1. The Simple Truth, Straightaway!
(వ।। 1) (పియమయన స్వామీజీ! మేము (వ్రవంచంలో ఉన్నామా? లేకపోతే (పపంచం మాలో ఉన్నదా?
మీరు ప్రపంచంలో లేరు. ప్రపంచం మీలో లేదు. మీరు ప్రపంచంలో ఉన్నారు, అనే భావం మిమ్మలని భౌతికవాదులుగా చేస్తుంది. అలా కాకుండా ప్రపంచం మీలోపల ఉన్నది అనే భావం మిమ్మలని ఆధ్యాత్మిక వ్యక్తులుగా మారుస్తుంది. రెండూ కూడా భావాలే కల్పనలే.
స్పష్టంగా అర్థం చేసుకోండి, మీరు ప్రపంచంలో ఉన్నాము అని అనుకుంటే మీరు భౌతికవాదులవుతారు. అప్పుడు ఈ వస్తు ప్రపంచం వెనుక పరుగెడతారు. మీరు కేవలం దానివైపుగానే వెళ్ళతారు. దానిని పొందాలి అని అనుకుంటారు. దానిని మీ ఆధీనం చేసుకోవాలని అనుకుంటారు.
మీ లోపల ప్రపంచం ఉన్నది అని మీరు అనుకుంటే, మీరు
మీ అంతరంగంలోని మీ ఉనికి వెనుక పరిగెడతారు. దానిని పొందాలి అని అనుకుంటారు. ఇదికూడా పైన చెప్పిన పరుగులాంటిదే, కానీ ఈ పరుగు కొంచెం మార్చబడి, అది మీ అంతరంగం లోపలికి వెళుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధికి లేదా ఏదో కొంత ఆధ్యాత్మికమయిన అనుభవాల కోసం చేసే పరుగు ఇది. దీనినే మనం అద్భుతమయిన వ్యవహారం అని అనవచ్చు. ఈ రెండూ కూడా రెండు రకాల కల్పనలు. రెండు రకాల భావాలు. ఎప్పుడయితే ఈ రెండూ కూడా భావాలు అని మీకు అర్థమవుతుందో అప్పుడు మీరు మీలో ఆధ్యాత్మిక అనుభవం జరిగేవిధంగా చూస్తారు. అయితే ఆధ్యాత్మిక అనుభవం మాటల వలన జరుగదు. ఉదాహరణకి గంగానదిని చూడండి అందులో చిన్ని వెదురు కుర్రని వేస్తే అది నదిలో తేలుతుంది. అప్పుడు ఆ వెదురు కురని మధ్యపాయింట్‌గా అనుకొని గంగానది రెండుగా చీలిపోయింది, ఒకటి ఎడమ గంగ, రెండవది కుడి గంగ అని అంటారా? అది సరియైన పద్ధతేనా? గంగానది రెండగా విడిపోయింది అని మీరు చెప్పగలరా? లేదు. నిజానికి గంగానది విడిపోలేదు. మీరు వెదురుకుని మధ్యపాయింట్ గా చేసి, మీ అవసరం కోసం, మీరు విషయాన్ని అర్ధం చేసుకోవటం కోసం, గంగానదిని ఎదమ గంగా, కుడిగంగా అని పేర్లు పెట్టారు. అదే విధంగా, కేవలం ఏదో అవసరానికి మీరు ఈ శరీరాన్ని శరీరమని, బయట దానిని ప్రపంచం అని పిలుస్తున్నారు. ఇది కేవలం ఏదో పేర్లు పెట్టటం మాత్రమే.
మీరు లోపలికి చూదండి. మీ లోపలికి చూడండి. ఎందుకు నేను మిమ్మలని మీ లోపలకి చూదమంటున్నాను? మీరు ఇంతకాలం బయటకి మాత్రమే చూస్తున్నారు అని మీకు తెలుసు. అందుకే మిమ్మలని లోపలకి చూడమంటున్నాను. మీరు ఎప్పుదయితే లోపలకి చూస్తారో, మీకు అక్కడ మీకు, ప్రపంచానికి మధ్య ఎటువంటి హద్దు కనపడదు. మీకు ఇవతల హద్దు బలంగా ఉన్నట్లు అనిపించితే మీరు ప్రపంచంలో ఉన్నట్లుగా అనుకుంటారు. అవతలి హద్దు బలంగా కనిపించితే, ప్రపంచం మీలో ఉన్నది అని అనుకుంటారు.
ఎవరయితే ప్రపంచంలో ఉన్నాము అని అనుకుంటారో, వాళ్ళు లౌకికులు, వస్తుపపంచానికి సంబంధించిన భౌతికవాదులు. వాకృ ఎప్పుడూ మేము ప్రపంచంలో ఉన్నాము అని అంటారు. ఎవరయితే కొండగుహలలోనో హిమాలయాలలోనో కళ్ళుమూసుకుని కూర్చుంటారో వాళ్ళు ప్రపంచం మాలో ఉన్నది అని అంటారు. అయితే ఈ రెండూ కూడా కల్పనలే. మీకు ఇవి రెండూ కల్పనలు అని అనిపించటం లేదా? ఈహద్దు బలంగా ఉన్నట్టు మీకు అనిపించితే, మీరు ప్రపంచంలో ఉన్నామని అనుకుంటారు. అవతలి హద్దు బలంగా అనిపించితే మీలోపల ప్రపంచం ఉన్నది అని అనుకుంటారు. అంతే.
మీరు ఒక్కసారి ఈ రెండు విషయాలని వదిలివేస్తే మీరు అక్కడ చూసేది మిమ్మలనే. అక్కడ మీరు ఉంటారు. సాధారణంగా
యోగులు, రుషులు ప్రపంచం మీలో ఉన్నది అని మీకు నేర్పించుతారు. వాళ్ళు అలా ఎందుకు నేర్పుతారో మీకు తెలుసా? ఎందుకంటే, మీరు దీనికి వ్యతిరేక భావానికి బాగా అలవాటు పడిపోయారు. అదే, మీరు ప్రపంచంలో ఉన్నారు అనే భావనకి. మిమ్మలని ఆ భావం నుంచి బయటకి తీసుకురావటానికి వాళ్ళు మీతో 'ప్రపంచం మీలో ఉన్నది' అని అంటారు.
నిజంగా చెప్పాలి అంటే, మీపాదంలో ముల్లు గుచ్చుకుంటే, దానిని మరొక ముల్లతో తీస్తాము. ఒక్కసారి ముల్లుని బయటకి తీసేసాక ఆ రెండు ముళ్ళని బయట పారేస్తాము. ప్రపంచం మీలో ఉన్నది అనే భావం ఒక ముల్లులా ఉపయోగించేది మీలో ఉన్న 'పపంచంలో నేను ఉన్నాను' అనే ముల్లుని తీయటానికి మాత్రమే. చివరకి ఈ రెండూ కూడా కేవలం భావాలే. మీరు ఆ హద్గులని వదిలేస్తే, మీకు నిజమేమిటో తెలుస్తుంది. సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటారు. ఆ సత్యాన్ని మీరు ఈ రెండు భావాల ద్వారా వివరించలేరు.
గంగానదిలోని వెదురు కురిని బయటకి తీసివేసి, ఇప్పుడు గంగానది ఒక్కటిగా అయిపోయింది అని చెప్పగలరా? లేదు. ఎందుకంటే గంగానది ఎప్పుడూ ఒక్కటే. ఎప్పుడయినా ఒకటి ఉన్నది అని మీరు చెప్పారు అంటే, రెండవది తప్పనిసరిగా ఉన్నట్లే. అసలు రెండవది లేదనుకోండి, అప్పుడు మొదటిది అని మీరు ఎలా
చెప్పగలరు. మీకు స్పష్టంగా అర్థమయిందా? బహువచనం ఉంటేనే ఏకవచనం ఉంటుంది. అసలు బహువచనమే లేనప్పుడు, ఇక ఏకవచనం ఎలా ఉంటుంది? అది ఏకవచనం అని మీరు ఎలా చెప్పగలుగుతారు? అలా చెప్పలేరు. అందుకే రుషులు, యోగులు ఈ తత్వాన్ని అధ్వెతం అని అన్నారు.
ధెత్వం అంటే రెండు. కాని అద్వెతం అనే మాటని ద్వెతానికి ఏకవచనంగా చెప్పలేము. అలా చెబితే ఎక్కడో బహువచనం ఉన్నట్లే. అద్వెతం ఎప్పుదు 'ఒకటి' అని చెప్పలేము. దీనిని కేవలం 'ఎక్కడ అయితే బహుళం లేదో' అది అద్వెతం అని చెప్పగలం. ద్వెతా అంటే రెండు. అద్వెతా అంటే రెండు కానిది. అంతే.
మీరు ఎప్పుదయితే, 'నేను ప్రపంచంలో ఉన్నాను' అని అంటారో అది ద్వెతం. అలాగే ప్రపంచం నాలో ఉన్నది' అన్నప్పుడు కూడా అది ద్వెతం. అలా కాకుండా, ఈ రెండూ కూడా నిజం కాదు అనే విషయాన్ని మీరు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటే, సత్యాన్ని చూడగలుగుతారు. ఆ అనుభూతి తెలుసుకుంటారు. సత్యాన్ని ద్వెత తత్వంతో వివరించలేము. దానిని కేవలం అద్వెత తత్వంతో మాత్రమే వివరించగలం.
