Chapter 1

జీవితాన్ని గ్రహించటానికి సంసిద్ధం కావటం

1 sections

జీవితాన్ని గ్రహించటానికి సంసిద్ధం కావటం

ఒక ప్రసిద్ద జెన్‌కథ ఈవిధంగా సాగుతుంది :

ఒకరోజు, ప్రఖ్యాత ఆచార్యుడు తనకు కలిగిన కొన్ని తత్త్వ విషయాలను గూర్చి వివరణను పొందటానికి గొప్ప జెన్ మాస్టర్ నాన్‌సెన్ దగ్గరకు వచ్చాడు. అడవిలో ఒక పర్ణశాలలో మాస్టర్ నివసిస్తున్నాడు. ఆయనను కలుసుకోవటానికి ఆచార్యుడు చాలా దూరం నడవాల్సి ఉంటుంది. ఆయన పర్ణశాలను సమీపించినప్పుడు మాస్టర్ టీ తయారు చేయటానికి నీళ్ళను మరిగిస్తున్నాడు.

నాన్‌సెన్‌ను అడగటానికి ఆచార్యుని చిత్తం పలు ప్రశ్నలతో నిండి ఉంది. ఆయన వాటిని నేరుగా అడగటం మొదలుపెట్టాడు.

"వేచి ఉండు మొదట టీ తాగుదాం" అన్నారు మాస్టర్‌గారు.

కాని ఆచార్యుడు అసహనానికి లోనయ్యాడు.

తన ప్రశ్నలకు నాన్‌సెస్ నుండి సమాధానాలను రాబట్టుకోవాలనే కాకుండా తన జ్ఞానాన్ని నాన్‌సెస్ ముందు ప్రదర్శించాలని ఆచార్యుడు తలపోశాడు. నాన్‌సెసెన్ టీ తయారు చేస్తుండగా అచార్యుడు ఈ సిద్దాంతాన్ని గురించి ఆ తత్వాన్ని గురించి మాట్లాడుతూ, నాన్‌సెన్‌ను అభిప్రాయాలను అడుగుతూ తన అభిపాయాలను చెప్పసాగాడు.

మాస్టర్ నా ప్రశ్నలకు సమాధానాలను ఎప్పడు చెప్తారు?

మీ నుంచి నేను ఎంతో తెలుసుకోవాలి. సహనంతో ఆచార్యుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.

సమాధానంగా నాన్‌సెన్ ఆచార్యుని కప్పలో నిశ్శబ్దంగా టీ పోయసాగాడు.

నాన్‌సెన్ కప్పనిండా పొంగి పొర్లేదాకా టీ పోస్తూనే ఉన్నాడు. ఇంకా పోస్తూనే ఉన్నాడు. టీ ఒలికి పోతోంది.

జెన్ మాస్టర్లు ఉన్మత్తులు అనే పేరుంది. కాని ఇది మరీ విపరీతం.

"మీరేం చేస్తున్నారు? ఇంకే మాతమూ ఈ కప్పలో టీ పట్టదు అని మీకు తెలియదా?' ఇప్పటికే అది నిండిపోయింది" అని ఆచార్యుడు వినోదంగా అరిచాడు.

"అలాగా? మీ కప్పను మీరు ఎందుకు ఖాళీ చేయలేదు" అని నాన్‌సెన్ నవ్వాడు. జెన్ మాస్టర్లు సాధారణంగా ప్రహేశికలతో మాట్లాడతారు, కాని ఆచార్యుడు తెలివైనవాడు అర్థం చేసుకున్నాడు.

నాన్‌సెన్ చెప్పే కప్ప తానే. ఆచార్యునిలో అప్పటికే సొంత భావాలు, ఎరవు తెచ్చుకున్న తత్త్య చింతనలూ, సంపాదించుకున్న జ్ఞానం చోటుచేసుకున్నాయి. నాన్‌సెన్‌కు అతనికి ఏ విషయమూ భోధించటానికి వేరే దారిలేదు. కొత్తది నేర్చుకోవటానికి అతనిలో 'ఎ మాతమూ జాగాలేదు. కొత్తది నేర్చుకోవటానికి ముందు మీరు మీ కప్పను ఖాళీ చేసుకోవాల్సిన అవసరముంది.

మీకప్పను ఖాళీ చేసుకోమనటంలో మాస్టర్ అంతరార్ధమేమిటి?

