స్వేచ్ఛ (Freedom)
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
(అత్యుత్తమ, అత్యున్నత, అత్యంత ప్రియమైన కోరిక)
ప్రతి మనిషి నిరంతరం కోరుకునేది స్వేచ్ఛని మాత్రమే. మనిషి ఒక్కడే కాదు ఈ భూమిమీద జన్మించిన ప్రతి
ప్రాణి తహతహలాడేది స్వేచ్ఛ కోసమే. మనిషి చేసే ప్రతి పనివెనుకా అతనికి తెలిసికాని, తెలియకకాని ప్రోత్సాహాన్నిచ్చే
బలమైన అంశం స్వేచ్ఛ అనే కోరిక.
ప్రపంచం మొత్తం ఏ సత్యం కోసమైతే తన ప్రాణాన్ని, తన శక్తిని ధారబోస్తుందో ఆ సత్యమే స్వేచ్ఛ. మనిషి
దేనినైతే స్వేచ్ఛ అనుకుంటాడో, దానివైపుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.
మనిషి అంతరంగంలోనికి కొంచం లోతుగా చూడగలిగితే అతని చేతనస్థితి నిరంతరం స్వేచ్ఛవైపుకి ప్రవహిస్తూ
ఉంటుందని తెలుస్తుంది.
ప్రపంచ దేశాల చరిత్రని, సంస్కృతులను లోతుగా గమనిస్తే మనకి ఒక విషయం అర్థమవుతుంది. వారు
దేనినైతే స్వేచ్ఛ, స్వాతంత్రం అని అనుకుంటారో దాని కోసం వారు తమ శక్తి యుక్తుల్ని ఉపయోగించారు. వారి
భావప్రకటనలు, అభిప్రాయాలు, ప్రవర్తనా నియమావళి అన్నీ దానికి అనుగుణంగా ఉంటాయి. ఆస్వేచ్ఛవైపు వారు
తమ శక్తిని పూర్తిగా ఉపయోగించారు అని మనకి అర్థమవుతుంది.
ఆస్వేచ్ఛ ఏదైనా సరే! అది ఐశ్వర్యం కోసమైనా సరే. ఎందుకు ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఐశ్వర్యాన్ని
మరింత సంపాదించాలని కోరుకుంటారు. ఎందుకు డబ్బు సంపాదన వెనుక అలా పరిగెడతారు? ఎందుకంటే
డబ్బు మనకి స్వేచ్ఛ అనుభవాన్నిస్తుంది. ఎలా అంటే, డబ్బు ఉంటే చాలా వాటినుంచి మనకి కావలసినవాటిని
ఎంచుకోవచ్చు, డబ్బు ఉన్నప్పుడే ఎంపిక సాధ్యమవుతుంది.
డబ్బుతో మనం ఎంచుకునేది సమస్యలనే. డబ్బులేకపోతే ఒకటే సమస్య. డబ్బు ఉంటే దానితో చాలా
సమస్యల్ని ఎంచుకుంటాము. అది సరే! డబ్బు ఉంటే మనకి స్వేచ్ఛ ఉంటుంది. డబ్బుకోసం తాపత్రయపడటం
అంటే స్వేచ్ఛ కోసం తపించటమే. అది ఒకరకంగా స్వేచ్ఛని కోరుకోవటమే.
మానవ చేతనస్థితి నిరంతరం స్వేచ్ఛవైపుగా విస్తరిస్తూ ఉంటుంది. ఎవరు దేనిని స్వేచ్ఛ అనుకుంటారో
వారు తమ శక్తిని దానిమీద కేంద్రీకరిస్తారు. వారంతా ఆస్వేచ్ఛ దిశగా తమప్రయాణాన్ని సాగిస్తారు. కొందరు
రాజకీయ స్వేచ్ఛ అంతిమ స్వేచ్ఛ అనుకొని దానికోసం పనిచేస్తారు. ఎవరైతే ఆర్థిక స్వేచ్ఛ అంతిమం అనుకుంటారో
వారు ఆ స్వేచ్ఛకోసం పాటుపడతారు. ఎవరైతే సామాజిక స్వేచ్ఛ ముఖ్యం అనుకుంటారో ఆదిశగా ప్రయాణిస్తారు.
ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంతిమం అనుకునేవారు, అందుకోసం పనిచేస్తారు. కాబట్టి ఎవరు ఏది స్వేచ్ఛ అని అనుకుంటారో
ఆ దిశగా తమప్రయాణాన్ని సాగిస్తారు. ఈవిధంగా కొన్ని సంస్కృతులు రాజకీయ స్వేచ్ఛ కోసం, కొన్ని సంస్కృతులు
ఆర్థిక స్వేచ్ఛ కోసం, కొన్ని సంస్కృతులు ఆధ్యాత్మిక స్వేచ్ఛకోసం పనిచేసాయి.
ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని చెబుతాను. ఈ ప్రపంచంలోని సంస్కృతుల్ని రెండు తరగతులుగా
విభజించవచ్చు. అవి బయట ప్రపంచానికి సంబంధించిన స్వేచ్ఛ అంతిమస్వేచ్ఛ అనుకొని దానికోసం పనిచేసేవి,
రెండవది అంతరంగపు స్వేచ్ఛ అంతిమస్వేచ్ఛ అనుకొని దానికోసం పనిచేసేవి. బయట ప్రపంచపు స్వేచ్ఛ అంతిమం
అనుకునేవారు రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వేచ్ఛకి ప్రాధాన్యానిస్తారు. అంతరంగపు స్వేచ్ఛ అంతిమం అనుకునే
సంస్కృతులు ఆధ్యాత్మిక అభివృద్ధికి పనిచేస్తాయి.
అసలు స్వేచ్ఛ కావాలి అనే భావనకి ఆధారం ఏమిటి? ఏ అనుభవం నుంచి అది బయటకి వస్తుంది?
సాధారణంగా ఎటువంటి స్వేచ్ఛ అంతిమస్వేచ్ఛ అని మనిషి ఎలా నిర్ణయిస్తాడు? అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి?
ఉపనిషత్తులలో ఒక చక్కని మాట ఉన్నది, 'ఏకోనాం బహుశ్యాం' ఒకరు అనేకరూపాలలో ఉంటూ సర్వాంతర్యామిలో
ఆనంద ఉత్సవాలు జరుపుకుంటారు. తానే అన్నిరూపాలలో ఉన్నదని, అందరిపైనా ప్రేమ, కరుణ కురిపిస్తూ
రెట్టింపు ఆనందాన్ని పొందుతారు.
ఈ సందర్భంగా ఉపనిషత్తులలో చెప్పిన ఒక సంఘటన మీకు చెబుతాను.
ఒక గురువుగారు శిష్యుడిని పిలచి అతనితో, 'నీవు, నీ ఐదు జ్ఞానేంద్రియాలతో ఆనందించగలవా?' అని
అడుగుతాడు.
శిష్యుడు, 'అవును గురుదేవా! నా ఐదు జ్ఞానేంద్రియాలతో ఆనందాన్ని పొందుతాను' అంటాడు.
అప్పుడు గురువుగారు, ఒకవేళ నీవు ఒక జ్ఞానేంద్రియాన్ని పొగొట్టుకుంటే, లేదా అది పనిచేయకపోతే, అంతే ఆనందాన్ని పొందగలవా? అని అడుగుతాడు.
అప్పుడు శిష్యుడు, లేదు గురుదేవా! నా ఆనందంలో ఇరవైశాతం తగ్గిపోతుంది. అదే విధంగా రెండు జ్ఞానేంద్రియాలు పనిచేయకపోతే నలభై శాతం ఆనందం తగ్గిపోతుంది అని జవాబు ఇస్తాడు.
ఆ గురువుగారు శిష్యుడిని, 'ఒక వేళ నీకు మరొక ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటే ఎలా ఉంటుంది?' అని అడుగుతాడు. గురువుగారి ప్రశ్నకు శిష్యుడు, ' నా ఆనందం రెట్టింపు అవుతుంది అని జవాబు ఇస్తాడు. అదేవిధంగా నేను ఐదు శరీరాలతో ఉండగలితే ఆ ఆనందం ఐదింతలు పెరుగుతుంది అని అంటాడు.
ఒక్క నిముషం ఆలోచించండి. మీరు ఈ ప్రపంచంలో అన్ని శరీరాలతో ఉండగలిగితే మీ ఆనంద స్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఆ ఆనందం ఎన్ని కోట్ల రెట్లు పెరుగుతుందో తెలుసుకోండి. ఆ ఆనందాన్ని కొలవలేము. అది నిత్యమైనది, శాశ్వతమైనది. అది అనంతమై ఆనంద పారవశ్యపు స్థితి. జ్ఞానోదయమైన యోగులు ఉండేది ఆ స్థితిలోనే. అందుకే వారు నిరంతరం ఆనంద పారవశ్యంలో ఉంటారు. వారు ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తిలో తాము ఉన్నట్టు తెలుసుకుంటారు. ఆ ఆనందస్థితి అత్యుత్తమమైన ఆనంద పారవశ్యపు స్థితి. అది ఒక అద్భుతమైన దివ్య అనుభూతి. అదే నిజమైన స్వేచ్ఛ. దానినే సంపూర్ణమైన, అంతిమ స్వేచ్ఛ లేదా విముక్తి అనవచ్చు.