ప్రియమయిన స్వామీజీ, మాకు ఈ కార్యక్రమంలో కుండలినీ అనే ధ్యాన పద్దతిని కూడా నేర్పించుతారా?
తప్పకుండా నేర్చుకుంటారు. తరువాత రెండు రోజులలో
ప్రయోగాత్మకంగా, జాగ్రత్తగా కుండలి శక్తిని చైతన్యపరచే పద్ధతిని నేర్సుకుంటారు.
మీ జీవితాల నుంచి అత్యుత్తమ ఫలితాలు పొందాలన్నా, జీవితాన్ని ఆహ్లాదంగా, ఆనందమయంగా చేయాలన్నా, ఆధ్యాత్మిక జీవితం పొందాలన్నా, నిజమయిన జీవితం కావాలన్నా, రెండు విషయాలు అవసరం. అందులో మొదటిది పరిణితి ? పరిణితి అంటే మీలోపలి అసలయిన మీ ఉనికిని సర్వాంతర్యామిని అర్ధం చేసుకోవటం. రెండవది ధ్యానం. అర్గంచేసుకోవడం మీచేతన స్థితిలో మైండ్‌ని (ఆలోచనలని) స్పష్టం చేస్తుంది. ధ్యానం మీ అచేతన స్థితలోని మైండ్‌ని శుభ్రపరచి, స్పష్టం చేస్తుంది.
కేవలం అర్ధంచేసుకోవటం ద్వారా మనం చాలా విషయాలని తెలుసుకోలేము. మాటని అర్ధం చేసుకోగలరు. ప్రపతి సిగరెట్ అద్వటెజ్‌మెంటు మీదా హెచ్చరిక ఉంటుంది. అది మనకి తెలుసు. కానీ పొగతాగి బాధలను అనుభవిస్తుంటారు. దీనిని మనం అపలేము. ఎందుకు? ఎందుకంటే తెలివితేటలతో అర్గం చేసుకోవటం కొన్ని విషయాలలో సరిపోదు. అందుకే మన అచేతన వ్యవస్థకి శక్తిని పంపించవలసిన అవసరం ఉంటుంది.
అచేతన ప్రదేశాన్ని మనం స్పష్టమయిన తెలివితేటలతో, పరిణితో శుభ్రపరచి స్పష్టపరచవచ్చు. స్పష్టమయిన తెలివితేటలతో
మనలోని 50% సమస్యలు పరిష్కారమవుతాయి. మన సంతోషకరమయిన జీవితంలో స్పష్టమయిన తెలివికి పాత్రలేదు అని మనం చెప్పలేము. దానికి ఉండే ప్రాముఖ్యత, ప్రత్యేక స్థానం దానికి ఉన్నాయి. అయితే అది చాలదు. అదే అంతిమం కాదు.
మీలో స్పష్టమయిన తెలివితేటలు ఉంటే మీరు మీలోపలి ప్రతి చక్రాన్ని అర్గంచేసుకోగలుగుతారు. చక్రాలు ఎలా పనిచేస్తాయి, ఏవిధంగా ఈ శక్తి కేంద్రాలు వికసించుతాయి? ఇటువంటి విషయాలు మీకు అర్థమవుతాయి. ఉదాః ఎందుకు మానసిక కుంగుబాటుకు మణిపూరక చక్రానికి దగ్గర సంబంధం ఉంటుంది? మణిపూరక చక్రం నాభిప్రాంతంలో ఉంటుంది. ఎప్పుదయితే మీరు భరించలేని వార్త వింటారో మొదటి దెబ్బ మీ కడుపు భాగంలో తగులుతుంది. అప్పుడు మీకు కదుపులో గడబిడ మొదలవుతుంది, లేదా మీకు డయేరియా వస్తుంది. మీలో ఎవరికయినా ఎప్పుడయినా ఇలా జరిగిందా? మనం ఎప్పుదూ అంటుంటాం 'నేను జీర్లించుకోలేను' అని తెలుగులోనే కాదు అన్ని భాషలలో ఈ మాటని వాదతాం. ఎప్పుడయినా మీరు భరించలేని వార్త విన్నప్పుడు, మీరు 'నేను జీర్దిచుకోలేకపోతున్నాను అంటారు'.
అనహత చక్రం [ప్రామకి సంబంధించినది. అన్ని భాషలలోనూ [పేమ, గుండె లేదా హృదయం అనేవి పత్యామ్నాయ పదాలు. అలా అని అన్ని భాషలు ఒకేసారి సృష్టించబడలేదు.
భగవంతుడు వేరు వేరు భాషల సి.డి. పేకేజీలు చేసి అన్ని దేశాలలో ఇవ్వలేదు. దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళం, ఉత్తర భారతదేశంలో హిందీ, ఇంగ్లాండ్‌లో ఇంగ్లీషు, ఇలా వేరు వేరు ప్రాంతాలలో ఎన్నో భాషలు వేరు పేరు సమయాలలో అభివృద్ధి చెందాయి. అయితే అన్ని భాషలలోను [పేమ, హృదయం చాలా దగ్గర పదాలుగా వాడతారు. దీని అర్థం ఏమిటంటే మీలోని భావావేశాన్ని ఎలా సంభాళించుకోవాలో తెలిస్తే, దానిని మీ పరిణితితో అర్థంచేసుకోగలిగితే, అది మీలోని 50% సమస్యలని పరిష్కరించుతుంది. ఆ చక్రాన్ని చైతన్యం చేయగల శక్తి మిగతా 50% సమస్యలని పరిష్కరించుతుంది. పరిణితి శక్తిని సృష్టిస్తుంది. శక్తి పరిణితిని పెంచుతుంది. ఇలా బంతి ద్రొల్లగానే మీకు అంతిమమయిన పరమానందం కలిగి, నిత్యానంద అనుభూతిని పొందుతారు.
త్వరలో మనం ప్రతి చక్రం గురించి వివరంగా రాబోయే సెషన్స్‌లో తెలుసుకుంటాము. అప్పుదు చక్రాల గురించి బాగా అర్థమవుతుంది.
పరిణితి మైండ్ లోని చేతన స్పితిని సృష్టం చేస్తుంది. ధ్యానం అచేతన స్పితిని స్పష్టం చేస్తుంది. ఎప్పుదయితే ఇవి రెండూ శుభ్రపడి స్పష్టమవుతాయో మీ అంతరంగం లోని అసలయిన మీ ఉనికి లో మార్పు వస్తుంది. దానితో మీ ఉనికి, మీ అంతరంగం అద్భుతంగా
వికసించటం మీలోపల జరుగుతుంది.
అందుకే నేను ఈ కార్యక్రమాన్ని ఆనందస్పురణ అని అంటాను. స్పురణ అంటే వికసించటం. మన అంతరంగంలో పరమానందం నిరంతరం వికసిస్తూ ఉంటుంది. కాకపోతే మనం మన లోపలికి చూడం. అక్కడ ఏమి జరుగుతుందో గమనించం. మీరు లోపలికి చూదండి. మీకు అది కనిపిస్తుంది. అదే ఆనంద స్పురణ – వికసించే పరమానందం.
(వ।। 3) (పియంవైన స్వామీజీ, నేను ఆధ్యాత్మికంగా చైతన్యవంతమవటానికి నాకు అర్హత ఉన్నదా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది. ?
మంచి ప్రశ్న. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక వికాసానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి అర్హుదా, అనర్హుడా అనే మాటలని పూజారులు లేదా పండితులు స్పష్టించారు. మీరు జీవించి ఉన్నారు. అని నిర్దారణ అయితే అదే మీరు ఆధ్యాత్మిక అభివృద్ధికి అర్హత్త.
ఒకవ్యక్తి రమణ మహర్చి దగ్గరికి వెళ్ళి "భగవాన్, నేను ఆధ్యాత్మిక ప్రగతికి, ఆధ్యాత్మిక దారిలో నడవటానికి అర్హుదనేన" అని అడిగాడు.
అప్పుడు రమణ మహర్కి అతనిని ఇలా అడిగాదు "నీవు జీవించి ఉన్నావా?" దానికి ఆ వ్యక్తి 'అవును' జీవించి ఉన్నాను." అని జావాబు ఇచ్చాడు.
"అయితే నీవు పూర్తిగా అర్హుడవే", అని రమణ మహర్చి జవాబు ఇచ్చారు.
భావం. చూడండి, మీలో అపరాధభావాన్ని నింపకపోతే, మిమ్మలని కింది స్థానంలో నిలబెట్టకపోతే, మీరు వాళ్ళకి లోబడి ఉందరు. కేవలం ప్రజలని తమకి అనుగుణంగా మార్చుకోవటానికి మాత్రమే ఈ అర్హత అనే భావాన్ని సృష్టించారు. మనలోని వివేకాన్ని చంపేసి, మనలోని ఆధ్యాత్మికతను నాశనం చేసే ప్రాథమిక విషయం ఈ అర్హత అనే వ్యవహారం.
