1. The Path of Meditation
ఆనంద స్థితిని చేరటానికి ఒక కచ్చితమయిన మార్గం ధ్యానం.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ విధంగా అంటారు, మీరు మీలోపల ఉండే పరమానంద స్థితిని కనుగోనటానికి సిద్ధమవ్వటమే ధ్యానం. మీరు బయట ప్రపంచంలో ఆనందం కోసం వెతకటం అనేది ప్రయోజనం లేని పని, అని ఏ నిమిషాన తెలుసుకుంటారో అప్పుడు మీరు ధ్యానానికి సిద్ధపడినట్లే.
ధ్యానం నిర్వచనం?
ధ్యానం అంటే ఏమిటో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ విధంగా చెబుతారు. ధ్యానం అనే పదాన్ని చాలా మంది యోగులు చాలా రకాలుగా నిర్వచించారు. వారంతా వారి వారి అనుభవాల ఆధారంగా ధ్యాన స్థితిని, ధ్యాన పద్ధతిని, ధ్యానాన్ని నిర్వచించారు. అదే విధంగా ఆయా సందర్భాలలో ఉండే అవసరాన్ని బట్టి కూడా ధ్యానాన్ని వివిధ రకాలుగా నిర్వచించారు.
ధ్యానం అంటే ప్రకటన.
ధ్యానం అంటే మనలో నిక్షిప్తమయిన, మన అంతరంగంలో బందించబడిన సంపదలని కనుగొనటానికి సహాయం చేసే ఒక ప్రక్రియ. ధ్యానం మనని విశ్వశక్తితో కలపగలిగే ఒక పద్ధతి. ఈవిధంగా ధ్యానాన్ని అనేక రకరకాలుగా నిర్వచించారు. స్వామీజీ ఈ విధంగా చెబుతారు,
కానీ నేను చెప్పే నిర్వచనం, ధ్యానం అంటే ఆక్షణంలో ఆనంద స్థితిలో ఉండగలగటమే. ఎప్పుడయితే మీరు ఆ క్షణంలో ప్రశాంతంగా ఉండగలరో మీరు ధ్యాన స్థితిలో ఉన్నట్లే. అంతకుమించి మీరు చేసేది ఏమీ లేదు.
ధ్యానం మిమ్మలని మీ అంతరంగపు ప్రపంచంలోనికి తీసుకువేళ్చే ఒక చక్కని మార్గం.
ధ్యాన స్థితి పొందటం:
ధ్యాన స్థితి అంటే ఆలోచనల తరంగాలు లేని నిశ్చల మానసిక స్థితి. ఎప్పుడయితే ఒక్క సెకంద్‌కి క్షణానికి మీకు వచ్చే ఆలోచనల సంఖ్య తగ్గుతూ ఉంటుందో, అప్పుడు మీరు ధ్యాన స్థితికి చేరుతున్నారు అని అర్ధం. ఆలోచనలు పూర్తిగా సున్నా స్థాయికి (లేని స్థాయికి) చేరినప్పుడు సంపూర్ణ ధ్యాన స్థితిలో ఉంటారు.
ఆలోచనలు అంటే ఏమిటి ?
ఈ ప్రశ్నకు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM శాస్త్రీయ నిరూపణతో వివరణని ఇస్తారు. ప్రతి వ్యక్తి నిరంతరం ఆలోచనల ప్రవాహంలో మునిగిపోయి ఉంటాడు. అసలు మనం నిరంతరం ఏమి ఆలోచిస్తాము? మీరు ఎప్పుడయినా ఒక్క క్షణమయినా ఆ విషయాన్ని గమనించారా?
"నేను ధ్యాన శిక్షణ కార్యక్రమాలు చేస్తుంటాను. అటువంటిదే నిత్యానంద స్పురణ అనే కార్యక్రమం. అందులో పాల్గొన్న వారిని ఒక పేపర్ పెన్ తీసుకొని ఐదు నిముషాలు కళ్ళుమూసుకుని కూర్చోమని చెబుతాను. ఆ అయిదు నిముషాలలో వారి ఆలోచనలని గమనించి వాటిని మార్పు చేయకుండా వ్రాయమంటాను. వాళ్ళు వ్రాసినవి ఎవరూ చదవరు, అందుకే మార్పు చేయకుండా వచ్చిన ఆలోచన వచ్చినట్లు వ్రాయమని చెబుతాను. ఐదు నిమిషాలు అయ్యాక పేపర్ చదువుకొని వారు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచనలు అంత అర్ధంలేకుండా, ఒకదానికి ఒకటి ఎటువంటి సంబంధం లేకుండా ఉంటాయి".
ఉదాహరణకి మీరు ఇప్పుడు ఒక విషయం గురించి ఆలోచిస్తు ఉంటారు. మరుక్షణంలో అమెరికాలో ఉన్న మీ బంధువు గురించి, ఆ తరువాత బజార్‌లో కూరలు, మరుక్షణంలో ఆఫీసు బాయ్, మీ బాస్ ఇలా దేనికీ సంబంధంలేని విషయాలు ఒక గొలుసులా, ఒక ప్రవాహంలా నిరంతరం మీ లోనికి వస్తుంటాయి. ఇవన్నీ ఒక రాశిలా ఏర్పడితే, దానినే మనస్సు అంటాము.
అంతరంగపు మాటలు (Inner Chatter):
ఈ ఆలోచనలకి మూలం మనం నిరంతరం మనలో మాట్లాడుకునే వ్యర్థపు మాటలు. ఆ మాటల ప్రవాహానికి అంతం ఉండదు. ఆ మాటలకి అర్థం ఉండదు. ఉదా: మీ స్నేహితుడు మీ దగ్గరికి వచ్చి తనకి చాలా మంచి ఉద్యోగం వచ్చింది, అని చెప్పి, అతను తీసుకునే జీతం ఇతర సదుపాయాల గురించి చెప్పాదనుకోండి. దీనికి మీరు రెండు విదాలుగా స్పందించుతారు.
మొదటిది : చాలా సంతోషం, బాగుంది. అని
రెండవది : అతనికి మంచి ఉద్యోగం వచ్చింది. జీతం, అలవెన్సులు అన్ని చాలా ఎక్కువ. అతను అదృష్టవంతుడు. ఈ విషయం నాభార్యకి తెలిస్తే ఏమనుకుంటుంది. నేనుకూడా కొత్త ఉద్యోగానికి ప్రయత్నించాలా? అదేమి కర్మ కానీ, నాకు ఏదీ కలసిరాదు. ఎప్పూడూ దురదృష్టం నావెంట ఉంటుంది. అసలు నా జాతకమే .................ఇలా మాటలు సాగిపోతుంటాయి.
ఇవే మన ఆలోచనలు కూడా. ఇలా మనలో మనం మాట్లాదుకునే ఈ ఆర్ధంలేని మాటలని విశ్లేషణ చేస్తే, మనకి చివరలో అర్ధమయ్యే విషయం ఏమిటంటే, మన లోపల మనం ఒక పిచ్చి గృహాన్ని నడుపుతున్నాము అని. ఇదే మనలో అన్ని సమస్యలకి మూలం. ఇవన్నీ కలిపి మనలోపల ఒక గట్టి వ్యవస్థవి ఏర్పరచుతాయి. దానినే మనం మానసిక స్థితి అంటాము.
దేని గురించి ఈ ఆలోచనలు ఉంటాయి.
మీరు జాగ్రత్తగా గమనిస్తే అందరూ నిరంతరం దేనిని గురించి ఆలోచిస్తున్నారో అర్ధమవుతుంది. అందరూ తమ అంతరంగంలో మాట్లాడే మాటలు కాని, నిరంతరం ప్రవాహాంలా వచ్చే ఆలోచనలు కాని, కేవలం భూతకాలానికి గాని, భవిష్యత్‌కి సంబంధించి ఉంటాయి. అవే ఆలోచనలు.
మనం నిరంతరం జరిగిపోయిన విషయాల గురించి మదన పడుతుంటాము లేదా, అపరాధ భావంతో ఉంటాము. అలా ఎందుకు జరిగింది, ఈవిధంగా జరిగితే ఎంత బాగుండేది, నేను ఎందుకు అలా మాట్లాడాను. నేనేనా ఆ తెలివితక్కువ నిర్దయం చేసింది. ఇది ఎలా సాధ్యం, అసలు నాకు అప్పుడు ఏదో జరిగింది. ఈ విధంగా జరిగిపోయన విషయాల గురించి మనలో ఉండే శక్తినంతా ఉపయోగించి వ్యధ చెందుతుంటాము.
లేదా, భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో అని ఆందోళన పదుతుంటాము. మీరు ఒక్కసారి మీ దిన చర్యని గమనించండి. మీరు ఉదయాన్నే నిద్రదలేచి పళ్ళుతోముకుంటూ, 9 గం|| ఆఫీసుకు వెళ్ళే విషయం, బస్సు దొరుకుతుందా లేదా, కారు డ్రయివర్ సమయానికి వస్తాడా రాదా అని ఆలోచిస్తుంటారు. ఆఫీసుకు వెళ్ళె మీ సీట్లో కూర్చోగానే లంచ్ టైం గురించి, మధ్యాహ్నం భోజనంలో కూర గురించి లేదా భోజనం చేసేటపుడు కోలీగ్‌తో ఏం మాట్తాడాలి అని ఆలోచిస్తారు. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో, సాయంత్రం జరగబోయే మీటింగ్ సంగతి ఆలోచిస్తుంటారు. మీటింగులో కూర్చొని సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సు దొరుకుతుందో లేదో, లేదా ట్రాఫిక్ జాం గురించి ఆలోచిస్తారు. ఇంటికి వెళ్ళి కుర్సీలో రిలాక్స్ అవుతూ రేపు ఆఫీసులో జరగబోయేథ విషయాల గురించి లేదా మరో విషయం గురించి ఆలోచిస్తుంటారు.
దీని అర్ధం ఏమిటంటే, మీరు నిరంతరం భూతకాలంలోనో లేదా భవిష్యత్‌లోనో ఉంటారు. అలా చేయటం వలన మీరు ఏమి పోగొట్లుకుంటున్నారు? అత్యంత విలువయిన ఈ క్షణాన్ని పోగొట్యకుంటున్నారు. ఈ క్షణాన్ని మీరు ఎప్పూడు ఆనందముగా ఆనుభవించటం లేదు. ఈ క్షణంలో మీరు చేస్తున్న పని యొక్క అనుభూతిని పూర్తిగా మిస్ అవుతున్నారు. అందుకే మీరు నిరంతరం ఆశాంతిగా, అసహనంగా (distrubed) ఉంటారు.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఒక పెద్ద రాజ్యానికి చక్రవర్తి ఒక రోజు వేటకి అడవి లోపలికి వెళ్ళి దారి తప్పుతాడు. అతడు గొప్ప ఐశ్వర్యవంతమయిన, విశాలమయిన మహారాజ్యానికి చక్రవర్తి. ఆయన యువకుడు, మహా మేధావి. అతను అలా వెళ్ళి వెళ్ళి ఒక ముని కుటీరానికి చేరతాడు. అక్కడ ఉన్న ముని శిష్యులు ఆ చక్రవర్తికి అతిధి మర్యాదలు చేస్తారు. చక్రవర్తికి, గురుదేవులకి భోజనం వడ్డిసారు. ఆ చక్రవర్తి వారి గురువు అయిన రుషిని పరిశీలనగా చూసాడు. రుషిని అతనిలో పొంగి ప్రవహిస్తున్న మహానందాన్ని చూసి చక్రవర్తి ఆశ్చర్సపోతాడు. రుషి అంత ఆనందంగా అంత ప్రశాంతంగా, తృప్తిగా ఉండటానికి గల కారణం, ఈ మేధావికి అంతుపట్టలేదు. పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి అయి ఉండే, ఎంతో ఐశ్వర్యంతో తులతూగే తనకి ఎప్పుడూ అంత ఆనందం కలుగలేదు కదా! అని అనుకుని, చక్రవరి ఎంతో వినయంగా ఆ రుషిని ఇలా అడుగుతాడు, "గురుదేవా ! మీరు ఇంత అనందంగా, ప్రశాంతంగా, తృప్తిగా ఎలా ఉండగలుగుతున్నారు. నాకు సర్వసంపదలు, అన్ని ఐశ్వర్యాలు అంతలేని ధన ధాన్యరాసులు ఉన్నాయి.గొప్ప సామ్రాజ్యానికి చక్రవరిని, కానీ నాకు తెలిసి నేను ఎప్పూడూ కనీసం కొంత సమయమయినా మీలో కనపడే ఆనందం, తృప్తి, ప్రశాంతతో ఎప్పూడూ లేను. దాని కారణం ఏమిటి? అని అడుగుతాడు.
చక్రవర్తి ప్రశ్నకు ఒక చిన్న నవ్వు సామాన్యమయిన చిన్న విషయం. నేను భోజనం చేసే సమయంలో భోజనమే చేస్తాను. నిద్రించే సమయంలో నిద్రిస్తాను.అదే రహస్యం" అంటాడు.
చకవరి ఆ రుషి నుంచి గొప్పగొప్ప తాత్వాలని, పెద్ద ప్రవచనాన్ని లేదా ఏవో ఉపనిషత్తులని చెపుతాడు అని ఆశిస్తాడు. అంత గొప్ప రుషి ఆ విధంగా అనగానే చక్రవరికి ఆశాభంగం కలిగి విసుగువస్తుంది. అతను గురువుతో, "గురుదేవా ! నేనుకూడా అదే చేస్తున్నాను కదా! అంటాడు. "
అప్పుడు గురుదేవులు " లేదు మహారాజా! నీవు భోజనం చేసేసమయంలో, నీరాజ్య పాలనా లేదా నీ సభలోని సమస్యల గురించి ఆలోచిస్తువుంటావు. నీవు నిజంగా భోజనం చేయవు. అదేవిధంగా నిదురించే సమయంలో రేపటి కార్యకమాలు, సమస్యల గురించి ప్రణాళికలు వేసువుంటావు కాని నిదురించవు. అదే నీ అశాంతికి కారణం" అంటాడు. మహామేధావి అయిన చక్రవరికి వెంటనే తన లోపం అర్ధం చేసుకొని, తనకి చక్కని జ్ఞానాన్ని ఇచ్చిన గురుదేవుని పాదాలకి నమస్కరించి ఎంతో ఉత్సాహంగా తన నగరానికి తిరుగు ప్రయాణం అయి వెళతాడు.
అందరూ కూడా ఆ చక్రవర్తి ఉన్న పరిస్థితిలోనే ఉంటారు. ప్రతి క్షణం గడచిపోయిన కాలానికి, భవిష్యత్ కాలానికి మధ్య తిరుగుతూ ఉంటారు. కాని ఒక్కక్షణమయినా వర్తమానంలో ఉండరు. ఎప్పుడయితే మీరు పూర్తిగా వర్తమానంలో ఉంటారో ఆ క్షణంలో మీ ఆలోచనలు సున్నా స్థాయికి (Zero state) పడిపోతాయి. ఆక్షణం మీరు పరమానందాన్ని అనుభవించుతారు. వర్తమానంలో ఉండగలిగితే ప్రతి క్షణం పరమానందమే. ప్రతి నిమిషం ఒక ఉత్సవంలా ఉంటుంది. అప్పుడే మీరు ఈ అద్భుత సృష్టిలోని అందాలు చూసి ఆనందించగలుగుతారు. అటువంటి స్థితిలోనే మీరు సర్వాంతర్యామికి అనుగుణంగా, ఒక చైతన్య గ్రంథిలా సాగిపోగలుగుతారు.
ఆ క్షణంలో పూర్తి వర్తమానంలో ఉండగలగటానికి ధ్యానం సహాయం చేస్తుంది. ధ్యాన సాధనతో అందరూ ఆస్థితిని చేరవచ్చు ఆలోచనలు లేని వర్తమాన స్తితో ఉన్నప్పుడు మీకు అనంతమయిన భూత భవిష్యత్ కాలాలు అందుబాటులో ఉంటాయి. జ్ఞానోదయమయిన యోగులు, రుషులు ఉండేది ఆ స్థితిలోనే. వారు ఎప్పూడు భూత భవిష్యత్ కాలాలలో ఉండరు.వారికి ఆలోచనలు అనేవి ఉండవు. వారు అంతరంగం నిశ్శబ్దంగా ఉంటుంది. అంతరంగంలో వారితో వారు మాట్లాడుకోవటం అనేది ఉండదు. అందుకే వారు నిరంతరం పరమానందంలో ఉండగలుగుతారు. నిత్య చైతన్యంతో సర్వాంతర్యామికి అనుగుణంగా, సర్వసృష్టితో సమానంగా జీవించగలుగుతారు. అందుకే వారు నిత్యం శాశ్వతమయిన పరమానంద స్థితిలో ఉంటారు.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
ఆనంద స్తితి అంటే ఏమిటి ? మనలో ప్రతి ఒక్కరూ కోరుకునేది సర్వసామాన్యమయిన కోరిక, సర్వమానవాళి వెతికేది ఆనందం. ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, ఎన్ని కీర్తి ప్రతిష్టలు పొందినా అన్నింటి ధ్యేయం ఆనందంగా ఉండటం. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తీ ప్రతి క్షణం ప్రయత్నించేది ఆనందం కోసం. మరి ఎందుకు అందరూ ఎప్పుడూ ఆనందంగా ఉండరు? ఎందుకు మానవ జీవితాలు సంతోషం, దుఃఖం అనే రెండు భావోద్వేగాల మధ్య లోలకం ఊగినట్లగా ఊగుతుంటుంది. అప్పుడే ఎంతో సంతోషంలో ఉంటారు. మరి కాసేపు కాగానే దుఃఖంలో మునిగి పోతారు. ఎందుకు శాశ్వతంగా ఆనందస్థితిలో ఉండలేము?
ఈ ప్రశ్నకు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చెప్పేజవాబు, మీకు కావలసిన ఆనందం మీ అంతరంగపు లోతులలో ఉన్నది. దానిని తెలుసుకోగలిగే పద్ధతి ధ్యానం. ఆ ఆనందాన్ని చేరే నమ్మకమయిన మార్గం ధ్యానం. ఆ ఆనందం యొక్క అనుభూతిని సొంతం చేసుకోగల శక్తి ధ్యాన శక్తి. ధ్యానసిద్ధి ఆనందస్థితికి అతి సులభమయిన, పూర్తిగా నమ్మకమయిన దారి.
ధ్యానం మనపై ఎలా ప్రభావాన్ని చూపిస్తుంది? అసలు ధ్యానానికి మనిషికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?
ఈ ప్రశ్న మన అందరిలో సామాన్యంగా ముందు వస్తుంది. ఈ ప్రశ్నకు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చక్కని వివరణని ఇస్తారు. స్వామీజీ ఈవిధంగా చెబుతారు.
ఆనందం మనిషి యొక్క సహజ లక్షణం. దానికోసం మనం నిరంతరం వెతుకుతున్నాము. ఎందుకు? ఎందుకంటే తైత్రేయ ఉపనిషత్తులో ఒక అందమయిన, అర్ధవంతమయిన శ్లోకం ఉన్నది.
శ్లోకం : ఏతాస్ అత్తునః ఆకాశ్య సంభూతః ఆకాశత్ వాయుః, వాయోర్ అగ్నిః అగ్నిర్ ఆపాః, ఆపాః పృధ్వి పృధ్విర్యో ఔషధః ……
ఈ శ్లోకం ద్వారా మనకి ఏమి తెలుస్తుంది అంటే, ఈ విశ్వం పంచభూతాలయిన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం తో నిర్మించబడినది. ఈ అయిదూ సర్వసృష్టిలో ఒక భాగమయిన మనిషి కూడా ఈ పంచభూతాలతోనే సృష్టించబడ్డాడు. మానావాళి పంచభూతాల సమ్మేళనం. కాబట్టి పంచభూత నిర్మితమయిన మనిషి నిరంతరం తన మూలాల వైపుకే ఆకర్షితుదవుతారు. తన మూలాలతో సంబంధం నెలకోల్చాలనే తీవమయిన ఆకాంక్ష అతనిలో జ్వలిస్తూ ఉంటుంది.
తన మూలాలతో ఐక్యం అవ్వాలి అనే కోరికని వివిధ పద్ధతులలో సాధించుతుంటాడు. ఈ ఐదు శక్తులతో ప్రత్యక్ష సంబంధాన్ని రకరకాలుగా నెలకొల్సుతుంటాడు. విగ్రహారాధన చేయటం ద్వారా మనిషి భూమి యొక్క శక్తికి దగ్గరవుతూ దానికి అనుగుణంగా ఉంటాడు. పవితమయిన నదులలో స్నానం చేయటం ద్వారా జల శక్తికి దగ్గరవటానికి ప్రయత్నిస్తాడు. అందుకే నదీ స్నానానికి అంత ఉత్సాహాన్ని చూపుతాడు.
హోమాలు, యజ్ఞాలు చేయటం ద్వారా అగ్నితో సంభాషణచేస్తాడు. అగ్నితో సంబంధాలని నెలకొల్పుకుంటాడు. మంత్రాలు జపించటం ద్వారా వాయుశక్తికి సన్నిహితమవుతారు.
ఇక మిగిలిన అయిదవ అంశం ఆకాశ శకి. అది అతి సూక్ష్మమయిన అత్యున్నతమయిన శక్తి. ఆశక్తిని ఇటువంటి పద్ధతుల ద్వారా, బాహ్య ప్రపంచం ద్వారా చేరలేము. మన అంతరంగ ప్రపంచం ద్వారా ఆ శక్తిని చేరగలము. దానిని మన అంతరంగంలో మాత్రమే అనుభవించగలం. అటువంటి ఉన్నతమయిన ఆకాశ శక్తితో సంబంధాన్ని ఏర్పరచుకోగలం, ఆ అత్యున్నత శక్తిని తెలుసుకోగలం, దానిని చేరగలం.
మనం ఎప్పుడయితే ధ్యానంలోనికి ప్రవేశించుతామో, అప్పుడు ఈ పంచభూతాలను చేరాలి అనే సంకల్ప వృత్తం పూర్తి అవుతుంది. అప్పుడు మనలో
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM,
ఇంతవరకూ కనపడకుండా పోయిన బంధం (link) కనపడుతుంది. ఆ బంధమే మనకి మన మూలాలకి సంబంధాన్ని నెలకొల్చే కీలక బంధం. ఎప్పుడయితే ఈ వృత్తం పూర్తి అవుతుందో అప్పుడే మనం మన మూలాలని చేరగలుగుతాము. అప్పుడే మనం సంపూర్ణ తృప్తిని పొందుతాము. మనం ఒక చక్కని భద్రతా భావాన్ని పొందుతాము. ఎప్పుడయితే తృప్తి, భద్రతా భావం కలుగుతాయో, అప్పుడే మనం మనకి కావలసిన నిజమయిన ఆనందాన్ని, శాశ్వత ఆనందాన్ని పొందుతాము . సంపూర్ణమయిన అనుభూతి ఆ ఆనందాన్ని ఇస్తుంది. అది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. అందుకే మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆనందంలో ఉండగలము.
కాబట్టి మనం బలంగా కోరుకునే అనందం అంటే, ఏమిటి అంటే మన మూలాలికి మనం చేరాలి అనే తపన. ఆ కారణం వలననే మనం మనకి తెలిసి కాని తెలియక గాని నిరంతరం ధ్యానం చేయాలి అనే కోరికని మనలోపల నింపుకొని తిరుగుతుంటాము. ఈ విధంగా ధ్యానానికి, మనిషికి విడదీయలేని అవినాభావ సంబంధం జన్మతః ఉంటుంది.
అయితే నేను కూడా ధ్యానం నేర్చుకోగలనా ?
ఈ ప్రశ్నకు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చాలా చిన్నది కాని చాలా సూటిగా మనకి అర్ధమయ్యి మనని ఆశ్చర్యంలో ముంచే ఒక జవాబు చెబుతారు.
నీవు ధ్యానం నేర్చుకోనవసరంలేదు. ఎందుకంటే నీవు ధ్యానివి.
ధ్యానం ప్రతి మనిషికి ఉండే ఒక అందమయిన సహజ లక్షణం. మనం మన జీవిత కాలంలో, మన దైనందిన జీవితంలో ఎన్నోసార్లు ధ్యాన స్థితిలోనికి వెళుతుంటాము. ఈ విషయం మీద THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ విధంగా చెబుతారు;
మీరు ఎప్పుడయినా ఒక అద్భుతమయిన అందాన్ని చూసి, ఆ ఆనందపు అనుభూతిలో ఉన్న క్షణాలని గుర్తు చేసుకోండి. చాలా అందమయిన గులాబీ పూవుని చూసిన క్షణంలో ఆ అందాన్ని చూసిన అనుభూతి గుర్తు చేసుకోండి.
ఆక్షణంలో మీరు నిశ్చలంగా అయిపోతారు. ఆ అందాన్ని చూస్తూ కొన్ని క్షణాలు ఆలోచనలు లేని నిశ్శబ్దంలోనికి వెళ్ళిపోతారు. ఆ క్షణాలు మీరు ధ్యానంలో ఉన్నట్లే. ఆ కొన్ని క్షణాలు మీరు మీ అంతరంగంలోని మాటలని ఆపివేసారు. అప్పుడు మీరు ఉన్న స్థితి ధ్యానం.
అయితే ఈ స్థితి మీకు కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. అది చాలా తక్కువ సమయం. వెంటనే మీలోనికి మీ మాటలు, ఆలోచనలు వచ్చేసాయి. ఆహా ! గులాబీపువ్వు ఎంత అందంగా ఉన్నది. అనుకుని వెంటనే ఆ రంగు, ఆ పూవు సువాసన, వీటిని పోల్చడం మొదలు పెడతారు. క్రమంగా ఇదివరకు మీరు చూసిన అటువంటి గులాబీని, దానిని మీకు ఇచ్చిన వ్యక్తి, ఆనాటి సంఘటనలు ఈ విధంగా ఆలోచనలు ప్రవాహంలో మీరు పూర్తిగా మునిగి పోతారు. ఎప్పుడయితే ఇలా ఆలోచనలు, అంతరంగపు మాటలు మొదలవుతాయో మీరు ధ్యానంలోంచి బయటికి వచ్చేసారు అని అర్ధం.
కాబట్టి స్పష్టంగా అర్ధం చేసుకోండి, ధ్యానం అంటే మీరు గులాబీ అందాన్ని చూడగానే పొందిన నిశ్చల స్థితిలో ఉండటం. మీ అంతరంగంలో నిశ్శబ్దంగా ఉండటం. అందుకే నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను, ధ్యానం అంటే మీరు ఏదో చేయటం కాదు. అది ఒక పనికాదు. అది అనుభవం.కాబట్టి మీరు ధ్యానాన్ని చేయరు, ధ్యాన స్థితి లోనికి వెళ్ళగలుగుతారు. ఆ స్థితి యొక్క అనుభవాన్ని పొందుతారు.
స్పష్టంగా అర్థం ధ్యానం అంటే ఏదో ఒకటి చేయటం కాదు. చేసే పనులు (actions), చర్యలు వదిలివేయటం .ఆలోచనలు కూడా ఒక పనే, వాటిని కూడా వదిలివేయటమే ధ్యానం. అంతేకాని భౌతికంగా చేసే కొన్ని చర్యలు ధ్యానం కాదు. అవి ధ్యానస్థితికి తీసుకెళ్ళగల పద్ధతులు మాత్రమే.
ధ్యానం అంటే మీలోని ఆలోచనలు, భావాలు, మీరు చేసున్న పనులు అన్ని మీనుంచి వెళ్ళిపోయాక మిగిలిన మీరు ఉండే స్థితి. అంటే ఇవేమీలేకుందా THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
అసలయిన మీరు మాత్రమే, మీ నిజమయిన ఉనికితో మీరు ఉన్న స్థితి ధ్యానం. ఇందాక నేను చెప్పిన కథలో గురుదేవులు ఏవిధంగా అయితే ప్రతిక్షణం వర్తమానంలో ఉంటారో, ఆ విధంగా వర్తమానంలో ఉంటూ ఆ అనుభవాన్ని పోందటమే ధ్యానం.
అయితే ఇన్ని ధ్యాన పద్దతులు ఎందుకు ?
