Books / Living Enlightenment (Gospel of Paramahamsa Nithyananda)

1. Living Enlightenment (Gospel of Paramahamsa Nithyananda)

జీవస్ముక్తికి (The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ప్రవచనాలు)

మానవశరీరం, మనస్సు అనే వాటికి అతీతంగా ఉన్నతమైన చేతనస్థితికి తీసుకువెళుతుంది. ఈ అత్యున్నత చేతనస్తితిని అనుభవించండి. మీలోని అంతిమశక్తిని తెలుసుకోండి. మానవజీవితంలో ఒకే ఒక లక్ష్యం – అంతిమవిలాసమైన జీవన్ముక్తి స్థితిలో ఆనందంగా ఉండగలగటమే,"

–THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, ఈ రోజు మన మధ్య ఉన్న జ్ఞానోదయమైన యోగీశ్వరుడు.

ఈ గ్రంథంలో ఉన్న అంశాలు

స్పష్టమైన జీవితపరిష్కారాలు సంపూర్ణంగా.

  • అపరాధభావం నుంచి ఎలా బయటికి రావాలి?
  • నిజమైన ప్రేమ అంటే ఏమిటి? -
  • నిత్యం ఆనందస్థితిలో ఉండటానికి సరైన మార్గం.
  • ఆనందజీవనసరళికి యోగా, ధ్యానం.
  • 100కి పైగా ధ్యానపద్ధతుల్ని, నిత్యం తెలుసుకోగల సాధన.
  • కాలాతీతమైన సత్యాలలోనికి తొంగి చూడగల అరుదైన అవకాశం.
  • కర్మ అంటే ఏమిటి?
  • జీవితలక్ష్యం ఏమిటి ?
  • గురుదేవులలోని వివిధ కోణాలు.
  • గురువు అంటే ఎవరు?

నేను అంతిమసత్యం తెలుసుకోవాలంటే గురుదేవులు ఏ సహాయం చేస్తారు..... ఇంకా చాలా ఉన్నాయి.

రచయిత గురించి

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM 21వ శతాబ్దిలో మన మధ్య ఉన్న జ్ఞానోదయమైన యోగీశ్వరుడు. ఆయన బోధనలలో యోగా, ధ్యానం మనలోని అంతిమశక్తిని తెలుసుకోవటానికి అవసరమైన సాధనలు, మనిషిని దివ్యాంశ స్వరూపుడుగా మార్చటం ఉంటాయి. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మిషన్ లక్ష్యం పరమానందస్థితి అయిన నిత్యానందజీవితాన్ని ప్రచారం చేస్తూ జ్ఞానమయమమైన మానవసమాజాన్ని సృష్టించటం.

– లైఫ్ బ్లిస్ ఫౌండేషన్

ప్రేమ వాహినిలో తేలి ఆదండి

పొంగి ప్రవహించే ప్రేమని అందరి పట్ల చూపించటమే జీవన్ముక్తి అంటే

'ఆలోచనలు మెదడు నుంచి, భావావేశాలు హృదయంనుంచి వస్తాయి' అని సైకాలజిస్టులు చెబుతారు. 'అవి ఎక్కడినుంచి వచ్చినా, ఆలోచనలు, భావాలు వేరువేరు కాదు. ఆలోచనలు మనని తయారు చేసాయి' అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. మన భావావేశాలు ఏమిటో మనం అదే విధంగా ఉంటాం. మన జీవితాలలో మార్పు రావాలి అంటే మన భావావేశాలతో చక్కగా వ్యవహరించగలగటం ముఖ్యం.

ప్రేమ అంటే ఏమిటి?

మనం దేనినైనా మొదటిసారి చూడగానే, దానినుంచి ఏమి పొందగలమో లెక్కలు కడతాం. మనం చూసింది ఒక వ్యక్తి వైపు గాని లేదా ఒక వస్తువు వైపుగాని, ఏదైనా కావచ్చు. మనం దాన్ని గురించి ఆలోచించేటప్పుడు ఆ ఆలోచనలవెనుక భయంకాని, ఆశ కాని ఉంటుంది. మన ఏకాగ్రత ఆ వస్తువు మీద ఉంటుంది.

మన ఏకాగ్రతను మన అంతరంగం వైపు తిప్పి, ఇలా అడగవచ్చు 'నేను ఏమి ఇవ్వగలను? 'నేను దీన్ని మరింతగా ఎలా అభివృద్ధి చేయగలను.' ఇలా కాకుండా, 'నేను దీని నుంచి ఏమి పొందగలను' అని అనుకుంటే, మన కోరికముందుకు నడుస్తుంది. ఆవిధంగా కాకుండా నేను ఎలా అభివృద్ధి చేయగలననుకుంటే అది ప్రేమ అవుతుంది. కోరిక అడిగే శక్తి. ప్రేమ ఇచ్చే శక్తి.

నిజాయితీగా చెప్పాలంటే, ప్రేమని నిర్వచించటం చాలా కష్టం. కేవలం మాటలతో దాన్ని పూర్తిగా నిర్వచించలేం. నేను అక్కడక్కడ కొన్ని పదాలని ఉపయోగిస్తున్నాను. అప్పుడు ఏదో ఒక పదం మీ అంతరంగాన్ని స్పృశించవచ్చు.

ప్రేమ అంటే అంతరంగంలో జరిగే ఒక లోతయిన గొప్ప అనుభవం. చాలామంది ప్రేమ అంటే ఎంపిక అనుకుంటారు. మనం ప్రేమని వెల్లడించటం, అనుభవించటం అనేవి మనం ఎంచుకోవటం అనుకుంటాం. మనం కావాలి అనుకుంటే మనం ప్రేమతో వ్యవహరించగలం అనుకుంటాం. లేకపోతే దాన్ని వదిలి వేద్దాం అనుకుంటాం. అది సరికాదు. మనం అనుకున్నట్టు అది మన ఎంపిక కాదు. అది జీవితానికి కావలసిన ప్రాథమిక అవసరం.

జీవితం అంటే కేవలం శ్వాసతీసుకుంటూ జీవించి ఉండటం కాదు. జీవించటం అంటే మీ అంతరంగంలో, ఆత్మస్థాయిలో జీవించగలగటం. చేతనస్థితిలో జీవించగలగటం. ప్రేమని వెల్లడి చేయగలిగి, దాన్ని అనుభవించ గలిగితే చేతన స్థితిలో జీవిస్తున్నట్టే అర్థం. మీరు ప్రేమని వెల్లడి చేయలేకపోతే, దాన్ని అనుభవించలేకపోతే, మీరు ఆత్మస్థాయిలో జీవించటం లేదు అని అర్థం. మన చుట్టూ జంతువులు, చెట్టు ఇలాంటివన్నీ ప్రతిరోజూ శ్వాసిస్తూ ఉన్నాయి. మీరు కూడా వాటిలాగానే శ్వాసిస్తుంటారు అంతే.

ఒక చిన్న కథ : ఒక శిష్యుడు తన గురువుగారిని 'జ్ఞానోదయమయిన వారు మాట్లాడతారా' అని అడుగుతాడు. గురువుగారు 'లేదు! జ్ఞానోదయమయిన వారు మాట్లాడరు. కేవలం జ్ఞానోదయం కానివారు మాత్రమే మాట్లాడతారు', అని జవాబు ఇస్తాడు.

శిష్యుడు మరలా ఆయనతో, 'అయితే జ్ఞానోదయమయినవారు మౌనంగా ఉంటారా?' అని అడుగుతాడు. గురువుగారు, 'లేదు జ్ఞానోదయమయినవారు ఎపుడూ మౌనంగా ఉండరు. వాక్కు మౌనంగా ఉన్నారు అంటే వారికి జ్ఞానోదయం కాలేదు అని అర్ధం,' అని జవాబు ఇస్తాడు. శిష్యుడు చాలా అయోమయంలో పడతాడు. అతను తిరిగి గురువుగారిని 'వీరు మాట్లాడరు అన్నారు, మౌనంగా ఉండరు అన్నారు కదా! మరి వాళ్ళు ఏం చేస్తారు' అని అడుగుతాడు.

గురువుగారు 'ఆయన పాడతాడు ! ఆయన ఆత్మ పాడుతుంది. ఆయన మాట్లాడడు, మౌనంగా ఉండదు, పాడుతుంటాడు', అని జవాబు ఇస్తాడు.

ప్రేమ మనిషికి ఉండే అంతిమ అనుభవం. ఆ అనుభవం జరిగితే మనం ఆ అనుభవాన్ని పట్టుకోలేం. ఆ అనుభవం పట్టులోనికి మనం వెళతాం. ఇక్కడ గురువుగారి మాటలకి అర్ధం అదే. ఆ అనుభవం ఆధీనంలో ఉన్నప్పుడు మనం ఏమి చేసినా అది అందమైన సంగీతంలా ఉంటుంది. వారి నుంచి వచ్చే ప్రతీ మాట ఒక కవితాగానం. ఆత్మ తేలికగా ఉంటుంది. మనం తేలుతూ ఉంటాం మన నడక నాట్యంలా ఉంటుంది. మన శరీరం తేజస్సుని వెదజల్లుతూ ఉంటుంది. మనం వెల్లడి చేసేవన్నీ మానవాళికి మనం చేసే సేవ అవుతుంది.

ప్రేమని వెదజల్లుతూ ఉంటాడు. అతను పుట్టినప్పుడు ఆ చుట్టు పక్కల ఉన్నవారు ఎవరైనా అతనికి తెలుసా! లేదు అతని శక్తి కారణం లేని ప్రేమ. మనం పెరిగే కొద్దీ సమాజం మనలోపల ఆశ,భయాలని నింపుతుంది. మన ప్రేమని ఆశ, భయాల ఆధారంగా పెంచుతాం. ఇక అది కారణం లేని ప్రేమ కాదు. అది కారణంతో ఉన్న ప్రేమ. అది మనని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అప్పుడే మనలో అసూయ, భయం, కోపం వంటి భావాలు ఏర్పడతాయి. మనం ప్రేమని ఏదో కారణంతోనే అనుభవించగలం. కొంత తెలుసుకునే తత్వంతో, అవగాహనతో మనం మన అసలయిన ప్రేమని తిరిగి పొందగలం.

ప్రేమని సృష్టించలేం

ేహేతుబద్దమయిన తెలివి తేటలతో కూడిన నిర్ణయాలతో (పేమని పుట్టించలేం. మీరే ఒక (పేమగా మారగల మానసిక వ్యవస్థని తయారు చేయగలం. అప్పుడు మీరు చేసే ప్రతి పని (పేమతో ఉంటుంది. మీ తర్శం, జ్ఞానం తర్శానికి అతీతమయిన (పేమని వెదజల్లుతూ ఉంటుంది. మీలో నిజమయిన (పేమ ఏర్సడినప్పుడు, మీరు (పేమతో నిండి ఉన్నారని, మీరు (పేమమూరి అని మీకు తెలియదు. ఎదుటివారికి మాతం మీ (పేమ తెలుసుంది. మీలో (పకాశించే (పేమని అందరూ చూడగలుగుతారు.

మీలో నిజమయిన [పేమ అనేది స్తిరపడినప్పుడు, మీలోపల శక్తి పొంగి ప్రపహిస్తూ ఉంటుంది. అప్పుడు దేనినైనా ఎదుటివారికి ఇవ్యగల శక్రి మీకు వస్తుంది. మీలో అంతులేని నమ్శకం కలుగుతుంది. ఎందుకంటే అది మీలో కలిగిన విషయం. మీకు తెలుసు అది శక్రి కాని, సమయం కాని, వైపుణ్యం కాని లేదా ఆనందం కాని, అది మీలో పొంగి ప్రపహించేటప్పుడే దాన్ని ఎదుటివారికి పంచగలరు. అదే విధంగా (పేమ మీలో సహజంగా కలగాలి కాని నిర్శంధంతో కాదు. మీలో [పేమని [ప్రయత్నంతో కలిగే విధంగా చేయటం అంటే పువ్వురేకులను బలంగా తెరచి, అది పూచేవిధంగా చేయటమే. అలా చేసినప్పుడు దాన్ని పుష్పించటం అనగలమా? లేదు! (పేమ మీ అంతరంగపు లోతులలో వికసించాలి. అప్రుదు అది అందమైన సువాసనలని నలు దిక్కులా వెదజల్లుతూ అందరికీ అనందాన్ని పంచుతుంది.

(పేమ ఐదురకాల అస్థిరత్వాల్ని అసహనాల్ని బాగుచేస్తుంది

(పేమ అనే మాట చాలా అర్థాలతో నిండిపోయి ఉన్నది. దానికి ఇచ్చిన వ్యాఖ్యానాలు నానా అర్థాలతో నిండిపోయాయి. కారణంలేని నిస్వార్థ, ఆధ్యాత్మిక [పేమని ఒక పక్కన పెడదాం. ముందుగా మనం సాధారణమైన, మామూలు [పేమ అన్నింటినీ స్వంతంచేసుకునే భావన, అసూయ, ఇటువంటి సైద్ఎఫెక్స్‌తో ఉండే [పేమ గురించి చూద్దాం. ఇటువంటి [పేమ కూడా మీ శరీరానికి, మనస్సుకి చాలా మంచి చేస్తుంది. తరువాత మనం నిస్వార్ణ, ఆధ్యాత్మిక, పరిణతి చెందిన (పేమ గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు ఒక పుత్రికలో వ్యాసం చదివాను. దాని పేరు ఎప్పటికీ జీవించి ఉండండి (లివ్ ఫర్ ఎవర్). అది చదివి ఆశ్చర్యపోయాను. అందులో మీ జీవితాన్ని మరొక ఇరవై సంవత్సరాలు పెంచగలిగే పదకొండు పద్ధతులు ఇచ్చారు. ఆ పద్దతులకి ఆధారంగా కొంత గణాంకాలని కూడా చూపించారు. ఆ పదకొండు పద్ధతులూ [పేమకి సంబంధించినవే. అందులో ఇలా చెప్పారు, కనీసం మీ పెంపుదు జంతువుని (శద్దగా చూసినప్పుడు మీ లోపల విడుదలయ్యే హార్మోను మీరు శరీరంతో సౌకర్యంగా ఉండే విధంగా చేస్తుంది. పెంపుడు జంతువుని !శద్గగా చూస్తేనే అంత ఉపయోగం ఉంటే భార్య– భర్తల మధ్య (పేమ ఎన్ని ఉపయోగాలను ఇస్తుందో కదా!

ఆ వ్యాసం ఒంటరిగా ఉండేవారు ఏ విధంగా త్వరగా మరణిస్తారో కూడా చెబుతూ, '[పేమ జీవితకాలాన్ని పొడిగిస్తుంది' అని చెప్పారు. 'మీ జీవితంలో [పేమ ఉంటే కాన్సర్, డి(పెషన్ వంటివి రావు' అని కూడా అందులో రాసారు. కాబట్టి మనందరికీ తెలిసిన అతి

సాధారణ [పేమ ఎన్నో అద్భుతాలని చేస్తుంది. అది మీ శరీరానికి, మానసిక వ్యవస్థకి గొప్ప చికిత్స చేసి మిమ్మల్ని చక్కని స్థితిలో ఉంచగలుగుతుంది.

తంlతం అంటే [పాచీన వేద సంస్కృతిలో జ్ఞానోదయాన్ని పొందటానికి ఆధ్యాత్మిక పద్ధతుల్ని, ధ్యానాన్ని, పూజా, హోమ కార్యకమాల్ని ఎలా చేయాలో చెప్పేది. తం(తం (పకారం, సాధారణ [పేమ మనలో ఏర్సడే ఐదురకాల అసహనాల్ని ఎలా బాగుచేస్తుందో చెబుతుంది. ఇది ఒకరిపట్ట ఒకరు [శద్ద చూపించటమే. మరొకసారి చెబుతున్నాను, నేను అధ్యాత్మిక [పేమ లేదా భక్తి గురించి మాట్షాదటం లేదు. దాని గురించి తరువాత తెలుసుకుందాం.

ఒక చిన్న కథ : ఒక స్కూలుకి వెళ్ళే అబ్బాయి, తన క్షాసు అమ్మాయి (పేమలో పడతాడు.

ఒకరోజు టెరరిస్థులు ఆ అబ్బాయిని కిద్నాప్ చేసి, సరిహద్దులలో ఉన్న ట్రబునింగ్ కాంప్‌లో పెడతారు. కొన్ని నెలలు గడిచాక అతను తన ఊరికి తిరిగి వచ్చి 'అక్కడ ఉగ్రదాదాన్ని పెంచాలి' అని అనుకుంటాడు.

అతను ఊరిలోనికి రాగానే తన ప్రియురాలి కుటుంబాన్ని ఉగ్రవాదులు చంపారు అని తెలుసుకుంటాడు.

అతను ఆ అమ్మాయిని కలుస్తాడు. ఇద్దరూ మాట్లాదుకుంటూ ఉంటారు. ఆమె ఉుగ్రవాదం పట్ల తన అసహ్యాన్ని ప్రపకటిస్తుంది. అతను చేస్తుంది మంచిది కాదని ఆ పనిని మానేయమని బతిమాలుతుంది. 'అధికారులకి లొంగిపోతే నిన్ను వివాహం చేసుకుంటా'నంటుంది. ఆ అబ్బాయి అధికారులకు లొంగిపోతాడు. సైన్యంలో చేరి ఆ అమ్మాయి ఫొటో దగ్గర పెట్టుకొని తన విధులు నిర్వహిస్తూంటాడు.

మనం ముందుగా మనందరికీ తెలిసిన [పేమ గురించి అంటే సకారణమైన [పేమ గురించి తెలుసుకుందాం. మీకు ఆధారమైన వ్యక్తికి, మీకు పేరు ప్రతిష్ఠలు తెచ్చే వ్యక్తికి మాత్రమే మీ (పేమని పంచుతారు. ఇటువంటి (పేమ కూడా మీలోని అస్టిరత్వాన్ని, అసహనాన్ని బాగు చేయగలుగుతుంది.

మీలో కలిగే అసహనం ముందుగా మీ పరిస్థితుల వల్ల ఏర్పడుతుంది. కొన్ని సార్లు, కొన్ని సందర్భాలలో, కొన్ని స్థలాలలో మీరు అస్థిరంగా, అసహనంగా ఉంటారు. మీరు ఆ సందర్సం నుంచి, ఆ చోట నుండి బయటకు రాగానే విశాంతిగా, స్తిరంగా అవుతారు. మీకు అసౌకర్యం కలిగే స్థితిలో ఎవరైనా మీ పట్ట [పేమని, శ్రశ్నని చూపించారనుకోండి లేదా మీరు ఎదుటి వారి పట్ల (పేమని, శ్రశని చూపించారనుకోండి అప్పుడు మీరు ఆ కంగారు నుంచి బయట పడి విశ్రాంతిగా ఉండగలుగుతారు.

మరొక రకమయిన కంగారు భౌతికమయింది. ఇటువంటి కంగారు ఎటువంటి కారణం లేని ఒత్తిడి (టెన్షన్) మీలో కలిగినప్పుడు వసుంది. ఇక్ుడ ఏమి చెబుతారంటే మీరు అటువంటి కంగారులో ఉన్నప్పుడు, మీరు ఎవరి పట్ట అయినా (పేమ చూపగలిగితే, మీలో ఆ కంగారు తగ్తి, టెన్షన్ తగ్తి శాంతంగా ఉంటారు. (పేమ ఏ విధంగా మీలోని కంగారుని, ఒత్తిడిని తగ్రిసుంది? మీరు మీ జీవితంలోనికి చూదండి. ఒక తల్లిని గమనించండి. పిల్లలు ఎంత విసిగించినా ఆమె ప్రతిక్షణం నూతనోత్సాహంతో ఉంటుంది. ఎందుకంటే అమె నిరంతరం [పేమ చూపిసూ ఉంటుంది. అందుకే ఆ ఒత్తిడి నుంచి బయటకి రాగలుగుతుంది. ఆమె అలా బయటకి రాలేకపోతే పిల్లల్ని పెంచలేదు. పిల్డల పెంపకం అంత సులభం కాదు.

(పతి క్రణం ఆమెలో నూతనోత్సాహం కలగటానికి కారణం ఆమె పిల్లల మీద చూపించే ుశద్ధ, (పేమ. మన శరీరంలో ఉండే ఎటువంటి టెన్నన్ అయినా, కంగారు అయినా ఎదుటివారి మీద [పేమ చూపించగానే పోతుంది. మీరు ఎదుటివారిని చూసి నవ్వే చిరునవ్వే కానివ్యండి లేదా మీ శరీరం వ్యక్లం చేసే ఏదయినా సరే కనీసం ఒక్కసారైనాసరే ఎదుటి వారిలో టెన్నన్ తగ్తిస్తుంది. అదే విధంగా మీలో కూడా.

మిమ్మల్ని మీరు మీ మెదడు ద్వారా వెల్లడి చేస్తే దాన్ని మేధస్సు అంటారు. మిమ్మల్ని మీరు హృదయం నుంచి వ్యక్తం చేస్తే అది మీ (పేమ. మిమ్మల్ని మీరు మీ అంతరంగంలోని ఆత్మ నుంచి వెల్లడి చేసే అప్పుడు మీరు శక్రిని అనుభవిసారు. మీరు దేన్సీ వెల్డడి చేయకుండా, మీ అంతరంగంలో ఉంచగలిగితే అది నిత్యానందం లేదా పరమానందం. ఇదంతా కూడా ఒక్కటే శక్తి. కాని ఆశక్తిని నాలు విధాలుగా వ్యక్తం చేస్తున్నారు.

కాబటి మీరు (పేమను వెలడించినప్పుడు, మీరు శకిని కూడా వెలడి చేసారు. (పేమ స్థిరంగా ఉండి గ్రామ శక్తి. కాబట్టి సహజంగా మీరు [పేమని వెల్లడి చేసినప్పడు మీరు చికిత్స చేయగల శక్రికి వాహకులు అవుతారు. ఎప్పుడెతే చికిత్సా శక్రికి మీరు వాహకులవుతారో, మీరు ఎదుటి వారికి కాదు మీకు మీరు కూడా చికిత్స చేసుకుంటారు.

ఆ తరువాత ఉండే అసహనం మానసికమయింది. ఎటువంటి మానసిక అస్థిరత్యాన్నెనా, కంగారునైనా [పేమతో బాగు చేయవచ్చు. పరిశోధనలు ఏమి చెబుతున్నాయంటే ఎవరైతే పెంపుడు జంతువులతో లేదా చిన్న పిల్లలతో గడుపుతూ వారిపై [శద్ద చూపుతారో వారికి గుండె జబ్లులు వచ్చే అవకాశం చాలా తక్కువ.

ఆ తరువాతది భావావేశం. మానసిక అసహనం భావాత్మక అసహనం రెండూ వేరు వేరు, మానసిక అసహనం మేధస్సుకి సంబంధించినది. దాన్ని సులభంగా నియంత్రించవచ్చు కాని భావాత్మక అసహనాన్ని కొన్ని ఓదార్చు మాటలతో నియం[తించలేం. దాన్ని కేవలం [పేమతో మా(తమే నియంlతించగలం. మీరు [పేమని వెదజల్లుతున్నప్పుడు, మీ అంతరంగం శక్తితో

నిండిపోతుంది. ఎప్పుడైతే మీ అంతరాత్మ ఆ ఉన్నత శక్రికి విప్పారుతుందో, మీలోని భావాత్శక అసహనాన్ని తగ్గిస్తుంది.

చివరిది ఆధ్యాత్మిక అసహనం. చాలామంది ఎదుటివారితో కూర్చోగలరు, టి.వి.తో కూర్చోగలరు, స్యూస్ పేపర్లతో కూర్చోగలరు కాని వారితో వారు కూర్చోలేరు. దీన్నే ఆధ్యాత్మిక అసహనం అనవచ్చు. అంటే మీతో మీరు ఉండలేరు అని అర్ధం. మీరు అందరికీ అప్పాయింట్‌మెంట్ ఇస్తారు. కాని మీకు మీరు అప్పాయింట్‌మెంట్ ఇచ్చుకోలేరు.

గురువుల మీద మీకు ఉండే (పేమ ఇటువంటి అసహనాన్ని తగ్గిసుంది. నాతో చాలామంది అంటుంటారు, 'స్వామిజీ! కేవలం మీ సమక్టంలో కూర్చోగానే మేం చాలా విరామంగా అవుతాం. మరలా ఇంటికి వెళ్ళాక ఆ విరామం ఉండటం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది ?' మీరు జ్జానోదయమయిన వారి సమక్షంలో ఉన్నప్పుడు వారితో బంధాన్ని ఏర్పరచుకోగలరు. అప్పుడు వారి పట్ల మీరు [పేమని వెల్లడి చేయగలరు. ఆ [పేమ మీలోని ఆధ్యాత్మిక అసహనాన్ని తగ్గిస్తుంది.

మీరు గమనిస్తే, నేను మాట్తాడే సమయంలో మాటకి మధ్యలో చాలా ఖాళీలు ఇసుంటాను. ఆ ఖాళీ ఉద్దేశం మీలోని ఆధ్యాత్మిక అసహనాన్ని తగ్గించటమే. మీరు టి.వి. ముందు కూర్చున్నప్పుపు మీరు సౌకర్యంగా ఉండగలరు. ఎందుకంటే అందులోని సమాచారం మీ లోపలికి దూసుకుపోతుంది. అప్పుడు మీలోని అసహనాన్ని తెలుసుకునే అవకాశం ఉండదు. అక్కడ సహనం ఉన్నా మీరు దాన్ని అనుభవించలేరు. అందుకే సౌకర్యంగా ఉందగలుగుతున్నారు.

ఇక్కడ మీరు ఓపికగా కూర్చొని ఈ పెద్ద ఫెద్ద ఖాళీలతో ఉండే మాటల్ని వింటుంబే మీలో ఆధ్యాత్మిక అసహనం తగ్మతుంది. అదే విధంగా మీ మనస్సు అడిగే ఆ తరువాత ఆలోచన ఏమిటీ అనేది కూడా తగ్గుతుంది. అప్పుడు మీరు స్వీకరించే స్థితిలో ఉంటారు. అప్పుడు ఈ మాటలు మీ మెదడునే కాదు మీ హృదయాన్ని తాకుతాయి. మీరు పూర్తి విరామంగా ఉండగలిగినప్పుడు మీతో మీరు సౌకర్యంగా ఉండగలిగినప్పుడు, మీలో ఎక్కువ అలోచనలు లేకుండా ఉండగలిగినప్పుడు, మీ అంతరాత్మ విప్సారుతుంది. అప్పుడు అది తనలోనికి ఏది తీసుకున్నా అది చికిత్స చేయగలుగుతుంది.

మీ మనస్సు విరామంగా, నిశ్నబ్దంగా ఉంటే, వినటం చాలు. మీరు తరువాత ధ్యానం చేయనవసరం లేదు. ఆ వినటమే మీలో కావలసిన అనుభవాన్ని ఇస్తుంది. మీరు వినే పద్ధతి సరిగా లేకపోతే అప్పుదు మీలో అనుభవం కలగటం కష్టం. జిడ్డు క్సష్టమూర్తి ఒక గొప్ప తత్వవేత్త, వినటం మంచిది అంటారు. ఎటువంటి అసహనం లేకుండా లోతుగా వినగలగటం దైవత్వమే. అదే భగవంతుడు. మీరు మీ అంతరాత్మ లోపలికి లోతుగా చూడగలిగితే సాక్షాత్తు గురుదేవుల సమక్షం మీలో (పేమ కలిగేలా చేస్తుంది. అదే మీలోని అసహనానికి చికిత్స చేసి

విశ్రాంతిలో ఉంచుతుంది. కాబట్టి సాధారణ [పేమ మనలోని ఐదు రకాల అసహనాల్ని బాగుచేసుంది.

(పేమ గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది

రామానుజాచార్యుల జీవితంలో ఒక చక్కని సంఘటన జరిగింది. (రామానుజులు భారతలో ఉన్న గొప్ప తత్వవేత్త, ముగ్డురు గొప్ప హిందూ గురువులలో ఆదిశంకరాచార్యులు, మధ్యాచార్యులలో ఒకరు. ఆయన విశిష్తాద్వి మనకి పరిచయం చేసారు). ఆయన జీవితాన్ని పరిశీలిస్తే ప్రపతి దశలో ఎదుగుతూ ఆయన ఎలా జ్ఞానోదయాన్ని పొందారో తెలుస్తుంది.

'రామానుజునికి దీక్షని ఇసూ ఆయన గురుదేవులు ఒక మంత్రాన్ని జపించమని చెబుతాదు. ఆ మంత్రాన్ని మరెవరికీ చెప్పవద్దని అలా చేస్తే నరకానికి వెళతావు' అని అంటాడు. అప్పుడు రామానుజులు గురువుగారిని, 'ఆ మంత్రం విన్నవాళ్ళు ఏమవుతారు' అని అదుగుతాడు. గురువుగారు రామానుజునితో 'వారికి మోక్షం కలుగుతుంది' (జ్ఞానోదయం) అని జవాబు ఇస్తాదు. అదే మనం అయితే ఏమి చేస్తాం, ఎవరికీ చెప్పకుండా ఉండిపోయేవాళ్ళం. ఎందుకు అనవసరంగా నరకానికి వెళ్ళటం అని మౌనంగా ఉండేవాళ్ళం.

రామానుజులు గుడి మండపం మీద నిలబడి మొత్గం ఆ ఊరి వారందరినీ అక్కడికి రమ్మని పిలుసాడు. అంతా వచ్చాక గురువుగారు తనకి చెప్పిన మంతాన్ని వాళ్ళందరికీ చెప్పి దీనివల్ల మీరంతా స్వర్గానికి వెళతారు. నేను ఒక్కడినే నరకానికి వెళ్ళటం వల్ల నష్టం లేదు. మీరంతా స్వర్గానికి వెళ్ళండి', అని చెబుతాడు.

మీరు లోతైన (పేమతో ఉన్నప్పుడు, మీ అంతరాత్మ మొత్తం విప్చారి ఉంటుంది. అప్పుడు మీరు ఎటువంటి దానికోసం ఎంత దూరమైనా వెళ్ళి సాధిసారు. దానికోసం మీరు అవకాశం అంచులవరకు వెళ్ళగలుగుతారు. మీ అంతరాత్మని రక్షించుకోవలసిన అవసరం ఉండదు. మీ అంతరాత్మ పూర్తిగా వికసించి ఉంటుంది. మీరు ఆ (పేమతో నిండినపుడు రక్షణ గురించి అనుకోరు. అందుకే [పేమతో ఉన్నవారు ఎంత కష్టమైన పనినైనా చేస్తారు. వారు ఎంత కష్టాన్నెనా తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ వారు పోగొట్టుకోవటానికి ఏమీ ఉండదు. ఏ విషయంలో కూడా అభద్రదతా భావం ఉండదు. ఎందుకంటే [పేమ అంతులేని ధైర్యాన్ని, శక్తిని ఇస్తుంది. అది మీరు వికసించే విధంగా చేస్తుంది. మీకు మీరు దొరికే విధంగా చేస్తుంది. ప్రస్తుతం మీకు మీరు దొరికే స్టితిలో లేరు. [పేమ మీకు మీరు దొరికే విధంగా చేస్తుంది.

రామానుజాచార్యులు చేసిన పని చూసిన గురువుగారు, తాను తన శిష్యుడి నుంచి పాఠం నేర్సుకున్నాను అని అనుకున్నాడు. ఆయన 'రామానుజుదు అత్యున్నత స్థాయికి ఎదిగాడు'

(పేమ వాహినిలో తేలి ఆదండి

అని అందరికీ చెప్పాడు. ఆయన రామానుజునితో, 'నీవు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నావు' అని అంటాడు.

విప్పారి ఉండండి – తత్వవేత్తలుగా కాదు

మీరు జాగత్తగా గమనిసే, (ప్రతిరోజూ మీరు కలసి వారిపట్ల ఒక నిరిష్టమైన మానసిక స్తితిని కలిగి ఉంటారు. మీకు, వారికి మధ్య జరిగిన సంభాషణ ప్రతి మాట మీకు బాగా తెలుసు. మీరు సంభాషణని ఏవిధంగా ప్రారంభిస్తే అవతలివారు ఏ విధమైన జవాబు ఇస్తారు అనేది చాలా కచ్చితంగా మీకు తెలుసు. మీరు పీ సంభాషణని ఏ విధంగా మారిస్కే అవతలివారు ఏ విధంగా తమ జవాబుని మారుస్తారో కూడా మీకు తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే (పతిరోజు మీ మధ్య జరిగే సంభాషణ, అందులో డైలాగుల స్క్రిప్ట్ మొత్తం మీకు తెలుసు.

ఎప్పుడైనా ఎవరైనా కొత్తవారు, కొత్త సంభాషణతో వచ్చినప్పుడు మీరు కొంత అయోమయపడతారు. కొంత కదలిపోతారు. మీకు ఎలా జవాబు చెప్పాలో తెలియదు. ఎలా స్సందించాలో తెలియదు. ఆ కొన్ని క్షణాలు ఎలా స్పందించాలో తెలియక ఆశ్చర్లపోతారు. లేకపోతే ఆ రోజు మొత్తం చెప్పే డైలాగులు మీకు తెలుసు. ఎలా (పారంభించాలో, ఎలా మలుపు తిప్పాలో ఎలా ముగించాలో అన్నీ తెలుసు. అది జీవం లేని దైలాగు. అందులో జీవం ఉండదు.

అసలు సమస్య ఏమిటంటే మనందరం తత్వవేత్తలుగా మారాం. జీవితం అంటే తత్వం, వేదాంతం కాదు అని మనకి తెలియదు. అది అప్ర‌య‌త్నంగా విక‌సించే శ‌క్తి. అది ప్ర‌తిక్షణం కొత్తగా ఉంటుంది. తత్వం అంటే పాతవాటినే వేరువేరు విధాలుగా చెప్పటం. అంతే అందులో తాజాదనం ఉందదు. వేదాంతం జీవితంలోని తాజాదనాన్ని కొల్లగొదుతుంది.

ఒక చిన్న కథ : ఒక దేశంలో పదిమంది తత్వవేత్తలను జైల్లోని ఒకే సెల్‌లో పెడతారు. వారంతా ఏదో విధంగా జైలు నుంచి తప్పించుకొని పారిపోవాలని అనుకుంటారు. అందరూ కూర్చొని ఒక పెద్ద ప్లాను వేస్తారు. వాళ్ళు కష్టపడి జైలు తాళం చెవి ముద్దని సంపాదిసారు. దాంతో తాళంచెవి చేస్తారు.

చివరగా పారిపోవటానికి ఒక రోజును నిర్ణయించుకుంటారు. ప్రాను మొత్తాన్ని క్రుణ్ణంగా చదువుతారు. ప్తాను (పకారం ఆ రోజు రాశి ముందుగా ఇద్దరు వెళ్ళి జైలుకి ఉన్న తాళాన్ని వీళ్ళు తయారుచేసిన తాళం చెవితో తెరవాలి. అలా తెరిచాక వాళ్ళు మిగతావారికి ఈ విషయాన్ని తెలియచేయాలి. అప్పుదు అందరూ పారిపోవాలి. చివరిలో ఆ ఇద్గరూ జైలు తలుపు వేసి వచ్చేయాలి. ఇది ప్లాను.

వాక్సు తప్పించుకు వెళ్లిపోవాలి అని నిర్ణయించిన రోజు వసుంది. ప్రాను (పకారం ఇద్దరు జెలు తాళం తీయటానికి వెళతారు. ఎంతసేపు చూసినా వాళ్ళకి ఎటువంటి సంకేతం రాదు. అలా మూదు గంటలు గడచిపోతాయి. అకస్మాత్‌గా ఆ ఇద్దరూ వెనక్కి సెల్‌లో ఉన్నవారి దగ్గరకి వస్తారు. 'ఏం జరిగింది' అని అడగ్తానే, వాళ్ళు, 'ఈరోజు మనం తప్పించుకొని వెళ్ళలేం. ఆ ప్లాను ఈ రోజుకి వదిలివేయాలి. మరొక రోజు మనం మరలా ప్రయత్నిద్ధాం అంటారు'.

మిగతావారంతా, 'అసలు ఏమయ్యింది' అని అడుగుతారు. వాళ్ళు 'ఏం చేస్తాం. తెలివితక్కువ కాపలాదారు జైలు గేటుకి తాళం వేయటం మర్సిపోయాదు' అని జవాబు ఇస్తారు.

తత్వవేత్తలుగా ఉండేవారు ఏదీ కొత్తగా ఆలోచించలేరు. వారిది పాత మానసిక వ్యవస్థ మాంతమే. ఏమాతం మార్పు ఉన్నా, కొత్తగా ఉన్నా, ఆ వ్యవహారాన్ని సృజనాత్మకంగా మేనేజ్ చేయలేరు. ఎందుకంటే వారు విప్పారి ఉండరు. వారు మూసుకుపోయి ఉంటారు.

మనం మనతో వ్యవహరించేటప్పుడు ఫిలాసఫర్స్‌లా మూసుకుపోయి ఉంటాం. జరిగిపోయిన పంథాలో చిక్కుకుపోతాం. ఏదైనా కొత్త విషయం జరిగితే, మనం ఏమీ చేయలేని స్తితిలో ఉంటాం.

ఏ వ్యక్తి అయితే నిత్య చైతన్యంతో ఉంటాదో అతను ఎప్పుడూ కొత్తగా ఉంటాదు. అతను విప్పారిన అంతరంగంతో ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటాదు. అతను ఈ సృష్టిలో ఒకడిగా అనుభూతిని పొందుతాడు. ఒక విషయం అర్థం చేసుకోండి, విప్పారి ఉండటం అంటే అందరినీ సమాన గౌరవ భావంతో చూడగలగటం. దీని అర్థం అందరినీ సమానంగా పరిగణించి వారితో సమాన భావంతో ఉండటమే. అందుబాటులో ఉండటం అంటే మీకు సృష్టంగా తెలుసుకదా, ఈ విశ్వంలో దేనికైనా మూలం విశ్వశక్తి. అ విశ్వశక్తికి నిరంతరం అందుబాటులో ఉందాలి. అదే అందుబాటులో ఉందటం అంటే. విశ్వశక్తి యొక్క అత్యున్నత స్థితిని గుర్తించి అన్నీ అందులో భాగాలే అని తెలుసు కోవటం. మీరు విప్పారి, అందుబాటులో ఉంటే, మీరు తత్వవేత్త కారు. మీరు జీవితాన్ని [పేమతో ఆహ్వానించగలరు.

తత్వంతో, వేదాంతంతో మీలో స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడతాయి. మీరు మరింతంగా గట్టిపడతారు. మీరు గట్టిపడే కొద్దీ [పేమించలేరు. దృఢత్వం అనేది దౌర్హన్యపూరితంగా ఉండి [పేమని మీలోనికి రానీయదు. మీకు కచ్చితంగా తెలిసి, ముందుగా ఏర్పరచుకున్న భావాలతో నిండి ఉంటే, (పేమ ప్రవేశించటానికి ఖాళీ ఎక్కడుంటుంది. (పేమ ప్రవేశించి వికసించటానికి అందమైన ప్రదేశం కావాలి.

వేదాంత, తత్వజ్షానాలతో నిండి ఉంటే [పేమ విశ్వచేతన రూపంలో స్థిరపడటానికి స్థానం ఉండదు. అది ఈ విధంగా ఉంటుంది, మీరు అమృతం రుచి తెలుసుకోవాలి అని అనుకుంటే, ఏవో కొన్ని భావాలు, ఐడియాల ద్వారా తెలుసుకోగలరా? లేదు! మీ అంతట మీరు అమ్నతం

రుచిని చూడాలి. దానికి మీలోపల కొంత స్తానాన్ని ఇవాలి. అది దాని సహజ స్థితిలో మీలో స్తిరపడే అవకాశం ఇవాలి. అప్పుడే అమృతం రుచి మీకు తెలుసుంది. అదే విధంగా (పేమ అసుభవం తెలియాలంటే దాని గురించి ఏవో కొన్ని భావనలు సహాయం చేయవు. మీరు దాన్ని తన సహజసిద్ధ స్వరూపంలో మీలోపల పెరగనీయాలి. అప్పుడు మీరు (పేమ అంటే ఏమిటో తెలుసుకోగలరు. అది మీ హృదయంలో జరిగేలా చూడండి. మీ మెదడులోకాదు. అది మీ హృదయంలో ఉండేలా చూడండి. అప్పుడు అది మీలో పెరిగి ఆ అనుభవం కలుగుతుంది.

ఒకప్పుడు ఏదైతే మీ మెదడులో అపజయం అయ్యిందో అది మీ హృదయంలో విజయం అవుతుంది. ప్రేమ అనేది హృదయం యొక్క విజయం. దాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. మెదడులో స్థిరంగా ఉండటం సులభం. అది కేవలం ప్రాపంచిక జ్ఞానం. అక్కడనుంచి హృదయం లోనికి రావటానికి ధైర్యం కావాలి. ఎందుకంటే హృదయంలో ఏవీ తెలిసిన విషయాలు ఉండవు. అన్నీ కొత్త విషయాలే ఉంటాయి. అక్కడ మీ గుర్తింపులు ఉండవు. అదంతా విశాలమైన బహిరంగ ప్రదేశం. అందుకే అందులోనికి ప్రవేశించటానికి చాలా ధైర్యం కావాలి. అందుకే చాలామంది ప్రేమ అనగానే భయపడతారు, అది మనకి పరిచయం లేని ప్రదేశం. అదే మెదడు (జ్ఞానం) అనేది మనకి బాగా పరిచయం ఉన్న ప్రదేశం.

అహంకారం బంధాన్ని విడదీస్తుంది – ప్రేమ బంధాలను కలుపుతుంది

విశ్వం ఒక మహాసాగరం అయితే మనం ఆ సాగరంలో భాగాలమే కాని విడిగా ఉండే నీటి బిందువులంకాదు. ఎప్పుడైతే 'నేను' విడిగా ఉండే వ్యక్తిగతమైన బిందువుని అని అనుకుంటామో అప్పుడు మనం మన హద్దులతో వేరుపడిపోతాం. మన భావాలతో వేరు అవుతాం. దీన్నే అహం అంటారు. మనం 'నేను' 'నాది' అనే వాటితో ముందుకి నడపబడతాం. ఎంతకాలం అయితే నేను వేరు అని అనుకుంటామో అంతకాలం మనం ఆ సాగర ప్రేమని అనుభవించలేం. కారణంలేని, పొంగి ప్రవహించే ఆ ప్రేమని అనుభవించలేం.

మనం సముద్రంలో ఒక నీటి బొట్టుగా ఉన్నంతకాలం జీవితానికి 'లేదు' 'కాదు' అని చెబుతాం. మనం ప్రేమించలేం, నమ్మలేం. మనం శాశ్వతానంద స్థితిని పొందలేం. ఎందుకంటే, 'ప్రేమ', 'నమ్మకం' ఉన్నవారు మాత్రమే నిత్యానంద స్థితిని అనుభవించగలరు. ఎవరైతే 'సాగరంలో నేను' ఒక భాగమే అనుకుంటారో వారిలోనే ఆనంద స్థితి కలుగుతుంది. నిత్యానందస్థితి కేవలం హృదయం అవును అని చెప్పినప్పుడే సాధ్యమవుతుంది. 'లేదు', 'కాదు' అనేది పూర్తిగా మన నుంచి మాయమైనపుడే ఇది సాధ్యం. 'లేదు', 'కాదు' అనేది చీకటి. 'అవును' అనేది వెలుగు, 'కాదు' అనేది అహంకారం. 'అవును' అనేది నిరహంకారం.

'కాదు' అనేది అచేతన స్థితిలో ఉండే వ్యక్తి గత పద్ధతి. 'అవును', 'సరే' అనేది అంతిమ సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తియొక్క మార్గం. మన జీవితంలో ఉండే అన్ని సమస్యలకి, అన్ని విభేదాలకి కారణం కాదు అని చెప్పటమే. కాదు అంటే పోరాటం, విశ్వశక్తితో యుద్ధం. అవును అనేది సంపూర్ణత్వంతో అంటే మహాసాగరానికి అనుగుణంగా ఉండటమే. అదే నిత్యానంద స్తితి.

పరమానంద స్థితిలో ఉండాలంటే ఆ సాగరంలో కరిగిపోవాలి. అంతే కాని నీటి బొట్టులా ఉండకూడదు. అందులో ఐక్యమైపోవాలి. నీటి బొట్టుని అనుకుంటే అది అహం. మనలో ఉండే అన్ని వ్యథలకి కారణం అహం. మనలో అహం పోగానే సాగరం అనే విశ్వశక్తి నలుమూలల నుంచి మనని చేరుతుంది. అది ఎలా ఉంటుందంటే అహం మాయమవటానికే చూస్తున్నట్టుగా ఉంటుంది.

అహం ముడుచుకుపోయిన చేతన స్థితి. కిటికీలు, తలుపులు అన్నీ మూసుకుపోయి ఉంటాయి. అప్పుడు జీవితం ప్రత్యేకంగా వేరు చేయబడి, పొరలతో కప్పబడిపోయి ఉంటుంది. అహం మూత వేయబడిన కోశం లాంటిది. అందులోనికి ఏదీ వెళ్ళలేదు. భయంతో మూతవేసుకొని ఉంటుంది. దాని లోనికి అది ముడుచుకు పోతుంది. ఈ విధంగా చేస్తూ మనకి మనం సమస్యలని, వ్యథని సృష్టించుకుంటాం.

ప్రేమ విశ్వశక్తితో ప్రవహిస్తూ, సంపూర్ణంగా విశ్వశక్తితో ఉంటుంది. అహం గడ్డకట్టిన ఐసుగడ్డ లాంటిది. ప్రేమ నీరులా చైతన్య వంతమైనది. మనం ద్రవంలా ఉన్నప్పుడే సాగరంలో ఒక భాగం కాగలం. అప్పుడు మనకి వ్యక్తిగతమైన లక్ష్యాలు, గమ్యాలు ఉండవు. ప్రతిక్షణం పరమానందమే, అంతులేని పారవశ్యమే. విశ్వ ప్రణాళికతో ముందుకి సాగటమే.

మనస్సు అహంలో భాగం. దానికి ఏ విధంగా మూసిఉండాలో తెలుసు కాని ఎలా విప్పారాలో తెలియదు. ప్రేమించటం అంటే విప్పారి ఉండటం, ఆధీనమవటం. అంటే విశ్వస్థితికి విప్పారి ఉండటం, పూలకి, తేనెటీగలకి నక్షతాలకి అన్నింటికీ విప్పారి ఉండటం. సరస్వతిలో ఉన్న అందమయిన సంగీతానికి మనం ఏవిధంగా విప్పారి ఉండగలం? చుట్టూ నిరంతరం జరుగుతుండే ఉత్సవాలకి మనం ఏవిధంగా విప్పారి ఉండగలం? మలయవీచికలకి నాట్యం చేసే సుమాలు, మలయమారుతాలతో ఆనందం పొందే వృక్షాలు, నక్షత్రాలు ఇవన్నీ ఏ విధంగా ఆనంద స్థితిలో ఉండగలుగుతున్నాయి. మనిషి తప్ప అంతా సృష్టికి అనుగుణంగా సాగి పోతున్నాయి.

ఒక విషయం అర్థంచేసుకోండి; మనిషి సృష్టి లయల నుంచి ఎందుకు బయటకి వచ్చాడు అంటే అతనిలో చేతన స్తితి ఉన్నది. అది మిగిలిన జీవరాసులలో లేదు.

చేతన స్థితి రెండు పనులు చేస్తుంది. అది అహాన్ని సృష్టిస్తుంది లేదా నిరహంకారాన్ని సృష్టిస్తుంది. అది అహాన్ని కలిగించి మనం నరకంలో ఉంటాం. అది నిరహంకారాన్ని సృష్టిస్తే, మనం స్వర్గంలో ఉంటాం. ఈ ప్రపంచమంతా స్వర్గం. ఆ స్వర్గంలోనికి ప్రవేశించాక దాన్ని పూర్తిగా తెలుసుకుంటాం. అదే మనిషిలోని వైభవం, అందం. అదే ప్రమాదం కూడా ఎందుకంటే అహం వలలో పడటం చాలా సులభం.

సమస్య ఏమిటి అంటే మనం ఎవరం, ఎందుకు సృష్టించబడామనేది మర్చిపోయాం. మనం ప్రేమ చక్రవర్తులం, కానీ బిక్షగాళ్ళలా ఉన్నాం. మన అంతరంగంలో సర్వసృష్టి యొక్క సామ్రాజ్యం ఉంది. కానీ మనం ప్రాపంచిక విషయాలని బిక్ష అడుగుతున్నాం. మన అంతరంగంలో ఉన్న అంతులేని ఐశ్వర్యాన్ని మర్చిపోయి చిన్న చిన్న వాటిని పోగుచేసుకుంటున్నాం. మనం ఒక మహాసాగరం అయి ఉండి దాహంతో ఉన్నాం. ఎందుకంటే మన నుంచి మనం వేరు అయిపోయాం. కాని ఎంతగా మనసుంచి దూరం అయినా, అది ఎంతకాలంగా దూరం అయినా, మనం ఎంతగా మర్చిపోయినా, మనం దాన్ని ఒక్కక్షణంలో గుర్తుచేసుకోగలం, వెంటనే బంధాన్ని ఏర్పరచుకోగలం. ఆ బంధాన్ని ఏర్పరచేదే ప్రేమ.

ఆనందం ప్రేమనుంచే ఉదయిస్తుంది. ప్రేమ అనే కవిత మిమ్మల్ని తిరిగి సృష్టికి అనుసంధానం చేస్తుంది. ప్రేమ అనే ఖడ్గం అహాన్ని తుంచి మనం సాగరంలో ఐక్యమైపోయేలా చేస్తుంది. ఎప్పుడైతే మీ హృదయం ప్రేమతో నింపబడుతుందో మీరు వచనం నుంచి కవితాగానానికి, శబ్దాలనుంచి సంగీతానికి, అసమ్మతి నుంచి ఐక్యతలోనికి మార్పు చెందుతారు.

అపుడు కేవలం ఆవిధంగా ఉండటమే ఆనందం. కేవలం అలా ఉంటే చాలు. అయితే అంతరాత్మపొందే ఆనందపు అనుభూతిని తెలుసుకోవటానికి మనలో సున్నితత్వం ఉండాలి. ఆ అనుభూతి ఉండాలి. అదే ప్రేమ అంటే. అలా ఉండే ఆనందాన్ని అనుభవించటమే ప్రేమ. ఆ విధంగా ఉన్నప్పుడు జీవితం అంటే ఎదో కొన్ని స్వతంత్రమైన ఆలోచనలు కాదు, అది నిరంతరం ఉండే ఒక అనుభూతి అని తెలుస్తుంది. అప్పుడు అహం కరగటం మొదలుపెడుతుంది. ఒకసారి మనం ఆలోచనలసుంచి అనుభూతికి మారగలిగితే, అక్కడినుంచి అంతరాత్మని చేరటానికి మరొక మెట్టుమాత్రమే ఉంటుంది. అది చాలా సులభం.

ఇందులో మొదటి దశ కష్టం. అది ఆలోచనల నుంచి అనుభవం వైపు వెళ్ళటం. అహం ఆలోచనలు ఎక్కువగా ఉండే విధంగా శిక్షణ ఇస్తుంది. ఈ దశ దాటాక రెండవది ఆటోమేటిక్‌గా వస్తుంది. అది జరగటానికి మనం ఏమీ చేయనవసరం లేదు. అనుభవం నుంచి అంతరాత్మలోనికి దూరం ఉండదు. అది ఎప్పుడైనా జరగవచ్చు. కవి ఏ నిమిషంలోనైనా యోగిగా మారవచ్చు యోగి అక్కడే ఉన్నాడు. అసలు సమస్య ఈ ఆలోచనలనుంచి ఎలా బయటకి వెళ్ళాలి, ఏ విధంగా అనుభవంలోనికి వెళ్ళాలి అని మాత్రమే.

మీ హృదయ స్పందనని అనుసరించండి. మరింతగా ప్రేమించండి. అదిచాలు. ఎక్కువ అనుభూతిని పొంది మరింత ఆనందంగా ఉండి హృదయానికి శక్తినివ్వండి. సూర్యోదయం, సూర్యాస్తమయం, మబ్బులు, ఇంద్రధనుస్సు, పక్షులు, మనుషులు ఇలా అన్నింటినీ గమనించండి. మనుషులని, వారి కళ్ళలోనికి చూడండి. సృష్టి ఎన్నో కోణాలలో ఉంటుంది. ఒక కవిలా అన్ని కోణాలలో చూడండి. దాన్ని అభినందించండి. ఆ అనుభూతి పొందండి. పారవశ్వంలో ఉండండి. మీ చేతన స్థితిని మరింత విస్తృతం చేయండి. సృష్టిలో ప్రతి దాన్ని ప్రేమతో చూస్తూ, ఆ అనుభూతిని పొందండి. క్రమంగా అహం తన పట్టుని పోగొట్టుకొని మాయం అయిపోతుంది.

ప్రేమకి ఉండే ఒకే ఒక అడ్డంకి భయం. ఏదైనా జరగటం ప్రారంభంకాగానే మీరు భయపడతారు. ఎందుకంటే ప్రేమతో మనం కరిగిపోతాం. అది మన అహంకారానికి సవాలు. అహం అంటే తాను ప్రత్యేకం అని అనుకోవటం. అందుకే మనం వేరు అనుకుంటాం. ప్రేమ అంటే ఐక్యమైపోవటం. అహం మాయమవుతుందేమో అనేది మన భయం. అహం పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటే, అది మనని వదిలి వెళ్ళిపోతుంది. అప్పటినుంచి అభివృద్ధి సులభం. అది అప్రయత్నంగా, మాములుగా జరుగుతుంది. అప్పుడు మనం ఉంటాం, కేవలం అక్కడ ఉండేది ప్రేమ మాత్రమే.

ప్రతీ క్షణం ప్రేమ స్వరూపంగా ఉండండి

జీవితంలో ప్రతి సంఘటన్ని ప్రేమతో ఎదుర్కొండి, త్వరలోనే మీరు స్వచ్ఛమైన ప్రేమమయులుగా మారతారు. అది ఒక వ్యక్తికాని, మీ పనివాడు కాని, తోటివారుకాని, దేవుడు కాని ఏదైనా సరే లోతైన ప్రేమతో వారిని చూడండి. మీరు నాట్య కళాకారిణి అయితే, నాట్యంలో సంపూర్ణమైన ప్రేమతో ఉండండి. మీరు కంప్యూటర్ మీద పనిచేస్తుంటే, దాన్ని పూర్తి ప్రేమతో చూస్తూ అందులో మునిగిపోండి. నిజాయితీగా పూర్తిగా ప్రతిక్షణం ప్రేమలో ఉండండి.

మీరు బొమ్మని చిత్రిస్తూ, అదే సమయంలో దాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, ఎంతకి అమ్మాలి అని ఆలోచిస్తున్నారనుకోండి అప్పుడు మిమ్మలని మీరు ప్రేమలో మునిగిపోయేలా చేయలేరు. మీరు ఏదో ఒక విషయంలో మాత్రమే ప్రేమతో ఉండగలరు. ఉదాహరణకి డబ్బు విషయం ఆలోచించటం. మీరు నాట్యం చేస్తూ, నాట్యం పూర్తిఅయ్యాక ఎంత డబ్బు వస్తుంది అని లెక్కలు కడుతున్నారనుకోండి, అప్పుడు మీరు నాట్యం పట్ల ప్రేమతో మిమ్మల్ని మీరు మరచిపోలేరు. అలా చేయటం వల్ల మీరు మరింత బంధాలలో చిక్కుకుంటారు. మీ జీవితంలో గురుదేవులు తారసపడ్డా మీరు ఇదే విధంగా చేస్తారు. నేను ఎప్పుడూ చెబుతుంటాను, 'నేను నా చేతి వేలితో చంద్రుణ్ణి చూపిస్తాను. మీరు చంద్రుణ్ణి చూస్తే నేను పొందిన అనుభవమే పొందవచ్చు. కాని మీరు నా వేలుని పట్టుకు వేలాడితే ఆ అనుభవమూ రాదు, మీరు విరామంగా ఉండలేరు'.

చేసినా చాలా ఏకాగ్రతతో చేయగలరు. ఎందుకంటే మీరు లోతైన ప్రేమలో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మీ జీవితమే ఒక లోతైన ధ్యానంతో కూడిన ప్రేమగా మారుతుంది.

అపుడు మీరు అనుభూతిని పొందుతూ, మీ పరిసరాలలో ప్రతి దాన్ని మీలాంటి జీవిగా గుర్తించి గౌరవ బంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. మీరు ఎదుటివారి ఆలోచనలని అనుభవంతో తెలుసుకోగలరు. ఎదుటివారు మీకు ఏమీ చెప్పకుండానే మీరు వారితో బంధాన్ని ఏర్పరచుకోగలరు, సరియైన పద్ధతిలో స్పందించగలరు. మీరు విశ్వశక్తి సమక్షాన్ని నిరంతరం అనుభవించగలరు. అప్పుడు మీలో అత్యంత మేధస్సు ఉంటుంది. మీరు దేనితో ఏ విధమైన బంధాన్ని ఏర్పరచుకోవచ్చునో కచ్చితంగా తెలుస్తుంది.అదే ప్రేమ యొక్క శక్తి.

నిజమైన ప్రేమ మిమ్మల్ని ఈ క్షణంలో ఉంచగలుగుతుంది. అది మీలో అంతులేని తెలుసుకోగల తత్వాన్ని పెంచుతుంది. అందుకే దానికి అంతశక్తి. ఏదీ కూడ వర్తమానంలో ఉన్నంత తీవంగా ఉండదు. ప్రేమ అంటే జీవితాన్ని క్షణ క్షణం సంపూర్ణంగా జీవించేలా చేసే శక్తి. అది ఏ వ్యక్తి పట్ల లేదా వస్తువు పట్ల ప్రేమ కాదు. అది ప్రేమ కోసం ప్రేమించటమే. మీరు ఒక్క సారి ఒక్కక్షణం సంపూర్ణంగా జీవించేలా చేసే శక్తి ప్రేమ. ఆ ప్రేమ అనుభవాన్ని మీ అంతరంగం లోపల పెంచిపోషించవచ్చు. అది మీ అంతరంగం అంతా నిండే విధంగా, మీ జీవితాన్ని నింపే విధంగా పెంచవచ్చు. ఆ ప్రేమ రవ్వ చాలు ఇదంతా జరగటానికి.

అప్పుడు మీరు ఒక అద్భుతమైన సృజనాత్మక శక్తిగా మారుతారు. ప్రేమ అంటేనే సృజనాత్మక శక్తి, అందుకే కవి అందమయిన కవితని సృష్టించగలడు. వారు ప్రేమలో తమని తాము మర్సిపోతారు. వారు ఆనంద సృజనాత్మకులు అవుతారు.

జలాలుద్దీన్ రుమి అనే సూఫీ యోగి ఈ విధంగా చెబుతాడు, 'మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నిరంతరం ప్రేమికునిలా ఉండండి' సృష్టి సర్వం తనమీద తాను లోతయిన, అందమయిన ప్రేమలో ఉంటుంది. మీరు అందులో భాగమే. కాబట్టి ప్రేమికునిగా ఉండటం అనేది మీ సహజ లక్షణం. ఆవిధంగా ఉంటూ మాత్రమే మీరు నిజమైన పరిపూర్ణతని సాధించగలరు.

ముందుగా మిమ్మలని మీరు ప్రేమించండి

ఈ రోజులలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే వారినివారు ప్రేమించలేకపోవటం. సమాజం మననిమనం ప్రేమించగలం అని నేర్పించదు. ఒక విషయం అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనప్పుడు ఎదుటి వారిని ప్రేమించలేరు. మీ ప్రేమలో మిమ్మల్ని మీరు మరచిపోతే, ఎదుటివారి ప్రేమలో కూడా మిమ్మల్ని మీరు కోల్పోగలుగుతారు. మనకి ఏమని నేర్పిస్తారంటే ఏదో కారణం ఉంటేనే మనని మనం ప్రేమించగలుగుతాం. మనం ఏదైన సాధిస్తే మనని మనం ప్రేమించగలం. అపజయం పొందితే మనని మనం ద్వేషిస్తాం. అదే ధోరణిని ఎదుటివారి విషయంలో కూడ ఉపయోగిస్తాం. ఏదో ఒక కారణం ఉంటేనే ఎదుటివారిని ప్రేమిస్తాం. లేకపోతే లేదు.

మిమ్మల్ని మీరు ప్రేమించ లేకపోతే, మీరు మీ జీవితం పట్ల వ్యతిరేకతను కలిగి వుంటారు. మీ తల్లి గర్భంలో ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ప్రేమతో, పరమానంద స్థితిలో ఉన్నారు. మీరు ఒంటరిగా వున్నప్పుడు తల్లి గర్భంలో మీలోని ప్రేమని అనుభవించారు. అందుకే మీలో ఎప్పుడైనా అభద్రతా భావం ఏర్పడితే మీరు గర్భంలోని శిశువులా పడుకుంటారు. పరమానందకరమైన ఒంటరితనం మీ సహజ లక్షణం. ఒక్కసారి ఈ ప్రపంచంలోనికి వచ్చాక, సమాజం మీకు నిరంతరం తోటి మనుషులు అవసరం అని, మీరు ఆనందంగా ఉండాలి అంటే టి.వి. అవసరం అని నేర్పిస్తుంది. మీ సహజ లక్షణం ఆనందకరమైన ఏకాంతం. మీరు తిరిగి ఆ స్థితికి వెళ్ళగలిగితే మీరు స్థిరంగా ఉండగలరు. అప్పుడు ప్రశాంతంగా ఉంటూ మీలో మీరు విరామంగా ఉండగలరు.

ప్రతిరోజు కొన్ని నిమిషాలు కేవలం మీతో మీరు కూర్చోండి. అలా కూర్చొని మీ పట్ల పొంగి పొరలే ప్రేమని అనుభవించండి. మీరు ఎంత అద్భుతమైన వ్యక్తో, ఆ అనుభూతిని పొందండి. మిమ్మల్ని మీరు ఎంత యదాలాపంగా తీసుకున్నారో తెలుసుకోండి. మీరు విశ్వశక్తిలో ఒక భాగం అనే అనుభూతిని పొందండి. ఆ విశ్వశక్తి కోసం మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీలోని ప్రేమలో కరిగిపోంది. మీరు ఈ విధంగా ప్రతిరోజు సాధన చేస్తే, మీరు ఎక్కడయితే గట్టిపడిపోయారో అక్కడ సున్నితంగా అవుతారు.

ఎప్పుడెతే మీరు మీలోపల శాంతి, ప్రేమలతో లోతుగా స్థిరపడతారో అప్పుడు నిత్యానందం పెల్లుబికి వస్తుంది. ఎప్పుడైతే మీ నరాలు శుభ్రపడతాయో, మీ నాడీ మండలం శుభ్రపడుతుందో అప్పుడు పరమానందం ఉబికి వస్తుంది. గురుదేవుల శరీరం వెదజల్లే ఆ పరమానందాన్ని మీరు కూడా వెల్లడి చేస్తారు.

అప్పుడు ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తే మీరు నేను దానికి అర్హుడను కాదు అనే అపరాధ భావంతో ఉండకుండా, మిమ్మల్ని మీరు ఎలా ప్రేమిస్తారో వాళ్ళు కూడా మిమ్మల్ని అదే విధంగా ప్రేమిస్తున్నారని వారి ప్రేమని స్వీకరిస్తారు. సాధారణంగా ఎవరైనా ప్రేమిస్తే నేను అర్హుడను కాదు అని అపరాధభావంతో ఉంటారు. ఒకసారి మీ అంతరంగంలో లోతైన ప్రేమ స్థిరపడితే మీరు ఎదుటివారి ప్రేమని స్వీకరించి ఆనందపడతారు.

విశ్వ శక్తిని ప్రేమించండి, అది మిమ్మల్ని ప్రేమిస్తున్న భావం పొందండి

విశ్వశక్తి, సర్వాంతర్యామి ఒక వస్తువు కాదు. అది జీవశక్తి. ప్రతి చెట్టు, చెట్టుకాదు మీ ప్రేమకి, ద్వేషానికి స్పందిస్తుంది.

క్షేవ్ బాక్‌స్టర్ పాలీగ్రాఫ్ నిపుణులు. ఆయన మనుషుల ఆలోచనకి, భావావేశాలకి మొక్కలు ఏ విధంగా స్పందిస్తాయో చాలా ప్రయోగాలు చేసారు. ఆయన పరిశోధనలలో మనుషుల ఆలోచనలకి తోటి మనుషులు ఏ విధంగా స్పందిస్తారో, మొక్కలు కూడా అదే విధంగా స్పందిస్తాయి అని కనుగొన్నాడు. ఆకులని తగులపెట్టాలి అనే చిన్న ఆలోచన, మొక్కలు ఏ విధంగా ఒణికిపోయేలా చేసిందో పాలిగాఫ్ మీద అడ్డదిద్దంగా వచ్చిన గ్రాఫ్ ద్వారా తెలుసుకోవచ్చు. దీన్నే ఆయన ప్రాథమిక గ్రహింపు శక్తి అన్నాడు. ఇదే చెట్టు, జంతువులు, మనుషుల కణాలలో ఏ ఆలోచననైనా తెలుసుకొని స్పందించే శక్తి.

అటువంటి ఒక సందర్భంలో ఆయన ఒక గ్రాఫ్ మీద ఒక అడ్డ గీతని రికార్డు చేసారు. ఆ స్థితిని ఆయన చెట్టు 'షాక్‌లో ఉన్నాయి' అని అన్నారు. ఆయన ఆ చెట్లు గలవారిని మీరు ఏమి చేసారు అని అడిగాడు. వాటికి ఎలా బాధ కలిగింది అన్నాడు. ఆమె వాటి ఆకుల బరువు చూడటానికి ఆకులని వేయించాను అని చెప్పింది.

మీరు సృష్టిని ప్రేమించటం మొదలు పెట్టగానే అది చాలా అందంగా స్పందించటం మీరు గమనించగలరు. అప్పుడు మీరు మీ చుట్టూ ఉండే మనుషులు, సందర్యాలు భావావేశాలు ఇలా వేటితోనైనా ఉండే భేదాలకి అతీతంగా వెళ్ళగలుగుతారు. ప్రతీదీ ఒక్కటిగా కలసిపోతుంది. అదే సత్యం. ప్రతీది ఈ సర్వస్వంలో ఒక భాగం. ప్రేమ మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకునేలా చేయగలదు.

భారతదేశంలో ఆధ్యాత్మిక సాధన చేసేవారు కాలినడకన దేశమంతా తిరుగుతూ దేవాలయాలు, పుణ్యప్రదేశాలు చూసారు. వారిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఇది ఎలా సాధ్యం, అడవుల గుండా ప్రయాణిస్తూ, క్రూర జంతువుల మధ్య ఉంటూ, అడవులలో నిద్రపోతూ, భిక్షాటన చేస్తూ ఏ విధంగా అలా చేయగలుగుతారు అనుకునే వాడిని. ఇందులో రహస్యం ఏమిటంటే వాళ్ళు సర్వప్రకృతితో చక్కని అనుబంధాన్ని పెంచుకుంటారు. దాంతో సంపూర్ణంగా కలిసిపోతారు. అప్పుడు ప్రకృతి వారిని నిరంతరం కాపాడుతూ ఉంటుంది. వర్షం వచ్చినా, ఎండవచ్చినా, చెట్టు జంతువులు అన్నీ వారి రక్షణ భారాన్ని తీసుకుంటాయి. దీన్ని తార్కికంగా అర్ధం చేసుకోవటం కష్టమైనా ఇది సత్యం.

మీరు సర్వసృష్టి పట్ల గౌరవం, ప్రేమతో ఉంటే, అందులోని ప్రతిది మీలో మీకు కనిపిస్తుంది. మీరు చూపించే ప్రేమకి ప్రకృతి అందంగా స్పందిస్తుంది.

ప్రేమ, గౌరవం వేరు

చాలాసార్లు ప్రేమని గౌరవం అనుకుంటారు. పిల్లల్ని చిన్నతనం నుంచి పెద్దవారిని గౌరవించాలని నేర్పిస్తారు కాని ప్రేమించాలని చెప్పరు. మీరు వింటుంటారు కదా! 'పెద్దవారిని గౌరవించండి' అని చెప్పటం కానీ 'పెద్దవారిని ప్రేమించండి' అని చెప్పటం మీరు వినరు. అదే సమస్య.

గౌరవం అనేది మీలోపల మీరు తక్కువ వారు అనే భావానికి విత్తనం వేస్తుంది. మీరు గౌరవం చూపించే వ్యక్తి వేరు, మీరు వేరు అని మీరు అనుకునేలా చేస్తుంది. అదే ప్రేమ మీలో ఆనందం, ఐక్యమవ్వటం అనే విత్తనాన్ని నాటుతుంది. ప్రేమ మీరు ప్రేమించే వ్యక్తితో చక్కని అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. అదే విధంగా సర్వస్థుష్టితో అనుబంధాన్ని ఏర్సరుస్తుంది. గౌరవంలో భయం ఉంటుంది. ప్రేమలో నిజమైన గౌరవం ఉంటుంది. దాంతో ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. గౌరవం ఒక విధమైన అంధత్వం. ప్రేమతో అర్థం చేసుకోగలం, దాంతో చాలా చక్కని మార్పు కలిగే అవకాశం ఉంటుంది. ప్రేమ మిమ్మల్ని సున్నితంగా చేసి మీరు కరిగిపోయేలా చేస్తుంది.

ఒక పండితుడు, ప్రొఫెసర్ అయిన నికోల్‌సన్, సూఫీ (ఇస్లాంలో ఒక తెగ) మీద ఒక పద్యం రాసాడు.

ప్రేమ, ప్రేమ మాత్రమే చనిపోయింది అనుకున్నదాన్ని చంపగలదు.

ఆలోచన అనే గడ్డకట్టిన పాము, ప్రేమ మాత్రమే.

కన్నీళ్ళ ప్రార్ధన, తీవమైన కోరిక

పాఠశాల‌లు ఇవ్వలేని జ్ఞానం ఇచ్చేది, ప్రేమ.

ఎంత రాతి గుండెనా ప్రేమకి కరిగిపోతుంది. మీలోని కాఠిన్యాన్ని కేవలం ప్రేమ మాత్రమే కరిగించగలదు. ప్రేమ మాత్రమే మిమ్మల్ని వాహినిగా చేయగలదు.

గౌరవం మీకు, ఎదుటివారికి మధ్య దూరాన్ని పెంచుతుంది. ప్రేమ మీకు ఎదుటివారికి మధ్య వారధిని నిర్మిస్తుంది. కేవలం ప్రేమ అనుభవం తెలియదు కాబట్టి, ప్రవర్తనా నియమావళిగా గౌరవాన్ని చూపిస్తారు. గౌరవించటం సులభం. కాని నిజంకాదు. ప్రేమించటం కష్టం. ఎందుకంటే అది ఎలాగో చాలామందికి తెలియదు. కాని అది సత్యం. ప్రేమతో వచ్చే గౌరవం నిజమైనది. గౌరవం ఉన్న దగ్గర ప్రేమని బలవంతంగా తీసుకురావాలి. అది నిజం కాదు.

అన్ని మతాలకి మూలం ప్రేమ

ప్రేమ అసలయిన మతం. అన్ని ఆధ్యాత్మిక మార్గాలకి ప్రేమ మూలం. మతాలన్నీ దానిలోంచి పుట్టినవే. ప్రేమ వృక్షం యొక్క వేరు అయితే, మతాలు ఆ వృక్షం యొక్క కొమ్మలు, ఆకులు. పెద్ద పెద్ద మతాలు కూడా ఆ చెట్టుకి ఉండే పెద్ద కొమ్మలు మాత్రమే.

ప్రేమకు దేవాలయం లేదు, గ్రంథాలు లేవు. చెట్టు వేరులా అది భూమిలో నిక్షిప్తమె ఉంటుంది. కాని అదే జీవితానికి పోషణని ఇచ్చేది. అదే లేకపోతే, మహావృక్షమైనా మరణిస్తుంది. ప్రేమతో చాలా కొమ్మలు, ఆకులు సృష్టించబడ్డాయి. కానీ మనమేం చేస్తున్నాం? మనం కొమ్మల్ని,

ఆకుల్ని పట్టుకు వేలాడుతున్నాం. కానీ మనం వేర్లని పట్టుకుని వేలాడాలి. మనం వేర్లని పట్టుకుంటే జీవిత పోషణ తిన్నగా మనకి దొరుకుతుంది. మనం కొమ్మల్ని పట్టుకొని ఉంటే పోషణ యొక్క కోణాలని చూసి సంతోషపడాలి. మీరు మరింత ప్రేమమయులయితే, మీకు కనిపించని ప్రేమమాయలోనికి వెళ్ళగలరు.

చెట్ల వేర్లకి ప్రపంచంలోని అన్ని వ్యక్తుల సమాచారం తెలుసు. ఎలా అంటే ఒక్క నీటి బిందువులో మహాసాగరాలకి సంబంధించిన సమాచారం మొత్తం ఉంటుంది. మంచు బిందువు వ్యవస్థని మనం అర్ధం చేసుకోగలిగితే, ఈ భూమిమీద ఉన్న సముద్రాలని మనం అర్ధం చేసుకోగలం. నీరు అనే ఒక మూలకాన్ని అర్థం చేసుకోగలం. నీరు ఎక్కడ ఉన్నా అందులోని రసాయన పదార్గాలు ఒక్కటే. ఆ రసాయన పదార్థాల మిశ్రమం చిన్న నీటి బిందువులో అమరి ఉంటాయి.

అదే విధంగా మనిషి ప్రేమ యొక్క అణువు. ప్రేమ విశ్వశక్తి యొక్క లక్షణం. ప్రేమ గురించి తెలిస్తే సర్వ విశ్వశక్తి గురించి అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఒక విషయం అర్థం చేసుకోండి. మనిషి భౌతిక, రసాయన, మానసిక మిశ్రమం కాదు. అది ఆధ్యాత్మిక మిశ్రమం. కాబట్టి ఆధ్యాత్మికతని ఎవరూ మనకి అది ఏమిటో బోధించనవసరం లేదు. మనంతట మనం ఆ అనుభవాన్ని పొందాలి. అన్ని రకాల జ్ఞానం అది భౌతిక, రసాయన, శాస్త్రీయ, మానసికమైన జ్ఞానం ఏదైనా దాన్ని మరొకరికి బదిలీ చేయవచ్చు. అటువంటి జ్ఞానాన్ని సులభంగా బదిలీ చేయవచ్చు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలా చేయలేం. దాన్ని బోధించలేం. కానీ దాన్ని అనుభవంతో తెలుసుకోవచ్చు.

ఒక చిన్న కథ : ఒక గురువు గారు ఆయన శిష్యులను 'ఎప్పుడు మీరు రాత్రి ముగిసినట్టు, పగలు ప్రారంభమైనట్లు చెప్పగల'రని అడుగుతాడు.

వారిలో ఒక శిష్యుడు, 'మనం దూరం నుంచి చూసి ఆ జంతువు ఏమిటి? అది ఆవు లేక గుర్రమా అని చెప్పగలిగినప్పుడు', అని జవాబు ఇస్తాడు. గురువుగారు అది సరికాదు అంటారు.

మరొక శిష్యుడు, 'గురుదేవా! దూరం నుంచి చూసి ఒక చెట్టు ఏ చెట్లో చెప్పగలిగినప్పుడు' అని జవాబు ఇస్తాడు. గురువుగారు అదీ జవాబు కాదు అంటాడు

అప్పుడు శిష్యులు ఆయన్ని 'గురుదేవా! మీరే చెప్పండి' అని అడుగుతారు. ఆ గురువుగారు ఈ విధంగా జవాబు చెబుతాడు, 'మీరు ఏవ్యక్తి ముఖమైనా చూసి ఆ ముఖంలో మీ సోదరుడిని గుర్తించగలిగినప్పుడు, ఏ స్త్రీ ముఖమైనా చూసి ఆ ముఖంలో మీ సోదరిని గుర్తించగలిగినప్పుడు. మీరు ఆ విధంగా చేయలేనప్పుడు అది పగటి పూట అయినా సరే, రాత్రితో సమానం'.

గురుదేవులు ఏవో కొన్ని సూచనలు ఇస్తారు. వాటి ఆధారంగా మనం మన మార్గాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రేమ ఒక సూచన. మనం ప్రేమని అనుసరిస్తే క్రమంగా, భగవంతుడు సత్యమవుతాడు. ఆయన ఒక భావనగా మాత్రమే అనిపించడు. ఒక ఆలోచన మాత్రమే అనిపించడు. మనం అనుభూతితో తెలుసుకోగలిగే విధంగా ఉంటాడు భగవంతుడు. మనం ప్రేమలో లోతుగా వెళ్ళేకొద్దీ ఆ అనుభూతికి మరింత దగ్గరవుతాం. మనం ఏ రోజైతే ప్రేమలో కరిగిపోతామో అప్పుడు ఆయనలో ఒకటిగా అయిపోతాం.

అన్ని మతాల రహస్యం ప్రేమ. ఆ విధంగా ఉన్నా కూడా అందరూ తర్మంలో, వేదాంత శాస్త్రాలలో తమని తాము మర్చిపోయేలా నిమగ్నమవుతారు. వేదాంతం మతానికి చాలా దూరం. భగవంతుని గురించి తర్మం ఉండదు. కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. భగవంతుడు అంటే కవితాగానం. అంతేకాని హేతువాదం కాదు.

తార్కికంగా భగవంతుడిని ఒక భావనలా చూడవచ్చు. ఆయన మన అంతరంగంలో ఒక అనుభవం. అది లోతైన అంతరంగం. అక్కడికి ఒంటరిగా వెళ్ళి దాన్ని కనుగొనాలి. మనం లెక్కించలేని ప్రాచీన కాలం నుంచి, యోగులంతా చెప్పే విషయం ఒక్కటే, పదార్ధం ప్రేమతో కప్పబడింది. కంటికి కనిపించని శక్తి అణువులని, పరమాణువులని కలిపి ఉంచింది. కనపడని ఆశక్తి వల్ల అవి ఒకదానికొకటి దూరం కావు. శాస్త్రం ఈ అంతిమ శక్తిని కనుగొనవలసి ఉన్నది. ఆ శక్తి యొక్క కొన్ని రూపాలని, భూమ్యాకర్షణ శక్తి, విద్యుత్ శక్తి ఇలా కొన్నింటిని తెలుసుకోగలిగారు. ఇవన్నీ చాలా తక్కువ స్థాయితో కనుగొన్న విషయాలు. ఏ రోజైతే శాస్త్రం ప్రేమని కనుగొనగలుగుతుందో ఆ రోజు మతం శాస్త్రం ఒక దానిలో మరొకటి కలిసిపోతాయి.

ప్రస్తుతం, ప్రేమ సాధ్యమే అని సంతోషపడండి. ప్రేమ మీ అంతరంగపు శక్తి అని ఆనందపడండి. ప్రేమతో అంతిమ స్థితి, అత్యున్నత స్థితికి మీరు చేరగలుగుతారు. ప్రేమతో అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే ప్రేమ రూపాంతరం చెందితే అదే భగవంతుడు.

మూడు రకాల ప్రేమ, వాటి అనుసంధానం

చాలా మంది కోరికని ప్రేమ అనుకుంటారు. ఇది ఒక పెద్ద విషాదం. ఎవరైతే కోరికని ప్రేమ అనుకుంటారో వారు భౌతిక దశలోనే ఉండిపోతారు. అంతకు మించి ఉన్నత దశకి ఎదగలేరు. అతను అట్టడుగు భాగాన ఉండిపోతాడు. సెక్స్ అనేది అడుగుభాగం. అక్కడ మీరు నివసించలేరు. దాన్ని మరొక పనికి ఉపయోగించుతాం. అది మీ ఇల్లుకాదు. మీ ఇల్లు బేస్‌మెంట్ పైన ఉంటుంది.

మనిషి మూడు దశలలో జీవిస్తాడు. జంతు దశ, మానవ దశ, దైవ దశ. మొదటిది కోరిక దశ, అదే జంతుదశ, అది ప్రేమ యొక్క ముడి రూపం. అందులో ప్రేమ ఉండదు. ప్రేమని ఆశ, కోరిక మొదలైన వాటితో కల్తీ చేసేసారు. అంతే. మన అంతరంగం పరిణితి పొందే కొద్ది మనం రెండవది అయిన సాధారణ మానవ ప్రేమ దశకి వెళతాం. ఇందులో ఆశించటం, అసూయ ఉంటాయి. ఇది జంతుప్రేమకంటే ఉన్నతమైంది. అందుకే ఎదుటి వ్యక్తిని, వారి స్వార్థం కోసం ఉపయోగించరు.

మూడవ ప్రేమ దైవ ప్రేమ. అది అత్యున్నత స్థాయిలో ఉండే ప్రేమ. అది ప్రార్థన లాంటిది. ఇందులో ఆశించటం ఉండదు. అందులో ప్రాపంచిక విషయాలు ఉండవు. అది కనపడని బలమైన శక్తి. ప్రేమ ప్రార్థన అయినప్పుడు మనం మొదటిసారి విరామంగా సంపూర్ణ తృప్తితో ఉండగలం. ఎందుకు విరామంగా అని అంటున్నానంటే మిగతా రెండు రకాల ప్రేమలు ఇంకా సాధించాలని చూస్తారు. దీంతో ఎంతో కొంత పోగొట్టుకుంటారు. అప్పుడు వారిలో విరామం ఉండదు. మూడవ రకమైన దైవ ప్రేమ జరిగితే, సెక్స్ కూడా లోతైన భౌతిక సంతోషానికి అతీతంగా ఒకలోతైన, పవిత్రమైన చర్య అవుతుంది.

భారతదేశంలో మూడు నదుల సంగమాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. ఇది మనిషిలోని మూడు భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల కలయిక. ఈ మూడు నిజంగా కలిస్తే, అక్కడ గొప్ప సంతోషం, పరమానందాలు ఉంటాయి.

సాధారణంగా మనం వేరు వేరు భాగాలుగా జీవిస్తూ ఉంటాం. మన శరీరం ఒక భాగంలో ఉంటుంది. మన మనస్సు మరొకదానిలో, మన ఆత్మ మరొక చోట ఉంటాయి. శరీరానికి మనస్సు తెలియదు. శరీరం ఆత్మని మరచిపోయింది. ఈ మూడు కలిసి ఉంటాయి, కాని ఒకదానికొకటి తెలుసుకోలేవు.

ధ్యానం యొక్క మొదటి దశ ఈ మూడింటిని దగ్గరకి తీసుకురాగలగటం, ఒకదానికొకదాన్ని పరిచయం చేయటం, వాటిని లోతైన స్నేహబంధంతో కలపటం ద్వారా అవన్నీ ఒకటిగా ఐక్యమయ్యే విషయం సుసాధ్యం చేయటం. ఈ మూడు కోణాలు ఒకటిగా కలిసిపోయినప్పుడు, నాలుగవ కోణం ఆవిర్భవిస్తుంది. ఆ నాల్గవదే భగవంతుడు లేదా విశ్వశక్తి లేదా దైవత్వం లేదా మీరు మరొక పేరుతో పిలుచుకోవచ్చు.

ఆధ్యాత్మికత్వం యొక్క ముఖ్యమైన పని ఒక చక్కని రసాయన చర్య ద్వారా శరీరం మనస్సులో కరిగే విధంగా, మనసు శరీరంలో కరిగేలా చేయటమే. క్రమంగా నెమ్మది నెమ్మదిగా అవన్నీ కలిపి ఒకటిగా అవుతాయి. అప్పుడు అందులోంచి ఉదయించేదే ప్రేమ.

కారణం లేని ప్రేమలోనికి ప్రవేశించండి

చాలా మంది చెబుతుంటారు, వారికి నాపట్ల ప్రేమ పొంగి ప్రవహిస్తుందని. నేను వారితో ఈ ప్రేమని ద్వారంలా చేసుకొని, ఆ ప్రేమని సర్వమానవాళి పట్ల చూపించమని చెబుతాను. గురుదేవుల పట్ల చూపించే ప్రేమ ఆహారం లాంటిది. దాన్ని మీరు జీర్ణించుకోగలిగితే, మీరు శక్తి వంతులవుతారు. శక్తిని మీ జీవితంలో నలుదిశల ప్రసరింప చేస్తారు.

గౌతమ బుద్ధుడు ఈ విధంగా చెబుతాడు, 'నేను సంఘంలో ఉంటాను' అని, దాని అర్థం మీ ఏకాగ్రతని నావైపు చూపించకండి. ఆ ఏకాగ్రతని ప్రపంచం వైపు చూపించండని. ప్రేమ దిశ ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి వైపు కానప్పుడు అది ప్రపంచం వైపు ఉంటుంది. అప్పుడు మీరు వ్యథలోనికి ప్రవేశించరు.

ముందుగా మీరు అర్ధం చేసుకోవలసిన విషయం, బంధాలు కారణం లేకుండా ఏర్పడగలుగుతాయి. అప్పుడే మన ప్రేమ, అనుభవం అనేది వస్తువులు, వ్యక్తుల కంటే ముఖ్యమైనది అని తెలుసుకోగలుగుతాం.

మీ జీవితంలో కనీసం ఒక అనుబంధం కూడా లేదు అంటే స్పష్టంగా అర్ధం చేసుకోండి, మీకు ఐశ్వర్యం ఉన్నా అంతరంగంలో మీరు పేదవారే.

ఈ రోజునుంచి మీరు ఎవరో ఒకరితో కారణంలేని బాంధవ్యాన్ని పెంచుకోండి. అందులో మీకు డబ్బు లేదా మరొక లాభం ఉండకూడదు. మీరు ఒక్కసారైనా కారణం లేని ప్రేమని అనుభవించగలిగితే, ఆ తరువాత ఐశ్వర్యం, శరీరం దేన్ని పంచుకున్నా ఫరవాలేదు. అప్పుడు అందులో ఉండే నాణ్యత పూర్తి వేరుగా ఉంటుంది. నేను డబ్బుకి, వివాహానికి వ్యతిరేకిని కాదు. నేను శారీరక సంబంధానికి వ్యతిరేకిని కాదు. కానీ అదే మీ జీవితానికి కేంద్రం అయితే మీరు చాలా ముఖ్యమైనది పోగొట్టుకుంటారు. ఇక్కడ మీకు ఆ విషయమే నేను చెప్పదలచుకున్నాను. మీరు మీ అంతరంగంలో ఒక ముఖ్య కోణాన్ని, ఒక శక్తిని పోగొట్టుకుంటారు.

నాకు ఒక చిన్న కథ గుర్తుకు వస్తుంది : ఒక అంధురాలు ఉంటుంది. ఆమె తనని తాను అసహ్యించుకుంటుంది. ఎందుకంటే తాను చూడలేను అని. తన స్నేహితుడిని తప్ప అందరినీ అసహ్యించుకుంటుంది. ఒకరోజు ఆ అమ్మాయి స్నేహితునితో, నేను ఈ ప్రపంచాన్ని చూడగలిగితే నిన్ను వివాహం చేసుకుంటాను అంటుంది. అకస్మాత్‌గా ఒకరోజు డాక్టరు ఆ అమ్మాయితో ఎవరో కళ్ళు దానం చేయటానికి ముందుకు వచ్చినట్లు చెబుతాడు. ఆమెకి ఆపరేషన్ జరుగుతుంది. ఆమె కళ్ళు తెరచి ప్రపంచాన్ని చూడగలుగుతుంది, ఆమె స్నేహితుడిని కూడా చూస్తుంది.

ఆమె స్నేహితుడు, 'ఇప్పుడు నీవు చూడగలుగుతున్నావు కదా! నన్ను పెళ్ళి చేసుకుంటావా?' అని అడుగుతాడు. ఆమె స్నేహితుడు అంధుడుగా ఉండటం చూసి, 'నీవు అంధుడివి, నిన్ను పెళ్ళి చేసుకోను' అంటుంది.

అతను బాధగా బయటకి వెళుతూ 'నా కళ్ళని జాగ్రత్తగా చూసుకో' అని చెప్పి వెళ్ళిపోతాడు.

అందుకే నేను మీ ఉనికిని మీ అంతరంగంలో స్పష్టించుకోవాలని చెప్పాను. మీ లోపల మీరు ప్రేమ కేంద్రాన్ని మేల్కొలపాలి. మీ జీవితంలో కనీసం ఒక సంబంధమైనా ఎటువంటి ఆశించటాలు లేకుండా ఉండగలగాలి. మీరు ఆ సంబంధానికి ఎటువంటి ఉపయోగాలని కలపకూడదు. అది డబ్బు, కీర్తి, సౌకర్యాలు ఇలా ఏవైనా సరే ఆ సంబంధం నుంచి ఆశించకూడదు. ఆ సంబంధం ఒక చెట్టుతో కాని, చంద్రుడితో కాని, ఏదైనా ఫరవాలేదు. ఇక్కడ ఉద్ధేశం ఏమిటంటే సంబంధం నుంచి మీరు ఏ లాభమూ ఆశించకూడదు. అప్పుడే మీకు ప్రేమ అనే మాటకి అర్థం తెలుస్తుంది. అప్పుడే మీ అంతరంగంలో ప్రేమ మేల్కొంటుంది.

నేను ఎప్పుడూ చెబుతుంటాను, ప్రతిరోజు ఒక అరగంట ఏదైనా ఒక పనిని ఏమీ ఆశించకుండా చేయండి. అది డబ్బు కాని లేదా కీర్తి కాని ఏదీ ఉండకూడదు. కేవలం ఒక అరగంట, ఏదైనా గుడికి లేదా చర్చ్‌కి వెళ్ళి అక్కడ శుభ్రం చేయండి. అక్కడ కమిటీలో మెంబరు అవ్వాలని అనుకోవద్దు, లేదా అలా చేయటం వల్ల పుణ్యం వచ్చి స్వర్గానికి వెళతాను అనుకోవద్దు. ఆ అరగంటసేపు ఆపని తప్పా మరే విషయం మీరు పట్టించుకోవద్దు.

మీరు ఆ అరగంటలో మాత్రమే నిజంగా జీవించినట్టు అనుభూతిచెందుతారు. ఆ అరగంట మీరు ఆశతో ముందుకి వెళ్ళరు. మీ చుట్టు పక్కల వారిని చూసి ఎటువంటి లెక్కలు కట్టకుండా హాయిగా చిరునవ్వు నవ్వగలరు. మీరు కొత్తగా చాలా నిజాయితీని అనుభవిస్తారు.

మిమ్మల్ని మీరు మిగతా సమయంలో గమనించితే, మీరు చిరునవ్వు నవ్వటానికి కూడా మనస్సులో చాలా లెక్కలు కడతారు. నవ్వే ముందు మీ పక్కన ఎవరు ఉన్నారని చూస్తారు. అలా చూసి అప్పుడు పెదాలు ఎన్ని అంగుళాలు విప్పి నవ్వవచ్చు అని లెక్కలు కడతారు. మిమ్మల్ని మీరు ఎలా చూపించుకోవాలో నిర్ణయిస్తారు. ఇటువంటి వాటిని అధిగమించటానికి కేవలం ఒక్క అరగంట చాలు. మీకు డబ్బు, ఎటువంటి గుర్తింపు, సమాజంలో ఒక స్టేటస్ లాంటివి రాని, ఎటువంటి లాభం రాని పనిని చేయండి. అప్పుడు మీరు నేను చెప్పిన కారణం లేని సంబంధం అన్న మాటకి అర్థాన్ని తెలుసుకుంటారు. ఈ అరగంట మీ జీవితంలో చాలా ముఖ్యమైనదిగా అనుకుంటారు. అదే నిజమైన జీవితం అవుతుంది.

అవి మీకు శక్తినిస్తున్నాయి అందుకే నిరాశగా, నిరాసక్తిగా ఉంటారు.

మీరు ఈ పద్ధతిని సాధన చేస్తే మీ శరీరం మనస్సు అనేవి ఆశ, భయం లేకుండానే పనిచేయడం ప్రారంభిస్తాయి. ఎప్పుడైతే ఆశ, భయం లేకుండా మీ శరీరాన్ని కదపగల నేర్చును తెలుసుకుంటారో మీరు ప్రవేశించగలుగుతారు. అప్పుడు ప్రేమ అనే శక్తి వలలో ఎలా పడాలో తెలుస్తుంది. మీ జీవితాన్ని ప్రేమ అనే అందమైన శక్తి ఆధారంగా జీవితాన్ని నడపవచ్చు. అప్పుడే మీకు ప్రేమంటే నిజమైన అర్థం తెలిసేది.

మీ లోపల కొత్త కోణం ఆవిష్కరింపబడుతుంది. మీలో ఒక కొత్త శక్తి ప్రకాశించడం ప్రారంభమవుతుంది. అప్పుడు మీలో ప్రేమించడం కారణం లేని అనుబంధాన్ని పెంచుకోవడం ఎలాగో తెలుస్తుంది.

ప్రేమ, ద్వేషం, శ్రద్ధని ఆశించడం

ప్రేమ నిబంధనలతో ఉన్నంత వరకూ ప్రేమ, ద్వేషం అనేవి నాణానికి రెండు పక్కలుగా ఉంటాయి. మనం ఆశించేవి పొందలేం అనుకోగానే ప్రేమ ద్వేషంగా మారుతుంది. ఇటువంటి ప్రేమలో, ఆశించినవి జరుగుతున్నంతవరకే ప్రేమ ఉంటుంది. ప్రేమలో నిబంధనలు మారగానే ప్రేమకూడా మారిపోతుంది.

మామూలుగా మనందరం అనుకునే ప్రేమ సమయం, స్థలం ఆధారంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య దూరం ఎక్కువగా ఉన్నంతకాలం, వారు కలిసి ఉండే సమయం తక్కువగా ఉన్నంతకాలం వారికి ఒకరిమీద ఒకరికి ప్రేమ ఉంటుంది. ఎప్పుడైతే వారు దగ్గరగా వస్తారో, ఎక్కువ సమయం కలసి ఉంటారో, అప్పుడు వారి మధ్య అంత గాఢమైన ప్రేమ ఉండదు. పరిచయం ప్రేమని ద్వేషంగా మారుస్తుంది. ఈ ప్రేమ, ద్వేషాన్ని మార్చాలంటే ముందుగా మనం ఆశించటాలు, నిబంధనలని వదిలివేయాలి. ఆశించటం ప్రేమకి ఉండే మొదటి శత్రువు.

మనందరం జీవితకాలంలో మన అనుబంధాల విషయంలో చాలా దశలగుండా వెళతాం. ఒకసారి దగ్గరగా గమనించితే, మనం ఏ దశలో ఉన్నా, మనం ఎదుటివారు ప్రేమించాలి అని ఆశించినా, ప్రేమని అడిగినా అది ప్రేమకాదు, కేవలం వారి శ్రద్ధ మన మీద ఉండాలనే కోరిక. ఎదుటి వ్యక్తి నన్ను ప్రేమించటం లేదు అంటే దాని అర్థం వారు తగినంత శ్రద్ధ చూపించటంలేదు అని చెప్పటమే. మనిషికి ఉండే ఒక ప్రాథమిక అవసరం ఎదుటివారి శ్రద్ధ తన మీద ఉండాలి అనుకోవటం.

అనుభవించేది.

ఎదుటి వారి మీద ఆధారపడటం అనేది భౌతికంగా కాని, మానసికంగా కాని, ఆధ్యాత్మికంగా కాని ఉండవచ్చు. ఉదాహరణకి మీరు ఎదుటివారు మన పక్కన నిలబడాలి అని అనుకుంటే అది మానసికంగా ఆధారపడటం అవుతుంది. మీరు ఎదుటివారినుంచి డబ్బు ఆశించినా, శారీరక కోరికలు తీర్చాలి అని అనుకున్నా, భౌతికంగా ఆధారపడటమే. ఈ ఆధారపడటం అనేది ఏ విధంగా ఉన్నా, అది ఏదో ఒక విధంగా వారినుంచి శ్రద్ధని పొందటమే. ప్రేమ అనే మాట అంటేనే ఏ విధంగా చూసినా ఎదుటివారి శ్రద్ధని ఆశించటం.

ప్రేమ వాహినిలో తేలి ఆడండి

నేను ధ్యాన కార్యక్రమాలలో మొదటి సెషన్‌లో వారందరినీ వారి జీవితంలో నిజంగా ప్రేమించిన వ్యక్తుల ఇద్దరు, ముగ్గురు పేర్లు రాయమంటాను. వాళ్ళు భర్త, భార్య, తల్లి, తండ్రి, అక్క చెల్లెళ్ళు ఇలా చాలా మంది పేర్లు రాసారు. ఈ లిస్టులో వారు సంతోష పెట్టే వ్యక్తులు, వారిని సంతోషపెట్టేవారి పేర్లు ఉంటాయి. ప్రేమ మీద నేను కొంతసేపు మాట్లాడాక అందులో చాలా పేర్లు కొట్టేస్తారు. అంటే ఆ వ్యక్తులు మొదట మీ లిస్టులో లేరు. చాలామంది చాలాపేర్లు, వాళ్ళు తమకి ఏదో మంచి చేసారులే అన్నట్లు రాస్తారు. నాకు మంచి చేసారు అనే భావన అంటే ఏమిటి? దాని అర్ధం మీరు మంచివారు అని మీకు తెలిసేలా చేయటం. అంటే మనం ఒక వ్యక్తి మనని పొగిడితే వారిని ప్రేమిస్తాం. మీరు మంచివారు, మీరు ఇది, మీరు అది అని సర్టిఫికెట్టు ఇస్తే మనకి బాగుంటుంది. ఆ విధంగా ఎవరు పొగిడినా వారిని ప్రేమిస్తాం. అవును కదా! వారితో వాదించే ముందు రెండుసార్లు అలోచిస్తాం. ప్రేమ పేరుతో మనం వారితో మంచిగా ఉంటూ మనం మంచివారం అనివారు చెప్పేమాటలను పెంచి పోషిస్తాం. ఒక వేళ వారి మాటల్లో తేడా చూపించితే మనం డిప్రెషన్‌లోనికి వెళ్ళిపోతాం. అందుకే వారిని సంతోషపెట్టటానికి ప్రేమిస్తాం. ఈ విధంగా మన ప్రేమకి ఏదో ఒక కనిపించని కారణం ఉంటుంది.

కొంత మంది నాతో అంటుంటారు, 'కాదు స్వామిజీ! మా పిల్లల్ని కారణాలతో ప్రేమించం' అని. అప్పుడు నేను వారితో, 'అయితే సరే! అకస్మాత్‌గా మీ అబ్బాయి అన్నీ తన సొంత నిర్ణయాలే చేసుకుంటున్నాడనుకోండి, మీ మాటవినటం లేదనుకోండి, మీ పద్ధతి ప్రకారం నడచుకోవటం లేదనుకోండి అప్పుడు మీ అబ్బాయిని ఇదే విధంగా ప్రేమిస్తారా?' అని అడుగుతాను. అప్పుడు వాళ్లు, 'లేదు! మా ప్రేమ తగ్గుతుంది'. అని జవాబు ఇస్తారు.

అంటే దీని అర్థం ఏమిటి? మనం మన తరువాత తరం వారిని, వారు మనకి అనుగుణంగా జీవిస్తున్నంతవరకూ ప్రేమిస్తాం. మనం వారి ద్వారా మన కోరికలు తీర్చుకుంటాం. మన జీవితాలని వారి ద్వారా జీవిస్తాం. మనం సాధించలేనివి వారి ద్వారా సాధించాలి అని చూస్తాం. మనం వారిని మన జీవితాలకి ఒక పొడిగింపులా చూస్తాం. మనం డాక్టరు కావాలని కలగని అవ్వలేక వారిని డాక్టర్ చేయాలని చూస్తాం. వాళ్ళు మన జీవితాలకి పొడిగింపులా ఉన్నంతకాలం, వారితో మన అనుబంధం చక్కగా ఉంటుంది. ఎప్పుడయితే వారి నిర్ణయాలు వారు చేసుకోవటం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే మన మూలంగా వారు ఊపిరాడనట్లు ఉంటారో, ఎప్పుడైతే వారు నిలబడి 'లేదు కాదు' అని చెబుతారో అప్పుడు పిల్లలతో మన అనుబంధం రూపు మారిపోతుంది.

ఒక చిన్న కథ : ముగ్గురు పెద్దవాళ్ళు కూర్చొని టీ తాగుతూ ఉంటారు. అక్కడ కింద నేలమీద వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ పెద్దవారు ముగ్గురూ అకస్మాత్‌గా ఏదైనా ప్రమాదం జరిగితే ఏంచేయాలో ఎలా స్పందించాలో మాట్లాడుకుంటారు. వాళ్ళు ముందు పిల్లల్ని తీసుకొని పరిగెత్తి వెళ్ళిపోవాలి అని అంటారు.

అకస్మాత్‌గా అక్కడ పెద్ద శబ్దంతో కుక్కర్ సేఫీ వాల్స్ బద్దలవుతుంది. కొన్ని క్షణాలలో అందరూ బయటకి పరుగెత్తుతారు. పిల్లలు అక్కడ నేలమీద ఆడుకుంటూనే ఉంటారు.

మన ప్రేమ మనం చెప్పుకుంటున్నంత గొప్పది కాదు. అసలు మనకి మన ప్రేమ ఎంతలోతెనదో తెలియదు. కాని మనం ప్రేమ పేరుతో చాలా చెబుతాం, చాలా చేస్తాం. అయితే ఆశ్చర్యకరంగా అసలు మనం చూపించేదానికి, చెప్పేదానికి సంబంధం ఉండదు. మనలోని ప్రేమ భావాన్ని ఏకీకృతం చేయగలిగితే అది చాలా నిజాయితీగా ఉంటుంది. దాన్ని సహజత్వంతో వెల్లడించవచ్చు.

ప్రేమలో ఐక్యత

పెద్దలకి లేదు, కాదు అని ఎదిరించి చెప్పినప్పుడే పిల్లలు తాము పెద్దవాళ్ళమయ్యాం అనుకుంటారు. అది చాలా సహజం. ఎప్పుడైతే కాదు అంటారో వాళ్ళు వ్యక్తిత్వం పొందినట్టు అనుకుంటారు. అందుకే ప్రపంచంలో ఎక్కడైనా యువకులు ఎదిరిస్తూనే ఉంటారు. అది తూర్పు దేశాలైనా, పశ్చిమ దేశాలైనా అన్ని సంస్కృతులలోనూ యువకులు ఎదిరిస్తారు. ఎప్పుడైతే 'కాదు లేదు' అంటారో, వాళ్ళు తాము బలవంతులం అనుకుంటారు.

కాని మన ప్రేమ 'అవును' మీద ఆధారపడి ఉంటుంది. మనకి సరే అని ఎదుటివారు అంటున్నంతకాలం మన ప్రేమ కూడా 'సరే'. ఎప్పుడయితే 'కాదు' వస్తుందో మన ప్రేమకూడా 'కాదు, లేదు' అవుతుంది. ఇది అడ్డగీతలాంటి ప్రేమ. అది ప్రారంభం అవటం ముగింపుకి రావటం అడ్డగీతలానే ఉంటుంది. మరొక ప్రేమ నిలువు ప్రేమ. అది ఎప్పటికి ముగింపుకి రాదు. ఎందుకంటే అది ఆరంభం కాదు. అది నిరంతరం శక్తి రూపంలో ఉంటుంది. అదే చేతనస్థితి. ఆ ప్రేమ మనం అకస్మాత్‌గా అన్నింటిలో అందరిలో మనని మనం చూసినప్పుడు తెలుస్తుంది. ఉపనిషత్ అంటే వేదాల సారం. ఉపనిషత్ అంటే అర్థం గురువుల సమక్షంలో కూర్చొని అని అర్ధం. మనకి 11 ప్రధాన ఉపనిషత్తులు ఉన్నాయి. ఆదిశంకరాచార్యులు వాటిపె వ్యాఖ్యానం రాసారు. ఉపనిషత్తులలో ఒక చక్కని ఉదాహరణ ఉన్నది.

ఒక గురువుగారు శిష్యులను, 'మీరు మీ ఐదు జ్ఞానేంద్రియాలతో సంతోషాన్ని పొందుతున్నారా' అని అడుగుతారు.

ఒక శిష్యుడు, 'అవును గురుదేవా!' అని జవాబు ఇస్తాడు.

గురువుగారు, 'ఒకవేళ ఐదింట్లో ఒక జ్ఞానేంద్రియం పోతే నీకు అదే ఆనందం ఉంటుందా'? అని అడుగుతాడు.

అపుడు శిష్యుడు 'లేదు ! అప్పుడు ఇరవై శాతం తగ్గుతుంది. అదే రెండు జ్ఞానేంద్రియాలు పోతే నలభై శాతం తగ్గుతుంది' అని జవాబు ఇస్తాడు.

ప్రేమ వాహినిలో తేలి ఆదండి

అకస్మాత్‌గా గురువు 'ఒకవేళ నీకు మరొక ఐదు జ్ఞానేంద్రియాలు కలిస్తే ఎలా ఉంటుంది' అని అడుగుతాడు.

శిష్యుడు 'సహజంగా వందశాతం ఎక్కువ ఉంటుంది' అంటాడు. అదే 'విధంగా నాకు ఐదు శరీరాలు ఉంటే, ఐదు రెట్లు ఎక్కువ సంతోషం పొందుతాను' అంటాడు.

ఒక్కసారి ఆలోచించండి, మీరు ప్రపంచంలో ప్రతి దానిలో జీవిస్తున్న అనుభవాన్ని పొందితే మీకు ఎంత ఆనందం, ఎంత పారవశ్యం కలుగుతుందో కదా! దాన్ని కొలవలేం. అది అంతులేనిది, నిత్యమైనది, అంతిమమైన ఆనందం. దాన్నే జ్ఞానోదయమైన వాళ్ళు నిరంతరం పొందేది. వాళ్ళు సర్వ విశ్వంలో ఉన్న అనుభూతిని పొందుతారు. వాళ్ళు అంతులేని అనంద పారవశ్వంలో ఉంటారు. వారికి వారు చాలు. వారికి బయటి ప్రపంచంనుంచి ఏదీ అవసరం లేదు. వాళ్ళు అత్యున్నత ప్రేమ శక్తిలో స్థిరపడి ఉంటారు.

శ్రీ కృష్ణ భగవానుని రాసలీల అంటే కారణం లేని ప్రేమ, దైవ ప్రేమ. రాసలీల అన్నమాటకి చాలామంది తప్పు అర్దాన్ని ఇస్తారు. అది భౌతికమైన సంబంధం కాదు. మీకు స్పష్టంగా చెబుతాను, రాసలీలలు వర్ణించేటపుడు కృష్ణుని వయస్సు ఎనిమిది సంవత్సరాలు. ఏ విధంగా చూసినా అది భౌతికమైనది కాదు. అది స్వచ్ఛమైన కారణం లేని ఆధ్యాత్మిక ప్రేమ.

రాధ ఆయన ప్రియురాలు. ఆమె ఎప్పుడూ ఆనందించలేదు. ఎందుకంటే ఆమె నిరంతరం సంతోషం నుంచి బాధ, బాధ నుంచి సంతోషానికి ఊగిసలాడుతూ ఉంటుంది. ఆమెకి కృష్ణుడు తనకు కావాలనే కోరికలో ఉంది. రాసలీలలో కృష్ణుడు రాధకి తన అత్యున్నత చేతన స్థితితో ఒకేసారి అందరి గోపికలతోనూ ఉండటాన్ని చూపిస్తాడు. ఆమెకి తాను ప్రతి వారిలో, ప్రతి వసువులో ఉంటాను అని చూపిస్తాడు. అదే దైవ ప్రేమతో ఉండే దివ్యాత్మల ప్రేమ.

జలాలుద్దీన్ రుమి అనే సూఫీయోగి ఒక్క చక్కని పద్యాన్ని రాసాడు. అది ఈ విధంగా ఉంటుంది.

ఒక ప్రేమికుడు ప్రియురాలి ఇంటికి వెళ్ళి తలుపు తడతాడు

'ఎవరదీ' ఒక గొంతు నుంచి వచ్చిన ప్రశ్న

'నేను' అతను చెప్పిన జవాబు

ఆ గొంతు ఇలా అంటుంది, 'నేను', 'నీవు'కి ఇక్కడ స్థలం లేదు'.

ఒక సంవత్సరం ఒంటరిగా గడిపిన ప్రియుడు తిరిగి ఆమె ఇంటికి వచ్చి తలుపు తడతాడు.

ఒక గొంతు నుంచి ప్ర‌శ్న 'ఎవ‌ర‌ది'?

అతను జవాబు ఇస్తాడు, 'అది నీవు'

అతని కోసం తలుపు తెరవబడుతుంది.

నిజమైన ప్రేమలో ఇద్దరు ఉండరు. ఆ ప్రేమ ఒక్కరితో, ప్రతి దాంతో ఏకమై ఉంటుంది. అది ప్రేమ యొక్క అంతిమ దశ.

ప్రేమించి స్వేచ్ఛ పొందండి, అధీన పరచుకోవద్దు

మన ప్రేమ ఏదైనా ఒక వస్తువు వైపు ఉంటే, అది ఒక వ్యక్తి అయినా, ఆవ్యక్తిని ఒక వసువు స్థాయికి తెస్తుంది. మనం ఎవరినైనా అధీన పరచుకోవాలి లేదా వారితోనే కలసి ఉండాలి అని అనుకున్నప్పుడు జరిగేది కచ్చితంగా ఇదే. మన ఇంటినో, ఫర్నిచర్‌నో లేదా వస్తువులనో మన సొంతంచేసుకోవాలని చూసినట్లే, వ్యక్తుల్ని కూడా మనం సొంతం చేసుకోవాలి అనుకుంటాం. ఆ వ్యక్తులు మనం కోరినట్టు, మనకి ఇష్టమైనట్టు ఉండాలి అని అనుకుంటాం. దాని అర్థం మనం వారిని ఒక వస్తువు లేదా ఒక పదార్థం స్థాయికి దించుతాం.

కాబట్టి అర్థం చేసుకోండి, మన ప్రేమ, మన ఏకాగ్రత ఏదో ఒకదాని పట్ల ఉంటే, మీరు మెటీరియలిస్ట్ అవుతారు. అది మీకు చాలా సమస్యల్ని తెచ్చిపెడుతుంది. మనం కేవలం ఆ వసువుని లేదా ఆ వ్యక్తిని ఊపిరాదకుండా చేస్తాం. ఆ విధంగా కాకుండా మన ఏకాగ్రతని మనలో జరిగే ప్రేమ అనుభవంలోనికి మళ్ళించగలిగితే మనం ఆ వస్తువుని లేదా ఆ వ్యక్తికి స్వేచ్ఛ కలిగించవచ్చు. మనం ఆ వస్తువునుంచి లేదా వ్యక్తి నుంచి స్వేచ్ఛ పొందుతాం. అదే ప్రేమ యొక్క అందం.

మీరు ఎవరినైనా సొంతం చేసుకోవాలని చూస్తే, మిమ్మల్ని మీరు బందీ చేసుకుంటారు. మీరు మీ పెంపుడు కుక్కగొలుసు పట్టుకొని నడుస్తున్నారనుకోండి, మీకు కుక్క బందీ అయిఉంటే, మీరు కూడా దానికి బందీనే కదా! కుక్క మీ నుంచి పారిపోలేనట్లే మీరు కూడా కుక్కపంచి పారిపోలేరు కదా! మీరేమనుకుంటారంటే కుక్కకి కట్టిన గొలుసుని నేను పట్టుకున్నాను అని. అదే విధంగా ఆ కుక్క కూడా అనుకోవచ్చు కదా! అలా అనుకోదు అని చెప్పలేం కదా!

ఎప్పుడూ మనం ఏకాగ్రతని, వస్తువు లేదా వ్యక్తిపైన ఉంచితే, మనలో జరిగే ప్రేమ అనుభవాన్ని మిస్ అవుతాం. మనం మనలో జరిగే ఆనందానికి, ఉత్సాహానికి కారణం ఆ వస్తువు లేదా వ్యక్తి అనే తప్పుడు అభిప్రాయంలో ఉంటాం. ఆ ఉత్సాహానికి ప్రేరణకి కారణం ఆ వస్తువు కాదు అని అర్థం చేసుకోలేం. అది మనలో జరిగే శక్తి. ఆ ప్రేరణ కేవలం ఆ వస్తువు లేదా వ్యక్తి వల్ల మాత్రమే అయితే, ఆ వస్తువు మన దగ్గరకి వచ్చిన ప్రతిసారి మనలో ఆ ఉత్సాహం ఉండాలి. అవును కదా! కానీ ఆ విధంగా జరగటం లేదు. ఎదురుగా అదే వ్యక్తి, వసువు ఉన్నా ఆ ఉత్సాహంలోని వేడి తగ్గిపోతుంది. అంటే దీని అర్థం ఆ ఉత్సాహానికి, వసువుకి ఏమీ సంబంధం లేదు. అది కేవలం మనకి సంబంధించింది. అది అనుభవానికి సంబంధించింది కాని వసువుకి, వ్యక్తికి కాదు.

ప్రేమ వాహినిలో తేలి ఆదండి

ఒక చిన్న కథ : కళాత్మక వస్తువులను సేకరించే వ్యక్తి ఒక పల్లెటూరికి వెళతాడు. అక్కడ టీస్టాలు దగ్గర ఒక పిల్లి పురాతన సాసర్‌లో పాలు తాగుతూ కనిపిస్తుంది. ఆ వ్యక్తి సాసర్‌ని చూసి అది చాలా ఖరీదైనదని గుర్తిస్తాడు. ఆ సాసర్ కొనాలి అనుకుంటాడు. అతను షాపు ఓనర్ దగ్గరకి వెళ్ళి "సర్! ఈ పిల్లిని నేను రెండు డాలర్లకి కొంటాను అమ్ముతారా" అని అడుగుతాడు. షాపు ఓనరు 'అమ్మను' అంటాడు.

ఆవ్యక్తి షాపు ఓనరుతో, మా ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి. నాకు ఒక పిల్లి కావాలి. దయచేసి దీన్ని అమ్మమని అడుగుతాడు. కావాలంటే పది డాలర్లు ఇస్తాను అంటాడు. అప్పుడు షాపు ఓనరు సరే అని పిల్లిని తీసుకోమంటాడు.

ఇప్పుడు ఆ వ్యక్తి షాపు ఓనరుని, "నేను పిల్లిని తీసుకువెళతాను. నాకు సాసర్ కూడా ఇవ్వు. నేను ఇప్పుడు ఇంకొక కొత్త సాసర్ కొనను. అంతే కాకుండా పిల్లి ఆ సాసర్‌కి అలవాటు పడి ఉంటుంది. ఆ సాసర్ అయితే పిల్లి కూడా సంతోషపడుతుంది కాబట్టి ఆ సాసర్ నాకు ఇచ్చేయి" అంటాడు.

షాపు ఓనరు 'నేను ఆ సాసర్ ఇవ్వను. అది నా అద్బుష్ట సాసర్. ఆ సాసర్ మూలాన వారం రోజులలో నేను 68 పిల్లుల్ని అమ్మాను' అంటాడు.

కళాత్మక వసువులు సేకరించే వ్యక్తి సాసర్ పొందాలి అనుకున్నాడు. కానీ అతనికి పిల్లి దొరికింది. మనం కూడా నిజంగా అనుభవం పొందవలసిన దాన్ని వదిలి, అనవసరమైన వసువులని పొందుతున్నాం. మనం వాటివైపు వెళుతున్నాం కానీ అనుభవం వైపు కాదు.

ఈసారి మీరు ఎవరితోనైనా ఉన్నప్పుడు, మీరు ఎవరి దగ్గరైతే స్వేచ్ఛగా విప్పారి ఉండగలరో, మీ స్నేహితుడు ఎవరైనా సరే అప్పుడు ఈ పద్దతిని సాధన చేయండి.

అతని పక్కన కూర్చోండి. మీరు ఏమి చేయబోతున్నారో, ఏమి చెప్పబోతున్నారో అసలు పట్టించుకోవద్దు. కేవలం కూర్చోండి. అంతే. అదే పద్ధతి. నిజానికి మాట్లాడటం అంటే అవతలి వ్యక్తిని తప్పించటమే. అది సత్యం. అవతల వ్యక్తి వింటాడు. ఎందుకంటే మీరు ఆపగానే తాను మాట్లాడటానికి. ఒక వ్యక్తి మీరు చెప్పేది వింటున్నాడు అంటే వేరే ఏదైనా ఆలోచిస్తూ ఉండాలి లేదా తాను ఏమి మాట్లాడాలనుకుంటాడో దాన్ని తయారు చేసుకుంటుంటాడు. మీరు ఆపగానే తాను ప్రారంభించటానికే అక్కడ కూర్చుంటాడు.

ఇప్పుడు ఈ పద్ధతిని మీరు సాధన చేస్తే, మీరు వేరే స్థితికి వెళ్ళగలుగుతారు. మీరు గురువుగారితో ఉన్నప్పుడు లేదా స్నేహితునితో లేదా ప్రియునితో, ఎవరితో అయితే మీకు లోతైన అనుబంధం ఉన్నదో, ఎవరి దగ్గర మీరు విప్పారిన అంతరంగంతో ఉండగలరో, వాళ్లు దగ్గర ఉన్నప్పుడు ఈ పద్ధతిని సాధన చేయండి. ఈ పద్దతి మిమ్మల్ని నేరుగా ఆత్మ సాక్షాత్కారానికి తీసుకువెళుతుంది. స్పష్తంగా తెలుసుకోండి, మీకు మంచి సంబంధ బాంధవ్యాలకోసం ఈ పద్దతి చెప్పటం లేదు. ఈ పద్దతి ద్వారా తిన్నగా మీరు స్వచ్ఛమైన ప్రేమకు వెళతారు అని చెబుతున్నాను.

పెద్ద సమస్య ఏమిటంటే మీరు విరామంగా కూర్చోలేరు. మీరు ఆశతో ముందుకి వెళతారు. అంటే ఏదో చెప్పేయాలనే ఆత్రుతతో ఉంటారు. లేదా ఏమి చెప్పాలో ఏమి చేయాలో తెలియక భయంతో ఉంటారు. మీరు మీ పని పూర్తిచేసి పారిపోవాలి అని చూస్తుంటారు. మీరు ఆశతోనైనా ఉంటారు లేదా భయంతోనైనా ఉంటారు. కాని ఇప్పుడు పూర్తిగా రిలాక్స్ అవ్వండి. భయంతో లేదా ఆశతో ఉండవద్దు.

మీరు వర్తమానంలో ఉండండి. అవతల వ్యక్తి సమక్షాన్ని అనుభూతితో తెలుసుకోండి. ఆ వ్యక్తిని అదే విధంగా స్వీకరించండి. అప్పుడు మీలో ఏమి జరుగుతుందో గమనించండి. దీన్ని కొన్నిరోజులు సాధన చేయండి. అకస్మాత్‌గా మీరు వేరే స్థితిని అనుభవిస్తారు. మీరు అంతకు ముందు ఎప్పుడూ అటువంటి అనుభవాన్ని పొంది ఉండరు.

ఇది శివసూత్రాలలోని ఒక ధ్యాన పద్ధతి. శివ సూత్రాలు అంటే జ్ఞానోదయం పొందటానికి శివుడు చెప్పిన కొన్ని సూత్రాలు. ఈ పద్ధతి మిమ్మల్ని రూపం నుంచి రూపం లేని స్థితికి పెద్ద అడుగు వేసేలా చేస్తుంది. సొంతం చేసుకోవాలి అనుకునే ప్రేమనుంచి కారణం లేని ప్రేమకి తీసుకువెళుతుంది.

మీరు మీకు ప్రియమైన వారికి లేదా గురువులకి లేదా స్నేహితులకి చాలా దగ్గరగా ఉంటారు. ఆ దగ్గర అనుబంధం నుంచి బయటకి రావాలి అంటే, రూపం నుంచి రూపం లేని స్థితికి రావాలంటే ఈ పద్ధతిని సాధన చేయాలి. ఈ పద్ధతితో మీరు ప్రేమలోనికి ఒక పెద్ద అడుగు వేయగలరు. ఈ అదుగుతో మీకు ప్రేమ ఉదయించటానికి ఒక వస్తువుతో అవసరం లేదు. మనలో శక్తి పొంగి ప్రవహిస్తూ ఉంటే, బయట ప్రపంచంలో అది అనుబంధాల కోసం చూడదు. మీలో పొంగిపొరలే శక్తిని ఎదుటివారికి ఇస్తున్నారు అంతే. అక్కడ వస్తువు లేదా వ్యక్తి ఉన్నా లేకపోయినా ఇది జరుగుతూ ఉంటుంది.

ఎప్పుడయితే కారణం లేని ఒక శక్తిగా ప్రేమ మీలో పొంగుతుందో మీరు స్వేచ్ఛని పొందుతారు. అదే విధంగా అవతలి వ్యక్తి కూడా మీ బంధం నుంచి స్వేచ్ఛని పొందుతాడు. ఆధీనం అనేది అవతలి వ్యక్తినే కాదు మిమ్మలని కూడా బందీలుగా చేస్తుంది. అది మిమ్మలని, అవతల వ్యక్తిని ఇద్దరినీ హింసిస్తుంది. నిజమైన ప్రేమ ఇద్దరినీ విముక్తుల్ని చేస్తుంది. అది మీకు, అవతలి వ్యక్తికీ ఇద్దరికీ స్వేచ్చని ఇస్తుంది.

ప్రేమ వాహినిలో తేలి ఆదండి

నేను ప్రపంచమంతా తిరుగుతుంటాను. నన్ను, 'ఇది కొత్త స్థలం కదా! మీకు రాత్రి నిద్ర పట్టిందా' అని అడుగుతుంటారు. నేను వాళ్ళకి చెబుతాను, మీకు ఏదో ఒక ఇంటితో సంబంధం లోతుగా ఉంటే, మరొక ఇల్లు కొతగా ఉంటుంది. దాంతో మీరు ఇబ్బంది పడతారు. మీకు ఏ ఇంటితోనూ అనుబంధం లేకపోతే, మీరు ఎక్కడికి వెళ్ళినా, మీ ఇంట్లో ఉన్న విధంగానే ఉంటారు.

నేను ఏ ప్రాంతాన్ని నాది అనుకోను, నాది కాదు అనికూడా అనుకోను. నేను ఎక్కడికి వెళ్ళినా నా ఇల్లు అన్నంత సౌకర్యంగా ఉంటాను. సౌకర్యం అనేది ఎప్పుడూ మన అంతరంగంలో ఉంటుంది, కాని బయట కాదు. మనలో సౌక్యరం లేనప్పుడు బయట సౌకర్యాలకోసం చూస్తుంటాం. మన లోపల సౌకర్యంగా ఉండగలగటం అంటే అది కారణం లేని ప్రేమశక్తి మూలానే. మనం ఎప్పుడైతే ఒక ఇంటితో అనుబంధాన్ని పెంచుకోమో, ఈ ప్రపంచంలో ఎక్కడైనా మన ఇంట్లో ఉన్నట్టే ఉండవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా రిలాక్స్‌డ్‌గా ఉండవచ్చు.

నన్ను చాలామంది అడుగుతుంటారు, 'స్వామీజీ! మీరు అంత ఎక్కువగా ఎలా ప్రయాణాలు చేయగలుగుతారు? మీకు అలసటగా అనిపించదా?' అని ఈ ప్రశ్న ఎక్కువగా ప్రయాణించే వ్యాపారవేత్తల నుంచి వస్తుంది. వాళ్ళు ఏమంటారంటే, మేం ఒకటి రెండు చోట్లకి వెళితే తిరిగివచ్చాక స్థిరపడే వరకూ విశాంతి తీసుకోవాలి. అప్పుడే తిరిగి మా రోజువారి పనికి వెళ్ళ గలం. ఆ తరువాత మాకు సౌకర్యంగా ఉంటుంది. మీరు అలా నిరంతరం ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు? ఆ రహస్యం మీకు ఇంతకు ముందు చెప్పినదే. నేను ఏదో ఒక ఇంటితో లేదా ప్రాంతంతో అనుబంధాన్ని పెంచుకోను. ప్రపంచంమొత్తంతో నా అనుబంధం ఉంటుంది. ఈ భావంతో మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు లోతైన అనుభవాన్ని పొందుతారు. మీరు విరామంగా, పరమానందంతో, నిత్యం ఆనంద పారవశ్యంలో ఉంటారు. ఆనందం బయటి ఇంటినుంచి రాదు. మన అంతరంగపు ఇంటి నుంచి వస్తుంది.

అనుబంధాలలో ప్రేమ

నిజజీవితంలో ఎదుటివారి పట్ల మన ప్రేమని కనిపించే విధంగా వెల్లడి చేయాలి అని చూస్తాం. కేవలం ప్రేమని కనిపించే విధంగా ప్రదర్శించేనే, ఈ రోజులలో దాన్ని ప్రేమ అంటున్నారు. నిజమైన ప్రేమ అంటే ఒక సంయోగం. ఇది రెండు అంతరాత్మల మధ్య ప్రేమ వ్యవహారం. దాన్ని ఏ విధంగా వెల్లడి చేయకుండానే అనుభవం పొందవచ్చు. ఇందులో సంభాషణతో అవసరం లేదు. ఎందుకంటే అక్కడ సంయోగం ఉంది.

మీరు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే, మీ శరీర కదలికలే ఆ విషయాన్ని చెబుతాయి. మాటలతో ఆ భావం చెప్పలేరు. మాటలు ఆ భావాన్ని వ్యక్తం చేయటానికి చాలవు. అవి మీ ప్రేమని కిందకి తెచ్చేసాయి. మీరు మాటల్ని ఉపయోగిస్తే ఎక్కడో నిజమైన ప్రేమ జరగలేదు అని అర్ధం. ప్రేమని వెల్లడి చేయటానికి మాట్లాడవలసివస్తే, ఎక్కడో అబద్ధం ఉంది. ఆ అబద్దాన్ని అందంగా కప్పిపుచ్చటానికి మీరు మాటలు ఉపయోగిస్తారు.

నిజమైన ప్రేమ మీకు విముక్తినిస్తుంది. ఎందుకంటే నిరంతరం దాన్ని వెల్లడి చేయాలి అని బలవంతం చేయదు. ప్రేమ ఉంటుంది. అంతే. నిజమైన ప్రేమ మీరు ఏమి చెప్పదలచుకున్నారో చెప్పే స్వేచ్ఛని ఇస్తుంది. మీరు ఏమి చెప్పదలచుకున్నారో అది వెల్లడి చేయవచ్చు. ఏభావమైనా, అది విసుగు, కోపం ఏదైనా కాని అది ప్రేమని తగ్గించదు.

నిజమైన ప్రేమతో ఒకర్ని ఒకరు అధిగమించటం, అధికారం చూపించటం వంటివి ఉండవు. ప్రతి ఒక్కరు ఒక అందమైన పూవు లాంటివారే. ప్రతి పుష్పం ప్రత్యేకమైన సువాసనలని వెదజల్లుతుంది.

నిజమైన ప్రేమలో భయం, అభ్రదతా భావం అనేవి ఉండవు. సాధారణ ప్రేమలో, వ్యకులు దూరం కాగానే అభ్రదతా భావం, నమ్మకం లేకపోవటం జరుగుతాయి.

ఒక చిన్న కథ : ఒక యువసెనికుడు, తన అధికారి దగ్గరకి వెళ్ళి, 'సార్ ! నా స్నేహితుడు యుద్ధభూమి నుంచి తిరిగి రాలేదు. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి నేను అతన్ని తీసుకు వస్తాను' అని అడుగుతాడు.

అధికారి 'లేదు! నీవు వెళ్ళవద్దు. బహుశః నీ స్నేహితుడు చనిపోయి ఉంటాడు. నీవు నీ జీవితాన్ని ప్రమాదంలో పెట్టి అక్కడికి వెళ్ళవద్దు' అంటాడు.

అయినా ఆ సైనికుడు వెళ్ళి, బాగా గాయాలతో స్నేహితుడి శవాన్ని తీసుకొస్తాడు.

ఆ సైనికుడిని చూసి అధికారి మండిపడతాడు. 'నేను నీకు చెప్పాను. అతను చనిపోయి ఉంటాడు అని. ఇప్పుడు నేను మీ ఇద్దరినీ పోగొట్టుకున్నాను. నాకు చెప్పు, నీవు అంత ప్రపూదాన్ని ఉంచుకొని అక్కడికి వెళ్ళి, అతని శవాన్ని తీసుకురావాలా?' అని అడుగుతాడు.

మరణానికి దగ్గరగా ఉన్న ఆ సైనికుడు, 'అవును, వెళ్ళాలి సార్! నేను వెళ్ళే సమయానికి నా స్నేహితుడు బ్రతికే ఉన్నాడు. అతను నాతో, 'నాకు కచ్చితంగా తెలుసు నీవువస్తావు' అని అన్నాడు', అని అధికారికి చెపుతాడు.

నిజమయిన ప్రేమ ఉపయోగాలను చూడదు. అది నమ్మకం మీద పనిచేస్తుంది. అది కాలానికి, స్థలానికి అతీతమైంది.

ఈ రోజులలో ఒకరికొకరు తమ ప్రేమని వెల్లడి చేయటానికి చాలా బహుమతులను ఇచ్చుకుంటున్నారు. బహుమతి ప్రేమని వెల్లడిచేసే పద్దతి అయ్యింది. బహుమతిని కారణం లేకుండా మనలో పొంగి ప్రవహించే ప్రేమతో ఇస్తే ఫరవాలేదు. అలా కాకుండా అది ఒక నిబంధన అని లేదా ఆశని తీర్చేది అయితేనే సమస్య. అప్పుడు బహుమతి నిజమైన ప్రేమకి ఏ విధంగాను సరిరాదు.

ప్రేమ వాహినిలో తేలి ఆడండి

ప్రేమ ఉన్నంతవరకూ ఏ సంబంధమూ విసుగు అనిపించదు. ప్రేమ ఉన్నంతవరకూ, ప్రతి వస్తువు లేదా వ్యక్తి ప్రత్యేకంగా ఉంటారు. మీ ఆఫీసుల్లో ఒక గుమాస్తా మరణిస్తే, మీ ఆఫీసు పని ఏదీ ఆగదు. మీకు ఏమీ కాదు. మీరు అందరితోపాటు అతని కుటుంబ సభ్యులని ఓదార్చి వస్తారు. కానీ మీరు ఆ గుమాస్తాని ప్రేమిస్తే ఏమిటి? మీ జీవితం అదే విధంగా ఉండదు. అవును కదా? మీరు ఏదైనా ఒక వస్తువు పట్ట లేదా వ్యక్తి పట్ట ప్రేమతో ఉంటే లేదా వారు ప్రేమిస్తే, అంతా చాలా ప్రత్యేకంగా అవుతుంది. ప్రేమ అన్నింటినీ ప్రత్యేకంగా చేస్తుంది.

ఒకసారి ఒక ఆశ్రమవాసి నన్ను ఇలా అడిగారు, "స్వామీజీ! మీరు ప్రతిరోజు మమ్మల్ని చూస్తూ ఉంటారు. మా తప్పులు, మా ఆయోమయాలు అన్నీ చూసుకుంటారు. ప్రతిరోజూ అదే జరుగుతుంది. మీకు బోరుకొట్టడం లేదా?" అని. ఇది చాలా నిజాయితీ అయిన ప్రశ్న. నేను వాళ్ళకి చెప్పాను, 'జ్ఞానోదయం అయిన వ్యక్తిలో పొంగి ప్రవహించే ప్రేమ వల్ల ప్రతి వ్యక్తీ ఒక ప్రత్యేకతతో కనిపిస్తాడు. అటువంటి వారు వ్యక్తులని ఏదో కొన్ని సంఖ్యలుగా చూడరు. ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపిస్తాడు.

ఈ కారణం వల్లనే గురువులు ఎంతో ఓపికతో, అంతమంది శిష్యులతో పనిచేయగలుగుతారు. ఆ విధంగా కాకుండా, వారిని మామూలు వ్యక్తులుగా చూస్తే వేరుగా ఉంటుంది. మీ అంతరంగం ప్రేమతో నింపబడి ఉంటే, మీలో తర్శం ఉండదు. మీ పనులకి ఏదో కారణాలు ఉండవు. మీరు ఎవరితోనైనా అనుబంధాన్ని పెంచుకోగలరు. మీరు నిరంతరం ప్రేమని వెదజల్లుతూ ఉంటారు.

అంతేకాదు, కారణం లేని పొంగి ప్రవహించే ప్రేమ ఎప్పుడూ సంపూర్ణంగా వెల్లడికాబడుతుంది. అందులో మామూలుగా ఉండే ఆశ, భయం ఉండవు. కాబట్టి మీరు ఎవర్ని ప్రేమించినా, వారిని ఎటువంటి రిజర్వేషన్ లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తారు. అతను ఏవిధంగా ఉన్నా ప్రేమిస్తారు. మీరు ఈ విధంగా ప్రేమించగలిగితే, ఆ వ్యక్తి మీ జీవితం నుంచి తప్పుకున్నా, మీరు బాధపడరు. ఒక వ్యక్తి మరణిస్తే మీరు ఎందుకు బాధ పడతారు అంటే మీరు వారిని సంపూర్ణంగా ప్రేమించనందుకు. మీరు ఒక వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమించాలి అంటే మీ ప్రేమ సంపూర్ణంగా ఉండాలి. దానికి ఎదుటి వ్యక్తితో ఎటువంటి సంబంధం ఉండదు. అతను ఎటువంటి వ్యక్తి అయినా సరే, అది సమస్యకాదు. నిజమయిన ప్రేమలోని అందం అదే. అది ప్రేమకోసం ప్రేమిస్తుంది కాని వ్యక్తి కోసం కాదు.

మీరు ఒక వ్యక్తికోసం బాధపడుతున్నారు అంటే స్పష్టంగా తెలుసుకోండి, మీరు ఆ వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమించనందుకే. మీరు ఆ వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమించగలిగితే, మీరు ఆ వ్యక్తికి పూర్తి విరామంలో 'బై' చెప్పగలరు. మీరు బాధపడటానికి కారణం ఎక్కడో ఏదో మిస్ అయ్యింది. ఆ వ్యక్తి మీ తండ్రి, భర్త, బిడ్డ ఎవరెనా సరే. మీరు వారు జీవించి ఉన్నప్పుడు వారి పట్ల కారణం లేని ప్రేమని చూపి ఉంటే, వారు లేనప్పుడు బాధపడరు. కారణాలతో వారిని ప్రేమిస్తే, వాళ్ళు లేనప్పుడు వారి పట్ల మీరు చూపిన ప్రేమ మీలో ఆ బాధని, వారిని తలచుకుని బాధపడే స్థితిని కలిగిస్తుంది.

ధ్యాన పద్ధతి – మీలో పొంగి ప్రవహించే ప్రేమ అనుభూతిని తెలుసుకోండి

కళ్ళు మూసుకొని సౌకర్యంగా మీతోనే మీరు కూర్చోండి. మీ హృదయం ఉన్న ప్రాంతంలోనే ఏకాగ్రతని ఉంచండి. మిగతా అన్ని భాగాలు మర్చిపోయి గుండె ప్రాంతంలోనే ఏకాగ్రతని నిలపండి.

మీ హృదయంలో అంతులేని దీవెనలు పొంగి ప్రవహిస్తున్నట్లు చూడండి. మీ హృదయ స్పందనని లోతుగా గమనించండి. ఆ శబ్దం మీ అంతరంగంలో మారుమోగాలి.

రెండు గుండె చప్పుడుల మధ్య, ప్రేమ శక్తి పొంగుతున్న అనుభూతిని పొందండి. మీ అంతరంగంలోపల, మీ శరీరం, మనస్సు అంతరాత్మల లోతులలో ప్రేమశక్తి మీ కోసం ఎదురుచూస్తున్న విషయం గుర్తించండి.

మీ గుండెలలోని ఆ ప్రేమశక్తిని ఆహ్వానించండి. అది మీ శరీరంలోని లోతైన ప్రాంతాలలో, మీ శరీరం, మనస్సు, ఆత్మలలోనికి పొంగి ప్రవహించేలా చేయండి.

నెమ్మదిగా, కళ్ళు తెరవండి.

  • ★ మీరు ప్రేమను వెల్లడించినప్పుడు, మీరు శక్తిని కూడా వెల్లడి చేస్తారు.
  • ★ ప్రేమ అనేది హృదయం యొక్క విజయం. దాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలి.
  • ★ చేతన స్థితి రెండు పనులు చేస్తుంది. అది అహాన్ని సృష్టిస్తుంది లేదా నిరహంకారాన్ని సృష్టిస్తుంది.
  • ★ నిజమైన ప్రేమ మిమ్మల్ని ఈ క్షణంలో ఉంచగలుగుతుంది.
  • ★ ప్రేమ వృక్షం యొక్క వేరు అయితే, మతాలు ఆ వృక్షం యొక్క కొమ్మలు, ఆకులు.
  • ★ అన్ని మతాల రహస్యం ప్రేమ. ఆ విధంగా ఉన్నా కూడా అందరూ తర్కంలో, వేదాంత శాస్త్రాలలో తమని తాము మర్చిపోయేలా నిమగ్నమవుతారు.
  • ★ ఈ ప్రేమ, ద్వేషాన్ని మార్చాలంటే ముందుగా మనం ఆశించటాలు, నిబంధనలని వదిలివేయాలి. ఆశించటం ప్రేమకి ఉండే మొదటి శత్రువు.

వ్యథ అంటే ఏమిటి?

ఇప్పటి వరకూ మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నాం. ప్రేమ అంటే మనకి ఇతరులతో ఉండే సంబంధబాంధవ్యాలు. ప్రేమ అంటే మనతో మనకి ఉండే అనుబంధం కూడా. మనని మనం ప్రేమించుకోకుండా ఇతరులని ప్రేమించలేం. మనని మనం ప్రేమించుకోకుండా అడ్డపడేది మనలో నిరంతరం ఉండే వ్యథ్య, విసుగు. అవి మనలోనే పుడతాయి. విషయాలన్నీ చక్కగా జరిగినా జరగక పోయినా మనం వ్యథ చెందుతూనే ఉంటాం. మన ఆత్మ సంత్సప్తికి అడ్డపడేది ఈ వ్యథ, చింత లేదా కలత.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి బార్‌కి వస్తాడు. అతడు చూడటానికి చాలా బాధపడుతూ ఏదో నిరాశలో ఉన్నట్టు ఉంటాడు. అతన్ని చూసి అక్కడ ఉన్న బార్ అటెండర్ 'ఏమిటి విషయం సర్! మీరు చాలా బాధలో ఉన్నట్లు ఉన్నారు. విషయం ఏమిటి?' అని అడుగుతాడు.

అతనితో ఆ వ్యక్తి, "నాభార్య నేను పోట్లాడుకున్నాం. ఆమె నాతో ఒక నెలరోజులు మాట్లాడను" అని అన్నది. అంటాడు. అప్పుడు బార్ అటెండర్, "అయ్యో! అలానా! ఫరవాలేదు, నెల ఎంతలోకి తిరిగిపోతుంది" అని ఓదారుస్తాడు.

ఆ వ్యక్తి, 'నాకు తెలుసు, నెల ఇవాళతో అయిపోయింది' అని జవాబు ఇస్తాడు.

ప్రతీ ఒక్కరికీ ఏవో కొన్ని బాధలు ఉంటాయి. నేను మిమ్మల్ని మీ బాధ ఏమిటి? అని అడిగితే 'నాకు ఉద్యోగం లేదు అది నా బాధ' అని ఒకరంటే మరొకరు, 'నా ఉద్యోగమే నా బాధ' అని మరొకరంటారు. ఒకరు 'నాకు పిల్లలు లేరు అది నా బాధ' అంటే మరొకరు 'నా పిల్లలే నా బాధ' అంటారు. అంటే ఏమిటి? ఒకరి కోరిక కల మరొకరికి బాధ. అసలు ఇందులో ఏమైనా అర్థం ఉందా?

బాధ లేక వ్యథ అంటే ఏమిటి? మీరు అనుకున్న విధంగా జరగకపోతే మీకు కలిగేదే బాధ. ఇది మీరు ఆశించిన దానికి సత్యానికి మధ్య ఉన్న తేడానే బాధ. ఉదాహరణకి మీ అబ్బాయి మీతో ఉండాలి అని అనుకుంటారు. కానీ మీ అబ్బాయికి తనంతట తాను ఉండాలి అనుకుంటాడు. అదే మీ బాధలకు కారణం. మీరు మీ జీతం ఇంకా కొంచం పెరిగితే బాగుండు అనుకుంటారు. కానీ మీ బాస్ మరొక విధంగా అనుకుంటాడు. మీరు మీ భర్త 1గం.కి భోజనానికి వస్తే బాగుండు అనుకుంటారు. కానీ మీ భర్తకు పని అంతా అయ్యాక పని తృప్తిగా పూర్తి చేసుకొని ఇంటికి వస్తే బాగుంటుంది అనుకుంటాడు.

మీరు నిరంతరం ఒక విధంగా, ఒక పద్ధతిలో జరగాలి అని ఆశిస్తారు. అది మీ ఉద్యోగంలా పెద్ద విషయమైనా సరే లేదా టైంకి భోజనానికి రావటం అనే చిన్న విషయమైనా సరే, అది జరగాలి అని ఆశిస్తాం. లేకపోతే బాధ పడతాం.

వ్యథ చెందటానికి ఏమీలేదు

అసలు వ్యథ అనేది ఏ విధంగా ప్రారంభమవుతుంది?

వ్యథ అనేది మీ మాటల్లో నుంచి వస్తుంది. మీ లోపల రెండు విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి సంభాషణ రెండవది మీకు మీరు మాట్లాడుకునే మాటలు దీనినే అంతరంగపు మాటలు అంటారు. ఏది ఏమైనా మాటలు అనేవి మీకు బాధలని స్పష్టిస్తాయి.

మీరు మాటలు బయటకి మాట్టాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే సంఘం మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. కానీ మీరు మీతో మాట్లాడుకునే మాటలు మీకు తప్పా మరెవరికీ తెలియదు. మీ లోపల ఉదయించే ఆ మాటలే నిజమైన వ్యథ లేక బాధ. ఖలీల్ జిబ్రాన్ అనే లెబనాన్ కవి పద్దెనిమిదవ శతాబ్దంలో ఉన్నారు. ఆయన చాలా చక్కగా చెబుతారు. 'మీరు మీ ఆలోచనలతో ప్రశాంతంగా ఉండకూడదు అని అనుకున్నప్పుడు మాట్లాడటం మొదలు పెడతారు.'

అది ఈ విధంగా ఉంటుంది; మీ అంతరంగంలో నిరంతరం మాట్లాదుకుంటూ ఉంటారు. అది నిరంతరం 24×7 విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రవాహం నుంచి కొన్ని బయటకి వస్తుంటాయి. వీటినే బాధలు అంటారు. కాబట్టి బాధలు అంటే మీ అంతరంగంలో మాటలు. మీరు వాటిని నిరంతరం మీ అంతరంగంలో అనుకుంటూ ఉంటారు.

ఆ ఆలోచనలలో ఎక్కువ భాగం వ్యతిరేకపు మాటలే. అదే సమస్య. నేను మిమ్మల్ని కొన్ని పేజీలలో మీ జీవిత చరిత్ర రాయమని చెబితే మీరు కష్టపడిన కొన్ని సంఘటనలని రాస్తారు. మీరు మీ జీవితంలో ఆనందపడిన విషయాల్ని, జరిగిన సంఘటనల్ని రాయరు. మీ మానసిక వ్యవస్థకి కేవలం వ్యతిరేక విషయాలు, బాధ కలిగించిన సంఘటనల్ని మాత్రమే గుర్తుపెట్టుకునేలా శిక్షణనిచ్చారు. మీకు సంతోషం కలిగించే విషయాలు జరిగినా, అది జరిగిపోయాక బాధ కలిగించే వాటిని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే మీరు ఆ అనుభవంలో సంతోషంగా ఉన్నప్పుడు అది ఎప్పుడు అయిపోతుందో అని బాధపడుతూ ఉంటారు. మీకు చిన్నతనం నుంచీ జీవితం అంటే ఒక కష్టం నుంచి మరొక కష్టంలోనికి వెళ్ళటం, ఒక బాధనుంచి మరొక బాధలోనికి వెళ్ళటం అని మాత్రమే నేర్పిస్తారు. అంతే కానీ జీవితం అంటే సంతోషం నుంచి మరొక సంతోషంలోనికి అని నేర్పించరు.

ఒక క్లాసులో టీచర్ ఒక అబ్బాయి దిగులుగా కూర్చొని ఉండటం చూసి అతన్ని, 'ఏమి జరిగింది, ఎందుకు బాధ పడుతున్నావు' అని అడుగుతుంది. టీచర్ ప్రశ్నకు ఆ అబ్బాయి, 'నా తల్లితండ్రులు నాకు మంచి బట్టలు, మంచి చదువు ఇవ్వటానికి చాలా కష్టపడి రోజంతా పని చేస్తారు. నేను ఏది అడిగితే అది కొని ఇస్తారు. మా అమ్మ నాకు మంచి భోజనం తయారు చేసి పెడుతుంది నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది' అని జవాబు ఇస్తాడు.

అప్పుడు టీచర్, 'మరైతే నీవు ఎందుకు బాధ పడుతున్నావు? అసలు నీ సమస్య ఏమిటి?' అని తిరిగి అడుగుతుంది.

అప్పుడు ఆ అబ్బాయి, 'వాక్బు పారిపోతారేమో అని భయంగా ఉన్నది' అని జవాబు ఇస్తాడు.

మనస్సు బాధలోనే తనని తాను నిలుపుకో గలుగుతుంది. కాని సంతోషంలో కాదు. అందుకే సంతోషంగా ఉన్న సమయంలో కూడా బాధ పడిన సంఘటనలనే గుర్తు చేసుకుంటారు.

సంతోషం ఎప్పుడూ జ్ఞాపకాలలో రికార్డు కాదు కాని బాధ రికార్డు అవుతుంది. కేవలం బాధ కలిగించే వ్యతిరేకపు మాటలు మాత్రమే జ్ఞాపకాలలో ఎందుకు రికార్డు చేయబడతాయి. ఎందుకంటే సంతోషం ఎప్పుడూ మాటల రూపంలో జ్ఞాపకాలలో రికార్డు కాదు. అది మిమ్మల్ని మీ అంతరంగంలో గల శూన్యంలోనికి పంపిస్తుంది. ఉదాహరణకి మీ జీవితం ఒక టేప్‌లా ఉంటే మీరు ఆనందపడిన క్షణాలు శూన్యంలో ఉంటాయి. దానికి సంబంధించిన రికార్డు ఉండదు. అదే బాధ పడిన క్షణాలు మాత్రం నల్లటి గుర్తులుగా ముద్రించబడతాయి. ఒక చక్కని తెల్లటి బోర్డు మీద ఒక చిన్న నల్లటి చుక్కనిపెట్టి, ఇక్కడ మీకు ఏమి కనిపిస్తుంది అని అడిగితే మీరు నల్లటి చుక్కని మాత్రమే చెబుతారు కాని విశాలమయిన తెల్లని బోర్డు సంగతి మాట్లాడరు. అదే విధంగా మీ జీవితంలో కూడా బాధలు, సమస్యలు మాత్రమే ఉన్నాయనే అభిప్రాయానికి వస్తారు.

దేనినెనా అదే విధంగా చూసి – ముందుకి సాగండి

బుద్ధుడు ఒక మాటని ఉపయోగించేవాడు. తథత్ అంటే ఉన్న దాన్ని అదే విధంగా చూడగలగటం. అక్కడ ఉన్న దాన్ని అదే విధంగా చూడాలి కాని దానికి మీ ఊహల్ని అభిప్రాయాల్ని కలపకూడదు.

కానీ చాలాసార్లు మనం ఏ విషయాన్నెనా మన బాధలలోంచి మాత్రమే చూస్తాం. ఎప్పుడెతే ఏ విషయాన్నెనా దాన్ని అదే విధంగా చూడగలిగితే అందులో సంతోషం ఉంటుంది. సంతోషం ఉన్నప్పుడు మాటలు ఉండవు, ఆ మాటలు రికార్డు కావు. అంతా ఖాళీ ప్రదేశం మాత్రమే ఉంటుంది. అందుకే మీరు సంతోషంగా ఉన్నప్పుడు తేలికగా ఉన్నట్లు ఉంటారు. ఎందుకంటే మీ లోపల ఏదీ రికార్డు కాదు. మీరు ప్రతి దాన్ని సమస్యలోపలి నుంచి, బాధలోంచి చూసినప్పుడు మీ లోపల చాలా మాటలు రికార్డులు అవుతాయి. అందుకే మీరు బరువుగా ఉన్నభావన కలుగుతుంది.

ఒక చక్కని మాట ఉన్నది, 'మనం దేన్నీ అదే విధంగా చూడం. మనం ఏమిటో ఆ విధంగా చూస్తాం.'

ఒక విషయం అర్ధం చేసుకోండి; మనం చూసే వాటిలో ఏదైనా సరిగా లేదు అని మీకు అనిపిస్తే, మీ అంతరంగంలోనికి మీరు చూడవలసిన సమయం ఇది అని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు బయటకి చూసేది అక్కడ నుంచి మాత్రమే.

ఉన్న దాన్ని అదే విధంగా చూడటానికి ఆలోచనల నుంచి ఏ విధంగా దూరంగా ఉండవచ్చు. నిరంతరం ఈ క్షణంలో ఏ విధంగా సంతోషంతో ఉండగలం? మీరు ఒక చిన్న పద్ధతిని ప్రయత్నించండి. మీరు దేనినైనా చూసినప్పుడు ఒక పుస్తకం, ఒక వస్తువు, ఒక సంఘటన, ఒక వ్యక్తి దేనినైనా సరే చూడగానే మీ నుంచి పాత మాటలు మనకి బాగా తెలిసిన స్పందనలు బయటకి వస్తాయి. వెంటనే మీరు ఎరుకతో, తెలుసుకునే తత్వాన్ని తీసుకువచ్చి, ఆ మాటలని చెదరగొట్టండి. ఆ విధంగా చేసిన తరువాత ఆ సంఘటల్ని, లేదా వ్యక్తిని కొత్త కళ్ళతో చూడండి. మీరు మొదటి సారి చూస్తున్న భావంతో చూడండి. అప్పుడు మీకు మీ సమస్యలు భావాలు, అభిప్రాయాల మూలంగా ఎంత పోగొట్టుకున్నారో తెలుస్తుంది.

మీరు మీ భార్య, భర్త లేక అన్నదమ్ములు ఎవరినైనా సరే మొదటి సారి చూస్తున్న భావంతో చూడండి. అప్పుడు మీరు ఎటువంటి బాధ కలగకపోవటాన్ని చూసారు. అంతే కాదు అన్నీ మీకు ఒకే విధంగా కనిపించటం ప్రారంభమవుతాయి. మీకు బాగా తెలిసిన వ్యక్తి, కొత్త వ్యక్తి ఒకే విధంగా కనిపిస్తారు. అది సరైన పద్ధతి. మీకు శాశ్వతంగా ఎవరూ తెలియదు. మీ భార్య కూడా మీకు తెలియదు. అందరూ సర్వస్పష్టితో పాటు మారుతూ ఉంటారు. కేవలం మీ మానసిక వ్యవస్థ మాత్రమే శాశ్వతంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది.

ఎప్పుడెతే మీరు దేన్నెనా అదే విధంగా చూడటం మొదలు పెడతారో మీలోని శక్తి మీతోనే ఉంటుంది. మీలో ఎటువంటి బాధ ఉండవు. మీలో సందిగ్దత, అనుమానం ఉండవు. బాధ ఎందుకు వస్తుందంటే మీలోని మాటలు మీరు చూసే దాన్ని వ్యతిరేకిస్తుంది. మీలో ఆ పోరాటం ఆగగానే, మీరు దాని మీద ఖర్చు పెట్టే శక్తి మీలోపల ఉండిపోతుంది.

ఒకరు జిద్ధు కృష్ణమూర్తిగారిని ఉన్నదాన్ని అదే విధంగా ఎలా చూడగలం దానికి అనుగుణంగా ఎలా ఉండగలం అని అడిగారు. దానికి ఆయన చాలా చక్కగా జవాబు చెప్పారు, 'మీరు దానికి పేరు ఇవ్వవద్దు, అప్పుడు మీరు అసలైన దానికి అనుగుణంగా ఉంటారు.'

సాధారణంగా మనం దేన్నెనా చూస్తున్నప్పుడు మనం దాన్ని దాంతో గుర్తించటానికి ప్రయత్నిస్తాం లేదా దాన్ని ఖండించటానికి ప్రయత్నిస్తాం. ఉదాహరణకి మిమ్మల్ని ఎవరైనా దుడుకు స్వభావం గల వారు అని అంటే మీరు అదే విధంగా ఉండటానికి ప్రయత్నిస్తారు లేదా ఆ విధంగా ఉండకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. మీరు దుదుకు స్వభావాన్ని అర్థం చేసుకోరు. దానికి అతీతంగా వెళ్ళరు. మీరు దేనిలో చిక్కుకుంటారో ఆ పరిధి వరకు మాత్రమే ఆ విషయాన్ని అర్థం చేసుకోగలరు. ఏ విషయాన్నెనా నిజంగా అర్థం చేసుకోవాలి అంటే మీరు దానికి అతీతంగా వెళ్ళాలి. దానికి మీరు దుడుకు స్వభావం అని పేరు పెట్టటం మానివేయాలి, అంతే అప్పుడు దుదుకుతనం అనేది ఉండదు. దానికి పేరు పెట్టటం మూలాన మీరు మీలో వ్యతిరేక భావాల్ని సృష్టిస్తారు. ఆ విధంగా దేన్నెనా దానిలా చూడగలరు. దానికి పేరు ఇవ్వటం మానేయండి.

ఒక వ్యక్తి బస్సులోకి ఎక్కి ఒక యువకుడి పక్కన కూర్చుంటాడు. ఆ అబ్బాయి హిప్పీ. అతను ఒక్క కాలికే బూటు వేసుకుంటాడు.

అతను అబ్బాయిని, 'ఒక కాలి బూటు పోయిందా?' అని అడుగుతాడు. ఆ అబ్బాయి, 'కాదు, ఒక బూటు దొరికింది.' అని జవాబు ఇస్తాడు.

ఏ పరిస్థితికైనా పేరు పెట్టటం అనే దాన్ని మానేయండి. అది ఒక వ్యక్తి లేదా పరిస్థితి ఏదైనా కేవలం చూడండి. అంతే దాన్ని ఖండించటానికి లేదా స్వీకరించటానికి చేసే ఆలోచనలకి తావు ఇవ్వకండి. ప్రారంభంలో అభిప్రాయాలు వెల్లడి చేయటం తప్పని సరి అవుతుంది. ఎందుకంటే అది మీ అలవాటు. కాని ఉన్నదాన్ని ఉన్నట్లు చూసినప్పుడు మీ లోపల గొప్ప శక్తి పుడుతుంది. అప్పుడు మీరు ఆలోచనలు, వ్యథలు, బాధలు లేనటువంటి స్థితిలో ఉండాలి అని కోరుకుంటారు. మీరు ఎప్పుడైతే ఉన్న దాన్ని ఉన్న విధంగా చూడగలరో మీరు స్వర్గంలో ఉంటారు. మీరు చూడాలి అనుకున్న విధంగా చూసినప్పుడు మీరు నరకంలో ఉంటారు. ప్రతీదీ శుభకరం అని మీరు అనుకున్నప్పుడు మీరు ఆశించటం అనే దాన్ని వదిలివేస్తారు ఎందుకంటే ప్రతీదీ శుభకరం కాబట్టి.

ఒక చిన్న కథ : ఒక శిష్యుడు గురువుగార్ని పదే పదే 'గురుదేవా! స్వర్గం ఎక్కడ ఉంది? అని అడుగుతుంటాడు. చివరికి ఒకరోజు గురువుగారు, 'నీకు నిజంగా తెలుసుకోవాలని ఉందా?'' అంటాడు. శిష్యుడు 'అవును గురుదేవా!' అంటాడు.

అప్పుడు గురువుగారు,'సరే! నా మొదటి శిష్యుడు హేమచంద్ర స్వర్గంలో ఉన్నాడు,' అని కళ్ళు మూసుకొని ధ్యానంలోనికి వెళ్ళిపోతాడు.

శిష్యుడికి గురువుగారు ఇప్పటిలో కళ్ళుతెరవరు అని తెలుసు. అప్పుడు అతను వెళ్ళి కొంతమందిని హేమచంద్ర ఎక్కడ ఉండేవాడు అని అడుగుతాడు. కాని వాళ్లంతా తెలియదంటారు. చివరకి ఒక వ్యక్తి 'అక్కడికి ఎలా వెళ్ళాలో నీకు చెబుతాను కానీ నేనెప్పుడూ అక్కడికి వెళ్ళలేదు, అది చాలా లోతైన లోయ అది మంచు కొండల వెనుక ఉంటుంది,' అని చెబుతాడు.

శిష్యుడు సూచనలు, దారి అంతా చాలా జాగ్రత్తగా రాసుకుంటాడు. గురువుగారి దగ్గరకి వెళ్ళి, 'గురుదేవా!' నేను హేమచంద్రదని చూడటానికి వెళ్ళాలి అనుకుంటున్నాను,' అంటాడు.

గురువుగారు ఏదో పనిలో పూర్తిగా లీనమై ఉంటాడు. అతని వైపు చూడకుండానే, 'సరే వెళ్ళు' అంటాడు.

శిష్యుడు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అతను చాలా రోజులు ప్రయాణం చేస్తాడు. అతను ఎండా, వర్షం, మంచు ఇలా అన్నింటినీ దాటుకుంటూ ప్రయాణం చేస్తుంటాడు. చివరికి పూర్తిగా అలసిపోతాడు. బలహీనపడి మరణించే దశకి చేరతాడు. చివరిగా వందరోజులు ప్రయాణం చేసి ఆ లోయని చేరతాడు. అక్కడికి చేరి ఆ లోయని చూసి 'ఇదేమంత గొప్పగా లేదు. ఇంతకంటే అందమైన లోయల్ని చాలా చూసాను. గురువుగారు దీన్ని స్వర్గం అని ఏ విధంగా అన్నారు' అని అనుకుంటాడు.

అతను చుట్టూ చూసి ఇంకా కొంచెం ముందుకి వెళ్ళి చూసే అక్కడ హేమచంద్ర కుటీరం కనిపిస్తుంది. శిష్యుడిని చూసి హేమచంద్ర చాలా సంతోష పడతాడు. అతనికి భోజనం పెట్టి 'గురువుగారు మిగిలిన శిష్యులు ఎలా ఉన్నారు' అని అడుగుతాడు. శిష్యుడు ఈ సమయమమంతా ఇలా ఆలోచిస్తూనే ఉంటాడు, 'గురువుగారు ఈ స్థలాన్ని స్వర్గం అని ఏ విధంగా అన్నారు. నేను నమ్మలేక పోతున్నాను. '

ఒక వారం గడిచాక అతను తిరిగి గురువుగారి దగ్గరకి వస్తాడు. తిరిగి రావటానికి అతనికి మరొక వందరోజులు పడుతుంది.

అతను తిన్నగా గురువుగారి దగ్గరకి వెళ్ళి, 'గురుదేవా! మీరు ఆ స్థలాన్ని స్వర్గం అన్నారు. కాని నేను చూసింది చాలా సామాన్యమైన ప్రదేశం.' అని అంటాడు. అప్పుడు గురువుగారు, 'అయ్యా! భగవంతుడా నీవు నన్ను అడిగే సమయంలో పూర్తిగా నీ ఉద్దేశం ఏమిటో వివరించాల్సింది. నీకు సత్యాన్ని చెప్పేవాడిని,' అంటాడు. శిష్యుడు,'సత్యం ఏమిటి గురుదేవా!' అని ప్రశ్నిస్తాడు.

గురువుగారు ఇలా సమాధానం చెబుతాడు, 'హేమచంద్ర స్వర్గంలో లేదు స్వర్గం హేమచంద్రలో ఉంది. '

మీరు స్పష్టికి సమీపంగా ఎటువంటి ఆశించటాలు లేకుండా, ఉన్నదాన్ని అదే విధంగా చూడగలిగితే అందులోనే దివెనలన్ని పొందగలిగితే, మీరు మీలోపల స్వర్గాన్ని నింపుకుంటారు. స్వర్గం అంటే అదేదో ఒక స్థలం కాదు. అది మానసికమైంది. అది భౌతికమైంది కాదు. మీరు నిర్ణయించుకుంటే ఈ క్షణం స్వర్గంలో ఉండవచ్చు. చాలా మంది నా దగ్గరకి వచ్చి వాళ్లు కలలో చూసిన విషయాలు చెప్పి వాటి అర్దాలు అడుగుతుంటారు. నేను వారికి చెబుతాను, 'నిజంగా జరిగే వాటినే మనం స్వీకరించే స్థితిలో లేం, ఇక కలల్లో జరిగే విషయాలు ఎందుకు' అని అంటాను.

ఒకరోజు ఒక వ్యక్తికి ఒక కొత్త రకం కల వస్తుంది. అతనికి ఆ కల అర్థం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. అతను గురువు దగ్గరకి వెళ్ళి తన కల గురించి చెప్పి వివరణ చెప్పమంటాడు.

అప్పుడు గురువు ఆ వ్యక్తితో, 'నీవు మేలుకొని ఉన్నప్పుడు వచ్చే కలల గురించి అడగటానికి నా దగ్గరకి రా. మనం వాటి మీద పని చేద్దాం. నీకు నిద్దలో వచ్చే కలల గురించి నా దగ్గరకి రావద్దు. అవి నా మేధస్సుకి, నీ ఊహకి అందనివి' అని జవాబు ఇస్తాడు.

మీరు ఇంకా మీ కలల గురించి కలత చెందుతుంటే మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. కలలు మేల్కొని ఉన్నప్పటి మీ మానసిక స్థితిని తెలియచేస్తాయి. మీరు మేల్కొన్నప్పుడు మీ మనస్సుని ఏ విధంగా మార్చగలరో ఆలోచించండి. ఉదాహరణకి మీరు మేల్కొన్నప్పుడు కోరికల గురించి ఎక్కువ ఆలోచిస్తే, మీకు వచ్చే కలలన్నీ ఆ కోరికలతోనే ఉంటాయి. మీరు పరీక్షలో మంచి మార్కులతో పాస్ అవ్వాలని అనే ఆత్రుతతో ఉంటే మీరు కలలో పరీక్షలు రాసారు. మీ సంబంధ బాంధవ్యాలు గురించి ఎక్కువ ఆలోచిస్తే మీ కలలో ఎవరితోనైనా పోట్లాడతారు. కాబట్టి మీ కలలు ఏమి చెబుతున్నాయో ఏమి సూచిస్తున్నాయో తెలుసుకోండి. అంతకు మించి కలలకి అర్థం ఉండదు. నిద్ర లేచి అదేమిటో అదే విధంగా చూడండి.

వ్యథ ఆనువంశికంగా తరువాత తరాలకి బదిలీ అయింది

వ్యథ అంటే తాతలనుంచి తండ్రులకు, తండ్రుల నుంచి పిల్లలకి బదిలీ అయ్యే ఒక అయిష్ట సంపద. పిల్లలు స్పాంజిలాంటి వారు. వాళ్ళు తల్లితండ్రుల శరీర కదలికల్ని, వారి ధోరణిని ఇట్టే గ్రహిస్తారు. తల్లితండ్రులకి ఈ విషయం తెలియదు. ఉదాహరణకి ఎవరైనా ఒక తల్లి పదే పదే ఒక బాధని అంటూ ఉన్నదనుకోండి, అది గమనించిన పిల్లలు దాన్ని తమ అంతరంగంలో నింపి, దాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవారయ్యే కొద్దీ ఆ మాటలనే అంటుంటారు. వ్యథకి ఇదొక కారణం.

ఆ పిల్లలు ఆ వ్యథలని తమ వివాహం వరకూ తీసుకు వెళతారు. ఇప్పుడు అతను, అతని భార్యా ఇద్దరూ ఈ వ్యథతో వ్యవహరించాలి. నిజానికి అది అతని తల్లికి సంబంధించింది. ఆ తరువాత అతని పిల్లలకి అదే వస్తుంది. మీరు సంఘటనలకు పేరు పెట్టటం మానేసే వరకూ ఇది జరుగుతూ ఉంటుంది. మీరు ఉన్న దాన్ని అదే విధంగా చూస్తూ, అదే విధంగా జీవించటం నేర్చుకునే వరకూ ఇది జరుగుతుంది.

తల్లితండ్రులు నిరంతరం బాధని వెల్లడి చేస్తుంటే, పిల్లలు ఏమనుకుంటారంటే బాధలు ఉంటేనే జీవితం గడుస్తుంది అని. ఒక విషయం అర్థం చేసుకోండి, జీవితం మీ మూలాన గడవటం లేదు, మీరు లేకపోయినా గడుస్తుంది.

మనం ఈ విధంగా బాధపడటానికి శిక్షణ పొందాం. బాధ పడటం మీద నేను ఒక రిపోర్టు చదివాను. మనం బాధపడే విషయాలలో నలభై శాతం అసలు జరగవు. ముప్పై శాతం గతానికి సంబంధించినవి, మనం ఏమీ చేయలేం. పన్నెండు శాతం ఇతరులకి సంబంధించినవి, అది మన వ్యవహారం కాదు. పది శాతం అనారోగ్యం గురించి అది కేవలం ఊహ మాత్రమే. ఎనిమిది శాతం బాధపడదగిన విషయాలు కానీ వాటికి అంత శక్తి ఖర్చుపెట్టనవసరం లేదు. మనం చేసే పనులలో నమ్మకం ఉంచుతూ ఉంటే వాటిని అధిగమించవచ్చు. కాబట్టి సున్నా శాతం బాధలే బాధ పడదగినవి.

ఎవరైనా గణాంకాలతో ఏ విషయాన్ని చెప్పినా నమ్ముతారు. అందుకే నేను గణాంకాలతో చెబుతున్నాను. లేకపోతే ఒక్క వాక్యం చాలు, 'బాధ పడకండి, మీ పని చేయండి అప్పుడు ఏది ఎలా జరగాలో అదే విధంగా జరుగుతుంది' అని. కానీ సమస్య ఏమిటంటే తల్లితండ్రులు తమ పిల్లలు వ్యథ చెందాలి అని చూసారు. వారు బాధపడకపోతే వారిని జాగ్రత్త లేనివారు అంటారు. బాధపడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.

జాగ్రత్త అంటే పని చేయటం, బాధ పడటం అంటే అంతరంగపు మాటల ప్రవాహం. మాటలు అంటే బ్రిడ్జి రాకుండానే దాన్ని దాటటం లాంటిది.

ఒక యువకుడు అతని తల్లిని పక్క గ్రామానికి కారులో తీసుకువెళుతుంటాడు. వాళ్ళ గ్రామం దగ్గర ఉన్న పాత బ్రిడ్జి గుర్తుకి వస్తుంది. అది ఉపయోగించటానికి పనికి రాదు.

అతని తల్లి నేను కారులో ఆ బ్రిడ్జిని ఎప్పుడూ దాటలేదు అంటుంది. కొడుకు ఆమెతో అది వచ్చినప్పుడు చూద్దాం అంటాడు. అప్పుడు తల్లి మనం ఆ బ్రిడ్జి దాటటానికి ప్రయత్నిస్తే, మధ్యలో విరిగిపోతుంది అంటుంది.

అది ఎంత బలంగా ఉన్నదో చూదాం. ఏమీ చూడకుండా మనం దాన్ని దాటం కదా! అంటాడు. అతని తల్లి, ఏదైనా జరిగి నీకు ఏదైనా అయితే నీ తండ్రి నన్ను క్షమించడు, అంటుంది. ఈ విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది.

ఇంతలోనే వాళ్ళు బ్రిడ్జి దగ్గరకి వస్తారు. అక్కడ కొత్త బ్రిడ్జి ఉంటుంది.

మీరు రెండు విషయాల్ని అర్థం చేసుకోవాలి. కాలం ప్రకారం ప్లాను చేయటం, మానసికంగా బాధపడటం. కాలం ప్రకారం చేసే ప్లానులో ఏ పనులు ఎప్పుడు చేయాలో టైం ప్రకారం ఉంటుంది. ఉదాహరణకి; నేను ఉదయం ఆరు గంటలకి నిద్రలేచి మెడిటేషన్ చేసి ఏడుగంటలకి స్నానంచేసి….. ఈవిధంగా ఉంటుంది.

ఇటువంటి ప్లానింగ్ బాగుంటుంది. అయితే ప్రతి పని ప్రారంభించేముందు మీరు కంగారు పడతారు. ప్రతీ పనిలో మంచి చెడ్డల గురించి అలోచిస్తారు. దీన్నే వ్యథ చెందటం అంటారు. అది అవసరంలేదు. కాలం ప్రకారం ప్లాను మంచిదే కానీ మానసికంగా కంగారుపడటం అనవసరం. దీని అర్థం బ్రిడ్జిరాకుండా దాన్ని దాటటం. బాధపడటానికి చాలా శక్తిని ఖర్చుచేసారు. అది ఉపయోగంలేదు. నేను పైన చెప్పిన కథలో కొడుకు జాగ్రత్త పడతాడు. బ్రిడ్జి రాకుండా దాన్ని గురించి అంత ఆందోళన ఎందుకు.

అర్థం చేసుకోండి, ఆందోళన పడటం, సున్నితత్వంతో ఉండటం వేరు వేరు విషయాలు. అవసరానికి తగిన విధంగా సున్నితత్వంతో ఉండవచ్చు కాని ఆందోళన పడనవసరంలేదు. పిల్లల్ని చూడండి, మీ ఆరోగ్యం బాగా లేనప్పుడు ఎంతో సెన్సిటివ్‌గా ఉంటారు. సున్నితంగా స్పందిస్తారు. కానీ మీలా ఆందోళనపడరు. వ్యథ చెందరు. మీపిల్లలు ఎదుటి వారి అవసరాలకి

సున్నితంగా స్పందిస్తుంటే చాలా మంచిది. అది చూపించటానికి వారు వ్యథ చెందనక్కరలేదు. నిజానికి మీరు సంతోషపడాలి, ఎందుకంటే పిల్లలు ఇంట్లో వ్యథలని మరింతగా చేయనందుకు.

మీరు మీ ఇంట్లో భౌతికంగా ఉన్న గదులు, కార్పెట్‌ని, నేలని శుభ్రం చేయవచ్చు. కానీ ఇంటిలో భౌతికంగా లేని మిగిలిన ప్రదేశాన్ని ఏవిధంగా శుభ్రం చేసారు? ఈ స్థలంలోనే ఇంట్లోని శక్తి తిరుగుతూ ఉంటుంది.

మీ ఆలోచనలు మానసిక స్థితిని ఆ ప్రదేశమే కల్పిస్తుంది. మీ వ్యథలన్నీ ఆ ప్రదేశంలోనే వేలాడుతూ ఉంటాయి.

అందుకే ఇంట్లోకి రాగానే మీకు పరిచయమున్న చింతలు, మీ లోనికి వస్తాయి. ఆ ప్రదేశంలో వేలాడే చింతలు, బాధలు, మిమ్మల్ని వాటి గుప్పెటలోనికి తీసుకుంటాయి. అర్ధం చేసుకోండి మీ మానసిక వ్యవస్థ ఆ ఇంట శూన్య ప్రదేశంలో స్థిరపడుతుంది.

ప్రదేశాన్ని మీరు కలుషితం చేయటం ద్వారా మీరు వేరే వ్యక్తులకి కూడా హాని చేస్తున్నారు, అది సమస్య. చాలామంది ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయటానికి పూజలు హోమాలు చేసుంటారు. కానీ అది చాలదు. అవి జరిగాక తిరిగి మీ వ్యతిరేకపు ఆలోచనలు ఆ ప్రదేశం అంతా స్థిరపడతాయి. అటువంటప్పుడు శుభ్రపరిచే హోమాలు అనవసరం. హోమాలతో పాటు మీరు అనుకూల ఆలోచనలని పెంపొందించుకుంటే, మీ ఇంట్లో ఉన్న శక్తి శుభ్రపడుతుంది.

వ్యథ, అయోమయం – మన అంతరంగపు సాఫ్ట్‌వేర్

ఒక వ్యక్తి గాఢనిద్రనుంచి ఒక్క కుదుపుతో మేలుకుంటాడు. అతని స్నేహితుడు విషయం ఏమిటి అని అడుగుతాడు. 'నేను నిద్రమాత్ర వేసుకోవటం మర్చిపోయాను' అంటాడు.

ఆందోళన అనేది మనలోపల లోతుగా స్థిరపడిన ఒక క్రమం. అది స్వతంత్రంగా ఏర్పడుతుంది. దానికి వేరే కారణం అవసరంలేదు. అది సిగరెట్టు, ఆల్కహాలులా ఒక అలవాటు. నేను ఈమధ్య అమెరికన్ కాలేజి ఆఫ్ చెస్ట్ ఫిజీషియిన్స్ నిర్వహించిన ఒక పరిశోధన గురించి చదివాను. ఆ ఫలితాల ప్రకారం ఎక్కువ పొగాకుకు అలవాటు పడినవారు గత పద్దెనిమిది సంవత్సరాలలో పెరిగారు అని.

ఇటువంటి అలవాట్లు ఎందుకు వస్తాయంటే మనం మనలోని అలవాటుల క్రమాన్ని నిరంతరం నిలపుకోవటానికి ప్రయత్నిస్తాం. అదే విధంగా మన భావాలక్రమాన్ని నిలపటానికి మనం బాధపడతాం. అది మీ లక్షణం అవుతుంది.

ఒక విషయం అర్థం చేసుకోండి. మనస్సు హార్డ్‌వేర్ అయితే, వ్యథలు సాఫ్ట్‌వేర్ అవుతుంది. ఉదాహరణకి మీరు ప్రతిరోజు ఉదయం పదిగంటలకి ఏదో అందోళన పడతారనుకోండి. అది మీ ఆఫీసు పనికావచ్చు, ఏదైన మీలో ఉదయం పది అనగానే మీరు వ్యథచెందే టైంగా రికార్డు అవుతుంది. ప్రతిరోజు ఉదయం పదింటికి మీరు ఏదో ఆందోళన పడతారు. మీలో చాలామందికి ఈ అనుభవం జరిగిఉంటుంది. అది ఆదివారమైనా అదే విధంగా ఉంటుంది. అప్పుడు మీరు మీరు కాదు. ఇది ఆదివారం నేను ఆందోళన పడనవసరంలేదు ఎందుకంటే ఆఫీసుకు వెళ్ళను కదా అనుకుంటారు. ఆ తరువాత మీకు విరామంగా ఉంటుంది. కాని తరువాత మరల అదే స్థితికి మీ ఆలోచనలు జారుకుంటాయి. ఎందుకంటే అది ఆ విధంగా ప్రోగ్రాం అయ్యింది కాబట్టి.

వ్యథ చెందటం, ఆందోళన చెందటం అనేది మీ అంతరంగంలో ఒక భాగమైపోయింది. ఆ బాధని మీ నుంచి తీసివేస్తే మీరు ఒంటరితనంతో బాధపడతారు. మనం ఏదో పోగొట్టుకున్నట్టు అయిపోతాం. పెద్దవయస్సు వచ్చాక బాధపడటానికి ఏమీ ఉండదు. ఎవరూ మనని సమస్యలకి పరిష్కారాలు అడగరు.

మీరు కొంత మంది పెద్దవాళ్ళను గమనిస్తే, వాళ్ళ పిల్లలకి, కొన్నిసార్లు మనుమలకి పెళ్ళిళ్లు అయ్యాక కూడా న్యూస్ పేపర్లో వచ్చే 'వివాహ బంధాలు' అనే శీర్షిక చూస్తూ ఉంటారు.

మరొక విషయం, మనం ఈ సాఫ్ట్‌వేర్‌లో పడితే, అదే బాధ మరల మరల కలిగి మనం డెలమాలో పడతాం.

అయోమయం అంటే ఏమిటి ? నిర్ణయం చేసే సమయంలో ముందుకీ వెనక్కి ఊగిసలాడటమే అయోమయం. ఇది ఊగిసలాడే మనస్సు. ఇలా ఎందుకు ఊగిసలాడుతుందంటే మన లోపల చాలా ఆలోచనలు ఉంటాయి. అవి మన తుది నిర్ణయం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ ఆలోచన మధ్య చాలా విబేధాలు ఉంటాయి. ఎందుకంటే అవి వేరు సమయాలలో వేరు వేరు సందర్భాలలో ఏర్పడతాయి. అందుకే అవి ఒకదానితో ఒకటి విభేదిస్తాయి. ఆ విభేదాలే మనలోని అయోమయం. ఈ అయోమయం ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన ప్రమాణాలు లేవు.

ఒక చిన్న కథ : ఒక స్నేహితుడు మరొక స్నేహితునితో, "నేను ఇద్దరు అమ్మాయిలని ప్రేమించాను ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. కాని ఆమెకి డబ్బు లేదు. మరొక అమ్మాయి అందంగా ఉండదు. కాని డబ్బు ఉన్నది. నేను ఎవరిని వివాహం చేసుకోను" అని అడుగుతాడు.

అతని స్నేహితుడు, 'నీవు అందంగా ఉన్న అమ్మాయినే ప్రేమించి ఉంటావు కాబట్టి ఆ అమ్మాయినే వివాహం చేసుకో' అంటాడు.

స్నేహితునికి చాలా రిలీఫ్ వస్తుంది. అతను స్నేహితునికి కృతజ్ఞత చెబుతాడు.

అప్పుడు అతని స్నేహితుడు, 'ఆ రెండవ అమ్మాయి పేరు నాకు ఇవ్వు.' అంటాడు

సమస్య అనేది వారివారి మానసిక వ్యవస్థని బట్టి, వారి ఆలోచనల క్రమాన్ని బట్టి ఒకొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆలోచనలు వేరుగా ఉంటాయి అప్పుడు వ్యథ కూడా వేరుగా ఉంటుంది.

ఒక్కొక్కరి వ్యథ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది వారి అంతరంగపు సాఫ్ట్‌వేర్‌బట్టి ఉంటుంది.

అయితే పెద్ద సమస్య ఏమిటంటే మీరు మీ సాఫ్ట్‌వేర్‌కి ఎంతగా అలవాటు పడిపోయారంటే, మీరు సువాసన భరితమైన ప్రధాన భూభాగంతో వేరుపడిపోయి ఒక దీపంలా అయిపోయారు. మీరు అందమైన సృష్టి నుంచి వేరుపడిపోయారు. ఎందుకంటే మీ వ్యథల మూలంగా మీరు సర్వ సృష్టి మీచుట్టూ చేస్తున్న అద్భుతాలని పోగొట్టుకుంటున్నారు. మీరు పొగడటం మర్చిపోయారు. కేవలం పిర్యాదులు చేయటానికే అలవాటుపడ్డారు. మీరు నవ్వటం మర్చిపోయారు. ఆత్రుత పడటమే గుర్తున్నది. వ్యతిరేక విషయాలు మాత్రమే గుర్తుంచుకోవటానికి అలవాటుపడిపోయారు.

మరొక చిన్న కథ : ఒక మాంసం అమ్మేషాపులోనికి కుక్క వస్తుంది.ఆ షాపు యజమాని దాన్ని బయటకి తరిమేసాడు. అయినా అది మరలా షాపులోనికి వస్తుంది. అకస్తాత్‌గా షాపు యజమాని కుక్క నోటిలో కాగితం మీద ఏదో రాసి ఉండటాన్ని చూస్తాడు. అతను దాని దగ్గరకి వెళ్ళి ఆ పేపర్ చూస్తాడు. అందులో ఎవరో ఆర్డరు రాసి ఇచ్చారు.

కుక్కమెడలోని గొలుసు దగ్గర పది డాలర్లు పెట్టి ఉంటాయి. అతను డబ్బు తీసుకొని రాసిన ఆర్డరు ప్రకారం ఒక కవరులో వేసి కుక్క నోటికి ఇస్తాడు. అతనికి ఆ కుక్కని చూస్తే చాలా ముచ్చట వేసింది. షాపు మూసి కుక్క వెనుక వెళతాడు. కుక్క రోడ్డు చివరికి వెళ్ళి క్రాస్ లైన్ల దగ్గర నిలబడుతుంది. అది ఓపికగా ఆ కవరుని నోటీలో పెట్టుకొని ఆకుపచ్చ లైటు వెలిగేవరకూ నిలబడి ఉంటుంది. ఆకుపచ్చ లైటు రాగానే రోడ్డు దాటుతుంది. షాపు యజమాని కూడా దాని వెనకనే రోడ్డు దాటుతాడు.

తరువాత కుక్క బస్ స్టాపుకి వచ్చి టైంటేబిల్ చూస్తుంది. టైం చెక్ చేసుకొని అక్కడ ఉన్న ఒక బెంచి మీద కూర్చుంటుంది. కాసేపటికి ఒక బస్ వస్తుంది. కుక్క బస్సు ముందుకు వెళ్ళి నెంబరు చూసుకొని, తిరిగి ఇంతకుముందు కూర్చున్న బెంచ్ దగ్గరకి వెళ్ళి కూర్చుంటుంది. తరువాత మరొక బస్ వస్తుంది. అది ముందుకి వెళ్ళి బస్ నెంబరు చూస్తుంది. అది సరైన నంబరే వెంటనే బస్సు ఎక్కుతుంది. షాపు యజమాని కూడా బస్సు ఎక్కుతాడు. కొన్ని స్టాపులు అయ్యాక, కుక్క నిలబడి బస్సుని ఆపే బటన్ నొక్కుతుంది.బస్సు ఆగగానే కవరుని నోటితో పట్టుకొని బస్ దిగి నడుస్తుంది. షాపు యజమాని కూడా దాని వెనకనే నడుస్తూ వెళతాడు. కుక్క ఒక గేటులోనికి వెళ్ళి గుమ్మం దగ్గర కవరుపెట్టి, ఎగిరి దోర్‌బెల్ కొడుతుంది. అక్కడికి ఎవరూ రారు. అక్కడే ఉన్న కిటికీని తన తలతో ఆ గ్లాస్ మీద చాలాసార్లు కొట్టిగుమ్మం దగ్గర నిలబడుతుంది. షాపు ఓనరు ఇదంతా చూస్తూ ఉంటాడు. కొంతసేపటికి ఒక లావుపాటి వ్యక్తి

వ్యథ చెందటానికి ఏమీలేదు

వచ్చి తలుపు తీసాడు. షాపు యజమాని ఆశ్చర్యంగా చూసూ ఉంటాడు అతను కుక్కని తిట్టటం మొదలు పెడతాడు. షాపు యజమాని పరిగెత్తి కెళ్ళి, 'ఈ కుక్క గొప్ప మేధస్సు కలది తెలివైనది. నీకు ఎంతో సహాయం చేస్తుంది. అటువంటి దాన్ని ఎందుకు తిడుతున్నావు' అని అడుగుతాడు.

ఆ లావు వ్యక్తి, 'ఇది తెలివైనదా? ఈ వారంలో రెండవసారి ఇది తాళంచెవి మర్చిపోయి వెళ్ళటం' అంటాడు.

మన చుట్టూ ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనం మనలోని సాఫ్ట్‌వేర్ దగ్గరే ఉండి ఈ అద్భుతాలని చూడలేకపోతున్నాం. అన్నీ మిస్ అవుతున్నాం.

తెలుసుకునే తత్వం ఒక మంచి వైరస్

మన మానసిక వ్యవస్తలో చెదిరిపోయిన సాఫ్ట్‌వేర్‌కి పరిష్కారం ఏమిటి? లోతైన తెలుసుకునే తత్వం ఒక మంచి పరిష్కారం. లోతైన తెలుసుకునే తత్వం ఒక మంచి, దయగల వైరస్ (ఒకవేళ అటువంటిది ఉండి ఉంటే). ఒక్కసారి ఆ తెలుసుకునే తత్వం మీ వ్యవస్థలోనికి ప్రవేశిస్తే, మీరు మనస్సుతో పని చేసిన ప్రతిసారి అది వ్యథలోనికి వెళ్ళి దాన్ని నాశనం చేస్తుంది. తెలుసుకునే తత్వం లేదా ఎరుక అంటే, మనలోపల, మన చుట్టూ ఏమైతే జరుగుతుందో కచ్చితంగా దానిమీదకి మన పూర్తి ఏకాగ్రతని తీసుకురావటం ఇది విషయాన్ని గమనించటం. మనం దేన్నైతే తెలుసుకునే తత్వంతో గమనిస్తామో అది కరిగిపోతుంది. అదే తెలుసుకునే తత్వం యొక్క శక్తి. అది శారీరక, మానసిక లేదా మరే బాధ అయినా దాన్ని తెలుసుకునే తత్త్వంతో గమనిస్తే మనం విభేదాలని తొలగించవచ్చు. అప్పుడు మనం సహజంగా ప్రవహిస్తున్నా అన్నింటితో పాటు ప్రవహిస్తూ ముందుకు సాగవచ్చు.

మనం వ్యథ మీద తెలుసుకునే తత్వంతో కచ్చితంగా వ్యథ ఎలా వచ్చింది, ఎలా ఉన్నది అనే వాటిమీద ఏకాగ్రత ఉంచితే వ్యథ కరిగిపోయి మనలో స్పష్టత పెరుగుతుంది.

బుద్ధుడు అతని శిష్యుని గురించి ఒక చిన్న కథ : ఒకరోజు గౌతమ బుద్ధుడు ఉదయం తన శిష్యులకి ప్రవచనాలు, బోధనలు చెప్పటానికి వస్తాడు.ఆయన చేతి రుమాలుని ముడివేసి శిష్యులను వచ్చి ఆ ముడితీయమని చెబుతాడు.

ఒక శిష్యుడు వచ్చి దాన్ని ఇటు లాగి అటులాగి చూస్తాడు. అది మరింత బిగుసుకు పోతుంది. మరొక శిష్యుడు వచ్చి ఆ ముడివైపు శ్రద్ధగా చూసి దాన్ని అలవోకగా విప్పేస్తాడు.

ఆ శిష్యుడు చేసింది, కేవలం ఆ ముడిని జాగ్రత్తగా పరిశీలించటమే. ఆ విధంగా చూసినప్పుడు అతనికి ముడి ఎలా పడిందో అర్థం అయ్యింది. దాంతో ముడి విప్పగలిగాడు. అంటే ముడిని ఏ విధంగా విప్పాలో ముడి అతనికి నేర్పించింది.

మన జీవితంలో వ్యథలే ముడులు. ఆ వ్యథల వైపు తెలుసుకునే తత్వంతో చూడగలిగితే అవి కరిగిపోతాయి. అప్పుడు మనం అసలు వ్యథ అన్నది ఏ విధంగా ఏర్పడిందో స్పష్టంగా చూడగలుగుతాం. అప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్మరించాలో అర్థమెపోతుంది, వ్యథ మనకి ఎలా పరిష్కారాన్ని కనుగొనాలో నేర్పిస్తుంది. అసలు వ్యథ గురించి బాధ పడనవసరం లేదు. జీవితం తన పరిష్కారాలని తాను చూసుకోగలుగుతుంది. ఇది తనంతటతాను పరిష్మరించుకోగల అందమైన నేర్చు. మనం కేవలం సహజంగా అది జరగటాన్ని అనుమతించాలి. అప్పుడు మనం దాని యొక్క అత్యుత్తమ మేధస్సుని తెలుసుకోగలుగుతాం. అప్పుడు మన వ్యథలన్నింటినీ వదిలేస్తాం.

అంతే కాదు ఎప్పుడెతే మనం గమనించటం ప్రారంభిస్తామో అప్పుడు ఆలోచన సంఖ్య తగ్గుతుంది. వ్యథ ఉన్నప్పుడు చాలా ఆందోళనగా ఉంటుంది. ఎప్పుడెతే తెలుసుకునే తత్వాన్ని తీసుకువస్తామో ఆ ఆందోళన క్రమంగా తగ్గుతుంది. అప్పుడు ఏది ఎలా జరగాలో ఆ విధంగా జరుగుతుంది.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి అనుకుంటాడు. అతను ఒక గురువు దగ్గరకి వెళ్ళి, 'నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను. అవి నేర్చుకోవటానికి నాకు ఎంత సమయం పడుతుంది' అని అడుగుతాడు.

గురువు 'పది సంవత్సరాలు పడుతుంది' అంటాడు. ఆ అబ్బాయికి చాలా బాధ అనిపిస్తుంది. అతను, 'నేను బాగా కష్టపడతాను. నేను త్వరగా నేర్చుకోవాలి అనుకుంటున్నాను రోజు పది గంటల కంటే ఎక్కువ సాధన చేయమన్నా చేస్తాను. నేను ఆ విధంగా చేస్తే ఎంతకాలం పడుతుంది,' అని అడుగుతాడు. అప్పుడు గురువు ఆ అబ్బాయితో, 'ఇరవై సంవత్సరాలు పడుతుంది అంటాడు. '

ఇక్కడ గురువుగారు చెప్పేది ఏమిటి అంటే కంగారు పడితే ఏదీ సాధించలేం. మీరు కంగారు పడితే ఆత్రుత పెరుగుతుంది. మీరు నిజంగా ఏదైనా సాధించాలి అంటే మీకు ఆత్రుత ఉండకూడదు కాని తెలుసుకునే తత్వం ఉండాలి. ఎందుకంటే మీలో తెలుసుకునే తత్వం ఉంటే మీరు చేసే పని సరిగ్గా చేయగలుగుతారు. మీరు కంగారులో ఉంటే పని అంతా గందరగోళంగా మారుతుంది.

తెలుసుకునే తత్వం ఉన్నప్పుడు ఏదైనా ఒక దీవెన అవుతుంది. అది అనారోగ్యమెనా సరే. మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆనందంగా ఉండగలరా? మీరు తెలుసుకునే తత్వంతో ఉన్నప్పుడు ఆ విధంగా ఉండగలరు. అనారోగ్యం గురించి మీరు బాధపడనవసరం లేదు. అనారోగ్యం కూడా సర్వ సృష్టి ప్రవాహంలో ఒక భాగమే. మీరు తెలుసుకునే తత్వంతో ఉన్నప్పుడు ఈ విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. జరిగేదంతా విశ్వశక్తి స్థితిలోనే అని తెలుసుకుంటారు. తెలుసుకోగలిగితే లోతుగా అర్థం చేసుకొని విశ్రాంతిగా ఉండగలుగుతారు

ఇతరుల అభిప్రాయాల గురించి కలతపడవద్దు

మనని కలతపరిచే మరొక విషయం, ఎదుటివారు మన గురించి అనుకున్నట్లుగా వారిని తప్పు అని నిరూపించటానికి చేసే ప్రయత్నం. ఇందులో హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే వారి మీద కూడా మన అభిప్రాయాల గురించి ఆందోళన పడుతుంటారు. సమాజం నిరంతరం మనని ఎదుటి వారి అభిప్రాయాలకి విలువ ఇమ్మని అందుకోసమే వ్యథ చెందమని ప్రోత్సహిస్తుంది. అది అసలు సమస్య.

ఎప్పుడైతే మీరు ఎదుటివారు ఏమనుకుంటారో అని ఆందోళన పడతారో, మీరు చేసున్న పనికి పెట్టే శ్రమని బలహీనపరుస్తారు. మీరు పనికి ఉపయోగించవలసిన శక్తిని బాధపడటానికి, ఆందోళన చెందటానికి ఉపయోగిస్తారు.

అసలు మీరు ఎందుకు ఎదుటివారి పొగడలకి అంత విలువ ఇస్తారు. వాటిని అసలు పట్టించుకోవద్దు. ఏ పనైనా సంపూర్ణంగా చేయండి. మీ శక్కికి తగినంతగా చేయగలిగినంత చేయండి. మిగిలింది వదిలేయండి. అంతే, అప్పుడు మాత్రమే మీరు, మీరు చేయగలిగినంత చక్కగా ఆ పన్ని చేయగలుగుతారు. చివరికి మీ బలమే మీది అవుతుంది కాని ఇతరులు కాదు. కాబట్టి మీరు ఎవరి గురించీ, దేన్ని గురించీ బాధ పడనవసరం లేదు. మీరు ముందు నుంచీ మీకు మీరే బలం అనే స్పష్టతతో ఉండాలి. అప్పుడు మీరు ఎదుటివారి గురించి వ్యథ చెందరు.

ప్రోత్సాహంతో పనిచేయాలి కాని వ్యథతో కాదు

మీరు దగ్గరగా గమనిస్తే, మీరు ఏర్పరచుకున్న లక్ష్యాలు మీకు వ్యధలని స్పష్టిస్తాయి. మనం లక్ష్యం వైపుకి ముందుకి సాగేకొద్దీ ఫలితాల గురించి ఎక్కువ ఆందోళన పదుతుంటాం.

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చాలా చక్కగా చెబుతాడు, 'ఏ వ్యక్తి అయితే చేస్తున్న పని నుంచి ఫలితాలని ఆశించదో, జయం అపజయం గురించి ఆలోచించదో. ఆ వ్యక్తి తృప్తిగా సంతోషంగా పని చేస్తాడు. అతనికి ప్రోత్సాహం అవసరం లేదు.'

మీరు ఫలితాల గురించి ఆందోళన పడితే ఆ ఆందోళన ఫలితాల్ని ప్రభావితం చేస్తుంది. ఏ పని చేసినా దాన్ని ఉత్సాహంతో చేయాలి గాని ఆందోళనతో, ఆత్రుతతో కాదు. మీ ఉత్సాహమే మీ పనికి ప్రోత్సాహం కావాలి కాని వ్యథ కాదు. ఉత్సాహం అంటే మీలో పొంగి ప్రవహించే శక్తి. ఈ శక్తి మీరు పనిచేయగల నేర్పును మరింతగా అభివృద్ధి చేస్తుంది. అది పనిని శక్తి వంతం చేయటమే. వ్యథ పనిచేసే శక్తిని కృశింప చేస్తుంది. అది మీ పని శక్తిని తగ్గస్తుంది. ఎందుకంటే ఆ శక్తిని ఉపయోగించి మీరు వ్యథ చెందుతారు.

మీరు ఆత్రుత, ఆందోళనలతో పనిచేస్తే, కేవలం ఫలితాల మీదే దృష్టిని పెదతారు. మీరు ఉత్సాహంతో పనిచేయగలిగితే, ఫలితాల గురించి ఆలోచించరు. అప్పుడు మీ ఏకాగ్రత అంతా పనిమీద ఉంటుంది. ఏ పనినైనా ప్రోత్సాహంతో చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ మీరు అనుకున్న ఫలితాన్ని ఆ పని ఇవ్వకపోయినా మీరు బాధపడరు, కుంగిపోరు. ఎందుకంటే ఆ పనిలోనే మీరు చాలా చక్కని సంత్సపిని సాధిసారు. ఆవిధంగా చేసేపని అద్భుతమైన సంత్పపిని ఇస్తుంది.

ఈ రోజులలో ప్రతిదాన్ని ఉత్పాదకతతో (ప్రొదక్షివిటి) కొలుస్తున్నారు. ఆ విధంగా చూసినా వ్యథ చెందటం సమయాన్ని వృథా పరచటమే. అది ఏ విధంగానూ ఉపయోగపడే పని కాదు.

సమస్య ఏమిటంటే ఈ రోజుల్లో పోటీ ఎక్కువైయ్యింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని, మొదటి స్థానంలో ఉండాలి అనుకుంటున్నారు. దాంతో ప్రతి ఒక్కరూ ఆ స్థానాన్ని పోగొట్టుకుంటామేమో అనే ఆందోళనలో ఉన్నారు. నాకు ఒక విషయం చెప్పండి, మీరు చివరి స్థానంలో ఉంటే నష్టం ఏమిటి? ఎవరో ఒకరు చివర ఉంటారు. మీరు మీ శక్తి కొద్దీ పూర్తిగా పని చేయలేనప్పుడు బాధపడాలి. మీరు మీ శక్తి కొద్ది చేయగలిగినంత చేసాక అసలు బాధపడన వసరంలేదు. నిజానికి మీరు ఏ విధంగా అనుకోకుండా ఉండగలిగితే (అయ్యా చివర ఉన్నాను అని), ముందు ఉన్నవారి కంటే గొప్ప తృప్తిని సాధించగలుగుతారు. ఇది అపజయానికి గుర్శకాదు. ఇది మరొక స్థాయిలో విజయానికి గుర్తు

వ్యథతో నింపబడే ఖాళీని వదలకండి

మీరు ఏమీ ఆశించకుండా పని చేయగలిగితే మీరు సంపూర్ణులే. అప్పుడు వ్యథ కాని అసంత్సప్తి కాని ప్రవేశించటానికి ఖాళీ ఉండదు. మీలో అందోళన లేకపోతే విషయాల్ని వాటిని వాటిలా చూడగలుగుతారు. ఏదీ జరుగుతుందో జరగదో అన్న విషయాన్ని పట్టించుకోవద్దు. వ్యథ అనేది మీరు ఖాళీ ఇస్తేనే మీలోనికి రాగలుగుతుంది. వ్యథ ప్రవేశించగల ప్రదేశం గతం లేదా భవిష్యత్, కాని వర్తమానంలో వ్యథకి ఖాళీ ఉండదు.

ఎప్పుడైతే మీ మనస్సు గతం నుంచి భవిష్యత్‌కి, భవిష్యత్ నుంచి గతానికి మధ్య ఊగుతూ ఉంటుందో, వ్యథ సృష్టించబడుతుంది. గతం అనుభవాలు, భవిష్యత్ నుంచి ఆశించటాలు మధ్య వ్యథ వుంటుంది. ఉదాహరణకి, మీ స్నేహితుడి ఉద్యోగం పోయిందనుకోండి, మీ ఉద్యోగం పోతుందేమో అని మీరు బాధ పడతారు. ఆ విషయం గురించి ఇప్పుడు ఎందుకు బాధపడటం? మీ ఉద్యోగం గురించి మీకు ఇప్పటికే నూటపది సమస్యలు ఉన్నాయి. ఇంకా నూట పదకొండవ దాన్ని కలపటం ఎందుకు? ఉద్యోగం పోలేదు, ఎందుకు దాని గురించి బాధ పడటం. ఆ ప్రదేశంలోనికి వ్యథని అసలు రానీయకూడదు.

ఒక చిన్న కథ : ఒకామె ఆమె కొడుకుకి భోజనం తయారు చేస్తుంటుంది. గిన్నెలో బీన్స్ వేసి స్టవ్ మీద పెడుతుంది. అంతలో ఫోన్ మోగుతుంది. ఆమె ఆ ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంది. అందుకే ఫోన్ తీయాలి అనుకుంటుంది. కాని ఆమె చిన్న పిల్లాడైన కొడుకుని అక్కడ వదిలి ఫోన్ దగ్గరకి వెళ్ళదం ఇష్టం ఉండదు.

ఆమె కొడుకుతో, 'నేను ఫోన్ మాట్లాడి వచ్చేవరకూ ఇక్కడే కూర్చో... ఇక్కడ నుంచి కదలవద్దు. అల్లరి పనులు చేయొద్దు. ఈ బీన్స్ ముక్కులో పెట్టుకోకు…

ఈ విధంగా మనం జరిగిన దాని గురించి జరగబోయే దాని గురించి బాద పడుతూ ఉంటాం. అసలు ఆ అబ్బాయికి బీన్స్ ముక్కులో పెట్టుకోవాలనే ఆలోచన ఉండి ఉండదు. ఇప్పుడు తల్లి అతనికి ఆ ఐడియా ఇస్తుంది. వ్యథ మన జీవితంలోనికి చాలా విషయాలని అనవసరంగా తీసుకువస్తుంది. ఒకవేళ అబ్బాయి నిజంగా ఆ బీన్స్ ముక్కులో పెట్టుకుంటే, ఆమె ఏమనుకుంటుందంటే నేను ఆందోళన పడ్డట్టే జరిగింది అని నా ఆందోళన ఎప్పడూ నిజమే అని అనుకుంటుంది.

జార్టి మెక్ దోనాల్డ్, స్కాటిష్ కవి ఈ విధంగా చెబుతాడు, 'రేపటి బరువుని ఈనాటి బరువుకి కలిపితే, ఆ బరువు మనిషి మోయలేనంత అవుతుంది' అని.

మీకు మీరు అధికమైన బరువుని మోస్తున్న భావంతో ఉంటే, కనీసం ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది మీరు చేసుకున్నదే కాని భగవంతుడు చేసిందికాదు. ఆయన భవిష్యత్ తనకి వదలమని బ్రతిమలాడి చెబుతున్నాడు. మీరు కేవలం వర్తమానంలో ఉండండి చాలు.

ఎప్పుడైతే మీరు ఈ క్షణం యొక్క బాధ్యత మాత్రమే తీసుకుంటారో అప్పుడు ఆ క్షణాన్ని ఎంతో సంతోషంగా గడుపుతారు. మీరు ఆనందకర భవిష్యత్‌ని నిర్మించుకోగలుగుతారు. ఎందుకంటే ఈ క్షణం నుంచే మరుక్షణం పుడుతుంది. ఎప్పుడైతే మీరు ఈ క్షణంలో ఉంటారో మీరు పని చేస్తున్నట్టు అనుకోరు. కాని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు వ్యథలు ప్రారంభమవుతాయి. ఆందోళన పడాలి అంటే ఆలోచించే స్థలం ఉండాలి, ముందుకు వెళ్ళే సమయం ఉండాలి. ఇక్కడ స్థలం అంటే మీ మనస్సు. సమయం అంటే మీరు అనుకునే గతం, భవిష్యత్ మాత్రమే.

ఒక విషయం అర్థం చేసుకోండి. ఎవరైతే ఎక్కువగా ఆందోళనపదుతుంటారో వారికి ఆ ఆందోళనే ఒక ఆశగా ఉంటుంది. అది లేకపోతే అసహాయులవుతారు. వ్యథ ఎప్పుడు ఆశ కాదు. అది అడ్డంకి మాత్రమే. అది ముందుకీ వెనక్కీ వెళుతుందే కాని అందులోంచి ఏమీ రాదు.

ఎప్పుడైతే మీరు ఆందోళనపడటం మానేసారో, మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. కొంతమంది వారి నిర్ణయాలు నన్ను చేయమంటారు. వారు బయట ప్రపంచపు విషయాలని తమ సమస్యలకి కారణాలు అనుకుంటారు.ఆ కారణాల వల్ల వారు మంచి నిర్ణయాలు చేయలేకపోతున్నాం అనుకుంటారు. కొన్నిసార్లు తమ తల్లితండ్రులు వారికి మంచి చదువులు చెప్పించలేదు అని తల్లితండ్రులని తప్పుపడతారు. మీ తల్లితండ్రులకి ఏది మంచి అనిపించిందో దాన్ని చేసారు. వాళ్ళుచేసినదానికి కృతజ్ఞతతో ఉండండి.వాళ్ళు మిమ్మల్ని మంచి చదువులు చదివించి ఉండకపోవచ్చు. కాని మీరు ఒక మంచి వ్యక్తిగా తయారుకాగల విలువలు ఇచ్చారు. కాబట్టి చూసే దాన్ని సంపూర్ణంగా చూసి ముందుకి సాగండి. వర్తమానం మాత్రమే మీ నియంత్రణలో ఉన్నది. మరి ఎందుకు గతం గురించి సమయం వృథాచేయటం.

అదే విధంగా భవిష్యత్ పూర్తిగా విప్పారి తెరవబడి ఉంటుంది. కాబట్టి భవిష్యత్‌లో ఏదైనా జరగవచ్చు. అందులో మంచిని మీరు చేయవచ్చు. అలా చేయటం మీ చేతులలో ఉంది. ఎప్పుడైతే మీరు గతాన్ని తలచుకుంటూ, భవిష్యత్‌కి తయారైతే ఆ గతాన్నే భవిష్యత్‌లో చేయగలుగుతారు. లేకపోతే భవిష్యత్ పూర్తిగా తెరవబడి అందుబాటులో ఉండేది. కేవలం ఆందోళన పడుతూ భవిష్యత్‌లో కూడా అవే పొరపాట్లు చేస్తారు.

వ్యథ ఒక ఊహ మాత్రమే

మీలో కలతలు, బాధలు రావటానికి కారణం ఇదంతా సర్వాంతర్యామి ఆడే నాటకం అనే విషయం తెలియని లోతైన అజ్ఞానమే. మీరు చూడగలిగితే వ్యథలు అన్నీ ఊహలే అని తెలుస్తుంది. మరణం సంభవించినప్పుడు ఏమి జరుగుతుందో గమనిస్తే ఈ విషయం మీకు అర్ధమవుతుంది. మీరు జీవించి ఉండగా మీలోపల నూటపది వ్యథలు ఉంటాయి. మీరు మరణిస్తున్నారనుకోండి ఆ క్షణంలో మీలో ఎన్ని వ్యథలు ఉంటాయి. అప్పుడు కేవలం ఒక్క వ్యథ మాత్రమే ఉంటుంది. అది మీరు మరణిస్తున్నారు అన్నదే. అప్పుడు ఇంతకుముందు ఉన్న వ్యథలు ఇక ఏమీ మీ మీద ప్రభావాన్ని చూపించవు. మన బయట ప్రపంచపు విషయాలు అదే విధంగా ఉంటాయి. కాని వ్యథలు మాయం అవుతాయి. అప్పుడు మీ చుట్టూ ఉన్న వారిని గురించి మంచి విషయాలు మాత్రమే గుర్తు ఉంటాయి.

ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే మీ వ్యథలు ఎప్పుడూ కూడా మీలో ఒక ప్రధాన భాగం కాదు కాబట్టి. అవి మీ మనస్సులో ఒక భాగం, అవి దృఢమైనవి కావు. అవే దృఢమైనవి అయితే మీ మరణ సమయంలో కూడా మీ మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపించేవి.

వ్యథ లక్షణం ఏమిటంటే అక్కడ లేనిదాని వెనక వెళ్ళటం. మీకు ఐశ్వర్యం ఉంటే సంబంధ బాంధవ్యాలు వెనుక ఉంటాయి. మంచి సంబంధాలు ఉంటే చదువు వెనుక వెళుతుంది. చదువు ఉంటే అందం వెనుక ఉంటుంది. అన్నీ ఉంటే ఉన్న దాన్ని అనుమానిస్తుంది.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి కోమాలో కాసేపు, మామూలుగా కాసేపు ఉంటున్నాడు. ఈ విధంగా కొన్ని నెలలు గడిచాయి. అయినా అతని భార్య అతని మంచం పక్కనే రాత్రి పగలూ ఉంటుంది.

ఒకరోజు రాత్రి అతను కళ్ళు తెరచి ఆమెతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. అతను మెల్లని గొంతుతో, ఇలా అంటాడు, 'నాకు నష్టం కలిగి కష్టాలలో ఉన్నన్ని రోజులు నీవు నా పక్కన ఉన్నావు, నేను ఆస్తి పోగొట్టుకున్నప్పుడూ నాపక్కన ఉన్నావు. నా ఆరోగ్యం పాడైనప్పుడూ నా దగ్గరే ఉన్నావు. ఇదంతా చూసి నేను ఏమనుకుంటున్నాను అని నీవు అనుకుంటున్నావు' అని అడుగుతాడు. 'ఆమె మీరు ఏమనుకుంటున్నారు' అని అడుగుతుంది. 'అతను, నీవు నా దురదృష్టానివి అని అనుకుంటున్నాను' అంటాడు..

వ్యథ నిరంతరం తెల్లని బోర్డుమీద ఉన్న చుక్కని మాత్రమే చూడమంటుంది, అదీ సమస్య. అంతే కాదు మనకి వ్యథ అనిపించేది ఊహ మాత్రమే.

మరొక చిన్న కథ చెబుతాను : ఒక శిష్యుడు గురువు దగ్గరకి వెళ్ళి, "నాకు ఈ ప్రపంచాన్ని సన్యసించాలి అని ఉన్నది. కానీ నేను సన్యసించితే నా కుంటుంబం ఏమవుతుందో అని ఆందోళనగా ఉన్నది. వాళ్ళు నా మరణాన్ని జీర్ణించుకోలేరు" అని అడుగుతాడు.

గురువుగారు అతని మాటలు విని, 'సరే నీకు ఒక యోగ రహస్యం చెబుతాను. అది నీకు మరణం సంభవించేలా చేస్తుంది.' అంటాడు.

శిష్యుడు సరే అని ఒప్పుకుంటాడు. అతను గురువుగారు చెప్పిన విధంగా చేస్తాడు. అతని కుటుంబ సభ్యులు అరుస్తూ ఏడుస్తూంటారు. గురువుగారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో, 'నేను అతన్ని బ్రతికించగలను. అయితే మీలో ఒకరు అతని స్థానంలో చనిపోవాలి. దానికి మీలో ఎవరు ముందుకి వస్తారు,' అని అడుగుతాడు.

వారిలో ఒక్కరు కూడా ముందుకు రారు. చివరకి అతని భార్య కూడా ఏదో కారణం చెప్పి ముందుకురాదు. ఇదంతా చూస్తున్న శిష్యుడు నిశ్సాంతపోతాడు. చివరికి వాళ్ళంతా అతను లేకపోయినా ఫరవాలేదు, మనమే ఎదో చూసుకుందాం అని నిర్ణయిస్తారు.

మనం ఒక్కసారి మన బాధలని గమనిస్తే మనకి అందులో ఎక్కడా నిజం కనిపించదు. ఇది సత్యం.

అధీనమై విరామంగా ఉండండి

ఎప్పుడైతే మీరు సర్వాంతర్యామి ప్రణాళికలో ఒక భాగం అని స్పష్టంగా అర్థం చేసుకుంటారో మీలోపల ఒక్క వ్యథకూడా ఉండదు. సర్వాంతర్యామి, విశ్వశక్తి అంటే జీవాధారశక్తి. ఆ విశ్వశక్తికి అద్భుతమైన మేధస్సు ఉన్నది. ఆ మేధస్సు ఈ జగన్నాటకాన్ని ఆడించేది. మనందరం అందులో భాగాలమే. మనం ఆ విశ్వశక్తి అనుగుణంగా మలచుకోగలిగితే, మనం చేసే పనులు ఆ విశ్వశక్తి ప్రవాహంతో పాటు అప్రయత్నంగా ముందుకి సాగిపోతాయి. మనం దానికి అనుగుణంగా లేకపోతే మనలోపల వ్యథలు భయాలు స్థిరపడి మనం ముడుచుకుపోయేలా చేస్తాయి. విశ్వసృష్టి నుంచి మనం చాలా నేర్సుకోవచ్చు. ఉదాహరణకి జంతువులని చూడండి. అవి ఏనాడైనా ఆందోళనగా వ్యథచెందుతూ ఉండటం మీరు చూసారా? లేదు, అవి కూడా మనలానే జీవిస్తున్న జీవులు. అవీ పిల్లల్ని కంటాయి, ఆహారం సంపాదించుకుంటాయి, మరణిస్తాయి. అంతా మనుషుల జీవితంలాగానే ఉంటుంది. మీరు అనవచ్చు వాటికి మాకున్నన్ని సమస్యలు ఉండవు అని. వాటికి ఎందుకు ఉండవు. అవి పిల్లల్ని కనాలి, చనిపోవాలి. మరి అవి వ్యథ చెందుతున్నాయా?

లేదే. వాటికీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ విశ్వాన్ని మొత్తం విశ్వశక్తి నడిపిస్తుంది. అది తప్పకుండా మీ రక్షణ బాధ్యతని తీసుకుంటుంది.

విశ్వశక్తి యొక్క న్యాయసూత్రాలకి మీరు అధీనులైతే మీరు ఈ వ్యథల నుంచి గొప్ప స్వేచ్ఛని పొందవచ్చు. ఒక్కసారి మీరు ఆధీనులైతే అప్పుడు ఏదీ మీలో ఆందోళనని కలిగించదు. మీరు ప్రతి దానిలో దీవెనలనే చూస్తారు. అక్కడ కేవలం ఒక్కటే ఉంటుంది, అధీనమవటం కాని లేదా వ్యథ చెందటం కాని ఈ రెండూ ఎప్పుడూ కలసి ఉండవు. ఒక్కసారి మీరు అధీనులైతే, విశ్వశక్తి ప్రతి చిన్న విషయాన్ని ఎంతో అందంగా ప్లాన్ చేస్తుంది. కాకపోతే దాన్ని మీరు చూడరు.

ఈశావాస్య ఉపనిషత్ ఈ విధంగా చెబుతుంది.'ప్రతి జీవి భగవంతుని వెలుగు రేఖగా చూడగలిగినప్పుడు వారికి ఏ విషయంలోను ఎటువంటి ఆందోళనా ఉండదు.' జరిగే ప్రతీదీ సర్వాంతర్యామి యొక్క వెలుగురేఖ మాత్రమే. అది సత్యం.

ఒక చిన్న కథ : ఒక ధనవంతుడు బౌద్ధ గురువుని కలుస్తాడు. అతను గురువుగారిని తనకు, తన కుటుంబానికి రాబోయే సంవత్సరాలలో ప్రోత్సాహాన్ని ఇవ్వగలదాన్ని ఏదైనా రాసి ఇమ్మంటాడు. అతనికి కొన్ని తరాలు దాన్ని చదివి ఆనందించేది రాయాలి అని ఉంటుంది.

బౌద్ధ గురువు ఒక పెద్ద కాగితం తీసుకొని, తండ్రి చనిపోతాడు, కొడుకు చనిపోతాడు, మనుమడు చనిపోతాడు అని రాసాడు. ధనవంతుడు గురువుగారు రాసింది చదివి చాలా కోపం తెచ్చుకుంటాడు. అతను గురువుగారితో 'నేను నా కుంటుంబ శ్రేయస్సుకి వారి అభివృద్ధికి సంతోషానికి సహాయం చేసే మాటలు రాసి ఇవ్వమంటే మీరు ఈ విధంగా ఎందుకు రాసారు అంటాడు.

అప్పుడు గురువుగారు, 'నీ కొడుకు నీ కంటే ముందే మరణిస్తే అది నీకు అంతులేని దుఃఖాన్ని నీ కుటుంబానికి చాలా బాధని తెస్తుంది. నీ మనుమడు నీ కొడుకు కంటే ముందే మరణిస్తే అది కూడా మీ కుటుంబానికి అంతులేని దుఃఖాన్ని బాధని ఇస్తుంది. మీ కుటుంబంవారు తరతరాలుగా నేను రాసిన క్రమంలోనే మరణిస్తే నిజమైన సంతోషాన్ని, అభివృద్ధిని నీ కుటుంబానికి ఇస్తుంది.

మీ మనస్సు వ్యథతో బాధపడినప్పుడు, మీరు సర్వాంతర్యామి మార్గాలని ఎక్కడో మీ అమాయకత్వంతో మీ మానసిక వ్యవస్థలతో మీకు తోచిన అర్థాలని ఇస్తున్నారు అని తెలుసుకోండి. అప్పుడు మీరు బాధపడటం మానేసారు.

మారువేషంలో ఉన్న అహంకారం

మీలోని వ్యథలని గమనిస్తే వాటికి ఎటువంటి ఆధారం లేదు అని అర్థం అవుతుంది. కాని సమస్య ఏమిటంటే మీ అహం దాన్ని ఒప్పుకోదు. అహం ఈ వ్యథలలో చాలా పెట్టబడి పెట్టింది. వ్యథని అలవోకగా తీసి పారేయలేం. మనం ఎదుటివారికి వ్యథలు అంటే అంత బాధపడతగ్గ విషయాలు కాదు అని చెప్పి ఒప్పించలేం. అలా చెప్పగానే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. మీరు వాళ్ళతో నీ వ్యథలు నిజం కావు అంటే వాళ్ళు ఆనందపడతారు అనుకుంటారు కాని అలా జరగదు. వాళ్ళు చాలా బాధపడతారు. వారి అహంకారానికి అది దెబ్బ. ఎప్పుడైతే వ్యథల్ని గౌరవంతో గుర్తించలేదో వారి అహంకారం బాధపడుతుంది.

చైతన్యమహాప్రభు చాలా చక్కగా చెబుతారు,'ఏ జీవి అయినా భగవంతునితో తనకి ఉన్న సహజమైన సంబంధాన్ని మర్చిపోతే అతనికి బయటి శక్తి ఎక్కువగా వస్తుంది. అది అతనిలో ఒక అబద్ధపు అహంకారాన్ని తయారుచేస్తుంది. అదే అతను తనని తాను శరీరం మనస్సులలో తన గుర్తింపుని చూసుకునేలా చేస్తుంది.'

మీకు విశ్వశక్తితో సంబంధం తెగిపోయినప్పుడే అహంకారం మీలో ప్రవేశిస్తుంది. ఆ అహంకారమే వ్యథలని పెంచిపోషిస్తుంది. వ్యథ అనేది అజ్ఞానం వల్ల స్పష్టించబడుతుంది. అహం దాన్ని పోషిస్తుంది. వ్యథని తీసివేస్తే అహం బాధపడుతుంది. పని విషయంలో బాధపడటం, బాధ్యతల విషయంలో బాధపడటం సంప్రదాయమైన ఉదాహరణలు.

ఒక విషయం అర్థం చేసుకోండి. కష్టపడటం అనేది ఒక అబద్దం. కష్టపడటం అంటే వ్యథ చెందటం ప్లస్ కొంచెం పని చేయటం అంతే. నిజంగా కష్టపడితే అది ఎటువంటి కలతనీ ఇవ్వదు. అది కేవలం ఒక చైతన్యవంతమైన, గాఢమైన కెరటంలా పైకి లేచి కిందకి పడుతుంది. అది వ్యథతో పలుచన అవ్వదు.

ఒక చిన్న కథ : ఒక ఎనిమిది సంవత్సరాల అమ్మాయి వాళ్ళ అమ్మకి ఒక బహుమతి కొని ఇవ్వాలి అనుకుంటుంది. తల్లి చాలా సంతోష పడుతుంది. కనీసం నా కూతురెనా నేను పడుతున్న శ్రమని అభినందిస్తుంది. వేరే ఎవరూ అది చేయరు అనుకుంటుంది.

ఆ అమ్మాయి చాలా తెలివైనది. తల్లికి బహుమతి ఇస్తే సంతోషపడుతుంది అని తెలుసుకుంటుంది. ఆ అమ్మాయి తల్లికి ఒక బహుమతి ఇస్తుంది. 'ఇది నీకు నేను ఇచ్చే బహుమతి. ఎందుకంటే నీవు చాలా కష్టపడి పని చేస్తావు. ఎవరూ దాన్ని పొగడరు' అని అంటుంది.

అప్పుడు ఆ అమ్మాయి తల్లి, 'అవును సరే కాని మరి మీ నాన్నగారు కూడా చాలా కష్టపడతారు కదా ఆ విషయం మర్చిపోవద్దు.' అని అంటుంది. ఆ అమ్మాయి 'నిజమే కాని ఆ విషయంలో ఆయన అంత హడావుడి చేయరు' అంటుంది.

ఇక్కడ హడావుడి అంటే ఆందోళన పడటం, మీరు కొంతమందిని గమనిస్తే వాళ్ళు పరిస్థితిని భూతద్ధంలో చూసి ఎన్నో రెట్లు చేసి ఏదో చాలా పెద్దపెద్ద బాధలు ఈ భూమి మీద వారికే ఉన్నట్లు చేస్తారు. అహంకారం నిరంతరం తన ప్రాముఖ్యతని ఎవరైనా తగ్గిస్తారేమో అని ఆందోళనలో ఉంటుంది. ఎందుకంటే అందరూ అహంకారంతో తాము ఎప్పుడూ ప్రత్యేకమైన వారిమే అని అనుకుంటూ ఉంటారు. మనం మన జీవితంలో చాలా భాగం మన ప్రాముఖ్యత కోసం ఖర్చుచేస్తాం.అర్థం చేసుకోండి, అన్నింటికంటే గొప్ప వరం మనం ఎవరం అనే గుర్తింపు లేకుందా ఆనందంలో ఉండగలగటం. జ్ఞానోదయమైన వారి గురించి ఒక మాట చెబుతారు, వాళ్ళు అత్యంత అసాధారణ వ్యక్తులైఉండీ మేం సామాన్యులమే అనుకుంటారట. కాబట్టి అర్థం చేసుకోండి, జ్ఞానోదయం అంటేనే మీలోపల మీరు విరామంగా ఉండగలగటం. మీరు ఎప్పుడూ ప్రత్యేకమైన వారిలా ఉండాలి అంటే వ్యథలని, అహంకారాన్ని వదిలివేయాలి.

మీ రక్షణ ప్రదేశం నుంచి బయటకి వచ్చేయండి

మీరు మీ వ్యథల నుంచి బయటకి రావాలంటే మీరు ఇప్పుడే వచ్చేయవచ్చు. మీరు మీ వ్యథలని సమర్ధించటానికి ప్రయత్నించకుండా ఉంటే చాలు. కాని ఇక్కడ విషయం ఏమిటంటే మన వ్యథలే మన సౌకర్యవంతమైన ప్రదేశాలు. మనం ఆ రక్షిత ప్రదేశంలో దాగి ఉంటాం. దాగి ఉంటూ, దాని గురించి మాట్లాడటం మనం సోమరిగా ఉండే విధంగా సహాయం చేస్తుంది.

ఒకరు జైన భగవానుడు మహావీరుని (జ్ఞానోదయమైన జైన యోగీశ్వరుడు) ఈ విధంగా అడుగుతారు. 'ఎవరికి వ్యథలు ఉంటాయి.' అని ఆయన చక్కగా చెబుతారు. 'వ్యథలలో ఉన్న వ్యక్తికి' అని.

వ్యథకి కారణం ఏమిటి? అని వాళ్ళు ఆయన్ని మరలా అడుగుతారు.ఆ ప్రశ్నకి ఆయన, 'సోమరితనం' అని జవాబు ఇస్తాడు. వాళ్ళు మరలా, 'ఎవరు మన బాధలు తొలగిస్తారు? అని అడుగుతారు. ఆయన 'మనుషులే తొలగించుకోవాలి' అంటాడు. వాళ్ళు 'వ్యథలకి ముగింపు ఎలా?' అని అడిగితే, సోమరితనాన్ని వదిలివేయండి అని' మహావీరుడు జవాబు ఇస్తాడు.

మీరు సోమరితనాన్ని వదిలితే సరియైన పనిలో పడగలుగుతారు. మీరు వ్యథలతో ఎంత సౌకర్యంగా ఉంటారో మీరు ఎదుటివారి బాధలకి స్పందించే పద్దతి చూస్తే తెలుస్తుంది. ఎవరైనా మీ దగ్గరకి వచ్చి వారి వ్యథలని చెప్పారనుకోండి, మీరు ఏమంటారు, మనం ఏమి చేయగలం. అదంతా ఆ విధంగా జరగాలని ఉంది, జరిగింది. ఇలా చెబుతారు. కాని వారికి స్పష్టమైన, కచ్చితమైన పరిష్కారాన్ని ఇవ్వరు. ఈ విధంగా మీరు ఎప్పుడు చేసారు. స్పష్టంగా అర్ధం చేసుకోండి, వారిని సౌకర్యమైన రక్షిత ప్రదేశంలో ఉంచాలని, మీరు కూడా అక్కడే ఉండాలి అని అనుకున్నప్పుడు.

వ్యథకి కారణం బయట ఉండదు. బయట చాలా సంఘటనలు జరుగుతుంటాయి. కానీ మీ అంతరంగం వాటికి ఎలా స్పందించాలో చెబుతుంది.మీరు వ్యథతో స్పందించాలి అని అనుకుంటే స్పష్టంగా అర్ధం చేసుకోండి, ఎక్కడో మీ లోపల సోమరితనం అనే రక్షిత ప్రదేశం ఉన్నదని. మీరు అక్కడ సౌకర్యంగా కూర్చొని, ఏ పనీ చేయకుండా కలతపదుతూ ఉంటారు.

బయటి ప్రపంచానికి సంబంధించి ఏ విషయాన్నెనా సరియెన నిర్ధయంతో హాండిల్ చేయవచ్చు. మీరు మీ వ్యథల గురించి ఆపకుండా ఎన్ని గంటలైనా అనర్గళంగా మాట్లాడవచ్చు. దేని మీద మీ ఏకాగ్ర‌త నిల‌పాలి అన్న‌ది మీ ఎంపిక‌.

మనం తిరిగి తిరిగి ఆ పాత బాధలనే కోరుకుంటాం. మనం బాధలని ప్రేమిస్తాం, వాటిగురించి పదే పదే మాట్షాడతాం. అలా చేయటం వల్ల మనం చాలా బాధ్యతలని చాలా వ్యథలని మోసున్నాం అని అనుకుంటాం. అలా చేయటం వల్ల నేను చాలా ముఖ్యమయిన వ్యక్తిని అని అనుకుంటాం. నేను లేకపోతే ప్రపంచంలో ఎవరూ ఈ పని చేయలేరు అని అనుకుంటాం.

ఒక వ్యక్తి, అతని భార్య సినిమా విశ్రాంతి తరువాత వాళ్ళ సీట్ల దగ్గరికి హాదావుడిగా వెళుతుంటారు. అతను మర్యాద పూర్వకంగా ఆ లైను చివర కూర్చున్న ఒకామెని 'నేను పొరపాటున మీ కాలు తొక్కలేదు కదా' అని అదుగుతాడు. ఆమె కోపంగా 'అవును తొక్కావు' అని జవాబు ఇస్తుంది. అప్పుడు అతను, 'అలాగా! అయితే ఇదే మా లైను,' అని అంటాడు.

వ్యథ మన లైను అవుతుంది. దాని వల్ల బాధపడినా మీరు వ్యథతో సౌకర్యంగా ఉండగలుగుతారు. మీరు నిజంగా దాని నుంచి బయటకి రావాలి అనుకోవటం లేకపోతే అక్కడే ఉండాలి అని అనుకోవటం ఇక్కడ ప్రశ్న.

మీరు ఒక సమస్యని చూసినప్పుడు దానికి పరిష్కారం కావాలి అనుకుంటే మీరు ఆ సమస్య మీద నిలబడరు. పరిష్కారంలోనికి వెంటనే వచ్చేసారు. అదే విధంగా ప్రతి వ్యథకి వెంటనే దొరికే పరిష్కారం ఉంటుంది. మీరు దాన్ని కోరుకోవాలి, అదే చేయాలి.

చాలా వరకూ మీరు సౌకర్యంగా ఉండే ఆ బాధల వెనుక ఉండటానికే ఇష్ట పడతారు. అది మిమ్మల్ని స్టిరంగా ఉంచుతుంది. ఉదాహరణకి మీరు కాలేజీలో ఉన్న మీ అబ్బాయిని లేదా అమ్మాయిని చూడటానికి వెళుతున్నారనుకోండి. వాళ్ళలో కొంత మంది రూమ్స్‌నీట్‌గా పెట్టకుండా, ఒకరి బట్టలు ఒకరు వేసుకొని ఉండటం మీరు చూసారునుకోండి. ఇదంతా మీ లోపల రికార్డు చేసుకొని, హాస్టల్‌లో జీవితం అంటే ఇదే విధంగా ఉంటుంది అనే కచ్ఛితమైన అభిప్రాయానికి వచ్చేస్తారు. మీరు మీ పిల్లల్ని వాళ్ళ వస్తువులు నీట్‌గా పెట్టుకోమని వేరే వారి బట్టలు వేసుకోవద్దని వాళ్ళకి సలహాలు ఇస్తారు. ఒకవేళ మీ అబ్బాయి తను రూంనీట్‌గా ఉంచుకుంటానని వేరేవారి బట్టలు వేసుకోనని చెప్పినా మీ లోపల రికార్డయిన ప్రోగాంని అంత త్వరగా తుడిచివేయలేరు. ఇంతకు ముందు మీరు గమనించిన విషయం దగ్గరే ఉండిపోతారు.

అక్కడ మీరు రికార్డు చేసుకోతగ్గ అందమైన, చక్కని విషయాలు ఎన్నో ఉండి ఉండవచ్చు. ఉదాహరణకి స్టూడెంట్స్ ఎంత ఉత్పాహంగా, ఆనందంగా ఉన్నారో అక్కడ ఉన్న అందమైన కాంపస్, తోటలు. మీరు మీ అమ్మాయి / అబ్బాయి గురించి ఎప్పుడు ఆలోచించినా ఆ విషయాన్నే ఆలోచించి బాధపడుతూ ఉంటారు. అంతేకాదు మీరు ఎవర్ని కలసినా ఈ విషయమే మాట్తాడుకుంటారు అన్నీ చెబుతారు. మీలో రికార్డు చేయటమే ఒక అబద్ధం. కాని మీరు దాన్ని మీ సౌకర్యంగా ఎంచుకుంటారు. మీరు దాన్ని తిరిగి మరింత బలంగా తయారుచేస్తారు.

నేను ఎప్పుడూ చెబుతుంటాను, మీరు ఇంట్లో కూర్చొని బాధపడుతుంటే దాన్ని ఇంటి పని అంటారు. ఆఫీసులో కూర్చొని బాధపడుతుంటే ఆఫీసు పని అంటారు. బీచ్‌లో కూర్చొని బాధపడుతుంటే సెలవురోజు అంటారు అంతే. మానసిక స్థితి అదే. కాకపోతే స్థలం మారుతుంది. స్థలాన్ని మార్చి మీరు శాంతిని పొందలేరు.

వేరే సీను చూడాలంటే ప్రొజెక్టర్ ముందున్న స్లైడ్ ప్రొజకర్ట్ ముందు పెట్టి ఎన్ని స్కీనుల తెరల మార్చినా అదే బొమ్మ తెరమీద కనిపిస్తుంది. వ్యథని మార్ఫేందుకు మీరు చేసున్న ప్రయత్నాలు తెరని మార్చి వేరే సీను చూడాలి అనుకోవటమే. మీరు నిజంగా వేరే సీను చూదాలి అనుకుంటే స్లైద్ మార్చండి.

మీ ఐశ్వర్యం గురించి ఆందోళన పడటం మానేయండి

అందరికీ ఉండే ఒక శాశ్వతమైన వ్యథ డబ్బు గురించి. ఒక విషయం అర్థం చేసుకోండి మీరు లేచి సరియెన పనిలోనికి వెళ్ళగలిగితే ఈ వ్యథని పరిష్మరించవచ్చు. ఒక మంచి మాట ఉంటుంది, 'సమస్యకి పరిష్మారం దొరక్కపోతే మీరే సమస్య అని అర్థం చేసుకోండి.' మీకు డబ్బు సంపాదించటమే సమస్య అయితే అక్కడ సోమరితనం మిమ్మల్ని వ్యథ అనే సౌకర్యంలోనికి లాగుతున్నది. ఆ సోమరితానాన్ని వదిలించుకొని ముందుకు సాగితే మీరు డబ్బు సంపాదించవచ్చు. ఈ రోజున దొరక్కపోతే మీరు సమస్య అని అర్థం చేసుకోండి. ఈ రోజున ప్రపంచంలో డబ్బు సంపాదించటానికి లక్షలకొద్దీ అవకాశాలు ఉన్నాయి.

ఆ డబ్బు నిలుపుకోవటం మీ వ్యథ అయితే ఖర్చులు తగ్గించుకోండి. లేదా సర్వాంతర్యామికి అధీనులు అవ్యండి.

విశ్వశక్తి మీ ఐశ్వర్యాన్ని నిలపగలదు అనే నమ్మకంతో అధీనులు అవ్వండి. డబ్బు ఎలా నిలుపుకోవాలనేది నిజానికి ఒక పెద్ద సమస్య కాదు. విరామంగా ఉండి సరియైన పని చేయండి.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈవిధంగా చెబుతాడు ఏ వ్యక్తి అంతరంగం, మానసిక వ్యవస్థ ఆధ్యాతిక జ్ఞానంతో నిండి ఉంటుందో, అతని మనస్సు సంపూర్ణ సంతృప్తితో ఉంటుంది. అతనికి బంగారం, రాయి ఒక మాదిరిగానే కనిపిస్తుంది. తనకున్న దాంతో ఎంతో తృప్తి పడతాడు. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉంటాడు. అటువంటి వ్యక్తి ఆత్మజ్ఞానంలో స్థిరపడతాడు. అతనినే జ్ఞానోదయమైన యోగీశ్వరుడు అంటారు.

వ్యథని వదిలి ఆరోగ్యాన్ని పొందండి

మీరు మీ లోపల వ్యథలు, ఆందోళనలతో ఎక్కువ ఆలోచనలని తయారుచేస్తే అవి మీ నాభిప్రాంతం మీద ఒత్రిడిని, బరువుని పెంచుతాయి. నాభిప్రాంతం నుంచి ఆలోచనలు, వ్యథలు ప్రారంభమవుతాయి. మీలో బాధ ఎక్కువ కలిగేతే మీకదుపులో బరువుగా అనిపిస్తుంది. నాభి ప్రాంతంలో మణిపూరక చక్రం ఉంటుంది. అక్కడ వ్యథల బరువు పెరిగే కొద్దీ ఆ చుక్రం ముడుచుకుపోతుంది. ఆ శక్తి కేంద్రం వ్యథలకి స్పందిస్తుంది. దానిఫలితంగా కదుపులో అనారోగ్వం కలుగుతుంది. అందుకే మీరు దేన్ని గురించైనా ఎక్కువ బాధపడితే మీకు కదుపులో అసౌకర్యంగా ఉంటుంది లేదా ఏదైనా భరించలేని వార్త విన్నప్పుడు మీ కడుపులో తిప్పేస్తుంది. మీ ఆలోచనలకి స్పందించే అతిసున్నితమైన భాగం మీకదుపు భాగం.

మీరు గమనిస్తే ఎవరైతే అత్యాశతో ఉంటారో, ప్రతీది కచ్చితంగా చేయాలని అనుకుంటారో వాళ్ళకి అల్గర్స్ ఉంటాయి. పనులు కచ్చితంగా ఉండాలి అనే అత్యాశ ఉంటే కదుపుకి సంబంధించి అనారోగ్యాలు, అల్పర్స్ వస్తాయి. అటువంటి వాళ్ళు ఎప్సుడూ కలతతో, ఆందోళనలో ఉంటారు. అల్పర్స్ అనేవి నిరంతరం వ్యథలతో బాధపడేవారిలో ఉంటాయి. వ్యథలు ఒక అలవాటుగా మారితే మానసిక అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. కాన్సర్ కూడా అందుకే వస్తుంది. వ్యథ అనేది ఏదో ఒక భాగాన్ని ప్రభావితం చేయదు. అది అన్ని భాగాలలో అనారోగ్యాన్ని కలిగిస్తుంది. మానసిక వ్యాధులకి మరే కారణం అవసరం లేదు.

ఒక ఊరిలో కీళ్ళవ్యాధులకి సంబంధించి ఒక డాక్టరు ఉంటాడు. ఆయనకు గొప్పనిపుణుడు అని పేరు. ఎప్పుడూ అతని దగ్గర పెద్ద పెద్ద క్యూలలో పేషెంట్లు ఎదురు చూస్తుంటాడు.

ఒకరోజు ఒక ముసలామె బాగా వంగిపోయి ఒక కుర్ర సాయంతో నడుస్తూ హాస్పిటల్‌కి వస్తుంది. ఆమె వంతు వచ్చాక డాక్టరు దగ్గరకి వెళుతుంది. చాలా అశ్చర్యకరంగా ఐదునిముషాలలో పూర్తిగా నిలబడి నడుస్తూ తల నిటారుగా పెట్టి డాక్టరు రూమ్‌నుంచి బయటకి వస్తుంది.

అక్కడ ఉన్న ఒకామె ఈ పెద్దామెని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఆమె దగ్గరకి వెళ్ళి 'ఇది అద్భుతం! నీవు లోపలికి పూర్తిగా ఒంగిపోయి నడుస్తూ వెళ్ళావు. ఇప్పుడు చక్కగా నిలబడి నడుస్తున్నారు దాక్టరుగారు ఏమి చేసారు.' అని అడుగుతారు.

పెద్దావిడ ఇలా జవాబు చెబుతుంది, 'డాక్టరుగారు నాకు పెద్దకుర్ర ఇచ్చారు'

మనం జీవితంలో చాలాసార్లు ఒక విధానానికి అలవాటు పడి అంతకంటే మెరుగ్గా జీవించలేం అనుకుంటాం. వ్యథ, కలత అన్నవి మనని మన శక్తి కొద్దీ జీవించనీయవు. అది మన శరీరంలోనికి వ్యాధులని ఆహ్వానిస్తుంది. అనారోగ్యం మానసిక వ్యవస్థలో ప్రారంభమవుంది.

కొన్ని వ్యథలు అతిగా ఉంటాయి. అవి అలవాటుగా మారతాయి. అవి మనం చేసే పనులని క్రమంగా నెమ్మదిగా చేస్తాయి. ఇటువంటి బాధని జెనరలైజ్ యాంజైటీ డిస్ఆర్లర్ (జి.ఎ.డి.) అంటారు. ఇది మామూలుగా దైనందిన జీవితంలో అందరూ పడే ఆందోళన కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్, అమెరికా వారి పరిశోధనల ప్రకారం జిఎడి అనేది అరవై ఎనిమిది లక్షలమంది అమెరికన్లకి ఉన్నది అని నిరూపించింది.

అర్థం చేసుకోగలగటం అనేది లోపలికి చూడగల శక్తిని ఇస్తుంది. అది కాల ప్రవాహాన్ని, విశ్వం యొక్క న్యాయసూతాలని, ఏదైనా ఒక విషయం జరగటానికి కారణం దాని ప్రభావం ఇటువంటివి అర్థమయ్యేలా చేస్తుంది. దీంతో లోతైన ప్రశాంతత విశ్వశక్తి పట్ల గౌరవం ఏర్పడతాయి. ఒక్కసారి ఇది జరిగితే, మీ దారిలోనికి ఏది వచ్చినా ఆనందంగా ఉండగలుగుతారు. మీరు జీవితంలోనికి నవ్వుతూ ఆనందంగా ప్రవేశించగలుగుతారు. ఆనందంగా ఉన్న వ్యక్తి జీవితం ఒక ఐశ్వర్యం. అతని జీవితంలో వ్యథకి సమయం, స్థలం ఉండవు.

ధ్యానం ఏ విధంగా సహాయం చేస్తుంది

ఒకసారి ఆందోళన కలిగితే మనం సైకియాట్రిస్ట్ దగ్గరకి వెళతాం. వ్యథకి కారణం మానసిక వ్యవస్తలో ఉంటుంది. కాని బయట కాదు. అప్పుడు మందులు మాత్రమే ఏ విధంగా సహాయం చేస్తాయి.

ప్రపంచంలో చాలామంది ఆందోళన తగ్గించుకోవటానికి సైకియాట్రిస్ట్ దగ్గరకి వెళతారు. మందులు వాదవచ్చు. కాని దానితోపాటు ధ్యానం కూడా అవసరం.

యుద్ధం జరిగే ప్రదేశాలలో మహర్షి మహేష్ యోగి ట్రాన్సెన్‌డెంటల్ మెడిటేషన్ – సిద్ధి కార్యకమం మీద పరిశోధనలు చేసారు. ఆ ధ్యానం చేసినప్పుడు అక్కడ నేరాలసంఖ్య, హింసాప్రవృత్తి, ఆందోళన ఇటువంటివి బాగా తగ్గాయి అని, జీవిత విధానం బాగుపడినట్టు నిరూపణ అయ్యింది.

ధ్యానం మిమ్మల్ని సున్నితంగా చేస్తుంది. అప్పుడు మీలో ప్రేమ కరుణ క్షమత వస్తాయి. క్రమంగా వ్యథలు తగ్గుతాయి. వ్యథ కూడా ఒక రకమైన హింస. అది సూక్ష్మస్తాయిలో ఉండే హింస. అది కనపదకుండా మన వ్యవస్థతో పోరాటం చేస్తుంది. ధ్యానంతో మనలో తెలుసుకునే తత్వం పెరుగుతుంది. అప్పుడు మీరు బయట ప్రపంచపు పనులలో ఉన్నా అవి మీ అంతరంగాన్ని అంటవు. అదే నిజమైన వ్యథలు లేని జీవితం.

ధ్యాన పద్ధతి

మీకు ఒక చిన్న ధ్యాన పద్ధతి చెబుతాను. దీంతో వ్యథలని వదిలివేయవచ్చు. మీరు నిరంతరం అహ్లాదంగా ఉండవచ్చు. ఈ ధ్యానం మిమ్మల్ని ఆనందానికి అనుగుణంగా మారుస్తుంది.దీన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా సాధన చేయవచ్చు. నిరంతరం ఇరవెనాలుగు గంటలూ చేయవచ్చు.

మీరు నిరంతరం ఆనందాన్ని, వెలుగుని శ్వాసిస్తున్నట్టు ఊహించండి. ప్రాణ, మీకు జీవితాన్ని ఇచ్చేశక్తి. మీ ప్రతి శ్వాసతో లోనికి వచ్చి బయటకి వస్తుంది. ప్రాణ అనేది శక్తి, ఆనందం కూడా. అది గాలితోపాటు లోపలకి వచ్చి బయటకి వెళుతుంది. ప్రాణ గాలిని ఒక వాహనంలా ఉపయోగించుకుంటుంది. మీలో జీవనం కొనసాగుతున్నది అంటే కారణం ప్రాణ. అందుకే మీరు శ్వాస తీసుకున్నప్పుడు వదిలే సమయంలో ఆనందపు వెలుగు శక్తిని శ్వాసిస్తున్నట్లు చూడండి. మీ శరీరం మొత్తం వెలుగుతో నింపబడినట్లు భావించండి అప్పుడు మీరు వ్యథలని, చికాకుని వెదజల్లడం ఆపి ఆనందాన్ని వెదజల్లుతారు.అప్పుడు వ్యథలు కరిగిపోతాయి. మీరు ప్రేమని, ఆనందాన్ని నిరంతరం అన్ని దిశలకూ వెదజల్లుతూ ఉంటారు.

సూక్తులు

  • మీకు ఆనందకరమైనది జరిగినప్పుడు కూడా మీరు అది ఎప్పుడు ముగుస్తుంది అన్నట్లు చూస్తారు.
  • ఎప్పుడైతే ప్రతీదీ మంగళకరం అని అనుకుంటారో మీరు ఆశించటం అనే దాన్ని వదిలేస్తారు.
  • వ్యథ అంటే అక్కరలేని ఆశ. తాతల నుండి తండ్రులకి, వారి నుంచి పిల్లలకి బదిలీ అవుతుంది.
  • ఏవైనా ప్రోత్సాహకరమైన ఉత్తాహంతో చేసే పనులన్ని చాలా మంచి ఫలితాలే.
  • మీరు ఖాళీ ఇస్తేనే వ్యథ మీ లోనికి ప్రవేశిస్తుంది.
  • వ్యథ అనేది అజ్ఞానం వల్ల సృష్టించబడుతుంది. అహం దాన్ని పోషిస్తుంది. ఆ వ్యథని తీసివేసే అహం బాధపడుతుంది.
  • మన వ్యథలు మనకి ఒక రక్షణ ప్రదేశం. మనం అక్కడ దాగి ఉంటాం.
  • మీరు వ్యథలని పోగొట్టటానికి చేసే ప్రయత్నం ఎలా ఉంటుందంటే మీరు చూసే సీనుల స్క్రీను మార్చటంలా ఉంటుంది.

వత్తిడి లేని ఉత్తమస్థితి

వత్తిడి లేకుండా బాధ్యత తీసుకోవటమే జీవన్ముక్తి

వత్తిడి అంటే ఏమిటి ?

వ్యథ, వత్తిడి రెండూ దగ్గర సంబంధంకలిగి ఉంటాయి. అవి తల్లీబిడ్డలవంటివి. ఒకటి లేకుండా మరొకటి ఉండదు.ఏది ఒకదానికి పనిచేస్తుందో అదే రెండవ దానికీ పనిచేస్తూంది. అయితే నేటి ఆధునిక సమాజంలో వత్తిడి ఆరోగ్యానికి అధికంగా హాని చేస్తుంది అంటున్నారు కాబట్టి దీనిని లోతుగా చూద్దాం.

నాలుగువందల సంవత్సరాల క్రితం రెనెదేకార్ల్ ఈ విధంగా చెప్పారు, నేను అనుకున్నాను(ఆలోచించాను) అందుకే నేను ఉన్నాను అని. ఇది ఆధునిక ఆలోచనా పద్ధతికి ఆధారం అయ్యింది.కోట్లమంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. ఎదుటివారిని మించి ఆలోచించకపోతే ఈ ప్రపంచంలో విజయులం కాలేం అని ఆయన చెప్పింది ఒక విధంగా నిజం, మరొక విధంగా తప్ప. అయన చెప్పింది సరియైనదే, ఎందుకంటే మనిషికి ఆలోచనలు లేకుండా (మనస్సు లేకుండా) ఎలా జీవించాలో తెలియదు. దీంతో మనుషులు తమ మనస్సుకి బానిసలయ్యారు, బందీలుగా జీవిస్తున్నారు.

దేకార్గ్ కంటె కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం వేదకాలంనాటి ఋషులు, మనిషి ఆలోచనలు ఆపేవరకూ నిజంగా జీవితం ప్రారంభించలేదు అని చెప్పారు. ఆదిశంకరాచార్యులు ఎనిమిది సంవత్సరాల వయస్సులో తుంగభద్రానదిలో తన గురువు నీవు ఎవరు? అని అడిగిన ప్రశ్నకి జవాబుగా, 'నేను మనస్సుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను అహంకారం కాదు, నేను జ్ఞానేంద్రియాలని కాదు, నేను వీటన్నింటికీ అతీతుడను, నేను స్వచ్ఛమైన చేతన స్థితిని' అని చెపుతాడు.

శరీరం మనస్సు మనం అని అనుకున్నంతకాలం మనం జీవయంత్రాలమే. మనం మన జ్ఞానేంద్రియాల ద్వారా ముందుకి నడపబడితే మనం జంతువులకంటే కేవలం ఒక్కదశ ఉన్నతులం మాత్రమే. కానీ నిజమైన మనిషి శక్తి కేవలం ఆలోచించి, తాను జంతువులకంటే ఉన్నతుడిని అని నిరూపించటం కాదు. మానవ జీవిత లక్ష్యం మనస్సుని మార్పుచేసి దాన్ని అత్యున్నత చేతన స్థితిగా రూపాంతరం చెందే విధంగా చేయటమే. ఆ స్థితిలో మనం ఎక్కడినుంచైతే వచ్చామో ఆ దైవత్వాన్ని పొందుతాం.

మనం ఆ స్థితికి చేరేవరకూ, మనం మన నిజమైన స్థితికి చేరేవరకూ మనకి ఈ వ్యథ తప్పదు. మన నిజమైన, సహజమైన స్థితికి మనం చేరుకునేవరకూ మన మధ్య ఉన్న ఘర్హణ యొక్క వ్యథనే టెన్షన్ లేదా వత్తిడి అంటాం.

వత్తిడి లేని ఉత్తమస్థితి

మనస్సు (మైండ్) యండ్రం కాదు

వేదకాలం నాటి మానసిక శాస్త్రం ప్రకారం మనం చెదిరి (డిస్టర్స్) ఉండం. దీన్ని లోతుగా చూద్దాం అప్పుడు మీకు అర్థం అవుతుంది. మీరు టెన్షన్‌లో ఉండరు, మీరే టెన్షన్. మీరు డిస్టర్స్ కాబడ్డారు, మీరు చెదరగొట్టబడారు అనటానికి మీరే డిస్టర్బెన్స్ అనటానికి చాలా తేడా ఉన్నది. ఒక శాస్త్రజ్ఞుల టీం చాలా రోజులు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వారు ఇలా చెబుతారు, ఒక మనిషి చేసే పనులకి మనం అతడిని బాధ్యుడిని చేయకూడదు. ఎందుకంటే తనలోని భావావేశాలతో ఎలా వ్యవహరించాలో, తనలో జరిగే విషయాలని ఎలా నియంత్రించాలో అతనికి మనం నేర్చించలేదు.

ఐదువేల సంవత్సరాలకి పూర్వం వేదకాలంనాటి ఋషులు ఏమి చెప్పారో, ఆధునిక శాస్త్రవేత్తలు అదే చెబుతున్నారు. అతి ప్రాచీనమైన ఈ సమస్యకి వేదాలు, పురాణాలు జవాబుల్ని, పరిష్కారాల్ని చెబుతున్నాయి. అవి పాశ్చాత్య మానసిక శాస్త్రానికి (సైకాలజీకి) వేదకాలం నాటి మానసిక శాస్త్రానికి వారధిలా ఉన్నాయి.

పాశ్చాత్య మానసిక నిపుణులు నన్ను నేనుగానే ఉంచి మనం ఎలా సాధారణ స్థితికి రాగలమో చెబుతారు. ఉదాహరణకి ఈ గదిలో వేడిగా ఉంటే ఎ.సి. పెట్టి చల్లదనాన్ని తీసుకురావచ్చు. అది గదిని చల్లబరుస్తుంది, సౌకర్యంగా చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్య విషయాన్ని మర్సిపోయాం. మనం ఎప్పుడైతే ఎ.సి. మెషిన్ తెస్తామో అప్పుడు దాన్ని మనం నిర్యహించాలి. అది అదనపు టెన్షన్‌ని, సమస్యలను తెస్తుంది. సౌకర్యాలకి మనకు డబ్బుకావాలి. అప్పుడు బయటకి వెళ్ళి పనిచేయాలి.అప్పుడు ఈ గదిని, ఇక్కడ సౌకర్యాన్ని వదిలి ఈ సంతోషాన్ని వదిలి బయటకి వెళ్ళాలి. ఈ గది ఉంటుంది, ఎ. సి. ఉంటుంది. కాని మీరు ఇక్కడ ఉండరు. కరెంటు బిల్లు కట్టటానికి డబ్బు సంపాదించటానికి బయటకి వెళ్ళతారు.

మనం ఒక ముఖ్య విషయాన్ని మర్సిపోయాం. మీరు మీరుగా ఒక అనారోగ్యం. పాశ్చాత్యుల నిర్వచనం ప్రకారం మనస్సు ఒక యంత్రం. వేదకాలంనాటి ఋషుల మాటల్లో అది జరుగుతూ ఉండే ఒక క్రమం. మనస్సు నిరంతరం జరుగుతూ ఉండే ఒక కార్యక్రమం కాని యంత్రం కాదు. నిరంతరం జరిగేది మనస్సు. సంస్కృతంలో మనస్సు అంటే నిరంతరం జరిగేది, అంతేకాని నిశ్చలంగా ఉండేది, చైతన్యం లేనిది కాదు. అది జీవంతో చైతన్యంతో ఉంటుంది. అదే మనస్సు పాశ్చాత్యదేశాల మానసిక నిపుణులు మనస్సుని జీవయంత్రం అంటారు. మనందరం ఒక పదార్ధంలా చూస్తాం. అందుకే మనం ఇంతకిముందు జరిగిపోయిన వాటిని ఒక గొలుసులా తయారు చేసి దాంతో మనస్సు అంటే ఒక గట్టి పదార్థం అని నమ్మటం ప్రారంభిస్తాం.

సంబంధం లేని వాటికి బంధాలు కల్పించటం

మీకు ఒక ఉదాహరణ చెబుతాను. మీకు పది సంవత్సరాల్సకితం కలిగిన బాధ, తొమ్మిది సంవత్సరాల క్రితం కలిగిన బాధ స్వతంత్రమైన, ఒకదానితో ఒకటి సంబంధం లేని సంఘటనలు. ఈ సంఘటనలు వేరు వేరు కారణాలతో, వేరు వేరు సమయాలలో, వేరు సందర్భాలలో, వేరే ఉద్దేశంతో జరిగిన సంఘటనలు. ఒకదానితో ఒకటి సంబంధం లేని ఈ సంఘటనలని కలిపి నా జీవితం వ్యథా భరితం అని అంటారు.

కొన్ని సంవత్సరాల క్రితం, నెలల క్రితం మీకు కలిగిన బాధలు అనేవి ఒకదానికొకటి సంబంధం లేని సంఘటనలు. పది సంవత్సరాల క్రితం మీరు బొమ్మలని పోగొట్టుకొని ఆ దుఖంతో బాధపడి ఉంటారు. తొమ్మిది సంవత్సరాలక్షితం మీ స్నేహితురాలు వెళ్ళిపోయింది అని బాధ పడతారు. మూడు సంవత్సరాల క్రితం మీ అబ్బాయి మీ మాట వినటం లేదు అని బాధ పడతారు. ఈ విధంగా వేరు సందర్భాలలో, వేరు వేరు కారణాలతో మీరు బాధ పడ్డారు. కారణం పూర్తిగావేరు. అయితే మీరు వీటన్నింటినీ కలిపి, నా జీవితం దుఃఖమయం అని డిప్రెషన్‌లోనికి వెళ్ళి మీకు మీరు నరకాన్ని సృష్టించుకుంటారు.

నా జీవితం వ్యథాభరితం అనుకుంటే, జీవితం అదే విధంగా ఉంటుంది. ఒక విషయం అర్డం చేసుకోండి మీరు మీ గతం ఏది అనుకుంటారో దాన్నే మీ భవిష్యత్‌గా మార్చుకుంటారు. మనందరికీ మన గత అనుభవాల నుంచి మనం ఆకాశంలో పక్షిలా ఎగరలేం అని తెలుసు. దాంతో రేపటి నుంచి ఎగరాలి అంటే ఎలా ఎగరగలం? ఎగరలేం. మనం మన గతంలో ఏది నమ్ముతామో, అదే మన భవిష్యత్ అని నమ్ముతాం. కాబట్టి ఒక్కసారి నాగతం దుఃఖమయం అని అనుకుంటే, అచేతనస్థితిలో మన భవిష్యత్ కూడా దుఃఖమయం అని నమ్ముతాం.

మనస్సు అనేది కేవలం ఒక పదార్థం, ఒక జీవమున్న యండ్రం అని నమ్మి, మనకి మనం నరకాన్ని సృష్టించుకున్నాం. అదృష్టం కొద్దీ మనస్సు పదార్థం కాదు. అక్కడ ఆశ ఉన్నది. అది నిరంతరం జరిగే చర్య. అది నామవాచకం కాదు, అది క్రియ. ఎప్పుడెతే మనస్సుని ఒక వస్తువులా చూస్తామో, మనం అక్కడ లేని సమస్యలని సృష్టించుకుంటాం.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి మానసిక నిపుణుడి దగ్గరకి వెళ్ళి, డాక్టర్ నా జీవితం అంతా సమస్యలమయం అన్నాదు. అప్పుడు డాక్టరు; 'అందరి జీవితాలలో సమస్యలు ఉంటాయి, బాధపడకు. ప్రతివారం మనం మూడు సెషన్స్‌లో కలుద్దాం. ఒక్కొక్క సెషన్‌కి వంద డాలర్లు చార్జి చేస్తాను' అంటాడు. అప్పుడు అతను, 'వారానికి మూడు సెషన్స్, ఒక్కొక్క సెషన్‌కి వంద డాలర్లు అంటే మీ సమస్య పరిష్కారం అవుతుంది. మరి నా సమస్యల మాట ఏమిటి?' అంటాడు.

అర్ధం చేసుకోండి. ఎప్పుడైతే మనస్సు ఒక పదార్ధం అనుకుంటామో, మనం అసహాయులమవుతాం. ఏ సైకియాటిస్టు మనకి సహాయం చేయలేదు. ఏ పద్దతి మనకి సహాయం చేయలేదు. ఎందుకంటే మన ప్రాథమిక నమ్మకం తప్ప కాబట్టి. ఎప్పుడైతే తప్పు నమ్మకాన్ని తీసుకువస్తామో, దానిమీద నిర్మించింది మొత్తం తప్పు అవుతుంది. అది సత్యం కాదు. మనం ప్రాథమిక సత్యమైన మనస్సు అంటే నిరంతర చర్య అని తెలుసుకుంటే టెన్షన్ ఉండదు. అప్పుడు మనమే టెన్షన్ అని తెలుసుకుంటారు.

వత్తిడి లేని ఉత్తమస్తితి

గుర్తింపుల మధ్య ఖాళీ

మిమ్మలని మీరు బయట ప్రపంచానికి చూపించే గుర్తింపుని అహంకారం అంటాం. మీరు అంటే ఏమిటో మీకు మీరు చూపించే గుర్తింపుని మమకారం అంటాం. వేద సంస్కృతి పదే పదే మీరు ఈ రెండింటికీ అతీతులు అని చెబుతుంది. మీరు ఈ రెండూ కాదు. పాశ్చాత్య మానసిక నిపుణుల అభిప్రాయం మీరు అంటే ఈ రెండు గుర్తింపులూ. అందుకే ఈ గుర్తింపుని కాపాడటానికి చాలా సమయాన్ని, శక్తిని ఖర్చుపెడుతున్నారు.

నిజానికి, నిజమైన మీరు అంటే రెండింటి కంటే చాలా ఉన్నతమైన స్థితి. మీరు ఈ రెండు గుర్తింపులకీ అతీతమైన వారు.ఇది కాకుండా మీరు ఒక విషయం అర్ధం చేసుకోవాలి. మనస్సు అంటే యంత్రం కాదు. అది ఒకదాంతో ఒకటి కలిపిలేదు.ఆ ఖాళీ మీరు మీ అనుభవంతో తెలుసుకోలేరు. అందుకే వాటిని ఒక గొలుసులా కలుపుతుంటారు. మీరు ఏ విధంగా టెన్షన్‌లో అనిశ్చలంగా ఉన్నారో పదే పదే చెబుతారు. అది కాదు. మీరు అనిశ్చలతలో ఉందరు. మీరు డిస్టర్స్ కారు, మీరే డిస్టర్‌బెన్స్. అసలు సమస్య ఎక్కడ పుట్టిందో ఎలా వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక వస్తువు కాదు.మీరు అనుకునే సంతోషం, బాధ, జీవితం ఆ విధంగా మీరు అనుకునేవన్నీ ఒక అబద్ధం మీద నిర్మించబడ్డాయి, అది మీరు ఒక పదార్థం అని అనుకోవటం.

మనస్సు, ఒక నిరంతర చర్య

మీరు ఈ ఒక్క సత్యాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఒక చైతన్యం, నిరంతరం జరిగే క్రమం. సహజ సిద్ధంగా మీ ఆలోచనలు ఒక దాంతో ఒకటి సంబంధంలేనివి. అవి స్వతంత్రమైనవిగా, బంధవిముక్తమైనవిగా ఉంటాయి.

ఒక విషయం అర్థంచేసుకోండి. మీ జీవన గమనానికి మీరు మీ గుర్తింపు అనుకునే ఆ గుర్తింపు అవసరం లేదు. మీరు అనవచ్చు, లేదు, నేను అలా గొలుసు చేయకపోతే, బంధాలు ఏర్పరచక పోతే, నేను నా భవిష్యత్ జీవితానికి ప్రణాళికలు ఎలా వేయగలను? రేపటి గురించి ఎలా ఆలోచించగలను? నా ప్రాజెక్టు పని డెడ్‌లైను నాటికి ఎలా పూర్తి చేయగలను. నేను ఎలా పని చేయగలను? నా ప్రతిరోజు పనులు ఎలా చేయగలను? ఇవన్నీ పెద్ద ప్రశ్నలే.

ఈ ఒక ఉదాహరణని అర్థం చేసుకోండి. మీరు కారు డ్రైవ్ చేసేటప్పుడు అన్ని స్టెప్స్ ప్లాన్ చేస్తారా? యాక్సిలేటర్ ఎంత నొక్కాలి, ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు కుడివైపు తిరగాలి ఇవన్నీ ప్లాన్ చేసారా? లేదు! ప్రారంభంలో, మీరు శిక్షణ పొందేటప్పుడు ఒక్కసారి ఆ విధంగా చేసారేమో కాని డ్రైవింగ్ బాగా వచ్చాక కేవలం మీరు కూర్చుంటారు. చాలా సార్లు డ్రైవింగ్ చేసి వచ్చాక డ్రైవింగ్ చేసినప్పుడు ఏమెందో కూడా తెలియదు. అవును కదా! మీరు ఆఫీసుకు చేరేవరకూ అంతసేపు డ్రైవ్ చేసిన విషయం గుర్తు ఉండదు. ఆఫీసు ముందు కారు పార్క్ చేసాక అప్పుడు గుర్తుకు వస్తుంది మీరు ఇంతసేపు డ్రైవింగ్ చేసి ఆఫీసుకు చేరానని.

మీరు అంటే మీరు అనుకునే గుర్తింపు. దీనినే మనం ప్రారబ్దం అంటాం. ఇదే బయోమెమరీ. మీకు జీవితాన్ని నడపటానికి అభివృద్ధి చేసుకోవటానికి ఆటోమేటిక్ తెలివి తేటలు ఉంటాయి. అర్ధం చేసుకోండి, నేను ప్రాథమిక సత్యం గురించి మాట్లాడుతున్నాను. మీరు మనస్సుతో జీవితంలో సరిపడా బాధపడి ఉంటే నేను చెప్పే మాటలు అర్థం అవుతాయి, మీరు మీ గుర్తింపుని అనుమానించే స్థితికి వచ్చినప్పుడు ఈ విషయాలు అర్ధమవుతాయి,

మనస్సు ఒక ఊహ కూడా

మన మనస్సుకి దారాలు మన జ్వానేందియాలు. మనం కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం లేకుండా ఉంటే, మన మనసుకి ఏ విధమైన సమాచారం ఇవ్వలేం, జ్వానేందియాలు ఇచ్చే సమాచారమే మనస్సుకి ఆహారం, దాని మీదే మనస్సు జీవించేది. మనం ఏమనుకుంటామంటే మనం చూసేవన్నీ, వినేవన్నీ సహజమైనవి, అసలైన సమాచారం అనుకుంటాం.

మీరు కొంచెం విశ్లేషిస్తే అవి ఎంత అబద్దమో అర్ధమవుతుంది. ఎన్నిసార్లు మీరు అనుకున్న విషయానికి, నిజానికి అక్కడ ఉన్నదానికి ఎంత తేడా ఉంటుందో. మీరు అనుకునేది మీ నిబంధనల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక స్త్రీ, పురుషుడు దగ్గరగా ఉండి చాలా ఎమోషనల్‌గా అతి సమీపంలో ఉంటే మీరు వెంటనే వాళ్ళు ప్రేమికులు అనే అభిప్రాయానికి వచ్చేస్తారు వాళ్ళు స్నేహితులో, అన్నాచెల్లెలో, తండీకూతురో అయ్యి ఉండవచ్చు కదా!

మన లోపల ఉన్న నిబంధనలు, అభిపాయాలు మనం చూసిన, విన్న విషయాలని ఆ అభిప్రాయాలకి అనుగుణంగా చూపిస్తాయి. అందుకే నేనెప్పుడూ అంటుంటాను మనం ముందుగా అభిప్రాయాలు ఏర్పరచుకొని వాటికి అనుగుణమైన సమాచారాన్ని మాత్రమే సేకరించుతాం. మనం నిర్ణయం ముందే చేసేసి దానికి ఆధారంగా కొంత సమాచారాన్ని సేకరిస్తాం. అంతే. మన మనస్సు ఒక ప్రొజెక్టర్లా ఉంటుంది. మన జీవన మార్గంలో మనం చాలా స్లెడ్స్‌ని పోగుచేసుకుంటాం. కొన్ని మన క్రిత జన్మనుంచి తెస్తాం. ఈ స్లెడ్స్ ప్రాజెక్ట్ చేసేదే మన జీవితం. స్లెడ్స్ తిరిగి ప్రొజెక్ట్ అయిన ప్రతీసారి అది బలంగా తయారవుతుంది. మొదట కొన్ని సార్లు ఆ స్లెడ్ ఎక్కువ నిముషాలు ప్రొజెక్ట్ అవుతుంది. అప్పుడు అది మనమీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. సంస్కారాలు లోతుగా మన మనస్సులో నాటబడేకొద్దీ, ఆ తరువాత అవి కొంతసేపు ప్రొజెక్ట్ అయినా చాలు. ఆ సంస్కారాల ఆధారంగా మనం నిర్ణయాలుచేస్తాం.

మాలిక్యులార్ బయాలజీలోని పరిశోధనలు ఒక ఆశ్చర్యపోయే సత్యాన్ని చెప్పాయి. మనం బలమైన భావావేశానికి లోనయిన ప్రతీసారి, ఉదాహరణకి కోపం, మనలోపల సెల్యులార్

వత్తిడి లేని ఉత్తమస్తితి

ట్రాన్స్‌మిటర్స్, రిసెప్టర్స్ తయారయ్యి, అవి కోపాన్ని మన మానసిక, శారీరక వ్యవస్థలో చాలా చైతన్యవంతం చేస్తాయి. అది మెదడులోనే కాదు, శరీరమంతా జరుగుతుంది. మొదటకొన్ని సార్లు చాలా కొద్దిసేపు వ్యవస్థ అంతా జరుగుతుంది. ఒక్కసారి సెల్యూలార్ వ్యవస్థ మరల మరల తయారైతే అదిచాలా బలంగా తయారౌతుంది. మొదట నీటితుంపరగా ప్రారంభమై చివరికి అది పెద్ద తుఫానులా స్థిరపడుతుంది.

ఒక వ్యక్తి స్పీడుగావెళ్తున్నాడు అని పోలిస్ హైవేమీద ఆపుతాడు. పోలీసు ఆ వ్యక్తిని 'ఎందుకు స్పీడుగా వెళుతున్నావు' అంటే అతను కోపంగా, 'లేదు నేను స్పీడుగా వెళ్ళడంలేదు' అంటాడు. అప్పుడు పోలీస్ 'అక్కడ 50మెళ్ళ స్పీడు ఉండాలి కాని నీవు 70 మెళ్ళ స్పీడులో వెళ్ళుతున్నావు. నేను రికార్డు చేసాను' అంటాడు. అతను పోలీస్ మీద అరుస్తూ నీవు అబద్ధం చెపుతున్నావు అంటాడు. అప్పుడు పోలీస్ తుపాకి తీయబోతాడు. అప్పుడు అతని భార్య కారులోంచి చూస్తూ, 'సార్! నా భర్త తాగి ఉన్నప్పుడు వాదించకండి అతడు ప్రమాదకరంగా అవుతాడు' అంటుంది.

రోడ్డు మీద ఈవిధంగా జరిగే సంఘటనలు, హింస ఇలాంటివన్నీ ఏదో ఒక్క సంఘటనతో జరగవు. నిబంధనలు అనేవి బలంగా లోతుగా కణజాలాలలో స్థిరపడినప్పుడు జరుగుతాయి. ఇది కాన్సర్ లాంటిది. ఈ మధ్య శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనుగొన్నారు; మన ఎమోషన్స్ మన లోపల విపరీతమైన రిసెప్టర్స్‌ని సృష్టించితే, ఆ భావావేశాలు శరీరమంతా నిండి అవి మన నియంత్రణ శక్తిని దాటిపోతాయి అని, మన పవర్ అంతా పూర్తిగా వాటి గుప్పిటిలో ఉంటుందని. మనం మన మనస్సుని నియంత్రిస్తామనేది, నిర్ణయాలు మనమే చేస్తామనేది వట్టి ఊహ మాత్రమే. అది పెద్ద కల్పన. అదే మన జీవితాన్ని నడుపుతుంది. ఈ మాయ మనని నడుపుతున్నది.

మనం ఎలా నిర్ణయిస్తాం

మన జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన సమాచారంలో కేవలం పదిశాతం మాత్రమే మన చేతన మానసిక వ్యవస్థలో రికార్డు అవుతుంది. మిగిలింది అచేతన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అందుకే మనం ప్రతిరోజు వెళ్ళేదారిలో స్థలాలైనా గుర్తుపట్టలేం. ఈ జ్ఞానేందియాలు గ్రహించే దానిలో మనకి ఆసక్తి లేనంతవరకూ అది మనలో రికార్డు కాదు.

మనచేతన స్థితిలో రికార్డు అయ్యే సమాచారం ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ సమాచారాన్ని మన మానసిక వ్యవస్థలోని వివిధ భాగాలు వేరుచేసి గుర్తిస్తాయి. మీ చేతన మనస్సు మీరు ఎదురుగా చూసే వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తా లేక కొత్త వ్యక్తా అని చూస్తుంది. అతనితో మీరు ఎలా వ్యవహరించాలి అనేది ఇక చేతనవ్యవస్థ పనికాదు. ఒకవేళ ఆ వ్యక్తి మీకు తెలిసినవాడైతే మీలోని సంస్కారాల ఆధారంగా అతనితో వ్యవహరిస్తారు. ఒకవేళ అతను కొత్త వ్యక్తి అయితే, అతని రూపురేఖలు మన అచేతనస్థితిలో నాటుకుపోయిన స్పందనల ఆధారంగా ఉంటుంది. ఈ రెండు విధాలలో ఏదైనా సరే నిర్ణయంకోసం ఆలోచనలు అచేతనస్థితిలోనికి వెళుతుంది. అక్కడ మనం ఏమి చేయాలో నిర్ణయం జరుగుతుంది. మనలో చాలామందికి మానసిక వ్యవస్థలో పదిశాతం లోపు మాత్రమే చేతనావ్యవస్థలో ఉంటుంది. పదిశాతంలోపు సమాచారం మాత్రమే చేతన వ్యవస్థలో రికార్డు అవుతుంది. మీరు చేసే నిర్ణయాలలో ఒక శాతం లోపు నిర్ణయాలు మాత్రమే వివేకంతో ఉంటాయి.

అప్పుడు మనం ఏమి చేస్తాం? మన అచేతన మానసిక వ్యవస్థ మనని నియంత్రించేలా చేస్తామా? లేక నియంత్రణ చేతనస్థితికి వెళ్ళేవిధంగా ఏమైనా చేస్తామా?

నియంత్రణని మనం రెండు విధాలుగా తిరిగి పొందవచ్చు, మనని కట్లుబాటుచేసే నిబంధనలని తగ్గించాలి. మా ధ్యాస కార్యక్రమాలలో, మనని కట్టుబాటుచేసే సంస్కారాలని తొలగించేలా అవి కరిగిపోయేలా పని చేస్తాం. రెండవ పద్ధతి వర్తమానంలో పూర్తిగా తెలుసుకునే తత్వంతో నియంత్రణతో ఉండగలగటం.

మా ఆనంద స్పురణ ధ్యాన కార్యక్రమంలో ఈ రెండు పద్ధతులకి సరిపోయే ధ్యానం నేర్పిస్తాం. అత్యుత్తమ ధ్యానంతో చేతనస్థితిలో లోతుగా నాటుకుపోయిన జ్ఞాపకాలని తొలగించవచ్చు. అప్పుడు మన అంతరంగం శుభ్రమౌతుంది. అప్పుడు ఎవరైనా వర్తమానంలో పూరి తెలుసుకునే తత్వంతో ఉండగలరు.

సమయాన్ని అధిగమించి – వర్తమానంలో ఉండటం

మీరు మీ ఆలోచనలని జాగ్రత్తగా గమనిస్తే మీకు రెండు విషయాలు అర్థమౌతాయి. అందులో ఒకటి ఇంతకు ముందు చెప్పినట్లు ఆలోచనలు ఒకదానికి ఒకటి సంబంధం లేనివి. మీరు చేయవలసింది, కూర్చొని ఒక్క పది నిముషాలలో మీకు వచ్చే ఆలోచనలని ఒక పేపర్ మీద వ్రాయండి. మీరు అలా చేస్తే ఆలోచనలకి మధ్య చాలా తక్కువ సంబంధం ఉండటాన్ని గమనిస్తారు. అవి ఒక విషయం నుంచి మరొక దానిలోనికి నిరంతరం దూకుతూ ఉంటాయి. ఇక రెండవ విషయం, మీ ఆలోచనలు అన్నీ మీ గతానికి సంబంధించి లేదా భవిష్యత్‌కి సంబంధించి ఉంటాయి. మీరు కేవలం గడచిపోయిన కాలంలో ఏమి జరిగింది, భవిష్యత్‌లో ఏమి జరగబోతున్నది అనే విషయాలగురించి బాధపడటమే. అది ఇలా ఎందుకు చేసాను అనే అపరాధ భావం భవిష్యత్ కాలానికి సంబంధించి మీరు ఏమి చేయాలనుకున్నారో ఆ ఆలోచనలు ఉంటాయి.

ఒక విషయం అర్థం చేసుకోండి, మీ భూతకాలం కాని భవిష్యత్ కాలం కాని ఏదీ నిజం కాదు. జరిగిపోయింది, ఇక లేదు. చాలా సార్లు మనం జరిగిపోయిన దాని నుంచి ఏమీ నేర్చుకోం. ఇక్కడ మనం చేసేది జరిగిపోయిన దానితో భవిష్యత్ లోనికి వెళ్ళటమే. ఇది ఎలా ఉంటుందంటే వెనక ట్రాఫిక్‌ని కారు అద్దంలో చూస్తూ కారుని డ్రైవ్ చేయటం. అలా చేస్తే మీరు ఎక్కడికి వెళతారో కచ్చితంగా మీకు తెలుసు.

వత్తిడి లేని ఉత్తమస్తితి

భవిష్యత్ ఇంకా అసత్యం. అది ఇంకా జరగలేదు. భవిష్యత్ మీద మీకు ఎటువంటి నియంత్రణ ఉండదు. ఎందుకంటే మీ పనులన్నీ అచేతనవ్యవస్థ ద్వారా నడప బడుతున్నాయి. మీరు మీ పాత జ్ఞాపకాలద్వారా ముందుకి వెళుతున్నారు. మీ ఆలోచనలు భూతకాలం నుంచి భవిష్యత్‌కి, భవిష్యత్ నుంచి భూతకాలానికి తిరుగుతూ ఉండటమే. మీ మనస్సు విశ్రాంతిని అసలు కోరదు. అది విశ్రాంతి తీసుకుంటే, అది లేకుండా మీరు పనులు చేసుకోగలరు అని మీకు తెలుస్తుంది.

మీరు మీ మనస్సుకి విశ్రాంతి ఇచ్చినా లేదా అది విశ్రాంతి తీసుకునేలా చేసినా మీరు పరమానంద స్థితిని చేరగలుగుతారు. అదే వర్తమానంలో ఉండే స్థితి. మీ భవిష్యత్ అంతా ఈ వర్తమానంలో జరగవలసిందే. మీరు ఇప్పుడు వర్తమానంలో చేసే నిర్ణయమే మీ భవిష్యత్ అవుతుంది. మీరు ఈ క్షణాన్ని జాగ్రత్తగా చూడగలిగితే, మీరు ఈ క్షణంలో చేతనస్థితిలో ఉండగలిగితే, మీరు ఎపుండూ జరిగిపోయిన దాన్ని గురించి బాధపడరు. మీలో అపరాధభావం ఉండదు.

మీరు చాలా సమయం ఈ రెండింటి మధ్య చాలా వేగంగా ఊగుతూ ఉంటారు. మీరు విశ్రాంతి తీసుకుంటున్నాను అని అనుకున్నప్పుడు కూడా మీరు ఆవేశపడతారు. అందుకే బుద్ధుడు మనస్సుని కోతి అంటాడు. సెకండుకి వచ్చే ఆలోచనల సంఖ్య లేదా టి. పి. ఎస్ తగ్గితే మీరు వర్తమానంలో ఉంటారు. బొమ్మలో, అడ్డగీత మధ్య భాగం సమయాన్ని సూచిస్తుంది. మీలో టి. పి. ఎస్ ఎక్కువ అయ్యేకొద్దీ మీరు వర్తమాన స్థితికి దూరంగా ఉంటారు. మీరు భవిష్యత్ గురించి బాధపడుతూ, దాన్ని భూతకాలంలోనికి పదేస్తారు. అప్పుడు కనీసం ఒక్క క్షణం కూడా వర్తమానంలో ఉండరు.

మీలో టిపిఎస్ తగ్గేకొద్దీ మీరు వర్తమానంలోనికి వస్తారు. మీరు వర్తమానంలోనికి వచ్చాక మీ గతం, భవిష్యత్ మీకు స్పష్టంగా కనిపిస్తాయి. గతం గురించి స్పష్టంగా తెలియటానికి ఏముంది అని మీరు ఆశ్చర్యపడవచ్చు. భవిష్యత్ స్పష్టంగా తెలియదేమో, గడచిపోయింది ఎందుకు తెలియదు అని అనుకోవచ్చు. గతం అంటే నేను జీవించిన నా అనుభవం, దాన్ని నేను స్పష్టంగా చూడటానికి ఏముంది అనుకోవచ్చు. మీరు ఒక విషయం అర్ధం చేసుకోవాలి. మీరు మీ భూతకాలాన్ని మీ అభిప్రాయాలతో గుర్తుంచుకుంటారు కాని అక్కడ ఎలా జరిగిందో ఆవిధంగా కాదు. ఎన్ని సార్లు మనం మన గడచినకాలం బంగారం అని అంటాం? బంగారు కాలం అని గడచిన కాలం గురించి ఎన్ని వ్రాయలేదు. జరిగిపోయిన కాలం అంతా ఏమీ బంగారం కాదు. మనం ఏవో కొన్ని మంచి విషయాలు గుర్తుంచుకుంటే అది బంగారంలా కనిపిస్తుంది. మీరు ఆత్మప్రబోధ స్థితిలో ఉంటే, ఆ కొద్ది నిముషాలు మీ టి.పి.ఎస్ తగ్గిపోతుంది. అప్పుడు వర్తమానంలో ఉంటారు.

టి.పి.ఎస్ సున్నాకి పడిపోతే మీరు స్పష్టంగా మీ భవిష్యత్, భూతకాలాల్ని చూడగలరు. ఏ పాయింటు దగ్గర భవిష్యత్, భూతకాలాన్ని కలుస్తుందో అదే వర్తమానం. ఇక్కడ మీ ఆలోచనల

వేగం సున్నా. అక్కడ మీరు ఆలోచనలు లేని స్థితిలో (నో మైండ్ స్టేట్) ఉంటారు. మీరు మీ మనస్సుని నియంత్రించలేరు. అణచలేరు. అది అసాధ్యం. మీరు మనస్సుని అధిగమించాలి. అది సాధ్యమే. ఇక్కడ మనస్సు మీతో ఇక ఆడలేదు. మీరు మీ మనస్సుతో ఆడుకోవచ్చు. దాన్ని ఎలా కావాలంటే అలా ఉపయోగించ వచ్చు. ఏ స్థితిలో ఉండాలి అని మనం ఎంచు కోవచ్చు. అదే ధ్యాన స్థితి. ధ్యానం మనస్సుని విశ్రాంతి స్థితికి తెస్తుంది. అది మనస్సుకి పనిలేకుండా చేస్తుంది. అప్పుడు మనస్సు ఆటలు ఆడదు.

మనం గురుదేవుల సమక్షంలో ఆ స్థితికి చేరవచ్చు. గురుదేవులు నిరంతరం ఆలోచనలు

లేని స్థితిలో ఉంటారు. అంటే సున్నా టి.పి. ఎస్ స్థితి. మీరు పూర్తి తెలుసుకునే తత్వంతో ఉన్నప్పుడు మీ టి.పి.ఎస్ సున్నాకి వస్తుంది. మీరు గురువుగారి సమక్షంలో ఉంటే టి.పి.ఎస్ సున్నాకి వస్తుంది. గురువుగారి సమక్షమే ధ్యానం.

అంతరంగపు మాటలు

మనం సాధారణ స్థితిలో ఉన్నప్పుడు నిరంతరం మాట్లాడుతూ ఉంటాం. మనం బయటి వారితో గట్టిగా మాట్లాడకపోయినా, మనం నిశ్శబ్దంగా మనలో మనం మాట్లాడుకుంటాం. మన మనస్సు విరామంగా ఉండకపోవటమే కాదు, మన అంతరంగంలో ఆలోచనలు సంభాషణలా తయారవుతాయి.

ఈ అంతరంగపు మాటలే వ్యధ అంటే. వ్యధ అంటే నిరంతరం మన లోపల జరిగే వ్యతిరేకపు మాటల ప్రవాహం. మనం తిరిగి తిరిగి అదే గతాన్ని భవిష్యత్ లోనికి తీసుకువెళతాం. గతాన్ని భవిష్యత్‌లో జరిగినట్లు చూస్తాం.

మీలో తొంబైశాతం బాధలు మీరు అనుకున్నట్లు అసలు జరగవు. మా కార్యక్రమాలలో పాల్గొన్నవారికి ఇది నేను చూపించాను. నేను వారికి ఉన్న బాధలని ఒక పేపర్‌మీద వ్రాయమని చెప్పి, దాన్ని ఆరునెలల తరువాత విశ్లేషణ చేయమని చెబుతాను. ఆ తరువాత వాళ్ళు నన్ను కలిసినప్పుడు వాటిలో తొంభై శాతం జరగలేదని, మిగిలిన పదిశాతం వారికి మంచే జరిగిందని చెబుతారు.

మీరు బలంగా ఊహించటమే బాధలని ఆహ్వానించటం. ఏదైనా ఒక బాధ నిరంతరం మిమ్మల్ని విసిగిస్తుంటే అది మీ మనస్సు చేసే కల్పన అని అర్థం చేసుకోండి. మనస్సు అంటేనే నిజం కాదు. అది మీ ఆలోచనలతో చేయబడింది, కాబట్టి మీ బాధలు కూడా నిజం కాదు. వ్యతిరేకపు మాటలని తీసి ప్రోత్సాహకరమైన అనుకూలమైన మాటలతో నింపండి. అది సులభం. వాటిలో శక్తి ఉన్నది.

మాటలు ఒత్తిడిని సృష్టిస్తాయి

మన ఆలోచనలలు, మాటలు ఎంత శక్తిగలవో మీరు తెలుసుకోలేరు. ఇంతకు ముందు మీకు చెప్పాను. ఎమోటో అన్న శాస్త్రవేత్త నీటిమీద చేసిన ప్రయోగాలు. దాన్ని బట్టి మాటల శక్తిని అర్థం చేసుకోండి.

మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మీ మాటలు అలా ఉంటాయి. మీ మాటలు ఏ విధంగా ఉంటాయో మీ పనులు అదే విధంగా ఉంటాయి. మీ పనులు ఎలా ఉంటాయో, మీరు అదే విధంగా ఉంటారు.

మీరు అనే వ్యతిరేకపు మాటలు ఎదుటివారిని మాత్రమే ప్రభావితం చేస్తాయి అనుకోవద్దు. స్పష్టంగా తెలుసుకోండి. అవే ఆలోచనలు అవే మాటలు మీ మీద కూడా అదే విధంగా ప్రభావాన్ని చూపిస్తాయి. వాటిని సృష్టించిన మిమ్మల్ని ముందుగా ప్రభావితం చేసి తరువాత ఎదుటివారిని ప్రభావితం చేస్తాయి.

ఒత్తిడి తెచ్చే మానసిక ప్రభావం

ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమి చెబుతున్నాయో చూశాం. వత్తిడి ఎలా వస్తుంది అని నేను ఆలోచించాను. శాస్త్రం ఏమి చెబుతుందో చూద్దాం. మన మెదడులో ఒక భాగం మనలో కొన్ని పనులని నియంత్రిస్తుంది. అవి యాంత్రికంగా, ఆటోమేటిక్‌గా జరిగే శ్వాస, జీర్ణక్రియ మొదలైన శరీరపు పనులు. సహజంగా మన మెదడులో ఒక రక్షణ భాగం ఏర్పడి ఉన్నది. అదే హిపోథలామస్. దానినే జీవశాస్త్రవేత్తలు మెదడుకు వినయం కలిగిన (రెప్టేలియన్ బ్రెయిన్) భాగం అంటారు.

ప్రవర్తన మీద పరిశోధనలు చెప్పే, "పోరాడు లేదా పారిపో" అనే స్పందన గురించి చెబుతున్నాయి. శరీరం యొక్క వివేకం ఒక ప్రమాదాన్ని పసికడితే, మన మెదడులోని హిపోథెలామస్ మన అచేతన వ్యవస్థ ద్వారా మార్పుచెందుతుంది. అచేతనస్థితి, చేతనస్థితి

కంటే అత్యంత వేగంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రమాదం గురించి మనం చేతనస్థితిలో తెలుసుకునే లోపుగానే మనం జాగ్రత్త పడతాం. హిపోథలామస్ పిట్యుటరి గ్లాండుని చైతన్య పరుస్తుంది. అది మాస్టర్‌గ్వాండ్. దాన్ని ప్రేరేపిస్తే అది అడ్రినలిన్ అనే హార్మోనుని తయారుచేస్తుంది. ఆ హార్మోను మన శరీరమంతా ముఖ్యంగా కళ్ళు, చేతులకి వ్యాపిస్తుంది. అప్పుడు మనం పోరాటానికి లేదా పారిపోవటానికి సిద్ధం అవుతాం. ఆ శక్తి మనం పోరాటానికి లేదా పారిపోవటానికి మనని తయారుచేస్తుంది.

అచేతన స్థితి రెప్టేలియన్ బ్రెయిన్ మనల్ని రక్షించటానికి శరీరంలోనికి కొన్ని రసాయనాలని పంపించటానికి నిర్ణయిస్తుంది. ఈ పద్ధతి రాతి యుగంనాటి మనుషులకి బాగా పనిచేసింది. వాళ్ళు క్రూరమృగాలని చూసినప్పుడు ఇది ఉపయోగపడేది. ఆలోచించకుండా పోరాటం చేయటం లేదా పారిపోవటం అనేది జరిగేది.

అడ్డినలిన్ ప్రభావం మన శరీరం మీద ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవటానికి పరుగు పందాలలో పాల్గొనేవారిమీద పరిశోధనలు చేసారు. వారందరినీ పందెం గీతమీద నిలబెట్టి సరీగ్గా ఫిస్టల్ గాలిలో లేపేముందు అంపెరు చేతిని కిందికి దించేవాడు. అప్పుడు క్రీడాకారులు వెనక్కి తగ్గేవారు. ఈవిధంగా ఆరుసార్లు జరిగాక, కనీసం ఒక మీటరు కూడా పరిగెత్తకుండానే వారంత కింద పడిపోయారు. వారి శరీరంలో అడ్డినలిన్ ప్రమాద స్తాయికి చేరింది. కారణంలేకుండా అడ్డినలిన్ శరీరంలో తయారయితే రక్తంలో కలిసే ఆ రసాయనం ప్రమాదకారిగా మారుతుంది.

పెద్ద పులిని కాని సింహాన్ని కాని మనం ఆకస్మాత్‌గా చూడడం అనేది ఈ రోజులో చాలా తక్కువ. కాని మన అచేతన వ్యవస్థ ప్రమాదం యొక్క సంకేతాలను పంపుతూ ఉంటుంది. వీటినే నేను ఫియర్ స్టోక్స్ అంటాను. మానసిక నిపుణుల అంచనా ప్రకారం మనం రోజుకి ఆరు సార్లు అటువంటి ఫియర్ స్టోక్స్‌కి గురిఅవుతాం. అదే అడ్డినలిన్‌ని అధిక మోతాదుల్తో మనలో తయారుచేస్తుంది. ఈ అడ్డినలిన్ మనలో ఏర్పడే డిప్రెషన్‌కి కారణం. మనలో ఉండే చాలా భయంకరమైన వ్యాధులకి డిప్రెషన్ కారణం అని తెలిసింది.

చాలా సంపన్న దేశాలలో జరిగిన వైద్య పరిశోధనలు, యువతలోని ఆర్టరీలు చాలా అడ్డంకులతో మూయబడి వున్నాయి, వారి ఆర్టరీలు అరవైఏళ్ళవారి ఆర్టరీలులా ఉన్నాయి అని తెలిసింది. డాక్టర్స్ చెప్పటం ఈ స్థితికి భౌతికకారణాలు కేవలం ఒక భాగమే అని భౌతికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో కూడా. ఈ మానసిక మార్పులు గుండె జబ్బులని తయారుచేస్తాయి.

ఈరోజుల్లో గుండె వైద్య నిపుణులు, డాక్టర్స్ పేషెంట్లని ఒక ప్రశ్నావళిని నింపమని అడుగుతున్నారు. దాని ద్వారా వారు ఎంతవరకూ వత్తిడి వలన ప్రభావితం అవుతున్నారో తెలుసుకుంటారు. అది ఏవిధంగా గుండెపై ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుంటారు.

వైద్యులు చెప్పిన ముఖ్యమైన ఒత్తిడి కలిగించే కారణాలు, దగ్గరవారి మరణం, ఉద్యోగం పోవటం, డబ్బుపోవటం, ఉద్యోగంలో ట్రాన్స్‌ఫుర్ రావటం, ఇల్లు మారటం మొదలైనవి. ఇవి హార్ట్ అటాక్స్‌కి దారితీయవచ్చు. గుండెకి సంబంధించిన వ్యాధులకి కారణాలే చాలా వ్యాధులకి కారణం. వీపునొప్పి, మైగ్రీన్, అల్సర్స్ మొదలైనవి ఆ కారణాలతోనే వస్తాయి. ఇందులో అంతర్గతంగా ఉండే మానసిక కారణాలు చాలా వరకూ ఈ స్థితికి కారణం అవుతాయి.

స్ట్రెస్ మనిషిని చంపగలదు, కాని అది మానసిక వ్యవస్తలో మాత్రమే. వ్యధ చెందుతూ మనం ఫియర్‌స్టోక్స్ సృష్టిస్తాం. నిబంధనలవలన వాటిని కలుషిస్తాం. మందులతో వాటిని కొంతవరకూ మార్చవచ్చు. కానీ ఇందులో అంతర్లీనమైన కారణాలని తొలగించకపోతే ఏ మందు పనిచేయదు. దాన్ని శాశ్వతంగా తగ్గించలేం.

ఒత్తిడి, పనికి సంబంధించిందా?

ఒక ఐటి కంపెనీ చీఫ్ ఎక్షిక్యూటివ్‌కి ఒక ప్రాజెక్టు గురించి ఎంక్వయరీ లెటరు వస్తుంది. ఆయన దాన్ని చూదమని తన సబార్ధినేటుకి పంపుతాడు. ఇటువంటి ప్రాజెక్టు చేసే టీం ఆ ప్రాజెక్ట్‌ని క్షుణ్ణంగా పరిశీలించి ఆప్రాజెక్ట్‌ని పూర్తి చేయటానికి "ఆరునెలలు పడుతుంది అని, దాని ఖరీదు మిలియన్ డాలర్లు" అని చెబుతారు. ఆ టీం మేనేజరు రిపోర్ట్ చదివి, టీం నాలుగు నెలల్లో దీన్ని పూర్తిచేసారని ముప్పావు మిలియన్ డాలర్లకి పని పూర్తి అవుతుందని రాసి తనబాస్‌కి పంపుతాడు.

దాన్ని జనరల్ మేనేజర్ చదివి, అందరినీ మీటింగ్‌కి పిలుస్తాడు. అతను వారితో మనం దీన్ని అరమిలియను డాలర్లతో మూడు నెలలలో చేయాలి అంటాడు. ఈ ప్రపోజల్‌ని చీఫ్ ఎగ్టిక్యూటివ్‌కి పంపిస్తాడు. చీఫ్ ఎగ్టిక్యూటివ్ కస్టమర్‌ని పిలిచి ఈ ప్రాజెక్ట్‌ని రెండునెలల్లో అర్ధమిలియన్ డాలర్లకి పూర్తిచేస్తాం అని చెబుతాడు.

కార్పొరేట్ సంస్థలలో పని చేసేవారికి ఈ సంఘటన అర్థం అవుతుంది. నిర్ణయాలుచేసే వ్యక్తులు సాధారణంగా అసలు పనికి దూరంగా ఉంటారు. ఆ పనిగురించి వారికి తెలియదు. అటువంటి నిర్లయాలు చేయటం వలన వారి అహంకారం తృప్తి పడుతుంది. అటువంటివారు వారి అహంకారం కోసం దేనినైనా త్యాగం చేస్తారు. కార్పొరేట్ ఆఫీసుల గురించి కొంచెం పరిశోధన చేస్తే అర్ధమౌతుంది, కేవలం కొందరు వ్యక్తుల అహంకారం కోసం ఎన్ని సంస్థలు మూతపడ్డాయో. ఎందుకంటే నిర్హయాలు చేసే వ్యక్తులు వారి అహంకారంతో నదపబడతారు. నా శిష్యులు కొందరు కార్పొరేట్లలో పనిచేసారు. లెవెల్–5 నాయకత్వం గురించి వారు చెబుతుంటారు. ఆ ఆఫీసర్లు కంపెనీ అవసరాల వెనుక ఉంటారు. వారి అహంకారం కోసం కాకుండా కంపెనీ కోసం పనిచేసారు. ఒక కంపెనీ విజయాన్ని సాధిస్తే దానివెనుక వారి కష్టం ఉంటుంది. కానీ వారు ప్రపంచానికి తెలియరు. వారు కూడ బయటపడరు.

మన జీవితాలలో రెండురకాల మనుషులు ఉంటారు, వత్తిడికి గురయ్యేవాళ్ళు అలా గురికాని వాళ్ళు. ఒత్తిడికి గురి అయ్యేవాళ్ళు జీవితాన్ని నియంత్రించాలి అని చూసారు. వాళ్ళు జీవితాన్ని తాము కోరుకున్న విధంగా మలచాలని చూస్తారు. వాళ్ళ ఏకాగ్రత కేవలం వారి మీదే ఉంటుంది. ఒత్తిడి లేని వారు జీవితంతో పాటు ప్రవహిస్తూ వెళతారు. జీవితం వారికి ఏది ఇస్తే దాన్ని ఎటువంటి ఫిర్యాదులు లేకుండా తీసుకుంటారు. వారి ఏకాగ్రత ఇతరులకి ఏమి చేయగలను అనే దాని మీదే ఉంటుంది. మీరు ప్రవాహానికి ఎదురు ఈదినప్పుడే ఒత్తిడికి గురవుతారు. అదే ప్రవాహంతో పాటు వెళితే ఒత్తిడి ఉండదు. అలా ప్రవాహంతో వెళితే మిమ్మల్ని మీరు మర్చిపోతారు.

మీరు కేవలం ఇంట్లో కూర్చొని ఒత్తిడికి గురికావచ్చు. దానికోసం బయటకి వెళ్ళి పనిచేయనవసరం లేదు. పరిశోధనల ఫలితాల ప్రకారం విడాకుల సంఖ్య నలభై, ఏభై సంవత్సరాల మధ్యలో ఎక్కువగా ఉంటుందని, పిల్లలు పెద్ద వాళ్ళయ్య ఇల్లు వదిలాక విదాకులు ఎక్కువగా ఉన్నాయి అంటారు. అప్పటి వరకూ తల్లితం(దుల మధ్య పిల్లలు ఉంటారు. పిల్లలు తమ మధ్య లేనప్పుడు వారికి ఏమి చేయాలో తెలియదు. నిశ్శబ్దం ఒత్తిడిని కలిగిస్తుంది.

పని చేసే స్థలంలో ఒత్తిడి అనేది మన విద్యావ్యవస్థతో ప్రారంభమౌతుంది. పిల్లలు చిన్నతనం నుంచి వారికి మనం రాంకులు అంటగడతాం. ఒక క్లాసులో ఒకరిని హీరోని చేస్తే మిగతావారు తాము ఎందుకూ పనికిరానివారం అనుకుంటారు. చిన్నవయస్సు నుంచే పోటీలు అలవాటు చేసారు. ఈ పోల్సుకోవటం అనేది పనిచేసే చోటుకి కూడా వస్తుంది. అది ఆ పనిచేసే చోటుని యుద్ధభూమిగా మారుస్తుంది.

ఒక చిన్న కథ : ఒక కాకి ఏపనీ లేకుండా రోజంతా చెట్టుమీద కూర్చొని ఉంటుంది. ఒక కుందేలు అటు పక్కగా వెళుతూ కాకిని చూస్తుంది. దానికి కాకిని చూస్తే అసూయ అనిపిస్తుంది. అది కాకిని, 'నేను కూడా నీలాగా ఏమీ చేయకుండా కూర్చోగలనా?' అని అడుగుతుంది.

దానికి కాకి, 'ఓ! తప్పకుండా నీకు ఎలా కావాలంటే ఆవిధంగా చేయి' అని అంటుంది. అప్పుడు కుందేలు చెట్టుకింద ఏమీ చేయకుండా కూర్చుంటుంది. కొంతసేపయ్యాక నక్క అటువైపువచ్చి కుందేలుని తినేస్తుంది.

ఈ కథ నుంచి మనం ఏమి అర్థం చేసుకుంటామంటే ఏమీ చేయకుండా కూర్చుంటే మీరు చాలా పైన కూర్చుంటారు. మనకి తెలిసిన మానవవనరుల అభివృద్ధి కార్యక్రమంలో మనుషులని తరగతులుగా విభజించాలి అంటారు. నాకు ఎవరో చెప్పారు, ప్రతి కంపెనీలో కనీసం 10 నుంచి 15 మందిని బాగా పనిచేయని వారిగా చూపించాలి అని. అంటే మనుషులని సంఖ్యల స్థాయికి దించారు అని అర్థం. వారి మనుగడ కోసం చాలా మందిని బలిచేస్తారు. అందుకే ఈ ఆఫీసులని కాంక్రీటు అడవులు అంటారు.

వత్తిడి లేని ఉత్తమస్తితి

ఎంత కాలం అయితే మనుషులు భయం, ఆశలతో ముందుకి నడపబడతారో, వారు ఉత్తేజులు కారు. వారిని కంట్రోల్ లో పెట్టి ఏదో రోజువారీ పనులని చేయించవచ్చు, కానీ వారిని ఉత్సాహపరచి పెద్దవి, కొత్తవి అసాధ్యమైన పనులు చేయించలేం. ఇది ప్రస్తుతం పెద్ద కంపెనీలలో ఉన్న సమస్య. వారికి అందరూ బాగా పని చేయాలి అని ఉంటుంది. కాని వారిని ఉత్సాహపరిచే విధానాలు కంపెనీల దగ్గర లేవు. వాళ్ళ దగ్గర కొరడా లేదా కేరెట్ మాత్రమే ఉన్నాయి. అంతకు మించి మరేమీ లేవు.

మనుషులు కేవలం ఏవో కొన్ని వస్తువులతో తృప్తిపదరు. మేనేజ్‌మేంట్‌లో ఉన్న సైకాలజిస్తులు దీన్ని గుర్తించారు. వారు చెబుతారు జీతాలు, అదనపు భత్యాలు ఉద్యోగస్తులకి ఏ మాత్రం ఉత్సాహాన్ని ఇవ్వలేవు. వీరు ఏమని చెబుతారంటే ఉద్యోగస్తులకి సరిగ్గా జీతాలు పెంచితే సంతోషపడరు. వారికి ఇంతకు మించి మరేదో కావాలి. వారికి గుర్తింపు కావాలి. ఒక ప్రముఖ సైకాలజిస్టు మనుషులు ఏవిధంగా తమ కోరికతో పెళ్లారో ఒక మోదల్‌ని తయారుచేసారు. దానినే మాస్తో హెయిరార్కీ నీడ్స్ అంటారు. ఆ పిరమిడ్ అడుగు భాగాన ప్రాథమిక అవసరాలైన భోజనం, దుస్తులు నివాసం మిగతా అవసరాలు ఉంటాయి. ఆ తరువాత సంఘంలో తమకి త్సప్తికలిగే బంధాలు, బాంధ్యవ్యాలు వారికి అవసరం అవుతాయి. ఆ తరువాత వారికి ప్రేమ, ఎదుటివారి శ్రద్ధ కావాలి. ఆ తరువాత గౌరవం, పేరు ప్రతిష్ఠలు కావాలి. అయినా ఆ తరువాత కూడాఏదో కొంత మిస్ అయ్యింది అనుకుంటారు.

ఆ ఏదో అనేది వారి అంతరంగం. మాస్లో దానినే సెల్స్ యాక్టువలైజేషన్ అంటాడు. ఈ విశ్వశక్తిలో ఒక భాగం అనుకుంటాం. మీరు ఇంట్లో పనిచేసినా, అఫీసులో చేసినా, ఫాక్టరీలో చేసినా, ఏ పనీ చేయకపోయినా అందరూ చూసేది ఈ స్థితి కోసమే. అక్కడ మీరు కేంద్రీకృతమై ఉంటారు.

దీనినే మా ప్రాథమిక కార్యక్రమం అయిన ఆనంద స్నురణలో నేర్పిస్తాం. మాస్లో చెప్పే ఐదు దశలు ఈ కార్యక్రమంలో చెప్పే శక్తి కేంద్రాలు ఒకే విధంగా ఉంటాయి. వీటినే శక్తి చుకాలు అని వేదసంస్కృతిలో అనేవారు. ఒక్కొక్క చక్రం ఒక భావావేశాన్ని, ఒక కోరికని తెలియచేస్తుంది. ఇందులో ఒక్కొక్క చక్రాన్ని, దానికి సంబంధించిన అవసరాన్ని తీర్చుతూ వెళితే మనం పై శక్తి కేంద్రాలకి వెళ్ళి చివరికి పరిపూర్ణ దశకి చేరతాం. కొన్ని వేలమంది ఈ కార్యక్రమం ద్వారా అద్భుతంగా ప్రభావితం అయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలలో ఇచ్చాం. దీనినే నేను నమ్మకమైన పరిష్కారాలు అంటాను. ఇంతకు ముందు మీకు చెప్పాను 5వ స్థాయి నాయకత్వం. ఈపద్దతితో ఎదుటివారికి నేను ఏమి చేయగలను అనేవారిని అభివృద్ధి చేస్తుంది. అదే విధంగా ఆనందస్పురణ కార్యక్రమం 5వ స్థాయి నాయకులని తయారు చేస్తుంది. అటువంటివారు ఒత్తిడితో బాధపడరు. అదేవిధంగా వారు ఎవరినీ ఒత్తిడికి గురిచేయరు.

ఒత్తిడికి అతీతంగా

ముంగింపులో నేను చేప్పేది ఒత్తిడి అనేది జీవితంలో ఒక భాగం. ఒత్తిడి అనేది లేకుండా జీవితం అనేది ఉండదు. మన బయట జరిగేవాటికి మన శరీరం, మనస్సు నుంచి వచ్చే స్పందన. ఇది జరిగే డిస్టర్బెన్స్‌కాదు. మనకి సమస్యని ఇచ్చే అనిశ్చల స్థితి కాదు. ఇది మన అంతరంగంలోని అనిశ్చలస్థితి, అందుకే అంటాను మనమే డిస్టర్బెన్స్ అని. ఈ కారణం వల్లనే ఒక వ్యక్తిలో ఒత్తిడికి కారణమైన విషయం మరొక వ్యక్తిలో ఒత్తిడిని కలుగచేయదు. అంటే ఒకరికి అమృతం మరొకరికి విషం కావచ్చు అంటారే అదే ఇది. కార్పొరేట్ ప్రపంచంలో 'స్ట్రెస్ అనేది చాలా ముఖ్యమైన విషయం. వారి లెక్కల ప్రకారం కోట్లకోద్దీ డాలర్లు ఈ స్ట్రెస్ కోసం వృథా చేస్తున్నారు. ఒత్తిడి అనేది కేవలం మనుషుల మీద ప్రభావాన్ని చూపిస్తే ఎవరూ పట్టించుకోరు. అది వారి కంపెనీ మీద ప్రభావం చూపితేనే సమస్య. ఒత్తిడి గురించి మాట్లాదుతూ దానికి ఏదో కొద్ది ఉపశమనం కలిగే పనులు చేయటం అనేది ఒక పెద్ద వ్యాపారం. బయట ప్రపంచంలో ఏవో కొన్ని పనులు చేయటం ద్వారా మీరు ఎట్టిపరిస్థితిలో ఒత్తిడిని తగ్గించలేరు. మీరు ఎంతకాలం పరిగెత్తగలరు? దేని నుంచి పరిగెత్తగలరు?

మీరు చేయగలిగేది మిమ్మల్ని మీరు మార్చుకోవటం. మీకు మీరు ఆ ఒత్తిడినుంచి స్వేచ్చ పొందవచ్చు. ఇది చాలా సులభం. బయట జరిగే వాటితో ప్రభావితం కాకూడదు అని నిర్దయించుకోండి. ఇది అసాధ్యం ఏమి కాదు. ఇది సూక్రుసత్యం. మీ నియంత్రణలో లేని విషయాలు మీ మీద ప్రభావాన్ని చూపటం అనేది మీరు పెట్టుకునే నిబంధనే. ఏదీ మంచికాదు, చెడుకాదు. అది మీ అభిప్రాయం మాత్రమే.

మీ మీద మీ అభిప్రాయాలని వదిలివేయండి. అదే విధంగా ఎదుటివారిమీద పరిసరాల మీద మీ అభిప్రాయలు వదిలివేయండి. అప్పుడు మీలో ఒత్తిడి ఉండదు. మిమ్మల్ని ఒత్తిడినుంచి బయటకి తెస్తుంది. ఈ విషయంలో ధ్యానం చాలా సహాయం చేస్తుంది. ధ్యానం మీ మనస్సుని విరామ స్తితికి తీసుకువెళుతుంది. అప్పుడు మీ చుట్టు ప్రపక్కల జరిగే విషయాలని వాటితో ప్రభావితం కాకుండా గమనించగలుగుతారు. ప్రయత్నించటంలో మీరు పొగొట్టుకునేది ఏదీ లేదు, ఒత్తిడి తప్ప.

ధ్యాన పద్దతి

మనలోని వత్తిడిని పోగొట్టటానికి ఇది చాలా సులభమైన, బలమెన ధ్యాన పద్దతి. దీన్ని ఆసందస్సురణ కార్యక్రమంలో నేర్పిస్తాం. అందులో మణిపూరక చక్రాన్ని నాభి ప్రాంతంలో

వత్తిడి లేని ఉత్తమస్తితి

ఉండే చక్రం తేలిక చేసే ధ్యానం. అదే ఒత్తిడికి పీఠం. ఈ ధ్యానం భోజనానికి ముందు ఖాళీ కడుపుతో చేయాలి. నిగ్రద పోవటానికి కొన్ని గంటల ముందు చేయవచ్చు. నిలబడి అరవండి. అయితే మీకు తెలియని భాషలో అరవాలి. వినేవారికి కూడా ఏమీ అర్థం కాకూడదు. ఆవేశంగా మీ ఎమోషన్స్ అన్నింటినీ బయటకి తెచ్చేయండి. ఏడవాలనిపిస్తే ఏడ్సేయండి. కింద దొర్లాలి అనిపిస్తే దొర్లండి.

ఇది చాలా బలమైన ధ్యానపద్ధతి. మీ అచేతన స్థితిలో అడ్డంకులని తొలగిస్తుంది. మీ అంతరంగంలోని అన్ని వ్యతిరేక భావాలని కరిగించి వేస్తుంది. ఇది ఒకవిధమైన సైకోఎనలెకికల్ సెషన్. అందులో పేషెంట్స్ ఎనలిస్ట్ దగ్గర ఇదే విధంగా చేస్తారు. అందులో సైకోఎనాలిసిస్ పది శాతం నిలవలో ఉన్న జ్ఞాపకాలు పోతాయి. హిప్పసిస్ అనేది అచేతనస్థితికి సంబంధించినది. దాని మీద మీ నియంత్రణ అనేది ఉండదు. కానీ ఈ ధ్యానం అత్యున్నత చేతన స్థితి యొక్క చర్య. దీన్ని శుభ్రం చేసే సమయంలో మీరు పూర్తిగా తెలుసుకునే స్థితిలో ఉంటారు.

ఈ పద్ధతిని ఇరవై నిముషాలు సాధన చేయండి. తరువాత పది నిముషాలు నిశ్శబ్దంగా ఉండి ఆ శక్తి మీలోపల అంతా వ్యాపించేలా చేయండి. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ ఆలోచనలని గమనించండి. వాటిని అణచవద్దు.

బూంగ్ బూంగ్ బూంగ్

  • అహంకారం మీ స్వచ్ఛమైన అంతరంగం యొక్క అబద్దపు గుర్తింపు. దీన్ని మీరు బయట ప్రపంచానికి చూపిస్తారు. ఇది అహం యొక్క ఒక రూపం దీనినే బయటకి ప్రదర్శిస్తారు.
  • మమకారం అంతరంగపు అహంకారం. అదే నిరంతరం మీరు మీ నిజ స్థితికంటే చాలా తక్కువ అని మీకు చూపిస్తుంది.
  • ★ మనం మన మనస్సుని నియంత్రిస్తాము అని, మనం చేసే దాన్ని మనమే నిర్ణయిస్తాం అనేది మనం మన జీవితంలో మోసే ఒక పెద్దఊహ.
  • ★ మీరు ఆత్మప్రబోధ స్థితిలో ఉంటే, వర్తమానంలో ఉంటారు.
  • ★ మీలో తొంభై శాతం వ్యధలు అంతరంగపు మాటలు, నిజంగా వ్యధలు కావు.
  • జీవితాన్ని రక్షించే అడ్రిలిన్ అనే రసాయనం అనవసరంగా శరీరంలో ★ కారణంలేకుండా తయారయితే అది ప్రమాదకారిగా మారుతుంది.
  • ★ వత్తిడి మనల్ని చంపుతుంది. అయితే అది మానసిక వ్యవస్థలో ఉంటుంది.

భయాలకి ఎదురు నిలవండి,

స్వేచ్ఛని పాందండి

భయాన్ని

భయం అంటే ఏమిటి?

భయం అంటే వ్యధయొక్క లోతైన ఒక కోణం. అల్పర్లు రావటానికి కారణం మనలోని వ్యధ మాత్రమే. ఏ విధంగా అయితే వ్యధ అనేది లేకుండా మన జీవితం లేదో అదే విధంగా భయం అనేది కూడా మన జీవితాలలో అల్లుకుపోయింది. భయం లేకుండా భయాన్ని ఎరురొనడం సాధ్యమే. ధైర్యం గల వ్యక్తి అంటే భయం లేని వ్యక్తి కాదు, భయాన్ని ఎదుర్కోవటం తెలుసుకున్న వ్యక్తి.

భయం శక్తి యొక్క ఒక రూపం. అందుకే దాన్ని నాశనం చేయలేరు. శక్తిని సృష్టించలేరు, నాశనం చేయలేరు. దాని రూపాన్ని మాత్రం మార్చగలరు.

అర్థం చేసుకోండి, మీ భయం అన్నది మీ జీవశక్తితో నేరుగా బంధాన్ని కలిగి ఉంటుంది. మీరు జీవన్మరణ సమస్యని ఎదుర్కొన్నప్పుడు, మీలో భయం కలిగినప్పుడు మీలో అడినలిన్ అనేది మీ శరీరంలో తయారౌతుంది. అడ్డినలిన్ మీరు వేగంగా పారిపోయే శక్తిని ఇస్తుంది. దీనినే పోరాడు లేదా పారిపోయే స్పందన అంటారు. మీరు భయాన్ని ఎదుర్కొంటారు లేదా దాని నుంచి పారిపోతారు. మీరు జీవన్మరణ స్థితిని ఎదుర్కొన్నప్పుడు మీలోనికి చాలా శక్తి వస్తుంది, మీలో భయం కలిగినప్పుడు మీ స్వాధిష్ఠాన చక్రం పూర్తిగా చలించిపోతుంది.

మీలోపలి బిగ్ బాంగ్ మరియు కృష్ణబిలం

మీలోపల స్వచ్ఛమైన కోరిక కాని స్వచ్ఛమైన ఆశ కాని ఉండి, దానికి ప్రత్యేకమైన లక్ష్యం లేనప్పుడు అది మీలో పొంగి ప్రపహించే శక్తి అవుతుంది. దానికి సృష్టించి, విస్తృతం కాగల శక్తి ఉంటుంది. అదే బిగ్ బాంగ్! కారణం లేకుండా మీలో శక్తి విస్సోటకం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మీలోపల ప్రత్యేక లక్ష్యం లేని స్వచ్ఛమైన భయం ఉన్నప్పుడు అది కుంచించుకు పోతుంది. అదే మీలోని కృష్ణబిలం లేదా బ్లాక్‌హోల్‌.

ఒక విషయం అర్థం చేసుకోండి, భయం మీ లక్షణం. దాన్ని ఏదో ఒకలక్ష్యం వెపుకి మళ్ళించకండి. భయం సహజం, దానికి కారణం సమాజపరమైనది. స్వచ్ఛమైన భయం జీవించటానికి సహాయం చేస్తుంది.

మీలోపల నుంచి ఏకారణంలేకుండా వ్యాపించే శక్తి స్వచ్ఛమైన ఆశ. ఎప్పుడెతే ఆశకికి ఒక లక్ష్యం ఉంటుందో అది మామూలు ఆశగా మారుతుంది. అదే విధంగా మీలోపలకి కారణం లేకుండా వచ్చిన శక్తి స్వచ్ఛమైన భయం. ఏదో ఒక లక్ష్యంతో ఏర్పడిన భయం సాధారణ భయం. కృష్ణబిలం ఏర్పడకపోతే బిగ్‌బాంగ్ జరగదు. ఇదంతా జీవితంలో ఒక భాగం. జగన్నాటకంలో ఒక భాగం. స్వచ్ఛమైన భయం అంటే మీలోపల మీరు విరామంగా

ఉండగలగటం. దానినే నాశనం అంటాం. ఈ విశ్వం పుట్టుకే బిగ్‌బాంగ్ అంటే విశ్వం యొక్క మరణం. బ్లాక్‌హోల్ అంటే మీ ఆత్మ పుట్టక. బిగ్‌బాంగ్ మరణమే బ్లాక్‌హోల్. మీరు లోపలికి తీసుకునే శ్వాస కోరిక, బయటకి వదిలే శాస భయం.

శ్వాస ద్వారా మీలోపలికి ప్రాణం వెళ్ళటమే బిగ్ బాంగ్. మీశరీరంలోంచి ప్రాణం బయటకి వెళ్ళటమే బ్లాక్‌హోల్. అంటే బిగ్‌బాంగ్ కాని బ్లాక్‌హోల్‌ని కాని ఆపటానికి ప్రయత్నిస్తే, దానితో పోరాడితే మీకు మీరు సమస్యలని సృష్టించుకుంటారు.

భయం కలిగినప్పుడు, బ్లాక్‌హోల్ కలిగినప్పుడు మీరు ప్రశాంతతవైపు తిరుగుతారు. అంటే బిగ్‌బాంగ్‌కి సిద్ధమవుతారు. మీలో స్వచ్ఛమైన భయం కలిగి నప్పుడు, మీరు బాగా విరామంలోనికి వెళ్ళి నూతనత్వాన్ని పొందుతారు. అదే మీలోపల ధైర్యంలా శక్తిలా ఉప్పొంగుతుంది.

మీలోని శక్తి, మీలోని వ్యతిరేక తత్వానికి మధ్య పోరాటం

మీకు ఉన్నది పోతుందేమో అన్న భయం మీకు కలిగినప్పుడు లేదా నేను ఏదీ సాధించలేను అన్న భయం ఏర్పడినప్పుడు మీలోని శక్తికి, మీ వ్యతిరేకతకి మధ్య పోరాటం జరుగుతుంది.

మీరు అనుకున్నది సాధించలేనని తెలుసుకున్నప్పుడు, దాన్ని సాధించగల శక్తి మీలో లేదు అని కచ్చితంగా తెలిసినప్పుడు మీలో భయం అనేది ఉండదు. అదే విధంగా దేనినైనా కచ్చితంగా సాధించగలను అని అనుకున్నప్పుడు భయం ఉండదు.

భయం అంటే మీ నమ్మకానికి, విశ్వాసానికి మధ్య జరిగే పోరు. అదే విధంగా మరొకవైపు మీలోని వ్యతిరేక భావాలకి, మీ ఆశలకి మధ్య జరిగే పోరాటం. అంటే మీరు మీలోని అనుకూల, వ్యతిరేక శక్తులతో పోరాడటమే. కాబట్టి అర్థం చేసుకోండి, మీకు సాధించే శక్తి లేదు అని కచ్చితంగా తెలిసినప్పుడు భయం ఉండదు. అయితే మీరు దేనినో సాధించాలి అనుకుని, దాన్ని సాధించే శక్తి లేనప్పుడు మీలో భయం కలుగుతుంది. ఈ పోరాటమే భయం. చూడండి, మీరు దేశానికి, ప్రపంచానికి రాజును కాలేనేమో అని ఎప్పుడూ భయపడరు. మీరు అలా కాలేరు అని తెలుసు. అయితే మీ సోదరుడి అంత విజయాన్ని సాధించలేనేమో అని భయపడతారు. మీలో ఉన్నదాన్ని పొందలేను అని భయపడతారు.

అవకాశం భయాన్ని సృష్టిస్తుంది. దీని అర్థం ఏమిటంటే భయం జీవితానికి మూలం. మీరు భూమిమీద మూడు వందల సంవత్సరాలు బతకనేమో అని భయపడతారా? లేదు. ఎందుకంటే అంతకాలం బతకలేమని కచ్చితంగా తెలుసు. అయితే మీరు ఎప్పుడూ అరవై, డెబ్బై సంవత్సరాలు బతకనేమో అని భయపడతారు. మీరు కచ్చితంగా సాధించగలను అని స్పష్టంగా తెలిసినప్పుడు మీలో భయం ఉండదు.

భయాన్ని రెండు విధాలుగా తప్పించుకోవచ్చు. ఒకటి అన్ని అవకాశాలని మూసివేయటం. అంటే మరణించటం. అప్పుడు భయం ఉండదు.

రెండవది అవకాశాల హద్దులని చెరిపివేయటం. అంతులేని అవకాశాలు, హద్దులు లేని సాధ్యత మీకు భయం లేకుండా చేస్తాయి.

ఏదీ సాధించలేమంటే మీ నుంచి దేనినీ తీసుకోలేరు అనుకున్నప్పుడు భయం ఉండదు. అన్నీ సాధించవచ్చు అన్నా భయం ఉండదు. ఎందుకంటే, మీరు పూర్తి శక్తివంతులు అని అనుకుంటారు. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే, ఒక్క క్లిక్ జరిగితే మీలో భయాలన్నీ పోతాయి.

ఈ రెండు విధాలని గురువులు పద్ధతులుగా ఉపయోగిస్తారు. నీవు ఏమీ చేయలేవు అని గురువు అంటే అది పూర్తి అధీనత. అది మానసిక మరణం. మీరు ఇక ఏమీ చేయలేను అనుకోగానే విరామంగా అయిపోతారు. దీనినే రమణ మహర్షి ఆత్మశరణాగతి అంటారు. ఈ విధంగా మీరు భయానికి అతీతంగా వెళ్ళవచ్చు.

రెండవది అన్ని అవకాశాలని తెరవడం ద్వారా భయం నుంచి తప్పించుకోవచ్చు. దీనిని ఆత్మజ్ఞానం అంటారు.

ఒక చక్కని కథ ఉన్నది : ఒక వ్యక్తి బోధనలు రాసే గుడి గోడమీద 'సోఽహం' అని రాస్తాడు. అంటే నేను అది అని, నాకు అన్నీ సాధ్యాలే అని. మరొక వ్యక్తి వచ్చి 'దాసోఽహం' అని రాసాడు. నాకు ఏదీ సాధ్యం కాదు. నేను దాసుడను అని. అదికూడా పర్వాలేదు. మరొక వ్యక్తి 'సదాసోఽహం' అని రాస్తాడు. దాని అర్థం నేను ఎప్పుడూ అదే.

నీవు ఏదీ సాధించలేనని అనుకున్నప్పుడు మీరు దాసోஉహం కాగలరు. నేను సాధించగలను అనుకున్నప్పుడు మీ శక్తిని తెలుసుకుంటారు. ఈ రెండు విధాలుగా మీరు భయం నుంచి స్వేచ్ఛని పొందవచ్చు. నేను ఏదీ సాధించలేను అనే భావంతో ఉంటే మీరు పరిశోధించి అనుభూతిని పొందుతారు. ఈ రెండింటిలో ఏ విధానమైనా మీరు భయానికి అతీతంగా వెళతారు. అయితే ఆ భావానికి పూర్తిగా కట్టుబడి ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకదానితో పని చేసే విధంగా ఉండాలి.

జ్ఞానోదయపు అవకాశాన్ని పెంచటం

కొంతమంది నన్ను, 'మాకు ఎన్నో భయాలు ఉన్నాయి. మేం ఏంచేయగలం?' అని అడుగుతారు. మీకు చాల భయాలుంటే మీరు జ్ఞానోదయం పొందటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అంటాను నేను. స్తబ్దంగా జీవితం గడిపేవారికి భయాలు ఎక్కువ ఉండవు. వారు జ్ఞానోదయం పొందడానికి అవకాశాలు తక్కువ.

స్తబ్దంగా జీవితం గడిపేవారు ఏ సాహసం చేయరు. అటువంటివారు పోగొట్టుకొనేది ఏమీ ఉండదు. తగిన నిర్ణయాలు తీసుకునే అవసరం లేదు. అప్పుడు భయాలు ఉండవు. వారు జ్ఞానోదయం పొందే అవకాశాలు తక్కువ.

Part 3: Living Enlightenment

చురుకైన వారు నిరంతరం పనిచేస్తూ ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కువ భయపడతారు. వారు జ్ఞానోదయం పొందడానికి చాలా ద్వారాలు ఉంటాయి. అవి తెరవగలిగితే ద్వారంగా ఉంటుంది. మీకు సరైన పద్ధతులు తెలిస్తే ఆ భయాలని ద్వారాలుగా చేసికొని విముక్తి పొందవచ్చు. లేకపోతే అవి అన్నీ గోడలై మిమ్మల్ని బంధిస్తాయి.

మీకు భయం అనిపిస్తే, మిమ్మల్ని అగౌరవ పరచుకోకుండా, కించపరచుకోకుండా నమ్మకంతో ఉండండి. ఎవరైతే భయాన్ని ఎదుర్కొంటారో వారికి సమస్యలుండవు. భయపడే వారు తమకి తాము ఎక్కువ సమస్యల్ని సృష్టించు కుంటారు. భయంగురించి ఎక్కువ ఆలోచించటం వలన సమస్యలు వస్తాయి.

భయం నిజస్వరూపం తెలుసుకొని ధైర్యంగా ఎదుర్కొంటే, విముక్తి చెందుతారు. అదే మీకు ఆశీర్వాదం. అప్పుడప్పుడు మీ దృష్టిని వేరొక దానిపైకి మరల్చితే భయంపోతుంది. భయం లేకుండా ఉండటం అంటే మీ చైతన్యస్థితిలోకి వెళ్ళటం. అక్కడ పోతుందనే భయం ఉండదు. మీకు జీవితంలో ఉండే భయాలు దగ్గరవారిని పోగొట్టుకుంటామని, ధనాన్ని కోల్పోతామని, తెలియని దాని గురించి విఫలమౌతామని భయపడతాం. ప్రతి భయాన్ని ఒక ద్వారంగా ఉపయోగించుకొని జ్ఞానోదయాన్ని పొందవచ్చు. మీరు ఆందోళనతోగాని, శక్తితోగాని నింపబడి ఉంటారు. మీరు ఆందోళనగా ఉన్నప్పుడు, తెలియకుండా, మీ అంతర్గతశక్తిని బలవంతంగా వాడుకుంటారు. మీ ఆత్మశక్తి నుండి పద్ధతి తెలియకుండా బలవంతంగా శక్తిని తీసుకుంటే, ఆందోళన కలుగుతుంది.

మనం ఆత్మశక్తి నుండి ధ్యానం ద్వారా శక్తిని పొందవచ్చు. మనకు అవసరమైనప్పుడు శక్తిని బలవంతంగా తీసుకోకుండా ఓర్పుతో, ధ్యానంతో వచ్చే శక్తిని, బ్రహ్మానందాన్ని మీలోకి వ్యాప్తి చెందనీయండి.

మీరు తెలుసుకోవలసిన ఇంకొక సత్యం

మీలో ఉన్న శక్తికి మరణం లేదు. మీలో ఉన్నమరొకదానికి మరణం ఉంది. ఉన్నది పోతుందని అనుకోవటమే మీకు మరణం, అంటే భయం కలిగించేది. మీలో ఉన్నదానికి మరణంలేదు అంటే లేనిది కోల్పోరు. దేనికి మరణంఉందో, అది మీ అంతరంగంలో ఇమడదు.

భయం లేకపోవటం అంటే భయాన్ని ధైర్యంతో ఎదుర్కోవటమే

మీరు భయాన్ని జయించలేరు. భయం లేకపోవటం అంటే తీవ్రమైన భయంతో ఉండగల మేధస్సుని కలిగి ఉండి, ఆ భయాన్ని ఏ లక్ష్యంవైపు తిప్పకుండా ఉండటమే. భయం కలిగించే వస్తువు లేదా లక్ష్యం లేనప్పుడు మనలో కలిగిన స్వచ్చమైన భయం మనకి లోతైన విశ్రాంతిని, శాంతిని ఇస్తుంది.

భయం అనేది ఒక గొప్ప శక్తి. అది మనకి లోతైన విరామాన్ని ఇస్తుంది. భయం యొక్క కేంద్రం నూతనత్వానికి కేంద్రం. భయాన్ని అణచడం భయం లేక పోవటంకాదు. మనం

చీకట్లో వెళ్ళేటప్పుడు భయంతో భగవంతుడి నామ జపం మొదలు పెడతాం. భయం వల్ల మీకు భగవంతుడి పేరు గుర్తుకు వస్తుంది. మనసులో నామజపం చేస్తున్నందువల్ల భయం లేదనిపిస్తుంది. మీసమస్యని పూర్తిగా పరిష్కరించకుండా, మీ దృష్టిని వేరొకదాని మీదకు మరల్చారని అర్థం చేసుకోండి.

ఉదాహరణకి, పిల్లి గట్టిగా కళ్ళుమూసుకొని పాలుతాగుతూ ఎవరూ చూడటంలేదని అనుకుంటుంది. మీరు భయం పోయిందని అనుకున్నప్పుడు అదేపని చేస్తున్నారు. మీరు భయం పోయిందని అనుకుంటారు. భయం కలగటంలేదు అంటే భయంలేదని కాదు. స్పష్టంగా తెలుసుకోండి. భయం ఉంది కాని, మీరు భయాన్ని ఎదుర్కోడానికి లేదా భయంతో ఉండటానికి అపారమైన శక్తి ఉంటుంది. భయం లేదంటే భయానికి అతీతంగా వెళ్ళి దానితో ఎటువంటి సంబంధం లేకుండా ఉండటం. భయం అనేది జీవితంలో ఒక సహజమైన భాగం.

తెలియని దాని గురించి భయం ఉంటే ఏమిచేయాలి? అని చాలామంది నన్ను అడుగుతారు. భయం ఉందంటే మీరు ప్రాణంతో ఉన్నారని అర్థం. మీరు ఏదో పోగొట్టుకుంటారనే భయం లేకపోతే భయం ఉండదు. మీరు మరణిస్తే కోల్పోయేది ఏమీ లేదు కాబట్టి భయం ఉండదు. మీరు కోల్పోయేది ఉన్నప్పుడు భయం ఉంటుంది. అది మనిషి సహజ సుభావం.

చీకటంటే భయం

మరణ భయం, చీకటి భయం ఒకటే. తెలియనిదాని గురించి ఉండే భయం చీకటితో సంబంధం ఏర్పరచుకుంటే పోతుంది. మీకు మరణ భయం కూడ ఉండదు.

నాకు ఒక జోక్ గుర్తు వచ్చింది.

ఒక పాప, "నాన్నా నీకు చీకటంటే భయమా?" అని తండ్రిని అడిగింది. "లేదు" అన్నాడు తండ్రి. మరి నీకు "పాములంటే భయమా?" అస్సలు భయం లేదు అన్నాడు. ఆ చిన్న పాప తాను కొత్తగా ఏదో కనిపెట్టానని, అయితే నీకు అమ్మ తప్ప ఏదన్నా భయం లేదు అంది ఆనందంగా.

మీ అజ్ఞానంవల్ల మీకు చీకటంటే భయం అని అర్ధం చేసుకోండి.

తంత్రంలో గురువు శిష్యుల్ని భయం పోగొట్టుకోడానికి అడవికి వెళ్ళి శూన్యాన్ని చూస్తూ ఉండమని చెప్తారు. అంటే రాత్రంతా శూన్యమైన అనంత ఆకాశాన్ని చూస్తూ కూర్చోవాలి. మీలో అణిగి ఉన్న భావాలన్నీ బయటకువస్తాయి.

జెన్ సంప్రదాయంలో వ్యక్తిని గోడవంకచూస్తూ కూర్చోమంటారు. మనసు శూన్యమే, బాహ్య శూన్యంతో కలిసి పోతుంది.

పై పద్ధతులలో ఏపద్దతైనా మీలో అణచుకున్న అవిరామం పోయి, మీరు నిశ్శబ్దంలో విశ్రాంతి పొందే విధంగా చేస్తుంది. మీ అంతరంగాన్ని శుభ్రపరుస్తుంది. మీలో అణచుకున్న భావాలు బయటకు రావడమే మీ భయాలు. మీరు అవగాహనతో ఆ భయంలోనికి, చీకటిలోనికి చూడ గలిగితే మీ భయం పోతుంది.

భయం నుండి వివేకం

ఒక చిన్న పిల్లవాడు భయపడినప్పుడు భయపడకు ధైర్యంగా ఉండమని చెబుతాం. మనం పిల్లలకి భయపడ కూడదని నేర్పిస్తున్నాం కనుక భయం అనిపించినప్పుడు సహజ స్వభావాన్ని అణచుకుని ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. అలా కాకుండా పిల్లల్ని భయాన్ని వెదకనిస్తే, భయానికి స్థూలంగా ఉనికి లేదని తెలుస్తుంది. అప్పుడు వారికి భయం పోతుంది.

గుర్తింపు పోతుందని భయం

మానవులకు ఉండే పెద్ద భయం గుర్తింపు ఉండదని, గుర్తింపు పోతుందన్న భయం, మరణభయం కన్నా అధ్వాన్నమైనది.

అనారోగ్యం, మానసిక అనారోగ్యం, ఆస్తి, పేరు ప్రతిష్ఠల్ని కోల్పోవటం అనేవి మరో రూపంలో ఉన్న మరణ భయం

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి సభలో ఉపన్యాసం ఇవ్వడానికి చేతిలోకి మైక్ తీసుకున్నప్పుడు, అతని మెదడు శూన్యమైపోయింది. అతడు కొంతసేపు మాటలు రానివాడిలా నిలబడిపోయాడు. కొంత సేపటికి ప్రపంచంలో అత్యంత అద్భుతమైంది మనిషి మెదడు. అది పుట్టినప్పటి నుంచి మరణించేవరకు నిర్విరామంగా పనిచేస్తుంది కాని ఉపన్యసించే ముందు ఆగిపోతుంది, అని అన్నాడు.

సమాజాన్ని తప్పు పట్టడానికి, సమాజంలో గుర్తింపు పొందలేమనే భయంతో, మనకు ఇష్టంలేని, మంచివి కాని పనులు చేస్తాం. సమాజం మనల్ని స్వీకరించదని భయం. మన అహంకారం చంపబడుతుందన్న భయం. మనం చేసే ప్రతి పని వెనుక, అంతర్లీనంగా మరణ భయం ఉంటుంది. మరణాన్ని అర్థం చేసుకుంటే జీవితం మీద అవగాహన మారుతుంది. మీలో ఉన్న భయాల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది.

కోపం భయానికి ప్రతిరూపం

లోపల ఉండేది భయం, వ్యక్తపరచేది కోపం.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి చేతిలో కొన్ని కాగితాలతో కోపంగా పోస్టాఫీసులోకి వెళ్ళి నన్ను బెదిరిస్తూ ఉత్తరాలు రాయడానికి మీకెంత ధైర్యం అని అడిగాడు. అక్కడ ఉన్న ఉద్యోగి అవును బెదిరింపు ఉత్తరాలు పంపడం చట్టరీత్యా నేరమే. ఆ ఉత్తరాలు ఎవరు పంపుతున్నారో మీకు తెలుసా? అని అడిగాడు. ఎందుకు తెలియదు, ఇన్‌కంటాక్సు అధికారి అని గట్టిగా అన్నాడు ఆ వ్యక్తి.

మీకు కోపంవచ్చినప్పుడు దానిలోకి చూస్తే మీ భయం కనిపిస్తుంది. భయం వేసినప్పుడు, చేతులు విసిరి కాళ్ళని విదిలించి, మీ కోపాన్ని వ్యక్తపరిస్తే భయం పోతుంది. భయం కోపంగా ఎలా మారుతుందో, అలాగే ద్వేషంగా కూడ మారుతుంది. మీరు అవగాహనతో ఉంటే మీ భావాలు, ఒక దాని నుండి వేరొకదానికి ఎలా మారతాయో గమనించవచ్చు.

భయం ఆపదలు

తోటలో నడుస్తున్నప్పుడు చీకటిలో తాడుని చూసి పాము అని భ్రమపడితే కలిగే భయం ఆపద కలిగించే భయం. ఒక గులాబి మొక్కని వేళ్లతో కుదిపితే అది చనిపోతుంది.

మనం రోజుకి నిద్రలోనో, లేక మెలకువగా ఉన్నప్పుడు 6 నుండి 12 భయ విపత్తుల్ని ఎదుర్కొంటాం. ఇవి మన అచేతనస్థితి నుండి పుడతాయి. మనం వాటిని చేతనస్థితిలో అవగాహనతో చూస్తే తగ్గుతాయి.

ఆ భయం క్షణికం కాబట్టి తరువాత దాన్ని లోతుగా విశ్లేషిస్తే భయాలంటే అర్థం అవుతుంది. అది భయాన్ని పూర్తిగా పోగొడుతుంది. మనలో ఉండే సహజ భయాన్ని తగ్గించుకుంటే ఈ భయ విపత్తుల తీవ్రవత, తరచుగా రావటం తగ్గుతాయి. మనకు సహజంగా ఉండే భయాన్ని అవగాహనతో, లోతుగా అర్థం చేసుకుంటే తగ్గించుకోవచ్చు.

భయాన్ని అధిగమించటం

చూడటం, స్వీకరించడం, భయాన్ని అణచకుండ దాన్ని చూసి స్వీకరి స్తే అది కరిగిపోతుంది. భయంతో మన శరీరాన్ని వణకనివ్వండి, కన్నీరు కారనివ్వండి. గాలిలో గడ్డిపోచ ఎలా వంగుతుందో అలా భయానికి లొంగిపోండి.

ఒక చిన్న కథ : ఒక చీకటి రాత్రి ఓ వ్యక్తి నడుస్తుంటే రాయి తగిలి తూలి క్రిందికి జారాడు. అతడు పడిపోకుండా వేళ్ళాడుతున్న కొమ్మని పట్టుకున్నాడు. చిమ్మ చీకటిలో అతడు కొమ్మని గట్టిగా పట్టుకుని, సహాయం కోసం గట్టిగా అరిచాడు. అతడు తన గొంతు ప్రతిధ్వనిని విని, తాను అగాధంలో పడానేమో అని భయపడ్డాడు. ఆ రాత్రి గడవటం కష్టమైంది. తెల్లవారిన తరువాత చూస్తే రెండు అడుగుల కింద ఒక పెద్దరాయి కనిపించింది. అగాధంలేదు.

మీ భయాలన్నీ ఇలాగే ఉంటాయి. మీ భయాన్ని ఎదుర్కొంటే అవి లోతైనవి కావని తెలుస్తుంది. మీరు వాటిని భూతద్ధంలోంచి చూసి అగాధాలనుకుంటారు. మీరు భయం అనే కొమ్మని వదిలేస్తారో, పట్టుకుని వేళ్ళాడతారో అన్నది మీ ఇష్టం.

స్వాధిష్ఠాన చక్రం – ఇది భయానికి మూలం.

నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన, నేను ప్రతిరోజు తెల్లవారు జామున 4 గంటలకి కీర్తనలు పాడుకుంటూ అరుణాచలం కొండకి ప్రదక్షిణలు చేసేవాడిని. ఒక రోజు నేను, అర్ధరాత్రి తరువాత లేచి కొండ చుట్టు ప్రదక్షిణ చేయడానికి బయలుదేరాను. ఆ రోజుల్లో సరైన దీపాలు

భయాలకి ఎదురు నిలవండి, స్వేచ్ఛని పొందండి

లేవు, దారిలేదు, చుట్టూ దట్టమైన అడవి. నేను పాటలు పాడుకుంటూ తలవంచుకుని నడుస్తున్నాను. ఒక నది దగ్గర అప్రయత్నంగా తలెత్తి చూసేసరికి ఒక హైనాల గుంపు నామీద దూకడానికి సిద్ధంగా ఉంది.

అంతులేని భయం వేసింది. అలాంటి అనుభవం నాకు ఎప్పుడూ కలగలేదు. దాని తరువాత నా జీవితంలో మళ్ళీ అలాంటి భయం కలగలేదు.

నేను అరుణాచలేశ్వరునికి పూర్తిగా అధీనమైనట్లు అనిపించింది, నన్ను అరుణాచలేశ్వరుడు రక్షిస్తాడని పూర్తి నమ్మకం కలిగింది. ఎక్కడి నుంచో ఒక సన్యాసి వచ్చి తన కుర్రతో ఆ హైనాల గుంపుని తరిమేసాడు. ఆ జంతువుల గుంపు పారిపోగానే ఆ వృద్ధుడు కూడ మాయమైయ్యాడు.

మనసులో చిత్రాలు ఏర్పరచుకొనటం

భయాన్ని పోగొట్టుకోవాలంటే దానిలోనుండి వెళ్ళన్నట్లు మనసులో పూరిగా ఊహించుకోవాలి. ఈ పద్ధతిని మీకు భయం లేనప్పుడు, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉపయోగించవచ్చు. మీరు ఏకాంతంగా కూర్చొని భయాన్ని ఊహించుకొని, పూర్తి అవగాహనతో ఎదుర్కొండి. మీకు బాధ కలిగినా, శరీరానికి అసౌకర్యం అనిపించినా పర్వాలేదు భయాన్ని అణచవద్దు, అనుభవం పొందండి, ఆ అనుభవంతో అది పూర్తిగా పోతుంది.

ధ్యాన పద్ధతులు

  1. హంస మంత్రం : ఈ పద్ధతి చాలా శక్తివంతమైనది. 24 గంటలు ఇది ఉపయోగించవచ్చు ఎప్పుడైనా మీకు భయం అనిపిస్తే విరామంగా కూర్చోండి. మీ ధ్యాస, ఏకాగ్రతని బయటకి వదిలే శ్వాస మీద వుంచండి. 'సా' ని మీమనసులో నిశ్శబ్దంగా శ్వాస వదులుతూ మనన చేయండి. శ్వాస వదలటం అంటే విశ్రాంతిగా ఉండటం, పోయేవాటిని పోనీయటం. శ్వాస తీసుకునేటప్పుడు మీరు నిరంతరం దేనినో దాన్ని పట్టుకుని ఉంటారు. శ్వాస వదిలేటప్పుడు అన్నీ వదిలేస్తారు. ఇప్పుడు అదేవిధంగా వదిలేయండి. శ్వాసని విడవటంమీదే ఏకాగ్రతని నిలపండి. శ్వాస తీసుకోవటాన్ని పట్టించుకోవద్దు. శ్వాస తీసుకుంటూ 'హం' అని నిశ్శబ్దంగా అనుకోండి.

బయటికి వదిలే శ్వాసమీద ఎక్కువ శ్రద్ధని ఉంచండి. లోతుగా శ్వాస వదలండి. అప్రయత్నంగా శరీరం శ్వాస తీసుకునే విధంగా చేసి కేవలం శ్వాస వదలటం మీద మాత్రమే శ్రద్ధ ఉంచండి. నిశ్శబ్దంగా హం.... సా.....హం..... సా.... అనుకోండి. హంస మంత్రం, అకస్మాత్‌గా మిమ్మల్ని తెలుసుకునే తత్వంలో ఉంచుతుంది. మీకు విరామాన్ని ఇస్తుంది. అది ఎప్పటికీ పోని (మరణించని) విరామం. పోయేవన్నీ మిమ్మల్ని వదలి పోతాయి.

మీకు భయం వేయనప్పుడు కూడా ఈ పద్ధతిని సాధన చేయవచ్చు. మీరు కూర్చొని, నిలబడి, నడుస్తూ, తింటూ కూడా ఈ పద్ధతిని సాధన చేయవచ్చు. ఇది చాలా శక్తివంతమైన పద్ధతి. నిరంతరం బయటకి విడిచే శ్వాసమీద శ్రద్ధని ఉంచి హంసా ని నిశ్శబ్దంగా జపిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ హం అని వదులుతూ 'సా' అని అనుకోండి.

ఈ విధంగా నిశ్శబ్దంగా చేసే మీరు 'అజపా జప' గా అవుతారు. ప్రయత్నం లేకుండా జపించటం. ప్రయత్నంతో జపించేది జపం. అజపాజప అంటే మీలోపల నిరంతరం దానంతట అదే జరుగుతూ ఉండేది అని అర్ధం. పోయేవన్నీ మిమ్మల్ని వదలి వెళ్ళిపోతాయి. మీరు దానినుంచి బంధవిముక్తులవుతారు. ఏదైతే ఎప్పటికీ మరణించదో అది మీలో ఉండిపోతుంది. అప్పుడు మీరు అంటే ఎప్పటికీ మరణించని వారు అని తెలుసుకుంటారు. ఆ సత్యమే జ్ఞానోదయం. హంసమంతం అజప అయితే మీరు పరమహంస అవుతారు.

ఈ పద్ధతిని మూడురోజులు సాధనచేయండి. గుర్తువచ్చినప్పుడు శ్వాస తీసుకుంటూ 'హం' అనుకోండి, శ్వాస వదులుతూ 'సా' అనుకోండి. మీ ఏకాగ్రతని శ్వాస వదలటం మీద మాత్రమే ఉంచండి. అకస్మాత్‌గా మీలో ఆస్తిపోతుంది, ఆరోగ్యం పోతుందేమో అనే భయాలన్నీ పోతాయి. అన్ని భయాలు పోతాయి. బయట శ్వాస మీద ఏకాగ్రతని నిలిపితే మీ అంతరంగంలో మరణించేవన్నీ మిమ్మల్ని వదిలివేస్తాయి.

  1. చీకటి ధ్యానం : మనం చీకటి నుంచే జన్మించాం. అమ్మ గర్భంలో చీకటి అదే. మనం అనుకున్నట్లు చీకటి వ్యతిరేకమైంది, చెడ్డది కాదు. అది అద్భుతమైన చికిత్సా శక్తి, తల్లి లాంటి మంచి అనుకూలమైన శక్తి.

తల్లి గర్భంలోని ఆ శక్తినుంచే మీ శరీరం తయారు అయ్యింది. దీనినే కారణశరీరం అంటారు. చీకటి మీ శరీరానికి ఆధారం. అంతేకాదు ఆకాశం, విశ్వం అంతా చీకటే. విశ్వం అంటే వెలుగుకాదు, గాఢమైన చీకటి.

వేదసాహిత్యం ఏమి చెబుతుందంటే, సృష్టికి ముందు చీకటిని, చీకటి కప్పిఉంచింది అని. అది అన్నింటికీ మూలం, అదే ఆధారం. మీరు విమానం లోంచి బయటకి రాత్రివేళ చూస్తే నేను చెప్పే చీకటి తెలుస్తుంది. చీకటి మాత్రమే నిజానికి అక్కడ ఉన్నది. మిగిలినవి వస్తాయి పోతాయి. చీకటి మీరనుకున్నట్లు వ్యతిరేకమైంది కాదు. మనం చీకటి అంటే మరణం అనుకుంటాం. మరణం తరువాత వచ్చే ఖాళీ చీకటి అనుకుంటారు. కానీ మీరు పుట్టటానికి ముందుకూడా చీకటే అన్న విషయం మీకు తెలియదు. ఇప్పుడు అర్థం చేసుకోండి. చీకటి అంటే మరణం తరువాత వచ్చే శూన్యం కాదు. చీకటి అంటే పరిపూర్ణత. అది సృజనాత్మక శక్తి. దాని నుంచే మీరు జన్మించారు. ఇది స్పష్టంగా అర్థమైతే మీరు చీకటితో అనుబంధాన్ని పెంచుకోగలరు.

ముందు మీరు చీకటి అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే, అప్పుడు చీకటిమీద ధ్యానం చేయగలుగుతారు. మీకు చీకటి అంటే భయం ఉంటే ఈ ధ్యానంలోనికి వెళ్ళలేరు. ఈ ధ్యానం మీలోని తీవ్రమైన బద్దకానికి, అతినిద్రకి, నిరాశకి చికిత్స చేస్తుంది. ఈ నాలుగు సమస్యలకి పరిష్కారం ఈ ధ్యానం.

సూచనలు: (సమయం 25 నిముషాలు)

భయాలకి ఎదురు నిలవండి, స్వేచ్ఛని పొందండి

కళ్ళు మూసుకుని కూర్చోండి. కళ్ళు మూసుకోవటం అంటే మీలోపల కూడా చూడకూడదు. మీరు కళ్ళుమూయగానే లోపల ఏవేవో చూస్తూవుంటారు. లోపల టి.వి ఆన్ అవుతుంది. ఇప్పుడు పూర్తిగా కళ్ళు మూయాలి. అప్పుడు మీలోపల గాఢమైన చీకటిని చూసారు. తల్లి గర్భంలోని చీకటి మీరు జన్మ తీసుకున్న చీకటి. అదే విశ్వం అంతా ఉన్న విశ్వశక్తి అందులోంచే సృష్టి ఆవిర్భవించింది. మీరు పుట్టినప్పుడు ఆ శక్తిని, ఆ చీకటిని మీ లోపల ఉంచుకొని పుట్టారు.

మీరు కళ్ళుమూసుకొని, లోపల చూడటం ఆపగలిగితే మీరు ఆ చీకటిని చూడగలుగుతారు. ఆ గాధమైన చీకటితో ఇరవై నిమిషాలు ఉండండి. ఒకవేళ మనస్సు ఎక్కడికైనా వెళిళే తిరిగి చీకటిలోనికి తీసుకురండి. 20 నిముషాల తరువాత కళ్ళుతెరచి బయటకూడా చీకటిలోనే 5 నిమిషాలు ఉందండి. కళ్ళుతెరచి అదే చీకటిని బయటకూడా చూడండి. మీరు బయటా లోపల అదే చీకటిని చూడగలిగినప్పుడు మీ మనస్సుని అపగలిగి అవసరమైనప్పుడు తెచ్చుకోగల స్థితికి వస్తారు.

మీరు సమస్యల నుంచి స్వేచ్ఛని పొందాలంటే మీ మనస్సుని ఆపగలగాలి. కారణ శరీరానికి సంబంధించిన నిద్ర సమస్యలకి ఇదే పరిష్కారం. మీరు గాధమైన చీకటిలో ప్రవేశించగానే అనారోగ్యం బాగవుతుంది. మానసికంగా, భౌతికంగా మీలో చక్కని మార్పు వస్తుంది. అది చికిత్స చేయటమే కాదు మీ అంతరంగపు లోతులలోనికి, మీ చేతనస్థితిలోనికి తీసుకువెళుతుంది. అది జ్ఞానోదయానికి తీసుకువెళుతుంది.

స్వాధిష్ఠాన చక్రం మీద ఏకాగ్రత

స్టెప్–1 : స్వాధిష్ఠాన చక్రాన్ని గుర్తు చేసుకోండి.

నాభి ప్రాంతానికి రెండు అంగుళాలు క్రింద ఉన్న ఈ చక్రం మీద ఏకాగ్రత ఉంచి లోతుగా హూ కారాన్ని చేయండి. హూ ని లోతుగా గట్టిగా అనాలి. అప్పుడు ఏవైనా భయాలు బయటకి వస్తే రానీయండి. మీకు భయం వేసినా పరవాలేదు. హూకార మంత్రాన్ని తీవ్రంగా చేయండి.

స్టెప్–2 : మీ కేంద్రంలో విరామంగా ఉండండి.

స్వచ్ఛమైన ఆశ అంటే ఆనందం, ఉత్సాహం. స్వచ్చమైన భయం లోతైన శాంతి, ఆనందంతో మీరు ఏదైనా సాధించగలరు. శాంతితో కూడా సాధించగలరు. ఆ శాంతిలో విరామంగా ఉండండి. మీరు చాలా చైతన్యంతో ఉండగలరు.

ముఖ్య విషయాలు

  • శక్తిని సృష్టించలేరు, నాశనం చేయలేరు. దాని రూపాన్ని మాత్రం మార్చగలరు.
  • మీలోపల నుంచి ఏకారణంలేకుండా వ్యాపించే శక్తి స్వచ్ఛమైన ఆశ.
  • ఎవరైతే భయాన్ని ఎదుర్కొంటారో వారికి సమస్యలుండవు. భయపడే వారు తమకి తాము ఎక్కువ సమస్యల్ని సృష్టించు కుంటారు.

బాధ ఒక గొప్ప గురువు

జీవన్ముక్తి అంటే 'బాధకి' బాధపడటానికి అతీతంగా వెళ్ళటం

చాలాసార్లు భయం బాధగా మారుతుంది. ఈ ప్రపంచంలో అత్యంత భయపెట్టే విషయం బాధ. జీవించి ఉన్న ప్రాణులన్నీ భయపడేది ఒకే ఒక్క విషయానికి, అదే బాధ. మీరు కొంచెం లోతుగా చూస్తే మీకు తెలుస్తుంది, ఎవరైనా మరణం అంటే భయపడరు. కాని, మరణం లోని బాధ గురించి, అప్పుడు వారు అనుభవించే యాతన గురించి భయపడతారు. కొంతమందికి పేదరికం అంటే భయం. కొందరికి సంబంధబాంధవ్యాల గురించి భయం. మరి కొందరికి అనారోగ్యం అంటే భయం. అయితే ఈ భయాలన్నింటికీ మూలకారణం బాధ. వీటి ద్వారా వారికి కలిగే బాధ అంటే భయం. ఈ భయాలన్ని బాధ అంటే ఉండే భయమే.

బాధ అంటే ఏమిటి?

బాధ అనేది శారీరకం లేదా మానసికం లేదా భావావేశాత్మకమై ఉంటుంది. భౌతికమైన లేదా శారీరకమైన బాధ అనేది శరీరానికి కావలసిన ప్రాథమిక అవసరం. ఒక్కసారి ఊహించండి, పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే, శరీరానికి బాధ కలగకపోతే అలా దెబ్బలు తగిలించుకుంటూ ఉంటాం. మనం జుట్టుని రకరకాల స్టైల్స్‌లో మార్చినట్టు ముఖాన్ని, కాళ్ళు చేతులని మార్చుతాం. నిజానికి బాధ అంటే శరీరం మైండ్‌కి రాసే ఒక విన్నపం, దయచేసి నామీద కొంత శ్రద్ధ చూపించు అని రాసే ఉత్తరం. ఎప్పుడైతే బాధ కలిగిన ప్రాంతంలో మన ఏకాగ్రతని పెడతామో, శ్రద్ధ చూపిస్తామో అది శక్తి అవుతుంది. ఎప్పుడైతే శరీరం తన బాధని తెలియచేస్తుందో అది మన శ్రద్ధని ఆశించటం. ఆ శ్రద్ధ శరీరానికి చికిత్స చేస్తుంది.

మానసిక, భావావేశాత్మక బాధ అంటే మీకు ఇష్టంలేని దాన్ని ఎదుర్కొన్నప్పుడు మీలో ఒక మానసిక భావన కలుగుతుంది. పరిశోధనలు ఏమి చెబుతున్నాయంటే మానసిక బాధ శరీరాన్ని చాలా ఎక్కువగా కలతపడే విధంగా చేస్తుంది. సెక్స్ పరమైన మానసిక భావనలని అణచివేస్తే దాని ఫలితం వీపు క్రింది భాగం వ్యాధిగ్రస్తమవుతుంది. ఎక్కువ బాధ్యతలు తీసుకుంటే భుజాల నొప్పులు వస్తాయి. అది శారీరక బాధ కాని, మానసిక బాధ కాని, మీరు ఒక ముఖ్య విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ బాధైనా వర్తమానాన్ని అడ్డుకునే ప్రయత్నంలోనే వస్తుంది.

కాలం Vs అర్థం చేసుకోవటం

జీవితంలో ఏదైన బాధాకరమైన సంఘటన జరిగితే, అది బిడ్డని కాని, భర్త లేదా భార్యని కాని పోగొట్టుకోవటం, మంచి స్నేహాన్ని పోగొట్టుకోవటం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధపడతారు. కాని కొంతకాలం అయ్యాక ఆ విషయాన్ని స్వీకరిస్తారు. చాలా రాత్రులు, పగలు ఏడుస్తారు. కానీ ఆ తరువాత ఆ విషయాన్ని స్వీకరిస్తారు. కాలం బాధని మాన్పుతుంది. ఇది ఒక సామెత. ఒక విషయం అర్థం చేసుకోండి. మీలో బాధని మాన్పటానికి కాలం ఎప్పుడు అవసరం అవుతుందంటే ఆ సంఘటన జరిగినప్పుడు. ఆ బాధని భరించటానికి మీరు పూర్తి చేతన స్థితిలో, పూర్తి తెలుసుకునే తత్వంతో లేనప్పుడు. బాధ కలిగినప్పుడు మీరు దానివైపు కేవలం చూడగలిగితే, ఆ భావావేశాన్ని తెలుసుకునే తత్వంతో గమనించ గలిగితే అపుడు మీరు మీకు బాధకలిగించే విధంగా మనసు ఆడే ఆటని తెలుసుకోవచ్చు. మీకు సమయం ఎందుకు కావాలంటే అప్పటికి మీరు అర్థం చేసుకుంటారు. కొన్ని వారాలు లేదా నెలలు గడిచాక లేదా సంవత్సరాలు గడిచాక క్రమంగా ఆ సంఘటన మసకబారుతుంది. అది ఎక్కడో దూరంగా ఉండే జ్ఞాపకాలలో చేరుతుంది.

కాని ఆ బాధ పూర్తిగా వ్యవస్థని వదిలిపోదు. ఎప్పుడైనా మీరు పోగొట్టుకున్న వ్యక్తిలాంటి మనిషిని చూసినప్పుడు నడక, మాట, నవ్వు ఏదైనా మీరు పోగొట్టుకున్న వారిని గుర్తు తెప్పిస్తే తిరిగి ఆ గాయం రేగుతుంది. అది మిమ్మల్ని బాధపెడుతుంది. ఎందుకంటే మీరు మీ గతాన్ని మీ లోపల మోస్తూ ఉంటారు. ఈ కారణం వలన మీకు జీవితం చాలా బరువుగా ఉంటుంది. మీరు మీ గతాన్నంతా మోస్తూ ఉంటారు. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి, యువకులుగా ఉన్నప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా జీవితంలో ప్రతి దశలోని అనుభవాలని, చేసిన తప్పులని, బాధలని పట్టుకొని ఉంటారు. మీరు మోసే గతం యొక్క బరువే మీరు ఎప్పుడు ఆ అనుభవాన్ని పొందినా తిరిగి బాధపడేట్లుచేస్తుంది. మీరు మీ గతాన్ని వదిలివేయాలి అని నిర్ణయించుకొని, ప్రతి పరిస్థితిని కొత్తగా చూడగలిగితే మీకు అంత బాధ ఉండదు. మీకు బాధ కలిగినా వెంటనే మానిపోతుంది. దానికి అంత ఎక్కువ సమయం అవసరం లేదు.

బాధ. సంతోషం – ఒక నాణానికి రెండు వైపులు

ఒక చిన్న కథ : ఒక శిష్యుడు గురువుగారి దగ్గరకి వెళ్ళి ఆయనతో, "గురుదేవా! నేను ధ్యానం చేయలేకపోతున్నాను. కాళ్ళ లాగుతున్నాయి. నా ఏకాగ్రత చెదురుతున్నది," అని అంటాడు. అప్పుడు గురువుగారు, 'అదిపోతుంది' అంటారు. రెండువారాలు గడిచాక ఆ శిష్యుడు గురువుగారి దగ్గరకి మరలా వెళ్ళి "గురుదేవా! నేను బాగా ధ్యానం చేయగలుగుతున్నాను. నేను చేతన స్థితిలో ఆనందస్థితిలో ఉండగలుగుతున్నాను" అంటాడు. గురువుగారు శిష్యుడితో, అది పోతుంది, అంటాడు.

బాధకి, సంతోషానికి మూలం ఒక్కటే. అది ఒకే విధమైన స్పందన. కాకపోతే రెండు పేర్లు. అది ఇలా ఉంటుంది, ఇద్దరు వ్యక్తులు శరీరాన్ని మసాజ్ చేయించుకుంటారు. వారిలో ఒకరు ఇది చాలా చక్కని ఉత్సాహం కలిగించే పని అంటాడు. మరొక వ్యక్తి ఇది చాలా బాధకలిగించే హింస అంటాడు. ఒక్కటే సందేశం కాని అది తీసుకున్న వ్యక్తిని బట్టి అది సంతోషమా, బాధా అనేది ఉంటుంది.

జీవితంలో ఈ రెండూ వ్యతిరేకాలు ఉంటాయి. సంతోషం బాధ, ఈ రెండూ కూడా మనస్సు నుంచే వస్తాయి. మనస్సు నిరంతరం ఈ చివరిదైన బాధనుంచి ఆ చివరిదైన సంతోషం వైపు ఇలా రెండు చివరల మధ్య తిరుగుతూ ఉంటుంది. చాలా అరుదుగా మధ్య ప్రాంతంలోనికి వస్తుంది. సంతోషం బాధ అనేవి ఆయా వ్యక్తుల భావాల మీద ఆధారపడి ఉంటుంది. మీకు సంతోషం కలిగించేది మరొకరికి బాధ కలిగించవచ్చు.