ఎప్పుడైతే ఒక వ్యక్తి తనని తాను అందరిలో చూడగలడో ఆ వ్యక్తి సర్వాంతర్యామిలో ఒకటిగా అయిపోగలడు. అదే పూర్ణత్వం, ఏకత్వం. ఆస్థితిలో ఉన్న వ్యక్తి పూర్తి స్వేచ్ఛతో ఉండగలడు. అతనిలో ఉండే ఒకే ఒక భావం కరుణ.
ఎప్పుడైతే నేను వేరు ఎదుటివారు వేరు అనే 'ద్వి' భావన వస్తుందో ఆ వ్యక్తిలో భయం ఉంటుంది. అటువంటి వ్యక్తి ఎదుటి వారు ఉంటే తనకి స్వేచ్ఛ లేదనుకుంటాడు. అందుకే ఎదుటివారిని శత్రువుగా చూస్తాడు. అంతా ఏకత్వం, సంపూర్ణత్వం అనుకునే వ్యక్తి తాను అనంతమైన ఆనందపారవశ్యాన్ని తానుగా తనలో పొందగలడు. అతనికి కరుణతప్పమరొక భావం ఉండదు.
అసలు సర్వాంతర్యామికి ఉండే ఒకే ఒక న్యాయసూత్రం కరుణ. అదే భగవంతుని న్యాయసూత్రం. మిగిలినవన్నీ మనుషులు సృష్టించిన న్యాయసూత్రాలు. అసలు ఈ సర్వసృష్టి కరుణ అనే అంశం ఆధారంగానే సృష్టించబడినది. విశ్వసృష్టికి కరుణ అనే అంశం కీలకమైనది. ఏ వ్యక్తి అయితే అందరిలో ఉన్నది నేనే అనుకుటాడో, అంతా కలసిమెలసి ఉండాలి అని ఆశిస్తాడు. ఆస్థితికి ఆధారం కరుణ. ఏ సంస్కృతి అయితే అంతా ఒక్కటే అని నమ్మారో ఆ సంస్కృతి కరుణ ఆధారంగా అభివృద్ధి చెందినది.
ఎప్పుడైతే నేను వేరు అనుకుంటారో భయం వారికి ఆధారమవుతుంది. ఆయాసంస్కృతులు భయం అనే ఆధారంమీద నిర్మించబడతాయి. వారికి స్వేచ్ఛ అనగానే శత్రువులు లేనప్పుడే స్వేచ్ఛ అనుకుంటారు. ఎదుటివారినుంచి పొందేదే స్వేచ్ఛ అని అనుకుంటారు. ఇటువంటి సంస్కృతులు రాజకీయ స్వేచ్ఛ లేదా ఆర్థిక స్వేచ్ఛ మీద తమ శక్తిని కేంద్రీకరించాయి. అందుకే ఆయాసంస్కృతులు యుద్ధవీరుల్ని హీరోలుగా ఆరాధిస్తారు. ఆ సంస్కృతులలో హింసకి ప్రాధాన్యత ఉంటుంది. వారు పోరాటం ద్వారా స్వేచ్ఛని పొందుతాము అనుకుంటారు.
కరుణ ఆధారంగా అభివృద్ధి చెందిన సంస్కృతులు అంతరంగపు స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ పైన తమ శక్తిని కేంద్రీకరించాయి. ఆ సంస్కృతులలో జ్ఞానోదయమైన యోగీశ్వరులు హీరోలు. వారినే ఆ సంస్కృతులు ఆరాధిస్తాయి. ఉదాహరణకి మన సంస్కృతి. ఇక్కడ రాజకీయ స్వేచ్ఛకోసం కూడా ఒక మహాయోగి అయిన మహాత్ముని మీద ఆధారపడ్డారు. ఆయనే మహాత్మగాంధి. ఆయన పూర్తిగా అహింసా భావనలో స్థిరపడిన యోగి, మహాత్ముడు.
నేను నా అనుభవంతో చెబుతున్నాను, నిజమైన స్వేచ్ఛ ని మీరు ఉన్న స్థలం నుంచి భౌతిక స్థితి నుంచి పొందలేరు. అది మీ అంతరంగపు స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మీ అంతరంగం కరుణ లేదా అహింస భావంలో స్థిరపడితే మీరు పొందేది అత్యుత్తమ స్వేచ్ఛ యొక్క అనుభవమే. ఆ భావం, ఆ స్వేచ్ఛ స్థితి మిమ్ముల్ని ఏ సమస్యనుంచైనా రక్షించగలుగుతుంది. నేను మీకు మరలా చెబుతున్నాను, ఎంత కఠినమైన సమస్యనుంచి బయటికి రావాలన్నా, ఎంత క్లిష్ట పరిస్థితిలోనైనా మీకు పరిష్కారాన్ని ఇవ్వగలిగేది అహింస, కరుణ మాత్రమే. అవి రెండూ మీ అంతరంగంలో స్థిరపడనప్పుడు, మీరు నిజమైన స్వేచ్ఛ అనుభవించలేరు.
కాబట్టి స్వేచ్ఛ అనేది మీ అంతరంగానికి సంబంధించిన విషయమే కాని, దానికి బయట ఉన్న భౌతిక ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేదు.
మీరు స్థిరపడిన అంతరంగపు స్థితి లోతైన ఆనంద పారవశ్యంతో, కరుణతో నిండి ఉన్నప్పుడు మీలోపలికి
వచ్చే సమాచారాన్ని స్నేహభావంతో, ఆనందంతో తీసుకోగలరు. ఆ సమాచారాన్ని అదే ఆనంద భావంతో విశ్లేషించి నిర్ణయాలు చేయగలరు. మీరు ఎప్పుడైతే అటువంటి స్థితిలో స్థిరపడతారో మీరు నిజమైన, అసలైన స్వేచ్ఛతో ఉంటారు. ఆ స్వేచ్ఛలో స్థిరపడగలుగుతారు. అదే అత్యుత్తమమైన అంతిమ స్వేచ్ఛ. దానిని మీ నుంచి ఎవరూ తీసివేయలేరు. అది మీలో ప్రకాశించే అందమైన సౌమ్యత అవుతుంది. అది మీ నుంచి వెల్లడి అయ్యే ఒక భావ వీచిక అని చెప్పవచ్చు. మరే పదం వాడినా అది చిన్నది అవుతుంది.
మీరు ఏస్థితి నుంచి నిర్ణయాలు చేసినా, ఆ నిర్ణయాలకి కరుణ అనే భావాన్ని అమరిస్తే అది స్వేచ్ఛకి దారితీస్తుంది. విశ్వశక్తి సృష్టిని చేసేటప్పుడు ఉపయోగించిన కందెన (గ్రీజు) కరుణ మాత్రమే. ఎప్పుడైతే నేను అందరిలో ఉన్నాను అని అనుకుంటారో వారు నాకునేను ఆనంద ఉత్సవాలు జరుపుకుంటాను అని అనుకోగలుగుతారు. తనకు తాను సృష్టించుకున్న న్యాయసూత్రం ‘కలసి జీవించుదాము’ అనేదే. అంతా కలసి ఉందాము అనే సూత్రం వారిదే.
స్వేచ్ఛ అనగానే మన స్ఫురణకి వచ్చేది రెండు విషయాలు. ఈ విషయాలని అర్థం చేసుకుంటే అంతిమ స్వేచ్ఛని పొందగలుగుతారు. అవి దేని నుంచి స్వేచ్ఛని పొందాలి అనుకుంటున్నారు, దేనికోసం మీరు స్వేచ్ఛని ఆశిస్తున్నారు, అనే రెండు ముఖ్యమైన అంశాలు.
దేని నుంచైనా స్వేచ్ఛ పొందాలి అనుకోవటం స్వేచ్ఛలోని వ్యతిరేక భావం. దేనికోసం స్వేచ్ఛని పొందాలి అనుకుంటారో అది స్వేచ్ఛయొక్క అనుకూల భావం. అయితే దేని నుంచి, దేనికోసం స్వేచ్ఛ అనే ఈ రెండింటినుంచీ స్వేచ్ఛని పొందగలిగితే అదే నిజమైన అంతిమస్వేచ్ఛ. ఒక్క విషయం అర్థం చేసుకోండి, దేనినుంచైనా స్వేచ్ఛ పొందాలి అని అనుకోవటం అంటే ఏవో బంధాలనుంచి స్వేచ్ఛని పొందటం, అది జైలునుంచి గాని, నిబంధనలు నుంచి కాని, పేదరికం నుంచి కాని లేదా ఏదైనా చేతకాని విషయం నుంచి కాని. ఇవన్నీ కూడా స్వేచ్ఛని ఒకదాని నుంచి పొందాలి అనుకోవటమే. అదే స్వేచ్ఛలోని వ్యతిరేక భాగం.