మీకు నిజం చెప్పాలి అంటే అర్హులయిన వ్యక్తులు మీకు ఎక్కడా కడనపదరు. వందల సంవత్సరాల సాధన తరువాత కూడా, వారు అర్హత పొందారా లేదా అనే విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించే ప్రశ్న అవుతుంది. అలా ఎందుకో తెలియదు. బహుశా మీలో అపరాధ భావాన్ని అంతగా నింపి ఉంటారు. స్పష్టంగా అర్థం చేసుకోండి, బొంబే సిటీలోనే కాదు, మీరు ఎక్కడ ఉన్నా అర్హులే. మీరు జీవించి ఉన్నారు అని అనుకుంటే, అదిచాలు, మీరు అర్హులవుతారు. ఈ అర్హత అనే దానిని మిమ్మలని మానసికంగా వేధించటానికి, మిమ్మలని ఉపయోగించుకోవటానికి మాత్రమే తీసుకువచ్చారు.
జెన్ బౌద్ధం నుంచి ఒక చక్కని కథః
ఒకవ్యక్తి గురువు దగ్గరికి ఇదే ప్రశ్నతో వెళతాదు. అతను గురువుని, "గురుదేవా! ఆధ్యాత్మిక ప్రగతికి నేను అర్హుడనేనా? నాలో చాలా అద్దంకులు ఉన్నాయి అని అనుకుంటున్నాను" అని గురువుని అడుగుతాదు.
అతని ప్రశ్నకి గురువు ఈవిధంగా సమాధానం ఇస్తాడు "అద్దంకు అనే ఒకే ఒకమాట నీలో ఉన్న అద్దంకు. ఇంకా ఏమీ లేదు".
అద్దంకు ఉన్నదా? అనే ఒక మాట మాత్రమే ఆథ్యాత్మిక జీవితానికి అద్దం. ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరూ దైవత్వంతో నిండి ఉన్నవారే. ఎప్పుడయితే ఒక వ్యక్తి దైవత్వంతో నిండి ఉన్నాడో, ఇక అతనికి కావలసిన అర్హత ఏమిటి? అతనికి ఏ అర్హత అవసరం. ఇటువంటి రూల్స్, నిబంధనలూ కేవలం మనుషుల్లో అపరాధ భావాన్ని నింపటానికి, వారిని క్రిందిస్థాయిలో ఉంచటానకి మాత్రమే. ఆ ఉద్దేశమే లేకపోతే, ఇక అర్హత అనేమాట ఉందదు. మీకు అర్హత కావాలి అని అంటే ఇక ఆధ్యాత్మికతకి అర్థం ఏమిటి? దాని ఉద్దేశం ఏమిటి? ఒక వ్యక్తి నాదగ్గరకి వచ్చి, "స్వామీజీ, నేను అనాయామా,
నియమాలను అసలు పాటించలేదు" అని అన్నాడు.
పతంజలి యోగాశాస్త్రంలో, యోగాకి మొదటి మెట్టు అనాయామా. అనాయామా అంటే అయిదు నియమాలని
పాటించటం. [బహ్మచర్యం, అహింస, సత్యం, అపయికరా, ఆస్టేయ. ఇవి ఐదు గొప్ప ప్రప్పాణాలు. ఇవి బ్రహ్మచర్యం పాటించటం, హింసా ప్రప్పత్తి లేకపోవడం, నిజం మాత్రమే పలకటం, దొంగతనం చేయకపోవటం, దేనిని ఆధీనపరచుకోకుండా ఉండటం. ఈ అయిదూ కూడా ప్రప్రాణాలు. నేర్సుకోవటానిక అర్హులవుతారు.
ఆ వ్యక్తి నన్ను ఇలా అడిగాదు, "స్వామీజీ, నేను ఈ ఐదూ పాటించలేదు. మరి నేను యోగాలోనికి ఎలా ప్రవేశించగలను?"
అతనికి నేను ఈ విధంగా సమాధానం ఇచ్చాను, "నీవు ఈ అయిదు నియమాలు పాటించి ఉంటే, అందులో అర్హత పొంది ఉంటే ఇక నీకు యోగాతో అవసరం లేదు".
పరిణితి, ధ్యానం రెండూ ఒకదానికి ఒకటి సహాయం చేస్తాయి. పరిణితి మీకు శక్తిని ఇసుంది, శక్తి మీలో పరిణితిని పెంచుతుంది. ముందుగా మీరు ఎక్కడ ఏదశలో ఉన్నారో అక్కడ సాధన ప్రారంభించండి. అప్పుడు మీ బంతి దానంతట అదే ద్రదొల్లుతూ వెళుతుంది.
ప్రబల 4) ప్రియమయిన స్వామీజీ, "నేను అనుకున్నాను, అందుకే నేను ఉన్నాను" (I Think, Therefore I am) అనేది నిజమేనా?
ఇదే పశ్నని వ్యతిరేక పద్ధతిలో చెబితే, కొత్తసీసాలో పాతవైను అవుతుంది.
స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు "నేను అనుకున్నట్లు, అని అనలేరు, అలాగే, 'నేను ఉన్నాను' అని కూడా అనలేరు. మీరు ఆలోచించలేరు. మీరు ఉండరు. ఇదే జవాబుని మీకు మరొక విధంగా ఇస్తాను. మీరు ఆలోచించరు, మీరు ఉందరు. మీరు ఉన్నారు అని అన్నప్పుడు, మీరు ఉండి తీరాలి అని అనుకున్నప్పుడు, అసలు మీరు ఉండి ఉంటే అని మీరు ఆలోచించరు. మీరు ఆలోచించితే ఉండి తీరాలి.
నిజానికి ఇది చాలా అయోమయమయిన, తికమక పెట్టే లేక మాలో ప్రపంచం ఉన్నదా అనే ప్రశ్న లాంటిదే. మనం ఉండి (జీవిస్తూ) ఆలోచించుతామా లేకపోతే ఆలోచించి అలా ఉంటామా? చూదండి, ఇది ఒక హద్దులు లేని విషయం. తిరిగి మీరు మళ్ళీ ఒక పాయింట్ దగ్గర నిలబడాలి అని అనుకుంటున్నారు. మీరు ఎడమ గంగలో స్నానం చేయాలి, అని అనుకుంటున్నారా లేక కుడి గంగలో స్నానం చేయాలి అని అనుకుంటున్నారా? మీరు ఎదమ గంగానది దగ్గర లేరు, కుడి గంగానది దగ్గర లేరు. మీరు గంగానది దగ్గర ఉన్నారు. మీరు ఆలోచించటం, ఉందటం అనే వాటి మధ్య తేదా లేదు అని అర్గం.చేసుకుంటే వాటిమధ్య హద్దులేదు అనే విషయాన్ని మీరు చూడగలుగుతారు.
ఈ రోజు నన్ను రాజ్ కారులో "పదార్గము శక్తి అనేవి
ప్రపంచంలో ఉన్నాయా" అని అడిగాదు. నేను లేదు అని చెప్పాను. పదార్ధం అనేది లేదు, కేవలం శక్తి మాత్రమే ఉన్నది. ఎప్పడుయితే శక్తి ఒక్కటే ఉన్నదో, అప్పుడు మీరు శక్తి అనేమాటని ఎలా చెబుతారు. అక్క ద మీరు శక్తి, పదార్గం అనే రెండు మాటలని ఉపయోగించవచ్చు. కాని అక్కడ ఒకే ఒక ఒక విషయం ఉన్నప్పుడు మీరు ఏవిధంగా పదార్గం లేదా శక్తి అని అనగలరు. అదేవిధంగా ఆలోచించటం, ఉండటం అనే రెండు విషయాలు లేవు. అక్కడ ఉన్నది ఒక్కటే.
కానీ మీరు హద్దులు సృష్టించుతారు. ఎందుకంటే హద్దులు లేకపోతే మనం సౌఖ్యంగా ఉండలేము. ఇది తర్కం. తర్కానికి ఉండే లక్షణం, విషయాలని ముక్కలు ముక్కలుగా చేయటం. అలా విషయాలని ముక్కలు చేయకపోతే మీరు అర్గం చేసుకోలేరు. ఆ విధంగా అర్డం చేసుకోవటమంటే, విషయాలకి ఏవో కొన్ని ముద్రలు వేయటం వాటిని మరింత తెలివితేటలతో తయారు చేయటం, వాటిని హేతుబద్ధం చేయటం. కేవలం మీ అవసరం కోసం ఎడమ గంగా, కుడి గంగా అని ఎలా అంటారో ఇది కూడా అంతే.కానీ నిజానికి రెండు గంగానదులు ఎక్కడ ఉన్నాయి. కేవలం పోల్చటానికి మాత్రమే ఎడమ ప్రక్క కుడి ప్రక్క ఉంటాయి. ఈ సృష్టిలో నిజానికి రెండు గంగానదులు లేవు. అదే విధంగా పోల్సటానికి మాత్రం ఆలోచించట, ఉందటం అనేవి ఉంటాయి. కానీ నిజానికి మీరు ఉన్నారు. అంతే కేవలం 'ఉంటారు' అనే పదమే 'ఉంటుంది'
మీరు హద్దులు కల్పించితే అప్పుడు మీరు ఇంతవరకూ ఆలోచించటం, ఆ తరువాత నేను ఉండటం (లేదా నా ఉనికి) అని అనుకుంటారు. కానీ ఆలోచించటానికి, మీ ఉనికికి మధ్య హద్దులేదు. మీరు "ఇక్కడ వరకూ నా ఉనికి ఇక్కడి నుంచి నా ఆలోచన" అని చెప్పగలరా? అటువంటి రెండు విషయాలు ఎక్కడా లేవు.