భగవద్దీత, ఆత్మసాక్షాత్కారానికి ఎన్నో మార్గాలు చూపించిన శ్రీకృష్ణ భగవానునిచే చెప్పబడిన మహాగంథం. అందులో చాలా చక్కగా చెబుతారు, ఎవరైతే బాధని సంతోషాన్ని ఒకే విధంగా చూస్తారో ఎవరైతే మట్టిని, బంగారాన్ని ఒకే విధంగా చూస్తారో, ఎవరైతే పొగడని, విమర్శని వివేకంతో ఒకే విధంగా తీసుకుంటారో, ఎవరైతే మిత్రులని, శత్రువుని ఒకే విధంగా చూస్తారో అటువంటివారు ఊగిసలాడే వ్యవస్థకి అతీతంగా వెళతారు. అటువంటి వారికి సంతోషం బాధ ఒకే విధంగా ఉంటుంది. అటువంటివారు జ్ఞానోదయానికి సిద్ధమైనట్టే.

సంతోషం, బాధలనుంచి స్వేచ్ఛ పొందండి

గౌతమబుద్ధుడు ఈ విధంగా చెబుతాడు, మిమ్మల్ని మీరు సంతోషం, బాధలనుంచి విముక్తుల్ని చేసుకోండి. సంతోషం కోసం పాకులాడటం, బాధని పెంచి పోషించటం అనే ఈ రెండు ఒకే విషయానికి సంబంధించిన రెండు వ్యవహారాలు.రెండూ గొలుసులే. బాధ గొలుసు అందవిహీనంగా కనిపిస్తుంది, సంతోషం గొలుసు అందంగా కనిపిస్తుంది. ఇది ఎలా అంటే రాత్రి తరువాత పగలు వస్తుంది, పగలు తరువాత రాత్రి ఒకదాని తరువాత ఒకటి వస్తాయి.అదేవిధంగా సంతోషం బాధ అనేవి కూడా.

ఎపుడైతే మీరు సంతోషం బాధ అనేవి మనస్సు చేసిన సృష్టి అని అర్థం చేసుకుంటారో, అప్పుడు అవి ఎక్కువసేపు ఉండవు, అవి అశాశ్వతం అని తెలుసుకుంటారు. అవి గాలి బుడగలులా వస్తుంటాయి, పోతుంటాయి. మీ సంతోషాన్ని ఎవరూ తీసివేయనవసరం లేదు. ఎందుకంటే మీ మనస్సు పెండ్యులం లా బాధవైపుకి వెళుతుంది. దీనికి పరిష్కారమార్గం ఈ రెండింటికీ అతీతంగా వెళ్ళగలగటమే. దీని అర్థం సంతోషాన్ని అణచివేసి, బాధని మర్చిపొమ్మని కాదు. తెలుసుకునే తత్వంతో ఉంటే బాధ ఆనందంగా రూపాంతరం చెందుతుంది. బయట పరిస్థితులు ఏవిధంగా ఉన్నా, ఆ శక్తి మీలో ఉంటుంది. పరమానందం మీ సహజ లక్షణం. అది ఎక్కడికీ పోదు. కేవలం జరుగుతున్నదాన్ని ఆపటానికి ప్రయత్నిస్తే, మీలో సహజసిద్ధమైన పరమానందాన్ని మరచిపోతారు.

బాధలో తెలుసుకునే తత్వం

బాధ అది భౌతికమైనా, మానసికమైనా, భావాత్మకమైనది. దానికి చీకటిలా ఉనికిలేదు. వెలుగులేనప్పుడే చీకటి ఉంటుంది. అదే విధంగా బాధకి అసలు ఉనికిలేదు. ఎప్పుడైతే తెలుసుకునే తత్వం ఉండదో బాధ ఉంటుంది. లైటు వేయగానే ఏవిధంగా చీకటి వెళ్ళిపోతుందో, మీ తెలుసుకునే తత్వం అనే శక్తిని మీలోనికి తీసుకువచ్చినప్పుడు బాధ కరిగిపోతుంది.

మీరు అనుకునే మానసిక లేదా భావాత్మక బాధ అనేది ఐస్‌బర్గ్ మొనలాంటిది. మీరు దాని మూలాలదగ్గరకి వెళ్ళి అది ఎక్కడ ప్రారంభమైందో తెలుసుకోవాలి. దాని అసలు కారణం తెలుసుకుని దానికి చికిత్స చేయాలి. ఆ విధంగా చేయకపోతే ఆ బాధని మరొకరి మీద చూపించి వాళ్ళని బాధ పెడతారు, మీరు బాధ పడతారు. నేను ఎప్పుడూ చెబుతుంటాను, మీకు బాధ ఉంటే మిగతా అన్ని విషయాలు వదిలివేసి దానిమీద పనిచేయండని. దాని వేర్లకి చికిత్స జరిగేవిధంగా చూడండి. అప్పుడే మీరు రక్షణ ప్రదేశంలో ఉండగలుగుతారు. లేకపోతే మీరుకాని, మీ చుట్టూ నివసించేవారు కాని రక్షణ ప్రదేశంలో ఉండరు.

మీరు తెలుసుకునే తత్వంతో బాధని చూడగలిగితే మీరు కేవలం శరీరం కాదు అన్న విషయాన్ని తెలుసుకుంటారు. అప్పుడు ఏ బాధ నిజమైన మిమ్మల్ని అంటలేదు అని తెలుసుకుంటారు. ఒక్కసారి మీరు ఈ బాధలకి అతీతులని తెలుసుకుంటే, మీరు ఆ బాధకి అతీతంగా వెళ్ళి, దుఃఖాతీతులు అవుతారు. అప్పుడు మీరు శరీరంతో ఎటువంటి బంధం లేని ఒక అరుదైన స్వేచ్ఛని అనుభవిస్తారు. ఈ స్వేచ్ఛని మీ జీవితమంతా మీతో ఉంచుతారు. అప్పుడు ఈ విశ్వప్రపంచం మాయమౌతుంది. మీలోనికి మరో అద్భుతమైన, ఎక్కడా పోల్చలేని అందంగాఉన్న, అమాయకత్వంతో సంతోషం, కరుణ నిండిన మరొక ప్రపంచం మీ ముందుకి వస్తుంది.

మీరు లోతైన స్పష్టతతో ఆ బాధని, దానికి గల కారణాన్ని, దాని లక్షణాల్ని చూడగలిగితే బాధ తనంతట తాను ఆవిరైపోతుంది. ఎందుకంటే బాధ మీలో ఉండటానికి గల కారణాన్ని స్పష్టంగా చూడగలిగితే ఆ కారణం అవిరైపోతుంది. ఈ విధంగా తెలుసుకున్నప్పుడు మీలోనికి పూర్తి ఆనందం వస్తుంది. అదే జ్ఞానోదయపు స్థితి.

జన్మించిన దగ్గరనుంచి మరణించే వరకూ బాధ

జన్మ అనేది బాధతో ప్రారంభమవుతుంది. అదే జన్మతీసుకునే బాధ. మీరు జన్మించేటప్పుడు చాలా బాధపడతారు. ఆ బాధకి జన్మించేముందు మీరు కోమాలోనికి వెళతారు. యోగీశ్వరులు ఏమి చెబుతారంటే మీరు ప్రపంచంలోనికి రాకముందు స్వచ్ఛమైన చేతన స్థితి. అప్పుడు ఈ జన్మ ఎందుకు తీసుకుంటున్నారో మీకు తెలుసు. మీరు కోమాలోనికి వెళ్ళినప్పుడు మీరు మీ గత జన్మల్ని మరచిపోతారు. మరలా జన్మ ఎందుకు తీసుకుంటున్నారో మరచిపోతారు. అదేవిధంగా శరీరాన్ని వదిలేటప్పుడు కూడా చాలా బాధ అనుభవిస్తారు.

జీవితం అంటే బాధకి బాధకి మధ్య వారధి. ఇది అమెరికాలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జి ఏ విధంగా రెండు ప్రాంతాలని అనుసంధానం చేస్తుందో అదే విధంగా జీవితం రెండు బాధలకి వారధి కడుతుంది.

బాధనుంచి విముక్తి పొందటం

మీరు మీ మీద ఏకాగ్రత నిలిపితే, మీ మీద కేంద్రీకృతమైతే మీకు ఎక్కువ శారీరక లేదా మానసిక బాధ కలిగినప్పుడు మీ అంతరాత్మలో నిలవగలిగితే మీరు ఈ బాధకి అతీతంగా వెళ్ళగలుగుతారు. మీరు మీ లోపలికి లోతుగా వెళ్ళగలిగితే, మీరు తెలుసుకునే తత్వంతో ఉండగలిగితే, మీరు చేతనస్థితిలో ఉంటే మీరు అకస్మాత్‌గా ఒక విషయాన్ని తెలుసుకుంటారు, అది మీరు ఎక్కువ కలత పొందేది మీ అంతరంగపు సత్యం వలన కాని, బయట జరిగిన సంఘటన వలన కాదు. మీరు మరొక విషయాన్ని అర్థం చేసుకుంటారు, బయట జరుగుతున్న విషయాలు ఏవీ ప్రత్యక్షంగా మీ అంతరంగంలో జరిగే అనుభవాలకి సంబంధించి ఉండవు. కొన్ని సార్లు మీరు పదే పదే చెప్పేమాటల్ని, బాధగా ఉన్నది, నొప్పిగా ఉన్నది ఇటువంటి మాటలని ఆపేస్తే మీరు ఆ బాధనుంచి తప్పుకోవచ్చు. లేక పోతే మీరు ఆ బాధ గుండా వెళ్ళాలి.

ఉదాహరణకి ఏదైనా ఒక సంఘటన మీకు మీ అంతరంగంలో బాధని కలిగించింది అనుకోండి. కొంచెం వివేకాన్ని, కొంచెం జాగ్రత్తని చూపించి ముందునుంచే మీ ఆలోచనలలో బాధగా ఉంది, నేను బాధ పడుతున్నాను అనే ఆలోచనలని రాకుండా జాగ్రత్త పడండి. మీరు కొంత ఎరుకతో చేతనస్థితిలో ఇటువంటి మాటల్ని ముందుగా మీ చేతనస్థితిలో రాకుండా అపగలిగితే మీరు ఆ బాధ నుంచి తప్పించుకోగలరు. మీరు కొంచం తెలుసుకోగలిగితే మీరు మీ అంతరంగపు సత్యంతో ఎలా ఆడుకోవచ్చో, మీరు నిశ్చలంగా సమతుల్యతతో ఎలా ఉండవచ్చునో తెలుస్తుంది. అప్పుడు బయటి ప్రపంచపు విషయాలు మిమ్మల్ని ఏమి చేయలేవు.

బాధ మనస్సు యొక్క సృష్టి బాధ లేని ప్రసవం

నేను పరివ్రాజకునిగా దేశమంతా తిరిగే రోజుల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఆ విషయం మీకు చెబుతాను. నేను భారత్ అంతా తిరిగే రోజుల్లో ఒకసారి మధ్యప్రదేశ్ అడవి ప్రాంతంలో ఉన్నాను. అక్కడ ఒక చిన్న గ్రామం మధ్యలో ఉన్న చిన్న గుడిలో ఉండేవాడిని. ఒకరోజు ఒక గర్బవతి పాకలాంటి చిన్న ఇంటిలోకి వెళ్ళడం చూసాను. ఒక అరగంట గడిచాక ఆమె అప్పుడే పుట్టిన పసిబిడ్డతో బయటకి రావటం చూసాను. బాధ లేదు, దాక్షరు లేదు, నర్సులేదు, అరుపులులేవు. అరగంటలో ఆమె బిడ్డతో నడుస్తూ బయటకి వచ్చింది.

నేను ఆశ్చర్యపోయాను. నేను ఏమీ అడగలేను ఎందుకంటే నాకు వాళ్ళ భాష తెలియదు. ఒక నెల గడిచాక మరొక స్త్రీని అదే విధంగా చూసాను. అక్కడి పూజారిని ఈ విషయం అడిగాను. "ఇది ఎలా సాధ్యం వాళ్ళకి నొప్పి ఉండదా?" అని అడిగాను. అతను అశ్చర్యంగా నొప్పా? ఎందుకు నొప్పి? అని అడిగాడు.

నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వారి సమాజంలో బిడ్డకి జన్మనిచ్చే సమయంలో స్త్రీకి నొప్పి ఉంటుంది అనే విషయం తెలియదు. అంతేకాదు గర్భానికి సంబంధించి వారికి ఎటువంటి వ్యాధులు, నొప్పులూ లేవు. వారికి మెనోపాజ్ బాధలు తెలియవు.

నేను వారి జీవన విధానం గురించి తెలుసుకున్నాను. వారి సంప్రదాయం ప్రకారం స్త్రీలని గౌరవంతో చూస్తారు. ఆడపిల్ల మెచ్యూర్‌కాగానే ఆమె తల్లి అయ్యే అర్హత పొందింది, అని అత్యంత గౌరవంతో చూస్తారు. అందరూ ఆమె పాదాలకి నమస్కరించి ఆమె దీవెనలు తీసుకుంటారు. ఇటువంటి పరిస్థితి వలన వారికి బాధ అనేది ఉండదు.

యదార్ధంకాని బాధ

యదార్థం కాని బాధ గురించి రికార్డు చేయబడిన సంఘటనలు ఉన్నాయి. శరీరంలో ఒక భాగంలో బాధ లేకుండానే బాధ పడటం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక సైనికుడికి కాలు బాగా దెబ్బతిన్న మూలంగా తీసివేయవలసి వచ్చింది. అయితే ఇందులో కొత్త విషయం ఏమిటంటే అతను స్పృహలోనికి వచ్చాక కాలు నొప్పిగా ఉంది అని చెప్పేవాడు. అతన్ని దుప్పటితో కప్పేస్తారు కాబట్టి అతనికి కాలు తీసేసిన సంగతి తెలియదు. అతనికి దుప్పటి తీసి కాలు లేదు అని చూపించి చెప్పినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత పరిశోధనలు ఏమి చెప్పాయంటే శరీరంలో ప్రతి భాగం మెదడులో ఒక భాగానికి సంబంధం కలిగి ఉంటుంది. అతనికి కాలు ఉన్నప్పుడు మెదడు ఏ విధంగా స్పందించిందో ఆ తరువాత కూడా అదే విధంగా స్పందించటం మొదలు పెట్టింది. ఇటువంటివి చాలా సంఘటనలు ఉన్నాయి. లేని భాగంలో బాధ ఉన్నది అని చెప్పటం దీనినే ఫాంటమ్ పెయిన్ అంటారు.

ప్లేసిబో ఎఫెక్ట్

మనస్సు శరీరంమీద చాలా గట్టి ప్రభావాన్ని చూపిస్తుంది. భౌతికమైన బాధని గ్రహించే శక్తిని మనస్సుతో మార్చు తెచ్చి బాధని మార్చవచ్చు. దీన్ని శాస్త్రీయంగా ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. మామూలు పంచదార గుళిక ఒక పెయిన్ కిల్లర్‌లా పనిచేయవచ్చు. ఎలా అంటే అతన్ని అది నిజమైన మాత్ర అని నమ్మించటం ద్వారా. నేను ఒక రిసెర్స్ రిపోర్టుని జర్నల్ ఆఫ్ న్యూరోస్టెన్స్ లో చదివాను. మిచిగాన్ యూనివర్సిటీ, అమెరికాలో జరిపిన పరిశోధన అది. కొంతమంది యువకులు ఈ ప్రయోగానికి ముందుకు వచ్చారు. వారికి దవడ కండరాలలోనికి ఉప్పునీటిని ఇంజెక్ట్ చేయటం ద్వార బాధని కలిగించారు. ఆ బాధకి మెదడు యొక్క స్పందనని పొజిట్టాన్ ఎమిషన్ టొమోగ్రీఫీ (పి ఇ టి ) ద్వారా స్కాన్ చేసి చూసారు. దాని ద్వారా వారికి తెలిసిన విషయం శరీరంలో సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. వాటినే ఎండార్ఫిన్స్ అంటారు.

ఆ తరువాత వారికి పెయిన్ కిల్లర్ మందు ఇస్తున్నాం అని చెప్పి ఆ మందు లేనిది మరొక పదార్థాన్ని ఇచ్చి (దీనినే ప్లాసిబో అంటారు) వారి బాధని 0 నుంచి 100, వరకూ రేటింగ్ ఇస్తూ చెప్పమన్నారు. అదే విధంగా పి.ఇ.టి.స్కాన్ కూడా గమనించారు. ఆ యువకులు చెప్పిన విషయం, స్కాన్‌లో మెదడు చూపించిన స్పందన ఒకే విధంగా ఉన్నాయి. చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏమిటంటే ఆ యువకులని ప్లాసిబో ఇచ్చినప్పుడు, అంటే అసలు మందులేని పదార్ధం ఇచ్చినప్పుడు వారిలో నొప్పి తగ్గిపోయింది.

పి. ఇ. టి స్కాన్‌లో ఎండోర్ఫిన్ అనే సహజమైన పెయిన్ కిల్లర్ మెదడులో చైతన్యమవటం చూపించింది. ప్లాసిబో ఇచ్చాక అది చాలా యాక్టివ్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు దాన్ని పెయిన్ కిల్లర్ అని నమ్మారు. కాబట్టి ఆ తరువాత పరిశోధనలలో 70% మంది ప్లేసిబో ప్రభావానికి లోనయ్యారు. వారిలో 22% నొప్పి తగ్గింది. సైన్స్ ఈ విషయం మీద ఇంకా పరిశోధనలని చేస్తున్నది. దీన్ని బట్టి శరీరం–మనస్సు మధ్య సంబంధం అర్థం అవుతుంది.

మనం బాధని ఆహ్వానిస్తాం

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి చాలా బాధగా నడుస్తుంటాడు. మరొక వ్యక్తి అతన్ని "ఏమి జరిగింది, నీకు కడుపు నొప్పిగా ఉన్నదా?" అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, "అబ్బే! అదేం కాదు. నేను వేసుకున్న బూట్లు చిన్న సైజువి"అని జవాబు ఇస్తాడు. రెండవ వ్యక్తి అతని జవాబుకి ఆశ్చర్యపోయి; "మరైతే అవి ఎందుకు వేసుకున్నావు?" అని అడుగుతాడు.

ఆ వ్యక్తి, అవును నేను ఇప్పుడు బాధపడతాను. కాని సాయంత్రం ఈ బూట్లు తీయగానే చాలా రిలీఫ్ వచ్చి హాయిగా ఉంటుంది. అది ఎంత హాయిగా ఉంటుందో నీకు తెలియదు అని జవాబు ఇస్తాడు.

ఇది వినటానికి హాస్యాస్పదంగా ఉన్నది. కాని మనం మన జీవితాలలోనికి చూస్తే మనందరం కచ్చితంగా ఇలానే ప్రపరిస్తుంటాం.

మీరు బాధని మీ దగ్గరకి ఆహ్వానించారు. ఈ విషయం మీరు నమ్మకపోవచ్చు. కాని మీరు అనుభవించే ప్రతి బాధ మీరు అహ్వానించిందే. అది ఎలా ఉంటుందంటే అతిథులని మరీ మరీ బతిమలాడి గౌరవంతో ఎలా ఆహ్యానిస్తామో ఆవిధంగా బాధలని ఆహ్వానించి తీరా అవి వచ్చాక ఎందుకు వచ్చారు అని చూస్తారు. మనలోని అలవాట్లతో ఒత్తిడితో కూడిన పనులతో వ్యాధులని ఆహ్వానించి, ఆ తరువాత విషయాలన్నీ మర్చిపోయి, ఆ వ్యాధుల మీద పిర్యాదులు ఇస్తాం.

బాధాకర శరీరం

మీరు బాధ పడిన ప్రతీసారి అది మీలోపల ఆ బాధలకి సంబంధించిన శేషభాగాలనే భావనలని మీ లోపల నిలువ చేస్తుంది. అది మీ శరీరంలో స్తిరపడుతుంది. ఈ విధంగా పేరుకుపోయిన బాధలు మీ చుట్టూ వ్యతిరేక శక్తి క్షేతాన్ని సృష్టిస్తాయి. దీనినే బాధాకర శరీరం అంటాం. బాధాకర శరీరం బాధలని నిలువచేయటమే కాకుండా అది రకరకాల బాధలని సృష్టించటం మొదలు పెడుతుంది. మనం మరల మనం సృష్టించిన దాన్ని అందరికి పంచిపెడతాం. అందుకే నేనెప్పుడూ చెబుతుంటాను, మీరు బాధాకర శరీరం ద్వారా ఐశఁర్యాన్ని సృష్టిస్తే మీరు ఆ ఐశ్వర్యంతోపాటు, బాధాకర శరీరాన్ని కూడా తరువాత తరం వారికి బదిలీ చేసారు. ఐశఁర్యాన్ని విరామంగా, పరమానందంలో ఉన్న శరీరంతో సంపాదించాలి. అప్పుడు ఆ ఐశ్వర్యాన్ని ఎవరికైతే ఇస్తామో వాళ్ళు ఉపయోగించుకొని అనందపడతారు.

బాధాకర శరీరం నిరంతరం అటువంటి వారినే ఆకర్షిస్తుంది. సృష్టి యొక్క న్యాయసూత్రం మీరు ఏదైతే సత్యం అనుకుంటారో దానినే స్పష్టిస్తారు. కాబట్టి మీలోపల బాధ ఎక్కువ నిలవ ఉందే కొద్దీ మీరు మరింత బాధని ఆకర్కిస్తారు.

బాధ అహంకారం వల్ల కలుగుతుంది

మీరు చాలా పరిస్థితులలో బాధ పడతారు. అది మీకు అనారోగ్యం కలిగినప్పుడు లేదా మీ పక్కింటాయన కొత్తకారు కొన్నప్పుడు, మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు, మీ బాస్ మిమ్మల్ని తిట్టినప్పుడు లేదా మీరు ఐశ్వర్యం పోగొట్టుకున్నప్పుడు. ఒకవేళ ఈ పరిస్థితుల్ని వాటిని అదే విధంగా ఎటువంటి కోపం లేకుండా ఎటువంటి ప్రతిఘటనా లేకుందా ఆహ్యానించగలిగితే, మీరు బాధపడతారా? లేదు. కాని పరిస్థితులని మీరు ఆ విధంగా నిర్వహించలేరు. మీ బాస్ మిమ్మల్ని తిడితే బాధపడతారు. తిట్టినప్పుడు ఎందుకు బాధపడతారు. ఎందుకంటే బాస్ మిమ్మల్ని అందరి ముందూ తిట్టినందుకు లేదా అతని దృష్టిలో మీరు తక్కువైనందుకు లేదా ఆ తిట్లు నాకు అనవసరంగా పద్దాయని ఇటువంటి భావనల వలన బాధపడతారు.

మీరు మీ తోనే కూర్చొని, నిజాయితీగా కారణం ఏమిటి అని ఆలోచించండి. ఒకవేళ ఆయన అందరి ముందూ తిట్టినందుకు బాధ కలిగితే నిజానికి అది మీ అహంకారానికి దెబ్బతగలటమే. అప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి,' సరే, అందరూ నన్ను తిట్టటం చూసారు. అయితే ఏమిటి? వేరే వారు నన్ను గురించి ఏమనుకుంటారు అనే విషయం మీద నేను అంత శక్తిని వ్యథా చేయాలా? నేను ఏమిటో నాకు తెలుసు, నేను నాగురించి లెక్కగట్టగలనని మిమ్మల్ని మీరు ప్ర‌శ్నించుకోగ‌లిగితే, ఎదుటివారి అభిప్రాయం అంత విలువైనది కాదు అని తెలుసుకుంటారు. అప్పుడు మీ బాధ మాయమౌతుంది.

మీరు పని బాగా చేయలేదు అని బాధపడితే, దాన్ని పూర్తిగా లోతుగా తెలుసుకోండి. ఆ విధంగా తెలుసుకోగలిగినప్పుడు మీరు బాధనుంచి బయటకి రాగలుగుతారు. అప్పుడు ఆ సంఘటన నుంచి చాలా నేర్చుకుంటారు. అప్పుడు మీ భావాలలోంచి చెడు భావన అనే భాగాన్ని తొలగించగలుగుతారు.

ఒకవేళ మీ బాధకి కారణం మీరు బాగా పనిచేసారు కాని అనవసరంగా తిట్లు పడ్డానని అనుకుంటే మీరు లోతైన తెలుసుకునే తత్వాన్ని మీ లోనికి తీసుకురండి. అప్పుడు బాధ కరిగిపోతుంది. అది మీరు పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకుని, దాన్ని స్వీకరించేలా చేస్తుంది. అప్పుడు మీ బాస్‌ని అర్థం చేసుకోగలరు. అలా చేయటంవలన ఆ తరువాత మీరు అతని దగ్గరకి వెళ్ళి విషయాన్ని స్పష్టంగా చెప్పగల ఓర్పు వస్తుంది. మీరు లోతుగా గమనిస్తే, మీలో ప్రతి బాధ కూడా మీరు అహంకారాన్ని ఎక్కువగా పట్టించుకోవటమే. అంతే కాని మీ బాస్, మీరు ప్రేమించిన వ్యక్తి మీ డబ్బు కారణం కాదు. మీలోని బాధకి బయట ఎవరూ కారణం కాలేరు. ఎందుకంటే బాధ అంటే బయట విషయాలకి మీ నుంచి మీరు దేనిమీద శ్రద్ధ పెడతారో దాని మూలంగా వచ్చే స్పందన మాత్రమే. మీ అహంకారాన్ని ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారో మీరు అక్కడ బాధపడతారు. మీరు ఈ పొరల్ని కరిగించేయటం ప్రారంభిస్తే మీరు తెలివైనవారవుతారు.

ఒక విషయం అర్థం చేసుకోండి. మీ అహంకారాన్ని నాశనం చేయటానికి పని చేస్తున్నారంటే మీరు మీ బాధాకర శరీరం మీద పనిచేస్తున్నారని అర్థం. మీరు అలాంటివి జరిగినప్పుడు అంతగా బాధపడరు.

మన జీవితాలలోనికి చూసే మనందరం బాధలని జీవంతో ఉంచి వాటికి అహంకారంతో అలంకరణ చేస్తాం. బాధ జీవితం నుంచి రాదు. మనం ఆశించే దాని నుంచి వస్తుంది. మన అహంకారం నుంచి వస్తుంది. ఇప్పుడు సమస్య ఏమిటంటే అందవికారిని అందంగా ఎలా చేయాలి, బాధని సంతోషంగా ఎలా మార్చాలని. ఇక్కడ అచేతనస్థితిని, చేతనస్థితిగా ఎలా మార్చాలి. మనలోపలికి తెలుసుకునే తత్వాన్ని ఎలా ప్రవేశపెట్టాలి. సత్యాన్ని ఎలా మన దగ్గరకి తీసుకోవాలి అని.

బాధ సత్యాన్వేషణకి ఒక కేటలిస్టు

ఒక్కసారి మీ జీవితంలోనికి చూడండి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు జీవితానికి అర్ధం ఏమిటి అని ఆశ్చర్యపోతారా? అప్పుడు మీరు మీ అంతరంగంలోనికి చూసి నేను ఎవరిని, ఈ జీవితం అంటే ఏమిటి? అని అనుకుంటారా? విషయాలన్నీ మామూలుగా జరుగుతున్నంత కాలం మీరు గుడ్డిగా జీవితాన్ని అనుసరిస్తారు. ప్రతి రోజు పనులని ఏమాత్రం తెలుసుకోకుండా చేసేసారు.

ఎప్పుడైతే బాధ కలుగుతుందో అప్పుడు జీవితంలోనికి చూసారు. అది మిమ్మల్ని జీవితంలోనికి లోతుగా చూసే విధంగా చేస్తుంది. మీరు జీవిత రహస్యాలు తెలుసుకోవాలని ఆరాటపడతారు. అందుకే బాధ అనేది ఒక కనిపించని దీవెన లాంటిది. అది మీకు తెలియని ప్రపంచపు ద్వారం తెరవగల తాళం చెవి. ఆ ద్వారం తెరవాలా వద్దా అనేది మీ ఎంపిక.

బాధ అనేది మీ స్వప్నస్థితిని కుదిపివేస్తుంది. ఒక విషయం అర్ధం చేసుకోండి, మీరు మేలుకొని ఉన్న స్థితిలో ఉన్నప్పుడు పూర్తిగా సత్యంతో అనుబంధం కలిగి ఉంటాను అని అనుకోవద్దు. మీరు మీ భయాలు, ఆశలు ఉన్న ప్రపంచంలో ఉంటారు. దానినే మేలుకొని ఉన్న స్వప్నావస్త అనవచ్చు. మీరు ఈ ప్రపంచాన్ని ఆశ, భయం అనే కళ్ళద్దాల్లోంచి చూస్తారు. బాధ ఒక గొప్ప గురువు. అది మిమ్మల్ని ఒక్కకుదుపు కుదిపి ఆ కలల ప్రపంచం నుంచి బయటకి తెచ్చి సత్యం వైపు నెడుతుంది. బాధతో మీలోని సాధారణ ఆలోచనల క్రమం కదలిపోతుంది. అప్పుడు మీరు విషయాలని అదే విధంగా చూడగలుగుతారు. అప్పుడు మీకు బాధకి మధ్య ఉన్న సూక్ష్మమైన దూరం తెలియటం ప్రారంభమౌతుంది. బాధ మీ సహజసిద్ధమైన లక్షణం కాదు అని తెలుసుకుంటారు.

బాధ, బాధపడటానికి మెట్టు

బాధని ఎప్పుడూ తిట్టవద్దు. మీకు బాధ కలిగించిన వ్యక్తినీ తిట్టవద్దు. తిట్టేబదులు ఆ బాధని ఒక దీవెనలా తీసుకొని దాని లోతులలోనికి వెళ్ళి, దాన్ని గమనించి దానివేర్లని కత్తిరించండి. మీరు అనుమతిస్తే బాధ గొప్ప గురువు. ఒక్కసారి మీరు బాధని జాగ్రత్తగా గమనించి దాని కారణం, దాని ప్రభావం మీద లోతుగా పరిశోధన చేస్తే అది మీ జీవితానికి ఒక గొప్ప మలుపు అవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. బాధ అనేది తప్పనిసరి కావచ్చు కాని బాధపడటం అలా కాదు. ఉదాహరణకి మీకు దెబ్బతగిలిందనుకోండి, అప్పుడు తప్పకుండా బాధ ఉంటుంది. కాని ఆ దెబ్బనుంచి ఎంత బాధపడాలి అనేది మీ ఎంపిక. బాధపడటం జీవన సరళి కాదు. అది ఒక సంఘటన పట్ల మీనుంచి వచ్చే స్పందన. ఒక సంఘటనలో ఒక పరిస్థితిలో బాధపడాలా వద్దా అనేది కేవలం ఆ పరిస్థితికి మీనుంచి వచ్చే స్పందన మీద ఆధారపడి ఉంటుంది.

ఒక చిన్న కథ : ఒకసారి ఒక వ్యక్తి బాగా గాయపడతాడు. అతనికి శరీరంలోచాలా చోట్ల ఫ్రాక్చర్ అవుతుంది. అతని స్నేహితుడు అది చూసి ఏమనాలో తెలియక "ఇప్పుడు ఎలా ఉంది నీకు, నీకు చాలా నొప్పిగా ఉండి ఉంటుంది. చాలా దెబ్బలు తగిలాయి కదా చాలా నొప్పిగా ఉందా?" అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి అంత ఎక్కువ లేవు, నేను నవ్వినప్పుడు కొంచెం అనిపిస్తుంది అని జవాబు ఇస్తాడు. బాధ పడటం మన దృక్పథం. బాధ తప్పదు కాని బాధపడటం మీ ఎంపిక.

బాధ పడటం అవసరమా?

బాధ పడటానికి ఒక కనపడని కారణం మీరు బాధలని ఎంజాయ్ చేయటం. ఉదాహరణకి మీకు అనారోగ్యం కలగటం సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు కోరుకునే ఎదుటివారి

బాధ మీలో కలిగించినా లేదా మీరు మరొకరిలో కలిగించినా సంతోషం కలగటానికి కారణం ఏమిటో మీ లోపలికి లోతుగా వెళ్ళి విశ్లేషణ చేయండి. అవిధంగా కాకుండా మరొక మార్గంలో అదే సంతోషాన్ని బాధ ద్వారా కాకుండా మరొక విధంగా పొందగలరా ఆలోచించండి.

మొక్క మొలిచేముందు విత్తనం పగలాలి. అందులోంచి మొక్క వచ్చి అది చెట్టుగా మారి కాయలు కాస్తుంది. లోతైన బాధ ఉన్నప్పుడే అది మీ అహంకారాన్ని పగిలేలా చేస్తుంది. అప్పుడే మీలో ఉన్నతమైన మార్పు సాధ్యమౌతుంది. మహాభారతకథలో కుంతి చెప్పిన ఒక మాట అద్భుతంగా ఉంటుంది. ఆమె కృష్ణుడిని ఈ విధంగా కోరుకుంటుంది "ఓ! కృష్ణా నా జీవితంలో కష్టాలు సమస్యలు అన్ని వైపుల నుంచి వచ్చేలా చేయి. ఆ కష్టాలు నిరంతరం నిన్ను గుర్తుచేసుకునేలా చేస్తాయి" అని. కుంతి కృష్ణుడిని కష్టాలు ఇవ్వమని ప్రార్థిస్తుంది. అందులోంచి బయటపడేందుకు భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ ఆ విధంగా ఆయనని మరిచిపోకుండా ఉండవచ్చు. ఇప్పుడు మనం ఆ స్థితికి వెళ్ళనవసరం లేదు. మనం ఎంత వరకూ బాధపడగలమో మన అంతరంగంలో స్పష్టంగా తెలిస్తే చాలు. బాధ మనని ఏకత్యంలో ఉంచి మనలో మార్పు సాధ్యమయ్యే విధంగా చేస్తుంది.

మీరు మీ అనుభావాల మీద అభిప్రాయాలు వెల్లడి చేయకుండా వాటిని గమనించండి. మీరు స్థూలంగానూ, సూక్ష్మస్థాయిలో ఎక్కడ బాధపడుతున్నారో స్పష్టంగా చూడండి. మీరు ఏమాత్రం తెలుసుకోగలిగినా బాధపడటం అనేది ఎంత అవసరమో మీకు బోధిస్తుంది. దీనినే నేను' అనవసరమైన బాధ అని అంటాను. ఒక్కసారి మీరు'అనవసరమైన బాధ' నుంచి పాఠం నేర్సుకుంటే మీరు బాధతో చాలా చక్కగా వ్యవహరించగలుగుతారు.

బోధిధర్మ (బుద్ధుని శిష్యుడు, జెన్ బౌద్ధమత ప్రచుర్యానికి కారకుడు) ఈ విధంగా చెబుతాడు, ప్రతి బాధా ఒక బుద్ధావిత్తనం. బాధ మిమ్మల్ని బుద్ధనిగా చేస్తుంది. అది మీకు జీవితం గురించి, సత్యం గురించి తెలుసుకోగల వివేకాన్ని ఇస్తుంది. ఆయన ఇలా అంటారు బాధపడటాన్ని వ్యతిరేకించకండి. ఎందుకంటే బాధ బాధపడటం అనేది సత్యశోధనకి సహాయపడుతుంది. ఆ విధంగా కాకపోతే మీరు ఒక రాయిలా లేదా ఒక చెట్టులా జీవితాన్ని గదుపుతారు. మీరు అంతిమ సత్యాన్ని తెలుసుకోలేరు. అంతిమ సత్యాన్ని మానవ చేతనస్థితితో సాధించవచ్చు.

శరీరం, మనసు అనేవి నేల అయితే బాధపడటం విత్తనం అవుతుంది. దానిలోంచి వచ్చే మొక్క బుద్ధి. మీరు పొందే అంతిమ స్థితి దాని నుంచి వచ్చే ఫలం. మీరు శరీరం మనస్సు అనే నేలలో బాధ అనే విత్తనాన్ని నాటితే అందులో పుట్టే వివేకం మీకు అంతిమసత్యాన్ని సాధించే విధంగా సహాయంచేస్తుంది. మనం బాధ కలిగినప్పుడు మామూలుగా ఆ బాధ తప్పించుకునే పనులు చేస్తాము. నన్ను చాలా మంది అడుగుతుంటారు, మీరు ఎప్పుడూ మహదానందంలో ఉంటారు ఇది ఎలా సాధ్యం? జ్ఞానోదయం అయితే బాధలు ఉండవా?

జ్ఞానోదయం అంటే బాధల నుంచి పారిపోవటం కాదు బాధని అర్ధంచేసుకోవటం

అది మీకు అందులోనికి లోతుగా చూసే శక్తిని ఇస్తుంది. మీవైపు ధైర్యంగా చూడగల వివేకాన్ని ఇస్తుంది. నేను ఎందుకు బాధ పడుతున్నాను? నన్ను ఏకారణం బాధకి గురిచేస్తుంది? అసలు నా బాధకి కారణం కచ్చితంగా ఏమిటి? మీకు కావలసింది, ఈ ప్ర‌శ్న‌ల‌ని అడిగే ధైర్యం, వాటికి వచ్చే జవాబుల్ని ఎదుర్కోగల ధైర్యం వస్తుంది. అప్పుడు మామూలు బాధనుంచి విముక్తి పొందుతారు.

ఒక చిన్న కథ : ఒకసారి ఒక వ్యక్తి ఒక జెన్ గురువు దగ్గరికి వచ్చి; గురుదేవా ఈ చలిని వేడిని ఎలా పోగొట్టాలని అడుగుతాడు. గురువుగారు ఈ విధంగా చెబుతారు. వేడిగా ఉండు,చల్లగా ఉండు, అని. ఇక్కడ వేడి, చల్లదనం అంటే బాధ సంతోషం. సంతోషం, బాధలని ఎలా తొలగించాలి. మీరు వాటి గుండా వెళ్ళి వాటిని గమనించండి, అంతే.

బాధ ఆలోచనలు లేని స్థితికి దారి

ఒక చిన్న కథ : ఒక శిష్యుడు జెన్ గురువుతో కలిసి వెళుతుంటాడు. వాళ్ళ ముందు ఒక బాతుల గుంపు వెళుతూ ఉంటుంది. గురువుగారు శిష్యుడిని అవి ఏమిటి? అని అడుగుతాడు. అప్పుడు శిష్యుడు అవి అడవి బాతులు అంటాడు. గురువుగారు అవి ఎక్కడికి వెళ్ళాయి, అని అడుగుతాడు. అవి వెళ్ళిపోయాయి. అంటాడు శిష్యుడు. ఆకస్మాత్‌గా గురువుగారు శిష్యుడి ముక్కు పట్టుకొని మెలిక తిప్పాంతాడు. శిష్యుడు నొప్పితో అరుస్తాడు. ఈ కథ ఎలా ముగుస్తుందంటే అప్పుడు, శిష్యుడికి జ్ఞానోదయం అవుతుంది.

ఈ కథ వినటానికి కొత్తగా ఉంటుంది. కాని జెన్ బౌద్ధంలో గురువులు అదే విధంగా ఉంటారు. బాధకి మిమ్మల్ని మేలుకొలపగల గొప్ప విలువ ఉంటుంది. అందుకే బాధని జ్ఞానోదయం కలిగించటానికి, నిద్రలో ఉన్న శిష్యులని మేల్మొలపటానికి, ఉపయోగించేవారు. మామూలుగా మనం ఏమి చేస్తాం? బాధలో ఉన్న వ్యక్తిని ఓదారుస్తాం. ఇంకా నిద్రపోయేలా చేస్తాం కాని గురువు ఓదార్చడు. అతనికి కేవలం శిష్యులని మేల్కొలపటంలోనే ఆసక్తి ఉంటుంది. బాధ తీవ్రంగా ఉన్నప్పుడు ఆలోచనలు ఆగుతాయి. బాధ మాత్రమే ఉంటుంది. ఆ క్రమంలో సత్యం తెలుస్తుంది. ఈ కథలో శిష్యుడికి బాధ కలిగినప్పుడు అతని అంతరంగం గురుదేవుల నుంచి సత్యాన్ని తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నది.

మార్పు చెందే బాధ

బాధ గొప్ప సృజనాత్మక శక్తిగా తయారవ్వవచ్చు. అది భగవంతుని గుర్తు చేసుకోవటమే, అది ప్రార్థనగా మారవచ్చు. అది ధ్యానంగా ఉండవచ్చు. అది తెలుసుకునే తత్వమవ్వవచ్చు. అది మీలో గొప్ప ఉన్నతమైన మార్పుని తెచ్చేది కావచ్చు.

జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన రహస్యాన్ని మీరు అర్ధం చేసుకోవాలి. మీరు దేనినైతే లోతుగా తెలుసుకుంటారో మీరు దాన్ని వదిలించుకోలేరు. అది మీతోనే ఉంటుంది. బాధ బాధగా ఎందుకు ఉంటుందంటే మీరు బాధని ఎదుర్కోవాలి అనే భయం పెరిగి పెరిగి పెద్ద కంతిలా తయారౌతుంది. గురువు మాస్టర్ సర్జరీ చేసి ఆ కంతిని తొలగిస్తారు. అది మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు మీరు కొత్త వ్యక్తిలా రూపాంతరం చెందుతారు. ఒకసారి ఒక వ్యక్తి నన్ను ఈ విధంగా అడిగాడు, స్వామీజీ! నా అంతరంగాన్ని శుభ్రపరచి, స్వచ్ఛంగా చేయాలంటే దానికి సర్జరీ చేయాలి అని నాకు అర్థమైంది. గురువు పెయిన్ కిల్లర్ ఇచ్చి (మత్తు ఇచ్చి) ఆపరేషన్ చేయవచ్చు కదా?

గురువుగారు చేసే బాధాకరమైన ఆపరేషన్‌కి ఎటువంటి దృక్పథం అవసరం అవుతుంది? కొన్నిసార్లు తెలుసుకునే తత్వంతో ఉంటే చాలు బాధ కరిగిపోతుంది. చాలాసార్లు ఆ బాధ వైపు చూసాను. అంతే అది మాయమైపోతుంది. అది కరిగిపోతుంది. ఇప్పుడు బాధాకరమైన మాస్టర్ సర్జరీలని ఏ విధమైన దృక్పథంతో వ్యవహరించాలి? దీనికి సంపూర్ణ విశ్వాసం ఉండాలి. గురుదేవులు ఎటువంటి బాధని కలిగించినా అది కేవలం నా మంచి కోసమే, మరింకేమి కాదు. ఆయన సర్జరీ చేస్తున్నారు అంటే అది ఆయనలోని హద్దులు లేని ప్రేమ, అంతులేని కరుణ వలన మాత్రమే. దీన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే అప్పుడు మీకు బాధ కలిగినా మీరు లోతయిన కృతజ్ఞతా భావంతో ఆ బాధని మీ మంచి కోసం గురువుగారు చేస్తున్నారు అని స్వీకరిస్తారు. గురువుల వైపు నుంచి పెయిన్ కిల్లర్ అంటే ఆయన చూపించే ప్రేమ కరుణా.

మరొక విషయం అది బాధగా ఎందుకు ఉంటుందంటే మీరు దాన్ని బాధ అని ఆలోచిస్తూ దానికి బాధ అని పేరు పెడతారు. మీకు బోధించే విషయాన్ని గురువు కొన్ని క్షణాలలో బోధిస్తారు. అదే సాధారణ స్థితిలో ఒక జీవితకాలం లేదా కొన్ని వందల సంవత్సరాలు లేదా కొన్ని జన్మల సమయం పట్టవచ్చు. గురుదేవులు అంటే అత్యంత గాఢమైన జీవితం. ఆయన కేవలం ఆ కంతిని తీసి అవతల పారవేసారు. అది కొంత తీవ్రంగా ఉన్నా గురుదేవులతో వెళ్ళటమే మంచిది. ఎందుకంటే అది త్వరగా ముగుస్తుంది. అంతే కాకుండా గురువు మీకు ఏమి చేస్తున్నారో దాన్ని అర్థం చేసుకుంటే అది మీ జీవితంలో జరిగే అంతిమ విషయం అని సంతోష పడతారు.

మరొక విషయం మీరు మీ లోపల కంతులతో జీవితాన్ని గడుపుతూ ఉంటే అప్పుడు మీరు అనుభవించే బాధ సర్జరీ చేసేటప్పటి బాధకంటే ఎక్కువగా ఉంటుంది. కంతిని తీసివేయటానికి చాలా కొంచం సమయం చాలు ఆయన కొన్ని నిముషాలలో తీసేస్తారు, అయిపోతుంది. ఒక్కసారి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే, మార్చు చెందటాన్ని ఎప్పుడూ బాధ అనరు. దానికి స్వాగతం చెబుతారు. దానికి స్వాగతం చెప్పటమే కాదు, మీ అచేతన స్థితిలోని దాన్ని పైకి తెచ్చి తొలగించినందుకు మీరు కృతజ్ఞతలు చెబుతారు.

బాధ ఒక గొప్ప గురువు

నిజమైన మిమ్మల్ని, భగవంతుణ్ణి తెలుసుకోవాలనే గాఢమైన కోరిక

మీ నిజమైన లక్షణం దివ్యత్వం. మీరు అంతిమంగా సాధించగలది ఆ దైవత్యాన్ని తెలుసుకోవటం. దానికంటే ఏమాత్రం తగ్గినా మీలో అసంతృప్తి అసంపూర్ణత్వపు భావాలు ఏర్పడతాయి. మీకు ఈ ప్రపంచంలోని సంపద అంతా ఉండవచ్చు. మీకు గొప్ప పేరు ప్రతిష్ఠలు ఉండవచ్చు, మంచి సంబంధ బాంధవ్యాలు ఉండవచ్చు, కానీ మీలో శూన్యం ఉంటుంది. అసంతృప్తి యొక్క బాధ ఉంటుంది. మీలోని దైవత్సం వికసించే వరకూ, అది మీకు తెలిసేవరకూ, మీలో సంపూర్ణత్వం, సంతృపి ఏర్పడవు.

గురుదేవులు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అనే కోరికని మీలో రగిలిస్తాడు. ఆయన మీలో అసంతృప్ధి బాధని మీలో కలిగిస్తాడు. మీలో లోతైన కోరికని కలిగిస్తాడు. అప్పుడే మీరు మీకు తెలియని, మీలో ఇప్పటికే ఉన్న ఆ దివ్యత్వంలోనికి ఒక పెద్ద అడుగువేస్తారు. అప్పుడు మాత్రమే అర్ధంలేని కలల జీవితంలో కొన్ని జీవిత కాలాలు జీవిస్తున్న మీరు మేలుకొంటారు. అప్పుడే మీరు మీలోని అన్ని శక్తులని ఏకీకృతం చేసి, మీ అంతరంగ జీవిత పరిశోధనల కోసం ముందుకి దూకుతారు.

ధ్యాన పద్ధతులు

బాధ మీద ఏకాగ్రత నిలపండి : బాధ అంటే మనం శ్రద్ధ చూపకపోవటమే కాబట్టి దీనికి పరిష్కారం మనం శ్రద్దని ఇవ్వటం. ఒక చిన్న, చాలా శక్తి వంతమైన తమకి తాము చికిత్స చేసుకోగల ధ్యాన పద్దతి ఉన్నది. అది మీ ఏకాగ్రతని అనారోగ్యభాగంవైపు లేదా మానసిక వ్యవస్థవెపు పంపిస్తుంది. ఈ సారి మీకు ఎక్కడయినా బాధ కలిగినప్పుడు ఈ ధ్యానం చేయండి. పెయిన్‌కిల్లర్ కంటే ఇది చాలా మంచిది. పెయిన్‌కిల్లర్‌లో సైడ్ ఎఫెక్ట్స్ అసలు బాధకంటే ఎక్కువ ఉండవచ్చు.

మీకు కాలిలో నొప్పిగా ఉన్నదనుకోండి, లేదా ఏదైనా దెబ్బతగిలిందనుకోంది. ఒక గదిలో పడుకోండి. చేతనస్థితిలో ప్రయత్నించి మీ శరీరంలో అన్ని భాగాలని మర్చిపోండి. కేవలం బాధ ఉన్న ప్రాంతంలోనే మీ ఏకాగ్రతని నిలపండి. ఒకవేళ అది మానసిక బాధ అయితే శరీరాన్ని మర్చిపోయి మీకు బాధ కలిగించిన సంఘటన మీద ఏ ఏకాగ్రతని నిలపండి. మీకు బాధ కలుగుతున్నప్పుడు బాధ అనే మాటని ప్రయత్నంతో వదిలివేయండి.

మీ అంతరంగపు మాటలు మీ మనస్సు మీకు బాధగా ఉన్నది అని చెబుతుంటాయి. దానిని ఆపేయండి. లోతుగా ఫీల్ అవ్వండి. విపులమైన మనస్సుతో, అనుభవంతో తెలుసుకోండి. మీ మనస్సులో ఏమి జరుగుతుందో గమనించండి. మీ మనస్సు బాధని అధికం చేసి చూపించటానికి ప్రయత్నిస్తుంది. మీ మొత్తం తెలుసుకునే తత్వాన్ని బాధ ఉన్న ప్రాంతంలో మధ్యలో ఉంచండి. కొంతసేపటికి అది తగుతూ వచ్చి చిన్న పాయింట్‌గా అయిపోతుంది. ఆ పాయింట్ మీద పూర్తి ఏకాగ్రతని పెట్టండి. అకస్మాత్మగా బాధపోవటం తెలుసుకుంటారు. ఆ క్షణంలో ఆనందం ఉంటుంది.

ఆపండి, గడ్డకట్టించండి : మీకు బాధ కలిగినప్పుడు ఈ ధ్యానపద్ధతిని కూడా ప్రయత్నించండి. కళ్ళుమూసుకొని విశ్రాంతిగా కూర్చోండి. తిన్నగా కూర్చోనవసరం లేదు. కాళ్ళుచాపాలి అనిపిస్తే చాపండి. నేలమీద కూర్చోవాలి అనిపిస్తే నేల మీద కూర్చోండి. గోడకి అనుకోవాలి అనిపిస్తే ఆనుకోండి. మీకు పూర్తి సౌకర్యంగా ఉండే విధంగా కూర్చోండి. అప్పుడే బాధని మీరు చూడగలరు. మీరు అసౌకర్యంగా కూర్చుంటే, అక్కడి నుంచి వచ్చే బాధని చూసారు. మీరు సౌకర్యంగా కూర్చుంటేనే, అసలయిన బాధని చూడగలరు.

కళ్ళుమూసుకొని, మీ తలనుంచి పాదాలవరకూ గడ్డకట్టుకు పోయినట్టు ఊహించండి. అన్ని కదలికలని ఆపండి. గడ్డకట్టినట్టు ఉండండి. ఒక రాయిలా ఉండండి. కళ్ళలో, చేతులలో, కాళ్ళలో ఎక్కడా ఎటువంటి కదలిక ఉండకూడదు. శ్వాసలోకూడా ఏ కదలిక ఉండకూడదు. ఆపేసి గడ్డకట్టినట్టు ఉండండి.

మీ అంతరంగంలో మీరు గడ్డకట్టుకు పోయిన భావన తప్పా మరేది ఉండకూడదు. మరే భావమూ ఉండకూడదు. కేవలం మీరు గడ్డకట్టుకు పోయిన భావం తప్పా మరేమి ఉండకూడదు. ఎటువంటి విరామాన్ని ఊహించకండి. విరామం లేదా చేతనస్థితిని గమనించటం అనేది దానంతట అదే జరగాలి. అప్పటి వరకూ గడ్డకట్టి ఉండండి. మీరు అంతిమ ఆనందంలో స్థిరపడటం గమనించవచ్చు.

బాధని గమనించండి : ఈ ధ్యాన పద్దతిని ఏదైనా ఒక భాగంలో ఉన్న బాధని కరిగించటానికి ఉపయోగించవచ్చు. మీ శరీరంలో ఎక్కడయినా బాధ కలిగితే బాధ కలిగే భావనని గమనించండి. ఏ భాగంలో నొప్పిగా ఉన్నదో అక్కడ బాధ ఎక్కువ అవుతుంది. త్వరలోనే ఆ బాధ చిన్న బిందువులా మారి మాయం అవుతుంది. ఏమి జరుగుతుందంటే మీకు దెబ్బ తగలగానే మీ శరీరం యొక్క మేధాశక్తిని ఆ దెబ్బ తగిలిన చోటుకి చికిత్సకోసం పంపిస్తుంది. ఆ శక్తి వెళ్ళటాన్నే బాధ అంటారు. మీరు ఆ శక్తి వెళ్ళటాన్ని అక్కడ చికిత్స జరగటం విరామంగా గమనించగలిగితే, నొప్పి మాయం అయ్యి అక్కడ చికిత్స జరుగుతుంది. మనం కేవలం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మనం దేనినీ ఆపం. నొప్పి ఉన్నప్పుడు బాధపడం. సహజంగా శరీరంలో ఉన్న చికిత్స శక్రితో సహకరిస్తాం.

నేను నా అనుభవం నుంచి ఒక సంఘటన చెబుతున్నాను. ఒకసారి ఒకరు నా చేతివేలు ఉండగానే కారు తలుపు వేసారు. నా చుట్టుపక్కల ఉన్నవారు కంగారు పడిపోయి మందు తేవటానికి అటూ ఇటూ పరిగెత్తారు. నేను వాళ్లతో ఏమీ అవసరం లేదు అని చెప్పాను.

నా చేతివేలు వాచింది నేను నా శరీరం లోపల ఏమి జరుగుతున్నదో స్పష్టంగా గమనించాను. నా నాభి ప్రాంతం నుంచి వేలివైపుకి శక్తి ప్రవహించటం గమనించాను. శరీర మేధస్సు అత్యవసర పరిస్థితికి స్పందించటం స్పష్టంగా చూసాను, దానంతట అదే చికిత్స చేసుకున్నది. మీ అంతరంగంలో ఉండే అంబులెన్స్ వ్యవస్థే నొప్పి అంటే. బాధని గమనిస్తే మీరు కేవలం శరీరమే కాదు అనే విషయం తెలుస్తుంది. మీరు మీ లోని శకిని తాకగలుగుతారు. అప్పుడు మీరు ఈ మనస్సు, శరీరాల కంటే ఉన్నతులు అని తెలుస్తుంది. నొప్పిని తీవంగా లోతుగా గమనించండి కాని బాధ, నొప్పి అనే మాటలు వాడవద్దు. ముందు నొప్పి కొంచం ఎక్కువ అయినట్లు ఉంటుంది, కానీ వెంటనే అది కరిగిపోతుంది.

శరీరానికి ఏ భాగం అయితే చికిత్స కావాలి అని అడుగుతుందో అక్కడికి శక్తిని పంపించే మేధస్సు ఉంది. కాని మీరు దానిని నొప్పి అని చెప్పి ఆపటానికి ప్రయత్నిస్తారు. ఆ శక్తి ప్రవాహాన్ని చక్కగా ఆ భాగానికి వెళ్ళనీయండి. ఆ భాగంలో మీ తెలుసుకునే తత్వాన్ని నింపండి. ఆ శక్తి ప్రవాహాన్ని కుతూహలంతో గమనించండి. అక్కడ చక్కని చికిత్స జరగటం చూస్తారు.

అమృతంతో నింపండి : కళ్ళుమూసుకొని, నిటారుగా కూర్చోండి. లోతుగా శ్వాస తీసుకొని వదలండి. మీ శరీరం అంతా అమృతంలో నింపబడినట్లు ఊహించండి. మీ శరీరం మొత్తం నవ్వుతున్న మధుర భావంతో ఉండండి. శరీరంలో ఏభాగంలో అయినా నొప్పి దురద అనిపిస్తే అక్కడ మీ ఏకాగ్రతని నిలిపి, ఆ ప్రాంతం కూడా అమృతంతో నిండినట్టు ఊహించండి. మీ కడుపుమొత్తం అమృతంతో నిండిపోయినట్టు చూడండి. మీ తలనుంచి కాలి వేళ్ళవరకూ గమనించండి. మీరు ఒక బయట వ్యక్తిలా దానిని గమనించండి. మీరు అందులో పాల్గొనవద్దు కేవలం శరీరం మొత్తం అమృతంతో నిండిపోయినట్టు ఊహించండి. చక్కని భావనతో ఉండండి.

ఇప్పుడు నెమ్మదిగా మీరు బాధ ఉన్న ప్రాంతానికి మీ ఏకాగ్రతని తీసుకువెళ్ళండి. ఆ ప్రాంతం మీదే ఏకాగ్రత ఉంచండి. బాధ నొప్పి అనే మాటలని వదిలివేయండి. అక్కడ ఎలా ఉన్నది, అక్కడ ఆ పాయింట్ దగ్గర మీ అనుభవం ఎలా ఉన్నది మానసికంగా మీరు కష్టపడవద్దు. మానసికంగా కలత పదవద్దు. ఆ పాయింట్ దగ్గర ఏమి జరుగుతుందో చూడండి. చిన్న పిల్లలు ఏవిధంగా కుతూహలంతో చూస్తారో అదే విధంగా చూడండి. దాని లోపలికి చొచ్చుకొని వెళ్ళండి. నొప్పి బాధ అనకుండా ఆ ప్రాంతంలో ఉండండి. అక్కడ సెన్సేషన్ పూర్తిగా మాయం అయ్యేవరకూ అలా ఉండండి.

నీలి ఆకాశం లోనికి చూడండి : మేఘాలకి పైన ఉన్న నీలి ఆకాశాన్ని చూడండి. సాధారణంగా మనం మేఘాలని చూసి అభిప్రాయాలు వెల్లడి చేస్తాం. అందమైన మేఘాలు, నల్లటి మేఘాలు అంటూ మనం తీర్పులు చెబుతాం. ఇప్పుడు మేఘాలలో చిక్కుకుపోకండి. మేఘాలు ఆలోచనలవంటివి. ఆ మేఘాలకి అతీతంగా నీలి ఆకాశంలోనికి అంతులేని శూన్యంలోనికి చూడండి.

మీరు మేఘాలలోనికి చూస్తే ఏదైనా ఆలోచిస్తారు. ఆకాశంలోకి చూస్తే ఆలోచనలు ఆగుతాయి. నక్షతాలను చూసినా ఆలోచిస్తారు. మేఘాలని చూడడం అంటే ఆలోచనల దగ్గర ఆగిపోవటం. నక్షత్రం దగ్గర ఆగటం అంటే ఆధ్యాత్మిక విషయం దగ్గర ఆగిపోవటం. ఈ రెండూ చేయవద్దు. కేవలం శూన్యంగా విశాలంగా ఉన్న నీలి ఆకాశాన్ని చూడండి. మీ తల కింద తలగడపెట్టుకోవద్దు. అలా చేస్తే నిద్రపోతారు. పడుకుని ఆకాశాన్ని చూడండి.

కేవలం అలా చూడండి. భయం వేయవచ్చు. కేవలం ఆకాశంలోకి చూస్తే భయం వేస్తుంది. మీ హద్దు కరిగిపోతున్న భయం. ఆ భయాన్ని పట్టించుకోవద్దు. మీరు సరిగా చేస్తే భయం వేస్తుంది. మీరు ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తున్నారనుకోండి, మీకు భయం వేయదు. ఎందుకంటే మీరు ఇంకా మీ శరీరం హద్దులలో చిక్కుకుని ఉన్నారు. ఇది ఎలా ఉంటుందంటే వెనక సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నట్ట. మీరు చూస్తున్నారు కాని మనస్సు ఆలోచిస్తుంది.

కేవలం చూడండి. ఆలోచించవద్దు కొంచంసేపు అయ్యాక అకస్మాత్తుగా మీరు మీ శరీరాన్ని కొన్ని నిముషాలు మరిచిపోయిన విషయం తెలుసుకుంటారు. మీ ఆలోచనల గొలుసు మీరు మామూలుగా సృష్టించే ఆలోచనల లింకు అకస్మాత్తుగా మాయం అవుతుంది. అది జరగాలి అని చూస్తే జరగదు. అందుకే ఏదీ ఆశించకండి. నా ఆలోచనలు ఎప్పుడుపోతాయి అని చూడకండి. ఈ గొలుసు ఎప్పుడు మాయం అవుతుంది అని ఎదురు చూడకండి. ఏవిషయం పట్టించుకోకుండా కేవలం ఆకాశం వైపు చూస్తూ ఉండండి.

మీరు ఆ విధంగా చూస్తూ ఉన్నప్పుడు చివర కొన్ని సెకండ్ల పాటు మీకు ఆలోచనలు ఉండవు. అప్పుడు కళ్ళుమూసుకొని బయట ఉన్న ఆ ప్రదేశం మొత్తాన్ని మీ అంతరంగంలోకి తీసుకురండి. దానినే మీలోపల చూడటానికి ప్రయత్నించండి. అకస్మాత్మగా అదే మీ అంతరంగంలో మీకు కనిపిస్తుంది. మీకు ఆలోచనలు ఉండవు. నక్షత్రాలు ఉండవు. కేవలం విశాలమయిన ప్రదేశం మాత్రమే ఉంటుంది.

మీకు మోకాళ్ళ నొప్పి అయితే ఈ పద్ధతిని సాధన చేయండి. కేవలం ఆకాశంలోకి చూడండి. అకస్మాత్తుగా ఎప్పుడు మీకు కొన్ని సెకండ్ల పాటు మీకు ఆలోచనలు లేవు అని తెలుసుకుంటారో ఆ ప్రదేశాన్ని మీ మోకాళ్ళ దగ్గరకి తీసుకువెళ్ళండి. కొన్ని సెకండ్లలో నొప్పి మాయం అయిపోతుంది. మీలో శారీరక బాధ ఉన్నప్పుడు లేదా మానసిక బాధ ఉన్నప్పుడు ఈ పద్ధతిని సాధన చేయండి. అప్పుడు ప్రతి క్రణం మీకు చికిత్స జరుగుతుంది. అప్పుడు ప్రతి క్షణం మీ లోపల చికిత్స జరుగటం చూసారు. చికిత్సతో పాటు మీరు ఆధ్యాత్మిక ప్రగతికోసం చూస్తున్నవారైతే ఈ సాధన మీ లోనికి అంతులేని శక్తిని, గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. మీ అభివృద్ధిలో మీరు ఒక పెద్ద అడుగు ముందుకి వేయగలుగుతారు.

బూంగ్ బూంగ్ బూంగ్

  • సంతోషం బాధలు రెండూ కూడా మనస్సు నుంచే వస్తాయి.
  • మనలో పేరుకుపోయిన బాధలు మన చుట్టూ వ్యతిరేక శక్తి క్షేత్రాలని సృష్టిస్తాయి, దానినే మనం బాధాకర శరీరం అంటాం. మీ ప్రతీ బాధా మీరు అంతరంగంలో పెట్టుబడి పెట్టిన మీ అహంకారమే.
  • మీరు కొంచం తెలుసుకోగలిగితే బాధ పడటం అనేది మీ కళ్లని తెరిపించి బాధ అనే ఎంత అబద్దమో గుర్తించగల మార్గం. జ్ఞానోదయం అంటే బాధనుంచి తప్పించుకోవటం కాదు బాధని అర్థం చేసుకోవటం.
  • శరీర బాధని మనస్సు మార్చవచ్చు.
  • గురుదేవులు అంటే తీవ్రమయిన జీవితం. ఆయన కత్తిని అలవోకగా తీసి అవతల పారవేసారు.

కోరిక చైతన్యవంతమైన శక్తి

జీవస్ముక్తి అంటే కోరిక శక్తిని అతిస్వచ్ఛమైన స్థాయిలో పొందటమే

భయం, కోరిక అనేవి మనల్ని ముందుకు నడిపే ప్రాథమిక శక్తులు. మనం ఏపనినైనా ఏదో సాధించాలనే కోరికతోనో, ఎక్కడికో చేరాలని లేదా ఏదో అనుభవాన్ని పొందాలనో చేస్తాం. ఆకర్షణ వికర్షణ అనేవి కేవలం కొన్ని మూలకాలశక్తి మాత్రమే కాదు మానవుల ముఖ్యప్రవర్తన కూడా.

మీ నిజమైన కోరికని గురించండి

మనిషి జీవితాన్ని నడిపే ముఖ్యమైన శకులలో కోరిక ఒకటి. మీరు మీ జీవితంలోనికి తొంగిచూస్తే చాలా సమయాలలో మీరు కోరికతోనో, భయంతోనో నదపబడతారు.

మనకి చాలా కోరికలు ఉంటాయి. వాటిని తీర్చుకునే శక్తి మనకి లేదు అని మనం చాలా సార్లు అనుకుంటాం. జైన సంప్రదాయం ప్రకారం, భగవంతుడు మనని ఈ భూమి మీదకి పంపేటప్పుడు మన కోరికలు తీర్చుకోవటానికి సరిపడా శక్తిని ఇచ్చి పంపిస్తాడు. కాని మనలో చాలా మంది అలా అనుకోం. ఎందుకు? మన నిజమైన కోరికలకి, అప్పుతెచ్చుకున్న కోరికలకి చాలా తేడా ఉన్నది. మన నిజమైన కోరికలని అవసరాలు అంటారు. అవసరాలు తీర్చుకోవటానికి కావలసిన శక్తి మనందరికీ ఉన్నది. మన అవసరాలు ఏమిటి?

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్పురణ ధ్యాన కార్యక్రమంలో ఒక సెషన్‌లో, అందులో పాల్గొన్న వారిని, వారి అవసరాలు, కోరికల లిస్టు రాయమని చెబుతాం. ఆ తరువాత వాళ్ళు ఆ కోరికల మీద ధ్యానం చేస్తారు. తరువాత వారిని తమకోరికలని గుర్తుతెచ్చుకోమని చెబుతాను. వాళ్ళు రాసిన దానిలో చాలా కొద్దిగా మాత్రమే గుర్తుతెచ్చుకోగలరు, అన్నీ గుర్తురావు. ఇది ఎలా ఉంటుందంటే నిండా ఆకులతో ఉన్న చెట్టు మెడిటేషన్ తరువాత ఆకులని రాలినట్టు అయ్యి, ఆ చెట్టుకి కేవలం బంగారు ఆకులు మాత్రమే మిగులుతాయి.

మీరు అర్థం చేసుకోగలిగితే ఏది స్వభావ సిద్ధమైన కోరిక, ఏది మీరు కావాలి అని తెచ్చుకున్న కోరికో తెలుస్తుంది. అప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి అప్రయత్నంగా ముందుకి సాగుతుంది. అప్పుడు మీలో మిగిలిన కోరికలు బంగారంలా ప్రకాశిస్తాయి. అవి తీరగల శక్తిని ఆ కోరికలు కలిగి ఉంటాయి.

అవి నిజమైన కోరికలు. మీరు తెలుసుకునే తత్వంతో ఈ పని చేస్తే ఈ కోరికలు నిస్వార్థంగా ఉంటాయి. అవి ఆ వ్యక్తికి కచ్చితంగా ఉపయోగపడతాయి, అదే విధంగా మానవజాతికి ఉపయోగపడతాయి. కేవలం అటువంటి కోరికలే అవి తీరే విధంగా విశ్వశక్తిని తమతో ఉంచుకుంటాయి. కోరికలు మన నిజమైన కోరికలైనప్పుడు అవి అవసరాలు అయినప్పుడు, అవి మన అంతరంగ శక్తిని వెల్లడి చేసినప్పుడు వాటిని సాధించే క్రమంలో మనం అలసిపోం. వాటిని అతి సహజంగా కాలంతో పాటు సాధించగలం అని తెలుసుకుంటాం. మనం సమస్యల్లో ఇరుక్కోం. జరిగిన వాటిని స్వీకరించగలుగుతాం.

మనం మన జీవితమంతా కలసి ఉండేవారిని నిజంగా ప్రేమించాలి అంటే 'అంతే ఇదేలే', అనే అనాసక్తి పోవాలి. అంటే నేను, నాది అనేవాటిని వదిలివేయాలి. భార్య లేదా భర్త నా సొంతం అన్న అలోచన ఉన్నంతకాలం మనలో ప్రేమ ఉండదు. అక్కడ ఉండేది హింసమాత్రమే. మనం వారిని నియంత్రణలో ఉంచి వారిమీద అధికారిని అని నిరూపిస్తాం. నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అంటే సొంతం అన్న విషయాన్ని వదిలివేయాలి. ఖలీల్ జిబ్రాన్ తన గ్రంథంలో ప్రేమ గురించి ఈ విధంగా చెబుతాడు, 'ఒకరి నొకరు ప్రేమించుకోండి. కాని బందీలుగా కాదు. ఒకరి కొకరు భోజనం పంచుకోండి కాని ఒక ముక్కలోంచి తినవద్దు. '

సంతృప్తి అనేది నిజమైన కోరిక

మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు మీరు సౌకర్యంగా ఉండలేరు. ఎందుకంటే అది మీ సహజ స్థితి కాదు. మీ సహజ స్థితి తలనొప్పి లేని స్థితి. అదే విధంగా మీలో కోరిక కలిగితే, మీరు వెంటనే దానిలోంచి బయటకి రావాలి అనుకుంటారు. ఎందుకంటే లోతైన సంపూర్ణత్వం, సంతృప్తి మీ సహజ లక్షణం. కోరిక మీలోనికి రాగానే మీలో సమతుల్యత పోతుంది.

మీరు రెండు ముఖ్యమైన సత్యాలు అర్థం చేసుకోవాలి.

  1. మీ జీవితం అంటే చాలా సంఘటనల గొలుసు. ఇవన్నీ కూడా కేవల ఒక లక్ష్యం వైపు నిర్దేశింపబడి ఉన్నాయి. అది సంత్సపి. మీరు ఏమి చేసినా, తిన్నా తాగినా, సంబంధ బాంధవ్యాలున్నా, ఆస్తి, సంతోషం ఇవన్నీ కూడా ఆ సంతృప్తిని పొందటానికే. దాన్ని డైరెక్ట్‌గా పొందకుండా రకరకాల దారులలో పొందటానికి ప్రయత్నిస్తారు.
  2. సంత్సపి అనేది మీలో ఉంది. అది మీ సహజ లక్షణం. అందుకే అసంతృప్తి నుంచి బయటకి రావటానికి ప్రయత్నిస్తుంటారు.

సంత్సపి కోసం మీరు ప్రయత్నిస్తున్నారు అంటే దాని అర్థం సంతృప్తి అనేది ఉంది అని మీకు తెలుసు. లేకపోతే మీరు దానికోసం వెతకరు. జీవితంలో ఒకసారి సంతృప్తి అనేది జరిగితే మీరు ఆ అనుభవాన్ని మరలా పొందాలి అనే ఆశతో ఉంటారు. ఆ విధంగా జీవితాన్ని విస్తృత పరచుకుంటారు.

కోరిక – జ్ఞానం – పనులు

స్వచ్ఛమైన కోరిక ఒక వ్యక్తి వైపుకాని, వస్తువు వైపుకాని నిర్దేశించి ఉండదు. అది కేవలం పొంగి ప్రవహించే శక్తి దానినే ఇచ్చాశక్తి అంటారు. అది కోరిక శక్తి.

నాభిప్రాంతం నుంచి స్వచ్ఛమైన శక్తి వస్తుంది. హృదయప్రాంతంలో ఈ శక్తి కోరిక శక్రిలా మారుతుంది. గొంతు ప్రాంతంలో అది మాటలుగా మారుతుంది. అది మాటలుగా మారితే దాన్ని వాక్ శక్తి అంటారు. కొంచం విశ్లేషించి చూస్తే, నాభి ప్రాంతంలో శక్తి పత్తి లాంటిది. గొంతు ప్రాంతంలో అది దారం అవుతుంది. లేదా ఈ విధంగా అర్థం చేసుకోండి. నాభిప్రాంతంలో ఇది ఇనుము, గొంతు దగ్గర అది వస్తువుగా మారుతుంది.

వాక్‌శక్తి మెదడుకి వెళుతుంది. అక్కడ అది జ్ఞానంలా ఉండి చివరికి ఆజ్ఞగా మారుతుంది. మెదులో అది జ్ఞానశక్తిగా స్టిరపడుతుంది. శరీరానికి సంబంధించిన కోరికశక్తి శరీరపు జ్ఞానంలా మారుతుంది.

మరొక పద్ధతిలో మాటలు ఆజ్ఞగా మారి ఆ పని జరిగే విధంగా చూస్తాయి. ఆ ఆజ్ఞ శరీరం మొత్తం వ్యాపిస్తుంది. దీనినే క్రియాశక్తి అంటారు. ఉదాహరణకి కోరికశక్తి క్రియాశక్తిగా మారి మీ శరీరంలో కదలికలు తెస్తుంది.

స్వచ్ఛమైన ఇచ్చాశక్తి మీ అంతరాత్మనుంచి వస్తుంది. అది గొంతు ప్రాంతంలో జ్ఞాన శక్తిగా మారుతుంది. అది క్రియాశక్తిగా అవుతుంది.

శక్తి ఈ విధంగా ఒక క్రమంలో జరగకపోతే, జ్ఞానం, పని అనేవి స్వచ్చమైన కోరికశక్తి నుంచి విడిపోతాయి. జ్ఞానం, పని అనేవి కోరికశక్తికి అనుగుణంగా ఉండాలి. అప్పుడు అది ఒక ధర్మ చక్రాన్ని సృష్టిస్తుంది. కోరిక మంచి జ్ఞానానికి దారితీస్తే, అది సరియైన పని చేయిస్తుంది. అది తిరికి స్వచ్ఛమైన కోరికల వైపు తీసుకువెళుతుంది.

మీకు లక్ష డాలర్లు సంపాదించాలని కోరిక ఉందనుకోండి. అది జ్ఞానంగా మారుతుంది. అప్పుడు మీరు స్వచ్ఛమైన ప్లానువేసి, దానికి తగిన విధమైన పనులు చేసి లక్ష డాలర్లు సంపాదిస్తారు. ఇచ్చాశక్తి అధికమైన జ్ఞానశక్తిగాను తక్కువ క్రియాశక్తిగా మారితే, మీరు కేవలం అధికంగా ఆలోచించి, ఆలోచించి, చివరికి గాలిలో మేడలు కట్టటం మాత్రమే చేస్తారు.

ఆ విధంగా కాకుండా ఇచ్చాశక్తి అధికమైన క్రియాశక్తిగా మారి తక్కువ జ్ఞానశక్తిగా మారితే మీరు గుడ్డిగా పని చేసారు. కాని అందుకే ఇచ్చాశక్తిని పనిగా సరియైన విధంగా మార్చగలగాలి. ఎప్పుడైతే మీలో తెలుసుకునే తత్వం లేదో ఈ మార్పు సరియైన పద్ధతిలో జరుగదు. మీరు నిజాయితీగా మీ కోరికతో అనుసంధానమైతే మీలో విభేదం అనేది ఉండదు అప్పుడు కోరిక అది తీరగల పని వైపు చక్కగా మార్పు చెందుతుంది.

మీ చైతన్య స్పృహను వస్తువు నుండి మీ వైపుకి మరల్సుకోవడం

చిన్న కథ : ఒకసారి ఒక యువకుడు రామానుజాచార్యులు దగ్గరకి వెళ్ళి, నాకు జ్ఞానోదయం కావాలి. నేను ఏ విధంగా దాన్ని సాధించగలనో నేర్పించండి అని అడుగుతాడు. రామానుజా చార్యులు అతన్ని నీవు ఎప్పుడైన ప్రేమని అనుభవించావా అని ప్రశ్నిస్తాడు. ఆ యువకుడు నిరాశాంపోతాడు. అతను మీరు ఏమి అడుగుతున్నారు? నేను చాలా స్వచ్ఛమైన జీవితాన్ని గడిపాను. నా కోరికలను నియంత్రించాను. ఎన్నో సాధనలు చేసాను. భగవంతుని తెలుసుకోవడానికి వచ్చాను అంటాడు. అతనితో రామానుజా చార్యులు 'నీవు మామూలు ప్రేమ అనుభవాన్ని పొందనప్పుడు భగవంతుడి అనుభూతిని ఏ విధంగా పొందుతావు?' అని అంటాడు.

మీకు సాధారణ ప్రేమ అనుభవం లేకపోతే ప్రేమ అనేది మీలో కలిగినప్పుడు ఏమి జరుగుతుందో అర్థంకాదు. ఒక వస్తువు లేదా ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలిసే అప్పుడు మీరు అనుభవం వైపు మరలుతారు. మీ ఏకాగ్రతను తెలుసుకునే తత్వంవైపు మరల్చగలగడమే సహజంగా మిమ్మల్ని మీ వైపు మరలించుతుంది. ఆ ప్రేమ మిమ్మల్ని మీ అంతరాత్మకి దగ్గర చేస్తుంది. ప్రేమ మిమ్మల్ని లక్ష్యం వైపు మరల్చవచ్చు. లేదా వస్తువు లేదా విషయం వైపు తిప్పవచ్చు. ఇది వారధి లాంటిది. మిమ్మల్ని మీ అసలైన విషయం మీదకి మరలిస్తుంది. ఎవరైతే అంతరాత్మలోనికి ప్రవేశించడానికి దీన్ని ద్వారంగా మలచుకుంటారో వారికి జ్ఞానోదయమౌతుంది. అటువంటి వారు వాటి నుంచి స్వేచ్ఛని పొందటమే కాదు ఎదుటివారికి స్వేచ్ఛని ప్రసాదిస్తారు.

ప్రతీక్షణం జీవితాన్ని అనుభవించండి

ఒక చిన్న కథ : ఒక వీథిలో ఇద్దరు స్నేహితులు కలుసుకుంటారు. ఒక వ్యక్తి విచారంగా ఉంటాడు. మరొక వ్యక్తి అతన్ని 'ఏమయింది? చూస్తుంటే ప్రపంచమే చివరికి వచ్చిందా అన్నట్టు ఉన్నావు' అని అడుగుతాడు.

అతను, 'మూడు వారాల క్రితం మా మామయ్య చనిపోతూ నాకు పది లక్షల ఆస్తి వదిలి వెళ్ళాడు' అంటాడు. 'అయ్యో! మీ మామయ్య చనిపోయాడా! పాపం. అయినా నీకు పది లక్షల ఆస్తి ఇచ్చాడుగా' అంటాడు. ఆ వ్యక్తి 'రెండు వారాల క్రితం మా బాబాయి చనిపోయితూ నాకు 5 లక్షల ఆస్తి వదలివెళ్ళాడు' అంటాడు.

అతని స్నేహితుడు, 'మరెతే నీ సమస్య ఏమిటి?' అని అడుగుతాడు.

ఆ వ్యక్తి, 'ఈ వారం నాకు మరే కబురూ రాలేదు, అంటాడు విచారంగా.

ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు అప్పుడప్పుడు జీవితాన్ని అనుభవిస్తారు. మరొక రకం వారు నిరంతరం జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నాను అనుకుంటారో ఆ కొన్ని నిముషాలు జీవితాన్ని అనుభవిస్తారు. అప్పుడు మీరు ఎంతో చైతన్యంతో ఉంటారు. అంతా అందంగా కనిపిస్తుంది. సర్వసృష్టి పట్ల అనుకూల భావం ఉంటుంది.

మీ సంతోషం అంతా కూడా విశ్వశక్తి పట్ల మీకున్న అనుకూలమైన అనుభవమే. అది స్వీటు తినటం అయినాసరే. ఆ కొన్ని నిముషాలు జీవితం అద్భుతం అనుకుంటారు. జీవితం చాలా అవసరం అనుకుంటారు. దానితో అనుబంధాన్ని పెంచుకుంటారు. మీరు శాశ్వతమైన సృష్టి సమక్షానికి అనుకూలంగా ఉంటారు.

శాశ్వతంగా నిలచి ఉండే దానినే జీవితం అంటాం. అన్ని పనులకీ కారణం ఆ శాశ్వత తత్వాన్ని ఇప్పుడైనా అనుభవించవచ్చు లేదా ముందు అనుభవిస్తాను అనే ఆశతోనెనా ఉండవచ్చు. అందుకే మీరు మీ శరీరాన్ని కదుపుతూ ఇంకా జీవించి ఉన్నారు. మీరు నిద్రమంచం మీద నుంచి ఏమనుకుని లేసారు, ఆ రోజు ఏదో ఒక మంచి అనుభవం కావాలి అని లేదా ముందు ముందు అటువంటి అనుభవాన్ని పొందాలి అని. అదే మిమ్మల్ని ముందుకు నడిపించే కోరిక. అదే మిమ్మల్ని నిద్ర మంచం మీద నుంచి లేపగల శాశ్వత స్థితి. మిమ్మల్ని ముందుకి నడిపించే ప్రతి కోరిక శాశ్వత స్థితిని అనుభవించాలి అనే కోరిక మాత్రమే.

ప్రేమ శక్తి

మీరు జీవితంలో ఇటువంటి సంఘటనలని చూసి ఉంటారు. ఒకామెకి రోడ్డు దాటాలి అంటే చాలా భయం. కాని ఆమె బిడ్డలు రోడ్లమీదకి పరిగెత్తి వెళ్ళితే, ఆమె ఒక్క ఉదుటున రోడ్డు దాటి తన గురించి ఏ మాత్రం ఆలోచించకుండా తన బిడ్డని జాగ్రత్తగా తెచ్చుకుంటుంది.

మనం ఇక్కడ ఒకటి అర్ధంచేసుకోవాలి. అంత అకస్మాత్తుగా ఆమె భయం ఏ విధంగా మాయమైంది. తన బిడ్డమీద ప్రేమ ఆమెలో తల్లిని మేల్కొలిపింది. ప్రతి ప్రేమ బంధంలో ఉండేది ఇదే. ఎవరిలోనైనా ప్రేమ భావం వికసిస్తే వ్యక్తి అంతరంగంలో అన్ని రకాల భయాలు పోతాయి.

మీరు ఇటువంటివి మీ జీవితంలో విని ఉంటారు. మేము మా అమ్మాయిని అతి జాగ్రత్తగా పెంచాం. ఎంతో ప్రేమతో, జాగ్రత్తతో పెంచాం. ఆ అమ్మాయికి అసలు బయట ప్రపంచం తెలియదు కానీ ఒకరోజు తను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయింది. ఇది ఎలా జరిగిందో మాకు తెలియటం లేదు, అని అంటుంటారు.

ప్రేమకి అంతులేని శక్తి ఉన్నది. మోహంకి (కోరికకి) అంతే శక్తి ఉంది. మీ మూలాధార చక్రంలో ఎక్కువ శక్తి ఉన్నప్పుడు అది మిగతా చక్రాలని అధిగమిస్తుంది. అప్పుడు బాధలు ఉండవు. ఈ చక్రాలేవి కూడా మూలాధార శక్తితో నిండి ఉన్నప్పుడు పని చేయవు. ఆ వ్యక్తికి తెలియకుండా అతనిలో అంతులేని శక్తిని విడుదల చేస్తుంది. దాన్ని అతను బయటి ప్రపంచంలోనికి పంపిస్తాడు. అందుకే అతి ప్రాచీన కాలంనుంచీ ఎవరైనా ప్రేమలో పడితే, వారిలో ఎంతో శక్తి వస్తుంది. వారు ఈ సంఘం మొత్తాన్ని ఎదిరించగలుగుతారు. ఉదాహరణకి రోమియో జూలియట్‌లని తీసుకోండి. వాళ్ళు పరిణతిగల వారు, తెలివైన వారు, కాని ప్రేమలో ఉన్నప్పుడు వారి తెలివితేటలకి అతీతంగా వెళ్ళి ధైర్యంగా వారికి అడ్డువచ్చిన సమాజాన్ని ఎదిరిస్తారు.

చరిత్రలో ఇటువంటి కథలు చాలా ఉన్నాయి. ప్రేమికులు ప్రేమ కోసం మామూలుగా వారికి సాధ్యంకానివి చేసారు. వారు వారి అంతరాత్మలో వారి భావనలలో మరొక కోణాన్ని చూడగలుగుతారు.

మీలోపలి విభిన్న కోణాల్ని వేరు వేరు వ్యక్తులు చైతన్య పరచగలరు. మీరు ప్రేమిస్తే మీ లోపల ప్రేమ భావం మేల్కొంటుంది, మీకు పిల్లలు ఉంటే తల్లిదనం మీ అంతరంగంలో చైతన్యవంతమౌతుంది. మీ మానసిక వ్యవస్థ రకరకాల కోణాలలోని అనుభవాలని స్వీకరించే దశలో ఉన్నప్పుడు, అవన్నీ మీ లోపల వికసిస్తాయి.

కాబట్టి లోతైన సత్యం ఏమిటంటే, ఇద్దరి మధ్య ప్రేమ కలిగితే ఆ భావం వారిద్దరినీ ఒకరికోసం ఒకరు ఎంత త్యాగం చేయటానికైనా సిద్ధంచేస్తుంది. వారికి ఉన్న భావం ఎంత లోతుగా ఉంటే అంత ఎక్కువ త్యాగం చేయగలుగుతారు.

మీరు విప్పారిన అంతరంగం గల వారైతే, మీ జీవితంలో కలిసిన ప్రతీ వ్యక్తి మరింతగా విప్పారే విధంగా చేయగలుగుతారు. మీరు అహంకారి అయితే మీ జీవిత భాగస్వామి, మీ ప్రేమికురాలు లేదా ప్రేమికుడు ఎవరినీ కూడా వికసించే విధంగా చేయలేరు. మీరు మీ జీవిత భాగసాన్మితో కాని లేదా పిల్లలతో కాని సంబంధాన్ని ఏర్పచుకునే ముందు పూర్తిగా వికసించి వుండాలి. మీ మానసిక వ్యవస్థ విప్పారి ఉండే విధంగా చూడటం మీ బాధ్యత. అప్పుడు ఆ భావన మీలో మార్పుని తీసుకురాగలుగుతుంది. మీలో శాశ్వతమైన మార్పు అప్పుడు రాకపోతే జీవితంలో ఒక పెద్ద అవకాశాన్ని పోగొట్టుకున్న వారవుతారు.

భార్యా భర్తల మధ్య అహంకారం లేని భావనని సృష్టించుకోలేకపోతే వారి మధ్య ఉన్న దాన్ని అనుబంధం అనరు. జంతువులలోని శారీరక సంబంధం లాంటింది. ఆ సంబంధం నిజమైన అనుబంధం వైపుగా ఆ మార్పుని తేగల ప్రభావాన్ని ఇద్దరి అంతరంగాలలో చూపగలగాలి. ఆ భావన ఇద్దరిలో సమాన స్థాయిలో ఉండాలి.

మనం ఎందుకు నిజమైన ప్రేమని పొందలేక పోతున్నాం. అది మన సంస్కారాల వలన మన పాత జ్ఞాపకాలతో, భావాలకి ఉన్న అనుబంధం వలన. ఉదాహరణకి మీకు ఒక కంప్యూటర్ ఉందనుకోండి, దాంట్లో ఏవో కొన్ని మెమొరీస్ ఉంటాయి. అందులో హైరిజల్యుషన్ బొమ్మలని ఎక్కువ ఉంచామనుకోండి. అది మొత్తం కంప్యూటర్ అంతా నిండిపోతుంది. మీకు ఉపయోగించటానికి తగినంత శక్తి దొరకదు. ఎందుకంటే మీ శక్తి అంతా పాత జ్ఞాపకాలకి, మీ జ్ఞాపకాలలోని మనుషులకి, వారితో అనుబంధాలైన కోపం లేదా అపరాధ భావం వీటికి సరిపోతుంది. మీలోని శక్తిని మీ అంతరంగాన్ని పూర్తిగా అవి ఆక్రమించి ఉంటాయి. అందుకే మీరు ఎవరితోనూ డైరెక్ట్‌గా అనుబంధాన్ని పెంచుకోలేరు. మీరు ప్రేమించలేరు. మీ భయాలు, అత్యాశ, అపరాధ భావం ఇవన్నీ కూడ మీ లోపల ఉండటానికి కారణం మీ శక్తిని సంస్మారాలు తీసేసుకున్నాయి. ఈ హైరిజల్యుషన్ బొమ్మలు మీ అంతరంగం లోనికి పదే పదే వస్తాయి. అందుకే మీరు స్వచ్చమైన చేతన స్థితిలో ఈ క్షణంతో అనుబంధాన్ని ఉంచుకోలేరు. ఎవరికైతే హెరిజల్యుషన్ బొమ్మలు అంటే భావాత్మక సంబంధాలు ఎక్కువ ఉండవో వారు ఎవరితోనైనా దేనితోనెనా చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకోగలరు.

మీ అంతరంగం అంతా గతానికి సంబంధించిన వాటితో నిండిపోయింది. అందుకే మీ అంతరంగం ఈ క్షణానికి దొరకటం లేదు. అందుకే మీరు మీ గత జ్ఞాపకాలకి సంబంధించిన వారితో మాత్రమే అనుబంధాన్ని పెంచుకోగలరు, వారిని మాత్రమే ప్రేమించగలరు. మీరు గతంతో ఎటువంటి భావావేశాత్మకమైన సంబంధాన్ని పెట్టుకోకపోతే వాటిని వదలివేయగలిగితే, అకస్మాత్‌గా మీరు మీ అంతరంగాన్ని చూడగలరు. అది మీకు దొరుకుతుంది. అప్పుడు మీ ఎదురుగా ఎవరు ఉన్నా వారి గతాన్ని అడగకుండా వారితో అనుబంధాన్ని పెంచుకోగలరు.

కామం నుంచి ప్రేమకి

కామం సృష్టి కల్పించిన ఒక ప్రాథమిక భావావేశం. అది జాతి వృద్ధికి అవసరం. దానికి అతీతంగా వెళ్ళగలగటమే మనలో నిక్షిప్తమైన అంతిమ శక్తిని తెలుసుకోవటానికి మనం వేసే మొదటి అడుగు.

మనుషులు ఎప్పుడూ ప్రేమకి, కామానికి మధ్య అయోమయ పడతారు. వాళ్ళు జంతువులలో ఉండేది కామం అనుకుంటారు. నిజానికి జంతువులలో ఉండేది స్వచ్ఛమైన కామం. కాని మనుషులలో వారి దర్శనంవలన స్వచ్చమైన కామం ఉండదు, స్వచ్ఛమైన ప్రేమ ఉండదు. అందుకే వారిలో అంత అసంతృప్తి.

ఏ కోరికనైనా పూర్తిగా అనుభవిస్తే అది మన వ్యవస్థని వదిలి వెళ్ళిపోతుంది. పూర్వకాలం వారిలో కామం, సెక్స్ అనేవి సంసారులని నలభై సంవత్సరాలు వచ్చేసరికి వదిలివేసేవి. ఎందుకంటే వారు దానిలో లోతుగా వెళ్ళి, పూర్తిగా సంతోషించేవారు.

ఒక విషయం అర్థం చేసుకోండి, శారీరక సంబంధాన్ని ఒక స్కేలుగా ఉపయోగించి ఒక వ్యక్తి ఇంకా ప్రేమిస్తున్నాడా లేదా అదే విధంగా ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నామా లేదా అని తెలుసుకోవటానికి ఉపయోగిస్తున్నారు. అప్పుడే అనుమానమే వారి మధ్య బానిసత్యాన్ని ఏర్పరుస్తుంది.

సెక్స్ బొగ్గు అయితే ప్రేమ వజ్రం. సెక్స్ బురద అయితే ఆ బురదలో వికసించే పద్మం ప్రేమ. రెండింటిలో పదార్థం ఒక్కటే కాకపోతే దానిని ఏ విధంగా తయారు చేయాలో ఆ పద్ధతిని మీరు తెలుసుకోవాలి. మీరు ఆశించటాన్ని వదిలివేయండి, అప్పుడు మీలోపల శక్తి ఉప్పొంగుతుంది.

మీలో ఉన్న స్త్రీని, పురుషుణ్ణి కనుగొనండి

ఈనాటి జీవశాస్త్రం ప్రకారం పురుషుడు 100% పురుషుడు కాదు, అదే విధంగా స్త్రీ 100 శాతం స్త్రీ కాదు. పురుషుడు 51% పురుషుడు 49% స్త్రీ. అదే విధంగా స్త్రీ 51% స్త్రీ 49% పురుషుడు. అంటే వారిద్ధరి మధ్య తేడా 1 శాతం లేదా కొంచం ఎక్కువ, అంతే.

మీరు తల్లి, తండ్రుల శక్తి నుంచి జన్మించారు. కాబట్టి కేవలం స్త్రీ లేదా కేవలం పురుషునిగా ఎలా ఉంటారు. మీరు ఒప్పుకున్నా ఒప్పకోకపోయినా మనం స్త్రీ పురుష శక్తుల కలయిక. మనం సంపూర్ణులమే కాని విడి భాగాలం కాదు.

సంపూర్ణత్వంలో ఉండాలి అంటే మనం స్త్రీ పురుష లక్షణాలని స్వీకరించాలి వెల్లడి చేయగలగాలి. కాని అది నిజంగా జరుగుతుందా? మనని ఆ రెండూ వెల్లడి చేయనిస్తారా?

మీరు పుట్టగానే అబ్బాయి, అమ్మాయి అనే ముద్రలు వేస్తుంది సమాజం. మీరు ఆ విధంగానే ప్రవర్తించాలి అని ఆశిస్తుంది. సమాజం మగపిల్లల్ని ఆడపిల్లల లక్షణాలని, అమ్మాయిల్ని మగపిల్లల లక్షణాలని వెల్లడి చేయనీయదు, చాలా చిన్నతనం నుంచే మనలోని సగ భాగాన్ని అణచి వేసారు.

పిల్లలు ఏడు సంవత్సరాల వయస్సు వచ్చే వరకూ సమాజపు గుప్పిటిలోనికి పూర్తిగా వెళ్ళరు. వారిలో తాము ఆడ లేదా మగ అన్న తేడా తెలియదు. అందుకే చిన్న పిల్లలలో ఆ సంపూర్ణత్వం అనేది ఉంటుంది. వారు తమలోనే కేంద్రీకరింపబడి ఉంటారు. ఏడు సంవత్సరాలు దాటాక సమాజం గుప్పెటిలోనికి వస్తారు.

ఇప్పుడు పిల్లల మీద సమాజం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా, లోతుగా ఉంటుంది. అప్పుడు వారిలో సగభాగాన్ని అణచివేస్తారు. మనం తెలుసుకోం కాని ఈ సమయం వారికి నరకప్రాయం. అకస్మాత్‌గా తనలోని సగభాగం పోయినట్లు భావిస్తారు. అప్పుడే వారు పోగొట్టుకున్న భాగం కోసం బయట వెతకటం ప్రారంభిస్తారు.

మనిషి సహజంగా పూర్ణత్వాన్ని పొందాలి అని అనుకుంటాడు. అందుకే అచేతనస్థితిలో తాను పోగొట్టుకున్న భాగాన్ని వెతుక్కోవటం ప్రారంభిస్తాడు. తాను పోగొట్టుకున్న భాగంలో నింపగలిగే దాని కోసం చూస్తుంటాడు. మగ పిల్లవాడు ఆడ పిల్ల సమాక్షాన్ని, ఆడపిల్ల పురుష సమాక్షాన్ని కోరుకుంటారు. ఇక్కడే సెక్స్ అనే విషయం ప్రారంభమయ్యేది. ఇక్కడే దాని మూలాలు నాటబడేది.

ఏడు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకూ పిల్లలు తల్లిదండ్రులకి దగ్గరగా ఉంటారు. ఇక్కడి నుంచి వారు తమ దృష్టి స్త్రీ పురుషుడు అంటే ఏమిటో వారిలో రూపుదిద్దుకుంటారు. మగ పిల్లలు తాము పోగొట్టుకున్న భాగాన్ని తల్లినుంచి, ఆడపిల్ల తండ్రినుంచి పొందుతారు.

అందుకే ప్రతి మగపిలవాడికి మొదటి హీరోయిన్ తల్లి, ఆడపిలకి హీరో తండ్రి. ఇది రాయని న్యాయసూత్రం. లోతుగా నాటబడిన ఈ వెతకటం అనేది ఫ్యూడియన్ మానసిక శాస్త్రం వెనుక ఉన్న సూత్రం. పురుషుడు తన తల్లి ఎటువంటి శ్రద్ధ అనురాగాన్ని చూపేదో అదే తన భార్య నుంచి కోరుకుంటాడు. భార్య భర్తనుంచి తన తండ్రి ఇచ్చిన రక్షణని కోరుకుంటుంది.

పద్నాలుగు సంవత్సరాలు వచ్చే సరికి పిల్లలలో భౌతిక పరిణతి వస్తుంది. వారికి బయట పనులు, చదువులు ఇవి ఎక్కువ అవుతాయి. దాంతో తల్లిదండ్రులతో ఇదివరకు ఉన్నంత దగ్గరగా ఉండలేరు. ఇప్పుడు తమలో పోగొట్టుకున్న సగభాగం కోసం బయట వెతకటం ప్రారంభిస్తారు. మీడియాకి ఈ విషయం బాగా తెలుసు. అందుకే అడ్వర్టైజ్‌మెంట్స్ ఆ విధంగా ఉంటాయి. అందమైన యువతీ, యువకుల బొమ్మలు ఉంటాయి. వారికీ అమ్మే వస్తువుకి సంబంధం ఉండదు. మీలో అణచివేయబడిన కోరికలని మీడియా ఆ విధంగా డబ్బు చేసుకుంటుంది.

ఒక ప్రక్క మీడియా మీ లోపలికి కొన్ని రూపాలని పంపిస్తూ ఉంటుంది. మరొక ప్రక్క సమాజం మిమ్మల్ని అణచివేస్తూ ఉంటుంది. సమాజం అణచివేసేకొద్దీ మీలో కోరికలు పెరుగుతూ ఉంటాయి. సమాజం లక్షణాలని తుంచుతుంది, కాని అసలు మూలాలని కాదు. మీరు మీడియానుంచి అన్ని ఐడియాలు పోగుచేసుకుంటారు. ఒక కచ్చితమైన స్త్రీ ఎలా ఉండాలి లేదా పురుషుడు ఎలా ఉండాలి అని ఒక్కోన్న మోడల్ నుంచి ఒక్కొక్క భాగం, కన్ను, చెవి, ముక్కు ఈ విధంగా పోగుచేసి చాలా అందమైన రూపాన్ని తయారు చేసుకుంటారు, కంప్యూటర్‌లో చేసిన విధంగా కట్ పేస్ట్ చేస్తారు.

ఈ దశ ఏడు సంవత్సరాలు ఉంటుంది. అప్పటికి మీరు 21 సంవత్సరాల వారవుతారు. మీలో మీరు తయారుచేసుకున్న రూపం స్థిరపడుతుంది. అటువంటి వ్యక్తి కోసం వెతకటం ప్రారంభిస్తారు. ఇది మీ కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని ఇక్కడ ఆశించటం ప్రారంభమవుతుంది.

ఒక చిన్న కథ : తొంభై సంవత్సరాల ఒక వ్యక్తి ప్రతి రోజు బీచ్‌లో కూర్చుంటాడు. అతను ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉంటాడు. అందరినీ గమనిస్తూ ఉంటాడు. ఇతన్ని ఒక యువకుడు చూసి, 'ప్రతి రోజు ఇక్కడ కూర్చొని ఏమి చేస్తారు మీరు?' అని అడుగుతాడు.

'నేను నా కాబోయే భార్యని వెతుక్కుంటున్నాను' అంటాడు. ఆ యువకుడు ఆశ్చర్యపోయి, 'మీ చిన్న తనంలో ఎందుకు వెతుక్కోలేదు' అంటాడు.

పెద్దాయన, 'నేను నా 30 సంవత్సరాల వయస్సు నుంచీ వెతుకుతున్నాను' అంటాడు. ఆ యువకుడు ఆశ్చర్యపోయి, మీరు ఎటువంటి స్త్రీ కోసం వెతుకుతున్నారు. అని అడుగుతాడు. 'నేను ఒక కచ్చితమైన పరిపూర్ణమైన స్త్రీ కోసం వెతుకుతున్నాను.' అని జవాబు ఇస్తాడు. 'అయితే ఇంతవరకూ మీకు ఎవరూ అలా కనపడలేదా? అని అడుగుతాడు ఆ యువకుడు.

నాకు ఒకసారి ఒకామె కనపడింది. సరిగ్గా నా మనస్సులో ఉన్నటువంటి స్త్రీ అని జవాబు ఇస్తాడు. 'మరి ఎందుకు ఆమెని వివాహం చేసుకోలేదు' అని అడుగుతాడు యువకుడు.

'ఆమె ఒక సంపూర్ణ పురుషుడికోసం వెతుకుతున్నది' అని జవాబు ఇస్తాడు.

మీరు మీ ఊహలలో ఉన్నరూపం లాంటి వ్యక్తి కోసం వెతికితే ఈ విధంగానే ఉంటుంది.

అయితే చాలాకాలం ఆ విధంగా వెతికాక అకస్తాత్తుగా మీకు మీ మనసులోని రూపంలాంటి వ్యక్తి కనిపిస్తుంది. మీ మనస్సులో రూపం ఆకుపచ్చ, అప్పుడు మీకు ఆమె సరిపోయింది అనుకుంటారు.

దీనినే ప్రేమలో పడటం అంటారు. ప్రేమలో పడటం వెనుక ఉన్న శాస్త్రం ఇదే. ఒక విషయం గమనించండి, ప్రేమలో పడటమే కాని లేవటం ఉండదు. మనలో ఉండే బలమైన కోరిక మూలాన మనం ఏది కావాలి అనుకుంటామో దానినే చూస్తాం. మన మనస్సులో కోరిక ఎదుటి వారిమీద ప్రొజెక్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రపంచమంతా ఆకుపచ్చగా, చక్కని సంగీతంలా ఉంటుంది. ఇప్పుడే కవితలు రాయటం, బొమ్మలు వేయటం చేస్తారు.

వారి ఇద్దరి మధ్య దూరం ఎక్కువగా ఉన్నంతవరకూ అన్నీ బాగా జరుగుతాయి. వాళ్ళ ఊహల ప్రొజెక్ట్‌ని ఒకరి మీద ఒకరు చూపించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఇద్దరూ కొంచం దగ్గరకి వస్తారో అది ఆకుపచ్చ కాదు వెలసిన ఆకుపచ్చ అనుకుంటారు. సరేలే అనుకొని ఇంకొంచం ముందుకి వెళతారు. అప్పుడు అది లేత ఆకుపచ్చ కూడా కాదు ఒక రకమైన పసుపు అని తెలుసుకుంటారు. ఈ స్థితిలో మన ఊహలు తప్పు అయ్యాయని నమ్మలేం. అప్పుడు ఆ స్థితికి కారణాలు చెప్పకుంటాం. ఇది జీవితం ప్రతీది అనుకున్నట్లు జరగదు. ఈ విధంగా నచ్చచెప్పుకుంటాం. సత్యంతో జీవించటానికి చాలా ధైర్యం తెలివితేటలూ కావాలి. సత్యం నుంచి దాగి ఉండటానికి ఇలా చెప్పుకుంటాం.

ఇంకాస్త దగ్గరయ్యాక అది పసుపు కూడా కాదు తెలుపు అని తెలుస్తుంది. మనలోపల ఉంది ఆకుపచ్చ, బయట ఉంది తెలుపు. ఊహలు, నిజాలు పూర్తి విరుద్దంగా ఉంటాయి.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి మేడ మూడవ అంతసునుంచి పడిపోతాడు, అటుగా వెళ్ళే ఒక వ్యక్తి పరుగున వచ్చి అతన్ని, 'పై నుంచి పడ్డావా! బాగా దెబ్బలు తగిలాయా' అని అడుగుతాడు.

ఆ వ్యక్తి, 'లేదు, పడటం వలన నాకు దెబ్బ తగలలేదు, నన్ను అకస్మాత్తుగా ఆపటం వల్ల దెబ్బ తగిలింది' అని అంటాడు.

ప్రేమలో తేలుతున్నంతకాలం, మన మధ్య దూరం ఎక్కువగా ఉండి, కలసి ఉండే సమయం తక్కువగా ఉన్నంతవరకూ అంతా బాగుంటుంది. మనం ఊహల ప్రపంచంలో ఉంటాం. ఆ తేలటం ఆగినప్పుడే, నిజమైన సంబంధం ప్రారంభమైనప్పుడే ఇద్దరి మధ్య దూరం తగ్గినప్పుడే అన్ని సమస్యలు ప్రారంభమయ్యేది.

మీరు తక్కువ ఊహలతో ఉంటే, సమస్యలు తక్కువ ఉంటాయి. మీలో అసలు ఊహలు అనేవి లేకపోతే మీ ఆత్మ జంటని వెంటనే కలుస్తారు. ఎవరిని వివాహం చేసుకుంటారో వారే మీ ఆత్మీయులవుతారు.

మనం ఒక విషయం అర్ధం చేసుకోవాలి. జీవించి ఉన్న ఏ వ్యక్తీ తన ఊహలలో ఉన్నట్లు జీవించలేదు. ఎందుకంటే ఊహలు అసత్యం నుంచి తయారు చేయబడ్డాయి. ఊహ నిజానికి ఎప్పుడూ సరిపోదు. ఎందుకంటే చివరికి ఊహలే మిగులుతాయి.

అంతిమ రసాయన చర్య

రసాయన చర్య అంటే ఏమిటి? తక్కువ స్థాయిలో ఉండే లోహాలని ఉదాహరణకి రాగి వంటి వాటిని బంగారంలా మార్చటం. అదే విధంగా ఎప్పుడెతే మన అంతరాత్మ పరిణతిని పొందుతుందో, కామం ప్రేమగా మారుతుంది. అదే మనం పొందగల అత్యుత్తమ భావావేశం.

రసాయన చర్యలో ఆ లోహంలో ఉండే మలిన పదారాలని తీసివేసి కొన్ని స్వచ్ఛమైన మూలకాలని కలుపుతారు. అప్పుడు అది బంగారంలా మారుతుంది. అదే విధంగా మీలోని ఊహలు అనే మలినాన్ని తొలగించి స్వచ్చమైన స్నేహ భావాన్ని మీ సంబంధానికి కలపండి. ఇది ఓపికగా చేయవలసిన పద్ధతి. ప్రారంభంలో ఎదుటివారు మీలోని మార్పుని అర్థం చేసుకోలేక పోవచ్చు. కాని మీరు అదే పద్ధతితో మీ మీద నమ్మకంతో ముందుకు సాగండి. మీలోని నిజాయితీశక్తి తప్పని సరిగా మీ చుట్టూఉన్న వారిని అనుకూలంగా సున్నితంగా స్పృశిస్తుంది.

మనం మనని పూర్తిగా స్వీకరించనప్పుడు, ఎవరినో అసహజంగా అనుకరించినప్పుడు, మనం అందంగా ఉండవచ్చు కాని తేజస్పుతో ఉండలేం. తేజస్పు మీ అంతరంగం నుంచి రావలసిన విషయం. మీరు ఏమిటో అదే విధంగా స్వీకరించండి. అలాగే మీ జీవిత భాగస్వామిని అదే విధంగా తీసుకోండి.

ప్రేమకి స్నేహాన్ని కలపండి. ఇప్పుడు మనలోని కామం చాలా లోతుగా నాటబడి ఆ వ్యక్తిని సొంతం చేసుకోవాలి అనే హింస మాన్లమే. ఆ సంబంధానికి స్నేహాన్ని కలపండి. జీవిత భాగస్వామిని ఆహ్వానించండి. స్వీకరించటంకాదు స్వాగతించాలి. స్వాగతంతో శరీరాన్ని, మనస్సుని ఆత్మని అదే విధంగా స్వీకరించండి. అప్పుడు కామం ప్రేమగా మారుతుంది. మీ ఆత్మ నిత్య ఆనందంలో ఉంటుంది.

పతంజలి ఈ విధంగా చెబుతారు, 'మీ మనసును ఏది ఆకరిసే దాని మీద ధ్యానం చేయండి. మీరు అనవచ్చు, నామనస్సు అన్నీ చెడ్డ విషయాల మీదకి వెళుతుందని. ఏమీ ఫరవాలేదు, దాన్ని చెడ్డ అని అనకండి. దాని మీద అందమైన భావంతో పవిత్రంగా ధ్యానం చేయంది. అప్పుడు ఏదైనా పవితంగా మారుతుంది. మీరు దేనితోనైనా అనుబంధాన్ని పెంచుకోగలుగుతారు. ఎప్పుడెతే మోహానికి ప్రేమని కలుపుతారో అది పవితంగా ఉండి గౌరవాన్ని పొందుతుంది.

ప్రేమ మనిషికి జీవితాన్ని ఇస్తుంది. ప్రేమతో మనిషి ఆత్మ మరియు జీవితం అవుతాడు. ప్రేమ లేనప్పుడు వ్యక్తి ఒక వస్తువు స్థాయికి దిగిపోతాడు. కేవలం ఒక ఉపయోగం అవుతాడు. ప్రేమ లేకుండా ఒక వ్యక్తిని చూసి వారి నుంచి నేనేమి పొందగలనని అనుకున్నప్పుడు, మీరు ఆ వ్యక్తిని ఒక వస్తువు స్థాయికి దింపినవారవుతారు. మీరు ఒక వ్యక్తిని ప్రేమతో చూసినప్పుడు మాత్రమే ఆవ్యక్తి ఆత్మతో ఉన్న మనిషి.

అందుకే మీవైపు ఎవరైనా కోరిక ఉన్న కళ్ళతో చూస్తే మీరు ఇబ్బంది పడతారు. అది అసహ్యం అనిపిస్తుంది. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీ వైపు ఎవరైనా ప్రేమతో చూస్తే మీరు నిరంతరం ఆ వ్యక్తి సమక్షంలో ఉండాలి అని అనుకుంటారు.

బ్రహ్మచర్యం

బహ్మచర్యం అంటే మీలో అణచబడిన సగభాగం కోసం బయట వెతకకుండా ఉండటమే. మీరు పురుషుడైతే మీలో అణచివేయబడిన భాగాన్ని మీ నుంచే పొందగలిగి ఉండి ఆ భాగం లేదు అన్న భావం మీలో లేకుండా ఉండగలగటమే బ్రహ్నచర్యం. మీకు మీరు చాలు. పరిపూర్ణతకి మీరు బయట చూడనవసరం లేదు.

ఒకసారి మీరు ఈ స్థితిని సాధించగలిగితే బయటి ప్రపంచంలో స్త్రీ లేదా పురుషుడు లేకుందా ఉండగలరు. అది సాధించకపోతే మీకు వివాహం అయినా మీరు హార్మోన్ల చిత్రహింసకి గురి అవుతూ ఉంటారు. హార్మోన్ల చిత్రహింస అంటే మీరు పొగొట్టుకున్న భాగాన్ని పొంది సంపూర్ణత సాధించాలి అనే తపన మాత్రమే. నిజానికి దీన్ని మీ నుంచి మాత్రమే మీరు పొందవలసి ఉంది.

ఎప్పుడెతే ఇటువంటి పరిపూర్ణతని సాధిస్తారో మీరు వివాహం చేసుకున్నా లేకపోయినా ప్రశాంతమైన మనస్సుతో ఉండగలుగుతారు. అప్పుడు మీరు వివాహం చేసుకున్నా బహ్మచారిగా ఉండగలరు. అది నిజమైన బ్రహ్మచర్యం.

ధ్యాన పద్ధతులు

వసువుకి అతీతంగా దృక్పథం వైపు శి వస్ువుని మార్చటం ఎప్పుడూ సమస్యకి పరిష్కారం కాదు. మీ దృక్పథాన్ని మార్చటమే పరిష్కారం. మీరు దేనికి బంధాన్ని కలిగి ఉన్నారో ఆ వస్తువుల లిస్తు రాయండి. దేని పట్ల అత్వాశ ఉందో అవి కూడా రాయండి. అవి అలవాటు కాని, ఒకరకమైన సంతోషం, మనుషులు,వసువులు ఏదైనా సరే సొంతం అనుకున్న వారి పేర్తు, ఆశలు కోరికలు కూడా రాయండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని వాటి మీద లోతైన పవిత్రతా భావంతో గౌరవం చూపండి.

మోహంతో మనిషిని వస్తువుగా మారుస్తారు. ఎందుకంటే ఆ మనిషిని సొంతంచేసుకోవాలి అనుకుంటారు. మీరు ప్రేమ, గౌరవంతో వసువుని కూడా ఒక ప్రేమ నిండిన దానిలా చూడవచ్చు. ఎప్పుడెతే పవిత్రతని కలుపుతారో, కామం ప్రేమగా మారుతుంది. వస్తువులని, మనుషులని ఆత్మస్తాయికి తీసుకువెళ్ళండి. అకస్మాత్తుగా కామం ప్రేమగా మారటాన్ని చూడగలుగుతారు. మీ ఆలోచనలు కరుణగా మారతాయి. అప్పుడు నిజమైన ప్రేమని, అనుభవించగలుగుతారు.

దుఃఖహరణ ధ్యానం (సమయం 30నిముషాలు) : ఈ ధ్యానం మీలో అణచివేయబడిన భావాలని పెకి తెస్తుంది. శ్వాస మన మనస్సుకి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. మీఆలోచన నెమ్మదిగా ఉన్నప్పుడు శ్యాస విరామంగా ఉంటుంది. మీరు పోరాడే విధమైన ఆలోచనలతో ఉంటే శ్వాస కూడా అదే విధంగా ఉంటుంది.

ఈ ధ్యానం ఖాళీకదుపుతో చేయాలి. దీనిని 21 రోజులు చేసినట్లయితే మీలో చక్కని మార్చు వస్తుంది. మీ ముఖంలోనికి, శరీరంలోనికి ప్రకాశం వస్తుంది. ఇది మానసికస్నానం లాంటిది. మీఅంతరంగంలో అందమైన నిశ్శబ్దాన్ని అనుభవించ గలుగుతారు.

  • స్టెప్ 1 : 10 నిముషాలు నిలబడి కక్బు మూసుకోండి. మీరు లోతైన శాస తీసుకోవడం ద్వారా మానసిక వ్యవస్థ చైతన్యమవుతుంది. శరీర కణాలకి ఎక్కువ శక్తి వస్తుంది. ఈజీవశక్తి మీలో అణచివేయబడిన భావా వేశాలని కరిగించివేసూ లోతుగా, ఒక పద్ధతి లేకుండా శ్వాస తీసుకోండి. ఎప్పుదూ ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి. పెదాలు మూసి ఉంచాలి. మీ చేతులు పైకి కిందికి అంటూ, మోకాళ్ళ దగ్రర వంచి వంగుతూ లేసూ, పక్రి ఎగురుతున్న విధంగా చేయాలి. దానికి తగినట్లు శ్యాస తీసుకోండి. సున్నితంగా చేయండి. పై కి లే సూతా శ్యాస లో పలికి తీసుకోండి. కిందికి వంగేటప్పుడు శ్వాస వదలండి. మీకు గుండెకు సంబంధించిన సమస్యలు ఉంటే ఎంతవరకూ చేయగలరో అంతే చేయండి.

  • సైప్ 2 : 10 నిముషాలు కక్కు మూసుకొని మీ శరీరంలో ప్రతి భాగాన్ని బిగపెట్టి వదలండి. ఒక భాగం తరువాత ఒక భాగం. పాదాలనుంచి ప్రారంభించి, కాళ్ళు, తొడలు, పొట్ట, వీపు, చాతి,మెడ,ముఖం, తల చేసూ వెళ్ళి మీ శరీరాన్ని మొత్తం రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీరు ఖాళీగా, చల్డగా అవుతారు.

  • స్టెప్ 3 : 10 నిముషాలు కూర్చొని కళ్ళు మూసుకొని హూకారం చేయండి. ఇది కేవలం 'హూ'. రిలాక్స్‌గా అంటే చాలు. లోతుగా అవసరం లేదు. మీలోపల బయట ఏమి జరుగుతుందో గమనించండి.

ఈ ధ్యానంలో మొదటి రెండు భాగాలు, మూడవదైన ధ్యానానికి సిద్ధం చేయటం. మీరు మూడవ స్టెప్ దగ్గరకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా ధ్యానంలోనికి వెళతారు. మనస్సు దానంతట అదే నిశ్శబ్దంగా అవుతుంది. నిశ్శబ్ధాన్ని బలవంతంగా తీసుకురాలేం. అదే జరగాలి.

నవ్వు ముఖంతో అనందంతో పూర్తిగా రిలాక్స్ అవ్వండి. ఈ సమయంలో మీకు చాలా అనుభవాలు జరగవచ్చు. కేవలం వాటిని గమనించండి. మీలో వచ్చే ఆలోచనని ఒకదాని తరువాత ఒక దాన్ని కేవలం గమనించండి.

బుంగ్ బుంగ్ బుంగ్

  • తెలుసుకునే తత్యాన్ని లక్ష్యం నుంచి విషయం వెపు మారల్తాలి.
  • మూలాధారం అనేది సూక్ష్మమైన శక్తి కేంద్రం. అది వెన్నెముక చివరి భాగంలో ఉంటుంది. అది అత్తాశ, కామం అనే భావాలకి సంబంధించింది.

అపరాధ భావం అసలైన పాపం

జీవస్ముక్తి అంటే చేతన స్థితి యొక్క మేథస్సుతో జీవించటం. అంతేకాని అపరాధ భావంతో జీవించటం కాదు.

అపరాధ భావం అంటే ఏమిటి?

మీలో కోరిక ఉన్నప్రుందు అపరాధ భావం కూడా ఉంటుంది. కోరిక మరొక రూపం అపరాధ భావం. ఒక్కొక్కసారి కోరకూడనిది కోరుకొని అపరాధ భావంతో ఉంటారు. కొన్నిసార్లు మీ కోరికలు తీరాక, ఆ కోరికలకి నేను తగినవాడిని కాదు అనే భావంతో తప్పుచేసినట్టు భావిస్తారు. మీ కోరికలు తీరకపోయినా అపరాధ భావం కలుగుతుంది. అయ్యో! నేను చేయవలసినంత చేయలేదు అనే భావన. కోరికలు ఏ విధంగానైనా అపరాధ భావాన్ని కలిగిస్తాయి.

అపరాధ భావం అంటే గతంలో మీరు చేసిన నిర్ణయాల్ని, పనుల్ని ఇప్పటి కొత్తజ్ఞానంతో విశ్లేషించటమే. ఉదాహరణకి చిన్నప్రుదు స్కూల్తో మీరు ఏవో చెడ్డమాటలతో మీ స్నేహితుదిని తిట్టారు. దానితో ఆ బంధం తెగిపోయింది. ఇప్పుడు మీకున్న మేధస్సుతో ఆ సంఘటన్ని గుర్తు తెచ్చుకొని మీరు చేసిన పని బాగాలేదని అపరాధ భావంతో ఉంటారు.అలా చేయకూడదు. అప్పుడు మీకు అంతే వివేకం ఉంది, అందుకే ఆ విధంగా ప్రవర్తించారు. ఇప్పందు మీ వివేకంలో పరిణతి ఉన్నది. గతంలో జరిగిన విషయాలని ఇప్పటి జ్ఞానంతో విశ్లేషించకూడదు.

గతం వ్యర్థం

జరిగింది ఏదో జరిగిపోయింది. కావలసింది అయ్యింది. దాన్ని తిరిగి మార్చలేరు. జరిగిన దాన్ని గురు తెచ్చుకొని అపరాధ భావంతో బాధపడితే మీరు వర్తమానాన్ని భవిష్యత్మని కూడా పోగొట్టుకుంటారు. జరిగిన దాన్ని గురించి ఇప్పుడు మనం ఏమీ చేయలేం. కాబట్టి అపరాధ భావం అనవసరం. మీరు ఏం చేయగలరు? మీరు చేయగలిగింది అదే విషయాన్ని మరలా తిరిగి చేయకండి. అప్పటిలో మీకున్న పరిణతితో ఆ విధంగా చేసారు, అంతే.

మన గతం ఎప్పుడూ గతమే అది ఇక లేదు. అందుకే గతం అంటారు. కాని మనం గతించిపోయిన గతం మన మీద ప్రభావం చూపేలా చేసుకుంటాం. అది ఏ విధంగా చేస్తాం? అది రెండు విధాలుగా ఉంటుంది.

    1. మీరు మీ గతంలోని సంఘటల్ని, నిర్ణయాల్ని ఇప్పటి వివేకంతో పోల్చి విశ్లేషిస్తే మీలో అపరాధ భావం ఏర్పడుతుంది.
    1. మీ గతం యొక్క అనుభవాల మీద అధారపడి ఇప్పుడు నిర్ణయాలు చేస్తే మీరు ఆ గతాన్నే తిరిగి చేసి దాన్నే భవిష్యత్మకి బదిలీ చేసారు. ఏదైనా ఉంటే కొద్దిపాటి మార్పులు కలుపుతారు. మీరు అదే తప్పు చేయకపోయినా మీరు ఆ అనుభవంతో అదే స్థితిలో ముందుకి వెళతారు. మన మానసిక వ్యవస్థ ఒక పద్ధతిని తయారు చేసుకొని అందులోనే

ఉండటానికి చూస్తుంటుంది. మనని అదే విధంగా చేయమంటుంది. అందుకే మనం చేసిన తప్పులనే చేస్తుంటాం.

మూడు రకాల అపరాధ భావాలు

మనలో మూడు రకాల అపరాధ భావాలు నాటుకొని మన వివేకాన్ని నాశనం చేస్తాయి.

    1. కుటుంబ సభ్యులు మనలో నింపే అపరాధ భావం.
  • సమాజపు న్యాయసూత్రాలు మనలోనికి పంపించే అపరాధ భావం. 2.
  • మనకి మనం పెంచే అపరాధ భావం.

కుటుంబ సభ్యులు స్పష్టించే అపరాధ భావం.

ఏడు సంవత్సరాల వయస్సుకి ముందే మీ కుటుంబ సభ్యులు మీలో అపరాధ భావాన్ని ప్రవేశపెడతారు. మీ తల్లితండ్రులు చెప్పిన విధంగా నడచుకోకపోతే మీలో తప్పుచేసిన భావం స్పష్టిస్తారు. భగవంతుడు మిమ్మల్ని మెచ్చుకోడు అంటారు. పాపం! భగవంతుడు ఈ మాటలన్నీ భరించాల్నిందే. లేదా! వారు ఏమి చెబితే దాన్ని గౌరవించాలి అంటారు.వెంటనే మీరు వారిని సంతోష పెట్టలేకపోయినందుకు తప్పుచేసాం అనే భావనలో ఉంటారు. ఈ విధంగా మీ కుటుంబం మీలోపల మొదటి అపరాధ భావ విత్తనాన్ని నాటుతుంది.దాన్ని మీరు మీ పిల్లలకి బదిలీ చేస్తారు. వాళ్ళు వాళ్ళ పిల్లలకి అందిస్తారు. రాజ్యాధికారం తరతరాలకి బదిలీ అయినట్టు బదిలీ చేస్తారు.

మీరు దేనినైనా ఆ విధంగా ఎందుకు చేయాలో వివరించే జ్ఞానంలేదు కాబట్టి దాన్ని ఒక రూల్‌లా మార్చి పిల్లల మీద దాన్ని బలవంతంగా రుద్ధుతారు. దాని ద్వారా వారిలో అపరాధ భావాన్ని పెడతారు. ఉదాహరణకి పిల్లలు గిర్రున తిరుగుతూ ఆడుకుంటారు. వాళ్ళు వాళ్ళ శరీర కదలికలతో సాగుతూఉంటారు. ఇది వారిలో వారు కేంద్రీకృతమయ్యే ఒక సహజ పద్ధతి. కాని మనం ఏమి చేస్తాం. వారిని అలా తిరగనీయం. వారిని అపి, పడిపోతావు. దెబ్బలు తగులుతాయి! అని చెప్పి భయాన్ని స్పష్టిస్తాం. వాక్కు మనలా గట్టిపడిపోయి, డల్‌గా తయారయ్యే వరకూ వారిని వారిలోని చైతన్యాన్ని ఆపటానికే ప్రయత్నిస్తాం.

పిల్లలు బయటకి వెళ్ళి ఎండలో ఆడుకోవాలి అనుకుంటారు, లేదా కొన్ని రాళ్ళు, పూలు పోగుచేసుకుంటారు. అలా స్వచ్ఛమైన గాలిలో ఆడుకుంటాం అంటారు. మీరు దీని గురించి ఆలోచిస్తే ఇది అంత అతిగా ఉండే విషయం కాదు. చాలా మామూలు విషయం. కాని పిల్లలు అలా అడగగానే వద్దు! ఎండలో తిరగకూడదు, జ్వరం వస్తుంది, జలుబు చేస్శుంది, ఇలా కట్టడి చేస్తారు. మీరు కొంచం లోతుగా చూస్తే వద్దు అని చెప్పటంలో సూక్ష్మస్థాయిలో మీ అధికారం, పిల్లలమీద మీ నియం|తణ ఉండాలి అనే తపన కనిపిస్తాయి. బయట ఎండ అనేది కారణం కాదు అంతకంటే సూక్ష్మమెనది మరొకటి ఉంది.

తల్లి వద్దు అన్న మాట పిల్లలమీద చాలా లోతైన ప్రభావాని చూపిస్తుంది. అది పిల్లలలో అపరాధ భావాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు పిల్లలు బలవంతంగా లోపల కూర్చోవాలి లేదా తల్లి కళ్ళుగప్పి బయటకి పారిపోవాలి. రెండువిధాలుగా కూడా ఆబిడ్డలోని సహజశకకి అణచివేయబడుతుంది. పిల్లలు బలవంతంగా ఇంట్లోనే ఉండిపోతే వారిలోని శక్తిని వెల్లడి చేయలేరు. బయటకి వెళితే అపరాధ భావం. అమ్మకి తెలుస్తుందని భయం. ఇదంతా కేవలం దేనికి, ఎండలో ఆడుకోవటానికి.

పిల్లలు పెరిగి పెద్దవారయ్యే కొద్దీ ఈ అపరాధ భావం ఒక లోతైన సంస్కారంలా అతనిలో స్తిరపడిపోతుంది. అబ్బాయి పెద్దవాడయ్యాక స్వతంత్రుడైనా, బయట లాన్‌లో కూర్చున్నా చిన్ననాటి ఆ జ్ఞాపకం అతనిలో ఉంటుంది. అతను కారణం లేకుండా అపరాధ భావంతో అసౌకర్యంగా ఉంటాడు. బయట లాన్‌లో కూర్చుంటే ఏమి తప్పుచేసాం అని బాధపడనవసరం లేదు, కాని పాత జ్ఞాపకాలు అతన్ని అసౌకర్యానికి గురి చేస్తాయి. ఈ విధంగా అపరాధ భావం ఏర్పడుతుంది. ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు అన్నీ ప్రోగుచేయబడి అపరాధ భావం మీ సహజ జీవిత విధానం అవుతుంది.

అపరాధ భావం, సంతోషం

చిన్న పిల్లలులా మనం కూడా సంతోషంగా ఉంటూ సహజంగా ఉండే సంతోషాన్ని ఉత్సాహాన్ని ఎందుకు ప్రోత్సహించ కూడదు?

మీరు కొంచం లోతుగా చూస్తే సంతోషం అపరాధ భావంతో ముడి పడి ఉండటం మీకు తెలుస్తుంది. చిన్న పిల్లలకి అపరాధ భావం అంటే తెలియదు. వారు ఎంతో సహజంగా వారికి ఇష్టం వచ్చిన విధంగా ఉంటారు. అందుకే చిన్న పిల్లల్ని చూడాలి అని పిస్తుంది. చిన్న పిల్లలు ఏమి చేసినా సంపూర్ణంగా ఉంటుంది. అతన్ని సంస్కృతి అనే ముసుగుకి అలవాటు చేయలేదు. సహజంగా ఒక పద్ధతి లేకుండా ఉంటారు. అందుకే అంత శక్తితో ఉంటారు. వారిలో పొంగిపొరలే సంతోషం, కుతూహలం ఉంటాయి. వాళ్ళు తమలో ఉప్పొంగే శక్తిని వెదజల్లుతూ ఉంటారు.

పిల్లలు అన్నీ అంతా సంతోషంగా అనుభవించాలి అనుకుంటారు, కాని తల్లితండులు సమాజపు నిబంధనలు అపరాధ భావం, గంభీరత్వం ఇటువంటి వాటితో నిండిపోయి ఉంటారు. పిల్లలకి అరవాలని, గెంతాలని, నాట్యం చేయాలని ఉంటుంది. అది వారి సహజ స్థితి. కాని పెద్దవాళ్ళు వారిని ఆపేస్తారు. అరవద్దు అది మర్యాద కాదు అంటారు. సంస్కారంతో ఉండాలి అంటారు. మీరు మా లాగా ఉండాలి అంటారు. దాంతో క్రమంగా సంతోషం, స్వేచ్ఛ అనగానే అపరాధ భావంతోనే ఉంటారు.

సమాజం సృష్టించే అపరాధ భావం

ఏడు సంవత్సరాల వయస్సు నుంచి పద్నాలుగు వరకూ సమాజం రూల్స్ పేరు మీద మీలో అపరాధ భావాన్ని సృష్టిస్తుంది. భయంతో ఉండే అపరాధ భావం సమాజపు న్యాయసూతాల మీద సృష్టించబడుతుంది. పద్చాలుగు సంవత్సరాలు వచ్చే వరకూ కుటుంబం, సమాజం మీలో అపరాధ భావాన్ని నింపుతుంది. ఇందులో ముఖ్యమైనది సెక్స్ పట్ల తప్రుచేసామనే భావన. తల్లితం|దులు కాని కుటుంబ సభ్యులు కాని సెక్స్ విషయంలో నోరు విప్పి ఏమీ చెప్పరు. మీలో కొన్ని రసాయన మార్చులు జరిగే సమయంలో మీ శరీరం మీకు కొత్తగా ఉంటుంది. మీలో చాలా ప్రశ్నలు వస్తాయి. వాటిని స్పష్టం చేయాలి. కాని దానికి ఎవరూ ముందుకి రారు.

ఆ సున్నితమైన మార్చుచెందే వయస్సులో మీడియా ఊహలతో, కల్పనలతో మీ ముందుకి వస్తుంది. అది మీ కోరికలని, అయోమయాన్ని మరింతగా పెంచుతుంది. దీనికి తోడు సమాజం 'నీకు నీవు చాలవు,' అని చెప్పి మీరు ఏమిటో ఏమి చేస్తున్నారో అది తక్కువ అన్న భావాన్ని మీలో కల్పిస్తుంది. ఒక్కసారి మీరు పాపాత్ములు అని ఒప్పించబడ్డారనుకోండి, మీరు సమాజం గుప్పిట్లో చిక్కినట్టే. ఇక మీరు జీవితానుభవాన్ని ఏమాత్రం సంతోషంగా పొందలేరు. నా దృష్టిలో అపరాధ భావం అన్నిటికంటే పెద్ద పాపం. మిగతా పాపాలు కనీసం మీరు మరణించాక మిమ్మల్ని శిక్షిస్తాయి. ఇది మాత్రం మీరు జీవించి ఉండగానే శిక్షిస్తుంది.

టిబేటియన్ కవి మిలారేపా (యోగి మార్చా అనే టిబెట్ గురువుకి శిష్యుడు) ఈ విధంగా పాడేవాడు, జన్మించటం మరణించటం అనే వాటి గురించి బాధ పడనిదే నా మతం అని. మిమ్మల్ని పాపాత్ములా పుణ్యాత్ములా అని చెప్పేది కేవలం సమాజం మాత్రమే. సమాజం మిమ్మల్ని పుణ్యాత్ముదు అంటున్నంత వరకూ మీరు పుణ్యాత్ములే. సమాజం మిమ్మల్ని పాపాత్ముడు అనగానే మీరు పాపాత్ములే. మీరు ఎవరినైనా చంపితే మిమ్మల్ని హంతకులు అంటారు, మీకు శిక్రలు విధిస్తారు. అదే మీరు యుద్ధంలో ఎవరినైనా చంపితే మిమ్మల్ని హీరో అంటారు మీకు అవార్డులు బహుమతులు ఇస్తారు. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనే వాటికి కచ్చితమైన స్కేలు లేదు. ఇదంతా సమాజపు తర్కం.

దోపిడీకి (బాధించటానికి) పద్దతి

ఎవరైతే మీలో అపరాధ భావం నింపటానికి రూల్స్ విధిస్తారో వారంతా వారి జీవితాలలో వాటి వెనుకనే దాగి ఉంటారు. వాళ్ళు పెట్టిన రూల్స్‌కి వారు విరుద్ధంగా ఉంటారు. వాళ్ళు రూల్స్ ఎందుకు పెడతారంటే అపరాధ భావం మీలో నింపి దానిద్వారా మిమ్మల్ని తాము కోరుకున్న విధంగా ఆడించటానికి. ఒక్కసారి మీలో అపరాధ భావాన్ని నింపితే మీరు చాలా సులభంగా సమాజానికి బానిస అవుతారు. అందుకే సమాజం ముందుగా మీలో అపరాధ భావాన్ని పెడుతుంది.

అపరాధ భావం ఉన్న వ్యక్తి ఎప్పటికీ తనతో తాను సౌకర్యంగా ఉండలేదు. అతనికి అతని మీద నమ్మకం ఉండదు. తనకి దారి చూపే వారికోసం వెతుకుతూ ఉంటాడు. ఇక సమాజం మీ జీవితంలోనికి ప్రవేశించి తన ఇష్టప్రకారం మిమ్మల్ని ఆడిస్తుంది. సమాజం నిరంతరం అపరాధ భావం మీద పని చేస్తుంది. మీరు ఆ భావాన్ని పెంచుకునే కొద్దీ సమాజం బలంగా తయారవుతుంది. ముందుగా మీలో అపరాధ భావాన్ని ప్రవేశ పెట్టి దానిలోంచి ఎలా బయటకి రావాలో దారులు చూపిస్తుంది. ముందు మీకు అనారోగ్యాన్ని కలిగించి తరువాత మందులు అమ్ముతుంది సమాజం. మరొక విషయం, ఎవరైతే బోధనలని పాటించరో వాళ్ళే నిరంతరం బోధిస్తూ ఉంటారు. వాక్బు చాలా చాలా మాటలు చెబుతుంటారు. మీలోపల మాటలు ఉప్పొంగుతున్నాయనుకోండి, వాటిని మీరు ఆచరించలేరనుకోండి, అప్పుడు మీరు ఎవరో ఒకరిని పట్టుకొని అవే మాటలు బోధిస్తారు. ఇలా చేయటం అపరాధ భావం నుంచి తప్పించుకోవటమే. ఎదుటి వారిలో అపరాధ భావం కలిగిస్తారు. కాని మీరు అపరాధ భావం తెచ్చుకోరు. ఇదంతా ఒక గొలుసులా ఒకరి తరువాత ఒకరికి అంటుతుంది.

ఒక చిన్న కథ : ఒకసారి నలుగురు సాధువులు దీపం దగ్గర కూర్చోని ఆ దీపాన్ని చూస్తూ ధ్యానం చేయాలని, పూర్తి నిశ్శబ్దంలో ఐదు రోజుల పాటు దీప శిఖని చూస్తూ ధ్యానం చేయాలని నిర్ణయించుకుంటారు. మొదటి రోజు చివరలో దీపం రెపరెపలాడుతుంది. ఒక సాధువు వెంటనే, 'అయ్యా! దీపం అరిపోతుంది.' అంటాడు. రెండవ సాధువు, 'మనం మాట్లాడకూడదు. గుర్తుంచుకో అంటాడు. మూడవ సాధువు! మీరిద్దరూ ఎందుకు మాటాదుతున్నారు' అంటాడు. చివరిగా నాలుగవ సాధువు వాళ్ళ వైపు గుర్రుగా చూస్తూ 'నే నొక్కడినే మాట్లాడలేదు. ' అంటాడు.

ఎదుటి వారిలో తప్పులు చూపించేటప్పుడు మనం అదేతప్ప చేస్తున్నట్లు తెలుసుకోం. మనలోపలకి జాగ్రత్తగా గమనిస్తే చాలా సందర్భాలలో ఎదుటివారి తప్పులు దిద్దుతూ మనం అవే తప్పులు చేస్తూ ఆ అపరాధ భావంతో ఉంటాం. కాకపోతే వారికంటే పెద్ద స్థితిలో ఉండి దీనినుంచి తప్పించుకుంటాం.

సందిగ్గావస్థ

అపరాధ భావం అంటే ఎదుటివాళ్ళు వద్దు అన్న పనిని మీరు చేయటం. మీరు సమాజం మాట వినకుండా మీ సహజమైన వివేకం మాట విన్నప్పుడు మీకు తప్పుచేసిన భావన కలుగుతుంది. మీరు భయపడి మిమ్మల్ని మీరు సవరించుకోవటం మొదలు పెడతారు. అసలు మీరు అది చేయలేదు అని కూడా దబాయిస్తారు. మీరు నిరంతరం ఒత్తిడిలో ఉంటారు. కానీ ఎదుటి వారు చెప్పినట్లు నడచుకుంటే మీకు సంతోషం కలుగదు. ఎందుకంటే మీకు సహజంగా అలా చేయటం ఇష్టం ఉండదు. కాబట్టి మీరు ఈ అయోమయంలో చిక్కుకుని ఉంటారు.

అపరాధ భావం మిమ్మల్ని ఇద్దరు మనుషులుగా విడగొడుతుంది. మీ లోపల మీరు చూసే మీరు అనే వ్యక్తి, బయట ప్రపంచం చూసే వ్యక్తి. అపరాధ భావం అనే చీలిక మీరు రెండు రకాల ప్రమాణాలు గల వ్యక్తిగా చేస్తుంది.

స్వర్గం నరకం

చాలా సూక్ష్మంగా అపరాధ భావాన్ని మీలోపల పెట్టే మరొక పద్ధతి మీలోపల స్వర్గం నరకం అనే విషయాలని నాటటం. ఎదుటివారు మీలోని భయాన్ని ఆశని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని స్వర్గం నరకం అంటూ ఆడిస్తారు. మీలో స్వర్గం అనే ఆశని, నరకం అనే భయాన్ని కలిగిస్తారు. వాళ్ళు స్వర్గం నరకం అనే దాని మీద చాలా విషయాలని తయారుచేసి వాటిని మీకు అమ్ముతారు. మీతో వాక్కు, 'నీవు ఈ విధంగా ఇవన్నీ చేస్తే స్వర్గానికి వెళతావు లేదా నరకానికి వెళతావు' అని చెబుతారు. ఎప్పుడైతే ఆశ, భయం ఆధారంగా మీకు రూల్స్ పెడితే మీ అంతరంగం లోతులలో అప్రయత్నంగానే అపరాధ భావం అనేది ఏర్పడుతుంది.

ఒక చిన్న కథ : ఒకసారి ఒక మిలటరీ ఆఫీసరు ఒక జెన్ బౌద్ధ గురువుని స్వర్గం నరకం అంటే ఏమిటి అని అడుగుతాడు. ఆ గురువుగారు, 'నీవు జీవించటానికి ఏమి చేస్తావు?' అని అడుగుతాడు. నేను మిలటరీ జనరల్‌ని అని జవాబు ఇస్తాడు.

గురువుగారు నవ్వి 'ఏ మూర్ఖుడు నిన్ను జనరల్ అన్నాడు. నీవు చూడటానికి మాంసం అమ్ముకునే కసాయివాడిలా ఉన్నావు. ' అంటాడు. జనరల్‌కి చాలా కోపం వస్తుంది. తన చేతిలోనికి కత్తి తీసుకొని, గట్టిగా అరుస్తూ 'నిన్ను ముక్కలుగా నరుకుతాను' అని గురువుగారి మీద దాడి చేయబోతాడు.

గురువుగారు చేయి ఎత్తి ఆపి, 'ఇదే నరకానికి ద్వారం' అంటాడు. జనరల్ అర్థం చేసుకొని గురువుగారి పాదాల మీద పడి క్షమించమని అడుగుతాడు. అప్పుడు గురువుగారు, 'ఇదే స్వర్గానికి ద్వారం' అంటాడు.

స్పష్టంగా తెలుసుకోండి. స్వర్గం నరకం అనేవి మీరు ఊహించినట్లు భౌతికంగా ఉండే రెండు స్థలాలు కావు. అవి మీ మానసిక స్థితి మాత్రమే. ఒక్క నిముషం మనస్సు స్వర్ణంలో ఉంటుంది, మరునిముషం నరకంలో ఉంటుంది. స్వర్గ ద్వారాలు నరక ద్వారాలు ఒకదాని తరువాత ఒకటి నిరంతరం తెరువబడుతూనే ఉంటాయి.

మీ అంతట మీరే ఏర్పరచుకున్న అపరాధ భావం

మీకు ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు వచ్చే వరకూ కుటుంబం, సమాజం మీలోపల అపరాధ భావాన్ని పెడుతుంది. ఇరవై ఒక్క సంవత్సరాలకి ఆ భావం లోతుగా మీలో నాటుకుపోతుంది. ఆ తరువాత ఏ కారణం లేకుండా మీ అంతట మీరు మీ లోపల అపరాధ భావాన్ని ఏర్పరుచుకుంటారు. మీ అంతరంగంలో అపరాధ భావం శాశ్వత అతిథి అవుతుంది.

కుటుంబం సమాజం సృష్టించిన అపరాధ భావం మీ మీద బలవంతంగా రుద్దబడిన భావం. అది ఒక తరం నుంచి మరొక తరానికి బదీలీ అవుతూ ఉంటుంది. మూడవది ఇంకా భయంకరమైంది. అది మీకు మీరు సృష్టించుకున్న అపరాధ భావం. అత్యాశ, భయం ఆధారంగా మీరు సృష్టించుకున్న భావం మరొక రకమైన అపరాధ భావం.

ఎప్పుడైతే మీరు అపరాధ భావంతో ఉంటారో మిమ్మల్ని ఆడించటం సులభం. ముఖ్యంగా మీతో మీరు పోరాడుతున్నపుడు అది మరీ సులభం. మీరు ఒక్కసారి మీ జీవితంలోనికి చూసుకుంటే మీకు స్పష్టంగా తెలుస్తుంది, ఏ విధంగా ప్రతి నిముషం మీతో మీరు పోరాడుతుంటారో, మీతో మీరు ఎంత అసంతృప్తిగా ఉంటారో. పోరాటం లేకుండా ఉండలేరు. మీకు మీరు బాధలని కలుగ చేసుకుంటారు. మీకు ఇదే నేర్పించారు, సంతోషంగా ఉండటం పాపం అని చెప్పారు.

ప్రవహించే నదివంటి మనస్సును అడ్డుకునే రాళ్ళు అపరాధ భావాలు – అవే మీ జ్ఞాన ప్రవాహానికి ఆనకట్టలు కూడా

మీరు నదిలా స్వేచ్ఛగా ప్రవహించటానికి తయారు చేయబడ్డారు. అపరాధ భావం ఆ నీటి ప్రవాహానికి అడ్డుపడే రాళ్ళు. సమాజం చాలా సూక్ష్మంగా సంతోషం, పాపం అని నేర్పించింది. అదీ సమస్య. మీరు గమనిస్తే ఎప్పుడైతే మీ జీవితం ప్రశాంతంగా సంతోషంగా జరిగిపోతుంటే మీలోపల ఏదో అపరాధ భావం గుచ్చుకుంటూ ఉంటుంది. సంతోషంగా ఉత్సాహంగా ఉండటం అంటే బాధ్యత లేకపోవటం అని మీకు సమాజం నేర్పించింది. అందుకే మీలో అపరాధ భావం.

మీరు విచారంగా బాధగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అపరాధ భావంతో ఉన్నారా? లేదు. మీకు ఏమని నేర్పించుతారంటే జీవితం అంటే కష్టాల గొలుసు. సంతోషం అనేది అప్పుడప్పుడు మీ జీవితంలోనికి వస్తుంది. అందుకే మీరు నిరంతరం నవ్వుతూ సంతోషంగా ఉంటే మీ చుట్టూ ఉన్నవారు ఒప్పుకోరు. వాళ్ళంతా ప్రయత్నించి మిమ్మల్ని సాధారణ స్థితికి తీసుకురావటానికి, అంటే అపరాధ భావంతో ఉండే విధంగా కృషి చేస్తారు. మీరు బీచ్‌లో గాని ఎక్కడైనా సంతోషంగా గెంతుతూ, ఆడుతూ విరామంగా ఉన్నారనుకోండి. అకస్మాత్‌గా మీ లోపలకి అపరాధ భావం ప్రవేశిస్తుంది. అయ్యో! ఆఫీసులో అంతపని పెండింగ్ ఉన్నది, చాలా బాధ్యతలు ఉన్నాయి, నేనేమిటి ఇలా అని. అపరాధ భావానికి అసలు సపోర్ట్ అనేది లేదు. కాని అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మీరు అపరాధ భావం లేకుండా జీవించగలిగితే, మీరు జీవితంలో ప్రతి క్షణం సంతోషంగా గడపగలరు. అదే సమయంలో మీ బాధ్యతలని చక్కగా నిర్వర్తించగలరు. కాని సమస్య ఏమిటంటే మీ అంతరాత్మ చాలామంది గొంతులతో నిండిపోయి ఉంది. అవి మీ అమ్మగారు చెప్పే మాటలు, నాన్నగారివి, టీచర్స్ చెప్పినవి, మీ పక్కింటి

వాళ్ళవి ఈ విధంగా అందరి గొంతులు అక్కడే వున్నాయి. అక్కడ కేవలం ఒకరు చెప్పిన మాటలే ఉంటే అసలు సమస్య లేదు. అప్పుడు మీ మనస్సు నదిలా స్వచ్ఛగా ప్రవహిస్తుంది. కాని అక్కడ చాలామంది చాలా విషయాలు చెప్పి చాలా రాళ్ళు అనే అపరాధ భావాన్ని మీ ప్రవాహానికి అడ్డంగా వేసారు.

మీరు నదిలా ప్రవహిస్తున్నంతకాలం మీరు అత్యద్భుతమైన మేధస్సుని చూపించ గలుగుతారు. మీరు ప్రతి క్షణం పొంగి పొరలే శక్తితో ఉంటారు. ఎప్పుడైతే అపరాధ భావం మీలోనికి వస్తుందో, ఆ స్వేచ్ఛా వాహినిని ఆపినవారవుతారు. మీ అంతరంగంలో చాలా అడ్డంకులు ఏర్పడతాయి.

నీకు నీవు ఉన్నత స్థితికి వెళ్ళాలి

ఎప్పుడైతే మీరు అపరాధ భావంతో ముందుకు వెళుతున్నట్లు తెలుసుకుంటారో మీరు దానిలోంచి బయటకి రావటానికి చూస్తారు. మీరు దేనినైనా సహజంగా సాధన చేస్తుంటే మీరు తిరిగి జారిపడుతుంటారు. మీరు అపరాధ భావంతో సాధన చేస్తే మీరు తిరిగి ఆశ, భయం అనే పాత వాటిలో పడతారు, అప్పుడు అకస్మాత్తుగా 'అరే! నేను భయం నుంచి బయటకి రావాలి అనుకుంటున్నాను.' 'నేను ఆశ నుంచి రావటానికి పని చేస్తున్నాను,' అని హెచ్చరించుకుంటారు. మళ్ళీ కొత్తగా మొదలు పెడతారు. మీరు పని చేయటం ప్రారంభించగానే సహజంగా ఇలాంటివన్నీ జరుగుతుంటాయి.

ఒక చిన్న కథ : ఆశ్రమం నుంచి ఒక సాధువుని ఒక మారుమూల గిరిజన ప్రాంతానికి సేవచేయటానికి పంపిసారు. అకస్తాత్తుగా ఆ సాధువు మీద చాలా ఫిర్యాదులు మొదలవుతాయి. ఆ ఫిర్యాదుల ఉత్తరాలు చదివి అధ్యక్షుడు, 'అక్కడికి సరైన వ్యక్తినే పంపిస్తాం.' అని అంటాడు. సెక్రటరీ ఆయనతో, 'ఇదేమిటి సార్‌? అతని గురించి అన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. మీరేమో సరియైన వ్యక్తినే పంపిస్తాం అంటున్నారు?' అని అడుగుతాడు.

'ఫిర్యాదులు వస్తున్నాయి అంటే అర్థం అతను పని చేయటం మొదలు పెట్టాడు అని' అని అధ్యక్షుడు జవాబు ఇస్తాడు.

మీరు ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించారనుకోండి, మూడు విషయాలు జరుగుతాయి. ముందుగా దానికి అడ్డు పడటం, దాని నుంచి తొలగిపోవటం, ఆ తరువాత దాన్ని ప్రజలు ఆపరు, పట్టించుకోరు, ఇక మూడవది దాన్ని ఒప్పుకోవటం.

అదే విధంగా మీ అంతరంగంలో మీరు ఏదైనా ఒక దాన్ని ప్రారంభించారనుకోండి, మీరు అభివృద్ధి చెందుతారు కాని ఈ మూడు విషయాలు మీలో జరుగుతాయి. ముందుగా ఆ విషయాన్ని అడ్డుకుంటారు. కొత్త సాధన వలన మీ జీవన సరళిలో మార్పు తీసుకురావాలి. దీని తరువాత అవకాశాలని, మీరు మారగల అవకాశాలని వదులుకోవటం చేస్తారు. తిరిగి తిరిగి మీ పాత పద్ధతిలోనికి వెళ్ళిపోతుంటారు. మీ వ్యవస్థ దీన్ని అడ్డుకుంటూ ఉంటుంది. అప్పుడు మీరు అన్ని రకాల సమస్యలని సృష్టిస్తారు. దాన్ని ఆపటానికి అన్ని రకాల వాదనలని తీసుకువస్తారు. ఆ అడ్డుకునే దృక్పథాన్ని ఆవిధంగా వదిలివేస్తే మీకు మీరు ఒక శత్రువుగా మారతారు.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈవిధంగా చెబుతాడు! నిన్ను నీవు ఉన్నత స్థితికి చేర్చుకో అని. డిప్రెషన్‌లోనికి వెళ్ళవద్దు. అపరాధ భావం వద్దు. ఇది నేను చేయలేను అని అనుకోవద్దు.

బుద్ధుని జీవితం చదివితే ఆయన శరీరాన్ని వదిలే సమయంలో ఆయన శిష్యులు చివరి సందేశం ఇవ్వమన్నప్పుడు 'ఆత్మ దీపో భవ' అంటాడు. నీకు నీవే దీపానివి కావాలి. నీకు నీవే మార్గదర్శివి కావాలి అని అర్ధం.

అపరాధ భావం అహంకారం మరో రూపం

అపరాధ భావం అహంకారం నీడ.

ఉదాహరణకి : ఎవరో ఏదో అంటారు, మీకు కోపం వస్తుంది. ఇక్కడ మీరు అంటే మీ అహంకారం. అదే కోపానికి కారణం. ఆ తరువాత కోపం తెచ్చుకున్నందుకు బాధ పడతారు. ఇప్పుడు కూడా ఆ అహంకారమే మీలో అపరాధ భావాన్ని కలిగిస్తుంది. అది మీకు ఈ విధంగా చేయకుండా, మరొక విధంగా చేసి ఉండవలసింది, అనే భావాన్ని కలిగిస్తుంది. ఇదే అయోమయం. అహం అనేది ఈ సమస్యని సృష్టిస్తుంది. అదే అహం అపరాధ భావాన్ని పట్టి ఉంచుతుంది. మీరు అహం ఆడే ఈ ఆటని అర్థం చేసుకుంటే అపరాధ భావాన్ని వదిలివేయ గలుగుతారు. మీరు మీలోనికి అహంకారాన్ని రానీయకుందా కేవలం తెలుసుకునే తత్వాన్ని మాత్రమే రానిస్తే మీరు అనవసరంగా కోపం తెచ్చుకోరు. ఆ తరువాత బాధపడరు. అహంకారం వలన మీరు గుడ్డిగా కోపం తెచ్చుకుంటారు. దానితో మీలో తప్పుచేసాను అనే భావం కలుగుతుంది.

అపరాధ భావం మొదటి దారి

మీరు ఏదైనా తప్పు చేస్తే దాన్ని రెండు విధాలుగా చూస్తారు. తప్పు చేసాను అనే భావం మొదటిది. మీరు ఈ విధంగా అనుకుంటే తిరిగి అదే తప్పు చేస్తారు. ఎందుకంటే మీరు తప్పుని మర్చిపోయి తప్పు చేసాను అనే భావం మీద మీ ఏకాగ్రతని నిలిపితే, మీరు ఎక్కడ ఎందుకు తప్పు చేసారో తెలుసుకుంటారు. తిరిగి ఆ తప్పు ఎలా ఎక్కడ జరిగింది అనే విషయాన్ని ఎప్పటీకీ తెలుసుకోలేరు. అందుకే అదే తప్పుని మరలా మరలా చేస్తారు.

అలవాటు నుంచి బయట పడటం

నన్ను చాలా మంది అడుగుతుంటారు, 'స్వామీజీ! నేను సిగెరెట్ మానేయాలను కుంటున్నాను. ఎలా మానాలో చెప్పండి' అని. నేను వాళ్ళతో, 'ముందు మీలోని తప్పు చేస్తున్నాను అనే భావనని వదిలివేయండి' అని చెబుతాను.

వాళ్ళు నా వైపు ఆశ్చర్యంగా చూసారు. 'స్వామీజీ! నేను అపరాధ భావాన్ని వదిలివేసే ఇంకా ఎక్కువగా సిగెరెట్స్ కాలుస్తాను కదా' అంటారు.

అలా చేయరు! మీరు ఆ భావనని వదిలి వేసినప్పుడు మాత్రమే మీ గతం నుంచి స్వేచ్ఛని పొందగలుగుతారు. అప్పుడే మీ భవిష్యత్తుని మార్చగల శక్తి మీకు వస్తుంది. మీలో అపరాధ భావం ఉన్నంత వరకూ మీ గతాన్ని మాత్రమే భవిష్యత్తుకి తీసుకువెళ్ళగలుగుతారు.

ఒక విషయం అర్ధం చేసుకోండి, మీలో అపరాధ భావం ఉన్నదంటే, ఇక భవిష్యత్తులో నేను మారను అని మీరు నిర్ణయించినట్టే. ఆ విధంగా కాకుండా భవిష్యత్తులో నేను మారగలను అనే నమ్మకం ఉంటే, మీలో అపరాధ భావం ఉండదు. మీలో అపరాధ భావం ఎంత లోతుగా ఉంటే మీరు అంత ఎక్కువగా అదే తప్పుని తిరిగి చేస్తారు.

రామాయణంలో ఒక చక్కని పాత్ర ఉంది, వాలి అని. వాలి గురించి ఏమి చెబుతారంటే యుద్ధంలో అతనికి ఎవరు ఎదురుపడితే వారు తమలో సగం శక్తిని పోగొట్టుకుంటారు. అతని ముందు ఎదురుగా మీరు నిలబడితే మీలోని సగం శక్తి అతనిలోనికి వెళ్ళిపోతుంది.

అదే విధంగా మీరు మీ గతం ముందు నిలబడి పోరాడితే మీలోని సగం బలం అందులోనికి వెళ్ళిపోతుంది. మీలోని అపరాధ భావం మీ సగం బలాన్ని లాగేస్తుంది. దయచేసి అర్ధం చేసుకోండి. మీలోని వ్యతిరేకపు భావాలకి ఉన్న బలం ఒక్కటే ఒక్కటి, అది మీకు దాని మీద ఉన్న నమ్మకం. ఎప్పుడైతే మీరు సిగెరెట్ కాల్చటం మీద పోరాటం చేయాలి అని నిర్ణయించుతారో, మీలో సగం బలం దానికి వెళ్ళిపోతుంది. తీరా పోరాటం మొదలు పెట్టాక అది మీ నీడతోనే అవుతుంది. మీరు ఎప్పటికీ గెలవరు. మీరు గతంతో పోరాడుతున్నంత కాలం మీరు అచేతన స్థితిలో దాన్ని బలంగా తయారు చేస్తారు. దాన్ని భవిష్యత్‌లోనికి కూడా పొడిగించుకుంటారు. ఎప్పుడైతే మీలో అపరాధ భావం ఎక్కువగా ఉంటుందో మీరు అదే తప్పు ఎక్కువసార్లు చేస్తారు. అపరాధ భావంతో మీరు తప్పులోంచి బయటకి రాలేరు.

రెండవ పద్ధతి – దానిలోంచి చూడటం

అపరాధ భావంతో ఉండటం అంటే పాపంలో ఉండటమే. నిజానికి అది ఒక్కటే పాపం. నరకం అంటే అదెక్కడో లేదు. మీరు అపరాధ భావంతో ఉన్నప్పుడు నరకంలో ఉంటారు.

స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు అనుకునే అపరాధ భావం బాధ. ఇవన్నీ మీ ఊహలలో తయారయ్యే మీ మెదడులో ఉన్న గొలుసులు మాత్రమే. మీరు పది సంవత్సరాల క్రితం చేసిన తప్పు ఐదు సంవత్సరాల క్రితం తప్ప అన్నీ దేనికవే విడి సంఘటనలు మీరు వాటిని ఒక దానితో ఒకటి ఒక గొలుసులా కలిపి వాటి గురించి ఆలోచించటం మొదలుపెడతారు. సహజంగానే మీరు అపరాధ భావంతో ఉంటారు. ఇక నిరంతరం పాపాత్ముడనే అని అనుకోవటం మొదలు పెడతారు. ఇది ఒక పద్ధతి.

ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఎందుకు చేసాను అని దానిలోనికి చూడండి. దాన్ని ఎలా చేసారో చూడండి. ఒక పరిశీలకుడిగా ఎందుకు ఎలా అది జరిగిందో గమనించండి. అపరాధ భావం అనే దానిలోనికి శాస్తీయంగా చూడండి. ఈ తెలుసుకోవటం అనేది మీకు కొత్త ద్వారాలని తెరుస్తుంది, అదే తప్పుని మరలా చేయరు. ఎందుకంటే ఒక్కసారి దానిలోనికి చూసాక కారణం తెలుసుకోగానే అది మాయం అవుతుంది. ఎప్పుడైతే దానిలోనికి లోతుగా చూసారో అది మీ నుంచి మాయం అవుతుంది.

నైతిక విలువలు – పూర్ణత్వం

నీతి అనేది పూర్ణత్వంతో ( ఏకీకృతంతో) జరగాలి కాని అపరాధ భావంతో ఏర్పడకూడదు.

పూర్ణత్వం అంటే ఏమిటి? పూర్ణత్వం అంటే ఈ క్షణంలో పూర్తి వర్తమానంలో ఉండటమే. మీ ఉనికి దృఢంగా ఒకే ఒక తత్వంతో ఉండాలి కాని విడిపోయి ఉండకూడదు. నిజానికి మనస్సు ఆడే ఆటతో కాకుండా నిజంలానే చూడాలి. ఒక్కసారి మనస్సు ప్రవేశించింది అంటే మనం భాగాలుగా (అభిన్నత్వం) విడిపోతాం. మీరు అత్యంత శ్రద్ధతో వర్తమానాన్ని తెలుసుకుంటూ ఈ క్షణంలో ఉండగలిగితే మీరు ఒక్కరుగానే పూర్ణత్వంతో ఉండగలరు కాని రెండు లేదా మూడు వ్యక్తిత్వాలతో ఉండరు. ఎప్పుడైతే మీ మనస్సు గతానికి భవిష్యత్‌కి మధ్య తిరుగుతూ ఉంటుందో మీలో భిన్నత్వం వస్తుంది. మనస్సు వర్తమానంలో స్థిరపడితే మీరు ఆటోమాటిక్‌గా పూర్ణత్వంలో (ఒక్కరుగానే) ఉంటారు.

ఒక చిన్న కథ : ఒక ప్రీస్ట్ దేవుడి ముందు మోకాళ్ళ మీద కూర్చొని గట్టిగా అరుస్తూ ఓ! భగవంతుడా నేను పాపిని నా మీద దయచూపు అని ప్రార్థిస్తుంటాడు. ఆ పక్కనే మౌనంగా ప్రార్ధన చేసుకుంటున్న వ్యక్తికి ఉత్సాహం వచ్చి అతను కూడా ప్రీస్ట్ ప్రక్కన కూర్చొని గట్టిగా, 'ఓ! భగవంతుడా నేను పాపిని. నా మీద దయచూపించు,' అని గట్టిగా ప్రార్థిస్తుంటాడు. మరొక వ్యక్తి కూడా వచ్చి అరవటం మొదలు పెడతాడు. అప్పుడు ప్రీస్ట్ మొదటి వ్యక్తితో ఆ రెండవ వ్యక్తిని చూపిస్తూ చూడు అతన్ని చూసి ఎవరు పాపి అనుకుంటారు,' అని అంటాడు.

మనం చూపించే వినయం, నీతి నియమాలు అన్నీ కూడా ఎదుటి వారికి చూపించటానికి, మనకి మనం చూపుకోవటానికి మాత్రమే. అలా ఎందుకు మనం నటిస్తాం అంటే మనలో భిన్నత్వం ఉన్నందు వలన మనలో దృఢమైన ఏకత్వం లేనందువలన. మనలో మనం ఉండం. మనకే అందులో ఏది మన నిజమైన వ్యక్తిత్వం అనేది మనకి తెలియదు. అందుకే మనం అటువంటి ఆటలలో చిక్కుకుపోతాం. మనం ఏకత్వంతో ఉండగలిగితే మనం చేసే ప్రతి పనీ అసలైనదిగా ఉండి మనలో నైతికత్వం ఆటోమాటిక్‌గా ఉంటుంది.

తెలుసుకోండి, అప్రయత్నంగా సరిగా ఉండండి

మీరు లోతైన తెలుసుకునే తత్వంతో ఉంటే ఏ పనిచేసేటప్పుడైనా తప్పులు చేయరు. మీరు తెలుసుకునే తత్వంతో ఉన్నప్పుడు మీరు దృఢమైన ఏకతత్వంతో ఉంటారు, నీతితో ఉంటారు. ఆ విధంగా కాకపోతే మీలో చాలా వ్యక్తిత్వాలు వస్తాయి. అప్పుడు అవినీతి కూడా ప్రవేశిస్తుంది. నీతి అనేది తెలుసుకునే తత్వానికి సంబంధించింది. అంతేకాని సమాజపు సూత్రాలు కాదు. సహజంగా నీతితో ఉండాలి అంటే తెలుసుకునే తత్వంతో ఉండాలి.

తెలుసుకునే తత్వం మీరు సరియైన సమయంలో అప్రయత్నంగా సరియైన నిర్ణయం చేసేలా చేస్తుంది. నీతి నియమాలు అనేవి సరియైన పరిస్థితిలో తప్పు పని చేసే విధంగా చేస్తుంది. ఎందుకంటే దానికి సరియైన ఆధారం లేదు కాబట్టి. దాని ఆధారం మీద అనుబంధాన్ని పెట్టుకోలేరు. ఎప్పుడైతే సంబంధం లేదో మీరు నమ్మకంతో పని చేయలేరు. మీరు ఒక్కరుగా కూర్చుండి ఉంటే మీరు ఏకత్వంతో ఉండగలిగితే మీరు తెలుసుకునే తత్వం మీద కేంద్రీకరించగలుగుతారు. మీరు విడి భాగాలుగా ఉంటే మీలో తెలుసుకునే తత్వం ఉండదు. అప్పుడు మార్గదర్శకత్వానికి నీతి నియమాల మీద ఆధారపడతారు.

తప్పు ఒప్పులకి అతీతంగా వెళ్ళండి

అపరాధ భావానికి మూలకారణం ఏమిటి? ఇది మనకి ఉండే తప్పు ఒప్పు అనే భావన మాత్రమే. ఏది తప్పు ఏది ఒప్పు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకునే తప్పు ఒప్పులని కొలవగల స్కేలు ఏమిటి?

హిందూ మతంలో శాఖాహారం మంచిది అంటారు. క్రిస్టియన్స్‌లో మాంసాహారం మంచిది అంటారు. హిందూమతంలో ఒక్కరినే వివాహం చేసుకోవాలి అంటారు. ఇస్తాంలో ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు. హిందూమతంలో ఆల్కహాల్ తాగకూడదు. క్రిస్టియానిటిలో అది తప్పు కాదు. మీరు ఇటువంటి నిబంధనలలో చిక్కుకుపోయి ఉంటారు. అప్పుడు ఇది తింటే అపరాధ భావం, అది తాగితే అపరాధ భావం.

హిందూమతాన్ని భరతలో అత్యధికులు అనుసరిస్తారు. అది వేద సంస్కృతి మీద ఆధారపడి అభివృద్ధి చెందింది. సనాతన ధర్మం అనేది అంతిమ న్యాయసూత్రం. దాని నుంచి వచ్చినవే చాలా మతాలు, బౌద్ధమతం, జైనమతం మొదలైనవి. వేరు వేరు ప్రాంతాలలో వేరువేరు

రూల్స్ ఉంటాయి. వేరు పరిస్థితులలో సమాజాలలో వేరు రూల్స్ ఉంటాయి. నీతి అనబడే ఈ నియమాలని కొలిచే స్కేలు ఏది? ఇవన్నీ ఆయా ప్రాంతీయ సంస్థదాయాలు. కొంతకాలానికి అవే నీతినియమాలుగా తయారవుతున్నాయి.

వేరు వేరు కాలాలలో వేరే విధమైన రూల్స్ ఉండేవి. ఒక సమాజంలో నీతి అనుకున్నవి మరొక చోట అవినీతి అంటారు. అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో జూదం, నాట్యం ఉండే కాసినోలని అనుమతిస్తారు. కాని కొన్ని రాష్ట్రాలలో అది న్యాయ సమ్మతం కాదు.

మంచికి, చెడుకి స్కేలు ఏమిటి? ఒక వ్యక్తికి ఒక ఆహారం అమృతం అయితే అదే మరొక వ్యక్తికి విషం. ఈ తప్పు, ఒప్పు, మంచి చెడులలో చిక్కుకొని ఉన్నంత వరకూ మీరు ఏ పనీ ప్రశాంతంగా చేయలేరు. మీరు అపరాధభావంతోనే ఉంటారు. మీరు ఈ మంచీ చెడులకి అతీతంగా వెళ్ళగలగాలి. మీ చేతనస్థితిలోనికి వెళ్ళాలి. అక్కడే అసలు తాళం చెవి ఉన్నది.

మనస్సాక్షి Vs చేతన స్థితి

ఎప్పుడైతే మనం సమాజ నిబంధనలు, సూత్రాలని మనలో నింపుకుంటామో అవి మన అంతరంగంలో పెద్ద గాయాన్ని చేస్తాయి. మీరు మీ అంతరంగంలోని మేధని నాశనం చేసేసారు. నా అభిప్రాయంలో పిల్లలకి కొన్ని రూల్స్ పెట్టవచ్చు. అప్పుడు వారు తమ చేతనస్థితికి దూరంగా వెళ్ళరు. కాని వారికి త్వరలోనే జీవితాన్ని అర్థమయ్యే విధంగా చెప్పాలి. వాళ్ళని మనస్సాక్షి ద్వారా కాకుండా చేతనస్థితి లోంచి పనిచేసే విధంగా చేయాలి.

మీరు చేతనస్థితిలో జీవిస్తే ఆటోమేటిక్‌గా నీతినియమాలలో ఉంటారు. మీరు చేతనస్థితిలో జీవించే అవసరం గురించి తెలుసుకోవటం ప్రారంభించగానే మీరు నీతినియమాల వైపు కేవలం చూడండి. నీతి అనేది పైపైన ఉండేదే, కాని చేతనస్థితి మీ అంతరంగపు లోతులలోంచి ఉంటుంది. మీ అంతరాత్మ నుంచి ఉంటుంది. మీ చేతనస్థితి మనస్సాక్షిని దాటుకొని వస్తుంది. అది నిరంతరం మీ మనస్సాక్షితో పోరాడుతూ ఉంటుంది. మనసాక్షి సమాజపరమైనది. చేతనస్థితి సహజమైనది. మనస్సాక్షి చేతనస్థితికి ఏ విధంగా సరిరాదు. నన్ను చాలా మంది అడుగుతుంటారు, 'స్వామిజీ ఇదంతా ఏమిటి? మీరు సమాజ వ్యవస్థని కిందికి లాగేస్తున్నారు. అప్పుడు మేం నీతిగా బతకగలమా' అని. నేను వాళ్ళతో ఇలా చెబుతుంటాను, స్పష్టంగా అర్థం చేసుకోండి. చిన్న పిల్లలకి బలవంతంగా నీతినియమాలు విధించాలి. వాళ్ళతో మీరు 'అలా చేయవద్దు, నీకు చాక్లెట్ ఇస్తాను' అని చెప్పాలి. కాకపోతే ఈ రోజులలో పిల్లలు 'నాకు ఇలానే బాగుంది, నీ చాక్లెట్ నాకు అవసరం లేదు, నీ చాక్లెట్ ఎవరికి కావాలి అంటున్నారు. చిన్నపిల్లలతో నీకు చాక్లెట్ ఇస్తాను అని చెప్పి వాళ్ళని ఆపవచ్చు. ఆశ చూపించి నియమాలు విధించవచ్చు. కాని మీది పరిణతి పొందిన స్థితి. మీరు చిన్న పిల్లలు కాదు. చేతనస్థితిలో నిలబడండి. చేతనస్థితి అంటే మీ అంతరాత్మ యొక్క మేధ.

నియమ నిబంధనలు – నియమాలు ఉల్లంఘించాలనేది సహజమైన ప్రేరణ

మీ మీద ఏ నియమాన్నైనా బలవంతంగా విధిస్తే దాని నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటారు. ఉదాహరణకి పోలీస్ లేకపోతే ఎక్కువ స్పీదుతో వెళతారు.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి హై వే మీద చాలా స్పీడుగా వెళుతుంటే పోలీసు ఆపి లెసెన్స్ అడుగుతాడు. అతను పోలీసుతో, 'నేను నా వెనుక కారుకి సరిపడ దూరాన్ని జాగ్రత్తగా మెంటేన్ చేస్తున్నాను' అంటాడు.

నియమాలని కళ్ళు మూసుకుని అనుసరిస్తే ఈ విధంగానే ఉంటుంది. నియమాలని ఉల్లంఘించటానికి ఏదో సాకుని వెతుకుతారు. మీకు మీరు నిజాయితీగా జవాబు చెప్పకోండి. ఒకవేళ ఏ రూల్స్ నిబంధనలు ఏమీ లేవనుకోండి, మిమ్మల్ని కంటోల్ చేసేవారెవరూ లేరనుకోండి, మీరు ఇదే విధంగా ఉంటారా? ఈ పనులు ఇదే విధంగా చేస్తారా? ఒకవేళ కాదు అని జవాబు వస్తే మీరు మనస్సాక్షి నుంచి పని చేస్తున్నారు, కాని చేతనస్థితి నుంచి కాదు. మీరు నియమాలని మీ అంతరంగంలో నిలుపుకోలేదు. లేదా ఆ రూల్ మీకు నచ్చలేదు, అందుకే మీరు సహజమైన రీతిలో పనిచేయటం లేదు.

'కాదు,' 'లేదు' అనటం సరదా

మీరు పిల్లలకి ఈ పని చేయవద్దు అంటే వారికి అదే చేయాలని ఉంటుంది. మీరు వద్దు, కాదు అనేమాట చెప్పనంత వరకూ వారు దేన్నీ పట్టించుకోరు. కాని ఎప్పుడైతే ఈ పని చేయొద్దు అంటారో, అది ఎప్పుడు చేయాలా అని చూసుంటారు.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి 'నేను మూడు రకాలుగా పని చేయటం తెలుసుకున్నాను' అంటాడు. అతని స్నేహితుడు, 'అవి ఏమిటి?' అని అడుగుతాడు. ఆ వ్యక్తి 'ఒకటి ఆ పని నీ అంతట నీవే చేయి'. రెండవది 'ఎవరినైనా చేయమని చెప్పు' ఇక మూడవది 'మీ పిల్లలతో ఆ పని చేయవద్దు అని చెప్పు' అంతే ఆ పని అయిపోతుంది అంటాడు.

చేయకూడదు అన్న పనిని చేయటం థ్రిల్‌గా ఉంటుంది. సరదాగా ఉంటుంది. ఎవరైనా అలా చేయొద్దు అంటే సహజంగా అలా చేయాలనిపిస్తుంది. అలా చేయటంలో ఒక రకమైన సంతోషం, సరదా, తృప్తి ఉంటాయి. అది ప్రతి వ్యక్తిలో ఉండే ఒక సహజమైన ధోరణి.

మరో చిన్న కథ : ఒక షాపు యజమాని అమ్మకాలు పెంచటానికి చాలా కష్టపడుతుంటాడు. చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటాడు. మంచి అడ్వర్టైజ్‌మెంట్స్ ఇస్తాడు. డిస్కౌంటులు ఇస్తాడు. మంచి కస్టమర్ సర్వీసు చేస్తుంటాడు. కాని ఏదీ పని చేయదు. ఒక రోజు కిటికీకి ఒక తెరకట్టి దానికి రంధ్రం చేసి లోపలికి చూడటం నిషేధం అని బోర్డు పెడతాడు.ఆ రోజు నుంచి చాలా మంది షాపు దగ్గర గుమికూడి అదేమిటో చూడాలి అని వస్తుంటారు. అతని అమ్మకాలు బాగా పెరిగాయి. అతని షాపులో ఉన్న మంచి వస్తువుల గురించి అందరూ తెలుసుకుంటారు. అతని అమ్మకాలు ఇంకా పెరిగాయి.

ఎప్పుడైతే ఇది చేయకూడదు అని అంటారో, మనిషిలో ఉండే ప్రాథమిక సహజ లక్షణం సరిగా అదే చేయటం. యువతకి లేదు కాదు అని చెప్పటం వాళ్ళు స్వతంత్రులమయ్యామనే భావనని వ్యక్తం చేయటమే. ఎపుడైతే కాదు అని చెబుతారో, మీరొక ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటారు. ఔను సరే అని చెపితే మీరు చిన్న పిల్లలు అని అనుకుంటారు.ఎప్పుడైతే 'కాదు' అని అంటారో పెద్దవారమయ్యాం అనుకుంటారు.

కాదు అని మీ నాన్నగారికి చెప్పినప్పడే మీరు పెద్దవారమయ్యాం అనుకుంటారు. అప్పటి వరకూ మీరు చిన్నవారనుకుంటారు. మీరు పెద్దవారయ్యారు అని నిరూపించటానికి వద్దు, కాదు అని చెబుతారు. అలా చెప్పినప్పుడే మీరు ఫలానా అని అనుకుంటారు. లేకపోతే ఎవరో అనుకుంటారు.

జీవితం మాత్రమే నేర్పించగలదు

నా దగ్గరకి వచ్చి చాలా మంది చెబుతుంటారు. 'మా అబ్బాయి నా మాట వినేలా ఎలా చేయాలి, ఇది తనకి మంచిది అని నాకు తెలుసు, అతను నా మాట వినడు,' అంటారు. మీకు రెండు విషయాలు అర్థమవుతాయి. వాళ్ళకి ఏదైనా సంతోషం కలుగుతుంది అంటే అది చేయనీయండి. వాళ్ళకి జీవితమే నేర్పిస్తుంది. ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీరు ఎవరికీ ఏదీ నేర్పించలేరు. జీవితమే నేర్పిస్తుంది. మీరు వారి లోపల కొన్ని మాటలు పెట్టండి (వారికి చెప్పండి). జీవితం పాఠం నేర్పినప్పుడు ఆ మాటలు వారిలో ప్రతిధ్వనిస్తాయి.

రెండవ విషయం – వారు అడిగితే తప్ప మీరు వారికి సహాయం చేయవద్దు. మీ సహాయం అవసరమైనప్పుడు వాళ్ళు మీ దగ్గరకి వస్తారు. మీ సంతోషం, విచారం అనేవి మీ అనుభవం నుంచి వచ్చాయి. ఒక్కసారి ఆలోచించండి. మీ చిన్నతనంలో మీ నాన్నగారి మాట విన్నారా? లేదు, వినలేదు.

ఏ కొడుకూ తండ్రి మాట వినడు. వాళ్ళు తండ్రులు అయ్యాక వారి చిన్నతనాన్ని మరచిపోయి పిల్లలు నా మాట వినటం లేదు అని ఫిర్యాదులు చేస్తారు. వాళ్ళ పిల్లలకి చెప్పాలి కాబట్టి వాళ్ళు వాళ్ళ తల్లితండ్రం మాట విన్న సంఘటనలని మాత్రమే గుర్తుంచుకుంటారు. వాళ్ళు మాట వినని సందర్భాలని మరిచిపోతారు. ఇప్పుడు మీరు చేసేపని మీ పిల్లలూ చేసారు. కేవలం జీవితం మాత్రమే నేర్పించగలుగుతుంది. మీరు వాళ్ళకి నేర్పించలేరు. అదే విధంగా వారు అడగకుండా సహాయం చేయలేరు. మీరు వారి మీద బలవంతంగా రుద్దితే, వారి మీద బలవంతంగా రూల్స్ పెడితే వాళ్ళు నేర్చుకునేది ఒక్కటే, మిమ్మల్ని ఎలా మోసం చేయాలి అని మాత్రమే. కాబట్టి మీ పిల్లలు ఉన్న దశని తెలుసుకోండి, అది చాలు. అతను మీ సహాయం కావాలి అని ఎప్పుడు అడిగినా మీరు సిద్ధంగా ఉంటారు.

అపరాధ భావం అసలైన పాపం

జీవం లేని నియమాలు Vs జీవ చైతన్యమైన మేధ

కాలం గడిచేకొద్దీ పాత నియమాలు ఉపయోగం లేనివిగా మారతాయి. వాటికి అర్ధం ఉండదు. భారత దేశంలో కరెంటు లేని రోజులలో బట్టలు కుట్టేవారు. రాత్రి పూట బట్టలు కుట్టాలి అంటే లాంతరు వెలుగులో కుట్టేవారు.ఆ రోజులలో చేతితో బట్టలు కుట్టేవారు. అందుకే సూర్యాస్తమయం అయ్యాక కుట్టకూడదు అని రూల్ ఉండేది. ఎందుకంటే లాంతరు వెలుగులో కుడితే కళ్ళకి హాని జరుగుతుంది. కాని ఇప్పుడు కూడా చాలామంది పెద్దవాళ్ళు చీకటి పడ్డాక కుట్టకూడదు. మంచిది కాదు అంటారు. నిజానికి ఆ రూల్ ఇప్పుడు పనిచేయదు. ఇప్పుడు కరెంటు ఉన్నది. పెద్ద లైట్లు ఉన్నాయి. కాని అది ఒక అలవాటుగా సంప్రదాయంగా మారిపోయింది.

ఒక చిన్న కథ : పారాచూట్‌లో సాహసం చేసే ఒక వ్యక్తిని టి.వి. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు అతన్ని మీ జీవితంలో చాలా సాహసాలు ఉండి ఉంటాయి కదా! అంటారు. అతను 'అవును కొన్నిసార్లు' అంటాడు.

'మీ జీవితంలో మీరు చాలా కంగారుపడిన సంఘటన ఏదైనా ఉందా' అని అడుగుతారు. అతను, 'ఒకసారి నేను పారాచూట్‌తో కిందకి దిగుతున్నాను. అది ఒక ఇంటి ముందు ఉన్న లాన్, ఈ లాన్ మీద నడవకూడదు, అన్న బోర్డు కనిపించింది అదే, నా జీవితంలో కంగారు పడిన సంఘటన' అంటాడు.

మీకు రూల్స్ సరిగ్గా అర్థం చేసుకునే మేధ లేకపోతే ఏదైనా జీవంలేని రూల్ అవుతుంది. మీరు సరైన విధంగా అర్థం చేసుకోగలిగితే ప్రతి రూల్ మీ జీవితాన్ని మరింత నాణ్యతతో చేసే ఒక స్నేహపూరితపద్ధతి అవుతుంది. రూల్స్ సంప్రదాయాలు అనేవి జ్ఞానోదయం పొందటానికి ఉపయోగపడే పద్దతులు. నేను జ్ఞానోదయం అని అంటే స్పష్టతతో కూడిన ఆనందకరమైన జీవితం అని అర్థం. దీన్ని లోతుగా గ్రహించగలిగితే మీరు అంతిమమైన పరమానందస్థితిలో స్థిరపడగలుగుతారు.

మరో చిన్న కథ : ఒక రైలులో మర్దర్ జరిగింది అన్న విషయం రైల్వే ఆఫీసరుకి తెలుస్తుంది, 'ఒక వ్యక్తి ట్రైయిన్ కంపార్ట్‌మెంట్ లోనికి వచ్చి ఒక వ్యక్తిని కత్తితో పొడిచి, అటువైపు గుమ్మం నుంచి ట్రాక్ మీదకి దూకి పారిపోయాడు. ఈ విధంగా అతను రైల్వే రూల్స్‌ని అతిక్రమించాడు.' – అని రిపోర్టు వస్తుంది.

మీరు విషయాలని, రూల్స్‌ని సరియైన పద్ధతిలో అర్థం చేసుకోకపోతే మీరు మొత్తం మిస్ అవుతారు. చివరికి ఒక తెలివితక్కువ పనితో ముగిస్తారు. మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే ఏ రూల్ అయినా మీ కోసం, మీ చుట్టుపక్కల వారి మంచికి, వారి సంతోషం కోసం మాత్రమే సృష్టించారు అని తెలుస్తుంది. రూల్స్‌లో ఉండే అర్ధాన్ని తెలుసుకుంటే వాటిని అనుసరించటానికి మీకు ఏ సమస్య ఉండదు. అలా దాన్ని అర్థం చేసుకొని అనుసరించగలిగితే అందులో ఆనందాన్ని, దాని సారాన్ని పొందవచ్చు. అందులో ఆనందంగా పాల్గొంటారు. అందులో అంతరార్ధం తెలియకపోతే మొత్తం పోగొట్టుకుంటారు. జీవితం పేలవంగా స్తబ్దతతో, డల్‌గా ఉంటుంది.

ఉదాహరణకి ధ్యానాన్ని తీసుకోండి, అది మిమ్మల్ని మీలోనికి తీసుకువెళుతుంది. బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా ఎంత ధ్వనులు, గొడవ ఉన్నా, మిమ్మల్ని లోనికి తీసుకువెళుతుంది. నేను కొంతమందిని చూస్తుంటాను, వారు ధ్యానం ప్రారంభించేముందు, వారి పరిసరాలని నిశ్శబ్దంగా చేస్తారు. వాళ్ళు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని చెబుతారు. వాళ్ళు అందరినీ కంట్రోల్ చేసారు. ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేయబోతున్నారు కాబట్టి.

నియమనిబంధనలని మన జీవితం బాగుండేందుకే తయారుచేసారు. కాని ఎప్పుడైతే వాటిని అర్థం చేసుకోకుండా పాటిస్తారో అప్పుడు మీలో అపరాధభావం ఏర్పడుతుంది. వాటిని అర్ధం చేసుకొని పాటించగలిగితే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఆ విధంగా కాకుండా మీరు కేవలం అందులోని మాటలని మాత్రమే అనుసరించి అర్ధాన్ని వదిలేస్తే మీలో అపరాధ భావం కలుగుతుంది. మీరు న్యాయం నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటే ఏం చేస్తారు, మీరు అందులో మాటలని పట్టుకొని అర్థాన్ని వదిలేస్తారు. అప్పుడు న్యాయపరంగా ఆ మాటల చుట్టూ పనిచేసి తప్పించుకుంటారు. మీరు మాటల్ని మాత్రమే పట్టుకుంటే మీరు అసలు అర్ధాన్ని వదిలేస్తారు. మీరు అర్థాన్ని తెలుసుకున్నప్పుడే వివేకంతో ఉంటారు. అప్పుడు మీలో అపరాధ భావం ఉండదు.

న్యాయ సూత్రాల మీద ఆధారపడి ఎవరూ జీవించలేరు

ఒక ముఖ్యవిషయం; ఇది ఒక అంతిమసత్యం. దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.

ఎవరూ కూడా న్యాయసూత్రాల మీద ఆధారపడి జీవించలేరు. నేను ఎవరు కూడా అంటే అర్ధం కచ్చితంగా ఎవరూ అలా బ్రతకలేరు అని. న్యాయసూత్రాలు అంటే ఎటువంటి న్యాయం అయినా సరే. జీవితం న్యాయసూత్రాల కంటే ఎంతో ఉన్నతమైనది. జీవితం జీవమున్న మేధ. ఏ న్యాయసూత్రం కాని, నియమనిబంధనలు కాని ఏదో జీవితం గురించి కొంచం అర్థం చేసుకొని దాని ఆధారంగా కల్పించినవే. కానీ జీవితం అంటే మనం అర్థం చేసుకున్న దానికి మన తర్కానికి అతీతమైనది. నన్ను చాలా మంది అడుగుతుంటారు, 'అసలు ఈ జీవితం ఎందుకు సృష్టించబడింది?' నేను ఎప్పుడు చెబుతుంటాను ఎందుకు అనే దానికి ఎప్పుడూ జవాబు చెప్పలేను. ఎందుకంటే అది మన తర్మం మీద ఆధారపడింది. మీ తర్కం, భగవంతుని తర్కం అసలు కలవలేవు. ఆయన తర్కం అనంతం, అతివిశాలం.

జీవితాన్ని భగవంతుడు సృష్టించాడు. రూల్స్‌ని మీరు సృష్టించారు. న్యాయసూత్రాలని మీరు సృష్టించారు. మీరు సృష్టించిన న్యాయసూత్రాలు భగవంతుని సృష్టి అయిన జీవితానికి ఎక్కడా సరిరావు. జీవితం సహజమైనది. న్యాయసూతాలు సమాజపరమైనవి. జీవితం భౌతికమైనది. న్యాయం మానసికమైనది. మీ భావనలు, మీ విధినిషేధాలు తప్పుఒప్పులు, నీతినియమాలు అన్నీ కూడా, సమాజం కల్పించినవే. నియమాలు అనేవి అందరూ కలసి ప్రశాంతంగా జీవించటం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. కాని వాటికి అతీతంగా మీలోని వివేకం మేలుకోవాలి. అప్పుడే జీవితాన్ని అత్యున్నత స్థాయిలో జీవించవచ్చు.

నియమాల నుంచి బయటకి రావటం – తప్పించుకోవటం లేదా పగతీర్చుకోవటం

సహజంగా మీరు స్వేచ్ఛ కోసం వెతుకుతుంటారు. ఎవరైనా మీ మీద నీతినియమాల పేరు మీద నిబంధనలని విధిస్తే వాటి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు. అలా వీలు కాకపోతే ఆ రూల్స్ పెట్టిన వారి మీద కక్ష సాధిస్తారు. మీ మీద బలవంతంగా విధించబడిన నియమాలు, మిమ్మల్ని ఎదిరించాలి అనే విధంగా తయారు చేస్తాయి. అది మీకు స్పష్టంగా తెలియకపోవచ్చు. అది చాలా సూక్ష్మస్థాయిలో మీలో ఉంటుంది.

ఉదాహరణకి చాలా మంది నాతో అంటుంటారు, 'మా అబ్బాయి నన్ను పట్టించుకోవటం లేదు' అని. మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి, మీ అబ్బాయి మీ ప్రథమశత్రువు అయి వుండవచ్చు ఎందుకంటే జీవితంలో అతని మీద మీరు ఎన్నో నియమాలని విధించి ఉంటారు. అతని మనస్సులో సగం మీ మీద గౌరవం ఉంటే, మిగిలిన సగం మీ పట్ల కక్ష ఉంటుంది.

నేను ఏదో కొత్త విషయాన్ని చెబుతున్నాను అని అనుకోవద్దు. లేదా ఇది మీ ఒక్కరికి సంబంధించింది కాదు, అది సమాజంలోని ఒక ప్రాథమికసత్యం. దీన్ని గురించి ఎవరూ ఎక్కువ మాట్లాడరు. ఎందుకంటే ఇది భరించలేని సత్యం. నేను ఈ విషయాన్ని చెబితే ఏ తండ్రి లేదా ఏ కొడుకు ఒప్పుకుంటారు? ఇది చాలా లోతైన సత్యం, కాని అందరూ దాన్ని చూడనట్టు వదిలేసారు. మీకు అటువంటి సత్యాలని తెలియచేయటం నా బాధ్యత.

మీరు నిత్యముక్తులు – శాశ్వతంగా స్వేచ్ఛాజీవులు

మీరు జీవితంలో చేసే ప్రతి పోరాటం, స్వేచ్ఛ కోసమే. మీ డబ్బు సంపాదన కూడా స్వేచ్ఛ కోసం తపన. మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే మీకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. సౌకర్యాలు, ఇల్లు, కారు, ఇలా మీ ఇష్టమైన వాటిని ఎంచుకోవచ్చు. ఎంపిక కోసం మీరు పడే తపన స్వేచ్ఛ కోసమే. మీరు అనుబంధాలకోసం వెతుకుతున్నారు అంటే అది లేదా ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్ఠల కోసం వెతుకుతున్నా అదీ స్వేచ్ఛ కోసం వెతకటమే.

రూల్స్ ముందుగా మీలో, 'అమ్మో! ఆ నియమాన్ని ఉల్లంఘిస్తానేమో' అనే భయంలో పెడతాయి. మీరు నియమాన్ని పాటిస్తున్నా కూడా భయం, అపరాధభావంతో ఉంటారు. ఎప్పుడైతే మీలో భయం వుంటుందో స్వేచ్ఛ లేనట్టుగా భావిస్తారు. అప్పుడు మీరు డల్‌గా, నిస్పారంగా జీవం లేనట్టు తయారవుతారు. ఎందుకంటే సహజంగా మీరు స్వేచ్ఛ కోసం తపిస్తూ ఉంటారు.

మీ సహజలక్షణం మీరు నిత్యముక్తులు. శాశ్వతంగా ఎప్పటికీ స్వేచ్ఛాజీవులు. మిమ్మల్ని అడ్డుకోవటం ఇష్టపడరు. ఏ నియమానికి బానిసలుగా ఉండటం ఇష్టం ఉండదు. ఆ విధంగా ఉండాలంటే మీరు పూర్తి తెలుసుకునే తత్వంతో సరైన పద్ధతిలో నియమాన్ని అర్ధం చేసుకొని దాన్ని అనుసరించాలి. అప్పుడు స్వేచ్ఛని కోల్పోయాం అనుకోరు.

అపరాధ భావం బాధ్యత

కొన్నిసార్లు మీ అపరాధ భావాన్ని బాధ్యతగా చెప్పుకొని సమర్ధించుకుంటారు. అది సరి కాదు. బాధ్యతకి అపరాధ భావానికి తేడా ఏమిటి? బాధ్యత గురించి అనుకున్నప్పుడు మీరు నిరాశకి లోనైతే అది అపరాధభావం అవుతుంది. మీరు గాఢతతో ఏకీకృతమై ఉన్న భావన కలిగితే అది బాధ్యత. ఇదే స్పష్టమైన స్కేలు. ఏమి చేసారు అనుకోగానే నిరాశ కలిగితే, అది అపరాధభావం, దాన్ని గురించి ఉత్సాహంగా ఉంటే అది బాధ్యత. అపరాధభావం అంటే బాధ్యత నుంచి తప్పించుకోవటమే.

ఒకసారి ఒక వ్యక్తి నాదగ్గరకి వచ్చి 'నేను చాలా కష్టాలలో ఉన్నాను. నాకు పద్నాలుగు మంది పిల్లలు' అన్నాడు. 'అంత మందిని ఎందుకు కన్నావు అని అడిగితే భగవంతుడు ఇచ్చాడు' అని చెప్పాడు. ఇక్కడ సమస్య ఏమిటి అంటే 'మనం చేసేవన్నీ చేసి ఎటువంటి బాధ్యత తీసుకోకుండా, భగవంతుడి మీద నేపం నెడతాం. మనం చేసే ప్రతి పనికీ బాధ్యతని తీసుకుంటే మనలో అపరాధభావం అనేది ఉండదు. అక్రమ సంబంధాల విషయంలో అపరాధభావం అందుకే ఉంటుంది. ప్రవర్తన విషయంలో బాధ్యత లేకుండా ఉండటం. అక్రమసంబంధంలో మీ జీవితభాగస్వామి పట్ల గౌరవం లేదని స్పష్టంగా తెలుస్తుంది. వారిని అగౌరవపరచే హక్కు మీకు లేదు. అసలు వివాహబంధం అంటే ఏమిటో మీకు వివరంగా చెబుతాను. మగవారు మూలాధారచక్రం అంటే కోరికలో చిక్కుకొని ఉంటారు. స్త్రీలు స్వాధిష్ఠానచుకంలో అంటే భయంలో చిక్కుకుని ఉంటారు. అందుకు మగవారు కోరిక అనే భావనలకి దొరికిపోతారు. స్త్రీలు రక్షణ అనే విషయానికి దొరుకుతారు.

మన వేద సంస్కృతిలో వివాహ వేడుకలో హోమం ముందు, అగ్నిసాక్షిగా భర్త భార్యకి 'నీకు నేను రక్షణని ఇచ్చి అభద్రత అనే భయం నుంచి నీకు స్వేచ్ఛని కలిగిస్తాను,' అని ప్రమాణం చేస్తాడు. భార్య భర్తతో 'నేను నీకు ప్రేమని పంచి కోరిక అనే దానినుంచి స్వేచ్ఛ కలిగేలా చేస్తాను' అని ప్రమాణం చేసారు. ఈ విధంగా ఇద్దరూ వారి వారి బలహీనతల నుంచి స్వేచ్ఛ పొందేలా సహకరించుకుంటామని ప్రమాణాలు చేస్తారు.

వివాహ వేడుక ముగిసాక ఏమి జరుగుతుంది? ఒకరి నొకరు స్వేచ్ఛ పొందే విధంగా సహాయం చేసుకోకుండా వారి వారి బలహీనతలతో అదుకుంటారు. ఎదుటి వ్యక్తి బలహీనత తెలిసి వారి పట్ల దయగా ఉండకుండా, ఒకరికి ఒకరు మరిన్ని సమస్యలు సృష్టిస్తారు.

మీరు అక్రమ సంబంధాలతో ఉంటే మీ జీవిత భాగస్వామి రక్షణ విషయంలో మరింత భయపడతారు. ఎదుటి వ్యక్తిని అగౌరవపరచటం ద్వారా మీరు వారిని ఒక వస్తువులా చూస్తున్నారు. వారిని ఆ విధంగా చూస్తున్నంతకాలం, మీరు వారివారి బలహీనతలతో ఆదుకుంటారు. వారిని ఒక వ్యక్తిగా చూడగలిగితే, మీ జీవితానికి వారు ఎంత ఆధారంగా నిలబడ్డారో అర్థం చేసుకుంటారు.

ఒక విషయం అర్ధంచేసుకోండి; భర్త అభద్రతాభావంతో ఉన్నప్పుడు భార్య తల్లిలా మారాలి. భార్య అభద్రతాభావంతో ఉంటే భర్త తండ్రిలా మారాలి.

మీ ఎంపికకి మీదే బాధ్యత

ఏ విషయాన్నెనా చెబితే, అది మంచిదా కాదా అని నిర్ణయించుకొని, మీ నిర్ణయం, బాధ్యతా పూర్తిగా తీసుకున్నప్పుడు మీలో అపరాధభావం ఉండదు. మీ నిర్ణయానికి బాధ్యత తీసుకోనప్పుడు, ఆ పని చేసినా, చేయకపోయినా, మీలో అసంతృప్తి ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా ఈ విధంగా చేయి అని చెప్పారనుకోండి. వారు మీ మీద పెత్తనం చేస్తున్నారు అనుకుంటారు. అది మీకు ఇష్టం ఉండదు. ఆ విధంగా ఎదుటి వారు చెప్పినట్టు చేయకపోతే మీలో అపరాధ భావం కలుగుతుంది, ఒకవేళ అది సరైనదేమో ఆ పని చేయకుండ తప్ప చేశానేమో అనుకుంటారు.

అనవసరమైన అయోమయం వద్దు. మామూలుగా ఉండండి. వివేకంతో స్పందించండి. మీరు ఏది చేసినా దాని బాధ్యత తీసుకోండి. అప్పుడు మీలో అపరాధభావం ఉండదు. మీరు ఆ విధంగా చేయనప్పుడు ఎదుటివారికి మీరు ఎందుకు ఆ పని చేయటం లేదో వివరించండి. మీరు ఆ విధంగా వివరిస్తే ఆ వ్యక్తి మీరు చెప్పిన దానికి ఒప్పుకోవచ్చు. వారు మీకు కృతజ్ఞతలు చెప్పవచ్చు. ఒక వేళ మీరు చెప్పినదాని కంటే ఆ వ్యక్తి బలమైన కారణం చూపిస్తే, ఆ విషయం తెచ్చినందుకు మీరు కృతజ్ఞతలు చెబుతారు. ఈ విధంగా మీరు ప్రతి అవకాశాన్ని ప్రతినిముషం ఉపయోగిస్తూ మీ మేధని పెంచుకోవచ్చు. అదే విధంగా మీ చేతనస్థితిని పెంచుకోవచ్చు

ఉపయోగపడే అపరాధభావం

మీకు ఉపయోగపడే అపరాధభావం కూడా ఉంటుంది. మీరు అపరాధ భావాన్ని వివేకంతో చూడగలిగితే అది మీ జీవితంలో ప్రగతిని సాధించేలా చేస్తుంది. అది ఈ విధంగా ఉంటుంది. మీకు మీ లోపల ఏపనినైనా చేయగల శక్తి ఉంది అని తెలిసి కూడా, ఆ శక్తిని ఉపయోగించుకోవటం లేదనుకోండి. మీరు వివేకవంతులైతే మీలో చేయలేకపోతున్నానే అనే భావన కలుగుతుంది. అటువంటి అపరాధభావన మిమ్మల్ని పనులు చేసే దిశగా ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా మీలోని శక్తిని పూర్తి స్తాయిలో వినియోగించుకోగలుగుతారు.

కొన్ని సార్లు మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలని చూసినపుడు మనకి అనిపిస్తుంది, నేను ఇంకా బాగా చేయగలనని, కాని సోమరితనంతోనో లేకపోతే ఆ పని ప్రారంభించే ధైర్యం లేకనో మీరు అలా చూస్తూ ఉండిపోతారు. అటువంటి స్థితి మీలో లోతైన అపరాధభావాన్ని సృష్టిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. అప్పుడు మనం ఆ సమస్యని లేదా ఆ పరిస్థితిని చక్కదిద్దాలి అని అనుకొని ఆ విధంగా చేస్తే మనలోని అపరాధభావం మాయమౌతుంది.అప్పుడు మనం ముందుకి వెళ్ళగలం.

ఇటువంటి అపరాధభావం మీరు ఏది చేయవలసి ఉందో ఆ పని చేసే విధంగా మిమ్మల్ని ముందుకి తీసుకువెళుతుంది. ఎందుకంటే ఇటువంటి అపరాధభావాన్ని మీరు ఎక్కువ రోజులు మీ లోపల ఉంచుకోలేరు. దానిలోంచి బయటకి రావాలంటే ఆ పనిని చేయటమే. ఒక్కసారి ఆ పనిని చేయగానే మీరు అపరాధభావం నుంచి బయటికి వస్తారు. ఎంత కాలమైతే ఆ పని చేయకుందా ఉంటారో అంతకాలం మీరు అపరాధభావంతో బాధపడతారు. ఇది అపరాధభావానికి సంబంధించిన ఒక లక్షణం.

ఇటువంటి భావం మరొక రూపంలో కూడా వస్తుంది. మీ అహంకారం బయటకి వస్తున్న విషయం తెలిసి మీరు ఏమీ చేయలేకపోతారు. అహంకారాన్ని గమనిస్తారు, కాని దాన్ని నియం(తే)త్రించలేరు. అప్పుడు మీలో తప్పుచేస్తున్న భావం ఏర్పడుతుంది. ఇది కూడా మంచి భావనే, ఎందుకంటే ఇది మీలోని లోతైన తెలుసుకునే తత్వం ఉంది అనటానికి గుర్తు. అప్పుడు ఆ అహంకారాన్ని తీసేయటానికి మీరు నిజాయితీగా పని చేస్తారు.

అపరాధభావం శారీరక అనారోగ్యాలని కలిగించవచ్చు

అపరాధభావం మీలోని వివేకాన్ని చంపేస్తుంది. నా అభిప్రాయంలో అపరాధభావం అనేది మేధని చంపేస్తుంది, అది మీ జీవితంలో మిమ్మల్ని ముందుకి సాగనీయదు. ఒకామెకి వెన్నెముక చివరిలో ట్యూమర్ వచ్చింది. ఆమె ఇరవై సంవత్సరాలు ఆ ట్యూమర్‌తో బాధపడింది. ఆమె నా దగ్గరకి వచ్చి 'నాకు బాగుచేయండి, నాకు సహాయం చేయండి.' అని అడిగింది.

'నేను దీనితో గత ఇరవై సంవత్సరాల నుంచీ బాధపడుతున్నాను. ఒకసారి ఆపరేషన్ అయ్యింది. కాని మళ్ళా వచ్చింది' అని చెప్పింది. నేను ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టాను, ఆ సమస్య మూలం ఏమిటో తెలుసుకోవాలి అని అనుకున్నాను. ఆమెని చాలా ప్రశ్నలు అడిగాను. చివ(రి)రగా ఆమె ఏదవడం మొదలు పెట్టింది. నేను ఆమెని 'నీ సెక్స్ ఎనర్జీ పట్ల తప్పు చేసిన భావం ఉందా?' అని అడిగాను.

అప్పుడు ఆమె చిన్న తనంలో తనని శారీరకంగా అవమానం చేసిన విషయం చెప్పింది. ఆమె సమీప బంధువు ఆమెను ఆ విధంగా శారీరకంగా అవమానించాడు. ఆ అపరాధభావం ఆమెలో స్థిరపడిపోయింది. ఆమె ఈ విధంగా చెప్పింది, 'నేను నా శరీరంలో ఆ భాగాన్ని అతిగా అసహ్యించుకోవటం మొదలు పెట్టాను. నా శరీరంలో ఆ భాగం ఉందకుండా ఉంటే బాగుంటుంది అనుకునేదాన్ని. అది నా శరీరంలో భాగం కాదు అనుకున్నాను. ఆ వ్యక్తి పట్ట అసహ్యం, నా శరీరం మీద చూపించాను.' అంది.

ఆమె అసహ్యం చాలా గాఢంగా ఉంది. నేను ఆమెతో మాటలు పొడిగించాను. అమె ఇంకా ఇంకా చాలా బాధని వెళ్ళగక్కింది. ఆ విధంగా ఆ అపరాధ భావాన్ని బయటకి తెచ్చి దాన్నుంచి స్వేచ్ఛ పొందింది. ఆమెకి మానసికంగా చికిత్స జరిగింది.

నేను ఆమెకు ఆ భాగం మీద చేసే చిన్న ధ్యానపద్ధతిని నేర్పించాను. నేను ఆమెతో చెప్పాను, 'నీవు నీ కోపాన్ని అతని పట్ల చూపించు, ఏడవాలనిపిస్తే ఏడ్సేసేయి, అరువు, కొట్టు, తలుపులు వేసుకొని తలగడని ఆ వ్యక్తిలా ఊహించి నీ కోపం పోయేవరకూ దాన్ని కొట్టు, ఆ తరువాత నిశ్శబ్దంగా కూర్చొని ఆ భాగం నీ శరీరంలో ఒక భాగం, అది నీది. దాని పట్ల, నీ శరీరంపట్ల ప్రేమను చూపించు,' అని చెప్పాను.

మీరు ఆశ్చర్యపోతారు. పదిరోజుల్లో ఆ గడ్డ మాయం అయ్యింది. అది తిరిగిరాలేదు.

మనలోని చాలా అనారోగ్యాలు, మానసికంగా మనం గాయపడినప్పుడు అపరాధ భావంతో ప్రవేశించేవే. అపరాధ భావం వల్ల మనలోని శక్తి ప్రవాహం స్వేచ్ఛగా ప్రవహించదు. మీరు లోతుగా గమనిస్తే ఎక్కడైతే మీరు ముందుకి సాగలేకపోతున్నారో, ఎక్కడైతే మీరు నిర్ణయాలు చేయలేకపోతున్నారో, ఎక్కడైతే భయం ఉందో అక్కడ అపరాధభావం ఉంటుంది.

ఒప్పుకోవటం దాన్నుంచి బయటకి రాగల చక్కని మార్గం

గతానికి భవిష్యత్తుకి మధ్య ఉండే లాగుడుతోపుడుల నుంచి మీరు బయటికి రావాలి అనుకుంటే పరిస్థితిని ఒప్పుకోండి. ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటారో తిన్నగా వర్తమానంలోనికి వస్తారు. ముందుగా మీరు బయటి ప్రపంచంలో జరిగే విషయాలు మీ అంతరంగంలో జరిగే విషయాలని ఒప్పుకోండి. బయటి ప్రపంచంలో సారాంశం చూడండి. దాన్ని పూర్తిగా ఒప్పుకోండి. మీలోని అపరాధభావాన్ని చేసిన తప్పులని, అపజయాలని దేనినె(తే)తే ఒప్పుకోలేక పోతున్నారో వాటన్నింటినీ ఒప్పుకోండి. తరువాత రిలాక్స్ అవ్వండి. మీలోంచి అపరాధభావం తొలగిపోతుంది.

ఈ చిన్న ప్రయోగం ప్రయత్నించండి.

మూడురోజుల పాటు అన్నీ ఒప్పుకొని విరామంగా ఉండండి. ఆ విధంగా మూడు రోజులు రిలాక్స్ అయితే మీ అంతరంగంలో బయటి ప్రపంచంలో లాగుడు, తోపుడు అనేవి లేకుందా ఉంటే మీ ఐశ్వర్యం అంతా పోతుందా? కచ్చితంగా పోదు. అప్పుడు మీ సమస్య ఏమిటి? ఈ మూడు రోజులలో మీరు ఏమీ పోగొట్టుకోరు. అప్పుడు దీన్ని ప్రయత్నించవచ్చు కదా! కేవలం మూడు రోజులు ప్రయత్నించండి. నిజాయితీగా, పూర్తిగా మీ జీవితంలో ప్రతి దాన్నీ ఒప్పుకోండి.

ఆ విధంగా నూరుశాతం ఒప్పుకోలేకపోయారనుకోండి, నేను ఒప్పుకోలేక పోయానన్న విషయాన్ని ఒప్పుకోండి. నన్ను నేను బయటి ప్రపంచంలో, అంతరంగ ప్రపంచంలో, ఒప్పుకోలేక పోతున్నానని మీరు అనుకోగలిగినా ఈ లాగుడు, తోపుడు నుంచి బయటకి రాగలుగుతారు. 'ఎప్పుడైతే ఈ భయాలు కోరికల తోపుడు లాగుడు నుంచి బయటకి రాలేకపోతున్నాను, జీవితంలో నేను అంటే ఉన్న నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నాను' అని మీరు అర్థం చేసుకోగలిగితే, అదే చేయవలసిన పనిని చేసుకుపోతుంది.

మీరు ఈ మూడు రోజులు బయటి ప్రపంచం, అంతరంగం విషయాలలో పూర్తిగా రిలాక్స్ అవ్వగలిగితే మీరు వర్తమానం లోనికి రాగలుగుతారు. అప్పుడు మీకు కొంత అర్థమౌతుంది. జీవితం ఏమిటి? వర్తమానంలో ఎందుకు ఉండాలి? ఇదే మీలో జరిగితే మీరు ఆనందపారవశ్యాన్ని అనుభవించగలరు. ఇంతకు ముందు జీవితంలో ఎప్పుడూ అనుభవించనిది మీకు తెలుస్తుంది.

మీరు గత ముప్పై నలభై సంవత్సరాలుగా మీకు తెలిసిన పద్ధతిలో మీ తత్వంలో జీవించారు. ఈ మూడు రోజులు మాత్రం మీరు బయటి ప్రపంచంలో ఎవరినీ మార్చటానికి ప్రయత్నించవద్దు. మీరు ఈ ప్రయోగాన్ని చేసే మీ అంతరంగంలో అద్భుతాలు జరుగుతాయి. మీలో అద్భుతమైన, ఉన్నత రసాయన చర్య ప్రారంభమవుతుంది. మీరు నిజాయితీగా ఉండలేకపోతే దాన్ని కూడా ఒప్పుకోండి. ఆ నిజాయితీ అయినా చాలు, మీలోపల మరొక కోణాన్ని, మరొక స్థితిని చూడగలుగుతారు.

అపరాధభావం కేవలం లక్షణాలని మారుస్తుంది

మీరు స్పష్టంగా తెలుసుకోండి, అపరాధ భావంతో మీకు మీరు ఎటువంటి సహాయం చేసుకోలేరు. ఎవరైనా కనీసం ఒక్క వ్యక్తి అయినా అపరాధభావం వల్ల నేను మారాను అని చెప్పగలరా? లేదు. స్పష్టంగా తెలుసుకోండి, మీరు అపరాధ భావాన్ని వెల్లడి చేయటం మానేసి ఉంటారు. కాని మీరు అపరాధ భావం మూలాలకి వెళ్ళకపోతే అది మీ వ్యవస్థని పూర్తిగా వదలదు. కేవలం లక్షణాలు మారతాయి, అంతే.

చిన్నకథ : డాక్టరుగారు పేషెంట్‌తో 'నీ చెవులలో టెలిఫోన్ మోత వినపడుతుంది అనే సమస్యతో నా దగ్గరకి వచ్చావు కదా. మందులు వాడాకా ఎలా ఉంది అని అడుగుతాడు. 'మందులు వాడాక నాకు కేవలం ఎంగేజ్డ్ టోన్ మాత్రమే వినిపిస్తుంది.' అని జవాబు ఇస్తాడు.

రింగ్ టోన్ బిజీ సిగ్నల్‌గా మారవచ్చు. దాని అర్థం సిగ్నల్ పూర్తిగాపోయింది అని కాదు.

వేదకాలం నాటి సాంఘిక వ్యవస్థ Vs రాజకీయాలు ఆధారంగా ఉన్న వ్యవస్థ

ఏ సమాజమైతే అధికారం, రాజకీయాలు ఆధారంగా వ్యాపారులతో, రాజకీయ నాయకులతో సృష్టించబడిందో అది సహజంగా అందరిలో అపరాధభావాన్ని కలిగించే పద్ధతులని ఉపయోగిస్తుంది. వారిని నియంత్రణలో ఉంచాలి. అందుకే వారిలో అపరాధ భావాన్ని కలిగిస్తారు. అపరాధభావాన్ని కలిగి స్తేనే ప్రజలు వాళ్ళ కంట్రోలులో వాళ్ళు ఉంటారు. కాని జ్ఞానోదయమైన యోగీశ్వరులు అభివృద్ధి చేసిన సమాజం, ప్రజలని మరింత స్వేచ్ఛగా ఉండే విధంగా, వారు స్వేచ్ఛని మరింతగా వెల్లడి చేసే విధంగా తయారుచేసారు. ఈ రెండు సమాజాలకి మధ్య జ్ఞానోదయమైన యోగులు సృష్టించిన సమాజానికి, రాజకీయనాయకులు, వ్యాపారులు, సృష్టించిన సమాజానికి చాలా తేడా ఉంది.

యోగీశ్వరులు సృష్టించిన వ్యవస్థ ప్రజలకి నిరంతరం వారిమీద వారికి విశ్వాసం పెరిగేలా చేస్తుంది. మీకు అపజయం కలిగినా 'ఏమీ పరవాలేదు' అని వెన్ను తడుతుంది. మీరు తప్పుచేయగానే పాపాత్ములు కారు. పాపం చేయటం వేరు, పాపాత్ములుగా ఉండటం వేరు. జ్ఞానోదయమైన యోగీశ్వరులు సృష్టించిన వ్యవస్థలో 'పాపాత్ములారా' అనే పదుపయోగం కాని, సంబోధన కాని లేదు. ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడాలంటే 'అమృతస్య పుత్ర' అనేవారు. అంటే భగవంతుని రూపాలు అని అర్థం.

మీరు మీరుగానే సంపూర్ణులు

చిన్నకథ : ఒక శిష్యుడు గురువుగారి దగ్గరకి వెళ్ళి 'గురుదేవా! నేను ఏ విధంగా స్వేచ్ఛని (విముక్తిని) పొందగలను, అని అడుగుతాడు.

గురువుగారు, 'నిన్ను ఎవరు బందీగా చేసారు' అని ప్రశ్నిస్తాడు. శిష్యుడు 'నన్ను ఎవరూ బంధించలేదు' అని జవాబు ఇస్తాడు. అప్పుడు గురువుగారు, 'నిన్ను బంధించి ఉన్న గొలుసులు ఏవి? అని అడుగుతాడు. శిష్యుడు, 'నాకు గొలుసులు లేవు' అని జవాబు ఇస్తాడు. గురువుగారు, 'అయితే దేని నుంచి నీకు స్వేచ్ఛకావాలి?' అని అడుగుతాడు.

ఒక్కసారి జంతువులని చూడండి. వాటిలో అపరాధభావం ఉండదు. అవి ఏమిటో అదే విధంగా ఉంటాయి. వాటికి నీతి నియమాలు, కచ్చితంగా ఉండాలనే దృక్పథం, అసంతృప్తి ఇవేవీ ఉండవు. అందుకే అవి అందంగా, అమాయకంగా ఉంటాయి. కాని మనుషుల విషయంలో తాను ఎలా ఉండాలో, తన కుటుంబం ఎలా ఉండాలో, పరిస్థితులు ఏ విధంగా ఉండాలో, సంఘం ఎలా ఉండాలో అన్నీ తాను ఊహించిన విధంగా కోరుకుంటాడు. తాను కాని విధంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు.

అది ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే అది మంచిది కాదు కూడా. మీలో దాగి వున్న నైపుణ్యాన్ని వెలికి తీసి ఉపయోగించుకోవడం ఆరోగ్యకరం. కాని ఎక్కువ భాగం సమాజం మీ మీద బలవంతంగా మోపిన వాటితో లేదా ఎక్కడినుంచైనా అరువు తెచ్చుకున్న భావాలతో మీరు మీరుగా చూపించటానికి ప్రయత్నిస్తారు. అది మంచిది కాదు.

ఒక్కసారి మీ మీద విధింపబడిన కోరికలు, భావాలలో చిక్కుకుపోతే, మీరు ఎప్పటికీ రిలాక్స్ కాలేరు. మీ జీవిత ప్రయాణాన్ని ఆనందించలేరు. మీరు నిరంతరం అసంతృప్తితోనే ఉంటారు. మీలో అసంతృప్తి పెరిగే కొద్దీ మీరు మీ గమ్యాన్ని చేరలేరు. ఇది ఛేదించలేని వృత్తంలా తయారవుతుంది. అసంతృప్తి అనే నేలలో మేధ, సృజనాత్మకత అనే విత్తనాలు మొలకెత్తవు. కళ్ళకి గంతలు కట్టిన గుర్రంలా ఉంటారు. మీ ఆలోచనలు కుంచించుకుపోయి ఉంటాయి.

మీలో అసంతృప్తి లేనప్పుడు, మిమ్మల్ని మీరుగా ఒప్పుకోగలిగినప్పుడు, మీకు కావలసినవన్నీ ఇక్కడే ఇప్పుడే తీరుతాయి. సమాజం నిరంతరం మీరు సంపూర్ణులు కాదు అని చెబుతుంది. మీలో మీరు చాలా తక్కువ వారు అనే భావన కలిగే విధంగా చేస్తుంది. అప్పుడు మీ మీద మీకు విశ్వాసం ఉండదు. మీరు స్వతంత్రంగా ఉండలేరు. అప్పుడు మీలోని మేధ అణచివేయబడుతుంది. సమాజం చెప్పిన విధంగా నడుచుకుంటారు.

మీరు ఏది కాగలరో అదే మీరు చేయవలసింది, కేవలం రిలాక్స్ అవ్వటం, విశ్వశక్తిని మీ ద్వారా ప్రవహింప చేయటం అంతే. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో చిక్కుకుపోయారనుకోండి, మీరు రిలాక్స్ కాలేరు. మీరు టెన్షన్‌తో ఉంటారు, ఎప్పుడూ ఏదో తక్కువగా ఉన్నవారిలా ఉంటారు.

నిజమైన మతం మీరు మీరుగా సంపూర్ణులు అని చెబుతుంది. మీరు పూర్ణత్వంలోంచి వచ్చినప్పుడు మీరు మరొక విధంగా ఎలా ఉంటారు? మనిషి సంపూర్ణత్వం నుంచి జన్మించాడు. కాబట్టి అతని సహజలక్షణం సంపూర్ణత్వం. దీన్నే మహావాక్యంలో ఈ విధంగా చెబుతారు – అహం బ్రహ్మాస్మి, తత్వమసి అని. దీని అర్ధం నేను బ్రహ్మాన్ని. (బ్రహ్మాం అంటే విశ్వశక్తి విశ్వచేతన స్థితి. అదే ప్రతి వ్యక్తి ఆత్మకీ జన్మస్థానం )

మీరు సంపూర్ణత్వంతో ఉండేవారు. మీరు మరెక్కడికో చేరనవసరం లేదు. మీరు మీ గమ్యస్తానంలోనే ఉన్నారు. మీరు ఏదో కానవసరం లేదు. మీరు అదే, ఆ సత్యాన్ని మేలుకొలిపితే చాలు.

ప్రేమకి అర్హుడిని కాదు అనే అపరాధ భావం

చాలా మంది తాము ప్రేమకి అర్హులు కారు అనే భావంతో ఉంటారు. చిన్నతనంలో వారి మీద విధించిన నియమాలు వారు ఆ విధంగా అనుకోవటానికి కారణం. చిన్నతనంలో తల్లితండ్రులు నీవు ఇది చేస్తేనే నీవంటే నాకు ప్రేమ, నీవు అది చేస్తే చాక్లెట్ ఇస్తాను, నా మాట వింటే సినిమాకి తీసుకువెళతాను అంటుంటారు. ఇలాంటివన్నీ మీలో నాటుకుపోయి ఉంటాయి. దీంతోనే మీరు పెరిగి పెద్దవారవుతారు. మీలో నేను ప్రేమించబడటానికి అర్హత ఉండాలి అనే బలమైన భావన లోతుగా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఏ కారణం లేకుండా ప్రేమిస్తే అపరాధ భావంతో ఉండాలి అనుకుంటారు. నా దగ్గరకి వచ్చే చాలామంది అటువంటి గిల్ట్‌తో వస్తారు. స్పష్టంగా అర్థం చేసుకోండి, మీరు ఇక్కడ ఉంది ఏదో అర్హత వల్ల కాదు ఇక్కడ మీరు ఉంది. విశ్వశక్తి ప్రవాహానికి అనుగుణంగా అందులో భాగంగా ఇక్కడ ఉన్నారు. ఈ విషయంలో నేను దీనికి అర్హుడనేనా, కాదా అనేది ఏదీ లేదు. నేను నీటితో నిండి ఉన్న మేఘాన్ని. మీ మీద వర్షం కురిపించటానికి మీకు ఏ అర్హతలూ అవసరం లేదు.

గురుదేవుల ప్రేమని పొందటానికి మీకు ఎటువంటి అర్హతలూ అవసరం లేదు. ఎవరూ ఆ అర్హతలని అడగరు. మీరు వికసించి విప్పారి ఉంటే చాలు, మీరు చేతులు చాచి ఉంటే అందుకోగలరు. అపరాధభావం అనే గొడుగుని వేసుకొని ఉంటే సహజంగానే మీరు దేన్నీ పొందలేరు.

అపరాధ భావం Vs కృతజ్ఞత

మీలో అపరాధ భావం ఉంటే సర్వాంతర్యామితో అనుబంధాన్ని పెంచుకోలేరు. ఆ భావం నుంచి బయటకి రావాలి అంటే అత్యున్నతమైన ఆత్మతో అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. కానీ మీలోని అపరాధభావం అడ్డుగా నిలబడుతుంది. ఈ భావం నుంచి బయటకి రావాలి అంటే కృతజ్ఞతా భావంలో కరిగిపోవాలి. దేన్నెనా స్వీకరించి ఒప్పుకోగలిగినప్పుడు కారణం లేని సర్వాంతర్యామి దీవెనలని అనుభవించినప్పుడు మీరు కృతజ్ఞతతో నిండిపోతారు. కృతజ్ఞతల సువాసనలు మీ అంతరంగమంతా వ్యాపించినప్పుడు అందులోని అపరాధభావం అనే చెడువాసన మాయమౌతుంది.

అపరాధభావంతో మీరు జీవితాన్ని ఒక ఉత్సవంగా గడపలేరు. అది మీ గుండెల మీద రాయిలా ఉంటుంది. అది బరువుగా గట్టిపడిపోయి ఉంటుంది, అది మీరు స్వేచ్ఛగా నాట్యం చేయటానికి, పాడటానికి, నవ్వటానికి, ప్రేమించటానికి అవకాశం లేకుండా చేస్తుంది.

పూర్తిగా స్వీకరించి, అధీనమవటం

ముఖ్యంగా గురుశిష్యుల సంబంధాలలో చాలామంది అపరాధభావంతో ఉంటారు. గురువు విషయం వచ్చేసరికి మీరు ఆయనతో ఎలాంటి అనుబంధాన్ని కలిగిఉండాలి. ఆయన సూచనలు ఎలా స్వీకరించాలి. ఇటువంటి విషయాలలో మీకు కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. వాటి ఆధారంగా మీలో మీరు గిల్ట్‌ని కలిగించుకుంటారు. గురువుగారిని మీరు ఉన్న స్థితిలోనే మీలోనికి ఆహ్వానించండి. ప్రతిదశ, ప్రతిస్థితి సరైనవే. ప్రతి సంబంధం సరైనదే. మీరు ఏమనుకుంటున్నారో దాన్ని అదే విధంగా అనుకోండి, అది చాలు.

మీరు ఏమనుకుంటున్నారో మీ గురించి, మీ గురువుల గురించి ఎలా అనుకుంటున్నారో దాన్ని నిజాయితీగా అనుకోండి. అయన మీరు అంతిమగమ్యానికి ఎలా చేరాలో చూపిస్తాడు. ఇతరుల వైపు చూసి మీరు ఆదర్శాలు నిర్ణయించుకోవద్దు. మీకు మీ గురువుగారితో ఉండే అనుబంధం చాలా ప్రత్యేకం. మీ దారిలో మీరు ఆయనతో సన్నిహితంగా ఉంటారు. మీరు కానిదాని వైపు మిమ్మల్ని దాటి దూకవద్దు. అప్పుడు మీకు సమస్యల్ని సృష్టించుకుంటారు, అపరాధభావంతో ఉంటారు.

మిమ్మల్ని మీరు అదే విధంగా స్వీకరించండి. సంపూర్తిగా నిబంధనలు ఏమీ లేకుండా స్వీకరించాలి. అలా చేసినప్పుడు సంపూర్ణమైన, గాఢమైన విశ్రాంతిలో ఉండవచ్చు. అప్పుడు మీలో సహజమైన మేధ వికసిస్తుంది. మీలో మంచి మార్పు వస్తుంది. మీ అంతరంగపు లోతులలో మీరు ఏమిటో తెలుసుకోగలుగుతారు. అకస్మాత్తుగా మీలో కదలికలు ప్రారంభమై మీరు ప్రవహిస్తూ ఉంటారు. మీరు తెలుసుకోగల లక్ష్యం వైపు ప్రవహిస్తూ ఉంటారు. నది సాగరసంగమానికి ఏ విధంగా ప్రవహిస్తుందో ఏ నియమనిబంధనలూ, ఎటువంటి సూచనలు లేకుండా ఏ విధంగా ప్రవహిస్తుందో, మీరు కూడా అదే విధంగా ప్రవహిస్తారు.

జీవించటం, ప్రవహించటం ప్రారంభించండి. మీరు ఏ విధంగా ఉంటారో అదే విధంగా సర్వాంతర్యామికి అధీనమైపోయి అంతిమ ఆనందాన్ని పొందండి. అపరాధభావం వద్దు. ఏదో పోగొట్టుకున్నాం అని భయపడవద్దు. మీరు ఎప్పుడూ దేనికోసమైతే వెతుకుతున్నారో అది మీలోనే ఉంది, మీరు ఎప్పుడూ సంపూర్ణమైనవారే. మరి ఏ విధంగా దాన్ని పోగొట్టుకుంటారు. మీరు పూర్తి విరామంలో ఉన్నప్పుడు ఆ సంపూర్ణత్వాన్ని తెలుసుకుంటారు. కాని మీరు అపరాధభావంతో ఉంటే మీలో ఖాళీని సృష్టిస్తారు. అప్పుడే మీరు అసంపూర్ణులం అని, సంపూర్ణత్వానికి దూరం అవుతారు.

అది ఈ విధంగా ఉంటుంది; చిన్న పిల్లలతో వేదాంతవిషయాలు చర్చించారనుకోండి, వాళ్ళు ఏమి చేస్తారు. సహజంగానే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు గెంతుతూ, ఆడుతూ ఉంటారు. వేదాంతంలో తప్పు ఉంది అని అనగలరా? లేదు. అదే విధంగా మీరు ఏమిటో అదే మీరు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. దేన్నెతే మీరు స్వీకరించగలరో దాన్ని తీసుకోండి. మీరు పొందగలను అని ఊహించినవి పొందలేనప్పుడు అపరాధభావంతో ఉండవద్దు.

మీరు దూకేందుకు ప్రయత్నించినప్పుడే ఒత్తిడికి లోనవుతారు. అప్పుడు మీరు సాధించాలి అనుకున్నదాన్ని సాధించటానికి ఎక్కువ సమయం పడుతుంది. జెన్‌బౌద్ధంలో ఒక మాట ఉంటుంది. 'మీరు దేని వేగమైనా తగ్గించాలి అనుకుంటే, వేగంగా పనులు చేయండి' అని. మీరు దేన్నెనా త్వరగా చేయాలి అని అనుకుంటే, మొగ్గ రేకులని బలవంతంగా విప్పటమే. దాన్ని పుష్పించటం అని అనగలరా? మొగ్గని బలవంతంగా విరిసేలా చేయలేం.

సమయం వచ్చినప్పుడు, పరిణతి కలిగినప్పుడు, జరగవలసినవి జరుగుతాయి. జరగవలసిన సమయంలో జరిగితేనే జీవితం అందంగా ఉంటుంది. కొన్నిసార్లు నేను చెప్పేది ఇప్పుడు వింటారు. కాని కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం అయ్యాక మీరు విన్నది అప్పుడు అర్థం అవుతుంది. నేను మీలో వేసే విత్తనం నిద్రావస్థలో ఉండవచ్చు. సరైన సమయం వచ్చినప్పుడు అది మొలకెత్తుతుంది. అలా అయితే ఫరవాలేదు. దాని గురించి కంగారుపడవద్దు, అపరాధభావాన్ని పెంచుకోవద్దు. మీరు ఆ విధంగా బాధపడితే ఆ కంగారులో, విత్తనం పోతుంది.

జీవితం ఒక కల

మీరు నిజంగా చూస్తున్నాను అనుకునేదంతా ఒక కల. ఈ సత్యాన్ని తెలుసుకోవటమే నిజమయిన జ్ఞానం. అప్పుడు రిలాక్స్ కాగలరు. అప్పుడే కలతో సంతోషంగా ఉండగలరు. ఎందుకంటే కల నిజం కాదు అని మీకు తెలుసు కాబట్టి. ఇది చెస్ ఆటలాంటిది. ఆడేవాళ్ళకి సరియైన ఎత్తు తెలియదు. బయట ఉండి ఆట చూసేవారికి అది తెలుస్తుంది. ఎందుకంటే వారు ఆటలో లీనమవ్వరు కాబట్టి. అతను చక్కగా, ఆటని సంతోషంగా చూడగలడు. వివేకంతో తరువాత ఎత్తు గురించి చెప్పగలడు.

మీరు గమనిస్తున్నప్పుడల్లా జీవితాన్ని ఎక్కువగా ఆనందించగలరు. అది ఒక కల. దానిలో మీరు పోగొట్టుకునేది ఏదీ లేదు – అని తెలుసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. అప్పుడు అపరాధభావం కూడా ఉండదు. జీవితం ఉత్సవంలా ఉంటుంది. ప్రపంచంలోనే ఉంటూ దాని చేత ప్రభావితం కారు. అపరాధభావం లేకుండా, ఆనందంగా ఉండగలుగుతారు.

ఇది ఎలా ఉంటుందంటే – సినిమాకి వెళ్ళి చూస్తూ, అది నిజం కాదు అని అనుకుంటారు. అందుకే సినిమాని మీరు ఎంజాయ్ చేసారు. తెర మీద ఏం జరిగినా ఎంజాయ్ చేసారు.

ఇంటికివచ్చి దాన్ని మరిచిపోతారు. జీవితం అదే విధంగా ఉంటుంది. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద తెర. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మీరు ఈ కలని లేదా సినిమాని ఎంజాయ్ చేసారు. దాన్ని ఎంజాయ్ చేయటం తప్పు కాదు అని తెలుసుకుంటారు.

"మరొక గురువుని అనుసరిస్తున్నాను" అనే అపరాధభావం

మరొక సాధారణమైన అపరాధభావం మరొక గురువుని అనుసరించటం. అర్థం చేసుకోండి. రకరకాల గురువుల పట్ల విభేదం అంటే, అది మీ లోపల జరుగుతున్న విభేదమే. ఇద్దరు నిజమైన గురువుల మధ్య విభేదం ఉండదు. గురువులందరిలో ఉండేది ఒకే శక్తి కాబట్టి విభేదాలు అవసరం లేదు.

నేను ఎప్పుడూ చెబుతుంటాను, అంతా వెతకండి, అన్ని తోటల లోంచీ మంచి పూలని తెచ్చుకొని అందమైన పూలహారాన్ని చేసుకోండి. కాని సమస్య ఏమిటంటే అన్ని తోటలకీ వెళతారు, కాని ఏ తోటలోంచీ పూలు తెంచుకోరు, కానీ ముక్సని తెంచుకుంటారు. ఏదో అలా చూస్తూ వెళుతుంటే, విండో షాపింగ్ చేస్తే, మీరు ఏ గురువు దగ్గర ఏమీ నేర్చుకోలేరు. మీరు నిజాయితీగా చాలా మంది గురువుల దగ్గరకి వెళ్ళి నేర్చుకోదగినవన్నీ నేర్చుకొని మీరు దృఢంగా తయారవ్వగలగాలి. మీకు చాలా విషయాలు తెలిసాక, ఆ పరిణతి వచ్చాక ఒక గురువు దగ్గర స్థిరపడాలి. అప్పుడు మీరు గురువు సహాయంతో లోతుగా వెళ్ళగలుగుతారు. మీరు ఏ గురువు నుంచీ ఏదీ నేర్చుకోలేకపోతే, ఒక గురువు దగ్గరే ఉండిపోవటం మంచిది. అంతమంది దగ్గర నేర్చుకోలేనిది ఒకరి దగ్గర నేర్చుకోవటంలో ఇబ్బంది లేదు. విండో షాపింగ్‌లా గురువుల దగ్గరకి వెళ్ళటం వృథా. దాని వల్ల వారికి, మీకు సమస్య. గురువుని ఒక బోధకుడిగా మాత్రమే చూస్తే, అతన్ని మార్గంలా చూడకపోతే అతన్ని వదిలేయండి.

దీనికి ఒక కొండ గుర్తు ఏమిటంటే – మీ గురువుని చూడగానే కారణం లేకుండా మీ హృదయం ఆయనకి అంకితం అయిపోతుంది.

ధ్యాన పద్ధతులు

తిరిగి జీవించటమే విముక్తి : తిరిగి జీవించటమే విముక్తి. మీలోని అపరాధ్యభావాన్ని వదిలివేయాలంటే తిరిగి అందులో జీవించండి, ధ్యానభావంతో కూర్చోండి. కళ్ళు మూసుకొని మీలోని అపరాధభావాన్ని ఒక దాని తరువాత ఒకటిగా బయటకి తీసుకురండి. ఆ గాయాన్ని తిరిగి మీలోనికి తెచ్చుకోండి. దాని నుంచి తప్పులు తెరచి ఆ వివరాలన్నీ పేపర్ మీద రాయండి. వివరంగా రాయండి. మీరు ఆ గిల్ట్ భావం నుంచి విముక్తి పొందుతారు.

తల నుంచి హృదయం దగ్గరకి : కళ్ళు మూసుకొని కూర్చోండి, నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోండి. అలా కొన్ని నిముషాలు చేయండి. అలా చేస్తూ మీ తలని హృదయం లోనికి నొక్కినట్టు ఊహించండి. తల లేకుండా ఉండండి. ఇప్పుడు మీకు తల లేదు. తల లేకుండా ఉన్నారు. మీరు హృదయం నుంచి వాసన చూస్తున్నారు. హృదయం నుంచి శ్వాస తీసుకోవటాన్ని స్పష్టంగా చూడండి. హృదయం నుంచి వినండి. హృదయం నుంచి అనుభవించండి.

నిలబడి హృదయాన్ని మాత్రమే తెలుసుకుంటూ నెమ్మదిగా శరీరాన్ని కదిలించండి, నడవవద్దు. మీరు హృదయం నుంచి కదులుతున్నారు. మళ్ళీ మళ్ళీ తలని మరిచిపోండి. హృదయం నుంచే కదలండి, మీకు తల లేదు.

ఒక చోట నిలబడి శరీరం కదలికలని ఇంకా పెంచండి హృదయం నుంచి మాత్రమే కదలండి, తలని మరిచిపోండి. తల లేని వ్యక్తిగా కదలండి. (కొన్ని నిముషాల తరువాత) ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చోండి. తల లేకుండా కూర్చోండి. హృదయంతోనే కూర్చోండి. రిలాక్స్ అవ్వండి. (కొన్ని నిముషాలు అయ్యాక) నెమ్మదిగా కళ్ళు తెరవండి.

గమనించండి : ఏ భావాన్నెనా, అపరాధభావాన్నెనా గమనించటం ద్వారా దాని నుంచి విముక్తి పొందవచ్చు. కేవలం గమనించండి. దీన్నే సాక్షి అంటారు. సూఫీలు సహద అంటారు. ఇంకేమీ చేయవద్దు. వ్యతిరేకభావాలు ఉన్నప్పుడు ఏం చేసినా తప్పు అవుతుంది. ఆ తరువాత అపరాధభావం వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇంకేమీ చేయకుండా కేవలం గమనించండి, దాన్ని చూడండి. అది అక్కడ ఉంది మీరు కాదు. మీరు కేవలం చూసే వ్యక్తి. అది ఏ విధంగా పోతుందో చూసి ఆశ్చర్యపోతారు. అది అక్కడ ఎప్పటికీ ఉండదు. సహజంగా మనస్సు తన స్థితిని మారుస్తూ ఉంటుంది. కొన్ని నిముషాలలో అపరాధభావం పోతుంది. అది తన శేషాన్ని కూడా వదలకుండా పూర్తిగా మీ నుంచి వెళ్ళిపోతుంది.

  • ★ అపరాధభావం అన్నింటి కంటే పెద్ద పాపం అది మీరు జీవించి ఉండగానే శిక్షిస్తుంది.
  • స్కర్గం, నరకం అనేవి రెండూ భౌతికంగా ఉండే ప్రదేశాలు కాదు. అవి మీ మానసికస్థితి మాత్రమే. మీరు సృష్టించుకునే అపరాధభావం.
  • ★ మనస్సు అనే నదిలో ఉన్న అపరాధ భావం అనే రాతి బండ ని ప్రవహింపనీయకుండా ఆపే అడ్డంకి.
  • ఎప్పుడైతే అపరాధభావంతో ఉంటారో మిమ్మల్ని ఆడించటం సులభం. ★
  • ★ మీరు ఒక్కసారి ఏకాగ్రతతో ఉండగలిగితే మీరు తెలుసుకునే తత్వం మీద కేంద్రీకృతులవుతారు.

పోలిక, అసూయ

భయం, కోరిక, అపరాధం అనేవి వ్యక్తిగత భావావేశాలు. ఇవి కలగడానికి వస్తువు కాని, వేరే వ్యక్తి కాని అవసరం లేదని నా అర్థం. మీరు స్పర్శకి, వాసన, రుచి చూడటానికి అవకాశం లేని ఒక గదిలో కళ్ళుమూసుకుని కూర్చున్నట్లుగా ఊహించుకోండి. అప్పుడు కూడా భయం, కోరిక అనేవి కలుగుతాయి కాని, అసూయకి అవకాశం లేదు. ఇంకొకరితో పోల్పుకుని, అతనంటే అసూయ పడాలంటే వేరొక వ్యక్తి ఉండాలి. అందుకే అసూయ విషయాత్మకమైన భావావేశం. ఒక వ్యక్తి లేదా వస్తువు వల్ల ప్రేరేపింపబడే భావం.

చిన్నకథ : ఒక సాయంకాలం, ఓ వ్యక్తి తన భార్యతో పార్కులో బల్ల మీద కూర్చుని ఉన్నాడు. వారిని గమనించకుండా, ఒక యువకుడు, అతని స్నేహితురాలు అదే బల్ల మీద వారి పక్కన కూర్చున్నారు. ఆ యువకుడు ఆమెతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు.

ఆ మాటలు విన్న భార్య తన భర్తతో, 'అతను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని చెబుతాడేమో, మీరు కొంచెం దగ్గరగా వెళ్ళి అతన్ని హెచ్చరించండి' అంటుంది. 'నన్ను ఎవరూ అలా హెచ్చరించలేదు. నేను ఎందుకు హెచ్చరించాలి?' అని సమాధానం ఇచ్చాడు, ఆమె భర్త.

పోలికతో అసూయ మొదలవుతుంది. మనం ఎప్పుడూ రూపం, ఆస్తి, జ్ఞానం, పేరు పోల్చుకున్నప్పుడు వారికి మనకంటే ఇంకా ఎదో ఎక్కువగా ఉంది అనుకొని అసూయపడతాం. పోలిక విత్తనం అయితే, అసూయ దానికి కాసే ఫలం.

పోలిక ఎందుకు?

మనం ఎందుకు ఇతరులతో పోల్చుకుంటాం?

మొదటగా మనని మనం అర్ధం చేసుకోలేదు కాబట్టి పోల్సుకుంటాం. మనం ఎవరమో, ఏమిటో అనేది మనకు తెలియదు కాబట్టి పోల్సుకుంటాం. రెండవది పుట్టినప్పటి నుంచి ఇతరులతో పోల్సుకుని మన విలువను నిర్ణయించేట్టు, సమాజం మనకి నేర్పించింది. చిన్నప్పటి నుండి పోలిక మొదలవుతుంది. స్కూలులో గ్రేడింగ్ పద్ధతి వల్ల పిల్లల్లో పోటీ, ఇతరులలో పోలిక అనేవి మొదలవుతాయి.

ఒక అబ్బాయికి లెక్కలు బాగా వచ్చునా లేకపోతే శాస్త్రజ్ఞానంలో ప్రతిభ క్రీడాసామర్థ్యం, ఇలాంటివి కొలవాలంటే ప్రామాణికమైన కొలబద్దలున్నాయి. కాని మనం ఆ పిల్లవాడి గుణగణాలు కొలిచేటప్పుడు పోలిక అనే సేబులతో కొలుస్తాం. 'బహుమానం' అనే పద్ధతిని ప్రవేశపెట్టి ఒక విధంగా పిల్లలనందరినీ శిక్షిస్తున్నాం. ఆ పిల్లవాడు ఇతరులతో పోల్చుకొని తన గురించి తెలుసుకోవడానికి అలవాటుపడతాడు. తను ఏమిటో తనంతట తాను అర్ధం చేసుకోలేదు. అతని గురించి తెలుసుకోడానికి ఇతరుల మీద ఆధారపడతాడు.

చిన్నకథ : ఒక వ్యక్తి న్యాయస్థానంలో ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సాక్ష్యం ఇస్తున్నాడు. హఠాత్తుగా, తాను చెబుతుంది న్యాయస్తాన విలేఖరి రాసుకోవడం గమనించాడు. ఆ వ్యక్తి ఎంత తొందరగా మాట్లాడుతున్నాడో ఆ విలేఖరి అంత వేగంగా రాసుకుంటున్నాడు. ఆ వ్యక్తి 'దయచేసి, అంత వేగంగా రాయకండి, నేను మీ వేగాన్ని అందుకో లేకపోతున్నాను' అని విలేఖరితో అన్నాడు.

మీ గురించి నిర్ణయించే ప్రతీదీ, ఎదో ఒక పోలికపై ఆధారపడి ఉంటుంది. కాని ఎందువల్ల నీ మనస్సులోకి ఇంకొకరి గురించి ఆలోచన వస్తుంది? ఎందుకంటే నీలోనికి చూసుకొని నీవెవరివో తెలుసుకోలేదు. నీలో ఉన్న ఆనందాన్ని, గొప్ప సామర్థ్యాన్ని నీవు అనుభూతి చెందలేదు కాబట్టి. నీవు ఎలా ఉన్నావో అలా వ్యక్తపరచలేనందువల్ల అసంపూర్ణంగా ఉన్నానని అనుకుంటావు. నీలో శూన్యత, సంపూర్ణత్వం లేనందువల్ల నీవు ఇతరుల కంటే తక్కువ స్థాయిలో ఉన్నానని అనుకుంటావు.

పోలిక వ్యర్థం

'బంధాలలో తప్పిస్తే ఇంకేదీ లేదు' అని బుద్ధుడు అంటాడు. ఒక కొత్త గ్రహం మీద మీరు ఒక్కరే ఉంటే ఎవరితో పోల్చుకుంటారు? మనం పోల్చుకోడానికి ఎవరూ లేనప్పుడు మనం మనమే. అర్థం చేసుకోండి, ఇప్పుడు కూడా మీరు ఎవరితోనెనా పోల్చుకోదానికి కొలబద్ద ఏదీ లేదు. ప్రతీ వ్యక్తికీ ప్రత్యేకత ఉంది. మీరు ఒక సింహాన్ని గుఱ్ఱంతో పోల్చగలరా? మనం ఎప్పుడైనా పువ్వులతో లేదా పక్షులతో లేదా పర్వతాలతో పోల్చుకుంటామా? అలాంటప్పుడు ఇతర మనుష్యులతో ఎందుకు పోల్సుకోవాలి?

ఒక చక్కని బౌద్ధ కథ : ఒక రాజు తను పొరుగు రాజుల కంటే శక్తిమంతుడు అవటానికి ఏదైనా సాధన చెప్పమని అడగటానికి ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజు గురువు ఎదుట కూర్చుని తాను వచ్చిన పనిని చెబుతాడు. గురువు చాలా ఓపికగా రాజు చెప్పింది విన్నాడు. గురువు రాజుతో 'రాజా! తోటలో గులాబీ మొక్క గానుగ చెట్టు పక్కపక్కగా ఎదుగుతున్న చోటికి వెళ్ళు, నీవు నేర్చుకోవలసింది, అవి నేర్పుతాయి', అంటాడు.

రాజు తోటలోకి వెళ్ళి ఆ రెండింటినీ చూసాడు, కాని అతనికి ఆ రెండు మొక్కల నుండీ ఏమి నేర్చుకోవాలో అర్థం కాలేదు. అతను తిరిగి గురువు దగ్గరకు వెళ్ళి 'మీరు అన్నది ఏమిటో నాకు అర్ధం కాలేదు. ఈ మొక్కలు నాకు ఎలా నేర్పుతాయో నాకు అర్థం అవటం లేదు' అని అంటాడు.

ఆ గురువు రాజుని తోటలోకి తీసుకు వెళ్ళి, రాజా ఈ గానుగ చెట్టు, గులాబీ మొక్క చాలా సంవత్సరాల నుండి, పక్కనే ఉన్నా, ఒక్కసారి కూడా గులాబీ మొక్కలా అవ్వాలి అని గానుగ అనుకోలేదు. అలాగే గులాబీ మొక్క గానుగ చెట్టులా అవ్వాలని అనుకోలేదు. ఒక మనిషి గానుగ చెట్టు స్తానంలో ఉంటే, అతను గులాబీ మొక్కతో పోల్సుకుని ఆ మొక్కని అందరూ శ్రద్ధగా చూస్తున్నారని అసూయపడేవాడు. లేదా ఆ మనిషి గులాబీ మొక్క అయి ఉంటే, గానుగ చెట్టుకేసి అసూయగా చూసి, ఇది ఎంత ప్రశాంతంగా ఉంది, దాన్ని తుంచి ఎవరూ బాధ పెట్టటం లేదని అనుకునేవాడు. ఆ రెండు మొక్కలూ తమ మొత్తం శక్తిని పెరగడానికి ఉపయోగించుకొని, పోల్చుకోకుండా, బాగా వృద్ధి చెందాయి' అని వివరంగా చెబుతాడు.

మీరు ఏ క్షణం పోల్చుకోడం ఆపేసారో ఆ క్షణమే అసూయ మాయవుతుంది. దానికి బదులు మీలో సంతృప్తి నిండి, సర్వాంతర్యామికి కృతజ్ఞతాభావాన్ని తెలియచేస్తారు. లేకపోతే మీకు ఇతరులంటే అసూయ కలిగి బాధపడతారు. మీరు నిరంతరం మీతో లేదా ఇతరులతో పోట్లాడుతూ ఉంటారు. ఎవరైనా నవ్విసప్పుడు మిమ్మల్ని చూసి నవ్వారనుకుంటారు. ఏ వ్యక్తి అయినా ఇంకొకరితో స్నేహంగా ఉంటే, ఆ వ్యక్తి అంటే అసూయ ఏర్పడుతుంది. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టాలనుకుంటారు. మీ లోపలి అసూయ గాయంలా ఉంటుంది. నిన్ను బాధపెట్టకూడని ఏ పనైనా సరే, మీ లోపలి గాయాన్ని తాకి మీకు బాధ కలిగిస్తుంది.

మీకు బాధ కలిగినప్పుడు లోపల గాయం ఉందని అర్థం చేసుకోండి. మీ బాధకి మరెవరో బాధ్యులు అని అనుకోవద్దు. ఆ గాయం మానాలి, అసూయ కరిగిపోవాలి, అప్పుడు మిమ్మల్ని ఎవరూ బాధపెట్టలేరు. స్పష్టంగా అర్థం చేసుకోండి, మీరు నిశ్శబ్దంగా అనుమతించకపోతే మిమ్మల్ని బాధించేవారు ఉండరు.

మీలో ఏదో లోపం ఉందని, మీరు ప్రతి ఒక్కరితో పోల్సుకుంటున్నారు. నిజానికి మీ ప్రత్యేకమైన సామర్థ్యం గురించి మీకు ఏ విధమైన భావమూ లేదు. మీకు తెలిసిఉంటే ఒక్క క్షణం కూడా సృజనాత్మకంగా పరిపూర్ణంగా ఎలా జీవించాలి అనే దానికి సమాధానం బయటి ప్రపంచంలో వెతకరు. మీకు కావలసిన మేధాశక్తి, విశ్వాసం చురుకైన శక్తి అన్నీ మీలోనే ఉన్నాయి. మీకు భగవంతుడిలా భూమి మీద జీవించే సామర్థ్యం ఉంది. మీ లోపలికి తొంగిచూడండి. పరిశోధించి, పరిశీలించి, మీరు ఎవరో అన్న నిజం తెలుసుకోండి. అప్పుడు పైన చెప్పిన గుణాలన్నీ అప్రయత్నంగా మీ నుండి ప్రసరిస్తాయి.

నీకునీవే సర్వశ్రేష్ఠుడివి, ఇక పోల్సుకోవటం ఎందుకు?

నిచ్చెనకి పైన, కింద

ఒక పెద్ద నిచ్చెన మీద అందంగా లేదా తెలివిగల వాళ్ళని ఎక్కువ నుంచి తక్కువ ప్రాధాన్యంలో ఒక వరుసలో నిలబడమన్నారు అనుకోండి, ఆ నిచ్చెన మీద మీ స్తానం ఎక్కడో మధ్యలో ఉంటుంది. మీ పైన చాలమంది ఉన్నారు. అలాగే మీ కింద కూడా చాలామంది నిలబడి ఉన్నారు. మీ పైన ఉన్నవారిని చూస్తే అసూయ కలిగి మీరు నిరంతరం వారికంటే ఎక్కువ స్టాయిలో ఉండాలని ప్రయత్నిస్తారు.

మీరు కిందికి చూసే ఏమి కనిపిస్తుంది? మీ కింద చాలామంది ఉన్నారు. అంతమందిని చూసి నేను మరీ అంత తక్కువ స్తాయిలో లేను అన్న ఆనందం కలుగుతుంది. మీలో ఆశ చిగురిస్తుంది. ఇక్కడ అసలు పోరాటం మొదలవుతుంది. మీరు పైకి చూసే బాధకలుగుతుంది. కిందికి చూసే ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మీరు నిచ్చెన ఎక్కడం వ్యర్థం అని తెలుసుకున్నా మీరు కిందికి దూకలేరు. మీరు కిందికి దూకేస్తే, ఒంటరిగా మిగిలిపోతారు, మీ పైన లేదా కింద ఎవరూ ఉండరు.

కోరికలు Vs అవసరాలు

మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీకు అందమైన ఇల్లు, ఒక చక్కని కారు ఉన్నందుకు ఆనందంగా, సంతృప్తిగా అనిపిస్తుంది. కొంతసేపైన తరువాత మీ కారులో బయటికి వెళ్ళి సిగ్నలు దగ్గర ఆగినప్పుడు, పక్కనే ఒక కొత్త మెర్సిడెజ్ కారు కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? తక్షణం మీ కారు అంత గొప్పగా అనిపించదు. అప్పుడు మనస్సులో కొత్త కారు కొనుక్కోవాలి, మెర్సిడెజ్ ఎందుకు కొనుక్కోకూడదు? అన్న ఆలోచన వస్తుంది. కొంతసేపటి క్రితం, మీకు ఉన్నవాటితో ఆనందం కలిగింది, కాని ఇంకెవరి కారునో చూసిన తరువాత మీలో అదే కారు ఉంటే బావుంటుంది అన్న కోరిక ప్రవేశించింది. మీరు ఆ కారు యజమాని కోరికని అప్పు తెచ్చుకున్నారు, ఇది పోలిక వల్ల కలిగిన కోరిక.

ఇది తెచ్చిపెట్టుకున్న కోరిక, అవసరం కాదు. ఇలా చేసి చూడండి, మీకు కోరికలు కలిగినప్పుడు, వాటిని నిజాయితీగా విశ్లేషణ చేసుకోండి. మీ హోదాకి అడ్డువచ్చే సమస్యలన్నీ వదిలేసి ఆత్మవిశ్లేషణ చేసుకోండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ పరువుని వదలకపోతే ఇతరులలో ఉన్నప్పుడు ఎలా వదలగలరు? మనస్సుకి స్వభావసిద్ధంగా సంతృప్తి కలగదు, సంతోషం ఉండదు, వర్తమానంలో ఉండలేరు. మనస్సు భూత భవిష్యత్తుల మధ్య ఊగిసలాడుతుంది. అది వర్తమానంలో ఉండలేదు, ఎందుకంటే ఈ క్షణంలో ఆలోచనలు ఉండవు. అందుకే మనస్సు కోరికల వెంట పరుగెడుతుంది.

మనం ఏవి మన కోరికలో, ఏవి ఇతరుల దగ్గర నుంచి తెచ్చుకున్న కోరికలో తెలుసుకోవాలి.

మహావీర అనే జ్ఞానోదయమెన యోగి, జైనమతాన్ని స్థాపించిన గురువు ఇలా అంటారు. 'నీవు పుట్టినప్పుడు నీకు జీవితకాలం అవసరాలు తీర్చుకునే శక్తిని నీతో పంపిస్తారు.' నిన్ను భూమి మీదకు పంపే ముందు సర్వాంతర్యామి నీవు సంతోషంగా, సంత్సప్తిగా నీ జీవితాన్ని గడపటానికి నీకు కావలసినంత శక్తిని ఇస్తారు. కాని ఈ శక్తిని మీరు తెచ్చిపెట్టుకున్న కోరికలు తీర్చుకోదానికి వినియోగిస్తే, కోరికలన్నీ తీరడానికి సరిపోయినంత శక్తి మీకు లేదనిపిస్తుంది. మీ సొంత కోరికలు తీరనందువల్ల మీకు అసంతృప్తిగా ఉంటుంది. మీ అవసరాలన్నీ తీర్చుకునే శక్తి మీ దగ్గర ఉంటుంది, కానీ అన్ని కోరికలూ తీర్చుకునేందుకు కాదు. ఒక కోరిక తీరిందంటే ఇంకా ఎన్నో కోరికలు ఇతరుల నుండి తెచ్చిపెట్టుకున్నవి వస్తాయి.

చేయటం, పొందడం, ఉండడం

మనం చేయదం, పొందడం, ఉండడం అనే మూడు అంశాల చుట్టూ పని చేస్తాం. జీవించడంలో ఆనందించకుండా, పొందడానికి ఎప్పుడూ పని చేయడమే మన బాధలకి కారణం. చేయడం అనేది పొందడాన్ని చేరుకోలేదు. ఏదైనా ఒక కోరిక తీరడానికి మీరు కష్టపడి పనిచేసారు. హఠాత్తుగా ఆ కోరిక మీ మీద పట్టు వదిలేస్తుంది.

రమణమహర్షి ఇలా అంటారు, మనస్సు ఎలాంటిదంటే ఆవగింజని పొందేవరకు అది ఒక పెద్ద పర్వతంలా కనిపిస్తుంది. ఒకసారి దాన్ని పొందిన తరువాత, పెద్ద కొండ కూడా ఆవగింజలాగ కనిపిస్తుంది. '

ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పైకి మీ మనస్సు లాగుతుంది. మొదటిది తీరినందువల్ల మీకు సంతోషించడానికి కూడా సమయం ఉండదు. మీరు, 'ఈ ఒక్కటి పొందిన తరువాత, నేను హాయిగా ఉన్నవాటితో సంతోషంగా ఉంటాను' అని అనుకుంటారు. స్పష్టంగా తెలుసుకోండి, మీ మనస్సు అలా చెయ్యనివ్వదు!

జీవితాన్ని సంతోషంగా గడపాలంటే, నిజంగా జీవించాలంటే, పనిచేయడమే సంతోషంగా చెయ్యాలి. అప్పుడు చేయడం, పొందడం, ఉండడం అనేవి వాటంతట అవే జరుగుతాయి.

మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి

వెదురు మొలకెత్తినప్పుడు, మొదటి నాలుగు సంవత్సరాలూ అంత పెరుగుదల ఉండదు. అయిదవ సంవత్సరంలో, ఒక్క ఆరు వారాలలోనే అది 90 అడుగులు పెరుగుతుంది. అంటే మొదటి నాలుగు సంవత్సరాలూ దానిలో ఎదుగుదల లేదని కాదు. ఆ పెరుగుదల కంటికి కనిపించకపోయినా, దాని వేర్లు బలంగా ఎదిగి, ఆ మొక్క త్వరగా పెరిగి పెద్ద చెట్లు అవడానికి తోడ్పడతాయి. ఆ వెదురు పెరుగుదలలాగానే మిమ్మల్ని మీరు కొలుచుకోడానికి మీరు తప్ప వేరెవరూ కొలబద్ద కారు. మీ శక్తినంతా మీతో మీరు పోటీపడటానికి ఉపయోగిస్తే త్వరగా మీరు అభివృద్ధి చెందుతారు.

మొదట భగవంతుడు ఒక కళాకారుడే కాని ఇంజినీరు కాదని అర్థం చేసుకోండి. ఆయన ఒక ఇంజినీరు అయితే ఒక మగమనిషిని, ఆడమనిషిని సంపూర్ణంగా తయారుచేసి, మిగతా మనుషులందరినీ అదే మూసలో తయారుచేసేవాడు. కాని భగవంతుడు ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా తయారుచేస్తాడు. మీరు ఒక గులాబీ, లిల్లీపువ్వు, ఏదైనా అడవిజాతి పువ్వు, అన్ని పువ్వులే అయినా ఏ పువ్వుకి ఉన్న ప్రత్యేకత దానిది అని గుర్తించాలి. మీ ప్రత్యేకతని మీరు గుర్తిస్తే ఆ పరిమళం నలువైపులా ప్రసరించి అందరినీ ఆహ్రాదపరుస్తుంది.

అది అందం కావచ్చు, లేదా మేధకావచ్చు. దేనిలోనైనా మీ ప్రత్యేకత మీదే. ఎప్పుడైతే మీ ప్రత్యేకతని గౌరవించరో అప్పుడు ఇతరులతో పోల్చుకోటం మొదలుపెడతారు. మీ శరీరాన్ని ఉపయోగించడమే మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ శరీరాన్ని అంగీకరించి, ఆహ్వానించండి.

అసూయకి దృఢమైన ఉనికి లేదు

నిజానికి అసూయకి గట్టి ఉనికి లేదు. అది చీకటి లాంటిది. చీకటికి స్వతంత్రమైన ఉనికి లేదు. చీకటి అంటే ఏదో ఉంది అని అర్థం కాదు, కాంతి లేకపోవటమే చీకటి. అలాగే, అసూయకి స్వతంత్రమైన, బలమైన ఉనికి లేదు. జ్ఞానం లేదా అవగాహన లేకపోవటమే అసూయ.

చిన్నకథ : ఒక వ్యక్తి, తన తల్లికి నచ్చిన అమ్మాయిని భార్యగా చేసుకోవాలని అనుకున్నాడు. అతను తన స్నేహితుని సలహా అడిగాడు. స్నేహితుడు 'తల్లిలా ఉండే అమ్మాయిని వెతుక్కుంటే మీ అమ్మకు నచ్చవచ్చు' అని చెప్పాడు. ఆ వ్యక్తి స్నేహితుని సలహా పాటించి, అలాంటి అమ్మాయిని వెతుక్కున్నాడు.

అతను మళ్ళీ స్నేహితుని దగ్గరకు వెళ్ళి, 'నువ్వు చెప్పినట్టే నేను మా అమ్మలా ఉండే అమ్మాయిని చూసాను. ఆ అమ్మాయి, మాట, నడక, నడవడిక అన్నీ మా అమ్మలాగే ఉంటాయి' అని అన్నాడు. అయినా ఇంకా విచారంగా కనిపించాడు. స్నేహితుడు, సరే నీకు కావలసిన అమ్మాయి దొరికింది, అయినా ఎందుకు విచారంగా ఉన్నావు' అని అడిగాడు. ఆ వ్యక్తి, 'మా నాన్న ఆ అమ్మాయిని ద్వేషిస్తున్నాడు,' అని సమాధానం ఇచ్చాడు.

పోలికకి అంతు లేదు, అది మన మనస్సులో ఉంటుంది. దానికి నిజమైన ఉనికి లేదు. పోలిక నుండి పుట్టే అసూయకి కూడా ఉనికీ, ఆధారం లేవు. అలాంటప్పుడు ఇతరులనీ, వారి ఘనకార్యాలనీ మనం పట్టించుకోనవసరం లేదు. అప్పుడు పోల్సుకునే సమస్య ఉండదు.ఇది అసూయ కలగకుండా ఉండడానికి మంచి పద్ధతి కాదా? అని కొంతమంది నన్ను అడుగుతారు.

మీ ఆలోచనలను పట్టించుకోనంత మాతాన మనస్సు నుండి తప్పించుకోలేరు. మీరు ఇతరులను చూసినా వారివల్ల మీమీద ఏ ప్రభావం లేకపోతే అది సరైన పద్ధతి. చూసేవాటినీ, జరిగే వాటినీ, సమ్మతించి ఆహ్వానిస్తే మీ ప్రశాంతతని ఎవరూ కదిలించలేరు.

అసూయ కలిగించే వస్తువుని నిందించవద్దు

చిన్నకథ : ఒక వ్యక్తిని, 'నీకు అదృష్టం అంటే నమ్మకం ఉందా' అని అడిగారు. అప్పుడు అతను, 'తప్పకుండా ఉంది, లేకపోతే మనం ద్వేషించేవారి అభివృద్ధిని ఎలా వివరించగలం' అని సమాధానం ఇచ్చాడు.

మీకు అసూయ కలిగించే దాన్ని నిందిస్తే, అసూయ నుండి విముక్తి పొందరు. మీరు ఏ క్షణం అయితే ఇంకో వ్యక్తిని నిందించడం మొదలుపెడతారో అప్పుడే మీ లోపల ఉన్న గాయాన్ని తెలిసో తెలియకో కప్పిపుచ్చుతున్నారని అర్ధం. మీకు ఏ వస్తువు అసూయ కలిగిస్తే దాన్ని నిందించడం వల్ల ఆ వస్తువు నుండి విముక్తి కలుగుతుందేమో కాని, ఇంకొక దాని మీద అసూయ ఆరంభం అవుతుంది. అందని ద్రాక్ష పుల్లన అని అనుకొని వేరొక ద్రాక్షతోటకి వెళ్ళడం. అందుకే అసూయ కలిగించేవాటి నుండి విముక్తి పొందడం, సమస్యకి పరిష్కారం కాదు. మీలో మార్పు కలగటానికి మీరు కృషి చెయ్యాలి.

యోగాను ప్రవేశపెట్టిన 'పతంజలి' అనే మహాఋషి, 'ఎవరైనా పరమానందంలో ఉంటే, ఆ ఆనందాన్ని మీరు కూడా అనుభూతి చెందుతారు' అని అంటారు. ఇందులో అసలు రహస్యం ఏమంటే పరమానందం అన్నది, అందరికీ చెందింది. పువ్వు పరిమళం ఎలా వ్యాప్తి చెంది, అందరికీ అందుబాటులో ఉంటుందో అలాగే పరమానందం అన్నది ఎవరైనా అనుభూతి చెందవచ్చు. సూర్యోదయం చూసి లేదా శ్రావ్యమైన గానం విని ఆనందించడం అందరికీ అందుబాటులో ఎలా ఉంటుందో అలాగే మీరు పరమానందం అనుభూతి చెందడానికి అనుగుణం చేసుకోవడం మీ ఎంపిక.

మన కష్టాల కంటే ఇతరులవి చెడ్డవి

చిన్నకథ : ఒక వ్యక్తికి తన కష్టాలు మోయలేనంత బరువుగా ఉన్నాయి. అతను 'ప్రతి రోజూ' ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. నేను ఎందుకు ఇంత బాధపడాలి అని భగవంతునితో మొరపెట్టుకునేవాడు. ఒకరోజు చాలా దుఃఖంతో నేను ఈ బాధను ఇంక భరించలేకపోతున్నాను. దాన్ని తీసేయి. దీనికి బదులు ఇంకొకరి బాధను తీసుకోడానికి నేను సిద్ధమే. అని ప్రార్థించాడు.

ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. అందులో భగవంతుడు ఆ గ్రామవాసులందరినీ వారి కష్టాలని ఆయన దగ్గరకు తీసుకురమ్మని చెప్పారు. అందరూ పెద్ద సంచులలో వారి కష్టాలని దేవుడు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు భగవంతుడు మీరంతా మీ సంచులని నా చుట్టూరా పెట్టండి, అని అన్నాడు. గ్రామవాసులంతా వారి బాధలని వదిలించుకోవాలని, వారి సంచులను వెంటనే దేవుడి దగ్గర పెట్టేసారు. వారు వారి ప్రార్థనలలో అడిగినట్టు భగవంతుడు ఇప్పుడు మీరు ఏ సంచీ అయినా తీసుకోవచ్చు అని అన్నాడు. వెంటనే ప్రతి ఒక్కరూ తమ సంచీని తీసుకుందామని దేవుడి దగ్గరకి పరిగెత్తారు. కలగన్న వ్యక్తి కూడా అందులో ఉన్నాడు.

మొట్టమొదటి సారిగా వారి సంచుల కంటే ఇతరులవి పెద్దవిగా కనిపించి, వారికి ఆనందం కలిగింది. ప్రతి ఒక్కడికీ తన కష్టాలు అలవాటయిపోయాయి, ఎవ్వరు కూడా ఇతరుల తెలియని కష్టాలని తీసుకోడానికి ఇష్టపడలేదు. కలగంటున్న వ్యక్తికి హఠాత్తుగా మెలకువ వచ్చి, 'దేవా నా కళ్ళు తెరిపించినందుకు, నేను నీకు కృతజ్ఞత చెప్తున్నాను. నాకు ఉన్నవి నాకు మంచివి అని తెలుసుకున్నాను. అందుకే నా పరిస్థితులను అలా కల్పించావు'. అని అన్నాడు.

అసూయ వంచనకు తల్లి

అసూయ వల్ల మీలో మీరే బాధపడతారు. మీ జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఆ కోల్పోయింది, పొందడానికి మీ స్వభావానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. ఇదే వంచన ఆరంభదశ. మీరు ఇతరులను అనుకరించి వేరొకరిలా తయారవుతారు. ఇదే విషవలయాన్ని మీరు ఎంత అనుకరిస్తే, అంత మీ సహజస్వభానికి దూరంగా వెళ్ళిపోతారు. ఇది మరి కొంత అసంతృప్తినీ, అసూయనీ కలిగించి ఇంకా మీ కపటప్రవర్తనని పెంచుతుంది.

ఈ విషవలయంలో నుండి బయటికి రావాలంటే, మీ ప్రత్యేకతను గుర్తించి వ్యక్తపరచటమే. చేసే ప్రతి పనీ నిజాయితీగా చేయండి. ఈ స్వేచ్ఛ అనుభూతి మీ ప్రత్యేకమైన యథార్ధమైన సృజనాత్మక శక్తిని గుర్తించడానికి సహాయపడుతుంది.

సమవయస్కుల ఒత్తిడి – అసూయ చేతిలో కఱ్ఱ

విశ్వం అంతా వ్యాపించి ఉన్న మాయాశక్తి, నీ చేత ఏ పని అయినా చేయించడానికి అసూయని ఒక పరికరంలా ఉపయోగిస్తుంది అని.

భారతదేశం వీథులలో కోతి ఆడించే వారుంటారు. వారి దగ్గర చిన్న కర్ర ఉంటుంది. వారు కర్రను తీయగానే, కోతి వారు చెప్పినట్టుగా ఆడుతుంది. ఆడించేవారు, చేతులని సంజ్ఞలు చేసే ఆ కోతి వారి మాట వినదు. ఎప్పుడైనా కర్ర తీసాడని తెలిసినా కర్ర తీసుకునే వరకూ చెప్పిన మాట వినదు. కర్ర చేత పట్టుకుని, తిన్నగా నడవమంటే ఆ కోతి అలాగే నడుస్తుంది. ఆ వ్యక్తి మూడుసార్లు గెంతమంటే అలాగే మూడుసార్లు గెంతుతుంది.

అలాగే మాయ అనే శక్తి సమవయస్కుల పైన ఒత్తిడినీ, అసూయనీ కర్రలా ఉపయోగించి మీ చేత ఏ పనైనా చేయిస్తుంది. ఇది అహంకారంతో ఆడే ఆట అని అర్ధం చేసుకోండి. మీరు పెరగడానికి ఇది అవసరం లేదు. మీ అవసరాలన్నీ తీర్చడానికి లోకంలో కావలసినంత ఆహారం, వస్త్రాలు, ఇళ్ళు, వైద్యం అన్నీ ఉన్నాయి. మీరు ఇంకొకరితో పోటీపడే అవసరం లేదు.

అసూయని ఎలా జయించాలి

కోపం, ఆశ, దుఃఖం, సొంతంచేసుకోవటం అనే భావావేశాలు, అసూయతో దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఈ అసూయ అనే వలయాన్ని ఛేదిస్తే అన్ని చెడు భావావేశాలు కరిగిపోతాయి.

గమనించండి

అసూయ కలిగించే దాన్ని నిందించడం వల్ల లేదా అసూయ నుండి తప్పించుకోవడం వల్ల, మనం దాన్ని అధిగమించలేం. అసూయ కలిగినప్పుడు పూర్తిగా తెలుసుకునే తత్వంతో ఉంటే చాలు. అది మాయమవడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

బుద్ధభగవానుడు, అసూయ అనే వేరును నాశనం చేసి అంతు లేని శాంతిని ఆనందించు అని అంటాడు.

మీ సహజమైన ఆనందాన్ని దొంగిలించిన అసూయని, పోటీ తత్వాన్ని ద్వేషించటాన్ని తెలుసుకుని నాశనం చెయ్యండి. ఎరుక అనే వెలుగుని ఉపయోగించి ఈ వ్యతిరేక భావావేశాల నీడను తెలుసుకోండి.

అసూయని జయించాలంటే దాన్ని అణచటం లేదా, దాని ఉనికి లేదనుకోవడం కాదని అర్ధం చేసుకోండి. దాన్ని వ్యక్తపరిచి ప్రోత్సహించడం కూడా సరైన పద్దతి కాదు. ఎందుకంటే మీరు అసూయని ఎరుకతో ఎదుర్కోడానికి సిద్ధంగా లేరు కాబట్టి. మీలో అసూయ ఎలా పుడుతుందో గమనించండి. అది అసూయ కలిగించే దాని మీద ద్వేషంగా మారడం చూడండి. మీలో వైఫల్యాన్ని ఎలా సృష్టించి మీ శాంతినీ, ప్రశాంతతనీ ఎలా పోగొడుతుందో గమనించండి.

అసూయ కలిగించేదాన్ని ద్వేషించటం కంటే అసూయని ఎరుకతో చూడండి. దాన్ని కేవలం గమనించండి. దాన్ని శాస్త్రీయదృష్టితో చూడండి. శాస్త్రీయదృష్టి అంటే ఏమిటి?

నీకునీవే సర్వశ్రేష్టుడివి, ఇక పోల్సుకోవటం ఎందుకు?

ఒక శాస్త్రజ్ఞుడు ప్రయోగం చేసేటపుడు దాని ఫలితం గురించి ఏ విధమైన అభిప్రాయం ఏర్పరచుకోకుండా, కేవలం ప్రయోగంపై దృష్టి పెడతాడు. అతని మనస్సులో ఆ ప్రయోగం ఫలితం మీద ఏదైనా అభిప్రాయం ఉంటే అతను శాస్త్రజ్ఞుడు కాడు. ఎందుకంటే అతనిలో ఉన్న అభిప్రాయం ఆ ప్రయోగాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు మీ అంతరంగ ప్రపంచ ప్రయోగశాలలో ఒక శాస్త్రజ్ఞులు. మీ మనసు ఒక ప్రయోగశాల. ఎరుకతో ఉండి ఏ భేదభావమూ లేకుండా గమనించాలి. మీకు కలిగే భావావేశాన్ని చెడ్డది అని నిందించవద్దు. అలాకాక అసూయ అనేది చెడు భావావేశం అని అనుభూతి చెందితే అప్రయత్నంగా దాన్ని వదిలేసారు. అది మీకు అనుభవంలోకి రాలేదు, ఇతరుల నుండి, ఆ భావాన్ని తెచ్చుకున్నారు. అసూయ కలిగించే వాటిని నిదించవదు.

అసూయని ఎరుకతో ఎప్పుడు చూసారో దానికి ఉనికి లేదని తెలుసుకుంటారు. ఇది జరిగితే అసూయ మిమ్మల్ని వదిలేస్తుంది. మీరు దాన్ని వదిలేయక్కర్లేదు.

చిన్నకథ : ఒక స్త్రీ తన బొమ్మ వేయడానికి, ఒక నిపుణుడైన చిత్రకారుడిని అభ్యర్థిస్తుంది. ఆ చిత్రకారుడు ఆమె చిత్రాన్ని తయారుచేసి, ఆమెకు చూపించి ఎలా ఉందని అడిగాడు.

ఆమె చిత్రాన్ని చూసి, 'బావుంది, కాని దీనికి కొన్ని మెరుగులు దిద్దాలి. నీవు ఒక మెరిసే రత్నాల హారం, ఒక బంగారం చేతిగడియారం, చెవికి పచ్చల లోలకులు, వేళ్ళకి ముత్యపు ఉంగరాలు, వేయాలి' అని అంది. ఆ చిత్రకారుడు, 'ఈ చిత్రం చాలా నిరాడంబరంగా, అందంగా ఉంది, దానికి ఆభరణాలన్నీ వేసి ఎందుకు పాడు చేయమంటారు?' అని అడిగాడు.

'ధనవంతులైన పొరుగింటివారు, నా ఆభరణాలన్నీ చూసి ఈమెకు ఎన్ని ఆభరణాలున్నాయో అనుకొని వారికి పిచ్చి ఎక్కాలి' అని అంటుంది.

అసూయ అనే నిప్పుని ఎరుకతో ఆర్చకపోతే నిన్ను దహించివేస్తుంది.

అనంతమైన ప్రేమ

అసూయ మీ సహజ స్వభావమైన ప్రేమని ఆనందాన్ని అనుభవించనీయదు. అసూయ అనేది జీవితాన్ని, మిమ్మల్ని సరిగ్గా అర్ధం చేసుకోనందువల్ల కలుగుతుంది. మీరు ప్రేమ అనేది, ఎక్కడో బయట నుండి పొందాలని తప్పగా అర్ధంచేసుకున్నారు. అదే కాదు, ప్రేమ అనేది పంచుకోవాలి అనుకుంటారు. పంచితే మీ వాటా ఎక్కడ తగ్గిపోతుందో అని భయపడతారు.

ప్రేమ అనేది మీలో ఉన్న గుణం అని అర్ధం చేసుకోవాలి. అది పరిమితమైన పదార్ధం కాదు. అది మీ లోపల అంతులేకుండా ఉప్పొంగే భావన. అది మీ సహజ స్వభావం కాబట్టి మీరు దాన్ని అడ్డుకోలేరు, ఎవరూ అడ్డుపడరు.

ఒకసారి ప్రేమ ప్రవాహంలా మొదలవుతే, అసూయ, స్వాధీనపరుచుకోడం అనేవి అసలు ఉండవు. మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారో అలా స్వీకరిస్తే, ఇతరులని వారు ఎలా ఉన్నారో అలా స్వీకరించగలరు.

ధ్యానపద్దతి – శక్తిసాగరం

ఈ ధ్యానపద్ధతి మీలో ఉన్న అనంతమైన శక్తిని మీ అందుబాటులో ఉంచి మీకు ఉపయోగపడుతుంది. మనలో అనంతమైనశక్తి ఉందని మనకి తెలియదు. ఈ శక్తిని ఎలా తెచ్చుకోవాలో తెలిస్తే మీ అవరోధాలన్నీ దాటవచ్చు.

ఈ ధ్యానంలో మీ దృష్టిని గొంతు దగ్గర ఉన్న విశుద్ధిచుక్రం మీద కేంద్రీకరించాలి. ఇలా చేసే విశ్వశక్తి విశుద్ధి చుక్రంలో నుండి, మీలోకి ప్రవేశిస్తుంది. మీకు అనంతమైన శక్తిని ఇస్తుంది.

కళ్ళుమూసుకుని నిలబడి విశుద్ధిచక్రం మీద శ్రద్ధ పెట్టండి. ఒక కుర్చీని ఆధారం చేసుకొని మెల్లిగా నడవండి. అతి నెమ్మదిగా మీరు ఎక్కడ నుంచున్నారో అక్కడే నడవాలి.

మెల్లిగా మీ నడక వేగం పెంచండి. అదే స్థానంలో వేగంగా, అతివేగంగా నదవండి. మీకు అసౌకర్యం కలుగకుండా ఎంత వేగంగా నడవగలిగితే అంత వేగంగా నడవండి. మీ శక్తికి మించి శ్రమపడకండి. అన్ని వేళలా విశుద్ధి మీద దృష్టి పెట్టండి. విశుద్ధి నుండి శక్తి రావడం గమనించవచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం, మీ వేగం తగ్గించకుందా విశుద్ధి మీద మనస్సు నిలిపి నడవాలి. 20 నిముషాల తరువాత ఆపండి. పది నిముషాలు ఎక్కడి వారు అక్కడే కూర్చుని విశుద్ధి మీద కళ్ళుమూసుకుని ధ్యాస పెట్టాలి. మీరు నడుస్తున్నప్పుడు వచ్చిన శక్తిని ఇప్పుడు మీలోనికి గ్రహించ గలుగుతారు.

  • మీరు బాధపడితే మీ లోపల గాయం ఉంది అని అర్ధం.
  • మిమ్మల్ని ఈ భూమి మీదికి పంపించే ముందు సర్వాంతర్యామి మీ అవసరాలు తీరగల శక్తిని ఇస్తాడు. నీవు సంతోషంగా సంతృప్తిగా జీవించగల శక్తిని ఇస్తాడు.
  • సమవయస్కుల ఒత్తిడి అహంకారం ఆడే ఒక పెద్ద ఆట. మీ ఎదుగుదలకి అది అవసరం లేదు.
  • మిమ్మల్ని మీరు అదే విధంగా స్వీకరించగలిగినప్పుడు, మీరు ఎదుటివారిని కూడా వారిని వారిలా స్వీకరించగలరు.

జీవస్ముక్తి అంటే వ్యక్తిగతమైన అహంకారాన్ని సర్వాంతర్యామిలో కరిగిపోయేలా చేయటం

గంభీరత Vs నిజాయితీ :

మన గురించి మనం అనుకునేదానితోనే, మనను ఇతరులతో పోల్సుకోవటం అనేది మొదలవుతుంది. మన ప్రత్యేకతను తెలుసుకుంటే మనలో అసూయ మాయమౌతుంది. అప్పుడు మనం ఇంకొక సమస్యను సృష్టించుకుంటాం. మనం చాలా ప్రత్యేకమైనవారమని నమ్మి దాన్ని తీవ్రంగా తీసుకుంటాం.

గంభీరత అంటే ఏమిటి?

గంభీరత అంటే అన్నీ వదిలేసి ఒక దానికి అనవసరమైన ప్రాధాన్యాన్ని ఇవ్వడం. జీవితం అనేది ప్రతి క్షణం జరుగుతున్న నాటకం అని తెలియకపోవడం వల్ల, జీవితం నుండి ఎక్కువ ఆశించడం వల్ల గంభీరత అనేది కలుగుతుంది.

చిన్నకథ : ఇద్దరు అబ్బాయిలు సముద్రపు ఒడ్డున ఇసుక గూళ్ళు కట్టుకుంటున్నారు. ఇద్దరూ పోట్లాడుకొని, ఒక అబ్బాయి కోపంతో మరొక అబ్బాయి ఇసుక గూడును కూల్చాడు. ఆ అబ్బాయి రాజుగారి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసాడు. ఆ ఇసుక గూడును గురించి ఆ అబ్బాయి పడుతున్న ఆందోళనను చూసి రాజు గట్టిగా నవ్వాడు. అది చూసి రాజుగారి సలహాదారు అయిన బౌద్ధ సన్నాసి రాజును చూసి నవ్వాడు. అతను 'రాజా! నీవు నిద్రపోకుండా మీ రాతి భవనాల గురించి యుద్ధాలు చేసుకొనేటప్పుడు ఆ అబ్బాయిలు ఇసుక గూళ్ళని గురించి పోట్లాడుకుంటే ఎందుకు నవ్వుతారు?' అని రాజును అడిగాడు.

ఇసుక గూళ్ళను గురించి మనం తీవ్రంగా తీసుకుంటున్నాం. ఆ అబ్బాయికి ఆ వయసులో ఇసుక గూడు చాలా విలువైనది. మన వయసుకు రాతి భవనాలు విలువైనవి. అది అంతే, అది ఇసుక గూడైనా, రాతి భవనమైనా రెంటి వెనక ఉన్న తీవ్రత ఒకటే. వస్తువు వేరు కావచ్చు కాని తీవ్రత ఒకటే. అందుకే పిల్లలు ఇసుక గూళ్ళను గురించి పోట్లాడుకుంటే నవ్వకండి.

గంభీరత వలన జీవితంలో స్వేచ్ఛని, వికాసాన్ని పోగొట్టుకుంటున్నారు. అది మిమ్మల్ని చేతన్యరహితంగా చేస్తుంది. మీ ఆలోచనాశక్తిని అణచివేసి, మీరెప్పుడూ ఉపయోగించే పద్దతినే పట్టుకొని వేలాడే విధంగా చేస్తుంది.

మరో చిన్న కథ : ఒక జెన్ గురువుగారి ఆశ్రమంలోని శిష్యుల్తో ఎవరు తోటను అందంగా ఉంచగలరని ఒక పోటీ నిర్వహించారు. ఒక శిష్యుడు చాలా గంభీరంగా ఉండేవాడు. అతను ఈ పోటీని తీవ్రంగా తీసుకుని, తన తోటని శుభ్రంగా పొందికగా, బాగా అందంగా తయారుచేసాడు. గడ్డిని సమానంగా కత్తిరించాడు. పొదలను కూడా అందంగా కత్తిరించాడు. తనకే మొదటి బహుమతి వస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు.

గురువుగారు పోటీ రోజున అన్ని తోటల్నీ పరిశీలించి ర్యాంకులని నిర్ణయించారు. గంభీరంగా ఉండే శిష్యుని తోటకు చివరి ర్యాంకు వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ శిష్యుడు ఉండబట్టలేక గురువుగార్ని గురుదేవా! నా తోటలో ఏ లోపం ఉంది? ఎందుకు అన్నిటి కంటే తక్కువ చేసారు? అని అడిగాడు. గురువు అతనిని చూసి "రాలిపోయిన ఆకులు ఏవీ? అవి లేకపోతే తోటకు జీవం లేనట్టే కదా!' అని సమాధానమిచ్చారు.

గంభీరత సహజత్యాన్ని అణచివేసి, సృజనాత్మకతను నాశనం చేస్తుంది. మీరు ఏదైనా పనిని తేలికగా తీసుకొని, హాయిగా చేసే, మీ ఆలోచన, నిర్ణయించే సామర్థ్యం, అభివృద్ధిగా పెరుగుతాయని శాస్త్రం నిరూపించింది. అదే పనిని గంభీరంగా చేస్తే, మనసు మందకొడిగా తయారవుతుంది. మీరేదయినా చాలా సీరియస్‌గా తీసుకొని, ఫలితానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తే మీరు ఆ పనిని చేయగలిగిన స్థాయిలో చేయటం లేదని అర్థం.

మీరు పనికి ప్రణాళిక తయారుచేసి, దాన్ని గురించి బాగా ఆలోచించాలి. ఆ పనిని గంభీరంగా కాకుండా నిజాయితీగా చేయండి. గంభీరతా నిజాయితీ ఒకటి కావు. నిజాయితీగా అంటే చేసే పనిని ఉత్సాహంగా, చురుకుగా చేయాలి. ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకుండా పని శ్రద్ధగా చేయాలి. గంభీరంగా ఉంటే సంతోషించలేరు, నవ్వలేరు. మీరు గంభీరంగా ఎలా నవ్వగలరు? మీరు ప్రేరణకు స్పందించగలిగి ఉండాలి.

స్పందించడమంటే, మీరు అన్నీ తెలిసిఉండి, సమర్ధంగా ఉండటం. అంటే కపటంగా ఉండమని అర్థం కాదు. దేనికైనా 'చేయను' అని చెప్పలేకపోవటం స్పందించడం కాదు. అది అసలైన అహంకారం. ఏ వ్యక్తి అయితే అవసరమైనపుడు కాదని చెప్పలేదో అతను అహంకారి. స్పందించడం అంటే ఎప్పుడు ఔను, ఎప్పుడు కాదు అని స్పష్టంగా చెప్పగలగటం. ఆ నిర్ణయాన్ని నిజాయితీగా, ధైర్యంగా అమలుపరచాలి.

పరిపూర్ణవాదం, కచ్చితం

పరిపూర్ణత అనేది మీ మనసులో నుండి వస్తుంది. అదే మీ లక్ష్యం అవుతుంది. అదే మీ లక్ష్యంగా పని చేసారు. ఆవిధంగా చేసే అది నిస్సారంగా తయారవుతుంది. దానినే సంపూర్ణత్వంతో, హృదయపూర్వకంగా చేస్తే అది లోతైన అనుభవం అవుతుంది. వచ్చే ప్రతిఫలం అందంగా ఉండి, మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడు మీరు ఏం చేసినా, సృష్టితో అనుసంధానంలో ఉంటారు. మీరు ఏది చేసినా పూర్తిగా సంపూర్ణత్వంతో చేస్తే అది పరిపూర్ణత్వం అవుతుంది. అప్పుడు మీరు కచ్చితంగా ఉండాలి అనే విషయం గురించి బాధపడరు.

కచ్చితంగా ఉండాలి, అనేది మీకు సంతోషాన్నివ్వదు. అది మీ అహంకారాన్ని తృప్తిపరుస్తుంది. చివరికి మీకు సంతృప్తిగా అనిపించినా, అది మీ అహంకారం తృప్తి పొందడమే గాని ఆత్మ సంత్సప్తి మాత్రం కాదు. అన్నీ కచ్చితంగా ఉండాలి అనేవారు పెద్ద అహంకారులని స్పష్టంగా తెలుస్తుంది. వారు సంపూర్ణంగా ఉండడాన్ని కోల్పోతారు. దేనిలోనైనా లోతుగా ప్రవేశించినపుడు సంపూర్ణత్వ అనుభూతి పొందవచ్చు. కచ్చితం అనేది మీ మనసులోనిది కాబట్టి దాని అర్థం మారుతూ ఉంటుంది.

తప్పుల నుండి నేర్చుకోవడం

ధైర్యంగా తప్పులు చేయండి. గంభీరంగా ఉండే వ్యక్తులు తప్పులు చేయదానికి భయపడతారు. వారు ప్రతిదాన్నీ సీరియస్‌గా తీసుకుంటారు. వారు తమనుగురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారికి తప్పులు చేస్తే వేలెత్తి చూపిస్తారనే భయం ఉంటుంది. చిన్న తప్పులు చేయడానికి భయపడేవారు, పెద్ద తప్పులు చేస్తారని నేనంటాను.

నిజానికి మీరు తప్పులు చేసినప్పుడు ఎవరైనా వేలెత్తి చూపితే మీరు భరించలేరు. మీ సున్నితత్వం వల్ల మీ అహంకారం దెబ్బ తింటుంది కనుక, మీరు తప్పు చేయకుండా ఉండడానికి తయారుచేసుకుంటారు. మీరు చెప్పే కారణాలు వేరుగా ఉంటాయి. మీరు అబద్ధం చెబుతున్నారని కాదు, మీ అహం అంతర్లీనంగా ఎలా పని చేస్తుందో మీకు తెలియదు.

తప్పులు చేయడం తప్పు కాదు, నిజానికి మీరు కొన్ని తప్పులు చేయదం వల్ల, తప్పులు ఎలా చేయకుండా ఉండాలో అనుభవంతో స్పష్టంగా తెలుస్తుంది. తప్పులు చేయదం వల్ల ఎంత నేర్సుకుంటారో, అంత ఎక్కువ తప్పులు చేయకుండా ఉండడమనేది తెలుసుకుంటారు. తప్పులు చేసామేమో అనే ఆలోచన లేకుండా మీకున్న తెలివితేటలతో ఉత్సాహంగా పని చేయండి. ఏ క్షణాన తప్పు చేస్తున్నామనే భావం మీలో కలిగిందో అప్పుడే మీ అహంకారం దెబ్బ తింటుందన్న బాధ మీలో కలిగిందని గ్రహించండి.

సృష్టి – సమకాలీనత

మీ అహం దెబ్బ తింటుందనే విషయం పట్టించుకోకపోతే, ఏది చేయడానికైనా మీకు ధైర్యం ఉంటుంది. నిజంగా బాధపడేది, మీ అహం ఎక్కడ దెబ్బ తింటుందోనని. మీకు అహంకారం లేకపోతే, స్వేచ్ఛగా, ధైర్యంగా ఏ పనైనా చేయగలరు. ఇంకా ఎక్కువగా అన్వేషించదానికి ఇష్టపడతారు. ఆశ్చర్యంలో మునిగి ఉన్నప్పుడు మీరు కొత్త సృష్టి చేయగలరు. మీరు అహంకారంతో నిండి ఉంటే దేన్ని సృష్టించలేరు. ఒక వేళ సృష్టించినా అది నిస్సారంగా ఉంటుంది. అది ఒక ప్లాస్టిక్ గులాబిలా కచ్చితంగా ఉన్నప్పటికి పరిమళమూ, జీవమూ లేకుండా ఉంటుంది.

మీరు ఎవరని అనుకుంటున్నారో అది మీరు కాదు

ఒక కళాకారుడు ప్రేమతో ఏదైనా సృష్టిస్తే, ఆ సృష్టికి ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది. తన అహంకారంతో సృష్టిస్తే దానిలో జీవం ఉండదు. మీరు సృష్టితో అనుసంధానంలో ఉంటే మీకు జీవితంలో ప్రతి ఒక్కటీ సర్వాంతర్యామితో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ స్థితిలో మీకు కావాల్సింది దొరుకుతుంది. మీరు సృష్టితో ఒకే శ్రుతిలో ఉన్నారు కాబట్టి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. దీన్నే సృష్టి సమకాలీనత అంటారు.

ఒకటి అర్థం చేసుకోండి, మీరు సృష్టితో అనుసంధానంలో ఉన్నప్పుడు అత్యాశతో అన్నీ కావాలని అనుకోరు. అడగక ముందే కావలసినది ఆ సర్వాంతర్యామి ఆ క్షణంలో మీకిస్తాడు. ఏది కావాలనుకుంటే అది దొరుకుతుంది అని దాని అర్థం. మీరు సర్వాంతర్యామికి ఎంత దగ్గరెతే అహంకారం అంత తగ్గిపోతుంది. మీకెంత అహంకారం తగ్గుతుందో సర్వాంతర్యామికి అంత దగ్గరగా వెళతారు.

జీవితం మీ తర్శానికి అతీతమైనది

మన జీవితంలోని సంఘటనలు తర్మం అధీనంలో ఉన్నాయని మనలో చాలా మంది నమ్ముతారు. కాని జీవితం తర్శానికి అందనిదని మన జీవితం పదేపదే గుర్తు చేస్తుంది. ఈ విషయం మీ కుటుంబసభ్యులలో ఎవరైనా చనిపోయినపుడు లేదా ఏదైనా అనుకోని సంఘటన జరిగినపుడు, మీకు గుర్తొస్తుంది. మీ ఉద్యోగం పోతే జీవితం మీ అధీనంలో లేదని తెలుస్తుంది. అపుడు జీవితం మీ తర్మానికి అతీతమైనది అని తెలుసుకొని, మీరు సత్యాన్వేషణ మొదలు పెడతారు.

మీరు పట్టణంలో నివసిస్తుంటే, మీ దినచర్యలో ఏ మార్పూ ఉండదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా గడుస్తుందో మీకు తెలుసు. ఎక్కడికి వెళతారో ఏం చేస్తారో, ఏం చేయరో, ఎప్పుడు ఏం తింటారో, మీకు తెలుస్తాయి. మీ అహంకారం మీకు ఆలోచనను కలిగిస్తుంది. తర్శం, జీవితం మీ అధీనంలో ఉన్నదనే భావనను కలిగిస్తుంది. మీ తర్శానికి అందని ఏ సంఘటనైనా మీ జీవితంలో జరిగితే మీరు తట్టుకోలేరు. ఏం చేయాలో మీకు తెలియదు. బాధతో మీరు కుంగిపోతారు. మీరు ఒక ముఖ్యమైన నిజాన్ని, అంతిమరహస్యాన్ని అర్ధం చేసుకోవాలి. మీ వల్ల అన్ని పనులూ సవ్యంగా జరుగుతున్నాయని ఎప్పుడూ అనుకోకండి. మీరున్నా, లేకపోయినా, జరిగేవి సవ్యంగా జరుగుతాయి. ఇది ముఖ్యమైన రహస్యం. మీ వల్ల అన్ని పనులూ సవ్యంగా జరుగుతున్నాయని మీరనుకున్నంతకాలం, మీరు నిరంతరం అహంకారంలో ఉన్నారని తెలుస్తుంది.

అహంకారం అంటే ఏమిటి?

జీవితానికి ఒక ఉద్దేశం ఉందని దాని వెంట పరుగెడితే, 'మీరు అహంకారం గల వ్యక్తి' అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఉద్దేశరహితమైన జీవితపు అందాన్ని ఎప్పుడు గ్రహిస్తారో, మీ అహం మిమ్మల్ని వదిలేస్తుంది. మీ గురుదేవులు మీ జీవితం ఉద్దేశరహితమైందని మీకు తెలియజేసారు. మీరింతవరకు ఏది ఉపయోగం కలదని అనుకుంటున్నారో, అది నిజానికి ఉపయోగకరమైంది కాదు. అహంకారం గల వ్యక్తి జీవిత ఉద్దేశాన్ని గురించి వెతుకుతూ, అసలు నిజాన్ని గ్రహించలేడు. మీరింత కాలం మనసు అనుకున్న దానికి నిజమైన ఉనికి లేదని, మరణం మీకు స్పష్టంగా చెబుతుంది. మీ జీవితం ఉద్దేశరహితమైనదని తెలుసుకున్నప్పుడు మీలో కొత్త చేతనశక్తి వికసించడం ప్రారంభమౌతుంది. ఏ క్షణమైతే మీరు సాధించవలసింది ఏమీ లేదనే అనుభవం కలుగుతుందో, మీరు రక్షిస్తున్నవి రత్నాలు కాదు రాళ్లు, జీవితంలో సాధించిన గొప్ప పనులన్నీ కేవలం ఆట వస్తువులని తెలుసుకొని, జీవితం ఉద్దేశరహితమైంది అని అర్థంచేసుకుంటారు. అహంకారాన్ని వదిలేసినపుడు జీవిత దివ్య ఉద్దేశాన్ని అర్థంచేసుకుంటారు. సర్వాంతర్యామి ఆడే నాటకం లేదా భగవంతుని లీలలు మీకు అర్ధమౌతాయి. మీరు జీవితానికి ఏదో ఉద్దేశం ఉందని ఆలోచిస్తూ ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తే అసలు జీవితాన్ని కోల్పోతారు.

జీవితమే మార్గం, లక్ష్యం. మీకు లక్ష్యం ఉంటే పరుగులు తీస్తారు. మీ పాదాలు నేల మీద ఆనవు. ప్రకృతిలోని అందాన్ని అనుభవించలేరు. లక్ష్యాన్ని వదిలేస్తే మీకు మార్గం కనిపిస్తుంది. మీకు జీవితం ఉద్దేశరహితమైనదని అర్ధమైనప్పుడు జీవించడం అనే దానికి అర్ధం తెలుస్తుంది. అంత వరకు మీరు జీవన్మృతులు. ఆసుపత్రిలో అచేతనంగా ఉన్న వ్యక్తి, సత్యాన్ని తెలుసుకోని వ్యక్తి – ఇద్దరూ చేతనస్థితిలో జీవించరు. గురువు మీకు ఈ సత్యాన్ని తెలియచేస్తాడు. లక్ష్యాన్ని వదిలేసి జీవితాన్ని ఆనందించండి. దీని మీదే పదేపదే ధ్యానం చేయండి. మీలో సత్యం ఉదయించి నిత్యానందం అనే పుష్పం వికసిస్తుంది. నిత్యానందమే జీవితానికి అర్థం.

లేదు' అనే దృఢమైన భావన

మీరు చాలాసార్లు ఎవరైనా ఏమైనా చెప్తే, మీలో మొదటిసారి కలిగే ప్రతిచర్య 'కాదు' అనే భావం. మీరు 'కాదు' అని చెప్తే, మీ అహం సంతృప్తి చెందుతుంది. మీరు లోపల గట్టిగా, దృఢంగా ఉన్నారని అనుకుంటారు. మీరు 'అవును' అంటే మీరు కరిగిపోయినట్టు, లోబడినట్టు అనిపిస్తుంది. మీ అహం అణకువగా అనిపించి, అసౌకర్యం కలిగించడం వల్ల మీరు కాదు అని చెప్తారు.

అందుకే మీరు ఇంట్లో, పాఠశాలలో, ఆఫీసులో, డ్రైవ్ చేసేటపుడు రూలు పాటించకపోతే మీకు చాలా బాగుంది అనిపిస్తుంది. మీరు రూల్చుకి 'కాదు' అని చెప్తే మీ అహానికి బలం వస్తుంది. ఇది చిన్న పిల్లలలో చూడవచ్చు. ఏ క్షణంలో అయితే వారికి కొన్ని వస్తువులు అవసరం లేదని చెప్తామో, అవే అడగటం మొదలుపెడతారు.

సాధారణం Vs అసాధారణం

మీరు అహం కోసం జీవించాలనుకుంటే, మీ జీవితాన్నీ, ఇతరుల జీవితాలనీ నరకం చేస్తారు. చాలాసార్లు మీరు పడే కష్టాలు ఇతరులు కల్పించినవి కావు. మీకు తెలియకుండా కల్పించుకున్నవి. వాటి వల్ల మీరు ఏ లాభమూ పొందకపోవచ్చు. మీ అహాన్ని నిరూపించుకోడానికి మీరు ఆ కష్టాలను సృష్టించుకొంటారు.

నిత్యజీవితంలో ప్రతివ్యక్తీ తను అసామాన్యమైన వాడినని అనుకుంటాడు. మీరు ఎక్కువ కష్టాలు అనుభవించానని అనుకుంటే, మీరు అలాంటి జీవితాన్ని గడిపినందుకు మీ అహం తృప్తి చెందుతుంది. మీ శత్రువు పెద్దగా ఉంటే మీరు పెద్దగా ఉన్నారని అనుకుంటారు. మీ శత్రువు చిన్నగా ఉంటే, మీరు చిన్నగా ఉన్నానని అనుకుంటారు. అదే కారణం వల్ల, మీకు పెద్ద కష్టం వస్తే, మీకు బావుంటుంది. మీ అహంకారం తృప్తి చెందుతుంది. మీ జీవితాన్ని మీకొచ్చిన కష్టంతో కొలుస్తారు. తెలియకుండా మీరు ఇతరులనీ, మిమ్మల్నీ కూడా చిత్రహింస పెట్టుకుంటారు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి తాను అసాధారణమైన వ్యక్తి అని అనుకుంటాడు.

చిన్నకథ : భరత్ లో చాలా అహంకారి అయిన ఒక రాజు ఉండేవాడు. అతని అహం ఎంత పెరిగిందంటే అతడు "నేను భగవంతుడు చేసే ప్రతీదీ చెయ్యగలను, నేను భగవంతుని కంటే గొప్పవాడిని" అని బహిరంగంగా చెప్పేవాడు. అతన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే, వారిని వెంటనే చంపేయమని ఆజ్ఞాపించేవాడు.

ఆ రాజ్యంలో జ్ఞానోదయం పొందిన ఒక గురువు ఉండేవారు. అతడు రాజధానికి వచ్చినప్పుడు ఆ రాజు అహంకార స్వభావాన్ని తెలుసుకొని, ఆ రాజుకు సత్యం ఏమిటో చూపిద్దామనుకున్నాడు. అతడు ఆస్థానానికి వెళ్ళి 'రాజా, నువ్వు సర్వాంతర్యామితో సమానం. నువ్వే సర్వాంతర్యామివి' అని రాజుని పొగడసాగాడు. రాజు సంతోషించి, 'అవును. మీరు చాలా తెలివిగల వారిలా కనిపిస్తున్నారు. ఇంకా మీరు ఏం తెలుసుకున్నారో మాకు చెప్పండి.' అని అన్నాడు. గురువు 'ఓ రాజా, నేను నీకు ముఖ్యమైన ఒక విషయం చెప్పాలి. భగవంతుడు కూడా చెయ్యలేని పనులు కొన్ని నువ్వు చెయ్యగలవు' అని రాజుతో అన్నాడు. ఇప్పుడు రాజు గర్వంతో ఉబ్బిపోసాగాడు. అతడు గురువుతో 'దయచేసి సర్వాంతర్యామి చేయలేని పని, నేను చేయగలిగింది ఏమిటో చెప్పండి' అని అన్నాడు.

గురుదేవుడు 'ఓ రాజా, నీకు ఎవరి మీదైనా కోపం వస్తే వారిని నీ రాజ్యం నుండి బయటికి పంపించగలవు. కాని భగవంతుడు అలా చేయలేదు' అని రాజుతో ప్రశాంతంగా అన్నాడు. సర్వాంతర్యామి ఆయన రాజ్యంలో నుండి మనని బయటకు పంపించలేదు.

మీరు సామాన్యమైన వారా, కాదా, అని తెలుసుకోదానికి ఈ చిన్న ప్రయోగం చేయండి. మీకు అసాధారణమైన వ్యక్తిని అని అనిపిస్తే, స్పష్టంగా తెలుసుకోండి, మీరు సామాన్యమైన వ్యక్తి. మీరు సామాన్యులు అని అనిపిస్తే, మీరు అసాధారణమైనవారు.

సరియైన ముసుగుని వాడటం

మీరంతా ప్రతిరోజు జీవితంలో వేరు, వేరు ముసుగులు వేసుకుంటారు. మీ తల్లి కోసం ఒక ముసుగు, తండ్రి కోసం మరొక ముసుగు, మీ యజమాని కోసం వేరొకటి వేసుకుంటారు. మీరు వ్యక్తులు కాబట్టి సరైన ముసుగులు వేసుకుంటే అంతా సరిగ్గానే ఉంటుంది. మీరు ఏ వ్యక్తి కోసమైనా తప్పుడు ముసుగు ఉపయోగిస్తే, అక్కడ మీ అహం అడుగుపెట్టిందని తెలుసుకోండి.

మీరు చేయవలసింది కేవలం సామర్థ్యంతో ముసుగులు మార్చుకుంటూ, వేడుకని ఆనందించడమే. అప్పుడు మీరు ఒక ప్రేక్షకుడు మాత్రమే. మీరు ముసుగుకి అతీతమైన వ్యక్తి అని తెలుసుకున్నప్పుడే అలా చేయగలరు. లేకపోతే ముసుగుతో వివేకం పోగొట్టుకొని, జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతారు. మీరు ముసుగులనే ఉపయోగిస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు మిమ్మల్ని కోరికలు వదిలేస్తాయి. మీరు పెద్ద అవగానే, బొమ్మలు ఎలా వదిలేస్తారో, అలా ఈ ముసుగులని వివేకంతో, అవసరమైనప్పుడు వాడుకుంటే వాటి మీద కోరిక ఉండదు.

అసంతృప్తితో అహంకారం జన్మిస్తుంది

మీరు బలమైన అహంకారం గల వ్యక్తి అయితే, మీ మనస్సు ఎప్పుడూ సంఘర్షణతో అసంతృప్తిగా ఉండి, మీకు నరకం చూపిస్తుంది.

సంతృప్తి కలిగితే మీకు పరిధి ఉండదు. అందుకే మీకు సంతోషం లేదా బ్రహ్మానందం అక్కర్లేదు. మీకు పరమానందం కావాలని ఎప్పుడూ ఆలోచించరు. లేదా నిజానికి మీకు సంతోషం అన్నా, బ్రహ్మానందం అన్నా భయం. మీరు ప్రశాంతంగా ఏ బాధా లేనప్పుడు మిమ్మల్ని గమనించండి. మీకు ఆలోచించడానికి ఏమీ లేనప్పుడు ఏదో కోల్పోయాను అనుకుంటారు. మీరు గట్టిగా ఆలోచించదానికి ఏదైనా లేకపోతే మీ అంతరంగంలో తీర్చిదిద్దిన పరిధి ఉండదు. మీరు కష్టకోణాన్ని తాకినప్పుడే మనసుకి ఉనికి ఉంటుంది. మీకు తగినంత బాధలేకపోతే, గుర్తింపు లేదా పరిధి ఉన్నట్టు అనిపించదు. కొంచెం లోతుగా చూస్తే, మీకు ఆలోచించదానికి ఏ బాధా లేనప్పుడు మీకు ఒంటరిగా ఉన్న భావన కలుగుతుందన్నది అర్థమౌతుంది. మీరు అలాగే ఉన్నానని అనుకుంటారు. ఎందుకంటే మనసు స్వభావసిద్ధంగా చెడువాటినే గుర్తుంచుకుంటుంది. మనసు ఎక్కువ ఆలోచనలను పుట్టించి వృద్ధి చెందుతుంది. అది బాధనూ, అసంతృప్తినీ, అసంతుష్టినీ, స్పష్టంగా గుర్తిస్తుంది. ఆనందానికి పరిధి లేదు. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీకు పరిధి ఉన్నట్లు అనిపించదు. మీకు ఎప్పుడు పరిధి లేదు అని అనిపిస్తుందో అప్పుడు ఆనందస్థితిలో సంతోషంగా సంతృప్తిగా, ఉంటారు.

బాధ అహంకారానికి దారి తీస్తుంది

బాధ లేకుండా మీ అహంకారానికి ఉనికి లేదు. అహంకారానికి బాధ పునాది. ఈ ముఖ్యమైన విషయం మీరు అర్ధంచేసుకోవాలి. మీరు ఎప్పుడు అహం బాధ వల్ల కలత చెందుతుందని అనుకుంటారు. కాదు అహం బాధవల్ల పెరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం మీ బాధ తక్కువగా ఉంటే మీకు అహంకారం తక్కువగా ఉంటుంది. మీరు చాలా చిన్నగా అనిపించి, మీ బాధని పెంచుకుని, మీకు గుర్తింపు వచ్చింది అని అనుకుంటారు.

బాధ తక్కువైతే, అహంకారం తక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువగా బాధపడితే, మీ అహంకారం దృఢంగా అవుతుంది. అందుకే ఎప్పుడూ మీ బాధని గొప్పగా చెప్పుకుంటారు. కొన్నాళ్ళ తర్వాత అతిశయోక్తిగా చెప్పినట్టు మరిచిపోతారు. అదే అసలు సమస్య. అప్పుడు మీరు అదే వలలో చిక్కుకుంటారు. "మీకు నా జీవితం తెలియదు, నా బాధ తెలియదు" అని అంటారు. కాని మీరు కల్పించుకున్న వలలో మీరు చిక్కుకున్నారని స్పష్టంగా తెలుసుకోండి.

అహంకారం లేనప్పుడు మీరు ఆనందించగలరు

మీకు అహంకారం ఉంటే మీరు ఆనందంగా ఉండలేరు. అద్దం ముందు నిలబడి తయారైన మిమ్మల్ని చూసి ఇతరులు ఆనందిస్తారు. కానీ మీరు మిమ్మల్ని చూసుకుని ఆనందించలేరు. అహంకారం లేని వ్యక్తి అంటే ఎవరైతే తన శరీరం, మనసు వల్ల గుర్తింపు పొందరో, అతను ఆనందించగలడు. మీది అన్న భావన కలిగినప్పుడు ఆనందించలేరు. ఏ వస్తువునైనా, ఏ బాంధవ్యమైనా మీది అని అనుకుంటారో, దాన్ని ఆనందించడానికి మీరు స్వాతంత్ర్యాన్ని కోల్పోయినట్లే.

అహంకారం, ప్రకృతితో దాని సంబంధం

నేను దక్షిణభారత్ లో, తమిళనాడులో ఉన్నప్పుడు జ్ఞానోదయం పొందిన తర్వాత జరిగిన సంఘటన.

నేను ఓ సాయంత్రం అడవిలో హాయిగా కూర్చుని ఉన్నాను. ఆలోచనారహితంగా ఉన్నాను. నా ఎదురుగా 3 అడుగుల దూరంలో ఓ పెద్ద పాము పడుకుని ఉంది. నా కళ్ళు ఏ విధమైన సమాచారాన్నీ గ్రహించటం లేదు. కాబట్టి నాలో భయం లేదు. నేను కూర్చుని ఉన్నాను. అలాగే తాచుపాము కూడా హాయిగా, సుఖంగా పడుకుని ఉంది.

నేను నెమ్మదిగా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, నా మనసులో 'అక్కడ ఒక పాము ఉంది' అన్న ఆలోచన వచ్చింది. తర్వాత 'ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి' అన్న మరొక ఆలోచన వచ్చింది. ఏ క్షణం నా మనసులోకి 'పాము' అన్న ఆలోచన వచ్చిందో అదే క్షణం ఆ పాము కూడా పక్కనే మనిషి ఉన్నాడని కలత చెందడం నాకు స్పష్టంగా కనిపించింది.

నేను 'అక్కడ పాము ఉంది' అని అనుకునేంత వరకూ, పాముకి నేను ఒక మనిషిని అన్న భావం కలగలేదు. నాలో భయం కలిగే వరకూ పాము నా వల్ల భయపడలేదు. నాకు భయం కలిగిన క్షణంలో పాముకీ భయం వేసింది. మా ఇద్దరి మధ్య దూరం తగ్గలేదు. నాకు పాము అనే ఆలోచన వచ్చే సరికి పాము అంతరంగంలో ఒకలాంటి అలజడి, ఆందోళనభావన కలగడం నేను గ్రహించాను. ఏ క్షణాన 'నేను కదలాలి' అనే ఆలోచన వచ్చిందో, ఏ క్షణాన భయం కలిగిందో, పాముకి కూడా అభద్రతా భావం కలిగి భయపడింది. వెంటనే పాము అక్కడి నుంచి వెళ్ళిపోసాగింది. మీలో అహంకారం దృఢంగా ఉంటే మీరు ప్రకృతికి అనుగుణంగా ఉండగల సామర్థ్యంపోతుంది.

రెండు రకాల గుర్తింపులు

మనందరికీ రెండు రకాల గుర్తింపులు ఉంటాయి. మనం బయటి ప్రపంచానికి చూపించే వ్యక్తిత్వం, మన అంతరంగంలో మనం అనుకునే వ్యక్తిత్వం. మనలో ఉన్న మన వ్యక్తిత్వాన్ని సంస్కృతంలో మమకారం అంటారు. అసలైన మీ కంటే అది చాలా చిన్నదిగా ఉంటుంది. మీరు లోపల, ఇది వరకు చేసిన తప్పులు, మీ ఓటములు గుర్తుపెట్టుకుని, న్యూనతా భావం కలిగి వాటిపై నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు.

మీరు బయటి లోకానికి చూపించే మీ వ్యక్తిత్వాన్ని 'అహంకారం' అంటారు. 'అహంకారం' మీ గుర్తింపు కార్డు. ఆ కార్డు మీద ఇతరులు మీ గురించి ఏం తెలుసుకోవాలో అన్నీ రాసి ఉంటాయి. అవి మీరు బయటి ప్రపంచానికి చూపించాలనుకున్న గుర్తింపుపై ఆధారపడి ఉంటాయి. అది అసలైన మీ కంటే ఎక్కువగా ఉంటుంది. మీకున్న వాటి కంటే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మిమ్మల్ని మీరు విక్రయించుకోవాలి. ఇది మీరు సమాజంలో గుర్తింపు పొందాలంటే ప్రాథమిక అవశ్యకత అవుతుంది. అహంకారం అన్నది ఉన్నతుడినన్న భావం మీద ఆధారపడి ఉంటుంది. మమకారం ఆత్మన్యూనతాభావం, అత్యాశల మీద ఆధారపడుతుంది.

మీరు ఎవరని అనుకుంటున్నారో అది మీరు కాదు

చిన్నకథ : ఒక వ్యక్తి తన వ్యాపారసంస్థ ఉద్యోగులకు వరుసగా నాయకత్వం మీద ఉపన్యాసాలు ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. అతని భార్య "ఉపన్యాసాలు ఎలా జరిగాయ" అని అడిగింది. అతడు 'బాగానే జరిగాయి కాని నేను చెప్పింది ఎంతమందికి అర్ధం అయిందో చెప్పలేను' అని సమాధానం ఇచ్చాడు. భార్య అలా ఎందుకు అనుకుంటున్నారు?' అని అడిగింది. ఆ వ్యక్తి, 'అవి నాకు అర్ధం కాలేదు కాబట్టి,' అని సమాధానం ఇచ్చాడు.

మీరు బయటి ప్రపంచానికి చూపించే మీ వ్యక్తిత్వం, భయం మీద ఆధారపడుతుంది. అందుకే అది అసలైన మీ కంటే ఎక్కువగా ఉంటుంది. దాన్ని నిరంతరం సజీవంగా ఉంచడానికి, పెంచడానికి ఎంతో శక్తి అవసరం. అందుకే దాన్ని నిరంతరం వృద్ధి చెయ్యాలి అని అనుకుంటారు. నిరంతరం మీరు అనుకునే మీ గుర్తింపు పైన పని చేయటానికి ప్రయత్నిస్తారు.

మీ జీవితం ఈ రెండింటి మధ్య పోరాటం మాత్రమే. అహంకారం, మమకారం మధ్య సంఘర్షణ, మీరు బాహ్యప్రపంచానికి, అంతరంగ ప్రపంచంలో చూపించే వ్యక్తిత్వాల మధ్య సంఘర్షణే ఒత్తిడి అంటే. ఈ రెండు గుర్తింపుల మధ్యా ఉన్న అసౌకర్యం అనే భావన అసౌఖ్యాన్ని కలిగిస్తుంది.

అహంకారం, మమకారం అనే రెండు గుర్తింపులూ కల్పనలే. ఆ రెండూ కూడా అబద్దాలే. మీరు ఈ రెండింటికీ అతీతమైనవారు. మీ శక్తిని అంతా, బాహ్యప్రపంచానికి చూపించే మీ గుర్తింపు, 'అహంకారాన్ని' పెంచడానికి ఉపయోగిస్తే, మీ జీవితం ఐహికం అవుతుంది. 'మమకారం' మీద పని చేసే వ్యక్తులు, తమ వ్యక్తిత్వాన్ని నిరంతరం తమను తృప్తి పరిచే విధంగా మార్చుకుంటారు. మీరు జీవితాంతం, చెక్కుతూ 'మమకారాన్ని' మీరు అనుకునే గుర్తింపుని పెంచితే, మీ జీవితం నైతికంగా అణిచివేసినట్లుగా ఉంటుంది. అసలు మౌలికసత్యం ఏమిటంటే, మీరు ఈ రెండు గుర్తింపుల కంటే చాలా ఉన్నతులు. మీరు ఈ రెండు గుర్తింపులనీ వదిలేస్తే, మీరు రెండింటికీ అతీతమని హఠాత్తుగా తెలుసుకుంటారు. అది జరిగినప్పుడు, ఈ రెండు గుర్గింపులూ మిమ్మల్ని బంధించలేవు.

న్యూనతా అహంకారం

న్యూనతాభావం అంటే మీరు ఉన్న దానికంటే తక్కువ అని చూపించడం లేదా అనుకోవడం. ఆత్మగౌరవం ఎక్కువగా ఉండి, మీరు ఉన్న దాని కంటే ఎక్కువ అని ఊహించుకోవడం కూడా ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడుతుంది. మీరు మీ జీవితాన్ని బట్టి కాకుండా మీ జీవితశైలిని బట్టి నిర్ణయిస్తారు. పొందిన చేతనశక్తితో కాకుండా మీరు కొనుక్కున్న కార్లు, స్థలాలతో మిమ్మల్ని తూచుకుంటారు.

మీకున్న వ్యక్తిత్వాన్ని మార్చుకోలేకపోవడమే పెద్ద సమస్య. మీకు వ్యక్తిత్వాలని కోటులా ఉపయోగించడం తెలియదు. ఒక వ్యక్తిత్వంలో చిక్కుకుని ఉంటారు. తప్పు వ్యక్తిత్వాన్ని, తప్పు ప్రదేశంలో ఉపయోగించడమే అహంకారం. ఎక్కడైతే మర్యాదగా, నమ్రతగా ఉండాలో, అక్కడ గర్వంగా, కోపంగా ఉండడం అహంకారం అని అర్ధం చేసుకోండి, ఎక్కడైతే ధైర్యంగా ఉండాలో అక్కడ మర్యాదగా, నమ్రుతగా ఉంటే, మీరు అహంకారి. 'నేను నమ్రతగా ఉంటే, అహంకారిని ఎలా అవుతాను?' అని మనం అనుకోవచ్చు. కాని స్పష్టంగా తెలుసుకోండి, తలకిందులుగా ఉన్న అహంకారం కూడా అహంకారమే. దానినే న్యూనతా అహంకారం అంటారు.

రమణమహర్షి జీవితంలో ఒక సంఘటన : రమణమహర్షి శిష్యులలో ఒకరు, ఆయన పుస్తకాన్ని వేరొక భాషలోకి అనువదించాడు. ఆ అనువదించిన పుస్తకంలో అతని పేరుని ప్రచురించారు. పుస్తకం చూసిన ఆ శిష్యుడికి కోపం వచ్చి, అది ప్రచురించినవారిని ఆ తప్పు చేసినందుకు తిట్టాడు. అతను రమణమహర్షి దగ్గరికి వెళ్ళి, 'భగవాన్, వారు నా పేరు పుస్తకంలో ఎందుకు వేశారు?' అని అడిగాడు.

భగవాన్, 'పేరు ఉండాలనే అహంకారం, పేరు ఉండకూడదు అన్న అహంకారం, రెండూ ఒక్కటే' అని చెప్పారు.

స్పష్టంగా తెలుసుకోండి, న్యూనతాభావం గల అహంకారం నమ్రతగా ఉన్నట్లు చూపించినా, అది అహంకారమే. ఉన్నతుడినని అనే భావంతో మీరు చూపించే తీవ్రమైన అహంకారానికి, సమాజం మీకు పాఠం చెబుతుంది. అది అందరికీ కనిపిస్తుంది. నమ్రతగా ఉన్న అహంకారం, సమాజానికి కనిపించదు. అది ఎక్కువ ప్రమాదకరం. అది జిత్తులమారి అహంకారం, తనని తాను రక్షించుకోగలదు.

అహంకారాల్లో రకాలు

చురుకైన అహంకారం, మందకొడి అహంకారం : చురుకైన అహంకారాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఇలాంటివారు అధికారం చలాయిస్తారు, తమ ప్రాముఖ్యాన్ని బహిరంగంగా చాటుకుంటారు. వారు గర్వంగా ఉంటారు. ఇలాంటి అహంకారాన్ని గురుదేవులు సులభంగా తగ్గించగలరు. ఆ అహంకారం మీద కొన్నిసార్లు కొట్టగానే అది విరిగిపోతుంది.

చురుకైన అహంకారం ఉన్న వ్యక్తి, ఏ పరిస్థితుల్లోనూ తన అహంకారాన్ని వదులుకోడానికి ఇష్టపడదు. నెమ్మదిగా ఉన్న అహంకారం అంతర్లీనంగా, వంచనతో కూడి ఉంటుంది. నెమ్మదిగా ఉన్న అహంకారం గల వ్యక్తులు, నుమతగా ఉన్నట్లు ప్రవర్తిస్తారు, మనుష్యులను ఎదుర్కోడానికి ధైర్యం చెయ్యరు. పరపతిని అంగీకరించడానికి సిగ్గుపడతారు. అసహ్యకరమైన విషయం ఏమంటే,

వారు తమకి అహంకారం లేనందువల్ల అలా ఉన్నామనుకుంటారు. వారు తమ అహంకారం దెబ్బ తినకుండా ఉండడానికి, అచేతనంగా తాము నుమతగా ఉన్నామని అనుకుంటారు. చురుకైన అహంకారం గలవారు, ఎండిపోయిన గట్టికొమ్మలా ఉంటారు. ఆ అహంకారాన్ని సులభంగా విరిచేయచ్చు. నెమ్మదెన అహంకారం ఉన్నవారు, తాజాగా, పచ్చికొమ్మలా ఉంటారు. వారి అహంకారం దెబ్బ తిన్నప్పుడు, ఆ కొమ్మలు వంగుతాయి కాని విరగవు. వారు అహంకారాన్ని జాగ్రత్తగా కాపాదుకుంటారు. వీరు ఇతరుల అభిప్రాయాలకీ, ప్రతిచర్యలకీ ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. వీరు ఇన్ని ఏళ్ళూ పెంచి పోషించిన అహంకారం దెబ్ల తినడం సహించలేరు. ఈ అహంకారమే మీ చుక్కాని. అది ఎదురు దెబ్బతింటే, మీరు చుక్కాని లేని వారు అవుతారు. అందుకే మీరు నుమతతో, విధేయతతో నిశ్శబ్దంగా ఉంటారు. మీరు గురుదేవుల ఎదుట మీ అహంకారాన్ని ప్రదర్శిస్తే, ఇంకొక అవకాశం పోగొట్లకుంటారు. మీరు వికసించదానికి ఒక పెద్ద అడుగు తీసుకునే అవకాశాన్ని కోల్పోతారు.

సామాజిక అహంకారం : మనం ఇంకొక అహంకారాన్ని జాశ్రశ్తగా పోషిస్తాం. అదే సామాజిక లేదా సాంఘిక అహంకారం. మీ జీవితం వ్యక్తిగతం అని భావించి, ఎవ్వరూ అందులోకి తొంగిచూడకూడదనుకుంటారు. మీ గుర్తింపు పూర్తిగా పెళపెళమంటూ పగిలిపోతుంది. తిరిగి దాన్ని సమాజంలో నిలబెట్టలేనని భయపడతారు. ఇదే సామాజిక అహంకారం. ఆ గుర్తింపు ఇతరుల కంటే మీకు అనుభవంలోకి వచ్చేది. మీరు ఎలా ఉన్నారో అలా లోకానికి వ్యక్తపరిస్తే, మీరు ఏమీ దాచనపసరంలేదు కాబట్టి హాయిగా ఉంటారు.

చిన్నకథ : ఒకసారి రాజకీయాలలోకి వెళదామనుకున్న వ్యక్తి తన ప్రసంగం తరువాత కూర్చున్నాడు. అతని పక్కన కూర్చున్న వ్యక్తి, 'అయ్యా! మీరు ఏమైనా తాగుతారా?' మా వద్ద మద్య పానీయాలు కూడా ఉన్నాయి.' అని చెప్పాడు. మొదటి వ్యక్తి, 'ఇది విచారణా లేదా ఆహ్వానమా – అన్నది నాకు తెలియాలి' అని సమాధానం ఇచ్చాడు.

మనం సామాజిక అహంకారం వల్ల ఎప్పుడు సచేతనంగా ఉంటాం. వ్యక్తులు మనని చూసి మన గురించి మాట్తాదుకుంటున్నారని అనుకుంటాం. మీరు సచేతనంగా ఉన్నప్పుడు మీరు అహంకారులని, స్పష్టంగా తెలుసుకోండి. మీరు చాలా గొప్ప వ్యక్తి, అందుకే ఎప్పడూ అందరి కళ్ళూ మీ మీద ఉన్నాయని అనుకుంటారు. అందుకే మీరు సచేతనంగా ఉంటారు.

మీరు సచేతనంగా ఉన్నప్పుడు, మీరు జీవిస్తున్నారు. అయినా జీవించటం లేదు. అది మీ అందానికి ఒక అడ్లు గోద. మీ అందం స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపించదు. జంతువులకేసీ, ప్రకృతి వైపూ చూదండి. అవి అందంగా, స్వేచ్ఛగా ఉంటాయి. ఎందుకంటే అవి సచేతనంగా ఉండవు. అవి సృష్టితో ఒకటిగా ఉన్నాయి కాబట్టి, ఆనందంగా ఉంటాయి. ఏ క్షణం అయితే మనుష్యులు మిమ్మల్ని చూసున్నారు అన్న భావం కలుగుతుందో, అహంకారం అదుగుపెడుతుంది. మీరు సహజస్యభావాన్ని కోల్చోతారు.

పెద్దవారిలా, పిల్లలు సచేతనంగా ఉండరు. వారు ఆడుకుంటున్నప్పుడు చూసే ఎంతో అందంగా, అమాయకంగా కనిపిసారు. ఫోటోలు తీసినప్పుడు కూడా మీకు తెలియకుండా తీసినవి, మీరు కావాలని తీయించుకున్నవాటి కంటే బావుంటాయి.

ఏ క్షణం, మిమ్మల్సి కెమెరా ముందు నిలబడి ఫోటో తీయించుకోమంటారో, మీరు సచేతనంగా అవుతారు. ఇతరులు మీ గురించి ఏమనుకుంటారో, అని మీ అహంకారం భయపడుతుంది. సచేతన అహంకారం ఎప్పుడూ ఇతరుల అభిప్రాయాలని లెక్కిస్తుంటుంది.

మీరు లెక్కపెట్టడం మానేసి, ఎప్పుడు అమాయకంగా, మనోవికాసంతో ఉంటారో, అప్పుడు మీరు ఆశ్చర్యంతో, స్వచ్చతతో నిండిపోతారు. జీవితం ఎప్పటికి మందకొడిగా తయారవరు.

నేను, నాది

'నేను' అనేది అహం. అది భయానికి మూలం.ఈ ఇల్లు నాది, అది నా కారు, వీళ్ళు నా స్పేహితులు – అనేవి అత్యాశకు మూలం. నేను అంటే నిరంతరం చేయడం. నాది అంటే నిరంతరం పొందడం. నిరంతరం మీ పరిధిని పెంచుకోదానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడూ బాహ్యంగా ఉన్న వస్తువులని మార్చడానికి ప్రయత్నిస్తారు. మీరు 'నాది' అనే పరిధి పెంచుకోవాలనుకుంటారు. ఉదాహరణకి, మీకు ఒక కారు ఉంది. అంత కంటే సుఖాన్ని కలిగించే కారు కావాలనుకుంటారు. ఒకటి కంటే ఎక్కువ కార్లు కావాలనుకుంటారు. మీరు ఉండటానికి ఒక ఇల్లు ఉంది, అంత కంటే, పెద్ద ఇల్లు కావాలన్న కోరిక కలుగుతుంది. అలాంటి వ్యక్తులు, నిరంతరం ఎక్కువ వసువులని పొందగలిగినప్పుడే ఆనందంగా, హాయిగా, నిర్శయంగా ఉంటారు.

అభద్రతాభావం, భయం మనని అత్యాశకు గురిచేసి, నిరంతరం ఎక్కువ వస్తువులు కలిగి ఉండేలా చేస్తాయి. నిరంతరం వస్తువులని పొందడం అనేది కేవలం గాధమైన అభద్రంతా భావమే. ఎక్కువ వసువులు కావాలి అనుకోదం కేవలం భయం, అభ్రదతా భావం వల్ల మాతమే. మన చుట్లూ చాలా మంది స్నేహితులు, చుట్లాలు, చాలా వస్తువులు ఉంటే మనం భద్రదంగా ఉన్నా మనుకుంటాం. అంత భదతతో ఉన్నప్పుడు, మనని ఈ ప్రపంచం నుండి ఎవ్వరూ తీసుకువెళ్ళరు అని అనుకుంటాం.

అహంకారం గురువు

'మేము గురువులని ఎందుకు అనుసరించాలి?' అని చాలామంది నన్ను అడుగుతారు. మీరు గురువులని అనుసరించక్కర్లేదు. మీరు గురువులని అనుసరించకపోతే మీ అహంకారాన్ని

అనుసరిసారు, అంతే. మీకు రెండే ఎంపికలున్నాయి, మీరు గురువు మాటని వినండి లేదా మీ అహంకారం చెప్పేది వినండి, అని నేను వారితో అన్నాను.

గురువు నిత్యానందస్థితిని పొందిన వ్యక్తి. మీరు ఆయనని అనుసరిస్తే, అదే స్థితికి చేరుకుంటారు. మీ అహంకారం వల్ల మీరు ఏం పొందారో, అది ఎటు దారి తీస్తుందో మీకు తెలుసు. మీ అహంకారం తీసుకుని వెళ్ళే మార్గంలో మీకు సంతోషాన్నీ, సుఖాన్నీ, సంతృప్ధినీ, ఆనందాన్నీ ఇస్తే మీరు మీ అహంకారాన్నే అనుసరించండి. అందులో తప్పేమీ లేదు. మీకు కొంచెం అసౌకర్యంగా ఉండి, మార్చు కావాలనుకుంటే గురుదేవుల మార్గాన్ని అనుసరించండి.

రెండే వస్తువులు ఉన్నాయి – గురువు లేదా మనస్సు. మీరు గురువును అనుసరిస్తే, మనసు వెంట వెళ్ళలేరు. మీరు మనసు వెంబడి వెళ్తే గురువుని అనుసరించలేరు.

ఒక అందమైన పదం ఉంది, 'సమః'. దాని అర్ధం 'నాది కాదు' 'నేను కాదు' – నేను, గురుదేవుల లేదా భగవంతుని దగ్గర, 'నేను', 'నాది' అధీనం చేస్శున్నాను.

దక్రిణామూర్తి స్వామి కథ

దక్రిణామూర్తి స్వామీజీ అని ఒక జ్వానోదయమైన గురువు ఉండేవారు. ఆయన ఒక మర్రి చెట్టు కింద కూర్చునేవారు. ఆయన సమక్షాన్ని అందరూ అనుభూతిలోకి తెచ్చుకోగలిగారు. ఆయన సన్నిధి ఎంత శక్తివంతంగా ఉండేది అంటే ఆయన మాట్లాడవలసిన అవసరం వచ్చేదికాదు. ఎవరికైనా మాట్లాడాలి అనే భావం కలిగేదికాదు.

ఆ రాజ్యంలో ఉండే ఆస్థానకవి, ఆయన మీద 1000 పద్యాలు రాసాదు. ఆ కవి దక్షిణామూరి స్వామీజీ ఒక గొప్ప వీరుడు అని అన్నాడు. సంద్రదాయపరంగా ఏ వ్యక్తి అయితే యుద్ధంలో 1000 ఏనుగులని చంపుతాదో, అతనికి గొప్ప వీరుదు అన్న బిరుదు ఇస్తారు. కవి, దక్షిణామూరి శూరత్వగుణాలనీ, శక్తినీ మెచ్చుకుంటూ 1000 పద్యాలు పాదాదు. ఈ విషయం విన్న ఆ దేశపు రాజు అహంకారం దెబ్బ తింది. అప్పటి వరకు ఆ ప్రాంతంలో రాజు ఒక్కడే యుద్ధంలో 1000 ఏనుగులు చంపాడు. అతనికి గొప్ప వీరుదు అన్న బిరుదు ఉందని తెలుసు.

ఆ రాజు, కవిని పిలిచి "సువ్వు ఆ మరి చెట్లు కింద కూర్చున్న నగ్న బికారిని స్తుతిస్తూ 1000 పద్యాలు పాడినందుకు సమాధానం చెప్సు. లేకపోతే నీ తల నరికేయబదుతుంది" అని అన్నాడు.

ఆ కవి, 'నేను ఏ కారణమూ, ఏ సమాధానమూ చెప్పలేను. మీరు నన్ను చంపించవచ్చు కాని ఆయన సన్నిధిలో ఏదో ఉంది. నేను మిమ్మల్ని ఒక చిన్న కోరిక కోరుతున్నాను. మీకు

కొంత సమయం ఉంటే, ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళి కూర్చోండి. అంతే, నేను ఇంకేమీ అడగను,' అని రాజుతో అన్నాడు.

రాజుకు, దక్షిణామూర్తి స్వామి గురించి తెలుసుకోవాలి అన్న కుతూహలం కలిగింది. ఆయన తన మొత్తం సైన్యంతో ఆ స్వామిని కలవడానికి వెళ్ళాడు. రాజులు సాధారణంగా ప్ర‌యాణం చేసేట‌ప్పుడు అన్ని హంగుల‌తో వెళారు. లేక‌పోతే వారికి గురింపు ఉండ‌ద‌ని అనుకుంటారు. దక్షిణామూర్తి ఒక పరమహంస, జ్ఞానోదయం పొందిన గురువు. రాజు ఆయన ఒక మర్రిచెట్టు కింద ఏ సరంజామా లేకుండా, బట్టలు కూడా లేకుండా కూర్చుని ఉండడం చూసాడు. ఆ స్వామి బహ్మానందంలో కనిపించారు.ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒక సామాన్యమైన బిచ్చగాడు ఒక మూల బట్టలు లేకుండా కూర్చున్నాడు. ఆయన ఆనందంలో, ప్రపశాంతతలో కలిసిపోయాదు, పూర్తిగా విశ్వశక్తిలో తన ఉనికిని మరిచిపోయాడు. ఆయన అతినిశ్శబ్దంలో ప్రశాంతతతో ఉన్నారు. ఆ నిశ్శబ్దం ఆయన సమక్షంలో ఉన్న ఎవరిలోకైనా చొచ్చుకుపోతున్నది.

ఆ రాజు తన రథం దిగి, దక్షిణామూర్తి స్వామి దిశగా వెళ్ళాదు. ఆ రాజునీ, ఆయన సెన్యాన్నీ చూసి, ఆ గందరగోళాన్ని విని, దక్రిణామూర్తి కొంచెం కూడా కదలలేదు. ఆయన కళ్ళు తెరిచి, సూటిగా రాజు కళ్ళలోకి చూసారు. మొట్లమొదటిసారి రాజు కళ్ళలోకి ధైర్యంచేసి, సూటీగా చూసిన వ్యక్తి దక్రిణామూరి సాయి. ఎప్పుడూ రాజు ఇతరులకేసి చూసేవాడు, వారు తలలు వంచుకునేవారు. రాజు కళ్ళలోకి ఒకరు సూటిగా చూడడం అదే మొదటి సారి. రాజు పూర్తిగా వణికిపోయాడు. కొన్ని క్రణాల తరువాత, రాజు తల దించేసుకున్నాడు. ఆయన తనలో ఏదో మార్చు జరగడం గమనించాడు. గురువెన దక్షిణామూరి స్వామి, రాజుని కూర్చోమని సంజ్ఞ చేసారు. మంత్రులు, సైన్యం, అంతా తమ ఆయుధాలని వదిలేసి నిశ్మబ్దంగా కింద కూర్సున్నారు. పది నిమిషాలలో మొత్తం సైన్యం అంతా కింద కూర్చుంది.

ఒక గంట గడిచింది. రెండు గంటలు గడిచాయి, మూడు గంటలు, సాయంత్రం అయింది. ఒక పూర్తి రోజు గడిచింది. గురువు, రాజు, సైన్యం అంతా నిశ్శబ్దంగా కూర్చునే ఉన్నారు. ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేదు. మూడు రోజులు గడిచాయి.

అప్పుడు గురువు కళ్ళు తెరచి, 'నీవు ఇక వెళ్ళవచ్చు' అని రాజుతో అన్నారు. రాజు గురువు పాదాల మీద సాహ్తాంగపడిపోయాడు. అక్కడి నుండి, నిశ్మబ్దంగా వెళ్ళిపోయాడు. రాజు తన భవనాన్ని చేరి, ఆ దక్షిణామూర్తిని సుత్రిస్తూ పద్యాలు రాసిన కవిని పిలిచి, 'ఆ స్వామిని స్తుతిస్తూ 1000 పద్యాలే ఎందుకు రాసావు?' ఆయన మీద పదివేల పద్యాలు పాడాలి' అని అన్నాడు.

ఆ కవి ఒక అందమైన వాక్యం చెప్పాడు. 'పదివేల ఏనుగులని చంపడం సులభం. మీకు ఆయుధాలు ఉంటే చాలు కాని ఒకరి మనస్సుని చంపడం అన్నది నిజమైన ఘనకార్యం.'

గురువు, రాజు మనసుని చంపేసాడు. దక్రిణామూరి తన మనసునే కాకుండా ఆయన సమక్షంలో ఉన్న ఎవరి మనస్సునైనా చంపగలిగేవారు. పదివేల ఏనుగులని చంపడానికి ధైర్యం అక్కర్లేదు. మీ మనస్సుని చంపడానికి ధైర్యం కావాలి.

ధ్యానపద్ధతులు :

  1. ద్రష్టని గుర్తుంచుకోండి : చూసేవాడిని గుర్తుపెట్టుకోండి. మీరు కక్కు తెరచినప్పుడు మీరు కళ్ళతో చూసున్నారని అర్థం చేసుకోండి. మీరు చూడటం లేదు. అప్పుడు మీ శక్తి అంతా ఆజ్ఞా చక్రం లేదా రెండు కనుబొమల మధ్య కేంద్రీకృతమైనట్లు అనిపిస్తుంది. మీరు వస్తువులను ఇంకా స్పష్టంగా, వాన పడిన తరువాత వసువులు ఎంత తాజాగా ఉంటాయో అంత వివరంగా చూస్తారు. అప్పుడు మీకు అనురాగం, ద్వేషం రెండూ ఉండవు. మీకు ఏ విధమైన బాధా ఉండదు.

ఉదాహరణకి, నిద్దలో మీకు కల వచ్చినప్పుడు అప్పదప్పుడు అందులో నుండి బయటికి రాలేరు. ఆ స్థితిలో మీకు కలలు స్పష్టంగా కనిపిస్తాయి. కావాలంటే, వాటిని మీరు మార్చుకోగలరు. అదే విధంగా, మీరు నిజం అనుకునేది ఒక కల అని తెలుసుకుంటే మీకు దాన్ని మార్చుకునే శక్తీ, తెలివి కూడా ఉంటాయి. మీ చేతనస్గితి పెరిగితే, మీరు అది కల అని గ్రహించే తెలివి కలిగితే, మార్చుకునే అవసరం అక్కడ ఉండదు.

  1. మనస్సులో చిత్రం ఏర్పరచుకోవటం : ఈ పద్ధతికి ఏ సమయంలోనైనా సాధన చేయవచ్చు. విశ్వాన్ని జీవంతో ఉన్నట్లుగా అనుభూతి చెందండి. మీ చుట్టూ ఉన్న ప్రతి దానిలో జీవం ఉందనుకోండి. అది చూడడానికి మొదట, మీ శరీరంలోని జీవాన్ని స్పృశించడానికి ప్రయత్నం చేయండి. మీరు కూర్చున్న కుర్చీలో జీవాన్ని తాకడానికి ప్రయత్నించండి. మీరు సజీవంగా మీ చర్మం లోపల ఎలా ఉన్నారో అన్న చిత్రం ఏర్పరచుకోండి. అదే విధంగా మీరు కుర్చీలో కుషను మీద సజీవంగా ఉన్నట్లు మనస్సులో చిత్రించుకోండి. మీ పక్కన కూర్చుని ఉన్న వారిలో మీరు సజీవంగా ఉన్నట్టు చిత్రించుకోండి.

నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వెదురు కురని నదిలో వేసారు అనుకోండి. ఆ వెదురు కుర ఎడమవెపు నది ఒక భాగం ఉంటుంది. అలాగే వెదురు కుడి పక్కన నది ఇంకొక భాగం ఉంటుంది. ఇప్పుడు నది రెండు భాగాల కింద విడిపోయింది అని అనుకుంటున్నారా? లేదు! ఆ వెదురు కుర తీస్తే, ఎడమ లేదు, కుడి లేదు. దానికి పరిధి లేదు. ఒక్క నదే అది.

జీవితం నది లాంటిది. వెదురు కుర మీ అహంకారం. మీ అహంకారం వల్ల మీరు, 'నేను', 'నువ్వు' అని అంటారు. మీకు రెండు వైపులు ఉన్నాయి. మీకు ప్రపంచం వెదురు వలన రెండుగా కనిపిసుంది. మీ అహంకారమనే వెదురు తీసేస్కే 'నేను' లేదు, 'నువ్వు' లేవు, అంతా సజీవంగా ఉన్న సమక్షమే!

  1. మూడవకన్ను మీద ధ్యానం : మొత్తం సమయం – 25 నిమిషాలు. ఇది చాల శక్తి వంతమైన పద్దతి. మీరు గురువు సమక్షంలో కానీ, ఆయన కళ్ళ చిత్రం ముందుకానీ చేస్తే, ఎక్కువ ఉపయోగం ఉంటుంది.
  • స్టెప్ 1 : 5 నిమిషాలు. కళ్ళు మూసుకుని, మీకు కనిపిస్తున్న ప్రతిబింబాలని చూడండి.
  • స్టెప్ 2 : 5 నిమిషాలు. మీరు కళ్ళు తెరుచుకుని, మీ మూడవ కంటితో, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMల మూడవ కంటి వైపు తీక్షంగా చూడండి. మీ కళ్ళతో చూదండి.
  • స్టెప్ 3 : 5 నిమిషాలు. కళ్ళు మూసుకుని, మూసి ఉన్న కళ్ళ వెనక, కనిపిస్తున్న ప్రతిబింబాలని కళ్ళతో చూసున్నట్లుగా చూదండి.
  • స్టెప్ 4 : 5 నిమిషాలు. మీరు కళ్ళు తెరుచుకుని, మీ మూదవ కంటితో చిత్రంలో ఉన్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMల మూడవ కంటి వైపు తీక్షంగా చూదండి.
  • స్టెప్ : 5 నిమిషాలు. కళ్ళుమూసుకుని, మీ మూసిన కళ్ళ వెనుక కనిపిస్తున్న ప్రతిబింబాలని మీ కళ్ళతో చూడండి.

ఈ ధ్యానం చేసేటప్పుడు, మీకు ఇష్టమైన దేవతలు కనిపించవచ్చు. లేదా గురుమూర్తి బదులు కాంతిపుంజం కనబడచ్చు. కొన్నిసార్లు చిత్రం ఉన్న చోట శూన్యం కనిపించవచ్చు. మీరు కంగారుపడటం గాని, మీ ఎరుకను పొగొట్టకోవడం కాని చెయ్యకండి. ఇది సమ్మోహనం

చేయడం కాదు. అందులోంచి బయటికి తీసుకురావడం. మీ చేతనశక్రిని మేలుకొల్పడం. మీకు కాంతి కాని, శూన్యం కాని కనిపిస్తే మీరు అతిశ్రద్ధగా ధ్యానం చేసినట్టు. ఇదే మన సహజస్యభావం. మనం అంతా శక్రితో నిండి ఉన్నాం.

కంటితో చూస్తే మీరు 'నేను' ని పొందవచ్చు. మీ నిజస్యరూపాన్ని తయారు చేస్తున్నారు. మీరు కళ్ళతో చూస్తే మీరు మేల్కొని, నిజాన్ని యథాతథంగా చూస్తారు.

ఆ ఆ ఆ

  • గంభీరత అంటే అన్నీ వదిలేసి ఒక దానికి అనవసరమైన ప్రాధాన్యాన్ని ఇవ్యడం. ★
  • ఒక కళాకారుడు ప్రేమతో విద్దెనా సృష్టిస్తే, ఆ సృష్టికి ఒక ప్రత్తేకమైన అందం ★ ఉంటుంది. తన అహంకారంతో సృష్టిస్తే దానిలో జీవం ఉండదు.
  • ★ జీవితానికి ఒక ఉదేశం ఉందని దాని వెంట పరుగెడితే, 'మీరు అహంతారం గల వ్యక్తి' అని ఉపనిషతులు చెబుతున్నాయి.
  • × ఎంతో అందంగా, అమాయకంగా కనిపిసారు.
    • 'పదివేల ఏనుగులని చంపడం సులభం. మీకు ఆయుధాలు ఉంటే చాలు కాని ఒక‌రి మ‌న‌స్తుని చంప‌డం అన్న‌ది నిజ‌మ్మెన ఘ‌న‌కార్డం.'

కృతజ్ఞత అంటే ఏమిటి? ఎందుకు?

ఎప్పుడెతే మనం సర్వాంతర్యామిలో ఒక భాగం అనుకుంటామో, సర్వాంతర్యామి ప్రతి నిముషం మనని శ్రద్ధతో రక్షిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు, మనం కృతజ్ఞతా భావంతో ఉంటాం. శరీరాన్నీ, అందులోని భాగాలనీ ఉపయోగించటం అయినా సరే.

కృతజ్ఞత అంటే సర్వాంతర్యామి వైభవాన్ని గుర్తించటమే.అది మీ లోపల అద్భుతంగా వికసించే శక్తి!

మీ జీవితాన్ని జాగ్రాత్తగా కాపాడుతున్న శక్తి అనేది ఏదైనా ఉంది అంటే, అది కృతజ్ఝతాశక్తి. మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా లోటు అనిపిస్తే దానికి కారణం ఎక్కడో మీలో కృతజ్ఝతాభావం తగ్గటమే.

ఈ రోజు ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటీ ఒక్కొక్క తత్వాన్ని ఆధారంగా చేసుకొని అభివృద్ధి చెందుతాయి. అవి ప్రార్థన, తపస్సు, అధీనం అవటం– ఇలా రకరకాలుగా ఉంటాయి. వీటన్నింటి కంటే కూడా మిమ్మల్ని సూటిగా సర్వాంతర్యామితో అనుబంధాన్ని పెంచే విధంగా చేసేది కృతజ్ఝతా భావం. అన్నింటి కంటే గొప్ప మతం. నేను ఈ విషయం చెప్పినప్పుడు అందరూ అశ్చర్యపోతారు. కృతజ్ఞత ఏ విధంగా మతం అవుతుంది? అని అడుగుతారు. అసలు అది మతం ఎలా అవుతుంది, అది ఒక సామాజికమర్యాద మాత్రమే కదా అని.

కృతజ్ఞత అన్నది ప్రతి వ్యక్తికీ శ్వాస కావాలి కాని మతం కాదు. కృతజ్ఞత అనేది మనలో అభివృద్ధి తీసుకురాగల శక్తి. ఆ శక్తి మిమ్మల్ని సర్వసృష్టికి అనుగుణంగా మారుస్తుంది. ఆ విధంగా చేసి మీలో అంతు లేని అభివృద్ధిని తీసుకువస్తుంది. కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు సర్వస్థ మీకు అనుగుణంగా, ఒక జీవించి ఉన్న వ్యక్తిలా మీ పట్ల ప్రతిస్పందిస్తుంది. సర్వాంతర్యామిలో ఐక్యమయ్యేందుకు కృతజ్ఞత ఒక చక్కని మార్గం.

మీలో కృతజ్ఞత అన్నది కలిగినప్పుడు, అది ఆకర్షణ సూతం మీద పని చేస్తుంది. ఆ విధంగా అది గొప్ప ఐశ్వర్యాన్ని మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది.

చిన్నకథ : అక్బర్ అనే చక్రవర్తి తన సలహాదారు బీర్శల్‌తో ఒక రోజు వాహ్యాళికి వెళతాడు. దారిలో ఒక గంధపు చెక్క వ్యాపారిని చూసి బీర్బల్‌తో "నాకు ఈ వ్యాపారిని ఉరి

తీయాలని ఉంది" అని అక్బర్ అన్నాడు. ఒక నెల తరువాత "మళ్ళీ అదే మార్గంలో వెళ్ళూ నాకు వింతగా ఉంది, ఈ రోజు ఈ వ్యాపారికి ఏదైనా బహుమతి ఇవ్వాలని ఉంది, ఇది ఎలా సాధ్యం?" అని అక్బర్, బీర్శల్‌ని అడిగాడు.

'రాజా, నెల కిందట, ఈ వ్యాపారికి వ్యాపారంలో నష్టం వచ్చింది. మనం ఈ దారిలో నడుసున్నప్పుడు మిమ్మల్ని చూసి, ఎవరైనా రాజు చచ్చిపోతే దహనం చేయదానికి తన వద్ద గంధపు చెక్కలు కొంటారని మనస్సులో అనుకున్నాడు. అతని హీనమైన భావనలు మిమ్మల్ని తాకినప్పుడు, మీకు అతన్ని ఉరితీయాలనే ఆలోచన కలిగింది. నేను వెంటనే అతని దగ్గర గంధపు చెక్క కొని, ఆస్తానానికి కావలసిన బల్లలు, కుర్సీలు చేయించాను. ఆ వ్యాపారికి ఎంతో డబ్బు రావటం వల్ల సంతోషంగా ఉన్నాడు. మీరంటే అతని మనస్సులో కృతజ్ఞతాభావం ఏర్పడినందువల్ల, ఈ రోజు మీకు అతనికి ఏదైనా ఇవ్వాలని అనిపించింది అని బీర్శల్, రాజుకి అంతా వివరించాడు.

ఆకర్షణసూత్రం ప్రకారం ఒక రకమైన శక్తిని అదే ఆకర్షిస్తుంది. ఇది కృతజ్ఞతకు ఎలా వర్తిస్తుంది? దీన్ని అర్థం చేసుకోండి, మీరు ప్రతిదాని పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటే, మీరు సంతృప్తిని పొందుతారు. మీరు ఆనందంగా ఉంటారు. మీరు కృతజ్ఞతాభావాన్ని వెదజల్లుతూ ఉంటే సంతృప్తి, తిరిగి సంతృప్తిని ఆకర్షిస్తుంది. అది ఐశ్వర్యాన్ని ఇస్తుంది.

ఇక్కడ ఒక ముఖ్యవిషయం ఏమిటంటే మీరు పొందే ఐశ్వర్యం, అనుబంధాలు అనేవి కృతజ్ఞత ద్వారా మీరు పొందే ఉపఫలితాలు మాత్రమే. అసలు ముఖ్యమైనది, మీరు సృష్టితో అనునాదంలో ఉండి ఒక అందమైన వ్యక్తిగా తయారవుతారు.

మనస్తత్వశాస్త్రవేత్తలు మానవుల కృతజ్ఞత ప్రభావం మీద పరిశోధన చేసారు. డల్లాస్‌లోని మెథడిస్ట్ విశ్వవిద్యాలయం మనస్తత్వశాస్త్రవేత్త మరియు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మనస్తత్వశాస్త్రవేత్త కృతజ్ఞత మనిషి స్వభావం మీద పరిశోధనలో కొన్ని వందల మందితో వారి దినచర్యను డైరీలో రాయాలి అని చెప్పారు. ఒక వర్గం వారు దినచర్యను రాసారు, రెండవ వర్గం వారు, వారికి బాధ కలిగించిన అనుభవాలు రాసారు. మూడవ వర్గం వారు, వారికి ఏవి అంటే కృతజ్ఞతాభావం ఏర్పడిందో వాటి పట్టీని తయారు చేసారు.

వారి పరిశోధన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి రోజూ కృతజ్ఞతని తెలియచేసినవారు చాలా ఉత్సాహంగా, కుతూహలంగా, పట్టుదలగా చాలా మెలకువగా ఉన్నారు. ఈ బృందం వారిలో నిరాశ, టెన్షన్ చాలా తక్కువగా ఉన్నట్లు ఫలితాలు చూపించాయి. వారిలో ఎదుటివారికి సహాయం చేయాలన్న తపన ఉంది. వారు చాలా క్రమపద్ధతిలో ఉండి వారి లక్ష్యాలను చక్కగా సాధించే విధంగా ఉన్నారు. ప్రతి రోజూ వారి కృతజ్ఞతలను రాసినవారు ఎక్కువగా ప్రేమించబడ్డారు. కృతజ్ఞత భావం అనుకూలవృత్తాలని ఏర్పరుస్తుంది. ఒక వ్యక్తికి ఆ భావం ఉంటే అది మరొకరికి కూడా అదే భావం కలిగేలా చేస్తుంది.

ఈ పరిశోధనలలో మరొక విషయం కూడా తెలిసింది. కృతజ్ఞతా భావానికీ, మతానికీ, ఏ సంబంధమూ లేదు. ఇది మతానికి అతీతంగా పని చేస్తుంది.

మీరు ఈ భూమి మీద ఉన్నందుకు కృతజ్ఞత చూపండి

ఈ నాటి ప్రపంచంలో ప్రతిదానికీ కారణం ఉండాలి. ఒక చిన్న పిల్లకి చాక్లెట్ చూపిస్తే మన దగ్గరకు వస్తుంది. మన అందరిలో ప్రయోజనం ఉన్నదా లేదా అనే భావం లోతుగా పాతుకుపోయింది. ప్రయోజనం ఉన్నదంటే పని జరుగుతుంది లేదా కష్టం అవుతుంది. నేను కృతజ్ఞతాభావంతో ఉండండి అని చెప్తే వారు ఎందుకు అని కారణాలు అడుగుతారు. నిజమైన కృతజ్ఞత కారణం లేకుండా మీలో వికసిస్తుంది. పువ్వు తన సహజ స్వభావం వల్ల వికసిస్తుంది. కృతజ్ఞత అనేది మన సహజ స్వభావం. అది సమాజంలో ఏర్పడిన నిబంధన పొరల కింద కప్పుకొని పోయి ఉంది.

సమాజానికి కృతజ్ఞత భాష తెలియదు. వినియోగం భాషే తెలుసు. మీరు సమాజానికి వినియోగపడటానికి మీలో భయాన్ని కలిగిస్తుంది. సమాజానికి కృతజ్ఞతా మార్గం మంచి ఫలితాలని ఇస్తుంది – అని తెలియదు. అదే అసలైన సమస్య.

మన సహజస్వభావం కృతజ్ఞతాభావం. కృతజ్ఞత కనబరచడానికి లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి. ఈ జీవితం మనం పొందిన ఒక వరం. మనం ఎవ్వరం దీని గురించి పని చెయ్యలేదు. మనం మానవులుగా పుట్టడమే మన మొదటి వరం. మన ఉనికికి కృతజ్ఞతగా ఉండాలి.

చిన్నకథ : ఒక చిన్న పాప భోజనం చేయడానికి కూర్చుంది. ఆ పాప అన్నం తింటుంటే తల్లి ప్రార్థన చేసావా అని అడిగింది. నేను భగవంతుడికి కృతజ్ఞత చెప్పని ఏ పదార్ధమూ ఈ కంచంలో లేదని ఆ పాప సమాధానం ఇచ్చింది.

మీ జీవితం నిస్సారంగా అనిపిస్తే మీలో కృతజ్ఞతా భావం లోపించిందని అర్థం. కృతజ్ఞత అనే శక్తి ప్రతీ క్షణం మీ జీవితాన్ని ఉత్సాహపరుస్తుంది. మీలో తీవ్రమైన కృతజ్ఞత ఉంటే జీవితం తీపిగా ఉంటుంది లేదా చేదు అనిపిస్తుంది. మీకు అసలు కారణం తెలియదు, అదే సమస్య. ఇవి జీవిత రహస్యాలు. ప్రతి ఉదయం లేచిన వెంటనే ఈ అద్భుతమైన సృష్టిలో మీరు మానవుడుగా పుట్టినందుకు కృతజ్ఞతాభావంతో ఉండండి. మీరు మనిషిగా పుట్టినందుకు ప్రతీది ఆనందిస్తున్నారని తెలుసుకుని కృతజ్ఞతాభావంతో ఉండండి. ఆ భావనలో కరిగిపోండి.

అదే విధంగా నిద్రపోవటానికి ముందు మంచం మీద కూర్చొని మీరు ఉన్నందుకు మీ అంతరాత్మలోనికి కృతజ్ఞత భావాన్ని తీసుకురండి. ఆ భావాన్ని, ఆ అనుభూతిని, మీ శరీరంలో, మనస్సులో నింపండి. మీకు ఆ రోజు చెడ్డరోజయినా మీరు ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియచేయండి. అన్ని రోజులూ చెడ్డరోజులుకావు. చాలా మంది మనకి ఉన్న అతి చెడ్డరోజుల కంటే చెడ్డరోజులలో బతుకుతున్నారు. కాబట్టి మీ అభిప్రాయాలు పక్కన పెట్టి కృతజ్ఞత తెలపండి. ఆ భావంతో నిద్రపోండి. మీలో కారణం లేని కృతజ్ఞతాభావాన్ని పెంచటానికి ఇది చాలా శక్తి వంతమైన ధ్యానపద్దతి.

ప్రతీది ఒక బహుమానం

మనం కృతజ్ఞతాభావానుభవాన్ని ఎందుకు పొందలేకపోతున్నామంటే, మనం ప్రతీదీ మనదే అని యథాలాపంగా తీసుకుని కృతజ్ఞత చూపం. ఇతరులు మనకి ఏం చేసినా అది మన జన్మహక్కు అనుకుంటాం. వారు మీకు ఏం చేసినా అది మీకు బహుమానం అని కృతజ్ఞత మీరు చెప్పాలి. జీవితంలో ప్రతీ చిన్నదాన్నీ ఒక వరంగా తీసుకోవాలి. మీరు తినే భోజనం, తినే కంచం, తినే చెయ్యి, కూర్చునే కుర్చీ అన్నీ మీకు బహుమానాలే. మీరు భోజనం వడ్డించినప్పుడు, ఆ భోజనమూ బహుమానమే. భోజనం చేయటానికి కుర్చీలో కూర్చున్నప్పుడు ఆ కుర్చీ ఒక బహుమానమే. భోజనం చేసాక చేతులు కడుగుతాం. మన చేతి వేళ్ళు బహుమానమే. మనం వీటిని బహుమతులుగా చూడం. వేటిని బహుమానాలనుకోం. కొంతమందికి తినే కంచాలు ఉండవు, చేతి వేళ్ళు ఉండవు, కొంతమందికి తిండే ఉండదు. వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎప్పుడూ వజ్రపు ఉంగరం పెట్టుకున్న వేళ్ళని చూస్తాం, వేళ్ళు లేని చేతిని గమనించం. అందుకే ఏదీ వరంగా అనిపించదు.

మనలో చిన్నవాటికి కృతజ్ఞతాభావం కలిగితే, మన సున్నితత్వం వృద్ధి చెందుతుంది. జీవితం మీద మన దృక్పథం మారుతుంది. ఏ మనిషి చిన్నవాటికి కృతజ్ఞతాభావం చూపదో పెద్దవాటికి కూడా చూపించడు. మనం పొందేవన్నీ మన జన్మహక్కు అనుకుంటున్నాం ఇప్పటి వరకు. ఈ భావన వల్ల మనం సృష్టి లేదా భగవంతుడి కరుణను గుర్తించం. సృష్టి మన మీద వర్దించిన వరాలకి స్పందించం.

చిన్నకథ : ఒక వ్యక్తి తన స్నేహితుడికి తాను ఎడారిలో ఎలా దారి తప్పాడో వివరిస్తున్నాడు. 'నేను మోకాళ్ళ మీద కూర్కుని అత్యంత దీనంగా నాకు దారి చూపమని భగవంతుని ప్రార్థించాను అంటాడు.' 'మరి నీ ప్రార్థనకు భగవంతుడు సమాధానం ఇచ్చాడా?' అని స్నేహితుడు అడిగాడు. 'లేదు, ఇంతలో ఒక పరిశోధకుడు వచ్చి నాకు దారి చూపించాడు' అన్నాడు.

జీవితంలో అస్సలు స్పందన లేకుండా ఉంటాం. మనలో కృతజ్ఞతాభావం పెంచుకుంటే దీన్ని మన హక్కు కింద పరిగణించం. ప్రతీదీ తేలికగా తీసుకోం. మన చేతివేళ్ళని, ధనాన్ని, సృష్టి మనకు దయతో ఇచ్చినవాటిని తేలికగా తీసుకోం. సున్నితత్వం పెరిగితే ప్రతీక్షణం భక్తిభావంతో తీసుకుంటాం.

ఇతరులను కృతజ్ఞతతో గౌరవించండి

మొట్టమొదట మీరు అర్ధం చేసుకోవలసినది మీకు సేవ చెయ్యటానికి ఎవరూ పుట్టలేదు. చేసారు. వివాహబంధం వల్ల మీ భర్త కాని భార్య కాని మీకు జీవితంలో అన్నీ సమకూరుస్తారు. ఒకరిని ఒకరు తేలికగా తీసుకోకూడదు. వారిని మీ జన్మహక్కు కింద భావించకూడదు.

