ద్వారా మనం అన్నివిధాలుగా అభివృద్ధి చెందే విధంగా ఉన్నాయి. అవి మనలో పరిణామాత్మక ఆధ్యాత్మికతని పెంపొందించే విధంగా, వస్తు ప్రపంచాలు కలసి పరమానంద జీవితాన్ని సృష్టించే విధంగా పనిచేస్తున్నాయి.

వ్యక్తిలో సమూలమైన మార్పు తేగల నమ్మకమయిన జీవిత పరిష్కారాలని అందిస్తున్నారు. ఐ.వి.హెచ్.యు. ద్వారా ప్రపంచవ్యాప్తంగా రకరకాల ధ్యాన పద్ధతులని నేర్పిస్తున్నారు. నిత్య స్పిరిచ్యువల్ హీలింగ్ ద్వారా ఉచిత హీలింగ్, ఉచిత విద్య, ఉచిత మెడికల్ కాంప్లు, ఉచిత భోజనము, ఒక సంవత్సరం ఆధ్యాత్మిక శిక్షణ ఉచిత భోజన వసతితో ఇస్తున్నారు. ఇక్కడి గురుకుల వ్యవస్థలో చిన్న పిల్లలకి విద్యాబోధన జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సేవలన్నీ అందిస్తున్నారు.

నిత్య ధీర సేవసేన వారి ఆనందసేవకులు, వాలంటీర్లుగా తమ సేవలని, నిత్యం ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నారు. వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉన్నది.

నిత్యానంద ధ్యానపీఠం అందించే కార్యక్రమాలు :

నిత్యానంద ధ్యానపీఠం ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమందికి వారి శరీర మానసిక ఆధ్యాత్మికాభివృద్ధికి ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలని అందిస్తున్నారు.

ఆనందస్ఫురణ కార్యక్రమం. - శక్తివంతులు అవ్వండి.

ఈ కార్యక్రమంలో మీలోని ప్రధాన చక్రాలని శక్తివంతం చేస్తూ దాని ద్వారా మీరు నిశ్చలంగా విరామంగా ఉండగలరు. ఈ కార్యక్రమం మీ భావావేశాల గురించి మేధోపరమన జ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా ఇస్తుంది. ఈ కార్యక్రమం మీ భౌతిక స్థితిలో ఆధ్యాత్మిక ప్రభావాన్ని ఇవ్వగలిగే విధంగా రూపొందించారు. ఇది మీలోని పరమానందాన్ని అనుభవించగల నమ్మకమయిన జీవిత పరిష్కారం. ఇది చాలా శక్తివంతమయిన శిక్షణా కార్యక్రమం. దీనిని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చేసారు.

నిత్యానంద గ్రంథాలు 23 భాషలలో దొరుకుతాయి.

డివిడిలు, సిడిలు, ధ్యానం కిట్టులు మొదలమయినవి ఆనందగలేరియాలో దొరుకుతాయి.

Our Nithyananda Meditation Acadamies (NMA)

INDIA:

Nithyananda Dhyanapeetam

Nithyanandapuri

Kallugopahalli, Mysore Road, Bidadi

Bangalore - 562 109

Karnataka, INDIA

Phone: 91 +80 65591844 / 27202084

Fax: 91 +80 7288207

URL: www.nithyananda.org

Nithyananda Dhyanapeetam

Sri Ananda Rajarajeshwari Temple,

Nithyananda Giri

Pashambanda Sathamrai Village, Shamshabad Mandal

Rangareddy District

Andhra Pradesh - 501 218, INDIA

Ph.: +91 93470 65288

Nithyananda Dhyanapeetam
HYDERABAD CENTRE,
Ph : 93910 35463

Nithyananda Dhyanapeetam VISKHAPATNAM CENTRE Viskhapatnam District, Andhra Pradesh, INDIA

Nithyananda Dhyanapeetam ELURU CENTRE, West Godavari District, Andhra Pradesh - 534 003, INDIA Ph : 08812 - 250712, Cell : 94908 26692

Nithyananda Dhyanapeetam BHIMAVARAM CENTRE, West Godavari District, A ndhra Pradesh, INDIA Ph : 9912144429, 99498 33599

మనలోని భావావేశాలు, ఆలోచనలు
అనేవి మనకి ఒక మానసిక వ్యవస్థిని
తయారు చేస్తాయి. మన దృక్పథానికి
అవే కారణం. వీటికి అతీతంగా వెళ్లాలి
అంటే మీరు ఆలోచనలు, భావావేశాలు
ఆడే ఆటలని అర్ధం చేసుకోవాలి.
నిత్యధ్యానం అనేది 35 నిముషాల
ధ్యాన పద్ధతి. దీనిని పరమహంస
నిత్యానంద మనం స్వేచ్ఛ
పొందే విధంగాను, మనస్సుకు అతీతంగా
వెళ్లే విధంగా తయారుచేసారు.

Ebook ISBN: 979-8-88572-852-2

నిత్యానంద ధ్యానపీఠం

నిత్యానందపురి, కలిగొలహళ్ళి, మైసూర్ రోడ్డు, బిడది. బెంగుళూరు జిల్లా, కర్ణాటక - 562 109. ఫోన్ : +91 - 80 - 65591844, 27202084