ఇది సరియైన ప్రశ్నే. మనకి చాలా ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అయితే ఈ ధ్యాన పద్ధతుల ద్వారా మీరు ధ్యానాన్ని సాధించలేరు. ఈ ధ్యాన పద్దతులు ధ్యానం యొక్క అవసరాన్ని మీకు గుర్తు చేస్తాయి. ధ్యానంలోనికి ప్రవేశించటానికి మీకు కొంత సహాయకారిగా ఉంటాయి. లోతు ఎంతో తెలియని, ఆవలి ఒడ్డు లేని మహాసముద్రం వంటిది ధ్యానం. అటువంటి సముద్రంలోనికి ఈత రానివారు ఏవిధంగా వెళ్ళగలుగుతారు? ముందుగా ఈత తెలిసిన గజఈతగాళ్ళ దగ్గర నీళ్ళలోనికి ఎలా దిగాలో తెలుసుకుంటారు. అదేవిధంగా లైఫ్ జాకెట్స్ వేసుకుంటారు. అప్పుడు మీరు నీళ్ళలో మునిగిపోరు. క్రమంగా ఈదటం నేర్చుకుంటారు. ఈత వచ్చాక ధైర్యంగా నీళ్ళలోనికి దిగుతారు.అప్పుడు లైఫ్ జాకెట్స్‌తో అవసరం ఉండదు.
ఈ సందర్బంలో ధ్యానంలోనికి ప్రవేశించటానికి, ధ్యాన పద్ధతులు మనకి లైఫ్ జాకెట్లుగా ఉపయోగపడతాయి. మనకి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఒక్కసారి మీకు ధ్యానమే మీ జీవితంగా మారిపోగానే ఈ పద్ధతులు లైఫ్ జాకెట్లు, గజఈతగాళ్ళు, అన్నింటినీ వదిలివేస్తారు. అప్పుడు వాటి అవసరం ఉండదు. కాబట్టి ధ్యానంలో కొత్తగా ప్రవేశించాలి అనుకునేవారికి ఈ ధ్యానపద్దతులు అవసరం. నేను మీకు మరోకసారి గుర్తుచేస్తున్నాను, ధ్యానం అనేది సాధించే విషయంకాదు. దానిలోనికి ప్రవేశించి దానిని అనుభవించే స్థితి మాత్రమే. మీరు ధ్యానం నేర్చుకోనవసరం లేదు. మీరు జన్మతః ధ్యానులు. మీ జీవితంలో చాలా సార్లు ఆ ధ్యానస్థితిలోనికి వెళ్ళినవారే. అయితే తెలిసో తెలియకో ఆస్థితిలో ఎక్కువసేపు ఉండలేరు. మీరు దానినుంచి వచ్చేస్తారు. ధ్యానపద్ధతులని సాధన చేస్తే, ఆ స్థితిలో ఉండగలగటం తెలుస్తుంది.
ధ్యాన మార్గం
ధ్యానం చేయటానికి అందరూ అర్హులేనా ?
ఈ ప్రశ్న చాలామందికి కలుగుతుంది. నాకు అనారోగ్యం, నాకు మానసిక వ్యధలు ఉన్నాయి, నేను ఎటువంటి నియమాలు పాటించను, నాకు క్రమశిక్షణ లేదు…. కాబట్టి నేను ధ్యానం చేయవచ్చునా? నాకు అర్హత ఉన్నదా? నా ఈ వయస్సులో నాకు ధ్యానం ఉపయోగపడుతుందా?
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామిని చాలా మంది ఈ ప్రశ్న అడుగుతుంటారు. అన్ని ప్రశ్నల సారాంశము...నేను ధ్యానం చేయవచ్చునా? దానికి కావలసిన అర్హత ఏమిటి?
ఈ ప్రశ్నలు అడిగినప్పుడు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చాలా అందమయిన చిరునవ్వునవిఁ ఒక అందమయిన కథని చెబుతారు. ఈ కథ ఆధ్యాత్మిక జీవితానికి, యోగా, ధ్యానం నేర్చుకోవటానికి నేను అర్హుడనేనా? అన్న ప్రశ్నకి సంబంధించినది. ఒకరోజు ఒక వ్యక్తి భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వచ్చి "భగవాన్, నేను ఆధ్యాత్మికమయిన జీవితంలోనికి ప్రవేశించటానికి అర్హుడనేనా" అని వినయంగా అడుగుతాడు.
అప్పుడు రమణమహర్సి తనదయిన శైలిలో "నీవు జీవించి ఉన్నావా?" అని అడుగుతారు. ఆ యువకుడు ఆశ్చర్యపోయి, "నేను జీవించి ఉన్నాను, భగవాన్", అని జవాబు ఇస్తాడు.
"అలా అయితే ఆధ్యాత్మిక జీవితానికి నీవు పూర్తిగా అర్హుడవులే", అని భగవాన్ చిరునవ్వుతో బదులు చెబుతారు.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కి చాలా ఇష్టమయిన కథ ఇది. ఆయన పదే పదే చెప్పేమాట, అర్హత ఉందటం, అర్హత లేదు అనటం అంతా అబద్ధపు మాటలు. అసలు మీరే ధ్యాని అని ఆయన అంత గట్టిగా, నమ్మకంగా చెప్పినప్పుడు, ఇక అర్హత, అనర్హత అనే ప్రసక్తిలేదు కదా! ధ్యానం అందరూ అన్ని వయస్సులవారు, అన్ని సమయాలలో నిరభ్యంతరంగా చేయవచ్చు అని THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చెబుతారు.
ధ్యానం చేయటానికి నియమాలు నిష్టలు లేవు. అలా అని మీకు ఎవరయినా చెబితే మీరునమ్మవద్దు. అర్హత లేదు అని అనటానికి ఎవరికీ అధికారం లేదు. అలా ఎవరయినా అంటే వారు మిమ్మలని కంట్ట్రోలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు అని అర్ధం. అటువంటి వారిని మీరు విశ్వసించినవసరంలేదు. అలా మీ అర్హత గురించి ప్రశ్నించేవారిని మీరు పట్టించుకోవద్దు. మీకు నచ్చిన విధంగా ధ్యానం చేయండి.
ధ్యానం ఎంతసేపు చేయాలి ? ఎన్ని రోజులు చేయాలి ?
ధ్యానం ఎన్ని గంటలు చేయాలి? ఎన్ని రోజులు చేయాలి? ఈ ప్రశ్నలు అర్థం లేని ప్రశ్నలు. ఎందుకంటే ధ్యానం అనేది మీ జీవితాలకి అదనంగా కలుపుకునే ఒక వస్తువు కాదు, ఒక సౌకర్యంకాదు. అదేవిధంగా దీనిని ఇన్ని యూనిట్లు పొందాలి ఇంత పరిమాణంలో సాధించాలి అని అనుకునే భౌతిక వస్తువు కాదు. ధ్యానం అంటే మీ జీవితం, మీ జీవనసరళి ధ్యానంగా మారిపోవాలి. మీ ప్రశ్న ఎలా ఉన్నది అంటే, నేను రోజుకి ఎన్నిసార్లు ఊపిరి తీసుకోవాలి? అని అడిగినట్లే. ఊపిరి తీయటమే మీజీవితం, మీజీవితమే ఊపిరి; ధ్యానం కూడా అంతే కావాలి.
జ్ఞానోదయం పొందిన యోగులు ఉండేది ఈ స్థితిలోనే. వారు ఏపని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, నిరంతరం ధ్యాన స్థితిలోనే ఉంటారు. అందుకే అంత మనోహరమయిన ఆనంద స్టితిలోనే ఉంటారు. మనం ఎప్పుడయినా కలతతో కోపంతో, అసంత్పప్తితో ఉన్న యోగులని చూస్తామా? ఎప్పుడయినా జ్ఞానోదయమయిన వారిలో అసహనాన్ని అశాంతినీ చూడగలమా? లేదు ఎందుకంటే వారి జీవితమే ధ్యానం. వారు ధ్యానం చేయరు. ధ్యాన స్టితిలో ఉంటారు. వారు ధ్యానులు. ధ్యానమే వారి జీవితం.
ఈ సందర్భంలో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఒక చిన్న కథ చెబుతారు. ఒక గురుకులంలో ఉండే ఇద్దరు శిష్యులు మంచి స్నేహితులు . ఒకరోజు వారు ఇద్దరూ గురువు గారిని ఒక విషయంలో అనుమతి అడగాలి అని ఆయన కుటీరం దగ్గరికి వసారు. ముందు ఒక శిష్యుడు లోపలకి వెళ్ళి, కొద్దిసేపటిలోనే ఏడుస్తూ బయటకి వసాడు. ఆ తరువాత రెండవ శిష్యుడు లోపలకి వెళ్ళి, నవ్వుతూ ఆనందంగా బయటకి వస్తాడు. రెండవ శిష్యుడు తన స్నేహితుడిని ఏమయింది అని అడుగుతాడు.
మొదటి శిష్యుడు ఏడుస్తూ, "గురువుగారిని నేను ధ్యానం చేస్తూ పొగ తాగవచ్చా (సిగరెట్ కాల్చవచ్చా) అని అడిగాను. ఆయన నా చెంప మీద చెళ్ళున కొట్టి బయటికి వెళ్ళి పొమ్మన్నారు" అని చెప్పి, "మరి నీవిషయం ఏమయిందీ అని అడుగుతాడు".
ఆ ప్రశ్నకు రెండవ శిష్యుడు, "నేను గురువు గారిని పొగ తాగుతూ ధ్యానం చేయవచ్చునా అని అడిగాను, ఆయన నిరభ్యంతరంగా ధ్యానం చేయవచ్చు, అని చెప్పి నన్ను మెచ్చుకుని పంపించారు. అంతేకాని ధ్యానం చేస్తూ పనులు చేయటం కాదు" అని జవాబు ఇస్తాడు. ధ్యానం మన జీవితం కావాలి. మనం చేసే ప్రతిపని ధ్యానంగా మారాలి.
జీవితం ధ్యానంగా మారటం అంటే ఏమిటి ? ప్రతిపని ఏవిధంగా ధ్యానం అవుతుంది ?
ఈ ప్రశ్నకు పరమహంస చాలా సులభ రీతిలో ఇలా చెబుతారు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను; ధ్యానం అంటే వర్తమానంలో ఉండటమే. మీరు భూతకాలం నుంచి (గడచిపోయిన విషయాలగురించి మదనపడటం) భవిష్యత్ కి అతి వేగంగా దూకుతూ ఉంటారు. మీరు ఈ రెండు పాయింట్లుకి మధ్య ఎంత వేగంగా తిరుగుతుంటారంటే, వర్తమానం అనే పాయింటు దగ్గర అసలు ఉండరు. అతి సూక్ష్మమయినంత సమయంకూడా వర్తమానంలో ఉండరు. ఎప్పుడయితే మీరు వర్తమానంలో ఉంటారో, అప్పుడు ధ్యానంలో ఉన్నట్లే. మీరు వర్తమానంలో ఉన్నారా? లేదా? అనే ఆలోచనా ఉండదు. మీలో మీరు మాట్లాడుకునే అంతరంగపు మాటలు అసలు ఉండదు. మీరు కేవలం ఆ క్షణంలో ఏపని చేస్తున్నారో అది మాత్రమే మీ లోపల ఉంటుంది.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
మీరు కొన్ని సార్లు అనుకోకుండా లేదా తెలిసో తెలియకో, కొన్ని పనులు చేసేటప్పుడు, అందమయిన కవిత చదివేటప్పుడు, ఒక బొమ్మని పెయింట్ చేసేటప్పుడు, ఒక చక్కని పాటని వ్రాసేటప్పుడు మీ పరిసరాలని, మిమ్ములని మీరు మరచిపోయి కేవలం చేస్తున్నా ఆ పనిలోనే నిమగ్నమయి పోతారు. అప్పుడు మీకు మరొక ఆలోచన ఉండదు. దానినే నేను ధ్యాన స్థితి అంటాను. మీరు ఆ విధంగా, చేసే ప్రతిపనినీ చేస్తే మీ జీవితమే ధ్యానం అయిపోతుంది.
మీరు కొన్ని సందర్భాలలో, కొందరి విషయాలలో ఒకమాట వింటుంటారు. అతను ఆ పనిని ఒక తపస్సులా చేస్తున్నాడు. అతను ఆ గ్రంధ రచననని ఒక తపస్సులా చేసి పూర్తిచేసాడు. ఇలా అంటుంటారు. తపస్సు అంటేనే ధ్యానం. కాబట్టి జీవితాన్ని ధ్యానంగా మలచుకోవచ్చు. ప్రతిపనినీ ధ్యానంలా చేయవచ్చు. అలా చేయగలిగినపుడు మీరు అంతరంగ ప్రపంచంలోనూ, బయట ప్రపంచంలోనూ ఎంతో నైపుణ్యంతో పనులు చేయగలుగుతారు. మీ జీవితం యొక్క నాణ్యత మీరు ఊహించనంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది.
జ్ఞానోదయమయిన యోగులు, గురువులు జీవితాన్ని ధ్యానంలా గడుపుతారు. అందుకే అంత పెద్ద పెద్ద పనులని ఎంతో మాములుగా, సునాయసంగా చేసేయగలుగుతారు. వారి కార్యక్రమాలని గమనించితే సామాన్యులకి అది అసాధ్యం అని అనిపిస్తుంది. ఈ విషయాన్ని వివరిస్తూ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, ధ్యానమే జీవితంగా గడపగలిగిన వారికి ఈ ప్రపంచంలో అన్ని అద్భుతాలు సుసాధ్యమే అని చెబుతారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ పరమహంస సంవత్సర కేలండరే. ఒక సంవత్సరంలో స్వామీజీ పాల్గొన్న కార్యక్రమాలు, ప్రపంచం వ్యాప్తంగా ఆయన ఇచ్చిన ప్రవచనాలు గమనిస్తే ఇది సామాన్యులకి అసాధ్యం అని తెలుస్తుంది. ఆయన ఒక సంవత్సరంలో కచ్చితంగా ఒక ప్రపంచ పర్యటన చేసారు. వందల కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది సామాన్యులకి అసాధ్యం.
నిత్య జీవితంలో చేసే పనులని సమన్యయంతో చేయగలమా ?
జ్ఞానోదయమయిన యోగులకి, గురుదేవులకి ఇదంతా సుసాధ్యమేనేమో? కాని నిత్య జీవితంలో ఎన్నో పనులు, భాద్యతలు, సమస్యలు, రకరకాల ఒత్తుదులు వీటి మధ్య ప్రతి పనినీ ఏ విధంగా ధ్యానంలా చేయగలం? అసలు ఒక సమన్యయంతో పనులు చేయగలమా? లేకపోతే లౌకిక విషయాలని, ప్రాపంచిక విషయాలని పూర్తిగా వదిలివేయాలా? ఇదంతా చాలా అయోమయంగా ఉన్నది. అని కొంతమంది అడుగుతుంటారు. వారికి స్వామి ఈ విధంగా చెబుతారు: ధ్యానం మన రోజువారి చేసుకునే ఏ పనికి వ్యతిరేకి కాదు. ధ్యానం అనేది ఒక చర్యకాదు ఒక పని కాదు, అలాగే అది ఏ పనికీ, ఏ చర్యకీ అడ్డంకు కాదు, సరికదా ఎంతో దోహదకారిగా ఉంటుంది.
ఒక్కసారి మీరు నిశ్చలంగా ఉండగలిగే నైపుణ్యాన్ని నేర్చుకోగలిగితే, ఎవరూ, మీ నిశ్చలతని భంగపరచలేరు. మీరు మీ అసలయిన ఉనికిని నిశ్చలంగా
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
ఉంచగలిగితే, ప్రతి పనీ ధ్యానంలా చేయగలుగుతారు. అప్పుడు మీకు బయట ప్రపంచంలో మనుషులు, సంఘటనలు, వస్తువులు అనేవి ఏవీ పట్టవు. మిమ్మలని అవి ఏమీ చేయలేవు. అటువంటి నిశ్చలస్థితిని మీరు పొందగలగాలి. ఆస్థితిని చేరాలి అంటే మీరు ఈ క్రింది విషయాలని గ్రహించాలి.
మీరు మీ అంతరంగంలోని అసలయిన మీ ఉనికిని కనుగొని దానితో సంబంధం ఏర్పరచుకోవాలి. అసలు ముందుగా మీరు అనుకునే 'మీరు', అసలయినది మీరు కాదు. మీ అంతరంగంలో ఎన్నో రకరకాల గట్టి పొరల క్రింద కప్పబడిన అసలయిన 'మీరు' అనే మీ ఉనికి ఉన్నది అని మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీరు పూర్తిగా మీతోనే ఉండగలగటం నేర్చుకుంటారు.
మీరు కేవలం మీతోనే ఉండగలగటం అంటే మీ ఏకాగ్రతని, మీ తెలుసుకునే తత్వాన్ని మీ అంతరంగంలో కేంద్రీకరించటమే . ఆ విధంగా ఉండటంలోని ఆనందపు అనుభూతిని మీరు పొందగలగాలి. అయితే సాధన ద్వారా మీరు ఆ స్థితిని చేరగలరు. ఈ రోజునుంచీ ప్రతిరోజు అరగంట అలా ఉండటాన్ని సాధన చేయండి. క్రమంగా అలా ఉండే సమయాన్ని పెంచుతూవెళ్ళండి. ఎప్పుడయితే మీరు ఈ స్థితిలో సౌకర్యంగా ఇమిడిపోగలరో, అప్పుడు అదే నిశ్చలతతో బయట పనులు చేయటం ప్రారంభించండి.
మీరు ప్రతి రోజు చేసే చిన్న చిన్న పనులతో ఈవిధంగా ప్రయత్నించి చూడండి. మీరు నడచేటప్పుడు, భోజనం చేసే సమయంలో మీ ఏకాగ్రతని మీమీద, మీ అంతరంగంలోని మీ ఉనికి మీద కేంద్రదీకరించండి. ఎప్పుడయితే ఈ విధమయిన చిన్నచిన్న పనులని నిశ్చలతతో చేయగలుగుతారో, క్రమంగా పెద్దపనులు చేసే టప్పుడు కూడా ఆస్థితిలో చేయటం సాధన చేయండి , ఇది క్రమంగా సాధన చేస్తే, అటువంటి నిశ్చలతనిలో ఉండగలుగుతారు.
మీరు ఎప్పుడయితే ఈ విధంగా పనులు చేయటానికి అలవాటు పడతారో, బయట ప్రపంచంలో చూడటానికి మీరు మామూలుగా అన్ని పనులు చేస్తున్నట్లుగానే
ఉంటుంది. అయితే మీ జీవన సరళిలో ఎంతో నాణ్యత కనిపిస్తుంది. మీరు చేసే పనులు చాలా నైపుణ్యంతో చేయగలగటం, మీరు స్పష్టంగా గమనించగలుగుతారు. అప్పుడు మీరు మీ జీవితాన్ని మరింత స్పష్టతతో జీవించగలుగుతారు. ఎప్పుడయితే మీ ఏకాగ్రత కేవలం మీ అంతరంగం మీద, మీ ఉనికి మీద కేంద్రీకృతమవుతుందో మీరు చాలా సృజనాత్మకతతో పని చేయగలుగుతారు.
అదే సమయంలో మీరు మీ అంతరంగంలో లోతయిన నిశ్చలతని, నిశ్నబాన్ని అనుభవించుతారు. ఏ విషయం మిమ్ములని సులభంగా కదిలించలేవు. నిజానికి ప్రతి వ్యక్తి కోరుకునే ఒక అద్భుత వరం ఈ స్థితి.
కాబట్టి మీరు అందరూ (పతీ పనీ ధ్యానంలా చేయగలరు. మీ జీవితాన్ని ధ్యానంగా మలచుకోగలరు. దీనికి [పత్యక్ష ఉదాహరణ మనముందు ఉన్న జ్ఞానోదయమయన యోగులు, గురువులు. నిశ్చలతలోని అద్యుతమయిన అందాలు చూదాలి అంటే జ్ఞానోదయమయిన గురువుల సమక్షంలోనే చూడగలం. ఎందుకంటే వారు ధ్యాసం యొక్క లోతులని చివరి వరకూ చూసి ఆస్థితి యొక్క అద్భుతాన్ని అనుభవించారు. వారు నిరంతరం ధ్యాన స్లితిలోనే ఉంటారు.
ధ్యాసం మామూలు మనిషిని మహాత్మునిగా మార్చగలదు, అని కూడా మనకి తెలుస్తుంది. ధ్యానం మన [పాచీన యోగులు మనకి అందించిన ఒక అద్భుతమయిన వరం, అని ఈ మహాధ్యానులని చూసినప్పుడు మనకి అర్ధం అవుతుంది.
ధ్వానం వలన ఇంకా ఏమయినా లాభాలు ఉన్నాయా?
ధ్యాసం అనే ఒక ఆధ్యాత్మిక (పక్రియని కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్సో లక్షల మంది అనుసరించి నిత్యజీవితంలోనూ, ఆధ్యాత్మిక జీవితంలోనూ అద్ముతాలని సాధించారు అని అందరికీ తెలుసు. ఒక సాధారణ వ్యక్తిని మహాజ్ఞానిగా, మహారుషిగా, మర్మయోగిగా మలచగలిగే శక్తి ధ్యానానికి ఉన్నది అని మన పురాణాలు చెబుతాయి. అయితే ఈ విషయాలు ఏవీ సామాన్య మానవులకి అందుబాటులో
లేవు. తెలిసిన అతి కొద్ది విషయాలు ధ్యానంలో పూర్తి అవగాహన లేకుండా సగం తెలిసిన విషయాలని మిడిమిడి జ్ఞానంతో ఇంతవరకు ప్రచారం చేసినవి మాత్రమే మనకి తెలుసు.
ఈ సందర్శంలో పరమహంస నిత్యానంద స్వామి ఈవిధంగా అంటారు: అర్గ సత్యం (Half truth) అబద్ధం కంటే (ప్రమాదకరమయినది అని. అంతేకాకుండా సత్యాలు అనుభవాల నుంచి వెల్డడి అయినపుడు అవి సూటిగా మనలోనికి చొచ్చుకుపోగలుగుతాయి. ఆ సత్యాలు తమతో పాటు ఆ సత్యాన్ని వివరించే గురుదేవుల ఆశీర్వాద బలాన్ని, ఆయన మన కోసం పంపించే శక్తిని తీసుకువస్తాయి. అందుకే జ్ఞానోదయమయిన యోగీశ్వరుల ద్వారా వెల్లడి అయ్యే సత్యాలు మనని అభివృద్ధి వెపు తీసుకువెళతాయి. మనకి మంచి చేస్తాయి. వారు చూపిన మార్ధంలో నడవగలిగితే ఆధ్యాత్మికంగా అత్యున్నత శిఖరాలని చేరగలుగుతాము.
ధ్యానం వలన మనకి లాభాలు ఉన్నాయా అన్న [పశ్నకి పరమహంస నిత్యానంద చాలా వివరంగా జవాబు ఇస్తారు. ఆయన ధ్యానం మనకి, ముఖ్యంగా ఆధునిక మానవులకి ఏవిధంగా ఉపయోగపడుతుందో ఈ విధంగా చెబుతారు.
ధ్యానానికి మనిషికి యొక్క ఉన్నతస్థితికి అసలు సంబంధం ఏమిటి?
ముందుగా ధ్యానస్దితి అంటే ఏమిటో చూద్దాము. మనస్సు (మనలోని ఆలోచనా వ్యవస్గ, దీనినే మైండ్ అంటాము) నిరంతరం భూత భవిష్యత్‌ల మధ్య అత్యంత వేగంగా తిరుగుతూ ఉంటుంది. మన ఆలోచనలతో మనం అవిధంగా నిరంతరం తిరుగుతూ ఉంటాయి అనే విషయం మనకి తెలియదు. ఎందుకంటే మనలో జరిగే చాలా పనులు (లోపల, బయట ప్రపంచంలో) మన అచేతన స్థితిలో జరుగుతుంటాయి. అవే పనులు చేతనస్థితిలో జరిగితే మనకి అసలు మెండ్‌తో అవసరం ఉండదు. మైండ్ అనేది లేనప్పుడు మనకి శారీరక సమస్యలయిన అనారోగ్యలు ఉందవు, ఇక మానసిక సమస్య అన్న ప్రపక్తే ఉండదు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్దం చేసుకోవాలి.
మనకి కలిగే 99 శాతం అనారోగ్యాలు మానసికమయినవే అవి డాక్షర్స్ అంటారు. శాసనేత్రలు దానిని నిరూపించారు కూడా. చాలా ఆశుర్యకరమయిన విషయం ఏమిటంటే, బి.పి., దయాబిటిస్, గుండెకి సంబంధించిన సమస్యలు, చర్శవ్యాధులు మొదలయినవన్నీ మన మానసిక స్గితి నుంచి వచ్చినవేనని నిరూపించరు.
దీని అర్ధం ఏమిటంటే మనం చేసే పనులు చేతనస్థితిలో చేయగలిగితే ఈ అనర్గం జరగదు. అసలు ఆలోచనలు, చేతనస్థితికి ఉండే సంబంధం ఏమిటి? చేతన స్ధితి యొక్క నాలుగు స్లితులు అర్ధం చేసుకుంటే ఈ విషయం మనకి సృష్ణంగా తెలుసుంది.
| ఆలోచనలతో | ఆలోచనలు లేకుండా | |
|---|---|---|
| 'నేను' అనే స్పృహక్రో | జాగ్బతి దశ | తురియ దశ |
| 'నేను' అనే స్పృహ లేకుండా | స్వప్న దశ | సషుప్లి దశ |
పెన ఇచ్చిన పటంలోని విషయాలు గమనించితే మన చేతనస్థితి యొక్క స్థితులు మనకి తెలుస్తాయి.
అవి 1. ఇందులో జాగ్నతి దశ, అంటే మనం మెలకువగా ఉన్న దశ. ఈ దశలో మనకి ఆలోచనలు ఉంటాయి. మన మీద మనకి స్పృహ ఉంటుంది. నేను అనేది తెలసుంది. ఈ దశలో మైండ్ (మనస్సు) శరీరం రెండూ (శ్రమ పడుతుంటాయి.
- మరొకదశ, స్వప్న దశ : ఇందులో మనకి ఆలోచనలు ఉంటాయి కానీ మన మీద మనకి స్పుహ ఉండదు. అది నిద్ధావస్ద. అక్కడ మన ఆలోచనలు కలల రూపంలో ఉంటాయి. ఆ స్టితిలో శరీరానికి విశాంతి ఉంటుంది. కానీ మెండ్‌కి విశ్రాంతి ఉండదు.
పరమహంస శ్రీ నిత్యానంద
-
తరువాత దశ సుషుప్తి దశ. ఇది గాధమయిన నిద్ధావస్త. ఈ సితిలో మన మీద మనకి స్పృహ ఉండదు. నేను అనేది అసలు ఉందని దశ అదే విధంగా అసలు ఆలోచనలు లేని దశ. మైంద్, శరీరం రెండూ పూర్తి విశ్రాంతిలో ఉంటాయి. కానీ ఈ గాధమయిన నిగ్రద నేటి మానవులకి అరుదయిన విషయం. ఎందుకంటే మనకి కలత నిద్ద కూడా కరువయిన రోజులు కదా.
-
ఇక చివరిదశ తురియ దశ. దీనినే సమాధి స్థితి అని అంటాము. ఈ స్లితిలో ఆలోచనలు అసలు ఉండవు. ఆలోచనలు సున్నాస్ధాయిలో ఉంటాయి. కానీ పూర్తిగా నేను అనే స్పృహ ఉంటుంది. నేను అనేది తెలుసుంది. ఈ స్థితిలోనే పూర్తి వర్గమానంలో మనం ఉండగలిగే దశ. ఈ దశలోనే మనిషి జ్ఞానోదయాన్ని పొంది శాశ్వత ఆనందస్థితిలో ఉండగలదు. ఈ స్థితిలోనే అతను సర్వాంతర్యామికి చేరువకాగలడు.
ధ్యానం పాత్ర ఏమిటి?
మామూలు మనిషి తురియ స్థితిని పొందాలి అంటే చాలా కష్టం, అది అద్యుతం కూడా. ఆ కష్టాన్ని సులభం చేసేది, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ధ్యానానికి ఉన్నది. ధ్యానం మనని తురియ స్గితికి చేర్చగల అతి శక్తివంతమయిన నమ్మకమయిన మార్గం.
ధ్యానం నేను ఎవరిని? అనే ప్రశ్నకి జవాబు చూపిస్తుంది?