ముఖ్యంగా, భార్యాభర్తల మధ్య అన్నీ తేలికగానే తీసుకుంటారు.ఈ భావన మన సమాజంలో లోతుగా పాతుకుపోయింది. ఎంతమంది భార్యాభర్తలు విడిపోతున్నారు. భార్యాభర్తలు ఆనందం పంచుకునేటప్పుడు కూడా ఒకరికి ఒకరు కృతజ్ఞతాభావంతో గౌరవించుకోరు. అలా గౌరవించుకుంటే వారిది దివ్యానుభూతే అవుతుంది. ఎన్నో వివాహాలు రక్షించబడతాయి. మీరు మీ జీవిత భాగస్వామి ద్వారా అంత సంతోషాన్ని పొందినప్పుడు ఎందుకు కృతజ్ఞతతో ఉండరు?

చిన్నకథ : ఒక వ్యక్తి భగవంతునితో 'ఓ తండీ, నా మీద దయ చూపించు. నేను రోజూ కష్టపడి పని చేస్తుంటే, నా భార్య ఇంట్లో హాయిగా ఉంటుంది. నేను నా భార్యలా మారేట్టు, నా భార్య నాలాగ అయ్యేట్టు వరం ఇయ్యి' అని ప్రార్థించాడు. భగవంతుడు అతని కోరికని తీర్చాడు. మార్పు భార్యగా మారిన భర్త, ఉదయమే లేచి, టిఫిన్ చేసి, వంట వండి, పిల్లలని లేపి, తయారు చేసి స్కూల్‌కి దింపి వచ్చింది. మధ్యాహ్నం బట్టలు ఉతికి, బ్యాంకుకి వెళ్ళి డబ్బు తెచ్చి కరెంట్ బిల్లు, ఫోను బిల్లు కట్టి, పచారీ కొట్టు నుండి సరకులు కొని తెచ్చి, ఆరిన బట్టలు మడత పెట్టి, స్కూల్ నుండి పిల్లలను తీసుకు వచ్చి, వారితో హోమ్ వర్కు పూర్తి చేయిస్తూ, బట్టలన్నీ ఇస్త్రీ చేసి సాయంత్రం వంటచేసి, పిల్లలకి పెట్టి, నిద్రపుచ్చి, తాను తిని పడుకుంది. మరునాడు పొద్దునే ఆ వ్యక్తి, 'భగవంతుడా, ఈ పని నా వల్ల కాదు మళ్ళీ నన్ను తిరిగి మామూలుగా మార్చేయి' అని ప్రార్థించాడు. భగవంతుడు నువ్వు ఇప్పుడు గర్భవతివి, 9 నెలలయిన తరువాత. నిన్ను మామూలు రూపంలోకి మారుస్తాను' అని సమాధానం ఇచ్చాడు.

ప్రతి మనిషి భూమి మీద తన పాత్ర పోషిస్తాడు. ఎవ్వరినీ తీసేయలేం. ప్రతి ఒక్కరికీ మరొకరంటే కృతజ్ఞత ఉండాలి.

నేను భార్యాభర్తలలో, 'మీ ఇద్దరి మధ్యన విభేదాలు ఉంటే సామరస్యంగా కృతజ్ఞతతో విడిపోండి' అని చెప్తాను. ప్రతీ బాంధవ్యం శుభకరమైనది. జీవితంలో మంచినే తెస్తుంది.

కృతజ్ఞత చాలు

మనమే ఆవిధంగా చూడం. మనలోని అభద్రతా భావం, మనని ఇతరులు బాధపెడతారనే భావాన్ని కలుగజేస్తుంది. మన ఆత్మరక్షణ భావం, కారణం లేకుండా అన్ని బాంధవ్యాలకీ అడ్డం వస్తుంది. కృతజ్ఞత వికసిస్తే ఆ భావన మాయమవుతుంది.

ఇంకో చిన్న కథ : ఒక రోజు భార్యాభర్తలు తమ ముగ్గురు పిల్లలతో సముద్రపు ఒడ్డకి వెళ్ళారు. పిల్లలు ఇసుకతో కోటకదుతూ అనందంగా ఆదుకుంటున్నారు. ఒక ముసలి ఆవిడ చినిగిన బట్టలతో ఆ దారివెపు రావడం చూసారు. ఆవిడ వంగి ఇసుకలో ఏరినవాటిని తన సంచిలో వేసుకుంటున్నది. ఆమె పిల్లల దగ్గరకి వచ్చేసరికి వారి తల్లిదండ్రులు, ఆమెకు దూరంగా వెళ్ళిపోమని ఆపిల్లలతో చెప్పారు. ఆ పెద్దామె పిల్లలను చూసి చిరునవ్వు నవ్సినా, వారు నవ్వలేదు.

ఆ ముసలి ఆవిడ, రోజూ ఇసుకలో ఉన్న గాజు ముక్కలను పిల్లల కాళ్ళకు గుచ్చుకోకూడదని ఏరిపారేసేది – అని కొన్ని రోజుల తరువాత ఆ కుటుంబం తెలుసుకున్నారు. మనం ప్రతీ బాంధవ్యాన్నీ మంచి, చెడ్డ, అని ముద్రవేసేస్తాం. ఆ బాంధవ్యం తల్లిపిల్లలు లేదా యజమాని, ఉద్యోగి మధ్య లేదా స్నేహితుల మధ్య కావచ్చు.

చాలా మంది తల్లిదండ్రులు, సమాజం వారికి నిబంధనలు పెట్టారని వారి పట్ల కృతజ్ఞత లేకుండా ఉంటారు. మేము నేర్పించే కృతజ్ఞత ధ్యానంలో అందరినీ తమకు వారి మానసికవ్యవస్థని, దృక్పథాన్ని ఇచ్చినందుకు ముందుగా తల్లిదండ్రులకూ మిగతా బంధువులకూ కృతజ్ఞత చెప్పమంటాం. మీకు వున్న తెలివి వల్ల మీకు సరి అయిన శిక్షణ ఇవ్వలేదని మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు మారడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ముందు మీకు శిక్షణ ఇచ్చినవారిని నిందించకూడదు. మనకు పుట్టుకనిచ్చిన వారు, వారికి మంచిదని తోచినది మనకు నేర్పించారు. వారు మనకు ఏ విధమైన హాని చెయ్యాలనుకోలేదు. మనం వారికి ఎప్పుడూ కృతజ్ఞత చూపించాలి. మీకు ఏ బాంధవ్యాలలో కృతజ్ఞతా భావం కలుగుతుందో, వారిని స్వాధీనం చేసుకోరు. వారిని అందమైన వ్యక్తులుగా గుర్తిస్తారు. వారిని వ్యక్తిగా కాకుండా వస్తువుగా అనుకున్నప్పుడు స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. కృతజ్ఞతాభావంతో వారిని ఎదగనిస్తారా? ఏ సందర్భంలో నైనా కొన్ని రోజులు ప్రేమగా, కృతజ్ఞతతో ఉండడానికి నిశ్చయించుకోండి. రెండు రోజులు మీరు ముందు చేసినట్టుగా కాకుండా ప్రేమతో స్పందించండి. మీ బాంధవ్యం కొత్త మలుపు తిరుగుతుంది.

సృష్టిలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా భగవంతుని రూపంలా కనిపిస్తారు. మీ చుట్టూ ఉన్నవారితో, ఉన్న వస్తువులతో ఒక గాఢమైన బాంధవ్యం ఏర్పడుతుంది. ఉన్న ప్రతిదాని మీద దయ కలుగుతుంది. మీరు కోపిష్టులైతే కోపం తగ్గిపోతుంది. మీకు ఉన్న చెడ్డ భావాలు అన్నీ కృతజ్ఞత వల్ల మాయమవుతాయి. మీరు ఒక దయ, ప్రేమ కలిగిన వ్యక్తిగా మారుతారు.

మీ శరీరానికి కృతజ్ఞత చెప్పండి

చిన్నకథ : ఒక మధ్య వయస్సు స్త్రీకి గుండెనొప్పి వస్తే ఆసుపత్రికి తీసుకువెళతారు. ఆమె ఆపరేషన్ బల్లపై ఉన్నప్పుడు ఆమెకు మరణ అనుభవం జరుగుతుంది. ఆ అనుభూతిలో ఆమెకు భగవంతుడు కనిపించాడు. ఆమె భగవంతుడిని అది తన చివరి దశా అని అడిగింది. దేవుడు ఆమెకు ఇంకా 30 నుండి 40 సంవత్సరాల ఆయుస్సు ఉందని చెప్పాడు. ఆమెకు నయం అయ్యాక ఇంకా కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండి దవడ సరి చెయ్యడానికి ముక్కు వంకర తీయడానికి శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు తీయించుకోవడానికి ఇలా ఎన్నోఆపరేషన్లు చేయించుకుంది. ఆమె తను ఎలాగు 30 సంవత్సరాలు జీవిస్తాను అన్న ఉద్దేశంలో ఒక క్రొత్త రూపంతో జీవిద్దామని అనుకుంది. ఆపరేషన్లు అన్నీ అయ్యాక, ఆసుపత్రి నుండి బయటకు వెళ్ళే సమయంలో ప్రమాదవశాతు కిందపడి ఆమె చనిపోతుంది. ఆమె భగవంతుని దగ్గరకు వెళ్ళి 'దేవా నీవు నేను ఇంకా 30 సంవత్సరాలు బతుకుతానని చెప్పావు కదా? అని అడిగింది. నేను నిన్ను గుర్తు పట్టలేదు' అని భగవంతుడు సమాధాన మిచ్చాడు.

ఒక్కలా ఉండరు. భగవంతుడు ఇంజనీరు కాదు. ఆయన ఒక కళాకారుడు. అందుకే ప్రతీ ఒక్కరూ ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆయన ఒక ఇంజనీరు అయితే మనందరనీ ఒక మూసలో వేసి ఒకేలా తయారు చేసేవారు. కాని అలా చేయలేదు. ప్రతీ ఒక్కరిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా సృష్టించారు. కాని మనం అందంగా వున్నామని అనుకోం. మనం ఎప్పుడు ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండడానికి ప్రయత్నిస్తాం. మన శరీరం, అందంగా ఉన్నది అన్న భావన కలుగనీయం.

మన శరీరం మన ఆలోచనల వల్ల ప్రభావితం అవుతుంది. ప్రతికణం మన ఆలోచనలకి, భావనలకి స్పందిస్తుంది. మనం శరీరానికి కృతజ్ఞత చూపిస్తే, అది ఆరోగ్యంగా తయారవుతుంది. మనం శరీరాన్ని అసహ్యించుకుంటే అది వ్యాధితో కృశించిపోతుంది. మన ఆలోచనలు లేదా మాటలు మనుషులని ఎలా ప్రభావితం చేస్తాయో అలాగే శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. మనం వ్యక్తులని మెచ్చుకుంటే వారు ఇంకా బాగా పని చేస్తారు. మీరు మీ శరీరం వల్ల ఇక్కడ కూర్చుని నా మాటలు వినగలుగుతున్నారు. మీరు ఇక్కడ ఉండి, నేను చెప్పేది వింటున్నారు. అంటే మీ శరీరం మూలానే. అటువంటప్పుడు దాన్ని ఎలా ద్వేషిస్తారు? ఎలా నిర్లక్ష్యం చేస్తారు? మీ చుట్టూ చూసే కాలు లేదా చెయ్యిలేనివారు కనిపిస్తారు. కొంతమందికి కంటిచూపు ఉండదు. లేదా ప్రమాదాలలో కనుచూపును పోగొట్టుకుంటారు. మనకు అన్నీ వున్నాయి కాని వాటిని లక్ష్యపెట్టం. అప్పుడప్పుడు వికలాంగులు, సంపూర్ణమైన వ్యక్తి కంటే ఎక్కువ కృతజ్ఞతా భావంతో ఉంటారు. వికలాంగులకి, శరీరంలో ఒక భాగం లోపిస్తే ఎలా ఉంటుందో తెలుసు కనుక మిగతా శరీరభాగాలపట్ల కృతజ్ఞతా భావంతో ఉంటారు.

సూఫీ సంప్రదాయం ప్రకారం ఒక అందమైన ధ్యాన పద్ధతి ఉంది.వారు ఉదయం లేవగానే శరీరంలో ప్రతి భాగాన్ని స్పృశించి కృతజ్ఞతా భావాన్ని వెల్లడి చేస్తారు. వారు తలనుండి పాదాల వరకు ఎంతో ప్రేమగా కృతజ్ఞతా భావంతో ప్రతి శరీరభాగాన్ని స్పృశిస్తారు. ఇది సాధన చేయగల ఒక అద్భుతమైన ధ్యానపద్ధతి. మీ శరీరంలో ప్రతి భాగం అందంగా తయారయి, ఏ విధమైన అసౌకర్యం ఉన్నా నయం అయిపోతుంది.

ప్రతీది శుభప్రదం, దాన్ని పండుగలా చేసుకో

ఒకటి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి, సృష్టి అంతా శుభప్రదమైంది. మీరు సృష్టిలో ఒక భాగం. మీ చుట్టూ జరుగుతున్నదంతా శుభప్రదమే. ఇదే సృష్టి యొక్క సత్యం. సృష్టిలో జరిగేది ఏది అశుభంకాదు. ప్రతీది ఒక వరమే. ఇది స్పష్టంగా అర్థమైతే జీవితంలో ఫిర్యాదు చెయ్యడానికి ఏమి లేదు. ఇది స్పష్టంగా అర్థమైతే మీరు ప్రతీ దాన్ని కృతజ్ఞతా భావంతో చూస్తారు. కృతజ్ఞతా భావంతో నిండిన కంటికి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏది లౌకికంగా కనిపించదు. ప్రతీది ఒక అద్భుతంగా అనిపిస్తుంది.

చిన్నకథ : ఒక రోజు వేటగాడు పిట్టలు పట్టుకునే కుక్కని కొందామని మార్కెట్‌కి వెళ్ళాడు. ఆశ్చర్యంగా అక్కడ నీటి మీద నడిచే కుక్క కనిపించింది. అది తీసుకుని ఇంటికి వెళ్ళాడు. మరునాడు కుక్కని తీసుకుని ఒక స్నేహితునితో బాతుల వేటకి వెళ్ళాడు. ఒక బాతుల గుంపు దగ్గరకు వచ్చినపుడు గురిపెట్టి తుపాకి పేల్చి, నిశ్శబ్దంగా చూసాడు. ఆ కుక్క నీటి మీద నడిచి, పక్షిని పట్టి తెచ్చింది. ఆ వేటగాడు, తన స్నేహితుడిలో ఏ విధమైన ప్రతిచర్య కనిపిస్తుందో అని చూసాడు. కాని అతను ఏమీ అనకపోయేసరికి, 'నీవు ఆ కుక్కలో ఏమైనా ప్రత్యేకత చూసావా?'' అని అడిగాడు. స్నేహితుడు 'ఆ కుక్కకి ఈత రాదు' అని జవాబు ఇచ్చాడు.

మన ముందు నిరంతరం అద్భుతాలు జరుగుతున్నాయి. మనం వాటిని ఎప్పుడూ గమనించం. అందుకే మనకు జీవితం లౌకికంగా, నిస్పారంగా అనిపిస్తుంది. మనం ఆ అద్భుతాలను గ్రహించినప్పుడు మన జీవితమే అద్భుతంగా మారిపోతుంది. అసలు సత్యం ఏమిటంటే మన జీవితంలో మన చుట్టూ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి.

మనం, భగవంతుడు, ప్రపంచం, మన ఉనికిని ఒక ఉత్సవంలా చేసుకుంటే, సృష్టి అంతా నిరంతరం జరుగుతున్న ఒక దీవెనలా అనుభూతి పొందుతాం. నేను మీకు వివరిస్తాను.

మనం, భగవంతుడు, ప్రపంచం, మన ఉనికిని ఒక ఉత్సవంలా భావిస్తే అవి మూడు వాటి రహస్యాలని మీకు తెలియచేస్తాయి. దయచేసి అర్ధం చేసుకోండి, మీరు మీ ఉనికిని ప్రపంచాన్ని, భగవంతుని ఒక ఉత్సవంలా చేసుకోండి అని మీకు చెప్పే ఇది ఒక నైతిక సలహా కాదు. నేను మీకు ఒక ఆధ్యాత్మికపద్దతిని చెప్తున్నాను.

మొదటిది : మీరు మిమ్మల్ని స్వీకరించి, మీ ఉనికిని ఒక ఉత్సవంలా జరుపుకునేంతవరకూ, మీరంటే ఏమిటో తెలుసుకోలేరు. మీ గురించి అర్థం చేసుకోలేరు. మీరు ఏమిటో అని పోరాడితే మీరు నిజంగా ఎలాంటివారో తెలుసుకోలేరు.

మనలో మనం రెండు గుర్తింపులని మోస్తున్నాం. ఒకటి బయట ప్రపంచంలోని గుర్తింపు, రెండవది అంతరంగ ప్రపంచంలోని గుర్తింపు. సంస్కృతంలో వాటిని అహంకారం, మమకారం అని అంటారు. మనం లోకానికి బయటి ప్రపంచపు గుర్తింపుని చూపిస్తాం. లోకం మనని ఎలా చూడాలనుకుంటామో మనని ఎలా గుర్తించాలి ఎలా ప్రపంచానికి మనలను చూపించాలో అలా చూపిస్తాం. ఈ గుర్తింపు మనం నిజంగా ఏమిటో దానికంటే ఎక్కువగా ఉంటుంది. రెండవదైన అంతరంగ ప్రపంచం గుర్తింపు అసలైన మనం అనుకుంటాం. ఈ గుర్తింపు మన అసలైన మనం కంటే తక్కువగా ఉంటుంది. దీన్నే మనం ఆత్మగౌరవం తక్కువగా ఉంది అంటాం.

మీ జీవితం అంతా ఈ రెండు గుర్తింపుల మధ్య పోరాటమే. మనం నిరంతరం మన బాహ్యాప్రపంచం గుర్తింపుని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాం. ఇది అంతరంగ ప్రపంచంలోని గుర్తింపుకి వేరుగా ఉంటుంది. ఇది మీతో మీకు పెనుగులాటని కలిగిస్తుంది. ఈ రెండు గుర్తింపుల మధ్య పోరాటమే మీ జీవితాన్ని అంతా తినేస్తుంది.

ఆ పోరాటాన్ని ఆపే సమయం వచ్చింది. మీరు ఎలాంటివారెనా ఉత్సవం చేసుకోండి. మీరు నెమ్మదిగా అసలైన మిమ్మల్ని తెలుసుకుంటారు. ఈ రెండు గుర్తింపుల మధ్య తేదా వల్ల ఆత్మజ్ఞానం మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతుంది. ఏ క్షణం అయితే ఆ రెండింటి మధ్య విభేదం పోతుందో, అవి రెండు గుర్తింపులూ తెలుసుకొనే తత్వంలో కరిగిపోతాయి.

అందుకే బయటి ప్రపంచంలో, అంతరంగ ప్రపంచంలో మీరు ఎవరో దాన్నే తీసుకోవాలి. దాన్ని స్వీకరించి మీలో మీకు 'అవును' అని అనుకోవాలి. అకస్మాత్తుగా మీకు రెండు గుర్తింపులూ ఉపయోగం లేవని తెలుసుకుంటారు. అప్పుడు అవి మాయమవుతాయి. అవి మీ శరీరాన్ని వదిలేస్తాయి. మీ అంతరంగం నుండి మాయమవుతాయి. అప్పుడు మిమ్మల్ని స్వీకరించి ఉత్సవం చేసుకోవాలి. అప్పుడు మీరు లోపలి ప్రపంచంలో కాని, బాహ్యప్రపంచంలో కాని అభివృద్ధి చేయనవసరం లేదు అని అర్థం చేసుకుంటారు. ఇది అర్థమైయితే ఆత్మజ్ఞానం అప్రయత్నంగా కలుగుతుంది.

ఇప్పుడు మనం ప్రపంచంతో ఎలా ఉత్సవం చేసుకుంటామో తెలుసుకుందాం. అర్థం చేసుకోండి, మీకూ ప్రపంచానికీ మధ్య సమస్యలూ, కష్టాలూ ఎందుకు ఉన్నాయంటే మీరు ప్రపంచాన్ని ఒక అద్భుతం అనుకోరు. మీరు నిరంతరం మీ తర్కంతో ప్రపంచ రహస్యాలను తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మీరు ప్రపంచాన్ని స్వీకరించి ఆనందంగా ఉత్సవం చేసుకునే బదులు, మీ మేధస్సుతో దాన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు. మీరు దాన్ని విడదీసి, విశ్రేషించి మీ అధీనంలోనికి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చెయ్యడం సాధ్యం కాదు. ప్రపంచం చాలా విశాలమైనది. మేధస్సులతో ఉంటుంది. దాన్ని ఆనందించాలి, కాని విశ్లేషించకూడదు.

రామకృష్ణ పరమహంస ఒక చక్కటి కథ చెప్తారు.

ఇద్దరు వ్యక్తులు మామిడి తోటలోకి వెళ్ళారు. ఒక వ్యక్తి కూర్చొని ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్కపెట్టాడు. వాటికి ఎన్ని కొమ్మలు ఉన్నాయో, ఆ చెట్ల ఆకులు ఎంత మందంగా ఉన్నాయో, మొత్తం ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయో కనుక్కున్నాడు. ఎన్ని రకాల మామిడి పళ్ళు ఉన్నాయో తెలుసుకున్నాడు. వాటిని ఎక్కడ అమ్మితే ఎంత ధర ఉంటుంది అన్నది ఆలోచించాడు. రెండవ వ్యక్తి కొన్ని మామిడి పళ్ళు తిని ఆనందంగా బయటకు వచ్చాడు.

మీరు ప్రపంచంలోకి వచ్చినపుడు ఒక మామిడి తోటలోకి ప్రవేశించామని అనుకోండి. మీరు నిరంతరం ప్రతి ఒక్కటీ మీ తర్కంతో విశ్లేషించి అభిప్రాయం ఏర్పరచుకుని, మీ అధీనంలో ఉంచుకోవాలనుకుంటే, మీరు జీవితంలో మొత్తం అందాన్నంతా కోల్పోతారు.

చాలామంది ఏదైనా టూర్‌కి కొత్త ప్రదేశాలకి వెళ్ళినప్పుడు వారు దాన్ని సొంతం చేసుకుంటేనే ఆనందించగలరు. అది న్యాయబద్ధంగా వారిదైతేనే ఆనందించగలరు. దేన్నైనా సాధిస్తేనే వారు సంతోషిస్తారు. మీ తార్కికశక్తితో ప్రతీది సాధించక్కర్లేదు. మీరు ఏదైనా ఆనందించాలంటే దాన్ని సొంతం చేసుకోవలసిన అవసరం లేదు. లోకాన్ని అర్ధం చేసుకోవడం అంటే, మొత్తం సృష్టిని మేధస్సుతో సొంతం చేసుకోవాలని ప్రయత్నించడమే. మేధస్సుతో ప్రయత్నించడం అంటే అది తమది కావాలి అనుకోవడమే. ఈ మార్గం అనుసరిస్తే మీరు ప్రపంచవైభవాన్ని ఒక ఉత్సవంలా చేసుకోలేరు. ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి సృష్టి అందాలన్ని, వింతలనీ ఒక ఉత్సవంలా చేసుకోలేరు.

దీని మీద అభిప్రాయం ఏర్పరచుకోవద్దు. మనం నిరంతరం ఇది తప్పు, ఇది ఒప్పు ఇది ఇలా జరిగి ఉండాలి, ఇది ఇలా జరగకుండా ఉందాల్సింది అని నిర్ణయాలు చేస్తాం. అర్థం చేసుకోండి, సృష్టిలో ఏం జరిగినా మంగళకరమే. సంస్కృతంలో శివ అంటే కారణం లేని మంగళకరమైంది అని అర్ధం. శివ అనేది ఒక భగవంతుని పేరు. ఏ కారణమూ లేకుండా మంగళం అనేది నిరంతరం ప్రవహిస్తుందన్నది. మీరు ఒప్పుకున్నా లేకపోయినా నిరంతరం వికసిస్తూ పెరుగుతున్నారు. మీ పుట్టుక, ప్రతిచర్య మీ జీవితంలో జరుగుతున్న ప్రతీ ఒక్కటి మీ మేధస్సును పెంచుతుంది. అకారణమైన విసారం మీలో కూడా జరుగుతుంది. కాని మీరు దాని అనుభూతి పొందవచ్చు, పొందలేకపోవచ్చు. అది వేరే విషయం.

ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉన్నారు. ఒక రకమైన వారు లోకంలో జరుగుతున్నది, తమ ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతుందని ఎప్పుడూ ఎదో ఒక మార్చు చెయ్యాలి అనే భావన కలిగి ఉంటారు. అలాంటి వారు జరుగుతున్న వాటిని తప్పు అని నిర్ణయించి, తమ అభిప్రాయాల కనుగుణంగా మార్చి అభివృద్ధి చెయ్యడానికి ప్రయత్నిస్తారు. ఇంకొక రకమైన వ్యక్తులు, లోకంలో జరుగుతున్నదంతా మంగళకరమే అని అనుకుంటారు. ఎవరైతే శివభగవానుడిలా జరుగుతున్నదంతా మంగళకరం అనుకుంటారో వారు శివచేతన స్థితిలో, నిత్యానందంలో ఉత్సవం చేసుకుంటూ జీవిస్తారు. మొదటి రకం వ్యక్తులు జరుగుతున్నవాటిని మార్చడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వారు నిరంతరం బాధపడతారు.

ప్రతీది అంటే వ్యాధి, మరణం కూడా సందేశాన్నిస్తుంది. ప్రతీది మనకి సందేశాన్ని ఇస్తుంది. ప్రతి దాంటో మనం నేర్చుకునేది ఉంటుంది. ప్రతీ సంఘటనా మేధస్సును పెంచి మన చేతనస్థితిని అభివృద్ధి చేస్తుంది. సర్వాంతర్యామి ఆడే నాటకంలో మన జీవితంలో ఏది జరిగినా మనకు శుభకరమే అనుకుని, మనం లోకాన్ని ఒక అద్భుతం, మేధస్సుతో ఉన్న అద్భుతంలా చూడాలి.

చిన్నకథ : ఎన్నో ఎకరాలలో ఉన్న మొక్కజొన్న తోటల మధ్య విడిగా ఒక గ్రామం ఉండేది. అది పట్టణానికి చాలా దూరంగా ఉండటం చేత ఆ గ్రామం ప్రశాంతంగా ఉండేది.

ఒక ఉదయం గ్రామవాసులు, ఆ గ్రామంలో ఎప్పుడూ చూడని ఒక యోగిని చూసారు. ఆయన ఒక మఱ్ఱి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. ఆ గ్రామప్రజలు, ఆ యోగిని, 'మీరు ఎక్కడినుండి వచ్చారు' అని అడిగారు. ఆ యోగి 'మీరంతా నా అన్నదమ్ములు అనుకొని, మీతో కొన్నాళ్ళు ఉండాలని వచ్చాను' అని అన్నాడు.

ఆ గ్రామప్రజలు అది విని సంతోషించి, ఆ యోగికి ఒక చిన్న కుటీరం వేసారు. ఆ యోగి వారి సమస్యలను తీరుస్తూ వారి వ్యాధులను నయం చేయసాగాడు.

ఒకసారి అంటు వ్యాధి వల్ల గ్రామంలో చాలా పక్షులు మరణించాయి. గ్రామవాసులు ఈ విషయం యోగికి చెప్పారు. 'అది విని, అతను అన్ని పక్షులు చనిపోయినందుకు విచారిస్తున్నాను కాని సర్వాంతర్యామిని నమ్మి, ప్రార్థన చెయ్యండి, పక్షులు లేకపోవడం వల్ల మీరు లాభం పొందవచ్చు అని అన్నాడు.

గ్రామ ప్రజలు అది పూర్తిగా అంగీకరించకపోయినా, ఆయన మీద గౌరవం కొద్ది, మాట్లాడకుండా వెళ్ళిపొయ్యారు. ఆ తరువాత వారం గ్రామంలో కుక్కలన్నీ ఎక్కడికో వెళ్లిపోయాయి. గ్రామప్రజలు కుక్కలు తమను దొంగల నుండి రక్షించేవి, గ్రామంనుండి పారిపోయేసరికి చాలా బాధపడ్డారు. ఈ విషయం మళ్ళీ వెళ్ళి యోగికి చెప్పారు. ఆయన మళ్ళీ అదే సమాధానం ఇచ్చారు. మీరు సర్వాంతర్యామిలో నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే మీరు పోగొట్టుకున్నది, మరేదో పొందడానికి అయి ఉండవచ్చు అన్నారు.

ఇంకొన్ని రోజుల తరువాత ఆ గ్రామంలో మరొక వింత జరిగింది. ఆ రోజులలో అగ్గి పెట్టెలు లేవు. ఆ ప్రజలు రెండు రాళ్ళు రుద్ది నిప్పు పుట్టించి వారి పొయ్యులలో నిప్పు రాజేసేవారు, ఒక రోజు అన్ని పొయ్యలు ఆరిపోయాయి. వారు రెండు రాళ్ళు రుద్ది నిప్పు పుట్టించాలని చూసారు. కాని నిప్పు రాలేదు. దానితో ఆ గ్రామవాసులు కలవరపడ్డారు. వారు మళ్ళీ యోగి దగ్గరకు వెళ్ళి ఏం జరిగిందో చెప్పారు. ఆ యోగి 'ఇక్కడ ఏదో పెద్ద వింత జరగబోతోంది' అని అన్నారు.

గ్రామవాసులు యోగిని అనుమానించసాగారు. వారు యోగి తమ కంటే ఏ విధంగా ఎక్కువ, ఇలాంటి విషయాల గురించి అతను చెప్పతగ్గవాడా అని అనుకొన్నారు. కొంతమంది గ్రామవాసులు వేరొక గ్రామానికి వెళ్ళి నిప్పు తెద్దామనుకున్నారు. కాని ఆ యోగి వారిని వెళ్ళొద్దని బలవంతంగా ఆపేసాడు. మరుసటి ఉదయమే కొంతమంది వేరొక గ్రామానికి బయలుదేరారు. వారికి దూరంలో ఒక గాలిదుమారం కనిపించింది. కొన్ని క్షణాల తరువాత అది ఒక దొంగల ముఠా గుర్రాల మీద వస్తున్నారని గుర్తించారు. వారు దారిలో ప్రతీ గ్రామాన్ని నాశనం చేసి వస్తున్నారు.

గ్రామవాసులు చెట్టువెనుక దాక్కొని వారిని చూడసాగారు. ఆ దొంగలు వారి ముందు ఆగారు. అందులో ఒకడు 'పదండి ఈ గ్రామాన్ని కూడా ముట్టడిద్దాం' అని అరిచాడు. ఇంకొకడు దాని వల్ల లాభం లేదు. ఈ గ్రామంలో ఉదయమే ఒక పక్షి కిచకిచలు కూడా వినిపించటం లేదు. ఒక కుక్క మొరగటంలేదు, ఏ ఇంటి పొగగొట్టం నుండి పొగ రావటం లేదు. ఇక్కడ ఎవరూ నివసిస్తున్నట్టు లేదు' అని అన్నాడు. ఆ దొంగల గుంపు వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. దాగి వున్న గ్రామవాసులు పరుగున గ్రామంలోకి వెళ్ళి మిగతావారికి, జరిగింది చెప్పారు. వారికి యోగి చెప్పింది ఎంత సత్యమో తెలిసింది. వారంతా యోగికి చెప్పాలని, ఆయన కుటీరం దగ్గరకు వెళ్ళారు. కాని ఆ కుటీరం ఖాళీగా ఉంది. ఆ యోగి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతని గమ్యస్థానం ఎవ్వరికి తెలియలేదు.

సృష్టి అనేది ఒక ప్రమాదం కాదు, అది స్వతంత్రమైన మేధస్సు అని అర్ధం చేసుకుంటారో, సృష్టి అనేది అనుభూతి పొందే ఒక అద్భుతం అని అర్థం చేసుకుంటారో, మీ జీవితంలో ప్రతీది తాను నేర్చవలసిన పాఠాన్ని మీకు తెలియచేస్తుంది.

మీకు బాధ వచ్చినప్పుడు స్వీకరించకుండా నిరోధిస్తే, అది నొప్పిని కలిగిస్తుంది. అది ఇంకొంత బాధ కలిగిస్తుంది. అదే బాధని గౌరవంతో, కృతజ్ఞతాభావంతో స్వీకరిస్తే, అదే తన రహస్యాన్ని మీకు తెలియజేస్తుంది. అది మీ జీవితంలో రావడానికి కారణాన్ని తెలియజేసి అది మీకు ఏ పాఠం నేర్చాలో చూపిస్తుంది. మీరు బాధని మేధస్సుతో స్వీకరిస్తే, ఆకస్మాత్తుగా మీ జీవితంలో ఆనందం అనుభూతి కలుగుతాయి అని విశదీకరిస్తుంది.

ప్రపంచంలో జరిగే అన్ని ప్రకృతి వైపరీత్యాలు కూడా మంగళకరమే. అమంగళం అనేది ఏది లేదు. మానవుల కొన్ని చర్యలకి ప్రకృతి సర్దుబాటు చేసుకోవడంలో, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. అందుకే వాటిని స్వీకరించి ప్రపంచం ఉనికిని ఉత్సవంలా జరుపుకోండి.

మూడవది, మనం భగవంతుని ఉనికిని ఉత్సవంలా జరుపుకోవడం, మిగతా రెండింటికీ, మన ఉనికికీ, ప్రపంచానికీ మూలమైన భగవంతుడి ఉత్సవం. భగవంతుని ఉనికిని అనుమానించినా, నమ్మకపోయినా, మీరు భగవంతుని అనుభూతి పొందరు. అర్ధం చేసుకోండి, అనుమానంలా నమ్మిక కూడా ఒక అడ్డంకే. నేను భగవంతుని నమ్మే మనుషులను చూసాను కాని వారు భగవంతుని అనుభూతిని పొందడానికి ప్రయత్నించరు. వారికి నమ్మకం ఉంటుంది కాని భగవంతుని అనుభూతి పొందరు. అందుకు ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా, లేడా అన్నదాని మీద మీ అనుమానం, నమ్మకం ఈ రెండూ వదిలేయండి. మీరు భగవంతుడు ఉన్నాడు అని నమ్మినా మీకు ఆయనంటే ఒక అభిప్రాయం ఉంటుంది. ఆయనకు 10 చేతులున్నాయి లేదా 18 తలలు ఉన్నాయి. పొడవు లేదా పొట్టిగా ఉంటాదు ఇలా అనుకుంటారు. అందుకే మీ అనుమానం, నమ్మిక వదిలేయండి. ఒక్కటే గుర్తుంచుకోండి, సృష్టి ఉంటే సృష్టికర్త ఉండాలి.

అది ఎలా అంటే, మీరు ఏ క్షణాన ఒక వస్తువు చూస్తారో ఆ వస్తువును సృష్టించినవాడు ఉన్నాడు అని మీకు తెలుసు. అవును కదా? సృష్టి ఉంటే సృష్టికర్త కూడా ఉన్నాడు. సృష్టికర్త అన్న పదం కూడా భగవంతునికి సరిగ్గా సరిపోదు ఆయన ఏ కారణం లేకుండా ఉప్పొంగే సృజనాత్మక శక్తి, అంతే. ఆయన నిరంతరం వ్యాపిస్తూ సృజనాత్మకశక్తి. ఆయన నిరంతరం జరిగే 'బిగ్ బాంగ్‌'. ఆయన నిరంతరం ఏర్పడే సృష్టిబిలం.

సృష్టి, సృష్టించబడింది, సృష్టికర్త మూడు సృజనాత్మకతనే సూచిస్తాయి. సర్వాంతర్యామి సృజనాత్మకశక్తి. సృజనాత్మకత ఉనికిని ఉత్సవంలా చేసుకోండి. సృజనాత్మకత లేనిదే సృష్టి జరగదు. సృష్టి ఉన్నదమే సృష్టకర్త లేదా సృజనాత్మకత ఉన్నది అన్నదానికి గట్టి నిదర్శనం. సృజనాత్మకత అనేది జీవం లేని క్రమబద్దమైన నియమాలు కాదు. అది స్వతంత్ర మేధస్సు, అది తెలివి, స్వేచ్ఛా స్వాతంత్ర్యం. అందుకే ఆ స్వతంత్ర మేధస్సు ఆ ఉనికిని ఉత్సవంలా జరుపుకోండి. సర్వాంతర్యామి ఉనికి సృజనాత్మకత అని ఉత్సవం చెయ్యండి. మీరు, ప్రపంచం, భగవంతుడు మీ ఉనికిని ఈ మూడింటి ఉనికిని ఉత్సవంలా చేసుకుంటే అకస్మాత్తుగా ఈ మూడు అవరోధాలని అచేతనమనస్సు సృష్టించిందని తెలుసుకుంటారు. స్వచ్ఛమైన ఉనికి, స్వచ్చమైన చేతనస్థితి, స్వచ్చమైన ఉత్సవమే ఉన్నాయి.

ఆత్మ, పరమాత్మ, లోకం – మూడూ ఒక్కటే అని స్పష్టంగా తెలుసుకుంటే అవి ఉనికికి, హృదయం అంతర భాగం ఈ అంతరభాగం. ఉనికిని ఒక ఉత్సవంలా చేసుకుంటే దానినే జీవన్ముక్తి అంటాను.

మీరు ఈ మూడింటి ఉనికినీ ఉత్సవంలా జరుపుకుంటే అకస్మాత్తుగా ఒక వేదిక ఉన్నట్లు కనిపిస్తుంది. మూడూ ఉత్సవంలో కరిగిపోతాయి. ఈ మూడూ ఉత్సవంలో కరిగిపోతే మిగిలేదే శాశ్వతమైన పరమానందం.

అహంకారం, స్వీకరించకపోవటం ఉన్నంతవరకూ ఈ మూడింటి మధ్యా సరిహద్దులు ఉంటాయి. ఎప్పుడైతే స్వీకరించకపోవటం మాయం అవుతుందో, స్వీకరించడం జరుగుతుంది. అహంకారం కరిగిపోతుంది. కేవలం ఉత్సవమే మిగులుతుంది.

కొంతమంది నన్ను 'స్వామీజీ మేము మీకు మా కృతజ్ఞత ఎలా తెలియజేయాలి' అని అడుగుతారు. నాకు కృతజ్ఞత చెప్పాలంటే నేను మీకు చెప్పిన విధంగా జీవన్ముక్తులుగా ఉండండి. అదే మీరు నాకు చేయగలిగింది, నేను మీకు చేయగలిగింది.

మీకు నా మీద అంత కృతజ్ఞత భావం కలగడానికి కారణం మీ జీవితంతో ఒక జ్ఞానోదయమైన గురువు ప్రవేశించినప్పుడే, మీకు కృతజ్ఞత అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పటి వరకు, కృతజ్ఞత అనేది బాహ్యంగా మీరు చూపించే ఒక సామాజిక అలవాటు మాత్రమే. ఎప్పుడైతే గురువు లభిస్తారో మీలో మార్పు ఆరంభం అవుతుందో, మీ లోపల కదలిక ప్రారంభమవుతాయి. గొప్ప ఆనందం, అప్పుడప్పుడు ఒకవిధమైన బాధ, వివరింపలేని భావన బాహ్యం నుండి కాకుండా, మీ అంతరంగం నుండి వస్తుంది. ఆ భావనే కృతజ్ఞత అంటాము. దానినే భక్తి అనవచ్చు. అది మాటలలో చెప్పలేని భావం. అదే నిజమైన కృతజ్ఞతలోని అందం. ఆ కృతజ్ఞతతో నిండిపోయి మీలో మార్పు జరగనివ్వండి. మీ ఉనికి నుండి మార్పు జరుగుతుంది. అది చాలు, అప్పుడు గురుదేవుల పని పూర్తి అయినట్లు.

'ఎలాంటి సేవ చేయవచ్చు', అని నన్ను చాలా మంది అడుగుతారు. ఒకరి చేతనస్థితిని వికసింపచేసుకోవటమే లోకానికి చేయగల పెద్ద సేవ అని నేను అంటాను. ఇది జరిగితే మీరు అహంకారంతో కాకుండా మీ ఉప్పొంగే ఉత్సాహంతో ఎక్కడ అవసరమైతే అక్కడ మీ అంతట మీరు సేవ చేస్తారు. దాన్నే సేవ అంటాం. అది పొంగిపొర్లుతుంది. ఆ విధంగా సేవ జరగాలి. ఇచ్చేటు కాకుండా పంచుకునే విధంగా ఉండాలి.

సాధారణంగా వ్యక్తులు పేరు కోసం సేవ చేసారు. 'సేవ చేస్తే మన పాపాలు పోయి మనకు స్వర్గంలో స్థానం లభిస్తుంది' అని సమాజం మనకు నేర్పిస్తుంది. సేవ చేస్తే మనకు స్వర్గంలో ఎవరూ స్థానం కల్పించరు. ఈ రకమైన బేరమేదీ స్వర్గం మనతో పెట్టుకోలేదు. మీలో మీరు ఉప్పొంగుతున్నప్పుడు, మీకు ఇంకేమీ చేయవలసింది లేదనే భావన కలిగినప్పుడు, మీ అంతట మీరు సేవ చేయడం ఆరంభిస్తారు, అంతే. మీ పొంగిపొర్లే తత్వానికీ, మీ ఐహికసంపదకీ ఏ విధమైన సంబంధం లేదు. మీలోని అకారణమైన పరమానందం మీ లోపలి స్నేహ విశ్వం అంతటి మీద మీ కృతజ్ఞతాభావమే దానికి కారణం. ఈ విధంగా సేవ చేసినప్పుడు మీరు జ్ఞానోదయం పొందవచ్చు.

కృతజ్ఞత మీ కర్మలను కరిగిస్తుంది

సూఫీ మతం పూర్తిగా కృతజ్ఞత మీద ఆధారపడిన మతం. సూఫీమతం గురించి ఒక మాటలో చెప్పాలంటే అది కృతజ్ఞత. ఈ భావం జలాలుద్దీన్ రూమీ లాంటి గొప్ప సూఫీ గురువులు రాసిన పద్యాలలో కనబడుతుంది. కృతజ్ఞత అనేది, మిమ్మల్ని శక్తి ప్రవాహంలా చేస్తుంది.

కృతజ్ఞత నిప్పు లాంటిది, అది అన్ని కర్మలనూ కాల్చేస్తుంది. కర్మ అంటే ఏమిటి? నెరవేర్చని పనులు ఏదైతే మిమ్మల్ని నెరవేర్చమని మళ్ళీ మళ్ళీ లాగుతాయో అవి. మనం కూడబెట్టుకున్న కర్మలన్నీ నెరవేర్చడానికీ, అవి పోగొట్టుకోవడానికీ తిరిగి ఈ భూమి మీద జన్మిస్తాం. మనం కృతజ్ఞత అనే శక్తితో ఉండడం వల్ల అన్ని కర్మలు కాలిపోతాయి. కృతజ్ఞతకి అంత శక్తి ఉంది.

కృతజ్ఞత–అత్యుత్తమప్రార్ధన, మతం

మీ ప్రార్థన కృతజ్ఞతగా మారితే మీరు ఎక్కువ దయని ఆకర్షిస్తారు. ఇది ఆకర్షణసూత్రం. ఇది నిజమైన ప్రార్థన. దీనితో మనం ఊహించినదాని కంటే ఎక్కువ లభిస్తుంది.

చాలమంది ప్రార్థన, కృతజ్ఞత బంధాలు అని అనుకుంటారు. కాదు, అవి గొప్ప విముక్తిని కలిగించేవి. అసంతృప్తి అనే బంధం నుండి విముక్తిని ఇస్తాయి. అసంతృప్తి అనేది మీ మొత్తం జీవితాన్ని నాశనం చేయవచ్చు. మనం అసంతృప్తి వల్ల ఏదో ఒక దాని వెనుక పరుగెడతాం. కృతజ్ఞత వికసించినప్పుడు అసంతృప్తి అనే భావాన్ని తుడిచేస్తుంది. అప్పుడు జీవితం అంటే వేరే అనుభూతి పొందుతారు. ఆ అనుభూతి సంతృప్తిగా ఉంటుంది.

ఏ మానవునికైనా సంతృప్తి అనే భావనతో జీవించడం ఒక గొప్ప వరం. ఎప్పుడైతే కృతజ్ఞత వికసిస్తుందో, సంతృప్తి ఉంటుంది. సంతృప్తి ఉన్నప్పుడు మీరు ఏది చేసినా సంతృప్తిగా ఉంటుంది. మీరు సంతృప్తి కోసం పనులు చేయరు. మీకు సంతృప్తి ఉన్నది కాబట్టి పనులు చేసారు. కృతజ్ఞత మీ తీరు అయితే సంతృప్తి మీ స్వభావం అవుతుంది. అప్పుడు ప్రతిక్షణం మీ నుంచి శక్తి ఉప్పొంగుతుంది. ప్రార్థన కూడా పొంగి పొర్లుతుంది.

ప్రార్థన అనేది మీలో కృతజ్ఞత, సంతృప్తి, ఉప్పొంగడమే. కొంతమంది అయితే 'మనం గుడికి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేస్తాం?' అని అడుగుతారు. మనం సర్వాంతర్యామి దయను ఉత్సవంలా చేసుకోవడానికి ప్రార్థన చేస్తాం. మనం అలా ప్రార్థిస్తే సర్వాంతర్యామి ప్రత్యుత్తరమిస్తాడు. సర్వాంతర్యామి ప్రత్యుత్తరమిచ్చినప్పుడు మీ జీవితంలో ఇంకా ఎక్కువ ఉపకారం జరుగుతుంది. ఇది ప్రార్థన, వరాల తాలూకు పవిత్రమైన వలయం (వృత్తం). సమస్య ఏమిటంటే భగవంతుడు, ప్రార్థన అనేవి ఆఖరిగా ఆశ్రయించే పరికరాలు అని మనకు నేర్చారు. భగవంతుడు, ప్రార్ధన అనేవి నిరంతరం జరిగే మంగళత్వానికి మూలం అని చెప్పలేదు.

చాలా మంది మనస్సులో ఇక ఆశ లేదు అనుకున్నప్పుడు ఆఖరుగా ఆశ్రయించేది భగవంతుడిని. ప్రార్థన అనేది, అనంతమైన సర్వాంతర్యామికి మోకరిల్లి, మీ గౌరవాన్ని, భయాన్ని తత్తరపాటుని, ఆందోళనని ప్రతీది అధీనం చేయటం. ఆయన మీ శరీరంలో ఊపిరి, మీ మనస్సులోని ఆలోచనలు, సర్వం ఆయనే.

మీరు అత్యంతభక్తితో ప్రార్థిస్తే, సర్వాంతర్యామి మీ జీవితంలో అవసరమైన నాలుగింటిని మీ మీద వర్షింపచేస్తాడు.అవి,

    1. ఏ విషయాలకి మార్పు అవసరమో అవి మార్చే శక్తి.
    1. ఏ విషయాలకి మార్పు అవసరం లేదో వాటిని గుర్తించే వివేకం.
    1. మీరు ఏ మార్పు చేసినా, సృష్టి అనేది నిరంతరం మారుతున్న కల అనేది తెలుసుకోవడం.
    1. పై మూడింటి నుంచి వచ్చే విముక్తి

మీరు ఎప్పుడైతే సర్వాతర్యామిని అనుభూతి చెందుతారో, అప్పుడు మీలో కృతజ్ఞత అనే భావం మొదలవుతుంది. అదే ప్రార్థన కూడా. ప్రార్ధన అనేది గాఢమైన భక్తి ఎప్పుడూ సర్వాంతర్యామితో కలిసిఉన్నట్లు ఉండే భావన. సత్సంగాలు, అధ్యాత్మిక సభలు సర్వాంతర్యామితో అనుబంధాన్ని పెంచడానికి ఏర్పాటు చేస్తారు.

నిజమైన ప్రార్థన, ప్రార్థన పుస్తకాలు చదవటం కాదు. అది భగవంతునికి పదార్దాలని నివేదన చేయడం కాదు. గుడికి డబ్బు ఇవ్వడం కాదు. సర్వాంతర్యామికి గాఢమైన కృతజ్ఞత నిశ్శబ్దంగా తెలియజేయడమే ప్రార్థన. ప్రార్థన సర్వాంతర్యామి సంరక్షిస్తున్నాడనే నిర్మయమైన నమ్మిక. అది గాఢంగా స్తబ్దంగా సర్వాంతర్యామి కోసం వేచి ఉండటం. ఇది నిజమైన ప్రార్థన. ఇది ఉప్పొంగుతున్నందువల్ల మిగతావి ఏం జరిగినా సరే, పరవాలేదు అనిపిస్తుంది.

నేను ఎపుడూ ఒక సూఫీ యోగి గురించి చక్రుని కథ చెబుతుంటాను. సూఫీ మతం కృతజ్ఞతని ఆధారం చేసుకున్న మతం. అది సర్వాంతర్యామికి కృతజ్ఞత చెప్పటమే.

చిన్నకథ : ఒక సూఫీ యోగి అతని శిష్యులు ఆధ్యాత్మికసంచారం చేస్తున్నారు. వారికి మూడు రోజులు ఆహారం దొరకలేదు. నాలుగవ రోజు వారిని ఒక గ్రామం నుండి తరిమేశారు, ఆ రాత్రి శ్శశానంలో పదుకున్నారు. ఆ మర్నాడు పొద్దునే ఆ యోగి ఎప్పటిలా భగవంతునికి కృతజ్ఞత చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన శిష్యులు అది చూసి విస్మితులయ్యారు. వారికి కొన్ని రోజులుగా ఆహారం, తలదాచుకోటానికి చోటు దొరకలేదు. అయినా గురువుగారు సర్వాంతర్వామికి కృతజ్ఞత ఎలా చెప్తున్నారు? వారు ఆయనతో కలిసి ఆ ప్రార్థన చెప్పడానికి నిరాకరించారు. వారు 'మనకు మూడు రోజులు భోజనం, ఉండడానికి చోటు దొరకనపుడు భగవంతునికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి.' అని గురువుని అడిగారు. గురువు వారికి, 'మీకు 30 సంవత్సరాలు భోజనంపెట్టి, ఉండడానికి చోటు ఇచ్చాడు. దానికి ఆ సర్వాంతర్యామికి కృతజ్ఞత చెప్పవచ్చు కదా?' అని సమాధానం ఇచ్చారు.

సర్వాంతర్యామి మన మీద నిరంతరం కురిపించే వరాలకి చెప్పే కృతజ్ఞతే ప్రార్థన.

నేను మీకు ఏవో చాలా పాత పద్ధతులు చెప్తున్నాను అని అనుకోకండి. నేను నా జీవితంలో అనుభూతి చెందిందే మీకు చెబుతున్నాను. నేను జ్ఞానోదయం పొందకముందు పరివ్రాజకుడుగా ఉండగా, నేను చాలా దూరాలు కాలినడకన ప్రయాణం చేసేవాడిని. నేను భారత్ అంతా తిరిగాను. నేను కేవలం రెండు జతల బట్టలు, భిక్షాటన పాత్రతో ప్రయాణం చేసేవాడిని. నేను డబ్బు ముట్టుకోకూడదు, ఏదీ రేపటికి నిలువ చేసుకోకూడదు అని ప్రతిజ్ఞ చేసుకున్నాను.

ఆ కొన్ని సంవత్సరాలూ నేను విముక్తి పొందిన రాజులా, ఈ భూమి మీద నివసించాను. నాకు సర్వాంతర్యామి, ఆ క్షణాలకి కావలసినది ఇచ్చారు. నేను మరుక్షణం గురించి ఆలోచించలేదు. నేను దేశసంచారం చేసే రోజులలో ప్రతీక్షణం సర్వాంతర్యామి అద్దశ్యహస్తం ఉందన్న అనుభూతి చెందాను. మీ ముందు కూర్చున్న నాకు ఇవి జరిగాయనీ, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నదనీ అర్థం చేసుకోండి.

ఆశించడం అపరాధం, దాన్ని వదిలేయండి

మీరు కూర్చుని రెండు లిస్టులు తయారుచేయండి. ఒకటి మీకు ఉన్న వస్తువులు, రెండవది మీకు లేనివి. మొదటి జాబితాలో మీకు ఉన్నవి అన్నీ రాయాలి. మీకళ్ళు, చెవులు, ముక్కు చేతులు, కాళ్ళు మొదలైనవి. ఎందుచేతనంటే ఇవి లేని వారు కూడా ఉన్నారు. మీకు భౌతికంగా ఉన్నవి, మానసికంగా వున్నవి రాసిన తరువాత వస్తువులని రాయండి. మీరు నిజాయితీగా ఏది వదలకుండా రాసే మీరు మొదటి జాబితాని పూర్తి చేయలేరు, అది నిజం. మీరు మొదటి జాబితా పూర్తి చేయలేకపోతే మీలో కృతజ్ఞత అనే భావం ఉన్నది అని అర్థం.

అసలు సమస్య ఏమిటంటే నిరంతరం మనం ఏదో ఒకటి ఆశిస్తాం. అందుకే కృతజ్ఞతా భావం సులభంగా కలగదు. మనం నిరంతరం కళ్ళతో, చెవులతో, ముక్కు, జిహ్వ, స్పర్శల వల్ల సమాచారాన్ని గ్రహిస్తాం. దీని ఆధారంగా మనం నిరంతరం ఏదో ఒకటి ఇలా జరగాలని ఆశిస్తాం. ఎవరికైనా మంచి ఇల్లు, మంచి కారు ఉంటే అది మన మనస్సులో రిజిష్టరు అయిపోతుంది. ఎవరైనా మంచి పని, ఘనకార్యం చేసారని వింటే అది మన మనస్సులో రికార్డు అవుతుంది. మన శక్తిని ఎప్పుడూ బాహ్యంగా జరిగే వాటిని, మన పంచేదియాలు గ్రహించడానికి ఉపయోగిస్తాం. ఆ శక్తిని లోపల ఆత్మవెపు మళ్ళించం.

ఎప్పుడెతే మన శక్తి లోపల వైపు మళ్ళుతుందో, కృతజ్ఞతాభావన కలిగి మీలో వున్న సమృద్ధిని తెలుసుకుంటారు. కృతజ్ఞతతో ఆశించడంలో లోభత్వం ఉండదు.

ఆశతో పని చేస్తే నిప్పు ఆర్చడానికి స్వచ్ఛమైన నేతిని పోసినట్లే. మీరు నెయ్యి పోసి నిప్పుని ఆర్చగలరా? అది జరగని పని. అలాగే మీరు చేసేవాటికి ఆశ ఆధారం. అయితే మీకు సంతృప్తి అనేది కలగదు. మీ ఇంద్రియాలకి అలసట కలుగుతుంది, అంతే.

మీరు ఆశించడంతో లేదా కృతజ్ఞతతో ఉండగలరు. రెండింటితో ఒకేసారి ఎప్పటికీ ఉండలేరు. ఆశతో వస్తువులను పొందాలనుకుంటారు. మీరు ఏదైనా సొంతం చేసుకోవాలంటే, ఏది మీకు చాలు అనిపించదు. మీరు ఆనందిస్తే ప్రతీదీ పొంగిపొర్లుతున్న భావన కలుగుతుంది. అదే రెండింటికీ ఉన్న తేడా.

చిన్నకథ : ఒక గ్రామంలో కాపలాదారు తన ఈల వేస్తూ రాత్రి గస్తీ తిరుగుతున్నాడు. వెలిగించడానికి అగ్గి పెట్టె కోసం వెతుక్కున్నాడు. అతని దగ్గర అగ్గిపెట్టె లేదు. దగ్గర వున్న ఇంటికి వెళ్లి ముసలమ్మని పొయ్యలో నిప్పు ఇవ్వమని అడిగాడు. ఆవిడ 'తన పొయ్యిలో నిప్ప లేక మూడు రోజుల నుండి గుడిలో ఇచ్చిన కొద్ది ఆహారంతో సరిపెట్టుకుంటున్నానని చెప్పింది.

ఆ పక్కన ఇంటికి వెళ్ళి ఆ కాపలాదారు మళ్ళీ అగ్గిపెట్టె అడిగాడు. వాళ్ళు వారి పక్కన వున్నవారి నుంచి మండే కట్టెపుల్ల తెచ్చుకుని తమ పొయ్యి అంటించుకున్నామనీ, ప్రస్తుతం నిప్పు లేదు అగ్గిపెట్టె లేదని చెప్పారు. అప్పుడు ఆ కాపలాదారు, గ్రామపెద్ద ఇంటికి వెళ్ళి అక్కడ వున్న పనివారిని అగ్గిపెట్టె అడిగాడు. వారిలో ఒక అమ్మాయి అతన్ని చూసి నీకు నిప్పు కావాలా? చేతిలో లాంతరు ఉంది కదా అని అడిగింది. ఆ కాపలాదారు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. '

మనకు కావలసినది ఎక్కడో బయటే ఉందనుకుంటే ఆ రాత్రి కాపలాదారులా వెతుక్కుంటూనే ఉంటాం. మనం సర్వాంతర్యామి మనకి కావలసినవి ఇస్తాడు – అన్న నమ్మకం ఉంటే, మనకు కావలసినది మన దగ్గరే ఉంటుంది.

కృతజ్ఞతతో మీ శరీరం కదలికలలో మార్పు వస్తుంది

మనం ఆశిస్తూ పనులు చేసే మన శరీరంలో దాగి వున్న హింసాప్రవృత్తిని తెలియచేసాము. అది అంతరంగమంతా ఉన్నది. మనం సూక్ష్మగ్రాహులమైతే శరీరంలోని ఆ భావనను తెలుసుకోవచ్చు.

మీరు కంప్యూటరు మీద టైపు చేస్తున్నప్పుడు, ఫోను కాల్ తీసుకున్నప్పుప్పుడు, మీరు తిరిగి ఫోను ఎలా పెడతారో గమనించండి. మీరు ఎలా అడుగులు వేస్తారో, ఎలా తలుపు వేస్తారో, చిన్నపిల్లల చెయ్య ఎలా పట్టుకుంటారో – అన్నింటినీ జాగ్రత్తగా గమనించండి. ప్రతీ దాంట్లో కనిపించని హింసాప్రవృత్తి ఉంటుంది. ఇది ప్రయత్నించి చూడండి. మీరు తలుపు మూసేటప్పుడు గమనించి, ఈ సారి వేసేప్పుడు తెరచి నెమ్మదిగా అత్యంత కృతజ్ఞతాభావంతో తెలుసుకునే తత్వంతో పూర్తిగా మూసుకునేంతవరకు వెయ్యండి. ఆ అనుభూతిని పొందండి. రెండుసార్లు తలుపు వేసిన దాంట్లో తేడా తెలుస్తుంది. రెండవసారి తలుపు వేసినపుడు లోపల మృదువుగా అవడం తెలుసుకుంటారు. కృతజ్ఞత మీపై ఇలాంటి ప్రభావాన్నే చూపిస్తుంది.

కృతజ్ఞతతో మీ శరీరభాష మారిపోతుంది. మీరు లోతైన కృతజ్ఞతను అనుభూతి చెందినప్పుడు సంఘటనలకి మీ స్పందన మారుతుంది. మీరు సర్వాంతర్యామితో అనుసంధానమై ఉంటారు. మీ శరీరం అంతా మృదువుగా, సుకుమారంగా ప్రవహిస్తుంది. మీరు చేసే పనులన్నీ చూడదానికి అందంగా ఉంటాయి. మీలో కోపం ఉండదు, అంతా ఆనందమే. మీరు ఏది చేసినా, మీ జీవితంలో మాధుర్యాన్ని నిలుపుకుంటారు.

ధ్యానం

ప్రతీరోజూ అరగంట మీతో మీరు కూర్చోండి. కళ్ళు మూసుకొని ఆలోచనని, వ్యక్తిని లేదా సంఘటనని మనస్సులోకి రానియ్యండి. అది మంచి ఆలోచన, మీరు ప్రేమించే వ్యక్తి లేదా మీకు ఇష్టమైన సంఘటన. అది సంఘటనైతే దాని గురించి గాఢమైన కృతజ్ఞత అనుభూతి చెంది అది వెళ్ళిపోవటం చూడండి. అది చెడు ఆలోచన మీకు నచ్చని వ్యక్తి లేదా అనిష్టమైన సంఘటనైతే వాటిని కృతజ్ఞతతో చూసి ఆశీర్వదించి పంపించేయండి. ఏది మనస్సులోకి వచ్చినా కృతజ్ఞతో దీవించండి. కొన్ని రోజులలో మీ తత్వం పూర్తిగా మృదువుగా ప్రేమగా మారిపోతుంది. మీరు ప్రతీది ఎంతో దయాఆర్ద్రహృదయంతో చూసి గ్రహిస్తారు.

  • నిజమైన కృతజ్ఞతకి ఒక కారణం ఉండదు అది కారణం లేకుండా మీ లోపల వికసిస్తుంది.

  • మీరు కృతజ్ఞత అనుభవాని ఎందుకు పొందరంటే మీరు అన్నీ యథాలాపంగా తీసుకుంటారు.

  • ఎప్పుడెతే మనం చిన్నవాటికి కూడా కృతజ్ఞతని చూపుతామో మనలో సున్నితత్వం పెరుగుతుంది. మనం మరింత పరిణతి చెందుతాము.

  • నేను కొంతమందిని చూసాను. వారు దేనితోనైనా సంతోషాన్ని పొందాలి అంటే అది వారి సొంతం కావాలి.

  • ప్రతిదానిలో మనకి ఒక సందేశం ఉంటుంది. అది మరణం కానీయండి లేదా అనారోగ్యం కానీయండి అందులో సందేశం ఉంటుంది.

  • మీరు చేసే పనులు ఆశించటం మీద ఉంటే మీరు సంతృప్తిని పొందరు. అది మీ జ్ఞానేంద్రియాలని నీరసింపచేయటమే. సృష్టి అన్నది ఒక ప్రమాదం కాదు, ప్రతిదానిలో మనకి ఒక సందేశం ఉంటుంది.

  • మీ జీవితంలోనికి ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరుడు వచ్చాక, కృతజ్ఞత అంటే ఏమిటో తెలుస్తుంది.

  • మీ సామ్రాజ్యానికి తాళం చెవి జ్ఞానోదయం

  • సన్న్యాసం అంటే అంతిమద్యూతం

  • విశ్వశాంతి మీ నుంచి ప్రారంభమవుతుంది

  • సమష్టిచైతన్యంలో మీరూ ఒక భాగం

  • జీవిత ద్వారాల్ని తెరిచే అమాయకత్వం

  • తీవ్రత అపజయం లేని మార్గం

  • నాయకత్వం ఒక స్థితి, హోదా కాదు

  • బాధ్యత మిమ్మల్ని ఉన్నతస్థితికి చేర్చుతుంది

  • మీరే మేధ

  • మరణం ఒక ఉత్సవం

  • కర్మచక్రాన్ని ఛేదించవచ్చు

  • మానసిక అయోమయాల నుంచి విముక్తి పొందగలరు

మానసిక అయోమయాల నుంచి విముక్తి పొందగలరు

జీవస్ముక్తి అంటే ఆలోచనలు లేని స్థితిలో జీవించటమే

మనని నడిపించే ప్రాథమిక భావావేశాల గురించి తెలుసుకున్నాం.ఈ భావావేశాలని వ్యతిరేకంగా వ్యక్తపరిస్తే అవి మన లోపలి శక్తిని నాశనం చేసి బయటి నుంచి శక్తిని పొందలేని విధంగా చేస్తాయి. ప్రతి చాప్టర్‌లో ఇచ్చిన పద్ధతులని సాధన చేయటం ద్వారా ఆ వ్యతిరేకభావాల నుంచి ఏ విధంగా బయట పడగలరో తెలుసుకున్నారు. దానితో మీలోని శక్తిప్రవాహానికి ఉన్న అడ్డంకులని ఏ విధంగా తొలగించుకోవచ్చునో నేర్చుకున్నారు.

ఇప్పుడు మనం మరి కొన్ని విషయాలని తెలుసుకుందాం. వాటిని బాగా అర్థం చేసుకోవటం ద్వారా మనం మన జీవనసరళిని మార్చుకోవచ్చు. వీటిని అర్థం చేసుకుంటే మనం మారవచ్చు

మనం ఒక చిన్న విషయంతో ప్రారంభిద్దాం. దేన్నైతే మనం యథాలాపంగా తీసుకుంటామో, దాన్ని చూద్దాం. మన మనస్సు నిజంగా ఏ విధంగా పని చేసుందో చూద్దాం.

పది నిముషాల ప్రయోగం

పది నిముషాలు చేసే ఈ ప్రయోగాన్ని ప్రయత్నించండి. ఒక పేపరు, పెన్ తీసుకొని ఒక్కరే కూర్చోండి. మీ మనస్సు లోనికి వచ్చిన ప్రతి ఆలోచననీ రాయండి. మీ మైండ్‌కి ఒక రాసే యంత్రాన్ని కనెక్ట్ చేస్తే ఎలా ఆలోచనలని రాసుందో ఆ విధంగా వచ్చిన ఆలోచనని అదే విధంగా రాయండి. దేన్నీ ఎడిట్ చేయవద్దు. ఆలోచనలని ఇది కేవలం మీ కోసం చేసే ప్రయోగం. మీరు రాసిన దాన్ని ఎవరూ చదవరు. పది నిముషాలు అయ్యాక మీరు ఏమి రాసారో చదవండి. మీరు ఆశ్చర్యపోతారు. మీ మనస్సులో ఏర్పడిన ఆలోచనలకి ఏ మాత్రం అర్థం లేదు అని తెలుస్తుంది.

ఉదాహరణకి మీరు వీథిలో ఒక కుక్కని చూస్తారు. వెంటనే మీకు, మీరు చిన్నప్పుడు భయపడిన కుక్క గుర్తు వస్తుంది, ఆ తరువాత ఆలోచన మీ చిన్నతనం గురించి. మీ చిన్నప్పుడు స్కూల్ టీచర్ గురించి ఆ తరువాత ఆలోచన మీ క్లాసు రూమ్, మీ టీచర్ ఇల్లు. మీరు ఇప్పుడు చూసిన కుక్కకి, మీ చిన్ననాటి స్కూల్ టీచరుకి ఏ విధమైన సంబంధం లేదు. కేవలం కొన్ని సెకండ్ల కాలంలో మీ ఆలోచనలు అర్థం లేని విషయాల మీదకి దూకుతూ ఉంటాయి. మీ ఆలోచనలు ఒక దాని నుంచి మరొక విషయానికి మారటం మీరే చూసారు. దీన్ని 'ఆలోచించటం' అనలేం. ఇది ఒక సమూహం మాత్రమే. కుక్క మీ చిన్నతనాన్ని కలిపింది. మీరు తరువాత టీచరు, ఇల్లు ఇలా ఒకదాని కొకటి కలుపుతూ వెళ్ళారు. నిజానికి ఈ ఎక్సర్‌సైజు ఒక్కపారి చేస్తే దాని నుంచి మీరు తెలుసుకున్న విషయం మీరు, మీ గురించి ఆలోచించే పద్ధతిని మార్చేస్తుంది. అదే విధంగా మీరు మిమ్మల్ని, ఎదుటివారిని ఏ విధంగా చూస్తారో ఆ ధోరణిలో మార్పు వస్తుంది. మీ జీవితంలోనూ మార్పు వస్తుంది.

మానసిక అయోమయాల నుంచి విముక్తి పొందగలరు

మానసిక వ్యవస్థ ఏ విధంగా పని చేస్తుంది?

మనం ఆలోచనలని ఏ విధంగా సృష్టిస్తాం, వాటిని ఒక దానితో మరొక దానికి ఏ విధంగా బంధాలు కల్పిస్తాం?

జీవితాన్ని ఏ విధంగా అనుభవిస్తాం?

మనస్సు లక్షణం

మీ లోపల ఆలోచనలు ఏ విధంగా సాగుతాయో, ఆలోచనకి, ఆలోచనకి ఏ విధంగా మీరు లింకులు పెడతారో ఒక బొమ్మ వేసి మీకు వివరిస్తాను. ఈ బొమ్మలో ఒక్కొక్క

చతురస్రం ఒక్కొక్క ఆలోచన. ఒక్కొక్కటి ఒకొక్క సైజు, ఒక్కొక్క రంగులో ఉంటాయి. రకరకాల ఆలోచనలు నిరంతరం మీలోనికి వస్తూ పోతూ ఉంటాయి. ఒక ఆలోచన బాధకి, ఆ అనుభవానికి సంబంధించి ఉంటే, మరొక ఆలోచన సంతోషానికి సంబంధించి ఉంటుంది. మరొక ఆలోచన సంతోషానికి సంబంధించిందే కాని మీరు దాన్ని బాధ అనుకుంటారు. దాన్ని చార్ట్‌లో జె.పి.గా చూపించాను. జె.పి అంటే ఆనందకరమైన అనుభవం, కాని మీకు బాధలా కనిపిస్తుంది. అదే విధంగా బాధాకరమైన ఆలోచన కాని మీకు సంతోషకరంగా కనిపిస్తుంది.అదే పి.జె.గా చార్ట్‌లో చూపించాను.

ఆలోచనలు వల్ల సంతోషమా, బాధా

సాధారణంగా మనలోని ఆలోచనలు అన్నీ కూడా గతానికి కాని, భవిష్యత్తుకి కాని సంబంధించి ఉంటాయి. వర్తమానం అంటే ఈ క్షణం గురించి మీకు ఆలోచనలు ఉండవు. వర్తమానంలో కేవలం చేతనస్థితిలో మాత్రమే ఉండగలరు. ఆలోచనలు ఉండవు. ఆలోచనలు గతంలో జరిగిన ఒక సంతోషకరమైన అనుభవం కాని లేదా భవిష్యత్తులో మీరు పొందబోయే సంతోషకరమైన అనుభవం గురించి ఉంటాయి లేదా మీరు గతంలో అనుభవించిన బాధ గురించి, భవిష్యత్తులో ఆ బాధ లేకుండా ఎలా ఉండాలి అనే ఆలోచనలు ఉంటాయి.

మీరు సీరియస్‌గా ఉన్న సమయాలలో కూడా అనుకూలమైన ఆలోచనలు అకస్మాత్తుగా రావచ్చు. సంతోషం అత్యున్నతస్తాయిలో అనుభవంలో ఉన్న సమయంలో వ్యతిరేకమైన ఆలోచనలు రావచ్చు. ప్రతి ఆలోచనా స్వతంత్రమైంది. దాని ముందు ఆలోచనతో ఎటువంటి సంబంధం లేని ఆలోచన. అందుకే బాధపడే ఆలోచనల మధ్య సంతోషకరమైన ఆలోచనలు మీకు రావచ్చు ఒక విషయం అర్థం చేసుకోండి. ఏ రెండు ఆలోచనలూ అర్థవంతంగా ఒకదానికొకటి లింక్ చేసి ఉండవు. తరువాత ఆలోచన రావటానికి ముందు ఆలోచనది ఎటువంటి బాధ్యత ఉండదు. అవన్నీ విడివిడిగా, అర్థం లేకుండా ఉండే ఆలోచనలు ఒక దానితో ఇంకొక దానికి సంబంధం ఉండదు.

ఈ విధంగా వచ్చే ఆలోచనల నుంచి మీరు ఏ విధంగా బయటకి రాగలరు. దాని నుంచి విముక్తులు అవ్వాలి (అన్‌క్లచ్). బంధ విముకులు అవటం (అన్‌క్లచ్) అనే మాటని పదే పదే ఉపయోగించబోతున్నాను. దాని అర్ధం ఏమిటో వివరిస్తాను. కారు డ్రయివ్ చేసేటప్పుడు మీరు గేర్లు మారుస్తారు కదా? ఆ విధంగా మొదటి గేరు నుంచి రెండవదాని లోనికి, రెండవ గేరు నుంచి మూడవ దాని లోనికి ఇలా గేరు మారిన ప్రతీ సారీ మీరు న్యూటల్ గేరు లోనికి వెళతారు. అంటే పూర్తిగా అన్‌క్లచ్ అయ్యి న్యూటల్ లోనికి వెళ్ళాం. అప్పుడే తరువాత గేర్ లోనికి వెళ్ళగలుగుతాం. అంతే కదా! అదే విధంగా రెండు ఆలోచనల మధ్యలో మనం న్యూటల్ లోనికి వెళ్ళాం. అంటే రెండు ఆలోచనల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం. అదే రెండు ఆలోచనల మధ్య ఉండే నిశ్శబ్దం. అదే శాంతి, ఆనందం. ఎప్పుడైతే గతానికి, భవిష్యత్తుకి ఆలోచనలతో బంధాలు వేయకుండా ఉంటామో మనం బంధాల నుంచి స్వేచ్ఛని పొందుతాం. అదే బంధవిముక్తి లేదా అన్‌క్లచ్ స్థితి. ఎప్పుడెతే ఆలోచనలకి లింకులు ఏర్పరచమో ఆ శూన్యప్రదేశంలో పూర్తి తెలుసుకునే తత్వంతో ఉండగలుగుతాం. అలా ఉన్నప్పుడు రెండు ఆలోచనల మధ్య ఉండే ఖాళీ పెరుగుతూ ఉంటుంది. మనం ఆ శూన్య ప్రదేశంలో ఎక్కువసేపు ఉండగలుగుతాం. అప్పుడు ప్రశాంతతని, ఆనందాన్ని అనుభవించగలుగుతాం.

తెలుసుకునే తత్వం

చివరి తాళంచెవి : మీరు అకస్మాత్తుగా తెలుసుకునే తత్వంతో ఉండగలిగితే, మీ ముందుకి ఏ ఆలోచన వచ్చినా అది మీ జీవితం అవుతుంది. మీరు దాని పట్ల మీ ఏకాగ్రత నిలుపగలుగుతారు. మీరు దాన్ని సాధిస్తారు. లేదా దాని నుంచి తప్పుకుంటారు. ఇది ప్రొజెక్టర్ ముందు ఉన్న స్లైడు లాంటిది. ప్రొజెక్టరు ముందు ఏ స్లైడుని ఉంచితే అదే నిజం అన్నట్లు తెర మీద చూపిస్తుంది. కాని సమస్య ఏమిటి అంటే మీ అంతరంగంలో ఉండే ప్రొజెక్టర్ లైటు ఎప్పుడూ వెలుగుతూ ఉండదు. ఇక్కడ ప్రొజెక్టరు లైటు అంటే మీలోని తెలుసుకునే తత్వం. అది వస్తుంది పోతుంది ; వస్తుంది పోతుంది. మీరు పూర్తిగా నిరంతరం తెలుసుకునే తత్వంతో ఉండరు.

చాలా సార్లు మీరు కళ్ళు తెరచి ఉంటారు, శరీరం కదులుతూ ఉంటుంది. కాని మీరు ఉన్నారు అని మీకు తెలియదు. ఉదాహరణకి మీరు ఇంట్లో నుంచి కారులో బయలుదేరతారు. అరగంట డ్రైవ్ చేసి ఆఫీసుకి వస్తారు. అక్కడ కారు పార్క్ చేసి దిగాక అకస్కాత్తుగా గుర్తొస్తుంది,

మీరు అరగంట డ్రైవ్ చేసారు అని, ఆఫీసుకి వచ్చేసారు అని. దీని అర్ధం ఏమిటంటే మీరు డ్రైవ్ చేస్తున్నంతసేపూ మీ అంతరంగంలోని ప్రొజెక్టర్ లైటు ఆరిపోయి ఉన్నది. మీ ప్రొజెక్టర్ లైటు ఆరిపోయి ఉన్నప్పుడు అంటే మీలో తెలుసుకునే తత్వం లేనప్పుడు, ఏం జరిగినా ఏ స్లైడు ఉంచినా, అది మీ జీవితంలో భాగం కాదు. దాన్ని మీరు గుర్తుంచుకోలేరు. మళ్ళా లైటు వెలిగినప్పుడు, మీలోనికి తెలుసుకునే తత్వం వచ్చినప్పుడు, అప్పుడు మీకు వచ్చిన ఆలోచన మాత్రమే మీ జీవితంలో భాగం అవుతుంది. ఇది చాలా సూక్ష్మత్వం. మీకు వచ్చిన అన్ని ఆలోచనలూ కలిపి – మీకు తెలిసి వచ్చినవి, తెలియకుండా వచ్చినవి అన్నీ కలిపి – మీ జీవితం.

దురదృష్టం కొద్దీ మీలో తెలుసుకునే తత్వం లేని స్థితిలోనే మీరు చాలా ముఖ్యమైన నిర్ణయాలు చేస్తారు. జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు జరుగుతాయి. అవి కూడా మీ జీవితంలో భాగమే కానీ అవి మీకు తెలియదు. అప్పుడు వచ్చిన ఆలోచనలు, చేసిన నిర్ణయాలు మీకు తెలియదు. మీకు తెలియకుండానే అవి మీ జీవితానికి తోడ్పడతాయి.

స్పష్టంగా తెలుసుకోండి, మీ జీవితంలో జరిగే ఏ క్షణమైనా మీకు తెలియకుండా, మీ అనుభవం లేకుండా జరిగితే అది బాధాకరమే. మీరు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని బాధని స్పృశించినవారవుతారు. మీ కారులోని మలుపు తిప్పాలి అని సూచించే లైటు వెలిగి ఆరుతూ ఉన్నట్లును మీ అంతరంగంలో చేతనస్థితి మినుకుమినుకుమంటూ ఉంటుంది. కాని మీలో తెలుసుకునే తత్వం లేనప్పుడు అది ఎప్పుడు వెలిగిందో, ఎప్పుడు ఆరుతుందో తెలుసుకోలేరు.

ఆలోచనల ప్రవాహం మీ ముందు వెళుతూ ఉంటే మీరు అకస్మాత్తుగా తెలుసుకుంటారు, 'అయ్యా! భగవంతుడా! ఇవన్నీ నిజంగా నాలో జరుగుతున్నాయా? నేను ఎక్కడికి వెళుతున్నానో తెలియటం లేదు. నాలో ఏం జరుగుతున్నదో తెలియటం లేదు' అని. మీకు తెలియదు కాని, మీకు అన్నీ తెలుస్తున్నాయి అని అనుకోవటం మీలోని మొదటి ఊహ. మీరు నిరంతరం తెలుసుకునే తత్వంతో ఉంటే మీరు విప్పారి ఉంటారు. అప్పుడు సత్యాన్ని మొదటిసారి చూడగలుగుతారు. ప్రారంభంలో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం గాఢంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకూ మీరు అచేతనస్థితిలోనే గడిపారు. ఎప్పుడైతే తెలుసుకునే తత్వంతో ఉంటారో మీరు కేవలం సంతోషాన్ని, ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తారు.

మీ నిజమైన గతం మీకు తెలియదు

ఇది మొదటి సత్యం. మీ నిజమైన గతం మీకు తెలియదు. మీ ముందు జరుగుతున్న అన్ని విషయాలూ మీకు తెలియవు. నిజంగా ఏ విధంగా జరిగిందో ఆ విధంగా మీకు గుర్తుండదు.

ఒక చిన్న ఉదాహరణని తీసుకోండి. మీ జీవితం అంతా రకరకాల సంఘటనలతో నిండి ఉంటుంది. కొన్ని సంతోషకరమైన సంఘటనలు, కొన్ని బాధ కలిగించేవి, మరి కొన్ని అపరాధభావంతో, మరి కొన్ని నిరాశా నిస్పుహలతో ఉన్నవి. మీరు జీవితాన్ని యథాతథంగా చూడరు. మీరు సాధారణంగా ఏం చేసారు? మీరు కేవలం బాధ కలిగించిన సంఘటనల్ని మాత్రమే తీసుకుంటారు. వాటినన్నింటినీ ఒక గొలుసులా చేసి, ఆ భావాలనే కలిపి జీవితం అంటే బాధపడటం అని చెబుతారు. మీరు ఏమనుకుంటారంటే జీవితం బాధలతో ఉన్న ఒక పొడవైన గొలుసు, అని అనుకుంటారు. చాలా అరుదుగా మీరు సంతోషాల గొలుసుని తయారు చేస్తారు. చాలా అరుదుగా సంతోషకరమైన సంఘటనలని పోగుచేసి ఆ భావనలతో సంతోషాల గొలుసు చేసి, జీవితం అంటే సంతోషం అని అనుకుంటారు. సంతోషాల గొలుసులు అరుదుగా ఉన్నట్టే వాటి నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. చాలా వరకు మీరు బాధ కలిగించే సంఘటనలని, భావాలని తీసుకొని, ఒక గొలుసు చేసి జీవితం బాధలమయం అనే భావాన్ని స్పష్టించుకుంటారు. ఎప్పుడైతే జీవితం నిరంతరం ప్రవహించే బాధలు అని అచేతనస్థితిలో అనుకుంటారో, మీరు నమ్మకాన్ని బలంగా తయారుచేసారు. కానీ మీకు తెలిసే విధంగా ఆ గొలుసుని విడగొట్టాలి, తెంపాలి అని చూస్తారు. ఒక విషయం అర్ధం చేసుకోంది, జీవితం అంటే బాధల గొలుసు లేదా సంతోషాల గొలుసు అని మీరు అనుకునేది, మీరు అచేతనస్థితిలో ఉన్నంతవరకు మాత్రమే ఉంటుంది. ఒక్కసారి మీరు తెలుసుకునే తత్వంతో ఉంటే అది మాయం అవుతుంది.

మీ అంతరంగంలో ఆలోచనలకి, మీలోని తెలుసుకునే తత్వానికి మధ్య

మీరు మోహం (కోరిక) కి సంబంధించిన ఆలోచనలతో సంతోషపడితే, అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు, మీరు తెలుసుకుంటారు. అప్పుడు 'నేను' అనేది ఉంటుంది. మీరు హింసాత్మక ఆలోచనలతో సంతోషపడితే, అటువంటి ఆలోచనలు మీలోనికి వచ్చినప్పుడు మీలో జీవం వస్తుంది. మీరు ఉన్నారు అని తెలుస్తుంది. దీనినే ఛేదించలేని వృత్తం అంటాను. మీరు మీలోని వ్యతిరేక ఆలోచనలని, వ్యతిరేకతని జీవంతో తిరిగి తీసుకువస్తారు. వ్యతిరేక ఆలోచనలకి బలాన్ని ఇస్తారు. దాంతో వ్యతిరేక ఆలోచనలు ఇంకా పెరుగుతాయి, జీవితాన్ని ఉత్పాహపరచటానికి మరింత వ్యతిరేకతని తెస్తారు.

మీరు అనుకుంటున్నది అసలు లేదు

బాధాకరమైన గొలుసు ఎప్పుడూ బాధాకరమైన సంఘటనలని మీ జీవితంలోనికి ఆకర్షిస్తుంది.

రమణమహర్షి ఈ విషయాన్ని చక్కని ఉపమానంతో చెప్పేవారు. ఒక కుక్క ఎండిన ఎముకని కొరుకుతూ ఉంటుంది. అలా నములుతుంటే ఆ ఎముక దాని నోట్లో గుచ్చుకొని రక్తం వస్తుంది. కుక్క ఆ రక్తం ఎముక నుంచి వస్తుంది అని సంతోషంగా ఇంకా ఆ ఎముకని కొరుకుతూ ఉంటుంది. ఆ రక్తం తన నుంచి వస్తుందని తెలుసుకోలేదు. అది ఎముక నుంచి వస్తుంది అని సంతోషపడుతుంది.

మీలో హింస ఉత్పాహాన్ని కలిగిస్తే మీరు అటువంటి సంఘటన కోసం ఎదురు చూసారు. మీలో బాధలు ఉత్పాహాన్ని కలిగిస్తే జీవితంలో అటువంటి సంఘటన కోసం చూసారు. వాటికి బలాన్ని ఇచ్చి ఇంకా నమ్ముతారు. అది సాధారణమానవుల మానసికస్థితి. చెప్పటానికి మాత్రం హింస లేదా బాధాకరమైన గొలుసుని తెంపాలి అని చూస్తున్నాం అంటారు కాని రహస్యంగా దాన్ని పెంచి పోషిస్తారు.

బాధలు

మీకు బాగా లోతుగా అర్థమయ్యేలా చెబుతాను. పది సంవత్సరాల క్రితం అనుభవించిన బాధ, తొమ్మిది సంవత్సరాల క్రితం అనుభవించిన బాధ, ఏడు సంవత్సరాల క్రితం అనుభవించిన బాధ, మూడు సంవత్సరాల క్రితంది, నిన్నటిదీ – అన్నీ ఒక దానికొకటి ఎటువంటి సంబంధం లేని స్వతంత్రమైన సంఘటనలు. కాని మీరు వాటిని అన్నింటినీ కలిపి బాధల గొలుసు తయారు చేస్తారు. ఇటువంటి బాధల గొలుసులు మరిన్ని కలిపి మరొక పెద్ద బాధల గొలుసు తయారుచేసారు. అలా చేసి నా జీవితం బాధలమయం అని గట్టిగా నమ్ముతారు. కాని అది సరి కాదు. మధ్య మధ్యలో మీరు ఆనందించిన మధురక్షణాలు, మంచి సంఘటనలు ఏమయ్యాయి? తప్పనిసరిగా ఆ సంతోషకరమైన సమయం ఉండి ఉంటుంది. గొలుసులు తయారుచేసేటప్పుడు వాటిని మరిచిపోయారు. కాబట్టి ఎటువంటి గొలుసైనా అది నిజం కాదు. ఎందుకంటే అది మీ జీవితంలో ఒక చిన్న భాగమే కాని పూర్తి జీవితం కాదు.

ముందుగా మీరు బాధాకరమైన సంఘటనలని ఎందుకో గుర్తుపెట్టుకుంటారు. డాక్టరుకి చెప్పటానికి లేదా అటువంటి అవసరానికి కష్టం, బాధ కలిగించిన సంఘటనలని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. క్రమంగా వీటిని ఒక గొలుసులా అల్లి, జీవితం అంటే బాధ అనుకుంటారు. ఎప్పుడైతే మీ జీవితం బాధాకరం అని మీరు నిర్ణయించి దాన్ని నమ్ముతారో, అది మీకు నరకాన్ని సృష్టిస్తుంది.

ఉదాహరణకి, నిన్నటి వరకూ మీరు నడిచారు. ఎప్పుడూ గాలిలోకి ఎగరలేదు. మీ గతంలో ఎప్పుడూ ఎగరలేదు అని తెలుసు. ఎప్పుడూ నడిచినట్లే తెలుసు. రేపటి నుంచి నీవు ఎగరగలవు అని చెబితే నమ్ముతారా? లేదు. మీరు నమ్మలేరు. రేపు కూడా మీరు నడవగలనని మాత్రమే అనుకుంటారు. మీ భవిష్యత్తుని కేవలం మీ గత అనుభవాలతోనే తయారుచేస్తారు. ఆ అనుభవాలలో కొత్త అవకాశాలని వదిలేస్తారు.

బాధ జ్ఞానోదయానికి మహాద్వారం

బాధ గురించి మరొక విషయాన్ని మీకు చెప్పదలచుకున్నాను. ఇది మార్మికమైనది, నమ్మటం కష్టం. కానీ నిజాయితీగా చెబుతున్నాను. పతంజలి ఈ విధంగా చెబుతారు, 'ఎటువంటి బాధనైనా జ్ఞానోదయానికి ద్వారంగా ఉపయోగించవచ్చు.' ఆ పద్ధతిలో దానికి బాధ అని పేరు పెట్టకూడదు. కేవలం అక్కడ ఏం జరుగుతుందో గమనించండి. చిన్న పిల్లలు కొత్త విషయాలని ఎంత కుతూహలంగా, ఉత్సాహంగా చూసారో ఆ విధంగా చూడండి. బాధ కలిగినప్పుడు ఆ విధంగా చూడండి. ఆ అనుభవం మీలో గొప్ప మార్పుని తీసుకువస్తుంది.

ఎప్పుడైతే మీరు బాధని చూడగలుగుతారో రెండు విషయాలు జరుగుతాయి. ఆ బాధ అనే కార్యక్రమంలో శరీరం తిరిగి కోలుకోవటాన్ని చూడగలుగుతారు. శరీరం చక్కగా చికిత్స చేసుకుంటుంది. ఆ కార్యక్రమానికి మీరు బాధ అని పేరు పెడతారు. రెండవది అప్పుడు మీరు దాన్ని బాధ అనరు. దాన్ని ఆపటానికి ప్రయత్నించరు. అప్పుడు ఆ భాగం త్వరగా బాగు అవుతుంది. మీరు దాన్ని బాధ అన్నప్పుడు, మీ శరీరంలో జరిగే చికిత్సా కార్యక్రమానికి అడ్డుపడినవారవుతారు. దానితో బాధపడే సమయాన్ని పెంచుతారు.

సంతోషాల గొలుసు

పది సంవత్సరాల క్రితం మీకు కలిగిన సంతోషం, తొమ్మిది సంవత్సరాల క్రితం, మూడు సంవత్సరాల క్రితం కలిగిన సంతోషం, నిన్న కలిగిన సంతోషం – అన్నీ ఒక దానికొకటి సంబంధం లేని స్వతంత్ర సంఘటనలు. ఇప్పుడు మీరు వీటినన్నింటినీ కలిపి ఒక పెద్ద సంతోషాల గొలుసు తయారు చేసారు. మీరు మీ సంతోషానికి ఒక వ్యక్తి, ఒక సంఘటన లేదా ఒక స్థలాన్ని కారణంగా గుర్తిస్తారు. అప్పుడు మీరు తిరిగి అదే వ్యక్తిని లేదా సంఘటనని పదే పదే మీ జీవితంలోనికి తీసుకురావటానికి ప్రయత్నిస్తారు. కాని మీరు

ఎంత ప్రయత్నించినా తిరిగి అదే సంతోషాన్ని పొందలేరు. అది మీకు బాధని కలిగిస్తుంది.

బాధల గొలుసు లేదా సంతోషాల గొలుసు, ఏదైనా బాధే.

మనం జీవితంలో నిరంతరం బాధలదో, సంతోషాలదో ఏదో ఒక గొలుసుని తయారుచేస్తుంటాము. ఒకసారి బాధల గొలుసుని తయారుచేసి, దాన్ని తెంపాలి అని చూస్తారు. సంతోషాల గొలుసుని పెంచాలి అని చూసారు. కాని దాన్ని తెంపలేరు, దీన్ని పెంచలేరు అని అర్ధం చేసుకోరు. ఎందుకంటే అసలు ఆ గొలుసులు నిజంగా అక్కడ లేవు. అవి కేవలం కొన్ని ఎంపిక చేసుకున్న జ్ఞాపకాలు మాత్రమే. గొలుసు అనేది కేవలం మీ ఊహ మాత్రమే.

మానసిక అయోమయాల నుంచి విముక్తి పొందగలరు

ఆలోచనలు చెరువులోని గాలి బుదగలు

మనలో వచ్చే ఏ రెండు ఆలోచనలకి ఎటువంటి సంబంధం ఉండదు. వాటికి ఉన్న సంబంధం కేవలం ఒక్కటే, ఆలోచనలు అన్నీ ఒక దగ్గర నుంచే వస్తాయి. కాని మనం నిరంతరం ఒక ఆలోచనను మరొక ఆలోచనతో కలుపుతుంటాం. చెరువులో వచ్చే గాలి బుదగలు చెరువు అడుగు నుంచి నిలువుగా వస్తాయి. మన ఆలోచనలు కూడా అదే విధంగా వస్తాయి. ఒక గాలి బుదగ నీటి పైకి వచ్చాక రెండవది వస్తుంది. ఆ తరువాత మూడవది వస్తుంది. అయితే అవి చాలా వేగంగా రావటం వల్ల, ఒక గొలుసులా కనిపిస్తాయి. నిజానికి రెండు గాలి బుడగల మధ్య ఖాళీ ఉంటుంది. అదే విధంగా మన రెండు ఆలోచనల మధ్య కొంత శూన్యప్రదేశం ఉంటుంది. అయితే రెండు ఆలోచనల మధ్య ఉండే ఖాళీ చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి, అవన్నీ ఒకదానికొకటి కలసిపోయి, ఒక గొలుసులా కనిపిస్తాయి. కాని ఆలోచనల మధ్య ఎప్పుడూ ఖాళీ ఉంటుంది.

మీకు ఒక సంఘటన చెబుతాను.

ఒక మధ్యవయస్సు వ్యక్తి నా దగ్గరకి వచ్చి తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని, అందుకు ఆశీర్వదించమని అడిగాడు. అతనికి సుమారుగా నలభై ఐదు సంవత్సరాల వయస్సు ఉంటుంది. అప్పుడు అతనితో, 'నేను వివాహాలకే ఆశీర్వదిస్తాను, కాని విడాకులకి కాదు' అని చెప్పాను. నీకు విడాకులు ఎందుకు? అని అడిగాను. అతను నాతో, 'నేను చాలా కష్టాలు పడతాను, మీరు తప్పకుండా నన్ను ఆశీర్వదించాలి,' అని గట్టిగా అడిగాడు.

నేను అతనితో, 'బాధ అనేది ఎప్పుడూ ఇచ్చి పుచ్చుకునేదే. కేవలం తీసుకోవటం ఒక్కటే ఉండదు. నీవు నీ భార్యని తగినంత కష్టపెట్టి ఉంటావు. కాబట్టి అసలు జరిగినది ఏమిటో నిజం చెప్పు' అని అడిగాను. అతను, 'అసలు మీకు నేను ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదో తెలియటం లేదు.' చాలా సంఘటనలు ఉన్నాయి. ఆమె మొదటి రోజు నుంచి నన్ను చిత్రహింసలు పెడుతున్నది. నేను ఎన్ని హింసలు అనుభవించానో మీకు తెలియదు. అని చెప్పి, అతను తన పెళ్ళినాటి సంఘటనని ఒకటి చెప్పాడు.

ఉంగరం తీసే సమయంలో ఆమె నా చేతిని గీరింది. ఆమె గోళ్ళతో నా చేతి మీద గీరింది అని. ఆ తరువాత చాలా విషయాలు చెప్పాడు. అతను ఒక పోలీసు ఫైలులా ఫైలు పెట్టుకొని అన్నీ అందులో రికార్డు చేసినట్లు గుర్తుంచుకున్నాడు. ఆ విధంగా రెండు – మూడు సంఘటనలు చెప్పాక నేను అతన్ని ఇక మాట్లాడవద్దు అని చెప్పాను. నీవు ఇదే విధంగా ఉంటే, నీ నుంచి విడిపోతే ఆమె సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా పెద్ద పెద్ద ఫైల్స్ మైండ్‌లో పెట్టుకుని తిరిగేవారితో ఎవరికైనా బతకటం చాల కష్టం. ఎప్పుడు ఆమె ఏమి చేసినా అతను ఆ ఫైల్స్ నుంచి మాత్రమే చూడగలడు.

ఆ తరువాత అతను విడాకులు తీసుకోవటానికి గల కారణం చెప్పాడు. ఆమె నా మీద కాఫీ ఒంపింది. అది కారణం అన్నాడు. నేను అతనితో కాఫీ ఒలికితే విడాకులు ఇవ్వాలా అని అడిగాను. అతను నాతో, 'మీకు తెలియదు. ఇవాళ ఆమె నా మీద కాఫీ పోసింది, రేపు యాసిడ్ పోయవచ్చు' అని అన్నాడు. ఆ కనెక్షన్ ఏమిటో నాకు అర్ధం కాలేదు. నేను అతన్ని కాఫీకి, యాసిడ్‌కి సంబంధం ఏమిటి అని అడిగాను. అతను నాతో 'మీకు తెలియదు సన్యాసిజీ!' అన్నాడు.

అతని ధోరణి కొంచెం అతిగా అనిపించవచ్చు, ఇది విన్నప్పుడు మీరు నవ్వవచ్చు. కాని మీ జీవితం లోనికి కొంచెం లోతుగా చూస్తే మీరు కూడా ఇంచుమించు ఇదే విధంగా అర్థం లేని కనెక్షన్స్ పెడుతుంటారు. మీరు ఆ సంఘటల్ని విడివిడిగా చూడలేరు. ఎందుకంటే మీరు ఆలోచనలని విడివిడిగా చూడరు.

మీరు ఈ చిన్న పద్దతిని పాటించగలిగితే, ఆలోచనలకి లింకులు పెట్టకుండా ఉంటే, మీరు మీ అంతరంగంలో, అంతరాత్మలో చాలా శక్తిని నిలుపుకోగలుగుతారు. అప్పుడు మీరు ఎంతో సృజనాత్మకంగా, చాలా బాగా పని చేయగలుగుతారు. మీకు ఇతరులతో ఉండే సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక సంఘటనకి, మరొక దానికి లింకులు పెట్టరు కాబట్టి. ఎదుటివారు మీ నుంచి ఆశించే విషయంలో మీరు ఉక్కిరిబిక్కిరి కాకుండా స్వేచ్ఛగా ఉండగలరు. మీ అంతరంగంలో చాలా ప్రదేశం మీ అందుబాటులోకి వస్తుంది. మీరు మీ అవసరాలనే కాకుండా ఇతరుల అవసరాలు కూడా తీర్చగలుగుతారు. ఎదుటివారు బాధపడితే వారి విషయంలో కలుగచేసుకునే కరుణ మీలోకి వస్తుంది. మీరు ఎదుటివారి బాధని అర్ధం చేసుకోనప్పుడు మాత్రమే మీరు వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. మీరు లింకులు ఏర్పరచకుండా ఉన్నప్పుడు ఎదుటివారికి మీ అంతరంగంలో స్థానం కల్పించగలుగుతారు. మీరు అప్రయత్నంగా కరుణతో ఉంటారు. మీ జీవితంలో నాణ్యత పెరుగుతుంది. మీరు ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారతారు.

అది ఎప్పుడూ ఒక్కటే కాదు

మన జీవితంలో ప్రతి చిన్న సంఘటన వేరువేరుగానే ఉంటుంది. అవి తినటం, తాగటం వంటి సాధారణ విషయాలు కూడా ప్రతి అనుభవం ప్రత్యేకమైందే. నిన్న మంచినీళ్ళు తాగటం, ఇవాళ మంచినీళ్ళు తాగటం రెండూ పూర్తిగా వేరు పేరు సంఘటనలు. చూడటానికి ఒకే విధంగా ఉన్నా నిన్న చేసిన భోజనం, ఈ రోజు చేసిన భోజనం రెండూ వేరువేరు, రెండూ ప్రత్యేకమే. కాని మీ మానసికవ్యవస్థ మాత్రం నిన్న తిన్నది, ఇవాళ తిన్నది, ఒక్కటే అని చెబుతుంది.

స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు ప్రతి రోజూ ఒక రకమైనవే తినరు. మీరు తినటం అనే మాటని రెండు అనుభవాలకి వాడతారు. మీరు ఉపయోగించే మాటలతో మోసగింపబడవద్దు. ఇవాళ తినటం, నిన్న తినటం, రేపు తినటం అనేవి ప్రత్యేకమైనవి. అవి వేరు అనుభవాలు. అవన్నీ పూర్తిగా స్వతంత్రమైనవి. ఒక దానితో ఒకటి సంబంధం లేనివి.

మానసిక అయోమయాల నుంచి విముక్తి పొందగలరు

మధ్య భారత దేశంలో ఉన్న ఒక జ్ఞానోదయమైన యోగి జీవితం నుంచి ఒక చక్కని సంఘటనని చెబుతాను.

ఆ యోగికి, డాక్టర్స్ ఆరోగ్యరీత్యా ఒక విధమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని చెప్పారు. ఆ విధంగా ఆయన జీవితంలో చివరి సంవత్సరాలు గడిచాయి. అది తప్ప ఆయన మరేమీ తినకూడదు. అదే భోజనాన్ని ప్రతి రోజూ మూడుసార్లు తినాలి. ఆ విధంగా రెండు సంవత్సరాలు గడిచాక ఆయనకి వంట చేసే వ్యక్తి ఆయన దగ్గరకి వచ్చి, 'ఇదే వండటానికి నాకు ఎంతో విసుగ్గా ఉంది. అదే భోజనం చేయటానికి మీకు ఇంక ఎంత విసుగ్గా ఉందో కదా!' అని అడుగుతుంది. ఆయన నవ్వి, 'నేను ప్రతి రోజూ ఒకే ఆహారాన్ని తినటం లేదు. ప్రతి రోజూ ఒకే విధమైన భోజనం ఎలా చేయగలుగుతాను. ఈ రోజు భోజనం ఇవాళ చేస్తాను. రేపు తినేది పూర్తిగా వేరే భోజనం' అని చెబుతాడు.

జీవితం అంటే ప్రతిక్షణం కొత్తదనంతో ఉంటుంది. కేవలం మానసికస్థితే నిస్సారంగా, విసుగ్గా అదే పని చేస్తున్న విధంగా ఉంటుంది.

భయం నుంచి స్వేచ్ఛకి

మీ భయమే మీ మానసికవ్యవస్థకి బలం: ఒక రౌడీ మొదటిరోజు టౌనులో అడుగు పెట్టినప్పుడు భయంభయంగా ఉంటాడు. ఎప్పుడైతే అందరూ అతనికి అణకువగా ఉంటారో అప్పుడు అతనికి తన మీద నమ్మకం కలుగుతుంది. 'అవును, నేను గొప్పవాడిని' అనుకుంటాడు. అలా అనుకోగానే అతని ప్రవర్తనలో, నడక, మాటతీరులలో మార్పు వస్తుంది.

అదే విధంగా మీ మీద దాడి చేసే ముందు, మనస్సుకు ప్రారంభంలో తన మీద తనకి నమ్మకం లేకుండా ఉంటుంది. కాని ఎప్పుడైతే మీ మానసికవ్యవస్థకి భయపడతారో, అప్పుడు దానికి నమ్మకం పెరిగి మిమ్మల్ని గుప్పెటలో పెట్టుకుంటుంది. ఒక్కసారి మీ భయాన్ని దానికి చూపిస్తే, ఒక్కసారి మీ సున్నితత్వం చూపిస్తే చాలు, అది మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటుంది.

ఇది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఆడించాలి అనుకునే వ్యక్తి, ముందుగా మీరు మీ జీవితాన్ని నడుపుకోలేరు అని మీరు నమ్మే విధంగా చేస్తాడు. ఆ వ్యక్తి సహాయం లేకుండా మీరు బ్రతకలేరు, అనే నమ్మకాన్ని మీలో కలిగిస్తాడు. అది అతను చేసే మొదటి పని. మీరు ఒక్కసారి ఆ దారిలో పడితే, మీతో ఆటలు ఆడుకోవటం ప్రారంభిస్తాడు. ఒక్కసారి అతను లేకుండా మీరు బ్రతకలేను అని అనుకుంటే, అతను మిమ్మల్ని తిట్టినా, బాధపెట్టినా భరిస్తారు.

అదే విధంగా మీ మనస్సు ఒక్కసారి మిమ్మల్ని ఒప్పిస్తే అది లేకుండా మీరు బ్రతకలేను అనుకుంటారు. ఎప్పుడైతే మనస్సు మిమ్మల్ని నమ్మిస్తుందో మీరేమీ చేయలేరు. అప్పుడు ఇక మీరు మీ మనస్సుని వదలలేరు.

గుర్తింపును వదిలెయ్యండి

నేను పరివ్రాజకుడుగా భారత దేశంలో తిరిగే సమయంలో జరిగిన సంఘటన. ఉత్తర భారత దేశంలోని అడవులలో వేటగాళ్ళు పక్షులని పట్టుకునే పద్ధతి చూసాను. రెండు కొమ్మలకి మధ్య ఒక తాడు కడతారు. తాడు మధ్యలో ఒక చిన్న కర్రని అడ్డంగా వేలాడే విధంగా కడతారు. ఈ కర్ర వేటగాళ్ళు పక్షులని పట్టే సాధనం.

ఒక చిన్న కర్ర ఏ విధంగా పక్షులని పడుతుంది అనుకుంటారు. అంతే పక్షి ఆ కర్రమీద వాలగానే, ఆ బరువుకి, కర్ర తలకిందులవుతుంది. ఇప్పుడు ఆ పక్షి తలకిందులుగా వేలాడుతుంది. అది కర్రని కాళ్ళతో పట్టుకొని వేలాడుతుంది. ఎప్పుడైతే పక్షి తలకిందులవుతుందో అది పూర్తిగా భయపడిపోతుంది.

కాళ్ళతో ఆ కర్రని గట్టిగా పట్టుకుంటుంది. ఎందుకంటే తలకిందులుగా వేలాడుతుంది కాబట్టి, కర్రని వదిలితే కిందపడి చనిపోతాను అనుకుంటుంది.

ఎక్కడా, ఎప్పుడూ పక్షి కిందపడి చనిపోవటం అనేది లేదు. కాని పక్షికి అంత వివేకం లేదు. అది ఆ విధంగా వేలాడుతూ ఉంటుంది. ఆ కర్రని వదలకుండా వేలాడి దాని స్వేచ్ఛని పోగొట్టుకుంటుంది. వేటగాడు నెమ్మదిగా వచ్చి దాన్ని తన బుట్టలో వేసుకునే వరకూ, ఆ విధంగా కర్రని వదలకుండా వేలాడుతూ ఉంటుంది.

ఆ పక్షిలా మీరు కూడా మీ మనస్సుని వదలరు. ఎప్పుడైతే దాన్ని వదులుతారో మీరు పరమహంస అవుతారు. మీకు స్వేచ్ఛ దొరుకుతుంది. హాయిగా ఎగిరి వెళ్ళిపోవచ్చు. ఆ పక్షి

భయంతో కర్రకి వేలాడే స్థితి ఇప్పుడు మీకు ఉంది. మీ భయం, పక్షి భయం ఒక్కటే. పక్షి కర్రని వదిలి బ్రతకలేను అనుకుంటుంది. మీరు కూడా మనస్సుని (ఆలోచనలని) వదిలి స్వచ్ఛంగా ఉండలేవు అనుకుంటారు. దాన్ని వదలలేను నేను ఆ విధంగా దానితో ఉండకపోతే, బంధాలు ఏర్పరచకుండా, స్వతంత్రంగా ఉంటే నేనేమైపోతాను అనుకుంటారు.

రెండు – మూడు గంటలయ్యాక వేటగాడు వచ్చి పక్షిని బుట్టలో వేసుకొని వెళతాడు. ఇప్పుడు ఆ పక్షి ఎగరలేదు. వేటాడటానికి కర్ర లేదు. ఆ తెలివితక్కువ పక్షికి కర్రని వదిలితే

స్వేచ్ఛగా ఎగిరి వెళ్ళిపోవచ్చు అని తెలియదు. అదే విధంగా మీరు కూడా మీరు అని అనుకునే గుర్తింపుకి, రక్షణ అనుకునే మీ చదువు, మీ ఆలోచనలు, మీ జీవితం, మీ అనుబంధాలు, ఆస్తులు – వీటిని పట్టుకొని వేలాడతారు. యముడు వచ్చి మీ గుర్తింపు అనే కర్ర తీసే వరకూ అలా వేలాడుతూ ఉంటారు. మీరు పరమహంస కాలేకపోతారు. మీ వ్యక్తిత్వాన్ని పట్టుకొని ఉండలేరు. మీకు స్వేచ్ఛ ఉండదు. మీరు అనుకునే కర్ర ఉండదు. ఎందుకంటే ఆ కర్ర ఒక ఊహ!

ఒక విషయం చెబుతాను. ఆ పక్షి కర్రని వదిలితే ఒకటి – రెండు క్షణాలు రెక్కలు కొట్టుకుని స్థిరపడుతుంది. కాని కిందపడి చనిపోదు. కర్ర వదలగానే కొంచెం కిందికి వచ్చి వెంటనే పైకి ఎగిరిపోవచ్చు. ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు స్వేచ్ఛగా వదిలేస్తే మీరు ఎప్పుడూ కిందపడి చనిపోరు. మీరు పరమహంస (జ్ఞానోదయమైన మహాత్ముడు) అవుతారు.

ఈ క్షణంలో మీ మీద నమ్మకాన్ని ఉంచండి. మీ వ్యక్తిత్వం పోతుంది, గుర్తింపు పోతుంది అనే విషయాన్ని పట్టించుకోకండి. మీ మీద నమ్మకంతో మీ గుర్తింపుని వదిలేయండి. మీరు వెంటనే పరమహంస అయి స్వేచ్ఛని పొందుతారు. మీరు చేయవలసింది మీరు బంధాలు అనేవి లేని స్వేచ్చాజీవి అని నమ్మటం. మీరు నమ్మకపోయినా అది సత్యం!

సంఘం అనేది రక్షణ వల

ఎప్పుడైతే మీరు ఇటువంటి బంధాలని ఏర్పరచుకోకుండా, బంధవిముక్తులవుతారో మీ జీవనసరళిలో, నిర్ణయాలు చేసే పద్ధతిలో, మీ జీవన విధానంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ధైర్యంగా ఆ మార్పుల గుండా వెళ్ళగలగటాన్నే నేను తపస్సు అంటాను.

నేను పరివాజకుడుగా ఉన్న రోజులలో ఒక అరుదైన సంఘటనని చూసాను. ఒక పక్షి వేలాడుతుంటే మరొక పక్షి వచ్చి దాన్ని పొడుస్తూ వదలమని చెబుతుంది. ఆ పక్షి ఒకప్పుడు వేలాడి ధైర్యంతో పట్టు వదిలి స్వేచ్ఛగా ఎగిరిపోయిన పక్షి. అది వేలాడే పక్షిని 'రిలాక్స్ అవ్వు, పట్టు వదిలి ఎగిరిపో, నేను అదే విధంగా చేసి ఎగిరిపోయాను, నేను స్వేచ్ఛని పొందాను,' అని చెప్పటమే. కానీ వేలాడే పక్షి ఆ మాటలని నమ్మదు. అలా స్వేచ్ఛ పొందిన పక్షికి వేలాడుతున్న పక్షులని రక్షించటం అనేది ఒక బాధ్యత. స్వేచ్ఛ పొందిన పక్షి అలా వేలాడే పక్షులని పొడిచి, పట్టు వదిలి స్వేచ్ఛగా ఎగిరిపో అని చెప్పాలి. నేను ఆ విధంగా స్వేచ్ఛ పొందిన పక్షిని. నేను ఒక రక్షణ వలని తయారుచేసాను. మీరు పడిపోయినా ఆ వలలోనే పడతారు. మీకు దెబ్బ తగలదు. కాబట్టి రిలాక్స్ అవ్వండి, ఇవన్నీ వదిలేయండి, అప్పుడే స్వేచ్ఛగా ఎగరగలుగుతారు. గురుదేవుల సంఘాన్ని చూడండి, అదే వల. మీరు పడినా ఆ వలలోనే పడతారు. మీకు దెబ్బలు తగలవు. అసలు మీరు పడరు. కాని మీకు లోతైన నమ్మకాన్ని ఇవ్వటానికి ఈ ఆధ్యాత్మికవ్యవస్థని, ఈ సంఘాన్ని సృష్టించాను. నేను మిమ్మలనందరినీ ఈ సంఘం లోనికి వచ్చి ఆ అనుభవాన్ని పొందమని ఆహ్వానిస్తున్నాను. అర్ధం చేసుకోండి, ఇది స్వేచ్ఛ పొందిన పక్షి బాధ్యత. వేలాడే పక్షులకి సహాయం చేసి, వాటిని స్వేచ్ఛగా ఎగిరే విధంగా చేయటం ఆ స్వేచ్ఛ పొందిన పక్షి బాధ్యత.

క్రోతి కథ

పక్షులని పట్టినట్లే వేటగాళ్ళు కోతులని కూడా పడతారు. అందుకు చిన్న డబ్బాను వాడతారు. ఒక డబ్బాకి చిన్న మూతి ఉంటుంది. అందులో కొన్ని తీపిపదార్తాలు పెడతారు.అవి తీసుకోవటానికి కోతి చేతిని దాంట్లో పెట్టి వాటిని పట్టుకుంటుంది. చేతిలో స్వీట్లు పట్టుకుని ఉన్నంత వరకూ కోతి చేయి డబ్బా లోంచి బయటకి రాదు. ఎందుకంటే కోతి గుప్పిట డబ్బా మూతి లోంచి పట్టదు. కోతి స్వీట్లని వదిలేస్తే, చేతిని లాగేసి స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. కాని అది తెలుసుకునే తెలివితేటలు కోతికి లేవు. అది స్వీట్లని ఆ విధంగానే పట్టుకొని, గిలగిలలాడుతూ ఉంటుంది. స్వీటుని వదిలితేనే దానికి స్వేచ్ఛ. మీరు ఈ కథలోని అర్ధాన్ని తెలుసుకునేలా చేసుకోగలిగితే మీరు ఈ గొలుసుల నుంచి వెంటనే, ఈ క్షణమే విముక్తి పొందుతారు.

సమాజం మీకు స్వేచ్చను ఇవ్వదు

సమాజం మీకు నిరంతరం ఇచ్చే శిక్షణ ఏమిటంటే మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి అని మీరు నమ్మే విధంగా చేయటమే. సమాజం మీరు నిరంతరం బాధల గొలుసుతో కాని, సంతోషపు గొలుసుతో గాని ఉండాలి అని నేర్పిస్తుంది. మీరు బాధల గొలుసుని నమ్మితే నిరంతరం గొలుసుని తెంపటానికి మీ సమయాన్ని ఖర్చు చేసారు. ఆ విధంగా చేస్తూ మీరు జీవితాన్ని వృథా చేసారు. మీరు సంతోషపు గొలుసుని నమ్మితే నిరంతరం దాన్ని పొడిగించాలని చూస్తారు. ఆ విధంగా కూడా జీవితాన్ని వృథా చేస్తారు. మీరు స్వేచ్ఛగా ఉంటే సమాజం భరించలేదు. అందుకే బంధవిముక్తులు కాగల ధైర్యాన్ని సమాజం మీకు కలగనీయదు. ఎందుకంటే ఒక్కసారి మీరు బంధవిముక్తులైతే సమాజం మిమ్మల్ని నియంత్రించలేదు. మిమ్మల్ని ఎవరూ ఆడించలేరు. మీరు బందీగా ఉన్నప్పుడే సమాజం కాని, ఇతరులు కాని, మిమ్మల్ని ఆడించగలుగుతారు. తనకి కావలసిన పద్ధతిలో నియమాలు విధించి మీరు అనుసరించేలా చేస్తుంది సమాజం. సమాజానికి ఏది అవసరమైతే దాన్ని, ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు, మీ లోనికి ఆ విషయాన్ని పంపిస్తుంది. అప్పుడు మీరు సమాజానికి ఉపయోగపడతారు. కాని మీరు ఒక ఉపయోగపడే వస్తువుగా మాత్రమే ఉంటారు. నిజానికి సమాజం మీ మంచినేమీ పట్టించుకోదు. మీరు సమాజానికి అవసరం, అంతే.

మీరు ఎప్పుడైతే సహజంగా మీరు స్వేచ్ఛ గలవారు, స్వేచ్ఛ మీ లక్షణం అని తెలుసుకొని విరామంలో ఉండగలరో, మీ లోపలికి ఆనందం ప్రవేశిస్తుంది. మీరు స్వేచ్ఛని అనుభవించగలరు. ఒక్కసారి మీరు స్వేచ్ఛని అనుభవించగలిగితే చాలు, అది మీరు ఎగిరిపోగల గొప్ప ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. మీ అంతరాత్మ పరమహంసలా మారుతుంది. అది స్వచ్ఛమైన విశ్వచేతనస్థితి.

మానసిక అయోమయాల నుంచి విముక్తి పొందగలరు

అచేతనస్తితి ఒక కల్పన

మనకి నేర్పించిన విధంగా అచేతనస్తితి అనేది మనకి లేదు. స్పష్టంగా అర్థం చేసుకోండి. నేను ధైర్యంగా ఒక విషయాన్ని చెబుతున్నాను. అయితే నాకు 'పాచీనఋషుల' ఆధారం ఉన్నది. వారు మానవ చేతనస్తితి లోనికి లోతుగా వెళ్ళి పరిశోధనలు చేసారు. అంతరంగ ప్రపంచానికి సంబంధించి చాలా పరిశోధనలు చేసారు. కాబట్టి అర్థం చేసుకోండి. అచేతనస్థితి అనేది మీలో భయాన్ని కలిగించటానికి సృష్టించిన మరొక విషయం మాత్రమే. మీకు ఒక సమయంలో కేవలం ఒక ఆలోచనే ఉంటుంది. ఒకే సమయంలో రెండు – మూడు ఆలోచనలు ఉంటాయా? లేదు. అలా జరగదు. మీకు ఒక సమయంలో ఒకే ఆలోచన ఉంటుంది. మరి అటువంటప్పుడు అచేతనస్థితికి అవకాశం ఏది? అసలు అది ఉందా? ఉంటే అది ఏమిటి?

ఒక విషయం అర్థం చేసుకోండి. సంతోషాల గొలుసులు, బాధల గొలుసులు తయారుచేయటం అసలు పాపం. అంతకు మించి మీరు పాపాత్ములు కారు. వేదకాలం నాటి ఋషులు మనుషులని 'అమృతస్య పుత్ర' అంటే మరణం లేని కుమారులు లేదా భగవంతుని బిడ్డలు అని సంబోధించేవారు. ఆ స్థితిని వేరుగా సాధించనవసరం లేదు. మనిషి అంటేనే తీవ్రమైన జ్ఞానోదయ అనుభవం నుంచి జన్మించినవాడు.

బంధవిముకులు కండి!

తెలుసుకునే తత్వాన్ని, శక్తిని మేధస్సుని వ్యాపింపచేయండి

ఎప్పుడైతే మీరు పూర్తిగా బంధాలు ఏర్పరచని స్థితికి చేరతారో మీలో అంతు లేని శక్తి, చేతనస్తితి, మేధ అనేవి ప్రవేశిస్తాయి. శక్తిని తయారుచేయలేం. దాన్ని ఒక వస్తువులా తయారుచేయలేం.అది మీ అంతరాత్మలో నిరంతరం కలుగుతూ ఉంటుంది. నేను శరీరాన్ని అని మీరు అనుకుంటే మీరు భౌతికస్థితిలో వస్తుప్రపంచంలో ఉంటారు. అప్పుడు మీరు కేవలం శరీరంలోనే జీవించగలరు. అప్పుడు మీ కోరికలూ, మీ భయాలూ కూడా భౌతికస్థితిలో ఉంటాయి. ఉదాహరణకి మరణభయం, మొదలైనవి.

మీరు మానసికవ్యవస్థని అని అనుకుంటే మీరు మానసికదశలో జీవిస్తారు. మీ కోరికలు, భయాలు అన్నీ మీ మానసికవ్యవస్థకి సంబంధించి ఉంటాయి. ఉదాహరణకి పేరు ప్రతిష్ఠలు కావాలని కోరిక, మీ గుర్తింపు పోతుందేమో అనే భయం. మానసికశరీరంలో కోరికలు, భయాలు చాలా సూక్ష్మస్థాయిలో ఉంటాయి. ఆధ్యాత్మికస్థితిలో కోరికలు, భయాలు ఉండవు. మీరు నిరంతరం శక్తిని వ్యాపింప చేస్తుంటారు. మీరు ఏ దశలో ఉన్నా మీ సమక్షం శక్తిని వెదజల్లుతూ ఉంటుంది.

మన ఆలోచనలే మన శరీరాన్ని సృష్టిస్తాయి

యోగానే కాకుండా వైద్యశాస్త్రం కూడా మన శరీరం నిరంతరం కొత్తదనాన్ని తెచ్చుకుంటుంది, నిరంతరం కొత్త శరీరం ఏర్పడుతూ ఉంటుంది, అని నిరూపించాయి. మనం నిరంతరం కొత్త శరీరాన్ని తయారుచేసుకుంటూ ఉంటాము. ఇది మొదటి సత్యం. రెండవ సత్యం దీన్ని యోగా, ఆయుర్వేదమే కాకుండా వైద్యశాస్త్రం, జీవశాస్త్రం కూడా రూఢి చేసాయి. అది మన శరీరాన్ని మన మనస్సు సృష్టిస్తుంది. మన శరీరానికి మనస్సే మార్గదర్శి.

బూస్ లిప్లన్ అనే శాస్త్రవేత్త బయాలజీ ఆఫ్ బిలీఫ్ అనే పుస్తకాన్ని రాసారు. ఆయన జీవశాస్త్రంలో ముప్పై సంవత్సరాలు పరిశోధనలు చేసి చాలా బలమైన ఫలితాలని చెప్పారు.ఆయన స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పారు. మన శరీరాన్ని డి.ఎన్.ఎ. లేదా కణాల కంటే మనలోని వ్యతిరేక, అనుకూలభావాలే ఎక్కువగా నియంత్రిస్తాయి అని, మన శరీరం మన నమ్మకాలు, విశ్వాసం, మన అనుకూల, వ్యతిరేకభావాల మీద ఆధారపడి ఉంది అని చెప్పారు. ఆయన ఇంకా ఏం చెబుతారంటే మన మనస్సు శరీరనిర్మాణాన్ని కూడా మార్చగలదు అని. ఆయన చాలా వివరంగా ఒకదాని తరువాత ఒకటిగా, మనలోని జెనిటిక్, భౌతిక, మానసికసమస్యల్ని మన నమ్మకం ఏ విధంగా సృష్టిస్తూందో వివరాలతో చెప్పారు.

తమ అసలు తల్లిదండ్రుల నుంచి వేరైన పిల్లల మీద కూడా కొన్ని ప్రయోగాలు చేసారు. వారిని పెంచిన తల్లిదండ్రులే తమ సొంత తల్లిదండ్రులు అనే నమ్మకంతో పెరిగిన పిల్లల్లో, వారిని పెంచినవారి వంశపారంపర్యసమస్యలే వీరిలో కూడా వచ్చాయి.

బంధ విముక్తి ద్వారా

మీకు ఒక వుదంత కథ చెబుతాను : ఒక వ్యక్తి నది ఒడ్డున ఉన్న ఒక చెట్టుని గొడ్డలితో కొడుతూ ఉంటాడు. అతని గొడ్డలి జారి నదిలో పడిపోతుంది. అప్పుడు నది లోంచి దేవత వచ్చి బంగారు గొడ్డలి చూపించి ఈ గొడ్డలి నీదేనా అని అడుగుతుంది? అతను కాదు అంటాడు. మళ్ళా ఆ దేవత వెండి గొడ్డలి తెచ్చి ఇది నీ గొడ్డలేనా? అని అడుగుతుంది. అతను కాదు అని జవాబు ఇస్తాడు. ఈ సారి దేవత ఇనప గొడ్డలి చూపించి ఇది నీదేనా? అని అడుగుతుంది. అతను 'ఔను అది నాది' అంటాడు. దేవత అతని నిజాయితీకి సంతోషించి, మూడు గొడ్డళ్ళూ అతనికి ఇస్తుంది.

ఇప్పుడు నేను మీకు ఈ కథకి పొడిగింపు చెబుతాను.

ఆ వ్యక్తి ఆ తరువాత ఒకసారి అదే నది దగ్గర చెట్టు కొడుతుంటాడు. అతనికి అతని భార్య సహాయం చేస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా భార్య నదిలో పడిపోతుంది. అదే దేవత ఒక అందమైన అమ్మాయిని తీసుకువచ్చి ఈమె నీ భార్యేనా? అని అడుగుతుంది. అతను 'ఔను! ఈమె నా భార్య' అంటాడు. దేవతకి చాలా కోపం వస్తుంది. 'అబద్ధం చెప్పటానికి ఎంత ధైర్యం. నీ గొడ్డలి నదిలో పడిపోయినప్పుడు నిజం చెప్పావు. ఇప్పుడు నీ భార్య పడిపోతే అబద్దం చెబుతున్నావు. ' అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి, 'లేదు లేదు! నీకు నా సమస్య అర్ధం కాలేదు. క్రితం సారి బంగారు, వెండి గొడ్డళ్ళు నావి కావు అని చెప్పినప్పుడు మూడూ నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా నీవు ముగ్గురు స్త్రీలని ఇస్తే నా గతేం కావాలి? ఒక్కరితోనే నేను పడే బాధలు నీకు తెలియవు. అందుకే ముందు జాగ్రత్తతో అలా చెప్పాను. ఎవరైనా ఒక్కరే కాని దయచేసి నన్ను ఒక్క భార్యతో వదిలేయి' అని ప్రార్ధిస్తాడు.

సరే! ఆ దేవతలాగానే విశ్వమాత కూడా 'ఇది నీ కొత్త శరీరమేనా? అని అడుగుతుంది. ప్రకృతి మీకు ప్రతి నిమిషం కొత్త శరీరాన్ని ఇస్తూ ఉంటుంది. మనలోని శరీరకణాలు ప్రతి నిమిషం కొత్తగా జన్మిస్తుంటాయి.

విశ్వమాత వచ్చి, 'ఇది నీ కొత్త శరీరమా' అని అడిగితే మీరు వెంటనే 'కాదు, కాదు నాకు నా పాత శరీరమే కావాలి, అంటారు'. అదీ సమస్య. శరీరం ఎప్పటికప్పుడు కొత్తగా తయారైనా ఎన్ని సంవత్సరాలు గడచినా మీ శరీరంలో పెద్దగా మార్పుల్ని చూడరు. మన శరీరానికి కొత్తగా శరీరాన్ని సృష్టించుకునే మేధస్సు ఉంటుంది. అంటే మీ మనస్సులో నాకు వ్యాధి ఉంది అని గట్టిగా నమ్ముతారు. మీరు అదే మానసికవ్యవస్థని మోస్తూ ఉంటారు. అందుకే అది తిరిగి అదే శరీరాన్ని తయారుచేస్తుంది. ఆ విధంగా బంధాలు ఏర్పరుస్తూ మీ శరీరానికి సహజంగా జరిగే చికిత్సని మీరే ఆపినవారవుతారు.

ఎప్పుడైతే మీ లోపల మీ అంతరంగంలో చికిత్స జరగనిస్తే బయటి శరీరంలో చికిత్స అదే జరిగిపోతుంది. ఎప్పుడైతే మీరు వీటి నుంచి బంధవిముక్తులవుతారో అప్పుడు మీ లోపల నిరాశ, కుంగుబాటు మాయం అవుతాయి. నేను చెబుతున్నాను, మీరు పూర్తిగా కొత్త శరీరాన్ని తయారుచేసుకుంటారు. మీలోని అనారోగ్యాన్ని కొత్త శరీరం లోనికి తీసుకురానవసరం లేదు. కాని మీరు అవే అనారోగ్యాల్ని కొత్త శరీరం లోనికి తెచ్చుకుంటారు. ఎందుకంటే మీరు అన్నింటినీ ఒక దానితో ఇంకొకటి కలుపుతారు. ఇంతకు ముందు తయారు చేసి పెట్టుకున్న గొలుసులు ఇంకా సహాయం చేస్తాయి. ఎప్పుడైతే మీరు కొత్త కణాలని, కొత్త శరీరభాగాల్ని సృష్టిస్తారో, మీరు అదే అనారోగ్యాన్ని ఆ కొత్త శరీరం లోనికి కూడా తీసుకువెళతారు.

ఈ విషయాన్ని మీరు మీ జీవితంలో చూడవచ్చు. చిన్నప్పుడు మీ అమ్మగారు వర్షంలో తడిస్తే నీకు జలుబు చేస్తుందని చెప్పి ఉంటారు. ఈ విషయాన్ని మీ చిన్నతనంలో చాలాసార్లు మీ లోపలకి బాగా నాటుకునేలా అంటుంటారు. మీరు పెద్దవారయ్యాక మీరు వర్షంలో తడవనవసరం లేదు. కిటికీ దగ్గర నిలబడి వర్షాన్ని చూస్తే చాలు, మీరు తుమ్మటం మొదలు పెడతారు. ఎప్పుడైతే మీరు బంధాలు ఏర్పరచకుండా ఉండగలుగుతారో మీలోని నొప్పులని, బాధల్ని నివారించుకోగలరు చికిత్స చేసుకోగలరు. మీకు త్వరగా తగ్గిపోతుంది కూడా. అప్పుడు మీకు అనారోగ్యాన్ని, నిరాశని కలిగించే గొలుసుల్ని మీరు తయారుచేయరు. ఉదాహరణకి పది రోజుల క్రితం మీకు వచ్చిన మోకాళ్ళ నొప్పులకి, తొమ్మిది రోజుల క్రితం వచ్చిన మోకాళ్ళ నొప్పలకి, ఎనిమిది రోజుల క్రితం వచ్చిన మోకాళ్ళ నొప్పలకి ఎటువంటి సంబంధం లేదు.అవన్నీ ఒక దానికొకటి సంబంధంలేని స్వతంత్ర సంఘటనలు కాని, ఎప్పుడైతే మీరు వాటినన్నింటినీ కలిపి ఒక గొలుసులా తయారుచేసారో, అప్పుడు మీరు 'నాకు మోకాళ్ళ నొప్పి అనే' ఒక గొలుసుని చేసారు.

ఎప్పుడైతే నాకు గడచిన పది సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పి అని గట్టిగా నమ్ముతారో, అప్పుడు మిగతా జీవితం అంతా మోకాళ్ళ నొప్పి ఉంటుందని మరింత నమ్మకంతో ఉంటారు. ఈ నమ్మకం ఒక్కటి చాలు, ప్రతి రోజూ ఉదయం మీలో తయారయ్యే ఆ కొత్త శరీరం లోనికి మోకాళ్ళ నొప్పుల్ని ప్రవేశపెట్టడానికి. ఎందుకంటే మీరు అదే మైండ్‌తో (మానసికవ్యవస్థతో) ఒకదానికి ఒకటి లింకులు పెడుతూ, అదే వ్యాధిని కొత్త శరీరంలోనూ సృష్టిస్తారు.

ఎప్పుడైతే మీరు అదే మనస్సుని మోయటం మానేసారో, పాత గుర్తింపుల్ని వదిలేస్తారో, అప్పుడు మీ శరీరంలో ఉన్న వ్యాధిని కొత్త శరీరంలో సృష్టించరు. అదే బాధని తిరిగి కలిగించరు. అదే నిరాశ, అవే సమస్యలు, అవే వ్యాధులు కొత్త శరీరంలో ఉండవు. మీరు స్వేచ్ఛని పొందుతారు. మీరు బాధల నుంచి స్వేచ్ఛ పొందితే మీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని మీ శరీరమే బాగుచేసుకునే అవకాశాన్ని శరీరానికి ఇస్తారు. అప్పుడు మీరు కొత్త శరీరాన్ని పొంది శక్తితో చైతన్యవంతంగా ఉంటారు. మీరు అప్పుడు చిన్న పిల్లల్లా ఉంటారు. చిన్న పిల్లలు నూతనోత్సాహంతో ఉరకలేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిక్షణం కొత్త శరీరాన్ని స్పష్టించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ గొలుసుల దగ్గర ఆగిపోరు. వాళ్ళకి పైన ఎటువంటి ముద్దలు, గుర్తింపులూ వారికి తెలియవు. అందుకే నిన్న మీరు వారితో పోట్లాడినా ఈ రోజు మిమ్మల్ని చూసి నవ్వుతారు. అసలు ఏమీ జరగనట్టే ఉంటారు. వాళ్ళు మనస్సులో రికార్డులు మోస్తూ తిరగరు. వారికి సంబంధించి ఎటువంటి గుర్తింపులనీ వాళ్ళు మోయరు. వాళ్ళు నిన్నటి గొడవని, మొన్నటి గొడవని, ఈ రోజు గొడవని, నెల క్రితం గొడవని కలపరు. వాళ్ళు ఇటువంటి గొలుసుల నుంచి స్వేచ్చగా ఉంటారు.

గుర్తింపులను వదిలేయండి

ఒక విషయం ముందు అర్థం చేసుకోండి. శరీరమే మీరు అనుకోవటం ఒక ఊహ. అదే ముందుగా మీరు సృష్టించే గొలుసు, దాని ఫలితమే బాధలు పడటం. మీరు సహజంగా ధర్మం లేని, బాధ్యత లేని, స్వతంత్రమైన, ఒక దానితో సంబంధం లేని, బంధాలు లేని వ్యక్తి అనే సత్యాన్ని అనుభవిస్తే అప్పుడు మీరు కొత్త జీవనచైతన్యంతో ఉన్న తాజా శరీరాన్ని సృష్టించగలరు. మన అహాన్ని తృప్తి పరచటానికి శరీరాన్ని అగౌరవ పరుస్తాం. ఎప్పుడైతే ఈ శరీరం నేను కాదు అని అనుకుంటారో, మన శరీరాన్ని సహజంగా పని చేసేలా చేయగలం.

సహజమైన శరీరమేధస్సు

సహజంగా శరీరం తనకి తాను చికిత్స చేసుకోగలదు. శరీరానికి మేధస్సు ఉన్నది. కాని మీరు అద్భుతమైన ఆ మేధస్సుతో సంబంధాన్ని తెంచేసుకున్నారు. మీరు నిరంతరం మీ శరీరాన్ని అగౌరవపరుస్తూ దాన్ని హింసిస్తారు. ఎప్పుడైతే నా శరీరమే నేను అనుకుంటారో, శరీరాన్ని అగౌరవంతో చూస్తూ హింసిస్తారు. మనసుని తృప్తి పరచటానికి చాలా పనులు చేసారు. మనస్సు లక్షణం శరీరాన్ని అగౌరపరచటం.

మీరు ఈ శరీరం నేను అనే విషయం నుంచి బయటకి వచ్చి విరామంగా ఉండగలిగితే మీరు మీ శరీరాన్ని గౌరవిస్తారు. అప్పుడు శరీరం తన మేధస్సుని ఉపయోగించే నిర్ణయాలు చేస్తుంది. శరీరం సహజంగా ఉండే విధంగా చూస్తుంది. మీరు ఉత్సాహంతో పొంగిపొర్లే శక్తితో ఉంటారు. మీరు అంటే మనస్సు కాదు అని తెలుసుకోగానే, మీలో చురుకైన తెలివితేటలు, అప్రయత్నంగా స్పందించే తత్త్యం అభివృద్ధి చెందుతాయి. ముందుగా మీరు అర్థం చేసుకోవలసిన విషయం మీరు ఈ శరీరం, ఈ మనస్సు కాదు. మీరు మనస్సు, శరీరం కాదు అని ఎప్పుడు తెలుసుకుంటారో, అప్పుడు మీరు ఆ రెండింటినీ గౌరవంగా చూస్తారు. మీరు వాటితో జీవిస్తారు, కాని వాటికి వ్యతిరేకంగా కాదు. మీరు శరీరాన్ని, దానికి ఉన్న మేధస్సుని గౌరవిస్తారు. మీ శరీరం సహజంగా ఆనందంగా ఉండే విధంగా చేస్తారు.

అష్టావక్రుడు (జ్ఞానోదయమైన ఒక యోగీశ్వరుడు, ఆయన అష్టావక్ర గీతని రాసారు) ఈ విధంగా చెబుతారు, 'నీవు శరీరం కాదు, మనస్సు కాదు. నీవు భూమివి కాదు, నీరు కాదు. నీవు అగ్నివి కాదు, వాయువు కాదు. నీవు ఆకాశానివి కూడా కాదు' అని.

శరీరం నుంచి విముక్తి పొంది, మేధస్సులో ఉండగల సూత్రం

మీరు శరీరం నుంచి విడిపోయి మేధస్సులో విరామంగా స్థిరపడగలిగితే మీరు సంతోషంగా ఉండగలరు. మీరు శరీరం మనస్సు కాదు. రెండవ విషయం మీరు శరీరం నుంచి, మేధస్సులో విరామంతో ఉండగలిగితే మీరు ఒక్కసారిగా సంతోషంతో ప్రశాంతతతో అన్ని రకాల సంకెళ్ళని తెంచుకొని స్వేచ్చగా ఉండగలరు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మీరుగా స్వీకరించగల స్థితిలో ఉంటారు. ఆ క్షణంలోనే మీరు మీ లోపల విరామంతో ఉండగలరు. మీరు నిశ్శబ్దంగా అవుతారు. ఆ క్షణం నుంచి పరమానందంలో ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ శరీరం మనస్సు కాదు అని తెలుసుకుంటారో ఈ సంసారసాగరం నుంచి, ఈ భౌతిక ప్రపంచం నుంచి విశాంతి తీసుకొని, ఆనందస్థితిలో స్థిరపడగలుగుతారు. మీ శరీరం, మనస్సు మీరే అని అనుకున్నంత కాలం, శరీరం, మనస్సుల్లో ఉండే సమస్యల్ని మీరు భరిస్తుంటారు.

ప్రతీక్షణాన్ని సన్న్యసించటం (వదిలివేయటం) మీ సహజలక్షణం

అదృష్టం కొద్దీ ఒక సమయంలో మీరు కేవలం ఒక ఆలోచనతోనే ఉండగలరు. రెండవ ఆలోచన మీ లోనికి రాగానే ముందు ఆలోచన తన శక్తిని పోగొట్టుకుంటుంది. దాని ప్రభావం మీ మీద ఉండదు. మీ లోనికి కొత్త ఆలోచన వచ్చింది అంటే పాత ఆలోచన వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక సమయంలో మీలో ఒక్క ఆలోచన మాత్రమే ఉంటుంది. ఒక వేళ మీరు మీ పాత ఆలోచన ఇంకా అక్కడ ఉంది అని అంటే దాని అర్థం కొత్త ఆలోచన లేదని.

రామకృష్ణ పరమహంస ఒక చక్కని కథ చెబుతారు.

ఒక రాజుగారు కోట లోపల ఉండగా రెండు లక్షల మంది సైన్యంతో శత్రురాజు కోటని ముట్టడిస్తాడు. రాజు దగ్గర కేవలం నలుగురైదుగురు మాత్రమే ఉన్నారు. రాజు చాలా భయపడిపోతాడు. తన సలహాదారునితో 'నేను ఒక్కడినే ఆ 2 లక్షలమందితో ఎలా పోరాడగలను.' అంటాడు. అప్పుడు ఆ సలహాదారుడు, భయపడకండి రాజా! మీరు ఒక తలుపు మాత్రమే తీయండి. అప్పుడు లోపలికి ఒకరి తరువాత ఒకరు వస్తారు. మీరు ఒక పక్కన నిలబడి లోపలకి వచ్చిన వారిని వచ్చినట్టే చంపేయండి. అప్పుడు మీరు అందరితో యుద్ధం చేయనవసరం లేదు' అని చెబుతాడు.

ఎప్పుడైతే మీరు మీ శత్రువులంతా కలిసి ఉన్నారు అని అనుకుంటారో భయపడతారు. మీకు ఎప్పుడూ రెండు ఆలోచనలు కలిసి రావు. ఒక సమయంలో ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది. దీని అర్ధం ఒక ఆలోచన ముందుదాని స్థానం లోనికి వస్తుంది. నేను మరొక సారి చెబుతున్నాను, ఒక సమయంలో మీకు ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది. రెండవ విషయం పాత ఆలోచన బయటకి వెళ్ళకుండా కొత్త ఆలోచన రాదు. మూడవ విషయం, ఎవరైనా నన్ను ఇక్కడి నుంచి తోసేసి, ఈ కుర్చీలో కూర్చున్నారు అంటే అతను నా కంటే బలవంతుడై ఉంటాడు. కొత్త ఆలోచన పాతదాన్ని తోసేయగలిగింది అంటే అది పాత ఆలోచన కంటే బలమైనది అని అర్థం. అంటే ఏ ఆలోచన వచ్చినా అది వర్తమానంలో ఉంటుంది. అది వెళ్ళిపోయిన ఆలోచన కంటే బలంగా ఉంటుంది. అది ఎటువంటిదైనా సరే, దాని కంటే కొత్త ఆలోచన బలమైనది. మీరు సహజంగా దేన్నైనా వదిలేయగలరు. సన్యసించటం మీరు నేర్చుకోనవసరం లేదు. ప్రతి నిమిషం మీరు సన్మ్యసిస్తుంటారు. ఇక్కడ సన్యసించటం అంటే ఏమిటి? ఇక్కడ దాని అర్ధం, మీరు ఒక ఆలోచనని తెచ్చుకునే ముందు ప్రతి నిమిషం మీ అంతరంగంలోని ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి.

ఆలోచనలు నిరంతరం సన్న్యసిస్తుంటాయి. ఎప్పుడైతే ఈ ఆలోచనలన్నింటినీ ఒక గొలుసులా ఒకదానికొకటి లింకులు పెడతారో అప్పుడు మీరు బాధపడతారు. నాకు ఏదో సమస్య ఉంది అనుకోవటమే మీ నిజమైన సమస్య. ప్రతి నిమిషం మీ అంతరంగం కొత్త ఆలోచనలతో స్వచ్ఛంగా ఉంటుంది. మీరు దాన్ని ఆ విధంగా జరగనిస్తే అంతా దానంతట అదే జరుగుతుంది. మీరు మీ మనస్సుని శుభ్రం చేసుకోవలసిన అవసరం లేదు. మీరు చేయవలసింది కేవలం ఆ వ్యవస్థ నుంచి బయటికి రావటమే. అప్పుడు వ్యవస్థ దానంతట అదే పని చేసుకుంటుంది. ఒక ముఖ్యవిషయం, మీరు కావాలని పట్టుకొని ఉండాలని ప్రయత్నించినా, ఒక బాధని లేదా సమస్యని కాని ఎక్కువ కాలం పట్టుకొని ఉండలేరు.

మానసిక అయోమయాల నుంచి విముక్తి పొందగలరు

మీరు పట్టుకోవాలి అని ప్రయత్నించినా చేయలేరు. ఎందుకంటే బాధని కలిగించే ఆలోచనలు పోయి కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఒక ఆలోచనని పట్టుకొని ఉండాలి అంటే మీరు చాలా ప్రయత్నించాలి. ఎందుకంటే ఆలోచనలు నిరంతరం ఒక ప్రవాహంలా వస్తుంటాయి.

ఆలోచనల స్థానంలో మరొకటి వచ్చేలా చేయండి

ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. ఒక కొత్త ఆలోచనని తీసుకురాగల శక్తి మీకు ఉంది అంటే దాన్ని వదలగల శక్తి కూడా మీకు ఉంటుంది. వస్తున్న కొత్త ఆలోచనల్ని గమనించవలసింది పోయి మీరు వాటికి పాత ఆలోచనల్ని కలుపుతారు. ఇది ఎలా ఉంటుందంటే ట్రాష్‌లో వేసిన ఫైల్స్‌ని తిరిగి మీ ఇన్ బాక్స్ లోనికి తెచ్చుకున్నట్లు. ఎప్పుడైతే మీరు మీ పాత ఆలోచనల్ని తిరిగి తెస్తారో దానితో సమస్యల్ని సృష్టించుకుంటారు. ఒక విషయం అర్థం చేసుకోండి, ఏ బాధనైనా కొత్త ఆలోచనల ప్రవాహంతో నింపవచ్చు అనే ఆలోచనని పెంచి పోషిస్తే అది మీకు నిజమవుతుంది. అప్పుడు మీకు బాధలు అనేవి ఉండవు. ఆ విధంగా కాకుండా నేను ఎంత ప్రయత్నించినా బాధల ఆలోచనల లోనికి కొత్త ఆలోచనల్ని తీసుకురాలేకపోతున్నాను అనే ఆలోచనని పెంచుకుంటే అదే నిజం అవుతుంది. నాకు బాధల ఆలోచనలు తిరిగి వస్తాయి అని అనుకుంటే అవే ఆలోచనలు వస్తాయి.

మీరు అర్ధం చేసుకోవలసింది ఏమిటంటే కనీసం ఒక్కసారి మీ ఆలోచనని మీ అంతరంగం లోనికి తిరిగి రానీయకుండా చేయగలిగితే, మీకు మీ నమ్మకం కలుగుతుంది. నేను ఒకసారి పాత ఆలోచనని తిరిగి రానీయలేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ విధంగా చేయగలను అనే నమ్మకం పెరుగుతుంది. అప్పుడు మీకు మీరు ఈ విధంగా చెప్పుకోవచ్చు, 'ఒకవేళ పాత ఆలోచన పదిసార్లు నా లోనికి వచ్చినా నేను పదిసార్లు దాన్ని కొత్త అలోచనతో నింపగలను' అంతే. అలా అనుకోగలిగినప్పుడు పాత ఆలోచనలు తిరిగి రావు.

గౌతమబుద్ధుని జీవితంలో చక్కటి సంఘటన ఉన్నది.

బుద్ధుడు ఈ విధంగా చెబుతుండేవారు, 'నేను ధ్యానం చేసుకున్నప్పుడు, కొన్ని గంటలు అయ్యాక నేను ధ్యానంనుంచి లేస్తాను అని అనుకున్నంత కాలం నాకు జ్ఞానోదయం కాలేదు. ఒకసారి నేను ఈ విధంగా అనుకున్నాను,' 'నాకు జ్ఞానోదయం అయ్యే వరకూ ఇక్కడి నుంచి కదలను. నా శరీరం కృశించి ఎండిపోయినా సరే. నాకు ఆత్మసాక్షాత్కారం కలిగే వరకూ ఇక్కడి నుంచి కదలను,' అని గట్టిగా నిర్ణయించుకున్నాను, అని బుద్ధుడు చెబుతాడు. తాను ఆ విధంగా గట్టిగా స్పష్టంగా నిర్ణయించుకున్న మరుక్షణం ఆయనకి ఆత్మసాక్షాత్కారం జరిగిందని చెబుతారు. ఆయన తనలో కల్పించుకున్న గట్టి సంకల్పం మరు నిముషంలో ఆయన్ని జ్ఞానోదయస్థితికి తీసుకు వెళ్ళింది.

మీరు మీ బాధల ఆలోచనల్ని బయట తోసి అక్కడ కొత్త ఆలోచనల్ని నింపాలి అని పదిసార్లు అనుకుంటారు. ఆలోచనని కొత్త దానితో నింపుతాను, పాత ఆలోచన పదకొండవసారి వస్తే రేపు చూస్తాను అనుకున్నారనుకోండి, మీరు ఏమీ చేయలేరు. మీలో మార్పు జరగదు. స్పష్టంగా నిర్ణయించుకోండి, పాత ఆలోచన రావటం ఆగనంతవరకూ నేను కదలను అనుకోవాలి. దీన్నే నేను ధైర్యం అంటాను.

భౌతిక మానసిక భావావేశాత్మక సమస్యలకి పరిష్కారం

మనం బంధాలు కల్పించటం మానివేయగానే మొదటగా మనలో జరిగేది, అంతరంగంలో చక్కని చికిత్స. దీని ప్రభావంతో మనలో లోతైన నిశ్శబ్దం, ప్రశాంతత ఏర్పడతాయి. రెండవది, ఆ అంతరంగచికిత్స మన శరీర ఆరోగ్యంలో కనిపిస్తుంది. అది మనకి ఇతరులతో ఉండే అనుబంధంలో కూడా కనిపిస్తుంది. ఇక నాల్గవది, ఈ మూడూ చక్కగా ఎప్పుదైతే జరుగుతూ ఉంటాయో, మీరు చాలా సృజనాత్మకతతో ఉంటూ, నాణ్యమైన రీతిలో పనులు చేస్తారు.

తీవ్రమైన వ్యాధులకి పరిష్కారం

చాలా మంది నా దగ్గరకి వచ్చి 'స్వామీజీ! నాకు ఇరవై సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు' అని చెబుతుంటారు. అది సరి కాదు, అలా ఉండదు. అర్థం చేసుకోండి, నిజంగా అలా ఉండదు. మీ సమస్యలు, బాధలు అన్నీ కేవలం మీ తలలో మాత్రమే ఉంటాయి. అలా అని నేను మిమ్మల్ని అగౌరపరచటం లేదు, లేదా ఏదో బాధని మీకు కలపటం లేదు. నేను సత్యాన్ని చెబుతున్నాను, అంతే. మీ బాధలు అన్నీ మీ తలలోనే ఉన్నాయి. మీకు రెండు సంవత్సరాల క్రితం ఉన్న మోకాళ్ళ నొప్పి, మూడు నెలల క్రితం నొప్పి, రెండు గంటల క్రితం నొప్పి – అన్నీ వేరు వేరు సంఘటనలు. మీరు వీటినన్నింటినీ కలిపి మీకు గడచిన ఇరవై సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పి అని ముగింపులు చెబుతారు. అది నిజంగా నిజమేనా? ఇరవై సంవత్సరాలుగా నిరంతరం మోకాళ్ళ నొప్పి ఉందా? మరి నొప్పి లేని సమయాలు ఏమిటి? మీరు అన్నింటినీ ఒక గొలుసులా చేసి నొప్పి నిరంతరం ఉంది అని చెప్పటం వలన అక్కడ చికిత్స జరిగే అవకాశాన్ని పోగొడుతున్నారు.

నిరాశకు పరిష్కారం

మీకు నెల క్రితం కలిగిన నిరాశ, సంవత్సరం క్రితం నిరాశ, మూడేళ్ళ క్రితం కలిగింది అన్నీ విడివిడిగా జరిగిన సంఘటనలు. అవి ఒక దానితో మరొక దానికి ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండవు. ఇది కూడా భౌతికసమస్య లాంటిదే. మీరు అన్నిటికీ లింకులు పెట్టి, నాకు డిప్రెషన్ ఉన్నది అని మరింత కుంగిపోతారు. చివరికి నా జీవితం అంటే డిప్రెషన్ అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. అప్పుడు దానితో పోరాటం మొదలు పెడతారు. ఆ పోరాటమే డిప్రెషన్‌కి మరింత బలాన్ని ఇస్తుంది.

పది సంవత్సరాలుగా నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నేను నిరాశ డిప్రెషన్‌లో ఉన్నాను, అని గట్టిగా నమ్మినప్పుడు అదే పరిస్థితితో ఒక బలమైన మానసికవ్యవస్థని ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి సహజంగానే నా భవిష్యత్తు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది, అది నిరాశానిస్పృహలతో నిండి ఉంటుంది అని నమ్ముతారు. ఒక వ్యక్తి మీ ఎదురుగా ఉన్నాడనుకోండి, అతను శత్రువు అనుకోండి, అకస్మాత్తుగా అతని తల, కాళ్ళు, చేతులు వేరుచేయబడ్డట్టు కనిపించిందనుకోండి, అతనితో పోరాడే బుద్ధి అవుతుందా? లేదు. అతను మీరు పోరాడదగినవాడు కాదు అనిపిస్తుంది. అతను మీరు అనుకున్న విధంగా లేనప్పుడు మీరు పోరాడటం ఎందుకు అనుకుంటారు. అదే విధంగా మీ సమస్య పెద్దదిగా, ఒక భారీ మనిషిలా మీ ఎదురుగా ఉన్నప్పుడు మీకు పోరాడాలి అనిపిస్తుంది. అప్పుడు మీరు పోరాడుతూ ఉంటారు. మరిన్ని సమస్యల్ని తెస్తారు. మీరు అనుకున్నట్లు మీ డిప్రెషన్ పెద్ద శత్రువు కాదు. తల, కాళ్ళు లేని ఒక వ్యక్తి లాంటిది. విడిపోయిన భాగాలన్నీ కలిపి మీరు దానికి జీవితాన్ని ఇస్తున్నారు. దాంతో చేసే పోరాటమే మీ నిరాశకి అసలు కారణం.

ఎప్పుడైతే మీరు ఆ గొలుసు నుంచి బయటికి వస్తారో మీరు శూన్యాన్ని అనుభవిస్తారు. అప్పుడు మీ అంతరంగంలో చికిత్స ప్రారంభమవుతుంది. అప్పుడు మీరు భౌతికంగా కూడా ఆరోగ్యవంతులు అవుతారు. మీరు నిరాశానిస్పృహలని వదలండి. సహజంగా అదే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. అది మీ నుంచి బయటకి వెళ్ళిపోతుంది. మీలో సహజంగా సంతోషం అనేది ఏ విధంగా మాయం అవుతుందో నిరాశ కూడా అదే విధంగా మాయం అవుతుంది. ఎప్పుడెతే మీరు దాన్ని ప్రయత్నపూర్వకంగా బయటికి పంపించాలి అని అనుకుంటే మీరు దాన్ని పొడిగించి మరింత జీవితాన్ని బలాన్ని ఇచ్చినవారవుతారు. చూడండి. మీలో లోతైన నిరాశ ఉన్నదనుకోండి, మీరు ఆఫీసుకి వెళ్ళటం మానేస్తారా? లేదే! మీ మనస్సులో డిప్రెషన్ ఉంటుంది. శరీరం మాత్రం ఆఫీసుకి వెళుతుంది. మీరు పని చేస్తారు. అయితే మీ పనిలో అంత నాణ్యత ఉండకపోవచ్చు. కాని మీ శరీరం కదులుతూ ఉంటుంది.

ఆ విధంగా నిరాశలతో జీవించే కంటే దాని నుంచి విముక్తులయి జీవించండి. మనం మానసిక కుంగుబాటులో ఉన్నప్పుడు మనలో ఈ ప్రశ్నలు ఉండవు. నాలో డిప్రెషన్ ఉంటే నేను ఏ విధంగా కదలగలను, ఇటువంటి ప్రశ్నలు ఉండవు. డిప్రెషన్ మన జీవితంలో ఒక భాగమవుతుంది. ప్రారంభంలో మీలో కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు. నేను ఏ విధంగా అన్నింటినీ, అన్ని ఆలోచనలకి లింకులు పెట్టకుండా ఉండగలను, ఇది సాధ్యమేనా, అలా ఉంటూ నా పనులు నేను ఏ విధంగా చేయగలను? ఒక విషయం అర్థం చేసుకోండి. నిరంతరం బంధవిముక్తిని గుర్తుచేసుకోవటం అనేది మీ జీవితానికి అడ్డు కాదు. అది మీ శరీరం మనసులకి అడ్డు రాదు. అది మీ లోపలికి డిప్రెషన్ రాకుండా చూస్తుంది. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు, పోయినప్పడూ మీరు ఏమీ పట్టించుకోరు, లింకులు పెట్టరు, ఆ విధంగా డిప్రెషన్ పోతుంది.

అలవాటు మానటానికి పరిష్కారాలు

అలవాటు అంటే ఏమిటి? ఏ పనైనా మీరు చేయకపోతే ఏదో చాలా పోగొట్టుకున్న భావం, ఏదో తీవ్రమైన లోటు ఉండటం. కాని ఆ పనిని చేస్తే అది మీకు అదనపు సంతోషాన్ని ఇవ్వదు. అది యాంత్రికంగా జరిగిపోతుంది. అలవాటంటే ఒక వస్తువు మూలంగా లేదా వ్యక్తి మూలంగా లేదా స్థితి వల్ల సంతోషం కలుగుతుంది అని నమ్మటం. అర్ధం చేసుకోండి. సంతోషాల గొలుసుని తిరిగి సృష్టిస్తూ పొడవుగా చేయటమే అలవాటు అంటే. అదే వస్తువులు, స్థితి లేదా మనుషుల్ని తిరిగి మళ్ళా మళ్ళా మీ జీవితంలోనికి తీసుకురావటమే అలవాటు అంటే. అలా చేయటం వలన అదే సంతోషం కలుగుతుంది అనే నమ్మకం. కొంతమంది త్రాగుడుకి, కొందరు సిగెరెట్ కాల్చటానికి – ఇలా రకరకాలుగా అలవాటు పడుతుంటారు.

ఒక విషయం గుర్తుంచుకోండి, అదే సంతోషం కోసం దేన్నైనా తిరిగి మీ జీవితంలోనికి తెచ్చుకుంటే అది అప్పుడు ఇచ్చిన ఉత్సాహాన్ని, సంతోషాన్ని మళ్ళా మీకు ఇవ్వదు. అది మిమ్మల్ని అలవాటులోకి మాత్రం తీసుకువెళుతుంది. కాని సంతోషంలోకి మాత్రం కాదు. మొట్ట మొదటిసారి స్వీటు తిన్నప్పుడు అది చాలా అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. అది పూర్తిగా వేరుగా ఉంటుంది. అయితే మీరు అదే స్వీటుని పదే పదే తింటే అదే ఆనందాన్ని ఇవ్వదు. తృప్తి ఇవ్వకపోవటం కాదు, దాన్ని కనీసం చూడబుద్ధి కూడా కాదు. అదే విధంగా ఒక వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఆ తరువాత అది ఉండదు.

చాలామంది నన్ను అడుగుతుంటారు, 'నా అలవాట్లు ఎలా మానగలను' అని. అలవాటు అన్నది చాలా చక్కని మాట. అందులోంచి నేను అనే మాటని తీసేస్తే అలవాటు లేకుందా పోతుంది. స్పష్టంగా అర్థం చేసుకోండి, మీరు రెండు రోజుల క్రితం సిగరెట్ కాల్చటం, సంవత్సరం క్రితం సిగరెట్ కాల్చటం, ఐదు సంవత్సరాల క్రితం సిగరెట్ కాల్చటం అన్నీ విడివిడిగా జరిగిన సంఘటనలు. వాటికి ఒక దానితో ఒకటి సంబంధం లేదు. మీరు వీటినన్నింటినీ ఒక గొలుసులా కలిపి, నాకు సిగరెట్ కాల్చే అలవాటుంది అనుకోవటం ఆ నమ్మకం, అలవాటు అనే గొలుసుని తయారుచేస్తుంది. అప్పుడు దాంతో పోరాడుతూ ఉంటారు. దీన్నే 'నేను' అనే దాన్ని వదలాలి అని నేను చెప్పిన మాటలో అర్ధం. మీ నమ్మకమే అలవాటుని తయారు చేస్తుంది. మీరు నమ్మకాన్ని వదిలేస్తే అలవాటు పోతుంది. సిగరెట్ కాల్చటం అనేది సంతోషాన్ని ఇస్తుంది అని మీరు అనుకుంటే మీరు మళ్ళా మళ్ళా అడ్డుకోకుండా సిగరెట్ కాల్చి మీరు ఎలా ఫీల్ అవుతారో గమనించండి. మీరు పొగని లోపలికి పీల్చినప్పుడు అది సంతోషంగా ఎలా ఉంటుంది. అది ఎప్పటికీ నిజమైన సంతోషం కాదు.

మీరు సిగరెట్ కాల్చినప్పుడు, ఆ క్షణంలో మీ అంతరంగంలో ఏం జరుగుతుందో గమనించండి. మీరు ఏమీ సంతోషపడరు. మీరు దేన్నుంచో తప్పించుకోవాలి అని చూస్తుంటారు.

మీరు కేవలం సిగరెట్ కాల్చటం సంతోషం అనుకుంటారు. సిగరెట్ కాల్చినప్పుడు మీకు నిజంగా సంతోషం కలగకపోయినా, దానిలోంచి సంతోషాన్ని పిండాలి అని చూస్తారు.

మీరు మీ జీవితాన్ని లోతుగా స్కాన్ చేసి చూస్తే, మీరు సెక్స్ విషయంలో కాని, సిగరెట్ కాల్చటంలో కాని, డబ్బు సంపాదనలో కాని మొదటిసారి పొందిన సంతోషం ఆ తరువాత పొందకపోయినా, దానినుంచి ఆ సంతోషాన్ని బలవంతంగా రాబట్టడానికి ప్రయత్నిస్తారు అని అర్ధం అవుతుంది. మిమ్మల్ని మీరు, 'కాదు కాదు, ఇది నిజంగా సంతోషమే' అని ఓదార్చుకుంటారు. 'ఇది కాకపోతే సంతోషం ఏమిటి, అని మీలోని నిరాశని కప్పిపుచ్చుతారు. అదే సంతోషం అని నమ్మాలి అని అనుకుంటారు.

ఏ అలవాటునైనా వదిలేయటానికి ప్రయత్నించండి. మీరు వదలలేరు. ఒకవేళ ఒక అలవాటుని మీరు ఆశతోనో, భయంతోనో వదలవచ్చు. అది పెద్ద అలవాటు కాకపోవచ్చు మీరు భయంతోనో ఆశతోనో సిగరెట్ కాల్చటం మానేస్తే మీరు మీ అంతరంగానికి చెడు చేసినవారవుతారు. మిమ్మల్ని మీరు మరింతగా పాదుచేసుకున్నవారవుతారు. మీరు సిగెరెట్ కాల్చడం మానేసి ఉంటారు. కాని ఏ భయం లేదా ఆశతో దాన్ని వదిలారో అది మీ అంతరంగంలో స్థిరపడిపోతుంది. సిగరెట్ కాల్చటం వల్ల కేవలం మీ శరీరం పాడైపోతుంది. భయం, ఆశల వల్ల మీ అంతరంగాన్ని, మీ ఉనికి మొత్తాన్ని నష్టపరుస్తుంది.

దాంతో జన్మ తరువాత మరు జన్మ, ఆ తరువాత జన్మ అన్నీ నష్టపోతారు. ఆ తరువాత తీసుకున్న శరీరంలో మీరు భయం, ఆశలని నింపుతారు. సిగరెట్ కాల్చడం అనేది మీరు మరు జన్మకి తీసుకువెళతారు. కాబట్టి మంచి పద్దతి ఏమిటంటే అసలు ఆ అలవాటు మీకు ఉంది అనే భావనని వదిలేయడం.

మరణభయానికి ఒక కప్పు కాఫీ

ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకి వచ్చి మరణ భయం నన్ను వెంటాడుతూంది. నా ఆస్తి పోతుందేమో లేదా నేను మరణిస్తానేమో అనే భయం ఎక్కువగా ఉంది. నాకు ఏదైనా పరిష్కారాన్ని చూపించండి. నా భయాన్ని పోగొట్టండని అడిగాడు. నేను అతనితో ఒక కప్పు కాఫీ తాగమని చెప్పాను. అతను నాతో మీరు ఏం చెబుతున్నారు అని అడిగాడు. ఆయనతో వెంటనే ఒక కప్పు కాఫీ తాగాలి అనుకొని ఒక కప్పు కాఫీ తాగండి అన్నాను. అతను ఇది ఏ విధంగా నాకు సహాయం చేస్తుంది? అని అడిగాడు.

నీవు ఒక కప్పు కాఫీ తాగాలి అనుకొని, ఒక కప్పు కాఫీ తాగినప్పుడు, నిన్ను వెంటాడే భయం నీ అంతరంగం నుంచి వెళ్ళిపోతుంది. అవును కదా! అది ఒక్క క్షణం పాటేనా సరే. ఎప్పుడైతే కాఫీ తాగాలి అనే ఆలోచన మీలోకి వస్తుందో భయం మీ నుంచి వెళ్ళిపోతుంది.

మరణభయం అతని అంతరంగాన్ని వదలకుండా ఒక కప్పు కాఫీ తాగాలి. ఒకసారి ఒక్క ఆలోచన మాత్రమే ఉంటుంది. వెళ్ళిపోయిన పాత ఆలోచన మళ్ళీ మీలోకి వచ్చింది అంటే అర్ధం ఏమిటి? మీరు ఆ ఆలోచనని బలవంతంగా మీ అంతరంగంలోనికి తీసుకురావటమే. అంటే ట్రాష్‌లో వేసిన మెయిల్‌ని తిరిగి ఇన్‌బాక్స్ లోనికి తెచ్చినట్లు. కాబట్టి ఒక కప్పు కాఫీ తాగాలి, అనే చిన్న ఆలోచన చాలా బలమైన మరణభయం అనే ఆలోచనని తోసివేయ గలుగుతుంది.

అప్పుడు అతను 'ఇది చాలా మామూలుగా ఉంది. తిరిగి మరణభయం నాలోకి వస్తుంది. అప్పుడు ఏం చేయను అని అడిగాడు. అది మళ్ళా వస్తే ఇంకో కప్పు కాఫీ తాగు అంతే అని చెప్పాను.

చిన్న విషయం అర్థమైతే చాలు. అదృష్టం కొద్దీ ఒక సమయంలో ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే కొత్త ఆలోచన వస్తుందో, దాని అర్థం పాత ఆలోచన మీ మీద ప్రభావాన్ని చూపించలేదు. ఆ విధంగా కాకపోతే కొత్త ఆలోచన మీ లోనికి రాదు.

ఒకవేళ పాత ఆలోచన అంత బలంగా ఉంటే, అది మరింత బలంగా తయారై మీ మీద కూర్చుంటుంది. అది మీ అంతరంగాన్ని వదిలేయగలగాలి. కాబట్టి మీ లోపలికి కొత్త ఆలోచన రాగానే, పాత ఆలోచన మీ మీద పట్టు కోల్పోతుంది. అది మిమ్మల్ని వదిలేస్తుంది. అందుకే కొత్త ఆలోచన రాగానే అది మీలోనికి రాగలిగింది. ఎప్పుడైతే ఒక కప్పు కాఫీ తాగాలి అని అనుకుంటామో మరణ భయం మిమ్మల్ని వదిలేస్తుంది.

అతను మళ్ళా ఈ విధంగా అడిగాడు, 'ఆ భయం నాలోకి వచ్చినప్పుడు కప్పు కాఫీ తాగుతాను. అది మళ్ళా వస్తే ఏం చేయను? అప్పుడు ఒక గ్లాసు నీరు తాగు అని చెప్పాను, అంతే.

ఒక విషయం అర్థం చేసుకోండి. ఆ భయం తిరిగి వస్తుందేమో అన్న భయాన్ని తిరిగి మీలో ఆ భయం కలిగేలా చేస్తుంది. ఎందుకు ఆ భయానికి, ఆ ఆలోచనకి అంత శక్తిని ఇస్తారు. ఇది మిగతా ఆలోచనల లాంటిదే కదా! మరొక ఆలోచనని మీ లోనికి తెచ్చుకోవచ్చు కదా! మీరు భయం అనే ఆలోచనకి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు. అందుకే అది తిరిగి మీ లోనికి వస్తున్నది. ఇది కూడా ఒక ఆలోచనే. దీనికి ఎందుకు అంత ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు.

మీరు మీ భయాల గురించి ఆశల గురించి, అంత వ్యథ చెందనవసరం లేదు. మీ బాధల గురించి బాధ పడటం, భయాల గురించి బాధ పడటం ఆశల గురించి బాధ పడటం ఇదే అసలు సమస్య. అంతే కాని భయం సమస్య కాదు. భయం గురించి బాధ పడటమే సమస్య. భయం ఎందుకు వస్తుందంటే మీరు సాధించవలసిన లక్ష్యాన్ని సాధించలేను అని అనుకున్నప్పుడు. భయం అపజయానికి సంబంధించింది కాదు. భయం, అపజయం పొందుతానేమో అన్న భయం గురించి మాత్రమే.

మానసిక అయోమయాల నుంచి విముక్తి పొందగలరు

ఉదరసంబంధ సమస్యలకి పరిష్కారం

ఆయుర్వేదం ఏం చెబుతుందంటే మనకి ఉదరసంబంధ సమస్యలు, మలబద్ధకం – ఇవి మనం శరీరాన్ని అతిగా నిరంతరం పట్టుకొని ఉంటే వస్తాయి. మనం రిలాక్స్ అయ్యి, గమనించగలిగితే, మన శరీరం మనం కాదు అని అనుకోగలిగితే, మనకి ఇటువంటి సమస్యలు రావు. నాకు కొన్ని లక్షల మందితో ఉన్న అనుభవంతో చెబుతున్నాను. ఇటువంటి సమస్యలు ఉన్నవారు, ఈ పద్ధతిని రెండు మూడు రోజులు సాధన చేయండి. నిరంతరం మీరు శరీరం కాదు అని రెండు – మూడు రోజులపాటు అనుకోండి. ఆ విధంగా అనుకోగలిగితే ఈ సమస్యల నుంచి బయటపడతారు. మీ ఉదరం శుభ్రపడుతుంది. మీకు అల్సర్, ఇరిటేషన్ – ఈ విధంగా కడుపులో సమస్యలు ఉంటే ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. రెండు – మూడు రోజులు వరసగా 'నేను శరీరాన్ని కాదు' 'నేను ఈ శరీరం కాదు' అని అనుకోండి. రిలాక్స్ అయి శరీరాన్ని దానంతట అదే పని చేసే విధంగా చేయండి. నేను చెబుతున్నాను, రెండు – మూడు రోజులలో మీకు బాగైపోతుంది.

ఎలర్జీలకి పరిష్కారం

మీలో ఉండే రకరకాల భయాలకి, ఎలర్జీలకి కారణం, స్వతంత్రంగా ఒక దానితో ఒకటి సంబంధం లేని ఆలోచనలని కలపటమే. ఇక్కడ మీకు కావలసింది కేవలం వాటికి బంధాలు ఏర్పరచకుండా ఉండటమే. ఒక విషయం అర్థం చేసుకోండి. గడచిన మూడు సంవత్సరాలలో నేను కనీసం వేయిమందికి ఎలర్జీల విషయంలో హీలింగ్ చేసాను. నేను హైదరాబాదులో క్లాసు తీసుకునే సమయంలో ఒక వ్యక్తి వచ్చి వేరుసెనగ పప్పు తింటే తనకి ఎలర్జీ అని, తాను 25 సంవత్సరాల నుంచి దానితో బాధ పడుతున్నాడని కేవలం ఒక స్పూను తిన్నా ఒళ్ళు ఉబ్బుతుందని చెప్పాడు. నేను అతన్ని అది తెచ్చుకొని నా పక్కన కూర్చొని తినమని చెప్పాను. అతను నా పక్కన కూర్చొని తిన్నాడు, అతను చక్కగా తిన్నాడు కాని ఏమీ కాలేదు. ఎలర్జీ మాయమైపోయింది. ఇక్కడ కావలసింది ఆ ఆలోచన నుంచి బయటికి వచ్చే ధైర్యాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే అతనితో నేను చూసుకుంటాను అని అన్నానో, ఆ ఆలోచనల గొలుసుని తెంపగల ధైర్యం అతనికి వచ్చింది. ఎలర్జీ అనే భయాన్ని కలిగించే ఆలోచనల గొలుసుని ఛేదించగలిగాడు.

పెద్ద వయస్సు వారి సమస్యలు – పరిష్కారం

నేను ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న రోజుల్లో జరిగిన ఒక సంఘటనని చెబుతాను.

నేను ఒక పల్లెటూరికి వెళ్ళాను. అక్కడ అంతా పెద్ద వయస్సులో ఉన్న లామాలు ఉన్నారు. నేను ఒక వ్యక్తిని అడిగాను, 'నేను ఒక పెద్ద లామాని చూడాలి (లామా అంటే బౌద్ధ సన్యాసి) అని. అతను నన్ను అక్కడ ఉన్న పొలం దగ్గరకి వెళ్ళమన్నాడు. నేను అక్కడికి వెళ్ళి ఆ లామాతో మాట్లాడాను. అతను పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు.

నేను అతనితో, 'మీరంతా వయస్సులో చాలా పెద్దవారు. మీ జీవితవిధానం గురించి, మీ అనుభవాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను, అని అన్నాను. నా మాట విని అతను నవ్వటం మొదలు పెట్టాడు, 'ఏమిటి? పెద్దవారమా? నేను మధ్యవయస్సు వాడినే. నా వయస్సు 136 సంవత్సరాలే. ఇక్కడ ఇంకా చాలా పెద్దవారు ఉన్నారు. 190 సంవత్సరాల కంటే పెద్దవారు ఉన్నారు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడు' అన్నాడు. నేను నిర్ఘాంతపోయాను. నేను అతనితో, మీరు అంత కాలం ఎలా జీవిస్తారు'? అని అడిగాను.

అతను చాలా మామూలుగా 'ఏముంది దాంట్లో, మాకు చిన్నప్పటి నుంచీ మనిషి 300 సంవత్సరాలు జీవిస్తాడు' అని నేర్పిస్తారు అన్నాడు.

వారికి ముందు నుంచీ 300 సంవత్సరాలు జీవిస్తారు అని నేర్పిస్తారు. మీ శరీరం పసిబిడ్డ లాంటిది. మీరు ఏది చెబితే అది వింటుంది. మీరు చేయవలసింది కేవలం సరైనదాన్ని బలమైన నమ్మకంలా మీలో కలిగించటమే. మీరు ఆలోచనలకి లింకులు పెట్టకుండా ఉంటే జరగవలసినవి జరిగే రీతిలో జరుగుతాయి. మీరు నిరంతరం నూతనత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మనిషి అంటే 70 – 90 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు అనే విషయాన్ని బలంగా నమ్ముతారు. మీకు 70 సంవత్సరాలు రాగానే మరణానికి సిద్ధపడతారు. మీరు నిరంతరం 'నేను పెద్దవాడినయ్యాను ఇక చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను.' అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా మీ శరీరాన్ని మరణానికి సిద్ధం చేస్తారు.'

విసుగుకి పరిష్కారం

ఏ వ్యాధినైతే గౌరవంగా చూస్తుంటారో ఆ వ్యాధిని మీ శరీరం స్పష్టిస్తుంది. అలసిపోవటం, విసుగు వంటివన్నీ అటువంటి గుర్తింపులకి సంబంధించినవే. దీన్ని మీరు గుర్తింపుల గొలుసు అనవచ్చు. గుర్తింపుల గొలుసు అంటే ఏమిటి? ఉదాహరణకి అలసటని తీసుకోండి, మీరు నిన్నటి అలసటని – వారం క్రితం దాన్ని కలిపి నాకు 8 గంటలు కాగానే నీరసం వస్తుంది అని అనుకుంటారు. అప్పుడు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచే ఎనిమిది అయ్యేటప్పటికి నాకు నీరసం వస్తుంది అనే భావనతో ఉంటారు. ఎనిమిది కాగానే నీరసం అనిపిస్తుంది. మీ ఈ గుర్తింపుని తప్పనిసరి పరచటానికి బలవంతంగా నీరసాన్ని అనుభవిస్తారు.

కాబట్టి మీరు ఆరు అయ్యేటప్పటికి సోమరితనాన్ని, నీరసాన్ని తయారు చేసుకుంటారు. ఇప్పుడు మీరు సృష్టించుకున్న ఈ గుర్తింపుని నిరూపించాలి. కొన్నిసార్లు ఈ గుర్తింపుని బయట ప్రపంచానికి నిరూపించే కార్యక్రమాన్ని మరిచిపోవచ్చు కాని మీకు మీరు నిరూపించటం మానరు. ఒకవేళ బయట ప్రపంచం మీ ముద్దుల్ని గుర్తించకపోతే పరవాలేదు. కాని మిమ్మల్ని మీరు అనుమానిస్తే అది మీ అహంకారానికి ఒక పెద్ద దెబ్బ. అది జరగకుండా మీరు జాగ్రత్త పడతారు. మీరు ఒక సంవత్సరం క్రితం నీరసపడ్డాను అని అనుకున్నా చాలు, ఇప్పుడు దాన్ని తిరిగి తాజా చేసుకుంటారు. నిజానికి మీకు ఇప్పుడు ఆ సమస్య లేకపోవచ్చు. కానీ మీరు విసుగు నుంచి బయటకి వచ్చాను అన్న విషయాన్ని నమ్మటం మీకు ఇష్టం ఉండదు. మీ పాత గుర్తింపుల్ని నిలుపుకోవటానికే ప్రయత్నిస్తుంటారు. మీ అహం దేన్నైనా త్యాగం చేస్తుంది కాని గుర్తింపుని చేయదు. అందుకే మీరు చక్కగా మంచి పద్ధతిలో ఒక మోసపూరితమైన జిత్తులమారి ఆట ఆడతారు.

అపరాధభావానికి పరిష్కారం

ఒక వ్యక్తి నాతో, 'నేను సిగరెట్ కాల్చే అలవాటు వల్ల చాలా బాధ పడుతున్నాను. నేను నిద్ర లేవగానే సిగరెట్ కాల్చాలి. కాని ఒక గంట తరువాత తప్పు చేసానే అని బాధపడతాను. ఆ తరువాత ఆఫీసుకు బయలుదేరే ముందు మళ్ళా సిగరెట్ కాలుస్తాను. ఆ తరువాత తప్ప చేసాను అని బాధపడతాను. నేను ఏం చేయాలి? నేను నిరంతరం తప్పు చేసానని బాధపడతాను. ఈ అలవాటు వల్ల చాలా బాధపడుతున్నాను' అని చెప్పాడు.

నేను అతనితో 'నీవు సిగరెట్‌నైనా వదలాలి లేదా అపరాధభావాన్నెనా వదలాలి. ఏదో ఒకదాన్ని వదలాలి. అప్పుడే ఈ అలవాటు నుంచి స్వేచ్ఛని పొందుతావు!' అని చెప్పాను.

ఇది విని అతను ఆశ్చర్యపోయాడు. అతను నాతో, నేను సిగరెట్ కాల్చటం మానలేను. నేను అపరాధభావాన్ని వదిలినా ఇంకా ఇంకా ఎక్కువ సిగరెట్లు కాలుస్తాను కాని మానెయ్యను. అప్పుడు నేను సిగరెట్ కాల్చటం మానేసాను అని మీరు ఏ విధంగా చెప్పగలరు? అని అడిగాడు. చూడండి, ఇది ఒక ఛేదించలేని వృత్తం లాంటిది. మీలో తప్పు చేసాను అనే భావం ఉన్నప్పుడు మీరు నిరంతరం 'నేను సిగరెట్ కాల్చకూడదు. నేను సిగరెట్ కాల్చటం ఆపాలి ' అనుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? మీ మనస్సులో సిగరెట్ అనే మాటకి ఎక్కువ శక్తిని ఇస్తారు. ఆ ఆలోచన సిగరెట్ అనే మాటని మీ అంతరంగంలో లోతుగా నాటుకునే విధంగా చేస్తుంది. అప్పుడు మీరు ఏ విధంగా సిగరెట్ కాల్చటం మానగలరు?

ఎప్పుడైతే మిమ్మల్ని మీరు క్షమించుకోలేరో దాన్నే అపరాధభావం అంటారు. ఎదుటివారిని క్షమించలేకపోతే దాన్ని పగ అంటారు. ఎప్పుడైతే మీరు ఆలోచనలకి బంధాలు కల్పించకుండా దానిలోంచి బయటకి వస్తారో అపరాధభావం, పగ – రెండూ మీ నుంచి మాయమౌతాయి. మీరు ఎదుటివారిని క్షమించటమే కాదు, మీరు ఆ విషయాన్ని మరిచిపోతారు. ఎందుకంటే మీ ప్రవర్తనకి ఆలోచనలకి బంధాలు ఉండవు కాబట్టి.

ముందుకి వేసే పెద్ద అడుగే – గతం నుంచి పొందే స్వేచ్ఛ

మీరు అడగవచ్చు, 'మేము బంధవిముక్తులమైతే మా గతం నుంచి ఏం నేర్చుకోగలం' అని మీరు గత అనుభవాల నుంచి స్వేచ్ఛని పొందినప్పుడే గతం నుంచి నిజంగా ఏదైనా

నేర్చుకోగలరు. ఎప్పుడైతే గతంలోని అనుభవాల నుంచి స్వేచ్ఛని పొందుతారో, అప్పుడే గతం నుంచి నేర్చుకోగలవి, నేర్చుకోవలసిన విషయాల్ని నేర్చుకుంటారు. అవి మీలో ఒక భాగం అవుతాయి. ఎప్పుడైతే మీరు నిరంతరం గతబంధాలతో ఉంటారో, అప్పుడు బాధలు, సమస్యలు, అపరాధభావం మీ అంతరంగంలో నిండి ఉంటాయి. మీరు అభివృద్ధి చెందిన వివేకంతో గతం యొక్క సారాన్ని తెలుసుకోలేరు. అంతే కాకుండా మీకు మీ గతం పట్ల ఎక్కువ గౌరవభావం ఉన్నా దాని మీద మీరు ఎక్కువ ఆధారపడినా మీరు వర్తమానంలో ఈ క్షణంలో ఉండలేరు. మీరు నిరంతరం గతాన్ని వర్తమానంలోకి భవిష్యత్తు లోనికి తీసుకువచ్చి వాటిని కూడా పాడుచేసారు. మీరు ఆ విధంగా చేసినప్పుడు ఏ విధంగానూ ఆనందంలో ఉండలేరు. గతం నుంచి బయటికి రండి. అప్పుడు మీరు నేర్చుకోగల సారాంశం మీలో ఒక భాగమౌతుంది. అప్పుడు ఈ క్షణంలో జీవితాన్ని ఒక ఉత్సవంలా జరుపుకోండి.

అప్రయత్నంగా జరిగే నీతి, క్రమశిక్షణ

కొన్ని ఆలోచనలని ఒక గొలుసులా చేయవచ్చు అని మీరు నమ్మి, సంతోషం కలిగించే ఆలోచనలకి మాత్రం ప్రాణం పోస్తారు. కొన్ని ఆలోచనలు బాధాకరమని మీరు అనుకుంటే వాటి నుంచి శక్తిని వెనక్కి తీసుకుంటారు. దీని వల్ల మీరు జీవితాన్ని పూర్తిగా జీవించరు. మీరు నిరంతరం ఏ భాగంలో జీవించాలి అని ఆలోచిస్తుంటారు. ఎందుకంటే మీరు మీ మనస్సు మీద అత్యధికంగా ఆధారపడి ఉంటున్నారు. మీకు ఒక విషయం అర్థం కావటం లేదు, మీరు మీ మానసికవ్యవస్థ (ఆలోచనలు) లేకుండా కూడా జీవించగలరు. మీరు జీవితంలో నీతి నియమాలు లేని జీవితాన్ని గడపాలేమో అనుకుంటారు. ఏ వ్యక్తి అయితే సహజసిద్ధంగా తన ఆలోచనలకి బంధాలు లేవు అని తెలుసుకుంటాడో, ఆ వ్యక్తి సంఘం పెట్టే నియమనిబంధనలకి అతీతంగా చాలా సహజమైన నీతి నియమాలతో జీవించగలడు. అటువంటి వ్యక్తిలోనే మీరు లోతైన చేతనస్థితిలో ఉండే నీతినియుమాల్ని చూడగలరు. అటువంటి వారిలోనే అత్యంతక్రమశిక్షణతో కూడిన జీవితాన్ని చూడగలరు. ఆ క్రమశిక్షణని ఎవరూ కూల్చలేరు. ఆ నీతినియమాల్ని ఎవరూ అతని నుంచి తీసేయలేరు. ఆ నీతినియమాలు భయం, ఆశల నుంచి రావు. నిజమైన నీతినియమాలు తనని, తాను తెలుసుకుని, ప్రపంచాన్ని, భగవంతుడిని లోతుగా తెలుసుకున్నప్పుడే ఆ వ్యక్తిలో వికసిస్తాయి.

గమనించటం ఒక చేతనస్థితి

భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు చక్కగా ఒక విషయాన్ని పాడతారు. కుమ్మరి చక్రం తిరుగుతూ ఉంటుంది. దాని పీఠం మాత్రం నిరంతరం తిరిగే చక్రం మధ్య నిశ్చలంగా ఉంటుంది. అదే విధంగా ఒక కచ్చితమైన వ్యక్తి ఏ పనిలో ఉన్నా నిశ్చలంగా ఉండగలడు. మీరు దేనితోను బందీలు కాదు అని తెలుసుకున్నప్పుడు అకస్కాత్తుగా మీరు కుమ్మరి చక్రంలోని పీఠంలా ఎటువంటి పనులు చేసినా, ఎటువంటి అనుభవాలు మీలో మిగిలినా మీరు మాత్రం ప్రభావితం కారు. ఒక విషయం అర్థం చేసుకోండి, అక్కడ చూపిస్తున్న సినిమా మీరు కాదు. మీరు కేవలం సినిమాని ప్రదర్శిస్తున్న తెర మాత్రమే. తెర మీద ఏ సినిమాని ప్రదర్శించినా తెర నిశ్చలంగా ఉంటుంది.

ప్రభావంతో బంధాలు

బాలుడైన అష్టావక్రుడు, జనకుడితో ఈ విధంగా చెబుతాడు. నీవు నిశ్చయంగా ఎప్పటికీ స్వేచ్ఛా జీవివి. నీవు అన్నీ చూడగల నిత్యస్వేచ్ఛాజీవివి. నిశ్చయంగా ఇది ఒక్కటే బంధం. అదే నీవు చూసేవాడిని మరొక విధంగా చూడటం. ఎప్పుడైతే చూసేది చూసేవాడిని ప్రభావితం చేస్తుందో అప్పుడే బంధాల సమస్య ప్రారంభమవుతుంది. అసలైన మీ ఉనికి స్వచ్చమైంది. కాని ఎప్పుడైతే మీరు చూసే వ్యక్తి కాక మరొకరుగా అనుకున్నప్పుడే సమస్య ప్రారంభమౌతుంది. అంతకు మించి బంధాలేమీ ఉండవు.

ఇప్పుడు బంధవిముక్తులైతే

మీరు బాధల గొలుసుని తయారుచేసాను అనుకోవటం, మరొక గొలుసుని చేయటమే. పది సంవత్సరాల క్రితం చేసిన గొలుసు, తొమ్మిది సంవత్సరాల క్రితం గొలుసు, నిన్నటిదీ అన్ని స్వతంత్ర సంఘటనలు. వీటినన్నింటినీ ఒక గొలుసులా చేయటం మరొక గొలుసు, అంతే. ఈ విషయం మీరు అంతరంగపు లోతులలో మీకు అర్థం అయితే అది తన జాగ్రత్తని తాను తీసుకుంటుంది. అప్పుడు మీ ఆలోచనలలో, మీ పనులలో మార్పు వస్తుంది. నన్ను చాలామంది అసలు గొలుసులు సృష్టించకుండా వుండాలి అని నిరంతరం గుర్తుంచుకోగల విధానాన్ని చెప్పండి అని అడుగుతుంటారు. మీరు ఆ విధంగా అనుకోవటం కూడా మరొక గొలుసుని సృష్టించటమే. ఎప్పుడైతే ఒకటి మీకు సంతోషం అనిపిస్తుందో అది ఎప్పటికీ కావాలి అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, మరొక గొలుసుని తయారుచేస్తారు.

ఎంపిక పరమానందం కాదు

బంధవిముక్తితో దొరికే పరమానందాన్ని మీలో ఉంచాలని ప్రయత్నించవద్దు. మీకు శాశ్వతమైన ఆ ఆనందానికి కారణం మీలో ఏదీ ఉంచలేను అని తెలుసుకోవటం వల్లే. మీలో లోతైన సంతోషాన్ని మీరు ఎలా పొందారంటే ఎంపికల నుంచి స్వేచ్ఛ పొందారు కాబట్టి. మీరు దేంతోనూ బంధాలలో లేరు కాబట్టి. మీరు బంధవిముక్తులని తెలుసుకున్నారు కాబట్టి. ఇప్పుడు తిరిగి బంధాలు కల్పించవద్దు.

ఎవరైనా మీతో నేను టెన్నిస్ ఆడి ఆ సంతోషపారవశ్యంలో ఉన్నాను అని చెబితే, మీరు టెన్నిస్ ఆట పారవశ్యాన్ని ఇస్తుంది అనుకొని మీలో ఒక ఈక్వేషన్ వేసుకుంటారు. అప్పుడు మీరు టెన్నిస్ ఆడటం ప్రారంభించి బంతిని కొడుతూనే ఉంటారు. కానీ మీలో ఏమీ జరగదు. పారవశ్వం ఉండదు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, టెన్నిస్ ఆట పారవశ్వాన్ని ఇస్తుందని చెప్పి అతను మిమ్మల్ని మోసం చేసాడు. ఒక విషయం అర్థం చేసుకోండి, టెన్నిస్ ఆడేటప్పుడు, అతను సంతోషం గురించి అసలు పట్టించుకోదు. అతను ఆటలో ఎంతో విరామంగా ఉంటాడు. ఆ కారణంగానే అతనిలో సంతోషం కలుగుతుంది. కాకపోతే ఆ సంతోషానికి కారణం టెన్నిస్ ఆడటం అనుకుంటాడు. అతని సంతోషానికి కారణం టెన్నిస్ కాదు. అతను పూర్తి బంధవిముక్తిస్థితిలో ఎంత సేపు ఉంటే అంతవరకూ ఆనందపారవశ్వంలో ఉంటాడు. అతను టెన్నిస్ ఆడనవసరం లేదు.

ఎంపిక లేకపోవటమే పరమానందం. ఎప్పుడైతే మీరు ఎంచుకుంటారో పరమానందం కలుగదు. ఎందుకంటే మీరు దాన్ని ఎంచుకొని, అది కలిగే అవకాశాన్ని పోగొట్టారు. మీరు ఎప్పుడైతే ఎంపిక లేకుండా, పూర్తి విరామంలో ఉంటారో అప్పుడు మీలో ఆనందం దానంతట అదే కలుగుతుంది. ఎప్పుడైతే మీరు ఆనందం గురించి అనుకుంటారో, మీరు కచ్చితంగా ఆ అనుభవాన్ని పొందరు.

మీ కలల సాధనకి ఉన్న పద్ధతి బంధవిముక్తులవటం

ఎప్పుడైతే మీరు బంధవిముకులవుతారో అప్పుడు మీ కలలన్నీ నిజమవుతాయి. స్పష్టంగా తెలుసుకోండి. మీ కలల్ని నిజం చేసుకోగల ఒక చిన్నది, శక్తివంతమైన పద్ధతి ఇది. మీ భవిష్యత్తు గురించి మీకు ఎటువంటి కలలు ఉన్నా మీరు విరామంగా ఉన్నప్పుడు, మీరు బంధవిముక్తులుగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీరు మీ ఆలోచనల ద్వారా ఒక కొత్త శక్తి మీలోకి ప్రవేశించటాన్ని చూడగలుగుతారు. ఆ శక్తి మీ కలలపట్ల శ్రద్ధ తీసుకుంటుంది. ఇది విరామంగా ఉండగలిగి తెలుసుకునే తత్వం యొక్క స్థితి. అంతరంగప్రపంచంలో జరిగిన పరిశోధనల సారాంశం అదే. బంధవిముక్తి అనేది మీకు అన్నీ ఇవ్వగల అంతిమపద్ధతి.

అబద్ధపు గుర్తింపులు, అహం అవసరం లేదు

ఈ చిన్న సత్యాన్ని అర్థం చేసుకోండి. ఒక జంతువుగా ఉండి శ్వాస తీసుకోవటానికి అహం కాని, గుర్తింపు కాని, లక్షణాలు కాని అవసరం లేదు. కాని ఒక మనిషిగా మీరు మీ గుర్తింపుని వదులుకోవటానికి భయపడతారు. మీ శరీరాన్ని ఉపయోగించలేనేమో అని భయపడతారు. మీకు ఏదో చెడు జరుగుతుంది అని భయపడతారు. మీ గుర్తింపుని వదిలితే మీ శరీరం సరిగా పని చేయదు అని భయపడతారు. మీ గురించి మీకు ఒక భావన ఉంటుంది. నేను ఫలానావారి తండ్రిని, ఫలానావారి కొడుకుని అని మీ గురించి మీకు ఉన్న ఈ భావన, ఈ గుర్తింపు మీరు మోస్తూ తిరిగే అహంకారం, మీ శరీరం చక్కగా పనిచేయటానికి ఏ మాత్రం అవసరం కాదు. అయితే దీన్ని నమ్మటం చాలా కష్టం.

మానసిక అయోమయాల నుంచి విముక్తి పొందగలరు

మీరు శ్వాసించటం గురించి, గుండె కొట్టుకోవటం గురించి, ఆహారం జీర్ణం అవటం గురించి ఆలోచించాలా? లేదు! ఈ సత్యం ఆధారంగా మీరు జీవించటానికి అహం అవసరం లేదు అని తెలుసుకోండి. అహానికి అతీతంగా ఏదో ఉంది. అదే మీరు జీవించగలిగేలా చేస్తుంది. మీ జీవితం అహంకారం మీదే ఆధారపడి ఉంటే అది ఎంత విపత్తు అయి ఉండేదో, మనం దాంతో వ్యవహరించలేం. మనం మన అహాని కంటే ఎంతో ఉన్నతులం. కాని ఇది నమ్మటానికి చాలా కష్టంగా ఉంటుంది.

ఒక చిన్న కథ : ఒక అంధుడు డాక్టరు దగ్గరికి వెళ్ళి తనకు చూపు వచ్చేలా చేయమని ప్రార్థిస్తాడు. డాక్టరు అతనితో నీకు ఆపరేషన్ చేస్తాను. అప్పుడు నీవు చూడగలుగుతావు. నీవు ఈ కర్ర అవసరం లేకుండా నడవగలవు, అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, 'డాక్టర్‌గారూ, మీరు ఆపరేషన్ చేస్తే నాకు తిరిగి చూపు వస్తుంది అన్న విషయం అర్థమైంది, కాని నేను కర్ర లేకుండా ఎలా నడవగలనో అర్థం కాలేదు,' అంటాడు.

కంటి చూపు లేని వ్యక్తిని, అతనికి చూపు వస్తే కర్ర లేకుండా ఏ విధంగా నడవగలదో చెప్పి ఒప్పించలేం. అతన్ని వివేకంతో ఒప్పించలేం. ఎందుకంటే నమ్మడు కాబట్టి. అతనికి చూపు వచ్చాక మాత్రమే తాను కర్ర లేకుండా నడవగలను అని తెలుసుకోగలడు.

అదే విధంగా మీరు మీ శరీరంలో, మానసికవ్యవస్థలో జీవించటానికి అహం అవసరంలేదు. మీ శరీరం లోపల, మీ మానసిక వ్యవస్త లోపల అహం లేకుండా జీవించగలరు. చూపు వచ్చిన వ్యక్తికి కర్ర ఏ విధంగా అవసరం ఉండదో, మీరు జీవించటానికి అహం అవసరం లేదు.

అహంకారం మమకారం గుర్తింపులు

మన అందరికీ రెండు రకాల గుర్తింపులు ఉంటాయి. మనం బయటి ప్రపంచానికి చూపించేది, మన అంతరంగంలో మనం అని నమ్మే గుర్తింపు. మన లోపల ఉండే గుర్తింపుని మమకారం అని అంటారు. అది మనం నిజంగా ఉన్నదాని కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. మీరు మీ అపజయాలనే గుర్తుంచుకుంటారు. మీరు గతంలో చేసిన తప్పలు, అపరాధ భావం వీటినే గుర్తుంచుకొని మీ గుర్తింపుని బాగుపరచటానికి నిరంతరం చెక్కుతూ ఉంటారు.

మీరు బయటి ప్రపంచానికి చూపించే గుర్తింపు అహంకారం. అది మీ విజిటింగ్ కార్డు. అందులో ప్రపంచం మీలో ఏదేది గుర్తించాలి అనుకుంటారో అవన్నీ ప్రింటు చేసారు. అది ఎప్పుడూ కూడా మీ నిజమైన మీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు అమ్ముకోవాలి అనుకుంటారు. కాబట్టి ఏ సమాజంలో అయితే మిమ్మల్ని మీరు అమ్ముకోవాలో ఆ సమాజంలో ఇది ఒక ప్రాథమిక అవసరం. ఆ కారణమే మీరు అంటే ఎక్కువగా చూపించాలి అని ఒత్తిడి చేస్తుంది.

అహంకారం నేను ఎక్కువ అనే భావం మీద ఆధారపడి ఉంటుంది. మమకారం తక్కువ అనే భావం మీద ఉంటుంది. అహంకారం భయం మీద ఆధారపడి ఉంటుంది. మమకారం ఆశ మీద ఆధారపడి ఉంటుంది. మీరు మీ శక్తిని అహంకారం మీద ఎక్కువగా ఉపయోగించి దాన్ని విస్తృతం చేయాలి అని చూస్తే మీరు ప్రాపంచికవిషయాల్లో ఎక్కువగా ఉంటారు. మీరు జీవితం అంతా మమకారాన్ని చెక్కుతూ దాన్ని మరింత బాగా చేయాలి అని చూసుంటే మీరు నీతిబోధకులవుతారు. అణచివేయబడినవారవుతారు. మీరు బయటి ప్రపంచానికి మీలోని శక్తిమంతమైన పాయింట్‌ని చూపిస్తారు. మిమ్మల్ని మీరు మీ లోపల గణించేటప్పుడు అత్యంత బలహీనమైన లింకుతో చూస్తారు. అహంకారమమకారాల మధ్య విభేదాలు, మీరు బయటి ప్రపంచానికి, లోపలి ప్రపంచానికి చూపించే వ్యక్తిత్వాల మధ్య పోరాటమే టెన్షన్ అంటే.

మీరు నిరంతరం ఈ రెండు గుర్తింపుల్ని కాపాడాలని చూస్తుంటారు. అవి పెరిగే కొద్దీ వాటి మధ్య పోరాటం కూడా పెరుగుతుంది. అదే మీకు సమస్యల్ని సృష్టిస్తుంది. ఇది ఎలా అంటే – ఒకేసారి ఇద్దరు స్త్రీలని వివాహమాడి వారితో ఒకే చోట కలసి ఉన్నట్లే. ఈ రెండు గుర్తింపులూ ఊహలే. మీరు నిరంతరంమోసే ఈ రెండు గుర్తింపుల కంటే ఉన్నతమైనవారు మీరు. ఈ రెండు గుర్తింపుల నుంచి పొందే స్వేచ్ఛనే నేను మోక్షం (ఆత్మజ్ఞానంతో పొందే స్వేచ్ఛ) లేదా నిర్యాణస్థితి అంటాను. అదే జ్ఞానోదయం. ఈ రెండు గుర్తింపులూ బంధాలే. ఎప్పుడైతే మీరు ఈ రెండింటికీ అతీతమైనవారమని తెలుసుకుంటారో మీరు జీవన్ముక్తులపుతారు.

నేను మీకు ఒక విషయాన్ని చెబుతాను. మీరు అనుకునే ఆ భావనని వదిలినప్పుడే మీరు చైతన్యవంతులవుతారు. అంతవరకూ మీరు జీవించి ఉన్నారు అనటానికి శ్వాస తీసుకుంటూ ఉంటారు, కాని మీ లోపల చైతన్యం ఉండదు. శ్యాస మీరు జీవించి ఉన్నారు అని చెప్పే ప్రామాణికం కాదు. శ్వాస తీస్తున్నాను కాబట్టి నేను జీవించి ఉన్నాను అని ఎప్పుడూ అనుకోవద్దు. మీరు బయటి ప్రపంచానికి, అంతరంగప్రపంచానికి కనబడేదాని కంటే కూడా చాలా ఉన్నతులు. ఎప్పుడెతే మీరు ఈ రెండు గుర్తింపుల నుంచీ విరామంగా ఉండగలరో మీరు జీవన్ముకులవుతారు. అంటే జీవించి ఉండగానే జననమరణచుక్రం నుంచి బయటికి వస్తారు. నేను మీకు చెబుతున్నాను మీరు భగవంతుని కంటే తక్కువ అని ఏది అనుకున్నా మీరు మీ కంటే తక్కువ స్థాయిలో ఉన్నారు అని అర్థం. ఎందుకంటే మీరు భగవత్ స్వరూపులు.

మీరు బంధవిముక్తులు అని మనస్సు మిమ్మల్ని నమ్మనీయదు

మీరు బంధవిముకులు అని మీ మనస్సు మిమ్మల్ని నమ్మనివ్వకపోవటానికి రెందు కారణాలు ఉన్నాయి. మీరు బయట ప్రపంచంలో దేనినైతే మీ గుర్తింపు అని అనుకుంటారో – అవి ఆస్త్రి, ఐశ‌ర్యం, బంధుతాలు, ఇలాంటివ‌న్నీ కూడా మీరు త‌యారుచేసుకున్న గొలుసులు ఆధారంగానే ఉంటాయి. మీరు ఆ గొలుసుల నుంచి స్వేచ్ఛని పొందితే మీ గుర్తింపులు పోతాయి. అందుకే మీ గురింపు పోతుందనేది మొదటి భయం.

తరువాత కారణం మీలోని నీతినియమాలు. మీరు అనగానే ఎలా ఏంచేయాలి అనుకుంటారో అది. మీరు మీ గుర్ధింపుని పోగొట్టుకుంటే మీలోని ఆలోచనలను ఒక దానికి ఒకటి లింకులు పెట్టే విషయాన్ని నమ్మనప్పుడు మీపై మీకు ఉన్న గుర్గింపు పోతుంది. మీరు బయటి ప్రపంచానికి చూపించే గుర్తింపు మీకు మీరు చూపించే గుర్తింపు రెండూ మాయం అవుతాయి. అప్పుడు మంచి ఏది చెడు ఏది, అని ఎలా తెలుసుకుంటారు? అలా నిర్హయించటానికి ఆధారం లేదు. అందుకే మీ మనస్సు మీరు బంధవిముక్తులని నమ్మనీయదు.

స్పష్టంగా అర్ధం చేసుకోండి. నేను నా అనుభవం నుంచి చెబుతున్నాను. నేను ఇంతవరకూ తన గుర్తింపుని పూర్తిగా భావించే ఒక్క వ్యక్తిని కూడా చూడలేదు. మీరు సంపూర్ణంగా అనుకోరు, ఎందుకంటే మీరు స్వచ్చంగా కచ్చితంగా ఉండాలి అని అనుకున్నా, దాన్ని ఏళ్ళ తరబడి సాధన చేసినా, మీరు అదే మనస్సుతో ఉంటారు. ఎందుకంటే మీకు అక్కడ నిజంగా లేని మనస్సుని చెక్కుతున్నారు. అది అక్కడ నిజంగా ఉంటే దాన్ని మీకు ఇష్టమైన విధంగా చెక్కుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినట్లు ఉంచుకోవచ్చు. కాని అదే లేదు. ఆ గొలుసే లేదు. ఇక అక్కడ చెక్కటానికి ఏముంది.

అష్ఠావుకుడు ఈ విధంగా చెబుతాడు. మీరు – బంధాలు లేని, రూపం లేని అన్నింటినీ గమనించేవారు.

మీరు మీ గుర్తింపు కాదు మీరు రూపం లేని దేనితోనూ బంధం లేని మీ చుట్తూ జరుగుతున్నదాన్ని గమనించేవారు మాత్రమే.

అహం, భయాన్ని ఉపయోగిసుంది

మీరు భయపడుతున్నంత కాలం అహంకారం మిమ్మల్ని ఆడిస్తుంది. మిమ్మల్ని ఎవరైనా ఆడించాలి అనుకుంటారో, బానిస చేయాలనుకుంటారో వారు ముందుగా మీలో భయాన్ని కల్పిసారు. అప్పుడు మీరు అతను లేకపోతే ఏ పనీ చేయలేను అని నమ్ముతారు. అది మీ ఇంట్తో కాని మీ ఆఫీసు లేదా వ్యాపారంలో కాని. అతను ముందు మీలో భయాన్ని సృష్టిసాడు. ఆ భయం ఎంత ఉందో అంత ఎక్కువగా మిమ్మల్ని ఆడిస్తాడు. అదే విధంగా మీ అహంకారం ముందుగా తాను లేకపోతే మీరు మీ శరీరంలో మానసిక వ్యవస్తలో జీవించలేరు అని మీకు నిరూపిసుంది. ఒకసారి భయం మీలోకి వస్తే, ఒకసారి అహం లేకుండా నేను జీవించలేను

అని నమ్మితే అది సులభంగా మిమ్మల్ని ఆడిస్తుంది. స్పష్టంగా అర్థంచేసుకోండి, అది కేవలం భయం మాత్రమే.

బంధవిముకి – అంటే చక్కగా పనిచేయటం

ఎప్పుడెతే ఆలోచనలకి లింకులు పెట్షం అని వింటారో మీరు భయపడతారు. నేను ఆలోచనలను కలిపి ఉంచకపోతే నా బిల్డులు ఎవరు కడతారు? నా ఆస్తి ఎవరు కాపాడతారు? నేను దబ్బు ఎక్కడ పెట్టానో ఎలా గుర్తు ఉంటుంది. అసలు నేను ఎలా జీవించగలను. ఈ సమాజంలో ఎలా నెగ్దుకురాగలను. నా ఉద్యోగం ఎలా చేయగలను? నా విషయాలన్నీ ఎలా జాగ్రత్తగా చూడగలను. నేను ఆఫీసుకి ఏవిధంగా వెళ్ళగలను? అనే భయాలు వస్తాయి. నేసు మిమ్మల్ని అడుగుతాను, మీరు ఆఫీసుకి ఎందుకు వెళ్ళలేరు. మీరు ఎప్పుడైతే ఈ ప్ర‌శ్న అడిగారో ఎక్శదో మీ అంతరంగంలో ఆనువంశకమైన అయిష్టత ఉద్యోగం పట్ల ఉన్నది అని అర్ధం. అందుకే ఏదైనా చిన్న అవకాశం రాగానే ఆ పని తప్పించుకోవాలి అని చూసారు. ఈ ప్రపశ్న అదగటం ద్వారా మీ దైనందినజీవితం పట్ల మీకున్న కోపాన్ని, కక్రని ఈ విధంగా చూపిసారు. అంతకు మించి ఏమీ లేదు. అసలు విషయం బంధాల నుంచి విముక్కి పొందటం ఇష్టం లేకపోవటమే.

మీకు అటువంటి ప్ర‌శ్నలు వచ్చినప్రుడు ఆలోచనలకి లింకులు పెట్టటం ఆపి ఒక పది రోజులు నిద్రపొండి. అందులో తప్పేమీలేదు. పది రోజులు సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్ళండి. నేను రెండు గుర్ధింపుల నుంచి విముక్కి పొందుతున్నాను, అని నిర్ణయించుకోండి. ఎన్ని రోజులు మీరు నిద్దపోగలరు? మీరు పనులు చేయకుందా ఎన్ని రోజులు ఉందగలరు. మీలో తమస్సు (త్రిగుణాలలో ఒకటి – సోమరితనం) పోతుంది, ఆ తరువాత పని చేయటం మొదలుపెడతారు.

బాధ్యత లేనితనం పని తప్పించుకోవటం అని అనుకున్నా పరవాలేదు. మీరు ఆలోచనలకి బంధాలు ఏర్పరచటం ఆపేయండి. అప్రుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. మీరు బంధవిముక్తులుగా ఉన్నప్పుడు సోమరితనం అసలు ఉండదు. మానసికంగా మీరు నిశ్నబ్దంగా ఉంటారు కాని భౌతికంగా చాలా ఉత్పాహంగా ఉంటారు. మీరు బాధ్యత లేని పని నుంచి తప్పించుకునే దృక్సథంతో ఉన్నప్పుదు, మానసికంగా చాలా చెతన్యంతో ఉంటారు. కాని భౌతికంగా త్వరగా అలసిపోతారు. మీరు బంధవిముకులైనప్పుడు భౌతికంగా చెతన్యంతో ఉంటారు. కాని మానసికంగా నిశ్శబ్దంగా ఉంటారు.

చూదండి, మీ శరీరంలో 33% సత్త్వం (జడత్వం నిశ్శబ్దం) అంటే స్వచ్చమైన నిశ్శబ్దం ఉంటుంది. 33% రజస్సు అంటే అసహనం ఉంటుంది. మిగిలిన 33% తమస్సు ఉంటుంది. తమస్సు అంటే గాధనిద్రద, సోమరితనం.

మీరు బంధ్రవిముకులు కండి. అప్రుడు మీలోని 33% సోమరితనం త్వరగా మాయం అవుతుంది. కొద్ది రోజులలోనే అది మీ వ్యవస్థ నుంచి మాయం అవుతుంది. అప్పుడు మీ అంతరంగంలోని మేధస్నుతో పనిచేయగలరు. అప్పుడు మీరు ఆశ, భయం అనే వాటితో మీ జీవితాన్ని గడపనవసరం లేదు.

మిమ్మల్ని పూర్తిగా ఆలోచించటం మానమని నేను చెప్పటం లేదు. నేను కేవలం బంధాలు పెట్లనప్పుడు మీ ఆలోచనలు అప్రయత్నంగా వస్తాయి అని చెబుతున్నాను. బంధవిముకులుగా ఉన్నప్సుడు ప్రారంభంలో అసలు ఆలోచనలు లేవు అనిపిస్తుంది. ఆ తరువాత అవసరమైనప్పుడు మీరు ఆలోచించగలరని, ఆలోచనల్ని కలపగలమని తెలుసుకుంటారు. అలోచనలు అవసరం లేదు అనిపించగానే మీ మనస్సు బంధవిముక్రమవుతుంది. అప్పుడు మీ మనస్సుని ఒక పనిముట్లులా వాడవచ్చు.

అప్పుడు మనం స్వచ్ఛమైన ఉత్పాహంలో జీవించవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే మనకి నమ్మకం ఉందదు. ఉత్సాహంతో జీవించగలం అనే ధైర్యాన్ని మనకి ఇవ్వరు. కొన్నిసార్హ మీరు ఏ కారణం లేకుండా ఉత్సాహంతో ఉరకలువేసూ ఉంటారు. కారణం లేకుండా మేధస్సుని నలుదిశలా వెదజల్లుతూ ఉంటారు. దానినే ప్రోత్సాహం, ఉత్పాహం, అంటాను. అది కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు మాతమే ఉండవచ్చు. కాని మీరు ఆ విషయాన్ని తెలుసుకోగలగాలి. అదే జీవనసరళి అని తెలుసుకోవాలి. మీరు బంధవిముక్తులుగా ఉంటే మీలో ఆ ఉత్సాహం నిరంతరం పొంగి ప్రపహిస్తూ ఉంటుంది. బంధవిముక్తి మేధస్సుని ప్రపకాశింపచేస్తుంది. అది అంతరంగశక్తిని కలిగిస్తుంది. అదే ఉత్సాహం, అదే బంధవిముక్తి.

మీ జీవితాన్ని నడపటానికి 'మీరు' అవసరమా?

ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోండి. మనకి అప్రయత్నంగా పని చేసే మేధస్సు ఉంటుంది. అదే మన రోజువారీ జీవితంలోని బాధ్యతలు చూసుకుంటుంది. అది జీవితాన్ని నడపటమే కాదు జీవితాన్ని నిర్వహిస్తుంది, అభివృద్ధి చేస్తుంది. విస్తృతం చేస్తుంది కూడా. కాని సమాజం మీ చిన్నతనం నుండి మిమ్మల్ని నిబంధనలలో ఉంచుతుంది. మీరు ప్లాన్ చేయకుండా, భయం, ఆశ లేకుండా అప్రయత్నంగా |బతకలేరు అని నేర్సిసుంది. మీ ఆత్మగౌరవాన్ని మీ నుంచి తీసేస్తుంది. అందుకే నిరంతరం మీరు ఆశని, భయాన్ని మీలో నింపుకుంటూ ఉంటారు. మీరు బ్రితకటానికి భయాన్ని, ఆశని, ఇంధనంగా వాదుకుంటారు.

స్సష్టంగా తెలుసుకోండి, భయం, ఆశలతో మీరు జీవితాన్ని నడపలేరు. మీరు భయం, ఆశలతో జీవితాన్ని ముందుకి నడిపితే మీరు నిరంతరం విసుగుని, అసహనాన్ని మోసూ ఉంటారు. నిద్ద లేచింది మొదలు నిద్ద పోయేవరకూ చికాకుతో ఉంటారు. ఎవరి మీదైనా విరుచుకుపడే అవకాశం కోసం చూసూ ఉంటారు. ఒక చిన్న కారణం చాలు ఎదుటివారి మీదికి విరుచుకుపడిపోతారు. ఎదుటివారు తప్రు చేయనవసరం లేదు, కేవలం మీ ముందుకి వస్తే చాలు, మీలో అసహనం ఉవ్వెత్తున లేస్తుంది. ఇదంతా కూడా జీవితాన్ని ఆశ, కోపాలతో ముందుకు నడపటం వల్ల కలిగిన శ్రమ వల్ల మాత్రమే. మీరు వీటి నుంచి విరామంగా ఉండగలిగితే విశ్వ మేధస్సు మీ జీవితాన్ని అందంగా ముందుకి తీసుకువెళ్ళుతుంది. మీ పనులన్నీ విశ్వశక్తి సహాయంతో అద్భుతంగా పూర్తి అవుతాయి.

చేసేది నేను కాదు – ఒక పద్తతి

అష్టావుకుడు ఈ విధంగా చెబుతారు.

అన్నీ చేసేది నేనే అన్న నల్లత్రాచు పాము అనే అహంకారంతో కాటు వేయబద్దారు. 'నేను కాదు అన్నీ చేసేది' అనే విశ్వాసంతో ఉన్న అమృతాన్ని తాగి ఆనందంగా ఉండండి. అష్తావుకుడు ఈ పద్ధతిని జనకమహారాజుకి బోధిసాందు. ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు నేను కాదు చేసేది అనే విషయం మీద నమ్మకాన్ని ఉంచగానే, ఆ భావన రాగానే మీకు స్వేచ్ఛ (ముక్తి) రాదు. ఈ పద్ధతి మీకు స్వేచ్ఛని ఇవ్వదు. అది మీరు అలసిపోయేలా చేస్తుంది. మీరు నిరంతరం నేను కాదు చేసేది అనే విషయాన్ని గురుంచుకోలేరు, ఈ విషయాన్ని నేను కాదు చేసేది అనే భావనని నిరంతరం గురుంచుకోలేకపోతున్నాను అనే నిరాశలో మీరు మీ మనస్సుని వదిలేసారు. ఎప్పుడెతే ఆలోచనలు ఆగిపోతాయో నేను కాదు చేసేది అన్న భావం నిజమవుతుంది. ఇక్కడ చెప్పిన పద్గతి ఇదే.

బంధవిముక్తి – ఆత్మపక్షాళనా।క్రమపద్ధతి

బంధ విముక్తి అనే దాన్ని సులభంగా అర్థం చేసుకునే పద్ధతి. ఎప్పుడైతే పాత ఆలోచనలకి మీరు అర్గాలని ఇవ్వటం ప్రారంభిస్తారో వెంటనే వాటి నుంచి బయటికి వచ్చేయండి. లేదా పాత ఆలోచనలని ఒకదానికొకటి దానికి లింకులు ఏర్పరుస్తారో, అది మిమ్మల్ని పట్టించుకునేలా చేయండి. మీ ఆలోచననీ సృష్టించవద్దు, పోషించవద్దు, అణిచేయవద్దు. ఎప్పుడైతే మీరు ఈ మూడూ చేయగలుగుతారో మీరు పరమహంస అవుతారు.

బంధాలు ఏర్సరచకపోవటం అంటే ఆత్మశుద్ధి కార్యక్రమం. ఆత్మపక్షాళనా కార్యక్రమం. ఏదైనా సరే మీకు స్వేచ్ఛని ఇచ్చే ఏ పద్దతైనా సరే మీరు సూక్ష్మస్థాయికి వెళ్ళగానే అది కూడా సూక్ల ంగా అయిపోవాలి. ఇది అటువంటి పద్లతి. ఏదైతే సూక్ష్మం కాదో అది పెద్దగా కనిపిస్తుంది. ఏ పద్ధతి అయితే తనని తాను నాశనం చేసుకోదో, తనంతట తాను మిమ్మల్ని వదిలిపోదో అది మిమ్మల్ని నాశనం చేసుంది. బంధవిముక్తి విషయంలో ఒక చక్కని విశేషం ఏమిటి అంటే మీరు సూక్ష్మంగా అయ్యేకొద్గీ అది మరీ సూక్ష్మంగా అవుతుంది. చివరికి అది కరిగిపోతుంది.

ధ్యానపద్ధతులు

శ్వాస ద్వారా బంధవిముకులవటం : మన శరీరంలో నిరంతరం జరిగే శాసతో బంధవిముక్తి ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉన్నదో చూద్దాం.

లోపలికి వెళ్ళే శాస, బయటకి వచ్చే శ్యాసలకి మధ్య శూన్వపదేశం ఉంటుంది. లోపలికి వెళ్ళే శ్యాస, బయటకి వచ్చే శ్యాసలో మీ గుర్తింపు ఉంటుంది. మీరు శ్యాస పైన ఏకాగ్రత నిలిపితే వాటిని ఒకదానితో ఒకటిగా కలిపి బంధాలు ఏర్పరచవచ్చు. కాని రెండు శ్వాసల మధ్య ఉన్న శూన్యపదేశంలో మీ గుర్తింపు ఉందదు. అప్పుదు ఖాళీని కలపలేరు. అందుకే ఆ శూన్యం మీది నుంచి దూకేస్తారు.

శ్వాససమయం, శూన్యసమయం కంటే ఎక్కువ ఉన్నట్లు అనిపిసుంది. ఎందుకంటే శ్వాస తీసుకునే సమయంలో మీలో అలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీ గుర్తింపుకి ఎక్కువ పాధాన్యమిస్తారు. అందుకే శ్వాసించేసమయం శూన్యం కంటే ఎక్కువ అనిపిస్తుంది. నిజానికి అది సరి కాదు. ఇది మీమనస్సు ఆదే ఆట.

బయటకి వెళ్ళే శ్వాస లోపలికి వెళ్ళే శ్వాస శూన్యపదేశం.

ధ్యానానికి సూచనలు : ఇది సూచనలతో ఉన్న ధ్యానం. ఒక్కసారి మీరు బంధవిముక్తి అనుభవాన్ని పొందితే మీరు ఈ పద్ధతిని సాధన చేయనవసరం లేదు. ఆ అనుభవాన్ని గురుంచుకోండి చాలు. అప్పుడు మీరు ఆ ।పదేశంలో ఉండగలరు. పారంభంలో మా(తం మీరు రిలాక్స్ కాగలగాలి. వేలాడే పక్రి ఎగిరిపోయిన విధంగా మీరు విముకులు కాగలిగితే, మీరు ఏ విషయాన్ని పట్టించుకోనవసరం లేదు. కళ్ళు మూసుకొని, నిటారుగా కూర్చోండి. ముందుగా మీరు శ్వాసని లోతుగా తీసుకోండి.

తరువాత లోపలికి తీసుకునే శ్వాసని మాత్రం గమనించండి. బయటకి వెళ్ళే శ్వాసని పట్టించుకోవద్దు. కేవలం లోపలికి వెళ్ళే శ్వాసనే మాత్రం గమనించండి. కేవలం చూడండి. లోపలికి వెళ్ళే శ్వాసనే జాగ్రత్తగా గమనించండి.

(ఐదు నిముషాలు గడిచాక)

ఇప్పుడు నెమ్మదిగా బయటకి వెళ్ళే శ్వాసని గమనించండి. లోపలికి వెళ్ళే శ్వాసని మరిచిపోండి. కేవలం బయటకి వెళ్ళే శ్వాసనే గమనించండి.

(ఐదు నిముషాల తరువాత)

ఇప్పుడు చాలా నెమ్మదిగా రెండు శ్వాసల మధ్య ఉన్న రెండు శూన్యప్రదేశాలను గమనించండి. లోపలికి వెళ్ళే శాస బయటకి వెళ్ళే శాసనా తిరిగే మలుపులో, అదే విధంగా బయటకి వెళ్ళే శ్యాస లోనికి తిరిగే మలుపుని గమనించండి. కేవలం ఆ ఖాళీ ప్రదేశాలని గమనించండి. కేవలం ఆ శూన్యపదేశాలనే గమనించంది.

(ఐదు నిముషాల తరువాత)

ఇప్పుడు లోపలికి వచ్చే శాసని, అక్కడి శూన్వపదేశాన్ని, బయటకి వెళ్ళే శాసని అక్కడి శూన్యపదేశాన్ని గమనించండి.

ఆలోచనలకి లింకులు పెట్టవద్ు. వచ్చే ఆలోచనలకి ఎటువంటి బంధాలూ ఏర్పరచవద్దు. మీరు ఆలోచిస్తున్నాను అని కూడా అనుకోవద్దు. మీరు ఆలోచనల్ని కలిపినప్పుడే ఆ ఆలోచన వస్తుంది. ప్రతిదీ స్వతంత్రమెంది, కాబట్టి వాటిని కలపవద్దు.

స్యతంతమైన ఆలోచన అనే గాలిబుడగని పెకి వచ్చిపోనీయండి. స్వతంత్రమైన ఆలోచనలు వస్తే రానీయండి పోనీయండి. వాటిని కలిపి ఆలోచిస్తున్నాను అని అనుకోవద్దు. బంధాలు చేయకుండా వాటి నుంచి బయటికి రండి. ఆలోచనలు వస్తే రానీయండి. పోతే పోనీయండి. మీరు ఆలోచిస్తున్నాను అన్నది అబద్దం. మనస్సు నుంచి బయటికి రండి. స్వేచ్చని పొందండి.

ఎక్కడెనా ఎప్పుడైనా బంధాల నుంచి విముకి పొందండి

మీరు కూర్చుని ఉన్నప్పుడు సహజంగానే ఆలోచనలు వస్తాయి. ఎప్పుడెతే ఆలోచన రావటం గమనిస్తారో దానికి అర్దాన్ని ఇవ్వకండి. మీరు వాటిని గతంతో కలిపితేనే వాటికి అర్థాలని ఇస్తారు. వాటికి అర్థాన్ని ఇవ్వకుండా వాటినుంచి విముక్తి పొందండి. అలా చేసి ఏమవుతుందో చూడండి. మీరు ఆలోచన నుంచి బయటకి రావాలి వాటికి అర్దాన్ని ఇవ్వకూడదు అనుకోగానే కొన్ని సెకంద్లపాటు నిశ్శబ్దం ఉంటుంది. ఎప్పుడైతే ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తారో అది మరొక ఆలోచన అవుతుంది. మీరు దాని నుంచి కూడా బయటికి రండి. అప్పుడు మరలా కొన్ని సెంకండ్లు ఖాళీ ఏర్పడుతుంది. అప్పుడు మరొక ఆలోచన వస్తుంది. నేను నిశ్మబ్దంగా ఉన్నాను అని లేదా నేను ఆలోచన నుంచి బయటకి వస్తున్నాను అని. ఆ ఆలోచన నుంచి కూడా బయటకి రండి. అప్పుడు నిశ్శబం లేదా ఖాళీ సమయం పెరుగుతుంది. అదే ఈ పద్ధతి ఉద్ధేశం.

సహజంగా మనస్సు అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుదైతే ఆ విధంగా తిరుగుతున్నది, అని అనుకోగానే దాని నుంచి బయటకి వచ్చేయండి. దీని గురించి ఎటువంటి అపరాధభావం అవసరం లేదు. దీని గురించి కంగారు పడవద్దు. గుర్తు రాగానే ఆ ఆలోచన నుంచి బయటకి వచ్చేయండి అంతే. పారంభంలో ఇది ఒక పెద్ద విషయంలా ఉంటుంది. మీరు విముక్తి పొందాలి అని ఒక మం|తంలా జపించాలి. కొంత సేపటికి అదిచాలా సూక్ల ్లంగా అవుతుంది. బంధవిముక్తి, ఆలోచనలని లింకులు పెట్టకుండా ఉంటే…

ప్రతిక్షణం కొత్తగా ఉంటుంది. ప్రతిక్షణం పారవశ్వంతో ఉంటారు. ప్రతిక్షణం సంతోషంగా ఉంటారు. ప్రపతిక్రణం ఉత్పాహం ఉరకలేస్తుంది. బంధవిముక్తి అనేది నిత్యోత్సాహానికి, నిత్యాసందస్సురణకి ఆధారం, మూలం.

아이폰

  • మీరు తెలుసుకునే తత్త్రంతో ఉన్నప్యడూ వచ్చిన ఆలోచనల మొత్తమే మీ జీవితం.
  • ★ సంతోషాల గొలుసు, బాధల గొలుసు అనేవి అసలు లేవు.
  • ★ మన జీవితంలో ప్రతి చిన్న సంఘటన స్యతంత్రమెంది.
  • మీరు చేయవలసినది మీరు సహజంగా బంధాలు లేని స్కేచ్ఛాజీవి అని నమ్మాఖి. ★ మీరు నమ్మకపారియనా అది సత్తం.
  • ★ మన శరీరం నిరంతరం కొత్తగా తయారవుతూ తనకి తాను కొత్త శరీరాన్ని ఏర్తరచుకుంటూ ఉంటుంది.
  • ★ మీరు బంధాలు ఏర్షరచకుండా ఉంటే మీరు మీ శరీరాన్ని చికిత్త చేసుకోశిసారు.
  • ★ ఎప్కడెతే మనం బంధాలు పెట్టకుండా, వాటి నుంచి విముక్తి అవుతామో, మన అంతరంగంలో చికిత్త ప్రారంభమై భౌతికంగా కూడా బాగుంటాము.
  • మీరు నా జీవితం నిరాశామయం అనే భావనరి సృష్టించుకుంటారు. ఆ ★ తరువాత దాంతో పారాడతారు.
  • ★ మీరు బంధవిముకులుగా ఉంటే భౌతికంగా చాలా చెతన్మంతో ఉంటారు. మానసికంగా నిశ్శబ్ధంలో ఉంటారు.

కర్తచక్రాన్ని చేదించవచ్చు

జీవస్ముక్తి అంటే మీ విధిని అదృష్టాన్ని

ఎప్పుడెతే మన మానసికవ్యవస్థ ఆలోచనల గొలుసులని బాధ, సంతోషాలతో చేస్తుందని మనం ఆ విధంగా గొలుసు తయారుచేయకుండా ఉందవచ్చు అని తెలుసుకుంటామో, అప్పడు నిజంగా మన మనస్సుని మనం చక్కగా ఉపయోగించగలం. అప్పుడు బుద్ధుడు చెప్పిన సంపూర్ణత్వంలో ఉండగలం. మనలోని ఆలోచనలు నిరంతరం మనని గతం నుంచి భవిష్యత్తుకి, భవిష్యత్తు నుంచి గతానికి తీసుకువెకుతుంటాయి. అలోచనలు మనని వర్గమానంలో ఉండనీయవు.

దీన్ని సృష్టంగా అర్థంచేసుకోండి, మనం వర్రమానంలో (ఈ క్షణంలో) ఉండగలిగితే భయం, ఆశ లేకుండా సమస్య నుంచి బయటికి రావచ్చు. భయం, కోరిక అనేవి లేకుండా మనం పనులు చేయవచ్చు. ఎలా అని మీరు అడగవచ్చు, నాకు కోరిక లేకపోతే ఏ పనీ చేయాలనే ప్రోత్సాహం ఉండదు అనవచ్చు. అసలు మీకు ప్రోత్సాహం అవసరం లేదు. మీలో ఏ ప్రోత్సాహం శ్వాస తీసుకునేలా చేస్తుంది, అహారం జీర్ణమయ్యేలా చేసుంది. అది మీలోని మేధాశక్తి. మనం ఉన్నా లేకపోయినా మనం జీవించే విధంగా, అభివృద్ధి చెందే విధంగా చేస్తుంది. మనం మన వల్ల జీవించటం లేదు. మనం లేకపోయినా జీవించగలం.

ఎప్పుడెతే దేంతోనూ అనుబంధాన్ని పెంచుకోకుండా పని చేస్తామో, అప్పుదు ఆ పని ఫలితాలు మనని అంటవు. ఆ పనుల నుంచి మనం కర్మలని సృష్టించం.

కర్మ అంటే ఏమిటి?

ఈశావాస్య ఉపనిషత్తులో చాలా అందమైన శ్రోకం ఉన్నది.

ఓంపూర్ణమదః పూర్ణమిదమ్ పూర్హాత్ పూర్ణముదచ్యతే పూర్లస్య పూర్లమాదాయ పూర్ణమేవావ శిష్యతే.

పూర్ణం నుంచి వచ్చినదే పూర్ణం. పూర్ణం నుంచి పూర్హాన్ని తీసేస్తే అక్కడ మిగిలేది పూర్ణం.

మనం సహజంగా పూర్ణత్వాన్ని కోరుకుంటాం. సహజంగానే మనం ఏ పని చేసినా అందులో సంపూర్ణత్వాన్ని పొందాలి అని చూస్కాం.

అది తినటం, తాగటం, ఎగరటం, చదవటం, మాట్లాదటం, నిద్ర పోవటం లేదా ధ్యాసం చేయటం, ఇలా ఏ పని చేసినా మన అంతరాత్మ దాన్ని పూర్తిగా అనుభవం చెందాలని, అందులో పూర్తిగా నిమగ్నవ్వాలి అని చూసుంది. మనం చేస్తున్న ప్రతి పనిలో పూర్తి చేతనస్థితిలో నిమగ్నమవుతామా? మన జీవితంలో ప్రతి క్షణాన్ని మనం తెలుసుకునే విధంగా జీవిస్తున్నామా?

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి ఒక టాక్సీలో ఎయిర్‌పోర్టుకి వెళుతుంటాడు. డ్రెవరు చాలా వేగంగా తీసుకువెళుతుంటాడు. మలుపుల దగ్గర, మూలల దగ్గర కూడా వేగం తగ్గించడు. ఆ వ్యక్తి భయంతో వణికిపోతుంటాడు.

అప్పుడు డైవర్ వణికిపోతున్న ఆ వ్యక్తిని చూసి 'నీవు నేను ఎలా చేసానో అలా చేయవచ్చు కదా! మలుపులు వచ్చినప్పుడు నేను ఎలా కళ్ళు మూసుకుంటానో నీవు అలా కళ్ళు మూసుకోవచ్చు కదా' అంటాడు.

ఎప్పుడు మీరు పూర్తి తెలుసుకునే తత్వంలో ఉందరో అప్పుడు మీరు ఏ పనిలో ఉన్నా మీ అంతరాత్మ ఆ అనుభవంతో సంతృప్తి చెందదు. అసంతృప్తిగా, అసంపూర్ణంగా ఉన్న ఆ అనుభవం అంతరంగంలో ఉండి అది నిరంతరం ఆ పనిని తిరిగి మరింత తీవ్రంగా చేసి పరిపూర్ణతని సాధించమని అటు వైపు లాగుతూ ఉంటుంది. ఇదే కర్మ అంటే. మనలోని తీరని అనుభవాల రాశి మన అంతరంగంలో ఉండి వాటిని సంపూర్తిగా సాధించమని, అటు వైపు లాగుతూ ఉండేవి కర్మలు అంటే.

దేన్నైతే మనం తీవ్రంగా, లోతుగా చేస్తామో, ఏదైతే లోతైన అనుభవాన్ని ఇస్తుందో అది మీ వ్యవస్థని త్వరగా వదిలేస్తుంది. అది మీకు స్వేచ్ఛనిస్తుంది. ఏ అనుభవం అయితే మనం పూర్తిగా లోతుగా దాని లోనికి వెళ్ళమో, ఏదైతే సంపూర్ణమైన సంతృప్ధినివ్వదో, ఏదైతే మన శక్తిని పూర్తిగా పొందదో, మన ఏకాగ్రతని, తెలుసుకునే తత్వాన్ని పొందదో అది మన అంతరంగంలో ఒక కర్మగా మిగిలిపోతుంది.

మన లోపల కర్మలు ఉన్నా, మనం సంపూర్ణమైన సంతృప్తితో ఉండే సంపూర్ణులం. కాబట్టి ఏ కర్మ అయినా సంపూర్తిగా సాధించలేకపోతే అది మన అంతరంగంలో ఎక్కువ కాలం విరామంగా ఉండలేదు. అది పరిపూర్ణత పొందటానికే ప్రయత్నిస్తుంది. అదే పనిని తిరిగి చేయమని పదే పదే మనని ఆ వైపు తోస్తుంది. ఏ కోరిక అయితే, ఏ అనుభవం అయితే మన లోపల పూర్తిగా సంతృప్తి చెందదో అది మన వ్యవస్థలో కర్మగా ఉండి ఆ పనిని చేయమని పదే పదే అటు వైపు మనని లాగుతుంది. ఆ అనుభవం పరిపూర్ణత పొందే వరకూ పదే పదే ఆ పనిని చేయమని ప్రోత్సహిస్తుంది.

మనం లోతైన అజ్ఞానంతో, సంతృప్తి లేకుండా, ఎటువంటి స్పష్టతా లేకుండా ఆలోచిస్తాం, మాట్లాడతాం, పనులు చేస్తాం. ఈ ఆలోచనలు, మాటలు పనులు కర్మ అనే ఒక బరువైన లగేజిని మనలో తయారుచేస్తాయి. ఎందుకంటే అటువంటి మాటలు, పనులు మనకి తృప్తినివ్వవు కాబట్టి. ఎప్పుడైతే అవి సంతృప్తినివ్వవో వాటి వైపు పదే పదే మనని తోస్తుంటాయి. ఆ కర్మల్ని ఏదో ఒక విధంగా సాధించేలా చేస్తాయి. మన ఆలోచనలు, మాటలు, పనులే మన కర్మలుగా మారుతాయి. అవి పరిపూర్ణ అనుభవం పొందేవరకూ ఏదో ఒక విధంగా ఆ పనిని చేసే విధంగా చేస్తాయి.

వర్తమానం మన పూర్తి గతం

ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు ఈ పుస్తకం చదువుతున్నారంటే గతంలో మీరు చేసిన నిర్ణయాల ఫలితమే. షాపులో ఉన్న పుస్తకాన్ని చూడాలి అనుకున్నారు, దాన్ని కొనాలి అనుకున్నారు, కూర్చుని ఈ పుస్తకాన్ని చదవాలి అని అనుకున్నారు. ఈ నిర్ణయాలు అన్నీ కలిపి ఇప్పుడు మీరు కూర్చొని ఈ పుస్తకాన్ని చదవగలిగేట్టు చేసాయి.

గతంలోని అన్ని నిర్ణయాల మొత్తం మీ వర్తమానం. అదే విషయాన్ని ఇప్పటికి వర్తమానానికి అన్వయిస్తే, ఈ వర్తమానం మీ భవిష్యత్తు అవుతుంది.

కర్మసిద్ధాంత సారాంశం ఇదే. మీ గతం మొత్తం మీ వర్తమానం. మీ వర్తమానమే మీ భవిష్యత్తు. ఇక్కడ సమస్య ఏమిటంటే మనం చాలా నిర్ణయాల్ని అచేతనస్థితిలో చేస్తాం. అచేతనస్తితో వేల కొద్దీ నిర్ణయాల్ని చేస్తాం. ఈ కారణం వల్లనే మనం కారణానికి ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోలేకపోతున్నాం.

మీ ఆలోచనావ్యవస్థ లోనికి చాలా ఎక్కువగా తెలుసుకునే తత్వాన్ని, వివేకాన్ని ప్రవేశపెట్టండి. మీ నిర్ణయాల వ్యవస్థ లోనికి ఎక్కువ తెలుసుకునే తత్వాన్ని, ఎక్కువ చేతనస్థితిని ప్రవేశపెట్టండి.

ఏ క్రమంలోనైనా మీ భవిష్యత్తు నిబంధనలతో ముందుగా నిర్ణయించబడిందే. ఆ సమయం వరకూ భవిష్యత్తు ఇప్పటి సంఘటనలు ఆధారంగా కచ్చితమైనదే. అదే నిర్ణయించబడిన భవిష్యత్తు అయితే అది నిబంధనలతో ఉంటుంది. అయితే దీన్ని మార్చగలది, మార్చేది, ఒకటి ఉంది, అదే చేతనస్థితి.

చిన్నకథ : అన్నదమ్ములు ఇద్దరు ఒక యోగి దగ్గరకి వెళ్ళి తమ భవిష్యత్తు చెప్పమని గౌరవంతో ప్రాధేయపడతారు. యోగి వారితో మీరు భవిష్యత్తు తెలుసుకోవటం అంత మంచిది కాదు, అయినా అది ఎప్పుడైనా మారవచ్చు అంటాడు. కానీ వారు తమ భవిష్యత్తు చెప్పమని పట్టుపడతారు. ఆ యోగి అన్న వైపు చూసి, ఒక సంవత్సరంలో నీవు రాజువుతావు అంటాడు. తమ్ముడి వైపు చూసి సంవత్సరంలో నీవు ఒక హంతకుడి చేతిలో మరణిస్తావు అని చెబుతాడు.

అన్నదమ్ములు ఇంటికి బయలుదేరతారు. అన్న చాలా సంతోషంగా ఉంటాడు. తమ్ముడు చాలా నిరాశలో ఉంటాడు.

అన్న తాను రాజెనట్టు ఊహల్లో ఉంటాడు. తమ్ముడు తాను జీవించే ఈ కొద్ది కాలం బాగా ఉండాలి అని చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తిరుగుతూ ఆధ్యాత్మికసేవ చేస్తూ నిరాశ నుంచి బయటకి వస్తాడు.

ఆ విధంగా పదకొండు నెలల సమయం గడచిపోతుంది. ఒకరోజు అన్న, తమ్ముడిని తీసుకొని తాను రాజు అయితే తాను కట్టుకోబోయే రాజభవనానికి తగిన స్థలం చూడటానికి

కర్మచక్రాన్ని ఛేదించవచ్చు

వెళతాడు. వాళ్ళు నడిచివెళుతుండగా వారికి సగం భూమిలో పూడ్చిన కుండ కనిపిస్తుంది. దాన్ని తవ్వి బయటకి తీస్తే దాని నిండా బంగారు నాణాలు ఉంటాయి.

అన్నకి అత్యంత ఉత్సాహం కలుగుతుంది. ఈ ఐశ్వర్యం నా కోసమే. దీనితో రాజభవనాన్ని కట్లుకుంటాను. నా రాజ్యాన్ని స్థాపిస్తాను అని అరుస్తాడు. అప్పుడే ఒక దొంగ వారి మీదికి దూకి అన్నని గట్టిగా కొట్టి ఆ కుండని లాక్కోబోతాడు. తమ్ముడు ఆ దొంగ మీదికి దూకి అన్నని రక్షించాడు. దొంగ తమ్ముడిని కత్తితో గాయం చేసి అక్కడి నుంచి పారిపోతాడు.

అన్నకి తమ్ముడి పట్ల చాలా కృతజ్ఞత కలుగుతుంది. కుండలోని సగం బంగారం తమ్ముడికి ఇస్తాడు. తమ్ముడు తాను ఎక్కువ కాలం ఉండనని, తనకి అవసరం లేదని బంగారాన్ని తీసుకోడు. అన్న ఆ బంగారంతో విలాసాలలో మునిగిపోతాడు.

ఆ విధంగా సంవత్సరం గడిచిపోతుంది. అన్న రాజు అయ్యే సూచనలు ఎక్కడా కనిపించవు. తమ్ముడు ఆరోగ్యంతో ఉంటాడు. వారిద్ధరూ యోగి దగ్గరకి వెళ్ళి ఆయన చెప్పిన విషయం ఎందుకు తప్పు అయ్యింది అని అడుగుతారు. యోగి ధ్యానంలోకి వెళ్ళి 'నేను చెప్పాను కదా మీ భవిష్యత్తు మారవచ్చు అని' అంటాడు.

యోగి అన్న వైపు చూసి, 'నీ బాధ్యతారహితమైన పనుల వల్ల నీ భవిష్యత్తు మారింది. రాజు కావలసిన నీకు కుండ బంగారంతో అది సరిపెట్టింది' అంటాడు.

తమ్ముడి వైపు చూసి, 'నీ ఆధ్యాత్మిక జీవనసరళి వల్ల సర్వాంతర్యామి నీ మరణాన్ని హంతకుడి చేతిలో చిన్న గాయంగా మార్సేసాడు.' అంటాడు.

అర్థం చేసుకోండి, భవిష్యత్తు అనేది ఒక రాతి మీద చెక్కి ఉండదు. అది మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి మీరు ఏ విధంగా స్పందిస్తారో దాని ఆధారంగా ఉంటుంది. మీలోని తెలుసుకునే తత్వం మీకు కావలసిన వివేకాన్ని ఇస్తుంది. అది మీ జీవితంలో జరిగే సంఘటనల్ని మార్చే ధైర్యాన్ని ఇస్తుంది.

కర్మ, టి.పి.ఎస్

మీకు మీ గతం పూర్తిగా తెలియనప్పుడు మీరు అదే గతంలోని విషయాలనే తిరిగి చేస్తారు. మీలో సెకండ్‌కి వచ్చే ఆలోచనల సంఖ్య (థాట్స్ పర్ సెకండ్, టి.పి.ఎస్.) బాగా తగ్గినప్పుడు గతాన్ని జరిగినదాన్ని జరిగినట్టు తెలుసుకుంటారు. అప్పుడు మీరు దాన్నే తిరిగి చేయరు. అప్పుడు మీరు కర్మముక్తులు అవుతారు. అంటే కర్మ నుంచి స్వేచ్ఛని పొందుతారు. ప్రస్తుతం మీరు కర్మబందీలు. ఎందుకంటే మీ గతాన్ని మీరు పూర్తిగా జీవించలేదు కాబట్టి.

ఉదాహరణకి చిన్నతనం రోజులు బంగారు రోజుల్లా అనిపిస్తాయి. గతం ఎప్పుడూ బంగారం అనుకుంటారు. ఆ తరువాత కాలేజి రోజులు చాలా బాగున్నాయి అనిపిస్తుంది. కాని

మీరు నిజంగా కాలేజీలో ఉన్నప్పుడు మీరు అసలు అలా అనుకోరు, ఎందుకు? ఎందుకంటే మీరు అప్పుడు పడిన బాధ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి అప్పుడు గతంతో ఇపుటి స్థితిని పోల్చిచూస్తే గతమే బాగున్నట్లు అనిపిస్తుంది. అందుకే గతం చాలా సంతోషంగా ఉంది అంటారు. మీరు ఆ సమయంలో జీవించినప్పుడు మీకు ఆ విధంగా అనిపించిందా? లేదు.

మీరు ఈ క్షణంలో ఆలోచనలు సున్నా స్థాయిలో ఉండే స్థితికి వచ్చి అక్కడ 11 క్షణాలు ఉండగలిగితే, మీరు కాలం అనే గొలుసు గుండా వెళ్ళగలుగుతారు. అదే సున్నా ఆలోచనల స్థాయిలో 21 క్షణాలు ఉండగలిగితే, మీరు కాలం అనే గొలుసుగుండా వెళ్ళి మీ భవిష్యత్తుని మార్చగలరు. అది మీ చేతుల్తోనే ఉన్నది.

ధ్యానపద్ధతులన్నీ మీ టి.పి.ఎస్. ని తగ్గించే పద్ధతులే. అప్పుడు మీరు కాలగమనంలోకి చొచ్చుకుపోగలరు.

క్షణం

క్షణం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. క్షణం అనే మాటకి సమానమైన పదం ఇంగ్లీషులో లేదు. క్షణం అంటే ఏమిటో వివరిస్తాను. క్షణం అంటే కాలాన్ని కొలిచేది. అయితే మీరు అనుకున్నట్లు నిముషంలో ఉండే సెకండ్ కాదు.

రెండు ఆలోచనల మధ్య ఉండే ఖాళీనే క్షణం అంటే. మనందరికీ కాలం అనగానే ఉన్నది ఉన్నట్లుగా చూడటమే తెలుసు కాని కాలం పోలికతో ఉంటుంది. ప్రతి మనిషిలో ఆలోచనలు వచ్చే వేగం చాలా వేరుగా ఉంటుంది. కాబట్టి క్షణం మనిషి మనిషికీ మారుతూ ఉంటుంది.

ఏ వ్యక్తి అయితే అసహనంతో ఉంటాడో, అతనికి ఒక సెకంద్‌కి చాలా ఆలోచనలు వస్తాయి. ఆ వ్యక్తి క్షణం చాలా చిన్నది. ఎందుకంటే అతని రెండు ఆలోచనల మధ్య ఖాళీ చాలా చిన్నది. ఏ వ్యక్తి అయితే విరామంగా, శాంతంగా ధ్యానంలో కూర్చుని ఉంటాడో అతని ఆలోచనల సంఖ్య తక్కువగా ఉంటుంది. అతని క్షణం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రెండు ఆలోచనల మధ్య ఖాళీ ఎక్కువగా ఉంటుంది.

కర్మ–చేతన స్థితిలో చేసే ఎంపిక మొత్తం

మీ జీవితం అంటే చేతనస్థితిలో నిరంతరం మీరు చేసే నిర్ణయాల మొత్తం. మీరు కావాలన్నా, వద్దు అన్నా, ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మీరు నిరంతరం ఎంపిక చేస్తూనే ఉంటారు. ఎవరో మీకు ఎంపిక చేయరు. మీరే చేస్తారు.

చిన్నకథ : ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తి బాస్ దగరికి వెళ్ళి 'నా భార్య జీతం పెంచమని మిమ్మల్ని అడగమన్నది,' అంటాడు. బాసు, 'అలాగా! నేను నా భార్యని అడిగి నీకు జీతం పెంచాలా వద్దా నిర్ణయిస్తాను' అని జవాబు ఇస్తాడు.

అర్ధంచేసుకోండి, నిరంతరం ఎంపికలు చేసేది మీరే. మీ నిర్ణయాలు మీరు చేస్తారు. మీరు అనుకుంటారు ఎవరో నిర్ణయించారు అని కాని నిర్ణయించేది మీరే.

ఈ సత్యం అర్ధమయ్యేలా మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. ఎవరైనా మిమ్మల్ని విమర్శించారనుకోండి. మీరు గాయపడాలి, బాధపడాలి అని నిర్ణయించుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే సంతోషపడాలి అని నిర్ణయించుకుంటారు. మీకు ఉండే అలవాటుతో మీకు తెలియకుండా మీ అచేతనస్థితిలో నిర్ణయాలు చేసారు. ఎవరో చేసే నిర్ణయం కాదు. అది మీరు చేసే ఎంపిక. ఎవరో మీ నిర్ణయాల్ని ప్రభావితం చేసారు అని ఆలోచించటానికి అలవాటు పడిపోయారు. కాబట్టి మీరు ఎంపిక చేస్తున్నారు అన్న విషయాన్ని మరిచిపోయారు. ఎవరైనా విమర్శిస్తే బాధపడాలి అనేది మీ ఎంపిక ఎప్పుడైనా ఎవరైనా మెచ్చుకుంటే సంతోషపడటం మీ నిర్ణయం. ఇది ఎవరో చేసే ఎంపిక కాదు. అది మీ నిర్ణయం. మీరు ఏదో ఒకటి నిర్ణయించవచ్చు. ఎవరెనా విమర్శిస్తే బాధపడనవసరం లేదు అని మీరు నిర్ణయించుకోవచ్చు. బాధపడాలా, వద్దా అన్నది మీ నిర్ణయం.

ప్రతి నిమిషం మీరు చేతనస్తితిలో చేసే ఎంపికల మొత్తం కలిసి మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. నిర్ణయం మీరు చేయకుండా, సంఘటనలు నిర్ణయించే విధంగా చేస్తే మీరు మీలో కొంత భాగం చచ్చుపడిపోయినట్టు భావిస్తారు. మన జీవితాలు ప్రస్తుతం పక్షవాతంతో ఉన్నాయి. ఎప్పుడెతే మీ జీవితం బయటి సంఘటనల ఆధారంగా కాకుండా, నిర్ణయాలని మీ మీద బలవంతంగా మోపకుండా జీవిస్తారో, మీరు నిజంగా జీవించటానికి నిర్ణయించారు అని అర్థం.

జీవితంలో ప్రతిదీ మీ ఎంపిక, మీ నిర్ణయం

మనం రోజుకి కొన్ని వేల నిర్ణయాలు చేసాం. అది ఆలోచించటం, మాట్లాడటం లేదా వంట చేయటం ఏదైనా సరే, చేయాలి కాబట్టి చేస్తాం.

మీరు భోజనం చేసేటప్పుడు పూర్తిగా అందులోనే నిమగ్నమవుతారా? భోజనం చేసే సమయంలో సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాలో ప్లాను వేస్తారు లేదా పని ఎలా బాగా చేయాలి అని ఆలోచిస్తారు. ఆహారం లోపలికి వెళుతూ ఉంటుంది. కాని మీరు ఆ రుచిని పూర్తిగా, సంతోషంగా అనుభవించరు. మీరు తెలుసుకునే తత్త్వంతో భోజనం చేస్తే అప్పుడు ఏ రకమైన ఆహారం ఎంత తీసుకోవాలో మీకు తెలుస్తుంది.

మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని మీరు జీవితంలో ప్రతి దాన్నీ నిర్ణయిస్తారు. మీ జీవితంలో వేరే ఎవరో నిర్ణయాలు చేయరు. మీరే ఎంపిక

చేసుకుంటారు. నిరంతరం ప్రతిదీ మీ ఎంపిక, మీ నిర్ణయం మీరు అనుకుంటారు వేరే ఎవరో మీ జీవితాన్ని నిర్ణయిసారు అని, అది సరి కాదు! అన్నీ ఎంపిక చేసుకునేది మీరే.

ఎవరైనా విమర్శిస్తే బాధపదాలి పొగిడితే సంతోషపదాలని మీరు అచేతనస్పితిలో స్పందించటం వల్ల ఆ విధంగా అలవాటు పడిపోయారు. ఇది వేరే ఎవరైనా నిర్ణయించారా? లేదు. ఇది పూర్తిగా మీ ఎంపిక. అది అలవాటుగా మారింది, కాబట్టి మీరే నిర్ణయిస్తారు, అనేది మరిచిపోయారు.

చిన్నకథ : ఒక వ్యక్తిని శాస్త్రవేత్త భోజనానికి ఆహ్వానిస్తాడు. ఆ వ్యక్తి టేబుల్ దగ్గర కూర్చుని గోడకి ఉన్న గుర్రం నాదాని గమనిస్తాడు. అది అదృష్ఠాన్ని తెస్తుంది అని ఒక నమ్మకం. ఆ వ్యక్తి నిర్ఘాంతపోయి శాస్త్రజ్ఞుడితో, సార్! నేను నమ్మలేకపోతున్నాను. మీరు శాస్త్రజ్ఞుడై ఉండి ఇలాంటివి ఎలా నమ్ముతారు? గుర్రం నాదా అదృష్టం ఇస్తుంది అని ఎలా అనుకున్నారు? అని అంటాడు.

అప్పుడు ఆ శాస్త్రవేత్త 'అబ్బే లేదు! ఇలాంటి మూఢనమ్మకాలు నాకు లేవు. ఇది ఇచ్చిన వ్యక్తి నేను నమ్మినా నమ్మకపోయినా ఇది అదృష్టాన్ని తెస్తుంది అని చెప్పాడు' అని జవాబు ఇస్తాడు.

ఎలా స్పందించాలో మీరు నిర్ణయిసారు. అయితే ఎవరి మూలానో మీరు నిర్ణయాలు చేసాను అని నమ్మి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. వాళ్ళు ఇష్టపడినట్టు మీతో పనులు చేయిస్తున్నారు అనుకుంటారు.

అర్థం చేసుకోండి, మీరు వేరుగా స్పందించవచ్చు అని మీరు నిర్ణయం చేయవచ్చు ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే బాధపడకూడదు అని మీరు నిర్ణయించుకోవచ్చు. విరామంగా, నిశ్చలంగా ఉండాలి అని నిర్ణయించుకోవచ్చు. బాధపడటం అనేది మీ నిర్ణయం.

మనం ఎప్పుడూ మనకి ప్రతికూల ఫలితాలు వస్తాయి అని అనుకుంటాం. ఇలా ఎందుకు అనుకుంటామంటే కారణానికి, ఫలితానికి మధ్య సంబంధం తెలియదు కాబట్టి. ఆ విధంగా తెలియకుండానే మన జీవితంలో చాలా విషయాలు జరుగుతుంటాయి. అయితే మనం వాటికి కారణం మనం అని తెలియకుండా గడిపేస్తాం. అచేతనస్థితిలో జీవిస్తూ అవి అలా జరిగేలా చేస్తాం. చివరికి అనేక కర్మల్ని పోగుచేసుకుంటాం.

వాసన, సంస్కారం, కర్మ

సంస్కృతంలో వీటికి సంబంధించి మూడు విషయాలు ఉంటాయి. అవి వాసన, సంస్కారం, కర్మ.

వాసన : వాసన అంటే కోరిక తాలూకు విత్తనం, ఉదాహరణకి, మీరు నడిచి వెళుతూ షాపులో పెట్టిన మెరిసే నెక్లెస్ చూసారనుకోండి, దాన్ని పొందాలి అనే కోరిక కలుగుతుంది. ఇది వాసన అంటే.

సంస్కారం : వాసన అనే విత్తనం మొలకెత్తితే వచ్చే మొక్క సంస్కారం. ఆ నెక్లెస్‌ని మరీ మరీ చూస్తూ ఉంటే దాన్ని పొందాలి అనే కోరిక బలమవుతుంది. ఎపుడైతే దాన్ని పొందాలి అనే కోరికబలమవుతుందో, అది మొక్కకి నీరు, ఎరువులా అవుతుంది. ఇది వాసన అనే విత్తనానికి బలాన్ని ఇస్తుంది.

అంతరంగంలో జరిగే కల్మషాన్నే నేను సంస్కారం అంటాను. అవే లోతుగా నాటబడే జ్ఞాపకాలు. అవి జ్ఞాపకాలుగా మీ అంతరంగంలో స్థిరపడి పదే పదే ఆ అనుభవం కోసం మిమ్మల్ని అటుగా లాగుతూ ఉంటాయి. అవి మీరు అదే పనిని తిరిగి చేసేలా పదే పదే లాగుతూ ఉంటాయి. అవే ఆలోచనలు కలిగేలా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అదే పని చేయమని అటు లాగుతూ ఉంటాయి. ఈ జ్ఞాపకాలనే నేను సంస్కారాలు అంటాను.

ఏ సంస్కారమైతే మీ చేతనస్థితిలో కాని అచేతనస్థితిలో కాని పని చేస్తుందో అదే మీరు సంపూర్ణత్వాన్ని సాధించటానికి ఉండే అడ్డంకి. సంస్కారాలలో మంచివిచెడువి అని ఉండవు. ఏ సంస్కారం మంచిది కాదు. సంస్కారాలతో అంతరంగం నిండిపోయి ఉంటే అది నరకం. సంస్కారాలు లేని అంతరంగం స్వర్గం. సంస్కారాల్ని మంచిచెడులుగా విభజించవద్దు.

సహజసిద్ధంగా సంస్కారం అంటేనే వ్యతిరేకమైంది. అది కుంగుబాటుతనంతో ఉంటుంది. సంస్కారాలతో ఏ పని చేసినా అది శూన్యంగా ఉంటుంది, విసుగుపుడుతుంది. స్వచ్ఛమైన అంతరంగం నుంచి లోతుగా అర్ధం చేసుకొని మీరు ఏంచేసినా అది మీకు నాణ్యతని, విలువని కలుపుతుంది. సంస్కారాల నుంచి చేసే పని మిమ్మల్ని బందీలని చేస్తుంది.

చిన్నతనం నుంచి రకరకాల సంస్కారాలని రకరకాల మార్గాలలో మనం పోగుచేసుకుంటాం. వాటిని పోగుచేసుకొని మరింతగా పెంచుతాం. అవి వాటంతట అవే ఏ పనీ చేయకపోయినా పెరిగిపోతాయి.

సంస్కారాలు రకరకాల మార్గాల ద్వారా బలపడుతుంటాయి. కొన్ని సంస్కారాలు కొన్ని పనుల ద్వారా మాత్రమే బలపడతాయి. ఆ పని తిరిగి చేసినప్పుడు ఆయా సంస్కారాలకి శక్తి వస్తుంది. కొన్ని సంస్కారాలు కేవలం బయటి ప్రపంచం నుంచి కొంత సమాచారం మీలోకి చేరటం ద్వారా బలపడతాయి. కొన్ని సంస్కారాలకి మీరు ఏ పనీ చేయనవసరం లేదు. మీకు సమాచారంతో పని లేదు. కేవలం వాటిని గుర్తుకుంటే చాలు, అవి బలంగా అవుతాయి.

మనం రకరకాల స్థాయిలలో సంస్కారాల్ని పోగుచేసుకుంటాం. వాటిని మన అంతరంగ వ్యవస్థలో నిలవచేసి వాటిని అభివృద్ధి చేస్తుంటాం.

కోరిక ప్రోద్భలంతో ఆ పనిని చేస్తే అది కర్మ అవుతుంది. కోరిక శక్తితో మీరు నెక్లెస్ కొంటారు, ఆ పని కర్మ.

ఏ పనెనా సగం చేస్తే అది మీ అంతరంగంలో ఒక సంస్కారంగా మిగిలి పోతుంది. దేంట్లోనైతే పూర్తిగా జీవించరో దాని శేషభాగం సంస్కారంలా మీలో మిగిలిపోతుంది. అదే మిమ్మల్ని మళ్ళా మళ్ళా అదే పని చేసే విధంగా ఆ పని వైపు లాగుతుంది. అది పూర్తిగా తీరే వరకూ అటు వైపు లాగుతుంది.

అలవాట్లు కూడా సంస్కారాల వల్ల ఏర్పడతాయి. నాకు కొన్ని వేలమందితో ఉన్న వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నాను. ధ్యానం ద్వారా వారు అలవాట్లని వదిలేయగలిగారు. ఇందులో సత్యం ఏమిటంటే మీరు జీవితాన్ని అస్పష్టంగా, అసంపూర్తిగా జీవిస్తారు కాని సంపూర్తిగా కాదు. ఆ విధంగా పూర్తిగా జీవించని కోరికలు, ఆ కోరిక వైపు పదే పదే బలంగా లాగుతూ ఉంటాయి. తీరని కోరికలు మీ లోపల సంస్కారాలని స్పష్టించి తిరిగి అదే అనుభవాన్ని పొందమని పదే పదే ఆ కోరిక వైపు బలంగా లాగుతాయి.

ఏ భావావేశంలో అయితే మీరు లోతుగా జీవిస్తారో మీరు దాని నుంచి స్వేచ్ఛని పొందుతారు. అది కోపం కావచ్చు. భయం, తినాలి అనే కోరిక లేదా ఏదైనా వస్తువు, వ్యక్తి పట్ల మీకు ఉన్న అనుబంధం. మీరు దాంటో పూర్తిగా జీవిస్తే అది మిమ్మల్ని పూర్తిగా వదిలేస్తుంది. ఎవరెనా ఒక వ్యక్తి పదే పదే ఒక సమస్య వైపు వెళుతున్నారు అంటే అర్థం వారు దాంటో పూర్తిగా జీవించలేదు అని.

మనం జీవించేటప్పుడు మన మనస్సు సగభాగం ఎక్కడో ఉంటుంది. పతంజలి చాలా చక్కగా చెబుతాడు, 'పరిమాణం పెరిగితే నాణ్యత తగ్గుతుంది,' అని. ఎప్పుడెతే ఒక వస్తువు నుంచి పొందే సంతోషం పెరుగుతుందో, దాని పరిమాణం తగ్గుతుంది, కాబట్టి నాణ్యతని పెంచాలి.

జీవితం ఒక చిన్న కొవ్వొత్తి కాదు. అది ప్రకాశవంతంగా వెలుగుతున్న ఒక కాగడా. దాన్ని ఎంత ప్రకాశవంతం చేయగలరో అంత ప్రకాశవంతం చేయండి.

ఏడు శరీరాల సంస్కారాలు

మన వ్యవస్తలో ఏడు శక్తి శరీరాలు ఉంటాయి. అందులో మొదటిది భౌతికశరీరం. అది రకమాంసాలతో తయారవుతుంది. అదే మిమ్మల్ని మోస్తూ తిరుగుతుంది.

రెండవ శరీరం ప్రాణశరీరం. అందులో ప్రాణం తిరుగుతూ ఉంటుంది. ప్రాణం అంటే మీరు శ్వాస తీసుకున్నప్పుడు శ్యాస ద్వారా మీ లోపలికి వచ్చే జీవశక్తి. మీ జీవితాన్ని నిలిపే

కర్శచక్రాన్ని ఛేదించవచ్చు

కర్మ

ఆ దశల్లోనిదే ప్రాణశరీరం లేదా శ్యాస శరీరం.

ఆ తరువాతిది మానసికశరీరం. మనలో నిరంతరం సాగే మాటలు, ఆలోచనల ప్రవాహాన్ని అంతరంగపు మాటలు అంటాను. ఆ అంతరంగపు మాటలు నిరంతరం మానసికశరీరంలో ఉంటాయి. అదే మానసికశరీరం.

నాలుగవ శరీరం భావావేశాల శరీరం. మీలోని తర్శానికి, వివేకానికి కూడా అర్థం కాని లోతైన అంతరంగపు మాటలే మీ భావావేశాలు.

గాఢనిద్రలో మీరు అనుభవించే లోతైన నిశ్శబ్దమే ఐదవ శరీరం. దీన్ని కారణశరీరం అంటారు.

లోతైన ధ్యానంలో, ఆలోచనలు లేని స్థితి లోనికి మీరు వెళ్ళినప్పుడు, పూర్తి తెలుసుకునే తత్వంతో ఉన్నప్పుడు మీ లోపల ప్రతి ధ్వనించే నిశ్శబ్దం ఏర్పడుతుంది. అందులో మీకు అద్భుతమైన సంతోషం ఉంటుంది. అదే అరవ శరీరం. ఏడవ శరీరం జ్ఞానోదయం. మనం ఈ ఏడు శరీరాల్లో రకరకాల సంస్కారాలని పోగుచేసి ఉంచుతాం.

భౌతికశరీరం – లోతైన దీర్ఘకాల శ్రమ

భౌతికశరీరంలో దీర్ఘకాలం నిలువచేయబడి ఉంటుంది. అందుకే మీరు ఏదైనా చేయాలి అని అనుకోగానే, అది చిన్న పని కాని లేదా నడవాలి అనుకున్నా, ఎక్సర్‌సైజు చేయాలనుకున్నా ముందుగా మీ శరీరం అలసటని ముందుకి తెస్తుంది. ఇటువంటి మొదటిదశ సంస్కారాల్ని పట్టించుకోకుండా మీరు చేయదలచుకున్న పనిని చేస్తే అకస్మాత్తుగా ఆ పని మీకు శక్తిని ఇస్తుంది. మీరు నడవటం ప్రారంభించగానే మీ మనస్సు పదిసార్లు చెబుతుంది, 'నేను అలసిపోయాను ఇక చాలు ఇప్పటికే ఎక్కువ నడిచాను. ఈ రోజుకి ఇది చాలు, రేపు ఇంకొంచెం ఎక్కువ నడవవచ్చు,' ఇలా చెబుతుంది. మీరు మీ మనస్సు చెప్పే మాటలు ఈ సంస్కారాల్ని వినకుండా ముందుకి వెళితే, కొద్ది నిముషాల్లో ఆ పని మీలో కొత్త శక్తిని తెస్తుంది.

చాలాకాలంగా ఉండిపోయిన లోతైన అలసట మిమ్మల్ని నిరంతరం ఏ పనీ చేయకుండా విశ్రాంతిగా ఉండే విధంగా చేసే లక్షణం భౌతికశరీరంలో నిలువ ఉంటుంది. దీర్ఘకాలిక విశ్రాంతి కోసం అలమటించేవారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ కోరికే మీలోకి వ్యాధులని తీసుకువస్తాయి. అవే మిమ్మల్ని మంచం మీద ఉండేలా చేస్తాయి.

సెలవులో గడిపే రిసార్టుల అడ్వర్టైజ్‌మెంట్లు చూడండి. చక్కని బీచ్, ఆ పక్కనే ఒక వాలు కుర్చీ, అందులో చాలా విరామంగా, హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న వ్యక్తి ఉన్నట్టు చూపిస్తారు. అది చూడగానే మీలో ఏదో జరగటం ప్రారంభమవుతుంది. మీకు కూడా ఆ ఫోటోలోని వ్యక్తిలా ప్రశాంతంగా, పూర్తి విరామంతో, విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తుంది. దాన్నే తీవ్రమైన తమస్సు ( పని లేకుండా ఉండే స్థితి) అంటాను.

ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు అదే బీచ్‌కి వెళ్ళి, అదే కుర్చీలో పడుకున్నా మీకు మీరు ఊహించిన ప్రశాంతత ఉండదు. మీలోని తమస్సుకి సంబంధించిన సంస్కారాలు పూర్తిగా పోయేవరకూ, అవి మీ భౌతికశరీరంలో ఉన్నంత వరకూ ఆ ప్రశాంతతని పొందలేరు. విశ్రాంతి కావాలి అనే మీ కోరిక మిమ్మల్ని విశ్రాంతి తీసుకోనీయదు. ఎందుకంటే ఆ కోరిక సంస్కారాల నుంచి వస్తుంది.

అదే బీచ్, అదే స్థలం, అదే వాలు కుర్చీ, అందులోనే పడుకున్నాక మీలోని సంస్కారం కొద్ది సేపు నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ తరువాత సంస్కారం బయటికి వచ్చి మిమ్మల్ని విశ్రాంతిగా ఉండనీయదు. మీరు విశ్రాంతి తీసుకోవాలి అన్న నిర్ణయం మీ సంస్కారం నుంచి కాబట్టి మీరు నిజంగా విశ్రాంతి తీసుకోలేరు.

నేను మీకు చెబుతున్నాను, సెలవు కావాలి, విశ్రాంతి కావాలి అనే లోతైన కోరిక మీ శరీరవ్యవస్థని వదిలి వెళ్ళిపోతే మీ ఆధ్యాత్మిక ప్రయాణం 90% ముగిసినట్టే. ఈ మొదటి దశ సంస్కారం అన్నింటి కంటే చెడ్డది.

ప్రాణశరీరం – కోరికల సంస్కారాలు

ఆ తరువాతిది ప్రాణశరీరం లేదా శ్యాసశరీరం. కోరికలకు సంబంధించిన సంస్కారాలు ప్రాణశరీరంలో నిలువచేయబడి ఉంటాయి. అందుకే మీలో కోరికలు మారగానే మీ శ్యాసలో కూడా మార్చు వస్తుంది. ఉదాహరణకి మీరు కోపం లేదా మోహం అనే వాటిలో తీవ్రంగా చిక్కుకుపోయారనుకోండి, మీ శ్వాస ఒక విధంగా మారిపోతుంది. అప్పుడు మీ శ్యాస గందరగోళంగా, లోతుగా ఉంటుంది. కోరికలోకి వెళ్ళే కొద్దీ మీ సంస్కారాలు శక్తిమంతమవుతాయి.

మానసికశరీరం – అపరాధభావ సంస్కారాలు

మూడవది మానసికశరీరం. రెండవదైన ప్రాణశరీరంలో మీ జీవితం ఎలా ఉండాలో అన్న ఆలోచనలు నిండి ఉంటాయి. మానసికశరీరంలో మీ జీవితం ఎలా ఉండకూడదు అనుకుంటారో ఆ అలోచనలు ఉంటాయి. ఈ శరీరం అపరాధభావం మీద సృష్టించబడి ఉంటుంది. మీ శక్తి నిరంతరం భవిష్యత్తు వైపు ప్రవహిస్తూ ఉంటే అది కోరిక. అది గతం వైపు ప్రవహిస్తూ ఉంటే అపరాధ భావం.

ఈ శరీరంలో మీరు ఒక పనిని పదే పదే చేయనవసరం లేకుండానే సంస్కారాలు బలపడతాయి. కేవలం సమాచారం అందించటం ద్వారా లేదా జ్ఞాపకం చేసుకోవటం ద్వారా ఆ సంస్కారాలు బలపడతాయి. ఉదాహరణకి మీరు అదే స్థలం లేదా అదే వ్యక్తిని చూసారనుకోండి, అదే సంఘటనని ఎదుర్కొన్నారనుకోండి, వెంటనే ఆ సంస్కారాలు బలపడతాయి. అవి చైతన్యమవుతాయి.

భావావేశాత్మక శరీరం – బాధ సంస్కారాలు

నాలుగవ శరీరం భావావేశాలకి సంబంధించినది. ఈ శరీరంలో మీరు బాధకి సంబంధించిన ఊహలని నిలువచేసారు.

ఇది చాలా శక్తిమంతమైనది ఈ సంస్కారాల్ని శక్తిమంతం చేయటానికి సమాచారం అవసరం లేదు. అదే విధంగా మీరు ఏమీ చేయనవసరం లేదు. కాబట్టి అదే బాధని తిరిగి మరలా పొందరు. మీలో ఈ సంస్కారం చాలు. అది దానంతటి అదే కొన్ని రెట్లు పెరిగిపోతుంది. అది అలా విస్తృతం అవుతూ ఉంటుంది.

కారణశరీరం, గాఢనిద్ర

గాఢనిద్రలో పొందే అనుభవమే మీ కారణ శరీరం. ఈ శరీరంలో ఉండే సంస్కారాల్ని మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే గాఢనిద్రలో మీ ఆలోచనలు ఏమీ చేయలేవు, అది అచేతనశరీరం.

మొదటి నాలుగు శరీరాలలో సంస్కారాల లోతుని తగ్గించవచ్చు. ఐదు, ఆరు శరీరాలు సహజంగానే శుభపడతాయి. మొదటి నాలుగింటినీ మీరు శుభపరిస్తే, ఐదవది దానంతట అదే శుభపడుతుంది. ఎప్పుడైతే ఐదవ శరీరం శుభ్రపడుతుందో అరవదాని అనుభవాన్ని క్రమంగా పొందగలరు. ఆరవది ధ్యానశరీరం.

మీరు సులభంగా గాఢనిద్రలోకి వెళ్ళగలుగుతున్నారు అంటే మొదటి నాలుగు శరీరాలు శుభంగా ఉన్నాయి అని అర్థం. మొదటి నాలుగు శుభ్రంగా లేకపోతే ఐదవ కోశంలో మీరు కష్టపడతారు. అందుకే మీ మీద ఒత్తిడి, భారం ఉన్నప్పుడు నిద్ర సంబంధమైన సమస్యలతో బాధపడతారు.

అంతే కాదు, మొదటి నాలుగు శరీరాలలో సంస్కారాలు ఎక్కువగా ఉంటే, ఐదవ శరీరంలో మీకు మీ శరీరానికి అనుబంధం తెగిపోతుంది. మొదటి నాలుగు శరీరాలలో సంస్కారాలు తక్కువగా ఉంటే మీ శరీరం మీకు స్నేహితురాలవుతుంది.

మన శరీరాన్ని ఏ విధంగా బాధపెట్టి, తక్కువగా చూస్తామో మీరు తెలుసుకోరు. అర్ధం చేసుకోండి, మీ శరీరం బరువు ఎక్కువగా ఉంటే అది ప్రత్యక్షంగా ఈ సంస్కారాలతో సంబంధం కలిగి ఉంటుంది. మీ లోపల ఖాళీగాను, మీరు ఒంటరిగా ఉన్న భావన ఏర్పడినప్పుడు, మీ లోపల నింపటం ప్రారంభిస్తారు. ఆహారంతో గాని, పానీయాలతో గాని నింపుతారు. సాధారణంగా స్త్రీలు ఆహారంతో, పురుషులు పానీయాలతో నింపుతారు. ఈ ఆధునికకాలంలో ఇలా చెప్పలేం. మీరు ఒంటరిగా ఖాళీగా అనిపించినప్పుడు మీరు మీ లోపల ఏదో ఒకటి నింపాలి అని చూసారు.

మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటనా, ఏదో ఒక సంస్కారంతో సంబంధాన్ని కలిగిఉంటుంది. ఈ సంస్కారాల్ని తీసేయటమే మీ శరీరంతో స్నేహం చేయటం. మీ శరీరంతో లోతైన స్నేహబంధాన్ని ఏర్పరచుకోవటం. ఇది మీ శరీరాన్ని బాగు చేసే ఒక మంచి మార్గం.

కర్మలు మూడు రకాలు

ఆగామ్య, ప్రారబ్ద, సంచిత.

మొదటిది సంచిత కర్మ : సంచిత కర్మ బాంకులో రిజర్వ్ అకౌంటు లాంటిది. ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు శరీరాన్ని తీసుకోవటం భూమిమీదకి రావటం ఇది మొదటిసారి కాకపోవచ్చు. ఇంతకు ముందు కొన్ని వేల శరీరాలు తీసుకొనిఉండి ఉంటారు. అన్ని వేల వేల జన్మలలో మీరు చేసిన ఆలోచనలు పనులు, మాట్లాడిన మాటలు, తీరని అనుభవాలు అవన్ని లోతైన సంస్కారాలుగా మీ లోపల ఉంటాయి. వీటినన్నింటినీ కలిపి సంచిత కర్మ అంటారు. నేను బాంక్ అనగానే అది మీ డిపాజిట్ అనుకోవద్దు. అది అప్పు మాత్రమే. ఇది తిరిగి తీర్పవలసిన బాకీ లాంటిది.

రెండవది ప్రారబ్ధ కర్మ : ప్రారబ్ధం అంటే, మీరు సంచిత కర్మల నుంచి కొన్ని కర్మల్ని తీసుకొని వాటితో ఈ శరీరాన్ని పొందుతారు. ఆ తరువాత ఈ శరీరం దారా వచ్చిన కర్మలని పూర్తిచేసుకోవాలి అని నిర్ణయించుకుంటారు. కాబట్టి ప్రారబ్ధం అంటే మీ రిజర్వు అకౌంటులోని సంచిత కర్మలలో కొన్నింటిని తెచ్చుకుని ఈ శరీరంతో భూమి మీదికి వస్తారు. అదే ప్రారబ్ద కర్మ.

మూడవది ఆగామ్యకర్మ : మూడవది అన్నింటిలోనూ మహా చెడ్డది, ఆగామ్యకర్మ. ఈ భూమి మీదికి వచ్చాక కొత్తగా మీరు పోగుచేసుకునేదే ఆగామ్యకర్మ. మీలో వచ్చే కొత్త ఆలోచనలు కొత్త పనులతో కొత్త మాటలతో ఈ కర్మల్ని పెంచుతారు.

ఎవరైతే ఈ భూమి మీదికి వస్తారో వాళ్ళు మరణించే లోపు ప్రారబ్ద కర్మలని పూర్తిగా పోగొట్టుకోవాలి. ఉదాహరణకి మీ సంచిత కర్మలు 1000 అనుకుంటే మీరు అందులోంచి 10 కర్మలు తీసుకొని శరీరాన్ని పొంది భూమి మీదికి వస్తారు. అంటే మీరు 10 ప్రారబ్ద కర్మలతో వస్తారు. ముందుగా ఈ పది కర్మలు పూర్తి చేయాలి. అయితే మీరు ఈ భూమి మీదికి వచ్చాక ఆ పది కర్మలు పోగొట్టుకోకుండా కొత్త కర్మలని పోగుచేసుకోవటం ప్రారంభిస్తారు. ఎదుటివారి కోరికలు మీ కోరికలుగా తెచ్చుకొని వాటితో కొత్త ఆలోచనలు, కొత్త మాటలు, పనులు చేసారు.

కర్మచక్రాన్ని ఛేదించవచ్చు

ఉదాహరణకి మీరు ఎవరైనా అందమైన వారిని చూసారనుకోండి, అసూయతో మీ ఆలోచనలు రెట్టింపు అవుతాయి. ఈ ఆలోచనలతో కొత్త కర్మలు చేసారు. కొన్నిసార్లు ఎదుటివారి గురించి చెడ్డగా మాట్లాడతారు. అప్పుడు కూడా ఆ మాటలు ఆధారంగా కర్మలని కలుపుకుంటారు.

ప్రతి రోజూ మీలో ఉండే చికాకు, అసహనం నుంచి బయటకి రావటం – మీ ప్రారబ్ధ కర్మలలో జీవించటం.

కర్మలలో రకాలని వేరు వేరు కోణాలలో వివరిస్తాను. చూడండి, మీకు తెలిసిన అవకాశాలన్నీ తెలుసుకుంటూ, విశ్వంలో దొరికే అవకాశాలని తెలుసుకుంటూ వాటిని ఉపయోగించుకోవటమే ఆగామ్య కర్మలు. అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. మీరు చేపగా, పాముగా, మనిషిగా, దేవుడుగా ఏదైనా కావచ్చు, ఇవన్నీ అవకాశాలు. దీన్నే ఆగామ్య అంటాం.

మీకు మరొక విధమైన అవకాశాలు కూడా ఉన్నాయి. అవి మీకు తెలిసిన చేప, కప్ప, కుక్క కోతి, మనిషి ఇవే కాకుండా మీకు తెలియని అవకాశాలు కూడా మీకు దొరుకుతాయి. మనకి తెలిసిన, తెలియని అన్నిరకాల సాధ్యాలని కలిపి సంచిత అంటారు.

మొత్తం సంచితం అయితే, మీ ముందు ఉన్న అవకాశాలు ఆగామ్యం. మీరు ఈ శరీరంలోనికి వచ్చాక ఏవో కొన్ని హద్దులలోనే జీవిస్తారు, అవే ప్రారబ్ధం. చూడండి, మీరు కిందికి వచ్చినప్పుడు మీరు కొన్ని హద్దులు కల్పించుకుంటారు. వాటినే ప్రారబ్దం అంటారు.

ఇక్కడికి వచ్చాక చాలా అవకాశాలు చూసి వాటిని పోగుచేసుకుంటారు. వాటిని పొందాలి అనుకుంటారు. అవే ఆగామ్య. మీతో తెచ్చుకున్న ప్రారబ్దాలకి మీ జీవితాన్ని నడపగల మేధ ఉన్నది. ఇక్కడ పెద్ద సమస్య ఏమిటి అంటే, మీరు చాలా ఆగామ్యాలు చూసి, చాలా అవకాశాలని చూస్తారు. దానివలన మీరు మీ ప్రారబ్దాలని నమ్ముతారు. మీరు ముందుగా అవకాశాలు తగ్గుతాయి. అప్పుడు మీ ప్రారబ్ద జీవితాన్ని నడపేంత శక్తి గలవి అని నమ్మకం కుదరదు. ఎందుకంటే మీ ముందు ఆగామ్యలు ఉన్నాయి.

మీకు ఇది వివరిస్తాను, ప్రారబ్దాన్ని నమ్మటం శక్తివంతమైనది. ప్రారబ్దాన్ని పూర్తిచేస్తే మీలో చికాకు తగ్గుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకూ మీతో మోసే చికాకు అసహనం అనేవి ఆగామ్య ఇచ్చిన బహుమతి.

నిద్రలేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకూ మీకు అసహనం, చికాకు ఉంటాయి. మనకి ఎవరో ఒకరు ఒక చిన్న తప్పుచేసి దొరకాలి, అంతే వాళ్ళమీద విరుచుకుపడతాం. మనం దానికోసమే ఎదురుచూస్తుంటాం. మన ముందుకి ఎవరు వస్తే వారికి మన దీవెనలు తప్పవు. ఆ చికాకుకి కారణం మనం ఆగామ్య మీద కేంద్రీకృతం అయ్యాం.

మనలో శక్తి, మన అంతరంగం ప్రారబ్దం మీద ఏకాగ్రతని నిలిపితే, మనం మనలో అసహనాన్ని, చికాకుని మోయం. అంటే మనం పని చేయం అని కాదు. మనం మన పనిని చక్కగా చేస్తాం. కాని మన ప్రారబ్దం మీదే ఉంటాం. చూడండి, నిరంతరం అన్నింటినీ వ్యతిరేకిస్తూ నిరంతరం అసహనంతో చికాకుగా ఉన్నారు అంటే కారణం ఆగామ్య. ఎందుకంటే మన చుట్టూ అవకాశాలు చూస్తాం. కాబట్టి మనం ఎంపికల వెనుక పరిగెడుతున్నాం. అవే ఆగామ్య. అయితే ప్రారబ్దం చాలా శక్తివంతమైనది, తెలివైనది, అని మర్చిపోతున్నాం.

ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. అందులో కొందరి అంతరంగం ఆగామ్యం మీద కేంద్రీకృతమై ఉంటుంది. రెండవ రకంవారికి ప్రారబ్దం మీద ఉంటుంది. ప్రారబ్ధం మీద ఉన్నవారు విరామంగా తెలుసుకునే తత్వంతో గడుపుతారు.

ఆగామ్యం మీద కేంద్రీకృతమైన మనస్సు భయం, ఆశలతో ముందుకి నడుస్తుంది. అది మీరు నిద్రలేవగానే తెలుస్తుంది. మీరు కలలోంచి బయటకి రావాలి అంటే మీకు కోరిక ఉండాలి. లేదా భయం వేయాలి. ఉదాహరణకి మీ పాపని స్కూలుకి పంపించాలి అనే కోరికతో నిద్రలేసారు. అంటే మీ పాపకి మంచి చదువుచెప్పించి, మంచి భవిష్యత్‌ని ఏర్పరచాలి అనే కోరిక లేదా ఆఫీసుకి ఆలస్యం అవుతుంది, అనే భయంతోనైనా త్వరగా నిద్రలేస్తారు.

శరీరాన్ని ఆశ లేదా భయంతో కదిలించే దానినే ఆగామ్యం పైన జీవించే జీవితం అంటాను.

కర్మ చక్రం నుంచి బయటకి రావటం

మనం చేసే పనులన్నీ ఆశ, భయంతో జరుగుతాయి. దాంతో ఏదో పైపైన జరిగే పనులతో మనం కర్మల్ని కలుపుకుంటూ ఉంటాం. ఈ విధంగా చాలా కర్మల్ని పోగు చేసుకుంటాం.

కర్మచక్రాన్ని ఛేదించవచ్చు

తిరిగి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? మీ కర్మల బాంక్ బాలెన్స్ ఆగామ్య కర్మలలో నిండిపోయి ఉంటుంది.

ఉదాహరణకి మీరు 10 కర్మలు తీసుకుని వచ్చారు. ఈ పది కర్మలు పోగొట్టు కోవలసినది పోయి మరొక 200 కర్మలు కొత్తగా పోగుచేసి మీతో తీసుకువెళుతున్నారు. మరలా మీరు శరీరాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది. మీకు ఉన్న 1000 సంచిత కర్మలకి మరో 200 ఆగామ్య కర్మలని కలుపుతున్నారు. అంటే కిందటి జన్మ కంటే మరొక 200 కర్మలు ఎక్కువ అయ్యాయి. ఇందులోంచి మళ్ళా ఒక పది కర్మలు తీసుకొని మరొక శరీరాన్ని తీసుకుంటారు. మరలా చాలా కర్మలని పోగుచేసుకొని వెనక్కివెళతారు. ఇది ఛేదించలేని ఒక విషవలయంలా అవుతుంది. దీన్నే జననమరణ చక్రం అంటారు. నిరంతరం పుడుతూ, మరణిస్తూ మళ్ళా పుడుతూ ఉండటమే.

ఆ విధంగా కాకుండా మీరు జీవించి ఉన్నప్పుడే మీకు ఎవరైనా మీరు అంటే శరీరం మానసికవ్యవస్థ కాదు, మీరు అంటే కర్మల ప్రభావం మాత్రమే, ఆ కర్మల ప్రభావం వలనే మీరు తిరిగి ఈ భూమి మీదికి వస్తారు, అనే జ్ఞానాన్ని ఇస్తే అప్పుడు మీరు ఈ కర్మల్ని పోగొట్టుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అప్పుడు ముందుగా మీ ప్రారబ్ధ కర్మల్ని పూర్తిగా పోగొట్టుకోగలుగుతారు.

ఉదాహరణకి మీరు ప్రారబ్ధ కర్మలతో ఈ శరీరాన్ని భూమి మీదకి వచారు. మీరు పది కర్మలతో వచ్చారనుకోండి. అందులో మూడు సంస్కారాలు మిమ్మల్ని నిరాశలోకి పంపిచే శక్తి ఉన్నవి అనుకోండి. మీరు వీటి మాట వింటున్నంత కాలం అవి ఇంకా ఎక్కువే అవి పది అవుతాయి. మీరు తీసుకున్న ఏడు కర్మలు ఆగామ్య కర్మలు. తెచ్చుకున్న ప్రారబ్ద కర్మలు పోగొట్టుకునే బదులు మీరు మరిన్ని కొత్తవి కలుపుతున్నారు.

అచేతన స్థితిలో జీవించటం : ఆ విధంగా కాకుండా మీరు నిరాశలోనికి వెళ్ళినపుడు మీరు నేర్చుకున్న కొన్ని పద్ధతుల ద్వారా ఆ కుంగుబాటు నుంచి బయటకి వస్తే, ఆ సంస్కారాలు తమ శక్తిని కోల్పోతాయి. క్రమంగా ఆ పది కర్మలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ప్రారబ్ద కర్మల ప్రభావం మీ మీద తగ్గుతుందో, ప్రారబ్దకర్మలు మండిపోయి మీ నుంచి వెళ్ళిపోతాయి. ఆ విధంగా ప్రారబ్ద కర్మలు మండిపోతే కొత్త ఆగామ్య కర్మలు చేరే అవకాశం తగ్గుతుంది. అప్పుడు ఆగామ్య కర్మలు తగ్గిపోతాయి.

ఎప్పుడైతే ప్రారబ్ద ప్రభావం మీ మీద ఉండదో మీరు ఆగామ్యాలని పోగుచేసుకోరు. ఎప్పుడైతే 10 ప్రారబ్ద కర్మల ప్రభావం మీ మీద ఉండదో మీరు ఆగామ్యలను పోగుచేయరు. ఎందుకంటే ఈ పది ప్రారబ్దకర్మలే ఆగామ్యాలకి కారణం.

ఇప్పుడు సంచిత కర్మ గురించి చూద్దాం మీరు సంచిత కర్మల రిజర్వు అకౌంటు గురించి ఏమీ చేయలేరు. సంచిత కర్మలు పోవాలి అంటే గురుకృప ఉండాలి. గురుదేవుల కరుణతోనే సంచిత కర్మలు పోతాయి. గురుదేవులు మాత్రమే ఈ విషయంలో సహాయం చేయగలరు.

విశ్వకారణం = ప్రభావ సూత్రం

మీరు పాపం చేస్తే నరకానికి వెళతారని, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళతారని చెబుతుంటారు. నేను మీకు చెబుతున్నాను, సమాజం మిమ్మల్ని నియంత్రించటానికి నరకం అనే భయాన్ని, స్వర్గం అనే ఆశని మీలో కల్పిస్తుంది.

ఒక చిన్న కథ : ఒక ప్రమాదంలో ఒక గ్రామం మొత్తం కొట్టుకుపోతుంది. ఆ గ్రామప్రజలందరూ స్వర్గద్వారాల దగ్గర ఉంటారు. భగవంతుడు వారితో, 'మగవారంతా రెండు వరుసలలో నిలబడండి. భూమి మీద ఉన్నప్పుడు స్త్రీలపై అధికారం చలాయించినవారంతా

ఒక వరుసలో, వారి భార్యల అధికారంలో ఉన్నవారు మరొక వరుసలో నిలబదండి' అని చెబుతాడు.

భార్యలు అధికారం చెలాయించిన వారి వరుస కొన్ని మైళ్ళు ఉంటుంది. మగవారు అధికారం చలాయించిన వరుసలో ఒక్క వ్యక్తి మాత్రమే ఉంటాడు. భగవంతుడు అతన్ని 'నీ భార్య నీ మీద అధికారం చలాయించకుండా నీవు ఏ విధంగా తప్పించుకున్నావు?' అని అడుగుతాడు.

ఆ వ్యక్తి, 'నాకు తెలియదు భగవాన్, నా భార్య ఇక్కడ నిలబదమని చెప్పింది' అని జవాబు ఇస్తాడు.

మీరు భయంలో చిక్కుకున్నప్పుడు సమాజం ఏంచెబితే అదే చేసారు. మీ మీద ఎటువంటి అధికారం ఉండదు. మీరు సమాజం నియంత్రణలో ఉంటారు. ఎక్కడా స్వర్గం, నరకం అని లేవు. నరకం, స్వర్గం కేవలం మీ మానసికస్థితులు మాత్రమే.

మీకు మంచి ఆలోచనలు వచ్చినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు మీరు స్వర్గంలో ఉంటారు. మీకు చెడు ఆలోచనలు వచ్చినప్పుడు చెడ్డ పనులు చేసినప్పుడు నరకంలో ఉంటారు అంతే. అదంతా కూడా కర్మ. ఇదే విశ్వకారణం, ప్రభావం అనే సూత్రం. మీరు అంటే మీ మనస్సు ఎక్కడ ఏకాగ్రత ఉంచుతుందో, ఏదైతే మీరు అనుకుంటారో అదే అవుతారు. మీలోని లోతైన తెలుసుకునే తత్వం నుంచి రాని మాటలు, పనులు ఏదో పైపెనే ఉండి కర్మలని సృష్టిస్తాయి. తిరిగి వాటిని సాధించటానికి మళ్ళా మాటలు, పనులు వస్తాయి.

ప్రతిధ్వనించే చైతన్యం

ఎప్పుడెతే విశ్వం అంటే శక్తి అని తెలుసుకుంటారో అప్పుడు మీకు ఇది ఒక చైతన్యజీవం అని అర్థం అవుతుంది. విశ్వంలో మన సౌరకుటుంబం ఒక చిన్న భాగం మాత్రమే. విశ్వం నిత్యనూతనత్వంతో నిరంతరం తనని తాను స్పష్టించుకుంటూ ఉంటుంది. ఇందులో బిగ్ బాంగ్ ద్వారా కొత్త సౌరకుటుంబాల సృష్టి, కృష్ణబిలం ద్వారా నక్షత్రాల నాశనం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఎప్పుడైతే విశ్వంలో బిగ్ బాంగ్ జరుగుతుందో అప్పుడు విశ్వంలో మరొక చోట కృష్ణబిలం (బ్లాక్ హోల్) ఏర్పడుతూ ఉంటుంది అని. ఒకటి లేకుండా మరొకటి సాధ్యపడదు. అన్ని రకాల శక్తి ఒకదానికొకటి సంబంధించి ఉంటుంది, ఇదే విశ్వకర్మ.

ఎప్పుడైతే విశ్వం మొత్తం శక్తి అని తెలుసుకుంటారో, అది చైతన్యజీవనం అని మీకు అర్థం అవుతుంది.

కయాస్ (గందరగోళం) థియరీ అని ఒక సిద్ధాంతం ఉన్నది. ఆ థియరీ ప్రకారం చైనాలో సీతాకోక చిలుక రెక్కలు కొట్టకుంటే మెక్సికోలో తుఫాను వస్తుంది అని చెబుతారు.

దీన్నే బటర్‌ఫ్లె ఎఫెక్ష్ అంటారు. సీతాకోక చిలుక రెక్కలు కొట్టకున్నప్పుడు వాతావరణంలో చిన్న మార్పుని తెస్తుంది. అది ఒక గొలుసులా యాక్షన్, రియాక్షన్ల ద్వారా వాతావరణంలో ఒత్తిడిని కలిగిస్తుంది. అది భూమి మీద మరొక ప్రాంతంలో ఫలితం కనిపించే విధంగా జరుగుతుంది. ఎక్కడో ఒక అణువు కదిలితేనే ఇక్కడ ఒక అణువు కదులుతుంది.

మీరు కొంచెం లోతుగా చూస్తే మనం శారీరకవ్యాధుల్నే మనలోకి ఆహ్వానించటం లేదు, ప్రమాదాలని కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ సమస్య ఏమిటంటే మనం అంతా అచేతన స్థితిలో ఆలోచిస్తాం. అందుకే కారణానికి, ఫలితానికి సంబంధాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నాం.

ప్రతిచర్య లేక ప్రతిస్పందన

కర్మ అంటే చర్య లేదా పని. అయితే చర్య అనేది రెండు రకాలు. అది ప్రతిచర్య కాని లేదా ప్రతిస్పందన కాని.

ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీకు కోపం వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆశించినట్టు మీరు ప్రవర్తిస్తారు. అతను కకరించమనగానే మీ భావం, మీ మూడ్ మారిపోతాయి. కాబట్టి అతను యజమాని, మీరు బానిసగా ప్రవరిస్తున్నారు. మీకు సంఘటన మీద ఎటువంటి నియంత్రణ లేదు. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీరు వెంటనే మీ పాత అనుభవాల నుంచి ప్రతిస్పందిస్తారు. ఈ ప్రతిచర్యనే కర్మ అంటారు. ఇది బందీలని చేసే శక్తి. ఇది మీకు సంకెళ్ళని సృష్టిస్తుంది.

కాని ప్రతిస్పందన అనేది పూర్తి వేరుగా ఉంటుంది. ఎవరైనా అవమానిస్తే మీరు కోపం తెచ్చుకోనవసరం లేదు. ఎవరైనా ఏదైనా అంటే మీరు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా, ఇది తప్పు, ఇది సరే అని అనకుండా వాళ్ళు చెప్పేది వినవచ్చు. వెంటనే ప్రతిచర్య చూపించకుండా మీరు వాళ్ళు చెప్పేది వినవచ్చు. ఆ తరువాత పూర్తి తెలుసుకునే తత్వంతో జవాబు ఇవ్వవచ్చు. మీరు గత అనుభవాల నుంచి ప్రతిస్పందించనవసరం లేదు. మీరు వర్తమానం నుంచి స్పందిస్తున్నారు.

ఒకవేళ ఎదుటి వ్యక్తి చెప్పేది కరెక్ట్ అయితే అతను అలా చెప్పినందుకు కృతజ్ఞతలు చెబుతారు. అతను చెప్పేది తప్పు అయితే మీరు మీ భావావేశాన్ని కేవలం గమనిస్తారు. కాని ప్రతిచర్య చూపరు. అతను అన్నది అబద్దమైతే మీరు ఎందుకు ప్రతిచర్య చూపాలి?

జార్టిగూర్టీఫ్ (ఈయన గ్రీకు–అమెరికా యోగి, ఆధ్యాత్మిక గురువు ఆయన నాలుగవ దారి అనే సూత్రాన్ని చెబుతాడు. అది మన వేదాలలో ఉన్న తురీయదశని పోలి ఉంటుంది) జీవితం నుంచి ఒక చక్కని సంఘటన.

జార్లి గుర్టీఫ్ తొమ్మిది ఏళ్ళ వయస్సులో ఉండగా తండి చనిపోతాడు. అతను పేదవాడు కాని చాలా నిజాయితీ పరుడు. ఆయన మరణ సమయంలో గుర్హీఫ్‌ని పిలిచి తన చివరి సందేశాన్ని ఇస్తాడు.

కర్మచక్రాన్ని ఛేదించవచ్చు

ఎవరైనా అవమానిస్తే నిశ్శబ్దంగా పూర్తిగా అతను చెప్పేది విను. ఆ తరువాత అతనితో నా పట్ల అంత శ్రద్ధ తీసుకున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పు, మళ్ళా 24 గంటల తరువాత వచ్చి నీకు జవాబు ఇస్తాను అని చెప్పు, అని చెబుతాడు. గుర్హీఫ్ తండ్రికి ఆ విధంగా ఉంటాను అని ప్రమాణం చేస్తాడు.

ఆయనకి పెద్ద వయస్సు వచ్చాక తన శిష్యులతో, 'మా నాన్నగారు చెప్పిన చిన్న పద్ధతి నాకు చాలా సహాయం చేసింది. ఎందుకంటే 24 గంటల తరువాత ఎవరు కోపంగా ఉంటారు 24 గంటల తరువాత అతను కరెక్ట్ అని తెలుస్తుంది లేదా అతను తప్ప అని తెలుస్తుంది.

ఒకవేళ అతను చెప్పింది సరైనదే అయితే మిమ్మల్ని మీరు బాగుచేసుకోవటానికి ఒక అవకాశం అది. మీ గురించి మీరు బాగా తెలుసుకుంటారు. ఒకవేళ అతను తప్పు అయితే మీరు కోపం తెచ్చుకోవలసిన అవసరం లేదు.

మీ స్పందన అద్దంలో ప్రతిబింబంలా ఎటువంటి అభిప్రాయాలు, తీర్పులు లేకుండా ఉండాలి. అది మీ కర్మల నుంచి గత అనుభవాల నుంచి రాకూడదు. అది వర్తమానం నుంచి రావాలి. ఏదైతే మీ గత అనుభవం నుంచి వస్తుందో అది కర్మల గొలుసుని తయారుచేస్తుంది. వర్తమానం నుంచి వచ్చే స్పందన మీకు స్వేచ్చని ఇస్తుంది.

మీ కర్మల్ని మీరే సృష్టించుకుంటారు. కర్మ మిమ్మల్ని సృష్టించదు. మీ పనుల ఫలితమైన ఉపవస్తువు కాదు. మీరు మీ పనుల కంటే ఉన్నతులు.

గురుదేవులకి కర్మలు ఉండవు

ఒక చిన్న కథ : ఒక అందమైన తోటలో చాలా పూల చెట్లు, రకరకాల పండ్ల చెట్లు, ఉంటాయి. ముగ్గురు స్నేహితులు ఆ తోట దగ్గరకి వస్తారు. తోట చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉంటుంది. వారిలో ఒకరు గోడ ఎక్కి అటు చూస్తాడు.

అతను గట్టిగా, 'అబ్బో! ఎంత అందమైన తోట' అని అరిచి అటు వైపు దూకుతాడు. అక్కడి అందాలు చూస్తూ, మధురమైన ఆ పళ్ళు తింటూ ఆనందంగా తిరుగుతూ ఉంటాడు. రెండవ వ్యక్తి గోడ ఎక్కి తోటని చూస్తాడు. అది చాలా అందంగా కనిపిస్తుంది. అతనికి కొంచెం మర్యాద తెలుసు, కింద నిలబడ్డ తన స్నేహితునితో, 'ఓ! స్నేహితుడా! ఇక్కడ చాలా అందమైన తోట ఉన్నది. నేను వెళుతున్నాను. నీవు కూడా ఇక్కడికి రా' అని చెప్పి అటు వైపు తోటలోనికి దూకి ఆ పళ్ళు తింటూ ఆనందంగా తిరుగుతాడు.

మూడవ వ్యక్తి గోడ ఎక్కి తోటని చూస్తాడు. అతని స్నేహితుల ఆనందపారవశ్వాన్ని చూస్తాడు. అప్పుడు తనకి తాను ఈ విధంగా చెప్పుకుంటాడు, 'నేను వెనక్కి వెళ్ళి అందరికీ ఈ అందమైన తోట సంగతి చెబుతాను. వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకువస్తాను.' అని వెనక్కి తిరిగి వెళ్లతాడు.

అవతారమూర్తి, అవధూత అంటే ఈ విధంగా తిరిగి భూమి మీదకి వచ్చి తాను పొందిన పరమానందస్థితి గురించి అందరికీ చెప్పే మహనీయుడే.

ఎవరైతే దివ్యత్వం నుంచి ఈ భూమి మీదికి వచ్చి తాను పొందిన అద్భుత అనుభవాన్ని అందరికీ వివరిస్తాడో, అందరూ అది తెలుసుకునే విధంగా చేస్తాడో ఆయన అవతారమూరి, ఆయనకి కర్మలు ఉండవు. వారు సాధించవలసింది ఏమీ ఉండదు. వారు పొందవలసింది ఏదీ ఉండదు. అటువంటప్పుడు వారు శరీరాన్ని ఎందుకు ధరిస్తారు?

వారు మానవులపై ఉండే అపారమైన ప్రేమ వల్ల ఈ భూమి మీద అవతరిస్తారు. అవతారమూర్తులు మానవశరీరాన్ని తీసుకోవటానికి కారణం మానవులకు జననమరణచక్రం నుంచి విముక్తి కలిగించటానికి, కర్మల సంకెళ్ళ నుంచి స్వేచ్ఛని కలిగించటానికి.

ఉద్దేశమే ముఖ్యం

భాగవతంలో ఒక చక్కని కథ ఉంది : కృష్ణుడు గోపికలతో కలసి యమునానది ఒడ్డకి వస్తాడు. వారంతా యమునని దాటాలి కాని ఎక్కడా దారి లేదు. అప్పుడు కృష్ణుడు, 'నేను నిజమైన బ్రహ్మచారిని అయితే యమున దారి ఇస్తుంది.' అంటాడు. యమున వారందరికీ దారి ఇస్తుంది.

మామూలుగా చూస్తే కృష్ణుడు అమ్మాయిలతో ఉన్న సాధారణవ్యక్తిలా కనిపిస్తాడు. కాని కృష్ణుడు శరీరానికి, మనస్సుకి అతీతమైన వాడు. ఆయన పనులు సాధారణమానవునిలా ఒక ఉద్దేశంతో ఉండవు. ఎప్పుడైనా పనిలోని ఉద్దేశం ముఖ్యం కాని పని కాదు. ఉద్దేశం అనేది లగేజి. అది కర్మ. అంతే కాని చర్య కాదు. ఒక పని ఉద్దేశాన్ని సృష్టిస్తే అది లగేజి అవుతుంది. స్వచ్ఛమైన పనికి ఫలితం గురించి ఉద్దేశం ఉండదు.

గురుదేవుల సమక్షం ఉద్దేశాన్ని ప్రభావితం చేస్తుంది

చూడండి, గురుదేవుల సమక్షంలో మీరు ఏం చేసినా అది గురువుల కోసమే. ఇది ఏ విధంగా కూడా మీకు పేరు ప్రతిష్ఠలని ఇవ్వదు అని తెలుసు. కాబట్టి మీ పనులు ఒక ఉద్దేశ్యతో ఉండవు. అక్కడ ఉద్దేశాలు ఉండవు. ఉద్దేశం గురువు గారిది, పనులు మీవి. ఉద్దేశ్యాలు అనేవి లేని వ్యక్తిలోని అంతరాత్మ ఉద్దేశం ఇది.

చూడండి, పూర్తి సంచితకర్మలు మీవి కాని నావి కాని, కాదు. ఇది సర్వాంతర్యామి దివ్యనాటకం. మీది బాధపడటం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, మీ సంచితకర్మ కూడా దివ్యనాటకంలా ప్రారంభమవుతుంది. కాని ఆగామ్యకర్మలు పోగుచేసి అది అసహ్యంగా మారుతుంది.

నాకు కర్మలు ఉండవు కాబట్టి నాతో పాటు ముందుకి సాగితే మీకు ఉద్దేశాలు, కోరికలు ఉండవు. ఉద్దేశం లేకుండా పని చేయటమే జీవన్ముక్తి

ఉద్దేశం లేని పనులు – కర్మ నుంచి స్వేచ్ఛ

ఒక వ్యక్తి పది హత్యలు చేస్తే అతని హత్యల సంఖ్య రికార్డు కాదు కాని హత్యల ఉద్దేశం రికార్డు అవుతుంది. అందులోని నాణ్యత, మానసికస్థితి, దృక్పథం – ఇవే కర్మ అనే భారాన్ని తెస్తాయి.

అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు పదే పదే పని కాదు దాని ఉద్దేశం ముఖ్యం అని చెబుతాడు. భగవద్గీత సందేశం అదే ఆయన ఇలా చెబుతాడు, 'మీరు ఉద్దేశం లేకుండా ఉంటే నేను మీ బాధ్యత తీసుకుంటాను' అని. పని రికార్డు చేయబడదు, దాని ఉద్దేశం రికార్డు చేయబడుతుంది.

మహాభారతంలో ఒక చక్కని కథ ఉన్నది.

ఒక సాధువు, వేశ్య ఇంటికి ఎదురుగా నివసిస్తూ ఉంటాడు. అతను ఆమె దగ్గరికి వచ్చే వారిని లెక్కపెడుతూ ఆ ఇంట్లో ఏమేం జరుగుతుంటాయో, ఆమె జీవితం ఏ విధంగా ఉంటుందో ఊహిస్తూ ఉంటాడు. ఆమె మాత్రం ఖాళీ సమయమంతా కృష్ణని ధ్యానిస్తూ ఆ జీవితం నుంచి విముక్తి ప్రసాదించమని ప్రార్ధిస్తూ ఉంటుంది.

చివరికి వారిద్దరూ చనిపోయి యముడి దగ్గరకి చేరతారు. యముడు వారి జీవితాన్ని పరిశీలించి సాధువుని నరకానికి పంపించి, వేశ్యని స్వర్గానికి వెళ్ళమంటాడు. సాధువు నిర్ఘాంతపోయి యముడితో గొడవ పడతాడు, 'నేను చాలా పవిత్రమైన జీవితాన్ని గడిపాను. ఆమె అవినీతితో జీవించింది. నన్ను ఏ విధంగా నరకానికి పంపిస్తున్నారు? అని గట్టిగా అడుగుతాడు.

అప్పుడు యమధర్మరాజు, 'నా న్యాయస్థానంలో పనులకి విలువ లేదు వాటి ఉద్దేశానికే విలువ. నీవు సన్నాసి బట్టలు ధరించి బయటకి పవిత్రమైన జీవితాన్ని గడిపావు. కాని నీ అంతరంగం కామంతో నిండి ఉన్నది. అందుకే బయట ప్రపంచంలో నీ శరీరానికి గౌరవమర్యాదలతో అంత్యక్రియలు జరిగాయి. కానీ ఆ స్త్రీ అంతరంగం శ్రీకృష్ణునితో నిండి ఉన్నది. అందుకే ఆమె శరీరానికి అంత్య క్రియలే జరగలేదు. కాని ఆమె స్వర్గానికి వెళ్ళింది.'

మీరు అడగవచ్చు, ఇలా అయితే అందరూ అవినీతి పనులు చేయవచ్చు కదా అని. అవినీతి పనులకి ఇది లెసెన్సు కదా అని.

జ్ఞానోదయమైన అవతారమూర్తులు సర్వాంతర్యామితో ఉంటారు. వారు మాత్రమే సర్వాంతర్యామికి అనుగుణంగా ఉండగలరు. అందులోంచి బయటికి రారు. ఆయన పనులన్నీ పూర్తి తెలుసుకునే తత్త్యంలో చేతనస్థితిలో ఉంటాయి. అవి కరుణాపూరితం.

మనకి అటువంటి చేతనస్థితి, తెలుసుకునే తత్వం ఉండవు కాబట్టి మన పనుల్ని సమర్ధించుకోలేం. వాటిని అవతారమూరుల పనులతో పోల్చుకోలేం. పనులు ఒకే విధంగా ఉండవచ్చు కాని అంతరంగం, అందులో ఉద్దేశం వేరుగా ఉంటాయి. ఆదిశంకరాచార్యుల వారి జీవితం నుంచి ఒక చక్కని కథ:

ఆదిశంకరాచార్యులు శిష్యలతో ఒక చోటినుంచి మరొక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆయనకి బాగా దాహం వేస్తుంది. ఎక్కడా నీళ్ళు దొరకవు. అక్కడ ఒక షాపు కనిపిస్తే అతడు మంచి నీళ్ళు అడుగుతాడు ఆదిశంకరాచార్యులు. అతను తన దగ్గర కల్లు మాత్రమే ఉంది, మంచినీళ్ళు లేవు అని చెబుతాడు.

ఆదిశంకరాచార్యులు అతనితో 'సరే! అదే ఇవ్వు, అని అడిగి కల్లు తాగి దాహం తీర్చుకుంటాడు. శిష్యులు ఇది చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళు కూడా తృప్తిగా కల్ను తాగుతారు.

వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. ఆదిశంకరాచార్య మామూలుగా నడుస్తుంటారు కాని శిష్యులు ఆ మత్తులో సరిగ్గా నడవలేకపోతారు. అలా కొంత దూరం వెళ్ళాక ఇనుము కరిగించే దుకాణం వస్తుంది.

శంకరాచార్యులు ఇనుము కరిగించే వ్యక్తి దగ్గరకి వెళ్ళి మంచి నీళ్ళు అడుగుతాడు. అతను తన దగ్గర మంచి నీరు లేదని చెబుతాడు. ఆదిశంకరాచార్య కరిగిన ఇనుముని ఇవ్వమని అడుగుతాడు.

ఆయన శిష్యులు నిర్ఘాంతపోయి ఆయననే చూస్తుంటారు. శంకరాచార్యులు కరిగిన ఇనుముని మంచి నీళ్లలా తాగి శిష్యుల వైపు తిరిగి మీరు కూడా తాగండి అంటాడు. శిష్యులు తలలు వంచి నిలబడతారు. అప్పుడు ఆయన శిష్యులతో నేను చేసే పనులు అనుకరించవద్దు. నేను చెప్పింది చేయండి, లేదా మీ మనస్సు చెప్పినట్టు నడుచుకోండి అని చెబుతాడు.

ఒక విషయం అర్థం చేసుకోండి. జ్ఞానోదయమైన యోగీశ్వరులు ఒక స్థితిలో ఉంటారు. అది సాధారణమానవులు ఉండే స్థితికి వేరుగా ఉండే స్థితి. కాబట్టి వారు మామూలు మనుషులు చేసే విధంగా చేయనవసరం లేదు. వారి ఉద్దేశం ముఖ్యం. దాన్ని మామూలు తర్కంతో వివరించలేం.

జ్ఞానోదయమైన యోగీశ్వరునికి వ్యక్తిగత ఆసక్తి ఉండదు ఎందుకంటే ఆయనలో నేను, నాది ఉండదు, ఆయనలోని వ్యక్తిత్వపు గుర్తింపు సర్వాంతర్యామిలో కరిగిపోయి ఉంటుంది.

ఉద్దేశం, చర్య

ఎవరిలోనైతే ఉద్దేశం లోతుగా, చేసిన పని తక్కువగా ఉంటే వారిలో సోమరితనం ఉంటుంది. అతను తమస్సులో ఉంటాడు. ఉద్దేశం చేసే పని సమానస్దాయిలో ఉంటే అసహనంగా ఉంటాడు. అదే రజస్సు (త్రిగుణాలలో ఒకటి, ఇది అసహనం).

కర్మచక్రాన్ని ఛేదించవచ్చు

ఉద్దేశం లేకుండా కేవలం పని మాత్రం ఉంటే అది సత్వగుణం. అందుకే భగవద్దీతలో కృష్ణుడు అర్జునుని యుద్ధం చేయమంటాడు. యుద్ధం చేయటం కాదు ముఖ్యం, దాని ఉద్దేశం. ఆ ఉద్దేశం కృష్ణని ఉద్దేశమే. అదే విశ్వశక్తి ఉద్దేశం. ఎందుకంటే కృష్ణుడు విశ్వశక్తి కాబట్టి.

మీరు విశ్వశక్తికి అనుగుణంగా ఉంటే ఆ విశ్వశక్తి మిమ్మల్ని దీవిస్తుంది. అప్పుడు మీరు అన్ని అనుకూలసంఘటనలనే ఆకర్కిస్తారు. అందుకే ఎవరైనా అటువంటి వ్యక్తికి ఏది చేసినా వారికి నలుమూలల నుంచి మంచి వారిపై వర్తిస్తుంది.

ప్రతి రోజూ ఉండే ఉద్దేశం యొక్క శక్తి

మనం ఏడు రకాలైన భౌతిక, ప్రాణ, మానసిక, భావావేశాత్మక, కారణ, ఆనందమయ, నిర్వాణ శరీరాల గురించి తెలుసుకున్నాం. ఒక విషయం అర్థం చేసుకోండి. కారణ శరీరంలో ఆగామ్యకర్మ మనకి పూర్తి అందుబాటులో ఉంటుంది. కారణ శరీరంలో మీలోని నైపుణ్యాలు ఉండవచ్చు. క్రికెట్ ఆడటం, టెన్నిస్ ఆడగల నైపుణ్యం ఈ విధంగా ఉండవచ్చు. నిద్రద లేవగానే నేను క్రికెట్ ఆడాలి అని గట్టిగా నిర్ణయించుకొని ఆ ఉద్దేశంతో గాఢనిద్ర లోంచి లేస్తే, క్రికెట్ ఆడే వివేకం కారణశరీరం నుంచి దొరుకుతుంది. దానికి తగిన వాతావరణం, మేధలోనికి వెళతారు. నిద్ర పోయే ముందు రేపు గోల్స్ ఆడాలి అనే గట్టి ఉద్దేశంతో పడుకుంటే తెల్లవారి నిద్ర లేచాక ఆ ఆట ఆడే నేర్చుతో నిద్ర లేస్తారు.

కారణశరీరం మారకం చేసే స్థలం, అది డబ్బు మారకం వంటిది. కారణశరీరంలో మీరు దేనినైనా మార్చవచ్చు. మీరు కారణ శరీరంలోనికి వెళ్ళినప్పుడు ఈ జన్మకి కారణమైన కర్మ మారిపోవచ్చు. మీరు బలమైన ఉద్దేశంతో ఉంటే దాన్ని మార్చవచ్చు. అది నిజమైన స్వేచ్ఛ

మనం పోగుచేసుకున్న ఆగామ్యకర్మలని, మనం జన్మిస్తూ తెచ్చుకున్న ప్రారబ్ధకర్మలని మార్చగల శక్తి బలమైన ఉద్దేశానికి ఉంటుంది. అయితే ఇది సంచితకర్మలని మార్చలేదు. సంచిత కర్మల్ని ఎవరికైతే ఎటువంటి కర్మలు ఉండవో ఆ గురుదేవుల కృపతో మాత్రమే సాధ్యమవుతుంది.

కార్యప్రచారసంఘం లేదా యంత్రం

గురుదేవుల్ని కలవటం, ఆయన చెప్పినవి చేయటం, ఎటువంటి ఉద్దేశం లేకుండా పనులు చేయటం – ఇవన్నీ కూడా జీవితం అనే ఆట మాత్రమే. ప్రత్యేక ఉద్దేశం లేకుండా చేసే పని సంఘ కార్యం లేదా మిషన్ ఏదైనా ఒక ఉద్దేశం లేదా కోరికతో చేసే పనిలో మీరు కేవలం యంత్రంలా ఉంటారు.

మీరు ఎటువంటి ఉద్దేశం లేకుండా పని చేస్తే మీరు మిషన్ (సంఘం) అవుతారు. సంఘం కావాలా, యంత్రంలా ఉంటారా అనేది మీ ఎంపిక. మీరు నా ఉద్దేశం ప్రకారం పని చేస్తూ అందులో మీ ఉద్దేశాన్ని కలపకుండా ఉంటే నేను మీకు శిక్షణ ఇస్తుంటాను. నేను చెప్పింది చేయండి. మీ ఉద్దేశాల నుంచి ప్రోత్సాహం తెచ్చుకోవద్దు. మీ ఆశ, భయాల నుంచి పరిపూర్ణతని, సంతృప్తినిస్తుంది.

ఈ జన్మలో కర్మ అంటే ఏమిటి? అది మన పూర్తి కర్మ సూక్ష్మరూపం

మరొక విషయం అర్ధంచేసుకోండి. మీకు ఉన్న సంచితకర్మలలో 100 కోరికలు మీ మూలాధారానికి సంబంధించినవి అనుకోండి. అంటే ఆశ కోరికలకి సంబంధించినవి. మరొక 100 స్వాధిష్మానానికి సంబంధించినవి అనుకోండి. అంటే భయం. మరొక 100 బాధలకి సంబంధించి మణిపూరకానికి చెందినవి. ఆ విధంగా మీకు 700 కోరికలు ఉన్నాయి అనుకోండి. ఒకొక్క చక్రానికి 100 చొప్పున 700 కోరికలు ఉన్నాయనుకోండి. వీటిలో ఒకొక్కదాని నుంచి 10 తీసుకొని ఈ జన్మ తీసుకున్నారనుకోండి. మీకున్న సంచితకర్మల లోంచి తీసుకున్న ఈ కొద్ది భాగమే ప్రారబ్దకర్మ.

జన్మతో వచ్చిన కర్మలని శ్వాస ద్వారా ఎలా కరిగించాలి

మరొక ముఖ్యవిషయం మీరు ఆగామ్యకర్మలని పోగుచేసుకోకుండా ఉండగలిగితే కేవలం శ్వాస ద్వారా జన్మతో తీసుకున్న ప్రారబ్దకర్మలని కరిగించవచ్చు. అవి మీ ఆలోచనాక్రమంలోనే కరిగిపోతాయి.

ఉదాహరణకి మీరు ఎవరినైనా చూడగానే మీలో కోరిక బయటకి వస్తే ఆ ఉద్దేశంలో ఆ భావావేశంలో ఆ ప్రారబ్ధకర్మ కరిగిపోతుంది. ఆ విధంగా కాకుండా మీరు ఆ కోరిక తీర్సుకోవటానికి ఏదైనా చేస్తే అది ఆగామ్యకర్మని సృష్టిస్తుంది. మీరు ఏ పనీ చేయకుండా, ఎటువంటి ఆగామ్యని పోగుచేయకుండా ఆ కోరికని బయటకి శ్వాసిస్తే ప్రారబ్ధం కరగిపోతుంది. తెలుసుకునే తత్వంతో శ్వాసించటం చేస్తే దానికి ఆ కర్మని మండించే శక్తి ఉంటుంది. అప్పుడు ప్రారబ్ధం కరగిపోతుంది.

మా నిత్యానందస్పురణ ధ్యానకార్యక్రమంలో పాల్గొన్నవారిని ప్రాణశరీరంలో చేసే ధ్యానంతో అక్కడ ఉన్న కోరికల్ని, సంస్కారాల్ని కరిగించేస్తాం. వాళ్ళు తమ కోరికల్ని లిస్టులా రాస్తారు. వాటిని ధ్వంసం చేసే సమయంలో శ్వాస ద్వారా తెలుసుకునే తత్వాన్ని ఆ కోరికలో ఉంచి, కోరికల్ని బయటకి శ్వాసింప చేసే అవి కరిగిపోతాయి.

అదే కత్తి మీకు గుచ్చుకుంటుంది

కర్మ అంటే బహుమతి కాదు, శిక్ష కాదు, భగవంతుడు పాపం చేసిన వారిని శిక్షించటానికి ఉపయోగించేది కాదు. అది మీ మానసికస్థితి. అదే మీకు స్వర్గం, నరకం అనే అనుభవాల్ని ఇస్తుంది.

ఒక చిన్న కథ : స్పీడుగా వెళ్తున్న ఒక వ్యక్తిని ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటాడు. అతనికి వార్నింగ్ టికెట్ ఇవ్వబోతాడు.

అంతలో కారు లోంచి ఒకామె గట్టిగా, 'చూడండి! నేను చెప్పాను స్పీడుగా వెళ్ళవద్ద. అలా వెళితే పట్టుబడతారు అని. ఎవరు మిమ్మల్ని అంత స్పీడుగా వెళ్ళమన్నారు. నేను జాగ్రత్తగా, నెమ్మదిగా వెళ్ళండి, గమనించండి, అంటే నన్ను నోరు మూసుకో అన్నారు. ఇప్పుడు చూడండి, పట్టుబడ్డారు. అంటుంది. గట్టిగట్టిగా అరుస్తూ. పోలీసు అతనితో 'ఆమె ఎవరు' అని అడుగుతాడు. అతను 'ఆమె నా భార్య' అంటాడు.

పోలీసు వార్నింగ్ టికెట్ చింపేసి, 'ఇక వెళ్ళు. నీకు సరిపడా శిక్ష పడింది' అంటాడు.

మీకు కోపం వస్తే పాపం వస్తుంది. దానితో తరువాత జన్మలో దాన్ని అనుభవించాలి అని అనుకోవటం సరి కాదు. ఇప్పుడు ఆ కోపంతో మీరు బాధ పడుతున్నారు. అదే మీరు అనుభవించే నరకబాధలు. మీరు కోపంతో ఏ విధంగా మరొకరిని బాధించారో అదే హింసని మీ అంతరంగంలో మీరు అనుభవిస్తారు.

మీరు బయటివారి మీద వేసే మంటలు, అదే వేడితో మీ అంతరంగంలో మిమ్మల్ని కాల్చివేస్తాయి. మీ కోపం ఎదుటివారిని కాల్చుతుందో లేదో తెలియదు కాని అది మాత్రం కచ్చితంగా మిమ్మల్ని మీ అంతరంగంలో కాలుస్తుంది. బయట ఎవరి మీదో మీరు కత్తి దూస్తే ముందుగా అది మిమ్మల్ని అదే తీవ్రతతో పొడుస్తుంది. గుర్తుంచుకోండి, దీనికి రెండు వైపులా పదునే.

గౌతమబుద్దుని జీవితం నుంచి ఒక అందమైన కథ : ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుని ముఖం మీద ఉమ్మేసాడు. బుద్ధుడు ముఖం తుడుచుకొని అతనితో 'నీవు ఇంకా ఏమైనా చెబుతావా? లేకపోతే ఇది చాలా? ' అని అడుగుతాడు. బుద్ధుని శిష్యుడు ఆనందుడికి చాలా కోపం వస్తుంది. అతను లోపల మండిపోతుంటాడు. ఏ కారణం లేకుండా ఒక వ్యక్తి వచ్చి తన గురువుని అలా చేయటం అతనికి చాలా కోపాన్ని తెప్పిస్తుంది. అతను బుద్ధునితో, 'భగవాన్! నాకు అనుమతిని ఇవ్వండి. ఇతని సంగతి నేను చూసుకుంటాను' అంటాడు.

బుద్ధుడు ఆనందునితో, 'నీవు సన్నాసివని మరిచిపోయావా? ఆ వ్యక్తి కోపంతో చాలా బాధపడుతున్నాడు. అతని కోపంతో ఉన్న ముఖం చూడు, అతని శరీరం కోపంతో ఎలా వణికిపోతున్నదో చూడు. అతను నా ముఖం మీద ఊసే ముందు ఆనందంలో ఉత్సవం చేసుకుంటున్నాడు అని అనుకున్నావా? అతను కోపంతో పిచ్చివాడయ్యాడు అప్పుడు వచ్చి నా మీద ఊసాడు.

అతను ఆ స్థితిలో ఉండటం కంటే మరొక శిక్ష ఏముంది? అతను నాకు చేసిన హాని ఏముంది? అతను ఊసింది తుడుచుకున్నాను. ఇప్పుడు నీవు కోపం తెచ్చుకోకు. అలా చేస్తే నీ లోపల అదే స్థితి ఏర్పడుతుంది. నిన్ను నీవు ఎందుకు శిక్షించుకుంటావు? అది తెలివితక్కువతనం. అతని పట్ల జాలి చూపించు.' అని అంటాడు.

బుద్ధుడు అతనితో, 'ఇంటికి వెళ్ళు. నీవు చాలా అలసిపోయావు. నిన్ను నీవు శిక్షించుకున్నది చాలు. నీవు నా పట్ల ఎలా ప్రవర్తించావో మర్చిపో. ఈ శరీరం తిరిగి భూమిలో కలవవలసిందే. అప్పుడు అందరూ దీని మీద అన్నీ చేస్తారు. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో ' అంటాడు. బుద్దుని జవాబుతో ఆ వ్యక్తి పూర్తిగా కదలిపోతాడు. అతను ఇంటికి వెళ్ళి తిరిగి సాయంత్రం వచ్చి బుద్ధుని పాదాల మీద పడి క్షమించమని దీనంగా ప్రార్థిస్తాడు.

బుద్ధుడు చాలా శాంతంగా 'నాకు కోపం లేదు ఇక నేను నిన్ను క్షమించటం ఏమిటి? నీవు ఆ కోపం నుంచి స్వేచ్ఛని పొందటం చూసి ఆనందంగా ఉన్నది. ఒక మాట గుర్తుంచుకో. ఇటువంటి పని మరి చేయకు. ఈ విధంగానే నీకు నీవు నరకాన్ని సృష్టించుకుంటావు' అని చెబుతాడు.

ధర్మం, కర్మ

మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఎవరైతే మిమ్మల్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో, అటువంటి వారి దగ్గర నుంచే గౌరవాన్ని పొందండి. అటువంటి వ్యక్తి ఎప్పటికీ మిమ్మల్ని అగౌరపరచడు. ఒకవేళ అగౌరపరచినా అతనే బాధపడతాడు. మీరు బాధపడరు. ధర్మమార్గంలో జీవించండి. మిమ్మల్ని స్పష్టంగా తెలుసుకున్న వ్యక్తి మాత్రమే మిమ్మల్ని గౌరవించేందుకు అనుమతించండి. ఒకవేళ వారు మిమ్మల్ని అగౌరపరచినా అది మిమ్మల్ని అంటదు. ఎందుకంటే ధర్మానికి శక్తి ఎక్కువ. అది మీ అంతరంగమంతా నిండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.

ధర్మం అంటే మీ అంతరంగం పట్ల స్పష్టతతో, నిజాయితీగా ఉంటూ, దాన్ని అర్ధం చేసుకోవటమే. ధర్మం అంటే చేతనస్థితిలో, ధర్మ బద్ధంగా జీవించటమే. ధర్మం అంటే సమాజం చెప్పే నీతినియమాలలో జీవించటం కాదు. మీరు సమాజం చెప్పిన నీతి నియమాలలో జీవిస్తే బయట ప్రపంచంలో మీకు రక్షణ ఉంటుంది. మీరు ధర్మమార్గాన్ని అనుసరిస్తే మీ అంతరంగ ప్రపంచంలో రక్షణ ఉంటుంది. మీరు ధర్మమార్గంలో ఉంటే నిరంతరం సరైన విధంగా ఉంటారు. మీరు నిరాశకి లోను కారు.

మనం బయట ప్రపంచరక్షణ కోసం న్యాయసూత్రాల్ని అధికంగా పట్టించుకుంటాం. అర్థం చేసుకోండి, మీరు ధర్మాన్ని అనుసరించండి. మీరు సమస్యలలో ఇరుక్కోరు, నిరాశతో కుంగిపోరు.

బయట ప్రపంచసమస్యల కంటే అంతరంగ ప్రపంచ సమస్యలు చాలా బలమైనవి, అవి చాలా ప్రమాదకరం. అంతరంగ ప్రపంచ సమస్య వస్తే మీరు కదలిపోతారు, వణికిపోతారు. అప్పుడే బయట ప్రపంచసమస్యల్ని మీలోనికి తెచ్చుకుంటారు.

మీ అనుబంధాలు అన్నీ ధర్శపథంలో స్పష్టతతో ఉండాలి. మీ బోధలతో మీరు అంటే తెలుసుకున్నవారు మిమ్మల్ని అవమానపరిస్తే మీరు బాధపడరు. మీరు వారి చేత ప్రభావితం కారు. ఆ వ్యక్తి నిరాశ, కుంగుబాటులకి లోనవుతాడు. సమాజంలో న్యాయసూత్రాలు ఏవిధంగా తయారుచేయబడి, ఒక పద్ధతిలో ఆచరించబడతాయో అదే విధంగా అంతరంగ ప్రపంచ న్యాయసూత్రాలు సర్వాంతర్యామి చేత చేయబడి ఉంటాయి. ధర్మాన్ని అనుసరించండి. అది ఇంకా వర్ధిల్లుతూ ఉన్నది.

ఒక చక్కని మాట ఉన్నది ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఎప్పుడైతే సర్వాంతర్యామి న్యాయాన్ని మీరు నిలబెడతారో, దాని మార్గంలో జీవిస్తారో, ఆ న్యాయం మీకు శక్తిని ఇస్తుంది. ధర్మం తాలూకు న్యాయసూత్రాలు చాలా శక్తిమంతమైనవి.

నన్ను చాలామంది అడుగుతుంటారు, 'స్వామీజీ! మంచివారు బాధలు పడటం, చెడ్డవాళ్ళు సంతోషంగా ఉండటం నేను చూసాను, ఇది ఎలా అని. ముందు ఒక విషయం అర్ధంచేసుకోండి, మంచివాళ్ళు ఎప్పుడూ బాధపడరు కాని ఆ విధంగా కనిపిస్తారు. వాళ్ళు నిజంగా బాధపడితే ఎక్కడో ధర్మమార్గం తప్పింది అని అర్థం. మంచివాళ్ళకి బాధలు ఎక్కువ చెడ్డవారు సంతోషంగా ఉంటారు అన్న మాట తప్పుగా అర్థం చేసుకున్న మాట. ఒక సరదా మాట ఉన్నది. అదృష్టం అంటే ఏమిటి? ఎవరికైతే అవసరం లేదో వారికి విజయాన్ని ఇచ్చిన ఒక కారకం.

వికృమార్థంలో అర్ధం చేసుకున్న మాట ధర్మం కాదు. మరొక ముఖ్య విషయం మీ అనుభవంలో ఒక భాగం కాని ఉన్నత శ్రేణి విషయాల్ని అర్ధం చేసుకోవలసిన అవసరం లేదు. మీకు అర్ధమైన విషయాలు, సత్యం పట్ల మాత్రం నిజాయితీగా ఉండండి, అది చాలు.

మీరు ధర్మస్థాయిలో ఉంటే పూర్తిగా ధర్మంలోనే ఉండండి. అదే సంధర్శం. మీ అంతరంగంలో అతిముఖ్యమైన భాగం అయిన ధర్మం విషయంలో నిజాయితీగా ఉంటూ, దానికి అనుగుణంగా ఉంటే చాలు.

అప్పుడు మీలో అనవసరమైన కదలికలు ఉండవు. మీరు నిరాశలో పడరు. మీరు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. నేను చెబుతున్నాను, మీరు ధర్మాన్ని రక్షిస్తే అది మీకు చాలా శక్తిని ఇస్తుంది. అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది.

బాధ్యత

కర్మసిద్ధాంతం ఏమి చెబుతుందంటే మీకు ఏది జరిగితే అది మీ పని వల్లనే అని. మీ బయట నుంచి మీకు ఏమీ జరగదు. మీకు జరిగేదంతా మీరు సృష్టించుకున్నదే. అయితే ఈ విషయం చాలావరకు మీకు తెలియదు. మీరు చేతన స్థితిలో ఉండరు, కాబట్టి చేసేవన్నీ మీరు చూడరు.

మీరు విచారంగా ఉన్నప్పుడు దానిలోకి చూడండి. దాని మీద ధ్యానం చేయండి. ఏ విధంగా ఆ విచారాన్ని మీరు సృష్టించుకున్నారో తెలుసుకోండి, ఆ విచారణకి కారణం మీ లోపల ఎక్కడ ఉన్నదో చూడండి. మీ విచారణకి అందరూ కారణం అని మీ మనస్సు చెబుతుంది. మీ భార్య లేక భర్త స్నేహితుడు, బాస్, పక్కింటివాళ్ళు – ఇలా ఎవరో ఒకరు కారణం అని చెబుతుంది.

ఒక చిన్న కథ : న్యూస్ పేపర్లో ఒక అడ్వర్‌టైజ్‌మెంటు వస్తుంది. 'మా సంస్థలో ఉద్యోగం చేయటానికి ఒక బాధ్యత గల వ్యక్తి కావాలి' అని. ఒక వ్యక్తి ఆ ఉద్యోగం కోసం వెళతాడు. అతను బాస్‌తో నేను మీ ఉద్యోగానికి సరిగ్గా సరిపోయే వ్యక్తిని అంటాడు. బాస్ కుతూహలంగా 'ఎందుకు?' అంటాడు.

ఆ వ్యక్తి 'నేను ఎక్కడ పని చేసినా అక్కడ ఏ తప్పు జరిగినా నాదే బాధ్యత అనే వారు.' అని జవాబు చెబుతాడు. స్పష్టంగా తెలుసుకోండి, మీరు ఏమి చెప్పినా, ఏది చేసినా దానికి బాధ్యులు మీరే.

మీరు నిశ్శబ్దంగా అనుమతించకపోతే ఎవరూ మిమ్మల్ని బాధపెట్టలేరు. ఒక్కసారి మీరు ఏం జరిగినా దానికి బాధ్యత మీ లోపలనే ఉన్నది అని తెలుసుకుంటారో, అప్పుడు అకస్మాత్తుగా జరిగే మార్పులు చూడవచ్చు. మీ పైన పూర్తి బాధ్యత మీరే తీసుకోండి. అప్పుడు మీరు ఏది చేసినా చాలా చక్కగా చేయగలరు.

ఎదుటివారిని తప్పు పట్టడం ఆపితే, జరిగేవాటి కన్నింటికీ మీరే బాధ్యులు అని తెలుసుకుంటే, మీరు ప్రతి పనిని తెలుసుకునే తత్త్వంతో చూడగలరు. మీ ప్రతి ఆలోచనా మీకు తెలుస్తుంది.

ఆ మాత్రం తెలుసుకోగలిగితే చాలు, మీరు వివేకంతో ఏ పనెనా చేసారు. మీరు విచారంగా ఉండాలి అంటే విచారంగా ఉంటారు. దానిలో తప్పు లేదు. విచారంలో పూర్తి విచారంతోనే ఉండండి. విచారం అవసరం లేదు అనుకుంటే సంతోషంగా ఉండండి, అంతే.

మీ సమస్యల్ని మీరు ఎలా సృష్టించుకుంటారో గమనించండి. రకరకాల మూడ్స్‌ని ఎలా తయారుచేసుకుంటారో, గమనించండి. మీరు తయారు చేసుకున్నవాటికి ఎదుటివారిని బాధ్యుల్ని చేసే తెలివితక్కువ పని చేయకండి. అలా చేస్తే మీరు ఎప్పటికీ మారరు. మీరు ఎప్పటికీ విచారంగానే ఉంటారు. ఎందుకంటే మీరు ఏమీ చేయలేరు. కాబట్టి ఎదుటివారు అన్నీ చేస్తున్నారు – అని మీరు అనుకుంటే ఇక మీరు ఏం చేయగలరు? మీ పాత్ర ఏముంది? అప్పుడు మీ చేతుల్లో ఏమీ ఉండదు. మీరు ఎదుటివారు మారేదాకా ఎదురుచూడాలి. కాని మార్పు ఎప్పటికీ రాదు. ఎందుకంటే మీ లోపల జరిగే వాటికన్నింటికీ ఎదుటివారు బాధ్యులు కాదు.

కర్మచక్రాన్ని ఛేదించవచ్చు

కర్మ, మీ తరువాత శరీరం

తరువాత జన్మని ఎలా ఎంచుకుంటాం : మన నుంచి జీవశక్తి బయటకి వెళ్ళగానే, అది మూడు క్షణాల్లో తరువాత శరీరాన్ని తీసుకుంటుంది. మరణించే సమయంలో మీ లోపల ఉన్న అత్యంతోషకరమైన మూడు అనుభవాలు మీ చివరి ఆలోచనలలో ఉంటాయి. ఈ మూడు అనుభవాల ఆధారంగా ఏర్పడే మీ మానసికవ్యవస్థ ఆధారంగా తరువాతి శరీరాన్ని తీసుకుంటారు.

ఈ మూడు ఆలోచనలు ఒక్కొక్క కర్మనుంచి, సంచిత, ప్రారబ్ద ఆగామ్యకర్మల నుంచి ఉంటాయి. దీని ఆధారంగా ఈ జీవితంలో ప్రారబ్ధకర్మలు రూపుదిద్దుకుంటాయి.

ఆధ్యాత్మికజీవనసరళి సంచితకర్మల్ని తగ్గిస్తుంది, తెలుసుకునే తత్వంలో జీవించేలా చేస్తుంది.

ధ్యానం ప్రారబ్ధకర్మల్ని తగ్గిస్తుంది. ధ్యానం చేతనస్తితిలో సహాయం చేయటమే కాదు, అచేతనస్థితి లోనికి చొచ్చుకుపోయి అక్కడ భౌతిక – మానసిక – ఆత్మస్థాయిలో శుభ్రం చేసి, స్వచ్ఛంగా ఉంచగలుగుతుంది.

అయితే కర్మల అకౌంటులో పెద్ద బాలెన్స్ సంచితకర్మలు. అవి కేవలం గురువుల కృపతోనే కరిగిపోతాయి.

ఈ కర్మలు కరిగిపోయే కొద్దీ తరువాత శరీరాన్ని తీసుకొనేటప్పుడు ఉండే అడ్డంకులు తొలుగుతాయి. ఈ మూడు కర్మలూ తరువాత శరీరంలో లోతుగా ఉండవలసిన అనుభవాల్ని నిర్దేశిస్తాయి. తరువాత తీసుకునే శరీరం ఆ అనుభవాలకి అనుగుణంగా ఉండాలి.

అది ఈ విధంగా ఉంటుంది, నేను ఇంగ్లీషు మాట్లాడే వ్యక్తిని కలవాలి అనుకుంటే నాకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా నేను ఇంగ్లీషు, స్పానిష్, జర్మన్ మాట్లాడగలిగే వ్యక్తిని కలవాలి అనుకుంటే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

అదే విధంగా మీకు మూడు కర్మలూ ఉంటే మరొక శరీరాన్ని తీసుకునేటప్పుడు చాలా అడ్డంకులు ఉంటాయి.

ఉదాహరణకి మీ సంచితకర్మల నుంచి ఉన్న కోరిక నేను అందంగా ఉండాలి అని, ప్రారబ్ధం అంటే జన్మ తీసుకున్న కర్మ నుంచి నేను బాగా డబ్బున్నవాడినై ఉండాలి అనే కోరిక, జన్మలో పోగుచేసుకున్న ఆగామ్యకర్మ నుంచి నేను అమెరికాలో సెటిల్ అవ్వాలి అనే కోరిక ఉన్నాయనుకోండి. అప్పుడు శరీరం దొరకటం మీ జీవశక్తికి కష్టంగా ఉంటుంది.

శరీరాన్ని వదిలిన మూడు క్షణాల్తో అటువంటి శరీరం అంత తక్కువ సమయంలో దొరకటం కష్టం.అప్పుడు జీవశక్తి ఉన్నవాటిలో బలమైన కోరికని తృప్తిపరచగల శరీరాన్ని తీసుకుంటుంది. ముందు శరీరాన్ని వదిలే సమయంలో ఉన్న కోరికలు, మానసికవ్యవస్థ వీటినే వాసన అంటారు.

ఈ మూడు కోరికల్ని, మూడు ఆలోచనల్ని ఒక్క క్షణదర్శనంలా మూడు క్షణాల్లో ఒక వాసనలా చూసారు. వాసన అనేది టెలివిజన్ చానెల్. ఆ వాసనకి ఆకర్షితమైన శరీరం టెలివిజన్ సెట్టుని ఆ చానెల్‌కి ట్యూన్ చేయటమే. వాసన లోతు శరీరానికి సరిపడినప్పుడు అది జీవశక్తిని ఆకర్షిస్తుంది. ట్యూన్ చేసిన టి.వి. ఏ విధంగా చానెల్‌కి తగిన విద్యుత్తరంగాలని ఆకర్షిస్తుందో, వాసన తగిన శరీరాన్ని ఆకర్షిస్తుంది.

జీవశక్తి, ఆత్మ శరీరాన్ని వదిలి తాను ఎంచుకున్న కొత్త శరీరం లోనికి ప్రవేశించి తల్లి గర్భం నుంచి బయటికి వస్తుంది. తల్లి గర్బంలో శరీరం లోనికి ప్రవేశిస్తుంది. కారణశరీరంలోని చీకటి తల్లి గర్బంలోని చీకటితో పోలి ఉంటుంది. శరీరం తల్లిదండ్రుల శక్తితో తయారయ్యి ఉంటుంది. కాబట్టి జీవశక్తి తన కోరికలు, వాసనలు, మానసికవ్యవస్థ ఆధారంగా, ఆ రెండు శక్తులూ కలసి ఉన్న శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంచుకోరు. బిడ్డలే తల్లిదండ్రులని ఎంపిక చేసుకుంటారు.

ఒక శరీరాన్ని ఎంపిక చేసుకున్నాక, జీవాత్మ మిగిలిన రెండు కోరికలనీ తృప్తిపరచాలి. అయితే అందుకు అనువైన శరీరం దొరకలేదు. అయితే చీకటిలో తల్లి గర్భంలో తాను పొందిన బాధతో ఆత్మ తనలోని వాసనలని మరిచిపోయి కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఈ కొత్త శరీరం పాత శరీరాన్ని వదిలేటప్పటి కోరికల్ని గుర్తుంచుకోలేదు. దారిలో తాను ఏ కోరికతో పాత శరీరాన్ని వదిలిందో, వాటిని మరిచిపోతుంది. ఆ కోరికలు తీర్చటం బదులు కొత్త శరీరం కొత్త కోరికల్ని తెచ్చుకొని కొత్త కర్మల్ని పోగుచేసుకుంటుంది.

కర్మచక్రాన్ని ఛేదించవచ్చు

ఎప్పుడైతే ఈ మూడు కర్మలలో ఒకటి పోతుందో, జీవాత్మకి తన ఎంపిక మీద ఏకాగ్రత ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోగుచేసుకున్న ఆగామ్యకర్మ, జన్మతో తెచ్చుకున్న ప్రారబ్దకర్మల్ని ధ్యానం ద్వారా, జీవనసరళిని అర్థం చేసుకోవటం ద్వారా పోగొట్టుకోవచ్చు గురుకృపతో సంచితకర్మలు తగ్గించుకోవచ్చు

ఒకసారి సంచితకర్మలు పూర్తిగా శుభ్రపడితే ఇక మరొక శరీరాన్ని తీసుకోవలసిన అవసరం ఉండదు. ఒకవేళ మరొక జన్మ తీసుకున్నా అది పొంగి ప్రవహించే ఉత్సాహంతో ఆనందంతో ఉంటుంది. అప్పుడు జన్మ చేతనస్థితిలో జరుగుతుంది. ఎందుకంటే బలంగా శరీరం వైపు లాగే కర్మలు ఉండవు కాబట్టి. వారు జీవించే జీవితం లీల, కారణం లేని ఒక నాటకం, ఒక ఆట. ఇదంతా అవతారమూర్తులు ఆడే ఆట.

జననమరణ చక్రం ఎలా

మన అందరికీ మన పూర్తి సంచితకర్మ ప్రారంభంలో ఒక దైవనాటకం. జ్ఞానోదయమైన యోగికి అది ఎప్పుడూ దైవనాటకమే. ఎందుకంటే ఆయనకి కర్మలు ఉండవు కాబట్టి. ఇది ఆట ఎందుకంటే మీరంతా ఆ దేవుని ఆటని మాత్రమే.

మనం ఎంచుకొని జన్మ తీసుకుంటాం. మన

ప్రారబ్దకర్మలు మరిచిపోయి ఆగామ్యకర్మల్ని పోగు చేసుకుంటూ సంచితకర్మల్ని మరింత పెంచుకుంటాం. తరువాత పెరిగిన కర్మల భారం తొలగించుకోవటానికి మరొక జన్మ తీసుకుంటాం. మరలా చాలా కర్మల్ని పోగు చేసుకుంటాం. ఈ విధంగా జనన మరణాల చక్రం ఏర్పడుతుంది.

ఒక విషయం అర్ధం చేసుకోండి. మీరు పోగు చేసుకున్న ఆగామ్యకర్మలే మీకు బంధాలు మొత్తం కర్మలైన సంచిత కర్మలు ప్రారబ్ద కర్మలు సర్వాంతర్యామి ఆట. దాని ఫలితం ఆ జన్మలోని కర్మ జన్మించాక తిరిగి కర్మల్ని పోగుచేసుకోకుండా ఉంటే సర్వాంతర్యామి ఆట కొనసాగుతుంది. బంధాలు పోగుచేసుకున్నా కర్మలతోనే ఉంటుంది.

మనిషి తరువాతి జన్మలో జంతువుగా పక్షిగా, పురుగుగా లేక మనిషిగా – జన్మ తీసుకుంటాడు?

ఇది మంచి ప్రశ్న. ఈ సత్యాన్ని ధైర్యంగా చెబుతాను. జననమరణచక్రానికి సంబంధించిన ఊహలని మీకు పోగొడతాను.

ఒకసారి మనిషి జన్మ తీసుకున్నాక అతను తిరిగి మనిషిగానే జన్మిస్తాడు. అతను చేతనస్థితికి వ్యతిరేకంగా ఏ పని చేసినా అంటే ఎదుటివారిని మాటల ద్వారా చేతల ద్వారా భౌతికంగా,

మానసికంగా బాధిస్తే, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM లేదా మానసికచేతనస్థితి ఏమైతే సర్వాంతర్యామి స్వరూపాలో వారిని బాధిస్తే తిరిగి మనిషి జన్మ పొందకపోవచ్చు. ఈ పనుల తీవ్రత విశ్వశక్తిలో రికార్డు చేయబడతాయి. ఒక విషయం అర్ధం చేసుకోండి, పని ఒకటే కాదు దాని తీవ్రత కూడా ముఖ్యం.

ఏ వ్యక్తి అయితే అత్యల్పచేతనస్థితిలో జీవిస్తాడో అతను జంతువుగా జన్మ తీసుకుంటాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి జీవితం అంతా తినటానికి, నిద్ర పోవటానికే గడిపితే అతను జంతువుగా జన్మిస్తాడు. మనిషికి ఉండే ప్రత్యేకలక్షణాలైన ప్రేమని పంచటం, జ్ఞానోదయం కోసం తపించటం ఇటువంటివి కనీసం ఒక్కసారైనా అనుభవాన్ని పొందకపోతే అతను జంతువుగా జన్మిస్తాడు. ఎందుకంటే అతని శరీరం మానవశరీరమే కాని అతనిలో అనుభవాలు మేలుకొనలేదు.

మనం దేని గురించి అయినా బలంగా అనుకుంటే అది ప్రారబ్ధం కాకుండా ఉంటే తరువాతి జన్మ కోసం ఎదురుచూడాలా?

లేదు, మీరు మీ ప్రారబ్దాన్ని బలమైన సంకల్పం ద్వారా మార్చవచ్చు. మీలో సంకల్పం బలంగా ఉంటే ఈ జన్మలోనే మీకు పునర్జన్మ జరగవచ్చు. ఆ తరువాత జన్మ ఇప్పుడే తీసుకుంటారు. ఉదాహరణకి గృహస్థలు, బాధ్యతలలో చిక్కుకుపోయి ఉన్నవారు నన్ను అడుగుతుంటారు, 'స్వామీజీ, కనీసం వచ్చే జన్మలోనైనా నేను మీతో ఉండేలా దీవించండి' అంటారు. వాళ్ళు కొన్ని నెలలలోనే ఆశ్రమవాసులవుతారు. ఇదంతా వారి సంకల్పబలం మాత్రమే.

జ్ఞానోదయం – తిరిగి మన ఇంటికి వెళ్ళటం

సర్వాంతర్యామి అనే మహాసముద్రంలో పైకి లేచిన ఒక కెరటం మీరు. కెరటం పైకి లేచినా అది సముద్రంతో అనుబంధాన్ని కలిగిఉంటుంది. అది తాను స్వతంత్రమైన ఉనికి కలిగి ఉన్నాను అని అనుకుంటుంది. కాని అది ఒక ఊహ. అది సముద్రానికి పైన లేచినా, సముద్రంలో పడిపోతున్నా కెరటం సముద్రంలో ఒక భాగమే.

దానంతట అది సంతోషంతో శరీరాన్ని తీసుకుంటే దానికి ఆగామ్యకర్మలు ఉండవు. ఎప్పుడైతే ఆగామ్యకర్మల్ని పోగుచేసుకుంటుందో స్వచ్ఛమైన సంచిత కర్మ కూడా కలుషితం అవుతుంది. ఆ సంచిత కర్మ తిరిగి మరు జన్మలోనే పోగొట్టుకోగలుగుతారు. కల్మషమైన సంచిత కర్మ జనన మరణ చక్రాన్ని సృష్టిస్తుంది. ఆ విధంగా జననమరణచక్రం తయారవుతుంది.

జీవాత్మ కొత్త శరీరాన్ని తీసుకున్నాక ప్రారబ్ధకర్మల్ని మరిచిపోతుంది. కాబట్టి ఏ కోరికలతో మీరు మీ క్రితం జన్మ శరీరాన్ని వదిలారో అది మరిచిపోతారు. ఆ కోరికలని గుర్తు చేసి, వాటిని ఈ జన్మలో సాధించేలా చేసేది తపస్సు, అదే జ్ఞానోదయం పొందటం.

కాబట్టి దివ్యనాటకం ద్వారా జన్మించినప్పుడు మీరు మరిచిపోతే ఏమవుతుంది. కర్మల భారం ఎక్కువెనప్పుడు తెలుసుకుంటారు, ఎక్కడో ఏదో సమస్య ఉన్నది అని అర్థం అవుతుంది. అప్పుడు మేల్కొని జ్ఞానోదయం పొందాలని చూస్తారు. తిరిగి జ్ఞానోదయం పొందుతారు. తిరిగి వెనక్కి రావటమే జ్ఞానోదయం.

కొన్నిసార్లు భయంకరమైన కల వచ్చినప్పుడు మాత్రమే ఇది కల అని వెంటనే అనుకుంటారు. అప్పుడు మేలుకొంటారు. నేను కలకంటున్నాను అన్న ఆలోచన వచ్చినప్పుడు మీరు జ్ఞానోదయం పొందుతారు. నేను కల కంటున్నాను, ఈ ప్రపంచం ఒక కల అని తెలుసుకొని అబద్దమైన ప్రపంచాన్ని వదిలివేసి, సత్యాన్ని పట్టుకోవటమే జ్ఞానోదయం. ఈ ప్రపంచంలో అవే అనుభవాలు వాటితో అలసిపోతారు. అప్పుడు మీకు అనుమానం వస్తుంది, నేను కల కంటున్నానా అనుకుంటారు. అప్పుడు ప్రపంచాన్ని అనుమానిస్తారు. ప్రపంచం మీకు చేసిన ప్రమాణాల్ని అనుమానిస్తారు.

ఇదంతా న్యూస్ పేపర్ అడ్వర్ర్‌టెజ్‌మెంట్‌లా ఉంటుంది. అందమైన బీచ్, చక్కని టేబుల్, దాని మీద రుచికరమైన పదార్థాలు, అంతా స్వర్గంలా ఉంటుంది. అది అత్యంతవిలాసాన్ని మీకు ఆశ పెడుతుంది. ఆ ప్రపూణాన్ని అనుమానిస్తారు, ఎందుకంటే వందమంది దీన్ని చూసి అక్కడికి వెళితే వారి అందరికీ అదే ఆనందపారవశ్వం కలగదు. ఈ విషయం మీరు తెలుసుకుంటారు. జీవితం కూడా అంతే, మీ మనస్సు చేసే ప్రపూణాలు నెరవేరలేదు అని తెలిసి అనుమానిస్తుంటారు.

కర్మ నుంచి బయటికి రావటానికి సాధనపద్ధతులు

స్వేచ్ఛ పొందటానికి తిరిగి జీవించండి : ఇంత వరకూ మనం చెప్పుకున్న విషయాలు కర్మలు రాకుండా ఎలా ఉండాలి అని. దాని నుంచి తప్పించుకోవటానికి ఒక చిన్న సాధన చెబుతాను. ఈ క్షణం నుంచి ప్రయత్నించి, మీ జీవితంలోని అన్ని సంఘటల్ని గుర్తుచేసుకోండి. మీ చిన్నతనపు రోజుల వరకూ వెళ్ళండి. మీరు గుర్తు తెచ్చుకోగలిగినంత గుర్తు తెచ్చుకోండి.

మీకు గుర్తుకు రాని విషయాల గురించి పట్టించుకోవద్దు. ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు గుర్తు పెట్టుకోలేనివి కేవలం వేలాదేవి మాత్రమే. అవి మిమ్మల్ని లోతుగా ప్రభావితం చేయలేదు. అందుకే మీ జ్ఞాపకాలలో అవి లేవు. ఈ పద్ధతిని ఒక సంవత్సరం సాధన చేయండి. తిరిగి అందులో జీవిస్తే దాని నుంచి స్వేచ్చ దొరుకుతుంది.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్సురణ కార్యక్రమంలో ఈ విషయం మీదే ఏకాగ్రతని ఉంచి కర్మలు పోయేలా చేస్తాం. అది జ్ఞానోదయం అయిన యోగీశ్వరుని సమక్షంలో మీరు తీసుకునే ఆధ్యాత్మికస్నానం.

విగ్రహాలు – జ్ఞానోదయమైన యోగీశ్వరులు : మీ కర్మలు పోగొట్టే మార్గం

తిరిగి కర్మల్ని పోగుచేసుకోవద్దు అని పదే పదే గుర్తుచేయటానికి ఒక దారి ఉన్నది. మీ గతకర్మల ప్రభావం లేకుండా జీవించటానికి మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది కర్మ ఉన్నత చేతనస్థితి సమక్షంలో శక్తి హీనమవుతుంది అని అర్థం చేసుకోవటం. సాధారణ మానవులకి, జ్ఞానోదయం అయిన గురువులకి మధ్య చాలా తేడా ఉన్నది. సాధారణ మానవునికి తన సంకల్పంతో తన శరీరాన్ని జీవింపజేసి ఉంచే శక్తి లేదు. అంటే మామూలు మనిషి శరీరం జీవించి ఉంటుంది లేదా మరణిస్తుంది. అది అతని నియంత్రణలో ఉండదు.

కాని జ్ఞానోదయమైన వారికి అది వారి నియంత్రణలో ఉంటుంది. ఆయన తన శరీరాన్ని జీవంతో ఉంచగలడు లేదా విశ్రాంతి ఇవ్వగలదు. ఈ శక్తి ద్వారా ఆయన మరొక శరీరానికి కూడా జీవితాన్ని ఇవ్వగలడు. ఆయన ఒక రాతికి కాని, లోహానికి కాని ప్రాణాన్ని ఇస్తే, అది ఆయన ప్రతినిధి అవుతుంది.

మనకి ఉన్న పెద్ద పెద్ద పెద్ద దేవాలయాలలోని విగ్రహాలన్నీ జ్ఞానోదయమైన యోగీశ్వరుల చేత ప్రాణప్రతిష్ఠ కావించబడ్డాయి. అరుణగిరి యోగీశ్వరుడు తిరువణ్ణామలెలోను, పతంజలి చిదంబరంలోను, కరూరార్ తంజావూరులోను, కొంగనావర్ తిరుపతిలోను, మీనాక్షి మదురెలోను ఆయా విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేసారు.

అందుకే విగ్రహాలు సాక్షాత్తు జ్ఞానోదయమైన యోగీశ్వరుల శరీరాలతో సమానం. యోగీశ్వరులు శరీరాన్ని వదిలాక కూడా వారి శిష్యులు ఆ విగ్రహాలకి సేవ చేస్తుంటారు. ఆ విగ్రహాన్ని గురుదేవుల శరీరంగానే భావిస్తారు. అందుకే విగ్రహాలకి గురుదేవులకి చేసే సేవలన్నీ చేస్తారు. ఉదాహరణకి అరుణగిరి యోగీశ్వరుని శిష్యులు, అరుణాచలం గుడిలో కొన్ని తరాలుగా అవే సేవల్ని అందిస్తున్నారు. గురుదేవులకి ఏ విధంగా సేవ చేసేవారో విగ్రహాలకి కూడా అవే చేసారు.

గురుదేవులు శరీరాన్ని వదిలాక కూడా ఈ విగ్రహాల ద్వారా శిష్యులకి అందుబాటులో ఉంటారు. ఉదాహరణకి నా జీవితకాలంలో నా భౌతికశరీరం, నా సమక్టం అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ విగ్రహాలని ఏ విధంగా చేసాను అంటే నేను భౌతికంగా లేని చోట అవి నా ప్రతినిధిగా పని చేస్తాయి.

విగ్రహాలకి స్వతంత్రమైన మేధ ఉంటుంది. వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేయటం చాలా పెద్ద కార్యక్రమం. అది బిడ్డకి జన్మనివ్వటం లాంటిది. ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలు డైరెక్ట్‌గా మీ ప్రార్థనని ఆలకించి, జవాబు ఇవ్వగలవు. మీరు వాటితో అనుబంధాన్ని పెంచుకోగలిగితే అవి డెరెక్ట్‌గా మీతో అనుబంధాన్ని పెంచుకుంటాయి.

కర్మచక్రాన్ని ఛేదించవచ్చు

మీరు మా ఆశ్రమంలో పూజ, మొదలైన కార్యక్రమాలు చూసే అర్ధం అవుతుంది. ఉదయాన్నే సుప్రభాతం ఉంటుంది. అక్కడ విగ్రహానికి సుప్రభాతసేవ అది. తరువాత చిన్న గిన్నెలో నూనె తలకి రాసుకోవటానికి, పళ్ళ పొడి బ్రష్ చేసుకోవటానికి ఇస్తారు. తరువాత స్నానం చేయించి ఉతికి ఇస్తీ చేసిన బట్టలు ఇస్తారు. తరువాత గురుదేవులకి ఇచ్చినట్లే (ఆహారం) నివేదన చేసారు. హారతి ఇస్తారు. రాత్రి ఒక ఉత్సవంలా ఆ విగ్రహానికి పవళింపుసేవ చేస్తారు.

ఒక విషయం అర్థం చేసుకోండి. ఇదంతా చేయటం విగ్రహాలు కాని, గురువు కాని ఏమీ పొందరు. అది మనకి జరుగుతుంది. దీనినే భగవంతునితో జీవించటం అంటారు. గురుదేవుల సమక్షాన్ని సాధన చేయటమే పూజ. ప్రతి రోజూ పూజ చేయటం వల్ల గురుదేవుల సమక్షాన్ని, భగవంతుని సమక్షాన్ని గుర్తు చేసుకోవటమే.

పూజలు, హోమాలు మొదలైనవి

పూజా కార్యకమాలు చాలా శక్తిమంతమైనవి. వాటికి చాలా శక్తి ఉన్నది. నన్ను చాలా మంది అడుగుతుంటారు, 'మీరు జ్ఞానోదయమైన యోగీశ్వరులు కదా మీరు ఎందుకు పూజాకార్యక్రమాలు చేసారు అని. నేను వాళ్ళకి చెబుతాను.' 'నేను జ్ఞానోదయమైనందుకే పూజలు ఎందుకు, కచ్చితంగా ఎలా చేయాలో అందరికీ నేర్పిస్తున్నాను. జ్ఞానోదయమైనవారికి వారి కోసం ఎటువంటి పూజాకార్యక్రమాలు అవసరం లేదు.'

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి హోటల్‌కి వెళ్ళి ఇడ్లీలు తినటం ప్రారంభిస్తాడు. అతను ఎనిమిది ఇడ్లీలు తింటాడు. తొమ్మిదవ ఇడ్లీ తిన్నాక అతనికి తృప్తి కలుగుతుంది. ఆకలి తీరుతుంది. వెయిటర్ బిల్లు తొమ్మిది ఇడ్లీలకి తెచ్చి ఇస్తాడు. అతను వెయిటర్‌తో, 'ఇదేమిటి? నేను ఒక ఇడ్లీకే బిల్లు కడతాను. ఎందుకంటే తొమ్మిదవ ఇడ్లీ ఒక్కటే నా ఆకలి తీర్సింది. ముందు ఎనిమిది ఇడ్లీలు నా ఆకలి తీర్చలేదు. అందుకే నేను ఆ తొమ్మిదవ ఇడ్లీకే బిల్లు కడతా' అంటాడు.