శక్తి, శివ అనేవి రెండు లేవు. అక్కడ ఉన్నది కేవలం ఒక్కటే అది శక్తి మాతమే అది ఎప్పుడయితే ఒక్కటే విషయం అవుతుందో అప్పుడు మనం దానిని శక్తి అని కూడా అనము. మీరు నేను ఉండి ఆలోచిస్తున్నాను లేక ఆలోచించి ఉంటున్నానా అని కలత చెందుతున్నంతవరకూ అయోమయంలో ఉంటారు. ఇవి రెండు కూడా ఇవి మనం ఆదుకునే రెండు పదాలు మాత్రమే. ఆడుకోవటానికైతే పరవాలేదు. కానీ నిజ జీవితానికి మాత్రం అన్యయించవద్దు. మీరు బొమ్మ విమానంలో ప్రయాణం చేయగలరా? అలా ప్రయత్నిస్తే మీరు ఎక్కడ ఆగుతారో మీకు తెలుసు. ఈ మాటలు లేదా పదాలతో కూడా అంతే. వాటితో ఆడుకోవటానికి బాగుంటుంది. కానీ వాటిని సీరియస్‌గా తీసుకుంటే, మిమ్మలని అవి ఎక్కడికీ తీసుకెళ్ళవు.
ప్రియమయన స్వామీజీ, ఆధ్యాత్మికత పేరుతో ఎందుకు ఇంత హింసాకాండ జరుగుతున్నది?
కొట్లాటలు, హింసాకాండలు అనేవి ఆధ్యాత్మికత వలన జరిగేవి కాదు. అవి మతాల వలన జరుగుతాయి. ఎప్పుడయితే ఆధ్యాత్మికత చైతన్యవంతంగా ఉంటుందో, అప్పుడు పోట్లాటలు, యుద్ధాలు ఉండవు. ఎప్పుడయితే బయట జరిగే మతపరమయిన పనులు చైతన్యంతో ఉంటే, అధికంగా ఉంటే, అప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి. మీరు భగవద్గీతకి ప్రాముఖ్యాన్నిస్తే సమస్యలేదు. కానీ ఎప్పుడయితే శ్రీ కృష్ణునికి ప్రాముఖ్యాన్ని ఇస్తారో సమస్యలు ప్రారంభమవుతాయి. కానీ భగవద్గీతను అర్దంచేసుకోవాలి అంటే శ్రీకృష్ణనికి కొంత ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి. గీతని శ్రీకృష్ణనితో ప్రారంభించటం చాలా కచ్చితంగా సరియైన పద్ధతి. కానీ కృష్ణనితో ముగింపు చేయాలి అన్నప్పుడే కొన్ని సమస్యలు వస్తాయి. చర్చిలో పుట్టటం చాలా అందమయన విషయం, అంతేకాని చర్చిలో చనిపోవటం కాదు. మీరు మతంతో ప్రారంభించి, ఆధ్యాత్మికంగా ముందుకి వెళితే అసలు గొడవలు ఉండవు.
మీకు అయోధ్య అంటే అర్థం తెలుసా? అయోధ్య అనేది అయోధి అనే మాట నుంచి వచ్చింది. అయోధి అంటే యుద్దాలు లేనిది. అయోధ్య అంటే యుద్ధాలు జరగని ప్రాంతం. ఈ విషయం ఆధారంగానే శ్రీరాముడు అయోధిని సృష్టించాడు, అదే ఆధారంగా అయోధ్య అని పేరు పెట్టాడు. నేననుకుంటాను బహుశః శ్రీరాముడు ఆ ప్రాంతాన్ని ప్రశాంతమయిన, అహ్లాదకరమయిన, సంతోషకరమయిన స్వర్గంలా ఊహించి ఉంటాడు. అందుకే ఆ ప్రాంతానికి అయోధ్య అని పేరు పెట్టాడు. అయోధ్య అంటే యుద్దాలకి, గొదవలని, పోట్లాటలకి అతీతమయినది అని అర్థం. మనం శ్రీరాముడిని పట్టుకొని అతని భావనని, అతని దృష్ణిని, ఆయన ఉద్దేసాన్ని వదిలివేశాము. ఇక్కడే సమస్యలు ప్రారంభమవుతాయి. మనం ఆయనని పట్టుకున్నాము, కానీ ఆయన ఉద్దేశాన్ని వదిలేసాము. మనం బైబిల్ పట్టుకోకుండా కైస్ట్‌ని పట్టుకున్నప్పుడు సమస్యలు వస్తాయి.
చాలా చక్కని చిన్ని కథ ఒకటి ఉన్నది. శ్రీరాముని భక్తుడు అయిన ఒక వ్యక్తి బెనారస్‌లో గంగానది ఒడ్డున నివసించేవాడు. ప్రతిరోజు ఉదయం ఆయన తులసీ రామాయణం నుంచి కొన్ని పాటలు పాడి, వాటిని చదివేవాడు. అతని దగ్గర తులసీరామాయణం ఒక్క పుస్తకం మాతమే ఉన్నది. అతను దివ్యత్వాన్ని పొందటానికి ప్రతిరోజూ తులసీ రామాయణాన్ని చదివేవాడు. అతను రోజంతా అక్కడ కూర్చోని రామనామాన్ని జపిస్తూ, రామనామంలోని మాధుర్యాన్ని ఆ ఆనందాన్ని అనుభవించేవాడు. ఎప్పుడూ ఆ పారవశ్యంలో ఉండేవాడు. ఆ ప్రాంతంలో అందరికీ అతను సుపరిచితుడు. అందరూ అతని దగ్గరికి వెళ్ళి అతని ఆశీస్పులు పొందేవారు. అతను జ్ఞానోదయమయిన వ్యక్తిలా నిరంతరం ఆనందంలో, పారవశ్యంలో జీవించేవాడు.
ఒకరోజు ఒక భిక్షగాడు అతని దగ్గరికి వచ్చి "అయ్యా! నేను గత మూడురోజులుగా భోజనం చేయలేదు. దయచేసి నాకు తినటానికి ఏదయినా ఇవ్వండి" అని అడుగుతాడు. అతను జ్ఞానోదయం పొందిన వ్యక్తి. అతను కరుణతో, ప్రేమతో నింపబడిన వ్యక్తి. భిక్షగాడు మూడురోజులుగా ఏమీ తినలేదు అని తెలిసి భరించలేకపోయాడు. అతను ఎంత బాధ అనుభవించాడో ఈయన అర్థం చేసుకుని చాలా బాధ పడ్డాడు. మామూలు మనుషులు, జాలిచూపించుతారు. కాని గురువులు, జ్ఞానోదయమయిన యోగులు, ఎదుటివారి బాధలను తమలో అన్వయించి (Empathy) వారికి సహాయం చేస్తారు. వారిని క్రింది స్థితికి చేరేలా చేస్తారు. సాధారణ వ్యక్తులు ఎదుటివారి బాధలను పంచుకున్నప్పుడు, వాళ్ళు కూడా బాధలలో పడిపోతారు. వాళ్ళ సమస్యలలో మీరు పడిపోతారు. దాంతో మీరు కూడా వాళ్ళ స్థితిలోనికి వెళతారు, ఆ బాధలలో భాగమయిపోతారు. కానీ గురువులు వారి ప్రేమతో బాధలలో ఉన్నవారిని పైకి లేపుతారు, వారిని ఉన్నత స్థితిలో నిలుపుతారు.
ఈ జ్ఞానోదయమయిన రామభకుడు, ఎవరో ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాదు అని తెలిసి భరించలేక పోయాడు. కానీ సహాయం చేయటానికి అతని దగ్గర తులసీ రామాయణం తప్ప ఏమీ లేవు. దాంతో ఆయన ఆ రామాయణాన్ని భిక్షగానికి ఇచ్చి ఇలా చెప్పాడు" దయచేసి ఈ పుస్తకాన్ని తీసుకో. దీనిని మార్కెట్‌కి తీసుకెళ్ళి, ఇది నా పుస్తకమని, నేను నీకు ఇచ్చానని చెప్పు. అప్పుడు ఎవరయినా సరే ఈ పుస్తకాన్ని చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఆ డబ్బుతో నీకు కావలసిన పదార్దాలు కొనుక్కొని నీ ఆకలి తీర్చుకో" అని చెబుతాడు.
రామభక్తునికి ఆ రామాయణ గ్రంథం చాలా పవిత్రమయినది. ఆయన ప్రతీరోజు దానిని పూజిస్తాడు. దానిని ఎవరికీ చూపించడు. అది అతని ప్రాణం, అతని ఆత్మ. అటువంటి ఆ గ్రంథాన్ని ఆయన భిక్షగానికి ఇచ్చేసి, దానిని మార్కెట్‌లో అమ్ముకొని ఆ డబ్బుతో ఆకలి తీర్చుకోమని చెప్పాడు.