మొత్తం సామానునంతా మోస్తూ మనమంతా జీవితాన్ని గడుపుతున్నాం. మూర్త పదార్థాల్ని మనం చూడగలగుతున్నాం, అర్థం చేసేకోగలుగుతున్నాం -

ముమ్మల్ని మీరు ఖాళీ చేసుకోండి

సూక్ష్మపులు, మన ఇళ్ళు వాకిళ్ల, మన ధనం, మన సర్టిఫికెట్లు, మీ జీవితంలోని బరువునంతటినీ పూర్తిగా దించుకోవలసిందిగా నేను మీకు చెపుతున్నానంటే దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నానో కనీసం మీకు తెలుస్తుంది.

కాని మీకు తెలియకుండానే మీలో మీరు మోస్తున్న సామాను సంగతి ఏమిటి?

మన జీవిత ఆలోచనలతో తత్వాలతో పీకల దాకా కూరుకుపోయి ఉన్నాము.

ప్రపంచంలోని అన్ని విషయాల గురించి మనకు పూర్వం ఏర్పరచుకున్న భావాలున్నాయి. మనకు ఏమి పని చేస్తాయి ఏమి పని చేయవు అనే వాటి గురించి మనం ఇప్పటికే ఒక తుది నిర్ణయానికి వచ్చేశాం :

మనం అంగీకరించనప్పటికీ, మన సమస్యల గురించి తప్ప ప్రపంచంలోని అన్ని సమస్యల గురించి మనకు పరిష్కారాలున్నాయి.

దానికి అదనంగా, మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను ప్రభావితం చేసే భయాలలోను స్పృతులలోను భాగం పంచుకోవాలి. ఇంకోలా చెప్పాలంటే, ఏ కొత్త విషయానికీ మనలో ఇంకే మాత్రమూ జాగా లేని విధంగా మనం నిండి ఉన్నాము.

మీరు దీన్ని చదివేటప్పుడు ఏదో కొత్త విషయాన్ని తెలుసుకోవటానికి చూస్తున్నారనే అర్థం.

కేవలం కుతూహలంతో మీరు చదువుతుంటే, మీరు తెలసుకోవాలని అనుకున్న దానినంతంటిని ఇప్పటికే తెలుసుకున్నామని నిశ్చయంగా అనుకుంటే -

అది పూర్తిగా వాంఛితమే, మీరనుకున్నట్లుగా ముందుకు సాగి చదవచ్చు. నా సమక్షంలో సమయం గడిపేవేళ మీరు ఏదయినా విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే ఏదయినా విషయాన్ని సముపార్జించుకోవాలనుకుంటే నేను సూచిస్తున్నాను :

మీ కప్పను ఖాళీ చేయండి.

ఇంకో చిన్న కథ :

ఉ స్పెన్స్, అనే ప్రజ్ఞాశాలి అయిన గణిత శాస్త్రజ్ఞుడు తత్త్వశాస్త్రవేత్త గుర్‌జెఫ్ నుండి చాలా విషయాలను నేర్చుకోవటం కోసం సమీపించాడు. ఆచార్యుడు జెన్ మాస్టర్ నుండి నేర్చుకోవాలని అనుకున్నటుగానే ఉప్పెన్నీ, గుర్‌జెఫ్ నుండి తనకు కలిగిన కొన్ని సందేహాలకు స్పష్టమయిన సమాధానాలను రాబట్టాలనుకున్నాడు. సదా తెలివైన విజయవంతమయిన వారికే ఈ సందేహాలు కలుగుతుంటాయి. సహజంగా, మనిషి ఆకలితో అలమటించేటప్పుడు అతడికి ఆధ్యాత్మికత గురించి ఆలోచించటానికి సమయం కాని అభిరుచికాని ఉండదు. మీ కప్ప ఐశ్వర్యం, జ్ఞానం, విజయంతో నిండినప్పుడు మాత్రమే ఇంకా ఏదో కొంత లోపించినట్లుగా పుగంధం కొరవడినట్లుగా మీరు తెలుసుకుంటారు. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మికత కోసం మీరు ముందడుగు వేస్తారు.

ఉ స్పెన్సీ, గుర్‌జెఫ్‌ను సమీపించినప్పుడు అప్పటికే అతడు ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు. అతడు గణిత శాస్త్రంలో మలుపు తిప్పే మార్గాలను అనేకం ఆవిష్కరించాడు. సహజంగా అతడికి తన జ్ఞానం పట్ల గర్వం ఉంది. ఆ సమయంలో గుర్‌బెఫ గురించి ప్రజలకు అంతగా తెలియదు.