అతను ఎనిమిది ఇడ్లీలు తినకపోతే తొమ్మిదవ ఇడ్లీ ఒక్కటే ఏ విధంగా ఆకలి తీరుస్తుంది. మనం సరిగ్గా ఇదే పని మన జీవితాలలో చేస్తుంటాం. పూజలు వద్దు అనేవారంతా ముందు తిన్న ఎనిమిది ఇడ్లీలు వద్దు అన్నవారే. ఎవరైతే పూజలు చేయటం వృథా, తిన్నగా ధ్యానం లోనికి వెళ్ళాం, ఆ విధంగా ఆధ్యాత్మిక అనుభవం పొందుతాం, అంటే ముందు ఎనిమిది ఇడ్లీలకి డబ్బు కట్టమంటున్నారని అర్ధం.

అర్థం చేసుకోండి. తొమ్మిదవ ఇడ్లీ పని చేయటానికి కారణం ముందు తిన్న ఎనిమిది ఇడ్లీలు. అతను ముందు ఎనిమిది ఇడ్లీలు తినకపోతే ఒక ఇడ్లీ ఆకలి తీర్చలేదు కదా. ధ్యానం విషయం కూడా అంతే. మీరు పూజలు నిజాయితీగా చేసారు కాబట్టి ధ్యానం పని చేస్తుంది. మీరు ఈ ప్రాథమికమైన వాటిని తోసేస్తే డైరెక్ట్‌గా తొమ్మిదవ ఇడ్లీ ఆకలి తీర్చుతుందనుకోవటమే.

మీకు శరీరం ఉన్నది అనుకున్నంత కాలం, మీరు విశ్వశక్తితో అనుబంధాన్ని మరొక శరీరం ద్వారా మాత్రమే ఏర్పరచుకోగలరు. ఎప్పుడైతే మీరు శరీరం అనే భావాన్ని వదులుతారో సర్వాంతర్యామిని రూపంలేకుండా చూడగలరు. అంత వరకూ మీకు ఒక రూపం కావాలి. దాన్ని గురు చేయటానికి పూజాకార్యక్రమాలు కావాలి. పూజతో పాటు ధ్యానం కూడా ఉంటే మంచిది. అలా ఉన్నప్పుడు సాధన చేసే క్రమశిక్షణ కలుగుతుంది.

లేకపోతే ధ్యానం నిరంతరం చేయలేరు. మొదటి రోజు, 'ఇవాళ మా అత్తగారు ఇక్కడే ఉన్నారు. పని ఎక్కువగా ఉంది. రేపు ధ్యానం చేయవచ్చులే' అనుకుంటారు. రెండు రోజుల తరువాత మీ అత్తగారు వెళ్ళిపోయాక, 'మా అత్తగారు ఇప్పుడేగా వెళ్ళారు. కాస్త రిలాక్స్ అయ్యి ధ్యానం చేస్తానులే' అనుకుంటారు. అలా కాకుండా మీరు సంతోషంగా ఉంటే, ఇవాళ సంతోషంగా ఉన్నాను, ఇంకా ధ్యానం ఎందుకు అని ధ్యానం చేయరు. ఒకవేళ నిరాశగా ఉంటే, నాకు నిరాశగా ఉంది, నేను ధ్యానం మీద ఎలా ఏకాగ్రత నిలపగలను అనుకుంటారు ధ్యానం చేయకుండా ఉండేందుకు మీ మనస్సు ఏదో ఒక చక్కని కారణాన్ని వెతుకుతుంది. దాన్నేఒక పూజాకార్యక్రమంలా అనుకోండి, ఇక మానటానికి ఏ వాదాన్నీ వెతకరు. ధ్యానం లేదా పూజ చేసేసారు.

కార్యక్రమంలా చేసే పూజ – మీలో క్లిక్ కలిగించే ఒక పద్దతి దీక్ష

కేవలం దీక్షతో మీలోని ప్రారబ్ధకర్మలని తగ్గించవచ్చు. వాటి ప్రభావాన్ని మీ మీద తగ్గించి, మీ అసలైన సంతోషస్థితి వైపుగా మీరు వెళ్ళవచ్చు. మీ స్వచ్ఛమైన అంతరంగాన్ని మీరు తిరిగి పొందవచ్చు. అప్పుడు మీరు ఆగామ్యకర్మల్ని పోగుచేయటం కూడా ఆపవచ్చు,

దీక్ష అంటే జ్ఞానం. మిమ్మల్ని నిరాశ, కుంగుబాటు ఆలోచనల నుండి బయటకి తీయగల క్లిక్‌లు.అవి మిమ్మల్ని ప్రారబ్ద కర్మల ప్రభావం నుంచి బయటికి తెస్తాయి.

పూజ

పూజ అంటే ఒక కార్యక్రమంలా చేసే సేవ. పూజ అంటే ఈ రోజు వరకూ మీకు జరిగిన క్లిక్‌లని గుర్తుచేసుకోవటమే. అప్పుడు మీకు అవసరమైనప్పుడు అవసరమైన క్లిక్ మీ ముందుకి వచ్చి మీ సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తుంది.

గురువులు బోధిస్తున్నారు అంటే అది బోధ కాదు. అది ఒక శక్తిమంతమైన అనుభవం. ఆయన ఇచ్చిన దీక్షలని మీరు సరిగా ఉపయోగించుకోలేకపోతే, ఈ శాస్త్రశ్నస్తాలని మళ్ళా మళ్ళా ఉపయోగించలేకపోతే, మీరు ఈ దీక్షలని సరిగ్గా గుర్తుంచుకోలేరు. ఈ ముఖ్యవిషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి.

ఉదాహరణకి మీకు ఒక మంచం ఉందనుకోండి, దాన్ని రెండు సంవత్సరాల పాటు ఉపయోగించలేదనుకోండి, ఇక అది పనికి రాదు. కొన్నాళ్ళకి అది మాయమైపోతుంది కూడా. మీకు గురుదేవులు ఇచ్చిన దీక్షల్ని, జ్ఞానాన్ని రెండు సంవత్సరాల పాటు ఉపయోగించకుండా పోతే, అవి మీ కోసం ఎదురు చూస్తూ కూర్చోవు, అవి మాయమైపోతాయి, అంతే.

కాబట్టి మీలో గురుదేవుల ద్వారా జరిగిన క్లిక్‌లని ఏ విధంగా ప్రతి రోజూ గుర్తు పెట్టుకుంటారు, అదే పూజ. పూజని ఆ విధంగా రూపొందించారు.

మీరు ప్రతి రోజూ ఒక కార్యక్రమంలా పూజకి కూర్చోగానే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఆ క్లిక్‌ని, ఆ అనుభవాల్ని గుర్తు చేసుకుంటారు. అప్పుడు ఆ క్లిక్ మీ లోపల పైకి వస్తాయి. ఈ పూజలు మీలోని స్వచ్ఛమైన చేతనస్థితిని ప్రతి రోజూ తీసుకువస్తాయి. అప్పుడు సంస్కారాల శక్తి,

మీరు జన్మ తీసుకుంటూ తెచ్చుకున్న కర్మల ప్రభావం తగ్గిపోతే మీరు ఈ జన్మలో కొత్త కర్మల్ని పోగుచేసుకోరు. కొత్త కర్మల్ని పోగుచేయటం ఆగిపోగానే, బాలెన్స్‌లో ఉన్న కర్మల శక్తి, వాటి ప్రభావం మీపైన తగ్గిపోతాయి. మిమ్మల్ని పదే పదే అత్యుత్తమచేతన స్థితికి తీసుకురాగల వ్యక్తి గురుదేవులు. మీరు శరీరాన్ని వదిలే సమయంలో మీకు కనిపించి సంచితకర్మల్ని పూర్తిగా తొలగిస్తాడు.

ఉదాహరణకి చిన్న పాప మీ ఒడిలో కూర్చొని చాలా ప్రయత్నించి ఇల్లు కట్టటానికి కష్టపడుతుందనుకోండి, మీరేం చేసారు, 'సరేలే! దీన్ని పట్టించుకోవద్దు. నేను ఇల్లు కట్టి నీకు ఇస్తాను.' అంటారు. అదే విధంగా శిష్యులు నిజాయితీగా ప్రారబ్ద, ఆగామ్య కర్మల్ని పొగొట్టటానికి

ఒక ముఖ్యవిషయాన్ని అర్ధంచేసుకోండి, ఇక్కడ నేను చెప్పే గురుదేవుల కరుణ అనేది నా మీద ఆధారపడి లేదు. ఎవరైతే ధ్యానం చేస్తారో, నేను లేకపోయినా, నేను కాకపోయినా ఆ కరుణ వారి మీద కురుస్తుంది. దీనికి నేను కారణం కానవసరం లేదు. ఇది అటోమాటిక్‌గా జరుగుతుంది.

స్పష్టంగా అర్థం చేసుకోండి, మీలో దీన్ని తీసుకోగల శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాని నా మీద అది ఆధారపడి లేదు. నేను ఒక సముద్రం లాంటివాడిని. నా దగ్గరికి ఎవరు వస్తే వారికి అందుబాటులో ఉంటాను. ఈ సముద్రం ఎంత గిన్నె తెస్తే అన్ని నీళ్ళు తీసుకువెళ్ళవచ్చు. కొబ్బరి చిప్ప తెస్తే అంతే నన్ను తీసుకెళ్ళగలరు. పెద్ద గిన్నె తెస్తే అంత నన్ను తీసుకెళ్ళగలరు. పెద్ద డమ్ము తెస్తే, డ్రమ్ము నిండా నన్ను తీసుకువెళ్ళవచ్చు. తెలివైనవారు నిత్యానందసాగరంలోకి దూకేసి అక్కడే ఉంటారు.

కాబట్టి పూజ అంటే మీకు జరిగిన అనుభవాల్ని గురుదేవుల ద్వారా పొందిన క్లిక్‌ని, అనుభూతుల్ని ప్రతి రోజూ గుర్తు చేసుకోవటమే. మిమ్మల్ని అదే చేతనస్థితిలోకి తిరిగి మళ్ళా మళ్ళా తీసుకురావటమే. మీరు ప్రతి రోజూ ఉత్సాహంగా ఉండగలిగితే ఆ తరువాత 24 గంటల జీవితనాటకం సజావుగా జరుగుతుంది. అందుకు కావలసిన శక్తి ఉంటుంది. పూజ అంటే అర్ధం అదే.

ధ్యానం చేతనస్తితి – కర్మకి విరుగుడు

మీరు కనీసం ఒక క్షణం పాటైనా స్వచ్ఛమైన చేతన స్థితిని అనుభవించగలిగితే ఏ కర్మ మీ మీద ప్రభావాన్ని చూపదు. మీ ఫ్రీక్వెన్సీ, కర్మ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువగా ఉంటుంది. మీలో ఆలోచనలు ఉన్నంతవరకు మాత్రమే కర్మ పని చేస్తుంది. చేతనస్థితిలో మీరు ఆలోచనలకి అతీతంగా వెళ్ళిపోతారు కాబట్టి సహజంగానే మీరు కర్మల కంటే అధికస్తాయిలో ఉంటారు. ఏ ధ్యానమైనా తీవ్రంగా, గాధంగా చేస్తే అది మీకు చేతనస్థితి యొక్క క్షణదర్శనాన్ని ఇస్తుంది. మీరు అంతిమసత్యదర్శనం చేయవచ్చు. అందుకే అంటారు, ధ్యానం అంటే మీ ఫిల్మ్‌ని ఎండకి ఎక్స్‌పోజ్ చేయటమే అని. కెమెరా ఒక్క సెకండ్ తెరిస్తే, ముందు ఉన్నది ఫిలింలో ఫోటోగా రికార్డు అవుతుంది. షట్టర్ పూర్తిగా తెరచి ఉంచేస్తే, సూర్యకిరణాలు తిన్నగా ఫిల్మ్ మీద పడితే ఏం జరుగుతుంది? అందులోని ఫోటోలన్నీ తుడుచుకుపోతాయి.

మీరు జన్మించినప్పుడు కెమెరా షట్టర్ ఒక్క సెకండ్ తెరవబడి మీ శరీరంలోనికి జీవాత్మ ప్రవేశిస్తుంది. అప్పుడు బయట ఉన్న సీన్ అంతా రికార్డు అవుతుంది. ఇక్కడ సీన్ అంటే అర్ధం గ్రహస్థితి. అందుకే జన్మకాలం చాలా ముఖ్యం. దాని ఆధారంగా మీ చేతనస్థితి పని చేస్తుంది. అయితే ధ్యానం చేసినప్పుడు చేతనస్థితి ఎక్కువ సేపు తెరవబడి ఉంటుంది. కాబట్టి అక్కడ రికార్డు చేసి ఉన్నదంతా తుడుచుకుపోతుంది.

అంటే మీరు పుట్టినప్పుడు మొదటిసారి షట్టర్ ఒక్కసెకండు పాటు తెరవబడుతుంది. రెండవసారి మీరు దీక్షని పొందినప్పుడు తెరవబడుతుంది. దీక్ష సమయంలో ఎక్కువ సేపు తెరవబడి ఫిల్మ్‌ని ఎక్కువ సేపు వెలుగుకి ఎక్స్‌పోజ్ చేసారు గురువులు. అప్పుడు మీ కర్మలు తుడుచుకుపోతాయి. అందుకే గురువులు మీకు దీక్షని ఇచ్చినప్పుడు మిమ్మల్ని ద్విజులు అంటారు. ద్విజులు అంటే రెండుసార్లు జన్మించటం, కెమేరాని ఉపయోగించి షట్టర్ తెరిచే వ్యక్తి గురువు. ఆయనే మీ గురుదేవులు.

నిత్యం – ధ్యానం – ఆనందం

కాబట్టి ఇక్కడ కావలసింది ఏమిటంటే ఆగామ్యకర్మల్ని పోగుచేసుకోకూడదు. ఇదే జీవితపరిష్కారం. దీన్నే నిత్యం అంటాను. ఎందుకంటే మీరు నిత్యం సాధన చేసే విషయం కాబట్టి ఈ జన్మలో కర్మల్ని కరిగించటానికి మీరు ధ్యానం చేయాలి. అందుకే మన ధ్యాన పద్ధతులు చాలా శ్వాస ఆధారంగా ఉంటాయి. శ్వాసని మార్చటం, నెమ్మదిగా చేయటం, గబగబా చేయటం ఇవన్నీ ధ్యాన పద్ధతులే. మొత్తం కర్మ అంతా కరగాలి అంటే గురుదేవుల కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.

కాబట్టి స్పష్టంగా అర్ధంచేసుకోండి, కర్మ అంటే లోతైన అజ్ఞానంతో మనం చేసే ఆలోచనలు, మాట్లాడే మాటలు, చేసే పనులు. అవి మనలో కొన్ని తెలిసిన సమస్యల్ని, బాధల్ని సృష్టిస్తాయి. దీని నుంచి బయటకి రావాలంటే గురుదేవుల నుంచి వచ్చే క్లిక్‌ని తీసుకోగలిగి ఉండాలి, అలాగే మీరు ఉన్నతమైన చేతనస్థితిలో జీవించగలగాలి.

ప్ర: మరో వ్యక్తి మనకి సలహా ఇచ్చినా, మనని అంటుకున్నా వారి కర్మలు మనకి వస్తాయా? ఎదుటివారి కర్మలు మనకి ఎంత వరకూ వస్తాయి?

ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు కర్మని మరొకరి తెచ్చుకోలేరు. మీకు సరిపడా కర్మలు మీకు ఉన్నాయి. కాబట్టి ఇతరుల నాకు వస్తాయేమో అనే భావన పూర్తిగా వదిలేయండి.

అంటుకోవటం వల్ల కాని, సలహా పొందటం వల్లకాని, లేదా చాలా దగ్గరగా కలిసి జీవించటం వల్ల కాని మరొక వ్యక్తి కర్మలు మీకు రావు. దగ్గరగా కలిసి జీవిస్తే వారి మనస్తత్వం మీకు వస్తుందేమో గాని, కర్మలు రావు. వారి మానసికస్థితి రానంత బలమైన స్థితిలో మీరు ఉండగలగాలి. మీ అంతరంగంలో బలంగా మీలో జరిగిన క్లిక్‌ని తెలుసుకోగలిగివుంటే మానసికస్తితి మీకు ఇతరుల రాదు.

మరొక విషయం అర్థం చేసుకోండి, నేను మీ కర్మలలో కల్పించుకోను. సూర్యోదయం అయితే చీకట్లు ఏ విధంగా మాయం అవుతాయో అదే విధంగా మీరు నా సమక్షంలోనికి రాగానే కర్మలు వాటంతట అవే మండిపోతాయి. చీకటిలా కర్మలకి ఉనికి లేదు. దాన్ని చేత్తో తీసి బయట వేయలేం. వెలుగులేకపోవటమే చీకటి. మీ అంతరంగంలో వెలుగు లేకపోవటమే కర్మ. అది కేవలం అజ్ఞానం. అది శక్తి లేని స్థితి. క్లిక్‌ని గుర్తుచేసుకోవటం ద్వారా కర్మల్ని పోగొట్టుకోవచ్చు. క్లిక్‌ని అర్థం చేసుకోవాలి. కర్మ అంటే ఉండే భయం మీద మీకు ఉన్న నమ్మకం.

మీ భయం ఉన్నంత లోతులో కూడా కర్మ ఉండదు. భయం లోతుగా ఉండే మీ కారణ శరీరం వరకూ వెళుతుంది. కర్మ అంత లోతుగా ఉండదు. అది మీరు చేసే పనిలో ఉంటుంది. అర్థం చేసుకొని, తెలుసుకునే తత్వంతో ఆ పని చేయకుండా ఉంటే, చేతనసితిలో ఆలోచనలు, మాటలు పనుల ద్వారా కర్మ చేయను అని నిర్ణయించుకుంటే చాలు.

కర్మలని పోగొట్టుకుంటూ జీవించటం ముఖ్యం. అంతే కాని ఇంకా పోగు చేసుకోకూడదు. వేదసంస్మృతిలోని వివాహాల్తో ఇదే సందేశం ఉంటుంది. వివాహసమయంలో భార్యాభర్తలు ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యంమిస్తాం అని ప్రమాణం చేస్తారు. ఒకరి కర్మలు పోయేలా మరొకరు సహకరిస్తాం అని చెబుతారు. వివాహబంధంలో మగవారు కోరిక ఆధారంగా, స్త్రీలు భయం ఆధారంగా జీవిస్తారు. ఈ విధంగా ఒకరి బలహీనతని మరొకరు వాడుకుంటారు. వివాహసమయంలో ఒకరి కర్మలు ఒకరు పోగొట్టటానికి సహకరిస్తాం అని ప్రపూణం చేసి ఇక్కడ కర్మలు పెరిగేలా జీవిస్తారు.

ప్ర: ధార్మికకార్యాలు చేస్తూ కర్మల్ని కరిగించుకోవచ్చునా?

సంఘసేవ చేయటానికి మీకు ఉన్న ప్రోత్సాహం ఎలా ఉన్నది అనే విషయం గమనించాలి. నిజాయితీగా చూడండి. ఎందుకు సేవ చేయాలనుకుంటున్నారు? నరకానికి వెళతాను అనే భయంతో మంచి పనులు చేయాలనుకుంటున్నారా? లేదా సంఘంలో మంచి పేరు ప్రతిష్ఠలు కావాలి అని చేస్తున్నారా? మీ కాలక్షేపానికి చేస్తున్నారా? మీరు జన్మలో మంచి జరుగుతుంది అని చేస్తున్నారా? మీరు భయం, ఆశలతో చేస్తే, చేసే సేవ నుంచి సంతోషం పొందలేరు. మీలో ఒక భాగం సేవ చేస్తుంది. మరొక భాగం అందులో మీరు పొందే లాభాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీరు ఏక దృక్సథంతో ఉండరు. అందుకే సంపూర్ణత్వాన్ని పొందలేరు.

ఇది కూడా మీకు బంధమవుతుంది. బయటికి సమాజపరంగా అది చూడటానికి బాగుంటుంది. బంధవిముక్తిలా ఉంటుంది. కానీ మీ అంతరంగంలో ఆ విధంగా ఉండదు. మానవులంతా ఫలితాల ఆధారమైన పనులలో ఇరుక్కుపోయారు. అదే సేవకి కూడా అన్వయిస్తున్నారు. కనీసం సేవ విషయంలోనైనా డబ్బు, పేరు అనే విషయాల గురించి ఆలోచించవద్దు. మీ ప్రాముఖ్యం కోసం చేయవద్దు.

సేవను కేవలం సేవ కోసం మాత్రమే చేయండి. ఏదీ ప్లాన్ చేయవద్దు. ఏ సేవ ఎక్కడైనా చేయండి. ఆ విధంగా చేసినప్పుడు మీ లోపలికి చాలా శక్తి వస్తుంది. మీ అంతరంగశక్తితో నిండుతుంది. రోజూ కనీసం ఒక అరగంట పాటు ఎటువంటి ఉపయోగాలూ ఆశించకుండా సేవ చేయండి. అప్పుడు సేవలోని నిజమైన ఆనందాన్ని మీరు అనుభవించగలరు.

కర్మలు కేవలం లోతుగా అర్ధం చేసుకొని, తెలుసుకునే తత్వంతో ఉన్నప్పుడు మాత్రమే మీ నుంచి వెళ్ళిపోతాయి. కనీసం ఒక్క క్షణం అయినా చేతనస్థితిని అనుభవించాలి.

‌ప్ర‌ : మీరు మాకు ధ్యానం నేర్పిస్తున్నారు. ప్ర‌పంచ‌మంతా బాధ‌ల్లో ఉంటే మేం వారికి సేవ చేయకుండా ధ్యానం చేస్తూ కూర్చోవటంలో అర్థం ఏమిటి?

ఒక చిన్న కథ : ఒక రాజుగారు చాలా కరుణామూర్తి అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన మారువేషంలో దేశాటన చేస్తూ పరిస్థితులు గమనించేవాడు.

ఒక రోజు ఆయన చిన్న అబ్బాయి పావురాన్ని పట్టుకోవటం చూసాడు. అది రెక్కలు కొట్టుకుంటుంటే అతను దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. రాజు అతనితో చూడు అది భయపడిపోతుంది. దాన్ని వదిలేయి అంటాడు.

ఆలోచించి, 'దీన్ని నాకు అమ్ముతావా' అని అదుగుతాదు. ఆ అబ్బాయ ఒప్పుకుంటాడు. రాజు ఆ అబ్బాయికి బంగారు నాణాన్ని ఇచ్చి పావురాన్ని తీసుకుంటాడు.

అప్పటికి అక్కడ చాలా జనం మూగుతారు. రాజు ఆ పావురాన్ని తీసుకొని దాన్ని స్వేచ్ఛగా వదిలివేసాడు. అందరూ ఆయనని పొగడుతారు.

రాజుగారు మిగతావారిని చూసి, 'మీ దగ్గర కూడా ఏమెనా పక్షులు ఉన్నాయా? ' అని అడుగుతాదు. వాళ్ళు ఉన్నాయి అని తెచ్చి రాజు గారికి ఆ పక్రుల్ని ఇచ్చి, బంగారు నాణాలు తీసుకుంటారు. ఆయన గర్వంగా ఆ పక్షుల్ని విడిచిపెడతాదు. కొన్ని రోజులు గడిచాక, రాజగురువు రాజు దర్శనానికి వస్తాడు. ఆయన రాజుని మారువేషంలో రాజ్యంలోకి తీసుకువెళ్తతాడు. అలా వాళ్ళు అడవిలోకి వెళతారు. అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయే విధమైన సంఘటల్ని చూస్తారు. చాలామంది గ్రామస్థులు వలలు పన్ని పక్షుల్ని పట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా పట్టడంలో చాలా పక్రులు చనిపోయి ఉంటాయి. అందరూ బంగారు నాణాల కోసం పక్రుల్ని పట్టటం ప్రారంభించారు.

రాజగురువు రాజుగారిని, 'నీ కరుణని చూపటానికి ఇన్ని పక్రులు తమ ప్రాణాలని బలి ఇవ్వాలా?' అని అడుగుతాడు.

మనం చేసే పనులు స్వచ్ఛమైన చేతనస్థితి నుంచి వస్తేనే అవి నిజమైన ప్రభావాన్ని చూపగలుగుతాయి.

మనం నిజంగా మనుషుల బాధలు చూసి చలించితే, ఆ కరుణతో వారి బాధలు తొలగించటానికి పని చేసే అది చాలా మంచిది. కాని ముందుగా మనం మన చేతనసితి విప్పారాలి, అది కరుణని తెలుసుకోవాలి. అంతే కాదు, మీరు మనుషులకి చేసే గొప్ప సేవ మీరు ఒక దివ్యమానవుడుగా తయారుకావాలి. దానికి ధ్యానం మొదటి అదుగు.

ప్రప : ఎవరికైనా అకాలమరణం ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్మ మరణం సంభవిస్తే ఏం జరుగుతుంది?

అకాలమరణంతో, ఆత్మ తన సమయం వచ్చేవరకూ వేచి చూదాలి. ఆ తరువాత మాత్రమే కొత్త శరీరాన్ని తీసుకోగలుగుతుంది. ఆత్మహత్య విషయంలో బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. అది బ్రతికి ఉన్నప్పటి కష్ఠాల కంటే ఎక్కువగా ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ఇష్టమైన భోజనం ఎదురుగా ఉంటుంది. కాని తినటానికి చేతులు, శరీరం ఉండవు.

ప్రమాదాల విషయంలో కూడా ఆత్మ కొత్త శరీరం తీసుకోవటానికి ఎదురుచూదాలి. కాని ఆత్మ చేతనస్థితిలో ఉంటుంది. కొత్త శరీరం కోసం ఎదురుచూసుంది. అంతే.

ప్రప : చనిపోయినవారికి కొన్ని కర్మకాండలు చేస్తారు. ఎందుకు?

అలా చేయటం జీవించి ఉన్నవారికి మరణాన్ని ఆహ్వానించాలి అని చెప్పటానికి చేస్తారు. అయితే జ్లానోదయమైన యోగీశ్వరులు చేస్తే అది కర్మకాండ కాదు. అది ఒక సంకల్చంలా పని చేస్తుంది. జ్ఞానోదయమైన యోగీశ్వరులు సంకల్సం చేస్తే మీరు శరీరంలో ఉంటే, అది స్టిరపడటానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మీరు ఉండే స్థితి, ఆయన చేసిన సంకల్సస్టితి వేరు వేరు వేరు శ్రేణులలో ఉంటాయి కాబట్టి, శరీరంతో లేనివారికి అది వెంటనే ఉపయోగపడుతుంది. ఎందుకంటే గురుదేవుల శక్తిలా అది కూడా సూక్ష్మశక్తి రూపంలో ఉంటుంది కాబట్లి.

అదే విధంగా ఆత్మ మరొక శరీరంలో ఉంటే స్థిరపదటానికి సమయం పడుతుంది. అయితే వారు పాత సంస్కారాల నుంచి విముక్కి పొందుతారు. అకస్మాత్మగా ఆ వ్యక్తి ఏ కారణమూ లేకుండా స్వేచ్ఛని, తేలికదనాన్ని పొందుతాడు.

ప్రప : ఈ జీవితంలో కితం జన్మలోనికి వెళ్ళటం ఉపయోగమేనా? అది మంచిదేనా?

పాత జీవితంలోకి కేవలం జ్వానోదయమైన గురువులు మాత్రమే తీసుకెళ్ళాలి. దాని జన్శలోకి తీసుకువెళితే అతను ఇప్పుడు అంధుడయ్యే అవకాశం ఉన్నది. జ్ఞానోదయం పొందినవారు అలా చేస్తే వారికి అలా చేసే వ్యక్తి కర్శలు వస్తాయి. పాత జన్మకర్శలు పోగొట్లుకోవటానికి, వాటితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. వాటిని మూసేయాలి.

కర్మచక్రాన్ని ఛేదించవచ్చు

‌ప్ర‌ : గురుదేవులు క‌ర్మ‌ల్ని పోగొట్టే స‌మ‌యంలో మేం బాధ‌ప‌డ‌తామా?

గురువులు కర్మలని పోగొట్టే సమయాన్ని మీరు బాధ అంటారు. కాని గురుదేవులు కేవలం ఒక సెకందులో వాటిని తీసేసారు. లేకపోతే అవి పోగొట్టుకోవటానికి మీకు కొన్ని జన్మల సమయం పడుతుంది. కాబట్టి ఇది బాధపడటం కాదు.

శారదాదేవి ఈ విధంగా చెబుతారు, గురుదేవులు సంస్కారాలని తీసేయటం అంటే కాలు విరిగిపడే బాధ బదులు ముల్లు గుచ్చుకున్నట్లే అని.

కర్ష, అంటే మనలోని తీరని అనుభవాలు మన అంతరంగంలో ఉండి వాటిని సంపూల్తిగా సాంధించమని అటువైపు లాగుతూ ఉంటాయి.
మీ గతం అంతా కలిసి ఇష్టటి మీ వర్తమానం, మీ వర్తమానం మొత్తం కలసి మీ భవిష్యత్తు అవుతాయి.
అదృష్టం, నీ భవిష్కత్తు అనేవి జీవితంలో నీకు కలిగే సంఘటనలకి నీవు ఎలా స్థందిస్తావో దాని ఆధారంగా ఉంటుంది.
మీరు ఆలోచనలు సున్నాస్థాయిలో 21 క్షణాల వరకూ ఉండగలిగితే మీరు మీ కాలగమనంలోకి చొచ్చుకుని వెళ్ళి, భవిష్కత్తుని మార్చవచ్చు.
ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని విమల్శిస్తే బాధ పడకూడదు అని మీరు నిర్ణయించుకోవచ్చు. మీరు నిశ్చలంగా ఉండాలి అని అనుకోవచ్చు.
మీలో కోలికలు మాలినప్పడు మీ శ్వాసలోని క్రమం కూడా మారుతూ ఉంటుంది.
మీలో నిక్షిప్తమైన సంస్కారాల్ని తీసేయటం అంటే మీ శరీరంతో లోత్తెన స్నేహాబంధాన్ని ఏర్హరచుకోవటం.
ప్రారబ్దాన్ని పూల్తిగా సాధించితే మనలోని ఒక వ్యతిరేకవిషయం అయిన అసహానం, చికాకుల్ని మన జీవితం నుంచి తీసేయవచ్చు.
జన్ష తరువాత జన్మలలో పోగుచేసిన సంచితకర్త్రలు జన్త్ర విషనలయం అచేతనస్థితిలో జీవించటం ప్రారబ్ధకర్త్రలతో ఆగామ్మ కర్త,లు జన్కించటం.
నరకం, స్వర్గం అనేవి మీ మానసికస్థితి మాత్రమే.
మీరు మీ పనుల ఫలితమైన ఒక ఉపవస్తువు కాదు. మీరు మీ పనుల కంటే చాలా ఉన్నతులు.

మరణం ఒక ఉత్సవం

జీవస్ముక్తి అంటే ।పతిక్షణం అంతిమ ఆనందంలో తిరిగి జన్మించటమే

మన కర్శల గురించి ఉన్న ఆందోళనకి మూలం మరణభయంలో ఉంది. తెలియని దాని గురించి ఉండే అతిముఖ్యమైన భయం అది. ఈ జన్మలో మన పనులు చాలా వరకూ వచ్చే జన్మలో మంచి జీవితం కావాలి అన్న కోరిక ఆధారంగా నిర్దేశించబడి ఉన్నాయి. మరణం తరువాత ఇంకా తక్కువ స్తాయి ఉండకూడదు అనే కోరిక ముందుకి తీసుకువెళుతుంది. శరీరాన్ని, మానసిక వ్యవస్థని వదిలేస్తామేమో అన్న భయం అతిప్రాచీనకాలం నుంచీ ఉంది.

యయాతి కథ

మహాభారతంలో ఒక చక్కని కథ ఉంది. యయాతి అనే ఒక రాజు వంద సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తూ, సకల ఐశ్వర్యాల్ని అనుభవిస్తూ, భౌతిక, మానసికసౌకర్యాలతో జీవించాడు. ఆయనకి 100 సంవత్సరాలు పూర్తి అయ్యాక యమధర్శరాజు వచ్చి అతన్ని తీసుకువెళ్ళాలి అని అంటాడు. యమధర్మరాజుని చూసిన రాజు నిర్వాంతపోతాడు. ఎందుకు ఇంత త్వరగా వచ్చావు. ఇంత అకస్మాత్మగా వస్తే ఎలా? నేను నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించలేదు. నాకు ఇంకొంతకాలం జీవించటానికి అవకాశం ఇవ్వు అని ప్రార్థిస్తాడు.

యమధర్శరాజు అది సాధ్యం కాదు అంటాడు. యయాతి దీనంగా ప్రార్ధించి కొంత సమయం ఇమ్మని కోరతాడు. అప్పుడు యమధర్మరాజు ఆయనతో నీ కొదుకులు ఎవరైనా వారి జీవితాన్ని నీకు ఇసే నీవు అంత కాలం జీవించవచ్చు అంటాడు. యయాతి తన కొడుకుల్తో ఒకరిని పిలిచి తన కోసం వారి జీవితాన్ని ఇమ్మని అదుగుతాడు. కొడుకు అందుకు ఒప్పుకొని అతని జీవితాన్ని తండ్రికి ఇస్తాడు. యమధర్శరాజు యయాతి జీవితాన్ని వంద సంవత్సరాలకి పెంచుతాడు.

యయాతి అన్ని విలాసాల్ని అనుభవిస్తూ సంతోషంగా వంద సంవత్సరాలు గదుపుతాదు. వంద సంవత్సరాలు పూర్తి కాగానే యమధర్శరాజు వస్తాడు. ఈ సారి కూడా యయాతి యముడితో వెళ్ళటానికి నిరాకరించి, నేను జీవితాన్ని పూర్తిగా అనుభవించలేదు. నాకు మరి కొంచెం సమయాన్ని ఇవ్వు అని ప్రార్థిస్తాడు. యముడు యయాతికి మరొక అవకాశం ఇస్తాడు. ఇప్పుడు మరొక కొదుకు తన జీవితాన్ని తండ్రికి ఇస్తాడు. మరొక వంద సంవత్సరాలు అన్నీ అనుభవిస్తూ గడుపుతాదు. మళ్ళా యముదు వచ్చినప్పుడు నేను రాను అని నిరాకరిసాదు. ఈసారి యముడు అదే ఆట ఆడదలచలేదు.

ఆయన యయాతితో అత్యంతకరుణతో మాట్తాడతాదు, 'రాజా! నీవు నూనె పోసి మంట ఆర్సగలవా? నీవు కోరికలలో జీవిస్తూ వాటిని సంపూర్ణంగా జీవించగలనని అనుకుంటున్నావా?' ఈ విధంగా యమధర్శరాజు యయాతికి జీవితలక్ష్యాన్ని చక్కగా వివరిసాదు. చివరికి యయాతి ఈ భూమిని వదిలి సర్వాంతర్యామి పాదాల దగ్గర విశ్రాంతి పొందుతాడు.

జ్ఞానేంద్రియాలకి విలాసాలని ఇస్తూ మీరు ఎప్పటికీ పరిపూర్ణమైన సంత్సప్రిని పొందలేరు. మీరు లోతుగా, గాధతతో జీవించి ఉందకపోతే, ఎప్పటికీ మరణానికి సిద్ధపడలేరు. జ్ఞానేంద్రియాల్ని త్పపి పరుస్తూ, వాటిలోనికి విలాసాల్ని పంపిస్తూ, మీకు ఇష్టమైన పద్ధతిలో ఉండటాన్ని లోతుగా జీవించటం అనరు. ఎప్పుడెతే గాధమైన, లోతైన అనుభవాలతో జీవిస్తారో, అప్పుడు మీరు స్వేచ్ఛని పొందుతారు.

మరణం సాధారణ అవగాహన

మరణం అనే మాట కలవరాన్ని, భయాన్ని కలిగిస్తుంది. ఆ విషయం గురించి మాట్లాడటం అశుభంగా అనుకుంటారు. అలా చేస్తే మరణాన్ని ఆహ్వానించటం అనుకుంటారు.

మరణాన్ని శత్రువుగా చూసారు. అందుకే అన్ని మతాల్లో మరణాన్ని నలుపు రంగులో చూపిసారు. హిందూమతంలో యముడు నలుపు. క్రిస్టియానిటీలో సైతాన్ నల్లగా ఉంటాడు. బౌద్ధమతంలో మరణాన్ని నల్లగా చూపిసారు. అన్ని మతాలలో మరణాన్ని నల్లగా చూపిసారు. మరణం మనకి విలన్ కాని హీరో కాదు. మరణం అనే విషయాన్ని వ్యతిరేక దృక్పథంతోనే చూస్తాం. మరణం మన నుంచి అన్నీ తీసుకువెళ్ళిపోతుంది అనుకుంటాం. ఏదైతే కావాలి అనుకుంటామో వాటిని, మన సంతోషాన్ని మనకి ఉన్న వాటిని అన్నిటినీ బలవంతంగా మన నుంచి తీసుకువెళుతుంది అనుకుంటాం. చాలామంది అందుకే మరణాన్ని వద్దు అనుకుంటారు లేదా మరణం అంటే భయపడతారు. మనం ఏమనుకుంటామంటే అసలు మరణం గురించి ఇప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి. అది వచ్చినప్పుడు చూదవచ్ఛు అనుకుంటాం. కావాలని ఆ ఆలోచన రాకుండా చూస్తాం.

తప్పించుకోవాలి అని చూస్తాం. అతిప్రాచీనకాలం నుంచి అన్ని మతాలు, అన్ని సంస్మృతులూ మరణాన్ని జయించటానికి అన్ని అవకాశాల ద్వారా ప్రయత్నించాయి. శాస్త్రజ్ఞలు మందులు అందుకే కనిపెట్టారు, అదే అలోపతి. తూర్పుదేశాల సిద్ధులు ఆయుర్వేదం దారా మూలికావెద్యం చేసూ 'సిద్ధ' సంప్రదాయాన్ని తీసుకువచ్చారు. కాయకల్చచికిత్స ఇందులో భాగమే. యోగులు మంత్రాల ద్వారా ప్రయత్నిస్తున్నారు. అవే మృత్యుంజయమంత్రం, ప్రాణాయామపద్ధతి. బౌద్ధసన్యాసులైన లామాలు ధ్వానం ద్వారా ప్రయత్నిస్తున్నారు. వారు స్పష్టించిందే మహామంlతధ్యానం. అన్ని మతాలు, సంస్కృతులు మరణాన్ని జయించాలని చూస్తున్నాయి. మరణానికి అతీతంగా వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాయి.

మరణం అంటే మనం ఎందుకు భయపడతాం

మానవజాతి మొత్తం ఒకే విషయం గురించి పోరాదుతూంది, అదే అందరి జీవితాల్తో కచ్చితంగా జరిగే విషయం. మరి ఎందుకు అలా పోరాదుతూంది?

మనం భూమిని బల్లపరుపుగా చేయగలమా? లేదు. ఎందుకంటే భూమి గుండ్రదంగా ఉంటుంది. కాని మనం ఈ నిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే, మన పోరాటంలో ఏదో లోపం ఉంది. మనం అర్ధం చేసుకోవటంలో ఎక్కదో లోపం ఉంది అని అర్థం. మరణం విషయంలో కూడా అంతే. సత్యాన్ని స్వీకరించటానికి ఎందుకు పోరాటం? దీని వల్ల చాలామంది మరణం సంభవించినప్పుడు దాన్ని స్వీకరించలేకపోతున్నారు. వాళ్ళు జీవించిన జీవితాన్ని యథాతథంగా తీసుకోలేకపోతున్నారు. మనం మరణం అంటే ఎందుకు భయపడుతున్నాం? మనం ఎందుకు భయపడతామంటే సహజంగా మనం మార్చుని అద్దుకుంటాం. మరణం అనేది అకస్మాత్మగా జరిగే ఒక మార్చు. చాంగ్‌సు అనే గురువు చాలా చక్కగా చెబుతారు, 'భవిష్యత్తులో జీవించాలి అనే తపన మనిషిని వర్తమానంలో జీవించలేకుండా చేస్తుంది.'

మనం ఎందుకు భయపడతామంటే, మనకి మనం అంటే ఏమిటో తెలియదు కాబట్టి, మనం మనలోని గుర్తింపుల్ని గట్టిగా పట్టకొని ఉంటాం. ఈ గుర్గింపులు కుటుంబ అనుబంధాలకి సంబంధించి కాని, ఉద్యోగం, ఆస్టి, ఐశ్వరాలు, పేరుప్రతిష్ఠలు ఇలాంటివాటి మీద ఆధారపడి ఉంటాయి. మరణం మనం నిర్మించుకున్న గుర్తింపుల పునాదుల్ని తీసివేస్తుంది. అందుకే మరణం మన నుంచి అన్నీ తీసేసుకుంటుంది అనుకుంటాం.

మనం మరణం గురించి అర్ధం చేసుకున్నది, సరిగ్గా చెప్పాలి అంటే అపార్ధం చేసుకున్న విధానం, మనం మరణమంటే భయపడే విధంగా చేస్తుంది. అది మనకి భయాన్ని మిగిల్చే అనుభవం అవుతుంది. మరణాన్ని అడ్డుకునే వ్యక్తి జీవించి ఉండగానే మరణిస్తాడు. అతను ప్రతిక్షణం మరణిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ భావంతో ప్రతిక్లణం చిత్రహింసకి గురవుతుంటాడు. మరణం అని నేను అనగానే అది భౌతికమరణమే కాదు. మరణరూపంలో పోగొట్టుకునేది ఏదైనా సరే సౌకర్యవంతమైన జీవితాన్ని పోగొట్టుకోవటం, బంధువులని పోగొట్టుకోవటం, ఇటువంటివి అర్థం చేసుకోండి. ఏ రూపంలో దేన్ని పోగొట్టుకున్నా అది మరణమే.

ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మన జీవితం చివరిలో జరిగే మరణం అన్న సంఘటన, అసలైన మరణం ఒక్కసారే జరుగుతుంది. కాని మానసికమరణం, మరణభయం ఎప్పుదూ జరుగుతూ ఉంటాయి. మరణభయం అన్నదే మన జీవనవ్యవస్థని నిర్మిస్తుంది.

మీరు నన్ను అడగవచ్చు, ఎందుకు సమీపబంధువులు మరణిస్తే అందరూ అలా కుంగిపోతారు, అనిశ్చలంగా అవుతారు అని. మీకు వారితో అంత అనుబంధం లేకపోయినా,

మరణం ఒక ఉత్పవం

వారి మరణం మీ మీద లోతైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీ అమ్మగారు చనిపోతే మీ ఎడమభాగం చాలా బాధతో ఉంటుంది. మీ తండ్రి మరణిస్తే కుడిభాగం బాధతో ఉంటుంది. అన్నదమ్ములు చనిపోతే చేతులు బాధలో ఉంటాయి. మీకు, మీ బంధువులకి మధ్య లోతైన అనుబంధం ఉంటుంది. మీలోని ప్రతి భాగం ఎవరో ఒకరితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మీ ఉనికి ఒంటరిది కాదు. అది ప్రత్యేకమైంది కాదు. మనం అందరం, ఒకరితో ఒకరు బంధాలు ఏర్పడి ఉన్నవారిమే. అందుకే ఎవరైనా మరణిస్తే మనం చాలా బాధపడతాం. మీరు పోగొట్టుకునే ప్రతి వ్యక్తీ మీకు ఒక మరణమే.

మరణం గురించి మనకి తెలిసిన విషయం ఒక్కటే, అది జీవితానికి వ్యతిరేకమైంది. భయం కొద్దీ మరణం గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. ఆ భయంతో దాన్ని ఒక రాక్షసిలా చూస్తాం. నిజమైన మరణం ఆరు అడుగుల పొదవు అయితే, మన భయం అరవై అదుగుల పొడవు ఉంటుంది. మరణ భయం అంటే పొడిగించి కొనసాగించటం లేదా ఆపేయటం. మన భయం – తరువాత ఏమిటి అని.

మరణమర్శంలోనే జీవిత సమాధానం

ఒకసారి అమెరికాలో ఒక యువతి, స్వామి వివేకానందని 'జీవితం అంటే ఏమిటి,' అని అడిగింది. స్వామి వివేకానంద, 'నాతో భారతదేశానికి వస్తే బోధిస్తాను' అని జవాబు ఇచ్చారు. ఆమె 'మీరు నాకు ఏం బోధిస్తారు?' అని తిరిగి ప్రశ్నించింది. ఆయన, 'ఎలా మరణించాలో నేర్పిస్తాను' అని జవాబు ఇచ్చారు.

ప్రశ్న జీవితం గురించి కాని జవాబు మరణం గురించి చెప్పాడు ఆయన. ఇది కొత్తగా అనిపించవచ్చు. ఇక్కడ స్వామి వివేకానంద ఏం చెబుతున్నారంటే మరణరహస్యాన్ని తెలుసుకుంటే మీ జీవితంలో నాణ్యత పెరుగుతుంది. ప్రతి విషయాన్ని చక్కగా అర్లం చేసుకోగలుగుతారు. ప్రతి దాని పట్ల ఉన్న మీ దృక్పథంలో మార్పు వస్తుంది.

మరణం మీ జీవితం చివరిలో జరిగే ఒక సంఘటన కాదు. అది గొప్ప జ్ఞానం. ఎలా మరణించాలో తెలిస్తే ఎలా జీవించాలో తెలుస్తుంది. జీవించటం, మరణించటం ఒక నాణానికి రెండు వెపులు. ఒకసారి మరణం అంటే ఏమిటో అర్లం చేసుకుంటే, మీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది.

మరణంలోకి ప్రవేశించటం

ఒక సంప్రదాయం వారు మరణం గురించి తెలుసుకోవటంలో మనం తప్పు దిశగా వెళుతున్నాం, అందుకే పోరాదవలసి వచ్చింది, అనుకొని 180 డిగ్రీలు వెనక్కి తిరిగారు. మరణం గురించి మరొక మార్గంలో పని చేసారు. వారు ధ్యానాన్ని ఒక పద్ధతిగా ఎంచుకున్నారు. మిగిలినవారు

ఆ ధ్లెర్యం చేయలేకపోయారు. వారే ఉపనిషత్తుల కాలానికి సంబంధించిన బుషులు. వారు మరణంపై చేసిన పరిశోధన ఫలితాల సిద్ధాంత గ్రగంథమే కఠోపనిషత్తు. వారు చాలా లోతుగా పరిశోధనలు చేసి, మరణాన్ని ఆపటం ద్వారా అర్థం చేసుకోలేం. మరణాన్ని ఆపటానికి ప్రయత్నిసూ మీరు మరణానికి అతీతంగా వెళ్ళలేరు. జనన మరణ చుకాన్ని ఛేదించటానికి మీరు జ్ఞానోదయం పొందాలి. భయాన్ని విడిచి మరణంలోకి ప్రవేశించాలి.

మీరు భయపడుతున్నంత కాలం మీరు మరణాన్ని మీ కళ్ళతో చూడలేరు. మీరు అలా చేయనంత కాలం మీరు ఎంత గొప్ప దీవెనల్ని పొందారో తెలుసుకోలేరు. ఎప్పుదైతే ఒక దాన్ని పోగొట్టకుంటాను అని తెలుసుకుంటారో అప్పుడే దాని విలువ తెలుసుకుంటారు.

ఒకసారి ధ్యానం చేయండి, మీరు రెండు రోజుల్లో మరణించబోతున్నారు అని తెలిసిందనుకోండి, మీరు ఏం చేయాలనుకుంటారు? మీరు పూరి చేయవలసింది ఇంకా ఎంత ఉంది? మీరు జీవితాన్ని చూసినప్రుడే మీకు ఎంత మంచి జరిగిందో అర్థం చేసుకుంటారు. మీరు ఎల్డకాలం ఉంటాను అనే నమ్మకంతో ప్రతి దాన్ని చాలా యథాలాపంగా తీసుకున్నారు. ఎప్పుడెతే మరణాన్ని అర్థం చేసుకుంటారో జీవితం విలువ మీకు తెలుసుంది.

ఒకసారి మరణాన్ని భయం లేకుండా ఎదుర్మొంటే మరణం జీవితానికి చివర కాదు, అది జీవితంలో అత్యున్నతఘటన అని అర్ధం అవుతుంది. ఎప్పుడెతే ఈ విషయం మీకు అర్ధమవుతుందో అప్పుడు ఇంకా జీవితం పొడిగించాలి అని కోరుకోరు. ఒక విషయం అర్ధం చేసుకోండి, మరణం మీ కంటే శక్తితో ఉంటుంది. ఎందుకంటే మీకు దానిలో ఉన్న నమ్మకం దానికి ఆ శక్తిని ఇస్తుంది, అంతే. ఇది కేవలం నమ్మకం మాత్రమే. ఎప్పుడైతే మరణం భయపెదుతుంది అని నమ్ముతారో అది నిజంగా భయపెడుతుంది. ఇది అద్దంలా మీరు ఏమిటో దాన్ని విశ్వాసంతో చూపిసుంది.

ఒక గాడిద అద్దంలో చూసే ఏం కనిపిస్తుంది? గాడిదే కనిపిస్తుంది. మరేమీ కాదు. అదే విధంగా మరణం అంటే మీరు భయపడితే అందులో మీకు భయమే కనిపిసుంది. అప్పుడు మరణం నిజంగా మరణమే అవుతుంది. మీరు కొంచెం సమయం తీసుకొని మరణ భయంలోకి చూడగలిగితే అది మిమ్మల్ని ఎంతో చక్కగా, అనుకూలంగా మార్చగలుగుతుంది. దానికి ఆ శక్తి ఉంది. అది జీవితానికి వ్యతిరేకం కాదు, అనుకూలమైనది అని మీకు అర్థం అవుతుంది.

స్వేచ్చగా వదిలేయటమే అంతిమం

మనం మరణాన్ని చూడలేకపోతున్నాం. ఎందుకంటే నిరంతరం మారే జీవితాన్ని చూడలేకపోతున్నాం. మనం ఎప్పుడూ మనుషులనో, పసువులనో, సంఘటనలనో, పట్టుకొని వేలాడుతూ ఉంటాం, అదే సమస్య. దాన్ని స్వేచ్ఛగా వదిలేయటానికి భయపడిపోతున్నాం. ఈ స్థితి బాధాకరమైంది. అసాధ్యాలని పట్టుకొని వేలాడటమే కాదు, బాధలకి మూలాల్ని పట్టుకొని ఉన్నాం. మీరు స్వేచ్ఛగా వదిలేయగలిగితే, సర్వాంతర్యామి మీద విశ్వాసం ఉంచి విరామంగా ఉండగలిగితే, సర్వాంతర్యామి మీ రక్షణ బాధ్యతని తీసుకుంటాడు. మీరు ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.

మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని అర్థంచేసుకుంటూ చూడండి. మార్పు అనేది జీవనలక్షణం. అందుకే జీవితం రంగురంగులుగా, ఆసక్తికరంగా, అందంగా ఉంటుంది. అప్పుడు జీవితం మీకు చూపించే అందమైన అద్భుతాల్ని చూడవచ్చు. వాటి అందమైన మరొక అద్భుతమే మరణం.

మరణం అంటే లోతైన విరామం. అది అంతిమ స్వేచ్ఛ. పాతని వదలి కొత్త దానిలోకి వెళ్ళటమే మరణం. ఎప్పుడైతే మీలోని ఆత్మశక్తి తాను సాధించాలి అనుకున్నది ఈ శరీరం ద్వారా సాధించలేను అనుకున్నప్పుడు, ఈ శరీరాన్ని వదిలి మరొక దానిలోకి వెళుతుంది. అలా వెళ్ళటమే మరణం అంటే.

మీ ఇల్లు కొన్ని సంవత్సరాలయ్యాక పాతబడిపోతుంది. ఉండటానికి వీలుగా ఉండదు, రిపేరు చేయటానికి వీలు కాలేదు అనుకోండి. మీరు దాన్ని అమ్మి కొత్త ఇంట్లోకి వెళతారు లేదా కొత్తగా మళ్ళా కట్టుకుంటారు. అప్పుడు మీరు బాధపడతారా? లేదే బాధపడరు. అదే విధంగా మీరు ఏ విధంగా జీవించాలి అనుకున్నారో, అలా పూర్తిగా జీవించలేనప్పుడు, ఈ శరీరాన్ని వదలి మరొక కొత్త శరీరంలోకి వెళతారు. కొత్త జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తారు. తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించటమే మరణం అంటే.

కొత్తగా ప్రారంభించటం

మీరు మరణించినప్పుడు అక్కడ జరిగేది ఏమిటంటే నూతనత్వాన్ని పొందటం. మీ శరీరం, మానసిక వ్యవస్థ కొత్తగా అవుతాయి. మీరు తాజా జ్ఞాపకాల్ని, కొత్త స్థలాన్ని, కొత్త బంధువుల్ని, కొత్త జీవితాన్ని పొందుతారు. ఇంకా చెప్పాలి అంటే మీరు కొత్త జన్మ తీసుకొని పూర్తి కాని మీ పనుల్ని సాధిస్తారు. తీరని కోరికలు తీర్చుకుంటారు. మీరు సగంలో వదిలినవాటిని పూర్తి చేయటానికి తిరిగి భూమి మీదికి వస్తారు. మీకు తిరిగి ప్రారంభించే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వటాన్నే మరణం అంటారు. ఈ చిన్న సత్యాన్ని అర్థం చేసుకోకుండా మరణాన్ని అపుతూ మీరు జీవితాన్ని వృథా చేస్తున్నారు. ఒకసారి ధ్యానాన్ని మీ జీవితానికి కలిపితే, సంవత్సరాల్ని (వయస్సుని) అర్థం చేసుకోగలుగుతారు. భయాన్ని ఎదుర్కోగలిగితే మరణరహస్యం తెలుస్తుంది. మీకు పొగ మంచు వీడి అసలు సత్యం వికసించి స్పష్టంగా కనిపించటం ప్రారంభమవుతుంది. మీ కళ్ళలో ఎదురుగా మరణాన్ని చూడగలరు.

మరణాన్ని ఎదురుగా చూడగలిగితే అది జీవితం అని అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రతిక్షణం మీరు మరణిస్తారు. ప్రతిక్షణం జన్మిస్తారు. మరణం, జననం ఒక చుక్రం లాంటివి. మీరు చనిపోతే మరలా పుడతారు. మీరు పుడితే మరలా చనిపోతారు. మీకు ఈ విషయం అర్థమైతే మీలోని భయాలన్నీ పోతాయి. జీవితాన్ని జీవించటం ప్రారంభిస్తారు. ప్రతి శ్వాసలో సంతోషాన్ని పొందుతారు. ఈ భూమి మీద ప్రతిక్షణం ఉత్సవం చేసుకుంటారు.

మీరు నలభై సంవత్సరాల వయస్సులో ఉంటే 20 లేదా 30 నాటి మనుషులు కాదు. కాని మీరు పూర్తి వేరుగా ఉన్నా మరణించాను అని భావించరు. మీరు భౌతికంగా, మానసికంగా, భావాత్మకంగా, ఏ విధంగా చూసినా పూర్తి కొత్త వ్యక్తులు. కాని మీరు జీవితం అలా కొనసాగుతుంది అనుకుంటారు. మరణం కూడా అంతే, అది జీవితానికి మరొక పొడిగింపు. ఏదీ మరణించదు, ఏదీ ఆగిపోదు. సృష్టి చెప్పిన విధంగా అది కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు మరణం లేదు అని తెలుసుకుంటారో, మీలో పరమానందం వెల్లివిరుస్తుంది. మీరు ఆనందపారవశ్వంలో ఉంటారు. మీ జీవితభయం నుంచి భయం లేని విధంగా మరణం నుంచి అమరత్యంగా మార్చు చెందుతుంది. భగవద్దీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చక్కగా చెబుతాడు. మరణం అంటే వస్త్రాలు మార్చుకోవటం వంటిది అని. మనం ఏ విధంగా అయితే చొక్కా మార్సుకుంటామో అదే విధంగా శరీరాన్ని మార్చుకుంటాం. ఈ విధంగా శరీరాన్ని మార్చటం ద్వారా మన అంతరంగంలో మార్పు కలుగుతుంది. మరణం జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించటమే.

రహస్యాలకే రహస్యం

మహాభారతంలో ఒక చక్కని కథ ఉన్నది.

యక్షుడు పాండవకుమారుడైన యుధిష్టిరుని (ధర్మరాజుని) ఒక ప్రశ్న అడుగుతాడు. ఈ భూమి మీద అత్యంత ఆశ్చర్యకరమైన అద్భుతం ఏది? యుధిష్ఠిరుడు చక్కని జవాబు ఇస్తాడు, 'ప్రతి రోజూ ఎందరో యమలోకానికి వెళ్ళటం చూసూ కూడా, ఇక్కడ ఉన్నవారు మాత్రం తాము ఎప్పటికీ ఈ భూమి మీదే ఉంటాం అనుకుంటారు. ఇదే ఆశ్చర్యకరమైన రహస్యం.

మనం ఎప్పుడూ ఏమనుకుంటామంటే, ఎవరో చనిపోతారు నేను కాదని. అందుకే మరణం రహస్యాల్లోకే ఒక రహస్యం. మరణం గురించి రెండు విషయాలు కచ్చితంగా ఉంటాయి. మనం ఏదో ఒకరోజు మరణిస్తాం. రెండవ విషయం ఎప్పుడు ఎక్కడ ఎలా మరణిస్తాం అన్న విషయం తెలియదు. పుట్టిన ప్ర‌తిదీ మ‌ర‌ణించాలి అదే జీవిత ల‌క్షణం.

బుద్ధుని జీవితం నుంచి ఒక చక్కని కథ : ఒక స్త్రీ చనిపోయిన తన కొడుకుని తీసుకుని బుద్ధుని దగ్గరకి వస్తుంది. కొడుకు మరణంతో ఆమె కుంగిపోయి ఆ దుఃఖంలో పిచ్చిదానిలా అయిపోతుంది. ఆమె బుద్ధుని పాదాల మీద పడి బిడ్డని బ్రతికించమని ప్రార్థిస్తుంది.

బుద్ధుడు ఆమెతో, 'నాకు గుప్పెడు ఆవాలు ఇవ్వు' అంటాడు. ఆమె అలాగే అని చెప్పి పరుగున ఇంటికి వెళ్ళబోతుంది. అప్పుడు బుద్ధుడు ఆమెతో, 'ఏ ఇంట్లో అయితే మరణం సంభవించలేదో, ఎవరినీ వారు పోగొట్టుకోలేదో ఆ ఇంటి నుంచి మాత్రమే ఆవాలు తీసుకురావాలి' అంటాడు. ఆమె ఇంటింటికీ తిరుగుతూ దీనంగా ఆవాలు ఇవ్వమని ప్రార్థిస్తుంది. ఆమె మీద జాలితో అందరూ ఆవాలు ఇవ్వబోతారు. అప్పుడు ఆమె మీ ఇంట్లో ఎవరూ మరణించలేదు కదా అని అడిగితే వారు ఎవరో ఒకరి గురించి చెప్పేవారు. ఆ విధంగా సాయంత్రం వరకూ ఆమె ఇళ్లన్నీ తిరిగింది కాని మరణం లేని ఇల్లు ఎక్కడా కనిపించలేదు. ఆమె బిడ్డ శవాన్ని సమాధి చేసి బుద్ధుడి దగ్గరకి వస్తుంది. ఆయన పాదాల మీద పడి 'నాకు సత్యం బోధించండి. మరణం అంటే ఏమిటి? మరణానికి అతీతంగా ఏం ఉంటుంది.' అని అడుగుతుంది.

ఆమె చివరికి బుద్ధుడి శిష్యురాలుగా మారి జీవితాంతం ఆయన మార్గాన్ని అనుసరిస్తుంది.

ఒక చక్కని మాట ఉంది, 'రేపు లేదా తరువాతి జన్మ ఏది ముందు వస్తుందో మనకి ఎప్పటికీ తెలియదు. బుద్ధుడు ఈ విధంగా చెబుతాడు, 'సర్వాంతర్యామి మేఘంలా వెళుతూఉంటాడు. జనన మరణాల్ని గమనిస్తే అది నాట్యంలా ఉంటుంది అని.

ఏ మతాలవారు అయితే మనిషికి ఉన్నది ఒకే జన్మ అని నమ్ముతారో వారే కంగారు, ఒత్తిడిలను సృష్టించారు. జీవితసారాంసాన్ని పిండుకోవాలని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదీ పోగొట్టుకోలేరు కాబట్టి. మనిషికి ఉన్నది ఒక జన్మ మాత్రమే అన్న నమ్మకం శాస్త్రసాంకేతిక అభివృద్ధికి కారణం. అప్పుడే జీవితంలో ఎక్కువ సంతోషాన్ని పొందవచ్చు అన్నది వారి అభిప్రాయం.

తూర్పుదేశాల మతాలు, మనిషికి చాలా జన్మలు ఉన్నాయి అని నమ్ముతాయి. మీరు ఈ భూమి మీదకి పలుసార్లు వస్తారని నమ్ముతారు. తిరిగి అదే జీవితం అనే నాటకం ఆడాలి. అదే వ్యవస్థ, అవే బంధాలు, కాకపోతే వేరు వేరు కాలాలు. అందుకే జన్మ అంటే విసిగిపోయి ఉంటారు. ఎన్నిసార్లు జన్మించాలి? ఎన్నిసార్లు అదే నాటకం, నాకు దీని నుంచి స్వేచ్ఛ కావాలి అనుకుంటారు. అందుకే విముక్తి, మోక్షం గురించి పని చేసారు. మరణం అంటే మీకు ఉండే భావం మీ జీవనవిధానాన్ని మార్చేస్తుంది.

పునర్జన్మ అన్న విషయం అంత ప్రాచుర్యాన్ని పొందలేదు. ఎందుకంటే దాన్ని శాస్త్రీయంగా నిరూపించలేం. నియర్‌డెత్ ఎక్స్‌పీరియన్స్ అనే విషయం ఇప్పుడు బాగా ప్రాచుర్యాన్ని పొందింది. ఎందుకంటే చాలామంది డాక్టర్స్ వారి అనుభవాల్ని అందులో చెప్పారు. మరణం సమీపానికి వెళ్ళి బతికిన వేలమంది తమ అభిప్రాయాల్ని చెప్పారు. అందరి అనుభవం ఒకే విధంగా ఉంది. వారు సంఘటనలో జీవించారు. హిప్నోటిస్ట్ కూడా కొందరిని వారి క్రితం జన్మలోకి తీసుకువెళ్ళినప్పుడు అది కూడా ఒకే విధంగా ఉన్నది. ఇవన్నీ కూడా కఠోపనిషత్తులో ఋషులు ఏం చెప్పారో అదే విధంగా ఉన్నాయి.

జ్ఞానోదయానికి ముందు నా సమయంలో జరిగిన మరణం

నాకు జ్ఞానోదయం జరగటానికి ముందు ఆధ్యాత్మికప్రయాణంలో, ఒక సంఘటన జరిగింది. నేను వారణాసికి దగ్గరలో గజియాబాద్ అనే ఊరిలో ఉన్నాను. అక్కడ ఒక పెద్దవయస్సు సాధువు హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐ.సి.యు.) లో ఉంటే నేను అతనికి తోడుగా ఉన్నాను. ఇది సంప్రదాయం. పెద్ద వయస్సు సాధువుకి ఆరోగ్యం బాగుండకపోతే చిన్న సాధువులు వారి సంరక్షణ చూసుకుంటారు. నేను ఆ విధంగా ఆయన దగ్గర ఉన్నాను.

నేను ఒక రోజు ఆయన దగ్గర ఉన్నప్పుడు పక్క మంచం మీద వ్యక్తి చనిపోతున్నాడు. అతను జీవితం కోసం కొట్టమిట్టాడుతున్నాడు. అతని అంతరంగంలో జరిగేది నాకు స్పష్టంగా కనిపిస్తూంది. నాకు లోతైన ఆధ్యాత్మిక అనుభవం జరిగింది కాని జ్ఞానోదయం కాలేదు. నేను ఇంకా అన్వేషణలోనే ఉన్నాను. నా శరీరం జ్ఞానోదయం జరిగినప్పుడు సంభవించే శక్తి విస్ఫోటానికి తయారు అవుతున్నది.

చాలామంది డాక్టర్లు ఆయన ప్రాణాలు నిలపటానికి చాలా ప్రయత్నం చేసారు. అతనికి శ్వాస అందటం లేదు. అతనికి మరణం ఎలా సంభవించిందో నేను స్పష్టంగా చూడగలిగాను. అతనిలోని జీవాత్మ ఏ విధంగా శరీరం బయటకి వెళుతూందో చూడగలిగాను.

నా శరీరం బయట నాకు జరిగిన అతిశక్తిమంతమైన అనుభవం. అక్కడ జరుగుతున్నది నాకు కనపడుతూన్నది. కాని నేను దాన్ని భరించలేకపోయాను. మీరు ఒక ముఖ్యవిషయం తెలుసుకోవాలి, ఎవరైనా భౌతికంగా బాధపడుతుంటే, అది మిమ్మల్ని ముప్పై నుంచి నలభై శాతం ప్రభావితం చేస్తుంది. అది మానసికంగా బాధపడితే, డిప్రెషన్‌లో ఉంటే అది అరవై శాతం మీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అదే భావాత్మకస్థితిలోని బాధ అయితే ఎనభై శాతం మీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. బాధ సూక్ష్మంగా అయ్యే కొద్దీ దాని ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది.

నేను శారీరక, మానసిక, భావాత్మకబాధనే కాదు, అంతరంగంలోని జీవాత్మస్తాయిలో బాధని కూడా చూసాను. ఆ బాధ అంతా నేను పడినట్లు అయ్యింది. అక్కడి నుంచి పరుగెత్తి, వెళ్ళిపోవాలి అనుకున్నాను. కాని ఆ సాధువు నా చేయి పట్టుకొని, నన్ను వెళ్ళవద్దు అని బతిమిలాడసాగాడు. నేను మూడు నెలలుగా అతన్ని చూసుకుంటున్నాను. అదే మా మధ్య అనుబంధం.

నా చిన్నప్పటి నుంచి సాధువులకి, సన్నాసులకి సేవ చేయటం నాకు చాలా ఇష్టం. మా ఇంటి నుంచి భోజనం, బట్టలు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాడిని. అది నాకు ఇష్టం. ఈ రోజుకి కూడా వేదసంస్కృతి నిలబడి ఉంది అంటే దానికి కారణం ఈ యోగీశ్వరులే. ఆ శాస్త్రాన్ని అలా నిలబెట్టారు. వారు వారి శాస్త్ర సాంకేతికరంగాల్లో పరిశోధనలు చేయాలి అంటే చాలా రకాలైన సహాయ సహకారాలు అందించాలి. ఉదాహరణకి పాశ్చాత్యదేశాలలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. దానికి చాలామంది, చాలా సంస్థలు సహాయం చేస్తాయి. వైద్యరంగంలో పరిశోధనలకి ఫార్మసీ కంపెనీలు సహాయం చేసాయి. అదే అంతరిక్షపరిశోధనలు అయితే ప్రభుత్వం సహాయం చేస్తుంది.

అదే విధంగా భారత దేశం మొత్తం ఆధ్యాత్మికపరిశోధనలకి తన సహాయసహకారాలు అందిస్తుంది. దేశం మొత్తం అంతరంగ ప్రపంచశాస్త్రవేత్తల బాధ్యతని తీసుకుంటుంది. వారికి భోజనం, బట్టలూ, ఆశ్రయం ఇచ్చి, వారి పరిశోధనలకి అంతరాయం కలగకుండా చూస్తుంది. వారు బయట ప్రపంచంలో ప్రాథమిక అవసరాలకి సమయాన్ని వృథా చేయనీయకుండా ఆ అవసరాల్ని చూస్తారు. అందుకే నేను ఎప్పుడూ సాధువులకి, యోగులకి సేవచేయటం నా బాధ్యత అని చేసేవాడిని.

ఆ పెద్ద సాధువు నన్ను అక్కడి నుంచి వెళ్ళనీయలేదు. ఆ పక్క మంచం మీద వ్యక్తి మరణించటం అతన్ని భయపెట్టింది. ఆ వ్యక్తి యాతనని అనుభవిస్తున్నాడు. ఆరు అడుగుల శరీరం వేరు చేయబడినట్టు బాధపడుతున్నాడు. మన వేలికి చిన్న గాయం అయితేనే నొప్పి భరించలేం. అది ఎంత బాధగా ఉంటుందో కదా! ఒకేసారి వెయ్యి తేళ్ళు కుట్టినంత బాధని అనుభవిస్తున్నాడు. నాకు అతను పడుతున్న బాధ స్పష్టంగా కనిపిస్తూంది.

ఒక వైపు అతని ఆత్మకి సంబంధించిన తీరని కోరికలు, భావావేశాలు, అత్యాశ, అపరాధభావం – ఇవన్నీ వ్యథని చెందుతున్నాయి. ఆత్మ శరీరంలో ఉండి ఈ కోరికలన్నీ తీర్చుకోవాలి అనుకుంటూంది. కాని శరీరం అలసిపోయి విశ్రాంతి కావాలి అంటుంది. శరీరం చాలు అంటూంది. ఆత్మ కావాలి అని శరీరాన్ని పట్టుకొని ఉంది. కుడి చేయి పోతే, ఎడమ చేతిని పట్టుకొని ఉంటుంది. ఎడమ చేయి చనిపోతే ఆత్మ కాలుని పట్టుకొని వేలాడుతుంది. ఆ విధంగా శరీరంలో ఏ భాగం బాగుందో దాన్ని పట్టుకొని వేలాడుతూంది. ఒక భాగం తరువాత ఒకటిగా శరీరం మరణిస్తూంది. నాకు స్పష్టంగా కనిపించింది. కింది భాగంతో అతను అంత యాతన అనుభవించలేదు కాని శరీరంపై భాగం బాధకి అతను వణికిపోతున్నాడు.

క్రమంగా జీవాత్మ శరీరాన్ని వదలి బయటకి వెళ్ళిపోతూంది. ఒక విషయం అర్థం చేసుకోండి, ఎప్పుడైతే శ్వాస ఆగుతుందో, జీవాత్మ శరీరాన్ని వదిలింది అని అర్థం. మీ లోపల ఏడు శరీరాలు ఉంటాయి. రక్తమాంసాలతో ఉండి మీరు చూడగలిగేది భౌతిక శరీరం. మీలోని జీవశక్తి అయిన ప్రాణం కదలాడే శరీరం ప్రాణశరీరం. ప్రాణం మీ లోపల ఐదు రకాల కదలికల్ని కలిగి ఉంటుంది. మీ లోపలికి ప్రవేశించిన శ్వాస, మీ లోపల తిరిగే గాలి, శరీరమంతా జీవశక్తిలా వ్యాపించే గాలి, మీ నుంచి బయటికి వచ్చేసే గాళి, ఇదంతా కలిపి మీలోని రెండవ శరీరంగా ఉంటుంది. అదే ప్రాణ శరీరం.

మూడవది, నిరంతరం మీ లోపల మీరు మాట్లాడుకునే మాటలు. అంతరంగపు మాటలు (ఇన్నర్ చాటర్). అంటే మీలో ఒక ప్రవాహంలా వచ్చే మాటలు ఆలోచనలు. అవి మీ లోపల ఒక ప్రవాహంలా కదులుతూ ఉంటాయి. నాలుగవ శరీరం మీ భావావేశాలైన భయం, కోపం, ఆశలూ మొదలైనవి. ఇవన్నీ ఎటువంటి మాటలూ అవసరం లేకుండా మీ శరీరమంతా ఒక భావంలా వ్యాపిస్తాయి. మాటలు లేకుండా కేవలం ఆ భావావేశం మిమ్మల్ని కుదిపేస్తుంది. ఇదే భావావేశాల శరీరం. ఐదవది, మీరు గాఢనిద్రలో అనుభవించే నిశ్శబ్దం. ఇక్కడే లోతుగా నాటుకుపోయిన సంస్కారాలు ఉంటాయి. అవి విత్తనం స్థాయిలో ఉంటాయి. ఈ సంస్కారాలు చైతన్యంతో ఉండవు. అలా అని జీవం లేకుండా కాదు అవి లోతైన కోమాలో ఉంటాయి. మీరు మీకు ఇష్టమైన విధంగా జీవించలేరు. అలా అని మీరు మరణించలేదు. అక్కడ ఇరుక్కుపోయి ఉంటారు.

కారణశరీరం నుంచి ఆత్మ ఆనందశరీరానికి చేరుతుంది. ఇది ఆరవ శరీరం. ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తారు. ఇదే మిమ్మల్ని ఆధ్యాత్మిక అన్వేషకులుగా ఉండాలి అని నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక అన్వేషకులైతే ఈ శరీరం మీలో చాలా బలంగా ఉంటుంది. మీరు ఈ శరీరాన్ని ఐశ్వర్యవంతం చేస్తే, మీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ శరీరంలో ఏవైనా సంస్కారాలు మిగిలి ఉంటే తిరిగి మీరు జన్మ ఎత్తుతారు.

మీరు సంతోషకరమైన అనుభవాలతో ఎక్కువగా ఉంటే, మీరు స్వర్గంలో ఉంటారు. మీరు బాధలలో ఇరుక్కుపోయి ఎక్కువ కాలం ఉండిపోతే మీరు నరకంలో ఉన్నట్లే. మీరు జీవించి ఉన్నప్పుడు ఎంత బాధని అనుభవించారో మరణించే సమయంలో అంత సేపూ బాధల్తో ఉంటారు. అదే మరణసమయంలో నరకం. మీరు జీవించినప్పుడు ఎంత ఆనందాన్ని అనుభవించారో, అంత సేపు మరణ సమయంలో ఆనందంలో ఉంటారు. అదే స్వర్గం. అంత సేపు ఈ ఆనందకోశంలో ఉంటారు.

స్వర్గం, నరకం అనేవి మానసికస్థితులు, అది సత్యం. మీ లోపల ఉన్న సంస్కారాలు ఆధారంగా మీరు స్వర్గాన్ని, నరకాన్ని అనుభవిస్తారు. అందుకే రకరకాల సంస్కృతులలో స్వర్గనరకాల్ని వేరువేరుగా ఊహిస్తారు. ఎందుకంటే స్వర్గం ఒక స్థలం కాదు, అది మానసిక స్థితి. ఏడవ శరీరం నిర్వాణశరీరం ఇది జ్ఞానోదయశరీరం. మరణసమయంలో వ్యక్తి జీవాత్మకి, అతని శరీరానికి మధ్య చాలా పెద్ద పోరాటం జరుగుతుంది. శరీరం ఇక నా వల్ల కాదు నేను అలసిపోయాను అంటుంది. ఆత్మ కాదు, నాకు నీవు కావాలి నిన్ను ఇంకా ఉపయోగించుకోవాలి, అంటుంది.

శరీరం గెలిస్తే, ఆత్మ తరువాతి శరీరంలోకి వెళుతుంది, అదే ప్రాణశరీరం మీరు కలల్లో ఉండేది. ఈ శరీరంలో మీ తర్కం పని చేయదు. కాని కోరికలు అదే విధంగా ఉంటాయి. కల అంటేనే అర్ధం ఎటువంటి తర్కం, అర్థం లేనిది. కాని కోరికలు, సంస్కారాలు అదే విధంగా చైతన్యంతో ఉంటాయి. మీరు అచేతనస్థితిలో ఉన్నా, కోమాలో ఉన్నా, మీ తర్కం పని చేయదు.

మీరు భౌతికశరీరంలో ఉన్నంత కాలం మీలో కోరికలు ఉంటాయి. మీరు అవి అవసరమా. కాదా అని విశ్లేషణ చేయగల తర్కం ఉంటుంది. ఏ కోరికల్ని ముందు తీర్చాలి అని నిర్ణయించే తర్కం ఉంటుంది. కోరికలు మీ నియంత్రణలో ఉంటాయి. అక్కడ సమతుల్యతలో ఉంచే యంత్రాంగం ఉంటుంది. ఎప్పుడైతే తగిన తర్కం ఉండదో, కోరికలు ఆత్మని ఫుట్‌బాల్‌ని కొట్టినట్టు ఆడుకుంటాయి. ఒక పక్క అపరాధభావం ఉంటుంది. మరొక పక్క కోరికలు ఆత్మని అన్ని వైపులకీ లాగుతుంటాయి.

నేను ఆ మరణించే వ్యక్తిని గమనించినప్పుడు, అతనిలోని ఆత్మ ఒక దాని తరువాత ఒక శరీరం లోంచి వెళ్ళటం స్పష్టంగా చూడగలిగాను. కోరికలు తీరని శరీరం గుండా వెళ్ళేటప్పుడు ఆత్మపడిన క్షోభని, యాతనని చూసాను. అపరాధభావం ఆత్మని ఎంత బాధపెట్టిందో చూసాను. నేను అనుకున్నది సాధించలేకపోయాను అనే భావం ఆత్మని అతిగా బాధపెట్టింది. అప్పుడే మీరు జన్మించిన మీ లక్ష్యాన్ని మరణసమయంలోనే గుర్తు చేసుకుంటారు.

మీరు జన్మనెత్తే సమయంలో చాలా బాధని అనుభవిస్తారు. ఆ బాధలో జన్మ లక్ష్యాన్ని మరచిపోతారు. అది లోతైన అచేతన స్థితిలో జరుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, మీరు విమానంలో కూర్చున్నాక కోమాలోకి వెళ్ళారనుకోండి, తరువాత విమానం దిగాక మీరు ఎందుకు విమానం ఎక్కి అక్కడికి వచ్చారో మరిచిపోతారు. ఆ స్థలాన్ని వదిలాక అకస్కాత్తుగా అక్కడికి ఎందుకు వచ్చారో గుర్తు వస్తుంది.

అదే విధంగా మరణించే సమయంలో మీలో బలమైన అపరాధభావం అందుకే కలుగుతుంది. నేను జన్మ నెత్తిన ఉద్దేశాన్ని అంటే ప్రారబ్ధకర్మలని పూర్తి చేయలేకపోయానే అనే అపరాధభావం అది. ఈ భావం లోంచి ప్రయాణం చేసాక, మీ జీవితంలో, అనుభవించిన బాధల అనుభవాలు వస్తాయి. కాబట్టి మరణసమయంలో మీరు ముందుగా శారీరకబాధల లోంచి, ఆ తరువాత కోరికల గుండా, ఆ తరువాత అపరాధభావం ద్వారా ఆ తరువాత భావావేశాల బాధల గుండా, చివరికి ఆనందకోశం ద్వారా ఈ జన్మలో అనుభవించిన ఆనందంతో బయటికి వెళ్ళిపోతారు.

సాధారణంగా మీరు ఆనందమయకోశం అయిన ఆరవ శరీరాన్ని చేరగానే తరువాతి శరీరం తీసుకోవటానికి సిద్ధపడతారు. అంటే వ్యక్తిలోని జీవాత్మ ఆ తరువాతి శరీరాన్ని తీసుకోవటం. చాలా అరుదుగా ఆరవ శరీరం దాటి నిర్వాణశరీరంలోకి ప్రవేశిస్తారు. అలా ప్రవేశించగలిగితే తిరిగి వెనక్కి వచ్చి కొత్త శరీరాన్ని తీసుకోరు.

మీరు ఈ శరీరాల నుంచి ప్రయాణం చేసినప్పుడు మీకు చాలా అనుభవాలు కలుగుతాయి. మీలోని తీరని కోరికలు, లోతైన అపరాధభావం, తీవ్రమైన బాధ – వీటి అనుభవంతో మీరు గట్టిగా ఒక నిర్ణయానికి వస్తారు. నేను మరొక శరీరాన్ని నేను సాధించవలసిన విషయాలు ఈ సారి మరిచిపోకుండా సాధించి తీరతాను. నేను తిన్నగా సత్యమార్ధంలో సత్యాన్వేషణలో ఉంటాను అనుకుంటారు. కాని జన్మ నెత్తే సమయంలో ఆ తీవ్రమైన బాధకి మీ లక్ష్యాలు మరిచిపోతారు.

చివరికి ఆ వ్యక్తి మరణించాడు. కాని ఆ అనుభవం నా లోపల ఒక లోతైన గుర్తుగా మిగిలిపోయింది. అద్దస్థం కొద్దీ ఆ సాధువుకి ఆరోగ్యం కుదుటపడి ఆయనని డిశ్చార్టి చేసారు. నేను తిరిగి నా ప్రయాణం కొనసాగించాను. ఆ తరువాత కొంత కాలానికి నాకు మరణ అసుభవం కలిగింది. నాకు జ్వానోదయం అయ్యింది. నా జీవితం ఒక విముక్తి పొందినవానిలా నా పన్నెండవ సంవత్సరంలోనే ప్రారంభమైంది. అప్పుడే నాకు చాలా గాధమైన, లోతైన ఆధ్యాత్మిక అసుభవం కలిగింది. కాని నా లక్ష్యం, నా మిషన్ గురించి స్పష్టత జ్ఞానోదయం తరువాత మాత్రమే కలిగాయి. ఈ శరీరం ద్వారా ఏం జరుగబోతున్నది అనే విషయం జ్ఞానోదయం తరువాత మాత్రమే స్పష్టంగా నాకు తెలిసింది.

జ్ఞానోదయమెన తరువాత నా సమక్షంలో జరిగిన మరణం

నాకు జ్ఞానోదయం అయిన తరువాత నేను దక్రిణభారతదేశం వచ్చి బెంగళూరులో ఒక భకుని ఇంట్లో ఉంటూ అందరికీ హీలింగ్ చేసేవాడిని. ఆ సమయంలో ఒక వ్యక్థి ఐ.సి.యు.లో ఉంటే హీల్ చేయటానికి అక్కడికి వెళ్ళాను.

అక్కడ నేను హీలింగ్ చేసే సమయంలో పక్క మంచం మీద ఉన్న వ్యక్తిలో మరణం ప్రారంభమైంది. నేను ఎప్పుడైతే అతను మరణించబోతున్నాడు అని అనుకున్నానో, ఆ బాధ చూడలేను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. కానీ హీలింగ్ చేయించుకుంటున్న వ్యక్తి నన్ను వెళ్ళనీయలేదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం, మరణిసున్న ఈ వ్యక్తి అంతకు ముందు నాకు జరిగిన అనుభవంలోని వ్యక్తిలా బాధ పడటం లేదు. నేను నిరాంతపోయాను. నాకు చాలా కుతూహలం కలిగింది. ఇంతకు ముందు వ్యక్రిలో ఆత్మ ఒక శరీరం నుంచి మరొక దానిలోకి ఎంతో యాతనపడి, బాధపడి వెళ్ళేది. కాని ఇతని ఆత్మ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్ళటం నేను చూసాను.

మొదటిద్దెన భౌతికశరీరంలో కొంత బాధ అనుభవించాడు. అకస్మాత్తుగా బాధ మాయమైంది. ఆత్మ ప్రశాంతంగా ప్రాణ శరీరంలోకి ప్రవేశించింది. రాజఠీవితో ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి వెళ్ళగలిగింది. ఆత్మ చాలా శక్తిమంతం అయింది. కోరిక, అపరాధభావం – ఇటువంటివి ఏవీ కూడా ఆత్మని ఏమీ చేయలేకపోయాయి. కారణశరీరంలో అది గాధనిద్దలోకి వెళ్ళలేదు. అది చివరిగా నిర్వాణశరీరంలోకి ప్రవేశించి అక్కడ విరామంగా ఉండి మాయమైపోయింది. నేను ఆ వ్యక్తిని గొప్ప ఆధ్యాత్మికుడు అనుకున్నాను. నేను ఆయన బంధువుల్తి ఆ విషయం అడిగాను. అతని బంధువులు కాదని చెప్పారు. అతను జీవితంలో ఎప్పుడూ ధ్యానం చేయలేదు, ఏ ఆధ్యాత్మికసాధనా చేయలేదు, అని చెప్పారు. అతను మామూలు ప్రాపంచికజీవితాన్ని గడిపాడు.

నేను ఈ విషయం గురించి లోతుగా అలోచించాను. నేను మొదట చూసిన మరణం భయంకరంగా ఉంది. రెండవది అద్భుతంగా ఉంది. నేను ఇప్పుడు మీకు చెబుతున్న విషయం నిజాయితీతో, సత్యాన్ని తిన్నగా చెబుతున్నాను. ఈ విషయం చెప్పటంలో నా బాధ్యత ఎక్కువగా ఉంది. ఈ రెండు మరణాలకి తేడా ఏమిటి అని ధ్యానంలోకి వెళ్ళి గమనిస్తే నాకు విషయదర్శనం అయ్యింది. రెండవ మరణ సమయంలో నాకు జ్ఞానోదయం కలిగింది. ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరుని సమక్షంలో రెండవ మరణం సంభవించింది. మొదటి మరణంలో నా సమక్షం ఏ మాతం సహాయం చేయలేకపోయింది. ఎందుకంటే జ్ఞానోదయశక్తి నా నుంచి ప్రసరించలేదు. నాకు అప్పటికి జ్ఞానోదయం కాలేదు. అందుకే మొదటి వ్యక్తి సాధారణమరణాన్ని పొందాడు. రెండవ వ్యక్తి జ్ఞానోదయమైనవారి సమక్షంలో మరణించాడు. అదే తేడా.

ఈ విషయం నాకు ఎప్పుడెతే అర్ధమెందో, నా అంతరంగం నుంచి గాధమైన కరుణ పెల్లుబకటం తెలిసింది. నాకు అప్పుడు అనిపించింది దీన్ని ప్రతి మనిషికి ఒక బహుమతిగా నేను ఇవ్వగలిగితే నా మిషన్, నా లక్ష్యం నెరవేరినట్టే. అని అంత ప్రపశాంతమైన మరణాన్ని కేవలం జ్ఞానోదయమైన యోగీశ్వరుడు మాత్రమే ఇవ్వగలడు. అప్పుడు నేను ధ్యానంలోకి వెళ్ళి ఏ విధంగా ఈ బహుమతిని నేను అందరికీ ఇవ్వగలను అనుకున్నాను. నేను అన్ని ఐ.సి.యు.లో ఉండలేను. దీని వెనుక గల శాస్త్రాన్ని అర్థం చేసుకున్నాను. మరణం వెనుక ఉన్న విషయాన్ని శాస్తీయంగా తెలుసుకోగలిగాను. మరణసమయంలో నిజంగా ఏమి జరుగుతుందో తెలుసుకున్నాను. మీకు వివరిస్తాను.

మీరు మామూలు తర్కానికి కట్టుబడి కేవలం భౌతికశరీరంలోనే ఉండిపోతే, గురుదేవులు అనగానే మీకు మామూలుగా ఉండే నమ్మకం అనిపిస్తుంది. అంతే అప్సుడు బయట ప్రపంచం చాలా దృధంగా, గొప్పగా, ఒక సత్యంలా అనిపిస్తుంది. మీరు లోతుగా వెళ్ళే కొద్దీ మిగతా శరీరాల్లోకి వెళ్ళే కొద్దీ గురువులు సత్యం అని, ప్రపంచం మసకగానూ కనిపిస్తుంది. నిద్ర పోయేటప్పుడు కల నిజంలా బయట ప్రపంచం మసకగా కనిపిస్తాయి. నిద్ద లేచాక ఏ విధంగా కల నిజం కాదు, బయటి ప్రపంచం నిజం అనిపిసుందో, ఇది కూడా అంతే. మీరు చేతనస్థితిలో ఉన్నప్పుడు మీరు కలలో చూసే ప్రపంచం ఒక ఊహ, ఒక కల్పనలా అనిపిసుంది. కలలో చూసే ప్రపంచం చైతన్యంతో 4డి కలర్ సినిమాలా ఉంటుంది. కల లోంచి బయటకి రాగానే కల నలుపు – తెలుపులా ఉంటుంది.

అదే విధంగా మీ చేతనస్థితి అత్యున్నతస్థాయికి చేరితే ఈ బయటి ప్రపంచం జీవం లేనట్టు డల్‌గా ఉంటుంది. ఆధ్యాత్మిక సత్యాలు, గురువులు నిజమని తెలుస్తుంది. మీరు శరీరం నుండి విడిపోయి ఉన్నతచేతనస్థితిలోకి వెళ్ళగలిగితే, గురుదేవులు, అత్యున్నత చేతనస్థితి శక్తి ఒక దృధమైన సత్యమని మీరు తెలుసుకోగలుగుతారు.

రెండవ వ్యక్తి మరణించినప్పుడు అతను గాధమైన జ్ఞానోదయ శక్తిక్షేత్రంలో ఉన్నాడు. అది అతన్ని ఆ శక్తితో కలపగలిగింది.

ఒక విషయం అర్ధం చేసుకోండి, మీరు ఇక్కడ కూర్చుని నేను చెప్పేది వింటున్నారు. మిమ్మల్ని ఆ జ్ఞానోదయశక్తితో బంధం ఏర్సరచుకోనీయకుండా, ఆ శక్తిలో లీనమవకుండా ఏమి ఆపుతుంది అంటే అది మీలోని తర్శం, కారణాలు వెతికే తెలివితేటలు. మీరు ఇక్కడ అచేతనస్తితిలో చాలా అనుమానాలతో కూర్చున్నారు. నేను నా సర్వస్వం ఆయనకి అధీనం చేసి నేను అధీనమైపోతే, గురువుగారు అవన్నీ తీసేసుకుంటారేమో అనేది మరొక కారణం. ప్రస్తుతం మీకు ఈ ప్రపంచం నిజంలా కనిపిస్తుంది. గురువుగారు కూడా అంతే అనుకుంటారు.

వస్తు ప్రపంచంలో మిగిలినవి ఏ విధమైన లోతుతో మీరు అర్థం చేసుకుంటారో గురువుని కూడా అదే విధంగా అర్ధం చేసుకుంటారు. రెండవ వ్యక్తికి మరణసమయంలో బయటి ప్రపంచానికి సంబంధించి ఏదీ అందుబాటులో లేదు. అతని మరణసమయంలో బాంక్ అకౌంటు చూసే స్తితో లేదు, కారు డయివ్ చేసే స్థితిలోలేదు, అతను ప్రాపంచికవిషయాలతో వేరు పడిపోయాడు. అతని చుట్టూ కేవలం జ్ఞానోదయమైనవారి నుంచి ప్రకాశించే శక్తి మాత్రమే ఉంది. అతను శక్తిమంతమైన ప్రకాశం నా నుంచి రావటం చూసాడు. అప్పుడు అతనిలో అభ్రయత్నంగా అధీనం జరిగింది. ఆ క్షణంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి అతను నాకు అధీనమవ్వగలిగాడు. ఆ వ్యక్తి బతికి ఉండగా నన్ను చూసి ఉంటే నాతో బంధం ఏర్పరచుకోవటానికి, నాకు అధీనమవ్వటానికి చాలా పోరాటం చేయవలసి వచ్చేది. అతని నుంచి అన్నీ తీసివేసుకోబడ్డాయి. అతను పట్టుకొని వేలాదటానికి అక్కడ ఏమీ లేదు. అందుకే నాతో బంధం ఏర్పరచుకోగలిగాడు.

భాగవతంలో ఒక చక్కని కథ ఉంది.

శ్రీకృష్ణుడికి ధనవంతుడైన భక్తుడు ఒకడు ఉంటాడు. అతను కృష్ణుణ్ణి ఇంకా ఐశ్వర్యం ఇవ్వమని కోరతాడు. కృష్ణుడు అదే విధంగా ఇస్తాడు. అక్కడే ఒక పేదరాలు ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. కృష్ణుడు ఆమె ఇంటికి వెళ్ళి అమెపెట్టిన ఫలాహారం తీసుకుని, అమెని దీవించి వెళ్ళతాడు. ఆ రోజు ఆమె ఆవు చనిపోతుంది.

కృష్ణుణ్ణి ఒకరు ఈ విషయం గురించి ఇలా అడుగుతారు, ధనవంతుడికి ఇంకాస్త ధనాన్ని ఇచ్చావు. పేదరాలికి ఉన్న ఒకే ఒక ఆధారమైన ఆవుని తీసేసావు, ఇది ఏమి న్యాయం, అని?

కృష్ణుడు చక్కగా వివరణ ఇస్తాడు. ఆ ధనవంతుడు ఇంకా ఈ మిథ్యావస్తుప్రపంచాన్నే నమ్ముతున్నాడు. అందుకే అతనికి అదే ఇచ్చాను. ఏదో ఒక రోజు ఈ ఐశ్వర్యంతో అలసిపోయి జ్ఞానోదయం వైపు వస్తాడు. ఆ పేదరాలు విషయం అలా కాదు, ఆమెకి ఉన్న ఒకే కోరిక నాతో అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి అని. దానికి ఆమెకి ఉన్న ఒకే ఒక అడ్డం ఆవు. నేను ఆవుని తీసేసాను. ఇక ఆమె పూర్తిగా నాలో లీనమైపోతుంది.

అదే విధంగా రెండవ వ్యక్తి మరణించే సమయంలో ఆవుని తొలగించటమైంది. భౌతికశరీరంతో అనుబంధాన్ని ఏర్పరచుకోలేక పోయాడు. కాని ప్రాణశరీరంలో అతనిలోని చేతనస్థితి ఉన్నతస్తానంలోకి వచ్చింది. అతను నన్ను స్పష్టంగా చూడగలిగాడు. గురుదేవుల సమక్షం బయటి ప్రపంచాని కంటే చాలా బలమైంది. మీ కల కంటే ఈ ప్రపంచం ఎలా బలమెందో, ఇది కూడా అంతే.

ఆ వ్యక్తి అక్కడ బలమైన శక్తిని చూసాడు. ఆ శకికి అధీనమైపోయాడు. ఎప్పుడు ఐతే ఆ విధంగా అధీనమయ్యాడో అతనిలోని సంస్కారాలు శక్తిని పోగొట్టుకుని అతణ్ణి ఏమీ చేయలేకపోయాయి. అతని వ్యక్తిగతచేతనస్థితి శక్తిమంతమైంది. కోరికలు, అపరాధ భావం అన్నీ తల వంచేసాయి. తిన్నగా ఆత్మశక్తి పెరిగింది.

అర్థం చేసుకోండి, సత్యాన్వేషి బలంగా ఉంటే అతను చూసేది ఏదీ అతని మీద ప్రభావాన్ని చూపదు. ఇదే మరణం వెనుక ఉన్న శాస్త్రం. మొదటి మరణంలో చూసేవాని కంటే చూడబడేది బలమెంది. రెండవ మరణంలో చూసేవాడు చూడబడే దానికంటే బలవంతుడు. ఈ శాస్తాన్ని అందరికీ ఎలా చెప్సాలి అనే విషయం మీద తీవంగా ధ్యానం చేసాను. అప్పుడు అకస్మాత్తుగా నాకు ఒక విషయం స్పురించింది.

ఒక విషయం అర్థం చేసుకోండి. శక్తికి కాలం, స్థలం అనేవి అడ్డం కాదు. అది ఉపగ్రహ శక్తితరంగాల్లా విశ్వంలో ఉంటుంది. దానికి తగిన యంత్రాన్ని పెడితే ఆ తరంగాల్లోని విషయాల్ని వినవచ్చు, చూదవచ్చు. జ్ఞానోదయమైన యోగీశ్వరుని శక్తి విశ్వమంతా వ్యాపించగలదు. ఆ యంత్రాన్ని నేను మనుషుల్తో అమర్చగలగాలి. అది ఫేస్‌మేకర్ లాంటిది. అది ఒకసారి అమర్చితే ఆ శక్తితో అతను అనుబంధాన్ని ఏర్పరచుకోగలడు. ముఖ్యంగా శరీరాన్ని వదిలే సమయంలో గురుదేవులంటే తన అంతరంగప్రపంచంలో జరిగిన అధ్యాత్మిక అనుభవాలు. అందరి అంతరంగంలో జరిగే విధంగా సూత్రాల్ని తయారుచేసే వ్యక్తి. ఆ సూత్రమే THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM సుగ్గరణ కార్యకమం. ఆ కార్యకమం ఫేస్ మేకర్‌ని మీలోపల అమర్చగలుగుతుంది.

ఆ విధంగా అమర్చటమే కాదు, నేను మీకు ప్రమాణం చేసి చెబుతున్నాను, మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మీరు మరణించే సమయంలో నేను మీ దగ్గర ఉంటాను. మీరు హాయిగా, అందంగా, నిర్వాణ శరీరంలో విరామంగా ఉండే విధంగా చేస్తాను. దయచేసి అర్ధం చేసుకోండి, నేను ఈ రోజు ఇక్కడ ఏం మాట్లాదుతున్నానో, దానికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరైతే ఈ మాటల్ని ప్రత్యక్ట్యంగా నా నుంచి వింటున్నారో వారికి నేను కట్టుబడి ఉంటాను.

ఈ శాస్త్రాన్ని చెప్పటం మొదలుపెట్టాక అందరి అనుభవాల నుంచీ నాకు తెలిసిన విషయం ఏమిటంటే, వారి జీవితం చివరి దశలో ప్రశాంతతని పొందటమే కాదు. వారి జీవితమే గాఢతతో, సంతోషంతో అనందపారవశ్యంతో గడచింది. ఒక విషయం అర్ధం చేసుకోండి, జీవితం, మరణం – రెండూ ఆనందమయం కావాలంటే మీ లోపల లోతుగా నాటుకుపోయిన సంస్మారాలు పూర్తిగా తొలగిపోవాలి. అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఐశ్వర్యాన్ని, మంచి అనుబంధాల్ని పొందగలుగుతారు. ఎందుకంటే మీరు ఉండే స్థితి చాలా బలమైంది. మీరు నిర్వాణశరీరంలో విరామంగా ఉండగలుగుతారు. ఈ శాస్తం అనే ఫేస్ మేకర్ మీలో అమరింతే మీరు విరామంగా నిర్వాణ శరీరంలో ఉండగలుగుతారు. అప్పుడు మీరు చేతనస్థితిలో జన్మ తీసుకొని జ్ఞానోదయం పొందగలుగుతారు. ఇక తిరిగి జన్మ పొందవలసిన అవసరం మీకు ఉండదు.

చివరి నిముషంలో మీకు గురున్నదే లెక్క

ఉపనిషతులలో ఒక చక్కని కథ ఉన్నది : జడభరతుడు అనే ఋషి ఉండేవాడు. అతను రక్షించిన ఒక లేడితో అతనికి అనుబంధం ఏర్పడింది. అతను సన్న్యాస జీవితం గడుపుతున్నాడు కాని ఈ లేడి పిల్లతో అనుబంధాన్ని పెంచుకుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆ లేడికి సంరక్షణ చేస్తూ దానితోనే సమయాన్ని గడుపుతుంటాడు. అతను మరణించే సమయంలో ఆ లేడిని మరిచిపోలేకపోతాడు. దాని సంరక్షణ ఎవరు తీసుకుంటారు అని బాధపడతాడు. 'అయ్యో! దాన్ని ఎవరు చూస్తారు? నేను మరణించాక దాని గతి ఏమిటి?' అని అనుకుంటూ ఉంటాడు.

అతను మరణించాక మరుజన్మలో లేడిగా జన్మిస్తాడు.

ఉపనిషత్తులోని ఒక శ్దోకంలో చాలా చక్కగా చెబుతారు, చివరి క్షణాల్లో నీవు దేని గురించి అయితే అనుకుంటావో నీవు అదే అవుతావు అని.

చాలా మంది అతి తెలివితో ఇలా అనుకుంటారు. జీవితమంతా నా ఇష్టం వచ్చినట్టు గడిపి, చివరి నిముషంలో దేవుడి పేరు తలచుకుంటాను, అప్పుడు నేను స్వర్గానికి వెళ్ళవచ్చు, అని. స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు జీవితంలో ఎక్కువగా దేని గురించి అనుకున్నారో చివరి నిమిషంలో అదే ముందుకి వస్తుంది. ఆ సమయంలో ఆటలు అడటానికి కుదరదు.

నిజానికి మీరు శరీరాన్ని వదిలే సమయంలో మీ శరీరవ్యవస్థ మొత్తం బాధలో ఉంటుంది. ఎందుకంటే మీ 80 లేదా 90 సంవత్సరాల జీవితం ఫాస్ట్ ఫార్వర్ద్ అవుతుంది. మీలో కలిగిన లోతైన అనుభవాలు మాత్రమే పెకి వస్తాయి. మీలోని ఆధ్యాత్మిక అనుభవాలు రంగురంగులుగా పెకి వస్తాయి.

స్పష్టంగా అర్ధంచేసుకోండి, ఆలోచనలు లేని తెలుసుకునే తత్వం అన్నింటి కంటే బలమైన అనుభవం అవుతుంది. అది ఒక్క క్షణం కలిగినా చాలు, మీరు శరీరాన్ని వదిలే సమయంలో అదే పైకి వస్తుంది. అదే దీపంలా మీ ముందుకి వచ్చి మీరు చేతన స్థితిలోనికి వెళ్ళే విధంగా దారి చూపిస్తుంది.

మరణసమయం గురించి మరొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ఆత్మహత్య కారణంగా అకాలమరణం సంభవించితే వారి సమయం వచ్చే వరకూ శరీరాన్ని ధరించలేరు. ఆ జీవాత్మ అంత వరకూ ఎదురు చూడవలసిందే. దానికి శరీరం లేకుండా ఎదురుచూడాలి.

ఉదాహరణకి ఒక వ్యక్తి 90 సంవత్సరాలు జీవించాలి అని శరీరాన్ని పొందినప్పుడు నిర్ణయించుకున్నాడనుకోండి, అతను 60వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకొని మరణించాడనుకోండి, అతను 30 సంవత్సరాల వరకూ మరొక కొత్త శరీరంలోకి వెళ్ళలేదు. శరీరంతో ఉన్నప్పుడు పడే బాధల నుంచి తప్పించుకోవటానికి అతను ఆత్మహత్య చేసుకుంటే, చనిపోయాక అతను శరీరం లేకుండా నరకం అనుభవిస్తాడు. అందుకే ఆత్మహత్య జీవితంలో ఏ సమస్యకి పరిష్కారం కాదు అని అర్థం చేసుకోవాలి.

ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఎందుకంటే ఈ జీవితం బాధామయం, నేను చిత్రహింసలు అనుభవిస్తున్నాను అనుకుంటారు. కాని ఆత్మహత్య చేసుకున్నాక వారు అనుభవించే బాధలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. మీ ముందు రుచికరమైన పదార్శాలు ఉంటాయి, కాని తినటానికి శరీరం ఉండదు. అది ఎంత బాధో కదా! ప్రపంచం అంతా మీ ముందు ఉంటుంది. కాని సంతోషంగా అనుభవించటానికి శరీరం ఉండదు. వాళ్ళు సమయం పూర్తి అయ్యే వరకూ జీవాత్మ అలా తిరుగుతూ ఉంటుంది.

నా మరణానుభవం

నాకు చేతనస్థితిలో జరిగిన మరణానుభవం గురించి చెబుతాను. ఇది వారణాసిలో జరిగింది.

నాకు ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేది. చేతనస్థితిలో మరణానుభవం పొందాలి, మరణాన్ని ఎదురుగా చూడాలి అని. అయితే అది నా ప్రాధాన్యంలో మొదటి స్థానంలో లేదు. ఏ అనుభవం జరగాలనుకున్నా, ఆ ఆలోచన మన ప్రాధాన్యాల్లో అన్నింటికంటే ప్రంథమస్తానంలో ఉండాలి. అది మీ మనస్సులో ఒక మూల ఉంటే చాలదు.

సాధారణంగా మనం చేయాలని అనుకున్న లిస్టులో ఇల్లు శుభ్రం చేయటం, వందుకోవటం, బిల్స్ కట్టడం, అద్దె కట్టటం – ఇలా ఉంటాయి. చివరగా ఉంటే జ్ఞానోదయం కూడా లిస్టుకి కలుపుతాం. అలా ఉండకూడదు. జ్ఞానోదయం కావాలనుకుంటే అది ప్రాధాన్యంలో ముందు ఉండాలి. కోరిక అత్యవసరమైనప్సుడే మీ చుట్టుపక్కల పరిస్తితులు దానికి అనుగుణంగా మారతాయి. ఇది ఒక్క జ్ఞానోదయం విషయమే కాదు. దేని పట్ట అయినా అంతే, ఇది సత్యం.

ఒక విషయం అర్ధం చేసుకోండి. మీరు అనుకున్నది జరగటం లేదు అనుకున్నారనుకోండి, ఒక విషయం తెలుసుకోండి. అది మీ ప్రాధాన్యం కాలేదు అని. దీని గురించి ఎవరినీ, ఏ పరిస్థితిని నిందించనవసరం లేదు. ఎప్పుడైతే, మీ ఆలోచన మొదటి ప్రాధాన్యంలోకి వస్తుందో, అది సాధించే శక్తి మీలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అది జరుగుతుంది. అప్పటి వరకూ మీరు ఎదురుచూదవలసినదే. మరణానుభవం అనే కోరిక అప్పటిలో నా ప్రాధాన్యం కాదు. అందుకే అది వాయిదా పడుతూ వసున్నది.

నేను పరిధాజకుడుగా తిరిగే రోజులలో వారణాసిలో ఉన్నాను. అక్కడ ఉన్న ఘాట్‌లలో మణికర్షిక ఘాట్ ఒకటి. అక్కడ రోజుకి సగటున 100 శవాల దహనం జరుగుతుండేది. అది పవిత్రగంగానది ఒద్దన ఉన్నది. అక్కడ నమ్మకం ఏమిటంటే అక్కడ మరణించినా లేదా శరీరాన్ని అక్కడ దహనం చేసినా వారికి ముక్తి వస్తుంది అని. అంటే వారికి జ్ఞానోదయం కలుగుతుంది అని అర్ధం.

ఇది ఒక సంధ్రపదాయికమైన నమ్మకం మాత్రమే కాదు రామకృష్ణ పరమహంస, జ్ఞానోదయమైన మహాయోగీశ్వరుడు, ఆయన తన అనుభవంతో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆయన ఈ విధంగా చెబుతారు 'నేను నా కకృతో స్పష్టంగా చూసాను. శివుడు ప్రతి శవదహనం దగ్గరకి వెళ్ళి, ఆత్మని తనలోకి తీసుకుని దాన్ని బంధవిముక్తి చేసి శరీరానికి, మానసికవ్యవస్థకి ముక్తిని ఇస్తాడు. కాబట్టి ఇదేదో పురాణకాలం నాటి నమ్మకం మాత్రమే అనుకోవద్దు. ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరుని అనుభవం.

నా అద్సష్టం కొద్దీ నేను మణికర్ణిక ఘాట్ దగ్గరకి వెళ్ళాను. ఇది నమ్మకం మాత్రమే కాదు సత్యం. గడచిన 2000 సంవత్సరాలుగా శవదహనానికి ఉపయోగించే మంట ఈ నాటికీ ఆరలేదు. వర్షంలో, ఎండలో, వరదలలో ఎప్పుడూ కూడా శవదహనానానికి మంటని తీసుకురారు. అక్కడ నిప్పు ఎప్పుడూ రగులుతూ ఉంటుంది. అక్కడి నుంచి నిప్రుని తీసుకొని చితికి నిప్పుపెడతారు అంతే. శవాలు వచ్చినవి వస్తుంటాయి. మంటలు మందుతూ ఉంటాయి. కొన్నిసార్లు రెండు – మూడు శవాలు ఒకేసారి ఒకే చోట దహనం కావటం చూసాను. ఆ విధంగా శవాలు వసూనే ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎక్కువగా ఉంటాయి. మనిషి మరణించిన ప్రదేశం దగ్గర నుంచి మనుషులు శవాన్ని 'రామ్‌నామ్ సత్య హై' అంటూ ఇక్కడికి మోసుకు వస్తారు. సాయంత్రానికి అక్కడికి చేరతారు.

అక్కడి విషయాలు అనుభవంతో తెలుసుకోవాలి కాని మాటల్తో చెప్పలేను. మీరు అక్కడికి వెళ్ళి ఆ అనుభవాన్ని తెలుసుకోవాలి.

మీకు నిజాయితీగా చెప్పాలి అంటే, కేవలం అక్కడ ఉన్నందుకే నాలో మరణం అంటే భయం పోయింది. నిరంతరం శవ దహనాలు జరుగుతూనే ఉంటాయి. నేను అనుకునేవాడిని, 'నేను కూడ ఒక రోజు అదే విధంగా అవుతాను కదా!' అని అంతే. అక్కడ మీకు చాలామంది, తోడు ఉంటారు. మీరు ఒక ట్రిప్ వేసినట్టే. అక్కడ చూస్తే మరణం అంటే ఒంటరితనం అనిపించదు.

మీ జీవితంలో మీరు ఒకటో – రెండో మరణాల్ని చూసి ఉంటారు. దానికే మీకు మరణం అంటే భయమేసుంది. కాని మణికర్షిక ఘాట్‌లో కార్యక్రమాలు ఏవీ ఉండవు. శవాన్ని తిన్నగా గంగానదిలోకి తీసుకువెళ్ళి 'రామ్ నామ్ సత్య హై' అంటూ అందులో మూడుసార్లు ముంచుతారు. ఈ లోపు అక్కడ చితిని ఏర్పాటు చేస్తారు. శవాన్ని తీసుకువచ్చి చితి మీద పెడతారు. అంతే.

అక్కడ మీరు గమనించదగిన కొత్త విషయం, బంధువులు ఎవరూ అక్కడ ఉండరు. అక్కడ ఎటువంటి కార్యకమాలూ చేయరు. నదిలో శవాన్ని ముంచి చితి మీద పెట్టి వాక్పు వెళ్ళిపోతారు. మిగతా విషయాలు అక్కడి నిర్వాహకులే చూసుకుంటారు. ఒక శవదహనానానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలియదు. అక్కడ ఇంకా చాలా శవాలు లైనులో ఉంటాయి.

నేను అనుకున్నాను, 'ఇక్కడ కూర్చొని ఏం జరుగుతుందో చూడాలి' అని ఆ ఘాట్ దగ్రర కూర్చున్నాను. ఒక గంటలోనే మరణం అంటే ఏదో ఒక కొత్త సంఘటన అనిపించలేదు. అదేదో నా బంధువో, నా స్నేహితుదో అన్నట్లు అనిపించింది. అక్కడ కూర్చొని ఒకదాని తరువాత ఒకటిగా వస్తున్న శవాల్ని చూదటం మొదలుపెట్టాను. అది కూడా మామూలుగా మిగతా లైనుల లాగానే అనిపించింది. రకరకాల సైజులు, రకరకాల వయస్సుల వారు, స్రీల, పురుషుల శవాలు అక్కడికి వస్తున్నాయి, అగ్నికి ఆహుతి అవుతున్నాయి.

నిరంతరం శవాలు అలా దహనమవటం చూసుంటే, మరణం అంటే మీకు గౌరవం పోతుంది. ప్రస్తుతం మీకు మరణం అంటే చాలా గౌరవం ఉన్నది. అందుకే మరణం గురించి ఏన్నో భావాలు. అదే సమస్య. మరణం అంటే ఏమీ లేదు. మన లోపలికి వెళ్ళిన శ్వాస బయటకి రాదు, అంతే. అదే మరణం, అంతకు మించి మరేమీ లేదు. దాన్ని ముందుకీ, వెనక్కి జరపలేరు.

నేను అలా చూస్తున్నప్పుడు, మరణం అంటే ఉండే కొంచెం భయం కూడా పోయింది. కొంత సేపటికి అలా చూడాలి అని ఆసక్తి కలిగింది. నేను కొన్ని శవాల దగ్గరకి వెళ్ళి వారికి సహాయం చేసాను. అప్పుడు నాకు నేను అనుకున్నాను, 'ఒక రోజు నా శరీరం కూడా ఈ విధంగా దహనం అవుతుంది. కదా!' అని.

ఎప్పుడైతే మరణం మీకు సంభవిస్తుంది అనుకుంటారో, మీ అహం పట్ల మీరు మోసున్న గౌరవం పోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా నన్ను వదలకూడదు అనుకుంటారో అది అహం మాత్రమే. ఎప్పుడైతే మీరు కచ్చితంగా ఏదో ఒక రోజు అన్నీ నన్ను వదిలిలేస్తాయి, అని అనుకుంటారో అప్పుడు అహం పట్ట మీకు ఉన్న గౌరవభావం పోతుంది. నా అహం పట్ట నాకు ఉన్న గౌరవభావం పూర్తిగా పోయింది.

నేను ఒక నిర్తయానికి వచ్చాను. ఎలాగూ నేను కూడా ఎప్పుదో ఒకప్పుడు మరణిస్తాను. కాబట్టి నాకు ఇప్పుడు చేతనస్థితిలో మరణానుభవం జరగాలి, తిరిగి నా మిగిలిన జీవితం అంతా మరణ భయం లేకుండా గడవాలి లేదా నేను మరణించాలి అని గట్టిగా నిర్దయించుకున్నాను. నాలో మరణం ఎలా జరుగుతుందో చూదాలి అని నిర్ణయించుకున్నాను. ఆ ఘాట్ దగ్గర చిన్న శివాలయం, ఒక చిన్న మందపం ఉన్నాయి. నేను ఆ చిన్న మండపంలో కూర్చున్నాను. అక్కడైతే ఎవరూ నన్ను కదిలించరు. ఎవరూ డిస్టర్బ్ చేయరు అని అక్కడ కూర్చుని శవదహనాలు చూస్తూ ఉన్నాను.

నాకు ఇంకా బాగా గుర్తు ఉన్నది. ఒక అనుభవం ద్వారా ఒక బలమైన క్లిక్ నాలో ఏర్పడింది. దానితో నాకు ఒక విషయం తెలిసింది. ఒక పెద్దావిడ శవం దహనమవుతూంది. ఆమె ఒంటి మీద బట్టలు కాలిపోయాయి. శవంపై ఇంకా ఎక్కువ మంటలు లేచాయి. అది చూసాక నాలో ఒక బలమెన క్లిక్ ఏర్పడింది, 'భగవంతుడా! ఈ శరీరానికి కూడా ఈ విధంగానే జరుగుతుంది కదా!' అని.

ఆ క్లిక్, నా శరీరంలో మరణం అంటే ఒక విధమైన భయాన్ని కల్పించింది. ఆ భయం నా శరీరమంతా వ్యాపించింది. భయం నా శరీరమంతా వ్యాపించటం నాకు సృష్టంగా కనిపించింది. అయితే నేను ఆ భయాన్ని చేతనస్థితిలో అనుభవించాను. ఎప్పుదైతే భయం నా తెలుసుకునే తత్వాన్ని ఢీ కొట్టిందో అదే మరణానుభవం. నేను చేతనస్థితిలో నా మరణాన్ని అనుభవించి, అందులోంచి బయటకి రాగలిగాను.

ఒక విషయం అర్ధం చేసుకోండి. భయాన్ని అణచేస్తే అది మీ లోపలే ఉండిపోతుంది. ఎప్పుడైతే భయం బయటికి వస్తుందో అప్పుడు దాన్ని చేతనస్థితిలో ఎదుర్కోకపోతే అది పెద్ద భయంలా తయారై, మిమ్మల్ని కుదిపివేస్తుంది. మీ నరాల వ్యవస్థ తెగిపోయినట్టు అవుతుంది. భయాన్ని చేతనస్థితిలో ఎదుర్కొంటే అది మరణానుభవం అవుతుంది, అంతే.

మరణభయం అచేతనస్థితిలో కలిస్తే అణచివేయబడుతుంది లేదా మరొక రూపంలో వక్రమార్గంలో బయటపడుతుంది. మరణ భయం, అచేతనస్థితితో కలిసినప్పుడు దాన్ని అణచకపోతే భయం ఒక ఘాతంలా తగిలి నరాల వ్యవస్థ దెబ్బ తింటుంది. ఎందుకంటే మీరు భయంతో కదిలిపోతారు. మరణభయం, చేతనస్థితిలో జరిగితే అది మరణానుభవం అవుతుంది. నా లోపల కలిగిన భయాన్ని నేను స్పష్టంగా చూడగలిగాను. నేను దాన్ని పూర్తిగా తెలుసుకునే తత్వంతో చేతనస్థితిలో ఎదుర్కొన్నాను. అది నాకు మరణానుభవం అయినది. నా శరీరం మరణించింది. దానిలో కదలికలు లేవు.

మరణం ఒక ఉత్సవం

ఆ విధంగా రెండున్నర రోజులపాటు నాకు ఆహారం, నీరు లేవు, ఆలోచనలు లేవు, ప్ర‌శ్న‌లు లేవు, అనుమానాలు లేవు. ఆ అనుభ‌వం జ‌రిగిపోయాక నేను ఆ విధంగా రెండున్న‌ర రోజులు ఉన్నాను అని అర్ధమైంది. నేను కళ్ళు మూసుకొని నా శరీరం మరణించటం చూసాను. ఎకుడా కదలికలు లేవు, రెండున్నర రోజులు గడిచాక అకస్మాత్తుగా నాలో ఒక క్లిక్ జరిగినది. 'భగవంతుడా! నా శరీరం మరణించింది కాని నేను జీవించి ఉన్నాను. అని ఆ స్పష్టత నాలో ఒక చక్కని పారవశ్యాన్ని కలిగించింది. మరణభయం నా నుంచి పూర్తిగా వెళ్ళిపోయింది.

నేను ఆనందపారవశ్యంలో, లోతైన ఆనందంలో ఉన్నాను, నేను నెమ్మదిగా కళ్ళు తెరిచాను. నేను నా శరీరాన్ని కదిలించగలిగాను. నాలో ముందుగా కలిగిన భావం, నాలో ఉప్పొంగుతున్న కృతజ్ఝత, ఆనందపారవశ్యం. నేను కిందికి వెళ్ళి, గంగ నీళ్ళు కొంచెం నా మీద చల్లుకొని, కమండలంలో గంగ నీరు పట్టుకొని, చితి మంటలో బూడిద కొంచెం తీసుకొని విశ్వనాథుని గుడికి వెళ్ళాను. నేను శివలింగం దగ్గరకి వెళ్ళి ఆ బూడిదని, ఆయనకి సమర్పించి ఉప్పొంగుతున్న కృతజ్ఞతాభావంతో ఆయనకి పూజ చేసాను. నా కంటికి విశ్వనాథుడు అక్కడ నిలబడి కనపడ్డాడు.

ఒక విషయం అర్ధం చేసుకోండి, నేను మరణించాను కాబట్టి విశ్వనాథుడు జీవంతో నాకు కనిపించాడు. అంతకు ముందు రోజు వరకూ నేను బతికి ఉన్నాను. కాబట్టి విశ్వనాథుడు నాకు ఒక రాయిలా కనిపించాడు. నేను అనుకునేవాడిని, ఈ చిన్న రాయిని ముట్టుకోవటానికి రోజూ లక్షల మంది అక్కడికి వస్తారు, ఎంత మూర్ఖత్వమో అనుకునేవాడిని. నేను ఎప్పడూ విశ్వనాథుడిని ఒక రాయిగా మాత్రమే చూసేవాడిని. నేను అలా ఎందుకు అనుకునేవాడిని అంటే అప్పుడు నేను ఇంకా బతికి ఉన్నాను కాబట్టి. నేను మరణించాక జీవించి ఉన్న ఆయనని స్పష్టంగా చూసాను.

ఎవరో ఒకరే జీవించి ఉండగలరు. మీరు కాని, ఆ సర్వాంతర్యామి కాని. మీరు సత్యాన్ని చూసినప్పుడు, ఆయన జీవిస్తారు. మీరు అనుకున్న విధంగా ఇక జీవించి ఉండరు. మరణభయం నన్ను శాశ్వతంగా వదలి వెళ్ళిపోయింది. ఇది నాకు జరిగిన ఒక బలమైన అనుభవం. అదే నన్ను అంతిమ అనుభవమైన జ్ఞానోదయాన్ని ప్రోత్సహించే విధంగా నాలో మార్పు తీసుకువచ్చింది.

మరణసమయంలో ఏం జరుగుతుంది?

శరీరాన్ని వదిలే సమయంలో అసలు ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు జవాబు జీవించి ఉన్న వ్యక్తి ఇవ్వలేదు. ఎందుకంటే అతనికి మరణానుభవం లేదు కాబట్టి. మరణించిన వారు చెప్పలేరు. ఎందుకంటే ఆ అనుభవాన్ని చెప్పటానికి వారు రాలేరు కాబట్టి. కేవలం జ్ఞానోదయమైన వ్యక్తి, ఎవరైతే చేతనస్థితిలో మరణానుభవాన్ని పొందుతారో, తిరిగి కొత్త వ్యక్తిగా వస్తాడో అతను మాత్రమే కచ్చితంగా మరణసమయంలో ఏం జరుగుతుందో చెప్పగలడు.

మరణరహస్యాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాను. మీకు ఇది ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మీరు నిశ్సాంతపోవచ్చు. కాని అది సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఔను అన్నా, కాదు అన్నా, మీరు స్వీకరించినా, లేకపోయినా, మరణసమయంలో ఇదే జరుగుతుంది.

మనకి ఒక శరీరం కాదు ఉన్నది. మనకి కనిపించే భౌతిక శరీరం మనకి ఉన్న ఏడు శరీరాల్లో ఒకటి. దాన్ని మాత్రమే మనం చూడగలం. కాని మనలో ఏడు పొరలు లేదా ఏడు శరీరాలు ఉంటాయి. అవి అతి సూక్ష్మస్తాయిలో ఉంటాయి. మనం వాటిని వాటిని అంటుకోలేం. ఆ ఏడు శరీరాల బొమ్మ కింది విధంగా ఉంటుంది.

భౌతిక శరీరం ప్రాణ శరీరం మానసిక శరీరం భావావేశాత్మక శరీరం కారణ శరీరం విశ్వ శరీరం నిర్వాణ శరీరం

ఈ శరీరాలు ఒక్కొక్కటి ఒక్కొక్క భావావేశాన్ని పట్టుకొని ఉంటాయి. ఉదాహరణకి, ప్రాణశరీరంలో మీ జీవితంలో కలిగిన కోరికలు ఉంటాయి. మానసికశరీరంలో మీలోని అపరాధభావం, ఆ అనుభవాలు ఉంటాయి. ఆకాశశరీరం లేదా భావావేశ శరీరంలో మానసిక వ్యథలుంటాయి. ఆత్మ శరీరాన్ని వదిలే సమయలో ఈ ఏడు శరీరాల ద్వారా వెళుతుంది. భౌతికశరీరం మరణిస్తుంది. కాని మిగిలిన ఆరు శరీరాలు పూర్తిగా మరణించవు. మీరు మీ జీవితంలో చాలా కోరికలతో ఉంటే, ఆ తీరని కోరికలన్నీ ప్రాణ శరీరంలో ఉంటాయి. అందుకే భౌతికశరీరం మరణించినా, ప్రాణశరీరం మరణించదు. ఆత్మ ప్రాణశరీరం లోంచి ప్రయాణించే సమయంలో చాలా బాధ పడుతుంది.

మీరు భౌతికశరీరాన్ని వదిలే సమయంలో చేతనస్థితి మీ శరీరం నుంచి వేరవుతుంది. అది శరీరం నుంచి చీల్చుతుంది. అప్పుడే ఆ వ్యక్తి కోమాలోకి వెళతాడు. డాక్టర్లు కోమా గురించి ఏం చెబుతారంటే, ఇది మీరు బాధని తట్టుకోలేని స్థాయిలో ఉంటే ఆటోమాటిక్ అనెస్టేషియాగా పని చేస్తుంది అని. బాధని తట్టుకోలేనప్పుడు ఆటోమాటిక్‌గా కోమాలోకి వెళ్ళిపోతారు.

ఆత్మ మొదటి శరీరం నుంచి రెండవదానిలోకి వెళ్ళే సమయంలో వారిలోని తీరని కోరికలు ముందుకి వస్తాయి. ఇది జరిగినప్పుడు ఒక గదిలో పదిమంది ఉండి ఫుట్ బాల్ ఆడితే ఎలా ఉంటుందో అదే విధంగా చేతన స్థితిని అన్ని మూలల నుంచీ కోరికలు కొడుతూ ఉంటాయి. ఒక్కొక్క మూల ఒక్కొక్క కోరిక ఉండి చేతనస్థితిని ఫుట్ బాల్‌లా తన్నుతూ ఉంటాయి. ఆ సమయంలో చేతనస్థితి శరీరాన్ని వదిలి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కోరికలు చేతన స్థితిని తిరిగి శరీరంలో ప్రవేశించమని బలవంతం చేసుంటాయి. తిరిగి వాటిని సాధించమంటాయి.

ఒక పక్క కోరికలు శరీరంలోకి ప్రవేశించమని గొడవ చేసుంటాయి, మరొక పక్క శరీరం, నా వల్ల కాదు నేను బాగా అలసిపోయాను, నన్ను వదిలెయ్యి అంటుంది. అదే మరణసమయంలో జరిగే తోపులాట. అది శరీరానికి, కోరికలకి మధ్య జరిగే పోరాటం. తరువాత అక్కడి నుంచి తరువాతదైన మానసికశరీరంలో ప్రవేశిస్తారు. అక్కడికి చేరగానే వారిలోని అపరాధభావం పైకి లేస్తుంది. వారు ఏ విధంగా జీవించాలి అనుకొని జీవించలేకపోయారో దాని గురించి, చేసిన తప్పుల గురించి – అన్నీ ఆ సమయంలో ముందుకు వచ్చి బాధపెడతాయి.

అర్థం చేసుకోండి, కోరిక భవిష్యతుకి సంబంధించింది. అపరాధభావం గతానికి సంబంధించింది. కానీ రెండూ ఒకటే. మనం ఎలా జీవించాలని అనుకున్నామో అది కోరిక, ఎలా జీవించకూడదు అనుకున్నామో అది అపరాధభావం. అపరాధభావం అంటే మన గతనిర్ణయాల్ని, ఇప్పటి తెలివితేటలతో విశ్లేషించటమే. ఈ విధంగా ఒకదాని తరువాత మరొక శరీరంలోకి ప్రవేశిస్తారు.

మీలో తీరని కోరికలు తక్కువగా ఉంటే మీ ప్రాణశరీరం తేలికగా ఉంటుంది. అప్పుడు శరీరాన్ని వదలటం సులభం. అదే విధంగా అపరాధభావం తక్కువగా ఉంటే మానసికశరీరాన్ని సులభంగా వదలవచ్చు. మరొక విషయం, కోరికలు, అపరాధభావం, బాధ అనేవి తక్కువ తీవ్రవతతో ఉంటే మరణం తక్కువ బాధతో సులభంగా జరగటమే కాదు, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అంతే కాదు, పెద్ద వయస్సులో ఆహ్లాదంగా ఉండగలుగుతారు. ఇదే వానప్రస్థాశ్రమం అంటే (వానప్రస్థాశ్రమం అంటే వేదసంస్కృతిలో జీవితంలో మూడవ దశ. భార్యాభర్తలు ఆధ్యాత్మికకార్యక్రమాలలో, అంతిమసత్యాన్వేషణలో ఉండటమే ఈ దశ). జీవితం చివరి దశలో పరిపూర్ణతతో జీవించగలగటం వానప్రస్థజీవితం ఇచ్చే గొప్ప బహుమానం. మానసికశరీరంలో మనం జీవితం అంతా పోగుచేసుకున్న అపరాధ భావం ముందుకి వస్తుంది. ఆ తరువాత భావావేశాల శరీరం ఇక్కడ మనం పడిన బాధలు, వ్యథలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క రకమైన సంస్కారాలు ఉంటాయి. ఈ శరీరాల గుండా ప్రయాణించటమే నరకం. అంతే కాని మరెక్కడో నరకం అనేది లేదు. స్వర్గం, నరకం ఏదో కొన్ని స్థలాలు కాదు. అవి మన మానసిక స్థితి.

మొదటి నాలుగు శరీరాలు శారీరక – మానసికవ్యవస్థకి సంబంధించినవి. అందులో కోరికలు, అపరాధభావం, బాధలకి సంబంధించిన సంస్కారాలు ఉంటాయి. ఐదవ శరీరం గతం నిధి. ఆరవది సంతోషకరమైన అనుభవాలకి సంబంధించింది. ఏడవది బాధలు, సంతోషాలకి అతీతమైంది. అదే అంతిమచేతనస్థితి. అర్ధం చేసుకోండి, సంతోషంతో అనుబంధాన్ని పెంచుకుంటే అది కూడా తిరిగి జననమరణచుక్రంలోకి తీసుకువస్తుంది. సంతోషాన్ని ఇచ్చిన సంఘటనల్ని మళ్ళా మళ్ళా తిరిగి అనుభవించాలి అనే కోరిక మరలా జన్మ ఎత్తేలా చేస్తుంది.

సంతోషానికి, పరమానందానికి చాలా తేడా ఉన్నది. సంతోషం బయటి ప్రపంచపు వస్తువుల నుంచి, ఏదో ఒక కారణంతో వస్తుంది. ఉదాహరణకి మీకు ఇష్టమైన తీపి తింటే సంతోషం కలుగుతుంది. మీరు ఏమనుకుంటారు, ఆ తీపి మీ సంతోషానికి కారణం అనుకుంటారు. కాని ఒకసారి దాని గురించి ఆలోచించండి. నిజంగా ఆ తీపి మీ సంతోషానికి కారణమైయితే అది ప్రతిసారి సంతోషాన్ని ఇవ్వాలి. కాని అది అలా ఇవ్వదు. ఆ తీపిని మరీ మరీ బలవంతంగా పెడితే మీరు అక్కడి నుంచి పారిపోతారు.

సంతోషం అనేది మనస్సు సృష్టించే ఒక అశాశ్వతస్థితి. పరమానందం, మనలోని ఏడవ శరీరం నిజమైంది. కారణం లేని అనంతమైన ఆనందం మన లోపల ఉంది. అది మంగళకరమైన, అప్రయత్నంగా ప్రవహించే శక్తి వాహిని. ఏ కారణం లేకుండా నిరంతరం మనలో పొంగి పని చేస్తుంది. కాని మీరు మీ సంతోషానికి తీపి కారణం అని అనుకుంటారు. కొద్ది సేపు మీ ఆనందమయకోశం దగ్గరకి వస్తారు. అదే మీ సంతోషానికి కారణం. ఈ శరీరాలు శుభ్రంగా ఉంటే, తేలికగా ఉండి, జీవాత్మ సులభంగా ప్రయాణించి శరీరాన్ని వదలగలుగుతుంది. పండిన అరటి పండు నుంచి తొక్కని సులభంగా తీయవచ్చు. అదే విధంగా జీవాత్మ శరీరాన్ని సులభంగా వదలగలుగుతుంది.

మరణం ప్రతి రోజూ సంభవిస్తూ ఉంటుంది

ఈ ఏడు శరీరాలలో, మొదటి నాలుగు, భౌతిక, ప్రాణ, మానసిక, భావాత్మకశరీరాలు మీరు నిద్ర పోయినప్పుడు కారణ శరీరంలో కలిసిపోతాయి. కారణశరీరంలోని గాఢమైన నిద్ర మిమ్మల్ని నూతనంగా చేస్తుంది. మీరు ఐదవది దాటనంత వరకూ మరణం రోజూ జరుగుతుంది. మీరు ప్రతి రోజూ నిద్రపోయినప్పుడు ఇదే జరుగుతుంది. ఎప్పుడెతే ఆత్మ ఐదవ శరీరాన్ని దాటి ఆరవ శరీరంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు మరణ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఒక వేళ జీవాత్మ మరొక శరీరాన్ని తీసుకునే అవసరం లేనప్పుడు ఇంకా తీరవలసిన కోరికలు లేనప్పుడు అది ఏడవ శరీరం అయిన నిర్వాణశరీరంలోకి చేరుతుంది. అదే జ్ఞానోదయం. జీవాత్మ వెనకకి వచ్చి మరొక శరీరాన్ని తీసుకుంటే అది మరణం.

జాగ్రత్ ప్రపంచం Vs స్వప్న ప్రపంచం

మరొక విషయం, మీరు కలల స్థితిలోకి వెళ్ళి కల కంటున్నప్పుడు మీరు నివసించే ప్రపంచం నలుపు – తెలుపుల చిత్రంలా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు కలలో ఉన్నారు కాబట్టి. మీరు మేలుకొని ఉన్నప్పటి ప్రపంచాన్ని మరచిపోతారు. స్వప్న ప్రపంచం నిజమనిపిస్తుంది. అది రంగురంగులుగా కనిపిస్తుంది. మీరు కలలోంచి బయటకి వస్తే, ఈ ప్రపంచం నాలుగు డైమెన్సన్స్‌లో 4డి లో కనిపిస్తుంది. మీరు భౌతికశరీరంలో ఉంటూ మేలుకుని ఉన్న స్థితిలో ఉంటే ఈ ప్రపంచం రంగురంగులుగా 4డిలో కనిపిస్తుంది. కలలో ఉన్నప్పుడు ఆ ప్రపంచం 4డిలో కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు స్వప్న ప్రపంచం 4డిలా, బయటి ప్రపంచం నలుపు – తెలుపుల్లా ఉంటుంది.

మీరు భౌతికశరీరం నుంచి ప్రాణశరీరంలోకి వెళ్ళినప్పుడు, మరణసమయంలో, ఈ వస్తుప్రపంచం, ఈ భౌతికప్రపంచం నలుపు – తెలుపులలో కనిపిస్తుంది. మీరు సాధించినవి, మీ గర్వం, మీ కీర్తి ప్రతిష్ఠలు కనిపిస్తాయి. అవి నలుపు – తెలుపులలో కనిపిస్తాయి.

ఈ విధంగా ఎందుకు జరుగుతుందో మీకు వివరిస్తాను. మీరు జీవించి ఉన్నప్పుడు మీరు అంటే, మీ వ్యక్తిత్వం అంటే ఏవో డబ్బు, కీర్తి ప్రతిష్ఠలు, మానవసంబంధాలు, గర్వం, స్నేహితులు, శ్రేయోభిలాషులు – ఇలా కొన్ని స్తంభాల మీద మీరు అనేదాన్ని నిర్మించుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని 'మీరు ఎవరు?' అని అడిగితే మీరు ఏమని జవాబు ఇస్తారు. నేను ఇంజినీరుని, నేను డాక్టరుని, నేను నాలుగు ఎకరాలకి అధిపతిని, నేను ఆమె భర్తని, నేను వాళ్ళ కూతురిని – ఇలా ఉంటాయి మీ సమాధానాలు. మన వ్యక్తిత్వాన్ని ఏవో కొన్ని స్తంభాల మీద నిర్మించుకుంటాం.

మీరు భౌతికశరీరం నుంచి వెళ్ళేటప్పుడు ఈ స్తంభాలన్నీ కదిలిపోతాయి. మీరు మీ చెక్కుల మీద సంతకాలు చేయలేరు. మీ సంతకాన్ని ఎవరూ ఒప్పుకోరు. మీ బాంక్ బాలెన్స్‌తో మీకు సంబంధం ఉండదు. మీ కారు ఏ మాత్రం మీకు ఉపయోగపడదు. మహా అయితే అంబులెన్స్ ఉపయోగపడుతుంది, అంతే.

మీ ఇల్లంతా మీ బంధువుల రోదనలతో నిండి ఉంటుంది. కానీ మీ ఇల్లు కాని, మీ బంధువులు కాని, అప్పుడు మీకు ఉపయోగపడరు. వాళ్ళు ఎవరూ మీతో రారు. మరణం అనే పాయింట్ దాటి రాలేరు కూడా. మీతో వచ్చేది కేవలం చేతనస్థితి యొక్క క్షణం పాటు అయినా జరిగిన అనుభవం మాత్రమే. మీ ఆధారాలు, మీ పునాది పూర్తిగా కదిలిపోయాక ఇక మీరు అనేది ఏదీ ఉండదు. అప్పుడు మీరు పట్టుకొని వేలాడటానికి ఏమీ ఉండదు.

ఈ ఒక్క విషయం అర్ధం చేసుకోండి. అకస్మాత్తుగా వ్యాపారంలో పెద్ద దెబ్బ తగిలిందని తెలిసిందనుకోండి, మనం మొత్తం కదిలిపోతాం. ఆ బాధ కేవలం ఏదో ఒక భాగంలో కాదు, శరీరవ్యవస్థ మొత్తం ఉంటుంది. మన ఉనికి ఆ బాధలో నలిగిపోతుంది. కాబట్టి మన నుంచి ఏదైనా వెళ్ళిపోతే, మనం మొత్తం బాధపడతాం. మనం భౌతిక శరీరం నుంచి వెళ్ళినప్పుడు శరీరం మొత్తం బాధపడుతుంది. మనం మన పునాది అనుకున్నది పూర్తిగా కదిలిపోతుంది.

ప్రస్తుతం ఈ ప్రపంచం 4డిలో రంగురంగులుగా కనిపిస్తుంది. ఆధ్యాత్మికత, ధ్యానం, అంతరంగుప్రపంచం – ఇవన్నీ నలుపు –తెలుపుల్లో కనిపిస్తాయి. నేను ధ్యానం చేయమంటే ఏమంటారు! స్వామీజీ! ధ్యానం చేయటానికి మాకు టైం లేదు అంటారు. నేను చాలా బిజీ ఇంకొక రెండుమూడు సంవత్సరాల తరువాత ఆలోచిస్తాను, అంటారు. స్పష్టంగా తెలుసుకోండి, ధ్యానం చేయటానికి నాకు టైం లేదు అనవద్దు. మీకు స్పష్టతతో ఉండండి. ఇప్పుడు ధ్యానం నా జీవితానికి ముఖ్యం కాదు, అని చెప్పండి. నా జీవితానికి ధ్యానం అంత ముఖ్యం అని అనుకోవటం లేదు అని చెప్పండి. అది నిజాయితీ ఉన్న సమాధానం. నాకు టైం లేదు అంటున్నారు అంటే, మిమ్మల్ని మీరు మూర్ఖులు చేసుకోవటమే. ఎవరికైనా చేతిలో ఉండేది 24 గంటలు మాత్రమే. ఆ సమయంలో వారు ఏమి చేయాలి అంటే ఆ పనులు చేయగలరు. ధ్యానం చేసేవారికి ఉద్యోగం లేదు, వేరే పనీ, పాటూ లేదు అనుకోవద్దు. ఇది కేవలం ప్రాధాన్యమీయటం. మీ జీవితానికి ఏది ముఖ్యం అని నిర్ణయించుకోవటం. మీకు ఆధ్యాత్మికత, ధ్యానం నలుపు – తెలుపుల్లో కనిపించితే, దాని వైపు మీ శక్తిని పోనీయరు. అంతే.

మీరు భౌతికశరీరం నుంచి వెళ్ళేటప్పుడు జరిగేది ఇదే, మీరు జీవించి ఉన్నప్పుడు ఏది 4డిలో నిజం అనిపించిందో, ఆ ప్రపంచం మాయమౌతుంది. అది నలుపు – తెలుపుల్తో కనిపిస్తుంది. మిమ్మల్ని ఆకర్షించినవి ఏం మీకు ఉండవు. అందుకే మరణం అంటే బాధ కలిగేది. మీకు జీవితంలో కనీసం ఒకసారైనా అంతిమసత్యానుభవం కేవలం ఒక్క క్షణం పాటు జరిగినా మీరు మరణంలోకి తెలుసుకునే తత్వంతో, చేతనస్థితిలోకి వెళ్ళవచ్చు.

చూడండి, ప్రస్తుతం మనం రెండు డైమెన్షన్స్‌లో ఉన్నాం. బయటి ప్రపంచం, ఆధ్యాత్మికప్రపంచం. మనం ఇప్పుడు నిర్మించుకున్న స్తంభాలు అన్నీ బయటి ప్రపంచం ఆధారంగా నిర్మించినవే, ఒక్క స్తంభం కూడా మన అంతరంగుప్రపంచానికి సంబంధించి ఉండదు. మన వ్యక్తిత్వం మొత్తం బయటి ప్రపంచం నుంచి, సమాజం ఏమి చెప్పిందో దాని నుంచి తయారు చేసుకున్నాం. అందరూ మనని గొప్పవారు అంటే, అవును గొప్పవారం అని నమ్ముతాం. నీవు పనికిరానివాడివి అంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం, కుంగిపోతాం.

ఇలా ఎందుకు జరుగుతుందంటే – మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న ఒక్క స్త్రంభం కూడా ఆధ్యాత్మికత ఆధారంగా ఉండవు. మొత్తం నిర్మాణమంతా బయటి ప్రపంచం నుంచే ఉంటుంది. అందుకే ఎవరైనా ఈ సంభాల్ని కుదిపితే మనం బాధపడతాం. మనం కనీసం ఒక సంభాన్ని అయినా చేతనస్థితితో నిర్మిస్తే, మనం దాని ఆధారంగా బాధలు కలిగినప్పుడు ఎటువంటి బాధాలేకుండా తిన్నగా నిలబడగలుగుతాం, కుంగిపోం.

మరొక విషయం. ఈ బయటి ప్రపంచస్థంభాలు మన నియంత్రణలో ఉండవు. ఎవరైనా ఈ సంభాల్ని సులభంగా కుదిపేయగలరు. ఒక చిన్న పిల్లవాడైనా సరే, ఒక అబ్బాయి మీ దగ్గరకి వచ్చి నీవు మూర్ఖుడివి అంటే చాలు, మీరు కదిలిపోతారు. అవును కదా! ఆ అబ్బాయి

Part 8: Living Enlightenment

మీతో ఏదో సరదాగా నేను నేర్చుకున్న కొత్తమాటల్ని ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పినా మనం కదిలిపోతాం. కాబట్టి బయటి ప్రపంచానికి సంబంధించిన సంభాలు ఎంత బలహీనమైనవో అర్థం చేసుకోండి.

శ్రీకృష్ణభగవానుని సందేశమైన భగవద్గీతలో అదే ఉంటుంది. మీ మరణసమయంలో ఏదైతే మీ మనస్సులో నిలబడి ఉంటుందో అదే మీ తరువాత జన్మని లేదా మీ జ్ఞానోదయస్థితిని నిర్ణయిస్తుంది. మనకి కనీసం ఒక్క స్తంభమైనా చేతనస్థితి మీద నిర్మించబడి ఉంటే, మరణసమయంలో మనం బాధపడం. అప్పుడు మిగతా సంభాలు నలుపు – తెలుపుగా మారతాయి. కానీ ఈ సంభం మాత్రం రంగురంగులతో 4డిలో ఉంటుంది. ఇప్పుడు మనని తీసుకువెళ్ళ గల సంభం ఒకటి కూడా లేదు. మన వ్యక్తిత్వం మొత్తం బయటి ప్రపంచం మీద మాత్రమే ఆధారపడి ఉంది. అందుకే ఒక పుట్ బాల్‌లా అందరూ మనని ఈ మూల నుంచి ఆ మూలకి తన్నగలుగుతున్నారు. ఎవరైనా మనని ఒక్క మాటతో కుంగిపోయేలా చేస్తున్నారు. ఎవరైనా నీవు పిచ్చివాడివంటే మనం వారి మీద అరిచి ఆ విషయం నిరూపిస్తాం. దయచేసి అర్ధం చేసుకోండి, మనం మన అంతరంగం అధారంగా కనీసం ఒక సంభాన్ని అయినా నిర్మించుకోగలిగితే అది మరణసమయంలో 4డిలో మెరుస్తూ మనని మన శరీరం నుంచి అందంగా దాటిస్తుంది.

మరణించే కళ

జెన్ బౌద్ధమతంలో ఒక మంచి మాట ఉన్నది, 'మరణించే కళ తెలియటం సత్యం. అదే మనం జీవితంలో నేర్చుకోగల అంతిమ జ్ఞానం.'

ఒక చిన్న జెన్ కథ : ఒక జ్ఞానోదయమైన గురువుగారు అకస్మాత్తుగా తాను మర్నాడు ఉదయం 6గం.లకు మరణిస్తున్నాను అని శిష్యులకి చెబుతాడు. జ్ఞానోదయమైన యోగీశ్వరులకి వారి మరణం గురించి తెలుసు. వారు ఆ విషయం ముందే చెప్పగలరు. ఆయన మర్నాడు ఉదయం 6గం.లకు మరణిస్తున్నట్లు ప్రకటిస్తారు. అది విన్న ఆయన శిష్యులు ఆయనతో, 'గురుదేవా! మీరు మరొక 2 లేదా మూడు గంటలు ఉండండి. ఉదయాన్నే అయితే బాగా చలిగా ఉంటుంది. మీరు మరి కొన్ని గంటలు ఆగవచ్చు కదా! అప్పుడు మేము చేయవలసిన కార్యక్రమాల్ని సజావుగా చేయగలం.' అంటారు. ఆయన సరే అని రేపు మధ్యాహ్నం 12 గంటలకి మరణిస్తాను అని చెప్పి, సరిగ్గా 12 గంటలకి అందరికీ చెప్పి ఆయన శరీరాన్ని వదులుతారు.

చరిత్రలో జరిగిన ఒక సంఘటనని చెబుతాను.

ఒక గ్రామం ఉండేది. ప్రస్తుతం ఆ గ్రామం లేదు. వారు ఆ గ్రామాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. ఆ గ్రామం అంతా కలిపి వంద మంది జనాభా ఉంటారు కాని వారంతా గొప్ప యోగశాస్త్రప్రవీణులు, ఆధ్యాత్మికులు. వారు ధ్యానంలో, ప్రాచీన ఆధ్యాత్మికతలో ప్రవీణులు. ఆ గ్రామంలో ఎప్పుడూ, ఎవరూ అనారోగ్యంతో బాధ పడలేదట. వారు ఎవరినైనా బాధ పెట్టినట్లు కల కన్నా ఉదయాన్నే ఆ వ్యక్తిని కలసి క్షమార్పణ కోరేవారట. మీ లోపల సూక్ష్మస్తాయిలో పగ అనేది ఉన్నప్పుడే ఎక్కడో అచేతనసితిలోనెనా వారి మీద కక్ష ఉంటేనే ఆ విధంగా కల వస్తుంది. అందుకే ఆ విధంగా కల వచ్చినా వెళ్ళి వారిని క్షమాపణ కోరేవారు. వారు చాలా పరిణతిపొందిన ఆధ్యాత్మికులు. వారి అంతరంగ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. బ్రిటిషువారు ఆ గ్రామాన్ని స్వాధీనపరచుకోవాలి అని చూసినప్పుడు, ఆ గ్రామస్తులు తమ స్వేచ్ఛని పోగొట్టుకోవటానికి ఇష్టపడరు. అప్పుడు బ్రిటిషు సైనికులు వారితో, 'మీరు అధీనం కాకపోతే మిమ్మల్ని చంపేస్తాం.' అని బెదిరిస్తారు.

మీరు ఆశ్చర్యపోతారు, వారు ఏమన్నారో తెలుసా! 'మీరు మమ్మల్ని చంపనవసరం లేదు. మీరు ఆ విషయం పట్టించుకోవద్దు. ఎలా మరణించాలో మాకు తెలుసు' అని అంటారు. బ్రిటీషు సైనికులు వారు ఆత్మహత్య చేసుకుంటారేమో అని అనుకుంటారు.

ఆ గ్రామస్తులంతా ఒక చోట గుమిగూడి, బ్రిటిషు సైనికులు చూస్తుండగా, వారి కళ్ల ముందు ఒక మంత్రం జపించి కిందపడి మరణిస్తారు. వారు వారి శరీరాలని నేల పైకి వదిలి మరణిస్తారు. ఈ సంఘటనని బ్రిటిషు వారు ఒక రిపోర్టులా రాసి దాచి వుంచారు. ఆ రిపోర్టులో వారు ఈ విధంగా రాసారు, 'మొదటిసారి అమాయక ప్రజల్ని చంపాం అనే అపరాధభావం మాలో కలిగింది. మేం చంపటానికి శిక్షణ పొందాం. ఎంతో మందిని చంపినప్పుడు కూడా మేం ఈ విధంగా తప్పు చేసామే అని బాధ పడలేదు. కాని ఇప్పుడు ఇక్కడ మాలో ఏదో అపరాధభావం కలిగింది. గొప్పవారైన అమాయకుల మరణానికి కారణమయ్యామే అని చాలా బాధపడ్డాం' అని వారు ఆ రిపోర్టులో రాసారు.

కొత్తవానికి స్థలం (అవకాశం)

వేద సంప్రదాయంలో శివుడు లయకారుడు. ఆయనని శుభకరుడు, మంగళకరుడు అంటారు. 'శివ' అంటే కారణం లేని మంగళత్వం. సంస్కృతంలో నాశనం అనే మాటకి వాడే పదం సంహార. సంహార అంటే నాశనం అని అర్థం కాదు. దాని అర్థం కొత్తదనం పొందటం. మనం నాశనం అనే అర్థానికి వాడే పదం అసలు అర్థం కొత్తవి జరగటానికి అనువైన అవకాశాన్ని కల్పించటం అనే అర్థంతో చూడవచ్చు. నాశనం అనే దాన్ని మరొక కోణం నుంచి చూస్తే అది కొత్తవి, మరింత మెరుగైనవి జరిగే అవకాశాన్ని కలిగించటం అని అర్థమౌతుంది. మీ శరీరానికి ఏదైనా ఒక వ్యాధి కలిగితే అది మీకు కొత్త శరీరం ఏర్పడటానికి సహాయం చేస్తుంది అని, మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు అని అర్థం. మీరు తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. చూడండి, తిరిగి ప్రారంభించటం ద్వారా మనలోని చాలా గాయాల్ని మాన్పవచ్చు. నిద్ర పోయి లేవటం ద్వారా చాలా గాయాల్ని మానువచ్చు. మీరు నిద్ర మేలుకొనేసరికి వాటిని మరిచిపోతారు.

మనలోని కొన్ని గాయాలు నిద్రలో పోవు. ఆ పాయింట్ దగ్గర మీరు నిర్ణయం తీసుకోవాలి, 'నేను స్వచ్చతతో తిరిగి మొత్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను' అని. మీ శరీరానికి ఏదైనా వ్యాధి ఉన్నా మీరు తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. వేద సంస్కృతి ప్రకారం ఏ అనుభవమూ వ్యర్థా కాదు, మీరు నిరంతరం, ఒక క్రమం నుంచి మరొక క్రమంలోకి వెళ్ళేటప్పుడు విస్తృతం అవుతుంటారు. మీరు నేర్చుకుంటూ ఉంటారు. మరింత అభివృద్ధి చెందుతారు. మీరు ఈ విధంగా ఆలోచించగలిగితే మరణం కూడా మంగళకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆ తరువాత దశకి వెళతారు కాబట్టి. ఎప్పుడైతే ఆ తరువాత దశ గురించి మీకు స్పష్టంగా తెలియదో అప్పుడే మరణం అంటే భయపడతారు.

వర్తమానంలో ఉండండి, మరణాన్ని జయించండి

ఒక విషయం అర్థం చేసుకోండి. భవిష్యత్తు గతంగా మారటమే వర్తమానం. వర్తమానం అనే పాయింట్ దగ్గర భవిష్యత్తు మెల్లగా భూతకాలంగా మారుతుంది. వర్తమానం అనేది శూన్యత్వాన్ని సాధించటానికి గల అవకాశం.

మీరు ఈ క్రమంలో వర్తమానంలో ఉండగలిగితే, భవిష్యత్తు మీ లోపలికి వచ్చి గతంలా మారి బయటకి వెళుతూ శక్తిని మీలో నింపటాన్ని మీరు స్పష్టంగా చూడగలరు. ప్రతిక్షణం మీరు శక్తితో ఉప్పొంగుతూ ఉంటారు. మీరు భవిష్యత్తులో చిక్కుకుపోతే ఊహలు, కల్పనలలో ఉంటూ, గాలిలో మేడలు కడుతూ ఉంటారు. నిజమైన ప్రపంచంలో బ్రతకటానికి శక్తి ఉండదు. మీరు భవిష్యత్తులో చిక్కుకొని ఉన్నంత వరకూ అభద్రతాభావంతో, భయంతో ఉంటారు.

మీరు గతంలో చిక్కుకొని ఉంటే, మీకు విషయాలన్నీ అశుభంగా కనిపిస్తాయి. జీవితం నిస్సారంగా, డల్‌గా, జీవం లేనిదానిలా అనిపిస్తుంది. మీరు రాయిలా కదలలేని స్థితిలో మీలో జీవం, శక్తి లేని విధంగా తయారవుతారు. మీరు వర్తమానంలో స్థిరపడి ఉన్నప్పుడు, ఏమి జరిగినా మంగళకరంలా అనిపిస్తుంది. మీరు శివునిలా కొత్తవాటి సృష్టికి కారణం అవుతారు. నిరంతరం కొత్త విషయాలు జరిగేందుకు వీలుగా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయగలుగుతారు.

మీకు భయం ఉండదు. ఎప్పుడైతే మీలో భయం అన్నది పోతుందో, అప్పుడు మీ చుట్టూ జరిగే ప్రతిదీ మంగళకరంగా, శుభకరంగా అనిపిస్తుంది. మీరు ప్రవహిస్తున్న నదిలా, ప్రవహిస్తున్న శక్తిలా ఉంటారు, మీరు కారణం లేని మంగళత్యాన్ని ప్రసరింపచేస్తుంటారు. మీరు వర్తమానంలో ఉన్నప్పుడు మీ నుంచి భవిష్యత్తు, గతంలా మారి బయటికి వస్తుంది. మీరు ఖాళీ వెదురులా, కాలం చేత ప్రభావితం కాకుండా మరణానికి అతీతంగా ఉంటారు.

మరణాన్ని గెలవటం అనేది చాలా చిన్న విషయం. మీరు కేవలం వర్తమానంలో ఉండి, కాలాన్ని మీ నుంచి ప్రవహించనీయండి. కాలం మీలోకి చొచ్చుకుపోయే విధంగా ఉండండి. కాలం మీ ద్వారా తన పనిని తాను చేసుకోనీయండి. భవిష్యత్తు మీలోకి వచ్చినప్పుడు అత్యాశతో దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నించకండి. దాన్ని మీ నుంచి వెళ్ళనీయండి. దాన్ని గతంలా మారనీయండి. దాని కార్యక్రమం దానికి ఉంటుంది, అలా ఉండనీయండి. మీరు వర్తమానంలో ఉంటే మీరు శాశ్వతులుగా జీవించగలరు. మీలో ప్రతి రోజూ శక్తి పెరుగుతూ ఉంటుంది. ప్రతీక్షణం మీ జీవితం విస్తృతం అవుతూ ఉంటుంది. మీ తర్కానికి అతీతంగా విస్తృతం అవుతుంది. అది అలా జరుగుతూనే ఉంటుంది.

సంపూర్ణాంగీకారం

మీ నుంచి దేన్నైతే తీసుకువెళ్ళాలో దాన్ని తీసేయటమైంది. మీకు ఏమైతే కలపాలో మీకు ఇవ్వాలో అవన్నీ కలపబడ్డాయి. నిరంతరం మంగళత్వం మీ ద్వారా వెల్లడి అవుతున్నది. మీ మనస్సు ఎప్పుడైతే దానికి 'కాదు' అని చెబుతుందో, అదే అమంగళం, అశుభం. మీ మనస్సు మీకు చెప్పే రక్షణ పద్ధతి అన్నింటి కంటే అమంగళమైంది. మీ జీవితంలోకి చూడండి దేనికైనా ఎప్పుడైనా సంపూర్ణంగా 'సరే' అని మీరు అన్నారా? కనీసం ఒకసారైనా అన్నారా? జీవితానికి ఒకసారైన సంపూర్ణమైన 'సరే' అనటమే జ్ఞానోదయం అంటే. ఇప్పుడు నిర్ణయించుకోండి, జీవితానికి సంపూర్ణమైన 'సరే' 'ఔను' అని అంటాను అని, అప్పుడు మీ మనస్సులోకి అనేకమైన అభద్రతాభావాలు వస్తాయి. ఏమైనా జరిగితే ఎలా? తరువాత అరగంట సరే అనటానికి నిర్ణయించుకోండి. మీ మనస్సు 'అబ్బే కుదరదు' అని చెప్పవచ్చు. అలా అయితే నా జీవితం ఏమైపోతుందో అనుకోవచ్చు. నేను చనిపోతానేమో, నాకు భోజనం దొరకదేమో ఇవన్నీ మీ మనస్సు చేసే ట్రిక్స్. మిమ్మల్ని తన నియంత్రణలో ఉంచటానికి మీ అహం నియంత్రణలో ఉంచటానికి మీ మనస్సు ఆడే ఆట. మీలోని అన్ని సమస్యలకి మూలం ఇదే.

ఎప్పుడు కాదు అని చెప్పే మీ మనస్సుని బలంగా, దృఢంగా తయారు చేస్తే, అప్పుడు అది ప్రతి దానికి, ప్రతి విషయానికి 'కాదు' అనే చెబుతుంది. క్రమంగా కాదు అనేది మీ లోపల లోతుగా నాటుకుపోతుంది. మీ శ్వాసలో నాటుకుపోతుంది. కాదు అనేది మీ శక్తి ప్రవాహంలో కలవటమే కాన్సర్‌కి మొదటి కారణం. జీవితంలా దాని గుండా కూడా మీరు సంపూర్ణమైన అంగీకార భావంతో వెళితే, మరణం కూడా ఉన్నతస్థితికి మిమ్మల్ని తీసుకువెళ్ళగలుగుతుంది. లేదు కాదుతో ఉంటే మిమ్మల్ని అత్యల్పస్థాయికి తీసుకువెళుతుంది. ఉన్నతస్థితికి, ఉన్నతమైన చేతనస్థితికి వెళ్ళాలా, అల్పస్థాయికి వెళ్ళాలా అనే నిర్ణయం మీరు చెప్పే ఔను, కాదు అనే వాటి మీద ఆధారపడి ఉంటుంది.

మరణం ఒక ఉత్సవం

మంగళకర మరణం

జరిగిన సంఘటన: పరమహంస యోగానంద 1920లో అమెరికాకి వెళ్ళారు. ఆయన గొప్ప యోగీశ్వరుడు. ఆయన శరీరాన్ని ఏ విధంగా వదిలారన్నది చాలా ఆసక్తిగా ఉంటుంది. చివరి నిముషం వరకూ ఆయన తన కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రవచనాలు ఇస్తూనే ఉన్నారు. ఒక రోజు భారత్ రాయబారి గౌరవార్థం ఇచ్చిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగాన్ని ముగించి కుర్చీలో శరీరాన్ని వదిలారు. ఇరవై రోజుల తరువాత కూడా ఆయన శరీరం పాడవలేదు. అన్ని రోజులుగా ఆయన శరీరం నుంచి ఎటువంటి దుర్ధంధమూ రాలేదు. ఆయన జీవితచరిత్రలో ఈ సంఘటన గురించి చక్కగా వివరించారు. అది ఒక అందమైన అనుభవం. ఆయన మరణం ఆయనకి మంగళకరమైంది.

నిజమే ఒక కల

మీరు అంటే కళ్లు కాదు. అవి ఒక పనిముట్టు లాంటివి. చాలాసార్లు మీ కళ్లు తెరిచి ఉంటాయి. కాని మీరు చూడరు. ఆ చూసేది మీలో ముద్ర పడదు. మీరు కళ్ల ద్వారా చూస్తున్నారు అని గుర్తుంచుకోండి. మీరు కళ్ళ ద్వారా చూస్తున్నాను అనుకోగానే మీరు ప్రతి దాన్నీ గమనించగలరు. రెండు రంధ్రాలు ఉన్న కళ్ళు మీరు కాదు. మీరు కళ్ళ దారా చూస్తున్నారు. మీరు కళ్ళు అని అనుకుంటే అహంలో చిక్కుకుపోతారు. మీ కలలో చూసేదాని మీద మీ ఏకాగ్రత ఉన్నంత వరకూ మీరు కలని పొడిగిస్తారు. ఎప్పుడైతే మీ ఏకాగ్రశ మీ వైపు తిరుగుతుందో, మీరు మేలుకుంటారు.

మీరు కళ్ళ కంటే అతీతమైనవారు అని ఎప్పుడు తెలుసుకుంటారో, అప్పుడు మీ ఏకాగ్రత మీ మీదకి మళ్ళుతుంది. అప్పుడు మీరు ఈ ప్రపంచం కూడా మీ కలలోని పదార్ధంతోనే తయారైంది అని తెలుసుకుంటారు. ఎంత కాలమైతే మీరు చూస్తున్నారు అనుకుంటారో, అంత వరకూ మీ ఏకాగ్రతని చూసే దాని మీద ఉంచుతారు. దీన్నే అహం అంటాను. ఎప్పుడైతే మీరు దీన్ని ఆపి, మీరు కళ్ళ ద్వారా చూస్తున్నాను అని తెలుసుకుంటారో అప్పుడు మీ ఏకాగ్రశ మీ మీద ఉంటుంది. దాన్నే నేను అమాయకత్వం అంటాను. అమాయకత్వం అంటే ప్రపంచంలో మీరు చూస్తున్నది, కలలో చేసిన పదార్థంతోనే చేయబడింది అని తెలుసుకోగలగటం.

దీంట్లో ఈ విధంగా ఉంటుంది, ముందుగా మీరు కల కంటున్నారు అనుకోండి. తరువాత ఆ కలని మార్చగల శక్తి మీకు ఉంది. అది కల మాత్రమే దాన్ని మార్చవలసిన అవసరం లేదు అని నిర్ణయించుకోగల బుద్ధి (వివేకం) ఉన్నది. మీరు తెలుసుకోవలసిన ఒక ముఖ్యసత్యం మీ కలలు, బయటి ప్రపంచం రెండూ ఒకటే. ఒకే పదార్ధంతో చేయబడ్డాయి. మీరు కలలు మామూలే అనుకుంటే ఈ ప్రపంచం కూడా మామూలే. మీరు ఈ ప్రపంచం ఒక విధమైన సత్యం అని అనుకుంటే మీ కలలు కూడా సత్యమే. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే, అది మీ కలల్ని నిజం చేయగల శక్తిని ఇస్తుంది. అంతే కాదు, మీరు దేన్నైతే, నిజం అనుకుంటున్నారో అది మరొక కల అని అర్థం చేసుకునే బుద్ధిని (వివేకాన్ని) ఇస్తుంది.

జీవితం, మరణం Vs మేలుకొని ఉన్న, నిద్ర పోయే సితి

గాలి – ప్రాణం : మీ జీవితాన్ని మార్చగల బలమైన సత్యం గురించి తెలుసుకోవాలంటే మీరు ఒక విషయాన్ని అర్ధం చేసుకోవాలి. అది మీ కలల ప్రపంచం. మీ బయటి ప్రపంచం ఏ పదార్ధంతో తయారైంది అనే విషయం. అదే విధంగా ప్రాణం అనేది మనం జీవించి ఉండేలా చేస్తుంది. దాని గురించి కూడా తెలుసుకోవాలి.

మీరు లోపలికి తీసుకునే గాలి, ప్రాణాన్ని తీసుకువచ్చే ఒక వాహనం మాత్రమే. ప్రాణం లేదా ప్రాణ అంటే జీవశక్తి. అది ఒక శక్తి. ఒక ఉదాహరణ, మీ ఆవరణలోకి లారీ వచ్చి సామాను దించి ఎలా వెళుతుందో, గాలి ప్రాణాన్ని తీసుకువచ్చి మీ లోపల ఉంచి వెళుతుంది. ఆ విధంగా గాలి నిరంతరం ప్రాణాన్ని లోపలికి తీసుకువెళ్ళి అక్కడ వదిలి బయటకి వస్తుంది. మనం నిరంతరం గాలి ద్వారా ప్రాణాన్ని తీసుకుంటున్నాం. మీరు కుంభమేళాకి వెళితే అక్కడ యోగులు తలలని భూమిలో పూడ్సిపెట్టి ఉండటాన్ని చూడవచ్చు. ఆ విధంగా వారు మూడు రోజులు ఉంటారు. వారు ఆ విధంగా ఎలా చేయగలరు అంటే వారికి ప్రాణాన్ని తిన్నగా విశ్వశక్తి నుంచి తీసుకోవటం తెలుసు. వారు ప్రాణాన్ని గాలి ద్వారా తీసుకోనవసరం లేదు. మీరు గాలి ద్వారా ప్రాణాన్ని తీసుకున్నంత కాలం, మీరు ముక్కు ద్వారా శ్రాస తీసుకోవాలి. కాని మీరు ప్రాణాన్ని తిన్నగా విశ్వశక్తి నుంచి తీసుకోగలిగినప్పుడు, మీరు శ్వాసించనవసరం లేదు. మీ శరీరం విశ్వం నుంచి ప్రాణాన్ని గ్రహించగలుగుతుంది.

జీవించటం, మరణించటం ప్రాణం కదలికల మీద ఆధారపడి ఉంటాయి

మరొక విషయం – మీరు లోపలికి తీసుకునే గాలి ప్రాణాన్ని తీసుకువచ్చి తిరిగి ఖాళీగా వెళుతున్నంత కాలం మీ జీవితం బలపడుతుంది. ఆ విధంగా కాకుండా లోపలికి వచ్చే శ్వాస తక్కువ ప్రాణంతో వచ్చి బయటకి వెళ్ళే శ్వాస ఎక్కువ ప్రాణంతో వెళుతుంటే, మరణం దగ్గరైంది అని అర్థం. జీవశక్తి మరణం వైపు వెళుతుంది అని అర్థం. మరణం సమీపించినప్పుడు లోపలికి ఖాళీగా ఉన్న గాలి వెళ్ళి, బయటికి ప్రాణంతో వెళుతుంది. ఈ కారణం వల్ల గొప్ప జ్ఞానోదయమైన యోగీశ్వరులు, అవతార పురుషులైన గౌతమబుద్ధుడు, శంకరాచార్యులు, గురునానక్, మహావీరుడు మొదలైనవారు తమ మరణాన్ని చెప్పగలిగారు. మరణించటానికి ఆరు నెలల ముందు వారు ప్రాణం బయటకి వెళ్ళటం స్పష్టంగా చూడగలిగేవారు.

ఆయుర్వేదంలో శిఖరాగ్రవయస్సు అనే ఒక చక్కని విషయం ఉన్నది. అది ప్రాణశాస్త్రం మీద ఆధారపడి చెప్పబడింది. కొంత వయస్సు వరకూ ప్రతి ఒక్కరూ లోపలికి ఎక్కువ ప్రాణాన్ని తీసుకుంటారు. అప్పుడు బయటకి వెళ్ళే ప్రాణం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే బయటకి వెళ్ళే శ్వాస ద్వారా ఎక్కువ ప్రాణం బయటికి వెళుతుందో, ఆ వ్యక్తి మరణానికి చేరువ అవుతున్నాడు అని అర్థమవుతుంది.

మేలుకొని ఉన్నప్పుడు, స్వప్నస్థితిలో, గాఢనిద్రలో ప్రాణం కదలికలు

మీరు మేల్కొని ఉన్నప్పుడు, జాగ్రత్‌స్థితిలో ఉన్నప్పుడు ప్రాణం కదలికలు ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటాయి. అది ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటుంది. మీరు స్వప్నస్థితిలో ఉన్నప్పుడు అది మెదడు ప్రాంతంలో విశుద్ధచక్రం దగ్గర ఉంటుంది. మీరు గాఢనిద్రలో ఉన్నప్పుడు అనాహతచక్రం ఉండే ప్రాంతంలో ఉంటుంది. అందుకే మీ తల నిటారుగాఉన్నప్పుడు నిద్ర పోలేరు. తలని ఒక వైపు వాల్చకుండా మీరు నిద్ర పోలేరు. ప్రాణ నుదుటి నుంచి గుండె ప్రాంతానికి వెళ్ళినప్పుడే నిద్రపోగలరు. అందుకే తల ఒక పక్కకి వాల్చకుండా మీరు నిద్ర పోలేరు. మీరు మంచం మీద పడుకున్నప్పుడు కూడా, మీరు తలని తిన్నగా పెడితే మీరు నిద్రపోలేరు. మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉంటే మీ తల నిటారుగా ఉంటుంది. భుజాల నొప్పిపుడుతుంది. తల నిటారుగా ఉండటానికి భుజాల నొప్పి పుట్టటానికి దగ్గర సంబంధం ఉంటుంది. అది మీరు గమనించవచ్చు. మీరు ఆఫీసుకు వెళ్ళి ఏ పనీ చేయనవసరం లేదు. మీరు సమస్యల గురించి ఆలోచించండి, మీ భుజాలలో నొప్పి కలుగుతుంది. నిజానికి అన్ని రకాల బాధ, ఒత్తిడి ముందుగా మీ భుజాల్లోనే కనిపిస్తాయి. భుజాలపై ఒత్తిడి ఉన్నప్పుడు తలని విరామంగా ఉంచలేము. అందుకే నిరంతరం ఆలోచించేవారు రిలాక్స్ కాలేరు. నిద్ర పోలేరు.

జీవితాన్ని నియంత్రించటం

జారటాన్నే మనం జీవించటం అంటాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, మనం నిజంగా జీవించటం లేదు, మరణం కోసం ఎదురు చూస్కున్నాం. సాధారణమానవులు ఎవరూ జీవించరు. జీవితం మరణం వైపుగా వెళుతూ ఉంటుంది. అందుకే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా సంతృప్తి అనేది ఉండదు. మీరు జీవితాన్ని జీవించాను అనుకోరు. ఎందుకంటే జీవితమంటే ఏమిటో మీకు తెలియదు. ఎప్పుడైతే మీ జీవితాన్ని చేతనస్తితిలో చూస్తారో, ఎప్పుడెతే మీరు మీ జీవితం గురించి ఆలోచిసారో, ఎప్పుడెతే మీ జీవితంలోకి కేంద్రాన్ని ఏర్పరుస్తారో. ఈ జీవితానికి మరణానికి మధ్య, మీరు జీవితంలోనికి ఎక్కువ తెలుసుకునే తత్వాన్ని తీసుకువచ్చినప్పుడు మీరు మీ లోపల ఒక కొత్త కేంద్రాన్ని, కొత్త ప్రదేశాన్ని ఏర్పరచగలుగుతారు. దాన్నే నేను చేతనస్దితి అంటాను.

మీరు తెలుసుకునే తత్వంతో ఉన్నప్పుడు మీరు మీ జీవితం గురించి నిర్ణయాలు చేసారు. మీరు ఎక్కువ తెలుసుకునే కొద్దీ, మీరు ఎక్కువగా ఎంపికలు చేస్తూ ఉంటారు. ఏ కారు కొనుకోన్నారి, ఎటువంటి ఇంట్లో ఉండాలి, ఎటువంటి జీవితం కావాలి – ఇలా జీవితాన్ని రూపొందిస్తారు. ప్రతి చిన్న విషయాన్ని నిర్ణయించటం ప్రారంభిసారు. ప్రతి విషయంలో జాగ్రగత్త పడతారు. ఎలా మాట్తాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఆలోచించాలి – ఇలా ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకునే విధంగా చేస్తారు.

ఎప్పుడైతే మీరు ప్రతిదీ తెలుసుకునే విధంగా చేస్తారో, మీరు నిర్ణయాలు చేయటం ప్రారంభిస్తారు. అప్పడు జీవితాన్ని నియంత్రిసారు. ఎప్పుడెతే ప్రతి దానిలోకీ మీ తెలుసుకునే తత్వాన్ని తీసుకువసారో, మీరు మరణాన్ని కూడా నియంత్రించవచ్చు. అప్పుడు చేతనస్థితిలో పుట్టటం, మరణించటం జరుగుతాయి. మీరు చేతనస్థితిలో ఆలోచించగలిగితే అది జీవితం. మీ చేతనస్థితిలో ఆలోచించకపోతే అది మరణం.

జిజ్ఞాసతో నియంత్రణ

అచేతనస్తితిలో రెండు విషయాలు జరుగుతాయి. కలల స్థితి, గాధనిద్ద. అచేతనస్థితిలో ఉండే తెలుసుకునే తత్వమే కల. అప్పుడు మీరు దేన్నెనా చూడగలిగితే, కదలిన అనుభవమైతే, తెలుసుకోగలిగితే అది కల. మీకు ఏమీ తెలియకపోతే ఏదీ అర్ధం కాకపోతే అది గాధ నిద్ద.

మీరు మేల్కొని ఉన్నప్పుడు, తెలుసుకోగలిగితే తెలుసుకునే స్థితిలో ఉంటారు. ఆ విధంగా తెలుసుకోలేకపోతే అది మరణం.

మీ జీవితంలోకి తెలుసుకునే తతాన్ని తీసుకువచ్చినప్పుడు మీ జీవితబాధ్యత తీసుకుంటారు. అదే విధంగా, కలలోకి తెలుసుకొనే తత్వాన్ని తీసుకువస్తే మీ కలలని, గాధనిద్ర బాధ్యతని తీసుకుంటారు.

మీ జీవితాన్ని, మరణాన్ని నియం(తించటానికి, మీ కలలని, గాధనిద్రని నియం(తించటానికి ఒక ముఖ్య నిబంధన; తెలుసుకొనే తత్త్యం. అదే ముఖ్యమైన విషయం. అదే వీటిని నియం(తించటానికి అవసరమైన విషయం.

మీ కలలోనికి తెలుసుకునే తత్వాన్ని తీసుకురావటం వలన మీరు మీ కలలని గాధనిద్రని; మీ మరణాన్ని, జీవితాన్ని, నియంత్రించవచ్చు.

నిజమూ, కలా రెండూ ప్రాణ రూపాలే !

నుదుటి దగ్గర ఉన్న ప్రాణాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగితే, మీకు ప్రాణం అనేది శ్వాస ద్వారా రావటమే కాదు మీరు అనుకునే నిజాన్ని, కలని అదే సృష్టిస్తుంది అని అర్ధం అవుతుంది.

మీరు అనుకునే కల, నిజం రెండూ కూడా ప్రాణం తయారు చేసినవే. దీన్నే ఆది శంకరాచార్య 'ఈ ప్రపంచం మాయ, మిథ్య' అనటంలో అర్థం.

ఎప్పుడైతే మీరు దీన్ని అర్ధం చేసుకుంటారో మీలో కలలని, జీవితాన్ని నియంత్రించే శక్తి వస్తుంది. ప్రస్కుతం మీరు వాటి చేత బాధితులు. మీ కలలని, జీవితాన్ని నియంత్రించలేరు.

మీరు కలల స్థితిలోకి ఎక్కువ తెలుసుకునే తత్వాన్ని తీసుకురాగలిగితే మీరు మేలుకొని ఉన్నప్పుడు ఆ తెలుసుకునే తత్వం పెరుగుతుంది. అది మరింత విస్పతం అవుతుంది. అప్పడు మీరు మరణాన్ని నియం(తించగలరు.

కలలు, జీవితం

మీరు కలల్లోకి మరింత తెలుసుకునే తత్వాన్ని, మరింత చేతనస్థితిని తీసుకురాగలిగితే, మీ జీవితంలో చేతనస్థితి నాణ్యత పెరుగుతుంది. మీ కలల్లోని నాణ్యత మారినప్పుడు, మీ గాధనిద్దలో నాణ్యతలో మార్చు వస్తే అప్పుడు మీ జీవితంలో నాణ్యత పెరుగుతుంది. ఈ రెండూ ఒకదాంతో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక విషయం అర్ధం చేసుకోండి. జీవితం అంటే పగటిపూట కల కనటం. కల అంటే రాత్రి పూట జీవించటం, రాత్రి జీవితం కల, పగటి కల జీవితం.

మీరు పగలు ఏం చేసినా దాన్ని జీవితం అంటారు. రాశ్రి ఏం జరిగినా దాన్ని కల అంటారు. మీరు పగలు ఏమీ చేయలేకపోతే దాన్ని మరణం అంటారు. రాశతి పూట మీరు ఏమీ చేయలేకపోతే దాన్ని గాధనిద్ర అంటారు. పగటి పూట అనుభవం, అనుభవించేవాడు, అసుభవించబడేది అనే మూడు ఉంటే దాన్ని జీవితం అంటాం. ఉదాహరణకి కాఫీ తాగటం, కాఫీ తాగే వ్యక్తి, తాగే అనుభవం, ఈ మూడింటినీ పగలు అనుభవిసే దాన్ని జీవితం అంటారు. మీరు వీటిని అనుభవించకపోతే మరణం అంటారు. అదే రాశ్రి పూట ఈ మూడింటినీ అనుభవించితే కల లేకపోతే గాధనిద్ద అంటారు.

నిద్రలో, మరణ సమయంలో ప్రాణ కదలికలు

మీరు స్వప్నస్థితి వైపు వెళితే ప్రాణం మీలోని విశుద్ధి దగ్గరకి వస్తుంది. మీరు గాధనిద్రదలోకి వెళితే అది అనాహత చుక్రం వైపు వెళుతుంది. అదే విధంగా మరణించేటప్పుడు, జీవించి ఉన్నప్పుడు కూడా ప్రాణం కదులుతుంది. మీరు చైతన్యంగా, శక్తిమంతంగా ఉన్నప్పుడు మీ లోపల ప్రాణం ఎక్కువగా ఉంటుంది. అది సుదుటి దగ్గర చేరుతుంది.

లోపలికి వచ్చే శాస ఎక్కువ ప్రాణాన్ని తీసుకువస్తే, బయటకి వెళ్ళే శాస ఖాళీగా వెళ్ళితే, మీలోని ప్రాణం నుదుట దగ్గర కేంద్రీకృతమై ఉంటుంది. లోపలికి వచ్చే శ్వాసలో తక్కువ ప్రాణం ఉండి బయటకి వెళ్ళే శ్వాసలో ఎక్కువ ప్రాణం వెళితే అది విశుద్ధి దగ్గరకి జారుతుంది. లోపలికి వచ్చే శ్వాస ప్రాణాన్ని తీసుకురాకపోతే, బయటకి వెళ్ళే శ్వాసతో ప్రాణం బయటకి వెళితే అది అనాహత దగ్గరకి వెళుతుంది.

నిజానికి జీవితం నుంచి మరణస్థితికి వెళ్ళటం, మేలుకొని ఉన్న స్థితి నుంచి గాధనిద్రలోకి వెళ్ళే స్థితి ఈ రెండూ ప్రాణం కదలికలకి సంబంధించి ఉంటుంది. మీరు శ్వాస ద్వారా వచ్చే ప్రాణాన్ని నియం(తించగలిగినప్పుడు, దానితో వ్యవహరించ గలిగినప్పుడు, మీరు జీవితాన్ని, మరణాన్ని కూడా నియం(తించగలుగుతారు. అదే విధంగా స్వప్పస్థితిని, గాధనిద్రాస్థితిని కూడా నియం(తించగలుగుతారు. ప్రాణం అనే ఒక తాళంచెవితో కలని, నిద్దలని, జీవితాన్ని, మరణాన్ని నియం(త్రించవచ్చు.

జననమరణచక్రాన్ని ఆపటం

మీరు నిద్రాస్తితిలోకి జారే సమయంలో తెలుసుకోగలిగితే, చేతనస్థితిలో ఉందగలిగితే, క్రమంగా మీ చేతనస్థితి మసకబారుతుంటే, మీకు క్రమంగా నిగ్రద పడుతూ ఉంటే, అక్కడ మీ తెలుసుకునే తత్వాన్ని ఉంచగలిగితే, మీరు మీ కలలని మార్చగలరు.

ఏ వ్యక్తి అయితే తన కలలని చేతనస్థితిలో తెలుసుకునే తత్వంతో చూడగలదో ఆ వ్యక్తికి కలలు రావు. ఏ వ్యక్తి అయితే జీవితాన్ని తెలుసుకునే తత్వంతో, చేతనస్థితిలో జీవించుతాదో ఆ వ్యక్తి తిరిగి జన్మ తీసుకోడు. అందుకే తూర్పుదేశాల ఆధ్యాత్మికగ్రంథాలు అవి వేదాలు కాని, ధముపదం కాని, జెనసూతాలు కాని, గురుగ్గంథ సాహిబ్ కాని, పునర్దన్మ లేని లక్ష్యం వైపు నిర్దేశించబడి వుంటాయి. వాటి అన్నింటికీ ఒకటే లక్ష్యం. అది మోక్షం అంటే జననమరణచుకం నుంచి స్వేచ్చు.

మీరు కలలని మార్సగలిగినప్పుడు ముందుగా మీరు తెలుసుకునే విషయం, మీరు చేసేది, కల కనటం మానేస్తారు. ఎందుకంటే కలలు ఉపయోగం లేనివి అని మీకు తెలుసుంది. మీరు కలల్హో మీ సమయాన్ని, శక్తిని వృథా చేసున్నారు అని అర్ధం అవుతుంది. ఎవరైతే కలలని తెలుసుకుంటారో, వాళ్ళు కల కనరు, కలలని ఆపేసారు. జీవితాన్ని తెలుసుకున్నవారు జననమరణచక్రాన్ని ఆపుతారు. మళ్ళా మరొక శరీరాన్ని తీసుకోరు.

మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను మరణం అన్న మాటని ఉపయోగించినప్పుడు అది ఆత్మహత్య కాదు. మీరు జీవితాన్ని తెలుసుకునప్పుడు మరణంలోకి ప్రవేశిసారు. మీరు సాధారణ పద్ధతిలో జీవించరు. మీ గుర్తింపులతో జీవించటం మానేస్తారు. మీ గుర్తింపులకి ప్రాముఖ్యాన్ని ఇవ్వరు. మీరు తిరిగి జన్మించుతారు. అందుకే జ్ఞానోదయమైన వారు యోగీశ్వరులని మరణించిన వ్యక్తులుగా చెబుతారు. నిజానికి జ్ఞానోదయమైన వారు ఈ ప్రపంచ నిర్వచనంతో జీవించి ఉందరు. వారికి గుర్తింపులు ఉండవు. వారు అర్ధం చేసుకోవటానికి జీవితం లేదు. వారి జీవితాన్ని జీవితం అని అనలేం. కచ్చితంగా చెప్పాలంటే వారి జీవితానికి ఒక పేరు పెట్టాలి. మీరు ఉపయోగించవలసిన ఒకే ఒక పదం మరణం. అందుకే అధ్యాత్మిక గ్రంథాలు పదే పదే వారిని తిరిగి జన్మించినవారు అని చెబుతుంటాయి. ఈ స్థితిలో ప్రాపంచిక విషయాలు మిమ్మల్ని బాధపెట్టవు. జీవితం మసకగా కనిపిసూంది. అది వారిలో చొచ్చుకొని రాదు. వారి నిశ్చలతని భంగపరచదు.

ప్రాణం గుండె ప్రాంతంలోకి జారటాన్ని మీరు తెలుసుకోగలిగితే, మీరు మీ కలలని మార్చవచ్చు. నియంత్రించవచ్చు, ఆపవచ్చు. మీ ప్రాణం ఆజ్ఞాచుక్రం నుంచి అనాహతకి జారటం తెలిసే మీ జీవితం చివరిదశలో మీ జీవితాన్ని మార్చవచ్చు. దాన్ని ముందుకి జరపవచ్చు. అవసరం అనుకుంటే మరణాన్ని వాయిదా వేయవచ్చు. మీకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా ఆడుకోవచ్చు.

మానవ చేతనస్థితి మీద కొన్ని వేల సంవత్సరాల పరిశోధన ఫలితమే, వేదసాంకేతిక పరిజ్ఞానం.

ఇవి సిద్ధాంతాలు కావు అని తెలుసుకోండి. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాలుగా బుషులు మానవచేతనస్తితి మీద జరిపిన పరిశోధనల ఫలితాలు.

ఈ సాంకేతికపద్గతులు మీ జీవితనాణ్యతని అభివృద్ధి చేస్తాయి. నేను ఈ పద్గతులు పది సంవత్సరాలు సాధన చేస్తే పదకొండవ సంవత్సరంలో ఫలితాలు వస్తాయేమో అని మీరు అసుకోనవసరం లేదు. ఈ సాంకేతిక పద్ధతులు, ఈ జ్ఞానం మీ జీవితంలో నాణ్యతని ఈ రోజు నుంచే మార్చేస్తాయి. దీని గురించి తెలియదు కాబట్టి ఆ అనుమానం వస్తుంది. ఉదాహరణకి భూమ్యాకర్షణ సిద్ధాంతం మీ జీవితానికి పనికివస్తే ఆ శాసాన్ని మీరు నమ్ముతారు. అలా ఉపయోగపడనప్పుడు మీరు దాన్ని మరిచిపోతారు, అనుమానిస్తారు చివరికి, ఆ శాస్మాన్ని బయటికి విసిరివేసారు.

కేవలం మనం శాసాన్ని సాధన చేయకపోవడం వల్ల ఈ సత్యాల్ని అనుమానించడం మొదలు పెట్టాం. ఆధ్యాత్మికతని ఇది నాకు ఉపయోగపదుతుందా? ఇది నాకు నిజంగా సహాయం చేస్తుందా? అని ప్రశ్నించడం ప్రారంభించాం.

ప్రాణం కదలికల్ని మార్చడం ద్వారా చికిత్స చేయవచ్చు, నూతనత్వాన్ని పొందవచ్చు

మీరు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదేది చెప్పానో అది మీ మరణానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు, జీవితంలో ప్రతిక్షణం మీకు సహాయం చేస్తుంది. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మీరు అడగవచ్చు.

నిజానికి స్వప్నస్థితి అంటే ప్రాణం తక్కువ స్థితిలో ఉంది అని అని అర్థం. అంటే ప్రాణం హృదయప్రాంతం వైపు వెళుతుంది అని అర్లం. మీరు ఆ సమయాన్ని తెలుసుకోగలిగితే అప్పుడు మీ కలల్ని నియం(తించగలుగుతారు అంతేకాదు, మీలోని శక్తిస్థాయిని పెంచగలుగుతారు. ఎప్పుడైతే మీలోని ప్రాణం తక్కువ స్థాయిలో ఉండటాన్ని గమనిస్తారో మీరు మీ శరీరంలో ప్రాణం స్తాయిని పెంచుకోవచ్చు. అలా తెలుసుకుంటే చాలు మీలోకి ఎక్కువ ప్రాణం వస్తుంది. అదే విధంగా మరణసమయంలో, దాన్ని ఆపి పైకి తీసుకురావచ్చు.

మీ ప్రాణ నెమ్మదిగా అనాహతం దగ్గరకి జారుతుంది. అది మరణసమయంలోనే కాదు, మీకు అనారోగ్యం కలిగినప్పుడు కూడా. అది కిందికి జారే కౌద్దీ మీరు మరింత అనారోగ్యులు అవుతారు. మీరు ప్రాణం కదలికల్ని ఆపి పైకి తీసుకురాగలిగితే తిరిగి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మీ శరీరాన్ని అనారోగ్యం నుంచి కాపాడి చికిత్స చేయగల అంతిమపద్దతి ఇది.

జీవితానికి, మరణానికి ఎదురుగా నిలబడగలగటానికి ధైర్యం కావాలి.

మీరు ప్రాణాని సాధన చేస్తే మీరు అనుకున్న విధంగా మరణం ఉండదు. మీరు మరణం అనగానే ఎందుకు భయపడుతారు అంటే అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి. అదే మీకు భయాన్ని కలిగిస్తుంది.

చూడండి అందరూ ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తారని తెలుసు. అయితే అది ఎప్పుడు, ఎలా ఆ తరువాత ఏమిటి అనే విషయాలు మనకి తెలియదు. ఈ విధంగా తెలియనిదాన్ని గురించి మనలో కలిగే ప్రత్నలే ఒక పెద్ద సమస్య. మరణం అనే మాట వినగానే మనం పడే మానసికవేదన నిజానికి మరణం గురించి కాదు, మరణం ఎప్పుడు సంభవిసుందో తెలియక. ఒకసారి ఇది స్పష్టమైతే, మరణం అనే విషయం పూరిగా మారిపోతుంది. మన అంతరంగంలో మరణం అంటే ఉండే వ్యతిరేకత పూర్తిగా పోతుంది.

జీవితాన్ని, ఆరోగ్యాన్ని, మరణాన్ని నియం(తించడం

మీరు మరణాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మాత్రమే కాకుండా, దాన్ని వాయిదా వేయగలగటం, అది ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోగలగటం కూడా సాధ్యమవుతుంది. ఏ ఆధ్యాత్మికపద్దతి నుంచి అయినా మీరు పొందగలిగే చివరి బహుమతి ఇది.

అంతే కాకుండా, మీకు అనారోగ్యం కలిగినప్పుడు, ప్రాణం పూర్తిగా అనాహత లోనికి వెళ్ళకుండా అటు వైపుగా ప్రయాణిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఇలా ప్రపయత్నించండి. మీరు నిద్ద పోయే ముందు మీ నుదుటిపైన మీ ఆజ్ఞానచుక్రం మీద ఏకాగ్రతని నిలపండి. మీరు పడుకుని, ఇక నిద పడుతుంది అని అనుకున్నప్పుడు మీ చేతనస్థితి కరుగుతున్నపుడు మీరు చీకటిలోకి వెళ్ళే ముందు, గాఢ నిద్రలోకి వెళ్ళేముందు, మీ మూడవ కన్ను మీద ఏకాగ్రతని నిలపండి.

తరువాత మీరు మేల్కొని ఉన్నప్పుడు నిరంతరం ఈ జీవితం ఒక మాయ అని అనుకుంటూ ఉండండి. మీరు మేల్శొని ఉన్నప్సుదు కూడా కల కంటున్నాను అని అనుకోండి. మళ్ళా మళ్ళా ఇలా అనుకోండి నేను ఏమేం చూస్కున్నానో అదంతా కల అని.

దీనిలోకి తర్శంతో చూడవద్ద. అది నిజమా కాదా అని విశ్రేషణ చేయవదు. మీరు అనుకోవచ్చు అది నిజం కదా! ఎలా ఇది కల అనుకోవాలి అని, ఈ ప్రపంచం నిజం కదా? ఇలా అనుకుంటారు.

ఒక విషయం అర్డం చేసుకోండి. నిజం. సత్యం రెండూ వేరు వేరు విషయాలు. ఈ ప్రపంచం అంతా కల అని నేను అంటే అది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే నిజాన్ని కొలిచే మీ పద్ధతులు ఏదీ సత్యం కాదు కాబట్టి.

మీరు ఈ విధంగా కొన్ని రోజులు సాధన చేస్తే, నేను చెప్పే మాటల వెనుక ఉన్న సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటారు. అది మిమ్మల్ని సత్యం వైపు తీసుకువెళుతుంది. మీరు అది కరిగిపోవటాన్ని చూడగలుగుతారు. ఈ కల కనపడే తెరని చూడగలుగుతారు. ఎప్పుడెతే తెరని చూడగలుగుతారో అదే తెరని మీ తెలుసుకునే తత్వంతో కలలో కూడా చూడగలుగుతారు. ఈ కలని చూపించే తెరనే నేను చేతనస్థితి అంటాను.

మీ మనస్సు అడిగే ఆ తరువాత ప్రశ్న, నేను మేల్కొని ఉన్నప్పుడు కల అనుకుంటే నేను ఎందుకు పని చేయాలి? అని. మీరు ఎందుకు పని చేయకుండా ఉండకూదదు?

మీకు పని ఎందుకు చేయకూడదు అనిపిస్తుందంటే, మీకు పని చేయాలి అని ఉండదు. మీ పనుల్ని ఏదో సాధించాలని చేస్తారు. ఫలితాల కోసం మీరు ఆ పనితో అనుబంధాన్ని పెంచుకుంటారు. మీరు కల కంటున్నాను అనుకుంటే మీరు కల కన్నా లేకపోయినా అక్కడ జరిగే మార్చు ఏదీ ఉందదు అని మీరు తెలుసుకుంటారు. ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. అలా జరిగే విధంగా మీరు సహకరిసారు. సృష్టంగా తెలుసుకోండి, జీవితం ఒక కల. అకస్మాత్మగా మీలోని మేధ మేల్కొంటుంది. మీరు సత్యం వైపు మేల్కొంటారు. అదే ఈ జీవితం అనే నాటకం. ఇది మొత్తం మీ ప్రొజెక్షనే. అది మీ ఊహ మాత్రమే.

మరణం అంటే జీవితం చివరి భాగంలో జరిగే ఒక సంఘటన కాదు. అది మీరు జీవించి ఉన్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు దబ్బు పోగొట్టుకుంటే, మీరు కోటీశ్వరుడు అనే గుర్తింపు చనిపోతుంది. మీ సోదరులు చనిపోతే, మీరు ఫలానావారి సోదరుడు అనే గుర్గింపు చనిపోతుంది. ఇలాంటి సంఘటనలతో మీలోని ఆయా భాగాలు చనిపోతాయి. అర్థం చేసుకోండి. జీవితం చివరి భాగంలో జరిగేది సంపూర్ణమరణం. మీరు జీవించి ఉండగా కొన్ని భాగాలు మరణిసూ ఉంటాయి. మీరు ఈ విషయాన్ని అర్ధం చేసుకున్నాక ఆయా సంఘటనలు జరిగినప్పుడు మీరు బాధపడరు. మీరు పనిని చేసుకువెళతారు. వాయిదా వేయాలి అంటే వేయగలుగుతారు లేదా ఆయా సంఘటల్ని ఆపాలి అంటే ఆపుతారు.

విశ్వంలో విలీనం కావటమే మరణం

మీరు ఒక ఖాళీ కుండని తీసుకున్నారనుకోండి. కుండ లోపల ఉన్నది ఖాళీ, బయట ఉన్నది కూడా ఖాళీ ప్రదేశం. మీరు కుండని పగలకొడితే, కుండ పోతుంది కానీ ఆ ప్రదేశం నాశనం కాదు. కుండ లోపలి ఖాళీ ప్రదేశం విశ్వంలో విలీనమైపోతుంది. కుండ బయట ఉన్న ఖాళీలో కలిసిపోతుంది. కుండ లోపల పట్టి ఉంచిన ఖాళీ బయట ఖాళీ ప్రదేశంలో కలిసిపోతుంది. మీరు ఆ ఖాళీ ప్రదేశం రూపాన్ని మార్చగలరు కాని, దాన్ని నాశనం చేయలేరు.

అదే విధంగా మరణించినప్పుడు మీ శరీరంలో ఉన్న చేతనస్థితి బయట ఉన్న చేతనస్థితిలో విలీనమైపోతుంది. మీ శరీరంలో ఖాళీ ప్రదేశం, మీ శరీరం బయట ఉన్న ఖాళీ ప్రదేశం అనే ఆ హద్దు చెరిగిపోగానే మీ లోపల ఉన్న ఖాళీ బయటిదానిలో కలిసిపోతుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే మీరు మరణభయం నుంచి స్వేచ్ఛని పొందవచ్చు. మీలోని దేన్నీ నాశనం చేయలేం.

సోక్రటీస్ జీవితంలో ఒక చక్కని సంఘటన ఉంది :

సోక్షటీస్‌ని హెమలాక్ అనే విషం ఇచ్చి చంపేసారు. అతనికి విషం ఇచ్చి నీకు మరణిస్తున్నాను అని భయం కలగటం లేదా అని అడుగుతారు.

అతను చాలా చక్కగా జవాబు ఇస్తాడు. భయం ఎందుకు? మరణం వల్ల రెండు విషయాలు జరగవచ్చు. నేను అనేవాడిని ఉందకపోవచ్చు. లేదా నేను మరొక రూపంలో మరొక చోట ఉందవచ్చు. నేను అనే వాడిని లేకపోతే అసలు సమస్య లేదు. ఇక భయటపడటానికి అక్కడ ఏమీ లేదు. నాకు ఏమీ తెలియదు కూడా నేను మరొక రూపంలో ఉంటే, అప్పుడు కూడ బాధ పదనవసరం లేదు. ఎందుకంటే నేను ఏదో ఒక రూపంలో ఉంటాను కాబట్టి, నేను మరణించను కాబట్లి.

సోక్రటీస్ చెప్పిన ఈ మాటలు గొప్ప మంత్రాలు

మీ జీవితంలోకి వెనక్కి తిరిగి చూడండి. మీరు జీవితం అంటే బాధ లేకపోతే సంతోషం అని చెబుతారు. ఈ రెందు మాత్రమే సాధ్యం. ఒక వేళ జీవితం అంటే వ్యథా పూరితం అనిపించిందనుకోండి, ఇక మరణానికి భయపడటం దేనికి? మీకు ఎలాగూ బాధలు ఉన్నాయి. మరొక బాధని ప్రయత్నించవచ్చు కదా?

మీరు జీవితం అంటే సంతోషం అన్నారు అనుకోండి. ఇప్పుడు కొత్త అనుభవాన్ని ఆనందమయమే కదా! కాబట్టి ఎలా చూసినా మరణం అంటే భయపడనవసరం లేదు అని తెలుసుంది.

అర్డం చేసుకోండి. మీ లోపల ఉన్న శక్తి మీ బయట ఉన్న శక్తితో విలీనమైపోతుంది. కాబట్టి మీ శరీరం మానసిక వ్యవస్థ నాశనమైపోయాక కూడా మీరు జీవించి ఉంటారు. ఇదే మీలో మార్చు తీసుకురాగల ప్రాథమికసత్యం. ఏ వ్యక్తి అయితే ఈ సత్యంలో స్థిరపడతాదో అతను నిర్యత్సాన్ని, ఆనందాన్ని నిరంతరం వెదజల్హుతూ ఉంటాడు. అతను అద్భుతమైన ఆనందాన్ని, ఆనంతమైన శక్తిని వెదజల్లుతూ, పరమానందస్థితిలో స్థిరపడి ఉంటాడు.

ధ్యానపద్దతి : 1

విశ్వవిస్సోటంతో జనించే శక్తి నిరంతరం విస్పృతమవుతూ ఉంటుంది. అదే శక్తి మీ లోపల కూడా ఉంది. లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస కలిసే దగ్గర మీ తెలుసుకునే తత్వాన్ని ఉంచండి. అది శక్కికి, శక్రిహీనతకి మధ్య స్థలం.

శాసించిన గాలి బయటికి వెళితే అది ఫూరి శకితో ఉంటుంది. మీ చేతనసితి ప్రతిధ్యనిసూ ఉంటుంది. జీవశక్తిని స్పుశించవచ్చు. తెలుసుకోవచ్చు. బయటికి వచ్చిన గాలి లోపలికి వెళ్ళేందుకు తిరిగే మలుపు శూన్యం. లోపలికి తీసుకున్న శ్వాస బయటికి వచ్చినప్పుడు దాన్ని స్పృశించవచ్చు, తెలుసుకోవచ్చు. మనం మన ఏకాగ్రతని ఈ రెండు పాయింట్ల దగ్గర ఉంచితే మనలో జరిగే విశ్వవిస్సోటాన్ని, శక్తి కరగిపోవటాన్ని తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు దీన్ని తెలుసుకుంటారో, మీరు విశ్వశక్తిగా మారతారు.

ధ్యానపద్లతి : 2

ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి మీరు నిద్ద పోయేటపుడు. రెండవది మీరు మేల్మొని ఉన్నప్పదు. ఏ పని చేసున్నా గుర్తు చేసుకుంటూ చేసేది. మొదటిది మీలో చాలా శక్తిని స్పష్టిస్తుంది. రెండవది దానికి వ్యతిరేకం. అది ఒక దానికి ఒకటి ఆధారం.

మొదటిభాగం : మీరు పడుకుని, నిద్రపోయేముందు, అజ్ఞాచక్రాన్ని గుర్తుచేసుకోండి. కానీ ఏకాగ్ర‌త పెట్ట‌వ‌ద్దు. కేవ‌లం గుర్తు చేసుకోండి. ఏకాగ్ర‌త‌ని బ‌ల‌వంతంగా అక్క‌డ నిలిపితే మీ నిద్ద పాదవుతుంది. మీకు తల నొప్పి వసుంది. కేవలం ఆ భాగాన్ని గుర్తు చేసుకోండి. చాలా విరామంగా గుర్తు చేసుకోండి. మీరు మెల్లగా విశ్రాంతిలోకి వెళతారు. క్రమంగా నెమ్మదిగా నిద్ధలోకి జారతారు. గాధనిద్దలోకి వెళతారు.

ఈ సమయాన్ని తెలుసుకోండి. మీరు గాధనిద్దలోకి జారే ఆ పాయింటుని తెలుసుకోండి, చాలు. మొదటి రోజు మీకు నిద్ధ రానట్టే ఉంటుంది. దాన్ని పట్టించుకోవద్దు. ఆజ్ఞాచుక్రం దగ్గర ప్రాణం కదలికల్ని గమనించండి.

మీరు కల కంటున్నట్టు తెలుసుకుంటారు. మీరు కలని పొడిగించాలి అంటే పొడిగిసారు. వద్గు అనుకుంటే దాని లోంచి బయటికి వచ్చేస్తారు. కాని మీకు భయంకరమైన కలలు మాతం రావు. కలల్హో తీవ్రత ఉండదు.

గుండె కొట్టకునే వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కల గురించి తెలుసుకుంటే దాని ప్రభావం మీ మీద ఉండదు. ఆ తరువాత మీకు కలలు లేని నిధ పదుతుంది. అది లోతైనది. ఎప్పుడెతే కలలు లేని నిద్ద కలుగుతుందో మీకు పగలు కూడా కలలు రావు. అంత వరకూ మీ శక్తి ఆదా చేయబడుతుంది.

మీరు ప్రాణం కదలికల్పి తెలుసుకుంటే, అది చాలు. అది ఆటో మాటిక్ ా ఉన్నతమైన శక్తి లోనికి వస్తుంది. ప్రాణం కదలికలతో మీ శరీరారోగ్యం బాగవుతుంది. అనారోగ్యానికి ప్రాణం కదలికలతో పత్యక్షసంబంధం ఉన్నది. అంత కంటే కూడా మీరు మీ కలలని మార్చగలరు. మీరు మీ కలల్ని ఎప్పుడెతే నియంత్రించగలుగుతారో అప్పుదు మీ జీవితంలో జరిగే సంఘటనలతో వ్యవహరించటానికి గొప్ప శక్తి, బలం మీకు దొరుకుతాయి.

పసుతం మీరు కలల ప్రభావానికి లోనవుతారు. వాటిని నియం)తించలేరు. మీరు కనీసం తుమ్ముని ఆపలేరు. మీరు మేల్కొని ఉన్నప్పుడు కాని, నిద్రపోయే సమయంలో కాని దేనినీ ఆపలేరు. అవి అలా జరుగుతాయి అంతే. కాకపోతే అవి నేను చేస్తున్నాను అనే ఊహలో ఉంటారు. మీరు కలల స్థితిని తెలుసుకోగలిగితే, మీకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. అప్పదు మీ చేతనస్థితి విస్తృతం అవుతుంది.

The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivamస్సురణ ప్రో|గామ్, ఎస్. ఎస్. పిస్.పి

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMస్సురణ కార్యకమం మీ జీవితంలోకి మిమ్మల్ని పయాణింపచేసే విధంగా ఉంటుంది. దానితో పాటు మరణ రహస్యాలు తెలిసేలా చేసుంది. అది మీ అంతరంగాన్ని శుభంగా, స్వచ్ఛంగా చేస్తుంది. మీరు మీ లోపల మోసే భావావేశాల భారాన్ని తగ్గిస్తుంది. అది మీరు ఆనందంలో జీవించటాన్ని, ప్ర‌శాంతంగా శ‌రీరాన్ని వ‌ద‌ల‌టాన్ని నేర్చిసుంది. అది మీకు మరణాన్ని సరైన విధంలో చూపించి జీవితాన్ని అర్థవంతంగా, ఆనందంగా చేస్తుంది.

The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivamస్కురణ కార్యకమం – చికిత్పాపభావం

కార్యక్రమం మీ లోపల శారీరక, మానసిక, అధ్యాత్మిక స్థితులకి చికిత్స చేస్తుంది. నన్ను చాలామంది అడుగుతుంటారు, ధ్యానం ఏ విధంగా చికిత్స చేసుంది అని. అర్థం చేసుకోండి నేను నా శరీరంతో మీ అనారోగ్యానికి చిక్చిత్స చేయను. నా సమక్షం మీలో ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. సూర్యోదయం అయితే పద్మం వికసిస్తుంది అదే విధంగా గురుదేవుల సమక్షంలో చికిత్స జరుగుతుంది.

మీ శరీరం నా సమక్షంలో ఉంటే హీల్ చేయగలను. అదే విధంగా మీ మనస్సు విప్పారి ఉంటే అది కూడా బాగా అవుతుంది. ఎస్.ఎస్.పి.లో మీ మనస్సుని విప్పే విధంగా చేస్తాం. మిమ్మల్పి గురించి రాయమంటాం. మీ బాధలు, కోరికలు, అపరాధభావం, సంతోషం అన్నీ రాసారు. ఇదంతా మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి, మీలోని సంస్మారాలని తెలుసుకోవటానికి. నస్సు చాలామంది అడుగుతుంటారు, ఆ విధంగా ఎందుకు రాయిసారని. వాళ్ళు రాసినవి నేను చూడను. ఎవరికీ చూపించనీయను. అలా రాస్తే నా సమక్షంలో మీ మనస్సుకి చికిత్స చేసాను. మీ గాయాలకి చికిత్ర జరుగుతుంది.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMస్సురణ కార్యక్రమంలో మీలోని శక్రి పొరలని ఒక దాని తరువాత ఒకటిగా వికసింపచేసారు. అవి తెరవబడతాయి. మీ బాధలు, సంతోషాలు, కోరికలు, అన్నీ తెరవబడతాయి. ఒకసారి ఇవి వికసిస్తే, వాటికి చికిత్స జరిగితే మీరు భగవదనుభవాన్ని మీ లోపల క్రణకాలమైనా అనుభవించగలుగుతారు.

  • మనం ఎందుకు భయపడతామంటే, సహజంగా మనం మార్తుని అడ్డుకుంటాం. మరణం అంటే అకస్త్రాతుగా జరిగే మార్కు
  • జననమరణచక్రాన్ని చేదించే ఒకే ఒక మార్థం జ్ఞానోదయాన్ని పాందటం.
  • తిరిగి కొత్తగా పారంభించాలి అనుకోవటానే మరణం అంటారు.
  • మరణం అంటే జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించటమే.
  • రేపు లేదా మరు జన్త, ఈ రెండింటిలో ముందు ప్రది వసుందో మనం ఎప్షటికీ చెప్తలేం.
  • కోలిక భవిష్త తుకి సంబంధించింది. అపరాధభావం గతానికి సంబంధించింది. నిజానికి ఈ రెండూ ఒకటే.
  • మీరు వర్తమానంలో ఉండి కాలాన్ని మీ నుండి పోనీయండి.
  • మీరు మీకు తెలిసేలా ఆలోచిస్తే అది జీవితం. మీ చేతనస్థితి ఆలోచించ లేకపోతే అది మరణం.

మీరే మేధ

తమలో విశ్వమేధని అనుభవమే జీవన్ముక్తి

మరణం భయం అంటే మన గురింపుని కోల్పోతామేమో అన్న భయం. దీని నుంచి విముకి పొందాలంటే, మనం ఈ శరీరానికి, మనసుకి అతీతులం అని తెలుసుకోవాలి. ఆ విషయం తెలుసుకోవాలంటే మనకి మేధ ఉండాలి. అప్పుడు మనకి ఈ కింది ప్రశ్నలు వస్తాయి.

మేధ అంటే ఏమిటి?

మనలో కొందరు ఎక్కువ మేధస్సుని కలిగి ఉంటారా?

మనం మనలోని మేధస్సుని పెంచవచ్చునా?

సహజమేధ

మేధ అనేది ఏదో పొందగలిగే ఒక విషయం కాదు. ప్రతి ఒక్కరూ మేధని కలిగి ఉంటారు. మనందరికీ మేధ ఉన్నది. అది మన సహజలక్షణం. అది మన పుట్టుకతో వస్తుంది. మంట వేడిగా, ఐసు చల్లగా ఉన్నంత సహజంగా మనకి మేధ ఉంటుంది.

మేధావుల మీద ఒక జోక్ నాకు గుర్తుకు వస్తుంది.

ఒకసారి నలుగురు వ్యక్తులు విమానంలో ప్రయాణం చేసూ ఉంటారు. అకస్మాత్మగా విమానం తోక భాగంలో మంటలు లేస్తాయి. దురదృష్ణం కొద్దీ అక్కడ మూడు పారాచూట్స్ మాత్రమే ఉంటాయి. అప్పుడు వారిలో మొదటి వ్యక్తి ఒక పారాచూట్ తీసుకొని, నాకు ఈ మధ్యనే వివాహం జరిగింది. నా భార్య నా కోసం చూస్తుంటుంది, అని చెప్పి కిందికి దూకేస్తాడు.

రెండవ వ్యక్తి, నేను ఈ భూమి మీద చాలా తెలివెనవాడిని. ఈ ప్రపంచానికి నా తెలివితేటలు చాలా అవసరం అని అతను దూకేస్తాడు. మిగిలిన ఇద్దరిలో ఒకాయన వయస్సులో బాగా పెద్దవాడు. ఆయన నాలుగవ వ్యక్తితో నేను పెద్దవాడినైపోయాను. నీకు ముందు చూడవలసిన జీవితం చాలా ఉన్నది. అందుకే ఈ పారాచూట్ తీసుకొని నీవు కిందకి దూకు' అని చెబుతాదు.

అప్పుడు ఆ యువకుడు 'మీరు కూడా రావచ్చు. మనం ఇద్దరం వెళ్ళవచ్చు. ఎందుకంటే ఈ భూమి మీద చాలా తెలివైన వ్యక్తి బాక్ పాక్‌తో దూకేసాడు' అని అంటాడు.

మనలో చాలామంది మన సహజమేధని మరిచిపోయారు, అందుకే మనం జీవితాన్ని సంపూర్ణంగా పూర్తి స్లాయిలో జీవించలేకపోతున్నాం. మనం సంపాదించుకున్న తెలివితేటల్ని పొరపాటుగా మన మేధ అనుకుంటాం. మనందరం ఆ తెలివైన వ్యక్తిలా బాక్ పాక్‌ని పారాచూట్ అనుకొని కిందకి దూకేస్తున్నాం.

ఈ స్పష్టిలో ప్రతిప్రాణికి తన సహజమైన మేధ ఉంటుంది. పక్రులు ఆకాశంలో ఎగరగల మేధ వాటికి ఉంటుంది. వలస పక్షులు కొన్ని వేల మైళ్ళు ఆకాశంలో ఎటువంటి పటం కాని, గైద్స్ కాని లేకుండా అదే అడస్‌కి రావటం ఎంత అశ్చర్యరం. సీజను అయిపోగానే తిరిగి అదే దారిలో వాటి సొంత ప్రాంతానికి జాగ్రత్తగా వెళ్ళిపోతాయి.

గొంగళి పురుగు నుంచి చింపాజీ వరకు ప్రతి జంతువూ తమ సహజమైన తెలివితేటలను ఉపయోగిసూ తమ జీవితాల్ని ఎంతో అందంగా జీవిస్తున్నాయి. మొక్కలకి, చెట్లకి సహజమేధ ఉంటుంది. ఆ మేధతో అవి సూర్యుడి నుంచి తమ ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి. మనిషికి కూడా అద్భుతమైన సహజమేధ ఉన్నది. అతను మరింతగా అభివృద్ధి చెందిన జీవి. అతనికి పక్టులు, జంతువులు, చెట్ల కంటే కూడా ఉన్నతమైన చేతనస్థితి ఉంది.

పతంజలి భరతదేశంలో ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరుదు. ఆయన ప్రాచీనయోగ శాస్త్రాన్ని రచించాడు. ఆయన ఈ విధంగా చెబుతాదు, తక్కువ స్తాయి ప్రాణులైన చెట్లు, పక్షులు జంతువుల్లో ఉండే అల్పస్తాయి చేతనస్థితి వివిధరూపాల్లో మనుషుల్లో ఉంటుంది.

మనిషి చెట్టులా ఆహారాన్ని తయారుచేయగలదు. జంతువులా, పక్లిల్లా మనిషికి జన్మ తీసుకుని తనంతట తానుగా జీవించే శక్తి ఉంది.

పతంజలి ఈ విధంగా చెబుతాదు, 'నీవు తాబేలుగా పుట్టినపుడు అంతకు పూర్వం నీవు తీసుకున్న పక్షులు, మొదలైన జన్మల జ్ఞాపకాలు ఆ తాబేలులో నిలువ చేయబడి ఉంటాయి. అదే విధంగా అంత కంటే మరో ఉన్నతమైన జన్మ తీసుకున్నప్పుడు, పాత జన్మల జ్ఞాపకాలు ఆ జన్మ తీసుకునే ముందు ఆ శరీరంలో నింపబడతాయి.

మీరు క్రమంగా మానవజన్మ సాయికి వచ్చే సమయానికి, మీ పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ మీ లోపల నింపబడి ఉంటాయి. మీకు సరైన పద్దతి తెలిస్తే ఆ పద్దతితో మీరు ఏ సమయంలోనెనా, ఏ జ్ఞాపకాన్నెనా పట్లుకోవచ్చు.

సహజంగానే మనకి అన్ని రకాల తెలివితేటలు మానవ శరీరంలోనే ఉంటాయి. కానీ సమస్య ఏమిటంటే మనతెలివి చాలా చిన్న పరిధిలోనే చాలా పరిమిత స్తాయిలోనే ఉన్నది అని గట్టిగా నమ్ముతాం. మనకి చాలా కొద్ది శక్తి మాత్రమే ఉన్నది అనే నియమం మన మీద రుద్ధబడి, దాన్నే బలంగా నమ్ముతాం. ఏదైనా నా వల్డ కాదు అనుకుంటాం. కాబట్టి ఈ శక్తిని ఎలా ఉపయోగించాలో మనం మరచిపోయాం. అందువల్ల మనలోని అన్ని కోణాలను చూడగల పద్తతిని ఉపయోగించలేకపోతున్నాం.

ఉదాహరణకి : మనిషికి ఎటువంటి శిక్రణా లేకుండా నీళ్ళలో ఈత కొట్టగలడు. జపాన్‌లో ఈ విషయం మీద ప్రయోగాలు చేసారు. అప్పుడే పుట్టిన బిద్దని నీళ్ళలో వేయగానే ఆ బిద్ల ఈత కొట్టటం ప్రారంభించింది.

పిల్లలు మేధతో పుడతారు

ఒక చిన్న కథ : ఒక అబ్బాయి స్కూలు సుంచి వచ్చాక వాళ్ళ అమ్మతో 'నీవు స్కూలు డెంటిస్ట్ నొప్పి లేకుండా చేసాడు అన్నావు కానీ అది కరెక్ట్ కాదు' అని అంటాడు. అతని తల్లి కంగారుగా, 'ఏమైంది? నీకు బాగా నొప్పి కలిగిందా?' అని అదుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి, 'కాదు! నేను వేలు కొరికినప్పుడు అతను చాలా గట్లిగా అరిచాదు' అని అంటాడు.

పిల్లలు జన్మతః మేధావులు. వారు అసంకల్పితంగా, స్పజనాత్మకంగా ఉంటారు. కానీ తల్లితం|దులు, సంఘం, స్కూలు, కాలేజీ చదువులు ఆ సహజమేధని నాశనం చేసాయి. చదువులు తర్శానికి, జ్ఞానంతో కూడిన తెలివికి, గుర్తు పెట్టుకునే శక్కికి, పోటీకి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తాయి. స్కూలు చదువుకి పిల్లలు చెల్లించే మూల్యం ఈ విధంగా చాలా ఎక్కువ. ఆ చదువు కోసం అత్యంత విలువెన సృజనాత్శకతని, తన ప్రత్యేకతని వదులుకుంటున్నారు. కనీసం వారికి ఈ విషయం తెలియదు.

ఒక రోజు యువకుడి టీ–షర్ మీద ఒక కొటేషన్ చదివాను, 'నా చదువు నాశనం చేసే ముందు వరకూ నేను మేధావిని' అని. ఈ రోజుల్తో పిల్డలకి అందిసున్న చదువుని గమనిసే అర్దమౌతుంది, అది వారి అభివృద్ధిని ఎంతగా నాశనం చేస్తుందో. తర్శానికి, విశ్లేషణలకి అనవసరప్రాధాన్యాన్ని ఇస్కన్నారు. ఇవన్నీ మెదడు ఎడమ పక్క భాగానికి చెందిన పనులు. కుడి పక్క మెదదు పనులైన స్నజనాత్మకత, కళలు అనే వాటిని మరిచిపోయాం. మన మెదడులోని సగం శక్తిని పూర్తిగా వదిలివేసాం. మీ మెదడులో, మీ శరీరంలో సగభాగం వెల్లడి చేయాలి అని ఆతురత పడుతున్నది. కానీ మనం పట్టించుకోవటం లేదు. సత్యాన్ని మేల్కొల్పగలిగినప్పుడు విద్య అద్భుతాల్ని ఆవిష్కరిస్తుంది. మెదడు ఎడమ భాగంలో విద్యాభ్యాసం మంచిదే. కుడి భాగం ఇంకా ముఖ్యమెనది.

ఎఫుడూ మీ ఆత్మ, మీరు సంపూరంగా వెలడి అవుతూ ఉంటారో మీలోని సహజమేధ అందంగా వికసిస్తూ ఉంటుంది. దాన్నే నేను పూర్ణత్వం లేదా ఏకత్వంలో ఉండగలిగి సంత్సపిని సాధించటం అంటాను.

భయం, ఆశ ముందుకు నడిపే శకులు

మనం చాలా తెలివెనవారం అనుకొని మన పిల్లల్ని కూడా మనలా తెలివైనవారిలా చేయాలి అని అనుకుంటాం.

ఆ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు వారికి తార్కికంగా ఆశ, భయం ఏ విధంగా జీవితాన్ని ముందుకు నడిపిస్తాయో నేర్సిస్తాం.

అతను ఏదైనా ఇంకా సాధించటానికి ప్రయత్నించాలి తనకి వద్దు అనుకున్నది ఆపటానికి పని చేయాలి అని చెబుతాం. మీరు అనుకున్నది జరగాలి అనుకుంటే అది అశ. మీరు ఏదైనా జరుగుతుందేమో అని భయపడితే అది భయం.

మంచి కాలేజీలో సీటు కోసం బాగా చదివి మంచి మార్కులు తెచ్ఛుకోవాలి. ఇదే ఆశతో ముందుకు వెళ్ళటం. బాగా చదవకపోతే ముందు జీవితంలో మంచి ఉద్యోగం దొరకదు. ఇది భయంతో ముందుకి వెళ్ళటం.

పిల్లల్లోని ప్రోత్సాహం కేవలం ఆశ, భయం. అంతే కాని అంతరంగంలో దొరికే పరిపూర్ణమైన త్సప్తి కాదు. అందుకే పిల్లలు అనవసరమైన పోటీల్లో (రాట్ రేస్) పడిపోయి, పరుగెడుతూనే ఉంటారు. ఎలా పరుగెడుతారంటే కనీసం ఒక్కసారి నిలబడి తాము ఎందుకు ఎక్కడికి పరుగెదుతున్నారో చూసుకోకుండా పరుగెడుతుంటారు. ఆ పరుగులో చక్కని సంతోషాన్ని పొందవచ్చు అని వారికి తెలియదు. వారికి ఏం నేర్సిసారంటే, మీరు అటూ ఇటూ చూస్తే, విలువైన సమయం వృథా అవుతుంది, మీ లక్ష్యాన్ని చేరటం ఆలస్యమవుతుంది అని.

లక్ష్యాన్ని చేరాక ఎంత మంది సంపూర్లమైన త్సప్తిని పొందారు? మీరు నిజంగా అనుకున్న లక్ష్యాన్ని చేరాక అక్కడ అసలు లక్ష్యం లేదని తెలుసుకుంటారు. అది ఇంకా ముందుకి జరిగిపోయిందని తెలుసుకుంటారు. ఇప్పుడు మీకు మరొకటి కనిపిస్తూ ఉంటుంది.

మీ లోపలికి చూడండి. మీరు నిజంగా మీ పిల్లల్ని పెంచి పెద్దవారిని చేస్తున్నారా లేక వారిని భయంతో, ఆశతో ముందుకు సాగమని చెబుతున్నారా? మీరు మీ అంతరంగం లోపలికి లోతుగా చూడండి. మీరు కేవలం పోటీ పరుగులో పరుగెడుతున్నారా? ఆ పరుగు మీకు మీ అంతరంగంలో సంత్సపిని ఇసున్నదా? మీరు నిజంగా చేయాలి అని అనుకున్నది చేస్తున్నారా! లేకపోతే మీ కుటుంబం, మీ సంఘం మీ నుంచి ఏదో అశిస్తున్నది కాబట్టి పరుగెడుతున్నారా?

ఒక విషయం అర్థం చేసుకోండి; ఎదుటివారు ఏం చేసున్నారో చూసి మీరు కూడా అదే చేయాలని చేస్తే, మీరు విలువైన మీ జీవితాన్ని వృథా చేసుకుంటున్నారు అని తెలుసుకోండి. దీన్నే గుంపులో ఉండే మనస్తత్వం అంటారు. అందరూ పరుగెడుతున్నారు కాబట్టి, నేను పరుగెడుతున్నాను అనే తత్వం ఇది. రాట్ రేస్‌లో గెలిచినా మీరు ఎలుకగానే మిగిలిపోతారు అని తెలుసుకోండి.

మేధని కొలవటం ఎలా?

మనం మేధని కొలవగలమా? అలా కొలవగలిగే ప్రపూణాలు ఉన్నాయా?

స్కూలు జీవితం నుంచి మనిషి మేధని కొలవటానికి ఏవో కొన్ని కొలమానాల్ని ఉపయోగిస్తున్నారు. స్కూలు, కాలేజీలలో ఇచ్చే గ్రేదులు ఒకరితో మరొకరిని పోల్చి ఇస్తారు.

ఒక విద్యార్థి సైన్సులో బాగా చదవచ్చు. ఒకరు సంగీతంలోనూ గ్రేడ్ చేసారు. ఇప్పుడు మీరు ఎవరు మేధావి అని ఎలా నిర్ణయిస్తారు. ఒకవేళ వారి సామర్థ్యాన్ని సైన్సు ఆధారంగా లెక్క కడితే మరొక విద్యార్థి తప్పుతాదు. అదే సంగీతం ఆధారంగా లెక్కిస్తే ఇంకొక విద్యార్థిని తగ్గించాలి.

చూడండి సైన్సు ఆధారంగా విద్యార్ధులు తెలివెనవారని నిర్ణయిస్తే కవి అయిన విద్యార్ధికి తాను తెలివితక్కువవాడిననే భావం కలుగుతుంది. తెలిసి కానీ తెలియక కాని తనలోని సహజమేధని ఆ విద్యార్లి అణిచేస్తాడు. సైన్సు విద్యార్థిని అనుకరించటం ప్రారంభిస్తాడు.

ఇక్నద మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సైంటిస్టుగా ఉండాలి అంటే ఒక రకమెన మేధ అవసరం. కవిగా ఉండాలి అంటే మరొక రకమెన మేధ అవసరం. ఒలింపింక్ ఆటలలో ఈత పోటీలకి వెళ్ళాలి అంటే మరొక రకమెన మేధ ఉందాలి.

మేధ అంటే ఒక సమస్యకి కాని ఒక సంఘటనకి కాని స్పందించగల సామర్హం. సంఘటన లేదా సమస్య మారినప్పుడు, ఉపయోగించవలసిన మేధ కూడా మారుతుంది. దానితో స్పందించే పద్ధతి మారుతుంది. సెంటిస్టు విద్యార్థి ఒక ప్రత్యేక కోణంలో ప్రత్యేకసంఘటనకి ప్రతిస్పందిస్తాడు. అదే విధంగా మరొక సమస్యకి కవి విద్యార్థి మరొక కోణంలో ప్రతిస్పందిస్తాడు. ఈత పోటీలకి వెళ్ళే వ్యక్తి మరొక కోణంలో ప్రతిస్పందిస్తాడు.

ప్రతిఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవటం ముఖ్యం.

అ(పయత్నంగా స్పందించటం మేధ

మీ అందరిలో సహజమైన, సమయోచితమేధ ఉంటుంది. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దాన్ని ఉపయోగిస్తారు.

చిన్నతనంలో మీరు వస్తువుల్ని కాని, విషయాల్ని కానీ మామూలుగా, తిన్నగా చూడగలుగుతారు. అందుకే మీరు అప్పుడు అప్పదుత్నంగా, సమయోచితస్పూర్తిగా ఉండేవారు. మీరు పెద్దవారయ్యాక ఆ సామర్థ్యం ఎక్కడికి పోయింది. మీ చిన్నతనం నుంచి సంఘం, సంఘనియమాలు నీకు అంత సామర్ధ్యం లేదు అని చెబుతూ ఉన్నాయి. మీరు నిరంతరం ఏదో సాధించి మరేదో అవ్వాలి అనే అనుకుంటున్నారు. నిరంతరం మీరు అంటే ఇదీ అని నిరూపించాలని చూసుంటారు. ఎప్పుడూ నాకు నేను సరిపడా లేను అనే భావంతో ఆలోచిసూ ఇతరులను అనుకరించటానికి ప్రయత్నిస్తుంటారు. దీని వల్ల మీ లోపల ఉన్న అద్భుతమైన సహజశకిని వృథా చేస్తున్నారు.

నేను ఒక సరదా వాక్యాన్ని ఒక కంపెనీ నోటీసు బోర్శులో చదివాను. మరణాన్ని క్రమించి స్వీకరిస్తాం కాని దానికి రెండు వారాల ముందుగా నోటీసు ఇవ్వాలి. ఎందుకంటే మీ వృత్తివిషయాలు మరొకరికి, మరణం ముందు, ఆ తరువాత నేర్చించటం మీ బాధ్యత.

సూచన : ఈ కొత్త కార్యక్రమం నిన్న ప్రారంభమైంది.

మీరు మీ అంతరంగంలోని మేధతో పని చేయకుండా గుడ్డిగా మరొక కంపెనీ పద్ధతిని కాని, మరొక వ్యక్తిని కాని అనుకరిస్తే అద్భుతమైన అవకాశాలని పొందకుండా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటమే.

ఒక స్టాటిస్టిక్స్ స్వూడెంట్ కారు డైవ్ చేసేటపుడు, జంక్షన్ దగ్గర బాగా స్పీదు పెంచి ఆ తరువాత నెమ్మదిగా వెళతాదు. ఒక రోజు అతని స్పేహితుదు అతనితో పాటు కారులో ప్రయాణిసూ ఉంటాడు. అతని పద్ధతిలో జంక్షన్ దగ్గర వేగంగా, ఆ తరువాత నెమ్మదిగా డైవ్ చేస్తాడు. అతని స్నేహితుడు ఆశ్చర్యంగా 'అదేమిటి' జంక్టన్ దగ్గర నెమ్మదిగా వెళ్ళి ఆ తరువాత వేగంగా వెళ్ళాలి కదా. మరి నీవేంటి వ్యతిరేకంగా చేసావు' అని అదుగుతాడు.

అప్పుడు అతను 'స్తాంిస్టిక్స్ ప్రకారం జంక్లన్ దగ్డర ఎకు)వ ప్రమాదాలు జరుగుతాయి. అక్కడ నేను తక్కువ సమయం ఉండే విధంగా జాగ్రగత్ర పడతాను' అని జవాబు ఇస్తాడు.

జ్ఞానం మంచిదే కాని దాన్ని వివేకంతో ఉపయోగించాలి. మేధ మాన్యతమే సరైన ఫలితాల్ని ఇస్తుంది, కాని జ్ఞానం కాదు. జ్ఞానాన్ని సరైన సమయంలో సరైన చోట ఉపయోగించటమే మేధ. సమయోచితం అంటే జ్ఞానాన్ని మేధతో కలిపి సున్నితంగా వెల్లడి చేయటమే. మీరు దేన్నెనా, మీలోని నైపుణ్యాన్ని, సామర్థాన్ని ఉపయోగించకపోతే కొంత కాలానికి మీరు దాన్ని మరిచిపోతారు. అదే విధంగా మేధని ఉపయోగించకపోతే కొంత కాలం జరిగాక మీకు మేధ ఉన్నది అని మరిచిపోయి నేను మేధావిని కాదు, తెలివితక్కువాని, ఏ విషయంలో సమయోచితంగా వ్యవహరించలేను అని గట్టిగా నమ్మి మీరు మీ గతం మీద కాని, ఇతరుల మీద కాని ఆధారపడిపోతారు.

జిజ్ఞాసకు కీలకాంశాలు.

ఒక చిన్న కథ : ఒక అబ్బాయి స్కూలులో, ఇంట్లో చాలా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. ఒక రోజు ఆ అబ్బాయి టీచర్‌తో, 'నిన్న నేను 3 ఆడ ఈగలని, 2 మగ ఈగలని చంపాను' అంటాడు. టీచర్ చాలా కుతూహలంగా 'అవి ఆడ, మగ ఈగలు అని నీకు ఎలా తెలుసు? అని ఆ అబ్బాయిని అడుగుతుంది. ఆ అబ్బాయి 'ఇది చాలా చిన్న విషయం, మూడు ఈగలు అద్దం మీద, రెండు ఈగలు సిగరెట్ పెట్టె మీద ఉన్నాయి' అని జవాబు ఇస్తాడు.

మేధ అంటే సమయోచిత స్ఫూర్తితో, ఎరుకతో ఉండగలగటమే.

ఒక ముఖ్య విషయాన్ని అర్థం చేసుకోండి, మీరు లోతైన ఎరుకతో ఉన్నప్పుడు పూర్తి తెలుసుకునే తత్వంలో తప్పులు చేయరు!

ఎప్పుడైతే మీరు పూర్తి ఎరుకతో ఉంటారో మీరు ఇతరుల మీద కాని, మీ గతం మీద కాని ఆధారపడరు. మీ లోపలికి నిబంధనలు, నియమాలు అనేవి కొన్ని సంవత్సరాలుగా నింపబడుతున్నాయి. మీరు పూర్తి తెలుసుకునే తత్వంలో ఉండగలిగినపుడు స్వచ్చమైన మేధతో పనులు చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు లోతైన (ఎరుకతో) తెలుసుకునే తత్వంతో ఉంటారో అపుడు మీరు వర్తమానంలో ఉండగలరు. ఎప్పుడైతే మీరు వర్తమానంలో, ఈ క్షణంలో ఉంటారో మీరు చైతన్యవంతంగా, జీవంతో, జాగరూకతతో ఉండగలుగుతారు. అదే మేధ అంటే. మేధ ముఖ్య లక్షణం సమయోచితంగా, అప్రయత్నంగా ఉండగలగటం. దీనికి ప్రత్యేకశిక్షణ, నేర్సుకోవటం అనేవి ఉండవు. దీనికి కేవలం మీరు మీలో ఉన్న మేధని మేల్కొల్పాలి, అంతే.

ఇందులో మొదటి దశ మిమ్మల్ని మీరు గమనించటం. అదే విధంగా ఏదైనా ఒక సంఘటనకి మీరు అచేతనంగా ఎలా స్పందిస్తారో గమనించటం. మీరు మీ పనులు ఏ విధంగా మీ దృక్పథంలో నాటుకుపోయి ఉంటాయో, మీరు ఏ విధంగా గతం నుంచి ముగింపులు ఇస్తారో చూడండి. మిమ్మల్ని మీరు తెలుసుకునే తత్త్యంతో గమనించటం మొదటి స్టెప్. తెలుసుకునే తత్వానికి సంబంధించి మంచి విషయం ఏమిటంటే, ఇదొక్కటే మీకు నిజంగా అవసరమైన విషయం.

మనం జీవితంలో చాలా భాగం గడచిపోయిన గతంలోనే జీవిస్తూంటాం. జీవితంలోని అద్భుతమైన క్షణాలని పోగొట్టుకుంటున్నాం లేదా జరిగిన విషయాల మీద కోపం తెచ్చుకొని బాధపడతాం. ఈ రెండు విధాలుగా కూడా మనం ఏదో ఒక దానిలోకి పూర్తిగా వెళ్ళటం లేదు. అలా చేయకుండా, మీరు సమస్యలోనికి లోతైన తెలుసుకునే తత్వంతో చూడగలిగితే, మీలో ఒక శక్తి ఉదయిస్తుంది – ఆ శక్తి మేధ – ఆ మేధ సమస్యకి సరైన పరిష్కారాన్ని ఇస్తుంది.

ఈ తెలుసుకునే తత్వం నిబంధనల నుంచి మీకు స్వేచ్చని కల్పిస్తుంది. దాన్ని మేల్కొల్పగలిగితే మీరు మేధస్సుతో పనిచేస్తారు. తెలుసుకునే తత్త్యం మీలో మేధ అనే అగ్గిరవ్వని వెలిగిస్తుంది. అది నిరంతరం మీలో ఒక భాగంలా ఉండిపోతుంది. తెలుసుకునే తత్వం అనే వెలుగు మీ లోపల సంవత్సరాల నుండి ఉన్న అలవాట్ల జీవితం అనే చీకటిని తొలగిస్తుంది.

ఒక ముఖ్యవిషయం, తాళం చెవి తెలుసుకునే తత్త్వం. దానితోనే మీలోని మేధ పనిచేస్తుంది. (ప్రతిక్షణం ఆ ఎరుకతో ఉండటమే ధ్యానం అంటే.

నియమాలకి అతీతంగా, బాధ్యత వైపుగా

ఒక చిన్న కథ : ఒక శిక్షణా కార్యక్రమంలో సార్జెంట్ అందరినీ ఉద్దేశించి 'వాల్‌నట్స్‌ని తుపాకీ తయారీలో ఎందుకు ఉపయోగిస్తారు' అని అడుగుతాడు. శిక్షకులు చాలాసేపు ఆలోచిస్తారు కానీ జవాబు దొరకదు. అందులో ఒకరు 'బహుశః దీని కంటే గట్టి గింజలు మరేమీ లేవు కాబట్టి' అని జవాబు ఇస్తాడు. సార్జెంట్ 'అది కూడా తప్పు' అంటాడు. మరొకరు 'ఇది చాలాకాలం ఉంటుంది, అందుకని' అని జవాబు ఇస్తాడు. సార్జెంట్ కూడా అని గట్టిగా అంటాడు. మూడవవ్యక్తి 'అది నీళ్ళలో తడవదు కాబట్టి', అని అంటాడు. ఈ సారి సార్జెంట్ మండిపడుతూ 'మీకు ఏమీ తెలియదు. మీరు చాలా నేర్చుకోవాలి' అని 'దీన్ని ఉపయోగించే కారణం చాలా చిన్నది, ఏమిటంటే అది ఒక రూలుగా రూల్స్ పుస్తకంలో ఉన్నది కాబట్టి దాన్ని ఉపయోగిస్తారు' అని అంటాడు.

జీవితంలో బాధ్యతని ఎదుటివారి మీద మోపి, గుడ్డిగా వారి సూచనలని అనుసరించటం సులభం. మీ మేధని ఉపయోగించటం కంటే ఇది సులభం.

మీరు ఏమంటారంటే ఇవి వినయవిధేయతలు అని కానీ, నిజానికి మీరు చేసే పనుల బాధ్యతని తప్పించుకోవటమే. ఇది ప్రమాదకరమైన పాత కాలం నుంచి ఉన్న ఒక అలవాటు. పుస్తకంలోని రూల్స్‌ని అనుసరించటం అంటేనే ప్రమాదకరం. ఇది ఎందుకు ప్రమాదకరం అంటే కొన్నిసార్లు మీ బాధ్యతని, మీ వివేకాన్ని పోగొట్టుకుంటున్నారు అన్న విషయం కూడా మీకు తెలియదు. చిలకలా ఎవరో చెప్పినవి వల్లించటం, సంవత్సరాల కొద్దీ అదే పనిని ఎవరో చెప్పారని చేయటం మీరు చేస్తారు.

బాధ్యత గురించి మాట్లాడటం, దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనే దాని మీద ఒక జోక్ ఉన్నది.

ఒకసారి ఒక నేరగాడు అతని లాయర్‌ని గట్టిగా తిడుతుంటాడు, 'నీవు ఏం లాయర్‌వి. ఉపయోగం లేని లాయర్‌వి. నీ బాధ్యత నీకు తెలియదు. ఎప్పుడు ఎదుటివారి మాటలకి, వాదానికి అడ్డు చెప్పాలో తెలియదు' అంటాడు. లాయర్‌కి చాలా అయోమయంగా ఉండి 'నాకు అర్థం కావటం లేదు. నేను ఎప్పుడు అడ్డు చెప్పాలని నీవు అనుకుంటున్నావు' అని అంటాడు.

అప్పుడు నేరగాడు 'ఎదుటి పార్టీ లాయరు మాట్లాడుతున్నప్పుడు మాత్రం నీవు అడ్డం వేస్తూ వచ్చావు. కానీ జడ్జి గారు నన్ను నేరగాడుగా చెబుతున్నప్పుడు మాత్రం నీ పెద్ద నోటిని మూసుకొని ఉన్నావు. అప్పుడే కదా లాయర్‌గా నీవు అడ్డు చెప్పాలి' అంటాడు కోపంగా.

మీ జీవితంలో మీకు జరిగిన విషయానికి ప్రపంచాన్ని నిందించటం చాలా తేలిక. కానీ మీరు కొంచెం లోపలికి వెళ్ళి, మీ అంతరంగంలోకి చూస్తే మీకు జరిగిన విషయాలకి మీరు ఎలా బాధ్యులో అర్థమవుతుంది. మీరు మీ జీవితంలో ప్రతిక్షణం వర్తమానంలో ఉండకుండా, మీరు మాట్లాడిన మాటలకి, చేసిన పనులకి బాధ్యతని తీసుకోకుండా, మీరు చాలా పనులు అచేతనస్థితిలో చేస్తుంటారు. ఎప్పుడెతే ఆ పనుల ప్రభావం కనపడటం ప్రారంభమవుతుందో, మీరు ఆ ఫలితాలు నాకు వద్దు అంటారు.

మీ మేధ ప్రకారం పనిచేయటం అంటే మీరు ప్రతి నిముషం మాట్లాడే మాటలు, పనుల బాధ్యతని తీసుకోవటమే. ఉదాహరణకి; మీరు వినయంగా ఉంటే వారికి లోబడిపోయాను అనుకుంటారు. వినయంగా లేకపోతే అపరాధభావంతో ఉంటూ అయ్యో వినయంగా ఉండవలసింది అని అనుకుంటారు. ఈ డైలమా, ఈ అయోమయం నుంచి బయటికి రావాలంటే మీరు ఆ సమయంలో మీ మేధని సృష్టతలో అనుసరిస్తూ మీ పనులకి, మాటలకి మీరే బాధ్యత తీసుకోవాలి. అప్పుడు మీరు ఎవరినీ బాధ పెట్టరు. మిమ్మల్ని బాధించుకోరు. మీరు ఎదిరించిన వ్యక్తికి కూడా వివేకంతో ప్రతిస్పందించగలుగుతారు.

ఇప్పుడు, ఇక్కడ

ఒక జోక్ చెబుతాను; ఒక సేల్స్‌మాన్ కస్టమర్‌ని పిలిచి బాస్ లోపల ఉన్నారా? అని అడుగుతాడు. కొత్త ఆఫీసు అసిస్టెంట్, 'మీరు సేల్స్‌మాన్ లేదా బిల్లు కలెక్టరా లేక స్నేహితుడా' అని అతణ్ణి అడుగుతాడు. అప్పుడు సేల్స్‌మాన్ కొంచెం ఆలోచించి 'ఈ మూడు' అని జవాబు ఇస్తాడు. అసిస్టెంట్ 'అలా అయితే బాస్ బిజినెస్ కాన్ఫరెన్స్‌లో ఉన్నారు, ఊళ్ళో లేరు, లోపలికి వచ్చి ఆయనని కలవండి' అని అంటాడు.

మామూలుగా మనం యంత్రాల్లా స్పందిస్తాం. సందర్భాన్ని అనుసరించి మనం స్పందించం. ఎవరెనా మిమ్మల్ని అవమానపరిస్తే మీరు ఆ విషయం పైన ఏం చేయబోతున్నారో తెలుసుకోక ముందే కోపం తెచ్చుకుంటారు.

గౌతమబుద్ధుని జీవితం నుంచి ఒక చక్కని సంఘటన : ఒక సారి ఒక వ్యక్తి బుద్ధుడిని అందరి ముందు అవమానించాడు. ఆయన శిష్యుడైన ఆనందుడు బుద్ధునితో, 'నాకు అతని మీద చాలా కోపం వచ్చింది. నీవు ఎందుకు మౌనంగా ఉండిపోయావు' అంటాడు. అప్పుడు బుద్ధుడు ప్రశాంతంగా 'నీవు నన్ను ఆశ్చర్యపరుస్తున్నావు. అతను ఏం మాట్లాడుతున్నాడో అది అర్థం లేనిది. అప్పుడు నీవు ఎందుకు కోపం తెచ్చుకోవటం? నిన్ను నీవు ఎందుకు శిక్షించుకుంటావు. అది తెలివితక్కువతనం. ఎవరో తప్పుచేస్తే నీవు దానికి ఎందుకు బాధ పడతావు?'

గట్టిపడిపోయిన అహంకారం కంటే కాలంతో కదులుతూ, జీవితంతో ప్రవహిస్తూ, చైతన్యసపంతిలా ఉండటమే మేధ అంటే. మనం మేధతో ఉండటానికి బద్దకిస్తాం. ఎందుకంటే నిరంతరం అప్పటి అవసరాలకి స్పందించాలంటే ఎరుకతో, మెలుకువతో ఉండాలి.

వర్తమానంలో ఉండటం అంటే రక్షణ లేకుండా జీవించటం. దానికి ధైర్యం, మేధ అవసరం. నిజానికి జీవితంలో రక్షణ అనేదే ఒక ఊహ. తరువాత క్షణంలో ఏమి జరగబోతుందో మీరు ఎలా చెప్పగలరు. మీరు ఏది ఊహించినా అది గతంలో మీరు చూసినదాని ఆధారంగానే

ఉంటుంది. భవిష్యత్తు ఇంకా రాలేదు. అది తెలియని బహుమతి కాబట్టి మీరు ఎపుడూ ఏది జరగబోతూంది అనే విషయాన్ని ముందుగా ఊహించలేరు.

వ్యక్తుల్ని, సందర్బాల్ని, జీవితాన్ని ఆహ్వానించండి

మేధ అంటే జీవితానికి ఆహ్వానం. అది వ్యక్తుల్ని, సందర్భాల్ని జీవితంలో ప్రతిదాన్ని ఆహ్వానించటమే. మీరు చూసే మీ జీవితంలో కొన్ని విషయాలు ఎలా జరగాలో, ఇలా ఉండాలి అనే ఆశలు, అశించటాలు, కొన్ని భావాలు ఉంటాయి. చేతులు చాచి విప్పారి ఉంటే జీవితాన్ని స్వీకరించటానికి మీరు సహాయపడతారు. రేపు వాతావరణం ఎలా ఉండాలో నియమాలు విధించగలరా మీరు. లేదు. అటువంటప్పుడు ఇంట్లో వాతావరణం అంటే భార్య, పిల్లలు మానసికస్థితి (మూడ్) ఎలా ఉండాలో మీరు ఏ విధంగా నిర్ణయిస్తారు.

ఒక విషయం అర్థం చేసుకోండి. మనం రెండు పనులు చేయవచ్చు. ఒకటి కావలసిన వివరాలు సేకరించి, వాదాలు తయారు చేసుకొని, నిర్ణయాలు (తీర్పు) చెప్పవచ్చు. రెండవది, ముందుగా నిర్ణయాలు చేసి దానికి వాదాలు తయారుచేసి, వాటికి అనుగుణంగా వివరాలు సేకరించవచ్చు.

మనం చాలాసార్లు ముందు నిర్ణయాలు చేసేసి, ఆ నిర్ణయానికి అనుకూలంగా ఉండే సంఘటనల్ని మాత్రమే తీసుకుంటాం. ఉదాహరణకి: మీరు మీ భార్య / భర్త పట్ల ఒక అభిప్రాయానికి వస్తారు. ఇప్పుడు మీరు భార్యని షాపింగ్‌కి రమ్మంటే అతను ఏమంటాడో తెలుసు. అదే విధంగా మీ భార్యని మీరు ఫుట్ బాల్ ఆట చూడటానికి రమ్మంటే ఏమంటుందో తెలుసు. ఈ ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు కొన్నింటి ఆధారంగా మీరు చాలా విషయాలలో చాలా నిర్ణయాలు వారి పైన / వారి గురించి చేసేస్తారు.

వారు వారిలో పెంపొందించుకునే జ్ఞానం పట్ల, వారి మేధ పట్ల మీరు ఎపుడూ గౌరవం చూపరు, దాన్ని గుర్తించరు. అసలు సమస్య ఏమిటంటే మీలోని సహజమేధనే మీరు గుర్తించలేరు, ‌జ్ఞానాన్ని నమ్మరు.

మెదడుకి అతీతంగా ఉండేదే మేధ

ఒక రోజు తండ్రి, కొడుకు ఒక మామూలు రోడ్డు పక్కన ఉన్న ఒక హోటల్‌లో రాత్రి ఉండటానికి నిర్ణయించుకుంటారు. ఇద్దరూ పడుకున్నాక, తండ్రి కొడుకుతో 'భయపడకు, దేవదూతలు చూస్తూ ఉంటారులే' అంటాడు. అప్పుడు కొడుకు 'అవును, నాకు తెలుసు. అప్పుడే ఇద్దరు నన్ను కొరికి వెళ్ళారు' అంటాడు.

మేధతో పనిచేయటం అంటే చిన్ననాటి అమాయకత్వంలోనికి వెళ్ళటమే. ఇది ఏదోగా అవ్వటానికి జరిగే పద్ధతి కాదు. ఏదో కొత్తది పొందటం కాదు. ఇది మీ లోపలి అసలైన ఉనికిని కనుగొనటమే. మీ అసలైన మీరు అంటే ఏమిటో తెలుసుకోగల ద్వారం. మీరు కేవలం మేధావి అయితే మెదడు నుంచి, మీ తర్కం నుంచి (జ్ఞానం) మాత్రమే పని చేస్తారు.

ఒకచిన్నకథ : ఒక వ్యక్తి తత్వశాసంలో పి. హెచ్.డి. చేసుంటాడు. ఆయన తన పరిశోధనలో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు. అతని భార్య తన భర్త తనని మరిచిపోతాడేమో అనే భయంతో అతనికి గుర్తు చేయాలి అని అనుకుంటుంది. ఆమె అతనితో 'హనీ! నీవు నన్ను అంతగా ప్రేమించటానికి ఒక కారణం చెప్పగలవా? అని అంటుంది. అతను భార్య వైపు సీరియస్‌గా చూస్తూ 'నీవు అంతగా ప్రేమించటం' అంటే అర్థం ఏమిటి? అంత లోతుగా అని అనుకుంటున్నావా? లేక అంత ఎక్కువా లేక వెల్లడిచేసే పద్ధతి గురించి అడుగుతున్నావా అని అడుగుతాడు.

మీరు మీ జ్ఞానంలో ఎక్కువగా చిక్కుకుపోయి ఉన్నప్పుడు మీ జ్ఞానం, తర్కంతో జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు అనుకుంటారు.

మరొక చిన్న కథ : ఒక వ్యక్తి నీరు పోయే గొట్టాల పని (ప్లంబింగ్)లో డిగ్రీ పాస్ అవుతాడు. అతను స్నేహితులతో కలసి నయాగరా జలపాతం చూడటానికి వెళతాడు. అతను జలపాతాన్ని చూసి 'నేను దాన్ని ఆపగలను (నిలపగలను) అని అనుకుంటున్నాను' అంటాడు.

మీ జ్ఞానం అన్నింటినీ తెలుసుకున్నాను అనే ఒక కపటమైన ఊహని ఇస్తుంది. అది మీరు మీ జ్ఞానంలో స్థిరపడిపోయేలా చేస్తుంది.

మీలో మేధ మేల్కొంటే, మీరు తల నుంచి హృదయంలోకి, తర్కం నుంచి ప్రేమలోకి వస్తారు. అప్పుడు మీరు కేవలం మేధ నుంచి కాకుండా కేవలం భావావేశాల నుంచి కాకుండా, ప్రేమతో కూడిన మేధ నుంచి పని చేస్తారు. అప్పుడు మీరు అప్రయత్నంగా మీ చుట్టూ ఉన్నవారి మీద కరుణని చూపిస్తారు.

ఆలోచించటం కాదు, అర్థం చేసుకోవాలి

ఒక చిన్న కథ : ఒకసారి ముగ్గురు జ్ఞానులు, జీవితం గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలి అని ఒక పట్టణానికి వెళుతుంటారు. వాళ్ళు చాలా పెద్ద నగరంలోకి వెళతారు. వారికి దూరంగా ఒక ఎత్తైన బహుళ అంతస్తుల భవనం కనిపిస్తుంది. అది ఏమిటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు.

వాళ్ళు ఏంచేయాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. దాని దగ్గరకి వెళ్ళి చూడటానికి వారికి భయం అనిపిస్తుంది. అందులో ఏదైనా ప్రమాదం ఉండవచ్చు అని భయపడతారు. దానిలోంచి బయటికి రాలేకపోతే ఎలా అనుకుంటారు. కాబట్టి లోపలికి వెళ్ళే ముందు, అందులోంచి ఎలా బయటికి రావాలో తెలుసుకోవాలి అని అనుకుంటారు. వాళ్ళు తమ గత అనుభవాల ఆధారంగా దాన్ని విశ్లేషించి అన్ని రకాల దారుల్ని, పద్ధతుల్ని తయారు చేస్తారు. అన్ని విశ్లేషణలు అయ్యాక, వారు ఇలా అనుకుంటారు, 'అది మనిషి కంటే పెద్దది. కాబట్టి రాక్షసుల వంటి అతి పెద్ద ఆకారగల ప్రాణులదై ఉండవచ్చు. కాబట్టి అక్కడికి వెళ్లటం క్షేమం కాదు' అని ఒక నిర్ణయానికి వస్తారు. ఇంత గొప్ప విషయాన్ని తెలుసుకున్న తృప్తితో వారు తిరిగి తమ ఊరికి వెళ్ళిపోతారు.

గత అనుభవాల జ్ఞానంతో మీరు అర్ధం చేసుకోగలది చాలా తక్కువ. మీరు మనస్సులో ఒక విషయం గురించి అనుకుని దానితో ఆ విషయాన్ని అర్ధం చేసుకోలేరు. మీరు దాన్ని చూసి అర్థం చేసుకోలేరు. ఒక వ్యక్తి ఒక బకెట్లలో నయాగరా జలపాతం నీరు చూసి నాకు నయాగరా జలపాతం గురించి బాగా తెలుసు అంటే ఎలా ఉంటుందో ఇదీ ఆ విధంగానే ఉంటుంది.

మీరు ఆలోచనల మీద ఆధారపడతారు, ఎందుకంటే మీలోని సహజంగా అర్థంచేసుకోగల శక్తి పని చేయకుండ చేసుకున్నారు. అర్థం చేసుకోగల శక్తి మీలో ఉండేట్లు చూస్తే, మీరు ఇంకా ఏమీ ఆలోచించనవసరం లేదు. ఎవరైతే అవసరాలని అర్థం చేసుకోరో ఆ వ్యక్తి ఆలోచించాలి.

మరొక విషయం: మీరు కేవలం మీకు తెలిసిన విషయాన్ని గురించి మాత్రమే ఆలోచించగలరు. మీకు జరిగిన అనుభవం గురించి ఆలోచించగలరు. కానీ, మీకు తెలియని విషయం గురించి మీరు ఆలోచించగలరా? కేవలం అటువంటి వాటి గురించి ఊహిస్తారు. అది కూడా మీరు గతంలో చూసిన దాని ఆధారంగా మాత్రమే.

ఆలోచించినప్పుడు మేధ, సత్యం శక్తి అక్కడ ఉండవు. కాబట్టి మీకు స్ఫురించే జవాబు పరిమితమైన అనుభవం నుంచి మాత్రమే వస్తుంది. ఆ జవాబు తిరిగి మరి కొన్ని అనుమానాలు, ప్రశ్నలకే దారి తీస్తుంది.

అర్థం చేసుకోవటమే మేధ. అది కొత్తగా స్వచ్చతతో ఉంటుంది. అది స్పష్టంగా ఉంటుంది. కాబట్టి అది తిరిగి మరొక ప్రశ్న అనేది రాకుండా జవాబుని ఇస్తుంది. ఆ జవాబు మీ అంతరాత్మ నుంచి వస్తుంది. కాబట్టి అది సత్యం. ఒక వేళ జవాబు నాకు తెలియదు అని వచ్చినా మంచిదే. అమాయకత్వం, సత్యానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే లేనిది ఉన్నట్లు భావించటం కంటే ఇదే మంచిది.

గతజ్ఞాపకాల నుంచి వచ్చే జవాబులు కాకుండా, వర్తమానం లోనికి చేతనస్థితి నుంచి పని చేయటాన్నే అర్థం చేసుకోవటం అంటారు.

మనస్సు – యజమానా లేక ఒక ఉపకరణమా?

మనసు లోంచి వచ్చేవే ఆలోచనలు. మనస్సు ఒక అద్భుతమైన యంత్రాంగం. అయితే సమస్య ఎక్కడ ఉంటుందంటే, ఆ మనస్సు మీ చేతిలో ఒక పనిముట్టులా కాకుండా మీ యజమాని అయినప్పుడు.

ఒక చిన్నకథ : ఒక రాజుగారి దగ్గర చాలా నమ్మకసుడైన సేవకుడు ఉండేవాడు. అతను ఎంతగా రాజుకి నమ్మకసుడంటే రెండు – మూడుసార్లు తన జీవితాన్ని ఫణంగా పెట్టి రాజుగారి ప్రాణాలు కాపాడాడు.

అటువంటి ఒక సందర్భంలో రాజుగారు చాలా సంతోషపడి, ఆ వ్యక్తిని నీకు ఏంకావాలో కోరుకోమని అంటాడు. ఆ సేవకుడు, 'నాకేమీ అవసరం లేదు మహారాజా! మీరు నాకు సమస్తం ఇచ్చారు' అని వినయంగా జవాబు చెబుతాడు. కానీ రాజుగారు అతణ్ణి బలవంతం చేస్తాడు. చివరికి అతను, 'మీరు నిజంగా నాకు వరం ఇవ్వదలచుకుంటే నన్ను ఒక్క రోజు ఈ దేశానికి రాజుని చేయండి' అంటాడు.

అది విన్నరాజు కొంచెం అసౌకర్యంగా భావిస్తాడు కానీ అతనికి మాట ఇచ్చాడు. కాబట్టి, ఒప్పుకుంటాడు. మర్నాడు ఉదయం సేవకుడు రాజు అవుతాడు. అతను సింహాసనాన్ని అధిష్టించగానే భటుల్ని పిలిచి రాజుని చంపమని చెబుతాడు. రాజు నిర్ఘాంతపోయి అతనితో, 'నీవు ఏం మాట్లాడుతున్నావో తెలుసా? అంటాడు. అప్పుడు సేవకుడు 'ఈ రోజు నేనే రాజుని, నేను ఏది తలచుకుంటే అది చేయగలను' అంటాడు. రాజుగారు చనిపోతాడు. సేవకుడు ఎప్పటికీ రాజుగా ఉండిపోతాడు.

అర్థం చేసుకోండి, ఇదే విధంగా ఎప్పుడెతే అధికారాన్ని మనస్సుకి ఇస్తామో అది మన జీవితాన్ని నియంత్రిస్తుంది.

మనస్సు అనేది రేడియో లాంటిది. కానీ దాన్ని ఎలా ఆపాలో మీకు తెలియటం లేదు. అందుకే అది మీలోని మేధని మీరు చూడగలిగే ఖాళీని, అవకాశాన్ని మీకు ఇవ్వటం లేదు. అందుకే మీరు విరామంగా ఉండటాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోతున్నారు. మీరు అలసిపోతున్నారు, బలహీనులవుతున్నారు.

మనస్సు లోతుల లోనికి

మీరు ఈ చిన్న ఎక్సర్‌సైజు చేయండి. అది మీ మనస్సు లోతులతో దాని లక్షణాల్ని మీకు చూపిస్తుంది. మీరు ఒక పేపర్, పెన్ తీసుకొని, మీకు వచ్చిన ఆలోచనల్ని ఆ పేపర్ మీద రాయండి. నిజాయితీగా రాయండి. దాన్ని ఎడిట్ చేయకుండా వచ్చిన ఆలోచన వచ్చినట్లే రాయండి. ఆలోచన రాగానే రాయండి. అలా ఐదు నిమిషాలు రాయండి. ఆ తరువాత మీరు ఏం రాసారో చదవండి.

అది చదివి మీరు నిర్ఘాంతపోతారు. ఒక ఆలోచన ఇక్కడ జరిగిన విషయం మీద ఉంటే, మరొక ఆలోచన అమెరికాలో ఉన్న మీ కూతురి గురించి ఉంటుంది. ఆ తరువాత మీ చిన్నప్పటి స్కూలు టీచర్ గురించి ఉంటుంది, అక్కడ రోడ్డు మీద అరచిన కుక్క గురొస్తుంది. ఆ పేపరు ఒక పిచ్చాసుపత్రిలా ఉంటుంది. మీరు ఆ పేపరు మీద రాసిన విషయాల్ని విశ్లేషిస్తే, మన ఆలోచనలు స్వతంత్రమైన, ఒక దానితో మరొక దానికి ఎటువంటి సంబంధం లేని, అర్థం లేని విషయాలని మీకు తెలుస్తుంది. మనస్సు అంటే ఈ విధంగా అర్థం లేని, ఒక దానితో మరొక దానికి సంబంధం లేని ఆలోచనల సమూహం అని అర్థమవుతుంది.

ఆలోచనలకి గట్టి పునాది ఉండదు అని అర్ధం చేసుకోండి. మనస్సు అని మనం పిలిచేదే ఒక ఊహ. అది ఒక దానితో మరొక దానికి ఎటువంటి సంబంధం లేని ఆలోచనల సమూహం. అవి కేవలం ఊహలు. అవి ఖాళీ గాలి బుదగల్లాంటివి. మీరు తెలుసుకునే తత్త్యం అనే వేలితో ఆ గాలి బుడగలని అంటుకుంటే అవి పేలిపోతాయి. ఆ ఖాళీ బయట ఉన్న అనంతంలో ఐక్యమెపోతుంది.

మీరు చేయవలసింది కేవలం మీ ఆలోచనల్ని గమనించటం, తెలుసుకునే తత్త్వంతో ఉండగలగటం. అప్పుడు క్రమంగా మీ ఆలోచనలు తగ్గుతాయి.

మీరు గమనించటం అనే బాణాన్ని ఉపయోగిస్తే ఆలోచనలు జీవించలేవు. మేధ ఆలోచనల్ని చక్కగా గమనించగలదు.

శరీరమేధ

మీలో ఎంత మందికి మన శరీరం వెల్లడిచేయగల మేధ గురించి తెలుసు?

జీర్ణాశయం తాలూకు మేధ

ఉదాహరణకి మన జీర్ణాశయాన్ని తీసుకోండి. ఆహారాన్ని రక్తంగా మార్చే ప్రక్రియ ఎంత కష్టమెందో, ఎంత సున్నితమైందో కదా – రకరకాల ఆహారాన్ని శరీరాన్ని నడిపే శక్తిగా మార్చటమే దీని పని. కొన్ని అడుగుల పేగులలో జరిగే పని బయట ఇండస్ట్రీలో చేయాలంటే ఎన్ని మైళ్ళ గొట్టాలు కావాలో కదా!

జీర్ణక్రియ మన నోటి దగ్గర ప్రారంభమవుతుంది. మనం ఆహారాన్ని నమిలే సమయంలోనే జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. చిన్న, పెద్ద శరీర భాగాలు ఆశ్చర్యం గొలిపే పనులు చేస్తాయి. మనం ఆహారం మింగగానే అది గొంతు ద్వారా పేగు లోనికి వెళుతుంది. అక్కడే ఉన్న గాలి గొట్టం (శ్వాసనాళం) లోనికి వెళ్ళకుండా తిన్నగా ఆహారనాళం లోనికి వెళ్ళే అమరిక ఎంత అందమైన అమరికో కదా! ఎలాస్టిక్ సంచిలా ఉండే జీర్ణాశయం లోనికి అహారం వెళుతుంది. అక్కడదే శక్తిమంతమైన జీర్ణక్రియ జరుగుతుంది. అహారంలో ఉన్న పదార్గాల ప్రకారం జీర్ణకియ మారుతూ ఉంటుంది.

మనలో ఉన్న జీర్ణశక్తిని సంస్కృతంలో జఠరాగ్ని అంటారు. అది ఒక యాసిడ్. జీర్ణాశయం అత్యంతసున్నితమైన భాగం. కానీ అందులో చాలా శక్తిమంతమైన యాసిడ్స్ ఉంటాయి. అవే ఆహారం జీర్ణమయ్యేలా చేస్తాయి. ఆ యాసిడ్స్ నుంచి పేగుల్ని మ్యూకస్ పొరరక్షిస్తూ ఉంటుంది. ఆ జీర్ణాశయం గోదల దగ్గర యాసిడ్ అంత శక్తితో ఉండదు.

మనం లోపలికి తీసుకునే రకరకాల ఆహారపదార్ణాలు కొన్ని గంటలలో జీర్ణమై శక్తిగా కలసిపోతాయి. ఒకసారి ఊహించండి. ఇందులో ఏ విషయమూ మనకి తెలియవలసిన అవసరం లేదు. అంతా ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. మన రుచులకి అనుగుణంగా సర్దుకుపోతుంది.

అక్కడి నుంచి ఆహారం చిన్న పేగుల లోనికి వెళుతుంది. జీర్ణక్రియలో చాలా భాగం ఇక్కడే జరుగుతుంది. జీర్ణమైన ఆహారం మన వ్యవస్థ లోనికి సులభంగా వెళ్ళేలా ఉంటుంది. ఆహారంలో కావలసిన పోషకాలు వ్యవస్థలోనికి వెళ్ళేది ఇక్కడే. కార్బోహైడేట్స్, ప్రోటీన్స్ సూక్ష్మ భాగాలుగా మారి, కాలేయంలోనికి వెళతాయి. అక్కడ మరి కొంత ప్రక్రియ జరుగుతుంది.

ఆ తరువాత పెద్ద పేగులలోనికి వెళుతుంది. అందులో నీటిని గ్రహిస్తుంది. ఆ తరువాత వ్యర్థాలతో బయటికి పోతుంది. జీర్ణక్రియ గురించి కొన్ని ప్రాథమిక విషయాలు మాత్రమే చెప్పాను. కానీ శరీరంలో అది చాలా క్లిష్టతరమైన, చాలా కచ్చితంగా జరిగే ఒక పద్ధతి.

రక్తంలో చక్కెర స్థితిని నియంత్రించటానికి ఎంత చక్కని పద్దతి ఉందో కదా! మనం ఆహారం తీసుకోగానే రక్తంలోని చక్కెర స్థాయి పెరుగుతుంది. రక్తం మన శరీరంలో చాలా ముఖ్యభాగం. అది చక్కెరని దాని స్థాయిని గమనిస్తూ ఉంటుంది. అలా కాకపోతే, మనలో చాలా భాగాలు కిడ్నీలు, కళ్ళు, నరాలు – ఇవన్నీ కూడా పాడైపోతాయి. డయాబెటిక్ రోగులకి ఇదే జరుగుతుంది.

మనలో ఉండే పాంక్రియాస్ ఇన్సులిన్‌ని తయారు చేస్తుంది. అదే మన రక్తంలోని చక్కెర స్థితిని తగ్గిస్తుంది. దాని వల్ల రక్తంలోని చక్కెర స్థాయి తగ్గదు, ఎక్కువ అవ్వదు. ఆహారం తీసుకున్నాక కూడా క్షేమంగా ఉంటుంది. ఎప్పుడైనా రక్తంలో చక్కెర స్థాయి తగ్గితే వెంటనే కాలేయం నుంచి చక్కెర రక్తం లోనికి విడుదల అవుతుంది.

ఏదైతే రక్తంలోని చక్కెరని తగ్గించే ఇన్సులిన్‌ను తయారుచేస్తుందో అదే పాంక్రియాస్ మరొక హార్మోన్ గ్లూకాజెన్ అనే చక్కెరని పెంచే హార్మోనుని కూడా తయారు చేస్తుంది. ప్రతి నిముషం రక్తంలోని చక్రెరని శరీరం అద్భుతంగా నియంత్రిస్తూ ఉంటుంది. అది ఎక్కువ తక్కువ కాకుండా చూస్తుంది.

మెదడుకి ఉండే మేధ

ఉదాహరణకి మనిషి మెదడుని తీసుకోండి. రెండు గుప్పిళ్ళ సైజు ఉన్న మెదడులో అద్భుతమైన మేధ పని చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఈ నాటికి కూడా సైంటిస్టులు మెదడులా పని చేయగలదాన్ని సృష్టించలేకపోయారు.

ఈ మధ్యనే వచ్చిన ఒక రిపోర్టులో, పదిమంది ఆంగ్లభాషాప్రవీణులు పది సంవత్సరాలపాటు ఇంగ్లీషు భాషని అధ్యయనం చేసి, విశ్లేషించగలిగినవారు కేవలం ఐదు సంవత్సరాల పాప భాష నేర్చుకునే శక్తితో కంప్యూటర్ ప్రోగ్రాం చేయలేకపోయారు.

కంప్యూటర్ కొన్ని లక్షల లెక్కల్ని ఒక సెకండ్‌లో చేయగలుగుతుందేమో గాని, ఒకేసారి మెదడు సెకండ్‌లో లక్షవ భాగంలో చేసే రకరకాల పనులు మాత్రం చేయలేదు.

గుండె తాలూకు మేధ

మీరు చూస్తే అర్థమవుతుంది. గుండె, శరీరం ఎంతో అద్భుతంగా ఒక దానికి తోడు మరొకటి పని చేసాయి. గుండెలో ఉండే సహజమైన పేస్ మేకర్ ప్రతి కొన్ని సెకంద్స్‌కి విద్యుత్తరంగాల్ని పంపిస్తూ ఉంటుంది. అవి శరీరమంతా వెళతాయి. అప్పుడు శరీరంలోని ప్రతి కణానికీ తెలుస్తుంది. అది ఒక కణంతో మరొకటి అనుసంధానం అవుతాయి. ఈ తరంగాల వల్ల ప్రతి కణం తన ప్రత్యేక విధుల్ని అది చేస్తూ పక్క కణం చర్యలకి అనుగుణంగా ఉంటుంది. అప్పుడే శరీరం అంతా ఒకే విధంగా పనిచేయగలుగుతుంది.

పంపిణీ మేధ

మానవశరీరం ఒక కణంలో ప్రారంభమై అది 250 రకాల కణాలుగా అభివృద్ధి చెందుతుంది. ఒక్కసారి ఊహించండి. ఒక కణం ఎన్నో రకాలైన ప్రత్యేకకణాలుగా రూపొంది అవి క్లిష్టమైన శరీర భాగాలుగా అభివృద్ధి చెందుతాయి. అంతే కాదు, ఈ కణాలు తమ ప్రత్యేకవిధుల్ని చేస్తాయి. ఒక సెకండ్‌కి కొన్ని లక్షల పనుల్ని చేస్తాయి. అవన్నీ శరీరం చేసే పనులకి అనుగుణంగా ఉండాలి. ఇదే పంపిణీ మేధ అంటే.

శరీరమేధపై విశ్వాసం ఉంచండి

ఒక్కసారి ఆలోచించండి; మన శరీరం ఆహారాన్ని జీర్ణింపచేస్తుంది, రకాన్ని అన్ని భాగాలకీ పంపిస్తుంది. పరిసరాలకి తగిన విధంగా మారగలుగుతుంది. అంతే కాకుండా బయట ఎవరి సహాయం లేకుండా కొన్ని వేల పనుల్ని చేస్తుంది. శరీరంలో మేధ అనే ఒక శక్తి ఉందని మీరు తెలుసుకోవాలి. ఆ శక్తి మిమ్మల్ని ముందుకి నడుపుతుంది. ఈ విషయాన్ని మీరు కొంచెం ఆలోచిస్తే మీకు శరీరమేధస్సు అనేది ఉన్నదని మీకు తెలుస్తుంది. దీన్ని మనం గమనించం. ఎందుకంటే అది నిశ్శబ్దంగా తన పనిని తాను చేసుకుంటూ వెళుతుంది కాబట్టి.

ఒక చిన్న కథ : ఒక రాజుగారు జ్ఞానోదయమైన బౌద్ధ గురువు దగ్గరకి వెళ్ళి 'మీరు జ్ఞానోదయమైన గురుదేవులు అని విన్నాను. నిరంతరం మీ చుట్టూ శక్తి వ్యాపిస్తూ ఉంటుంది. మీరు నిరంతరం పరమానందంలో ఉంటారు. మీరు దీనికి ఏం చేస్తారు? అని అడుగుతాడు.

బౌద్ధగురువు, 'నేను తినే సమయంలో తింటాను, నిద్ర పోయే సమయంలో నిద్ర పోతాను' అని జవాబు ఇస్తాడు.

మీరు అడగవచ్చు, 'మేమూ అదే చేయటం లేదా'? అని. మీరు మీ జీవితం లోనికి చూడండి. మీరు భోజనం చేసే సమయంలో మీ సమస్యలు, బాధలు, వ్యథలు అన్నింటినీ తీసుకువస్తారు. రేపు చేయబోయే పనిని, సెలవు రోజు చేయబోయే పనులకి ప్లానింగ్ చేస్తుంటారు. తినటానికి సమయం లేదు అంటూ గబగబా తినేస్తారు. మీరు భోజనం చేసేటప్పుడు నిజంగా భోజనం చేయరు. అదే విధంగా మీరు నిద్ర పోయేటపుడే ఆ రోజు జరిగిన విశేషాల్ని విశ్రేషిస్తారు. మీరు తినేటపుడు మీ అంతరాత్మ ఏ మాత్రం ఆహారాన్ని తీసుకుంటున్న దానితో ఉండదు. మీరు తెలుసుకునే తత్వంలో భోజనం చేస్తే మీరు ఎప్పుడూ బరువుగా అనుకోరు. అదే విధంగా మీరు ఎక్కువ తినరు. మీరు ఎంత, ఏది ఎప్పుడు తినాలో శరీరమేధ నిర్ణయిస్తుంది. మీరు మీకు ఏ ఆహారం కావాలో ఎరుకతో స్పష్టంగా తెలుసుకోవచ్చు. అదే గొప్ప ధ్యానం. అదే విధంగా మీరు నిద్రపోయినప్పుడు మీరు రిలాక్స్ కాలేరు. మీరు కేవలం వర్తమానంలో ఉండగలిగితే మీరు నిద్ర పోతారు. అది చాలు.

అలవాట్లను వదిలేయొచ్చు

నిజంగా జరిగిన ఒక సంఘటన : ఒకసారి ఒక యువకుడు నా దగ్గరకి వచ్చి సిగరెట్టు మానే విధంగా సహాయం చేయమని అడిగాడు. అతణ్ణి నేను ఆ అలవాటు ఎలా ప్రారంభమైందో చెప్పమన్నాను. అతను ఒక రోజు తన స్నేహితులలో ఉన్నాడు. వారంతా సిగరెట్స్ కాలుస్తున్నారు. ఈ యువకుడు వాళ్ళతో ఉండగా అతణ్ణి వాళ్ళ నాన్నగారు చూసి ఈ అబ్బాయి కూడా సిగరెట్ కాలుస్తున్నాడనుకొని అతణ్ణి బాగా తిడతాడు. ఆ అబ్బాయి ఎంత చెప్పినా నమ్మదు. ఆ అబ్బాయి ఇదంతా చెప్పి చివరలో ఇలా అన్నాడు, 'మర్నాడు సిగరెట్స్ కొని కాల్చాను. మా నాన్నగారు నన్ను నమ్మనందుకు కాల్చాను. క్రమంగా దీనికి అలవాటు పడిపోయాను'.

అతను నన్ను మళ్ళీ అడిగాడు ఈ అలవాటుని ఎలా వదలాలని. నేను అతనితో 'అలవాటు వదలవద్దు. సిగరెట్స్ కాల్చు. కానీ ఎవరికో ఏదో చేసి చూపించటానికి కాదు. అంతే కాదు, నీవు సిగరెట్ కాలిస్తే పెద్దవాడినయ్యాను అనే ఫీలింగ్‌తో కాల్చవద్దు. నీవు ఎప్పుడు సిగరెట్ కాల్చాలని తీస్తావో దాన్ని నిశ్శబ్దంగా చేయి. నీవు ఎందుకు సిగరెట్ కాలుస్తున్నావో పూర్తిగా తెలుసుకునే తత్వంలో, పూర్తి స్పృహతో చేయి. చేతనస్థితిలో నీ లోపలికి పొగ వెళ్ళటాన్ని గమనించు. నీవు సిగరెట్ ఎలా పట్టుకున్నావో, ఎలా నోట్లో పెట్టుకున్నావో అంతా పూర్తిగా నీకు తెలియాలి.

కొన్ని రోజుల తరువాత ఆ యువకుడు నా దగ్గరకి వచ్చి నేను ఇక సిగరెట్ కాల్చలేకపోతున్నాను. చేతనస్థితిలో చేయటం, నేను నా లోపలికి పొగని ఎలా పంపించగలను. ఆ తరువాత సిగరెట్ కాల్చటం నాకు అంత అవసరం అనిపించలేదు అన్నాడు. ఆ తరువాత ఆ యువకుడు అన్న మాటలు నాకు సంతోషాన్ని కలిగించాయి. నేను ఇంత కాలం నా శరీరం లోనికి పొగని పంపించి నా శరీరాన్ని ఏ విధంగా బాధపెట్టానో కదా; అని అన్నాడు.

మనం చేసే చాలా విషయాలు మనని వదిలేసాయి. ఇదే సమస్యలకి శాశ్వత పరిష్కారం. అయితే మేధని మేల్కొల్పటానికి కొన్ని రోజుల సమయం పట్టవచ్చు. ఆ సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యవిషయం, ఆశను వదులుకోవద్దు. సంఘం నుంచి నేర్చుకున్న తప్పు జ్ఞానం లోనికి పంపవద్దు. సంఘం నేర్చే నీతి నియమాలలో ఇరుక్కోవద్దు. మీ శరీరానికి ఉన్న సహజమేధపై నమ్మకం ఉంచండి, అది చాలు.

శరీరాన్ని నియంత్రించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు దేన్ని అదుపు చేస్తారో అది మరొక రూపంలో బయటికి వస్తుంది. మీరు అలా చేయాలని చూస్తే అది వ్యతిరేకిస్తుంది. ఇక్కడ మనకి కావలసింది మనం చేసే ప్రతి పనిలోనూ తెలుసుకునే తత్వాన్ని ఉంచటం. అదే విధంగా మనలోని సహజమేధ మీద విశ్వాసం ఉంచటం. అదే మన చుట్టూ ఉన్న నిబంధనలు అనే గోదని పగలగొడుతుంది. ఆ నిబంధనలే మనం అసహజంగా పని చేయటానికి, అచేతనస్థితిలో మనం జీవించటానికి కారణం.

ప్రతి కణానికీ మేధ ఉంది

జీవశాస్త్రంలో మరొక ఆశ్చర్యకరమైన పరిశోధన ఫలితాల్ని శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో తెలియచేసారు. మనకి తెలివితేటలు మెదడులోనే ఉంటాయని నేర్పారు. మెదడు శరీరాన్ని నియంత్రిస్తుంది, అని అనుకున్నాం. శాస్త్రం ఇంత కాలం రక్తప్రసరణ, జీర్ణక్రియ, శ్వాసక్రియ మొదలైన శరీరం పనుల్ని మెదడు నియంత్రిస్తుంది అని చెప్పేది.

ఇప్పుడు ఎపిజెనిటిక్స్ అనే శాస్త్రం అభివృద్ధి చెందింది. అందులో ప్రముఖశాస్త్రపరిశోధకుడు బూస్ లిప్టన్ ఒక పరిశోధన గ్రంథం బిలీఫ్ ఆఫ్ బయాలజీలో ఈ విధంగా చెప్పాడు, 'మెదడు మన శరీరాన్ని నియంత్రించదు. ప్రతి కణంలోనూ మేధ ఉంటుంది. అది సెల్ మెంబ్రేన్‌లో ఉంటుంది', అని.

ఈ మధ్యకాలంలో అమెరికాలోని సాండియా నేషనల్ లాబౌరేటరీస్‌లో జరిగిన పరిశోధనలు కూడా కణాలకి మేధ ఉన్న విషయాన్ని ధ్రువీకరించాయి. శరీరం మీదకి యాంటి జన్ అనే హానికరమైనవి వచ్చినపుడు కణాలు ఏ విధంగా స్పందిస్తాయో వివరించారు. వారు ఏ విధంగా చెప్పారంటే కణానికి ఉన్న పొరలో చాలా చక్కని, క్లిష్టమైన వ్యవస్థ ఉంటుంది. అది యాంటి జెన్‌తో పోరాడగలుగుతుంది. ఇంత వరకూ మనం అనుకున్న విధంగా అది చిన్న నిర్మాణం కాదు.

మన శరీరం మెదడు కేంద్రంగా పని చేసే సాధారణమేధతో పనిచేసే వ్యవస్థ కాదు. మన శరీరంలో మేధ అద్భుతంగా శరీరమంతా విస్తరించి పని చేస్తుంది.

తనకు తాను చికిత్స చేసుకోగల మేధ

విద్యుత్తుకి సొంత మేధ లేదు. బల్బుని పెడితే వెలుగుతుంది.అదే మీ వేలుని పెడితే షాక్ కొడుతుంది. కానీ మీ శరీరంలో నిరంతరం ప్రవహించే శక్తి ఆ విధంగా చేయదు. దానికి చికిత్స చేసే మేధ ఉన్నది. మీ శరీరానికి సహజంగా తనకి తాను చికిత్స చేసుకోగల శక్తి ఉన్నది. మీ వేలి మీద ఒక గాటు పడితే మీరు దాన్ని పట్టించుకోకపోయినా అది మానిపోతుంది. ఈ విషయం మీరు చాలాసార్లు గమనించి ఉంటారు.

మీరూ చికిత్సకులే!

శరీరానికి తిరిగి కొత్త శక్తి పొందే మేధ ఉంటుంది. అది మీ శరీరాన్ని నిరంతరం మారుస్తూ ఉంటుంది. మీ శరీరంలో ఏదైనా ఒక భాగం పాడైతే, తిరిగి దాన్ని పునర్నిర్మించుకోగల మేధ మీ శరీరానికి ఉంది. అయితే మీ అహం కాని, ఆలోచనలు కాని అడ్డుపడితే ఆ కార్యకమం ఆగిపోతుంది. మన శరీరంలో తనని తాను తిరిగి నిర్మించుకోగల మేధ ఉన్నది. నిరంతరం శరీరం తిరిగి నిర్మితమవుతూ ఉంటుంది. అప్పుడు మీరు అడగవచ్చు, 'అలా అయితే అదే వ్యాధి తిరిగి ఎందుకు వస్తుంది అని.' ఎందుకంటే ఆ వ్యాధి మీలో ఉందని మీరు బలంగా నమ్ముతారు కాబట్టి.

మీ ఆరోగ్యం బాగా లేదు అని దృఢంగా నమ్మే మానసికస్థితిని కొనసాగిస్తారు. అదే శరీరం తనకు తాను చికిత్స చేసుకోలేకుండా చేస్తుంది.

మీరు చేయవలసింది కేవలం ఒక్కటే, అది మీ శరీరానికి తనకి తాను చికిత్స చేసుకోగల శక్తి ఉంది అని నమ్మి విరామంగా ఉండటమే.

శక్తి అంటే మేధ. మీ అంతరాత్మ మేధ. కాని సమస్య ఏమిటంటే మీ అంతరాత్మకి మేధ ఉందని మీరు నమ్మరు. మీలోని బలహీనమైన లింకుని చూసి ఆధారంగా మిమ్మల్ని మీరు లెక్కిస్తారు. మీలోని బలహీనత మీరు కాదు. మీరు దాని కంటే ఎక్కువ. ఒక గొలుసు

బలాన్ని అందులో ఉండే బలహీనమైన లింకుతో లెక్క కట్టవచ్చు. కాని మీ ఆత్మశక్తిని ఈ విధంగా లెక్కించకూడదు. మీరంటే ఏమనుకుంటున్నారో అంత కంటే మీరు చాలా అధికులు అని అర్థం చేసుకోండి.

నిత్య స్పిరిచువల్ హీలింగ్ (నిత్య ఆధ్యాత్మికచికిత్స)

నిజానికి మీ శరీరానికి ఎంత పెద్ద వ్యాధినైనా, అది మానసికమైనా, శారీరకమైనా దానికి చికిత్సచేసి మాన్చగల శక్తి ఉన్నది. ఇందులో రహస్యం ఏమిటీ అంటే, మరచిపోయిన ఆ జ్ఞానాన్ని ఉపయోగించగలగాలి. అదే నిత్య ఆధ్యాత్మికచికిత్సశాస్త్రం. ఈ కార్యక్రమంలో మేధని విశ్వశక్తికి అనుసంధానం చేయాలి. విశ్వశక్తి స్వచ్ఛమైన మేధ. ఈ అనుసంధానం దీక్షపొందిన హీలర్ ద్వారా జరుగుతుంది.

కరుణ, మేధ, పరమానందం

ఒక విషయం అర్థం చేసుకోండి : శక్తి అంటే కరుణ, శక్తి అంటే మేధ, శక్తి అంటే పరమానందం. శక్తి, కరుణ, మేధస్సు, పరమానందం అనేవి ఒకే స్థంభానికి ఉన్న నాలుగు పక్కలు. ఈ నాలుగూ ఉన్నపుడు అది అత్యుత్తమచేతనస్థితి.ఇందులో ఏదైనా లేకపోతే అది అచేతనస్థితి. శక్తి మెదడు ద్వారా పని చేస్తే అది హృదయం ద్వారా పని చేస్తే కరుణ, ఆత్మ ద్వారా పనిచేస్తే అది స్వచ్ఛమైన శక్తి. శక్తి ఏ విధమైన రూపాల్లో లేకుండా మన లోపల ఉంటే అది పరమానందం.

మీ జీవితం మీవల్ల నడవదు!

మీరు నిర్ఘాంతపోయే ఒక ముఖ్యవిషయం మీరు అర్థం చేసుకోవాలి. మీ ప్రమేయం లేకుందా మీ జీవితాన్ని నడిపే స్వతంత్ర మేధావ్యవస్థ మీలో ఉంది. మీరు ఏమనుకుంటారంటే నా జీవితం సంతోషంగా గడవటానికి నా ప్రమేయం కావాలి, నేను కల్పించుకోవాలి అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ఏ మేధ అయితే మీరు ఈ భూమి మీదికి వచ్చేలా చేసిందో, ఏ మేధ మీ శరీరాన్ని సృష్టించిందో ఆ మేధ జీవితాన్ని చక్కగా ముందుకి నడుపుతుంది.

మీరు జన్మించినప్పుడు మీ శరీరాన్ని సృష్టించిన మేధని జీవమేధ (బయో మెమొరీ) అంటారు. ఇక్కడ ఈ ముఖ్యమైన విషయాన్ని (సత్యాన్ని) మీరు అర్థం చేసుకోవాలి. మీ శరీరాన్ని మీరే కొన్ని విషయాల్ని సాధించేందుకు వీలుగా కల్పించుకున్నారు. మీరు ఎన్ని సంవత్సరాలు జీవించాలని అనుకున్నారో, ఏ పనులు చేయాలి అని ఈ భూమి మీదికి వచ్చారో దానికి అనుగుణమైన శరీరాన్ని రూపొందించుకుంటారు.

మీరు జన్మించినప్పుడే మీ జీవితాన్ని, మీ సంతోషాల్ని, మీరు ఏమేం చేయదలచుకున్నారో అన్నీ నిర్ణయించుకుంటారు. ఆ జీవమేధకి సరిపడా వివేకం ఉంటుంది. అదే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది, అభివృద్ధి చేస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ఆ గొప్ప మేధ ప్రతిక్షణం మీ లోపల పని చేస్తూ ఉంటుంది. మనలో పరిమితమైన జ్ఞానం ఈ విషయాన్ని తెలుసుకోకుండా చేస్తుంది. అందుకే మనం జీవితం అంటే వర్తమానం కంటే మరేదో అనుకుంటాం. ఆ మేధ మీద నమ్మకం ఉంచి రిలాక్స్ అవ్వగలగటాన్నే నేను భక్తి అంటాను. అత్యుత్తమమేధకి అధీనమవటమే నిజమైన అధీనత. సహజ మేధకి అనుగుణంగా ఉండగలగటమే ఆధ్యాత్మికజీవితం.

భయం, ఆశ కాదు, అనివార్యమైన జీవితాన్ని స్వీకరించాలి

మనలో చాలామంది జీవితాల్ని ముందుకు నడిపేది రెండు విధాలుగా ఉంటుంది. వాటిలో మొదటిది ఆశ – అది జీవితంలో వర్తమానాన్ని స్వీకరించనప్పుడు వస్తుంది. ఈ జీవితం కాకుండా మరేదో కావాలి అని అనుకున్నప్పుడు పుట్టేదే ఆశ. మరొకటి భయం. జరగబోయే విషయాల్ని స్వీకరించలేనప్పుడు వచ్చేది భయం. భయం అంటే భవిష్యత్తుని చూసి భయపడటం. వర్తమానాన్ని స్వీకరించలేకపోతే ఉండేది ఆశ – అదే అవిశాంతి. భవిష్యత్తుని స్వీకరించలేకపోవటమే భయం.

ఈ రెండు విషయాల్లో మనకి అర్థం అయ్యే విషయం ఏమిటంటే అనివార్యమైన జీవితాన్ని స్వీకరించలేకపోవటమే. అనివార్యం అనే మాటని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి.

ధ్యానపద్ధతి – స్వీకరించటం అనే నిత్యసూత్రం

తిన్నగా కూర్చోండి. కళ్ళు మూసుకొని, శరీరాన్ని కదిలించకుండా విరామంగా కూర్చోండి. శరీరం కదలికలు ఆలోచనల్ని కలిగిస్తాయి. మీరు శరీరాన్ని కదిలించకుండా నిశ్చలంగా ఉండగలిగితే మీరు లోతైన నిశ్శబ్దం లోనికి వెళ్ళవచ్చు. మీరు చేతనస్థితిలో, చాలా తీవ్రంగా ఒక ఉద్గేశాన్ని ఏర్పరచుకోవాలి. అది బయట ప్రపంచంలో, మీ అంతరంగంలోనూ ఈ క్షణంలో మిమ్మల్ని మీరుగా స్వీకరిస్తాను అని.

మీకు మీరు ఈ విధంగా చెప్పుకోండి; నాకు బయటి ప్రపంచంలో సరిపడా మంచి విషయాలు, వస్తువులు ఉన్నాయి. నా అంతరంగంలో నాకు సరిపడా మంచి లక్షణాలు ఉన్నాయి. నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను. నేను బయటి ప్రపంచంలో కాని, అంతరంగప్రపంచంలో కానీ ఇక ఏమీ సాధించనవసరం లేదు. నాకు అహంకారం ఉంది. పరవాలేదు. నాలో అపరాధ భావం ఉంది. అయినా పరవాలేదు. భయం ఉంటే అది కూడా పరవాలేదు. అత్యాశ ఉన్నా పరవాలేదు. నాలో ఏవేవి ఉన్నాయి అని అంటారో అవన్నీ పరవాలేదు. నేను మరు నిమిషంలో మరణిస్తాను అని తెలిసినా పరవాలేదు. చేతనస్థితిలో అన్నిటినీ అదే విధంగా స్వీకరిస్తాను అని

నిర్ణయించుకోండి. అది తప్పా కాదా అని అనుకోవద్దు. మీ మనస్సు ఏదైనా అడ్డుపెట్టినా దాన్ని కూడా స్వీకరించండి.

ఈ క్షణాన్ని తీసుకోండి. రాబోయే క్షణాల్ని తీసుకోండి. మీకు ఇంత కంటే దారుణమైంది లేదు అనేది జరుగుతుందేమో అనిపించినా దాన్నీ స్వీకరించండి. అది జరిగినప్పుడు మీరు ఆపలేరు. అనివార్యమైనదాన్ని స్వీకరించండి. దీన్ని 21 నిముషాలు చేయండి. మీలోని మేధ మేల్కొంటుంది. అది ప్రతిక్షణంలో ఏ విధంగా అనుబంధాన్ని పెంచుకోవాలో చూపిస్తుంది. అదే విధంగా సంబంధాలతో, సంఘటనలతో ఏ విధంగా అనుబంధాన్ని పెంచుకోవచ్చునో చెబుతుంది.

విశ్వమేధ – మాక్రోకోసమ్, మైకోకోకోసమ్

మెక్రోకోసమ్ అంటే వ్యక్తిగతమైన శరీరమేధ. అదే విధంగా మాక్రోకోసం అంటే విశ్వమేధ. అదే స్వచ్చమైన శక్తి. విశ్వాన్ని నడిపించే ఆ స్వచ్ఛమైన శక్తి మన శరీరాన్ని కూడా నడిపిస్తుంది.

క్రమంలో గందరగోళం ; గందరగోళంలోనే క్రమం ఉంటుంది

విశ్వాన్ని, మాక్రోకోసమ్‌ని చూస్తే అదంతా ఒక పెద్ద గందరగోళం అనిపిస్తుంది. విశ్వంలో చాలా నక్షతాలు, గ్రహాలు, తోకచుక్కలు ఎన్నో కలిసి ఉంటాయి. అయితే అవన్నీ కూడా చాలా చక్కని క్రమపద్ధతిలో ఉంటాయి. వాటిని నియంత్రించే ట్రాఫిక్ పోలీసు ఉండడు. ఒక్కసారి ఊహించండి, ఒక్క గ్రహం తన గతి నుంచి తప్పితే, ఎన్ని అనర్థాలు జరుగుతాయో కదా! ఆ క్రమం లేకపోతే విశంలో గ్రాహాలు అన్నీ ఒక దానితో ఒకటి ఢీ కొట్టుకునేవి. దీన్నే గందరగోళంలో ఉండే ఒక క్రమపద్ధతి అని అంటాను. విశ్వంలో మనం అనుకునే గందరగోళంలో ఒక చక్కని క్రమం ఉన్నది. విశ్వానికి శక్షితో పాటు మేధ కూడా ఉంది అని చెప్పటానికి ఇది చాలు.

మేధ అంటే విశ్వశక్తి. శక్తి మేధ. అందుకే శక్తి స్వచ్ఛంగా ఉంటే చికిత్స చేయగలుగుతుంది. స్వచ్చమైన విశ్వశక్తికి శరీరంలో ఏ భాగానికి వెళ్ళి చికిత్సచేయాలో తెలుసు. అందుకే శరీరంలో లివర్ (కాలేయం) ఎక్కడ ఉందో కూడా తెలియకుండా దానికి చికిత్స చేయవచ్చు. చికిత్స చేయగల శక్తితో ఆ భాగంలో చికిత్స చేయవచ్చు. శక్తి స్వచ్చమైన మేధ. ఎప్పుడెతే విశ్వంలోని క్రమ పద్ధతిని తెలుసుకుంటామో మనం పరమానందస్థితికి చేరవచ్చు.

విశ్వంలో గందరగోళంలో చక్కని క్రమం ఉంది అని మనం ఎలా తెలుసుకోగలిగామో అదే విధంగా మనలో ఒక పద్ధతి క్రమం అనుకునే దానిలో గందరగోళం ఉంది. ప్రస్తుతతం మనం ఒక పద్ధతి ఒక క్రమం అనుకునే దానిలో గందరగోళం ఉంది. ప్రస్తుతతం మనం ఒక పద్ధతిలో ఉన్నాం అనుకుంటాం. ఎందుకంటే మన చుట్టూ ఒక చిన్న హద్దుని చూస్తున్నాం. ఇల్లు, ఆఫీసు, కొద్దిమంది బంధువులు, ఈ విధంగా చూస్తాం. అందుకే చాలా శ్రమపడి దీన్ని ఒక క్రమపద్ధతిలో ఉంచటానికి ప్రయత్నిస్తాం. క్రమపద్ధతిలో లేనివారిని విమర్శిస్తాం.

కానీ సత్యం ఏమిటంటే, మన అంతరంగంలో మనం ఒక చక్కని గందరగోళం. మనం సూక్ష్మవిశ్వం. విశ్వంలో మేధ-అదే అందమైన గందరగోళంలోని క్రమం. ఎపుడైతే ఈ విషయాన్ని మనం అర్ధం చేసుకుంటామో మనం మన పట్ల, ఇతరుల పట్ల కరుణతో ఉంటాం. ఎదుటివారిని విమర్శించటం మానివేస్తాం. నిజమైన క్రమపద్ధతి అంటే విశ్వంలోని క్రమం మాత్రమే అని అర్ధం చేసుకోగలుగుతాం.

కాబట్టి అర్థం చేసుకోండి; మనం ఒక క్రమపద్ధతిలో ఉండాలి అని ఎందుకు అనుకుంటామంటే, మనం హద్దుల్ని చూస్తాం కాబట్టి. మనం ఆ హద్దులని వదిలేస్తే, మనం ఒక క్రమపద్ధతి కోసం చేసే ప్రయత్నాలు ఆపేసాం. అప్పుడు మనం విశ్వకమానికి అనుగుణంగా ఉండగలుగుతాం. అప్పుడు మనలో ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే మనం మనలోని విశ్వచేతన స్థితిని తెలుసుకుంటామో మనలోని క్రమాన్ని తెలుసుకుంటాం. అప్పుడు మనం మనని స్వీకరిస్తాం. ఎదుటివారిని స్వీకరించగలం.

మీరు విశ్వకమాన్ని గందరగోళంలో అనుభవించగలిగితే పరమానందాన్ని అనుభవించగలరు. ఎప్పుడైతే మీ క్రమంలో ఉన్న గందగోళాన్ని తెలుసుకుంటారో కరుణని పంచగలరు.

విశ్వమేధ ప్రతిస్పందన

మనలోని ప్రతి ఆలోచనకీ విశ్వమేధ స్పందిస్తుంది. ఇది నమ్మలేని సత్యం. జపాన్ శాస్త్రవేత్త డా. మసారొ ఎమోటో చేసిన పరిశోధన ఇది నిజం అని నిరూపిస్తుంది.

మన ఆలోచనలకి నీరు ప్రతిస్పందిస్తుంది

డా။ మసారొ ఎమోటో నీళ్ళ మీద ప్రయోగం చేసారు. ఆయన నీళ్ళని కొంచెం కొంచెం తీసుకొని వాటిని మన ఆలోచనలు తెలిసేలా చేసాడు. అంటే వాటిని మన ఆలోచనకి ఎక్స్‌పోజ్ చేసారు. వాటిని గడ్డ కట్టించి, ఆ స్పటికాలని మైక్రోస్కోప్‌తో ఫోటోలు తీసాడు. వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించాడు.

నీళ్ళ మీద ఆయన చాలా పరిశోధనలు చేసారు. వాటి దగ్గర రకారకాల సంగీతం వినిపించారు. కొన్నింటి దగ్గర ప్రార్థనలు చేసాడు. కొన్నింటికి ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వినిపించాడు. చక్కని సంగీతం ఉన్న నీటి క్రిస్టల్స్ ఫోటోలు చాలా అందంగా వచ్చాయి.

వ్యతిరేకఆలోచనలకి ఎక్స్‌పోజ్ చేసిన నీటిని గడ్డ కట్టిస్తే ఆ ఐసు గడ్డలో ఎటువంటి రూపం లేదు. అవి ఆ వ్యక్తి భావాల్ని మాత్రం చూపించాయి.

మీరే మేధ

అదే విధంగా మనం మాట్లాడే మాటలని ఆ నీటి మీద ప్రయోగించి మరొక పరిశోధన చేసాడు. డిస్టిల్ నీళ్ళని చిన్న పిన్న సీసాలలో నింపి వాటి మీద కృతజ్ఞతలు, నీవు మూర్ఖుడివి అని ఇంగ్లీషు, కొరియన్, జపాను భాషల్లో రాసాడు.

ఆ నీటిని గడ్డ కట్టించి, ఆ పలకల్ని మైక్రోస్కోపులో చూస్తే ఒక దానికి మరొక దానికి చాలా తేడాలు కనిపించాయి. కృతజ్ఞతలు ఉన్న నీటి క్రిస్టల్స్ చాలా అందంగా ఉన్నాయి. నీవు తెలివితక్కువదానివి అని ఉన్న నీటి క్రిస్టల్స్ సమతులంగా లేవు.

అదే విధంగా వ్యతిరేక వ్యాఖ్యానాలు ఉన్నవి సరిగా లేవు. అదే ప్రేమ, పొగడ్తలు, శాంతి అని ఉన్న నీటి క్రిస్టల్స్ అందంగా ఒక చక్కని అమరికతో ఉన్నాయి.

ఈ విధమైన మాటలే కాదు, మాటలు చెప్పే సమయంలో గొంతులోని స్థాయి కూడా వాటిలో తేడాలు చూపించాయి. మనం కలిసి చేద్దాం. అని చెప్పిన నీటి క్రిష్టల్స్ విరామంగా ఉన్నాయి. అందమైన చెరీస్ ఉన్న ఫోటో చూపించిన నీటి క్రిస్టల్స్ అదే రంగులో అందంగా ఉన్నాయి.

ఆ తరువాత ఆలోచనలలో వచ్చే మార్పు నీటి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనే దాని మీద పరిశోధనలు చేసారు. జపాన్‌లో భూకంపం వచ్చినప్పుడు నీటి క్రిస్టల్స్ నల్లగా అద్దదిద్దమెన రూపంలో ఉన్నాయి. అవి మనిషిలో బాధని, భయాన్ని చూపించాయి. కొంత కాలం వారికి సహాయం చేసినవారికి ప్రేమ చూపుతూ నీటి క్రిస్టల్స్ అందంగా కనిపించాయి.

డామ్ దగ్గర నీటిని ముందుగా పరిశోధిస్తే అవి అందవికారంగా, దారుణంగా కనిపించాయి. ఒక గంట ఆ నీటి దగ్గర ప్రార్దనలుచేసి, నీరు శుభ్రమవ్వాలి అని కోరుకుని ఆ తరువాత పరిశోధన చేస్తే, ఆ నీటి క్రిస్టల్స్ అందంగా కనిపించాయి.

మన శరీరంలో 70% నీరు ఉంటుంది. భూమి కూడా 70% నీటితో ఉంటుంది. మన ఆలోచనల ప్రభావాన్ని నీటి మీద పరిశోధించాక, ఒకసారి ఊహించండి, మన ఆలోచనలు, మాటలు, ఉద్దేశాలు భూమి మీద ఎంత వ్యతిరేకప్రభావాన్ని చూపిస్తాయో. మన మీద ఎంత ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చరిత్రలో మరొక సంఘటన : భారత్ ను బ్రిటీషు వారు పరిపాలించే రోజుల్లో, వారు ఒక విషయాన్ని గమనించారు. లండన్ నుంచి భారత్ కు మంచి నీరు ఓడలో తెచ్చేటపుడు అది దారిలోనే పాడైపోయేది, కానీ భారత్ నుంచి తీసుకువెళ్ళే నీరు అదే విధంగా స్వచ్ఛంగా ఉండేది. దీని మీద శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేసి ఒక అద్భుతాన్ని కనుగొన్నారు.

భారత్ నుంచి తీసుకువెళుతున్న నీరు కలకతాలోని పవిత్రగంగానది నీరు. ఆ గంగని కొన్ని లక్షల మంది పూజిస్తూ ఉంటారు. ఆ నీటికి బాక్టీరియాని నాశనం చేసే లక్షణం ఉంది.

కొన్ని కోట్డమంది వేల సంవత్సరాలుగా గంగానదికి పూజలు చేస్తున్నారు. వారి పూజలు, ఆ ఆలోచనలు గంగానదిలో ఉన్నాయి. అందుకే గంగానది నీరు పవితమైంది, స్వచ్చమైంది దానికి చికిత్స చేసే శక్తి ఉంది. ఈజిప్ట్ దేశస్థులు నైలునదిని కొన్ని వేల సంవత్సరాలుగా దాని ప్రవాహవేగం, లోతుల మీద చాలా పరిశోధనలు చేసారు. ప్రవాహవేగం, లోతు అనేవి రాబోయే ప్రకృతివైపరీత్యాల్ని తెలియచేసేవి. అవి భూకంపం, తుఫాను వంటివి దగ్గరలోనెనా, దూరప్రాంతాల్లో జరిగినా వారికి ఆ నది ద్వారా తెలిసేది.

ప్రకృతితో సంబంధం

ఎందుకు మనం ప్రకృతికి సున్నితంగా స్పందించలేకపోతున్నాం. ఎప్పుడైతే మీలో అహంకారం వస్తుందో ఆ సున్నితత్వం పోతుంది. నేను ఒక యువకవి జీవితం నుంచి చక్కని సంఘటనని చదివాను. అతను తన ఇంటికి దగ్గరలో ఉన్న అడవి మృగాలతో ఆడుకునే వాడట. ఆ విధంగా చేయవద్దని అతని తండి చాలాసార్లు ఆ యువకుడిని వారించాడు. కానీ అతను వాటి దగ్గరకి వెళ్ళటం మానలేదు.

ఒకసారి అతను ఈ విధంగా చెపుతాడు; నేను వాటి విషయం కొంచెం జాగ్రత్త పడినట్టు ఉన్నా, కొంచెం భయపడినా అవి నా దగ్గరికి రావు. వాటికి, నాకు మధ్య ఎటువంటి సంబంధమూ ఏర్పడేది కాదు. సంభాషణ జరిగేది కాదు.

కాని నేను చక్కగా సంతోషకరమైన మనస్సుతో ఆడుకునే స్థితిలో ఉంటే అవి నా దగ్గరకి వచ్చేవి. మా మధ్య చక్కని అనుబంధం ఉండేది. అవి నాతో ఎంతో అనుబంధంతో ఉండటాన్ని నేను స్పష్టంగా చూడగలిగేవాడిని.

ఇక్కడ అహంకారం అని నేను అన్న మాటకి అర్థం, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని. ప్రకృతిలో వేరుగా ఉండే మనిషిని అనే గుర్తింపు. అది మీలో ఏర్పడినపుడు మీరు ప్రకృతికి దూరమైపోతారు. అమాయకంగా ప్రకృతితో ఏర్పరచుకునే బంధం చెదరిపోతుంది. మనిషికి జరిగే ఒక గొప్ప నష్టం ఇదే.

జన్మతః అంధుడికి అతను ఏది పోగొట్టుకున్నాదో చెప్పలేం. అదే విధంగా ప్రకృతితో అనుబంధాన్ని పోగొట్టుకున్న వ్యక్తికి తాను ఏం పోగొట్టుకున్నాదో అర్థం అయ్యేలా చెప్పటం కష్టం.

ఉద్దేశం శక్తి

'స్పాంటేనియస్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిసెర్' అనే గ్రంథంలో దీపక్ చోప్రా ఒక ఆసక్తికరమైన పరిశోధన గురించి రాస్తాడు. రకరకాల ఉత్తేజకాలకి తెల్ల రక్షకణాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలనేది ఆ ప్రయోగం. తెల్ల రక్షకణాలు బయట ఒక పరీక్షనాళికలో ఉన్నాయి. అకస్మాత్తుగా, పరిశోధకుడికి ఒక అభిప్రాయం కలుగుతుంది. తన చేతి వెనుక చిన్న గాయం చేస్తే బయట టెస్ట్ ట్యూబ్‌లోని తెల్ల కణాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలనిపించి, గాయం చేయటానికి ఒక చాకు కోసం చూస్తుంటాడు. అంతలోనే టెస్టెట్యూబ్‌లోని తెల్ల రక్తకణాలు చాలా ఎక్కువ చైతన్యవంతమవటం అతను గమనించాడు.

పరిశోధకుడు చేతికి గాయం చేసుకోవాలి అనే ఉద్దేశానికే తెల్ల రక్రకణాలు చాలా ఎక్కువగా స్పందించాయి. అతను కనీసం గాయం చేసుకోకుండానే, కేవలం అతని ఉద్దేశానికే స్పందించాయి. మానసికవ్యవస్థలోని ఉద్దేశం భౌతిక స్థితి మీద ప్రభావాన్ని చూపించగలదు అని తెలిసింది. అందుకే ఎప్పుడూ మంచి ఉద్దేశంతో ఉండటం అనేది చాలా ముఖ్యం.

ప్రదేశం అడ్డం కాదు

1987లో గిన్ బెర్డ్ – జిల్ బెర్ బామ్ పరిశోధన అని ఒక ప్రముఖపరిశోధన జరిగింది. ఎలుక్తోఎన్‌సెఫ్‌లో గ్రాఫ్ అనేదాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఇద్దరిద్దరు కలసి ధ్యానం చేస్తుప్పుడు వారి మెదడు తరంగాల్ని కొలిచారు. కొన్ని జంటల్లో మెదడు తరంగాలు ఒకే విధంగా ఉన్నాయి. ఆ విధంగా ఉన్న ఒక జంటలో ఇద్దరినీ పక్కపక్కన కూర్చొని ధ్యానం చేయమని చెప్పి, కొంత సేపయ్యాక వారిని వేరు వేరు గదుల లోనికి మార్చారు.

ఆ తరువాత ధ్యానంలో ఉన్న ఒక వ్యక్తి మీదికి బాగా వెలుతురు వచ్చే లైట్లని ఫోకస్ చేసారు. అప్పుడు ఇ.ఇ.జి. ఆ వ్యక్తిలోని మెదడు తరంగాలు చైతన్యవంతమవటాన్ని రికార్డు చేసింది – కాని చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే:

పక్క గదిలో ధ్యానం చేస్తున్న వ్యక్తి మీద ఎటువంటి లైటు ఫోకస్ చేయకపోయినా ఇవతల గదిలోని వ్యక్తి మెదడులో జరిగిన మార్పులే అతని మెదడులోనూ వెంటనే, ఆటోమేటిక్‌గా జరిగాయి.

అర్ధం చేసుకోండి; మీ మెదడులో ఏం జరిగి మీమీద ప్రభావం చూపిస్తుందో, అదే ప్రభావాన్ని మీ చుట్టు పక్కలవారి మీద కూడా చూపిస్తుంది. ఆలోచనలకి ఒక ప్రదేశం అవసరం కాదు. అవి గాలిలో ప్రయాణించగలవు. అందుకే మీరు ఇంట్లో ఒక బాధని వ్యక్తం చేస్తే అది ఇంట్లో వారందరినీ బరువుగా చేస్తుంది. మీ నుంచి వచ్చే వ్యతిరేకత అంతటా వ్యాపించి అందరినీ ప్రభావితం చేస్తుంది.

మేధ అనేది అనుభవం కాదు; అనుభవం నుంచి నేర్సుకోవలసిన పాఠం మేధ

అంటే మీ దగ్గర ఉన్న సమాచారం కాదు. అది కేవలం జ్ఞానం. మరొక విధంగా చెప్పాలి అంటే, మేధ అంటే మీ అనుభవాలు కాదు కాని అది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు. మీరు వికసించి ఉండి, ఎటువంటి అభిప్రాయాలు, పక్షపాతాలు లేకుండా ఉండి యాదృచ్ఛికంగా ఉన్నప్పుడు అది జరుగుతుంది. మీరు కల్పించుకున్న అభిప్రాయాలతో ఉంటే అర్ధం అవటం అనేది మీ లోపలికి చొచ్చుకొని పోయి, మీరు మేధావులు అవుతారు.

ఉదాహరణకి : ఒక వ్యక్తి వెలుగుతున్న అగ్గి పుల్లని ముట్టుకొని ఇది కాలుతుంది అని తెలుసుకుంటాడు. అ తరువాత వెలుగుతున్న గ్యాస్ ప్లా పట్టుకొని అది కాలుతుంది అని తెలుసుకుంటాడు. ఆ విధంగా అన్నీ తెలుసుకునేసరికి తానే చితి మంటల లోనికి వెళతాడు.

మేధావి అయిన వ్యక్తి మొదటిసారి మంటని ముట్టుకొని అది కాలుతుందని తెలుసుకొని, ఏ మంటైనా సరే కాలుతుంది అని అర్థం చేసుకుంటాడు. ఇంకా మేధ కలిగిన వ్యక్తి కనీసం మొదటిసారి కాలేవరకూ కూడా ఎదురుచూదకుందా, ఎదుటివ్యక్తికి అగ్గి పుల్ల కాలేటప్పుడే అతను మంట ఏదైనా కాలుతుంది అని తెలుసుకుంటాడు.

బుద్ధుని జీవితం నుంచి ఒక అందమైన కథ : ఒక రోజు ఒక తత్వవేత బుద్ధుడి దగ్గరకి వచ్చి, 'మాటలు లేకుండా, మాటలు లేవు అనే భావం లేకుండా, నాకు సత్యాన్ని తెలియచేయండి' అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు నిశ్శబ్దంగా అయిపోతాడు. తత్వవేత్త బుద్ధనికి నమస్కరించి, 'మీరు ప్రేమ, కరుణలతో నాలోని ఊహల్ని తీసేసారు. నేను సత్యమార్ధం లోనికి రాగలిగాను' అని చెప్పి వెళ్ళిపోతాడు. తత్త్యవేత్త వెళ్ళాక ఆనందుదు బుద్ధుడిని, 'ఆ తత్త్వవేత్త ఏం నేర్సుకున్నాడు' అని అడుగుతాడు. అనందుడి ప్రశ్నకు 'మంచి గుర్రం చెర్నాకోలా నీడకి కూడా పరుగెడుతుంది' అని జవాబు ఇస్తాడు.

గుర్రాలు మూడు రకాలు. ఒకటి కొడితే గాని అంగుళమైనా కదలదు. కొట్టినపుడు కొంచెం ముందుకి వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ కొడితేనే ముందుకి కదులుతుంది. రెండవదాన్ని అంతగా కొట్టనవసరం లేదు. కొట్టబోతే చాలు ముందుకి వెళుతుంది. మూడవది చాలా తెలివైనది. కొట్టబోనవసరం లేదు. చర్నా కోల నీడ కనపడితే చాలు అది పరిగెడుతుంది.

బుద్ధుడి దగ్గరకి వచ్చిన తత్వవేత్త సత్యాన్ని తెలుసుకోవాలనే కోరికతో రగిలిపోతున్నాడు. అతనికి సత్యం తప్ప ఏమీ అవసరం లేదు. అతను చాలా మాటలు విన్నాడు. చాలా పద్ధతులు పాటించాడు. అందుకే మాటలు లేకుండా, నిశ్శబం కాకుండా సత్యాన్ని తెలియచేయమని బుద్ధుడిని అడుగుతాడు. బుద్ధుని మౌనంలో అతనికి చర్నా కోల నీడ కనపడింది, అతనికి కావలసిన జవాబు దొరికింది.

భావాత్మక అనుబంధం – మేధకు పెద్ద అద్దంకి

మీరు గతం నుంచి ఏమైనా నేర్చుకోగలిగితే, ఆ గతం మేధలో భాగం అవుతుంది. మీరు దాన్ని స్వచ్చమైన చేతనస్థితిలో, గమనించే భావంతో, వ్యతిరేక లేదా అనుకూల – వ్యతిరేకభావం లేకుండా గతం లోనికి వెళ్ళగలిగితే అది మేధలో భాగం అవుతుంది. అనుకూలభావం అంటే ఆ జ్ఞాపకం పట్ల ప్రేమ, వ్యతిరేకభావం అంటే ఆ జ్ఞాపకం పట్ల ద్వేషం. ఈ రెండు విధాలుగా కూడా ఆ జ్ఞాపకం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒక విషయం అర్ధం చేసుకోండి; జ్ఞాపకం ఎప్పుడూ సమస్య కాదు. దాంతో ఉండే అనుబంధమే సమస్య.

ఆ జ్ఞాపకం పట్ల మీకు ప్రేమ ఉంటే మీరు దాన్ని అభిమాన ఫైలులో భద్రపరుసారు. ద్వేషించేదైతే చెత్తలో వేస్తారు. దాన్ని మీరు చెత్త బుట్టలో వేసినా, దాని మీద ద్వేషంతో అది మరీ మరీ మీ ముందు అపరాధభావంతో వస్తూనే ఉంటుంది. గతంలో మీకు ఉన్న భావాత్మక అనుబంధం మీ జీవితంలో మొదటిది, చివరిది అయిన సమస్య అని అర్థం చేసుకోండి.

జీవితానికి నమ్మకమైన మేధ

మీరు చుట్టూ చూడగలిగితే మీ సమస్యల్ని పరిషురించగల మేధ, శక్తి నిరంతరం కనిపిస్తూ ఉంటాయి. మీరు గనక 50 సంవత్సరాలు జీవించి ఉంటే, మీ అనుభవంతో జీవిత సమస్యల్ని మీరే పరిష్కరించవచ్చు అని అర్దమై ఉంటుంది. ఈ అనుభవం మీద ఆధారపడి ఎటువంటి వ్యథా లేకుందా మీరు మరొక 50 సంవత్సరాలు జీవించవచ్చు.

పరమానందం మీరు సమస్యని పరిష్కరించుకోగల శక్తిని ఇస్తుంది. మీరు పరమానందస్తితిలో లేకపోయినట్లయితే ఆ శక్తి మరిన్ని సమస్యల్ని సృష్టించటానికి ఉపయోగపడుతుంది, అదీ సమస్య. మీరు పరమానందంలో ఉంటే బాధల నుంచి వేరు చేయబడతారు. ఆ శక్తిని సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారు.

భౌతికంగా కూడా పరిశోధనలు ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. మీరు ఆనందంలో ఉన్నప్పుడు మీ మెదడులో దొపామిన్ అనే ఒక రసాయనం విడుదల అవుతుంది. అది మెదడు ముందు బాగాన్ని బాగా ఉత్తేజపరుస్తుంది. మెదడు భాగం మేధకి తెలివికి సంబంధించినది. అప్పుడు ఆ భాగం బాగా పనిచేస్తుంది. మీరు నిజంగా పరమానందంలో ఉన్నప్పుడు మీరు అత్యున్నత మేధస్సు తో పనిచేయగలుగుతారు. మీరు ఎప్పుడెతే కొన్ని నిమిషాల పాటు బాధ లేకుండా ఆనందంలో ఉంటారో అప్పుడే మీకు కొత్త కొత్త ఊహలు, సృజనాత్మక ఊహలు మీ లోపల నుంచి వస్తుంటాయి.

జ్ఞానం వర్సెస్ మేధస్సు

మన విద్యావ్యవస్థ మొత్తం సమాచారాన్ని విశ్లేషించటం మీద ఆధారపడి ఉన్నది కాని మేధ మీద కాదు. అది జ్ఞానం, మాటల ఆధారంగా ఉంటుంది కాని మీ దృష్టికి తెలిసిన వాటి వల్ల కాదు.

మీరు సమాచారం ఆధారంగా ముందుకి సాగితే, మేధని పొందే శక్తిని పోగొట్టుకుంటారు. మీరు హేతుబద్దంగా, తార్కికంగా తర్కాన్ని అర్థం చేసుకుంటే తర్కం అసలు తార్కికంగా ఉండదు అని అర్థం అవుతుంది. జీవితం తర్కం కాదు. జీవితాన్ని పాపంచిక తర్కంతో, జ్ఞానంతో వివరించలేం. జ్ఞానం కంటే అది అత్యుత్తమస్తాయిలో ఉంటుంది.

మేధావి ప్రతి నిమిషం వర్తమానంలో జీవిస్తాడు కాని తర్కంతో కాదు. అతను అప్పు తెచ్చుకున్న జవాబుల్ని నమ్మడు. అతను పరిస్థితి తీవ్రవతని గమనిస్తాడు. దానికే సూటిగా ప్రతిస్పందిస్తాడు.

జ్ఞాని ఫోటోగ్రాఫ్ లాంటివాడు. అతని మీద గతం బొమ్మ ఉంటుంది. మేధావి అద్దం లాంటివాడు. అతను సత్యాన్ని ప్రతిబింబిస్తాడు, దానికి స్పందిస్తాడు. అందుకే అతను అప్రయత్నంగా ఉంటాడు.

జ్ఞానం ఒక ఉపకరణంలా ఉన్నంతవరకూ అది చక్కని పద్ధతి. అది మిమ్మల్ని నియంత్రించకూడదు. మీరు జ్ఞానాన్ని పక్కన పెడితే మీ లోపల మేధ మేల్కొంటుంది. అపుడు మీరు మీ హద్దుల నుంచి కాకుండా మీ కేంద్రం నుంచి పని చేస్తారు. మీ కేంద్రం అనేది స్వచ్ఛమైన మేధాశక్తి.

మేధ తిరిగి కనుగొనవచ్చు. దాన్ని ధ్యానం ద్వారా మాత్రమే కనుగొనవచ్చు. ధ్యానం సంఘం సృష్టించిన అడ్డంకుల్ని, ఆటంకాల్ని తొలగిస్తుంది. మీ మేధకి అడ్డుపడే అన్నింటినీ తొలగిస్తుంది. దాంతో అది చక్కగా ప్రవహిస్తుంది.

మేధకి ధైర్యం కావాలి. సాహసం అంటే ప్రేమించగలగాలి! మీరు నిరంతరం తెలియని దానిలోనికి వెళుతూ ఉంటే, తెలియని సాగరం లోనికి వెళుతూ ఉంటే, మీ మేధ పెరుగుతూ ఉంటుంది. అది పదును అవుతుంది. అది ప్రతి నిమిషం తెలియనిదానిని ఎదుర్కొంటేనే పెరుగుతుంది.

జ్ఞానం అనేది ఒక మానసిక క్రీడ. అది సృజనాత్మకంగా ఉండదు. అది ఒక ఊహ. కాని సృజనాత్మకత కాదు. మేధ సృజనాత్మకమైనది. ఎందుకంటే అది విశ్వశక్తిలో భాగం కాబట్టి.

తప్పుల నుంచి మేధ

ఒక చిన్న కథ : ఒకసారి ఇద్దరు సాహస వేటగాళ్ళు బాగా చిక్కటి అదవి లోనికి వెళ్ళి, వారి ప్రాంతాలలో కనపడని జంతువుల్ని వేటాడాలి అని నిర్ణయించుకుంటారు. అడవి లోనికి వెళ్ళటానికి విమానం అద్దెకి తీసుకుని అడవికి వెళతారు. అడవి అంతా తిరుగుతూ చాలా జంతువుల్ని వేటాడతారు. కొన్ని రోజులు గడిచాక విమానంతో పైలట్ వారిని వెనక్కి తీసుకువెళ్ళదానికి వస్తాడు. అతను ఇద్దరు వేటగాళ్ళని, అక్కడ ఉన్న అడవి దున్న, జీబాలని చూసి ఇంత బరువు ఈ విమానంలో కుదరదు. దేన్నెనా ఒక దాన్ని వదిలేయమని చెబుతాడు.

వారిలో ఒకదు 'కితం సారి మేమువచ్చినపుడు ఏ సైజు విమానం తీసుకున్నామో ఇప్పుడూ సరిగ్గా అదే విధంగా తీసుకున్నాం' అంటారు. పైలట్ సరే అని అన్నింటినీ తీసుకుంటాడు. విమానం కొంచెం పైకి లేవగానే, అది కూలిపోతుంది.

పైలట్, ఇద్దరు వేటగాళ్ళు దెబ్బలు లేకుండా తప్పించుకున్నారు. వేటగాళ్ళలో ఒకరు 'మనం ఎక్కడ ఉన్నాం' అని అడుగుతాడు. దానికి రెండవ వ్యక్తి 'కితం సారి మన విమానం కూలినదానికి కొంచెం అవతల ప్రక్క ఉన్నాం' అని జవాబు ఇస్తాడు.

మీరు మీ జీవితాల్ని గమనించి మీకు డైరీ రాసే అలవాటు ఉంటే, మీరు చేసిన తప్పులనే చేయటం గమనించవచ్చు. గత ఇరవై, ముప్పై సంవత్సరాలలో మీరు చేసిన తప్పులనే చాలా సార్లు చేసి ఉంటారు. కాకపోతే వాటి డిగ్రీ వేరు, స్థలం వేరు, వేరు పద్ధతిలో చేసి ఉండవచ్చు. కానీ తప్పులు మాత్రం దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కొత్త తప్పులు చేయటానికి చాలినంత మేధ అవసరం.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి దాక్టరు దగ్గరకి వచ్చి రెండు చెవుల దగ్గర మంటగా ఉన్నది అంటాడు. డాక్టరు అతన్ని 'ఏ విధంగా రెండు చెవులూ కాలాయి' అని అడుగుతాడు. ఆ వ్యక్తి 'నేను ఫోన్ వచ్చే సమయానికి ఇస్త్రీ చేస్తున్నాను. పొరపాటున ఫోను బదులు ఇస్త్రీ పెట్టె తీసాను' అని జవాబు ఇస్తాడు. డాక్షరు ఆశ్చర్యంగా 'మరి రెండవ చెవి ఎందుకు కాలింది' అని అడుగుతాడు' ఆ వ్యక్తి కోపంగా 'ఆ ఫోన్ చేసిన మనిషే మళ్ళా ఫోను చేసాడు' అని జవాబు ఇస్తాడు.

మీరు మేధతో జీవిస్తే, చేసిన తప్పు మళ్ళా చేయరు. ఎందుకంటే మీరు వివేకంతో ఉంటే ఆ తప్పు లోనికి మీ తెలుసుకునే తత్వాన్ని తీసుకువస్తారు. అందులోంచి పాఠం నేర్చుకుంటారు.

జీవితం ఒక కల అని తెలుసుకోగల మేధ

ఇక్కడ నేను రెండు వాక్యాలు చెబుతాను. వాటిని మీరు అర్థం చేసుకోవాలి. అందులో మొదటిది. మీరు ప్రపంచం అంటే ఏమిటి అని అనుకుంటున్నారో, ఆ విషయాలతో, ఆ పదార్థాలతో చేసినదే మీ కల కూడా. ఇది ముఖ్యమైన వాక్యం. దీన్ని అర్థం చేసుకుంటే మీరు దీన్ని చాలా విధాలుగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి మీ కలని సృష్టించే శక్తిని ఏ విధంగా ఉపయోగించవచ్చునో ఆ శక్తితో మీరు బయటి ప్రపంచంలో వెల్లడి చేయవచ్చు. మీ కలల్లోని శకితో బయటి ప్రపంచాన్ని సృష్టిస్తారు.

రెండవ వాక్యం: మీరు చూసేదంతా మీరు సృష్టించిందే, కాబట్టి దీన్ని మార్చగల శక్తి మీకు ఉంది. మనం మన జీవితం ఒక యాక్సిడెంట్ అనుకుంటాం. అది కాదు. అది యాక్సిడెంట్ కాదు అది ఒక సంఘటన. మీరు ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితం చాలా విధాలుగా మార్పు చెందుతుంది. అది మీ దృష్టిని మార్చుతుంది. అది మీ ఆలోచనలని, కలల్ని స్పష్టం చేసే మీ ఊహల్ని మారుస్తుంది.

మనం చాలాసార్లు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండే లేదా మనకి వ్యతిరేకంగా ఉండే కలలని కంటుంటాం. అదే మనని అయోమయానికి గురి చేస్తుంది. అనవసర కలలతో మన శక్తి వృథా అవుతుంది. ఆ శక్తిని పొదుపు చేసి సరియైన పద్ధతిలో ఉపయోగిస్తే, అప్పుడు మీరు సృష్టించే సత్యం, మీరు ఇప్పుడు ఉన్న సత్యం కంటే గొప్పగా ఉంటుంది.

మీకు మీ కలల్ని సాకారం చేసుకునే శక్తి ఉంది. అంతే కాదు, మీరు నిజం అని చూస్తున్నదంతా కూడా ఒక అందమైన కల అని తెలుసుకోగలుగుతారు. ఈ విషయాలు మీ జీవితంలో మంచి మార్పుని తెస్తాయి. మీ కలల్ని నిజం చేసుకోవటం, ఆ నిజం ఒక కల అని అర్థం చేసుకోవటం మీలో చక్కని మార్పుని తెస్తాయి.

మీరు జీవితంలో ఏది సాధించాలి అని అనుకున్నారో దాన్ని సాధించటానికి మీ ఉద్దేశం అనే శక్తి, సృజనాత్మకశక్తి, కలల్ని ఉపయోగించగల శక్తి అవసరం. ఇవి మీ జీవితాన్ని పరిపూర్ణత్వంతో జీవించగల శక్తిని సృష్టిస్తుంది. అయితే అది నాణానికి ఒక వైపు మాత్రమే. ఇక్కడ శాస్త్రం కూడా వదిలేసిన ఒక ముఖ్యవిషయం – మీరు చూసేదంతా కూడా ఒక కల మాత్రమే అని తెలుసుకోగల మేధ. మీరు దాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే. మీరు మీ లోపల విరామంగా ఉండగలరు. అప్పటివరకూ అసంతృప్తితోనే ఉంటారు. అదే మీలో చెప్పలేని అసహనం, విసుగుని కలిగిస్తుంది.

మేధ, దృష్టి

స్పష్టమైన దృష్టి మేధకి ఆధారం. మీకు స్పష్టమైన అవగాహన లేకపోతే మీరు ఏ ప్రణాళికనీ చేయలేరు. స్వచ్ఛమైన, స్పష్టమైన దృష్టి ఏ విషయాన్నైనా మీకు పూర్తిగా చూపిస్తుంది. అటువంటి దృష్టి లేనప్పుడు మీరు ఒక దాని తరువాత ఒకటిగా ప్రణాళికలు వేయాలి.

జ్ఞానోదయమైన గురువులకి అంతరంగపు మాటలు ఉండవు. వారిలో ఆలోచనల ప్రవాహం ఉండదు. అందుకే వారిలో స్వచ్ఛమైన, అంతిమదృష్టి ఉంటుంది.

ఎవరికైతే స్పష్టమైన దృష్టి ఉంటుందో వారికి ప్రణాళికలు అవసరం లేదు. అప్రయత్నంగా పనులు జరిగిపోతాయి. అటువంటి వ్యక్తి చుట్టూ ప్రణాళికలు అవే తయారవుతాయి. అతనికి ఏదైనా ఒక కొత్త విధానం తెలిసినా అది అందులో చక్కగా అమరిపోతుంది. కేవలం స్వచ్చమైన దృష్టి ఉన్న వ్యక్తి మాత్రమే ప్రణాళికలు వేసి దాన్ని మరింత కొత్తగా తన మేధతో చేయగలడు.

మీరు చాలా ఉదాహరణలు చూడవచ్చు. తిరువణ్ణామల్లె, గొప్ప దేవాలయం ఉన్న చిన్న పట్టణం. అక్కడ ఖాళీ ప్రదేశాన్ని అందమైన ఆశ్రమంలా కేవలం 18 రోజుల్లో చేసాం. 18వరోజున

Part 9: Living Enlightenment (Gospel of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM)_Telugu_part_9.md

12 విగ్రహాల్ని, 1008 శివలింగాలని ప్రతిష్ఠించాం. మంచి భోజన, వసతి సదుపాయాలు తయారయ్యాయి. దీన్ని దగ్గర దగ్గర లక్ష మంది చూసారు. వారంతా సాక్ష్యమే.

ధ్యాన పద్ధతి – జ్ఞానాన్ని వదిలిపెట్టండి

దీన్ని 48 గంటలు ప్రయత్నించండి. మీ సమస్యల గురించి ఆలోచించను అని చేతనస్థితిలో నిర్ధయించుకోండి. అప్రయత్నంగా సమస్యని పరిషరించే మేధ లేదు అని మీకు మీరు చెప్పుకుంటూ మీ జ్ఞానాన్ని ఒక పక్కన పెట్టేయండి. మీకు ఆ ప్రయత్నం చేసే శక్తి లేదు అని చెప్పుకోండి.

మీ సమస్యల్ని ధైర్యంగా, పూర్తి ఎరుకతో పరిష్కరించండి. మీలో మేధ ముందుకి రావటం మీరు గమనించారు. మీరు ఒక పాఠం నేర్చుకుంటారు. మీ జ్ఞానం అనేది అడ్డు రానప్పుడు ఉన్నతమేధ ముందుకి వస్తుంది, అది మీకు పరిష్కారాలు చూపిస్తుంది. దానికి సున్నితంగా స్పందించగలిగితే మీరు ఒక పెద్ద అడుగు వేయగలరు. అప్పుడు మీ సమస్యల పరిష్కారానికి మీరు ఏమీ పని చేయనవసరం లేదు. మీలోని అప్రయత్నమేధతో వాటంతట అవే పరిష్కరింప బడతాయి.

ఆ ஐயா

  • మీ అంతరాత్మని సంపూర్ణంగా వెల్లడి కానివ్వండి. అది ఏకీకృతంగా, సంపూర్ణంగా ఉంటుంది.
  • మీ లోపల సహజమైన, సమయస్ఫూర్తితో కూడిన మేధ ఉంది. ★
  • ★ కొత్త విషయాలకి స్పందించగల సమర్థతే మేధ.
  • ★ ప్రతి క్షణం పూర్తి తెలుసుకునే తత్వంతో జీవించటమే ధ్యానం అంటే.
  • మీ మేధ నుంచి పని చేయటం మీ పనులకి పూర్తి బాధ్యత తీసుకోవటమే. ★
  • ★ మీరు ఆలోచనల మీద ఆధారపడతారు, ఎందుకంటే సహజమేధని మీరు ముందుకి రానీయరు.

మీచుట్టూ ఉన్న బాధ్యతల్ని తీసుకోవటమే జీవన్ముక్తి

మనం ఎవరిమో, మనం ఇక్కడ ఏమిచేస్తున్నామో ఆ వివేకాన్ని పొందిన తరువాత మనం ఎదుటి వారిపట్ల బాధ్యతని తీసుకుంటాం. అప్పుడు మనం స్వతంత్రులం కాదు అని, మనం ఎదుటివారితో అనుబంధంతో ఉంటామని తెలుస్తుంది.

ఒకసారి తమిళనాడులోని ఒక ప్రాంతమంతా టి.బి. అంటువ్యాధిలా వ్యాపించింది. అధికారులు దాన్ని సమర్థవంతంగా అరికట్టి, అది పూర్తిగా పోవటానికి తామే బాధ్యులమని గర్వంగా ప్రకటించారు. మరి అది వ్యాపించటానికి వారే బాధ్యులని చెప్పుకోలేదు. ఆ వ్యాధి వ్యాపించకుండా చూడవలసిన బాధ్యత వారిదే. అదేవిధంగా మన జీవితాలలో మంచి జరిగితే బాధ్యత తీసుకుంటాం కాని చెడు విషయాలకి తీసుకోం. అంటే బాధ్యతని విడివిడిగా అనుకూలంగా తీసుకుంటాం.

ఎప్పుడైతే మనం ప్రతిదానికి బాధ్యత తీసుకుంటామో అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. ఎప్పుడైతే 'నేను బాధ్యుణ్ణి' అని అనుకుంటారో మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు కూర్చుని జాగ్రత్తగా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటననీ పరిశీలిస్తే అన్నింటికీ బాధ్యత మీదే అని తెలుస్తుంది. కానీ సాధారణంగా మన జీవితంలో జరిగిన సంఘటనలకి ఎవరో ఒకరిని బాధ్యుల్ని చేస్తాం. ఒక విషయం అర్థం చేసుకోండి, ఎవరైతే మరింత వికసించాలి అని అనుకుంటారో వారు ప్రతి దానికి ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని బాధ్యతని తీసుకుంటారు.

స్వామి వివేకానంద చాలా చక్కగా చెబుతారు, 'నీవు మోయగలిగినంత బాధ్యతని తీసుకో, ఎక్కువ బాధ్యతని తీసుకుంటే ఎక్కువ విస్పృతం అవుతారు అదే అభివృద్ధి అంటే. విస్పృతం కాలేకపోతే కుచించుకుపోయి మరణిస్తారు'.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి చారిటీ క్లబ్బులో బాధ్యతమీద చక్కని ఉపన్యాసాన్ని ఇస్తూ ఒక సంఘటన చెప్పాడు. ఒకరోజు నేను, నా స్నేహితుడూ నడుస్తూ వెళుతుంటే ఒక వ్యక్తి రోడ్డుమీద పడిపోయి ఉన్నాడు. ఎవరూ అతణ్ణి పట్టించుకోలేదు. అంతేకాదు మేం తిరిగి వెనక్కి వచ్చేటప్పటికి కూడా అతను అలాగే పడి ఉన్నాడు.

ఎదుటివారిని తప్పుపట్టే బదులు మనలోనికి చూద్దాం. సమస్యల పరిష్కారానికి ఏమి చేస్తున్నామో గమనిద్ధాం. మనం నిరంతరం ఎదుటి వారిని తప్పుపట్టటానికి సిద్ధంగా ఉంటాం. కాని సమస్య పరిష్కారానికి మనం ఏమి చేసాం?

మీరు ఎక్కువ బాధ్యత తీసుకునేకొద్దీ అభివృద్ధి చెందుతారు. మీ చుట్టూ జరిగే విషయాలకి బాధ్యత వహించినప్పుడే మీరు నాయకుడిగా అవుతారు. అప్పటి వరకూ మీరు కేవలం అనుచరులు మాత్రమే.

కరుణ అంటే బాధ్యత, శక్తి

నన్ను ఒకరు 'స్వామీజీ! నిరంతరం మీలో అంతశక్తి ఎలా ఉంటుంది?' అని అడిగారు. ఎప్పుడైతే మీరు బాధపడే వారిపట్ల కరుణ చూపిస్తారో అది బాధ్యతగా మారుతుంది. అదే శక్తిగా వెల్లడి అవుతుంది. అంతే. ఎవరైనా ఎదుటివారి బాధలపట్ల బాధ్యత తీసుకుంటారో వారి నుంచి శక్తి ప్రసరిస్తూ ఉంటుంది.

యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? పన్నెండు. రామకృష్ణ పరమహంసకి పదహారుమంది. అంత కొద్దిమంది శిష్యులైనా, వారు తీసుకున్న బాధ్యత వలన ఆ మిషన్స్ అంతగా విస్పృతం అయ్యాయి.

మీరు స్పష్టంగా తెలుసుకోండి, ఎప్పుడైతే మీరు ఎదుటివారి అభివృద్ధికి బాధ్యత తీసుకుంటారో అప్పుడే మీరు ఆ బాధ్యతని వహించగలరు. ఎప్పుడైతే ఎదుటివారికి అవసరమైంది ఏదైనా సరే చేస్తాను అని మీరు నిర్ణయించుకోగలిగితే మీ నుంచి శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. మీలో దివ్యశక్తి ప్రవేశిస్తుంది. ఈవిషయం గురించి కొంచం విశ్లేషించండి, మీకు లోతుగా అర్థం అవుతుంది.

మూసుకుపోయిన వెదురు నుంచి గాలి వెళుతుందా? లేదు. ఆ కొర శవాల్ని మోయటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది ఖాళీ అయినప్పుడే మురళిగా మారుతుంది. మీరు కేవలం మీ గురించి మాత్రమే ఆలోచిస్తే మీరు మూసుకుపోయిన వెదురులా పని చేస్తారు. మీ అహంకారం నుంచి బయటికి వచ్చి బాధ్యతని తీసుకుంటే, మీరు విస్తృతం అవుతారు, మురళిలా మారతారు. దానిలోంచి గాలి వెళ్ళి సంగీతాన్ని సృష్టిస్తుంది.

ఒక గొప్ప మార్పు

మీరు బాధ్యత తీసుకుంటే మీలో గొప్ప మార్పు కలుగుతుంది. మీ మానసికవ్యవస్థలో మార్పు వస్తుంది. మనలో చాలామంది బానిసలుగా ఉంటాం. మీరు పని చేసే చోట బాధ్యతతో చేస్తే మీరు ఉల్లాసంగా ఉంటారు. ఉదాహరణకి సొంత వ్యాపారం చేసే వ్యక్తి, అందులో పని చేసే వ్యక్తిని చూడండి. యజమాని పూర్తి బాధ్యత వహిస్తాడు కాని అందులో పని చేసే వ్యక్తి

ఎటువంటి బాధ్యతని తీసుకోదు. అందుకే అతనిలో ఎటువంటి ప్రోత్సాహం, ఉత్సాహం ఉండదు. అతనికి జీతం తీసుకున్న రోజు మాత్రమే ఒక ఉత్సవం. కాని యజమానికి ప్రతి రోజూ ఉత్సవమే. ఎందుకంటే అతను బాధ్యతని తీసుకుంటాడు. బాధ్యత తీసుకుంటే గొప్ప విషయాలు సాధించవచ్చు. బాధ్యత తీసుకున్నప్పుడు మీరు ఒక దృఢమైన శక్తిగా మారతారు. అప్పటివరకూ మీకు మీరు, ఎదుటివారికి బరువుగా ఉంటారు.

రామకృష్ణ పరమహంస చక్కగా చెబుతారు, సన్యాసి భగవంతుని గురించి ఆలోచించాలి. ఇది గొప్ప విషయం కాదు. కాని సంసారి భగవంతుని గురించి ఆలోచిస్తే అది గొప్ప విషయం, సన్యాసి భగవంతుని గురించి ఒక్క క్షణం మరిచిపోయినా అది పాపం. కాని సంసారి భగవంతుని గురించి ఒక్క నిమిషం తలచినా అది పుణ్యం. అదే విధంగా నాయకుడు బాధ్యత వహించాలి, అది గొప్ప విషయం కాదు. కాని అతని జూనియర్ బాధ్యత తీసుకుంటే ఆ సంస్థలో అందరూ ప్రోత్సాహాన్ని పొందుతారు.

కింది స్తాయిలో పనిచేసేవారు అందరినీ ప్రోత్సహించటానికి అవకాశం ఎక్కువ. కాబట్టి బాధ్యత తీసుకోవటానికి అధికారం కావాలి అని చూడవద్దు. అంతే కాదు, మీరు ఏదో తక్కువ స్థాయిలో ఉన్నారు అని అనుకోవద్దు. మీలో ఆ గొప్ప మార్పు జరిగేలా చూడండి.

మీ మానసికవ్యవస్థలో అది జరగాలి. ప్రస్తుతం మీ మానసికవ్యవస్థ మిథ్యలో ఉంది. ఊహలతో ఉంది. మీ మనస్సు బయట ప్రపంచంలోని బాధల్ని, దుఃఖాల్ని వెతుకుతూ ఉంటుంది. మీరు లోతుగా పరిశీలిస్తే, మీరు ఏదైనా సంతోషంలో మునిగినప్పుడు అకస్మాత్తుగా బాధలు లేవేమిటి అనుకుంటారు. వెంటనే బాధగురించి ఆలోచిస్తారు. బాధల్ని పోగుచేసుకుంటారు.

మిథ్య అంటే లేనిదాన్ని వెతకటం. మనం మిథ్యనుంచి నిత్యకి మారాలి. అదే వర్తమాన స్థితి. అదే మీలో రాగల పెనుమార్చు. మీరు బాధ్యత తీసుకున్నప్పుడే ఆ మార్పు మీలో కలుగుతుంది.

మీరు కేవలం 24 గంటల సేపు బాధ్యతతో ఉంటే పూర్తి కాని పనులన్నీ పూర్తి అవుతాయి. మీ జీవనసరళి పూర్తిగా మారిపోతుంది. మీరు కొత్త ఆనందంతో వికసిస్తారు. మీలో చక్కని పారవశ్యం నిండుగా ఉంటుంది. మీరు సహజమైన నాయకుడుగా తయారవుతారు. జీవితం ఒక ఉత్సవంలా ఉంటుంది.

మీరు ఎప్పుడైతే బాధ్యతని తీసుకుంటారో, మీరు విస్తృతం అయి, నాయకునిలా కనిపిస్తారు. నాయకుడు సింహాసనం మీద కూర్చుని, ఏ బాధ్యతా తీసుకోకుండా, ఎదుటివారిని అన్నింటికీ బాధ్యుల్ని చేస్తే అతను చిన్నవాడుగా కనిపిస్తాడు. మీ స్థితి మీకు ఆ అధికారాన్ని ఆ హోదాని ఇస్తుంది కాని హోదా స్థితిని తీసుకురాదు. నిత్యానందస్థితి వేరు నిత్యానంద హోదా వేరు.

సేవా నిబద్ధత

స్వామి వివేకానంద తన మిషన్ లక్ష్యం ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ – 'మోక్షం పొందటం, మానవసేవ' అని చెప్పారు. దీని అర్థం మానవసేవ చేయకుండా, ప్రపంచానికి మంచి చేయకుండా మీరు మోక్షం గురించి మాట్లాడకూడదు.

భగవంతుడు బాధ్యతలతో ఉన్న వ్యక్తిని ప్రేమిస్తాడు. వారి కోసం దిగివస్తాడు. అందుకే నేను ఎప్పుడూ చెబుతుంటాను, మీరు బాధ్యతని తీసుకుంటే శక్తి మీలో ప్రవహిస్తుంది అని.

అహంకారం Vs బాధ్యత

మీరు బాధ్యతని తీసుకున్నప్పుడు సమస్యలు కరిగిపోతాయి. మీలో కొత్త మేధ మేల్కొంటుంది. మీరు అహంకారులు అనుకోవద్దు. అహంకారం, బాధ్యత వేరు, వేరు విషయాలు. మీరు బాధ్యత అని అనుకున్నప్పుడే ఆసక్తితో ముందుకి వస్తారు. మీరు అహంకారంతో ఉండరు. నేను అందరి కంటే బాగా చేసాను అనుకున్నప్పుడు మీ లోనికి అహంకారం వస్తుంది. ఎప్పుడైతే అహంకారం ఆటలు మొదలవుతాయో, మీరు బాధ్యతని తీసుకోలేరు.

బాధ్యత అంటే గంభీరత కాదు – ప్రపంచం ఒక కల మాత్రమే

బాధ్యతతో ఉండటం అంటే గంభీరంగా ఉండటం కాదు. నిజాయితీగా ఉండటం. గంభీరంగా ఉంటే అహంకారాన్ని పెంచుతారు. మీరు నిజాయితీగా ఉంటే జీవితం పట్ల సృష్టతతో ఉంటారు. అప్పుడు జీవితానికి అనవసరమైన ప్రాధాన్యమివ్వరు. మీరు జీవితాన్ని ఉరకలెత్తే ఉత్సాహంతో తీసుకుంటారు. అమాయకత్వంతో, అప్రయత్నంగా ఉండగలుగుతారు.

చిన్న పిల్లల ప్రపంచం అంటేనే ఉత్సాహం, అమాయకత్వం. అతను నా పెన్సిల్ తీసుకున్నాడు, నా చాక్లెట్ నాకు ఇచ్చేయి…. ఈ విధంగా ఉంటుంది. మనందరం అదే అమాయకత్వంలో ఉన్నవారమే. అవి గుర్తు వస్తే మనకి ఏమనిపిస్తుంది. మనం ఎంతో ఆహ్లాదంగా నవ్వుకుంటాం.

మనం ఒక్కసారి మన బాల్యానికి వెళదాం. మన ఐదారు సంవత్సరాల వయస్సులో పెన్సిల్ ముక్క కోసం ఎంత పోట్లాడామో. మీరు ఇంకా పెద్దవారవుతారు, అప్పుడు మీ స్నేహితుడు మరొకరితో సరదాగా ఉంటే మీరు భరించలేరు. ఇప్పుడు ఆ విషయాలు గుర్తుకు వస్తే నవ్వుకుంటారు. పెద్దవారిని, యువత సమస్యల గురించి చెప్పమంటే అవేమంత పెద్ద విషయాలు కాదు అంటారు. ఈ విధంగా చూస్తూ వెళితే మనం ఈ స్థితులన్నీ దాటుతూ ఉంటాం. చివరికి ఈ స్థితులకి అతీతంగా ఉండే స్థితికి చేరతాం. అదే ఆనందాన్ని అనుభవించే ఆనందస్థితి. ఆ స్థితి మన జీవితంలోని మిగిలిన స్థితులకి అతీతమైన స్థితి.

మీకు పీడ కల వచ్చినపుడు, మీ ప్రియమైనవారిని పోగొట్టుకొని దుఃఖిస్తున్నట్లు కల వస్తే అందులో అంతు లేని బాధని అనుభవిస్తారు. అకస్మాత్తుగా మిమ్మల్ని నిద్ర లేపితే, 'ఓ! ఇది కలేనా!' అని రిలాక్స్ అవుతారు. ఈచిన్న విషయం అర్థం చేసుకుంటే, జీవితాన్ని జీవించటం తెలుస్తుంది. కల మాయం అయితే మనలో ప్రశాంతత ఏర్పడుతుంది.

శివుడు, ఈ ప్రపంచమంతా ఒక కల అంటాడు. ఈ విషయాన్ని ఎంత మంది ఒప్పుకుంటారు. మీరు ఈ ప్రపంచాన్ని నిజం అంటారు. ఎందుకంటే మీరు దాన్ని ఆ విధంగా అనుభవించారు.

మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాటినే స్వీకరిస్తాం. అనుభవం లేనివాటిని ఒప్పుకోం. కాబట్టి మనం చేయగలిగేది మన అంతరంగం లోనికి వెళ్ళి ఆనందస్థితిని తెలుసుకుని దాన్ని అనుభవించాలి.

మనం మధ్యవయస్సులో ఉన్నప్పుడు చిన్ననాటి పనులు నవ్వు తెప్పిస్తాయి. పెద్దవారం అయ్యాక మధ్యవయస్సు సమస్యలు నవ్వు తెప్పిస్తాయి. మనం అంతిమస్థితిని తెలుసుకున్నప్పుడు జీవితంలో జరిగిన ప్రతీదీ ఒక ఆటలా కనిపిస్తుంది. అప్పుడు జీవితం అనే ఆటని అందంగా ఆడవచ్చు. దానిలో గొంతు వరకూ మునిగిపోయినా సరే దాంతో ప్రభావితం కారు.

విశ్వాసం, సహనం

నేనెప్పుడూ ఒక విషయం చెబుతుంటాను, మీకు ఎంతో కొంత శక్తి ఉందని దాని మీకు తెలియకుండా ఆ పనిని పూర్తి చేసే శక్తి మీ లోనికి వస్తుంది. మీరు తీసుకున్న బాధ్యతలకి అనుగుణంగా మీలో శక్తి కలుగుతుంది. మీరు బాధ్యత తీసుకునే కొద్దీ మీ అంతరంగం విస్పృతం అవుతూ ఉంటుంది. అది ఎంత విస్పృతం అయితే మీ లోనికి అంత శక్తి ప్రసరిస్తుంది.

మీ చుట్టుపక్కల జరిగే విషయాలకి అప్రయత్నంగా బాధ్యత వహిస్తే, మీరు నాయకుడుగా ఎదుగుతారు. మీరు మీ జీవితాన్ని, ఎదుటివారి జీవితాల్ని మార్చగలుగుతారు. చేతనస్థితిలో అభివృద్ధి చెందటానికి బాధ్యత తీసుకోవటం ఒక పద్ధతి.

మీరు రెండు విషయాలు చేస్తే చాలు; జీవితం మంచిది అని నమ్మాలి. మీరు ఎంత బాధ్యత తీసుకుంటారో అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతారు అని తెలుసుకోవాలి. మరొక విషయం, ఆ ఎదుగుదల జరిగే సమయంలో సహనంతో ఉండండి. ఆ మార్పు జరిగే కాలంలో సహనంతో ఉండటాన్నే నేను తపస్సు అంటాను. షిరిడీ బాబా ఒక విషయాన్ని చెబుతారు, శ్రద్ధ, విశ్వాసం, సహనం అని, అదే జీవితసారాంశం.

మీరు జీవితంలో మరింత విస్పష్టం అవుతారు అనే నమ్మకం మీరు తీసుకున్న బాధ్యతల్ని నెరవేర్చేంతగా మిమ్మల్ని ఎదగనిస్తుంది. ఆ విస్పష్టం అనేది జరుగుతున్నంత సేపూ మీరు సహనంతో ఉండాలి అంతే. అంతకు మించి మరేమీ అవసరంలేదు.

మనకి నమ్మకం కాని, సహనం కాని ఉంటుంది. అందుకే మనం మన గతాన్నే తిరిగి భవిష్యత్తులో తయారు చేస్తాం. మన జీవితంలో ఒక పెద్ద మార్పుని ఎందుకు తీసుకురాకూడదు? మన జీవితం ఒక కొత్త స్థితికి తీసుకు వెళ్ళగలుగుతుంది అని నమ్మం. అందుకే మీకు సహనం, నమ్మకం కావాలి. ఒక సూక్రుసత్యం ఏమిటంటే మీరు ఎక్కువ బాధ్యతని తీసుకుంటే మీ లోనికి ఎక్కువ శక్తి ప్రవహిస్తుంది. అది మీ ద్వారా వెల్లడి అవుతుంది. దానికి అనుగుణంగా మీరు అభివృద్ధి చెందుతారు.

ఎదుటివారి కోసం బాధ్యత తీసుకోవటం

చేతనస్తితిలో ఎదగగల ఒక పద్దతి బాధ్యతని తీసుకోవటం. ఎదుటివారి కోసం బాధ్యతని తీసుకోవటం అనేది జ్ఞానోదయం పొందగల ఒక సాధనపద్దతి. దీన్నే భగవద్దీతలో కర్మయోగం అన్నారు. మీరు కర్మ చేయాలి అని నిజంగా అనుకున్నప్పుడు, మీరు ఎదుటివారి బాధ్యత తీసుకున్నప్పుడు, మీరు ఫలితాల్ని అసలు పట్టించుకోరు. కరుణతో, బాధ్యతతో పని చేస్తారు.

మీ నుంచి పొంగి ప్రపహించే శక్తితో, కరుణతో, బాధ్యతతో పని చేయటమే ఆధ్యాత్మిక జీవితం అంటే. భయం, ఆశతో కాకుండా మీ నుంచి పొంగి ప్రవహించే బాధ్యతతో పని చేయడమే ఆధ్యాత్మికజీవితం.

జ్ఞానోదయబాధ్యత

ఒక విషయం అర్ధం చేసుకోండి, జ్ఞానోదయం బాధ్యతతో వస్తుంది. మీలో అత్యధికమైన కరుణ తాలూకు ఒత్తిడితో వస్తుంది. ఒత్తిడి అనేది సరియైన మాట. మీ అంతరంగం మొత్తం కరుణతో నిండి, ఆ ప్రకంపనల్ని ప్రపరిస్తూ ఉంటుంది. అది లోతైన, గాధమైన కరుణ.

మీకు ఒక సంఘటన చెబుతాను : ఒక రోజు ఉదయం వివేకానందుడు అకస్మాత్తుగా నిద్ద లేచి, నా కుడి చేతిలో చాలా నొప్పిగా ఉంది అంటాడు. ఆయన వారితో, నా చేతి వైపు సముద్రానికి అవతల ఒక దేశంలో ఏదో ఒక ఉపద్రవం జరుగుతూంది. అదేమిటో తెలుసుకోండి. అవసరమైతే సహాయంగా మన స్వాముల్ని ఎవరినైనా పంపిద్దాం అంటాడు. మర్నాడు వాళ్ళకి ఆ ప్రాంతంలో భయంకరమైన భూకంపం వచ్చినట్లు తెలుసుకుంటారు. స్వాములు చాలా మంది బృందంగా అక్కడ సహాయం చేయటానికి వెళతారు.

వివేకానందుడు ఎంత సున్నితత్వంతో ఉన్నాదంటే, ఎక్కడో బాధని అనుభవిస్తున్న ప్రజల బాధని ఆయన అనుభవించాడు.

జ్ఞానోదయంతో విశ్వం అంతా మీలో ఉన్న అనుభవాన్ని పొందుతారు. జ్ఞానో దయానుభవంతో పాటు గాధమైన కరుణ కూడా మీ లోనికి వస్తుంది. అర్థం చేసుకోండి, జ్ఞానోదయం అంటేనే బాధ్యత. అది కేవలం స్వేచ్ఛ కాదు. అది గొప్ప బాధ్యత కూడా.

స్థితే కాని హోదా కాదు

మనలో చాలా మంది బాధ్యత తీసుకోవాలి అంటే తగిన హోదా ఉండాలి అనుకుంటారు. అది పని చేయదు. మీరు బాధ్యత తీసుకున్నాక మాత్రమే హోదా వస్తుంది. హోదా కోసం ఎదురు చూసేవారు ఎప్పటికీ బాధ్యత తీసుకోరు. హోదా వచ్చాక కూడా బాధ్యత తీసుకోరు. బాధ్యత తప్పించుకోవటానికి మరొక కారణం వెతుకుతారు.

స్పష్టంగా తెలుసుకోండి, బాధ్యత అంటే చేతనస్థితి.

చాలా మంది జ్ఞానోదయం అంటే బంగారు సింహాసనం మీద కూర్చోవటం అనుకుంటారు. ఎవరో ఒకరు భోజనం, ఆశ్రయం ఇస్తారు అనుకుంటారు. అందరూ వారి ఫోటోకి పూజ చేసారు అనుకుంటారు. మీరు ఇలా అనుకుని జ్ఞానోదయం పొందాలి అనుకుంటే మీరు మోసపోయినట్టే, మీరు జ్ఞానోదయమైన గురువుల హోదా కాకుండా ఆ స్థితి చూసి దాన్ని పొందాలి అనుకుంటే మీరు విజయం సాధిస్తారు. మీరు సంతోషంగా ఉంటారు. అదే హోదాకి, స్థితికి ఉన్న తేడా.

ముఖ్య విషయాలు :

    • మీరు బాధ్యత తీసుకుంటే మీలో గొప్ప మార్పు కలుగుతుంది. మీ మానసికవ్యవస్థలో మార్పు వస్తుంది.
    • మీరు ఎప్పుడైతే బాధ్యతని తీసుకుంటారో, మీరు విస్పష్టం అయి, నాయకునిలా కనిపిస్తారు.
  • ★ భగవంతుడు బాధ్యతలతో ఉన్న వ్యక్తిని ప్రేమిస్తాడు. వాని కోసం నిలబడతాడు.
  • ★ బాధ్యతతో ఉండటం అంటే గంభీరంగా ఉండటం కాదు. నిజాయితీగా ఉండటం.
  • ★ మీరు బాధ్యతని తీసుకున్నప్పుడు సమస్యలు కలిగిపోతాయి. మీలో కొత్త మేధ మేల్కొంటుంది. మీరు అహంకారులు అనుకోవద్దు. అహంకారం, బాధ్యత వేరు, వేరు విషయాలు.

నాయకత్వం ఒక స్థితి, హోదా కాదు

జీవన్ముక్తి అంటే జీవితపు అన్ని కోణాల్లో సహజనాయకుడుగా సమర్థంగా జీవించగలగటం

మనం ఇతరులకి బాధ్యత వహించినప్పుడు, మన మీద దృష్టి కేందీకరించం, మనం ఇతరులకి సేవ చేసాం. ఇతరులకి సేవ చేయడం నాయకత్వం. మన అవసరాలు తీర్చుకుంటూ ఇతరులపై శ్రద్ధ చూపించకపోతే నాయకత్వం లోపించిందని అర్థం.

నేపథ్యం

నాయకత్వం, ఒక సంస్థని జయప్రదంగా నడిపించడానికి దాని ప్రాముఖ్యం తెలియడానికి, ఈ రోజులలో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఎందరో గురువులు నాయకత్వం వహించి, సంస్థలలో ఉన్నవారికి నాయకత్వం పెంపొందించడానికి శిక్షణ ఇస్తున్నారు. అయినా మనం అన్ని సంస్థలలో లాభాల కోసం వ్యాపారం చేస్తున్నవారిలో లేదా ఏ ప్రభుత్వ ఉద్యోగంలో వారిని, లేదా సామాజిక సేవా సంస్థల్లో వారిని చూస్తే నాయకులు అరుదుగా కనిపిస్తారు.

మీరు ఏ సంస్థనైనా చూస్తే, అందులో 1% కంటే తక్కువ మంది నాయకులు అవడానికి ఉండి, వారి రంగంలో అభివృద్ధి సాధించి, లాభాలు గడించి – మంచి ఉత్పత్తి సాధించి సమాజసేవ చేస్తున్నారు. వారు ఉద్యోగుల్ని తృప్తిపరుస్తున్నారు. అందుకే నిజమైన నాయకులు విజయం పొందిన వ్యాపార సంస్థలలో 1% ఉంటారు. అంటే, మొత్తం పని చేసేవారిలో 0.01% మందికి నిజమైన నాయకత్వలక్షణాలు ఉన్నాయి అని అర్థం. మిగతా రంగాలలో ఉన్నటువంటి ఇతర సంస్థల గురించి ఇదే అనుకోవచ్చు. అందుకే నిజమైన నాయకులు అరుదు అని అంటాను.

ఇది ఇలా ఎందుకుందో తెలుసుకుందాం. దానికి ఈ కింద ఇచ్చినవాటిని అర్ధం చేసుకోవాలి.

  • నాయకత్వం అంటే ఏమిటి?
  • నాయకులని తయారు చేయగలమా లేదా పుట్టుకతో నాయకులై ఉండాలా?
  • విజయవంతమైన నాయకుడు అవడానికి కావలసినవి ఏమిటి?
  • ఎందుకు కొంతమంది సహజంగా కష్టపడకుండా నాయకత్వం వహిస్తారు, మరి కొంత మంది చాలా కష్టపడతారు?
  • మనం నాయకులు అవడానికి ఏ విధంగా ప్రయాణం చెయ్యాలి?

పైన ఇచ్చినవాటిని, ఒకటి తరువాత ఒకటి అర్థం చేసుకుందాం.

నాయకత్వం ఒక స్థితి, హోదా కాదు

నాయకత్వం అంటే ఏమిటి?

చాలా మంది ఈ విషయం మీద అనేకపుస్తకాలు రాసారు. చాలామంది ఒక నాయకుడు సఫలీకృతం కావాలంటే ఏ లక్షణాలు ఉండాలో రాసారు. వ్యాపారసంస్థలు నాయకత్వం మీద అనేక శిక్షణకార్యక్రమాలు నిర్వహించారు.

వ్యాపారుప్రపంచం నుండి వచ్చిన నా శిష్యులు, ఆ శిక్షణ తరగతులు ఎలా జరుగుతాయో, ఆ శిక్షణ నుండి వారు ఏ విధమైన ఉపయోగం పొందారో నాకు వివరించారు. ఆ కార్యక్రమాలు వారికి సహాయపడినా, కొన్ని రోజుల తరువాత ఆ శిక్షణ ప్రభావం తగ్గిపోతుందని వారు నాతో చెప్పారు.