దయచేసి ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి, స్వేచ్ఛ యొక్క వ్యతిరేక భాగంనుంచి మీరు సంపూర్ణమైన సంతృప్తిని పొందలేరు. స్వేచ్ఛనుంచి తృప్తిని పొందాలి అంటే అందులో అనుకూల భాగం కూడా ఉండాలి. అదే స్వేచ్ఛ ఎందుకు అనే అంశం. స్వేచ్ఛ దేనికోసం.. స్వేచ్ఛ దేనికోసం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే దాని నుంచి స్వేచ్ఛని పొందినా అది మీకు సంతృప్తిని ఇవ్వదు. మీరు అటువంటి స్వేచ్ఛని అంటే దేనికోసం స్వేచ్ఛని పొందారో అర్థం చేసుకోలేనప్పుడు, ఆ స్వేచ్ఛని యధాలాపంగా తీసుకుంటారు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు జైలునుంచి స్వేచ్ఛని పొంది బయటకి వచ్చారనుకోండి. ఎందుకు అన్న ప్రశ్నకి జవాబు లేనప్పుడు, బయటకి వచ్చిన తరువాత నాలుగురోజులు ఉత్సాహంగా ఉంటారు. తరువాత మీరు దేనినుంచి స్వేచ్ఛని పొందారో మరచిపోతారు. ఆ తరువాత మిగిలేది శూన్యం. చూడండి! మీరందరూ స్వేచ్ఛని ఉత్సవంలా చేసుకుంటున్నారా? లేదు! మీ స్వేచ్ఛని యధాలాపంగా తీసుకుంటున్నారు. మీకు స్వేచ్ఛ ఎందుకో తెలియనప్పుడు స్వేచ్ఛని చాలా మామూలుగా తీసుకుంటారు, దేనినుంచి స్వేచ్ఛని పొందారో మరచిపోతారు. ఎందుకు స్వేచ్ఛ కావాలి అని అనుకుంటున్నారో, దానిని తెలుసుకున్నప్పుడు మీరు సంపూర్ణమైన తృప్తిని పొందుతారు. అందుకే దేనినుంచి స్వేచ్ఛని పొందారో అది వ్యతిరేక భాగం అయితే, దేనికోసం స్వేచ్ఛని పొందాలను కుంటున్నారో అది అనుకూల భావం అవుతుంది.
మీకు ఇంకొంచం వివరంగా చెబుతాను. కొంచం లోతుగా ఈ విషయం గురించి చూద్దాము. మీరు దేని నుంచి, దేనికోసం స్వేచ్ఛని పొందాలని అనుకుంటున్నారో ఆ రెండింటి నుంచీ స్వేచ్ఛని పొందటమే అంతిమ స్వేచ్ఛ. స్వేచ్ఛ దేనికోసం అని మీరు అనుకుంటారో, అది ఏదైనా సాధించటానికా లేదా ఏదో ఒక పని చేయటానికా లేదా ఈ బంధాలనుంచి బయటపడితే నేను పలానా పని చేసేవాడిని అని అనుకోవటం కోసమా? దేనికోసం? ఎందుకు అనే ఆ విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే, దేనినుంచి స్వేచ్ఛ పొందాలి అనుకుంటున్నారో అది మీ జీవితానికి ఒక అర్థాన్నిస్తుంది. నేను మీకు అంతిమ సత్యాన్ని చెబుతాను, దేని నుంచి, దేని కోసం అనే వాటినుంచి మీరు స్వేచ్ఛని పొందగలిగితే అప్పుడు మీరు అంతిమ స్వేచ్ఛని అనుభవించగలరు. ఏ చేతనస్థితిలోనైతే కరుణ స్థిరపడి ఉంటుందో ఆ స్థితినుంచి మీరు నిర్ణయాలు చేసినప్పుడు, అకస్మాత్‌గా మీరు అంతిమమైన, అత్యుత్తమైన, మీనుంచి ఎవరూ వేరుచేయలేని స్వేచ్ఛని అనుభవిస్తారు. దానినే నేను జ్ఞానోదయస్థితి అంటాను.
దయచేసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి నా జీవితంలో తి క్లిష్టమైన సమస్యని నకేను ఎదుర్కొని ఆ మూడు నెలల సమయంలో, నాలో ఒక భాగం దేని చేతా ప్రభావితం కాలేదు. ఏ విషయం దానిని ఆటలేదు. చక్కటి ప్రశాంతస్థితిలో విరామంగా నిశ్చలంగా ఉన్నది నాలో ఆ భాగం. నేను నిజాయితీగా మీకు చెబుతున్నాను. నా హృదయాంతరాలలోంచి చెబుతున్నాను నా అంతరంగపు ఉనికినుంచి మీకు చెబుతున్నాను. నేను కనీసం ఒక్కసారికూడా ఇదంతా ఎందుకు జరిగింది అని అనుకోలేదు. కనీసం ఒక్కసారికూడా నేను బాధ పడలేదు. నేను ఏ విధమైన వ్యధకి లోనుకాలేదు. అగౌరవాన్ని కాని నిందలు కాని నన్ను అంటలేదు. అన్ని మూలలనుంచి నన్ను ఎంతో అగౌరపరిచారు, నిందించారు. చాలాచాలా జరిగాయి. ఎంత జరిగినా కాని నా అంతరంగంలో ఉనికి స్థిరంగా ఉన్నది. దేనినైతే నా నుంచి తీసివేయలేరో అది అక్కడ స్థిరంగా ఉన్నది.
మరొక విషయం అర్థం చేసుకోండి, జైలులో ఉన్నప్పుడు కరుణ, జ్ఞానోదయం అనేవి గొప్ప ఆడంబరాలు కాదు, అవి అవసరాలు, ఉపయోగాలు. అవి ప్రాథమిక ఉపయోగాలు. అవి లేకుండా ఉండటం కష్టం. జ్ఞానోదయం ఒక గర్వించదగిన విషయం అని మీరు అనుకోవద్దు. అలా అనుకోగలిగినప్పుడే మీరు విరామంగా ఉండగలరు. నేను చెబుతున్నాను, త్వరగా జ్ఞానోదయాన్ని పొందండి అది నిజంగా మీకు ఉపయోగపడుతుంది.
మీరు ద్వేషం, పగ నుంచి స్వేచ్ఛని పొందకపోతే విరామంగా ఉండలేరు. నాకు ఏ సమస్య లేదు పూర్తి విరామంగా నిశ్చలంగా ఉండగలిగాను. నన్ను అగౌరవరుస్తున్నారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు.
అంతేకాదు నా పేరుకి రకరకాల మాటలు తగిలించి పేపర్లలో రాసేవారు. చాలా అగౌరవంగా ఉండేవి. నేను ఎప్పుడూ పేరుతో రూపంతో ఎటువంటి బంధాన్ని ఏర్పరచుకోలేదు. నిత్యానంద అనే పేరుకి ఈ రూపానికి అతీతంగా ఉండేవాడిని. అందుకే ఆ అగౌరవం నన్ను అంటలేదు.
నిత్యానంద అన్న పేరు ఎంత సందడిని సృష్టించినదంటే, ఎవరో ఒకరు నాకు ఒక రిపోర్టు చూపించారు. ఇంటర్నెట్ చరిత్రలో రెండుసార్లు ఇంటర్నెట్ జామ్ అయిందట ఒకసారి మైకెల్ జాక్సన్ చనిపోయినప్పుడు, రెండవది నిత్యానందా స్కాండల్. ఇంటర్నెట్‌ని జామ్ చేయటానికి మైకెల్ జాక్సన్ పాటలు పాడాడు, డాన్స్వేసాడు, గెంతాడు. చివరికి ఆయన చనిపోయినప్పుడు ఇంటర్నెట్ జాoఅయింది. కాని నేను ఏమీ చేయలేదు. ఎవరో ఏదో చేసారు ట్రాఫిక్ జాo అయింది. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. ఆ వ్యాసంలో మరో విశేషం కూడా ఉన్నది. గూగుల్‌లో అత్యంత ఎక్కువగా వెతికిన పేరు నిత్యానంద అని. ఏమైతే అయింది, నేను ఎప్పుడూ ఆ పేరుతో బంధాన్ని పెంచుకోలేదు. నేను ఎప్పుడూ ఏ పేరుతో అనుబంధాన్ని పెంచుకోలేదు. అందుకే పేరు ముందు ఎన్ని రకాలు వ్రాసినా అవి నన్ను ప్రభావితం చేయలేదు. నాకూ బాధకలగలేదు. ఏ సమస్యని కలిగించలేదు. నన్ను ఆ విధంగా కాపాడిన ఆ స్థితి నాతోనే ఉన్నది. అది ఏ పరిస్థితులలోకూడా నన్ను వదలి వెళ్ళలేదు.