భిక్షగాడు ఆ గ్రంథం తీసుకొని వెళ్ళిపోయాక, ఆయన శ్రీరామునికి ఈవిధంగా విన్నవించుకుంటాడు, "హే! శ్రీరామచంద్రా! నేను నీ మాట నిలబెట్టటానికి, నీ మాటలని ఇచ్చేసాను. నీ మాటలు పాటించి నీ మాటలని ఇచ్చేసాను".
శ్రీ రామచంద్రుని తత్వం ఏమిటి? అది ఇవ్వటం. అదే అంతిమ త్యాగం. శ్రీరాముడు త్యాగమూర్తి.
"నీ మాటలు నిలబెట్టడానికి నీ మాటలని ఇచ్చేసాను". మీరు మాట నిలపటానికి మాటలు ఇచ్చేస్తే సమస్యలేదు. గొడవలు రావు. అప్పుడు సహజంగానే ఐకమత్యం, పరమానందం, ప్రశాంతత, సామరస్యం అనే అనుభవాలు కలుగుతాయి. ఇందంతా మీరు మాటలని నిలెబట్టినప్పుడే సాధ్యపడుతుంది. అలా కాకుండా మీరు మాటలని మీ జీవితాలకి అన్వయించుకోకుండా వాటిని పుస్తకాలలో పెట్టెస్తే, అప్పుడు సమస్యలు మొదలవుతాయి. కాబట్టి మాటలు నిలబెట్టడానికి మీ మాటలను ఇచ్చేయగలిగితే, సమస్యలు రావు, సమస్యలు ఉండవు. ఇది ఒక్కటే ఈ సమస్యలకి పరిష్కారం. మరి వేరే దారిలేదు. మీ శక్తిని సమస్యలు అర్థం చేసుకోవటం లోనికి, మీ జీవితాన్ని అభివృద్ధి వైపు సాగటానికి ఉపయోగించండి. అంతేకాని మీశక్తిని బయటచేసే మతపరమయిన కార్యక్రమాలకి లేదా కొన్ని రూపాలకి ఇవ్వవద్దు.
కొంచెం వివరంగా చెప్పండి.
మీరు రెండు విషయాలు అడిగారు – చక్రాలు, మంత్రాలు. ముందు మీకు చక్రాలగురించి వివరించుతాను. మనలోపల సూక్ష్మంగా ఉండే శక్తి కేంద్రాలే ఈ చక్రాలు. వాటికి భౌతిక రూపంలేదు. వాటిని చైతన్యపరచటం ద్వారా ఒక వ్యక్తిలోని అనారోగ్యాన్ని పూర్తిగా తొలగించవచ్చు. మీలోపల ఉండే ఈ ఏడు శక్తికేంద్రాలు, మీలో జరిగే భౌతిక, మానసిక భావాత్మక, ఆధ్యాత్మిక చర్యలని నియంత్రిస్తాయి. మీ వైఖరిని, మీ పనులని ఈ చక్రాలు నియంత్రిస్తాయి, నిర్వహించుతాయి.
ఉదాహరణకిః మీరు ఒక మంచివార్తి విన్నప్పుడు కూడా మీకు కడుపులో గడబిడ మొదలయితే ఆ వార్త యొక్క ఆనందాన్ని అనుభవించలేరు. అలా కాకుండా, మీ కడుపు ప్రాంతం విరామంగా ఉంటే, మీ అంతరాత్మ తేలికగా ఉంటే, మీరు చెడు వార్త విన్నా లేదా ఎవరయిన ఒక పెద్ద తప్పు చేసినా మీరు దానిని తేలికగా తీసుకోగలుగుతారు. ఆ వ్యక్తిని క్షమించగలుగుతారు. ఈ చక్రాలు మీలోని భౌతిక, మానసిక, భావాత్మక, ఆధ్యాత్మిక పనులని నిర్వహించటంలో ప్రముఖ పాత్ర పోషించుతాయి. ఎప్పుడయితే వాటిని చెదరగొడతామో, ఎప్పుడయితే అవి మీ వ్యవస్థలో తేలికగా ఇమడలేవో, అప్పుడు మీకు అనారోగ్యం కలుగుతుంది. అవి మీ అంతరాత్మతో తేలికగా, ఇమడలేని స్థితి, అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ చక్రాలని సరియైన పద్ధతిలో, సరియైన విధంగా చైతన్యపరిస్తే, మీరు అనారోగ్యం నుంచి బయట పడతారు. మీరు అనారోగ్యం నుంచి బయటకి రావటమే కాదు పరిపూర్ణ ఆరోగ్యస్థితి అంటే ఉండే అనుభవాన్ని పొందగలుగుతారు. ఆ రుచిని తెలుసుకుంటారు.
మీకు ఎటువంటి అనారోగ్యం లేకపోయినా, మనం పరిపూర్ణ ఆరోగ్యస్థితిని ఎప్పుదోగాని అనుభవించము. దీనికి స్కేలు ఏమిటి? దీనిని ఎలా కొలవాలి. మీరు పరిపూర్ణంగా మంచి స్థితిలో ఉన్నారు అని తెలుసుకోవటం ఎలా? ఉదయాన్నే నిద్రలేవగానే, మీరు బాత్‌రూంకి వెళ్ళేటప్పుడు మీ నడకని గమనించండి. కేవలం అడుగులు వేస్తున్నట్లు కాకుండా అవి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటే మీరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు అని అర్థం. మీరు చాలా మంచి స్థితిలో ఉన్నారు అని తెలుస్తుంది. అంటే మీరు బాత్‌రూంకి నడిచే అడుగులు, అడుగులులా కాకుండా నాట్యంలా ఉండాలి. మీ అంతరంగం, అసలయిన మీరు అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే అదే సరియైన సమయం. సరిగ్గా ఆసమయంలోనే మీరు మీ అచేతన స్థితి నుంచి బయటకి వస్తారు. ఆ సమయంలోనే మీరు ఎవరు? మీరు ఏమిటి అనే విషయాన్ని కొలవటానికి సరియైన సమయం.
ఉదయాన్నే నిద్రలేవగానే జంతువులు ఎలా ఉంటాయో ఒక్కసారి గమనించండి. అదేవిధంగా నిద్రలేవగానే పక్షులు ఎలా ఉంటాయో చూడండి. ఆవు దూడలని చూడండి. అవి తమకి కట్టిన తాళ్ళ మీదుగా ఎలా దూకుతుంటాయో. అదే పిల్లి అయితే చుట్టూ గెంతుతూ తిరుగుతుంది. మనిషి అనే ఒక్క జీవి మాత్రమే నిద్రలేచి ఇటు దొర్లి, అటు దొర్లి, తిరిగి నిద్రపోయేది. మనిషి అనే ఒక్కజీవి మాత్రమే అలారం మోగాక దానిని కట్టేసి మళ్ళీ నిద్రపోయేది. మనిషి ఒక్కటే ఈ ప్రకృతితో ఈ సర్వసృష్టితో సంబంధాలను పూర్తిగా తెంపుకొని జీవిస్తున్న ప్రాణి.
ఒక చిన్న కథః
ఒక మధ్యవస్సు ఉన్న వ్యక్తి ఏవో కొన్ని కారణాల మూలంగా తన భార్యని బయటకి పంపించేయాలని అనుకున్నాడు. అతని భార్యకి ఒక పిల్లి ఉన్నది. అతను భార్యని, పిల్లిని ఇద్దరినీ వదిలించుకోవాలి అని చూస్తున్నాడు. ముందు పిల్లిని వదిలించుకోవాలి అని అనుకుని, ఒకరోజు దానిని పట్టుకొని పదిమైళ్ళ దూరంగా, తెలియని ప్రదేశంలో వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు. అతను ఇంటికి వచ్చేటప్పటికి, ఇంటి గుమ్మం దగ్గర పిల్లి నిలబడి అతని కోసం ఎదురుచూస్తూ ఉన్నది.
మర్నాడు ఆ వ్యక్తి పిల్లిని తీసుకొని వాళ్ళ ఊరికి ఇంకొక పక్కకి 20 మైళ్ళ దూరం వెళ్ళి అక్కడ వదిలి పెట్టి, తిరిగి ఇంటికి వస్తాడు. ఒక గంట గడిచాక అతను పిల్లిని ఇంటి ముందు చూస్తాడు.
ఆ వ్యక్తికి చాలా కోపం వస్తుంది. చాలా అశాంతిగా ఉంటాడు. మూడవరోజు అతను ఆ పిల్లిని ఒక గోనెసంచిలో మూటకట్టి, కారులో దూరంగా తీసుకెళ్ళాడు. అలా వెళ్ళేటప్పుడు పిల్లికి దారి తెలియకుండా, కుడివైపు ఎడమ వైపు ఇలా డైవ్ చేసుకుంటూ, కాసేపు తూర్పువెపు కాసేపు పడమర వైపు ఇలా గజి బిజిగా రెండు మూడు గంటలపాటు ప్రయాణం చేసి ఒక అడవిలోనికి వెళ్ళాడు. ఇక ముందుకు దారి లేదు. అక్కడి ఆగి అతను "నేను ఎప్పుడూ ఈ ప్రాంతానికి రాలేదు. ఇక ఈ పిల్లి తిరిగి ఇంటికి రాలేదు, అని అనుకున్నాడు." ఇప్పుడు పిల్లిని ఇక్కడ వదిలిపెడతాను. దీనిని వదలటానికి ఇదే సరైన ప్రదేశం నాకే ఈ స్థలం గురించి తెలియదు. ఇక ఈ పిల్లి వెనక్కి రాదు. అని అనుకొని ఆ మూటని అక్కడ వదిలి వెనక్కి వచ్చాడు.