వారాంతశిబిరాల్లో, తాళ్లు మీద నడవటం, ఆటలు ఆడటం, స్నేహభావాన్ని కలిగించడం వలన జట్టు చైతన్యం ఎలా పెంపొందిస్తారో అన్నది నాకు చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమాలు వ్యక్తి బాహ్యగుణాల మీదే పని చేస్తాయి. అంతరంగభావాల మీద ప్రభావం చూపించవని, నా శిష్యులు చెప్పినదాని నుంచి నేను అర్థం చేసుకున్నాను. వ్యక్తిగతాభివృద్ధి, మార్పు చెందిన వ్యక్తి నుండి ప్రసరించే అనుభవమే నాయకత్వం, అది ఒక గుణం కాదు.

సంప్రదాయపద్ధతిలో నాయకత్వాన్ని ఎలా వర్ణించారో అన్నది నేను వివరిస్తాను. ఇంటర్‌నెట్‌లో 'నాయకత్వం' 'నాయకుడు' అనే మాటలకి అర్థాలు వెతికితే, చాలా సమాధానాలు రావడం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈ మధ్యనే, నేను గూగుల్‌లో, 'నాయకత్వం' అన్న పదం టైపు చేసినప్పుడు వేల సమాధానాలు వచ్చాయి. కాబట్టి ఈ విషయాల మీద రాయవలసినది లేదా చెప్పవలసినది అంతా చెప్పేసారు. అందుకే నేను ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించేవారు నాయకత్వం మీద చెప్పిన విషయాలు, ఉదాహరణలు చెప్తాను. ముఖ్యంగా, నాయకుడు ఎలా అవ్వాలి అన్నదానికి అసలైన అర్థం, పద్దతులు చెప్పిన తరువాత, వారి వ్యక్తిత్వంలో మార్పు వచ్చిన తరువాత ఎలా 'నాయకత్వ' లక్షణాలు చూపించగలరో చెప్తాను.

ప్రతి మానవుడు ఒక శక్తి గల నాయకుడు అన్నది అర్థం చేసుకోండి. అందరూ అనుకునే విధంగా, కొంత మందికి పుట్టుకతో 'నాయకత్వం' అనే గుణం ఉండదు. ప్రతి ఒక్కరూ నాయకుడు కావచ్చు. అతను ఒక ప్రత్యేకసంస్థ లేక పరిస్థితికి తీసుకున్న బాధ్యత నుండి అతనిలో నాయకత్వగుణం పెంపొందుతుంది.

ఇక్కడ మీకు ఇంటర్‌నెట్ నుంచి 'నాయకత్వం' మీద దొరికే కొన్ని నిర్వచనాలు ఇస్తాను.

పీటరు డ్ర‌క్క‌రు, ఇచ్చిన నిర్వచ‌నం 'ఏ వ్య‌క్తికెతే అనుచ‌రులు ఉన్నారో అత‌ను 'నాయ‌కుడు'

జాన్ సి మాక్స్‌వెల్ ఇచ్చిన నిర్వచనం 'నాయకత్వం, అనేది ప్రభావం – ఎక్కువ కాకుండ, తక్కువ కాకుండ ఉండటం.'

Warren Benni's ఇచ్చిన నిర్వచనం 'నాయకత్వం నిన్ను నువ్వు తెలుసుకునే ప్రక్రియ, బాగా చెప్పగలిగే, ముందు చూపు ఉండగలగటం, సహోద్యోగులలో విశ్వాసం కలిగించటం, నీ నాయకత్వశక్తిని తెలుసుకోదానికి ఉపయుక్తమైన చర్య చేయడం' అని అన్నారు.

నాయకతానికి ఒక నాయకుడు ఇచ్చిన నిర్వచనం: 'నాయకత్వం అంటే ఒక వ్యక్తి ఇతరులను ప్రభావితం చేసి, తన లక్ష్యాన్ని సాధించే విధానంతో ఆ సంస్తని కలిసి ఉండేటట్లు చేయటం. నాయకులు తమ నాయకత్వగుణాలైన నమ్మకాలు, విలువలు, జ్ఞానం, నైతికత, స్వభావం నిపుణతతో ఈ పనిని నిర్వహిస్తారు. '

'నాయకుడు', 'నాయకత్వం' అనే పదాలకి ఎన్నో వేల నిర్వచనాలు ఉన్నాయని నాకు కచ్చితంగా తెలుసు. అందుకే కొంత మంది నాయకుడు, నాయకత్వానికి ఇచ్చిన నిర్వచనాలని, మీ ముందు ఉంచాను. ఈ నిపుణులందరూ, నాయకుడు ఎలా ఉండాలి, ఒక అనుకూలమైన నాయకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అన్నది చెప్పారు. కాని ఈ లక్షణాలు ఎలా పొందాలన్నది అంతగా చెప్పలేదు.

నాయకత్వలక్షణాలు పుట్టుకతో వస్తాయా, లేకపోతే నాయకుడిని తయారు చేయగలమా అన్న ప్రశ్న కలుగుతుంది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం మనస్సు అంటే ఏమిటి, అంతరంగప్రపంచవిజ్ఞానం తెలుసుకోవాలి. ఈ అంతరంగప్రపంచం గురించి తెలుసుకోదానికి తూర్పు దేశపు మార్మికులు కొన్ని వేల సంవత్సరాలు పరిశోధన చేసారు. వారు నాయకత్వలక్షణాలను పెంపొందించడానికి, కొన్ని పద్ధతులు కనుక్కున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

నాయకులను తయారుచేయగలమా లేదా పుట్టుకతో నాయకుడె ఉండాలా?

చాలా మంది, నాయకుదు ఎలా ఉండాలన్నది చెప్పారు. కాని ఆ స్థితికి ఎలా చేరుకోవాలో అన్నది తక్కువగా చెప్పారు. దీని అర్థం ఏమిటి?

నాయకత్వం అనే గుణం పుట్టుకతో రావాలా లేదా అలవర్సుకోవచ్చా? ఒక వ్యక్తి నాయకత్వపు నైపుణ్యాన్ని ఎలా వృద్ధి చేసుకోగలడు? ఆమె లేదా అతడు, వ్యక్తిగత కష్ఠాలు లేదా కలవరపాటులో ఉన్నప్పుడు ఒక సంస్థను నదపగలడా?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పేముందు నాయకత్వపు లక్షణాలు అలవరచుకోవచ్చని అనుకుందాం.

అది అంతా నాయకుడు అనే చెతన్యస్థితి పొందడమే, కాని హోదా కాదు. ఇది చదివేటప్పుడు, నేను మిమ్మల్ని ఆధ్యాత్మిక ప్రయాణం చేయిస్తున్నానని అనుకోవద్దు! నేను చెప్పబోయే పద్ధతి, కాలానుగుణంగా, వ్యక్తిగతంగా మారడానికి నిరూపితమైన శాస్త్రం. అంతరంగవిజ్ఞానం మీద పదివేల సంవత్సరాలు పరిశోధించి అభివృద్ధి చేసిన ఫలితం ఈ శాస్త్రం. దీని అర్థం ఏమిటంటే,

మొదటిది, ప్రతి నాగరికత తమ శక్తులన్నింటినీ ఏవో కొన్ని రంగాలపై కేంద్రీకరించింది. పశ్చిమదేశాలు, వారి ప్రయత్నాలన్నీ బాహ్య ప్రపంచం మీద కేంద్రీకరించి, సుఖంగా జీవించేందుకు కావలసిన సౌకర్యాలు చాలా కనుక్కున్నారు. బయటి ప్రపంచం మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు, మానవులకు అత్యంతసుఖజీవనానికి ఉపయోగపడే చాలా వస్తువులు కనుక్కున్నారు, సేవాసంస్థలు స్థాపించారు.

బాహ్య ప్రపంచం మీద శాస్త్రం ఎలా ఉందో అలాగే అంతరంగ ప్రపంచం మీద కూడ శాస్త్రం ఉంది. అది మన అందరిలో ఉంది. అంతరంగ ప్రపంచ వైజ్ఞానికులు లేదా ఋషులు, మన మనస్సుని, అనుభూతి చెందే వివిధభావావేశాలను అదుపులో పెట్టడానికి ఎన్నో రకాల పద్ధతులను కనిపెట్టారు. సుమారు పదివేల సంవత్సరాల నుండి, మన అంతరంగ ప్రపంచ వెజ్షానికులు, మనకు భావావేశాల వల్ల కలిగే ఒత్తిడి, వ్యాకులతలను పోగొట్టుకోదానికి కావలసిన పరికరాలు, సాంకేతిక పద్ధతులను కనుక్కున్నారు. మనం పరమానందంతో ఉండడానికి చాలా పద్ధతులని సృష్టించారు. ఈ సాంకేతికపద్దతులనే, నేను ధ్యానపద్దతులు అని అంటాను.

నాయకత్వం మీద నేను చెప్పబోయే విషయాలు, మన భావావేశాలను, మనస్సును అర్థం చేసుకోడం మనం సంపూర్ణంగా సఫలమైన జీవితం గడపడానికి, అంతరంగవైజ్ఞానికులు చెప్పిన పద్ధతులు ఎలా ఉపయోగపడతాయో అన్నదానిపై ఆధారపడుతుంది.

చాలా సంస్థలలో నాయకులైనవారు, నాయకుడు అనే హోదా పొందారు కాని వారు నాయకుడు అన్న స్థితి పొందలేకపోయి ఉండవచ్చు. దీని అర్థం ఏమిటి? ఇది అర్ధం చేసుకోవాలంటే, ఒక విజయవంతమైన నాయకుడిని తయారు చేయాలంటే కావలసిన అంశాలేమిటో అర్థం చేసుకుందాం.

విజయవంతుడైన నాయకుడిని తయారు చెయ్యడానికి కావలసిన ముఖ్య అంశాలు:

ఒక చిన్న కథ : ఒకప్పుడు రెండు దేశాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధం కొన్నాళ్ళు జరిగేసరికి ఆ సైనికులు అలసిపోయారు.

ఒక మిట్టమధ్యాహ్నం అలసిన సైనికులు పెద్ద గొయ్యి తవ్వుతున్న సమయంలో, ఒక వ్యక్తి సామాన్యపౌరుడి దుస్తులలో గుఱ్ఱం మీద ఆ దిశగా వెళ్ళాడు. ఆ సైనికుల నాయకుడు, వారిని గంట లోపల పని పూర్తి కాకపోతే, శిక్షిస్తానని బెదిరిస్తూ గట్టిగా ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. గుఱ్ఱం మీద ఉన్న అపరిచితవ్యక్తి ఆగి, 'అయ్యా, మీరు వారి మీద అరుస్తూ ఆజ్ఞలు ఎందుకు ఇస్తున్నారు? మీరు కూడా వారికి సహాయం చెయ్యచ్చుకదా?' అని ఆ సైనికుల నాయకుడిని అడిగాడు.

నాయకుడు ఆ వ్యక్తి వైపు చూసి, 'ఏమిటి మీ ఉద్దేశ్యం? నేను నాయకుడిని. నేను ఏది చెపితే అది ఆ సైనికులు చెయ్యాలి. మీకు అంతగా సహాయం చెయ్యాలి అని అనిపిస్తే మీరే వచ్చి చెయ్యండి' అని సమాధానం ఇచ్చాడు.

ఆ వ్యక్తి గుఱ్ఱం దిగి ఆ సైనికుల వైపు వెళ్ళాడు. పని పూర్తి అయ్యేవరకు, పరికరాలు తీసుకుని, ఆ సైనికులకి సహాయం చేసాడు. ఇది చూసి నాయకుడు ఆశ్చర్యపోయాడు.

ఆ వ్యక్తి తిరిగి వెళ్ళబోయే ముందు, సైనికులను మెచ్చుకొని, నాయకుడి వద్దకువెళ్ళి, ఈ సారి నీ హోదా సైనికులకి సహాయం చెయ్యడానికి అడ్డు వస్తే, నీ పై అధికారికి తెలియచేస్తే – నీకు ఏదో ఒక పరిష్కారం చెప్తారు. అని అన్నాడు.

ఆ సైనికుల నాయకుడు ఆశృర్యపోయి, ఆ వ్యక్తి కేసి నిశితంగా చూసాడు. అతను సెనికదళాధిపతి అని గుర్తించాడు.

ఇప్పుడు మనం, 'ఎన్ని సంస్థలలో అలాంటి నాయకులు ఉంటారు?' అని ప్రశ్నించుకోవాలి. మీకు తెలిసిన ఎంత మంది వ్యక్తులు ఆ సైనికుల నాయకుడిలాగా ఉంటారు. అలాగే ఎంత మంది సైన్యాధిపతిలా ఉంటారు. సంస్థలలో ఉండే చాలామంది నాయకులు కథలో సైనికనాయకుడిలా ఉంటారు అని అందరికి తెలుసు. వారికి నాయకుడనే హోదా ఉంటుంది కాని స్థితి ఉండదు.

పని పూర్తి కావాలని సహాయానికి సిద్ధంగా ఉండేవారు చాలా తక్కువమంది ఉంటారు. సైన్యాధిపతి ఒక నిజమైన నాయకుడికి ఉండవలసిన లక్షణాలని వ్యక్తపరిచాడు.

  • నిజాయితీ, బాధ్యత.
  • ఇతరుల పట్ల నిజమైన శ్రద్ధ కలిగి ఉండడం.
  • విశ్వాసం.
  • సామర్థ్యం – పలురకాలుగా ఆలోచించే నెపుణ్యం.
  • సవిస్తరంగా తెలుసుకోవటం మీద శ్రద్ధ.
  • విస్తారంగా ఆలోచించి పని చేయటం.

ఈ లక్షణాలని మీకు వివరిస్తాను.

నాయకుడి చేతనస్థితి :

నాయకత్వం – ఒక వ్యక్తి చేతనస్థితిలో ఎంచుకున్న దాని ఫలితం నాయకుడి చేతనస్థితి అనే పదానికి అర్థం ఏమిటి?

మనం చాలా మంది, నాయకుడు అనే హోదా పొందుతాం కాని ఆ స్థితిని కాదు. స్థితి, అన్నది హోదా కంటే పూర్తిగా భిన్నమైంది. హోదా అన్నది సమాజం నుండి వస్తుంది. మీరు ఒక జనసమూహానికి నాయకత్వం వహిస్తే, లేదా, ఒక సంస్థలో ఒక విభాగం బాధ్యత బలవంతంగా ఇవ్వబడితే లేదా, ఆశతో ఒక విభాగం బాధ్యత తీసుకుంటే మీకు నాయకుడన్న హోదా వస్తుంది. కాని 'స్థితి' అన్నది పూర్తిగా వేరుగా ఉంటుంది.

నేను 'స్థితి' అన్న పదం ఉపయోగిస్తే, మీ అంతరంగం ఆ బాధ్యతను తీసుకోదానికి సిద్ధంగా ఉండాలని నా ఉద్దేశ్యం.

మనకి స్థితి లేకుందా హోదా వస్తే, వ్యాపారసంస్థలలో సమస్యలన్నీ మొదలవుతాయి – వ్యక్తిగతంగా టెన్సను, ఒత్తిడి, సామూహికంగా రాజకీయాలు, పరోక్షంగా నిందించడం, ఈ సమస్యలన్నీ మీరు హోదా పొంది, ఆ స్థితి చేరక ముందు ఉంటాయి.

తూర్చు దేశాల సంస్థదాయంలోని కొన్ని నిజాలు మీకు వివరిస్తాను – నాయకత్వచేతనస్థితి ఎలా పొందాలి, నాయకుడు హోదాయే కాకుండా స్థితిని కూడా ఎలా పొందాలి? హోదా సులభంగానే వస్తుంది, స్థితిని నిజంగా పొందాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తి అయితే నాయకుడు అనే స్థితిని చేరుకుంటాడో, హోదా వెంటనే వస్తుంది. ఆ హోదా రావడానికి కొంత సమయం పట్టినా, అతను పెద్దగా పట్టించుకోడు, ఎందుకంటే అతను ఒక రాజులా జీవిస్తాడు. అతని జీవితం పూర్తి సంతృప్తితో నిండి ఉంటుంది. ఎవరైతే నాయకత్వ చేతనస్థితి పొందుతారో విలువ కట్టలేని సంతృప్తితో జీవిస్తారు.

నాయకుడి, హోదా Vs స్థితి!

నాయకుడి స్థితి అనే దానికి అర్థం ఏమిటి?

ఏ వ్యక్తి అయితే పూర్తి స్పుహతో, బాధ్యత తీసుకోదానికి, జీవితం జీవించదానికి సిద్ధంగా ఉంది, తన పాతజ్ఞాపకాలమీద ఆధారపడదో, అతనే నిజమైన నాయకుడు. మీరు మీ జ్ఞాపకశక్తి మీద ఆధారపడి, లేదా జరిగిపోయిన జీవితం పైన ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే, మీరు కేవలం ఒక అనుసరించే వ్యక్తి మాత్రమే కాని మీరు నాయకుడు కాదు. అని స్పష్టంగా తెలుసుకోండి. పరిస్థితులకి అప్రయత్నంగా స్పందించదాన్నే, నేను బాధ్యత అని అంటాను. ఏ వ్యక్తి అయితే పరిస్థితులకి అప్రయత్నంగా స్పందిస్తాడో, నిరంతరం స్వచ్ఛంగా, సచేతనంగా ఉండి పాత జ్ఞాపకాలలో ఉండిపోదో అతనే బాధ్యత గల నాయకుడు.

నాయకుడు స్థితి ఎలా పొందవచ్చో, ఎలా మనలో నాయకత్వచేతనస్థితి కలుగుతుందో, మనస్సు ఎలా పని చేస్తుందో అన్నవి, ఒక చిన్న బొమ్మతో వివరిస్తాను.

మనస్సు ఎలా పని చేస్తుందో అర్ధం చేసుకుందాం – మనం విషయాన్ని గ్రహించి, అది విశ్లేషించిన తరువాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామన్నది తెలుసుకుందాం.

ఉదాహరణకి మీరు కంటితో ఏదో చూస్తున్నారు. అది ఎలా క్రమబద్దీకరించబడి ఎలా దాన్ని తయారు చేసుందో ఆ బొమ్మ చూపిస్తుంది. ఇది కేవలం కళ్ళతో చూసిన సమాచారమే కాదు. అది చెవుల ద్వారా, లేదా నాలుక ద్వారా, స్పర్శ ద్వారా లేదా ముక్కు ద్వారా, ఏ స్సర్నేందియం నుంచి వచ్చిన సమాచారమైనా సరే అదే విధంగా మనలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఉదాహరణకి కళ్ళని తీసుకుందాం. కళ్ళు చూసిన సమాచారం ఒక ఫైలు రూపంలో చక్రువు (శక్రికేంద్రం) దగ్గరికి వెళ్తుంది. ఇది డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ (Digital signal processor)గా పని చేస్తుంది. అలా కళ్ళ ద్వారా వచ్చిన సమాచారాన్ని చక్షువు, డిజిటల్ ఫైలు కింద మారుస్తుంది. ఈ ఫైలు 'చిత్రం' అనే భాగానికి వెళ్ళుంది. ఇది కంప్యూటర్ మెమొరీ లాంటిది. ఉదాహరణకి మీరు ఈ పుస్తకం చూసినప్పుడు – అది ఒక ఫైలు క్రింద చక్రువు దగ్గరికి వెళుంది. అక్కడ డిజిటల్ ఫైలుగా మారి 'చిత్రం' దగ్గరకి పంపబడుతుంది. 'చిత్రం' అంటే జ్ఞాపకాలు ఉండే భాగం, అది ఫైలుని విశ్లేషించడం మొదలుపెడుతుంది. 'ఇది రాయి కాదు, ఇది చెట్టుకాదు, ఇది జంతువు కాదు' అని చిత్తం ఫైలులో ఉన్న సమాచారంలోని అనవసరవిషయాలని తొలగిస్తుంది. ఇలా తీసేసే కార్యక్రమం 'చిత్తం'లో జరుగుతుంది.

నాయకత్వం ఒక స్థితి, హోదా కాదు

ఇప్పుడు ఆ ఫైలు మనసు లోనికి వెళ్ళంది. మనసు ఆ ఫైలుని గుర్తిస్తుంది. మనస్సు ఆ ఫైలుని 'ఇది ఒక పుస్తకం', ఇది ఆధ్యాత్మికత మీద రాసిన పుస్తకం' 'ఇది ఒక జ్ఞానోదయమైన గురువుచే రాయబడింది' అని గుర్తిస్తుంది. గుర్తింపబడిన తరువాత ఆ ఫైలు 'అహం' అనే చోటుకి వెళ్ళంది. ఇది నిర్ణయాలు చేసే కేంద్రం. మీ 'అహం'లో మీకు ఉన్న పరిస్థితికి ఏమిటి సంబంధం అని ఆలోచన మొదలవుతుంది. ఈ రకమైన పుస్తకాలతో మీ పూర్వానుభవాలు బాగుంటే, మీరు ఈ పుస్తకం చదువుతారు. మీ పూర్వ అనుభవాలు బావుండకపోతే, 'ఇది వరకు ఇలాంటి పుస్తకం చదివినప్పుడు చాలా విసుగు కలిగింది, ఇలాంటి పుస్తకాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు' అని అనిపించి, పుస్తకం చదవరు. మీ పూర్వానుభవాల మీద మీ అహం నిర్ణయం తీసుకుంటుంది. ఈ విధంగా మీ మనస్సు పని చేస్తుంది.

ఇప్పుడు మీరు అర్థం చేసుకోవలసిన ముఖ్యవిషయం ఏమంటే, నిర్ణయాలు అచేతనంగా జరుగుతాయి అని.

పైన చెప్పిన విధంగా సూటిగా మనస్సు నిర్ణయం తీసుకుంటే, ఏ విధమైన సమస్యా లేకుంద మీ జీవితంలో పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. ప్రతీదీ స్పష్టంగా, సూటీగా ఉంటుంది. కాని జరిగే పని ఎప్పుడు సూటిగా జరగదు. కొన్నిసార్లు కొన్ని విషయాలు అచేతనంగా జరుగుతాయి. ఉదాహరణకి, మీరు ఇలాంటి పుస్తకం చదివినప్పుడు, అందులోని ఏ విషయమైనా మిమ్మల్ని బాధపెట్టినా లేదా మిమ్మల్ని కలవరపెట్టి ఉంటే, ఈ పుస్తకం చూసినా వెంటనే, ఆ జ్ఞాపకం అచేతనంగా బైటికి వస్తుంది.

చూడండి, మీ జీవితంలో ఒక ప్రత్యేకసంఘటన వల్ల లేదా, ఏదైనా ఒక రంగు దుస్తులు ధరించిన వ్యక్తి వల్ల కాని మీకు బాధ కలిగి ఉంటే, అదే ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేదా అదే రంగు దుస్తులు ధరించిన వ్యక్తిని చూసినప్పుడు, మీ పాత అనుభవాలకి ఏమీ సంబంధం లేదని తెలిసినా, మీకు మళ్ళీ అలాంటి భావనే కలుగుతుంది. అదే మీ మనస్సులో జ్ఞాపకంగా ఉండిపోతుంది. అదే అనుభవం మళ్ళీ కలుగుతుంది. వీటినే నేను 'సంస్కారాలు' అని అంటాను. నిలువ చేసి ఉంచిన పాత జ్ఞాపకాలు.

ఈ పాత జ్ఞాపకాలు, మీ నిర్ణయించే సామర్థ్యాన్ని కలవరపెడతాయి. మనస్సు పని చేసే విధానం అనే బొమ్మలో నేను చెప్పిన కార్యక్రమం అంతా చేతనస్థితిలో జరిగితే ఆ కార్యక్రమం సూటీగా ఉంటుంది. కాని అది అచేతనస్థితిలో జరగటం వల్ల కార్యక్రమం సూటిగా ఉండదు. ఇదే స్థానంలో రాజకీయాలు జరుగుతాయి. ఈ ప్రదేశంలోనే పాత జ్ఞాపకాలు లేదా ఎన్‌గ్రామ్స్ ఉండి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియనియ్యవు. మీకు అచేతనస్థితిలో మనస్సు ఎలా పని చేస్తుందో బాగా అర్థం అవడానికి ఇంకొక ఉదాహరణ ఇస్తాను.

మీరు చేతనస్థితిలో విశ్లేషిస్తే, పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని మీకందరికీ తెలుసు. మీ జ్ఞానేంద్రియాలు గ్రహించిన సమాచారం, ఒక పద్ధతిలో కంటి నుండి మనస్సు వరకు వెళితే, మీకు పొగతాగటం ఆరోగ్యానికి హానికరం అని స్పష్టంగా తెలుస్తుంది. మీ తర్కబుద్ధి మీకు పొగ తాగవద్దు అని చెప్పినా, వెంటనే మీరు పొగ తాగాలని నిర్ణయించుకుంటారు. మీ తర్కానికి, చేతనస్థితికి వ్యతిరేకంగా, ఇక్కడే అచేతనంగా ఉన్న ఎన్‌గ్రామ్స్ ఉంటాయి.

చేతనంగా మీకు పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా సమాచారం ఫైలు రూపంలో అహం దగ్గరకి వెళ్ళేసరికి పొగ తాగాలని నిర్ణయం తీసుకుంటారు. మీలో ఏదో జ్ఞాపకం లేదా ఏదో అనుభవం పొగ తాగినప్పుడు హాయిగా ఉండి ఉంటుంది, లేదా మీరు చిన్నప్పుడు సిగరెట్టు కాల్సినప్పుడు నేను ఒక 'హీరో'ని అన్న భావం మీలో కలిగిఉండవచ్చు. ఈ అలవాటుతో ఇలాంటి ఎన్‌గ్రామ్స్ కి సంబంధం ఉండబట్టి మీకు చేతనంగా పొగ తాగడం హానికరం అని తెలిసినా వెంటనే పొగ తాగాలి అన్న నిర్ణయం తీసుకుంటారు.

ఇదే విధంగా, మీ జీవితంలో చాలా సార్లు, మీకు ఏది సరైనదో తెలిసినా, మీ సంస్కారం వల్ల అచేతన స్థితిలో నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవితం అచేతనంగా ఉన్న సంస్కారాల నియంత్రణలో ఉంటుంది మీ నియంత్రణలో ఉండదు.

మీ నిర్ణయాలు మీరు చేస్తున్నారని అనుకుంటారు, కాని అన్నీ సంస్కారాలే నిర్ణయిస్తాయి.

మన ప్రవర్తనకి ఈ సంస్కారాలే మూలకారణం. వీటి కారణంగా మనం ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తాం. సంస్కారాలు మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మన అభిప్రాయాల్ని మబ్బులా కప్పేస్తాయి. ఒక సంస్థలో మనం నిర్వహించే పనిపై ఆ సంస్కారాలు ప్రభావం చూపిస్తాయి. ఇవి మన ఉత్పాదకత, అంతర వ్యక్తిగతసంబంధాల మీద, పని, అభిప్రాయాలు, మన అన్ని స్పందనల, మన ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తాయి. వ్యాపారసంస్థల ట్రైనింగులో, నాయకత్వలక్షణాలను పెంపొందించుకునేటప్పుడు, ఈ సంస్కారాలు అంటే ఏ విధమైన ప్రాముఖ్యమూ ఇవ్వరు, ఇవి ఎవరికీ అర్థం కావు.

మనలో పాత జ్ఞాపకాలను తుడిచేయడానికి, తూర్పుదేశపు ఋషులు, అంతరంగ ప్రపంచశాస్త్రవేత్తలు ధ్యానపద్ధతులను కనుగొనటానికి కొన్ని వేల సంవత్సరాలు పరిశోధన చేసారు. ఈ సంస్కారాలని ధ్యాన పద్ధతుల ద్వారా సమర్థంగా తుడిచేయొచ్చు.

నేను ఈ మధ్యనే ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు, వారి గదిలో ఉన్న చక్కని వాక్యాన్ని చూసాను.

'నేను ఈ ఇంటి యజమానిని, అలా అనడానికి నాభార్య అనుమతి ఇచ్చింది.'

నాయకత్వం ఒక స్థితి, హోదా కాదు

అలాగే మీరు యజమాని అని మీరు అనుకోవచ్చు, కాని మీలో అచేతనంగా ఉన్న సంస్కారాలు మీకు తోవ చూపిస్తున్నాయి. మీరు ఈ అచేతనంగా ఉన్న సంస్కారాలలో చిక్కుకుని ఉన్నంత వరకు, మీరు నాయకుడు అన్న స్థితికి చేరుకోలేరు. మీరు చాలా కష్టపడి, బాధతో నాయకుడు అన్న హోదా సంపాదించుకోగలరు. మీరు నాయకుడి కుర్చీలో చాలా ప్రయాస, ఆవేదనలతో కూర్చుంటే, మీ అనుచరులకి కూడా అదే ప్రయాస, ఆవేదన కలిగిస్తారని స్పష్టంగా తెలుసుకోండి.

ఈ స్థాయికి వచ్చాను, 'నేను ఎంతో ప్రయాస పడి, చాలా బాధ పడి ఈ స్థాయికి వచ్చాను. వారు కూడా ఎందుకు బాధపడకూడదు' అని పదే పదే మీ మనస్సు చెపుంది. ఇది సంస్థలో వారిని నిరుత్సాహపరిచే అంశం.

నిర్ణయం తీసుకోవడం, ఒత్తిడి

ఇప్పుడు కొన్ని ముఖ్యమైన నిజాలని చెబుతాను.

మీరు చేతనంగా నిర్ణయాలు తీసుకుంటే మీకు ఎప్పుడూ ఒత్తిడి ఉండదు. మీరు అచేతనంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు సంస్కారాలు అడ్డుపడితే, ఒత్తిడి కలుగుతుంది. అన్నీ సవ్యంగా జరిగితే, మీరు వేల నిర్ణయాలు తీసుకున్నా హాయిగా ఉంటారు. మీ జీవితం ఒక నదిలా ప్రవహిస్తుంది.

కాని మీరు సంస్కారాలతో నింపబడి ఉన్నప్పుడు రెండు – మూడు నిర్ణయాలు తీసుకున్న తరువాత, మీరు పూర్తిగా అలసిపోతారు. మీరు పని చేయకుండానే, కుర్చీలో కూర్చుని, పని గురించి ఆలోచిస్తే అరగంటలో భుజం నొప్పి పుడుతుంది. అంటే మీరు సంస్కారాల్లో చిక్కుకుని ఉన్నారని అర్థం. అవి మిమ్మల్ని నిర్ణయాలు తీసుకోనియ్యవు.

ఫైలు మనస్సు నుండి పెద్ద అడుగుతో వెళ్ళినప్పుడు, దాని మీద ప్రతి సంస్కారం తన అభిప్రాయాన్ని రాస్తుంది. ఎన్ని ఎక్కువ సంస్కారాలు ఉంటే, అన్ని ఎక్కువ నిర్ణయాలు ఉంటాయి, అందుకే ఫైలు అహాన్ని చేరుకున్నప్పుడు, పూర్తిగా తికమక పడుతుంది. ఆ ఫైలు మీద 300 అభిప్రాయాలు ఉంటే, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? మీ అహం, 'నీకు కావలసిన విధంగా చేసుకో, నన్ను వదిలేయి' అని అంటుంది. మీకు నిర్ణయం తీసుకునే ఓపిక ఉండదు. ఏ విధమైన సృష్టతా లేకుండా క్రమపద్ధతి లేని నిర్ణయాలు తీసుకుంటారు.

మీరు నిరంతరం స్పష్టత లేకుండా నాయకుడి కుర్చీలో కూర్చుని నిర్ణయిస్తే, మీరు బాధపడటమే కాకుండా ఇతరుల్ని కూడా బాధపెడతారు అన్న విషయం స్పష్టంగా తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా నాయకులే. మీరు మీ టీముకి నాయకులు లేదా మీ ఇంటికి నాయకులు. ఏదో ఒక రీతిలో మనమంతా నాయకులమే.

ఏ వ్యక్తి అయితే సంస్కారాల్లో చిక్కుకుని ఉంటాడో, ఎవరైతే సంస్కారాలతో బాధపడతాడో అతను హాయిగా ఉండలేదు, సెలవులకి ఎక్కడికి వెళ్ళలేదు. మీ నిజజీవితంలో మీరు ఉదయం లేచి పళ్ళు తోముకుంటునప్పుడు మీ మనస్సు ఆఫీసులో ఉంటుంది. మీరు ఆఫీసులో పని చేస్తునప్పుడు, మనస్సు సాయంత్రం బీచ్ దగ్గర ఏం చెయ్యాలి అని అనుకుంటుంది. మీరు బీచ్‌లో కూర్చుని ఉన్నప్పుడు మనస్సు ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక్కటి మటుకు కచ్ఛితంగా చెప్పొచ్చు, మీ శరీరం ఇక్కడ ఉంటే మనస్సు ఎక్కడో ఉంటుంది.

మీ శరీరం ఉన్న ప్రదేశంలో మీరు వుండరు. మీరు నిరంతరం ఎక్కడో ఉంటారు. మీరు ఇంట్లో వుండి వ్యథ చెందితే మీరు ఇంటి నుండి పని చేస్తున్నట్లు అని నేను చాలామందికి చెప్తాను. మీరు ఆఫీసులో ఉండి వ్యథ చెందితే అక్కడ ఉద్యోగం చేస్తున్నట్టు. మీరు బీచ్‌లో కూర్చుని బాధపడితే, మీరు సెలవులో ఉన్నట్టే. అది అంతే. స్థలం వేరు కావచ్చు కాని మీ మానసికవ్యవస్థ ఒక్కటే.

ఏ వ్యక్తిలో అయితే సంస్కారాలు నిండి ఉంటాయో అతను హాయిగా ఉండలేదు. అలాంటి వ్యక్తి నుండి స్పజనాత్మకత, సరైన నిర్ణయాలు ఆశించలేం. ఎవరైతే సంస్కారాలతో చిక్కుకుని ఉంటారో, వారు జీవితాన్ని పూర్తిగా జీవించలేరు, సెలవులు తీసుకోలేరు. పని లేదా సెలవులు, జీవించడం లేదా వెళ్ళిపోవడం అన్నీ మీ చేతనస్థితికి సంబంధించినవే. వాటికి మీ ఉనికితో సంబంధం ఉంది, మీరు చేసేదాంతో కాదు. ఏ వ్యక్తికి తన ఉనికి పైన ఎరుక ఉంటుందో, కేవలం అతనే నాయకుడి చేతనాన్ని పొందుతాడు.

ఉత్పాదన నిర్వచనాలు, అర్హం చేసుకోవటం

ఒక చిన్నకథ : ఒకసారి యజమాని తన ఉద్యోగిని 'ఇంత చిన్న పని పూర్తిచెయ్యడానికి ఆరు నెలలు ఎందుకు పట్టింది?' అని అడిగాడు.

'మీరు ఇచ్చిన అవకతవక సూచనలు, నిరంతర మార్పులు, తక్కువ పని దినాల వల్లి' అని ఉద్యోగి సమాధానం చెప్పాడు.

'నేను నీలాంటి బద్ధకస్తుడి గురించే ఎదురుచూస్తున్నాను' అని యజమాని అన్నాడు.

ఉత్పాదన గురించి వ్యాపారసంస్థల్లో చాలా చెప్పారు, రాసారు కూడా. రెండు లేదా మూడు దశాబ్దాల నుండి, సంస్థల్లో 'ఉత్పాదన' అనేది ఒక మంత్రం అయిపోయింది.

కంప్యూటర్లు వచ్చిన తరువాత, కొత్తగా సందేశాలు పంపడానికి ఇంటర్‌నెట్, సెల్ ఫోను వచ్చిన తరువాత, మన ప్రపంచం చాలా చిన్న ప్రదేశం అయిపోయింది. వ్యాపారసంస్థల్లో ఉత్పాదన పెరిగినా అది ఉద్యోగుల భౌతిక మానసికఆరోగ్యాల మీద దెబ్బ తీసింది. ఇప్పుడు మనం ఉత్పాదన అంటే ఏమిటి, దాన్ని ఉద్యోగులకి ఒత్తిడి కలగకుండా ఎలా పెంపొందించాలన్నది అర్ధం చేసుకుందాం.

సరళమైన పదాలలో

ఉత్పాదన = Output/Input

ఒక వ్యాపారసంస్థ ఉత్పాదక కొలత, ఒక వ్యక్తి లేదా జట్టు చేసే పనుల సంఖ్య. ఒక ప్రాజెక్టుకి ఎన్ని గంటలు పని చేసారు అన్నది ఉత్పాదక కొలతని ఇస్తుంది.

ఉత్పాదన మీద సంస్కారాల ప్రభావం

మానవుల ఉత్పాదనశక్తి పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారసంస్థలు కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు చేసారు. చాలా సంస్థల ప్రయత్నాలు సంస్థకి ముఖ్యమైన రంగాలలో వెపుణ్యాన్ని పెంచడానికి శిక్షణ ఇప్పించడం లేదా సాంకేతికపద్దతులను మెరుగు పరచడం, అంటే కంప్యూటర్ల ఉపయోగం, ఇంటర్‌నెట్ లేదా సందేశం పంపడానికి క్రొత్త విధానాలు అమలుపరచడం మీద కేంద్రీక్షుతమైనాయి. కొన్ని కంపెనీలు, అంతర వ్యక్తిగతనైపుణ్యం, జట్టు నిర్మాణంలో నైపుణ్యం అనే సాఫ్ట్ స్కిల్సు పెంపొందించడానికి పెట్టుబడి పెట్టారు. ఇలాంటి శిక్షణలన్నీ వ్యక్తుల చేతనస్థితి పైన ఉన్న స్వభావం, పనులు, గ్రహింపు మొదలైనవి మారడానికి ఉపయోగపడతాయి. కాని 90% మన భావావేశాలు, స్వభావాలు మనస్సులో లోతుగా స్థిరపడి ఉంటాయి. దీన్నే సిగ్మండ్ ఫ్రాయిడ్ అచేతనమనస్సు అని అంటాడు.

మనస్సుని చూస్తే చేతనస్థితిలో ఆలోచనలు, జ్ఞానం పోగుచేయబడి ఉంటాయి. కాని లోతుగా జ్ఞాపకాలలో సమస్యలకు పరిష్మరించుకోడానికి కావలసిన జ్ఞానం ఉంటుంది. అచేతనస్థాయిలో చాలా భావావేశాలు, అనుభవాలు నిక్షిప్లమై ఉంటాయి. ఇక్కడే సంస్కారాలు ఉంటాయి.

మనం నిజానికి, ఏ క్షణమైనా బద్దలయే భావావేశాలు అనే అగ్నిపర్వతం మీద కూర్చుని ఉంటాం. ఈ దాగి ఉన్న భావావేశాలే మనం అప్పుడప్పుడు తర్కవిరుద్ధం, సామర్థ్యం లేకుండా ప్రవర్తించదానికి కారణం అవుతాయి.

అందుకే సంస్కారాలు మనం నిర్ణయాలు చేసేటప్పుడు అడ్డుపడతాయి. వీటిని మనస్సులో ఉన్న పనికి రాని విషయాలని అంటాం. ఎక్కువ సంఖ్యలో సంస్కారాలు ఉంటే మన ఆలోచనాస్థితి మబ్బుకమ్మి ఉంటుంది. మన ఉత్పాదకశక్తి తగ్గిపోతుంది. ఇంకోవిధంగా చెప్పాలంటే చాలా సంస్కారాలు ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన ఉత్పాదన చెయ్యాలంటే ఎక్కువ కాలం లేదా ఎక్కువ మనుష్యులు, డబ్బు అవసరం. దీని వల్ల ఉత్పత్తి తగ్గుతుంది.

అచేతనమనస్సు (ఫ్రాయిడ్ వివరణ

సెకాలజీ చదివిన పాఠకులకి, మనస్సుకి ఫ్రాయిడ్ ఇచ్చిన వివరణ తెలిసే ఉంటుంది. వ్యాపారసంస్థలు ఇచ్చే సాంప్రదాయిక శిక్షణ కేవలం 10శాతమే మనలోని శక్తిని ఉపయోగించేలా చేస్తుంది. మీలో సంస్కారాల్ని తుడిచేస్తే మిగిలిన 90 శాతం ఉపయోగంలోకి వస్తుంది. మీలో నిక్షిప్తమైన అద్భుతశక్తిని ధ్యానం ద్వారా సాధించవచ్చు.

నేను ఇంత వరకు వివరించిన దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. 15 నిమిషాలు మీ సమయంలో ఈ చిన్న సాధన చెయ్యడానికి వినియోగించండి. ఒక తెల్ల కాగితం తీసుకుని, మీ మనస్సులోకి ఏం వస్తే అది రాయండి. మీ మనస్సులో వచ్చిన ఆలోచనల్ని యథాతథంగా రాయండి. వేటినీ తీసివేయొద్దు. అభిపాయం మార్చుకోవద్దు. మీకు ఒక ఆలోచన రికార్డర్ పెట్టారనుకుని, మీకు వచ్చే ఆలోచనలన్నీ అందులోకి వెళ్ళున్నాయనుకోండి. 15 నిమిషాలు తరువాత, రాసినవి చదువుకోండి.

మీరు నిజాయితీగా రాస్తే, మీ మనస్సులో ఆలోచనలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అర్ధం లేకుండా ఉన్నట్లు తెలుసుకుంటారు. ఈ ఆలోచనలు, యంత్రంలో ఘర్షణలా ఉంటాయి. అవి యంత్రాన్ని పనికి రాకుండా, ఉత్పాదన లేకుండా చేస్తాయి. అదే తక్కువ ఉత్పాదనకి మూలకారణం. నా శిష్యులు చాలామంది చేతనంగా వారి సంస్కారాల్ని పోగొట్టుకోడానికి సాధన చేసి నాదగ్గరకు వచ్చి ఇలా చెప్పారు. వారు తమ జీవితంలో, అస్థిరమనస్సుతో, ఆలోచనలతో బాధ పడటం లేదు అని చెప్పారు. దానితో వారి బిజీ జీవితంలో కావలసినంత సమయం దొరుకుతుంది అని చెప్పారు.

సంస్కారాల వల్ల వచ్చే అర్థం లేని ఆలోచనలని తొలగించటానికి ఉపయోగపడే పద్దతి ధ్యానం అని నేను అంటాను. ఈ ఆలోచనలు తొలగించడం అనేది యంత్రంలో ఘర్షణ తొలగించి, యంత్రాన్ని సమర్థంగా పని చేయించి ఉత్పాదన పెంచడమే.

అన్ని జాతులు, కులాలు, సామాజిక, ఆర్థికనేపథ్యం ఉన్నవారు వేలమంది మా ధ్యానకార్యక్రమాల్లో సంస్కారాలను పోగొట్టుకున్నారు. వారి ఉత్పాదనశకి పెరిగింది, పరస్పరసంబంధబాంధవ్యాలు మెరుగుపడి, ఒత్తిడి లేకుండా, వారి వ్యక్తిగతవృత్తివ్యాపార జీవితాలలో స్పజనాత్మకత పెరిగిందని చెప్పారు.

కొంత మంది కార్పొరేట్ నాయకులకి నోబెల్ బహుమతి గ్రహీతలకి నాతో ఈ విషయం మీద ఆసక్తికరమైన సంభాషణలు జరిగాయి. వారి సంస్కారాలు తొలగిపోయిన తరువాత వారి అంతఃస్ఫూర్తి మెరుగైనట్లు, అద్భుతమైన ఆ అనుభవాన్ని నాతో పంచుకున్నారు.

ఇప్పుడు ఉత్పాదనసమీకరణాన్ని ఈ కింది విధంగా రాయవచ్చు.

ఉత్పాదన = Output/Input

Input = (వివేకం + సాంకేతికనైపుణ్యాలు + సంస్కారాలు)

మీకు తెలిసినట్లు మనం రోజుకి 24 గం. సంవత్సరానికి 365 రోజులు మనస్సుతోనే ఉంటాం. చాలామందికి మనస్సు ఎప్పుడూ పరుగెడూ, విశ్లేషణ చేస్తూ, వ్యక్తులపై అభిప్రాయాలు ఏర్పరుచుకుంటూ, రకరకాల భావావేశాలతో, సంఘటనలకి స్పందిస్తూ ఉంటుంది. ఇది అంతా వారిని వెంటాడుతున్న సంస్కారాలపై ఆధారపడిఉంటుంది.

ఈ సంస్కారాల బరువు లేకపోతే, మీ అంతరంగవివేకం, మీరు నేర్చుకున్న నైపుణ్యాలు, మీ జీవితానుభవాలూ, మీరు చేసే పనికి ఉపయోగపడతాయి. ఉత్పాదన పైకి దూసుకుపోతుంది.

ఈ విషయంపై వ్యాపారసంస్థలు ఎక్కువ దృష్టి పెట్టలేదు. ఈ సంస్కారాల్ని తుడిచేయడానికి, యోగులు అభివృద్ధి చేసిన ధ్యాన పద్ధతులు ఉన్నాయి.

కొన్నిసార్లు కొంత మంది వ్యక్తులు 'ఈ సంస్కారాలు లేకపోతే మేం ఆలోచించడం మానేస్తామా? మేం సోమరులుగా ఉంటామా?' అని నన్ను అడుగుతారు. నిజానికి దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. నేను ఇంతకు ముందు మీకు ఇచ్చిన అభ్యాసాన్ని గుర్తుచేసుకోండి. 15 నిమిషాలు, తెల్ల కాగితంపై మీ ఆలోచనలు రాయమన్నాను. మీ మనస్సులో ఏ సంస్కారాలు లేకపోతే, మీ వివేకంలో పెద్ద అడుగుని చూసారు. మేధలో కొత్త ప్రదేశం ఏర్పడి మీ సృజనాత్మకశక్తి పెరుగుతుంది. అకస్తాత్తుగా మీ అంతఃస్ఫూర్తి, నైపుణ్యం అభివృద్ధి చెందుతాయి. మీరు ప్రవేశించేది మూర్ఛికమండలం కాదని అర్థం చేసుకోండి. అంతఃస్ఫూర్తి నైపుణ్యాలు మన అందరిలో ఉంటాయని స్పష్టంగా తెలుసుకోండి. అవి సంస్కారాల ప్రభావం వల్ల మేఘావృతమై ఉన్నాయి. ఇప్పుడు నేను, సంస్కారాలు లేని, మనస్సు – శరీరవ్యవస్థలో, అంతఃస్ఫూర్తి, నూతనకల్పనాశక్తి ఎలా వృద్ధి చెందుతాయో వివరిస్తాను.

అంతఃస్ఫూర్తి సంస్కారాల ప్రభావం

అంతఃస్ఫూర్తి అన్నది అద్భుతమైన విషయం. ఆధునిక సి.ఇ.ఓ. లని వారి జీవితంలో మలుపు ఎలా వచ్చింది, వారు ప్రధానమైన నిర్ణయాలు ఎలా చేసారని అడిగితే వచ్చే సమాధానాలు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

వారు పదే పదే మేధకి అతీతమైన శక్తి ఏదో వారికి నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని, శక్తిని ఇచ్చిందని, అందువల్ల జీవితంలో విజయం పొందామని చెప్తారు. ఇది సఫలమైన సి.ఇ.ఓ.లకే పరిమితం కాదు. శాస్త్రవేత్తలు కూడా అదే అంటారు.

ఆ మధ్య, నాకు దా.చార్లెస్ టౌన్ను, (భౌతికశాస్త్రం నోబుల్ గ్రహీత) ని కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు నేను ఆయనని 'మీరు లేజర్ కనిపెట్టడం ఎలా జరిగింది? అది మీరు ఎలా తయారు చేయగలిగారు?' అని అడిగాను. 'నేను వాషింగ్‌టన్ డి.సి.లో ఒక పార్ములో కూర్చుని ఉండగా అకస్మాత్మగా ఏదో జరిగింది. నాకు ముగింపు ఏమిటో తెలిసింది. నాకు కలిగిన అనుభూతిని రాసాను. కాని అప్పుడు ఒక పెద్ద ఇబ్బంది వచ్చింది. నాకు ముగింపు తెలిసింది కాని, అది ఏ విధంగా నిరూపించాలో తెలియలేదు. అందుకే అది ఎవరికి చెప్పలేకపోయాను.' అని అందమైన సమాధానం ఇచ్చారు.

ఇదే విధంగా ఆల్బర్ట్ ఐన్‌స్టీనుకి కూడా జరిగింది. 'నాకు ఏది కొత్తగా తట్టినా అది అంతఃస్ఫురణ వల్ల వచ్చింది. వివేకం వలన కాదు'అని ఆయన అంటారు, 'అంతఃస్ఫురితమైన మనస్సు ఒక పవిత్రమైన బహుమతి, హేతుబద్దమైన మనస్సు విశ్వాసం గలసేవకుడు. మనం సేవకుడిని సన్మానించి, ఆ బహుమతిని మరిచిపోయిన సమాజాన్ని నిర్మించాం' అని ఆయన చక్కగా చెప్తారు.

మనం నమ్మినా, నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, అంతఃస్ఫురణ లేదా ఆత్మపబోధస్థితి అనేది ఉన్నది. ఆల్బర్ట్ ఐన్‌స్టీను దీన్ని బహుమతి అంటారు, ఎందుకంటే, అదిఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో అనేది కచ్చితంగా చెప్పలేం. మీరు దాని గురించి సాధన చేస్తే తప్పకుండా వస్తుంది అని యోగులు, ఋషులు పదే పదే చెప్తారు. మీరు అది ఒక బహుమానం అని అనుకోనక్కర్లేదు. దాని గురించి సాధన చెయ్యొచ్చు. అప్పుడు, ఆత్మప్రబోధం మీ జీవితంలో ఒక భాగం అవుతుంది. కొత్తవి ఏంజరిగినా, మీ వివేకానికి అతీతంగా ఉన్నప్పుడు, అంతఃస్ఫురణతో జరిగినవే.

మీరు ఉన్నతశిఖరాన ఉన్నప్పుడు, ఏదో వికసిస్తుంది, వివేకానికి అతీతంగా జరిగేదాన్నే అంతఃస్ఫురణ లేదా వెల్లడి చేయటం అంటాం. ఋషులు పదే పదే అది ఒక శాస్త్రం అని చెప్పారు. మీ ఉనికిలో నిరంతరం దొరికే అంతఃస్ఫురణ అనే శక్తిని శ్రుతి చేసుకుంటే, మీ నిజజీవితంలో ఈ శక్తిని ఉపయోగించవచ్చు. ఋషులు పదే పదే అది సంభవించేది అని చెప్తారు. మీరు కూడా అంతఃస్ఫురణ కలిగేట్లు చేసుకోవచ్చు. ఋషులకి అది జరిగేట్లు ఎలా చెయ్యాలో తెలుసు. ఆ శక్తిని మీలో ఎలా మేలుకొల్పాలో అన్నది మనం చూద్దాం. మనం ఇంత కితం చర్చించుకున్న మనస్సు ఎలా పని చేసుంది అన్న విషయానికి ఈ అంతఃస్ఫురణ నైపుణ్యాలు ఎలా జోడించాలో చూద్దాం.

అంతఃస్ఫురణ గురించి విపులంగా చర్చించే ముందు, అది ప్రకృతిలో అనుకోకుండా సంభవించేది అనే ఊహని పోగొట్టాలి. మీరు అలవరచుకునే వైపుణ్యాల లాగే, అంతఃస్ఫురణ అనే నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. అది ఎవరి దగ్గర నుండో కాదు, మీ నుండే వస్తుంది. మనం ఆ భాగాన్ని, మన ఉనికి ఆ పరిమాణాన్ని అనుభూతి చెందలేదు కాబట్టి మనం అది మరిచిపోయాం. ఒక ధ్యాన కార్యక్రమంలో ఒకతను నాతో, నాకు ఎవరో జ్ఞాపకం వచ్చినపుడు, ఆ మరు క్షణంలో ఫోను మోగినప్పుడు తీస్తే, అతనే మాట్తాడాడు. ఒక పార్టీలో ఎవరో గురుకి వస్తే, మరు క్షణం అతన్ని చూసాను.' అని అన్నాడు. నేను ఆ కార్యక్రమంలో ఉన్న మిగతావారిని, వారి జీవితాలలో ఇలాంటి సంఘటన ఒక్కసారైనా జరిగిందా అని ప్రశ్నించాను. కొంత శాతం మంది జరిగిందని చెప్పారు. అది ఒక వ్యక్తికి జరిగితే దాన్ని యాదృచ్చికసంఘటన అంటాం. అది కొంత శాతం మందికి జరిగితే యాదృచ్చికం అని అనలేం. దాని వెనక ఏదో కారణం ఉన్నది.

దాన్ని తార్కికంగా తెలుసుకోలేం కాని పూర్తిగా కొట్టి పారేయలేం. తర్కపరంగా తెలిస్తే, దాన్ని సంఘటన అంటారు. తర్కబద్ధంగా తెలియకపోతే యాదృచ్చికం అంటారు. ఈ భూమి మీద కారణం లేకుండా ఏదీ జరగదు. అది ఎప్పుడూ కారణం – ప్రభావంతో ఉంటుంది. మీకు కారణం – ప్రభావం మధ్య లింకు తెలిస్తే దాన్ని సంఘటన అంటారు. మీకు ఆ సంబంధం తెలియకపోతే దాన్ని యాదృచ్చికం అంటాం.

అంతఃస్ఫురణని అర్థం చేసుకునే ఈ కార్యక్రమంలో ఒకసారి ముందు చెప్పిన మనస్సు బొమ్మని గుర్తు చేసుకుందాం. కన్ను చూసిన సమాచారాన్ని చక్రువు వద్దకి పంపిస్తుంది. చక్రువు నుండి చిత్రానికి, చిత్రం నుండి మనస్సుకి వెళ్ళి, అక్కడి నుండి అహానికి ఒక పెద్ద అడుగు వేస్తుంది. ఆ సంస్మారాలతో మబ్బు కమ్మిన అహంలో నిర్ణయాలు జరుగుతాయి.

కంటికి, మనస్సు మధ్య జరిగే కార్యక్రమం చేతనంగా జరుగుతుంది. మీకు ఇది తెలుస్తుంది. అది మీ ఎరుకతో జరుగుతుంది. కాని మనస్సుకి అహానికి మధ్య జరిగే పని అచేతనంగా జరుగుతుంది. అది మీకు చాలాసార్లు తెలియదు. మీ ఆలోచనపద్దతికి వ్యతిరేకంగా నిర్ణయం చేస్తారు. ఉదాహరణకి, మీరు సేకరించిన సమాచారంతో, మీకు పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, అది మీ శరీరానికి మంచిది కాదని తెలుసు. కాని మనస్సు అచేతనంగా అహానికి ఒక గంతు వేస్తే, మీరు పొగతాగాలన్న నిర్ణయం తీసుకుంటారు.

చేతనస్థితి, అది ఆరోగ్యానికి మంచిది కాదు అని చెపుతుంది. కాని అచేతనంగా జరిగిన పని – ఏమి చెప్పకుండానే, నిర్ణయం తీసుకుంటుంది. మీరు అది అమలుపరుస్తారు. అచేతనస్థితి చాలా శక్తి గలది కాబట్టి ఈ నిర్ణయాలు మీ అధీనంలో ఉండవు. అచేతన మనస్సు మూడు స్థాయిలలో పని చేస్తుంది. – సహజస్థాయి, వివేకస్థాయి, అంతఃస్ఫురణస్థాయి. అచేతనస్థితి, జ్ఞాపకాలు అసహనంతో నిండి ఉంటే, అది సహజస్థాయిలో పని చేస్తుంది. మీరు వెంటనే నిర్ధయం తీసుకుంటారు. మీకు కోపం ఎందుకు ఉందో కూడా తెలియదు. అకస్మాత్మగా విరుచుకుపడతారు. కొన్ని సార్లు మీరు చేసే పనులు, లేదా మీరు మాట్లాడే మాటలు, మీవి కావు అని అనిపిస్తుంది. మీరు ఏదో చేసాక ఇలా అలోచిస్తారు – 'ఇది నేను కాదే. నేను ఇలా ఎలా చేసాను, ఎలా జరగనిచ్చాను?'అని. మీ అచేతనస్థితి సహజస్తాయిలో ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది.

చాలా సార్లు మనం హేతుబద్ధంగా ఆలోచించం. ఉదాహరణకి, మీరు తెల్ల డ్రెస్సు వేసుకున్న వ్యక్తివల్ల బాధపడితే, మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక వ్యక్తి తెల్ల డ్రెస్సు వేసుకుని మీ కంటబడితే, వెంటనే మీకు పాత జ్ఞాపకం వచ్చి కోపం వస్తుంది. ఇది సహజస్తాయి. మీ చేతన మనస్సుకి తెలియకుందా, మీకు అర్థం కాకుండా అది అలా జరుగుతుంది.

మీ అచేతనమనస్సు సంస్కారాల బరువుతో అసహనంగా ఉంటే మీరు సహజస్తాయిలో ఉంటారు. తరువాతిది వివేకస్తాయి. మీరు చేతనంగా ఉన్నారుకాని, కావలసినంత ఉత్సాహం లేదు. మీరు చేతనస్థితిలో ఉన్నా సృజనాత్మకత లేనప్పుడు మీరు పెద్ద అదుగులు వేయరు, ఎదగలేరు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పినట్టు ఒక విశ్వాసం గల సేవకుడిలా ఉంటారు. మీ జీవితమంతా సేవకుడిలా ఉంటారు. మీ వల్ల ఏ రకమైన గొప్ప పనీ జరగదు. మీరు సమాచారాన్ని సేకరించి, దాని మీద పని చేసి, వచ్చే ఫలితాన్ని ఒక కంప్యూటరులా అందజేసారు. మీరు వివేకస్థాయిలో ఉండిపోతే మీ శక్తిని పూర్తిగా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవట్లేదు.

తరువాతది అంతఃస్ఫురణస్థాయి. ఈ స్థాయి అర్థం చేసుకోదానికి శాస్త్రంలోకి లోతుగా వెళ్ళాలి. అప్పుడే మీకు నేను అనే అంతఃస్ఫురణ ఏమిటో అర్థం అవుతుంది. మీ వివేకానికి అతీతంగా ఉండేది మీ అంతఃస్ఫురణ. దీనివల్ల అకస్మాత్తుగా మీకు ఇది సరైన పని అని తెలిసి, చేయదానికి కావలసినంత శక్తి ఉంటుంది. కాని ఏ విధంగా ఆ నిర్ణయం తీసుకున్నారో తెలియదు.

మీకు ముందుగా జరిగింది ఏమీ లేనప్పుడు ఉండే పరిస్థితిలో ఈ శక్తి అవసరమవుతుంది. ఎప్పుడైతే మీ దగ్గర సమాచారం తక్కువగా ఉండి, నిర్ణయం తీసుకునేటప్పుడు లేదా, మీకు చాలా ఎంపికలున్నాయి కాని, మీకు ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేనప్పుడు, అంతఃస్ఫురణశక్తి మీకు సహాయపడుతుంది. అంతఃస్ఫురణశక్తి ధైర్యాన్ని, సరైన ఎంపిక చేయనిస్తుంది. అంతఃస్ఫురణ, నిర్ణయించడానికే కాకుండా నిర్ణయించింది అమలుచెయ్యడానికి కూడా శక్తిని ఇస్తుంది. చాలామంది, 'నాకు అంతఃస్ఫురణ ఉందని ఎలా తెలుస్తుంది? కొన్నిసార్లు అది అంతఃస్ఫురణ లేక వివేకమా అని కలవరపడుతున్నా' అని నన్ను అడుగుతారు. వారు తికమకపడితే అది వివేకమే అని నేను చెప్పాను. కలవరపడను అని అన్నప్పుడే అది వివేకం అని తెలిసిపోతుంది. మీరు అంతఃస్ఫురణ అనుభూతి చెందితే మీకు స్పష్టంగా తెలిసి, మీకు అమలు పరచడానికి తగినంత శక్తి వస్తుంది. మీలో ఉన్న మొత్తం శక్తి వెలువడుతుంది, మీరు దీన్నివెల్లడి చేస్తారు.

నాయకత్వం ఒక స్థితి, హోదా కాదు

తరువాతి ప్రశ్న – ఈ అంతఃస్ఫురణశక్తిని ఎలా మేలుకొల్పాలి?

మీరు చేతనంగా దానికి కొంత విశ్రాంతిని ఇస్తే, అచేతనస్థితిలో ఉన్న శక్తి వికసిస్తుంది. ఈ శక్తి వికసించినప్పుడు, ముందు అణచేసినదంతా బయటికి వస్తుంది. దాని తరువాత స్వచ్చమైన అంతఃస్ఫురణశకి వెల్లడి అవుతుంది.

స్వచ్ఛమైన శక్తి, అచేతనస్థితి నుండి వెల్లడి అయినప్పుడు, అచేతనాన్ని సహజస్థితి లేదా వివేకస్తాయిలో ఉపయోగించకుండా దాన్ని అంతఃస్ఫురణ స్తాయిలో ఉపయోగిస్తాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే, ఈ ఉన్నతస్తాయిలో వచ్చే శక్తి, మిమ్మల్ని భౌతికంగా, మానసికంగా, మీ భావావేశాలను బాగుచేస్తుందని ఋషులు నిరూపించారు. ఇది మీ ఒత్తిడిని తగ్గించి, అప్రయత్నంగా నిర్ణయాలు తీసుకునేట్లు చేస్తుంది. అప్రయత్నంగా సేకరించిన సమాచారంతో కాకుండా అది ఏ విధంగా కార్యరూపంలోకి మారుతూందో అన్న దానికి సంబంధం ఉన్నది. అదే సమాచారాన్ని అనేకవిధాలుగా కార్యరూపంలోకి మార్చవచ్చు. అంతఃస్ఫురణ అనేది వివేకానికి అతీతంగా పనిని ఏ విధంగా చేస్తే, దాన్ని పూర్తి చేయగలమో అన్నది తెలియచేస్తుంది.

ధ్యానం అనే కొన్ని సాంకేతికపద్ధతుల ద్వారా ఈ అంతఃస్ఫురణశక్తికి అనుగుణంగా మనని మనం సిద్ధం చేసుకోవచ్చు. తూర్పుదేశాల సంస్కృతిలో, మన ఉనికిలో ఉన్న ఈ గొప్ప శక్తిని తెలుసుకోవటాన్ని ధ్యానం అని అంటాం. మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మీరు మీతో ఉండండి, మనం అందరికీ సమయాన్ని ఇస్తాం కాని మనకి సమయాన్ని కేటాయించుకోం. మీకు మీరు సమయం ఇచ్చుకుంటే, మీలో ఉన్న ఏదో భాగం ఏదో తెలియచెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి, అన్నది మీరు చూస్తారు. కాని మనం ఆ భాగానికి సమయం, అవకాశం ఇవ్వం. మనం ఎప్పుడు విషయాల్లో చిక్కుకుని ఉంటాం. అదే అతిఉత్తమమైంది అని అనుకుంటాం. కాని పదే పదే ఋషులు దాని కంటే అతీతమైనది సాధ్యం అని నిరూపించారు.. Albert Einstein లేదా Isaac Newton ఎవరైనా కావచ్చు, వారికి వివేకానికి అతీతమైన శక్తి ఉంది. వారిలో వివేకానికి అతీతంగా ఏదో జరిగింది. అదే శక్తి మన అందరిలో ఉంది. మనం ఆ శక్తిని శ్రుతి చేసుకుంటే దాన్ని వ్యక్తపర్చగలం. దానికి శ్రుతి చేసుకోవడమే ధ్యానం, అని నేను అంటాను. మీ సంస్కారాలు తుడిచివేయడానికి నేనొక చిన్న ధ్యానపద్ధతిని ఇచ్చాను. అది సాధన చేస్తే, కొన్ని రోజుల్లో మీలో నిద్రిస్తున్న ఈ శక్తిని మేలుకొల్పవచ్చు. కొన్ని రోజులంటే రెండు లేదా మూడు రోజులు, అంతఃస్ఫురణశక్తికి శ్రుతి చేసుకోదానికి ఈ రోజులు చాలు. ఇప్పటి వరకు మనం సహజజ్ఞాన స్థాయిలో లేదా వివేకస్థాయిలో అచేతనస్థితిలో ఉన్న శక్తిని ఉపయోగిస్తున్నాం. శక్తిని శ్రుతిచేసుకుని అంతఃస్ఫురణస్థాయిలో వాడుకొని, నిర్ణయం తీసుకోవచ్చు.

నేను అంతఃస్ఫురణ గురించి ఇంకొంత సమాచారాన్ని ఇస్తాను. ఈ కింది విషయాల్ని మీరు ఒప్పుకునేందుకు అది చాలా ముఖ్యం.

  1. మన అందరిలో అంతఃస్ఫురణ అనేది ఉన్నది.
  2. అది మీలో ఉంది, మీరు దాన్ని వ్యక్తపరచగలరు.

మీ మనసు మూడు స్థాయిలలో పని చేస్తుంది – సహజజ్ఞానం, వివేకం, అంతఃస్ఫురణ. సహజస్తాయిలో మీ మనస్సు వ్యతిరేక జ్ఞాపకాల వలన విరామం లేనందుకు – అచేతనంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మీరు తెల్ల డ్రెస్సు వల్ల కలత చెందారంటే, నర్సుని చూసినా అచేతనంగా కలత చెందుతారు. వివేకస్తాయిలో చేతనస్థితిలో – శక్తి, ఉత్సాహం లోపించి, ఒక కంప్యూటరులా మరమనిషిలా పని చేసారు. అంతఃస్ఫురణస్తాయిలో మీకు అకస్మాత్తుగా ఏది సరిఅయిందో తెలుస్తుంది. ఎలాగో తెలియదు కాని మీకు శక్తి ఉంటుంది. మీకు కొంత సమాచారం ఉంటుంది. కాని ముందు ఏం జరిగిందో తెలియదు, మీకు చాలా ఎంపికలు ఉంటాయి, అందులో ఒకటి నచ్చుతుంది. అంతఃస్ఫురణ, నిర్ణయించి అదే అమలు చేయదానికి శక్తిని ఇస్తుంది.

వివిధ చేతన స్థితులు
ఆలోచనలతోఆలోచనలు లేకుండా
"నేను" అన్న చేతనతోజాగ్రత్ మేల్కొన్న అవస్థ ఆలోచిస్తూతురీయ పరమానంద స్థితి సంపూర్ణ చేతనస్థితి
"నేను" అన్న చేతన లేకుండాస్వప్నము స్వప్పస్ట్రప్ప కలలుకంటూసుషుప్తి అచేతన స్థితి గాఢ నిద్ర

ఇదే మరొక విధంగా చెబుతాను.

మనకు రెండు స్తాయిలలో చేతనస్థితి, రెండు స్థాయిలలో ఆలోచనలు ఉంటాయి. మనం మెలకువగా ఉన్నప్పుడు, 'నేను' అనే చేతనస్థితి, ఆలోచనలు ఉంటాయి (మేలుకొని ఉన్న స్థితిని – సంస్కృతంలో జాగ్రత్ అవస్త అంటారు) మీకు స్వప్నంలో ఆలోచనలు ఉంటాయి కాని 'నేను' అనే స్పృహ ఉండదు. ఆలోచనల వేగం, 'నేను' అనే స్పృహ కంటే ఎక్కువ ఉంటుంది. అందుకే స్వప్నస్థితిలో మీరు కలలని అదుపులో ఉంచలేరు. కలలు వాటంతట అవే వస్తాయి.

మేలుకుని ఉన్నప్పుడు, మీరు ఆలోచనలని అదుపులో పెట్టుకోవచ్చు. గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు మీకు 'నేను' అనే స్పృహ ఉండదు, ఆలోచనలు ఉండవు. (అచేతనస్థితి – సంస్కృతంలో సుషుప్తి అంటారు. ) మీకు తెలియని నాలవస్తితి – దాన్నే అంతఃస్ఫురణ లేదా ధ్యానం అంటారు. ఈ స్థితిలో 'నేను' అనే స్పృహ ఉంటుంది ఆలోచనలు ఉండవు. ఈ స్థితిని వివరించడానికి సైకాలజీలో ఏ పదం లేదు. సంస్కృతంలో ఈ స్థితిని తురీయ అంటారు. దీన్నే నేను అంతఃస్ఫురణ లేదా ధ్యానం లేదా ఆలోచన లేని ఎరుక అని అంటాను. ఈ స్థితినే సమాధిస్థితి అని కూడా అంటారు. మీరు ఈ నాల్గవస్థితిని అనుభూతి చెందితే, మీరు వివేకానికి అతీతమైన చేతనానుభవం తెలుసుకోగలరు. ఈ స్థితిలో బ్రహ్మానందం, శాంతి అంతఃస్ఫురణ ఉంటాయి.

ఈ స్థితిలో మీకు ధైర్యం, సృజనాత్మకత ఉంటాయి. అప్రయత్నంగా నిర్ణయాలు తీసుకుంటారు. అప్రయత్నంగా నిర్ణయాలు తీసుకోడమే బాధ్యత అని నేను అంటాను. మీరు ఎంత ఎక్కువ అప్రయత్నంగా నిర్ణయాలు తీసుకుంటే అంత ఎక్కువ బాధ్యత గలవారు అవుతారు. ఎన్నో పరిస్థితుల్లో మీకు కేవలం సమాచారం ఉంటే పని చేయలేరు. ఆ సమాచారం కూడా అంతా తెలియకపోవచ్చు. దీనికి ముందు జరిగింది ఏమిటో మీకు తెలియదు – అంటే మీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలు వగైరా. అలాంటి పరిస్థితుల్లో మీకు వివేకం కంటే ఎక్కువైనది ఏదో కావాలి. సమాచారానికి అతీతంగా అవసరం ఉంటుంది. అదే ఆలోచన లేని తెలుసుకునే తత్వం. మీ జీవితం లోనే కాకుండా – మీ బాంధవ్యాలలో, లేదా సామాజిక, వ్యాపారస్తాయిలో ఆ స్థితిని కనీసం ఒక నిమిషం మాత్రం అనుభూతి పొందితే, మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తుంది.

ఈ స్థితి అనుభవం మీకు చాలా లాభాలను ఇస్తుంది. అన్ని స్థాయిలలో మీ సంబంధ బాంధవ్యాలు అభివృద్ధి చెందుతాయి. మీ వ్యక్తిగతజీవితంలో, వ్యాపారసంస్థ స్థాయిలో కూడా. మన అచేతనస్థితి వల్ల సంబంధాలలో దెబ్బ తగలవచ్చు. అచేతనమనస్సునే ప్రతిక్రియామనస్సు అని కూడా అంటారు. ఈ అచేతనమనస్సులో మనం నిరంతరం వాదాలని సేకరించి, ఒక వ్యక్తి మీద లేదా సంఘటన మీద అభిపాయాలు ఏర్పరచుకుంటాం. మీరు, అతను లేదా ఆమె తప్పు చేసింది అని నిర్ణయం తీసుకుని అప్పుడు మీ అభిప్రాయాన్ని బలపరచుకోడానికి వాదాల్ని సేకరిస్తారు. అంటే మీరు కేవలం సహజజ్ఞానస్తాయిలో పని చేస్తున్నారు.

కొన్ని సార్లు సహజ జ్ఞానస్థాయి, అంతఃస్ఫురణ ఒకలాగే అనిపిస్తాయి. వీటి మధ్య భేదాన్ని ఎలా కనుక్కోవాలి అని నన్ను అదుగుతారు. అంతఃస్ఫురణతో మీరు చాలా శక్తిమంతంగా, చైతన్యంతో ఉంటారు. సహజజ్ఞానస్థాయిలో, మీలో నుండి శక్తిని తీసేసినట్లుగా ఉంటారు. మీ వివేకాన్ని ఉపయోగించినప్పుడు, మీకు అలసట అనిపిస్తే, మీరు సహజజ్ఞానస్థాయిలో పనిచేస్తున్నారని స్పష్టంగా తెలుసుకోండి. చాలా సార్లు మీరు కోపంతో లేదా వేరే ఆవేశంతో పని చేసినప్పుడు మీరు సహజజ్ఞానస్తాయిలో నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడు అర్థం చేసుకుని ఆలోచిస్తారు– 'నేను ఇలా ఎందుకు చేసాను?' అప్పుడు మీలో అపరాధభావం కలుగుతుంది. అపరాధభావం, అచేతనస్థితి ఇచ్చిన బహుమతి.

ధ్యానం అనే నాల్గవస్థితిని అనుభవిస్తే, మన ఉనికిలో అంతఃస్ఫురణశక్తిని నియంత్రించవచ్చు. ఈ నాల్గవస్థితి ఆధునిక ఫ్రాయిడి మానసిక శాస్త్రవ్యవస్థకి తెలియదు. కాని ఈ నాల్గవస్థితి అయిన తురీయ లేదా సమాధిస్థితిలో ఆలోచన లేని ఎరుక ఉన్న చోటిలో అంతఃస్ఫురణ, జ్ఞానం ఉంటాయి. ఇది చాలా మందికి తెలియని స్థితి. ఎవరైతే దీన్ని చేతనంగా ఉపయోగిస్తారో వారికి వ్యక్తిగతంగా సంస్థపరంగా చాలా ప్రయోజనాలు ఉంటాయి.

చివరిగా, నిజమైన నాయకుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే అంతఃస్ఫురణస్తితిలో పని చేయగలిగి ఉండాలి. ఒత్తిడి లేకుండ నిర్ణయాలు చేసి వాటిని కచ్చితంగా సమర్ధంగా అమలు చేస్తాడు.

ధ్యానపద్ధతి

మహామంత్రధ్యానం : ఈ మహామంత్రధ్యానం, గుండె ప్రాంతంలోని 'అనాహత' చక్రాన్ని వికసింప చెయ్యడానికి టిబెట్టు బౌద్ధులు ప్రాచీనకాలంలో వాడిన ధ్యానపద్ధతి. ఈ ధ్యానం మీ మనస్సుని దృఢంగా, స్థిరంగా చేస్తుంది. మీ మనస్సు ఎప్పుడూ ఆలోచనలతో ఊగిసలాడుతూ ఉంటుంది. ఈ ధ్యానం మీ మనస్సుని స్థిరపరచి, ఆలోచనలు లేని స్థితికి తీసుకెళ్తుంది.

ఈ ధ్యానాన్ని ఖాళీ కడుపుతో ఉదయం చెయ్యాలి. లేదా భోజనం చేశాక రెండు గంటల తరువాత చెయ్యాలి. ఇది ఒక్కరు లేదా సమూహంగా చేసుకోవచ్చు. సామూహికంగా ఈ ధ్యానం చేస్తే, ఆ ప్రదేశానికి శక్తి కలుగుతుంది.

చెయ్యవలసిన పద్ధతి :

సమయం 30 నిమిషాలు

  • స్టెప్ 1 : 1:20 నిమిషాలు సౌకర్యంగా నేల మీద కూర్చోండి. మీ తల, మెడ, వెన్నెముక నిటారుగా ఉండాలి. మీరు కింద కూర్చో లేకపోతే కుర్సీలో కూర్చోవచ్చు. కళ్ళు మూసుకుని, రిలాక్సు అవ్వండి. మనం కళ్ళు మూసుకున్న తరువాత కూడా మనకు బొమ్మలు కనిపిస్తాయి. వీటిని అదుపులో పెట్టాలంటే, మీ కళ్ళు రాళ్ళలా అయినట్లు ఊహించుకోండి. మానసికంగా వాటిని గట్టిగా చేస్తే, బొమ్మలు మాయమవుతాయి. కళ్ళ కదలికలకి, మనస్సులో ఆలోచనలకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే మీ కనుగుడ్లని ఏ కదలికా లేకుండ చెయ్యమంటారు. దాన్ని ఎక్కువగా పట్టించుకోకండి. మీ పెదవులు రెండూ దగ్గర పెట్టి 'మ్మ్…' అనే శబ్దాన్ని లోపల నుండి చెయ్యండి. మీరు ఖాళీ అల్యుమినియం గిన్నెలో మొహంపెట్టి హమ్మింగ్ చేస్తే, ఆ శబ్దం ఇలాగే ఉంటుంది. ఇది 'హం' కాని 'ఓం' కాని కాదు, అది మీ పెదవులు రెండు దగ్గర పెట్టి, 'మ్…' అనే శబ్దం చెయ్యడం. ఇది పొదవుగా లోతుగా నాభిప్రాంతం నుండి గట్టిగా చెయ్యాలి.

ప్రతిసారి 'మ్మ్….' అనే శబ్దం చెయ్యగానే ప్రయత్నపూర్వకంగా దీర్ఘమైన శ్వాస తీసుకోవలసిన అవసరం లేదు. శరీరానికి అవసరమైనప్పుడు తనంతట తానే శ్వాస తీసుకుంటుంది. ఒత్తిడికి గురి కాకండి. మీ శక్తి నంతా ఈ శబ్దం చెయ్యడంలో పెట్టండి. మీరు శబ్దంగా మారిపోవాలి. మీ శరీరం అంతా ఆ శబ్దప్రకంపనలతో నిండిపోనివ్వండి. కొంత సేపు అయిన తరువాత, హమ్మింగు మీ ప్రయత్నం లేకుండా అదే జరుగుతుంది. మీరు ఒక శ్రోతగా మిగిలిపోతారు.

ఈ హమ్మింగు మీ ఎరుకను ఈ క్షణంలోకి తెచ్చే శక్తివంతమైన విధానం. మీరు తీవ్రంగా చేస్తే, మీకు ఆలోచనలు రావు. కాబట్టి మీకు సెకనుకు వచ్చే ఆలోచనలు (TPS) తగ్గిపోతాయి. ఆ హమ్మింగు వలన వచ్చే శక్తి, శరీరంలో ఉండే చక్రికేంద్రాలకి శక్తిని ఇస్తుంది. మీరు తీవ్రంగా హమ్మింగు చేస్తే, మీ గురించి మీకున్న అభిప్రాయాలన్నీ పూర్తిగా కదిలిపోతాయి. ఇది మనస్సుని కుదిపేయడానికి ఒక చక్కని పద్ధతి.

  • స్టెప్ 2 : 10 నిమిషాలు హమ్మింగు అపేసిన తరువాత, కళ్ళు మూసుకుని నిశ్నబ్దంగా చిరునవ్వుతో, ప్ర‌శాంతంగా కూర్చోండి. ఏదేనా ఆలోచ‌న వ‌స్తే రానీయండి. టి.వి. చూస్తున్నట్లు చూడండి. వచ్చే ఆలోచనల్ని వాటి మీద అభిప్రాయాలు ఉందకూడదు. నిశ్శబ్దంగా, అనందంగా ఉందండి. ఈ సమయంలో శరీరంలో ‌ప్ర‌తి భాగంలోకీ హ‌మ్మింగు వ‌ల్ల వ‌చ్చిన శ‌క్తి వెళ్ళి, ఆ భాగాన్ని శుభ్ర‌ప‌రుసుంది. అది మిమ్మల్ని వర్తమానంలో ఉంచుతుంది. ఈ ఎరుక మీలో ఉన్న అన్ని వ్యతిరేకాలోచనలు పోగొట్టి, మీ నిజమైన శక్తి ఏదో మీకు తెలియచేస్తుంది.

    • ఇతరులకి సేవ చేయడం నాయకత్తం. మన అవసరాలు తీర్తుకుంటూ ఇతరులపై శ్రద్ధ చూపించకపోతే నాయకత్యం లోపించిందని అర్హం.
    • అలాంటి వ్యక్తి నుండి స్యజనాత్త్రకత, సరైన నిర్ణయాలు ఆశించలేం.
  • ★ సంస్కారాల వల్ల వచ్చే అర్థం లేని ఆలోచనలని తొలగించటానికి ఉపయోగపడే పద్ధతి ధ్ఞానం.

తీవ్రత - అపజయం లేని మార్గం

ప్రతిదానిలో లోతైన తీవ్రవతతో ఉండటమే జీవన్ముక్తి

మనం అనుచరులుగా అనుసరిస్తున్నా, నాయకుడుగా ముందుకి నడిపిస్కున్నా మనం చేస్తున్నదానిలో పరిపూర్ణత్వాన్ని సాధించాలంటే అందులో గాధత ఉందాలి. దాన్ని తీవంగా చేయాలి.

ఒక చిన్న కథ : ఒక బౌద్ధగురువు ఆయన శిష్యుదు నది ఒడ్డున నదుసూ ఉంటారు. శిష్యుడు అంతకు ముందు చాలా సార్లు గురువుగారిని అడిగినట్టే మళ్ళా ఈ విధంగా అడుగుతాదు 'గురుదేవా! దయచేసి నాకు జ్ఞానోదయం కలిగించండి' అని. అకస్మాత్తుగా గురువు శిష్యుడి తల పట్టుకుని నీళ్ళల్లో ముంచుతాదు. శిష్యుదు నిర్వాంతపోయి, తన తలని బయటకి తీయటానికి కొట్టుమిట్టాదుతాడు. కాని గురువుగారు తలని అలాగే నీళ్ళల్లో బలంగా అదిమి పెడతాడు. శిష్యుడు శ్వాస ఆదక కంగారు పదుతుంటాడు. అప్పుడు గురువు అతని తలను వదులుతాడు. శిష్యుడు ఆశ్చర్యంగానూ, పూర్తిగా వణికిపోతూనూ బయటికి వస్తాడు.

అప్పుడు గురువుగారు శిష్యుడితో 'నీవు నీళ్ళల్లో తల ఉన్నప్పుడు శ్వాస కోసం ఎంత తీవ్రంగా ప్ర‌య‌త్నించావో అంతే తీవ్ర‌త‌తో జ్జానోద‌యం కావాలి అని అనుకుంటున్నావా? అని అడుగుతాడు.

కోరిక అత్యవసరమైనప్పుడు, ప్రశ్న పరిశోధనగా మారినప్పుడు అంతిమ అనుభవం జరుగుతుంది. జ్ఞానోదయం జరగటానికి కావలసిన ముఖ్యాంశం తీవ్రవత.

తీ(వత లేదా గాధత అంటే?

చూదండి, మనందరం బయటి ప్రపంచం విషయాలలో తీ(వమైన అసహనాన్ని అసుభవిస్తాం. నేను ఇది చేయలేదు, అది చేయలేదు, ఇలా అనుకుంటూ ఉంటాం. అదే అసహనాన్ని మీ అంతరంగం వైపు మళ్ళించే దాన్ని గాధత అంటారు.

ఏమి జరుగుతుందో, ఏమి జరగాలో మీకు తెలియదు కాని మీ అంతరంగంలో మీకు లోతైన అసంతృప్తి ఉంటుంది. దాన్ని నేను తీవ్రవత లేదా గాధత అంటాను.

నేను అసంత్సప్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నానా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. నేను సంత్సప్తి గురించి మాత్రమే చెప్పాలి కదా! నేను చెబుతున్నాను, మీ అసంత్సప్తి ప్రస్తుతం బయటి ప్రపంచం వైపు ఉన్నది. అదే అసంతృప్తిని మీ అంతరంగం వైపు మళ్ళించండి. అప్పుడే మీకు నిజమైన సంత్సప్తి కలుగుతుంది.

ముందుగా జరగవలసింది సంత్సప్తి కాదు, మీ దిశ మారాలి. మీలో మానసికవిప్లవం రావాలి. అసహనం తీవ్రతగా మారాలి. అది బయట ప్రపంచానికి సంబంధించినదైతే మీ తీవ్రత – అపజయం లేని మార్ధం చేతనస్తితి నిరంతరం బయటి ప్రపంచం వైపు మళ్ళితే దాన్ని అసహనం అంటారు. అదే మీ అంతరంగం లోనికి మళ్ళితే దాన్ని తీవ్రత అంటారు.

తీ(వత అంటే వెంటనే ఏదో జరగాలనే అత్యధికమైన కాంక్ష. బంధాల నుంచి స్వేచ్ఛని పొంది అంతరంగం లోనికి వెళ్ళాలనే కోరిక. తీ(వత అనేది భావావేశం కాదు. మీరు అసహనంలో ఉన్నప్పుడు, అందులో ఒక భావం భావావేశమై ఉందవచ్చు. కాని తీ(వత భావావేశం కాదు. అది వేడి లాంటిది. తీవతలో ఒక భాగం కరిగి బయటికి వస్తుంది. దాన్ని భావావేశం అనవచ్చు. ఇది ఎలా అంటే హృదయం కరిగితే దాన్ని భావావేశం అంటాం. హృదయంతో పాటు, మీ మేధ, మీ అంతరాత్మ కూడా కరగాలి, తీవ్రవత పరిణామం భావావేశం.

మీ తీ(వత ఏమిటని పట్టించుకోవద్దు. అది దేని గురించి అని కూడా పట్టించుకోవద్దు. అది నాణ్యతతో ఉందాలి. మీరు ఎవరినైనా లేదా దేన్నెనా పట్టుకున్న అది గాధతతో ఉండాలి. మీరు మాట్టాడేటప్పుడు, మీ అనుబంధాలు, మీ నిర్హయాలు, మీ జ్ఞాపకాలు, మీ ఆలోచనలు, కోరికలు, భయాలు అన్నీ ఆ క్షణంలో గాధతలో ఉండాలి. దాన్నే తీవ్రత అంటాం. తీవ్రత అంటే బయటి ప్రపంచంలో, అంతరంగంలో విబేధాలు సృష్టించని శక్తి. మీ అంతరంగంలో లోతైన గాధతతో ఉందటమే తీవ్రవత అంటే.

అది విభేదాలు లేకుండా సున్నితంగా, దృఢంగా సాగిపోతూ ఉంటుంది.

మీరు అనుకోవచ్చు నదిలా సున్నితంగా సాగిపోతే అందులో గాధత ఉందదు. అది రాయిలా గాధతతో ఉంటే నదిలా స్వేచ్ఛగా, సున్నితంగా సాగిపోలేదు అని అనుకుంటారు, అది సరి కాదు. గాఢత అంటే వరదలా ప్రవహించటం.

నిరంతరం తీవ్రమైన విభేదాలు సృష్టించేవారిని నేను చాలా మందిని చూసాను. వాళ్ళని ఏదైనా చేయమని చెప్పగానే వారిలో వెంటనే ఏవో విభేదాలు వచ్చేసాయి.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి పన్నెండేళ్ళ తరువాత జైలు నుంచి తప్పించుకుని పారిపోయి ఇంటికి చేరతాడు. అతని భార్య తలుపు తీసి అతని మీద గట్టిగా అరవటం మొదలుపెట్టింది, 'ఎందుకు అంత ఆలస్యంగా వచ్చావు. జైలు నుంచి తప్పించుకుని 24 గంటలు అయ్యింది. ఇంటికి తిన్నగా రాకుండా ఏంచేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? ' అని అతని మీద విరుచుకుపడుతుంది.

ఆమె కేవలం తన భర్త ఎందుకు తిన్నగా ఇంటికి రాలేదు అని మాన్నంది. ఆమె చాలా తీవ్ర‌త‌తో ఉంది. కాని అది విభేదాలు సృష్టించ‌టానికే. నిజమైన గాఢ‌త విభేదాల‌ను సృష్టించదు. అది ప్రవాహంలా సాగుతూ ఉంటుంది. గాధత అంటే ఏకీకృతం, అది నిజాయితీ.

పతంజలి ఈ విధంగా చెబుతాదు, 'ఎవరి ప్ర‌య‌త్నాలెతే తీవ్రంగా, నిజాయితీతో ఉంటాయో వారే విజయానికి దగ్గరగా ఉంటారు. చూదండి, నీటికి దారి చూపే నావికుడు అవసరం లేదు. సముద్దం ఇటు వైపు అనే బోర్డులు అవసరం లేదు. అన్నీ నదులూ సముద్దాన్ని చక్కగా చేరతాయి. అవి వాటి లక్ష్యాలని గమ్యాలని, కచ్ఛితంగా చేరతాయి. మీలో శక్తి అంతా ఒకే మొతంగా ఒక దిశలో సాగితే మీరు చాలా సులభంగా వెళ్ళగలరు. మీరు గాధతతో ఉండి ప్రవహించటానికి సిద్ధంగా ఉంటే, మీ లక్ష్యాన్ని సాధించగలరు.

మామూలుగా సాంధ్రంత అనగానే దృఢంగా అనిపిసుంది, మీరు గాధతతో ఉంటూ ప్రపహించే శక్తిని పోగొట్టుకోవచ్చు. లేదా మీరు ప్రవహిస్తూ తీవంగా ఉంటే శక్తి లేకుండా ఉండవచ్చు.

చూడండి, మీరు గాధతతో ఉండి ప్రవహించే శక్తిని ఎందుకు పోగొట్టుకుంటారు అంటే మీరు మీ అహంకారంతో ముందుకు వెళారు. మీరు ఏది సాధించాలి అనుకుంటారో దాన్ని సాధించాలని చూసారు. అయితే అది ఎలా అనే దానికి మీ స్థిరమైన అభిప్రాయాలు మీకు ఉంటాయి. మీ స్పష్టి మీ కంటే చాలా బాగా, చాలా సమర్దంగా చేస్ుంది అని మీరు అర్థం చేసుకోలేకపోయారు.

నేను నా శిష్యులకి ఎప్పుదూ ఒక విషయం చెబుతుంటాను, మీరు ఏది ప్లాన్ చేసినా మీ శక్తి కొద్దీ చక్కగా చేసి, వదిలేయండి అంటాను. మీరు అనుకున్నట్లు జరగలేదనుకోంది, నిరాశతో కుంగిపోవద్దు. ఇంత కంటే మీరు ప్లాన్ చేసినదాని కంటే ఇంకా చాల మంచిది జరగవచ్చు.

మరొక విషయం, మీరు ప్రవహిస్తున్నారు కాని తీవ్రత లేదు, ఈ విధంగా కొందరిలో ఉంటుంది. వారు దానికి ఎదురు వచ్చినవాటితో డిస్టర్బు అవుతారు. వారి దృష్టి ఏకాగ్రత నిశ్చలంగా ఒక దాని మీద ఉండదు. వారు శక్తిని వృథా చేస్తారు. ఒక విషయం అర్ధం చేసుకోండి, నీరు ఆవిరిగా మారేది కేవలం 100 డిగ్రీల దగ్గర మాతమే. కనీసం 99 డిగ్రీల దగ్గర అది ఇంకా నీటిలా ఉంటుంది. అది అవిరిగా మారదు. అదే విధంగా, ఆధ్యాత్మిక అన్వేషణలో మీరు ఒకే దృష్టితో ఉందనప్పుడు శక్తి ఒకే వైపు కేంద్రీకృతం కాదు. అప్పుడు సంపూర్ణమైన మార్పు జరగదు. ఏదైనా ఒకటి తీసుకొని పూర్తి గాధతతో దాన్ని అనుసరించాలి. గాధత అంటే మార్పులు లేని అతి స్థిరత్వం కాదు. అవసరానికి తగిన మార్పులు చేసుకుంటూ ఉంటేనే నదిలా తీవ్రతతో మీరు ప్రపహించగలుగుతారు.

మీరు ఏదో అనుకుని ఏదో చేసారు. కాని మీ నిర్ణయం ప్రకారం జరుగుతుందా లేదా అని చూసుకోరు. మీ ఉద్దేశం ఇంకా కూడా ఉపయోగమా లేదా చూడరు.

రగులుతున్న తీవ్రత

ప్రాచీనవేదాల నుంచి ఒక చక్కని కథ : ఒక శిష్యుడు గురువు దగ్గరకి వెళ్ళి తనకి జ్ఞానోదయాన్ని ఇవ్వమని ప్రార్ధిస్తాడు. గురువు గారు అతనితో, 'తత్వమసి' అని తొమ్మిది సార్లు అంటాడు. తత్త్యమసి అంటే 'అదే నీవు' అని అర్లం. దీన్ని మహావాక్యం అంటారు. అది సూటిగా జ్ఞానోదయాన్ని ఇస్తుంది. మహత అంటే విశ్వం.

గురువుగారు తొమ్మిది సార్లు తత్వమసి అంటారు. శిష్యుడికి జ్ఞానోదయం అవుతుంది.

ఇది అంత సులభమా? మరి అది మాకు ఎందుకు జరగటం లేదు? మాలో లేనిది ఏమిటి? మాకు ఆ శిష్యుడికి తేడా ఏమిటి?

ఆ శిష్యుడు పరిపూర్ణంగా ఏకీకృతమై ఉన్నాడు. అతనిలో సత్యాన్ని తెలుసుకోవాలనే తపన తీవంగా రగులుతూంది.

ఆలిచిపుని చూడండి, వర్షపు నీటి కోసం చూస్తూ ఉంటుంది. వర్కపు చినుకు పడగానే దాన్ని తన గర్భంలో దాచి సముద్దపు అడుగు భాగానికి వెళుతుంది. అక్కడ వర్షపు చినుకు ముత్యంగా తయారవుతుంది. సముద్రం మీద ఆలిచిప్ప నోటిని తెరచి వర్షం కోసం చూస్తుంది. ఎంతో తీవంగా ఎదురుచూస్తుంది. సముద్దపు నీటితో ముత్యాన్ని తయారుచేయదు. దానికి స్వచ్చున మంచి నీరు కావాలి. ఒక చుక్క నీరు పడగానే అది సముద్దం లోనికి వెళుతుంది. అక్కడ ముత్యం తయారయ్యాక పైకి వస్తుంది.

అదే విధంగా గురువుగారి మాటలు తీవ్రంగా సత్యాన్ని కోరుకుంటున్న శిష్యుడి అంతరంగం లోనికి వెళ్ళాయి. ఆ మాటల్ని తన లోనికి తీసుకుని అంతరంగంలోనికి వెళుతాడు. అక్కడ జరగవలసింది జరిగాక ముత్యం అనే జ్ఞానోదయంతో బయటకి వస్తాడు.

తీ(వమైన అధ్యాత్మిక అన్వేషికి కొన్నిమాటలు చాలు. అతను అకస్మాత్తుగా తన అంతరాత్మ వికసించటం, విస్తుతం అవటం, అది వెల్లడి కావటం చూడగలడు. శిష్యుడిలోని తీప్రవత, విప్పారి ఉండే తత్త్వం ఆలిచిప్పలా ఉంటుంది. గురువుల మాటలు వర్షపు బిందువులుగా శిష్యని అంతరంగం లోనికి ప్రవేశించి జ్ఞానోదయం అనే ముత్యం బయటికి వస్తుంది.

ఆ విధంగా ఉండాలి అనుకోవటం Vs కేవలం ఉండటం

మీరు తీ(వతతో ఉన్నప్పుడు మీరుగా ఉంటారు. మీరు మరేదో కానవసరం లేదు. మీరు అలా ఉంటే చాలు.

ఏదో విధంగా ఉండటానికి చాలా మార్గాలు ఉన్నాయి. అలా జరగటం అనేది అదే విధంగా ఉండటానికి చాలా తేడా ఉన్నది. ఒక డాక్టర్‌గా కాని, లాయర్‌గా కాని అవ్వాలి అంటే ఏంచేయాలో మీకు తెలుసు. రాజకీయనాయకుడు కావాలి అంటే ఏంచేయాలో తెలుసు. మన జ్జానం అంతా ఇలా ఏ విధంగా కావాలంటే ఏం చేయాలో అది అవటానికే.

ఏదైనా అలా తయారు కావాలి అన్నది మనస్సుకి సంబంధించింది. అదే విధంగా, మీరు మీరుగా ఉండటం అనేది మీ సహజత్వానికి సంబంధించింది. మనకి ఏదైనా ఎలా కావాలో తెలుసు కాని మనం ఎలా ఉండాలో అన్న ముఖ్య విషయాన్ని మనం మరిచిపోయాం. ఎందుకంటే మన అంతరంగం కలుషితమైపోయింది. ఏదో అవ్వాలి అనే దానిలో పడి మనం ఎలా ఉండాలి అన్నది మరిచిపోయాం. మనలోని అసలైన అంతరాత్మని మరిచిపోయాం.

అంతరాత్మ చికిత్సాస్పర్శ

మీకు కనీసం ఒక్కసారి ఒక క్షణమైనా మీ అంతరాత్మ అనుభవాన్ని పొందగలిగితే మీలోని శారీరక, మానసికాది, అన్ని అనారోగ్యాలూ పోతాయి, మీ అంతరంగంలోని చికిత్సని అనుభవంతో తెలుసుకోగలరు. మీలోని గాయాలు మానిపోతాయి. వీటి అన్నింటి కంటే కూడా మీరు ఏదో అవటానికి దృఢమైన ఆధారం ఏర్పదుతుంది. ఏదో ఒకటి అవటం అనేది కూడా మీ అంతరాత్మ అనుభవంతో జరిగితే అది కూడా విజయమే. ఆ అనుభవం లేకుండా మీరు ఏదో కావాలి అంటే, అది ఒక అపజయమే.

ఉండటం అంటేనే గాధత

ఉండటం అంటే ఏమిటి? సంపూర్ణంగా, ఏకత్వంతో ఉంటూ శక్తిని వెల్లడి చేయగలగటమే. మీ అనుభవంలో కాని, వెల్లడి కాని సగమే ఉంటే అది కపటం.

కోపంలో తీ(వత

మీ కోపం కూడా కపటమే. మీరు కోపాన్ని వెల్లడి చేయాలా, వద్దా అనుకుంటారు. మీ కోపం కూడా మీ తర్కజ్ఞానానికి సంబంధించిందే. మీ తర్కానికి అతీతంగా మీకు కోపం రాదు. అది ఎప్పుదూ తర్కంలో ఉంటుంది. ఈ సందర్శంలో నేను దేన్నెనా పోగొట్టుకుంటున్నానా? అని ఆలోచిస్తారు. ఏదైనా నష్టం కలుగుతుంది అంటే కోపాన్ని అణచేస్తారు. నష్టం లేదు అనుకుంటే మీ కోపాన్ని చూపిస్తారు. కాని అప్పుడు చూపించవలసినదాని కంటే ఎక్కువ కోపాన్ని చూపించి ఎదుటి వ్యక్తి మీద ఎక్కువగా అరుసారు. మీలో నిలువ చేసి ఉన్నదాన్ని బయటకి తెస్తారు.

వెల్లడి, అణచటంవద్దు – కావలసింది

స్పష్టంగా అర్థం చేసుకోండి, తర్మం మీ కోపాన్ని నియంత్రిస్తే, మీకు రెండు రకాల సమస్యలు ఉంటాయి. మొదటిది, అవసరం లేనప్పుడు కోపాన్ని వెల్డడి చేసారు. రెండవది మీరు కోపాన్ని వెల్లడి చేయకపోతే, దాన్ని అణచుకుంటారు.

మొదటిది, మీరు వెల్లడి చేసే అవసరమైనదాని కంటే చాలా ఎక్కువ వెల్లడి చేసారు. తరువాతిది, దాన్ని వెల్లడి చేయకపోతే అణచేసారు, రెండూ తప్పే. వెల్లడి చేయటం, అణచటం రెండూ మీకు ఏ విధంగానూ సహాయం చేయవు. మీరు అడగవచ్చు 'అయితే మేం ఏం చేయాలి' అని. మీరు ఏమీ చేయవద్దు, అలా ఉందండి.

జిద్య కృష్ణమూర్తి చక్కగా చెబుతారు, 'ఎప్పుదైతే ఒక భావావేశం మిమ్మల్ని అధిగమించినప్పుడు, మిమ్మల్ని తన చేతుల్లోనికి తీసుకున్నప్పుడు, మీరు కనీసం ఒక్కపారి

అయినా మీ శరీరాన్ని కదపకుండా, ఆ ఆవేశానికి సహకరించకుందా ఉంటే మీరు దాని నుంచి విముక్తిని పొందుతారు' అని.

మీరు ఏదైనా ఆవేశంతో నిండిపోయి ఉన్నప్పుడు, శరీరాన్ని కదపకుండా నిశ్చలంగా ఉంచగలిగితే, ఆ ఆవేశం నుంచి మీరు బయటికి వచ్చేయగలుగుతారు. దీన్ని నిరంతరం సాధన చేయాలి అని నేను చెపుటం లేదు. ఈ విధంగా ఒక్కసారి మీరు చేయగలిగితే, మీరు ఆ ఆవేశం నుంచి స్వేచ్ఛని పొందగలుగుతారు.

గాఢతతో జీవించటం

జ్ఞానేందియాల తృప్తితో మీరు నిజమైన సంతృప్తిని గాధతతో జీవించటం అంటే జ్ఞానేంద్రియాల తృప్తి కాదు. గాఢత అంటే మీకు ఎలా జీవించాలని ఉంటే అలా జీవించటం కాదు.

నన్ను ఎవరో అడిగారు 'బంధాలతో ఉండటం, స్వేచ్ఛని పొందటం అనేది కేవలం ఒక పోలికలోనే కాబట్టి హాయిగా తిని జల్చాగా ఉండవచ్చు కదా! ' అని. అలా చేస్తే మంచిదే కాని గాధతతో చేయండి అంతే. తినేది తీవ్రవతతో తినండి. తినేటప్పుడు కేవలం తినండి. నిద్ర పోయేటప్పుడు కేవలం నిగ్రద పోండి. తాగేటప్పుడు ఎంజాయ్ చేసేటప్పుడు కేవలం ఆ పనిని మాత్రమే చేయండి మరేదీ చేయవదు.

అసలు సమస్య ఏమిటంటే ఎంజాయ్ అంటారు కాని నిజంగా మీరు ఎంజాయ్ చేయరు. అందుకే మీకు విముక్తి గురించి ఇన్ని బోధలు అవసరం. అందుకే ఇక్కడ మీరు ఆలోచిస్తారు. కేవలం తిని, తాగి, జల్పా చేయటం అంత సులభం అనుకున్నారా? కాదు. మీకు సంతోషంగా ఉండటం తెలియదు. అందుకే మీ శరీరానికి అవసరం లేనివాటిని తాగుతారు. మీ శరీరం స్వీకరించలేనివాటిని లోపలికి తీసుకుంటారు.

అర్ధం చేసుకోండి, గురువుల మాటల్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలి. ఆ మాటల్ని గాధంగా, లోతుగా, స్పష్టంగా అర్థం చేసుకోవాలి కాని ఏదో పైపైన కాదు. మీరు అనుకున్నట్టు తిని, తాగి, జల్పా చేయటం అంత సులభం కాదు. దాన్ని మీరు తీవ్రంగా చేయగలిగితే అది చాలా మంచిది.

తీవ్ర‌త గురించి ఒక చిన్న క‌థ : ఇర‌వై ఐదు సంవ‌త్స‌రాల వివాహ‌జీవితం త‌రువాత ఒక వ్యక్తి భర్త భర్త భర్త అలమారులో మూడు సోయా బీను గింజలు, ముప్పె దాలర్ల డబ్లు కనిపిస్తాయి. అవి ఏమిటో అనే కుతూహలంతో ఆమె భర్త దగ్గరకి వెళ్ళి 'ఈ గింజలు, ఈ దబ్బు ఏమిటి? ఎలా వచ్చాయి? వీటి అర్థం ఏమి'టని అడుగుతుంది.

అప్పుదు భర్త చాలా నెమ్మది గొంతుతో 'ఇప్పుదు నీకు నిజం చెబుతాను. నేను నిన్ను మోసం చేసిన ప్రతిసారీ ఒక గింజని అక్కడ పెట్టేవాడిని' అంటాదు. భార్య నిర్ఘాంతపోతుంది.

కాని వెంటనే తనకి తాను పోనీలే ఇరవై ఐదు సంవత్సరాల్లో కేవలం మూదుసార్లు మాత్రమే మోసం చేసాడులే అనుకుంటుంది. తరువాత అతణ్ణి 'ఆ దబ్బు ఏమిటి' అని అడుగుతుంది.

'సోయా గింజలు కేజీ అయినపుడు పది డాలర్లకి అమ్మేసాను,' అని జవాబు ఇస్తాడు.

కాబట్టి తిని, తాగి ఎంజాయ్ చేయండి, కాని దాన్ని సోయాగింజలని అర్థం చేసుకున్నట్లు కాదు. దాని వెనక ఉన్న ముప్పె డాలర్లని కూడా చూడాలి. అప్రుండే అసలు నిజం ఏమిటో తెలుసుంది. విముక్తి అంటే అర్లమవుతుంది. మీరు తీవ్రవతతో జీవిస్తే అభ్రయత్నంగా విముక్తి కలుగుతుంది.

కర్మ, సంస్కారం

మీరు ఏ క్రణంలోనెనా గాధతతో జీవించకపోతే ఏమవుతుంది?

మీ మనస్సు ఆ క్షణంలో ఆ పనిని తిరిగి చేయాలి అని చూసుంది. ఎందుకు? ఎందుకు మీ మనస్సు అదే అనుభవానికి మళ్ళా మళ్ళా మిమ్మల్ని లాగుతుంది.

మీరు అదే చాక్టెట్ కావాలి అని అనుకుంటారు. కొన్నింటికి అలవాటు పడిపోతారు. ఎందుకు? మీరు లోతుగా చూస్తే, అది ఎందుకో చూడగలరు. మీరు చాక్టెట్‌ని తినటం కాని లేదా మీ అలవాటుని కాని పూర్తిగా అందులోనే నిమగ్నమై చేయరు. ఆ పని లోనికి పూర్తిగా వెళ్ళకుండా మిమ్మల్ని మీరు పట్టుకొని ఉంటారు. దీన్ని గురించి మీరు అపరాధ భావంతో ఉందవచ్చు. లేదా ఆ సమయంలో మీలో అయోమయాన్ని కలిగించే చాలా ఆలోచనలు ఉండి ఉందవచ్చు. కాబట్టి మీరు ఆ పనిని అలోచనలు లేకుండా చేయాలి అని నిర్లయించుకోండి.

చూడండి, మీలో ఒక భాగం ఆ పనిలో నిమగ్నమవసమని చెబుతుంది. మరొక భాగం ఎందుకు అని వాదిస్తుంది. మీరు చాలా ఆలోచనల్తో చిక్కుకుపోయి ఉంటారు. ఆ ఆలోచనలలో చాలా పరస్సరవిరుద్ధమైన ఆలోచనలు. ఈ పోరాటాల్లోనే మీరు మీ శక్తిని పోగొట్టుకుంటారు. చివరికి ఆ పనిని చేసినా, చేయకపోయినా మీరు ఒకటిగా ఉందరు.

మీరు గాఢతతో ఉందరు. అందుకే ఆ కోరిక తృప్తిని ఇవ్వదు. దాని జ్ఞాపకాలని మీ లోపల ఉంచుతుంది. ఏ కోరికలైతే పూర్తి తృప్తిని ఇవ్వవో ఆ కోరికల జ్ఞాపకాలనే సంస్కారాలు అంటారు. ఈ సంస్కారాలు మిమ్మల్ని అదే దారిలో వెళ్ళే విధంగా చేసే శక్తిని కలిగి ఉంటాయి. అది కాఫీ తాగటం లేదా సిగరెట్ కాల్చటం, ఏదైనా సరే, ఒకసారి సంస్కారంగా మీలో ఏర్పడితే అది మీతో ఆ పనిని పదే చేయస్తుంది. ఆ పనిలో మీరు సంపూర్ణమైన తృప్తిని పొందే వరకూ అది అలానే ఉంటుంది.

మీ అలవాటుని మీరు తీవ్రంగా, లోతుగా ఒకసారైనా అనుభవించ గలిగితే, మీరు దాని నుంచి పూర్తిగా స్వేచ్ఛని పొందగలుగుతారు. ఆ సంస్కారం మిమ్మల్ని అదే మార్గంలో వెళ్ళమని ఎప్పుడూ ప్రోత్సహించదు.

తీరని సంస్కారాలనే కర్మలు అంటారు. మీ శరీరం, మనస్సు ఇంకా జీవంతో ఉన్నాయి, అంటే అర్థం అవి మీకు ఏదో ఇస్తాయి అనే ఆశ మీలో ఉండటమే. ఇంకా ఏదో అనుభవిస్తాను అన్న ఆశ మీలో ఉండటమే. ఈ శరీరం, మనస్సు ద్వారా ఏదో తృప్తిని పొందాలి అనుకోవటమే. దాన్నే నేను కర్మ అంటాను.

కర్మ అంటే మీ అంతరంగంలో ఉన్న సంస్మారాలు, కోరికలు. అవే నిరంతరం మిమ్మల్ని అదే దారిలో వెళ్ళమని, ఆ అనుభవాన్ని పొందమని పదే పదే ప్రోత్సహిస్తాయి. ఏ పనినైనా మీరు పూరిగా నిమగ్నమై చేస్తే, ఏ కోరికనైనా పూర్తిగా చేస్తే మీలో తిరిగి ఆ పనిని చేయాలి అనే కోరిక ఉండదు. మీరు ఆ కోరిక నుంచి విముకులవుతారు. ఇప్పుడు మీరు మీ శక్తిని కొత్త అనుభవాలు, కొత్త విషయాల్లోకి మళ్ళించవచ్చు. అప్పుడు మీరు విషవలయంలో చిక్కుకోరు. మీ జీవితం అభివృద్ధి వైపు, పరిపూర్ణత వైపు వెళుతుంది. జీవితం మీకు తాజా అయిన కొత్త క్షణాల్ని బహూకరిస్తుంది అని తెలుసుకుంటారు. దీని అంతటికీ మీ నుంచి కావలసినది కేవలం తీవ్రతతో, గాధతతో జీవించటమే.

జంతువు మార్గం, బుద్ధుని మార్గం

జీవించటం అనేది రెండు రకాలుగా ఉంటుంది.

ఒకటి పశువులా, కేవలం శ్వాసిస్తూ జీవించటం. దానిలో గాఢత ఉండదు. ఎటువంటి తీవ్రమైన కోరికా ఉండదు. మరొక మార్గం బుద్ధుని మార్గం అంటే ఈ క్షణంలో వర్తమానంలో, చేస్తున్న పనిలో గాఢతతో ఉండటం.

మీకు ఎప్పుడైనా పీడ కల వచ్చిందా? పీడ కల వచ్చినప్పుడు కళ్ళు తెరవాలన్నా మీరు కళ్ళు తెరవలేరు. చేతులు కదపాలన్నా కదపలేరు. అప్పుడు పీడ కల చాలా తీవ్రంగా ఉంటుంది. కలలో సింహం మిమ్మల్ని తరుముతుంది, మిమ్మల్ని పట్టేసుకోబోతూంది. మీరు పడిపోతారు, లేదా మరొకటి, మీ జీవితం మరణం అంచుల్లో ఉంటుంది. ఎప్పుడైతే కల తీవ్రత పెరుగుతుందో, అది అత్యధిక స్థాయికి వెళుతుందో మీకు మెలకువ వస్తుంది. పీడ కల అంత తీవ్రంగా లేకపోతే మీకు మెలకువ రాదు, మీరు కల లోంచి బయటికి రాలేరు. అది తీవ్రంగా ఉన్నప్పుడు, ఆ తీవ్రత మిమ్మల్ని మేల్కొలుపుతుంది. అది కల మాత్రమే కాని మీరు నిజం అనుకుంటారు.

అర్థం చేసుకోండి, అది జరుగుతుంది అని మీరు అనుకున్నా మీరు దాని లోంచి బయటకి వస్తారు. అది మీ ముందు జరుగుతున్న ఒక సినిమా లాంటిది.

పనితో సంబంధం లేకుండా తీవ్రత స్వతంత్రంగా ఉంటుంది

తీవ్రత అనేది పని మీద ఆధారపడి ఉండదు. పని అనేది కోట్ల విలువైన కంపెనీని నడపటం అయినా, గదులు తుడిచే పని అయినా ఏదైనా సరే, పని ఏమిటన్నది ముఖ్యం కాదు, ఎలా చేస్తున్నారన్నది ముఖ్యం. మీరు చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమై, అందులో మిమ్మల్ని మీరు మరిచిపోయేంత తీవ్రతతో చేస్తే తీవ్రతలోని అసలు సూత్రాన్ని పట్టుకున్నవారవుతారు. ఎప్పుడైతే చేస్తున్న పనిలో మీరు పూర్తిగా నిమగ్నమవుతారో, అప్పుడు మీరు సర్వాంతర్యామి అధరాల మీద మురళి అవుతారు. పూర్తిగా, తీవ్రతతో ఉండండి. మీ బాణం అనుకున్న లక్ష్యానికి సరిగ్గా తగలాలంటే ఇదే చేయాలి.

ఆసక్తి Vs తీవ్రత

తీవ్రత అనటానికి అర్హతలు ఏమిటి? తీవ్రతకి, ఆసక్తికి తేడా ఏమిటి?

ఆసక్తి అనేది పోతుంది, తీవ్రత ఎప్పటికీ పోదు.ఆసక్తి మనస్సులో వస్తుంది. తీవ్రత అంతరాత్మ నుంచి వస్తుంది. కొంత కాలం అయ్యాక ఆసక్తి పోతుంది. కాని తీవ్రతలోని దాహం అదే విధంగా ఉంటుంది. అది మీ ధర్మజ్ఞానాన్ని మారుస్తుంది. తీవ్రత మీ అంతరంగం లోపలి నుంచి వచ్చే పిలుపు.

లెటుకి, లేజర్‌కి ఉన్న తేడా చూడండి. రెండూ అవే కాంతిరేఖలతో చేయబడ్డాయి. లేజర్ ఒక పాయింట్ మీద తీవ్రంగా ఉంటుంది. తీవ్రత అనే శక్తి లేజర్‌కి అంత శక్తినిస్తుంది. దాన్ని ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. ఆ శక్తి లోహం మీద కూడా రంధ్రాన్ని చేయగలదు. అదే శక్తి అత్యంత సున్నితమైన కంటి లోపల భాగాల్ని కూడా తొలగించగలదు.

బయాజిద్ కథ : బయాజిద్ అనే జ్ఞానోదయమైన ఒక సూఫీ యోగి జీవితం నుంచి, ఒక కథ

బయాజిద్ తన గురువు దగ్గర పన్నెండు సంవత్సరాలు ఉంటాడు కాని గురువు ఒక మాట కూడా అతనితో మాట్లాడలేదు. పన్నెండు సంవత్సరాలు గడిచాక, ఒక రోజు గురువుగారు బయాజిద్‌ని పిలిచి హాలులో ఒక పుస్తకం ఉంటుంది అది తీసుకురా అంటాడు. పన్నెండు ఏళ్ళగా బయాజిద్ గురువుగారిని చూడటానికి ప్రతి రోజూ ఆ హాలు నుంచి వచ్చేవాడు.

అతను గురువుతో, 'నేను ఎప్పుడూ పుస్తకాన్ని అక్కడ చూడలేదు. నిజానికి నేను హాలుని సరిగ్గా చూడలేదు. నా ఆసక్తి కేవలం మీ మీదే. మరింక దేని మీద లేదు కాని మీరు వెళ్ళి, తీసుకురమ్మంటే వెళతాను అంటాడు. అప్పుడు గురువు అతనితో 'వద్దు, ఇక్కడే ఉండు' అంటాడు.

బయాజిద్ ఆసక్తి మొత్తం గాఢతతో ఉంది. అతని ఆసక్తి మొత్తం గురువుగారు మాత్రమే. గురువుగారు అతనితో 'ఆ పుస్తకం అవసరం లేదు. నేను నీ ఏకాగ్రత పూర్తిగా ఉందా లేదా అని చూసాను' అని అంటాడు. ఆ రోజు రాత్రి గురువుగారు శిష్యుడిని అక్కడే పడుకోమని చెప్తాడు. అతను గురువుగారి పక్కనే పడుకుంటాడు. అతనికి నిద్ర పట్టదు. అతను ఎంతో గాఢతతో నింపబడి ఉంటాడు. అతని మనస్సు పని చేయటం ఆగిపోయింది.

తీవ్రత – అపజయం లేని మార్గం

మర్నాడు ఉదయం బయాజిద్ మరణించి, కొత్త వ్యక్తిగా నిద్ర లేస్తాడు. అతనికి బోధనలు కాని, సూచనలు కాని ఇవ్వలేదు. కేవలం పన్నెండు సంవత్సరాలు ఎదురుచూసాడు అంతే.

అది కేవలం ఆసక్తి అయితే ఆ శిష్యుడు పన్నెండు సంవత్సరాలు, గురువు ఏమీ మాట్లాడకపోయినా ఆ విధంగా ఉండేవాడు కాదు. అతని మనస్సు ఇక అక్కడ ఉండనవసరం లేదు. అతని ఎదురుతిరిగేది, ఇక్కడ నీవు ఏం చేస్తున్నావు? నీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఏమీ జరగలేదు. గురువుగారికి నీ మీద ఆసక్తి లేదు, ఇలా ఎంత కాలం సమయాన్ని వృథా చేస్తావు? అని మనస్సు తొందర చేస్తుంది.

మీలోని తీవ్రత మిమ్మల్ని పట్టి ఉంచుతుంది, ఎందుకంటే మీ అంతరంగం లోతులలో, పన్నెండు సంవత్సరాలు ఏమిటి అంతిమ సత్యం లోనికి గురుదేవులు మనని తీసుకువెళతారు అంటే పన్నెండు లక్షల జన్మలైనా ఎదురుచూడవచ్చు అనుకుంటారు. అది కూడా తక్కువే. ఎడారిలో దాహం వేసినప్పుడు గ్లాసు నీళ్ళ కోసం మీ ప్రాణాన్ని అయినా ఇస్తారు. అదే విధంగా ఆధ్యాత్మికదాహం అయినా అంతిమసత్యం కోసం ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధం అన్నంత తీవ్రంగా ఉండాలి కోరిక.

జెన్ బౌద్ధమతం నుంచి ఒక చక్కని కథ : ఒక శిష్యుడు జెన్ గురువు దగ్గరకు వచ్చి తనకి జెన్ గురించి నేర్పించమని అడుగుతాడు. గురువు శిష్యుడితో, 'సరే నీవు ఒక చేతితో కొట్టిన చప్పట్ల శబ్దం విని నా దగ్గరకు రా' అని చెపుతాడు.

శిష్యుడు, మూడు సంవత్సరాలు ప్రయత్నిస్తాడు. కాని గురువు చెప్పిన ఆ శబ్దాన్ని వినలేకపోతాడు. అతనికి నిరాశ కలుగుతుంది. కన్నీటితో అతను గురువు దగ్గరకు వచ్చి మీరు చెప్పింది చేయలేకపోయాను. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయే స్థితి వచ్చింది అంటాడు.

అప్పుడు గురువు, 'మరొక వారం రోజులు చూడు. నిరంతరం ధ్యానం చేయి అంటాడు. అతను వారం రోజులు ఉంటాడు. కాని ఫలితం ఉండదు. గురువు గారు అతనితో మరొక ఐదు రోజులు ప్రయత్నించమని చెపుతాడు.

శిష్యుడు మరో ఐదు రోజులు ఉంటాడు, ఫలితం ఉండదు. శిష్యుడు అత్యంతనిరాశతో వచ్చి తనని పంపించేయమని అడుగుతాడు, అప్పుడు గురువు అతనితో 'మరొక మూడు రోజులు ప్రయత్నించు. నీకు జ్ఞానోదయం జరగకపోతే చనిపో' అంటాడు.

రెండవ రోజున శిష్యుడికి జ్ఞానోదయం అవుతుంది.

ఎప్పుడైతే మీ అంతరంగం మొత్తం ఆ సత్యం కోసం దహించుకుపోతుందో అప్పుడు గురువుల సూచనల్ని మీరు సూటిగా గ్రహించ గలుగుతారు. అప్పుడు మీలో మార్పు అనేది తప్పకుండా జరుగుతుంది. అప్పుడే మీరు దేన్నైనా స్వీకరించే స్థితిలో ఉంటారు. అప్పటి వరకూ మీలో ఉన్నది కేవలం ఆసక్తి మాత్రమే.

ఏ పని చేసినా తీవ్రతతో చేయాలి

తంత్రం ఏం చెబుతుందంటే సత్యాన్ని తెలుసుకోవాలంటే మీకు కావలసింది ఒకే ఒక నిబంధన, అది – తీవ్రత. మీరు చేసేదానిలో మీలో సంపూర్తిగా నిమగ్నమవ్వండి. ఈ క్షణంలో తీవ్రతతో ఉండండి. అప్పుడు నిజమైన జీవితపు రుచిని చూస్తారు. లేకపోతే మీరు జీవిస్తున్నట్లు కాదు, కేవలం మరణం కోసం ఎదురుచూడటమే.

తినేటపుడు తీవ్రతతో తినండి. మీ ఏకాగ్రత, మీ శక్తి అంతా ఆ తినేదాని మీద మాత్రమే ఉండాలి. మీ ఏకాగ్రతని అక్కడి నుంచి మళ్ళించవద్దు, మీరు చేసే పని నుంచి ఆలోచనలను అటూ ఇటూ వెళ్ళనీయవద్దు.

మీ అన్ని జ్ఞానేంద్రియాలతో ఆహారాన్ని అనుభవించండి. నోట్తో ఆహారం పెట్టుకోగానే ఆ రుచిని, మీ కళ్ళ ముందు ఉన్న భోజనాన్ని, దాని స్పర్శని ప్రేమతో ఒక ఉత్సవంలా సంతోషించండి. భోజనం నుంచి వచ్చే చక్కని వాసనని అనుభవించండి. ఈ విధంగా భోజనం చేసే దాన్ని మీ వ్యవస్థలోకి పంపించగలరు. ఆ జీవశక్తికి ఆహారాన్ని ఇవ్వటమే భోజనం అంటే. మీరు నీరు తాగేటపుడు, గాఢతతో మీరే దాహం అయిపోయి తాగండి. మీ నోటి లోంచి గొంతు ద్వారా అన్నవాహికలోకి నీళ్ళు తీసుకువెళ్ళే చల్లదనపు అనుభూతిని పొందండి. మీ నోటి లోనికి వెళ్ళే ప్రతి నీటి బొట్టూ మీకు తృప్తిని ఇవ్వాలి.

తమిళంలోని పెరియ పురాణంలో నాయన్శార్లు అనే శివభక్తుల కథలు ఉంటాయి. వారిలో చాలా మంది కేవలం సామాన్యమైన పనులు చేస్తూ, శివుడికి పూలమాలలు అల్లుతూ జ్ఞానోదయం పొందిన సంఘటనలు ఉన్నాయి. ఒక ఉదాహరణ, గణనాథ నాయన్శార్ ఒక శివభక్తుడు. అతడు శివపూజకి పూలు కోసి దండలు అల్లేవాడు. గుడి తుడిచి కడిగేవాడు. దీపాలు వెలిగించేవాడు. సాధారణ కార్యాలు చేస్తూ అంతిమస్థితిని చేరాడు. అందుకే అతనికి గణనాథుడు అనే పేరు. గణనాథుడు అంటే శివుని గణాలకి అధిపతి.

మీరు పూజ చేసే సమయంలో నిజంగా, అనుయత్నంగా ఉండండి. మీరు ఏ అనుభూతిని పొందుతారో దాన్ని పూర్తిగా పొంది భగవంతునికి సమర్పించేవి ఇవ్వండి. నాకు అటువంటి అనుభూతులు లేవు అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. భగవంతుడి నుంచి మీరు దేన్నీ దాచలేరు. మీ గురించి మీ కంటే భగవంతునికే బాగా తెలుసు.

మీ సత్యాన్వేషణ, మీ కోరిక అనేవి తీవ్రత ఉన్నప్పుడే జరుగుతాయి. మీలోని తీవ్రత తారస్థాయిలో ఉంటే అది అప్పుడే ఆ క్షణంలోనే జరుగుతుంది. ఆ తీవ్రత పూర్తిగా లేకపోయినా లేదా కొన్ని భాగాలుగా విడిపోయినా జరగటానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే తీవ్రత బలాన్ని పుంజుకోవటానికి సమయం పడుతుంది.

ఒక చిన్న కథ : జ్ఞానోదయమైన సూఫీ యోగీ జునాయిద్ తొమ్మిదవ శతాబ్దానికి చెందినవాడు. ఒక రోజు ఉదయం ఆయన నడుస్తుంటే ఒక వ్యక్తి వచ్చి నేను రాజధాని పట్టణానికి వెళ్ళాలి ఎంత సమయం పడుతుంది అని అడుగుతాడు. జునాయిద్ అతని వైపు చూసి నడవటం కొనసాగించాడు. ఆ వ్యక్తి అటు వైపు వెళుతున్నాడు. అతను జునాయిద్‌ని అనుసరించాడు. జునాయిద్ సరిగా వినలేదు అనుకొని అతన్ని మళ్ళా, 'నేను రాజధాని పట్టణం చేరటానికి ఎంత సమయం పడుతుంది.' అని అడుగుతాడు.

జునాయిద్ నడుస్తూనే ఉంటాడు. అతను ఇక అడగవద్దు అనుకుంటాడు. కొంత దూరం నడిచాక జునాయిద్ అతనితో, నీవు మరొక పదిగంటలు నడవాలి. అని అంటాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంగా, 'ఆ మాట ముందే చెప్పవచ్చు కదా'! అంటాడు.

జునాయిద్ అతనితో ముందే నేను ఎలా చెప్పగలను. నువ్వు ఎంత వేగంగా నడుస్తున్నావో గమనించకుండా ఎలా చెప్పను. నిన్ను గమనించి నీవు ఎప్పటికి చేరగలవో చెప్పాలి కదా' అంటాడు.

అదే విధంగా మీరు అంతిమ సత్యాన్ని ఎంతలో తెలుసుకోగలరు అనేది మీరు ఎంత తీవ్రంగా అన్వేషిస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు తీవ్రంగా ఉంటే అంతిమ స్తితిని చేరటానికి ఎక్కువ సమయం అవసరం లేదు. మీరు ఎవరు ఎక్కడ ఉన్నారు అన్నది అనవసరం. ఇప్పుడే ఇక్కడే ఆ స్థితిని చేరవచ్చు.

ఒక చిన్న కథ : ఒక రాజ్యంలో భయంకరమైన బందిపోటు దొంగ ఉన్నాడు. అతను చాలా మందిని దోచుకున్నాక, అతని పనులకి అతనిలో అసహనం, అసౌకర్యం అనే భావనలు కలిగాయి. అప్పుడు అతను ఒక గురువు దగ్గరికి వెళతాడు. 'నేను నీచమైన పని చేశాను. నేను మోక్షాన్ని పొందే అవకాశం ఉన్నదా? నాకు ముక్తి లభిస్తుందా?' అని అడుగుతాడు.

గురువు దొంగ వైపు చూసి నీవు ఏ విషయంలో సమర్ధుడివి అంటాడు. దొంగ ఏదీ లేదు అంటాడు. ఏమీ లేదా? ఏదో ఒక దానిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది కదా! అని అంటాడు. దొంగ చాలా సేపు ఆలోచించి, 'గురుదేవా! నాకు కేవలం దొంగతనం చేయటమే తెలుసు. నా జీవితం అంతా నేను ఆ పనే చేసాను' అని అంటాడు.

గురువుగారు నవ్వి, 'మంచిది. ఇప్పుడు నీవు దాన్నే ఉపయోగించాలి. ఏదైనా ప్రశాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి నీలోని భావాల్ని, ఆలోచనల్ని దొంగతనం చేయి. భూమి మీద ఉన్న చెట్లని, రాళ్ళని, నదుల్ని అన్నింటినీ దొంగతనం చేయి. వాటినన్నింటినీ నీ అంతరంగంలో ఉన్న విశాలమైన ఖాళీ ప్రదేశంలో కరిగించేయి,' అని చెబుతాడు.

దొంగ గురువుగారి సూచనల్ని అదే విధంగా పాటించాడు. అతను 21 రోజుల తరువాత తన సహజ స్థితిని తెలుసుకుంటాడు, అతను జ్ఞానోదయం పొందుతాడు.

తీవ్రత – చేతన స్థితిలోని నాలుగు దశలు

చేతనస్థితిలో నాలుగు దశలు ఉన్నాయి. మీకు మీ మీద పూర్తి స్పృహ ఉండి ఆలోచనలు ఉన్న జాగ్రత్‌స్థితి లేదా మేలుకొని ఉన్న స్థితి. అది ఇప్పుడు మీరు ఉన్న స్థితి. ఈ స్థితిలో నేను

అనేది మీ ఆలోచనల కంటే వేగంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆలోచనల్ని నియంత్రించవచ్చు. మీ మీద మీకు స్పృహ ఉండదు. కాని ఆలోచనలు ఉంటాయి. అదే స్వప్నస్థితి. స్వప్నస్థితిలో మీ ఆలోచనల వేగం ఎక్కువ. అందుకే మీరు ఆలోచనల్ని నియంత్రించలేరు.

వివిధ చేతన స్థితులు
ఆలోచనలతోఆలోచనలు లేకుండా
"నేను" అన్న చేతనతోజాగ్రత్తురీయ
మేల్కొన్న అవస్థపరమానంద స్థితి
ఆలోచిస్తూసంపూర్ణ చేతనస్థితి
"నేను" అన్న చేతన లేకుండాస్వప్నసుషుప్తి
కలలు కంటూఅచేతన స్థితి
గాఢ నిద్ర

మీ మీద మీకు 'నేను ' అనే స్పృహ ఉండదు, ఆలోచనలు ఉండవు. అదీ గాఢనిద్రస్థితి అయిన సుషుప్తి. సాధారణంగా మనకి ఈ మూడు స్థితులు తెలుసు. నాలుగవదానిలో నేను అనే స్పృహ ఉంటుంది. కాని ఆలోచనలు ఉండవు. ఇదే తురీయదశ.

తీవ్రమైన అన్వేషణ – మూడు స్థితులలో తెలుసుకునే తత్వం

తీవ్రత అంటే మీరు ఏ పని చేసినా ఆ క్షణంలో ఆ పనిని తీవ్రతతో చేయటమే. కాబట్టి ముందుగా మీ మీద మీకు పూర్తి స్పృహ, తెలుసుకునే తత్వం ఉండాలి. అప్పుడే మీరు తీవ్రంగా ఉండగలరు.

ఇప్పుడు మీరు తెలుసుకునే తత్వంతో మీరు అంటే ఎవరో జాగ్రత్‌స్థితిలో తెలుసుకోండి. మీరేమనుకుంటారు. నేను డాక్టర్ని, నేను లాయర్ని ఇలా అనుకుంటారు. మీరు మీ గుర్తింపులు తెలుసుకొని మూడు స్తితులలో సంతోషంగా ఉండగలిగితే అసలు సూత్రాన్ని పట్టుకున్నట్టే. ఈ మూడు స్తితుల్లో ఉండే కేంద్రసూత్రాన్ని పట్టకున్నప్పుడు, అకస్మాత్తుగా మనం ఈ మూడు స్థితులతో మన గురింపుని తెలుసుకోగలుగుతాం.

నన్ను ఒకరు ఇలా అడిగారు, 'గాఢనిద్రలో నన్ను నేను తెలుసుకోలేను కదా!' అని గాఢనిద్ర లోంచి వచ్చి గాఢనిద్రలో ప్రశాంతంగా నిద్రపోయాను అని చెప్పేది ఎవరు? నేను చీకటితో నింపబడ్డాను, అక్కడ నేను అనే వ్యక్తిని లేనంతగా నిద్రపోయాను అని చెప్పేది ఎవరు. నేను అసలు లేను అని గుర్తుంచుకొని చెప్పే వ్యక్తి ఎవరు? ఆ స్థితిలో ఆ వ్యక్తి లేకపోతే వెనక్కి వచ్చి ఈ మూడు దశలని కలిపి చెప్పే వ్యక్తి ఎవరు. కాబట్టి గాఢనిద్రలో నేను లేను అని చెప్పలేం. మనం అక్కడ ఉన్నాం కాని మన గుర్తింపులు మనకి ఆ స్థితిలో తెలియవు.

తీవ్రత – అపజయం లేని మార్గం

అర్థం చేసుకోండి, ఈ మూడు స్థితులు తెలుసుకున్న వ్యక్తి చేతనస్థితి. మనం ఈ మూడు స్థితుల్లో మన గుర్తింపుని తెలుసుకోగలిగితే, మనలో చేతనస్థితి ఉంటుంది. మన అన్వేషణ తీవ్రంగా ఉంటుంది. మనం దీక్ష పొందగల తీవ్రత ఉంటుంది.

మనకి ఈ మూడు స్థితులూ తెలిసి ఉండకపోతే, ఈ మూడు స్థితుల్ని అదే గుర్తింపుతో తెలుసుకోకపోతే, మనం మన ఆధ్యాత్మిక అన్వేషణని తీవ్రం చేయాలి.

తీవ్రమైన ఆధ్యాత్మిక అన్వేషకుడు ఈ మూడు స్థితుల్లోనూ తన గురింపుతో ఉంటాడు. కనీసం ఒకటి – రెండు సార్లయినా మీరు మేలుకుని ఉన్నప్పటి మీ గుర్తింపుని మీ కలల స్థితిలో కూడా తెలుసుకోగలిగితే మీలో తీవ్రత ఉందని అర్థం. కొన్నిసార్లు అకస్మాత్తుగా మీ కలల స్థితిలో మీ గుర్తింపుకి అతీతంగా వెళ్ళినట్టు తెలుసుకుంటారు. అధ్యాత్మికులు కలల స్థితికి ఈ అనుభవం పొందటం నాకు తెలుసు. వారికి కల వస్తుంటుంది. అకస్మాత్తుగా మేలుకున్న స్తితిలోని వారు అంటే ఏమిటో దాన్ని గుర్తిస్తారు. అప్పుడు వాళ్ళు కలల గురించి ఆలోచిస్తారు. ఇది చిన్నది, ఇందులో ఏమీ లేదు అనుకుంటారు. మీరు మేలుకుని ఉన్నప్పటి స్థితి కలల స్తితిలో గుర్తుంచుకోగలిగితే మీలో తీవ్రత ఉంది అని అర్ధం. మీ అన్వేషణ తీవ్రమైంది.

మేల్కొండి

పీడ కల వచ్చేటప్పుడు ఒక్క ఆలోచన, 'ఓ! ఇది కల' అనేది చాలు, మీరు మేలుకుంటారు. అదే విధంగా మీరు ఉన్న ఇప్పటి పెద్ద కల అయినా మేల్కొని ఉన్న స్థితిలో ఒక క్లిక్ చాలు, ఈ పెద్ద కల అనే దాని నుంచి మీరు మేల్కొంటారు.

'కాదు! నాకు మరొక పద్ధతి అవసరం,' అని మీరు అనుకుంటే, మీరు నిజంగా పీడ కల లోంచి వెళ్ళటం లేదు. మీ కల తీవ్రంగా లేదు. ఏవో కొన్ని ఆలోచనలు ఉన్నాయి.

కొన్నిసార్లు కలల్లో ఏవో స్పష్టత లేకుండా మసకగా చూస్తారు. ఏవో మామూలు విషయాలు సాధారణంగా ఉంటాయి. మీకు అవి చూడాలి అనిపించదు. దాని లోంచి బయటకి రావాలి అనిపించదు. మీరు ఇటువంటి కలలతో ఉంటే మీరు సమయం వృథా చేస్తున్నారు అని అర్థం. మీలో తీవ్రత లేనప్పుడు మీరు ఇటువంటి కలల స్థితిలో ఉంటారు. మీరు కిందికీ వెళ్ళలేరు, పైకి వెళ్ళలేరు. దయచేసి ఆ స్థితిలో ఉండవద్దు. అర్థం చేసుకోండి, మీరు అటువంటి మధ్య స్థితిలో ఉంటే, మీలో క్లిక్ అనేది జరగదు. మీలో బలమైన మార్పు జరగదు.

ఏదో ఒక టైంలో నిద్ర లేవాలి కాబట్టి లేసారు. కొన్ని జన్మలుగా ఉన్న ఆ నిరుత్సాహంతోనే నిద్ర లేస్తారు. మీలో నిద్ర లేవాలి అనే తీవ్రమైన కోరిక ఉంటే ఈ క్షణంలోనే మేల్కొంటారు.

కబీరు చాలా చక్కగా, గట్టిగా ఒక విషయం చెబుతాడు, 'మీరు ఆయన కోసం చూసే వెంటనే ఆయన మీకు కనిపిస్తాడు.' కొంత మంది అంటుంటారు, 'మా చేతులలో ఏముంది? మేము ఎప్పుడు మేల్కొవాలి అని భగవంతుడు నిర్ణయిస్తే అప్పుడే మేల్కొంటాం అది మా విధి రాత అని.' అర్థం చేసుకోండి, ఇవన్నీ మీ మనస్సు చేసే ట్రిక్స్ మాత్రమే. మీరు మీ కోసం నిర్మించుకున్న జైలు తలుపుని ఎప్పుడూ తడుతూ ఉంటాడు. మీరు తెరవకపోతే ఏం చేయగలడు.

నేనెప్పుడూ చెబుతాను. భగవంతుడు కరుణామయుడు. మీ స్వేచ్ఛకి అడ్లు పడదు. మీరు నిద్రలోనే ఉంటాను అనుకుంటే ఆయన మీరు మేల్కొనేవరకూ ఎదురు చూస్తుంటాడు. మీ స్వేచ్ఛని ఆయన గౌరవిస్తాడు. మీకు విసుగు కలిగి మీరు ఉన్న ప్రపంచం అంతా ఒక ఊహ అని తెలుసుకునేవరకూ ఓపికతో చూస్తాడు.

మీ లోపలికి చూడండి. మీ కలల ప్రపంచంలో నిద్ర పోవటానికే మీరు నిర్ణయించుకుంటారు. నిజంగా భగవంతుడు ప్రతిక్షణం మీ తలుపు తడుతూ ఉంటాడు, కాని మీరు పట్టించుకోరు. మనం మన కలల ప్రపంచానికి ఎంతగా అలవాటు పడిపోయామంటే, మేలుకోవటానికి ఇష్టపడనంత. ఎప్పుడైతే గురుదేవులు అసలైన సత్యం, అది చాలా అందంగా ఉంటుంది, అని చెప్పినా మీరు ఆ నిద్ర మొద్దు తనంలోనే ఉంటారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ పెద్ద కల నుంచి బయటికి రావాలి అని మీరే నిర్ణయించుకోవాలి. అది మీ ఎంపిక, మీ బాధ్యత.

నిద్రలో తీవ్రత

ఒక చిన్న ప్రయోగాన్ని ఎప్పుడైనా ప్రయత్నించారా? మీరు ఉదయం నాలుగు గంటలకు మేల్కోవాలి అనుకున్నారనుకోండి. మీ దగ్గర అలారం లేదనుకోండి, అప్పుడు మీరు నిద్ర పోయే ముందు గట్టిగా మీకు మీరు 'నేను 4 గం. లకు మేలుకుని తీరాలి' అనుకుంటారు. సరిగ్గా 4 గం. కి మీ కళ్ళు తెరుచుకుంటాయి, మీకు మెలకువ వస్తుంది, నిద్ర మాయం అవుతుంది. మీ శరీరం అనే గడియారం మీలోని తీవ్రమైన, నిజాయితీగా ఉన్న కోరికకి స్పందిస్తుంది.

మీరు నిజాయితీగా అనుకోకపోతే, మీ అంతరంగంలో 'చూద్దాం! లేవగలిగితే లేసాను. ఒకవేళ లేవలేకపోయినా పరవాలేదు అనుకుంటే ' మీరు లేవలేరు. మీరు నిజాయితీగా, దృఢంగా అనుకుంటే అది జరుగుతుంది. తీవ్రతకి మీ అచేతన స్థితిలోనికి, మీ గాఢ నిద్ర స్థితిలోనికి వెళ్ళగల శక్తి ఉంది.

ఏకాగ్రత మారాలి

ఈ నాలుగు స్థితుల్లో ఒకటి అన్నింటిలో ఉంటుంది. అదే వాటిని చూసే వ్యక్తి. ఆ అనుభవాన్ని పొందే వ్యక్తి. మనం కొంచెం లోతుగా చూస్తే, ఈ మూడు స్థితుల్లోనూ అక్కడున్న నిజమైన దాన్ని మార్చటానికి ప్రయత్నిస్తున్నాం అని తెలుస్తుంది. మన జీవితంలో జరిగే ప్రతి దాన్నీ మార్చటానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తుంటాం.

ఒక చిన్న కథ : ఒక అబ్బాయి అతని తల్లితండ్రులతో కలసి సినిమాకి వెళతాడు. అది చిన్న పిల్లల సినిమా. సింహం పిల్ల అడవి జంతువుల కథ. ఈ అబ్బాయి సినిమాలో లీనమైపోయి చూస్తుంటాడు. సినిమాలో ఒక వేటగాడు వచ్చి సింహం పిల్లని పట్టుకుని బోనులో పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు, అది భయపడుతుంది.

ఈ దృశ్యం చూసి ఆ అబ్బాయి తట్టుకోలేక పోతాడు. కుర్చీ లోంచి దూకి స్క్రీన్ దగ్గరకి వెళ్ళి కాళ్ళతో చేతులతో వేటగాడిని కొడుతుంటాడు. కొంత సేపటికి జంతువులన్నీ కలసి వేటగాడిని తరిమి సింహం పిల్లని రక్షిస్తాయి. ఆ అబ్బాయి తన కుర్చీ దగ్గరకి వచ్చి గర్వంగా వాళ్ళ అమ్మతో, 'చూసావా! నేను ముందు వెళ్ళగానే జంతువులన్నీ నన్ను అనుసరించాయి. మేం సింహం పిల్లని కాపాదాం' అని అంటాడు.

ఇది చూడటానికి చిన్నపిల్లల చేష్టగా ఉంటుంది, కాని మీరు కొంచెం లోతుగా మీ జీవితాల్లో చూస్తే ఆ అబ్బాయిలా మనం కూడా మన జీవితాల్ని నియంత్రిస్తున్నాం అనుకోవటం కనిపిస్తుంది. జీవితం అంటే ఒక సినిమా అది ఈ మూడు స్థితుల నుంచీ సాగుతూ ఉంటుంది.

మీరు చూసే వ్యక్తి ఆ ప్రొజెక్టరు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదంతా మీ సృష్టి. సీను మార్చాలి అంటే ఆ ప్రొజెక్టరులోని రీలు మార్చాలి. ఎప్పుడైతే ఈ మార్చటం అనేది ఈ మూడు స్తితుల్తో అసాధ్యం అని తెలుసుకుంటారో ఏకాగ్రత మీలోకి మారుతుంది, అపుడు మేల్కొంటారు. అలా కాకుండా, ఈ స్థితులలో ఏదో ఉపయోగం ఉన్నది అనుకుంటే, మీ ఏకాగ్రత వాటి మీద మాత్రమే ఉంటుంది. మీరు నిరంతరం వాటిలోనే నిమగ్నమై ఉంటారు. అప్పుడు మీరు సీనులు మార్చటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

ఈ విషయం మీలో క్లిక్ అయితే మీరు ఏ స్థితిలో ఉన్నా, అది మేల్కొని ఉండే జాగ్రత్త్యస్తితి, స్వప్నస్తితి లేదా గాఢనిద్ర అయిన సుషుప్తి నుంచి మేలుకోగలుగుతారు. మనకి కావలసింది కేవలం ఒక క్లిక్ మాత్రమే. 'ఇది ఒక కల మాత్రమే,' అంతే మనం ఆ స్థితి నుంచి మేల్కొంటాం.

నాల్గవ స్థితికి ద్వారం

ఇదే తెలుసుకునే తత్వాన్ని గాఢనిద్రస్థితికి కూడా తీసుకువెళ్ళగలుగుతారు. అటువంటివారు, ఈ విషయాన్ని ఈ మూడు స్తితులలో అర్థం చేసుకున్నప్పుడు అకస్కాత్తుగా వారు వారి అంతరంగం లోనికి వెళతారు. అప్పుడు వారు వారిని మేల్కొల్పగలుగుతారు.

ఒక చిన్న కథ : ఒక రోజు ఉదయాన్నే ఒక జెన్ బౌద్ధగురువు నిద్ర లేచి బయటకి వచ్చి ఏడవడం మొదలుపెడతాడు. అతని శిష్యులు ఆయనని అలా చూసి చాలా ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఆయనతో, 'గురుదేవా' ఎందుకు మీరు అలా బాధ పడుతున్నారు' అని అడుగుతారు.

అప్పుడు గురువుగారు, 'రాత్రి నాకు ఒక కల వచ్చింది. అందులో నేను సీతాకోక చిలుకలా ఉన్నాను' అంటాడు. శిష్యులు ఆయనతో, 'కాని అది కల కదా, 'ఇప్పుడు మీరు మా ముందు కూర్చుని ఉన్నారు, ఇంకా ఎందుకు బాధపడతారు?' అని అంటారు.

అప్పుడు గురువుగారు చాలా చక్కని సమాధానం ఇస్తారు. నాకు తెలియటం లేదు. నేను నా కలలో సీతాకోక చిలుకని అయ్యాక గురువుని అయ్యానా లేకపోతే సీతాకోకచిలుక కలలో ఒక గురువుని అయ్యానా, నాకు ఏమి తెలియటం లేదు.

అర్థం చేసుకోండి, చాలా కొద్దిమంది మాత్రమే మనస్సు తాలూకు మూడు సితుల్తో అదే తీవ్రతతో, అదే బంధంతో తమ గుర్తింపుని చూడగలుగుతారు. అన్ని స్థితుల్లో ఆ గుర్తింపు నిశ్చలమైన, విడిపోని అదే గుర్తింపుని ఈ మూడు స్థితుల్లో గుర్తించగలిగితే, మీరు ఆధ్యాత్మిక వేత్తలే. అప్పుడు మీలోని చేతనస్తితి మేలుకుంటుంది. ప్రత్యగాత్మ చైతన్య జాగ్రత్ స్థితి మీలో కలుగుతుంది. నేను కొన్ని సంస్కృతపదాలని వాడుతుంటాను. ఎందుకంటే వేదాల్లో మనం తీసుకువెళ్ళలేని విషయాలు ఉంటాయి. అంటే మనం వెల్లడి చేయలేని కొన్ని కోణాలు. అటువంటి పదాల్ని ఇంగ్లీషు లోనికి అనువదించటానికి కుదరదు. అలా అనువదిస్తే ఆ పదాలు చెప్పే అనుభవాలు అర్థం కాదు. ఆ సంస్కృతపదం తనలోని అనేకకోణాలలో ఉన్న అర్థాన్ని వెల్లడి చేస్తుంది.

జ్ఞానోదయం పొందటం ఎలా?

అర్థం చేసుకోండి, ప్రశ్న ఒక పదం, కోరిక ఒక భావం. మనిషి ఒక కోరికతో జన్మించాడు. సృష్టిలో మిగిలింది ఏదీ కూడా మనిషి సర్వాంతర్యామిని ప్రతిబింబించినంతగా ప్రతిబింబించదు. మనిషి అద్దం వంటివాడు. అతను సర్వాంతర్యామి వైపు తిరిగి, ఆయనది తనలో ప్రతిబింబించాలి అని అనుకోవచ్చు లేదా వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. మనిషి చేతనస్థితిలో తన ఎంపికని చేసుకొని అభివృద్ధి పొందవచ్చు. తనలోని మానవరూపంలో అతను భగవంతుని తెలుసుకోవచ్చు. సృష్టిలో మరే ప్రాణికీ ఈ అవకాశం లేదు.

మీలోంచి 'నాకు జ్ఞానోదయం ఎలా జరుగుతుంది? నాకు చాలా చాలా అత్యవసరంగా జ్ఞానోదయం కావాలి, అన్న మాటలు వస్తే, ఈ ప్రశ్న మీ అంతరంగపు లోతుల నుంచి నిజంగా వస్తే, ఇక మీరు ఏమీ చేయనవసరం లేదు. కేవలం మరిగిపోండి. ఆ కోరికతో మీ వ్యవస్థ పూర్తిగా మరిగి పోవాలి, అది చాలు. మీరు ఇంకేమీ చేయనవసరం లేదు. ఆ మరగటం అనేది, దహించటం అనేది తీవంగా ఉండాలి. దాన్ని అలా జరగనీయండి. ఆ కోరిక దహించేసేలా చెయ్యండి. ఆ తీవ్రతని అదే విధంగా కొనసాగించండి. ఆ అవసరాన్ని అదే విధంగా ఉంచండి.

అవసరం అత్యవసరం కావాలి. ప్రశ్న మీ తీవ్రమైన కోరికలా మారాలి. ఆ కోరిక మీ అహంకారాన్ని తినేయాలి. అది మీ అంతరంగం అంతా నిండాలి.

నన్ను చాలామంది అడుగుతుంటారు, 'మీరు భగవంతుని కృప వలన జ్ఞానోదయం పొందారా లేకపోతే కోరికతో పొందారా అని. నేను వారితో, మీలో కోరిక ఉంది అంటేనే భగవంతుని కృప అని చెప్పాను.

అర్థం చేసుకోండి, ఈ కోరిక లేదా అన్వేషణ అనేది ఒక విత్తనం లాంటిది. విత్తనం లోపల ఉక్కిర్రిబిక్కిరి అయిపోతూ ఉంటుంది. విత్తనం లోపల ఉన్న జీవచెతన్యం అందులో ఉక్కిరిబిక్కిరి కాకపోతే, ఇక అందులో తాను బతకలేను అనుకున్నప్పుడే అది బయటికి వస్తుంది. లేకపోతే అది పగిలి బయటికి రాదు, చెట్టుగా మారదు. ఎప్పుడైతే విత్తనం తాను బయటికి రావాలి అని అనుకుంటుందో, అప్పుడే అది తన సత్యాన్వేషణని ప్రారంభిస్తుంది. ఆ కోరిక అత్యవసరమైనప్పుడు, అది వికసించి మొక్కగా మారుతుంది. దీని అర్థం ఏమిటి? ఆ మొక్క విత్తనంలోనే ఉంది, కాని అది వికసించాక తనని తాను వెల్లడి చేసుకోవటం ప్రారంభించింది.

మీకు జ్ఞానోదయం కావాలి అనే భావన కలిగిందనుకోండి, మీలోని బుద్ధుడు కళ్ళు తెరచినట్లే. మీ లోపల ఉన్న బుద్ధుడు మేల్కొన్నట్లే. మీరు చేయవలసింది, కేవలం కళ్ళు తెరవటమే.

ఆ అన్వేషణని జరగనీయండి. ఉదయం నుంచి రాత్రి వరకు దాన్ని అలా మరిగిపోనీయండి. అది మీ లోపల లోతైన అసంతృప్తిని కలిగించనీయండి, మీ శరీరంలో ఇది సాధించలేదు అన్న నిరాశలు చాలా ఉంటాయి. కొన్ని రకాల బాధలు, వ్యథలు ఉంటాయి.ఈ ఒక్క బాధతో ఆ బాధలన్నీ కరిగిపోయేలా చేయండి.

జెన్ బౌద్ధం నుంచి ఒక చక్కని కథ : ఒక అమ్మాయి జెన్ బౌద్ధగురువు దగ్గర చాలా కాలం నుంచి అన్నీ నేర్చుకుంటూ ఉంటుంది. కాని నిజమైన ధ్యాన స్థితి అనుభవం ఆమెకి ఎంత కాలానికీ కలగదు. ఒక పౌర్ణమి రోజున ఆమె ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకువస్తూ ఉంటుంది. ఆమె ఒక కుండ మోస్తూ ఉంటుంది. ఆమె ఆ బకెట్లు నీళ్ళలో చంద్రుడి బింబాన్ని చూస్తుంది. అప్పుడే కుండ విరిగిపోతుంది. నీళ్ళు బకెట్ నుంచి బయట పడిపోతాయి, చంద్రుడి బింబం మాయం అవుతుంది. దాంతో పాటు ఆమె అహం కూడా పోతుంది.

మీలో తీవ్రత, తపన ఎక్కువగా ఉంటే, అది మీ అహంకారంలోని సారాంశాన్ని తీసేస్తుంది. పచ్చగడ్డి, ఎండుగడ్డి అయినట్లు అహం మారిపోతుంది. చిన్న అగ్గి రవ్వ చాలు, ఎండుగడ్డి మోపుని మండించేయటానికి. అంతిమస్థితి కేవలం ఒక్క క్షణంలో జరగవచ్చు. ఒక చిన్న సంఘటన చాలు అది జరగటానికి.

కాబట్టి అర్థం చేసుకోండి, మీరు అంటున్నారే, జ్ఞానోదయం ఎలా పొందాలి, నాకు అత్యవసరంగా కావాలి అని అంటున్నారే అది ఒక తీవ్రమైన కోరికగా మారాలి. ఆ కోరిక మిమ్మల్ని దహించేయాలి. అది మీలోని వ్యథల్ని, నిరాశని, కోరికలని, మీ జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్నీ దహించేయాలి.

అది జరగనీయంది. అకస్మాత్తుగా మీలోని అన్వేషణ, కోరిక అనేవి పూర్తిగా మాయమైపోవటం మీరు చూస్తారు. అది అక్కడ ఉండదు. ఎప్పుడైతే అన్వేషణ, కోరిక అన్నవి మాయమైపోతాయో మీకు జ్ఞానోదయం జరుగుతుంది. మీరు కోరుకున్నది, మీరు అన్వేషించేది మీకు దొరుకుతుంది.

గాఢతతో జీవించటం

మీరు నిజంగా జీవితాన్ని అనుభవించాలి అనుకుంటే, మీరు నిజంగా సర్వాంతర్వామి అంతిమ అద్భుతాన్ని తెలుసుకోవాలి అనుకుంటే, ఆనందసాగరంలోకి దూకాలి అనుకుంటే, మీకు కావలసినది గాఢత, తీవ్రత. మీరు ఏది చేసినా తీవ్రతతో చెయ్యండి, అందులో పూర్తిగా నిమగ్నమైపోండి. సగం పనులు చేయొద్దు. మిమల్ని మీరు ఆ పనిలో ఒకటిగా చేసేయండి.

మీరు డాన్స్ చేసే మీరే డాన్స్ అయిపోయేంతగా, పూర్తిగా అందులో నిమగ్నమవ్వండి. అక్కడ డాన్స్ చేసే వ్యక్తి ఉండరు, కేవలం డాన్స్ మాత్రమే ఉంటుంది. మీరు బొమ్మ వేస్తున్నారనుకోండి, పెయింటర్ మాయమైపోయి ఆ చిత్రమే మిగలాలి. అప్పుడు మీలోని అబద్ధపు గుర్తింపులు మాయమైపోతాయి. అప్పుడు మీలో ప్రవహించే మేధని చూడగలుగుతారు. విశ్వశక్తి మీ నుంచి ప్రవహించటం చూస్తారు.

బోధిధర్మ, జ్ఞానోదయమైన బౌద్ధయోగి, ఆయనే బౌద్ధమతాన్ని చైనా, జపాను దేశాలకి తీసుకువెళ్ళింది. ఆయన పైన ఒక చక్కని కథ ఉన్నది. బోధిధర్మ, తన గుహలోని గోడ వైపు తిరిగి దాన్ని చూస్తూ తొమ్మిది సంవత్సరాలు కూర్చున్నాడట. ఆయన ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా తొమ్మిది సంవత్సరాలు కూర్చున్నాడు. కాళ్ళలో కదలికలు లేని మూలాన అవి ఎలాగో అయిపోయాయి.

ఆయన ఎవరినీ శిష్యులుగా తీసుకునేవారు కాదు. ఎవరైతే తీవ్రతతో దహించుకు పోతుంటారో వారినే శిష్యులుగా తీసుకునేవారు. తొమ్మిది సంవత్సరాల తరువాత అతని మొదటి శిష్యుడు హయ్ కాజొ వస్తాడు. అతను తన చేతిని నరికి గురువుకి అర్పిస్తూ ఇలా చెబుతాడు. 'మీరు దీన్ని తీసుకోండి గురుదేవా. మీరు ఇప్పుడు నా వైపు చూడకపోతే, నేను నా తలని కూడా నరికేస్తాను అంటాడు.

బోధిధర్మ శిష్యుడి వైపు తిరిగి, 'నా సందేశాన్ని ఇవ్వగల వ్యక్తి వచ్చాడు,' అని అంటాడు.

ఒక్కసారిగా భగవంతుడిని చూడవచ్చు

కబీర్ ఈ విధంగా చెబుతాడు, 'నీవు నిజమైన ఆధ్యాత్మిక అన్వేషివైతే ఒక్కపారిగా చూడగలవు,'

మీరు నిజమైన ఆధ్యాత్మిక అన్వేషి అని ఎలా తెలుస్తుంది? మీలో ఆ అగ్ని రగులుతూ ఉంటే, ఆ తీవ్రత లోతుగా ఉంటే, అది అత్యవసరం అని అనిపిస్తే, ఆ దాహం ఉన్నప్పుడు మీరు ఆధ్యాత్మిక అన్వేషి, సత్యాన్ని కోరే వ్యక్తి. కబీర్ ఏం చెబుతాడు, మీలోని కోరిక నిజమైందిగా ఉండాలి. ఇక్కడ కావలసింది తీవమైన తపన, లోతైన కోరిక, నిజాయితీ, ఏకీకృతంగా ఉండే సత్యాన్వేషణ. మీలో ఇవన్ని ఉంటే మీరు తప్పనిసరిగా భగవంతుడిని చూడగలరు. మీరు చూడలేకపోతే, మీలో ఆ తీవ్రత లేదు అని అర్థం. అది పూర్తిగా లేదు. మీరు ఆయనని సగం హృదయంతోనే పిలుస్తున్నారు.

భగవంతుడిని చూడాలి అనే తీవ్రమైన కోరిక

మనలో చాలామంది అంటుంటాం, నేను చాలా తీవ్రంగా ప్రార్థిస్తున్నాను. భగవంతుడిని ఎలా చూడాలి? అని. మీ లోపలికి జాగ్రత్తగా చూడండి. భగవంతుడు మీ ప్రధాన ప్రాధాన్యమేనా? మనలో చాలామందికి భగవంతుడు ప్రాధాన్యాల లిస్టులో చివర ఉంటాడు. నిజం చెప్పాలంటే మీరు ఏమనుకుంటారు, 'నాకు మంచి ఇల్లు సమకూరేక, నా కుటుంబసభ్యులకి చేయవలసింది చేసాక, ఇంకా టైమ్ ఉంటే అప్పుడు నేను కోరుకునే లిస్టులో భగవంతుడిని కూడా కలుపుతానని. భగవంతుడిని కోరికల లిస్టులో చివరివాడైతే ఆ లిస్టుకి చివర అంటూ ఉండదు, ఇది ఒక విషన్నత్వం. భగవంతుడు ఎన్నటికీ ఆ లిస్టులో పైన ఉండడు, ఎందుకంటే కోరికలకీ చివర ఉండదు. ఒక కోరిక తీరటానికి మీరు పని చేస్తారు. ఆ పనిలో మీరు పూర్తిగా నిమగ్నం కారు. అప్పుడు భగవంతుడు కోరుకోనే వాటి లిస్టులో ఇంకా కిందికి నెట్టబడతాడు.

తీవ్రత వయస్సుని నిర్ణయిస్తుంది

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి గురువు గారిని మీ వయస్సు ఎంత? అని అడుగుతాడు. ఆయన, 'నాకు మూడు వందల సంవత్సరాలు,' అని జవాబు ఇస్తాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి,'అది ఎలా? మీరు చూడటానికి అరవై సంవత్సరాల వ్యక్తిలా ఉన్నారు, ' అని అంటాడు. అప్పుడు గురువు గారు, 'భౌతికంగా, కేలెండరు ప్రకారం నా వయస్సు అరవై సంవత్సరాలు కాని నేను జీవితాన్ని సాధారణమనిషి కంటే ఐదు రెట్లు గాఢతతో జీవించాను,' అని జవాబు ఇస్తారు.

ఇక్కడ కావలసింది ఎన్ని సంవత్సరాలు జీవించాం అని కాదు, ఎంత గాఢతతో జీవించాం, అని.

తీవ్రతతో అంతిమస్థితికి దీక్ష

వేదాలు ఏం చెబుతాయంటే, దీక్ష పొందిన వ్యక్తికి ప్రపంచమంతా స్వర్గంలా కనిపిస్తుందని. దీక్ష అనే పదాన్ని అర్ధం చేసుకోండి. ఏదో ఒక పనిని పూజలా, యాత్రికంగా చేయటం కాదు.

మీరు ఆహా! అది నిజమే, అని అనిపిస్తే, అకస్కాత్తుగా మీరు 'అవును ఆయన చెప్పింది నిజం, నేను ఇదే విధంగా చాలా సార్లు అనుకున్నాను అని అనుకోవటమే దీక్ష. ఆయన సరైన పద్ధతిలో చెప్పారు, అనుకున్నప్పుడు మీలో జరిగిందే దీక్ష. నేను మాట్లాడేది మీకు తెలిసిన విషయం, దాన్ని సరైన పద్ధతిలో చెప్పాను అని మీరు అనుకుంటే మీలో జరిగిందే దీక్ష

ఒక విషయం అర్ధం చేసుకోండి, చేయవలసినవన్నీ చేసాక, మీరు తీవ్రమైన స్థితిలో ఉన్నప్పుడే, గురువులు చెప్పేది మీలో దీక్షగా ఒక క్లిక్ అవుతుంది.

గురువులు మీతో ఇక మీరు కోరుకునేది, వెతికేది ఏమీ లేదు, ఇప్పుడే ముక్తిని పొందవచ్చు అన్నప్పుడు మీకు ఆ స్థితి కలగాలి. అంటే మీరు దానికి తగిన అన్వేషణని చేసి ఉండాలి. ఆ కోరిక అంత తీవ్రంగా అంత లోతుగా ఉండాలి. ఇక్కడ పద్దతి ఏమిటంటే గాఢతతో ఉన్న సరియైన దృక్పథం. నిజానికి మీ లోపల తీవ్రవతతో ఉన్న శక్తి ఉన్నప్పుడు సరిగ్గా వినగలుగుతారు. మీరు ఆ క్షణదర్శనాన్ని పట్టకోవటానికి చూస్తుంటారు. వినటానికి ఎదురుచూస్తుంటారు. దాన్ని మీలో ఇముడ్సుకోవటానికి ఎదురుచూస్తుంటారు.

అందుకే గురువులు అదే విషయాన్ని పదే పదే, చెబుతుంటారు. నేను కొన్ని సంవత్సరాల క్రితమే మాట్లాడటం మొదలు పెట్టాను. గౌతమబుద్ధుడు నలభై సంవత్సరాలు మాట్లాడాడు. ఆయన మొదటి ఉపన్యాసం, చివరిది ఒకటే. మీరు అనుకోవచ్చు, ఎందుకు వేలమంది కూర్చుని అదే ప్రవచనాలని, అదే సందేశాన్ని మళ్ళా మళ్ళా వింటారు అని. ఎందుకుంటే మీలో తీవ్రమైన శక్తి ఉన్నప్పుడే క్లిక్ అనేది జరుగుతుంది. తీవ్రవతలోనే దీక్ష ఉంటుంది. మీరు ఆ అగ్గి రవ్వని పట్టుకోండి, మీలో మేల్కొలుపు జరుగుతుంది.

లోతైన ఆధ్యాత్మిక అనుభవం – ఆధ్యాత్మిక అనుభవానికి కావలసినవి

ఆధ్యాత్మిక అనుభవం జరగాలంటే రెండు నిబంధనల్ని పాటించాలి. మొదటిది, మీరు పూర్తిగా విప్పారి, పరిసరాలకి అందుబాటులో ఉండాలి. రెండవది గాఢమైన శక్తిక్షేత్రం. కొన్ని సమయాల్లో మీరు పూర్తిగా విప్పారి ఉన్నా, అక్కడ తీవ్రమైన శక్తిక్షేత్రం లేకపోతే కొబ్బరికాయ లాంటి మీ అహంకారం పగలదు. ఆధ్యాత్మిక అనుభవం జరగదు. మొదటి ఆధ్యాత్మిక అనుభవం అంటేనే కొబ్బరికాయ లాంటి మీరు పగలటం. ఒకసారి ఇది జరిగితే, మిగిలిన కాయల్ని పగలగొట్టడం కష్టం కాదు. మొదట అహంకారం తొలగాలి. అంటే గాఢమైన శక్తికేంద్రం ఉండాలి.

నా మొదటి ఆధ్యాత్మిక అనుభవానికి ఈ రెండు విషయాలే కారణం. నేను విప్పారి ఉండి పరిసరాలకి అందుబాటులో ఉన్నాను. నేను అప్పుడు గొప్ప శక్తిక్షేతమైన అరుణాచలంలో ఉన్నాను. అదృష్టం కొద్దీ ఆ పర్వతం అందాలకి నేను ఆకర్షితుడనయ్యాను. మాములుగా మీరు ఒక పర్యటనని కాని, నదిని కాని, సముదాన్ని కాని ప్రతి రోజూ చూస్తే వాటిని చాలా యథాలాపంగా తీసుకుంటారు. ఎందుకో గాని అరుణాచలపర్వతాన్ని నేను ఆ విధంగా చూడలేకపోయాను. నాకు దాని గురించి తెలుసు అని ఎప్పుడు అనుకోలేదు. నేను ఎప్పుడూ తెరచిన అంతరంగంతో, ఆ పర్వతానికి అందుబాటులో ఉన్నాను.

తెరచి ఉండబడటం, అందుబాటులో ఉండటం అంటే ప్రతి ఉదయం కొత్త కళ్ళతో ప్రతి విషయాన్ని తాజాగా, కొత్తగా చూడటం. మనస్సుని విప్పారి ఉంచటం చాలా సమయాల్లో మనం మన సమాజానికి దొరకకుండా మూసుకుపోయి ఉంటాయి.

తీవ్రత – అపజయం లేని మార్ధం

మనం ఏదో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని, ఏదో అర్ధం చేసుకుని తిరిగి దానికి కొత్తవిషయాల్ని కలపం.

నాకు ప్రతి రోజూ అరుణాచలపర్వతం జీవంతోనే కనిపించేది. నాకు ఎప్పుడూ అది కొత్త అందాలతోనే కనిపించేది. ఎప్పుడూ పాత దృశ్యం కనబడలేదు. నాకు ఒక అలవాటు ఉండేది. నిద్ర లేవగానే కళ్ళు మూసుకుని గోడ పట్టుకుని నెమ్మదిగా ఒక చోటికి వచ్చి కళ్ళు తెరిచేవాడిని. కళ్ళు తెరవగానే అరుణాచలపర్వతం కనిపించేది. అంటే నేను కళ్ళు తెరవగానే ముందుగా అరుణాచలాన్ని చూడాలి అన్నది నా ఉద్దేశం. ఇది చూడటానికి విచిత్రంగా, మూఢనమ్మకంగానూ ఉండవచ్చు. కాని నేనెప్పుడూ ఏమనుకుంటానంటే, నేను జన్మ తీసుకున్నది, ఈ శరీరాన్ని తీసుకున్నది ఆ అరుణాచలపర్వతం ఆకర్షణ వల్లనే. జ్ఞానోదయమైనవారిని ఆ పర్వతం బలంగా తన వైపు ఆకర్షిస్తుంది.

తమిళంలో అరుణాచలపర్వతం గురించి ఒక పద్యం ఉన్నది, 'ఆ పర్వతం జ్ఞానోదయమైనవారిని తన వైపు ఆకర్షిస్తుంది' అని. ఆ పర్వతం అంటే గౌరవం, భక్తిభావం ఉండటానికి కారణం, అది అన్ని దిశల నుంచి జ్ఞానోదయమైనవారిని తన వైపు ఆకర్కిస్తుంది. అందుకే ఆ పర్వతాన్ని మాములుగా ఎప్పుడూ నేను అనుకోలేదు. అది నాకు ఎప్పుడూ జీవచైతన్యంతోనే కనిపిస్తుంది.

భగవంతునికి ఎదురుపడటం

ఒక రోజు అరుణాచలం మీదున్న ఒక రాయి మీద కూర్చొని ధ్యానం చేయటానికి ప్రయత్నిస్తున్నాను. ఆ రోజు పౌర్ణమి. రమణ మహర్షి శిష్యుడు, జ్ఞానోదయమైన యోగీశ్వరుడు, అண்ணாமలై స్వామి నాకు దీక్షని ఇచ్చి చెప్పిన ధ్యానం చేయటానికి ప్రయత్నిస్తున్నాను.

ఆ రాయి మీద కూర్చొని ఎక్కడి నుంచి 'నేను' అనేది వస్తుంది అని తెలుసుకోవాలను కుంటున్నాను. చాలా సేపు కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాను. నా లోపల ఏదో తెరవబడినట్టు అయ్యింది. అలా జరగగానే నేను 360 కోణంలో అంతా స్పష్టంగా చూడగలుగుతున్నాను. కళ్ళు మూసే ఉన్నాయి కాని నేను చుట్టూ జరిగేది, నా వెనుక, ముందు, పక్కన, కింది, పైనా అన్నీ చూడగలుగుతున్నాను. చూడటమే కాదు, మనం శరీరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అదే గాఢతతో నన్ను నేను అన్నింటిలో ఉన్న అనుభూతిని పొందుతున్నాను.

నా చుట్టూ ఉన్న రాళ్ళు, చెట్లు, మొక్కలు అన్నిటిలో నేను జీవించి ఉన్నాను. మీరు మీ శరీరంలో ఉండటాన్ని ఎలా అనుభవిస్తారో అదే విధంగా నేను సర్వసృష్టిలో, ప్రతిదానిలోనూ జీవిస్తున్నట్లు తెలుసుకున్నాను.

అప్పటి వరకు నేను అంటే శరీరం అనుకునేవాడిని. తరువాత నేను శరీరం కూడా అని తెలుసుకున్నాను. అర్థం చేసుకోండి, 'నేను శరీరం కూడా' అని తెలిసింది.

ఇది చాలా లోతైన అనుభవం. అనుభవం కేవలం మాటలు గాని లేదా ఊహ గాని అయితే అది మీ మీద ప్రభావాన్ని చూపించదు. అది తీవ్రమైన చేతనస్థితిలో జరిగిన అనుభవం.

కాని మీకు ఎంత మంది చెప్పినా, మీరు మీ శరీరం మాతమే కాదు అని ఎన్ని సార్హ చెప్పినా మీరు విని ఊరుకుంటారు. ఆ మాటల్ని మీ మీద పని చేయనీయరు. ఎందుకంటే చేతనస్తితిలో మీ అనుభవం శరీరం మా(తమే.

నా అనుభవం నేను అన్నింటిలోనూ ఉన్నాను అన్నది నాకు సత్యమైంది. అందుకే నేను ఆ విధంగా జీవించటం ప్రారంభించాను.

అంత చిన్న వయస్సులో, అంత తీవమైన జీవితాన్ని అనుభవించటం గురించి తెలిసినవారు చాలా ఆశ్చర్యపోయారు. వారంతా ఇది చాలా కష్టం, ఊహించలేని విషయం అన్నారు. మీకు ఇది ఊహించలేని విషయం, ఎందుకంటే ఇది మీ చేతనస్థితిలోని అనుభవం కాదు కాబట్టి. ఇది నాకు సులభం. ఎందుకంటే విశ్వమంతా అన్నింటిలోనూ నేను ఉన్నాను అన్నది నా దృఢమైన అనుభవం.

రమణమహర్షి మరణానుభవం

రమణమహర్సి జీవితం గాఢత గల జీవితానికి ఉన్న శక్తికి ఒక చక్కని ఉదాహరణ. పదహారు సంవత్సరాల వయస్సులో ఇది ఆయనకి జరిగింది. ఆయన మదురై దగ్గర తిరుచ్చుజి అనే ఊరిలో ఉన్నారు. ఒక రోజు అకస్మాత్తుగా ఆయన తాను మరణిసున్నట్లు తెలుసుకున్నారు. మరణం అనే గొప్ప భయం ఆయనలో కలిగింది.

మనకి కూడా కొన్నిసార్లు, ముఖ్యంగా ఎవరిద్దెనా మరణవార్ విన్నప్పుడు, లేదా మరణించినవారిని చూసినప్పుడు మరణం అంటే భయం కలుగుతుంది. మనం ఆ భయాన్ని అణచటంలో మంచి శిక్షణని పొందాం. ఆ భయం బయటికి రాకుండా, దాన్ని నియం(తిస్తాం. మనం ఎంత కపటంగా ఉంటామంటే మనని మనం మోసం చేసుకుంటున్నాం అని కూడా మనకి తెలియదు. చాలా సార్లు మనలో భయం కలుగుతుంది, కాని మనలో దాన్ని అణిచే ఒక వ్యవస్థ ఉండి భయాన్ని అణచివేస్తుంది. కొంత కాలం గడిచేసరికి మనలో సమతుల్యతని, అణచటాన్ని బాగా నేర్చుకుంటాం. దాన్ని అణచేసి మరిచిపోతాం. మరొక విషయం మీద ఏకా(గత నిలుపుతాం.

కాని రమణమహర్షి ఆ విధంగా చేయలేదు, దాన్ని ద్వారంగా మలచుకొని ఒక పెద్ద అడుగు ముందుకేయగలిగారు. మనందరం కూడా ఆ ద్వారం వరకు వెళతాం. ఎప్పుడైనా ఎవరిదైన మరణవార్త విన్నప్పుడు, భయం వేసినప్పుడు ఆ ద్వారం వరకు వెళతాం. కాని అక్కడి నుంచి దూకటానికి భయపడతాం. మనం కపటంగా ఉండటంలోనే శిక్షణ పొందాం కాని తీవ్రత‌లో కాదు. మ‌నం ఏదో ఒక విధంగా దాని నుంచి త‌ప్పించుకుంటాం... టి.వి చూస్తాం లేదా ఇంకొక దాని మీదికి దృష్టి మరలిస్తాం.

తీవ్రత – అపజయం లేని మార్ధం

రమణమహర్సి మరణం లేని స్థితికి ఒక పెద్ద అదుగు వేయగలిగారు. ఆయన నేల మీద కదలకుండా పదుకుని మరణాన్ని ఆహ్వానించారు. ఆయనకి జ్ఞానోదయం జరిగాక ఈ విషయం చాలా చక్కగా చెప్పారు.

'అకస్మాత్తుగా కారణం లేకుండా నేను మరణిసున్నాను అని నాకు అనిపించింది. నాలో లోతైన భయం కలిగింది. నాకు ఎటువంటి అనారోగ్యం లేదు. ఎటువంటి మానసికసమస్య లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను. అకస్మాత్తుగా 'నేను' చనిపోతున్నాను అనిపించింది. నేను ఆ భయంతో సహకరించాను. నేను పారిపోవాలి అని చూడలేదు. నేను అసలు ఏ విషయమూ పట్టించుకోలేదు. నాకు ఏమీ చేయాలనిపించలేదు. అలాగే కదలకుండా ఉండి అనుభవాన్ని జరగనిచ్చాను. నాకు మరణం కలగనిచ్చాను. నేను పడుకుని ఏం జరుగుతుందో చూద్ధాం అనుకున్నాను. దాన్ని స్వీకరించి భయం లోనికి వెళ్ళాను. భయం నా మీద పనిచేయటం ప్రారంభించింది. నేను చనిపోవటం చూసాను. నా శరీరం నుంచి బయటికి రావటం నాకు స్పష్టంగా కనిపించింది. అకస్మాత్తుగా ఒక వెలుగు లాగా సత్యం నాకు తెలిసింది. నా శరీరం చనిపోయింది కాని నేను జీవించి ఉన్నాను. 'నేను' మరణించలేదు, నా శరీరం మరణించటం నేను చూడగలిగాను. నేను ఉన్నాను, అంటే నేను శరీరానికి అతీతుడని.

ఈ చిన్న సత్యం నన్ను కుదిపేసింది. నేను శరీరం కాదు, శరీరానికి అతీతుడినని నాకు తెలిసింది. ఆ తరువాత నాకు మరణభయం కాని, మరే భయం కాని కలగలేదు. నా అంతరాత్మ నుంచి ఆ భయం శాశ్వతంగా పోయింది. నా శరీరం గురించి నాకెందుకు అన్న విషయం తెలుసుకున్నాను. నేను మరణించిన శరీరం గురించి ఎందుకు పట్టించుకోవాలి. ఎందుకంటే అది మరణించినా, నేను ఉంటాను. దీని అర్ధం నా గురించి నేను ఏమనుకుంటున్నానో నేను దానికి అతీతుడిని. ఈ విషయం నన్ను ఎప్పటికీ వదిలిపెట్టలేదు. ఈ అనుభవం తరువాత నేను ఈ సత్యాన్ని ఎప్పుడు వదలలేదు'.

ఒక భయం రమణ మహర్షిలో అంత మార్చుని ఎలా తీసుకురాగలిగింది? మన జీవితాలలో భయం చాలా సార్లు కలుగుతుంది కాని మనలో మార్పు రాదు. దీనికి జవాబు ఆ వ్యక్తిలోని తీవ్ర‌త అటువంటి అంతిమ అనుభ‌వానికి కార‌ణం.

సమాజసేవకి |పేరణ

మీకు సమాజసేవ చేయాలంటే మీకు తీవ్రమైన ఉద్దేశం ఉండాలి. నేను చాలా మందిని చూసాను. సమాజసేవ పేరు మీద ఏదో చేసూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళతో కూర్చోలేరు అందుకే అలా చేసారు. స్పష్టంగా తెలుసుకోండి, మీతో మీరు కూర్చోలేక గుడికి వెళ్ళటమో, సమాజసేవ చేసే సంస్థల దగ్గరకి వెళ్ళటం ఇలా చేసినపుడు మీరు సత్యాన్ని అనుభవించలేరు.

గుడికి వెళ్ళటం, సమాజసేవ అనేవి మీలో ఆ భావం పొంగి ప్రవహించేటప్పుడు చేయాలి. మీరు నిండుగా ఉండి, ఇక చేయవలసింది మరేది లేదు, నాకు చాలా టెం ఉన్నది కాబట్టి సేవ చేస్తాను అనుకోవటం బాగుంటుంది. అప్పుడు అది జ్ఞానోదయానికి దారి తీస్తుంది. ఆ సేవ మీకు ఆధ్యాత్మిక అనుభవం కలిగేలా చేస్తుంది. పొంగి పొరలే భావంతో ఉన్నప్పుడు మీరు 'భగవంతుడు' నాకు చాలా ఇచ్చాడు, జీవితం అంతా చాలా బాగున్నది అనుకుని గుడికి కాని చర్సికి గాని వెళ్ళి మీ కృతజ్ఞతాభావాన్ని వెల్లడి చేసే స్థితిలో ఉండాలి. అప్పుడు మీకు ముక్తి కలిగి జ్ఞానోదయం అవుతుంది.

మీతో ఉండలేక, సంఘసేవకో, గుడికో వెళితే అది మీకు ప్రశాంతతని ఇవ్వదు. మీలో చాలా అసహనం ఉంటుంది. దానితో ఏదో చేయాలని తపన ఉంటుంది. ఇటువంటి దృక్పథం ఉన్నవారు గుడికి వెళ్ళినా, అక్కడ కూడా అందరి మీదా అరుస్తుంటారు. ఇది చేయవద్ల, అలా చేయకండి, మీరు ఇలా ఏమి చేస్తున్నారు? భగవంతుడికి ఇలా చేసే నచ్చదు, అని చెబుతారు. వాళ్ళు భగవంతుడికి ప్రతినిధిని అనుకుంటారు. అంతే కాదు, కొన్నిసార్హ వాళ్ళే దేవుడిలా ప్రవరిసూంటారు. ఇటువంటివారు, ఏదైనా సేవ చేసినా, వారు ముందుగా అక్కడికి వారి అహంకారాన్నితెస్తారు. వారు ఎదుటివారిని చిత్రహింసలు పెదుతుంటారు, ఎదుటివారికి సేవ చేయరు.

ఒక చిన్న కథ : ఒక స్కూల్ టీచర్ స్కాట్ మాస్టరు. అతను తన స్టూడెంట్స్‌ని రోజు ఒక మంచి పని చేసి తనకి చెప్పాలి అని నిబంధన పెడతాడు. ఒక రోజు ముగ్గురు స్పేహితులు ఆయనతో ఈ రోజు మేం ముగ్గురం కలసి ఒక ముసలామెని రోడ్లు దాటించామని చెబుతారు. అప్పుడు టీచర్ వాళ్ళతో ముసలమ్మని రోడ్డు దాటించటం బాగానే ఉంది, కాని దానికి ముగ్గురు ఎందుకు అని అంటాడు.

సూరెంట్స్, అవును సార్, ముగ్గురం కలిసి చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆమె రోడ్డు దాటనని గొడవ చేసింది, అని చెబుతారు.

స్పష్టంగా తెలుసుకోండి, మీరు సేవ చేయాలి కాబట్టి అనుకుని చేస్తారు తప్ప ఆ సేవాభావం మీ నుంచి పొంగి ప్రవహించటం వల్ల కాదు. మీరు ఏం చేస్తున్నారో అది మీకు ఒక అనుభూతి కాదు. మీకు ఎదుటివారి అవసరం తెలియదు. మీకు మీ టెం పాస్ కావాలి, మీ రిపోర్టులు ఎవరికైనా చూపించాలి అని మాత్రమే సేవ చేసారు. ఈ విధమైన ఉద్దేశంతో సేవ చేస్తే అంతా గందరగోళం చేసి ఎదుటి వారికి చాలా సమస్యల్ని సృష్టించిన వారవుతారు.

నేనెప్పుడూ అనుకుంటాను, సేవ అనేది మన అంతరాత్మ నుంచి పొంగి ప్రవహించాలి అని వేరే ఉద్దేశంతో ఎప్పుడూ సేవ చేయకూడదు. ఆ విధంగా చేస్తే మీరు అభివృద్ధి చెందలేరు. మీ ప్రేమ,సేవ కేవలం కపటం అవుతాయి, అది కూడా కల్తీతో కూడిన కపటం. మీరు కపటంలోనైనా స్వచ్చంగా వుంటేనే స్వేచ్ఛని పొందగలుగుతారు. కాని మీ కపటం కూడా కల్లపమే.

బుద్ధుని తీవ్రత

గౌతమ బుద్ధుని జీవిత చరిత చూస్తే, ఆయన ఆరు సంవత్సరాలు తీవ్రసాధన చేసినట్టు తెలుస్తుంది. ఆయన అనేకమార్గాల్లో ప్రయత్నం చేసాడు. ఇందులో చక్కని విషయం ఏమిటంటే

తీవ్రత – అపజయం లేని మార్ధం

ఆయన ఏది చేసినా పూర్తిగా అందులో నిమగ్నమైపోయి చేసేవాడు. ఏ మార్గాన్ని అనుసరించాలి అనుకుంటే అందులో పూర్తిగా, తీవ్రతతో నిమగ్నమై ఆ పని చేసేవాడు. ఆయన చాలా పద్ధతులు, ఉపవాసాలు, కఠినమైన నియమాలు, జపాలు – ఇలా చాలా చేసాడు. చాలా ప్రయత్నించాడు. కాని ఏదీ పని చేయలేదు.

గౌతమబుద్ధుడు తన సత్యాన్వేషణ రోజుల్లో ఆయన గురువులు రోజుకి ఒక బియ్యపు గింజని మాత్రం తిను అని చెప్పారు. బుద్ధుడు ఆ విధంగా మూడు నెలలు చేసాడు. చాలా నిజాయితీగా గురువుగారి సూచనల్ని పాటించాడు. అతను కేవలం చర్మం ఎముకలు తప్ప మరేమీ లేని స్థితికి చేరాడు. అత్యంతబలహీనంగా అయ్యాడు.

ఒక రోజు నదిలో స్నానానికి దిగి, బలహీనతతో కాళ్ళు కదపలేక నీళ్ళలో కొట్టుకుపోయాడు. ఎలాగో ఒక చెట్టు కొమ్మని పట్టుకోగలిగాడు. ఆ విధంగా వేలాడుతూ అకస్మాతుగా ఈ పద్ధతులు ఉపయోగం లేనివి అని తెలుసుకున్నాడు. ఆతను శరీరాన్ని క్షశింపచేసే క్రమంలో, శరీరశక్తిని పోగోట్టుకున్నాను అనుకున్నాడు.

అంతరంగప్రపంచంలో ఏది సాధించలేకపోయానే అని నిరాశతో కుంగిపోయాదు. అతనికి బయటి ప్రపంచంలో కావలసింది ఏదీ లేదు. నది నుంచి బయటికి వచ్చి ఒక చెట్లు కింద కూర్చున్నాడు. ఆయన చాలా నిరుత్సాహంతో, నిరాశతో ఉన్నాడు. మామూలు నిరాశకి, బుద్ధుని నిరాశకి తేడా ఉన్నది, బుద్ధుని నిరాశ పూర్తిగా తీవ్రవతతో ఉంది.

ఆయనలో ఆవగింజంత ఆశ కూడా లేదు. అతను పూర్తిగా ఆశ వదిలేసుకున్నాడు. సాధించటానికి ఏమీ కనిపించటం లేదు. ముందుకి చూడటానికి ఏమీ లేదు. ఆ రోజు రా(తి నిద్ద పోయే ముందు ఆకాశం వైపు చూసాదు. ఆయన నిర్వాణాన్ని పొందాడు, నిర్వాణం అంటే ఆత్మజ్ఞానద్వారవిముక్తి లేదా జ్ఞానోదయం పొందటం.

బుద్ధుడు ఆ స్థితి సాధించటానికి సహాయపడిన ఒకే ఒక అంశం తీవత. మనలో చాలా మంది అంటుంటాం, మేం చాలా చేస్తున్నాం కాని ఏమీ జరగటం లేదు అని. మీరు కొంచెం మీ అంతరంగపు లోతుల లోనికి చూదండి, మీ కోరిక, మీ అన్వేషణ ఎంత తీవ్రవతతో ఉన్నాయి. మీ అన్వేషణ అనే దాహం ఎంత తీవంగా ఉన్నది చూడండి. మీరు దేన్ని కోరుకున్నా మీలోని శకులన్నింటినీ ఆ కోరిక వైపు కేంద్రీకరించండి, అప్పుడు విశ్వశక్తి మీ కోసం తలుపులు తెరవటాన్ని చూడగలుగుతారు,

మొదటి ఆధ్యాత్మిక అనుభవానికి నా తీవ్రమెన తపన

నేను మీకు నా మొదటి ఆధ్యాత్మిక అనుభవం గురించి చెప్పాను, అప్పుడు నాకు 360 డిగ్రీలలో చూడగల దృష్టి వచ్చింది అని చెప్పాను. చాలామంది చాలా ధ్యానపద్ధతుల్ని సాధన చేస్తూ ఉంటారు. తేడా ఏమిటి? ఒక చిన్న పిల్డవాడికి అనుభవం ఎలా జరిగింది?

నేను ఒక విషయం చెప్పగలను, నా అంతరంగం మొత్తం పరిణతిని పొంది పక్యానికి వచ్చింది. ఏ చిన్న పద్ధతైనా అది వికసించటానికి సిద్ధంగా ఉన్నది. నాకు తెలియకుండానే గురువులు ఉండే అత్యుత్తమస్థితిలో ఉండేవాడిని. చూడండి, చినృతనంలో మిమ్మల్ని ఎవరు ప్రభావితం చేసారో వారే మీ అంతరంగంలో హీరో. చాలా గొప్ప యోగీశ్వరులు నా మీద చాలా ప్రభావాన్ని చూపించారు. నేను నిరంతరం, ప్రతి విషయంలో 'ఆ యోగేశ్వరులు ఏ విధంగా ఉండి ఉంటారు?' అని అనుకుంటూ ఉండేవాడిని.

ఉదాహరణకి నాకు భయం వేస్తే నేను ఇలా అనుకునే వాడిని 'అన్నా మలైస్యామికి ఇలా భయం అనిపిస్తే ఏం చేసి ఉండేవారు?' అని. ఆయన అసలు దాన్ని పట్టించుకోరు ఆయన జ్ఞానోదయమైన యోగి. నేను కూడా ఆయన లాగానే ఉండాలి, ఇలా అనుకునే వాడిని.

నా అంతరంగంలోని గొప్ప ప్రేరణ, గొప్ప గొప్ప యోగీశ్వరుల ప్రభావం వల్ల నేను ఏ పని చేయాలన్నా, వారెతే ఏం చేసేవారు అని ఆలోచించి అలా చేసేవాడిని, అంతరంగం స్వచ్చంగా ఉండేది. ఆ చిన్న వయస్సులో యోగులు, బుషులు తప్ప నా అంతరంగంలో మరో హీరో ఉండేవాడు కాదు. ప్రతి చిన్న విషయానికి అయన అయితే ఎలా చేసేవారు నేనూ అలాగే చేయాలి. ఈయన అయితే ఎలా చేసేవారు, నేను కూడా ఇదే విధంగా చేయాలి అని అనుకునే వాడిని.

శ్మశానాల్లో ఉండేవాడిని

నేను అరుణాచలం గిరిప్రదక్షణానికి వేళ్ళేవాడిని. అది సుమారు 12 కిలోమీటర్లు ఉంటుంది. చీకటి పడ్డాక వెళ్ళేవాడిని. నాకు కొంచెం భయం వేసినప్పుడు, 'అణ్ణామలైస్వామి అయితే ఏం చేసేవారు? అనుకునేవాడిని. ఆయన భయపడరు. నేను కూడా భయపడను అనుకుని న‌డిచేవాడిని.

మీకు ఒక సంఘటన చెబుతాను.

ఆ రోజు నేను గిరిపదక్షిణ చేస్తుంటే బాగా వర్షం పడుతున్నది. మెరుపులు, ఉరుములు, పెద్ద వర్షం చూసి కొంచెం భయపడాను. వెంటనే అణ్డామలెస్వామి అయితే ఏం చేసేవారు అనుకుని, అయన భయం లేకుండా నడిచేవారు. నేను కూడా అలాగే నడవాలి అనుకుని నడక సాగించాను.

అలా ఒక శ్మశానం గుండా నడుస్తూ గిరిప్రదక్టణకి వెళ్ళాలి. అలా వెళుతున్నప్పుడు అక్కడ కుక్క దేన్నో తినటం చూసాను. దాని దగ్గరికి వెళ్ళే కొద్దీ అది అరవటం మొదలు పెట్టింది. నాకు భయం అనే మొదట ఆలోచన రాగానే వెంటనే 'అణ్డామలై స్వామి అయితే ఏం చేసేవారు? ఏం పట్టించుకోకుండా వెళ్ళేపోయేవారు. నేను అలాగే వెళతాను అనుకుని ముందుకు వెళ్ళాను. కుక్క భయంతో పారిపోయింది.

తీవ్రత – అపజయం లేని మార్ధం

దగ్గరికి వెళ్ళి చూస్తే అది మనిషి శవం. దాన్ని పూర్తిగా పూడి|పెట్టలేదు. వర్షానికి బయటికి వచ్చేసి రోడ్డు మీద ఉన్నది. ఊహించండి, పన్నెండేళ్ళ అబ్బాయి అర్థరా(తి ఒంటరిగా తల లేని శవాన్ని చూస్తున్నాడు అంటే ఎలా ఉంటుంది. భయం మొదలైంది కాని అది నా అంతరాత్మ వరకూ వెళ్ళలేదు. షాక్ కాని, భయంతో వణుకు రావటం కాని జరగలేదు. మొదటి ఆలోచన రాగానే, అదే అణ్డామలైస్వామి అయితే ఏం చేస్తారు అనుకుని నడిచి వెళ్ళిపోయాను. నేను అలా నడుస్తూనే ఉన్నాను. అంతే పక్కనుంచి వెళ్ళిపోయాను. నేను కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. భయం అనేది గాలి బుదగలా ప్రారంభమైంది. కాని పైకి రాలేదు. భయం అసలు లేదు, అది మరణించింది.

తీవ్రత, అమాయకమైన అంతరంగం

అంతరంగంలోని చేతనస్థితి మొత్తం తీవంగా, గాఢతతో సిద్ధంగా ఉన్నది. ఆ కారణం వల్లనే చిన్న అనుభవం, చిన్న పంచ్ నన్ను ఆ అనుభవంలోనికి తీసుకు వెళ్ళగలిగింది. దాన్నే నేను జీవన్ముక్తి అంటాను.

మీరు గురువుల శరీరభాషలో జీవిసే జీవన్నుకులవుతారు.

నేను ఒకసారి అణ్జామలైస్వామితో 'నేను కలలో జగన్మాతని (దేవి) చూసాను. మీరు కూడా కలలో దేవిని చూసారా?' అని అడిగాను. ఆయన నాతో, 'నాకు కలలు రావు' అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. ఆయనకి కలలు రావు మరి నా కెందుకు కలలు వన్నాయి. ఆ రోజు రాత్రి నాకు నేను ఇక కలలు రావు. అణ్ణామలై స్వామికి కలలు రావు అని చెప్పుకున్నాను. మీరు ఆశ్చర్యపోతారు ఆ రోజు రాశి నాకు కల వస్తుంటే నాకు ఎలా కలలు వస్తాయి అనుకున్నాను.

కల మాయమైపోయింది. అంతరంగం చాలా అమాయకంగా, సూటిగా ఉంటుంది. అది అలా జరిగింది. నాకు ఎప్పుడైనా జలుబు చేసినా అణ్హామలైస్వామి ఏం చేస్తారు. ఆయన పట్టించుకోరు, నేనూ పట్టించుకోను అని అనుకునేవాడిని. ఆ తరువాత ప్ర‌శ్న‌లు, వాదాలు అనేవి ఉండేవి కావు.

జీవస్శుక్తి సందేశం – 'గురువులు ఎలా ప్రవరిసారు?

మీరు కూడా చిన్నది, శక్తిమంతమైన ఈ పద్దతిని ఉపయోగించవచ్చు. మీ మనస్సు దీన్ని తప్పించుకోవటానికి ఎటువంటి సాకులూ చెప్పలేదు. ఏ పరిస్థితిలోనెనా, 'ఇదే గురువుగారెతే ఎలా చేసారు? అయన ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు? అదే చేయండి. అప్పుడు కొత్త దాఁరాలు తెరవబడటం చూసారు. దీన్ని నేను జీవన్నుక్తి అంటాను. మీరు వేరే ఏమీ చేయనవసరం లేదు. ఈ ఒక్కటీ చేస్తే చాలు. మీరు కూర్కున్నప్పుడు అలోచనలు వస్తున్నాయనుకోకండి. వెంటనే, గురుదేవులు కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది? అనుకోండి. సహజంగానే నిశ్శబ్దం. మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? నిశ్శబ్దంగా ఉండండి, అంతే. ఇంకేమీ లేదు.

మీ మనస్సు అనవచ్చు, 'అబ్బే, అబ్బే,' అదేం కుదరదు. నాకు తెలుసు ఇది సత్యం అని. కాని ఇది చాలా కష్టం. అప్పుడు మళ్ళా అనుకోండి, 'గురుదేవుల మనస్సు ఇలా చెప్పినప్పుడు ఆయన ఏం చేసారు? ఆయన మనస్సుని తినేసారు, అంతే. అది తెలుసుకోండి. ఈ ఒక్క సందేశాన్ని తెలుసుకోండి. అది మీలో జీవం కావాలి. అదే జీవన్ముక్రి అనే సందేశం. ఒక విషయం అర్థం చేసుకోండి. నాకు పది సంవత్సరాల వయస్సు నుంచీ నేను అణ్డామలైస్యామి చేత ప్రభావితమయ్యాను. అప్పటి నుంచీ ఇదే పద్ధతి పాటించాను. అప్పుడు అది ఒక ధ్యానపద్దతి అని నాకు తెలియదు.

గురువులతో నిజమైన అనుబంధం

దీన్నే నేను గురువులతో ఉండే అనుబంధం అంటాను. గురువులతో అనుబంధం అంటే ఏదో పూజ చేయటం, పూలు పెట్టటం, ఎప్సుదో ఒకసారి పూజించటం కాదు, అనుబంధం అనేది మీ మీద గురువుల ప్రభావం లోతుగా ఉన్నప్పుడే సాధ్యం. ఎప్పుడైనా ఏ స్థితి ఎదురైనా, అది కోపం, ఆశ, అభద్రతాభావం, భయం వెంటనే 'ఇదే గురుదేవులైతే ఏమి చేసారు?' అనుకోండి. అది మాయమవుతుంది. అది పూర్తిగా వెళ్ళిపోతుంది.

నేను చాలా సార్లు చెబుతుంటాను, గురువులతో దృఢమైన అనుబంధం ఉంటే చాలు. మరి ఇంకేమీ అవసరం లేదు. అది సాధారణ అనుబంధం కాదు. మామూలు సంబంధమైతే మీరు గురువుల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించరు, ఆయనని మీలో నిలుపుకోరు. నేను దాన్ని సంబంధం అని కూడా అనను. అది కేవలం సాధారణపరిచయం మాత్రమే.

గురువులతో అనుబంధం అంటే ఆయనలో, ఆయనలా జీవించటం. అప్పుడే ఆయనతో గాధమైన అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడే మీరు విస్నతం అవుతారు. మనలో ఉండే అనేకసంబంధ బాంధవ్యాల వల్ల అది మనలో జరగలేదు. మన అంతరంగంలో చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని ఉత్సాహపరచి, మీ మీద ప్రభావాన్ని చూపి మీ దృష్టిలో వారే హీరోలు అన్నవాళ్ళు ఉంటారు. మీ అంతరంగాన్ని గురువుగారితో నింపండి. మీ సమస్యలు కరిగిపోతాయి.

తీవ్రతతో నడవండి

నా మొదటి ఆధ్యాత్మిక అనుభవం, అంతిమసత్యాన్ని క్షణకాల అనుభవంతో చూపించింది. 'దాని తరువాత నాకు అంతిమ జ్ఞానోదయం పొందాలి అన్న కోరిక ఎంత తీవంగా ఉండేదంటే, అది ఎలా అన్న ఒక్క ప్రశ్న నా అంతరంగం అంతా నిండిపోయింది.

ఈ తీవ్రత చిన్న వయస్సులోనే ఇల్లు వదిలి వెళ్ళే ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యమే తీవ్రమైన సాధనలు చేసే విధంగా చేసింది. ఆధ్యాత్మికప్రపయాణం చేయటానికి, రోజుకు 10,000 సార్లు మంత్రాన్ని జపించటం, అతిసాధారణమైన జీవితం, కఠినమైన నియమాలతో దేశం మొత్తం తిరిగేలా చేసింది.

అడగండి, మీకు లభిస్తుంది

జీసస్ కైస్ట్ ఈ విధంగా అంటారు, 'అడగండి, మీకు ఇవ్వబడుతుంది, వెతకండి మీకు కనబడుతుంది,' అని. మనం ఒక ప్రశ్న అడుగుదాం. మనలో ఎంతమందికి అడగటం తెలుసు. కొన్ని సార్లు అయోమయంతో, సోమరితనంతో మనం అజ్ఞానంలో ఇరుక్కుపోతాం. మనం ఏం అడగాలని అనుకుంటున్నామో అది మనకి స్పష్టంగా తెలియదు.

మనలోని సంస్కారాలు, అబద్దపు గుర్తింపులు సర్వాంతర్యామి స్వచ్ఛమైన దివ్యప్రేమని అర్థం చేసుకోకుండా అడ్డుకుంటాయి. మనం కరుణామూరి అయిన, మనని నిరంతరం కాపాడే సర్వాంతర్యామిని ఏమడిగితే అవి ఇస్తాడు. మన ఏకాగ్రత ఒక్క పాయింట్‌లా చేసి నిజాయితీతో, భక్తితో ఉన్నపుడు భగవంతుడిని నిజంగా ఏమదగాలనే వివేకం మనకి కలుగుతుంది. అప్పుడు మనం అడిగినవి కచ్చితంగా ఆయన ఇస్తాడు.

తీవ్రత, అంతిమపద్దతి

మీరు ఏది చేస్తే దాన్ని తీవతతో చేయండి. మీరు తిన్నా, పాట పాడినా, పూజ చేసినా, పని చేసినా, దానిలో పూర్తిగా నిమగ్నమవ్వండి. ఆ క్షణంలో ఉండండి. తీవ్రవత అంటే జ్ఞానోదయమే. ప్రస్తుతం మీలోని ఒక భాగం తీవ్రతతో మరొక భాగం సోమరితనంలో ఉంటుంది. 100% తీవ్రతతో ఉండటయే జ్ఞానోదయం.

తీవ్రంగా నిర్ణయించుకోండి, నేను జీవితం అని పిలిచే ఈ జీవితం నుంచి మేల్కొనాలనే తీవ్రమైన కోరికని, ప్రార్థనని సృష్టించండి. మీరు ఒక ఉద్దేశాన్ని కల్పించి దాన్ని మీ వైపు తిప్పితే అది సంకల్పం అవుతుంది. దాన్ని భగవంతుని వైపు మళ్ళిస్తే అది ప్రార్ధన అవుతుంది. తీవ్రంగా మేల్కోవాలి అనే దృఢమైన ఉద్దేశం, జీవన్ముక్తిని సాధించాలి, నిత్యానందస్థితిని సాధించాలనే దృఢమైన కోరిక. మీకు, జ్ఞానోదయానికి మధ్య ఉన్న తేడా తీవ్రత.

ధ్యానపద్ధతి – గురుదేవుల జీవనసరళి

ఈ పద్ధతిని ప్రయత్నించండి, మీ మనస్సుకి ఏది వచ్చినా, గురుదేవులు ఎలా చేసారు? అది చేయండి. మరొక విషయం, మీరు నాలా ప్రవర్తిస్తే, నా దగ్గర ఉన్నవి మీకు దొరుకుతాయి. అది సర్వాంతర్యామి ప్రమాణం. నాకు అర్హత లేనివి నా దగ్గర లేవు, అయితే నా దగ్గరి ఏవైనా పోతాయేమో అన్న భయం నాకు లేదు.

అదే విధంగా మీరు కేవలం ఒక్క సందేశాన్ని తీసుకుంటే, గురువులు మాదిరిగా జీవించండి. అప్పుడు మీకు అర్హత ఉన్నవన్నీ మీ చుట్టూ చేరతాయి, అవి ఎప్పటికీ మీతోనే ఉంటాయి.

ధైర్యం ఉన్న వ్యక్తి 'గురుదేవులు ఎలా జీవిస్తారో అదే విధంగా జీవిస్తాను అనుకుంటాడు.' మీ మనస్సు చాలా ప్రశ్నలు వేయవచ్చు, ఆయన ఎలా ఉంటారో ఎవరికి తెలుసు, ఆయనేం చేసారు ఇలా ఉంటాయి. ఈ ప్రశ్నకు గురువులు ఏ విధంగా స్పందిస్తారు? నిశ్శబ్దంగా ఉంటారు. అప్పుడు మీరు కూడా అదే చేయండి. అది చేస్తే చాలు. ఈ సత్యాన్ని మీతోనే ఉంచితే, మీతో నేను ఉంటాను. గురువుల్ని మీతోనే ఉంచండి. అప్పుడు మీకు మీరు జన్మనిస్తారు.

ఎటువంటి కష్టాన్నీ పట్టించుకోవద్దు. వస్తే ఏమొస్తుంది? మరణం. కేవలం ఒకటి గుర్తుంచుకోండి, గురువులు ఏ విధంగా మరణించారు. ఆయన శరీరాన్ని అందంగా వదిలేసారు, నేను కూడా అదే చేస్తాను. ఇది గుర్తు పెట్టుకోండి, చాలు. ఈ అనుబంధమే నాకు సత్యాన్ని చూపించింది, అది నన్ను చైతన్యంగా, తీవ్రంగా శక్తిమంతుడుగా తయారు చేసింది.

ఈ ఒక్క సందేశాన్ని మీతో తీసుకువెళ్ళండి, గురువుగారు ఈ పరిస్థితికి ఎలా స్పందిస్తారు? ఈ ఒక్క ప్రశ్నతో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. అంతరంగ ప్రపంచానికి సంబంధించిన ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు, పరమహంస అంటే అన్ని అనుభవాలూ చూసిన వ్యక్తి. ఒక వేళ ఆ అనుభవాలు లేకపోతే, సర్వాంతర్యామి ఆ అనుభవాల గుండా నడిపిస్తాడు. నాకు జ్ఞానోదయం అయింది. ఒక గురువుగా చెప్తున్నాను, మీలో ఏవైతే అనుభవాలు జరుగుతాయో అవన్నీ నాకు జరిగాయి. నాకు అవి జరగలేదు అని మీరు అనుకోవద్దు.

తీవ్రత కోసం ధ్యానపద్ధతి

మీలో దహించుకుపోయే తీవ్రత. జరగకపోతే దాని కోసం తీవ్రంగా ప్రార్థించండి, అది మీలో జరుగుతుంది.

మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాల వెనుక ఎంత తీవ్రంగా, ఆదుర్దాగా పరుగులు తీస్తారో గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీకు ఎవరు తీవ్రంగా ప్రార్థన చేస్తారో, వారికి పది లక్షల రూపాయలు ఇస్తారంటే మీరు మీ జీవితంలోని తీవ్రత మొత్తంతో ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మీకు తృప్తిని ఇచ్చేది ఏదో ఒకటి ఉన్నది కాబట్టి. అది మీ జీవితానికి ఉపయోగం కాబట్టి. జ్ఞానోదయం కూడా మీ జీవితానికి ఉపయోగం.

జ్ఞానోదయం కోసం తీవ్రంగా ఉండటాన్ని వస్తువుల ద్వారా నేర్సుకోవచ్చు. ఉదాహరణకి మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం కావాలంటే ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తారో, అదే జ్ఞానోదయం వైపు ఉండాలి. మీలో తీరని కోరికలు ఆ తీవ్రతలో కాలిపోతాయి. మీలో సంత్సప్తి కలిగినప్పుడు దాని కోసం తపించండి. అది చాలు మిమ్మల్ని ఆవిరి చేయటానికి. ఆ సంత్సప్తి మీరు ఇంతకు ముందు పొందిన తృప్తి కంటే చాలా రెట్లు ఎక్కువ.

తీవ్రత – అపజయం లేని మార్గం

శివసూత్రాలలో శివుడు, దేవి పార్వతితో 'ఒక చక్కని పద్ధతి చెబుతాను, నీలోని సారం ఒక వెలుగు రేఖలా కేంద్రం నుంచి వెన్నెముక మధ్యగా వస్తుంది. నీలో జీవచెతన్యం పైకి లేస్తుంది' అని చెబుతాడు.

ఈ ధ్యానపద్ధతి ప్రాముఖ్యం అర్థం చేసుకోండి. దీన్నే నిత్యధ్యానంలో మూడవ సైపులో ఉపయోగించాను.

మిమ్మల్ని మీలో ఒక వెలుగులా మూలాధారచక్రం నుండి పైకి వెళ్ళండి. మీ తీవ్రత, చైతన్యం మీ కేంద్రం నుంచి పైకి రావటం చూసారు. అప్పుడు మీలోని తీవ్రత కూడా పైకి వెళుతుంది.

మీరు అనుకోవచ్చు అలా చూడటం ఏ విధంగా ద్వంద్వానికి అతీతంగా తీసుకువెళుతుందని. ఎంపిక లేని స్థితిని మీరు ఎంచుకోవచ్చు. అర్థం చేసుకోండి, మీరు ఒక దృశ్యాన్ని అంతరంగంలో చూస్తూ దానికి అతీతంగా వెళ్ళవచ్చు. దీన్ని జంపింగ్ బోర్డులా ఉపయోగించి మీరు ఉన్నతచేతనస్థితిని చేరటం చూస్తారు.

తీవ్రతకు ధ్యానపద్ధతి

ఇది శివసూత్రాలలోని ఒక శక్తిమంతమైన ధ్యానపద్ధతి. సూత్రం ఇలా చెబుతుంది; అనంతశూన్యంలోకి, ఎక్కడైతే నీవు ఉండవో ఆ శూన్యంలోకి కరిగిపో (మరణించి) జ్ఞానేంద్రియాలకి అతీతంగా శివుని చేతనస్థితిలోకి వెళ్ళటమే. ఈ ధ్యానపద్దతిని షణ్ముఖముద్ర అంటారు. ఈ ముద్రలో ఉండటం కష్టం. మీరు నేల మీద కూర్చొని చేతుల ఆధారంమీద ఉండండి. మీ ముందు కుర్చీ వేసుకొని దాని మీద చేతులు పెట్టుకోండి. అవసరమైనప్పుడు కుర్చీలో కూర్చొని చేతులకి సపోర్టు ఇవ్వండి. అలా చేస్తే భుజాలు నొప్పి పుట్టవు.

    1. షణ్ముఖ ముద్ర అంటే చేతులతో కళ్ళు, చెవులు, ముక్కు, నోరు మూసి ధ్యానం చేయటం. ఈ ముద్ర మీ జ్ఞానేంద్రియాల ద్వారాల్ని మూసేస్తుంది. దీన్ని ధ్యానంలో ప్రవేశం ఉన్నవారు మాత్రమే చేయాలి. కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చోండి.
    1. షణ్ముఖముద్రలో ఉంటే మీ ముఖంలోని ఏడు రంద్రాల నుంచి బయటికి వెళ్ళే శక్తి (రెండు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు) మీ లోపలి వెళ్ళుతుంది. అది శక్తిని బయటికి వెళ్ళకుండా ఆపగలుగుతుంది. దాన్ని ఆజ్ఞా చక్రం వైపు మళ్ళిస్తుంది.

కనుగుడ్డుని సగం మూయాలి. అలా చేయడం వలన శ్వాస ద్వారా వెళ్ళే గాలి తగ్గి శ్వాసని నియంత్రిస్తుంది. షణ్ముఖ ముద్ర బయటికి వెళ్ళే శక్తిప్రవాహాన్ని ఆపుతుంది.

రెండవది, ఈ జ్ఞానేంద్రియాల్ని మన లోపలికి మళ్ళించటం.

మూడవది, వాటిని మూడవ కన్ను అయిన ఆజ్ఞాచక్రం మీదే కేంద్రీకరించటం.

సూచనలు

కళ్ళ జోడు ఉన్నవారు వాటిని తీసివేయండి. చేతి వేళ్ళని కింది విధంగా ఉంచండి. బొటన వేళ్ళు చెవి దగ్గర ఉన్న చిన్న లోబ్స్‌తో లోపలికి మీకు హమ్మింగ్ శబ్దం వచ్చేవరకూ నొక్కి, ఉంచండి.

చూపుడు వేళ్ళతో కళ్ళు రెండు మూయండి. మధ్య వేలు ముక్కు రెండు వైపులా (ముక్కు దూలం పైన) ఉంచండి. ఉంగరపు వేలుతో ముక్కు సున్నితంగా సగం మూయండి.

చిటికెన వేలు పెదాల మీద ఉంచాలి.

తరువాత 21 నిమిషాలు ఈ కింది విధంగా చేయండి.

ముక్కు సగం మూయండి. ప్రాణప్రవాహాన్ని

కొంచెం తగ్గించండి. మనస్సు స్థిరంగా ఉంటే ప్రాణప్రవాహం తగ్గుతుంది. షణ్ముఖముద్రలో ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. నోరు గట్టిగా మూయండి. కనుగుడ్డు రిలాక్స్ గా మారాయి అనుకోండి.

మీ తెలుసుకునే తత్త్వాన్ని తీవ్రం చేయండి. ఒత్తిడి వద్దు. మీ తెలుసుకునే తత్త్యం లోనికి లోతుగా వెళ్ళండి. ఒత్తిడి వద్దు, తెలుసుకునే విధంగా ఉండండి. మీ మూడవ కంటిలోకి చొచ్చుకొని పోతున్నట్టు ఊహించండి, దాని లోపలికి డింక్ చేసుకుంటూ వెళుతున్నట్లు అనుకోండి.

రిలాక్స్, నెమ్మదిగా కళ్ళు తెరవండి.

మీరు సౌకర్యంగా షణ్ముఖముద్రలో ఉండాలి, మీ మూడవకంటి దగ్గర చాలా శక్తి ఉండటం గమనిస్తారు. అది మీలోని ఆత్మబోధస్థితిని మేల్కొలుపుతుంది. మీరు సౌకర్యంగా ఉంటే మీరు లోతైన శక్తి లోనికి ప్రవేశించటాన్ని అనుభూతితో తెలుసుకుంటారు. మీరు ఉన్నతచేతనస్థితిలో ప్రవేశిస్తారు.

తీవ్రత – అపజయం లేని మార్ధం

  • జరుగుతుంది.
  • తీవ్రత మీ లోపల బయట విభేదాలు సృష్టించదు. అది సున్నితంగా బలంగా ప్రవహిస్తుంది.
  • తీవ్రత అంటే మార్పులు లేకుండా కఠినంగా ఉండడం కాదు.
  • అనేషణలో మీరు మమేకం కాకపోతే మార్పు జరగదు.
  • అంతిమసత్యం అనే కోరికతో దహించుకుపోవడమే. అంతరంగంలోకి గురుదేవుల మాటలు ప్రవేశించినప్పుడు, జ్ఞానోదయం అనే ఆణిముత్యం తయారవుతుంది.
  • మీలో ఏదైనా ఆవేశం ఉన్నప్పుడు, అది మిమ్మల్ని అధిగమించినప్పుడే, మీ శరీరాన్ని కదలకుండా ఒక్కసారి ఉండగలిగినా మీరు ఆ ఆవేశం నుంచి స్వేచ్ఛని పొందగలరు.
  • మీరు తీవ్రంగా ఉంటే విముక్తిని పొందుతారు.
  • చేసే పనిలో మిమ్మల్ని మీరు మలిచిపోతే సర్వాంతర్యామి అధరం మీద వేణువుగా ఉంటారు.
  • ఈ క్షణంలో తీవ్రంగా ఉండి నిజమైన జీవితం రుచిని చూడండి లేకపోతే మీరు జీవించే ఉన్నట్లు కాదు.
  • సర్వాంతర్యామి నుంచి మీరు దేన్నీ దాచలేరు మీ కంటే మీ గురించి ఆయనకి బాగా తెలుసు.
  • కనీసం ఒకటి రెండుసారైనా కలల స్థితిలో మీ గుర్తింపుల్ని అనుభవిస్తే మీరు తీవ్రతతో ఉన్నట్లే.
  • తీవ్రతతో మీ చేతనస్థితిలోకి, మీ గాఢనిద్రలోకి చొచ్చుకుని పోయే శక్తి ఉంది.
  • మనిషి అద్దం లాంటివాడు. సర్వాంతర్యామికి ఎదురు నిలబడవచ్చు లేదా వెనుతిరిగి వెళ్ళిపోవచ్చు.
  • మీ అన్వేషణ, కోరిక, తీవ్రంగా వుంటే అహంకారంలోని జీవాన్ని తీసేస్తుంది.
  • కేవలం తీవ్రతతోనే క్లిక్ జరుగుతుంది. అగ్నిని పట్టుకోండి, మేల్కొలుపు జరుగుతుంది.
  • మీరు గాఢమైన శక్తితో ఉన్నప్పుడే క్లిక్ జరుగుతుంది.
  • మన కపటం ఎటువంటిదంటే అది మనని మోసం చేస్తుందని తెలుసుకోలేం.
  • మీ తీవ్రత ఎంత శక్తి గలదంటే అది మీ శరీరాన్ని, డి.ఎన్.ఎ.ని కూడా మార్చేస్తుంది.

జీవిత ద్వారాన్ని తెరిచే అమాయకత్వం

తీవ్రత గురించి, సాంద్రత గురించి మాట్లాడిన తరువాత అమాయకత్వం గురించి మాట్లాడుతుంటే కొత్తగా అనిపించవచ్చు. కాని నిజం చెప్పాలి అంటే మీరు దేనిలోనైనా పూర్తిగా నిమగ్నమవ్వాలంటే మీలో అమాయకత్వం ఉండాలి. నేను చెప్పే అమాయకత్వం, మీ నిఘంటువులో ఉన్న అమాయకత్వం వేరు. నేను చెప్పేది పసిబిడ్డలలోని అమాయకత్వం. చిన్న పిల్లలు ఏది చేసినా పూర్తిగా నిమగ్నమై గాఢతతో చేస్తారు. పెద్దవారిలో ఆ శక్తి పోయింది. కాని దాన్ని తిరిగి పొందవచ్చు.

అమాయకత్వం అంటే?

నిరంతరం మనం మంచిగా, స్వచ్ఛంగా, అమాయకంగా ఉండాలి అని చెబుతుంటారు. అమాయకత్వాన్ని మన మీద బలంగా మోపుతారు. నిరంతరం సమాజం, నీతి బోధకులు మనకి ఇది మంచిది ఇది చెడ్డది, ఇది తప్ప ఇది కరెక్టు, ఇది స్వచ్ఛమైంది. ఇది కలుషితమైంది, ఇది అమాయకత్వం అది కలుషితం ఇలా చెబుతూనే ఉంటారు. నిరంతరం మనకి మంచి చెడుల గురించి చెబుతూ ఉంటారు. సమాజం ఏది మంచి అని చెబుతుందో దాన్ని బలవంతంగా మనతో అమలు చేయిస్తారు.

కానీ జీవితం సమాజం చెప్పిన, నమ్మినవాటిలో ఉండదు. జీవితం పూర్తి వేరుగా ఉంటుంది. సమాజం నమ్మేది ఒక విధంగా ఉంటుంది, జీవితం మరొక విధంగా ఉంటుంది. ఒక చక్కని వాక్యం ఉంది, 'మీరు ఆలోచించేటప్పుడు అందరికీ సాధారణంగా ఉండే విధంగా ఆలోచిస్తారు. కాని జీవించేటప్పుడు అలా చేయరు.' ఇది ఎలా ఉంటుందంటే ఆలోచించేటప్పుడు ప్రపంచం దృష్టితో ఆలోచించి చేసే పని మన ప్రాంతానికి సరిపడే విధంగా చేయాలి అని.

సంఘటనల్ని జనసామ్యం చేయలేం. మీ జీవితంలో చాలా సంఘటనల్ని సాధారణంగా జనసామాన్యంగా చేయలేం. మామూలుగా ఆలోచించి మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అని మీ జీవితస్థితులకి అన్వయించలేరు. మీరు అనుకునే మంచిచెడులు, నీతి నియమాలు ప్రయోగాత్మకంగా ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండవు. నన్ను ఒకరు ఈ విధంగా అడిగారు, 'మన ప్రాచీనసాహిత్యంలో జూదం గురించి ఎందుకు ప్రస్తావించలేదు? అది పురాణాల్లో మాత్రమే ఎందుకు ఉంది?' అని.

నేను వారికి చెప్పాను, ఆ రోజుల్లో జూదం అనేది లేదు. కాబట్టి వారు దాని గురించి ఏ విధంగా మాట్లాడగలరు. అందుకే ఏ హిందూప్రాచీనసాహిత్యం కూడా జూదాన్ని, మత్తుమందుల్ని నిషేధించలేదు. ఎందుకంటే అప్పట్లో అవి లేవు కాబట్టి. నీతి నియమాలు అనేవి పూర్తిగా

ఆయా సంఘటనల మీద ఆధారపడి ఉంటాయి. అందుకే అది పోలికలోనే ఉంటుంది. దానికి దృఢమైన ఉనికి లేదు.

అమాయకత్వం అంటే అంతరంగస్వచ్చత. అది ఆలోచనలతో లేదా సంస్కారాలతో ప్రభావితం కాకుండా ఉన్న స్థితి. మీకు స్పష్టంగా చెబుతాను. మీరు భావావేశాల్ని, కోపం, ఆశ, కోరిక మొదలైనవాటిని వెల్లడి చేయలేకపోయినా, మీ లోపల ఉంటే మీరు అమాయకత్వంలో లేరు అని అర్థం. సమాజదృష్టిలో మీరు స్వచ్ఛమైనవారు కావచ్చును కాని అంతరంగంలో కాదు. అంతే మీరు కోపాన్ని, కోరికని వెల్లడి చేస్తూ వాటితో మీ అంతరంగం ప్రభావితం కాకపోతే, మీరు పసిబిడ్డలోని అమాయకత్వంతో జీవిస్తున్నారు అని అర్థం. అప్పుడు మీరు స్వచ్చమైనవారు.

పిల్లలు కోపం తెచ్చుకోవటం చూడండి. వాళ్ళకి అత్యాశ కూడా ఉంటుంది. వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఆశ మీదే నిర్మించుకుంటారు. అందుకే నాది అనేది వారు పూర్తి తెలుసుకునే తత్వంతో చేతనస్థితిలో చూపిస్తారు. వారి దగ్గర నుంచి ఒక బొమ్మ తీసుకోవటానికి ప్రయత్నించండి. వాళ్ళ జీవితాన్ని తీసేసుకున్నట్లు ప్రవర్తిస్తారు. అరుస్తారు, గోల చేస్తారు. ఎందుకంటే వారు దాన్ని నాది అనే భావం మీద నిర్మించుకుంటారు. కాబట్టి పిల్లల్లో ఆశ, కోపం ఉంటాయి. కాని వారిని స్వచ్చత లేనివారు అని అనలేం. ఎందుకంటే ఏదైతే కల్మషం అని మీరు అనుకుంటారో అది వారి అంతరంగాన్ని అంటదు కాబట్టి. వాళ్ళు బొమ్మలతో ఆడుకుంటారు. కొంత సేపు అయ్యాక వాటిని పక్కన పారవేసి వెళ్ళిపోతారు, వారితో వాళ్ళు ఏదీ తీసుకువెళ్ళరు. వారి అంతరంగం స్వచ్ఛంగా, అందంగా ఉంటుంది.

చిన్న పిల్లలలో ఆశ, కోపం ఉంటాయి. కాని వారి అంతరంగం స్వచ్ఛంగా అందంగా ఉంటుంది.

వాళ్ళు ఎవరినీ అడగకుండా ఏదైనా తీస్తే దొంగతనం అనలేం. ఎందుకంటే అవి ఎవరివో నేను వాటిని తీసుకోకూడదు అనే భావం వారికి ఉండదు. ఒక వస్తువు మరొకరి సొంతం అన్న భావం వారికి ఉండదు. అమాయకత్వం స్వచ్ఛమైనది. ఒక వస్తువు మరొకరిదని తెలిసి దాన్ని దొంగతనం చేయకపోయినా, మీరు దాన్ని కోరితే మీరు దొంగతనం చేసినట్లే. అక్కడ మీరు దొంగ కాదు ఎందుకంటే పోలీసు పట్టుకోలేరు కాబట్టి అంతే.

అమాయకత్వం అనేది అంతరంగానికి సంబంధించింది. అది ఏ విధంగా కూడా బయటి ప్రపంచానికి సంబంధించినది కాదు. శివసూత్రాల్లో శివుడు ఈ అమాయకతాన్ని తిరిగి పొందగల ఒక సాధన పద్ధతిని వివరిస్తాడు. మీరు హిందూపురాణాలలో వివరించిన శివుడి జీవిత సరళిని గమనిస్తే ఆయనలో సామాజిక, లేదా సంప్రదాయపరమైన అమాయకత్వం ఎక్కడా కనిపించదు. కాని ఆయనలో స్వచ్చమైన అంతిమ అమాయకత్వం ఉంటుంది. ఆయన జీవనవిధానం, నివసించే స్థలం ఏదీ కూడా ఆయనలోని స్వచ్చతకి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండదు. శివుడు శ్మశానంలో నివసిస్తాడు. ఆయన చుట్టూ ఉండేది ప్రేతాత్మలు, భూతాలు.

సంస్కృతంలో శివ అంటే అర్ధం కారణం లేని మంగళత్వం. ఈ శుభకరమంగళత్వమే నిత్యానందాన్ని సృష్టించగల శక్తి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడికి వెళితే అక్కడ ఆ పరమానందస్థితి స్వచ్చమైన అమాయకత్వంతో ఉండే ఆయన అంతరంగం నుంచి వస్తుంది.

వేదసంస్కృతిలో చాలా సాహిత్యం ఉంది. వాటిలో ఉపనిషత్తులు అనేవి ఒక భాగం. ఉపనిషత్తు అంటే సంస్కృతంలో గురువుల పాదాల దగ్గర శిష్యులు కూర్చొని గురువుల బోధనల ద్వారా నేర్చుకోవటమే. జ్ఞానోదయానికి అవి అవసరమైన శాస్త్రాన్ని ఇస్తాయి. వాటిని గొప్ప గొప్ప ఋషులు, యోగీశ్వరులు వేదకాలంలో తరువాత తరాలవారి కోసం అందించారు.

వేదసంస్కృతిలో 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు జ్ఞానోదయ శాస్త్రసారాంశం. వేదకాలం నాటి జ్ఞానోదయమైన యోగీశ్వరులు వీటిని మనకి అందించారు. వీటిలో ఛాందోగ్య ఉపనిషత్తు అనేది ఒకటి ఉంది. అందులో ఒక చక్కని కథ కథ రూపంలో ఉంటుంది.

సత్యకాముడు అనే ఒక శిష్యుడు గురువుగారి దగ్గరకి వెళ్ళి తనకి జ్ఞానోదయం పొందే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తాడు. అప్పుడు గురువుగారు అతనికి నాలుగు వందల ఆవుల్ని ఇచ్చి 'నీవు ఈ ఆవుల్ని తీసుకొని అవి వేయి అవుల అయ్యేంతవరకూ అడవిలో ఉండి తిరిగి రా' అని చెబుతాడు.

సత్యకాముడు అడవిలోకి వెళ్ళి ఆవులతో పాటు ఉంటాడు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇన్ని సంవత్సరాలూ అతను ఎవరితో మాట్లాడకుండా అలా ఆవులతోనే ఉండిపోతాడు. కొంత కాలానికి మానవభాషని మరిచిపోతాడు. లోతైన నిశ్శబ్దంలో, ఏ మనిషితో ఎటువంటి సంబంధం లేకుండా క్రమంగా బయట ప్రపంచంలోని తన గుర్తింపుని మరిచిపోతాడు.

కొంత కాలానికి ఆవులు అతని దగ్గరకి వచ్చి 'అయ్యా! మేం వేయి ఆవులు అయ్యాం. మనం గురువుగారి దగ్గరకి వెళదాం' అని అంటాయి. అతను 'అలాగా! అయితే వెళదాం' అంటాడు. సత్యకాముడు ఆనందపారవశ్యంలో ఉంటాడు. అతను దారి మరిచిపోతాడు. ఆవులు అతనికి దారి చూపిస్తూ అతన్ని తీసుకువెళతాయి. వెళ్ళే దారిలో జంతువులు, పక్షులు, తాను వంట చేసుకోవటానికి వెలిగించిన అగ్ని అన్నీ చాలా విషయాల్లో సత్యకామునికి సూచనలని ఇస్తాయి. పరబ్రహ్మ గురించి, అంతిమసత్యం గురించి బోధిస్తాయి.

సత్యకాముడు గురువు దగ్గరికి రాగానే, గురువుగారు అతని చిరునవ్వుతో చూస్తాడు. ఆయన సత్యకాముణ్ని 'నీవు అంతిమసత్యం తెలుసుకున్నవాడిలా ప్రకాశిస్తున్నావు. ఎవరు నీకు అది బోధించారు' అని అడుగుతాడు.

సత్యకాముడు తాను ఏ విధంగా పశుపక్ష్యాదుల నుంచి అంతిమసత్వాన్ని తెలుసుకున్నాడో వివరిస్తాడు. చివరిలో గురువుగారిని ఆయన మాటలలో సత్యబోధ చేయమని ప్రార్థిస్తాడు.

గురువుగారు, 'నీకు సత్యం తెలుసు' అని దీవిస్తారు. కథలో ఏముంటుందంటే సహజంగా ఉంటూ, ప్రకృతి చెప్పేది వింటూ సత్యకాముడు తనలో తాను స్థిరపడగలిగాడు. ఆ అంతిమసత్యంలో స్థిరపడ్డాడు. అతనికి జ్ఞానోదయం జరిగింది. సంపూర్ణ అమాయకత్వం జ్ఞానోదయం వైపు తీసుకువెళుతుంది. ఒక విషయం అర్థం చేసుకోండి. మీలో తర్కజ్ఞానం లేనంత వరకూ మీరు దాంతో విసిగి అలసిపోయేంత వరకూ మీలో మార్పు రాదు.

గురువు చెప్పిన దాన్ని శ్రద్ధగా ఆచరించడం వల్లనే సత్యకామునికి జ్ఞానోదయం కలిగినట్లు, ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది.

సత్యకాముడు గురువుని జ్ఞానోదయమార్గం తెలియజేయమంటే గురువు అతన్ని ఆవుల సంఖ్య పెంచమని చెబుతాడు. జ్ఞానోదయానికి ఆవుల సంఖ్య పెంచడానికి ఏమిటి సంబంధం? అదృష్టం వల్ల సత్యకామునికి హేతుబద్దమైన ఆలోచన లేదు. అతను ఆలాంటి విద్యను అభ్యసించలేదు. అందుకే ఆ ప్రశ్న అతను అడగలేదు. అతనిలోని వినయం సౌమ్యత, అమాయకత్వం జ్ఞానోదయం పొందటానికి సహకరించాయి. అతనిలో తర్కజ్ఞానం లేదు. హేతువాదం మీ జీవితాన్ని అర్ధం చేసుకోడానికి మీ అంతరంగప్రపంచంలోకి వెళ్ళటానికి మీకు సహాయం చెయ్యదు. అందుకే దాన్ని వదిలితే గాని మీలో మార్పు కలగడానికి సిద్ధంగా లేరని అర్థం చేసుకోండి.

నన్ను కొంతమంది అదుగుతుంటారు. 'స్వామిజీ! మీరు తర్కశాస్త్రానికి వ్యతిరేకులా?' అని. నేను వ్యతిరేకిని కాను. మీరు పడే కష్టాలు వివేకం లేని తర్కంవల్లే అంటాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు తార్కికజ్ఞానం మీలో ఎంత రాజకీయం సృష్టిస్తుందో చూసారా? అసలు రాజకీయం అంటే ఏమిటి? ఒకే విషయం మీద విభిన్న అభిప్రాయాలు కదా! ఇప్పుడు మీ మనస్సును గమనించండి. మీరు ఉదయం ఒక విషయాన్ని గురించి ఒక విధంగా ఆలోచిస్తారు, సాయంత్రానికి మీ అభిప్రాయం మారిపోతుంది. దీన్నే సందిగ్ధావస్థ అంటారు. ఏమీ నిర్ణయం చేయలేని స్థితి. అందరూ ఆధ్యాత్మికసంస్థలలో రాజకీయాలు ఎక్కువ అని అంటారు. అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి అని నేను వారిని అడుగుతాను. ఎవరైతే ఇలా అంటారో వారిలోనే రాజకీయం ఉంది. రాజకీయం సృష్టించడానికి ఇద్దరు మనుషులు అవసరం లేదు. ఒక్కరుంటే చాలు. తార్కికంగా ఆలోచించేవారైతే చాలు. ఎందుచేతనంటే అతని తర్కబుద్ధి ఉదయం ఒకటి చెబితే, సాయంత్రానికి అదే విషయం మీద వేరే ఆలోచన పుట్టిస్తుంది. మీ మనస్సులో మీతో మీరు చేసే పోరాటమే రాజకీయం. అలాంటప్పుడు ఆధ్యాత్మికసంస్థలలో రాజకీయాలున్నాయి అని ఎందుకు అంటారు?

మీరు ఒక విషయంపై ఉదయం తీసుకున్న నిర్ణయాలు, సాయంత్రం తీసుకున్నవి మీ ముందుంచితే, మీలోని రాజకీయనాయకుడిని చూసారు. తర్కం మీ అమాయకత్వాన్ని నిరాడంబరతను పోగొడుతుంది. మీలో మార్పు రావడానికి సహాయపడదు. మీలో మార్పు రావాలంటే మీరు తర్కాన్ని వదిలేయాలి. తర్కం లేనప్పుడు అమాయకత్వం ఉంటుంది. అమాయకత్వం మనలో మార్పు కలగడానికి సహకరిస్తుంది.

సత్యకాముని కథలో అదృష్టం కొద్దీ అతనికి తర్కబుద్ధి లేదు. ఎవరైనా శిష్యుడు గురువు దగ్గరకి వెళ్ళి నాకు జ్ఞానోదయం కావాలి అని అడిగితే గురువుగారు ఆవులని వెయ్యి చేసి తెమ్మంటే, శిష్యులు గురుదేవులు నా జీవితంతో ఆడుకుంటున్నారు, నన్ను గోవుల కాపరిలా ఉపయోగించుకుంటున్నారని ఆలోచిస్తారు. తర్కం అతని అమాయకత్వాన్ని పొగొడుతుంది. అందుకే ఆధునికకాలంలో ఏ శిష్యుడూ కూడా అంత అద్భుతమైన పద్ధతులను పాటించలేదు.

అర్థం చేసుకోండి, ఇది కథ కాదు. దీనిలో గొప్ప సత్యం ఉంది. అమాయకత్వంతో సత్యకాముడు తన గురువు చెప్పింది చేసాడు. అతనికి లెక్కించే జ్ఞానం పోయింది. అతను పూర్తిగా ఆనందపారవశ్యంలో మునిగిపోయాడు. అతని మనస్సు పని చేయడం మానేసింది. అతను గోవులు 1000 లేక రెండు వేలా అన్నది పట్టించుకోలేదు. అతని అమాయకత్వం, అంగీకారం అతనిలో గొప్ప మార్పుని తెచ్చాయి. అదే జ్ఞానోదయం. మీరు పూర్తిగా అంగీకరిస్తే మనస్సుతో అవసరం లేదు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు పోరాడేటప్పుడు మీకు బుద్ధి అవసరం. మీరు అంతరంగ ప్రపంచంలో, బయటి ప్రపంచంలో ఈ క్షణంలో మిమ్మల్ని మీరు సీకరిస్తే, ఈ క్షణంలో ఉండగలిగితే, జ్ఞానోదయస్థితిని పొందుతారు.

అన్ని సంవత్సరాలు, సత్యకాముడు తన గురుదేవులు చెప్పింది ఆచరించడం వల్ల అతనికి జ్ఞానోదయం కలగకుండా ఉంటుందా? మీరు అనుకోవచ్చు గురుదేవులు చెప్పింది చేస్తే అంత గొప్ప మార్పు సాధ్యమా? ఇక్కడ సమస్య ఏమిటంటే ఆధ్యాత్మికత, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి బుద్ధికుశలత అవసరమా? మేధలోంచే ఎలా అనే ప్రశ్న వస్తుంది. బుద్ధి ఎప్పుడూ ప్రశ్నిస్తుంది. వివేకవంతుడు నేను చెప్పింది వెంటనే పాటిస్తాడు. అదే బుద్ధికి, వివేకానికి గల తేడా.

శివసూత్రాలలో శివుడు ఈ విధంగా చెబుతారు, 'అంతిమసత్యాన్ని బోధించేటప్పుడు, జాగ్రత్తగా వినండి, కనురెప్పలు మూయకుండా, కళ్ళు కదిలించకుండా, నిశ్చలతతో వింటే మీరు సంపూర్ణమైన స్వేచ్ఛని పొందుతారు.

శివుడు 'కళ్ళు స్థిరంగా కనురెప్పలు మూయకుండా' అన్న మాటలను ఎందుకు వాడతాడు? మీరు మీ కనురెప్పలు మూయకుండా ఉంటే మీరు ఎందులోనైనా లీనం అయ్యారని తెలుస్తుంది. మీరు కనురెప్పలు కదిలిస్తే మీరు లీనం కాలేదని అర్థం.

మీరు కనురెప్పలు కదిలిస్తే మీరు కేవలం వింటున్నారు ఆలకించడం లేదని అర్థం. వినడానికి, ఆలకించడానికి చాలా తేడా ఉంది. మీరు వింటున్నప్పుడు మీ బుద్ధి పని చేస్తుంది. ఆలకించేటప్పుడు (అంటే శ్రద్ధగా వినడం) మీరు అందులో లీనమయ్యారని తెలుస్తుంది. మీ మేధస్సు పని చేయదు. మీరు పూర్తిగా కరిగిపోతారు. మీరు గురుదేవులు తప్పితే బాహ్య ప్రపంచం ఉండదు. మీరు పూర్తిగా అమాయకత్వంతో సత్యకామునిలా వికసిస్తారు. ఆ స్థితిలో గురుదేవులు పలికే ఒక్క మాటతో మీరు జ్ఞానోదయం పొందుతారు.

అమాయకత్వంతో సంపూర్ణంగా వికసించి ఉన్నప్పుడు కేవలం ఉపదేశమే జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. శివసూత్రాల్లో ఇది ఒక పద్ధతి. గురుదేవులు సత్యాన్ని బోధించినప్పుడు అంకితభావంతో విని – జ్ఞానోదయం పొందండి.

కేవలం సమర్పణభావంతో వింటే ఎలా జ్ఞానోదయం పొందగలం అనే సందేహం వస్తుంది. మనకు జ్ఞానోదయం కలగలేదు. సత్యకామునికి ఆ స్థితి ఎలా వచ్చింది? మొదటి కారణం సత్యకాముడు అమాయకమైన వివేకంతో గురుదేవుల ఆదేశాన్ని పాటించాడు. రెండవది, అతను ధైర్యంగా అడవికి వెళ్ళి నివసించాడు. అతనికి గురువు మీద పూర్తి నమ్మకం ఉంది. నమ్మకాన్ని వెన్నంటే అమాయకత్వం ఉంటుంది.

నేను మిమ్మల్ని వెయ్యి గోవులు తీసుకురమ్మనడంలేదు. సత్యకాముని మానసికస్థితిలో రమ్మని అంటున్నాను. అదే అమాయకత్వంతో రండి. సత్యకామునిలా అడవికి వెళ్లనవసరం లేదు, కాని అతను ఎలా ఉన్నాడో అలా ఉండండి. మీ అంతఃకరణ అంత స్వచ్ఛంగా ఉంటే ఈ క్షణంలో మీలో మార్పు వస్తుంది. మీరు పరమార్థాన్ని తెలుసుకుంటారు.

నిశ్చింతగా ఉండు

ఉపనిషత్ అంటే గురుదేవుల పాదాల దగ్గర కూర్చొని విద్యనేర్చుకోవటం. పూర్వం భరతదేశంలో 'గురుకులం'లో గురువుతో శిష్యులు నివసించేవారు. ఏడు సంవత్సరాల పిల్లలని గురుకులానికి పంపించేవారు. ఆ పిల్లలు అందమైన మనోవికాసంతో గురుదేవుల దగ్గర పెరిగేవారు. గురువులు సత్యంతో జీవించే అవతారమూర్తులు. వారి ఆలోచనలు, మాటలు, చేసే పనులు అన్ని పరమార్దాన్ని తెలియచేస్తాయి. శిష్యులు వారితో ఉంటూ ఆ సత్యాన్ని గ్రహిస్తారు.

గురుకులం – పురాతన హిందూ సంప్రదాయం, గురుశిష్యులు కలిసి ఒక కుటుంబంలా ఉండేవారు. శిష్యులు, గురుకులంలోనే, గురువు సంరక్షణలో పెరిగి, అంతరంగప్రపంచ జ్ఞానం పొందేవారు. సహజసిద్ధంగా వారికి బాహ్యప్రపంచం మీద అవగాహన కలిగేది.

స్వామి యుక్తేశ్వరగిరి భరతదేశంలో జ్ఞానోదయమైన గొప్ప యోగీశ్వరుడు. ఆయన ఈ విధంగా అన్నారు – గురువు దగ్గర కూర్చోవటమంటే కేవలం భౌతికంగా కాదు, ఆయన మూర్తిని మీ హృదయంలో ఉంచుకోవాలి. గురుదేవుల పద్ధతిని అనుసరిస్తూ పూర్తిగా ఆయనతో అనుసంధానం ఏర్పరచుకోవాలి. ఇదే ఉపనిషత్‌లో చెప్పిన పద్ధతి, గురువు ఎప్పుడూ సచేతనస్థితిలో ఉంటారు. శిష్యుడు గురువుతో అనుసంధానం ఏర్పరచుకుంటే ఆ చేతనస్థితిని పొందుతాడు. ఇది కేవలం అమాయకత్వంతో మాత్రమే లభిస్తుంది.

వికసించడం అంటే శూన్యతతో ఉండడం. మీరు జ్ఞానంతో నిండి ఉండకూడదు. జ్ఞానం ఒక పరికరం మాత్రమే. అది మీలోని పదార్థం కాదు. ప్రతి దాన్ని ఇది కాదు, అది కాదు అని నిరాకరించండి. నేను మీతో అనేది ఏమంటే, మిడిమిడి జ్ఞానంతో ఉండవద్దు, అంతిమసత్యాన్ని తెలుసుకొనే వరకు ఏదీ వద్దనండి. మీకు నిరంతరం వచ్చే ఆలోచనల్ని వదిలేస్తే శూన్యం మిగులుతుంది. మీలో మీరుంటారు. అక్కడే మీరు పరమార్దాన్ని తెలుసుకుంటారు. అప్పుడు మీరు సంపూర్ణంగా సత్యమనే వెలుగుతో నింపుతారు.

ఆది శంకరాచార్యులవారు ఎనిమిదవ ఏట నిర్వాణశతకం అనే అందమైన కవితని ఆశువుగా చెప్పారు.

నిర్వాణశతకం – నిర్వాణ అంటే అత్యున్నత ఆనందస్థితి. శంకరాచార్యులవారిని ఆయన గురుదేవులైన గోవింద భగవత్పాదులవారు ఈ విధంగా అడిగారు 'ఎవరు నీవు?' అని. ఆ ప్రశ్నకు జవాబుగా, ఆశువుగా శంకరాచార్యుల వారు, నిర్వాణశతకం చెప్పారు.

నాకు ప్రేమ కాని ద్వేషం కాని లేవు. నాకు లోభత్వం కాని అవిశ్వాసం కాని లేవు. నాకు గర్వం కాని అసూయ కాని లేవు. నేను చేయవలసిన పని లేదు. సంపాదించవలసిన ధనం లేదు. నేను ఆనందాన్ని కోరుకోవటం లేదు. విముక్తికి బంధించబడి లేను. చేతనస్థితి, బ్రహ్మానందం సహజస్వభావం. నాలో అంతా శుభప్రదమే శివోహం, నేను శివుడిని. శంకరాచార్యులవారు అతి చిన్న వయస్సులో అంత బ్రహ్మానందంలో ఉన్నారు.

మీరు పిల్లలని చూస్తే, వారి కళ్ళు ఎప్పుడూ ఆశ్చర్యం, కొత్తదనంతో నిండి ఉంటాయి. ఆ పసి మనస్సులు ఖాళీగా ఉంటాయి. దేని మీద అభిప్రాయం ఏర్పరచుకోరు. తెలుసుకోవాలనే

జీవిత ద్వారాల్ని తెరిచే అమాయకత్వం

కుతూహలస్థితిలో ఉంటారు. వారి కళ్ళు వారి సంసిద్ధతని తెలియజేసాయి. మీరు పెద్దవారిలో అలాంటి కళ్ళు చూసారా? పెద్దవారిలో వయస్సుతో పాటు కళ్ళ కాంతి తగ్గుతుంది. వయసుతో బుద్ధి పెరగడం వల్ల కళ్ళు నిస్తేజం అవుతాయి. మనకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి. కాని వాటి వల్ల కళ్ళ కాంతి తగ్గకూడదు. మన అంతరంగం ఖాళీగా ఉండాలి.

మీరు జీవితం మీద అభిప్రాయం ఏర్పరచుకోకుండా, స్థిరమైన ఆలోచనలు లేకుండా ఒక ఖాళీ టీ కప్పులా ఉంటే తయారుచేసిన టీని నింపవచ్చు. మీరు గ్రహించే స్థితిలో ఉంటారు. మీరు తెలుసుకునే తత్వంలో ఉంటారు. మీకు విసుగు పుట్టదు. మీరు ఒక చిన్న పిల్లాడిలా అమాయకత్వంతో సహజంగా ఉంటారు.

అమాయకత్వం జీవితంలోని అద్భుతాలను పంచుకోడానికి ఆహ్వానిస్తుంది. బుద్ధి జీవితంలో అద్భుతాలని అడుగు పెట్టనివ్వదు. పిల్లలు దాగుడుమూతలు ఆడుకునేటప్పుడు, పెద్దవాళ్ళు ఎక్కడ దాక్కుంటారో, ఎప్పుడూ అక్కడే దాక్కుంటారు. అలా ఎందుకు చేస్తారంటే, వారి అమాయకత్వం వల్ల. వారి మనస్సులో ఏ ఆలోచనా ఉండదు. వారి పసి హృదయం ఎలా చెప్తే అలా వింటారు. మీపై వారికి చాలా నమ్మకం ఉంటుంది. అందుకే ఆటలో మీరు ఎక్కడ దాక్కున్నారో అక్కడికే వెళ్ళి దాక్కుంటారు. ఆ అమాయకులకి మీరు వారిని అక్కడే వెతుకుతారు అన్న అనుమానం కూడ రాదు. అంత అందమైంది, స్వచ్ఛమైంది వారి అంతఃకరణం.

మానసికనిపుణులు పిల్లల తెలివితేటల మీద, వారికి ఉన్న అవగాహన పైన ఒక చక్కని పరిశోధన చేశారు. అందులో భాగంగా మానసికనిపుణులు పిల్లలకి తల్లి, కూతురు, కొడుకు బొమ్మల్ని చూపించారు. తరువాత తల్లి, తండ్రి బొమ్మలు అక్కడ నుంచి తీసేసి, పిల్లలతో వారు ఆఫీసుకి పనికి వెళ్ళారు అని చెప్పారు. తరువాత కొద్దిసేపు వారి దృష్టిని మరల్చి తిరిగి ఆ బొమ్మల్ని అదే స్థానంలో ఉంచారు. పిల్లలు ఆ బొమ్మల్ని చూస్తారు. ఇప్పుడు మరలా వారిని 'అమ్మ, నాన్నల బొమ్మలు ఏవి' అని వారిని అడిగినప్పుడు వారి నుంచి వచ్చిన జవాబులు ఆసక్తికరంగా ఉన్నాయి.

నాలుగు సంవత్సరాల వయస్సు వరకూ, పిల్లలు బొమ్మల్ని చూసి కూడా వాళ్ళు ఆఫీసుకి వెళ్ళారు అనే చెప్పారు. ఆ వయస్సులో వాళ్ళు చూస్తున్నదాన్ని అన్వయించుకోవటం వారికి రాలేదు. ఇంకా కూడా వాళ్ళు ఆ కౌన్సిలర్ చెప్పిన మాటలనే నమ్ముతున్నారు.

ఇదే అమాయకత్వంలోని అందం. అమాయకత్వంలో విశ్వాసం ఉంది. అమాయకత్వం తనని వాడుకుంటారేమో అనే భయాన్ని కలిగించదు. ఇప్పుడు న్యూరో సైంటిస్ట్‌లు వివరాలు కనుక్కుంటున్నారు. పిల్లలకి ఐదు – ఆరు సంవత్సరాల వరకూ మెదడు తరంగాలు తీటా డెల్టా స్థితిలో ఉంటాయి. ఇదే మనం కలలు కని నిద్ర పోయే స్థితి. ఈ స్థితిలో గుర్తింపుల అవసరం లేని స్థితి. పన్నెండు సంవత్సరాల వయస్సు వరకు ఆల్ఫా స్థితిలో ఉంటాయి. అది కూడా మంచి స్థితి. అందుకే పిల్లలు పెద్దవాళ్ళు ఏమిచెబితే దాన్నే నమ్ముతారు. వారి అమాయకత్వంలో విశ్వాసం ఉంటుంది. మీరు చిన్న పిల్లల కళ్ళు చూడండి. అవి ఖాళీగా, స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే బ్రహ్మానందంలో ఉంటారు. పెద్దవారవుతున్న కొద్దీ కళ్ళు జ్ఞానంతో నిండుతాయి. అప్పుడు మీకు చూపు ఉంటుంది, వివేకం ఉండదు. దీనికి కారణం మీరు నమ్మకాలు, అభిప్రాయాలు, తెలివి నిండిన కళ్ళతో చూసారు. దాని వల్ల నేర్చుకునేది ఏం ఉండదు. అలాంటి కళ్ళు మీకు ఏం తెలియజేయవు.

మీరు శూన్యమైన కళ్ళతో చూస్తే చూసింది లోతుగా మనస్సుకు హత్తుకుంటుంది. జీవితం వికసిస్తున్న అద్భుతంలా ఉంటుంది. మీరు ప్రశ్నించేవారి అమాయకత్వాన్ని తెలుసుకోవచ్చు.

ప్రశ్నలు మూడు రకాలుగా అడగవచ్చు, అమాయకత్వంతో అడగవచ్చు, మీకు ఉన్న జ్ఞానంతో అడగవచ్చు, మీకు తెలిసింది ధ్రువీకరించడానికి అడగవచ్చు.

మీరు అమాయకత్వంతో అడిగితే – మీరు జవాబు వినడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు జ్ఞానంతో అడిగితే, మీకు సమాధానం వినిపించదు. మీరు ఖాయం చేసుకోడానికి అడిగితే – జవాబును నిరాకరిస్తారు.

ఒక చిన్న కథ : బౌద్ధగురువులు సాధారణంగా శిష్యలకి వ్యక్తిగతమైన సలహాలు ఏకాంతంలో ఇస్తారు. ఒక బౌద్ధగురువు నిత్యం వ్యాపారులతో, పత్రికా విలేఖరులతో, తన శిష్యలతో మాట్లాడుతూ సంతోషంగా గడిపేవారు. ప్రతి రోజూ ఆయన దగ్గరికి ఒక చదువు రాని తొట్టెల వ్యాపారి వచ్చి, అర్థం లేని ప్రశ్నలు అడిగి, టీ తాగేసి వెళ్ళేవాడు. ఒక రోజు అతను ఉండగా శిష్యుడు బౌద్ధగురువుతో ఏకాంతంలో సలహా తీసుకోవడానికి వచ్చాడు. గురువు ఆ తొట్టెల వ్యాపారిని, కాసేపు బయటకి వెళ్ళి కూర్చోమన్నారు. వ్యాపారి ఇలా అన్నాడు, 'మీరు జీవంతో ఉన్న బుద్ధుడు, శిల్పాకృతిలో ఉన్న రాయితో చేసిన బుద్ధులు కూడా వాటి ముందు మనుష్యుల సమావేశాన్ని వద్దనరు, అలాంటప్పుడు నన్ను ఎందుకు వెళ్ళమంటున్నారు?'

బౌద్ధగురువు తన శిష్యుడితో మాట్లాడటానికి బయటకు వెళ్ళిపోయారు.

ఆ తొట్టెల వ్యాపారి జ్ఞానంతో ప్రశ్నించాడు, అతను ఆ క్షణం వివేకహీనుడు అయ్యాడు. గురుదేవులు ప్రతిక్షణం బోధిస్తూంటారు? పూర్తి వికాసంతో ఉన్నవారు ఆ బోధ గ్రహిస్తారు. అమాయకత్వం నేర్చుకోడానికి సహకరిస్తుంది. గురువు చెప్పింది అర్థం చేసుకోడానికి వ్యాపారి మిడిమిడి జ్ఞానం అడ్డపడింది. మీరు పిల్లలను చూస్తే, వారు తమ చుట్టూ ఉన్న ప్రతీది గ్రహిస్తారు. అందరు చెప్పింది అర్థం చేసుకుంటారు. వారి గ్రహణస్థితిని ఆ చిన్న వయస్సులో ఏదీ ఆపదు. అందుకే వేదసాంప్రదాయప్రకారం పిల్లలకి ఏడేళ్ళు నిండేసరికి గురుకులానికి పంపేవారు. గ్రహించడానికి లేదా నేర్చుకోవడానికి ముఖ్యంగా కావలసింది అమాయకత్వం.

జీవిత ద్వారాల్ని తెరిచే అమాయకత్వం

అసలు సమస్య ఎవరి మనస్సు శూన్యంగా లేదో వారు గ్రహించలేరు. వారు జ్ఞానంతో నింపబడి ఉన్నారని వారితో చెప్పలేం. వారు చెప్పినా అర్థం చేసుకోరు, ఒప్పుకోరు. అమాయకత్వంతో ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, 'నాకు ఉన్న జ్ఞానం వల్ల నేను అర్థం చేసుకోలేక పోతున్నాను, నాకు నిజంగా తెలియదు. నేను ఈ క్షణం నేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నాను' అని. ఎప్పుడైతే ఖాళీ ఏర్పడుతుందో, తెలుసుకోడం జరుగుతుంది. వారిలో తెలుసు అన్న అహం ఉండదు. వారు నిరోధించే స్థితిని వదిలేసి పూర్తిగా గ్రహించే స్థితిలో ఉంటారు.

జిడ్డు కృష్ణమూర్తి ఒక గొప్ప వేదాంతి. ఆయన ఈ విధంగా చెబుతారు, 'మనకి జ్ఞానం సమకూర్చుకోటానికి ప్రేరణ తెస్తే మనం జ్ఞానం నుండి స్వేచ్ఛ పొందుతాం'. సాధారణంగా జ్ఞానానికి ప్రేరణ ఏమిటి? వర్తమానం ఒక తెరుచుకుంటున్న రహస్యమైన అద్భుతం. మనకున్న జ్ఞానంతో ఆ రహస్యాన్ని అర్ధంచేసుకోడానికి ప్రయత్నిస్తాం. అదే జ్ఞానసంపాదనకి ప్రేరణ. కాని అది జరగదు. తెలియని దాన్ని తెలివితో బంధించలేం. అది కేవలం ఆత్మసమర్పణతో తెలుసుకోగలం. ఆ సమర్పణభావమే వివేకం. వివేకం వర్తమాన క్షణాల అద్భుతాన్ని గుర్తిస్తుంది. దానికి ఆనందంగా అంకితం అవుతుంది. ఆ ఆనందం అమాయకత్వంతో కూడి ఉంటుంది.

జ్ఞానం అద్భుతమైన ఈ క్షణాన్ని నిరాకరిస్తుంది. జ్ఞానం ప్రతి నిమిషం ఆ క్షణాన్ని వెతుక్కుంటుంది. కాని ఆ క్షణం జ్ఞానికి దొరకదు. అందుకే నిరంతరం మీకు ఆ తెలియనిదాని గురించి భయం. కనుక్కోవాలన్న ప్రయత్నమే తెలియనిదాని గురించి భయం పుట్టిస్తుంది. లేకపోతే మీకు భయం ఉండదు. మీకు ఈ క్షణం ఒక అద్భుతం అని స్పష్టంగా తెలుసు. జ్ఞానం వల్ల ఈ క్షణం గురించి తెలుసుకోలేరు. మన అహానికి తెలుసుకోలేకపోవటమంటే ఏమీ లేదని అర్థం. కాని మన అహంకారం దాన్ని ఒప్పుకోదు. అమాయకత్వం అంటే ఏమీ లేకుండా ఈ క్షణాన్ని ఆస్వాదించడం. వాస్తవం ఒక తెరవని బహుమతి. కాని జ్ఞానం ఆ ఉత్కంఠని దోచుకుంటుంది. జ్ఞానానికి మన అంతరంగాన్ని తెలుసుకోవాలని అర్ధమైతే అంతిమపరిజ్ఞానాన్ని తెలుసుకునే విధానానికి అడ్డుపడదు. జీవితంలో దాగి ఉన్న అద్భుతాల్ని చవి చూసినప్పుడు కాకుండా, కావలసినప్పుడు జ్ఞానాన్ని ఒక పరికరంలా ఉపయోగించాలి.

మనం ఎప్పుడైతే జ్ఞానం జీవితరహస్యాల్ని నిరాకరిస్తుంది అని గ్రహించి, తెలియనిదాని గురించి భయం వల్ల జ్ఞాన సముపార్జన చేస్తున్నామని తెలుసుకుంటే, మనలో వివేకం ప్రవేశిస్తుంది. అదే మనం జీవితానికి అధీనమవటం. దీని వల్ల అమాయకత్వం పుడుతుంది.

సమాజం, పుట్టిన ప్రతి శిశువులో కొన్ని నమ్మకాల్ని, కట్టుబాట్లని ప్రవేశపెడుతుంది. పెంచదంలోనే నమ్మకాల్ని ఆ పసి మనస్సులో నింపుతారు. అసలు నమ్మకం అంటే ఏమిటి? అది ఒక వ్యక్తి గురించి కలిగిన సొంత అభిప్రాయం అని అర్థం. పిల్లల్లో అలాంటి నమ్మకాలు నిండే అవసరంలేదు. వారిని స్వేచ్ఛగా వారి అభిప్రాయాలు ఏర్పరచుకోనివ్వాలి.

జిడ్డు కృష్ణమూర్తిగారు జ్ఞానం ఒక సంప్రదాయం, అది సహజంగా వస్తుంది అని అంటారు. ఆయన ఉద్దేశ్యం ఏమిటి? ఉదాహరణకి, మీరు ఒక హిందూ కుటుంబంలో జన్మిస్తే స్థిరమైన హిందూ సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకుంటారు. మీరు చేసే పనులు మీరు చెప్పే జవాబులు హిందూ సంప్రదాయ గాఢమైన నమ్మకాల, ఆదర్శల, ప్రభావాన్ని చూపిస్తాయి. సచేతనంగా, అచేతనంగా ఆ పద్ధతులకి అలవాటు పడతారు. అచేతనం నుండి వచ్చే జవాబే మీ సహజస్వభావాన్ని తెలియచేస్తుంది. మీ అనుభవాలు ఆ సంప్రదాయం, స్వభావం బట్టి ఉంటాయి యథాతథంగా ఉండవు. అందుకే దేన్ని గురించి యథాతథంగా తెలియదు. మీకు ఉన్న జ్ఞానంతోనే దాన్ని తెలుసుకోగలరు. అందుకే జ్ఞానం ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేదు.

అంతరంగం జ్ఞానంతో నిండిపోతే అనుభవించటానికి వారిలో ఖాళీ ఉండదు. దేన్నెనా ఆ జ్ఞానంతోనే చూసారు. ప్రతీది పాత అనుభవాల్ని లేదా ఏర్పరచుకున్న అనుభూతులని ప్రతిబింబింపచేస్తుంది. వారి భవిష్యత్తులో కూడా నిరంతరంగా సాగిపోయే పాత అనుభవాలు, పాత జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. మీకు పువ్వు పరిమళం తెలుసు, మీకు అలల శబ్దం తెలుసు, ఉదయించే సూర్యుడి అందం తెలుసు, ఇవి సృష్టి అంటే దేనికీ కొనసాగింపు కాదు అని అర్థం చేసుకోండి. ప్రతి నిమిషం దానిలో కొత్తదనం ఉంది. అది తెలుసుకోవడం సాధ్యం కాదు. తరువాత నిమిషంలో ఏం జరుగుతుందో మీకు ఎలా తెలుస్తుంది. ఇది అర్ధమైతే జ్ఞానాన్ని వదిలేయవచ్చు. అప్పుడు ఉండేది ఎఱుక మాత్రమే. ఎఱుక అమాయక వివేకం. అది జ్ఞానం అడ్డురాకుండా అనుభవాన్ని పొందనిస్తుంది. అప్పుడు అంతరుప్రపంచం, బాహ్యప్రపంచం, వాటిని కలిపే అద్భుతరహస్యాల గురించి తెలుసుకోవచ్చు.

జిద్ధు కృష్ణమూర్తిగారు ఇలా అన్నారు, నమ్మకం అనేది సాధ్యపడేవాటిని తోసి పుచ్చి ఒక ప్రత్యేకమైన వ్యాపకంపై మీ మనస్సును ప్రేరేపించటమే. మనస్సు వ్యాపకం కోసం వెతుకుంటుంది. అందుకే నమ్మకం వెంటే ఉంటుంది. జీవితం పూర్తిగా నమ్మకాలపై ఆధారపడుతుంది. అందుకే మనం పని మీద కాకుండా వ్యాపకంలో మునిగిపోతాం. వ్యాపకానికి నమ్మకమనే ఇంధనం కావాలి. అది మధ్యలో ఆగకూడదు. అది ఆగిపోతే మనం కుంగిపోతాం. అవసరమైనప్పుడు పని చేస్తాం. లేకపోతే ఆపేస్తాం. వ్యాపకం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. పని జరిగేది అవగాహన మీద. వ్యవహారం వల్డ నీరసం వస్తుంది. పని శక్తిని ఇస్తుంది, ఉత్సాహపరుస్తుంది. మీకు వ్యవహారం కాదు, పని అవసరం.

నమ్మకం అంటే ఒక దానిపై మీ అవగాహన. అది యథార్థంకాదు. ఒక పరిస్థితిని నలుగురు నాలుగు విధాలుగా అర్థం చేసుకుని నాలుగు నమ్మకాలను ఏర్పరచుకుంటారు. నమ్మకంలో పూర్తి నిజం లేదు. అది ఒక వ్యక్తి అవగాహన మాత్రమే. అమాయకత్వం అవగాహనని తెరచి ఉంచుతుంది. అదే అందులో ఉండే అందం. అమాయకత్వం దేని పైనా ఒక అభిప్రాయానికి వచ్చి దాన్ని మూసేయదు.

జీవన్ముక్తి

ఈ బొమ్మలో ఒక పెదావిడ కనిపిస్తుంది. అదే బొమ్మలో ఒక యువతి ముఖం కూడా కనిపిస్తుంది. పెద్దావిడ ముక్కు, చిన్నామె ఎడమ బుగ్గ, పెద్దామె మూతి, యువతి వేసుకొన్న డ్రెస్ మెడ, పెద్దామె ఎడమ కన్ను చిన్నామె ఎడమ చెవి.

ఈ విధంగా ఆ బొమ్మని ఎన్ని రకాలుగానెనా వివరించవచ్చు. ఒకే వివరణని పట్టుకొని ఉండక పోవటమే అమాయకత్వం. అప్పుడే స్ఫూర్తి సజీవంగా ఉంటుంది.

పరమహంస యోగానంద ఇలా అన్నారు, 'పగలు పిశాచాల ఆట స్థలం', పగలు మనం నిరంతరం మనస్సుని మాటలతో నింపుతాం. మాటలు అనేవి నేర్చుకొనే మార్గానికి అవరోధం కలిగిస్తాయి. ఉదాహరణకి, మీరు నా ముందు కూర్చొని ఉన్నారు. మీలో చాలా మందికి నేను ఏమి చెప్తున్నానో అర్థం కాదు, ఎందుకంటే నేను మీకు తెలియని ఇంగ్లీషులో మాట్లాడుతున్నాను. మీకు బాధగా ఉంది. కాని మీరు అందరిలో అందరి కంటే అదృష్టవంతులు. నా మాటలు మీకు ఏం నేర్పవు. నేను మిమ్మల్ని నిశ్శబ్దంగా ఉంచడానికి మాట్లాడతాను. నేను మాటలు ఆపితే మీరు లోపల మాట్లాడుకుంటారు. అందుకే నేను మాట్హాడతాను. నిశ్శబ్దం నుంచి మీరు చాలా నేర్చుకుంటారు. నిశ్శబ్దంలో అమాయకత్వం ఉంది. మాటలలో తెలివి ఉంది. తెలివి సత్యాన్ని తెలుసుకోలేదు. అమాయకత్వం తెలుసుకుంటుంది.

ఇక్కడ అమాయకంగా కూర్చొని ఉంటే చాలు, అప్పుడు మీరు ఎంతో కొంత పొందుతారు. నా మాటల మధ్యన ఉన్న ఖాళీల్తో నిజమైన సందేశం ఉంది. గురుదేవులు ఒక కావ్యం, జీవంతో ఉన్న కావ్యం. ఆయన వ్యక్తపరచేది జీవంతో నిండి ఉంటుంది. మీరు వినటానికి గురుదేవులు మాట్లాడతారు. ఆయన మాట్లాడుతుంటే అందమైన నిశ్శబ్దం ఉంటుంది. అదే ఆయన మాటల మధ్య అంతర్లీనంగా ఉన్న శక్తి. మీరు మనోవికాసంతో ఉంటే ఆ శక్తి మిమ్మల్ని తాకుతుంది. మాటలు సృష్టించిన ఖాళీలను నిశ్శబ్దం పూరిస్తుంది. నిశ్శబ్దం అంతరంగంలో మార్పుకి అవకాశం ఇస్తుంది. అప్పుడు నిజమైన బోధన సందేశాన్ని పొందుతారు. నిశ్శబ్దంలో మీరు మనోవికాసంతో ఉంటారు. ఆ క్షణాల్లో నేను సులభంగా మీ పద్ధతులు తుడిచేస్తాను. మీరు పూర్తి అమాయకత్వంతో ఉంటారు. దీన్నే నేను జీవన్ముక్తి అంటాను.

నిశ్శబ్దం – నేర్చుకోవటానికి, మరిచిపోవటానికి సరైన ప్రదేశం

అర్థం చేసుకోండి, సంభాషణ అనేది రెండు మేధల మధ్య జరిగేది. సంభాషణతో మీరు నన్ను తప్పగా అర్థం చేసుకోవచ్చు. అదే సంభాషణ రెండు హృదయాల మధ్యన అయితే అది ఒకరిలో ఒకరు ఐక్యమవడమే కాని సంభాషణ కాదు. అది రెండు ఆత్మల సంయోగం. సంభాషణలని మీరు మీలోని మేధతో ఎదుర్కొంటారు. అదే హృదయసంయోగంలో మీరు సూటిగా దీక్షని తీసుకుంటారు. కాని ఆ అనుభవాన్ని పొందుతారు. సంయోగంలో మాటలకి అందని మీ తపనని తృప్తిపరుస్తారు. అదే నా దగ్గర మీకు దొరికేది, దాన్నే మీరు నా నుంచి తీసుకోదగింది.

ధ్యానం అంటే సంయోగాన్ని ప్రారంభించటమే. మీలో అది నిశ్శబ్దాన్ని తెలుసుకోగలగటం. మీ అంతరంగనిశ్శబ్దం మీ ఆలోచనల వల్ల కాని, లేదా మీ అనుభవాలు వల్ల కాని ఏ విధంగా అదుపులోకి రాదో అప్పుడు మీరు అడవులకి వెళ్ళి ఏకాంతంగా ఉండాలనుకుంటారు. బాహ్యనిశ్శబ్దంలో తమ అంతరంగనిశ్శబ్దాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తారు. అది జరిగినప్పుడు మీరు పూర్తి సృష్టితో అనుసంధానంలో ఉంటారు. ఈ నిశ్శబ్దంలో ఏది జరిగినా సృష్టి దాన్ని ధృవీకరిస్తుంది.

చిన్న కథ : చైనాలో ఒక వ్యక్తి బౌద్ధగురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు అతణ్ణి 'నాయనా, నీకు ఏం కావాలి' అని అడుగుతారు. ఆ వ్యక్తి తనకు జ్ఞానోదయం కావాలని కోరుకున్నాడు. గురుదేవులు ఇలా అడిగారు. 'నీలోనే ఆ నిధి ఉంది బయట ఎందుకు వెతుకుతున్నావు?' శిష్యుడు 'అది ఎక్కడ ఉంది?' అని అడిగాడు. గురువుగారు ఇలా అన్నారు. 'నీ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందో అదే నీ నిధి' ఆ క్షణంలో శిష్యుడికి జ్ఞానోదయమైంది.

అంతరంగ నిశ్శబ్దమే నిధి ఉండే స్థలం. దాన్ని కనుగొనడానికి గురువు మీకు సహాయం చేస్తాడు. కాబట్టి, మీకు నేను చెప్పేది అర్ధంకాకపోయినా బాధ పడకండి. అమాయకత్వంతో ఉండి, మాటల మధ్య నిశ్శబంతో కలిసిపోండి. అప్పుడు మరిచిపోవడం, నేర్చుకోదం రెండూ జరిగే విధంగా జరుగుతాయి. ఆ నిశ్శబ్దంలో స్వర్ణం పొందాలన్న కోరిక కాని, నరకం వలన కలిగే భయం కాని, ఇతరులంటే అసూయ కాని, ప్రేమ కాని, బాధ కాని ఉండవు. ప్రతిధ్వనించే అమాయకత్వం గురుదేవులతో మాత్రమే ఉంటుంది. అప్పుడు ప్రత్యక్షంగా అది మీలోనికి పంపబడుతుంది.

అమాయకత్వంతో గ్రహించండి

అమాయకత్వం సున్నితమైన పరిమళం అయితే జ్ఞానం దృఢమైన వడపోత సాధనం. అదే రెండిటికి తేదా. అమాయకత్వమనే పరిమళం మొత్తం ప్రపంచాన్ని మీ దగ్గరకు ఆకర్షిస్తుంది. జ్ఞానం అనే వడపోసే సాధనం మీ దగ్గరకు చాలా వస్తువులని రానీయదు. మిమ్మల్ని జ్ఞానం పట్టుకుంటే మీరు ఎప్పుడూ తొందరలోనే ఉంటారు. మీరు అమాయకత్వంతో ఉన్నప్పుడు ప్రతిక్షణం ఆనందంలో ఉంటారు. మీరు అమాయకమైన మనుష్యులని చూసే వారు ప్రతిక్షనాన్ని సహజంగా, సంపూర్ణంగా ఆస్వాదిస్తారు. అమాయకత్వం ఆ క్షణాన్ని అనుభవిస్తుంది. జ్ఞానం ఆ క్షణాన్ని కోల్పోతుంది. జ్ఞానానికి కేవలం ఉద్దేశం ఉంటుంది. అమాయకత్వం ఉద్దేశరహితంగా ఉంటుంది.

మీ జ్ఞానాన్ని పక్కన పెడితే, మీరు ఈ క్షణాన్ని అనుభవిస్తారు ఇదే వాస్తవం. ఈ కాలం విద్యావ్యవస్థ కేవలం జ్ఞానానికే ప్రాధాన్యత ఇస్తుంది. పాఠశాలలో, కాలేజీలలో జ్ఞానం బోధిస్తున్నారు. తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతున్నారు. అమాయకత్వాన్ని మరిచిపోయేలా చేస్తున్నారు.

ఒక తండ్రి తన సహోద్యోగులకి తన కొడుకుని గర్యంగా పరిచయం చేసాడు. అందరూ ఆ అబ్బాయి చుట్టూ నిల్చొని ఉండగా తండ్రి – "బాబూ నీ వయసెంతో చెప్పమ్మా?" అని అడిగాడు. కొడుకు వెంటనే ఇలా సమాధానం ఇచ్చాడు. "నేను ఇంట్లో ఉన్నప్పుడు నా వయస్సు ఏడు సంవత్సరాలు. నేను బస్సులో వెళ్తున్నప్పుడు నాకు ఐదు ఏళ్ళు." ఈ విధంగా పిల్లకి పెద్దలు నేర్పుతున్నారు. ప్రతి దానిలో ఉపయోగమే చూస్తున్నారు. నీ ఉపయోగాన్ని బట్టి విద్య నీకు విలువ కడుతుంది. కానీ నీవు నీ ఉపయోగంకాదు. నీవు జీవుడికి జీవునికి విలువ కట్టలేం. మనసుకు విలువ కట్టగలం కానీ అది కల్పితం. సమాజం కల్పితాన్ని సృష్టిస్తుంది అదే నీ మనసు. ఆ మనస్సునే కొలబద్ధంగా తీసుకొని నీకు విలువ కడతారు. అందుకే ఈ రోజుల్లో జ్ఞానం ముఖ్యమైంది అనుకుంటారు.

ఒక చిన్న కథ : ఒక ఊళ్ళో నలుగురు స్నేహితులు ఉండేవారు. వారు ఎప్పుడు కలిసి కాలం గడిపేవారు. ముగ్గురు స్నేహితులు బాగా చదువుకున్నారు. నాల్గో వ్యక్తి అంతగా చదువుకోలేదు కాని చాలా తెలివైనవాడు.

ఒక రోజు వారి విద్యలను ప్రదర్శించి డబ్బు సంపాదించడానికి బయలుదేరారు. నాల్గవ స్నేహితునికి ఏమీ రాకపోయినా, వారితో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. మొదటి స్నేహితుడు నాల్గవ స్నేహితునితో 'నీకు ఏ విద్య రాదు, నీవు మాతో వస్తే అనవసరంగా మా డబ్బు నీతో పంచుకోవాలి' అన్నాడు. రెండవ స్నేహితుడు కూడ అతనికి వంతపాడి నాల్దవ వాడిని ఉండి పొమ్మన్నాడు. మూడవ స్నేహితుడు జాలితో ఇలా అన్నాడు. 'మనం అందరం కలిసి పెరిగాం. అతణ్ణి ఉండి పొమ్మనడం భావ్యం కాదు. మనతో వస్తాడు' అన్నాడు. ఆ విధంగా నలుగురు స్నేహితులూ కలిసి బయలుదేరారు. వారు ఒక దట్టమైన అడవిలో వెళ్తున్నారు. వారు క్రూరజంతువులను చూసారు.

ఒక రోజు దారిలో ఎముకల గుట్టని చూసారు. మనం నేర్చుకున్న విద్యతో ఈ జంతువుని బతికిద్దాం మన విద్యకిది ఒక పరీక్ష అన్నాడు వారిలో ఒకడు. మిగతా స్నేహితులిద్దరూ అందుకు ఒప్పుకున్నారు. నాల్గవ స్నేహితుడు ఇలా అన్నాడు. ఈ ఎముకల్ని చూస్తుంటే అది చాలా పెద్ద జంతువులా ఉంది. కాబట్టి దాన్ని తిరిగి బ్రతికించవద్దు," అన్నాడు. మిగతా ముగ్గురు అతణ్ణి చూసినవిఁ అతణ్ణి పిరికివాడుగా ఎంచి మాకు నీకు జ్ఞానం ఉంటే ఇలా భయపడవు. మాటాడకుండా మేం చేసేది చూడు, అని చెప్పారు.

ముగ్గురూ వారు నేర్చుకున్న విద్యను ప్రయోగించారు. మొదటివాడు ఆ ఎముకల్ని క్రమంలో పెట్టి ఒక జంతువు ఆకారాన్ని తయారుచేసాడు. అతడు కొన్ని మంత్రాలు చదివి దాని మీద పవితమైన నీటిని చిలకరించగానే, అది ఆ జంతువు అస్థిపంజరంగా మారింది. రెండవ స్నేహితుడు వచ్చి మరి కొన్ని మంత్రాలు వల్లించి నీళ్ళు చల్లగా ఆ అస్థిపంజరం కండరాలు రక్త మాంసాలతో నిండి చర్మంచే కప్పిన ఒక జీవంలేని సింహం ఆకృతిని పొందింది. ఆ స్నేహితులకి చాలా ఆశ్చర్యం కలిగింది. మూడవ స్నేహితుడు ముందుకు వచ్చి దానికి ప్రాణం పోస్తానంటాడు. నాల్గవ స్నేహితుడు మరొకసారి వారిని వారించాడు. ఆ ముగ్గురూ అతణ్ణి మళ్ళీ హేళన చేసారు. నాల్గవాడు నెమ్మదిగా ఒక చెట్టుపై ఎక్కి కూర్చున్నాడు. మూడవవాడు ఆ కళేబరానికి ప్రాణం పోయగానే ఆ సింహం జీవంతో లేచి నిలబడింది. గర్జిస్తూ ఆ ముగ్గురి స్నేహితుల పైనా దూకింది. వారు నాల్గవ స్నేహితుడు ఎక్కడున్నాడని చూసారు. అతడు చెట్టుపై నుండి వీరినే చూస్తున్నాడు. సింహం ఆ ముగ్గురు స్నేహితుల్నీ చం పేసింది.

కాబట్టి జ్ఞానం ఒక పరికరం మాత్రమే. అది మనలో వివేకాన్ని కలిగించదు. దాన్ని మనకి అవసరమైనప్పుడు ఉపయోగిస్తే అది అద్భుతాల్ని చేస్తుంది. తప్పేమిటంటే మనం పూర్తిగా జ్ఞానానికి లొంగిపోతాం. కాని అమాయకత్వం స్వచ్ఛమైన వివేకానికి దారి చూపిస్తుంది.

ఇంకొక చిన్న కథ : ఒక చిన్న పల్లెటూరులో ఒక మర్రిచెట్టు ఉంది. దాని నీడన ఒక ఆవు, ఒక అలసిపోయిన కుక్క ఉన్నాయి. అక్కడే ఒక వృద్ధుడు పొడవైన గడ్డంతో, ఆ చెట్టు మొదలు దగ్గర ఆనుకొని, కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నాడు. ఆ చెట్టు రెండు రాజ్యాల సరిహద్దుపై ఉంది. ఒక బాటసారి ఆ మార్గంలో వెళ్తూ ఇలా అన్నాడు. "నీ మారువేషం బావుంది. కాని అది పని చేయదు. నేను ఆ మధ్యన ఒక బంగారు గొలుసు దొంగిలించినప్పుడు ఇలాగే మారువేషం వేసుకున్నాను. ఒక కావలివాడు నన్ను వెతికి ఆ గొలుసు తీసుకొని నన్ను బాగా కొట్టాడు. సరే నీవు ఈ మారువేషం వల్ల తప్పించుకుంటావేమో చూద్దాం" అన్నాడు.

ఆ తర్వాత ఒకరు గుర్రంపై స్వారీచేస్తూ వచ్చాడు. అతడు ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తున్న గూఢచారి. అతడు వృద్ధుణ్ణి చూసి మనస్సులో ఇలా అనుకున్నాడు. "ఇతడు ఏ ఉద్దేశ్యంతో ఇక్కడ ఉన్నాడో ఎవరికి తెలుసు. ఇతడు కూడ నాలా ఒక గూఢచారి అయివుండవచ్చు, ఏమో" అనుకుంటూ అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోయాడు.

ఒక గంట తర్వాత పూర్తిగా తాగిన ఒక మనిషి తూలుతూ వచ్చి చెట్టుకు అనుకుని కూర్చున్న వృద్ధుడితో, "ఇవాళ నీవు ఎంత తాగావు? నా వంక చూడు నేను ఒక కుండని ఖాళీ చేసాను. అయినా ఎంత స్తిరంగా నడుస్తున్నానో చూశావా, అప్పుడప్పుడు తల కొంచెం బరువుగా ఉంది" అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

కొంత సేపటికి చీకటి పడింది. చుట్టూ ప్రశాంతంగా ఉంది. ఆ దారిలో నాల్గవ మనిషి వచ్చి, ఆ వృద్ధుణ్ణి చూసి అతని దగ్గరకి వెళ్ళి నమస్కరించాడు. ఆ వృద్ధుడితో 'నేను చాలా అదృష్టవంతుడిని. మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది,' అని అతడి మీద పాకుతున్న చీమల్ని పురుగుల్ని తరిమే ప్రయత్నంలో ఒక పెద్ద ఆకు తీసుకుని విసురుతున్నాడు.

ఆ యోగి సమాధి నుండి కళ్ళు తెరిచి చిరునవ్వుతో తనకు విసురుతున్న మనిషిని చూసాడు. అప్పుడు ఆ యువకుడు మళ్ళీ ఇలా అన్నాడు. 'ఓ మహాత్మా! మీరు నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి దగ్గర్లో ఉన్న మా యింట్లో ఈ రాత్రి గడిపితే నేను మీ ఆశీర్వాదం పొందానని అనుకుంటాను' అనగానే, ఆ యోగి 'అదే భగవంతుడి కోరిక అయితే అలాగే పద' అని అతని వెంట వెళ్ళాడు.

తెలివితో పోగొట్టుకొనేవాటిని అమాయకత్వం గ్రహిస్తుంది. అమాయకత్వం జరిగినవి వదిలేస్తుంది. కాని సత్యాన్ని గ్రహిస్తుంది. అమాయకత్వంతో వివేకం కలిసిఉండడం అనేది చాలా అరుదైన విషయం. జ్ఞానాన్ని పక్కకు పెట్టేది వివేకంతో కూడిన అమాయకత్వం. మీరు జ్ఞానాన్ని సమకూర్చుకోవద్దని నేను అనను. జ్ఞానం అమాయకత్వానికి ప్రత్యామ్నాయం కాదని అర్థం చేసుకోండి.

మీరు చదువుకోని గ్రామీణప్రజలను చూస్తే వారు స్వచ్ఛమైన వివేకాన్ని ప్రదర్శిస్తారు. అందుకే మీరు ఎక్కడ ఆగిపోతారో గ్రామీణ వ్యక్తి వెంటనే దాన్ని సులభంగా చేయగలుగుతాడు. అమాయకమైన వివేకానికి ఆ సామర్థ్యం ఉంది. అప్పుడు క్లిష్టమైనదాన్ని అర్థం చేసుకోవటం కష్టం కాదు. మీరు మీ మనస్సుతో విశ్లేషణాత్మకంగా వేరొక విధంగా ఆలోచిస్తే అది మీకు వెంటనే అర్ధమవుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి విమానశాస్త్రాన్ని సులభంగా అర్థం చేసుకోగలదు, కాని సరళమైన బౌద్ధ సూత్రాలు అర్ధమవుతాయా? బుద్ధుడు బోధించినవి బౌద్ధసూత్రాలు అవి మీ ఉనికిని తెలుపుతాయి. మీరు ఎవరు అన్నది తెలియజేస్తాయి, అవి మీ గురించి తప్పితే వేటి గురించి మీకు సలహాలు ఇవ్వవు. మీ గురించి తెలుసుకోవటానికి సహకరిస్తాయి. చాలా సాధారణంగా సూటిగా ఉంటాయి.

ఒక వ్యక్తి మేధను ఎలా పదును పెట్టాలో అన్న దాని మీదే అన్ని విశ్వవిద్యాలయాలూ పని చేస్తున్నాయి. వారు మనల్ని సమాజానికి పనికి వచ్చేలాగా, ఉపయోగకరంగా తయారుచేస్తారు. పనికివచ్చేలా ఉండడం తప్పుకాదు. అవి నేర్చుకోవటంలో మనం విశ్వాన్ని సృష్టితోపాటు

అమాయకతాన్ని మరిచిపోతున్నాం. సృష్టితో పాటు ఏకకాలంలో కలిసి ఉండలేక పోతున్నాం. విశ్వప్రణాళిక ప్రకారం నడచుకోవడం లేదు.

ఉండడం, చేయడం, పొందడం – అనేవి మూడు స్తితులు. చేయడం నుంచి పొందడానికి మనం నిరంతరం ఏదో ఒకటి చేస్తాం. నేర్చుకోవడం, ఆ నేర్చుకున్నది ఉపయోగిస్తే మనకు కావలసిన డబ్బు బాంధవ్యాలు, సుఖాలు పొందగలుగుతాం. అంత కంటే మెరుగైంది పొందాలని ఇంకా పని చేస్తుంటాం. మనం నిరంతరం చేయటం, పొందటంలోనే ఉండిపోతాం. మనలో మనం ఉండడం మరిచిపోతాం. మన నిజమైన విశ్రాంతి మనలో ఉందడంలోనే ఉంది. అందువల్ల మనం ఎంత చేసినా, పొందినా విశ్రాంతిని వెదుకుతూనే ఉంటాం. ఈ అనుభూతే మన ఉనికి పిలుపు.

మన ఉనికి నుంచి చేయడం జరిగితే పొందడానికి నిరంతరం పని చేయనవసరంలేదు. ఉనికి ప్రేరణ వల్ల చెయ్యడంలో నాణ్యత ఉంటే పొందడం ఒక ఉపఫలం మాత్రమే. ఇదే సృష్టిరహస్యం. విశ్వవిద్యాలయానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది, వ్యక్తికీ, సమాజానికి, మొత్తం విశ్వానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మనం ఎప్పుడూ మొత్తం గురించే ఆలోచించాలి.

పూర్వం భారతీయవిశ్వవిద్యాలయాలైన తక్షశిల, నలందాలలో విద్యార్థులు అంతరంగస్థాయిలోనే శిక్షణ పొందేవారు. భారతదేశం ఎప్పుడూ వ్యక్తి అంతరంగపు అమాయకత్వాన్ని పెంపొందించడం మీద తమ దృష్టిని కేంద్రీకరించింది. అది మనలో ఆత్మస్థైర్యాన్నిపెంచుతుంది. ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు.

పరమహంస యోగానంద ఆధ్యాత్మికత గురించి చాలా అందంగా వివరిస్తారు. ఆయన ఇలా అంటారు. "మన శరీరంలో లక్ష కొలది కణాలున్నాయి. ప్రతికణం ఒక తెలివైన వ్యక్తితో సమానం. ప్రతికణంలో డి.ఎన్.ఏ. అనే పదార్దంతో ఒక కొత్త శరీరం మేధను పుట్టించడానికి అవసరమైన సమాచారం, వివేకం ఉన్నాయి. నిద్రాణమై ఆ వివేకాన్ని లేపితే బుద్ధి సక్రమార్గం పట్టకుండా ఆనందంలో ఉంటుంది.

డి.ఎన్.ఏ.అనేది మనిషికి వివేకం కలిగించే పదార్ధం. ఆయన ఇంకా ఇలా అంటారు, ఆధ్యాత్మికవిద్య వల్ల ప్రాణం అనే విద్యుత్ వెన్నెముక ద్వారా మేధలో ప్రవేశించి, కణాలకి అయస్కాంతత్వం కలిగిస్తుంది. ఒక వ్యక్తి దీని వల్ల పరిణామాత్మకమైన వికాసాన్ని పొందుతాడు. ఈ దివ్యమైన అయస్కాంతత్వంతో ప్రతికణం జీవంతో ఉన్న మెదడులా ప్రతి జ్ఞానబిందువును గ్రహిస్తుంది. ఇలా జీవితంలో మేల్కొన్న కణాలవల్ల ఒక వ్యక్తి మేధాశక్తి ఎన్నో రెట్లు పెరిగి అన్ని రకాల జ్ఞానాన్ని సులభంగా అర్థంచేసుకునేలా చేస్తుంది అది అంతా ఆధ్యాత్మికవిద్య ప్రభావం.

గ్రీకు రాజు అలెగ్జాండరు మూడు వంతుల ప్రపంచాన్ని జయించి, ఆసియా ఖండాన్ని జయించాలని బయలుదేరాడు. ఆయన సింధునది తీరాన స్థిరపడి, భారతదేశాన్ని జయించాలని అనుకున్నాడు. అదే తీరాన ఒక సన్నాసి ఉండేవాడు. అలెగ్జాండరు అతని సైన్యం ఆ తీరం వెంబడి వెళ్ళేటప్పుడు ఆ సన్న్యాసి ధ్యానంలో ఉండి రాజు వచ్చినప్పుడు నిలబడి నమస్కరించలేదు. అలెగ్జాండరు అవమానంతో 'నీకు ఎంత ధైర్యం నాకు నమస్కరించాలని తెలియదా?' అని అరచి, సన్యాసి తల నరకాలని కత్తి తీసాడు.

సన్నాసి రాజుకేసి చూసి నవ్వాడు. అలెగ్జాండరు ఆశ్చర్యంతో "నేను నిన్ను చంపబోతుంటే ఎలా నవ్వుతున్నావు?" అన్నాడు. అందుకు సన్నాసి "నీవు ఎవరిని చంపాలనుకుంటున్నావు? నేను చంపబడను. నేను శాశ్వతం, నాశనం చేయబడను. ఆయుధాలు నన్ను ఏమీ చేయలేవు. అగ్ని నన్ను దహించదు. నీరు నన్ను తడపలేదు. ఈ ఆత్మను గాలి ఎండించలేదు" అని భగవద్గీతలోని విషయాన్ని తెలియజేసాడు. అలెగ్జాండరు తన కత్తిని జారవిడిచి, సన్న్యాసికి నమస్కరించి ఇలా అన్నాడు. "భారతదేశంలో మహాపురుషులు ఉన్నారు. వారు చావుకి భయపడరు. అలాంటి గొప్ప దేశానికి ఇదే నా ప్రణామాలు" అని భారతదేశం నుండి తిరిగి వెళ్ళిపోయాడు.

భగవద్గీత మహాభారతంలో భగవానుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 700 శ్లోకాల సంపుటి. పూర్వకాలంలో విశ్వవిద్యాలయాల శిక్షణ వల్ల ఒక వ్యక్తి అత్యంత శ్రేష్ఠమైన జ్ఞానాన్ని పొంది మనోవికాసం కలిగి తమ అమాయకత్వాన్ని నిలుపుకునేవారు. ప్రతీ విద్యార్థి ఋషిలాగా మంచి గుణగణాలను అలవరచుకొనేవాడు. ఋషికి బయటి ప్రపంచజ్ఞానం కలిగి అంతరంగంగా అత్యంత అమాయకత్వంతో ఉండగలడు.

బుద్ధుడు 'ధమ్మపదం' అనే తన బోధనలలో ఇలా చెప్తాడు, భగవంతుడు కూడా ఋషి అంటే అసూయపడతాడు. ఎవరి ఇంద్రియాలు శిక్షణ పొందిన గుర్రాల వలె స్వాధీనంలో ఉంటాయో, ఎవరికి గర్వం ఉండదో, ఎవరు గర్వం నుండి విముక్తులౌతారో, భూదేవిలా సహనం కలిగి ఇంటి గడపలా నిలచి ఉంటారో, వారు బురద లేని స్వచ్ఛమైన సరస్సులా చావుబతుకుల చక్రంలో పడకుండా ఉంటారు. జ్ఞానికి బాహ్యప్రపంచంలో ఏది చెయ్యడానికైనా అర్హత ఉంటుంది.

పురాతనమైన గురుకులపద్ధతిలో నేర్చుకోవడం వేరే విధంగా ఉండేది. సృజనాత్మకమైన తెలివి. లోతైన చేతనస్థితి నుండి పుట్టేది. వారు సూటిగా ఉనికినే సంబోధించేవారు. చేయడం, పొందడం అనేవి పూర్తిగా వేరే అర్థం కలిగి ఉండేవి.

ఒక చిన్న కథ: మందబుద్ధి గల ఒక అబ్బాయిని అతని తండ్రి తమ ఊరిలోని సంస్కృత పాఠశాలకి తీసుకొని వెళ్ళాడు. ఆ ఊరిలోని పిల్లలందరు ఆ పాఠశాలోనే చదువుకునే వారు. తండ్రి ఉపాధ్యాయునితో, "నా కొడుకు తెలివితక్కువవాడు. మా అబ్బాయిని చివర వరుసలో కూర్చోడానికి అనుమతి ఇవ్వండి. చదువుల తల్లి సరస్వతీ దేవి నివసించే ఈ వాతావరణంలో ఉంటాడు. మీరు జాలి కరుణ కలిగినవారని తెలుసు, మావాడికి మార్గం చూపించండి. అదృష్టం ఉంటే ఏదైనా నేర్చుకుంటాడు" అని వేడుకున్నాడు.

హెందవ సంప్రదాయంలో సరస్వతీదేవి విద్యకు అధిదేవత. ఆ ఉపాధ్యాయుడు, ఆ పిల్లవాడిని పాఠశాలలో చేర్చుకోడానికి ఒప్పుకున్నాడు. ఆ అబ్బాయి ప్రతి రోజూ ఎవరూ రాక ముందే వెళ్ళి తరగతి తుడిచి, అలికి, ఉపాధ్యాయుని బల్ల సరిచేసి కుర్చీ వేసి తాను గది మూలకి వెళ్ళి పాఠం వినడానికి శ్రద్దగా కూర్చునేవాడు. పాఠాల వల్ల ఆ అబ్బాయి ఏమైనా నేర్చుకుంటాడని ఎవరూ అనుకోలేదు.

ఒక రోజున అతడు నమ్రుతతో ఉపాధ్యాయుని ఇలా అడిగాడు. "అయ్యా! మీరు నాకు ఎప్పుడు ఉపదేశిస్తారు? నేను ఎప్పుడు జ్ఞానాన్ని పొందుతాను?"

'ఇదుగో, ఇప్పుడే అని ఉపాధ్యాయుడు ఆ అబ్బాయిని ఆపకుండా, 'అహం బ్రహ్మాస్మి' అని బిగ్గరగా కాని, తనలో కాని చెప్పమన్నాడు. ఆ అబ్బాయి, ఆ వాక్యాన్ని పట్టుదలగా, ఉత్సాహంగా అర్థం గురించి పట్టించుకోకుండా, నేర్చుకున్నాడు. ఉపాధ్యాయుడు కూడా అతనికి ఆ వాక్యార్థాన్ని బోధించలేదు. ఆయనకది అవసరమనిపించలేదు.

ఆ విద్యార్థి ఇంటిలో 'అహం బ్రహ్మాస్మి' అని వల్లె వేయడం మొదలు పెట్టాడు. "నీకు ఆ వాక్యం అర్థం తెలుసా?" అని తండ్రి కుమారుని అడిగాడు, ఆ పిల్లవాడు కళ్ళు పెద్దవి చేసి తండ్రికేసి చూస్తూ "ఆ మాటలకి అర్థం ఉంటుందా?" అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసాడు. తండ్రి ఇలా చెప్పాడు. 'నేను ఆది' అన్నది దాని అర్ధం. ఆ పిల్లవాడు బాబాయి ఇంటికి వెళ్ళి 'అహం బ్రహ్మాస్మి' అది కాదు' అర్ధం 'నేను బ్రహ్మను' అని చెప్పాడు. ఆ పిల్లవాడికి ఆశ్చర్యం కలిగింది. కానీ ఏమీ మాట్లాడలేదు. ఇంటికెళ్ళే దారిలో 'అహం బ్రహ్మాస్మి' అంటే బాబాయి పరమాత్మ అని అర్ధం అనుకున్నాడు. అదే దారిలో వెళుతున్న ఆ ఊరి పెద్ద ఆ పిల్లవాడి మాటలు విని 'బాబూ! ఆ మాటలకి మీ బాబాయి పరమాత్మ అని అర్ధం కాదు 'నేను బ్రహ్మను' అని అర్ధం చెప్పాడు. ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. ఒక పదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయా? నాన్న, బాబాయి, ఊరి పెద్ద పరమాత్మలు. అతడి తల తిరిగినట్లనిపించి, ఒక పెద్ద రాతి మీద కూర్చున్నాడు. ఆ పదాల అర్ధం తెలుసుకుందామని ఆ రెండు పదాలను చాలా సార్లు వల్లె వేయటం మొదలు పెట్టాడు.

సూర్యాస్తమయం అయింది. చీకటి పడింది. చంద్రోదయమైంది. ఆ పిల్లవాడు వాటి అసలు అర్థం తెలుసుకోడానికి 'అహం బ్రహ్మాస్మి' అని అంటూనే ఉన్నాడు. తెల్లవారే సరికి, తను కూడా, తండ్రి, బాబాయి, ఊరి పెద్దలా, పరమాత్మనేనని తెలుసుకున్నాడు. 'ప్రతి మనిషి పరమాత్మే' అని తెలుసుకున్నాడు. ఈ విధంగా ఆ పిల్లవాడికి జ్ఞానోదయమైంది.

జీవిత ద్వారాల్ని తెరిచే అమాయకత్వం

అర్థం చేసుకోండి. ఏ క్షణాన ఆ అబ్బాయికి ఏమీ తెలియదని అర్థమైందో, అతనిలో మార్పు మొదలైంది. అజ్ఞానం అమాయకత్వంతో వెతుకుతుంది. మీకు ఎప్పుడైతే తెలియదు అని తెలియదో అదే అజ్ఞానం. మీకు తెలియదు అని తెలిసే అది అమాయకత్వం. అప్పుడు మీలో తెలియడం ఆరంభమౌతుంది. తెలుసుకొనేటప్పుడు జ్ఞానాన్ని సరిచూసుకోవాలి. తెలుసుకోవడానికి, జ్ఞానానికి తేడా ఉంది. తెలుసుకోవడం అమాయకత్వం. తెలుసుకోవడం మీరు అర్థంచేసుకున్న అసలైన అనుభవం. అప్పు తెచ్చుకున్నది జ్ఞానం. అది మీరు అనుభవించనిది. మీది కానిది. అది మీలో కొన్ని మాటల సంపుటి మాత్రమే.

ఒక వ్యక్తి ఏదో ఒకటి చదువుకుంటూ సంతోషపడగలదు. కేవలం చదవటం వల్ల వినోదం కలుగుతుంది. కాని జ్ఞానోదయం కాదు. వినోదానికి, జ్ఞానోదయానికి తేడా ఉంది. కొన్ని మంచి పుస్తకాలు చదివి ఆనందించటం, జ్ఞానోదయం పొందటం కాదు. అర్థం చేసుకోండి. ఏ పుస్తకాలు మీ తర్కానికి పదును పెడతాయో అవి మీకు తెలుసు అన్న భావన కలిగిస్తాయి. అప్పుడు మొదలవుతుంది అసలు సమస్య. ప్రతి పని ఒక లోతైన అనుభవం కలిగేట్టు చేయండి. అప్పుడు మీరు ఒక నిరాడంబరమైన వ్యక్తి. నిరాడంబరత్వం మిమ్మల్ని తేలిక చేసి ఇంకా నేర్చుకోడానికి సహాయపడుతుంది. అది కేవలం అమాయకత్వానికి తోడ్పడుతుంది.

అమాయకత్వం దేన్ని గ్రహిస్తుందో, దాన్ని వ్యక్తం చేయలేదు. ఎందుకంటే అది మాటల కందని భావం. కాని ఆ భావం కళ్ళలో కనిపిస్తుంది. కళ్ళు ఆత్మకి కిటికీలు. అందుకే మీరు జ్ఞానుల కళ్ళల్లోకి చూసినప్పుడు ఒక మహాసముద్రాన్ని చూసినట్టు అనిపిస్తుంది. వారి కళ్ళు కాంతిని ప్రసరిస్తాయి. అది బంధించబడదు. పాదాన్ని చెప్పుపై నుండి ఎలా గోకలేమో అలా వారి కంటి తేజస్సును వివరించలేం.

అర్ధం చేసుకోండి; అమాయకత్వం పోయినందుకు ఆధునికతను నిందించలేం. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. నేను కాలస్వరూపుడను. శ్రీకృష్ణుని మాటల్ని బట్టి ఆధునికత కూడా దివ్యమైన సృష్టి ఆటలో ఒక భాగమే, మనిషి ఆధునికతని సరైన పద్దతిలో అర్థం చేసుకోవాలి. దాన్ని పూర్తిగా అనాది నుండి వచ్చే పద్ధతుల బదులుగా అలవరచుకోకూడదు.

అమాయకత్వంతో ఉండండి

మీరు అమాయకత్వంతో ఉన్నప్పుడు ప్రకృతి ఏం నేర్చాలన్నా చైతన్యస్థితితో ఉంటారు. మీరు ముడుచుకుపోతే మీ చుట్టూ ఒక గోడ ఉన్నట్టుగా ఉండి, తాజా గాలి లోనికి రాలేదు. అది మిమ్మల్ని తాకదు. అదే విధంగా మీరు బయటకు వెళ్ళి ఆ గాలిని తాకలేరు.

చైతన్యస్థితిలో ఉన్నప్పుడు గోడ కూలిపోయి చల్లని గాలి లోనికి ప్రవేశించి మీలో ఉన్న మిమ్మల్ని తాకుతూ చైతన్యస్థితి ప్రతిదీ మిమ్మల్ని తాకేలా చేస్తుంది. మీరు చైతన్యస్థితిలో ఉన్నప్పుడు విశ్వచేతన మీ దగ్గరకి వస్తుంది.

చైతన్యస్థితిలో ఉండడం లోపం కాదు. మీ చుట్టూ ఉన్న గోడని పగలగొట్టినప్పుడు మీకు ఏ ప్రమాదంరాదు. ఆ గోడను భయం చేత కట్టుకొన్నారు. మీ నిజతత్వమే చైతన్యంలో ఉండటం. మీ చేతనస్థితిని విశానికి తెలియజేయడానికి భయపడతారు. మీ లోతైన మనసులో మీకు తెలుసు ఈ విషయం మీరు చేతనస్థితిలో ఉంటే పూర్తిగా అమాయకత్వంలో ఉండిపోతారు. అందుకే మీ అంతరంగ తలుపులను మూసివేసారు. కాని అదే గాలి ప్రవహించదం వల్ల ఉక్కిరిబిక్కిరవుతారు. అవే ఆలోచనలు, అవే పద్దతులు మనసులో మెదులుతూ ఉంటాయి. అలాంటప్పుడు గోడ అవసరమేమిటి. ఆ గోడ పగలగొట్టినపుడు మిమ్మల్ని ఏదీ వదిలిపెట్టిపోదు. ఒక నూతనమైన జీవితాన్ని పొందుతారని తెలుసుకుంటారు.

ఒక సాయంత్రం ఇద్దరు జ్యోతిష్కులు కలిసారు. ఒక జ్యోతిష్కుడు ఇలా అన్నాడు. ఎంత అందమైన సాయంకాలం. నేను ఎప్పుడూ చూడలేదని. ఇంకొక జ్యోతిష్కుడు ఇలా సమాధానం చెప్పాడు. నిజమే నాకు 2070 నాటి సాయంత్రం గుర్తుకు వచ్చింది.

మీరు చేతనస్థితిలో ఉంటే మీ ఉనికి ప్రతిదాన్ని అనుభవిస్తుంది. లేకపోతే అది మేధ కలిగించిన అనుభవం అవుతుంది. ఉనికి ఒక కవిత్వం. మేధ సాహిత్యం. కవిత్వమే జీవితం.

ఒక రాత్రి భార్య తన భర్త ఊయల దగ్గర నిలబడి తమ పాపను చూడడం గమనించింది. అతని ముఖంలో అనేకభావాలు కనిపించాయి. అపనమ్మకం, ఆశ్చర్యం, అనుమానం, వినయం, ఇంకా ఎన్నో ఇతర భావాలు. భార్య నెమ్మదిగా భర్త దగ్గరకు వెళ్ళి భుజం మీద ప్రేమగా చేయి వేసి 'మీ ఆలోచనలకు నా జోహార్లు' అంది.

భర్త ఇలా అన్నాడు ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. కేవలం 45 రూపాయలకే ఈ ఊయలను ఎవరు తయారుచేసారో.

కాబట్టి మీ మెదడుతో మీరు చేతనస్థితిలో ఉండలేరు. మీరు చేతనలో లేనప్పుడు మీరు మీ ఇంటి పెద్ద గోడ వెనుక కూర్చుని ఉన్నారన్నమాట. జీవితం ఇంకా మొదలవలేదు. జీవితం చేతనస్థితితోనే ప్రారంభమౌతుంది.

చేతనస్థితిలో ఉంటే మీరు సత్యం వైపు వేరే మార్గంలో వెళ్ళగలరు. అది ఆనందమైన మార్ధం. ఎందుకంటే మీరు ప్రకృతి నుండి సూటిగా గ్రహిస్తున్నారు. మీరు చేతనను గ్రహించే స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రకృతి మీకు ఇవ్వగలుగుతుంది. ప్రకృతికి సొంత నియమాలు ఉన్నాయి. జ్ఞానోదయమైన గురువులకు వారి సొంత నీతిసూత్రాలు ఉంటాయి. చేతనలో ఉంటే వాటిజల్లు మీ మీద కురుస్తుంది. మీ చుట్టూ గోడ ఉంటే అది నీతి సూతాలకు లోపలకు చొచ్చుకుపోయే అనుమతి లేదు. అందుకే గోడ పగిలేంత వరకు ఎదురుచూస్తారు.

మీరు చేతనలో ఉంటే ప్రకృతికి 'ఔను' అని చెప్తున్నట్లు. ప్రకృతి ఒక గొప్ప అద్భుతం. మనకు బోధించే శాశ్వతమైన గురువు. మీరు ప్రకృతికి 'ఔను' అని అంటే మీ శక్తి ఒక కొత్త దిశలో ప్రయాణిస్తుంది. తల నుండి హృదయం వైపు మీరా ప్రకృతి నుండి బోధనలు స్వీకరిస్తారు. మీరు ముందు చెప్పిన 'కాదు' అని చెప్పినవన్నీ 'అవును' గా మారతాయి. అప్పుడు ప్రపంచం, మీ ఆలోచనలో ఉన్నట్లు కాకుండా కొత్తగా కన్పిస్తుంది.

ఒకసారి మీరు అవును అని చెప్పడం మొదలుపెడితే మీరు ప్రేమను తెలియజేసారు. అదే మీ హృదయభాష. తర్కంతో ప్రేమను తెలుసుకోలేం. ప్రేమను ఇంకొకరితో 'అవును' అనడంలో తెలుసుకుంటాం. ఇంకొకరిని ఉపయోగించుకోవడానికి కాకుండా కేవలం ప్రేమకోసం ఆహ్వానించడం వల్లనే సాధ్యమౌతుంది. అది వారి మీద ఉన్న గాఢమైన నమ్మకం వల్ల తెలుస్తుంది. మీరు చేతనలో ఉంటే మీకు ఇతరుల మీద గొప్ప నమ్మకం ఉంటుంది.

చాలామంది నన్ను అడుగుతుంటారు, మీ సమక్షంలో మేం ఎలా ఉండాలి అని. మీరు అమాయకత్వంలో పూర్తి చేతనస్థితిలో ఉండండి. మీరు చేతనస్థితిలో ఉంటే మీ ఉనికి నేరుగా సత్యాన్ని గ్రహిస్తుంది. గురువు సృష్టికి స్వచ్చమైన ప్రతిరూపం. ఆయనకు అనుమతిస్తే ప్రకృతిని మీలో ప్రవేశించదానికి అనుమతించినట్లు. ప్రకృతి ప్రవేశించినప్పుడు మీ ఉనికిలో సత్యం ముద్రితమవుతుంది. గురుదేవుల దర్శనంతో ఆ ముద్ర గాఢమౌతుంది. గురువు బోధనల కన్నా ఈ ముద్దే గొప్పది.

బుద్ధుడి శిష్యుడు ఒకసారి ఇలా అన్నాడు. గురుదేవా, ఈ ప్రపంచం శాశ్వతమా! కాదా! అది పరిమితమా! అనంతమా! ఆత్మ శరీరం ఒకటా! వేరా! అన్న మా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేదు.

బుద్ధుడు అతడి వంక చూసి ఇలా అన్నాడు, నేను ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తానని మీకు ప్రమాణం చేసానా? శిష్యుడు 'లేదు' అన్నాడు. అప్పుడు మళ్ళీ ఇలా అన్నాడు. 'గుండెలో బాణం గుచ్చుకున్న ఒక మనిషి ఉన్నాదనుకో, అతని గుండెలో నుంచి బాణం బయటకు తీయబోతున్నప్పుడు అతడు నిన్ను ఆగమని నా మీద బాణం వేసిన మనిషి కులం, అతని ఎత్తు, బరువు, అతని కుటుంబ వివరాలు, అతను ఎక్కడి నుండి వచ్చాడు, ఆ బాణం ఏ రకమైన కర్రతో చేసారని చెప్పే వరకు, నిన్ను ఆ బాణం తీయడానికి ఒప్పుకోకపోతే, ఆ వ్యక్తి గురించి నువ్వు ఏమనుకుంటావు?'

శిష్యుడు సిగ్గుతో ఇలా అన్నాడు. 'గురువుగారూ! అతడు ఒక మూర్ఖుడు. అతడు అడిగే ప్రశ్నలకి, ఆ బాణానికి ఏమిటి సంబంధం? సమాధానాలు తెలుసుకునే లోపల అతను చనిపోతాడు'.

బుద్ధుడు అన్నాడు, నీవు చెప్పింది నిజం. అలాగే నేను కూడా ప్రపంచం శాశ్వతమా, అది పరిమితమైనదా లేక అనంతమా, శరీరం ఆత్మ ఒకటేనా వేరా అనే వాటి గురించి బోధించను. ఆ బాణాన్ని వెంటనే తీసేయి అని చెప్తాను. ఎందుచేతనంటే నీ బాధకి కారణం అదే అజ్ఞానం.

అర్థం చేసుకోండి, ఒక గురువు మీకు ఆధ్యాత్మికత బోధించలేరు. కాని మీరు చైతన్యంతో ఆయన మీద నమ్మకం ఉంచితే నేర్చుకోగలరు. ఆధ్యాత్మికతకి మాటల అవసరంలేదు, అది ఒక అనుభవం. అది మీరు గురుదేవుల శారీరకభాషని చూసి నేర్చుకోవాలి. జ్ఞానోదయకాంతిని చూసి దాన్ని పట్టుకోవచ్చు.

మీరు ఓర్పు లేకుండా ప్రశ్నిస్తుంటే, ఆ ప్రశ్నలే మీరు సత్యాన్ని గ్రహించడానికి అడ్డుపడతాయి. మీరు ఓర్పుతో జ్ఞానోదయ పరిమళాన్ని పట్టుకుంటే ఆ ప్రశ్నలు కరిగిపోతాయి. ప్రశ్నలు ఉదయించక ముందే సమాధానాలు దొరుకుతాయి. అది గురుదేవులతో ఉండడం వల్ల కలిగే గొప్ప అనుభవం. అందుకే జ్ఞానులు అప్పుడప్పుడు భూమి మీద కొంత మంది శిష్యులైనా జ్ఞానోదయం పొందుతారేమో అనే ఆశతో అవతారపురుషులుగా వస్తారు.

మీరు చైతన్యస్థితిలో ఉన్నప్పుడు ప్రకృతి వికసిస్తుంది. విశ్వం తాలూకు వివేకం మీ ద్వారా పని చేసేందుకు అవకాశం కలుగుతుంది.

ఒక చిన్న కథ : నది ఒడ్డున ఒక రైతుకు కొంత స్థలం ఉంది. ఆ స్థలంలో ఒక ఋషి నివసించేవాడు. ఆ గ్రామ పెద్దకు ఆ ఋషి అంటే ఇష్టం లేక ఆ స్థలాన్ని కొనాలనుకున్నాడు. గ్రామ పెద్ద ఎంత డబ్బు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రైతు అది అమ్మదానికి ఒప్పుకోలేదు. రైతు ఆ గ్రామ పెద్దతో ఇలా అన్నాడు. నేను ఆ స్థలాన్ని అమ్మితే వెంటనే ఆ ఋషిని అక్కడి నుంచి తరిమివేసావు. దానికి గ్రామ పెద్ద కోపంగా నువ్వు అతణ్ణి ఋషి అని ఎలా చెప్తావు? కాషాయరంగు బట్టలు వేసుకుంటే చాలా! అతను కూడా నీలాగా, నాలాగా ఒక మామూలు మనిషి అంటాడు.

రైతు ఇలా అన్నాడు, ఆయనలో ఋషి లక్షణాలు చూసాను. ఉదాహరణకి అతనికి కోపం రాదు. అందుకు గ్రామ పెద్ద, నీవు ఎలా చెప్పగలవు? అతనికి కోపం వచ్చే సందర్శం రాలేదేమో. రేపు ఆయన కుటీరం దగ్గరికి రా. ఆయనకు కోపం ఎలా వస్తుందో చూపిస్తాను అన్నాడు.

మర్నాడు ప్రొద్దున రైతు ఆ ఋషి కుటీరం దగ్గరకి వెళ్ళి గమనించసాగాడు. గ్రామ పెద్ద పంపించిన ఒక అబ్బాయి కుటీరం దగ్గరకి వచ్చాడు. ఆ ఋషి తల వంచుకొని ఏదో రాసుకుంటున్నాడు. ఆ అబ్బాయి ఆయన వెనుకకు వెళ్ళి ఆయన మీద ఉమ్మేసాడు. అది ఆ అబ్బాయి చేసిన పని అని తెలుసుకొని ఋషి లేచి వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. ఆ అబ్బాయి మళ్ళీ ఉమ్మేసాడు ఋషి మరొకసారి నదిలో మునిగి వచ్చి కూర్చున్నాడు. రైతు అదిచూసి భరించలేకపోయాడు. ఆ గ్రామ పెద్ద ఒక చెట్లు వెనక నుండి ఇదంతా చూస్తున్నాడు. అతడు ఆ ఋషి శాంతస్వభావాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఋషి నదిలో మునిగి వచ్చిన వెంటనే ఆ అబ్బాయి ఆయన మీద ఉమ్మేవాడు. ఇలా చేసినా ప్రతిసారీ ఋషి ఆ అబ్బాయిని

జీవిత ద్వారాల్ని తెరిచే అమాయకత్వం

చూసి చిరునవ్వు నవ్వి, వెళ్ళి నదిలో మునిగి వచ్చేవాడు. ఇలా 107 సార్లు ఉమ్మాడు. దానితో ఆ అబ్బాయి ముఖం కళ తప్పింది. ఇక అతని వల్ల కాలేదు. వెంటనే వెళ్ళి ఋషి కాళ్ళ మీద పడి ఏడవసాగాడు. 'నన్ను క్షమించండి. నేను పాపం చేసాను. నేను మిమ్మల్ని బాధపెట్టాను. ఇలా చేయడానికి నాకు డబ్బు ఇచ్చారు. మీరు శపిస్తారు. నాకు భయంగా ఉంది' అని ఆ అబ్బాయి అన్నాడు.

ఆ ఋషి శాంతంగా ఇలా అన్నాడు. 'అయితే నువ్వు నా మీద ఇక ఉమ్మేయవా?' ఆ అబ్బాయి ఇలా సమాధానమిచ్చాడు, 'మీ మీద ఉమ్మడం కంటే చావడం మేలు.' అప్పుడు ఋషి ఆ అబ్బాయిని లేవదీసి 'నేను నీకో రహస్యం చెప్తాను. నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా కాలం క్రితం నేను ఈ పవిత్రమైన నదిలో 108 సార్లు మునుగుతానని మొక్కుకున్నాను. ఈ నాటితో అది తీరింది. నా మొక్కు చెల్లించడానికి ఇంకొకసారి మునిగి రావాలి. ఈ సారి నీ గురించి ప్రార్థిస్తాను' అని అంటాడు.

ఋషి ఇంకొకసారి మునిగివచ్చాక ఆ గ్రామ పెద్ద అతని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. 'అసలు పాపిని నేను. చిన్న అబ్బాయికి డబ్బు ఇచ్చి నేనే అలా చేయమని చెప్పాను. నేను మీకు కోపం వస్తుందని నిరూపించాలనుకున్నాను' అని అన్నాడు. ఋషి నవ్వి ఇలా అన్నాడు 'ఆ అబ్బాయి అది నాకు ముందుగా చెప్పి ఉంటే నేను త్వరగా కోపం తెచ్చుకుని అతనికి బహుమతి వచ్చేలా చేసేవాడిని' అన్నాడు. అప్పటి నుండి ఆ గ్రామ పెద్ద అతనికి శిష్యుడైనాడు.

ఋషి చేసిన పని అనుకూలంగా ఉన్నది. ఆయన వికాసంతో ఉండడం వల్ల విశ్వశక్తి అతని మొక్కు తీరేట్లుగా సహాయం చేసింది. నేను మిమ్మల్ని ఉమ్మేయించుకోమని చెప్పట్లేదు. ప్రతి పనీ వికాసంతో ఉండడమనేది ఎంత ముఖ్యమో అర్ధం చేసుకోండి. మీరు వికాసంతో ఉన్నప్పుడు మీలో ఆ క్షణంలో ఎంతో మంచి జరగడానికి అవకాశం ఇస్తారు. మీ ప్రతి పనితో మీ వ్యవస్థలో మార్పు వచ్చి మీ జీవనశైలి మారుతుంది.

ఒక జెన్ కథ : బౌద్ధగురువులు వారి శిష్యులకి ఏ విధంగా వ్యక్తపరచాలో అన్నది మాత్రమే నేర్పుతారు. ఒక బౌద్ధారామంలోని ఒక శిష్యుడు ఉదయం కూరలు కొనడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఉదయం మరొక బౌద్ధారామంలోని శిష్యుణ్ని కలిసేవాడు.

ఒకరోజు మొదటి శిష్యుడు రెండవ వాణ్ణి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అని అడిగాడు దానికి రెండవ శిష్యుడు 'నా కాళ్ళు ఎక్కడికి తీసుకెళితే అక్కడికి' అని సమాధాన మిచ్చాడు. ఈ సమాధానం మొదటి శిష్యుడిని తికమక పెట్టింది. తన గురువుగారిని దాని అర్థం ఏమిటని అడిగాడు. ఆ గురువు రేపు అతడిని కలిసినపుడు అదే ప్రశ్న అడుగు. అతడు నీకు అదే సమాధాన మిస్తాడు. అప్పుడు 'నీకు కాళ్ళు లేకపోతే ఎక్కడికి వెళ్ళావు' అని మళ్ళీ అడుగు.

అతనికి బుద్ధి వస్తుంది' అని చెప్పాడు. మర్నాడు మళ్ళీ మొదటి శిష్యుడు అదే ప్రశ్న అడిగాడు. దానికి రెండవ శిష్యుడు ఇలా సమాధాన మిచ్చాడు. 'గాలి ఎటు వీస్తే అటు వెళ్తాను'. మొదటి శిష్యుడు మళ్ళీ వెళ్ళి తన గురువుగారి సహాయం అడిగాడు. 'నువ్వు రేపు అతడిని కలిసినప్పుడు గాలి లేకపోతే ఎక్కడికి వెళావు అని అడుగు' అని గురువు చెప్పారు. మర్నాడు మొదటి శిష్యుడు రెండవ వాణ్ని 'నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?' అని అడిగాడు. రెండవ శిష్యుడు 'నేను కూరలు కొనడానికి మార్కెట్‌కి వెళ్తున్నాను' అని సమాధాన మిచ్చాడు.

చైతన్యంతో వ్యక్తపరచాలంటే ఒక పక్షిలా స్వేచ్ఛగా ఉండడమే. భూతభవిష్యత్కాల గురించి విచారించకుండా ఆ క్షణంలో ఉండడం. అదే బౌద్ధగురువులు వారి శిష్యులకి నేర్పేవారు.

నమ్మకంతో లొంగిపొండి

అపారవైన నమ్మకం అధీనానికి దారి చూపిస్తుంది. అధీనమవడం అంటే హృదయనిరాడంబరతే. మీరు అంతిమసత్యాన్ని గురించి నిర్ణయించుకోకుండా దాంతో పాటు ఉండటం అని తెలుసుకోవటం. మీరు సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు అధీనమౌతారు.

మీ పెంపుడు కుక్కను మీరు మోసం చేసినా మళ్ళీ మీ దగ్గరకు నమ్మకంతో వస్తుంది. ఆ పెంపుడు జంతువు విశ్వాసంలో అమాయకత్వంతో ఉంటుంది. దాని విశ్వాసానికి కారణం అనేది ఉండదు. ఆ కుక్క మిమ్మల్ని ఏమీ ప్రశ్నించదు. దానికి మీరు సమాధానం చెప్పక్కర్లేదు. దానికి ఎందులోనూ ఉపయోగం కనిపించదు. అది ఒక తెరిచివున్న పుస్తకం లాంటిది.

రెండు బంగారు రంగు చేపపిల్లలు ఒక నీళ్ళ కుండీలో ఉన్నాయి. మొదటిది రెండవదాన్ని 'నీకు భగవంతుడంటే నమ్మకం ఉందా?' అని అడిగింది. రెండవది 'ఎందుకు లేదు? రోజూ మన కుండీలో నీటిని ఎవరు మారుస్తున్నారు?' అని సమాధానమిచ్చింది.

అమాయకత్వమే నమ్మకానికి, అధీనానికి పునాది. జ్ఞానం ప్రతిదీ మనకు ఉపయోగమా, కాదా – అని ఆలోచిస్తుంది. ప్రతి దాంట్లో కారణం వెతుకుతుంది. అధీనమవటం కారణం పరస్పరం భిన్నమైనవి. అధీనమవటం నమ్మకంతో ఉంటుంది. కేవలం అమాయకత్వంతో అధీనం కావచ్చు. ఎందుకంటే అమాయకత్వం వల్ల నమ్మకం కలుగుతుంది.

నమ్మకంలో అంగీకారం పుడుతుంది. అంగీకారం అంటే మనం జీవించే పరిస్తితులు, మనుషుల్ని అంగీకరించమని అర్థం కాదు. అంగీకారం అంటే జీవితాన్ని సృష్టి ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమతిలా ఆహ్వానించడం. ప్రతి మనిషి లేదా ప్రతి పరిస్థితి, తాజాగా జరిగేది. దాన్ని లోతుగా అంగీకరించడమే అధీనమవటం అంటే. మనిషిని పరిస్థితుల్ని నేరుగా చేపట్టాలి. అప్రయత్న అంగీకారమే అధీనమవటం అంటే. మనల్ని రక్షించే ప్రకృతి పట్ల మనకు గల

గాధమైన నుమతే అంగీకారం. అది మళ్ళీ [పక్బతిని 'ఔను' అనడమే. మీరు 'ఔను' అంటే అంతటా వ్యాపించిన విశ్వాన్ని నడిపే జీవశక్తిని సమ్మతించినట్లు. అదే 'అధీనమవటం' అవుతుంది. అధీనంతో గాధమైన విశ్రాంతిని పొందగలరు. అధీనం కావడం వల్ల వివేకం పుడుతుంది. ఆ శక్తే వివేకం. నమ్మకమంటే పని లేకుండా ఉండడం కాదు, జ్ఞానంతో కాకుండా పూర్తి వివేకంతో చేసే పనే 'సమ్మకం' అవుతుంది.

ఒక సూఫీ మతగురువు గుదారం దగ్గరకి ఒక వ్యక్తి ఒంటె మీద వచ్చాడు. అతడు ఒంటె దిగి గుదారం లోపలికి వెళ్ళి, గురువుగారికి నమస్కరించి 'గురువుగారూ! నాకు భగవంతుడంటే చాలా నమ్మకం. భగవంతుడు తనని ప్రేమించేవారిని ఎప్పుడూ రక్షిస్తాడు. అందుకే నా ఒంటెను కట్టేయకుండా బయట వదిలివచ్చాను' అని అన్నాడు.

గురువుగారు అతన్ని మందలించి 'ఓ మూర్చుడా! వెంటనే వెళ్ళి ఒంటెను కట్లేయి. నీవు చేయగలిగే పనిని భగవంతుడు పట్టించుకోడు' అని చెప్పాడు.

నమ్మకం అనేది ఒక వైఖరి, అది తగిన చర్యకు బదులు కాదు. నమ్మకం అనేది జీవితసారం అని గ్రహించండి. నమ్మకంతో, అమాయకత్వంతో అధీనమవగలిగితే మీరు విశ్రాంతిని, పరమానందాన్ని పొందవచ్చు. మీరు పూర్తిగా అర్థం చేసుకుని ఆ మార్గంలో వెళితే మీరు ఏమీ పోగొట్టుకోరు. అంతవరకు నమ్మకమనే మార్గంలోనే ఉంటారు.

గొప్ప జ్ఞానులందరూ నిరంతరం బ్రహ్మానందస్థితిలో ఉంటారు. వారు పూర్తి నమ్మకంతో సృష్టికి అధీనమయ్యారు కాబట్టి, బోలుగా ఉన్న వెదురు లోంచి గాలి ఏ విధంగా ప్రవహిస్తుందో అదే విధంగా వారిలో జీవశక్షి ప్రవహిస్తుంది. అందుకే జ్ఞానోదయమైనవారు తేజస్పుతో అందంగా ఉంటారు. జీవశక్తి ప్రవాహమైనప్పుడు వారు దైవత్వాన్ని వ్యక్తపరుస్తారు. వారి అనుగ్రహమే విశ్వక్టప. వారే భూమి మీద అమాయకులుగా ఉంటారు.

యోగులకు స్పష్టిలో ప్రతిదీ సాధ్యమే అని తెలుసు. వారు నమ్మకానికి జీవంతో ఉన్న ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉన్నా అమాయకత్వంతో ఉంటారు.

మనకి జ్ఞానం ఉంటుంది కాని సమస్య ఏమిటంటే మనకి తెలిసినదే సర్గెంది అని, మిగతా జ్ఞానమంతా తప్పు అని అనుకుంటాం. అర్థం చేసుకోండి, అంతిమజ్ఞానం అందరికీ ఒక్కటే. ఇంకేదైనా ఉంటే మనం అప్పు తెచ్చుకున్న భావం మాత్రమే. ఇది స్పష్టంగా తెలుసుకుంటే ప్రపక్సతికి అధీనమై, మనకు బరువెన జ్ఞానాన్ని వదిలేసి, అమాయకత్వాన్ని పొందుతాం. మనకు తెలియనిదాన్ని ఎలా తెలుసుకోవాలి? మనకు తెలియదని స్పష్టంగా తెలిస్తే చాలు. జ్ఞానానికి మూలమైన పరమాత్మ కొరకు ధ్యానం చేయండి. ఎప్పుడూ సృష్టికి అధీనమయ్యే భావంతో ధ్యానం చేయండి. స్పష్టికి అధీనమవడానికి పట్టుదల చూపండి. మీ చుట్టూ అద్భుతాలు జరగటం చూసారు.

పురాణంలో, అవతారపురుషుడైన శ్రీరాముని భక్తుడు, హనుమంతుని గురించి ఒక కథ ఉంది. హనుమంతుణ్ని ఒకసారి చాంద్రమానంలో అది ఏ రోజు అని అడిగితే 'నేను ఎల్హప్పుడూ రాముడినే తలుచుకుంటాను, ఈ నెలలో ఇవాళ ఏతిథి, ఏ నక్షుతం అనేవి నాకు తెలియవు', అని సమాధానం చెప్పాడు.

మీరు సత్యమనే అద్భుతంలో స్థిరపడితే మీరు ఎంత అమాయకత్వంతో ఉంటారంటే మీకు జీవితం ఒక ధ్యానంలాగా, అద్భుతంగా అనిపిస్తుంది. హనుమంతుడు రామనామం జపిస్తూ ఒక ప్ర‌య‌త్నంతో స‌ముద్దాన్ని దాటి భరత్ దేశం నుండి లంక‌కు వెళ్ళాడు. శ్రీ రాముడు తన వానరసైన్యంతో సముద్రాన్ని దాటడానికి వారధి కట్లవలసి వచ్చింది. దీన్ని బట్టి పరమాత్మకి అమాయకత్వంతో అధీనమైతే కలిగేది అత్యంతశక్తి అని గ్రహించండి.

ఒక వ్యక్తి ఎప్పుడెతే దైవానికి అధీనమవుతాదో ప్రతిక్షణం అద్భుతాలు జరుగుతాయి. మానవులు ఎప్పుడూ అద్భుతాల కోసం ఎదురుచూసారు. అధీనంతో పెద్ద అద్భుతాలు జరుగుతాయి. భరత్దేశంలో యోగీశ్వరుదైన షిరిడీ సాయి బాబా జీవితచరిత్రలో ఒక అద్యుతమైన కథ ఉంది.

ప్రతి రోజు సాయిబాబా మసీదులో దీపాలు వెలిగించేవారు. ఆయన మానవజాతిలో అజ్ఞామనే చీకటిని తొలగించడానికి చిహ్సంగా దీపాలు వెలిగించేవారు. కానీ అందరూ ఆయనకు అలా చేయటం ఇష్టం కాబట్టి దీపాలు పెట్టేవారని అనుకునేవారు. బాబా నూనె వర్శకుల దగ్గర నుండి నూనె తెచ్చుకునేవారు, ఒకసారి నూనె వర్గకులంతా కలిసి ఉచితంగా బాబాకు సూనె ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. బాబాకి వారి నిర్ణయం తెలిసినా, తెలియనట్లు మర్నాడు నూనె కోసం వర్గకుల దగ్గరకి వెళ్ళారు. వర్గకులు నూనె ఇవ్వమని అన్నారు. బాబా చిరునవ్వుతో మసీదుకి తిరిగి వెళ్ళిపోయారు. ఆ గ్రామప్రజలు, నూనె వర్గకులు కుతూహలంతో బాబా ఏం చేసారో చూద్దామని మసీదు చుట్తూ వచ్చి నిలబడ్డారు. బాబా ప్రమిదల్తో నీరు పోసి వత్తులు వెలిగించారు. అవి రోజూ కంటే ఎక్కువ కాంతితో వెలిగాయి. సూనె వర్గకులు ఆశ్చర్యపోయారు. వారు బాబాను క్రమించమని అడిగారు. సాయిబాబా వారిని క్రమించారు.

అధీనమవడం అంటే స్పష్టి మీలో నుండి జరగదం. జ్జానోదయమెనవారు, ప్రకృతి తమతో ఆదుకోవడంలో ఆనందాన్ని పొందుతారు. ఒక చిన్న పిల్లవాడిలా అమాయకత్వంతో ఆసందిస్తారు. అందుకే వారిని చూస్తే మనకు కూడా ఆనందంగా ఉంటుంది.

మరో సంగతి – మీరు ఎప్పుడైతే నమ్మకంతో అధీనమై ఉంటారో, అప్పుడు మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు. అమాయకత్వంతో కూడిన నమ్మకం, మోసం నుండి రక్షిస్తుంది.

Part 11: Living Enlightenment

అది ఆ విధమైన కాంతిని ప్రసరిస్తుంది. మా ఆశమంలో అన్ని రకాలైన మనుషులు వచ్చి ఉంటారు. వారు ఆశమంలో ప్రవేశించగానే వారిలో ఒక గాధమైన నమ్మకం కలుగుతుంది. బయటి ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆశ్రమవాసిగా అడుగుపెట్టాలనే నిర్ణయం, నమ్మకం వల్లనే అది కలుగుతుంది. వారు ఒకసారి ఆశమంలో ప్రవేశించి ఇతరులతో అన్నీ పంచుకొంటూ నివసిస్తుంటే, వారిలో వింత నమ్మకం ఏర్పడుతుంది. అంటే వారు వేటికీ తాళాలు వెయ్యరు. వారు ఉండే గది అపరిచితవ్యక్తులతో నిండి ఉందవచ్చు, అయినా తాళం వెయ్యాలి అనుకోరు. వారి వస్తువు ఏదీ పోదు. పోయినా దాన్ని గురించి పట్టించుకోరు. అదే దానిలో ఉండే అందం.

హబీబ్ ఆజమీ అనే గొప్ప సూఫీ సన్యాసి ఉండేవాడు. అతదు ఒక రోజు ఒక నది ఒడ్డున తన కోటును వదిలేసి స్నానానికి వెళ్ళాడు. ఆ దారిలో వెళ్ళన్న ఓ మనిషి ఆ కోటును చూసాడు. ఎవరు ఈ కోటును ఇంత నిర్లక్ష్యంగా వదిలివెళ్ళారనుకుంటూ, ఆ కోటు యజమాని వచ్చేంత వరకు అది పోకుండా చూదామని అక్కడే నిలుచున్నాడు. హబీబ్ తన కోటు కోసం వచ్చినప్పుడు ఆ వ్యక్తి అతనితో మీరు స్నానానికి వెళ్ళినపుడు ఈ కోటు ఎవరికి అప్పగించి వెళ్ళారు? దీన్ని ఎవరైనా పట్టుకుపోయేవారు కదా, అని అన్నాడు. దానికి హబీబ్ నేను నా కోటును భగవంతుడి రక్షణలో వదిలివెళ్ళాను. ఆయనే నిన్ను కాపలాదారుగా పంపించారు, అని అన్నాడు.

బాగా అర్థం చేసుకోవడం వల్ల నమ్మకం ఏర్పడితే, ఏదీ పోదు.

నేను నా శిష్యులకు ఎప్పుడూ నేను హిమాలయాల్లో ఆధ్యాత్మికత కోసం తిరిగినప్పుడూ కలిసిన బౌద్ధసన్నాసుల గురించి చెప్తాను. ఆ బౌద్ధసన్యాసులు అన్నీ వదులుకొని తపస్పు చేసుకోదానికి హిమాలయాలకు వచ్చారు. కాని అక్కడ వారు కమండలం కోసం పోట్లాదుకునేవారు. వసువు మారింది, కాని 'నాది' అనే భావన పోలేదు, అంతే. అర్ధం చేసుకోండి, నమ్మకం ఏర్పడితే భౌతికమైనవన్నీ ప్రకృతికి చెందుతాయనే భావన కలుగుతుంది. స్వాధీనంలో ఉంచుకోవాలనే వైఖరిని వదిలేస్తాం. అది మనసుకు విశ్రాంతి నిస్తుంది.

2004వ సంగలో కొంతమందితో హిమాలయాలకు వెళ్ళాను. మీ జీవితంలో ఒకసారైనా హిమాలయాలకు వెళ్ళాలి. మేం 'గోముఖ్'కి వెళ్ళాం. అక్కడే పవితగంగానది పుట్టింది. ఆ మార్గం వెడల్పు కేవలం నాలుగు అడుగులే. పోనీ (చిన్న గుర్రం) మీద వెళ్ళాలి. రావడానికి, పోవడానికి 10 గంటలు పడుతుంది. కాలు జారితే కింద ప్రవహిస్తున్న గంగానదిలో పడతారు. 'గోముఖ్' చేరగానే అక్కడ కొంత సమయం గడిపి అందరూ వెళ్ళిపోయారు. నేను కొంత మంది శిష్యులతో అక్కడే ఉండిపోయాను. కిందికి వెళ్ళేవారు సరిగ్గా చీకటి పడే సమయానికి బయలుదేరారు. నేను వారిని ప్రకృతే సంరక్షిస్తుందని, ఏమీ భయపడవద్దని చెప్పాను. చీకటిలో ఆ చిన్న గుర్రం వారిని కొండ దిగువకు తీసుకెళ్ళుతున్నదో లేక తిన్నగా అగాధం వైపు వెళ్ళన్నదో వారికి తెలియకుండా వారు కిందికి చేరుకున్నారు. ఆ మర్నాడు నేను వారి అనుభవం ఎలా ఉన్నది అని అడిగాను. వారిలో ఒకరు ఇలా అన్నారు, స్వామీజీ గుడ్డిగా నమ్మడం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఆ నమ్మకమైన క్షణాలను పొడిగిస్తే అదే జీవితసారం. అప్పుడు మీరు ఫలితాన్ని స్పష్టికి వదిలేసి పని చేయవచ్చు.

హిమాలయపర్వతాలను చూస్తే చాలు నమ్మకం, అధీనమవటం మీలో మొలకెత్తుతాయి. పరంతాలను చూసే స్పష్టి మానవమేధ కంటే శక్తిమంతమైనదని మీకు తెలుస్తుంది. ఆ పర్వతాలు సులభంగా అంతు పట్టవు అన్న సత్యం తెలుసుకుంటే సంఘర్షణ ఉండదు. అప్పుడు మనసు పని చేయదు. అప్పుడు మీరు హిమాలయాల్లో తిరిగితే బ్రహ్మానందం గమ్యస్థానం కాదు, ఒక మార్గం అని తెలుసుకుంటారు. మీరు ఈ క్షణంలో ఉంటే మీరు అమాయకత్వంతో పూర్తి వికాసంతో ఉంటారు. ఎందుకంటే ఈ క్షణంలో మీ మనసు లేదు. మనసుకి గమనం ఉండాలి. అది భూత – భవిష్యకాలాల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. ఈ క్షణంలో భూతభవిష్యత్తులు లేవు. వర్తమానం ఒక్కటే ఉంది. అంతే.

నమ్మడం, అధీనమవడం, అంటే 'నేను' 'నాది' అనేవి వదులుకోవటం. 'అహం' అనేది 'నాది' తో మొదలై 'నేను' దగ్గరకి వెళుతుంది. నేను అనే గుర్తింపు రాక ముందే 'నాది' అనే భావం ఉంటుంది. చిన్న పిల్లవాడిని చూసే 'నేను' అనే భావం లేక ముందే 'నాది' అని పోట్లాడతాడు. మీరు ఆ పిల్లవాడి చేతిలో బొమ్మ లాగి చూడండి. దాన్ని వదలదు, ఆ బొమ్మ అతనిది. మీరు దాన్ని తీసుకోలేరు. ఆ పిల్లవాడు 'నేను' అనే ముందే 'నాది' అని అంటాడు. అధీనమవడం అంటే సృష్టితో కలిసిపోవటం, నేను నాది అనేవి లేక పోవడం. అధీనమవడం అంటే మనసుని, అహాన్ని చంపుకోవటం. మీరు సృష్టి ఒకటి కాదు అనే భావనే అహం. ఈ వేరు భావం వల్లనే నేను నాది అనేవి బలంగా కలుగుతాయి. నేను, నాది అనేవి బలంగా ఉండడం వల్ల వేరు అనే భావం కలుగుతుంది.

అర్థం చేసుకోండి; మనిషికి మనసే శత్రువు వ్యక్తి ప్రకృతితో ఏకీభవించదు. కానీ మనసు అడ్డుపడుతుంది. ఉనికికి తెలుసు కానీ మనసుకు అనుమానం. ఉనికి ఎప్పుడూ ఔనంటుంది. మనసు కాదంటుంది. ఉనికి అమాయకంగా ఉంటుంది. మనసు జిత్తులమారి. ఔననడం మనసుకు మరణం లాంటిది. కాబట్టి ఎప్పుడూ కాదనే అంటుంది. దాన్ని ఒప్పించగా ఒప్పించగా ఔనంటుంది. అలా వదిలేసే కాదనే అంటుంది.

మనసును ఎలా నిశ్శబ్దంగా ఉంచాలి అని మీరు అడుగుతారు. మనసుతో మనసుని నిశ్శబ్దంగా ఉంచలేరు. ఇది అపరాధిని అధీనంలో ఉండమనడం లాంటిది. అది ఎన్నటికీ జరగదు. మనసనేది వాస్తవం కాదని మీరు తెలుసుకోవాలి. అది కేవలం కల్పితం. వాస్తవం కాని దాన్ని పట్టుకొని దాన్ని నిశ్శబ్దంగా ఉంచాలనుకుంటారు. మీలో జరుగుతున్నదాన్ని అవగాహన చేసుకుంటే, మీకు మనసు ఎక్కడ కాదని అంటుందో తెలుస్తుంది. అప్పుడు దాన్ని విశ్రాంతిగా ఉంచి మీ ఉనికి అంటున్న ఔను అనేదాన్ని వినవచ్చు. అవగాహనతో ఉన్నప్పుడు నిరాకరించడాన్ని వదిలేస్తుంది. అవగాహన అనేది ఒక తాళం చెవి లాంటిది. అప్పుడు మీరు మీలోనికి వెళ్ళి విశ్రాంతిని పొందుతారు.

అక్కడ నుండి అమాయకత్వం వ్యక్తమౌతుంది. అమాయకత్వం లేనిదే సన్నిహితత్వం రాదు. సన్నిహితత్వమే ప్రకృతి భాష. మనసుకు సన్నిహితత్వం తెలియదు. అది కేవలం ఉనికికే తెలుసు. సన్నిహితత్వంతోనే వికాసం ఉంటుంది. అప్పుడు దేన్నైనా చిత్తశుద్ధితో చెబుతారు. అప్పుడు మీరు చెప్పే మాటలు, చేసే పనుల్లో ప్రామాణికత ఉంటుంది. దాంతో మీరు ప్రసరింపచేసే శక్తి ఇతరుల్ని అమాయకత్వంతో నింపి వికాసం కలిగేలా ప్రేరణనిస్తుంది. అప్పుడు ప్రకృతి అందాన్ని అనుభవించగలరు.

ఆధ్యాత్మికత – అమాయకత్వంతో కూడిన గౌరవానికి మార్గం

ఒక ప్రసిద్దమైన నానుడి ఉంది. నీవు కలత చెందితే ప్రార్దన చేయనట్లు. ప్రార్దన చేసినట్లయితే కలత చెందవు.

ఆధ్యాత్మికత అంటే కలతను ప్రకృతికి అధీనం చేసి స్వేచ్ఛగా ఉండడమే. ఆధ్యాత్మికత అనేది ఆధునికమానవునికి విశ్రాంతిని కలిగిస్తుంది. అది నిరూపితమైన విజ్ఞానం. ఈ నాటి విజ్ఞానప్రపంచంలో ఉనికి పిలుపును వెంటనే తెలుసుకోవాలి. ఆధ్యాత్మికతే దానికి మార్గం. విశ్వరహస్యాన్ని పవిత్రతను పూర్వస్థితికి తీసుకువస్తుంది. అది మనిషి ఈ భూమి మీద గొప్ప జీవి కాదని, ప్రకృతి శక్తే విశ్వమంతటా ఆవరించి ఉందని గుర్తు చేస్తుంది. అది మనసులో అమాయకత్వంతో అధీనమవడాన్ని తెలియజేస్తుంది.

ఆధ్యాత్మికత అంటే ఆచారం కాదు. అది ప్రకృతితో మమేకమయ్యే విజ్ఞానం. అనాది కాలం నుండి ప్రపంచమతాలు దైవభక్తిని జీవితంలో ఒక భాగంగా చేసాయి. దేవాలయం అనేది విశ్వశక్తితో సంబంధం కలిగి ఉండి, విశ్రాంతినిచ్చే ఒక చక్కని ప్రదేశం. అన్ని ప్రపంచమతాల ఉద్దేశం కూడా ఇదే. విశ్వశక్షితో సంబంధం గాధమైనప్పుడు ఒక వ్యక్థిలో బ్రహ్మానందస్థితి కలుగుతుంది. మతం అనేది ఆధ్యాత్మికతకు ఒక మెట్టు లాంటిది.

కొంతమంది పరిశోధకులు పరిశోధన చేసి తేల్చిన విషయమేమంటే, మనుషులే కాకుండా జంతువులు కూడా ఒక ప్రత్యేకస్థలంలోనే విశ్రాంతిని తీసుకుంటాయి. ఆ ప్రదేశంలో తినడం లాంటి యితర పనులు చేయవు. వాటికి పూజ, ప్రార్దన లాంటివి తెలియవు, కానీ అవి ఆ నిర్దీతప్రదేశంలోనే విశ్రాంతిని తీసుకుంటాయి. ఆ ప్రదేశంలో ప్రకృతితో అనుబంధం ఏర్పరచుకొని ప్రకృతి ఒడిలో విశాంతి తీసుకోవడానికే ఉద్ధేశింపబడింది. మానవుడు తన వేగవంతమైన జీవితంలో విశ్రాంతి తీసుకోలేకపోవచ్చు కానీ, జంతువులు ఒక క్రమపద్దతిలో విశ్రాంతి తీసుకుంటాయి. అవి ప్రకృతి అధీనంలో ఉండడం వల్ల వాటి కళ్ళలోకి చూస్తే గాధమైన అమాయకత్యం.

మానవుడు తెలివి మీరి విజ్ఞానాన్నే అనుసరిస్తూ తాను కనుగొన్న కొత్త విషయాలను తన తెలివితేటలతో కనిపెట్టానని అనుకుంటాడు. ఆధ్యాత్మికత అనేది విశ్వరహస్యాన్ని జీవింపచేస్తుంది. జీవశక్తి అనేది మానవమేధ కంటే బలమైంది. ఆధ్యాత్మికత అనేది జీవశక్తి పట్ల గౌరవాన్ని, నుమతను కలిగిస్తుంది కాబట్టి, ఆధ్యాత్మికత అనేది అమాయకత్వ పూర్వస్థితిని కలిగిస్తుంది. విశ్వశక్తిని గౌరవించి మానవమేధనే శాంతింపచేయటమే మన తక్షణకర్తవ్యం. అప్పుడు మానవుడు అగాధమైన విశ్వాన్ని గురించి భయపడడు. గాధమైన భక్తిప్రేమలతో విశ్వంతో అనుసంధానంలో ఉండి బ్రహ్మానందపారవశ్యాన్ని పొందుతాడు. భరత్దేశమహర్షులు తమ ఆధ్యాత్మికత ద్వారా ఈ బ్రహ్మానందపారవశ్యాన్ని పొందారు.

ఒక చిన్న కథ : మురుగనార్ అనే శివభకుడు ఉండేవాడు. ప్రతి రోజు సూర్యోదయానికి ముందే నదిలో స్నానం చేసి చెట్టు, తీగల నుండి, పూలు కోసుకొని, శివునికి పూల మాలలల్లేవాడు. మాలలోని పూవులు నలగకుండా భద్రంగా ఆ మాలను, దేవాలయానికి నడిచి వెళ్ళి శివునికి సమర్పించేవాడు. పవితమైన మంత్రాలను వల్లిస్తూ గంటలకొద్దీ ఆలయంలోనే గడిపేవాడు. అతడు అమాయకత్వంతో కూడిన భక్తితో జ్ఞానోదయాన్ని పొందాడని ప్రతీతి. ఆ విధంగా అమాయకమైన దైవభక్తితో జ్ఞానోదయం పొందిన శివయోగులైన 63 మంది నాయన్శార్లలో ఒకడుగా అతడు నేడు పూజలందుకుంటున్నాడు.

ఆధ్యాత్మికతలోని మాధుర్యం తెలియనివారు దాన్ని వదులుకుంటారు. గంభీరంగా ఉండటమే ఆధ్యాత్మికతగా భావిస్తారు. భగవంతుడు అనందస్వరూపుడైనప్పుడు ఆధ్యాత్మికత గంభీరత ఎలా అవుతుంది? మానవుడే ఆచారాలు ఏర్పాటు చేసి ఆధ్యాత్మికతను గంభీరంగా చేసాడు. మనం ఏ సమయాల్లో ప్రార్టిస్తే అంతరాత్మతో సంబంధం కలుగుతుందో కూడా మన గురువులు బోధించారు. తెల్లవారు జామున ప్రార్ధించడం మంచిదని చెప్పారు. అప్పుడు మేధ విశ్రాంతిలో ఉంటుంది. ఆ సమయంలో గనక మనం ఆధ్యాత్మికతను సాధన చేస్తే మనసు మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనసు అమాయకంగా, తాజాగా ఉండడం వల్ల ఆధ్యాత్మికతతో అది ప్రభావితమౌతుంది. ఆధ్యాత్మికత అనేది మన అమాయకత్వాన్ని, నమ్మకాన్ని పూర్వస్థితికి తీసుకురావడానికి సరైన మార్గాన్ని కల్పిస్తుందని, మన గురువులు బోధించారు.

ఒక చిన్న కథ : ఒక రైతు సాయంకాలం బజారు నుండి ఇంటికి తిరిగి వెళ్ళేటపుడు ప్రార్థన పుస్తకం తన దగ్గర లేదని గ్రహించాడు. బండి చక్రం అడవి మధ్యలో ఊడిపోవడం వల్ల ఆ నాటి ప్రార్ధన చేయలేనేమో అనే బాధ కలిగింది. అప్పుడు అతడు భగవంతుణ్ని ఇలా ప్రార్ధించాడు, ఓ దేవా! నేను ప్రార్ధన పుస్తకాన్ని మరిచిపోయిన మూర్హుడిని. నాకు జ్ఞాపకశక్తి లేదు. ఒక ప్రార్ధన కూడా గుర్తు రావడం లేదు. కాబట్టి అక్షరాలన్నింటినీ ఐదు సార్లు వల్లె వేస్తాను. నీకన్ని ప్రార్ధనలూ తెలుసు గనుక నాకు గుర్తు రాని ప్రార్ధనల్ని ఆ అక్టరాల నుండి సమకూర్చుకో, అని అక్షరాలని మననం చేసాడు. ఆ రోజు భగవంతుడు దేవతలతో ఇలా అన్నాడు, 'నేను విన్న ప్రార్థనలన్నింటిలో ఇతనిది అత్యుత్తమమైన ప్రార్దన, ఎందుకంటే అది నిజాయితీగా, హ్నాదయం నుండి వెలువడిన సహజమైన ప్రార్థన గనుక.'

అమాయకత్వాన్ని పవిత్రంగా వ్యక్తీకరించేదే ఆధ్యాత్మికత అని గుర్తించాలి.

ఆధ్యాత్మికత స్వచ్చమైన అమాయకత్వాన్ని వ్యక్తపరచడానికి అవకాశమిస్తుంది. అమాయకత్వమే భగవంతునికి నివేదన, అమాయకత్వమే భగవంతునికి ఒక గొప్ప ప్రార్టన.

మతం అనేది అందరూ అనుకునేట్లు నమ్మకం కాదు. ప్రతి మతం ఆయా గురువుల ఆధ్యాత్మిక అనుభవాల సారాంశం. అదే అనుభూతిని మానవులందరూ పొందాలనే ఉద్దేశంతో ఆయా గురువులు తమ అనుభూతిని మతం రూపంలో అందించారు. ఇది అర్థమైతే మనిషి ఏ మతాన్నెనా అనుసరించవచ్చు. అదే మతాల్లో ఉండే అందం.

మీరు అమాయకత్వంతో గురుదేవుల అధీనంలో ఉండండి. అమాయకత్వంతో ఉంటే, గురుదేవుల నిశ్నబ్దం మీ అంతరంగంలోకి ప్రవేశిస్తుంది. నిశ్నబం అనేది మతాలన్నిటిలోకీ గొప్పది. గొప్ప యోగీశ్వరుల మతం నిశ్నబ్దమే. అదే అసలైన ఆధ్యాత్మికత.

ఆధ్యాత్మికతను, అమాయకత్వంతో సాధన చేస్తే, అది మిమ్మల్ని పసిపిల్లలుగా ఉంచుతుంది. తంజావూరులోని వేదకాలం నాటి చితాలను చూస్తే, వాటిలో అద, మగ, ఋషుల, దేవతల ముఖాలన్నీ అమాయకంగా చిన్నగా కనిపిస్తాయి. మీరు మేధతో ఉంటే వార్తక్యచిహ్నాలు తొందరగా వస్తాయి. మీరు హృదయంతో ఉంటే, ఎప్పుడూ నూతనంగా చిన్నగా కనిపిసారు.

ఆధ్యాత్మికతతో, మీ అంతరాత్మ నుంచి పరమాత్మపై గాధమైన భక్తి కలుగుతుంది. అది వెల్లువలా పొంగి, మీ అవరోధాలన్నింటినీ తొలగించి, మిమ్మల్ని చేతనస్థితిలోకి తెచ్చి ప్రపక్సతిని మీలోకి ప్రవేశింపచేస్తుంది. మన పురాణాల్లో అత్యంతభక్తి గల భక్తుల కథలు చాలా ఉన్నాయి. ఆ భక్తులు వారి ప్రగాధమైన భక్తి వల్ల ఎన్నో అద్భుతాలు చూసారు. అమాయకత్వంతో పూజ చేసేవారి భక్తి అంత గాధంగా ఉంటుంది, పూజ అయిన తర్వాత కూడా వారు దైవధ్యానంలోనే ఉంటారు. ధ్యాసం లేదా ప్రార్దన అనేది నుమతగా, అమాయకంగా కృతజ్ఞతాభావంతో విశ్వశక్తి పట్ల భక్తిని వ్యక్తపరచడం. దీనికి కారణాలనేవి ఉండవు.

సహజంగా ఉండండి

నేను సత్యకాముని కథను కొంత మందికి చెప్పినపుడు వారిలో ఒకరు ఇలా అన్నారు, స్వామీజీ ! మీరు చెప్పే పద్ధతులు ఆధ్యాత్మికంగా అత్యున్నతస్థితికి చేరినవారికి సరిపోతాయి. ఆ కథలో గురువు ఆశీర్వాదం వల్ల శిష్యుడికి జ్ఞానోదయమైంది. సత్యకాముడు ఆధ్యాత్మికంగా ఉన్నతస్తితికి చేరిన వ్యక్తి. '

నేను ఆతనితో ఇలా అన్నాను, 'కాదు. ఆ పద్దతి బాగా ఉన్నతస్థితికి చెందినవారిది కాదు. బాగా అమాయకత్వంతో ఉన్న వ్యక్తులది.'

అర్థం చేసుకోండి; బాగా వికసించిన వ్యక్తికి ఏ పద్ధతీ అవసరం లేదు. పతంజలి చెప్పిన అష్టాంగయోగంలో ఎనిమిది పద్ధతులు ఒకేసారి సాధన చేయాలి. మీరు ఒక పద్దతిని సాధన చేసే ఒక మెట్టు పైన ఉన్నట్లు కాదు. మొదటి పద్ధతిని మీరు గట్టిగా సాధన చేసే రెందో పద్ధతి అవసరం లేదు. మొదటి పద్ధతి 'యమ' ప్రత్యేకమైన అడ్డంకులు. ఈ పద్ధతిలో ప్రావీణ్యం పొందితే మిగతా ఏడు అవసరం లేదు. మీరు ఏ యోగ (పాణాయామం చేయనక్కరలేదు. అర్ధం చేసుకోండి. ఎనిమిది పద్ధతులు జ్ఞానోదయం నిజంగా కోరుకునేవారి కోసం ఇవ్వబడ్డాయి. ఆ ఎనిమిది ఒక దాని తర్వాత ఒకటి సాధన చేసే పద్దతులు కావు.

అష్టాంగయోగం, పతంజలి చెప్పిన యోగపద్ధతులు. అలాగే సత్యకామునికి ఇచ్చిన పద్ధతి అమాయకత్వంతో ఉన్నవారికే ఇవ్వబడుతుంది. నేర్చరితనంతో ఉన్నప్పుడు చేతనస్థితిలో ఉండరు. మీరు చేతనస్థితిలో స్వచ్చంగా పసివాడిలా ఉంటారు. పసి పిల్లవాడు, ఒకేసారి వివేకంగా, అమాయకంగా ఉండగలడు. కాలక్రమేణా వివేకం అలాగే ఉంటుంది. కాని అమాయకత్వం నేర్సరితనంగా మారుతుంది. పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తే అమాయకత్వంతో ఉంటారు. వారికి మనం ఎన్నో విషయాలు నేర్చి సంఘజీవుల్తా తయారుచేస్తాము. అర్థం చేసుకోండి, పిల్లల్ని నేర్చరులుగా చేయకుండా పెంచడంలో మన బాధ్యత చాలా ఉంది.

ఖలీల్ గిబ్రాన్ ఒక గొప్ప కవి, పిల్లల గురించి ఆయన ఇలా అందంగా చెప్పారు.

మీరు పిల్లలకి ప్రేమ ఇవ్వండి, కాని మీ ఆలోచనలు వద్దు. వారికి వారి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మీరు వారి శరీరాలకి ఇల్లు కట్టవచ్చు కాని వారి ఆత్మలకు కాదు. ఎందుకంటే, అవి ఉండే రేపటి ఇల్లు. మీరు కలలో కూడా సందర్శించలేరు. మీరు వారిలా ఉండడానికి ప్రయత్నించవచ్చు. కాని వారిని మీలా చెయ్యాలని అనుకోవద్దు. జీవితం వెనక్కి వెళ్ళదు. నిన్నటిలా ఆలస్యం చెయ్యదు కనుక మీరు ధనుస్సులు, వాటి నుండి పిల్లలనే జీవబాణాలు వెలువడతాయి.

విలుకాదు అనంతవిశ్వంలో తన లక్ష్యం చూసుకొని బలమంతా ఉపయోగించి ధనుస్సు నుంచి వదిలిన బాణాలు వేగంగా దూరంగా వెళ్ళాలని వేస్తాడు. మీరు భగవంతుడనే విలుకాడి చేతిలో ఆనందంగా వంగండి. ఆయనకి వేగంగా వెళ్ళే బాణాలంటే ఎంత ప్రేమ ఉన్నదో స్టిరంగా ఉన్న ధనుస్సు మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది.

అసలు సమస్య ఏమిటంటే దేన్నెనా సంపూర్ణంగా కాకుండా విభజించి చూస్తాం. ఒక పాప తాను ఆదుకునే ప్రతి బొమ్మని మొత్తంగా చూస్తుంది. మొత్తం బొమ్మను నోట్నో పెట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. కళ్ళకి వస్తువును మొత్తంగా చూడడమే తెలుసు. కాని విభజించి చూడాలనుకోవు. మీరు ఎప్పుడెతే విడదీసి చూపించటం నేర్చుతారో, మీరు వారిలో నేర్చరితనానికి బీజం నాటినట్లు అవుతుంది. అది అమాయకత్వంగా, సహజంగా వ్యక్తపరచటాన్ని ఆటంకపరుస్తుంది. నేర్చరితనానికి విభజించటం, లెక్కించటమే వచ్చు. లెక్కించటం ద్వారానే వ్యక్తపరచటం వచ్చు. అది లెక్కకు సరిగా ఉన్నా అంతరాత్మకు సరి కాదు. మనం ఎప్పుడైనా వరాలను లెక్కపెడతామా? అయాచితంగా వాటిని తీసుకుంటాం.

నేర్పు అనేది మొత్తాన్ని విభజించటంతో ఆరంభమౌతుంది. మనస్సును విభజించేసరికి అమాయకత్వం పోతుంది. ఒక్కసారి మనస్సు దానికి అలవాటు పడితే, సహజమైన అమాయకత్వానికి దూరంగా వెళ్ళిపోతుంది.

ఒక దుకాణం దగ్గర రెండు చిన్న పిల్లల చక్రాల బళ్ళు పక్కపక్కన ఉన్నాయి. ఒక దానిలో ఉన్న చిన్న బిడ్డ, రెండో బండిలో ఉన్న పాపను అడిగింది, నీవు ఆడా, మగా? అని. ఆ పాప తనకు తెలియదని సమాధానమిచ్చింది. మొదటి పాప 'ఉండు నేను చెప్తాను' అని రెందో పాప చక్రాల బండిలోకి తొంగి చూసింది. తిరిగి 'నీవు అమ్మాయి', 'నేను అబ్బాయిని' అని చెప్పింది. రెండో పాప ఆశ్చర్యంగా 'నీకు ఎలా తెలిసింది?' అని అడిగింది. ఆ మొదటి పాప 'నువ్వు గులాబీ రంగు బూట్లు వేసుకున్నావు నేను నీలం రంగువి వేసుకున్నాను' అని ఠఫీమని సమాధానమిచ్చింది.

చాలా చిన్నప్పటి నుండే పిల్లలకి విభజన నేర్పుతారు. పిల్లలు తమకు తెలియకుండానే అమాయకత్వాన్ని పోగొట్టుకొని కపటాన్ని నేర్చుకుంటారు. ఈ నేర్సరితనం వల్ల ప్రమాదం ఏమిటంటే, దాని వేళ్ళు అన్ని వైపులకూ చొచ్చుకుపోయి మనిషిలో పాతుకుపోతాయి. ఆ వ్యక్తికి తాను నేర్సుగా మాట్లాడతున్నానని కూడా తెలియదు. తనలోని సంఘర్షణ, నేర్సరితనం వల్లనే అని కూడా తెలియదు.

ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. స్వామీజీ, నాకు వివాహేతరసంబంధాలు ఉన్నాయి. అది తప్పని నాకు తెలుసు, అన్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, అలాంటివి ఆపేయి అని. 'మీరే ఆపగలరు' అని అతడు తిరిగి అన్నాడు. 'అరె, నేను ఆపడానికి అలాంటి సంబంధాలు లేవు. నీకు అలాంటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మానేయడానికి నీవు నిర్ణయించుకోవాలి' అని నేను అంటే అతను మాట్తాకుండా నిశ్శబ్ధంగా ఉండిపోయాడు, నేను మీరు అపండి అంటే అర్లం ఏమిటి? నీ కారు తాళాలు తీసుకుని నిన్ను వెళ్ళకుండా చెయ్యాలా? అని అడిగాను. ఇదే నేర్చుగా మాట్లాడడం అంటే. అప్పుడు అతడు ఇలా అన్నాదు, నేను మీకు అధీనం అయ్యాను, అందుకే మీరే అంతా చూసుకోవాలి. సరే నీవు నాకు అధీనమయ్యావు కదా! అయితే ఇక్కడ కూర్చొని ధ్యాసం చెయ్యి, అన్నాను. అప్పుడు అతను, అదేంటి స్వామీజీ అలా అంటున్నారు, అని అన్నాడు. ఇప్పుడే కదా నువ్వు నాకు అధీనమయ్యానన్నావు. నేను చెప్పినట్టు చెయ్యాలి. కదలకుండా ఇక్కడే కూర్చో అని నేనన్నాను. అతడు అలా చేయడానికి సిద్ధంగా లేదు.

ఒక చిన్న కథ : ఒక రోజున నదులన్నీ కలసి సముద్రంతో 'మేం మంచి నీరుగా తాగడానికి వీలుగా వస్తాం. నీలో ప్రవేశించేసరికి నీవు మమ్మల్ని ఉప్పగా తాగడానికి వీలు లేకుండా చేసావు,' అని అన్నాయి. నదులన్నీ తననే తప్పు పడుతున్నాయని గ్రహించి సముద్రం 'మీరు నా దగ్గరకు రావద్దు, అపుడు మీరు ఉప్పు నీరుగా మారరు,' అంది.

మీరు సులభమైన పరిష్మారాలకు సిద్ధంగా లేరంటే మీరు నేర్చుగా నాటకమాడుతున్నారని అర్ధం. మీరు నేర్చరితనంతో విసుగు చెందితే గానీ మీకు సహాయం చేయడం వీలు కాదు. మీకు ఏ పద్దతీ పనికి రాదు. మీ నేర్చరితనానికి ప్రతి పద్ధతి నుండీ తప్పించుకోదం తెలుసు. చాలా మంది, నా దగ్తరకు వచ్చి ఇలా అంటారు, స్వామీజీ! మీరు చెప్పేది అంతా బాగుంది కాని… అర్ధం చేసుకోండి. ఏ క్షణం మీరు కాని అంటారో అప్పుడే మీరు పోగొట్టుకున్నట్లు. అంతా అయిపోయినట్టు మీరు మీ నేర్పుతో తప్పించుకోడానికి చూస్కున్నారని అర్థం.

మరి కొంతమంది, స్వామీజీ! మీరు చెప్పేది అంతా సరి అయిందే కాని మీరు చెప్పినట్టు నేను చేసేట్టు చూదండి అంటారు. ఏమిటి మీ ఉద్దేశం? నేను మీకు మీరు చేసున్నారా లేదా అని కాపలా పెట్టాలా? నేర్పుతో నాతో ఆడుకోవటం మానేయండి. అప్పుడు మీరు నేను చెప్పింది చేయగలరు. నేర్చు అనేది మీరు మీతో దాగుడుమూతలు ఆడటం లాంటిది. అది నాతో మీరు అడలేరు. మీరు ఎక్కడ దాక్కున్నారో నాకు తెలుసు నేను కనుక్కోడానికి మీ దగ్గరకు రానక్కరలేదు. అందుకే అర్థం చేసుకోండి. మీరు మీతో ఆడుకుంటున్నారు. మీరు మీతో మనఃపూర్వకంగా నిజాయితీగా ఉండాలని బలమైన నిర్ణయం తీసుకుంటే, మీరు నేర్చరితనాన్ని వదిలేస్తారు. అది కరిగిపోతే నిజాయితీ, యథార్థం బయటికివస్తాయి. మీకు తొందరగా జ్ఞానోదయం అవుతుంది. నిజాయితీగా ఉన్నప్పుడు మాటలు చెప్పరు, నేర్చు పని లేని మాటల్ని వ్యక్తపరుస్తుంది. మీరు మనిషి ముఖం మీద చెప్పలేనిది నేర్చుగా వెనక మాట్లాడుకుంటారు. ఆ నేర్సు నుండి బయట పడాలి అని నన్ను అడిగితే నాకు ఎలా తెలుస్తుంది? నేను దాన్ని ఎలా ఆపగలను. మీరు దాన్ని రహస్యంగా పోషిస్తున్నారు. అందుకే అపలేరు. అది మీ సృష్టి. ఒక నిమిషం కూడా దాన్ని పోషించడం వదలరు. అందుకే మీరు 'నేర్సును మానేయాలని ఉంది' అని నా ఎదుట నటిస్తారు. నన్ను మన్నించమని అడుగుతారు. నిద్ర పోతున్న మనిషిని లేపవచ్చు. నిద్ర నటిస్తున్నవారిని లేపలేం. మీరు నిద్ర పోతున్నట్లు నటిస్తున్నప్పుడు మీకు లేవాలన్న గట్టి అవసరం కలగదు. సూటిగా దాంతో ఏకీభవించడం మానండి. అంతే అది ఒక్కటే మార్ధం. నిప్పు ముట్టుకుంటే కాలుతుందని తెలిసినప్పుడు, నన్ను మీరు నిప్పు ముట్టుకోకుండా ఉండేట్ట ఆపమని అడుగుతారా? అడగరు. అలాంటప్పుడు మీరు నేర్పుగా మాట్లాదుతున్నారని తెలిసి దాన్ని వదిలేయలేరా?

జీవిత ద్వారాల్ని తెరిచే అమాయకత్వం

ఎపుడు మీరు నేర్సును వదిలేసారో, సహజత్వం మీలో వికసిస్తుంది. అది లెక్కలు కట్టటానికి వ్యతిరేకి. సహజత్వం అంటే వివేకం, అమాయకత్వాల కలయిక. వివేకం నేర్చుతో కలిస్తే ప్రతి దానికీ విలువకడతారు. వికసించే అమాయకత్వమే సహజత్వం అవుతుంది. అంటే మీలో మీరు మోయలేని బరువు లేకుండా ఉండడం. అర్ధం చేసుకోండి, మీరు నేర్చుతో చాలా వస్తువులను పొందుతున్నామని అనుకుంటారేమో! కానీ అసలు నిజం ఏమంటే, మీరు మీ అమాయకత్వాన్ని పోగొట్టుకొంటున్నారు. అమాయకత్వం పోయిందంటే మీ జీవితాన్ని పోగొట్టుకొన్నట్లు. మీరు దేన్నెనా కోల్పోవచ్చు, కాని అమాయకత్వాన్ని కోల్పోకూడదు.

నేర్చుతో మీ సహజస్వభావాన్ని మరిచిపోతున్నారు. నిరంతరం వేరే విధంగా ఉండాలని మీరు మోసగించుకోవడమే గాక, మీ అంతరంగపరిమళాన్ని పోగొట్టుకునే ప్రమాదంలో ఉన్నారు. సృష్టిలో సహజమైన, అనంతమైన పరిమళం మీలోనూ ఉంది. సహజస్వభావం మీ వరకే పరిమితమెంది.

మీరు సహజంగా ఉన్నప్పుడు కచ్చితమైన అభిప్రాయాలతో ఉండరు. ఎప్పుడూ ఒక నిశ్చితమైన అభిప్రాయంతో పని చేయవలసిన అవసరం లేదు. వివేకం అనేది వాస్తవానికి దగ్గరో ఉంటుంది. నిశ్చితమైన అభిపాయంలో సహజమనే రసం పోతుంది. సమాజం మనల్ని వివిధ అభిప్రాయాలతో ఉండేట్లు తయారుచేస్తుంది. మనకి కొన్ని ప్రామాణికమైన అభిప్రాయాలుంటాయి. మనం మన అభిప్రాయాలను వదులుకొని వికాసంతో ఉండడానికి భయపడతాం. ఎందుకంటే మనసు ఎప్పుడూ ఒకే మూసకు అలవాటు పడింది. ఒకే మూసలో ఉండడం వల్ల అది పదిలంగా ఉన్నాననుకుంటుంది.

సృష్టి అదే విధంగా తిరిగి చెయ్యదు. ప్రతి రాత్రీ పగలు వేరుగా ఉంటాయి. ఇది అదే పగలు, అదే రాత్రి అని ఎవరూ చెప్పలేరు. అది ప్రతి రోజూ జరిగేదే కాని ఒకే విధంగా ఉండవు. అదే ప్రకృతిలో ఉన్న అందం. అటువంటప్పుడు మనం మూస కోసం ఎందుకు వెదకాలి? అవసరం లేదు. సహజంగా ఉండడంలో కలిగే ఆనందాన్ని అనుభవించవచ్చు. పిల్లలు ఐదు సంత్సరాల వరకు వికాసంతో, సహజత్వంతో ఉంటారు. అప్పుడు సమాజం వారి మీద ముద్ర వేయడం ప్రారంభిస్తుంది.

ఒక యువతి దారిలో సిగరెట్ కాలుస్తున్న వ్యక్తిని చూసి, 'అబ్బాయీ, మీ అమ్మకి నువు రోడ్ మీద సిగరెట్ కాలుస్కున్నావని తెలుసా?' అని అడిగింది. వెంటనే అతడు ఆమెకేసి చూసి 'మీ భర్తకి మీరు దారిలో ఒక అపరిచితవ్యక్తితో మాట్లాడతారని తెలుసా?' అన్నాడు.

పిల్లలు ఎంతో సహజంగా ఉంటారు. వారు దేన్నీ పట్టించుకోరు. ఒక టీచరు తరగతిలో తోక చుక్క అంటే ఏమిటి? అని అడిగింది. ఒక పిల్లవాడు వెంటనే 'ఒక నక్షతానికి తోక ఉంటే దాన్ని తోక చుక్క అంటారు" అని చెప్పాడు. అయితే ఒక తోక చుక్క పేరు చెపుమని మళ్ళీ ఆ టీచరు అడిగింది.ఆ పిల్లవాడు 'మిక్కీమౌస్' అని సమాధానమిచ్చాడు.

పిల్లలకి భయం ఉండదు. వారు చెప్పాలనుకున్నది వెంటనే అనేసారు. వారు మరు క్షణంలో ఏం మాట్లాడతారో ఎవరూ చెప్పలేరు. అదే వారి ప్రత్యేకత. ఇక్కడ సమస్య ఏమంటే చిన్న పిల్లల సహజస్వభావాన్ని మనం ఒప్పుకుంటాం. అదే పెద్దవారిలో తప్పు పడతాం. ఒక పిల్లవాని సహజత్వానికి మనసులో చోటిస్తాం, కానీ మన తోటివారి సహజత్వాన్ని మనం భరించలేం.

పిల్లలు కొట్టినా ఏమీ అనరు, పైగా ఆనందిస్తారు. అదే పెద్దవారు చేస్తే ఊరుకుంటారా? పిల్లల అమాయకత్వం వల్ల కొట్టడం కూడా అందంగా అనిపిస్తుంది. పిల్లలు చేసే దాని వెనక అమాయకత్వం ఉంటుంది. పెద్దవాళ్ళు చేసే పని వెనక మనసు ఉంటుంది, అదే తేడా.

అమాయకత్వం/ సంపూర్ణత్వం, పరిణతి

ధమ్మపదలో ఇలా ఉంది : "అంతరంగికదీపం వెలిగించు, జ్ఞానం పొందడానికి కష్టపడు, స్వచ్చంగా, అమాయకంగా ఉండు. కాంతి అనే ప్రపంచంలో నివసించు."

నీవు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఒక అమాయకమైన చంటి బిడ్డవు. సమాజం నీకు మనసు అనేది కల్పించేంత వరకూ, నీవు అమాయకత్వం అనే కాంతిని ప్రసరించావు. ఇప్పుడు నీ బుద్ధిని వదిలేసి మళ్ళీ అమాయకంగా ఉండాలనుకుంటున్నావు. అమాయకతాన్ని తిరిగి పొందడమే పరిణతి. అమాయకత్యాన్ని తిరిగి పొందవచ్చు. నీవు ఒకప్పుడు అమాయకంగా ఉన్నావని నమ్మకం ఉంటే చాలు. నీలో ఆ అమాయకత్వం ఇంకా ఉందని నమ్మితే మళ్ళీ దాని కాంతిని ప్రసరించవచ్చు. అది అర్థం చేసుకుంటే తిరిగి ఆ పని ఆరంభమౌతుంది.

పరిణతి, మనం సంపూర్ణంగా జీవించేట్లు చేస్తుంది. సంపూర్ణత్వం అనేది ఎంతో అమాయకత్వం వల్ల కలుగుతుంది. మీలో ఏ అభిప్రాయం, తీర్పూ లేవు. కేవలం ఆ క్షణానికి తీవ్రమైన ఉత్సాహంతో వికసించటమే అమాయకత్వం. మళ్ళీ మీరు అమాయకంగా ఉండాలంటే ఒకటే మార్గం, మీరు అబద్ధమైన జ్ఞానం వెనుక దాగవద్దు. దాని నుండి బయటకు వచ్చి మీ సహజసితిని తెలియజేయండి. అప్పుడు మీరు పూర్తి వికాసంతో ఉన్నట్లు. అదే జ్ఞానోదయానికి దారి తీస్తుంది. మొదట మీరు ఎక్కడ దాగి ఉన్నారో తెలుసుకోవాలి. రెండవది మీరు అక్కడ నుండి బయటకు రావడానికి తీసుకున్న బలమైన నిర్ణయం. అప్పుడు అమాయకత్వం పరిణతి పొందుతుంది.

మీరు పరిణతి చెందాలంటే, మొదట మీరు మీ లోపలకు వెళ్ళాలి. మీరు మీ సహజ స్వభావంతో, అరమరికలు లేకుండా, హాయిగా ఉండడమే పరిణతి చెందటం. మీ సహజ స్వభావంతో ఉండాలంటే మీ మనసుని తేలికగా ఉంచండి. మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మీ అంతరంగాన్ని ఎప్పుడూ హాయిగా ఉంచండి. అప్పుడు మీరు స్వచ్ఛతను నిలబెట్టుకోవచ్చు, మీ అంతరంగంలో ఉన్న మీ సహజస్వభావాన్ని కష్టపడకుండా, అరమరికలు లేకుండా గ్రహించాలి.

సమాజం మిమ్మల్ని ఎప్పుడూ ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండమని చెప్పడం వల్ల మీ సహజ స్వభావం అణిగిపోతుంది. నిరంతరం ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండవలసిన అవసరంలేదు. అది ఒక అపరిపక్వమైన ఆలోచన. ఆ ఆలోచనను వదిలేస్తే మనసు విశాంతిని పొందుతుంది. మనసు నేర్చుతో ఉండాలనే ఒత్తిడి ఉండదు. ఈ విశ్రాంతి అమాయకత్వాన్ని పుట్టిస్తుంది.

మీరు మీ మనస్సుని శాంతపరచలేకపోతున్నారు. కాబట్టి అమాయకత్వం కోసం ప్రయత్న పడుతున్నారు. మీరు అమాయకత్వాన్ని తిరిగి పొందడానికి మీ మనసు అడ్డుపడుతుందని అర్థం చేసుకుంటే ఆ పోరాటం ఉండదు. మీరు అర్థం చేసుకోకపోతే పోరాటం తప్పదు. ఆ పోరాటాన్ని మీ అహం అడ్డుకుంటుంది.

మీరు మనసును వదిలితే ఈ క్షణంలోకి వస్తారు. మీ మనసు భూతభవిష్యత్తుల మధ్య ఊగిసలాడుతుంది. ఒక పిల్లవాడు ఎప్పుడు వర్తమానంలోనే ఉంటాడు. జరిగిపోయిన దాన్ని గుర్తుంచుకోదు. అది వాడికి అవసరం లేదు. ఆ క్షణాన్ని ఆనందించడంలోనే ఇష్టం చూపిస్తాడు. మనం ఏదైనా గుర్తు తెచ్చుకోవాలంటే క్షణాలనే కాని రోజుల్ని గుర్తు తెచ్చుకోలేం. అలా కాకుండా ప్రతి క్షణాన్నీ గుర్తుంచుకొనేట్టుగా చేసుకోవాలి. భూతభవిష్యత్ముల వెనక పరుగులు పెట్టకూడదు.

దారి తప్పినపుడే మీకు అమాయకత్వం తిరిగి పొందాలన్న ప్రేరణ కలుగుతుంది. మీరు పెడదారి పట్టినపుడు దాని పర్యవసాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పుడు ఆత్మపరిశీలన ఆరంభమౌతుంది. ఆ ఆత్మపరిశీలనే మీలో మిమ్మల్ని తిరిగి అమాయకత్వం పొందడానికి ప్రేరేపిస్తుంది. పెడదారి పట్టినపుడు మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు.

అవగాహన తెచ్చుకొని సరైన మార్గంలో సమైక్యం పొందండి. మీ చైతన్యస్థితిని తెలుసుకోవటం, నిజాయితీతో సమైక్యం చెందటం, జరిగినపుడు మీరు పసిబిడ్డగా అవుతారు. పసితనంలో ఉన్నపుడు మీలో అమాయకత్వం ఉంది కాని అది అవగాహనతో కాదు. మీరు ఎదిగిన తరువాత అమాయకత్వాన్ని కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి పొందుతున్నారు. ఈ కొత్త అమాయకత్వం పూర్తి అవగాహనతో ఉంటుంది. ఇదే అసలైన అమాయకత్వం. మీరు అమాయకతాన్ని తిరిగి పొందినపుడు, పసితనం కంటె విలువైంది ఏదీ లేదనే నిర్ణయంతో వికసిస్తారు. అదే జ్ఞానోదయానికి దారి తీస్తుంది.

అందుకే పసివారి అమాయకత్వాన్ని చాలా జాగ్రత్తగా పోషించాలి. వారి అమాయకత్వం మీద మన జ్ఞానాన్ని ఆపాదించకపోతే, వారు తమ అమాయకత్యాన్ని పోగొట్టుకోకుండా పెరుగుతారు. ఉదాహరణకి, ఆకాశం కొన్ని సమయాల్తో నీలంగా, అప్పుడప్పుడూ తెల్లగా ఎందుకు ఉంటుంది, అని పిల్లవాడు అడిగితే అది అలాగే ఉంటుందని చెప్పాలి. ఆ పిల్లవాడు చదువుకొనేటప్పుడు దాన్ని గురించి ఎలాగూ తెలుసుకుంటాడు. మీరు అది అలాగే ఉంటుంది, అని చెప్పడం వల్ల ప్రకృతి సహజంగా ఎలా ఉంటుందనేది పిల్లవాడికి అర్ధమవుతుంది. దాని గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకోడు. ఆ జ్ఞానాన్ని విశ్వవిద్యాలయాలు ఎలాగూ అతనికి అందిస్తాయి.

ఆకాశం సహజంగా అలాగే ఉంటుందని మీరు పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పి దానికి జ్ఞానంతో పని లేదని తెలియజేస్తే, అతనిలోని అమాయకత్వం అలాగే ఉండిపోతుంది. అతడు చూడగలుగుతాడు. ఎప్పుడెతే వర్ణించడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు అమాయకత్వమనేది పోతుంది. అది చూడటం కాదు, గమనించడం అవుతుంది. దాంతో మొత్తం అందం పోయినట్లే. ఎదగడాన్ని అందరూ గంభీరంగా చూసారు. గంభీరతతో పెరిగితే మీరు కేవలం పెద్దవాళ్ళవుతారు, ఆడుతూ పాడుతూ, పెరిగితే మీరు చిన్నగానే ఉంటారు. అప్పుడప్పుడు పిల్లల్ని జంతువుల్ని గమనిస్తే, అవి ఆడుతూ, పాడుతూ అమాయకత్వంతో ఉంటాయి. వాటిని చూస్తే మనం తిరిగి అమాయకత్వంతో సంబంధం ఏర్పరచుకోవచ్చు.

ఒక చిన్న కథ : ఒక సింహం అడవిలో వెళ్ళూ క్రూరజంతువు లన్నిటిలో గొప్ప జంతువు ఏది? అన్న సమాచారాన్ని సేకరిస్తూంది. ఆ సింహం ఒక ఖడ్గమృగాన్ని చూసి, ఈ అడవికి రాజు ఎవరు? అని ప్రశ్నించింది. 'తప్పకుండా మీరే' అని అది సమాధానమిచ్చింది. సింహం సంతోషంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. జీబ్రాను కూడా అదే ప్రశ్న అడిగింది. జీబ్రా కూడా నువ్వే ఈ అడవికి రాజువి అన్నది. సింహం గర్వంగా ముందుకి నడిచింది. అక్కడ ఉన్న ఒక ఏనుగుతో ఈ అడవికి రాజు ఎవరో చెప్పు అనగానే ఏనుగు తొండంతో సింహాన్ని పట్టుకొని ఒక చెట్టుకేసి విసిరింది. సింహం చెట్టుకు కొట్టుకొని, కింద పడి, నీకు సరైన సమాధానం తెలియకపోతే అంత పిచ్చి కోపం తెచ్చుకోవాలా? అంది.

అమాయకత్వంతో జీవితాన్ని సమీపించాలి, ఎప్పుడెతే మీరు మీ అమాయకతాన్ని తిరిగి పొందాలని గ్రహిస్తారో ఆ క్షణమే మీరు మార్పుకు సిద్ధంగా ఉన్నారని అర్థం. అమాయకత్వాన్ని మీరు తిరిగి పొందడానికి మీ జీవితంలో జరిగే చిన్న సంఘటనకూ మీ ప్రతిచర్యను గమనిస్తే తెలుస్తుంది, అదే సరైన కొలమానం. అమాయకత్వం అన్నింటినీ ఆశ్చర్యంగా, వినయంగా చూస్తుంది. చిన్న పిల్లల కళ్ళల్లో ఎప్పుడూ ఆశ్చర్యం కనిపిస్తుంది. మీరు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారంటే అమాయకత్వం పొందుతున్నారని అర్థం. అప్పుడు మీకు ప్రపంచజ్షానం ఎంత ఉన్నా, మీ కళ్ళు స్వచ్ఛంగా, అమాయకంగా ఉంటాయి. అటువంటి కళ్ళు ఋషులకు ఉంటాయి.

పిల్లలు అమాయకత్వంతో ఎన్నో తెలుసుకుంటారు. కాని అర్థం చేసుకోలేరు. పిల్లలు తమ అమాయకత్వంలోనే వాటిని అనందిస్తారు. కానీ అమాయకత్వాన్ని తిరిగి పొందినవారు ఏదైనా కనుగొన్నపుడు పూర్తిగా అర్థం చేసుకొంటారు. అదే ఇద్దరికీ ఉన్న తేడా.

పిల్లల అమాయకత్వం అందంగా ఉంటుంది. కాని అంత మాత్రమే సరిపోదు. అది జీవితంలో పోగొట్టుకొని, తిరిగి పూర్తి అవగాహనతో పరిణతి పొందాలి.

ఒక పిచ్చివాడు, యోగి, ఒకేలాగా కనిపిస్తారు. వారిద్దరి ప్రవర్తనా విపరీతంగానే ఉంటుంది. కారణం లేకుండా నవ్వుతారు. అర్థం లేని పనులు చేస్తారు. వారు ఒక పటానికి రెండు అంచుల వంటివారు. అంచులు రెండూ ఒకేలా ఉంటాయి. చూడటానికి వారిద్ధరూ ఒకే విధంగా కనిపిస్తారు అంతే. ఒక పసివాడు, యోగి కూడా ఒకేలా కనిపిస్తారు. కాకపోతే ఆ పసివాడికి ఇంకా అమాయకత్వాన్ని తిరిగి పొందటం ఆరంభం కాలేదు. యోగికి పూర్తి అయిపోయింది.

పిల్లవాడి అమాయకత్వం భగవంతుడు ఇచ్చింది. కానీ జీవితంలో తిరిగి పొందింది కాదు. పిల్లవాడి అమాయకత్వాన్ని సులభంగా చెదరగొట్టవచ్చు. యోగి అమాయకత్వాన్ని చెదరగొట్టలేం. అమాయకత్వాన్ని పోగొట్టుకొని, తిరిగి దాన్ని శాశ్వతంగా పొందటమే పరిణతి చెందడం. అది చిత్రపటానికి ఒక చివరి నుండి మరొక చివరికి ప్రయాణించదం వంటిది.

ఒక పసివాడిని ప్రేమతో పెంచితే వాడి అమాయకత్వాన్ని పదిలపరచినట్లే. అప్పుడు అతడు తన హృదయంతోనే కాని ఆలోచనతో పనిచెయ్యడు, అవసరమైనపుడు తన తెలివితేటల్ని ఉపయోగిస్తాడు, అందువల్ల ఆ పిల్లవాడు పనికి రాకుండా పోతాడని అర్థం కాదు, అతని అమాయకత్వాన్ని జ్ఞానం చెడగొట్టదు. అతడికి జ్ఞానం కేంద్రం కాదు. ప్రేమే కేంద్రం అవుతుంది. జ్ఞానం అనేది సమస్య కాదు. దాన్ని మనం వాడుకునే విధానంలోనే సమస్య.

మీరు అమాయకత్వాన్ని తిరిగి పొందినప్పుడు ఇంకొకరి కళ్ళలోకి సూటిగా చూడగలుగుతారు, మిమ్మల్ని అమాయకత్వం చేతనస్థితిలోకి తీసుకురావటమే కాకుండా పరిపూర్ణతను కలిగిస్తుంది.

అమాయకత్వాన్ని తిరిగిపొందినపుడు, సమైక్యభావంతో, మీ తోనూ, ఇతరులతోనూ నిజాయితీగా ఉంటారు, మీ కళ్ళలోని నిజాయితీ ఇతరులను ఆకట్టుకుంటుంది. ఆ నిజాయితే పరిణతి.

తిరిగి అమాయకత్వం పొందాలనుకుంటే చాలు, మీలో మీరు కానిదాన్ని నాశనం చేస్తుంది. అవన్నీ నిబంధనల పొరలే. పూర్తిగా ఆ పొరలు తొలగిపోయేంత వరకు దృఢమైన నిశ్చయంతో ఉండాలి. ఆ సంకల్పం నేర్చుతో కాకుండా, నిజాయితీగా, సద్భావంతో ఉండడాన్ని గుర్తు చేసుకోండి. పూర్తిగా మీలో నిబంధనల పొరలు తొలగిపోయేవరకు విశ్రాంతి తీసుకోనని గట్టి నిర్ణయం తీసుకోండి.

పరిణతి చెందడంలో అందం ఏమంటే, అవసరమైనపుడు, పెద్దవారిలా లేకపోతే చిన్నపిల్లల్లా ఉండచ్చు. ఒక స్థితి నుండి వేరొక స్థితికి సులభంగా మారుతూ, మీ అంతరంగంతో అన్యోన్యంగా ఉంటారు.

మీరు మళ్ళీ అమాయకత్వాన్ని పొందితే, మిమ్మల్ని 'ద్విజ' అని అంటారు. దీనికి కీలకం మీరు అమాయకత్వాన్ని తిరిగి పొందే ప్రయత్నాన్ని వదలకపోవటమే. వెంటనే అమాయకత్వం పొందలేకపోవడం వల్ల ఆశాభంగం కలుగుతుంది. దీనికి కారణం సమాజం మిమ్మల్ని చాలా నియమాలతో కట్టుదిట్టం చేసింది. ఉల్లిపాయ పొరలు ఎలా తీస్తామో అలా ఆ నియమాల పొరలన్నీ తీస్తే, అమాయకత్వకేంద్రానికి చేరుతారు. అందుకే విశ్రాంతి తీసుకోకుండా ఉంటే, అమాయకత్వం తిరిగి పొందుతారు. అమాయకత్వం మీలో ఉంది. అది బాహ్యంగా చేరవలసిన లక్ష్యం కాదని గుర్తు తెచ్చుకుంటే, ప్రతి ఆశాభంగం వెనుకా ఆశ కనిపిస్తుంది.

ప్రతి రోజూ, కొద్ది క్షణాలు మీరు ఒంటరిగా కూర్చుని, ప్రశాంతంగా మీలోకి వెళ్ళి, స్వచ్ఛతని, అమాయకత్వాన్ని అనుభూతి చెందండి. ఆ అనుభూతి మీ శరీరంలో, మనస్సులో అంతరంగంలో వ్యాపించనివ్వండి. మీ అమాయకత్వంతో ఎంత అందంగా ఉన్నారో అనుభూతి చెందుతారు. ఇలా చేస్తే త్వరలోనే అది సహజస్వభావం అవుతుంది. మీలో మీరు కానిది కాలిపోయి అసలైన మీరు బయటికి వస్తారు.

అమాయకత్వం సంపూర్ణత్వంతో ఉంటుంది. ఆ సంపూర్ణత్వాన్నే 'సుకుమారం' అంటారు. అందువలనే జ్ఞానోదయమైన గురువులు సుకుమారంగా, అందంగా ఉంటారు. చూసేవారికి అమాయకత్వం ఒక అద్భుతమైన అందంగా కనబడుతుంది. ఎంతో నేర్పు గలవారు కూడా కాదనలేనంత సంపూర్ణంగా ఉంటుంది. అది తర్కాన్ని కాదని మిమ్మల్ని స్పృశిస్తుంది.

అమాయకత్వం పొందడం అంటే మన అంతరాత్మ నుండి పని చేస్తున్నట్టు ఆలోచనలు లేని అవగాహనతో ఉండడం. అంత వరకు మీరు మీ మనస్సుతో పని చేస్తున్నారు. మీ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయో గమనిస్తే, అవి విడిచిపెట్టి, చిన్నప్పటి ఆలోచనలు లేని అవగాహన స్థితికి వెళతారు. అదే అమాయకత్వం కాని ఇది పరిణతి చెందిన అమాయకత్వం. ఈ అవగాహన మీ జ్ఞానానికి ఏమీ జోడించదు, మీ అమాయకత్వాన్ని మరింత గాఢం చేస్తుంది.

జీవిత ద్వారాల్ని తెరిచే అమాయకత్వం

అది విశ్వాన్ని ఇంకా అద్భుతంగా, అందంగా కనిపించేట్లు చేస్తుంది. అమాయకతానికి వ్యతిరేకభావాలు ఉండవు. అది చూస్తూ ఉంటుంది. తార్కికదృష్టి లేకపోవడమే అమాయకత్వపు అందం. ఒక యువకుడు చాలా కాలం తరువాత తన స్నేహితురాల్ని చూదటానికి వెళ్ళాడు. అప్పుడు ఆ అమ్మాయి తమ్ముడు అక్కడే కూర్చుని ఏదో తింటూ టి.వి. చూస్తున్నాడు. ఆ యువకుడు అబ్బాయిని మేడ మీదికి వెళ్ళి రోడ్డు మీద ఎర్ర టోపీతో వెళ్ళేవారిని లెక్కపెట్టమని, ఒక్కొక్కరికి 50 పైసల చొప్పున ఇస్తానని చెప్తాడు. ఆ చిన్నబ్బాయి హుషారుగా మేడ మీదికి వెళ్ళాడు. ఆ యువకుడు తన స్నేహితురాలి దగ్గర కూర్చుని మాట్లాడే సమయంలో పది నిమిషాల తరువాత ఆ అమ్మాయి తమ్ముడు, ఆ గదిలోకి హఠాత్తుగా వచ్చాడు. ఆ యువకుడు, కోపంగా, 'నేను నిన్ను రోడ్డు మీద వెళ్ళే ఎర్ర టోపీల వాళ్ళని లెక్కపెట్టమన్నానా? అని అరిచాడు. ఆ చిన్న అబ్బాయి ఆయాసపడుతూ 'నాకు తెలుసు ఇప్పుడే ఎర్ర టోపీలు పెట్టుకున్న ఒక సైనిక సమూహం వెళ్ళింది. టోపీకి 50 పైసలు చొప్పున నువ్వు నాకు 1200 రూపాయలు ఇయ్యాలి' అని సమాధానమిచ్చాడు.

మనం పిల్లలు అంతగా ఎదగనివారనుకుంటాం. అలాగే పెద్దవారు ఏడ్చినా, వారి భావాలను వ్యక్తపరచినా, పరిణతి చెందలేదని అనుకుంటాం. వారి భావాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అమాయకత్వానికి నిదర్శనం. నేర్పరులు వారి భావాలను పూర్తిగా వ్యక్తపరచరు. ఎవరి ముందైనా ఏడ్వడంలో తప్పు లేదు. మీరు ఏం దాచాలనుకుంటున్నారు? ఏడ్వడం వల్ల మీ నిజమైన అనుభూతిని తెలియచేస్తున్నారు. అందులో దాచవలసింది ఏమి లేదు. సమస్య ఏమిటంటే సమాజం మీరు మీ నిజస్వభావాన్ని మరుగుపరచి వేరొకరిలా కనిపించేట్లు చేస్తుంది. కొంత కాలానికి మన సహజస్వభావాన్ని, అమాయకత్యాన్ని మరిచిపోతాం.

ఉపాధ్యాయులు – తల్లిదండ్రుల సమావేశంలో ఒక టీచరు, ఒక అమ్మాయి తండ్రితో 'మీ అమ్మాయి అన్నింట్లోనూ చక్కగా ఉంటుంది. కాని ఇంకా పూర్తిగా ఎదగలేదు' అన్నది. దానికి ఆ తండ్రి టీచర్‌కేసి ప్రశ్నార్థకంగా చూసి, మూడేళ్ళ పిల్ల ఎలా ఉండాలని మీ ఉద్దేశ్యం? అని అడిగాడు.

పిల్లలతో వారి స్నేహితునిలా ఆడుతూ పాడుతూ గడిపితే, మళ్ళీ అమాయకత్వాన్ని పొందవచ్చు. వారితో ఉన్నప్పుడు నటించకుండా, నిజంగా పిల్లలా అయిపోండి. అదే మీరు మీకు చేసుకునే ఉపకారం.

మన సమస్య, సమాజం మనకి నేర్చినదాన్ని పొగొట్టుకుంటామని భయం. సమాజం నుండి మన వ్యక్తిత్వం ఎలా ఉండాలో నేర్చుకుంటాం. మన సహజస్వభావం, వ్యక్తిత్వం వేరు. సహజ స్వభావం నిజమైంది, వ్యక్తిత్వం నిర్మించుకున్నది. మన సహజస్వభావాన్ని దృఢపరిస్తే మనం వాస్తవంలో ఉన్నట్టు, వ్యక్తిత్వాన్ని దృఢపరిస్తే ఊహల్లో ఉన్నట్టు.

మనం పిల్లలు తినే విధానం చూసే వారు ఎంత ఇష్టంగా తింటారో తెలుస్తుంది. ఉదాహరణకి వాళ్ళు బంగాళ దుంప చిప్స్ తినేటప్పుడు ప్రతీది ఎంతో ఆనందంతో చూస్తూ ఇష్టంగా తింటారు. అదే వారికి గొప్ప ఆశీర్వాదం. పిల్లలు తింటున్నది చూసి, మనం వాళ్ళని వేగంగా తినమని తొందర చేస్తాం. ఆ విధంగా మనం జీవితంలో అద్భుతక్షణాలను, అమాయకత్వాన్ని తెలుసుకునే స్థితిని కోల్పోతాం.

మీలో దాగి ఉన్న పసితనాన్ని కనుగొనడానికి ఎన్నో విధాలు ఉన్నాయి. పిల్లలతో దాగుడుమూతలు ఆడండి. టామ్ అండ్ జెర్రీ కార్టూన్ చూడండి. మట్టితో బొమ్మలు చెయ్యండి, లేదా, రంగురంగుల పీచు మిఠాయి తినండి ఇవన్నీ మీలో ఉన్న చిన్నతనాన్ని బయటకి తీసుకువస్తాయి. మీ కరడుగట్టిన వ్యక్తిత్వం కరిగిపోతుంది. మీరు ప్రవహించే నదిలా ప్రవహిస్తారు. మీ గంభీరత అనే బరువుని వదిలేసి తేలికై పరమానందస్థితికి వెళతారు.

గంభీరత అనేది అహం. మీరు మీ అధికారం పోతుందని, ఇతరులు బాధపడతారని భయపడడం వల్ల గంభీరంగా మారతారు. మీరు మిమ్మల్ని కేంద్రంగా చేసుకుంటే జరిగేది అదే. అన్నీ వదిలేసి, ఆడుతూ పాడుతూ, మీ అమాయకత్యాన్ని పొందగలరు. అప్పుడు కలిగే ఆనందం మీ గంభీరతని పోగొడుతుంది. ఆ కాస్త సమయంలో పట్టుకువేలాడడానికి ఏమీ లేదని అర్ధమవుతుంది. ఆ అవగాహన మీకు కలిగితే, మీరు పూర్తిగా అమాయకత్వాన్ని పొందడానికి, స్వచ్ఛం కావడానికి ముందుకి సాగిపోతారు.

అమాయకత్వం మన చైతన్యాన్ని బుద్దిలో స్థిరపడకుండా హృదయానికి దగ్గర చేస్తుంది.

  • అమాయకత్వం అంటే స్వచ్ఛమైన అంతరంగం. ★
  • తర్కజ్ఞానంతో అలసిపోయాక కాని మీరు మార్పుకి సిద్ధం కారు. ★
  • ★ మధ్యంతరంగా ఉండే జ్ఞానంలో స్థిరపడవద్దు, అంతిమసత్త్యంలోనే ఉండండి.
  • ★ మీరు అమాయకత్వంతో ప్రశ్నిస్తే మీరు జవాబు స్వీకరించటానికి పూర్తిగా సిద్ధంగా ఉంటారు.
  • ★ తెలియనిదాన్ని తెలుసుకోవటం అనేది పూర్తిగా ఆ విషయానికి అంకితమైనప్పుడే సాధ్యం.
  • ★ ఏదో ఒక అభిప్రాయాన్ని పట్టుకొని వేలాడకుండా ఉండటమే అమాయకత్వం.
  • ★ సమాజం సృష్టించిన కలను మీ మనస్సు దాన్నే కొలబద్ధలా ఉపయోగించి మిమ్మల్ని కొలుస్తారు.
  • ★ విశ్వాసం ఒక దృక్పథం. అది అమాయకత్వానికి, అంకితానికి, విరామస్థితికి, పరమానందానికి తీసుకువెళుతుంది.
  • ★ ఆధ్యాత్మికతని అమాయకత్వంతో సాధన చేస్తే మీరు పసిబిడ్డల్లా ఉంటారు.
  • అమాయకత్వం దేవునికి చేసే ఒక గొప్ప ప్రార్థన. ★
  • ★ మోసపూరితమైన నేర్పరితనం మిమ్మల్ని విడదీస్తుంది. అది నిరంతరం లెక్కలు కడుతుంది.
  • ★ పిల్లల్లోని అమాయకత్వశక్తి వారి వెనకనే ఉంటుంది. అదే పెద్దవారిలో వారి మనస్సు వారి వెనుక ఉంటుంది.

సమష్టిచైతన్యంలో మీరూ ఒక భాగం

మనం ఇప్పుడు కొంచెం కష్టమైన విషయం గురించి తెలుసుకుందాం. అది మన చుట్టూ ఉన్న బయటి ప్రపంచానికి, మనకి ఉన్న సంబంధం. మనం చూసేది ఎందుకు అలా కనబడుతుంది? మనం చూసేది ఎలా చూస్తాం? మనం ఈ విశ్వశక్తి సృష్టిలో ఎలా ఇముడుతాం?

పదార్థం, శక్తికి అతీతమైన..

ఈ ప్రపంచం దేంతో చేయబడింది? మన పంచేంద్రియాలు, చూడటం, వినడం, వాసన, రుచి, స్పర్శ అనేవి ఈ ప్రపంచాన్ని అనుభూతి చెందడానికి ద్వారాల వంటివి. అవి, ఈ ప్రపంచం పదార్థంతో చేయబడిందని మనకు తెలియజేసాయి. వస్తువులు వివిధ ఆకారాలు, రంగులు, గుణాలు కలిగి ఉంటాయి.

మనం ఐదు మూలకాలైన – భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశంతో ఏర్పడిన మూడు పరిమాణాలు గల ప్రపంచంలో నివసిస్తున్నాం. మనం ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు, కాలంతో మార్పు చెందడం చూస్తాం. అన్నీ కాలంతో సృష్టి, స్థితి, లయం చెందుతాయి.

పదార్థం, మూడు గమనసూత్రాలు, గురుత్వాకర్షణ, ప్రవాహగతికశాస్త్రం అనే భౌతిక సూత్రాలకు లోబడి ఉంటుందని, మన ప్రాచీన భౌతికశాస్త్రం చెప్పన్నది. అన్ని వస్తువులు, అణువులతో, అవి పరమాణువులతో, పరమాణువులు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రానులతో చేయబడి ఉంటాయి. ఈ ప్రాథమికవిషయాలన్నీ మనం స్కూలులో నేర్చుకున్నాం.

కాని ఆధునికశాస్త్ర ప్రకారం, ప్రపంచం మౌలికంగా పదార్థంతో చేయబడలేదు. ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రానులు ప్రాథమిక కణాలు కావు. పదార్ధమే శక్తి అని ఆధునికశాస్త్రం చెబుతుంది.

ప్రపంచ ప్రసిద్ధి కెక్కిన ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ సమీకరణం E=mc² ('E'అనేది శక్తి, m అన్నది ద్రవ్యరాశి, c అంటే కాంతి వేగం) పదార్థం, శక్తి రెండూ ఒక్కటే అని నిరూపిస్తుంది. నేను ఈ మధ్య ఒక అమెరికా జర్నల్‌లో ఈ సమీకరణనిరూపణ గురించి చదివాను. కేంద్రకం nucleus లో ఉన్న ప్రాథమికకణాలు ఇంకా చిన్నవైన క్వార్కులు Quarks తో చేయబడ్డాయి. అవి గ్లూఆన్సు Gluons తో అతకబడి ప్రాథమికకణాల కింద ఏర్పడతాయి. అన్నింటి కంటే ఆశ్చర్యమైన విషయం, గ్లూఆన్సుకి ద్రవ్యరాశి '0' క్వార్కులకి ద్రవ్యరాశి 5% మాత్రమే ఉంది. మిగతా 95% ద్రవ్యరాశి, ఆ గ్లూఆన్సుకి, క్వార్కుల మధ్య అంతరచర్య, కదలికల నుండి వచ్చే శక్తి నుండి వస్తుంది. అందుకే ద్రవ్యరాశి, శక్తి, సమానమైనవి.

సమష్టిచెతన్యంలో మీరూ ఒక భాగం

ఏ నిజాన్నయితే కొన్ని దశాబ్దాల కింద శాస్త్రం కనుక్కుందో, అదే తూర్పుదేశ ఋషులు, వేదసారమైన ఉపనిషత్శల్లో ప్రతిపాదించారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన ఈశావాస్య ఉపనిషత్శలోని మొదటి వాక్యం – ఈశావాస్యం ఇదం సర్వం – ఉన్నది అంతా శక్తిమయమే.

క్వాంటం ప్రపంచం

ఈ రోజున మనం క్వాంటం ప్రపంచయుగంలో ఉన్నాం. మనం క్వాంటం భౌతికశాస్త్రం, క్వాంటం లీప్స్, క్వాంటం ఆలోచన గురించి మాట్లాడుకుంటాం. అసలు క్వాంటం అనే పదానికి అర్థం ఏమిటి? క్వాంటం అంటే మధ్య ఉన్న స్థితుల్లో నుండి వెళ్ళకుండా, ఒక స్థితి నుండి ఇంకొక స్తితికి పెద్ద అడుగు వేయడం. ఈ రోజుల్లో మధ్య ఉన్న స్థితులలో నుండి వెళ్ళడానికి ఎవరికీ సమయం లేదు. ప్రతి దానిలో వెంటనే ఫలితాలు కావాలి. మనకి క్వాంటం ఫలితాలు కావాలి.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తికి నిద్ర సరిగ్గా పట్టక డాక్టర్ దగ్గరకు వెళ్ళి నిద్రకు మంచి మందు ఇమ్మన్నాడు. డాక్టర్ ఒక మాత్ర ఇచ్చి సగం వేసుకుంటే బాగా నిద్ర పడుతుందని చెప్తాడు.

ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి బాగా నిద్ర పట్టడానికి పూర్తి వేసుకున్నాడు. ఉదయం లేచేసరికి అతనికి తాజాగా, ఉత్సాహంగా అనిపించింది, అతను ఆఫీసుకు వెళ్ళాడు. మేనేజరు దగ్గరకి వెళ్ళి, 'నేను ఇవాళ ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నిన్న రాత్రి మొద్దు నిద్రపోయాను. ఉదయం లేవగానే ఒక పిల్లవాడినన్న భావన కలుగుతూంది' అన్నాడు.

'బావుంది, కాని నిన్నంతా నువ్వు ఎక్కడ ఉన్నావు?' అని మేనేజరు అడిగాడు.

మనకు ప్రతి దాంట్లో క్వాంటం ఫలితమే కావాలి. పరమాణువులో కేంద్రకం ఉంటుంది, దాని చుట్టూ, ఎలక్ట్రానులు నిర్దిష్టమైన దూరాల్లో తిరుగుతాయని నేర్చుకున్నాం.

ఎలక్ట్రాను తన కక్ష్యలోనే ఉంటుందని నేర్చుకున్నాం. ఆ ఎలక్ట్రాను వేడి వల్ల లేదా రసాయనికచర్య వల్ల ఉత్తేజితమైతే, అది కొంత శక్తిని విదుదల చేసి పై కక్ష్యలోకి వెళ్ళుతుంది. కొంత శక్తిని ఇచ్చేసి కింది కక్ష్యకి వచ్చేస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎలక్ట్రాను ఒక కక్ష్య నుండి ఇంకొక కక్ష్యకు, మధ్యనున్న స్థలంలో నుండి వెళ్ళకుండా దూకుతుంది. ఒక క్షణం ఒక కక్ష్యలో ఉంటుంది, మరుక్షణం వేరొక కక్ష్యలో ఉంటుంది. దీన్నే క్వాంటం జంప్ అంటాం. క్వాంటం జంప్ అంటే మధ్య నుండి వెళ్ళకుండా ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి మారడం.

పదార్థ కంపనశక్తి

శక్తి తరచుగా కంపిస్తూ వివిధరూపాలు తీసుకోదాన్నే పదార్థం అని అంటారు. ఈ తరచుదనం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కంపనాలు మన కంటికి కనిపించవు. కదలిక చాలా వేగంగా ఉంటే విడిగా ఉన్న ఫలకాల్లో వస్తువులని కళ్ళు చూడలేవు. కళ్ళకి ఒక వస్తువు ఇంకొక దాంట్లో నిరంతరం విలీనం అవడమే కనిపిస్తుంది.

అలాగే శక్తికంపనాలు కంటికి కనిపించవు. అది ఘనపదార్ధం కింద కనిపిస్తుంది. శక్తి స్థూలరూపపదార్థం. పదార్థం సూక్ష్మరూపం శక్తి. సూక్ష్మరూపంలో ఉన్న మనస్సుకి స్థూలరూపమే శరీరం. స్థూలమైన శరీరానికి సూక్ష్మరూపం మనస్సు. వ్యక్తి వ్యక్తికి మనస్సు పని చేసే విధానం వేరుగా ఉంటుంది అని అర్థం చేసుకోండి.

మనుష్యుల మధ్య పరస్సర లేదా అంతరచర్యలు కూడా శక్తి అంతరచర్యలే. ఉదాహరణకి, పరమాణువులో కేంద్రం చుట్టూ మేఘంలా ఉన్న ఎలక్రానులను, ఒక ఫుట్ బాల్ క్షేతంతో పోల్చవచ్చు. కేంద్రం ఆ క్షేతంలో ఒక వేరుసెనగ గింజంత ఉంటుంది. చుట్టూ ఉన్న ఎలక్షానులు, క్షేతంలో ఉన్న ఖాళీ స్థలంలా ఉంటాయి. ఇంకొక పోలిక ఏమిటంటే భూమి మీద ఉన్న పరమాణువుల మధ్య ఖాళీస్థలం తీసేస్తే అది ఒక పంచదార క్యూబ్‌లా తయారవుతుంది. ఈ ఉదాహరణలో ఘనపదార్థంలా కనిపించే పుట్ బాల్ క్షేత్రం నిజానికి పెద్ద ఖాళీ స్థలాల్లో ఉన్న ఎలక్షాను మేఘాలు. ఒక దానిలో ఒకటి అంతరచర్యలో ఉన్నాయి. ఇదే విధంగా, మిగతావారితో మన పరస్సర అంతరచర్యలు కేవలం శక్తి అంతరచర్వలే. ఈ చర్యలో శక్తిని ఉపయోగించటం జరుగుతుంది. మీరు కొంత శక్తిని ఇచ్చి వేరొక వ్యక్తి లేదా వస్తువు నుండి శక్తి తీసుకుంటారు.

సాధ్యమైనవి అనంతం

అసలు పదార్థానికి శక్తికి ఉత్పత్తిస్థానం అంటే మూలం ఏది? శరీరానికి, మనస్సుకి ఉన్న అసలు సత్యం ఏమిటి? మన ఇందియాలతో నిజరూపాన్ని చూడలేకపోతే, ఆ నిజస్వభావం ఏమిటి?

శివసూత్రాల్లో ఈ ప్రశ్న ఉంది. శివుడి భార్య పార్వతీదేవి, 'ఈ అద్భుతమైన విశ్వం స్వభావం ఏమిటి?' అని అడిగింది.

దానికి సమాధానంగా శివుడు జ్ఞానోదయం పొందడానికి 112 సాంకేతికధ్యానపద్ధతులను చెప్తాడు. అవి సాధన చేస్తే, ప్రశ్నకు అనుభూతి రూపంలో సమాధానం వస్తుంది.

సత్యం గురించి ఈ ప్రశ్న, మనని పదార్థానికి, శక్తికి అతీతంగా, కాలం, స్థలం, అవధులకి అతీతంగా తీసుకువెళుతుంది. ఈ ప్రపంచంలో అన్ని రకాల శక్తి బీజరూపంలో ఉన్నాయి. అదే ఆలోచనలకి మొదలు, ఈ భౌతికప్రపంచంలో జరిగే సంఘటన లన్నింటికీ అదే మూలం.

ప్రపంచానికి అతీతంగా, తర్కం ఉండదు. కారణం – ప్రభావాలకి సంబంధం ఉండదు. ఒక సంఘటన జరగడం, ఇంకొక సంఘటన జరగడానికి కారణం. రెండింటికీ పరస్పరసంబంధం ఉంటుంది. ఈ పరస్సరసంబంధం కాలం, స్థలం మీద ఆధారపడదు. అంటే మనం బీజం అనేది, అనంతశక్తి అనే మహాసముద్రం. అక్కడి నుండి సంఘటనలు కెరటాల రూపంలో పైకి లేస్తాయి.

అనంతవిశ్వం, అందులో జరిగే సంఘటనలు, అన్నీ కారణం లేని శుభకరాలే, మహాసముద్రంలో వస్తున్న కెరటాల వంటివి. విశ్వం అనేది పరమానందం, ఇది మహాసముద్రం. ఏ కారణం లేని పొంగి పొర్హుతున్న ట్రుబ్బానందం నుండి, విశ్వశక్తి అనే మహాసముద్రం లోంచి సృష్టి అనే కెరటం లేస్తుంది. అసంఖ్యమైన విశ్వాల్లో, అనంతమైన రూపాల్లో భగవంతుడు ఆడుకున్న ఆటే జీవం అంటే. ఆట వదిలేసి, ఆ విశ్వశక్తిలో కలిసిపోవడమే లయం అంటారు.

లయం చెందడం అంటే, ఆ పరబ్రహ్మస్థితికి తిరిగి చేరుకోవడం. ఏ కారణం లేకుండా మళ్ళీ ఆట మొదలవుతుంది. ఇది ఇలా కొనసాగుతుంది. మనం విశ్వంలో జరిగే అనంతమైనవాటిని ఫలితాల కింద చూస్తాం.

సహజ ప్రకృతి

మన వ్యక్తిగతగ్రహింపును బట్టి మనం ఈ కారణం లేని, పరమానందమైన విశ్వశక్తి ఆటని చూస్తాం. ఆ అద్భుతమైన ఆటని మన గ్రహింపు శక్తి ఒక స్థానిక సంఘటనలా చూపిస్తుంది. ప్రతి వ్యక్తి ఆ అందమైన సంఘటనని తన గ్రహింపుకి అనుగుణమైన సత్యాన్ని చూస్తాడు.

ఒకరు నన్ను అడిగారు 'నేను ఇక్కడ ఈ బల్లను చూస్తాను. ఈ గదిలో ఉన్న వ్యకులు అందరూ, అదే బల్లను చూస్తారు. అప్పుడు, ఈ బల్ల నిజరూపం కాదని ఎలా అనగలరు?' అని. అర్థం చేసుకోండి! 'నీవు చూసే ఈ బల్ల, ఇంకొకరు చూసేది ఒకలా ఉందవు. ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ బల్లను వేరేగా చూసారు. అదే అసలు నిజం' అదే నేను మీకు వివరించడానికి ప్రయత్నించాను.

మనస్సు గ్రహించినంతసేపూ, గ్రహించబడింది అంతిమసత్యం కాదు, కేవలం అనంతమైన చేతనస్థితి ఉన్నవారే, సత్యాన్ని అసలు జరిగినట్టుగా గ్రహించగలరు. అతను దాన్ని మాటలలో వివరించలేదు. మాటలు కాలానికి, స్తలానికి అతీతమైనవాటిని వివరించలేవు, అతను మీకు అదే అనుభూతి కలిగేవరకు వేచి ఉండని చెప్పగలడు. అందుకే శివభగవానుడు వేదాంతం నుండి సమాధానాలు ఇవ్వటం లేదు, ధ్యానపద్ధతులను చెప్పాడు. విశ్వశక్తిస్వభావం, సత్యాన్ని అనుభూతి చెందడానికి, సూటిగా, సాంకేతికపద్దతులను శివుడు దేవికి చెప్పాడు.

ఈ విషయాన్ని శక్తి – పదార్ధం అనే ఆధారం తీసుకుని వివరిస్తాను. నిజానికి పదార్డం – శక్తిరూపం. ప్రాచీనభౌతికశాస్త్రం, ఎలక్ష్రాను ఒక కణం అని చెప్తుంది. కాని క్వాంటం భౌతికశాస్త్రం, అది ఒక తరంగం అని చెప్పింది, వేరు పరిస్థితులలో ఎలక్ట్రాను, కణస్యభావాన్ని వ్యక్తపరుస్తుంది. భౌతికశాస్త్రవేత్తలు, ఎలక్ట్రానుకి 'కణం – తరంగం'గా రెండు స్వభావాలు ఉన్నాయి అని తీర్మానించారు.

సాధ్యాన్ని నిజం చేసే పరిశీలన

ఎలక్ష్మాను ఒక కణం అయితే అది ఎక్కడ ఉంటుంది? అది ఒక తరంగమైతే దాని వేగం ఎంత? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆశ్చర్యానికి దారి తీస్తాయి. ఈ కణం – తరంగం అనేది, కణమైనా లేదా తరంగమైనా కావచ్చు లేదా ఏకకాలంలో రెండూ అవవచ్చు. మీరు ఎలక్ష్మాను, స్థానం, వేగం ఒకేసారి కనుక్కోలేరు. స్థానం కనుక్కునే లోపల వేగం మారిపోతుంది. వేగం కనుక్కునే సమయంలో, స్థానం మారిపోతుంది. దీన్నే శాస్త్రంలో హైసన్‌బెర్గ్ అనిశ్చయనియమమని అంటారు.

కణం – తరంగం అనేది పరిశీలించేవరకు ఏకకాలంలో కణం, తరంగం అవచ్చు. ఈ పరిశీలనని, మనం కారణం లేకుండా విశ్వంలో జరిగేవాటిని పరిశీలనతో జోడించవచ్చు. మనం పరిశీలించేటప్పుడు, మన సంస్కారాల్లో, మనలో లోతుగా పాతుకుపోయి ఉన్న జ్ఞాపకాల్లో, పరిశీలిస్తాం. ప్రతి ఒక్కరి పరిశీలనా, వారి సంస్కారాలు లేదా ఎన్‌గ్రామ్స్‌తో ప్రభావితమవుతుంది. దీన్ని ఆధారం చేసుకుని, జరిగేదాన్ని తమ అనుభవానికి సరిపడే విధంగా నిజం అనుకుంటారు.

కణం – తరంగం విషయంలో పరిశీలన తరంగం – కణాన్ని, తరంగంలోకి లేదా కణంలోకి వెళ్ళిపోయేట్టుగా చేస్తుంది. ఇది ఎర్విన్‌స్‌స్కోడ్స్ అనే భౌతికశాస్త్రజ్ఞుడు తన ఊహించిన పిల్లి ప్రయోగంలో చూపించాడు.

మీరు ఒక పిల్లిని, చిన్న సీసాతో విషాన్ని ఒక అరలో పెట్టి మూశారనుకోండి. బయట ఉన్న పరిశీలకుడికి లోపల పిల్లి చచ్చిపోయిందో లేదా బతికీ ఉందో అన్నది తెలియదు. మనకు తెలియదు కాబట్టి, పిల్లి బతికి ఉంది, చనిపోయిందని రెండూ అనుకోవచ్చు. ఇది సంభావ్యతల వివరణ, అందులో చనిపోయే, బతికివున్న రెండు సంభావ్యతలు ఉంటాయి.

మీరు అరను తెరచి, పిల్లి స్థితిని చూడాలనుకుంటే, అరను తెరవడమే, పిల్లి స్థితిని మార్చేస్తుంది. మనం అరని బలవంతంగా తెరచేటప్పుడు, ఆ విషం సీసా పగిలి, పిల్లి చనిపోవచ్చు. అసలు జరిగింది ఏమిటో పరిశీలించకుండా, ఉంటే, ఎప్పటికీ ఏం జరిగిందో తెలియదు.

దీన్ని బట్టి రెండు స్టితులు ఒకేసారి సంభావ్యమని మనకు అర్థమవుతుంది. పరిశీలించడమే, ఈ సంభావ్యతని ప్రత్యేకమైన సత్యానికి మారుస్తుంది.

నేను మీకు అందమైన సత్యాన్ని, పరిశీలన అన్నది ఎలా మార్చేస్తుందో దానికి ఇంకొక శాస్త్రీయప్రయోగం చెప్తాను. మీరు – కాంతిలో రెండు చీలికల ప్రయోగం (double-slit experiment) గురించి విని ఉండవచ్చు. ఈ ప్రయోగంలో కాంతిపుంజాన్ని రెండు చీలికలు ఉండే రేకు మీద పడేటు చేసారు. రెండో వెపున ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేటు మీద, రెండు చీలికల నుండి వెళ్ళిన కాంతి పడుతుంది. ఒకే చీలిక తెరిచిఉంటే, ఫోటోగ్రాఫిక్ ప్లేటు మీద, కాంతి గీతలా ఏర్పడుతుంది. రెండు చీలికలు తెరిచి ఉంటే, ఆ ప్లేటు మీద రెండు గీతలు ఏర్పడతాయి అని

అసుకుంటాం, కాని చాలా గీతలు, గాధంగా లేనివి, మారుతున్న పరిమాణం గల నల్లనివి ఏర్పడతాయి. ఇదే కాంతివ్యతికరణనియమం, ఇందులో కాంతితరంగాలు కింద ప్రవర్శించి, ఒకదాంతో ఒకటి జోక్యం చేసుకుంటాయి. కాంతిపుంజవేగాన్ని బాగాతగ్గించినప్పుడు, ఫోటాన్న వెళ్ళి ప్లేటును తాకితే, వ్యతికరణం జరగకుండా, చీలికలో ఏకీభవించే కాంతి గీత కనపడాలి. కాని ఇప్పుదు కూడా కాంతి వ్యతికరణమే కనిపించింది.

ఇది ఎలా సాధ్యం? ఇక్కడ ఒక ఫోటానే ఉంది. అది వెళ్ళి దాంట్లోనే వ్యతికరణ చెందాలి కదా? ప్రతి ఫోటాను రెండు చీలికల నుండి వెళ్ళి, అదే సమయంలో అన్ని దారుల నుండి ఫోటోగ్రాఫిక్ ప్లేటు వైపు వెళ్ళుంది అని ప్ర‌యోగంలో నిరూపించారు.

ఇది ఎలా జరుగుతుందో చూడడానికి, ఒక ఫోటాను ఏ దారిలో వెళ్ళందో తెలుసుకోదానికి అనేకప్రయోగాలు చేసారు. ఆ ప్రయోగం చేసినప్పుడు, ఏదో విధంగా ఫొటాన్ల తోవ చెదరగొట్టబడేది. పరిశీలించడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్లేటు మీద రెండు గీతలు కనిపించేవి. వాటిని కొలవడానికి ప్రయత్నిస్తే, ఎన్నో గీతలు తక్కువ గాధంగా ఉన్నవి, నల్లనివి కనిపించేవి.

ఒక ఫోటాను ఒకేసారి చాలా దారులలో ప్రయాణిస్తుంది. కాని, వాటిని కొలవడానికి ప్రయత్నిస్తే, ఒకే బాటలోకి కలిసిపోతాయి. అలాగే మనం అనంతమైనవాటిని విశ్వం అనే మహాసముద్రంలో చూడాలని ప్రయత్నిస్తే, అది మన పరిమితమైన మనస్సుకి పరిమితంగా కనిపిస్తుంది.

ఒక జెన్ గురువుని అతని శిష్యుడు, 'అసలు బాట ఏది' అని అడిగాడు. 'ప్రతి రోజూ జీవితమే బాట' అని గురువు సమాధానం ఇచ్చారు. 'దాన్ని అధ్యయనం చెయ్యొచ్చా?' అని శిష్యుడు అన్నాడు.

గురువు 'నువ్వు అధ్యయనం చెయ్యాలని ప్రయత్నిస్తే, దానికి నువ్వు చాలా దూరంగా ఉంటావు' అని అన్నాడు. 'నేను అధ్యయనం చెయ్యకపోతే అదే బాట అని ఎలా తెలుస్తుంది?' అని శిష్యుడు అడిగాడు.

గురువు: 'ఆ దారి ప్రపంచానికి చెందదు. అది కనిపించని ప్రపంచానికి కూడా చెందదు. కనిపించేది మోసం. కనిపించనిది చైతన్యం లేనిది. నీకు అనుమానం లేకుండా నిజమైన పథాన్ని చేరాలంటే, ఆకాశానికి ఉన్నంత స్వేచ్చతో ఉందు. దానికి మంచిది, మంచిది కాదు అని పేరు పెట్టకు', అని జవాబు ఇస్తాడు.

విషయ గ్రహణస్థితి

మనం విషయాలని గ్రహించినప్పుడు, భౌతికస్టాయిలో నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

భౌతికవాస్తవాన్ని గ్రహించినప్పుడు, మెదడులోని వేర్వేరు భాగాలలో నాడీవ్యవస్థ నిర్శాణానికి మూలమైన నాడికణాలు ఒక్కసారిగా ప్రేరణ పొందటం చేత నరాల క్రియాశీలతలో మార్పు కనబడుతుంది. దీని వల్హ క్రమం లేకుండా కాంతి, విశేషమైన ఆకారాల్తో బొమ్మలని ఏర్సరుస్తుంది. మన స్పర్మేంద్రియాలు గ్రహించిన ప్రతి విషయం, శబ్ద, స్పర్త, గంధ, రుచి లేదా దృష్టి అనుభవం కింద మారుతుంది.

ఒక్కసారి వెనక్కి తిరిగి చూసే పరిశీలించి, గ్రహించే ముందు ప్రపంచం, మీరు అంటే చూడబడేది, చూసేవారు ఇద్దరూ కల్హోలస్థితిలో ఉంటారు. గ్రహించిన తరువాత కల్హోలస్థితి ఉన్న రెండు అంటే బాహ్యప్రపంచంలో చూడబడింది, చూసినవాడు, చూసే విధానంలో ఒకేసారి కొంత క్రమం ఏర్సదుతుంది. చూసే క్షణంలో, చూడబడిన దాని సంభావ్యత ఒక విశేషమైన ఆకారంలోకి మారిపోతుంది.

భగవద్దీతలో కృష్ణభగవానుడు తన శిష్యుడెన అర్జునుడికి తన విశ్వరూపదర్శనం అనుభూతిని ఇవ్వాలని అనుకుంటాడు. అప్పటి వరకు అర్జునుడు ఆరు అడుగుల అందమైన స్నేహితుడిని చూస్తాడు. అర్జునుని కోరిక మీద కృష్ణుడు తన విశ్వరూపం అర్జునుడు చూడడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకొని, ఆ అనుభూతిని అతనికి ఇవ్వదానికి నిర్ణయించుకుంటాడు. అర్జునుడు కృష్ణుడిలో మొత్తం విశ్వం అల్లకల్లోలంలో ఉండడం చూస్తాడు.

అర్జునుడు 'ఓ దేవా, నీ శరీరంలో నాకు అందరు దేవుళ్లు, దేవతలు, కనిపిస్తున్నారు. నాకు అందరు ఋషులు, దివ్యమైన స్మృతులు కనిపిస్తున్నాయి. విశ్వం అంతటికి అయిన ఓ భగవంతుడా, నేను చాలా చేతులు, పొట్టలు, మొహాలు, కళ్ళు నీ అనంతమైన ఆకారంలో చూసున్నాను.

'ఓ విశ్వరూపుడా, నీ ఆరంభం, మధ్యభాగం అంతం నాకు కనిపించటం లేదు' అని ఎలుగెత్తి కృష్ణుడితో చెప్పాడు. అర్జునుడి వివేకం విషయాల మీద నియంత్రణ కోల్పోయి ఆ విశ్వరూపానుభూతిని భరించలేకపోతాడు. అతనికి సమతాస్థితిని ఇమ్మని వేడుకుంటాడు, అంటే అతని మనస్సు అతని వివేకనియంత్రణలో ఉండాలని అర్థం. అతనికి జరిగే విషయాల, కారణం – ప్రభావం తెలుసుకొని అవి తన నియంత్రణలో ఉన్నాయన్న భావన కలగాలి. ఆ అనుభూతి అతణ్ణి కారణం – ప్రభావం అనే తర్శుగ్రహణం నుండి పూర్తిగా చీల్చేసింది. ఎంత వరకు కారణం – ప్రభావం అనే తర్శం మీ నియంత్రణలో ఉంటుందో మీరు నిజాన్ని గ్రహిస్తున్నారన్న భావన కలుగుతుంది. మీ అహం దృఢంగా, నిశ్చలంగా ఉంటుంది. ఏ క్షణంలో మీ జ్ఞానం కుదపబడుతుందో, అప్పుడు మీకు చాలా భయం కలుగుతుంది. మీరు మహాసముద్దంలో కేవలం ఒక బొట్టు మాత్రమే అని మీకు అనిపిస్తుంది. అర్జునుడు చూసింది సంపూర్ణమైన యథార్థం. కాని అదే నిజం, అతని తర్కానికి అందలేదు కాబట్టి అతను భయపడాడు. అర్జునుడు అహం వల్ల తన పంచేందియాలు గ్రహించే రూపంలోకి మారిపోమని కృష్ణుడిని వేడుకుంటాడు.

సమష్టిచెతన్యంలో మీరూ ఒక భాగం

అసలు ప్రదేశం – సమయం

1 డి, 2 డి, 3 డి ప్రపంచాలు

బిందువు ఒక పరిమాణం గల వస్తువు. బిందువు ఒక దిశలో కదిలి గీత ఏర్పడుతుంది. ఒక గీత జరిగితే, రెండు పరిమాణాలు ఉన్న వస్సువు ఏర్పడుతుంది. ఒక గీత అదే దిశలో జరిగితే గీతగానే ఉండిపోతుంది. ఒక గీత అది ఉన్న దిశలో వేరే దిశలో జరిగితే ఒక సమతలం ఏర్పడుతుంది.

బిందువురేఖను గురిసున్న బిందువులు

అలాగే ఒక సమతలం అది ఉన్న దిశలో కాకుండా కదిలితే ఘనపదార్దాన్ని అంటే మూడు పరిమాణాలు ఉన్న వస్తువు ఏర్పడుతుంది.

తలాన్ని గురిసున్న రేఖలు రేఖ తలం – 2డి వసువు

అందుకే ఒక గీతలో అనంతమైన బిందువులు ఉంటాయి.

ఒక సమతలంలో అనంతమైన గీతలు ఉంటాయి, ఒక ఘనపదార్ధంలో అనంతమైన సమతలాలు ఉంటాయి.

అలాగే నాలుగు పరిమాణాల ప్రదేశాన్ని అనంతమైన మూడు పరిమాణాలు ఉన్న ప్రదేశాల కింద ఊహించుకోవచ్చు.

ఇప్పుడు మనం ఎక్కువ పరిమాణాలున్న వస్తువుల్ని పరిమాణాల నుండి ఎలా నిర్మించామో అలాగే, తక్కువ పరిమాణాల్ని ఎక్కువ పరిమాణాలు గల ప్రదేశం భాగాల కింద తీసుకోవచ్చు.

ఉదాహరణకి రెండు గీతలు ఖండించుకుంటే బిందువు ఏర్పడుతుంది. అంటే బిందువు ఒక గీతలో భాగం. ఒక గీత సమతలంలో భాగం. ఒక సమతలం ఘన పదార్దంలో భాగం.

అలాగే ఒక ఘనపదార్ధం, నాలుగు పరిమాణాలు ఉన్న వసువులో భాగం, మన మూడు పరిమాణాలు ఉన్న ప్రదేశం, నాలుగు పరిమాణాలు ఉన్న ప్రదేశంలో భాగం. పి.డి. జాస్సెన్సీ తన పుస్తకంలో వీటిని చాలా అందంగా వివరిస్తారు. ఆయన, విడిగా మూడు

పరిమాణాలు ఉన్న వస్తువులు, ఉదాహరణకి మనుష్యులు, నాలుగు పరిమాణాలు ఉన్న వస్తువుల్తో భాగమై ఉండవచ్చు అని అంటారు.

కనిపిస్తాయి. కాని మూడు పరిమాణాలు ఉన్న ప్రదేశం నుండి చూస్తే, ఇవి అన్నీ ఒక చెట్టు భాగాలే అని తెలుస్తుంది.

నాలుగు పరిమాణాలున్న ప్రదేశం – కాలం

నాలుగు పరిమాణాలు ఉన్న ప్రపంచంలో,

ప్రదేశంలో గరిష్ఠసంఖ్య ఉన్న పరిమాణాలు మూడే, కాలం నాల్గవ పరిమాణం. అందుకే నాలుగు పరిమాణాలు ఉన్న ప్రపంచాన్ని, ప్రదేశం – కాలం Continuum (సాతత్యం) కింద తీసుకోవచ్చు, కాలాన్ని, ప్రదేశపు నాల్గవ పరిమాణం అనవచ్చు.

మనం కాలాన్ని మూడు రూపాల్లో చూస్తాం – భూత, వర్తమాన, భవిష్యత్తులు. మనం భూతకాలం గతించింది, ఇంక ఉండదు అనుకుంటాం. భవిష్యత్తు జరగలేదు కాబట్టి అది

దీన్ని ఆయన చక్కని ఉదాహరణతో వివరిస్తారు.

క్షితిజసమాంతరంగా ఉన్న ఒక సమతలం చెట్లు పై భాగాన్ని ఖండిస్తే, ఆ సమతలం పై ఉన్న కొమ్మలన్నీ ఒక దానికి, ఇంకొక కొమ్మకి సంబంధం లేకుండా వేరుగా

ఉండదు. అందుకే జరుగుతున్న వర్తమానం, లేని భవిష్యత్తు, ఇంకొక లేని భూతకాలంలోకి మారుతోంది.

మూడు పరిమాణాలున్న ప్రపంచంలో ఒక చెట్లు కొమ్మలు రెండు పరిమాణాలున్న ప్రపంచంలో వేరుగా కనిపించేవి, మూడవ పరిమాణంలో ఒకటిగా కలిసి ఉన్నట్లు కనిపిస్తాయి. ఇదే విధంగా మనం ఉండే తలం స్థితి పైకి వెళ్ళే చైతన్యాన్ని ఊహించుకుంటే, చైతన్యం నాల్గవ పరిమాణం అయిన కాలాన్ని అవిచ్చిన్నంగా చూస్తుంది. భూత, వర్తమాన, భవిష్యత్తులు అన్నీ ఏకకాలంలో ఉంటాయి. మామూలు చైతన్యం ఏ సంఘటనలనైతే విడిగా నియమితకాలాల్లో చూస్తుందో, అవి ఈ చైతన్యానికి ఏకకాలంలో జరిగే సంఘటనలుగా కనిపిస్తాయి.

మూడు పరిమాణాలు ఉన్న వసువు కాలంతో కదిలితే నాలుగు పరిమాణాలున్న వసువుని ఏర్పరుస్తుంది. మనలో పసి వయస్సు నుండి యౌవనంలోకి యౌవనం నుండి ప్రౌధత్వంలోకి, ప్రౌధత్వం నుండి వార్ధక్యంలోకి వెళ్ళినప్పుడు కాలంలో మనకు గమనం కనిపిస్తుంది. కాని మన గ్రహింపు పరిమితం కాబట్టి మనకు ఈ నాలుగు పరిమాణాల శరీరం కనిపించటం లేదు. మనం మూడు పరిమాణాల లోకంలో ఉంటున్నాం కాబట్టి మనకు నాలుగు పరిమాణాల శరీరంలో భాగంగా మూడు పరిమాణాలు ఉన్న శరీరాన్ని చూడగలం. అది సినిమా రీలులో వరుసగా ఉన్న బొమ్మల్లో ఒక బొమ్మలా ఉంటుంది.

నాలుగు పరిమాణాలు ఉన్న ప్రపంచం, మూడు పరిమాణాల్లో ఎలా గ్రహిస్తామో అని

అర్థం చేసుకోదానికి, ముందుగా మూడు పరిమాణాలో జరిగేది, రెండు పరిమాణాల ప్రపంచంలో ఎలా కనిపిస్తుందో చూద్దాం.

మీరు రెండు పరిమాణాల ప్రపంచంలో ఉన్నారనుకోండి. అంటే సమతలాలు, ఉపరితలాల లోకం, మీ జీవితం. మీరు గ్రహించేది గోడలా ఒక సమతలానికి పరిమిత మవుతుంది. ఒక చుక్రం మీరు ఉండే తలానికి లంబంగా తిరుగుతూందని ఊహించుకోండి. దాని ఒకొక్క ఊచకి ఒకొక్క రంగు వేసారు.

ఆ చక్రం గమనం మీకు ఎలా కనిపిస్తుంది? ఆ చక్రం ఊచ సమతలాన్ని ఖండించినప్పుడు ఆ రెండూ ఖండించుకున్న చోట ఒక రంగు గీత కనబడుతుంది. ఒక ఊచ తరువాత, ఖాళీ ప్రదేశం వల్ల, మీకు ఏమీ కనిపించదు. అప్పుడు, ఇంకో రంగు ఉన్న ఊచ సమతలం లోంచి వెళ్ళుంది. అందుకే మనకు చక్రగమనం సమానకాల వ్యవధులలో రంగుల గీతలు కింద కనిపిస్తాయి.

ఏం జరుగుతుందో అది ఇది : తక్కువ పరిమాణాలు ఉండే ప్రపంచంలో, పరిమితమైన గ్రహింపు వల్ల, ప్రదేశంలో కనిపించేదాన్ని కాలంలో జరిగేట్టుగా మారుస్తుంది. మీకు మూడు పరిమాణాలలో రెండే కనిపిస్తాయి కాబట్టి, మీ మూడవ పరిమాణం మీ సమతలాల్లో కాలంలో కనిపిస్తుంది. అందుకే అది మీకు కనిపించే రెండు పరిమాణాలకి, ప్రదేశానికి సంబంధం లేకుండా చూసి దాన్ని కాలంలో జరిగే విషయంగా గుర్తిస్తారు.

ఇప్పుడు ఒక ఆకుపచ్చ ఊచ ఆ సమతలం లోంచి వెళ్ళినప్పుడు, ఎక్కడో ఒక కుక్క మొరిగింది అని ఊహించుకోండి. రెండు పరిమాణాలు ఉన్న ప్రపంచంలో, ఒక ఆకు పచ్చ గీత వచ్చినప్పుడు, కుక్క మొరగటానికి సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది, కాని నిజానికి అలాంటిదేమీ లేదు.

రెండు పరిమాణాలు ఉన్న మనిషికి తనకు తెలిసిన సమతలం పైన సంఘటనలు జరుగుతాయి అంటే నమ్మకం కలగదు. మూడు పరిమాణాల ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి, అతను రెందు పరిమాణాల చైతన్యంతో ఉంటే సరిపోదు. అతను మూడు పరిమాణాల చెతన్యానికి ఎదగాలి. అలాగే నాలుగు పరిమాణాల ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి మనం నాల్గవ పరిమాణచైతన్యంలో ఉండాలి.

ఇది సాధ్యమా? మనం పంచేంద్రియాలతో గ్రహించే మూడు పరిమాణాల ప్రపంచం కంటే అతీతంగా వెళ్ళడం సాధ్యమా? మనం కాలంలో నిమిషమాత్రం చూడగలిగిన నిజాన్ని అస్సలు చూడగలమా? వీటికి సమాధానం 'అవును' చూడగలం.

తూర్పుదేశ ఋషులు లోతుగా పరిశోధన చేసి, యథార్గాన్ని అది ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు, అనుభూతి కూడా పొందవచ్చు అని కనుక్కున్నారు. ఇది మామూలుగా జీవితంలో జరగవచ్చు. ఈ అనుభవం వారికి కలిగింది. ధ్యానం ద్వారా మనం కూడా అదే స్థితిని అనుభవించవచ్చు.

ఒక అందమైన జెన్ కథ : ఒకసారి ఇద్దరు సైనికులు గాలిలో జెండా ఎగరడం చూసారు. ఒక సెనికుడు 'జెండా కదులుతోంది' అని అన్నాడు. రెండవ సైనికుడు 'కాదు, గాలి వీస్తోంది' అని అన్నాడు.

ఆ దారిన వెళ్లే జెన్ గురువు ఆ ఇద్దరి వాదం విన్నాడు. ఆ సైనికులు గురువుని వారి వాదానికి తీర్మానం చెప్పమని అర్థించారు. అందులో ఒక పైనికుడు 'గురుదేవా, నేను జెండా కదులుతోంది అన్నాను. కాని అతను గాలి కదులుతూంది అని అంటాడు. ఏది సరైంది?' అని ప్రశ్నించాడు.

ఆ గురువు 'మీరు ఇద్దరూ తప్పే చెప్పారు. కేవలం చెతన్యం కదులుతోంది' అని చెబుతాడు.

ఇపుటికి మనం జీవితంలో ప్రతి రోజూ యథార్ధం అని అనుకునేది కూడా 'మిథ్య'. అది కేవలం ప్రదేశం, కాలంలో వస్తువుల గ్రహింపు వేరుగా ఉండటమే. మనం లోతుగా చూస్తే మనం ప్రపంచాన్ని గ్రహించే విధానాన్నే ప్రప్పించుకోవలసివస్తుంది. మనం ఏ రకమైన చైతన్యంతో చూసినా, మనకి యథార్థం అనిపించేది, సంపూర్ణమైన యథార్ధం కాదు.

యథార్థానికి పదకొండు పరిమాణాలు

మనం మూడు పరిమాణాల ప్రపంచం, నాల్గవ పరిమాణమైన కాలంలో ఉన్నామని అసుకుంటాం. నిజానికి పదకొండు పరిమాణాలు ఉన్నాయి. పొడవు, వెడల్పు, లోతు, కాలం, చెతన్యం అనేవి ప్రాథమికపరిమాణాలు. వీటి కలయిక హెచ్చు పరిమాణాన్ని ఇస్తుంది.

ఉదాహరణకి ఒక కరకు పొదవు, వెడల్పు, లోతు ఉంటాయి. అది ప్రదేశం, కాలాల్లో ఉంది. ఇప్పుదు, పొడవు, వెడల్పు ఉంచి, లోతు తీసేస్తే, కుర కనబదుతుంది, చెయ్య అందులోంచి దూరిపోతుంది. లోతుని ఉంచి, పొడవు, వెడల్పు తీసేస్తే, ఏమీ కనిపించదు. చెయ్య దూర్చడానికి ప్రయత్నిస్తే, ఏదో అడ్డు తగులుతుంది.

ఈ విధంగా, రకరకాలుగా కలిపితే పదకొందు పరిమాణాలు ఉన్న విశ్వం ఏర్పదుతుంది. మీరు ఈ నాలుగు పరిమాణాలు ఉన్న ప్రదేశం – కాలం కన్నా ఉన్నతమైన సమతలంలో ఉంటే మీకు పదకొందు పరిమాణాలు కనిపిస్తాయి. జ్ఞానోదయం పొందినవారు చూడగలిగినట్టు మీరూ యథార్థాన్ని చూడగలుగుతారు.

కల్లోలక్రమం –

పరమాణువులో శక్తి అయినా లేదా విశ్వంలో శక్తి అయినా పెద్ద కల్హోలం కింద ఉంటుంది. ఆ గందరగోళంలో మీరు ఊహించని క్రమం ఉంటుంది. కల్హోలం ఒక క్రమంలో కదిలితే, చెతన్యాన్ని లేదా మేధని సృష్టిస్తుంది.

కల్లోలమే శకి

అస్తవ్యస్థంగా ఉన్నది పద్ధతి లేకుండా శక్తిమంతంగా ఉంటుంది. దేనికి క్రమం ఉంటుందో అది ఉత్సాహం కలిగించదు. మన జీవితంలో ఏదైతే అస్తవ్యస్తంగా ఉంటుందో, పద్ధతి లేకుండా ఉంటుందో, శక్తిని ప్రసరిస్తుంది. మనం పిల్లలని స్వేచ్ఛగా వదిలేస్తే, వాళ్ళు చాలా శక్తిని వెల్లడించడం మనం చూస్తాం. మన జీవితాల్లోనే, మనం ఏదైనా నియమాన్ని ఉల్లంఘించడానికి అవకాశం వస్తే మనకి ఆనందం కలుగుతుంది. మనం చాలా శక్తిని వెల్లడిస్తాం. కల్లోలానికి శక్తితో సంబంధం ఉంది (అస్తవ్యస్తంలో ఉన్న స్వేచ్ఛ, నియమాలతో బంధింపబడి లేకపోవటం, ఒక క్రమం లేకుండా).

మనం సేఁచుగా వేసే అదుగుల్తో క్రమం లేకుండా ఉన్నత్యం చేస్తే మనం చాలా శక్తిమంతులై ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నియమాల్నో బంధింపబడి లేం. అస్తవ్యస్థంలో ఉన్న స్వేచ్ఛ దీనికి కారణం. ఏ క్షణమైతే బంధింపబడి ఉన్నామని తెలుసుందో, మనకి ఉత్పాహం ఉండదు. భౌతికంగా మనని అది ప్రభావం చెయ్యకపోయినా మనలో నిరుత్సాహం ప్రవేశిస్తుంది. ఉదాహరణకి మీరు ఒక హాలులో కూర్చున్నారు, అది తెరిచి వుంది. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోవచ్చు, మీరు స్వచ్చతతో, జీవంతో, అనందంగా ఉంటారు. అకస్మాత్తుగా హాలు తాళం వేసారు, మీరు హాలు నుండి బయటికి వెళ్ళలేరు అన్న విషయం మీకు తెలుస్తుంది, మీరు సుఖంగా అక్కడ కూర్చోగలరా? లేదు!

ఏ నియమమెనా స్వేచ్ఛను పోగొడుతుంది, శక్తిని తగ్గిస్తుంది. ఏ విధమైన నిబంధనైనా మీ శక్తిని తగ్గిస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా, 'నువ్వు ఆ స్థానంలో కూర్చోవద్దు' అని అంటే మీకు అదే చోట కూర్చోవాలి అనిపిస్తుంది. ఆ నియమం ఏర్పడేవరకు మీరు అక్కడ కూర్చోవాలి అని అనుకోరు.

మనం బంధితులమని, స్వేచ్చగా ఉన్నాం అన్న మానసిక సంతృప్తి కోసం, పొగ తాగే అలవాటు మానుకోం. మిమ్మల్ని మీరు చేతనంగా పరిశీలించుకుంటే మీరు నిబంధనల్ని అతిక్రమించినప్పుడు, అంటే మీకు ఒక క్రమం లేకుండా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుందన్న విషయం, అర్ధమవుతుంది.

అస్తవ్యసమే ఒక క్రమం

మొత్తం విశ్వమంతా అస్తవ్యసమే. ఈ విశ్వంలో ఎన్నో గ్రహాలు తిరుగుతున్నాయి. ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్, దారి సంభాలు, పోలీసులు లేకపోయినా, గ్రహాలు ఎంతో క్రమంలో అందంగా కదులుతున్నాయి. అదే విధంగా, క్వాంటం భౌతికశాస్త్రంలో అతి చిన్నదైన కణానికి, తరంగధర్మాలు కూడా ఉన్నాయి. దానికి సంభావ్యతలు కూడ అనేకం. ఆ అస్తవ్యస్తంలో ఒక క్రమం ఉన్నది. సృష్టి అంతా క్రమం లేకుండా అస్తవ్యస్తంగా ఉంటే, అది విచ్చిన్నానికి దారి తీస్తుంది. అస్తవ్యస్తం క్రమంలో ఉండ‌డాన్నే 'విశ్వ‌మేధ' అని నేను అంటాను.

మనం నివసించే భూమినే తీసుకుందాం, దీని మీద ఉష్ణోగ్రత లేదా నీరు లేదా గాలి, అగ్ని – ఏది లేకపోయినా ఇప్పుడు మనం ఉంటునట్టు ఉండలేం. ఇది అకస్మాత్తుగా సంభవించింది కాదు. మొత్తం అస్థవ్యసానికి ఒక క్రమం ఉంది.

విశ్వంలోని అస్తవ్యసానికి ఒక క్రమం ఉంది. పరమాణువులో క్రమం ఉంది అని శాసం ఇంకా నిరూపించలేకపోయింది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం వివేకానికి అతీతంగా వెళ్ళాలి.

ఋషులకి, వేదకాలం నాటి శాస్త్రవేత్తలకి, అస్తవ్యస్తంలో ఒక క్రమం ఉందని స్పష్టంగా తెలుసు. దీన్నే వారు 'విశ్వమేధ' అంటారు. లేజరు మేసర్ మీద పని చేసిన, నోబుల్ బహుమతి గ్రహీత, భౌతికశాస్త్రజ్ఞుడు అయిన డా. చార్లెస్ టవున్స్‌ని కలిసే అవకాశం నాకు వచ్చింది. ఆయన ఇలా అన్నారు – 'ఈ విశ్వమంతా ప్రత్యేకమైంది. విశ్వం అంతా ఒక ఆధ్యాత్మిక జీవి. దానికి సొంత వివేకం ఉంది. నేను అది మాటల్లో చెప్పలేకపోయినా, అది ఒక వివేకం గల ఆధ్యాత్మికజీవి.'

విశానికి సొంత మేధ ఉంది. అది కేవలం అధికారం కాదు శక్రి కూడా. శక్రికి, అధికారానికి తేడా ఉంది. అధికారం ప్లస్ వివేకం శక్తి. వివేకం లేని శక్తి అధికారం. విశ్వశక్తి అనేది కేవలం బలం కాదు. అది శక్తితో కూడిన వివేకం. అది మీ ఆలోచనలకి, ప్రార్థనలకి స్పందిస్తుంది.

ఒక వ్యక్తి బుద్ధుడిని 'ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరు?' అని అడిగారు. బుద్ధుడు 'విశ్వమే తన సృష్టికర్త' అని సమాధానమిచ్చాడు.

సృష్టి, సృష్టికర్త వేరుగా ఉంటే, సృష్టికర్త వివేకవంతుడు, సృష్టికి వివేకం లేదు అని అర్థం. విశ్వానికి వివేకం ఉంది కాబట్టి విశ్వమే తన సృష్టికర్త. విశ్వం జీవిస్తున్న శక్తి. మీరు ఒక జీవిస్తున్న శక్తిలో ఉన్నారు.

తెత్తిరీయ ఉపనిషత్తు చక్కగా ఇలా చెప్నంది.

చేతనస్థితి లేదా భగవంతుడు లేదా అంతిమచేతనస్థితి నుంచి ఆకాశం, ఆకాశం నుంచి గాలి, గాలి నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి ఆహారం వచ్చాయి. ఈ విధంగా సృష్టి జరిగింది. ఇలా ఋషులు పదే పదే మనం చేతనస్థితి అంటే భగవంతుడి నుండి వచ్చామని చెప్పారు.

సృష్టి తన స్పష్టికర్త, అది కేవలం వివేకాన్ని వ్యక్తపరుస్తున్నది. ఎంత కాలం మీరు విశ్వాన్ని కేవలం భౌతికం, యాంత్రికం, వివేకం లేనిది అని అనుకుంటారో, మీకు జీవితంలో ఏ లక్ష్యమూ ఉండదు. 'బలం మీ హక్కు' అన్నది అంతిమసూత్రం అవుతుంది.

ప్రపంచం కేవలం పదార్ధం అని నమ్మడం మనం చేసే మొదటి తప్పు. ఈ నమ్మకం భూమి మీద హింసకి, ఉగ్రనాదానికి మూల కారణం. మనం ఎంత కాలం విశ్వం కేవలం జీవం లేని పదార్థం అని నమ్ముతామో, అది అధికారదాహాన్ని ఎక్కువ చేస్తుంది. మనం మొత్తం ప్రపంచం అస్తవ్యస్తంగా ఉంది అని అనుకుంటే, మనం సహజంగా, 'అంతా అస్తవ్యసంగా ఉన్నప్పుడు, ఏదో ఒకటి పట్టుకుని ఎంత జీవించగలనో అంత జీవిస్తాను' అని అనుకుంటాం. మనం 'బలమే మన హక్కు' అన్న విషయంతో జీవించడానికి ఉత్పాహపడతాం. పదే పదే, విశ్వమేధ మన ఆలోచనలకి స్పందిస్తున్నట్టు నిరూపిస్తుంది. కొన్ని వందల ప్రయోగాలు మొక్కల మీద, జంతువులు, రాళ్ళు, అగ్ని, నీటి మీద కూడా చేసారు. ఇవన్నీ మన ఆలోచనలకి స్పందిస్తాయి.

దా. మజర్ ఇమొటొ, అనే జపాన్ శాస్త్రజ్ఞుడు నీటి మీద ప్రయోగాలు చేసి, నీరు మన ఆలోచనలకి స్పందించి, వాటికి అనుగుణంగా ఆకారాన్ని ఎలా మార్చుకుంటుందో నిరూపించారు.

మనం ఎప్రుడైతే విశ్వానికి మేధ ఉందని తెలుసుకుంటామో, శాంతిబీజం నాటబడింది అని అర్థం. మన జీవనవిధానం ప్రతిఫలిస్తుందని, మన ప్రార్ధనలు ఫలిస్తాయని, జీవించే మేధ ఉందని, అస్తవ్యస్తంలో క్రమం ఉందని అర్థం చేసుకుంటే అప్పుడే మనం శాంతికి, పరమానందానికి, ఆధ్యాత్మికతకు కృషి చేస్తాం. మన సరిహద్దులను వ్యాపి చెయ్యడానికి ప్రపుత్నించే బదులు, మన చేతనస్థితిని వ్యాపింపచేయడానికి ప్రయత్నిస్తాం. ఏ క్షణమైతే విశ్వమే మేధ అని నమ్ముతామో, మనం హాయిగా విశ్వాన్ని నమ్ముకుని ఉండవచ్చు.

అస్తవ్యసంలో క్రమం

ఒక చక్తుని జెన్ కథ : ఒక శిష్యుడు తన గురువుని, 'గురుదేవా, మీరు ఎలా ఆరంభించారు, ఏ పథంలో వెళ్ళారు, అంతిమ అనుభూతిని ఎలా పొందారు' అని అడిగాడు.

గురువు : 'నేను బయలుదేరినప్పుడు కొండ – కొండలా, నది – నదిలా, చెట్టు – చెట్టులా ఉన్నాయి. నేను ప్ర‌యాణం చేసిన‌ప్పుడు కొండ – కొండ‌లా లేదు, న‌ది – న‌దిలా లేదు, చెట్లు – చెట్లులా లేదు. నేను అంతిమ అనుభూతిని పొందిన తరువాత కొండ – కొండలా ఉంది, నది – నదిలా ఉంది, చెట్టు – చెట్టులా ఉంది' అని సమాధానం ఇచ్చాడు.

మీరు పొందే ముందు, అసాధారణమైనవారని అనుకున్నా, మీరు సాధారణమైన వ్యక్తే. మీరు పొందిన తరువాత అసాధరణమైన వ్యక్తి అయినా, మీరు సాధారణమైనవారని అర్థం చేసుకుంటారు.

మీ శరీరం, మనస్సు, ఉనికి క్రమంలో ఉన్నాయి అని అనుకున్నవాటిలో అద్భుతమైన అస్తవ్యస్తం ఉంది. మీరు అస్తవ్యస్తంగా ఉన్న విశ్వం అంటే బ్రహ్మాండంలో క్రమం ఉందని అనుభూతి చెందితే, క్రమం ఉన్న శరీరం పిండాండంలా అస్తవ్యస్తంగా ఉందని తెలుసుకుంటారు.

మీరు శరీరం కాదు. మీరు సూక్లుప్రపంచం కాదు. మీరు సూక్ష్మరూపంలో ఉన్న బ్రహ్మాండం. మీరు విశ్వంలాగే అంతిమ అనంతమైన స్థితిశక్లి, మహాసముద్దం అని తెలుసుకుంటారు. మీరు అనుకునేదాని కంటే, అతీతమైనవారని అనుభూతి చెందుతారు.

మీ సరిహద్దు చిన్నదిగా ఉంది కాబట్టి మీరు క్రమంలో ఉన్నారనుకుంటారు. ఏ క్షణమైతే విశ్వచైతన్యాన్ని, అస్తవ్యస్తంలో ఉన్న క్రమాన్ని అనుభూతి చెందుతారో, మీ క్రమంలో ఉన్నా అస్థవ్యస్తాన్ని తెలుసుకుంటారు. మీ శరీరం లోపల ఉన్న చైతన్యాన్ని, శక్తిని తెలుసుకుంటారు. అప్పుడు మిమ్మల్ని ఎలా క్రమంలో పెట్టుకోవాలో అన్నది మీరు ఆలోచించరు. అది దానంతట అదే జరుగుతుంది. మీరు క్రమశిక్షణ కోసం పాటుపడరు. క్రమశిక్షణ మీలో వచ్చేస్తుంది.

శరీరంలోని విశ్వచెతన్యాన్ని అంటే పిండాండంలో బ్రహ్నాండాన్ని తెలుసుకుంటే. మీ శకి తగ్గకుండా మీరు పద్ధతి ప్రకారం ఎలా ఉండాలో నేర్చుకుంటారు. మీరు క్రమంలో ఉండాలని ప్రయత్నిస్తే, మీ శక్తిని అణిచేసారు, ప్రతి ఒక్కరినీ అణిచేస్తారు.

మొదట మీరు అస్తవ్యసంలో క్రమాన్ని తెలుసుకుంటే, ఒక ఆధ్యాత్మికవ్వక్రి అయి, ప్రేమని, పరమానందాన్ని అనుభూతి చెందుతారు. మీరు క్రమంలో అస్తవ్యస్తాన్ని తెలుసుకుంటే, మీరు కరుణ గల వ్యక్తి అవుతారు. మీరు అస్తవ్యసంలో క్రమాన్ని తెలుసుకున్నప్పుడు, మీరు ప్రేమ, పరమానందంలో అనుభవం చెందే భాగాన్ని అనుభూతి చెందుతారు. మీరు క్రమంలో అస్తవ్యస్తాన్ని తెలుసుకున్నప్పుడు, మీరు ప్రేమతో వ్యక్తపరిచే భాగం అంటే కరుణని వ్యక్తపరుస్తారు.

చూసేవాడు – చూడబడేది – చూడటం

చూడటం అనే కార్యక్రమంలో రెండింటిని చూస్తాం, చూసేవాడు, చూడబడే వస్తువు. ఈ చూడటం అన్న దాంట్లో ఏం జరుగుతోంది? (ఇక్కడ కంటి ఉదాహరణ ఇచ్చినా, ఇది అన్ని ఇంద్రియాలకీ వర్తిస్తుంది).

చూసేవాడి దగ్గర నుంచి చెతన్యం చూడబడేదాని వరకు నిరంతరం వెళుతూ ఉంటుంది. ఎందుచేతనంటే అది చూసేవాడిలోనే ఉండలేదు. చైతన్యానికి అవిరంతి వల్ల చూడబడేదానికి జీవం ఇస్తుంది.

చూసేవాడి నుండి చూడబడేదానికి నిరంతరం దూకదం వల్ల చూడటం అనేది జరుగుతుంది (చూసేవాడి నుంచి, చూడబడేదానికి, చూడబడేదాని నుండి చూసేవాడికి, ఇలా చైతన్యం దూకుతూనే ఉంటుంది).

చూసేవాడు ఎప్పుడైతే పరమానందంలో ఉందదో, అతను గెంతుతాడు. అప్పుడు చూడబడేదానికి జీవం వస్తుంది. దాన్నే చూడటం అంటారు. ఈ చూసే పనిని రెండు రకాలుగా వదిలేయవచ్చు. చూసేవాడైనా, చూడబడేదెనా, ఈ చూసే కార్యకమాన్ని ఆపాలి.

చూడబడేదాన్ని వదిలేసినప్పుడు, అది చూసేవాడి మీద అధికారం కోలో తుంది. చూడబడేది ఏమీ లేదు కాబట్టి దూకడానికి అవసరం లేదు. దూకడానికి ఏమీ లేనప్పుడు, చూసేవాడు తనలోనే ఉండిపోతాడు. అప్పుడు చూడడం అన్నది జరగదు. చూదటం అనేది లేనప్పుడు, చూసేవాదు జ్ఞానోదయం పొందుతాడు.

ఏ వ్యక్తి అయితే, చూడబడేదాన్ని వదిలేసి గెంతడం మానేసాడో అతను సన్యాసి. ఈ చూడబడే వస్తువులకి విలువ లేదు అని నమ్మడానికి, అతను చూసే కోరికని వదిలేసాడు. చూడబడేది ఉత్పాహం కలిగించకపోవడం వల్ల గెంతడం ఆగిపోతుంది. అతను సన్యాసించి జ్ఞానోదయం పొందుతాడు. ఇది నిజమైన ఆత్మజ్ఞానం – జ్ఞానం.

జ్ఞానమార్ధంలో చూచేవాడు, బంధవిముకుడై కేవలం సాక్షిగా ఉంటాడు. ఈ విధంగా అతను యథార్థాన్ని కనుకోశ్లానికి ప్రయత్నిస్తాడు. యథార్థాన్ని అనుభూతి చెందడానికి, చురుకైన స్వచ్ఛమైన వివేకాన్ని అభివృద్ధి చేయటమే ముఖ్యమైన ఉద్దేశం. అదిశంకరాచార్యులు, భారతదేశ గొప్ప జ్ఞానయోగి, జ్ఞానమార్ధం అనుసరించి జ్ఞానోదయం పొందారు.

ఆయన ఆత్మజ్ఞానంపై ఎప్పుడూ రాయబడని చక్కని వాడిగా ఉన్న (వేదాలు) గ్రంథాల్ని రాసారు.

ఆ విధంగా కాకుండా చూసేవాడిని వదిలేస్తే, చూడబడేది మిగులుతుంది, రెండింటి మధ్య గెంతడం ఆగిపోతుంది. యథార్థం కనిపిస్తుంది. చూసేవాడు భక్తి వల్ల జ్ఞానోదయం పొందుతాడు.

సమష్టిచెతన్యంలో మీరూ ఒక భాగం

చూసేవాడి గుర్తింపు పోయి, చూడబడేదానిలో లయం చెందితే సర్వాంతర్యామి మీద అత్యంతభక్తి కలుగుతుంది.

అతనికి ప్రతి దాంట్లో సర్వాంతర్యామి రూపమే కనిపిస్తుంది. అతనికి గుర్తింపు ఉండదు. అతను సర్వాఁంతర్యామిలో లయం చెందుతాడు. భారత దేశంలో భక్రిమార్ధంలో నడిచిన మీరాబాయి ఎప్పుడూ తన ఉనికిని మరిచిపోయి, భగవంతుడి ధ్యానంలో, తన్మయత్వంలో ఉండేది. తన శరీరం మీద స్పృహ లేకుండా, వీథుల వెంట నడుస్తూ భగవత్సంకీర్తన చేస్తూ వుండేది.

అందుకే, ఏదో విధంగా, చూసేవాడైన లేదా చూడబడేదాన్నెనా వదిలివేయాలి. అప్పుడే, రెండింటి మధ్యనా గెంతడం ఆగిపోతుంది. గెంతడం అగితే చూడటం కూడా ఆగిపోతుంది.

మీరు చూసేవాడితోనో లేదా చూడబడేదానిలోనో చిక్కుకుపోతే అలాగే పూర్తిగా నిమగ్నమైపోతే, మీరు జ్జానోదయం పొందుతారు. మీరు చూసేవాడు, చూడబడేదాని మధ్య దూకితే మీరు దేనిలోకీ వెళ్ళకుండా రెండూ, విడిగా ఉన్నాయి అన్న భ్రమలో ఉంటారు. ఈ దూకదాన్నే మీరు 'చూదటం' అంటారు.

చూడబడేదాని తరచుదనం, చూసేవాడి కంటే ఎక్కువగా ఉంటే చూడబడేది, చూసేవాడిని మార్చేయగలదు. చూసేవాడి తరచుదనం చూడబడేదాని కంటే ఎక్కువగా ఉంటే, చూడబడేది, చూసేవాడితో మార్చేయబడుతుంది. The Morphing of conciousness into 'Seer (s) and Seen(s)'. కారణం లేని ఉప్పొంగుతున్న బ్రహ్మానందంలో నుంచి విశ్వశక్తి అనే మహాసమున్నదంలో, సృష్టి అనే కెరటం లేస్తుంది.

అసంఖ్యాకమైన విశ్వాల్తో అసంఖ్యమైన రూపాల్తో సర్వాంతర్వామి ఆటనే జీవనాధారం అని అంటారు. ఆ ఆటని వదిలేసి తనలోకి తను వెళ్ళిపోవడమే లయం చెందడం. ఇది సంపూర్ణమైన స్థితిలో స్థితిలో స్థిరబడటం. ఏ విధమైన తార్కికకారణం లేకుండా మళ్ళీ ఆట ఆరంభం అవుతుంది. ఈ విధంగా, విశ్వచెతన్యశక్తి అనేక అకారాలలో, లెక్క లేనన్ని చూసేవాళ్ళని, చూడబడేవాటిని సృష్టిస్తుంది. ఇదే భౌతికప్రపంచానికి మూలం.

సామూహిక చేతనస్థితి

మనం అనుకునే విధంగా మనం విడిగా సంబంధం లేని ద్వీపాల వంటివారం కాము. భౌతికంగా మనం విడిగా ఉన్న ద్వీపాల్లా కనిపిస్తాం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కావలసినా అక్కరలేకపోయినా, మనమంతా సామూహికచేతనస్థితితో కలపబడి ఉన్నాం.

ఆహారంలో విషం కలిపితే, అది తినే వ్యక్తి బాధపడతాడు, ప్రతి మనిషి కాదు. ఇలా ఆలోచిస్తే, మీరు ఒక వ్యక్తి, కాని మీరు సృష్టిలో సూక్ష్మస్థాయులకి వెళ్తే, మీకు మనలోని అంతరసంబంధాలు ఎక్కువ స్పష్టంగా తెలుస్తాయి. ఉదాహరణకి, గాలిలో విషవాయువులు ఉంటే, ఎవరు ఆ గాలి పీలిసే వారు బాధపడతారు, ఒకరి నుండి ఒకరు చాలా దూరంలో ఉన్నా సరే. ఈ సంబంధం గాలి పీల్సుకునే స్తాయిలో ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, సూక్ష్మశక్తి స్థాయులలో మన మధ్య దూరం తగ్గుతుంది.

భౌతికంగా గాలి పీల్చుకునే స్తాయుల కంటే మానసికస్తాయిలో, మనం ఇంకా దగ్గరగా ఉంటాం. మానసికస్తాయి అంటే ఆలోచనల స్థాయి అని నేను చెప్పే అర్థం. మన ఆలోచనలు మననే కాకుండా, మన చుట్టూ ఉన్నవారిని, దూరంగా ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తాయి. మీ జలుబు కంటే మీ ఆలోచనలు ఎక్కువ అంటుతాయి. అంటే మీ జలుబు నుండి మనుష్యులు తప్పించుకుంటారు కాని మీ ఆలోచనల నుండి తప్పించుకోలేరు. ఉదాహరణకి ఒక ఆదివారం నాడు కాలేజీ ఫుట్‌బాల్ ఆటకి వెళ్ళారనుకోండి. మీరు స్టేడియంలోకి ప్రవేశించగానే వాతావరణం అంతా ఆవేశాలతో నిండి ఉన్నట్లు గ్రహిస్తారు. అక్కడ ఉన్న ఉత్పాహభరితమైన వాతావరణంతో మీరు ప్రభావితం అవుతారు. అలాగే ఎక్కడైనా సమూహంలో గొదవ జరుగుతుంటే, మతసంబంధమైన గొడవలు లేదా, ఏ ఇంట్లోవైనా మరణం సంభవిస్తే అది మీ మనస్సుని మీ అధీనంలో లేనంత ప్రభావం చేస్తుంది.

మీకు ఎవరి వల్లనైనా జలుబు వస్తే, మీరు దాంతో కొన్ని రోజులు బాధపడిన తరువాత, పూర్తిగా కోలుకుంటారు. మీరు ఇతరుల ఆలోచనలతో ప్రభావితమైనప్పుడు, మానసికంగా బాధపడతారు. అలాగే, మీరు ఏది అనుకున్నా, మీ చుట్టూ ఉన్న వ్యక్తులని ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి మనస్సు కలుషితమై ఉంటే అతనే కాకుండా, అతని చుట్టూ ఉన్నవారు బాధపడతారు. ఉదాహరణకి చెదిరిన మనస్సు గల వ్యక్తి ఒక నగరానికి నాయకుడైతే, అతని నిర్ణయాల వల్ల నగరమంతా ప్రభావితం అవుతుంది. అతని చెదిరిన మనస్సు, తప్పు నిర్ణయాలు తీసుకుని, మొత్తం నగరానికి హాని కలిగిస్తుంది.

వ్యతిరేకాలోచన కలిగిన వ్యక్తి చేసే ప్రతి పని జనాభా మీద విపరీతమైన ప్రభావం చూపుతుంది.

ఉదాహరణకి, ఆటంబాంబు సంగతి తీసుకోండి. ఇది పరమాణు కేంద్రకసిద్ధాంతం మీద ఏర్పడిన ఊహాచితం, ఈ బాంబుకి మూలం భౌతికశాస్త్రవేత్త (Albert Einstein ) కనుక్కున్న E=mc². దీని ఆధారంగా చెడు అలోచనతో రూపొందించిన ఆటంబాంబు, భూమికి నష్టం కలిగించింది. ఈ ఒక్క ఆవిష్కారం వల్ల, కేంద్రీయసిద్ధాంతం అందరికీ భయం కలిగిస్తోంది. ఈ రోజున భూమిని చాలా సార్లు పదే పదే నాశనం చేసుకోవడానికి కావలసినన్ని అణ్యాయుధాలు ఉన్నాయి.

మనం విడిగా సంబంధం లేని వ్యక్తులం అని అనుకున్నప్పుడు, హాని కలిగించే విత్తనాలు నాటబడతాయి. మనం హింసాప్రవృత్తి, స్వార్థం, పెదసరం గల వ్యక్తులుగా తయారవుతాం. మనం కేవలం ఒక్క వ్యక్తి చైతన్యంతో జీవిస్తే, మనం ప్రతి విషయం ముక్కలు చేసి విశ్రేషిస్తాం. అలాంటి తర్కం నాశనానికి దారి తీస్తుంది. మన సమష్టిచెతన్యంతో ఉంటే, అన్నింటినీ కలపడానికి ప్రయత్సిస్తాం.

మానసికస్తాయిలోనే కాకుండా, ఇంకా లోతుగా ఉండే చేతనస్థితిలో కూడా మనం చాలా గాధంగా కలపబడి ఉంటాం. ఈ కింది బొమ్మని చూడండి. ఈ బొమ్మ ఆధారంగా, నేను నిజాన్ని వివరిస్తాను.

ఈ ఏడు వృత్తాలూ మన శరీరంలో ఉన్న ఏడు శక్తి పొరలని సూచిస్తాయి. మొదటి పొర, భౌతికశరీరం – మీ చేతులు, కాళ్ళు మొదలైనవి. రెండవది మీ ప్రాణిక్ శరీరం – ఏ శరీరంలో అయితే ప్రాణం లేదా జీవశక్తి లేదా మీ శాస ఉంటుందో ఆ శరీరం. ఈ విధంగా, ఏడు శక్తి పొరలు, మన శరీరంలో ఉంటాయి. భౌతికశరీరం పొరలో, మీరు, భగవంతుడు, నేను మూడు వేరు బిందువులుగా సూచించబడ్డాయి. ఈ భౌతిక పొరలో మన మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది.

మీరు ఇంకొంచెం లోతుగా ప్రాణిక్ శరీరం దగ్గరికి వెళితే మన మధ్య దూరం తగ్గుతుంది. ఇంకా లోతుగా ఉన్న మానసికశరీరం దగ్గరకి వెళితే, దూరాలు ఇంకా తగ్గుతాయి. మీరు ఇంకా బాగా లోతుగా వెళితే మూడు ఒక బిందువులా కలిసిపోతాయి. మధ్యలో ఉన్న బిందువు దగ్గర, మీరు, భగవంతుడు, నేను కలిసి ఒకే బిందువు కింద ఏర్పడ్డాం. మధ్యన దూరం అంతరించిపోయింది. ఇదే స్థూలస్థాయిలో కూడా ఉన్న సత్యం. మీరు విడిగా ఉన్నారన్నది కేవలం మీ భావన మాత్రమే.

మీరు అనుకునేట్టు మీరు విడిగా ఉన్న వ్యక్తి కాదు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే, అతను కాని ఆమె ప్రేమ లేదా బాధ మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. అది మీలోకి వచ్చి వెళుతూ ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందంటే, అంతరాంతరాల్లో మీరు వేరే వ్యక్తి కాదు, మీరు సామూహికచేతనసితిలో ఒక భాగం. మీరు బాధ కోరుకోవటం లేదు, కాని దాని నుండి తప్పించుకోలేరు. అధిభౌతికమైన నొప్పి లేదా మానసికబాధ లేదా ఆధ్యాత్మికబంధం, ఏదైనా సరే, అది పదే పదే అనుభూతి పొందుతారు. దీనికి కారణం, మీరు సమష్టి చైతన్యంలో భాగం అన్న విషయం మీకు తెలియకపోవడమే.

ఒక్కసారి మీరు సమష్టిచేతనస్థితిలో భాగం అని తెలుసుకుంటే, మీకు విడిగా గుర్ధింపు లేదని అర్థంచేసుకుంటే, మీకు విడిగా అహంకారం ఉండదు, మీరు బాధపడరు.

ఈ విశ్వసృష్టిలో, విడిగా ఏ ఒక్కదానికీ గుర్తింపు లేదు. ఇది ఒక్కసారి మీ అనుభవంలోకి వస్తే, మీరు, బాధ, కుంగుబాటు, ఆనారోగ్యం అనేవాటికి అతీతంగా వెళారు. దయచేసి అర్ధం చేసుకోండి, మీ భావనలు మీకు ఉన్నంతసేహ్రా, మీరు ప్రత్యేకచేతనతో ఉండి ఏదో విధంగా బాధపడతారు. మీరు ప్రకృతిలో ఉన్న వేడిని, చలిని ఎందుకు నిరంతరం వ్యతిరేకిస్తున్నారని అనుకుంటున్నారు? ప్రకృతి ఏది మనకి ఇచ్చినా మనం వ్యతిరేకిస్తాం. ఒక అందమైన నానుడి ఉంది:

మనిషి నియమానుసారం అవివేకి వేడిగా ఉన్నప్పుడు, చల్లదనం కావాలనుకుంటాడు చల్లగా ఉన్నప్పుడు, వెచ్చదనం కావాలనుకుంటాడు ఎల్లప్పుడూ లేనిది కావాలనుకోవడం

చల్లగా ఉన్నప్పుడు మీరు చలిని నిరోధిస్తారు. మీకు, సర్వాంతర్యామికి వ్యత్యాసం ఉంది అని మీరు అనుకోవడం వల్ల, ఇలా జరుగుతుంది.

నేను బాగా చలిగా ఉండే హిమాలయపర్వతాలలో తక్కువ వుస్తాల్లో ఉన్నాను. నాకు ఏ సమస్యా రాలేదు. దీనికి కారణం నేను, వాతావరణం వేరు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ప్ర‌కృతిలో ఒక‌డిని అనే భావ‌నే నాలో ఉండేది. నేను హిమాలయాల్లో చాలా మంది సన్నాసులు ఇదే విధంగా ఉండటం చూసాను.

మీరు, వాతావరణం వేరు అని అనుకున్నప్పుడు, మీరు దాన్ని నిరోధించడం మొదలు పెదతారు.

ఇప్పుడు మీరు చాలా సరళమైన సాధన చెయ్యవచ్చు. మీకు చలిగా ఉంటే మీలో మీరు ఉండండి, ఎక్కడ చలి అనిపిస్తోందో ఆ భాగాన్ని గుర్తించండి. దాన్ని గమనించండి. అక్కడ వాతావరణాన్ని నిరోధించవద్దు, గాలిని నిరోధించకండి, ఉష్మోగ్రతను నిరోధించకండి. మీలో 'నేను ప‌కృతిని నిరోధించను, నేను ఉష్ణోగ్రతను నిరోధించను, నేను సృష్టిని నిరోధించను' అనుకుని చేతనస్థితిలో నిర్ణయం తీసుకోండి. మీ శరీరం సడలుతున్నట్లు, చలి అనే భావన మాయమవుతున్నట్లు మీకు తెలుసుంది. మీకు పూర్తిగా సుఖం అనిపిసుంది.

నేను ఇలా చెప్పినప్పుడు, వ్యక్తులు 'మీరు చెప్పినట్టు ఇప్పుడు సాధన చేసే బానే ఉంటుంది, నిజంగా తీవ్రమైన పరిస్థితుల్తో ఏం చెయ్యాలి?' అని నన్ను అడుగుతారు. నిజంగా తీవ్రమైన వాతావరణం మార్పులు రాకపోయినా, మనస్సు అలాగే ఆలోచిస్తుంది. తీవమైన పరిస్థితుల్లో కూడా మీరు సంపూర్ణంగా మనస్సుపెట్టి సాధన చేయవచ్చు అన్నది సృష్టంగా తెలుకోండి. ఇప్పుడు సమస్య మీరు పూర్తిగా మనస్సు పెట్టలేదు, సృష్టత లేదు. మీరు సంపూర్ణంగా ప్రకృతికి అనుగుణంగా ఉంటే, మీరు తీవ్రమైన పరిస్థితుల్లో కూడా సుఖంగా ఉండగలరు. చాలా మంది అలా చేస్తున్నారు. మీరు కూడా చేయగలరు.

గాలిలో అన్ని రకాల బాక్షీరియా, వైరసులు ఉంటాయి. ఏ క్రణంలో అయినా ఎదో ఒక వెరస్ కాని బాక్షీరియా కాని, మీలో వ్యాధికి కారణం అవుతుంది. మీరు ప్రకృతిలో పూర్తిగా శ్రుతిలో ఉంటే, వైరస్ లేదా బాక్టీరియా లోపలికి వెళ్ళినా, మీకు ఏ వ్యాధీ రాదు. ఏ క్షణం మీరు ప‌కృతి నుండి వేరుగా ఉన్నట్టు భావిస్తారో, ఆ క్షణం ప్రకృతి మొత్తం మీకు శత్రువు అవుతుంది. అది మీ విశ్వాసపాత్రుడైన తండ్రి, తల్లి, స్నేహితుడు గురువు.

మీరు సమష్టిచేతనస్తితితో అనుగుణంగా ఉన్నప్పుడు, అందులో భాగం అయినప్పుడు, ప‌కృతి మీ స్నేహితుడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది.

మీరు ఎప్పుడైతే సామాజికంగా లేదా అర్థికంగా ఏదైనా సాధించాలని అనుకుంటారో, మీరు మొత్తం సమూహంతో, సమష్టి చేతనస్థితిలో ఉంటే మీరు పొందవలసింది పొందుతారు. మీరు ఎంత కాలం ఒక వ్యక్తిగా, ప్రత్యేకమైన గుర్తింపు కావాలనుకుంటారో, స్పష్టంగా తెలుసుకోండి, మీరు ఆఫీసు లేదా ఏ ప్రదేశమైనా సరే, ఇది జరుగుతుంది. మీరు సమష్టిచేతనస్థితిలోకి అద్దృవ్ధామెతే, మీకు రక్షణ కలుగుతుంది, మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తారు. మీరు సామాజికంగా, ఆర్థికంగా పూర్తి విజయం పొంది, సంతృప్తిగా ఉంటారు. ఆ భావనని వివరించలేరు. ఏ క్షణమైతే నిరోధించడం మొదలుపెడతారో, మీకు నరకం కనిపిసుంది.

ఒక చిన్న కథ : కొంత మంది వ్యక్తులు వచ్చి ఒక మనిషితో, అతని భార్య నదిలో దూకింది, ఆమెను రక్షించడానికి అతను నదిలో దూకాలని చెప్తారు. ఆ మనిషి వెంటనే నదిలోకి దూకి, ప్రపవాహానికి ఎదురీత మొదలు పెద్తాడు.

అందరికీ ఆశ్చర్యం కలిగి, 'ఎందుకు ప్రవాహానికి ఎదురీదుతున్నావు? నీ భార్య ప్రపాహం దిశలోనే కొట్టుకుపోయి ఉంటుంది' అని అరిచారు. ఆ వ్యక్తి 'మీకు నా భార్య గురించి తెలియదు.

ఆమె నదిలో పడినా ఆమె ప్రతీది ఎలా ఎదిరిస్తుందో, అలాగే నదిలో పవాహానికి కూడా ఎదురు తిరుగుతుంది!'అని సమాధానం ఇచ్చాడు.

అది మీరు పని చేసే స్థలం, మీ ఇల్లు లేదా మీ వ్యాపారసంస్థ లేదా ఏ ప్రదేశమైనా సరే, మీరు ఎంతకాలం ప్రవాహాన్ని నిరోధిసారో, ఎంత కాలం సమష్టిచేతనస్థితిలో కలిసిపోరో, అంత కాలం మీకు నరకం సృష్టించుకుని, ఇతరులకి కూడా నరకం చూపిస్తారు. మీ భౌతిక శరీరంలో మీరు వేరు అని అనుకుంటే, వ్యాధిని ఆహ్వానిస్తున్నారని సృష్టంగా తెలుసుకోండి.

మీ మానసికపు పొరలో, మీరు ప్రత్యేకమైన వ్యక్తి అని అనుకుంటే, పదే పదే మీలో హింసాబీజాలు నాటుకుంటాయి. సమష్టి చేతనస్థితిలో మీరు ఉంటే అందరినీ కలుపుతారు. విడి చేతనస్థితిలో ఉంటే విదదీస్తారు, చిన్న ముక్కల కింద వస్తువులను కత్తిరిస్తారు. తర్కం ఎప్పుడూ విడదీస్తుంది (ముక్కలు చేస్తుంది), అంతఃప్రేరణ ఎప్పుడూ కలుపుతుంది.

ఏ క్రణం అయితే మీరు లోతుగా, సంపూర్ణంగా, తీవంగా, మొత్తం సమూహంలో మొత్తం విశ్వంలో ఉన్నారని అర్ధం చేసుకుంటారో మీరు బ్రబహ్మానందానుభూతి పొంది, జీవించడం ఆరంభిస్తారు. మీ ఉనికిలో ఎన్నో పరిమాణాలు వికసిస్తాయి.

ప్రస్తుతం మీరు ఒత్తిడికి గుర్రె, నిరంత‌రం క‌ల‌త చెందుతూ చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఒక్క శరీరం లో మీరు చాలా ఆలోచించాలి. మీరు చాలా సంతోషించవచ్చు. మీరు సమష్టిచేతనస్థితిలోకి అద్భశ్యమెతే, మీకు ఎన్నో పరిమాణాలు ఉంటాయి, మీకు సాధ్యమైనవి ఎన్ని ఉంటాయో, మీరు ఊహించలేరు! చూదండి, ఇప్పుదు ఒక్క శరీరంతో, మీరు చాలా సౌఖ్యాలు అనుభవించి, సంతోషిస్తున్నారు. మీకు రెండు శరీరాలు ఉంటే ఏం చెయ్యగలరో ఊహించండి! చాలా శరీరాలు ఉంటే ఎలాంటి భావన కలుగుతుందో ఊహించండి. మీరు సమష్టిచేతనస్థితిలో భాగం అని తెలుసుకుంటే అదే అనుభూతి కలుగుతుంది.

మీరు ఏకత్వం లేదా సమష్టిచేతనస్థితి అనుభూతి చెందితే, మీ పేరు, ఆస్తి, సామాజిక అంతస్తు, పరువులో ఉన్న భేదాలని మరిచిపోతారు. మీరు మీ గురించి ఏమనుకుంటారో అది అంతా మాయమై అసలైన మిమ్మల్ని తెలుసుకుంటారు.

ఆలోచన (ఏకకాలంలో సంభవించటం) ఏకీభవించటం!

మీరు చేపల గుంపు ఈదుతున్నప్పుడు లేదా పక్రుల గుంపు ఎగురుతున్నప్పుడు పరిశీలిస్తే, వాటి గమనంలో సమకాలీకరణం చూస్తారు. వందల కొద్దీ పక్షులు 'V' ఆకారంలో ఎగురుతూ ఉందచ్చు, కాని అవి దిశ మార్చుకునేటప్పుడు, అన్నీ ఏకకాలంలో ఏ విధమైన తికమక పదకుందా ఆలస్యం చేయకుండా ఒకేసారి మార్చుకుంటాయి. శాస్త్రజ్ఞులు ఇది ఎలా సాధ్యం అని అర్థం చేసుకోదానికి ప్రయత్నిస్తున్నారు. జంతువులు, పురుగుల మీద అధ్యయనాలు, వాటికి ప్రమాదం సంభవించినప్పుడు అవి ఎంత త్వరగా స్పందిసాయో చూపించాయి. ఆ స్గందనలని మనం వాడుకలో ఉండే పద్ధతుల్లో వివరించలేం.

కుక్కలపై ఆలోచన ప్రభావం మీద ఒక ఆసక్కికరమైన ప్రయోగం చేసారు. కుక్కల యజమానుల్ని ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళమని చెప్పారు. వారు ఇల్లు వదిలిన తరువాత వారిని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలకి వెళ్ళి, మధ్యలో క్రమం లేకుండా తిరిగి రమ్మని చెప్పారు. ఆ యజమాని తిరిగి ఇంటికి వెళ్ళే సమయానికి, కుక్మ తలుపు దగ్గరకు వెళ్ళి యజమాని గురించి ఎదురు చూసినట్లు, ఈ ప్ర‌యోగం వ‌ల్ల తెలిసింది.

భారతదేశంలో అండమాన్ – నికోబార్ దీఁపాలలో సునామీ రాకముందే అన్ని జంతువులూ, ఏనుగులు కూడా, ఆ ప్రదేశాన్ని వదిలేసి మహాసము|దం నుండి దూరంగా, సురక్షితమైన ఎత్తయిన ప్రదేశాలకి వెళ్ళిపోయాయి. భూకంపం రాక ముందే, నిమిషాల ముందు భూమి కంపిసుందని, జంతువులకూ, పురుగులకూ తెలిసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ జంతువులకి, మనకి గల తేదా ఏమిటి? వాటికి ప్రకృతితో ఉన్న సంబంధమే. అవి ప్రకృతితో ఉంటాయి కాబట్టి ప్ర‌కృతి ఇచ్చే సంకేతాల‌ని అర్థం చేసుకుంటాయి. మాన‌వులైన మ‌నం అబ‌ద్ద‌పు గుర్తింపు, అహం వల్ల, ప్రకృతితో సంబంధాన్ని పోగొట్టుకున్నాం. అందుకే ప్రపకృతి ఇచ్చే సంకేతాలను గ్ర‌హించ‌లేం.

అత్యున్నతమేధకి అనుగుణంగా

భూమిపై వివిధుపదేశాల్లో ఉన్న వ్యక్తులు ఒకేసారి ఒకేలాంటి పరిశోధన చేయదం మనం చరిత్రలో చాలా సార్లు చూసాం. దీనికి కారణం వారి ఆలోచనలు సమష్టిచేతనస్థితిలో ఉండడం. గాలిలో వందల కొద్దీ విద్యుదయస్శాంతతరంగాలు ఉంటాయి కాని మీ టి.వి. ఏ పౌనఃపున్యానికి (frequency) ట్యూను చెయ్యబడి ఉంటుందో, అదే తరంగాలని తీసుకుంటుంది. అలాగే మనస్సులు ట్యూన్ చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. గాలిలో తేలుతున్న ఆలోచనలను గ్రస్కొంచి, వాటిని నిజం చేస్తాయి.

మనకు అవే ఆలోచనలు వస్తున్నప్పుడు, వాటిని ఒకే రూపంలో వెల్లడి చేసి గ్రహిస్తుంటాం. మన ఆలోచనల అల్లికలోనే చిక్కుకుని ఉంటాం. ఈ విధంగా ఒక సగటు మనిషి తన జీవితాన్ని గదుపుతాదు. కాని తెలివిగల వ్యక్తులు విశ్వసూత్రాలను అర్థం చేసుకొని, ఉన్నతస్థాయిలో ఉన్న మేధకి అనుగుణంగా సృజనాత్మకంగా, కొత్త విషయాలు తెలుసుకుంటూ జీవిసారు.

విశ్వం తనకి ఒకే ఉనికి అని ఎలా సూచిస్తుందో అలాగే ప్రకృతి తన యథార్ధస్యభావాన్ని సూచిసుంది. ఎలుక మెదడులో ఏ భాగం తీసేసినా, అది మెదడు పూర్తిగా ఉన్నప్పుడు ఎలాంటి కష్టమైన పనులు చేయగలిగిందో, తరువాత కూడా అలాంటి పనులు చేయగలిగింది. ఇది 1920లో చేసిన ప్రయోగాల్లో నిరూపితమైంది. ఎలుక మెదడు 'హోలో|గాఫిక్' మెమరీని చూపించింది.

లేసర్ కాంతి అడ్డదిద్దంగా (criss-cross) చలించి, తిదిశ ఫోటోగాఫ్‌ను ఎలా తయారుచేసుందో అదే విధంగా మెదడులో నాడీప్రచోదనాలు అడ్డదిడ్డంగా వెళ్ళదం వల్ల. వివిధ నమూనాలలో జ్లాపకాలు ఏర్సదతాయి. ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. ఇదే విధంగా రెండు గుప్పెళ్ళ పరిమాణంలో ఉన్న మనిషి మెదడులో కోట్ల బిట్సు రూపంలో సమాచారం నిక్రిపమై ఉంటుంది.

విశ్యం ఒక తిదిశ ఫోటోగాఫ్. అందులో మనం ఒక భాగం, ఈ తిదిశ ఫోటోగాఫ్ (hologram) లో ఏభాగమైనా మొత్తం ఉన్నదాన్ని చూపిస్తుంది. అలాగే మనం కూడా విశ్వం పూర్ణత్వాన్ని పరావర్గనం చేస్తాన్ని జీవం ఉన్న జీవం లేని పదార్ధాలుగా వర్గీకరించలేదు. అది సంపూర్ణమె, అంతరసంబంధాలు కలది. మీకు చుట్టూ ఉన్న చెట్లు, జంతువులు, పక్షులు, భూమి మీద ఉన్న రాక్బు, గ్రహాలు, నక్షతాలు, విశ్వంలో ఉన్న నక్షతాలు, అన్నింటితో సంబంధం ఉంది. అది మీరు గ్రహిస్తారో లేదో అన్నది మీ చేతనస్థితిపై ఆధారపడి ఉంది.

ప్రశ్నలు, జవాబులు

  • ప్ర : శాస్త్రప్రకారం, పదార్థం లేకపోతే శూన్యం ఏర్పడుతుంది. మీ ప్రకారం శూన్యం అంటే శక్తి. పదార్థం శక్తి రూపం. శూన్యం అంటే నిర్వచనం ఏమిటి? శాస్తం తన అభిప్రాయాన్ని మార్చుకుంది అని అర్థం చేసుకోండి. ఇప్పుడు శాస్యజ్ఞులు, శూన్యాన్ని మనం సృష్టించలేం అన్న విషయాన్ని తెలుసుకున్నారు. అంతరిక్షంలో ఎక్కడెతే శూన్యం ఉందని అనుకున్నారో అక్కడ ఈథరు ఉంది. శక్తి స్థూలరూపం ఈథరు. ఈథరు పదార్థం అని కూడా శాస్తం చెప్తోంది. దాన్ని పట్టుకోవచ్చు, కొలవవచ్చు. ఆధ్యాత్మికసత్యాలని కొంత వరకు అర్థం చేసుకోదానికి శాస్త్రం అభివృద్ధి చెందింది. ఇప్పందు శాస్త్రం పదార్థంలో కొన్ని భాగాల లోపమే శూన్యం అని చెప్తున్నది. భూమి, అగ్ని, నీరు, గాలి, ఈథరు అనేవి అయిదు ప్రధానమైన మూలకాలు. ఇందులో భూమి, నీరు, అగ్ని, గాలి అనే నాలుగు మూలకాలు లోపిస్తే శూన్యం ఏర్పడుతుంది. అంటే మొత్తం పదార్థం లేకపోవడం కాదు. అది నాలుగు మూలకాలు లేకపోవడంతో ఏర్పడేది.

వేల సంవత్సరాల క్రితం తూర్చుదేశాలకి చెందిన ఋషులు, వాస్తుశ్రాస్తాన్ని అభివృద్ధి చేసారు. అది మన దైనందినజీవితంలో ఈథరు సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించాలి అని చెప్పే శాస్త్రం. అది ఏ పద్ధతిలో ఇక్కు, భవనాలు నిర్మిస్తే, వాటి లోపల ఈథరు శక్తిని ఉంచుకోగలరో చెప్పే శాస్త్రం. ఈ రోజు శాస్తజ్ఞులు ఈథరును ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది ఆలోచిస్తున్నారు.

అందుకే నా ప్రకారం, శాస్తపకారం శూన్యం అంటే శక్తి. పదార్ధం లేకపోవడం శూన్యం కాదు.

  • ప్ర : ఒక వ్యక్తి తన మనస్సుని నియంత్రించగలదు అని అన్నారు. అంటే ఇతరుల మనస్సులు ఆ వ్యక్తి మనస్సుని, ఆలోచనవిధానాన్ని ప్రభావితం చెయ్యగలవా? మనం దీన్ని ఎలా నియంత్రించి, కోపం క్రుంగుబాటుల నుండి విముక్తి పొందగలం? మంచి ప్ర‌శ్న‌. మీ మ‌న‌సుని మీరు అదుపులో పెట్ట‌గ‌ల‌రా?

కొన్నిసార్లు అది నాకు కష్టమనిపిసుంది.

సరే. ఇదే జవాబు నాకు అందరి నుండి వస్తుంది. ఒక వ్యక్తి మనస్సుని నియత్రించవచ్చు అనేది కేవలం చెప్పటం మాత్రమే, అది సాధన చెయ్యరు, అనుభవంలోకి తెచ్చుకోరు. ఇతరుల మనస్సులు ఆ వ్యక్తి మనస్సుని, ఆలోచన విధానాన్ని ప్రభావితం చెయ్యగలవు.

మీకు వివాహం అయిందా?

అయింది!

అయితే మీ భర్త మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తారని అంగీకరిస్తారు. అతని మాటల వల్లనే కాకుండా, వేరే విధంగా కూడా జరుగుతుంది.

ఉదాహరణకి, మీకు ఈ రోజు ఇక్కడికి ధ్యానానికి రావాలని ఉందనుకోండి, అతనితో ధ్యానానికి వెళ్ళానని చెపారు. అతను వద్దనకుందా, సీరియస్‌గా మొహం పెడతారు. అతని మొహం జ్ఞాపకంతో మీ ధ్యానం ప్రభావితం అవుతుంది. మీరు ఇక్కడ కూర్చుని అతని ముఖంపై ధ్యానం చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, అతను ఊళ్ళో లేకపోయినా, మీకు అతని సీరియస్ మొహం గురుకు వచ్చి, ఇక్కడ ధ్యానం ఉత్పాహంగా చేయలేరు.

ఇతరులు తమ ఆలోచనలు వ్యక్తపరచకుండానే, మీ మనస్సుని ప్రభావితం చేయగలరు అన్నది అర్థం చేసుకోండి.

ప్ర‌ : కోపం, డి[పెషన్ రాకుండా ఉండ‌దానికి మ‌న‌స్సుపై ప్ర‌భావాల‌ని ఎలా నియంత్రించాలి?

ధ్యానం ద్వారా!

మీరు ఒక ఉల్లిపాయ లాంటివారు. ఉల్లిపాయ పొర తరువాత పొరను తీసేస్తే లోపల ఏముంటుంది? ఖాళీ మాన్నమే. ఉల్డిపాయ తనలో ఏదో కొంత ఉంది అనుకుంటుంది, కాని పొరలు అన్నీ తీసేస్కే అక్కడ ఖాళీ మిగులుతుంది. అలాగే మనిషి తను చైతన్యం అని అనుకుంటాడు, కాని విడిగా ఉన్న పొరలని తీసివేస్తే, అతను విశ్వవైతన్యాన్ని అనుభూతి పొందుతాదు, అదే సమష్టిచేతనస్థితి. ఈ విధంగానే ఇతరుల నుండి, ఇతరుల వల్ల మీ చైతన్యంలోకి

చొరబడే కోపాన్ని ఆపగలరు. మీరు ధ్యాసం చేస్తే, మీ ఎరుక వ్యద్ధి చెంది, మీ వ్యక్తిగతవైతన్యానికి కేవలం ప్రేక్షకుడిగా మిగిలిపోతుంది, మీరు ఏది చూసినా అది విశ్వచెతన్యంలో కరిగిపోతుంది.

  • ప్ర‌ : మ‌నం ఎందుకు బాధ ప‌డాలి? బాల్యంలో మ‌నం మిగిలిన‌వారి కంటే వేరు అని శిక్షణ ఇసారు. స్కూలులో గురింపు వసుంది – పెద్దయ్యాక ఇతరులతో పోటీ చెయ్యాలని చెపారు. అంతిమసత్యం మనం అంతా ఒక్కటే, మనమందరం పరమానందంలో ఉన్నట్లు అయితే, సమిష్టిచేతనస్థితి ఈ ఆనందాన్ని, శాంతి ప్రేమని ఎందుకు ప్రతిబింబింపచేయదు? ఇది చాలా మంచి ప్ర‌శ్న‌. ఒక దాని త‌రువాత ఒక‌టి, స‌మాధానం చెప్తాను. ఈ ప్ర‌శ్న‌కి మంచి శక్తి గల అర్ధం ఉంది.

ఇప్పటి విద్యావ్యవస్థని స్థాపించిన వ్యక్తులు జ్ఞానోదయం పొందలేదు. గురుకులం అనే ప్రాచీన విద్యావ్యవస్థను ఋషులు స్థాపించారు. దురదృష్టవశాత్తూ ఆ పద్గతి ఇప్పుడు లేదు.

జ్రానోదయమెన గురువులు ప్రారంభించిన విద్యావ్యవస్థ గురించి కొంచెం చెప్సనీయండి. ఈ పదతిలో దేశంలో ఏ బాలుడెనా సరే గురువుకి చెందుతాడు! గురువు ఆ బాలుడికి సంరక్షణ చేస్తాడు. పుట్టిన కొన్ని సంవత్సరాలకి, తల్లిదండ్రులు, బాలుడిని లేదా బాలికని గురువుకి అప్పగిస్తారు.

ఈ విద్యావ్యవస్తలో, కొంత వయస్సు వచ్చేవరకు పిల్లలని బట్టలు వేసుకోమని బలవంతం చేసేవారు కాదు. అలాంటప్పుడు పిల్లలకి తమవి వేరు శరీరాలు అన్న భావన కలిగేది కాదు. వారు సులభంగా ఆకాశం, పువ్వులు, అడవులు, చెట్లు, భూమి అన్నింటితో సంబంధం పెట్లుకునేవారు. వారు వేరు అనే ఆలోచన వారికి ఉండేది కాదు. ఆడ, మగ అన్న భేదం ఆ పిల్లలలో ఉండేది కాదు. నిజానికి మగ అంటే 51% పురుషశక్తి, 49% సీశక్రి ఉంటాయి. ఆడ అంటే 51% స్కీశక్తి, 49% పురుషశక్తి ఉంటాయి. వారిలో ఉన్న తక్కువ శక్తిని సమాజం అణిచేసి, వారు పూర్తిగా మగ లేదా ఆడ అన్న భావన కలిగించేది. ఇది వారి చేతనస్థితిలో చాలా సమస్యలని కలిగిస్తుంది.

పిల్లలని పెంచేటప్పుడు మీరు కొన్ని జాగత్రలు తీసుకోవాలి. మీరు బట్టలు వేసేటప్పుడు, పైభాగాన్ని, కింది భాగాన్ని కప్పేట్లు రెండూ విడిగా వేయకుండా, పొదవుగా ఒకటే వేయండి. వారికి మగ, ఆడ అన్న భావం కలగనీయకండి. మీరు పిల్లల్ని స్కూలుకి పంపాలి కాబట్టి ఇది కొంచెం కష్టమవుతుంది. కాని ప్రయత్నించండి.

గురుకులం పద్ధతిలో, పిల్లలకు ముందు ధ్యానం నేర్సేవారు. వారికి మగ, ఆడ అనే భావన కలిగినా, ఆ ధ్యానపద్ధతిని సాధన చేసి ఆ భావనని తగ్గించుకునేవారు. ఈ పద్దతి వారిని సమష్టిచేతనస్థితిలో సంబంధం ఏర్పరచుకోదానికి సహాయపడేది. ఈ సాంకేతిక పద్దతినే గాయత్రిమం(తం అంటారు.

ఏడు సంవత్సరాల నుండి 14 సం။ వయస్సు వచ్చే దాకా పిల్లలు గాయత్రి సాధన చేసేవారు. 14 సంవత్సరాలకి వారికి చేతనస్థితి క్రణమాతం దర్శనం కలిగేది. వారి అనుభవతీవతను బట్టి వారికి లోతైన ధ్యానపద్గతులు చెప్పేవారు. 21 సం။ల వయస్సు వచ్చేసరికి వారు జ్ఞానోదయం పొందేవారు.

ఒకానౌక కాలంలో 70% వ్యక్తులు జ్ఞానోదయం కలిగినవారె ఉండేవారు. మిగతా 30% మందీ జ్ఞానోదయం పొందడానికి సాధన చేసేవారు. జ్ఞానోదయమైన గురువులు ఎలాంటి సమాజాన్ని నిర్మించారంటే, జ్లానోదయం పొందిన వ్యక్తులు లేదా జ్ఞానోదయం పొందడానికి సిద్ధంగా ఉన్నవారే ఉండేవారు. వేరొక వర్తానికి చెందిన వ్యక్తులు లేనే లేరు. అలాంటి పద్ధతిని మనం దురద్శష్షవశాతూ కోల్సోయాం. అందుకే ప్రపంచమంతా, ప్రతివారం, ధ్యానకార్యక్రమాలు పెట్టాల్పిన అవసరం కలుగుతోంది.

భారతదేశం ఆశ్రమంలో ఆ గురుకులం పద్ధతి ఉంది. మేం ఆధునికవిద్యాపద్ధతికి హాని కలిగించకుందా తిరిగి వేదపద్లతిని పునరుద్గరిస్తున్నాం. ఈ పద్గతి వల్ల వారు పెరుగుతూ, సమష్టిచేతనస్తితో సంబంధం ఏర్పరచుకోగలరు.

్రప : మనమంతా సమస్టిచేతనస్థితిలో భాగమే. అలాంటప్పుడు భగవంతుడు ఇందులోకి ఎలా వసాడు?

ఆ సమష్టిచెతన్యాన్నే నేను భగవంతుడు అని అంటాను. సంపూర్ణంగా ఉన్నదాన్ని నేను భగవంతుడు అని అంటాను. మీరు సంపూర్ణంగా ఉంటే, పవిత్రమైనవారు.

of the off

    • మనం స్కేచ్ఛగా వేసే అడుగుల్తో క్రమం లేకుండా నృత్తం చేస్తే మనం చాలా శక్గిమంతులై ఉన్నట్లు అనిపిస్కుంది.
  • ఏ నియమమైనా స్కేచ్చను పోరొడుతుంది, శక్తిని తగ్గిసుంది. ★
  • ప్రపంచం కేవలం పదారం అని నమ్మడం మనం చేసే మొదటి తప్క. ఈ ★ నమ్మకం భూమి మీద హింసకి, ఉగ్రవాదానికి ముంల కారణం.
  • ★ మనం ఎప్పడైతే విశ్యానికి మేధ ఉందని తెలుసుకుంటామెం, శాంతిబీజం నాటబడింది అని అర్డం.
    • మీ శక్గి తగ్గకుండా మీరు పద్ధతి ప్రకారం ఎలా ఉండాలో నేర్చుకుంటారు.
    • మీరు ఎంతకాలం ప్రవాహాన్ని నిరోధిస్తారో, ఎంత కాలం సమస్జిచేతనస్పితలో కలిసిపోరో, అంత కాలం మీకు నరకం సృష్టించుకుని, ఇతరులకి కూడా నరకం చూపిస్తారు.

విశ్వశాంతి మీ నుంచి ప్రారంభమవుతుంది

జీవన్ముక్తి అంటే ఈ భూమికి శాంతి బహుమతి కావటమే

ఎప్పుడెతే మనం విశ్వశక్తి పథకంలో భాగమే అని తెలుసుకుంటామో, అప్పుదు మనం, సృష్టి వేరు వేరు అని అనుకోం. ఎప్పుడైతే అందులో మన పాతని అచేతనస్థితిలో చేస్తామో, దాని గురించి తెలుసుకోవెా అప్పుడే మనం, సృష్ణి ఒకటి కాదు అనుకుంటాం. జ్ఞానోదయమైనవారిని ఎక్కువ సంఖ్యల్లో భూమి మీద తయారు చేయవలసిన సమయం వచ్చింది. కేవలం అంతిమసత్యాన్ని తెలుసుకున్న, జ్జానోదయం పొందిన చాలా మందిని తయారు చేయటం ద్వారా మాత్రమే, ఈ భూమి మీద పేరుకుపోయిన వ్యక్తిగత వ్యతిరేకశక్తిని సమూలంగా నాశనం చేయగలం. ఈ భూమి మీద జరుగుతున్న ప్రమాదాలన్నీ కూడా అచేతనస్థితిలో ఉన్నవారి వల్ల మాత్రమే జరుగుతున్నాయి. భూమి వేడెక్కటం, హెచ్.ఐ.వి., ఉగ్రవాదం, మతోన్నాదం, కుప్పలుగా పేరుకొనిపోయిన అణ్వస్త్రాలు, ఇవన్నీ కూడా మనిషిలో వ్యతిరేకాలోచనలతోనే జరుగుతున్నాయి. ఈ రోజు మనం చాలా ప్రమాదాల్ని ఎదుర్కొంటున్నాం. మనం శాంతప్రపృత్తితో, అనందంగా ఉత్సాహంగా ఉండే జ్ఞానోదయమైన సంఘాన్ని సృష్టించకపోతే, ఈ అందమైన భూమిని కాపాడుకోలేం.

నా లక్ష్యం ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన, అనందకరమైన, చేతనస్థితి కలిగిన జ్ఞానోదయసమాజాన్ని సృష్టించాలని.

విశ్వశాంతి=వ్యక్తిగతానందఫలితం=పరస్సరవిరుద్దమైన ఆలోచనలు

మనలో చాలా మంది మన మీద మనం పోరాటం చేసుకోవటంలోనే చిక్కుకుపోయాం. మనం పరస్సరవిరుద్దమైన ఆలోచనలు, కోరికలు అనే సాలె గూటిలో చిక్కుకుపోయాం. మన ఆలోచనలు, మాటలు అనేవి చాలా శక్తిమంతమైనవి. కానీ మనం వాటిని చాలా యథాలాపంగా వాడుతున్నాం.

ఉదాహరణకి : మీకు తలనొప్పిగా ఉందనుకోండి, మీరు ఏం చేసారు? మీకు మీరు నాకు తలనొప్పి తగ్గితే బాగుంటుంది అని పదే అంటుంటారు. కానీ మీరు అలా అనుకున్న ఈ మాటలు అంటూ, తలనొప్పి అనే మాటకి పోతే బాగుండు అనే మాటతో పాటు ఎక్కువ శక్తిని ఇస్తున్నారు. దీన్నే నేను పరస్సరవిరుద్దమైన ఆలోచనలు అంటాను. అంటే మీ కోరికకి వ్యతిరేకంగా అంటున్నారు. అప్పుడు అనుకూలమైన దృక్పథం కూడా పోరాడవలసి వస్తుంది. మీ మాటలు, ఆలోచనలూ అయోమయంలో పడతాయి. మనస్సు లక్షణమే అయోమయం.

అప్పుడు మీరు నన్ను అడగవచ్చు, 'మరి తలనొప్పిని ఏ విధంగా పోగొట్టగలం' అని. మీరు 'నేను బాగుండాలి' అని మాత్రం మీకు మీరు చెప్పుకోండి. కాని మనస్సుకి నిరంతరం వ్యతిరేకపదాల్ని అనటమే అలవాటు. అదీ సమస్య.

విశ్వశాంతి మీ నుంచి ప్రారంభమవుతుంది

Part 12: Living Enlightenment (Gospel of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM)_Telugu_part_12.md

మనలోని పరస్సరవిరుద్ధమైన ఆలోచనలే మన అన్ని వ్యథలకి కారణం. మనలో అన్ని బాధలకి కారణం మన సహజలక్షణం పరమానందం అని తెలియకపోవటమే. మనం పరమానందభరితమైన సర్యసృష్టిలో ఒక భాగం. ఒక్కసారి ఈ విషయాన్ని మనం వివేకంతో, అనుభవపూర్వకంగా అర్థం చేసుకోగలిగితే, అప్పుడు మనం చేతనస్థితిలో, బలంగా మనలోని పరస్సర విరుద్ధాలోచనల్ని వదిలేసి మనకి చికిత్స చేయగల మాటలతో అంతరంగాన్ని నింపుతాం.

మనం నిరంతరం చికిత్స చేయగల ఆలోచల్ని మన లోపలికి పంపిస్తూ ఉంటే మనం అనుకూలమైన ఆలోచనలకి, మాటలకి శక్తిని ఇవ్వగలం. వాటిని మన కండరాల జ్ఞాపకాల్లో నిక్షిప్తం చేయగలం. మనం నిరాశలో ఉన్నప్పుడు ఈ ఆలోచనలు, మాటలు అప్రయత్నంగా మన అంతరంగంలోకి వచ్చి మనని ఆ నిరాశ నుంచి బయటికి తెస్తాయి. మనంతట మనం నిరాశ నుంచి, మన మనస్సు ఆడే వ్యతిరేకపు ఆట నుంచి పైకి లేవగలుగుతాం.

వ్యక్తిగతమైన ప్రశాంతత సహజంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది

గౌతమబుద్ధుని జీవితం నుంచి ఒక చక్కని కథ : దేవదతుడు, బుద్ధుని సోదరుడు. అతను బుద్ధుని ఆధ్యాత్మికవ్యవస్తలో ప్రవేశిస్తాడు. అతనికి అధికారకాంక్ష ఎక్కువ. అతనికి ఆ సన్నాసపీఠానికి అధికారి కావాలని కోరిక.

పరిణతి లేని అటువంటి వ్యక్తి జ్ఞానోదయం కోసం కాకుండా, అధికారం కోసం పాకులాడే వ్యక్తి అధికారంలోకి రావటం బుద్ధునికి ఇష్టం లేదు. దాంతో దేవదతుడు బుద్ధుడంటే అసూయ, వ్యతిరేకతలతో ఉండేవాడు. బుద్ధుడిని చంపటానికి చాలా ప్రయత్నాలు కూడా చేసాడు.

ఒకసారి దేవదతుడు పట్టపుటేనుగుకి బాగా మత్తు ఇచ్చి దాన్ని బుద్ధుడు వస్తున్న దారిలో వదులుతాడు. అది భయంకరంగా అరుస్తూ, విచ్చలవిడిగా పరిగెడుతూ ఆ వీథులలో బీభత్సం చేస్తుంటుంది. ప్రజలంతా భయంతో పరుగులు తీస్తుంటారు.

ఏనుగు బుద్ధుడి దగ్గరకి వస్తూంటుంది. బుద్ధుడు ప్రశాంతంగా, స్థిరంగా అదే పంథాలో నడుస్తూనే ఉంటాడు. ఏనుగు భయంకరస్థితి బుద్ధునిలోని పరమానందాన్ని, ప్రశాంతతని ఏమీ చేయలేకపోయింది. పిచ్చి కోపంలో అది బుద్ధుడిని సమీపిస్తుంది. అది బుద్ధుని దగ్గరికి రాగానే, నిశ్శబ్దంగా అయిపోతుంది. బుద్ధనోదయసమక్షంలో దానిలోని క్రూరత్వం కరిగిపోతుంది. బుద్ధుడు దాని నుదుటిని సున్నితంగా స్పృశిస్తాడు. అప్పుడు ఏనుగు కాళ్ళ మీద వంగి బుద్ధునికి నమస్కరిస్తుంది.

ఇదంతా చూస్తున్న ప్రజలు నిర్ఘాంతపోతారు. పరమానందంలో ఉంటూ ఆ ప్రశాంతతని, ఆనందాన్ని నలుదిశలా వ్యాపింపచేసే వ్యక్తి పరిసరాలల్లోకి పంపే శాంతితరంగాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక కొలనులో, రాయి విసిరితే అక్కడి నుంచి వచ్చిన తరంగాలు కొలను అంతా వ్యాపిస్తాయి. ఆ తరంగాలు కొలనులోని ప్రతి భాగాన్నీ స్పృశిస్తాయి.

ప్రశాంతమైన వ్యక్తి నుంచి వ్యాపించే పరమానందతరంగాలు, సహజంగా, అప్రయత్నంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి.

సమూహచేతనస్థితి

నేను మీకు ఒక సత్యాన్ని చెబుతాను.మనందరం సమాజపరంగానే ఒకరితో ఒకరు సంబంధాన్ని కలిగి ఉందం. మనందరం చేతనస్థితిలో, సమూహచేతనస్థితిలో ఒక భాగం. ఆ విధంగా ఒకరికొకరం సంబంధించి ఉంటాం. మనం ఏకాంతద్వీపాలం కాదు. మన ఆలోచనలు, భావాలు, మాటలు మననే కాదు, మిగిలిన ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

సర్వాంతర్యామి, సర్వసృష్టి అనే మహాసాగరంలో మనమంతా అలలం. సర్వాంతర్యామి అంటే స్వచ్ఛమైన మేధాశక్తి. ఈ శక్తి మనందరం విజయులమై జీవితంలో పరిపూర్ణత సాధించాలి అని కోరుకుంటుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం మనలోని భయాలని, అసూయని, బాధలనీ, నిరాశని అలా వదిలేసి నిరంతరం సర్వాంతర్యామి ప్రేమహస్తాలలో విశ్రాంతిగా ఉండగలం.

ఈ గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే, అప్పుడు మనలో ప్రతి ఒక్కరూ ఎంత ప్రత్యేకమైనవారమో తెలుస్తుంది. ఈ అద్భుత విశ్వంలో మనని పోలినవారు ఉండరు. మన ఖాళీ మరొకరు భర్తీ చేయలేరు, అని తెలుసుకుంటాం.

లోపలికి చూడటం

ఒకరినొకరు శత్రువులుగా చూసుకునే కంటే, మీ లోపలికి మీరు చూడగలిగితే, మీ లోపలి శత్రువే మీకు సమస్యలు సృష్టిస్తుంది అని తెలుస్తుంది. అంతే గాని బయట ఎవరికీ శత్రువులు ఉండరు. అంతా కూడా మీలాగే సర్వాంతర్యామిలో ఒక పరమానందభాగమే.

మనం ఎందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తామంటే మనకి తెలియదు కాబట్టి. మన ఆలోచనలు మన చుట్టూ ఉన్నవారినే కాదు, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. కఠినమైన మాటలు, కోపం, అణచివేయబడిన భావాలు, వ్యథలు అన్నీ కూడా ప్రపంచంలో అశాంతిని సృష్టించే విషయాలే.

వ్యక్తిగతమైన ఒత్తిడి, ద్వేషం, హింస అనేవి సంఘంలో అందరిలోనూ ఒత్తిడి, ద్వేషం, హింసల్ని ప్రేరేపిస్తున్నాయి. దీంతో మనిషిలో తెలుసుకునే తత్త్వం తగ్గిపోయి ప్రకృతికి వ్యతిరేకంగా అనేకహింసలు జరిగే స్థితి తయారవుతుంది. ఈ వృత్తాన్ని మనం ఛేదించాలి. ఆ విధంగా చేయకపోతే మరిన్ని మనిషి తప్పిదాలతో వచ్చే ప్రమాదాలు, ప్రకృతివైపరీత్యాలు పెరిగిపోతాయి. ప్రకృతి అంత హింసని తట్టుకొని నిలవలేదు.

కాబట్టి ప్రపంచశాంతి అనే మాటకి అర్థం లేదు. అది వ్యక్తిలోని ప్రశాంతత, పరమానందస్థితి. ఆ స్థితి ఫలితమే విశ్వశాంతి. ఒక వ్యక్తిలోని సత్సప్రేమ, తెలుసుకునే తత్వం, సృజనాత్మకత, మేధ ఇవన్నీ కూడా ప్రపంచశాంతికి, ప్రపంచ అభివృద్ధికి, సౌభ్రాతృత్వానికి దారి తీస్తాయి.

ప్రపంచంలోని బాధతో ఏ విధంగా వ్యవహరించాలి

ముందుగా మనం ఒక విషయం అర్ధం చేసుకోవాలి. ప్రభుత్వస్థాయిలో చేసే ప్రతి నిర్ణయం కూడా సమూహపు అనుకూల లేదా వ్యతిరేకశక్తి వెల్లడి. ఎందుకంటే సమూహంగా అందరి చేతనస్థితి ఫలితం నాయకులు. కాబట్టి నాయకులని, అధికారులని నిందించే ముందు మనం కొంచెం మన అంతరంగం లోపలికి వెళ్ళి, శక్తిని మన అంతరంగంలో ఉంచి అక్కడ పని చేస్తే, కొంత అనుకూలచేతనస్థితిని మన అంతరంగంలో సృష్టించగలిగితే, మనం నిజంగా కొంచెమైనా మంచి చేసినవారమవుతాం.

దేంతోనైనా రెండు విధాలుగా వ్యవహరించవచ్చు. కేవలం దాని గురించి మాట్లాడటం, రెండవది అసలైన పని చేయటం.

మీకు కేవలం ఆ విషయాల గురించి మాట్లాడటం మీదే ఆసక్తి ఉన్నట్లయితే, మీరు మీ చుట్టూ వున్న అందరినీ విమర్శిస్తారు. మీరు మీ ఇంటి పక్కన వారి నుంచి రాజకీయనాయకుల వరకూ, వ్యాపారరంగం నుంచి ప్రపంచంలోని నాయకుల వరకూ అందరినీ తప్పు పడతారు. ఎదుటివారిని విమర్శించటం ద్వారా మీరు ఏదీ సాధించలేరు, అంతే కాదు, అది మీలోని శక్తిని కిందికి లాగేస్తుంది. ఇది చాలా సామాన్యమైన ఉపయోగం లేని పద్ధతి.

ఇక రెండవ పద్ధతి : మీకు నిజంగా ఆ పరిస్థితి ఇష్టం లేకపోతే, దాన్ని మార్చటానికి నిజాయితీగా పని చేసారు. మీరు అనుకూల సామూహికశక్తిని సృష్టించటానికి పని చేసారు. అది ముందుగా మీ నుంచి ప్రారంభమవుతుంది. ఆ తరువాత అది ప్రపంచంలోకి వెళుతుంది.

ఇదే సరైన సమయం......

మన నుంచి ఎక్కువ అనుకూలతని సృష్టిద్దాం.

మన పనులలోకి ఎక్కువ ప్రేమను తీసుకొద్దాం.

మన వ్యక్తిగతచేతనస్థితిని మరింత ఉన్నతస్థితికి తీసుకెళదాం.

వ్యతిరేకనిర్ణయాల పట్ల మీరు అసహనంగా మారే కంటే, మీరు మీ చుట్టూ అనుకూలశక్తిని సృష్టించండి. అప్పుడు మీ చుట్టు పక్కలవారు, ఈ ప్రపంచం కూడా ఆ అనుకూలచేతనస్థితి శక్తికి ప్రభావితం అవుతుంది. అప్పుడు అది నాయకుల నుంచి కూడా అన్ని దిశలా వ్యాప్తిస్తుంది. ఎప్పుడెతే చాలా మంది మారతారో అప్పుడు సమష్టి అనుకూలశక్తి సరియైన దేశనాయకుల ద్వారా వెల్లడి అవుతుంది. నాయకులందరూ ప్రజలు సృష్టించిన సమష్టి అనుకూల – ప్రతికూల శక్తి వెల్లడి. వారంతా ప్రజల చేత నడిపించబడుతున్నారు.

విషయాలని రెండు విధాలుగా చూడవచ్చు. కూర్చొని విషయాలని విమర్శిస్తూ అందరినీ తప్పు పట్టటం లేదా అనుకూలశక్తిని సృష్టించే దిశగా పని చేయటం. నిజాయితీ గల వ్యక్తి ఎదుటివారిని తప్పు పట్టకుండా, ఎదుటివారి పరిస్థితుల్ని విమర్శించకుండా, పరిస్థితులకి అసహనం తెచ్చుకోకుండా, అనుకూలశక్తిని సృష్టించటానికి పని చేయాలి అని నేను అనుకుంటాను.

మీరు నిరాశతో, అసహనంగా ఉంటే ఏం సాధించగలరు, ఏమీ సాధించలేరు. కాకపోతే మీరు మరి కాస్త నిరాశకి లోనై, మరి కొంచెం వ్యతిరేకశక్తిని సృష్టిస్తారు. దాని వల్ల వ్యతిరేకచేతనస్థితి తయారవుతుంది. కాబట్టి విప్లవం కాదు కావలసింది, క్రమమైన అభివృద్ధి కావాలి.

ప్రతి విప్లవం ఒక సత్యాన్ని, ఒక పరిష్కారాన్ని ఇస్తాయని ప్రమాణాలు చేసింది. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది? గడిచిన 3000 వేల సంవత్సరాల ప్రపంచచరిత్రలో 5000 యుద్ధాలు జరిగిన రికార్డు ఉంది. చరి(తకారుల లెక్కల ప్రకారం గడచిన 3000 సంవత్సరాల్లో కనీసం 9000 శాంతి ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల సగటు జీవితకాలం కేవలం ఎనిమిది సంవత్సరాలు.

దీన్ని బట్టి చూస్తే మనుషులు ఇంకే పనీ చేయకుండా యుద్ధాలు మాత్రమే చేస్తున్నారు అనిపిస్తుంది. కారణం ఏమిటంటే మనం విప్లవాలని నమ్ముతాం. ఇప్పుడు వ్యక్తిగతక్రమాభివృద్దిని నమ్మవలసిన సమయం వచ్చింది. పెద్ద పెద్ద విప్లవాలు మరొక వ్యవస్థని చేసాయి. మళ్ళా అధికారంలోకి వచ్చిన వ్యక్తులు సమష్టి ప్రతికూలశక్తితోనో లేదా సమష్టి అనుకూలశకితోనో ముందుకి సాగుతారు. కాబట్టి మరింత అనుకూలశక్తిని సృష్టించటం మనందరి బాధ్యత. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ చేయగల పని అదే.

శాంతిని వ్యక్తుల హృదయాల్లోకి తీసుకురాగలగాలి. అప్పుడు అది పుష్పాలలోని పరిమళంలా అంతటా వ్యాపించి, ప్రపంచాన్ని మార్చేస్తుంది. మనం అంతరంగంలో నిజాయితీగా ఉందాం. అలా ఉంటూ మనకి శాంతిని తెచ్చుకుని ప్రపంచానికి శాంతిని ఇద్దాం. అప్పుడు మనం సమష్టి అనుకూలచేతనస్థితిని మరింత బలంగా సృష్టించగలుగుతాం.

అనుకూలశక్తిని స్పష్టించండి. దాంతో మీ చుట్టుపక్కల వారు, ఈ ప్రపంచం మొత్తం ఆ అనుకూలచేతనస్థితితో ప్రభావితం అవుతాయి. అప్పుడు అది నాయకుల ద్వారా వెల్లడి అవుతుంది.

ప్రపంచంలోని బాధలని ఏ విధంగా రూపుమాపాలి

మన చుట్టూ జరుగుతున్న చాలా సంఘటనలు గతం ఫలితాలు. కనీసం ఇప్పుడైనా, మనం చాలా ఎక్కువగా సమష్టి చేతనస్థితిని సృష్టించగలగాలి. ఆ విధంగా సృష్టించిన శక్తితో విశ్వశాంతి మీ నుంచి ప్రారంభమవుతుంది రాబోయే కొన్ని ప్రమాదాల్ని, సమస్యల్ని తొలగించుకోవచ్చు. మనం అసహనంగా, ఆందోళనగా తయారైతే మరింత హింసని స్పష్టించినవారమవుతాం. ఉన్నటువంటి హింసని తగ్గించటానికి మనం హింసని సృష్టిస్తాం. హింస హింసని ఆపలేదు. రక్తం రక్తాన్ని తుడిచేయలేదు.

బుద్ధుడు చాలా చక్కగా చెబుతాడు. కంటికి కన్ను అనే సూత్రాన్ని పాటిస్తే ప్రపంచం గుడ్డిదైపోతుంది. కంటికి కన్ను అని పని చేస్తే ఈ వర్గంలో వ్యక్తి అవతలి వర్గంవాడి కన్ను తీస్తాడు. ఆ వర్గం వాళ్ళు ఈ వర్గంలోని వ్యక్తి కన్ను తీస్తారు. చివరికి ప్రపంచమంతా అంధులైపోతారు.

మీరు చేయగలిగిన ఒకే ఒక పని చాలా చాలా ప్రశాంతమైన, అనుకూలమైన వాతావరణాన్ని మీ అంతరంగంలో స్పష్టించి, ఆ తరువాత నిరంతరం బయటి ప్రపంచంలో ప్రేమని, శాంతిని సృష్టించటానికి పనిచేయటం. అదొక్కటే ఈ సమస్యకి పరిష్కారం.

మీరు ఈ విధంగా నిర్ణయించుకోండి: ఈ నిమిషంలో నాకున్న శక్తితో నాకు దొరికిన ప్రశాంతమైన ప్రార్ధనలు, అనుకూలశక్తి, అనుకూలమైన ఆలోచనల్ని పంపిస్తాను. నా శరీర – మానసికవ్యవస్థలు నా నియంత్రణలో ఉన్నంత వరకూ అన్నీ అనుకూలంగా చేస్తాను.

ఆందోళన చేసినంత మాతాన ఏమీ సాధించలేం. ఆందోళన చేసేవారే యుద్ధాలకి కారణం. మనం కూడా ఆందోళనలు చేస్తే సమస్య ఏ విధంగా పరిష్కారమవుతుంది? మనం మరిన్ని సమస్యల్ని స్పష్టిస్తాం. మీరు ఆందోళన చెందితే ఓడిపోయినట్లే. మనం ఏం చేసినా ఆందోళనలు, విప్లవాలు లేకుండా చేయగలగాలి.

దీనికి ఉండే ఒకే ఒక మార్గం, ఇక్కడే, ఇప్పుడే ఉండగలగటం. సమస్తచేతనస్థితికీ సంతోషాన్ని, పరమానందాన్ని, నిశ్శబ్దాన్ని కలపగలగటం. ఎవరైతే విప్లవంతో ప్రయత్నించారో వారు మరొక వ్యవస్థని సృష్టించారు. మరొక సంద్రదాయాన్ని, మరొక అధికారక్షేత్రాన్ని సృష్టించగలిగారు. అది చివరికి యుద్ధంతో ముగుస్తుంది. కాబట్టి మనకి ఉన్న ఒకే ఒక మార్గం బుద్ధుని మార్గమైన శాంతి మార్గం, శివుని మార్గమైన నిశ్శబ్దమార్గం.

మనతో మనం పని చేయటం, మన మీద మనం యజమానులు కాగలగటం, ఆందోళన చెందకుండా సరైన దారిలో వెళుతూ సరైన పనులు చేయగలగాలి. మనం గొడవలు చేసేవారం కాకుండా ఉపయోగపడే పనులు చేయగలగాలి. మనం శాంతి, నిశ్శబ్దం, పరమానందం కోసం ఎంత చేయగలిగితే అంత చేయగలగాలి. మన చేతనస్థితిలోకి ఎంత శాంతిని వీలైతే అంత మనం మనలోకి తెస్తూ, నాయకుల్ని చేతనస్థితిలోకి తీసుకురావటానికి ప్రయత్నించాలి.

గందరగోళాన్ని తగ్గించేందుకు సమష్టి అనుకూలశక్తిని పెంచాలి

భౌతికస్థితిలో వేడిని తగ్గించగలిగితే, ఆందోళన, గందరగోళం తగ్గుతాయి. ఉదాహరణకి మీరు వేడి తగ్గించగానే ద్రవరూపంలో ఉన్న నీరు మంచుగడ్డలా తయారవుతుంది. అదే విధంగా అందులో ఉండే మలినాలు కూడా పోతాయి. ఉప్పు నీటిని గడ్డ కట్టిస్తే, అడుగున ఉప్పు ఉండటాన్ని చూడవచ్చు. అయితే అది నీరు గడ్డ కట్టాక మాత్రమే కనిపిస్తుంది. అదే విధంగా సంఘం సమష్టి చేతనస్థితి మారినప్పుడు, అందులో గందరగోళం తగ్గి ఆ వ్యవస్థ శుభ్రపడుతుంది.

శాంతిపై ధ్యాన ప్రభావం – పరిశోధనలు

సమూహంలో చేసే ధ్యాన ప్రభావం సంఘం మీద ఏ విధంగా ఉంటుందో చాలా పరిశోధనలు జరిగాయి. కొంచెం క్లిష్టమైన సమూహం మీద ట్రూన్స్‌స్మాండల్ ధ్యానాన్ని ప్రయోగించి చూసారు. సమూహాల్లో ధ్యానం చేసినప్పుడు ఆయా ప్రాంతాలలో నేరాల సంఖ్య ఏడు శాతం తగ్గినట్లు ఫలితాలు వచ్చాయి. మరి కొన్ని ప్రాంతాల్లో హింస తగ్గి సహాయసహకారాలు పెరిగాయి అని ఫలితాలు చూపించాయి. యుద్ధాలు జరిగే ప్రాంతాల్లో మరణాలు తగ్గాయని, గాయాలు జరగటం తగ్గాయని ఫలితాలు వచ్చాయి. మొత్తం మీద నేరాల సంఖ్య, ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, హింస బాగా తగ్గి జీవితంలో నాణ్యత పెరిగినట్లు తెలిసింది.

విశ్వశాంతి ధ్యానం

సెప్టెంబర్ 21న ప్రపంచ శాంతిదినం జరుపుతారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ప్రార్ధనలు, ధ్యానాలు, ఉత్సవాలు చేస్తుంటారు. ఇవన్నీ ప్రపంచశాంతికి చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆ సందర్భంగా నిత్యానంద మిషన్ సెంటర్లలో సామూహిక ధ్యాసకార్యక్రమాల్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఆ విధంగా చేసినప్పుడు సమష్టి చేతనస్థితి అత్యున్నతస్థాయికి చేరుతుంది.

ఏదైనా ఒక పదార్ధాన్ని లేదా ఒక వసువుని పంచుకుంటే తగ్గుతుంది. ఉదాహరణకి ఒక యాపిల్ నలుగురు పంచుకుంటే దాన్ని నాలుగు ముక్కలు చేయాలి. ఒక్కొక్కరికి ఒక ముక్క వస్తుంది. అదే విద్యుత్తును పంచుకుంటే దాని వోల్టేజ్‌లో మార్పు ఉండదు. ఒక వైరులో 10 ఓల్లుల కరెంట్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పట్టుకున్నా 10 ఓల్లుల శక్తితో షాక్ కొడుతుంది. నలుగురు పట్టుకున్నా అంతే.

అయితే సూక్ష్మస్థాయిలో ఉండే ధ్యానశక్తి పరిస్థితి వేరు. ధ్యానాన్ని చాలా మంది ఒక సమూహంలో చేసే అది మరింతగా పెరుగుతుంది. అది తగ్గదు, అదే స్థితిలో ఉండదు కానీ చాలా రెట్టు పెరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ధ్యానం చేస్తే 10 ఓల్ట్‌ల శక్తి వస్తే 100 మంది చేస్తే 1000 ఓల్టుల వస్తుంది. ఆ శక్తి ధ్యానం చేసిన ప్రాంతాన్ని శుభ్రం చేస్తుంది.

అందుకే సమూహంలో చేసే ధ్యానాన్ని బాగా ప్రోత్సహిస్తారు. దీన్ని మామూలు లైటుకి, లేజర్ లైటుకి ఉన్న తేడాతో పోల్చవచ్చు. లేజర్ లైటు సమష్టి ధ్యానం లాంటింది.

జ్ఞానోదయమైన గురువుల ప్రేమస్పర్శ

బుద్ధుని జీవితం నుంచి ఒక కథ : అంగుళీమాలుడు అనే దొంగ ఉండేవాడు. అతను అడవిలో ఉంటూ ఆ అడవి మార్గంలో వెళ్ళేవారి ధనం దోచుకుంటూ ఉండేవాడు. అలా ఎవరి దగ్గర దోచుకుంటే వారి బొటన వేలు కోసి వాటిని మాల కట్టి వేసుకునేవాడు. అందుకే అతన్ని అంగుళీమాలుడు అనేవారు.

ఒకసారి బుద్ధుడు ఆ అడవి గుండా ప్రయాణిస్తున్నాడు. అక్కడివారు బుద్ధుడికి అంగుళీమాలుణ్ని గురించి జాగ్రత్త చెబుతారు. బుద్ధుడు పట్టించుకోకుండా అదే మార్గంలో వెళ్ళాడు. అడవి లోపలికి వెళ్ళాక, చెట్ల గుబురు లోంచి అకస్మాత్తుగా దూకి బుద్ధుడిని 'కదలకుండా నిలబడు' అని అరుస్తాడు. బుద్ధుడు నిలబడి 'నేను కదలకుండా ఉన్నాను. నీవు కూడా అలా ఉండు' అంటాడు.

అంగుళీమాలుడు జీవితంలో మొదటిసారి తన అంతరంగం నుంచి భయపడతాడు. బుద్ధుడి నుంచి ఏదో అతన్ని స్పృశించింది. బుద్ధుడిని ఏమీ చేయలేకపోయాదు. అతను బుద్ధుని పాదాల మీద పడి క్షమించమని ప్రార్ధిస్తాడు.

ఈ కథలో జ్ఞానోదయమైన గురుదేవుల ప్రభావం ఎంతగా ఉంటుందో అర్థం అవుతుంది. ఎటువంటి ప్రయత్నమూ లేకుండా జ్ఞానోదయమైన యోగీశ్వరులు తమ నుంచి శాంతిని, కరుణని నిరంతరం ప్రసరింపచేస్తుంటారు. ఆ శక్తి ఎదుటివారిని మార్చగలుగుతుంది.

ఆ ప్రభావం కేవలం మనుషులకే పరిమితం కాదు. జంతువులు కూడా ఆ స్వచ్ఛమైన ప్రేమ కరుణల ప్రభావానికి లోనవుతాయి. అంత అత్యున్నతశక్తి సమక్షంలో ఏదైనా మారుతుంది.

ఆదిశంకరాచార్యుల వారి జీవితం నుంచి ఒక అందమైన కథ : శంకరాచార్యుల వారు దక్షిణభారతదేశంలో సంచారం చేస్తూ శృంగేరి అనే ఊరికి వసారు. అక్కడ ఒక రోజు ఒక చక్కని సంఘటనని చూసారు. ఒక రాతి మీద రెండు కప్పలు ఉంటాయి. ఎండ రాగానే అవి నీళ్ళలోకి దూకబోతాయి. సరిగ్గా ఆ సమయంలో ఒక తాచుపాము పడగని విప్పి ఆ కప్పలకి నీడనిస్తుంది. కప్పలు ఆ నీడలో కొద్దిసేపు సేదదీరి నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. పాము కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. శంకరాచార్యులు ఇదంతా చూసి ఆశ్చర్యపోతాడు. ఆయన మహామేధావి. ఆయన ఆ సంఘటనని అక్కడితో వదలలేదు. అయన ఇలా అనుకుంటారు, 'ఇది చాలా పవిత్రమైన ప్రదేశమై ఉంటుంది. అక్కడ ఉన్న అత్యున్నతశక్తికి జంతువులు తమ శత్రుత్వాన్ని మరచిపోయి చక్కగా కలిసి ఉంటున్నాయి.' ఇలా అనుకొని ఆ చుట్టుపక్కల చాలామందిని ఆ స్థలవిశేషం అడుగుతారు. అక్కడ ఒకప్పుడు గొప్ప జ్ఞానోదయమైన యోగీశ్వరుని ఆశ్రమం ఉండేదని తెలుస్తుంది.

జ్ఞానోదయమైన యోగీశ్వరులు అప్రయత్నంగా సమష్టి అనుకూలశక్తిని తమ అంతరంగం నుంచి నిరంతరం ప్రసరింపచేస్తుంటారు. పతంజలి ఈ విధంగా చెబుతాడు 'జ్ఞానోదయమైన యోగీశ్వరుని సమక్షంలో సహజంగా శత్రువులు కూడా తమ శత్రుత్వాన్ని వదులుతారు'.

పూర్తి స్తాయిలో మండే మంట దేన్నైనా తనలోకి తీసుకొని స్వాహా చేస్తుంది. కాని అది దేని వల్లా కూడా మలినం కాదు. ఆ మంటలోకి ఏది వెళ్ళినా అది స్వచ్ఛంగా మారుతుంది. కాని ఆ మలినాలు మంటని అంటవు. అదే విధంగా జ్ఞానోదయమైన వారు మంచి, చెడు అనేవాటి వల్ల ప్రభావితం కారు. అవి వారిని ఏమీ చేయలేవు. వారి సమక్షం ఎంత తీవంగా ఉంటుందంటే, అక్కడికి వచ్చిన ప్రతిదీ వారి ప్రేమకరుణలకి కరిగిపోవలసిందే.

చేయటం. నా మిషన్ లక్ష్యం ఇదే.

నిత్యానంద మిషన్

నేను ఈ భూమి మీదికి వచ్చిన కారణం, వ్యక్తిగత చేతనస్థితి, దాని నుంచి కలిగే సమిష్టిచేతనస్థితి, దాని నుంచి అత్యున్నత చేతన స్థితిలోకి ప్రవేశించగల ఒక ధర్మచక్రాన్ని సృష్టించటమే. అది సాధించటానికి, ఒక లక్షమందిని జీవన్ముక్తులుగా, జీవిస్తూ జ్ఞానోదయాను భవాన్ని పొందే విధంగా దీక్షని ఇచ్చాను.

కోటిమందికి నిత్యధ్యానం దీక్షని ఇచ్చాను. నిత్యధ్వానం ఈ భూమి మీద ఉన్నవారిని అనుకూలస్థితిలో ఉన్నతమైన వ్యక్తిగత చేతనస్థితికి తీసుకువెళుతుంది.

ప్రపంచశాంతికి ధ్యానపద్ధతి

ప్రపంచశాంతిని సాధించాలి అంటే వ్యక్తిగతశాంతి కావాలి. ప్రపంచశాంతికి చేసే ధ్యానం సమూహంలో చేసేది సమష్టిధ్యానం. ఇది చాలా సులభమైంది. చాలా శక్తిమంతమైంది.

అందరూ వృత్తాకారంలో కూర్చొని ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. మీరు మీ కుడి పక్కన ఉన్న వ్యక్తి చేతిలో మీ కుడి అరచేతిని ఇస్తున్న విధంగా బోర్లించినట్టు ఉంచండి. అంటే శాంతిని, ఆనందాన్ని ఇస్తున్నారని అర్థం. మీరు మీ ఎడమచేతిని మీ ఎడమ పక్కన వారి చేతి కింద శాంతిని, ఆనందాన్ని తీసుకుంటున్న విధంగా ఉంచాలి. ఈ విధంగా కూర్చున్నప్పుడు అక్కడ గొప్ప శక్తి జనిస్తుంది. ఒక వ్యక్తిలోని ధ్యానశక్తి అందరూ పంచుకుంటారు. ఈ విధంగా ఈ ధ్యానాన్ని 21 నిమిషాల పాటు చేయాలి.

విశ్వశాంతి మీ నుంచి ప్రారంభమవుతుంది

  • మనలోని పరస్పర విరుద్ధమైన ఆలోచనలే మన అన్ని వ్యథలకి కారణం.
  • సర్వాంతర్యామి, సర్వసృష్టి అనే మహాసాగరంలో మనమంతా అలలం. ★ సర్యాంతర్యామి అంటే స్వచ్ఛమైన మేధాశక్తి.
  • ఆందోళన చేసినంత మాత్రాన ఏమీ సాధించలేం. ఆందోళన చేసేవారే యుద్ధాలకి కారణం.
  • మనతో మనం పని చేయటం, మన మీద మనం యజమానులు కాగలగటం, ★ ఆందోళన చెందకుండా సరైన దారిలో వెళుతూ సరైన పనులు చేయగలగాలి.
  • ప్రపంచశాంతిని సాధించాలి అంటే వ్యక్తిగతశాంతి కావాలి. ప్రపంచశాంతికి ★ చేసే ధ్యానం సమూహంలో చేసేది సమష్టిధ్యానం. ఇది చాలా సులభమైంది. చాలా శక్తిమంతమైంది.

సన్యాసం అంటే అంతిమద్యూతం

అంతిమద్యూతమైన సన్న్యాసాన్ని గెలవటమే జీవన్ముక్తి

మనం మన చుట్టుపక్కల వున్నవారితో, సర్వసృష్టికి అనుగుణంగా ఉండగల శక్తి మన ప్రాధాన్యత మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంచుకునే ప్రాధాన్యాల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంచుకోకపోతే ఏమవుతుంది? ఉన్నదాన్ని ఉన్న విధంగా తీసుకుంటే ఏమవుతుంది?

సన్యాసం గురించి మాట్లాడే సమయం ఇదే. సన్యాసం అంటే జీవితం నుంచి పారిపోవటం కాదు. దేన్నీ అడ్డగించకుండా జీవితంతో పాటు ప్రవహించటమే. సంస్కృతంలో సన్యాసం అంటే సర్వాంతర్యామి మీద నమ్మకంతో ముందుకి సాగుతూ మిగతా విషయాల్ని వదిలేయటమే.

గౌతమబుద్ధుని జీవితం నుంచి ఒక చక్కని సంఘటనని చెబుతాను. జ్ఞానోదయం అయ్యాక బుద్ధుడు ప్రజలకి ధర్మబోధనలు చేస్తూ, వారికి ఆధ్యాత్మికదీక్షలనిస్తూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళుతూ ఉంటాడు.

ఈ విధంగా చాలా ప్రాంతాలను దర్శించి, తన జన్మస్థలమైన కపిలవస్తు నగరంలోకి ప్రవేశిసాడు. కాషాయవుస్తాలు ధరించి, తన శిష్యులతో ప్రతి వీథిలోనూ తిరుగుతున్న బుద్ధుణ్ని ప్రజలు ఆశ్చర్యంగా చూసుంటారు. బుద్ధుని భార్య యశోధర వీథిలోని కోలాహలాన్ని విని, అక్కడ ఉన్న పనివారిని ఆ సందడి ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు వారు ఆమెతో ఆయన మరెవరో కాదు, నీ భర్త. ఆయన జ్ఞానోదయం పొంది బుద్ధుడుగా ఇక్కడికి వచ్చారు, అని చెబుతారు. ఆమె ఆయనని కలవటానికి వెళ్ళదు కాని, ఆమె కుమారుడైన రాహులుణ్ని పిలిపిస్తుంది. రాహులుడు, బుద్ధుడు జ్ఞానోదయం కోసం ఇంటిని వదలి వెళ్ళిన రాత్రి జన్మిస్తాడు.

ఆమె రాహులునితో, 'ప్రకాశాన్ని నలుదిశలా వ్యాపింపచేస్తూ, చేతిలో భిక్షాపాత్ర ఉండి కూడా చక్రవర్తిలా ఉన్న వ్యక్తిని చూసావా? ఆయనే నీ తండ్రి. వెళ్ళి ఆయన ఆశీస్సులు పొంది, వారి నుంచి వారసత్వాన్ని కోరుకొని రా!' అని చెబుతుంది.

బాలుడైన రాహులుడు పరుగుపరుగున తండ్రి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద వాలిపోయి, తల్లి చెప్పిన విధంగా అవే మాటల్ని ధైర్యంగా చెబుతాడు.

బుద్ధుడు నెమ్మదిగా ఆ బాలుడిని లేపి, చక్కని చిరునవ్వుతో అతని వైపు చూస్తాడు. ఆ తరువాత ఆ బాలుడి ఒంటిమీద ఉన్న మేలిమి పట్టవస్త్రాలని తీసేసి కాషాయవస్త్రాన్ని కప్పుతాడు.

ఏడు సంవత్సరాల ఆ బాలుడికి, తన వారసత్వాన్ని ఇస్తాడు. రాహులుడే అతి చిన్న వయస్సులో సన్యాసదీక్షని పొందిన ఏకైకవ్యక్తి.

నన్ను ఒక వ్యక్తి ఈ విధంగా అడిగాడు, జీవితంలో ప్రతివిషయం సహజపరిణామ క్రమంలో అభివృద్ధి చెందేదైనప్పుడు, ఏ విధంగా అంటే, కోతి నుంచి మానవుడుగా; చెడు

నుంచి మంచిగా రూపాంతరం చెందగలిగినప్పుడు, మనిషి భగవంతుడుగా కూడా సహజంగా, క్రమపద్ధతిలో మారవచ్చు కదా! అప్పుడు ఈ ధ్యానం, తపస్సు, సన్యాసం – వీటి అవసరం ఏమిటి? అటువంటి ప్రోత్సాహకాల అవసరం ఏమిటి?

ఆ వ్యక్తితో నేను ఇలా అన్నాను 'కోతి మనిషిగా రూపాంతరం చెందటానికి ఐదు వేల సంవత్సరాల సమయం పట్టింది. అదే విధంగా మనిషి భగవంతుడుగా మారటానికి అంతే సమయం పడుతుంది. మీరు అంత సమయం ఎదురు చూడటానికి సిద్ధంగా ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు.'

ఆ విధంగా కాదు అనుకుంటే, పూర్తి చేతనస్థితిలో జీవించాలి అని మీరు నిర్ణయించుకొని, జీవితం పట్ల పూర్తి స్పష్టతలో, విశ్వనియమాలు, సూత్రాల్ని అనుసరించి ధ్యానంతో జీవించవచ్చు. మీ పరిణామక్రమాన్ని విప్లవాత్మకంగా చేసుకోవచ్చు. సరైన విప్లవాత్మకమైన మార్పు చక్కని పరిణామాత్మక మార్పు అయిన జ్ఞానోదయం వైపు తీసుకువెళుతుంది, అదే సన్యాసం. అన్నింటి కంటే గొప్ప వ్యక్తిగత విప్లవాత్మకజీవితం. అదే పరమహంసలా, జ్ఞానోదయమైన యోగీశ్వరునిలా జీవించగలగటం.

ఆదిశంకరాచార్యులవారు వివేకచూడామణి అనే గ్రంథంలో చాలా అందమైన శ్లోకాన్ని రచించారు. అన్ని ప్రాణుల్లోనూ, అన్ని జన్మల్లోనూ అరుదైంది మానవజన్మ, అంత కంటే అరుదైంది సాత్వికజీవితం (మంచి దృక్పథం). దాని కంటే గొప్పది, వేదాల్తో వివరించిన విధంగా ఆధ్యాత్మిక మార్గంలో స్థిరపడటం.

ఆదిశంకరాచార్యులు చెప్పిన ఈ మాటలు, వివేకానందుని జీవితం మీద చాలా లోతైన ప్రభావం చూపించాయి. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఆదిశంకరాచార్యులవారిని జ్ఞానోదయమైన యోగీశ్వరుడు. ఆయన ఆదిశంకరాచార్యునికి రెండు వేల సంవత్సరాల తరువాత ఉన్న వ్యక్తి వివేకానందుడు న్యాయశాస్త్ర (లా) పరీక్షలకి సిద్ధమవుతున్న సమయంలో ఈ మాటలు ఆయనకి ఒక మెరుపులా తాకాయి. ఆ తరువాత ఆయన ఏ మాత్రం తన చదువుని సాగించలేకపోయాడు. పుస్తకాలని ఒక పక్కన పెట్టి, తన గురుదేవులైన రామకృష్ణ పరమహంస దగ్గరకి వెళ్ళటానికి పరుగుతీసాడు. ఆయన ఆ విధంగా పరిగెత్తే సమయంలో ఆదిశంకరాచార్యుల మాటల్లోని సత్యాలు వివేకానందుని అంతరంగంలో పదే పదే మారుమోగుతుంటాయి. ఆయన తనలో ఈ విధంగా అనుకుంటాడు, నేను ఆదిశంకరాచార్యులు చెప్పిన మూడు స్థితులనీ పొందాను. నేను మానవుడుగా జన్మించాను. నాకు ముక్తి (స్వేచ్ఛ) కావాలి అనే కోరికని పొందాను. ఒక గొప్ప గురుదేవుణ్ని పొందాను.

ఎవరైతే తమ మీద తాము గెలవాలని అనుకుంటారో వారికి కావలసింది సన్యాసమార్గం. ఎవరికైతే అసూయ, కోపం, ఒత్తిడి, క్రుంగుబాటు – ఇటువంటి సంకెళ్ళ నుంచి శాశ్వత విముక్తి కావాలి అనే కోరిక ఉంటుందో వారికి సన్యాసం సరైన మార్గం. చాలామంది సన్యాసం అంటే జీవితంలో అన్ని విధాలుగా ఓడిపోయినవారు చేసే పని అనుకుంటారు. అది కాదు, కాకపోతే కొందరికి జీవితంలో ఏం చేయాలో తెలియక సన్యాసం తీసుకుంటారు. అయితే సన్యాసంలోని ముఖ్యార్థం అది కాదు.

సన్యాసం అంటే మొట్టమొదటిసారిగా చేతనస్థితిలోకి రావటానికి చేసే ప్రయత్నం. మనిషి చుట్టూ ఉండే యాంత్రికజీవితం నుంచి చేతనస్థితిలోకి రావటానికి చేసే ప్రయత్నం సన్యాసం. మీరు సర్వాంతర్యామిలో ఒక భాగం. సర్వాంతర్యామి తన పద్ధతిలో తాను సాగిపోతుంటాడు. తన సంగీతంతో తాను ముందుకి వెళుతుంటాడు. ఆ సంగీతలయలకి అనుగుణంగా సాగిపోయే శాస్త్రమే సన్యాసం. సర్వాంతర్యామి అయిన విశ్వశక్తికి మన ఆత్మతో ఉండే అనుబంధమే సన్యాసం. అది ఒక్కటే జీవితంలో విజయాన్ని సాధించగల దగ్గర దారి.

విశ్వశక్తి సంగీతనాదాన్ని వినాలి అంటే మీరు సరైన దశలో, సరైన స్థితిలో ముందుకి సాగాలి. ఆ స్థితిని కనుక్కోవాలి అంటే ముందుగా మీరు మిగతా విషయాల్ని వదిలి కేవలం ఆ సంగీతాన్ని లోతుగా, తెలుసుకునే తత్వంతో, పూర్తి ఎరుకతో వినగలగాలి. అప్పుడు ఆ స్థితిని మీరు కనుక్కుంటారు. ఆ స్థితిలోనే జీవితం సాగరం వైపు పరుగులు తీసే నదిలా సాగిపోతుంది. మరే ఇతరమార్గమైనా చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది.

ఎప్పుడైతే జీవితం ఒక ప్రవహిస్తున్న నదిలా ఉంటుందో, అప్పుడు అది సాగరంలో కలసిపోవలసిందే. అంతకు మించి దానికి వేరే దారి లేదు. సన్యాసం అంటే ప్రవహించే శాస్త్రం. సర్వప్రకృతికి, ఈ సృష్టికి అనుగుణంగా ప్రవహిస్తూ చివరికి ఆ విశ్వశక్తితో ఐక్యమైపోవటమే.

నదిలా ప్రవహించండి

నది ఎప్పుడూ సాగరం వైపు మాత్రమే ప్రవహిస్తుంది. అది ఎక్కడా ఆగి నిలిచిపోదు. సన్యాసి ఎప్పుడూ కూడా తన లక్ష్యమైన జ్ఞానోదయం వైపు ప్రవహిస్తూ ఉంటాడు. అతనికి అడ్డంకులు ఏవీ తెలియవు. నది నిరంతరం పరమానందంతో ప్రవహిస్తూ ఉంటుంది. అందులో ఏది, ఎంత వేసి కలుషితం చేసినా అది అలా ఆనందవాహినిలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలోకి పూలని వేసినా, ఆకులు వేసినా, ఆహారం, పక్షులు, జంతువులు, కళేబరాలు, ఇది కాదు, అది కాదు అనకుండా ఏది వేసినా, ఏ మాత్రం వాటిని పట్టించుకోకుండా నిరంతరం ఆనందంగా ప్రవహిస్తూ, తనకి అడ్డం వచ్చేదాని ద్వారా కూడా ప్రభావితం కాకుండా, ముందుకు పోతూ ఉంటుంది. నదిలోని ప్రవాహవేగం, ఆ అడ్డంకుల్ని దాటే విధంగా చేస్తూ, అది తిరిగే సుడుల శబ్దం నుంచి సంగీతాన్ని సృష్టిస్తూ సాగరసంగమం కోసం సాగరదిశగా పరుగులు తీస్తుంది. విశ్వమేధాశక్తి కూడా సన్యాసిని అతనికి అడ్డం వచ్చే అడ్డంకుల నుంచి ముందుకి లాగుతూ, తన జీవితలక్ష్యమైన జ్ఞానోదయం వైపు సాగిపోయే విధంగా చేస్తుంది. అతనికి అసలు అడ్డంకులు ఏమిటో తెలియదు.

సన్యాసం అంటే అంతిమద్యూతం

పరివ్రాజకుడుగా చాలా ప్రాంతాల్లో తిరిగే రోజుల్లో, ఒకసారి నేను, దాదాపు తొమ్మిది నెలల పాటు రెండు చోట్ల గడిపాను. అవి పవిత్రగంగానది ఒడ్డున, పవిత్రనర్మదానది ఒడ్డున. ఆ రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, ఆ నదిలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చునేవాడిని. అలా కూర్చొని కేవలం ఆ నదీప్రవాహాన్ని చూస్తూ ఉండేవాడిని. సూర్యోదయం అయ్యేది. నేను అదే విధంగా నదీప్రవాహాన్ని చూస్తూ ఉండేవాడిని. అలా చూసే సమయంలో నా మనస్సు నిశ్శబ్దం అయ్యేది. ఆలోచనలు క్రమంగా తగ్గేవి. అంతరంగంలోని మాటల ప్రవాహం ఆగిపోయేది. నేను ఆ నదీప్రవాహంలో ఐక్యమైపోయేవాడిని. ఆ విధంగా కొన్ని గంటల పాటు ఉండేవాడిని.

అంతే కాదు, మీరు ఎప్పుడైతే నదిని నిరంతరంగా చూస్తూ ఉంటారో మీలో భయం పోతుంది. నదిలో చాలా కొట్టుకువస్తుంటాయి. శవాలు తేలిరావటం చూసారు. ఒక రోజు నేను కూడా చనిపోయి అలా తేలుతాను కదా అని అనిపిస్తుంది. ఎప్పుడైతే నదీప్రవాహంలో ఐక్యమైపోతారో, మీ అంతరంగపు లోతులలో ఉన్న అన్ని రకాల భయాలూ మాయమౌతాయి.

ఒకసారి ఒక వ్యక్తి జెన్ మాస్టర్‌ని 'జెన్ అంటే ఏమిటి?' అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు ఆయన 'నడుస్తూ ఉండు' అంటాడు.

జెన్ బౌద్ధమతంలో జీవితం గురించి చక్కగా చెబుతారు. జీవితం నదిలా ప్రవహిస్తూ, జీవితానికి, సన్నాసికి ఉండవలసిన ముఖ్యలక్షణం. సన్యాసం అంటే జీవితాన్ని జీవిస్తూ అందులో నుంచి నేర్చుకోవటమే కాని దాన్ని ఒక వేదాంతంలా చేయటం కాదు, జీవితం ఒక శక్తి. అది సిద్ధాంతం లేదా ఒక నియమం కాదు. నిజమైన సన్నాసి జీవితం ఎప్పుడూ సరైన దిశలో ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణంలోనే తాను నేర్చుకోగల అన్ని అంశాలూ నేర్చుకుంటాడు. నేర్చుకోవటం, జీవితం వేరు వేరు కాదు. జీవిస్తూ జీవితానుభవాల నుంచి నేర్చుకుంటాడు.

ఒక చిన్న కథ : ఒకప్పుడు ఒక దొంగ ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఒక రోజు అతను కొడుకుని తీసుకొని ఒక ఇంటికి వచ్చి అందరూ నిద్ర పోయాక కొడుకుని ఇంట్లో లోపలికి వెళ్ళి ఏదైనా దొంగతనం చేసి తీసుకురమ్మని లోపలికి పంపిస్తాడు. కొడుకు సరే అని లోపలికి వెళతాడు. అతను లోపలికి వెళ్ళగానే దొంగ తలుపు మూసి గడియ వేసి, ముందు పక్క తలుపుని గట్టిగా కొడతాడు. ఆ శబ్దానికి ఇంట్లోవాళ్ళంతా మేలుకుంటారు. వాళ్ళు ఎవరూ తనను చూడకుండా త్వరగా అక్కడి నుంచి పారిపోతాడు.

కొన్ని గంటలయ్యాక కొడుకు తండ్రి దగ్గరకి వచ్చి, చాలా కోపంగా అరుస్తూ 'ఎందుకు నన్ను లోపలుంచి గడియ పెట్టావు? అని అడుగుతాడు. తండ్రి దొంగ నవ్వి, 'నేను అలా చేయకపోతే, నీవు దొంగతనంలో మొదటి పాఠం నేర్చుకునేవాడివి కాదు' అంటాడు.

సన్యాసం అంటే నేరుగా సత్యాల్ని ప్రతిక్షణం సాధన చేయటమే. ప్రపంచంలో కావలసినంత వేదాంతం, ఆధ్యాత్మికగ్రంథాలు ఉన్నాయి. కాని అనుసరించేవారు, సాధన చేసేవారు లేరు. సన్యాసం అంటే సత్యాల్లో జీవించటం, జీవితంలో ప్రతిక్షణం ఆ సత్యాల్ని సాధన చేయాలని చేతనస్థితిలో నిర్ణయించటం.

జెన్ బౌద్ధగురువు తన శిష్యులతో ఒక చక్కని మాట చెబుతాడు, 'సత్యాల్ని వేదాంతపాఠాలుగా చదవటం అంటే బోధన పరికరాలని పోగుచేసుకోవటమే. బాగా గుర్తుంచుకో, ఆ సత్యాల్ని నిరంతరం సాధన చేయకపోతే, నీలోని సత్యం అనే జ్యోతి ఆరిపోతుంది.'

సాధన అంటే సరైన దిశలో, ఎక్కడా ఆగకుండా అలా నిరంతరం ప్రవహిస్తున్నట్టు వెళుతూ ఉండటమే. ఎప్పుడైనా, ఎక్కడైనా ఆ నిరంతర ప్రయాణం ఆగితే, అక్కడ కూడా కదలికలు ఉండాలి. ప్రవాహానికి అడ్డు తగిలిన అడ్డంకి నుంచి తప్పుకొని ప్రవహించగల మార్గాన్వేషణ ఉండాలి. అటువంటివారికి ఆగటం అనేది అసలు ఉండదు.

ఒక జపాన్ యోధుడికి శత్రువులతో పోరాడవలసిన అవసరం ఏర్పడుతుంది. అతని సైన్యం శత్రుసైన్యంలో పదవ వంతు కూడా ఉండదు. కానీ తాను తప్పకుండా గెలుస్తానని అనుకుంటాడు. అతని సైన్యం ఆ మాటని నమ్మరు. యుద్ధానికి వెళ్ళే దారిలో వారు ఒక దేవాలయం దగ్గర ఆగుతారు. అప్పుడు ఆ యోధుడు తన సైన్యంతో ఈ విధంగా అంటాడు, 'నేను గుడిలోకి ఒక నాణాన్ని వేసాను. బొమ్మ పడితే మనం గెలుస్తాం. బొరుసు అయితే మనం ఓడిపోతాం. మన అదృష్టాన్ని ఆ దేవత చేతిలో పెడుతున్నాను.' సైన్యం దీనికి అంగీకరిస్తారు. యోధుడు గుడి లోపలికి వెళ్ళి నిశ్శబ్దంగా ప్రార్థన చేసి నాణాన్ని విసురుతాడు. అప్పుడు బొమ్మ పడుతుంది. అతని సైన్యం ఉత్సాహంతో ముందుకు దూసుకువెళ్ళి, ధైర్యంతో యుద్ధం చేసి గెలుస్తారు.

యుద్ధం తరువాత, ఆ యోధుని సన్నిహితుడు ఈ విధంగా అంటాడు, 'అదృష్టాన్ని ఎవరూ మార్చలేరు' అని. అపుడు యోధుడు, 'అది సరి కాదు' అని తన చేతిలోని నాణాన్ని చూపిస్తాడు. దానికి రెండు వైపులా బొమ్మ ఉంటుంది.

సన్యాసి నిరంతరం విశ్వమేధతో ముందుకి సాగుతాడు. అతను ఎక్కడా ఆగదు. అతను ప్రతిక్షణం వర్తమానంలో ఉంటాడు. ఏ క్షణానికి ఎలా అవసరమో ఆ విధంగా ఉంటాడు. దీన్నే చైతన్యవంతమైన జీవితం అంటారు.

విశ్వశక్తికి అధీనమై, ఆ శక్తి తాలూకు మేధకి అనుగుణంగా ముందుకి సాగటమే సన్యాసం, సన్యాసి నదిలా ముందుకి సాగుతూ ఉంటాడు. సర్వాంతర్యామి ప్రకృతి, పక్షులు, జంతువులు, సముద్రాలు – వీటితో పాటు ఆ సన్యాసిని కూడా తనతో ముందుకు తీసుకువెళుతుంది. అధీనం అవటం అంటే సోమరితనం, జడత్వం కాదు. చేయవలసిన పనుల్ని సర్వాంతర్యామికి అధీనమై చేయటమే. అప్పుడు సర్వసృష్టి న్యాయసూత్రాల ఆధారంగా ఆ పనుల ఫలితాలు ఉంటాయి. మీరు నిరంతరం విరామంగా ఉండగలుగుతారు.

ఎప్పుడైతే మీరు విరామంగా, విశ్రాంతిగా ఉండగలరో, అప్పుడే మీరు ఇతరుల పట్ల బాధ్యతతో వ్యవహరించగలరు. మీ ప్రతిస్పందన బాధ్యతాయుతంగా ఉంటుంది. అప్పటి వరకు మీరు ఎదుటివారికి చూపేది ప్రతిచర్య మాత్రమే కాని ప్రతిస్పందన కాదు. ప్రతిచర్య అంటే అచేతనస్థితి నుంచి వెల్లడి చేయటమే. అదే ప్రతిస్పందన అంటే చేతనస్థితి నుంచి వెల్లడి చేయటం. అది బాధ్యత కూడా. ప్రతిచర్య ఎప్పటికీ బాధ్యత కాదు. సన్యాసం అంటే ప్రపంచం పట్ల, ఆ వ్యక్తి పట్ల బాధ్యత దిశగా చేతనస్థితిలో వేసే మొదటి అడుగు. సన్యాసం అంటే ఇది అని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అందరూ సన్యాసం అంటే జీవితం పట్ల బాధ్యతల్ని వదిలేయటం అనుకుంటారు. అది కాదు, సన్యాసం అంటే జీవితంలో ఎక్కువ బాధ్యతలు తీసుకోవటమే సన్యాసం. వారికి ప్రపంచమే ఒక కుటుంబం. వారు అందరి బాధ్యతనీ తీసుకుంటారు.

సన్యాసం అంటే అన్నీ వదిలేయటం కాదు

సన్నాసం అనగానే అన్నీ వదిలేయటం అనే తప్పు అర్థాన్నిస్తారు. మీరు దేన్నీ వదిలేయనవసరం లేదు. మీరు ఒక్క విషయం అర్థం చేసుకుంటే చాలు – ఈ ఐశ్వర్యానికి, వసువులకి మీరు కొంత కాలం కాపలా ఉండే కాపలాదారులు మాత్రమే అని, ఆ ఐశ్వర్యం, వస్తువులు అన్నీ ఆ సర్వాంతర్యామివే. మీలాగానే అవీ ఆయన సొంతం. అటువంటప్పుడు మీరు దేన్నీ వదలనవసరం లేదు. ఎందుకంటే మీరు దేన్నీ 'నాది' అధీనపరచుకోలేదు కాబట్టి. అంతే కాకుండా మీరు మీ ఐశ్వర్యాన్ని వదులుకోవలసి వచ్చినప్పుడు మీరు బాధ పడరు, ఎందుకంటే అది మీది కాదు కాబట్టి. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైతే నాది అనే దృక్సథంతో అన్నింటినీ సొంతం చేసుకోవాలి అనుకున్నప్పుడే.

నేను ఒక చక్కని జెన్ పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఈ విధంగా ఉంది 'నాది అని మీకు అనిపించిన వాటినన్నింటినీ మానసికంగా వదిలేయండి. ఏదైనా ఒక రోజు, అవి మీ దగ్గర నిజంగా లేకపోయినా బాధపడరు.' దీన్ని మీరు ఒక చక్కని పదినిమిషాల ధ్యానంలా ప్రతి రోజూ చేయవచ్చు. మీరు సొంతం చేసుకోవాలని అనుకునే మీ దృక్పథం మీద చాలా బలమైన కేవలం మీతోనే కూర్చోండి. మీకు ఉన్న ఐశ్వర్యమంతా ఆ సర్వాంతర్యామిది అని ఊహించండి, ఏది మీది కాదు. సర్వాంతర్యామి దయతో ఆ ఐశ్వర్యాన్ని ఉపయోగించుకోమని మీకు ఇచ్చాడు. ఆ విశ్వశక్తి పట్ల కృతజ్ఞతాభావాన్ని మీ అంతరంగంలో నింపండి. ఆ భావం మీ నుంచి భగవంతుని వైపు పొంగి ప్రపహించే విధంగా ఉండండి. ఈ భావాన్ని బలంగా స్పష్టంగా మీ అనుభవంతో తెలుసుకోండి. అప్పుడు మీరు మీ లోపల అకస్మాత్తుగా 180 డిగ్రీల మార్పు రావటాన్ని చూడగలుగుతారు. ముందుగా మీ సొంతమైంది ఏది అనే విషయంలో ఆశ్చర్యపోతారు. అర్థం చేసుకోండి, సన్న్యాసం అనేది కృతజ్ఞతాభావం పొంగి ప్రపహించే దగ్గర ప్రారంభమవుతుంది.

సన్నాసి ఈ ప్రపంచాన్ని ఎలా వదలాలి అని భయపడనవసరం లేదు. అదే విధంగా సంసారి సన్నాసం గురించి భయపడనవసరం లేదు. సర్వసృష్టికర్ సరైన సమయంలో ఇవ్వవలసింది ఇస్తాడు, తీసుకోవలసిందాన్ని తీసుకుంటాడు అని స్పష్టంగా తెలుసుకోగలిగితే చాలు. అప్పుడు మీరు ఈ నిమిషాన ఏం జరిగితే అదే మంచిది అని తెలుసుకుంటారు. జీవితం ఎలా సాగాలో అదే విధంగా సాగిపోతుంది. అప్పుడు మీకు, మీ ఐశ్వర్యానికి మధ్య ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీనే సన్యుసించటం అంటారు. అది కేవలం ఖాళీ మాత్రమే. సొంతం చేసుకోవాలి అని కొనసాగే మన దృక్సథానికి ఒక బ్రేక్. అంతకు మించి మరేమీ కాదు. సన్నాసం అనే సందర్భంలో సన్యుసించటం (వదిలేయటం) అనే మాటని తప్పుగా ఉపయోగించారు.

ఒక్క చిన్న కథ : ఇద్దరు ఆధ్యాత్మికసాధకులు కలసి ప్రయాణం చేస్తూ ఉంటారు. వారిలో ఒక వ్యక్తి ఐశ్వర్యం అవసరం, దాని ద్వారా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందవచ్చు, మంచి సాధన చేయవచ్చు అని నమ్మే వ్యక్తి. మరొక వ్యక్తి సన్న్యాసమార్గంలో వెళ్ళే వ్యక్తి. ఇద్దరూ వారి వారి జీవనమార్తాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. వారు అలా మాట్లాడుతు ఉండగా రాత్రి అవుతుంది. అప్పుడు వారు ఒక నది ఒడ్డుకి వస్తారు.

సన్నాసమార్గంలో ఉన్న వ్యక్తి దగ్గర డబ్బు లేదు. అప్పుడు అతను 'మన దగ్గర నదిని దాటేందుకు కావలసిన డబ్బు లేదు. కాబట్టి ఈ రాత్రికి నది ఒడ్డున గడిపి తెల్లవారేక ఎవరి సహాయంతోనైనా నదిని దాటుదాం అంటాడు. అప్పుడు మొదటి వ్యక్తి, 'అది జరగని పని. మనం రాత్రికి ఇక్కడే ఉంటే ఏ క్రూరమృగమైనా మనని తినవచ్చు. నా దగ్గర డబ్బు ఉంది. మనం పడవవానికి డబ్బు కట్టి నదిని దాటుదాం' అంటాడు.

వారిద్దరూ ఆ విధంగా నదిని క్షేమంగా దాటి అవతలి ఒడ్డుకి చేరతారు. అప్పుడు మొదటి వ్యక్తి సన్నాసమార్గంలో ఉన్న వ్యక్తితో, 'ఇప్పుడు నీకు డబ్బు విలువ తెలిసిందా? నేను కూడా నీలాగా సన్నాసమార్గంలో ఉండి ఉంటే ఏం జరిగేది?' అంటాడు. అప్పుడు రెండవ వ్యక్తి 'నీలోని సన్నాసదృక్పథమే మనని నదిని దాటించింది. నీవు నీ దగ్గరున్న డబ్బుని వదులుకోబట్టే మనం నదిని దాటగలిగాం' అని జవాబు ఇస్తాడు.

సన్నుసించటం అంటే దేన్నైనా అది నాది కాదు అనే భావంతో దాన్ని కలిగి ఉండటం. అదే విధంగా దాన్ని వదిలేస్తున్నారు అనే భావం లేకుండా దాన్ని వదిలివేయగలగటం. అంతే కాని బయటి ప్రపంచంలో ఏవో కొన్ని వస్తువుల్ని వదిలేయటం ద్వారా, మీరు ఏమీ పొందలేరు. మీరు కేవలం నాది అనే దాన్ని త్యాగం చేస్తున్న బాధని అనుభవిస్తారు అంతే. సన్నాసం అంటే నాది అనేదాన్నుంచి పారిపోవటం కాదు. నాది అనే దానికి అతీతంగా వెళ్ళటమే సన్యాసం. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవటం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని సన్నుసిస్తే ఫరవాలేదు. అలా కానపుడు అది మీ లోపల ఉండి మీరు ఎక్కడికి వెళితే అక్కడికి మీతోనే వస్తుంది. అంతే కాదు నేను, నాది అనే భావనతో సన్నసిస్తే మీ పని ఎలా ఉంటుందంటే చేసే పని కరెక్టే కాని కారణం మాత్రం తప్పు అన్నట్లుగా ఉంటుంది. బయటి ప్రపంచంలోని ఐశ్వర్యాన్ని, వస్తువుల్ని సన్నుసించినంత మాత్రాన మీరు సన్నాసి కాలేరు. సన్నాసి అంటే మీ అంతరంగానికి సంబంధించింది. అంతే కాని అది బయటి ప్రపంచానికి సంబంధించింది కాదు. సన్యాసం కోసం బయట ప్రపంచంలోని ఐశ్వర్యాల్ని, వస్తువుల్ని సన్నుసించటం అంటే తప్పు కారణంతో సరైన పనిచేసాను అని చెప్పటమే.

అర్థం చేసుకోండి, నిర్ణయం సరియైందే కాని దాని కారణం మాత్రం తప్పు. బయటి ప్రపంచంలోని పని సరైన పని అయినా కారణం మాత్రం తప్పు. ఐశ్వర్యం, సన్న్యాసం ఒక దానికి ఒకటి వ్యతిరేకం కాదు. నిజానికి సన్న్యాసం అంటే మచ్చ లేకుండా ఐశ్వర్యాన్ని సంపాదించే ఒక కళ, ఒక శాస్త్రం.

మీరు ఒక నిజాన్ని తెలుసుకోవాలి. భరతదేశంలోని బంగారంలో చాలా భాగం దేవాలయాల్లో, ఆశ్రమాల్లోనే ఉంది. దక్షిణ భరతదేశంలో చాలా దేవాలయాల గోపురాలు బంగారంతో ఉంటాయి. మీరు ఊహించండి, అది ఎంత ఐశ్వర్యమో, మీరు సన్నాసం అంటే ఏమిటో, ఆ సత్యాన్ని అర్థం చేసుకుంటే ఐశ్వర్యం నుంచి మీరు పారిపోరు. దాని పట్ల మీకు గౌరవం కలుగుతుంది కానీ మీరు దానిలో చిక్కుకోరు. దాన్ని మీ అంతరంగంలో నిలుపుకోరు. మీ అంతరంగంలో ఐశ్వర్యానికి అసలు స్థానం ఉండదు. కాబట్టి దాని విషయంలో మీరు ఎప్పుడూ బాధ పడరు. ఐశ్వర్యం వల్ల మీరు ఎప్పుడూ వ్యధ చెందరు.

మీరు వేదసాహిత్యాన్ని చదివితే మీకు ఒక విషయం అర్ధమవుతుంది. అందులో ఋషులు జీవితాన్ని సుసంపన్నంగా ఉంచటం గురించే చెబుతారు. జీవితం నుంచి పారిపోమని చెప్పరు. వారు బయటి ప్రపంచవిషయంతో మనకి ఉన్న బంధాల్ని వదులుచేయమని అంటారు. అంతే కాని వాటిని సన్న్యసించమని కాని, వాటిని ద్వేషించమని కాని చెప్పరు. సన్నాసం అంటే జీవితాన్ని సుసంపన్నంగా సంపూర్ణంగా చూడగలగటమే. అంతే కాని మీకు ఉన్న చిన్న వస్తువులతో బంధాలు ఏర్పరచుకోమని కాదు. ఐశ్వర్యం కూడా సర్వాంతర్యామి, సర్వసృష్టి తాలూకు ఒక రూపం అని తెలుసుకోవటమే సన్యాసం. ఒక్కసారి ఈ విషయాన్ని తెలుసుకోగలిగితే, అప్పుడు మీ దగ్గర ఎంత సంపద ఉన్నా మిమ్మల్ని ఏమీ చేయదు. మీరు దాని చేత ప్రభావితం కాలేరు. అది మిమ్మల్ని అంటదు. ఆ విధంగా ఐశ్వర్యం చేత ప్రభావితం కాకుండా, ఉండగలగటమే సన్యసించటం అంటే.

సన్నాసి తనంతట తానుగా, తన ఎంపికతో, తన నిర్ణయంతో సంపదల్ని వదిలేయటం అయితే పరవాలేదు. అంతే కాని సన్యాసం అంటే సంపదలు వదిలేయాలనే నిర్వచనం కోసం కాదు. నిజమైన సన్నాసి సంపదలకి అతీతంగా జీవిస్తాడు. ఎప్పుడైతే సంపదలకి అతీతంగా వెళతాడో, అప్పుడు అతనికి ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా ఒకటే. ఇదంతా లోతుగా అర్డం చేసుకొని అప్పుడు సంపదల్ని సన్నాసిస్తే పరవాలేదు కానీ ఏదో బలవంతంగానో లేదా ఓడిపోయి సన్నాసించటం సన్నాసం కాదు.

సన్నాసం అంటే ఆత్మహత్య కాదు, అది జీవితం. సన్న్యాసం అంటే అంతరంగ ప్రపంచంలోనూ, బయటి ప్రపంచంలోనూ అద్భుతమైన అందంతో జీవించగలగటమే.

పర్కియన్ యోగి జలాలుద్ధీన్ రుమి కథ : ఒక సాధువు తన పొలంలో దున్నటానికి వెళతాడు. అక్కడ ఒక నెమలి తన ముక్కుతో అందమైన తన ఈకల్ని పొడిచి పాడు చేస్తుంటుంది. ఆ సాధువు తనని తాను పాడు చేసుకుంటున్న నెమలిని చూసి తట్టుకోలేకపోతాడు. అందులోనూ అంత అందమైన పక్షి అలా చేయటం సహించలేక, అలా చేయవద్ద అని దాన్ని వారిస్తాడు. అప్పుడు నెమలి సాధువుతో 'నేను ఆపను. నా ఈ అందమైన ఈకలు నా యజమానికి కష్టాల్ని కలిగిస్తాయి. వేటగాళ్ళు నా ఈ అందమైన ఈకల కోసం నన్ను నిరంతరం వెంటాడుతుంటారు. నన్ను తన దగ్గర ఉంచుకోవటం నా యజమానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ అందమైన ఈకల్ని తీసేసి నన్ను నేను అందవిహీనంగా చేసుకుంటే వీళ్ళు నన్ను వెంబడించరు' అని చెబుతుంది.

అర్ధం చేసుకోండి, బయట కనిపించే అందం, సిరిసంపదలు సన్నాసమార్గంకు శత్రువులు కావు. అవి సన్నిహితులే. సన్నాసి బయటి అందానికి, ఐశ్వర్యానికి, అంతరంగపు అందాన్ని, సంపదల్ని కలుపుతాడు. సన్నాసం అతనికి బయట ప్రపంచపు అందాన్ని, ఐశ్వర్యాన్ని బాధలు లేకుండా నిర్వహించగల మేధని ఇస్తుంది.

వాసవంలో జీవించండి!

సన్నాసం అంటే వస్తుప్రపంచానికి, ఆధ్యాత్మికప్రపంచానికి మధ్య ఆడుకునే ఆట కాదు. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోండి, మనకి వస్తుప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం అని రెండు ప్రపంచాలు లేవు. మనకి ఉన్న ప్రపంచం ఒక్కటే.

ఇక రెండవ విషయం: సన్న్యాసం అంటే సిద్ధాంతం కాదు. ఈ ప్రపంచంలో సరైన దృక్సథంతో జీవించగలగటం. సన్యాసం అంటే ఎంత చక్కగా మనం జీవించవచ్చో అర్ధం చేసుకోవటమే. వాస్తవానికి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ఎలా జీవించాలో అర్థం చేసుకోవటమే. వాస్తవంలో జీవించటం అంటే జీవితాన్ని అత్యున్నతస్థితిలో జీవించటమే.

వాస్తవంలో, వాస్తవంతో జీవించటం అంటే ఏమిటి?

ఒక వ్యక్తి నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పుడు మనం మేల్కొని ఉన్న స్థితిని మీరు సత్యం కాదు ఇది కూడా స్వప్నమే అన్నారు కదా! అది ఎలా సాధ్యం? మేం నిద్ర పోయి, తిరిగి మేల్కొన్నప్పుడు, మా చుట్టూ ఉన్న వస్తువులు, ఇల్లు, కారు, మనుషులు – అన్నీ అవే ఉంటాయి. నిద్ర లేచేసరికి అవి మారిపోవు. కానీ నిద్రలో మాకు కలలు వచ్చినపుడు అవి ఒకే విధంగా ఉండవు. కాబట్టి కల అంటే కలే. మేల్కొని ఉన్న స్థితి వేరు, అది నిజం.

నేను ఇప్పుడు ఏం చెబుతున్నానో జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మీకు ఒక రాత్రి వచ్చిన కలలో 10 నుంచి 12 సంవత్సరాల జీవితం కలగా వస్తుంది. కరెక్టేనా? మీ కలలో మీ కాలేజీ జీవితం, ఆ తరువాత వివాహం, పిల్లలు – ఈ విధంగా కల వస్తుంది. అంటే 10 సంవత్సరాల జీవితాన్ని ఒక రాత్రిలో జీవించారు.

దీని అర్థం ఏమిటి?

దీని అర్థం 10 సంవత్సరాల మీ జీవితాన్ని 10 గంటల్నో జీవించారు. అయితే మీరు కల కనేటపుడు అది అంత త్వరగా గడిచింది అని అనుకోరు. మీరు స్పష్టంగా 10 సంవత్సరాల జీవితాన్ని జీవిస్తున్నాను అని అనుకుంటారు. మీరు అకస్మాత్తుగా నిద్ర లేవగానే, మీరు కేవలం 10 గంటలే గడిపినట్లు తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ విషయాన్ని అర్ధం చేసుకోండి; అదే విధంగా, ఏ క్షణంలోనైనా మీరు మేల్కొని, మీరు ఈ భూమి మీద 70 సంవత్సరాలు గడపలేదు అని అది కేవలం ఏడు గంటలే అని అనుకోవచ్చు కదా! మీకు వివరిస్తాను.

నిన్న మే 10వ తారీఖు. సరేనా! మే 9 వ తారీఖు, 10వ తారీఖు మధ్యలో అంటే ఒక రాత్రి 10 గంటల సేపు మీకు వచ్చిన కలలో 10 సంవత్సరాల జీవితాన్ని గడిపారు. ఆ పది గంటల సమయంలో మీరు కాలేజీకి వెళ్ళి చదివారు, నిద్ర పోయారు, మేల్కొన్నారు. ఇలా 10 సంవత్సరాల జీవితాన్ని గడిపారు. అంటే 10 సంవత్సరాల్లో మీరు నిద్ర పోకుండా ఉండరు కదా! కాబట్టి కలలో కూడా మీరు నిద్ర పోతారు, మేల్కొంటారు, మామూలు జీవితాన్ని గడుపుతారు.

ఇప్పుడు ఒక ముఖ్యవిషయాన్ని అర్ధం చేసుకోండి. మీరు 9వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ ఉదయం వరకూ వచ్చిన కలలో 10 సంవత్సరాల జీవితాన్ని గడిపారు. అందులో చాలా సార్లు నిద్రపోయి లేచారు. ఇదంతా కలలో ఒక భాగంగానే చేసారు. ఆ కలలో నిద్ర మేల్కొన్న ప్రతిసారీ మీరు, మీకు సంబంధించిన వ్యక్తులు వస్తువులు – అన్నీ అదే విధంగా ఉంటాయి. అవును కదా! అంటే మీరు కలలో ఒక కాలేజీ స్టూడెంట్‌గా నిద్రపోతే ఆ కలలో నిద్ర లేచినప్పుడు కాలేజీ స్టూడెంట్‌గానే ఉంటారు. కాలేజీ స్టూడెంట్‌గా కల మొదలై తరువాతి దశ, ఆ తరువాతిది – ఇలా ఒక దాని తరువాత ఒకటిగా ఎటువంటి అయోమయం లేకుండా స్పష్టంగా అన్ని దశలూ జరుగుతాయి. దీని అర్థం ఏమిటి? ఇదంతా మీరు మేల్కొని ఉన్న సమయంలో ఏ విధంగా అయితే మీరు కాలేజీకి వెళ్ళివచ్చినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు, మీకు సంబంధించిన వస్తువు, ఇల్లు, కారు అంతా అవే ఉంటాయి. అందుకే ఇది నిజం కల కాదు అనుకుంటారు. అంతే కదా!

దీని అర్ధం ఏమిటి? అంటే మీరు నిద్ర పోయి పొద్దునే మేల్కొన్నప్పుపుడు, మీకు అన్నీ అదే విధంగా కనిపిస్తాయి. అదే బాంక్ బాలెన్స్, అదే ఇల్లు, అదే కారు. మరి దీని అర్థం ఏమిటి? ఇది కూడా నిజం కాదు అనే కదా! ఈ విషయాన్ని అర్ధం చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ విషయం అర్ధమైతే మీ జీవితాన్ని చక్కగా విశ్లేషించగలుగుతారు. చాలా విషయాలలో స్పష్టత వస్తుంది.

ఎప్పుడైతే ఇదంతా ఒక మాయ–మిథ్య అని తెలుస్తుందో, మీరు దేన్నీ సన్నుసించరు. మీరు అన్నింటితోనూ జీవిస్తారు కాని దేని వల్లా మీ నిశ్చలతని పొగొట్టుకోరు. ఏ విషయం మీ మీద ప్రభావాన్ని చూపలేదు. ఇప్పుడు ఏ విధంగా అయితే మీ 10 సంవత్సరాల జీవితం 10 గంటల కలలో గడిపారో అదేవిధంగా మీ 70 సంవత్సరాల జీవితం మరొకరికి, ఎవరైతే ఇంకా ఉన్నతఆధ్యాత్మిక స్థితిలో ఉంటారో వారికి ఏడు గంటలే కావచ్చు. ఎవరి కాలెండరు వారిది.

సంస్కృతంలో దీన్నే క్షణికం అంటారు. మీకు ఒక సెకండ్‌కి వచ్చే ఆలోచనలు ఎక్కువగా ఉంటే చాలా సమయం పట్టినట్టు అనిపిస్తుంది. ఉదాహరణకి మీకు బాగా ఇష్టమైన వ్యక్తితో ఉన్నప్పుడు మీకు సమయం త్వరగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మీలో సెకండ్‌కి వచ్చే ఆలోచనల సంఖ్య తగ్గుతుంది. మీరు ఇష్టం లేని వ్యక్శితో ఉన్నప్పుడు ఎంతకీ కాలం గడవనట్లే ఉంటుంది. ప్రతి ఐదు నిమిషాలకి మీరేం చేస్తారు? మీరు వాచీలో టైం చూస్తూ ఉంటారు. అప్పుడు సెకండ్‌కి మీకు వచ్చే ఆలోచనల సంఖ్య చాలా ఎక్కువ. అప్పుడే మీరు అసహనంగా అవుతారు. చాలా సమయం గడిచిపోయినట్టు భావిస్తారు.

అందుకే వేదసంస్కృతిలో కాలాన్ని కొలిచే యూనిట్ సెకండ్ కాదు, అది క్షణం. పాశ్చాత్యసంస్కృతిలో కాలాన్ని కొలిచే యూనిట్ సెకండ్. అంటే కాలంలో ఒక యూనిట్ సెకండ్ అవుతుంది. వేదసంస్కృతిలో కాలాన్ని కొలిచే యూనిట్ క్షణం. క్షణం అంటే రెండు ఆలోచనల మధ్య ఉన్న ఖాళీ. పాశ్సాత్యుల కాలెండర్ ప్రకారం మీ సెకండ్, నా సెకండ్ వ్యవధి ఒకటే. కానీ వేదసంస్కృతి కాలెండర్ ప్రకారం మీ క్షణం, నా క్షణం వేరు. ఎందుకంటే నా ఆలోచనల మధ్య ఉన్న ఖాళీకి, మీ ఆలోచనల మధ్య ఉన్న ఖాళీకి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ సమయం అంటే కాలమానం కాదు, అది మానసికమైంది.

ఒక్క సెకెండ్‌కి వచ్చే ఆలోచనల్ని టి.పి.ఎస్. (థాట్స్ పర్ సెకండ్) అనవచ్చు. మీరు కలలతో ఉన్నప్పుడు మీకు వచ్చే ఆలోచనల సంఖ్య చాలా ఎక్కువ. టి.పి.ఎస్. ఎక్కువ. అందుకే కలలో మీరు ఎక్కువ కాలం ఉన్న అనుభూతిని పొందుతారు. మేల్కొని ఉన్న స్థితిలో మీ టి.పి.ఎస్. కొంత తక్కువగా ఉంటుంది. అందుకే సమయం త్వరగా గడచిపోతుంది. టి.పి.ఎస్. ఎక్కువ ఉంటే 10 సంవత్సరాలు పది గంటల్లో గడచిపోతాయి. అదే దేవతలకి, టి.పి.ఎస్. చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారి ఒక రోజు మనకి ఒక సంవత్సరంతో సమానం అంటారు. దీన్ని వేదసంస్కృతి కాలెండర్‌లో చూడవచ్చు.

మీరు మీలోని టి.పి.ఎస్.ని తగ్గించగలిగితే మీరు తురీయ లేదా సమాధిస్థితిలోకి ప్రవేశించవచ్చు. దాని అర్థం సర్వాంతర్యామి అత్యున్నతచేతనస్థితితో ఐక్యం కావచ్చు, అదే సత్యం. ఎప్పుడైతే మీలోని ఆలోచనల సంఖ్య బాగా తగ్గిపోతుందో అప్పుడు ఈ సత్యాన్ని మీరు అనుభవంతో తెలుసుకుంటారు.

ఇప్పుడు మనం మళ్ళా స్వప్నస్థితిని, మేల్కొని ఉన్న స్థితిని గురించి చూద్దాం. మీరు మేల్కొని ఉన్న స్థితిలో, మీలోని ఆలోచనల సంఖ్య తగ్గి ఉన్న స్థితిలో మీరు కలని నిజం కాదు అని తెలుసుకుంటారు. అవును కదా! అదే మీరు స్వప్నంలో ఉన్నప్పుడు, అది నిజం అనుకుంటారు. ఎందుకంటే అంతా నిజంలాగానే ఉంటుంది. మీరు ప్రతిదానికీ ప్రతిస్పందిస్తారు. మీకు పీడ కలలు వస్తాయి, మామూలుగా ఉండే సామాన్యసమస్యలు వస్తాయి. ఎప్పుడైతే మీ ఆలోచనల సంఖ్య మేల్కొనే స్థితికి తెచ్చేంతగా తగ్గుతాయో అప్పుడు, మీరు ఇదంతా నిజం కాదు కేవలం కల అని తెలుసుకుంటారు. అదే విధంగా, మీరు మేల్కొని ఉన్న స్థితి కూడా నిజం కాదు, అది అంతా కల్పన, మిథ్య అని తెలుసుకోవాలి అంటే మీ ఆలోచనల సంఖ్యని ఇంకా తగ్గించాలి. అవి ఇంకా ఇంకా తగ్గి మీరు తురీయదశకి వచ్చినప్పుడు, మీరు అకస్మాత్తుగా ఇదంతా నిజం కాదు, ఇది అంతా మాయ అని తెలుసుకుంటారు.

మీరు స్వప్నావస్థలో ఉన్నప్పుడు మీ ఆలోచనల సంఖ్య, ఒక సెకండ్‌కి 1000 అయితే, మీరు మేల్కొని ఉన్నప్పుడు అవి 100 ఉంటాయి. అవి సున్నా స్థాయికి వస్తే, అంటే ఆలోచనలు అసలు లేకుండా ఉంటే, అది సమాధిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు నిద్ర మేల్కొంటారో, మీ ఆలోచనల సంఖ్య తగ్గుతుంది. అప్పుడు కల నిజం కాదు అని తెలుసుకుంటారు. అదే విధంగా ఆలోచనల సంఖ్య సున్నా స్థాయికి వచ్చినప్పుడు, మేలుకున్న స్థితి నిజం కాదు అని తెలుసుకుంటారు. ప్రస్తుతం మీ అంతరంగం అంతా మీరు మేల్కొని ఉన్నప్పటి అనుభవాలతో నిండి ఉంది. అందుకే మీరు సమాధిస్థితికి చేరలేరు.

మరొక విషయం: ఇది ఒక ఛేదించలేని వృత్తం. మీరు కలల్లో సంతోషంగా ఉన్నంత సేపూ దాని లోంచి బయటికి రాలేరు. మీరు దాని లోంచి బయటికి వచ్చాక మాత్రమే అది నిజం కాదు, అది కేవలం కల అని తెలుసుకుంటారు. అదే విధంగా మీరు మేల్కొని ఉన్న స్థితిలో సంతోషంగా ఉన్నంతవరకూ, అది అంతా ఒక మాయ అని అనుకోరు.

ఇక్కడే శివుడు మనకి సహాయం చేయటానికి వస్తాడు.

ఆయన చెప్పే ధ్యానపద్ధతులు, ఆ మాయ నుంచి మేల్కొనటానికి సహాయం చేస్తాయి. చూడండి. ఇది చాలా సూక్షుమైన, ముఖ్యమైన విషయం. మీరు స్వప్నస్థితిలో ఉన్నా, మేల్కొని ఉన్న స్థితిలో ఉన్నా లేదా సమాధిస్థితిలో ఉన్నా అసలు వ్యక్తి మాత్రం ఒక్కరే. అవును కదా! మీరు 1000 ఆలోచనలతో ఉన్నా, 100 ఆలోచనలతో ఉన్నా, '0' ఆలోచనలతో ఉన్నా, ఆ కల కనే వ్యక్తి ఒక్కరే. అయితే కలల నుంచి మేల్కొనే స్థితికి మీరు రావటానికి కారణం ఏమిటి? మీ ఏకాగ్రతలో కలిగిన మార్పు. అది చూసేదాని నుంచి చూసేవాని వైపు మళ్ళటమే. అంతే కదా! ఎప్పుడైతే మీ ఏకాగ్రతని, మీ ఎరుకని చూసేదాని నుంచి చూసేవాని వైపు మళ్ళుతుందో, చూస్తున్న వస్తువు నుంచి చూసే వ్యక్తి వైపు మళ్ళుతుందో అప్పుడు మీరు ఆ తరువాత స్థితిలోకి, అంటే స్వప్నస్థితి నుంచి మేల్కొన్న స్థితికి చేరతారు. కాబట్టి ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి; ఎప్పుడైతే మీ ఏకాగ్రత, చూసే విషయం నుంచి చూసే వ్యక్తి వైపు మళ్ళుతుందో, మీరు మేల్కొంటారు.

ఇది ఒక ధ్యానపద్ధతి. మీ ఏకాగ్రతని చూసే వస్తువు నుంచి చూస్తున్న వ్యక్తి వైపు మారిస్తే మీరు మేల్కొంటారు.

సన్నాసం అంటే చూసే వ్యక్తి వైపు ఏకాగ్రత పెరిగేలా చేయటమే. సన్యుసించటం లేదా ధ్యానం, ధ్యానపద్ధతులు – ఇవన్నీ కూడా చూసే వస్తువు నుంచి దాన్ని చూసే వ్యక్తి పైకి ఏకాగ్రతని మళ్ళించటానికి ఉపయోగించే వివిధమార్గాలు. ఒక్కసారి మీరు చూసే వ్యక్తి వైపు మీ ఏకాగ్రతని, మీ తెలుసుకునే తత్వాన్ని నిలపగలిగితే మీరు నిజమైన ఏకాంతాన్ని, మీతోనే మీరు ఉండగల నేర్చుని అనుభవంతో తెలుసుకోగలుగుతారు. ఒంటరితనం మీ సహజగుణం. మీరు మీ తల్లి గర్బంలో ఉన్నప్పుడు ఒంటరితనాన్ని ఆ ఆనందాన్ని అనుభవించారు. మీరు అనుకునే ఒంటరితనం, మీతో మీరు ఉండగల ఏకాంతం వేరు. సంఘం మిమ్మల్ని నిరంతరం మనుషుల సమూహంలో, కుటుంబంతో, ఏదైనా ఒక సంఘంతో లేదా టి.వి.తో ఉండమని నేర్పిస్తుంది. ఇటువంటివాటి మీద ఆధారపడటం అలవాటైతే మీరు బలహీనులవుతారు. ఇవి మీ చుట్టూ లేనపుడు ఒంటరితనంతో బాధపడతారు. ఇటువంటి ఒంటరితనం ఎప్పుడూ బాధల్ని తీసుకువస్తుంది. ఏకాంతంగా, మీతోనే మీరు ఉండగల స్థితి మీకు ఎల్లవేళలా కారణం లేని ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞానోదయమైన గొప్ప యోగీశ్వరులు పదే పదే చెప్పే పరమానందపారవశ్యం ఇదే. ఏకాంతం మాత్రమే ఆ శక్తిని ఇవ్వగలుగుతుంది.

సన్నాసం అంటే ఆ ఏకాంతాన్ని కనుగొని అందులో విరామంగా ఉండగలగటం.

సంసారం – సన్న్యాసం

సంసారం అంటే (ప్రపంచం లేదా మార్గం అని అర్ధం). సంసారం బాహ్యప్రపంచానికి సంబంధించి అందునుంచి వచ్చే అనేక కారణాల వల్ల అంతు లేనన్ని జననమరణవృత్తాల్ని స్పష్టించేది అని అర్ధం. ఆ రెండు మార్గాల్లో, ఏ మార్గంలోనైనా రెండు విధాలుగా సాగవచ్చు; అందులో ఒక పద్ధతి మనుషులు, వస్తువులతో లేదా ఒంటరిగా వారంతట వారు ప్రయాణించటం.

మొదటి పద్దతిలో మీరు చాలా సార్లు ఎదురు చూడాలి. రెండవ పద్ధతిలో మీరు గమ్యాన్ని చేరగలరు. దాన్ని ఈ నిమిషాన్నేనా చేరగలరు.

సన్నాసం అంటే ఆ మార్గంలో ప్రయాణించేటప్పుడు సామానులు, వస్తువులు, మనుషులు లేకుండా చేసే ప్రయాణం. మీకు అన్నీ ఉంటాయి కానీ మీరు వేటినీ మోయనవసరం లేదు. ఎప్పుడైతే మీరు వేటీనీ మీతో పాటు మోయరో అప్పుడు విశ్వశక్తి మీకు అవసరమైన వాటినన్నింటినీ మీ దగ్గరకి పంపిస్తుంది. అదే సన్నాసం అంటే.

బుద్ధని జీవితచరిత్ర నుంచి ఒక చక్కని కథ చెబుతాను; ఒక రోజు బుద్ధుని శిష్యులు ఆయన దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడు వారిలో కొందరు సన్యాసం అంటే అసలైన అర్థం ఏమిటో వివరించమని బుద్ధుడిని అడుగుతారు. అప్పుడు ఆయన వారికి ఒక కథ చెబుతాడు.

ఒక ద్వీపంలో ఒక వ్యక్తి ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. ఒక రోజు అకస్మాత్తుగా అతనికి ఆ ద్వీపం నుంచి బయటికి వెళ్ళే సమయం వచ్చింది అనే భావన కలుగుతుంది. అతనికి ఆ నదిని దాటటానికి పడవ లేదు. అక్కడ అతనికి దొరికిన చెట్ల కొమ్మలతో, ఆకులతో ఒక పడవని తయారు చేసాడు. అతికష్టం మీద అతను ఆ నదిలో ప్రయాణించి చివరికి ఒడ్డుకి చేరతాడు. ఈ విధంగా చెప్పి బుద్ధుడు శిష్యుల్ని ఒక ప్రశ్న అడుగుతాడు 'ఆవలి ఒడ్డుకి చేరాక ఆ వ్యక్తి పడవని ఉంచుతాడా లేక నీళ్ళలో పారేస్తాడా?' అని. శిష్యులు రకరకాల జవాబులు ఇస్తారు.

బుద్ధుడు చివరగా ఇలా జవాబు చెబుతాడు, అతను సన్నాసమార్గంలోని వ్యక్తి అయితే ఆ పడవని పారేసాడు. ఎందుకంటే అవసరమైనపుడు అతనికి దొరుకుతుంది అని తెలుసు. సంసారమార్గంలోని వ్యక్తి అంత కష్టపడి తయారు చేసిన పడవ, తిరిగి తాను మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో దాన్ని జాగ్రత్త చేస్తాడు. సన్నాసి విశ్వశక్తి మీద తన మనస్సుని లగ్నం చేసి ముందుకి సాగుతాడు. అదే సంసారి అయితే తాను ఎలా జీవించాలి అనే విషయం మీద మనస్సుని ఉంచి ముందుకి సాగుతాడు. సన్నాసి జీవితం అనే సముద్రాన్ని దాటటానికి పడవని ఉపయోగిస్తాడు. సంసారి ఆ పడవని తనతోనే మోస్తూ తిరుగుతాడు. ఆ పడవని వదిలేయవచ్చని అతనికి తెలియదు. అదే వారిద్దరి మధ్య ఉన్న తేడా. ఇందులో ఒకటి తప్పు. ఒకటి సరైంది అనేది ఏమీ లేదు. ఇవి రెండూ రెండు పద్దతులు, అంతే.

ఇప్పుడు మీకు కర్మ అనే విషయంలో సన్నాసం ఏమిటో వివరిస్తాను. ఎందుకంటే మన కర్మల్ని పోగొట్టుకోవటానికి సన్యాసం దగ్గర దారి. కర్మ అంటే క్రితం జన్మల్లో మనం పూర్తి చేయని పనులు. అవే మనం తిరిగి పూర్తి చేసేంత వరకు పదే పదే జన్మించేలా జన్మ వైపు లాగుతూ ఉంటాయి. మన జననమరణచక్రానికి ఉండే అసలైన కారణం ఈ కర్మలు. ఆ కర్మలు పూర్తి అయ్యేవరకు అవి మనల్ని ఈ ప్రపంచంలో పదే పదే జన్మించేలా చేస్తాయి.

కర్మలు మూడు రకాలు – సంచిత, ప్రారబ్ద, ఆగామ్యకర్మలు.

సంచితకర్మలు అంటే జన్మజన్మలుగా మనం పోగుచేసుకున్న, పూర్తి చేయలేకపోయిన కర్మలు. అంటే అవి మన పూర్తి బాలెన్స్ అన్న మాట. ప్రారబ్దకర్మలు అంటే సంచితకర్మల్లో కొన్నింటిని తీసుకొని వాటిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో జన్మ తీసుకుంటాం. మీరు జన్మ తీసుకున్న ప్రతిసారీ కొన్ని కర్మల్ని పూర్తి చేయాలని సంచితకర్మల్దోంచి కొన్ని తీసుకువస్తారు. ఇందులో మీ తీరని కోరికలు, కోపం, భయం, అత్యాశ, మొదలైనవన్నీ ఉంటాయి. ఇక మూడవది ఆగామ్యకర్మ. ఇది ఈ జన్మలో మీరు కొత్తగా పోగుచేసుకునే కర్మలు. ఈ జన్మలో మీ తీరని కోరికలు, పూర్తి చేయని పనులు.

కర్మల్ని పూర్తిగా పోగొట్టుకోవాలి అంటే మీరు మూడు పనులు చేయాలి. అందులో మొదటిది, ఈ జన్మలో కొత్త కర్మల్ని చేయకుండా, ఆగామ్యకర్మలు పెరగకుండా చూడాలి. అవి మీ బాంక్ బాలెన్స్‌ని పెంచుతాయి. రెండవది మీరు ఈ జన్మలో పూర్తి చేయాలి అని తెచ్చుకున్న ప్రారబ్ధకర్మల్ని పూర్తి చేయాలి, మిగలకూడదు. ఇక మూడవది ఏదో ఒక విధంగా మీ సంచితకర్మల్ని మీరు తగ్గించుకోవాలి. దాని వల్ల మీరు జన్మించే జన్మల సంఖ్య తగ్గించవచ్చు.

ప్రారబ్దకర్మల్ని సరైన పద్ధతిలో పోగొట్టుకోగలిగితే, ఆగామ్యకర్మలు ఏర్పడవు. ప్రారబ్దకర్మల్ని పోగొట్టగలిగే మేధ, ఆగామ్యకర్మలు కొత్తగా ఏర్పడకుండా జాగ్రత్త తీసుకుంటుంది. సంచితకర్మలని మాత్రం జ్ఞానోదయమైన యోగీశ్వరుని కరుణతోనే పోగొట్టుకోగలం. ఇప్పుడు ఒక విషయాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోండి. మీలోని ప్రారబ్దకర్మల కల్పనలు మీ మేధ కంటే ఎక్కువైతే, మేధను మించి ఉంటే అప్పుడు మీకు కావలసిన మార్గం సంసారజీవితం. ఆ విధంగా కాకుండా మీ ప్రారబ్ధం తాలూకు కల్పనలు మేధ కంటే తక్కువగా ఉంటే, సన్నాసమార్గంలో మీ మేధ నిలుస్తుంది. సంసారమార్గంలో జీవితం మీకు చాలా రకాలుగా నేర్పిస్తుంది. అప్పుడు కొన్ని లక్షల జన్మల్ని తీసుకొని కాని మీరు ప్రారబ్దకర్మల్ని పోగొట్టుకోలేరు.

పతంజలి యోగసూత్రాల్లో జ్ఞానోదయానికి ఎనిమిది విధాలైన మార్గాలు ఉంటాయి. ఈ ఎనిమిది మార్గాల్నీ ఒకేసారి అనుసరించాలి. అంటే అన్ని పద్ధతుల్నీ పాటించాలి. అందులో మూడు భాగాలు ప్రత్యాహార, ధ్యానం. ధ్యానం. ప్రత్యాహార అంటే మనస్సుని ఇంద్రియాల నుంచి అంతరంగంలోకి మళ్ళించటమే. ఆ తరువాతది ధారణ. ధారణ అంటే మనస్సుని ఆత్మలో ఐక్యం చేయటం. మూడవది ధ్యానం.

మనస్సుని ఐదు జ్ఞానేంద్రియాల నుంచి మళ్ళించటం అనేది, జ్ఞానేంద్రియాలు ఆత్మలో ఐక్యమైనప్పుడే సాధ్యమవుతుంది. ఉదాహరణకి నిచ్చెన మీద ఒక మెట్లు నుంచి పైదానికి కాలు పెట్టాలి అంటే ముందుగా ఈ మెట్టు మీద మీ కాలిని స్థిరపరచాలి కదా! మీరు పైకొమ్మ మీదికి ఎక్కిన తరువాతే చెట్టు మీద ఉన్న కింది కొమ్మని వదిలేయగలరు. మనం అందరం ఏమనుకుంటామంటే ప్రపంచంతో మనకి ఉన్న సంబంధబాంధవ్యాల్ని పూర్తిగా వదిలాక, భగవంతుడిని చేరతాం అని. అది సరి కాదు. సత్యం ఏమిటంటే భగవంతుడిని తెలుసుకోగలిగాక మాత్రమే, మనని ఈ బయటి ప్రపంచపు విషయాలు ప్రభావితం చేయవు. మీరు నిత్యానందస్థితికి చేరాక మాత్రమే ఈ మిథ్యానంద అనే కల్పనలు, మాయని ఛేదించగలరు, వదలగలరు. కాని పైన ఉన్న మెట్టు గురించి తెలుసుకుని, దాన్ని పట్టుకున్న తరువాత మాత్రమే కింది దాన్ని వదలగలరు. ఈ తెలుసుకోగలగటమే సన్నాసం. పై మెట్టుని పట్టుకొని కింది మెట్లుని వదిలే ఒక కార్యక్రమమే సన్నాసం. అలా మీరు ముందుకి సాగే కొద్దీ సన్యాసం అనేది మీలో అప్రయత్నంగా కలుగుతుంది. ఇది ఒక ఉపవస్తువులా ఏర్పడుతుంది. ఎందుకంటే నిచ్చెనలో పైకి వెళ్ళటానికి మీకు మీరు చాలు అన్న విషయం తెలుసుకుంటారు. అప్పుడు మీరు మీతో మోసుకెళ్ళేవన్నీ భారమే; వాటితో మీరు ముందుకి వెళ్ళటం కష్టం.

ఒక చిన్న జెన్ కథ : ఒక రాజుగారు సన్నాసించి, తన దేశాన్ని వదిలి ఒక జెన్ బౌద్ధగురువు దగ్గరకి వెళ్ళి తనని శిష్యుడుగా తీసుకోమని అడుగుతాడు. అప్పుడు గురువుగారు అతనితో, 'సరే! నిన్ను శిష్యుడుగా తీసుకుంటాను. కానీ నీకు మరింత పరిణతి కలిగేవరకూ నీవు ఎదురుచూడాలి' అంటాడు. కానీ అలా ఎదురుచూసే సహనం రాజుకి లేదు. అందుకని ఆయన గురువుగారిని బాగా ప్రార్ధిస్తాడు. చివరికి గురువుగారు ఒక షరతు మీద ఒప్పుకుంటాడు. ఆయన రాజుతో, "సరే! కానీ నీవు మరొక అడవికి వెళ్ళి అక్కడ నివసించాలి" అంటాడు. రాజుగారు అందుకు ఒప్పుకొని అదే విధంగా చేస్తాడు.

కొన్ని రోజులు గడుస్తాయి. రాజుగారు అక్కడ ఉన్న దోమల బాధ పడలేక ఒక దోమ తెర తెచ్చుకొని తన చుట్టూ దోమల నుంచి రక్షణగా పెట్టుకుంటాడు. రాజు కొన్ని రోజులు పోయాక, మంచం ఉంటే బాగుంటుంది, అప్పుడు బాగా ధ్యానం చేసుకోవచ్చు అనుకొని, వెళ్ళి ఒక మంచం కొని తెచ్చుకుంటాడు. ఆ తరువాత వర్షం వల్ల మంచం పాడవటం గమనించి మంచాన్ని కాపాడటానికి ఒక చిన్న గదిని కట్టుకొని అందులో మంచం వేస్తాడు. మరి కొన్ని రోజులు గడిచేసరికి ఆ గది శుభ్రం చేయటానికి ఒక మనిషి ఉంటే బాగుంటుందని పనికి ఒక మనిషిని తెచ్చుకుంటాడు. ఆ తరువాత మరి కొంత మందిని తెస్తాడు. ఈ విధంగా కొంత కాలం జరిగేసరికి ఆ అడవిలో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసేస్తాడు.

అర్థం చేసుకోండి; ఒక రాజు అడవిలోనెనా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయగలడు. సంసారి ఎక్కడెనా బయటకి ప్రకృతిలోని అందాన్ని చూడటానికి వెళతాడు. అదే సన్నాసి అయితే తాను ఎక్కడ ఉంటే అక్కడ, ఆ పరిసరాలలోనే దివ్యసౌందర్యాన్ని, భగవంతుణ్ణి చూస్తాడు. అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడగలడు. ఎప్పుడైతే సంసారి తన అంతరంగంలోకి మళ్ళగలుగుతాడో, అతను సన్నాసి అవుతాడు. అతనిలో జ్వలించే అవసరాన్ని కనుగొనేవరకూ, అతను తాను చేస్తున్న పనినే కొనసాగించాలి. సంసారి మనసు ఒక దాంతో మరొకటి సరిపడని విషయాలతో నిండి ఉంటుంది. అతను తనకు కావాలి అనుకునే విషయాన్ని సాధించే ప్రయత్నంలో ఉంటాడు. తనలోని మేధతో సంసారి సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. తనకి ఈ నిమిషంలో ఏది అవసరమో అతను దాన్ని పొందగలుగుతున్నాడు అనే సత్యాన్ని తెలుసుకుంటాడు.

సంసారి కేవలం బయటి ప్రపంచంలోని వస్తువులకి, తన జీవితానికే ప్రాముఖ్యాన్ని ఇస్తాడు. సన్నాసి మరణం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. తనలో ఉన్న తాను కాని విషయాలకి, మరణానికి ప్రాముఖ్యాన్ని ఇస్తాడు. అహంకారం, అన్నీ పొందాలి అనుకోవటం, కోరికలు, కోపం, భయం, అసూయ, అసంతృప్తి – ఇలాంటి విషయాలను పూర్తిగా నాశనం చేయటానికి ప్రాముఖ్యాన్ని ఇస్తాడు. అతనికి తాను వీటి అన్నింటికీ అతీతుడినని తెలుసు. అతని ప్రయత్నమంతా దీన్ని తెలుసుకోవాలి అని మాత్రమే. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటాడో అప్పుడు నిచ్చెనలో పైన ఉన్న మెట్టుని చేరగలడు. అప్పుడు కింద ఉన్న మెట్టుని వదలగలదు. ఈ కింది మెట్టులోనే ఈ భావావేశాలు, కోరికలు, అహం అనేవి ఉండేది.

సన్నాసం అంటే నేను ఎవరిని అనే ప్రశ్నకి జవాబుని తెలుసుకునే ప్రయత్నం. సన్నాసి తన శక్తిని, మేధని పూర్తిగా ఈ విషయం కనుగొనటానికి ఖర్చు పెడతాడు. మిమ్మల్ని మీరు 'నేను ఎవరిని' అని ప్రశ్నించుకుంటే మీకు దొరికే జవాబులు – నేను ఫలానా వారి కొడుకుని, నేను ఇంజినీరుని, నేను ప్రొఫెసర్‌ని, ఇలా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా బయటి ప్రపంచంలో మీకు ఉన్న బాంధవ్యాలు మాత్రమే. అసలు ఈ బయట ప్రపంచం అనేది లేకపోతే అప్పుడు మీరు ఎవరు? జ్ఞానోదయమైన యోగీశ్వరులు, గొప్ప గొప్ప గురుదేవులు, ప్రపంచంలోని మతాలను స్థాపించిన అవతారమూర్తులు పదే పదే చెప్పే విషయం అహం బ్రహ్మాస్మి – నేను అది. ఈ వాక్యం హిందూమతంలోది. క్రిస్టియన్ మతంలో 'నిశ్శబ్దంగా ఉండి భగవంతుడిని అని తెలుసుకోండి' అని ఉంటుంది. ఇస్లాం మతంలో అనల్ హక్ – నేనే సత్యాన్ని అని ఉంది. నేనే భగవంతుడిని అనే అనుభవాన్ని పొందటమే మానవజీవిత లక్ష్యం.

ఒక్కసారి మీకు ఆ అనుభవం అయితే, యోగీశ్వరులు చెప్పే అంతరంగంలోని నిత్యానందస్థితి మీలో ప్రారంభమవుతుంది. అప్పుడు మీకు బయటి ప్రపంచం అనేది భగవంతుడు ఆడే దివ్యనాటకానికి ఏర్పడిన అందమైన వేదిక అని తెలుస్తుంది. అప్పుడు మీకు ఈ ప్రపంచంలోని అన్ని సమస్యలు, బంధాల నుంచి అంతిమస్వేచ్ఛ దొరుకుతుంది. అప్పుడు మీరు మాట్లాడతారు కాని మాట్లాడరు. మీరు పని చేస్తారు కానీ పని చేయరు. మీరు బాధపడతారు కాని బాధ మీకు ఉండదు. మీ అంతరాత్మ అన్ని సందర్భాల్లో నిశ్చలంగా ఉంటుంది.

మీరు పరమానందస్థితిలో ఉంటారు. అదే నిత్యానందం.

సమస్య ఏమిటంటే అందరూ సన్న్యాసానికి బాహ్యాపపంచవిషయాలు అడ్డు అని అనుకుంటారు. వారంతా సన్న్యాసం అంటే గంభీరంగా, సీరియస్‌గా ఉండటం అనుకుంటారు.

ఇది సరి కాదు. సన్న్యాసం అంటే జీవితాన్ని అత్యున్నతస్థితిలో జీవించగల ఒక లక్షణం. దీనికి గంభీరత్వం పని చేయదు. నిజాయితీ, నవ్యతూ ఉండగలగడం అనేవి మాత్రమే జీవితాన్ని అత్యుత్తమస్థాయిలో ఉంచగలుగుతాయి. నవ్వటం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మికలక్షణం.

చిన్న కథ : ఒక గురువుగారు తన శిష్యులతో కూర్చొని ఉంటారు. ఆయన చాలా చక్కని స్థితిలో, ఆనందపారవశ్యంతో ఉంటాడు. ఇదే మంచి సమయం అని అనుకొని శిష్యులు ఆయనని ఈ స్థితికి చేరటానికి ఆయన ఏయే దశలని, ఎలా దాటారో అడుగుతారు.

గురుదేవులు వారి ప్రశ్నకు చాలా చక్కని వివరణ ఇచ్చారు. 'భగవంతుడు నన్ను, పని చేసే స్థలానికి తీసుకువెళ్ళాడు. అక్కడ నేను చాలా కాలం ఉన్నాను. తరువాత భగవంతుడు వచ్చి నన్ను వ్యధాపూరిత ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ నేను అత్యంతదుఃఖంతో ఉండి, కొన్నిసార్లు దానికి అతీతంగా వెళ్ళేవాడిని. అప్పుడు నేను సంతోషపడేవాడిని. తరువాత భగవంతుడు నన్ను అకస్మాత్తుగా ప్రేమ భూమిలో నిలిపాదు. అప్పుడు నేను జ్వలించే భావావేశాలతో గడిపాను. అప్పుడే నేను శుద్ధి అయ్యాను అని తెలుసుకున్నాను. ఆ తరువాత ఆయన నన్ను నిశ్శబ్దానికి తీసుకువెళ్ళాడు. అక్కడ నేను జీవనమరణాల మర్మాలని తెలుసుకున్నాను. '

అపుడు ఒక శిష్యుడు 'అంటే మీ అన్వేషణలో చివరి దశకి చేరారన్నమాట' అని అంటాడు. అపుడు గురువుగారు 'కాదు ఒక రోజు భగవంతుడు వచ్చి, 'ఈ రోజు నేను నిన్ను నా హృదయస్థానానికి తీసుకువెళతాను' అన్నాడు. అలా చెప్పి ఆయన నన్ను నవ్వుల భూమికి తీసుకువెళ్ళాడు' అని ముగిస్తాడు.

కాబట్టి అర్థం చేసుకోండి; సన్నాసం అంటే మీ శక్తి. అటువంటప్పుడు అది దేనికైనా ఏ విధంగా అడ్డంకి అవుతుంది? అంతే కాదు, సన్నాసశక్తితో మీరు నిరంతరం యువకుడుగానే ఉండవచ్చు. మీరు నిరంతరం జీవితంలో ఎటువంటి సవాలునెనా ఎదుర్కోగలరు.

సన్న్యాసం గొప్ప శక్తి. ఎందుకంటే ఈ కల్పనలు, ఊహా ప్రపంచంలో మీరు అత్యుత్తమక్రమశిక్షణతో జీవించగల లక్షణాన్ని నేర్పిస్తుంది. ఒక వ్యక్తి జైన్ మతయోగీశ్వరుడైన భగవాన్ మహావీరుని ఒక ప్రశ్న అడుగుతాడు, ఎవరు గొప్ప? సంసారి గొప్పా లేక సన్న్యాసి గొప్పవాడా? అని. అప్పుడు మహావీరుడు క్రమశిక్షణ చాలా గొప్పది, అని జవాబు ఇస్తాడు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో సంసారి గొప్ప క్రమశిక్షణతో ఉండగలడు. అర్థం చేసుకోండి; క్రమశిక్షణ, అంటే తనని తాను చిత్రహింసలు పెట్టుకోవటం కాదు. అది మీలో ఏర్పడే అందమైన విరామం. ఈ ప్రపంచాన్ని, మానసికవ్యవస్థని చక్కగా, లోతుగా అర్థం చేసుకున్నాక మీలో ఏర్సడే చక్కని విరామమే క్రమశిక్షణ అంటే. అది మీ అంతరంగం నుంచి ఏర్పడుతుంది. అంతే.

నేను ఈ విధంగా చెప్పినపుడు కొందరు నన్ను అడుగుతుంటారు 'అలా అయితే మేం సంసారజీవితంలో ఉంటూ సన్నాసచేతనస్థితిలో ఉండవచ్చు కదా!' అని. అర్థం చేసుకోండి, మనిషి సహజగుణం ఎలా ఉంటుందంటే చేతనస్థితిలో నిర్ణయం చేయకపోతే, అతని అంతరంగంలో, అతని చేతనస్థితిలో శాశ్వతమైన మార్పు సాధ్యపడదు. సన్న్యాసం అంటే చేతనస్థితో శాశ్వతమైన మార్పు కావాలి అని చేతనసితిలో చేసే నిర్ణయం. అంతకు మించి మరేమీ కాదు. అందుకే సన్నాసం తీసుకోవాలి. ఎప్పుడెతే చేతనస్థితిలో ఒక నిర్ణయం చేస్తామో అది మనని నిరంతరం తెలుసుకునే తత్వంలో ఉంచుతుంది. అటువంటి పరిస్థితిలో వెనక్కి మళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది. అలా కానప్పుడు మిమ్మల్ని ఆ మార్గానికి కట్టుబడి ఉండేలా చేయలేదు. అప్పుడు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మీరు సన్న్యాసమార్గాన్ని ఎంచుకున్నప్పుడు, చేస్తున్న పనిని మరింత నైపుణ్యంతో కొనసాగించగలుగుతారు. అదే పనిని ఇంకాస్త నమ్మకంతో ఇంకా బాగా, ఇంకా సృజనాత్మకతతో చేస్తూ భగవంతునికి దగ్గరగా వెళ్ళగలుగుతారు. ఈ సృష్టి భగవంతుని లక్షణం. సర్వాంతర్యామి నిరంతరం సృష్టిస్తూనే ఉంటాడు. సన్న్యాసం అంటే ఆ సృష్టిలక్షణాల్ని అలవరచుకోవటమే. అతనికి సర్వం ఆ సర్వాంతర్యామి సృష్టి అని తెలుసు.

చిన్న కథ : ఒకామె తన గ్రామం నుంచి పక్క గ్రామానికి నడిచి వెళుతూ ఉంటుంది. ఆమె అలా నడుస్తూ గుమ్మడి తోట దగ్గరకి వస్తుంది. అక్కడే ఒక పెద్ద వేప చెట్టుని చూస్తుంది. అప్పటికే బాగా అలసిపోయి ఉందేమో, కాసేపు అక్కడ కూర్చుందాం అని, ఆ చెట్లు కింద నీడలో కూర్చుంటుంది. అకస్కాత్తుగా ఆమె తల పైకెత్తి చెట్లు మీదికి చూస్తుంది. చెట్లుకి చిన్న చిన్న వేపకాయలు ఉంటాయి. పెద్ద పెద్ద బలమైన కొమ్మలకి చిన్న కాయలు వేలాడుతూ ఉంటాయి. ముందుకి చూసే సన్నటి తీగలకి చాలా పెద్ద గుమ్మడికాయలు కాచి ఉంటాయి. వాటిని చూసి ఆమె 'భగవంతుడు కూడా అప్పుడప్పుడూ తప్పులు చేస్తుంటాడు.' సన్నటి తీగలకి వేపకాయలని బలమైన వేపచెట్టుకి గుమ్మడి కాయలని ఆ భగవంతుడు ఇవ్వవలసింది అని అనుకుంటుంది. కొంత సేపటికి నిద్ర వచ్చి ఆ చెట్టు కింద పడుకుంటుంది. అంతలో గాలి వీచి ఒక వేపకాయ రాలి ఆమె చెంప మీద పడుతుంది. ఆ దెబ్బకి ఆమె మేలుకొని కాయ తగిలిన చోట చేతో తడుముకుంటూ ఇలా అనుకుంటుంది. 'ఎంతైనా ఆయన భగవంతుడు. అన్నీ సరిగ్గానే చేస్తాడు'.

సన్నాసి సర్వసృష్టిలో ప్రతిదీ అద్భుతంగా అమరిపోయి చక్కగా కలిసి ఉండటాన్ని చూడగలుగుతాడు. సన్న్యాసి అంటే తామరాకు మీద నీటిబొట్టు లాంటివాడు. తామరాకుని చూడండి. దాని మీద నీరు ఉంటుంది కాని అది దాన్ని అంటదు. సన్నాసి కూడా అంతే. బయటి ప్రపంచంలో అన్ని సంబంధబాంధవ్యాలతో ఉంటాడు కాని అవి ఏవీ అతన్ని అంటవు, అతనిలో నిశ్చలత్వాన్ని పాడు చేయవు. కాని సన్నాసం అనగానే సామాన్యంగా అందరూ అనుకునే విషయం బాంధవ్యాల్ని వదిలేయాలి అని. అది సరికాదు. సన్నాసం బాంధవ్యాల్ని మరింత బలపరుస్తుంది. నా శిష్యులు చాలా మంది నా దగ్గర ఒకమాట అంటుంటారు. సన్నాసదీక్ష తీసుకున్నాక భార్యాభర్తల మధ్య సంబంధాలు మరింత చక్కగా వికసించాయి. ఇప్పుడే మేం ఇద్దరం ఒకే పంథాలో జీవించగలుగుతున్నాం అని చెబుతుంటారు.

సన్యాసం అంటే అన్నీ వదిలేయటం కాదు (Part 2)

సన్నాసంతో మీరు మీ పరిసరాల్ని గమనించగల పరిశీలకులుగా మారగలుగుతారు. దీని వల్ల మీకు ఇతరులకి మధ్య ఒక ఖాళీ ప్రదేశాన్ని సృష్టించగలుగుతారు. ఈ ఖాళీని సన్నాసించటం అని తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంతకు ముందు ఆ ఖాళీ లేదు అని తెలుస్తుంది. అందరూ అందుకే ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఇప్పుడు ఆ ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీ దూరం వల్ల ఏర్పడింది కాదు. చేతనస్థితితో, తెలుసుకునే తత్త్వం వల్ల ఏర్పడిన ఖాళీ. తెలుసుకునే తత్త్యం మీ మనస్సులోకి చేతనస్థితిని తెస్తుంది. అప్పుడు మీరు నిర్ణయాలు, తీర్పులు చేయకుండా కేవలం విషయాల్ని చూడగలుగుతారు. ఇది చాలా సూక్ష్మచర్య, అది క్రమంగా మీలో ఒక భాగం అవుతుంది. అదే సన్నాసం అంటే.

సన్నాసం ప్రతి క్షణంలోకి తెలుసుకునే తత్వాన్ని ప్రవేశపెడుతుంది. తెలుసుకునే తత్వం, మీలో బాధలు ప్రవేశించకుండానే వాటికి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఎందుకంటే మీరు పూర్తి ఎరుకతో విషయాల్ని గమనించటం నేర్సుకున్నారు కాబట్టి. ఆ తెలుసుకునే తత్వం మీలో లేనప్పుడు ఎప్పుడో ఒకప్పుడు, దేనికో ఒక దానికి మీరు బాధపడవలసి ఉంటుంది.

సన్యాసం అంటే అంతరంగంలో స్త్రీ లేదా పురుషుడు అనే బరువు లేకుండా జీవించే వ్యక్తి. అంతరంగ స్త్రీ లేదా పురుషుడు అంటే ఏమిటి? అది లోపల దాగి ఉన్న కోరిక. తంత్రంలో శివుడు చాలా అద్భుతంగా చెబుతాడు. ఎవరైతే తన అంతరంగంలో స్త్రీని పూర్తిగా తుడిచేస్తాడో అతనే సన్యాసి. అతను సంసారజీవితంలో ఉన్నా కూడా సన్న్యాసి. అదే విధంగా, మనస్సులో స్త్రీ ఆలోచనలు ఉన్నప్పుడు సన్నాసి సన్నాసమార్గంలో లేనట్టే. అటువంటి వ్యక్తి సన్నాసి కాదు. ఎవరైనా ఒక వ్యక్తి సన్న్యాసా కాదా అని కొలవాలి అంటే ఇదే కొలమానం.

గౌతమబుద్ధుని నాలుగు అత్యుత్తమబోధల్లో రెండవది బాధలు, వ్యధల గురించి, దానికి కారణాల గురించి ఉంటుంది. బాధపడటం గురించి బుద్ధుడు చాలా చక్కగా చెబుతాడు. మన జీవితంలో ప్రతి నిమిషం నుంచి ఏదో ఒకటి ఆశించటం వల్లనే బాధలు కలుగుతాయి. ఇది ఎలా ఉంటుందంటే అరటి చెట్టుని మామిడి పళ్ళు ఇవ్వమన్నట్లుగా ఉంటుంది. మనం తెలుసుకునే తత్వాన్ని జీవితంలో ప్రతిక్షణంలో నింపినప్పుడే ఈ విషయం మనకు అర్థమవుతుంది.

అంతే కాదు, మీరు ఎప్పుడైతే సంబంధబాంధవ్యాల్ని గమనించటం మొదలు పెడతారో అందులో జరిగే వ్యవహారాలు మీకు అర్థం అవుతాయి. ఎదుటివారి నుంచి ఆశించటం అనే విషయం మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా ముందుకి నడిపిస్తుందో మీరు తెలుసుకోవచ్చు. ప్రతి దానిలోని అసలైన ప్రోత్సాహకరం ఏమిటో తెలుసుకోవచ్చు.

నాకు పన్నెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. మా బామ్మల్లో ఒకామె 104 సంవత్సరాల వయసులో మరణించింది. ఆమెకి పిల్లలు లేరు. మా మామయ్యల్లో ఒకరు ఆమెని చూస్తుండేవారు. అయితే ఆ పెద్దావిడని చూడటం అతనికి, అతని భార్యకి ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఆమె మీద ఏదో ఒక ఫిర్యాదు చేస్తుండేవారు. ఆమెని సరిగ్గా చూసేవారు కాదు. ఆమె కూడా సమస్యలు సృష్టించే వ్యక్తి. ఆమెకి ఆస్థి ఉంది. ఆమె నన్ను అప్పుడప్పుడూ పొగాకు తెచ్చి పెట్టమనేది. నేను ఎప్పుడైనా డబ్బు అడిగితే, వెళ్ళి మీ నాన్నని అడుగు అనేది. తన పక్కింటివారికి కూడా వేసవి కాలంలో అయినా బావిలో మంచి నీళ్ళు ఇచ్చేది కాదు.

ఆమె చనిపోయినప్పుడు ఏడవటానికి ఎవరూ లేరు. కానీ ఆమెని చూసే ఆవిడ మాత్రం ఒక పాత చీర కట్టుకొని, లేని దుఃఖం తెచ్చుకొని, పలకరించటానికి వచ్చేవారిని చూసి గొల్లున ఏడ్చేది. మళ్ళా ఎవరైనా వస్తే ఏడుపు మొదలు పెట్టేది. అమెని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.

ఆ పెద్దావిడ భౌతికశరీరం ఇంకా అక్కడ ఉండగానే ఆమెకి దగ్గరివారంతా ఆమె గదిలోకి వెళ్ళి నగల పెట్టె తెరిచి, ఇది నా వాటా, ఇది నా వాటా అని పోట్లాడుకోవటం మొదలుపెట్టారు. శవం ఇంకా అక్కడే ఉంది, వాళ్ళు మాత్రం కంసాలిని పిలిచి బంగారం ఎంత ఉందో, దాని వెల ఎంతో లెక్కలు కట్టించటంలో మునిగిపోయారు.

ఆ క్షణంలో నాకు కుటుంబవ్యవస్థ అన్నా, సంబంధబాంధవ్యాలన్నా గౌరవం పోయింది. వారి ప్రదర్శన చూసి గట్టిగా నవ్వటం ప్రారంభించాను. మా మామయ్య ఒకరు నా నవ్వు ఆపటానికి కొట్టబోయాడు. నేను అతని చేతిని పట్టుకొని, 'ఇంకొకసారి నా మీద చెయ్యి ఎత్తితే మీరంతా కలసి చనిపోయిన పెద్దావిడ శవం ఉండగానే ఆమె ఆస్థిని ఎలా దోచుకున్నారో అందరికీ చెబుతాను' అన్నాను. మా అమ్మకి నా సంగతి తెలుసు. ఆమె మామయ్యని జాగ్రత్త అని చెప్పింది. నేను ఏ మాట అంటానో అది చేసి తీరతాను అని వారికి చెప్పింది.

ఆ తరువాత బంధువులు, చనిపోయిన ఆమె అంత్యక్రియలని ఎవరు చేస్తారు, ఆ ఖర్చు ఎవరు భరించాలి? అని వాదులాడుకోవటం ప్రారంభించారు. మా నాన్నగారు వారి వాదాలు చూసి చికాకు పడి ఆ ఖర్చులు నేను భరిస్తాను అని ముందుకు వచ్చారు. ఆయన నెమ్మదస్తుడు, అమాయకుడు.

ఈ గొడవ అంతా చూసి చాలా చికాకుపడ్డ నేను, చనిపోయిన బామ్మ దగ్గర కూర్చొని భగవద్గీతలోని శ్లోకాలు చదవటం ప్రారంభించాను. చనిపోయినవారి భౌతికకాయం దగ్గర భగవద్గీతలోని శ్లోకాలు చదివితే చనిపోయిన వ్యక్తికి ముక్తి దొరుకుతుంది అంటారు. నా ఆ వయస్సుకి ఆ సమయంలో నేను చేయగల మంచి పని అదే అనిపించింది. అర్ధం చేసుకోండి, సన్నాసి ప్రపంచం బాధ్యతని తీసుకుంటాడు. అతనికి తన కుటుంబసభ్యులు, బయటివారు అనే తేడా తెలియదు. అతనికి అందరూ సమానమే. తన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికీ ముక్తిని ఇవ్వాలని చూస్తాడు.

కాని సంసారి అలా కాదు. అతను కేవలం తన కుటుంబబాధ్యతలే తీసుకుంటాడు. లేదా ఒకటి – రెండు సంస్థల బాధ్యత తీసుకుంటాడు. అతని బాధ్యత ఏదో ఒక కచ్చితమైన కారణంతో ఉంటుంది. అది కీర్తిప్రతిష్ఠలు పొందాలని లేదా ఏదో ఒక బాధ్యత తీర్చుకోవటానికి లేదా తన చుట్టు పక్కల ఉన్న ప్రజలతో చక్కగా ఇమిడిపోయి జీవించటానికి. సన్న్యాసి తీసుకునే బాధ్యత లక్షణాలు పూర్తి వేరుగా ఉంటాయి. అతనికి ప్రపంచమంతా అతని కుటుంబమే. అతన్ని ముందుకు నడిపే ప్రత్యేకబాధ్యత ఏదీ ఉండదు. ఇదంతా అతని అంతరంగలక్షణాల వల్ల జరుగుతుంది. సంసారి తన బాధ్యతలు తీరాక జీవితంలో ఒక స్థితిలో విశ్రాంతి తీసుకోవచ్చు. సన్నాసి మాత్రం నిరంతరం పని చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే అతని దగ్గరికి ప్రజలు నిరంతరం వస్తూనే ఉంటారు. వారికి జీవితసత్యాల్ని తెలియజేస్తూ ఉండాలి.

సన్నాసి బలమైన సంబంధాలలో స్థిరపడగలడు. సామాన్యులు మాత్రం సన్నాసి బంధాల నుంచి పారిపోతాడు అని అనుకుంటారు. ఒకసారి ఒక కాలేజీ ప్రోగ్రాంలో ఒక అమ్మాయి నన్ను 'స్వామీజీ! మీరు ప్రేమలో ఓడిపోయి సన్నాసి అయ్యారా' అని అడిగింది. నేను ఆమెతో 'ప్రేమలో గెలిచాను కాబట్టి నేను సన్నాసినయ్యాను' అని చెప్పాను. నిజానికి సన్నాసమే మిమ్మల్ని ప్రేమలో నిలుపుతుంది. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ ఒక వ్యక్తి వైపు కాదు. ఆ ప్రేమ సర్వాంతర్యామి వైపు, సర్వసృష్టి వైపు ఉంటుంది.

సామాన్యంగా అందరూ ప్రేమ అనుకునే ప్రేమ ఒక కారణంతో లేదా కోరికతో ఉంటుంది. అర్ధం చేసుకోండి, అంతరంగంలో స్త్రీ లేదా పురుషుడు అంటే ఏమిటి? అది మన లోపల దాగి ఉన్న కోరిక లేదా కామం. శివుడు తంత్రాల్లో ఈ విషయాన్ని చాలా చక్కగా చెబుతాడు. ఎవరైతే తన అంతరంగంలో స్త్రీని తుడిచేస్తాడో అతనే నిజమైన సన్నాసి.

సన్నాసి అంటే మహారాజులా జీవించే వ్యక్తి. సన్యాసం అంటే మహారాజు జీవితానికి ప్రారంభం. ఎప్పుడైతే నీ లోపలి బాధల్ని, వ్యధల్ని పూర్తిగా తొలగించి శుభ్రపడతావో, నీవు ఈ సాటి రాని ఐశ్వర్యవంతులవుతారు.

నేను జన్మించినప్పుడు జ్యోతిష్యపండితుల్ని పిలిపించి నా జాతకచుక్రం చూడమని చెప్పారట. ఆయన నా జాతకచక్రం చదివి 'ఈ అబ్బాయి రాజసన్న్యాసి అవుతాడు' అని చెప్పారట. అర్థం చేసుకోండి. సన్న్యాసమార్గాన్ని సరైన పద్ధతిలో అనుసరించగలిగితే అతనికి మహారాజయోగాన్ని ఆపాదిస్తారు. సన్నాసం అంతిమరాజసం. ఎందుకంటే సన్నుసి ఏమీ లేకుండానే ఐశ్వర్యవంతు. ఒక రాజు కేవలం అతని సంపద వల్ల మాత్రమే రాజు. అది బయటి ప్రపంచానికి సంబంధించిన ఐశ్వర్యం. సన్యాసి తన అంతరంగప్రపంచానికి సంబంధించిన ఐశ్వర్యంతో మహారాజు అవుతాడు. బయటి ప్రపంచసంపదని ఎప్పుడైనా పోగొట్టుకోవచ్చు. అప్పుడు మహారాజు కూడా పేదవాడై పోతాడు. అంతరంగసంపదలతో మీరు శాశ్వతంగా, ఎప్పటికీ ఐశ్వర్యవంతులే.

గౌతమబుద్ధుడు భిక్షాటన చేస్తూ వీథులలో తిరుగుతున్నపుడు, ఆయన మహాచక్రవర్తిలా కనిపించేవాడట. ఆయనకి భిక్షవేసేవారు భిక్షకులుగా అనిపించేవారు అని చెబుతారు. అదే సన్నాసి ముఖ్యలక్షణం. అప్పటికే బుద్ధుడు జ్ఞానోదయమైన యోగీశ్వరుడు. అయినా సన్నాసి లక్షణం కూడా అందులో ఉంది. సన్న్యాసం అంటే రాజసం ఉట్టిపడటమే.

అంతే కాదు; ఎప్పుడైతే అంతరంగప్రపంచం ఐశ్వర్యవంతమవుతుందో ఆ వ్యక్తికి బయటి ప్రపంచంలో ప్రతి అనుభవమూ ఐశ్వర్యవంతంగా ఉంటుంది. సన్న్యాసికి అంతు లేని సృష్టిసంపదలు కనిపిస్తూ ఉంటాయి. ఆయన దృష్టి మహాసముద్రం, ఆయన చిన్న చిన్న పరిధుల్లో చిక్కుకొని ఉండడు. అతనికి సర్వసృష్టి ఒకటిగానే కనిపిస్తుంది. అతను తనకి తాను ఆ ఐశ్వర్యంలో ఒక భాగం అని తెలుసుకుంటాడు. అందుకే తాను కూడా చాలా ఐశ్వర్యవంతుడిని అని తెలుసుకుంటాడు. అర్ధం చేసుకోండి. ఒక వ్యక్తి కొన్ని ఎకరాల పొలానికి అధిపతిని అని తాను ధనవంతుడినని అనుకుంటాడు. కాని అతను నిజంగా ధనవంతుడు కాదు. అతను అంత వరకూ పేదవాడే. ఎవరైతే సృష్టిలోని అంతు లేని సంపదల్ని చూడగలదో అతనే ధనవంతుడు.

ఒక చిన్న కథ : ఒక రోజు ఒక ధనవంతుడైన వ్యక్తి తన కొడుకుని తీసుకొని ఊరు బయట ఉండే చిన్న గ్రామానికి వెళతాడు. అక్కడ ఉన్న పేదవారిని, వారి జీవితవిధానాల్ని తన కుమారుడికి చూపించాలి అన్నది అతని ఉద్దేశం. అక్కడ ఒక వ్యవసాయదారుని కుటుంబంతో కొన్ని రోజులు గడుపుతాడు. తిరిగి వారి ఊరికి వచ్చేస్తూ, తిరుగు ప్రయాణంలో తండ్రి కొడుకును తమ ఈ ప్రయాణం ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు కొడుకు, చాలా బాగుంది అని జవాబు చెబుతాడు.

తండ్రి కొడుకుని 'అక్కడ పేదవారి జీవనసరళిని గమనించావా?' అని అడుగుతాడు. 'అవును, చూసాను' అని కొడుకు సమాధానం ఇస్తాడు. తండ్రి కొడుకుని 'మన ఈ ప్రయాణం నుంచి నీవు ఏం నేర్చుకున్నావు' అని అడుగుతాడు.

కొడుకు ఇలా సమాధానం ఇస్తాడు. 'మనకి ఒక కుక్క మాత్రమే ఉంది. కాని వాళ్లకి నాలుగు ఉన్నాయి. మనకి చిన్న కొలను ఉంది. అది మన తోట మధ్యలోనే ఉంది. కాని వారికి అవతలి ఒడ్డు కనపదనంత పెద్ద నది ఉంది. మన తోటలో దీపాలు వున్నాయి. కానీ వీరికి నక్షత్రాలు ఉన్నాయి. మన ముందు వైపు, వెనుక చిన్న తోట మాత్రమే ఉంది. వారికి మాత్రం దిక్కులన్నీ అంటే అంత పెద్ద వాకిలి, తోట ఉన్నాయి. మనం ఉండటానికి చాలా చిన్న స్థలం ఉంది. కాని వారు ఉండే స్థలం పొలాలు కంటికి కనపడేంత వరకూ ఉన్నాయి. మనకి సేవలు చేయటానికి పనివారు వున్నారు. కానీ అక్కడ వాళ్ళే ఇతరులకి సేవలు చేస్తారు. మనం మన భోజనపదార్థాలు కొనుక్కుంటాం. వాళ్ళు వాటిని స్వయంగా పండించుకుంటారు. మనని రక్షించటానికి నాలుగు వైపులా గోడలు ఉన్నాయి. కాని వారిని రక్షించటానికి వారి స్నేహితులు ఉన్నారు.' కొడుకు జవాబు విని తండ్రి నిశ్శాంతపోతాడు. చివరలో కొడుకు ఇలా అంటాడు 'నాన్నగారూ' మనం ఎంత పేదవారమో నాకు చూపించారు. మీకు కృతజ్ఞతలు.'

అర్థం చేసుకోండి; ధనవంతుడు, సంపదలు అనే మాటని చాలా తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఏవో ఒకటి – రెండు ఎకరాలకి సొంతదారుని అనే వ్యక్తిని మీరు ఎలా ధనవంతుడు అంటారు. అది సరి కాదు. ఏ వ్యక్తి అయితే నిరంతరం తన చుట్టూ ఉన్న అనంతమైన సృష్టిలోని సంపదల్ని అనుభవిస్తాడో అతనే ధనవంతుడు. సన్న్యాసి నిజమైన ధనవంతుడు.

స్వేచ్ఛని మేల్కొలపడం

ఈ గ్రంథంలోని ఈ భాగం వివేకానందస్వామి రాసిన ఒక సన్నాసి పాట అనే పద్యభాగం మీద THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఇచ్చిన వ్యాఖ్య. ఆయన బిడదిలోని ఆశ్రమవాసుల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ విషయాల్ని వివరించారు. ఆయన చెప్పిన విషయాలు తక్కువే అయినా ప్రసంగం అందరిలో ఒక అందమైన, విజ్ఞానపూరితమైన నిశ్శబ్దంలోకి తీసుకువెళ్ళింది. ఇందులో పెద్దగా ఉన్న వరుసలు అసలు పద్యం తెలుగు అనువాదం. ఆయన బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులకి తాను ఏ విధంగా శిక్షణని ఇస్తారో వివరించారు.

స్వరాన్ని మేలుకొలుపు

స్వరాన్ని మేల్కొలపండి! పాటకి అదే జన్మస్తానం. సుదూరాల్లో ఎక్కడైతే ఈ ప్రపంచ మలినాలు చేరవో కొండ గుహల్లో, అడవుల అంతర్భాగాల్లో ఎవరైతే మౌనంగా ఐశ్వర్యం, పేరు కావాలని కోరిక లేదని అనేవారిని ఎవరైనా భంగపరచగలరా; ఎక్కడైతే జ్ఞానం, సత్యం, పరమానందం ఒక నిరంతరవాహినిలా ఉందో ఆ రాగాలని ఉచ్ఛస్వరంతో ఆలపించండి. ధైర్యంతో పాడండి గొంతెత్తి ఓ! సన్న్యాసీ ధైర్యంగా చెప్పు, ఓం తత్ సత్ ఓం!

నిన్ను బంధించే సంకెళ్ళు తెంచు! నిన్ను బందీని చేసే బంధాల్ని తెంచుకో. మెరిసే బంగారం కానీ, మెరవని మామూలు లోహం ప్రేమ – ద్వేషం; మంచి చెడు అన్నీ ద్వంద్వాలే. బానిస బానిసేనని తెలుసుకో, బుజ్జగించినా, బాధపెట్టినా అది స్వేచ్ఛ కాదు. సంకెళ్ళు బంగారానివైనా, బందీని చేసేవి బలహీనమైనా వాటిని తొలగించుకో, సన్నాసీ ధైర్యంగా గొంతెత్తి అను ఓం తత్ సత్ ఓం!

ప్రస్తుతానికి మీలోని అహంకారం కొన్ని చోట్లలో స్థిరపడి ఉంది; అవి గర్వం, కోరిక, కోపం, సంపదలు, సంఘంలో పేరు ప్రతిష్ఠలు, వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఇలాంటివాటిల్లో ఉంది.

మీరు ఆ విధంగా జీవిస్తున్నంత కాలం, మీరు అవి సాధించకపోయినా, మానసిక ఉన్నా అది నిరాశానిస్పృహలకే దారి తీస్తుంది అది సూక్ష్మంగానైనా ఉంటుంది లేదా స్పష్టంగా కనిపిస్తుంది.

గుంపులుగా వచ్చే ద్వంద్వాలే, లాలన కాని, బాధించటం కాని గురువుగారు ప్రేమని చూపించినా లేదా మీ మీద మండిపడినా, మీరు అహంకారం ఆధారంగా జీవనసరళిని నడిపిస్తూ ఉంటే, మీరు ఎప్పటికీ బానిసగానే ఉంటారు.

బంగారానివైనా అవి సంకెళ్ళే

అర్థం చేసుకోండి; వెంటనే దొరికే స్వేచ్ఛ అనే ఒక విషయం ఉంది. అది ఎలా ఉంటుంది అంటే. మీరు నిద్ర లేవగానే మీకు ఎలా చేయాలి అనిపిస్తే అలా చేస్తారు. ఎప్పుడు నిద్ర లేవాలి అనిపిస్తే అప్పుడు నిద్ర లేసారు. ఎప్పుడు ఏ పని చేయాలి అనిపిస్తే అప్పుడు ఆ పనిని చేసారు. మీ చేతికి డబ్బు వచ్చినపుడు ఏమి కొనాలి అనిపిస్తే అది కొంటారు. దీన్నే వెంటనే లభించే స్వేచ్ఛ అనవచ్చు. ఎప్పుడైతే మీలోని అటువంటి స్వేచ్ఛని కుదిపేస్తామో అప్పుడే మీలో సమూలమైన మార్పు వస్తుంది. నేను, నాది అనేవి కదిలిపోతాయి. అప్పుడే మీలో మార్పు అనేది సాధ్య పడుతుంది. ఆ మార్పు మీ చేతనస్థితిలోని మానసికవ్యవస్థ, అచేతనస్థితిలోని మానసికవ్యవస్థ ఒక దాంతో ఒకటి సంభాషించుకోవటమే.

నేను ఏం చేస్తున్నానో గమనిస్తే మీరు చాలా చూడవచ్చు; నేను నిరంతరం మీలోని వెంటనే లభించే స్వేచ్ఛని కుదిపేస్తూ ఉంటాను. అంతకు మించి మరేమీ లేదు. మీరు మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఇటువంటి స్వేచ్ఛలో స్థిరపరిచారు. దాన్ని నేను కుదిపేస్తున్నాను. మీకు కొంచెం వివరంగా చెబుతాను. అప్పుడు దాన్ని మీ జీవితానికి అన్వయించి అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం మీరంతా ఆశ్రమపద్ధతిని అనుసరిస్తున్నారు. దాని ప్రకారమే మీరు ఉదయం 5 గం నుంచి రాత్రి 12 వరకు చేయవలసిన విధంగా మీ విధులు చేస్తున్నారు. ఉదాహరణకి రేపటి నుంచి 10 రోజులు మీకు సెలవులు ఇస్తున్నాను అన్నాననుకోండి. అంటే మీరు ఆశ్రమపద్ధతులు పాటించనవసరం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు. ముందు మూడు – నాలుగు రోజులు కొంచెం ఎక్కువ సేపు నిద్ర పోతారు. మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ గడుపుతారు. ఆ తరువాత ఏం జరుగుతుంది? మీ కోరికలు ముందుకు వచ్చి మీ మీద అధికారం చేస్తాయి. మీరు వాటి ప్రకారం పనులు చేయటం మొదలు పెడతారు.

నేను మీకు విధించిన దైనందినజీవనపద్ధతి మీ చేతనస్థితిని ఉన్నతంగా ఉంచుతుంది. కానీ అది మీకు నచ్చదు. కాబట్టి మీకు స్వేచ్ఛని ఇవ్వగానే ముందు కొన్ని రోజులు చాలా స్వేచ్ఛగా ఉంటారు. కానీ ఆ తరువాత ఏం జరుగుతుంది? మీ లోపల ఉన్న, మీ అచేతనస్థితిలో ఉన్న కోరికలు ముందుకి వచ్చి, మీ మీద అజమాయిషీ చేస్తాయి. మీకు తెలియకుండా మీరు మరొకసారి బానిస అవుతారు. అది కూడా మీ కోరికలకి బానిస అవుతారు.

ప్రస్తుతం మీరు ఏమనుకుంటున్నారు? నిరంతరం ఒక బానిసలా పని చేసే అవసరం ఉందా? ఉదయం నుంచి రాత్రి వరకూ అదే పనిని చేయాలా? మీరు నాలుగు రోజుల స్వేచ్ఛ తరువాత మీకు అర్ధమయ్యేది ఏమిటంటే మీ కోరికలకి మీరు బానిస అని, అంతే.

మీరు మీ కోరికల్ని అనుసరించి మీరు ప్రతి దాన్నీ వాయిదా వేసుంటారు. మీ దైనందిన కార్యాలను వదిలివేసారు. మీరు భోజనం చేసే సమయం, నిద్ర పోయే సమయం అన్నింటినీ విరామంగా చేస్తారు. మీరు ఆ విధంగా చేసేటప్పుడు మీ అంతరాత్మ పైన మానసికమైన క్రుంగుబాటు అనే ఒక దళసరి పొర ఏర్పడటం గమనించవచ్చు (చేతితో గ్రిడ్‌లా చేసి చూపిస్తూ చెబుతున్నారు).

ఎప్పుడైతే మీ భ్రమలే మీకు తెలియకుండా మీ దైనందినజీవితాన్ని నడపటం ప్రారంభిస్తాయో, అప్పుడు మీ లోపల నిరాశానిస్పృహలు, క్రుంగుబాటుతనం అనేవి ఒక దళసరి పొరలా ఏర్పడతాయి. అదే ఇక్కడ ఆశ్రమంలో నేను చెప్పే జీవనసరళి అటువంటి పొరలు ఏర్పడకుండా సహాయం చేస్తుంది. ఎందుకంటే ప్రతి రోజూ మీ వాదనలకి, మీ లౌక్యానికి అందని విధంగా మీ లోపల ఒక ఆహ్లాదకరమైన భావన మీ అంతరంగాన్ని కప్పుతూ మిమ్మల్ని తేలికపరుస్తుంది. ఇదే ఈ రెండు మార్గాల మధ్య ఉన్న పెద్ద తేడా. ఈ విషయాన్నే నేను ఉదయం ప్రాణనాథకి చెబుతున్నాను.

ఈ చీకటులు తొలగాలి ! మనోసంకల్పం ముందుకి సాగాలి

నిరాశ పొరల వెలుగులు మరింతగా తగ్గిపోవాలి. జీవితాంతంలోని దాహాన్ని శాశ్వతంగా పోగొట్టాలి.

జన్మ నుంచి మరణానికి, మరణం నుంచి జన్మకి అది సాగాలి ఎవరు తనని తాను గెలుస్తారో, అతనే విజయుడు ఈ సంగతి తెలుసుకో, మిగిలిన విషయానికి కరిగిపోకు ఓ ధైర్యం గల సన్న్యాసీ, గొంతెత్తి పాడు 'ఓం తత్ సత్ సత్ ఓం' అనే నాదాన్ని

ఈ విషయాన్నే నేను చెబుతున్నది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరైతే మరణానికి తరువాత జన్మకి మధ్య 'ఆహా…….. నేను చేయగలిగింది చేసి బయట పడ్డాను' అనే వ్యక్తి సన్నాసి. పుట్టకకి, మరణానికి మధ్య ఉన్నదే జీవితం అనుకుని 'ఆహా! నేను గొప్పవి సాధించాను' అనుకునే వ్యక్తి సంసారి. అర్ధమైందా?

మన అంతరాత్మ మరణానికి తరువాత జన్మకి మధ్య ఉండే సమయంలో తన పాత జ్ఞాపకాల్ని, పనుల్ని తిరిగి మననం చేసుకుంటుంది. ముందు జన్మలో సత్యానికి దగ్గరగా జీవించగలిగితే తృప్తిగా ఉంటుంది. అలా కాకుండా ఊహలు, కల్పనల్లో జీవించి ఉంటే బాధపడుతుంది. మరణానికి ఆ తరువాతి జన్మకి మధ్యలో తాను జీవితంలో మంచి పని చేసాను అని అనుకోగలిగితే చక్కగా బయటికి రాగలుగుతాడు. ఎందుకంటే అతను సత్యానికి అతి చేరువగా జీవించాడు కాబట్టి.

అదే సంసారి అయితే జీవితానికి, మరణానికి మధ్య ఉన్నదే జీవితం అనుకొని, కల్పనలతో చేసిన పనుల్ని ఘనతగా భావించి, ఆహా! నేను సాధించాను అనుకుంటాడు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి, నేను సంసారి అని అంటే వివాహం అయినవారు అని అర్థం కాదు. ఇది మానసికస్థితికి సంబంధించిన విషయం. ఎవరైతే సత్యానికి దూరంగా కల్పనల ప్రపంచంలో ఉంటారో వారంతా సంసారులే. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి.

జీవితంలోని దాహాన్ని పూర్తిగా పోగొట్టాలి: అది సాధ్యమా?

జీవితం మీద ఆశ ఎప్పటికీ మరణించదు. అది నిరంతరం జరుగుతూ ఉంటుంది. చాలా జన్మలు గడిచాక, జన్మలంటే బోరు కొట్టి, అప్పుడు స్థిరపడటమే అనుభవం అంటే అదే జీవితంలో అంతిమ అనుభవం. జ్ఞానోదయమైన యోగీశ్వరులు ఎన్నో వేల జన్మల్ని తీసుకొని, విసుగొచ్చి, ఒక స్థితిలో స్థిరపడతారు. అటువంటి వ్యక్తి నిరంతరం అపురూపమైన శక్తిని నలువైపులా ప్రసరింపచేస్తుంటారు. ఏ వ్యక్తి అయినా ఆ యోగీశ్వరుని చూస్తే ఆయనకి జీవితాంతం దగ్గరైపోతాడు. ఆయనని వదలలేదు. అదే ఆ వ్యక్తి జ్ఞానోదయం పొందాడు అనటానికి గుర్తు. ఆ విధంగానే గురువుకి, శిష్యులకి మధ్య బంధం ఏర్పడేది. శిష్యుడు గురుదేవుల్లో తన దర్శనానికి అందని శక్తిని చూసి దానికి కట్టుబడి ఉంటాడు.

అర్థం చేసుకోండి; చాలా చాలా జీవితాల నుంచి వచ్చిన అనుభవాల తరువాత నేను ఈ స్థితిలో ఉన్నాను. అందుకే మీరు నన్ను సీనియర్ ఆత్మ అని అంటారు. ఆ విధంగా కాకపోతే నా వయస్సు 31 సంవత్సరాలు, నా లోపల ఉన్న ఆత్మకి ఏం సంబంధం ఉంది? ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి, అటువంటి ప్రాచీన, సీనియర్ ఆత్మని చూడగానే ఆ అనుభవాన్ని గ్రహించి తమని తాము ఉన్నతస్థితికి వెళ్ళగలగటమే సన్న్యాసం అంటే. ఈ విషయాన్నే వివేకానందుడు ఇక్కడ వివరిస్తున్నాడు. సన్న్యాసం అంటే జ్ఞానోదయమైన యోగీశ్వరుని చూసి, ఆయనతో ఉండి తనకి తాను అత్యున్నతస్థితికి చేరటమే. ఎవరు తనని తాను గెలుస్తారో, వారు ఎవరి పైన అయినా గెలుపే సాధిస్తారు. ప్రాపంచికవిషయాలకి కరిగిపోవద్దు.

ఓ సన్న్యాసీ ధైర్యంగా గొంతెత్తి చెప్పు

'ఓం తత్ సత్. ఓం!' ఎవరు విత్తనం నాటుతారో వారికే ఫలాలు అన్నది ఆర్యక్రి కారణమే ప్రభావానికి మూలం మంచి అయితే దొరికేది మంచి చెడు అయితే దొరికేది చెడు ఎవరూ న్యాయసూత్రాన్ని తప్పించుకోలేరు. కాని ఎవరు ఒక రూపాన్ని పొందారో వారు బంధాల్ని భరించాలి నిజమైన సత్యం : కాని సుదూరం రూపం వేరు రెండు ఆత్మే అది ఎప్పటికీ స్వేచ్ఛాభిలాషి ఆ కళని నీవు నేర్చుకో ఓ సన్న్యాసీ ధైర్యంగా గొంతెత్తి చెప్పు ఓం తత్ సత్ ఓం!

ఒక సందర్భాన్ని కాని, లేదా న్యాయస్థానాన్ని కానీ ఒక్కసారి తప్పించుకుంటే మీరు నిజంగా తప్పించుకున్నాను అని ఎప్పుడూ అనుకోవద్దు. ఏదైనా ఒక సమస్య వస్తే మీ అంతరాత్మ లోపలికి వెళ్ళండి. మిమ్మల్ని మీరు సాంత్వన పరచుకునే మాటలు చెప్పండి. 'నేను ఆత్మని' అని గుర్తు చేసుకోండి. ఆ సమస్యకి మీ నుంచి వచ్చే జవాబుని, అది మీ అంతరంగంలో కలిగచేసే అనుభవాన్ని తెలుసుకోండి. అది ఎంత జటిలమైన సమస్య అయినా సరే, మీకు జవాబు వస్తుంది. దాని ప్రకారం నడుచుకోండి, అదే స్వేచ్ఛ అంటే. ప్రస్తుతం మీకు ఏదైనా సమస్య ఉంటే, మీరు ఏం చేస్తున్నారు? ఆ సందర్భం నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తున్నారు. అవును కదా? అలా తప్పించుకొని మీకు స్వేచ్ఛ ఉంది అనుకుంటున్నారు. ఆ పద్దతి వద్దు అని వివేకానందుడు ఇక్కడ చెబుతున్నాడు.

పేరు, రూపం కూడా ఆత్మే. అది ఎప్పటికీ స్వేచ్ఛతో ఉంటుంది. ఆ (స్వేచ్ఛ) కళని నేర్చుకో.

జీవితపరిష్కారాల్ని మీ అంతరంగానికి అన్వయించటం ద్వారా స్వేచ్ఛని మేల్కొలపండి. ఆ విధంగా వచ్చే స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ మాత్రమే మిమ్మల్ని అంతిమస్వేచ్ఛకి తీసుకు వెళ్ళగలుగుతుంది. ఈ విధంగా కాకుండా, మరే విధంగా అయినా, ఏ పద్దతిలోనైనా మీరు స్వేచ్ఛ దిశగా సాగుతున్నాం అని అనుకుంటే, అది మిమ్మల్ని మరింతగా బంధాల్లోకి తీసుకువెళుతుంది.

ఎవరు విత్తితే వారు ఫలాలు పొందుతారు. కారణం తప్పక ఫలితాన్ని ఇస్తుంది అనే ఆర్యక్రి మంచితో మంచిని పొందుతావు చెడుతో చెడుని పొందుతావు. అది మరేమీ కాదు. న్యాయం నుంచి తప్పించుకున్నా. ఎవరైతే రూపాన్ని పొందుతారో, వారు బంధాల్ని భరించాలి. అది నిజమైన సత్యం; కానీ ఎక్కడో సుదూరాల్లో ఉంది.

చూడండి! మీరు ఒక రూపాన్ని తీసుకోగానే అంటే మీరు జన్మించగానే మీరు స్వేచ్ఛ కోసం చాలా విధాలుగా ప్రయత్నిస్తారు. అది ఈ జన్మ నుంచి తప్పించుకోవటం గాని లేదా దేన్నైనా ఆపాలి అని ప్రయత్నించటం ద్వారా గాని చేస్తారు. కానీ అది జరగదు. ఇది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని బంధించి ఉన్న గొలుసుని విప్పి మళ్ళా మీకు మీరే మరొక చోట గట్టిగా కట్టినట్లుగా ఉంటుంది. ఒక గాయం తగ్గాలి అంటే దానికి మందు వేయాలి. అంతే కదా! కానీ దాన్ని ఇంకా ఇంకా లోపలికి తొలుస్తూ వెళితే అది ఎలా తగ్గుతుంది. తగ్గదు. బయటి ప్రపంచంలో ప్రయత్నాల ద్వారా స్వేచ్ఛ పొందాలి అని మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని మీరు లోతైన క్రుంగుబాటుతనంలో మునిగేలా చేస్తుంది. ఆ నిరాశ నుంచి మీరు పని చేసినా అది మరింత నిరాశ, క్రుంగుబాటులకే దారి తీస్తుంది. అదే విధంగా మీరు బందీలుగా బంధాలలో చిక్కుకుని ఏ పని చేసినా అది మిమ్మల్ని మరింత బంధాల్లోకి తీసుకువెళుతుంది. కేవలం మీరు మీ అంతరంగప్రపంచంలో పని చేసినప్పుడే మీకు ఆ స్వేచ్ఛ దొరుకుతుంది.

ఉదాహరణకి; మీరు ఏదైనా తప్పు చేసారనుకోండి, ఆ పరిస్థితుల నుంచి తప్పుకోవటానికి ఈ ప్రపంచంలో మనుషులని కాని లేదా పరిస్థితులని కాని ప్రయత్నిస్తారు. అంతే కదా? ఆ తప్పుని మూసేయటానికి ఇటువి అటు మార్చుతారు. ఆ తరువాత అంత కంటే బాధాకరమైనవి జరుగుతాయి. ఆ దుఃఖం బయటికి వచ్చినపుడు 'ఎవరైనా ఈ విషయం మీద ప్రశ్నిస్తే ఏం జవాబు ఇవ్వాలి? ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి?' అని ఆలోచించటం మొదలుపెడతారు. మీ అహంకారం' ఈ దుఃఖానికి కారణం మీరే అని చెప్పనీయదు. కాబట్టి మీరు ఏం చేసారు? మీ తప్పులు బయటికి రానీయకుండా, ఆ దుఃఖానుభవాన్ని మీలో కలుగనీయకుండా ఆ దుఃఖాన్ని, బాధని బయటకి రానీయకుండా, మీరు 'ఆ........ నేను మంచి పనే చేసాను, ఇక దాన్ని వదిలేస్తాను. అది ఎలా జరగాలో ఆ విధంగా జరుగుతుంది' అని చెప్పుకుంటారు.

అంతే కదా! జీవితం ఆ విధంగానే సాగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆశ్రమంలో మీ జీవితాన్నే ఉదాహరణగా తీసుకోండి.

ఎప్పుడైతే మీ లోపల కదలికలు, అనిశ్చలత అనేవి ప్రారంభమవుతాయో, ఎప్పుడెతే నేను మీ అహంకారానికి సమస్యలు సృష్టించటం ప్రారంభిస్తానో, వెంటనే మీరు ఒక గుర్తింపుని తయారుచేసుకొని, మీ వ్యక్తిత్వం అది అనుకొని ఇక్కడి నుంచి పారిపోయి పాండిచ్చేరి ఆశ్రమానికి చేరతారు. ఎప్పుడైతే మీరు పాండిచ్చేరి ఆశ్రమానికి చేరతారో అక్కడ ఇంకా పెద్ద సమస్యలు (దుఃఖం) ఎదురుచూస్తూ ఉంటాయి. అప్పుడు అక్కడి నుంచి పారిపోయి సేలం ఆశ్రమానికి చేరతారు. అక్కడి నుంచి తిరువణ్ణామలె ఆశ్రమానికి చేరతారు. ఒకవేళ ఇవేవీ పని చేయకపోతే మీరు ఈ సంస్థనే వదిలేసి బయటికి వెళ్ళిపోతారు. అవును కదా! అర్థం చేసుకోవటానికి దుఃఖం లేదా బాధ వచ్చినప్పుడు మీరు ఏం చేసారు, మిమ్మల్ని మీరు దాచుకుంటారు. మీరు 'అబ్బే! అటువంటిది ఏమీ లేదు. అంతా బాగుంది,' అని మభ్యపెట్టుకుంటారు. ఈ దుఃఖానికి కారణం మీరు తీసుకున్న నిర్ణయమే అని తెలిసి కూడా, మిమ్మల్ని మీరు ఓదార్చుకోవటానికి, ఆ పనినే కొనసాగిసారు. మీరు ఇలా నిరంతరం చేస్తూ, ఈ చక్రంలో స్థిరపడిపోతే, స్వేచ్ఛని పొందే అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటారు. మీ పేరు రూపం, ఆ స్వేచ్ఛ – అన్నీ ఆత్మే. ఆ కళని నీవు నేర్చుకో.

సరే! మరి దీనికి పరిష్కారం ఏమిటి? వివేకానందుడు మరీ మరీ ఒక విషయాన్ని చెబుతాడు, 'ఆ కళని నేర్చుకో' అని. మీ అంతరంగంలో స్వేచ్ఛని నిలబెడతాను అని పదే పదే అనుకోవాలి. బయటి ప్రపంచంలో ఏం జరిగినా అది సర్వాంతర్యామి మాత్రమే అనుకోవాలి. ఈ క్షణం అనే దాన్ని మనం మార్చలేం అని తెలుసుకోగలగాలి. మీరు అర్థం చేసుకోనవసరం కూడా లేదు. నేను ఆత్మని అని అనుకోండి అది చాలు. నేను స్వచ్ఛమైన ఆత్మని ఈ శరీరానికి, మానసికవ్యవస్థకి నాకు ఏ బంధం లేదు అని అనుకోండి. బయటి ప్రపంచంలో మీకు ఏం జరిగినా దాన్ని భగవంతుడు ఆడే నాటకం అనే అనుభవంతోనే చూడండి. అవన్నీ కూడా కేవలం మీరు చూస్తున్న ప్రతిబింబాలే. ఈ సత్యాలని పదే పదే గుర్తు చేసుకోవటం ద్వారా మీ అంతరంగంలో స్వేచ్ఛని మేల్మొలుపుతారు. అదే నిజమైన స్వేచ్ఛ. అదే అంతిమస్వేచ్ఛ.

ఆ కళని నేర్చుకో, ఓ! సన్న్యాసీ ధైర్యంగా గొంతెత్తి చెప్పు ఓం తత్ సత్ ఓం! ఎవరైతే ఖాళీ కలలని కంటారో వారు సత్యాన్ని తెలుసుకోరు. ఒక తండ్రిగా, తల్లిగా, భార్యగా, బిడ్డలుగా, స్నేహితుడుగా లింగభేదం లేని ఆత్మ! ఎవరి తండ్రి అది? ఎవరి బిడ్డ? ఎవరి స్నేహితుడు, ఎవరికి శత్రువు : అన్నీ అతనే ఆత్మ అన్నింటిలో ఉండేది అదే, ఎక్కడా లేనిది అదే ; ఆ కళని నేర్చుకో, ఓ సన్న్యాసీ ధైర్యంగా చెప్పుకో

ఓం తత్ సత్, ఓం.

ప్రతి నిమిషం కొన్ని వేల ఆలోచనలు మీలోంచి వెళుతుంటాయి. అవన్నీ ఖాళీ కలలే. ఉపయోగం లేని మీ మనస్సు సృష్టించే ఊహలే. ఈ బాంధవ్యాలు, భావావేశాలు అన్నీ కల్పనలే. మీరు ఈ ప్రపంచంలోకి మీ కర్మల్ని పోగొట్టుకోవటానికి వచ్చారు. ఈ ప్రపంచం నుంచి జ్ఞానోదయాన్ని పొంది వెళ్ళాలి అనుకుని వచ్చారు. కాని ఇక్కడికి వచ్చాక, మీరు ఈ ఉపయోగం లేని కలల్లో చిక్కుకుపోయారు. అంతే కాదు, బాంధవ్యాలు, భావావేశాలు ఒకటని ఏమిటి, ఎన్నో ఈ నిరుపయోగపు స్వప్నాలు మీ మనస్సు గుండా వెళుతూ ఉంటే, మీరు ఏమనుకుంటారంటే అతిభయంకరమైన హింస మీకు జరుగుతుంది అనుకుంటారు. దీన్ని ఇక ఏ మాత్రం భరించలేను అనుకుంటారు. అర్థం చేసుకోండి; ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఉక్కిరిబిక్కిరి అవుతారో, మీరు నిలబడే సమయం వచ్చింది అని తెలుసుకోండి. మీలోని ఊహల్ని కుదిపేసి సత్యాలని చూడవలసిన సమయం ఇదే అని తెలుసుకోండి. కానీ మీరు ఏం చేసారు? మీరు కలల్ని మార్చుకుంటారు. మీరు పరిస్థితుల్ని మారుస్తారు. అప్పుడేం జరుగుతుంది? మీ కలల్ని అలాగే కొనసాగిస్తారు. కాకపోతే అవి సున్నితంగా ఉంటాయి. మీరు మేల్కొనగలిగే అవకాశాన్ని పోగొట్టుకుంటారు. సత్యాన్ని చూడగలిగే అవకాశాన్ని పోగొట్టుకుంటారు.

ఎప్పుడైతే నేను మిమ్మల్ని మరీ మరీ మరిగిస్తానో, మీ కలల్ని మీకు భయంకరంగా మారుస్తానో, నేను మిమ్మల్ని మేల్కొలుపుతున్నాను అని అర్థం చేసుకోండి. మరుగుతున్నప్పుడు, బంగాళదుంప బయటపడిపోతే ఏమవుతుంది, అది వ్యర్ధా అవుతుంది. అదే విధంగా నేను మరిగించేటప్పుడు, బయటకి దూకేయకుండా, మీరు లోపలే ఉండగలిగితే, మీరు మీ మనస్సులో 'అసలు ఏం జరుగుతుందో చూడాలి' అని గట్టిగా నిర్ణయించుకోగలిగితే అది చాలు. అదే మీరు సిద్దులు అవటానికి సహాయం చేస్తుంది. అదే ఆత్మజ్ఞానం అంటే.

ఖాళీ కలలు కనే………………… ఓం తత్ సత్ ఓం.

అర్థం చేసుకోండి, మీరు బయటకి దూకటం ద్వారా కేవలం మీ ఖాళీ కలల్ని కొనసాగించటమే. చూడండి కల భయంకరమైంది అయితేనే మీరు మేలుకుంటారు. అది సున్నితమైందైతే మీరు మేల్కోరు. నేను మీ జీవితాన్ని భయంకరమైన కలలోకి తీసుకువెళ్ళగలిగితే, నేను మిమ్మల్ని మేల్కొలుపగలుగుతాను. నేను మిమ్మల్ని మేల్కొలిపే ఉద్యోగం చేస్తున్నాను. కానీ ఆ సమయంలో వద్ద! నన్ను వదిలేయండి స్వామీ! అని మీరు అరిస్తే మీ పరిస్థితుల్ని మార్చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అది సున్నితమైన కలగా మారుతుంది. ఆ తరువాత మీరు ఏం చేస్తారు? ఆ కలని అలా కొనసాగిస్తారు. ఆ విధంగా ఎంత కాలం కావాలి అంటే అంత కాలం, అన్ని రోజులూ ఆ కలని కొనసాగిస్తారు. ఇది మీ వ్యక్తిగత ప్రాధాన్యం.

అయితే ఒకటి ఉంది – స్వేచ్ఛ, అదే తెలుసుకునేవారు, ఆత్మ

రూపం ఉండదు, పేరు ఉండదు, దానికి కళంకమూ లేదు

సన్న్యాసం అంటే అంతిమద్యూతం

అతనిలోనే ఉంది మాయ, ఈ కలల్ని కంటూ ఉండటమే గమనించేవారు, సహజంగా ఉండే అది ఆత్మే ఆ కళ నేర్చుకో, ఓ సన్న్యాసీ, ధైర్యంగా అను ఓం తత్ సత్ ఓం! అని నీకంటూ ఒక ఇల్లు లేదు. ఇక ఏ గృహం నిన్ను బంధిస్తుంది ఓ స్నేహితుడా! ఆకాశమే ఇంటి కప్పుగా, పచ్చని గడ్డి నీ పడకగా, భోజనం అంటారా, అది ఒక అవకాశం మాత్రమే చక్కగా వండారా లేదా, ఏమీ అనుకోవు ఆ పవిత్రాత్మని ఆహారం, పానీయం బాధించవు తనను తాను మాత్రం తెలుసుకోగల ఆత్మ, నిత్యనదీప్రవాహమంత స్వేచ్ఛాజీవి నీవు ఎవరైనా, ఓ సన్న్యాసీ ధైర్యంగా చెప్పు ఓం తత్ సత్ ఓం! రోజురోజుకి, ఆ కర్మ శక్తి ఖర్చు అయ్యేవరకు ఆత్మకి పూర్తిగా స్వేచ్ఛని ఇవ్వండి తిరిగి జన్మ లేకుండా.

వివేకానందుడు పదే పదే చెప్పేది, మీరు ప్రతి రోజూ మేల్కొనగలిగే విధంగా జీవించండి. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీరు నా దగ్గరకి బలమైన ఉత్సాహంతో ఈ కోరికతో వస్తారు. కొంత గడిచాక, ప్రతి రోజూ నేను మిమ్మల్ని మేల్కొలపటానికి మిమ్మల్ని రగిలిస్తాను అని మరచిపోతారు. అప్పుడు మీరు ఏం చేసారు? మీరు ఈ బయట ప్రపంచచక్రంలో స్థిరపడతారు. అహా! ఇదంతా ఒక వ్యవహారం అంతే అనుకుంటారు. ఇందులో ఏముంది? అందులో ఏముంది ? ఇటువంటి ఆలోచనలలో స్థిరపడి, మీ బలమైన ఉత్సాహాన్ని పలుచన చేసేస్తారు. నన్ను చాలా యథాలాపంగా తీసుకుంటారు.

ప్రతి రోజూ, నీ కర్మల శక్తి పూర్తిగా పోయేవరకూ నీ ఆత్మ స్వేచ్ఛని పొందేవరకూ, తిరిగి జన్మ అనేది లేనంత వరకు నేను కానీ, నీవు కాని, భగవంతుడు గాని మనిషి కాని నేను అనేది సర్వంలో ఐక్యమయ్య, సర్వం నేను అనేదిగా మారితే అదే నిత్యానందం. ఆ కళని నేర్చుకో, ఓ సన్యాసీ ధైర్యంగా చెప్పు. ఓం తత్ సత్ ఓం! శరీరం ఎలా జీవిస్తుందో, మరణిస్తుందో మరి నీవు జాగ్రత్త పడనవసరం లేదు తన పనిని పూర్తి చేస్తుంది. కర్మలు తేలిపోయే విధంగా

ఎవరు పూలమాలలు వేసినా, మరెవరో అవమానం చేసినా ఈ పరిధిని పొగడలైనా, అవమానాలైనా ఏమీ చేయలేవని ఎక్కిపొగిడేవారు, పొగడబడేవారు అవమానించే వారు అవమానం పొందేవారు అంతా ఒక్కటే, అందుకే శాంతంగా ఉండు ఓ సన్న్యాసీ, ధైర్యంగా చెప్పు, ఓం తత్ సత్ ఓం అని. ఎక్కడైతే కోరిక, కీరికాంక్ష, అత్యాశ, పొందాలనే కోరిక ఉంటాయో సత్యం ఆ దరిదాపులకి రాలేదు ఎవరైతే స్త్రీని భార్యగా ఊహించడో, అతను కచ్చితమైనవాడు అతనే ఏ వస్తువునీ పొందాలని ఆశించడు. అతణ్ణి ఏ కోపం బంధించలేదు మాయ అనే ద్వారం గుండా చక్కగా వెళ్ళగలుగుతాడు అందుకే ఇటువంటి విషయాల్ని వదిలేయి ఓ సన్న్యాసీ, దైర్యంగా చెప్పు ఓం తత్ సత్ ఓం అని అందరికీ శాంతిని ఆశించు నా నుంచి ప్రపూదం లేదు అని చెప్పు.

జీవించడానికి ఎవరిలోనైతే ఉన్నతస్థితి ఉంటుందో, ఎవరిలో అయితే వినయం ఉందో, నేను అందరిలో ఉండే ఆత్మని ఇక్కడ, అక్కడ పూర్తి జీవితాన్ని సన్న్యసించాను.

అన్ని స్వర్గాల్ని, నరకాల్ని, భూలోకాన్ని, అన్ని ఆశల్ని, భయాల్ని సన్యసించాను, బంధాలని తెంచాను అని ఓ సన్న్యాసీ ధైర్యంగా చెప్పు ఓం తత్ సత్ ఓం!

ఓ స్నేహితుడా! ఎక్కడ అన్వేషణ ఉందో అక్కడ స్వేచ్ఛ ఉంది.

దాన్ని ఈ ప్రపంచం ఇవ్వలేదు. గుడిలో గ్రంథాలలో వెతికినా కనిపించదు.

నిన్ను ముందుకి నడిపించే తాదు అదే.

నిన్ను ముందుకు నడిపేది ఆ తాదు పట్టుకున్న నీ చేయి మాత్రమే.

ఓ సన్న్యాసీ ధైర్యంగా చెప్పు ఓం తత్ సత్ ఓం!

వివేకానందుడు ఈ విధంగా చెబుతున్నాడు, స్నేహితులు, గ్రంథాలు, దేవాలయాలు ఇవేవీ కూడా సరైన జ్ఞానాన్ని ఇవ్వలేవు. ఆ ఇవ్వగలిగేది సత్యంలో జీవిస్తున్న గురుదేవుల హస్తాలు మాత్రమే. ఆ జ్ఞానాన్ని నీకు ఇవ్వగలవు. కాబట్టి ఆ చేతులని పట్టుకో. ఎప్పటికీ ఆ చేతులు వదలవద్దు. ఆ తరువాత నీకు దుఃఖం అనేది ఉండదు.

వివేకానందుడు నిజమైన సన్న్యాసి. ఆయన తన లక్ష్యానికి జీవితాన్ని త్యాగం చేసాడు. ఆయన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఏ విధంగా ఈ భూమి మీద జీవించాడో తాను జీవించి చూపించాడు. అర్థం చేసుకోండి. ఈ మాటలన్నీ అత్యున్నతచేతనస్థితి నుండి వెల్లడి అయిన మాటలు. ఈ మాటలు ప్రతి ఒక్కరినీ లేచి నిలబడగలిగే శక్తిని ఇవ్వగల స్పష్టతని వారిలో మరీ మరీ కలిగిస్తాయి. ఈ మాటలు మంచి నిర్ణయాలు చేసే విధంగా సహాయం చేసాయి. అందులోంచి మనందరం ఆశిస్తున్న స్వేచ్ఛ దొరుకుతుంది అని వివేకానందుడు చెబుతున్నాడు.

కాబట్టి అర్ధం చేసుకోండి; నిరాశ, క్రుంగుబాటుల నుంచి బయటికి రావటానికి పరిస్థితుల్ని మార్చకండి. అలా పరిస్థితుల్ని మారిస్తే మీరు మరింత లోతైన నిరాశలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు నిరాశతో తీసుకునే నిర్ణయం మిమ్మల్ని మరింత నిరాశ, క్రుంగుబాటులకి తీసుకువెళుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు నిరాశ, క్రుంగుబాటులలో ఉన్నప్పుడు మంచి నిర్ణయం చేయగల స్పష్టత మీలో ఉంటుందా? ఏ విషయాన్నెనా నిర్వహించగల స్పష్టత మీలో ఉంటుందా? ఉండదు. ఆ స్థితిలో మీరు ఏం చేసినా అయిదారు తాళం చెవులున్న హుక్కుని తగులుకున్నవారవుతారు. తాగిన మత్తులో ఉన్న వ్యక్తికి తాదు దొరికితే అచేతనస్థితిలో తనని తాను మరింతగా బంధించుకుంటాడు. కాని తాను బంధవిముకుడిని అవుతున్నాను అనుకుంటాడు. మీరు నిరాశలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగానే ఉంటాయి.

కాబట్టి మీకు అవసరమైంది ఏమిటంటే, మీలోకి స్పష్టతని తీసుకురావటమే. కేవలం గమనించండి. ధైర్యంగా నిలబడండి. అప్పుడే నిజమైన స్వేచ్ఛ అనేది మీలో కలుగుతుంది.

నమో అరిహంతా!

సన్న్యాసంలో గురువుల పాత్ర ఏమిటి?

మహావీరజైనుడు ఒక గొప్ప జైనగురుదేవులు. ఆయన జైనసూత్రాల్ని, జైనుల బోధనలుగా రచించారు. ఆయన ఆ బోధనల్ని ఈ కింది మాటలతో ప్రారంభిస్తారు.

నమో అరిహంతనం

ఈ మాటలకి అర్థం: అంతిమసత్యాన్ని సాధించిన అరిహంతులకి గౌరవంతో నమస్కరిస్తున్నాను. ఆయన అందులో జ్ఞానోదయమైన గొప్ప యోగీశ్వరుల గురించి చెబుతారు.

ఈ యోగీశ్వరులు తాము అంతిమసత్యాన్ని సాధించటమే కాదు, ఆ సత్యప్రకాశాన్ని నలుదిశల ప్రసరింపచేస్తుంటారు. వారి సమక్షంలోకి ఎవరు వెళ్ళినా, వారు కూడా ఆ సత్యాన్ని సాధించాలి అనే ఉత్సాహాన్ని పొందుతారు. అరిహంత అంటే బోధలు చేసే వ్యక్తి కాదు. ఎవరైతే ఇతరుల్ని ప్రోత్సహిస్తారో వారిని అరిహంతులు అంటారు.

బోధలతో జ్ఞానోదయాన్ని కలిగించలేరు. అలా చేయగలిగితే ఎప్పుడో దాన్ని అమ్మకానికి పెట్టేవారు. దాని కోసం వెబ్‌సైట్ ప్రారంభించేవాళ్ళు. జ్ఞానోదయం కావాలి అనుకునే వారు మా వెబ్ సైటుని సందర్శించండి అని చెప్పేవాళ్ళు. జ్ఞానోదయం గ్యారంటీ అనే షాపులు పెట్టేవారు. అదంతా జరగని పని. అదృష్టం కొద్దీ లేదా దురదృష్టం కొద్దీ జ్ఞానోదయాన్ని బోధల ద్వారా కలిగించలేం. కేవలం వారిని ప్రోత్సహించటం ద్వారా ఎదుటివారికి జ్ఞానోదయాన్ని కలిగించవచ్చు. ఎవరికెనా జ్ఞానోదయాన్ని కలిగించాలి అంటే వారిలో ఆ ప్రేరణ కలిగించటం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది కాని బోధలు ద్వారా కాదు.

అరిహంత అంటే ఆ సత్యాన్ని చాలా శక్తిమంతంగా ప్రసరింపచేసే వ్యక్తి అని అర్ధం. వారి సమక్షం ఎంత తీవంగా ఉంటుందంటే, ఎవరైతే వారి దగ్గరకి వచ్చి, కొన్ని నిమిషాలు వారి సమక్షంలో ఉంటేనే వారిలో ఆ ప్రేరణ కలుగుతుంది. వారిలో అగ్గి రవ్వ వెలిగి, జ్వాలగా మార్పు చెందుతుంది. ఇది చాలా అద్భుతమైన జీవితం అనే భావన వారిలో ప్రారంభమవుతుంది. ఇదే మనం జీవించగల చక్కని స్థితి అని అనిపిస్తుంది. నా జీవితంలో నాకు కలిగే అతి చక్కని స్థితి ఇదే అని అనిపిస్తుంది. అర్థం చేసుకోండి, మీరు ఒక జ్ఞానోదయం అయిన యోగీశ్వరుని సమక్షంలో రెండు – మూడు నిమషాల పాటు ఉండగలిగినా చాలు, అప్పుడు మీకు అకస్మాత్తుగా, నా జీవితంలో జరగగలిగే ఎంతో మంచి స్థితి ఇదే అని అనిపిస్తుంది.

కేవలం ఆయన సమక్షంలో ఉండటం ద్వారా మీరు భగవదనుభవాన్ని పొందుతారు. అతను మీకు గొప్ప ఆకర్షణ అవుతాడు. ఆయన మిమ్మల్ని అంతగా ఉత్సాహపరుస్తాడు. ఆయన మీ అంతరంగాన్ని ఎంతగా ఆక్రమిస్తాడంటే, మీరు ఆ స్థితిని పొందే దిశగా పని చేసారు లేదా నేను అలా చేయలేకపోతున్నాను అనుకుంటారు. మీరు అలా చేయలేకపోతున్నాను అనుకున్నా పరవాలేదు. ఆ విధంగా అయితే కనీసం మీరు మొదటి మెట్టు ఎక్కగలుగుతారు. మీరు అన్వేషణ ప్రారంభించారు అని అర్థం. జ్ఞానోదయమైన యోగీశ్వరుని పట్ల గౌరవభావాన్ని వెల్లడి చేయటం అంటే జ్ఞానోదయానికి మీరు వేసే మొదటి అడుగు. దీని అర్ధం ఏమిటంటే, మీరు ఆ స్థితిని కోరుకుంటున్నారు అని అర్థం. సామాన్యంగా ఏ విషయాన్నెనా, ఎవరినైనా మీరు త్వరగా గౌరవించరు. అందులోని అసలైన భావం మీకు నచ్చితేనే మీరు గౌరవిస్తారు. ఆ భావం పట్ల కొంత బాంధవ్యమైనా మీకు ఉన్నట్లయితే, లేదా సూక్ష్మస్థాయిలోనైనా ఆ స్థితి మీకు కూడా కావాలి అని అనిపించినప్పుడే మీరు ఆ భావాన్ని గౌరవిస్తారు. లేకపోతే మీరు గౌరవించరు. ఉదాహరణకి: మీరు ఎవరైనా అందంగా ఉన్నవారిని గౌరవిస్తున్నారంటే సూక్ష్మంగా మీరు ఆ విధంగా ఉండాలి అని కోరుకోవటమే. అదే విధంగా మీరు ఒక ధనవంతుణ్ని గౌరవిస్తున్నారు అంటే, మీలో ఎక్కడో సూక్ష్మస్థాయిలో మీరూ ఆ విధంగా ఐశ్వర్యవంతులు కావాలి అనే కోరిక ఉంటుంది. మీరు దేన్నైనా గౌరవిస్తున్నారంటే అది మీ అంతరంగంలోకి ప్రవేశించింది అని అర్ధం.

ఎప్పుడెతే మీరు, జ్ఞానోదయమైన యోగీశ్వరులకి గౌరవంతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని అంటారో దాని అర్థం మీరు జ్ఞానోదయాన్ని గౌరవిస్తున్నారు అని. అంతే కాని, మీరు ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని భయం నుంచి కాపాడి మీకు సహాయం చేసే వ్యక్తికి నమస్కరిస్తున్నాను అని కాదు. మీరు ఒక రాజుకి నమస్కరించటం లేదు. మీకు ధనసహాయం చేసిన ధనవంతుడికి మీరు తల వంచి నమస్కరించటం లేదు. మీకు హేతువాదాన్ని, తర్కాన్ని, వేదాంతాన్ని చాలా చాలా మాటలని చెప్పే వ్యక్తికి వారు నమస్కరించటం లేదు. మీరు ఇక్కడ ఎవరినీ అనుసరించటం లేదు. మీరు కేవలం మీలో ప్రేరణ కలిగించగలిగే వ్యక్తికి మాత్రమే నమస్కరిస్తున్నారు. ఎవరైతే మీలో జ్ఞానోదయం అనే విత్తనాన్ని నాటుతారో, ఎవరైతే మీరు జ్ఞానోదయాన్ని సాధించే విధంగా మీకు సహాయం చేసారో అటువంటి వ్యక్తికి నమస్కరిస్తారు. ఎక్కడో ఒక చోట మీరు కేవలం ఆయన సమక్షంలో ఉండగలిగితే చాలు అని అనుకుంటారు. అది జరుగుతుంది. అదే అరిహంతుల సహజలక్షణం.

ఈ విషయం మీద చక్కని వ్యాఖ్యానం ఉంది. ఎప్పుడెతే మీరు అరిహంతుల సమక్షంలో, అంటే అత్యుత్తమచేతనస్థితిలో ఉన్న ఒక వ్యక్తి దగ్గర కూర్చుంటారో, మీకు తెలియకుందానే, మీ చేతనస్తితికి అర్థం కాకుండానే మీ అంతరంగం సర్వం ఒకే ఒక లక్ష్యం అయిన జ్ఞానోదయం పొందాలి అనే విషయంలో ఐక్యమైపోతుంది. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి మీరు అనుకున్నట్లుగా ఇక్కడ మీరు ఒక్క వ్యక్తి కాదు. మీ మెదడు, మీలోని తర్కం మిమ్మల్ని ఒక దిశ వైపుగా పిలుస్తూ ఉంటుంది. మీ కళ్ళు మరొక వైపు లాగుతూ ఉంటాయి. మీ చెవులు మరొక వైపుగా లాగుతుంటాయి. ఈ వివిధదిశల్లో ఉన్న భాగాలని చేతనస్థితిలో ఒక్కటిగా చేసి, దాన్ని జ్ఞానోదయం వైపు మళ్ళించే శక్తి, ఆ స్థితినే సన్న్యాసం అంటారు. సన్యాసం అంటే నాలో మార్పు రావాలి అని చేసే ఒక గట్టి నిర్ణయం. అప్పుడు గురువులు మీలో ఆ మార్పు కలిగేలా చేయగలరు.

మీరు ఆ సన్నాసస్థితిని పొందినపుడు, దాన్ని మీరు ఎవరికీ వివరించలేరు. మీరు ఆ స్థితిని అనుభవించగలరు. ఆ స్థితిని నలు దిశలా ప్రకాశింపచేయగలరు. మీ నడకలో, మాటలో, మీ ప్రవర్తనలో అది స్పష్టంగా అందరికీ కనిపిస్తుంది. అప్పుడు మీరు అప్రయత్నంగా పెద్ద పెద్ద సమూహాలకి ఆకర్షణబిందువుగా మారగలరు. మీ నుంచి చెప్పలేనంత ప్రకాశం, శక్తి నలు దిశలా వ్యాపిస్తుంది. సన్నాసంతో తేజస్సు వస్తుంది. ఎందుకంటే సన్నాసం అంటే అంతరంగ సౌందర్యాలని ప్రతిబింబించటమే కాబట్టి. సన్న్యాసంలో ఉండే అసలైన పరిమళాలు తేజస్సు, నిత్యానందం.

ఏకత్వం – సన్న్యాసలక్షణం

'తపస్సు' లేదా సన్నాసం అంటే ఏకత్వంలో ఉండగలగటం. మిమ్మల్ని మీరు ఒకే వ్యక్తిగా మలచుకోవటమే సన్న్యాసం. మీరు నన్ను అడగవచ్చు. 'మేం ఇప్పుడు ఆ విధంగా లేమా? అని.

మీరు ఒక్కసారి గమనించండి, అందరూ కూడా వేరు వేరు భాగాలుగా ఉంటారు కానీ ఒక్కటిగా కాదు. ఆ ఏకత్వం తప్ప, మన జీవితాల్లో అన్నీ ఉంటాయి.

మీరు మీ అంతరంగం లోతుల్లోకి చూడగలిగితే మీకు అర్థమౌతుంది. మీ అంతరంగంలో వందల కొద్దీ గొంతుకలు నిరంతరం మాట్లాడుతూనే ఉంటాయి. ఒక్క క్షణం మనం ఇది చేదాం అని అనుకోగానే వెంటనే మనం ఇది చేయవద్దు అనే ఆలోచన వస్తుంది. అలా చేయటం వల్ల జరిగే మంచి చెడు ఫలితాల్ని లెక్కలు కట్టిన తరువాత మనస్సు ఊగిసలాడటం మొదలుపెడుతుంది. ఈ విధంగా విడిపోయిన భాగాలుగా ఉన్న మనని ఒక్కటిగా చేయటమే జీవితపరమావధి. అదే భావాల్ని, ఆలోచనల్ని కలపగలిగే ఏకత్వం. మిమ్మల్ని మీ ఆలోచనల్ని ఒకటిగా చేయండి. మీ మనస్సులోని ఆలోచనలు, మీ ముఖంలోని భావాలు ఒక్కటే అన్న విషయాన్ని రూఢి చేసుకోండి.

మీరు గొప్ప గొప్ప యోగీశ్వరుల జీవితచరితలు చదివి, వారి జీవితాన్ని అర్ధం చేసుకోగలిగితే, వారిలోని గొప్పదనానికి భక్తి లేదా జ్ఞానం కారణం కాదు, ఏకత్వంలో ఉండగలగటమే అని అర్థమవుతుంది. వారు దేన్నైతే నమ్మారో అందులోనే ఆ సత్యంలోనే జీవించారు. వారిలోని ఏకత్వం చాలా దృఢంగా ఉంటుంది. వారు ప్రాణాన్నైనా వదులుతారు గాని వారిలోని ఏకత్వాన్ని కాదు.

చైతన్య మహాప్రభు ఒక గొప్ప జ్ఞానోదయమైన యోగీశ్వరుడు, ఆయన భక్తిగీతాలు పాడుతూ వీథివీధిలో తిరిగేవాడు. ప్రజలంతా తన గురించి ఏమనుకుంటున్నారో అని ఏ రోజూ అనుకోలేదు. అసలు వారిని ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆయనకి ఏ భావం మనస్సులోకి వస్తే దాన్ని అదే విధంగా స్వచ్ఛంగా వెల్లడి చేసేవాడు. ఆయన ఆ విధంగా వీధులలో తిరగటం నచ్చనివారు ఆయన్ను సముద్రంలోకి తోసేసారు. అయినా ఆయన తన విధానాన్ని వారి కోసం మార్చుకోలేదు. ఈ విధంగా ఉండగలగాలి అంటే త్యాగనిరతి ఉండాలి. ఏకత్వంలో జీవించాలి అంటే ధైర్యంతో దేన్నైనా వదులుకోగలగాలి.

అందుకే ఈ గొప్ప యోగీశ్వరులు వారి జీవితాలలో ఏది చేసినా, అది శాశ్వతమైన చేతనస్తితిని చేరే విధంగానే ఉంటుంది. ఎందుకంటే వారు ఏం చేసినా అది తమలో ఏకత్యాన్ని తీసుకురావటానికి చేసే ప్రయత్నమే అది. ఈ ఏకత్వం అనేది లోతైన భక్తిభావంతో, నిజాయితీతో చేసే ప్రయత్నమే. ఈ విధంగా తనని తాను ఏకత్వంలో నిలుపుకోవటానికి చేసే తీవ్రమైన ప్రయత్నమే సన్నాసం. మీ జీవితంలో లెక్క లేనన్ని విశేషాలు జరుగుతూ ఉంటాయి. వాటిని మీ ఏకత్వంలో అనుసంధానం చేయగలగటమే సన్నాసం. ఆ విధంగా కాకుండా, ఆ విషయాలు, విశేషాలు మిమ్మల్ని కుదిపేయగలిగితే, మీ నిశ్చలతని కుదిపేసే అప్పుడు మీకు మిగిలేది ఆవేదన, అవమానం. కాబట్టి ఏ విధంగా జీవించాలి అనేది పూర్తిగా మీ నిర్ణయం.

ఆదిశంకరాచార్యులు భారతదేశంలోనే ఒక గొప్ప యోగీశ్వరుడు, జ్ఞానోదయం పొందిన గురుదేవులు. ఆయన చిన్నతనంలో సన్నాసం తీసుకోవాలా, వద్దా అనే అయోమయంలో ఉంటాడు. ఆయన తన తల్లి అనుమతితో ఇల్లు వదిలి వెళ్లాలి అని నిర్ణయించుకుంటాడు. కానీ ఆమెకి ఆయనని పంపించటం ఇష్టం లేదు. ఒక రోజు శంకరాచార్యులు నదిలో స్నానం చేస్తుండగా, ఆయన తల్లికి రక్షించు అని పెద్దగా అరుపులు వినిపిస్తాయి. అది తన కుమారుడి ఆర్తనాదంగా గుర్తించి, ఆమె పరుగుపరుగున నది ఒడ్డుకి వస్తుంది. నదిలో శంకరాచార్యుల కాలు మొసలి పట్టుకొని లాగుతూ ఉంటుంది. ఆ బాలుడు మొసలి నుంచి తప్పించుకోవటానికి తన ప్రయత్నం తాను చేసుకుంటాడు.

అకస్మాత్తుగా అతనికి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. వెంటనే ఆ బాలుడు తల్లితో 'అమ్మా! నేను సన్నాసం తీసుకోవటానికి నీవు అనుమతినిస్తే, ఈ మొసలి బారి నుంచి నేను బయటపడి, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను' అని గట్టిగా అరుస్తూ చెబుతాడు.

అతని తల్లి అశ్చర్యపోయి, ఏ విధంగా ఇది జరుగుతుంది అంటుంది. అప్పుడు శంకరాచార్యులు తల్లితో, 'వేదాల ప్రకారం నేను ఆశ్రమానికి వెళ్ళి, నేను తిరిగి కొత్త జన్మ తీసుకున్నట్లే. నీవు సన్నాసానికి నాకు అనుమతిని ఇస్తే, భగవంతుడు తిరిగి కొత్త జీవితాన్ని ఇవ్వవచ్చు కదా' అంటారు.

ఈ స్థితిలో అతని తల్లి పూర్తిగా అసహాయురాలుగా ఉండిపోతుంది. ఆమె వెంటనే మనస్సుని దృఢపరచుకొని, తన కుమారుడు చనిపోవటం కంటే సన్నాసిగానైనా జీవించటం మంచిది అనుకుని అతనికి అనుమతిని ఇస్తుంది. వెంటనే మొసలి శంకరాచార్యులని వదిలివేస్తుంది. శంకరాచార్య ఆనందంతో తల్లి దగ్గరకి పరుగుపరుగున వెళతాడు. ఆయన ఆ నిమిషంలో సత్యం అనుకున్నదానిలోనే జీవించాడు. అది పని చేసింది. చూడండి, ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి.

సత్యాన్ని గురించి ఆలోచించటం సత్యాన్ని మాట్లాడటం సత్యంలో జీవించటం

మొదటి రెండింటినీ అనుసరించటం చాలా సులభం. కానీ మూడవది, ఎపుడూ సత్యంలో జీవించటం చాలా కష్టం. అది చాలా అరుదైన విషయం. సత్యం అని అనుకున్నదాని ప్రకారం ధైర్యంగా జీవించగలగటమే సన్న్యాసం. మనం సత్యాన్ని మాట్లాడటానికి ప్రాముఖ్యాన్ని ఇస్తాం. కానీ అంత కంటే గొప్పది సత్యంలో జీవించటం. మీరు ఎప్పుడైతే సత్యంలో జీవించగలుగుతారో అప్పుడు మీ మీద మీకు గౌరవం పెరుగుతుంది. ఇందులో ఉండే చక్కని విశేషం అదే.

మీరు నా దగ్గరకి ఏదైనా ఒక సమస్యతో వస్తే, కొన్ని సార్లు నేను మిమ్మల్ని ఓదార్చి, సరేలే ఇది పరవాలేదులే అని చెబుతాను. అర్థం చేసుకోండి; మీరు నా దగ్గరకి ఒక సమస్యతో వచ్చారు అంటేనే మీరు ఏకత్వంలో జీవించలేకపోతున్నారు, ఆ సమస్యని దాటలేకపోతున్నారు అని అర్ధం. అందుకే నేను మిమ్మల్ని ఓదార్చాలి. దేన్నైనా పోగొట్టుకోవచ్చు కాని ఏకత్వాన్ని కాదు. ఏకత్వంతో మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటే, మీరు ఉన్నతస్థితికి చేరగలరు. అప్పుడు మీ అచేతనస్థితిలోని మనస్సు మీ జీవితంలో జరగగలిగిన అతిశుభకరపరిణామం మీరే అని నమ్మటం ప్రారంభిస్తుంది. అప్పుడు స్వర్గద్వారాలు తెరచుకుంటాయి.

మీరు ఏకత్వంలో ఉంటే కపటజీవితాన్ని వదిలేయగలుగుతారు. కృత్రిమ (కపట) జీవితం అంటే మీరు కానిదాన్ని మీరు అని నమ్మటమే. ఇది చాలా విధాలుగా చాలా చోట్లలో దాగి ఉంటుంది. అందుకే ఎదుటివారికి మీ నిజమైన మీరు కనపడరు. మీ లోపలి వివిధభాగాలు ఒకదాన్ని ఒకటి మించాలి అని చూస్తుంటాయి. అదే మిమ్మల్ని ఒక కృత్రిమవ్యక్తిలా తయారుచేస్తుంది. మీ లోపల ముక్కలుగా అయిపోయిన వేరు వేరు భాగాలతో పోరాడి గెలవటం చాలా సులభం. మీరు ఎదుటివారితో పోరాడి గెలిస్తే మీరు వీరుడు అని చెప్పవచ్చు. మీతో మీరు పోరాడాలి అంటే చాలా ధైర్యం కావాలి. మీరు మీతో అలసిపోయేవరకు ఆ పోరాటాన్ని ప్రారంభించరు. ఎందుకంటే మీరు అలసిపోయాక మాత్రమే పోరాటం అవసరం అని తెలుసుకోగలుగుతారు.

ఎప్పుడైతే మీరు సంపూర్ణులుగా, ఏకత్వంతో ఉండగలరో, అప్పుడు మీ గురించి మీరు అసలు నిజాలని మొట్టమొదటిసారిగా తెలుసుకోగలుగుతారు. మీరు ఇంత వరకూ వేసుకున్న ముసుగులని వదిలివేసారు. మీరు మరింత సృష్టతలో స్వచ్ఛంగా ఉండగలుగుతారు. మీరు అకస్మాత్తుగా మీరు అనేదాని వల్ల ఎన్ని పోగొట్టుకున్నారో తెలుసుకుంటారు. సన్నాసం అంటే ఆ స్వచ్చతతో ఉండటమే. స్వచ్ఛతతో ఉండటం అంటే మీలోని నిజమైన మిమ్మల్ని వ్యక్తం చేయటమే కాని మీరు మానసికంగా తెచ్చి పెంచిన వ్యక్తిత్వంతో కాదు. మీ లోపల మీరు భాగాలుగా విడిపోయి ఉంటే అది వ్యక్తిత్వం అవుతుంది. ఆ విధంగా కాకుండా ఆ భాగాలన్నీ ఏకత్వంలో ఉంటే మీరు సంపూర్ణత్వంలో ఉంటారు, అదే అసలైన మీరు. ఈ సంపూర్ణత్వాన్ని మీరు తెలుసుకోగలరు. అదే వ్యక్తిత్వం అయితే సంఘం చేత అది మీలో నిర్మితమైన ఒక భాగం.

ఇక్కడ గురువు మీ లోపల ఒక చక్కని ప్రదేశాన్ని సృష్టిస్తారు. అక్కడ మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉండదు. అక్కడ మీరు పూర్తి స్వేచ్చలో ఉండవచ్చు. అక్కడ కేవలం అర్థం చేసుకోవటం ద్వారా మీలో మార్పుని సాధించవచ్చు

బుద్ధుడు తన శిష్యులకి ఎప్పుడూ ఒక విషయం చెబుతుండేవాడు. మీరు సన్నాసం తరువాత మాత్రమే మీ జీవితాన్ని లెక్కించండి, అని.

Part 13: Living Enlightenment (Gospel of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM)_Telugu_part_13.md

నన్ను ఒకసారి ఒక వ్యక్తి ఈ విధంగా అడిగాడు, సన్నాసం లేదా బ్రహ్మచర్యదీక్ష తీసుకుంటే జ్ఞానోదయం కలుగుతుందా? అని. అది మిమ్మల్ని జ్ఞానోదయం వైపు తీసుకువెళుతుందా లేదా అనేది తరువాత విషయం. ఆ దీక్ష పట్ల, ఆ దీక్షని మీరు అమలుచేస్తూ ఒక నెల రోజులు గడిపిన మీదట మీకు అంతు లేని గౌరవం ఏర్పడుతుంది, అది చాలు, దీన్నే అస్యసాధన అంటారు. అంటే సాధ్యం కాని పనిని విజయవంతంగా పూర్తి చేయటం, ఇదంతా ఏమిటంటే, ఇది నీకు సాధ్యం కాదు అని నీ మనస్సు చెప్పిన పనులని చేయటమే. ఉదాహరణకి నిప్పుల గుండం మీద నడవడం వంటివి. సాధరణంగా మీరు నిప్పుల గుండం మీద నడవలేరు అని మీ మనస్సు పదే పదే చెబుతుంది. కాని మీరు అలా నడవగలిగినప్పుడు మీ మీద మీకు చాలా గౌరవం పెరుగుతుంది. అప్పుడు మీరు సంపూర్ణస్థితికి రాగలరు. ఏకత్వం లేదా సంపూర్ణత్వం అనే విషయాన్ని మీరు రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు.

మొదటిది : మీమనస్సులో పోరాడే వివిధ్యభాగాలని ఏకం చేయటం. చూడండి, ఊగిసలాడే మనస్సుతో జీవితంలో చాలా భాగం వృథా అవుతుంది. మీరు ఏదో ఒక మార్దాన్ని అనుసరించగలిగితే చాలు మీరు సాధించగలరు. ఉదాహరణకి బెంగళూరు రావటానికి రెండు మార్గాలు ఉన్నాయనుకోండి. ఒక దారి 30 మైళ్ళు మరొకటి 30,000 మైళ్ళు ఉన్నాయనుకోండి, మీరు ఈ రెంటిలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలా అని ఊగిసలాడుతున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఒక దారిలో కొంత దూరం వెళతారు, ఆ తరువాత మీ మనస్సు మార్చుకుంటారు. అప్పుడు వెనక్కి వచ్చి మరొక మార్గంలో కొంత దూరం వెళతారు. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఎపుటికీ బెంగళూరు చేరలేరు, కనీసం మీరు 30,000 మైళ్ళు ఉన్న దారి అయినా ఎంచుకుంటే ఎప్పటికో అప్పటికి బెంగళూరు చేరుతారు, అలా కాకుండా రెండు దారుల మధ్య మనస్సు ఊగిసలాడుతుంటే 30 సంవత్సరాలైనా బెంగళూరు చేరలేరు.

మీరు తప్పు దారి ఎంచుకున్నా, మీరు ఏకత్వంతో ముందుకు వెళ్ళగలిగితే మీరు త్వరలోనే సరైన మార్గంలోకి రాగలుగుతారు. ఏది సాధించాలి అనుకున్నారో అది సాధిస్తారు. స్పష్టంగా అర్ధం చేసుకోండి ఈ భూమి మీద రెండు రకాల మనుషులు ఉన్నారు. తప్పు మార్గంలో వెళ్ళేవారు, సరైన మార్గంలో వెళ్ళేవారు. ఏకత్వంతో, పూర్ణత్వంతో జీవించేవారు, చాలా భాగాలుగా విడిపోయి జీవించేవారు. అంతే. కాబట్లి ఒక వ్యక్తిని కొలవాలి అంటే అతను వెళ్ళే మార్గం కొలమానం కాదు. అతను ఏకత్వంతో జీవిస్తున్నాడా లేక ముక్కలుగా జీవిస్తున్నాడా అన్నదే కొలమానం. ఏకత్వంతో ఉంటే మీరు నమ్మేదానికి శక్తిని ఇస్తుంది.

రెండో విషయం: బయటి ప్రపంచవిషయాలు మీపై ప్రభావాన్ని చూపి మిమ్మల్ని నిర్వీర్యం చేయకూడదు. ఇది కూడా పూర్ణత్వానికి ఒక గుర్తు. మన అంతరంగంలోని అయోమయాలు కాని, మన బయటి ప్రపంచవిషయాలు కాని మనని బలహీనుల్ని చేయకూడదు. పూర్ణత్వంతో జీవించిన వ్యక్తి బయటి రోడ్డు మీద మరణించినా తాను సంపూర్తిగా జీవించాను అనే తృప్తితో మరణిస్తాడు. ఏ వ్యక్తి అయితే వివిధభాగాలుగా (ముక్కలుగా) జీవిస్తాడో, అతను స్టార్ హాస్పిటల్‌లో మరణించినా అసంతృప్తితో మరణిస్తాడు. ఒక వ్యక్తి ఎంత నాణ్యమైన జీవితాన్ని గడిపాడు అనే విషయాన్ని కొలవాలంటే అతను జీవితం అంటే ఏది అని అనుభవపూర్వకంగా అనుకున్నాడో దానికి అంత అనుగుణంగా జీవించాలి, ఉదాహరణకి ఒక ఎతిస్టు (దేవుడిని నమ్మని వ్యక్తి) నిజమైన, శక్తి వంతమైన, ఎతిస్టులా జీవిస్తే తప్పు లేదు. అతను సాధించగలదు. ఎందుకంటే అతను బలంగా నమ్మే విషయంలోని శక్తి అతణ్ణి లోతుల్లోకి తీసుకువెళుతుంది. అలా శోధిస్తూ వెళ్ళి ఒక రోజు అంతిమసత్యాన్ని తెలుసుకోగలుగుతాడు.

మనసుని ఏకత్వంలో ఉంచటమే జీవితపరమావధి. మీరు మాట్లాడాలనుకుంది ఏది మంచి అని మీకు అనిపిస్తే అదే చేయాలి అని నిర్ణయించుకోండి, అప్పుడు మీలో అద్భుతమైన స్పష్టత వస్తుంది. అది మీ అంతరంగద్రపంచంలో బయటి ప్రపంచంలో ఉంటుంది.

వివేకానందుడు తను జీవితాన్ని పునశ్చరణ చేసుకుంటాడు. ఆయన గురుదేవులైన రామకృష్ణ పరమహంస తన మిషన్ బాధ్యతలు వివేకానందుని మీద వదిలి మరణిస్తాడు. ఆ కుటుంబానికి ఉన్న ఒకే ఒక ఆశ వివేకానందుడు. ఆయన తన కుటుంబాన్ని కాపాడటం, ఈ ప్రపంచాన్ని కాపాడటం అనే ఈ రెండు విషయాల మధ్య ఉంటాడు. ఆయన మాట్లాడుతున్న మిషన్ (సంస్థ) గురించి ఎవరూ పట్టించుకోరు. ఆయన ఈ సందర్శంలో చాలా చక్కగా చెబుతారు; ఒక బాలుడి ఊహలని ఎవరు అర్ధం చేసుకుంటారు? వివేకానందుడు నిజంగానే బాలుడు. ఆ కొద్ది రోజులని ఆయన 'ఊహించలేని నరకంగా' వర్ణిస్తాడు. ఆయన మరి కొంత మంది యువకులతో ఉంటాడు. వారి దగ్గర డబ్బు ఉండదు. కాని వారి దగ్గర ఉంది ఆ ఏకత్వలక్షణం. వారు దేన్ని నమ్మారో, ఏవిధంగా జీవించాలి అనుకున్నారో అదే విధంగా, వారి గురుదేవులు చెప్పిన విధంగా మాత్రమే జీవించారు. పది సంవత్సరాల తరువాత వివేకానందుడు ఈ విధంగా చెబుతాడు – 'పది సంవత్సరాల క్రితం గురుదేవుల శతజయంతి ఉత్సవాలు చేయటానికి నేను 100 మందిని తీసుకురాలేక పోయాను. ఇప్పుడు ఏభై వేల మంది ఉన్నారు."

సన్నాసం అంటే అచేతనస్థితి చేతనస్తితిని మూసేయకుండా ఉండగలగాలి అని తీసుకునే ఒక బలమైన నిర్ణయం. అంతే కాదు సన్న్యాసం అంటే చేతనస్థితిలో, గురుదేవుల మాటల ప్రకారం, దృఢంగా స్థిరపడగలగటమే.

వివేకానందుడిని చాలామంది 'ఆ సమయంలో నీవు ఏ విధంగా నీ కుటుంబాన్ని నిరాదరిస్తూ వదిలేయగలిగావు' అని అడిగారు. వారికి వివేకానందుడు చాలా చక్కని జవాబు ఇచ్చాడు, రామకృష్ణ పరమహంస బోధలు భారతీయులకి, అదే విధంగా ప్రపంచంలో ఉన్న ఎందరినో వారిలో వివేకం మేల్కొలిపేలా చేస్తాయి అని సమ్మాను. ఆ నమ్మకంతో కొంత మంది బాధపడినా పరవాలేదు కాని ఈ ప్రపంచంలో ఆ బోధలు, ఆ భావాలు నశించిపోకూడదు అని తెలుసుకున్నాను. ఒక తల్లి, ఇద్దరు సోదరులు మరణించగానే ఏం జరుగుతుంది? అది ఒక త్యాగమే. అది జరగనీయండి. త్యాగం లేకుండా ఏ గొప్ప విషయమూ జరగదు. హృదయానికి గాయం కావాలి. రక్తం చిందే ఆ హృదయాన్ని భగవంతుని పీఠం మీద అర్పించాలి. అప్పుడు మహాద్యుతాలు జరుగుతాయి.

అదే పూర్ణత్వం అంటే. అదే భాగాలు కాని ఒక వ్యక్తి ఏకత్వం. అంతే కాదు, వివేకానందుడు తన కుటుంబాన్ని నిరాదరించాడు, వదిలేసాడు అని మాట్లాడేవారికి కొన్ని నిజాలు తెలియవు. ఆయన తన కుటుంబసభ్యులకి కనీససావసరాలు తీర్చేవాడు. ఆ కుటుంబం ఎదుర్కొన్న కొన్ని సమస్యలకి ఆయన కోర్టుకి కూడా వెళ్ళేవాడు.

ఒక చిన్న కథ : జపాన్‌లో సివిల్ వార్ జరిగే రోజులలో, సైన్యం ఒక చిన్న పట్టణంలోకి పవేశించి దాన్ని అధీనం చేసుకున్నారు. అక్కడ ఒక గ్రామంలో, సైన్యం వచ్చే లోపు అందరూ పారిపోతారు కాని ఒక జెన్ మాస్టరు (బౌద్ధగురువు) మాత్రం ఉండిపోతాడు. సైన్యాధికారికి ఈ గురువు గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. అతను ఆ గురువుని కలవటానికి గుడికి వెళతాడు. బౌద్ధగురువు ఆ సైన్యాధికారిని కనీసం పట్టించుకోలేదు, గమనించలేదు. సైన్యాధికారికి చాలా కోపం వస్తుంది. ఆయన మిలిటరీ అధికారి, అతన్ని అందరూ చాలా గౌరవిస్తారు. అటువంటి గౌరవానికి అతను బాగా అలవాటు పడ్డాడు. అతను కత్తి తీసి, 'ఓ! మూర్ఖుడా! నీ ముందు ఎవరు నిలబడారో తెలుసుకోలేక పోతున్నావా? కనురెప్పపాటులో నీ నుంచి ఈ కత్తి దూసుకుపోయేలా చేసే వ్యక్తి నీ ముందు ఉన్నాడు!' అని గట్టిగా అరుస్తూ అంటాడు. అతని మాటలకి బౌద్ధగురువు ప్రశాంతంగా సైన్యాధికారి వైపు చూస్తూ, 'నీవు ఎవరి ముందు నిలబడ్డావో తెలుసా. నీ ముందు ఉన్న వ్యక్తి కనురెప్ప పాటులో నీ నుంచి దూసుకుపోగలడు' అని జవాబు ఇస్తాడు.

ఏకత్వంలో ఉన్న శక్తి మీకు సంపూర్ణస్వేచ్ఛని, పరమానందాన్ని ఇస్తుంది. అటువంటివారికి బయటి ప్రపంచంలో, అంతరంగ ప్రపంచంలో ఎక్కడా భయం అనేది ఉండదు.

జీవితం జ్ఞానోదయం పొందటానికే

జీవితం ఏకైకలక్ష్యం జ్ఞానోదయం పొందటమే. మీకు చాలా ఇతరలక్ష్యాలు ఉండి ఉండవచ్చు. అవన్నీ కూడా జ్ఞానోదయం పొందాలి అనే లక్ష్యానికి ఉన్న వేరు పేర్లు, రూపాలు. తెలిసి కాని, మీకు తెలియక కాని అవన్నీ కూడా జ్ఞానోదయం పొందాలి. అనే లక్ష్యాలే. అదే విధంగా మీరు దేన్నైతే అన్వేషిస్తున్నారో అది సన్నాసమే. అయితే మీకు ఆ విషయం తెలియదు. అదే అసలు సమస్య.

మీరేమనుకుంటారంటే మీ జీవితలక్ష్యం చాలా డబ్బు సంపాదించటం లేదా మంచి సంబంధబాంధవ్యాల్ని అభివృద్ధి చేసుకోవటం ఇలా ఉంటాయి. కాని అసలు సత్యం ఏమిటంటే, ఎవరైతే డబ్బు సంపాదన కోసం చూస్కున్నాడో అతను నిజానికి వెతికేది జ్ఞానోదయం కోసం మాత్రమే. చూడండి, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి డబ్బు, రెండవది కీర్తి, ప్రతిష్ఠ.

కీర్తి ప్రతిష్ఠలంటే మంచి సంబంధబాంధవ్యాలు కలిగి ఉండటమే. డబ్బు, కీర్తి ప్రతిష్ఠలు అంటే మంచి సంబంధబాంధవ్యాలు కలిగి ఉండటమే. డబ్బు, కీర్తి ప్రతిష్ఠలు లేదా మంచి సంబంధబాంధవ్యాల ద్వారా మీరు ఏది పొందుతాను అనుకుంటారో, ఏ అనుభవాన్ని పొందాలని వీటి గురించి తాపత్రయపడతారో ఆ అనుభవం మీకు జ్ఞానోదయం ద్వారా మాత్రమే కలుగుతుంది. అందుకే మీకు జ్ఞానోదయం అయ్యేవరకూ మీ ఆత్మ నిశ్చలంగా ఉండలేదు. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత మంచి బాంధవ్యాలు ఉన్నా కూడా మీకు సంపూర్ణమైన తృప్తి అనేది ఉండదు. ఎప్పుడైతే ఐశ్వర్యం, మంచి సంబంధబాంధవ్యాలు మీకు తృప్తిని ఇవ్వవో ఆ స్థితిని 'డిప్రెషన్ ఆఫ్ సక్సెస్' అని చెప్పవచ్చు. అంటే విజయాలు తెచ్చిన నిరాశ, క్రుంగుబాటు అని అర్థం. మీరు మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అత్యున్నతస్థాయికి వెళ్ళాక జరిగేది ఇదే స్థితి. నేను జీవితంలో సాధించాలి అని అనుకున్నవన్నీ సాధించాను. దేని కోసం? నేను ఏది సాధించాలి అని చేసానో దాన్ని సాధించలేకపోయాను. నేను అసంపూర్తిగా ఉండిపోయాను. అని అంటుంటారు. అర్ధం చేసుకోండి; మీరు ఇలా అనుకుంటున్నారు అంటే అర్థం, ఇది మీ ఆత్మ నుంచి వచ్చిన పిలుపు. అది కోరుకునేది కేవలం జ్ఞానోదయస్థితిని మాత్రమే. ఆ పిలుపుకి మీ నుంచి వచ్చే సమాధానం సన్న్యాసం.

జీవితంలో కావలసిన అసలు లక్ష్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవటమే మనకి ఉండే అన్ని సమస్యలకి మూలకారణం. సన్న్యాసం అంటే ఆ అసలు లక్ష్యాన్ని గుర్తించి దాంతో మీరు అనుసంధానమై, ఆ స్థితిని సాధించటమే. మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న మీ జీవితలక్ష్యం ఏదైనా కావచ్చు, అది ఐశ్వర్యం లేదా మంచి సంబంధాలు ఏదైనా సరే, కాని మీ చివరి లక్ష్యం మాత్రం పరమానందస్థితిని పొందటమే. జీవితంలో అంతకు మించి మరే లక్ష్యం లేదు.