ఇంత పెద్ద సమస్యలో నన్ను కాపాడింది పూర్తిగా కరుణ, అహింసలలో స్థిరపడిన నా అంతరంగపు స్థితి మాత్రమే. ఆ విధంగా లేకపోతే కనీసం నిద్రపోవటం కూడా సాధ్యమయ్యేది కాదు. మీరు కరుణలో స్థిరపడకపోతే మీరు అసలు విరామంగా ఉండలేరు. నిద్రపోవటం కూడా కష్టమవుతుంది. కారణం లేకుండా నామీద అనేక నిందలు అన్ని చోట్లా ప్రచారం చేసారు. ఏకారణం లేకుండా కక్షచూపించారు ఏకారణం లేకుండా విషం వెళ్ళగక్కారు. ఇదంతా ఎందుకు అంటే కారణ లేదు.
నేను మీకు చెబుతున్నాను, నా అంతరంగం లోపల ఎక్కడా ఎవరిమీద పగ సాధించాలి అన్న ఆలోచనే లేదు. ఆ కారణం వలననే నేను మామూలుగా విరామంగా ఉండగలిగాను. తటాత స్థితిలో ప్రశాంతంగా, పూర్తి విరామంలో నాకునేను సౌకర్యంగా ఉన్నాను. కనీసం నా లోపల ఒక్కసారికూడా ఎవరిమీద కోపం కాని, కక్షకాని కలగలేదు. ఎవరిమీదైనా ఏదైనా పగసాధించాలి అనే రహస్య ఆలోచనలు, ప్లాన్లు లేవు. అలా ఒక్కసారి కూడా అనిపించలేదు. అందుకే నేను నాతో చాలా సౌకర్యంగా ఉండగలిగాను. దానినే నేను సంపూర్ణమైన స్వేచ్ఛ అనుభవం అంటాను.
మీకు మరలా చెబుతున్నాను, నేను ఈ ప్రపంచానికి చెబుతున్న విషయాలలోని సారాంశం ఏమిటంటే, ఈ సమస్య రాకముందు పరమానందం అనిచెప్పేవాడిని. కాని ఇప్పుడు మాత్రం కరుణ అని చెబుతాను. ద్వేషం నుంచి స్వేచ్ఛని పొందటమే అంతిమ స్వేచ్ఛ. పగనుంచి స్వేచ్ఛని పొందటమే అంతిమ స్వేచ్ఛ.
మీరు ఎప్పుడైతే కరుణలో స్థిరపడతారో, అకస్మాత్‌గా ఎదుటివ్యక్తి శత్రువు కాదు అని తెలుసుకుంటారు. అప్పుడు మీరు బహురూపాలలో ఆనందోత్సవాలు జరుపుకుంటారు. మీ అంతరంగంలో అత్యంత సూక్ష్మస్థాయిలో పగ, ద్వేషం ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి శత్రువుగా కనిపిస్తాడు. అప్పుడు మీకు ఎదుటివారు నరకంలా తోస్తారు. ఎప్పుడైతే ఎదుటివారు శత్రువుగా, నరకంగా అనిపిస్తారో మీరు కుచించుకుపోతారు. మీరు విషయాలనుంచి దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు సహజంగానే మీరు జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతారు. క్రమంగా మరణం వైపుకి వెళ్ళిపోతారు.
ప్రాథమిక సూత్రం, సత్యం ఏమిటంటే కరుణ ఆధారంగా, కరుణలో స్థిరపడండి. అప్పుడు మీరు అత్యున్నత ఆనందపారవశ్యాన్ని అనుభవించగలరు. మీ అంతరంగంలో నిరంతరం ఆనంద వాహినులు ప్రవహించటం చూడగలరు. మీ అంతరంగంలో స్థిరపడగలిగితే ఒక్క క్షణం కూడా బాధ, వ్యధ అన్నవి మిమ్మలని అంటవు, ఎందుకంటే మీరు పూర్తి విరామంలో స్థిరపడి ఉంటారు కాబట్టి.
దేనికోసమో స్వేచ్ఛని ఆశిస్తున్నస్థితి నుంచి స్వేచ్ఛని పొందితే మీరు ఆశ నుంచి స్వేచ్ఛని పొందుతారు. అదేవిధంగా దేనినుంచి స్వేచ్ఛని పొందాలి అనుకుంటున్నారో దాని నుంచి స్వేచ్ఛని పొందితే అది భయంనుంచి స్వేచ్ఛని పొందటమే. ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. దేని నుంచో స్వేచ్ఛ పొందటం అంటే బంధాలనుంచి స్వేచ్ఛని పొందటమే. ఫలానాదానినుంచి స్వేచ్ఛ కావాలి అంటే మీరు ఆశ, లక్ష్యాలలో బంధీలు. ఎప్పుడైతే మీరు వీటినుంచి స్వేచ్ఛని పొందుతారో అప్పుడు మీరు భయంనుంచి కూడా స్వేచ్ఛని పొందుతారు. ఎప్పుడైతే మీరు ద్వేషం, విరోధం నుంచి స్వేచ్ఛని పొందుతారో మీరు స్వేచ్ఛలో ఒక కొత్తకోణాన్ని అకస్మాత్‌గా చూడగలుగుతారు. అదే అంతిమ స్వేచ్ఛ.
నేను జైలులో ఉండగా జరిగిన ఒక మార్మిక అద్భుతాన్ని, ఒక అనుభవాన్ని చెబుతాను. నేను తెలుసుకున్న సత్యాన్ని వివరిస్తాను.
మీకు కొత్తగా కలపవలసినవి ఏమీ లేవు. మీరు ఎంత సంపాదించినా, ఎంత పొందినా, ఎంతమందితో అనుబంధాన్ని ఏర్పరచుకున్నా మీరు వాటితో జీవించలేరు. ఇది చాలా ముఖ్యమైన సత్యం. మీరు అహింసలో, కరుణలో స్థిరపడితే, మీనుంచి శరీరాన్ని వేరుచేసినా మీ ఆనందాన్ని వేరుచేయలేరు. మీరు దేనినైతే ఆనందం, ఉత్సవం, సంతోషం అనుకుంటారో దానిని ఈ శరీరం లేకుండా కూడా పొందగలరు. మీకు స్పష్టంగా చెబుతాను, మీరు ఏ ఆనందాన్నైతే ఈ శరీరంద్వారా పొందగలను అనుకుంటారో ఆ ఆనందాన్ని శరీరం లేకుండా కూడా మీరు పొందగలరు. మీరు కరుణలో స్థిరపడినప్పుడు శరీరాన్ని మీనుంచి తీసివేసినా మీరు అదే ఆనందాన్ని పొందగలరు.
మీరు ద్వేషం, హింసలలో స్థిరపడినప్పుడు మీరు శరీరంతో ఉన్నా మీరు పొందాలి అనుకున్న ఆనందాన్ని పొందలేరు. మీరు ఏ జ్ఞానేంద్రియం ద్వారా కూడా ఆనందాన్ని పొందలేరు. మీరు తింటూ ఉంటారు కాని మరేదో విషయంలో మునిగిపోయి తింటున్న ఆనందాన్ని పొందరు. మీరు ఇంపైనది వింటూకూడా మరెక్కడో ఏదో ఆలోచిస్తూ ఆ ఆనందాన్ని అనుభవించలేరు. మీరు అందమైనవి చూస్తుంటారు కాని మరేదో కార్యక్రమానికి ప్రణాళికలు వేస్తుంటారు.
నేను చాలామందిని చూసాను సెలవులలో ఆనందంగా గడపటానికి అందమైన ప్రదేశాలకి వెళతారు. అందమైన హిల్‌స్టేషన్ లేదా బీచ్ లేదా మరొక ప్రదేశం. అక్కడ ఉన్న అద్భుతమైన అందాన్ని చూసి కొంచం సేపుకూడా ఆనందించరు. అక్కడ కాటేజీ కొంటే ఎలా ఉంటుంది. ఇక్కడ ఫాంహౌస్ కడితే ఎలాఉంటుంది అనే ఆలోచనలు, ప్లాన్లతో ఉన్న సమయాన్ని గడిపేస్తారు. అటువంటి వారు దేనినైతే సొంతంచేసుకుంటే గాని దానినుంచి ఆనందం పొందలేము అనుకుంటారు. దానిని న్యాయబద్ధంగా సొంతంచేసుకున్నదగ్గర నుంచి పనివాళ్ళ కోసం, ఎలక్ట్రీషియన్ కోసం ఆ తరువాత డబ్బుకోసం పరిగెడటంతో జీవితం గడచిపోతుంది. ఆ ఇంటిని జాగ్రత్తగా కాపాడటంలో ఆనందం అనే సంగతి మర్చిపోయి బాధ్యతలలో కూరుకుపోతారు.