వెనక్కి తిరిగి ఇంటికి వెళుతూ దారిలో భార్యకి ఫోను చేసి "పిల్లి ఇంటిలో ఉన్నదా?" అని అడిగాడు. దానికి అతని భార్య "పిల్లి ఇక్కడే ఉన్నది." అని జవాబు చెప్పింది.
అప్పుడు అతను భార్యతో "అలా అయితే పిల్లిని అడిగి మన ఇంటికి దారి తెలుసుకో. నేను దారితప్పాను. ఇంటికి ఎలా రావాలో తెలియటం లేదు. పిల్లికి దారి తెలుసు. ఎలాగో ఒకలా దానిని అడిగి దారి తెలుసుకో" అంటాడు.
మనిషి ఒక్కటే ప్రకృతితో పూర్తి సంబంధాలు తెంచుకున్న ప్రాణి దాంతో మనిషి పూర్తిగా దారితప్పాడు.
కాబట్టి ఉదయాన్నే నిద్రలేవగానే మీ అడుగులు నాట్యంలా ఉన్నాయనుకోండి, మీరు దారితప్పలేదు అని అర్థం. మీరు చాలా చక్కగా జీవిస్తున్నారు. అని అర్థం మనలోని చక్రాలని చైతన్యపరిస్తే, మీరు అనారోగ్యం నుంచి బయటపడటమే కాకుండా, పరిపూర్లమైన మంచి జీవితం యొక్క అనుభవాన్ని, ఆ చక్రాలు ఇస్తాయి. ఆ రుచి ఏమిటో చూపిస్తాయి. మనలో చాలా మందికి పరిపూర్ణయమయిన మంచి జీవనస్థితి అంటే తెలియదు. మనం ఎప్పుడూ ఆ స్థితకి వెళ్ళలేదు. మన స్థితి ఎలా ఉంటుందంటే, పుట్టుకనుంచి చూపులేని వ్యక్తికి అతను ఏమి కోల్పోయాడో అసలు తెలియదు. అదేవిధంగా మంచి జీవితం అంటే ఏమిటో తెలియక మనం చాలా కోల్పోయాం. కానీ మనం ఎంత పోగొట్టుకున్నామో మనకి అర్ధం కాదు. మంచి జీవితం యొక్క అనుభవం ఎలా ఉంటుందో మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము. ఎందుకంటే మనం దానిని చాలా చిన్న వయస్సులోనే పోగొట్టుకున్నాము. కాబట్టి మీరు ఈ చక్రాలలోనికి ప్రవేశించినప్పుడు, మీరు ఇన్నిరోజులు ఏమి పోగొట్టుకున్నారో అర్థమవుతుంది. ఇదే చక్రాలకి సంబంధించిన ప్రాథమిక వివరణ.
ఇప్పుడు మంత్రాల గురించి చూద్దాము. ఎప్పుడూ కూడా పదాలని పదాలే అని అనుకోవద్దు (Never think words are just words). సృష్టంగా అర్థం చేసుకోండి. ఎప్పుడూ మాటలు కేవలం మాటలే (లేదా) పదాలు అని అనుకోవద్దు. అవి శక్తిమయాలు. శక్తితో నిండినవి. ఉదాహరణకి నేను 'ఆవు' అని అనగానే మీ మెదడులోనికి ఒకరూపం వస్తుంది. దానికి నాలుగుకాళ్ళు, ఒకతోక, రెండు కొమ్ములు, రెండు చెవులు ఇలా ఒక రూపం మీ ముందుకి వస్తుంది. అవునుకదా? కేవలం ఒక చిన్న శబ్దాన్ని సృష్టించగానే వెంటనే మీ వ్యవస్థలో ఒకరూపం ఏర్పడింది. అలా చెప్పకుండా, ఏ శబ్దం సృష్టించకుండా మీలో ఒక రూపాన్ని తీసుకురావటానికి ప్రయత్నించండి. ఒకమాట అనకుండా, ఒక శబ్ధం లేకుండా మీరు ఏ రూపాన్నీ మీలోపల చూడలేరు. అలా మీరు ఎప్పటికీ చేయలేరు. ఈవిధంగా ఒక రూపాన్ని మీలో చూడగలగలటాన్ని ఇచ్చాశక్తి అంటారు.
మీ లోపల మూడు రకాల శక్తి ఉన్నది. అవి ఇచ్చా శక్తి క్రియా శక్తి, జ్ఞాన శక్తి. మిగతా రెండు శక్తులకు ఇచ్చా శక్తి ప్రాథమిక లోహం లాంటిది. ఈ ప్రాథమిక లోహం నుంచి బంగారాన్ని సృష్టించవచ్చు. ఇచ్చా శక్తి అనే ఒక ముడి పదార్థం నుంచి క్రియాశక్తిని, జ్ఞానశక్తిని తయారుచేయవచ్చు. అది 22 కారెట్ల బంగారం అయితే అది క్రియాశక్తి అవుతుంది. ఎప్పుడయితే అది 24 కారెట్ల బంగారం అవుతుందో అది జ్ఞానశక్తి, ముడి పదార్థం ఇచ్చా శక్తి. 22 కారెట్ల బంగారం క్రియాశక్తి 24 కారెట్ల బంగారం జ్ఞానశక్తి. అయితే ముడిపదార్థం ప్రాథమికమయినది. రూపాన్ని చూడగలగటం, దేనినైన ఊహించగల సామర్యాన్ని ముడిపదార్థం అంటాము. కాబట్టి ఏదైనా ఒక రూపాన్ని చూడగల సామర్థ్యంకి, పదాలకి చాలా దగ్గర సంబంధం ఉన్నది.
ముడిపదార్గానికి మంత్రాలను కలిపితే, ముడి పదార్థం స్వచ్చమయిన బంగారంలా మారే కార్యక్రమం అవుతుంది.
మంత్రం అనే పదాన్ని రెండు అర్థాలు ఉన్నాయి.
మన్ తః మన్ అంటే మానవ జాతి. త అంటే దారి చూపేది. కాబట్టి మంత్రం అంటే మనుషులకి మార్గాన్ని చూపించేది అని అర్ధం.
మన్ – త్రః మన్ అంటే మైండ్ అని కూడా అర్థం ఉన్నది. త అంటే దారి చూపేది. కాబట్టి మంత్రం అంటే మైండ్ లేదా మనస్సులోనికి దారి చూపేది. మైండ్ నుంచి బయటకి తీసుకు రాగలిగేది.
కాబట్టి మనిషిని మైండ్ నుంచి బయటకి తేగల సాంకేతకి పద్ధతి మంత్రం. మీరు ఈవిధంగా కూడా చెప్పవచ్చు. ఇది మనిషిని ప్రపంచం నుంచి బయటకి తీసుకువచ్చే ఒక నైపుణ్యం లేదా ఒక పద్దతి, ఇది మనిషికి దారి చూపించే ఒక పద్దతి ఎప్పుడయితే మంత్రాలను మీ అంతరాత్మకి, మీ ఉనికిని నిరంతరం కలుపుతూ ఉంటే, అది ముడి పదార్ధాన్ని శుభ్రపరిచే యాసిడ్ లా పనిచేసి, దానిని 22 కారెట్ల బంగారంలో తయారు చేస్తుంది. ఆ ప్రకారం మీరు ఇంకాచేస్తే అది చివరికి 24 కారెట్ల బంగారం అవుతుంది. కాబట్టి మంత్రం అనేది ఆధ్యాత్మిక స్థితికి చేరటానికి, జ్ఞానోదయం పొందటానికి, లేదా మన నిత్య జీవితానికి కాని మంత్రం చాలా శక్తివంతమయిన సాంకేతిక పద్ధతి.
మన రోజువారి (దైనందిన) జీవితానికి కూడా మంత్రాలు కావాలి. మంత్రాలు సంస్కృతంలోనే ఉండాలి అని లేదు. మీరు ఇంగ్లీషు, లేదా తెలుగు మంత్రాలని కూడా ఉపయోగించవచ్చు. నేను నా ఆఫీసులో విజయం సాధించాలి అనిగాని, నేను నా వ్యాపారంలో బాగా అభివృద్ధి సాధించాలి అని కాని, నేను ఒక వ్యక్తిని ఒప్పించాలి ఇలా ఏదైనా కూడా మంత్రాలే. ఏమాటలయితే మీకు తెలియకుండా మీలోపల జపిసుంటారో అవి మంత్రాలే. మంత్రాలంటే ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయా ఇవే మంత్రాలు కాదు. ఇవి ప్రాచీలకాలపు మంత్రాలు. ఈ ఆధునిక రోజుల్లో మంత్రాలు అంటే, మీరు నిద్రలేవగానే మీరు అనుకునే మాటలు. ఇవాళ నేను అతనితో మాట్లాడి ఆ వ్యవహరం పూర్తి చేయాలి. ఇలా మీరు ఏది అంటే అదే మండ్రం అది ఒకదానిని సాధించటానికి అవసరమయిన దారి.