ముక్కుర్పు మీరు ఖాళీ చేసుకోండి

ఆయినప్పటికి, ఉస్పెన్నీ, గురోజెఫ్‌లో ఏదో తెలుసుకోవలసినది ఉంది, అతడి నుండి నేర్చుకోవలసిసది ఉంది అని తెలుసుకున్నాడు.

కాబట్టి అతడు గుర్తెప్‌ను సమీపించి పలికాడు. మాస్టర్, మీ నుండి అనేక విషయాలను నేర్చుకోవలసింది ఏంతో ఉంది. నాకు నేర్చుతారా?

తప్పకుండా అన్నారు గుర్‌జెఫ్, జెన్ మాస్టర్‌లా కాకుండా విద్యార్థుల సమస్యలను పరిష్కరించటంలో అతడికి వేరే దారి ఉంది.

అతడు అతిసాధారణంగా పలికాడు నేను మొదలు పెట్టటానికి ముందు మొట్టమొదట మీకు ఇప్పటికే తెలిసిన విషయాలను గురించి ఒక జాబితాను ఎందుకు మీరు తయారు చేయరు? అప్పుడు తెలిసిన విషయాలను గురించి చర్చించుకుంటూ కాలక్షేపం చేయనవసరం లేదు. అప్పుడు నీవు నేర్చుకోవలసిన ఇతర విషయాలపై దృష్టిని కేంద్రీకరించవచ్చు.

జాబితా తయారు చేయటానికి కాగితం, పెన్నిలు తీసుకుని పక్క గదిలోకి ఉపెన్నీ, వెళ్ళాడు. ఉపెన్నీ, తన స్పృతులలో ఈవిధంగా రాశాడు. మొదటి సారి అక్కడ కూర్చుని, జాబితాలో ఒక్క విషయాన్ని కూడా రాయలేనని తెలుసుకున్నాను. ఒక విషయాన్ని గూర్చి సంపూర్ణంగా తెలుసుకుంటేనే తప్ప జాబితాలో పేరురాయలేను. గుర్‌జెఫ్ నుండి తప్పించుకునే మార్గంలేదు, అతడు చాలా తెలివెనవాడు - నేను ఒక విషయాన్ని తెలుసుకొని పేర్కొంటే, ఆ విషయాన్ని గూర్చి అతడు ప్రశ్నిస్తే నేను జవాబు చెప్పలేకపోవచ్చు.

దాన్ని గురించి ఆలోచించే కొద్దీ, నాకు ఏ విషయమూ, సంపూర్ణంగా, లోతుగా, వాస్తవంగా తెలియదని తెలుసుకున్నాను. జీవితంలో మొదటిసారిగా నేను నాకు ఏమీ తెలియదు అని తెలుసుకున్నాను.

48 నిమిషాల తర్వాత, ఉపెన్నీ, గుర్‌జెఫ్ వద్దకు తిరిగివచ్చాడు.

ఏమీ మాట్లాడకుండా, గుర్జెఫ్ పాదాల దగ్గర అతడు ఖాళీ కాగితాన్ని ఉంచాడు.

గురోజిఫ్ ఉపెన్స్, ని చిరునవ్వుతో చిట్టచివరకు నీవు తెలుసుకోవటం ప్రారంభించావు అంటూ కౌగిలించుకున్నాడు.

నీకు తెలియదని తెలుసుకోవటం జ్ఞానానికి మొదటి మెట్టు. నీకు తెలియదని తిలుసుకున్నప్పుడు, నీకు తెలియదని కనీసం తెలుసుకుంటావు. ఆ మాత్రం కనీసం నీకు తెలుస్తుంది.

నీకు తెలియదని నీకు తెలియనప్పుడు నీకు తెలయదనేది కూడా నీకు తెలియదు! అక్కడే కష్టమంతా ఉంది.

'ఖాళీ' అని నేను చెప్పినప్పుడు - ఖాళీ రెండు రకాలుగా ఉంటుంది.

ఒకటి వ్యతిరేకం, పతికూలం శూన్యత - నీవు అనుభవించే ఖాళీ, నియంత్రించలేనిది. కొన్ని విధాలుగా ఖాళీ చేయబడ్డ భావం ఏదో లోపించిన భావం కల ఖాళీ. ఇంకోటి అనుకూల మయినది, సంతోషమయినది, క్రియాశీలమయిన ఖాళీ. పూర్తిగా అత్యవసరం కాని ప్రతి దానిని మీ జీవితం నుండి బయటికి పారదోలితే ఏర్పడే ఖాళీ ఇది.

ఏకాంతతకు ఒంటరితనానికి మధ్య ఉన్న తేడా వంటిది !