నీవు ఎవరివి? నేను ఎవరిని? ఈ ప్రశ్నలు అతి సామాన్యమయిన ప్రశ్నలు. మన నిత్య జీవితంలో ఎన్నో సార్లు ఈ ప్రశ్న అడుగుతాము, ఈ ప్రశ్న వింటాము. ఇవి మనకి సుపరిచితమయిన ప్రపశ్నలు.
ఈ ప్రశ్న నీవు ఎవరివి అని అనగానే మనకి కళ్ళముందుకు వచ్చే జవాబు ఒక దృశ్యం. అది మన ఆరు అడుగులో లేదా 5.5 అడుగులో ఉన్న శరీరం. వెంటనే మనం ఏమని జవాబు ఇస్తాము. 'నేను సుబ్బారావుని' 'నేను లక్ష్మీ భవానీని' అని. దీని అర్ధం ఏమిటి అంటే, నేను అనగానే ఈ శరీరం నేను అని మనం అనుకుంటాము.
పరమహంస నిత్యానందస్వామి తన ప్రపతి ప్రపవనంలోనూ ఈ విషయాన్ని పదే పదే చెబుతుంటారు. పరమహంస 'నేను' అనే విషయాన్ని ఎంతో చక్కగా వివరించుతారు. ఆయన ఈ విషయాన్ని ఇలా వివరిస్తారు.
మీరు ముందుగా అర్ధం చేసుకోవలసిన విషయం నీవు వేరు నీ శరీరం వేరు అని. నీ శరీరం నీకు తాత్మాలిక నివాసం మాతమే. అది నిన్ను మోసూ తిరిగే ఒక వాహనం. ఈ ఆరదుగుల శరీరం నీవు కాదు. కానీ మీకు మీ శరీరం పైన ఉన్న [పేమ మీ శరీరమే మీరు అనే భ్రమని కలిగిస్తుంది.
నీవు ఎవరు? అనగానే నీ శరీరం మాత్రమే ముందుగా నీ కళ్ళు ముందుకు వస్తుంది. అది చాలా చిన్నదయిన అత్యల్పస్దాయిలో ఉండే నీకు సంబంధించిన ఒక గుర్తింపు.
నీవు ఎవరు అని మళ్ళీ రెట్టించి అడిగితే వెంటనే నేను సుబ్బారావుని, నేను డాక్టరుని, నేను పిల్లల డాక్టరుని, 25 సంవత్సరాల వెధ్య అనుభవం ఉన్న డాక్టరుని అని చెబుతారు. ఇది మీ మేధస్సుతో మీరు అంటే ఏమిటో మీకు మీరు వేసుకున్న మరొక గుర్తింపు. అది కూడా మీరు అంటే ఉందే ఒక అత్యల్స గుర్తింపు ముద మా(తమే కాని మీరు కాదు.
ఇంకా రెట్టించి నీవు ఎవరు? అని అడిగితే, ఇంకాస్త లోతుగా ఆలోచించి నేను ఒక మంచి నమ్మకమయిన, హస్లవాసిగల వైద్యుణ్జి. మంచి తండిని, ఆదర్శవంతమయిన స్నేహితుణ్ణి. నమ్మకమయిన భర్తని, దేశభక్తిగల పౌరుణ్ణి, దెవభక్తిగల భక్కణ్ణి అని చెబుతారు. ఇదంతా ఏమిటి? ఏమిటి అంటే మీరు అంటే ఏమిటో సమాజం తన అభి(పాయాన్ని గుర్తింపు ముద్దలుగా మీ మీద అంటించిన మున్దలు, గుర్తింపులు. అవి ఎంత బలంగా ఉంటాయంటే మనం అంటే అదే అని చాలా గట్టిగా నమ్మి ఎదుటి వారిని నమ్మించే అంతగా మనలో స్నిరపడిపోతాయి, ఆ గుర్గింపులు వాటి నుంచి మనం ఎట్టి పరిస్ధితిలోనూ బయటకి రాలేము.
ఈ విషయాన్ని వివరిస్తూ పరమహంస నిత్యానంద ఒక చక్కని ఉపమానాన్ని చెబుతారు. మీరు ఒక పార్శిల్ చేసి పోస్టు చేసారనుకోండి. దాని మీద తప్పు (డస్ వలన చాలా చోటులకి ఆ పార్శిల్ తిరుగుతుంది. అది వెళ్ళిన ముద్దలే అనుకుంటామా లేకపోతే అందులో ఉన్న వస్తువు ఏమిటో అది అనుకుంటామా?
మీ పరిస్తితి కూడా అంతే. సమాజం వేసిన ముదలనే 'మీరు' అని భ్రమపడుతున్నారు. అసలయిన మీరు మీ అంతరంగంలో ఉన్నారు. అది కనపదకుండా ముద్రలు ఉన్నాయి కాబట్టి, ఆముద్రలే మీరు అని అనుకుంటున్నారు.
మీ అసలయిన మీరు ఏమిటో ఎందుకు తెలసుకోలేకపోతున్నారు? ఎందుకంటే మీ మీద సమాజం వేసిన ముద్దలు, మీ నిజమయిన అసలయిన
ఉనికిపై గట్టి పొరలుగా ఏర్పడిపోతాయి. వాటి మీద మీ మేధస్సుతో సంపాదించిన జ్ఞానం మరింత గట్టి పొరని ఏర్పరుసాయి.దానితో పాటు అహంకారాన్ని జాగ్గత్తగా కాపాడుకోవటానికి, దానిని పెంచిపోషించే కార్యక్రమంలో మరిన్ని గట్టి పొరలని ఏర్పరుస్తున్నారు. ఈ పొరలన్నీ కాలం గడిచే కొద్దీ ఒక బలమయన రాతి గోదలుగా ఏర్పడి మిమ్మలని మీ నిజమయిన ఉనికికి దూరం చేస్తున్నాయి. అసలయిన మిమ్మలని మీరు వదిలేసి, ఈ భ్రమలని, గోదలని, రాతి గోడలలోని రాళ్ళని చూసి మీరనుకుని అవిధంగా (పవరిస్తున్నారు. అందుకే అందరికీ అంతులేని అశాంతి, అసంత్సప్తి మానసిక వ్యధ. అసలయిన మీ ఉనికికి అనందం లేనప్పుడు బాహ్యంగా మీరు ఎంత సాధించినా, ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా చివరికి మీకు మిగిలేది అసంత్సప్రి, అశాంతి. అందరిలో ఉండే అసహనం, అశాంతికి ఇదే అసలయిన కారణం.
ధ్యానం ఈ స్థితిలో ఏవిధంగా సహాయం చేస్తుంది?
ఈ బలమయిన రాతి గోడలని కూల్చగల అత్యంత శక్తిగల ఆయుధమే ధ్యానం. పదునైన ఈ ఆయుధాన్ని మీరు నమ్ముకుంటే, ఆ మార్గంలో వెళ్ళగలిగితే మీకు మీ నిజమయిన ఉనికిని మధ్య నిర్మించబడిన గోదలన్నీ, సూర్యరశ్శి తగిలిన మంచుపొరలు కరిగినట్టుగా కరిగిపోతాయి. ధ్యానం ఆ గోడలని ఎటువంటి ఆనవాలు లేకుండా కరిగించి మిమ్మలని నేరుగా మీ ఉనికి దగ్గరకి తీసుకువెళుతుంది. ఎప్పుడయితే మిమ్మలని మీరు తెలుసుకుంటారో శాశ్వతమయిన పరమానందం మీ స్వంతమవుతుంది. ఒక్కసారి ఆ పరమానంద స్పితిలో స్గిరపడితే ఈ ప్రపంచంలోని ఏ విషయం మిమ్మలని కదిలించలేదు. ప్రపంచవిషయాలు, సమాజం, దాని నిబంధనలు అనే సంకెళ్ళ వాటంతట అవే తెగిపోయి మీరు స్వేచ్ఛా జీవిగా బయటకి వస్తారు. అప్పుడు మీలో (పవహించే పరమానందపు వెల్లువ మీ చుట్టు (పక్కలకి వ్వాపించి మీరు ఉన్న పరిసరాలలో ఆ ఆనందపు సుమధుర పరిమళాల తరంగాలు వెదజల్లుతాయి. అప్పుడు ఆ పరిసరాలలోని వారు ఆ పరిమాళాలు అనందపు అనుభూతులని పొందటం తప్ప వారికి మరొకదారి ఉండదు. ఈ కారణం వలననే జ్ఞానోదయమయిన గురువులు యోగులు సమక్షంలో మనం అంత ఆనందంగా, ఆహ్లాదంగా ఉండగలం.
పరమహంస శ్రీ, నిత్యానంద
కాబట్లి పరమహంస నిత్యానంద స్వామి చెప్పినట్టుగా ధ్యానం మనని మన అంతరంగంలోనికి తీసుకువెళ్ళి మన అసలయిన ఉనికిని, మన ఆత్మని చూపించుతుంది. మనం మన ఆత్మతో పొందే ఆ సంయోగాన్నే ఆత్మసాక్షాత్మారం అంటాము. దానినే మనని మనం తెలుసుకోవటం అని అంటాము. ఆత్మసాక్షాతా)రం పొందినవారికి జ్ఞానోదయం అవుతుంది. అంతేకాకుండా ఆ జ్ఞానోదయపు స్థితిలో వారు స్తిరపడగల శక్తి కూడా వారికి వస్తుంది.
ధ్యానం మనలోని శక్తి కేంద్రాలని చెతన్యపరచి శక్తివంతం చేస్తుంది.
(పాచీన కాలంనాటి ఆధ్యాత్మిక అంతరంగ శాస్త్రాలకి సంబంధించిన శా(స్తవేత్తలు (రుషులు) ఆధునిక జీవశా(స్తానికి సంబంధించినశా(స్తవేత్తలు పరిశోధించి నిరూపించినవే ఈ శక్తి కేంద్రాలు. వారి పరిశోధనల ప్రపకారం మానవ శరీరంలో అనేక శక్తి కేంద్రాలు ఉన్నాయి. వీటినే మనం చక్రాలు అని అంటాము. వీటిలో (పధానమయిన చక్రాలు ఏడు. అవి మనిషి శరీరంలో చాలా కీలకమయిన స్తానాలలో ఉంటాయి. ఇవి అతి సూక్ష ్టంగా ఉండి భౌతిక నేతాలకి కనపదవు. కెర్లిన్ ఫోటోగ్రఫీ ద్వారా వీటిని ఫోటో తీయగలిగారు. ఈ చక్రాల గురించి పరమహంస నిత్యానంద చాలా వివరాలు చెబుతారు.
మనిషిలోని ప్రధానమయిన ఏడు చక్రాలు : మూలాధారా, మణిపూరక, స్వాధిష్తాన, అనాహత, విశుద్ధి, ఆజ్ఝా, సహుస్రార చక్రాలు. ఈ ఏదు చక్రాలు చైతన్యవంతంగా ఉండి, వికసించితే మనిషి శారీరకంగా, మానసికంగా, భావావేశాత్మకంగా చాలా ఆరోగ్యంగా ఉంటాదు. చక్రాలు వికసించినప్పుడు మనిషి జీవితం ఎంతో నెపుణ్యంగా, సమస్యలు లేకుండా ఉంటుంది. మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాదు. మనిషి యొక్క ఆధ్యాత్మిక స్గితి పూర్తిగా వికసించి ఉంటుంది.
చక్రాలు కల్మషమయి, ముడుచుకుపోయి బంధింపబడి ఉన్నప్పుడు అవి కోటు బటన్ సైజుకి కుంచించుకుపోతాయి. అప్పుడు మనిషి భౌతికంగా మానసికంగా అనేక సమస్యలతో ఉంటాదు. మానసికంగా కుంగిపోయి ఉంటాదు. జీవితంలో జీవకళ లేకుందా పోతుంది. నిరుత్సాహంగా ఉంటాదు. ఇదే అనేకరకాలు అనారోగ్యాలకి కారణం అవుతుంది. 29
ధ్యాన మార్గం
పరమహంస నిత్యానందస్వామి ఈ చక్రాలని శుభ్రపరచి, శక్తి నింపి చెతన్యం చేయగల శక్తి ధ్యానానికి ఉన్నది అని నిరూపించారు. సాఁమీజీ ఈ చక్రాలని చైతన్యవంతం చేయగల ధ్యానాలని రూపొందించారు. వీటితో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని తయారుచేసారు. దీనినే భారతదేశంలో ఆనందస్సురణ అని ఇతర దేశాలలో లెఫ్‌ఫ్లిస్ ప్రోగ్రాం అని అంటారు. దీనినే చక్రా ధ్యాన కార్యక్రమం అని కూడా అంటారు. స్వామీజీ ధ్యానంతో ఈ చక్రాలను శక్తివంతం చేసి దాని ద్వారా మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయగలగటాన్ని ుపయోగాత్మకంగా చేసి చూపించారు. ఇందులో ఒక్కొక్క చక్రానికి ఒకొన్నక్క ధ్యానపద్ధతిని నేర్చించుతారు. ఆ ధ్యానపద్ధతి ఏవిధంగా ఆయా చక్రాలని చైతన్యపరుస్తుందో, దాని ద్వారా మనకి సమస్యలని సృష్టించే భావావేశాలని ఏవిధంగా వదిలివేయగలమో వివరంగా చెబుతారు.
ధ్యానం ద్వారా శక్తికేంద్రాలు అద్భుతశక్తిని ప్రపహించేలా చేయవచ్చును అని స్వామీజీ చెపుతారు. మనలో శక్రి సాఫీగా (పవహించకుండా అడ్డుకునే అడ్గంకులని ధ్యానం ద్వారా తొలగించవచ్చు అని స్వామి నిరూపించారు. ధ్యానం మీలోని అత్యున్నత స్దాయిలో ఉండే శక్తిని పొందే విధంగా సహాయం చేస్తుంది :
ఈ విషయాన్ని పరమహంస నిత్యానంద చాలా వివరంగా చెబుతారు. మూలకాలు (పంచభూతాల) తో నిర్మించబడిందో, మనిషి కూడా అవే పంచభూతాలతో నిర్మించబద్దాదు. అంటే విశ్వం ఒక పెద్ద పదార్గమయితే దానిలో ఒక చిన్న భాగం మనిషి. కాబట్టి మనిషిని సూక్ర్మవిశ్వం అనవచ్చు.
ుపతి మనిషిలో శక్తి ఉంటుంది. ఆ శక్తి మూడు దశలలో మూడు పొరలుగా ఏర్పడి ఉంటుంది. (Three Energy layers in Man) అందులో మొదటిది మన మైంద్ నుంచి వస్తుంది. దీనినే మనం మన దిన చర్యలకి ఉపయోగించుతాము. మనం ఉదయం నిద్రబేచిన దగ్గర నుంచి, నిద్రపోయే వరకూ మనం చేసే ప్రపీ పనికీ
మనం శక్తిని ఇక్కడ నుంచి తెచ్చుకుంటాము. ఈ శక్రిని ఎకుప్రవగా ఉపయోగించితే మీరు అలసిపోతారు. మీరు ఎక్కువ పనిచేసినప్పుడు మీకు అలసట, విసుగు కలగటానికి ఇదే కారణం. ఆ సమయంలో ఎవరయినా ఇంకాస్త పని చెబితే ఎటువంటి ఉత్పాహం చూపించరు. ఈ శక్తి పొరకి కావలసిన శక్తి మనం తీసుకునే భోజనం నుంచి వసుంది. మీరు తీసుకునే ఆహారం, ఎక్చర్‌సైజుల నుంచి వచ్చే శక్తి ఈ మొదటి దశలో ఉండే శక్తికి సహాయం చేసుంది. ఇది చాలా తక్ుువ స్వాయిలో శక్తిని కలిగి ఉంటుంది.
మీలో రెండవ దశలో ఉండే శక్రి అత్యవసర శక్తి. ఈ శక్రి మన భావావేశాల నుంచి వస్తుంది. మనకి ఏదైనా అత్యవసరం అయినప్పుడు ఈ శక్తి బయటకి విదుదల అవుతుంది. ఉదాహరణకి మీరు రోడ్లు మీద నడుస్తున్నారనుకోండి, ఆకస్మాత్‌గా ఒక కుక్క మీ వెంటపడితే, అపుడు మీ నుంచి భయం అనే భావం బయటపదుతుంది. ఆ భావం మీలోని అత్యవసర శక్తిని విడుదల చేస్తుంది. అప్పుడు మీరు చాలా వేగంగా పరిగెడతారు. మామూలు స్లితిలో మీరు అంత వేగంగా పరిగెత్తలేరు. అసలు అలా పరిగెత్తగలను అని కూడా మీరు ఊహించలేరు. ఆ సమయంలో మీరు బాగా నీర్సంగా ఉన్నా కాళ్ళు నొప్పి పెడుతున్నా, అమ్మో ఇంకా ఒక్క అదుగు కూడా వేయలేను అనుకున్నా కూడా, భయం కలిగితే మీరు అలా పరిగెత్తగలుగుతారు. దీని అర్గం ఏమిటంటే, ఇక్కడ పరిగెత్తటానికి మీరు ఉపయోగించేది వేరొక శకి. దానినే నేను అత్యవసర శక్తి అంటాను. ఇది భావావేశాలు కలిగినప్పుడు మాతమే విడుదల అవుతుంది. అవి కోపం, [పేమ, ఆశ, భయం ఇటువంటి భావాలకి సంబంధించిన శక్తి. అత్యవసర పరిస్థితిలో మా(తమే మనకి ఉపయోగపడుతుంది.
మూడవ దశలో ఉండే శక్తి, మన ఉనికి (ఆత్మ) దశలోని శక్తి. అది మనిషి లోపల ఉండే అంతులేని శక్తి. ఈ శక్షిని సామాన్య మానవుల ఎవరూ ఉపయోగించరు. అసలు ఆ శక్తి మీ లోపల ఉన్నది అని కూడా మీకు తెలియదు. ఈ శక్తితో అద్భుతాలు చేయవచ్చు. ఈ శక్తికి అసాధ్యం అనే మాట ఉండదు.
మూడవ దశలో ఉండే ఈ అత్యన్నత శక్తిని వికసింపచేయాలన్నా, దానిని విదుదల చేసి ఉపయోగించాలన్నా దానికి ఉన్న ఒక మార్ధం ధ్యానం. ధ్యానం చేయటం ద్వారా ఆ శక్తిని పొందవచ్చును. లోతుగా, తీ(వంగా ధ్యానం చేసే యోగులు చేసే అద్భుతాలన్నీ ఈ శక్తి నుంచి చేసినవే. ధ్యానం మీకు మీలో ఉండే ఉన్నత శక్తిని చూపిస్తుంది. ఆ శక్తి యొక్క అనుభూతిని మీకు ఇసుంది. అప్పుడే ఆ శక్తిని మీరు తెలుసుకోగలుగుతారు. ఎప్పుదయితే మీరు మీ ఆత్మ శక్తిని తెలుసుకుంటారో, అప్పుడే మీ ప్రాణాధారాన్ని, జీవాధారాన్ని అత్యున్నతస్దాయిలో అందుకోగలుగుతారు. మీరు ఒక్కసారి ఈ శక్తిని ఉపయోగించటం తెలుసుకోగలిగితే మీదెనందిన జీవితంలో అద్భుతాలు చేయగలుగుతారు. మీ జీవితం యొక్క నాణ్యత మీరు ఊహించనంతంగా అభివృద్ధి చెందుతుంది.
కాబట్టి స్పష్టంగా అర్ధం చేసుకోండి. ధ్యానం మిమ్మలని అత్యున్నతమయిన శక్తికి దగ్గరగా చేసుంది. దానిని అందుకోగల నేర్చుని ఇసుంది. యోగులు, రుషులు, జ్ఞానోదయమయిన గురువులు ఉపయోగించేది ఈ శక్తినే. అందుకే మీరు వారిలో ఎటువంటి అలసటని కాని విసుగుని కాని చూదరు.
నన్ను చాలామంది అదుగుతుంటారు, 'స్వామీజీ! ఉదయం నుంచి అంత బిజీగా అన్ని పసులు, కార్యక్రమాలు, మీటింగ్‌లు ఇవన్ని ఎటువంటి విశ్రాంతి లేకుండా సాయంஞ்త వరకూ చేసూనే ఉంటారు. సాయంஞతం అంత మందికి హీలింగ్ చేసి వారు అడిగే వాటికి నవ్యుతూ జవాబు ఇసారు. కాని ఒక్క నిముషం అయినా మీ ముఖంలో అలసట ఉండదు. మీరు నీర్సంగా కనపడరు. అసలు రహస్యం ఏమిటి? అని.
ఇదే అసలు రహస్యం. మూడవ దశలోని శక్తిని ఉపయోగించుకోగలగితే ఎంత పని చేసినా అలసట ఉండదు. ధ్యానం ద్వారా మీరు కూడా ఆశక్తిని పొందవచ్చు. అప్పుడు మీరు కూడా అలసట, నీర్సం లేని జీవితాలని గడపవచ్చు. ఇదే ధ్యానంలోని గొప్పదనం అని స్వామి ఎంతో స్పష్టంగా, వివరంగా చెబుతారు. ధ్యానం అత్యల్సస్తాయిలో ఉండే శక్తిని ఉన్నతస్తాయికి తీసుకువెళ్ళగలుగుతుంది. ప్రతి మనిషిలో భావావేశాలు ఉంటాయి. అవి ఒక్కొక్కరిలో ఒక్కొక్కస్తాయిలో
ఉంటాయి. భావావేశాలు వ్యతిరేకంగానూ ఉంటాయి. అనుకూలంగానూ ఉంటాయి. మనిషిలోని (పతి ఆవేశం శక్తితో కూడుకొని ఉన్నవే. వ్యతిరేకభావావేశాలయిన కోపం, అత్యాశ, కోరిక, అసూయ, అసంతృప్తి, బాధ, భయం ఇవన్నీ కూడా శకితో నిండినవే. ఆ భావావేశం కలిగినప్పుడు శక్తి విడుదల అవుతుంది. అయితే వ్యతిరేక భావావేశాలలోని శక్తి అత్యల్పస్దాయిల ఉంటుంది. అది మానవుల అభివృద్ధికి ఏమాత్రం సహాయం చేయదు. అది అభివృద్ధి నిరోదకంగా పని చేస్తుంది.
ధ్యాసం ద్వారా అత్యల్సస్గాయిలో ఉండే వ్యతిరేకశక్షిని అత్యున్నత శక్తిగా మార్చవచ్చు. ఉదా : ప్రాపంచిక సౌక్యాల మీద కోరిక చాలా బలంగా ఉందనుకోండి. మీరు ఆ కోరికని అణచటం ద్వారా మరింత హాని చేసుకుంటారు. అత్యధికమయిన కోరిక, అత్యాశ కూడా మానవుల పతనానికి కారణం. కాబట్టి ఏమి చేయాలి. ఆ కోరిక అనేది దానంతట అదే మనని వదిలివేయాలి. ఆ పరిస్తితికి మనం చేరగలిగే మార్డం ధ్యానం. తీవ్రంగా, క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే ఈ వ్యతిరేకపు భావావేశాలని మనం వదిలివేయనవసరం లేదు. అవే మనని వదిలి వెళ్ళిపోతాయి.
వ్వతిరేకపు భావాలు ఆలోచనలు లేనపుడు మనలోని శక్తి ఉన్నత దశలో ఉంటుంది. అది అత్యున్నత శక్తి. ఆ శక్తితో దేనినైనా సాధించవచ్చు. ఆ శక్తి మీ అంతరంగ [పపంచలోనూ బయట [ప్రపంచలోనూ మీ అభివృద్ధి కి ఉపయోగపడుతుంది.
ఇక్కడ సామాన్యంగా ఒక ప్రశ్న వసుంది. ధ్యానం చేసే కోరికలు మనని ఎలా వదిలి వేసాయి? ఇది చాలా మామూలుగా జరిగే స్గితి. ధ్యానంలో ఉండే ఆనంద పారవశ్యాలు శాశ్వతమయినవి. మీ కోరిక తీరిన తరువాత మీరు పొందేది కేవలం సంతోషం. ఎప్పుదయితే నిజమయిన ఆనందపు అనుభూతిని మీరు ఒక్కసారి అనుభవించుతారో ఇక కోరికల మీద, మిగతా భావావేశాల మీద ఎటువంటి ఆహారం దొరకదు. అవి మీ నుంచి వెళ్ళిపోతాయి.
ఈ విధంగా ధ్యానం వినమ్మలని అత్యున్నత శక్తి ద శకి
తీసుకువెళ్ళగలుగుతుంది. ఈ కారణం వలనే యోగులు,రుషులు ఏ మా(తం ుపపంచ సౌక్యాలు లేకుండానే పరమానందంలో ఉండగలుగుతారు. వారు కేవలం ద్వారా మహాద్యుతమయిన ఆనందాన్ని పొందుతారు.
ధ్యాసం మిమ్మలని భౌతికంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది :
"మంచి ఆరోగ్యం అంటే అనారోగ్యలక్షణాలు లేకపోవటం కాదు. మీ లోపల ఉన్నతమయిన ఉనికిని (ఆత్మని) కలిగి ఉండే స్థితి. మనం ఏదో అనారోగ్యాన్ని కలిగించుకొని, తిరిగి దానిని బాగుచేసుకునే మామూలు మనుషులం కాదు. మనం పరమానందాన్ని కలిగి ఉన్న ఆనంద జీవులం. మనం జన్మించినది ఆ పరమాందపు అనుభూతిని పొందటానికి, ఆ ఆనందపు పారవశ్వాన్ని మన అంతరంగంలో మన ఉనికిలో నిరంతరం తేలి ఆదే విధంగా చేయటానికి. దీనినే నేను మంచి ఆరోగ్యం అంటాను" – పరమహంస నిత్యానంద.
పరమహంస నిత్యానందస్వామి మనిషి యొక్క ఆరోగ్యస్థితి గురించి చాలా విపులంగా, విస్తారంగా చెబుతారు. ఆయన తన శిక్రణా కార్యక్రమంలో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తారు. ప్రత్యేకించి ఈ అంశం మీద ఆరోగ్యస్సురణ అనే కార్యక్రమాన్ని రూపొందించారు.
మనిషి యొక్క ఆరోగ్యం గురించి పరమహంస ఈ విధంగా చెబుతారు. మంచి ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంతో ఉందే స్థితి. మీకు ఎటువంటి అనారోగ్యం లేదు అని దాక్షరు సర్టిఫికెట్ ఇస్తే మీరు భౌతికంగా, శారీరకంగా ఆరోగ్యవంతులు అని అర్ధం. అదే విధంగా మనం ఎదుటి వ్యక్షితో ఉన్నప్పుడు మనలో ఎటువంటి కలతా లేకుండా ఉంటే, మీరు ఎవరితోనెనా స్వేచ్ఛగా, మీపై ఎటువంటి ఒత్తిడి లేకుండా సంభాషించగలిగితే, మీ మానసిక స్గితి బాగుంది అని అర్గం. అదేవిధంగా మీలో వ్యతిరేకపు ఆలోచనలు ఉండకూడదు. బాధలు, అసూయ, అసంత్సప్తి అహంకారం, అత్యాశ మీలో ఉండకూడదు. వీటి అన్నింటినుంచి మీరు స్వేచ్చగా ఉండగలిగినప్పుడు మీరు మానసికంగా ఆరోగ్యవంతులు.
పరమహంస శీ, నిత్యానంద
ధ్యానం మిమ్మలని ఇటువంటి మంచి ఆరోగ్యకరమయిన సితిలో ఉంచుతుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే మనలో ఉండే మానసిక వత్తిడి తగుతుంది. (కమంగా బి.పి, దయాబిటిస్, గుండె సంబంధమయిన వ్యాధులు తగ్గుముఖం పడతాయి. మీరు వీటి కోసం వాదే మందుల త్వరగా ఫలితాలని ఇస్తాయి. (క్రమంగా మందుల వాదకం తగ్తించవచ్చు.
అదేవిధంగా మానసిక సమస్యలకి కూడా మంచి మందు ఈ ధ్యానం. ముఖ్యంగా మానసిక కుంగుబాటుతో బాధపడేవారికి ధ్యానం అద్భుతంగా పనిచేసుంది. నేటి (పపంచంలో అన్నింటికంటే (పమాదకరమయిన జబ్బుగా డి(పెషన్ లేదా మానసిక కుంగుబాటుతనాన్ని గుర్తించారు. ఇది నిశ్శద్ధంగా మనిషిని నాశనం చేస్తుంది. (క్రమంగా ధ్యానం చేయటం ద్వారా డి[పెషన్‌కి వాడే మందులని తగ్తించవచ్చు. కొంతకాలానికి (కమంగా మందులు పూర్తిగా మానివేయవచ్చు. డి(పెషన్‌కి ధ్యానం చాలా మంచి పద్గతి. ఎందుకంటే డి(పెషన్‌కి వాడే మందుల ఉండవు. ధ్యానం చేస్తే అటువంటి సైద్ ఎఫెక్స్స్ ఉండవు.