ఎవ్వక్తి అయితే పగ, ద్వేషంలో స్థిరపడతారో అటువంటివారు వారికి ప్రియమైన వ్యక్తి దగ్గర కూర్చున్నా వారు ఎంతగానో కోరుకున్న వారి సమక్షంలోఉన్నా, వారు ఎంతకాలంగానో చూసి ఆనందించాలి అనుకున్న స్థలంలో ఉన్నా వారు ఆ ఆనందాన్ని పొందలేరు. ఆ సమయంలో వారి అంతరంగంలో మరేదో జరుగుతూఉంటుంది. ఏ వ్యక్తి అయితే కరుణ, అహింసలలో స్థిరపడతారో అటువంటివారు శరీరం లేకపోయినా వారు పొందాలనుకున్న ఆనందాన్ని పూర్తిగా పొందగలుగుతారు.
ఈ సందర్భంలో నాకు జరిగిన ఒక చక్కని మార్మిక అనుభవాన్ని మీకు చెబుతాను. నమ్మేవారు నమ్మండి లేకపోతే ఆయన ఏదో చెబుతున్నారులే అని విని వదిలివేయండి. నేను నిజాయితీగా నాకు జరిగిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను.
నేను జైలులో ఉన్నప్పుడు ఒకరోజు పడుకుని ఉన్నాను. నేను పూర్తిగా విరామంలో ఉన్నాను. నా శరీరం పూర్తి విశ్రాంతిలో ఉన్నది. నా చేతన స్థితి చక్కటి సమాధిస్థితిలో ఉన్నది. అకస్మాత్‌గా శరీరం చక్కని సమాధి స్థితిలో ఉండటం, చేతనస్థితి తాను చేయవలసిన పనులు చేయటం నేను స్పష్టంగా చూడగలిగాను. ఎక్కడో ఎవరో ప్రార్థన చేస్తున్నారు. మరొక చోట ఎవరో ధ్యానం చేస్తున్నారు. అప్పుడు నేను చాలా స్పష్టంగా చూడగలిగాను, నా నుంచి శక్తి ఒక వెలుగు రేఖలా బయటకి వెళ్ళి వారికి సమాధానం ఇవ్వటం నేను చూసాను ఇది ఒక మార్మిక అనుభవం. దీనిని మీతో పంచుకుంటున్నాను. నాతో అనుబంధం ఉన్నవారు, నన్ను అర్థం చేసుకోగలవారు దీనిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. లేకపోతే ఈయన ఏదో చెబుతున్నాడు అని వదిలివేయండి. నాకు అప్పుడు జరిగిన అనుభవాన్ని మీకు యధాతదంగా చెబుతున్నాను.
శక్తి రేఖ, ఒక వెలుగులా నా శరీరం నుంచి వెళ్లి ప్రార్ధిస్తున్నవారికి, ధ్యానం చేస్తున్నవారికి అందుబాటులో ఉన్నది. వేరువేరు ప్రదేశాలలో రకరకాల వారి దగ్గరకి ఆ విధంగా వెళుతుంది. కొందరు అమెరికాలో ధ్యానం చేస్తుంటే, కొందరు ఆస్ట్రేలియాలో మరికొందరు ఇండియాలో ఈ విధంగా అందరి విషయాలని గమనిస్తూ వారిప్రార్థనకి ప్రతిస్పందిస్తున్నది.
నేను ఈ విషయాన్ని అనుభవంతో తెలుసుకునే సమయంలో ఈ శరీరాన్ని ఈ భౌతిక జ్ఞాపకాన్ని గుర్తుంచుకోలేకపోయాను. ఈ భౌతిక జ్ఞాపకాలని గుర్తుచేసుకుంటున్నప్పుడు ఆ మార్మిక అనుభవాన్ని గుర్తుంచుకోలేకపోయాను. విశ్వశక్తి స్పందన నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. నేను భౌతిక శరీరాన్ని గమనిస్తే విశ్వశక్తి స్పందని గుర్తుంచుకో లేకపోతున్నాను. ఆ స్పందనని గుర్తుంచుకుంటే భౌతిక జ్ఞాపకాలని మరచిపోతున్నాను. ఇది బైనరీ పద్దతిలా 1010101 లా ఉన్నది. ఒకసారి దీనిని మరొకసారి దానిని గుర్తిస్తున్నాను.
ఒక సెకండు పాటు, విశ్వస్పందనిని నాలో నింపాలి, నాలోనికి డౌన్లోడ్ చేయాలి అని అనుకున్నాను. ఆ విధంగా నాశరీర జ్ఞాపకాలలోనికి ఆ అనుభవాన్ని నింపి దాని అర్థాన్ని, ఆ అనుభవాన్ని అర్థంచేసుకోవాలి అని అనుకున్నాను. ఆ విధంగా అర్థం చేసుకోగలిగితే ఈ అనుభవాన్ని ఎవరికైనా చెప్పవచ్చు. విశ్వస్పందన అనుభవాన్ని భౌతిక జ్ఞాపకస్థాయికి తర్జుమాచేయాలి అనుకున్నాను. అలా చేయగలిగితేనే ఆ అనుభవాన్ని మన మాటలలో చెప్పగలం. ఆ అనుభవాన్ని మరొకరికి అందివ్వగలం. అందుకే ఆ మార్మిక అనుభవాన్ని నా భౌతిక జ్ఞాపకాలలోనికి, నా అంతరంగంలోనికి తీసుకురావాలి అనుకున్నాను.
అలా అనుకుని, ఒక క్షణం ఆ అనుభవాన్ని నా అంతరంగంలో నింపాను. క్షణం అంటే మీరు అనుకునే సెకండ్ కాదు. అది రెండు ఆలోచనలమధ్య ఉన్న సమయం. నేను గమనిస్తే, క్షణకాలంలో 1000 నుంచి 2000 పిలుపులకి ఆ శక్తి స్పందించటం చూసాను. ఆ ప్రార్థనలు, వినతులు, కోరికలు, ధ్యానం అన్నింటికీ ఈ శక్తి ఆటోమేటిక్ గా స్పందించటం చూసి ఆశ్చర్యపోయాను.
ఈ అనుభవాన్ని విశ్లేషించితే నాకు ఒక విషయం అర్థమయ్యింది. ఈ శరీరంద్వారా నేను పొందే ఆనందం, అందరికీ దీక్షనివ్వటం, జ్ఞానోదయపు అనుభవాన్ని అందరికీ వివరించటం ఈ శరీరంతో ఉండే ఒకే ఒక ఉపయోగం. శరీరాన్ని కలిగిఉండే లక్ష్యం అదే. ఈ శరీరంతో నేను పొందే ఆనందం అదే. అయితే నేను అకస్మాత్‌గా ఒక విషయాన్ని తెలుసుకున్నాను. అది ఈ శరీరంతో అవసరం లేకుండా, ఈ శరీరాన్ని ఉపయోగించకుండా నేను చేయదలచుకున్న పనులు చేయగలను అని. జైలులో శరీరం పడి ఉన్నా, నేను చేయగలిగిన పనులు సజావుగా జరిగిపోతున్నాయి. అప్పుడు నాకు ఈ శరీరంతో అవసరం లేదుకదా అనిపించింది. అకస్మాత్‌గా నాకు తెలిసిన విషయం శరీరం లేకుండా నేను చేయాలనుకున్నవి, నాకు ఆనందాన్ని కలిగించే అన్నీ చేయగలను అని. నాకు అప్పుడు అనిపించింది, అసలైన స్వేచ్ఛ అంటే అదే అని. అదే ఎవరైనా పొందగల అత్యున్నత అంతిమస్వేచ్ఛ. నిజానికి అందరూ కోరుకునే నిజమైన స్వేచ్ఛ అదే.
మీరు పొందాలనుకున్న ఆనందాన్ని శరీరం లేకుండా కూడా పొందగలిగేస్థితి అంతిమస్వేచ్ఛ. అప్పుడు అనిపించింది, భగవంతుడా! ఈ శరీరం నిజంగా అవసరం లేదుకదా! అని. కాని ఒక జవాబు నాకు స్పష్టంగా స్ఫురించింది. ఈ శరీరంతో కొత్తవారిలో వితర్కని కల్పించగలను. వారిలో విశ్వాసాన్ని కలిగించగలను. మరింత మందికి విశ్వశక్తి ద్వారా అవసరమైన జ్ఞానాన్ని, దీక్షని ఈ శరీరం ద్వారా ఇవ్వగలను. అందుకు మాత్రమే ఈ శరీరంతో అవసరం ఉన్నది.
ఎప్పుడైతే మీరు లోతైన కరుణ, ప్రేమలో స్థిరపడతారో మీరు ఆనందించాలనుకున్నవి ఆనందించటానికి ఈ శరీరంతో అవసరం లేదు. మీరు రుచిని ఆనందించాలనుకున్నారనుకోండి, మీరు అహింస ప్రేమలలో స్థిరపడినప్పుడు శరీరం లేకుండానే ఆనందాన్ని పొందవచ్చు.