మీ జీవితంలో నిజమయిన ఏ విషయమయినా ముందుగా అది ఒక మంత్రం రూపంలో ఉంటుంది. తరువాత అది నిజమవుతుంది. మంత్రం అచేతన స్తితిలో ఉంటే దాని ఫలితం కూడా అచేతన స్థితిలోనే ఉంటుంది. మంత్రం చేతన స్థితిలో ఉంటే అప్పుడు ఫలితంకూడా చేతన స్థితిలోనే ఉంటుంది. మంత్రాన్ని చేతనస్థితిలో జపించితే, దాని ఫలితాలు మీకు తెలుస్తాయి దాని ఫలితాలతో ఎలా ఆనందించాలో మీకు తెలుస్తుంది. మంత్రాన్ని మీకు తెలియకుండా (అచేతన స్థితిలో) జపించితే దాని ఉద్దేశము, దాని ఫలితాలు మీకు తెలియవు. అదే మీకు తెలిసేవిధంగా చేస్తే మీకు దాని ఉద్దేశం సృష్టంగా తెలుస్తుంది. దాని ఫలితంగా మీరు ఎక్కడికి వెళతారో, మీకు ఏమిజరుగుతుందో తెలుస్తుంది.
మీ మైండ్‌లోపలికి సచేతన స్తితిని ప్రవహింపచేస్తే, దానిని మీ మంత్రం యొక్క వ్యవస్థలోనికి నింపగలిగితే, అప్పుడు మీకు దాని దారి, దాని లక్ష్యం సృష్టంగా తెలుస్తుంది. మీ గమ్యానికి మీరు క్షేమంగా అందంగా, నాట్యం చేస్తూ చేరగలుగుతారు. మీరు నడవరు. అదే అచేతన స్థితిలో చేస్తే మీకు మీరు వెళ్ళవలసిన దారికాని, మీ గమ్యంకాని తెలియవు. దాంతో సహజంగానే మీరు ఈడ్చుతున్నట్లుగా వెళతారు. మీరు ప్రయాణం చేయరు. మీరు చేతన స్థితిలో ఉంటేనే ప్రయాణం చేస్తారు. మీరు మీకు తెలియని స్తితిలో అంటే మీరు ఈడ్చుకుంటూ మాత్రమే నడుస్తారు. మీకు కారుని ఎలా నడపాలి, ఎలా బ్రేక్ వేయాలి అనేవి తెలిస్తే మీరు కారు డ్రైవ్ చేసారు. మీకు తెలియకపోతే కారు మిమ్మలని డ్రైవ్ చేస్తుంది.
మనందరం మంత్రాలను నిరంతరం జపిస్తూ ఉంటాము. మనం మతాన్ని నమ్మేవారమయిన, నమ్మని వారమయినా, ఆధ్యాత్మిక వ్యక్తులయిన లేదా భౌతిక వాదులయినా మనం మంత్రాలని జపిస్తుంటాము. మీరు మంత్రాలని నిరంతరం చేతన స్థితిలోనయినా, అచేతన స్థితిలోనైనా జపిస్తూ ఉంటారు. అంతే.
మీరు మంత్రాలని మీకు తెలిసేలా చేతన స్థితిలో జపిస్తే, మీకు కారుని ఎలా ఆపాలో తెలుస్తుంది. అప్పుడు మీరు కారుని నడుపుతున్నారు. మంత్రం మిమ్మలని జపిస్తే, మీలోని అచేతనస్థితిలో జరిగితే, కారు మిమ్మలని నడుపుతుంది. మీరు కారు నడిపితే మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసు. కారు మిమ్మలని నడిపితే మీరు ఎక్కడికి వెళుతున్నారో మీకు తెలియదు.
(ప్రియమయన స్వామీజీ, మీరు మమ్ములని ఈ సర్వస్థుష్టిలో భాగం అని చెప్పారు. నేను ప్రత్యేకమయిన వేరే వ్యక్తిగా అనుభవాన్ని పొందాను. దీనిని వివరించండి.
మీరు సర్వస్థుష్టికి, సర్వాతర్యామి నుంచి వేరు అని మీరు అనుకుంటారు. కానీ మీరు వేరే కాదు. మీరు కావాలి అని అనుకున్నా, వద్దు అనుకున్నా మీరు సమ్మతించినా, లేకపోయినా, మీకు అర్థమయినా, అర్థం కాకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు భగవంతునితో సంబంధం ఉన్నవాళ్ళే. ఇది ఎలా అంటే మీరు భగవంతుని బిడ్డలే. మీ ఒడిలో చిన్న పాప ఉన్నదనుకోండి. ఆ పాప మిమ్మలని కొట్టినా, కాళ్ళతో తన్నినా, అలా కొడుతూనే ఉన్నా ఆ పాప మీ ఒడిలోనే ఉంటుంది. అదేవిధంగా మీరు ఒద్దు అని అనుకున్నా మీరు దైవత్వంలోనే ఉంటారు.
మీరు నదీప్రవాహంతో ఈదుతున్నా, ప్రవాహానికి ఎదురు ఈదుతున్నా మీరు నదితో సంబంధం కలిగి ఉంటారు. మీరు విశ్వమనస్సుతో, విశ్వచేతన స్థితిలో బంధం ఏర్పరచుకునే ఉంటారు. అన్ని మైండ్స్ (మనస్సులు) ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మీరు విశ్వచేతన వలయాన్ని ఉంటుంది. మధ్య నుంచి చివరకి వచ్చేకాద్దీ మీకు మిగతా వారికి మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. మీరు వలయం మధ్యకి వచ్చేకాద్దీ మీరు మీ పక్కవారికి, మిగతావారికి దగ్గరగా వస్తారు. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ మానసిక దశ మీ అంతరాత్మ దశలో అందరూ ఒకరినొకరు సంబంధం కలిగి ఉంటారు.
కాబట్టి మీరు తెలిసేటట్టుగా, మీచేతన స్థితిలో మీరు ఏమిచేసినా అది మీ మైండ్‌లో అలలను సృష్టిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే మీరు సరస్సులోనికి ఒక రాయిని విసిరితే, అది చిన్న చిన్న అలలను సృష్టించుతుంది. ఆ అలలు సరస్సు ఒడ్డుకి చేరతాయి. అవి కెరటాలలా విస్తరించుతాయి. అదేవిధంగా మీరు మంత్రాన్ని
ఒక రాయిలా మీ చేతన స్థితిలో మైండ్‌లోనికి వదిలితే, అది అలలని సృష్టిస్తుంది. ఆ అలలు సరస్సు ఒద్దకి చేరతాయి. అవి సరస్సు అంతా విస్తరించి మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక్క విషయం, రాయి పెద్దదయితే అలలు పెద్దగా ఉంటాయి. రాయి చిన్నదయితే అలలు చిన్నగా ఉంటాయి.
కాబట్టి మీరు ఎప్పుడు మంత్రాన్ని చదివినా, లేదా దేనినైనా జపించినా, మీరు ఎవరికోసమయినా ప్రార్థించినా, అది తప్పనిసరిగా దాని ప్రభావాన్ని మీ అంతరాత్మమీద, మిగతావారి మీద చూపిస్తుంది. అది రాయి లోపల పడినట్లు మీలో ప్రవేశించుతుంది. అది మైండ్‌లోనికి పడినప్పుడు అది అలలని సృష్టిస్తుంది. అది మీ వ్యవస్థలోను, వేరేవారి వ్యవస్థలోనూ కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు సరస్సులోనికి రాయి వేసినప్పుడు, సరస్సు ఒద్దుకి ఏమి జరుగుతుందో, అదే రకమయిన ప్రభావం మిగతావారి మీద కూడా ఉంటుంది. ఆ సరస్సు మధ్యలో ఏమి జరుగుతుందో, అంత ప్రభావం మీ అంతరాత్మలో జరుగుతుంది. కాబట్టి మీరు వేరే వారి గురించి ప్రార్థిస్తే, దాని ప్రభావం ఎదుటివారి మీదకన్నా మీ మీద ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి మీద కూడా ప్రభావం ఉంటుంది, కానీ ఫలితం మీకు ఉంటుంది. ఎదుటివారు కేవలం ప్రభావితమవుతారు. మీకు ఫలితం ఉంటుంది.
(ప్రియమయిన స్వామీజీ, చక్రాలు అత్యధికంగా ఉత్తేజమయితే దానివలన మనకి ప్రక్క నష్టాలు ఉంటాయా?