ధ్యానం వలన ఇతర ఉపయోగాలు :
ధ్యానం చేయటం వలన మనిషిలో సంపూర్ణమయిన (పగతి ఉంటుంది. చక్కని ఆధ్యాత్మిక జీవితానికి మంచి ఆధారాన్ని ఏర్పరస్తుంది. అందరిలో మానవ సంబంధాలు మంచి దశలో అభివృద్ధి చెందుతాయి. చిన్న చిన్న కలతలు, కలహాలు తగ్రిపోతాయి. అందరూ శాంతి [ప్రేమతో మెలుగుతారు. సహనం పెరుగుతుంది. అశాంతి, అసహనం,కోపం తగ్గుతాయి.
పరమహంస నిత్యానంద స్వామి లక్ష్యం కూడా ఇదే. ధ్యానం ద్వారా (పతి వ్యక్తిలో వ్యక్తిగతమయిన మార్పు తీసుకువచ్చి దాని ద్వారా ప్రపంచంలో మార్సు తేవాలి. అప్పుడు (పపంచంలో హింస, యుద్దాలు, పోరాటాలు, దాడులు ఏవీ ఉండవు. ధ్యానం చేసినప్పుడు వ్యాపించే అనుకూల శక్తి తరంగాలు మనిషిలోని వ్యతిరేకపు ఆలోచనలని తగ్గించివేస్తాయి. అదే విధంగా మనిషిలో హింసా[పవ్సతిని తగ్గిస్తాయి.
ధ్యానం చేయటానికి నేను ఏవిధంగా సిద్ధమవా్లి :
ఈ ప్రశ్నకి పరమహంస మనకి కొన్ని మార్గదర్శక సూతాలని ఇస్తారు. ఇక్కడ మనం ఒక ముఖ్యవిషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం అనేది ఒక పని కాదు, ఒక చర్య కాదు. కొన్ని పద్ధతుల ద్వారా మనం ధ్యానస్థితికి చేరాలి. ఆ పద్గతులని మన సౌలభ్యం కోసం ధ్యానపద్గతులు అని అంటాము. ఈ పద్దతులని పాటించే విషయంలో మనం కొంచం [శద్దవహించి, స్వామీజీ చెప్పిన సూత్రాలని అర్గం చేసుకుని పాటించితే ఫలితాలను త్వరగా, పూర్శిగా అనుభవించగలం. పరమహంస ధ్యానానికి సిద్ధమవ్యటానికి ఈ (కింది విషయాల మీద [శద్ద చూపమంటారు.
ధ్యానం చేయటం నిజాయితీగా చేయండి :
స్వామిజీ ముందుగా ఇలా చెబుతారు. ధ్యానం, దాని ఫలితాలని మిమ్మలని నమ్మమని చెప్పను, నమ్మవద్దు అని చెప్సను. అదే విధంగా దీని మీద నముకం ఉంచమని చెప్పను. కానీ ధ్యానాన్ని విశ్వసించండి. ధ్యానాన్ని ప్రయోగాత్మకంగా అనుభవించి, అప్పుడు దానిని విశ్వసించండి.
పరమహంస తన ప్రపతి ప్రపచనంలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతారు. నేను మీతో మామిడి పండు తియ్యగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ మాటని మీరు నమ్మవదు. అలా అని నమ్మను అని అనవద్దు. మీరు ఆ పండు తిని రుచి చూసి అప్పుడు ఆ సత్యాన్ని విశ్వసించండి. ఆ సత్యాన్ని మీ అంతట మీరు ప్రయోగాత్మకంగా అనుభవించి తెలుసుకుని అప్పుడు దాని మీద మీ విశ్వాసాన్ని ఉంచంది.
అదేవిధంగా ధ్యానానికి ఒక అవకాశం ఇవ్వండి. దానిని విప్పారిన మనస్సుతో వికసించిన అంతరంగంతో చేయండి. ధ్యానం చేయాలనే నిజమయిన కుతూహలంతో చేయండి. దాని ఫలితాలని అర్ధం చేసుకోగల మెంద్ (మానసిక స్థితితో) తో చేయండి. ఆ విధంగా ధ్యానం చేయటానికి నిజాయితీగా సిద్గపడండి.
పరమహంస శ్రీ, నిత్యానంద
ఆశావాదంతో ధ్యానం దరికి చేరండి :
నేను మీకు చెప్పే రెండవ ముఖ్య విషయం మీరు ధ్యానం (పారంభించేమందు మీకు మంచి జరుగుతుంది అనే అశావాదంతో మొదలుపెట్టండి, అంతే కాని నిరాశతో కాదు. నేను మీకు ఒక విషయం సృష్ధంగా చెబుతున్నాను అర్గం చేసుకోండి : పరమానంద స్గితి అనేది కేవలం యోగులకి, రుషులకి చెందిన సంపద కాదు. మీరందరూ కూడా కచ్చితంగా ఆస్థితిని పొందగలరు.
ఆ స్తితి పొందాలి అంటే మాకు యోగా, ధ్యానం ఇలాంటివి రావు, అసలు ఆధ్యాత్మిక అంటేనే తెలియదు. అంత గొప్ప స్టితిని సామాన్యమానవులమయిన మేము చేరగలమా? అని మనలాంటి వారు అడిగే ప్రశ్నలకి పరమహంస మనోహరమయిన చిరునవ్వుతో ఇలా జవాబు ఇస్తారు : శాశ్వతమయిన పరమానంద స్తి పొందటానికి మీరు ఏమీ తెలుసుకుని ఉందనవసం లేదు. దీనికి మీరు ఏ అర్హతలు సంపాదించనవసరం లేదు. భగవాన్ రమణమహర్షి చెప్పినట్ట్ర మీరు జీవించి ఉంటే మీరు పరమానందస్థితికి చేరటానికి అర్శులే.
మీరు ఒక విషయం అర్ధం చేసుకోండి : భగవంతుడు మీకు ఎటువంటి నిబంధనలని విధించలేదు. మీకు ఎటువంటి హద్గులూ కల్పించలేదు. మరి మీరెందుకు మీ మీద ఇన్ని నిబంధనలని విధించుకుంటారు. ఎదుటి వారిని సమాజాన్ని మీ మీద ఎందుకు నిబంధనలని, హద్దులని కలిగించనిస్తారు. మీరు ధ్యానం చేయాలన్నా, యోగా నేర్చుకోవాలన్నా,ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని సాధించాలన్నా, ఆ సర్వాంతర్యామి గురించి లేదా మీ అంతరంగపు లోతులలోని అద్యుతాల గురించి తెలుసుకోవాలన్నా ఎవరి అనుమతి అవసరం లేదు. దానికి ఎటువంటి అర్హతా అవసరం లేదు. మీకు సంకల్సం ఉంటే చాలు. అందుకే ముందుగా ధ్యానం చేయటానికి ఒక చక్కని కచ్చితమయిన లక్ష్యాన్ని నిర్లయించుకోండి. అప్పుడు మీరు కచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుతారు.
ఆహ్లాదంగా, ఒక ఆటలా ధ్యానం చేయండి :
ధ్యానం అంటే ఒక గొప్ప సాహసం. నిజానికి అది మీ జీవితంలో మీరు చేసే ఒక పెద్ద ప్రయోగం. అందుకని మీరు ధ్యానం అనగానే గంభీరంగా 37
(సీరియన్‌గా) అయిపోయారనుకోండి, ధ్యానంలో ఉండే అందాన్ని, ఆనందాన్ని మీరు పోగొట్టుకుంటారు.
నేను మీకు చాలా సార్లు చెప్పాను. ఎందుకో తెలియదు కాని ఆధ్యాత్మికత అనగానే అది ఒక సీరియస్ వ్యవహారం అనుకుంటారు. వెంటనే మీరు కూడా చాలా గంభీరంగా అయిపోతారు. అంతేకాదు ఆధ్యాత్మిక గురువులు అంటే సీరియస్‌గా ఉండాలి అని అనుకుంటారు. మీరు మరొక విషయం కూడా అనుకుంటారు. సీరియస్‌గా ఉంటేనే మనం పరిణితి చెందాము అని, గంభీరత అనేది పెద్దరికానికి గుర్తు అని. అందుకే ఆధ్యాత్మిక రంగంలో వారు చాలా మంది చాలా సీరియస్‌గా ఉంటారు.వారు పొరపాటున కూడా నవ్వరు. మీకు నేను చెబుతున్నాను. స్పష్టంగా అర్గం చేసుకోండి : ఆధ్యాత్మికత అంటే సీరియస్‌నెస్ కాదు. అది గంభీరంగా చేసే వ్యాపారం కాదు. ధ్యానం అంటే గంభీరంగా ఉండే స్థితి కాదు. ధ్యానం అంటే జీవితం ఒక లీల అని తెలుసుకోవటమే. ఇదంతా సర్వాంతర్యామి ఆడే జగన్నాటకం అని తెలుసుకోవటమే. జీవితం ఒక నాటకమయినప్పుడు, మన చుట్టూ ఉండే సర్వస్పష్టి భగవంతుడుఆడించే నాటకంలో భాగమయినపుడు ఇక సీరియస్‌గా ఉందవలసిన అవసరం ఏమున్నది?
ధ్యానం అనగానే మీరు సీరియస్‌గా, బరువుగా అయిపోవద్దు. ధ్యానాన్ని ఒక పండుగలా, ఒక ఉత్సవంలా చేయండి. అందులో ఆనందాన్ని పొందండి. ఇది ఒక అందమయిన ఆహ్లాదకరమయిన ఆట. నవ్వు ముఖంలో, అనందగా ధ్యానం చేయండి. ధ్యానాన్ని ఎంజాయ్ చేయండి. అంతేకాని దానిని ఒక బరువుగా, ఒక బాధ్యతగా చేయవద్ను.
నేను మీకు ఒక చిన్న సంఘటనని చెబుతాను. ఒకసారి ఒక ఆధ్యాత్మిక కాన్సరెన్స్ జరుగుతుంది. దానికి చాలామంది బౌద్ధ గురువులు సన్యాసులు వస్తారు. ఆ కాన్సరెన్స్‌లో అందరూ ఆధ్యాత్మికత గురించి మాట్లాదుతూ ఉంటారు. కొంతమంది చాలా పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు.
పరమహంస శీ, నిత్యానంద
ఈసారి ఒక బౌద్ధగురువు వంతు వచ్చింది. ఆయన సేజి మీదకి వెళ్ళి నవ్వటం మొదలుపెట్టాడు. ఆయన అలా నవ్యుతూనే ఉన్నాడు. ఆయన అంతరంగం లోపలి నుంచి నవ్యసాగాడు. ఆ నవ్యుతో ఆయన పూరిగా కదిలిపోసాగాడు.
హాలులో అందరూ ముందుగా ఆశ్చర్యపోయి ఆయనని చూడసాగారు.ఆయన నవ్యు హాలంతా వ్యాపించింది. నెమ్మదిగా హాలులోని (పేక్షకులు కూడా నవ్వటం (పారంభించారు. ఎందుకు నవ్యుతున్నారో కూడా తెలియకుండా అందరూ నవ్వుతున్నారు. ఇంకా, ఇంకా నవ్యుతున్నారు. అందరి నవ్వులతో ఆ హాలు అంతా శక్తి తరంగాలు ఏర్పడ్డాయి. అందరూ ఏదో తెలియని ఆనందస్థితికి, ఒక ఉన్నత స్గితికి చేరుకున్నారు. చివరలో ఆ గురువు గారు ఇదే నిజమయిన ఆధ్యాత్మికత అంటే ముగించారు.
నవ్వు ఒక చక్కని ధ్యానం. మనం నవ్యుతున్నప్పుడు మనలోపల వ్యర్ధపు మాటల (ప్రవాహం ఆగిపోతుంది. మన మైండ్ పూర్తి విశ్రాంతిలో ఉంటుంది. అందుకే మనసుతీరా నవ్వాక మనలో శక్తి ప్రవహించి కొత్త ఉత్సాహంతో ఉంటాము. అంతేకాదు నవ్యుకి మరొకరికి (అంటుకొనే) వ్యాపించే లక్రణం ఉన్నది. అందుకే దీనిని ఒక అందమయిన ధ్యానం అంటాను. నేను నిర్వహించే ధ్యాన కార్యక్రమాలలో ఈ నవ్వుని తప్పనిసరిగా ఒక ధ్యాన పద్ధతిలా చేయించుతాను. ఆ ధ్యాసం తరువాత అందరూ ఎంత ఉత్సాహంగా ఉంటారు. ముఖాలు ।పకాశవంతంగా అవుతాయి. అందుకే మీరు వీలయినప్పుడు నవ్వండి. నవ్య ముఖంతో ధ్యానం చేయండి.
ధ్యానం సహనంతో చేయాలి :
చాలామంది ఆధ్యాత్మిక శిక్షణా తరగతులకి వచ్చినప్పుడు మొదటిరోజే, మొదటి క్షాసులోనే వారికి ఏవో ఆధ్యాత్మిక అనుభవాలు జరుగుతాయి అని ఆశించుతారు. దాంతో ఏకాగ్రత అంతా ఫలితాల మీద ఉంటుంది.
అసలు నేటి సమాజంలో అన్నీ ఇన్‌స్టెంట్ ఫలితాలే కావాలి కదా. [పతి దానికి వెంటనే ఫలితం కావాలి. మనిషిలో దేనికైనా ఎదురుచూసే సహనం పూర్తిగా 39 పోయింది. అన్నింటికంటే ముందు వచ్చే భావం అసహనం. అనుకున్న దానికంటే అరనిముషం ఆలస్యమయితే చాలు అరవె సార్హు వాచీ చూసుకుంటాము. పరమహంస నిత్యానంద మనని ఈ అసహనం నుంచి బయటకి తేవటానికి చాలా సహాయం చేస్తారు. ముఖ్యంగా ఆయన నిర్వహించే ధ్యాన కార్యక్రమాలలో మనకి (పత్యక్షంగా పరోక్షంగా ఇచ్చే శిక్షణ ఈ అసహనం అనే అలవాటుని తప్పించటమే. ఆయన ప్రపతి శిక్రణా తరగతిలో ముందుగా చెప్పేమాట 'ఫలితాలని మొదటి క్షాసులోనే ఆశించకండి' అని. మనలో మనకి తెలియకుందా చాప కింద నీరులా నిశ్నబద్ధంగా వచ్చి చేరే డి[పెషన్ లేదా మనసిక కుంగుబాటు అనే వ్యాధికి, మనం నిరంతరం బాధపడే వత్తిడికి కారణం ఈ అసహనమే. అందుకే పరమహంస మనకి ఈ శిక్షణకి ఇస్తారు. సరే ఈ విషయంలో స్వామి ఏమి చెబుతారో చూద్రాము. మీరు ధ్యానం మొదలుపెట్టినరోజునే అద్భుతాలు జరుగుతాయి అని
ఆశించకండి. ఆ రోజునే సర్వాంతర్వామి, భగవంతుడు మీ దగ్గరకి వచ్చేస్తాడు అని ఎదురు చూడకండి. ఇంకా ఫలితాలు రాలేదు ఎలా అని బాధపడకండి. అసలు ఫలితం గురించి వ్యధ చెందకండి. అలా ఫలితాల గురించి ఆలోచించితే మీరు ధ్యానం చేయలేరు.
మీకు ఒక చిన్న కథ చెబుతాను :
ఒకసారి మూడు కోతులకి ఒక పండిన మామిడిపండు దొరుకుతుంది. ఆ మూడు కోతులు నేను తింటాను, నేను తింటాను అని పోట్నాటకి దిగుతాయి. చివరికి ఇలా కాదని వాటికి గురువులాంటిది పెద్దది అయిన మరొక కోతి దగ్గరకి ఆ మామిడి పందుని తీసుకొని వెళతాయి. గురువు కోతి వాటి వాదనలు, (పతివాదనలు విని, ఈ విధంగా తీర్చు చెబుతుంది.
ఇక్కడ ఉన్నది ఒక్క కాయ. కాబట్లి దీనిని నేను తిని ఇందులో టెంకని (విత్తనం) మీకు ఇస్తాను. మీ ముగ్దురూ కలసి దానిని నాటండి. మొక్క మొలచి పెద్ద చెట్లు అయ్యి చాలా కాయలు కాసుంది. ఇక మీ ఇష్హమొచ్చినన్ని కాయలు తినవచ్చు, అని చెబుతుంది. దీనికి కోతులు ఒప్పుకొని టెంకని పాతుతాయి. అందులో మొదటి కోతి రోజూ నీరు పోసాను అంటుంది : రెండవది ఎరువులు వేసాను అంటుంది, మూడవ కోతి దానిని జాగ్గత్తగా కాపాడతాను అంటుంది.
ఈ విధంగా చాలా కాలం గడచిపోతుంది. కానీ మొక్కరాలేదు. మూదు కోతులు గురువు దగ్గరకి వెళ్ళి తమని మోసం చేసిందని గొదవ పెట్టుకుంటాయి. అపుడు గురువు కోతి "మీరు ఏమి చేసారు" అని అదుగుతుంది. అప్పుడు మొదటి కోతి నేనురోజూ మర్సిపోకుండా నీరు పోస్మన్నాను అంటుంది. రెండవ కోతి ఎరువులు వేశాను అని చెబుతుంది. మూడవ కోతి నేను దానిని జాగ్గత్తగా కాపలా కాసున్నాను. అంతేకాదు (పతి రోజు విత్తనాన్ని బయటకి తీసి మొక్క వచ్చిందా లేదా అని కూడా చూస్తున్నాను అని చాలా గొప్పగా చెబుతుంది.
మనం కూడా అలానే చేసాము. అందుకే మనకి ఫలితం కనిపించదు. కాబట్టి మీరు ఫలితాల గురించి ఆత్బత పడవద్న. ధ్యానం అనే ఒక కార్యక్రమం, మీలో అభివృద్ధి జరిగేలా చూదండి. అంతేకాని అత్యాశతో ఫలితాలను గురించి బాధపడకండి. ఎప్పుదయితే మీ ఏకాగ్రత ఫలితాల మీదకి వెళుతుందో, మీలో జరగవలసిన ప్రగతిని ఆపినట్లు అవుతుంది. కాబట్టి సహనంతో ధ్యానం చేయండి. ఒంటరిగా మీతో మీరు ఉండే విధంగా చూసుకోండి.
పరమహంస ఈ |పశుకి చేయవచ్చు అని చెబుతారు. అయితే ఆయన మనకి కొన్ని సూచనలు ఇసూ మనం ధ్యానం [పారంభించటానికి కొన్ని విషయాలని వివరిస్తారు. వాటిలో ముఖ్యమయినవి ఈవిధంగా ఉంటాయి.
ధ్యానం చేసే సమయంలో మీరు గురుంచుకోవలసిన విషయాలు :
ధ్యానం ప్రారంభిస్తున్న ధ్యానులకి నిత్యానందస్వామి కొన్ని విషయాలని (పత్వేకంగా చెబుతారు. అవి మనం చేసే ధ్యానంలో మంచి ఫలితాలను పొందటానికి సహాయం చేస్తాయి. పరమహంస ధ్యానులని ఉద్దేశించి ఈ విధంగా చెబుతారు.
ధ్యాసం మిమ్మలని మీ అంతరంగపు (పపంచంలోనికి తీసుకువెళుతుంది. అయితే మీరు మీ అంతరంగంలోనికి [పవేశించేముందు మీ బాహ్యాప్రపంచంలో కొన్ని విషయాలపైన కొంత ఏకాగ్రతని నిలపాలి. ఎందుకంటే మీరు ఇంకా ధ్యానం పారంభించలేదు ధ్యానం ప్రారంభించబోతున్నారు. మీరు ఒద్దన నిలబడి కాలివేలిని నీటిలో ముంచి నీరు ఎలా ఉన్నది అని పరీక్షిస్తున్నారు. ఒకే వేళ నీరు చాలా చల్లగా ఉంటే నీళ్ళలోనికి దిగకూడదు అని కూడా అనుకుంటారు. అసలు ఇది నీళ్ళలోనికి దిగే సమయమేనా కాదా అని ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తూ ఉంటే మీరు నది ఒడ్లనే ఉండిపోతారు.
ఈ సందర్శంలో మీకు ఒక విషయం సృష్టంగా చెప్పాలి. మీరు అని అనుకుంటున్న 'మీరు' మూడు అంశాల కలయిక. అవి మీ శరీరం, మీ ఆలోచనలు, మీ భావావేశాలు. మీరు జన్మించినది మొదలు నేటి వరకూ మీరు అనగానే ఈ మూదు అని మాత్రమే మీకు చెబుతారు. మీకు మీ అసలయినది, మీ సొంతమయిన మరొక ప్రపంచం మీ అంతరంగంలో ఉన్నదని, అక్కడే మీ అసలయిన ఉనికి ఉన్నది అని మీకు సమాజం కానీ, మీ చుట్ణు [పక్కల వారు కాని ఎప్పుడూ చెప్పరు. ఎందుకంటే అటువంటిది ఉన్నది అని వారికి కూడా తెలియదు.
మీరు ధ్యానం చేసే ముందు కొంచం ఈ విషయాల మీద మీరు పని చేయాలి.
పరమహంస శ్రీ, నిత్యానంద
మీ శరీరం మీద పని చేయండి :
మీ శరీరం అంటే భౌతికంగా మీకు కనపడే మీ శరీర భాగాలు, తల నుంచి కాళ్ళ వరకూ ఉండే మొత్తం. మీరు ఈ శరీరంతో జన్మించుతారు. మీ వయస్సుతో పాటు అది పెరుగుతుంది.
సరే, మీరు మీ శరీరం గురించి ఏమనుకుంటున్నారు? అందరం మన మన శరీరాల గురించి కొన్ని అభిపాయాలని ఏర్పరచుకుంటాము. ఈ అభిప్రాయాలు అనేవి మీ సొంతం కాదు అని మీకు తెలుసు. సాధారణంగా ఇతరులు మన శరీరం గురించి వెల్లడి చేసిన వారి అభిపాయాలు నుంచి కొన్ని ఎంచుకొని వాటిని మనకి అన్యయించుకుంటాయి. మీరు ఒక్క నిముషం కళ్ళు మూసుకుని మీ శరీరంపై మీ అభిప్రాయాలని మీ శరీరం గురించి మీరు ఏమనుకుంటున్నారో గురు తెచ్చుకోండి. మీకు రెండు విషయాలు అర్ధమవుతాయి.
అవన్నీ బయట ఎవరో అన్న అభిప్రాయాలే కానీ మీ అభిప్రాయాలు కావు. ఇందులో ఎక్కువ భాగం వ్యతిరేకపు భావనలే.అయితే ఈ విషయం ఇప్పటివరకూ మీకు తెలియదు. మీ అచేతన స్థితిలో మీ శరీరం గురించి ఇటువంటి వ్యతిరేక భావనలు లోతుగా నాటుకుపోయి ఉన్నాయి. మీరు ఇంతకాలం వాటిని ఆ భావనలని మీకు తెలియకుండా మోసున్నారు.
నాకు తెలిసినంతవరకూ చాలా చాలా అరుదుగా నేను నా శరీరంతో సౌకర్యంగా ఉన్నాను అని చెప్పేవారిని చూస్తాను. ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఎవరో కాని తమ శరీరాన్ని ద్వేషించకుండా, నాకు నా శరీరం సౌకర్యంగానే ఉన్నది అని అంటారు.
మీరు మీ జీవితంలో ఎక్కువభాగం శరీరానికి సంబంధించిన వ్యతిరేకపు అభి(పాయాలని మాత్రమే వింటుంటారు. నీ శరీరమే నీ శుతువు. నీ శరీరం చెడ్డది. అది పాపంతో కూడి ఉన్నది. అందుకే నీ శరీరాన్ని హింసించు. దానిని పూర్తిగా వదిలివేయి. అసలు పట్టించుకోవద్దు. ఇలాంటి అభిప్రాయాలు, మాటలు, శరీరం గురించి అనే అతి సాధారణమయనవి. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు ఎక్కువగా ఇటువంటి అభి(పాయాలని కలిగి ఉంటారు. వారు ఆధ్యాత్మిక (పగతి సాధించే (క్రమంలో ఈ శరీరం ఒక అడ్డంకు అని అనుకుంటారు. అంతేకాకుండా సమాజంలోని నిబంధనలు, (కమశిక్రణ పేరుతో కూడా శరీరాన్ని అ(శద్ధ చేసారు. ఈ అభిపాయాలు చాలా చిన్నవయస్సు నుంచే మీ అచేతన స్గితిలో లోతుగా నాటబడిపోతాయి. అప్పుడు మీరు శరీరాన్ని ద్వేషించటం (పారంభిస్తారు. మీ శరీరం మీకు శుతువు అని గట్టిగా నమ్ముతారు. ఈ శరీరం మీకు వ్యతిరేకంగా పని చేస్తుందనే గట్టి అభిప్రాయాన్ని ఏర్సరచుకుంటారు.
కానీ అసలు సత్యం పీకు తెలియదు. మీ శరీరం ఈ సంసారం అనే సముద్రాన్ని దాటించే ఒక నౌక లాంటిది. ఒక్కసారి ఆలోచించండి. ఈ శరీరం లేకుండా మీరు ఈ [పపంచంలో ఎక్కడికయినా వెళ్ళగలరా? మీరు ఈ శరీరం సహాయం లేకుండా ఏ పనైనా చేయగలరా? మీ శరీరం మంచి స్థితిలో లేనప్పుడు మీరు అసలు ధ్యానం చేయగలరా? ఆధ్యాత్మికంగా ఏమైనా సాధించగలరా? కనీసం ఈ పుస్తకాన్ని చదవగలరా? ఈ పుస్తకం చదవాలి అంటే మీకు కళ్ళు, మీ మెదడు సహాయం చేయాలి కదా?
అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్సిపోకూడదు. మీరు చివరగా ఈ శరీరానికి అతీతంగా వెళ్ళగలగాలి. అలా శరీరానికి అతీతంగా వెళ్ళాలి కదా అని శరీరాన్ని అడ్రద్ధ చేయకూడదు.
కాబట్టి మీ శరీరాన్ని ఆదరించాలి. అర్గం చేసుకోవాలి. దానిఫై కొంత పని చేయాలి. అప్పుడే మీరు ఈ శరీరంతో ధ్యానం చేయగలుగుతారు. ఇక్కడ ఒక ముఖ్యవిషయం మరిచిపోకూడదు. మీ శరీరం ఒక శక్రివంతమయిన ఆయుధంలాంటిది. అది మీ శుతువు కాదు స్నేహితుడూ కాదు. ఇది మీకు ఉపయోగపడే ఒక పనిముట్లు మాత్రమే.
పరమహంస శీ, నిత్యానంద
కాబట్టి ధ్యానం చేయటానికి ముందు, మీ శరీరం మీద (శద్ద చూపించండి. మీ శరీరం ఎంతబాగా పని చేస్తే, మీరు ధ్యానంలోనికి అంత కచ్చితంగా పూర్తిగా వదిలివేయండి.
మన శరీరంపై ఎలా (శద్ద చూపాలి :
ముందుగా మీ శరీరం పట్ల [శద్ద చూపించటం మొదలుపెట్టండి. మీ శరీరం ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నప్పుడే మీరు ధ్యానం బాగా చేయగలుగుతారు. కాబట్లి మీ శరీరాన్ని శుభ్రం చేయండి.
శరీరాన్ని శుభ్రపరచటం అంటే ఏమిటి ?
మన శరీరంలో శక్తి ఒక ప్రవాహంలా నిరంతరం ప్రపహిస్తూ ఉంటుంది. ఆశక్తి (పవాహం నిరాటంగా (పవహిసున్నంత సేపు మనకి ఎటువంటి సమస్యలు ఉందవు. కానీ చాలాసార్డు ఆ శక్రికి అడ్డంకులు ఏర్పడతాయి. అప్పుదు మనకి శారీరక సమస్యలు ఏర్పడతాయి.
శకి (పవాహానికి అడ్డంకులు అంటే ఏమిటి?