ఈ ప్రపంచంలో రెండు రకాలవారు ఉన్నారు. ఒక రకం వారికి పరమానందస్థితి జ్ఞానోదయస్థితి అనేవి తెలుసు. అదే విధంగా ఆ స్థితికి చేరే మార్గం కూడా తెలుసు. దాని ప్రకారం వారు జీవిస్తారు. రెండవరకం వారికి పరమానందం, జ్ఞానోదయం అనే మాటలు తెలియవు. దాన్ని పొందే దారే తెలియదు. అందుకే వారు చుట్టూ తిరిగి గమ్యం చేరతారు. ఇందులో మొదటి రకం వారు సన్యాసులు, రెండవ రకం వారు సంసారులు.

మీరు బెంగళూరు వెళ్ళాలి అని నిర్ణయించుకొని మైసూర్ రోడ్డులో నిలబడ్డారనుకోండి. మీకు దగ్గర దారి తెలిస్తే 30 మైళ్ళు ప్రయాణం చేసి బెంగళూరు చేరతారు. ఆ దారి తెలియకపోతే మీరు 30,000 మైళ్ళు ప్రయాణం చేసి బెంగళూరు చేరతారు. ఎవరికైతే దగ్గర దారి తెలియదో వారు చుట్టూ తిరుగుతూనే ఉంటారు.

జ్ఞానోదయం కాకుండా మరే లక్ష్యమైనా అది మిమ్మల్ని ఆపేస్తుంది. ఆ లక్ష్యం మీకు సంపూర్ణమైన తృప్తిని ఇవ్వదు. జ్ఞానోదయం పొందాలి అనే లక్ష్యశక్తి మాత్రమే ఎప్పటికీ మీతో ఉండగలుగుతుంది. ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడే మీలో పరిపూర్ణమైన తృప్తి కలుగుతుంది.

మీరు ఈ శరీరంలో 70 లేదా 80 సంవత్సరాలు ఉంటారు. అవును కదా? ఆ 70 లేదా 80 సంవత్సరాల్లో మీరు మీ చేతనస్థితిని ఉన్నతస్థాయిలో లేదా తక్కువ స్థాయిలో ఉంచవచ్చు. మీరు ఈ రెండు విధాలుగా ఆడుకోవచ్చు. మీ చేతనస్థితిని ఉన్నతస్థాయిలో లేదా తక్కువ స్తాయిలో ఉంచుకోగల స్వేచ్ఛ ఈ 70 లేదా 80 సంవత్సరాల్లో ఉంటుంది. కొంచెం లోతుగా అర్ధం చేసుకోండి; మీరు ఏదైనా ఒక బహుమతిని పొంది దాన్ని వృథా చేసుకుంటే పరవాలేదు. కానీ మీరు చేతనస్థితి అనే బహుమతిని పొంది దాన్ని వృథా చేసుకుంటే అది ఎంతో పెద్ద నష్టం అని తెలుసుకోండి. అది ఎప్పటికీ తీరని నష్టం.

ఎన్నో గాజు పలకలు ఉంటాయి. కాని కొన్ని మాత్రమే వాటిలో సూర్యకాంతిని ప్రతిబింబించే విధంగా అమర్చబడతాయి. అదే విధంగా కొన్ని కోట్ల జీవులు ఈ భూమి మీద నివసిస్తున్నాయి. కానీ అవి అన్నీ విశ్వచేతనస్తితిని తమలోకి తీసుకోగలిగి, దాన్ని ప్రతిబింబింపచేయగల శక్తితో లేవు. కేవలం మనిషికి మాత్రమే విశ్వచేతనస్థితిని తనలో నింపుకొని దాన్ని నలు దిశలా వెల్లడి చేయగల శక్తి ఉంది. కేవలం విశ్వచేతనశక్తి ప్రకాశం మనపై పడటం మూలానే మనం ఎంతో అదృష్టవంతులం అవుతున్నాం. ఆ అవకాశం భూమి మీద మనం పొందగలిగే అత్యుత్తమస్థితి. మనిషి అదృష్టవంతుడు. అతను శక్తిని ప్రతిబింబించగల ఒక గాజు పలక. అతనికి ఆ ప్రకాశాన్ని సరైన పద్ధతిలో తీసుకోగల వివేకం ఉంది. అతను విశ్వచేతనస్థితి తనలో ప్రకాశించే విధంగా తనను తాను మలచుకోగలదు. కేవలం మానవుల చేతనస్థితికి మాత్రమే అత్యున్నతవికాసం జ్ఞానోదయస్థితిని పొందగల అవకాశం ఉంది.

నేను సామాన్యంగా ఏ విషయాన్నీ ఎవరి మీదా బలవంతంగా ఆపాదించను. ఏ విషయంలోనూ, నేను ఎవరినీ బలవంతం చేయను. కానీ జన్మలో అత్యున్నత అవకాశాన్ని వదులుకుంటూ, ఆ అవకాశాన్ని వృథా చేస్తున్నవారిని చాలా బాధ అనిపిస్తుంది. చుట్టూ ఉన్న అందరినీ గమనిస్తుంటే ఎలా ఉంటుందంటే, కళ్ళకి గంతలు కట్టుకొని అడవిలోకి వెళ్ళినవారిలా కనిపిస్తారు. ఎవరిదో అహంకారాన్ని తృప్తిపరచటానికి మీరు పరుగులు తీస్తూ, వృథాల్లో తిరుగుతూ ఉంటారు. కనీసం మీ అహాన్ని తృప్తి పరచటానికి మీరు పరుగులు తీయటం లేదు. మీరు ఎవరిదో అహాన్ని తృప్తి పరచటానికి పరిగెడుతున్నారు. మీ జీవితం ఈ విధంగా గడిచిపోతుంది. మీరు దేని కోసం పరుగెడుతున్నారో ఎందుకు పరుగెదుతున్నారో మీకు తెలియటం లేదు.

మీరు అద్భుతమైన మానవశరీరాన్ని పొందగలిగారు. దీంతో మీరు అత్యుత్తమచేతనస్థితిలోకి వెళ్ళగల శక్తి వస్తుంది. ఈ గాజు పలక సూర్యకాంతిని వెదజల్లటం ప్రారంభించింది. ఇప్పుడు ఆ గాజు పలక చేయవలసింది కేవలం ఆ సూర్యకాంతి వచ్చే మూలాన్ని కనుగొని, దాన్ని చూడగలగటమే. ఆ విధంగా అసలు మూలాలని కనుగొని అందులో ఐక్యమైపోవటమే. దాన్నే నేను జ్ఞానోదయం అంటాను. జ్ఞానోదయం అంటే వ్యక్తిగతమైన చేతనస్థితి విశ్వచేతనస్థితిలో కలసిపోగలగటమే. అదే గనక జరిగితే జన్మ తీసుకున్న లక్ష్యం, గాజు పలక లక్ష్యం నెరవేరినట్టే.

అప్పుడు ఆ గాజు పలక పగిలిపోయినా నష్టం లేదు. కానీ ఆ గాజు పలకని దేనికోసమైతే సృష్టించారో దాన్ని సాధించకుండా పగిలిపోతే అది ఎప్పటికీ గొప్ప నష్టమే. మానవశరీరం జ్ఞానోదయాన్ని పొందకుండా మరణిస్తే, అంతకు మించిన నష్టం మరేదీ లేదు.

సన్న్యాసం దీనికి ఒక మార్గం. సన్వ్యాసం జీవితానికి అంతం కాదు, అది జీవితానికి ప్రారంభం. అది జ్ఞానోదయసాధనకి ప్రారంభం. అదొక్కటే జీవితానికి ఉండే శాశ్వతమైన లక్ష్యం.

నిబంధన విధించటమే నేరం

జ్ఞానోదయమే జీవితలక్ష్యం అయినప్పుడు మనం ప్రస్తుతం ఎక్కడ ఆగిపోయాం? ఎక్కడ మనం తప్పు దారిలో వెళుతున్నాం? అర్ధం చేసుకోండి; అసలు సమస్య సరైన లక్ష్యాన్ని గుర్తించలేకపోవటమే. మీరు గుర్తించిన లక్ష్యం సరైందైతే మీరు సాధించినట్టే. మీ లక్ష్యం సరైందైతే మీరు అందులో జీవిస్తున్నట్లే.

సన్న్యాసం అంటే మీ జీవితలక్ష్యం పట్ల స్పష్టతని సృష్టించటమే. లక్ష్యాన్ని ఎందుకు తెలుసుకోలేరంటే వారికి దాని పట్ల స్పష్టత లేనందువల్ల ఎవరికైతే జీవితలక్ష్యం పట్ల స్పష్టత ఉంటుందో అటువంటి వారు జీవన్ముక్తులు. అంటే సంపూర్ణస్వేచ్ఛ (అంతిమముక్తి) లో జీవించేవారు. అటువంటివారు జీవితంలో ప్రతిక్షణం తమ చేతనస్గితిని కేవలం తమ జీవిత లక్ష్యం వైపు మాత్రమే నిలుపుతారు.

మీపై ఉండే నిబంధనలు, ఆంక్షలే మీరు లక్ష్యాన్ని గుర్తించకుండా చేస్తుంది. మీరు జన్మించినప్పుడు ఒక స్వేచ్ఛాజీవిగా వచ్చారు. మీరు అప్పుడు పరమహంస. పరమహంస నిరంతరం పరమానందస్థితిలో స్వేచ్ఛగా ఎగురుతూ, సర్వస్తుష్టిలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఆనందపారవశ్యంలో ఉంటుంది. మీరు ఈ భూమి మీదికి తెలియకుండా వచ్చి, హాయిగా ఎగిరి ఈ భూమి మీద స్థిరపడ్డారు. అదే సమస్య ఇక్కడ అలా స్వేచ్ఛగా వచ్చి వాలే పక్షుల్ని పట్టుకోవటానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సంఘం ఆ స్వేచ్ఛాజీవిని దేశం, మతం, కులం, రంగు అనే చట్రాల్లో బిగించాలని చూస్తుంది.

మీరు ఈ భూమి మీదికి వచ్చిన ఒక మధురజీవి. అంతే కాని మీరు హిందువుగా, ఇంజినీరుగా, ధనవంతుదుగా ఇక్కడికి రాలేదు. అర్థం చేసుకోండి. సంఘానికి గుమాస్తాలు, పనివారు కావాలి. సంఘానికి మీ చేతనస్థితి అవసరం లేదు. నిజానికి మీ తల్లిదండ్రులకి, మీ సంఘానికి మీలో చేతనస్థితి అనేది ఒకటి ఉంది అని తెలియదు. వారికి ఆ వివేకం లేదు. వారు నేర్సుకున్నదే మీకు నేర్పిస్తారు, అంతే.

మనిషి పైన ఉండే నిబంధనలు అనేవి మనిషికి అక్కర లేని బహుమతిగా తరతరాలుగా ఇవ్వబడ్డాయి. అవి మనిషికి అందుతున్నాయి. అందులో మొదటిది తల్లిదండుల నిబంధనలు.

ఆ తరువాత వచ్చేది సంఘపు కట్టణాట్లు, అది పెట్టే ఆంక్షలు. ఈ రెండింటి ఆధారంగా మీకు మీరు కొన్ని ఆంక్షల్ని, నియమాల్ని పెట్టుకుంటారు. అది మీ మీద మీరు విధించుకున్న నిబంధనలు. దీన్నే స్వధర్మం అంటాం. మన మీద ఇన్ని పొరలుపొరలుగా నిబంధనలు ఉన్నాయి కాబట్టి మనం సత్యాన్ని చూడలేకపోతున్నాం. మన జీవితలక్ష్యాన్ని తిన్నగా తెలుసుకోలేకపోతున్నాం. మనం మన జీవితలక్ష్యంలో జీవించలేకపోతున్నాం. ఈ నిబంధనల్లో చిక్కుకుపోయి మనమంటే ఎవరో మరిచిపోయాం. ఈ నిబంధనలు మనలో కొన్ని పరిమితుల్ని సృష్టిస్తాయి. ఈ లోపాలు, పరిమితులే మనం అని మనం నమ్మే విధంగా మనపై నిబంధనలు ఉన్నాయి.

చాలా నిబంధనలు, నియమాల్ని మన ప్రశాంతజీవనం కోసం సృష్టించారు. ఉదాహరణకి భావాల్ని సులభంగా పంచుకోవటానికి భాషని సృష్టించారు. భాష నేర్చుకోవటం తప్పు కాదు. కాని దాన్ని ఒక నియమంలా తీసుకొని, భాషే మీ జీవితం అనుకొని దాంతో మీకు దుఃఖాన్ని తెప్పించుకొని, ఎదుటివారికి సమస్యలు సృష్టించినప్పుడు భాష అనేది తప్పు అవుతుంది. అటువంటి మానసికదృక్పథం తప్పు. చాలా మంది భాష కోసం ప్రాణాల్ని త్యాగం చేసారు. అసలు భాష అనే నిబంధనే లేకపోతే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు కదా! అప్పుడు మానవచరిత్ర మరో విధంగా రాయబడి ఉండేది. నిబంధనలు, నియమాలు అనేవే మనుషుల్తో ఈ టెర్రరిజానికి కారణం. ఈ రోజుల్లో నిబంధనలు అనేవి ఏ విధంగా మనుషుల్ని విభజిస్తున్నాయంటే అది కొన్ని రాజకీయ పార్టీలు ఆధారంగా కూడా జరుగుతుంది.

మీకు ఒక విషయం చెబుతాను. ఎప్పుడైతే నిబంధన అనేది మీలో నాటబడుతుందో అప్పుడే యముడి నీడ మీ మీద పడినట్లే. ఆ పాశం కేవలం మీ మరణసమయంలోనే మీ మీద పడుతుంది అని అనుకోవద్ద. ఈ నిబంధనలు అనేవి అత్యధికమవ్వటమే అంతిమ మరణం, అంతే. మరణం అంటేనే నిబంధనలు అత్యున్నతస్థాయిలో మీ పైన ఉందటమే. ఎవరైతే నిబంధనలు, నియమాల్లో చిక్కుకొని ఉంటారో వారు ప్రతి నిమిషం మరణం వైపుగా సాగుతూ ఉంటారు. ఎవరైతే జ్ఞానోదయమైన యోగీశ్వరుని దగ్గర ఉంటారో వారు జీవితంలో ప్రతి నిమిషం స్వేచ్ఛ వైపుగా సాగుతూ ఉంటారు. అంటే ఒక రకం వారు యముడి వైపుగా ముందుకి సాగుతూ ఉంటే మరొక వర్గం వారు శివుని వైపుగా సాగుతూ ఉంటారు. నిబంధనలు అనేవి రోజురోజుకూ తగ్గుతూ ఉంటే మీరు శివుని వైపుగా ముందుకి సాగుతారు. అంటే నిబంధనల నుంచి మీరు క్రమంగా స్వేచ్ఛని పొందుతూ ఉంటారు.

సన్న్యాసం స్వీకరించటం ద్వారా, మొట్టమొదటిసారిగా మీరు మీ గతాన్ని వదిలేయాలి అని చేతనస్తితిలో నిర్ణయం చేస్తారు. గతాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. గతం అనేది మీకు బాగా పరిచయం. అందుకే మీరు జరిగిపోయిన భూతకాలాన్ని ఇష్టపడతారు. మనస్సుకి బాగా పరిచయమున్న విషయాల్ని ఇష్టపడుతుంది. సంఘం కూడా మీరు గతాన్ని మోస్తూ ఉండాలి అని నేర్పిస్తుంది. జరిగిపోయిన సంఘటనల ఆధారంగా సంఘం మీ లోపల అపరాధభావాన్ని నింపుతుంది. గతం అనేది మనకి అవసరం లేని ఏ మాత్రం ఉపయోగం లేని బరువు మాత్రమే. సన్న్యాసం అంటే గతం నుంచి పూర్తిగా బయటికి రావటమే. మీరు ఎప్పుడైతే గతాన్ని వదిలేసి కొత్త ప్రపంచం వైపు వస్తారో, ప్రారంభంలో మీరు రక్షణ లేని భావంలో ఉంటారు. సన్న్యాసం అంటేనే రక్షణ లేని స్థితి. ఎప్పుడెతే పూర్తి రక్షణ లేని స్థితిలో ఉంటారో, అపుడు పట్టుకొని ఉండటానికి ఆధారం ఏమీ ఉండదు. అప్పుడే భగవంతుడిని చూసారు.

నేను మీకు ఆధ్యాత్మికనామాలు ఎందుకు ఇస్తాను అని అనుకుంటారు? అవి మీకు మీ గతంతో సంబంధాన్ని తెంపివేస్తాయి. ఎవరైనా మిమ్మల్ని మీ పేరుతో పిలిస్తే, వెంటనే మీ చేతనస్తితి మిమ్మల్ని తన గుప్పిటలోకి తీసుకుంటుంది. అప్పుడు మీరు దానికి స్పందించి జవాబు ఇస్తారు. మీ పేరు మీ అచేతనస్థితిలో లోతుగా నాటుకుపోయి ఉంది. మీ పేరు మీలో వెంటనే తెలుసుకునే తత్వాన్ని తెస్తుంది. మీరు ఒక పెద్ద క్లాసులో ఉన్నారనుకోండి. టీచర్ మీ పేరు పిలవగానే, మీరు నిద్దపోతున్నా, లేదు ఏదైనా ఆలోచనల్లో ఉన్నా ఉలిక్కిపడి వర్తమానంలోకి వస్తారు. అవును కదా! మీ పేరు మిమ్మల్ని మీ లోపల కేంద్రీకరింపచేయటానికి చాలా ఉపయోగపడుతుంది. నేను మీకు ఇచ్చిన కొత్త పేరు మీలో మానసికచైతన్యం తీసుకురావాలి అని పదే పదే గుర్తు చేసూ ఉంటుంది. మీ లోపల ఒక కొత్త విధానం, కొత్తగా అర్థం చేసుకునే శక్తి వస్తాయి. పేరు మీ ఆధ్యాత్మికమార్గాన్ని కూడా సూచిస్తుంది. మీ సహజలక్షణం ప్రకారం ఈ పేరు మీలో మీ చేతనస్థితిలో అంతిమవికాసం కలిగేలా చేస్తుంది.

సన్న్యాసి అంటే వర్తమానంలో ఉంటూ, వర్తమానంలో పని చేసేవాడు. తన జీవితాన్ని పణంగా పెట్టి పనిచేసాడు. అతను ఫలితాల గురించి అసలు పట్టించుకోదు. ఫలితాలు వాటి జాగ్రత్తని అవి తీసుకుంటాయి. అతనికి కేవలం ఆ క్షణం గురించి మాత్రమే తెలుసు. మరేమీ తెలియదు. అందుకే అతను ప్రతిక్షణం సర్వాంతర్యామి నుంచి నేర్సుకుంటూ ఉంటాడు. అందుకే అతనికి ఒక సిద్ధాంతం, ఒక మతం అనేవి ఉండవు. సర్వసృష్టికి అనుగుణంగా దాంతో పాటు ముందుకి సాగటం, దాని నుంచి నేర్చుకోవలసిన విషయాల్ని నేర్చుకోవటమే తెలుసు.

సూఫీ సామెత ఒకటి ఉంది. 'సూఫీ అనే వ్యక్తి ఈ క్షణం తాలూకు బిడ్డ.' సూఫీల సాహిత్యంలో ప్రతి క్షణాన్ని శ్వాస అంటారు. సూఫీలని శ్వాస అనుచరులు అంటారు. ఎందుకంటే వారు ప్రతి శ్వాసలో ఎంతో ఎరుకతో, చేతనస్గితితో జీవిస్తారు. వారి మాటల్లో ప్రతిక్షణంలో కొత్త సూఫీ జన్మిస్తుంటాడు. అదే సన్న్యాసంలోని అసలు భావం. నిరంతరం స్వచ్చమైన తాజాదనంతో ఉండటం ఈ క్షణంలో ఉండగలిగే వ్యక్తి ఈ క్షణం నుంచి చాలా నేర్చుకుంటాడు. అటువంటివారికి సర్వాంతర్యామి, సర్వసృష్టి, గురువు.

సూఫీ యోగి అయిన హసన్ మరణించే సమయంలో, ఆయనని ఒకరు 'నీ గురువు ఎవరు' అని ప్రశ్నిస్తారు.

ఆ ప్రశ్నకు సమాధానంగా 'నాకు చాలా మంది గురువులు ఉన్నారు. వారి అందరి పేర్లూ చెబితే నెలలు, సంవత్సరాల సమయం పడుతుంది. ఇప్పుడు అది సాధ్యం కాదు. నాకు మరణం అతిసమీపంలో ఉంది. నేను మీకు ముగ్గురు గురువుల గురించి చెబుతాను.

'మొదటి గురువు దొంగ. నేను ఒకసారి ఎడారిలో దారి తప్పాను. దగ్గరలోని ఒక గ్రామానికి చేరే సమయానికి బాగా రాత్రి అయిపోయింది. అన్ని మూసేసి ఉన్నాయి. నేను చివరగా ఒక వ్యక్తిని కలవగలిగాను. అతను ఒక ఇంటి గోడకి కన్నం వేస్తున్నాడు. అతణ్ణి నేను ఈ రాత్రికి ఎక్కడ ఉండవచ్చో అడిగాను. ఆ వ్యక్తి 'ఈ సమయంలో అది చాలా కష్టం. నీకు ఒక దొంగతో ఉండటానికి అభ్యంతరం లేకపోతే నీవు నాతో ఉండవచ్చు' అన్నాడు.

'నేను ఆ వ్యక్తితో ఒక నెల రోజులు ఉన్నాను. ఆ వ్యక్తి ప్రతి రోజూ రాత్రి బయటికి వెళుతూ 'నేను నా పని మీద వెళుతున్నాను. నీవు విశ్రాంతి తీసుకో. నా కోసం ప్రార్ధన చేయి' అని చెప్పేవాడు. అతను వెనక్కి తిరిగి వచ్చాక, 'నీకు ఏమైనా దొరికిందా' అని నేను ఆ వ్యక్తిన అడిగేవాడిని. అతను 'ఈ రాత్రి ఏమీ దొరకలేదు. భగవంతుని కృప ఉంటే నేను మళ్ళీ ప్రయత్నిస్తాను' అని చెప్పేవాడు. అతను ఎప్పుడూ నిరాశాస్థితిలో చూడలేదు.

'నేను చాలా సంవత్సరాలు తపస్సు (ధ్యానం) చేసేటప్పుడు, నాకు ఏమీ జరగలేదు. ఏ ఫలితం రాలేదు. నాకు చాలా సార్లు నిరాశ అనిపించేది. నేను చాలా సార్లు ఈ ఉపయోగం లేని పనిని ఆపేయాలి అని అనుకునేవాడిని. అప్పుడు అకస్మాత్తుగా నాకు ఆ దొంగ గుర్తు వచ్చేవాడు. అతను ప్రతి రోజూ రాత్రి చెప్పే మాటలు, భగవంతుని కృప ఉంటే, రేపు జరగవచ్చు అనే మాటలు గుర్తు వచ్చేవి.

'నా రెండవ గురువు ఒక కుక్క: ఒక రోజు దాహం తీర్చుకుందామని నది వైపు వెళుతున్నాను. నాతో పాటు ఒక కుక్క కూడా దాహం తీర్పుకోవటానికి వచ్చింది. ఆ కుక్క నదిలోకి చూడగానే దానికి అక్కడ ఇంకొక కుక్క కనపడింది. అది దాని నీడ మాత్రమే. అది తన నీళ్ళలో ఉన్న మరొక కుక్కని చూసి అది భయపడి అరుస్తూ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయేది. దానికి దాహం ఎక్కువగా ఉండి తిరిగి నీళ్ళ దగ్గరకి వచ్చేది. ఈ విధంగా కొంత సేపు గడిచాక ఇక దాహం తట్టుకోలేక ఆ నీళ్ళలోకి దూకింది. అందులో నీడ మాయమైపోయింది. ఈ సంఘటన చూసాక భగవంతుడు నాకు తన సందేశాన్ని ఈ రూపంలో పంపించాడేమో అనిపించింది. ఎంత భయం ఉన్నా మనం ముందుకి దూకేయాలి.

నా మూడవ గురువు చిన్న బాలుడు. నేను ఒక పట్టణంలోకి వెళ్ళినపుడు ఒక చిన్న పిల్లవాడు కొవ్వొత్తిని వెలిగించి దాన్ని మసీదులో పెట్టటానికి వెళుతున్నాడు. నేను ఆ అబ్బాయిని, నీవే కొవ్వొత్తిని వెలిగించావా? అని అడిగాను. అతను అవును అని అన్నాడు. అప్పుడు నేను ఆ అబ్బాయిని, 'ఈ కొవ్వొత్తిని వెలిగించని సమయం ఉంది, అదే విధంగా దాన్ని వెలిగించిన సమయం ఉంది. మరి ఆ మంట ఎక్కడి నుంచి వచ్చిందో చూపించగలవా!' అని అడిగాను.

అప్పుడు ఆ అబ్బాయి గట్టిగా ఆ కొవ్వొత్తి మీద ఊదాడు. ఆ గాలికి దీపం ఆరిపోయింది. అప్పుడు ఆ అబ్బాయి నవ్వుతూ 'ఇప్పుడు దీపం వెళ్ళటం నీవు చూసావు కదా ! అది ఎక్కడికి వెళ్ళింది? చెప్పు' అన్నాడు.

'నాలోని అహంకారం చెదిరిపోయింది. నాలో ఉన్న జ్ఞానం సర్వం కొట్టుకుపోయింది. నాకు గురువు లేరు అన్న మాట నిజం. అలా అని నేను శిష్యుడిని కాదు అని చెప్పలేను. ఈ సర్వసృష్టిని నా గురువుగా అనుకున్నాను. నేను మేఘాలని, చెట్లని నమ్మాను. అవకాశం ఉన్న ప్రతి దాని నుంచీ పాఠాలు నేర్చుకున్నాను.'

'సన్నాసం అంటే చాలా ఆనందంగా ఈ క్షణం తాలూకు మార్గదర్శకత్వంతో, జ్ఞానోదయం దిశగా సాగిపోవటమే. మీరు చేయవలసింది కేవలం దానికి అనుగుణంగా స్వచ్ఛంగా విప్పారి ఉండటమే. సన్యాసి ఈ క్షణంలో సంపూర్ణవిరామంతో ఉండగలడు.

'రేపు కూడా ఈ రోజు మాదిరిగానే వస్తుంది. కాబట్టి నేటి మీద మాత్రమే ఎందుకు ఏకాగ్రత పెట్టకూడదు. మీరు ఎప్పుడైతే ఈ క్షణంలో ఉండగలరో అప్పుడు మీకు బాధలు, కష్టం అనేవి ఉండవు. మీరు బాధపడటానికి అనువైన ప్రదేశాన్ని సృష్టిస్తారు. మీరు ఈ క్షణంలో ఉండగలిగితే, మీరు అక్కడ సృష్టించే ప్రదేశంలో అన్నీ అందంగా అహ్లాదకరంగా ఉంటాయి. అప్పుడు అప్రయత్నంగానే జీవితం సర్వసృష్టితో చక్కని ప్రేమానుబంధంతో ఉంటుంది. మీరు సంపూర్ణంగా వెల్లడి కాగలుగుతారు. మీరు ప్రతి వస్తువుని, ప్రతి వ్యక్తిని ప్రేమించగలుగుతారు. ఆ ప్రేమకి కారణం ఉండదు. అదే సన్నాసం అంటే. అప్పుడు మీరు దేన్నీ (బరువులని) పోగు చేసుకోరు. మీకు భయం, బాధ అనేవి అసలు ఉండవు. అప్పుడు మీ చుట్టూ జరిగేవన్నీ అందమైన కలలా ఉంటాయి.

'సన్నాసం అంటే శాశ్వతంగా తన భావాలలో స్వేచ్ఛగా సంచారం చేసే జీవి. అతను ఒక ప్రదేశంలోనే ఉన్నా అతని భావం మాత్రం ఎటువంటి నిర్ధిష్టమైన పద్ధతి లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది. అతను సుదూర ప్రాంతాల్తోని వాటినైనా చూడగలడు. అతను దేన్నీ, వేటినీ పోగుచేసుకోవాలి అని అనుకోడు. అతనికి దొరికేవాటినన్నింటినీ వదిలివేస్తాడు. అతనికి కావలసినవాటి కంటే ఎక్కువ అతని దగ్గరికి వస్తాయి. అతను ఒక మహారాజులా జీవిస్తాడు.

ఒక చిన్న కథ : ఒక ధనవంతుడికి నేల మాళిగలో ఒక గది ఉంటుంది. దాని నిండా దాక్షరసం ఉంటుంది. అతని దగ్గర ఒక జగ్గులో ప్రత్యేకమైన ద్రాక్షరసం ఉంటుంది. దానికి జాగ్రత్తగా మూతపెట్టి ఉంటుంది. ఒకసారి ఆ రాష్ట్ర గవర్నరు అతని ఇంటికి వస్తాడు. అతను తనకి తాను ఇలా అనుకుంటాడు, 'ఈ జగ్గులో ఉన్న వైన్ చాలా ప్రత్యేకమైనది. అతనికి వేరే వైను ఇస్తాను.' కొన్ని రోజులు గడిచాక రాజకుటుంబీకులు అతని ఇంటికి వస్తారు. అప్పుడు కూడా ఆ ధనవంతుడు, 'ఈ ప్రత్యేకమైన వైను ఇవ్వగలిగేంత గొప్పవారు కాదు. ఇంకా ప్రత్యేకమైన వ్యక్తులు వస్తే వారికి ఇస్తాను, అని అనుకొని వారికి మామూలు వైను ఇస్తాడు. ఆ తరువాత వాళ్ళ ఇంట్లో ఒక వివాహం వేడుక జరుగుతుంది. అప్పుడు కూడా అతను తన బంధువులకి కాని, దగ్గరివారికి కాని ఆ వైను ఇవ్వడు. చివరికి అతను చనిపోతాడు. ఆ ప్రత్యేకమైన వైనుని మిగతావాటితో పాటు బయటికి తెచ్చి పేదసాదలకి అందరికీ పంచిపెడతారు. ఎవరికీ అది ప్రత్యేకమైన వైను అని తెలియదు.

సన్న్యాసం అంటే అంతిమద్యూతం

ఎపుడైతే దాచుకోరో మీరు ప్రవహిస్తూ ఉంటారు. జీవితం అనేది ప్రవహించటానికి సృష్టించబడింది. సన్యాసి ఆ ఎరుకతో, సర్వాంతర్యామి అనే ఒక శక్తి లాగుతూంది అని తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రవహిస్తూ ఉంటాడు. ఈ లక్షణమే సర్వాంతర్యామి దీవెనలని ఆకర్షించగలుగుతుంది.

అశాశ్వతస్థితిని ఆనందించండి

ఒకానొక రాజ్యంలో ఒక సంప్రదాయం ఉంటుంది. ఆ దేశపు పట్టపుటేనుగులు తరువాత సింహాసనాన్ని అధిష్టించగల వ్యక్తిని వెతికి, పట్టుకొని తమ వీపు మీద కూర్చోబెట్టుకొని రాజభవనానికి తీసుకువస్తాయి. అతనే ఆ దేశానికి రాజు అవుతాడు.

అటువంటి సందర్భంలో ఒకసారి ఏనుగు, కాబోయే రాజుని వెతుకుతూ అడవిలోకి వెళుతుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు దాన్ని అనుసరించి వెళ్ళారు. అది తిన్నగా ఒక యోగీశ్వరుడి దగ్గరకి వెళ్ళి అతణ్ణి పట్టుకొని తన పైన కూర్చోబెట్టుకొని రాజభవనానికి తీసుకువస్తుంది.

ఆ యోగికి రాజ్యపాలన అంటే ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితిలో అతను రాజై సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ఆయన యోగి కాబట్టి ఆయనలో భయం, అత్యాశ అనేవి లేవు. అతను తనలోని స్వచ్చమైన శక్తితో, తను ఉన్న ఉన్నతస్థితిలో దేశాన్ని అద్భుతంగా పరిపాలిస్తుంటాడు. మంత్రులు, ప్రజలు ఎవరికీ కూడా అవినీతి అనే మాట లేకుండా అంతా నిజాయితీగా తమ బాధ్యతలు నిర్వహిస్తుంటారు. పొరుగుదేశపు రాజుకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఆ రాజు ఈ రాజ్యాన్ని గెలవాలి అని నిశ్చయించుకొని, యుద్ధం ప్రకటిస్తాడు.

యోగి మాత్రం ఏమీ స్పందించకుండా, యుద్దానికి వచ్చిన పిలుపుని కూడా పట్టించుకోకుండా, తన సైన్యాన్ని సిద్ధం చేయకుండా నిశ్చలంగా ఉంటాడు. యుద్ధం ప్రకటించిన రాజు తన సైన్యంతో యుద్ధభూమికి వస్తాడు. అక్కడ అతనికి ఎవరూ కనిపించరు. చాలా ఆశ్చర్యపోతాడు. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో ఆ రాజు రాజభవనానికి వచ్చి, యోగితో, 'నేను నీతో యుద్ధం చేయాలని వచ్చాను' అంటాడు.

అప్పుడు యోగి, 'ఎందుకు యుద్ధం' అని అడుగుతాడు. రాజు యోగితో 'నాకు నీ రాజ్యం కావాలి' అంటాడు.

అప్పుడు యోగి, 'సరే ! తీసుకో' అంటాడు

రాజు నిర్ఘాంతపోతాడు. అతను గట్టిగా, 'నీ మాటలో అర్థం ఏమిటి? యుద్ధం చేయకుండానేనా' అంటాడు.

యోగి, 'అవును, యుద్ధం లేకుండానే' అంటాడు నిశ్చలంగా. రాజు యోగి పాదాల మీద పడి, 'నేను నా రాజ్యం పరిపాలించటానికి కూడా అర్హత లేనివాడిని, నా రాజ్యం కూడా దయచేసి నీవే తీసుకో' అని ప్రాథేయపడతాడు.

సన్నాసి అంటే ప్రతిదానిలోని అశాశ్వత్వాన్ని తెలుసుకోగలవాడు. కోరికలు, ఆస్తులు, భావాలు – అన్నీ కూడా ప్రతి నిమిషం మారుతూ ఉంటాయి. మీ కోరికల్ని ఒకసారి గమనించండి. ఒక కోరిక తీరక ముందు అదే మహోన్నతమైందిగా, ఒక గొప్ప పర్వతంలా ఉంటుంది. ఆ కోరిక తీరాక అది ఉపయోగం లేనిదవుతుంది. పర్వతమంత గొప్ప విషయం ఆవగింజంత అవుతుంది. కోరిక తీరక ముందు అదే మీ జీవితం అనిపిస్తుంది. అది తీరాక మీరు చాలా మామూలుగా మరొక కోరికలోకి వెళ్ళిపోతారు. అర్థం చేసుకోండి, ఈ చిన్న విషయంతోనే కోరికలు ఎంత అశాశ్వతమైనవో మీకు తెలుస్తుంది. కోరికలు అంటే నిరంతరం మారుతూ ఉండే మీ మనస్సు, ఊహలు అంతే.

సన్నాసం ఈ కోరికలు ఎంత అశాశ్వతమైనవో చూపిస్తుంది. అప్పుడు మీ లోపల క్రమంగా కోరికలు పుట్టటం ఆగిపోతుంది. అప్పుడు ఈ కోరికల్తో చిక్కుకుపోయిన శక్తి మీకు దొరుకుతుంది. అప్పుడు ఏ పనైనా చేయగల శక్తి మీలోకి వస్తుంది. అప్పుడు ఏ పనైనా సమర్ధంగా చేయగలుగుతారు. మీరు బయటి ప్రపంచంలోనే ఉన్నా ఇక్కడి ఏ వస్తువు, ఏ విషయం మిమ్మల్ని ఆకర్షించలేవు. మీరు నిజంగా చాలా అందమైనదాన్ని చూసినా దాన్ని సొంతం చేసుకోవాలి అని అనుకోరు. అంతే కాదు, ఆ అందాన్ని ఆస్వాదిస్తారు. అలా ముందుకి సాగిపోగలుగుతారు, అంతే, అదే సన్నాసం అంటే.

సన్నాసం అనేది చితి మంటల్లో శవదహనానికి ఉపయోగించే కర్ర లాంటిది. శవదహనం అయ్యాక కర్రని ఆ మంటల్లోనే వేసేసారు. అదే విధంగా సన్యాసం మనలోని కల్మషలు, ఊహలని కాల్సేసి, చివరికి అది కూడా ఆ మంటల్లో కలసిపోతుంది. ఇది ఒక పనిముట్టు లాంటిది.

ఆదిశంకరాచార్యులవారు భజగోవిందంలో చాలా చక్కగా చెబుతారు (భజగోవిందం అంటే భగవంతుని వైభవాన్ని కీర్తిస్తూ పాడటం). రాత్రి పగలు జరుగుతున్నా, వేసవిశీతకాలాలు వచ్చిపోయినా ఈ జీవితం చరమాంకంలోకి వచ్చినా కోరికల గుప్పిట మాత్రం అలానే ఉంటుంది.

కోరికలు అనేవి మన అచేతనస్థితిలో అంత బలంగా లాగుతాయి. ఆ కోరికల నుంచి స్వేచ్ఛని పొందగలగటమే అన్నిటి కంటే మహాద్యుతమైన స్వేచ్ఛ

ఒక చిన్న కథ : ఒకప్పుడు రాతి పని చేసే వ్యక్తి ఉండేవాడు. అతనికి జీవితంలో తాను ఉన్న స్థితి మీద తృప్తి లేదు. ఒక రోజు అతను ఒక ధనవంతుడైన వ్యాపారి ఇంటి ముందు నుంచి వెళుతుంటాడు. తెరచి ఉన్న గేటు లోంచి అతను ఆ ధనవంతుని ఇంట్లో ఉన్న విలువైన

వస్తువుల్ని, లోపల ఉన్న చాలా ముఖ్య అతిథుల్ని చూస్తాడు. అతను ఆ వ్యాపారి చాలా శక్తిమంతుడు అని అనుకుంటాడు. అతనిలో ఆ వ్యాపారి పట్ల అసూయ కలుగుతుంది. తాను కూడా ఆ వ్యాపారిలా ఉండాలి అని ఆశిస్తాడు.

అనుకోకుండా రాతి పని చేసే వ్యక్తికి వ్యాపారంలో బాగా లాభాలు వచ్చి ధన వంతుడవుతాడు. అతను చాలా సౌకర్యాల్ని సమకూర్చుకొని సంతోషపడుతుంటాడు. అతను తాను ఊహించినదాని కంటే బలవంతుడవుతాడు.

ఒక రోజు అతను బాట మీద నిలబడి ఉంటే ఒక ఉన్నతాధికారి వెళుతూ కనిపిస్తాడు. ఆయనని ఒక అందమైన పల్లకిలో తీసుకువెళుతుంటారు. ఆయనకి నాలుగు వైపులా పనివారు, సైనికులు నడుస్తుంటారు. కొందరు డప్పలు వాయిస్తూ బాకాలు ఊదుతూ ఉంటారు. అందరూ, ఎంత ధనవంతులైనా, పేదవారైనా ఆయనకి తల వంచి నమస్కరిస్తుంటారు. ఈ హడావుడి అంతా చూసిన ఆ వ్యక్తి 'నేను కూడా ఒక అధికారిగా ఉంటే ఎంత బాగుంటుంది!' అని అనుకుంటాడు. వెంటనే అతను ఒక ఉన్నతాధికారి అవుతాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా అట్టహాసంగా పల్లకిలో వెళుతుంటాడు.

ఒక రోజు వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. అతనికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. బాగా చికాకుగా ఉంటుంది. అతను తల పైకి ఎత్తి ఆకాశంలోనికి చూస్తే అక్కడ అందమైన ఆకాశం, అందులో ఎంతో ప్రకాశంతో ఉన్న సూర్యుడు కనిపిస్తాడు. ఆహా! సూర్యుడు ఎంత శక్తిమంతుడు. నేను సూర్యుడిని అయితే బాగుండు అనుకుంటాడు.

వెంటనే అతడు సూర్యుడిలా అయిపోయి చాలా బలమైన స్థితిలో ఉంటాడు. ఒక రోజు నల్లని మేఘం సూర్యుడికి, భూమికి మధ్యలోకి వస్తుంది. సూర్యకాంతి భూమి మీదికి వెళ్ళదు. అతను ఆశ్చర్యపోతాడు. అతను ఈ విధంగా అనుకుంటాడు, 'ఈ నల్లని మేఘం ఎంత శక్తిమంతమైనదో కదా! నేను ఆ మేఘాన్ని అయితే బాగుంటుంది! వెంటనే అతను మేఘంగా మారి తుఫాను సృష్టించి వరదలు తెప్పించి ఊళ్ళు ముంచేస్తాడు.

అయితే అతను మరొక విషయం తెలుసుకుంటాడు. ఏదో ఒక శక్తి తనని బలంగా తోసింది అని. అది బలంగా వస్తున్న గాలి అని అర్ధమవుతుంది. వెంటనే నేను గాలిగా మారితే బాగుండు అనుకుంటాడు. వెంటనే అతను గాలిగా మారి బలంగా వీస్తూ ఇల్లు, చెట్టు కూల్సేస్తాడు. అయితే అంత బలమైన గాలికి కదలకుండా ఉన్న ఒక పెద్ద రాయిని చూసి, ఆహా! ఈ రాయి ఎంత బలమైనది. నేను రాయిని అయితే బాగుంటుంది అని అనుకుంటాడు. వెంటనే అతను రాయిగా మారి, ఇప్పుడు నా కంటే బలమైనవాళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరు అనుకుంటాడు. అలా అనుకుంటూ ఉండగా అతనికి సుత్తితో కొడుతున్న శబ్దం వినిపిస్తుంది. రాతి మీద దెబ్బలు పడుతుంటాయి, తరువాత రాయి ఆకారం మారుతూ ఉంటుంది. అప్పుడు అతను ఈ విధంగా అనుకుంటాడు 'రాయి కంటే శక్తి గలది ఏముంది?' అని. కిందకి చూస్తే రాతి పని చేసే వ్యక్తి సుత్తితో రాయిమీద కొడుతుంటాడు.

ఈ కథలో మనకి అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఎంత సాధించినా, సాధించనిదే గొప్పగా కనిపిస్తుంది. దూరంగా అవతల పక్క గడ్డి చాలా అందమైన ఆకు పచ్చ రంగులో కనిపిస్తుంది. దాని దగ్గరగా వెళితే ఏం జరుగుతుంది? అపుడు ఇటు పక్క ఉన్న గడ్డి అందంగా కనిపిస్తుంది. మనం నిరంతరం ఒక దాని నుంచి మరొక దానిలోకి, ఒక కోరిక నుంచి మరొక కోరికలోకి, ఒక దృక్పథం నుంచి మరొక దానికి దూకుతూ అదే సంతోషం అనుకుంటాం.

కాని అసలు సత్యం ఏమిటంటే, మనకి మనం చాలు. మనం అది తెలుసుకుంటే చాలు. మనం ఆ విషయం తెలుసుకుంటే మన అందం మరింత ప్రకాశవంతం అవుతుంది. లేకపోతే దీన్ని వెతకటంలో మన డబ్బు, సమయాలను వృథా చేస్తాంఅంతే.

సన్నాసి ప్రతి నిమిషం, ప్రతిదీ మారటాన్ని స్పష్టంగా చూడగలడు. అది ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉంటేనే అందం. సన్నాసికి మరొక విషయం కూడా తెలుసు, అందం చూసే కళ్ళలో, చూసే వ్యక్తిలో ఉంది అని. అందుకే అతను ముందుగా తన కళ్ళని శుభ్రం చేసుకుంటాడు. కళ్ళు ఆత్మకి ద్వారాలు కాబట్టి అతని పని చాలా ముఖ్యమైన స్థాయిలో ఉంటుంది.

ఒక విషయం అర్ధం చేసుకోండి; మీరు ఎరుపు రంగు కళ్ళ అద్దాల నుంచి చూస్తే ప్రపంచంలో అన్నీ ఎరుపు రంగులోనే కనిపిస్తాయి. ఆకు పచ్చ అద్దాల గుండా చూస్తే ఆకు పచ్చ రంగులో కనిపిస్తాయి. మీరు స్వచ్ఛమైన కళ్ళతో చూస్తే సర్వం స్పష్టంగా, అందంగా కనిపిస్తుంది. సృష్టి అద్భుతమైన అందాల రాశి. కానీ మనం ఆ అందాలని చూడలేకపోతున్నాం. సన్యాసం అంటే స్వచ్ఛంగా చూడాలి అని నిర్ణయించుకోవటమే.

జీవితం నిరంతరం మారుతూ ఉంటుంది. మరి అటువంటపుడు దాన్ని ఒక చటంలో బిగించటం ఎందుకు? బుద్ధుడు 'దమ్మపదం'లో ఈ విధంగా చెబుతాడు – జీవితం అంటే ఆకాశంలో మెరిసే మెరుపు తీగ వంటింది. జీవితం మారుతూ ఉంటుంది. మరి మనం ఏం చేస్తున్నాం? మనం అసాధ్యమైన పని చేయాలి అని అనుకుంటున్నాం. అసలు మన చేయవలసింది ఉన్నదాన్ని స్పష్టంగా చూడటం, ఆనందించటం, ముందుకి సాగిపోవటం. సర్వం సృష్టి చైతన్యరూపమే అయినపుడు ఇక మనకి అహంతో పని ఏమిటి? భయానికి, దురాశ లేదా అత్యాశకి అవకాశం ఎక్కడ ఉంది. అర్ధం చేసుకోండి; సన్నాసంతో ఏమీ మార్చలేం. అన్నీ అదే విధంగా ఉంటాయి. అయితే సన్యాసం మీరు చూసే దృక్పథాన్ని మారుస్తుంది. సన్నాసం అనేది మీలో మార్పులు తెస్తుంది. అంతే కాని బయటి ప్రపంచంతో సన్న్యాసానికి ఏమీ సంబంధం లేదు.

ఒక చిన్న కథ : ఒకసారి ఒక ఆధ్యాత్మికబోధకుడు రాజదర్శనానికి వస్తాడు. ఎవరూ అతన్ని అడ్డగించరు. అతను తిన్నగా రాజసభకి వస్తాడు. అక్కడ రాజు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆయనని చూసి రాజు 'మీకు ఏం కావాలి' అంటాడు. అందుకు ఆధ్యాత్మిక బోధకుడు 'నాకు నిద్ర పోవటానికి సత్రం కావాలి' అని అడుగుతాడు. అప్పుడు రాజు 'సత్రం

ఎందుకు, నా రాజభవనంలో ఉండండి' అని అంటాడు. అప్పుడు ఆ మతబోధకుడు, నీకు ముందు రాజభవనం ఎవరిది' అని అడుగుతాడు. రాజు 'ఇది మా నాన్నగారిది, ఆయన మరణించారు' అని జవాబు ఇస్తాడు. 'అంతకు ముందు అది ఎవరిది' అని మళ్ళీ రాజుని అడుగుతాడు. రాజు 'అది మా తాతగారిది, ఆయన కూడా మరణించారు' అని జవాబు చెబుతాడు. అప్పుడు బోధకుడు, 'అంటే ఈ భవనంలోకి చాలా మంది వచ్చి, కొంత కాలం నివసించి ఆ తరువాత వెళ్ళిపోతారు. నీవు కూడా అదే విధంగా వచ్చావు, మరి ఇది సత్రమే కదా?! అంటాడు.

సన్నాసి రథసారథిని మేల్కొలుపుతాడు. మనిషి శరీరం రథం అయితే అందులో ఉండే అతని చేతనస్థితి రథసారథి. రథసారథి గాఢనిద్రలో ఉన్నాడు. గుర్రాలు ఆ రథాన్ని వాటి ఇష్టప్రకారం తీసుకువెళుతున్నాయి. రథానికి పూన్చిన ఐదు గురాలు మనలోని ఐదు జ్ఞానేంద్రియాలు, ఒక్కొక్కదానికి ఒక్కొక్క భావం, ఒక్కొక్క లక్ష్యం. వాటిలో ఒకటి కూడా సత్యం కాదు. అవి మారుతున్న భావాలు మాత్రమే.

చాలా కష్టసమయంలో కూడా సన్నాసి జీవితం అంటే మారుతూ ఉండే ఒక కల అనే ఎరుకతో ఉంటాడు. అతని నిర్వచనంలో విజయం, అపజయం అనేవి వేరే విధంగా ఉంటాయి. అతను జయాన్ని, అపజయాన్ని అదే విధంగా తీసుకోడు. అదే సంసారి తాను ఎక్కడికి వెళితే అక్కడకి జయం, అపజయం అనేవాటిని కూడా మోసుకెళుతూ ఉంటాడు. ఇక్కడే సమస్యలు ప్రారంభమయ్యేది.

అధీనమవటం, ప్రేమ, కరుణ, సన్నాసం

సన్నాసం అంటే సకలసృష్టికి, సర్వాంతర్యామికి సరే' అని చెప్పటం. అధీనమవటం అన్నా, ప్రేమ, కరుణా అన్నా కూడా అదే అర్థం.

మనిషి మెదడుకి ఎటువంటి శిక్షణ ఇస్తారంటే అన్నింటికీ 'కాదు, లేదు' అని చెప్పమని. లేదు, కాదు అనగానే అహంకారం గట్టిపడుతుంది. సరే అనగానే అహంకారం కరిగిపోతుంది. అందుకే మనస్సు ఎప్పుడూ లేదు, కాదు అనే అంటుంది. సన్నాసం అంటే సర్వాంతర్యామికి సరే, ఔను అని చెప్పటమే. సర్వాంతర్యామి మిమ్మల్ని సృష్టించాడు. ఆ విశ్వశక్తి మీ ద్వారా తన దివ్యనాటకాన్ని, దివ్యలీలల్ని ప్రదర్శించాలి అని చూస్తుంటాడు. మీరు సరే అని చెప్పగలిగితే సర్వాంతర్యామిని ఆయన లీలలు మీ ద్వారా జరగనివ్వటమే. ఆ దివ్యలీలలు జరిగితే, ఎప్పుడు ఏవి సృష్టిధర్మం ప్రకారం జరగాలో అదే విధంగా జరుగుతాయి. సర్వాంతర్యామి ప్రకారం అన్నీ కచ్చితంగా జరుగుతాయి. అప్పుడు ఏం జరిగినా అది శుభప్రదం, మంగళకరం. ఇదే మనస్సుని (ఆలోచనలని) వదిలేయండి అనే మాటకి అసలైన అర్దం. సర్వాంతర్యామికి, సృష్టికి మీరు సున్నితంగా స్పందించగలగటం అంటే ఇదే. సృష్టికి అనుగుణంగా పనిచేయటమే. అదే అధీనత అంటే. సృష్టికి, సర్వాంతర్యామికి విధేయులుగా ఉండటం అంటే అధీనం కావటం.

సరే అని చెప్పటానికి ప్రయత్నించటంలోనే మీరు సున్నితంగా అవుతారు. మీరు కాదు అని చెబుతున్న కొద్దీ గట్టిపడిపోతారు. మీరు సరే అని చెప్పటానికి చేసే ప్రయత్నం మిమ్మల్ని సున్నితంగా చేస్తుంది. ఎప్పుడైతే మీరు సరే అనాలి అని చేతనస్థితిలో నిర్ణయించుకుంటారో, అప్పుడే ఆ సున్నితత్వం ప్రారంభమవుతుంది. ఇక్కడే గురుదేవుల పాఠం ప్రారంభమవుతుంది.

సన్నాసం అంటే గురుదేవులని ఎటువంటి వివరణ అడగకుండా సరే అని చెప్పగలగటం. ఎప్పుడైతే గురువులని మీరు పూర్తిగా నమ్ముతారో అప్పుడు మీలో సన్న్యాసం అనేది ప్రారంభమవుతుంది. ఎక్కడో ఒక చోట మీ కంటే గురువులకే అన్నీ తెలుసు అనే విషయం మీకు స్పురిస్తుంది. అప్పుడు మీ మానసికవ్యవస్థ మీద (ఆలోచనల మీద) మీ గుప్పిటని వదులు చేసారు. మనస్సుని వదిలి గురువుల చేతులని పట్టకొని ముందుకు సాగుతారు. గురువులు ఎప్పుడూ చేతులు ముందుకు చాపి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. మీరే ఆ చేతులని పట్టుకోవటానికి సిద్ధంగా ఉండరు. ఒక్కసారి సరే అని మీరు అనటం ప్రారంభించగానే మీరు గురువులు చేతులు పట్టుకోవటం మొదలుపెడతారు.

ఎక్కడ ప్రేమ అనేది సృష్టి అవుతుందో అక్కడ అంతరంగపు ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ప్రేమ అనేది మీరు సరే, ఔను అని చెప్పటం ప్రారంభించాక మాత్రమే జరుగుతుంది. సరే అని అంగీకరించటం వల్ల మీరు నిజమైన ప్రేమని వెల్లడి చేస్తూ ప్రేమించటం ప్రారంభిస్తారు. అదే విధంగా మీరు వారికి అనుమతిని ఇస్తారు. అప్పుడు రాతిలా ఉండే మీ అంతరంగం దూది పింజలా మారుతుంది. అది ప్రేమలో మునిగిపోతుంది. ఆ ప్రేమ కేవలం ఒక వ్యక్తి వైపు మాత్రమే ఉండదు. అదే విధంగా ఏదో ఒక కారణంతో జరగదు. ఆ ప్రేమ కేవలం మీ నుంచి పొంగి ప్రవహించే శక్తి మాత్రమే. ఆ ప్రేమ సర్వసృష్టి వైపూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ప్రతి చెట్టుతో, ప్రతి ప్రాణితో సంభాషిస్తూ అందులో ఐక్యమైపోగలరు. అప్పుడు మీకు జీవితం మధురగానంలా ఉంటుంది. అది సృష్టి గీతం అయితే మీరు అందులో ఒక రాగం అవుతారు. అప్పుడు మీరు మీతోనే కాదు అందరితో, అన్నింటితోనూ లోతైన ప్రేమానుబంధంతో ఉంటారు. అప్పుడు మీరు చేసే ప్రతి పనీ, మీలోని అనందాన్ని వెల్లడి చేయటమే అవుతుంది. మీరు నిరంతరం ఆనందపారవశ్యంలో ఉంటారు.

ఒక చిన్న కథ : ఒక బౌద్ధగురువు కేంట్రిడ్డి బౌద్ధసంఘానికి వస్తాడు. ముఖ్య అతిథులు వస్తారు అనే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని అందరూ శుభ్రపరుస్తూ ఉంటారు. వారంతా బౌద్ధగురువుని చూసి ఆశ్చర్యపోతారు. ఆయన నిజానికి మర్నాడే అక్కడికి రావలసి ఉంది. ఆయన తన ప్యాంటు చేతులు పైకి మడిచి వారితో పాటు ఆ శుభ్రంచేసే పనుల్లో వారికి సహాయం చేయటం ప్రారంభిస్తాడు. ఆయన వారికి సహాయం చేయటం అనే విషయాన్ని వారు నమ్మలేకపోతారు. ఆశ్చర్యపోతున్నవారితో ఆయన, 'రేపు నేను వచ్చే సందర్భానికి చేసే పనుల్లో నేను కూడా ఎందుకు సహాయం చేయకూడదు?' అని వారితో అంటాడు.

సన్న్యాసం అంటే అంతిమద్యూతం

మీరు ఎప్పుడైతే సర్వాంతర్యామిలో, సృష్టితో పాటు ప్రతిధ్వనిస్తూ ఉంటే, మీరు మీతోనే కాదు అందరితో, ఆనందంగా ఉండగలరు. ఎందుకంటే మిమ్మల్ని మీరు వేరే విధంగా, సృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా చూడరు. ఏ విషయానికి వేరే కారణాల్ని వెతకరు. కానీ కొంత మంది సృష్టితో చక్కని అనుబంధాన్ని పెంచుకుంటారు. కానీ తోటి మనుషుల విషయంలో పూర్తిగా విఫలమవుతారు. అటువంటివారు ప్రకృతితో పెంచుకున్న అనుబంధం కూడా నిజం కాదు. కేవలం ప్రకృతిని మాత్రమే ప్రేమించగలరు అంటే అది నిజమైన ప్రేమ కాదు.

నాతో చాలా మంది అంటుంటారు, నాకు ప్రకృతితో చాలా మంచి అనుబంధబాంధవ్యాలు ఉన్నాయి, నేను ప్రకృతిని ప్రేమిస్తాను అని. ఒక విషయం అర్థం చేసుకోండి; చెట్లు, పక్షులు, జంతువులు మీకు ఎటువంటి సమస్యల్ని సృష్టించవు. అందుకే మీరు వాటిని ప్రేమిస్తున్నాను అని చెప్పగలుగుతారు. అవి ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటాయి. మీరు ఏం చెప్పదలచుకున్నారో కేవలం అది చెబితే చాలు. మీ భావాలు వాటి మీద పెట్టవచ్చు. వాటిని లాగవచ్చు. ఏది చేసైనా బాగుంది అనుకోవచ్చు. ఇదంతా మీ అహంకారానికి తృప్తి మాత్రమే. మీకు సమస్య ఉన్నప్పుడు కూడా సర్వసృష్టిని ప్రేమించగలగాలి. అదే అనుబంధం అంటే. మీరు ప్రతికూలస్థితిలో కూడా అటువంటి అంతరంగాన్ని స్పష్టించుకోగలిగినప్పుడు, మీది నిజమైన అనుబంధం.

ఒకసారి ఒక కవి ప్రేమగీతాన్ని రాసి తన స్నేహితులకి పంపిస్తాడు. కొన్ని రోజులు గడిచాక అతనికి ఒక ఉత్తరం వస్తుంది. అది ఆయన ఆ గీతాన్ని పంపిన ఒక స్త్రీ నుంచి వస్తుంది. ఆమె ఉత్తరం ఈ విధంగా రాసుంది, నాకు మీరు రాసిన ప్రేమగీతం చాలా నచ్చింది. అది నా హృదయాన్ని తాకింది. దయచేసి మీరు మా ఇంటికి వచ్చి మా తల్లిదండ్రుల అనుమతితో నన్ను వివాహం చేసుకోండి, అని ఉంటుంది.

కవి ఆ ఉత్తరం చదివి ఆశ్చర్యపోతాడు. ఆయన ఆమెకి సమాధానమిస్తూ ఉత్తరం రాసి అందులో 'నేను నా హృదయస్పందన నుంచి ఒక ప్రేమగీతం రాసి దాన్ని కొంతమంది స్నేహితులకి పంపించాను. అంతకు మించి అందులో మరేమీ లేదు' అని రాసాడు. ఆ ఉత్తరానికి జవాబుగా ఆమె, 'నీవు ఒక కపటప్రేమికుడివి. నిన్ను చూసాక మరి నా జీవితంలో కవి అనే ఏ వ్యక్తినీ నమ్మను! అని రాసుంది.

ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రతిదీ మేధతో కూడిన కారణంతో ముడిపడి ఉంటుంది. ప్రేమని కేవలం ఒక కోరిక స్థాయికి దిగజార్చి చూస్తున్నారు. అది మరొకరి శరీరం పట్ల ఉన్న కోరిక మాత్రమే. అదే సమస్య. నిజమైన ప్రేమ అంటే మీ అంతరంగం నుంచి ఏ కారణం లేకుండా పొంగి ప్రవహించే ఒక శక్తి. అది కేవలం సర్వాంతర్యామికి, సృష్టికి అనుగుణంగా మీరు ఉండగలిగినప్పుడే సాధ్యపడుతుంది.

గొప్ప కవి అయిన కబీరు ఒక మాట చెబుతాడు, ఎప్పుడైతే మీరు ప్రేమ అధీనంలోకి, ప్రేమ గుప్పిటలోకి వెళతారో రెండవసారి ఆలోచించరు అని. ఆ ప్రేమలో మునగండి. దాని గురించి ఆలోచించటం అంటే మీకు గాఢమైన నిద్ద వస్తున్నప్పుడు తలగడలని తడుముకున్నట్ల ఉంటుంది. ఆయన ఇంకా చెబుతాడు, 'దాని కోసం తలని ఇవ్వవలసివస్తే ఇచ్చేయండి. తల కోసం ఎందుకు బాధ పడటం?

గురుదేవులు మీ కోసం కొన్ని జన్మలుగా ఎదురు చూస్తుంటారు. కానీ మీరు మాత్రం సరే అని చెప్పాలి. గురువు అంటే ఒక గౌరవప్రదమైన వ్యక్తి. ఆయన ఎంత గొప్పవాడంటే మీరు బందీలుగానే ఉంటాం అంటే ఆ స్వేచ్ఛని మీకు ఇస్తారు. మీరు తెలుసుకునేవరకూ ఎదురుచూస్తూంటారు. ఒక్కసారి మీరు సరే అని చెప్పగానే ఆయన మిమ్మల్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. కేవలం గురుదేవులు మాత్రమే మీకు ప్రేమలోని నిజమైన శక్తిని చూపించగలరు.

ఒక చిన్న కథ : సదాశివబ్రహ్మేంద్ర అనే ఒక గొప్ప యోగీశ్వరుడు దక్షిణభారతదేశంలో ఉండేవాడు. ఆయన ఒక పసిబిడ్డలా జీవించేవాడు. ఆయన ఎప్పుడూ బట్టలు కట్టుకోలేదు. ఆయన నిరంతరం ఆనందపారవశ్వంలో ఉండేవాడు. ఒక రోజు ఆయన మహదానందంలో నడుస్తూ వెళుతుంటాడు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నవాబు గుర్రం మీద వెళుతూ ఆ యోగీశ్వరుడి పక్కనుంచే వెళతాడు. ఆనందపారవశ్యంలో ఉన్న యోగి ఆ నవాబుని గమనించడు, అతనికి గౌరవసూచనగా ఏమీ చేయడు. అది చూసి నవాబుకి చాలా కోపం వస్తుంది. నవాబు కత్తి తీసి ఆ యోగి చేతిని నరికేస్తాడు. సదాశివబ్రహ్మేంద్ర అసలేమీ పట్టించుకోకుండా అలా నడుస్తూ అదే ఆనందంలో ముందుకి వెళుతుంటాడు.

ఆయన భక్తురాలు ఒకామె ఇదంతా చూసి, బాధతో దుఃఖిస్తూ ఆయన దగ్గరకి వెళ్ళి, 'గురుదేవా! మీరు ఆ నవాబుని గౌరవించకుండా మీ చేతిని పోగొట్టుకున్నారు' అని ఏడుస్తుంది. యోగీశ్వరుడు ఆమె మాటలకి ఆశ్చర్యపోయి ఆమెతో తెగిపోయిన చేతిని తీసుకురమ్మని చెప్పి ఆ చేతిని విరిగిన స్థానంలో పెడతాడు. చేయి మామూలుగా అయిపోతుంది. ఆ భక్తురాలు ఇది చూసి ఆశ్చర్యంతో ఏమీ మాట్లాడలేకపోతుంది.

యోగీశ్వరుడు ఆమె వైపు చూస్తూ, 'నవాబులోని ద్వేషం నా చేయి పోయేటట్టు చేస్తే, నీ ప్రేమ దాన్ని చికిత్సతో మామూలుగా చేసింది', అంటాడు.

జ్ఞానోదయమైన యోగీశ్వరుని ప్రేమ, కరుణ అనంతసాగరం లాంటివి. వాటికి హద్దులు ఉండవు. సన్యాసి కూడా జ్ఞానోదయమైన యోగీశ్వరునిలా జీవిస్తాడు. సన్న్యాసం అంటే, జ్ఞానోదయస్థితిలో జీవించటమే.

సన్న్యాసి అంటే తన అంతరంగప్రపంచంలో ప్రేమకరుణలతో స్థిరపడి బయటి ప్రపంచంలో సున్నితంగా, కచ్చితంగా ఉండేవాడు. కచ్చితత్వం, సున్నితత్వం అతని చేతిలో కత్తి లాంటివి. అతను క‌ళ్ళు మూసుకుంటే బయ‌టి ప్ర‌పంచం ఉండ‌దు. క‌ళ్ళు తెరిస్తే, చేసే ప‌ని క‌చ్చితంగా ఉంటుంది. అతని పనిలోనూ, మానవసంబంధాల్లో కూడా పరిపూర్ణతతో, కచ్చితంగా ఉండగలడు. సన్న్యాసి ఒక తండ్రి, తల్లి, సోదరుడు, స్నేహితుడు అందరినీ కూడా ఒకే సమయంలో చూపగలదు. అతను తన అంతరంగమేధ మార్గదర్శకత్వంలో ముందుకి సాగుతాడు. అందుకే అతను నిరంతరం వర్తమానంలో ఉండగలుగుతాడు. ఆయన చాలా చక్కగా స్పందించగలుగుతాడు. అదే అంతిమ బాధ్యత. అంటే అప్రయత్నంగా ఆ క్షణానికి స్పందించగలగటం. నిజమైన ప్రేమ, కరుణ అనేవి అప్రయత్నంగా ఆ క్షణానికి స్పందించటమే. అందుకే సన్న్యాసి మనుషులు ఎవరైనా, పరిస్థితులు ఏవైనా నిరంతరం కరుణప్రేమల్ని వెదజల్లుతూ ఉంటాడు.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి ఒక బౌద్ధారామానికి వెళ్ళి అక్కడ ఉన్న గురువుగారితో, 'గురుదేవా! నేను జెన్ బౌద్ధధర్మాన్ని నా మిగిలిన జీవితమంతా సాధన చేయాలనుకుంటున్నాను. నేను ధ్యాన దగ్గరి దారిలో తెలుసుకుంటాను. జ్ఞానోదయానికి కూడా ఏదైనా దగ్గరి మార్గం ఉందా? అని అడుగుతాడు.

గురువుగారు ఆ వ్యక్తితో, 'నిన్ను మా ఆశ్రమంలోకి తీసుకుంటాను. అదీ రెండు రోజులు. ఈ రెండు రోజుల్లో జ్ఞానోదయానికి దగ్గరి మార్గాన్ని నేర్పిస్తాను. నీవు ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నావా?' అని అడుగుతాడు. గురువుగారి ప్రశ్నకు ఆ వ్యక్తి 'నేను దేనికీ కూడా ఎక్కువ కాలం కట్టుబడి ఉండను. అందువల్ల నేను ప్రత్యేకంగా ఏం చేయాలో నిర్ణయించుకోలేదు. కానీ నాకు చెస్ ఆడటం ఇష్టం' అంటాడు.

ఆ గురువుగారు ఒక యువకుడైన సన్న్యాసికి కబురు చేస్తాడు. అతను చెస్ బాగా ఆడతాడు. ఆయన వాళ్ళిద్దరినీ కూర్చోమని చెప్పి, వాళ్ళ మధ్య చెస్ బోర్డు పెడతాడు. ఆతరువాత తన దగ్గర ఉన్న కత్తి తీసి వారి మధ్య బల్ల మీద పెట్టి వాళ్ళతో, 'మీ ఇద్దరూ చెస్ ఆడాలి. మీలో ఎవరైతే ఓడిపోతారో వెంటనే ఈ కత్తితో వారి తల నరకబడుతుంది,' అని చెబుతాడు.

గురువుగారి మాటలకు వారు నిర్ఘాంతపోతారు. ఇద్దరూ ఆట ఆడటం మొదలు పెడతారు. వారిద్దరూ అంతకు ముందు ఎప్పుడూ లేనంత ఏకాగ్రాతతో ఆడుతుంటారు. ముందులో యువసన్న్యాసి బాగా ఆడతాడు. ఒక స్థితిలో అతనే ఆట గెలుస్తాడేమో అనిపిస్తుంది. కొంత సేపటికే విజయం అతనిదే అని తెలుస్తుంది.

అకస్మాత్తుగా అతను ఒక తప్పు చేసాడు. అప్పుడు ఆ కొత్త వ్యక్తి అవకాశాన్ని తీసుకొని ఆట గెలిచే దిశగా వెళుతుంటాడు. త్వరలోనే ఆ వ్యక్తి ఆట గెలిచే స్థితికి చేరతాడు. అప్పుడు ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఆ యువకుడైన సన్న్యాసి వైపు చూసి ఇలా అనుకుంటాడు, 'ఇంత చిన్న వయస్సులో అంకితభావం, భక్తితో గురువు దగ్గర ఉన్నాడు ఈ యువకుడు. కానీ నేను నా జీవితాన్ని వృథా పరిచాను'. వెంటనే ఆ వ్యక్తి ఒక నిర్ణయానికి వస్తాడు. 'ఒక వేళ ఎవరో ఒకరు చనిపోవటం అంటూ జరిగితే అది నేనే కావాలి' అనుకొని కావాలని తప్పు చేస్తాడు.

సన్న్యాసి అది చూసి తాను ఆట గెలిచే దిశగా ఎత్తు వేసాడు. గురువుగారు ఇదంతా గమనిస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో గురువుగారు ఆ చెస్ బోర్డుని లాగేసాడు. పావులన్నీ చెల్లాచెదరైపోతాయి. ఆయన వాళ్ళతో, 'మీలో ఎవరూ గెలవలేదు. ఎవరూ ఓడిపోలేదు. ఆట అయిపోయింది. జ్ఞానోదయానికి కావలసినవి రెండే విషయాలు. అవి ఏకాగ్రత, కరుణ. ఈ రోజు మీరిద్దరూ ఆ పాఠం నేర్చుకున్నారు. మీరు నాతో ఉండి, ఈ రోజు చెస్ ఏ విధంగా ఆడారో ఆ విధంగా చదువుకోండి. మీకు తప్పక జ్ఞానోదయమవుతుంది' అని చెబుతాడు.

అర్ధం చేసుకోండి; సన్న్యాసం అంటే ఏకాగ్రతని, కరుణని కలిపి తీసుకురావటం. ఏకాగ్రతతో మీరు జీవితగమ్యం అయిన జ్ఞానోదయం పొందాలి అనే లక్ష్యాన్ని ఎప్పుడూ మరిచిపోరు. మీ కరుణ త్యాగంతో ఎదుటివారి లక్ష్యం అయిన జ్ఞానోదయస్థితికి చేరే విధంగా సహాయం చేస్తుంది. ఈ రెండు లక్షణాలూ మీలో ఉన్నప్పుడు మీరూ మీ ఎదుటివారూ, ఇద్దరూ గమ్యం చేరగలుగుతారు. అదే సన్న్యాసంలోని అద్భుతమైన గొప్ప విషయం. అదే సన్న్యాసి ఉండే స్థితి.

సన్న్యాసికి ఉండే మరొక గొప్ప లక్షణం సర్వాంతర్యామి పైన, సర్వసృష్టి పైన ఉండే అపారమైన నమ్మకం. మీరు గమనిస్తే, ఈ సంఘం మీకు నిరంతరం మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తూ ఉంటుంది. అది అసలైన సమస్య. సృష్టి మీకు శత్రువు అని నేర్పిస్తారు. ఈ సృష్టి నుంచి నిరంతరం మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని సంఘం చెబుతూ ఉంటుంది. కాబట్టి మీరు నిరంతరం అదే సూత్రాన్ని పాటిస్తూ ఉంటారు. ఆ సూత్రం ఆధారంగానే మీరు గురువుల నుండి రక్షించుకుంటూ ఉంటారు. మీ జీవితంలో గురువు చేసే పని మీలోని అహంకారాన్ని రూపుమాపటమే. అందుకే ఆయన మీకు తారసపడతారు.

సన్న్యాసం అంటే మీరు మీ మార్గంలో ఎక్కడ తప్పుతున్నారో తెలుసుకోవాలని ప్రయత్నించటమే. ఆ తప్పు మార్గమే మీ అహంకారం. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, మీరు మీ రక్షణపద్ధతులని వదిలేసి గురువులని మీలోకి అనుమతిస్తారు. గురువులకి మీ అంతరంగాన్ని తెరచి ఉంచుతారు. గురువుల్ని మీలోనికి అనుమతించకుండా మీ అంతరంగాన్ని మూసేయటం అంటే పరిమళాల గాలులు వీస్తున్నప్పుడు మీరు చేతి వేళ్ళతో ముక్కు మూసుకున్నట్లే. మీరు ఆయన మీద సంపూర్ణమైన నమ్మకంతో, ఆయనకి విప్పారి ఉంటే మీ చుట్టూ ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీరే చూస్తారు.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తికి కొంత మంది శిష్యులు ఉన్నారు. అతనికి జ్ఞానోదయం కాలేదు కానీ వారినందరినీ ఆధ్యాత్మికమార్గంలో నడిపిస్తుంటారు. ఒక రోజు అతని దగ్గరికి ఒక కొత్త శిష్యుడు వస్తాడు. అతను వినయంగా, స్వచ్చంగా, సహజంగా ఉండేవాడు. అతన్ని చూసి మిగతా శిష్యులు అసూయపడుతుంటారు. వారంతా ఇతనే గురువుగారి వారసుడవుతాడు అని అనుకుంటూ ఉండేవారు. వాళ్ళలో వారికి చాలా రాజకీయాలు జరుగుతుంటాయి. చివరికి వాళ్ళు ఆ కొత్త శిష్యుణ్ణి చంపదలచుకుంటారు.

ఒక రోజు వారంతా అతని దగ్గర చేరి 'నీకు నిజంగా గురువు గారి మీద విశ్వాసం ఉంటే కొండ చివరి నుంచి కిందికి దూకాలి, అప్పుడు నీకు ఎటువంటి హానీ జరగకూడదు' అంటారు. ఆ శిష్యుడు సరే అని దూకుతాడు. ఆ లోయ సుమారు మూడు వేల అడుగుల లోతు ఉంటుంది. అతను చనిపోయి ఉంటాడని భావించి వారు కిందికి వెళ్ళి చూస్తే, అక్కడ శిష్యుడు చిరునవ్వుతో పద్మాసనంలో కూర్చొని ఉంటాడు. వీరిని చూసి శిష్యుడు కళ్ళు తెరచి, 'మీరు సరిగ్గా చెప్పారు. విశ్వాసం రక్షిస్తుంది' అంటాడు.

ఇదంతా ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన అయి ఉంటుంది అనుకొని అతన్ని చంపటానికి మరొక ప్లాను సిద్ధం చేసుకుంటారు. ఒక ఇంటికి నిప్పు అంటుకొని తగలబడిపోతూ ఉంటుంది. చాలా మంది ఆ ఇంట్లో ఉన్నవారిని రక్షించటానికి ప్రయత్నిస్తున్నారు కానీ మంటలు ఎక్కువగా ఉండటం వల్ల వారు ఏమీ చేయలేకపోతున్నారు. ఇదే అదను అనుకొని మిగతా శిష్యులు కొత్త శిష్యుడిని, 'నీకు మన గురువుగారి మీద నిజంగా ప్రేమ ఉంటే, ఈ మంటల్లోకి వెళ్ళి, లోపల ఉన్నవారిని రక్షించు' అంటారు. అతను సరే అని కాలుతున్న ఇంట్లోకి వెళ్ళి, ఒక నిమిషంలో లోపల ఉన్న తల్లీకూతుళ్ళని బయటకి తీసుకు వస్తాడు.

వాళ్ళు ఇంకా అతణ్ణి చంపాలనే చూస్తుంటారు. ఒక రోజు అందరూ నది దాటి వెళుతుంటారు. వారు కొత్త శిష్యునితో 'నీకు పడవ అవసరం లేదు. నీకు గురువు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి నీళ్ళ మీద నడిచిరా,' అంటారు. అతను సరే అని చెప్పి నీళ్ళ మీద నడిచి వస్తుంటాడు. వారంతా నిర్ఘాంతపోతారు.

గురువుగారు అతన్ని అలా చూడటం అదే మొదటిసారి. ఆయనకి అతను కొండ మీది నుంచి దూకటం, మంటల్లోకి వెళ్ళటం తెలియదు. గురువు గారు అతణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ, 'నీవు ఏం చేస్తున్నావు?' ఇది ఎలా సాధ్యం అని అడుగుతాడు. గురువు గారి ప్రశ్నకు 'ఇది సాధ్యమే గురుదేవా! ఇదంతా మీలోని శక్తితోనే నేను చేస్తున్నాను' అని జవాబు ఇస్తాడు. అపుడు గురువు ఆలోచిస్తాడు, 'నా పేరులోని శక్తితో ఈ అమాయకుడైన వ్యక్తి అంత గొప్ప పని చేస్తే, నేను ఇంకా ఎంత గొప్ప పని చేయగలనో కదా!' అనుకొని లేచి వచ్చి నీటి మీద నడవబోయి నీటిలో మునిగిపోతాడు.

విశ్వాసానికి గొప్ప శక్తి ఉంది. అది మన తర్కానికి, తెలివితేటలకి అతీతంగా పని చేస్తుంది. ఏదైతే తర్కానికి అతీతంగా ఉంటుందో అది సత్యం. అది ఎప్పటికీ తప్పు కాదు. అపజయం ఉండదు. ఎందుకంటే మీరు గురువుని నమ్మినప్పుడు ఆయన మీ బాధ్యత తీసుకుంటారు. అందులో ఆయనకి అపజయం ఉండదు. ఒక విషయం అర్ధం చేసుకోండి; మీరు ముందు గురువులకి అధీనమై ఆ తరువాత మీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు అనుకోవద్దు. అలా చేయకూడదు. ముందు ఒక విషయం తెలుసుకోండి, నిజమైన అధీనం అనేది జరిగితే అసలు తెలివితక్కువ పనులు చేయరు. నిజమైన అధీనత అంటే చేతనస్థితి, అంతే కాని అది ఒక విషయం లేదా ఒక ప్రయత్నం కాదు.

సన్న్యాసం అంటే గురువుల సమక్షంలో సమూహంలో కొందరి చేతనస్థితి వికసించటమే. కొన్ని సంవత్సరాలుగా సన్న్యాసం అనేది ఎప్పుడూ సమూహాలో జరుగుతుంది. చాలా మంది గొప్ప గొప్ప గురువులంతా పెద్ద సమూహాల్లోనే సన్న్యాసదీక్షని ఇచ్చేవారు. ఎప్పుడైతే సమూహంలోని వారంతా ఆ ప్రేమలో కరిగిపోతారో, అందులో ఐక్యం అయిపోతారో అప్పుడే సన్న్యాసం అనేది జరుగుతుంది. అప్పుడు అకస్మాత్తుగా అద్భుతమైన అందం నలు దిశలా వ్యాప్తిస్తుంది. అకస్మాత్తుగా సృష్టి సర్వం అద్భుతంగా, ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. చేతనస్థితి తాలూకు శక్తి మీ జీవనసరళిగా మారుతుంది. అప్పుడు మీ నుంచి అంతు లేని శక్తి పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఎటువంటి కారణం లేకుండానే ఎదుటివారు అద్భుతమైన అందంతో కనిపిస్తారు. ప్రతిదీ కూడా చాలా నాణ్యతతో, కచ్చితంగా కనపడుతుంది. మీ పరిసరాలన్నీ వికసిస్తున్న భావం కలుగుతుంది. అంటే సృష్టి అందంగా అయిందని కాదు. సృష్టి ఎప్పుడూ అదే విధంగా ఉంటుంది. మీరు ఆ సృష్టికి స్పందించటం ప్రారంభించారు అంతే. మీలోని మానవత్వలక్షణాలు ఉన్నతంగా మారాయి అంతే, అదే సన్న్యాసం. ఎప్పుడైతే మీరు సర్వసృష్టికి స్పందిస్తుంటారో మీలోని లక్షణాలు మరింత ఐశ్వర్యవంతమవుతాయి. ఎప్పుడైతే ఆ సృష్టిలో కరిగిపోతారో, దాని కోసం తపించిపోతారో, అప్పుడు మీలో సన్న్యాసం అనేది జరగటం ప్రారంభమవుతుంది.

ఒక విషయం అర్థం చేసుకోండి; ఎప్పుడైతే సన్న్యాసం అనేది జరుగుతుందో మీరు సృష్టికి అందాలు తెస్తారు. మీరు సృష్టించగలుగుతారు. అందరూ సన్న్యాసం అంటే సృజనాత్మకతని వదిలేయటం అనుకుంటారు. అది సరి కాదు. సన్న్యాసంలోని శక్తి సృజనాత్మకశక్తి. సన్న్యాసంలోని ఈ లక్షణం గురించి ఎక్కువగా అందరికీ తెలియదు.

ఎప్పుడు సన్న్యాసం జరుగుతుందో అదే మంచి ముహూర్రం

ఒక రోజు ఒక వ్యక్తి సోక్రటీస్ దగ్గరకి వచ్చి, 'ఓ మహాత్మా! నేను నీ దగ్గరికి జ్ఞానం కోసం వచ్చాను.' అంటాడు. సోక్రటీస్ ఆ వ్యక్తిని సముద్రం దగ్గరకి తీసుకువెళ్ళి అతని తలని నీళ్ళలో ముంచి కొన్ని సెకండ్లపాటు నొక్కి ఉంచుతాడు. అతన్ని వదలగానే అతను ఆయాసపడుతూ గబగబ శ్వాస తీసుకుంటూ బయటకి వస్తాడు. సోక్రటీస్ అతన్ని చూస్తూ 'ఇందాక ఏమన్నావో మళ్లా చెప్పు, అంటాడు. అతను 'నాకు జ్ఞానం కావాలి' అంటాడు. సోక్రటీస్ అతన్ని మళ్ళా నీళ్ళలో ముంచి ఇంకాస్త ఎక్కువ సేపు ఉంచి వదులుతాడు. మరలా అతన్ని 'నీకు ఏం కావాలి?' అని అడుగుతాడు' అతను 'జ్ఞానం' అని జవాబు ఇస్తాడు. సోక్రటీస్ మళ్ళా నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి అతని తలని ముంచి అతన్ని వదిలి అదే ప్రశ్న అడుగుతాడు. ఆ విధంగా కొన్ని సార్లు చేసాక ఆ వ్యక్తి చివరికి 'నాకు గాలి కావాలి' అంటాడు. అప్పుడు సోక్రటీస్ 'మంచిది. నీకు గాలి ఎంత అవసరమో జ్ఞానం అంతే అవసరం అనుకున్నప్పుడు అది నీకు దొరుకుతుంది' అంటాడు.

సన్న్యాసం అనేది మీ అంతరంగంలో జనించే ఒక లోతైన కోరిక అయి ఉండాలి. అది మీలో లోతైన ఆశయం అయివుండాలి. ఆ కోరిక నిరంతరం అదే స్థాయిలో లేకపోయినా పరవాలేదు. మీరు ఉన్నతస్థితిలోకి పెద్ద అడుగు వేయగలరు. అది నిరంతరం స్థిరంగా ఉండనవసరం లేదు. స్థిరంగా ఉండాలి అనేది మీ ఆశయం కానవసరం లేదు. అది మీలో నాటుకుంటే చాలు, మీరు సన్న్యాసానికి సిద్ధమైనట్లే. మీరు ఒక అడుగు వేయగలిగితే, ఆ అడుగు మిగతా పని చేసుకుపోతుంది.

ఒక వ్యక్తి శీతకాలంలో హిమాలయపర్వతాల వైపుగా నడిచి వెళుతుంటాడు. ఒక వృద్ధుడు ఈ వ్యక్తిని చూసి 'పర్వతాల దగ్గర చలి ఎక్కువగా ఉంటుంది. మీరు భరించగలరా?' అని అంటాడు. ఆ వ్యక్తి వృద్ధుని వైపు చూస్తూ 'నా హృదయం ఇప్పటికే అక్కడికి చేరి అక్కడ ఉంది. మిగిలిన భాగం అక్కడికి చేరి అక్కడ ఉండటం సులభమే' అని జవాబు ఇస్తాడు.

దీక్ష అనేది పని ప్రారంభానికి మొదలు. సన్న్యాసానికి బయటి ప్రపంచంలో సహాయం చేసేవి, మీ అంతరంగప్రపంచంలో ఉన్న దీక్షకి సహాయంగా ఉంటాయి. మీ లోపల ఉన్న శక్తిని బట్టి మీరు సన్న్యాసానికి సిద్ధంగా ఉన్నారు అని నేను చెప్పగలను. శక్తిని మీ తెలివితేటలతో, తర్కంతో విశ్లేషించలేరు. ఇది తర్కానికి అతీతమైంది. అర్థం చేసుకోండి; మీరు సన్న్యాసం తీసుకున్న క్షణం మంచి ముహూర్తం. మీరు తరువాత దాన్ని వదిలేసినా, దాని గురించి బాధపడనవసరం లేదు. ఎందుకంటే సన్న్యాసం అనేది మీలో నాటబడింది. ఒక్కసారి సన్న్యాసి అయితే అతను ఎప్పటికీ సన్న్యాసే. అది మళ్ళా సరైన సమయంలో జరుగుతుంది. అదే చివరిది కావచ్చు.

సన్నాసం అనేది వివేకవంతులు చేసే నిర్ణయం. జీవితంలో ఒక స్థాయికి వచ్చినపుడు, నిరాశానిస్పుహలు శిఖరాగ్రస్థాయికి చేరినప్పుడు, బయటి ప్రపంచం అనేది మీకు ఉపయోగం లేని విషయం అనే స్థితికి చేరినప్పుడు, ఇంతకు మించి సాధించటానికి ఇక ఏదీ లేదు అని అనుకున్నప్పుడు, మీకు ఎంపిక చేసుకోవటానికి మూడు విషయాలు ఉంటాయి.

మొదటిది : ఆత్మహత్య. ఆత్మహత్య మీకు వెంటనే స్వేచ్ఛని ఇస్తుంది. కానీ ఇందులో బాధ అధికంగా ఉంటుంది. చాలా మంది ఆత్మహత్య చేసుకోవాలి అంటే ధైర్యం కావాలనుకుంటారు. ధైర్యం అనేది ఒక అందమైన మాట. దాన్ని చాలా తప్పుగా ఉపయోగించారు. కారాన్ని కళ్ళలో పోసుకోవటానికి మీకు ధైర్యం కావాలా? లేదు. అది తెలివితక్కువ తనం, మూర్ఖత్వం, అవును కదా! అదే విధంగా ఆత్మహత్య చేసుకోవటానికి ధైర్యం అవసరం లేదు. అది తెలివితక్కువతనం. దీనిలో ధైర్యానికి సంబంధించి ఏమీ లేదు.

ఆత్మహత్య వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకోండి. మీ ఈ జీవితకాలం 90 సంవత్సరాలైతే, మీరు 45వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుంటే మిగిలిన 45 సంవత్సరాలూ మీరు ప్రేతాత్మగా ఉండవలసిందే. 90 సంవత్సరాల తరువాత మాత్రమే మీరు శరీరాన్ని, మరో జన్మని తీసుకోగలుగుతారు. ఈ 45 సంవత్సరాలూ మీరు భయంకరమైన నరకాన్ని అనుభవించాలి.

అది మీరు శరీరంలో ఉన్నప్పటి కష్టం కంటే భయంకరమైంది. మీరు అనుకున్నట్లు ఆత్మహత్య మీకు స్వేచ్ఛని ఇవ్వదు.

ఇక రెండవ విషయం: మీరు ఏదైనా మత్తు పదార్ధానికి అలవాటు కావచ్చు. అది నెమ్మదిగా మీ లోపల మీరు నింపుకుంటున్న విషం. ఇది కూడా తెలివితక్కువతనం. ఎందుకంటే తెలిసి తెలిసి మీ శరీరాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు.

మిగిలిన మూడవ మార్గం వివేకంతో కూడిన మార్గం. అది మీలోకి మీరు చూసుకో గలగటం. ఎప్పుడైతే మీకు ఇక బయటి ప్రపంచంతో పని లేదు అనిపిస్తుందో, మీరు మీ అంతరంగంలోకి వెళ్ళే సమయం వచ్చింది అని అర్థం. ఎప్పుడైతే మీరు మీ అంతరంగంలోనికి వెళ్ళాలి అనుకుంటారో అప్పుడు మీ లోపల సన్నాసం ప్రారంభమైంది అని అర్ధం. సన్న్యాసం అంటే ఒక అద్భుతమైన రసాయనచర్య. అది మీ జీవితసరళిని, మీలోని శక్తిని జ్ఞానోదయం వైపు మళ్ళిస్తుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికతని ఆశ్రయించాలి అనే ఆలోచన కలుగుతుందో మేధావి అయిన వ్యక్తి సన్నాసంలోకి ఒక పెద్ద అడుగు వేసాడు. ఆధ్యాత్మికప్రయాణంలో సన్న్యాసం దగ్గరి దారి.

సన్నాసం అంటే నీ మీద నీవు ఏకాగ్రత నిలిపి నీకు నీవు అప్పాయింట్‌మెంట్ ఇచ్చుకోవటమే. నీకు నీవు చేతనస్థితిలో నాలో నేను కాని విషయాల్ని నాశనం చేసేస్తాను, నన్ను నేను శుభ్రపరచుకుంటాను అని చేసే నిర్ణయం. ఒక్కసారి మీరు నిర్ణయం చేయగలిగితే మీరు చూసే పద్దతి, వినే విధానం మాట్లాడటం – అన్నీ పూర్తిగా మారిపోతాయి. ఆ విషయమే మీలో కొత్త అర్థాన్ని ఇస్తుంది. సన్నాసనిర్ణయం మీలో ఈ విధంగా పని చేస్తుంది. మీలోని తర్కాన్ని, తెలివిని ఒక పక్కన పెట్టి కేవలం మీలో ఉన్న శక్తికి అనుగుణంగా మీరు సన్నాసం తీసుకుంటే, మీ జీవితంలో జరిగే అద్భుతాల్ని మీరే చూడగలరు. ఎందుకంటే సన్యాసం ముఖ్య లక్షణం, మీతో అవసరం లేకుండానే మీలో మార్పు తీసుకురావటం.

సన్నాసం మాత్రమే మీ భవిష్యత్తుకి పరిష్కారం. ఎందుకంటే సన్నాసం మాత్రమే మీలో మీరు స్థిరపడగలిగే విధంగా చేస్తుంది. ఆ విధంగా స్థిరపడి మీరు బయటి ప్రపంచంలో ఆడుతూ, పాడుతూ ఆనందపారవశ్యంలో జీవించవచ్చు. సన్నాసం మీరు ఎన్ని పాత్రలైనా పోషిస్తూ, దేనిలో కూడా మీరు అదే అనే ముద్ర పడకుండా కాపాడుతుంది. అది మిమ్మల్ని నిత్యం ఉత్సాహభరితంగా ఉంచుతుంది. ఆనందపారవశ్వంతో ఉంచుతుంది. మీరు ఈ భూమి మీద జన్మని ఎందుకు తీసుకున్నారో ఆ అనుభవాన్ని మీకు ఇస్తుంది.

The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam స్మృతులు

(ఈ భాగాన్ని THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM బాల్యస్నేహితుడు చెప్పిన కొన్ని విషయాల నుంచి తీసుకోవటం జరిగింది. సంపత్ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి జ్ఞానోదయం కలగక ముందు చాలా సన్నిహితుదు. ఆయన చిన్నప్పుడు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలోని జ్ఞానోదయతృష్ణ గురించి ఈ విధంగా వివరించారు).

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM పాలిటెక్నిక్ చదివే రోజుల్తో, ఇక్కడ తాను సాధించే విషయాలు వృథా అనే స్థితికి వచ్చారు. అప్పుడు ఆయన ఒక సేవకుడుగా మారారు. ఎపుడైతే ఒకటి సాధించాలనే ఆలోచన మనకి వస్తుందో, అప్పుడు మనం అన్ని విషయాల్ని తోసేసి, కేవలం సాధించాలి అని అనుకున్నా దాని మీద ఏకాగ్రతని నిలుపుతాం. ఇది ఎలా ఉంటుందంటే చిన్న పిల్లవాడి మొండి పట్టులా ఉంటుంది. మనం కావాలి అని అనుకున్నది సాధించే వరకూ నిద్ర, భోజనం వద్దు అని అనుకుంటాం. స్వామి ఆ విధంగా అయ్యారు.

మా సొంత ఊరు తిరువణ్ణామలె గొప్ప ఆధ్యాత్మికకేంద్రం. అక్కడికి చాలామంది ఆధ్యాత్మికయోగులు వస్తుంటారు. వారు ఆ ప్రాంతమంతా ఉంటూ, తమ తమ మార్గాల్లో సత్యాన్వేషణ చేస్తుంటారు. ఆ సమయంలో స్వామి అటుగా వెళ్ళే సన్నాసుల్ని అర్ధిస్తూ ఉండేవారు. ఆయన వారి దగ్గరకి వెళ్ళి 'నన్ను మీతో తీసుకు వెళ్ళండి. నాకు ఏదైనా సహాయం చేయండి. దయచేసి నన్ను మీతో తీసుకువెళ్ళండి' అని అడుగుతుండేవారు.

ఆ సమయంలో తిరువణ్డామలెకి ఒక కొత్త ఆధ్యాత్మిక అన్వేషకుడు వచ్చాడు. అతని వయస్సు 28–30 మధ్య ఉంటుంది. అతనికి, నున్నటి గుండు, దానికి రుద్రాక్షలు ఉండేవి. మెడలో చక్కటి రుద్రాక్షమాల, చెవులకి బంగారు కుండలాలు ఉండేవి. అతన్ని చూడటానికి అచ్చం శివుడిలా ఉండేవాడు. అతన్ని చూస్తే చాలు, ఆయన పాదాలకు నమస్కరించాలనిపించేది. ఆయనలో గొప్ప తేజస్సు ఉండేది. అతను చక్కటి ఆధ్యాత్మిక గీతాలు, పురాతనమైన పద్యాలు పాడుతూ ఉండేవాడు. ఆయన పాడుతుంటే అందరూ కన్నీళ్ళతో ఆ పాటలో కరిగిపోయేవారు.

అతను కేవలం ఒక ఆధ్యాత్మికపరివ్రాజకుడు. అతనికి సత్యాన్వేషణ మీద అంత తీవ్రమైన కోరిక లేదు. అతను చూడటానికి శివునిలా కనపడేటప్పటికి ఆయనని చూసిన స్వామికి ఆయనలోని కోరిక మరింత రగలసాగింది. ఆయనలో స్వామి శివుడిని మాత్రమే చూడగలిగేవారు. ఆ వ్యక్తిని చూడగానే స్వామి కన్నీళ్ళతో ఆయన పాదాల మీద వాలిపోయారు.

ఆయనని 'స్వామీ, దయచేసి మీరు నన్ను మీతో తీసుకు వెళ్ళండి. నన్ను మీతో తీసుకు వెళ్ళండి. నేను మీతో వస్తాను. నాకు సహాయం చేయండి' అని ప్రాధేయపడ్డారు. స్వామిని అలా చూసి నేను ఆశ్చర్యపోయాను.

స్వామిలోని ఆధ్యాత్మికతృష్ణ శిఖరాగ్రానికి చేరింది. అందుకే ఆయన ఏ యోగిని కాని, సన్న్యాసిని కాని చూస్తే చాలు, నాకు ఏదైనా చేయండి, నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడేవారు. వారెవరూ కూడా స్వామిని చూసి ఆయనకి తాము ఏ సహాయం చేసే అర్హత లేనివారం అని అనుకునేవారు. స్వామి చాలా ఉన్నతస్థితి నుంచి (ఆధ్యాత్మికంగా) వచ్చినట్టు వారికి స్పష్టంగా తెలిసేది. వారంతా ఆయనకి ఏమీ సహాయం చేయలేమని చెప్పి వెళ్ళిపోయేవారు.

స్వామి పడుతున్న వేదన చూసి, అప్పటి నా స్థితితో ఆయనకి తీవ్రమైన కోరిక ఉందని అర్ధమైంది. ఆయన యోగుల్ని కన్నీళ్ళతో ప్రార్ధించే స్థితి చూసి అంతిమ సత్యాన్వేషణకి ఆయన పడుతున్న ఆవేదన అర్ధమైంది. ఆయన ఏ విధంగా బాధ పడేవారో నేను మీకు చేసి చూపిస్తే మీరు భరించలేరు.

అటువంటి కొన్ని సంఘటనలు నాలో చాలా లోతైన గుర్తులుగా ఉండిపోయాయి. నేనెప్పుడూ, ఎందుకు ఈయన ఇంత దుఃఖిస్తున్నాడు, అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఎందుకు ఇతను ఇవన్నీ చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయేవాడిని. ఇప్పుడు నాకు అర్ధమవుతుంది. బహుశా అప్పటిలో నేను ఒక రాతి మనిషిగా ఉండేవాడినేమో. నాకేమనిపిస్తుందంటే, ఈ విషయాల్ని అర్ధం చేసుకోవాలన్నా గురుదేవుల కృప అవసరం అని. ఎవరైనా ఆధ్యాత్మికవిషయాలు చెప్పినప్పుడు ఆ విషయాలు మన అంతరంగంలోకి వెళ్ళి అవి అక్కడ పని చేయాలంటే మనకి గురుకృప అవసరం. నేను ఒక్కోసారి అనుకుంటాను, కనీసం నేను స్వామితో ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలైనా అర్థం చేసుకోగలిగాను అని.

నేను స్వామిని అడిగేవాడిని, నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు? అని. దానికి ఆయన 'నేను ఏమీ చేయలేకపోతున్నాను. నేను ఇంకా ఇక్కడ ఉండలేకపోతున్నాను. నేను దేని మీదా ఏకాగ్రత నిలుపలేకపోతున్నాను. నేను ఇంకా ఇక్కడ ఉండలేనేమో అనిపిస్తుంది. సమయం వచ్చింది. ఇక నేను వెళ్ళిపోవాలి' అని చెబుతుండేవారు.

అప్పట్లో నాకు ఇటువంటి మరొక జీవితం అనేది ఉంటుంది అని తెలియదు. జ్ఞానోదయమే జీవితం అంతిమలక్ష్యం అని తెలియదు. దాని కోసమే మనం జన్మ తీసుకున్నామని తెలియదు.

ఆ రోజుల్లో ఆయన తనకి ఎవరూ సహాయం చేసేవారు లేక శ్రమపడేవారు. అటువంటి స్థితిలో నేను కూడా వెళ్ళవచ్చు అని ఎలా అనుకోగలను. చాలా సార్లు 'నేను కూడా వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాను' అని నాతో అంటే నేను సరే….. అని మాత్రమే అనగలిగేను కానీ మరేమీ మాట్లాడలేకపోయాను. అంత ధైర్యం చేయలేకపోయాను.

నిజమైన ప్రేమ ఆధ్యాత్మికమార్గంలో అడ్డురాదు

నిజమైన తల్లి సమయం వచ్చినప్పుడు తన బిడ్డలని స్వేచ్ఛగా వెళ్లనిస్తుంది. తల్లి ఎల్లకాలం బిడ్డల్ని తన అధీనంలోనే ఉంచుకోవాలి అని అనుకుంటే, ఆమె ఆ బిడ్డకి జన్మనియ్యలేదు. బిడ్డకి జన్మనియ్యటం అంటే ఒక విధంగా స్వేచ్ఛని ఇవ్వటం. ఆమె బిడ్డని తన శరీరం వదిలి వెళ్లనిస్తుంది. ఏ తల్లి అయితే తన బిడ్డలో ఆ తరువాత ఉండే ఉత్తమస్థితికి చేరాలనుకుంటుందో, ఎవరైతే బిడ్డని స్వేచ్ఛగా వెళ్ళనిస్తారో, ఎవరైతే తన బిడ్డకి చక్కని ప్రోత్సాహాన్ని ఇవ్వగలుగుతారో, ఆమె మాత్రమే నిజమైన తల్లి.

ఒక విషయం అర్థం చేసుకోండి; మీరు అంతగా బిడ్డలని మీ అధీనంలోనే ఉంచాలి అని అనుకుంటే, మీరు బిడ్డలని స్వేచ్ఛగా వెళ్లనీయటం అంత బాధగా ఉంటే, అప్పుడు బిడ్డకి అసలు జన్మనియ్యకూడదు. తల్లీబిడ్డల మధ్య ఉన్న ఆ పేగు బంధాన్ని తెంచకుండా అలా ఉంచేయాలి. మీరు బిడ్డలకి జన్మనిస్తేనే కదా ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యేది. అదే విధంగా ఆ బిడ్డతో బంధాన్ని తెంచి స్వేచ్ఛని ఇస్తేనే కదా ఆ బిడ్డ మానసికంగా పెరిగేది. భౌతికంగా బంధాన్ని తెంచేసే అది జన్మ. మానసికబంధాన్ని తెంచేసే అది సన్నాసం.

అర్థం చేసుకోండి; ఈ విధంగా చూస్తే నేను చాలా అదృష్టవంతుడినని. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి 'నేను సన్నాసజీవితం కోసం ఇల్లు వదిలి వెళుతున్నాను' అని రాత్రి 11 గం. సమయంలో చెప్పాను. అంతకు ముందు నేను గుడికి వెళ్ళి కొంత సమయం అక్కడ గడిపి ఇంటికి మామూలు సమయానికి వచ్చాను. తాళంతో తలుపు తీసి లోపలికి వెళ్ళాను, యోగులు వేసుకొనే చెక్క పాదుకలు వాడేవాడి రాతి నేల మీద అవి శబ్దం చేసేవి. ఆ శబ్దం విని మా అమ్మ వచ్చి నాకు భోజనం పెడుతుంది. ఒక్కొక్కసారి గుడిలోనే నేను ఏదైనా తింటే ఆ విషయం మా అమ్మకి చెప్పి, ఇద్దరం నిద్రపోయేవారం.

ఆ రోజు రాత్రి కూడా మా అమ్మ నాకు భోజనం సిద్ధం చేస్తోంది. ఆమెని పిలిచి 'అమ్మా నేను సన్నాసజీవితం కోసం ఇల్లు వదలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నేను గుడిలో భోజనం చేసాను. అయినా నాకు భోజనం పెట్టు. నేను తింటాను. ఎందుకంటే రేపు నేను ఉండను' అని చాలా మామూలుగా చెప్పాను. కానీ అది ఆమెకి ఒక అనుకోని షాకు. ఆమె నాతో ఏమీ అనలేదు. ఒక సంగతి నేను ఏదైనా ఒక నిర్ణయానికి వస్తే మారను అని వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి ఒక విషయాన్ని నేను చెప్పే ముందు నా అంతరంగంలో ఆ విషయం మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంటుందని అందరికీ తెలుసు. నేను ఏదైనా చెప్పానంటే అది జరుగుతుందని తెలుసు.

ఆమె కళ్ళ నుంచి నీరు రావటం మొదలైంది. నేను ఆమె వైపు చూసి 'అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు? అంటే నన్ను వెళ్ళవద్దు అని చెబుతున్నావా?' అని అడిగాను. ఆమె కాదు అన్నట్టు తల తిప్పుతూ 'కాదు, నేను ఆ విధంగా అనటం లేదు. నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. అందుకే ఏడుపు వస్తూన్నది. నేను ఎందుకో ఈ విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నాను. అంతే. నీవు వెళ్ళవద్దు అని నేను ఎలా చెప్పగలను? అంది.

ఇంత కాలం బట్టి నన్ను చూస్తున్నది ఇటువంటి రోజు వస్తుందని తెలుసు. ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానని తెలుసు. నా జాతకంలోనే అది ఉంది. ఇందులో చక్కని విషయం ఏమిటంటే, ఆమె ఎప్పుడూ లేదు అని చెప్పలేదు. ఆమె అలా అడ్డుపెట్టకపోవటమే కాదు, ఈ విషయాన్ని మా నాన్నగారికీ ఆమే చెప్పింది. మా నాన్నగారు మరోలా అనుకున్నారు. మా అమ్మ నన్ను తిట్టింది కాబోలు, అందుకు కోపం వచ్చి నేను వెళ్ళిపోతున్నానని ఆయన, మా అమ్మని 'ఎందుకు తిట్టావు. ఎందుకు అతనికి సమస్యలు సృష్టిస్తున్నావు' అని గట్టిగా అడిగారు. మా అమ్మ అది కాదు అని చెప్పాక ఆయన మౌనంగా ఉండిపోయారు.

అది మామూలుగా, తిన్నగా చెప్పిన ఒక మాట. మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి కూర్చొని, 'స్వామీ మీ అమ్మ నీవు ఏదో అన్నావని చెబుతుంది అది నిజమేనా? అని అడిగారు. తమాషాగా, అనుకోకుండా ఆ రోజుల్లో అందరూ నన్ను స్వామీ అని పిలిచేవారు. 'అవును సన్నాసజీవితం కోసం, జ్ఞానోదయం కోసం ఇల్లు వదలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను,' అని జవాబు ఇచ్చాను. ఇది ఆయనకి ఒక షాకు. కానీ ఆయనకి నేను చాలా విరామంగా, దృఢంగా, స్పష్టంగా, సమతుల్యంగా ఉండటం కనిపించింది. ఆయన నాతో ఒక్క మాట మాత్రం చెప్పారు. 'ఎప్పుడైనా నీకు ఆరోగ్యం బాగా లేకపోతే మాకు తెలియచేయి, మేం నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం అంతే' అని చెప్పారు. ఆయన చాలా మూమూలుగా చెప్పారు. ఎప్పుడైనా నీ ఆరోగ్యం బాగా లేకపోతే, ప్రయాణంలో ఇబ్బంది కలిగితే మాకు తెలియచేయి. మేం వచ్చి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం. ఇది తప్ప ఇంకేమీ లేదు. నీకు ఏది ఇష్టం అనిపిస్తే అలాగే చేయి.

నా తల్లిదండ్రులు నా మార్గానికి ఎప్పుడూ అడ్డుపడలేదు. ఒక విషయం అర్థం చేసుకోండి. అనుబంధాలు ఏవైనా సరే, తల్లిదండ్రుల, బిడ్డల మధ్య అనుబంధమైనా, పిల్లల ప్రగతికి అడ్డు రాకపోతే అది చాలా మంచి అనుబంధం. నేను చాలా మంది యువకుల్ని చూసాను. చాలా ధైర్యంగా, ఉత్సాహంగా, ఆధ్యాత్మికమార్గాన్ని ఎంచుకునే శక్తి ఉంటుంది కానీ వారికి ఆ అవకాశాన్ని ఇవ్వరు. వారిలో శోధనలు చేయనీయరు వారి తల్లితండ్రులు.

వారంతా మామూలు జీవితంలో నిమగ్నమై, తల్లితండ్రుల అహంకారాన్ని తృప్తి పరుస్తూ, బిడ్డల్ని పెంచుతూ జీవించేసారు. ఎవరో, ఏ కొద్ది మందో మాత్రమే అన్వేషించే ధైర్యంతో ముందుకి సాగుతారు. నేను మీ పిల్లలని సన్యాసులుగా చేయమని చెప్పటం లేదు. ఎవరికైనా ఆ జీవితం పట్ల ఆసక్తి కలిగితే వారికి అడ్డు రావద్దు అని మాత్రం చెబుతున్నాను. వారి మార్గానికి అడ్డు రాకుండా ఉంటే మీరు అదృష్టవంతులవుతారు.

మీ పిల్లలు ఎంచుకున్న మార్గాన్ని వివేకంతో గమనించండి. మీ బిడ్డ అంతిమమార్గాన్ని ఎంచుకున్నాడు. అతను ఆ మార్గంలో బాధ పడినా, దుఃఖపడినా, అపజయం పొందినా ఏమీ పరవాలేదు. ఆ విషయంలో భయం వద్దు. నేను ఇంతకు ముందు పది జన్మల్లో అపజయాన్ని పొంది ఉండి ఉండవచ్చు. అందుకే ఈ జన్మలో విజయం సాధించాను.

మరొక విషయం సన్నాసానికి మీరు పడుతూ, జ్ఞానోదయాన్ని పొందకపోయినా పరవాలేదు. అది అపజయం కాదు. అది ఘనవిజయం. ఎందుకంటే మీరు పూర్ణత్వంలో జీవించారు. అది కూడా చేతనస్థితిలో మీరు పూర్ణత్వంలో జీవించారు. చేతనస్థితిలో ఉన్నప్పుడు సర్వాంతర్యామి నిరంతరం మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు. ప్రతి దశలో మీకు రక్షణ ఉంటుంది. కాబట్టి ఏ పరిశోధన అయినా, చేతనస్థితిలో మీరు చేసే ఏ సాహసకార్యమైనా దాన్ని ప్రోత్సహించండి, అనుమతించండి. వారికి ఆధారంగా నిలబడండి. నేను నా తల్లిదండ్రులకు నా మార్గంలో అడ్డు కల్పించినందుకు వారికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలియచేస్తుంటాను.

  • మనం మన చుట్టుపక్కల వున్నవాటితో, సర్దుకుపోవడానికి అనుగుణంగా ఉండగల శక్తి మన పవర్ గణ మీద ఆధారపడి ఉంటుంది.
  • కలసిపోవలసిందే.
  • సాధన అంటే సరైన దిశలో, ఎక్కడా ఆగకుండా అలా నిరంతరం ప్రవహిస్తున్నట్టు వెళుతూ ఉండటమే.
  • విశిష్టశక్తికి అభీష్టమె, ఆ శక్తి తాలూకు మేధకు అనుగుణంగా ముందుకి సాగటమే సన్న్యాసం.

★ సన్యాసించరు. మీరు అన్నింటితోనూ జీవిస్తారు కాని దేని వల్లా మీ నిశ్చలతని పోగొట్టుకోరు.

  • మనస్సుని ఐదు జ్ఞానేంద్రియాల నుంచి మళ్లించటం అనేది, జ్ఞానేంద్రియాలు ఆత్మలో ఐక్యమైనప్పుడే సాధ్యమవుతుంది.

  • సామాన్యంగా అందరూ ప్రేమ అనుకునే ప్రేమ ఒక కారణంతో లేదా కోరికతో ఉంటుంది.

  • జీవితపరిష్కారాల్ని మీ అంతరంగానికి అన్వయించటం ద్వారా స్వేచ్ఛని మేల్కొలపండి. ఆ విధంగా వచ్చే స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛ.

  • నిజమైన తల్లి సమయం వచ్చినప్పుడు తన బిడ్డలని స్వేచ్ఛగా వెళ్లనిస్తుంది. తల్లి ఎల్లకాలం బిడ్డల్ని తన ఆధీనంలో ఉంచుకోవాలి అని అనుకుంటే, ఆమె ఆ బిడ్డకి జన్మనియ్యలేదు.

పరమానందం అనే మీ రాజ్యాన్ని తిరిగి పొందటమే జీవన్ముక్తి

ఇప్పుడు మనం అంతిమదశకి చేరాం. దీన్నే నేను అత్యున్నత అనుభవం అంటాను. మనం ఎవరు అని తెలుసుకొని ఈ విశ్వంలో అంతిమజ్ఞానాన్ని, అనుభవాన్ని తెలుసుకోవటమే. అజ్ఞానం అనే చీకటి నుంచి సత్యం అనే వెలుతురులోకి వెళ్ళాం. మనం జ్ఞానోదయాన్ని పొందాం.

జ్ఞానోదయమైనవారు ఈ భూమి మీద ఎందుకు అవతరిస్తారు

ఎవరైనా ఈత కొడుతుంటే మీకు మూడు విషయాలు అర్థం అవుతాయి, మొదటిది ఈత కొట్టడం సాధ్యమే, మనిషి నీళ్ళలో తేలగలడు. రెండవది, ఒక వ్యక్తి ఈత కొట్టకలిగితే నేనెందుకు చేయలేను. నేను ఈతకొట్టగలను. మూడవది, నేను కూడా నీళ్ళలోకి దూకుతాను అనే ప్రోత్సాహం, ధైర్యం మీకు కలుగుతాయి.

అదే విధంగా జ్ఞానోదయమైనవారు ఈ భూమి మీద నడుస్తూ ఉంటే, వారిని చూసినపుడు, వారి పరిసరాల్లో మీరు ఉండగలిగినప్పుడు మీకు మూడు విషయాలు అర్థం అవుతాయి. మొదటిది జ్ఞానోదయం సుసాధ్యమే. మీరు కూడా భూమి మీద భగవంతునిలా జీవించవచ్చు. రెండవది, వారికి జ్ఞానోదయం జరిగినప్పుడు, నాకెందుకు జరగదు? జ్ఞానోదయమైనవారు అతిసాధారణంగా ఉంటూ, సామాన్య మానవునిలా ఉంటారు. అప్పుడు మీకు మీ మీద నమ్మకం కలుగుతుంది. అది సాధ్యమే అనిపిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానోదయమైనవారు సమక్షంలో ఉంటారో, వారి కదలికల్ని, వారిని నిరంతరం గమనిస్తుంటారో అప్పుడు మీలో ఈ మూడూ జరుగుతాయి.

విశ్వం చేసే ఐదు పనులు

ఐదు విశ్వ కర్మలు ఉంటాయి. వాటిని పంచకర్మలు అంటారు. అవి సృష్టి, రక్షణ, నాశనం, మాయని సృష్టించటం, మాయ నుంచి ఆత్మని బయటకి తీసుకురావటం. భగవంతుడు ఈ ఐదు పనులూ చేస్తాయి.

నటరాజుకి నాలుగు చేతులు ఉంటాయి. అతనిపై చేతిలో దమరుకం ఉంటుంది, అది సృష్టికి చిహ్నం. దమరునాదం నుంచి సమస్తసృష్టి ఉద్భవించింది అంటారు. కింది చేతులు రక్షణని ఇస్తుంటాయి, పై ఎడమ చేతిలో మంట ఉంటుంది. అది నాశనానికి చిహ్నం. ఆయన మెడ చుట్టూ ఉండే సర్పం మాయకి గుర్తు. ముక్తికి ముందు దీనిలోనే చిక్కుకుంటారు.ఆయన పాదాలూ కింద ఉన్న రాక్షసుడు మాయ నుంచి బయటికి రావటానికి గుర్తు. శివుడు మాయని తన పాదాలూ కింద నాశనం చేస్తాడు. ఈ ఐదు పనులూ చేస్తూ కూడా శివుడు ప్రశాంతంగా, పరమానందంలో ఉంటాడు.

మీ సామ్రాజ్యానికి తాళం చెవి జ్ఞానోదయం

ఆయన తాండవం చేస్తూనే ఈ ఐదు పనులూ చేస్తుంటాడు. ఈ ఐదు పనులూ చేసే శక్తి విశ్వశక్తి. శివుడు మొదటి నాలుగు పనులు సృష్టి, రక్షణ, నాశనం, మాయని సృష్టించడం – అనేవాటిని ఆయన నిర్వాణశరీరంతో చేసాడు. నిరాణశరీరం ఏడు శరీరాల్లోనూ లోతైనది. దివ్యవిశ్వశక్తి తన నిర్యాణశరీరం నుంచి ఈ ఐదు పనులూ చేస్తుంది. ఈ పనులు చేయటానికి విశ్వశక్తి ఏ రూపాన్నీ తీసుకోనవసరం లేదు. శక్తిస్థాయిలోనే పరమాత్మ ఈ పనులు చేయగలదు.

అయితే ఐదవదైన, మాయ నుంచి మనిషిని బయటికి తీసుకురావటం అనే పనిని కేవలం మానవరూపంలో మాతమే చేయగలదు. విశ్వశక్తి ముందు నాలుగు పనులు చేయటానికి మీ సహకారం అవసరం లేదు కాని, మనిషిని మాయ నుంచి బయటికి తీసుకురావటానికి వారి సహాయం కావాలి.

సృష్టికి మీ అనుమతి అవసరం లేదు. రక్షణకి మీ మీద ఆధారపడదు. అదే విధంగా నాశనం మీకు తెలియ కుండా జరుగుతుంది. మిమ్మల్ని మాయలోకి పంపించటానికి మీ సహాయం అవసరం లేదు. అయితే మిమ్మల్ని మాయ నుంచి బయటికి లాగటానికి మీ సహాయం కావాలి.

భగవంతుడు మీకు ముక్తిని ఇచ్చే వీసా ఇవ్వటానికి దరఖాస్తు నింపమని అడగటమే ఇది. దాన్ని నింపి, సంతకం పెట్టి ఇవ్వాలి. ఇక్కడ సమస్య ఏమిటంటే దరఖాసు మీరు పూర్తిగా నింపరు. నింపే పనిని ఆలస్యం చేస్తారు. మీకు నమ్మకమైన ఆధారాన్ని ఇవ్వటానికి భగవంతుడు మానవరూపంలో వస్తాడు. మీకు జ్ఞానోదయం కలిగేలా చేయటానికి మనిషి రూపం తీసుకుంటాడు. ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరునిలా ఈ భూమి మీదకి వస్తాదు. ఈ భూమి మీదకి జ్ఞానోదయమైన మానవుడుగా వచ్చినప్పుడు, ఏడు శరీరాలతో వస్తాడు. ముందు నాలుగు పనులు చేయటానికి ఆయనకి నిర్వాణశరీరం ఒక్కటి చాలు, కాని మీకు జ్జానోదయం కలిగేలా చేయటానికి వచ్చినప్పుడు ఆయన ఏడు శరీరాలతో వచ్చి మిమ్మల్ని పైకి లేపుతారు.

పెద్ద అడుగు

ధ్యానకార్యక్రమాల్లో నన్ను చాలా మంది అడుగుతుంటారు. ధ్యానం చేసినప్పుడు నాలో లోతైన ప్ర‌శాంత‌త క‌లిగింది, శ‌క్తి క‌లిగింది. అంటే నేను జ్ఞానోద‌యానికి ద‌గ్గ‌ర‌గా ఉన్నాను అని అర్ధమేనా?

ముందుగా మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, మనం నిరంతరం జ్ఞానోదయానికి దగ్గరగానే ఉంటాం. అది ముఖ్య విషయం. మనం ఎప్పుడు జ్ఞానోదయానికి దగ్గరగానే ఉంటాం. ఒకరు దానికి దగ్గరగా ఉన్నారు, మరొకరు లేరు అనేది తప్ప భావం. ఉన్నది రెండు రకాలవారే, జ్ఞానోదయమైనవారు, కాని వారు అంతే. మీకు జ్ఞానోదయం జరగకపోతే, స్పష్టంగా తెలుసుకోండి మీరు జ్ఞానోదయానికి దగ్గరగా ఉన్నారు అని

మీరు 99.9 శాతం జ్ఞానోదయం పొందినా, మీరు జ్ఞానోదయం పొందలేదు అని అర్ధం. జ్ఞానోదయం సంపూర్ణమైన మార్పు. ఇది ఎలా అంటే నీరు కేవలం 100 డిగ్గీల దగ్గర మాతమే ఆవిరిగా మారుతుంది, 99 డిగ్రీల దగ్గర నీరులానే ఉంటుంది. కేవలం 100 వ డిగ్రీ మాత్రమే నీటిని ఆవిరిగా మారుస్తుంది. ఎప్పుడైనా అది నీటిలా ఉండాలి లేదా ఆవిరిలా ఉండాలి కాని రెండిటిలా ఉండదు. వేడి నీరు కూడా నిప్పుని చల్లారుస్తుంది. అంటే అది ఇంకా నీటి లక్షణాలనే కలిగి ఉన్నది కాని ఆవిరి లక్షణాల్ని కాదు. ఆవిరితో నిప్పుని ఆర్పలేరు కాబట్టి వేడి నీరెనా నీటి లక్షణాలనే కలిగి ఉంటుంది. అదే విధంగా ఎప్పుడైనా మీరు జ్ఞానోదయం పొంది ఉండాలి లేదా పొందకుండా ఉంటారు. అంతే కాని ఒకే సమయంలో రెండు సాధ్యం కాదు కాబట్టి దగ్గర అనే ప్రసక్తి లేదు.

మనం నిరంతరం జ్ఞానోదయానికి దగ్గరగా ఉంటాం

ఒక విషయం అర్థం చేసుకోండి, జ్ఞానోదయం మీకు పొడిగింపు కాదు. మీరు ఇప్పుడు ఉన్నదాని కంటే కొంచెం అభివృద్ధి కాదు, అది ఒక పెద్ద అడుగు వేయటానికి కాని పొడిగింపు కాదు. ఆధ్యాత్మిక క్రమంలో మీలో కొంత అభివృద్ధి, కొంత సృష్టత ఇలాంటివి జరిగితే అవి మాములే. ఇవన్నీ మీరు సరైన దారిలో ఉన్నారు అనటానికి చిహ్నాలు. మీరు హైదరాబాదు 100 కి.మీ. అన్న బోర్డు చూస్తే, అది హైదారాబాదుకి దారి అని మీకు చెప్పటం. మీరు ఉన్నది సరైన మార్గంలోనే అని మీకు తెలుస్తుంది. అంతే కాని మీరు గమ్యం చేరారని అర్థం కాదు.

మనం నిరంతరం ఎదుటివారు చెప్పే ఓదార్చు మాటల మీద ఆసక్తి చూపుతాం, మీరు వారి ఆసరా కోరుకుంటారు. అదే విధంగా మీరు వారికి ఆధారాన్ని ఇస్తారు, కాని గురుదేవులకి మీ ఆసరా అవసరం లేదు. అందుకే ఆయన తిన్నగా మీకు సత్యాన్ని చెబుతారు.

ఏక్కడ 99.9 శాతం జ్ఞానోదయం అనేది లేదు, అదే విధంగా జ్ఞానోదయానికి దగ్గరగా ఉన్నాను అన్నది కూడా లేదు. అయితే ఇంకా జ్జానోదయాన్ని పొందినవారు లేకపోతే ఇంకా జ్జానోదయాన్ని పొందనివారె ఉండాలి, జ్జానోదయం అంటే సంపూర్ణమైన 'ఔను' లేదా సంపూర్ణమైన 'కాదు' మధ్యలో మరేదీ ఉండదు. ఒక దశ తరువాత మరొక దశలో సాగే కార్యక్రమం కాదు జ్ఞానోదయం అంటే. కోతి నుంచి మాసవుడుగా అభివృద్ధి చెందిన క్రమంలో ఆ తరువాత మనం తీసుకునే ఒక పెద్ద అడుగే అంతిమమైన దశ జ్ఞానోదయస్థితి.

జ్ఞానోదయం అసలైన లక్ష్యం

మీరు దారిలో ఉన్నప్పుడు, ఆగి గతాన్ని రికార్డు చేయనవసరం లేదు. మీరు ఆగి గతాన్ని రికార్డు చేస్తున్నారు అనుకుంటే, స్పష్టంగా అర్థం చేసుకోండి అక్కడ రావలసిన మార్పు రాలేదు అని అర్థం. ఎప్పుడైతే మీలో సృష్టమైన పెను మార్పు వస్తుందో, మీరు ఒక పెద్ద అడుగు వేయగలరో, మీరు ఎంత అభివృద్ధి చెందారు అని లెక్కలు కట్టలేరు. ఆ అవసరం ఉండదు. ఆ అడుగు మీ తర్కానికి అతీతంగా ఉంటుంది. ఆ పెద్ద అడుగు వేసాక మీరు పూర్తిగా ఒక కొత్త వ్యక్తిగా రూపొందుతారు. మీ శరీరం మానవశరీరంలా ఉండవచ్చు కాని మీ అంతరంగం పూర్తిగా మారిపోతుంది. మీ జీవనసరళిలో గొప్ప మార్పు వస్తుంది.

జ్ఞానోదయం అంటే…

  1. అవధులు లేని అనంతమైన అనుభవం : అవధులు లేని అనంతమైన అనుభవంతో సాగిపోతూ జీవించటమే జ్ఞానోదయం. ఎప్పుడైతే మీరు మీలోని బయటి ప్రపంచం, అంతరంగ ప్రపంచపు గుర్తింపుల్ని వదిలేసి విరామంగా ఉండగలరో అప్పుడు మీరు అనుభూతితో జీవించగలరు. ఎప్పుడైతే మీరు అనంతమైన అనుభవంలో స్థిరపడతారో, ఎక్కడ చైతన్యంతో ఉండగలుగుతారో అప్పుడు మీరు జీవన్ముక్తులు. మీరు అందులో స్థిరపడలేకపోతే, కనీసం మీకు ఆ అనుభవం ఒక సారైనా జరిగితే అప్పుడు మీ అనుభవాన్ని సతోరి అంటారు.

  2. ఆత్మని, ప్రపంచాన్ని, భగవంతుడిని తెలుసుకోండి : జ్ఞానోదయానికి కావలసిన ప్రాథమిక సూత్రం మీలో మానసిక విప్లవం రావాలి. మీ గురించి, ప్రపంచం గురించి, భగవంతుని గురించి మీలో ఒక కొత్త రకమైన స్పష్టత కలగాలి.

మీరు ఎందుకు, ఎలా ఆలోచించారు, మీరు ఎలా ముందుకి నదపబడుతున్నారు. మీలో ప్రోత్సాహాన్ని కలిగించేది ఎవరు, మీ జీవితానికి ప్రేరణ ఏమిటి – ఇది అర్ధం అవటమే మీ జీవితానికి, మీ ఆత్మకి సంబంధించిన స్పష్టత ఇస్మంది. ప్రపంచంలో మీ కోరికలు ఎలా తీర్చుకోవాలి, భయాలు ఏ విధంగా తొలగించుకోవాలి, ప్రపంచం మీ మీద బలంగా మోపిన విషయాల్ని ఎలా తప్పించాలి అనే విషయాల్ని సృష్టంగా అర్థం చేసుకోవటమే జగత్తు.

భగవంతుడు లేదా ఈశ్వరుని పట్ల సృష్టత అంటే, ఆత్మ గురించి, ప్రపంచం గురించి తెలుసుకోవటమే. ఈ మూడింటినీ తెలుసుకోవటం అసలైన మూలాలని సాధించటమే జ్ఞానోదయం అంటే.

మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎలా ఆలోచిస్తున్నారు అనే దాన్ని పట్ల స్పష్టత కలిగితే మీకు ఆత్మ అనుభవాన్ని ఇస్తుంది. మీరు ప్రపంచంతో ఏ విధంగా బంధాల్ని ఏర్పరచాలి. భయంతో ఆశతో మీరు కోరుకున్నవాటిని సాధించాలి అని అనుకోవటం, మీకు అవసరం లేని దాన్ని వదిలేయటం – వీటి ద్వారా ప్రపంచానికి సంబంధించిన అనుభవం జరుగుతుంది. ఈ ఆత్మకి, ప్రపంచానికి ఆధారమైన మూలాలు భగవదనుభవాన్ని ఇస్తాయి. ఆత్మ, ప్రపంచం, భగవంతుడు అనే ఈ మూడు విషయాల్నీ సరిగ్గా అర్థం చేసుకోవటమే జ్ఞానోదయం అంటే.

  1. కారణం లేని లోతైన, అధికమైన ఉత్పాహం : నన్ను చాలా మంది అదుగుతుంటారు, జ్ఞానోదయం అయ్యాక దేంతోనైనా ఉత్పాహం, సంతోషం పొందగలమా అని. నేను చెబుతున్నాను, జ్ఞానోదయం తరువాత మాత్రమే మీరు నిజమైన ఆనందాన్ని పొందగలరు. అంతకు ముందు మీరు కేవలం సంతోషంగా ఉన్నాననుకుంటారు, అలా ఆలోచిస్తారు. జ్ఞానోదయం తరువాత సంతోషంగా, ఉల్లాసంగా ఉండటానికి జ్ఞానేంద్రియాలతో అవసరం లేదు. మీరు నిరంతరం ఆనందంలో ఉంటారు. ఏ కారణం లేకుండా ఉరకలేసే ఉత్సాహంతో, ఆహ్లాదంతో ఉంటారు. జ్ఞానోదయం అనే మాటని రెండు పదాల్లో నిర్వచించాలంటే, అది అత్యధికమైన ఉత్సాహం అని చెప్పవచ్చు, ఏ కారణం లేకుండా, ఏ వస్తువు పైన లేకుండా ఉండే అధికమైన ఉత్సాహపూరితమైన మనోభావన. అదే జ్ఞానోదయం అంటే.

నన్ను చాలా మంది అడుగుతుంటారు, ఏ కారణం లేకుండా ఎలా సంతోషంగా ఉండగలం అని. నేను వారితో ఇలా అంటాను – మీకు కారణం లేకుండా బాధపడే ఒక రహస్యం మాత్రమే తెలుసు. ఆ కళలో మీరు ఆరితేరారు. ఆ రంగంలో మీకు డాక్టరేటు ఉంది. దాన్ని కొంచెం మార్చండి. అంతే మనకి అది తెలిసినప్పుడు, ఇది నేర్చుకోలేమా?

మీరు చాలా సార్లు మూడ్ బాగా లేదు అని, ఎందుకు అలా ఉన్నారో కారణం కోసం వెతుకుతారు. కాని మీరు కారణాన్ని తెలుసుకోలేరు. ఏదో బాధతో ఉంటారు. మీలోని రసాయనశాస్త్రం లేకుండా బాధలోకి వెళ్ళటానికి అలవాటు పడిపోయారు. కొంత కాలం గడిచాక మీలోని రసాయనశాస్త్రం దీన్ని నేర్చుకుంటుంది. దాంతో అది మీ అంతరంగంలో స్థిరపడిపోతుంది, మీరు కారణం లేకుండానే బాధల్లోకి వెళ్ళగలుగుతారు. జ్ఞానోదయం అంటే ఎక్కడికో పారిపోవటం కాదు. జీవితాన్ని ఇక్కడే, ఇప్పుడే రుచి చూడటాన్ని నేను జ్ఞానోదయం అంటాను.

  1. మిమ్మల్ని మీరు చూసుకున్నట్లే ఎదుటివారినీ చూడటం : మీరు పొందే లోతైన జీవితానుభవాన్ని మీ శరీరం బయట, మీ అంతరంగంలో పొందటాన్ని నేను జ్ఞానోదయం అంటాను. మీరు మీ శరీరం లోపల మాత్రమే జీవించి లేరు. మీరు మీ శరీరం బయట ప్రతి వ్యక్తిలో, వస్తువుల్లో, చెట్లు, జంతువుల్తో, రాళ్ళలో ఉన్నారు. మీ శరీరం మీద మీకు ఉన్న పట్టు విశ్వశరీరం మీద పట్టుగా మారుతుంది. విశ్వంలోని ప్రతి అణువులో మీరు ఉంటారు. ప్రతి అణువూ విశ్వంలో ఒక భాగం.

వేదాల్లోని పురుషసూక్షంలో ఒక చక్కని శ్లోకం ఉంటుంది.

ఓం సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగుళమ్

మీ సామాజ్యానికి తాళం చెవి జ్ఞానోదయం

ఈ శ్లోకంలో విశ్వాన్ని అందమైన మానవరూపంలో 'పురుషుడుగా' వర్ణించారు. ఆయనకి వేయి తలలు, వేయి కళ్ళు, వేయిపాదాలు ఉన్నాయని చెప్పారు. ఆ రూపం భూమినంతా ఆవరించి, దానికి పది రెట్టు ఎక్కువగా ఉంది అన్నారు, ఇదే జ్ఞానోదయానుభవం.

ఒక విషయం అరం చేసుకోండి. నేను నా శరీరంలో ఎంత జీవించి ఉన్నానో శరీరం బయట కూడా అంతే జీవించి ఉన్నాను. కాబట్టి నేను లక్షల తలలలో, కళ్ళలో, పాదాల్లో ఈ విశ్వంలోని కోటాను కోట్ల జీవరాసుల్లో ఉన్నాను.

ఈ విషయం సాధించాలంటే మీరు ప్రతిదాన్ని మొదటిసారి చూస్తున్నట్టుగా చూదాలి. ఆ చూసే దానిలోకి మీ సంస్కారాల్ని (మీలో నిక్షిప్తమైన జ్ఞాపకాలు) తీసుకురావద్దు. అప్పుడు మీరు మీ శరీరంలో ఎంత లోతుగా, ఎంత గాఢతతో జీవిస్తారో మీ శరీరం బయట కూడా అంతే గాఢతతో జీవిస్తారు. మీరు దీన్ని పది రోజులు సాధన చేయండి. మీకు ఒక్కసారి ఒక క్షణం ఆ అనుభవం అయితే, మీరు దాన్ని ఎన్నటికీ పోగొట్టుకోరు. మీరు కారణం లేకుండా ఆనందపారవశ్యంలో ఉంటారు. ఏ కారణం లేకుండా మీరు ఉల్హాసంగా ఉంటారు. మీరు ఏ విషయాన్ని యథాలాపంగా తీసుకోరు. మీరు నిరంతరం ఉల్లాసంగా ఉంటారు.

  1. బంధవిముక్తత : ప్రస్తుతం మీరు మీ గతానుభవాల్ని కలిపి ఒక గొలుసు తయారు చేసుకుంటారు. మీ భవిష్యత్తులో జరగబోయే అనుభవాలు ఈ గొలుసు మీద ఆధారపడి ఉంటాయి. మీ గతం నుంచి ఏ పదాలని తీసుకున్నారో, ఏ విధంగా గొలుసు తయారు చేసారో దాని మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో మీ మాటలు, భావావేశాలు, ప్రతిచర్యలు, ఆలోచనలు – అన్నీ ఈ గొలుసు మీద ఆధారపడి ఉంటాయి. అయితే జ్ఞానోదయం జరిగాక జీవితం దీనికి వేరుగా ఉంటుంది. అవసరమైనప్పుడే ఆలోచనలు వస్తాయి. ఆ పని అయిపోయాక ఆలోచనలు మాయమైపోతాయి. మళ్ళా ఏదైనా పని ఉంటే ఆలోచనలు వస్తాయి, ఇదంతా చాలా చక్కగా, సహజంగా జరిగిపోతుంది. గొలుసుతో అవసరం ఉండదు.

మనందరం నిద్ర లేచిన దగ్గర నుంచి, నిద్ర పోయే వరకూ నిరంతరం ఒక రకమైన చికాకుతో ఉంటాం. ఏదో ఒక చికాకుని మోస్తూ ఉంటాం. ఎప్పుడూ ఎవరి మీద విరుచుకుపడాలా అని చూసుంటాం. ఏదో కారణం దొరికితే చాలు అన్నట్లు ఉంటాం. జ్ఞానోదయం తరువాత చికాకుని కలిగించే భయం, ఆశ, అపరాధభావం ఇటువంటివి ఉండవు. మీరు ఆ గొలుసుల బంధం నుంచి కొద్ది సమయం, ఒక క్షణం బయటికి రాగలిగినా మీరు జ్ఞానోదయానుభవాన్ని క్షణకాలం పొందగలరు.

ఆ గొలుసు నుంచి బయటికి క్షణ కాలంలో రాగలరు. మీరు లోతైన తెలుసుకునే తత్వంలో ఉన్నప్పుడు, మీరు ఆ క్షణాన్ని, ఎప్పుడైతే మీరు గొలుసు నుంచి విముక్తి అవుతారో ఆ క్షణాన్ని పట్టుకోగలుగుతారు. మనం చేసే తపస్సు, ఆధ్యాత్మిక శిక్షణ అంతా కూడా ఆ క్షణాన్ని పట్టుకోవటానికి. అటువంటి క్షణాలు చాలా జరుగుతాయి. మీరు ఎరుకతో ఉండి ఆ క్షణాన్ని పట్టుకోగలగాలి. మీరు ఆ గొలుసు నుంచి శాశ్వతంగా విముక్తి అయితే అదే జ్ఞానోదయం.

  1. నాలుగు శాశ్వతమైన మార్పులు : నాకు జ్ఞానోదయం కలిగినప్పుడు నాలో శాశ్వతమైన కొన్ని మార్పులు జరిగాయని చెప్పగలను.

జ్ఞానోదయం జరిగాక నిరంతరం ఉండే భయం, అపరాధభావం, కోరిక, నిరంతరం ఉండే చికాకు, పూర్తిగా మాయం అయిపోయాయి.

అందులో మొదటిది, అంతరంగంలో నిరంతరం జరిగే అంతరంగపు మాటలు ఆగి పోయాయి. మనందరిలో సాధారణంగా మాటలు జరుగుతుంటాయి. నేను మాట్లాడే సమయంలో మాటకి మధ్య విరామంలో కూడా నా అంతరంగంలో మాటలు ఉండవు. లోపల స్వచ్ఛమైన ఖాళీ ప్రదేశం, నిశ్శబ్దం మాత్రమే ఉంటాయి.

రెండవది నేను ఇక్కడితో ఆగి, ఇక్కడి నుంచి బయటి ప్రపంచం ఉంటుంది అనే భావన నాలోంచి పోయింది. నా హద్దు నాలో లేదు. నన్ను నేను అన్నింటిలో చూడగలను. ఆ భావంతో ఉంటాను. మీరు నన్ను గమనిస్తే, నా ఫోటోలు చూసి ఆనందపడే మొదటి వ్యక్తిని నేనే. నేను వాటితో నాలుగు – ఐదు రోజులు ఆడుకుంటాను.

నన్ను కొంత మంది అడుగుతుంటారు, ఇదేమిటి స్వామీజీ! మీరు మీ ఫోటోలు చూసి ఆనందిస్తున్నారు అని. నేను ఈ ఆరడుగుల రూపం మాత్రమే అనుకోను. మీరు ఏ విధంగా ఈ రూపాన్ని చూసి సంతోషిస్తారో నేను కూడా అదే విధంగా ఈ రూపాన్ని చూసి సంతోషిస్తాను. ఈ రూపం విశ్వంలో ఒక భాగంగా సంతోషిస్తాను. నిజం చెప్పాలంటే మీరు మీ ఫోటో చూసి ఆనందించటానికి మొహమాటపడతారు. ఎందుకంటే అది మీ హద్దులా భావిస్తారు, కాని నా విషయంలో అలా కాదు. నేను ఈ రూపం అనే భావం నాకు లేదు. అందుకే ఫోటోలతో ఆడుకుంటాను.

మూడవ విషయం ఈ శరీరం పురుషశరీరం అయినా, నా అంతరంగంలో భేదభావం, పురుషుడు అనే గుర్తింపు పోయాయి. నేను స్త్రీని, నేను పురుషుడిని అనే మానసిక భావం నాలో లేవు.

నాలుగవది నాలో నిరంతరం ఉండే ఉత్సాహం. చిన్నవైనా నాకు చాలా గొప్ప ఉత్సాహాన్ని, సంతోషాన్నిస్తాయి. చిన్న విషయమెనా నాలో గొప్ప ఉల్లాసాన్ని, కలిగిస్తుంది.

అది ఎంత చిన్నదైనా, చిన్న శివలింగం, చిన్న బుద్ధుడు, ప్రతి చిన్న విషయం కూడా గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

మీ సామాజ్యానికి తాళం చెవి జ్ఞానోదయం

మరొక ముఖ్యవిషయం – ఏ విషయం నాకు విసుగు తెప్పించవు. గత ఐదు సంవత్సరాల్లో వందల కొద్దీ కార్యక్రమాలు చేసాను కాని నాకు విసుగు అనిపించదు. ఎందుకంటే నాకు దృఢమైన గతం అనేది లేదు. ఎప్పుడెతే గతాన్ని దృఢంగా చేసారో అప్పుడు మీకు విసుగు పుడుతుంది. అన్నీ చూసినవేగా అనిపిస్తుంది. ఏ ముఖం చూసినా నాకు ఉత్సాహంగా ఉంటుంది. అంతే నాలో నిరంతరం ఉల్లాసం అత్యధికస్తాయిలో ఉంటుంది. జ్ఞానోదయం జరిగాక నాలో మార్పులు శాశ్వతంగా జరిగాయి.

  1. అంతిమమే కాని చివరిది కాదు : స్పష్టంగా అర్థం చేసుకోండి, జ్ఞానోదయం చివరి దశ కాదు. అది అంతిమ అనుభవమే కాని చివరిది కాదు.

అంతిమమైంది, చివరిది అన్న మాటలు వేరు వేరు అర్థాలనిస్తాయి. ఉదాహరణకి మొదటి రోజు ప్రవచనం జరిగాక ఒక వ్యక్తి నాతో, మీరు అన్ని విషయాలూ చెప్పేసారు, ఇంతకు మించి తెలుసుకోవలసినవి ఏవీ లేవు అని. మరొక వ్యక్తి, స్వామీజీ! మొదటి రోజు మీరు మమ్మల్ని మాలోకి లోతుగా తీసుకు వెళ్ళారు. ఇక అంతకు మించి లోనికి వెళ్ళలేం అనుకున్నాను. రెండవ రోజు మరింత లోతైన అనుభవాన్ని ఇచ్చారు. నేను ప్రతి రోజూ ఇక లోతుగా వెళ్ళేది లేదు అనుకునేవాడిని. కాని మాకు ప్రతి రోజూ లోతైన అనుభవాలు జరిగేవి అన్నాడు. ప్రతి రోజూ ఆ వ్యక్తికి అంతిమ అనుభవం జరిగేది. అంతిమ అనుభవం అంటే ప్రతిక్షనాన్ని పూర్తిగా జీవించటమే. అంతిమం చివర కాదు దాన్ని ఇంకాస్త అభివృద్ధి చేయవచ్చు.

చాలా మంది జ్ఞానోదయం జరిగాక గురువుల్లో అభివృద్ధి అనేది ఉండదు అనుకుంటారు. మీకు చెబుతున్నాను, జ్ఞానోదయం జరిగాక నిరంతరం అభివృద్ధి జరుగుతుంటుంది. ప్రతిక్షణం విస్తృతం అవుతూ ఉంటాం. భగవంతుడు అంటేనే అభివృద్ధి. భగవంతుడు మాత్రమే విస్తృతం అవుతూ ఉంటాడు. మరేదీ అలా కాలేదు. మీ అంతరంగంలో మీరు అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటారు కాని నిజమైన వృద్ధి విశ్వశక్తి లోనే జరుగుతుంది.

ఒక వ్యక్తికి జ్ఞానోదయం అయితే అతను నిరంతరం విస్తృతం అవుతూ, చాలా మంది జ్ఞానోదయం పొందేలా చేయగలుగుతాడు. ఆయన చాలా మంది జ్ఞానోదయమైనవారు ఉండేలా చేయగలరు.

  1. మాటలు, చూడటం ఉండవు : జ్ఞానోదయం అయ్యాక గొంతుకి, నాభికి మధ్యప్రాంతంలో మాటలు, పదాలు, అక్షరాల కదలికలు ఉండవు. పదాలు గొంతు నుంచి మాత్రమే వస్తాయి. ఇదే నేను జ్ఞానోదయానికి ఇచ్చే నిర్వచనం. నాభి నుంచి గొంతు వరకూ అక్షరాలు, మాటలు, శబ్దాలు, ఆలోచనలు అనేవి ఉండవు. మాట్లాడే సమయంలోనే మాటలు ఉంటాయి. మాట్లాడని సమయంలో మీ అంతరంగంలో ఆలోచనలు, మాటలు ఉండవు. కేవలం శక్తిప్రవాహం మాత్రం ఉంటుంది. మీ అంతరంగంలోని మాటలే ప్రశాంతత లేకుండా మీ జీవితాన్ని అస్థిరంగా చేసే అంశం. ఈ విషయం అర్థం చేసుకోవటం చాలా మందికి కష్టంగా ఉంటుంది.

అందరు ఏమనుకుంటారంటే నా అంతరంగంలో మాటలు లేకపోతే జీవితంలో ఎలా ప్లాన్స్ వేయగలను? ఎలా జీవించగలను? ఒక విషయం అర్థం చేసుకోండి. అంతరంగంలో మాటలు లేవు అంటే అది జీవం లేని నిశ్శబ్దం కాదు. అది తీవ్రమైన శక్తి. అందులోంచి మీకు ఏది అవసరమో అది పూర్తిగా మీ స్పురణకు వస్తుంది. అదే అంతరంగపు మాటల్లో అయితే ఒక దాని తరువాత ఒకటిగా వస్తుంది. ఉదయం నిద్ర లేవాలి. తరువాత కొత్త ప్రాజెక్ట్ మీద పని చేయాలి. సాయంత్రం ఇంటికి రావాలి. ఇలా ఒక క్రమంలో మాటలు, ఆలోచనలు వస్తాయి.

మీ అంతరంగంలో మాటలు లేనప్పుడు, మీరు మీతోనే ఉన్నప్పుడు మొత్తం అంతా ఒక దృశ్యరూపంలో, ఒక విషయంలా మీకు స్పురిస్తుంది. దీన్నే ఇంట్యూషన్ లేదా ఆత్మప్రబోధం అంటాం. ఒక దాని తరువాత ఒకటిగా ఒక పద్దతిలో వెళితే వాటిని అంతరంగపు మాటలు అంటాం. అది మేధ ఎప్పుడైతే మీలో అంతరంగపు మాటలు ఉండవో, మీకు విషయం తిన్నగా ఒక్క క్షణంలో మొత్తం స్పురిస్తుంది. మీకు మొత్తం తెలుస్తుంది.

  1. సమస్యలతో వ్యవహరించే ధైర్యం : జ్ఞానోదయం అంటే సమస్యలు లేకపోవటం కాదు. ఆ సమస్యలతో వ్యవహరించే ధైర్యాన్ని ఇస్తుంది జ్ఞానోదయస్థితి.

  2. మానవుని ఉనికి శిఖరాగానికి చేరటం : తెలివితేటలు పరిణతి పొందితే వివేకంగా, మేధగా మారతాయి. భావావేశాలు పరిణతి పొందితే విశ్వాసంగా మారతాయి. ఎప్పుడైతే ఉనికి (ఆత్మ) పరిణతిలో శిఖరాగానికి చేరుతుందో అది జ్ఞానోదయం అవుతుంది.

  3. బయటికి మాట్లాడే మాటలు, అంతరంగపు మాటలు ఏకీకృతమవటం : ఏ వ్యక్తి అయితే తన అంతరంగంలోని కపటాన్ని తొలగిస్తాడో అతను జ్ఞానోదయానుభవాన్ని పొందుతాడు.

రామకృష్ణ పరమహంస జ్ఞానోదయం అంటే ఈ విధంగా వివరిస్తారు. అంతరంగపు మాటలు, బయటి మాటలు ఒకే విధంగా ఉండటమే జ్ఞానోదయ స్థితి. ఆయన ఇలా అంటాడు, మీ అంతరంగంలో అనుకునే మాటలు, మీరు బయటికి మాట్లాడే మాటలు ఒకే విధంగా ఉన్నప్పుడు మీకు జ్ఞానోదయం కలుగుతుంది.

ఈ విధంగా అంతరంగపు మాటలు, బయటికి మాట్లాడే మాటలు ఒకే విధంగా ఉండే శరీరంలో జీవించటమే స్వర్గం. అటువంటి శరీరంలో జీవించే జీవితం ఇచ్చే ఆనందం మరెక్కడా ఉండదు. అది స్వచ్చమైన పారవశ్యస్థితి. ఈ నిరంతరం పారవశ్యస్థితిని నేను THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్థితి అంటాను. ఎప్పుడైతే అంతరంగపు మాటలు బయటికి మాట్లాడే మాటలు వేరు వేరుగా ఒకే విధంగా ఉన్న శరీరంలో ఉంటాయో మీరు అకస్మాత్తుగా ఒక బోలు వెదురులో ఉన్న అనుభవాన్ని పొందుతారు. మీరు అనంతమైన ఖాళీ ప్రదేశంలో ఉంటారు.

  1. మిమ్మల్ని మీరు విశ్వం అనుకోవడం : మీరు మహాకాశం, విశ్వం అని అనుకోవటమే జ్ఞానోదయస్థితి. మిమ్మల్ని మీరు కఠాకాశం అనే వ్యక్తిగతప్రదేశం అని అనుకోకుండా మీరు విశ్వం అని అనుకోవటమే.

  2. మీ మనస్సులోని మీరు అనే గుర్తింపు నుంచి బయటికి వచ్చేయటం : మీరు బయటి ప్రపంచానికి చూపించే మీరు అనే గుర్తింపు నుంచి బయటికి వచ్చే అనుభవమే మీ మొదటి అనుభవం. దాన్నే సతోరి అంటారు. మీ రెండవ గుర్తింపు అయిన మీరు అంటే మీ అంతరంగంలోని గుర్తింపు నుంచి బయటికి రావటాన్ని, ఆ అనుభవాన్ని నేను జ్ఞానోదయం అంటాను.

  3. అత్యున్నతచేతనస్థితిలో జరిగే పరిశోధన : జ్ఞానోదయం పొందినవారికి పదునైన అత్యున్నతచేతనస్థితి ఉంటుంది. దాని సహాయంతో పరిశోధనలు, ప్రయోగాలు, విశ్లేషణ చేయటం సులభంగా ఉంటుంది. జ్ఞానోదయం జరిగాక నేను బయట ప్రపంచశాస్త్రవేత్తలతో, అంతరంగుప్రపంచ శాస్త్రవేత్తలతో, నాతో అనేకప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నాను.

జ్ఞానోదయమైన గురువులు ఏదైన ఆధ్యాత్మికసాధన చేస్తున్నారు అంటే అది ఆయన కోసం కాదు తన శిష్యులకి సరైన సూతాల్ని అందించాలని, వాటి సహాయంతో వారు కూడా అదే అనుభవాన్ని పొందాలి అని మాత్రమే.

  1. మానవస్థితి నుంచి అత్యుత్తమరూపాంతరదశ : నన్ను ఒకరు ఇలా అడిగారు, జ్ఞానోదయం అంటే మానవుల్లో సహజంగా జరిగే ఒక దశ అవుతుందా లేక అది అత్యున్నతమైన మార్పు అవుతుందా? అని. కచ్చితంగా జ్ఞానోదయం మనిషిలో అత్యున్నత మార్పు. మీరు అనుకునే మానవదశ సంపూర్ణమైంది కాదు. మీరు బీజదశలోనే ఉన్నారు. ఇంకా వృక్షంగా మారలేదు. నిజానికి జ్ఞానోదయమే మీ నిజమైన స్థితి. మీరు బీజ దశలో ఉన్నప్పుడు మానవులు అంటారు. మీరు పరిణతి పొందిన దశని జ్ఞానోదయం అంటారు. మీరు ఆధ్యాత్మిక అనుభవంతో ఉన్న మామూలు మనిషి కాదు, మీరు మానవానుభవంతో ఉన్న ఆధ్యాత్మికులు.

  2. యోగ శక్తికి అతీతంగా : మీరు ధ్యానం సాధన చేస్తే చాలా యోగశక్తులు, సిద్ధులు కలుగుతాయి. అయితే మీరు వీటికి అతీతంగా వెళ్ళగలిగినప్పుడే జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానోదయం అంటేనే శక్తులతో వ్యవహరించగలగటమే కాదు, అవసరమైనప్పుడు వాటిని వదలగల స్థితి.

అకల్ట్ కెమిస్ట్రీ అన్న ఒక ఆర్టికల్ చదివాను. అది అనీబిసెంట్, చార్లెస్ లెడ్ బీటర్ మూలకాల నిర్మాణం మీద చేసిన పరిశోధన. భౌతికశాస్త్రం అణువులో న్యూక్లియస్ ఉంది అని చెప్పిన నాటికి చాలా కాలం పూర్వమే ఆధ్యాత్మికులు ఆ విషయాన్ని చెప్పారు. ఈ రోజున మనకి తెలిసిన ఉపకణం వరకూ అన్నీ ప్రాచీనకాలంలో ఉన్నాయి అని ఈ యోగశాస్త్రజ్ఞులు చెప్పారు. ఆధునికసాంకేతిక పరికరాలు లేకుండా వారు ఆ విధంగా ఎలా చెప్పగలిగారు. అప్పటికి భౌతికశాస్త్రం పుట్టలేదు. ఆ పరిశోధన నివేదిక ఏం చెబుతుందంటే సిద్ధుల ద్వారా, మానసికశక్తి ద్వారా ఆ విషయాలను కనుగొన్నారు అని. పతంజలి ఈ విషయం గురించి చక్కగా వివరించారు. అణిమా అంటే అతిసూక్ష్మ విషయాల్ని, దాగి ఉన్న విషయాల్ని, చాలా దూరంగా ఉన్న విషయాల్ని తెలుసుకునే శక్తిని అణిమాసిద్ధి ద్వారా పొందవచ్చు, అది అత్యుత్తమ భౌతిక కాంతిరేఖల ద్వారా సాధ్యం అని.

యోగసాధనతో, సాధారణ నేత్రానికి కనిపించని అతిసూక్ష్మమైన వాటి రూపాలని చూడవచ్చు. అటువంటి యోగశక్తితో వారు ఐదు కొత్త మూలకాలని చూడగలిగారు. ఆ మూలకాల అంతర్నిర్మాణంలోకి వాటి ఉప కణాలలోనికి వెళ్ళగలిగారు. ఆధునికశాస్త్రం వీటిని చూడగల సాంకేతికపద్దతిని ఇంకా తయారు చేయలేదు. వీటినే ప్రపంచంలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా వివిధకాలాల్లో కనుగొన్నట్లు వారు తెలియచేసారు.

వారు తమ ముగింపు వ్యాఖ్యల్లో విశ్వంలోని పదార్థమంతా ఒక గాలి బుడగలాంటిది. కంటికి కనబడని దారానికి ఉన్న ముత్యాల్లా ఉంటుంది. వాళ్ళు అతిసూక్ష్మమైనవాటిని చూడటమే కాదు, వాటి నిర్మాణాన్ని కూడా చూసినట్టు రాసారు. దాన్ని చూడగల పరికరాలు తయారు చేయాలంటే కోట్ల కోట్ల డబ్బు అవసరం అని కూడా అందులో రాసారు. తపస్సు, ధ్యానం ద్వారా ఇటువంటి సిద్దులు పొందిన యోగులు చాలా మంది ఉన్నారు. మీరు వాటిలో చిక్కుకుపోకుండా ఉన్నంత కాలం అవి మంచివే. లేకపోతే మీరు అంతిమ దశ అయిన జ్ఞానోదయాన్ని పోగొట్టుకుంటారు.

  1. భంగపరచలేని ప్రశాంతత : జ్ఞానోదయం అంటే మీలోని బలమైన, స్వచ్ఛమైన ప్రశాంతత. దాన్ని మీ ఆలోచనలు కూడా భంగపరచలేవు. జ్ఞానోదయమైన గురువులకి ఆలోచనలు ఉండవు అని అనుకోవద్దు. అయితే వారి అంతరంగం అనంతమైంది, అతివిశాలమైంది. అందులో ఆలోచనలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. మీ మానసికవ్యవస్థ పది ఎకరాలు అనుకుంటే, ఆ పది ఎకరాలు ఒక 'జూ' లాంటివి. అదే జ్ఞానోదయమైనా యోగీశ్వరునికి లక్ష ఎకరాల్లో ఒక పది ఎకరాలు జూ అయినా అది ఆయన మీద ఎటువంటి ప్రభావాన్నీ చూపించదు. ఎందుకంటే అది అత్యల్పం. అది అక్కడ లేనట్టే. అందుకే సాధారణ మానవుడు తాను శరీరం అనుకుంటాడు. జ్ఞానోదయమైన యోగి 'నేను' శరీరం కూడా అనుకుంటాడు. నేను శరీరాన్ని అన్న భావం మాయమవుతుందని కాదు అది మరింతగా విస్తృతమై నేను శరీరాన్ని కూడా అన్న స్థితికి తీసుకువెళుతుంది.

మీ సామ్రాజ్యానికి తాళం చెవి జ్ఞానోదయం.

  1. మీ శరీరం నుంచి సహజశక్తిని ప్రవహింప చేయండి : జ్ఞానోదయం అంటే సహజంగా ప్రవహించే శక్తిని ఎటువంటి అడ్డంకులూ, భేదాలూ సృష్టించకుండా మీ శరీరం ద్వారా సృష్టించినట్లే. జ్ఞానోదయాన్ని ఎంచుకున్న వ్యక్తికి జ్ఞానోదయం కలగదు. ఎవరైతే ఎంపికలు లేని స్థితిని ఎంచుకుంటారో వారికే జ్ఞానోదయం కలుగుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవలసిన ఒక ముఖ్యాంశం.

జ్ఞానోదయ భావనతో బంధం

కొన్ని వేల సంవత్సరాలుగా లక్షల మంది ఆధ్యాత్మిక అన్వేషకులు కఠోర ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో చాలా కొద్ది మాత్రమే జ్ఞానోదయస్థితిని పొందగలిగారు. కారణం ఏమిటంటే, జ్ఞానోదయం అంటే మీకు ఏదో ఒక భావం ఉంటుంది. ఆ భావం మీద ఆధారపడి మీకు నిజమనిపించే ఆలోచనని ఎంచుకుంటారు. మీరు జీవించి ఉన్న జ్ఞానోదయమైన యోగీశ్వరుల్ని చూసినప్పుడు, మీరు వారిలో జ్ఞానోదయం తాలూకు ఒక ఉపఫలితాన్ని మాత్రమే చూస్తారు. వారి జీవితసరళిలోని నాణ్యత, వారి శక్తిని చూసి జ్ఞానోదయం అనే అత్యాశ మీలో కలుగుతుంది.

అది జ్ఞానోదయంతో ఏర్పడిన బంధం కాదు. జ్ఞానోదయం అనే భావనతో ఏర్పడిన బంధం. ఉదాహరణకి నాకు జ్ఞానోదయం అయితే బంగారు సింహాసనం వస్తుంది అనుకున్నారనుకోండి, మీరు బంగారు సింహాసనంతో బంధాన్ని ఏర్పరచుకున్నారు కాని జ్ఞానోదయంతో కాదు.

జ్ఞానోదయంతో ఏ విధంగా బంధాన్ని ఏర్పరచుకోగలరు? జ్ఞానోదయం అంటే ఇప్పుడు ఉన్న ఏ భావం అయినా అది జ్ఞానోదయం కాదు. అది జ్ఞానోదయం గురించి మాత్రమే. జ్ఞానోదయం అంటే మీకు జ్ఞానోదయానికి మరింత దగ్గరగా వెళతారు. మీరు దాంతో బంధాన్ని ఏర్పరచలేరు. మీరు జ్ఞానోదయంతో బంధాన్ని ఏర్పరచుకున్నాను అని అనుకుంటే, స్పష్టంగా తెలుసుకోండి మీ భావం స్పష్టంగా లేదు, స్వచ్ఛంగా లేదు అని. మీ భావాన్ని స్వచ్ఛంగా చేసి, జ్ఞానోదయం అంటే ఏమిటో స్పష్టతతో అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి. గురువులు చెప్పే విషయాలు వినండి. జ్ఞానోదయం అంటే స్పష్టమైన అవగాహనకి రండి.

జ్ఞానోదయం అంటే స్పష్టమైన అవగాహన ఎందుకంటే కొంత కాలం అయ్యాక గురువులతో మీ పోరాటం ఆగిపోతుంది. అప్పుడు ఆయన ఇచ్చిన స్పష్టతతో కూడిన వివరణ మీకు ఒక అనుభవం అవుతుంది. మీ అంతరంగం ప్రేమతో నిండి ఉన్నప్పుడు, మీరు గురుదేవులతో బంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు, ఆయన చెప్పే ప్రతి మాటా మీకు ఒక అనుభవం అవుతుంది. కాబట్టి స్పష్టమైన అవగాహనని ఏర్పరచుకోండి, అది సహజంగా జ్ఞానోదయం వైపు తీసుకువెళుతుంది. మీలోని బంధం మాయమవుతుంది.

  1. జిజ్ఞాసతో అర్పణం : తెలుసుకునే తత్వంతో సరైన పనులు చేస్తూ, సర్వాంతర్యామికి అధీనమై ఉండటమే జ్ఞానోదయం అంటే. ఈ మూడూ కలిస్తే జ్ఞానోదయస్థితి. ఈ మూడు విషయాలు వేరు అని మీరు అనుకున్నంత కాలం మీకు జ్ఞానోదయం జరగదు. ఆ మూడూ ఒక్కటే అని ఎప్పుడు తెలుసుకుంటారో ఆ మూడు ఏకకాలంలో అప్రయత్నంగా కలుగుతాయి. మీకు జ్ఞానోదయం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే తెలుసుకునే తత్వంలో ఉంటారో మీరు సర్వాంతర్యామికి అధీనులై ఉంటారు. అప్పుడు మీరు అన్నీ సరైన పనులనే చేసారు.

  2. ఆనందానికి అతీతంగా : నిరంతరం గాఢతతో ఉండటమే జ్ఞానోదయమైన గురువుల లక్షణం. వారిని చూసినపుడు అది పరమానందం లేదా సంతోషం మీకు తెలుస్తుంది. నిజాయితీగా చెప్పాలంటే నేను ఏదో ప్రత్యేకమైన ఆనందంలో ఉండే వ్యక్తిని అనిపించదు. నాకు తెలిసేది ఒకటే, నాలో ఏదో అత్యంతప్రత్యేకమైంది, అసాధారణమైంది జరుగుతుందని అది తీవ్రంగా జరుగుతున్నదని తెలుస్తుంది. నిజానికి అది ఆనందం కూడా కాదు. దాని నాణ్యతని, లక్షణాన్ని వివరించలేం. మీ మనస్సుతో దాన్ని అర్థం చేసుకోలేరు.

  3. అనుభవం, అనుభవిస్తున్నవాడు, అనుభవించబడేది అనే మూడూ కలిసిపోవటం: ప్రస్తుతం మీరు మూడు విషయాల్ని చూసారు. అనుభవిస్తున్న వ్యక్తి, అనుభవం, అనుభవించబడేది. ఉదాహరణకి మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నారు. మీరు అనుభవించే వ్యక్తి అంటే చదువుతున్న వ్యక్తి చదవటం అనుభవం. అనుభవించబడేది పుస్తకం మీకు జ్ఞానోదయం అయితే ఈ మూడూ కలిసి ఒకటిగా అయిపోతుంది. మీరు అనుభవిస్తున్న వ్యక్తి, మీలోనే అనుభవం, అనుభవించేవి ఉంటాయి.

జీవస్ముక్తి

  1. విశ్వంలోని గందరగోళాన్ని మీ శరీరం లోపలే ఆనందించండి : ఇప్పటి స్థితిలో మీరు విశ్వాన్ని, అందులోని కల్లోలాన్ని మీ శరీరంలో పట్టి ఉంచే పరిణతిలో లేరు. ఆ కల్లోలాన్ని క్రమపద్ధతిలో పెట్టాలి. ఎందుకంటే విశ్వాన్ని పట్టి ఉంచే శక్తి మీకు లేదు. విశ్వంలోని కల్లోలాన్ని అదే విధంగా పట్టి వుంచే పరిణతి మీ ఆరు అడుగుల శరీరానికి లేదు. విశ్వాన్ని అనుభవించి ఆనందించే విధంగా మీ శరీరం లేదు.

మీ శరీరాన్ని, మనస్సుని, మేధని మేల్కొలిపి, విశ్వానికి అనుగుణంగా, ఆ అనుభవాన్ని పొందే విధంగా మార్చటమే జీవన్ముక్తి అంటే. దాని కోసం శరీరం, మనస్సుని, మేధని సిద్ధం చేయాలి. నిత్యయోగా లాంటి పద్ధతులలో శరీరాన్ని సిద్ధం చేయవచ్చు. మనస్సు సాఫ్ట్‌వేర్ లాంటిది. అందులో చేతనస్థితి, అచేతన స్థితి, రెండూ ఉన్నాయి. చేతనమనస్సుని సరియైన బోధల ద్వారా, తప్ప భావాలని తొలగించటం ద్వారా, మంచి భావనల ద్వారా శుభ్రపరచవచ్చు. ధ్యానపద్ధతుల ద్వారా అచేతనస్థితిని బాగుచేయవచ్చు.

అయితే అంతిమంగా సాఫ్ట్‌వేర్‌ని శాశ్వతంగా మార్చాలి అంటే హార్డ్‌వేర్‌ని కూడా మార్చాలి. మీ మెదడులోని గీతలని మార్చాలి. అప్పుడే అది జీవన్ముక్తి అనుభవాన్ని పట్టి ఉంచి, దాన్ని వెల్లడి చేస్తుంది. దీక్ష ద్వారా మీలోని శక్తిలో మార్పు వస్తుంది. అది వివిధ కోణాల్తో మిమ్మల్ని మేల్కొలపటం ప్రారంభిస్తుంది.

  1. విభేదాలు లేని స్వేచ్ఛాజీవితం : జీవన్ముక్తికి వివాహజీవితం లేదా బ్రహ్మచర్యజీవితం అనే విభేదాలు లేవు. జీవన్ముక్తి అంటే మనలో విభేదాలు లేని జీవితం. మీరు చేసే పనులు, జ్ఞానం మీ కోరికలకి అనుగుణంగా ఉండాలి.

  2. ఆలోచనల సంఖ్య తగ్గటం : ఏ విషయంలోనూ తీవ్రస్థాయిలో లేకుండా, భావావేశాల తీవ్రత లేకుండా, మధ్యస్థాయిలో ఉండగలగటమే మధ్యేమార్గం. మధ్యస్థాయిలో ఉండగలిగినప్పుడు మీలోని ఆలోచనలు సంఖ్య తగ్గటం గమనిస్తారు. అదే జీవన్ముక్తి. ఆలోచనలు పూర్తిగా తగ్గిపోయి, మీ పనులు మీరు మామూలుగా చేసుకుంటే, ఆ సమయంలో అలోచనలు అసలు ఉండవు. ఆ స్థితి జ్ఞానోదయస్థితి.

  3. సాత్వికస్థితిలో స్థిరపడటం : సత్వస్థితిలో ఉంటూ అనుకూల శక్తిలో స్థిరపడి మీ పనులు మీరు చేసుకోగలిగితే, మీ ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ మీ సంబంధ బాంధవ్యాల్లో ఉండగలిగితే మీ జీవితం అప్రయత్నంగా, చాలా అందంగా ఉంటుంది. ఆ అనుకూలశక్తిలో కేంద్రీకృతమై ప్రతి విషయాన్ని చక్కగా నిర్వహించగలుగుతారు. దాన్నే జీవన్ముక్తి అంటాను.

  4. యాంత్రికంగా లేని మెదడు భాగాల్ని మేల్కొలపటం : మీరు అనుకూలశక్తి అయిన సాత్వికస్థితిలో స్థిరపడితే మీఆత్మ మీజీవం వీటి పైన స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈ ప్రపంచం, జగతులతో ఏ విధమైన బంధాన్ని ఏర్పరచుకోవాలో అర్థమవుతుంది. ఆ స్పష్టత వల్ల, జీవం (ఆత్మ) జగత్ పట్ల కలిగిన స్పష్టత వల్ల, మీరు మూలాధారమైన ఈశ్వరులలోకి, సర్వాంతర్యామిలోకి ప్రవేశించగలుగుతారు. అర్థం చేసుకోవటంలో మీకు స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత అప్రయత్నంగా మీ మెదడులోని యాంత్రికంగా లేని భాగాలని మేల్కొలుపుతుంది. అది మేల్కొన్నప్పుడు మీ లోపల కల్లోలం ప్రారంభమవుతుంది. అప్పుడు మీ దినచర్య తిరిగి ఒక పద్ధతిలోకి వస్తుంది. మీరు కేవలం దాంతో సహకరించండి. దాన్నే నేను జీవన్ముక్తి అంటాను.

  5. మేలుకొనే స్థితికి సహకరించండి : మీ లోపల జరుగుతున్న కొత్త పారవశ్యస్థితికి, కొత్తగా జరిగిన జాగృతస్థితికి మీరు సహకరించకపోతే, మీ పాత నిస్సారమైన దినచర్యలతో ఉన్న జీవితాన్ని తిరిగి తీసుకువస్తారు. ఆ పాత వ్యక్తి మళ్ళా రాకూడదు. మీలో జరుగుతున్న కొత్త మేల్కొలుపుకి, పారవశ్యానికి సహకరించటాన్నే నేను శిష్యరికం లేదా జీవన్ముక్తి అంటాను.

  6. గొప్ప సత్యాల్తో జీవించటం : జీవన్ముక్తి అనేది సరైన పదం. ఈ గొప్ప సత్యాల్లో జీవిస్తే మీరు జ్ఞానోదయం పొందినవారవుతారు అంతే. చాలా మంది జ్ఞానోదయం అంటే బాధ్యతలకి దూరంగా వెళ్ళిపోయి మీరు ఏ పని చేయనవసరం లేదు అనుకుంటారు. ఇది సెలవు లాంటిది అనుకుంటారు. బీచ్‌లో పడుకొని పని అనేది ఏదీ లేకుండా ఉండటం అనుకుంటారు. మీరు కోరుకున్నది, జీవితంలో ఎప్పుడు దొరకనిది అయినదాని గురించి ఊహల్లో ఉంటారు. అవన్నీ జ్ఞానోదయమైన వారిలో చూడటానికి ప్రయత్నిస్తారు. మీ దృష్టిలో స్వర్గం అనేదాన్ని తీసుకువచ్చి జ్ఞానోదయం అంటే స్వర్గం అనుకుంటాను. జ్ఞానోదయం పొందటం అనేది సరైన పదం కాదు. జ్ఞానోదయంలో జీవించటం అనేది సరైన పదం.

మీరు సత్యాల్లో జీవించాలి. గొప్ప సత్యంలో జీవించటమే జ్ఞానోదయం. గురుదేవులు జ్ఞానోదయాన్ని మీకు అందించరు. అది మీకు ఆయన ఇవ్వగల ఒక వస్తువు కాదు. జ్ఞానోదయం అనుభవం. మీరు పొందే విధంగా ఆయన కొన్ని ఉపకరణాలనిస్తారు. ఆయన సత్యాలు తెలియచేస్తారు. ఆ సత్యాలతో జీవిస్తూ అనుభవాన్ని పొందాలి.

జ్ఞానోదయం అంటే శరీరాన్ని వదిలి మరణించటం కాదు. జ్ఞానేంద్రియాలకి అతీతంగా జీవించటమే జ్ఞానోదయం. అంటే మీలోని కేంద్రం జ్ఞానేంద్రియాల నుంచి మారుతుంది. మీలో పెద్ద మార్పు వస్తుంది. దాన్నే నేను జీవన్ముక్తి అంటాను.

అహంకారం Vs జ్ఞానోదయం

మీలోని జ్ఞానోదయాన్ని తీసేసేంత శక్తి అహంకారానికి లేదు. ఈ విషయం అర్ధం చేసుకోండి, మీ అహానికి అంత శక్తి లేదు. మీలో అహం ఉంది అని అనుకోవటం ఆపేయండి. మీరు అనుకున్నంత పెద్ద విషయం కాదు మీ అహంకారం. మీరు అనుకున్నంత పెద్దవారు కాదు మీరు. కాబట్టి మీ అహంకారం మీ జ్ఞానోదయాన్ని తీసేయలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా, అనుభవం కలిగినా లేకపోయినా మీరు నిత్యచేతనస్థితి మాత్రమే. మీ తర్కం, వివేకం కూడా మీరు అనుకున్నంత బలమైనవి కావు. నేను ఎప్పుడు చెబుతుంటాను, మీలోని అజ్ఞానం మీరు అనుకున్నంత బలమైనది కాదు. అది మీలోని జ్ఞానోదయాన్ని పొగొట్టలేదు. మీ అజ్ఞానం, మీ అహంకారం మీరు అనుకున్నంత పెద్దవి కావు అది సత్యం.

ముందు, ఆ తరువాత

ఒక చైనీస్ జెన్ సామెత ఉంది, జ్ఞానోదయానికి ముందు పర్వతం పర్వతంలా ఉంటుంది. నది నదిలా ఉంటుంది. అడవి అడవిలా ఉంటుంది. మీ సత్యాన్వేషణలో పర్వతం పర్వతంలా ఉండదు, నది నదిలా ఉండదు, అడవి అడవిలా ఉండదు, అంతా గందరగోళంలా ఉంటుంది. మీరు అన్వేషించే అంతిమసత్యమైన జ్ఞానోదయాన్ని పొందాక పర్వతం పర్వతంలా, నది నదిలా, అడవి అడవిలా ఉంటాయి. దీన్ని అర్ధం చేసుకోవటం కొంచెం కష్టం. దీని అర్ధం ఏమిటంటే మీ అన్వేషణ ముందు, అది సాధించాక విషయాలు అన్నీ స్పష్టంగా ఉంటాయి. అయితే ఆ అన్వేషణ జరిగే సమయంలో, స్పష్టత ఉండదు.అన్వేషణకి ముందు, జ్ఞానోదయం జరిగే సమయంలో, స్పష్టత ఉన్నా అందులో తేడా ఉంటుంది. ముందు ఉన్న స్పష్టతకి, జ్ఞానోదయం తరువాత ఉన్న స్పష్టతకి తేడా ఉంటుంది.

ముందు ఉన్న స్పష్టత కొద్దిపాటి మార్పు వచ్చినా మిమ్మల్ని అయోమయంలో పడేస్తుంది. అది అంతిమసుష్టత కాదు. అది ఒక మసకగా ఉన్న భావన మాత్రమే. కాని జ్ఞానోదయం తరువాత, మీలో వచ్చిన స్పష్టతని ఎవరూ, ఏది చెదరగొట్టలేరు, అది అంతిమసత్యం, అదే తేడా. ఏ స్పష్టతనైనా తరువాత, మీలో వచ్చిన స్పష్టతని ఎవరూ, ఏది చెదరగొట్టలేరో అది జ్ఞానోదయస్పష్టత. జ్ఞానోదయం తరువాత విషయాలను చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. పర్వతం పర్వతంలా, నది నదిలా, అడవి అడవిలా ఉన్నా వాటిని చూసే పద్ధతిలో చాలా మార్పు ఉంటుంది. అందుకే ఆ అయోమయం. దీన్ని మీరు పెద్దగా పట్టించుకోనవసరం లేదు.

లోత్రెన కోరిక, అర్హతలు లేవు

నన్ను చాలా మంది అడుగుతుంటారు, గురుదేవులు కావాలి అని అనుకుంటే, శిష్యులకి అర్హతలు ఉన్నా లేకపోయినా, వారికి జ్ఞానోదయాన్ని ఇవ్వగలరా? అని. గురుదేవులు ఒక్క ఆలోచనతో ఎవరికైనా జ్ఞానోదయాన్ని ఇవ్వగలరు. దానికి ఏమీ అవసరం లేదు. ఆయన ఎవరికైనా ముక్తిని స్వేచ్ఛని ప్రసాదించగలరు. ఈ భూమి మీద జరిగే అత్యంత గొప్ప విషయం అద్భుతమైన విషయం, జ్ఞానోదయం జరగని వ్యక్తి ఒక జ్ఞానోదయమైన గురుదేవుల సమక్షంలో కూర్చొని జ్ఞానోదయాన్ని పొందటమే.

గురుదేవులు జ్ఞానోదయపు సాఫ్ట్‌వేర్‌ని డౌన్ లోడ్ చేసి ఆ వ్యవస్థని ఎవరిలోనెనా నింపగలరు. మీరు పూర్తిగా విప్పారి ఉంటే, ఆ సాఫ్ట్‌వేర్‌ని మీలోపల నింపగలరు. ఇప్పుడు ఉన్నదాని కంటే

ఇది చాలా మంచిదని మీ శరీరం తెలుసుకుంటుంది. మీ శరీరంలోని జీవసంబంధ జాపకశక్తి ఇంకా బాగా ఉండగల విధానాన్ని నేర్చుకుంటుంది.

బుద్ధుని జీవితం నుంచి ఒక చిన్న కథ : ఒక వ్యక్తి బుద్ధుడిని భగవాన్, మీరు అందరికీ జ్ఞానోదయాన్ని ఇవ్వవచ్చు కదా, అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఆ వ్యక్తితో, మీ గ్రామంలో ఎవరికి జ్ఞానోదయం కావాలో అడిగి, కావాలన్నవారందరినీ తీసుకురా, వారికి జ్ఞానోదయాన్ని ఇస్తాను, అంటాడు. ఆ వ్యక్తి గ్రామంలోనికి వెళ్ళి అందరిని జ్ఞానోదయం కావాలా అని అడుగుతాడు. సాయంకాలానికి చిన్నబుచ్చుకుని బుద్ధుని దగ్గరికి వస్తాడు. బుద్ధుడు అతన్ని ఏం జరిగింది అని అడిగి, ఎవరూ జ్ఞానోదయం కావాలి అని అనలేదు కదా? అంటాడు.

ఆ వ్యక్తి నవ్వు ముఖంతో, ఇద్దరు కావాలి అన్నారు, అంటాడు. బుద్ధుడు ఐతే వారిని ఇక్కడికి తీసుకురా, వారికి ఇప్పుడే జ్ఞానోదయాన్ని ఇస్తాను అంటాడు. ఆ వ్యక్తి నెమ్మదిగా, అది కాదు భగవాన్, వారు ఇక్కడికి రావటం కుదరదు అన్నారు. మీరు వారుఉన్న దగ్గరికి పంపిస్తే తీసుకుంటాం అని చెప్పారు. అంటాడు. నిజానికి ఎవరూ జ్ఞానోదయాన్ని కోరుకోరు. ఏదో దాంతో వచ్చే ఉపయోగాల్ని కోరుకొంటారు లేదా దాన్ని షోకేసులో పెట్టుకోవటానికి అడుగుతారు.

ఒక విషయం అర్థం చేసుకోండి, మీరు బంధాల్లో ఉండాలి అని అనుకుంటే ఆ స్వేచ్ఛని భగవంతుడు మీకు ఇస్తాడు. జ్ఞానోదయాన్ని మీ మీద బలంగా రుద్దడు. అలా చేస్తే, స్వేచ్ఛ కూడా బందిఖానా అవుతుంది.

ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి; అర్హతలు, కోరిక.

జ్ఞానోదయానికి అర్హతలు లేవు. అయితే ఒక లోతైన భావన, తీవ్రమైన కోరిక, అది నాకు కావాలి అని ఉండాలి. స్పష్టంగా అర్ధం చేసుకోండి. నాకు కూడా మీ అందరికీ ఉన్న అన్ని సమస్యలూ ఉండేవి. సర్వాంతర్యామి మీద విశ్వాసం ఉండేది కాదు. నా మీద నమ్మకం ఉండేది కాదు. ఇవన్నీ నాకూ ఉండేవి. నేను చెప్పేదేమిటంటే జ్ఞానోదయానికి అర్హత్రలు లేవు, ఎవరికి ఎటువంటి అర్హతలూ అవసరం లేదు.

ఇది లాటరీ టికెట్టు గెలవటం లాంటిది. ఎవరైనా నేను లాటరీ కోసం కష్టపడి పని చేసాను అంటారా? నేను వెళ్ళి, దాన్ని కష్టపడి కొని తెచ్చాను కాబట్టి గెలవటానికి నాకు అర్హత ఉంది, గెలిచి తీరాలి అని అంటారా? లేదు. కోటి రూపాయల లాటరీ గెలవటానికి కావలసిన అర్హత ఏమిటి? మీరు టికెట్లు కొనటమే అంతే! దాని ఫలితంతో చూస్తే మీరు పడే కష్టం చాలా చిన్నది.

జ్ఞానోదయం లాటరీ లాంటిది. ఆ అనుభవం చాలా గొప్పది. ఆధ్యాత్మిక మార్గంలో మీరు పడిన కష్టం కంటే గొప్పది. ఒకసారి ఆ అనుభవం జరిగితే అది ఒక వరం అని అర్థం అవుతుంది. అప్పటి వరకూ మీరు చేసిందంతా లాటరీ టికెట్టు కొనటం లాంటిదే. లాటరీ టికెట్టు కొన్న వ్యక్తి తాను పడిన కష్టం వల్లనే లాటరీ గెలిచాను అని అనడు.

రమణమహర్షి, అరుణాచలేశ్వరుని ఉద్ధేశించి ఒక చక్కని పాటని పాడేవారు. సన్ను నేసు ఇచ్చి, నిన్ను పొదానూ. కాబట్టి ఇందులో విజయులు ఎవరు? ఎవరు తెలివైన వారు? అని.

మిమ్మల్ని మీరు సర్వాంతర్యామికి సమర్పించుకొని జ్ఞానోదయాన్ని పొందవచ్చు. మిమ్మల్ని మీరు సమర్పించుకోవటం మీరు పొందేదానికి సమానమైంది కాదు. మీ జీవితాన్ని ఇచ్చినా మీరు పొందే దాంతో పోల్చి చూస్తే ఇది లాటరీ టికెట్లు కొనటమే

ఇది జరిగిన తరువాత ఇదంతా కేవలం సర్వాంతర్యామి కరుణ, ఆయన దీవెన మాత్రమే అని తెలుస్తుంది. దీని ఫలితం, మీలో కలిగే అద్భుతమైన మార్పు. ఎంత గొప్పదంటే అంత గొప్ప వరాన్ని ఎలా నేను పొందాను అని అనుకుంటారు. ఇంత అద్భుతమైన అవకాశానికి నన్ను ఏ విధంగా సర్వాంతర్యామి ఎంచుకున్నాడు, ఇంత పెద్ద వరాన్ని నాకు అనుగ్రహించాడు అని ఆలోచిస్తాం. దీనికి ఏ అర్హతా అవసరం లేదు. లోతైన అవసరం, కోరిక, అన్వేషణ ఉంటే చాలు. సంతృప్తి ఎప్పుడూ ఒక బహుమతి. బహుమతి పొందటానికి అర్హత ఉండదు.

ఆ అనుభవం ఒక వరం!

ఆధ్యాత్మిక అన్వేషణ అంటే ఒక శూన్యభావాన్ని, ఖాళీ అనే భావాన్ని పొందటమే. ఎందుకంటే మీలో ఆధ్యాత్మికమైన స్పష్టత అనేది లేదు. మీకు ఇంకా జ్ఞానోదయం కలగలేదు. ఆ కోరిక అత్యవసరంగా మారాలి.

రామకృష్ణ పరమహంస ఈ విధంగా చెబుతారు, మీరు చాలా పేదరికంలో ఉన్నారనుకోండి. భోజనం, బట్టలు కూడా లేని స్థితిలో అతిదీనావస్తలో ఉన్నారనుకోండి. మీ పక్క గదిలో ఎవరో చాలా ఐశ్వర్యాన్ని ఉంచి తాళం వేసారనుకోండి. అది మీరు తీసుకుని వాడుకోవచ్చు అనుకోండి. అప్పుడు మీరు ప్రశాంతంగా నిద్ర పోగలరా? ఆ తలుపుని తెరవటానికి ప్రయత్నిస్తారు లేదా తలుపు పగలకొడతారు. అంత ఐశ్వర్యం మీ దగ్గర ఉన్నప్పుడు ఆకలితో నిద్ర పోలేరు.

అదే విధంగా ఇప్పుడు మీరు ఆధ్యాత్మికపరమైన పేదరికంలో ఉన్నారు. మీ అంతరంగంలో ఒక గదిలో అంతు లేని ఐశ్వర్యాన్ని పెట్టి తాళం వేసారు. ఆ జ్ఞానం, ఆ దృక్పథం, ఆ తీవ్రత ఇప్పుడు మీకు అవసరం. ఆ తీవ్రతతో చేసే అన్వేషణ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీలోని సమర్పణభావానికి చాలా శక్తి ఉంటుంది. అది జ్ఞానోదయం వైపు మిమ్మల్ని తీసుకువెళుతుంది. నిజానికి జ్ఞానోదయం అంటే వంట వండటం లాంటిది. అందులో కొంత కలపాలి, కొంత తీసేయాలి. మీరు తీవ్రమైన అన్వేషణని కలపాలి. అసహనం వంటి అనవసర విషయాల్ని తీసేయాలి. అవి అప్రయత్నంగానే బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు జ్ఞానోదయం జరుగుతుంది.

అకస్మాత్తుగా జ్ఞానోదయం

ఆధ్యాత్మిక సంప్రదాయాల్ని రెండు రకాలుగా విభజించవచ్చు. అందులో ఒకటి ఒక పద్ధతిలో అభివృద్ధిని ఇచ్చేది. అందులో స్పష్టమైన, చక్కగా నిర్వచించిన మార్గం ఉంటుంది. పతంజలి యోగసూత్రాల్లో 5 పద్ధతులని వివరించారు – యమ (క్రమశిక్షణ), నియమం (వ్యక్తిగత ప్రవర్తన), ఆసనాలు (ఆసనాలు వేయటం), ప్రాణాయమం (శ్వాస), ప్రత్యాహారం (వెనక్కి తీసుకోవటం లేదా మళ్ళించటం). ఇది సాధారణ మానవులకి బాగుంటుంది. మీరు ప్రారంభించి క్రమంగా ఒక దాని తరువాత మరొకటి సాధించే క్రమపద్ధతి సామాన్యులకి నచ్చుతుంది. ఇందులో ప్రారంభించటం సులభం కాని ముగింపు చాలా కష్టం, సాధించటం కష్టం.

మరొక సంప్రదాయం మీకు తిన్నగా ఆ అనుభవాన్ని ఇస్తుంది. ఉదాహరణకి శివుడు చెప్పిన శివసూత్రాలు, ఇందులో మీకు నేరుగా ఆ అనుభవాన్ని ఇచ్చే పద్ధతులు ఉంటాయి. అయితే ప్రారంభించటం కొంచెం కష్టం. ఎందుకంటే తార్కికంగా చూస్తే వాటితో బంధాన్ని ఏర్పరచుకోవటం మీకు తెలియదు.

శివుడు స్పష్టంగా ఈ విషయాన్ని చెబుతాడు. ఈ చిన్న చిన్న పద్ధతులు మీకు జ్ఞానోదయాన్ని ఇస్తాయి అని. ఉదాహరణకి ఒక పద్ధతి ఏం చెబుతుందంటే మీరు తుమ్మే సమయంలో చాలా లోతైన తెలుసుకునే తత్వంతో ఉంటే జ్ఞానోదయం అవుతుందని. ఆయన ఏం చెబుతాడంటే కేవలం తుమ్మటం ద్వారా జ్ఞానోదయాన్ని పొందవచ్చు అని. దీన్ని నమ్మటం ఎలా? తార్కికంగా మిమ్మల్ని నమ్మించటం కష్టం, మీకు అర్థం కాదు. శివసూత్రాల్లో చెప్పినట్టు కొన్ని పద్ధతులు మీకు ఆకస్మాత్తుగా జ్ఞానోదయాన్ని ఇస్తాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పద్ధతుల్ని సాధన చేయటానికి మీకు ధైర్యం కావాలి. సర్వాంతర్యామితో లేదా గురుదేవులతో బంధాన్ని ఏర్పరచుకోగలగాలి.

జ్ఞానోదయం ఏ క్రమంలోనైనా జరగవచ్చు. టిబెటియన్ బౌద్దమతంలో బర్డోస్, అంటే మరణానికి, జన్మకి మధ్య ఉన్న స్థితి, ఆ స్థితిలో జ్ఞానోదయం జరిగే అవకాశం ఉంటుంది అంటారు.

క్రమంగా జ్ఞానోదయాన్ని ఇచ్చే పద్ధతులు మనకి చాలా సహాయం చేస్తాయి. చాలామంది ఆధ్యాత్మిక అన్వేషకులకి అవి మంచి ప్రారంభం, ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. అయితే వీటితో ఒక ప్రమాదం ఉంది. అది మీకు చివరి మార్పుని ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆధునికమనస్సు త్వరగా అలసిపోతుంది. ఆధునిక మనసుకి అసహనం ఎక్కువ. దానికి అన్నీ వెంటనే ఫలితాలని ఇచ్చే విధంగా ఉండాలి. ఇన్‌స్టంట్ కాఫీలా ఉండాలి.

అకస్మాత్తుగా జ్ఞానోదయాన్ని ఇచ్చే పద్ధతులు చాలా మంచివి ఎందుకంటే అవి మీకు క్షణకాల ఆధ్యాత్మికానుభవాన్ని అయినా ఇస్తాయి. దాంతో జ్ఞానోదయం సాధ్యమే అనే నమ్మకాన్ని ఇస్తాయి. అప్పుడు మీకు అనుమానాలు, సమస్యలు ఉండవు. మీకు ఉన్న సమస్య కేవలం అనుమానాలే. అది నిజంగా దొరుకుతుందా? అది నాకు సాధ్యమేనా? నేను విజయం సాధించగలనా? నాకు ఏం జరుగుతుందో తెలియదు నా భర్తకి లేదా నా భార్యకి ఏమవుతుందో?

ఈ అనుమానాలే అసలు సమస్య. మీకు కనీసం జ్ఞానోదయం క్షణకాలం అనుభవం జరిగినా ఈ సమస్యలు, అనుమానాలు మాయం అవుతాయి. అప్పుడు ఆధ్యాత్మికమార్గంలో ప్రయాణం చేయటం చాలా సులభం.

మరొక విషయం; గురువుల మాటల మీద అభిప్రాయాలు కల్పించటం ఆపేయాలి. గురువుల మాటల్లో దేన్ని అనుసరించాలి అని ఎంచుకోవటం మానేయాలి. ఆయనని అనుసరించండి. అప్పుడు అంతిమజ్ఞానోదయం మీకు కలుగుతుంది. ఒక విషయం అర్ధం చేసుకోండి. ఎవరైతే మేల్కొని ఉన్న స్థితి, స్వప్న స్థితి, నిద్రాస్థితులని దాటి పోగలదో అతనికి జ్ఞానోదయం జరుగుతుంది. ఎవరైతే మూడు స్థితుల నుంచీ బంధవిముక్తులవుతారో వారు జ్ఞానోదయాన్ని సాధించగలరు.

వెల్లడి చేయటమే అనుభవానికి దారి

జ్ఞానోదయం నుంచి ఏది వచ్చినా అది జ్ఞానోదయానికి మిమ్మల్ని తీసుకువెళుతుంది. మీరు వెల్లడి చేసేదాన్ని మీలో నింపుకోగలిగితే అది ఆ అనుభవాన్ని ఇస్తుంది. జ్ఞానోదయమైనవారి నుంచి చిన్న సంగీతం మీరు వింటే, దాన్ని మీలో నింపుకోగలిగితే అది మిమ్మల్ని జ్ఞానోదయానుభవంలోకి తీసుకువెళుతుంది.

ఇంతకు ముందు నేను కళతో చికిత్స అనే ఆర్ట్ థెరపీ మీద ఒక వ్యాసం చదివాను. మానసిక రోగుల్ని పెయింట్ చేయమంటే వారు చాలా మోటుగా చేస్తారు. దాని మీద పెయింట్ పోసేసారు. కాన్వాస్ మీదే కాకుండా వారి శరీరమంతా రంగులు పులుముకుంటారు. వారిని ఆ విధంగా ఒక నెల రోజులు చేయనిస్తే క్రమంగా వారిలోని పిచ్చి తనం తగ్గి, మామూలు స్థితికి వస్తారు.

మీకు ఇది ఆశ్చర్యం అనిపించవచ్చు. వాళ్ళు అన్నీ చిందరవందర చేస్తారు. రెండవ పరిశోధనా ఫలితం ఎవరైతే స్త్రీ వల్ల లేదా కీర్తిప్రతిష్ఠల కోసం పిచ్చివారవుతారో వారు అవే బొమ్మలు వేస్తారు. వారిని అలా పెయింట్ చేయనిస్తే వారిలో ఉన్నదంతా బయటికి వస్తుంది. వారి పిచ్చికి కారణం అయినదాన్ని వాళ్ళు పెయింట్ ద్వారా వెల్లడి చేయగలుగుతారు.

మూడవ ముఖ్యవిషయం – ఆ పెయింట్స్‌ని బాగా చదివి లోతుగా విశ్లేషణ చేసి ముగింపులు చెప్పిన ఆ డాక్టర్ పిచ్చివాడయ్యాడు. స్పష్టంగా అర్థం చేసుకోండి; ఎవరైతే ఒక విషయాన్ని చాలా తీవ్రంగా వివరిస్తారో లేదా వెల్లడి చేస్తారో, దాన్ని ఎవరైతే లోతుగా విశ్లేషిస్తే ఆ అనుభవం విశ్లేషించేవారి అంతరంగంలో స్థిరపడుతుంది. అందుకే ఆ డాక్టర్ పిచ్చివాడయ్యాడు.

ఇప్పుడు అర్ధం చేసుకోండి. జ్ఞానోదయమైన గురువులు లోతైన జ్ఞానోదయానుభవాన్ని మీ అంతరంగంలో నిలుపుకోగలిగితే మీకు జ్ఞానోదయానుభవం కలుగుతుంది. జ్ఞానోదయమైన గురువుల సమక్షంలో ఉన్నవారు అదృష్టవంతులు.

సంగీతపు ఇంద్రజాలం

ప్రసిద్ధి చెందిన సంగీతవిద్యాంసులైన త్యాగయ్య, అన్నమయ్య, మొదలైనవారు ఆశువుగా పాటలు పాడితే, వారు తమలోని జ్ఞానోదయానుభవాల్ని వెల్లడి చేయటమే. సంప్రదాయ హిందూ సంగీతాన్ని ధ్యానంలా జ్ఞానోదయం కోసం రూపొందించారు. హిందూ నాట్యం జ్ఞానోదయం కోసం స్పష్టించబడింది. అందుకే ఆ ప్రదర్శన ఇచ్చేవారు, దాన్ని చూసేవారు ఇద్దరూ ధ్యానస్థితిలో ఉంటారు.

సంగీతాన్ని ఏ స్థితి నుంచి సృష్టిస్తారో, దానిలోకి ఆ స్థితిలోకి మీరు ప్రవేశించవచ్చు. అది హృదయం నుంచి వస్తే మీరు హృదయంలోకి వెళ్ళవచ్చు. అది కోరిక నుంచి వస్తే మీరూ కోరికని అనుభవిస్తారు. సంగీతాన్ని సృష్టిస్తున్న వ్యక్తి మానసికస్థితి మీ మానసికస్థితి మీద ప్రభావాన్ని చూపిస్తుంది.

ఎప్పుడు సంగీతాన్ని విన్నా దాన్ని స్వాగతించండి. అందులో పదాలకి రాగాలకి ప్రాముఖ్యాన్ని ఇవ్వనవసరం లేదు. దాని కేంద్రంలోకి వెళ్ళండి. అందులో ఆధారాన్ని పట్టకోండి. అందులో కేంద్రీకృతమైన శబ్దాన్ని పట్టుకోండి. అకస్మాత్తుగా అది ఎక్కడినుంచి వస్తుందో దాన్ని మీరు అనుభవిస్తారు.

అర్ధం చేసుకోండి; వెల్లడి జ్ఞానోదయం నుంచి వస్తే అది మీ జ్ఞానోదయానికి దారి తీస్తుంది.

ఆరోగ్యకరమైన శరీరం జ్ఞానోదయాన్ని పొందగల నమ్మకాన్ని ఇస్తుంది

ఒక విషయం అర్ధం చేసుకోండి; మీకు మీ కుటుంబం పూర్తి ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తే మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీరు నాయకులవుతారు. మీరు మీ మీ రంగాల్లో విజయులు అవుతారు. సంఘంలో విజయులుగా ఉండాలంటే మీ కుటుంబం అవసరం. ఎందుకంటే మీరు సరియైన నిర్ణయాలు చేయగల దైర్యాన్ని, నమ్మకాన్ని కుటుంబం ఇవ్వగలదు. అదే విధంగా జ్ఞానోదయాన్ని సాధించాలి అంటే ఆ నమ్మకాన్ని, ధైర్యాన్ని మీ శరీరం మీకు ఇవ్వగలదు. అందుకే జ్ఞానోదయానికి యోగా అంతగా ఉపయోగపడుతుంది. అది మీ శరీరం, మనస్సుల మీద పని చేస్తుంది. అది మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని, ఇస్తుంది.

జ్ఞానోదయమైన సమాజం

వేదకాలంలో భరతదేశంలో జీవితం, సమాజం, జ్ఞానోదయం పైన ఆధారపడి ఉండేది. 70 శాతం మంది జ్ఞానోదయమైనవారు, మిగిలిన 30 శాతం మంది ఆధ్యాత్మిక అన్వేషకులుగా జ్ఞానోదయానికి పని చేసేవారు.

కళలు, శాస్త్రాలు, విద్య, జీవనసరళి – అన్నీ, ప్రతి పనీ అంతిమ అనుభవమైన జ్ఞానోదయం వైపుగానే ఉండేవి. నాట్యం, సంగీతం, శిల్పకళ, దేవాలయాల సాంకేతికకళ, ఈ విధంగా అన్ని రకాల కళలూ సంస్కృతభాష, వాస్తుశాస్త్రం, గురుకుల విద్యావ్యవస్థ, సంప్రదాయమైన వేదికలు ప్రతీ విషయం కూడా, జీవితంలో జన్మించినప్పటి నుంచీ ఉండేవన్నీ జ్ఞానోదయమైన యోగీశ్వరుల నుంచి వచ్చినవే. అందుకే అవి అన్నీ జ్ఞానోదయానికి తీసుకువెళతాయి.

భరతదేశం – ఆధ్యాత్మిక ఇంకుబేటరు

భరతదేశం జ్ఞానోదయమైన యోగీశ్వరులని స్పష్టించే ఆధ్యాత్మిక ఇంకుబేటరు. పరిణతితో జన్మించని శిశువుల్ని ఇంకుబేటరులో ఉంచి వారికి సరిపడా ఆక్సిజన్, ఆహారం, వేడి – ఇలాంటివి అందిస్తూ వారిని జాగ్రత్తగా చూస్తారు. వారు తిరిగి తమంత తాము సహజంగా ఉండగలిగేంతవరకూ అందులో ఉంచుతారు. అదే విధంగా ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరుల్ని భూమి మీద అవతరించటానికి, తనలోని జ్ఞానోదయానుభవాన్ని పూర్తిగా వెల్లడి చేయగలగటానికి ఆయనకి ఇంకుబేటరు కావాలి. భరతదేశం అటువంటి ఇంకుబేటరు. ఎందుకంటే ఇక్కడి సమాజవ్యవస్థని అంతరంగపరిశోధనాలయాలుగా జ్ఞానోదయశాస్త్రశోధనలకి అనువుగా రూపొందించారు. జీవితంలో ప్రతిదశలో అది వ్యక్తిగతమైనా లేదా వ్యాపార – ఉద్యోగాలల్లో కూడా జ్ఞానోదయానుభవం కోసమే సృష్టించబడినవి. ఈ రోజున కూడా భరతదేశం జ్ఞానోదయం పొందాలి అనుకునేవారికి ఆ దిశగా అభివృద్ధి చెందటానికి అత్యంత అనువైన ప్రదేశం.

కాలపరీక్షకి నిలబడగల అంతిమశక్తి

ఈ భూమి మీద జ్ఞానోదయపు అనుభవాన్ని మించింది ఏది లేదు. వేదాంతం, ఏ వ్యవస్థ, సిద్ధాంతాలు ఏవైనా కూడా జ్ఞానోదయం మీద ఆధారపడి రూపొందించకపోతే, అవి కేవలం ఒకటి లేదా రెండు తరాల వరకూ మించి ఉండవు. భరతదేశాన్ని దాదాపు 3000 మంది రాజ వంశాలు పరిపాలించి ఉంటారు. వారిలో జ్ఞానోదయమైన యోగీశ్వరుని మార్గదర్శకత్వంలో లేనివి కనుమరుగైపోయాయి.

మీరు దక్షిణ భరతదేశంలోని గ్రామాల్లోకి వెళితే పెద్ద పెద్ద దేవాలయాలు కనిపిస్తాయి. అవన్నీ జ్ఞానోదయమైన యోగీశ్వరులు ప్రాణ ప్రతిష్ఠంచేసినవి. రాజులు నిర్మించిన రాజభవనాలు నిలవలేదు. కానీ దేవాలయాలు మాత్రం వేల సంవత్సరాలకి కూడా నిలబడి ఉన్నాయి.

ఒక విషయం అర్థం చేసుకోండి; దేవాలయాలు కట్టింది, రాజభవనాలు కట్టింది ఒకే శిల్పి, ఒక విధంగా చూస్తే రాజభవనానికి ఇంకా మంచి వస్తువులు వాడి ఉండవచ్చు. ఈ రోజున మీరు చూస్తే, దేవాలయాలు అలా నిలిచి ఉన్నాయి, కాని రాజభవనాలు లేవు. అవి కాలంతో కరిగిపోయాయి. మా సొంత ఊరు తిరువణ్డామలైలో ఇరవై ఐదు ఎకరాల స్థలంలో నిర్మించిన దేవాలయం ఉంది. అది రాజు నిర్మించిన గుడి. అది అదే విధంగా చెక్కు చెదరకుండా ఉంది. ఎందుకంటే అందులో ఉండేది జ్ఞానోదయమైన యోగీశ్వరుని శక్తి

మానవజాతికి చేయగల గొప్ప సేవ– జ్ఞానోదయం నిలచి ఉండేలా చేయటం

మీ జీవితంలో మీరు చేయగల గొప్ప సేవ, మీ జీవితాన్ని చక్కగా ఉపయోగించగల పద్దతి, జ్ఞానోదయం ఈ భూమి మీద ఉండేలా చేయటం. ఇన్ని రకాల మారణాయుధాలు ఈ భూమి మీద ఉన్నా జ్ఞానోదయమైన యెగీశ్వరులు ఉన్నంత కాలం, ఈ భూమిని ఎవరూ నాశనం చేయలేరు.

ఆ ఆ ఆ

మీ సామ్రాజ్యానికి తాళం చెవి జ్ఞానోదయం

జ్ఞానోదయం పొందటానికి ముఖ్యమైన 10 కారణాలు

  • వ్యథలు ఉండవు; సంతోషంగా ఉంటారు. విజయానికి అవసరమైన సందర్శోచిత స్పందన, సృజనాత్మకత.

  • జీవితాన్ని లోతుగా ఆనందించటం. స్వచ్ఛమైన ఉత్సాహంతో జీవితాన్ని ప్రతిక్షణం ఉల్లాసంగా గడపటం.

  • నిరంతరం పవిత్రతతో, మంగళత్వంతో జీవితంలో ఏం జరిగినా అది మంగళకరమే.

  • నిరంతరం సరైన విషయంగా ప్రణాళికలు, సంబంధబాంధవ్యాలు, వ్యాపారం, జీవితంలో - నిరంతరం సరైన నిర్ణయం చేయటం.

  • ప్రతిక్షణం అంతిమ అనుభవాన్ని అనుభవించటం, జీవితం అన్ని కోణాల్లో విస్తృతం అవుతూ విశ్వాసంలా అభివృద్ధి చెందటం.

  • చదవటం కాదు, డౌన్‌లోడ్ చేయటమే సైన్స్, కళలు, మతం, వ్యాపారం, వంట చేయటం.... ఏదైనా విశ్వశక్తి నుంచి డౌన్‌లోడ్ చేయటమే.

  • ఆశ లేదు, భయం లేదు. పొందేది, పోగొట్టుకునేది ఏదీ లేదు- మీకు కావలసినవి ఇప్పుడే ఇక్కడే పొందవచ్చు.

  • బంధవిముక్తి అత్యంతవేగవంతమైన గేర్ మాస్టర్ మైండ్ మనసు బంధాల నుంచి నిత్యస్వేచ్ఛ

  • భగవంతుడుగా ఉండడం మీ గమ్యం యొక్క మాస్టరు మీ నిజమైన స్వభావాన్ని సృష్టించుకోండి

  • ప్రదేశం, కాలం మనస్సుకి అతీతంగా నిత్య ఆనందస్థితి ఒడిలో ఆనందంగా ఉండటం. మీరు నిత్యానందం. ఇది అంతిమమైంది, జరుగుతూ ఉంటుంది, ఇది చివలిది కాదు జ్ఞానోదయం అంటే బలమైన స్పష్టమైన శాంతి మీ అంతరంగంలో ఉంటుంది. దాన్ని మీ ఆలోచనలు కూడా భంగపరచలేవు. గురుదేవులు జ్ఞానోదయపు సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసి ఎవరి శరీర వ్యవస్థలోనైనా నింపగలరు. యోగా శరీర మానసిక వ్యవస్థల మీద పని చేస్తూ అది మీరు అనుకున్నవి అమలుపరచే ధైర్యాన్ని నమ్మకాన్ని మీకు ఇస్తుంది.

  • నిత్యానందస్థితిలో ఉంచే ఎనిమిది మెట్లు .

  • నిత్యయోగ శరీరం, మనస్సులకి అతీతమైనవాటి కోసం

  • నిత్యధ్యానం నిత్యానంద ధ్యానం

  • ధ్యానం ఎందుకు .

ధ్యానం ఎందుకు

సహజంగా ధ్యానస్థితిలో ఉండటమే

ఇప్పటి వరకూ నేను మాట్లాడిన సత్యాల అనుభవం పొందే విధంగా ఇప్పుడు వచ్చే ఈ నాలుగు అధ్యాయాల్లోనూ, ఆ తరువాత వచ్చే ధ్యానపద్ధతుల్లోనూ వివరణ ఇచ్చాను. ఈ పాటికి మీకు ఏం చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాల మీద కావలసిన వివేకపూరితమైన అవగాహన కలిగింది.

ఇప్పుడు మీకు ఎలా చేయాలి అనే అంశం గురించి చెబుతాను. చెప్పిన విషయాలన్నీ మీకు అనుభవాన్ని ఇవ్వకపోతే అవి ఒక సిద్ధాంతంలా ఉండిపోతాయి.

నిజమైన జీవిత లక్ష్యం ఏమిటి?

మీ జీవితంలో అంతిమలక్ష్యం ఏమిటి?

ఇంకా సంపాదించాలని ఉందా?

ఎప్పటికీ అందంగా, ఆరోగ్యంగా, యౌవనంతో ఉండాలి అని ఉందా?

మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయాలనా?

ఈ జాబితాకి ముగింపు ఉండదు. ప్రతి వ్యక్తికీ ఒక ప్రత్యేకలక్ష్యం లేదా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ప్రతిలక్ష్యం ఎటువంటి మినహాయింపులూ లేకుండా ఒక దాని వైపు నిర్దేశించి ఉంటుంది, అదే ఆనందం. ఎవరైనా నాకు సంతోషం అవసరం లేదు, నాకు సంతృప్తి వద్దు, పరమానందం అంటే ఆసక్తి లేదు అని అనగలరా? లేదు!

మనం అందరం ఆనందం కోసమే వెతుకుతున్నాం. కాని వేరు వేరు మార్గాలలో వెతుకుతున్నాం. ఆ మార్గాలు ఎంత మేధతో ఉన్నా, ఎంత ఆధునికతతో ఉన్నా, ఏ విధంగా మనం వివరించినా మనందరం వెతికేది ఆనందం కోసమే. కాకపోతే మనం వెతికే దారులు వేరు.

అయితే మనలో తొంభై తొమ్మిది శాతం మందికి మన నిజమైన లక్ష్యం ఆనందం అని తెలియదు. అది తెలియదు కాబట్టి దాని కోసం బయటి ప్రపంచంలో అన్ని చోటులలో వెతుకుతున్నాం. దాన్ని కనుక్కోవాలి అని ఎదురు చూస్తున్నాం.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి సాయంత్రం పూట తన ఇంటి ముందు దేని కోసమో చాలా తీవ్రంగా వెతుకుతూ ఉంటాడు. అతని భార్య దేని కోసం వెతుకుతున్నారు అంటే బంగారు నాణెం పడిపోయింది అంటాడు. అతని భార్య కూడా వెతకటం మొదలుపెడుతుంది. అంతలో చుట్టు పక్కల వారు కూడా వెతకటం మొదలు పెడతారు. ఎంత వెతికినా బంగారు నాణెం కనిపించదు. అప్పుడు పక్కింటాయన 'ఎక్కడ నాణెం పడింది' అని అడుగుతాడు. అతను అది ఇంట్లో పడిపోయింది అంటాడు. వెతుకుతున్న వారందరికీ కోపం వస్తుంది. మరి ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు, అంటారు. ఆ వ్యక్తి 'ఇంట్లో లైటు లేవు ఇక్కడ వీధి దీపాలు ఉన్నాయి కదా! ఈ వెలుగులో వెతుకుతున్నాను' అని జవాబు ఇస్తాడు.

మన జీవితాల్తో సరిగా ఇదే విధంగా మనం చేసుంటాం. మనందరం తప్పు చిరునామాలో జవాబులు వెతకటంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాం. ఆనందాన్ని అన్నింటిలో వెతుకుతాం – డబ్బు, అధికారం, సంబంధబాంధవ్యాలు, కానీ మనలో మాత్రం వెతకం.

ఆనందం అంటే?

ప్రతి ఒక్కరికీ జీవితంలో గొప్ప సంతోషకరమైన అనుభవాలు ఉంటాయి. అయితే ఆ సంతోషం ఏదో ఒక కారణంతో ఉంటుంది. ఆ భావం బాగుంటుంది, కాని అందులో మనని విసిగించే రెండు లక్షణాలు ఉంటాయి. ఆ భావం ఎక్కువ సేపు ఉండదు. అది ఏదో ఒక కారణంతోనే కలుగుతుంది. మీ సంతోషానికి కారణం మీకు ప్రమోషన్ వచ్చింది లేదా మీ అనారోగ్యం బాగెంది, కాబట్టి సంతోషం. కొత్త కారు కొనుక్కున్నారు అందుకే సంతోషం.

ఆ సంతోషస్టితి నిరంతరం ఉండదు. అది కాసేపు మాత్రమే ఉంటుంది. అది మారినప్పుడు, అది పోయినప్పుడు మళ్ళా బాధ కలుగుతుంది. ఒక విషయం అర్థం చేసుకోండి. ఏ సంతోషమైతే కారణం లేకుండా వస్తుందో, ఏదైతే మీ నుంచి ఏ కారణంతోనూ బయటికి పోదో, అదే నిజమైన సంతోషం, అదే శాశ్వతమైంది. దీన్నే పరమానందం అంటాం. అటువంటి అనందం మీ బయట దేని మీదా ఆధారపడి ఉండదు.

ఆనందం అంటే అర్థం తగ్గించలేనిది పోగొట్టలేనిది, ఆనందం అంటే సంతోషం కాదు. దీని అర్థం చూస్తే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. దేన్నెతే తగ్గించలేమో, దేన్నెతే పోగొట్టలేమో అది ఆనందం. ఏ కారణం చేతాకూడా తగ్గనిది పరమానందం.

ధ్యానం అంటే?

ఆకాశం మన చేతనస్తితిని ప్రతిబింబించగల ఒకే ఒక మూలకం.

ధ్యానం అంటే సర్వశక్తికి, సర్వాంతర్యామికి అనుగుణంగా ఉండటమే. ఇది మీ సహజస్థితి. మీ నిజమైన ఆనందస్థితి అదే మిమ్మల్ని అంతిమచేతనస్థితితో కలపగలిగేది.

చూడండి, విశ్వం ఐదు మూలకాలతో చేయబడింది. అవి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అది అనంతవిశ్వం. సూక్ష్మ విశ్వమైన మన శరీరం కూడా అవే ఐదు మూలకాలతో చేయబడింది. మనం అనంత విశంతో, సర్వాంతర్వామితో ఈ మూలకాల ద్వారా అనుబంధాన్ని ఏర్పరచుకోవచ్చు, సూక్రువిశ్వం అయిన మన శరీరం అనంతవిశ్వం అనుభవాన్ని ఈ మూలకాల ద్వారా పొందగలుగుతుంది.

అనంతవిశ్వాన్ని భూమి అనే మూలకం ద్వారా అనుబంధాన్ని ఏర్పరచుకోవటానికి మనం విగ్రహారాధన చేస్తాం. విగ్రహాల్ని భూమికి సంబంధించిన పదార్ధాలతో చేస్తారు. అవి మట్టి, రాయి లేదా ఏదైనా లోహం. వాటిని పూజించటం అంటే భూమి ద్వారా పూజ చేయటం. నీటి ద్వారా విశ్వంతో అనుబంధాన్ని అభిషేకాలు చేయటం ద్వారా లేదా పవితమైన నదుల్లో స్నానం చేయటం ద్వారా చేస్తాం. హోమాలు చేయటం అగ్ని ద్వారా విశ్వంతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం. వాయువు దారా అనుబంధం మంత్రాలతో ఏర్పడుతుంది. అకాశం దారా అనుబంధం ధ్యానం దారా సాధ్యమవుతుంది. ఈ విధంగా ఐదు మూలకాల దాగరా మనం అనంత విశ్వంతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం.

ఈ ఐదు మూలకాల్లో ఆకాశం మాత్రమే చేతనస్థితిని ప్రతిబింబిస్తుంది. మిగిలిన నాలుగూ భూమి, నీరు, అగ్ని, వాయువు చేతనస్థితితో బంధాన్ని ఏర్సరచలేవు. కేవలం ధ్యాసం ద్వారా మాత్రమే సాధ్యం.

చేతనస్తితిని పెంచే పద్ధతి

ఏ పద్ధతి మీలోని చేతనస్థితిని మరింతగా పెంచుతుందో అదే ధ్యానం. మామూలుగా మనం తీసుకునే శ్వాస కూడా ఒక ధ్యాన పద్ధతి. ఒక మాటని పదే పదే జపించటం లేదా కేవలం కూర్చోవటం ఇవన్నీ ధ్యానమే. జెన్ బౌద్ధమతంలో కేవలం కూర్చోవటం ఒక ధ్యానపద్ధతి. మీరు అనుకోవచ్చు అది చాలా సులభమని. కేవలం కూర్చోవటం చాలా కష్టమైన ధ్యానపద్ధతి. మీలోని చేతనస్థితిని పెంచేది ఏదైనా ధ్యానమే.

వర్తమానంలో లోతైన ఆనందం

ధ్యానం అంటే ఈ క్షణంలో ఆనందంలో ఉండటమే. మీరు ఈ క్షణంలో పూర్తి ప్రశాంతతతో ఉండగలిగితే మీరు ధ్యానస్థితిలో ఉన్నట్లే.

మీ జీవితంలో చాలా గొప్ప అందాన్ని అనుభవించిన ఏవైనా కొన్ని క్షణాల్ని గుర్తుచేసుకోండి. కొండ వెనుక నుంచి పైకి వస్తున్న సూర్యుడు, మొదటిసారి మీరు విన్న చక్కని సంగీతం. అప్పుడు అకస్తాత్తుగా మీరు నిశ్చలంగా అయిపోతారు. మాటలు లేకుండా అయిపోతారు. ఆ అందం ముందు మీరు ఏమీ ఆలోచించలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. మీరు నిశ్శబ్దంగా, విరామంగా, ఆలోచనలు లేని తెలుసుకునే తత్వంతో ఉంటారు. మీరు ఆ అందంలో కరిగిపోతారు. ఆ క్షణమే ధ్యానం.

ఆ విధంగా కొన్ని క్షణాలు గడిచాక మీ లోపల మాటలు ప్రారంభమవుతాయి. మీ మనస్సు చెబుతుంది, 'ఆహా! ఎంత అందమైన సూర్యోదయం! ఆ విధంగా ఎప్పుడెతే మాటలు వస్తాయో మీరు ధ్యానం నుంచి బయటికి వచ్చేసారు. మీరు ఆలోచిస్తారు లేదా ధ్యానంలో ఉంటారు, కానీ రెండూ ఒకసారి జరగవు.

ధ్యానం అంటే కేవలం అదే విధంగా ఉండటం. వర్తమానక్షణాన్ని ఎటువంటి అడ్డంకులూ లేకుండా అనుభవించటం.

ధ్యానానికి సరైన మార్గం ఏమిటి?

మొట్టమొదటి విషయం నిజాయితీగా ఉండటం. మీరు విప్పారి ఉండాలి. మనస్సు తెరవబడి ఉండాలి. ప్రయోగాలు చేయగలగాలి. కుతూహలంతో ఉండాలి.

దృక్పధాన్ని వర్ణించటానికి జెన్ బౌద్ధమతంలో ఒక మాట ఉంది. ప్రారంభకుల మనస్సు స్థితి. దీని అర్థం ప్రతి దాన్నీ కొత్తగా చూడగలగటం. దీంతో జీవితం ఉల్లాసంగా ఉంటుంది.

రెండవ విషయం, సాధిస్తాను అనే నమ్మకంతో ఉండటం. మీరు కచ్చితంగా సాధించగల లక్ష్యం ఆనందం. మీకు ధ్యానం తెలియకపోయినా మీరు దాన్ని సాధించగలరు.

చిన్న కథ : ఒక వ్యక్తి రమణమహర్షి దగ్గరకి వెళ్ళి 'భగవాన్ నేను ఆధ్యాత్మికజీవితానికి అర్హుడనేనా?' అని అడుగుతాడు. రమణమహర్షి అతనితో, నీవు జీవించి ఉన్నావా? అని ప్రశ్నిస్తాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంగా అవును, జీవించి ఉన్నాను అంటాడు.

రమణమహర్షి 'అది చాలు. అధ్యాత్మికజీవితానికి కావలసిన అర్హత నీకు ఉంది' అని జవాబు ఇస్తాడు.

మానవజీవితలక్ష్యం జ్ఞానోదయం. జ్ఞానోదయం పొందగల శక్తి కుండలినీశక్తి, అది మీలో ఉంది. దాన్ని చైతన్యపరచగలిగితే అది మిమ్మల్ని వేరే దశకి, ఉన్నతచేతనస్థితికి తీసుకువెళుతుంది. ఉన్నతచేతనస్థితికి వెళ్ళగల శక్తి కేవలం మనిషిలోనే ఉంది. జంతువులకి జ్ఞానోదయం పొందే అవకాశం లేదు. ఉన్నతచేతనస్థితికి వెళ్ళలేవు.

మూడవ విషయం, అంతా ఒక ఆటలా చూడండి. ధ్యానం అంటే సాహసం చేయటం. మీరు ధ్యానాన్ని సీరియస్‌గా తీసుకుంటే మొత్తం మిస్ అవుతారు. ధ్యానాన్ని ఉత్సవంలా చేయండి. దానిలో ఆనందాన్ని పొందండి.

ఒక చిన్న కథ : మూడు కోతులకి పండిన మామిడి పండు దొరుకుతుంది. దాని కోసం మూడూ పోట్లాడుకుంటాయి. వాటికి ఎందుకో కొంత వివేకం కలుగుతుంది. ఆ మామిడి కాయని తినే బదులు భూమిలో పాతాలి అని నిర్ణయిస్తాయి. అది మొక్కగా మొలిచి, చెట్టు అయితే చాలా కాయలు కాసాయి. అప్పుడు ఎన్ని కాయలైనా తినవచ్చు. అని అనుకుంటాయి.

ఆ మూడు కోతులూ మూడు బాధ్యతలు తీసుకుంటాయి. మొదటిది 'నేను రోజూ ఆ మొక్కకి నీరు పోసాను' అంటుంది.

రెండవ కోతి 'నేను మంచి మట్టిని వేస్తాను. ఎరువులు వేసి మొక్క బాగా పెరిగేలా చేస్తాను' అంటుంది.

మూడవకోతి 'నేను మొక్కకి కాపలా ఉంటాను. జంతువుల నుంచి మొక్కని కాపాడతాను 'అంటుంది.

ఆ విధంగా మూడు నెలలు గడచిపోతాయి. మొక్క మొలవదు. కోతులు ఒక మీటింగ్ పెట్టుకుంటాయి.

మొదటి కోతి, 'నేను అన్న విధంగా రోజూ నీరు పోసున్నాను' అంటుంది.

రెండవది, 'నేను చెప్పిన విధంగా నేలలో ఎరువులు, మంచి మట్లి వేస్తున్నాను' అంటుంది.

మూడవ కోతి, 'నేను అన్న విధంగా విత్తనాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాను. అంతే కాదు, ప్రతిరోజూ విత్తనాన్ని బయటికి తీసి అది మొలిచిందా లేదా అని కూడా చూస్తున్నాను,' అని చెబుతుంది.

మీరు ఇన్‌స్టంట్ ఫలితాల కోసం ఆశతో చూసుంటారు. దాంతో మీ అంతరంగంలో స్థిరపడే కార్యక్రమానికి అడ్డు పడుతున్నారు. మీరే ఈ మొత్తాన్ని అడ్డుకుంటున్నారు.

ఇక ఐదవది ఏకాంతం. మీ అంతరంగ పరిస్థితులని అనుభవించగల అవకాశాన్ని మీకు ఇచ్చుకోండి. ధ్యానం మీలో ఒక భాగమైనప్పుడు, అనందం సహజంగా మీలో వికసిస్తుంది.

ధ్యానం ఎందుకు ?

చేతనస్థితి నాలుగు దశలు

చేతనస్థితి వివిధదశలు ఆలోచనలు. ఆలోచనలు ఉన్న స్థితి, లేని స్థితి, నేను అనే స్పృహ జాగ్రత్‌దశ తురీయదశ ఉన్న స్థితి నేను అనే స్పృహ, స్వప్న దశ సుషుప్తదశ లేని స్థితి

ధ్యానం ఎందుకు, ధ్యానసాధన అవసరం ఏమిటి అనే విషయాలు మీకు అర్ధమయ్యే విధంగా మీకు ఒక టేబిల్ ద్వారా వివరిస్తాను. దైనందినజీవితంలో మనలో రెండు రకాల మానసికస్థితి ఉంటుంది. ఆలోచనలు ఉన్న స్థితి, మరొకటి ఆలోచనలు లేని స్థితి. మనం

ధ్యానం ఎందుకు

మేల్కొని ఉన్నప్పుడు ఆలోచనలు ఉంటాయి. గాఢనిద్రలో ఆలోచనలు ఉండవు. కాబట్టి మన మానసికస్థితి రెండు రకాలు; ఆలోచనలు ఉన్న స్థితి, ఆలోచనలు లేని స్థితి.

మన ఉనికికి (ఆత్మ) కూడా రెండు స్థితులు ఉంటాయి. ఒక స్థితిలో నేను అనే గుర్తింపు పూర్తిగా ఉంటుంది. స్పష్టంగా ఉంటుంది. మనం మేల్కొని ఉన్నప్పుడు మనకి నేను అనే స్థితి స్పష్టంగా ఉంటుంది. నేను డాక్టరుని, నేను టీచర్‌ని ఇలా ఉంటుంది. మనం మేల్కొని ఉన్నప్పుడు, మనలోని 'నేను' అనేది నిరంతరం తెలియకుండా ఉంటుంది. అయితే గాఢనిద్రలో అది ఉండదు. అవును కదా? మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు నేను అనే గుర్తింపు ఉండదు. కాబట్టి మానసికస్థితిలో మనం రెండు స్థితుల్లో ఉంటాం. మన ఉనికి స్థాయిలో కూడా మనం రెండు స్థితుల్లో ఉంటాం. ఒకటి నేను అనే గుర్తింపులో, మరొకటి అది లేకుండా.

వివిధ చేతన స్థితులు
ఆలోచనలతోఆలోచనలు లేకుండా
"నేను"
అన్న చేతనతో
జాగ్రత్
మేల్కొన్న అవస్థ
ఆలోచిస్తూ
తురీయ
పరమానంద స్టితి
సంపూర్ణ చేతనస్టితి
"నేను"
అన్న చేతన
లేకుండా
స్వప్న స్వప్నస్థితి
కలలుకంటూ
సుషుప్తి
అచేతన స్థితి
గాఢ నిద్ర

ఇప్పుడు ఈ రెండు మానసికస్థితులూ, ఉనికి, స్థాయి స్థితులు ఏ విధంగా ఒక దాంతో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయో, అవి ఏ విధంగా మన చేతన స్థితిలో వేరు వేరు దశలని స్పష్టిస్తాయో చూద్దాం.

మొదటి దశ జాగత్ దశ. మనలో నేను అనే గుర్తింపు ఉంటుంది. ఆలోచనలు ఉంటాయి. మనం మేల్కొని ఉన్నప్పుడు నేను అనే గుర్తింపు గురించి తెలుసుకుంటాం. ఆ స్థితిలో మనకి ఆలోచనలు కూడా ఉంటాయి. ఈ స్థితిలో నేను అనే గుర్తింపు ఆలోచనల కంటే వేగంగా, ఉంటుంది. అందుకే ఈ స్థితిలో బలవైన నేను అనే గుర్తింపుతో ఆలోచనలని నియంత్రించగలుగుతాం. మనం కావాలనుకుంటే ఆలోచనని తీసుకురాగలం, దానిని నియంత్రించగలం, దాన్ని పోగొట్టగలం. అది మేల్కొని ఉన్న స్థితిలో మాత్రమే సాధ్యమవుతుంది.

దీని తరువాతి దశ కలలు ఉండే స్వప్నస్థితి. స్వప్నస్థితిలో మనకి ఆలోచనలు చాలా ఉంటాయి, కాని నేను అనే గుర్తింపు ఉండదు. మనం మన గుర్తింపు విషయం తెలుసుకునే స్థితిలో ఉండం. కాని ఆలోచనలు ఉంటాయి. అందుకే కలలో మీరు మీ అబ్బాయి పక్కన స్కూల్‌లో చదువుతున్నట్లు కనిపించవచ్చు. దీన్ని బట్టి చూస్తే కలల స్థితి తార్కికంగా స్పష్టంగా ఉండదు. స్వప్న దశలో నేను అనే గుర్తింపు వేగం, బలం ఆలోచనల కన్నా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వాటిని నియంత్రించలేరు. అందుకే మీకు అర్థం లేని ఆలోచనలు (కలలు) వస్తుంటాయి.

ఒక విషయం స్పష్టంగా అర్థంచేసుకోండి. మేల్కొని ఉన్న స్థితిలో నేను అనే గుర్తింపు ఆలోచనల కంటే వేగంగా, బలంగా ఉంటుంది. అందుకే ఆలోచనలని నియంత్రించగలం. స్వప్నదశలో నేను అనే గుర్తింపు కంటే ఆలోచనలు బలంగా వేగంగా ఉంటాయి. అందుకే కలల్లోని ఆలోచనలని నియంత్రించలేం. గాఢ నిద్రావస్థలో నేను అనే గుర్తింపు ఉండదు, ఆలోచనలు ఉండవు. దీన్నే సుషుప్తి అంటారు. కలలు ఉండవు, నేను అనే గుర్తింపు ఉండదు.

మన జీవితంలో ఈ మూడు దశల అనుభవాన్నీ మనం నిరంతరం పొందుతుంటాం. అవి జాగ్రత్ స్థితి, స్వప్నస్థితి, సుషుప్తి.

నాల్గవ దశ కూడా ఉంది, అది మనం అనుభవించని దశ, దీన్నే తురీయదశ అంటారు. ఇందులో నేను అనే గుర్తింపు ఉంటుంది. కాని ఆలోచనలు ఉండవు. దీన్నే ఆలోచనలు లేని ఎరుక అంటారు. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ స్థితి అనుభవంలోకివస్తుంది. కొంత మందికి ఈ స్థితి కొన్ని క్షణాల పాటు మాత్రమే ఉండవచ్చు. ఆ తరువాత తిరిగి మామూలు దశకి వెళ్ళిపోతారు. మీలో అకస్మాత్తుగా ఏదైనా జరిగినా లేదా అందమైన ప్రకృతిలో లీనమై పూర్తి విరామంగా ఉన్నప్పుడు, లోతైన నిశ్శుబ్దంలో ఉన్నప్పుడు ఆలోచనలు లేని ఎరుక అనుభవించవచ్చు. నేను అనే పూర్తి స్పృహ ఉంటుంది. కానీ ఆలోచనలు ఉండవు. ఇదే నాలుగవదైన తురీయ దశ.

మనలోని భౌతిక, మానసిక అనారోగ్యం స్వప్నస్థితిలో ప్రారంభమవుతుంది. అది సుషుప్తి స్వప్నదశల్లోకి చొచ్చుకొని వస్తుంది. మనం మేల్కొన్న స్థితిలోకి స్వప్నస్థితి వస్తే దాన్నే పగటి కలలు అంటారు. అప్పుడు మనం చేయాలని అనుకున్నవాటిని అంతు లేని ఊహల్లో చూస్తాం. సుషుప్తలోనికి స్వప్నస్థితి వస్తే అనిశ్చలమైన నిద్ర అంటాం.

రాత్రి కాని పగలు కాని, స్వప్నస్థితి మనని డిస్టర్స్ చేస్తూ ఉంటుంది. సుషుప్తస్థితికి స్వప్నస్థితి ఆటంకమైనప్పుడు స్తబ్దత, సోమరితనం, నిద్ర లేమి అనే సమస్యలు వస్తాయి. అదే మేల్కొన్న స్థితిని ఆటంకపరిస్తే పగటికలల్లో అంటే ఊహల్లో ఉంటారు. బయటి ప్రపంచం గురించిన ఎరుక ఉండదు.

మీరు ఇటువంటి స్థితి చాలా సార్లు అనుభవించి ఉంటారు. ఇంటి నుంచి ఆఫీసుకి కారులో డ్రైవ్ చేసి వెళతారు. అక్కడ పార్కింగ్ దగ్గర ఆగాక అరె ఇంత దూరం డ్రైవ్ చేసానా అని అనుకుంటారు. ఆ డ్రైవింగ్ సమయంలో కొన్ని వందల నిర్ణయాలు చేసారు. కారులో కూర్చోవటం, బ్రేక్ వేయటం, సిగ్నల్స్ తిప్పటం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగటం – ఇలా చాలా చేస్తారు. కానీ మీకు తెలియకుండానే ఈ నిర్ణయాలన్నీ చేస్తారు. అకస్మాత్మగా 'అరె! నేను ఆఫీసుకి వచ్చేసాను' అని అనుకుంటారు. ఇలా జరిగిందంటే మీ స్వప్నస్తితి మేల్కొన్న స్థితిలోకి చొచ్చుకొని వచ్చింది అని అర్థం. స్వప్నస్థితి మేల్కొన్న స్థితిలోకి ఎక్కువగా వచ్చే కొద్దీ మన చేతనస్తితి తగ్గిపోతూ ఉంటుంది. మనం మానవ శరీరంలో జీవిస్తూ నిజమైన మానవ జీవితాన్ని గడపం.

ఎప్పుడెతే చేతనస్తితి తగ్గుతుందో మనం చేసే నిర్ణయాల పట్ల మనకి పూర్తి అవగాహన, ఎరుక ఉండవు. మనం ఆలోచించే మాటల పట్ల ఎరుక ఉండదు. మన లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఇంట్లోనే ఉంటాం కాని అక్కడ ఏం జరుగుతుందో తెలియని స్థితి ఇది. మేల్కొన్న స్థితిలో స్వప్నస్థితిలో ఆటంకపరుస్తూ జీవించే జీవితాన్ని నేను నరకంలో జీవించటం అంటాను. మనలోని శారీరక మానసికసమస్యలకి కారణం స్వప్నస్తితి సుషుప్తస్థితిలోకి కాని జాంగత్‌స్టితిలోకి కాని చొచ్చుకొని రావటం వల్ల మాత్రమే. ఆ విధంగా జరిగినప్పుడు భౌతిక, మానసికసమస్యలు వస్తాయి.

ధ్యానం మన జాగ్రత్‌స్తితిలోకి, సుషుప్తిలోకి లోతైన ఎరుకని నింపటానికి అవసరం.

మేల్కొని ఉన్న స్థితిలోకి స్వప్న స్థితి ఎక్కువగా చొచ్చుకొని వస్తే అది మానసిక క్రుంగుబాటుకి (డిప్రెషన్) కి దారి తీస్తుంది. ఎందుకంటే మన ఆలోచనలలో స్పష్టత ఉండదు. కాబట్టి మనలోని వ్యతిరేకాలోచనలను దాటి వెళ్ళగల స్వేచ్ఛ గాని, శక్తి గాని మనకి ఉండవు. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు దారులన్నీ మూసుకుపోయి, అవకాశాలన్నీ అయిపోయాయనిపిస్తుంది. మీరు అడగవచ్చు, 'ఎందుకు ధ్యానం చేయాలి?' అని. ధ్యానం మీ జాగ్రత్ స్థితిలోకి సుషుప్తలోకి తెలుసుకునే తత్వాన్ని నింపుతుంది. ధ్యానం చేసినప్పుడు స్వప్న స్థితి జాగ్రత్‌లోకి, సుషుప్త లోకి చొచ్చుకుని పోయే బదులు తురీయ స్థితుల్లోకి వస్తుంది.

ధ్యానం తురీయదశని జీవితంలో ప్రతి క్షణంలోకీ తీసుకువస్తుంది.

మనం ధ్యానం చేసే కొద్దీ మనలో తెలుసుకునే తత్వం పెరుగుతుంది. మనం చేతనస్థితి అయిన తురీయదశకి మరింత చేరువ అవుతాం. తురీయ అంటే నాల్గవ దశ. ఈ స్థితికి ఒక కచ్చితమైన పేరు ఇవ్వలేం. ఈ దశకి చాలా పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే విధమైన చేతనస్థితిని సూచిస్తాయి. ఎప్పుడైతే ఈ దశ మేల్కొన్న స్థితిలోకి లేదా గాఢనిద్రలోకి వస్తుందో శారీరక, మానసికారోగ్యం బాగుంటుంది. మనం కారణం లేని ఆనందాన్ని అనుభవిస్తాం. అప్పుడు మన ఉనికి ధ్యానంగా మారుతుంది.

ధ్యానం ఉద్దేశం ఈ నాల్గవ దశని కనీసం ఒకసారైనా అనుభవించాలని. ఒక్కసారి ఈ దశని అనుభవిస్తే, ఆ అనుభవాన్ని మేల్కొని ఉన్న స్థితికి, గాఢనిద్రాస్థితికి తీసుకురావచ్చు

మన మేలుకున్న స్టితి, గాఢనిద్రాస్థితి నాల్గవ స్తితితో ప్రభావితమైతే, దాన్నే జీవన్ముక్తి అంటాం.

ధ్యానం ఉద్దేశం తురీయదశని మేల్కొన్న స్థితిలోకి, గాఢనిద్రస్థితిలోకి తీసుకురావటమే. ధ్యానపద్ధతులు ఎందుకు

ధ్యానపద్ధతులు మీరు ఏదో సాధించటానికి సహాయం చేయవు. మీరు ఇంకా పరమానందస్థితి, నిత్యానందస్థితిని పొందలేదు అని గుర్తుచేయటానికి సహాయం చేస్తాయి.

నేను మిమ్మల్ని అకస్మాతుగా 'ఆనందంలోకి వెళ్ళండి' అన్నాననుకోండి, అది సాధ్యమవుతుందా? లేదు! ఆనందం మీ సహజ స్థితి అన్న విషయం కూడా మీకు తెలియదు. కాని ఎప్పుడెతే గురువులు పదే పదే ధ్యానం చేయమని చెబుతుంటారో, మీరు ఆ ఆనందాన్వేషణలో ఉన్నారు అని గుర్తువస్తుంది.

ధ్యానపద్ధతులు ఆనందసాగరాన్ని దాటించే లైఫ్ జాకెట్స్. మీకు ఈత కొట్టటం రానప్పుడు తిన్నగా నీళ్ళలోకి దూకరు కదా! మీకు లైఫ్ జాకెట్స్ కావాలి. అవి మీరు నీళ్ళలో తేలేలా సహాయం చేస్తాయి. అదే విధంగా అనందసాగరంలోకి దూకటానికి ప్రారంభంలో మీకు ధ్యానపద్ధతులు అవసరం. ఒకసారి ధ్యానం మీ జీవనసరళి అయితే, మీరు అప్రయత్నంగా ఆ పద్ధతుల్ని వదిలేస్తారు. ఎందుకంటే ధ్యానం మీ జీవితం అవుతుంది కాని అది దినచర్య కాదు. ప్రతి క్షణం మీరు ధ్యాన స్థితిలో ఉంటారు. ధ్యానం మీలో నిరంతరం జరుగుతూ ఉంటుంది. మీరు బయటి ప్రపంచంలో ఏ పని చేస్తున్నా, ధ్యానం మీలో ఉంటుంది.

నన్ను చాలా మంది అడుగుతుంటారు, ఇన్ని ధ్యానపద్ధతులు ఎందుకు అని. చాలా ధ్యానపద్ధతులు ఎందుకు ఉన్నాయి అంటే చాలా రకాల మనుషులు ఉన్నారు కాబట్టి, ఒక్కొక్కరిది ఒక్కో మానసికవ్యవస్థ. ఒక ధ్యానపద్ధతి ఒకరికి కుదిరితే అది మరొకరికి నచ్చదు. కాబట్టి మీరు కొన్ని పద్ధతులతో ప్రయోగాలు చేసి మీకు బాగా పనిచేసే దానిని తెలుసుకోవచ్చు. రెండవ విషయం ఎప్పుడెతే మీరు రకరకాల పద్ధతుల్ని ప్రయత్నిస్తుంటారో మీకు తెలియకుండా మీరు ఆలోచనలు లేని స్థితికి వెళుతుంటారు. విరామ స్థితిని చేరతారు. పరమానంద స్థితిని పొందుతారు.

ధ్యానం ఉపయోగాలు

భౌతికారోగ్యం : ధ్యాసం మిమ్మల్ని భౌతికంగా, మానసికంగా, భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా మార్చగల శక్తిని కలిగి ఉంది. ఈ నాలుగురకాల ఆరోగ్యం అంటే ఏమిటో వివరిస్తాను. భౌతికారోగ్యం అంటే మీరు తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమై అది మీలో ఒక భాగం

కావాలి. మానసికారోగ్యం అంటే మీలోకి తీసుకున్న ఊహలు, భావాలని, సమస్యల్కి, మీరు పరిష్కారాలు కనుగొనే క్రమంలో ఎదుర్కొనే విషయాల్ని, జీర్ణింపచేసుకోగలగాలి. అంటే మీలో మీకు విభేదాలు లేకుండా జీవించగలగాలి. ఆధ్యాత్మికారోగ్యం అంటే మీరు విన్న గొప్ప బోధల్ని, శక్తిని జీర్ణించుకొని స్వేచ్ఛగా జీవించాలి. ఈ మూడింటినీ పొందటమే సంపూర్ణారోగ్యం.

మీ జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తే అది భౌతికారోగ్యం. నేను చెబుతున్నాను ఇక మీకు ఏమీ అవసరం లేదు. మీ జీర్దవ్యవస్థ కచ్చితంగా ఉంటే మీకు ఆహారంతో కూడా అవసరం లేదు. మీ శరీరవ్యవస్థకి విశ్వం నుంచి శక్తిని తీసుకునే మేధ ఉంటుంది. మీ జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటే చాలా కొంచెం ఆహారం చాలు, ఆహారం లేకపోయినా పరవాలేదు.

మందులకు బదులు ధ్యానం వాడవచ్చు. ధ్యానం ద్వారా మీలోని బి.పి.ని నియంత్రించవచ్చు. రక్తంలో ఉండే గ్లూకోజు పరిమాణాన్ని నియంత్రించవచ్చు. మీ శరీరం వ్యాధుల బారిన పడకుండా దానికి శక్తిని ఇవ్వవచ్చు. శరీరానికి ఉండే అలర్జీలు, ఆస్మా లాంటి వ్యాధుల్ని తగ్గించవచ్చు. ధ్యాన శక్తి ముందు ఏ వ్యాధి అయినా తల వంచవలసిందే.

మానసికారోగ్యం – మేధని మేల్కొలిపి ఆత్మప్రబోధస్థితి వికసించేలా చేయటం : మానసికవ్యవస్థలో ధ్యానం సృష్టతని ఇస్తుంది. ఏకాగ్రతని, జ్ఞాపకశక్తిని పెంచటానికి ధ్యానం సహాయం చేస్తుంది. వీటి అన్నింటి కంటే ధ్యానం మీలోని తెలివితేటల దశ నుంచి మిమ్మల్ని మేధస్సుకి, అక్కడి నుంచి ఆత్మప్రబోధస్థితికి తీసుకువెళుతుంది. కేవలం తార్కిక జ్ఞానంతో నిర్ణయాల్ని చేసే దాన్ని తెలివితేటల దశ అంటారు. ఒక విషయానికి లేదా ఒక సంఘటనకి మీరు సృజనాత్మకంగా నిర్మాణాత్మకంగా ప్రతిస్పందిస్తే దాన్ని వివేకం అంటారు. వివేకం అంటే జీవితంలో ప్రతిక్షణం జరుగుతున్నవాటికి స్పందిస్తూ, అది విసిరే సవాళ్ళని తెలుసుకోగలగటమే. సంఘటన పట్ల పూర్తి ఎరుకతో ఉండి సమయస్ఫూర్తితో జవాబులు ఇవ్వగలగటమే వివేకం అంటే.

నిర్ణయాలు మనలో ఒక స్ఫురణలా ఏర్పడటమే ఆత్మప్రబోధం అంటే. అది మీ ఉనికి శక్తి నుంచి జరుగుతుంది కాని మానసిక వ్యవస్థ నుంచి కాదు. ధ్యానం మీలో ఉన్న ఆ దివ్యశక్తిని పొందేలా చేస్తుంది. ధ్యానంతో మీరు మనస్సుకి అతీతంగా వెళ్ళవచ్చు. మీ ఉనికిని చేరవచ్చు. ఉనికి దగ్గర నియమనిబంధనలు ఉండవు. మీలో నిక్షిప్తమైన శక్తిని తెలుసుకోవటానికి పూర్తి స్వేచ్ఛనిస్తుంది. అందుకే ధ్యానంతో అకస్మాత్తుగా మీరు మీతో సౌకర్యంగా ఉండగలుగుతారు. కొత్త విషయాలతో చక్కగా వ్యవహరించగలుగుతారు. మీలోని సమయస్ఫూర్తిని మరొకసారి కనుగొనగలుగుతారు.

మీకు చికిత్స చేసే ఆలోచనలు

వైద్యపరంగా మీ శరీరం మంచి ఆరోగ్యస్థితిలో ఉండవచ్చు. దాని అర్థం మీరు సంపూర్ణారోగ్యంతో ఉన్నారు అని కాదు. నా అనుభవంలో నేను చాలా మందిని చూసాను. ఆ అనుభవంతో చెబుతున్నాను, ఎవరిలో అయితే తమకితాము చికిత్స చేసుకోగల స్పష్టత ఉండదో వారిలో చాలా మందికి శారీరకారోగ్యం ఉండదు. చికిత్స చేసుకోగల శక్తి అంటే మీరు నిరాశానిస్పృహల్లోకి వెళ్ళే ముందు, ఆ స్థితిని అర్థం చేసుకొని అందులోంచి బయటికి రాగలగటమే.

ఒక సంవత్సరం క్రితం నేను చిన్న పరిశోధన చేసాను. ధ్యానకార్యక్రమాలు చేసి, ఆధ్యాత్మికంగా కొంత చదివిన కొంత మందిని తీసుకున్నాను. వారిని ఇరవై నిమిషాల పాటు వారికి వచ్చిన ఆలోచనలని ఎడిట్ చేయకుండా రాయమని చెప్పాను. అదే విధంగా మరి కొంత మంది ఎవరైతే ఎటువంటి ధ్యానకార్యక్రమాలూ చేయలేదో వారిని కూడా వచ్చిన ఆలోచనలని రాయమని చెప్పాను. ఫలితాలు చూసి నిశ్సాంతపోయాను.

ఎటువంటి ధ్యాన కార్యక్రమాలూ చేయనివారిలో చాలా శాతం ఆలోచనలు నిరాశానిస్పృహలతో ఉన్నాయి. అవి డిప్రెషన్ కలిగించే ఆలోచనలు. కేవలం కొంత శాతం మాత్రమే సాంత్వన కలిగించే ఆలోచనలు. అవి డిప్రెషన్ నుంచి బయటకి తెచ్చే ఆలోచనలు. ధ్యాన కార్యక్రమాలు, ఆధ్యాత్మికకార్యక్రమాలు చేసేవారిలో దాదాపు సగం సాంత్వన కలిగించి, అంతరంగంలో చికిత్స చేసే ఆలోచనలు కేవలం కొంత శాతం డిప్రెషన్ వైపు తీసుకువెళ్ళే ఆలోచనలు. అదే ధ్యాన ప్రభావం. అది మిమ్మల్ని సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంచుతుంది.

డిప్రెషన్‌ని ఎదుర్కోగల జ్ఞానాయుధాలు

సత్యం గురించి చెప్పే జ్ఞానాన్ని నేను శాస్త్ర శస్త్రాలు అంటాను. శాస్త్రం అంటే సత్యం, జ్ఞానం, శస్త్రాలు అంటే ఆయుధాలు. ఈ శాస్త్రశస్త్రాలు మన లోపలి మానసిక కుంగుబాటుని నాశనం చేస్తాయి. ఎప్పుడైతే డిప్రెషన్ కాని, బాధలు కాని మీమీద దాడి చేస్తాయో, మీ మనస్సు మీ ముందుకి కొన్ని దృశ్యాల్ని తీసుకువస్తుంది. ఆ క్షణాలలో ఈ శాస్త్ర శస్త్రాలు మిమ్మల్ని ఆ కుంగుబాటు నుంచి బయటికి తెస్తాయి. ఆ ఆలోచనలు మీ వ్యథల నుంచి పైకి వచ్చేలా సహాయం చేస్తాయి. అందుకే సత్యాన్ని మీలో నింపుకోవటం ఒక భారమైన విషయం అనుకోవద్దు. దాన్ని జీర్ణించుకోవటానికి ప్రయత్నించండి. అది మీ అంతరంగంలో ఉంటుంది. దాన్ని మీ అంతరంగంలో జ్ఞానాయుధంగా దాచండి.

మీలో శాస్త్ర – శస్త్రాలు, జ్ఞానాయుధాలు ఎక్కువగా ఉంటే డిప్రెషన్ భయపడిపోతుంది. మీ సైన్యం పెద్దదైనప్పుడు సహజంగానే శత్రుసైన్యం భయపడుతుంది. అది మీ మీద దాడి చేయదు. మీ దగ్గర ఉన్న ఆయుధాల్ని చూసి మీ మీద దాడి చేయాలి అంటే ఆలోచిస్తుంది. అదే విధంగా మీ లోపల సాంత్వన కూర్చే, మీ అంతరంగంలో చికిత్స చేయగల ఆలోచనలు ఎక్కువగా ఉంటే బాధలు, మానసిక కుంగుబాటుతనం మీరంటే భయపడతాయి. నిజంగా చెప్పాలంటే మీ లోపల డిప్రెషన్ కలిగించే ఆలోచనలు తగ్గుతాయి. మిమ్మల్ని హింసించే ఆలోచనలు తగ్గి సాంత్వన ఇచ్చే ఆలోచనలు పెరుగుతాయి.

స్వేచ్ఛ

ధ్యానంతో మీరు మంచి జీవితాన్ని గడపవచ్చు. గొప్ప సృష్టతతో, గాఢతతో చక్కగా జీవించవచ్చు. మీలో తెలుసుకునే తత్వం సృజనాత్మకత పెరుగుతాయి. మీ అంతరంగంలో లోతైన, నిశ్చలమైన నిశ్శబ్ధాన్ని అనుభవిస్తారు.

మీరు చేయరు, చేసే వ్యక్తిని చూడగలుగుతారు. ధ్యానంలో ఉండే రహస్యం ఇదే. మీరు చేసే పనులని, మీ భావావేశాల్ని మీరు గమనించగలుగుతారు. మీరు చూడగలుగుతారు. మీ పనులని మీరు గమనించగలిగినప్పుడు, మీ లోపల ఎటువంటి మార్పుచెందని ఒకరు ఉన్నారు అని తెలుసుకుంటారు. ఆ వ్యక్తిలో మార్పుండదు, బాధ పడడు, కోపం రాదు, డబ్బు, రక్షణ, పేరు ప్రతిష్ఠలు వీటిని లెక్క చేయడు.

అదే నిజమైన మీరు. మిమ్మల్ని ఏదీ అంటలేదు. మీ మీద ఎవరూ ప్రభావం చూపలేరు. మిగిలినదంతా మీ చుట్టూ మీరు తయారుచేసుకున్న మీ వ్యక్తిత్వం. ఎప్పుడైతే ఈ పనులు చేసేది నిజమైన మీరు కాదు అని తెలుసుకుంటారో, కోపం తెచ్చుకునేది, బాధ పడేది, క్రుంగిపోయేది ఇవన్నీ నిజమైన మీరు కాదు అని తెలుసుకుంటారో, మీరు అంతు లేని స్వేచ్ఛని అనుభవిస్తారు. అది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. అదే నిజమైన స్వేచ్ఛ

మన జీవితం అంతా స్వేచ్ఛ కోసం వెతుకుతూ ఉంటాం. మీరు తెలుసుకున్నా, లేకపోయినా మనలో ప్రతి ఒక్కరూ వెతికేది ఆ స్వచ్ఛకోసమే. మన స్వేచ్ఛ వేరే వ్యక్తుల మీద ఆధారపడి ఉన్నది అనుకుంటాం. ఇప్పుడు మీకు ఎదుటివారికి, మీ స్వేచ్ఛకి ఎటువంటి సంబంధం లేదు అని అర్థం అవుతుంది.

సాధారణజీవితాల్లో మనందరం చూసేది స్వేచ్ఛ కోసం లేదా దేన్నుంచైనా స్వేచ్ఛ పొందాలి అని పని చేయటానికి, దేనైనా పొందటానికి, ఉండటానికి ఇవన్నీ కలిపి మనం అనుకున్న విధంగా జీవించాలి అని కోరుకుంటాం. మనకి ఇష్టంలేని – అనారోగ్యం బాధలు, కోపం, ఒత్తిడి, వ్యథలు, కష్టాలు ఇలాంటివాటి నుంచి స్వేచ్ఛని కోరుకుంటాం. మనం మంచివాటి పట్ట ఆశ, మంచివి కాని వాటి పట్ట భయం అనే ఈ రెండింటి మధ్యలో చిక్కుకొని ఉంటాం. మన జీవితం అంతా ఆశ, భయం అనే ఈ రెండు తాళ్ళతో నియంత్రించబడుతున్నాం. ఈ రెండు మనని నియంత్రించేటప్పుడు మనం నిజంగా కోరుకునే స్వేచ్ఛ సంగతి మరిచిపోతున్నాం.

ఒక రోజు ఒక వ్యక్తి నన్ను కలిసాడు. అతను కళాకారుడు. ధ్యానం అంటే నాకు ఇష్టం ఉండదు అని నాతో అన్నాడు. అతను ఇంకా ఇలా చెప్పాడు, 'ఈ రూల్స్ అన్నా, క్రమశిక్షణ అన్నా నాకు చాలా చిరాకు. నాకు స్వేచ్ఛగా నా ఇష్టం వచ్చినట్లు ఉండటం ఇష్టం. నేను పదింటికి నిద్ర లేస్తాను. ముందుగా కాఫీ తాగుతాను. తరువాత స్విమ్మింగ్‌కి వెళతాను..... ఇలా అతను రోజంతా ఏం చేస్తాడో చెప్పాడు. అప్పుడు అతన్ని నేను అడిగాను, 'ఎవరైనా నిన్ను ఆరుగంటలకే నిద్ర లేపితే ఏమవుతుంది' అని లేదా నీకు నిద్ర లేవగానే కాఫీ ఇవ్వకపోతే ఏమవుతుంది? అని. అతను 'అమ్మో! అలా చేస్తే నాకు పిచ్చి ఎక్కుతుంది' అని చెప్పి నవ్వాడు.

'ఒక రోజు స్విమ్మింగ్‌కి వెళ్ళకపోతే ఏమవుతుంది' అని అడిగాను. 'నాకు బాగుండదు. రోజంతా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది' అని జవాబు ఇచ్చాడు.

అతనితో నేను ఇలా అన్నాను, నీ స్వేచ్ఛ ఇన్ని నిబంధనల మీద ఆధారపడి ఉంది. నిజంగా నీవు స్వేచ్ఛగా ఉన్నావా? అని. అతను నిర్ఘాంతపోయాడు. నిజంగా స్వేచ్ఛ అంటే అన్నింటి నుంచీ స్వేచ్ఛగా ఉండాలి.

దాన్నే నేను నిజమైన స్వేచ్ఛ అంటాను. ఇది స్వేచ్ఛ కోసం కాదు వాటి నుంచి స్వేచ్ఛని పొందటం. నిజమైన స్వేచ్ఛ వర్తమానంలో, ఈ క్షణంలో జీవిస్తే దొరుకుతుంది. ఏ స్వేచ్ఛ అయితే బయటి ప్రపంచవిషయాల మీద ఆధారపడి ఉండదో అదే నిజమైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ మీకు ధ్యానం ద్వారా అనుభవం అవుతుంది.

కారణం లేని ప్రేమ, ఆనందం

మీరు ధ్యానంలోకి ప్రవేశించగానే మీ నుంచి పొంగి ప్రవహించే ప్రేమని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ధ్యానం ద్వారా ఇంత వరకూ మీరు చూడని మీలోని ఒక కొత్త కోణం మీతో సంభాషించటం అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఎప్పుడైతే తరిగిపోని ఆనందాన్ని అనుభవిస్తారో, ఎప్పుడైతే బయటి ప్రపంచవిషయాలు లేకుండా ఆనందాన్ని పొందుతారో అప్పుడు మీరు మీ అంతరంగంలోకి లోతుగా వెళుతున్నారు అని అర్థం. మీరు కలిసిన ప్రతి ఒక్కరితో ఆ ఆనందాన్ని పంచాలని అనుకుంటారు. ఎప్పుడైతే ఈ ఆనందం పొంగి ప్రవహిస్తుందో, అందరినీ ప్రభావితం చేస్తుందో దాన్ని ప్రేమ అంటారు.

స్వేచ్ఛ మాదిరిగానే ఈ ప్రేమ కూడా మీరు ఎప్పుడూ అనుభవించనిది. మీ జీవితం అంతా మీరు ప్రేమిస్తున్నారు, ప్రేమించబడుతున్నారు. అయితే అది ఏదో ఒక కారణంతో మాత్రమే. అది అత్యంతసన్నిహితుల మధ్య అయినా సరే భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమలో కూడా ఏవో కనపడని కారణాలు ఉంటాయి. మనకి తెలిసిన ప్రేమ, అసూయ, అధికారం, ఆశించటం అనే మరకలతో ఉంటుంది.

ధ్యానంతో మొదటిసారిగా కారణం లేకుండా ప్రేమించటం అంటే ఏమిటో తెలుసుకుంటారు. మీరు ప్రేమని అలవోకగా ఇచ్చేస్తారు. ఎందుకంటే మీ దగ్గర పొంగి ప్రవహిస్తున్న ప్రేమ ఉంది.

ధ్యానం ప్రయోజనాలు – ఆరోగ్యం

ధ్యానం సంపూర్ణమైన ఆరోగ్యానిస్తుంది. భౌతిక, మానసిక, భావావేశాత్మక స్థాయిలలో అది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ధ్యానం చేసిన వారు చెప్పిన కొన్ని ఆరోగ్యసంబంధిత ఉపయోగాలు ఈ కింది వివరించాం.

  • బి.పి., బ్లడ్ షుగర్, శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకోవటం నిశ్చలంగా, నియంత్రణలో ఉంటాయి.
  • శారీరక మానసిక పరమైన కదలికలు పద్ధతిలో ఉంటాయి.
  • కండరాల్లో సమస్యలు తగ్గి, ఎముకలు బలపడతాయి. శరీరానికి వ్యాధులను తట్టుకొనే శక్తి వస్తుంది.
  • శరీరశుభ్రత విషపదార్థాలు, వ్యర్థాలు త్వరగా బయటికి పోతాయి.
  • నిద్ర లేమి ఉండదు – మంచి నిద్ర పడుతుంది.
  • శక్తి పెరిగి ఎక్కువ పని చేయగలుగుతారు.
  • జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని చర్యలు బాగుంటాయి. శరీరకణాల జీవిత కాలం పెరుగుతుంది.
  • ఆరోగ్యకరమైన శరీరరసాయనాలు వృద్ధి చెందుతాయి. సహజమైన నిరాశానిస్పృహల్చి, డిప్రెషన్‌ని తొలగించే రసాయనాలు తయారవుతాయి. ఎండోర్ఫిన్, ఆనందాన్ని కలిగించే రసాయనాలు తయారవుతాయి.
  • మంచి సంబంధబాంధవ్యాలు ధ్యానం మిమ్మల్ని మీకు అనుగుణంగా మారుస్తుంది, ఎదుటివారికి అనుగుణంగా ఉంచుతుంది. దీంతో మానవసంబంధాలు లోతుగా అర్థవంతంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో, స్నేహితులతో, మీరు ఎవరిని కలిస్తే వారితో మంచి సంబంధాలు ఉంటాయి.
  • వివేకం బాగా పనిచేయటానికి మేధ కావాలి. మీలోని మేధని ధ్యానం చైతన్యవంతం చేస్తుంది. మీరు పదునైన తెలుసుకునే తత్వంతో ఉంటారు. దాంతో మీరు ఏ పనినైనా సహజసిద్ధంగా, సమర్థంగా పూర్తిచేయగలుగుతారు.
  • సృజనాత్మకత మన అందరిలో మనం కనుగొనని గొప్ప నైపుణ్యం అనే ఐశ్వర్యం ఉంటుంది. ధ్యానం దాన్ని మనకి తెలియచేస్తుంది. మనలో సృజనాత్మకతని పెంచుతుంది.
  • యథార్ధమైన ధ్యానం మీలోని నిజమైన మిమ్మల్ని స్పృశిస్తుంది. అది మీలోని ప్రత్యేకతని తెలుసుకునేలా చేస్తుంది. అప్పుడు మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది.
  • సమతుల్యత మనందరం ఏవో భావావేశాల తోపుడులతో ఈ చివరి నుంచి ఆ చివరికి ఊగిసలాడుతూ ఉంటాం. బాధ, అసూయ, అసంతృప్తి, భయం, కోపం, అపరాధభావం, ఇలా మన నియంత్రణలో లేనివాటి ప్రభావంలో ఉంటాం. ధ్యానం మీ మీద మీరు కేంద్రీకరింపబడే విధంగా చేస్తుంది. మీకు మీరు యజమానిగా ఉండగలరు.
  • విరామంగా, ప్రశాంతంగా, పరమానందంలో మనం జీవితాంతం కోరుకునే నిశ్చలమైన విశ్రాంతి, ప్రశాంతత అనేవి ధ్యానం ద్వారా మనకి దొరికే ఉపవస్తువులు, ధ్యానంతో మీరు భయం, ఆశ, ఒత్తిడి అనే విషచక్రం నుంచి ఆనందం అనే ధర్మచక్రంలోకి వస్తారు.
  • సంపూర్ణమైన ఆధ్యాత్మికప్రగతి మనలోని ఐక్యూతో కొలుస్తారు. ఇప్పుడు ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో ఐక్యూ కంటే ఎమోషనల్ కోషెంట్ ప్రముఖంగా వినిపిస్తూంది. కాని మన జీవితంలో చాలా ముఖ్యమైనది మన అంతరంగంలో ఉండే సంతృప్తి, పరిపూర్ణత్వం. ధ్యానం వీటిని వృద్ధి చేస్తుంది. స్పిరిచ్యువల్ కోషెంట్ ఐక్యు, ఐక్యూలని కూడా పెంచుతుంది.
  • జీవితం ప్రస్తుతం మన మానసికవ్యవస్థ గట్టిపడిపోయి, మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. వ్యక్తిత్వం అని మన మనస్సులో మోసే ఈ ముద్ర మనకి చాలా సమస్యల్ని తీసుకువస్తుంది. దాంతో మనం పూర్తిగా జీవితాన్ని ఆనందించలేకపోతున్నాం. ధ్యానం దీన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనం సంపూర్ణంగా జీవించగలుగుతాం.
  • అంతిమశక్తి మీరు విమానంలా ఎగరగల శక్తి ఉన్నవారు కాని మీరు ఎద్దుల బండిలా నడిచేవారిమే అనుకుంటున్నారు. మీ శక్తిని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ధ్యానం మీ శక్తిని తెలుసుకునేలా చేస్తుంది. మీరు చాలా నైపుణ్యాలతో, శక్తితో జన్మించారు.

ఆటలా పని చేయటం

మనలో చాలా మంది ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారంటే, నాకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది, చాలా పోటీ ఉంది, ఏదైనా చేయాలంటే ఏ పనీ చేయలేకపోతున్నాను, ఇలా అనుకుంటారు. మీరు అసలు సత్యాన్ని చూస్తే అది టైం లేకపోవటం లేదా పని ఎక్కువగా ఉండటం కాదు. అది వాటి పట్ట మీకుండే దృక్పథం మాత్రమే.

మీరు ఈ విధంగా చేయండి. మీరు ఏ పని చేసినా పూర్తి తెలుసుకునే తత్వంతో చేయండి. తినేటప్పుడు పూర్తి తెలుసుకునే తత్వంతో తినండి. దానికి అదనపు సమయం అవసరం లేదు. అలా చేస్తే తినటానికి తక్కువ సమయం పడుతుంది కూడా. ఎందుకంటే ఆ విధంగా తినే సమయంలో శరీరానికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకుంటారు. మామూలుగా అయితే పదార్థాల్ని మీలో నింపుతారు.

తెలుసుకునే తత్వానికి అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. మీ ప్రణాళికల కంటే ఇది అద్భుతాల్ని చేస్తుంది. తెలుసుకునే తత్వం దేనికీ వ్యతిరేకం కాదు. అది మీ పనులకి శక్తిని కలుపుతుంది. మీరు తెలుసుకునే తత్వంతో ఉన్నప్పుడు మీరు ఉండరు. మీరు తెలుసుకునే తత్వంతో ఉంటే అహంకారం ఉండదు. అహం ఉంటే ఎరుక ఉండదు. మీరు లేని స్థితి జీవన్ముక్తి. ఎప్పుడైతే మీరు ఎరుకతో ఉంటారో, తెలుసుకునే తత్వంతో ఉంటారో మీరు పనిని చాలా సమర్థంగా, శిఖరాగ్రస్థాయిలో చేయగలుగుతారు. మీలో శక్తిని సమర్ధంగా ఉపయోగించగలుగుతారు. కాబట్టి రోజూ చివరలో స్వచ్ఛంగా, తాజాగా ఉదయం ఉన్న విధంగా ఉంటారు. మీ పని మిమ్మల్ని నీరసపడే విధంగా చేయదు. అది మీ దృక్పథం, మీ మనస్సు అలా చేస్తాయి.

చిన్న ఉదాహరణ తీసుకోండి, మీరు రెండు మైళ్ళు ఆఫీసుకి నడిచివెళ్ళటం, అదే రెండు మైళ్ళు సరదగా బీచ్ ఒడ్డున నడవటం. ఆఫీసుకి నడచిన నడక పనిలా ఉంటుంది. మీకు నీరసం వస్తుంది. బీచ్‌లో నడచిన నడక సరదాగా ఉండి మీరు తాజాగా అవుతారు. ఇదంతా మీరు పని చేసేటప్పుడు ఉండే మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ధ్యానం అంటే మీ పని దృక్పథం ఉండే మానసిక స్థితి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావటం. జీవితంలో ప్రతిదీ దాన్ని సర్వాంతర్యామి ఆడే దివ్య క్రీడగా అందంగా చూడగలటమే.

జీవిత ధ్యానం నుంచి ధ్యాన జీవితంలోకి

ప్రారంభంలో మీ జీవితంలో ధ్యానాన్ని సాధన చేయాలి. మీకు తెలిసే విధంగా ధ్యానాన్ని మీ జీవితంలోకి ప్రవేశపెట్టాలి. ఒక ధ్యాన పద్ధతిని తీసుకొని ప్రతి రోజూ ఒక అరగంట కాని, గంట కాని సాధన చేయాలి. మీకు అది ఎలా ఉందో గమనించాలి. అది మీకు బాగుంది అనిపిస్తే దాన్ని పది రోజులు సాధన చేయండి. దాని నుంచి ఫలితాలు ఆశించకుండా సాధన చేయండి. పద్ధతి మిమ్మల్ని స్పందింపచేస్తే, అది మీలో కచ్చితంగా మార్పుని తీసుకువస్తుంది. కొన్నిసార్లు మార్పు చాలా సూక్ష్మస్థాయిలో జరుగుతుంది. కొన్నిసార్లు మన కంటే మనలోని మార్పుని ఎదుటివారు త్వరగా గమనించగలుగుతారు.

కేవలం ఒక్క క్షణం పాటు అయినా ధ్యానం ఆనందానుభూతి మీకు కలిగితే మీరు ధ్యానాన్ని ప్రేమిస్తారు. అప్పుడు మీరు దీన్ని గంటలు సాధన చేయాలి అని అడగరు. మీరు నిద్ర లేవగానే మీకు వచ్చే మొదటి ఆలోచన ధ్యానం చేయాలి అని. మీరు స్నానం చేసే సమయంలో, భోజనం చేసే సమయంలో మీరు పూర్తి ఎరుకతో, పూర్తి తెలుసుకునే తత్వంతో చేస్తారు. ధ్యానంతో ప్రతిక్షణం చైతన్యవంతంగా ఉంటుంది. అప్పుడు జీవితాన్ని ధ్యానంలో జీవిస్తారు.

ధ్యానం ఎప్పుడు చేయాలి?

తరువాతి ప్రశ్న, ధ్యానం ఎప్పుడు చేయాలి.

ఇది ఎప్పుడూ ఒక వివాదస్పదమైన ప్రశ్న. చిన్నవాళ్ళు దీన్ని మేం పెద్ద వయస్సు వచ్చాక జీవితాన్ని పూర్తిగా జీవించాక చేయాలి అనుకుంటారు. పెద్దవాళ్ళు, ఇది చిన్న తనంలో చేయాలి, అప్పుడు వయస్సులో ఉండి శక్తితో ఉంటాం' అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రశ్న 'ధ్యానం ఎంత సేపు చేయాలి అనే కాదు, ధ్యానం నా జీవితంలోనికి ఎప్పుడు తీసుకురావాలి' అని కూడా కాదు.

ధ్యానం అంటే కారు డ్రైవ్ చేసే ముందు ఓనర్స్ మాన్యువల్ చదివినట్లు. డ్రైవ్ చేయటానికి ముందు అది చదవకపోతే ప్రమాదం జరగవచ్చు. అదే విధంగా ధ్యానం మీ శరీరానికి, మీ జీవితానికి ఓనర్స్ మాన్యువల్ లాంటిది. జీవితాన్ని ప్రారంభించే ముందు ధ్యానం చేయటం మొదలు పెట్టకపోతే జీవితం సమస్యలతో ముగుస్తుంది. ఏదో ఒక సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లతారు.

దయచేసి ఒక విషయం అర్ధం చేసుకోండి, ధ్యానం ప్రతి ఒక్కరికీ జీవితంలో కావలసిన ప్రాథమికావసరం, అది ఎంపిక కాదు. ప్రాథమికావసరం.

ఏడు సంవత్సరాల వయస్సు తరువాత ధ్యానం కావాలి. ఆ వయస్సు వరకూ పిల్లలు ఉండేది ధ్యాన స్థితిలోనే. ఏడు సంవత్సరాల తరువాత సమాజంలో నియమ నిబంధనల్లోకి వెళతారు. అప్పుడు మీ నిజమైన, సహజమైన లక్షణాన్ని వదిలివేస్తారు. మీరు నిజంగా ధ్యానం అంటే ఏమిటో అర్థం చేసుకుని దానిలోకి వెళ్ళాలంటే మీలో మానసికవిప్లవం రావాలి. మానసికవిప్లవం అంటే మీ ఆత్మ, ప్రపంచం, భగవంతుని గురించి స్పష్టమైన అవగాహన రావటమే.

ప్రస్తుతం జీవితం అంటే మీరు అనుకున్నది పూర్తిగా కాదు. అందుకే మీ లోపల ప్రశాంతమైన విశ్రాంతిని అనుభవించలేకపోతున్నారు. మానసికవిప్లవం అంటే మీ గురించి, ప్రపంచం గురించి, భగవంతుని గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం. ఆత్మకి మూలం, ప్రపంచానికి మూలం, భగవంతుని మూలం గురించి తెలుసుకోవటం.

ఎవరైతే మానసికవిప్లవాన్ని పొందుతారో వాళ్ళు ధ్యానం చేయగలుగుతారు. అంతవరకూ మీరు ఏ ధ్యానపద్ధతిని సాధన చేసినా అది ఏదో ఒక దగ్గర ఆగిపోతుంది.

నాతో చాలా మంది అంటుంటారు, 'ధ్యానం చేయటానికి కళ్ళు మూయగానే మామూలుగా ఉన్నప్పటి కంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయి, నేను ఏదైనా పని చేసుంటే ఆలోచనలు ఎక్కువగా రావు. ఎప్పుడైతే ధ్యానం చేయాలి అని కళ్ళు మూస్తానో ఎక్కువ ఆలోచనలు వస్తాయి' అని అంటారు. దీని అర్థం వారిలో మానసికవిప్లవం రాలేదు అని.

స్యప్పితి నిరంతరం మేల్మొని ఉన్న స్థితిలోకి, గాధ నిడాస్థితిలోకి చొచ్చుకొని వచ్చినప్పుడు, అది విషయాల్ని తప్పగా అర్థం చేసుకునేలా చేస్తూ, మనిషిని సోమరిగా, నిస్తేజంగా తయారుచేస్తుంది. దీన్నే బాధల వైపుగా ప్రయాణించటం అంటారు. ఎప్పుడైతే స్పష్టత ఉండదో, ధ్యానం చేయలేం. అది నిస్తేజంగా మనని చేస్తుంది. దాంతో సృష్టతని కోల్పోతాం. ఇది ఒక విషవలయం లాంటిది.

తురీయదశ జాగ్రత్, సుషుప్తల లోకి వస్తే మనం సంత్సప్తి వైపు ప్రయాణిస్తాం. అది ధర్మచుకం, స్పష్టత ధ్యానం చేసేలా చేస్తుంది. ధ్యానం మరింత సృష్టతని ఇస్తుంది.

మీరు తిన్నగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి అనుకుంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయి. అందుకే ప్రారంభంలో నేను ఒక పద్దతి నేర్పిస్తాను. అది పూర్తి ధ్యానం కాదు. ఈ పద్ధతి తిన్నగా మిమ్మల్ని ఆలోచనలు లేని స్టితికి తీసుకువెళ్ళదు. అది స్పష్టత వైపు తీసుకువెళుతుంది. అది మానసికవిప్లవాన్ని కలిగిస్తుంది.

మానసికవిప్తవం అన్నది మీలో గాధమైన ఒక ప్రదేశాన్ని స్పష్టిస్తుంది. అక్కడ మీరు విశ్లేషణ చేయవచ్చు, మీ నిర్ణయాల్ని చూడవచ్చు. తిరిగి దాని గురించి ఆలోచించవచ్చు. మీ కోరికలు, భయాలు, బాధలు, ఇంకా మీ జీవితానికి ఏవి అవసరం అనుకుంటామో వాటన్నింటి గురించీ మళ్ళా మళ్ళా ఆలోచించవచ్చు. నిజానికి చాలా సందర్భాల్లో మన కోరికలు ఏమిటో మనకి తెలియదు.

చాలా సందర్సాల్లో మీరు జీవితం అంటే ఏమనుకుంటారో, జీవితంలో గొప్ప విషయం అని దేన్ని అనుకుంటారో అది మీ జీవితానికి ఏ విధంగానూ ఉపయోగముండదు. కాబట్టి ప్రారంభంలో ఒక పద్దతిని సాధన చేస్తే అది మీలో మానసికవిప్లవాన్ని కలిగిస్తుంది. ధ్యానం ప్రారంభించండి. వయస్సు, సమయం వీటి గురించి ధ్యానాన్ని వాయిదా వేయవద్దు.

ఆ తరువాత నన్ను ఎక్కువ మంది అడిగే ప్రశ్న, 'ఉదయం ధ్యానం చేయాలా లేకపోతే సాయంత్రం ధ్యానం చేయాలా' అని. నేను చెప్పే జవాబు లక్ష్యం అనేది ధ్యానాన్ని ఒక లెక్కగా కలపటం కాదు, అది మీ జీవితానికి నాణ్యతని కలపాలి.

ధ్యానపద్రతులు

మొదటిది సత్యాన్ని, ఎరుకని మీ జీవితంలోకి తెచ్చేవి. ఇటువంటి ధ్యానం ఇరవై నాలుగు గంటలూ చేయవచ్చు. శ్వాస ఆధారమైన ధ్యానాలు, విపాసన (బుద్ధుడు నేర్పిన అంతరంగంలోకి వెళ్ళగల పద్ధతి) లేదా ఏ పద్ధతైనా వర్తమానంలో, ఎరుకతో ఉండేలా చేసేవన్నీ ఈ రకం ధ్యానాలు. అది మీ దినచర్యలో భాగం కాకూడదు. మీ దినచర్యకి నాణ్యత కావాలి. మీరు ఏ పని చేస్తున్నా, రాస్తున్నా, చదువుతున్నా, వంట చేస్తున్నా, ధ్యానం కనపడని దారంలా అందులో ఉండాలి.

రెండవ రకం ధ్యానపద్దతికి మీరు కొంత సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి. అది ఉదయం కాని, సాయంత్రం కాని అరగంట లేదా ఒక గంట కేటాయించాలి, లేదా మరే సమయమైనా సరే. ఈ రకం ధ్యానపద్ధతికి మహామంత్రధ్యానం ఒక ఉదాహరణ. అందులో కొన్ని నిమిషాలు హమ్మింగ్ చేస్తారు. ఆ తరువాత గమనిస్తారు. నిత్యధ్యానం మరొక ఉదాహరణ, ఇవి రోజులో ఏదో ఒక ప్రత్యేకమైన సమయంలో సాధన చేయాలి.

మూడవ రకం ధ్యాన పద్దతి మీరు దాన్ని గుర్తు చేసుకుంటే చాలు. ఉదాహరణకి సత్యాలని, కొన్ని వ్యాఖ్యలని గుర్తు చేసుకుంటే చాలు. మీరు బాగా పరిణతి పొందిన దశలో ఉన్నప్పుడు మీకు ప్రత్యేకంగా ఏ పద్దతీ అవసరం లేదు. మీరు రోజంతా లేదా ఏదో ఒక సమయంలో సాధన చేయనవసరం లేదు. ఈ సత్యాల్ని గుర్తు చేసుకుంటే చాలు, అవి మిమ్మల్ని ఉన్నతస్థితికి తీసుకువెళతాయి. ఇది మూడవరకం ధ్యానపద్దతి. దీనికి ఉదాహరణ జెన్ కోయన్స్ గొప్ప సత్యాల్ని చిన్న వాక్యంలో వ్రాస్తారు. వాటిని గుర్తు చేసుకుంటే చాలు ఆ సత్యాలు మిమ్మల్ని ఉన్నతస్లితికి తీసుకువెళతాయి.

ఉపనిషత్తులో ఒక చక్కని కథ ఉంది; ఒక శిష్యుడు గురువు దగ్గరకి వచ్చి జ్ఞానోదయం పొందటానికి ఒక సాధనపద్ధతి చెప్పమని అడుగుతాడు. గురువుగారు కేవలం 'తత్వమసి, తత్వమసి, తత్వమసి' అంటాడు. అంటే నీవే ఆ సత్యం అని అర్థం, ఆ శిష్యుడికి జ్ఞానోదయం అవుతుంది.

వినటానికి ఇది చాలా కొత్తగా ఉంటుంది. గురువుగారు కొన్ని మాటలు అనగానే శిష్యుడికి జ్ఞానోదయం జరుగుతుంది. అది ఎలా సాధ్యం ఇది నమ్మలేని విషయంలా ఉంటుంది. ఇది సాధ్యమే. మనం మొదటి రెండు రకాల ధ్యానపద్ధతులు సాధన చేస్తే అంటే రోజంతా గుర్తు పెట్టుకునే పద్ధతి, ఏదో ఒక సమయంలో చేసే ధ్యానపద్దతి అవి ఇచ్చే పరిణతి, అంతిమసత్యాన్ని అనుభవించే విధంగా చేస్తుంది.

ధ్యానం సాధారణభయాలు

చాలా మంది అనుకుంటారు ధ్యానం అంటే దేన్నెనా గుడ్డిగా నమ్మటం అని. ఇది చాలా మందికి ఉన్న భయం. కొంత మంది నాతో చెబుతుంటారు, 'నేను ధ్యానానికి ఎక్కువగా అలవాటు పడిపోతానేమో అని భయంగా ఉంది' అని. ఒక విషయం అర్ధం చేసుకోండి, ధ్యానం అంటే మీలో ఉండే ఆ బంధాలని, అలవాట్లని తొలగించేది. కాబట్టి ధ్యానానికి మీరు అతిగా అలవాటు పడరు.

కొంత మంది ధ్యానం చేస్తే తమ కోరికలు, భయాలు అదే విధంగా జీవితం పట్ల వారికి ఉన్న కొన్ని నమ్మకాలు అన్నీ పోతాయేమోనని భయం. ఒక విధంగా ఇది నిజం. ధ్యానం చేయటం ప్రారంభించాక మీరు దేన్నెతే అప్పటి వరకూ జీవితం అని అనుకుంటున్నారో అది ముఖ్యం అని అనిపించదు. అసలైన సత్యాలు మీకు తెలియటం ప్రారంభమవుతుంది. అప్పటి వరకూ మీకు ఉన్న ఊహలు కల్పనలు మిమ్మల్ని వదిలివెళ్ళిపోతాయి.

ఇప్పటి వరకూ మిమ్మల్ని మీరు ఈ సత్యాల నుంచి కాపాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఊహల్ని వదలటం మీకు ఇష్టం ఉండదు కాబట్టి. మీరు ఒక దృఢమైన వ్యక్తి అని మీరు అనుకునే విషయమే మీలోని భయాలకి, సమస్యలకి కారణం. ధ్యానం చేస్తే అభిప్రాయం కదిలిపోతుంది. మీరు అనుకునే మీరు, మీలోని భయాలు, అన్ని కదిలిపోయి, మీలో గొప్ప మార్పు సంభవిస్తుంది.

దీన్నే నేను మానసికవిప్లవం అంటాను. మీకు నిజంగా పునర్జన్మ జరుగుతుంది. మీ కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్ మార్చటమే ఇది. మీ హార్డ్‌వేర్ అదే ఉంటుంది. మీ అంతరంగపు సాఫ్‌వేర్‌లో మార్పువస్తుంది. మీలో గొప్ప మార్పు వస్తుంది. ధ్యానం అంటే మీ అంతరంగపు సాఫ్‌వేర్‌ని మార్చటమే. మీ శరీరం మీ హార్డ్‌వేర్, అందులో మీ చుట్లు పక్కల జరిగే విషయాలలో మార్పు ఉండదు. మీ చుట్టూ ఉండే వ్యక్తులలో మార్పు ఉండదు. కానీ మీ ఆత్మలో, మీ అంతరంగంలో గొప్ప మార్పు ఉంటుంది.

నాలుగు రకాల చేతనస్థితిని అర్ధం చేసుకోగలిగితే మీలో మానసికవిప్లవం కలుగుతుంది. ఇది మాస్టర్ కీ లాంటిది. దీన్ని మీ జీవితంలో ప్రతి క్షణం ఉపయోగించగలిగితే, మీరు ఈ నాలుగు దశల చేతనస్థితిని తెలుసుకుంటూ ఉంటారు. మీ ప్రతి నిర్ణయంలోనూ మీ ఆలోచనక్రమం ధ్యానం వైపు ఉండి ప్రతి నిర్ణయం కూడా సరియైన పద్ధతిలో ఉంటుంది. దీన్నే నేను సమూలమైన మార్పు అంటాను. ఇది సమాచారాన్ని తీసుకొని దాంతో సరియైన నిర్ణయం చేయటం.

మీరు ఈ నాలుగు దశలూ అర్ధం చేసుకుంటే ఈ నాలుగు దశల పట్ల పూర్తి తెలుసుకునే తత్త్వంతో ఉంటే, అది చాలు. అది ఈ విధంగా ఉంటుంది, మీరు గాధనిద్రలో ఉన్నప్పుడు

మీకు కలల పట్ల ఏదో ఆకర్షణ ఉంటేనే గాధనిద్ర నుంచి బయటికి వస్తారు. మీరు కలల స్థితికి వచ్చినప్పుడు గాధనిద్ర ఊహ అని, కలల స్థితి నిజం అని అనుకుంటారు. అదే విధంగా మీరు కలల స్థితిలో ఉన్నప్పుడు, మేల్కొని ఏదో చేయాలనే ప్రేరణ లేకపోతే మేలుకున్న స్థితిలోకి రారు. అందుకే నిద్ర మేల్కొన్నాకా కూడా మీరు అటు తిరిగి మళ్ళా కలల స్థితిలోకి వెళ్ళిపోతారు.

మీకు మెలకువ రాగానే మంచం మీద నుంచి లేవకపోతే మేల్కొన్న స్థితి కంటే కలల స్థితి బాగున్నట్లుగా ఉంటుంది. కాని ఒక్కసారి మేలుకున్న స్థితికి వచ్చాక కలల స్థితి ఒక ఊహ అని, అది నిజం కాదు, అని అనుకుంటారు. అంతే కాదు మీరు మేల్కొన్న స్థితిలో ఉన్నప్పుడు, అది బాగా ఉత్సాహంగా లేదు అనిపిస్తే, మీరు కలల స్థితిలోకి జారిపోతారు.

ఇప్పుడు మీరు మేలుకున్న స్థితి నుంచి తురీయస్థితికి వెళ్ళాలంటే, మీకు బలమైన ప్రేరణ ఉండాలి. అదే ధ్యానం చేసే పని. అది క్రమంగా మీ చేతనస్థితిని పెంచి దాని ద్వారా తురీయస్థితికి తీసుకువెళుతుంది. ధ్యానంతో పాటు మీకు జ్ఞానోదయమైన యోగీశ్వరుడు గురువుగా దొరికితే ఆయన మీరు తురీయదశకి చేరటానికి చాలా గొప్ప పాత్ర పోషిస్తారు. కేవలం ఆయన మీకు దీక్షని ఇవ్వటం ద్వారా మీరు తురీయదశని చేరగల కార్యక్రమాన్ని వేగవంతం చేస్తారు.

ఎప్పుడైతే మేలుకొన్న స్థితి నుంచి తురీయస్థితికి వెళతారో అప్పుడు మేల్కొన్న స్థితి కూడా ఒక ఊహలా తెలుస్తుంది. మీరు ఉన్న స్థితి నిజమైనది అని కొలవగల స్కేలు లేదు అని అర్థం చేసుకోండి. అయితే ఈ విషయం గుర్తుంచుకోండి, మీరు లోతైన మానసిక కుంగుబాటులో ఉన్నప్పుడు ఈ సత్యం క్షణకాలం బోధపడుతుంది.

లోతైన నిరాశలో ఈ అవగాహన బయటకి వస్తుంది. అయితే దాన్ని మనం చక్కగా అణచివేసాం. ఎందుకంటే అప్పటికి వారిలో మానసికవిప్లవం జరగలేదు కాబట్టి. మనం పట్టుకువేలాడే జీవితానికి నష్టం కలుగుతుంది కాబట్టి అందుకే మనం మానసిక విప్లవం అంటే భయపడతాం.

ఇక్కడ సమస్య ఏమిటంటే మనలో మానసికవిప్లవం జరిగితే, ఎలా ఉంటుందో ఫలితాలు మనకి తెలియవు. మన కోరికలు, లక్ష్యాలు, కలలు, భావనలు, ఆశయాలు, ఏమవుతాయో తెలియదు. ఏది జరిగితే అది జరగనీయి అనటానికి భయపడతాం. అందుకే మనలో మానసికవిప్లవం జరగకుండా జాగ్రత్త తీసుకుంటాం.

నిరాశ కలిగించే ప్రతి సంఘటనా మనలో ఆ విప్లవం జరగటానికి ఒక అవకాశం. కాని మనం పదే పదే ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎప్పుడైతే ఊహ అన్న మాట వింటామో భయపడిపోతాం. మీరు అది తెలుసుకుంటే మొత్తం సన్యాసిస్తామేమో, అన్నీ వదిలేస్తామేమో, జీవితం మొత్తం మారిపోతుందేమో, అని భయపడతారు. నేను చెబుతున్నాను, మీరు వదిలేసేది కేవలం ఒక్క‌టే అది బాధ‌ప‌డ‌టం.

మీకు కొన్ని సార్లు ఒక అరుదైన అనుభవం జరుగుతుంది. కలల స్థితిలో ఉండగానే ఇది కల అని మీకు తెలుస్తుంది. అవును నేను కల కంటున్నాను అని అనుకుంటారు. ఆ తెలుసుకునే తత్వం ఉండటం వల్ల కలలోని సంఘటనల్ని మీరు మార్చగలుగుతారు. ఆ కొన్ని క్షణాల్లో, మీరు కల కంటునారు అని తెలుసుకోగలిగినప్పుడు మీరు మీ కలని మారుగలరు. ఆ తెలుసుకునే తత్త్వం ఇంకా పెరిగితే మీరు కలల స్థితిలో ఉన్నాను అని తెలుసుకుంటే, అందులోంచి బయటికి రాగలుగుతారు.

అదే విధంగా, ఈ ప్రపంచంలో కూడా, మేలుకున్న స్థితిలో ఉండగా, మీ గురించి తెలుసుకునే తత్వం పెరిగితే, అప్పుడు మీ ముందు ఉన్న ప్రపంచం ఒక కల అని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. అప్పుడు జీవితం మరొక మేల్కొని ఉన్న స్థితిలోని కల అని అర్థం చేసుకున్నప్పుడు, మీ చుట్టుపక్కల జరిగే సంఘటనలని మీ ఇష్టమైన పద్ధతిలో మార్చగలరు. దీన్నే సిద్దులు పొందటం అంటారు.

కాబట్టి ఒక విషయం అర్థం చేసుకోండి. నేను అనే చేతనస్థితి మీలో పెరగగలిగితే, అకస్మాత్తుగా మేల్కొన్న స్థితి కల అని తెలుసుకుని ఆ స్థితిలో సంఘటల్ని మార్చగల శక్తి, స్వేచ్ఛ మీకు దొరుకుతాయి. దాంతో మీ ముందు ఉన్న సంఘటల్ని మార్చగలుగుతారు.

అయితే ఈ స్థితిలో మీరు కేవలం సంఘటనలు మార్చుకునేదానిలోనే చిక్కుకుపోతే, మీలోని చేతనస్థితి కిందికి తగ్గిపోతుంది. మీరు తిరిగి జాగ్రత్ స్థితిలోకి వచ్చేసారు. అప్పుడు మీకు కలిగిన ప్రత్యేకమైన శక్తులని పోగొట్టుకుంటారు. మీరు వీటిలో ఎక్కువగా చిక్కుకుపోకపోతే, మీరు మీలోనే కేంద్రీకృతమై ఉండగలిగితే, మీరు మీ చేతనస్థితిని మరింత ఉన్నతస్థితికి తీసుకువెళ్ళ గలుగుతారు. అప్పుడు మీకు జ్ఞానోదయం జరుగుతుంది.

మీరు కలల స్థితి నుంచి జాగ్రత్‌స్థితికి రావాలన్నా, జాగ్రత్ స్థితి నుంచి జ్ఞానోదయస్థితికి రావాలన్నా అక్కడ జరిగే కార్యకమం ఒక్కటే. ఎప్పుడైతే మానసికవిప్లవం జరుగుతుందో అంతరంగంలో అద్భుతమైన చికిత్స జరుగుతుంది. అప్పుడు కొన్ని పద్ధతులు సాధన చేస్తే సహజంగా బయటి చికిత్స జరుగుతుంది. మానసికవిప్లవం జరుగకుండా, పద్దతుల్ని సాధన చేసే దాన్ని క్రియ లేదా యోగా అంటారు. క్రియ అంటే పని, యోగా అంటే – శరీరం మనస్సు ఆత్మల సంయోగం. ఇవన్నీ కేవల భౌతికస్తాయిలో జరుగుతాయి. మానసికవిప్లవం జరిగాక యోగా చేస్తే అది ఒక లోతైన ధ్యానం అవుతుంది. మానసికవిప్లవంతో పూజలు చేసినా అది ధ్యానం అవుతుంది. లేకపోతే ధ్యానం ఒక దినచర్య అవుతుంది.

అంతరంగంలో స్పష్టత కలిగినప్పుడు, మీ అంతరంగానికి ధ్యానాన్ని కలిపితే మీరు ధ్యానం చేసినప్పుడు ఆ స్పష్టత మరింత లోతుగా ఉంటుంది. మీరు తిరిగి మేలుకున్న స్థితికి వచ్చినప్పుడు, తెలుసుకునే తత్త్వంతో మీకు ఒక విషయం అర్థం అవుతుంది. అరగంట సేపు మీ చుట్టు పక్కల జరిగినవి మీ నియంత్రణలో లేవు అని. మీరు మేల్కొని ఉంటారు, కళ్ళు తెరిచి ఉంటాయి కాని మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీరు ఎక్కడో కలల స్థితికి, మేల్కొని ఉన్న స్థితికి మధ్యలో ఉంటారు. మనలో చాలా మంది ఎనభై శాతం వరకూ ఆ స్థితిలోనే ఉంటాం.

మీరు మంచం మీది నుంచి లేచారు కాబట్టి మేల్కొని ఉన్నాను అని అనుకోనవసరం లేదు. రోజంతా మంచం మీద పడుకోలేరు కాబట్టి లేచి బయటికి వస్తారు. అంతేకాని మీరు కలల స్థితిలో లేరు అని అర్థం కాదు.

మిమ్మల్ని జాగ్రత్‌స్థితి, స్వప్పస్థితి, గాధనిద్రాస్థితి నుంచి పూర్తిగా బయటకి తెచ్చే స్థితినే నేను ధ్యాన స్థితి అంటాను.

నిజం కలగా

మీరు అనుకోవచ్చు! నేను నిద్ర నుంచి లేవగానే ప్రతి రోజూ అదే ప్రపంచాన్ని చూస్తున్నాను కాని నిద్రపోయినప్పుడు కలలో అదే ప్రపంచాన్ని చూడటం లేదు, ఎలా? ఈ ప్రశ్న మేల్కొన్న స్థితి, శాశ్వతసత్యం అనే భావనకి ఆధారంగా ఉంటుంది.

ఒక రాత్రి కలని విశ్లేషిద్దాం. ఉదాహరణకి మీరు పద్నాలుగవ తేదీ రాత్రి పడుకొని పదిహేను ఉదయం లేచారనుకోండి. అంటే మీరు పది గంటలు నిద్ర పోయారనుకోండి. ఆ రాత్రి కలలో పది నుంచి ఇరవై సంవత్సరాల జీవితాన్ని మీరు జీవించి ఉండవచ్చు. కలలో మీ కాలేజీ జీవితంతో ప్రారంభించి, మీ పెళ్ళి, పిల్లలు, పిల్లల పెళ్ళిళ్ళు, ఇలా ఒకదాని తరువాత ఒకటి జరుగుతాయి. ఈ విధంగా పది గంటల కలలో ఇరవై సంవత్సరాల జీవితాన్ని గడుపుతారు. ఈ విధంగా మీకు ఒకసారైనా జరిగి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది అర్థం అవుతుంది.

చూడండి, మీరు నిద్ర పోయినప్పుడు స్వప్నస్థితికి తరువాత గాధనిద్రాస్థితిలోకి వెళతారు. ఆ తరువాత గాధనిద్రలోకి వెళతారు. అది బహుశ ఇరవై నిమిషాలు ఉండవచ్చు. ఆ తరువాత కలల స్థితికి వస్తారు. ఈ విధంగా కలల స్థితి నుంచి గాధనిద్రదకి గాధనిద్ర నుంచి కలల స్థితికి మారుతూ ఉంటారు.

ఒక విషయం అర్థం చేసుకోండి; ఒక రాత్రి కలలో ఇరవై సంవత్సరాల జీవితాన్ని గడుపుతారు. మొదటి ఎపిసోదులో కాలేజీ జీవితం, తరువాత ఎపిసోదులో వివాహం, ఆ తరువాత పిల్లలు ఒకవేళ నాల్గవసారి కూడా కలల స్థితిలోకి వస్తే మీ కొడుకు పెళ్ళి కూడా చూస్తారు.

ఇక్కడ ఒక ముఖ్యవిషయం అర్థం చేసుకోవాలి. మీరు గాధనిద్ర నుంచి కలల స్థితికి వచ్చిన ప్రతిసారి అదే ప్రపంచాన్ని చూసారు. అవును కదా? కొన్నిసార్లు కలలో ఒకే ప్రపంచాన్ని చూస్తారు. ఇది చాలా సూక్ష్మవిషయం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని అర్ధం చేసుకోగలిగితే మీలో చక్కని స్పష్టత వస్తుంది. అప్పుడు మీరు జీవితం అంటే ఏమనుకుంటున్నారో ఆ అవగాహనలో గొప్ప మార్పు వస్తుంది. అప్పుడు మీ సమస్యలకి వెతికే పరిష్కారాల్లో కూడా మార్పు వస్తుంది.

ఉదాహరణకి: ఒక వ్యక్తిని పెద్ద పులి తరుముతున్నట్లు కల వస్తుందనుకోండి. 'నన్ను పెద్ద పులి తరుముతూన్నది, నన్ను రక్షించండి' అని అరుస్తాడు. పక్కనే నిద్రపోతున్న అతని భార్య మేల్కొని అతనితో 'నిద్ర మేల్కోండి' అని నిద్ర లేపాలి. అలా కాకుండా అతనికి కత్తి గాని, తుపాకి గాని పులిని చంపటానికి ఇస్తే ఏమవుతుంది. తనని తాను కాల్సుకుంటాడు లేదా ఆమెని చంపుతాడు. కాబట్టి ఆమె ఏం చేసినా ఆ సమయంలో అది సమస్యలకి దారి తీస్తుంది. అక్కడ చేయవలసింది కేవలం అతనికి మేల్కొలపటమే.

ప్రాథమికవిషయాలు అర్ధం చేసుకుంటే మీరు చేసే నిర్ణయాలలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. మీలో అనూహ్యమైన మార్పు వస్తుంది. మీ ఆలోచనపద్దతి, నిర్ణయాలు చేసే పద్దతి, సమస్యలకి పరిష్కారాలు కనుగొనే పద్ధతిలో పూర్తి మార్పు వస్తుంది. మీరు సరైన పరిష్కారాల దిశగా మార్పు చెందుతారు.

మీరు కలగన్న పదిగంటల సమయంలో మీరు తేలికగా ఇరవై సంవత్సరాల జీవితాన్ని గడుపుతారు. గాధనిద్రలోకి వెళ్ళి మళ్ళా కలల స్థితిలోకి వస్తారు. మీరు ఎప్పుడు కలల స్థితిలోనికి వచ్చినా, అక్కడ అంతరాయం ఉన్నా, మీరు అదే ప్రపంచాన్ని చూస్తారు. అంటే మీరు ఆ తరువాత అదే ప్రపంచాన్ని కలలో చూడటం వల్ల దాన్ని నిజం అని అనలేరు. మీరు నిద్ర నుంచి మేల్కొన్న తరువాత ఇరవై సంవత్సరాల జీవితాన్ని పదిగంటల నిద్ర సమయంలో గడిపాను అని తెలుసుకుంటారు. అదే విధంగా మీరు మేల్కొన్న స్థితి నుంచి మేల్కోగలిగితే అకస్మాత్తుగా మీ తొంభై సంవత్సరాల జీవితాన్ని కొన్ని గంటలలో గడిపాను అని అనుకుంటారు. మీరు మేల్కొని ఉన్న ఈ స్థితి మరొక పెద్ద కల అయి ఉండవచ్చు.

మీరు కలల్లో ఉన్నప్పుడు, కల నిజం అనుకుంటారు. మీరు ఎక్కడ ఉంటే అప్పుడు అది నిజం అనుకుంటారు. దానికి మరొక స్కేలు లేదు. మీరు కలలో ఉన్నప్పుడు 'ఇది కల' అని అనుకోరు. మేల్కొని ఉన్నప్పుడు ఇది మరొక కల అనుకోరు. మీరు కల లోంచి బయటకి వచ్చాక అది కల అనుకుంటారు. కాని కలలో ఉన్నంత వరకూ అది నిజం అనుకుంటారు. మీరు కలకనే సమయంలో నిజ జీవితం కలలా ఉంటుంది. మేల్కొన్న స్థితిలో కలని 'కల' అనుకుంటారు. కాబట్టి మీరు ఉన్న స్థితి మీద ఆధారపడి అది కల, నిజం అని మీరు అనుకుంటారు. అంతేకాని ఏది నిజం, ఏది కల అని కొలిచే స్కేలు లేదు. మేల్కొని ఉన్న స్థితి

మరొక పెద్ద కల అని అర్థం చేసుకుంటే ఆ విషయాన్ని తెలుసుకోగలిగితే, మీరు మీ ఏకాగ్రతని, మీ లోపలికి, మీ చేతనస్తితి వైపు మళ్ళిస్తారు. అదే అసలైన అంతిమ సత్యం. మీరు మేల్కొని ఉన్న స్థితికి అతీతంగా వెళ్ళగలిగితే, అది కూడా ఒక పెద్ద కల అని మీకు తెలుస్తుంది.

ఆధ్యాత్మికతలో ఇది మొదటి మెట్టు, మానసికవిప్లవానికి ఇది మొదటి అడుగు.

మీలోని వ్యథ మీకు పదేపదే ఒకవిషయం చెపుతుంది, మీరు నిజంలో జీవించటం లేదు అని.

నన్ను చాలా మంది అడుగుతుంటారు. 'నేను మేల్కొన్న స్థితిలో అదే ప్రపంచాన్ని చూడటమే కాదు అదే మనుషులని చూస్తున్నాను, మరి అది అది అవుతుంది' అని. స్పష్టంగా అర్ధంచేసుకోండి. మీరు కలలో మీ కుటుంబసభ్యులతో కలసి ఒక ఊరు వెళ్ళారనుకోండి. కలలో మీరు, వాళ్ళు కూడా అదే ఊరిని చూసారు. ఎందుకంటే వాళ్ళు కూడా మీ మనస్సు కల్పించినవారే కాబట్టి.

మీ చుట్టూ ఉన్న మనుషులు, దృశ్యాలు – అన్నీ అలాగే ఉన్నాయి, కాబట్టి ఇది కల కాదు అని అనలేం. మీ చుట్టూ ఉన్నవారు, దృశ్యం అంతా మీ మనస్సు చిత్రాలే ప్రొజెక్షన్స్.

అంతిమసత్యం ఏమిటంటే, మీ కలలు తయారయ్యే పదార్ధం మీరు మేల్కొని ఉన్నప్పుడు ఉన్న ప్రపంచం నుంచి తయారు చేయబడిందే. మీరు ఆ పదార్దాన్ని పట్టించుకున్నంత కాలం మీ అంతరంగంలో చికిత్స జరగదు. మీ ఏకాగ్రత చేతనస్థితి మీద, ఈ పదార్ధం మీద సమానంగా ఉంటే, అది సమతుల్యతలో ఉండే ఆరోగ్యకరమైన జీవితం దొరుకుతుంది. మీ భౌతిక, మానసికారోగ్యం చక్కగా ఉంటుంది.

మీ ఏకాగ్రత ఆ పదార్ధం మీద కాకుండా కేవలం చేతనస్థితి మీద మాత్రమే ఉంటే, దాన్ని నేను జీవన్ముక్తి అంటాను. మీకు జీవన్ముక్తి కావాలా వద్దా, జ్ఞానోదయం కావాలా వద్దా అనేది తరువాత విషయం. మీరు మీ ఏకాగ్రతని మీ చేతనస్థితి వైపు కొంత తిప్పగలిగితే, అంతిమసత్యం వైపు తిప్పగలిగితే, మీ కేంద్రంలోనికి తిప్పగలిగితే అకస్మాత్తుగా మీ అంతరంగంలో చికిత్స జరగటాన్ని తెలుసుకుంటారు.

ఉదాహరణకి మీరు ఒక పెద్ద సమస్యలో ఉన్నారనుకోండి, లేదా నిరాశ, క్రుంగుబాటులో ఉన్నారనుకోంది, మీరు చేతనస్థితిలో ఇదంతా ఒక పెద్ద కల అని అర్థంచేసుకోగలిగితే, మీరు రిలాక్స్ అవ్వగలుగుతారు. మీ అంతరంగంలో కావలసిన చికిత్స జరుగుతుంది. ఆ చికిత్సనే నేను ధ్యానం అంటాను. మీలో కలిగే ఆ విశాంతితో కూడిన ఎరుకనే నేను సతోరి అంటాను. అదే సమాధి తాలూకు క్షణకాల అనుభవం.

ధ్యానం ఎందుకు

మీలో ప్రాథమికమైన పెద్ద మార్చు లేదా మానసికవిప్లవం అనే ఒక చిన్న విషయాన్ని మీరు అర్ధం చేసుకుంటే దాని ద్వారా గొప్ప మార్చు జరుగుతుంది. అదే మీరు నిజం అని అనుకునేది నిజం కాదు. ఈ సుష్టత మీ లోపల చికిత్స చేసి మీకు ఎరుకతో కూడిన విశ్రాంతిని, నిశ్చలత్వాన్ని ఇస్తుంది.

ధ్యానం పరిశోధనలు – వివరణ

ధ్యానానికి ఉన్న అనంతమైన శక్తితో శారీరక మానసికవ్యవస్థల్లో మార్పు తీసుకురావచ్చు అన్న విషయం మీద శాస్త్రజ్ఝలకి కొంచెం శాస్త్రీయ అవగాహన కలుగుతుంది. ధ్యానం వల్ల మనకి కలిగే ఉపయోగాలు అంతు లేనన్ని. అది అన్ని దశల్లో – భౌతిక, మానసిక, భావావేశాత్మక, ఆధ్యాత్మికదశల్లో ఉపయోగపడుతుంది. ధ్యానం జీవితనాణ్యతని మార్చేయగలుగుతుంది.

మెదడు శక్రి పెరుగుతుంది

ఈ మధ్య వరకూ మెదడులోని కణాలు చిన్నతనంలో ఏ విధంగా అమర్చబడ్డాయో అవి అదే విధంగా ఉంటాయని, మారవని అనుకునేవారు. అంటే చిన్నతనంలోనే మెదడు పెరుగుదల ఆగిపోతుంది అనుకునేవారు. ఇప్పుడు శాస్త్రజ్ఞులు మెదడు జీవితాంతం అభివృద్ధి చెందుతూ కొత్త కొత్త బంధాలు ఏర్పరచుకుంటుందని నిరూపించారు. దీన్నే 'న్యూరో ప్లాస్టిసీ ' అంటారు.

నేను న్యూస్ పేపర్‌లో ఒక విషయం చదివాను. విస్మాసిన్ యూనివర్సిటీ వారు మెదడు మీద ధ్యాన ప్రభావం అనే అంశం మీద పరిశోధనలు చేసారు. చాలా సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న టిబెట్ బౌద్ధమతసాధువుల మీద ఈ ప్రయోగం చేసారు. అదే విధంగా ధ్యానానికి కొత్తవారైన కొంత మంది విద్యార్ధుల్ని కూడా తీసుకున్నారు. వారికి ధ్యానం ఎలా చేయాలో నేర్పించారు. వారి పరిశోధనల్లో కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న సాధువుల మెదడు చాలా వేగంగా, చైతన్యవంతంగా చాలా చక్కని నిర్వహణా సామర్థ్యంతో ఉంది అని, విద్యార్థులలో అంతగా అది లేదు అని తెలిసింది. మెదడులో సంతోషానికి సంబంధించిన భాగం, సాధువుల్తో చాలా చైతన్యవంతంగా ఉంది, విద్యార్థులలో అది తక్కువ స్థాయిలో ఉన్నది.

మరొక ముఖ్యవిషయం, పరిశోధకులు విద్యార్థులలో కంటే ధ్యానం చేస్తున్న సాధువులలో మెదడు పని తీరు గాఢంగా, ఒక చక్కని నిర్వహణ శక్తితో ఉన్నట్లు కనుగొన్నారు. కాబట్టి ధ్యానం ఉపయోగాలు శాశ్వతమైనవి. ధ్యానం మెదడు నిర్మాణాన్ని, పని తీరుని మార్చగలుగుతుంది.

అమెరికాలోని పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలైన యాలె, హార్వర్డ్, ఎమ్.ఎమ్.టి. కూడా ధ్యానప్రభావం మీద పరిశోధనలు చేసాయి.

ఎమ్.ఆర్.ఐ ని ఉపయోగించి చేసిన పరిశోధనల్తో, తెలుసుకునే తత్వం, ఏకాగ్రతలకి సంబంధించిన మెదడులోని భాగాలు ధ్యానం చేసేవారిలో బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి అని తెలిసింది. వారిలో భావాలు సమతుల్యతతో ఉంటాయి.

పరిశోధనల్తో, రక్తనాళాలు వెడలు అయిన విషయాన్ని కనుగొన్నారు, వాటిలో చక్కని అభివృద్ధిని చూసారు. రక్తనాళాలు ఎక్కువగా పెరగటం గమనించారు.

ధ్యానం Vs నిద్ర

కెంటకీ విశ్వవిద్యాలయంలో నిద్ర‌–మ‌నిషిలోని తెలుసుకునే త‌త్వం మీద ప్ర‌భావం అనే అంశం మీద పరిశోధనలు చేసారు. కొంత మందిని ఒక తెర చూస్తూ దాని మీదికి ఏదైనా ఒక బొమ్మ రాగానే బటన్ నొక్కాలి అని చెప్పారు. నిద్ర తక్కువ ఉన్నవాళ్ళు ఆలస్యంగా స్పందిస్తారు. సాధారణనిద్ర ఉన్నవారు త్వరగా స్పందిస్తారు.

పరిశోధకులు వారిని 40 నిమిషాలు నిద్ర పోయాక, నిద్ర ముందు, అదే విధంగా ధ్యానం చేసే ముందు తరువాత, ఏదైనా చదివే ముందు తరువాత పరీక్ష చేసారు. వారి పరిశోధనలో ధ్యానం చేసిన తరువాత వారి స్పందన వేగంగా ఉంది. అని తెలిసింది. వారిలో కొంతమందికి ధ్యానం కొత్త అయినా వారి స్పందన వేగంగా ఉన్నది. వారు రాత్రి అంతా మేల్కొని ఉన్నా కూడా, ధ్యానం చేసిన వారిలో స్పందన వేగంగా ఉన్నది అని ఫలితాలు చెప్పాయి.

ఏకాగ్రత పెరుగుతుంది, త్వరగా స్పందిస్తారు

ధ్యానం వలన వేగంగా, సరిగ్గా స్పందించగలరు అని అనేక పరిశోధన ఫలితాలు నిరూపించాయి. ఇంగ్లాండులో జరిగిన పరిశోధనలలో, కొందరికి కొన్ని వరుసలలో అక్షరాలు రాసి వాటి మీద వేరువేరు సంఖ్యలలో గీతలు వేసారు. వారు ఆ గీతలలో హెచ్చించగల వాటిని వేగంగా కొట్టివేయాలి, అని చెప్పారు.

మరొక పరిశోధనలో కొందరికి ఎరుపు, ఆకుపచ్చ, నీలం అనే పదాల్ని వేరు వేరు రంగుల ఇంకుతో రాసి చూపించారు. ఆ పదాన్ని రాసిన రంగుని వారు వెంటనే గుర్తించాలి. ఇది కొంచెం కష్టం. ఎందుకంటే మెదడు అక్కడ రాసిన రంగుని ముందుగా గమనిస్తుంది. ఈ పరిశోధనలలో ధ్యానం చేసేవారు అందరి కంటే వేగంగా చేసారు. అదే విధంగా ధ్యానం చేయనివారి కంటే తక్కువ తప్పులు చేసారు.

ధ్యానం తెలుసుకునే తత్వాన్ని, ఏకాగ్రతని, జ్ఞాపకశక్తిని, స్పందించే వేగాన్ని, భావాల సమతుల్యతని, ఆరోగ్యాన్ని చాలా బాగా అభివృద్ధి చేస్తుంది.

ధ్యానం ఎందుకు

పాశ్చాత్యశాస్త్ర విజ్ఞానం ఇప్పుడే ధ్యానం ప్రభావాన్ని వేరు వేరు కోణాలలో పరిశోధించటం ప్రారంభిచింది. అయితే తూర్పుదేశాల అంతరంగ ప్రపంచ శాస్త్రవేత్తలు దీన్ని కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే చేసారు. వేదసంస్కృతి ఈ ఆధ్యాత్మిక సత్యాల మీద ఆధారపడి ఉన్నది. దీని వలన మానవులు ధ్యానం ఉపయోగాలని పొందుతూ అంతిమస్థితిని చేరవచ్చు. ఆత్మ జ్ఞానానికి ఇవి కాలాతీతమైన సాధనపద్ధతులు.

  • మనందరం వెతికేది ఆనందం కోసమే, అయితే వేరు వేరు మార్గాలలో వెతుకుతూ ఉంటాం.
  • ధ్యానం అంటే ఈ క్షణంలో ఆనందంలో ఉండటమే. ధ్యానం చేయటానికి సరియైన పద్ధతి ఏది?
  • ధ్యానం మన జాగ్రత్‌స్థితిలోనికి, సుషుప్తలోనికి లోతైన ఎరుకని నింపటానికి అవసరం.
  • మీరు తెలుసుకునే తత్వంతో ఉన్నప్పుడు పనిని శిఖరాగ్రస్థాయిలో చేయగలరు, మీ శక్తిని సమర్థంగా ఉపయోగించగలుగుతారు.
  • మానసికవిప్లవంతో పూజలు ధ్యానంలా మారతాయి, మానసికవిప్లవం జరగనప్పుడు ధ్యానం ఒక పూజా కార్యక్రమంలా ఉంటుంది.

నిత్యధ్యానం - The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ధ్యానం

జీవన్ముక్తికి నిత్యధ్యానం ప్రతిరోజూ చేయగల ధ్యానపద్ధతి

నిత్యధ్యానం – The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ధ్యానం రాజా సాధనపద్దతి

కొన్ని ధ్యానాలు కొంతమందికి, కొన్ని సమయాలలో చేయటానికి ఉంటాయి. కొన్ని ధ్యానాలు ఎప్పుడైనా ఎక్కడెనా ఎవరైనా చేయవచ్చు. అవి సర్వసామాన్యమైనవి. నేటి కాలంలోని ఆధ్యాత్మిక అన్వేషకులకి కావలసిన ధ్యానం, నిత్య ధ్యానం. ఇది సైబర్ ఏజ్ ధ్యానం.

నిత్యధ్యానం ఆవిర్భావం

ముందుగా నిత్యధ్యానం అనేది ఏ విధంగా జరిగిందో మీకు చెబుతాను. నాకు పదకొండు సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ చాలా ధ్యానపద్ధతుల్ని ప్రయోగాత్మకంగా ప్రయత్నించాను. పన్నెండవ సంవత్సరంలో నా మొదటి ఆధ్యాత్మిక అనుభవం చాలా లోతుగా, గాఢంగా జరిగినది. పన్నెండు నుంచి ఇరవై ఒకటవ సంవత్సరం వరకూ చాలా ధ్యానపద్దతుల్ని నేను స్కాన్ చేసి, విశ్లేషణ చేసి వాటి ఉపయోగాలు తెలుసుకున్నాను. నాకు జ్ఞానోదయం జరిగాక మూడు సంవత్సరాలు, నాలో కలిగిన అనుభవం ఎదుటివారిలో కలిగించగల మంచి సాధనపద్ధతుల మీద పని చేసాను. అంతరంగ ప్రపంచంలో చేసిన పరిశోధనల సారాంశమే నేను రూపొందించిన నిత్యధ్యానం.

నిత్యధ్యానం ఒక సూత్రం, ఒక ధ్యానపద్ధతి. ఇది వ్యక్తి ఉనికి మీద పనిచేసి అంతిమ అనుభవమైన జ్ఞానోదయం పొందటానికి అనువైన మార్చుని మీ లోపలకి తీసుకురాగలుగుతుంది. ఇందులోని ప్రతి భాగం మీలోని చేతనస్థితి పెరిగేలా చేస్తుంది. నిత్య ఆనంద స్థితి కోసం మీరు ప్రతి రోజూ చేయగల ధ్యానం నిత్యధ్యానం.

చక్రాలని తెలుసుకోవటం

నిత్యధ్యానపద్ధతిని అర్థం చేసుకోవాలంటే మనలోని సూక్ష్మశక్తి కేంద్రాలైన చక్రాల గురించి కొంచెం తెలుసుకోవాలి. చక్రాల మీద పనిచేయటం అంటే మన లోపల శక్తి ప్రవహించగల కొత్త దారుల్ని మేల్కొలపటమే. ఇది టి.వి.లో కొత్త చానల్‌కి చేయటం లాంటిది.

మనిషి ఈ ఏడు చక్రాల ఆధారంగానే ఆలోచించగలుగుతాడు. కొంతమందికి ఏ విషయమైనా వారికి కోరిక, కామం, స్పర్శ అనే ఉపయోగాలు ఉండాలి అని చూస్తారు. కొంతమందిలో భయం ముఖ్యంగా ఉంటుంది. కోరికల వంటి భావావేశాలతో ముందుకి వెళ్ళటంలో తప్పు లేదు కానీ మీరు మరొక కోణంలో ఉండే ప్రేమ వంటి భావాల్ని కూడా అనుభవించాలి. స్వచ్ఛమైన శక్తి నుంచి పనిచేయటం సాధ్యమే అని మీరు అర్థం చేసుకోగలిగాలి.

చక్రాలని చైతన్యవంతం చేయటం ద్వారా మీరు భావావేశాలకి అతీతంగా వెళ్ళి మానసికవ్యవస్థ నుంచి బయటకి వచ్చేయగలుగుతారు. మీరు ఒక స్వేచ్ఛాజీవిలా పనిచేయగలుగుతారు. మీరు మానసికవ్యవస్థ నుంచి స్వేచ్ఛని పొందినప్పుడే స్వేచ్ఛ విలువని మీరు తెలుసుకుంటారు. మీరు ఒక చక్రం నుంచి స్వేచ్ఛని పొందినప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఏ గుర్తింపు మీద మీ వ్యక్తిత్వం నిలబడి ఉన్నదో, ఏ భావం మీద మీ జీవితం ఉన్నదో అవి కరిగిపోతాయి. మీరు ఒక కొత్త శక్తిని అనుభవించగలుగుతారు.

ఉదాహరణకి మీరు అకస్మాత్తుగా షేర్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టారనుకోండి అప్పుడు మీరు కొత్త సమాచారాన్ని మ్యాగజైన్స్ నుంచి, టి.వి. రిపోర్ట్‌ల నుంచి సేకరించటానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. ఒక నెల గడిచాక అకస్కాత్తుగా ప్రపంచమంతా షేర్ మార్కెట్ గురించి తెలుసుకున్నారు అని అనుకుంటారు. ప్రపంచం ఇక్కడ మారలేదు. ప్రపంచం పట్ల మీ దృక్పథం మారింది. ఎప్పుడైతే మీ శక్తిని కొత్త విషయం మీద కేంద్రీకరిస్తారో, మీ చుట్టూ కొత్త రకం వ్యక్తులు చేరతారు. మీరు శక్తికేంద్రాన్ని మార్చినప్పుడు, మీరు చూస్తున్న ప్రపంచాన్ని మార్చగలుగుతారు. హిందూ పురాణాలలో ఏడు లోకాలు ఉన్నాయి అని చెబుతారు. దీని అర్ధం మీలోని ఏడు భావావేశాలు ఈ లోకాన్ని ఎలా చూడాలో నిర్ణయిస్తాయి. అలా ఏడు లోకాలు కనిపిస్తాయి.

నిత్యధ్యానపద్ధతి

ఇందులో ఐదు దశలు ఉన్నాయి. ఒక్కొక్కటికీ ఏడు నిమిషాల చొప్పున ఉంటాయి.

  1. ఒక పద్ధతి లేకుండా శ్వాస తీసుకోవటం (సమయం : 7 నిమిషాలు) : వజ్రాసనంలో కూర్చోండి. సాధారణంగా మన లోపల శక్తి సహస్రారం నుంచి మూలాధారం వైపుగా ప్రవహిస్తూ ఉంటుంది. వజ్రాసనంలో కూర్చుంటే అది మూలాధారం నుంచి సహస్రారం వైపు ప్రవహిస్తుంది. కళ్ళు మూసుకొని, చేతులు నడుము మీద పెట్టాలి. శ్వాస ఒక పద్ధతి లేకుండా తీసుకోవాలి. లోతుగా శ్వాస తీసుకుని వదలాలి. కేవలం శ్వాస మీద మాత్రమే మీ ఏకాగ్రతని ఉంచాలి. మీ ఉనికి మొత్తం శ్వాసగా మారిపోవాలి.

మొదటి దశ భౌతికమైంది. వజ్రాసనంలో కూర్చుని ఒక పద్ధతి లేకుండా శ్వాస తీసుకుని వదలాలి. మీకు జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఉంటే అవి పూర్తిగా బాగవుతాయి. శరీరం సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే శరీరం గాఢత పెరుగుతుందో, జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది. నిత్య ధ్యానంలో ఈ భాగం మంచి ఆరోగ్యకరమైన శరీరాన్ని సృష్టిస్తుంది.

ఇక్కడ ఒక ముఖ్యవిషయం మీరు అర్ధంచేసుకోవాలి, మీ మానసికవ్యవస్థ మీద ఆధారపడి మీ శ్వాసలో నాణ్యత మారుతూ ఉంటుంది. మీ భావావేశాలు శ్వాస మీద ప్రభావాన్ని చూపిస్తాయి.

మీరు ఆతురతలో ఉంటే శ్వాస మారుతుంది. కోపంగా ఉంటే మరోలా ఉంటుంది. టెన్షన్ గా అనిపించినప్పుడు లోతుగా శ్వాస తీసుకోండి, అకస్మాత్తుగా మీరు తేలికగా అవుతారు. రిలాక్స్ అయ్యి టెన్షన్ తగ్గుతుంది.

శ్వాస, మానసికవ్యవస్థ దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక దానితో ఒకటి మారుతూ ఉంటాయి. భావావేశాలు మన చేతుల్తో ఉండవు. కాని శ్వాస మన చేతుల్తోనే ఉంటుంది. మనం శ్వాసని నియంత్రించటం ద్వారా శ్వాసించే పద్ధతిలో కొన్ని మార్చులు తీసుకురావచ్చు. ఆ విధంగా మన భావావేశాల్ని, మానసికవ్యవస్థని ప్రభావితం చేయవచ్చు. మనం ఎప్పుడూ ఏదో ఒక పద్ధతిలో శ్వాస తీసుకుంటాం. మన పాత జ్ఞాపకాలు, సంస్కారాలు అచేతనస్థితిలో ఉంటాయి, అవి తమకి అనుకూలమైన ఒక శ్వాసపద్ధతిని తయారుచేసుకుంటాయి. దానితో అటువంటి శ్వాసని ఆకర్షిస్తాయి. సంస్కారాలు ఒక శ్వాసపద్ధతిని తయారుచేస్తే, ఆ శ్వాస అదే రకం సంస్కారాల్ని ఆకర్షిస్తాయి. ఈ విధంగా ఒక ఛేదించలేని వలయాన్ని తయారుచేసాయి. దీన్ని ఛేదించాలి.

నిత్యధ్యానం ఒక పద్ధతి లేని శ్వాసతో ప్రారంభమవుతుంది. దీన్ని ఒక పద్ధతిలో చేయరు కాబట్టి ఒకే విధమైన శ్వాస ఉండదు. దీంతో సంస్కారాలు తయారుచేసుకునే పద్దతికి ఆటంకం ఏర్పడుతుంది. ఎప్పుడైతే శ్వాస అలవాటైన కొన్ని సంవత్సరాల నుంచి అనుసరించే పద్ధతిలో ఉండదో ఆలోచనలు తగ్గిపోతాయి.

మన కందరాల్లో జీవశక్తి ద్వారా మన జ్ఞాపకాలు నిలువ ఉంటాయి. లోతైన ఒక పద్ధతి లేని శ్వాస కందరాల్లోని టెన్సన్ పొగొడుతుంది. ఆ జ్ఞాపకాలు శరీరభాగాల నుంచి బయటికి వెళ్ళిపోతాయి. సాధారణంగా మన కండరాలు ఒత్తిడిలో ఉంటాయి. ఒక పద్ధతి లేని శ్వాస కండరాల్ని ఒత్తిడి నుంచి బయటికి తెప్పిస్తుంది.

మనలోని ఒక్కొక్క భావావేశం ఒక్కొక్క శ్వాసపద్ధతిని తయారుచేసుకుంటాయి. మీరు చిన్న పిల్లలని గమనిస్తే వారు చాలా లోతుగా అనందంగా శ్వాస తీసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు పెరిగే కొద్దీ సమాజనిబంధనలోకి వచ్చేస్తారు. సమాజం నుంచి బాధ, సంతోషం, కోరిక ఇటువంటి భావావేశాల్ని తీసుకుంటారు. దానితో శ్వాసలోని నాణ్యత పోతుంది. ఈ క్రమాన్ని కుదిపేయటానికే, ఒక పద్దతి లేని శ్వాస అనేదాన్ని మీ లోపలికి తీసుకువెళ్ళాలి. మరొక క్రమపద్ధతిని లోపల పెట్టటం సమస్యకి పరిష్కారం కాదు.

నిత్యధ్యానం – THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానం

మీ లోపల పాత గుర్తుల్ని బయటికి తీయటానికి తీవ్రమైన గందరగోళాన్ని మీ వ్యవస్థలో స్పష్టించాలి. అందుకే ప్రాణాయామం లాంటి ఒక క్రమపద్ధతిలో ఉండే శ్వాసని నేను చెప్పను. ఈ ధ్యానంలో ఒక పద్ధతి లేకుండా శ్వాస తీసుకోండి. ఇది మీ పాత జ్ఞాపకాల్ని వాటితో ఉన్న బంధాన్ని పోగొడుతుంది.

ఇది ఎలా ఉంటుందంటే పండుటాకులతో ఉన్న చెట్లుని కుదపటం లాంటిది. అప్పుడు పండుటాకులన్నీ రాలిపోతాయి. అదే విధంగా మీలో అణచివేయబడిన వాటిని పూర్తిగా కుదిపేస్తుంది. పాత జ్ఞాపకాలు, సంస్కారాలు మీ నుంచి వెళ్ళిపోతాయి. లోతైన శ్వాస మీలోనికి ఎక్కువ ఆక్సిజన్‌ని పంపించి, కార్బన్–డై–ఆక్సైడ్‌ని బయటికి పంపిస్తుంది. దీనితో మీరు చాలా తాజాగా ఉంటారు. ఎక్కువ ఆక్సిజన్ మీ లోపలికి వెళ్ళినప్పుడు, అది మీ లోపల చాలా బయో ఎనర్జీని, అంటే జీవశక్తిని సృష్టిస్తుంది. శరీరం చైతన్యవంతంగా అవుతుంది. ఆ శక్తి సంస్కారాల్ని తుడిచేస్తుంది. మీరు తేలికగా, శక్తివంతంగా, ఆనందంగా ఉంటారు.

  1. తీవ్రమైన హమ్మింగ్ (సమయం : 7 నిముషాలు) : వజ్రాసనంలోనే కూర్చోండి. మీ చేతి వేళ్ళతో చిన్ ముద్ర పెట్టండి. చేతులు మోకాళ్ళ మీద ఉంచండి. అరచేతులు పైకి ఉండాలి. పెదాలు దగ్గరగా మూసి హమ్ చేయండి. గట్టిగా, లోతుగా పొదవుగా హమ్ చేయండి.

'మ్…' అనే శబ్దాన్ని మీ లోపలి నుంచి చేయాలి. మీ తల ఖాళీ అల్యూమినియమ్ పాత్రలో పెట్టి హమ్ చేస్తే ఏ శబ్దం వస్తుందో ఇది అదే విధంగా ఉంటుంది. ఇది కేవలం 'మ్... ' శబ్దం చేయాలి. ఇది 'ఓం' కాదు 'హమ్' కాదు. రెండు శ్వాసల మధ్య మ్.. పొదవుగా ఉండాలి. అది మీ నాభిప్రాంతం నుంచి రావాలి. శ్వాస లోతుగా ఉండాలి అని లేదు. శరీరం తనకి కావలసిన శ్వాసని తాను తీసుకుంటుంది.

మీ పూర్తి ఏకాగ్రత హమ్మింగ్ మీద ఉంచండి. మీరే హమ్మింగ్ అయిపోవాలి. మీలోపల నిరంతరం మాటలు జరుగుతూ ఉంటాయి. ఆ మాటలు తగ్గించే గొప్ప పద్ధతి ఈ హమ్మింగ్. అంతరంగపు మాటలు అంటే స్వతంత్రమైన ఆలోచనల ప్రవాహం. హమ్మింగ్ మీ శరీరం శక్తి అని తెలుసుకునేలా చేస్తుంది. ఎప్పుడెతే మీరు హమ్మింగ్ చేయటం మొదలుపెడతారో, మీరు చాలా తేలిక అయినట్లు తెలుసుకుంటారు. మీ శరీరం బరువు మీకు తెలియదు. ఎందుకంటే హమ్మింగ్ వైబ్రేషన్స్, శరీరం వైబ్రేషన్స్‌తో కలసిపోతాయి. మీరు ఒక శక్తిగా మీకు అనిపిస్తుంది.

ఇది చేసేటప్పుడు టెన్షన్ వద్దు. రిలాక్స్ అయ్యి చేయండి. హమ్మింగ్‌లో పూర్తిగా నిమగ్నమవ్వండి, రెండు హమ్మింగ్స్ మధ్య ఖాళీ తగ్గించటానికి ప్రయత్నించండి. కొంత సేపు అయ్యాక మీ ప్రయత్నం లేకుండా హమ్మింగ్ జరుగటం మీరు గమనిస్తారు. మీరు హమ్మింగ్ వింటారు. మీ శరీరం మానసికవ్యవస్థ హమ్మింగ్ ప్రకంపనలతో నిండి ఉంటాయి. హమ్మింగ్ మీ లోపల ఆరోగ్యకరమైన అంతరంగపు మాటల్ని సృష్టిస్తుంది. దీంతో ఆరోగ్యకరమైన ఉన్నతమైన భావావేశాలు ఉంటాయి.

  1. చక్రాల గురించి తెలుసుకోవటం (సమయం : 7 నిమిషాలు) : వజ్రాసనంలో కూర్చోగలిగితే కూర్చోండి లేదా మామూలుగా కూర్చోండి. చేతి వేళ్ళు చిన్ ముద్రలో ఉంచండి.

ఇప్పుడు మీ ఏకాగ్రతని మూలాధారచక్రం నుంచి ఒక్కొక్క చక్రం మీదికి తీసుకువెళ్ళండి. ఆ విధంగా సహస్రారం వరకూ అన్ని చక్రాల మీదికి తీసుకువెళ్ళండి. మిమ్మల్ని చక్రం మీద ఏకాగ్రత ఉంచమన్నప్పుడు మీరు ఆ శక్తి కేంద్రంగా మారిపోవాలి. మీరు మొత్తం ఆ శక్తి కేంద్రం అనుకోవాలి.

ఈ ఏడు చక్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్క భావావేశంతో సంబంధం కలిగి ఉంటాయి. కిర్లియన్ ఫోటోగ్రఫీ ఈ చక్రాలని ఫోటో తీయగలిగింది. ఇవి ఉన్నాయి అని నిరూపించింది. ఈ భావావేశాలు మనలోని సంస్కారాల వల్ల కలుగుతాయి. ఈ సంస్కారాలు మనని అదే విధంగా స్పందించేలా ప్రేరేపిస్తాయి. ఎప్పుడైతే భావావేశం పైకి వస్తుందో అది ఆ శక్తిప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీనితో శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ దశలో ప్రతి చక్రం మీద ఏకాగ్రతని నిలుపుతారు. అది వెన్నెముక చివర ఉన్న చక్రం నుంచి శీర్షభాగాన ఉన్న చక్రం వరకూ చేస్తారు. ఎప్పుడైతే తెలుసుకునే తత్వంతో ఏకాగ్రత నిలుపుతామో వ్యతిరేకశక్తి కరిగిపోతుంది. అది భౌతికమైన బాధకి కూడా వర్తిస్తుంది. మీ శరీరంలో ఎక్కడైనా బాధ ఉంటే అక్కడ తెలుసుకునే తత్వంతో ఏకాగ్రతని నిలపండి. క్రమంగా బాధ చిన్న బిందువుగా మారి మాయం అవుతుంది.

ఈ విధంగా ఏడు చక్రాల మీద ఒక్కొక్క నిమిషం పాటు ఏకాగ్రతని నిలపండి. అలా చేసినప్పుడు కేవలం ఆ చక్రాన్ని మాత్రమే చూడాలి. మిగతా అంతా మరిచిపోవాలి. మీరు ఆ చక్రం అవ్వాలి. అది మీ ఉనికి అయినట్టు భావించాలి. తరువాత మరొక చక్రం దగ్గరకి వెళ్ళాలి. ఈ దశ పూర్తి అయ్యాక మీరు పూర్తి శక్తితో నింపబడతారు.

మీరు పైకి వచ్చే కొద్దీ మీలో జీవచైతన్యం మరింత గాఢంగా అవుతుంది. మీరు గాఢంగా లోతుగా అవుతారు. ఇది మీకు ఆరోగ్యకరమైన శరీరాన్ని, మనస్సుని తయారుచేస్తుంది. మీ భావావేశాలు ఎరుకతో ఉంటాయి. ఈ దశ పూర్తి అయ్యాక శక్తితో, తేలికగా అవుతారు. మీరు చక్రాల మీద ఏకాగ్రతని నిలిపితే మనస్సు ఎటూ వెళ్ళదు. అది ఒక దగ్గర స్థిరంగా ఉంటుంది. అదే శరీరంలో మరొక భాగంలో ఏకాగ్రత నిలిపితే మనస్సు ఎటో వెళ్ళిపోతుంది.

  1. అన్‌క్ర‌చ్‌గా ఉండండి (బంధాల నుంచి విముకుల‌వ‌ండి) (స‌మ‌యం 7 నిమిషాలు) : ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్లం చేసుకోవాలి. మీ ఆలోచనలు ఒక దానితో ఒకటి సంబంధం లేని, అర్థం లేని స్వతంత్రమైనవి. మీకు ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని అణచవద్దు.

వాటితో (పభావితం కావద్దు. కేవలం వాటిని గమనించండి. అవి ఒక దానికొకటి ఎటువంటి సంబంధం లేనివి అని గమనించండి. అప్పుడు మీలో గమనించగల చేతనస్థితి ఏర్పడుతుంది. మీరు తెలుసుకున్నా లేకపోయినా ఔను అన్నా కాదు అన్నా, మీరు జ్ఞానోదయవైనవారే. సహజంగా మీరు బంధ విముకులే. నిశ్నబ్దంగా కూర్చొని ఆ బంధ విముక్తిని అనుభవంతో తెలుసుకోండి. జ్ఞానోదయానుభవానికి ఇది అంతిమపద్దతి.

  1. గురుపూజ (సమయం 7 నిమిషాలు) : నిత్యధ్యానాన్ని విశ్వశక్తితో అనుబంధాన్ని ఏర్పరచు

కోవటంతో ముగిస్తాం. విరామంగా కూర్చోండి. విశ్వశక్తితో, సర్వాంతర్యామితో చక్కని అనుబంధంతో కూర్సోండి. దేవుడి పైన అయినా లేదా గురువుల పైన అంబన మీకు [పేమ ఉంటే లోతైన అనుబంధంతో కూర్చొండి, విరామంలో స్థిరపడండి.

నిశ్శబ్దంగా, ఆనందంగా కూర్చొని గురుమంతశ్లోకాలని వినండి. సర్వాంతర్యామితో అనుబంధాన్ని అనుభూతి పొందండి. మంత్రాల (పకంపనలు, ఆ శక్తి మీలో నింపండి. మంత్రాలు సర్వాంతర్యామి పట్ల, గురుదేవుల పట్ల కృతజ్ఞతని

తెలియచేసాయి. మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు, అజ్ఞానం నుంచి మనని విముకుల్ని చేసినందుకు, నిత్యానందస్థితిని మనం పొందేలా చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేయండి.

సంస్కృతంలో చదవటం వల్ల దానికి ఉన్న శబ్దతత్వం మనకి సహాయం చేస్తుంది. ఆ మంత్రాల శబ్దంలో మన ఏకాగ్గతని నిలపగలిగితే, మనం మాటలకి శబ్దాలకి అతీతంగా వెళ్లగలం. వాటి అర్తాలు మనకి తెలియకపోయినా, దానిలోని శబ్ధతత్వం మనని మారుస్తుంది. మన మానసిక – శారీరకవ్యవస్థల్ని శుభ్రపరచి స్వచ్ఛంగా చేస్తుంది. మనలో అనుకూల(పకంపనల్ని కలిగిస్తుంది.

మీరు గురుపూజ కూడా చేయవచ్చు. మండ్రాలు పఠిస్తూ గురుపూజ చేయవచ్చు. గురుపూజకి వేరే పుస్తకాలు ఉన్నాయి.

ఈ ధ్యానం రోజుకి ఒకసారి చేయండి. మీలోని మరొక కోణాన్ని తెలుసు కోగలుగుతారు. నిత్యధ్యానం మీ శరీరాన్ని, మనస్సుని స్వచ్ఛమైన చేతనస్థితిని అనుభవించే విధంగా తయారుచేస్తుంది. నిత్యానందాన్ని పొందేలా చేస్తుంది.

నిత్యధ్యానం వల్ల [ప్రయోజనాలు

అరగంట చేసే నిత్యధ్యానం మనకి కింది ఉపయోగాలు కలిగిస్తుంది.

  • ఒత్తిడి తగ్గుతుంది
  • సంబంధబాంధవ్యాలు బాగుంటాయి.
  • అంతరంగ(పశాంతత, సంతృప్తి కలుగుతాయి.
  • ఆత్మపభోధస్థితి మేల్కొంటుంది.
  • బ్లడ్ (పెషర్ నియం(త్రణలో ఉంటుంది.
  • నిద్ద బాగుంటుంది.
  • స్పష్టత పెరుగుతుంది.
  • రోజంతా శక్రితో ఉంటారు.
  • విశ్వశక్తితో అనుబంధం పెరుగుతుంది.

మీ కుటుంబసభ్యుల్ని, స్నేహితుల్ని నిత్యధ్యానదీక్షతో నిత్య ధ్యానం చేయించంది. దీంతో ఈ భూమి మీద సామూహిక చేతనస్థితిని అనుకూలంగా పెంచగలం. ఎక్కువ మంది బంధవిముకులై జీవన్ముకులవుతారు. పతి ఒక్కరిలో వచ్చే వ్యక్తిగతమైన మార్పు ప్రపంచంలో

సామూహికచేతనస్థితిని ఉన్నతస్థితికి చేర్చి భూమి మీద ఉండే జీవశక్తి పైన, జీవితాల మీద అనుకూల(పభావాన్ని చూపిస్తుంది.

శక్తికేంద్రాన్ని మార్చినప్పుడు మీరు చూస్తున్న [పపంచాన్ని మార్చగలుగుతారు.

మీ మానసికవ్యవస్థ ఆధారంగా మీ శ్వాస మారుతూ ఉంటుంది.

హమ్మింగ్ మీ అంతరంగపు మాటలను తగ్గించే గొప్ప పద్ధతి.

నిత్త ఆనంద స్థితి కోసం మీరు ప్రతి రోజు చేయగల ధ్యానం నిత్తధ్యానం.

కొంతమందికి ఏ విషయమైనా వారికి కోరిక, కామం, టర్మ అనే ఉపయోగాలు ఉండాలి అని చూస్తారు.

మీ లోపల పాత గురుతులు బయటికి తీయటానికి తీవ్రమైన గందరగోళాన్ని మీ వ్యవస్థలో సృష్టించాలి.

మీకు ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని అణచవద్దు. వాటితో ప్రభావితం కావద్దు. కేవలం వాటిని గమనించండి.

నిరంతరం యోగలో ఉండటమే జీవన్ముక్తి

యోగ అంటే శారీరకవ్యాయామం కోసం మాత్రమే కాదు. ఇది శరీరం, మనసు, ఆత్మల సంయోగస్తితిని సాధించటానికి శరీరాన్ని సిద్ధం చేయటమే. ఈ సంయోగానికి పతంజలి భావాలతో రూపొందించిందే నిత్యయోగం. నిత్యధ్యానం ఏ విధంగా ఈ ఆధునిక తరానికి అనుకూలంగా ఉంటుందో, నిత్యయోగా కూడా అదే విధంగా నేటి తరాలవారికి అనుకూలంగా ఉంటుంది.

యోగ అంటే ఏమిటి?

ప్రాచీనయోగశాస్త్ర పితామహుడు, పతంజలి యోగశాస్త్రాన్ని రచించిన యోగీశ్వరుడు.

'యోగః చిత్రవృత్తి నిరోధః' పతంజలి ఈ విధంగా చెబుతున్నారు, 'యోగా అంటే మనస్సు (ఆలోచనల) లేని స్టితి' దీని అర్ధం. ఆలోచనలు ఆగ గానే యోగా అయిపోలేదు, యోగ ప్రారంభమవుతుంది. ఆలోచనలు ఆగినప్పుడు యోగా [పారంభమవుతుంది.

నిజానికి యోగా ఎప్పటికి ముగియదు. అది ప్రారంభమవుతుంది, నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. యోగ నిరంతరం ఏ విధంగా సాగుతూ ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏది జరుగుతుందో అదంతా మంగళకరమే, అని తెలుసుకోవాలి.

ఒక విషయం తెలుసుకోండి. మీలో [పతి అనుభవం మిమ్మల్ని, మీలోని చేతనస్థితిని అత్యున్నతస్తాయికి తీసుకువెళుతుంది. అది మిమ్మల్ని పరిణతుల్ని చేస్తుంది. మీరు ఐశ్వర్యాన్ని పోగొట్లుకోవటం కూడా మీకు పరిణతిని ఇస్తుంది. ఆరోగ్యాన్ని పోగొట్టుకోవటం మరి కొంత తెలుసుకునే విధంగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మీరు మీ అంతరంగంలో నింపగలరో, అప్పుడు జీవితం ప్రతిక్షణం ఒక అద్భుతంలా సాగిపోవటాన్ని మీరు చూడగలరు.

ఒక చిన్న కథ : ఒకసారి సముద్రంలో ఒక ఓడ వెళుతూ ఉంటుంది. అకస్మాత్మగా ఆ ఓడ కెప్టెన్‌కి ముందు వైపు అత్యంత ప్ర‌కాశ‌వంత‌మైన వెలుగు క‌నిపిస్తుంది. వెంట‌నే అతను ఓడను నడిపేవారి దగ్గరకి వెళ్ళి ఓడని ఆ ప్ర‌కాశానికి దూరంగా తీసుకువెళ్ళ‌మ‌ని హెచ్చ‌రిస్తాడు. అతను వారితో 'మీరు వెంటనే ఓడని 15 డిగ్రీలు ఉత్తరం వైపు మళ్ళించి ఓడ దాన్ని ఢీ కొట్టకుందా కాపాదండి' అని హెచ్ఛరిస్తాడు.

వెంటనే ఒక గొంతు వెనక నుంచి ఈ విధంగా వినిపిస్తుంది, 'మీ ఓడని 15 డిగ్రీలు దక్షిణదిశగా ఓడ ఢీకొట్టకుండా చూడమని చెబుతున్నాం' అని. అప్పుడు కెప్లెన్‌కి చాలా కోపం

వసుంది. చాలా అతిశయంతో, బెదిరించే విధంగా జవాబు ఇస్తాడు, 'ఇది దేశంలోనే అతి పెద్ద ఓడ. మా దగ్గర నాశనం చేయగల అస్తాలు, మమ్మల్ని, ఓడని రక్షించే పరికరాలు ఉన్నాయి. మీరు ఓడని ఉత్రరదిశగా 15 డిగ్రీలు మార్చండి. లేకపోతే ఓడని రక్షించటానికి మేం చేసే ప్ర‌య‌త్నాల‌ని మీరు ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంది', అంటాడు.

వెంటనే మళ్ళీ ఇలా వినిపిస్తుంది, 'మేము లైట్ హౌస్', అని.

అర్థం చేసుకోండి; సర్వసృష్టి నిరంతరం ఉంటుంది. అది మీకు మార్గదర్శకంగా ఉంటూ మీకు ఏది జరిగినా ఉన్నంతలో చాలా మంచి జరిగే విధంగా ఉంటుంది. మీరు దానికి అనుగుణంగా ఉండండి. అదే మంచి పద్ధతి. యోగా అనేది ఆ విధంగా మిమ్మల్ని మీరు మలచుకోగల ఒక మార్గం. రేడియోని ఎక్కువ (ప్రీక్వెన్సీకి ఏ విధంగా ట్యూన్ చేస్తామో ఇది కూడా అంతే.

యోగా ఒక లక్ష్యం కాదు. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది.

చాలా మంది యోగా అనగానే భౌతికంగా వేసే ఆసనాలు అనుకుంటారు. శరీరాన్ని ఎలా వంచాలి, ఎలా కదిలించాలి అనేది నేర్చుకోవటం అనుకుంటారు.

ఇంతకు ముందు ఒక జోక్ చదివాను. ఒక గుహలో కొన్ని గబ్బిలాలు పెన కప్పుకి వేలాదుతూ ఉంటాయి. వాటికి నేల మీద తిన్నగా నిలబడి ఉన్న ఒక గబ్బిలం కనిపిస్తుంది. అవి ఆశ్చర్యపోయి, దాంతో, 'కింద ఏమీ చేస్తున్నావు' అని అడుగుతాయి. కింది గబ్బిలం 'యోగా చేస్తున్నాను' అని గట్టిగా జవాబు ఇస్తుంది.

అందరూ యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పటం అనుకుంటారు. అది ఆరోగ్యం కోసం అనుకుంటారు. దయచేసి అర్థం చేసుకోండి; యోగా అంటే ఒక లక్ష్యం కాదు. అది నిరంతరం జరిగే ఒక అనుభవం. యోగా అంటే ఐక్యమైపోవటం.

సత్యానికి, స్వప్నానికి మధ్య ఉన్న ఖాళీ తగ్గించటం

మన లోపల రెండు జీవితాలు ఉన్నాయి. ఆ విషయం తెలుసుకోండి. ఒకటి మనం ఏ విధంగా జీవించాలి అనుకుంటున్నామో ఆ జీవితం, అది స్వప్పం. మరొక జీవితం సత్యం, మనం జీవిస్తున్న జీవితం. ఈ రెండు జీవితాలు కలవటాన్నే నేను యోగా అంటాను. ఇప్పుడు ఈ రెండు జీవితాలు, మీ స్వప్పజీవితం, నిజజీవితం కలవటం ఎలా?

మీరు ఈ రెండింటి మధ్య దూరాన్ని తగ్గించాలి అంటే కలల మందాన్ని తగ్గించాలి. లేదా మీ శక్తిని పూర్తిగా వెల్లడి చేయాలి. అప్పుడు సత్యం స్వప్నం దగ్గరకి వస్తుంది.

మీరు మీ ఊహలని, ఆశల లోతుని తగ్గిస్తే, స్వప్నస్థితి సత్యస్థితి ఒక దగ్గరకి వస్తాయి. అంతే కాకుండా మీరు మీలోని శక్తిని సత్యం ద్వారా వెల్లడి చేయగలిగినప్పుడు, సత్యదశ, స్వప్నదశకి దగ్గరగా వస్తుంది. ఈ రెండు దశలూ కలవటాన్నే నేను యోగా అంటాను.

నిరంతరం ఈ రెండింటిలో ఏదో ఒకటి, స్వప్పం లోతు తగ్గించటం లేదా శక్తిని సత్యం ద్వారా వెల్లడి చేయటం, దీన్నే యోగా అంటాను. ఎప్పుడైతే ఈ రెండు దశలూ సంపూర్ణత్వం కలుస్తాయో అప్పుడు ఆధ్యాత్మికవిస్పోటం జరుగుతుంది. అప్పుడే మనం చెప్పుకునే యోగా అనేది జరుగుతుంది. అయితే ఇక్కడితో యోగా అయిపోలేదు. కేవలం యోగా ప్రారంభమయ్యింది.

మమూలుగా యోగా అనగానే ఆసనాల్లో మంచి ప్రావీణ్యం సాధించి, ఒక స్థితికి రావటం అనుకుంటారు. యోగా అంటే అసనాల్లో (పావీణ్యం సంపాదించటం కాదు లేదా ఏదో ఒక లక్ష్యాన్ని సాధించటం కాదు. యోగా అంటే మీ అంతరంగంలో, మీ చుట్టూ జరిగే విషయాల్ని మేల్కొలపటం.

ఎవరైతే సత్యాన్ని స్వప్నస్థితికి తీసుకురావటానికి [పయత్నిస్తారో అతను భౌతికవాది. సత్యజీవితంలో తన కలలని నిజం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. కానీ దీంతో ఒక సమస్య ఉంది. స్వప్పం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. మీరు దాన్ని సాధించే దిశగా (పయత్సం మొదలు పెట్టాక, దాని లక్ష్యం మారిపోతుంది. మీ భావాలు మారే కొద్దీ మీ లక్ష్యం మారుతూ ఉంటుంది.

యోగా అంటే మీరు ఆధ్యాత్మిక ఆత్మని కలిగిన మానవానుభవాలతో ఉన్నవారు అని తెలుసుకోవటమే.

ఏ వ్యక్తి అయితే స్వప్నం లోతు తగ్గించి సత్యం వైపు దగ్గరగా వెళతాడో అతను తనలో అణచబడిన కోరికలు గల సన్నాసిలా సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన నిజాన్ని తెలుసుకోవాలి. కోరికల్ని అణచటం సన్న్యాసించటం లేదా శక్తిని వెల్లడి చేసూ కలలని సాధించటం అనే ఈ రెండు విషయాలు కూడా పని చేయవు. ఇక్కడే బుద్ధుడు చెప్పే మధ్యేమార్గం మనకి సహాయం చేస్తుంది. ఈ మధ్యే మార్గమే మేల్కోటానికి లేదా తెలుసుకునే తత్వాన్ని తీసుకురావటం లేదా యోగా అన్నా అదే అర్లం. మీరు మీ భావావేశాల తోపుడుకి లోను కాకుండా వాటిని చూదగలుగుతూ, మధ్యేమార్గంలో ఉండగలుగుతారు.

అంతరంగంలో స్థిరపడే స్టితి

యోగా అంటే అంతరంగంలో గల అసలైన ఉనికితో ఉండటమే. యోగసూత్రాల్లో పతంజలి యోగస్థితి గురించి చాలా అందంగా వర్ణిస్తాడు. 'యోగా అంటే మనస్సు (ఆలోచనలు) లేని స్లితి. ఎప్పుడైతే ఆలోచనలు అనేవి లేవో అప్పుడు మీరు యోగస్థితిలో ఉంటారు. అదే ఆలోచనలు లేని స్థితి. అదే అంతిమచేతనస్థితి, అదే జ్ఞానోదయం అంటే.

ఎప్పుడెతే మీరు ఆలోచనలు లేని స్వచ్చమైన చేతనసితిని అనుభవిసారో అప్పుడు మీలో చక్కని మానసిక విప్లవం ఏర్పడుతుంది. అది జీవం (ఆత్మ), ప్రపంచం (జగత్), భగవంతుడు (ఈశ్వరుడు)ల గురించి స్పష్టంగా అర్ధం చేసుకోగల శక్తిని ఇస్తుంది. అప్పుడు మీరు ఈ మూదూ వేరు కాదు, అవి అంతా ఒక సంపూర్ణత్వం అని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. మీ లోపల భగవంతుడు, ప్రపంచం అనే అనుభవాలు జరుగుతాయి.

యోగా ద్వారా మీరు ఆధ్యాత్మిక స్థితిని కోరే సామాన్య మానవులు కాదు. మీరు మానవాసుభవంతో ఉన్న ఆధ్యాత్మికులు అని తెలుసుకోగలుగుతారు.

పతంజలి – యోగశాస్త్రవ్యవస్థాపకుడు

పతంజలి యోగశాన్నప్యవస్థాపకులు. జ్ఞానోదయానుభవాన్ని ఎదుటివారిలో కలిగించగల ఒక స్పష్టమైన, శాస్త్రీయమైన వ్యవస్థని రూపొందించిన మొదటి గురుదేవులు పతంజలి.

పతంజలికి ముందు జ్ఞానోదయం అంటే ఏదో జాక్ పాట్ సాధించటం అని దాన్ని ఒక అద్దుష్టంగా భావించేవారు. ఆ అనుభవం జరిగినా లేకపోయినా, దాన్ని ఒక జూదం ఆటలా భావించేవారు. మీరు ఆడతారు కాని గెలుసారనే నమ్మకం ఉండదు.

పతంజలి ఈ విషయంలో మొట్టమొదటి గురువు. నేను ఆయనని ఆధ్యాత్మికనావికుడు అంటాను. ఆయన జ్జానోదయానికి చక్కని మార్దాన్ని, ఒక పటాన్ని పూర్తి వివరాలతో, సూచనలతో తయారుచేసిన మొదటి గురువు. ఆయన స్పష్లమైన సూచనలని ఇచ్చారు. ఒక దాని తరువాత ఒకటిగా చేయవలసినవన్నీ ఒక క్రమపద్ధతిలో, సూతాలతో ఇచ్చారు. ఇవన్నీ జ్ఞానోదయానుభవాన్ని కలిగించేవే. బయట ప్రపంచంలో శాస్తవేత్తలు ఏవిధంగా అయితే సూతాలను సృష్టించి వాటి ద్వారా తాము తెలుసుకున్న విషయాలు అందరికీ అర్దమయ్యేలా చెబుతారో, పతంజలి కూడా జ్ఞానోదయం అనే అనుభవాన్ని అంతరంగప్రపంచపువిషయాల్ని తెలుసుకోగల సూతాల్ని తయారుచేసాడు.

రఘుపతి యోగి – యోగా గురుదేవుడు

నేను చిన్నతనంలో ఒక గొప్ప యోగశాస్త్రప్రవీణులైన గురుదేవుల దగ్గర ఉండగల అదృష్ఠాన్ని పొందాను. ఆయన పేరు యోగిరాజ్ యోగానంద పూరి. ఆయనని రఘుపతి యోగి అని

కూడా పిలిచేవారు. పతంజలి రూపొందించిన యోగశాస్త్రం మొత్తాన్ని ఆయన నేర్చుకొని అందులో అద్భుతమైన ప్రావీణ్యాన్ని సంపాదించారు.

మీ శరీరం మీ జ్ఞాపకాల నుంచి తయారు చేయబడింది. మీరు ఏ ఉదేశంతో శరీరాన్ని, మనస్సుని కదిలిసారో అది మీ శరీరంలో మనస్సులో రికార్డు చేయబడుతుంది.

ఆయన ఆసనాల్లో గొప్ప (పావీణ్యం సాధించారు. భౌతికశరీరాన్ని ఏ విధంగానైనా వంచగల రకరకాల ఆసనాల్లో [పావీణ్యం సాధించారు. దీన్నే హఠయోగ అంటారు. అదే విధంగా [పాణయోగ అంటే జీవశక్తి, మనస్సుల మీద పని చేసారు. దృష్టి శక్తి, భావాలతో పని చేయటం ఈ విధంగా పతంజలి యోగశాస్ట్రంలోని అన్ని కోణాల్మో ఆయన పూర్తి అధికారాన్ని సంపాదించారు. యోగలోని అత్యంతముఖ్యమైన లోతులలో ఆయన దాన్ని తెలుసుకున్నారు.

ఒక విషయం అర్థం చేసుకోండి. యోగశాస్త్రంలో కేవలం పతంజలి మాటల్ని మాతం రాయగలిగారు. కానీ ఆయన తన శరీర కదలికలతో శిష్యులకి ఇచ్చిన సందేశాల్ని రాయలేక పోయారు. అసలు ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాదారో, ఏ ఉద్గేశంతో రాసారో ఆ విషయాల్ని రికార్డు చేయలేకపోయారు.

ఎవరైతే పతంజలి చేతనస్తితిని అనుభవిసారో, కేవలం ఆ వ్యక్తి మాత్రమే పతంజలిని తిరిగి తీసుకురాగలదు. నాకు అటువంటి గురువుతో ఉండే అద్భష్టం దొరికింది. ఆయన పతంజలి అంతరంగాన్ని, పతంజలి చేతనస్థితిని అనుభవపూర్వకంగా తెలుసుకున్న యోగ గురువు.

నేను ఆయనతో ఉన్న రోజుల్లో ఆయన వయస్సు సుమారు వంద, నూట ఐదు సంవత్సరాలు ఉందవచ్చు. కానీ ఆయన మంచి శరీరదార్థ్యంతో చాలా అరోగ్యంతో ఉండేవాడు. ఆయనలో ఆశ్చర్యం గొలిపే శక్తి ఉండేది. అయన శారీరకబలాన్ని ఊహించలేం. ఆయన తన ఛాతీకి ఇనుపగొలుసు కట్టుకొని శ్వాస వదిలి, తిరిగి పూర్తి స్థాప తీసుకుంటే, ఆ గొలుసు తెగిపోయేది.

తార్కికత గల మెదదుకి ఈ విషయం అర్థం కాదు. వారు ఈ విషయాన్ని ఒప్పుకోరు, అర్ధం చేసుకోలేరు. అయన గాలిలో పైకి లేవటం కనీసం ఇరవై సార్లు చూసి ఉంటాను. ఆయన పూర్తిగా శ్వాస తీసుకొని లోపల పట్టి ఉంచగానే గాలితో ఉన్న బుడగలా పైకి లేచేవారు.

నేను మూడు సంవత్సరాల వయస్సు నుంచి పదమూడు సంవత్సరాల వయస్సు వరకూ ఆయన పాదాల దగ్గర ఉండి, ఆయన ఆదరణలో ఆయన మార్గదర్శకత్వంలో పెరిగాను. ప్రతి రోజూ ఉదయం సుంచి మధ్యాహ్నం వరకూ కనీసం ఐదారు గంటలపాటు ఆయన నాతో రకరకాల యోగాసనాలు వేయించేవారు. నేతి, ధౌతి అనే పద్దతిలో (నేతి అంటే ముక్కు నాళాలని,

ధౌతి అంటే జీర్ణాశయాన్ని శుభపరిచే యోగపద్ధతులు) నాతో ఒక పొడవైన గుడ్డని మింగించి దాంతో లోపలి భాగాలు శుభ్రపడే విధంగా చేసేవారు.

ఒక ఉద్దేశంతో శరీరాన్ని కదిలించి ఫలితాల్ని పొందండి

రఘుపతి యోగి కొన్నిసార్లు నన్ను కదలకుండా, నిశ్మబ్ధంగా, ప్రశాంతంగా కూర్చోమని చెప్పి, ఆ నిశ్చలత మీద ధ్యానం చేయమని చెప్పేవారు. అలా పది నిమిషాలు గడవగానే. అకస్మాత్మగా నన్ను లేపి, గుడి అంతా ఎంత వేగంగా పరిగెత్తగలిగితే అంత వేగంగా పరిగెత్తమనేవారు.

నన్ను ఇటు పక్కకి, అటు పక్కకి వంగమనేవారు. నాకు ఆయన యోగా నేర్చే గుడిలో ఇరవె నుంచి ముప్పి సంభాలు ఉండేవి. ఆయన నన్ను సంభాలన్నీ ఒక చేతిని ఉపయోగిసూ ఎక్కి దిగమనేవారు. నేను ఆయనని అలా ఎందుకు స్కంభాలు ఎక్కి దిగాలి అని అడిగేవాడిని. ఎందుకంటే అటువంటి పద్ధతి ఏ యోగసూత్రంలోనూ లేదు.

నా [పశ్నకి ఆయన చాలా చక్కని జవాబు ఇచ్చారు. 'మీరు ఏ ఉద్దేశంతో శరీరాన్ని అటూ ఇటూ కదిలిస్తారో, అటూ ఇటూ వంచుతారో ఆ ఉద్దేశం మీ శరీరంలోనూ మానసికవ్యవస్థలోనూ పూర్తిగా నాటుకుపోతుంది, ఇది చాలా ఆశ్చర్యపరిచే ఒక సత్యం. ఆయన ఇలా చెప్పారు, 'మీరు ఏ ఉద్దేశంతో శరీరాన్ని అటూ ఇటూ వంచుతారో, శరీరాన్ని అటూ ఇటూ కదుపుతారో, ఆ ఉద్దేశం, ఆ లక్ష్యం మీ శరీరంలో నమోదు అవుతుంది. ఆ సంస్కారాన్ని మీ శరీరం వెల్లడి చేస్తూ ఉంటుంది.'

ఇక్కడ ఆయన చెప్పేది ఏమిటంటే, మీరు శరీరాన్ని ఏ విధంగా వంచుతున్నారు, ఏ విధంగా ఆసనాలు వేసున్నారు అన్న విషయం ముఖ్యం కాదు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, అన్నది ముఖ్యం. మీరు ఆరోగ్యం కోసం మీ శరీరాన్ని అటూ ఇటూ వంచితే, ఆ ఉద్దేశం అయిన ఆరోగ్యం మీకు కలుగుతుంది. ఈ రోజుల్లో, ముఖ్యంగా పశ్చిమదేశాల్లో, ఒక్కొక్క అనారోగ్యాన్ని ఒక్కొక్క ఆసనంతో కలిపి చేసున్నారు. ఈ అనారోగ్యానికి మీరు ఈ ఆసనం వేయాలి చెబుతున్నారు. ఈ సమస్యకి ఈ పద్ధతి నేర్చుకోవాలి అంటున్నారు.

మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో మన జీన్స్ ఆ విధంగా తయారు అవుతాయి. నిత్యయోగ మీ అంతరంగంలోని ఆనందాన్ని నిత్యానందస్థితిని అనుభవించి, వెల్లడి చేయటానికి మీ శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

ఒక చిన్న కథ : ఒక యువతికి చేతి వేళ్ళ గోళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. దాంతో ఆమె చాలా ఇబ్బందులు పడుతుంది. ఆమె తన స్నేహితురాలితో తన సమస్యని చెప్పి సహాయం చేయమని అడుగుతుంది. ఆమె స్నేహితురాలు యోగా నేర్చుకుంటే సమస్య పోతుంది అని

సలహా ఇస్తుంది. అమ్మాయి యోగా చేయటం (పారంభించి కొతకాలానికి గోళ్ళు కొరకటం మానేస్తుంది. గోళ్ళు అందంగా పెరుగుతాయి. ఆమె స్పేహితురాలు చాలా సంతోషపడి 'చూసావా! నేను చెప్పాను కదా. యోగా చేసే గోళ్ళు కొరికే నీ అలవాటు పోతుందని, నీ సమస్య పరిష్కారమైంది కదా' అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి 'నిజానికి సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు నేను, నా కాళ్ళ దగ్గరకి వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు కాళ్ళ గోళ్ళు కొరకటం మొదలు పెట్టాను'. అంటుంది.