మొదటి రకం ఖాళీని మీరంతా జీవితంలో ఏదో ఒక సమయంలో అనుభవించి ఉంటారు. వాస్తవంగా చాలామందికి ఇది శాశ్వత పరిస్థితి. ఇటువంటి ఖాళీనే సంఘం ప్రసార సాధనాలు నిర్ధిష్టంగా తాకుతున్నాయి. మీ దుర్బలతకు స్థానం అదే

ముమ్మల్ని మీరు ఖాళీ చేసుకోండి

కాబట్టి మీలో చొచ్చుకుపోవటం వాటికి చాలా తేలిక. బజారులో ఉన్న ప్రతి బ్రాండు ఈ సూత్రం పైనే ఆచరణాత్మకంగా పనిచేస్తూంది. ఈ బాండ్ల ఉత్పత్తులను మీరు కొనుక్కొని మీ సొంతం చేసుకోకపోతే మీ జీవితం ఒక విధంగా చూస్తే సుసంపన్నంకాదని, మరో మార్గంలో చూస్తే అసంపూర్ణం, ఖాళీ అని మీరు భావించేటట్లు చేస్తున్నాయి.

బజారు పరిభాషలో ఒక పదబంధం 'ఆవశ్యకతా సృజన' ఉంది. ఊహించండి! తత్ క్షణం మీరు అనుభూతి చెందని అవసరాన్ని సృష్టించి తర్వాత దాన్ని నింపటానికి వారి ఉత్పత్తితో భర్తీ చేయటం వారి పని.

వృత్తి వ్యాపారులు నియతంగా చేసే దానిని సంఘం అనియతంగా చేస్తుంది. సరి అయిన భర్త లేదా భార్య అపేక్షిత సంఖ్యలో సంతానం, అనుకున్న ఉద్యోగం మీకు లభించనప్పుడు, మీలో ఖాళీ ఉన్నట్లు మీరు అనుభూతి పొందుతారు.

చిన్న కథ :

శివపురాణంలో శివ - బ్రహ్మకపాల గాథ ఉంది.

బ్రహ్మకపాలం శివుడు భిక్షుకుడి వేషంలో సంచరించేటప్పుడు తప్పనిసరి పరిస్థితిలో అడుక్కోవటానికి పాతగా ఉపయోగించే పుర్రె. బ్రహ్మకపాలం గురించిన వింత విషయమేమిటంటే జనం బిచ్చంగా ఆ పాత్రలో ఏమి వేసినప్పటికీ ఆ పాత వెంటనే దాన్ని మింగివేస్తుంది. శివుడు దాన్ని నింపటానికి ఎంత ప్రయత్నించినప్పటికీ అది ఎప్పడూ ఖాళీగానే ఉండేది. బ్రహ్మకపాలం మన అందరిలోను ఉంది.

మన జీవితంలో మనలోని ఖాళీని నింపుకోవటానికి ఎప్పడూ ప్రయత్రిస్తూనే ఉంటాము. మనం దాన్ని ఐశ్వర్యంతోను, జ్ఞానంతోను సంబంధ బాంధవ్యాలతోను నింపటానికి ప్రయతిస్తుంటాము దానిలో వేసే ప్రతి దానిని నీలిబిలం (బ్లాక్ హోల్)లా అది కబళించి వేస్తుంది. అయినా పూర్ణత్వంతో మనం దానిలో ఇంకా ఇంకా ఎక్కువ వేస్తూనే ఉంటాము. మన ఖాళీని నింపు కోవటానికి ఇతోధికంగా పెట్టబడి పెడుతూనే ఉంటాము.

కాని చిట్టచివరకు, మనం విజయంతో నిండి నిబిడీకృతమయినప్పటికీ ఏదో పోగొట్టుకున్నట్లు భావిస్తుంటాము.

నేను బెంగాలులో సంచార సన్న్యాసిగా ఉన్నప్పుడు, రోడ్డు పక్క బటాణీలు అమ్ముకునేది తటస్థపడింది. ఆమె దగ్గర కొలమానంగా చిన్నబుట్ట ఉంది. ఖాతాదారు వచ్చినప్పుడు ఆమె తన బుట్టలో పొంగి పొర్లేటట్లు బటాణీలను కొలిచి ఖాతాదారు సంచిలో పోసేది. కాని వింతగా, బటాణీలు సంచిలో పడేవి, పరిమాణం గారడీ చేసినట్లు చాలా తక్కువ ఉండేది! ఆమె తంత్రం తెలుసుకోవటానికి నాకు కొంత సమయం పట్టింది - ఆమె కొలతకు ఉపయోగించే బుట్టకు అడుగుభాగం (మట్ట) లేదు! బయటి నుంచి చూచే వారికి బుట్ట నిండుగా కన్పించినప్పటికీ, బుట్టలోనంతా ఖాళీయే.