ఏ వ్యక్తి అయినా అహింసలో స్థిరపడగలిగితే, అతను భౌతిక శరీరాన్ని ఉపయోగించకుండా, ఎటువంటి ఆనందాన్నైనా పొందగలడు. అందుకే దానిని అమృతం అంటారు. అమృతం అంటే వయస్సు అనేది లేని, కాలంతో పనిలేని శరీరం. అదే నిజమైన స్వేచ్ఛ, కరుణలో స్థిరపడితే మీకు ఆ స్వేచ్ఛ దొరుకుతుంది.
మనిషి చేసే అతి తెలివితక్కువపని, సమస్యలనుంచి బయటకు రావటానికి ప్రణాళికలు చేయటమే.
మీరు సమస్యలలో ఉన్నప్పుడు, దానినుంచి బయటకి రావటానికి వేసే ప్రణాళికలన్నీ మీ సమస్యని మరింత కఠినంచేసి, మిమ్ములని మరిన్ని సమస్యలలోనికి తోస్తుంది. ఎందుకంటే, సమస్య ఏర్పడినప్పుడు సాధారణ మానసిక వ్యవస్థ భయం, ఆశలలో చిక్కుకు పోతుంది.అప్పుడు మీరు వ్యవహారాలు నడుపుతారు, బేరాలాడతారు. జీవితంలో బేరాలు ఆడవచ్చు కాని జీవితంతో కాదు. మీరు జీవితంతో బేరాలాడలేరు. జీవితం అంటే పూర్తిగా అధీనమవటమే.
ఒక విషయం అర్ధంచేసుకోండి, మీ జీవితం కంటే పెద్ద జీవనవిధానం మీ జీవితంలో ఏర్పడినప్పుడు మీరు కదలిపోయారనుకోండి, దానిని సమస్య అంటారు. మీరు ఆ సమయంలో విరామంగా, స్థిరంగా ఉన్నారనుకోండి, అది బోధన అవుతుంది. మీ జీవితంలోనికి మీ జీవితానికంటే పెద్ద జీవితం కల్పించుకున్నదనుకోండి మీరు ఆ జీవితాన్ని కొలవలేరు. అది ఎలా ఉంటుందంటే కాలేజీలో రాగింగ్ చేయటానికి జూనియర్స్‌కి అగ్గిపుల్ల ఇచ్చి పెద్ద హాలుని కొలవమన్నట్టే ఉంటుంది. అదే విధంగా మీముందు జీవితం ఏర్పడుతుంటే మీరు ఇదంతా ఎందుకు అని ప్రశ్నించటమే. ఎందుకు? ఏమిటి? ఎలా? ఎప్పుడు అనే ప్రశ్నలన్నీ అగ్గిపుల్లలతో పెద్ద హాలుని కొలవటమే. మీ దగ్గర ఉన్న అగ్గిపుల్ల అనే ప్రశ్నలతో జీవితాన్ని కొలవలేరు. మీ లోతు, వెడల్పు, ఎత్తులతో మీ జీవితాన్ని కొలవలేరు. ఆ విధంగా జీవిత సమస్యల్ని పరిష్కరించాలి అని ప్రయత్నిస్తే, మరింత గందరగోళం సృష్టించిన వారవుతారు. మీరు లోతైన దయ, సానుభూతిలో స్థిరపడగలిగితే, జీవితాన్ని యధాతధంగా, ఉన్న విధంగా మీరు స్వీకరించగలరు, దీనిని అభినందించగలుగుతారు. అప్పుడు జీవితాన్ని అదే విధంగా అనుభవించగలరు.
నేను మీ అందరికీ చెప్పదలచుకున్న ముఖ్యమైన సత్యం, మీరు కరుణ, ప్రేమలో స్థిరపడండి. మీ అంతరంగంలో అహింస అనే భావం ప్రవహించే విధంగా చూడండి. నేను అహింస అనే మాటని ఒక నీతినియమంగా మాట్లాడటంలేదు. దానిని ఒక శాస్త్రంగా మాట్లాడుతున్నాను. దానిని జ్ఞానోదయపు శాస్త్రంగా మాట్లాడుతున్నాను. మీరు పూర్తి అసహాయులుగా ఉన్నప్పుడు ఇది మీకు సహాయం చేస్తుంది. ఏదీ మీకు ఆధారంగా నిలువలేనప్పుడు అహింస, దయ అనేది మీకు ఆధారంగా నిలుస్తుంది.
ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే ఒక పద్ధతిని మీకు చెబుతాను. మీతో మీరు విరామంగా ఉండండి. మీ అంతరంగంలోనికి మీ జీవితంలో మిమ్ములని బాగా బాధించిన వ్యక్తులని ఒకరి తరువాత ఒకరుగా పిలవండి. మీరు హేతుబద్ధంగా, తార్కికంగా ఒక విషయాన్ని విశ్లేషించండి. ఈ విధంగా ప్రశ్నించుకోండి, ఈ వ్యక్తిమీద నేను పగతీర్చుకుంటే నాజీవితం మారిపోతుందా? నాకు సంతృప్తి, పరిపూర్ణత దొరుకుతాయా? లేదు అలా ఎప్పటికీ జరగదు.
ఒక విషయాన్ని అర్ధం చేసుకోండి, మీరు ఏ మనుకుంటారంటే మీరు సమస్యలతో ఉన్నప్పుడు, మిమ్మలని సమస్యలకు గురిచేసిన వ్యక్తిమీద పగసాధించితే మీరు ఏదో సాధించాననుకుంటారు. అది సరికాదు. అది విజయం కాదు. ఆవిధంగా పగసాధించాక మీలో శూన్యం ఏర్పడుతుంది. మీకు సంపూర్ణమైన సాధికారత, తృప్తి అనేవి అసలు కలగవు. అది మీకు సంతృప్తిని ఇవ్వదు. అత్యంత విలువైన మీ ప్రాణ శక్తి వృధా అవుతుంది. అయితే ఒక వ్యక్తిమీద పగసాధించాక అకస్మాత్‌గా మీరు ఆ విషయాన్ని తెలుసుకుంటారు. మీలో శూన్యం ఏర్పడటాన్ని తెలుసుకుంటారు. మీలో తృప్తి అనేది అసలు ఉండదు. అది మరింత అశాంతిని, సమస్యని సృష్టిస్తుంది.
అందుకే ద్వేషం, పగ అనేవాటిని మీ అంతరంగంనుంచి పూర్తిగా తీసేయండి. దానిని విశ్లేషించి బయటకి తోసేయండి. నేను ఇలా చెప్పినప్పుడు కొంతమంది అంటుంటారు, స్వామీజీ! ఇది ఒక అంతరంగస్వభావన. దీనిని తీసివేయటం కష్టం అని.
అది సరికాదు. మీరు ఏ భావనైనా 7 సార్లు విశ్లేషించి చూస్తే అది దాని ప్రభావాన్ని పోగొట్టుకుంటుంది. నేను మీకు ఒక ముఖ్యమైన క్లూని, విషయాన్ని చెబుతున్నాను. ఏ భావం అయినా అది కోపం, కోరిక, ద్వేషం, పగ ఏదైనాసరే చేతనస్థితిలో, మీ అంతరంగంలో దానిని తార్కికంగా 7 సార్లు విశ్లేషింపితే అది తన ప్రభావాన్ని పోగొట్టుకుంటుంది. అది మీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు.
కోపం, ద్వేషం, పగ ఉన్న ప్రతి వ్యక్తిని మీ అంతరంగంలోనికి తీసుకురండి, మీరు ఎందుకు ఎలా మీరు ద్వేషించే ప్రతి వ్యక్తిని మీ అంతరంగంలోనికి పిలవండి. వారిని ద్వేషించటం, వారి మీద పగ తీర్చుకోవటానికి కాదు మీ జీవితం. అది మీకు ఎటువంటి పూర్ణత్వాన్ని, సంతృప్తిని ఇవ్వదు అని చెప్పుకోండి. రక్తంతో రక్తాన్ని తుడవలేము, హింసతో హింసని మార్చలేము. కన్నుకి కన్ను అని అనుకుంటే ప్రపంచమంతా అంధులతో నిడిపోతుంది.