మనం మన చిన్నతనం నుంచి ఎన్నో భావావేశాలని అణచివేస్తాము. ఈ సమాజం మర్యాద పేరు మీద మనని మన శరీరం ద్వారా మనలోని భావావేశా లని వ్యక్తపరచనీయదు. ఉదాహరణకి మీకు ఎవరిమీదయినా కోపం వచ్చిందనుకోంది. వెంటనే శరీరం మనం పోట్లాదటానికి, ఇతరుల నుంచి మనని మనం రక్షించుకోవటానికి అవసరమయిన రసాయనాలని తయారుచేసుంది. ఒక వేళ మీకు కోపం వచ్చిన వ్యక్తి తండ్రి, గురువు లేదా మేనేజర్ ఇలా మీకంటే పెద్దవారయితే మీరు ఏం చేసారు. ఆ కోపాన్ని అణచివేసారు. అప్పుడు ఆ ఆవేశంతో పాటు విడుదల అయిన శక్తి అలాగే ఉండిపోతుంది. ఉపయోగించని శక్తి రసాయనాలు శరీరంలో అడ్డంకుగా తయారవుతాయి. అదే విధంగా కోరికని అణచినా, భయాన్ని అణచినా, ఆశని అణచినా చివరికి అవి అన్నీ అడ్డంకులుగా మారుతాయి. కాలం గడచే కొద్దీ ఇవన్నీ గట్టిపడిపోతాయి. అవే మనలో శక్తి 45
చెతన్యవంతంగా ఉండదో అప్పుడు మనలోని శక్తి కేంద్రాలయిన చక్రాలు ముదుచుకుపోయి చిన్నవయిపోతాయి. అప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఈ విధంగా అణచివేయబడిన భావావేశాలు కొంత హద్దులు దాటితే అవి మనిషిని పిచ్ఛివాళ్ళుగా, మానసిక రోగులుగా మార్చేసాయి. అందుకే అంటుంటారు, మీ శారీరక సమస్యలు మానసిక సమస్యలకి దారి తీస్తాయి. అదే విధంగా మీ మానసిక సమస్యలు కొన్ని అనారోగ్యాలని కలిగించి శారీరక సమస్యలని సృష్టిస్తాయి. అంతేకాదు మనలో ఉండే 80% వ్యాధులు మానసికమయినవే అని శాస్త్రీయంగా నిరూపించబద్దాయి.
అహారపు అలవాట్లు :
కొన్ని ఆహారపు అలవాటు కూడా మన శరీరానికి హాని చేసాయి. మనకి ఎన్నోసార్లు మన శరీరం 'నాకు వద్దు. దయచేసి ఇది తినవద్శ' అని కళ్ళ నీళ్ళతో పార్గిసూ అడుగుతుంది. కానీ మనం వినం. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఘాటయిన మసాలాలు తిన్నప్పుడు, ఎక్కువ కారం, ఎక్కువ పులుపు లేదా ఉప్పు తిన్నప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి. కానీ మనం బలవంతంగా అవన్నీ తినేసాము. అలా తిని వ్యాధులని మన మీదకి [ప్రామతో, మర్యాదలతో ఆహాన్విస్తాము. అలాగే అతిగా తిని జీర్ణవ్యవస్గకి మోయలేని పనిని ఇస్తాం.
అదే విధంగా నిగ్రదవస్తున్నా టి.వి. చూసారు. కక్కు అలసిపోయినా నాకు విశ్రీశాంతి ఆ కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తుంటాము. శరీరం నాకు విశ్రీశాంతి కావాలి అని గోలపెడుతున్న వినం. ఇవన్నీ మనం మన శరీరానికి చేసే హాని. ఈవిధంగా మన శరీరం మీదకి వ్యాధులని అతిధులుగా ఆహ్వానించి ఆ తరువాత వాటి మీద పిర్యాధులు చేస్తుంటాము.
అందుకే శరీరాన్ని ముందుగా శుభం చేయాలి :
ముందుగా మీలో ఏర్పడిన ఈ అద్ధంకులని తొలగించుకోవాలి. దీనికి ధ్యానం మీకు సహకరిస్తుంది. ఆ తరువాత శరీరంలో ఎటువంటి అద్దంకులని పరమహంస శీ, నిత్యానంద
సృష్టించకూడదు. ఒక్కసారి మీరు మీ శరీరాన్ని ఈ అధ్ధంకుల నుంచి కాపాడితే, అది ఎంత అందంగా వికసిస్తుందో మీరే స్వయంగా చూడగలరు. మీ శరీరం అందంగా దివ్యత్త్వంతో అలరారటం మీరు గమనించగలుగుతారు. అందుకే మీ శరీరంతో స్పేహపూరిత సంబంధాలని అందమయిన అనుబంధాన్ని పెంచుకోవాలి. శరీరాన్ని (పేమతో ఆదరించాలి. శరీర భాషని, అది మనకి ఏమి చెబుతుందో అర్గం చేసుకోవాలి. శరీరానికి కావలసిన తెలివితేటలు దానికి ఉన్నాయి. ఆ విషయం మీరు తెలుసుకోవాలి.
ఆహారశుద్ధి :
ఆహారశుద్తి గురించి పరమహంస నిత్యానంద అద్యుతమయిన వివరణ ఇస్తారు. ఆయన ఆహారశుద్ధి గురించి ఈ విధంగా చెబుతారు. ఆహారం అంటే మనం మన లోపలికి తీసుకునే భోజనమే కాదు, స్తుర్శావయవాల ద్వారా లోపలికి తీసుకునే అన్ని కూడా ఆహారమే. మనం కళ్ళతో చూసేవి, చర్మం స్పర్శ ద్వారా తెలుసుకునేవి, చెవులతో వినేవి, ముక్కు ద్వారా చూసే వాసనలు, నాలుక ద్వారా చూసే రుచులు అన్ని ఆహారమే. ఇవన్నీ కూడా పరిశుద్ధమయినవి అయినప్పుడే మన శరీరం, మనస్సు సౌకర్యంగా, ఆహ్లాదంగా ఉండగలుగుతాయి. అవి పరిశుద్ధిగా లేనప్పుడు శరీరం అసౌకర్యానికి గురి అవుతుంది.
మీ ఆలోచనల మీద పనిచేయండి :
మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమయిన పాత్ర పోషించే భాగం ఆలోచనలు. అవి మనలో నిరంతరం ఒక ప్రవాహంలా వస్తూనే ఉంటాయి. బహుశః మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి నేటి వరకు కనీసం ఒక క్షణమయినా ఆ ఆలోచనలు లేకుండా జీవితం ఉండి ఉండదు. నిద్దలో కూడా ఆలోచనలు కలల రూపంలో వసుంటాయి. ఈ ఆలోచనలన్నీ ఒక వ్యవస్థగా ఏర్పడితే దానినే మనస్సు లేదా మైండ్ అంటాము. అదే మన మానసిక స్థితిని తెలియచేస్తుంది.
ఆలోచనలు అంటే ఏమిటి?
ఈ ప్రశ్నకి పరమహంస ఒక చక్కని పరిశోధనా నివేదిక లాంటి శాసీయ వివరణ ఇస్తారు. ఆయన ఆలోచనల గురించి చాలా [పవచనాలలో ఎంతో అద్నుతంగా వివరించారు. అయన ఇచ్చిన వివరణ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని విషయాలు మనని నిర్ఘాంతపోయేలా చేస్తాయి. పరమహంస ఆలోచనలని గురించి చెప్పిన విషయాలు బహుశః మనం ఎక్కడా విని ఉండం లేదా ఎక్కడా చదివి ఉండము. సాంమీజీ ఆలోచనలని గురించి ఈ విధంగా చెబుతారు. ఆలోచనల మనలో మనం మాట్తాడుకునే మాటలే :
(పతి వ్యక్తి నిరంతరం తనలో తాను ఏదో మాట్తాదుకుంటూ ఉంటాడు. ఫెకి నిశ్నబ్ధంగా ఉన్న వ్యక్తి నిజానికి నిశ్నబ్దంగా ఉందరు. వారి అంతరంగంలో మాటల ప్రపవాహం వెళుతూ ఉంటుంది. అది అర్ధం లేని, కారణం లేని, ఎటువంటి సంబంధంలేని మాటల రాసులు మాత్రమే. ఒక్క అయిదు నిముషాలు మీ అంతరంగంలో అనుకునే మాటలు పైకి అనండి. మీ మాటలు మీరు విని ఎంత సిగ్గుపడతారో చూదండి. ఆ మాటలే ఆలోచనలు. ఒక్కొక్కసారి ఆ మాటల హింస నుంచి తప్పించుకోవటానికే మీరు బయట (పపంచంలో ఎవరో ఒకరిలో మాట్షాడుతూ ఉంటారు. అందుకే ఈ (పపంచంలో ఇంత ఎక్కువగా మాటల సంభాషణలు జరుగుతుంటాయి.
(పతి ఆలోచనా స్వతం(తమయినది :
మనలో జనించే (పతి ఆలోచనా స్వతం(తమయినవి. వాటికి ఒకదానితో మరొకదానిని ఎటువంటి సంబంధం ఉందవు. అవి అలా వస్తూవుంటాయి పోతుంటాయి. వాటికి ఇప్పటి పరిస్థితికీ ఏమీ సంబంధం ఉండదు. వాటికి అర్ధం ఉందదు, ఒక లక్ష్యం ఉండదు. అవి చెరువులోని గాలి బుదగలు లాగా పుదతాయి, మరొక ఆలోచన రాగానే మాయం అయిపోతాయి. అయితే ఇంత వరకూ పరవాలేదు కానీ మనం ఏమి చేస్తాం. అర్ధం లేని, స్వతంత్రమయిన ప్రుతి ఆలోచన ఒకదానితో ఒకదానికి ఏదో విధమయిన సంబంధాన్ని ఏర్పరచి, ఒకదానితో మరొకదానికి లింకులు ఏర్పాటు చేసి వాటనన్నింటినీ కలిపి ఒక చెనులా లేదా ఒక ఇరుసులా తయారు చేస్తాం. ఇప్పుడు దీని ఆధారంగా మనం ఎలా ఉండాలి అని నిర్ణయాలు చేస్తాం.
ఇది ఎంత విచితమో చూదండి. అసల అర్ధం లేని పిచ్చిమాటలని ఒక వ్యవస్తలా ఏర్పరచి, దానిని మనం నమ్ముతాము. దాని మీద మన విశ్వాసాన్ని వుంచి, మన జీవితాన్ని ఆ వ్యవస్గకి అప్పచెబుతాము. ఎందుకంటే మనం కల్పించిన అర్ధం లేని ఈ వ్యవస్థ మన నియంత్రణలో ఉండదు. మనం, మన జీవితం దాని నియం(తణలో ఉంటాయి. మనం ఈ ఆలోచనా వ్యవస్గ ఎలా చెబితే అలా జీవిస్తాము. దాని మనం అంత శక్తిని ఇస్తాము.
ఆలోచనలకి మనని మార్చే శక్తి ఉన్నది :
పరమహంస నిత్యానంద ఈ ఆలోచనలు మనని ఎలా ఆడిస్తాయో చక్కగా చెబుతారు. ఒకదానికి ఒకటి సంబంధం లేని ఆలోచనలకి లింకులు ఏర్పరచి దానిలో అర్దాలు వెతికి సమస్యలు మనమే సృష్టించుకుంటాము. స్వామి ఇలా చెబుతారు, మీరు ఏకాగ్రతలో, తెలుసుకునే తత్వంతో మీ సమస్యని గమనించండి. ఈ విషయం మీకు స్పష్టంగా అర్ధమవుతుంది.
అంతేకాకుండా మనం బాధపడాలి అని అనుకుంటే ఈ ఆలోచనల లింకులు పెట్టి, అప్పుడు బాధలతో నిండిపోతాము. సంతోషంగా ఉండాలి అని అనుకుంటే ఈ ఆలోచనల నుంచి, సంతోషం కలిగించే ఆలోచనలని పోగుచేసి, సంతోషంగా ఉంటాము. మన భాషలో మనం అనుకునే సంతోషం, బాధ అంటే ఇదే.
మీకు చెబుతున్నాను. స్పష్టంగా అర్గం చేసుకోండి. ఆలోచనలకి చాలా శక్తి ఉన్నది. అది మిమ్మలని, మీ జీవితాలని మార్చగలవు. అవి మీ మానసిక స్గితిని మీ జీవన సరళిని పూర్తిగా మార్చివేయగలవు.
ఉదాహరణకి : మీరు నిరంతరం అందమయన ఆలోచనలతో ఉంటే మీ జీవితం అందంగా అవుతుంది. మీ ఆలోచనలన్నీ ఆహ్లాదకరంగా ఉంటే జీవితం చాలా ఆహ్లాదంగా ఉండటాన్ని మీరు గమనించగలుగుతారు.
ఇప్పుడు మనం ఏమి చేయాలి?
ముందుగా మీ ఆలోచనలని జా।గతగా గమనించండి. మీ లోపలికి ఆలోచనలు వసున్నపుడు మీలో ఏమి జరుగుతున్నదో గమనించండి. వ్వతిరేకపు ఆలోచనలయన కోపం భయం, అత్యాశ, అసూయ ఇటువంటి వి కలిగినప్పుడు,వెంటనే మీరు చాలా అసౌకర్యంగా అయిపోతారు. అది మీకు స్పష్టంగా తెలుసుంది. అదే విధంగా మీ అహంకారం బయటికి వచ్చే అహంకారపూరితమయిన ఆలోచనలు వచ్చినపుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు సౌకర్యంగా, ఆహ్తాదంగా ఉంటారు.జాగ్గత్తగా వాటిని గమనించి మీకు అసౌకర్యం, ఇబ్బంది కలిగించే ఆలోచనలని వదిలివేయండి. మీకు ఆనందాన్ని ఆహ్తాదాన్ని కలిగించే మంచి ఆలోచనలని మాతమే పోగుచేయండి. అప్పుడు మీరు సౌకర్యంగా ఉందగలుగుతారు.
ఆలోచనలని కేవలం గమనించండి :
ఆలోచనలు వస్తుంటాయి. పోతుంటాయి మీరు వాటిని ఆపాలి అని చూదవదు. మీరు అలా అనుకున్నప్పుడు ఆలోచనలని ఎలా ఆపాలి అనే సమస్య మీకు ఉన్నసమస్యలతో పాటు మరొక సమస్యలా మీ ముందుకి వస్తుంది. అంతేకాకుండా ఆలోచనలని ఆపాలి అని అనుకొని బలవంతంగా ఆపితే అవి మరింత విజ్బంబించి మరిన్ని ఆలోచనలు మీ లోపలికి వస్తాయి.
కాబట్టి ఆలోచనలని ఆపాలి అని చూదవద్దు. మీ లోపలికి వచ్చే ఆలోచనలని అలా గమనించండి. అంతే అవి వస్సుంటాయి. పోతుంటాయి. వాటికి చిరునవ్వుతో అలా గమనించండి. వాటిని అర్థాలు వెతకకండి. అలాగే ఒక దానికి మరొక దానితో లింకులు పెట్టకండి. ఎప్పుడెతే మీరు ఒక పరిశీలకుడిగా మారతారో అప్పుడు ఆలోచనల ప్రవాహం యొక్క వేగం తగ్గుతుంది. క్రమంగా ఆలోచనల సంఖ్య కూడా తగ్గుతుంది.
ఇప్పుడు మీరు లోతుగా,ఏకాగ్రతతో ఆలోచనలు ఎక్కడి నుండి వస్కున్నాయో గమనించండి. అవి మీ అచేతన స్పితి నుంచి రావటం గమనించుతారు. ఇప్పుడు
Part 2: The Path of Meditation_Telugu_part_2.md
పరమహంస శ్రీ, నిత్యానంద
మీరు మీ అచేతన స్తితిలోని ఆలోచనలని మార్చటానికి ప్రయత్నించండి. అవి మీ చేతనస్తితోని జీవితం పైన (పభావాన్ని చూపుతాయి. ఉదాహరణకి మీకు కోపం తగ్గించుకోవాలి అని ఉన్నదనుకోండి. మీరు నిద్దపోయే ముందు మీ మైంద్‌కి (మనస్సుకి) కోపం తగ్తించుకోమని సూచనని ఇవ్వండి. ఆ విధంగా పదే పదే అదే సూచనని మైంద్‌కి ఇవ్వండి. కొంతకాలంలోనే మీరు ఆశ్చర్యపోయేంత మార్పు మీలో కలుగుతుంది. మీలో కోపం బాగా తగ్గిపోతుంది.
స్వామి చివరిలో ఈ విధంగా చెబుతారు. మీరు కేవలం పరిశీలకునిగా మారినప్పుడు, మీ ఆలోచనలు, దానితో ఏర్పడిన మీ మైండ్ (మనస్సు) మీచేతిలో ఒకపనిముట్టుగా మారిపోతుంది. అప్పుడు దానిని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు. ఎప్పుదయితే మీరు మైంద్‌ని మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చిన ప్రకారం వాడటానికి అలవాటుపడతారో, అప్పుడు మీరు దానిని (ఆలోచనలని) సులభంగా వదిలివేయగలరు.
బాగా గురుంచుకోండి, ఆలోచనలని అణచవద్దు. అలా చేస్తే అవి సరాసరి మీ మణిపూరక చక్రంలోనికి వెళతాయి. అవి (క్రమంగా మీలో వ్యతిరేక భావాలని కలిగించుతాయి. ఈ వ్యతిరేక భావాలే చాలా సమస్యలకి కారణం. కాబట్టి మీ ఆలోచనలని ఒక పరిశీలకునిగా మారండి. ఆ తరువాత జరగవలసినది మీకు అనుకూలంగా జరుగుతుంది.
మీ భావావేశాల మీద పనిచేయండి :
మన అందరిలో రకరకాల భావావేశాలు ఉంటాయి. వాటిలో కొన్ని వ్యతిరేక భావాలు, కొన్ని అనుకూల భావాలు. భావావేశాల గురించి పరమహంస నిత్యానంద ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుతారు. ఉదాహరణకి ఆనందస్సురణ అనే ధ్యాన శిక్రణా కార్యక్రమాన్ని పరమహంస ప్రవే్యక శ్రద్ధతో రూపొందించారు. ఇందులో మన వ్యతిరేక భావావేశాలు అవి మన జీవితం మీద ఎటువంటి (పభావాన్ని చూపుతాయి. ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి.
ధ్యాన మార్గం
ఆయన ముఖ్య [పవచనాల నుంచి కొంత తెలుసుకుందాము. ఈ భావావేశాల గురించి స్వామీజీ ఈ విధంగా చెబుతారు.
మనలోని భావావేశాలలే మన (పపంచాన్ని నిర్మిసాయి. మన భావావేశాలు ఎలా ఉంటే మన జీవితం, మన చుట్టుపక్కల ఉండే [పపంచం అదే విధంగా ఉంటుంది. మనలోని భావాలు స్పష్టంగా, అనుకూలంగా ఉంటే ప్రపంచం మనకి అనుకూలంగా ఉంటుంది. సర్వస్సష్టి, సర్వాంతర్యామి అనుకూలమవుతారు. ఉదాహరణనికి మీరు (పేమతో నిండి ఉంటే, మీరు ఎక్కడ అయినా (పేమనే చూదగలుగుతారు. మీరు ద్వేషంతో నిండి ఉంటే మీకు [పపంచంలో ద్వేషమే కనిపిస్తుంది. ఆ ద్వేషమే మీ దగ్గరకి ఏదో ఒక రూపంలో వస్తుంది. అప్పుడు మీరు ద్వేషాన్నే స్వీకరించుతారు.
ఇది సత్యం. అయితే ఈ విషయాన్ని మనం ఒప్పుకోము, అర్ధం చేసుకోము. స్పష్టంగా అర్ధం చేసుకోండి మీ జీవితాలలోని నాణ్యతకి పూర్తి బాధ్యత మీదే. మీలోని భావాలు మిమ్మలని అంతగా ప్రభావితం చేస్తాయి.
మనలో ఉండే సాధారణమయిన వ్యతిరేక భావాలు, కోరిక, భయం, వ్యధ, అసూయ, అసంత్సప్తి, అత్యాశ్, అహంకారం, స్వార్గం మొదలయినవి. మనలోని అనుకూల భావాలు (పేమ, కరుణ, కృతజ్ఞతా భావం, నిస్వార్గం మొదలయినవి.
మనలో వ్యతిరేక భావావేశాలు అధికంగా ఉంటే అవి నేరుగా మనలోని చ(కాలని కల్శషం చేసి వాటిని చిన్నవిగా కుంచించుకుపోయేలా చేసాయి. ఉదాహరణకి వ్యధలు,బాధలు, మణిపూరక చక్రకాన్ని బంధించివేస్తాయి. భయం, స్వాధిష్ఠాన చక్రకాన్ని బంధించి వేసుంది. అసూయ విశుద్ధి చక్రాన్ని శక్రిహీనం చేస్తుంది. అహంకారం ఆజ్ల చక్రకాన్ని చైతన్య రహితం చేస్తుంది. పరమహంస వీటికి ప్రత్యేకమయిన ధ్యానపద్ధతులని రూపొందించారు.
ఇక్కడ మీరు చేయవలసినది ఏమిటి అంటే :ముందుగా మీలోని భావావేశాలని జాగ్రత్తగా గమనించండి. అందులో వ్యతిరేక భావాలు, అనుకూల 52
పరమహంస శీ, నిత్యానంద
భావాలు అన్నీ ఉంటాయి. అదే విధంగా శక్రివంతమయినవి, తక్కువ శక్రి గల భావాలు ఉంటాయి. ముందుగా మీరు మీలోని శక్రివంతమయిన భావాలని గమినంచండి. మీలోని భావావేశాలని క్రుణ్ణంగా పరిశీలించితే ఇవి మీకు అర్గమవుతాయి.
(పతిరోజు మనలో మంచి ఆహ్లదకరమయిన భావాలు, అనుభవాలు ఉంటాయి, అదే విధంగా మనకి నచ్చనవి, మనని నొప్పించే భావాలు, అనుభవాలు ఉంటాయి. రోజు చివరిలో ఎవరయినా మనని ఈ రోజు నీ అనుభవాలు ఏమిటి అనగానే మనకు నచ్చనివి, మనని బాధపెట్టినవే గురువస్తాయి. మీ ద్రస్ మీద కాఫీ పడటం, ట్రాఫిక జామ్, ఆఫీసులో కొలిగ్‌తో చిన్న గొడవ, రిపోర్వలో ద్రాసిన తపు, దాని మీద బాస్ కామెంట్ ఇలాంటివే గురువస్తాయి. కానీ వాటితో పాటు ని।దలేవగానే చూసిన అందమయిన సూర్యోదయం, అంతకంటే అందమయిన చిరుసవ్వుతో భార్య అందించిన కాఫీ, గార్దెన్‌లో కూర్చొని విరబూసిన మందారాలని చూసూ తాగిన కమ్మటి కాఫీ, బుజ్టిపాపతో ఆడిన ఆటలు, హాయిగా షవర్ క్రింద చేసిన స్ఫానం, ఆఫీసులో స్నేహితులతో పంచుకొని తిన్న కమ్మటి ఆవకాయ పప్ప అన్నం, ఇవన్నీ ఆహ్లాదకరమయిన మంచి భావనలు. మరి ఇవి మనకి రోజు చివరిలో గుర్తురావు.
పరమహంస నిత్యానంద కొన్ని శిక్షణా కార్య(కమంలో ఇలా చెబుతారు. మీరు 24 గంటల సేపు కేవలం మీకు జరిగిన మంచి విషయాలని మీ మసస్సుకి ఆహ్లేదాన్ని ఇచ్చిన విషయాలని మాత్రమే పదే పదే గుర్తు చేసుకోంది. ఆ మంచి విషయాలు జరిగినందుకు కృతజ్ఞతని తెలియచేయండి. అలా 24 గంటలు తరువాత మీలో వచ్చే మార్చుని మీరే ఆశ్చర్యపోతారు. కృతజ్ఝత తెలియచేయటం కూడా ధ్యానమే. సుఫీ మతంలో కృతజ్ఞతని తెలియజేచేసే ప్రత్యేక ధ్యాన పద్ధతి ఉన్నది. అది సహస్రార చక్రాన్ని చైతన్యం చేసి, శక్తివంతం చేస్తుంది.
అదే విధంగా మీలోపలకి నిరంతరం వచ్చే వ్యతిరేకభావాలని అనుకూల భావాలుగా మార్చటానికి ప్రయత్నించండి. మీరు ధ్యానం చేయటం ద్వారా మీలో స్తిరపడిపోయిన వ్యతిరేక భావాలని, గట్టిపడిపోయిన వ్యతిరేకపు ఆలోచనలని కరిగించి వేయవచ్చు. ఆ తరువాత కొత్త భావాలని మీలో స్గిరపడనీయకండి.
మీ ఆలోచనలని, భావాలని, సంతోషం, ఆహ్తాదంతో నింపితే మీరు నిరంతరం మంచి ఆలోచనలతో, అనుకూలమయిన భావావేశాలతో ఉండగలుగుతారు. అప్పుడు కోపం, వ్యధ ఇటువంటి ఏవీ కూడా మీ దగ్తర రావు. మీరు నిరంతరం సంతోషంగా నవ్యతూ ఉంటే మీ జీవితమే ఆనందమయంగా ఉంటుంది. ఇటువంటి స్థితిలో మీరు ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానం మీలో గొప్ప మార్చుని తేగలుగుతుంది.
మీ శరీరాన్ని, మీ ఆలోచనలని శుభ్రపరచి వాటిని స్వచ్ఛంలా ఉంచగలిగితే దానినే తపస్పు అంటారు. నా అభిప్రాయంలో మీ శరీరం, మీ ఆలోచనల మీదా పనిచేయటమే గొప్ప తపస్పు. అన్నింటికంటే అద్భుతమయినది, కఠినమయిన తపస్సు మీ శరీరాన్ని, ఆలోచనలని స్వచ్చంగా ఉంచగలగటమే. మీరు ఈ విధంగా మీ శరీరాన్ని ఆలోచనలని పరిశుభం చేసుకోవటమే ధ్యానానికి మిమ్మలని మీరు సిద్ధం చేసుకోవటం.
మిమ్మలని మీరు తెలుసుకోవటం అతికీలకమయిన అంశం :
మీరు నిరంతరం మీ ఆలోచనలని, శరీరాన్ని గమనించటం ద్వారా మిమ్మలని మీరు తెలుసుకోగలుగుతారు. మిమ్మలని మీరు తెలుసుకోవటం ధ్యానానికి ఆధారం. మీరు ఎప్పుడయితే మీ ఆలోచనలకి, మీ శరీరానికి ఒక పరిశీలకునిగా మారతారో, అప్పుడు మీరు ఒక బయట వ్యక్తిలా విషయాలని తెలుసుకోవచ్చు. అందుకే నేను అంటాను తెలుసుకోగలగటం అనేది ధ్యానానికి చాలా కీలకమయిన అంశం.
ధ్యాన మార్గంలోని అడ్డంకులు :
ధ్యానం చక్కగా జరగాలి అంటే ఆ దారిలో అద్ధంకులు ఉండకూడదు. ఆ దారిలో వచ్చే అద్దంకులలో చాలా ముఖ్యమయినది అహంకారం. మనం సంకల్సించిన ధ్యానమార్ధంలో చాలా రకరకాల అద్ధంకులు వస్తుంటాయు. అవన్నీ కూడా అహంకారం యొక్క వివిధ రూపాలు.
అహంకారం అంటే ఏమిటి ?
అహంకారం అంటే మీరు అంటే ఏమిటి అని మీరు ఏర్పరచుకున్న కొన్ని భావాల వ్యవస్థ. కాబట్టి అహంకారం అంటే కేవలం మీ పట్ల ఏర్పరచుకున్న కొన్ని భావాల రాసి మా(తమే. అది అంతా ఒక ఊహ. అహంకారానికి నిజమయిన ఉనికి లేదు. అది కేవలం కొన్ని భావాల సమూహంతో ఏర్పడిన నీడలాంటి (భవు. కాని అటువంటి అసత్యమయిన అహంకారమే మన జీవితాలని నిర్దేసించుతుంది. మనని తన నియం(తణలో ఉంచుతుంది.