చక్రాలని సరియైన పద్ధతిలో, సరియైన విధంగా చెతన్యపరిస్తే అవి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ వేరే సమస్యలని తీసుకురావు. నేను రూపొందించిన పద్ధతులన్నీ చాలా నమ్మకమయిన పద్ధతులు. వాటితో ఎటువంటి సమస్యలు ఉండవు. మీరు ఏదో కొంచెం తప్పగా చేస్తే, దాని అసలు ప్రభావం కొంచెం తగ్గుతుంది. అంతే దానివలన ప్రక్కన వచ్చే సమస్యలు కాని, తరువాత వచ్చే సమస్యలు కానీ ఏమి ఉండవు. ఉపయోగించే పద్ధతి సరిగా ఉండాలి. అది సరిగా ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు.
ఇక రెండవ విషయంః అత్యథికంగా ఉత్తేజపరచటం అనేది చక్రాల విషయంలో లేదు. చక్రాలు బాగా చైతన్యమయితే, అవి బాగా విస్తారమవటాన్ని మీరు మీ చేతనస్థితిలో తెలుసుకుంటారు. అది మీకు ఇంకా ఇంకా మంచిని చేస్తాయి. మీరు అమృతసాగరంలో పడితే చనిపోరు. మీరు ఇంకా ఇంకా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా బాగా చెతన్యవంతమైన చక్రాలు చెడు ఫలితాలని ఇవ్వవు. అవి బాగా చైతన్యమయితే, దాని ఫలితంగా మీ ఉనికి, మీ జీవితం చాలా బాగుంటాయి. మీరు ఆనంద స్థితిలో ఉంటారు. మీకు ఆధ్యాత్మిక అనుభవాలు జరుగుతాయి చివరిగా మీకు
జ్ఞానోదయమవుతుంది. అవి మిమ్మలని విసిగించవు. అసౌకర్యంగా చేయవు. చక్రాలు స్తబ్దతగా, మెల్లగా, సోమరిగా ఉన్నప్పుడు, చక్రాలలోని తమస్సు సమస్యలని సృష్టిస్తుంది.
(పియంమైన స్వామీజీ, నేను ఒక గురువుని అనుసరిస్తున్నాను. అటువంటప్పుడు నేను ఈ ధ్యానపద్ధతులని పాటించవచ్చా?
ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. సాధనకి గురువులను మార్పు చేయటానికి సంబంధం లేదు. అర్థం చేసుకోండి, మీరు ఈ రెండురోజుల కార్యక్రమానికి హాజరయినంతలోనే మీరు గురువులని మార్చనవసరం లేదు. గురువులందరూ కూడా ఒకే విధమయిన శక్తితో నింపబడినవారే. అందుకే నేను ఎప్పుడూ ఎవరికీ గురువుని మార్చమని చెప్పను. ఇదంతా ఒకే రకమయిన శక్తి వేరు వేరు మార్గాలలో ప్రవహిస్తుంది.
కొంతమందికి నా దగ్గరికి వచ్చి అడుగుతారు, "స్వామీజీ, నేను వేరే ప్రపవచనాలకి కార్యక్రమాలకి వెళ్ళవచ్చునా? నేను మరొక గురువుని అనుసరించవచ్చునా? అని. తప్పకుండా చేయవచ్చు. ఇదేమి వ్యాపారం కాదు. నేను మిమ్మలని వేరే షాపు నుంచి తీసుకురాలేదు. ఆధ్యాత్మికతని వ్యాపారా స్థితికి దిగజార్చకూడదు. మీకు ఎవరు గురువు అయినా, మీరు ఎవరివైపు ఆకర్షింపబడతారో, ఎవరి పద్ధతి మీకు అనుకూలంగా ఉంటుందో ఆయనే మీకు గురువు. ఆయనే మీకు
పూర్తిగా గురువు. ఇది మీకు కేవలం సహాయంగా మాత్రమే ఉంటుంది. ఇది మిమ్మలని ఉత్తేజే పరుస్తుంది. ఇది మీ గురువులని మీరు అనుసరించేలా మేలుకొలుపుతుంది. నేను మీకు ఇచ్చేది కేవలం శక్తి, ఉత్తేజం. ఈ శక్తి, ఉత్తేజం మీరు వెళ్ళేమార్గాలలో మిమ్మలని వికసింపచేస్తాయి అంతే. దీనిలో గురువులని మార్చటం కానీ, మీ నమ్మకాలని లేదా మీ మతాలని మార్చటం కానీ, మీ ఆధ్యాత్మిక పద్ధతులని మార్చే విషయం కానీ ఉండవు. మీరు ఈ కార్యక్రమంలో పొందేది శక్తి, ఉత్తేజం మాత్రమే.
అయితే కుండలిని శక్తిని మేలుకొలపటం మాత్రం గురుశక్తి యొక్క కృపతోనే సాధ్యం. నేను గురువుల కృప అని అనటంలేదు. గురువుల యొక్క శక్తి కృపతో అంటున్నాను. గురుశక్తి! అన్ని గురుశక్తులూ ఒక్కటే. అది తీసుకునే రూపంలో మాత్రమే తేడా ఉంటుంది.
రాముడికి, కృష్ణుడికి ఎప్పుడూ విరోధం లేదు. కాని శ్రీరాముని వానరాలు శ్రీకృష్ణుని గోవులూ మాత్రం చివరి వరకూ పోట్లాడుకుంటూనే ఉంటాయి. గురువులని మార్చటం, ఇలాంటి మాటలన్నీ కేవలం మనలోని అమాయకత్వంతో మనం అనే మాటలు. ఏమీ మార్చనవసరం లేదు. కేవలం మీలో ఉత్తేజము, శక్తి మేలుకొంటే చాలు. కాబట్టి మీరు ఈ రెందురోజుల కార్యక్రమానికి హాజరయినందుకు ఏమీ మార్చనవసరం లేదు. మీరు గురువులని
కానీ, మీ నమ్మకాలని కాని, దేనినీ మార్చనవసరం లేదు. ఇది కేవలం మీ వ్యక్తిత్వాన్ని మాత్రం మారుస్తుంది. అంతకుమించి మరేమి ఉండదు.
ఈ సెషన్ పూర్తి చేయటానికి టైం అయింది. చివరి ప్రశ్న. దీనికి జవాబు చెప్పాక ఈ సెషన్‌ని ముగించుదాము.
(పియుమైన స్వామీజీ, ఇక్కడ కార్యక్రక్రమంలో పాల్గొనేవారు, కార్యకర్తలు ఎందుకు తెల్లటి దుస్తులనే వేసుకుంటారు.
మైండ్ రంగులవలన బాగా లోతుగా ప్రభావితం అవుతుంది.
పశ్చిమదేశాలలో ఈ విషయం మీద కొన్ని కొత్త విషయాలని కనుక్కొన్నారు. దాని ఆధారంగా ఒక కొత్త చికిత్సా పద్ధతి ప్రవేశ పెట్టారు. అదే రంగులతో చికిత్స (Colour Therapy). అది మీకు తెలుసా? మీరు మీ బెడ్‌రూంలో ఎరుపురంగు బల్బు పెడితే మీకు మంచి నిద్రపడుతుంది. అదే బ్లూరంగుది అయితే మంచి కలలు లేని నిద్రపడుతుంది. అలా చాలా ఉన్నాయి. రంగురంగులు ఎక్కువ వాడితే, మైండ్ బాగా చైతన్యవంతమవుతుంది. బహుశ అందుకే డిస్కో రంగులు చాలా రంగులతో ఉంటాయి. భరత్ లో దీనికి ఆపేరు పెట్టకుండా కొన్ని శతాబ్దాల నుంచి రంగులతో చికిత్స చేసే పద్ధతిని పాటిస్తున్నాము.
తెలుపురంగుకి మన మైండ్‌లో ప్రశాంతతను సృష్టించే
సామర్థ్యం ఉన్నదని మనకి తెలుసు. దానికి స్వీకరించే దృక్పథం ఉంటుంది. తెలుపురంగు దుస్తులు వేసుకుంటే అనవసరమయిన సంశయాలు, అనవసరమయిన ఆలోచనలూ తగ్గుతాయి. తెలుపు ఆహ్లాదకరమయిన మానసిక స్థితిని సృష్టిస్తుంది. మనసుని విరామంగా ఉంచుతుంది, మనం ఆనందంగా, సామరస్యంగా ఉండగలం. అందుకే తెలుపు రంగు వేసుకోమని చెబుతాము. ఇది తప్పనిసరి కాదు. నేను ఏ విషయాన్ని నిర్భంధం చేయను. ఇది ఒక సలహా మాత్రమే. ఎవరయినా ఏరంగు దుస్తులేసుకుని వచ్చినా పరవాలేదు. అది చాలు. మీరు తెలుపురంగు దుస్తులలో రాకపోతే ఈ కోర్సు చేయకూడదు అని ఏమీ ఉండదు. ఇక్కడ ఇచ్చే రూల్స్ అన్నీ కూడా మీకు మంచి ఫలితాలను పొందగలిగేవిధంగా ఉండే మార్గదర్శకాలే. మిగతాది మీ బాధ్యత. ఇది మీరు కొంచెం అర్థం చేసుకునే విధంగా ఇవ్వబడింది. అంతే. ఈ సెషన్ ముగించటానికి టైం అయింది.
నా ప్రేమ, ఆశీస్సులు సదా మీతో ఉండుగాక
ధన్యవాదములు.