స్పష్టంగా అర్థం చేసుకోండి, ప్రపంచమంతా అంధులతో నిండిపోతుంది. ఒక విషయం మీరు తెలుసుకోవాలి, మీరందరూ ఎప్పుడో ఒకసారి అయినా బాధని అనుభవించి ఉంటారు. బాధపడటం అనగానే నాకు నా శిష్యులు, నా అనుచరులు గుర్తొస్తున్నారు. నా మీద గొడవలు జరిగినప్పుడు వారంతా ఎన్నో నిందలు అనుభవించారు. వారి తప్పు ఏమీలేదు కాని వారిని అవమానించారు, కొంతమంది ఆశ్రమంలో ఉన్న బ్రహ్మచారులని కొట్టారు. మా ఆశ్రమాలు తగలపెట్టారు. కాని ఇవన్నీ ఏకారణ లేకుండా చేసిన పనులు. ఇంత జరిగినా నాకున్న లక్షలమంది అనుచరులు, భక్తులు, శిష్యులలో ఒక్కరుకూడా ఒక్కసారి కూడా ఎవరిమీద ఒక రాయికూడా విసరలేదు. చెడుగా మాట్లాడలేదు. ఎంత దురాగతం జరిగినా మౌనంగా ఉండిపోయారు. నేను మీకు చెబుతున్నాను మీరంటే నాకు చాలా గర్వంగా ఉన్నది, చాలా గౌరవం కలుగుతున్నది. మీ మౌనానికి నేను గర్విస్తున్నాను. అంత గందరగోళంలో కూడా నిశ్శబ్దంగా ఉండగలిగిన నా వారందరినీ చూసి చాలా ఆనందపడుతున్నాను, గర్విస్తున్నాను. మీరంతా మౌనంగా ఎంత వ్యధని అనుభవించారో నాకు తెలుసు. కానీ వారు సౌమ్యంగా, స్థిరమైన అంతరంగంతో శాంతంగా ఈ సమస్యని ఎదుర్కొన్నారు.
మీకోక చిన్న కథ చెబుతాను. ఒక అబ్బాయి తన 18 వ సంవత్సరం పుట్టిన రోజున తండ్రి దగ్గరకి వచ్చి ఆయన పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటూ, నానగారు ఇవాళతో నాకు 18 సంవత్సరాలు పూర్తీవుతాయి. నన్ను ఆశీర్వదించండి అంటాడు. తండి చాలా సౌమ్యంగా, ప్రేమగా కొడుకుని దగ్గరకి తీసుకొని, 18 సంవత్సరాలు నీవు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చావు నేను నీకు పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాను. నన్ను తృప్తిపరచటానికి ఇక నీవు ఏమీ చేయనవసరం లేదు, ఇక నుంచి నీ నిర్ణయాలు నీవు చేసుకొని జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు గడపవచ్చు. నీకు నేను పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాను. ఒక కొడుకునుంచి తండ్రి పొందవలసిన ఆనందాన్ని నేను ఆశించినదానికంటే ఎక్కువగా నీవు ఇచ్చావు. నాకు అదిచాలు. నాకు పూర్తి సంతృప్తి కలిగింది. నీకు నేను ఇవాళనుంచి పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాను అంటాడు.
దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి. మీ అందరికీ నేను అదే చెబుతున్నాను. ఎవరైతే ఆ రెండు నెలల సంక్షోభాన్ని, సమస్యని అహింసా పద్దతిలో ఎదుర్కొన్నారో, ఎవరైతే ఆ సమస్యలో పడి కదిలిపోకుండా స్థిరంగా నిలబడగలిగారో, సంస్థ మూలాల నుంచి వేరుకాకుండా నిలబడగలిగారో వారందరికీ నేను చెప్పేది ఆ తండ్రి చెప్పిన మాటలే నేను మీకు చెబుతున్నాను. మీరు నాకు అత్యుత్తమ ఆనందాన్ని ఇచ్చారు. శిష్యులనుంచి ఏమి కోరుకుంటానో అది నాకు తృప్తికలిగేలా మీరు ఇచ్చారు. ఇంతకు మించి మీ నుంచి నేను ఏదీ ఆశించటంలేదు. నేను మీకు పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాను.
ఎవరైతే ఈ సమస్యని అహింసా పద్దతిలో ఎదుర్కొన్నారో మీరంతా అదే పద్దతి పాటించారు అని నాకు తెలుసు, ఎవరైతే ఈ పుకార్లు అనే గాలి దుమారంతో పాటు వెళ్ళిపోకుండా స్థిరంగా నిలబడగలిగారో వారందరికీ నేను చెప్పేది ఇదే, మీకు పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాను. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను. చూడండి! కొన్ని తుఫానులకి పళ్ళచెట్లకి ఉన్న పూలు రాలిపోతాయి. బలంగా లేని, పూర్తిగా పక్వానికి రాని కాయలు రాలిపోతాయి. ఏ పూలు, పిందలు చెట్టుని అంటిపెట్టుకొని ఉంటాయో అవి సంపూర్ణమైన పండ్లవుతాయి. అవి నిజమైన పండ్లు. ఈ గాలి దుమారంలో చాలా పూలు, కాయలు రాలిపోయాయి. బలమైనవి మాత్రం వృక్షానికి అంటిపెట్టుకొని ఉండి అవి పక్వంగా మారి పరిపూర్ణ సిద్దిని పొందుతాయి.
మీరందరూ ఈ కష్టమైన సమస్యా కాలంలో అత్యంత కరుణ, ప్రేమ, అహింసలతో సమస్యని ఎదుర్కొని నాకు పరిపూర్ణమైన తృప్తిని ఇచ్చారు. ఇంత కంటే నేను ఇంకేమీ కోరుకోను. నాకు ఇంతకంటే మీ నుంచి ఏమీ అవసరంలేదు, ఈ తృప్తి చాలు.
సరే! అంతరంగంలో పరిపూర్ణమైన స్వేచ్ఛని పొందాలి అంటే మీకు ఒక పద్దతి చెబుతాను. ముఖ్యంగా ద్వేషం కోపం నుంచి స్వేచ్ఛని పొందగలిగితే అది ఇచ్చే తృప్తి, ఆనందం అనంతమైనది.
మిమ్మల్ని బాధపెట్టినవారిని, మీకు కోపం ఉన్న వ్యక్తుల్ని ఒక్కొక్కరిని మీ అంతరంగంలోనికి పిలవండి. ప్రతి వ్యక్తి జీవితంలో షుమారు 10 నుంచి 20 మంది వ్యక్తుల మీద ద్వేషం, కోపం ఉండవచ్చు. అంతకు మించి ఎక్కువ ఎవరికీ ఉండరు. ఒకవేళ ఉంటే, మరేదైనా సమస్య ఉన్నది అని అర్ధం, వారి ఎదురుగా ఉండి కోపకారణాన్ని హేతుబద్ధంగా విశ్లేషించి, ద్వేషాన్ని తీసివేయండి. మీలోని కోపాన్ని, పగని తుడిచివేయండి. ఒక విషయం చెబుతాను అర్థం చేసుకోండి, మీరు బాధపడినప్పుడు మీ నరాల వ్యవస్థ ఎంత వ్యథకిలోనయిందో, మీరు ఆ బాధని ఎంత బరువుగా మోసారో, ఎంత భారంగా మీకు అనిపించిందోకదా! మరి అటువంటి బాధని మీరు మరొకరికి ఇవ్వాలని ఎందుకనుకుంటున్నారు. మరొకవ్యక్తి కూడా అదే విధమైన బాధని అనుభవించాలి అని మీరు ఎందుకనుకుంటున్నారు. మీరు ఆవిధంగా అనుకోకూడదు. మీకు ఏదైనా బాధకలిగినపుడు, అదేవిధమైన బాధ మరొకరికి కలగాలి అన్న భావన రాక్షసం. వారినే రాక్షసులు అంటారు. తనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఇటువంటి బాధ మరెవరికీ రాకూడదు అన్న భావం దైవత్వం. వారు దైవసమానులు. మీకు బాధ కలిగినపుడు మీరు బాధలలో ఉన్నప్పుడు మీలో కలిగే స్పందన మీరు రాక్షసులా లేక దేవతలా అనే విషయాన్ని నిర్ణయిస్తుంది.
మీరు జీవితంలో ఒక్కసారైనా గొప్ప ఆనంద పారవశ్యాన్ని, సంతోషాన్ని అనుభవించి ఉంటారు. ఆ ఆనందాన్ని ఎదుటివారికి పంచటానికి ప్రయత్నించండి. అంతే కాని బరువైన వ్యథని ఎదుటివారికి పంచవద్దు. కాబట్టి మిమ్మలని బాధించిన వారిని ఒకరితరువాత ఒకరిని మీ అంతరంగంలోనికి ఆహ్వానించి వారిని ఒక సారి విశ్లేషించి గౌరవంగా మీ అంతరంగం నుంచి వీడ్కోలు ఇవ్వండి. వారిని అత్యంత గౌరవంగా మీనుంచి పంపించివేయండి.