అహంకారం నిజమయిన మీ ఉనికి (ఆత్మ) నుంచి మిమ్మలని వేరు చేస్తుంది. ఈ అహంకారమే మీ జీవితంలోని ప్రతి అంశంలో హద్దులని కల్పిసుంది. అది మీరంటే ఏమిటో ఒక బొమ్మని తయారు చేస్తుంది. ఆ బొమ్మ మీ చుట్యూ ఉండే సమాజం మీకు అంటించిన ముద్దలకి అనుగుణంగా ఉంటుంది. అప్పుడే మీలో 'నాది,నేను' అనేవి బలంగా అభివృద్ధి చెందుతాయి. మిమ్మలని మీ నుంచి, ఎదుటివారి నుంచి చివరికి (పక్సతి నుంచి వేరు చేసేది అహంకారం మా(తమే. నా అభిపాయంలో ప్రక్సతి నుంచి పూర్తిగా వేరుపడిపోయిన ప్రాణి ఒక్క మనిషి మా।తమే. ఇదే మనిషికి ఉండే అనేక సమస్యలకి కారణం కాబట్టి మనకి ఉండే అన్ని బాధలకి, వ్యధలకి, కలతలకి అసలయిన కారణం మన అహంకారం.
ఉదాహరణకి, మీకు బాధ కలిగించే విషయాలు అయిన కోపం, అసూయ, భయం ఇలాంటివన్నీ కూడా మన అహంకారం వలన మాత్రమే మనకి కలుగుతాయి. నేను వేరు, ఇది నా శరీరం, ఇది నాది, ప్రపంచం ఇతరులు వేరు ఇలా ఆలోచించినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు బాధలు ఏర్పడతాయి. మీరు ఒక్కసారి అహంకారాన్ని వదిలితే మీరు ఏర్పరచుకున్న హద్దులు కరిగిపోతాయి. ఇంతవరకూ నా శరీరం, ఇది నాది అనే భావనలు పోతాయి. అప్పుడు ఈ ప్రపంచాన్ని మీలో చూడగలుగుతారు, మీరు ప్రపంచమంతా ఉంటారు. అటువంటి స్పితిలో అసూయ, కోపం, ద్వేషం అనే భావాలు వచ్చే అవకాశమే ఉండదు. ఈ విషయాన్ని మన మేధస్సుతో అర్ధం చేసుకోవటం కొంచం కష్టం. స్వామి ప్రపవచనాలు విన్నప్పుడూ, ఆయన శిక్షణా కార్య(క్రమాలలో చెప్పినప్పుడు బాగా అర్ధం అవుతుంది. ధ్యానం చేయటానికి ఇటువంటి పరిస్సితి చాలా అనువయినది.
అనుమానాలు :
ధ్యాన మార్గంలో ఉండే మరొక అడ్డంకు అనుమానం. ఇది కూడా అహంకారం యొక్క మరొక రూపం. గురువుల సమక్షంలో ఉన్నప్పుడు మీలో వచ్చే చాలా అనుమానాలు కరిగిపోతాయి. ఇంకా ఏమయినా వుంటే మీరు ఆయనని మీలోనికి (పవేశింపనిసే మిగతావి కూడా కరిగిపోతాయి. అందుకే ధ్యానం (పారంభించటానికి గురువులు అందించే సహాయ సహకారాలు అనన్యసామ్యానయినవి. అవి మనని ఆ ధ్యాన మార్గంలో అత్యున్నత శిఖరాలని చేరుస్తాయి.
ఈ సందర్భంలో పరమహంస నిత్యానంద స్వామి తన శిష్యులతో ఈ విధంగా చెబుతుంటారు. మీరు నా సమక్లంలో ఉన్నప్పుడు నన్ను మీ మీద పని చేయనీయండి. నేను తిన్నగా వెళ్ళి మీలో ఉన్న అద్ధంకుల మీద నా చేయివేసి వాటిని తొలగిస్తాను. అహంకారపు వాపులని సర్హరీ చేసి తీసివేసాను. అని చెబుతుంటారు. అపుడు మనలో అనుమానాలు, మనలో (పవాహంలా వచ్చే (పశ్నలు కరగిపోతాయి. అదే గురుదేవుల సమక్షం యొక్క గొప్పతనం. అందుకే ఏ మాత్రం అవకాశం దొరికినా గురుదేవుని సమక్రంలో, ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో శిక్షణని (పారంభించటం చాలా మంచిది. అదీ ఒక జ్ఞానోదయమయిన మహాయోగీశ్వరుని సమక్లం అయితే అది మన అదృష్టంగా భావించాలి. అది ఒక అద్శుత వరమని అనుకోవాలి. అటువంటి అవకాశం చాలా అరుదుగా, కొద్దిమందికి మా(తమే దొరుకుతుంది.
ధ్యానం చేసే సమయంలో గురుంచుకోవలసిన ముఖ్య సూచనలు :
ధ్యానం [పారంభించదలచుకున్న జౌత్సాహిక ధ్యానులకు స్వామి ఈ సూచనలని ఇస్తారు.
తగిన సమయాన్ని కేటాయించండి :
ఈ సూచన కొత్తగా ధ్యానాన్ని [పారంభించే వారి కోసం చెబుతారు. [పతి రోజు ఒక నిర్హీతమయిన సమయంలో అరగంట ధ్యానానికి కేటాయించండి. ఈ అరగంట సమయలో ఎవరూ మిమ్మలని డిస్టర్డ్స్ చేయకుండా చూదండి. ఆ ട്ടെ
సమయంలో మీరు ఒంటరిగా ఉండే విధంగా చూదండి. ఇలా కొద్ది కాలం క్రమం తప్పకుండా చేయగలిగితే, మీశరీరం, మనస్సు (మైండ్) ఆ సమయానికి అలవాటుపడిపోతాయి. ఆ టైం కాగానే మనస్సు, శరీరం ధ్యానానికి అప్రయత్నంగా సిద్ధపడిపోతాయి. ఒక్కసారి మీరు ధ్యానంలో ప్రవేశించటం సులభమయితే, అప్పుడు మీరు ఎప్పుడయినా, ఎక్కడయినా చేయగల ధ్యాన పద్గతులని అచరించవచ్చు. కాబట్లి [పారంభంలో తప్పనిసరిగా ఒక్క అరగంట ధ్యానానికి కేటాయించండి. ఉదయం పూట అయితే బాగుంటుంది లేకపోతే భోజనం చేసాక రెండు గంటల తరువాత చేయంది. 24 గంటలలో మన కోసం కనీసం అరగంట కేటాయించుకోవడం అత్యాశకాదు. కదా!
తగిన స్గలాన్ని కేటాయించండి :
మనం ధ్యానం చేసే స్గలం అనువుగా ఉంటే మనం సౌకర్యంగా ధ్యానంలోనికి ప్రవేశించగలం. మీరు ధ్యానం కోసం కేటాయించిన స్దలం శుభ్రంగా, నిశ్నబ్ధంగా సరిపడా ఖాళీతో ఉండాలి. మీకు వీలుకలిగితే దీనికోసం ఒక గదిని కేటాయించండి. పూజ గది అయితే బాగుంటుంది. అక్కడ శక్తిక్షేత్రాలు ఉంటాయి. మీరు ఎంచుకున్న గదిలో గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. అదే ఆరుబయట ప్రదేశం అయితే మీకు ధ్యాన భంగం కలిగించే శబ్దాలు, మనుషులు లేకుండా చూడండి. అక్కడ మీకు తగినంత (పైవసీ వుండేలా చూదండి. మీరు ఎక్కడ స్థలం ఎంచుకున్న వీలనయినంత వరకూ ప్రతిరోజూ అక్కడే మీరు ధ్యానం చేసేవిధంగా చూడండి.అప్పుడు ఆ (పదేశంలోనికి రాగానే మీరు ధ్యానంలోని వెళ్ళాలి అని మీ శరీరం మనస్సు సిద్ధపడిపోతాయి.
సౌకర్యంగా ఉండే దస్తులు వేసుకోండి :
ధ్యానం చేసే సమయంలో మీరు భౌతికంగా సౌకర్యంగా ఉండేలా చూదండి. మీకు హాయిగా సౌఖ్యంగా ఉండే ఏవైనా బట్టలు వేసుకోండి. అవి పరిశుభ్రంగా ఉంటే మీరు ధ్యానం మీద ఏకాగ్రతని చూపగలుగుతారు. వీలయినంత వరకూ వదులుగా ఉండే కాటన్‌వి వేసుకోండి.
ధ్యాన మార్గం
తెలుఫురంగే వేసుకోవాలా? అటువంటి అవసరం నిబంధనా లేదు. పరమహంస నిత్యానంద తన ప్రవచనాలలో ఒక విషయం చాలా సృష్టంగా,గట్టిగా చెబుతారు. నిబంధనలు, హద్ములు (రూల్స్, కండిషన్స్) ఉన్నాయి అంటే అది ఆధ్శాతికత కాదు అని తెలుసుకోండి. సర్వాంతర్యామి కరుణామయుడు, (పేమమూరి. అయనని చేరాలని తపనపడే భకులకి, తన బిడ్డలకి ఎటువంటి నిబంధనలు, హద్దులు కల్పించడు. ఎవరయినా నిబంధనలని కల్పించితే, మీరు బాగా గురుపెట్టుకోండి, వారు మిమ్మలని నియం(తించాలని (కం(టోలు చేయాలని) చూస్తున్నారు అని అర్గం చేసుకోండి.
మరి వాలంటీర్చు కార్యకమంలో తెలుపు బట్టలే ఎందుకు వేసుకుంటారు?
ఈ (పశ్చకి పరమహంస చాలా హాయిగా అందంగా నవి: ఇలా జనాబు ఇస్తారు. నా కార్యక్రమంలో కాని, ఆ[శమంలో కానీ ఎవరికీ ఎటువంటి నిబంధన ఉందదు. నేను కావి రంగు బట్టలు వేసుకుంటాను, ఎందుకంటే అవి మురికి అయినా కనపడదు. దానిని మెయిన్‌టెన్ చేయటం సులభం. ఇక తెలుపురంగు మనస్సుకి ఆహ్రదంగా ఉండి (పశాంతతని ఇసుంది. అందుకే వారు తెలుపురంగు బట్లలువేసుకుంటారు. మీరు వినే ఉంటారుకదా రంగులకి మనస్సుకి ప్రభావం చేసే శక్తి ఉన్నది అని. దానినే కలర్ థెరపీ అంటారు. అంతే అంతకు మించి మరే కారణం లేదు.
శరీరం సౌకర్యంగా ఉందాలి :
ధ్యానం చేయటానికి ఇది చాలా ముఖ్యమయిన సూచన. మీ శరీరం సౌకర్యంగా ఉన్నప్పుడే మీరు ధ్యానం చేయగలుగుతారు. మీరు కూర్చున్న పద్ధతి చాలా సౌకర్యంగా ఉండేలా చూడండి. ఎక్కడా ఎటువంటి నొప్పి ఉండకూడదు. ఎందుకంటే మీరు ధ్యానం చేసే సమయంలో మీరు మీ శరీరాన్ని మర్చిపోవాలి. ఎక్కడయినా నొప్పి పుడుతుంటే మీ ఏకాుగ్రత నొప్పి మీద లేదా శరీరం మీద ఉంటుంది.
సౌకర్యంగా నేల మీద కూర్పొగలిగితే నేల మీద కూర్చోండి. లేకపోతే కూర్చీలో కూర్చోండి. ఏవిధంగా కూర్చొని చేసినా ధ్యానం యొక్క ఫలితం ఒకే 58
పరమహంస శ్రీ నిత్యానంద
విధంగా ఉంటుంది. పడుకొని చేసే సమయంలో నేల మీద పదుకోవద్దు. కార్చెట్ వేసుకోండి, లేదా జంకానా వేసుకోండి. అది లేకపోతే తుంగచాప వేసుకోండి. కళ్ళు మూసుకోండి :
మీరు ధ్యానం అరగంట సేపు చేసారు. ఆ అరగంట సేపు నిజాయితీగా కళ్ళుమూసుకుని ఉందండి. అసలు కళ్ళు తెరవవద్దు. అలా కళ్ళు తెరిస్తే మనం చుట్టుపక్కల వారు ఏమి చేసున్నారో గమనించాలని లేదా టెం ఎంతయింది ఇలా ఏదో ఒక విధంగా డిస్టర్బ్ అవుతాము. అరగంటసేపు కళ్ళు తెరవకుండా ఉండలేము అనుకుంటే కళ్ళకి గంతలు కట్టుకోండి. స్వామీజీ ఇచ్చే శిక్షణా కార్యక్రమలలో కళ్ళ గంతలు కట్టే బ్యాండ్స్ (Eye Bands) ఇస్తారు. ధ్యానం ప్రారంభించే ముందు తప్పనిసరిగా కళ్ళకి ఆ బాండ్స్ కట్లుకోవాలి. తిరిగి తీయమనప్పుడే ఆ బాంద్స్ విప్పాలి. ఇది చాలా మంచి పద్ధతి. అప్పుడు టైం లోపు మనం అసలు కళ్ళు తెరవం.
టెం ఎలా చూసుకోవాలి :
మీరు సూచనలనిచ్చే సి.డి. పెట్టుకోండి. లేకపోతే అలారం పెట్లుకోండి. అదీ వీలుకాకపోతే ఎవరినైనా అరగంట కాగానే మీకు చెప్పమని చెప్పండి. (పాధమిక శిక్షణ అవసరం :
ధ్యానం అనేది ఒక సాంకేతిక పద్ధతి. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. పరమహంస నిత్యానంద ఈ ధ్యాన పద్ధతులు, వాటి (క్రమం గురించి చాలా వివరంగా చెబుతారు.
ఇందులో ముఖ్యమయిన సూచన ఏమిటి అంటే, శిక్షణ పొందిన ఆచార్యుల పర్యవేక్షణలో మాత్రమే [పతీ ధ్యాన పద్దతినీ నేర్చుకోవాలి. పుస్తకాలు చదివి, సి.డి.లు విని చేయకూడదు. ఒకసారి శిక్షణ పొందాక పుస్తకాలు, సి.డి.లు మీకు గొప్ప సహాయకారి అవుతాయి కానీ ముందుగా కాదు. కాబట్టి ధ్యానం చేయాలి, అని అనుకునేవారు తప్సనిసరిగా ఒక శిక్షణా కార్యక్రమంలో పాల్గొని శిక్షణని పొందాలి. ఆ తరువాత మీ అంతట మీరు ధ్యానం సాధన చేయవచ్చు.
నిత్యానంద ధ్యానపీఠం వారి శిక్రణా కార్య(కమాలు :
పరమహంస నిత్యానంద పరి|వాజకునిగా హిమాలయాలలో కాలినడకన తిరిగే సమయంలో అనేకమంది యోగులని,సుఫీ గురువులని, బౌద్ధ, జెన్ గురువులని, బాబాలని, రుషులని కలిసారు.ఆయన వారి దగ్గర అతి [పాచీనమయిన ధ్యాన పద్దతుల నుంచి, ఆ నాటి వరకూ వాడుకలలో ఉన్న ధ్యాన పద్ధతులని చాలా వివరంగా లోతుగా నేర్చుకున్నారు. ఆయనకి ధ్యానం అంటే చాలా (పియమయిన అంశం. ఆయన లక్ష్యం, ధ్యానం ద్వారా [పతి వ్యక్తిలో మార్పు తీసుకువచ్చి దాని ద్వారా (ప్రపంచంలో మార్పు తేవాలి అని. స్వామి మాటలలో ధ్యానం అనేది సర్వాంతర్యామికి దగ్గర అవ్వగల అతి సులభమయిన అందమయన మార్ధం. ధ్యానం మనని అత్యుత్తున్నత చేతనస్థితికి తీసుకువెళ్ళగలుగుతుంది. అందుకే ఆయన ధ్యానం అనే అంశం మీద చాలా లోతయిన పరిశోధనలు చేసారు. స్వామీజీ యువకుడు, ఈనాటి మానవులకి [పతినిధి. నేటి ఆధునిక మానువుల స్గితిగతులని క్లుణ్ణంగా అధ్యయనం చేసారు. ఈ నాటి సామాజిక, ఆర్గిక, ఆధ్యాత్మిక స్గితిగతులకి అనుగుణంగా నేటి అతి బిజీ మనుషులకి ముఖ్యంగా అసలు టెంలేదు అనే పాశ్చాత్యులకి అనుగుణంగా కోన్ని ధ్యాన పద్ధతులని రూపొందించారు.
పరమహంస ఒక విషయం చెబుతారు. పతంజలి రోజులలో ఆయన చెప్పిన పద్ధతులు అప్పటి వారికి సరిపోయాయి.అప్పటికీ ఇప్పటికీ మనుషులలో వారి జీవన పద్ధతులలో అనేక మార్పులు వచ్చాయి. సాంకేతిక విప్లవం మనిషికి ఎన్నో సౌకర్యాలని సమకూర్చింది. కాబట్టి అప్పటి పద్ధతులు యధాతధంగా ఇప్పటి వారికి అంతగా పనికిరావు. ఉదాహరణకి మీ తండ్రి మిమ్ములని పెంచినట్లు, మీ పిల్లలని మీరు పెంచలేరు. మీ పిల్దలకి మీరు చెప్పే (క్రమశిక్రణ మీ మనుమలకి, మనుమరాళ్ళకి సరిపోదు, అది పని చేయదు. ఒక్కతరానికే అంత తేదా ఉన్నప్పుడు వేలసంవత్సరాల క్రితం ఏర్సరచిన పద్గతులు యధాతదంగా ఇప్పటి వారమయిన మనకి పనికరావు.
అందుకే పరమహంస నేటి మానవులకి అనుగుణంగా వారి జీవన శైలికి సరిపడే విధంగా, నేటి వారి అవసరాలని తీర్సేవిధంగా చాలా ధ్యాన పద్దతులని రూపొందించారు. కొన్ని ధ్యాన పద్గతులని ఇతర సంస్కృతుల నుంచి ఉదా : సుఫీ, భౌద్ధ, జెన్, ప్రాచీన కైస్థవం మెదలయిన వాటినుంచి తీసుకున్నారు. ఆయన ప్రతి ధ్యాన పద్ధతిని అరగంటకి సరిపడే విధంగా తయారుచేశారు.
ఆచార్య శిక్షణ :
పరమహంస నిత్యానంద తన కార్యకామాలని నిర్వహించటానికి 2003, జనవరి ఒకటవ నిత్యానంద ధ్యానపీఠంని స్థాపించారు. ఈ రోజున ుప్రపంచంవ్వాప్తంగా 30 దేశాలలో 1000కి పైగా సెంటర్స్ ద్వారా ఆయన కార్యక్రామాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రామాలకి ఇండియాలో బెంగుళూరులోని ఆశ్రమం కేంద్రం కాగా అమెరికాలోని లాస్ఎంజిల్స్‌లోని ఆశ్రమం ఇతర దేశాలలో జరిగే కార్యక్రామాలకి కేంద్రంగా ఉన్నది.
పరమహంస (పారంభంలో శిక్రణా కార్యక్రామాలని తానే స్వయంగా నిర్వహించేవారు. తరువాత ఆయన కొంతమంది అనుచరులకి తానే స్వయంగా శిక్షణని ఇచ్చి, వారిని ఆచార్యులుగా దీక్షని ఇచ్చి, ఈ కార్యక్రకమాలు నిర్వహించటానికి నియమించారు. దీక్రని ఇచ్చి స్వయంగా నియమించబడిన ఆచార్యులు 400 మంది పైగా ఉన్నారు. ప్రస్టుతం వీరంతా ప్రపంచం వ్యాప్తంగా ధ్యానంలోని ప్రాధమిక శిక్షణని ఆనందస్సురణ అనే పేరు మీద నిర్వహిస్తున్నారు. దీనినే ఇతర దేశాలలో లెఫ్ బ్లిస్ బ్లిస్ బ్రోగ్రాం అంటారు. ఈ కార్యక్రామాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. వీటి తరువాత కార్యక్రామాలని పరమహంస స్వయంగా నిర్వహంచుతారు.
కాబట్టి ధ్యానం నేర్చుకోవాలి అనుకునే ఔత్సాహికులు 20లేదా అంతకంటే ఎక్కువమంది కలసి ధ్యానపీఠం వారికి తెలియచేస్తే వారు ఆచార్యులని పంపించుతారు. మొదటి శిక్షణని రెండురోజులు పూర్తిగా నిర్వచించుతారు. ఈ కార్యక్రమం యొక్క వివరాలు ధ్యానపీఠం వారు ఇస్తారు. ధ్యానం ప్రారంభించాలి అనుకునేవారు నిత్యానంద ధ్వానపీఠం ద్వారా శిక్షణ పొంది ఆ తరువాత ధ్యానం సాధన చేయవచ్చు.
అందరూ ధ్వానం చేయవచ్చునా ?
అన్ని వయుస్పులవారు, స్తీ పురుషులు ధ్వానం చేయవచ్చు గుండెకి సంబంధించిన సమస్యలు ,ఫిట్స్, కీళ్ళనోప్పులు వంటి సమస్యలు ఉన్నవారు ఒకసారి వారి డాక్టర్స్ సలహా తీసుకుని ధ్యానం చేయటం మంచిది.
పరమహంస నిత్యానంద స్వామీ రూపొందించిన ధ్యానంయొక్క [పత్యేకత ఏమిటి ?
పరమహంస నిత్యానంద స్వామి ధ్యానం అనే అంశాన్ని చాలా లోతుగా శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆ తరువాత వీటిని రూపొందించారు. ఇవన్ని కూడా మనకి అనుగుణంగా ఉండే పద్ధతులు.
సమాజంలో (పజలలో ముఖ్యంగా పాశ్చాత్యులలో యోగా, ధ్యానం అనగానే ఏవో కొన్ని లక్షణాలు, అంశాలు నిబంధనలు అనుకుంటారు.ముఖ్యంగా ధ్యానం అనగానే కళ్ళుమూసుకొని ఏదో ఒక దానిమీద ఏకాగ్రతని నిలిపి ఉంచటం లేదా ఏదైనా ఒక మంత్రాన్ని, అక్షరాన్ని శబ్దాన్ని జపించటం అని అనుకుంటారు.
ధ్యానం గురించి నాత్యానందస్వామి ఈ విధంగా చెబుతారు. నిత్యజీవితంలో చాలా పనులతో, ఇంట్తో బయట ఉండే ఒత్తిడి, సమస్యలతో మనం శారీరకంగా, మానసికంగా అలసిపోతాము. ఇంటికి వచ్చి కుర్చీలో వాలి టీ తాగుతూ లేదా నిగ్రదపోతూ శరీరానికి విశాంతిని ఇస్తాము. శరీరంతో పాటు అలసిపోయిన మనస్సుకి విశ్రశాంతి ఎలా వస్తుంది?
అసలు మనస్సుకి (Mind) విశ్రాంతి అంటే ఏమిటి? మైంద్ ఎందుకు అలసిపోతుంది?
వైండ్ నిరంత రం ఆలోచిసూ ఉంటుంది. అది ఎంత అతిగా ఆలోచిసుంటుందంటే ఒక ఆలోచనకి మరోక ఆలోచనకి మధ్య సూక్ర్యాతి సూక్ర ్శమయిన ఖాళీ ఉంటుంది. కానీ అది మనం తెలుసుకోలేనంత సూక్ష్మమయినది. కనీసం మనం నిద్రపోయే సమయంలోనెనా మెండ్ విశ్రాంతి గా ఉంటుందా అంటే లేదనే చెప్పాలి అప్పుడు ఆలోచనలు కలల రూపంలో పరమహంస శీ, నిత్యానంద
వసుంటాయి. ఆవిధంగా కూడా మెండ్‌కి వి|శాంతి లేదు. ఎఫుడయితే మెండ్‌కి విశాంతి లేదో అప్పుడే మనకి శారీరక, మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి.
పరమహంస నిత్యానంద నేర్చించే ధ్యానాలు మెండ్‌కి విశ్రాంతిని ఇస్తాయి. మెండ్‌కి విశ్రాంతి రావాలి అంటే మనలో వచ్చే ఆలోచనల సంఖ్య తగ్గాలి.అలాగే ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉంటే ఖాళీ పెరగాలి.స్వామీజీ చాలా స్పష్టంగా ఈ విషయం ఇలా చెబుతారు; మీరు నిరంతరం ఖాళీ లేకుండా ఆలోచిసుంటూరు. మీ ఆలోచనలు లోలకంలా భవిష్యత్‌కి భూతకాలానికి మధ్య చాలా వేగంగా తిరుగుతుంటాయి. ఎప్పుడయితే ఆలోచనలు సున్నాస్ధాయికి పస్తాయో అప్పుడు మీరు మీ మైంద్‌కి సంపూర్ణమయిన వి[శాంతిని ఇచ్చినట్లు అవుతుంది.
ఎప్పుడయితే మీ ఆలోచనలు సున్నాస్థాయికి వస్తాయే అప్పుడు మీరు వర్తమానంలోనికి వస్తారు. ఆ వర్తమానంలోనికి రావటమే నిజమయిన సమయం (Real Time) లోనికి మీరు ప్రపేశించినట్లు. అప్పుడే విశ్వశక్తిమీకు అందుబాటులోనికి వస్తుంది. అప్పుడు పొందే ఆనందమే శాశ్వతానందం, అదే నిత్యానందం (Bliss)
పరమహంస నేర్చించే |పతి ధ్వానం మనని ఆలోచనలు లేని సితికి తీసుకువెళ్ళటానికే ప్రయత్నిస్తుంది. ఇదే స్వామీజీ నేర్పించే ధ్యానపద్దతులోని ప్రత్యేకత.
మరొక విషయం ఏమిటంటే, మనందరం ధ్యానం చేస్ుంటాము. అది కొంతవరకు మనకి సహాయం చేస్తుంది. ఆవిధంగా కొంతకాలం చేసాకా మనలో ఇంకా అసంత్సపి అనేది వుంటుంది. ఆ ధ్యానం మనని ఇంకా ముందుకి తీసుకువెళ్ళలేకపోతుంది. మనలో మనం ఆశించిన మార్చు కనిపించదు. దానితో మనకి అసంత్సప్తిగా ఉంటుంది. ఆ అసంతృప్ధికి కారణం మనలోపలి మన అసలయిన ఉనికికి మన ఆత్మకి కావలసినది దొరకలేదు. పరమహంస నిత్యానంద చెప్పేపతి ధ్యానం మనని మన అంతరంగంలోపల నిక్రిప్తమయి ఉన్న అసలయిన ఆనందం వైపు తీసుకువెళుతుంది. మనలోని నిజమయిన మనం (ఆత్మ) దగ్గరికి తీసుకువెళుతుంది.
ధ్యాన మార్గం
నిత్యానందస్వామి నేర్పించే ధ్యాన పద్ధతి మరొక లోపాన్ని కూడా సవరించుతుంది. ఈ పుస్తకంలో ఇంతకుముందు వివరించనట్లు, మనలోపలకి మనం వెళ్ళటానికి, అదేవిధంగా శక్రిమనలో చక్కగా [పవహించటానికి చాలా అద్ధంకులు ఉన్నాయి. అవి మనలో వ్యతిరేకపు ఆలోచనల వలన కాని, అణచివేయబడిన భావాలవలన కాని, గట్టిపొరలుగా ఏర్సడిపోయిన మనకి అడ్డంకులని సృష్టించుతాయి. మనం అసలయిన ధ్యానంలోనికి (ప్రవేశించటానికి ముందు వీటి మీద కొంత పనిచేయాలి. అప్పుడే ధ్యానం మనకి మనం కోరుకున్న ఫలితాన్ని ఇస్తుంది.
ఆ విధంగా మనలోని అడ్డంకులని శుభ్రంచేసే ధ్యాన పద్ధతులని పరమహంస నిత్యానంద మనలో చేయించుతారు. ఇవన్నీ చాలా చురుకుగా చేసే ధ్యాన పద్ధతులు (Active Meditations) ఉదాహరణకి జిబ్బరీష్ చేయటం వలన మనలో ఎంతోకాలంగా గట్టిపడిపోయిన స్పితిలో ఉండే అణచి వేయబడిన భావాలు బయటకి వచ్చేస్తాయి. ఆ తరువాత మనం చేసే ధ్యానం మనకి కావలసిన ఫలితాన్ని ఇసుంది. అదే విధంగా దుఃఖహరణ, మహామంత్ర ఇలా చాలా పద్ధతులు ముందుగా మన శరీరాన్ని మనస్సుని శుభ్రపరిచి అందులో ఉండే ఆటంకాలని తొలగిస్తాయి.ఇది పరమహంస నిత్యానంద స్వామి ధ్యాన పద్దతులలోని మరో ప్రత్యేకత.