పట్టుబడటానికి ముందు ఆమె ఎంతమంది ఖాతాదార్ల పై తన తంత్రాన్ని ప్రయోగించిందో కదా అని నేను ఆశ్చర్యపడ్డాను.

ఎందుకంటే, ప్రతి ఒక్కరిపై అన్ని వేళలా మీ తంత్రం పారదు.

మీరు ప్రత్యేకంగా మాస్టర్‌ను మాయ చేయలేరు.

మీరు గమనిస్తే, నాన్‌సెస్, గుర్‌జెఫ్‌లు మౌలికంగా విరుద్దమయిన రెండు విధానాలను తమ శిష్యులపై ప్రయోగించారు. ఆచార్యుడు అప్పటికే లోన నిండా నిండిపోయాడని

ముమ్మల్ని మీరు ఖాళీ చేసుకోండి

నాన్‌సెస్ తెలుపాడు. ఉస్పెన్స్క్‌ తనలోని ఖాళీని తానే తెలుసుకొనేటట్లు గుర్జెఫ్ చేయగలిగాడు.

కాని ఇద్దరూ చెప్పదలచుకున్న దాని సారాంశం సమానమే. ఎందుకంటే, పూర్ణత, ఖాళీ అనేవి రెండూ సారాంశంలో సమానమే! బటాణీలు అమ్ముకునే దానిలా, మన లోపలి ఖాళీని మూసివేసుకోవటానికి మనం కృతిమ సంపూర్ణతను సృష్టించు కుంటున్నాము.

ఈ కారణంగా మాస్టర్ రెండు ప్రయత్నాలు చేయాలి. మొదటిది, లోపల ఏళ్ళ తరబడి మీరు సంపాదించుకొని పోగుచేసుకున్న చెత్తనంతటినీ నేను తొలగించాలి.

రెండోది అప్పుడు నేను మీలో ఒప్పయిన ఖాళీ - అనుకూల ఖాళీ - ని సృష్టించాలి. మీరు దాన్ని అందుకునే విధంగా మిమ్మల్ని సిద్దం చేయాలి. ఖాళీకావటం అంత సులభం కాదు. ప్రపంచంలో ఖాళీకావటం మిక్కిలి భయపెట్టే విషయం.

మీ (అవాస్తవ) సంపూర్ణతను మీ అహంకారం పెంచుతుంది.

ప్రత్యేక వ్యక్తి భావాన్ని కలిగించే ప్రతి వస్తువును అది (అహంకారం) అంటి పెట్టుకునే ఉంటుంది. మీరు ఏమీ కాకుండా ఎలా ఉండగలరు? మీ అహంకారం దాన్ని ఏ మాత్రమూ సహించదు. తనను తాను ఖాళీ చేసుకోవటం అద్భుతాలలో పరమాద్భుతం.

నేను మీకప్పను ఖాళీ చేసుకోమన్నప్పుడు, మీరు కూడబెట్టిన జ్ఞానాన్ని అంతటినీ తోసి వేయవలసిందిగా చెప్పటంలేదు, మీరు నేర్చుకొన్నదాని విలువలను తగ్గించటం

లేదు, మీ జీవితంలో నిశ్చయంగా మీ జ్ఞానానికి పాత్ర ఉంది. మీరు గడుపుతున్న జీవితానికి జ్ఞానం ఆవశ్యకం కాని ఇప్పుడు మీరు వేరే భిన్నమయిన జోన్‌లో ప్రవేశిస్తున్నారు.

మీ అలవాట్లను, పక్షపాతాలను, మీరు ఇతః పూర్వమే ఏర్పరచుకొన్న భావాలను ప్రక్కన పెట్టవలసి ఉంది అని చెబుతున్నాను. సున్నిత మనస్తత్వాన్ని, గ్రహణశీలతను అలవరచు కోవలసిందిగా చెబుతున్నాను. నమ్మవలసిందని కాని నమ్మవద్దనికాని నేను చెప్పటం లేదు. సరిగా పూర్తిగా నిష్పక్షపాతంగా ఉండండి, సరిగా తెరచిన కళ్ళతో చూడండి.

ప్రతిక్షణం నేర్చుకోవటానికి సదవకాశంగా మార్చబడుతుంది.

జాడీలో సూర్యుడు