మీకు చెబుతున్నాను అర్థంచేసుకోండి. న్యాయనిర్ణయం చేయగలిగి, తీర్పునిచ్చేవారిని న్యాయమూర్తి (జడ్జి) అంటాము. న్యాయనిర్ణయం చేయగలస్థితిలో ఉండి, ఇతరులపై తీర్పులు చేయని వారిని భగవంతుడు అంటాము. కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టిన వారినందరినీ మీ అంతరంగపు కోర్టులో హాజరుపరచండి. ఎవరిమీద ఎటువంటి తీర్పులు నిర్ణయాలు చేయకుండా వారిని గౌరవంగా మీ నుంచి పంపించివేయండి. మీరు అలా చేయగలిగినప్పుడు అకస్మాత్‌గా మీరు విశ్వన్యాయమూర్తిగా, భగవంతునిగా అనిపిస్తారు. మీరు భగవంతుని శక్తిక్షేత్రంలో, ఆయన సమక్షంలో ఉన్న అనుభూతిని పొందుతారు. ఎప్పుడైతే మీరు భగవంతుని లక్షణాలతో, ఆ నాణ్యతతో జీవించుతారో మీరే భగవంతుడవుతారు.
నేను ఎప్పుడైతే ఇటువంటి పద్ధతులని చెబితే వెంటనే అయ్యో! ఇలా చేయటం నావల్లకాదు. అయినా ఇలా చేయటం అసాధ్యమైన విషయం ఒక వేళ నేను ఇవాళ ఇలా చేయగలిగినా రేపు తిరిగి ద్వేషం, కోపం నాలోనికి రావని నమ్మకం ఏమిటి? ఈ విధంగా మీకు మీ పాత అపజయాలు, చేయలేకపోయిన ధ్యానపద్ధతులు గుర్తొస్తాయి వెంటనే మీరు ఇంతవరకూ ఏ పద్ధతీ నాకు పనిచేయలేదు ఇది మాత్రం పనిచేస్తుందా? అని నిరుత్సాహపడతారు.
మీరు రేపటిగురించి ఆలోచించవద్దు. ద్వేషంలేని చక్కని భావనని కొన్ని నిమిషాలపాటైనా అనుభవించండి. ఇప్పుడే ఇక్కడే కూర్చొని మీ అంతరంగపు కోర్టులోనికి మీకు పగ ఉన్నవారిని ఆహ్వానించండి. ఒక్క నిమిషంపాటు అహింసా, కరుణలతో మీ అంతరంగాన్ని నింపండి. అప్పుడు మీరు పొందే ఆ అంతరంగపు స్వేచ్ఛ ఎంత అందంగా ఉంటుందో అనుభవంతో తెలుసుకోండి.
ఆ భావం శరీరంతో సంబంధంలేని ఒక అద్భుతమైన అనుభవం. అందుకే అంటాను ద్వేషం నుంచి పొందే స్వేచ్ఛ అంతిమస్వేచ్ఛ అని. అప్పుడు మీరు తెలుసుకునే విషయం ఇక నాకు ఈ శరీరంతో అవసరం లేదు అని, ఒక వేళ శరీరం ఉంటే అక్కడే ఉంటుంది; శరీరం లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది మీనుంచి ఏది తీసేసుకున్న భావాన్ని అనుభవంతో తెలుసుకుంటారు. దేనినైతే మీనుంచి ఎవరూ తీసివేయలేరో దానినే నేను స్వేచ్ఛ అంటాను. ఈ స్వేచ్ఛ మీ అంతరంగపు స్థితిమీద ఆధారపడి ఉంటుంది కాని మీ భౌతిక స్థితిమీద కాదు. ఆ అంతరంగపు స్థితిని మీరు ఏర్పరచుకొని, ఆ అత్యుత్తమ స్వేచ్ఛని పొందగలగాలి. అప్పుడు మీరు అనుభవించేది నిజమైన అంతిమ స్వేచ్ఛ.
ఇది చాలా చిన్న పద్ధతి సులభమైనది కూడా మీరు నిశ్శబ్దంగా కూర్చొని ఒక్కసారైనా ద్వేషంలేని అంతరంగపు అనుభవాన్ని పొందాలి అని నిర్ణయించుకోండి. మీ అంతరంగపు మూలల్లో ఎక్కడా సూక్ష్మస్థాయిలో కూడా ఎటువంటి రహస్యపు ఆలోచన కాని, ఎవరిమీద అయిన పగసాధించాలన్న ప్లానుకాని ఉండకూడదు. మీకు ఇలా అనిపించవచ్చు
- ఆ వ్యక్తి దుర్మార్గుడు అతనిని క్షమించకూడదు. అతనిని క్షమించితే నన్ను చంపేస్తాడు కాబట్టి ఆ ఒక్క వ్యక్తిని మాత్రం క్షమించను అని మీరు ఈ విషయంలో విరామంగా ఉండండి.
నేను మీకు చెప్పేది ఒక్కటే, ఒకసారి ద్వేషంలేని స్థితిని అనుభవంతో తెలుసుకోండి. అప్పుడు మీరు లోతైన, అద్భుతమైన స్వేచ్ఛని అనుభవిస్తారు. ఆ స్వేచ్ఛని కొలవలేరు. అది అంతిమస్వేచ్ఛ.
నా అనుచరులు, భక్తులు, శిష్యులు బాధపడినప్పుడు సానుభూతిని చూపించాను కాని బాధపడలేదు. నేనూ బాధపడితే సహాయంచేసేది ఎవరు? నాలోపలికి బాధ ప్రవేశించి మాయం అయ్యేది. ఆ తరువాత వారినుంచి బాధ తొలగిపోయేది నానుంచి కూడా.
ఒక విషయం అర్థంచేసుకోండి, మీ కరుణ హింసమీద ఆధారపడి ఉంటే, మీరు బాధపడతారు, దానితో మరింత బాధని సృష్టిస్తారు. ఆవిధంగా కాకుండా మీ కరుణ, దయలమీద ఆధారపడి ఉంటే, మీరు ఎదుటివారి బాధలని తీసుకొని వాటిని మసి చేసేయగలుగుతారు. బాధలు అనేవి పూర్తిగా మాయం అయిపోతాయి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏమిటంటే, మీరు కరుణలో స్థిరపడగలిగితే చాలు, అది ఏ సమస్యకైనా పరిష్కారాన్ని చూపి ఆ సమస్యనుంచి మివ్వల్ని బయటకి తెస్తుంది. అందుకు ఉదాహరణ నాకు వచ్చిన సమస్య ఆ మూడునెలల సంక్షోభం. అంతపెద్ద సమస్యని నేను ఎదుర్కోగలగటానికి కారణం నేను కరుణ, అహింసలలో స్థిరపడగలగటమే. మీరు కరుణతో ఉంటే అన్నీ చక్కగా జరుగుతాయి. ఆ స్థితినే నేను నిజమైన, అత్యుత్తమమైన అంతిమ స్వేచ్ఛ అంటాను. మీరందరూ ఆ స్వేచ్ఛస్థితిని పొందాలని ఆశీర్వదిస్తున్నాను. మీరంతా నిత్య ఆనందస్థితిని అనుభవిస్తూ దానిని వ్యాపింపచేయుదురుగాక నిత్యానందం.
ఒక ప్రశ్నకి సమాధానంగా పరమహంస ఈ విధంగా జవాబు చెప్పారు. నేను జైలులో ఉన్నప్పుడు చాలా మంచి ధ్యానపద్ధతులని రూపొందించాను. అవి మీరు జ్ఞానోదయం పొందేవిధంగా సహాయం చేస్తాయి. అందుకే నేనంటాను, మీరు నన్ను జైలులోపెట్టినా నేను మీ స్వేచ్ఛకి మీ విముక్తికి ప్రయత్నిస్తాను. ఇది నిజమైన కరుణ అసలైన అంతిమస్వేచ్ఛ

నిజమైన ప్రేమ, మీరు ప్రేమించిన వారికి, మీకు ఇద్దరకీ స్వేచ్ఛనిస్తుంది.
- కారణం లేకుండా మీలో ప్రేమ, కరుణా పొంగి ప్రవహించినప్పుడు మీరు అంతిమ స్వేచ్ఛని పొందుతారు.
- మీరు శరీరం, మనస్సు అనే వాటినుంచి బంధవిముక్తులు కాగలిగితే బంధాలనుంచి స్వేచ్ఛని పొందుతారు. అప్పుడు మీరు చక్కని ప్రశాంతతో ఆనంద స్థితిలో స్థిరపడగలుగుతారు.
- మనస్సు అనే బంధంనుంచి స్వేచ్ఛని పొంది, మేధస్సులో స్థిరపడగలిగితే మీరు పొందే అంతిమ స్వేచ్ఛ పరమానంద స్థితి.
- మీ అంతరంగంలో కరుణ, ప్రేమల నుంచి చేసేవన్నీ మీలో అంతిమ స్వేచ్ఛని మేల్కొలుపుతాయి. – పరమహంస నిత్యానంద
www.nithyananda.org
Ph: Bidadi - 80 27202801,
AP: 09440572543, 09494340692
వెల-4/- Ebook ISBN: 979-8-88572-657-3