స్వామీజీ ధ్యానం గురించి చెప్పేటప్పుడు మనలోని శక్రికేంద్రాలయిన ఏడు ప్రధాన చుకాల గురించి చెబుతారు. స్వామీజీ రూపొందించిన ధ్యాన పద్లతులు చక్రాలని శుభ్రంచేసి స్వచ్ఛంగా ఉంచుతాయి. తరువాత వాటిని శక్తితోనింపి చైతన్య పరుస్తాయి. అంతే కాకుండా ఒక్కొక్క చక్రం చైతన్యమవటానికి స్వామీజీ ఒక్కొక్క (పత్యేక ధ్యాన పద్ధతిని రూపొందించారు. వీటినే ఆనందస్సురణ (చక్రకా ధ్యాన) కార్యక్రామంలో నేర్సించుతారు. ఒక్కొక్క రకమయిన వ్యతిరేకపు భావావేశాలు మనలో అధికమయినప్పుడు ఒక్కొక్క చక్రం బంధింపబడుతుంది. అది మనలో ఏదో ఒక శారీరక లేదా మానసిక సమస్యకి కారణం అవుతుంది. అప్పుడు మనం దానికి సంబందించిన ధ్యానం 21 రోజులపాటు చేస్తే మనం ఆశ్చర్యపోయే మార్పు మనలో మనం చూడవచ్చు.
పరమహంస శ్రీ, నిత్యానంద
ఈ సందర్భంగా నిత్యానందప్వామీ ఒక ఉదాహరణ చెబుతారు. నాదగ్గరికి ఎవరయినా మానసిక కుంగుబాటుతో వస్తే (Depression) వారికి మహామం(త ధ్యానం నేర్చించి, వారిని (పతిరోజూ చేయమని చెబుతారు. అలా చేసే కొన్ని రోజులకి వారు మందులు మానేయగలుగుతారు.ధ్యానం అనేది మందుకంటే శక్తివంతంగా పని చేస్తుంది. మీరు క్రమంగా మందులు వాదటం తగ్గించివేయవచ్చు ధ్యానంతో అనారోగ్య సమస్యలకి చక్కగా చికత్స చేయవచ్చు : పరమహంస నిత్యానంద ఈ విషయాన్ని చాలా విపులంగా వివరించారు. మనిషి విశ్వంలో ఒక భాగం, అదేవిధంగా మనలోపల విశ్వశక్తి ప్రపహించుతూ ఉంటుంది. మనలో ఎప్పుడయితే అద్ధంకులు ఏర్పడతాయో ఆ శక్రిపవాహం తగ్గిపోతుంది. మన లోపల శక్తి తగ్గినప్పుడే మన లోపల మానసిక, శారీరక రుగ్మతలు మొదలవుతాయి.
ఎప్పుడయితే ఆ అద్దంకులు తొలగిపోయే ధ్యానం చేసామో మన శరీరం విశ్వశక్తిని అందుకోవాటానికి సిద్ధమవుతుంది. అప్పుడు మీరు చేసే ధ్యానం ఆ శకిని మీలోనికి తీసుకోగలుగుతుంది. గురుంచుకోండి: విశ్వశక్తికి గొప్ప చికిత్సా శక్తి ఉంటుంది ఎప్పుడయితే విశ్వశక్తి మీలోనికి నిరాటంకంగా (పవేశించుతుందో, మీ సమస్యలు రుగ్మతలు అన్నీకూడా పోయి తిరిగి ఆరోగ్యాన్ని పొందుతారు. మీరు లోతయిన ధ్యానంలో ఉన్నప్పుడు విశ్వశక్తి మీలోపల చేసే చికిత్స మీకు తెలుస్తుంది. ఇదే ధ్యానానికి ఉన్న విశిష్ఠత.
ధ్యానం తీవ్రమయిన కొద్ది మీరు విశ్వశక్తితో ప్రత్యక్షసంబంధాన్ని నెలకోల్పగలుగుతారు. అప్పుడు ఆశక్తిని నిరంతరం మీకు అందుబాటులో ఉంటుంది. అందుకే తీవ్రమయిన తపస్సు చేసిన యోగులు అంత శక్తివంతులు. వారిలో ఉండేది మహాద్యుతమయిన విశ్వశక్తి (Comsic Engery) నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను, మీరు కూడా ఆ స్థితికి వెళ్ళగలుగుతారు. మీరు ధ్యానాన్ని క్రమంతప్పకుండా సాధాన చేయండి, ఆ మహారుషులు సాధించినది మీరు సాధించగలుగుతారు.
ధ్యాన మార్గం
సాఁమీజీ మేము ఏవో కొన్ని ధ్యాన పద్గతులు కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము.కాని ఎందుకు మాకు ఆ శక్తి దొరకటం లేదు? అసలు ఆ ప్రపశాంతత ఎందుకు రావటం లేదు?
ఈ(పశ్న చాలామందికి వస్తుంది. పరమహంసని ఈ (పశ్న చాలామంది అదుగుతుంటారు. ఈ ప్రశ్నకి స్వామీజీ ఈ విధమయిన వివరణ ఇస్తారు. మీరు చేసే ధ్యానం, ధ్యానపద్ధతులు సరియెనవే అయితే ఇక్కడ రెండువిషయాలు మీరు గమనించాలి.
మొదటి విషయం. ధ్యానం చేసినప్పుడు మీలోపలికి విశ్వశక్తి ప్రవేశించి అంతటా (పవహించాలి.అయితే (పవేశానికి, (పవాహానికి ఎన్నో అడ్డంకులని మనం తయారు చేసుకుని ఉంచాము. ఇది ఎలా ఉంటుందంటే రక్తనాళాలలో రక్తం సాఫీగా ప్రవహించాలి. అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మన ఆహారపు అలవాట్లతో ఆ నాళాలలో కోలెస్టాల్ పెరిగి అడ్డుపడేలా చేసేస్మాము. అప్పుడు మనకి అనారోగ్యసమస్యలు వస్తాయి. మనం డాక్లర్ దగ్గరికి వెళితే సర్హరీ చేసి అడ్డంకులని తొలగిస్తారు. అదే విధంగా మనం ధ్యానం చెయటానికి ముందు తప్పని సరిగా ఆ అద్దంకులు తోలిగించే ధ్యానం చేయాలి. వాటినే శుభ్రపరిచే ధ్యానాలుగా నేను రూపొందించాను. అవన్నీ చురుకుగా (యాక్టివ్‌గా) చేసే ధ్యానాలు. మీరు ఈసారి అలా ప్రపయత్నించి చూదండి. తేదా మీకు సృష్ణంగా తెలుస్తుంది.
అంతేకాకుండా మన శాస్త్రాలు, ఉపనిషత్తులు, లేదా మరొక శాస్తం, ప్రత్తక్షంగా వాటిని రూపొందించిన గురువుల ద్వారా మనకి తెలిసే అవకాశం లేదు కదా! కాబట్టి ఈ పద్ధతులని చదివి వాటిని సాధన చేస్తారు. నేను ఇంతకు ముందు చెప్పాను అవి కొన్ని వేలసంవత్సరాల క్రితం అప్పటి మనుషులకి వారి జీవన సరళికి సరిపడే విధంగా అప్సటి రుషులు, గురువులు వాటిని రూపొందించారు. అప్పటి మనుషులకి ఇన్ని ఊహాలు, కల్పనలు అత్యాశలు, ఇంత పోటీ తత్వం ఉండేవి కాదు. ఇన్ని సౌకర్యాలకి లేవు. నేటి మానవుల శరీరాలు అతి సౌకర్యాలకి అలవాటు పడిపోయాయి. అంతేకాదు ఆరోజులలో మనుషుల చాలా విరామంగా ఉండేవారు. అంతులేని సమయం వారికి ലെ
అందుబాటులో ఉండేది.కాబట్లి ఆ పద్గతులు ఆనాటివారికి సరిపోయాయి. ఉదాహరణకి గౌతమబుద్ధుడు శ్వాస మీద ధ్యాస నిలపమని ఒక చిన్నది అతి సులభమయిన పద్దతి చెప్పి వేలమంది జ్ఞానోదయం పొందేలా చేసారు. కానీ రెండువేల అయిదువందల సంవత్సరాల తరువాత మనం అలా [ప్రయత్నించి జ్ఞానోదయం పొందలేము, ఈ విషయం కొంచెం ఆలోచించితే మీకే అర్గమయిపోతుంది.
మీరు ఈ విషయాలని అర్ధం చేసుకొని ధ్యానం చేస్తే, మీ ప్రపశ్నకి సరియైన సమాధానం తెలియటమే కాదు ఆ అనుభవం కూడా అవుతుంది. అనుభవం ద్వారా మీ అంతట మీరు తెలుసుకోవచ్చు. నేను నా కార్యక్రమాలకి వచ్చేవారితో ఈ విషయం చాలా స్పష్టంగా చెబుతాను. నేను చెప్పేమాటలు [శద్గగా వినండి. వాటిని నమ్మవద్స, అలా అని తిరస్కరించవద్దు. అది అవునా కాదా అని మీరు (ప్రయత్నించి మీ అనుభవంతో తెలుసుకోండి.
పరమహంస నిత్యానంద ఏవిషయానైనా మనసుకి సశా(స్తీయంగా, ఉదాహరణలతో సామాన్యులకి సహితం అర్గమయ్యేరీతిలో వివరించి చివరిలో పై విధంగా, మనంతట మనం అనుభవంతో తెలుసుకుని అప్పుడు ఆయన మాటలు నమ్మమని చెబుతారు. ఆయనలో విశిష్టత అదే. ఆ మహామేధావి, జ్ఞానోదయమయిన మహారుషి మాటలు వినగలిగే వారికి అవి అమృత వాక్కులు.
ప్రశ్న: స్వామీజీ, ధ్యాన పద్దతులు చాలా ఉన్నాయి. కదా! ఏపద్దతి మాకు సరిపోతుందో ఎలా తెలుసుంది?
ధ్యాన స్లితి అనేది ఒక్కటే. ఆ స్లితికిచేరే మార్గాలు పద్దతులు అనేకం. ఒక్కొక్క రుషి, ఒక్కొక్క గురువు వారు పొందిన అనుభవాల ఆధారంగా ఒకొన్న పద్ధతిని మనకి పరిచయం చేసారు. అన్నీ చాలా మంచి పద్దతులే. మీరు వీటిలో కొన్నింటిని తీసుకోని కొన్ని రోజులు సాధన చేయండి. మీకు ఏ ధ్యానం చేసున్నప్పుడు తృప్తిగా, ప్రశాంతంగా, అహ్హాదంగా, సౌకర్యంగా ఉంటుందో ఆపద్ధతిని మీరు కోనసాగించంది. ఆపద్ధతే మీ మానసిక శారీరక వ్యవస్థకి సరిపడే పద్దతి.
నేను వివిధ కార్యకమాలయిన ఆనంద స్కురణ (Jపస్తుతం నిత్యానంద ధ్యానపీఠం ఆచార్యులు నిర్వహించుతున్నారు) నిత్యానంద స్పురణ మొదలయిన కార్యక్రమాలలో చాలా ధ్యాన పద్ధతులని నేర్పించుతాను. అయితే అందులో పాల్తోన్న అందరూ అన్నీ చేయరు. మూడు నెలలు గడిచాక అడిగితే ఒక్కొక్కొరు ఒకటి లేదా రెండు ధ్యాన పద్ధతులని చేసున్నట్లు చెబుతారు. దీని అర్ధం ఏమిటి అంటే ఇవి వారికి అనువయిన పద్ధతులు.
ఇక పోతే నేను నేర్సే ధ్యానాల సంగతి: నేను మన వేదాలు, ఉపనిషత్తులు, వేరువేరు సంస్కృతుల నుంచి ధ్యాన పద్ధతులని నేర్చుకున్నాను. నావ్యక్తిగత అనుభవంతో వాటిలో కొన్నింటిని యధాతదంగా తీసుకొని ఇప్పటి మీకు, మీ సమయానికి సరిపడే విధంగా రూపొందించాను. కొన్ని ధ్యాన పద్గతులు నేను రూపొందించాను.
మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. ధ్యాన పద్ధతి దాని పేరు చరిత్ర ఇవికాదు మనకి ముఖ్యం. దాని నుంచి వచ్చే ఫలితాలు ముఖ్యం. నేను రూపొందించిన (పతి ధ్యాన పద్ధతి నా వ్యక్తిగత అనుభవంతో చెప్పినవే. ఈ విషయంలో మీకు నేను హామీ ఇసున్నాను.
ఒక ముఖ్యసూచన :
మీరు ధ్యానం ప్రారంభించనప్పుడు మీ శరీరంలో, మీ మానసిక వ్యవస్తలో కొన్ని అసాధారణ మార్చులని గమనించుతారు. వీటిని గమనించినపుడు కంగారు పదకండి. వీటికి తయారుగా ఉండండి. ధ్యానం అంటే మీ శరీరం వ్యవస్థలో, మానసిక వ్యవస్దలో ఉండే కల్మషాలని శుభ్రపరిచే కార్యక్రమం. మీలో ఎన్నో సంవత్సరాలుగా అణచివేయబడిన భావాలని బయటికి నెట్టివేసే ప్రయత్నం ఇది. మీరు జీవితాంతం కూడబెట్టిన అడ్డంకులని తొలగించే ప్రపయత్నమే ధ్యానం. ఈ శుభ్రపరిచే ధ్యానాలు మిమ్ములని చాలా చురుకుగా చేస్తాయి. ఆ ధ్యానం సమయంలో గట్టి గట్టిగా అరవాలి, గెంతాలి, నడవాలి ఇలా శరీరాన్ని వేగంగా కదిలించాలి. అటువంటి సమయంలో మీకు కొన్ని మార్సులు కనిసిస్తాయి.
మీ శరీరం బాగా వేడిగా అవుతుంది. కొన్నిసార్లు తల బరువుగా అవుతుంది. చేతి వేళ్ళు తిమ్మిరి ఎక్కినట్టు అనిపిసుంది. ఇదంతాకూడా మీలోపల శక్తి ఎక్కువగా (పవహించటం వలన ఏర్సడే పరిస్తితులు. ఇవన్నీ తాత్రాలికమయినవే. మీరు కంగారుపడి ధ్యానం ఆపవద్దు. కాస్త సర్శుకునేవరకూ తీవ్రతని తగ్గించి, తరువాత మాములుగా చేయవచ్చు. ఉదాహరణకి మహామంత్ర ధ్యానం మొదటిసారి చేసినప్పుడు తల బరువుగా అయ్యి, తల తిరిగినట్టు అనిపిస్తుంది. అప్పుడు మీరు కొంచెం నెమ్మదిగా చేయండి క్రమంగా ఆ ధ్యానంలో పూర్తిగా నిమగ్నమయిపోండి. ఇవన్నీ వాటంతట అవే (కమంగా పోతాయి. మీరు ధ్యానంలో నిమగ్నమవ్వగలిగి ధ్యానం చేస్తే, మీరు ఆశ్చర్యపోయే మార్పులు మీలో వస్తాయి.
ప్రశ్న : స్వామీజీ, ధ్యానం చేస్తే మాలో మార్పులు వస్తాయి అని చెబుతున్నారు కదా. భౌతికంగా మాలో ఎటువంటి మార్పులు వస్తాయి.?
ఈ (పశ్నకి స్వామీజీ చాలా వివరాలు చెబుతారు. అయిన చెప్పే (ప్రతీ మాట ఒక నిత్య సత్యం. ఎందుకంటే ఆయన చెప్సేవన్నీ ఆయన అనుభాలే. అందుకే స్వామి [పతి మాటని చాలా కచ్చితంగా, స్పష్టంగా సూటిగా చెప్పి చివరిలో ఆ విషయం మీద హామీ ఇసారు. నేను చెప్పే (పతిమాటకి నేను భాద్యత తీసుకుంటాను, అని అందరిలో స్నష్టమయిన హామీ ఇస్తారు. ధ్యానం వలన మనం ఇతర లాభాలు ఏమిటో ఆయన వివరణ చూదాము.
ఆనంతమయిన స్వేచ్ఛ కలుగుతుంది.
మీరు ధ్యానం చేస్తే మీరు ఇంతవరుకూ పొందని ఒక అద్భుతమయిన స్వేచ్ఛని పొందిన అనుభూతిని పొందుతారు.
స్వేచ్చ అంటే ఏమిటి? అది ఎందుకు?
ఈ విషయాన్ని చెప్పేటప్పుడు మనకి తెలియని ఒక కొత్త కోణాన్ని చూపించి స్వామి మనని ఆశ్చర్యపదేటట్లు చేస్తారు. స్వామి స్వేచ్చ గురించి ఈ విధంగా చెబుతారు.
(పతి మనిష్కిపతి క్రణం స్వేచ్ఛకోసం తపించి పోతుంటారు. నిరంతరం స్వేచ్ఛగా ఉండాలి అని చూసుంటారు.అసలు మీరు ధ్యానం నేర్చుకోవటంలో ఉదేశం కూడా అదే మీకు తెలసిగాని, తెలియకగాని నిరంతరం వెతికేది ఆ స్వేచ్ఛకోసమే.
సే్షచ్చ దేని నుంచి, దేని కోసం? అని ప్రపశ్నంచితే మీరు ఏమి చెబుతారు : నాకు ఇష్టమయిన పనులు చేసేస్వేచ్చ, నాకు ఇష్టం లేని కష్టం కలిగించే వాటి నుంచి స్వేచ్ఛ కావాలి. ఉదాహరణకి నాకు అనారోగ్యం నుంచి , వ్యధలనుంచి, కోపంనుంచి, పనుల వతిడి నుంచి, బాధలనుంచి స్వేచ్ఛకావాలి అని అంటారు.
వీటి నన్నింటి నీ క్లుపీకరించితే మిమ్మలని రెండు విషయాలు నియం(తిస్తున్నట్టు అర్ధం అవుతుంది. ఒకటి అత్యాశ రెండవది భయం. నిజానికి ఈ రెండు తాక్యులా మారి మిమ్ములని బంధించి వేసాయి. అసలు మీరు కోరుకునే స్వేచ్చ ఈ బంధం నుంచి, ఈ తాళ్ళునుంచి. కానీ ఈ విషయాన్ని మీరు అంగీకించరు.
మీకు ఒక సంఘటన చెబుతాను. ఒకసారి ఒక యువకుడు నాతో ఇలా చెప్పాడు: స్వామీజీ ఈ యోగా,ధ్యానం ఇటువంటివి అంటే నాకు ఇష్లం ఉండదు. ఎందుకంటే వీటిలో రూల్స్, (క్రమశిక్రణా, నిభంధనలు ఉంటాయి. నాకు స్వేచ్ఛ అంటే ఇష్టం అందుకే ఇలాంటివి చేయటం ఇష్టం ఉండదు, అని
అప్పుడు ఆ యువకుణ్ణి' సరే నీవు ఏం చేస్తావు ' అని అడిగాను. దానికి అతను, నేను ఆలస్యంగా ఎనిమిదింటికి నిద్రదలేస్తాను. కప్పు కాఫీ తాగుతా ఆ తరువాత వాకింగ్‌కి వెళతాను. తరువాత నా వ్యాపారం చూస్తాను.ఇలా స్వేచ్చగా ఉంటాను అన్నాడు.
నిన్ను ఎవరయినా ఉదయాన్నే 5 గంటలకి నిద్రలేపారనుకో ఏమవు తుంది?అని అడిగితే అతను రోజంతా చికాకుగా, విసుగ్గా ఉంటుంది, కోపంవస్తుంది" అని జవాబు చెప్పాడు.
నీకు ఉదయాన్నే కాఫీ ఇవ్వకపోతే ఏమవుతుంది, తిరిగి అడిగాను. దానికి ఆయువకుడు నాకు పిచ్చిఎక్సినట్టు ఉంటుంది. ఏపని చేయిలేను అని కొంచెం విసుగ్గానే జవాబు చెప్పాడు. సరే ,నీవు రోజు వాకింగ్‌కి వెళతావు కదా! ఒకరోజు వర్సం వచ్చి నీవు వాకింగ్ వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగితే, నాకు ఆరోజంతా ఏదో మిస్ అయినట్లు ఉంటుంది అని జవాబు చెప్పాడు.
ఆ యువకుడి జవాబులు విన్న తరువాత మనకి ఏమి అర్గమవుతుంది అంటే, అతను ఎంతో గర్వంగా ఆనందపడే స్వేచ్ఛ అన్ని కండిషన్ల్‌మీద (నిబంధనల మీద) ఆధారపడి ఉన్నది. మరి అది ఏవిధంగా స్వేచ్ఛ అవుతుంది. మనలో చాలామంది అనుకునే స్వేచ్ఛ ఇటువంటిదే. అందుకే ఆయా విషయాలలో మీకు ఎంత స్వేచ్ఛని ఇచ్ఛినా మీకు నిజమయిన ఆనందం కలుగదు. ఆ తృప్తి దొరకదు. ఎందుకంటే మీరు నిజంగా కోరుకునే స్వేచ్ఛ అత్యాశ, భయం అనే రెండు విషయాలు మాత్రమే. ఇవి పెద్ద పెద్ద తాక్బు వంటివి. అవే మిమ్మలని బంధించి మీకు స్వేచ్ఛలేకుండా చేస్తున్నాయి.
నేను మీకు చెప్పే స్వేచ్ఛ కేవలం స్వేచ్ఛ. అంతే. అది ఒక దానికోసం పొందే స్వేచ్ఛ కాదు, అదేవిధంగా ఒకదాని నుంచి పొందే స్వేచ్ఛ కాదు. ఇటువంటి స్వేచ్ఛ పొందాలి అంటే మీరు పూర్తిగా వర్గమానంలో, ఈ క్రణంలోనే ఉందాలి. కాని మీరు నిరంతరం భూతకాలంలో లేదా భవిష్యత్ కాలంలో ఉంటారు. మీరు కేవలం వర్గమానంలో ఉన్నప్పుడు అసలయిన స్వేచ్ఛని పొందగలుగుతారు. ఈ స్వేచ్ఛ బయటి విషయాలమీద ఆధారపడి లేదు. అది మీరు ధ్యానం ద్వారా పొందగలిగే స్వేచ్చ. అదే నిజమయిన స్వేచ్చ. మీరు ఒకసారి దానిని అనుభవించినప్పుడు నేను చెప్పే ఈ మాటలు ఇంకా స్పష్టంగా అర్గమవుతాయి. ఇటువంటి స్వేచ్ఛని పొందాలి అంటే ఉన్న ఒకే ఒక మార్గం, ధ్యానం.
ధ్యానం చేసే అద్భుతమయిన (పేమ మీలో పొంగి ప్రపహిస్తుంది.
(పేమ ముఖ్యంగా దివ్య గ్రేమ గురించి నిత్యానందస్వామి ఈ విధంగా చెబుతారు. మీరందరూ అనుకునే (పేమ కేవలం అత్యల్ప స్థాయిలో,ఇచ్చిపుచ్చుకునే
వ్యవహారం మాత్రమే అది ఎన్నో షరతులతో,నిబంధనలతో నిండివుంటుంది. నేను నిన్ను ఇంత (పేమిసాను కాబట్టి నువునన్ను అంత (పేమించు. నీవు నాగురించి మంచి మాటలు చెప్పావు: నాకు బహమతులు ఇచ్చావు, అందుకే నేను నిన్ను (పేమిసాను; అతని (పవర్తన నాకు నచ్చదు అందుకే అతనిని (పేమించను. ఇది మీకు తెలిసిన (పేమ. అది ఈవిధంగా ఉంటుంది.
(పేమికుల మధ్యగాని, భార్యభర్తలు, స్నేహితులు, తల్లితం(దులు పిల్లలు ఇలా ఎవరిమద్య (పేమ అయినా పెకి కనపడేవి కాని కనిపించనివి కానీ నిబంధనలు, ఆశించటాలు ఉంటాయి. ఎప్పుదయితే ఎదుటి వారి నుంచి ఎదయినా మీరు ఆశించుతారో అది (పేమకాదు. ఆన్లేమలో అనందం, శాంతి ఉందవు. ఆ (పేమ స్వీకరించేవారుకూడా ఆనందంగా ఉందరు అందుకే మన అందరికీ తెలిసిన ఈ లౌకిక [పేమ వ్యవహారం బాధ, వ్యధ, సమస్యలతో ముగుస్తుంది.
కానీ ధ్యానం చేసినప్పుడు మీరు ఊహించని అద్భుతమయిన అనుభవం కలుగుతుంది. అదే దివ్యమయిన అద్యుత [పేమ అదే దైవ [పేమ. దీనికి కారణం ఉందదు. అది జ్ఞానోదయయిన యోగులు, రుషులు కలిగి ఉండే (పేమ. వారిలో [పేమ నిరంతరం పొంగి [పవహిసూ ఉంటుంది. ఆ [పేమ తన ఎదురుగా ఎవరు ఉన్నారు అని ఆలోచించదు. వారికి అర్హత ఉన్నదా లేదా అని చూదదు. వారికి (పేమని పంచుతుంది. ఆ [పేమ అనుభూతి యొక్క ఆనందంలో వారు మునిగిపోతారు. ఇదే దైవ (పేమ, నిబంధనలు లేని షరతులు లేని కారణాలు లేని నిజమయిన [పేమ. ఆ[పేమ స్వీకరించిన వ్యక్తి, ఆ [పేమని పంచిన వ్యక్తి ఇద్దరూ ఈ [పేమ వలన నిజమయిన ఆనందాన్ని అనుభవిస్తారు. అంతేకాదు [పేమ ఇద్దరినీ ఉన్నత స్లితికి తీసుకువెళుతుంది.
ఈ సందర్భంలో పరమహంస నిత్యానంద స్వామి ఒక విషయాన్ని చాలా గమ్మత్తుగా సూటిగా చెబుతారు "మీరు అందరూ [పేమలో పడ్డారు అని అంటారు కదా, నిజమే ఆ [ప్రేమలో పడితే తిరిగి పైకి లేవలేరు." కాని మీరు గురువుల [పేమలో పడితే వారు మిమ్మలని [కింద పడనీయరు. మిమ్మలని అత్యున్నత స్థితికి
తీసుకు వెళుతారు. ఎందుకంటే వారిలో ఉండేది. ఉన్నతమయిన దెవ (పేమ .అది కారణాలు అదగని (పేమ, నిబంధనలు విధించని(పేమ. ఆ (పేమ వారిలో నిరంతరం పొంగి (పవహించి వారి సమక్షంలో ఎవరు ఉంటే వారిని ఆ (పేమలో పునీతం చేస్తుంది.
మీరు ధ్యానం చేసే అటువంటి దివ్య (పేమని మీలో చూడగలుగుతారు. మీ సమక్షంలోనికి ఎవరువచ్చినా ఆ అద్భుత (పేమయొక్క అనుభూతిని ఆస్వాదించ గలుగుతారు. మీలో జరిగే మార్పులు అద్భుతాలని చూసి మీరు ఆశ్చర్యపొతారు.
అప్పుడు మీరు అందరనీ సమానంగా (పేమించగలుగుతారు. అంతా మీవారే అనుకుంటారు. ఆ స్థితిలో మీరు అద్భుతమయిన ఆనంద పారవశ్యంలో ఉంటారు. ఇదంతా మీరు ధ్యానం ద్వారా సాధించవచ్చు. ఇది ఎంతో స్వేచ్ఛతో నిండిన (పేమ. మీరు అందరనీ (పేమిసారు. అంతకుమించి మీకు వేరే దారి ఉండదు.
ధ్యానం మీకు అంతులేని ఆనందాన్ని ఇసుంది.
ధ్యానం చేస్తే జీవితం ఆనందమయమవుతుంది. ధ్యానం ద్వారా మీరు పొందే ఆనందం నిజమయినది, శాశ్వతమయినది. మీరందరూ అనుకునే ఆనందం నిజానికి ఆనందం కాదు. అది కేవలం సంతోషం. సంతోషం వెంట భాధ, దుఃఖం ఉంటాయి. కానీ అనందానికి వ్యతిరేకాలు ఉందవు. ఆనందం ఆనందమే. ఈ ఆనంద స్థితికి బయట (పపంచంలో ఏవిషయం కారణం కావు. కేవలం లోతయిన ధ్యానం ద్వారా మాత్రమే ఇటువంటి ఆనందస్థితికి మీరు చేరుగలుగుతారు. అలా కాకుండా ఏదో కారణం వలన మీకు ఆనందం అనిపిస్తే దానిని ఆనందం అనము, సంతోషం అంటాము. ఆ సంతోషం చివరికి ఏదో వ్యధకి దారి తీస్తుంది.
ధ్యానం ఆత్మపఖోదస్థితికి తీసుకువెళుతుంది.
పరమహంస నిత్యానంద ఈ అంశం గురించి వివరాలు ఈవిధంగా చెబుతారు. మనజీవన సరళి యొక్క నాణ్యత మనం ఏదశ నుంచి పని చేస్తున్నామో, దాని మీద ఆధారపడి ఉంటుంది. మనిషి మూడు దశలలో పని చేసాడు; అవి సహజ దశ (Instinct), మేధస్సు లేదా తెలివితేటల దశ (intellect), ఆత్మ ప్రప్రభోద దశ (Intution). ఈ మూడు కూడా మన అచేతన వ్యవస్థ నుంచి పనిచేసాయి. మీరు సహజ దశలో పనిచేస్తున్నప్పుప్పుడు, అచేతనే స్థితి వ్యతిరేకపు ఆలోచనలలో, జ్ఞాపకాలతో నిండిపోయి ఉంటుంది. అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏమి సరియైనవి కావు. ఆ తరువాత మీరు ఆ నిర్ణయాలకి బాధపడతారు. ఇటువంటి నిర్ణయాలు చేసింది నేనేనా అని బాధపడతారు. ఈ దశలో మీరు విషయాన్ని అర్ధం చేసుకోలేరు. అందుకే సమస్యలు వస్తాయి.
దీని తరవాతది, తెలివితేటల దశ. ఇక్కడి నుంచి పని చేసినప్పుడు మీరు అర్ధవంతమయిన నిర్ణయాలు చేయగలుగుతారు. కానీ మీలో ఎటువంటి అదనపు కుతూహలం కాని, శక్తి కానీ ఉండవు. ఒక కంప్యూటర్‌లా పని చేయగలుగుతారు.
దీని తరువాతది ఆత్మపభోద స్లితి. దీనినే అతః[పేరణ దశ అంటారు. ఈ దశలో మీరు మీలోని నిగూధంగా ఉన్న శకులని నిజం చేయగలుగుతారు. మీ అచేతన స్థితి తెలుసుకునే తత్వంలో నిండిపోతుంది. ఇక్కడ మీరు చేసే నిర్దయాలు తెలుసుకోగల తత్వంతో చేస్తారు. ఎటువంటి నిర్హయానైనా చాలా సులభంగా తీసుకోగలరు. ఈ దశలో మీరు అనంతమయిన శక్తిని పొందుతారు. దానితో మంచి [పణాళికలు వేయగలుగుతారు, వాటిని సమర్ధతతో అమలు పరచగలుగుతారు. ఈ దశలో మీలోని నిగూధశక్తి విడుదల అవుతుంది . మీరు సృజనాత్మకంగా ఉండగలరు. గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు అద్భుత విషయాలు కనుగొన్నది ఈ ఆత్మపభోద దశలోనే. అక్కడ మీరు పొందే శక్తి నిజమయిన మీ ఆత్మశక్తి. రుషులు, జ్ఞానోదయం పొందిన యోగులు ఎల్లప్పుడు ఈ దశలోనే ఉంటారు. వారికి భూత, భవిష్యత్ కాలాలు అందుబాటులో ఉంటాయి. ధ్యానం మిమ్మలని ఆ దశకి చేర్చుతుంది.
ధ్యాసం మన మొదడు యొక్క పని తీరుని నియంత్రించ గలుగుతుంది. ధ్యాసం అనేది ఒక అద్భుతమయిన [పుక్రియ. కొన్ని వేల సంవత్సరాల (కితమే మన రుషులు కనుగొన్నారు. ధ్యానంతో అద్భుతాలు చేయవచ్చు, విశ్వశక్తిని నిరంతరం పొందవచ్చు, సాక్షాత్ భగవంతునితో ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్చుకోవచ్చు, మన అంతరంగ (పపంచంలోనికి వెళ్ళగలిగే ఒకే ఒక మార్ధం ధ్యానం, ఇలా వీటిని మనకి తమ అనుభవాలద్వారా తెలుసుకున్న సత్యాలని వివరించారు.
మన అంతరంగంలో అద్భుతమయిన ప్రపంచం ఉంటుంది. ప్రాచీన రుషులు ఈ అంతరంగ శాశ్వంలో ఎన్నో పరిశోధనలు చేసి వారి సిద్ధాంతాలని, సూతాలని ప్రపంచానికి వెల్లడి చేసారు. అవే ఒక్కొక్కొ మతంగా అభివృద్ధి చెందాయి.
అదే విధంగా ధ్యానంలో మరొక అద్భుతాన్ని నిత్యానందస్వామి చూపించారు. ధ్యానం ద్వారా మెదడు యొక్క పని తీరుని నియంເత్రిచవచ్చు అని శాస్తీయంగా నిరూపించి, ఆధునిక వైద్యశాస్త్రంలో కొత్త అధ్యాయాలు సృష్టించారు. ఏదైనా శాస్త్రీయంగా ప్రయోగాలు చేసి చూపిసే కానీ నమ్మని వారు పాశ్చాత్యులు. అటువంటి వారు స్వామీజీ మెదడు మీద (ప్రయోగాలు చేసి ధ్యానం యొక్క గొప్పదనానికి ఆశ్చర్యపోయి పరమహంస నిత్యానందని అద్భుత యోగిగా (పకటించారు.
ధ్యానం, మెదడు పని తీరుపై అమెరికాలో శాస్త్రజ్ఞులు, వైద్యులు చేసిన ప్రయోగాలు :
పరమహంస నిత్యానంద తన అమెరికా పర్యటనలో భాగంగా ఒక్లహామాసిటీకి వచ్చినప్పుడు, ఆయన గురించి ముఖ్యంగా ధ్యానంతో ఆయన చేస్తున్న అద్భుతాల గురించి విన్న శాస్త్రజ్ఞులు, డాక్టర్లు (న్యూరోసర్హన్) ఆయనని కలిసి ధ్యాన సమయంలో ఆయన మెదడు యొక్క పనితీరు పైన పరిశోధనలు చేయదానికి అనుమతి అడిగారు. పరమహంస ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆయనకి ఇటువంటి ప్రయోగాలన్నా లేదా దేనికైనా శాస్త్రీయంగా నిరూపించటమన్నా చాలా ఇష్టం. ఆయన ప్రపతి కార్యక్రమంలో శాస్త్రీదం, ప్రయోగాలు వీటి గురించి బాగా ప్రోత్సహిసారు. ఆయన చాలా సంతోషంగా అంగీకరించటమే కాదు ఆయన శరీరాన్ని వారికి అప్సగించేసారు. డా॥ మురళీకృష్ణ, [పెసిడెంట్ COO, Integris మెంటల్ హెల్స్; దా॥ ఫోర్షీస్, డా॥ రువే, డా॥ హిగ్గిన్స్, డా॥ చాకో ఒక బృందంగా ఏర్సడి స్వామీజీ పైన చేసిన పరిశోధనలలో పోల్గోన్నారు. వీరంతా ఒక్లహామా (యు.ఎస్.ఎ) కి చెందిన వారే.
స్వామిజీ మెదడు పనితీరుపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు వారు చేసిన ప్రయోగం :
వారు పరమహంస నిత్యానందని అధ్యయనం చేయటానికి, మాములు పేషెంట్లకి ఉపయోగించే సాంకేతిక పరికరాలని ఉపయోగించారు.వారు ముఖ్యంగా స్వామీజీ మెదడుని మూడు దశలలో పరిశీలించారు; అవి ఆయన మాములుగా ఉన్నప్పుడు, ధ్యానం ప్రారంభించి నప్పుడు, గాధమయిన ధ్యానంలో ఉన్నప్పుడు. మెదడు యొక్క చర్యల చిత్రాలు.
స్వామీజీ మెదడు యొక్క దృశ్యాలని PET (Positron Emission Tomography) అనే పరికరం సహాయంతో చూసారు. MRI, PET అనే పరికరాలు మెదడులోని కణాల జీవరాసాయన క్రియ ద్వారా మెదడులో జరుగే చర్యలని స్పష్టమయిన చిత్రాలుగా చూపించుతాయి. గర్లాకోజ్ లాంటి పదార్గాన్ని రేడియో యూక్లివ్ PET (టేసర్‌కి అతికించారు. వారు PET స్కానర్ చూపించిన దృశ్యాలు చూసి నిర్ఘాంతపోయాము అని, రిపోర్హులో చెప్పారు.
స్వామీజీ ధ్వానం (పారంభించటానికి ముందు మెదడు చురుకుగా ఉందటాన్ని గమనించారు. ధ్యానం ప్రారంభించాక సాధారణమైన వ్యక్తులలోని మెదడు కంటే చాలా రెట్టు అధికమయిన చురుకుతనంతో ఉండటాన్ని గమనించారు. ముఖ్యంగా ఆయన మెదడు ముందు భాగం (నొసట వైపు) అత్యంత చరుకుగా ఉందటాన్ని చూసారు. మెదడులోని ఈ భాగం తెలివితేటలు, [శద్ద చూపటం, వివేకం, నిర్తయాలు చేయటం వీటికి కేంద్ర స్తానం.
తరువాత దాక్షర్స్ స్వామీజీ ని లోతయిన ధ్యానంలోనికి వెళ్ళమని చెప్పారు. అప్పుడు వారు రెండు విశేషయిన విషయాలని గమనించారు.
అందులో వెబుదటిది నిత్యానంద స్వామి వెందడు 90% పై గా నిశ్రబ్ధమయిపోయింది. అది పూరిగా తన చర్యలని ఆపివేసింది. మెదడు మొత్తం నిశ్లుబ్గంగా నిశ్చలంగా అయిపోయింది. ఈ పరిస్ధితిని ఆయన ధ్యానం ద్వారా కావాలి అని చేసిన స్నితి.
రెండవ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే, ఆయన మెదడు ముందు క్రింద భాగం చాలా ప్రశాంవంతంగా ఉన్నది. ఈ భాగం అద్భుతమయిన మూదవ కన్నుకి సంబంధించిన భాగం. ఆ తరువాత డాక్టర్స్ స్వామీజిని, గాధమయిన ధ్యానంలో ఉందగా ఏమి చేసారు అని అడిగితే ఆయన తన మూడవ కన్ను తెరచినట్లు చెప్పారు.
మూడవ కన్ను అనేది ఆత్మయొక్క స్థానం. ఇది విశ్వమేధస్సు, అంతరంగ జ్ఞానం యొక్క కలయికతో ఏర్సడే (పదేశం, దీని ద్వారానే సర్వాంతర్యామితో సంబంధం ఏర్పరచవచ్చును.
అదే విధంగా QEEG ద్వారా స్వామీజీ మెదడులోని తరంగాలని గమనించినప్పుడు వాటి పై ఆయనికి పూర్తి నియంత్రణ ఉన్నట్లుగా తెలిసినది.
చివరగా దాక్టర్స్ ఈ విధంగా చెప్పారు. మానవ శరీరంలో మెదడు అత్యంత క్షిష్టమయిన భాగం. దానిని స్వామీజీ ఎంతో తేలికగా నియంత్రిచగలుగుతున్నారు. ఈ [పయోగం ద్వారా కుతూహాలం కలిగించే రహస్యాలు ఉన్న [పశ్నలు ఎన్నో మాకు కలిగాయి. ఈయనపైన చేసిన (పయోగాలు వైద్యశా(స్త్రంలో కొత్తపేజీలని సృష్టించాయి. ప్రత్యేక శిక్షణ ద్వారా వ్యాధులు నివారించే పద్ధతులని, అనారోగ్యానికి చికిత్స చేసుకోగల నేర్పుని తేగలమేమో అనిపించినది అని చెప్పారు.
ధ్యానం యొక్క విశిష్టతని లోకానికి చాటటానికి ఆయన తన శరారాన్ని, మెదడుని ప్రయోగశాలకి, శాస్తజ్ఞలకి అప్పగించి, వారికి పూర్తి సహాయసహాకారాలు అందించి, తాను చెప్పినవన్నీ సత్యాలే అని ప్రపంచానికి చాటారు ఈ యోగీశ్వరుడు ఒక్లహామా దాక్టర్స్ శాస్ట్రవేత్తలు స్వయంగా తయారు చేసి ఇచ్చిన రిపోర్టు నిత్యానంద ధ్యానపీఠం వారి దగ్గర ఉన్నది.
కాబట్టి ధ్యానంతో అద్భుతాలు చేయగలం అని |పపంచానికి నిరూపించి పాశ్చాత్యులతో ఈయన అద్శుత యోగి అని అనిపించారు పరమహంస నిత్యానంద. ధ్యానం గురించి వివిధ కార్యక్రమాలలో భక్తులు స్వామీజీని అడిగిన ప్రప్నాలు, వాటికి స్వామీజీ ఇచ్చిన అసాధరణ సమాధానాలు.
పరమహంస నిత్యానంద (పతి కార్యక్రమంలోను పాల్గొన్న వారిని అడిగే (పశ్చలని అక్కడే జవాబులు ఇసుంటారు. (పశ్చలకి కొంతమంది కాగితం మీద రాసి కూడా ఇస్తారు. ఆయన అద్భుతమయిన మేధస్సుతో, అత్యంత సమయస్సూర్తితో మనం అడిగే సాధారణ మయిన [పశ్నలకి అసాధారణమయిన జవాబులు ఇస్ముంటారు. స్వామీ ఎప్పుడూ ఇలా చెబుతారు. నేను [పశ్నకి జవాబు ఇవ్వను, జవాబు మాత్రం అసాధారణంగా ఉంటుంది. ఆ ప్రశ్నలలో కొన్ని ధ్యానం పై మనకి వచ్చే అనుమానాలని కూడా నివృత్తి చేస్తాయి.
|ప : |పియమయిన సాంపీజీ, ధ్యానం చేసే మాలో మార్పు ఎలా వస్తుంది.? ఎప్పుడయితే మీరు ధ్యానం చేస్తారో, మీలోని ప్రాధమిక స్తాయిలో ఉండే భావావేశాలు అయిన కోపం, కోరిక, అత్యాశ, అసూయ ఇలాంటివన్ని కూడా ఉన్నతమయిన శక్తిగా మారుతుంది. ఆ శక్తి మిమ్ములని ఉన్నతయిన చేతన స్థితికి, మీలో తెలుసు కోగల సితికి తీసుకువెళుతుంది. అప్పుడు మీలో అసహనం, ఆందోళన మాయం అవుతాయి. ఇటువంటి మార్పు కేవలం ధ్యానం ద్వారా మాన్రామే సాద్యమవుతుంది.
ప్రప : స్వామీజీ ధ్యానం ద్వారా మాలో మార్పు తేవటంలో గురువుల పాత్రని వివరంగా చెప్పండి ?
మీరు మీలోపల మీవి కాని చాలా విషయాలని కొన్ని సంవత్సరాలుగా, కొందరిలో కొన్ని జన్మలుగా నిలువచేసి ఉంచారు. అవి మీరు కొన్ని జన్మలుగా పోగుచేసుకున్న అనవసరమయిన విషయాలు. అవి మీలో అణచివేయబడిన ఆలోచనలు, భావావేశాలు, ఇలాంటివి. ఇవే మీ ధ్యాన మార్ధంలోని అడ్డంకులు. ఆ విషయం మీకు తెలియదు. గురువులు వాటిని గుర్తించి మీకు చూపించుతారు. అలా చూపించినప్పుడు మీరు వాటిని తొలిగించుకోవాలి. మీలో అణచివేయబడిన విషయాలని పైకి తేవటానికి కొన్ని పరిస్థితులని కల్పించుతారు, గురువులు. ఆయన మీ లోపల ఉండే అనవసరమయిన విషయాలని కాల్సివేసి అద్ధంకులు తొలిగిస్తాడు. అయితే మీరు ఆయనని మీ మీద పని చేయనిచ్చినప్పుడే ఇది సాధ్యం. అందుకే గురువుల సమక్షంలో మీరు చేసే ధ్యానం మీకు అద్యుతమయిన ఫలితాలని ఇస్తుంది.
ప్ర ॥ మేము ధ్వానం ఎంతసేపు చేయాలి?
ఎంతసేపు ధ్యానం చేసారు అనేది ముఖ్యం కాదు, ఎంత తీవంగా చేసారు అనేది ముఖ్యం. అప్పుడు మీలో ఉండే చేతనస్థితి యొక్క నాణ్యత ముఖ్యం. మీరు ధ్యానం చేసేటప్పుడు తీవ్రంగా ధ్యానం చేయండి. మీ ధ్యానంతో పాటు తీవ్రత కూడా ఉంటే, మీలో ఉన్నతమయిన చేతన స్లితి ఏర్పడుతుంది. అది మీరు వికసించటానికి సహాయం చేసుంది.
(పు। సాఁఘజీ, ధ్యానం మాకు సంత్సప్రిని పొందేందుకు ఏవిధంగా సహాయం చేసుంది.
మీరు నిరంతరం ధ్యానం చేసే సున్నితంగా, మృదువుగా తయారవుతారు. మీరు తెలుసుకోగల స్తితిలో ఉంటారు. మీ చేతన స్థితి విశాలమవటం మీరు తెలుసు కుంటారు. అప్పుదు అన్నివిషయాలు మీకు స్పష్టంగా ఉంటాయి. మీ మెండ్‌కి మీకు మధ్య దూరం పెరిగి మీ అంతరాత్మఎన్నో అనుభవాలని పొందుతుంది. ఆ అనుభూతులు ఏమిటి అంటే, పరిపూర్ణమయిన తృప్ధిని సాధించాము అన్న ఆనందం. అదే మనకి శాశ్వతమయిన నిత్యానందాన్ని ఇస్శుంది.
(ప 11 స్వామీజీ, ధ్యానం చేయటం కూడా ఒక పనే కదా?
ధ్యానం ప్రారంభించినప్పుడు అది ఒక పని లాంటిదే. నిశ్మబ్దంగా కూర్చోవాలి అని మీరు ఎపుడు అనుకుంటారో అది మీకు ఒక పనిలాంటిదే. ఎందుకంటే ఒకపనిని (నిశ్మబ్దంగా కూర్చోవటం) మీరు చేస్తున్నారు కాని అది సహజంగా మీరు కూర్చున్నట్లుగా కాదు. ఎప్పుడయితే నేను నిశ్నబ్దంగా కూర్చోవాలి అని ప్రత్యేకంగా మీరు అనుకుంటారో, అప్పుదు ధ్యానం ఒక పని.
కాని లోతుగా విశ్లేషణచేస్తే, ధ్యానం ఒకపని కాదు. మీరు ధ్యానంలోనికి సహజంగా (పవేశించగలిగినప్పుడు, కూర్చోవాలి అనే (పయత్నాలు మాయం అవుతాయి. అప్పుడు పూర్తి విరామంలో ఉండగలుగుతారు. మీరు ఫలితాల కోసం అప్పుడు ధ్యానం అంటే ఒక పని కాదు.
ప్ర : స్వామీజీ ధ్యానం చేసేటప్పుడు మాకు నిద్ర వసుంది. మేము ఏంచేయాలి?
ధ్యాసం |పారంభించిన కొత్తలో నిద్ద రావచ్చు. అది సమస్యకాదు. మీరు అప్పుడు నిగ్రద ఆపాలని (పయత్నాలు చేయకండి. నిద్దతో పోరాటానికి దిగకండి. అలా చేస్తే మీరు నిద్దపోలేరు, ధ్యానం చేయలేరు. ఆ తరువాత అయ్యో! ధ్యానం సరిగా చేయలేకపోయానే అని బాధ పడతారు. కాబట్టి నిద్రవస్తే హాయిగా నిద్దపోండి. నిద్ద అయిపోయి మీకు మెలకువ వచ్చాక అప్పుడు ధ్యానం చేయండి. అంతే.
ుప : స్వామీజీ, ధ్యానం ఎక్కువగా చేసే సైద్ ఎఫెక్స్ ఉంటాయా?
ధ్యానం చేస్తే ఉండే ఒకే ఒక ఎఫెక్ట్ అనందం. ఎక్కువగా ధ్యానం చేస్తే దొరికేది ఆనందమే. ఇది ఎలా ఉంటుందంటే అమృతం ఉన్న పెద్ద బాండారంలో మీరు పద్దారునుకోండి; ఏమవుతుంది, అమృతం అంటే మరణం లేకుండా చేసేది. అందులో పడితే మరణించం కదా. ధ్యానం కూడా అంతే. ధ్యానం చేస్తే అది మిమ్మలని పరమానంద స్థితికి తీసుకువెళుతుంది. అంతేకాకుండా మీరు శారీరకంగా, మానసికంగా, భావావేశాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ఆరోగ్యంతో ఉండగలుగుతారు. మీరు శక్తితో ఉత్సాహంగా ఉంటారు.
అంతే కాకుండా మీరు క్రమం తప్పకుండా, తీవంగా ధ్యానం చేస్తే మీలో, మీ ముఖంలో అందమయిన ప్రకాశం కనిపిసుంది. నేను ఎప్పుడూ ఒక విషయం చెబుతుంటాను. మీరు ధ్యానం (పారంభించే ముందు ఫోటో తీయించుకోంది. 21 రోజులు [ప్రతి రోజు ఏదో ఒక ధ్యాన పద్ధతిని సాధన చేయండి 21రోజులు తరువాత మీరు మరలా ఫోటో తీయించుకోండి. ఆ తేదా స్పష్టంగా మీకే తెలుస్తుంది. మీకు తెలిసినవారుకూడా మీలో మార్సుని స్పష్టంగా గుర్తించగలుగుతారు. అందం, ఉత్సాహం, ఆనందం మీ సొంతమవుతాయి. ఇవే ధ్యానం చేస్తే వచ్చే సైద్ ఎఫెక్స్.
ుప : స్వామీజీ నేటి సమాజంలో ధ్యానం వలన కలిగే లాభాలు ఏమిటి?
ఏ సమాజంలో నైనా మానవులకి కావలసినవి ఆరోగ్యకరమయిన బలమయిన శరీరం. ఆరోగ్యకరమయిన మానసిక స్లితి, ఆత్మబలం మన పనులు సమర్ధవంతంగా చేసుకోవటానికి ఉపయోగ పదుతుంది. మానసిక బలం మనస్సుని ప్రశాంతంగా జీవితాన్ని ఆహ్లేదంగా చేస్తుంది. ఆత్మబలం ఈ రెండింటికీ అతీతంగా మనని తీసుకువెళుతుంది. మనలో కరుణా, [పేమ, సమాజసేవ ఇటువంటి లక్షణాలని అభివృద్ధి చేసుంది.ఎప్పుడయితే ఈ మూదు బలంగా ఉంటాయో అపుడే మనిషి పరిపూర్లుడుగా మారి తనకి, తన సమాజానికి తన దేశానికి ఒక ఐశ్వర్యంలా ఉంటాడు. ఈ మూడింటినీ సాధించగల ఒకే ఒక మాస్టర్‌కీ (తాళం) ధ్యానం. ధ్యానం మనని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తుంది. మానసిక సమస్యలని తొలగిస్తుంది. మన ఆత్మకి నిజమయిన బలాన్ని ఇస్తుంది.
ప్ర : స్వామీజీ మీరు నేర్పించే ధ్యానపద్ధతులలోని [పత్యేకత ఏమిటి?
నేను నేర్పించే ధ్యాన పద్ధతులు, మీ లోపలి శక్తులని సమతుల్యంలో ఉంచుతాయి. విశ్వం మీద, అంతరిక్షం మీద, గ్రహాలమీద, సూర్యుడిమీద, చంద్రుడిమీద పని చేసే శక్తి ఒకటి ఉన్నది. దీనినే నేను విశ్వశక్తి అంటాను. మనిషి ఈ విశ్వశక్తితో సంబంధాన్ని కోల్సోయాడు. నేను నేర్సించే ధ్యాన పద్దతులు ఆ విశ్వశక్తితో మీ సంబంధాన్ని నెలకొల్చటానికి ఉపయోగపడతాయి. ఈ పద్ధతులు మిమ్మలని విశ్వశక్తిని అనుకూలంగా జీవించే విధంగా సహాయం చేస్తాయి.
ప : స్వామీజీ నేరం, నేరపప్పత్రిలో ఉండే వారిలో ధ్యానం మార్చు తేగలుగుతుందా? ఇటువంటి వాటిని మీరు సమర్తించుతారా ?
ధ్వానం ఎటువంటి వారిలోనెనా అద్భుతమయిన మార్పులు తెస్తుంది. ఇటువంటి (పయత్నాలని నేను సమర్ధించుతాను. నేరం చేసినవారు ఉండే (పదేశాలన్ని (ముఖ్యంగా జెక్కు) వ్యతిరేక ఆలోచనలతో, వ్యతిరేకపు భావాలతో నిండిపోయి ఉన్నాయి. అటువంటప్పుడు నేరప్రపవ్సత్తి ఉన్నవారిని మరింత నేరగాళ్ళుగా పరిస్థతులు తయారు చేసున్నాయి.
ఈ విషయంలో ధ్యానం కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే, ఎక్కడ ఎటువంటి మార్చు రావాలి అని అనుకున్నా అది ముందుగా మనిషి అంతరంగంలోని మార్సుతోనే [పారంభం కావాలి. అది నేర వ్యత్తిలోని వారయినా, ఆ వ్యత్తిలోకి రాబోయే వారయినా సరే. ధ్యానం వ్యక్తిగతంగా (పతి ఒక్కరినీ మార్చుతుంది, అదేవిధంగా సమాజంలో ఉండే నేరాలని తగ్గిస్తుంది.
ుప : స్వామీజీ, ధ్యానం ఈ రోజులలో మాకు ఒక [పయోగాత్మకమయిన పత్యామ్నాయంగా ఉండగలదా?
అవును, ప్రత్యేకంగా ఈ నాటి సమాజంలో మనుషులమీద ఒత్తిడి అధికంగా ఉన్నది. ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు కుటుంబ బాంధవ్యాలు పడిపోతాయి. మనుషుల మధ్య మానవ సంబంధాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇటువంటి పరిస్థితిలలో ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. ధ్యానం చేయటానికి మీ
చాలా చాలా బిజీగా ఉంటారని. మీకోసం కేవలం అరగంట సమయాన్ని కేటాయించండి. ప్రతీరోజు ఆరగంట ధ్యానం చేయగలిగితే మీలో ఎంతో మార్పు వస్తుంది. మీ జీవన సరళిలో ఎంతో నాణ్యత ఉంటుంది. ఈ మార్పు మానవ సంబంధాలని మెరుగుపరచి మిమ్మలని ఎదుటి వారికి దగ్గర చేస్తుంది. ఈ రోజులలోని పరిస్థితులలో ధ్యానం ఒక శక్తివంతమయిన ఆయుధం లాంటిది.
Nithyananda Dhyanapeetam
928 Huntington Dr, Duarte, Los Angeles, CA 91010, USA Ph.: 1-626 –205-3286 Email: [email protected]
4610, N.High Street, Columbus OH 43214, USA Ph.: 614-571-8425
NithyanandapuriKallugopahalli Mysore Road, Bidadi Bangalore - 562 109, Karnataka, India. Phone: 91 +80 65591844 / 27202084 Fax: 91 +80 7288207 Email: [email protected] URL: www.nithyananda.org Nithyananda Dhyanapeetam Sri Ananda Rajarajeshwari Temple, Nithyananda Giri, Pashambanda Sathamrai Village Shamshabad Mandal, Rangareddy District Andhra Pradesh - 501 218, INDIA Ph.: +91 93470 65288 E-mail: [email protected]
36/1, Kamakshiamman Street, Peramanur SALEM – 636 007 INDIA Ph.: 91 +427 3098133 Nithyananda Dhyanapeetam Nithyanandapuri, Zamin Pallavaram CHENNAI – 600 043, TAMILNADU, India Ph.: 98404 27966 / 94440 19791 (Directions: Behind Tirusoolam Hill.)
Nithyanandapuri, Othaivaadai Street Pavazhakundru, Tiruvannamalai – 606 601 TAMILNADU, India Ph.: 94432 33789 / 94433 26202 (Directions: On Big Street (Peria theru), take the lane opposite Indian Overseas bank. This is Othaivaadai Street.)
Nithyanandapuri 2/200, Tirumangkuruchi Post Namakkal – 637 003 Pavazhakundru, TAMILNADU, India. Ph.: 94433 88437 / 93447 17629 (Directions: Near the Collector's office)
Nithyanandapuri 102, Azhagapurampudur Salem – 636 016, TAMILNADU, India. Ph.: 94433 64644 / 94432 35262 (Directions: Behind Sharada College)
Ebook ISBN: 979-8-88572-610-8