అర్ధం చేసుకోండి, వ్యాధులు తగ్గటానికి ఆసనాలు వేయటం యోగా కాదు. మీరు ఒక జబ్బు గురించి అనుకుని ఆసనాలు వేస్తే, మీరు ఆ సందేశాన్ని, ఆ ఆలోచనని, మీ శరీరంలోకి పంపిస్తున్నారు అని అర్ధం.

రఘుపతి యోగి ఈ విధంగా చెప్పేవారు, 'ఏ అసనమైనా, ఆసనమే కాదు మీ భౌతికశరీరాన్ని కదపటానికైనా మీరు దేనికోసం చేస్తారో, ఏ ఉద్దేశంతో చేస్తారో, ఆ ప్రభావాన్ని మీ శరీరంలో స్పష్టించగలుగుతుంది. అది కేవలం కూర్చుని ఉండటం ద్వారా కూడా చేయవచ్చు. మీరు కూర్చోవటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని గట్టిగా నమ్మి అలా కేవలం కూర్చోగలిగినా, మీరు కోరుకున్న ఆరోగ్యం మీలో కలగటం మీరు చూడగలుగుతారు.

ఒక విషయం అర్ధం చేసుకోండి. మీ శరీరం మీ జ్ఞాపకాలతోనే తయారయ్యింది. మీ మనస్సు, మీరు అంటే మీరు ఏం అనుకుంటున్నారో అదే మీ శరీరాన్ని తయారుచేస్తుంది. మీరు ఫలానాది జరుగుతుంది అనే విశ్వాసంతో మీ శరీరాన్ని కదిలించితే అది జరిగి మీ నుంచి వెల్లడి కావటం పారంభమవుతుంది. మీ శరీరపు కండరాల్లో ప్రతీ జ్ఞాపకం నిలువచేయబడి ఉంటుంది. మీరు జ్ఞాపకాలను మార్చగానే, మీరు మీ వ్యవస్థని కూడా మార్సేసారు. మీ వ్యవస్థ మీ జ్ఞాపకాలకి స్పందిసుంది.

ఈ విధంగా నిత్యయోగ ద్వారా మీ శరీర మానసికవ్యవస్థల్లో మార్పు వస్తుంది. మీ అంతరంగం శుభ్రపడుతుంది. అప్పుడు మీ మానసిక వ్యవస్థ దానికి అనుగుణంగా మారుతుంది. అప్పుడు ఏ ఉద్దేశ్యంతో అయితే శరీర కదలికల్ని సాధన చేస్తారో దాన్ని శరీరం అనుసరిస్తుంది. ఆ ఉద్దేశం ప్రతి కండరంలోనూ, ప్రతికణం మేధలోకి చొప్పించబడుతుంది.

శాస్త్రీయనిరూపణ

మనం ఏది అనుకుంటామో అదే మనం. మనం అనుకునే విధంగానే మన పనులు ఉంటాయి. మన పనులు మన లక్ష్యాల్ని నిర్దేశిస్తాయి. ఇది ఉపనిషత్తులోని వాక్యం కాదు. బయాలజీ ఆఫ్ బిలీఫ్ అనే పుస్తకం లోది. దీన్ని దా॥ బూస్‌లిఫ్లన్ అనే బయాలజీ సైంటిస్ట్ రాసారు. ఆయన శరీరంలోని కణాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి అనే విషయం మీద ఒక కొత్త సిద్ధాంతాన్ని రాసాడు. మనం మన ప్రవర్తన మనలోని జీన్స్ ఆధారంగా ఉంటుంది అని అనుకునేవాళ్ళం. దా॥ లిఫ్తన్ పరిశోధన తరువాత దానికి వ్యతిరేకంగా చెప్పాడు – మన ప్రవర్తనని అనుసరించి మన జీన్స్ తయారు అవుతాయి!

ఉద్దేశం, దృష్టి పెట్టటం అనే విషయాల మీద భౌతికంగా నిజమైన సంఘటనలు చాలా రికార్డు చేయబడి ఉన్నాయి. ఉదాహరణకి భయంకరమైన వ్యాధులు కాన్సర్ వంటి వాటిని శారీరకవైకల్యాల్ని అద్భుతంగా మించి వారు సాధించగలం అనుకున్నవి సాధించగలిగారు. అవన్నీ కూడా సాధించాలి అని అనుకున్న సంకల్పం బలంతో వారి కణాల్లో ఉండే జ్ఞాపకాల్ని మార్చటం ద్వారా వారు సాధించగలిగారు.

ప్రాచీనమైన ఈ సత్యాన్ని ఇప్పుడు ఆధునికశాస్త్ర పరిశోధనలతో నిరూపించారు. వారు ఏం కనుక్కున్నారంటే మనం లోతుగా, నిరంతరం దేన్ని గురించి ఆలోచిస్తామో దాని ప్రభావం మన మీద శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది.

జ్ఞానోదయ శక్తిని నిలిపి ఉంచటానికి శరీరాన్ని సిద్ధపరచటం

నాకు పదమూడు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు రఘుపతి యోగి నన్ను జ్ఞానోదయ స్థితిలోకి వెళ్ళి అక్కడ స్థిరపడగలిగే విధంగా తయారుచేసారు. ఆ జ్ఞానోదయానుభవంలోనికి వెళ్ళటం, దాని క్షణమాత్రపుదర్శనం, ఆలోచనలు లేని స్థితికి రావటం, సతోరి అనేది నిజానికి అంత కష్టం కాదు. కానీ ఆ స్థితిలో ఆ అనుభవంలో స్థిరపడి, మరీ ముఖ్యంగా ఆ శక్తిని శరీరం ద్వారా వెల్లడి చేయాలి అంటే మీ శరీరాన్ని, మనస్సున్ని దానికి సిద్దం చేయాలి.

జ్ఞానోదయ క్షణమాతానుభవం అంత గొప్ప విషయం కాదు. కానీ అత్యుత్తమశక్తి స్థితిలో, అత్యున్నతచేతనస్థితిలో ఆ విశ్వశక్తిని వెల్లడిచేస్తూ, ఆ శక్తిని, అద్భుతమైన జ్ఞానోదయశక్తిని వెల్లడి చేయాలంటే అందుకు అనుగుణంగా శరీరాన్ని, మానసిక వ్యవస్థని సిద్ధం చేయాలి.

రఘుపతి యోగి నాకు, నా శరీరానికి, నా వ్యవస్థకి, నా నాడీమండలానికి ఇచ్చిన శిక్షణ ఆ అద్భుతమైన జ్ఞానోదయశక్తిని పట్టి ఉంచగల విధంగా సహాయం చేసింది. జ్ఞానోదయం అయిన శరీరం అంతు లేని శక్తిని కలిగి ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే నాలుగు ఏనుగుల్ని ఒక చిన్న పాకలో ఉంచినట్లు. ఆ శరీరం ఒక న్యూక్రియర్ రియాక్టర్ లాంటిది. నా శరీరం మామూలు ఉష్ణోగ్రత అందరి కంటే ఒకటి – రెండు డిగ్రీలు ఎక్కువ ఉంటుంది.

యోగా నా శరీరాన్ని అంతిమశక్తిలో స్థిరపడే విధంగా సహాయం చేసింది.

నిత్యయోగ ఉద్దేశం

నిత్యయోగ నేను ఈ ప్రపంచానికి ఇచ్చిన ఒక బహుమతి. నాలో కలిగిన జ్ఞానోదయాను భవాన్ని ఎదుటివారికి ఇవ్వగల ఒక శాస్త్రం, ఒక సూత్రం.

ఇది పతంజలి యోగశాస్త్రాన్ని ఆయన శరీరభాషతో పాటు, ఆయన శరీరశక్రితో ఆయన అంతరంగం వెల్లడి చేసిన విధంగా ఇవ్వబడింది. పరమానందాన్ని అనుభవించటం, ఆ ఆనందాన్ని వెల్లడి చేయగలగటమే నిత్యయోగ ఉద్దేశం. నిత్యయోగాతో పరమానందం మీ అంతరంగంలోకి ఒక విస్ఫోటనంలా వస్తుంది. మీ శరీరానికి ఆ ఆనందాన్ని వెల్లడి చేయగల, శక్తిని వ్యాపింపచేయగల సామర్థ్యం వస్తుంది.

ఇప్పటి మీ శారీరకవ్యవస్థ అదే స్థితిలో ఉండలేదు. అదే అనుభవాన్ని నిరంతరం వెల్లడి చేయలేదు. నిత్యయోగ మీ శరీరాన్ని ఆ అనుభవం పొంది, అందులో స్థిరపడి, ఆ అంతరంగపరమానందాన్ని, ఆ నిత్యానందాన్ని వెల్లడి చేయగల సామర్థ్యాన్ని ఇస్తుంది.

మీ మానసికవ్యవస్థకి ఆ పరమానందంలో స్థిరపడగల సామర్థ్యం లేదు. అంత అధికమైన చెతన్యస్థితిలో, ఆనందంలో స్థిరపడగల సామర్థ్యం లేదు. అటువంటి శిక్షణ పొందలేదు. నిత్యయోగా ద్వారా ఆధ్యాత్మిక అన్వేషణకులకి నేను ఆ పరమానందాన్ని పొందగలిగి, అందులో ఆ అనుభవంలో స్థిరపడగలిగి, దాన్ని వెల్లడి చేయగల శిక్షణనిస్తున్నాను.

నిత్యయోగ ఉద్దేశం ఆలోచనల బంధాలు తెంచుకొని పరమానందానుభవాన్ని పొందటం. దీని పాటు శారీరకారోగ్యం కూడా ఉపఫలితంలా వారికి దొరుకుతుంది. అదే విధంగా ధ్యానం అంటే కేవలం మానసికారోగ్యం కోసం మాత్రమే కాదు. మంచి మానసికారోగ్యం ధ్యానం ఒక చిన్న ఉప ఫలితం మాత్రమే. ఒక విషయం అర్ధం చేసుకోండి. యోగా అంటే కేవలం ఆరోగ్యం కాదు. అంత కంటే చాలా గొప్ప విషయాన్ని సాధించటానికే యోగా. యోగా ధ్యానం అనే వాటిని ఏదో శారీరక మానసికస్వస్థతలకోసం అనే అల్పస్థాయికి వాటిని దింపను. వాటి ద్వారా చాలా లోతైన అనుభవాన్ని పొందాలి. అదే అత్యుత్తమనిత్యానందస్థితి.

నిత్యాయోగా అనే కొత్త పద్ధతి ద్వారా దీన్ని అతిప్రాచీనపద్ధతి అంటాను, జీవితాల్లోకి సత్యాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాం. ఇది కొత్తది కాదు ఒక ప్రాచీనపద్దతి. నిత్యయోగ ద్వారా పతంజలి ఏ విధంగా అయితే యోగశాస్త్రాన్ని చెప్పారో అదే విధంగా తీసుకువస్తున్నాం.

నిత్యయోగ ముఖ్యోద్దేశం మీ జీవితాన్ని, మీ ప్రతి పనిని, మీ ప్రతి క్షణాన్ని యోగాగా మార్చటమే. నిత్యయోగ జీవితానికి కదలికల్ని కలపటం కాదు. మీ కదలికలకి జీవితాన్ని ఇవ్వటం. మీరు వర్తమానంలో ఉండి, పూర్తి ఎరుకతో ఉండి, ఏది చేస్తున్నా కదలికతో ఉంటే అదే యోగా – నిత్యయోగా.

ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నిత్యయోగా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం. నిత్యయోగాలోని ప్రతి సెషన్ మీలోని శరీరం మనస్సు – ఆత్మలని సంయోగం పొందే ప్రక్రియని మరింత లోతుగా చేస్తూ, పతంజలి చెప్పిన అష్టాంగయోగాని తీసుకువస్తారు. ఇందులో ఆసనాలని, ప్రాణాయామం, ముద్దలు, మొదలైనవి ఉంటాయి.

నిత్యయోగ మీ జీవితానికి మరిన్ని కదలికల్ని కలపటానికి కాదు. మీ కదలికలకి జీవితాన్ని కలుపుతుంది. ఇది మీ కదలికలకి గొప్ప జీవచైతన్యాన్ని చేరుస్తుంది.

మీరు వర్తమానంలో ఉండి, తెలుసుకునే తత్వంలో ఉంటే, ఏ పని చేసే సమయంలో అయినా పూర్తిగా మీ శరీరపు కదలికల్లో నిమగ్నమై ఉంటే, అది యోగా-నిత్వయోగ.

అష్టాంగయోగా : పతంజలి చెప్పిన ఎనిమిది అంగాలు లేదా మార్గాలు అవి యమా (క్రమశిక్షణ), నియమా (నిబంధనలు), ఆసన (ఆసనాలు), ప్రాణాయామ (శ్వాస), ప్రత్యాహార (ఇంద్రియాల నుంచి వెనక్కి రావటం), ధారణ (ఏకాగ్రత), ధ్యానం (ధ్యానం), సమాధి (నిత్యానందస్తితి).

ముద్దలు అంటే యోగసాధనలో, చేతులతో పెట్టే పద్ధతి. అది శక్తిని మనలో ఉండేలా చేసుంది.

బుంగ్ బుంగ్ బుంగ్

  • యోగా అంటే మనస్సు (ఆలోచనల) లేని స్థితి' ★
  • ★ నిజానికి యోగా ఎప్పటికీ ముగియదు. అది పారంభమవుతుంది, నిరంతరం కొనసాగుతూ ఉంటుంది.
  • ★ చాలా మంది యోగా అనగానే భౌతికంగా వేసే ఆసనాలు అనుకుంటారు. శరీరాన్ని ఎలా వంచాలి, ఎలా కదిలించాలి అనేది నేర్చుకోవటం అనుకుంటారు.
  • ★ ఏ వ్యక్తి అయితే సూక్ష్మం లోతు తగ్గించి సత్యం వైపు దగ్గరగా వెళతాడో అతను తనలో అణచబడిన కోరికలు గల సన్యాసిలా సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు.

లోతైన నిత్యానందస్థితిలో ప్రతిక్షణం

ఆనందంలో జీవించటం

ఆనందజీవితానికి ఎనిమిది మార్గాల ఆనంద అష్టాంగం, అవి: ఆనందకరమైన నవ్వు ఆనందాన్ని ధ్రువీకరించటం ఆనందకరమైన శుభ్రత ఆనందయోగా ఆనందధ్యానం ఆనందకరపరికరాలు ఆనందశక్తి ఆనందజపం.

ఆనంద అష్టాంగం ఆనందకరజీవితం అనే జీవన్ముక్తికి ఎనిమిది అంశాల మార్గం. ఇవి చాలా సామాన్యమైన పద్ధతులు. అవి మీకు ఎటువంటి వివరణ అవసరం లేకుండా నేరుగా ఆ అనుభవాన్ని ఇవ్వగలవు.

అనందకరమైన నవ్వు

నవ్వు ధ్యానం లేదా హాసధ్యానం.

ధ్యానపద్ధతి

నిద్ర లేవగానే మంచం మీది నుంచి బయటికి రాకుండా ఐదు నిమిషాలు నవ్వండి. మిమ్మల్ని మీరు గుర్తు చేసుకుని నవ్వండి. కారణం లేకుండా నవ్వండి.

నవ్వు ఒక అద్భుతమైన ధ్యానం. ప్రాచీన జెన్ బౌద్ధమతంలో గురువులు, శిష్యులు నవ్వు ద్వారా ఆలోచనలు లేని స్థితిని పొందేవారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నవ్వు చక్కగా పనిచేస్తుంది. ఇతరపద్దతులతో మీరు సాధన చేసి ఫలితాల్ని గమనించాలి. నవ్వుని సాధన చేయనవసరం లేదు. అది మొదటిసారి జరుగుతుంది. ప్రతిసారి కూడా జరుగుతుంది. అది లోతుగా అంతరంగంలోకి వెళ్ళి, మనని ఉన్నతస్థితికి తీసుకువెళుతుంది.

నవ్వు ఆరోగ్యంలోంచి పుడుతుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అది పొంగి ప్రవహించే శక్తి. మీలో అణచివేయబడిన భావావేశాల్ని, బయటికి తెచ్చేస్తుంది. నవ్వటం అనేది గొప్ప నిత్యానందస్థితిలో ఉంచే ఎనిమిది మెట్లు.

ఆధ్యాత్మిక లక్షణం. నవ్వులో మనం బుద్ధుడు అవుతాం. అంటే అది జ్ఞానోదయస్థితి. బుద్ధ అంటే ఆలోచనలు లేని స్తితి. నవ్వు కాని ఆలోచనలు కాని ఏదో ఒకటే ఉంటాయి. రెండూ ఒకేసారి ఉండవు. మనం నవ్వినప్పుడు ఆలోచనలు మాయం అవుతాయి. మనం విశ్వశక్తితో ఒకటిగా అవుతాం. మనకి మన గుర్తింపు గుర్తుకి రాదు. నవ్వు శిఖరాగ్రాన ఉన్నప్పుడు మనం ఒక ప్రత్యేకం అని అనుకోగలమా? లేదు! ఆ విధంగా లేకుండా పోవటం అనేది క్షణకాలమే. ఆ క్షణకాలం ఆలోచనలు ఉండవు. మనం విశ్వశక్తితో ఉంటాం. అందుకే మనం ఎక్కువగా నవ్వాలి. మన వ్యక్తిత్వం అనే గుర్తింపు మాయం అవటం అనేది మనని మనం పోగొట్టుకునేంతగా ముందుకి వెళ్ళి శక్తితో జీవించే విధంగా ఉండాలి.

నవ్వు చాలా రకాల వ్యాధుల్ని, ముఖ్యంగా శ్వాసకి సంబంధించిన గొంతుకి సంబంధించిన వ్యాధుల్ని బాగు చేస్తుంది. మన కణాలలో ఉండే హానికరపదార్థాలని నవ్వు బయటికి తీసేస్తుంది.

ఆనందసంకల్పం

ఆనందప్రమాణం లేదా ఆనందసంకల్పం. ఆనందం అంటే పరమానందం, సంకల్పం అంటే ప్రమాణం, అనందసంకల్పం అనందప్రమాణం. మీరు అనందంగా ఉంటాను అని దృఢంగా నిర్ణయించుకోవచ్చు. ఇది మీరు చేసే ఎంపిక. నిజానికి ఇది ఎంపిక కూడా కాదు. మిమ్మల్ని మీరు ఎటువంటి ఎంపికలూ లేకుండా సర్వాంతర్యామి నిర్ణయంతో పాటు ముందుకి వెళుతూ శాశ్వతమైన నిత్యానందస్థితిలో ఉండగలగటం. ఎంపిక లేని దృఢత్వాన్ని అలవాటు చేసుకోవచ్చు.

ఈ ధ్యానంలో కొంత భాగం సూఫీ యోగి నుంచి తీసుకొనబడింది. ( అబ్దల్డా అన్నారీ హేరత్ అనే సూఫీ యోగి, గురువు). సూఫీలు ఎప్పుడూ పరమానందంలో ఉండే యోగులు. వారి ప్రార్ధన కేవలం కృతజ్ఞతని వెల్లడి చేయటమే. అబ్దల్లా ఎప్పుడు నవ్వు ముఖంతో ఉండే గురువుగా ప్రసిద్ధి పొందాడు. ఆయన తన మరణసమయంలో కూడా నవ్వుతూనే ఉన్నాడని చెబుతారు. అతని శిష్యులు కొందరు ఆయనని నిరంతరం అనందంగా ఉండటం ఎలా సాధ్యం అని అడిగి, మరణసమయంలో నవ్వటానికి ఏముంది అని అడుగుతారు. అప్పుడు అబ్దుల్లా తన గురువు తనకి చెప్పిన రహస్యాన్ని వారికి చెప్పారు. ఆయన ఈ విధంగా చెప్పారు, 'మీ సంతోషం ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. మీ సంతోషం 100 శాతం మీ ఎంపిక. ప్రతి రోజూ మీకు ఒక అవకాశం ఇస్తుంది. మీరు సంతోషంగా అయినా ఉండవచ్చు లేదా దుఃఖంతో అయినా ఉండవచ్చు. దేన్ని ఎంచుకుంటారో అది మీ ఇష్టం.

ధ్యానపద్ధతి

దీని కంటే సులభమైన ధ్యానం మరేదీ లేదు. ఇది చాలా ప్రభావం గల ధ్యానం ఇది. ప్రతి రోజూ నిద్రలేవగానే, కళ్ళు తెరవక ముందు, మంచం పైన కూర్చోండి. మీ పేరు గట్టిగా

పిలవండి. పక్కవారిని డిస్టర్స్ చేయటం ఇష్టం లేకపోతే మెల్లగా మాట్లాడండి. మీ పేరుని ఉపయోగించి ఇలా అడగండి, 'ఇవాళ ఏమనుభవించాలి అనుకుంటున్నావు. అనందాన్ని అనుభవిస్తావా లేక బాధనా? సహజంగా ఉదయాన్నే మీరు బాధని కోరుకోరు. కాబట్టి మీ మనస్సు ఆనందాన్ని ఎంచుకుంటుంది.

వెంటనే మీ పేరు ఉపయోగించి, సరే అలాగే సంతోషంగా ఉందు అనంది. అంతే ఆ తరువాత కళ్ళు మూసి ఉంచి దృఢంగా ఒక విషయం అర్థం చేసుకోండి, మీరు నిశ్శబ్దంగా అనుమతిని ఇవ్వకపోతే ఎవరూ, ఏ పరిస్థితీ మీకు బాధని ఇవ్వదు. మీరు ఎందుకు బాధ పడతారంటే బయట విషయాల వల్ల ప్రభావితం కావటానికి ఒప్పుకుంటారు కాబట్టి. నిరంతరం ఆనందంగా ఉండగల శక్తి మీ లోపల ఉన్నది. ఇప్పుడు కళ్ళు తెరచి మీ సంకల్పానికి అనుగుణంగా ఉండండి.

ఆ రోజులో మీ సంకల్పబలంతో మీ మానసికవ్యవస్థని మార్చగలగటం మీరు చూస్తారు. అప్పటి వరకూ మీ బాధలకి ఏ విధంగా అందరినీ బాధ్యుల్ని చేసారో తెలుసుకుంటారు. ప్రతి సంఘటనలో బాధపడాలి అని మీరు నిర్ణయించుకున్నట్లు మీకు అర్ధం అవుతుంది. మీరు ఆనందంగా ఉండాలి అని నిర్ణయించుకున్నది, బయటి పరిస్థితుల్ని బట్టి కాదు. అలాంటివి ఏమీ అవసరం లేకుండానే మీరు అనందంగా ఉంటారు. ఎందుకంటే మీరే ఆనందం కాబట్టి అంతే.

ఆనందకరమైన శుభ్రత – ఆయిల్ పుల్లింగ్

మీ శరీరంలో ఏం జరుగుతుందో అది నాలుక మీద కనిపిస్తుంది. నాలుకని పరీక్ష చేసి, దాని రంగుని బట్టి మనిషి అనారోగ్యం ఏమిటో చెప్పవచ్చు. ఆయుర్వేదం ప్రకారం నాలుక బట్టి శరీరంలో వివిధ భాగాల్ని తెలుసుకోవచ్చు. నాలుక మీది ఒకొక్క భాగం శరీరంలోని ఒక్కొక్క ప్రాంతంతో సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే నూనెని పుక్కిలిస్తామో అది మనలో ఉండే బాక్టీరియాని, కఫాన్ని, విషపదార్థాల్ని లాలాజలంతో కలిపి బయటికి తెస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కఫం విషపదార్థం. దాన్ని బయటికి తెచ్చేయాలి.

ధ్యానపద్ధతి

ప్రతీ రోజూ ఉదయం పళ్ళు తోముకోకుండా, ఏమీ తినకుండా తాగకుండా ఒక గరిటెడు నువ్వుల నూనె కాని, రిఫైండ్ సన్ ఫ్లవర్ నూనె కాని నోట్లో పోసుకొని ఒక చోట కూర్చోండి. నూనె వెనుక పళ్ళ చివరి వరకూ వెళ్ళేలా గడ్డం పైకి పెట్టండి. దాన్ని నెమ్మదిగా పదిహేను నిముషాల పాటు పుక్కిలించండి. ఆ సమయంలో వేరే పనులు చేయవద్దు, సమయం అయ్యాక ఆ నూనెని వాష్ బేసిన్‌లో ఊసి బ్రష్ చేసుకోండి. అది బాగా పుక్కిలిస్తే, నూనె పల్చగా, తెల్లగా ఉంటుంది. పళ్ళు శుభ్రం చేసుకున్నాక రెండు గ్లాసుల నీళ్ళు తాగండి.

సూచన : పుక్కిలించిన నూనెని మింగవద్దు. దానిలో బాక్టీరియా, మొదలైనవి ఉంటాయి. భోజనం తరువాత ఆయిల్ పుల్లింగ్ చేయాలి అనుకుంటే కనీసం నాలుగు గంటలు ఆగాలి. ఆయిల్ పుల్లింగ్ వల్ల మడమలు పగలటం నుంచి కాన్సర్ వరకూ అన్నీ

బాగు అవుతాయి. వెబ్ సైట్‌లో ఆయిల్ పుల్లింగ్ ఉపయోగాలు చాలా ఉంటాయి. మీరు చూడవచ్చు.

ఆనందయోగా సూర్యనమస్కారాలు

నిత్యయోగా ప్రత్యేకత ఏమిటంటే పతంజలి యోగశాస్త్రాన్ని ఆధునికులకి అదే విధంగా అందించటం.

సూర్యనమస్కారాలు అంటే ప్రతి రోజూ సూర్యునికి సమస్కరించటం. ఇది శరీరాన్ని అత్యుత్తమస్థితిలో ఉంచటమే కాదు, శరీరం – మనస్సుల మీద పూర్తి అవగాహనని ఇస్తుంది.

సూర్యనమస్కారం – ప్రయోజనాలు

సూర్యనమస్కారాలు శరీరమేధని మేల్కొలిపి, శరీరం సూర్యుని నుంచి నేరుగా శక్తిని గ్రహించే విధంగా చేస్తాయి. మన చుట్టూ ఉండే ఆకాశశక్తిని పొందేలా సూర్యసమస్కారాల్ని రూపొందించారు. అవి మనిషి శరీరం, మనస్సు ఆత్మల మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఉదయం సూర్యరశ్మిలో తూర్పు వైపు తిరిగి దీనికి సరైన శ్వాసతో, మంత్రంతో చేస్తే వీటి ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఇంకేమీ చేయనవసరం లేదు. సూర్యనమస్కారాలు శరీరంలోని ప్రతి భాగం మీద, ప్రతి వ్యవస్థ మీద, చక్రాల మీద పనిచేస్తాయి. ఇవి ఒక క్రమంలో శ్వాసతో చేసే ఆసనాలు.

ప్రతీ ఉదయం మీరు ఆరు నుంచి పన్నెండు సార్లు సూర్యనమస్కారాలు చేయవచ్చు యోగాసనాలన్నింటి కంటే మీ శరీరాన్ని దృఢంగా చేసి, ప్రతి భాగాన్ని చెతన్యవంతం చేసి, వెన్నెముక నిటారుగా ఉండేలా చేయగల ఆసనాలు సూర్యనమస్కారాలు. అన్ని యోగాసనాలలోనూ ఇది రాజాసనం లాంటిది.

సూర్యనమస్కారం మంత్రాల ప్రాముఖ్యం

మంత్రం అనేది కొన్ని అక్షరాలు, పదాలు, శబ్దాలు లేదా వ్యాఖ్యానాలతో చేయబడి దాన్ని చేతనస్తితిలో జపిస్తే, అది మన శరీర మానసికవ్యవస్థలలోకి చొచ్చుకుపోయి అక్కడ బలంగా పని చేసాయి. సూర్యనమస్కారం మంత్రాలు బీజమంత్రాలు. సూర్యదేవుని వైభావాన్ని చెబుతాయి.

బీజమంత్రాలకి అర్ధం ఉండదు. అయితే దాన్ని జపించేటప్పుడు కలిగే ప్రకంపనలు శరీరవ్యవస్థ మీద బలంగా పని చేస్తాయి. థియరీ ఆఫ్ వైబ్రెషన్స్ అని ఆధునికశాస్త్రవేత్తలు చెప్పిన విషయాన్ని కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే వేదకాలం నాటి ఋషులు ఉపయోగించారు.

డా॥ మసారం ఎమోటో చేసిన పరిశోధనలలో శబ్దతరంగాలు నీటి మీద ఎంత ప్రభావాన్ని చూపిసాయో నిరూపితమైంది. మనిషి శరీరంలో అరవై శాతం నీరు ఉంటుంది. అందుకే శబ్దతరంగాలు మనిషి శారీరక మానసికవ్యవస్థల మీద ప్రభావాన్ని చూపిస్తాయి.

అచేతనసితిలో మనలో ఉండే ఆలోచనలు, భావావేశాలు బలమైన తరంగాలని మనలో సృష్టిస్తాయి. అవి జ్ఞాపకాల రూపంలో, సంస్కారాల రూపంలో ఉంటాయి. వాటిని చేతనస్థితిలో కరిగించేయాలి. అప్పుడు మనలో నిక్షిప్తమై ఉన్న స్వచ్చమైన చేతనస్థితిని అనుభవించగలం.

మొత్తం ఆరు బీజ మంత్రాలున్నాయి.

ఓం హ్రాం

ఓం హ్రీం

ఓం హ్రూం

ఓం హ్రైం

ఓం హ్రౌం

ఓం హ్రహా

ఈ మంత్రాలు సూర్యదేవుని వైభావాన్ని వెల్లడి చేస్తాయి. ఒకసారి పూర్తి నమస్కారాల క్రమాన్ని చేయటానికి ముందు, పూర్తి తెలుసుకునే తత్వంతో మంత్రాన్ని జపించాలి. దీన్ని నిజాయితీగా సాధన చేసే సాధకుడు ఆ వైభవాన్ని తాను కూడా పొందుతాడు.

చాలా సులభంగా సాధారణంగా ఉండే సూర్యనమస్కారాల ద్వారా బయట కనిపించే సూర్యుడు, మనలో ప్రకాశించే అంతరాత్మ అనే మేధ అని తెలుసుకుంటాం. సర్వాంతర్యామి అయిన విశ్వశక్తితో మన బంధాన్ని తెలుసుకుంటాం.

సూర్యనమస్కార బీజాక్షరసహిత మంత్రాలు

    1. నిత్యస్నేహితుడైన సూర్యదేవునికి నమస్కారాలు
  • ఓం హీం రవయే నమః 2. నిత్య‌ప‌కాశ‌కునికి న‌మ‌స్కారాలు
  • ఓం హూమ్ సూర్యాయ నమః 3. నిత్యచెతన్య ప్రదాతకి నమస్కారాలు
  • ఓం హైమ్ భానవే నమః 4. నిత్య‌ప‌కాశ‌దీపికి న‌మ‌స్కారాలు
  • ఓం హోమ్ ఖగాయ నమః 5. నిత్యవేగవంతునికి నమస్కారాలు
  • ఓం హోహా పూష్ణే నమః 6. నిత్యశక్తి ప్రదాతకు నమస్కారాలు
  • ఓం హామ్ హిరణ్యగర్భాయ నమః 7. నిత్య విశ్వకాంచన గర్భునికి నమస్శారాలు
  • ఓం హీం మారీచాయే నమః 8. నిత్యసంధ్యాధిపతికి నమస్కారాలు
  • ఓం హూమ్ ఆదిత్యాయ నమః 9. నిత్యవిశ్వమాత అదితిపుత్రునికి నమస్కారాలు
    1. ఓం హైమ్ సావిత్రే నమః నిత్యమాత్పదేవికి నమస్కారాలు
    1. ఓం హ్రూమ్ అర్కాయ నమః నిత్యకీర్తిపకాశునికి, పొగడదగినవానికి నమస్కారాలు
    1. ఓం నిత్యజ్ఞానోదయప్రదాతకి నమస్కారాలు.

శాసనియం(తణ

సూర్యనమస్కారాల్లో ప్రతి శరీర, కదలికకీ శాసపద్ధతి ఉంటుంది. ప్రతిసారీ శాస తీసుకున్నప్పుడు, శ్వాస వదలినప్పుడు ఆనందశక్తిని తీసుకుంటున్న అనుభూతిని పొందండి. మీ శరీరంలోని ప్రతి కణంలో ఆనందశక్షిపవాహాన్ని అనుభవంతో తెలుసుకోండి. మీ శరీరం మనస్సు కొత్త శక్తిని పొందటం తెలుసుకోండి.

ధ్యానపద్ధతి

దీన్ని ఖాళీ కడుపుతో ఉదయం పూట చేయాలి.

సూర్యనమస్కారాల క్రమం.

    1. నిలబడి చేతులు నమస్కారం పెట్టాలి. సూర్యనమస్కారాలు మొత్తం కళ్ళు తెరచి చేయాలి. చెప్పవలసిన మండ్రతం చెప్పాలి.
    1. శ్వాస లోపలికి తీసుకుంటూ నెమ్మదిగా చక్కగా చేతులు పైకెత్తి వెనక్కి ఎంత వంగ గలిగితే అంత వంగాలి.
  • శాఁస వదులుతూ మందుకు వంగి చేతులు కాళ్ళకి రెండు పక్కలా పెట్టాలి. నుదురు మోకాళ్ళ దగ్గరకి రావాలి. సులభంగా చేయటానికి మోకాళ్ళని కొద్దిగా వంచవచ్చు.

  • శాస లోపలికి తీసుకుంటూ కుడి పాదాన్ని వెనుకకి ఎంత వరకూ పెట్టగలరో అంత 4. వరకు పెట్టాలి. పైకి చూడాలి.

    1. శ్వాసని పట్టి ఉంచి ఎడమ పాదాన్ని కూడా వెనక్కి పెట్టాలి. ఒక బల్లలా మెడ, తల, వెన్నెముక, ఒక గీతలా ఉండాలి. చేతులు భుజాలకి కింద ఉండాలి. కళ్ళు కిందకి నేల వైపు చూడాలి.
  • శ్వాస వదులుతూ, మోకాళ్ళు, ఛాతీ, గద్దం నేలని తాకుతూ ఉండేలా చేసి, 6. సాష్టాంగసమస్కారంలా, ఉండాలి. పొట్ట భాగం నేలకి తగలకూడదు.

    1. శ్వాస లోపలికి తీసుకుంటూ, కాలివేళ్ళని బయటకి పెట్టి, పొట్ట భాగం నేలకి ఆన్చి ఛాతీ తల పైకి పెట్టాలి. భుజంగాసనం.

నిత్యస్థితిలో ఉంచే ఎనిమిది మెట్టు

    1. శ్వాస వదులుతూ చేతులు, కాళ్ళు నేల పైకి పెట్టి నడుం భాగం పైకి లేపాలి. అధోముఖశ్వానాసనం, వేళ్ళు వెడల్పుగా పెట్టండి. కాలి మడమలు నేలను తగిలే విధంగా ప్రయత్నించండి.
    1. ముందుకి చూసూ కుడి కాలు ముందుకి ఎంత వరకూ పెట్టగలిగితే అంత వరకూ పెట్టండి. చేతుల మధ్యకి వచ్చే విధంగా చూడండి.
    1. ఎడమ పాదం ముందుకి కుడి పాదంతో సమానంగా పెట్టి. అవసరమైతే మోకాళ్ళు కొంచెం వంచండి. శ్వాస వదులుతూ తలని కాళ్ళ దగ్గరకి తీసుకురండి.
    1. శ్వాస తీసుకుంటూ చేతులు వెనక్కి పెట్టి వెన్నెముకని వెనక్కి విల్లులా వంచండి.
    1. శ్వాస వదులుతూ చేతులు కిందికి తెచ్చి, మీ హృదయం దగ్గర కలిపి ఉంచి, నమస్కరిస్తున్నట్టుగా నిలబడండి.

ఒక్కొక్క పర్యాయం చేసినప్పుడు దానిలో మొత్తం ఈ 12 ఆసనాలూ రెండుసార్లు చేస్తే అది ఒక ఆవ్సతమవుతుంది. మొదటి అర్ధభాగంలో నాలుగు, తొమ్మిది దశలు చేసేటప్పుడు కుడికాలు ముందుకి పెట్టండి. తరువాత సగ భాగంలో ఎడమకాలు ముందుకి పెట్టండి.

ఆనందధ్యానం

నిత్యధ్యానం అనేది సాంకేతికసూత్రం లాంటిది. ఇది ఒక వ్యక్తిలో సంపూర్ణమైన మార్పుని తెచ్చి వారిని జ్ఞానోదయానికి సిద్ధం చేస్తుంది. ఈ ధ్యానంలోని ప్రతి దశాచేతనస్థితిని ఉన్నతస్థితికి తీసుకువెళ్ళేలా చేస్తుంది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కి ఇది ప్రతి రోజూ చేయదగిన ధ్యానపద్ధతి.

నిత్యధ్యానం – వివరణ

నిత్యధ్యానంలో మొత్తం ఐదు దశలు ఉంటాయి. ఒక్కొక్కటి ఏడు నిమిషాల వ్యవధిలో ఉంటాయి. మిగిలిన వివరాలకి నిత్యధ్యానం అనే అధ్యాయాన్ని చూడండి.

అనంద ఉపకరణాలు

శాస్త్రశస్త్రాలు లేదా జ్ఞానాయుధాలు.

ధ్యానం

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా వారి ప్రవచనాలు వినండి. గురుదేవుల మాటలు శాస్త్రాలు – అవి అంతిమజ్ఞానం, అంతిమసత్యాలు. అజ్ఞానాన్ని నరకగల ఆయుధాలే శాస్త్రాలు. ఎప్పుడైతే పదాలు ఆయుధాలుగా మారి అజ్జానాన్ని నాశనం చేస్తాయో వాటిని శాస్త్ర – శుస్తాలు అంటారు. అవే జ్ఞానాయుధాలు.

గురుదేవుల మాటలు శాస్త్ర – శుస్తాలు. అవి సూటిగా అజ్ఞానాన్ని నాశనం చేస్తాయి. గురువులు నిరంతరం సత్యాలు చెబుతూ ఉంటారు. అకస్మాత్తుగా ఒక భావం, ఒక సత్యం మిమ్మల్ని స్పుశిసుంది. మీకు క్లిక్ అవుతుంది. అది మిమ్మల్ని నిరాశ నుంచి బయటకి తీసుకు వస్తుంది. ఏదో ఒక సమస్యకి పరిష్కారాన్ని ఇస్తుంది. అదే క్లిక్, దాన్నే దీక్ష అంటాను. ఏ వ్యక్తి అయితే తన మాటల ద్వారా, పద్ధతుల ద్వారా, శరీరం కదలికల ద్వారా ఆ జ్ఞానాయుధాల్ని ఇవ్వగలరో ఆయనే గురువు. ఎవరైతే ఆ జ్ఞానాయుధాల్ని గురుదేవుల ద్వారా తీసుకుంటారో వారే దీక్ష పొందిన వారు.

గురువులు అంటే తమలో పొందిన అంతిమానుభవాన్ని ఇతరుల్లో కలిగించగల సాంకేతికసూతాల్ని సృష్టించగల వ్యక్తి. దీక్ష ఒక పద్ధతి. జ్ఞానాయుధాలు మన చేతనస్థితిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళ గల పద్ధతులు. జ్ఞానాయుధాలు మన లోపల స్థిరపడితే అవే మన అంతరంగగురువు. మన అంతరంగంలోని గురువు మేల్కొనే వరకూ బయటి ప్రపంచ గురువు మన మీద పని చేస్తుంటాడు. ఆయన తన మాటలు, పద్ధతులు, శరీరభాష – వీటి ద్వారా ఆ జ్ఞానాన్ని ఉపయోగించగలం అనే నమ్మకాన్ని మనలో కలిగిస్తారు. వీటన్నింటి కంటే కూడా జ్షానోదయజీవితాన్ని అందిస్తారు.

జ్షానోదయమైన గురువుల నుంచి అటువంటి క్లిక్స్, అటువంటి దీక్షలు పొందిన వారు అద్దుష్టవంతులు. ఆ క్లిక్ తార్కికమైంది కాదు. అకస్మాత్తుగా గురువులు చెప్పిన కొన్ని మాటలు హ్సదయాన్ని స్పృశిస్తాయి. ఎప్పుడైతే మొదటిసారి అటువంటి అనుభవం కలుగుతుందో అప్పుడు, అవును, ఈయన నా గురువు ఇదే నా మార్గం, అని అనిపిస్తుంది. అందుకే క్లిక్ అనేది మొదటి దీక్ట. ఎవరైతే గురుదేవుల మాటలు, పుస్తకాలు, బోధనలు, పద్దతులు, శక్తి లేదా శరీర భాష ద్వారా ఆ క్లిక్‌ని పొందుతారో వారు అదృష్టవంతులు.

ఒక విషయం అర్థం చేసుకోండి. విత్తనం పగలటానికి ఎప్పుడూ భయపడుతుంది. కాని ఏ విత్తనం అయితే పగిలి మొలకెత్తుతుందో అది మాత్రమే వృక్షంగా మారగలుగుతుంది. అప్పుడు ఆ వృక్షం మిగిలిన విత్తనాలకి ధైర్యాన్ని ఇవ్వగలగాలి. భయపడవద్స, పగలటం వల్ల మీరు చనిపోరు మీరు జీవిస్తారు, నా లాగా మరింత విస్తృతం అవుతారు అని. అయితే విత్తనం మొలకెత్తే వరకూ వృక్షం అలా ఎదురు చూస్తుంది. అందులోని విత్తనం పగిలి మొలకెత్తే వరకూ చూస్తుంది. అదే సమస్య. నేను చెపుతున్న సత్యం నాకు తెలుసు. ఓ! అమృతస్య పుత్రులారా! విత్తనాన్ని పగలకొట్టి మొలకెత్తి వృక్షంలా మారగల ధైర్యాన్ని పొందండి. ఆ ధైర్యంతో మరింత విస్పతమవండి.

ఈ శక్తి ఈ ప్రేరణనే గురుదేవులు. మీ జీవితంలోనికి గురుదేవుల ఆగమనమే గొప్ప సాహసం. ఒకసారి గురువు మీ అంతరంగంలోకి ప్రవేశిస్తే, మీరు చేయవలసింది కేవలం నమ్మకంతో ధైర్యంతో, విశ్వాసంతో లేచి నిలబడగలగటమే.

మీ జీవితంలో ఏర్పడిన క్రిక్‌ని పదే పదే ఉపయోగించండి. ఏ ఆయుధాన్ని అయినా చాలా కాలం ఉపయోగించకుండా ఉంచితే అది తన శక్తిని పోగొట్టుకుంటుంది. మనం దాన్ని ఎలా ఉపయోగించాలో మరచిపోతాం. ఆ ఆయుధాల్ని ఉపయోగించే కొద్దీ అది మీలోకి సృష్టతని, ధైర్యాన్ని తీసుకువస్తాయి. అప్పుడు వాటిని చక్కగా ఉపయోగించగలిగే వివేకం మీలో కలుగుతుంది.

గురుదేవుల మాటలని పదే పదే వింటూ మీ జీవితంలోనికి మరిన్ని క్లిక్స్‌ని తెచ్చుకోండి. వాటిని మీ అంతరంగంలో నింపుకోండి. మీకు నిరంతరం ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చే ఆధ్యాత్మికకుటుంబాన్ని, స్నేహితుల్ని, సన్నిహితుల్ని ఏర్పరచుకోండి. ఆ ధైర్యంతో జ్ఞానాయుధాల్ని చక్కగా ఉపయోగించండి.

మరొక విషయం, గురుదేవుల మాటల్ని వినేటప్పుడు జ్ఞానోదయమైన యోగీశ్వరుని శరీరభాషని గమనించాం. ఒక వ్యక్తి శరీర భాష అతనిలోని సత్యాన్ని, సంపూర్ణత్వాన్ని వెల్లడి చేస్తుంది. గురుదేవులు అంటేనే అంతిమవిశ్వసత్యం, సర్వాంతర్యామి రూపం. అందుకే అతని శరీరభాష సర్వాంతర్యామి భాష. ఆయనని గమనించటం ద్వారా మన తర్కానికి అందని అంతిమసత్యం మన మీద పనిచేస్తుంది.

ఆనందశక్తి విశ్వశక్తిని పొందటం – శకిధారణ

ఈ ధ్యానపద్ధతిని తంత్శాస్త్రం నుంచి, కులార్ణవతం(తం (శివుడు ప్రవచించిన అతిప్రాచీనసాహిత్యం) నుంచి తీసుకొన్నారు. విశ్వశక్తికి సంబంధించి ఇది చాలా చక్కని ధ్యానపద్దతి. దీన్ని రాత్రి పూట నిద్ద పోయే ముందు చేయాలి. దీన్ని ఉదయం కూడా చేయవచ్చు కాని ఈ ధ్యానం చేసాక కనీసం పదిహేను నిమిషాలు విశాంతి కావాలి. లేకపోతే మత్తుగా ఉంటుంది. ఈ ధ్యానం మీరు విశ్వశక్తిలో ఐక్యమయ్యేగల స్థితికి తీసుకువెళుతుంది. ఇది మిమ్మల్ని తురీయ దశకి తీసుకువెళుతుంది. అక్కడ మీరు పూర్తి తెలుసుకునే తత్త్వంతో ఆలోచనలు లేని స్తితిలో ఉండగలుగుతారు.

ధ్యానపద్ధతి

మోకాళ్ళ మీద నిలబడి కళ్ళు మూసుకొని చేతులు పైకి పెట్టాలి. అరచేతులు ఆకాశం వైపు ఉండాలి. తలని కొంచెం పైకి పెట్టాలి. ఈ స్థితిలో ఉండి విశ్వశక్తి మీ నుండి ప్రవహించటాన్ని అనుభూతి పొందండి. కాంతిరేఖ మీ నుండి వెళ్ళే దృశ్యాన్ని చూడండి. ప్రారంభంలో నవ్వు ముఖంతో ఉన్న గురుదేవుల రూపాన్ని చూడవచ్చు. పిసినారి

డబ్బు లెక్కపెట్టుకున్నపుడు ఆ స్థితిలో ఎంత శిఖరాగాన ఉంటాడో, ప్రేమికుడు ప్రియురాలితో ఉన్నప్పుడు ఆ స్థితిలో ఎంత శిఖరాఁగాన ఉంటాడో, గురుదేవులు నవ్వేటప్పుడు ఆయన శక్తి అంత శిఖరాగాన ఉంటుంది. అందుకే ఆయన నవ్వు ముఖాన్ని మీ అంతరంగంలో నింపుకొని శక్తి మీలో ప్రవహించే విధంగా చేయండి. అంతే కాకుండా ఆ సమయంలో గురుదేవుల గురించి మాత్రమే ఆలోచించగలిగితే మరే ఆలోచనలూ రావు.

విశ్వశక్తి మీ చేతుల గుండా ప్రవహించినప్పుడు, మీకు సూక్ష్మస్తాయిలో ప్రకంపనల రూపంలో తెలుస్తుంది. అది చిరుగాలికి ఆకు నాట్యం చేసినంత సున్నితంగా ఉంటుంది. ఆ ప్రకంపనని ఆ విధంగా జరగనీయండి. ఆ ప్రకంపనకి సహాయం చేయండి. మీ శరీరంలో మొత్తం శక్తి ప్రకంపనలతో నిండనీయండి. ఏది జరిగితే దాన్ని జరగనీయండి. మీ కింది భూమి, పైన ఆకాశం కలిసిపోయినట్లుగా అనిపించవచ్చు. అది స్త్రీపురుషశక్తులు కలసిపోయినట్టుగా ఉంటుంది. మీరు తేలిపోతున్నట్టు కరిగిపోతున్నట్టు మీకు అనిపించవచ్చు. ఆ భావాన్ని అదే విధంగా జరగనీయండి. మీరు అనే భావాన్ని పూర్తిగా వదిలేయండి. మీరు అనేది ఉండదు. మీరు సర్వాంతర్యామిలో ఒకటిగా ఐక్యమైపోతారు.

రెండు – మూడు నిమిషాల తరువాత, మీ అంతరంగం విశ్వశక్తితో నింపబడినట్లు అనిపించగానే ముందుకి వంగి చేతులు నేలమీద ఆనించండి. మోచేతుల నుంచి భూమిని ఆనాలి. భూమిని ముద్దాదండి. లేదా మీ నుదురు భూమికి తగిలేలా చేయండి. మీ నుంచి విశ్వశక్తి భూశక్తితో కలిసే విధంగా మీరు ఒక మధ్యవర్తిగా, ఒక ఉపకరణంలా ఉండండి. మీలోపలి శక్తినంతా భూమాతలో కలిసే విధంగా ఉండండి. ఇప్పుడు మీరు గురుదేవుల పాదాలని ఊహించవచ్చు. అప్పుడు మీరు భూమాతకి అధీనమై శక్తిని ఇస్తున్నట్టుగా ఉంటుంది.

మళ్ళా తిరిగి మామూలు స్థితికి రండి. ఈ క్రమాన్ని మరో ఆరుసార్లు చేయండి. అంటే మొత్తం ఏడుసార్లు ఆ విధంగా చేస్తారు.

ఈ ధ్యానం మీ శరీరంలో శక్తి బాగా ప్రవహించేలా చేస్తుంది. ఈ ధ్యానంతో వెన్నెముక సంబంధమైన సమస్యలన్నీ పోతాయి. ఎందుకంటే శక్తి మూలాధారం వరకూ వెళుతుంది కాబట్టి. ధ్యానం చేయటం పూర్తి అయ్యాక అదే ధ్యానస్థితిలో నిద్దలోనికి వెళ్ళండి. అప్పుడు మీకు కలలు లేని గాఢ నిద్ర కలుగుతుంది. మర్నాడు ఉదయం నిద్ర లేవగానే చాలా తాజాగా, చెతన్యంతో ఉంటారు.

ఇది చాలా శక్రిమంతమైన ధ్యానపద్ధతి. దీన్ని ప్రతి రోజూ చేసే కొత్త జీవితం, కొత్త అర్థం, కొత్త సత్యం మీలో ప్రవహిస్తాయి. మీరు ఆనందంగా ఉంటారు. ప్రతి రోజూ ఒక ఉత్సవంలా ఉంటుంది.

ఆనందజపం

– ఆనందజపం లేదా పురశ్చరణం

మంత్రాలని వేదభాష అయిన సంస్కృతంలో జపిస్తాం. సంస్కృతభాషలోని అందం ఏమిటంటే అన్ని రకాల శబ్దాలూ దానిలోని ఏభై ఒక్క అక్షరాలలో వివరించబడ్డాయి. సంస్కృతభాష అర్థాన్ని చెప్పటమే కాదు, అది ఒక ప్రత్యేకమైన శబ్దతరంగాల్ని పంపిస్తుంది. మీరు మంత్రాల్ని అర్థం చేసుకోలేకపోయినా వాటి తరంగాలు మీ మీద పని చేస్తాయి. తూర్పుదేశాల్లో దీక్షని ఇవ్వటానికి సంస్కృత మంత్రాలనే ఉపయోగిస్తారు. గురువుగారు శిష్యునికి మంత్రం చెప్పగానే ఆ మంత్రమే శిష్యునిలో దీక్షని మేల్కొలుపుతుంది. ఆ తరంగాలు సూటిగా వెళ్ళి అతని అంతరంగాన్ని స్పుశించి అక్కడ పని చేయటం ప్రారంభిస్తాయి.

గురుమంత్రం: ఓం హీం The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam య నమః

హిందూతత్త్వంలో ప్రతి పనికీ చాలా స్థితుల్లో అర్థంచేసుకోవటం అనేది ఉంటుంది. వారి వారి చేతనస్థితి ఆధారంగా ఆయా స్థితుల్లో అర్థం చేసుకుంటారు. 'ఓం' అంటే చాలా అర్థాలు ఉన్నాయి.

'ఓం' ప్రాథమిక శబ్దం, సమస్తసృష్టి దీని నుంచి ఉద్భవించింది అంటారు. అ, ఉ, మ్, అనే శబ్దాల కలయిక ఓం. అ అంటే బ్రహ్మ, సృష్టికర్త. ఉ అంటే విష్ణుమూర్తి స్థితికారుడు (పాలకుడు), మ్ అంటే శివుడు కొత్త సృష్టికి అవకాశం ఇచ్చేలా నాశనం చేసే లయకారుడు. అందుకే ఇవన్నీ కలసిన ఓం అంటే విశ్వం అని అర్థం.

లోతుగా విశ్లేషిస్తే దేవుని రూపాలన్నీ, సృష్టి, లయకారాలకి ప్రతినిధులు. ఈ మూడు మన శరీరం అంతరంగం అనే సూక్ష్మ విశ్వంలో ప్రతి కణంలోనూ జరుగుతుంటాయి.

ఓం అని జపించినప్పుడు భూప్రదక్రిణలా ఉంటుంది. అది మనలోని కోపం, కోరిక ఇటువంటి వాటికి కొన్ని మానసికసమస్యల్ని పరిష్మరిస్తుంది. అనంతమైన భూమాత మనలో నిండిన అనుభూతినిస్తుంది. వ్యతిరేకాలోచనల నుంచి మనస్సుని బయటికి తెస్తుంది. ఇది అంతు లేని శక్తిని ఇచ్చి, మెదడుని తాజాగా స్వచ్ఛంగా ఉంచుతుంది. ఇది మానసికప్రశాంతతని ఇస్తుంది. ఏకాగ్ర‌త‌ని పెంచుతుంది. మ‌న‌స్సుని వ‌ద‌లి ఆత్మ‌లోకి వెళ్ళ‌టానికి ఇది జంపింగ్ బోర్డు.

హీం అంటే దేవి బీజ మం(తం.

ప్రాచీనఋషులు ఈ శబ్దాలని సాధన చేసూ మానసిక, శారీరక, అంతరంగస్తాయిల్లో లోతైన అనుభవాల్ని పొందారు. అందరూ తాము పొందిన అనుభవాన్ని పొందాలి అనే ఉద్దేశంతో వీటిని శాస్త్రీయంగా వివరిస్తూ మనకి అందించారు. వేదకాలం నుంచి మంత్రోచ్సరణ అనేది ఋషుల పరిశోధనసిద్ధాంతాల వంటివి. మనుషుల మీద ఉన్న అపారమైన ప్రేమతో వారిలో కలిగిన అనుభవాన్ని అందరిలో కలిగించాలని వారు మనకి ఈ శాస్తాల్ని అందించారు.

ఓం హీం కలిపి ఉచ్ఛరిస్తే, మనలోని స్త్రీపురుషశకులు రెండూ చెతన్యమవుతాయి.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM అంటే అంతిమసత్యం తాలూకు రూపమైన గురుదేవులని మనలోకి ఆవాహన చేయటం, ఇది పూర్ణమూలమం(తం. ఇది శక్తి అంటే బయటి ప్రపంచంలో విజయానికి, శివ అంటే అంతరంగప్రపంచంలో విజయమైన జ్ఞానోదయానికి సూటిగా తీసుకువెళుతుంది.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM అంటే శాశ్వత ఆనందస్థితి. దీన్ని జపించటం ద్వారా మన ఆత్మకి మన చివరి కోరిక అయిన జ్ఞానోదయం గురించి చెప్పటమే.

నమః : అంటే నేను లేను అని అర్ధం. నమః, నేను లేను అని చెప్పటం ద్వారా సర్వాంతర్యామికి, సర్వాంతర్యామి రూపమైన గురుదేవులకి సంపూర్ణంగా అధీనమవుతున్నాను అని చెప్పటమే. నమః అని పదే పదే జపిస్తే అధీనమయ్యే అనుభవాన్ని బలంగా చేస్తుంది. నమ్రతని, విధేయతని మనలోకి తీసుకువస్తుంది.

ధ్యానపద్ధతి

గురుమంత్రాన్ని ఏభైనాలుగుసార్లు పదకొందు రోజులపాటు జపించండి. లేదా మీకు గుర్తు వచ్చినప్పుడు జపించండి. గురుమంత్రాన్ని గట్టిగా బయటికి జపించండి లేదా నిశ్శబ్దంగా మనస్సులో జపించండి. జపవేగం మనిషి మనిషికీ మారుతుంది.

ఈ మంత్రం మీ అంతరంగాన్ని శక్తితో నింపి, మీకు అనవసరమైన ఆలోచనలు రాకుండా చేస్తుంది. ఆలోచనలు నాభిప్రాంతంలోని మణిపూరకచక్రం నుంచి వస్తాయి. మీరు గురుమంత్రాన్ని జపిస్తే మణిపూరకం శుభ్రపడుతుంది. అది ఆటోమాటిక్‌గా మీ బాధల్ని తొలగిస్తుంది. మీలోని వ్యతిరేకభావాల్ని, ఆలోచల్ని తొలగిస్తుంది.

గురుమంత్రం మీ వాక్నకిని శుభ్రపరచి స్వచ్ఛంగా చేస్తుంది. అది మీలో అంతు లేని శక్తి పొంగి పొర్లేలా చేసి, జీవితాన్ని ఉత్సాహంగా ఆహాదంగా చేస్తుంది. ఈ మంత్రంలోని ప్రకంపనలు మీ అంతరంగం వేగాన్ని మారుస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం మీ ఎరుకని మండ్రం పైన ఉంచాలి. అలా మీ చేతనస్గితిలో ఉంచితే మీ ఆలోచనల వ్యవస్థ మొత్తం స్వచ్చంగా అవుతుంది. క్రమంగా మీ ప్రయత్నం లేకుండా మంతోచ్చరణ మీలో జరుగుతూ ఉంటుంది. మీరు చాలా సహజంగా ధ్యానస్థితిలోకి వెళ్ళగలుగుతారు.

ఒక పద్ధతిలో ఈ మంత్రాన్ని జపిస్తే అది ప్రార్థన అవుతుంది. ప్రార్థన మన శరీర, మానసికవ్యవస్థల మీద లోతైన ప్రభావాన్ని చూపిస్తుంది అని వైద్యపరిశోధనలు నిరూపించాయి. అమెరికాలోని పరిశోధనలు, ప్రార్థన, గుండెపోటు, కాన్సర్ మొదలైన వ్యాధుల ద్వారా సంభవించే మరణాల్ని నలభై శాతం తగ్గించిందని నిరూపించాయి. అదే విధంగా గుండె ఆపరేషన్స్ జరిగాక 14 రెట్లు జీవించే అవకాశాన్ని పెంచింది ప్రార్థన. అలాగే హాస్పిటల్‌లో చేరే పెద్దవారి సంఖ్య తగ్గింది. వెబ్‌సెట్‌లో ప్రార్థన వలన కలిగిన మంచి ఫలితాల్ని చాలా వివరంగా చూపించారు.

  • నవ్వు ఆరోగ్యంలోంచి పుడుతుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అది పొంగి ప్రవహించే శక్తి.
  • సూర్యనమస్కారాలు శరీరం మెదడుని మేల్కొలిపి, శరీరం సూర్యుని నుంచి నేరుగా శక్తిని గ్రహించే విధంగా చేస్తాయి.
  • గురువులు అంటే తమలో పొందిన అంతిమానుభవాన్ని ఇతరుల్తో కలిగించగల సాంకేతికసుంత్రాల్ని సృష్టించగల వ్యక్తి.
  • విత్తనం పగలటానికి ఎప్పుడూ భయపడుతుంది. కాని ఏ విత్తనం అయితే పగిలి మొలకెత్తుతుందో అది మాత్రమే వృక్షంగా మారగలుగుతుంది

గురుదేవులు - జీవన్నుక్తులు

గురుదేవులు అంటే రూపంలేని జ్ఞానోదయశక్తి మానవరూపంలో ఉండటమే

చిత్రం వటతరోర్మూలే వృద్ధ శిష్యా, గురూర్యువః గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నాః సంశయాత్

ఎంత విచిత్రం! మర్రి చెట్టు కింద కనిపించే ఈ దృశ్యం ఎంత అద్భుతం! గురుదేవులు చిన్న యువకుడు. ఆయన చుట్టా ఉన్న శిష్యులు వృద్దులు. గురువు మౌనంగా ఉన్నారు. శిష్యుల అనుమానాలన్నీ కరిగిపోతున్నాయి.

గురుదేవుల సమక్షంలో జరగవలసిన చర్య జరగనప్పుడు విషయాలని అర్థం చేసుకున్నా అవి విద్యలా ఉండిపోతాయి. నేర్సుకున్న సాధనపద్ధతులు ఉపకరణాలుగా మిగిలిపోతాయి. భగవంతుని తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికీ గురువు అవసరం ఉంది.

వేదసంస్కృతిలో ఆధ్యాత్మిక గురుదేవుల్ని భగవంతుని కంటే ఎక్కువ గౌరవంతో చూసేవారు. ఆయన అంత కంటే కూడా అతీతుడు.

మనలో చాలా మందికి భగవంతుడు అంటే ఒక విషయం. చాలా కొద్ది మంది మాత్రమే భగవంతుడిని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆయన గురించి మాట్లాడగలరు. ఒక చక్కని మాట ఉన్నది, 'అనుభవమెనవారు మాట్హాడరు, మాట్హాడేవారికి ఆ అనుభవం ఉండదు.' కేవలం గురుదేవులు మాత్రమే ఆ అనుభవాన్ని పొంది, ఆ దివ్యానుభవాన్ని మాటల రూపంలోనే కాదు, తన శరీరభాష ద్వారా, జీవనసరళి ద్వారా, స్పష్టంగా ఇతరులకి వెల్లడి చేయగలరు. వారివారి దివ్యానుభవానికి గురుదేవులు ఒక మహాద్వారం వంటివారు. ఆయన తన శిష్యుల చేతిని పట్టుకొని ఆ అనుభవం గుండా, తన అంతరంగంలోని దివ్యత్వం అనే సత్యం గుండా తీసుకువెళ్ళగలరు. ఈ క్రమంలో శిష్యుడు గురువుగా మారతాడు, తన శిష్యులకి మార్గదర్శి అవుతాడు. ఈ విధంగా ఇది ఒక వృత్తంలా ఉంటుంది.

జ్ఞానోదయం అనే ఈ ధర్మచక్రం వారి సహజస్థితి అనుభవంలోకి తీసుకువెళుతుంది. అది ఛేదించలేని విషవలయమైన కోరికలు, బాధలని తెంచగలుగుతుంది. మనమందరం ఆ వలయంలోనే చిక్కుకొని ఉంటాం. లోతైన అనుభవంతోనే గౌతమబుద్ధుడు కోరికలు అంటే వ్యథలు అని చెప్పాడు. ఇక్కడ ఆయన చెప్పే విషయం ఏమిటంటే, జ్ఞానేంద్రియాల ద్వారా ఈ కోర్కెలని తీర్చుకోవాలనేది మానవనైజం అని. అవి అలా పెరుగుతూనే ఉంటాయి. కేవలం తనలోని అద్భుతశక్తిని అర్థంచేసుకోవటం ద్వారా, అంతరంగానందాన్ని పొందినప్పుడు మాత్రమే బాధలు పూర్తిగా తొలగిపోతాయి. అదే మనిషి సహజలక్షణం అవుతుంది.

గురుదేవులు – జీవన్ముక్తులు

గురుదేవులు అంటే అద్దం వంటివారు. ఆయన మేధతో కూడిన అద్దం అనే శక్తి. ఆ శక్తి మనం అంటే ఏమిటో చూసుకునేలా చేస్తుంది. మనం ఇప్పుడు ఆ ప్ర‌యాణాన్ని ప్రారంభిద్దాం.

సింహం, సింహం కూన కథ

ఒకసారి నిండు గర్సంతో ఉన్న సింహం ఒక గొర్రెల గుంపు మీదకి దూకి, ఒక సింహం కూనకి జన్మనిచ్చి చనిపోతుంది. అప్పుడే పుట్టిన సింహం కూన కళ్ళుకూడా పూర్తిగా తెరవదు. సహాయం కోసం కొన్ని శబ్దాలు చేస్తుంది. ఆ కూనని చూసి గొర్రెలు జాలిపడతాయి. అవి సింహం పిల్ల ఎలా జాలి, కరుణ, చూపిస్తాయి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. శత్రువు నుంచి ప్రమాదం లేదు, శత్రువు మనకి హాని చేయదు అని తెలిసినప్పుడు ఎదుట ఉన్నది శత్రువైనా మనకి జాలి, కరుణ కలుగుతాయి. అదే విధంగా సింహపు కూన నుంచి వాటికి ఎటువంటి హాని లేదు కాబట్టి అవి జాలిపడతాయి. గొర్రెలు ఆ కూనపట్ల జాలిపడి వాటితో తీసుకువెళ్ళి దాన్ని పెంచాయి. గడ్డి ఎలా తినాలి, పాలు ఎలా తాగాలి, ఎలా 'బే ' అని అరవాలో దానికి నేర్పించాయి.

అది పుట్టినప్పటి నుంచీ ఎవరూ దానితో నీవు సింహానివి అని చెప్పలేదు. కాబట్టి అది గొర్రెగానే పెరిగింది. వాటితో ఒక గొర్రెపిల్లలా కలిసిపోయింది. సింహం కూన పెరిగేకొద్దీ దాని సహజశక్తిని చూపించేది.

ఒక రోజు ఒక సింహం ఈ గొర్రెల మంద మీదకి దూకింది. అన్నీ భయపడి తలా ఒక దిక్కుకి పరిగెత్తాయి. ఆ సింహానికి, గొర్రెలతో పాటు పారిపోతూ గొర్రెలా 'బే' అని అరుస్తూ వెళుతున్న సింహం కూన కనపడింది. సింహం తన కళ్ళని తాను నమ్మలేక పోయింది. తనని చూసి సింహం కూన ఎందుకు భయపడి పారిపోయిందో, అది ఎందుకు గొర్రెలా అరుస్తుందో సింహానికి అర్ధం కాలేదు.

మర్నాడు ఆ సింహం కూనని చూడటానికి సింహం మళ్ళా ఆ గొర్రెల గుంపు దగ్గరకి వస్తుంది. అది గొర్రెలతో ఉన్న సింహం కూనని చూసి నెమ్మదిగా వెనక నుంచి వెళ్ళి దాన్ని పట్టుకుంటుంది. సింహం కూన భయంతో, 'నన్ను వదులు బే... బే... నన్ను వదులు' అంటూ గొర్రిలా అరుస్తుంది.

సింహం దానితో, 'ఏయ్! మూర్ఖంగా మాట్లాడకు. భయపడకు, నేను నిన్ను చంపను. నీవు ఎవరివో నీకు తెలియదా?' అంటుంది. సింహం కూన భయంతో, అరుస్తూ 'నేను గొర్రెని నన్ను వెళ్ళనీయి'… అంటుంది.

సింహం దానితో 'ఓ తెలివితక్కువ దద్దమ్మా! నీవు గొర్రెవి కావు. నన్ను చూసి భయపడకు' అంటుంది. కాని సింహం కూన భాగా భయపడిపోయి సింహం ఏం చెప్పినా వినదు. అది మెల్లిగా సింహం నుంచి తప్పించుకొని పారిపోతుంది.

మర్నాడు ఈ గొర్రెలు ఉన్న చోటికి సింహం వచ్చి, జాగ్రత్తగా సింహం కూనని పట్టుకుంటుంది. ఈసారి దాన్ని చాలా గట్టిగా పట్టుకుంటుంది. సింహం గుప్పిటలో గిజగిజలాడుతుంది సింహం కూన. అయినా దాని మనస్సులో ఒక పక్క అక్కడి నుంచి తప్పించుకోమని చెబుతుంది, మరొక పక్క సింహం స్పర్శ చాలా బాగుంది అని చెబుతుంది. సింహం స్పర్శ సింహం కూన అంతరంగం లోతుల్లో ఏదో మేల్కొన్నట్టు అవుతుంది. సింహం కూన గిజగిజ కొట్టుకోవటం చూసి సింహం దాన్ని వదిలి, 'నేను రేపు కూడా ఇక్కడికి వస్తాను. కానీ నేను నిన్ను పట్టుకోను,' అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోతుంది.

సింహంకూనకి రాత్రి అంతా నిద్ర పట్టదు. దాని మనస్సు అంతా చాలా ఆలోచనలతో నిండిపోతుంది. 'ఆ సింహం మాటలు నేను నమ్మలేను. కాని అది చెప్పిన దానిలో ఏదో నిజం ఉండి ఉండవచ్చు. అబ్బే! లేదు, లేదు. సింహం చెప్పింది నిజం కాదు. నేను గొర్రెరె కూనని అని నాకు తెలుసు. ఆ సింహం చెప్పే మాట అర్థం లేనిది. నా నుంచి ఏదో ఆశించి ఆ సింహం అలా చెబుతూందని అనుకుంటుంది.

ఒక విషయం అర్థం చేసుకోండి. సింహం చెప్పిన విషయం సింహం కూన తర్కజ్ఞానానికి అందని విషయం. మీకు స్పష్టంగా చెబుతాను. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM సమక్షంలో మీ తర్కానికి అందని విధంగా మిమ్మల్ని ప్ర‌భావితం చేస్తే మీ లోప‌ల గురువు మేల్కొన్న‌ట్టే, మీరు సింహంతో బంధాన్ని ఏర్పరచుకోవాలి అంటే మీ అంతరంగంలోని సింహం మేల్కోవాలి. మీకు గురుదేవుల సమక్షం ఆనందపారవశ్యాన్ని ఇచ్చినప్పుడు, ఆ భావాలని తిరిగి మీరు మననం చేసుకుంటుంటే, అది మీ ఊహలోనెనా సరే స్పష్టంగా తెలుసుకోండి సింహం మీ అంతరంగపు లోతుల్ని స్పర్శించినది అని అర్ధం. మీలో ఒక భాగం ఆ సున్నితమైన అనుభూతిని పొందింది. మీలో ఒక భాగం గురుదేవులు చెప్పిన విషయంలో ఏదో ఉంది అనే భావంతో ఉంటుంది.

మరుసటి రోజు సింహం వచ్చేసరికి సింహం కూన అక్కడ నిలబడి ఉంటుంది. సింహం కూన ఓపికగా సింహం కోసం అడవి మొదట్లో నిలబడి చూస్తూ ఉంటుంది. కాని సింహం రాగానే నెమ్మదిగా దాని నుంచి దూరంగా వెనక్కి గొర్రెల వైపు అడుగులు వేస్తుంది కాని ముఖం మాత్రం సింహం వైపు ఉంటుంది. దాన్ని చూడకుండా ఉండలేదు. ఆ విధంగా కొంచెం వెనక్కి వెళ్ళి సింహంతో, 'నీవు అక్కడే ఉండు. నేను ఇక్కడ నిలబడతాను. మనం ఇలా మాట్లాడుకోవచ్చు నిజమే, నేను నిన్ను మరిచిపోలేక పోతున్నాను కానీ మన మధ్య దూరం ఇలానే ఉండాలి' అంటుంది. సింహం 'సరే' నీవు అక్కడే ఉండి నాతో మాట్లాడు' అంటుంది.

అప్పుడు సింహం, సింహంకూనతో, 'ఈ విషయం అర్ధం చేసుకో! నీవు సింహానివి. నీవు మరొకలా ఉండాలి అని ప్రయత్నిస్తూ, నీ సహజస్థితిని మరిచిపోతున్నావు. జాగ్రత్తగా చూడు! నీకు ఆ గొర్రెలకీ చాలా తేడా ఉంది' అంటుంది. వెంటనే 'సింహం కూన 'ఏం కాదు! అది ఎలా సాధ్యం. నేను అదే గడ్డి తింటాను. ఆ గొర్రెల్లాగానే జీవిస్తున్నాను' అంటుంది.

సింహం, 'ఓ మూర్ఖసింహమా! ఈ చిన్న విషయాన్ని గమనించు. నిన్ను నీవు చూసుకో. మిగిలిన గొర్రెలు నాతో ఎటువంటి బంధాన్నీ ఏర్పరచుకోలేదు. మరే గొర్రె నా కోసం ఎదురుచూడవు. అవన్నీ నన్ను చూసి భయపడుతున్నాయి. నీవు ఒక్కదానివే నా కోసం ఎదురు చూస్తున్నావు. దీన్ని బట్టి చూస్తే నీలో ఏదో మార్పు జరిగింది. నీవు నా కోసం ఎందుకు ఇక్కడ ఉండి ఎదురు చూడాలి? నాతో నది దగ్గరకి రా. అందులో నీ ముఖం, నా ముఖం చూస్తే నీకు అర్ధమవుతుంది' అని అంటుంది.

సింహం కూనకి సింహంతో వెళ్ళటానికి భయం వేస్తుంది. అది సింహంతో, 'వద్దు. నేను రాను. మనం ఇక్కడే నిలబడి మాట్లాడుకుందాం. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే నిలబడు. నేను ఇక్కడే నిలబడతాను. నీవు ఏం చెప్పదలచుకున్నావో అది చెప్పు. నేను ఇక్కడే ఉండి వింటాను. అని అంటుంది. అప్పుడు సింహం కూనతో ఈ విధంగా చెబుతుంది. 'సరే! నేను నీకు ఒక విషయం చెబుతాను. నీవు సరే అంటే నీ నిజమైన నిన్ను నది నీడలో చూపిస్తాను. నీవు నేను ఒకటే అని నిరూపిస్తాను. అయితే నేను నిన్ను బలవంతపెట్టను. నేను ఒక వారం తరువాత వస్తాను. నీవు సరే అనుకుంటే ఇక్కడికి వచ్చి నన్ను కలవవచ్చు. నేను నిన్ను నాతో నది దగ్గరకి తీసుకు వెళతాను. లేదు అనుకుంటే నన్ను మరిచిపో, నన్ను గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించకు.

ఒకవారం గడిచాక సింహం తాను చెప్పినట్లే వస్తుంది. సింహం కూన ఇంకా అయోమయంలో ఉంటుంది. 'నేను వెళ్ళి సింహాన్ని కలవాలా వద్దా !' అంతరంగం లోపల వెళ్ళి సింహాన్ని కలవాలని ఉంటుంది. కానీ పైకి సింహం అంటే భయం కలుగుతుంటుంది.

చివరికి సింహం ఉన్న దగ్గరికి వస్తుంది. సింహం అక్కడ ఉంటుంది. సింహం దాని వైపు చూసి, లేచి నిలబడుతుంది. సింహం దారి చూపిస్తూ నడుస్తుంటే సింహం కూనకూడా దాని వెంట నడుస్తూ వెళుతుంది. అలా ఆ రెండూ నది వైపు నడిచి వెళుతుంటాయి. సింహం కొంచెం దూరం జరిగి నెమ్మదిగా సింహం కూనకి కథలు చెప్పటం ప్రారంభిస్తుంది. తను చిన్నకూనగా ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఎలా పెద్దదైంది. అన్నీ చెబుతుంది. సింహం కూన కథలు వినటంలో మునిగిపోయి సింహం దగ్గరగా నడుస్తుంది. అలా నడుస్తూ సింహం, సింహం కూన దగ్గరికి జరుగుతుంది. సింహం కూన పూర్తిగా కథలో మునిగిపోయి, 'ఆహా! అలా జరిగిందా? తరువాత ఏమెంది, నీకు కూడా ఈ సమస్యలన్నీ ఉన్నాయా?' అని అడుగుతుంది.

సింహం కూనకి తెలియకుండా సింహం దానికి బాగా దగ్గరగా వచ్చి దానికి తగులుతూ నడుస్తుంది. అకస్మాత్తుగా సింహం కూన గమనిస్తుంది. కాని భయపడి దూరం జరగదు. సింహం స్పర్శ దానికి చాలా హాయిగా, ఆహ్లాదంగా ఉంటుంది. అది సింహాన్ని దగ్గరకి రావద్దని ఆపదు. సింహం అలా చెబుతూనే ఉంటుంది. సింహం కూన 'అలానా! అది బాగుంది' అని అంటూ ఉంటుంది. ఇప్పుడు సింహం, సింహం కూనని పట్టుకొని నడుస్తుంది. కాని సింహం కూన కథల్లో పూర్తిగా నిమగ్నమై అసలు ఈ విషయాన్ని పట్టించుకోదు.

అవి నది దగ్గరకి రాగానే 'సింహం, సింహం కూనని నీళ్ళలో చూడమంటుంది. సింహం కూన తాను తప్పించుకోలేనని తెలుసుకుంటుంది. కాని ఆశ్చర్యంగా దానికి తప్పించుకోవాలి అనే కోరిక కలగదు.

అర్ధం చేసుకోండి, సింహం కూనకి తాను తప్పించుకోలేను అని తెలుసు అంతే కాదు, దానికి తప్పించుకోవాలి అనే కోరిక కూడా లేదు. కాని దాని మనస్సులో ఒక మూల ఉన్న అహంకారం దాన్ని అలా అనుకోనీయదు.

అప్పుడు అది, 'వద్దు, నన్ను వెళ్ళనీయి. నన్నేం చేస్తున్నావు? నన్ను ఎందుకు పట్టుకున్నావు? అని భయంగా అడుగుతుంది.

సింహం సమాధానమిస్తుంది, 'నేను నిన్నేమీ చేయను. నీళ్ళలోకి చూడు' సింహం కూన నీళ్ళలోకి చూసి, 'సరే ! నేను నీళ్ళలోకి చూస్తున్నాను' అంటుంది. అప్పుడు సింహం, 'నీకు రెండు రూపాలు కనిపిస్తున్నాయా?' అంటుంది. అది 'అవును' అని అంటుంది. 'సరే అయితే, ఆ రెండింటిలో ఒకటి నేను, ఒకటి నీవు' అని చెబుతుంది సింహం.

'ఏమీ కాదు! ఇది నిజం కాదు. ఆ రెండు రూపాలూ నీవే అయిఉండవచ్చు' అని గట్టిగా అరుస్తూ చెబుతుంది. సింహం గట్టిగా అరిచి 'ఓ! తెలివితక్కువదానా! చూడు నేను చేతిని పైకి ఎత్తుతాను. నీళ్ళలో ఏ రూపం చేయి ఎత్తింది' అని అడుగుతుంది. సింహం కూన వేలితో చూపిస్తూ 'ఆ రూపం' అంటుంది. అప్పుడు సింహం, 'సరే! ఈ సారి నీవు చేయి ఎత్తు' అంటుంది.

సింహం కూన చేతిని ఎత్తి నదిలో రూపాన్ని చూస్తూ 'అవును! అవును! నేను, నేను చూసాను. నేను చూసాను' అంటుంది. తరువాత మెల్లని గొంతుతో 'కాని… ఇది ఎలా సాధ్యం. నేను ఎలా సింహాన్ని అవుతాను. నేను గొర్రెని కాదా' అంటుంది.

సింహం దాని వైపు చూసి, 'నేను నీతో ఆడుటానికి ఇక్కడికి రాలేదు' అంటుంది. అప్పుడే సింహం కూనలో ఒక విధమైన ఆనంద పారవశ్యం కలుగుతుంది. ఏదో అద్భుతం జరుగబోతూంది అని ఆ సింహం కూనకి అర్థం అవుతుంది.

వెంటనే దాని మనస్సు ముందుకి వచ్చి అది నిరాశలోకి వెళుతుంది. తన మనస్సులో ఇలా అనుకుంటుంది, 'నన్ను హిప్నటైజ్ చేసి ఉంటుంది. ఇది నా నిజమైన స్థితి కాదు. ఇది నేను కాదు, నేను ఎప్పుడూ ఇంత ఆనందంగా, ఇంత ఆహ్లాదంగా లేను. సింహం నన్నేదో చేస్తుంది. నాకు ఏదో చేసింది.' సింహం పారిపోవాలని చూస్తుంది. కాని అది పూర్తిగా వెళ్ళాలని కాదు. ఎందుకంటే దానికి నిజంగా సింహం దగ్గర నుంచి వెళ్ళాలని లేదు.

సింహం కూన వెంటనే, 'కాదు! కాదు! నేను వెళ్ళిపోవాలి. నన్ను వెళ్ళనీయి. నీవు సింహానివి అని నాకు తెలుసు. నీకు బహుమతిగా రోజూ నేను తినే గడ్డి తీసుకువస్తాను. నేను తాగే పాలు తెస్తాను. నా సమయాన్ని నీ సేవకి ఉపయోగిస్తాను' అని అంటుంది.

చివరికి సింహం ఇలా ఆలోచిస్తుంది, 'దీన్ని ఇప్పుడు వదిలివేయాలి. ఇప్పటికి ఇది మాత్రమే అర్ధం చేసుకోగలిగింది.' సింహం కూన వైపు తిరిగి, 'సరే! రేపు మనం మళ్ళా కలుద్దాం. నిన్ను కలవటానికి నేను అడవి చివరికి రాను. నేను నా ఇంట్లో ఉంటాను. నీకు నన్ను చూడాలనిపిస్తే నీవే నా ఇల్లు కనుక్కొని అక్కడికి రా. నిన్ను వెతుకుతూ నీ దగ్గరకి వచ్చి నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చే టెం లేదు నాకు. నీ అంతట నీవు రాలేకపోతే వదిలేసెయ్యి' అని సింహం కూనకి చెప్పి సింహం అడవిలోకి వెళ్ళిపోతుంది.

ఈ సారి సింహం కూన ఎప్పటిలా పరిగెత్తి పారిపోదు. నెమ్మదిగా నడుస్తూ వెళుతుంది. దానికి వెనక్కి వెళ్ళటం ఇష్టం ఉండదు. కానీ దాని మనస్సు మాత్రం గొర్రెల దగ్గరకి వెళ్ళమని చెబుతుంది. దాని మూడు కాళ్ళు ముందుకి పడటం లేదు. ఒక కాలు మాత్రమే ముందుకి కదులుతూంది. వెళ్ళిపోవాలి అనుకోగానే ఆ చిన్న కళ్ళ నుంచి కన్నీరు ధారగా ప్రవహిస్తుంది.

మర్నాడు సింహం తన ఇంట్లో మహా చక్రవర్తిలా కూర్చొని ఉంటుంది. సింహం కూన నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ చేతిలో లేతగా, తాజాగా ఉన్న పచ్చగడ్డితో వచ్చి, దాన్ని సింహం ముందు ఉంచి 'ఇది నీ కోసం తెచ్చాను దయచేసి తీసుకో' అంటుంది. సింహం దాని వైపు చూసి ఇలా అనుకుంటుంది. 'సరే, నేను ఈ గడ్డి తీసుకుంటే సింహంకూనకి నాతో అనుబంధం పెరుగుతుంది. దాంతో మా మధ్య బంధం గట్టిపడుతుంది, ఈ విధంగా ఆలోచించి ఎప్పుడూ గడ్డి తినకపోయినా, కాస్త గడ్డి తీసుకుని నోట్లో పెట్టుకొని నములుతుంది. సింహం కూనని మెచ్చుకుంటుంది. 'నీవు తెచ్చిన గడ్డి చాలా రుచిగా ఉంది' అంటుంది. సింహం కూన చాలా సంతోషపడుతుంది. సింహం గడ్డి తిన్నాక వారి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.

ఒక విషయం అర్ధం చేసుకోండి; సింహం కింది స్థాయికి దిగి వచ్చి గడ్డి తినటం, కేవలం సింహం కూనతో మంచి అనుబంధాన్ని పెంచుకోవాలని. నిజానికి సింహం గడ్డి తినదు ఇక్కడ అలా నటిస్తుంది. గడ్డిని ప్రేమిస్తుంది.

క్రమంగా సింహానికి, సింహం కూనకి మధ్య అనుబంధం బలంగా తయారవుతుంది. కొన్నిసార్లు సింహం గడ్డి చూసి, సింహంకూనని కోప్పడేది, 'మూర్ఖుడివి! నాకు ఎటువంటి గడ్డి తీసుకురావాలో తెలియదా! ఇదేం గడ్డి? ఈ పాటికి నేను ఎటువంటి గడ్డి తింటానో నీకు తెలిసి ఉండాలి. ఈ సారి మంచి గడ్డి తీసుకురా!' అని అరచేది.

సింహం కూన ఈ విధంగా ఆలోచించేది, సింహానికి కోపం వస్తుంది. నాకు కూడా కొన్నిసార్లు కోపం వస్తుంది. సింహం నాలాగే మాట్లాడుతుంది. సింహం నాలాగే ఉంది' అని అనుకుంటుంది.

సింహం గడ్డి తింటుంది అంటే తన స్థితి నుంచి, తన ఉన్నతచేతనస్థితి నుంచి కిందికి, సింహం కూన స్థితికి వస్తుంది అంటే ఆ అనుబంధం పెంచాలని మాత్రమే.

సింహం కూనకు ఇప్పుడు సింహంతో చక్కని అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు సింహం కూన ఇలా అనుకుంటుంది, 'ఈ సారి నేను మంచి గడ్డి తీసుకురావాలి. నేను చేసే పనులు సరిగ్గా చేయాలి. గడ్డిని చక్కగా కట్టి తీసుకురావలసింది. ఈ విధంగా సింహం కూన చక్కని ప్లాన్స్ వేస్తుంది. తాను సరిగ్గా పని చేయలేదు కాబట్టే సింహం తనని తిట్టింది కాబట్టి ఈ సారి బాగా చేయాలి అనుకుంటుంది. ఈ విధంగా సింహంతో దాని అనుబంధం గట్టిపడుతుంది. సింహం దగ్గర సౌకర్యంగా, విరామంగా, ఆనందంగా ఉంటుంది. ఇదే మాస్టర్ వేసే మాస్టర్ ప్లాను.

ఒక రోజు సింహం కూన మామూలుగా గడ్డి, పాలు తీసుకొని వచ్చేసరికి సింహం మాంసం తింటూ కనిపిస్తుంది. మాంసం చూడగానే సింహం కూన భయపడిపోతుంది. అది అరవటం మొదలుపెడుతుంది, 'నీ దగ్గర మాంసం ఎందుకు ఉంది. ఇదంతా ఏమిటి? నీవు మాంసాహారివా? నీవు మాంసాహారివని నాకు తెలియదు. నీవు చూడటానికి ఎంతో ప్రేమగా, తేజస్సుతో ఉంటావు. అలాంటి నీవు మాంసం తినకూడదు. ఇలాంటివన్నీ నీవు తింటావా? నేను శాకాహారిని. ఇవన్నీ నాకు పడవు' అని గట్టిగట్టిగా అరుస్తూ అడుగుతుంది.

ఈ సారి సింహం దానికి ఏం వివరణా ఇవ్వదు. అది సింహం పిల్ల గొంతు పట్టుకొని కొంత మాంసం తీసుకుని దాన్ని బలంగా సింహం కూన నోట్లో పెడుతుంది. ఎప్పుడైతే మాంసం తన నోటిలోకి వెళుతుందో, దాని రుచి సింహం కూనకి తెలుస్తుంది. దాని అంతరంగంలో అకస్మాతుగా ఏదో జరుగుతుంది.

తనలో ఏం జరుగుతుందో సింహం కూనకి అర్థం కాదు. మొదటిసారి అది మాంసం రుచిని చూసింది. దానిలో కలిగిన భావంతో పరవశిస్తుంది. ఇదే మీలో జరిగే మొదటి ఆధ్యాత్మికానుభవం 'సతోరి' ఆ ఆనందం, ఆ అనుభవం అయితే మీకు అర్థం అవుతుంది.

మాంసం రుచి చూసాక సింహం కూన సింహంలా గర్జిస్తుంది. తన సహజస్థితిని చూపిస్తూ సింహంలా గర్జిస్తుంది. ఇప్పుడు సింహం సూటిగా సింహం కూన కళ్ళలోనికి చూస్తూ 'తత్వమసి' నీవు అదే అంటుంది. దీక్ష జరుగుతుంది. సింహంగా మారుతుంది. తాను గొర్రెని అని అనుకుంటున్న సింహం, సింహంలా మారుతుంది.

మీరు సింహమే కాని గొర్రె కాదు

ఒక విషయం తెలుసుకోండి; మీరు మామూలు మనిషి కాదు, మీరనుకునే గుర్తింపు కూడా కాదు.

మీరు గొర్రెలా ఉన్నారు. నా వైపు చూసి అర్థం చేసుకోండి. నేను కూడా గొర్రెని అని అనుకునేవాడిని. నేను ఏ విధంగా సింహంలా అయ్యానో చూడండి. నా జీవితంలోకి చూడండి. అప్పుడు మీకు అర్ధం అవుతుంది. నేను గొర్రెని అని ఎంత తెలివి తక్కువగా అనుకుంటున్నారో తెలిసి మీరు సింహంలా అవుతారు.

కృష్ణుడు అన్న మాట, 'నీవు నా జీవితాన్ని అర్థం చేసుకుంటే ముక్తి పొందుతావు' కి అర్థం ఇదే. ముక్తి పొందిన వ్యక్తి జీవితం మీకు ముక్తిని ఇస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారో సరిగ్గా చూపిస్తుంది. ఆ జీవితం ముక్తి పొందిన వ్యక్తి కూడా ఒకప్పుడు అజ్ఞాని మీరు ఉన్న చోటే ఆయనా ఉన్నాడు. ఇది మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అది మీ సహజలక్షణమైన ఆనంద స్థితి అనే మాంసం మింగే ధైర్యాన్ని ఇస్తుంది. అప్పుడు సింహంలా గర్జిస్తారు. కాని గొర్రిలా బే బే అనరు.

సింహం కూనకు తాను సింహాన్ని అని తెలుసుకోవటానికి ఎంత సమయం పట్టింది. అంతా కలిపి ఒక క్షణం. ఎప్పుడైతే మాంసం లోపలికి వెళ్ళిందో, సింహం గర్జించటం మొదలుపెట్టింది. కాని గుర్తుంచుకోండి, మాంసం నోట్లోకి వెళ్ళటానికి ఎంత సమయం పట్టింది. గురుదేవుల గుహలోకి రావటానికి చాలా సమయం పట్టింది. దానికి ముందు అనుబంధం ఏర్పడాలి. అందుకే అంత సమయం అవసరం. జ్ఞానోదయం పొందటానికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఆ వంతెన నిర్మాణానికి, ఆ అనుభవం పొందటానికి సమయం పడుతుంది.

గురువులు అవసరమా?

గురువులు మీతో మాట్లాడటం మీకు సత్యాన్ని బోధించటానికి కాదు, అది మీలో ఉన్నది అని మీరు తెలుసుకునే విధంగా సహాయం చేయటానికి. గురువు అద్దం వంటివారు. ఆయన సమక్షంలో లోతైన నిశ్శబ్దంతో కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోగలరు. జ్ఞానోదయం భాష గురుదేవులు.

ఆదిశంకరాచార్యులు, భజగోవిందంలో ఈ విధంగా చెబుతారు : గురుదేవుల పాదపద్మముల దగ్గర అధీనమైతే ప్రపంచపు సంకెళ్ళ నుంచి స్వేచ్ఛని పొందుతారు. అప్పుడు మీ మనస్సు, ఇంద్రియాలు మీ నియంత్రణలోకి వస్తాయి. అప్పుడు మీ హృదయంలో భగవంతుడిని చూసారు.

గురుదేవుల ప్రాముఖ్యం

ఆధునికమనస్సుకి గురువుల అవసరం గురించి అర్ధం చేసుకోవటం చాలా కష్టం. గురువు మాత్రమే నిజమైన నీవు ఎవరు అనే సత్యాన్ని ఒక క్షణకాలదర్శనంలా ఇవ్వగలరు. ఆయన బోధించటానికి రాలేదు, మిమ్మల్ని మేల్కొలపటానికి వచ్చాడు.

గురువు అనే ఒకే ఒక గ్రంథం జీవించి ఉంది.

భగవంతుడికి అధీనమవటం కష్టం. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడో, భగవంతుడు అంటే ఎవరు మీకు తెలియదు కాబట్టి. భగవంతుడు అంటే మీకు కేవలం ఒక విషయం మాత్రమే కాని గురువు అంటే ఒక సంపూర్ణత్వం. ఆయన అంతిమస్థితిని చేరాడు. ఆయనకి భగవంతుడు అంటే సత్యం ఆయన భగవంతునితో జీవిస్తాడు. గురువు అంటే మీకు నిజం అని తెలుసు. ఆయనని చూడగలరు, కాబట్టి భగవంతుడిని చేరటానికి ఆయన మీకు ద్వారం లాంటివాడు. ఆయన ద్వారా భగవంతుని చేతుల్లోకి మీరు దూకవచ్చు.

మీ నిజమైన మీలోని మీరు అనే పరమానందానికి లేదా భగవంతునికి మధ్య ఉన్న అడ్డ గోడ అహంకారం. శిష్యుడుగా మారటం అంటే అహంకారాన్ని వదలేయటమే. అహంకారాన్ని వదలటం అంటే మీ గుర్తింపుల్ని వదలేయటం. అంటే, మీరు జీవించటానికి ఇంత కాలం మీరు మోస్తున్న మీ గుర్తింపుల్ని వదలేయటం. అహంకారం మీకూ, జీవితానికీ మధ్య ఉన్నప్పుడు అహంకారాన్ని వదలటం అంటే మరణించినట్లే.

కేవలం గురుదేవుల పై ఉండే విశ్వాసం, ప్రేమ, గౌరవం మాత్రమే అహంకారాన్ని వదిలే విషయం సాధ్యమయ్యేలా చేసేది. మీరు క్రమంగా ధైర్యాన్ని కూడగట్టకొని ఇంత కాలం మీరు పట్టుకొని వేలాడిన అహంకారాన్ని వదిలేయగలుగుతారు. మీరు అహంకారాన్ని ఎప్పుడు వదులుతారంటే, అలా వదిలినప్పుడు మీరు పడిపోయినా ఆ పడేది సర్వాంతర్వామి రూపమైన గురుదేవుల ప్రేమ, కరుణ అనే వలలోకే అని తెలుసుకున్నప్పుడు.

ప్రస్తుతం మీ అనుభవాలన్నీ మీ అంతరంగంలోకి భయాన్ని, ఆశని తీసుకువస్తాయి. అది కాకుండా ఉందే మరే అనుభవమైనా మీ అంతరాత్మకి బలాన్ని, చేతనస్థితిని ఇస్తుంది. ఇదే గురుదేవులు మీ పైన చేసిన పని ఫలితం. అది మీలో మానసిక విప్లవాన్ని తీసుకువచ్చి, మీలో సంపూర్ణమైన మార్పుని తెస్తుంది.

గురుదేవుల నుంచి నేర్చుకోవటం

మీరు అడగవచ్చు, 'నాకు గురువుతో అవసరం ఏమిటి? నేను నా జీవితం నుంచి నేర్చుకుంటాను కదా!' అని.

గురుదేవుల నుంచి నేర్చుకోవటం అనేది మధురమైన, ఆనందకరమైన అనుభవం. గురుదేవులు మీ అహంకారం అనే కణితిని ఆపరేషన్ చేసి తీసే ముందు, తన ఒడిలో కూర్చోపెట్టుకుని ప్రేమ అనే అనెస్తీషియా ఇస్తారు. ఆయన మీ మీద చూపించే ప్రేమతో, మీలో జరిగే మార్పు యొక్క బాధని తెలుసుకోలేరు. ఒకవేళ ఎప్పుడైనా బాధ కలిగినా కూడా దాన్ని ఆహ్లాదంగా తెలుసుకునే తత్వంతో గురుదేవుల సమక్షంలో ఉన్న ఆనందంలో చూస్తారు. గురుదేవులు అంటే గాఢమైన జీవితం ఆయన మీకు నేర్పించటమే కాదు, మీరు పొందవలసిన మార్పుని ఆనందంగా పొందే విధంగా చేస్తారు.

ఒక చిన్న కథ : ఒక వ్యక్తి చిన్నవాడైన తన కొడుకుని రాయిని కదపమని చెబుతాడు. అది పెద్ద రాయి, ఆ అబ్బాయి ఎంత ప్రయత్నించినా దాన్ని కదపలేదు. ఆ అబ్బాయి అలసిపోతాడు. అప్పుడు తండ్రి ఆ అబ్బాయితో 'నీవు నీలోని శక్తిని మొత్తం ఉపయోగించలేదు. నీ శక్తినంతా ఉపయోగించు' అంటాడు. కొడుకు పూర్తిగా అలసిపోతాడు. ఆ అబ్బాయి తండ్రి వైపు తిరిగి కోపంగా, 'నీవు ఏం చెబుతున్నావు? నా శక్తిని అంతా ఉపయోగించలేదు అన్నావు. నేను అలిసిపోయాను. నీవు చూడటం లేదా?' అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు తండ్రి కొడుకుతో, 'నీవు నన్ను అడగవలసింది. నేను నీ శక్తిని కాదా?' అంటాడు.

అదే విధంగా మీరు గురువుల సమక్షాన్ని ఉపయోగించుకోవచ్చు. అర్ధం చేసుకోండి, మీరు నన్ను అడగవచ్చు. మీరు గురువు సహాయం తీసుకోవచ్చు, కాని మీరు ఆ పని ఎప్పుడూ చేయలేదు. గురువు కూడా మీ శక్తి అని అనుకోలేదు. చాలా సహాయం దొరుకుతుంది, మీకు చాలా దొరుకుతుంది, కానీ మీరు ఎప్పుడూ అడగరు, ఉపయోగించుకోరు.

జీవితం ఒక గురువు, కాని ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఏది నేర్చుకోవాలి, ఎలా? అనే విషయాలు తెలుసుకోవటం కష్టం. దత్తాతేయుడు, ఒక గొప్ప గురుదేవులు ఈ విధంగా చెబుతారు, 'నాకు ఎప్పుడూ గురువు లేరు. ఎందుకంటే నా జీవితమే నా గురువు. ఏ విధంగా ఏకాగ్రాత నిలపాలో వేటగాడి దగ్గర నుంచి నేర్సుకున్నాను. చీమల నుంచి సంపద ఎలా దాచాలో నేర్సుకున్నాను.' జీవితం మీకు గురువు అయితే సరైన విషయాలు తెలుసుకునే వివేకం ఉండాలి. కానీ జీవితంలో చాలా సార్లు మీరు తప్పు విషయాలు ఎంచుకుంటారు.

ఒక చిన్న కథ : హరిశ్చంద్రుడు తన జీవితాంతం సత్యంతోనే జీవించాడు. ఆయన కథ ఏం చెబుతుందంటే సత్యం కోసం ఒక సమయంలో భార్యని, కొడుకుని కూడా అమ్ముకోవలసి వస్తుంది.

ఒకసారి ఒక గ్రామంలో ఒక బోధకుడు హరిశ్చంద్రుని కథ చెప్పి, ఈ కథ నుంచి మీరు ఏం నేర్సుకున్నారు, అని అడుగుతాడు. ఒక వ్యక్తి 'జీవితంలో ఏం జరిగినా సరే నిజమే చెప్పాలి' అని నేర్సుకున్నాను అని జవాబు ఇస్తాడు. బోధకుడు సంతోషపడి మరొక వ్యక్తిని 'నీవు ఈ కథ నుంచి ఏం నేర్చుకున్నావు' అని అడుగుతాడు. ఆ రెండవ వ్యక్తి 'అవసరానికి భార్యని అమ్మవచ్చు అందులో తప్పు లేదు' అని నేర్చుకున్నాను అని జవాబు ఇస్తాడు. చూడండి, ఒకే కథ నుంచి మీరు రెండు విషయాలు నేర్చుకోవచ్చు.

జీవితంలో ప్రతిసారీ సరైన విషయాలు నేర్చుకునే వివేకం మీకు లేకపోవచ్చు. అందుకే జీవితంలోనికి గురుదేవులు ప్రవేశిస్తారు. ఆయన మీకు సరైన మార్గం చూపించగలడు ఎందుకంటే ఆయన ప్రయత్నించి విజయం పొందాడు కాబట్టి.

చూడండి, కొన్ని మందులు ఇచ్చి కూడా ట్యూమర్‌ని తగ్గించవచ్చు. కాని దానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చు. గురుదేవులు వాటిని క్షణకాలంలో తీసివేయగలరు. మరొక విషయం ఆ ట్యూమర్స్‌తో బతికేటప్పుడు ఉండే బాధతో పోల్చితే గురువులు దాన్ని తొలగించేటప్పటి బాధ చాలా తక్కువ. అది అసలు బాధ కాదు. కాని ట్యూమర్‌తో జీవించటం కష్టం ప్రమాదకరం కూడా. అందుకే గురుదేవుల దగ్గరకి వెళ్ళటం అన్ని విధాలా మంచిది.

జీవితం ఒక లోతైన రహస్యం, దాన్ని మన కోరికలతో తెలుసుకోలేం. మన కోరికలు గొప్పవిగా, జీవితానికి సరితూగేవిగా కనిపించవచ్చు. ఎందుకంటే జీవితం అంటే మనకి ఉండే తక్కువ, సంకుచితమైన అభిప్రాయం వల్ల ఉపయోగం లేనివి ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. కాని చాలా అద్భుతమైన అర్థవంతమైన అనుభవాలు మన గుమ్మం దగ్గరే ఉన్నాయి. మన సమస్య ఏమిటంటే అటువంటివి ఉన్నాయని ఊహించలేం. ఎందుకంటే అది మనకి తెలియదు కాబట్టి.

ఈ సందర్సంలోనే గురువు ప్రవేశిస్తారు. ఆయన జీవితాన్ని సంపూర్ణంగా చూసారు. మీరు ఊహించలేనివాటిని, ఆయన చూడగలరు. మీ జీవితంలో కూడా పరిపూర్ణత సాధించే విధంగా ఆయన సహాయం చేయగలడు.

గురుదేవులు – జీవన్ముక్తులు

మీరు చేయవలసింది, నమ్మకంతో ఆయనతో పాటు నడవగలగటం, తరువాత జరిగే విషయాలు ఈ సత్యం పట్ల మీలో నమ్మకాన్ని కలిగిస్తాయి. అప్పుడు మీరు ధర్మచుక్రంలోకి ప్రవేశించగలుగుతారు. అది మరింత నమ్మకం వైపు తీసుకువెళుతుంది.

గురువు మీ మీద ఏదీ బలవంతంగా మోపరు. మీలో మీకు అవసరం లేనివాటిని తీసేయగలుగుతారు. మీ మీద బలవంతంగా మోపబడినవాటిని తీసివేస్తారు. మిమ్మల్ని కొత్తగా, తాజాగా చేయగలుగుతారు. మిమ్మల్ని చక్రని ఖాళీ కాన్వాసులా చేసారు. దాని మీద మీ ఇష్టమైన అందమైన పెయింట్ వేసుకోవచ్చు. మీ సంగీతాన్ని మీరు కూర్చవచ్చు. మీ నాట్యాన్ని మీరు చేయవచ్చు. గురుదేవులు మీ జీవితంలో అతిమధురమైన అనుభవాలకి ద్వారాలు తెరవగలడు. మీ ప్రత్యేకమైన అనుభవాలని మీరు పొందగలరు.

పద్ధతికి, క్రమానికి తేడా తెలుసుకోండి. పద్ధతి మళ్ళా చేస్తే అదే ఫలితం వస్తుంది కానీ చేసే కార్యక్రమం తిరిగి చేస్తే ప్రతిసారి అదే ఫలితాన్ని ఇవ్వదు. దాన్ని మీ అంతట మీరు స్వయంగా చేయలేరు. పద్ధతిని గురువులతో చేయటమే సాధనకార్యక్రమం. గురువు లేకుండా చేస్తే పద్ధతి అవుతుంది.

శాశ్వతమైన నిత్యానుబంధం

అనుబంధం అంటే ఏమిటి ?

అనుబంధం అనేది మీలో ఉన్న మీకు తెలియని కోణాలని మీకు చూపిస్తుంది. మీకు అనుభవపూర్వకంగా మీరు ఎవరినైనా దేన్నెనా ప్రేమించగలరని నిరూపిస్తుంది. మీరు ప్రేమించగలరని. ప్రేమకోసం ఎంత గొప్ప విషయాన్నెనా త్యాగం చేయగలరు అని అనుబంధం మీకు చూపిస్తుంది.

మనం జన్మించినప్పుడే సంపూర్ణత్వంతో జన్మిస్తాం. అయితే మనలోని అన్ని కోణాలూ మనం చేతనస్థితిలో లేనప్పుడు మనకి తెలియదు. బయటి ప్రపంచానికి కూడా తెలియదు. అనుబంధం మనకి తెలియని కోణాలని మనలో మేల్కొలుపుతుంది. మనం వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చేసి వాటిని బయటి ప్రపంచానికి అనుబంధంగా చూపిస్తుంది. అనుబంధాలు మీకు తెలియని మీలో ఉన్న అనేకకోణాలని మేల్కొలుపుతుంది, ఎవరితోనైనా, దేంతోనైనా ఉండే అనుబంధం THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMతో ఉండే అంతిమబంధానికి తీసుకువెళుతుంది.

మీరు ఎవరితోనైనా ప్రేమలో పడితే, అది స్త్రీ, పురుషుడు, పిల్లలు, దేవతామూర్తి, గురువు, ఎవరితోనైనా సరే, మీరు ఇంతకు ముందు మీలో చూడని అంశాలని చూడగలుగుతారు. మీలో ప్రేమ వికసించే కొద్దీ బాధ్యతాయుతంగా తయారవుతారు. మీరు జీవితసారాన్ని అనుభవించగలుగుతారు.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, సర్వాంతర్వామితో ఒకటిగా ఉండే ఆయనతో అనుబంధం అన్ని రకాల బంధాల కంటే లోతైన బంధం. అది ఆత్మస్తాయిలో ఉండే బంధం.

సాధారణంగా అన్ని రకాల అనుబంధాలూ బందీల్ని చేస్తాయి కాని THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMతో ఉండే అనుబంధం విముక్తుల్ని చేస్తుంది. దానికి మిమ్మల్ని అంతిమస్థితి అయిన నిత్యానంద స్థితికి తీసుకువెళ్ళగల శక్తి ఉంటుంది. ఈ బంధంలో కూడా మీరు బందీ అవ్వాలని ప్రయత్నించినా, అది పరమానందాన్ని మాత్రమే ఇస్తుంది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMతో అనుబంధం ఎప్పటికీ బందీలని చేయదు.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM రూపం అంతిమస్థితికీ మీకూ మధ్య వారధి. ఎందుకంటే THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM రూపం అంతిమసత్యం తాలూకు రూపం. అందులో మానవాంశ, భగవదంశ, రెండూ ఉంటాయి. మీరు ఆ రూపంతోనే కాకుండా, ఆ రూపం తాలూకు సత్యంతో కూడా అనుబంధాన్ని పెంచుకుంటే మీరు అంతిమజ్జానాన్ని చేరగలరు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM అంటే అన్ని రూపాలు, రూపం లేనివారు. ఆయనని ఒక చట్రంలో కుదించలేం. ఆయనని విగ్రహంలా మార్చి పూజించలేం. ఆయన అన్ని రూపాలకీ అతీతమైనవాడు. అన్ని కోణాలకీ అతీతుడు. ఆయనలో అనంతమైన కోణాలు ఉంటాయి. ఆయనని మాతృదేవిగానో, ప్రియుడుగానో ఒక ప్రేమలో ఉంచినప్పుడు ఆయనని పట్టుకొని ఉంచటం మీకు సులభం. ఆయన మిమ్మల్ని అయోమయంలోకి తోస్తాడు. అప్పుడు మీరు మీ లోపలికి వెళ్ళి జ్ఞానోదయం పొందుతారు. ఆయన మీరు అనుకునే మీరు మరణించి, అసలైన మీరు మేల్కొనాలని చూస్తాడు.

అమాయకత్వంతో గురువుల సమక్షానికి రండి. ఆయన మీకు మార్గాన్ని చూపిస్తారు. ప్రేమతో ఆయన చేతుల్లో ఒదిగిపోవటానికి తటపటాయించవద్దు. ఆయనతో పరమానందంలోకి ఎగిరివెళ్ళిపోతారు.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మనతో చాలా చుట్టాల్చో, చాలా స్థితులలో బంధాన్ని ఏర్పరుస్తారు. అందులోని అందాన్ని, గాధతని మనకి ప్రతి అనుబంధంలో కనిపించేలా చేస్తుంది ఈ బంధం. ఎవరైతే ఆయనలోనికి ప్రవేశిస్తారో ఆ అద్భుతవంతులకి ఈ అవకాశం ఉంటుంది. సత్యం కోసం అనేషించే ప్రతి ఒక్కరిని ఆయన వారివారికి సరిపడే ప్రత్యేకమైన, అందమైన దారిలో అజ్జానం అనే అంధకారం నుంచి జ్ఞానం అనే ప్రకాశం వైపు తీసుకువెళతారు. ఇది సున్నితమైన ప్రేమ వ్యవహారం. లోతైన నమ్మకంతో, అనుబంధంతో రెండు ఆత్మల కలయిక ఇది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM అంతరంగజ్యోతి శిష్యుల అంతరంగంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడే తెలుసుకునే తత్వం అనే నిప్పు రవ్వ వెలుగుతుంది.

రకరకాల అనుబంధాలు మీలో రకరకాల అంశాలని చూపిస్తాయి. ప్రేమికునిలో ప్రేమ అనే భావం కలిగిస్తుంది. మీ చుట్టూ ఉండే స్నేహితులు స్నేహభావం మీలో కలిగేలా చేస్తారు. మీ పిల్లలు మీలో మాతృత్వం అనే కోణాన్ని బయటికి తెస్తారు. మీ తల్లిదండ్రులు మీలోని చిన్నతనాన్ని చూపిస్తారు. కాని గురుదేవులు మాత్రం మీలోని అన్ని కోణాలనీ ఆవిష్కరిస్తారు. ఆయన మాత్రమే మీలో మీకు తెలియని జ్ఞానోదయం అనే కొత్త కోణాన్ని మేల్కొలుపుతాడు. గురుశిష్య సంబంధం మీలో తీసుకువచ్చే మార్చుని మీరు లెక్క కట్టలేరు. గురువు మీకు చాలా రకాలైన అనుబంధాల్ని కలిగించి మీలో అంతిమసత్యం అనుభూతిని, ఆ అనుబంధం ద్వారా ఆ యోగం ద్వారా కలిగిస్తారు.

భగవంతుడు, గురుదేవులు

కబీరు చాలా చక్కగా ఈ విధంగా పాడేవాడు.

గురువు, భగవంతుడు ఇద్దరూ నా ముందుకి వస్తే, ముందుగా ఎవరికి నమస్కరించాలి? నేను ముందుగా గురువుకి నమస్కరిస్తాను. ఆయనే నాకు భగవంతుడిని చూపాడు కాబట్టి.

ఒకసారి స్వామి వివేకానంద తన తోటి శిష్యులతో ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంసని భగవంతుడుగా చెబుతాడు. దానికి ఒక శిష్యుడు అభ్యంతరం చెప్పి, 'ఆయన జ్ఞానోదయమైన యోగీశ్వరుడు. అది ఒప్పుకుంటాను, కాని ఆయనే భగవంతుడు అంటే అతిగా ఉంది. ఆయనని భగవంతుడు అని ఎలా చెప్పగలవు? అంటాడు.

అతన్ని వివేకానందుడు, 'నీ దృష్టిలో భగవంతుడు అంటే ఏమిటి?' అని అడుగుతాడు. దానికి ఆ శిష్యుడు 'భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్లలో ఉంటాడు' అని జవాబు ఇస్తాడు.

'అంతటా ఉంటాడు అంటే అర్ధం ఏమిటి?' అని వివేకానందుడు మళ్ళా ప్రశ్నిస్తాడు. ఆ శిష్యుడు 'భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని అర్థం' అంటాడు, 'అయితే ఇక్కడ నీకు భగవంతుడు కనిపించాలి కదా!' అంటాడు. శిష్యుడు అయోమయపడి ఏమీ జవాబు చెప్పలేదు. అప్పుడు వివేకానందుడు అతనితో, 'నీకు భగవంతుడంటే ఒక విషయం. నీవు చూడలేవు. నీకు అర్థం కాదు. కాని నీ ముందు ఉన్న గురువు భగవంతుడు, అది నిజం' అని అంటాడు.

నన్ను ఒక వ్యక్తి 'గురువుకీ భగవంతుడికీ తేడా ఏమిటి?' అని అడిగారు. నేను అతన్ని 'భగవంతుడి గురించి నీకేమీ తెలుసు' అని అడిగాను. మీకు తెలిసింది ఏవో కొన్ని మాటలు మాత్రమే. అది ఒక విషయం మాత్రమే. భగవంతుడు అని మీరు అనేటప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియదు. మీకు భగవంతుడు అంటే ఒక భావన. ఆ అంతిమశక్తి, విశ్వచేతనస్ధితి లేదా మీరు మరే పేరు అనుకున్నా, అదేమిటో మీకు ఏమీ తెలియనిదాని గురించి మీకు ఉండే ఊహ. భగవంతుడంటే బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మసృష్టి గురించి ఈ విధంగా ఉంటుంది.

(తినేటిదైన శివుడు గురువు నాలుగు చేతుల విష్ణుమూర్తి నాలుగు ముఖాల బ్రహ్మ ఆయనే మానవరూపంలో ఉన్న పరమశివుడు అత్యున్నతుడు)

గురువు అంటే అంతిమవిశ్వశక్తి నిజమైన రూపం. గురువు ఆయన ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు. ఆయన వర్తమానం. మీకు, భగవంతునికి మధ్య వారధి గురువు. ఆ విధంగా చూస్తే ఆయన భగవంతుని కంటే గొప్ప

నన్ను చాలా మంది అడుగుతుంటారు, 'మీరు భగవంతుడా?' అని. నేను వారితో, 'మీరు భగవంతుడు అంటే ఏమిటి, ఎవరు అని తెలియనప్పుడు, నేను భగవంతుడినా కాదా అని మీరు ఎలా అడగగలరు?' అని అంటాను. భగవంతుడిని నిర్వచించలేం. ఆయనని అనుభూతితోనే తెలుసుకోగలం. మీకు ఒక విషయం స్పష్టంగా వివరిస్తాను; నేను భగవంతుడిని అని నిరూపించటానికి ఇక్కడికి రాలేదు. మీరు భగవంతుడు అని నిరూపించటానికి ఇక్కడికిరా వచ్చాను. నాలోని దివ్యత్వాన్ని నిరూపించటానికి రాలేదు మీలోని దివ్యత్వాన్ని నిరూపించటానికి ఇక్కడికి వచ్చాను.

గురువు అంటే నదికి ఒక పక్కన ప్రజ్వరిల్లే కార్చిచ్చు లాంటివాడు. శిష్యుడు నదికి అటు పక్కన ఉంటాడు. ఆ నది సంసారం, జననమరణాల సంసారమే ఆ నది. గురువుకి, శిష్యుడికి మధ్య వారధి ఉంటే కార్చిచ్చు శిష్యుణ్ణి చేరగలుగుతుంది. వారధిని దేంతో చేసారనేది అనవసరం. దానిని చెక్కతో కాని సిమెంట్‌తో కాని చేయవచ్చు. కాని అది ఆ కార్సిచ్చుని అటు వైపు వెళ్ళనీయగలగాలి. అదే విధంగా మీరు ఏ అనుబంధాన్ని గురువులతో ఏర్పరచుకున్నా పరవాలేదు. కాని మీరు ఆ అనుబంధంలో కరిగిపోగలగాలి.

మీరు దానిలోకి కరిగిపోగలిగితే, మీ భావనలని సఫలం చేసుకుంటారు. మీరు అంతిమస్థితి అయిన నిత్యానంద స్థితిని చేరగలుగుతారు. ఈ సత్యాన్ని మీరు లోతుగా అర్థం చేసుకోగలిగి పట్టుదలతో సాధన చేయండి. 'నేను నా భావనల మీద ఏకాగ్రతని నిలిపి గురుశిష్యబంధంలో కరిగిపోతాను' అని, అది మిమ్మల్ని అంతిమస్థితికి తీసుకువెళుతుంది. ఎలా కరిగిపోవాలో తెలియదు అని అనవద్దు. ఆ పట్టుదల చాలు. అది ఆటోమాటిక్‌గా జరుగుతుంది. గురుశిష్యుల మధ్య ఏ అడ్డంకి వచ్చినా వారి మధ్య ఉన్న బంధంలో అది కరిగిపోతుంది.

గురుదేవులతో ఐదు రకాల అనుబంధం

గురుదేవులతో అనుబంధాన్ని ఐదు విధాలుగా పెంచుకోవచ్చు. ఒక్కొక్క అనుబంధం ఒక్కొక్క మార్గాన్ని తెరుస్తుంది. అది మిమ్మల్ని మీకు దగ్గర చేస్తుంది.

అందులో ఒకటి మాతృభావం, తల్లికి బిడ్డల పట్ల ఉన్న దృక్పథం. గురుదేవుల్ని మీ బిడ్డలా భావించటం. దీన్నే వాత్సల్య భావం అంటారు. ఇదే యశోదకి శ్రీకృష్ణునితో ఉన్న అనుబంధం. మరొకటి బిడ్డకి తల్లి పట్ల ఉన్న భావం. దీన్నే మాతృభావం అంటారు. రామకృష్ణ పరమహంసకు కాళీమాతతో ఉన్న భావం. గురుదేవుల్ని తల్లి అనే భావంతో చూడటం. మూడవది స్నేహభావం గురుదేవుల్ని మీ స్నేహితుడుగా చూడటం. దీన్ని సఖభావం అంటారు. కుచేలుడికి, కృష్ణుడికి; అర్జునుడికి, కృష్ణునికి మధ్య ఉన్న అనుబంధం.

తరువాతది సేవాభావం దీన్నే దాసభావం అంటారు. ఈ సంబంధంలో శిష్యుడు, గురువు పట్ల విశాసం గల సేవకుడుగా ఉంటాడు. హనుమంతునికి, రామునికి మధ్య ఉన్న బంధం. అంతిమభావం ప్రేమభావం. దీన్నే మధురభావం అంటారు. రాధాకృష్ణుల మధ్య ఉన్నది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. మధురభావానికి స్త్రీపురుషభేదం లేదు. ఇది శరీరానికి సంబంధించిన విషయం కాదు. శరీరానికి అతీతమైన ఆత్మకి సంబంధించిన భావం. గురువు పురుషుడు, మీరు పురుషుడు, లేదా గురువు స్త్రీ శిష్యులు స్త్రీ అయినా వారి మధ్య మధురభావం ఏర్పడవచ్చు. ఇది స్త్రీపురుష అనే విషయానికి సంబంధించి ఉండదు. ఇది లోతైన, గాఢమైన అనుబంధం మాత్రమే.

చివరిది మహాభావం, ఇది అయిదు భావాలు ఉండి ఇంకా ఏదో ఉంటుంది. అసలైన గురుశిష్యుల బంధం, కొన్ని సార్లు గురువు మీ బిడ్డలా అనిపించవచ్చు. కొన్నిసార్లు మీకు తల్లిలా ఉండవచ్చు. ఒకసారి మీ స్నేహితుడుగా, మీ యజమానిగా, ప్రియుడుగా ఈ విధంగా అనిపించవచ్చు. గురుదేవులతో అనుబంధం, ఈ ఐదూ ఉండి ఇంకా ఏదో ఉంటుంది. మీరు గురువుతో ఈ ఐదు భావాల్లో ఏదో ఒక విధంగా ఉండవచ్చు. లేదా ఈ ఐదు భావాలూ కలిసి ఉండవచ్చు.

గురుశిష్యుల సంబంధం వివిధదశలు

గురుశిష్యుల సంబంధంలో చాలా దశలు ఉంటాయి. అందులో మొదటిది పూర్తిగా తెలివితేటలు, తార్కికజ్ఙానదశ. ఇది అనుమానాల మీద అధారపడి ఉంటుంది. చాలా అనుమానాలు నిరంతరం వస్తూ ఉంటాయి. మీరు ఇలా అనుకోవచ్చు 'ఆ.....! ఈయనకి చూస్తే ముప్పై సంవత్సరాల వయస్సు, ఈయన ఏం గురువు? పెద్దగా చదువుకోలేదు. ఈయన చెప్పేది ఏ విధంగా లక్షల మంది వింటున్నారు?' ఇలా మీకు అనుమానాలు ఉంటాయి. తెలివితేటల దశలో అనుబంధం ఏర్పడదు.

తెలివితేటల తరువాతది మేధ లేదా వివేకదశ. వ్యతిరేక దృక్పథం నుంచి అనుకూల దృక్పథానికి వస్తుంది. 'ఆయన ప్రోగ్రాంకి వెళ్ళి అసలు ఏమి చెబుతున్నారో, ఎలా చెబుతున్నారో చూడవచ్చు కదా! అయన ఏం చెబుతాడు అనుకునేదాని నుంచి 'ఏదో' ఉండి ఉంటుంది, అనుకునే వైపు వెళ్ళటమే. నేను నమ్మను అనను, అలా అని నమ్ముతాను అనను. చూద్దాం అసలు అక్కడ ఏముందో అన్న దశ వివేకదశ.

దీని తరువాతది మేధ, దాంతో పాటు భావావేశాలు ఉంటాయి. అంటే 60% మేధ, 40% భావాలు ఉంటాయి. అప్పుడు గురువు మంచి స్నేహితుడుగా అనిపిస్తారు. నాకు సలహా అవసరమైనప్పుడు ఈయన మార్గదర్శిగా ఉంటారు అనుకుంటారు. నా జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు. ఈయన చెప్పనవసరం లేదు. కాని ఎప్పుడైనా అవసరం అనిపిస్తే ఈయన సహాయం తీసుకుంటాను. ఇదే గురువుని స్నేహితుడుగా చూసే దశ. దీన్నే సఖభావం అంటాను.

ఇది నడవటానికి ఉపయోగించే ఊత కర్ర లాంటిది. ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు కర్రని ఉపయోగిస్తారు. తరువాత పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మీకు మీరు పరిష్కారం తెలుసుకోలేనప్పుడు మీరు ఆయనతో, 'మీ బోధలు బాగున్నాయి. కాని వాటిని నేను పూర్తిగా అర్థం చేసుకొని అనుసరించలేకపోతున్నాను. నేను ఏం చేయాలి? అని అడుగుతారు. అప్పుడు ఆయన మీకు మానసికాధారాన్ని ఇస్తాడు. అప్పుడు కర్ర ఒకటే సరి పోదు మరికొంత ఆధారం కావాలి అనుకుంటారు. అప్పుడు ఆయన చేతిని అసరాగా తీసుకొని నడవటం ప్రారంభిస్తారు. ఆయన చేతిని పట్టుకున్నప్పుడు మీలో కృతజ్ఞతాభావం ఉంటుంది.

మీకు కేవలం కర్రరే ఉంటే అది భావావేశంతో ఉన్న మేధ, అది స్నేహభావం. మీరు ఆయన చేతిని పట్టుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఉన్నత స్థితికి లేపుతారు. అప్పుడు మేధతో కూడిన భావావేశంగా మారుతుంది. ఈ దశలో గురువు తల్లిగా, తండ్రిగా అనిపిస్తారు. స్నేహితుని దగ్గర నుంచి తల్లి, తండ్రి అనే భావం వైపు వచ్చాక అనుబంధం మరింత లోతు అవుతుంది. క్రమంగా మీరు ఈ విధంగా అనుకోవటం మొదలుపెడతారు. ఈయన కేవలం స్నేహితుడే కాదు. ఈయన సలహాలు ఇచ్చే వ్యక్తి మాత్రమే కాదు. ఈయన నన్ను సమస్యల నుంచి బయటికి తీసుకువస్తాడు.

పలుసార్లు మిమ్మల్ని సమస్యల నుంచి కాపాడాక, మీ ఊహలకి అందని సహాయం చేశాక ఆయన పట్ల మీ దృక్పథం కేవలం భావాత్మకమే అవుతుంది. ఆయన మీ హృదయంలో, మీ అంతరంగంలో నిండి ఉంటాడు. ఆ సమయంలో ఆయనికి ఒక సేవకుడుగా నమస్కరిస్తారు. అది సిగ్గుపడుతూ కాదు. మిమ్మల్ని మీరు అర్చించుకోగల వ్యక్తి దొరికినందుకు ఆయనకి అధీనమవుతూ గౌరవంతో నమస్కరిస్తారు. రామాయణంలో హనుమంతుడు, రాముని పట్ల ఇదే విధమైన దృక్పథంతో ఉంటాడు. అతను రామునికి పూర్తిగా అధీనమై ఉంటాడు. అటువంటి అనుబంధం లోతుగా భావాత్మకతతో ఉంటుంది. ఇది మరింత భావాత్మకమైంది.

క్రమంగా మీ అనుబంధం గురువులతో మరింత గాఢంగా లోతుగా ఉంటుంది. ఆయన రక్షణలో ఉంటారు. ఆయన శ్రద్ధ మీ మీద కావాలని అడగటం సహాయం కావాలి అని

గురుదేవులు – జీవన్ముక్తులు

అడగటం మాని ఆయనకి ఆధారంగా ఉండటానికి ఇష్టపడతారు. ఆయనని ప్రేమిస్తారు. ఇది సంపూర్ణమైన భావాత్మకదశ. తల్లి తన బిడ్డ బాగుని కోరే దృక్పథం ఇది.

ఈ నాలుగు స్థితుల్లో, తెలివితేటలు, మేధ, మేధ – భావాత్మకత ; భావాత్మకత– మేధ మీ జీవితం గురువుల జీవితం వేరువేరుగా ఉంటుంది. మీరు కేవలం ఆయన నుంచి సహాయం పొంది జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటారు, అంతే.

భావాత్మకదశ పరిణతిని పొందినప్పుడు, మీ జీవితం ఆయన నుంచి వేరు కాదు అని తెలుసుకుంటారు. భావాత్మకదశ నుంచి అంతరాత్మదశకి మారతారు. అప్పుడు మీరు ఆయన కోసం మీ జీవితాన్ని త్యాగం చేయాలి అనుకుంటారు. ఆయనకి మీ జీవితాన్ని అంకితమిస్తారు. అంతరాత్మదశలో ఆయనతో ఐక్యమవుతారు. ఇది తల్లీబిడ్డల మధ్య ఉన్న అనుబంధాని కంటే బలమైనది. స్త్రీపురుష భేదం తెలియకుండా వారి మధ్య ఉన్న లోతైన ప్రేమబంధం అది. దీన్నే నేను మధురభావం అంటాను. అంతరాత్మ దశలో, భావాత్మకత కలసిపోయే గాఢమైన అనుబంధం ఇది.

మధురభావం పరిణతి పొందితే మీకు ఆయనకి మధ్య భేదం కనిపించదు. ఇద్దరు వ్యక్తులు ఉండరు. ఆయన మీరు ఒకటే. అదే మహాభావం. మీరు గురుదేవులు ఒకటే అన్న అనుభూతి మహాభావం. మీరు అంతిమభావమైన 'తత్వమసి' అదే నీవు అన్న భావాన్ని అనుభవిస్తారు.

ఈ విధంగా ఒక దాని తరువాత ఒక దశలో గురుశిష్యుల బంధంలో మీరు అభివృద్ధి చెందుతారు. కాకపోతే ఏ సమయంలోనెనా ఏదో ఒక భావం అన్నింటి కంటే ప్రాముఖ్యంలో ఉంటుంది.

అందరూ సామాజికశక్తితోనే వృద్ధి చెందుతారు. కాని గురుదేవులతో ఉండే అనుబంధం ఎవరిది వారిదే. ఇదే ఇందులోని అందమైన విశేషం. అది రాముడు – హనుమంతుల మధ్య ఉన్న భావం లాంటి దాసభావం కావచ్చు. యశోదాకృష్ణుల మధ్య ఉన్న వాత్సల్యభావం కావచ్చు, కృష్ణార్జునుల మధ్య ఉన్న స్నేహభావం లేదా సఖభావం కావచ్చు, రామకృష్ణ కాళీమాతల మధ్య ఉన్న వాత్సల్య భావం కావచ్చు. లేదా రాధాకృష్ణుల మధ్య ఉన్న మధురభావమ్లె ఉండవచ్చు. ప్రతి భావం ప్రత్యేకమైందే. గురుశిష్యుల మధ్య అనుబంధం ఇలా ఏదైనా ఉండవచ్చు. ప్రతి శిష్యుడు తన మార్గంలో సత్యాన్వేషణని చేస్తూ అభివృద్ధి చెందుతాడు.

గురువులతో ఏ విధంగా ఉండాలి – విప్పారిన అంతరంగంతో ఉండాలి

మీరు గురువుల సమక్షంలో విప్పారి, తెరవబడిన, అంతరంగంతో ఉండాలి కాని బిగుసుకుపోయి, ముడుచుకుపోయి ఉండకూడదు. తర్కజ్ఞానాని కంటే చాలా గొప్పది జీవితం. మీ తర్కాన్ని వదిలేయండి. పూర్తిగా విప్పారి, ఎరుకతో ఉండండి. ఎప్పుడైతే మీరు తర్కాన్ని వదిలి విప్పారి ఉంటారో, జీవచైతన్యంతో ఉండే గురుదేవుల శక్తి మీలో మార్పుని తెస్తుంది. మీరు ఒక కొత్త వ్యక్తిగా, కొత్త శక్తిగా, కొత్త చేతనస్థితిగా రూపాంతరాన్ని, మార్పుని పొందుతారు.

ఈ విషయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు ఒక కొత్త వ్యక్తిగా అవుతారు. మీరు కొత్తగా, స్పష్టంగా ఉండే ఒక న్యూక్లియర్ అవుతారు. మీరు తేలికగా అవుతారు. మీలో ఒక భాగం కాని కణితల్ని మోస్తూ ఉండే మీరు, ఆ కణితల బరువు వదిలించుకున్నారు. మీలో సహజమైన భాగం ఎప్పుడూ మీ నిశ్చలత్వాన్ని భంగపరచదు. అలా భంగపరచేది మీలో భాగం కాదు.

కాబట్టి వికసించి ఉండండి. తెరవబడిన అంతరంగంతో ఉన్నప్పుడు మాస్టర్ మీలో మీరు జన్మ జన్మల నుండి మోస్తున్న కణితల్ని తొలగిస్తారు. మీరు గురుదేవుల సమక్షంలో సంపూర్ణంగా ఉండండి. గురువులు చెప్పే విషయాన్ని మీరు ఒప్పుకుంటారా లేదా అని కాదు. దీనికి అతీతంగా వెళ్ళండి. మీరు సూర్యోదయాన్ని చూసినప్పుడు దాన్ని ఒప్పుకోవటం, ఒప్పుకోకపోవటం అని ఏదైనా ఉంటుందా? లేదు! అది అదే, అంతే. ఒకసారి ఆ భావం మీలో ఒక భాగమైతే చాలు, ఇక ఏదీ అవసరం లేదు. మిమ్మల్ని మీకు తెలియచేసే అనుమతిని, గురువుకి మీరు ఇచ్చినట్లే. శిష్యుడుగా ఉండటం అంటే పూర్తిగా విప్పారి ఉండాలి. భయపడకూడదు. మిమ్మల్ని మీరు దాచకూడదు. మీరు పూర్తి నిజాలతో విప్పారి ఉండాలి. అప్పుడే గురువు మీ మీద పనిచేయగలరు. మీరు చేయగలను అని ఊహించలేని దిశ వైపుగా ఆయన మిమ్మల్ని తిప్పతారు. మీరు భయపడే దశలోకి వెళ్ళగలిగే ప్రేరణని ఆయన మీకు ఇస్తారు. హద్దులు లేవు అని మీరు తెలుసుకునే అంతిమ స్థితికి మీరు చేరేవరకూ ఆయన మీ హద్దుల్ని విస్తృతం చేస్తూ ఉంటారు. అప్పుడు మీరు కూడా ఆయనలా అవుతారు. మీరు పూర్తి స్వేచ్ఛని పొంది, హద్దులు లేని పరమహంస అవుతారు. మీరు చేయవలసింది కేవలం గురుదేవులకి, సర్వాంతర్యామికి తెరవబడిన అంతరంగంతో ఉంటే చాలు. ఈ విశ్వాసం ఉంటే మీకు సర్వాంతర్యామికి మధ్య వారధి ఏర్పడుతుంది.

ఒక చిన్న కథ : ఒక శిష్యుడు గంగానదిలో పడిపోతాడు. అతని గురువుగారు గంగ ఒడ్డున కూర్చొని ఉంటాడు. ఆయనని చూసి శిష్యుడు 'రక్షించండి! రక్షించండి! భగవంతుడా రక్షించు, గురుదేవా రక్షించండి' అని గట్టిగా అరుస్తాడు.

అప్పుడు గురువుగారు ఆ శిష్యుడితో 'మూర్ఖుడా! లేచి నిలబడు. నిన్ను నీవు రక్షించుకో' అని అంటాడు. శిష్యుడు గురువుతో గట్టిగా, 'మీ పాఠాలు తరువాత బోధించండి. ముందు నన్ను రక్షించండి. నా జీవితం ప్రమాదంలో ఉంది. నన్ను రక్షించండి, చాలు' అని అరుస్తూ అడుగుతాడు. గురువుగారు అక్కడి నుంచి కదలకుండా అదే మాట అంటాడు, 'మూర్ఖుడా! నిన్ను నీవు రక్షించుకో. నిలబడు' అంటాడు. అప్పుడు శిష్యుడు గురువుతో, 'మీరు నా గురుదేవులు

గురుదేవులు – జీవన్ముక్తులు

అనుకున్నాను. దయచేసి నన్ను రక్షించండి రక్షించండి' అని అడుగుతాడు. గురువుగారు పెద్ద గొంతుతో 'మూర్ఖుడా! లేచి నిలబడు' అని అరుస్తాడు. శిష్యుడు భయపడి లేచి నిలబడతాడు. చూస్తే నీళ్ళు అతని నడుము వరకే ఉంటాయి.

మీరు కూడా ఇదే విధంగా పోరాడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు కూడా నీళ్ళలో పడి అవి నడుము లోతు మాత్రమే ఉన్నాయని తెలియక పోరాడతారు. మీరు గురువుల మాట విని నిలబడినప్పుడే, నీళ్ళు నడుము వరకు మాత్రమే ఉన్నాయని తెలుసుకొని రిలాక్స్ అవుతారు. మీరు మీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి అనుకునే సమస్యలు అసలు లేవు. అవన్నీ మీ ఊహలు. అవి ఏవీ కూడా నిజం కావు. కాబట్టి అర్థంచేసుకోండి, నేను చూసుకుంటాను (ఐ విల్ టేక్ కేర్) అని నేనంటే దాని అర్థం మీకు కర్రనిస్తున్నారు. దాని సహాయంతో లేచి నిలబడమని అర్థం. గురువులు నేను చూసుకుంటాను అన్నప్పుడు మీరు అనుమానిస్తే మీరు లేచి నిలబడే అవకాశాన్ని పొగొట్టుకున్న వారవుతారు.

గురువుల సమక్షంలో మీలోని సంస్కారాలు కాలిపోతాయి

రమణమహర్షి జీవితం నుంచి ఒక చక్కని సంఘటన.

ఒక శిష్యుడు రమణపురాణం రాస్తూ ఉంటాడు. అతనిలో రచయితకి ఉండే అహంకారం ఉండి ఒక చోట రచన ఆగిపోతుంది. మీరు అహంకారంతో రాసినప్పుడు ఎక్కడో ఒక చోట రచన ఆగిపోతుంది. అతను రమణమహర్షి దగ్గరకి వచ్చి 'భగవాన్, నేను రచనని కొనసాగించలేకపోతున్నాను. దయచేసి సహాయం చేయండి' అని వినయంగా ప్రార్థిస్తాడు. రమణ భగవాన్ అతనితో, 'ఆ కాగితాలు అక్కడ పెట్టి వెళ్ళు. నీతో తరువాత మాట్లాడతాను' అంటారు. శిష్యుడు ఆ కాగితాలు అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. మర్నాడు అతను వచ్చే సరికి ఆ పద్యం పూరించబడి ఉంటుంది. అంటే అందులో 300ల లైన్లు రమణమహర్షి రాసారు. ఆ ‌గ్రంథాన్ని ప్ర‌చురించాక ఈ 300ల లైన్ల‌ని కొటేష‌న్స్‌లో పెట్టి క్రింది 'ఈ 300ల లైన్లు భ‌గ‌వాన్ రమణమహర్షి రాసారు' అని రాయిసాడు.

భగవాన్ ఆ పుస్తకాన్ని చూసి, అతనితో, 'ఓహో! అయితే మిగిలినవన్నీ నీవు రాసావా! అంతేనా!' అని అంటారు. ఆ శిష్యుడు ఆ తరువాత ఒకసారి ఈ విధంగా అన్నాడు, 'ఆయన ఆ మాట అన్నప్పుడు నాలో ఏదో జరిగింది. కళ్ళలో నీరు ధారలా కారింది. నేను భగవానుని పాదాల మీద వాలిపోయాను, మరలా పైకి లేవలేదు'.

ఆ ఒక్క మాటతో మురుగనార్ అనే ఆ శిష్యుడు జ్ఞానోదయాన్ని పొందాడు. ఒక విషయం అర్థం చేసుకుంటే రచయితని అనే అహంకారపు సంస్కారం మురుగన్‌లో ఉన్న విధంగా మీలో కూడా చాలా సంస్కారాల్ని మీరు మీ లోపల మోస్తూ ఉంటారు. మీరు సంస్కారాలలో చిక్కుకుపోయి ఉన్నట్లయితే గురుదేవుల సమక్షంలో ఉండండి. మీకు పూర్తి చికిత్స జరుగుతుంది.

అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే ఆ సంస్కారం కనీసం మీలో ఉన్నది అని కూడా తెలుసుకోనీయదు. అది తాను ఉండటాన్ని సమర్థించుకుంటుంది. అది దాని జీవితసమస్య, అందుకే నేను ఎప్పుడూ చెబుతుంటాను. ఇటువంటి బలమైన సంస్కారాలలో చిక్కుకున్నప్పుడు, ముఖ్యంగా మిమ్మల్ని ముందుకి నడిపే కోపం, మోహం, భయం, ఆశ, అసూయ, నిరాశ – ఇటువంటి సంస్కారాలలో చిక్కుకుని ఉన్నప్పుడు పెద్ద వెద్ద నిర్ణయాలు చేయవద్దు అంటాను. మీరు గురువుల సమక్షంలో ఉండండి, ఆ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు. మీరు పూర్తిగా చికిత్స చేయబడి అందులోంచి బయటకి రాగలుగుతారు. మీరు సంస్కారాలలో చిక్కుకున్నప్పుడు గురువుల సమక్షాన్ని పోగొట్టుకోవద్దు.

ఎవరైనా డిప్రెషన్‌లో ఉన్నప్పుడే నన్ను వదలి వెళ్ళిపోతే ఆ వ్యక్తి గురించి నేను చాలా అనుకుంటాను. అంటే ఈ మిషన్‌కి ఒక వ్యక్తి తగ్గిపోయాదు అని కాదు, అతని లోతైన నిరాశలో ఉండగా వెళ్ళినందుకు. అదే వ్యక్తి సంతోషస్థితిలో ఉన్నప్పుడు నన్ను వదిలి వెళితే పరవాలేదు. అది సాధారణ బంధం. అతను ఎక్కడికి వెళ్ళినా నన్ను తనతో తీసుకువెళ్ళగలుగుతాడు. అదే ఆ వ్యక్తి నిరాశలో ఉంటే, అతను వృద్ధి పొందలేదు. అంతే కాదు, ఆ సంస్కారం నుంచి బయటకి రాలేదు. అది అతనిలో ఒక పెద్ద గాయం అవుతుంది. వేడి పాలతో మూతి కాల్చుకున్న పిల్లి, తిరిగి పాల వైపు వెళ్ళదు. ఈ వ్యక్తి కూడా అదే స్థితిలో ఉంటాడు.

మీ మూడ్ బాగా లేనప్పుడు నిర్ణయాలు చేయవద్దు. అది నిజాలని మీ నుంచి చెదరగొడుతుంది. నిర్ణయాలు చేయటానికి అది సరియైన సమయం కాదు. మీ మనః స్థితి బాగు అయ్యేవరకూ వేచి ఉండండి. అప్పుడు విషయాలు స్పష్టంగా ఉంటాయి. మీరు మానసికోల్లాసాన్ని కలిగి ఉన్నప్పుడే గట్టి నిర్ణయాన్ని తీసుకోండి. నిర్ణయాన్ని తీసుకునే ముందు మానసిక స్థితి దానిని స్వీకరించే స్థితిలో ఉండాలి. మనం చీకటి రాత్రిలో నిద్రలో ఉండి కాకుండా మేలుకొని ఉండి పగటి వెలుగులో నిర్ణయాలు తీసుకున్నట్లుగానే అవి ఉండాలి.

స్పష్టత కలిగి ఉండాలి. తక్కువ భావోద్వేగం కూడా తీవ్రభావోద్వేగంలానే ఉంటుంది. అది మానసిక సహజత్వం, చక్రంలాంటిది. క్రిందనున్నది పైకి వస్తుంది. పైనున్నది గొప్పదనికాని క్రిందనున్నది అల్పమైనదని కాని చెప్పడానికి వీలులేదు. అవి రెండూ ఉన్నాయి అంతే. కలిగి ఉన్నదాన్ని విశ్వసించడం నీకు గల గొప్ప అవకాశం.

మానసికస్థితి సరిగా లేని సందర్భంలో కొంతమంది వాటిని వదిలివేయాలనుకుంటారు, కాని వచ్చిన సమస్యల్లా మనసుతోనే. మానసిక స్థితి బాగుపడినప్పుడు తిరిగి అతను తన నిర్ణయాన్ని మార్చుకోవాలనుకుంటాడు కాని, అసాధ్యమవుతుంది. ఎందుకంటే అతను ఆత్మన్యూనతలో పడిపోయి, తిరిగి పూర్వపుస్తితికి చేరుకోగల అర్హతలేదనుకుంటాడు.

మీ మానసికస్థితి బాగా లేకున్నా మీరు వదిలిపెట్టొద్దని నేను ఎప్పుడూ చెబుతుంటాను. మీరు మానసిక ఆందోళన కలిగి ఉన్నప్పుడు నా సన్నిధిలో ఉండడమే మంచిదని భావిస్తాను.

నానుండి మీరు దూరంగా ఉండాలనుకోవడం అంటే మీరు జబ్బు పడివుండి కూడా వైద్యుడి దగ్గరకు వెళ్ళడానికి నిజంగా అదే సరియైన సమయం.

చొరవ అంటే ఏమిటి?

మిమ్మల్ని మీరు స్వస్థత పొందాలి అనుకున్నప్పుడు, మీ అంతరంగానికి స్వస్థత చేకూరాలన్నప్పుడు. మీరు జీవితాన్ని శక్తిమంతం చేసుకోవాలి. బాహ్య ప్రపంచం నుండి అడ్డంకులు వస్తూ ఉండడం మీరు చాలాసార్లు చూస్తూనే ఉంటారు. మనసులోని పాత జ్ఞాపకాలు మీలో నుండి శక్తిని తొలగించవచ్చు.

ఇంకో విషయం ఒకేసారి అనేక నిర్ణయాలు తీసుకోవడం కూ మీరు మీ శక్తిని కోల్పోయేలా చేయవచ్చు. ఇలా మీరు చేయవచ్చు. మీ ఆఫీసుకి వెళ్ళి కూర్చోండి. ఏ పనీ చేయకండి. కేవలం ఒక ఐదారు ముఖ్య నిర్ణయాలు మాత్రం తీసుకోండి. మీరు అలసిపోయినట్లుగా భావిస్తారు.

నిజాలు, ఆలోచనలే మిమ్మల్ని అలాంటి అలసట చెందిన మానసిక స్థితి అనే దాని నుండి బయటకు తెచ్చి మీలో బలాన్ని విశ్వాసాన్నిస్తాయి. వాటినే నేను 'శాస్త్రస్త్రాలని' లేక జ్ఞానాయుధాలని పిలుస్తాను.

నిజాలనేవి మిమ్మల్ని మానసిక ఆందోళననించి బయటికి తేవడమే కాకుండా, మానసిక ఆందోళనలకి మూలమైన వాటిని శాశ్వతంగా నిర్మూలించే మంత్రాలని నేను అంటాను. మానవాళికి మార్గాన్ని నిర్దేశం చేసే శబ్దాలే మంత్రాలు. గొప్ప అనుభూతితో వెలువడిన ఏ మంత్రమైన, అది పరిశుద్ధమై అంతరంగం నుండి వెలువడినదెవుంటే, దాన్ని గురించి ఏమిటి? ఎందుకు? అని ప్రశ్నించకుండా అకస్మాత్తుగా అది పని చేయడం మీరు చూస్తారు.

వెంటనే మీలో ఓ 'మెరుపు ఆలోచన' వచ్చి మంత్రం వల్లెవేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అది నిజంతో కూడుకున్న సహజమైన పదాల ఉచ్ఛారణ అయి ఉండాలి. అది మీ ఆంతరంగికం నుండి పైకి తెచ్చేదిలా ఉండాలి. మొదటి సారిగా మీరు ఆ నిజాన్ని విన్నప్పుడు చలించిపోతారు. అది మిమ్మల్ని మీ అంతరంగాన్ని, అక్షరాలవిస్ఫోటం కలిగిస్తుంది. దాన్ని మీరు మరచిపోలేరు. మీరు ఎలా వింటారో అలానే నివసించడం మొదలుపెడతారు.

ఏ ప్రయత్నం లేకుండానే మీ జీవితంలో మార్పు వస్తుంది. అదే మంత్రం యొక్క శక్తి. ప్రారంభంలో మీ తర్కజ్ఞానం ఒక పక్కన పోరాడుతూనే ఉంటుంది. ఎందుకంటే సత్యాన్ని మీరు ఒప్పుకుంటే అది మీ జీవితం ద్వారా వెల్లడికావటం ప్రారంభిస్తుంది. మీ ప్రాముఖ్యాలే నిజమైన జీవితం అని మీరు అనుకునే విషయాలు వాటి మనుగడ అనుమానాస్పదం అవుతుంది. కాని మీ అంతరాత్మ అర్థం చేసుకోగలుగుతుంది. దానికి క్లిక్ తెలుస్తుంది. అది చెప్పేది నిజం అని నాకు తెలుసు అని అంటుంది. మీ మనస్సులో ఒక మూల అనుమానం ఉండవచ్చు. కాని మీ అంతరాత్మ ఆ సత్యంతో బంధాన్ని ఏర్పరచుకోగలుగుతుంది. మీరు మీ తార్కికజ్ఞానంతో

అర్థం చేసుకోలేరు, కాని అకస్మాత్తుగా ఆ మాటలకి, ఆ భావాలకి మీ హృదయం స్పందించి వాటితో ఏకం అవుతుంది.

గురువుగారి మాటలకి, బోధలకి అకస్మాతుగా ఏర్పడే క్లిక్స్‌నే నేను దీక్ష అంటాను.

దీక్ష అంటే గొప్ప సత్యాలు, మాటలు, మిమ్మల్ని సత్యం వైపు తీసుకువెళ్ళటం, మీకు ఆ సత్యం వైపు తీసుకువెళ్ళే మార్గాన్ని చూపిస్తుంది. దాన్ని అనుభవంతో పొందినప్పుడు, కనీసం ఒకసారైనా శక్తిమంతమైన ఒక అనుభవం, మీ తార్కికజ్జానానికి అందని అనుభవం జరిగి మీలోని పాపంచికకోరికలలో మార్పు జరిగితే అప్పుడు మీ లోపల దీక్ష జరిగింది అని అర్థం. మీరు దీక్షని పొందారు అని అర్థం. నేను దీక్ష అన్న మాట అనగానే మీలో చాలా అనుమానాలు వస్తాయి. నేను ఇంతకు పూర్వమే మరొక గురువు దగ్గర దీక్ష పొందాను, మరి మీ దగ్గర కూడా నేను దీక్ష పొందవచ్చునా? మీ దగ్గర దీక్ష తీసుకుంటే, మరొక గురువు దగ్గరకి నేను వెళ్ళవచ్చునా? నేను ఇంకా కొత్తవి నేర్సుకోవచ్చునా? ఇలా చాలా అనుమానాలు మీలో కలుగుతాయి.

చక్కగా చేయవచ్చు అది తప్పు కాదు. నేను ఎప్పుడూ చెబుతుంటాను, అన్ని తోటల లోనికీ వెళ్ళి మంచి పూలని తెచ్చుకొని మీకు అందమైన పూలమాలని తయారుచేసుకోండి. ఇదేమీ దుకాణం కాదు. ఒక షాపుకు వెళితే మీరు కొనవలసినవి పూర్తి అయ్యేంతవరకూ ఆ షాపు యజమాని మిమ్మల్ని వదలదు. కాని ఇది షాపు కాదు. మనిషిలోని అహం చాలా పెద్దది. దాన్ని పదిమంది గురువులు కొడితే కాని అది తగ్గదు. కాబట్టి చాలా మంది గురువుల దగ్గరకి వెళ్ళండి, అన్ని మంచి విషయాలూ నేర్చుకుని మీ జీవితాన్ని ఐశ్వర్యవంతం చేసుకోండి. అయితే ఏదో విండో షాపింగ్ చేస్తున్నట్ట కాదు. అలా చేస్తే మీరు జీవితంలో ఏదీ నేర్చుకోలేరు. ఎవరి నుంచీ ఏమీ తెలుసుకోలేరు.

సత్యాన్వేషకులకి జరిగే మొదటి మార్పు, వారిలోని ప్రశ్నలన్నీ కరిగిపోతాయి. ప్రశ్నలు కరిగిపోయి దాహం మిగులుతుంది. ఎప్పుడైతే గురువులు మీలో దీక్షని కలిగిస్తారో అప్పుడు ముందుగా జరిగేది మీ ఏకాగ్రత – జ్ఞానం నుంచి తెలుసుకోవాలి అనే విషయం మీదకి, జ్ఞాపకం ఉంచుకోవాలి అనే అంశం నుంచి వివేకానికి మారుతుంది.

ఒకసారి మీ ఏకాగ్రత జ్ఞానం నుంచి తెలుసుకోవాలి అనే విషయం మీదకి మారగానే, ఒక దాని గురించి కాకుండా లోతుగా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. మీ గురించి తెలుసుకోవటానికి ఆసక్తి చూపిస్తారు. దానికి గురువుల సహాయాన్ని ఉపయోగించుకుంటారు. మీరు గురువులకి దగ్గర అయ్యే కొద్దీ ఆయన మీ గురించి మీరు తెలుసుకోవటానికి అతీతంగా మిమ్మల్ని తీసుకువెళతారు. మీరంటే మీకు ఉండే ఆ గుర్తింపు మీద అతి మక్కువని వదిలే వరకూ మీరు అంటే ఏమిటో తెలుసుకోలేరు. అదే మీ అహంకారం అంతిమదశ మీలో కలగాలి అంటే మీరు అహాన్ని వదలి, దాన్ని గురుదేవుల పాదాల దగ్గర అధీనం చేయాలి. మిమ్మల్ని మీరు మరిచిపోయినప్పుడే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు.

గురుదేవులు – జీవన్ముక్తులు

అంతిమ ప్రేమవ్యవహారం

మీ అంతరాత్మ తపనని తృప్తి పరచగలిగే వ్యక్తి గురువు. అది లోతైన, సున్నితమైన ప్రేమవ్యవహారం. మీరు మీ ప్రేమలో గురువులకి దగ్గర అయ్యేకొద్దీ, విశ్వాసంతో దగ్గర అయ్యేకొద్దీ మీలో లోతైన నిశ్శబ్దం ప్రారంభమవుతుంది. అది జీవంలేని శ్మశాన నిశ్శబ్దం కాదు. జీవచైతన్యంతో ప్రతిధ్వనించే జీవితం, ప్రేమల నిశ్శబ్దం.

మీ జీవితలక్ష్యాన్ని తెలుసుకునే కొద్దీ మీ జీవితం ఉత్సవంలా ఉంటుంది. ఎటువంటి కారణం లేకుండానే మీలో లోతైన ఆహ్లాదకర ఆనందం కలుగుతుంది. మీ లోపల లోతైన అనంతమైన ఆనందసాగరాన్ని కనుగొని, ఆ ఆనందాన్ని అందరికీ పంచిపెడతారు. మిగిలిన సంబంధబాంధవ్యాలలో ఈ ఆహ్లాదాన్ని, ఈ బంధాన్ని ఏదో కొన్నిసార్లు మీరు అనుభవించి ఉంటారు. అయితే అది గురుదేవుల బంధంలో కలిగినప్పుడు చాలా గాఢంగా ఉండి, అది మరొక ఉన్నతస్థితిలో జరుగుతుంది.

గురుశిష్యుల సంబంధం చాలా లోతైన అన్యోన్యమైన అనుబంధం. గొప్ప ప్రేమికుల మధ్య కూడా అంత అన్యోన్యత ఉండదు, ఎందుకంటే అది రెండు అహంకారాల మధ్య ఉన్న ప్రేమ. అహంకారాలు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాయి. ఎందుకంటే అవి రెండూ స్వతంత్రమైనవి. కాని గురువు అంటే ఒక వ్యక్తి కాదు. అక్కడ ఏమీ 'నేను' అని ఉండదు. ఆయనలో అహం అనేది లేదు. కాబట్టి గురుశిష్యబంధంలో ఒకే అహం ఉంటుంది. అది మీరు ఆయన లక్ష్యం దాన్ని కరిగించి మిమ్మల్ని కూడా 'ఎవరూ కాని' వ్యక్తిగా చేయటమే.

గురువుగారి కరుణతో, గాఢతతో అహంకారాన్ని కరిగించేటప్పుడు వారి మధ్య ఉన్న బలమైన బంధమే శిష్యుడిని పట్టి ఉంచుతుంది. అక్కడ గురువు లేదు, శిష్యుడు లేదు, అంతా ఒక పూర్ణత్వం. ఆ పూర్ణత్వం విశ్వాసాన్ని తనలో ప్రతిధ్వనింపచేస్తుంది. ఒకసారి నిజమైన అనుభూతి గురుదేవుల అనుబంధంలో మీ లోపల వికసిస్తే, మీరు ఎవరితోనైనా నిజాయితీతో, ప్రేమతో బంధాల్ని ఏర్పరచుకోగలరు. మీకు మనుషులతో, చెట్లతో, రాళ్ళతో, సర్వసృష్టితో ఉండే అన్ని రకాల బంధాలలోనికీ మీలో వికసించిన పరిమళాలు వెళతాయి.

అద్భుతమైన క్షణాలు

జీవితంలో అద్భుతమైన క్షణాలు శిష్యుడికి గురువు పట్ల విశ్వాసం, ప్రేమ కలిగిన క్షణాలు. ఈ బంధం ప్రపంచం నుంచి విశ్వరహస్యాలకి అతీతంగా వెళ్ళే బంధం. అది విశ్వంతో నాట్యం చేస్తూ అంతా జరుపుకునే ఒక మహా ఉత్సవం. ఇది ఎలా ఉంటుందంటే సాగరసంగమానికి నాట్యం చేస్తూ అత్యుత్సాహంతో పరుగున వచ్చే నది ఆ సాగరంలో ఒకటిగా అవటం లాంటిది. గురువులకి దగ్గరగా రావటం, తాను గురువుగా మారగల మార్గం విశ్వంతో ఐక్యమవ్వటమే ఈ బంధం. గురుశిష్య బంధంలో అందమైన విశేషం ఏమిటంటే అది ఆశించటాలు, ఇవ్వటం – తీసుకోవటం అనే విషయాలతో కల్మషం కాని స్వచ్చమైన బంధం. గురుదేవులు నిన్ను నీవుగానే స్వీకరిస్తారు. ఆ బంధంలోని సత్సంకల్పన నిన్ను మరొకలా చేయాలనే ప్రయత్నం ఉండదు. మీరు గురువుల్ని ఎందుకు ప్రేమిస్తారంటే ఆయన మీకు సంపూర్ణ స్వేచ్ఛని ఇస్తారు. నిన్ను నీవుగా ఉంచే స్వేచ్ఛ. నీకు ఎటువంటి బంధాలూ లేనిది. అందుకే గురుదేవుల్ని కలిసినప్పుడు నిత్య తాజాదనం, శాశ్వతమైన దివ్యప్రేమవ్యవహారం. ఇది సర్వాంతర్యామితో ప్రేమవ్యవహారం.

గురుశిష్యుల బంధం యొక్క శక్తిని సోదరి నివేదిత ఈ విధంగా వివరించారు: వస్తువులు, విషయాల పట్ల ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోతుంది; తమ అలవాటుగా ఉండే ఆలోచనసరళి అకస్మాత్తుగా అతన్ని వదలివెళ్ళిపోతుంది. దాని స్థానంలో ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుంది. ఇదంతా ఎటువంటి వాదాలు, వివరణలు, బోధనలూ అనేవి లేకుండా, ఆ విషయానికి సంబంధించి ఒక్కమాట మాట్లాడకుండా జరుగుతుంది. చర్చలు లేకుండా కేవలం గురువుల సమక్షంలో ఉండటంతోనే శిష్యునిలో జ్ఞానవృద్ధి జరుగుతుంది.

గురువులు – జీవించి ఉన్న ప్రమాణం

ఇది ఈ విధంగా ఉంటుంది; విత్తనం పగిలి, మొలకెత్తి, చెట్టు కావాలి అని ప్రయత్నిస్తుంది. అది చెట్టుతో, 'దయచేసి నీవు ముందు బయటికి రా, ఆ తరువాత నేను పగిలి మొలకెత్తుతాను. నేను పగిలి మొలకెత్తాక నీవు వస్తావని నమ్మకం ఏమిట? నేను చనిపోయి మాయం అవుతానేమో' అని అంటుంది. చెట్టు విత్తనంతో, 'అలా కుదరదు. నీవు పగలకుండా నేను రాలేను. ముందు విత్తనం పగలాలి' అంటుంది. అప్పుడు విత్తనం, 'కుదరదు, నీవు ముందు బయటికి రా, ఆ తరువాత నేను మొలకెతుతాను' అంటుంది. ఈ విధంగా ఈ రెండింటి మధ్య పోరు అలా జరుగుతూనే ఉంటుంది.

విత్తనానికి పగలాలి అంటే భయం ఎందుకంటే తాను చనిపోతానేమో, చెట్టుగా తయారవనేమో అని. చెట్టు 'నీవు పగలకపోతే నేను రాలేను' అంటుంది. వీరిద్దరి మధ్య పోరు అలా కొనసాగుతూ ఉంటుంది.

గురువు ఒకప్పుడు విత్తనం దశలో ఉన్న వ్యక్తి. ఆ తరువాత వృక్షంలా అయ్యారు. మనం విత్తనాల వంటివారం. ఆయన విత్తనాలకి హామీ ఇస్తారు, భయపడవద్దు. నేనూ మీలాగానే ఉండేవాడిని. నేను విప్పారే ధైర్యంతో ఈ విధంగా అందమైన వృక్షాన్ని అయ్యాను. కాబట్టి విప్పారండి. విరామంగా ఉండండి. మీరు వృక్షంలా అవుతారు కాని చనిపోరు.' ఈ విధంగా ఆయన మనకి హామీ ఇచ్చి నమ్మకం పెంచుతారు. గురుదేవులు అంటేనే ఒక ప్రమాణం, ఒక హామీ, ఒక ఆదర్శం. ఆయన మీకు ప్రమాణం చేస్తున్నారు, 'విప్పారండి. మీరు ఎప్పటికీ మరణించరు. '

అహంకారానికి, అసూయకి అతీతంగా

గురువుల ప్రేమ ఒక్కటే ఎటువంటి నిబంధనలూ లేని ప్రేమ. అది నిస్వార్థమైనది. ఎటువంటి ఆశించటాలూ లేకుండా ఇవ్వటమే కాని అడగటం లేని ప్రేమ. అది బంధాలు లేనిది, నిరంతరం ప్రకాశించే ప్రేమ. మీరు ఉన్నా లేకపోయినా అది ప్రకాశిస్తూ ఉంటుంది. మీరు చేయవలసినది కేవలం మీ పాత్రతో నిలబడి దాన్ని మరలా మరలా నింపుకుంటూ ఉండటమే.

తీసుకోవటానికి మగవారిలో ఉండే అడ్డంకు అహంకారం. స్త్రీలతో పోల్చి చూస్తే భావాత్మతకి మగవారు తక్కువ ప్రభావితులవుతారు. వారు తెలివితేటల నుంచి పని చేస్తారు. ఒకరికి సమర్పించుకోవటానికి లేదా ఒకరిని గురువుగా ఎటువంటి నిబంధనలూ లేకుండా స్వీకరించటం అనేది మనస్సుకి సాధ్యం కాదు. హృదయం దాన్ని స్వీకరిస్తే తప్ప మనసు అంగీకరించదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనస్సు స్థాయిలో ఉంటాడో, అర్పించుకోవటం అంటే తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవటం, తన గుర్తింపుల్ని వదులుకోవటం అది తన అహం మరణించటమే. దాన్ని పోగొట్టుకోవటం చాలా పెద్ద విషయం. అయితే ఈ విషయాన్ని తెలుసుకునే తత్వంతో చూడగలిగితే, తాను ఏది కోల్పోతున్నాడో తెలుసుకుంటే అలా కరిగిపోయి, తనని తాను సమర్పించుకోవటం సాధ్యమే.

ఇక స్త్రీల విషయానికి వస్తే, సొంతం చేసుకోవటం, అసూయ అనేవి గురువుగారికి, ఆమెకి మధ్య ఉన్న ప్రమాదకరవిషయాలు. స్త్రీ గురువు రూపానికి అతీతంగా, రూపం లేని స్థితిని చూడగలగాలి. రూపాన్ని పట్టి ఉంచాలి – అనే విషయానికి అతీతంగా ఆయన ప్రేమని, కరుణని అందరితో పంచుకుంటూ, అసూయ లేకుండా ఆధ్యాత్మికంగా ఎదగగలగాలి. మీలో పైకి వచ్చిన తరువాతే మిమ్మల్ని వదిలివేస్తాయి. అవి మీలోపల లోతుగా దాగి ఉంటే అవి మిమ్మల్ని వదలవు. గురుదేవులతో అనుబంధం వృద్ధిచెందే కొద్దీ తెలివైనవారు ఈ భావాల్ని స్వచ్ఛమైన ప్రేమగా మార్చుకుంటారు. అప్పుడే వారు గురుదేవుల స్వచ్ఛమైన ప్రేమని అనుభవించగలరు. అంతవరకూ వారిలోని అధీనపరచుకోవాలనే భావం, అసూయ, స్వచ్చమైన ప్రేమ అనుభవానికి అడ్డంగా ఉంటాయి.

గురువుగారు అంటే ఒక నది వంటివారు. మీరు చేతులు విప్పి ఉంచితే నదిలో నీరు స్వేచ్ఛగా మీ చేతులలో నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీరు నిరంతరం మీ చేతులలో ఉంటుంది. నీటిని పట్టి ఉంచాలి అని చూస్తే దాన్ని పోగొట్టుకుంటారు. గురుదేవుల నుంచి ఎటువంటి అటంకం లేకుండా మీకు ఎంత కావాలో అంత మీ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పట్టి ఉంచాలి అని చేతులు మూసారో, మీరు నదిని పోగొట్టుకుంటారు. గురువుని కూడా మీరు జీవనప్రవాహంలో ఒక అందమైన భాగంగా ఎంచి గురుదేవుల ప్రేమని పొంది ఆ ప్రేమలో ఆనందాన్ని పొందవచ్చు.

మీ జీవితలక్ష్యానికి, గురువులకి అనుగుణంగా మేలుకోవాలి

ఒక విషయం అర్థం చేసుకోండి, శిష్యులకి తమ అజ్ఞానం తెలియదు. ఎందుకంటే వారు చీకటిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ బాధ్యత వెలుతురులో ఉన్న వ్యక్తిదే కాని చీకటిలో ఉన్న వ్యక్తిది కాదు.

ఒక చిన్న కథ: ఒక వ్యక్తి జన్మతః అంధుడు. హిమాలయ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాడు. ఒకసారి అతను కర్ర కోసం వెతుకుతూ ఉంటాడు. అతని మీద మంచుకి గడ్డ కట్టిన పాము కనపడుతుంది. అతను దాన్ని కర్ర అనుకొని దాని సహాయంతో నడుస్తాడు. జ్ఞానోదయమైన యోగీశ్వరుడు అతన్ని చూసి 'ఓ మూర్ఖుడా! నీవు పట్టుకున్నది కర్ర కాదు పాము. దాన్ని పారవేయి' అంటాడు. ఆ అంధుడు, యోగి మీద అరుస్తాడు. 'ఏమీ కాదు. బహుశః నీ దగ్గర కర్ర లేదు కాబోలు, నేను దీన్ని పారవేస్తే నీవు తీసుకుందామని అనుకుంటున్నావు. అందుకే నన్ను పారవేయమని చెబుతున్నావు' అంటాడు. అప్పుడు యోగీశ్వరుడు, 'మూర్ఖుడా! నాకు అది అవసరం లేదు, అది కర్ర కాదు పాము. త్వరలో సూర్యుడు పైకి వస్తాడు. ఆ వేడికి పాము బయటికి వచ్చి నిన్ను చంపుతుంది' అంటాడు. అయినా ఆ వ్యక్తి నమ్మదు. అప్పుడు యోగి, 'నీవు నన్ను నమ్మకపోయినా నిన్ను రక్షించవలసిన బాధ్యత నాది' అని దాన్ని అతని చేతి నుంచి లాగేయబోతాడు. ఆ వ్యక్తి దానితోనే యోగీశ్వరుని కొడతాడు. అప్పుడు యోగీశ్వరుడు, 'నీవు నన్ను కొట్టినా నిన్ను కాపాడవలసిన బాధ్యత నాది' అని అతని చేతిలో పాముని లాగి దూరంగా పారవేస్తాడు.

మీకు తెలియదు, ఒక గురువుని చేరటానికి మీరు ఎన్ని జన్మలు బాధపడ్డారో, ఎన్ని జన్మలు ప్రార్ధనలు చేసారో. మీ లోపలి నిజమైన కోరిక ఏమిటో కూడా మీకు తెలియదు. ఒక విషయం అర్ధం చేసుకోండి. మీ జీవితంలో ఒక గురువు తారసపడటం అనేది, ఆషామాషి విషయం కాదు. జీవించి ఉన్న ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరుని దర్శనం కోసం మీరు ఎన్ని జన్మలుగా ఎదురుచూస్తున్నారో, ఎన్ని జన్మలు పూజలు చేసారో మీకు తెలియదు, ఆ గురుదేవుని పట్ల మేలుకోగలగటమే మీ జీవిత లక్ష్యాన్ని మీ అంతరాత్మ కోరికని తీర్చటం.

జీవితలక్ష్యం Vs సంస్కారాలు

నేను THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్పురణకార్యకమంలో ఎప్పుడూ చెబుతుంటాను, మీ మరణసమయంలో మీరు శరీరాన్ని వదిలే సమయంలో, మీ జీవితంలో ముఖ్యం అనుకున్న విషయాలు మీ జ్ఞానేంద్రియాల సంతోషానికి కారణమైన విషయాలు ఉపయోగం లేనివి అవుతాయి. అవి నలుపు తెలుపులలో ఉంటాయి. అవి ఇప్పుడున్నంత అందంగా ఉండవు.

అది ఇలా ఉంటుంది. మీ కలల స్థితిలో ప్రపంచం నలుపు – తెలుపులలో ఉంటుంది. కల నుంచి బయటకి వచ్చాక కలలు నలుపు తెలుపులలో ఉంటాయి. అదే విధంగా మీరు శరీరాన్ని వదిలాక పాత జీవితం నలుపు – తెలుపులలో ఉంటుంది. అప్పుడు ఆధ్యాత్మికంగా వివేకంతో కూడిన విషయాలు, చేతనస్థితిలో మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో చేసిన నిర్ణయాలు రంగురంగులలో ప్రకాశవంతంగా ఉంటాయి. మీ మనస్సు, శరీరస్థాయిలో పొందిన సంతోషాలన్నీ నలుపు – తెలుపులలో డల్‌గా ఉంటాయి. కేవలం చేతనస్థితిలో చేసినవే ప్రకాశవంతంగా ఉంటాయి.

ప్రస్తుతం మీకు గురువుగారు, ఆధ్యాత్మికత, చేతనస్థితి, ఇవన్నీ ఆసక్తి లేని విషయాలు. అవి మసకగా ఉంటాయి. అవన్నీ పెద్ద వయస్సువారికే అనుకుంటారు. ప్రస్తుతం గురువు అంటే ఒక ఎంపిక. మీరు శరీరాన్ని వదిలే సమయంలో చేతనస్థితిలో చేసిన నిర్ణయాలు, గురువులు, ఆయన బోధనలు అన్నీ రంగురంగులుగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ప్రపంచానికి సంబంధించిన వస్తువులు, విషయాలు మసకగా, నలుపు తెలుపు రంగుల్తో అందవిహీనంగా కనిపిస్తాయి.

అప్పుడు 'అయ్యో! భగవంతుడా! నేను మొత్తం పొగొట్టుకున్నాను. ఊహలు కల్పనలతో అంధుడినయ్యాను' అని మరణసమయంలో మీరు ఈ విషయాన్ని చాలా లోతుగా అనుకుంటే, తరువాత జన్మ సమయంలో గురుదేవులని ఎట్టి పరిస్థితిలో కూడా పోగొట్టుకోను' అని చాలా గట్టిగా నిర్ణయించుకుంటారు. తరువాత జన్మ తీసుకునే సమయంలో బాధతో కోమాలోనికి వెళ్ళి ఆ నిర్ణయాన్ని మరిచిపోతారు. మరలా మరణ సమయంలో అనుకుంటారు. ఇది ఈ విధంగా చాలా జన్మల వరకూ జరుగుతుంది.

కాబట్టి ఈ జన్మలో గురుదేవులతో ఉన్నా, ఇంతకు ముందు ఎన్ని జన్మలలో ఆయనని మీరు పోగొట్టుకున్నారో మీకు తెలియదు. అంతకు ముందు ఎంత బాధతో శరీరాన్ని వదిలారో మీకు తెలియదు. మీ జీవితలక్ష్యాన్ని మరిచిపోయారు. అదే అహంకారం, అవే సంస్కారాలు, అవే సమస్యలు తిరిగి మీరు అనుభవిస్తున్నారు. ఎందుకంటే అంతకు ముందు గురువుల్ని కలిసే అవకాశం పోగొట్టుకున్నట్లే ఇప్పుడూ పోగొట్టుకుంటున్నారు. ఈ సారి కూడా మీరు శరీరాన్ని వదిలే సమయంలో అదే బాధని, అయ్యో! గురువుని కలిసే అవకాశం పోయిందే అని చాలా బాధ పడతారు.

మీకు, గురువులకి మధ్య వారధి – విశ్వాసం

మనకి టైం ఉన్నది కాబట్టి. అంతే కాని వీటి వెనుక ఉన్న అనుభవం కోసం కాదు. మరణసమయంలో ఈ ప్రపంచంలో విషయాలు మన అనుభవాలు మసక బారిపోతాయి.

కేవలం గురువులతో ఉన్న క్షణాలు, చేతనస్థితిలో ప్రయాణం ఆధ్యాత్మిక అనుభవాలు ప్రకాశవంతంగా ఉంటాయి.

మీరు శరీరాన్ని వదిలే సమయంలో మీలో జరిగేవన్నీ నేను చూడగలను. అందుకే ఏదో ఒకటి చేయటం నా బాధ్యత అని అనుకున్నాను. అందుకే ఎవరైనా నన్ను మిస్ అయితే అప్పుడు 'అయ్యో! మరొకరు ఆ అనుభవాన్ని మిస్ అవుతున్నారే' అని అనుకుంటాను. గురువుతో ఉండటం ఎంత అవసరమో వారికి నా శక్తి కొద్దీ అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నిస్తాను.

చూడండి, మీరంతా ఈ శరీరంలో ఉండే 70 – 80 సంవత్సరాల జీవితాన్ని మాత్రమే చూస్తారు. అందుకే గురువు అంటే చాలా విషయాలలో ఒక ఎంపిక. మీరేమనుకుంటారంటే, సరే జరగాలని ఉంటే జరుగుతుంది' అనుకొని మరిచిపోతారు. ప్రస్తుతం ఇదే మీ దృక్పథం, కానీ నేను అంత కంటే ఎక్కువ చూడగలను.

ఈ విషయం అర్ధం చేసుకోండి; మీరు నేల మీద ఉన్నారు. అందుకే మీరు కేవలం ఒక మెయిలు దూరం మాత్రమే చూడగలరు. మీ జీవితంలో కూడా మీరు 30 సంవత్సరాల భవిష్యత్తుని మాత్రమే చూడగలరు. నేను పదమూడవ అంతస్థలో ఉన్నాను. కాబట్టి నేను కొన్ని గతజన్మల్ని, కొన్ని రాబోయే జన్మల్ని చూడగలను. అందుకే నేను చెబుతున్నాను, గురువు తారస పడటం అనేది చాలా అరుదైన గొప్ప అవకాశం. అందుకే మీరు నన్ను పోగొట్టుకోకూడదు అని అంత అయ్యో మిస్ అయ్యాను అని బాధ పడతారు. వారు శరీరాన్ని వదిలాక కూడా చాలా జన్మలు బాధ పడతారు.

కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే, గురువుల్ని కొన్ని జన్మలలో మిస్ అయ్యాక, ఆ తరువాత జన్మలో కొందరు లోతైన నిరాశ, కుంగుబాటుల్ని కాని ఏదైనా ఒక వ్యాధిని తీసుకుని కొత్త జన్మకి వస్తారు. అప్పుడు ఆ జన్మలో గురువుల్ని పోగొట్టుకోరు. ఆ వ్యాధి వారిని గురువులకి అంటిపెట్టుకొని ఉండేలా చేస్తుంది. 'అప్పర్' అనే గొప్ప యోగీశ్వరుడు ఆయన 63 మంది నాయన్మార్లలో ఒకరు. తమిళకవి, యోగీశ్వరుడు. ఈయన చాలా ఎక్కువ కడుపు బాధతో వస్తాడు. ఆయన తన జీవితచరిత్రలో ఇలా వివరిస్తారు. 'ఈ జన్మలో కావాలి అని ఈ వ్యాధితో వచ్చాను. అప్పుడు నేను శివుడిని మరిచిపోను.' మీరు గురువుని గుర్తుంచుకోవటానికి అంత బాధతో రానవసరం లేదు. మీరు ఆనందంతో గురువుల్ని ఈ జన్మలో గుర్తుంచుకోవచ్చు.

చూడండి, రోడ్లు మీద దూకుతూ ఆడుకుంటే ఏమవుతుందో చిన్న పిల్లలకి తెలియదు, కాని అమ్మకి తెలుసు అందుకే ఆమె పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. కాని పిల్లలు ఆ విషయాన్ని తెలుసుకోరు పిల్లలు ఏమంటారు 'నేను బయటకి వెళ్ళి ఏది కావాలో అలా చేసాను' అంటారు. తల్లి తాను చేయగలిగినంతా చేసి వారిని కాపాడుతుంది అంతే.

మీరు గురువుల్ని పోగొట్టుకుంటే, ఆయన ఏమీ పోగొట్టుకోరు. ఆయన సాధించ వలసినదంతా సాధించారు. ఇక ఆయనకి కావలసినది ఏమీ లేదు. గురువులు ఎప్పుడూ ఏదీ పోగొట్టుకోరు. కాని శిష్యులకి అది చాలా పెద్ద నష్టం. ఏ కారణంతోనైనా, ఏ పొరపాటు వలననైనా గురువుని పోగొట్టుకోవటం చాలా పెద్ద నష్టం. అందుకే నేను అది ఎవరికీ జరగకూడదు అనుకుంటాను. ఇది ఎలా ఉంటుందంటే పళ్ళు అమ్మే వ్యక్తికి డబ్బులు ఇవ్వకుండా ఒక అరటిపండు తీసేసుకుని తిన్నాడు. అంత చిన్న తప్పుకి మరణ శిక్షవేయటం ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అందుకే ఏ కారణం చేతనైనా ఎవరైనా నన్ను పొగొట్టుకుంటే నేను నా శక్తి కొద్దీ వారిని అటు నుంచి మళ్ళించటానికి ప్రయత్నిస్తాను.

గురువులని మిస్ అవ్వకండి. ఆయనని అంటిపెట్టుకొని ఉండండి. లోతైన నమ్మకం అనే వారధి నిర్మించుకోండి. అప్పుడు జీవితమే వేరుగా ఉంటుంది. గురుశిష్యుల బంధం కోసం ఏదైనా త్యాగం చేయవచ్చు. కాని దేని కోసమూ కూడా గురుశిష్యుల బంధాన్ని త్యాగం చేయకండి.

జీవితంలో మానసికనాటకానికి చివర

మీ జీవితం నాటకం, మీ సంబంధబాంధవ్యాలు, అందులోని పాత్రలు అంతా నాటకం. దయచేసి ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి, ప్రతి సంబంధం ఒక మానసికనాటకం అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక కుటుంబంలో జన్మించి, ఎవరో ఒకరిని తల్లి, తండ్రి, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అనుకొని ఆ కుటుంబసభ్యులతో ఒక నాటకమాడతారు. చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్లు ఇప్పుడు ఒకసారి మీ జీవితంలోనికి చూడండి. సంబంధబాంధవ్యాలను కాని, వస్తువులు కాని ఇంకా పొందాలి, ఇంకా కావాలి అని చూస్తుంటారు. మీ ఆస్తి ఐశ్వర్యాలు ఇంకా పెంచుతూనే ఉంటారు. అకస్మాత్తుగా ఈ నాటకం మరణంతో ముగుస్తుంది.

మరలా మీరు ఇంకొక కుటుంబంలో జన్మిస్తారు. వేరే తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అదే నాటకాన్ని మరలా అడతారు. మన జీవితం అంతా పిల్లలు ఆడుకునే బొమ్మలాట లాంటిదే. ఇది జీవితంలోని మానసిక క్రీడ. ఎవరైతే పూర్తిగా గురుశిష్యుల అనుభవాన్ని పొందుతారో, వారికి ఈ మానసికనాటకం మరలా ఉండదు.

మరగనియ్యండి – జ్ఞానోదయాన్ని పొందండి

ఒకరు నన్ను ఈ విధంగా అడిగారు, 'నాలోని సంస్కారాలు గతజన్మల జ్ఞాపకాలు మీకు శిష్యుడవటానికి అడ్డంకులు అవుతాయా, అని. సంస్కారాలు అదే విధంగా ఏ మాత్రం ఆటంకం కావు. కాని ఎప్పుడైతే గురువుగారు ఆ సంస్కారాల మీద పని చేస్తారో, వాటిని తొలగించాలి

అని చూస్తారో అప్పుడు మీరు ఒక విషయం అర్ధం చేసుకోవాలి. మీరు ఆయనని ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ప్రార్థించినందుకే ఆయన మీ మీద పని చేస్తున్నారు అని.

నేను మీ సంస్కారాల మీద పని చేసినప్పుడు ఏదో నాకు ఉపయోగం అని నాకు ఆశ లేదా భయంతో చేస్తున్నాను అని అనుకుంటారు. మీరు ఆ విధంగా ఎందుకు అనుకుంటారంటే, మీలోని భయాన్ని, ఆశని నా మీద మోపుతారు. అవి నాలో ఉన్నాయి అనుకుంటారు. జ్ఞానోదయమైన యోగీశ్వరులకి అటువంటి ఆశ, భయం ఉండవు. నేను మీ సంస్కారాల మీద పని చేస్తాను. వేల జన్మలలో వేలసార్లు నన్ను కోరి ప్రార్థించారు కాబట్టి పని చేస్తాను.

మీలోని సంస్కారం ఎప్పుడూ సమస్య కాదు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM పని చేసేటపుడు, మీరు అపకుండా ఉంటే పరవాలేదు. నేను దాని మీద పనిచేసే సమయంలో మీ నుంచి వచ్చే ఆటంకమే అసలు సమస్య. మీ సంస్కారాలు సమస్య కాదు కాని మీరు వాటిని పట్టుకొని ఉండాలి అని సమస్య లేదు. మీలోని ట్యూమర్‌ని (కణితిని) తొలగిస్తున్నాను అని అర్ధం చేసుకొని నాకు సహకరిస్తే చాలా బాగుంటుంది. కాని కొన్నిసార్లు మీరేమనుకుంటారంటే నేను ఏదో తప్పుతో చేస్తున్నాను అనుకుంటారు. అప్పుడే మీరు ఫిర్యాదులు చేస్తారు. నన్ను ఆపాలని చూస్తారు. ఆ సింహం కూనలా నన్ను తప్పు పడతారు.

సింహం మాంసం తింటుంటే, ఆ కథలో సింహం కూన ఏమంటుంది, 'నీవు చాలా మంచివాడవనుకున్నాను, గొప్పవాడివి అనుకున్నాను. నీవు నాకు చాలా సహాయం చేసావు. నాలో నమ్మకాన్ని పెంచావు. కానీ నీవు మాంసం తింటావని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీవు కూడా నాలాగా వెజిటేరియన్‌వి అనుకున్నాను' ఇలా ఉంటుంది. మీ వాదం మీలోని పరిణతి లేని నీతినియమాలు, పరిణతి లేని విధంగా అర్థంచేసుకోవటం, మీలోని భావాలని గురువుల మీద మోపటం – ఇవన్నీ గురువులు మీ మీద పని చేయకుండా ఆపుతాయి.

సంస్కారాలు సమస్య కాదు. ఆ సంస్కారాల వలనే మీరు గురువుల దగ్గరకి వస్తారు. మీలో సంస్కారాలు లేనప్పుడు ఎందుకు గురువు దగ్గరకి రావటం. మీరు అప్పటికే జ్ఞానోదయం పొంది ఉంటారు. నేను మిమ్మల్ని మీరుగానే స్వీకరిస్తాను. కాని మీరు సంస్కారాలతో ఉన్నప్పుడు మీరు మీ నిజమైన మీరు కాదు. మీరు మీ నరకంలో బాధపడుతూ ఉంటారు. నేను మీ నరకాన్ని చెదరగొడతాను. మీరు బందీలుగా ఉన్న జైలును పగలగొడుతుంటే, నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకుంటారు. అప్పుడు మీరు నన్ను ఆపాలని చూస్తూ మరిన్ని సమస్యల్ని సృష్టిస్తారు.

కొన్నిసార్లు మీరు నా దగ్గరకి వచ్చినప్పుడు మీలో గొప్ప శక్తి, ఆనందం పెరగటాన్ని మీరు తెలుసుకుంటారు. కొన్నిసార్లు మీలో చాలా కోపం, నిరాశ రావటం కూడా చూస్తారు. కాని నిరాశ త్వరలోనే మాయం అవుతుంది. ఎప్పుడైతే మీరు నాకు దగ్గరగా వస్తారో, ఒక గొప్ప శక్తి దగ్గరకి వచ్చినట్టే. అప్పుడు మీలోని వ్యతిరేకభావాలన్నీ ఆ శక్తిలో కరిగిపోతాయి. అందుకే మీరు మీ లోపల అన్నీ కలిసిన గాఢమైన భావాల్ని అనుభవిస్తారు. చూడండి, గురువుల శరీరం ఒక అణుశక్తికేంద్రం. మీరు దగ్గరగా వచ్చినప్పుడు మీలో ఏ భావాలు ఉంటాయో అవి మరగటం ప్రారంభిమవుతుంది. ఇది ఎలా అంటే మరిగే నీళ్లలో బంగాళదుంపల్ని వేస్తే అవి ఎగిరెగిరి పడుతుంటాయి. బంగాళదుంప దానంతట అది నాట్యం చేయదు. కింద ఉన్న మంటలోని శక్తి వలన అలా డాన్సు చేస్తుంది.

నేను ఎప్పుడూ చెబుతుంటాను, సంస్కారాలు సమస్య కాదు అని. బంగాళదుంప సమస్య కాదు. దూకే దుంప పాత్ర నుంచి బయటకి దూకి పారిపోకూడదు. అక్కడే జాగ్రత్త తీసుకోవాలి. అది పాత్రలోనే ఉంటే అది సిద్ధ దుంప అవుతుంది. సంస్కృతంలో సిద్ధ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఉడకటం, రెండు జ్ఞానోదయం పొందటం. బయటకి దూకకుండా ఉంటే అది ఉడికిన దుంపే కాదు, జ్ఞానోదయం పొందిన దుంపగానూ మారుతుంది.

అధీనమవటం – అంతిమపద్ధతి

భగవద్గీతలో అర్జునుడు తాను ఏ మార్గాన్ని అనుసరించాలో తెలియక గొప్ప అయోమయంలో పడిపోతాడు. చివరి అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి చేసిన బోధ, అంతిమస్థితిని తెలుసుకో అని. చాలా పద్ధతులు ధ్యానం, భక్తి జ్ఞానం, అన్నీ చెప్పాక కృష్ణుడు సూటి అయినది, కచ్చితమైనది, అంతిమమైనది అయిన ఒక పద్ధతిని చెబుతాడు. అదే అధీనమవటం. స్పష్టంగా అర్ధం చేసుకోండి, మీరు ఒక జ్ఞానోదయమైన యోగీశ్వరుడికి అధీనమైతే, మీరు నిజానికి అహంకారం లేని, నేను అనే గుర్తింపు లేని వ్యక్తికి అధీనమైనట్లు. ఆయనకి మీ అధీనత విషయంలో ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆయనకి ఆసక్తి కూడా ఉండదు. ఆయన పొంగి ప్రవహిస్తున్న విశ్వశక్తి. ఆయన చేతిని పట్టుకోవటం ద్వారా మీరు ఆయన ఉండే నిత్య ఆనందసాగరానికి మిమ్మల్ని కూడా తీసువెళ్ళమని అడగటమే.

నేను చేసేవాడిని అని అనుకోగానే బాధలు, టెన్షన్ పెరుగుతాయి. మీరు త్వరగా అలసిపోతారు. దీని అధికారాన్ని పైవాడికి బదలాయిస్తే, మీ పని మీరు ఆనందంగా చేసుకువెళితే మీరు అద్భుతంగా రిలాక్స్ అవుతారు.

ఒక చిన్న కథ : ఒక బాంక్ మేనేజరు రోజు డబ్బు మొత్తం ఇంటికి తీసుకువెళ్ళి మరలా ఉదయం బాంకుకి తెస్తుంటాడు. ఆ విధంగా ఒక నెల రోజులు చేసి ఇక ఆ విధంగా చేయలేకపోతాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు భయంతో వణికిపోతుంటాడు. అంత డబ్బు దగ్గర ఉంది కాబట్టి రాత్రి సరిగ్గా నిద్రపోదు. చివరికి అతనిపై అధికారిని తనను ఉద్యోగం నుంచి మార్చమని, తాను ఆ టెన్షన్ పడలేకపోతున్నానని అడుగుతాడు. ఆ అధికారి డబ్బు పోయినా పరవాలేదు, నిన్ను ఎవరూ ఏమీ అనరు అని అంటాడు. ఆ రోజు నుంచీ మేనేజరు ప్రశాంతంగా నిద్రపోతాడు.

అతనిలో వచ్చిన తేడా ఏమిటి? అతను అదే ఉద్యోగం చేస్తున్నాడు. ఆ భయం, టెన్షన్ ఏమయ్యాయి? ఏమీ లేదు, బాధ్యతని పై అధికారికి బదలాయించాడు అంతే. అతను చేస్తున్న పని, ఉద్యోగం అదే విధంగా కొనసాగించాడు. మీరు పైవాడికి, ఉన్నతమైన విశుశక్తికి అధీనమైతే, మీరు అలసిపోరు. ఎందుకంటే మీరు శక్తితో సూటిగా బంధాన్ని ఏర్పరచుకున్నారు. అదే అధీనత మీకు ఇచ్చే బహుమతి.

అధీనత యొక్క గాఢత

దూడ ఆవు దగ్గర పది నిమిషాలే ఉంటుంది. కాని అది గోక్షీరాన్ని తాగుతుంది. దోమ ఆవు మీద ఇరవై నాలుగు గంటలు ఉండవచ్చు. కాని అది రక్తం పీలుస్తుంది. మీరు గురువుల సమక్షంలోనే ఉండవచ్చు. కాని ఆయనతో ఎటువంటి అనుబంధం మీకు ఉండకపోవచ్చు. మీలో అన్వేషణ లేకపోవచ్చు. లేదా మీరు గురువులకి దూరంగా ఉందవచ్చు. కాని నిరంతరం ఆయనతో అనుబంధంతో ఉండవచ్చు కాబట్టి భౌతికంగా ఆయన సమక్షంలో ఉండటం అనేది విశేషం కాదు. ఆధ్యాత్మిక అన్వేషణలో దానికి అంత ప్రాముఖ్యం లేదు. అన్వేషణ అనేది ఎంత లోతుగా ఉన్నదో, అది ముఖ్యం.

రామకృష్ణ పరమహంస ఒక విషయం చక్కగా చెబుతారు, 'మీరు దేనికైనా ఎవరికైనా అధీనం కావచ్చు. ఇక్కడ అధీనమవటం ముఖ్యం అంతే కాని ఎవరికి అన్నది ముఖ్యం కాదు. మీరు రాయికి అధీనులైతే అదే భగవంతుడుగా మారి మీకు మార్గం చూపిస్తుంది.'

మీలో తీవ్రమైన సత్యాన్వేషణ అనే తపన లేనప్పుడు, సాక్షాత్తు భగవంతుడే వచ్చినా, మీరు ఆయనని ఐడెంటిటీ కార్డు అడుగుతారు. మీలో సత్యాన్వేషణతపన ఉన్నప్పుడు చిన్న రాయి కూడా మీకు బోధించగలుగుతుంది.

నాలో ఉన్న జీవశక్తి బయట కూడా ఉన్నది. అది మీలోనికి ప్రవేశించి మీకు నేర్పించవలసినవి నేర్పిస్తుంది. నేను ఖాళీగా ఉంటాను. నాలో ఏమీ లేదు. అందుకే జీవశక్తి నా లోపల ప్రవేశించి, అమరగీతంలా బయటకి వస్తుంది. కాబట్టి మీలో ఆధ్యాత్మికత స్పష్టంగా, లోతుగా, తీవ్రంగా ఉన్నప్పుడు, మీ నాసికద్వారా లోపలికి వెళ్ళే గాలి, మీ హృదయంలో గొప్ప ప్రేరణని ఇచ్చి, మీ లోపల బోధన జరిగేలా చేస్తుంది. మీలో ఆ తీవ్రత లేనప్పుడు, నేను ఏమి చెప్పినా మీకు అది గుర్తు ఉండదు. అది మీలో నాటుకోదు.

మీలో మీరు పరీక్షించుకోవలసిన సూక్ష్మవిషయం ఇదే. మీ మనస్సు ఒప్పుకోనప్పుడు, మీరు గురువులు చెప్పే మాటలు వినగలుగుతున్నారా లేదా గమనించండి. అవును అని జవాబు వస్తే మీరు అధీనులయ్యారు. కాకపోతే మీరు మీ మనస్సుకి నచ్చినవి చెబితేనే గురువుని అనుసరిస్తారు. మీ మనస్సుకి నచ్చినవి చెప్పటం, మీరు గురువుల మాట విని అనుసరించటం అనేది కొన్నిసార్లు అనుకోకుండా, యాదృచ్ఛికంగా జరుగుతుంది. అంతే అంతకు మించి మరేమీ లేదు.

గురువుల పని విషయానికి వచ్చినప్పుడు, ఆశకి, అనుకూలదృక్పథం అనేవి అవసరం లేదు. కేవలం అధీనమవటం, ఆయన చెప్పినవి స్వీకరించి చేయటం. ఎందుకంటే అది అంతరాత్మ లోతుల నుంచి వస్తుంది. కానీ ఏదో పై పై నుంచి మనస్సు నుంచి కాదు.

మీరు సర్వాంతర్యామికి అధీనులు కాలేరు కాబట్టి గురువులకి అధీనమవ్వాలి. విశాలమైన ఆకాశాన్ని చూస్తే మీరు భయపడతారు. కాబట్టి ఆకాశం లోనికి చూడటానికి మీకు ఉన్న కిటికీ వంటివాడు గురువు.

అధీనతలో మూడు దశలు

అధీనతలో ఉండే మూడు రకాలని వివరిస్తాను. తెలివితేటలు లేదా తార్కికజ్ఞానాన్ని అధీనం చేయటం, భావావేశాల్ని అధీనం చేయటం. ఇక మూడవది జ్ఞానేంద్రియాల్ని అధీనం చేయటం.

మొదటిది తెలివితేటలని అధీనం చేయటం అంటే గురువుల తెలివితేటలు మీ కంటే గొప్పవి అని అనుకోవటం. ఇదే తెలివితేటల అధీనం చేయటం అంటే. ఈ దశలో గురువులు చూపించిన విధంగా మీ జీవనసరళిని మార్చుకుంటారు.

రెండవది: మీ భావావేశాల కంటే గురువులవి ఉన్నతమైనవి అని నమ్మటం. దీని అర్ధం గురువులతో ఉన్న అనుబంధం అంతిమమైనది, అత్యున్నతమైనది అని నమ్మటం. భగవంతుడు అని అన్నప్పుడు మీరు గురువుని ఎంచుకుంటే అది భావావేశాత్మక అధీనత. అయితే ఒక విషయం, గురువు ఎప్పటికీ నాశనం కాదు. అది వేరే విషయం. ఏదో మీరు ఎంచుకున్నారు కాబట్టి ఆయన జీవించి ఉన్నారు అని అనుకోవద్దు. మీరు ఎంచుకున్నా లేకపోయినా ఆయన జీవించి ఉంటాడు.

మీకు గురువు పట్ల ఉన్న భావం అన్ని భావాల కంటే ఎక్కువ అని మీకు అనిపిస్తే, మీలో అధీనత భావావేశాల దశలో జరిగింది అని అర్ధం. స్పష్టంగా తెలుసుకోండి. 99% మంది మొదటి దశలో ఉంటారు. వీరిలో 20% నుంచి 40% మంది రెండవ దశకి వెళ్ళగలుగుతారు. మిగిలిన వారు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతారు.

మూడవ రకం అధీనత అనేది జ్ఞానేంద్రియాల్ని కూడా అధీనం చేయటం.

చిన్నకథ : మహాభారతయుద్ధం ముగిసాక ఒకరోజు శ్రీకృష్ణుడు, అర్జునుడు విశ్రాంతిగా కూర్చుని ఉంటారు. అకస్మాత్తుగా కృష్ణుడు, 'అర్జునా! చూడు, ఆ ఆకుపచ్చ కాకిని' అంటాడు. అర్జునుడు, 'అవును ఆకుపచ్చకాకి అందంగా ఉన్నది' అంటాడు. అప్పుడు కృష్ణుడు, 'మూర్ఖుడా! అది నలుపు ఆకుపచ్చ కాదు' అంటాడు. అర్జునుడు అవును కృష్ణా అది నలుపు, ఆకుపచ్చ కాదు' అంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జునునితో, 'నీకు ఏమయ్యింది? నేను ఆకుపచ్చ అంటే నీవు ఆకుపచ్చ అంటున్నావు. నేను నలుపు అంటే నీవు నలుపు అంటున్నావు. నీకు ఏమయ్యింది?' అని అడుగుతాడు.

అప్పుడు అర్జునుడు కృష్ణునితో, 'నేను నిజాయితీగా చెబుతున్నాను. ఆ కాకి రంగు ఏమిటో నాకు తెలియదు. నీవు ఆకుపచ్చ అన్నప్పుడు నేను ఆకుపచ్చనే చూసాను. నీవు నలుపు అన్నప్పుడు నలుపే చూసాను. నాకు ఏమీ తెలియదు' అంటాడు.

అర్జునుని జ్ఞానేంద్రియాలు కృష్ణుడిని నమ్మాయి. అతను గురువుల జ్ఞానేంద్రియాల్ని తన కంటే ఎక్కువగా నమ్మాడు.

ప్లేసిబో ప్రభావం, ఇంకా ఎక్కువ

వైద్యభాషలో 'ప్లేసిబో ప్రభావం' అనే ఒక మాట ఉన్నది. ఒక పేషెంటుకి మందు లేని టాబ్లెట్ ఇచ్చి, ఇది మందు అని చెబితే అతని అనారోగ్యం నయమవుతుంది. అయితే ఈ మధ్య జరిగిన పరిశోధనలలో ప్లేసిబో ప్రభావంలో చాలా లోతైన విషయాలు నిరూపించబడ్డాయి.

ఇటలీలోని ట్యురిన్‌లో జరిగిన పరిశోధనల గురించి చదివాను. ఒక వ్యక్తికి కొన్ని కంట్రోల్ చేయగల కరెంట్ షాకులు అమర్చారు, అతనికి నొప్పి తెలియని తక్కువ షాక్ నుంచి అతను భరించగల షాకు వరకూ ఒక స్కేలు అమర్చారు.

అతనికి షాక్ ఇచ్చే ముందు, అతని ఎదురుగా ఆకుపచ్చ, ఎరుపు రంగుల బల్బులు వెలిగేలా అమర్చారు. ఆకుపచ్చ బల్బు వెలిగితే అతనికి కొంచం షాకు ఇస్తారు. ఎరుపు బల్బు వెలిగితే ఎక్కువ షాకు ఇస్తారు. అతను స్కేలు మీద తనకి ఇచ్చిన షాకుల ప్రభావాన్ని 1 నుంచి 10 వరకూ రేటింగ్ చేయాలి. 1 నుంచి 10 వరకూ తక్కువ నుంచి ఎక్కువ షాక్ అని అర్ధం. అతని మీద 15 నిమిషాలు షాక్స్ ప్రయోగించారు. చివరలో అతను ఈ విధంగా చెప్పాడు, 'ప్రారంభంలో షాక్ ఎక్కువగా ఉండి తరువాత తక్కువ స్థాయిలో ఉన్నాయి' అని.

నిర్ఘాంతపోయే విషయం ఏమిటంటే అసలు వాళ్ళు ఇచ్చిన షాక్స్ దానికి పూర్తిగా వ్యతిరేకం. చివరలో ఇచ్చినవి బలమైన షాక్స్. మరి అతనికి అవి చిన్నవిగా ఎలా అనిపించాయి. ఎలా అంటే ఆ షాక్ ఇచ్చే ముందు, ఇవ్వబోయే షాక్స్ చిన్నవి అని చెప్పే ఆకుపచ్చ బల్బు వెలిగేది.

కాబట్టి ఆ వ్యక్తి మనస్సు వచ్చే షాకు చిన్నది అని తయారుగా ఉండేది. కాని నిజానికి బలమైన షాకు ఇచ్చినా మనస్సు అది చిన్నది అనుకున్నందుకు ఆ వ్యక్తి ఆ షాక్స్‌ని చిన్నవిగానే అనుభవించాడు. అతని శరీరానికి అవి చిన్న షాకులా అనిపించాయి. దీని ఫలితాల ఆధారంగా పరిశోధకులు ఏమంటారంటే ప్లేసిబో ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మనం అనుకున్న దాని కంటే దాని ప్రాముఖ్యం ఎక్కువ అని.

మందులు కూడా అన్ని వేళలా సూటిగా ప్రభావాన్ని చూపించవు. వాటి ఫలితాలు మనం ఎలా ఆశిస్తామో అదే విధంగా ఉంటాయి. ఒక వ్యక్తికి పెయిన్ కిల్లర్ అని చెప్పకుండా ఇంజక్షన్ ఇస్తే, అది పని చేయాలి అంటే చాలా ఎక్కువ డోస్ ఇవ్వాలి అని డాక్టర్స్ చెపుతారు. అదే ఆ వ్యక్తితో అది పెయిన్ కిల్లర్ అని చెప్పి ఇస్తే, చాలా తక్కువ డోస్ సరిపోతుంది.

మనస్సు చాలా బలమైనది. అది మీలో శారీరక మార్పుని కలిగించగలుగుతుంది. జ్ఞానేంద్రియాలు మనస్సుకి ఏ విధంగా అధీనమయ్యాయో అత్యున్నతచేతనస్థితికి కూడా అధీనమవ్వగలవు. కృష్ణార్జునుల విషయంలో ఇదే జరిగింది. కృష్ణుడు ఆకుపచ్చ కాకి అంటే అర్జునుడు ఆకుపచ్చ కాకిని మాత్రమే చూసాడు.

మీ జ్ఞానేంద్రియాలు మీరు సాధారణమానవులు అని చెబుతాయి. నేను మీరు దివ్య ఆధ్యాత్మికులు అని చెబుతాను. మీ జ్ఞానేంద్రియాల్ని నమ్మినంత కాలం మీరు సాధారణ మానవులుగానే ఉండిపోతారు. గురువుని నమ్మితే మీరు ఆధ్యాత్మిక అనుభవాలు పొందుతారు. దీన్నే నేను స్పష్టంగా చూడగల మార్పు అంటాను.

గురువు – అంతిమవిలాసం

మీ జీవితంలో గురువులు అంతిమవిలాసం. మీ జీవితంలో గురువే తారసపడితే ఇక మీకు ఏమీ అవసరం లేదు. ఆయనని కలవకపోతే ఏం ఉన్నా ప్రయోజనం లేదు. మీ జీవితం లోనికి వివేకాన్ని తెచ్చే ఒక దారి గురువు. అవసరానికి తగిన విధంగా ఆయన మీ మేధను పెంచగలడు. జీవశక్తి, గురువు రెండూ వేరు వేరు కాదు. గురువులు పదే పదే ఒక విషయం చెబుతారు. మీలోని గురువుని అనుభూతితో తెలుసుకోండి అని. మీలోని గురువుని అనుభూతితో తెలుసుకోగలిగేవరకూ బయట ప్రపంచంలో గురువు అవసరం అని మీరు అనుకుంటారు. ఒకసారి మీ అంతరంగంలోని గురువుని అనుభవంతో తెలుసుకోగలిగాక బయట ప్రపంచంలో గురువుల అవసరం లేదు.

గురుదేవుల సమక్షం

గురుదేవుల సమక్షంలో మీరు ధ్యానం చేస్తే అది అత్యున్నత రసాయనచర్య అవుతుంది. మీరు ఒక్కరే మీ ఇంట్లో చేస్తే అది ధ్యానం. అదే ధ్యానాన్ని గురువుల సమక్షంలో ఆయన సూచనతో, ఆయనతో పాటు చేస్తే అది ఆల్కెమీ లేదా రసాయన చర్య అవుతుంది. అది మిమ్మల్ని మరిగించటం లాంటిది. ఆ కార్యక్రమం గాఢతతో, చైతన్యంతో ఉంటుంది.

మీ అంతట మీరు ధ్యానం చేసినప్పుడు మంట వెలిగించటం మరిచిపోతారు. గురువుల సమక్షమే అగ్ని, అది మీలో జరగవలసిన రసాయనచర్య జరిగే విధంగా చూస్తుంది.

నన్ను ఇలా అడగవచ్చు, 'మీ సమక్షంలోనే ఎందుకు ఉండాలి? అని. మీరు సి.డిలు చూస్తూ కూడా నా మాటలు వినవచ్చు. కాని సత్యాలని వెల్లడి చేసేటప్పుడు నా శరీరం కదలికల నుంచి సత్యాన్ని పట్టుకోవచ్చు. మీరు పట్టుకుంటారు కూడా ఆ క్లిక్‌ని మీరు అనుభవిస్తారు. అవును ఈయన చెప్పేది సత్యమే ' అని మీకు స్పష్టంగా తెలుస్తుంది.

ఒకవేళ మీరు అనుమానించాలి, అని అనుకున్నా, మీ లాజిక్ మీ మీద ప్రభావాన్ని చూపించలేదు. మీ లాజిక్‌కు అతీతంగా ఈ మాటలు మీ లోపలికి వెళతాయి. అది మీరు గురువు సమక్షంలో ఉన్నప్పుడే జరుగుతుంది. దీన్నే ఉపనిషత్ అంటారు. గురువు సమక్షంలో ఉండి, వికసించి ఉండటమే ఉపనిషత్.

విశాసంతో విప్పారి ఉండండి. మీరు ఆ విశాసం లోనికి దూకండి. అక్కడ పట్టుకోవటానికి గురువుగారు ఉంటారు. మీ తల నుంచి హృదయంలోనికి జారండి. అక్కడ మిమ్మల్ని పట్టుకోవటానికి గురువుగారు ఉంటారు. మీకు జ్ఞానోదయం జరుగుతుంది' అంతే.

ఉపనిషత్తులు

ఉపనిషత్ అంటే కూర్చోవటం. ఎప్పుడైతే శిష్యుడు గురువు సమక్షంలో కూర్చుంటాడో, గురువులో కలిగిన అనుభవం శిష్యుడిలో తిరిగి జరుగుతుంది. ఏ శిష్యుడైతే గురువుల అనుభవం పొందుతాడో, ఎవరిలోనైతే గురువు తిరిగి ఆ అనుభవాన్ని ఇస్తాడో ఆ శిష్యుడు తనకి జరిగిన ఆ అనుభవాన్ని రాస్తాడు. గురువు కాని, శిష్యుడు కానీ లేదా మరొకరు ఆ అనుభవం ఎలా జరిగిందో రాసారు. ఇది ఎలా ప్రారంభమైంది, ఎలా ముగిసింది. ముగిసాక ఏం జరిగింది, ఇవన్నీ రాసినదాన్నే ఉపనిషత్ అంటారు.

కారణం–ప్రభావం అనే సూత్రానికి అతీతంగా ఉపనిషత్ ఎలా జరిగింది.

మనం కారణం – ప్రభావం అనే సూత్రం గురించి విన్నాం. బంతిని వదిలితే అది క్రింద పడుతుంది. నీటిని 100 సెం.మీ. దగ్గర వేడి చేస్తే అవిరి అవుతుంది. నీళ్ళలో ఉప్పు వేస్తే కరిగిపోతుంది. ఇది కారణసూత్రం, ప్రతి చర్య ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. శాస్త్రం ఈ సూత్రం మీద ఆధారపడి ఉంది.

అయితే సర్వాంతర్యామి సూత్రాలలో ఇది ఒక్కటే సూత్రం కాదు. సర్వాంతర్యామిలో ముఖ్యసూత్రం ఆత్మప్రబోధసూత్రం. దీన్నే కార్ల్‌జంగ్ అనే వేదాంతవేత్త ఒకే విధమైన సూత్రం అంటారు. ఇక్కడ అర్ధం ఒకటి జరిగింది కాబట్టి మరొకటి జరిగింది అని కాదు. ఏదో జరుగుతుంది. దాంతో మరి కొన్ని జరుగుతాయి.

మనమందరం కారణం ప్రభావాన్ని చూడటానికి అలవాటు పడతాం. వీటి మధ్య సంబంధం, ముందు కారణం చూస్తాం, వెంటనే దాని ప్రభావాన్ని చూస్తాం. అయితే జీవితంలో చాలా సంఘటనలలో, ప్రభావం చాలా కాలం తరువాత కనిపిస్తుంది. అప్పటికి అసలు మూలమైన కారణాన్ని మరిచిపోతాం. మీరు నీళ్ళలో రాయి విసిరితే చిన్న తరంగాలు వస్తాయి. అది రాయి విసరటం మూలాన అని మీకు తెలుసు. కొంత సేపయ్యాక మరలా ఉప తరంగాలు వస్తాయి. అయితే అవి ఏ విధంగా వచ్చాయో మీకు తెలియదు. మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు జరిగి ఉండి ఉండవచ్చు. మీరు మీ స్నేహితురాలి ఇంటికి వెళ్ళి మీకు ఇష్టమైన స్వీటు చేయించుకోవాలి అనుకుని ఆమె ఇంటికి వెళతారు. అప్పుడు ఆమె అదే స్వీటు చేసి ఉంటుంది. ఆమెకి ఎందుకో అది చేయాలి అనిపించి చేసింది. అంతే.

గురుశిష్యుల మధ్యా ఇదే విధంగా జరుగుతుంది. అది, చాలా దగ్గర సంబంధాలు అయిన స్నేహితులు, ప్రేమికులు, భార్యాభర్తల మధ్య కంటే ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే గురుశిష్యుల సంబంధం ఈ సృష్టిలోనే లోతైన అనుబంధం. ఇదే అంతిమ ప్రేమ వ్యవహారం. ఇది అద్భుతంగా ఉంటుంది. ఇది లాజిక్‌కి అతీతంగా ఉంటుంది. నిజానికి మీరు లాజిక్‌కి అతీతమైనదాన్ని స్పృశించాక జీవితం ప్రారంభమవుతుంది. అది మనస్సు డొమైన్‌లో ఇమడలేదు. అది మనస్సు చెప్పే వాదాలని పక్కన పెట్టేస్తుంది.

నిజమైన శిష్యుడు అసలు శిష్యుడు కాదు. ఎందుకంటే అది గురువుల స్థితి కాబట్టి. అందుకే గురువుల సమక్షంలో కూర్చుంటే శిష్యులు గురువుల లయకి అనుగుణంగా మారగలుగుతారు. అదే ఉపనిషత్ అంటే. అదే నిజమైన శిష్యరికం అంటే. విప్పారి ఉంటే గురువుల ప్రేమ వర్షిస్తుంది. మీరు ఆ వైభవాన్ని, ఆ తేజస్సుని తీసుకొని వృద్ధి చెందవచ్చు.

అనుమానం, నమ్మకం

మీకు ఎప్సుడైనా అనుమానం కలిగితే అనుమానాన్ని, నమ్మకాన్ని ఆయన పాదాల దగ్గర అర్సించండి. చూడండి, గురువు మీకు నమ్మకాన్ని ఇస్తారు. ఆయనే అనుమానాన్ని ఇస్తారు. మీరు అనుమానంలో చిక్కుకుపోయి ఉంటే మనస్సులో ఈ విధంగా అనుకోండి, 'గురుదేవా! నాలో మీ పట్ట నమ్మకం కలిగించింది మీరు. నాకు అనుమానాలు కలిగేలా చేసింది మీరు. ఈ రెండిటినీ మీ పాదాలకి అర్చిస్తున్నాను. నేను ఈ ఆటలు అడలేను. ఈ ఆటలతో అలసిపోయాను. దయచేసి మీరే అంతా చూసుకోండి.'

ఎప్పుడైతే అనుమానాన్ని, నమ్మకాన్ని గురువుల పాదాల దగ్గర అర్సిస్తారో అప్పుడు మీలో విశ్వాసం ఏర్పడుతుంది. విశ్వాసం అంటే అనుమానం కాదు, నమ్మకం కాదు. విశ్వాసం సత్యాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా తెలుసుకునే ధైర్యాన్ని ఇస్తుంది.

లోత్రెన విశ్వాసం

ఒక బౌద్ధగురువు దగ్గర చిన్నతనం నుంచీ ఉన్న శిష్యుడు ఉంటాడు. ఆ అబ్బాయికి గురువు పట్ట లోతైన, ప్రేమపూర్వకమైన అనుబంధం ఉంటుంది. కాని ఆ అబ్బాయి చాలా చిలిపివాడు. అతను గురువుగారిని అనుకరిస్తూ ఉంటాడు. ఆయన వెనక నిలబడి ఆయనలా చేసి అల్లరి చేసుండేవాడు. ఆయనకి ఒక అలవాటు వుంది. ఏ విషయమైనా గట్టిగా చెప్పాలి అంటే బొటనవేలు చూపించి చెప్సేవాడు. ఆ శిష్యుడు కూడా వెనుక నిలబడి వేలు పైకి పెట్టి గురువుగారిని అనుకరించే వాడు.

ఒక రోజు గురువుగారికి కోపం వచ్చి కత్తితో ఆ అబ్బాయి బొటనవేలు నరికేసాడు. అర్ధం చేసుకోండి. ఈ కథలో ఒక విషయం చక్కగా చెప్పబడింది. విశ్వాసం, ప్రేమ అన్నవి ఎంత లోతుగా ఉన్నాయి అంటే ఆ అబ్బాయి ఒక్క క్షణం కూడా తనకి అన్యాయం జరిగింది అనుకోలేదు. ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే గురువుగారు ఏం చేసినా నా మంచికే అని. అంత బాధలోనూ ఆ అబ్బాయిలో విశ్వాసం అదే విధంగా ఉంది. అంతే, ఆ క్షణంలో అబ్బాయికి జ్ఞానోదయం అవుతుంది.

ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. మొదటిది – ఆ అబ్బాయిలో గురువు పట్ట చాలా విశ్వాసం, అనుబంధం ఉన్నాయి. రెండవది ఆ అబ్బాయి ఎంత బాధనైనా అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి తపస్సుకు అయినా సిద్ధంగా ఉన్నాడు. తపస్సు అంటే ఆ సాధనపద్ధతి మీద ఎంత కష్టమైనా, నష్టమైనా పని చేయటం. ఎందుకంటే జ్ఞానోదయం అతని ప్రముఖాంశం కాబట్టి. సాధనపద్ధతి ఎప్పుడైనా జ్ఞానోదయం ముఖ్యం అనుకునేవారి కోసమే.

మీ గురింపుని అనుమానించండి, గురువుని కాదు

ఎప్పుడైతే మీరు ఒక భావాన్ని గాని, ఒక వ్యక్తిని గాని గట్టిగా పట్టుకొని ఉంటారో మీ నిరాశ, డిప్రెషన్ అంత లోతుగా ఉంటాయి. ఉదాహరణకి మీరు మీ బాయ్ ఫ్రెండ్‌ని లేదా భర్తని లేదా కొడుకుని గట్టిగా పట్టుకొని ఉన్నారనుకోండి. ఆ అనుబంధంలో తప్పనిసరిగా మీరు డిప్రెషన్ లోకి వెళతారు. ఆ తరువాత ఆ వ్యక్తిని తప్పుపడతారు. ఈ విధంగా డిప్రెషన్ ప్రారంభమవుతుంది. అదే విధంగా మీరు మీ అహంకారాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటే లేదా మీ గుర్తింపుల్ని పట్టుకొని ఉంటే, మీరు డిప్రెషన్ లోకి వెళతారు.

మీ గుర్తింపు వలన గాని లేదా మీ అహంకారం వలన కాని మీరు డిప్రెషన్‌లోకి వెళితే, మీరు ప్రపంచాన్ని తప్పుపడతారు. ఎందుకంటే తప్పుపట్టటానికి అక్కడ రెండవ వ్యక్తి లేదు కాబట్టి. మీకు ఈ ప్రపంచం మొత్తం మీద నమ్మకం పోతుంది. ఈ ప్రపంచం మీద విశ్వాసం ఉండదు. మీ డిప్రెషన్‌కి కారణం ఏమిటో మీకు తెలియదు. మీరు ప్రపంచాన్ని తప్పుపడతారు. మీరు ఇటువంటి డిప్రెషన్‌లో పడితే, ఆ డిప్రెషన్‌కి కారణం మీలో మీరు పట్టుకువేలాడే గురింపు అని తెలుసుకోగల వివేకం ఉండదు. అప్పుడు మీరు అందరినీ, అన్నింటినీ అనుమానంగా చూస్తుంటారు. ఏ చిన్న సంఘటన జరిగినా చాలు, మీ డిప్రెషన్‌కి ఆ వ్యక్తే కారణం అని తప్పుపడతారు. అహంకారం ఆధారంగా ఉండే గుర్తింపుతో ఇదే పెద్ద సమస్య.

మీరు ఏమనుకుంటారంటే, నాకంటూ ఒక రకమైన గుర్తింపు లేకపోతే, ఒక పద్దతి లేకపోతే ఎదుటివారు నన్ను మోసం చేస్తారు అనుకుంటారు. కాని ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే ఏవో కొన్ని నిమిషాలు చేయగలరు. దీని కోసం మీరు బలమైన గుర్తింపుని నిర్మించుకుంటే అది మిమ్మల్ని జీవితాంతం మోసం చేస్తూ ఉంటుంది. అది మీరు మేల్కొన్న స్థితిలో, స్వప్నస్థితిలో, గాఢనిద్రాస్థితిలో మీతోనే ఉంటుంది. కాని మీరు దాన్ని తెలుసుకోలేరు. కాబట్టి ఎదుటివారు మోసం చేసినా పరవాలేదు కాని మీ గుర్తింపు మోసం చేయకుండా ఉంటే చాలు.

ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి, గురువుని ఎప్పుడూ అనుమానించవద్దు, మిమ్మల్ని అనుమానించండి. మీరు మోసపోయే గుర్తింపుని అనుమానించండి. అదే సరైన పద్దతి.

ప్రేమ, ద్వేషం అనే చక్రం

ప్రారంభంలో మీరు గురువుల దగ్గరకి ప్రేమతో వస్తారు. ఆయన మీ అహంకారం అనే ట్యూమర్ మీద ఆపరేషన్ ప్రారంభించగానే అకస్మాత్తుగా చక్రం తిరిగిపోతుంది. ప్రేమ ద్వేషంగా మారుతుంది. కోపం, ఆటంకపరచటం అనేవి మొదలవుతాయి. మీలో తెలుసుకునే తత్వం ఉంటే మనస్సు ఆడే మోసపూరిత క్రీడలని గమనించగలుగుతారు. అప్పుడు ప్రేమద్వేషాలకి అతీతంగా వెళ్ళగలుగుతారు. అప్పుడు అనుబంధం మరింత లోతుగా ఉంటుంది. అప్పుడు మీలో ప్రేమ, ద్వేషం, భయం అనేవాటిని ఆశించరు. కాబట్టి మీకు కోపం వస్తే ఓపికగా ఉండండి. ఆ పాయింట్‌లోనే మీలో మార్పు వస్తుంది.

ఒక విషయం అర్ధం చేసుకోండి, పోరాటం మీకు, మీ మనస్సుకి మధ్య కాదు. పోరాటం మీ మనస్సుకి, నాకు మధ్య జరుగుతుంది. ఆ పోరాటంలో ఎవరి వైపు ఉండాలి అనే నిర్ణయం మీది. మీరు కొంచెం లోతుగా చూస్తే, ఇది ఓడిపోయే పోరాటం అని మీ మనస్సుకు తెలుసు. కాబట్టి దాని జీవనానికి అది అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. ఈ యుద్ధంలో మీరు ఓడిపోతేనే గెలవగలుగుతారు.

గురువుల చేతిలో ఓడిపోవటం అంటే మీలోని అబద్దపుపైరు మీద నిజమైన మీరు గెలిచారు అని అర్థం. అది మీ మీద మీరు సాధించే అంతిమవిజయం. మీరు భగవంతుని రాజ్యాన్ని తిరిగి పొందగలరు. దాన్ని ఇప్పటి వరకూ మీ మనస్సు దొంగిలించి ఉంచింది.

గురువు సమక్షంలో కేవలం 'ఉండండి'…. అది జరుగుతుంది

ఎప్పుడైతే గురువుల సమక్షం లోకి దూకగలుగుతారో, ఆయన సమక్షంలో సర్వస్పష్టంగా ఉత్సవాలు జరుపుకుంటారో, ఎప్పుడైతే మీ సమక్షాన్ని, గురువుల సమక్షాన్ని ఉత్సవంలా చేస్తారో, అప్పుడు మీలో జరగవలసినవి అవే జరుగుతాయి. మరింకేమీ కాదు. నిజమైన గురుశిష్యుల సంబంధం ఏర్పడటానికి ఇదే జవాబు, ఇదే పద్దతి, ఇదే పరిష్కారం.

ఈ విషయం మీకు అర్థం కానప్పుడు నేను చాలా చాలా మాట్లాడాలి, మీ ప్రశ్నలకి జవాబులు ఇవ్వాలి. ఇది మరిన్ని సమస్యల్ని సృష్టిస్తుంది. అంతే. నేను మీ ప్రశ్నలకి జవాబుల్ని ఇస్తే ఏమవుతుంది? మీరు అది ఎలా చేయాలి అని తిరిగి అడుగుతారు. దానికి పద్ధతి ఏమిటని అడుగుతారు. అప్పుడు మీకు అది అర్ధం చేసుకోవటానికి మరొక పద్దతి చెప్పాలి. అప్పుడు ఆ పద్ధతి ఎలా సాధన చేయాలి అంటారు. ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది.

ప్రశ్నలు మరిన్ని ప్రశ్నల్ని కలుస్తాయి. అందుకే తత్వం అనేది ఏ ప్రశ్నకీ పూర్తి సమాధానాన్ని ఇవ్వలేదు. ప్రశ్నలకి ఎప్పుడూ జవాబులు ఇవ్వలేము. ప్రశ్నలకి జవాబులు ఆ ప్రశ్నల దశ కంటే పెరిగినప్పుడే దొరుకుతాయి. అప్పుడు ఇక ప్రశ్నలు ఉండవు. అవి కరిగిపోయి మాయమైపోతాయి.

మీలో అనుమానాలు, ప్రశ్నలు ఉన్నప్పుడు మీరు ఉత్సవం చేసుకోలేరు. ఉత్సవం – అనుమానం పూర్తి వ్యతిరేకాలు. మీరు ఉత్సవం చేసుకుంటే ప్రశ్నలు, అనుమానాలు కరిగిపోతాయి. అవి పోయేవరకూ ఎదురుచూడాలి అనుకోవద్దు. అది జరగదు, మీరు ఉత్సవాలు చేయండి, ప్రశ్నలు అవే కరిగిపోతాయి.

రామకృష్ణ పరమహంస చక్కగా చెబుతారు, 'మీరు చెట్టు క్రింద కూర్చొని చప్పట్లు కొడితే చెట్టు మీది పక్షులు అన్నీ ఎగిరిపోతాయి' అదే విధంగా డాన్సు చేయండి మీలోని సంస్కారాలన్నీ కరిగిపోతాయి. మీ లోపల ఉన్న అనుమానాలన్నీ ఎగిరిపోయి మాయమవుతాయి. కాబట్టి బాగా గెంతుతూ వేగంగా డాన్స్ చేయండి. మీలోని పక్షులన్నీ ఎగిరిపోయి మాయం అవుతాయి. అవి తిరిగి రావాలి అనుకోవు. మీరు వాటి గూళ్ళు పడిపోయేలా గెంతండి. మీ లోపల ఉన్నవన్నీ పడిపోయి మాయమైపోతాయి.

మీరు అభివృద్ధి చెందాలంటే మీ అహంకారం మీద కొట్టాలి. అయితే ఒక విషయం తెలుసుకోండి. నేను ఎప్పుడూ మిమ్మల్ని నా నుంచి దూరం చేయను. కాబట్టి మీరు పడిపోయినా నా ఒడి లోనికే పడతారు. నేను మిమ్మల్ని కొట్టినప్పుడు రెండు జరుగుతాయి. మీరు సత్యాన్ని పట్టుకుంటారు లేదా మీరు పట్టుకోలేకపోతే నా ఒడి లోనికే పడతారు. ఒక విషయం అర్ధంచేసుకోండి, నేను మిమ్మల్ని కొట్టినప్పుడు స్వాగతించండి. దాన్ని ఆపవద్దు. దాని నుంచి తప్పించుకోవద్దు. దెబ్బవల్ల మీకు బాధకలగదు. దాన్ని ఆపటమే బాధ కలుగుతుంది. నేను

గురుదేవులు – జీవన్ముక్తులు

కొట్టటం మీకు దెబ్బ కాదు, దాన్ని ఆపటమే. అది కొట్టటం కాదు కరుణతో కూడిన దీవెన. మీ అభివృద్ధి కోసం గురువుల దీవెన అని తెలుసుకున్నప్పుడు అందులో అందాన్ని తెలుసుకొని దాన్ని స్వాగతిస్తారు.

బంధాన్ని ఏర్పరచుకున్న అనుభూతి

ఒకసారి గురువుతో బంధం ఏర్పడితే ఆయన మీకు ఇచ్చేది ఏమీ ఉండదు, ఆయన నుంచి తీసుకోవటానికి ఏమీ ఉండదు. ఇచ్చేవారు, తీసుకునేవారు ఉండరు. ఎందుకు? ఎందుకంటే ఒక విస్పోటం జరిగి ఇచ్చేవారు, తీసుకునేవారు ఒకరుగా కలసిపోతారు.

నేను ఎప్పుడూ చెబుతుంటాను, మీకు జీవితంలో భక్తి కలిగే అవకాశం, గురువులతో అనుబంధం ఏర్పరచుకునే అవకాశం కలిగినప్పుడు, ఆ అంతిమసంఘటనకి అవకాశం కలిగినప్పుడు ఆ అవకాశాన్ని అసలు పోగొట్టుకోవద్దు. అసలు మిస్ అవ్వకండి. ఆ అవకాశం పోయింది అంటే అది చాలా ఖరీదైన నష్టం. అది లోతైన సంఘటన, అది అంతిమవరం. మీకు ఆ అవకాశం వస్తే దాన్ని పోగొట్టుకోవద్దు.

మీలో నిరంతరం అనుబంధం ఏర్పడుతున్న అనుభూతి కలిగినప్పుడు, దాన్ని ఎన్ని కష్టనష్టాలు వచ్చినా పోగొట్టుకోవద్దు. మీకు, ఆయనకి మధ్య వచ్చే ఏ భావాన్నెనా విసిరిపారేయండి. ఏది పోయినా పరవాలేదు. కాని గురువులతో అనుబంధం పోకూడదు. ఎందుకంటే ఆ అనుబంధాన్ని జీవించనిస్తే, మీకు చాలా జరుగుతాయి. అవకాశాలు అనంతం, అన్ని దారాలూ తెరవబడతాయి. మీరు ఆ అనుబంధంలో విప్పారి తెరవబడిన అంతరంగంతో ఉన్నారా లేదా అని కొలవటానికి ఒక స్కేలు ఇస్తాను.

మీ అంతరంగం లోనికి గురువుగారు ప్రవేశించగానే మీ టి. పి. ఎస్ (సెకండుకి వచ్చే ఆలోచనల సంఖ్య) తగ్గిపోతే, దాని అర్థం మీరు విప్పారి ఉన్నారు అని.

రాళ్ళని కూడా కదపగల శక్తి

నా ఆధ్యాత్మిక ప్రయాణంలో జరిగిన ఒక సంఘటనని చెబుతాను.

ఒక గురువుగారు తన శిష్యులతో హిమాలయాలతో పూర్తిగా బంధాన్ని ఏర్పరచుకున్న విషయం గురించి మాట్లాడుతున్నారు. ఆయన చాలా ప్రేమతో, ఆదరణతో నన్ను కూడా ఆ ఉదయం పూట జరుగుతున్న క్లాసులో కూర్చోనిచ్చారు. ఆయన ఒకరి తరువాత ఒకరిని 'ఆ పద్ధతి సాధన చేసావా?' అని అడుగుతున్నారు. ఆయన అంతకు ముందు కొన్ని రోజుల క్రితం ఒక పద్ధతి చెప్పి సాధన చేయమన్నారు. అది హిమాలయాలు మొత్తం వారి శరీరంలో ఒక భాగం అని, ఆ భావాన్ని పూర్తిగా అంతరంగంలో నిలుపుకోవాలి.

ఒక శిష్యుడు, 'చేసాను గురుదేవా! నేను ఇప్పుడు పూర్తిగా హిమాలయాలతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను' అని చెప్పాడు. అప్పుడు గురువుగారు 'సరే! అయితే ఆ రాతిని కదుపు' అన్నారు. దూరంగా ఉన్న రాతిని చూపిస్తూ నేను పూర్ణం చేసి చెబుతున్నాను, దీన్ని నాకళ్ళతో చూసాను. ఆ శిష్యుడు, తన చేతిని కదపగానే అక్కడ రాయి కదిలింది.

తర్కజ్ఞానంతో చూస్తే దీన్ని అర్ధంచేసుకోవటం చాలా కష్టం. నేను నిర్ఘాంతపోయాను. అక్కడ జరిగింది చూసి కదిలిపోయాను. గురువుగారు నా వైపు చూసి, 'మనస్సు యొక్క శక్తి ఎంత ఉంటుందో చూసావా?' అని అడిగి ఇక్కడ కూర్చో అన్నారు. ఆ శిష్యుడి వైపు తిరిగి నా చేయి పట్టుకోమని చెప్పారు. నాతో ఆయన, 'ఇప్పుడు నీ చేతిని కదుపు' అన్నారు. నేను నా చేతిని కదపగానే రాయి వెనక్కి యథాస్తానానికి వచ్చేసింది. అది చాలా పెద్ద రాయి. గురువుగారు నాతో చాలా చక్కగా చెప్పారు. అది ఆ శిష్యుడు మాత్రమే చేయగలడు నీవు చేయలేవు అని కాదు, ఎవరైనా ఆ అనుబంధంలో భాగంగా ఉంటే వారు చేయగలరు. రాతినే కాదు, పర్వతాన్ని కూడా కదపగలరు.

నేను మిమ్మల్ని రాళ్ళు కదపమని చెప్పటం లేదు. ఈ పద్ధతి గురించి చెప్పాను. ఈ సాధనపద్ధతిలో ఉన్న శక్తి గురించి చెప్పాను.

మీరు పోగొట్టుకోకూడని ఒక విషయం

మీరు గురువుల ప్రేమలో ఉన్నప్పుడు ఆయనని భగవంతుడుగా భావించటమే కాదు, ఆయన సమక్షంలో భగవంతుడు చేసే అద్భుతాల్ని ఆయన ముందు చూడగలుగుతారు. కానీ ఎప్పుడైతే ఆ ప్రేమ పోతుందో, మీకు గురువుల పట్ట ప్రేమ ఉండదో ఆ అద్భుతాల్ని చూడలేరు. మీరు అదే వ్యక్తి, గురువు అదే వ్యక్తి. కాని అద్భుతాలు జరగవు.

ఇలా ఎందుకు జరుగుతుంది అని నన్ను ఎవరో అడిగారు. గురువుల జ్ఞానోదయం పోతుందా? లేదు. ఆయన దాన్ని పోగొట్టుకోరు. మీరు వాటిని గుర్తించే శక్తిని పోగొట్టుకున్నారు. మీరు జ్ఞానోదయంతో అనుబంధాన్ని పోగొట్టుకున్నారు. మీరు భగవంతుడా? అని ఎవరైనా నన్ను అడిగితే వారితో అది మీలో ఉంది అని చెబుతాను.

నేను నిరంతరం దొరుకుతాను. నేను విప్పారి ఉంటాను. మీరు నాతో ఒక టీచర్‌గా అనుబంధాన్ని పెంచుకుంటే ఆ జ్ఞానాన్ని పొందుతారు. ఒక గురువుగా నాతో బంధాన్ని ఏర్పరచుకుంటే, ఆ దీక్షని పొందగలుగుతారు. గురువు మాత్రమే దీక్షని ఇవ్వగలడు, టీచర్ ఇవ్వలేడు. టీచర్ బోధిస్తాడు. గురువు దీక్ష ఇస్తాడు. మీరు భగవంతుడు అని అనుబంధాన్ని పెంచుకుంటే, ఆ అంతిమశక్తితో బంధం ఏర్పడితే మీరు ఆ అనుభవాన్ని తీసుకుంటారు.

ఇదంతా మీ అంతరంగంలో నాకు దొరికే చోటుని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతే. మీరు తెలివితేటల దశలో బంధాన్ని ఏర్పరచుకుంటే మీరు జ్ఞానాన్ని తీసుకువెళతారు. భావాత్మకత కూడా కలిపితే, కొంచెం ప్రేమని కూడా కలిపితే, మీరు దీక్షని తీసుకువెళతారు. నా సాఫ్ట్‌వేర్ మీలోపలికి వస్తుంది. మీరు అంతరాత్మస్తాయిలో బంధాన్ని ఏర్పరచుకుంటే, మీకు దీక్ష కూడా అవసరం లేదు. ఆ అనుభవం మీ లోనికి బదిలీ అవుతుంది. సాఫ్ట్‌వేర్, దాని ఉపయోగాలు అన్నీ మీ లోనికి బదిలీ అవుతాయి. ఇదంతా ఆయా వ్యక్తులు అనుబంధాన్ని ఏర్పరచుకునే స్థాయి, దేనితో ఎలా ఏర్పరుచుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది.

నేను ఎప్పుడూ చెబుతుంటాను, భక్తి లేదా గురుదేవులతో ఏర్పరచుకున్న అనుబంధం – అన్నింటిలోనూ అత్యుత్తమమైన అంతిమ సంబంధం. మీ జీవితంలో ఆ అవకాశం వస్తే దాన్ని మిస్ అవ్వకండి. ఆ అవకాశాన్ని వదులుకోవద్దు. మీరు బయట ప్రపంచానికి సంబంధించిన వస్తువులు, అవకాశాలు మిస్ అయితే పరవాలేదు. మీ అంతరంగప్రపంచంలో మీకున్న భావాలు మిస్ అయినా పరవాలేదు.

ఇంగ్లీషులో ఒక సామెత ఉన్నది. మీ ఐశ్వర్యం పోతే మీరు పోగొట్టుకున్నది ఏదీ లేదు. ఆరోగ్యం పోతే ఏదో కొంత పోగొట్టుకున్నవారవుతారు. మీ ప్రవర్తనను పోగొట్టుకుంటే పోయేది ఏదీ లేదు! కాని గురువులతో ఉన్న అనుబంధం పోతే సమస్తం పోయినట్టే.

మరొక విషయం, మీరు నాతోనే బంధాన్ని పోగొట్టుకోవటం కాదు, నిజమైన అంతరాత్మతో కూడా బంధాన్ని పోగొట్టుకుంటారు. ప్రేమలో మీరు బంధం ఏర్పరచుకుంటారు. ద్వేషంలో దాన్ని తెంచుతారు. భక్తిలో ఈ రెండింటికీ అతీతంగా వెళతారు. మీరు నా సమక్షాన్ని అనుభూతితో తెలుసుకుంటారు. నేను భౌతికంగా ఉన్నా లేకపోయినా మీకు ఆ అనుభూతి కలుగుతుంది. ప్రేమకి అతీతంగా వెళ్ళటమంటే ద్వేషించమని కాదు, బంధాన్ని తెంచుకోమని కాదు నేను చెప్పేది. ఆ ప్రేమ భక్తిగా మారాలి. మీరు, గురువు వేరు కాదు ఒకటే అని మీరు అనుకోగలగాలి. అప్పుడు భౌతికంగా లేకపోయిన గురువుల సమక్షంలో మీరు ఉండగలరు. ఆయన నిరంతరం మిమ్మల్ని మీ లోనికి చూడమని గుర్తుచేస్తుంటాడు. ఆయన మిమ్మల్ని ఏ విధంగాను బందీ చేయడు.

ఎవరినైనా వారి సమక్షాన్ని అనుభూతితో తెలుసుకోవటానికి చాలా ఎక్కువ ప్రయత్నం చేయవలసి వచ్చినా, అందుకు చాలా శక్తిని వినియోగించినా, ఆ వ్యక్తితో ప్రయత్నపూర్వకంగా బంధాన్ని ఏర్పరచుకోవాలి అనుకున్నా, మీరు వారి మీద ఆధారపడతారు. ఆ తరువాత క్రమంగా వాళ్ళు కూడా మీ మీద ఆధారపడతారు. ఎవరైనా మీ మీద ఆధారపడకుండా, మిమ్మల్ని ఆయన మీద ఆధారపడనిస్తే అది మీరు స్వతంత్రంగా వ్యవహరించగలిగే స్థితి వరకూ ఆయన మీద ఆధారపడనిస్తే ఆయన జ్ఞానోదయమైన యోగీశ్వరుడు. జ్ఞానోదయమైన వ్యక్తి మీ మీద ఎప్పటికి ఆధారపడదు. కాబట్టి మిమ్మల్ని ఆయన తన నియంత్రణలో ఉంచవలసిన అవసరం, ఆ ఆసక్తి ఆయనకి లేవు.

సమయం వచ్చినప్పుడు, మీరు మీ లోపలికి వెళ్ళగల స్థితికి చేరినప్పుడు, ఆయన మిమ్మల్ని మీ లోనికి మళ్ళిస్తారు. ఆయన మిమ్మల్ని మీ లోనికి వెళ్ళమని చెబుతాడు. ఒకసారి ఆ కేంద్రీకరించే పని పూర్తి అయితే, వెంటనే ఆయన 'ఇక చాలు, నేను లేకుండా నీవు పని చేయాలి. నీ మీద పని చేయాలి' అంటాడు. ఆయన సమక్షం లేని సమయంలో మీకు సహాయంగా ఉంటూ, శక్తిని అంతా మీ పని లోనికి మళ్ళే విధంగా చేస్తాడు. ఆయన మిమ్మల్ని బంధాలలో ఉంచరు. అదే గురువులతో ప్రేమలో పడటంలోని గొప్పతనం.

గురువు ఎప్పుడూ మీ మీద ఆధారపడడు. ప్రారంభంలో మిమ్మల్ని ఆయన మీద ఆధారపడనిస్తాడు. సమయం వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని పూర్తి స్వేచ్ఛలోనికి వదిలేస్తాడు. ఆయన మీ శక్తిని అంతా మీలో నింపి 'ఇక సెలవు' అంటారు. అంతిమ అనుభవాన్ని మీ అంతట మీరు పొందేలా చేస్తారు.

హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లలో మార్పు

మీలోని అచేతనస్థితి సాఫ్ట్‌వేర్ లాంటిది. దాన్ని ధ్యానంతో శుభ్రం చేయవచ్చు. మీ మెదడు అనే హార్డ్‌వేర్‌ని కొత్త సాఫ్ట్‌వేర్‌కి అనుగుణంగా మార్చాలి అంటే మీకు దర్శనం లేదా గురుకృప కావాలి.

ఎప్పుడైతే ధ్యాసం ద్వారా మీ అచేతనస్థితిని, చేతనస్థితిని శుభపరచుకుంటారో, మీరు మీ లోపల మార్పుని తెస్తారు. ఆ మార్పుని మీలోని హార్డ్‌వేర్ పట్టిఉంచలేదు. గురువుల దర్శనంతో ఆయన దీవెనలతో హార్డ్‌వేర్ కూడా మారి దాన్ని పట్టుకొని ఉంచుతుంది. మీకు ఆ దీవెనలు దొరకకపోతే, ధ్యానం, బోధనలు అనేవి క్రమంగా హార్డ్‌వేర్ మారటానికి సహాయం చేస్తాయి.

హార్గ్‌వేర్ పాతది, సాఫ్ట్‌వేర్ కొత్తది అయినప్పుడు క్రమంగా హార్డ్‌వేర్ కూడా కొత్తగా అవుతుంది. మీ హార్డ్‌వేర్‌లో వెంటనే మార్పు రావాలి అంటే మీకు గురుకృప, దర్శనం సరియైనవి. అది సూటిగా హార్డ్‌వేర్‌ని మారుస్తుంది. కొన్ని సార్లు కొత్త సాఫ్ట్‌వేర్‌ని పెట్టకుండానె హార్డ్‌వేర్ మారిపోయి కొత్త సాఫ్ట్‌వేర్ లక్షణాలని చూపిస్తుంది. అది జరగాలి అంటే శిష్యుడు గురువుగారి దగ్గర పూర్తి విప్పారి ఉండాలి. కొన్నిసార్లు శిష్యుడు ఎటువంటి కారణం లేకుండానే గురువుగారి ప్రేమలో పడతాడు. ఆయన బోధనలకి ఆకర్షితుడు కాకపోవచ్చు. ధ్యానపద్ధతులు అతన్ని ఆకర్షించకపోవచ్చు. కాని గురువుల ప్రేమలో పడతారు. కారణం లేకుండా గురువుల పైన శిష్యుడు ప్రేమతో ఉంటే గురువు సూటిగా ఆ శిష్యుడి సాఫ్ట్‌వేర్ మార్చగలరు. అటువంటి శిష్యులు ఆయన బోధనలని, ధ్యానపద్ధతుల్ని అవి నేర్చుకోకుండానే వెల్లడి చేయగలరు.

ప్రస్తుతం హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండూ బయట ప్రపంచం వెపు ఉన్నాయి. బోధనలు వినటం వలన సాఫ్ట్‌వేర్‌లోని చేతనస్థితి అంతరంగం వెపు తిరుగుతుంది. కాని సాఫ్ట్‌వేర్ అంతరంగం వెపు తిరిగినా హార్డ్‌వేర్ దానిని నిర్వహించలేదు. కాబట్టి హార్డ్‌వేర్ తన పూర్వసితిలోనే ఉండటానికి చూస్తుంది. ఒకవేళ సాఫ్ట్‌వేర్ చాలా బలంగా ఉండి అది ఆ స్థితిలో ఉండగలిగితే క్రమంగా హార్డ్‌వేర్ మారుతుంది. కాని బోధనలు, ధ్యానం తరువాత వెంటనే గురుదర్శనం, ఆయన దీవెనలు ఉంటే, హార్గ్‌వేర్ వెంటనే మారిపోయి కొత్త సాఫ్ట్‌వేర్‌కి అనుగుణంగా ఉంటుంది. అదే అనుభవాన్ని పట్టి ఉంచేందుకు సిద్ధంగా ఉంటుంది.

మార్పుని పట్టి ఉంచగల శక్తి

జ్ఞానోదయమైన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMల సమక్షంలో ఉన్నప్పుడు ఆయన మీ హార్డ్‌వేర్‌ని మార్చి మీలో జరిగిన మార్పుని, ఆ కార్యక్రమాన్ని పట్టిఉంచే శక్తిని దానికి ఇస్తాడు.

ఒక విషయం అర్థం చేసుకోండి. జ్ఞానోదయంతో మీ భౌతికవ్యవస్తలో పూర్తిమార్పు వస్తుంది. గురుదేవులు మీలోనికి జ్ఞానోదయ వ్యవస్థని మీ భౌతికవ్యవస్థలో కూడా మార్పు తీసుకురాగలరు. ఆయన సమక్షంలో ఆయన మిమ్మల్ని స్పృశించినప్పుడు పూర్తిగా తెరవబడిన అంతరంగంతో ఉంటే, జ్ఞానోదయభౌతికవ్యవస్థ మీలోనికి పంపించబడుతుంది. మీ శరీరం ఇప్పుదున్నదాని కంటే చాలా బాగా ఉన్నాను. అని తెలుసుకుంటుంది. మీలోని జీవసంబంధ జ్ఞాపకవ్యవస్థ ఇంకా బాగా ఉండగల అవకాశాల్ని తెలుసుకుంటుంది.

వసుధైక కుటుంబకం

గురువుల ప్రేమతో, తోటి శిష్యులపైన కూడా ప్రేమ కలుగుతుంది. నేను అనేది తొలగిపోయి 'మేము' వస్తుంది. తోటి శిష్యులతో బలమైన బంధం ఏర్పడుతుంది. అది రక్తసంబంధీకులతో ఉండే బంధం కంటే బలమైనదిగా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి నిబంధనలు ఉండవు. ఆ ప్రేమ అంతా అవరించి ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పిన వసుధెక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబంగా ఉంటుంది.

మీరు అందరూ సామాజికంగా వృద్ధి చెందుతారు. కానీ గురుదేవులతో సంబంధంలో ఎవరి ప్రత్యేకత వారిదే. ఆ ప్రేమ వ్యవహారం, తెలివితేటల దశ లేదా హృదయదశ నుంచి ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరొక దానితో కలసిపోతుందో, శిష్యుల ఆత్మ గురువుల ఆత్మతో కలసిపోతుందో, అదే ముక్తి, నిత్య ఆనంద స్థితి.

జీవస్ముక్తి అంటే గురుదేవులతో జీవించటమే…. అది అంత సులభం.

ప్రశ్నలు – జవాబులు

గురువుగారు శిష్యులని ఎంచుకుంటారా లేక శిష్యులు గురువుగారిని ఎంచుకుంటారా?

మొదటి విషయం, శిష్యుడు గురువుని ఎంచుకుంటాడు. ఎందుకంటే గురువు ఎప్పుడూ ఎంచుకోరు. తన దగ్గరకి వచ్చినవారి మీద కరుణ కురిపిస్తాడు. ఆయన పవిత్రగంగానది వంటివాడు. ఆయన ప్రవహిస్తూ ఉంటాడు. మీరు కావాలి అనుకుంటే నది దగ్గరకి వెళ్ళవచ్చు. ఆ నది లోనికి దిగవచ్చు. అందులో మునగవచ్చు, ఆ నీరు తాగవచ్చు, అక్కడ ఆడుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది చేయవచ్చు. కాని గంగానది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎవరినీ ఎంచుకోదు. అదే విధంగా గురువు కూడా. అయనది ఎంపిక లేని శక్తి ఎంపిక లేని పరమానందం.

కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఆ అనుబంధాన్ని శిష్యుడే ఏర్పరచుకోవాలి. గురుశిష్యుల సంబంధాన్ని ఏర్పరచటంలో శిష్యునికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. అది అంతిమ స్వేచ్ఛ, ఆ సంబంధాన్ని ఏర్పరచాక, ఆ స్వేచ్ఛ పోతుంది. ఎందుకంటే అతను జ్ఞానోదయాన్ని పొందుతాడు కాబట్టి. మీరు చేయగల చివరి పని, మీ జీవితంలో చేయగల చివరి ఎంపిక గురువుని ఎంచుకోవటం, అంతే. ఒకసారి గురువుని ఎంచుకోగానే మీరు మాయమవుతారు. ఇక మీరు ఒక వ్యక్తి కాదు. మీరు గురువు అవుతారు.

గురుశిష్యుల మధ్య విశ్వాసం ఎలా ఏర్పడుతుంది? శిష్యుడు నిదర్శనం అడగవచ్చునా? అతను నిబంధనలు లేని అధీనతని ఆశిస్తారా?

మొదటి విషయం శిష్యుడు నిబంధనలు లేని అధీనతని ఇవ్వడు. అతను నిరూపించే విషయాల గురించి అడగటం మానడు. శిష్యుడు ఎప్పుడూ గురువు అసలు స్థితిని తెలుసుకోవటానికి గట్టి నిదర్శనలని ఆశిస్తాడు. రెండవ విషయం శిష్యుడికి ఉండే అన్ని అర్హతలూ అతనికి ఉండవు. అతనే శిష్యుడు. అతను కచ్చితమైన శిష్యుడు కాదు కాని గురువులో కచ్చితమైన అర్హతలని ఆశిస్తాడు. అదే శిష్యుడి లక్షణం. దీని గురించి పట్టించుకోవద్దు. గురువుల లక్షణం ఆయన అధీనం అయ్యే శిష్యులకి నిబంధనలు పెట్టడు. ఆయన నిరంతరం తాను నిజమైన గురువుని అని నిదర్శనాలు చూపుతూ ఉంటాడు. అదే గురువుల అర్హత. మరొక విషయం మీరు నిదర్శనం అడిగినా నిబంధనలు లేని అధీనతకి సిద్ధపడకపోయినా పరవాలేదు. అది అవసరం లేదు. మీరు అలా చేయలేరు కూడా. నిదర్శనాలు అడగండి, దొరుకుతాయి.

ఎప్పుడైతే మీకు నిదర్శనం దొరుకుతుందో నిబంధనలు లేకుండా అధీనమవుతారు.

ఎవరైనా గురువుగారు మారవచ్చునా లేక వారిని ఎంపిక చేసారా?

మిమ్మల్ని ఎవరూ ఎంపిక చేయనవసరం లేదు. మిమ్మల్ని మీరు ఎంచుకోవాలి, అంతే. అర్థం చేసుకోండి, అద్దుష్టం కొద్దీ గురువుని ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపిక చేయరు. ఎవరూ వారికి ఓటు వేయనవసరం లేదు. మీరు చేయవలసినది, కేవలం మీ ఓటు మీకు వేసుకోవటం. మిమ్మల్ని మీరు ఎంచుకోవాలి. ఎవరూ మిమ్మల్ని గురువులుగా ఎంపిక చేయనవసరం లేదు. మీరు ఈ విధంగా నిర్ణయించుకోండి, ఈ రోజు నుంచి నా అంతరాత్మ యొక్క సత్యంతో, సత్యంగా జీవిస్తాను. మీరు ఆ నిర్ణయం చేసుకుంటే చాలు, మీరు గురువు అవుతారు అంతే.

నేనెప్పుడూ చెబుతుంటాను, నేను ఫలానా రోజున జ్ఞానోదయం పొందాను అంటే ఆ రోజు ఏదో అయ్యింది అని కాదు. అంటే నా లోపల ఏదో జరగటం వాస్తవమే, అది ముఖ్యం కాదు. అది కాదు నేను చెప్పదలచుకున్న విషయం.

మొదటి విషయం, అప్పుడు ఏమైందంటే నేను చేతనస్థితిలో, జ్ఞానోదయస్థితిలో జీవిస్తాను అని నిర్ణయించుకున్నాను. నేను అలా నిర్ణయించగానే నాలో ఏదో జరిగింది. అందరూ ఏమసుకుంటారంటే ముందు జ్ఞానోదయం జరుగుతుంది. తరువాత నిర్ణయం చేస్తాం అని, అది కాదు. ముందు నిర్ణయం చేస్తాం తరువాత అనుభవం కలుగుతుంది.

స్వామీజీ ! జీవితం, ప్రపంచం, విశ్వం, భగవంతుడు లక్ష్యం ఏమిటి?

మీ జీవితలక్ష్యం తెలిస్తే, మిగతా మూడూ ఆటోమాటిక్‌గా తెలుస్తాయి. జీవిత లక్ష్యం, విశ్వలక్ష్మమే. విశ్వలక్ష్యం భగవంతుని లక్ష్యమే. అంటే మీ జీవితలక్ష్యమే భగవంతుని లక్ష్యం. స్పష్టంగా తెలుసుకోండి, ముందు మీ జీవితలక్ష్యాన్ని తెలుసుకోండి, అప్పుడు భగవంతుని లక్ష్యం తెలుస్తుంది. అయితే మీ జీవితలక్ష్యం నేను చెప్పలేను.

మరొక ముఖ్యమైన విషయం, మీ జీవితలక్ష్యం ఏది అనుకుంటారో అటువంటి విశ్వాన్ని మీ చుట్టూ ఆకర్షిస్తారు. అటువంటి ప్రపంచాన్ని మీ చుట్టూ నిర్మించుకుంటారు. అటువంటి దేవుడిని పూజిస్తారు. మీ జీవితలక్ష్యం మీ ప్రపంచాన్ని, మీ విశ్వాన్ని మీ భగవంతుడిని తయారుచేస్తాయి.

మీ లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే అయితే మీరు అటువంటి కార్పోరేట్ ప్రపంచాన్ని సృష్టిస్తారు. అటువంటి కార్సొరేట్ విశ్వాన్ని సృష్టించుకుంటారు. ఈ ప్రపంచాన్ని ఒక వ్యాపార సంస్థగానే అర్థం చేసుకుంటారు. కాబట్టి మీ జీవితలక్ష్యం ప్రపంచలక్ష్యాన్ని, మీ విశ్వలక్ష్యాన్ని, మీ దేవుడి లక్ష్యాన్ని నిర్ధయిస్తుంది. మీ జీవితలక్ష్యం జ్ఞానోదయం అయితే, డబ్బు మరేదీ కానప్పుడు అకస్మాత్తుగా మీరు అటువంటి సమాజాన్ని మీ చుట్టూ చూస్తారు. అటువంటి విశ్వాన్ని అటువంటి

దేవుడిని, ఎవరైతే మీకు జ్ఞానోదయం ఇవ్వగలరు అనుకుంటారో ఆ భగవంతుడిని మీరు చూడగలుగుతారు.

మీకు డబ్బు, జ్ఞానోదయం – రెండూ కావాలి అని అనుకుంటే, మీ విశ్వం అదే విధంగా ఉంటుంది. మీ చుట్టూ అటువంటి ప్రపంచాన్ని నిర్మిస్తారు. కాబట్టి జీవితలక్ష్యం అనేది చాలా ముఖ్యం. అదృష్టం కొద్దీ లేదా దురదృష్టం కొద్దీ ఆ ఒక్కటీ నేను మీకు నేర్పించలేను. అది మీరే తెలుసుకోవాలి.

శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు అవతరిస్తాడు – అన్న మాట నిజమేనా?

అవును, అది నిజమే. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు అవతరిస్తాడు. కొన్నిసార్లు శిష్యుడు సిద్ధంగా లేకపోయినా కరుణతో గురువు అవతరిస్తాడు. ఆయన అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి సిద్ధంగా లేనివారు కూడా అందులోనికి దూకవచ్చు. కాబట్టి ఆ అవకాశానికి నా సహాయ హస్తాన్ని ముందుకి చాపుతాను.

అయితే కొందరు ఆ చేతిని కొరుకుతారు. ఏం చేయాలి. నేను వారితో సరే కొరకండి, అది మీ సహజగుణం అంటాను. కాని నేను నా చేతిని, సహాయాన్ని అందిస్తూ ఉంటాను. అది నా సహజలక్షణం. ఏదో మీరు చేయి కొరికారు అని నేను నా చేతిని అందించను అని అనుకుంటారు. నేను మరొక చేతిని ముందుకి చాస్తాను. ఇది బాగు అయ్యాక, నొప్పి తగ్గాక ఈ చేతిని కూడా పట్టుకోమంటాను. అంతే.

అర్థం చేసుకోండి. కొన్నిసార్లు శిష్యులకి ఒక పెద్ద అడుగు వేసే అవకాశం దొరుకుతుంది. అందుకే శిష్యుడు సిద్ధంగా లేకపోయినా గురువులు అవతరిస్తారు.

స్వామి వివేకానంద తన గురువైన రామకృష్ణ పరమహంసని పరీక్షించాడు. నేను కూడా అదే విధంగా మిమ్మల్ని పరీక్షించవచ్చునా?

నేను ఒకసారి కాలేజీ స్టూడెంట్స్ ప్రోగ్రాంలో మాట్లాడుతున్నాను. అప్పుడు ఒక స్టూడెంట్ నన్ను 'దేవుడిని చూసారా మీరు?' అని అడిగాడు. నేను అతన్ని 'నీవు వివేకానందుడి పుస్తకం చదివావా' అని అడిగాను. 'అవును నేను వివేకానంద పుస్తకాలు చదివాను. వివేకానందుడు రామకృష్ణపరమహంసని ఇదే ప్రశ్న అడిగాడు. అదే విధంగా నేను మిమ్మల్ని ఆ ప్రశ్న అడుగుతున్నాను, మీరు దేవుడిని చూసారా?' అన్నాడు.

నేను అతనితో, 'చూడు! వివేకానందుని ప్రశ్నకి రామకృష్ణ పరమహంస' 'అవును చూసాను' అని జవాబు ఇచ్చాడు. వెంటనే సర్వం వదలి వివేకానంద రామకృష్ణుల వెనుక వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు చెబుతున్నాను, 'నేను చూడటమే కాదు. నీకు కూడా చూపిస్తాను. నాతో రా అన్నాను. ఆ అబ్బాయి జనంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఒక విషయం అర్థంచేసుకోండి. గురువుని పరీక్షించే ముందు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆ తరువాత నా దగ్గరకి వచ్చి పరీక్షించండి.

విశ్వాసం లోతుగా ఏర్పడటానికి విమర్శాత్మకంగా పరీక్షించనవసరం లేదు. అనుమానాలు ఉన్నా పర్వాలేదు, కాని ఆ అనుమానం శాస్త్రజ్ఞని అనుమానంలా తెరవబడి ఉండాలి. అంతేకాని ఎథీయిస్టు అనుమానంలా ఉండకూడదు.శాస్త్రజ్ఞుడు దేని మీదా ఇంకా అభిప్రాయాన్ని ఏర్పరచడు. వికసించిన మనస్సుతో ఇంకా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి శాస్త్రవేత్తలా అనుమానం ప్రశ్నలు ఉండవచ్చు కాని ఎథీయిస్టులా కాదు.

నేను ఏ విధంగా మీ శిష్యుణ్ని కాగలను.

మీరు బంధవిముకులైతే నా అంతరంగప్రదేశం లోనికి, నా పరిధి లోనికి ప్రవేశించవచ్చు ఆ విధంగా ఉంటే నాతో సూటిగా బంధాన్ని ఏర్పరచుకోగలరు. అప్పుడు మీ నుంచి అద్భుతమైన శక్తి ప్రవహించటం ప్రారంభమవుతుంది. బంధ విముక్తి అంటే ఏమిటి? ఏ వ్యక్తినీ, విషయాలన్నీ ఆలోచనని పట్టుకొని వేలాదకుండా విరామంగా ఉండగలగటం.

నేను ఎపుడూ ఒక విషయం చెబుతుంటాను, ఎవరైతే ఏదైనా బాధ కలిగి నా దగ్గరకి హీలింగ్‌కి వస్తారో వారు భక్తులు. భకుడు కేవలం తన సమస్యల గురించే చెబుతూ ఉంటాడు. ఏ వ్యక్తి అయితే నా బాధని తీసుకుంటాడో, నా బాధ్యతని తీసుకుంటాడో, అతను నా శిష్యుడు.

ఏ వ్యక్తి అయితే నా బాధ్యత తీసుకున్న తరువాత, 'ఒక జ్ఞానోదయమైన గురువులకి ఏ విధంగా నొప్పి ఉంటుంది. ఈ బాధ్యత తీసుకోక ముందు బాధ, నొప్పి అని నేను అనుకున్న బాధ్యత బాధ కాదు, అది నిత్యానందం అని తెలుసుకుంటాడో ఆ వ్యక్తి నా అంతరంగం లోనికి, నా ప్రపదేశం లోనికి వచ్చిన నా లోపలివాడవుతాడు.

కాబట్టి ఇప్పుడు మీకు ఎలా శిష్యుడుగా మారాలో తెలిసింది. నా బాధ్యత, సర్వాంతర్యామి బాధ్యతే. దాన్ని తెలుసుకోండి. అప్పుడు నా శిష్యులవుతారు.

ఒక ఆధ్యాత్మిక అన్వేషికి తాను గురువుని చేరాను అని ఎలా తెలుస్తుంది? అతనికి చాలా మంది గురువులు ఉండవచ్చునా?

మీరు మీ గురువుని చేరినప్పుడు 'ఈయన నా గురువేనా కాదా?' అన్న ప్రశ్న మాయం అవుతుంది. స్పష్టంగా తెలుసుకోండి. నన్ను చాలా మంది అడుగుతుంటారు. మేము మిమ్మల్ని గురువుగా స్వీకరించాలా? అని. నేను చెబుతాను, ఆ తప్పు పొరపాటున కూడా చేయవద్దు అని. నన్ను మీ గురువుగా తీసుకోండి అని నేను ఎప్పుడూ చెప్పను. నేను మీ గురువుని అయితే మీ తెలివితేటల స్థితికి అతీతంగా ఏదో ఉంటుంది. మీరు నన్ను మరచిపోలేరు. ఇప్పుడు చెబుతున్నాను. నన్ను మరచిపోగలిగితే మరచిపోండి. అప్పుడు నేను మీ గురువుని

కాదు. రిలాక్స్ అవ్వండి. మీకు సరియైన గురువు దొరుకుతారు. దాన్ని గురించి ఆదుర్తా పడవద్దు.

మీరు నన్ను మరిచిపోలేకపోతే నేను మీ గురువుని. నేను ఎప్పుడూ చెబుతుంటాను, నన్ను మీ గురువుగా అనుకోవద్దు. నేను మీ గురువుని అయితే నేను రాత్రి, పగలు కూడా మీ మనస్సులో ఉంటాను. మీ కలలలో కూడా నేనే ఉంటాను. మీ ఆలోచనల నిండా నేనే ఉంటే, నేను మీ గురువుని.

కొంతమంది అడుగుతుంటారు. స్వామీజీ మిమ్మల్ని గుర్తుంచుకోవాలా? అని. వద్దు, అలా చేయవద్దు, మరిచిపోవటమే సమస్య కాని నన్ను గుర్తుపెట్టుకోవటం సమస్య కాదు. మీరు మరిచిపోగలిగితే మరిచిపోయి, మీ ప్రయాణాన్ని కొనసాగించండి. అది మీకు మంచిది.

మీరు నన్ను మరిచిపోలేకపోతే నేను మీ గురువుని మీ మనస్సులో ఏదో ఒక మూలలో నా మీద అనుమానం ఉంటే నేను మీ గురువుని కాదు. రిలాక్స్ అవ్వండి. బాధ పడవద్దు, పోరాటం వద్దు, మిమ్మల్ని మీరు హింసించుకోవద్దు. నానుంచి ఆనందంగా సెలవు తీసుకోండి. మీకు మంచి గురువు దొరకాలని దీవిస్తాను. మీ గురువు కోసం అనేషణ పారంభించండి. ఆ విధంగా నేను చాలా మందికి సహాయం చేసాను. ఇది షాపు కాదు, వ్యాపారం కాదు, మరొక చోటకి వెళ్ళకూడదు అని లేదు. నేను మరొక విషయం కూడా చెబుతాను, మీరు నా శిష్యులైనా, మిగతా గురువుల నుంచి కూడా నేర్చుకోవచ్చు. అన్ని తోటలకి వెళ్ళి మంచి పూలు తెచ్చుకొని మీ కోసం అందమైన మాలని తయారుచేసుకోండి. జీవితం అంటే దాన్ని మరింత ఐశ్వర్యవంతం చేయటమే. ముందుగా మీరు తెలుసుకోండి. మీరు నా శిష్యులా కాదా అన్న ప్రశ్న, నేను మీ గురువునెనప్పుడు అసలు రాదు. మీకు ఆ ప్రశ్న వచ్చినప్పుడు స్పష్టంగా తెలుసుకోండి నేను మీ గురువుని కాదు అని. మీ అన్వేషణని కొనసాగించండి.

రెండవ విషయం: ఆ అనుమానం పూర్తిగా పోయాక, మీలో ఎటువంటి అనుమానం లేకపోయినా నాతో పూర్తిగా బంధాన్ని ఏర్పరచుకున్నాక అప్పుడు కూడా కొత్త విషయాలు కొత్త చోట్ల నుంచి నేర్చుకోవటం మానవద్దు. అందరి గురువుల నుంచీ దొరికే ప్రతి అవకాశం నుంచీ కొత్త విషయాల్ని నేర్చుకోండి. నేర్సుకోవటం ఆపవద్దు.

రెండు – మూడు సంవత్సరాలు మీతో గడిపాక ఎందుకు కొంతమంది మిమ్మల్ని వదలి వెళ్ళిపోతారు? వాళ్ళు ఆ విధంగా ఎలా వెళ్ళగలుగుతారు? మీరు వాళ్ళని ఎందుకు ఆపరు?

అదే జ్ఞానోదయమైన గురువుల గొప్పదనం. ఆయన మిమ్మల్ని హిప్నటైజ్ చేయడు. మీకు బ్రైయిన్ వాష్ చేయదు. మీకు ఆయన అన్ని అవకాశాలనిస్తాడు. మీరు పది సంవత్సరాల తరువాత అయినా ఆయనని వదిలివేయవచ్చు. ద్వారాలు ఎప్పుడూ తెరచి ఉంటాయి.

మామూలు బోధకుడు మీ చుట్టూ చాలా విషయాలు అల్లుతాడు, చాలా విషయాలు బోధిస్తాడు, వ్యవస్థల్ని తయారుచేస్తాడు. మీరు వదలివెళ్ళకుండా అన్నీ తయారుచేస్తాడు. దాంతో మీరు వదలివెళ్ళలేరు. కాని గురువులు మీకు అన్ని అవకాశాలూ ఇస్తారు. అవకాశాలు అన్నీ తెరవబడి ఉంటాయి. మీరు లోపలికి రావచ్చు. బయటకి వెళ్ళవచ్చు. నిరంతరం అన్ని అవకాశాలూ దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ అనుబంధాలు ప్రేమ, స్వేచ్చ, వికాసం, కరుణ అనేవాటి మీద ఏర్పడ్డాయి. మీరు ప్రేమలో ఉన్నప్పుడు సత్యాన్ని చూదగలుగుతారు. మీరు లోపలికి వచ్చినప్పుడు, నేను మీకు మార్గదర్శిగా ఉండాలి అని మీరు ఆశించినప్పుడు నేను కలుగచేసుకుంటాను. లేకపోతే నేను మీకు దూరంగా ఉంటాను. చూడండి. నా దగ్గరకి సలహాల కోసం, మార్గం కోసం వస్తారనుకోండి, వాళ్ళు వాళ్ళకి ఉన్న అయోమయస్థితి నుంచి తప్పించుకోవాలని అనుకుంటారు. ఇక్కడ శక్తి మంతమైన రక్షణవలయం ఉంది అని వారికి తెలుసు. ఇక్కడ ఒక మహామేధస్సు వారికి దారి చూపిస్తుంది అని వారికి తెలుసు. అయితే కొన్నిసార్లు వారి అచేతనస్థితి ఆ సలహాలని, ఆ మార్గదర్శకత్వాన్ని ఒప్పుకోదు. నేను వారిని వేచి ఉండమని చెబితే, నేను వారికి పరిష్కారం చూపించటం లేదు అనుకుంటారు. అలా కాకుండా నేను పదే పదే వారికి పరిష్కార మార్గం చూపిస్తే, వారు వారి స్వేచ్ఛని కోల్పోయాం అనుకుంటారు. ఇటువంటివి చూసాక నేను వాళ్ళని వేచి ఉండండి, మెల్లమెల్లగా జరగవలసినవి జరుగుతాయి అని చెబుతాను.

ఆ విధంగా వెళ్ళిపోయేవాళ్ళని వారికి రావాలనిపిస్తే తిరిగి వచ్చే స్వేచ్ఛ మీకు ఉంది అని చెబుతాను. అయితే వారు నన్ను సలహా అడిగితే వారిని విమర్శించను. వారు ప్రేమతో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలపైన అది లేనప్పుడు వారి అభిప్రాయాల్ని ఏర్పరచుకోకూడదు. అదే ప్రేమ లేనప్పుడు ఆ ప్రేమ ఉన్నప్పుడు జరిగిన సంఘటనలపై సత్యాల పైనా వారు ఇప్పుడు ఆ ప్రేమ లేని సమయంలో అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు.

  • జ్ఞానోదయం పొందటానికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఆ అనుభవం పంపించగల విశ్వాసానికి సమయం పడుతుంది.
  • జీవించి ఉన్న ఒకే ఒక ఆధ్యాత్మిక గ్రంథం గురువు.
  • గురువు సహాయంతో మీరు భగవంతుని చేతుల లోనికి దూకవచ్చు.
  • మీ జీవితం అసలు లక్ష్యాన్ని మీరు మర్చిపోయారు.
  • జీవితం ఒక నాటకం. సంబంధబాంధవ్యాలు అన్నీ ఒక మానసికనాటకం.
  • నేను పని చేసేవాడిని అని మీరు అనుకున్నప్పుడే బాధ, టెన్షన్ కలుగుతాయి.

జీవన్ముక్తికి ధ్యానపద్ధతులు

జీవస్ముక్తే అంతిమ ధ్యాన పద్ధతి

స్థిరంగా చేసే ధ్యానపద్ధతులు

  1. మూడవ కంటి మీద ధ్యానం : ఈ ప్రపంచాన్ని ఒక కలగా చూడండి. మీలోని అత్యున్నతమేధాశక్తిని మేలుకొలపండి.

సమయం : వర్తించదు.

ఈ ధ్యానం నిద్ర పోయే ముందు చేయాలి.

మంచం మీద నిటారుగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మీ కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రం అదే మూడవ కన్ను, దాన్ని గుర్తు తెచ్చుకోండి. ఏకాగ్రత నిలపవద్దు. దాన్ని శ్రమ పెట్టవద్దు. చాలా రిలాక్స్‌డ్‌గా దాన్ని గుర్తు చేసుకోండి. ఆజ్ఞాచక్రాన్ని గుర్తుంచుకొని, మీ ప్రాణం కదలికల్ని తెలుసుకోండి. ప్రాణం జీవశక్తి. ప్రాణం ఏ విధంగా మీ శరీరంలో ప్రవహిస్తుందో గమనించండి. లోపలికి వచ్చే శ్వాస ఏ విధంగా చాలా శక్తిని తీసుకువస్తున్నదో, బయటకి వెళ్ళే శ్వాస ఎలా మీ శరీరానికి విశ్రాంతిని ఇస్తుందో తెలుసుకోండి. కేవలం తెలుసుకోండి చాలు.

ఏకాగ్రత ఎక్కడా నిలపవద్దు. విశ్రాంతిగా ఆజ్ఞాచక్రాన్ని తెలుసుకుంటూ మీ లోపలికి వచ్చే శ్వాసని బయటకి వెళ్ళే శ్వాసని గమనించండి.

ఇప్పుడు పదుకునే పొజిషన్‌కి రండి. నిద్రపోయేటప్పుడు మూడవ కంటిని గుర్తుచేసుకోండి. పడుకోగానే ఇలా నిర్ణయించుకోండి 'అవును నేను నిద్రపోతున్నాను' అని, మీ చేతనస్థితి చెదిరిపోయేటప్పుడు తెలుసుకోండి. మీరు చీకటి లోనికి లోతుగా వెళ్ళేది గమనించండి. నిద్ర పోయే ముందు ఆజ్ఞాచక్రాన్ని గుర్తుచేసుకుంటే చాలు. ఎందుకంటే మీరు మేల్కొని ఉన్నప్పుడు మీ ప్రాణం అక్కడే ఉంటుంది. మీరు నిద్ర పోగానే ప్రాణం మూడవ కన్ను ప్రాంతం నుంచి కిందికి జారుతుంది.

మరొక విషయం, రోజంతా మీరు ఏది ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు అదంతా, ఈ ప్రపంచం మొత్తం నిజం కాదు, ఇదంతా కల, మీరు చూసేది కల అనుకోండి. చేతనస్థితిలో గుర్తుంచుకోండి. మీరు చేసేవన్నీ, అన్ని పనులూ తినటం, నిద్ర పోవటం, నడవటం తాగటం, ఆఫీసులో కూర్చోవటం – ఇవన్నీ కల అనుకోవాలి.

వెంటనే మీరు అనుకోవచ్చు 'ఇది ప్రపంచం. కల అని ఎలా అనుకోను? ఇది నిజం కదా! అని' ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. నిజానికి సత్యానికి తేడా ఉన్నది. మీ దృష్టిలో ఈ ప్రపంచం అంతా కల అన్నది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఏదైనా నిజమా కాదా అని కొలిచే స్కేలు కచ్చితం కాదు.

జీవన్ముక్తికి ధ్యానపద్ధతులు

ఒకసారి ఈ పద్ధతిని కొన్ని రోజులు సాధన చేస్తే, ఈ మాటల వెనుక ఉన్న సత్యం అర్థమవుతుంది. అవి మిమ్మల్ని సత్యం వైపు తీసుకువెళతాయి. మీ తార్కిక మనస్సుకి అది నిజం కాకపోవచ్చు. నిజం లోతుగా చూస్తే అది సత్యం. కాబట్టి రోజంతా మీకు ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు మీకు మీరు ఇలా చెప్పుకోండి, 'ఈ ప్రపంచం ఒక కల, నేను చూసేదంతా కల.' అప్పుడు క్రమంగా మీరు చూసేది చెదిరిపోతుంది. అప్పుడు ఈ నాటకం అంతా జరిగే తెరని మీరు చూడగలుగుతారు.

ఈ పద్ధతిని పదకొండు రోజులు సాధన చేయండి. మీ ముందు జరిగేది, మీరు అనుభవించేది, అంతా మారుతున్న కల. దీన్ని గుర్తుంచుకోండి, చాలు.

ఒక ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాలి. ఆ పదకొండు రోజులు రోజంతా ఏదైనా ఒక విషయం నిరంతరం గుర్తు వస్తుంటే, అదే మీ స్వప్నస్థితి లోనికి చొచ్చుకుపోతుంది. మీరు కల కనేటప్పుడు, అది కల అని తెలుస్తుంది. కలలో అది కల అని గుర్తు రాగానే మీరు మేల్కొంటారు. ఈ పదకొండు రోజులూ మీరు డాక్టరు కాకపోయినా నేను డాక్టర్‌ని అనుకుంటే మీ కలలో మీరు డాక్టరుగానే ఉంటారు. మీలోని గుర్తింపులు పోవాలి అంటే ఈ పదకొండు రోజులు చాలు. మీరు కొత్త గుర్తింపుని వెల్లడి చేయటం ప్రారంభిస్తారు.

ఈ భావం మీ అంతరాత్మ లోనికి చొచ్చుకొని వెళితే మీ అంతరంగంలో అద్భుతమైన హీలింగ్ జరిగిన అనుభూతి పొందుతారు. ఆ ఒక్క అనుభవం చాలు, మీ రోజువారీ జీవితంలో సమతుల్యతతో ఉండటానికి. అంతే కాదు, మీరు ఏది నిజం అనుకుంటారో దాన్ని మార్చే శక్తిని పొందుతారు. నేను మార్చలేను అనుకున్నవి మారటం ప్రారంభమవుతుంది. మీరు ఈ కలని చూసే తెర దీన్నే చేతనస్థితి అంటాను, దాన్ని చూడగలుగుతారు. ఎప్పుడైతే ఆ తెరని చూడగలరో, కలలో కూడా చేతనస్థితిలో ఆ తెరని చూడగలుగుతారు.

మీ మనస్సు అడిగే తరువాత ప్రశ్న, 'అంతా కల అయితే నేను పని చేయటం ఎందుకు?' ఇదంతా కల అయినా మీ పని మీరు చేసుకోవచ్చు. దానిలో తప్పు లేదు. మీరు పని చేయవద్దు అని ఎందుకు అనుకుంటారు? అంటే మిమ్మల్ని మీరు సీరియస్‌గా తీసుకుంటారు. ఇదంతా కల అని గుర్తు చేసుకుంటే మీరు కల కంటున్నారా లేదా అనేది అనవసరం. మీరు రిలాక్స్ అవుతారు. జీవితం అలా జరుగుతుంది. మీరు జీవన ప్రవాహంలో ఉంటారు. అకస్మాత్తుగా మీలో మేధస్సు మేల్కొంటుంది. సత్యం వైపు మేల్కొంటారు. ఇదంతా మీ ప్రొజెక్షన్, మీ కల్పన అని తెలుసుకుంటారు. ఇక మీరు పాత వ్యక్తి కాదు. ఎందుకంటే మీరు సత్యాన్ని చూసారు.

2. పొందండి.

ఒక డైరీ పెట్టుకొని మీ భావాలని, ఆవేశాలని వేరు వేరు సమయాలలో కలిగిన అనుభవాలని – ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా వేరు వేరు సమయాలలో రాయండి. ఈ విధంగా ఒక నెల రోజులు చేయండి.

తరువాత మీ డైరీ చదవండి. మీ మనస్సు ఏ విధంగా ఏ సమయంలో ఉన్నదో చూడండి. మీ మానసిక వృత్తాన్ని తెలుసుకోండి. తరువాత మీ మూడ్ బాగా లేనప్పుడు ఆ వృత్తంలో ఉండండి. ఆ వృత్తంలో ఇది ఒక భాగం అనుకోండి. సంతోషంగా ఉండండి. అది అంతే ఇది ఎప్పటికీ ఉండదు. ఇది కూడా జరిగిపోతుంది.

మీరు నిజంగా సంతోషంగా ఉన్నప్పుడు గమనించండి. ఆ భావాన్ని గమనించండి. దాని ద్వారా మిమ్మల్ని గమనించండి. ఈ పద్ధతిని కొన్ని వారాలు సాధన చేయండి. మీ భావాలతో నిశ్చలంగా వ్యవహరించగలుగుతారు. అది ఎటువంటి భావమైనా సరే, మీరు నిశ్చలంగా ఉంటారు.

3. స్థిరంగా చెప్పటం :

మీ మాటలు, ఆలోచనలు మీ మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. మీ చుట్టూ ఉండే ప్రపంచం మీద తమ ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు ఉపయోగించే మాటల శక్తిని తక్కువగా అంచనా వేసారు. అందుకే వాటిని చాలా మామూలుగా వాడేస్తారు. ముఖ్యంగా మీ లోపల మీరు మాట్లాడుకునే మాటలు వ్యతిరేకంగా, ప్రతికూలంగా ఉంటాయి. మీ చేతనస్థితికి అనుకూలమైన మాటలని సృష్టించండి.

సమయం : వర్తించదు.

సరైనవి, అనుకూలమైన మాటలు మాత్రమే ఉపయోగిస్తాను అని ఇప్పుడు నిర్ణయించుకోండి. మీ లోపల వస్తున్న వ్యతిరేక ఆలోచనలకి ఆధారాన్ని ఇవ్వకండి. మీ శక్తిని ఆధారాన్ని కేవలం అనుకూలమైన ఆలోచనలకి, భావాలకి – రోజులో ఇరవై నాలుగు గంటలూ ఇవ్వండి.

మీరు ఎప్పుడైనా మూడ్ బాగా లేని స్థితి, మనస్సు బాగా లేదు అనుకున్నప్పుడు ఇది ప్రయత్నించి చూడండి. నిద్ర పోవటానికి ముందు, మంచం మీద కూర్చొని మీకు మీరు ఈ విధంగా గట్టిగా చెప్పండి. మీరు సంతోషంగా ఉన్నారని, జీవితం అందమైన అనుభవం అని, ఇక నుంచి ఉల్లాసంగా ఆనందంగా ఉంటానని చెప్పండి. ఈ రూఢిగా చెప్పే మాటలని పదకొండు సార్లు చెప్పండి. ఇప్పుడు పడుకోండి. మీ తల తలగడని తగలగానే అది కేవలం తలగడ కాదు. సర్వాంతర్యామి ఒడిలో నిద్రపోతున్నాను అనుకోండి. రిలాక్స్ అవ్వండి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్న, మీ మూలం అయిన సర్వాంతర్యామి ఒడి లోనికి జారండి. ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవకుండా ఆ మాటలని మరలా మీకు మీరు పదకొండు సార్లు చెప్పండి.

జీవన్ముక్తికి ధ్యానపద్ధతులు

దీన్ని మిగిలిన వ్యతిరేకభావాలైన భయం, అసూయ, వ్యథ వీటికి కూడా ఉపయోగించవచ్చు. వ్యతిరేకతని తెలుసుకుని, దాన్ని వదిలేయాలి అని నిర్ణయించుకోండి. వాటి స్థానంలో అనుకూలభావాలు ఉంచి, ఆ మాటలని గట్టిగా చెప్పుకోండి.

4. బరువు లేని సాధనపద్ధతి :

మీలోపల ఉన్న లోతైన ప్రశాంతతని, ఆనందాన్ని అనుభవించండి.

సమయం : కనీసం 10 నిమిషాలు.

నేల పైన కాని లేదా కుర్చీలో కాని సౌకర్యంగా, నిటారుగా కూర్చోండి. పాదాల మీద మీ బరువు ఆనకుండా చూడండి. చేతనస్థితిలో మీ పిక్కల కండరాలని కొంచెం పైకి లేపండి. అప్పుడు బరువు వెన్నెముక మీద ఉంటుంది. ఎందుకంటే మన శరీరాన్ని సంతులనంగా మనం ఎప్పుడూ ఉంచం. మీ శరీరం నేలని తగులుతున్న పాయింట్స్‌ని గుర్తించండి. మామూలుగా ఆ విషయాలని మనం గమనించం. కాబట్టి కొంచెం సమయం పడుతుంది. అందులో రెండు నేలని తగిలే పాయింట్స్ మీద ఏకాగ్రత నిలపండి. ఆ రెండు పాయింట్స్ నుంచి మీ శరీరం బరువు మొత్తం భూమికి వెళుతుంది. మీరు ఆ రెండు పాయింట్స్ ద్వారా మీ బరువు భూమికి వెళ్ళటాన్ని అనుభవం చెందితే, ఆ తరువాత బాలెన్స్ పాయింట్‌కి వెళ్ళవచ్చు. బాలెన్సింగ్ అంటే మీరు బరువు లేని మధ్య పాయింట్‌ని కనుగొనటమే. మీరు ఎంత వరకూ వంగగలిగితే అంత వరకూ ముందుకు వంగి, మీ శరీర బరువు తెలుసుకోండి.

తరువాత చాలా నెమ్మదిగా, ఒక అంగుళం తరువాత మరొక అంగుళం చొప్పున వెనక్కి రండి. మీరు కదిలే సమయంలో శరీరం బరువుని తెలుసుకోండి. నెమ్మదిగా శరీరాన్ని నిటారుగా చేయండి. మీరు శరీరాన్ని నిటారుగా చేస్తున్నప్పుడు క్రమంగా శరీరం బరువు తగ్గినట్టు తెలుసుకుంటారు. ఏ పాయింట్ దగ్గర అసలు బరువు లేకుండా ఉంటారో, ఎక్కడ పూర్తిగా తేలికగా అనిపిస్తుందో ఆ పాయింట్ దగ్గరకి రావాలి. ఎక్కడ శరీరం బరువు లేకుండా ఉన్నదో తెలుసుకున్నాక ఇప్పుడు నెమ్మదిగా మీ శరీరాన్ని వెనక్కి వంచండి. అలా వెనక్కి వెళ్ళే కొద్దీ శరీరం బరువు అవటాన్ని తెలుసుకోండి.

ఇప్పుడు నెమ్మదిగా శరీరాన్ని ముందు ఉన్న పొజిషన్‌కి తీసుకురండి. నిటారుగా ఉండి ఎక్కడైతే మీ శరీరం బరువు లేదో అక్కడికి రండి. ఈ విధంగా మీ శరీరాన్ని కనీసం రెండు– మూడుసార్లు ముందుకీ వెనక్కీ కదపండి. ప్రతిసారీ నిటారుగా వచ్చి, ఎక్కడ అసలు బరువు లేదు అనుకుంటారో ఆ పాయింట్ దగ్గరకి రండి. ఆ విధంగా కొంచం సేపు చేసాక, బరువు లేని పాయింట్‌ని మీరు కచ్చితంగా తెలుసుకుంటారు.

ఎక్కడైతే మీ శరీరం బరువు ఉండదో ఆ పాయింట్ దగ్గర ఉండండి. అదే దశలో ఉండండి. మీరు దేన్ని గుర్తు చేసుకోనవసరం లేదు, దేని మీదా ఏకాగ్రత నిలపనవసరం లేదు. ఎక్కడ మీరు తేలికగా అనుకుంటారో ఆ పాయింట్ దగ్గర పూర్తిగా సంతులితంగా ఉండండి.

మీ శరీరాన్ని ఆ విధంగా పది నిమిషాలు ఉంచే విధంగా రోజుకి ఒకసారైనా చేయండి. దీన్ని పది రోజులు సాధన చేయండి. ఇందులో ఉండే సౌలభ్యాన్ని పట్టుకుంటారు. అప్పుడు మీరు రోజంతా ఆ బరువు లేని పాయింట్ దగ్గరే కూర్చుంటారు. ఆ భంగిమలో మీ శరీరం సౌకర్యంగా, నిశ్చలంగా ఉంటుంది. మీ మనస్సు శరీరం నుంచి స్వేచ్ఛగా ఉంటుంది. మీరు పూర్తి సమతౌల్యంలో ఉంటారు. మీరు తెలివితేటలకి, భావావేశాలకి అతీతంగా ఉంటారు. మీరు బయట ప్రపంచానికి, మీకు చూపించే గుర్తింపులకి అతీతంగా ఉంటారు.

శరీరాన్ని సమతుల్యతలో ఉంచినప్పుడు మీలో లోతైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంకా మీరు చేయవలసినది ఏమీ లేదు. మీరు అనుకోవచ్చు, 'కేవలం బాలెన్స్ చేసి ప్రశాంతతని ఎలా తేగలను' అని. మీరు సాధన చేసి చూడండి.

5. శరీరాన్ని చిన్న చిన్న వృత్తాలుగా కదిలించటం :

చేతనస్థితిలో మార్పుని అనుభవించండి సమయం : వర్తించదు.

ఈ పద్ధతి సాధన చేసేటప్పుడు విశ్లేషణ చేయవద్దు. కొలవవద్దు, లెక్కించవద్దు. మీ లోపల కదలికల్ని అలా జరగనీయండి. మనం మన లోపలికి చూసుకుంటే, అక్కడ చాలా చిన్న కదలికలు జరుగుతూ ఉంటాయి. అవి కనిపించని వృత్తాలుగా ఉంటాయి. మీరు ఆ కదలికలతో ఉండండి. వాటిని అలా జరగనీయండి. ఆ కదలికల్ని అలా జరగనిచ్చినప్పుడు వాటి మీద ధ్యానం చేయండి. అకస్మాత్తుగా మనకి ఇది ఒక గట్టి శరీరం కాదు, ప్రవహిస్తున్న శక్తి అని తెలుసుకుంటాం.

మనం ఒక ప్రవహిస్తున్న శక్తి అని తెలుసుకోవటాన్నే నేను జ్ఞానోదయం అంటాను. అదే అంతిమ అనుభవం.

అకస్మాత్తుగా మనం శరీరం కాదు అని తెలుసుకుంటాం. మనం శరీరంలో నివసిస్తున్నాం, అంతే కానీ మనం శరీరం కాదు అని తెలుసుకుంటాం.

ఈ ధ్యానపద్ధతి మనం ప్రాణంతో కదిలే విధంగా సహాయం చేస్తుంది. ప్రాణం అనే సూక్ష్మజీవశక్తి మన శరీరంలో కదులుతూ ఉంటుంది. మనం ఎంతలా గడ్డకట్టుకుపోయి ఉన్నామంటే ప్రారంభంలో శక్తిని అనుభూతి పొందటం కష్టం. ప్రారంభంలో మన శరీరానికి సహాయం చేయాలి సహకరించాలి. అందుకు మనం చిన్న చిన్న కనపడని వృత్తాలని, చిన్న కదలికల్ని సృష్టించాలి.

కళ్ళు మూసుకొని కూర్చోండి. నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకుని వదలండి. శరీరాన్ని చాలా నెమ్మదిగా చిన్న చిన్న వృత్తాలుగా కదపండి. మీరు అలా అనుకున్నా చాలు. అకస్మాత్తుగా మీ శరీరం నెమ్మదిగా కదలటం గమనిస్తారు. ఆ కదలికలు మీకు సౌకర్యంగా ఉంటాయి. ఆ స్థితిలో ఉండి ఆ కదలికల్ని అలా జరగనీయండి.

మణిపూరకచక్రం దగ్గర ఏకాగ్రతని నిలపండి. మీ శరీరం మొత్తం చిన్న చిన్న వృత్తాలుగా తిరగటం గమనిస్తారు. మీరు మణిపూరకం దగ్గరే కేంద్రీకృతమవుతారు.

మీరు దేనిలోనైనా ప్రయాణించేటప్పుడు ఈ పద్ధతిని సాధన చేయవచ్చు. మీరు కారు డ్రైవ్ చేయనప్పుడుఈ ధ్యానం చేయవచ్చు. అకస్మాత్తుగా మీరు శరీరానికి అతీతంగా వెళతారు.

దీన్ని కనీసం పదకొండు రోజులు సాధన చేయండి. మీరు మీ చేతనస్థితిలో మార్పు రావటం గమనిస్తారు.

6. ఒకదాన్ని తప్ప అన్నింటినీ తీసివేయటం :

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్థితి మీద కేంద్రీకరించండి.

సమయం : వర్తించదు.

ఈ ధ్యానపద్ధతిలో మూడు స్టెప్స్ ఉన్నాయి. ముందుగా మీ ఎదురు ఒక వ్యక్తి కాని వస్తువు కాని ఉన్నది అనుకోండి. కేవలం చూడటం కాదు, వ్యక్తి ఉన్న అనుభూతి పొంది పూర్తిగా అందులో కలసిపొండి.

రెండవది, మిగిలిన అన్ని వస్తువులూ లేనట్లు, కేవలం మీ ముందు ఉన్నది ఒక్కటే ఉన్నట్టు అనుకోండి. ఆ ఒక్కటి తప్ప మిగిలిన వాటినన్నింటినీ తీసివేయండి. కేవలం ఆ ఒక్క వస్తువు లేదా వ్యక్తిని పూర్తిగా గ్రహించండి.

మూడవది, ఎప్పుడైతే ఎక్కడా ఏ వస్తువు, వ్యక్తీ లేకుండా కేవలం ఈ ఒక్కటే ఉన్న స్థితికి వచ్చాక, ఆ వ్యక్తి లేదా వస్తువు నుంచి విముక్తి చెందండి. ఆ బంధాన్ని వదిలేయండి.

తరువాత వస్తువుని అనుకోవటం అది లేదు అని అనుకోవటం ఒక పక్కకి పెట్టి మిమ్మల్ని తెలుసుకోండి, అంటే మీ లోనికి మాయం అవ్యండి. అకస్మాత్తుగా మీ లోపల మీరు కేంద్రీకృతమై ఉండటాన్ని చూస్తారు. మీ అంతరాత్మ లోతులలో, మీ చేతనస్థితిలో, మీ ఆత్మలో మీరు ఉంటారు.

మీకు ఎవరైనా ఒక వ్యక్తి పట్ల లేదా వస్తువు పట్ల ప్రేమ ఉన్నప్పుడు ఈ పద్ధతిని ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మొత్తం అంతా మాయమైపోవాలి. తరువాత ఆ వ్యక్తి కూడా లేనట్లు అనుకోవాలి. అప్పుడు మీరు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్థితిలో కేంద్రీకృతమవుతారు.

7. అన్నింటినీ మీలో నిలుపుకోండి :

మీ చేతనస్థితిని విస్తృతపరచండి.

సమయం: 21 నిమిషాలు

స్టెప్ 1 : సమయం : 2 నిమిషాలు.

నిటారుగా కూర్చోండి మీ శరీరపు హద్దులు తెలుసుకోండి. మీరు కూర్చున్న గదిని చూడండి.

సైవ్ 2 : సమయం : 5 నిమిషాలు

కళ్ళు మూసుకొని ఆ గది మీలో ఉన్నట్లు భావించండి. అది మీలో ఒక భాగమైపోవాలి. మీ శరీరపు హద్దులు ఆ గదిని తనలో ఇముడ్చుకోవటానికి విస్తృతం కావాలి. మీలోని ప్రదేశం విస్తృతం కావాలి.

  • సైప్ 3 : సమయం 2 నిమిషాలు గది లోంచి బయటకి వెళ్ళి చెట్లను, ఇళ్లను మీ చుట్టూ ఉన్న వాటిని చూడండి.

  • సైప్ 4 : సమయం 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు మరింత విస్తృతమైనట్టుగా భావించి ఇప్పుడు వీటినన్నింటినీ కూడా మీలో ఒక భాగం అనుకోండి.

  • సెప్ల్ 5 : సమయం 2 నిమిషాలు కళ్ళు తెరచి విశాలమైన ఆకాశాన్ని చూడండి.

సెప్ల్ 6 : సమయం 5 నిమిషాలు

  • కళ్ళు మూసుకోండి, ఇప్పుడు ఆకాశం అంతా మీలో ఉన్నట్లు భావించండి. ఇది చాలా శక్తిమంతమైన ధ్యాన పద్ధతి. ఇది మీ రోజువారీ జీవితంలో ఒక భాగం కావచ్చు. మీ చుట్టూ ఉన్నవారిని, అందరినీ, అన్నింటినీ మీలో ఒక భాగం అనుకోండి. ఉదాహరణకి మీరు పని చేసే చోట అక్కడ ఉన్న వస్తువులు మీలో ఒక భాగం అనుకోండి. మీ తెలుసుకునే తత్వాన్ని విస్తృతం చేయండి. మీరు కంప్యూటర్ మీద పని చేస్తున్నప్పుడు, కంప్యూటర్, మీరు కూర్చున్న కుర్చీ, టేబుల్ ఆఫీసు రూం అన్నీ మీలో ఒక భాగం అనుకోండి. కళ్ళు మూసుకొని అవన్నీ మీలో ఒక భాగమైనట్లు భావించండి.

మీ చుట్టూ పని చేసేవారిని, మీ సహోద్యోగుల్ని, పనివారిని అందరినీ మీలో ఒక భాగం అనుకోండి. మీ వ్యక్తిగత చేతనస్థితి సామాజిక చేతనస్థితిగా సంతోషపడండి. ఈ ధ్యానాన్ని అందరూ కలసి సాధన చేస్తే వ్యక్తిత్వాలు కరిగిపోయి అహంకారపు గొడవలు సమసిపోతాయి.

8. మూలాన్ని కనుగొనటం :

మీ ఆలోచనల మూలాలని కనుగొని, అంతిమ మూలాధారమైన సర్వాంతర్యామిని మేలుకొలపటం.

సమయం : వర్తించదు.

మీరు మామూలుగా కూర్చుని ఉన్నప్పుడు ఏవో ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించండి. వాటి కదలికలు మీ శరీరంలో ఏ భాగంలో మీకు తెలుస్తుందో గమనించండి. ఆ ఆలోచనలతో పాటు అనుభూతిని పొందండి.

మీ ఆలోచనలు ఒక దాని తరువాత ఒకటి మీ లోపలి భాగాలలో ఒక సున్నితమైన స్పందనని, చలనాన్ని కలిగించటం తెలుస్తుంది. ఏ ఆలోచన ఏ భాగాన్ని స్పందింపచేస్తుందో, చూడటానికి ప్రయత్నించండి. మీ లోపల ఏ భాగం స్పందిస్తున్నదో, ఆ భాగమే ఈ ఆలోచనని కలిగిస్తుంది. దీన్ని మీ ప్రతి ఆలోచనకి చేయండి.

ఈ పద్ధతిని సాధన చేసినప్పుడు, ఇరవై నాలుగు గంటలలో అది క్లిక్ అయితే ఈ పద్ధతి మీకు సరిపోతుంది అని అర్థం. కాకపోతే మరొక పద్ధతిని కొనసాగించండి. ఈ పద్ధతి మీకు జ్ఞానోదయ అనుభవాన్ని ఇస్తుంది.

9. కనురెప్పలని ఈకలా స్పృశించండి :

కుండలినీశక్తిని మేల్కొలపటానికి ఇది చాలా మంచి ధ్యానపద్ధతి. మీ శరీరంలో సున్నితత్వాన్ని పెంచగల ఒక చక్కని ధ్యాన పద్ధతి ఇది.

సమయం : 30 నిమిషాలు

కళ్ళు మూసుకొని, వేలి కొసతో మీ కంటి రెప్పలని పక్షి ఈక అంత సున్నితంగా స్పృశించండి. లేదా పక్షి ఈకని కూడా ఉపయోగించవచ్చు. కంటి రెప్పని తాకినప్పుడు ఈక వంగకూడదు. అలా వంగితే దాన్ని మీరు బలంగా అదిమినట్టు అర్థం. దాని మీద అసలు ఒత్తిడి పడకూడదు. ఒత్తిడి ఈ పద్ధతికి పనికి రాదు. కేవలం అలా సున్నితంగా తాకండి.

అది అంటీ అంటనట్టు ఉండాలి. కేవలం వేలి కొసలు మాత్రమే కంటి రెప్పని తగులుతూ ఉండాలి. చేతిని సరైన రీతిలో ఉంచి, బాలెన్స్‌డ్‌గా ఉంచి కంటి రెప్పని కేవలం వేలి చివర్లు తగులుతున్న విధంగా ఉంచాలి. మొదటిసారి చేతులు కొంచెం వణుకుతాయి. మీరు కంటి రెప్పలని గట్టిగా అదుముతారు. లేదా అసలు మీ వేళ్ళు కంటి రెప్పని అంటవు.

ఎప్పుడైతే అతిసున్నితంగా మీ వేళ్ళు కంటి రెప్పలని స్పృశిస్తాయో, గొప్ప శక్తి మీ వేళ్ళ నుంచి కళ్ళకి వెళ్ళటం మీరు చూడగలుగుతారు. క్రమంగా చేతి వేళ్ళు, చేతులు మీ కంటిలో ఒక భాగమైనట్లు మీకు అనిపిస్తుంది.

ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోగానే, వాటి హద్దులు కంటి రెప్పల వరకే అనిపిస్తుంది. ఎప్పుడైతే అతిసున్నితంగా స్పృశిస్తారో, కళ్ళు విస్తృతమైనట్లు తెలుస్తుంది. మీరు సరైన విధంగా స్పృశిస్తే ఆ అనుభవం కలుగుతుంది. మీరు బయట అనుభవించే సున్నితత్వాన్ని లోపల కూడా అదే విధంగా కచ్చితంగా అనుభవించాలి.

ఈ పద్ధతిని బాగా సాధన చేస్తే, మీ లోపల శక్తి కళ్ళ ద్వారా బయటకి వెళ్ళి కూడా మీ లోపలే ప్రవహిస్తూ ఉంటుంది. ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు కళ్ళు మూసుకుంటే మీ జ్ఞానేంద్రియాలు పని చేయవు. దానితో శక్తి బయటికి వెళ్ళదు. అయినా మీ లోపల ఏవో కొన్ని దృశ్యాలు కదులుతూ ఉండి

శక్తి వ్యర్థా అవుతుంది. ఎప్పుడైతే మీరు మీ లోపల బయటి దృశ్యాల్ని పూర్తిగా ఆపగలుగుతారో అప్పుడే జ్ఞానోదయం కలుగుతుంది.

ఒక్కసారి బాలెన్స్ చేయాలన్నా కనీసం అరగంట సమయం పడుతుంది. సున్నితంగా స్పృశించే స్థితికి రావాలంటే ప్రతి రోజూ కనీసం ఒక నెల రోజులు దీన్ని సాధన చేయాలి. అప్పుడు పూర్తి బాలెన్స్ వస్తుంది.

10. సూర్యునితో పాటు లేవండి :

మీ లోపలి లోతైన శక్తిని మేల్కొలపండి.

సమయం : 10 నుంచి 15 నిమిషాలు.

సూర్యోదయానికి ముందు 10 నుంచి 15 నిమిషాలు ఆకాశాన్ని చూడండి. ఆకాశం లోకి రంగులు ప్రవేశించగానే లోతైన నిశ్శబ్దంతో, అత్యంత జాగ్రత్తతో గమనించండి. ఆకాశంలో సూర్యుడు పైకి వస్తుంటే మీ అంతరంగంలో సూర్యుడు కూడా పైకి వస్తున్నట్లు అనుభూతి పొందండి. సూర్యుడు దిక్కుక్రాంతిని అంటగానే మీ లోపల సూర్యుడు నాభిప్రాంతానికి వచ్చినట్ట అనుకోండి.

సూర్యుడు పైకి వచ్చే కొద్దీ మీ లోపల సూర్యుడు కూడా తీవ్రమవటం గమనించండి.

15 నిమిషాలు గడిచాక కళ్ళు మూసుకోండి. ప్రకాశవంతంగా, నిశ్శబ్దంగా మీ లోపల సూర్యుని అనుభూతిని ఆనందించండి.

11. భక్తి :

భక్తితో సున్నితత్వం పొంది మార్పు పొందండి.

సమయం : వర్తించదు.

కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చోండి. ముందుగా కొన్ని నిమిషాలు ఒక వ్యక్తిని ఎంచుకోండి, ఆ వ్యక్తి మీ జీవితంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి, మీ జీవితంలో ఆయన

జీవన్ముక్తికి ధ్యానపద్ధతులు

పాత్ర చాలా గొప్పది. ఏ వ్యక్తి అయితే మీ జీవితాభివృద్ధికి తోడ్పడ్డాడో, ఏ వ్యక్తి అయితే మీకు చాలా కావలసినవాడో ఆ వ్యక్తిని ఎంచుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తితో బంధాన్ని ఏర్పరచుకోండి. వ్యక్తిని స్పష్టంగా గుర్తుచేసుకోండి, మీ జీవితంలో గొప్ప మార్పుకి ఆ వ్యక్తి ఎలా సహాయం చేసాడో గుర్తుచేసుకోండి.

ఆ వ్యక్తితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోండి. మీ జీవితానికి ఆ వ్యక్తి ఇచ్చిన అందమైన విషయాల్ని, సంఘటనల్ని గుర్తు చేసుకోండి. మీ అంతరాత్మకి ఎంత ఇచ్చాడో గుర్తు చేసుకోండి. ఆ వ్యక్తిలోకి, ఆ గుర్తులోకి పూర్తిగా విరామంగా నిమగ్నమవ్వండి. ఆ వ్యక్తి అంతరాత్మలోకి మాయం అవ్వండి. ఆ వ్యక్తితో మీకు ఉన్న అందమైన, అత్యంత సన్నిహితమైన గుర్తులనులోకి మాయం అవ్వండి. ఆ వ్యక్తి అంతరాత్మలో విరామంలో ఐక్యమైపోండి.

12. బయట, అంతరంగంలో చూసి – వదిలేయండి :

భయం, అభద్రతాభావాల నుంచి బయటికి రండి.

సమయం : వర్తించదు.

ఒక వస్తువుని తీసుకొని కూర్చోండి. దాని లోపలికి లోతుగా, తీవంగా, గాఢతతో చూడండి. ఆ వస్తువుతో మీ మనస్సు మొత్తం నిండిపోవాలి. మీరు ఒక వ్యక్తి ఫోటోని ముందు ఉంచి దాని లోకి చూస్తే, మీ మనస్సు మొత్తం ఆ వ్యక్తి రూపంతో, ఆ వ్యక్తితో మీకున్న అనుభవాల జ్ఞాపకాలతో నిండిపోవాలి. ఆ అనుభవం మీ అంతరంగం అంతా నిండాలి.

ఇప్పుడు కళ్ళు మూసుకొని, ఆ వస్తువు నుంచి వెనక్కి వచ్చేయండి. మీ అంతరంగంలో కూర్చొని ఆ వస్తువుని లేదా ఆ వ్యక్తిని మీ అంతరంగంలో కొన్ని నిమిషాలు చూడండి.

ముందు ఆ వస్తువుని బయట చూడండి. ఆ తరువాత మీ అంతరంగంలో చూడండి. తరువాత కేవలం మీ అంతరంగంలోనే చూడండి. తరువాత దాన్ని కూడా వదిలేసి మీ అంతరాత్మతోనే ఉండండి. చేతనస్థితిలో ఆలోచనల నుంచి బయటికి వస్తాను అని నిర్ణయించుకొని, కేవలం మీతోనే ఉండండి.

  1. నిద్ర పట్టే సమయంలో తెలుసుకోండి : తెలుసుకునే తత్వంతో సమాధిస్థితికి వెళ్ళండి.

సమయం : వర్తించదు.

ఈ పద్ధతిని మీకు నిద్ర పట్టే సమయంలో చేయాలి. కాని నిగ్రహం పోయేటప్పుడు లేదా పడుకోవటానికి కేటాయించిన సమయంలో కాదు. శరీరం నిద్రకి సిద్ధమయ్యాను అని చెప్పగానే ఈ ధ్యానం చేయండి.

విశ్రాంతిగా ఉండి, చైతన్యంగా లేకుండా ఎదురు చూడండి, అంతే! నిద్ర పోవటానికి ప్రయత్నించకండి. నిద్ర పట్టటానికి ఏ పద్ధతినీ పాటించకండి. నిద్ర రాకపోతే ఆత్రుత పడవద్దు, అపరాధభావం వద్దు.

ఎదురుచూడండి. ఎదురుచూసేటప్పుడు మీరు బాగా తెలుసుకునే తత్వంతో ఉంటారు. మీరు ఏమీ చేయకుండా, కదలికలు లేకుండా ఎదురుచూస్తే, మీరు ఎక్కువ తెలుసుకునే తత్వంతో ఉంటారు. మీరు ఆత్రుతతో, దుడుకుగా ఉంటే తెలుసుకోలేరు.

ఒక ముఖ్యవిషయం అర్ధం చేసుకోవాలి. కదలికలు లేకుండా, స్వాగతించే దశలో ఉంటే మీరు బాగా తెలుసుకోగలుగుతారు. అందుకే ప్రార్ధన తెలుసుకునే తత్వాన్ని పెంచుతుంది. ప్రార్ధించే సమయంలో మీలో కదలికలు లేకుండా,లోతుగా భగవంతుని దయ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రార్థనతో కూడిన కదలికలు లేని స్థితి తెలుసుకునే తత్వాన్ని తెస్తుంది. శబ్దంగా ఉన్న మనస్సుతో ఉండండి. నిద్రని దేవత అనుకోండి. ఉపనిషత్తులతో నిద్రాదేవిని కొలిచే శ్లోకాలు ఉన్నాయి. సుషుప్తస్థితి గురించి ఆలోచించండి. సుషుప్తిని దేవత అనుకోండి. ఆమె మిమ్మల్ని ఆవరించేవరకు చలనం లేకుండా ఎదురుచూడండి. లోతైన ఎదురుచూసే మనస్సుతో ఉండండి.

అకస్మాత్తుగా మీరు మీ శరీరాన్ని మరచిపోతున్న స్థితి రావటం గమనిస్తారు. అది మీకు తెలుస్తుంది. 'నేను' అనే భావనని వదలరు. ఆ క్షణాన్ని గమనించండి. నాల్గవ దశ అయిన సమాధిస్థితికి ద్వారం తెరుచుకుంటుంది. ఆ స్థితిలో మీలో మాటలు ఎక్కువగా ఉండవు. ఆలోచనలు ఉండవు. కాని 'నేను' అనే విషయం తెలుస్తుంది. నాకు నా శరీరం తెలియటం లేదు కాని నేను ఉన్నాను అని తెలుస్తుంది.

సరిగ్గా ఈ పాయింట్ దగ్గర, మీరు పూర్తి విరామంలో, పూర్తి రిలాక్స్‌డ్ స్థితిలో ఉండటాన్ని చూస్తారు. మీకు తెలుస్తుంది. కాని మీ శరీరం అనే భావం పూర్తిగా పోతుంది. తరువాత ఉదయం నిద్ర లేవగానే మీకు చాలా తాజాగా, హుషారుగా, చైతన్యవంతంగా అనిపిస్తుంది. అయితే మీకు రాశి అంతా తెలుస్తూనే ఉంది అనిపిస్తుంది. మీకు అంతా తెలుస్తూనే ఉంటుంది, కాని పూర్తి విశ్రాంతి దొరుకుతుంది. మీకు అలసట అనేది ఉండదు. మీకు సమాధిస్థితి ఒక్క క్షణకాలం అనుభవమైనా ఆ అనుభవం ఇదే విధంగా ఉంటుంది.

చురుకైన – చైతన్యవంతంగా చేసే ధ్యానపద్ధతులు

  1. ఆనందనాట్యం : మీ లోపల నిక్షిప్తమై ఉన్న గొప్ప శక్తితో నూతనత్వాన్ని పొందండి. మీ లోపల లోతైన ప్రశాంతతతో విరామంగా ఉండండి.

సమయం : 31 నిమిషాలు

స్వేచ్ఛానాట్యం అంటే ఒక పద్ధతిలో అడుగులు వేయకుండా చేసేది. దీనికి నియమాలు, అడుగులు, పద్దతి ఉండవు, శరీరం తనకి నచ్చిన విధంగా కదలటమే స్వేచ్ఛానాట్యం. ఆడుకుంటున్నట్లుగా, ఎంజాయ్ చేస్తున్నట్లుగా మీ డాన్సు అనే శక్తిలో ఒక భాగమైపోవాలి.

ఇందులో రెండు దశలు ఉన్నాయి. డాన్స్ చేయటం, విశ్రాంతిగా ఉండటం.

జీవన్ముక్తికి ధ్యానపద్ధతులు

స్టెప్1

కళ్ళు మూసుకొని డాన్స్ చేయటం ప్రారంభించండి, స్టెప్స్ గురించి పట్టించుకోకండి. శరీరానికి తనకి ఇష్టమైన విధంగా స్వేచ్ఛగా కదలనీయండి. మీరు ఎలా ఉంటారో అని పట్టించుకోవద్దు. మీ బట్టలు ఎలా ఉన్నాయో అనుకోవద్దు. మిమ్మల్ని ఎవరూ చూడరు. ఇదేమీ స్టేజి మీద ప్రోగ్రాం కాదు. మీరు ఈ విధంగా డాన్స్ చేస్తూ ఉంటే మీలో చాలా శక్తి వస్తుంది. మీరు డాన్స్ చేస్తూనే ఉంటారు. మీరు డాన్స్ చేసే కొద్దీ మీరు మరింత శక్తితో ఉంటారు. మీకు అసలు అలసట రాదు. డాన్స్ లోపలికి లోతుగా వెళ్ళండి. ఎంత వేగంగా చేయగలిగితే అంత వేగంగా, అంత స్వేచ్ఛగా చేయండి. మిమ్మల్ని మీరే మరచిపోండి. మీరు నాట్యం అయిపోవాలి.

  • స్టెప్ 2 : సమయం 10 నిమిషాలు 21 నిమిషాలు అయ్యాక మీరు ఎక్కడ ఏ పొజిషన్‌లో ఉన్నారో, ఆ పొజిషన్‌లో కిందికి వాలిపోండి. నేల మీద నిశ్శబ్దంగా చలనం లేకుండా పడుకోండి. అకస్మాత్మగా వేగం నుంచి నిశ్చలత్వానికి రాగానే మీలో శూన్యం ఏర్పడుతున్న అనుభవం కలుగుతుంది. అదే ఆలోచనలు లేని స్థితి. అప్పుడు లోతైన నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు.

కొన్ని క్షణాలు గడిచాక ఆలోచనలు వస్తాయి. నిశ్శబ్దంగా ఆలోచనలని గమనించండి. వాటితో పోరాడవద్దు, వాటిలో నిమగ్నమవ్వద్దు. మీ లోపల ప్రశాంతతని తెలుసుకుంటారు. ఆలోచనలు వచ్చాక కూడా మీలో గొప్ప నిశ్శబ్దం ఉంటుంది. ఆ ప్రశాంతతని మీతోనే ఉండనీయండి. రోజంతా లోతైన నిశ్శబ్దం మీలో ఉంటుంది. మీ నిద్రలోకి కూడా ఆ నిశ్శబ్దాన్ని తీసుకువెళ్ళండి. నిద్ర లేచాక చాలా తాజాగా, చురుకుగా ఉంటారు.

  1. గిరగిరా తిరగటం : మీలో కదలిక లేని కేంద్రాన్ని కనుగొనండి. సర్వసృష్టిలో ఐక్యమైపోండి.

మొత్తం సమయం 31 నిమిషాలు.

మీలో మీరు కేంద్రీకృతం అవటానికి ఇది అందమైన, సహజమైన ధ్యానం. ఈ ధ్యానానికి ముందు మూడు గంటలు ఏమీ తినవద్దు, తాగవద్దు. ఇందులో రెండు దశలు ఉన్నాయి. గిరగిరా తిరగటం, విశ్రాంతిగా ఉండటం.

గిరగిరా తిరగటం : గడియారానికి వ్యతిరేకదిశలో, కుడిచేతిని పైకి పెట్టి, అరచేయి ఆకాశం వైపు ఉండేలా ఉంచి, ఎడమచేతిని కిందికి పెట్టి, ఎడమ అరచేయ నేల వైపు ఉంచి నెమ్మదిగా తిరగటం ప్రారంభించండి.

ఈ దశలో తిరగటం ఇబ్బందిగా ఉంటే గడియారం తిరిగే వైపు తిరగండి. నెమ్మదిగా మీ శరీరం సున్నితంగా తిరిగేలా తిరగండి. మీరు తిరిగేటప్పుడు చుట్టూ ఉన్నవి మసగ్గా కనిపిస్తాయి. దేని మీదా ఏకాగ్రత నిలపవద్దు. అలా చేస్తే కడుపులో తిప్పినట్లు అవుతుంది. వికారంగా ఉంటుంది.

నెమ్మదిగా వేగం పెంచండి. మీరే ఆ తిరుగుడు అయిపోవాలి. మీ శరీరం తిరుగుతూ ఉంటుంది. కాని లోపల ఎక్కడో కొంత భాగం నిశ్చలంగా ఉంటుంది. మీరు తిరగటాన్ని గమనిస్తున్నట్లు ఉంటుంది.

విరామంగా ఉండటం : మీరు అలా తిరుగుతూ ఉంటే కొంచెం సమయమయ్యాక శరీరం పడిపోతుంది. దాన్ని అలా పడనీయండి. మీరు కావాలని ఒక పద్ధతిలో పడవద్దు. అలా పడగానే బోర్లా పడుకోండి. మీ నాభిప్రాంతం భూమికి తగలాలి. మీ శరీరం భూమిలో ఒక భాగమైనట్లు అనుకోండి. కళ్ళు మూసుకొనే ఉండండి. అదే స్థితిలో ఉండండి. నిశ్శబ్దంగా కదలకుండా 15 నిమిషాలు ఉండండి.

ఈ ధ్యానం చేసాక కొన్ని గంటలు నిశ్శబ్దంగా ధ్యానస్థితిలో ఉండండి.

వాత – పిత్త – కఫ ధ్యానపద్ధతులు

మీ శరీరంలోని మూడు ముఖ్యమైన శక్తులని సమతుల్యతలో ఉంచండి.

ప్రాచీన ఆయుర్వేదశాస్త్రం ప్రకారం మీ శరీరంలో మూడు ముఖ్యమైన శక్తివనరులు ఉన్నాయి. అవి వాత (కదలికలు గల శక్తి) – పిత్త (జీర్ణక్రియకి సంబంధించిన శక్తి) – కఫ (శరీరవ్యవస్థ పనిచేయటానికి లూబ్రికేట్‌లా పని చేసే శక్తి) ఈ మూడు సమతుల్యతతో ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంతో ఉంటుంది. సాధారణంగా అందరిలో ఈ మూడు సమతుల్యతతో ఉండవు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువగా ఉంటాయి. కింద ఇచ్చిన పద్ధతులు వీటిని సమతుల్యతలో ఉంచుతాయి.

ఈ పద్ధతుల్ని తీవ్రంగా చేస్తే కాన్సర్ రాదు. ఈ ధ్యానపద్ధతుల్ని ఖాళీ కడుపుతో చేయాలి. ఉదయం చేస్తే మంచిది.

వాత ధ్యానపద్దతి : మొత్తం సమయం : 31 నిమిషాలు

స్టెప్ 1 : సమయం 10 నిమిషాలు

వజ్రాసనంలో కూర్చొని మీ చేతులు నడుము మీద పెట్టాలి. అలా చేతులు పెట్టటం ద్వారా మీలో పై భాగానికి, కింది భాగానికి సంబంధం ఏర్పడుతుంది. 'హు '

జీవన్ముక్తికి ధ్యానపద్ధతులు

కారం చేయండి. శ్వాస బయటకి వస్తున్నప్పుడు దానితో పాటు హు కారం చేయండి. మరలా శ్వాస తీసుకొని హుకారం చేయండి. ఎంత సేపు చేయగలిగితే అంత సేపు చేయండి.

  • స్టెప్ 2 : సమయం 21 నిమిషాలు. వజ్రాసనంలోనే కూర్చోండి. చేతులు నడుం పైనే ఉంచి మీ నుదురు నేలకి తగిలేలా ముందుకు వంగి హుకారం చేయండి.

  • పిత్తధ్యానం : మొత్తం సమయం 31 నిమిషాలు

  • స్టెప్ 1 : సమయం 10 నిమిషాలు.

వజ్రాసనంలో కూర్చొని చేతులు నడుము మీద పెట్టండి. హుకారం చేయండి. హుకారం చేస్తూ తెల్లని వెలుగు రేఖ మీ లోపల పైకి లేచి పైన తల వరకూ వెళ్ళి, బయటకి వెళ్ళి మళ్ళా మీ లోపలికి వెళుతున్నట్లు స్పష్టంగా చూడండి. హుకారం చేస్తున్నంత సేపూ తెల్లని వెలుగు రేఖ మీ లోపల నుంచి బయటికి, తిరిగి మీలోకి వృత్తంలా తిరుగుతున్న దృశ్యాన్ని చూడండి.

  • స్టెప్ 2 : సమయం 21 నిమిషాలు. వజ్రాసనంలోనే కూర్చోండి. చేతులు నడుము మీద ఉంచి మీ నుదురు నేలకు తగిలేలా ముందుకి వంగండి. హుకారం చేయండి. తెల్లని కాంతిపుంజం మీ నుంచి పైకి వచ్చి, తలఫై భాగం నుంచి బయటికి వెళ్ళి తిరిగి మీలోకి రావటం, అది ఒక వృత్తంలా తిరగటం చూడండి.

కఫధ్యానం : మొత్తం సమయం 41 నిమిషాలు

  • స్టెప్ 1 : సమయం 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చొని, చేతులు నడుము మీద ఉంచి హుకారం చేయండి. తెల్లని కాంతిరేఖ మీలోంచి పైకి వచ్చి మీ పై భాగం నుంచి బయటికి వెళ్ళి తిరిగి మీ లోనికి వస్తున్న దృశ్యాన్ని గమనించండి. హుకారం చేస్తూ ఉండాలి.

  • స్టెప్ 2 : సమయం 21 నిమిషాలు. వజ్రాసనంలోనే కూర్చోండి. చేతులు నడుము మీద ఉంచండి. నుదురు నేలకు తగిలేలా ముందుకు వంగండి. హుకారం చేస్తూ, తెల్లని కాంతిరేఖ మీ నుంచి పైకి వచ్చి తలపై భాగం నుంచి బయటికి వెళ్ళి తిరిగి మీ లోనికి రావటం చూడండి. స్టెప్ 3 : సమయం 10 నిమిషాలు.

కళ్ళు తెరవండి. మీ మూడవ కంటి నుంచి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఫొటోలో మూడవ కంటి వైపు చూడండి. తెల్లని కాంతిరేఖ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మూడవ కంటి నుంచి మీ మూడవ కంటిలోకి ప్రవేశించటాన్ని స్పష్టంగా చూడండి. ఈ ధ్యానం తంత్ర – మంత్ర – యంత్ర – మూడూ కలసిన ధ్యానం.

మంత్రం అంటే శరీరాన్ని కోరిన ప్రభావం వచ్చేలా ఉపయోగించటం – ఒక భంగిమలో కూర్చొని జపించటం (హుకారం చేయటం). తంత్ర అంటే శరీరాన్ని, మనస్సుని కావలసిన ప్రభావం కోసం ఉపయోగించటం – తెల్లని కాంతిరేఖని చూడగలగటం. యంత్ర అంటే బయట ఏదైనా ఒక దాన్ని ఉపయోగించటం – THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కళ్ళు ఉన్న ఫొటోని ఉపయోగించటం.

పిత్తాన్ని సమతుల్యతలో ఉంచటం

మీ శరీరంలోని అగ్ని, జలమూలకాల్ని సమతుల్యతతో ఉంచండి. మీ శరీరంలోని మీరు ఉపయోగించని శక్తిని మేల్కొలపండి.

సమయం : 30 నిమిషాలు.

ఏదైనా తింటే మూడు గంటల తరువాత ఈ ధ్యానం చేయాలి.

  • స్టెప్ 1 : సమయం 10 నిమిషాలు. నిలబడి శరీరం మొత్తాన్నీ కుదుపుతున్నట్లుగా కదిలించండి. తల నుంచి పాదాల వరకు చెట్టుని కుదిపితే ఎలా ఉంటుందో ఆ విధంగా కదిలించాలి. ఈ విధంగా చేస్తే మీలో ఉపయోగించని శక్తికేంద్రాలు మేల్కొంటాయి. మీ శరీరాన్ని ద్రవంలా చైతన్యపరుస్తుంది. బాగా కుదపండి.

  • స్టెప్ 2 : సమయం 10 నిమిషాలు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చోండి. ఏ శబ్దం మీకు అప్పుడు తగులుతుందో ఆ శబ్దం చేయండి. ఇది జిబ్బరిష్ లాంటిది. మాటలు ఉండకూడదు. మీ లోపలి చికాకు, వ్యథ, కోపం ఏదైనా సరే, ఈ చికాకులు మీలో ఉంటే పిత్తం సమతుల్యతతో ఉండదు, కాబట్టి ఆ చికాకులు బయటికి పోవాలి.

  • స్టెప్ 3 : సమయం 10 నిమిషాలు. నిశ్శబ్దంగా కూర్చోండి. కేవలం గమనించండి. మనసులోకి ఏది వచ్చినా దాన్ని నిలపాలని లేదా పోగొట్టాలని చూడవద్దు. మీ మనస్సులోకి ఏం వచ్చినా దాని మీద అభిప్రాయాలు ప్రకటించకుండా కేవలం గమనించండి.

జీవన్ముక్తికి ధ్యానపద్ధతులు

Part 17: Living Enlightenment (Gospel of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM)_Telugu_part_17.md

శ్వాససంబంధమైన ధ్యానపద్దతులు

శ్వాసని నిరంతరం గమనించటం ఒక శక్తిమంతమైన ధ్యానం, ఇది చాలామందికి జ్ఞానోదయాన్ని కలిగించింది. శ్వాసని గమనించటం వల్ల తెలుసుకునే తత్వం పెరుగుతుంది. తెలుసుకునే తత్వం పెరిగితే అంతరంగం మేల్కొంటుంది. పరమానందం లభిస్తుంది.

  1. లోపలికి వచ్చే శ్వాసని, బయటకి వెళ్ళే శ్వాసని, మధ్యలో ఖాళీని గమనించటం :

మొత్తం సమయం : 35 నిమిషాలు.

పూర్తి విరామంగా, సౌకర్యంగా కూర్చోండి. పూర్తిగా రిలాక్స్ అవ్వండి.

  • స్టెప్ 1 : సమయం 5 నిమిషాలు. మీ శ్వాసని గమనించటం ప్రారంభించండి. కేవలం గమనించండి, దాన్ని పెంచవద్దు. మామూలుగా మీరు లోపలికి తీసుకొని, బయటికి శ్వాసించటాన్ని గమనించండి.

  • స్టెప్ 2 : సమయం 5 నిమిషాలు. తరువాత కేవలం లోపలికి వెళ్ళే శ్వాసనే గమనించండి. బయటికి వెళ్ళే శ్వాసని పట్టించుకోవద్దు.

  • స్టెప్ 3 : సమయం 5 నిమిషాలు. ఇప్పుడు కేవలం బయటికి వెళ్ళే శ్వాసని గమనించండి. లోపలికి వచ్చే శ్వాసని పట్టించుకోవద్దు. మీరు పూర్తిగా తెలుసుకునే తత్త్వంతో బయటికి వెళ్ళే శ్వాసని మౌనంగా గమనించండి.

  • స్టెప్ 4 : సమయం 5 నిమిషాలు. ఇప్పుడు అన్నీ వదిలి కేవలం లోపలికి వచ్చే శ్వాసకి, బయటికి వెళ్ళే శ్వాసకి మధ్య ఉన్న ఖాళీని గమనించండి. మీ శ్వాస మలుపు తిరుగుతుంది. ఆ మలుపుని గమనించండి. కేవలం రెండు శ్వాసల మధ్య ఖాళీని మాత్రమే గమనించండి.

  • స్టెప్ 5 : సమయం 5 నిమిషాలు. ఇప్పుడు లోపలికి వచ్చే, శ్వాస, ఖాళీ, బయటికి వెళ్ళే శ్వాస, ఈ మూడింటినీ గమనించండి. ఈ మూడింటినీ తెలుసుకోండి. మీ శరీరం అంతా నూతనంగా, చైతన్యవంతంగా ఉండటాన్ని గమనించండి. మీరు జీవచైతన్యంతో ఉన్న నిశ్శబ్దంలో ఉన్నారు. అది శక్తిమయం. మీరు అత్యున్నతశక్తిని ప్రసరిస్తున్నారు.

  • స్టెప్ 6 : సమయం 5 నిమిషాలు. ఇప్పుడు రెండు శ్వాసల మధ్య ఖాళీని గమనించండి. కేవలం ఖాళీని మాత్రమే గమనించండి. మీకు అసలు శ్వాసించటం లేదు అనిపిస్తుంది. ఆ భావాన్ని కూడా గమనించండి.

  • స్టెప్ 7 : సమయం 5 నిమిషాలు.

కళ్ళు మూసుకునే ఉండి, రిలాక్స్ అవ్వండి. ధ్యానం చేయవద్దు. కేవలం రిలాక్స్ అవ్వండి. దేన్ని గురించీ ఆలోచించవద్దు. మనస్సుని స్థిరపడనీయండి. నెమ్మదిగా ఉన్నతశక్తిప్రదేశం నుంచి బయటికి రండి. 5 నిమిషాలు గడిచాక నెమ్మదిగా చాలా నెమ్మదిగా కళ్ళు తెరవండి.

  1. రెండు శ్వాసల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉన్న మేధ, శక్తి :

మొత్తం సమయం : 30 నిమిషాలు.

విరామంగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. శ్వాసని గమనించండి. లోపలికి వస్తున్న శ్వాస బయటికి వెళ్ళేదానిలా అవటాన్ని గమనించండి. బయటకి వెళ్ళిన శ్వాస లోపలికి వచ్చే శ్వాసగా మారటానికి మలుపు తిరుగుతుంది. ఆ మలుపులో ఉండే ఖాళీని గమనించండి. రెండు శ్వాసల మధ్య ఉన్న ఖాళీని గమనించండి. శ్వాస మలుపు తిరిగే దగ్గర ఉన్న ఖాళీని తెలుసుకోండి. ఈ సమయంలో రెండు శ్వాసల మధ్య ఉన్న ఖాళీలో శ్వాసలోకి వెళ్ళే ముందు ఉన్న ఖాళీలో ఉన్నప్పుడు మీలోకి మేధ శక్తీ ప్రవాహంలా వస్తుంది.

కొన్నిసార్లు చిన్న కోరిక మీలోకి జీవచైతన్యాన్ని తెస్తుంది. ఉదాహరణకి సెలవు రోజు ఉదయం నిద్ర లేచాక కూడా మంచం మీద నుంచి లేవబుద్ధి కాదు. అప్పుడు అకస్మాత్తుగా మీ స్నేహితుడు గుర్తుకు వచ్చి అతన్ని కలవాలనుకుంటే, వెంటనే ఒక్క ఉదుటున మంచం మీద నుంచి లేస్తారు. ఆ ఒక్క ఆలోచన రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉండేలా చేస్తుంది. ఎప్పుడైతే మీరు శక్తితో నింపబడతారో... జాగ్రత్తగా తెలుసుకోండి ఆ శక్తి ఈ ఖాళీ ప్రదేశం నుంచి వస్తుంది.

అదే విధంగా మీ నుంచి ఏదైనా తీసేసుకోబడింది అనుకోండి. దానికి మీరు ఓదార్పు తెచ్చుకుంటారు. అప్పుడు మేధతో నింపబడతారు. మీరు దేన్నైనా పోగొట్టుకున్నప్పుడు, వెంటనే మీకు ఒక సందేశం వస్తుంది. జీవితం పట్ల ఒక విధమైన అర్థం తెలుస్తుంది. అదే మీ మేధ. అటువంటి మేధ వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోండి.

రెండు శ్వాసల మధ్య ఖాళీలో, మీరు శక్తి, మేధలతో నింపబడతారు. ఈ ఖాళీల్లోకి మీ తెలుసుకునే తత్వాన్ని తీసుకురాగలిగితే మీరు రోజంతా శక్తితో ఉంటారు. శ్వాసల మధ్య ఉన్న రెండు ఖాళీ ప్రదేశాల్ని గమనించగలిగితే మీలోకి శక్తి, మేధ ఒక ప్రవాహంలా వస్తాయి.

మీరు కొంచెం లోతుగా వెళితే, మీరు మరొక ముఖ్యవిషయం అర్ధమవుతుంది. ప్రతీ క్షణం మీకు ఆలోచన, శక్తి రెండూ ఉంటాయి. బైనరీ సిస్టమ్ దీని మీద, ఆలోచన – శక్తి మీద ఆధారపడి ఉంది. శక్తి – ఆలోచన; ఆలోచన – శక్తి; ఇవి రెండూ ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి.

నిజానికి ఒకసారి మీరు ఇచ్చాశక్తి – కోరిక తాలూకు శక్తితో నింపబడి ఉంటారు. తరువాత క్షణం క్రియాశక్తి – పని చేయగల శక్తితో నింపబడి ఉంటారు. ఒక క్షణం శక్తితో నింపబడి ఉంటారు. తరువాత మేధతో నింపబడి ఉంటారు. నిరంతరం ఈ రెండూ ఆట ఆడుతుంటాయి. ఈ రెండూ విశ్వంలో ముఖ్యమైన – పదార్థం, శక్తి ఈ రెండింటితో విశ్వం నిండి ఉంటుంది.

నిరంతరం మీ అంతరంగంలో పదార్ధం, శక్తి నాట్యం చేస్తూ ఉంటాయి. మీరు ఖాళీని తెలుసుకోగలిగినప్పుడు, మీరు నిత్య ఆనందస్థితిని అనుభవించగలరు.

కోరిక శక్తి, క్రియాశక్తి మీ అంతరంగంలో నాట్యం చేస్తుంటాయి. మీరు ఆ ఖాళీని గమనించగలిగితే, మీరు జ్ఞానశక్తిని సాధించగలరు. అదే మేధాశక్తి. శక్తి నిరంతరం ఆనందంలో ఉంటుంది. తనని తాను మీ అంతరంగంలో వెల్లడి చేస్తూ ఉంటుంది. ఆ ఖాళీని తెలుసుకుంటే చాలు – దివ్యచేతనస్థితితో నింపబడతారు.

  1. శరీరం కదులుతున్నట్లు ఆ ఖాళీని తెలుసుకోవటం :

మొత్తం సమయం : 30 నిమిషాలు

నేల మీద నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకోండి. ఎంత నెమ్మదిగా చేయగలిగితే అంత నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకొని వదలండి.

స్టెప్ 1 : సమయం 3 నిమిషాలు.

నెమ్మదిగా మీ ఏకాగ్రతని లోపలికి తీసుకునే శ్వాస మీద ఉంచండి. కేవలం లోపలికి వచ్చే శ్వాసని గమనించండి.

స్టెప్ 2 : సమయం 3 నిమిషాలు.

నెమ్మదిగా బయటికి వెళ్ళే శ్వాసని తెలుసుకోండి. ఏకాగ్రతను బయటికి వెళ్ళే శ్వాస మీద ఉంచండి.

స్టెప్ 3 : సమయం 3 నిమిషాలు.

ఇప్పుడు లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాసలని మరిచిపోండి. రెండు శ్వాసల మధ్య మీ ఏకాగ్రత ఉంచండి. ఆ ఖాళీని తెలుసుకోండి.

స్టెప్ 4 : సమయం 3 నిమిషాలు.

మీ ఏకాగ్రతని రెండు శ్వాసల మధ్య ఉంచి, ఖాళీలో రిలాక్స్ అవ్వండి. ఆ ఖాళీలో ఉన్నప్పుడు ఒక చేయి కదిపినప్పుడు మీరు ఖాళీ ప్రదేశం నుంచి బయటికి వచ్చేసాం అనిపిస్తే తిరిగి ఆ ఖాళీ ప్రదేశానికి వెళ్ళండి. అక్కడికి వచ్చాక మళ్ళా చేయి కదపండి.

  • స్టెప్ 5 : సమయం 3 నిమిషాలు. అదే శూన్యప్రదేశంలో, రెండు శ్వాసల మధ్య ప్రదేశంలో ఉంది, నిలబడటానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆ ప్రదేశం నుంచి బయటకి వచ్చేసాం అనిపిస్తే కూర్చోండి. మళ్ళా ఆ ఖాళీ ప్రదేశానికి రండి. అక్కడ ఏకాగ్రత పోకుండా లేచి నిలబడండి.

కళ్ళు మూసే ఉంచండి. నిలబడిన తరువాత కూడా రెండు శ్వాసల మధ్య ఉన్న ఖాళీని గమనిస్తూ ఉండండి. మీ ఏకాగ్రత రెండు శ్వాసల మధ్య ఉండాలి. ఎక్కడ ఆలోచనలు ఉండవో అక్కడ ఉండండి.

  • స్టెప్ 6 : సమయం 3 నిమిషాలు. మీ ఏకాగ్రత రెండు శ్యాసల మధ్య ఉంచంది. ఆ ఖాళీని తెలుసుకోండి. అక్కడి నుంచి ఏకాగ్ర‌త పోకుండా రెండు చేతులూ నెమ్మ‌దిగా క‌ద‌పండి. ఇక్క‌డ ముఖ్య‌మైన విషయం, ఖాళీ పైన మీ ఏకాగ్రత పోకూడదు. ఒకవేళ ఏకాగ్రత ఖాళీ దగ్గర ఉందకపోతే, మళ్ళా మీరు ఆ ఖాళీపదేశం దగ్గరకి వచ్చి, చేతులు కదపండి.

  • స్టెప్ 7 : సమయం 3 నిమిషాలు. రిలాక్స్ అవ్వండి. రెండు శ్వాసల మధ్య కేంద్రీకృతమవ్వంది. అక్కడ సౌకర్యంగా ఉందండి. ఆ శూన్యపదేశంలో మీ తెలుసుకునే తత్వం ఉండాలి. అక్కడ ఏకాగ్రత పోకుండా నెమ్మదిగా తలని కదపండి. ముఖ్యవిషయం, మీ ఏకాగ్రత ఖాళీ దగ్గరే ఉండాలి.

  • స్టెప్ 8 : సమయం 3 నిమిషాలు. మీ ఏకాగ్రత రెండు శ్వాసల మధ్య ఉంచి, ఏకాగ్రత అక్కడి నుంచి పోకుండా పాదాలు కదపండి. పూర్తిగా ఖాళీ ప్రదేశంలో కేంద్రీకృతమవ్వండి. ఏకాగ్రత పోయింది అనిపిస్తే మళ్ళా అక్కడికి వచ్చి పాదాలు కదపండి. మీరు పూర్తిగా ఆ ఖాళీ ప్రదేశంలో కేంద్రీక్షతమై ఉండాలి. మీ ఏకాగ్రత రెండు శ్వాసల మధ్య ఉండాలి. అప్పుడు పాదాలు కదపండి.

స్టెప్ 9 : సమయం 3 నిమిషాలు.

మీ ఏకాగ్రత పోకుండా నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీరు కళ్ళు తెరిచినప్పుడు మీ ఏకాగ్రత పోయినట్లనిపిస్తే మళ్ళా కళ్ళు మూసుకొని ఏకాగ్రతని నిలపండి. అదే తెలుసుకునే తత్వంలో ఉంటూ అదే ఖాళీ ప్రదేశంలో ఉంటూ మళ్ళా కళ్ళు తెరవండి. మళ్ళా ఏకాగ్రత పోతే కళ్ళు మూసుకొని తిరిగి ఏకాగ్ర‌త ఖాళీలో నిల‌పండి. ఆ తెలుసుకునే తత్వం మీద ఏకాగ్రతని నిలపండి. రెండు శ్యాసల మధ్య ఏకాగ్రశని నిలపండి. ఆ ఖాళీలో ఏకాగ్ర‌త నిల‌పండి.

స్తెప్ 10 : సమయం 3 నిమిషాలు.

అదే ఏకాగ్రతలో మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే కూర్చోండి. మీ ఏకాగ్రత తప్పుతుందని అనుమానం వస్తే కొంచెం సేపు ఆగి ఏకాగ్రతని నిలిపి కూరో|ండి. మీ ఏకా|గత రెండు శ్వాసల మధ్య ఉన్న ఖాళీలో ఉంచి కూర్చోండి.

  1. రెండు శ్వాసల మధ్య ఖాళీని తెలుసుకుంటూ – భక్రిభావంతో ఉండటం :

మొత్తం సమయం : 21 నిమిషాలు

ఈ పద్ధతిని పూర్తి భక్తితో సాధన చేయాలి. మీకు ఎవరి పట్ల అయినా లోతైన భక్తిభావంతో ఉంటే, ఆ వ్యక్తి – భగవంతుడు, గురువు, తల్లిదండ్లూ, మీ జీవితంలో మీకు సహాయం చేసిన వ్యక్తి ఎవరైనా సరే, వారి పైన లోతైన భక్తిభావంతో ఉండాలి. మీరు ఇద్దరు – ముగ్గురినైనా గుర్తు చేసుకోవచ్చు. చక్కని మీ అమ్మగారు, మీ ఇష్టదేవత, గురువు ఇలా ఇద్దరు–ముగ్గురిని కూడా గుర్తు చేసుకోవచ్చు.

కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చోండి. మీకు ఎవరి పైన అయితే లోతైన భక్తిభావం ఉంటుందో, ఎవరైతే మీ హృదయంలో ఉంటారో, ఎవరితోనైతే మీకు లోతైన అనుబంధం ఉంటుందో, ఎవరైతే మీకు జీవితంలో (పేరణని, ఉత్సాహాన్ని ఇచ్చారో, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందే విధంగా సహాయం చేసారో అటువంటి వ్యక్తిని గుర్తుచేసుకోండి.

ఎవరైతే మీకు అతిముఖ్యులో వారితో మీ అంతరాత్మ లోతుల నుంచి బంధాన్ని ఏర్పరచుకోండి. ఆ వ్యక్తి పట్ల అత్యంతభక్తిభావాన్ని వెల్లడి చేసూ, ఆ భావంతో నిండి ఉండండి. మీ మొత్తం అంతరంగం అంతా ఆ భక్తిలో కరిగిపోనీయండి.

లోతైన భక్తిభావంతో మీ రెండు శ్వాసల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని తెలుసుకోండి. ప్రతి రెండు శ్వాసల మధ్య మీ ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. సత్యం వెల్లడి అవుతూ ఉంటుంది. అందుకే ఆ ఖాళీల్లోకి తెలుసుకునే తత్వాన్ని ఉంచమని గట్టిగా చెప్పటం. ఎప్పడైతే ఏకాగ్రత తెలుసుకునే తత్వం ఆ ఖాళీల్లోకి వస్తుందో సత్యాన్ని మేల్కొలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5. విషస్సన :

విపస్సన అంటే సత్యాన్ని అంచెలంచెలుగా తెలుసుకోవటం. విపస్సనని మూడు రకాలుగా చేయవచ్చు.

మీ శరీరం మనస్సు, హృదయం, పైన లోతైన ఎరుకని (తెలుసుకోవటం) కలిగి ఉండటం. సమయం : ఎప్పుడైనా, ఎక్కడైనా.

మీరు నడిచినప్పుడు, చేయి కదిపినప్పుడు, నవ్వినప్పుడు, ఏ పని చేసినా తెలుసుకునే తత్వంతో చేయండి. ఆ పని చేసేది మీరు అని కచ్చితంగా తెలుసుకుంటూ చేయండి. జాగ్రగత్తగా ఉండండి. ఒక్క క్షణం కూడా అచేతనస్థితిలో జరగకూడదు. మీకు తెలియకుండా మీ శరీరంలో ఒక్క పని కూడా జరగకూడదు.

మీ శరీరాన్ని గమనించినట్టే, మీ హృదయాన్ని, మీ మనస్సుని గమనించండి. మీ హృదయం లోనికి వచ్చే ప్రతి భావాన్నీ తెలుసుకోండి. ఎంపికలు చేయొద్దు. దేన్నీ విశ్లేషణ చేయొద్దు. కేవలం గమనించండి.

శ్వాసని గమనించటం

సమయం : ఎప్పుదైనా, ఎక్కడెనా.

శాస లోనికి తీసుకోవటానికి, శ్యాస బయటికి వెళ్ళేటప్పుడు మీ పొట్ట భాగం పెకి లేచి, లోపలికి వెళ్ళాలి. నాభిప్రాంతం, మీ జీవశక్తి స్థానం, అదే పొట్ట భాగం. మీరు నాభిప్రాంతంలో ఏకాగగత నిలిపితే మీ శరీరం లోపలికి వచ్చే జీవశక్షిని తెలుసుకుంటారు. మీరు ఆ భాగాన్ని బాగా తెలుసుకునే కొద్దీ మీ హృదయం మనస్సు నిశ్శబ్దమైపోతుంది.

శ్వాస మీలోకి వచ్చేటప్పుడు ముక్కుపుటాలని తగిలే దగ్గర గమనించండి.

సమయం : ఎప్పుదైనా, ఎక్కడెనా.

చల్లని గాలి మీ ముక్కులోకి వెళ్ళటం గమనించండి. ఎంత సులభంగా, హాయిగా శ్వాస ముక్కులోకి వెళ్ళి బయటికి వస్తుందో గమనించండి.

విపస్సన కూర్పుని కాని, నిలబడి కాని సాధన చేయవచ్చు.

కూర్చొని

మొత్తం సమయం : 60 నిమిషాలు.

నిటారుగా సౌకర్యంగా కూర్చోండి. కళ్లు మూసుకొని మామూలుగా శ్వాస తీసుకోండి. మీ భంగిమ మారకుండా నిశ్చలంగా కూర్చోండి. మీరు శ్వాస తీసుకొని వదిలే సమయంలో

పొట్ట భాగం పైకి లేచి లోపలికి వెళ్ళటం గమనించండి. శ్యాసపై ఏకాగ్రత నిలపవద్దు. నిశ్డబంగా గమనించండి. మీకు ఏవైనా ఆలోచనలు, స్పర్శలు, భావాలు వస్తే రానీయండి. వాటిని గమనించి తిరిగి శాసని గమనించండి. గమనించే పద్దతి ముఖ్యం కాని, ఏది గమనిస్తున్నారో అది ముఖ్యం కాదు. ప్రతి దాన్ని గమనించండి. దీన్ని 45 నిమిషాలు చేసి, 15 నిమిషాలు విశ్రాంతిగా ఉండండి.

నడుస్తూ

సమయం : 30 నిమిషాలు.

మీ పాదాలు నేలకు తగలగానే మీరు గమనించాలి. తెలుసుకునే తత్వాన్ని పాదాల మీద ఉంచాలి.

మీరు పదిహేను అడుగులు తిన్నగా అయినా నడవండి. లేదా గుండ్రంగా ఒక సర్కిల్ పైన అయినా నడవవచ్చు. ఈ పద్ధతిని మీ ఇంట్లో గది లోంచి మరొక గదిలోకి వెళుతూ సాధన చేయవచ్చు. లేదా తోటలో సాధన చేయవచ్చు.

కళ్ళు కిందికి దించి నేల వైపు చూస్తుండాలి. లేదా పాదాలని

చూస్తుండాలి. కూర్చున్నప్పుడు పొట్ట భాగాన్ని ఎలా గమనించారు, నడిచేటప్పుడు పాదం నేలని తగులుతున్న విషయాన్ని గమనించాలి. ఏదైనా ఆలోచనలు వస్తే రానీయండి. అవి మీ నిశ్చలతని పాడు చేయవు. మీరు వాటిని గమనించి తిరిగి మీ పాదాలని గమనించే దగ్గరికి వెళ్ళండి.

దీన్ని 20 నిమిషాలు చేసి 10 నిమిషాలు విశ్రాంతిగా ఉండండి.

తక్షణ ఫలితాల్నిచ్చే శక్తిమంతమైన ధ్యానపద్ధతులు

  1. స్వీకరించటం : మీరు తొలగించలేని వర్తమానక్షణాలని, భవిష్యక్షణాలని పూర్తిగా స్వీకరించండి. మీరు ఊహించలేని లోతైన విరామాన్ని అనుభవించండి.

మొత్తం సమయం : 21 నిమిషాలు.

నిటారుగా, విరామంగా కూర్చోండి. కళ్లు మూసుకొని, శరీరాన్ని కదలనీయకుండా విరామంగా, అదే విధంగా కూర్చోండి. శరీరం కదలికలు ఆలోచనలని కలిగిస్తాయి. ఎప్పుడైతే మీ శరీరం కదలికలు లేకుండా నిశ్చలంగా ఉంటుందో, అప్పుడు అది మిమ్మల్ని లోతైన నిశ్శబ్దంలోకి తీసుకువెళుతుంది. పూర్తి చేతనస్థితిలో గట్టి నిర్ణయంతో, గాఢతతో ఈ నిమిషాన మీరు, మీ అంతరంగప్రపంచంలో బయటి ప్రపంచంలో ఎలా ఉంటారో అటువంటి మిమ్మల్ని మీరుగా స్వీకరిస్తాను అనే గట్టి ఉద్దేశాన్ని మీలో కలిగించండి.

మీకు మీరు ఈ విధంగా చెప్పుకోండి. నాకు బయటి ప్రపంచంలో చాలినన్ని అద్భుతమైనవి సొంతానికి ఉన్నాయి. నా అంతరంగంలో నాకు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. నన్ను నేను సంపూర్ణంగా స్వీకరిస్తున్నాను. బయటి ప్రపంచంలో కాని, అంతరంగప్రపంచంలో కాని నన్ను నేను ఏమీ అభివృద్ధి చేసుకోనవసరం లేదు. నాకు అహంకారం ఉన్నా పరవాలేదు. నాలో అపరాధభావం అనేది ఉన్నా పరవాలేదు. నాకు భయం ఉన్నా పరవాలేదు. నాకు ఆశ ఉన్నా పరవాలేదు. నా గురించి అందరూ ఏవేవి చెప్పినా పరవాలేదు. నేను మంచి అయినా, చెడు అయినా అన్నింటి తోటీ నన్ను నేను స్వీకరిస్తాను.

ఒక వేళ మీ మనస్సు 'అదేం లేదు. నేను దాన్ని ఒప్పుకోను. దీన్ని స్వీకరించను' అని అంటే ఆ విషయాన్ని కూడా, నేను అన్నీ స్వీకరించలేకపోతున్నాను అన్న విషయాన్ని కూడా స్వీకరించండి.

ఈ క్షణాన్ని స్వీకరించండి. రాబోయే క్షణాలనన్నింటినీ స్వీకరించండి. మీ మనస్సు మీకు రాగల అతి చెడ్డ విషయం ఉన్నది అంటే, దాన్ని కూడా స్వీకరించండి. ఒకవేళ అది నిజంగా జరిగితే మీరు ఎలాగూ దాన్ని ఆపలేరు. అది మీకు తప్పదు. తప్పదు అన్న విషయాన్ని స్వీకరించండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు స్వీకరిస్తారో, ఇక మీకు ఆలోచనలు రావు. మనస్సు నిశ్శబ్దమైపోతుంది. ఆ నిశ్శబ్దాన్ని ఆనందించండి.

  1. ఆపండి : వర్తమానంలోకి, ఈ క్షణంలోకి మీ తెలుసుకునే తత్వాన్ని తీసుకురావటానికి ఇది బలమైన ధ్యానపద్ధతి.

సమయం : ఎప్పుదైనా, ఎక్కడెనా.

కేవలం ఆపండి, జస్ట్ స్టాప్. దీన్ని జ్ఞానోదయమైన జార్జ్ గుర్టీప్ అనే మహాత్ముడు ఎక్కువగా ఉపయోగించేవాడు. మీరు ఏదో చేయాలి అనుకున్నారు. దాన్ని ఆపండి. మీలో మోసపూరితమైన టక్కరితనం ఉంటుంది. అది జీవించటానికి అవసరం అనుకుంటారు. ఆ విధంగా ఉంటూ మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అనుకుంటారు. ఇప్పుడు ఆ టక్కరితనాన్ని మానేసి అమాయకత్వాన్ని, విశ్వాసాన్ని పెంచుకోండి.

ఇందులో రెండవ స్టెప్, మీకు ఏదైనా ఒక అత్యవసరమైన కోరిక లేదా స్పందన లేదా చర్య కలగబోతున్నాయనుకోండి. అది ఆకలి, కోపం, దాహం, తుమ్ము రాబోవటం, ఇలా ఏదైన అకస్మాత్తుగా రాబోయినప్పుడు, ఆపండి. మీరు ఆ పని నుంచి ఆత్మ దగ్గరకి వెళ్ళండి.

  1. భావావేశాల జ్ఞాపకాల మీద ధ్యానం : భావావేశాల జ్ఞాపకాల మధ్య నుంచి స్వేచ్ఛ పొందండి.

సమయం : వర్తించదు.

మీరు ఏదైనా ఒక భావావేశాత్మకజ్ఞాపకంలో చిక్కుకుపోయారనుకోండి. మీరు దాంతో కూర్చొని, దాని మీద ధ్యానం చేయండి. చేతనస్థితిలో దానిలోకి వెళ్ళండి. అది ఆశ, భయం, ప్రేమ ఏదైనా సరే, దానిలోపలికి పూర్తిగా వెళ్ళండి. నెమ్మదిగా మీ అంతరాత్మ దాని నుంచి విడిపోతుంది. ఆ జ్ఞాపకం నుంచి బయటికి స్వేచ్ఛంగా వస్తుంది. ఇంకా ఆ జ్ఞాపకానికి సంబంధించి ఏదైనా ఉన్నా, మార్పు ఉన్నా, ధ్యానం కొనసాగించండి. మీరు త్వరలోనే ఆ జ్ఞాపకానికి అతీతంగా వెళ్ళి, మీ అంతరంగంలోకి ప్రవేశించగలుగుతారు.

ఎప్పుడైతే మీ అంతరంగాన్ని తిరిగి పొందగలుగుతారో, అప్పుడు మీరు సర్వసృష్టితో, సర్వాంతర్యామితో ప్రేమలో పడతారు. కష్టపడనవసరం లేకుండా, ప్రయత్నం లేకుండా మీ హృదయం కరిగిపోతుంది. దీన్ని కొన్నిసార్లు సాధన చేస్తే, మీకు సత్యం తెలుస్తుంది.

  1. మార్చు రానిదాన్ని మార్చండి : మార్పు లేని చేతనస్థితి అంతిమసత్యం అని తెలుసుకోండి.

సమయం : ఎప్పుదైనా, ఎక్కడైనా

జరుగుతున్న మార్పుని అర్థం చేసుకోండి. మార్పుని మార్పుతో ఉపయోగించండి. మీరు మార్పు లేని చేతనస్థితిని చూడగలుగుతారు.

మీరు నిరంతరం మార్పు చెందే శాశ్వతమైన శక్తి. నిరంతరం మార్పు చెందే బయటి ప్రపంచంలోని మార్పుని తీసుకోండి. ఆ మార్పుని మీ అంతరంగంలో కలిగే మార్పు మింగేసేలా, అది లేకుండా చేసే విధంగా చేయండి. కల్లోలం కల్లోలాన్ని మింగనీయండి. కల్లోలాన్ని కల్లోలంతో మూసేయండి. కల్లోలంలో కల్లోలాన్ని నింపండి. ప్రశాంతమైన లోతైన విరామం లాంటిది తెలుసుకునే తత్వంలో కేంద్రీకృతమవ్వండి. ఈ విషయాన్ని అంటే మార్పుని మార్పుతో పోగొట్టాలి అనే విషయాన్ని పెంచుకోండి. నిరంతరం బయటి ప్రపంచంలో జరిగే మార్పుల్ని మీ అంతరంగంలో జరిగే మార్పులు మింగేస్తున్న దృశ్యాన్ని చూడండి.

మీ అంతరంగప్రపంచాన్ని లేదా బయటి ప్రపంచాన్ని నమ్మి మీరు ఏది చేసినా అది కల్లోలాన్ని విశ్వసించటమే. ఉదాహరణకి ఇంటి హాలులో ఒక మూల పెట్టటానికి నాకు అందమైన పూల మొక్క కావాలి అనుకుంటారు. దాని కోసం ప్రయత్నించి ఆ మొక్కని తెచ్చి మీ హాలులో పెట్టి సంతోషపడతారు. కానీ అప్పటికే ఇది కాదు, దీన్ని మరో చోట పెట్టాలి అనుకుంటారు. ఇటువంటి సాధారణమైన అనుభవాలు చాలా ఉంటాయి.

ప్రతిదీ నిరంతరం మారుతూ ఉంటుంది. అంతరంగంలో మారుతున్న నిజాలు, బయటి ప్రపంచంలో జరిగే మార్పుల్ని లాక్కొని మింగేస్తున్నట్లు తెలుసుకోండి. అప్పుడు ఏదీ మిమ్మల్ని అంటదు. ఇప్పుడు మీరు ఇది చేయాలా, అది చేయాలా అనుకుంటారు. అంటే రెండు పడవలలో ప్రయాణించటం. ఒక కాలు ఈ పడవ మీద, మరొక కాలు ఆ పడవ మీద పెట్టి బాలెన్స్

చేయటానికి ప్రయత్నిస్తారు. అది ఎప్పటికీ పని చేయదు. నీళ్ళలోకి దూకి ఈదుకుంటూ, ప్రవాహంతో పాటు తేలుతూ వెళ్ళిపోండి.

ఎప్పుడైతే అంతరంగంలో, బయటి ప్రపంచంలో నిరంతరం మార్పు జరుగుతుందని తెలుసుకొని, అంతరంగంలో మార్పు బయటి మార్పుని మారుస్తుంది – అని అర్థం చేసుకుంటారో దాన్ని మీ హృదయంలో తల్లిలా జాగ్రత్తగా పెంచిపోషించండి. అప్పుడు మీకు ఎప్పటికీ మారని చేతనస్థితి అంతిమసత్యం అని తెలుసుకుంటారు. ఎప్పుడెతే ఈ విషయాన్ని మీలో పెంచుకుంటారో, మీలో గొప్ప శక్తి వస్తుంది. మీ జీవితానికి నిజాయితీ, గాఢత అనేవి కలపబడతాయి. ఎపుడెతే నిజాయితీ, గాధత మీ జీవితంలో ప్రవేశిస్తాయో, మీరు జీవన్ముక్తులు అవుతారు.

జీవన్ముక్తి అంటే మీ సహజస్థితిలో స్వచ్చంగా జీవించటం. స్వచ్ఛమైన, సహజమైన అనుభవాల్ని, జ్ఞానాన్ని, పనుల్ని పెంచి పోషించటం.

  1. జీవచెతన్వాన్ని మీ లోపలా, మీ బయటా తెలుసుకోండి : విశ్వతమైన చేతనస్థితిని అనుభవించండి.

సమయం : 21 నిమిషాలు.

కళ్ళు మూసుకోండి, స్థిరపడటానికి కొంత సమయం తీసుకోండి. ఓపికతో ఉండండి. మీరు తెలుసుకునే తత్వాన్ని చేతనస్థితిలో సాధన చేసారు. ముందుగా మీరు కూర్చున్న కుర్చీతో ప్రారంభించండి. ఎందుకంటే అది మీకు అతిసమీపంలో ఉంది. మీరు కుర్చీలో ఉన్నట్లు చూడండి. మీరు మీ శరీరంలో ఉండటాన్ని ఏ విధంగా అనుకుంటున్నారో అదే విధంగా మీరు కుర్చీలో జీవించి ఉన్నట్లు అనుకోండి. మీరు శరీరంలో ఎంతగా జీవించి ఉన్నాను అనుకుంటున్నారో, కుర్చీలో కూడా అదే విధంగా జీవించి ఉన్నాను అనుకోండి. మీ శరీరంలో జీవం ఎలా ప్రకాశిస్తుందో కుర్చీలో కూడా అదే విధంగా జీవం వెదజల్లబడుతుంది.

మీ చుట్టూ ఉన్నవారిలో మీరు జీవించి ఉన్నట్లు అనుకోండి. కొంత సమయం తీసుకొని అందరిలో మీరు జీవించి ఉన్నట్లుగా చూడండి. మీరు అన్నింటిలో ఉన్నట్లు గోడలో, ఫర్నిచర్‌లో, మనుషుల్లో, పూలలో, గదిలో, నేలలో, అన్నింటిలో ఉన్నట్లు ఊహిస్తూ అలా అనుకోండి.

  1. బోలుగా ఉన్న వెదురు బొంగు : ఇది చక్కని శూన్యంగా అయ్యే ధ్యానపద్దతి. మీ లోపల ఉన్నదాన్నంతా ఖాళీ చేయండి. సర్వాంతర్యామి, విశ్వశక్తి తాలూకు శక్తి తీసుకోవటానికి సిద్ధంగా ఉండండి. మీరు దివ్యాత్మగా మారండి.

సమయం : 21 నిమిషాలు.

నిశ్శబ్దంగా ఉన్న చోట కదలకుండా ప్రశాంతంగా కూర్చోండి. మీ శరీరాన్ని తెలుసుకోండి. మీ శరీరంతో సౌకర్యంగా, హాయిగా ఉండండి.

ఇప్పుడు మీ శరీరం వెదురులా అయిందనుకోండి. అది ఖాళీ వెదురు బొంగులా ఉన్నట్టు అనుకోండి. మీ శరీరం, అందులో భాగాలు, ఎముకలు, కండరాలు, అన్నీ వెదురులో భాగాలు అనుకోండి. అందులో ఆ వెదురులో ఏమీ లేదు. ఖాళీ నిశ్శబ్దం తప్ప. మనస్సుని స్తబ్దంగా ఉంచండి. ఎటువంటి అనుభవం కోసం చూడవద్దు. అలాగే ఉండండి.

అకస్మాత్తుగా శక్తి మీలోకి ప్రవహించటం తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉండి, ఆటంకపరచకుండా ఉంటారో, మీలోకి విశ్వశక్తి ప్రవహిస్తుంది. మీరు దివ్యమురళిగా మారి అమరగీతాలు ఆలపిస్తారు. మీరు గురువులతో ఉంటే, మీరు ఖాళీ వెదురుగా మారగలిగితే ఆయన మీతో అమరగీతాలు ఆలపిస్తారు. ముందు మీరు ఖాళీ వెదురు. తరువాత వెదురు బొంగు మాయం అవుతుంది…… మీరు దివ్యాత్మలవుతారు. ఇక మీలో 'మీరు ' ఉండరు.

  1. అద్దం గుండా మీ లోపలికి చూడటం : నిరంతరం శక్తిమంతులుగా, చేతనత్వంతో ఉంటారు.

సమయం : 10 నిమిషాలు.

నిలువుటద్దం ముందు నిలబడి మీ వైపు చూడండి. బయట నుంచి ఒకసారి చక్కగా చూడండి. మీరు అనేది ప్రధానం. అద్దంలో కనపడే మీ ప్రతిబింబం మీరు చూస్తున్న లక్ష్యం. మీ నుంచి శక్తి దానికి వెళుతున్నట్లు అనుకుంటారు. మీరు చూస్తున్నారు. ప్రతిబింబం చూడబడే లక్ష్యం.

ఇప్పుడు మీ పాత్రల్ని అటూ ఇటూ చేయండి. మీ ప్రతిబింబం మిమ్మల్ని చూస్తున్నట్లు అనుకోండి. ముందు భయం అనిపిస్తుంది. ప్రతిబింబాన్ని అలా అనుకోలేరు కదా! ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్లు ప్రతిబింబం చూడటం అంటే కొత్తగా ఉంటుంది.

మీకు కొత్తగా భయంగా, అనిపించినా, అలాగే ఉండండి. కొంచెం సేపటిలో మీలో గొప్ప మార్పు వస్తుంది. మీ ప్రతిబింబం నుంచి మీ వైపు శక్తి రావటం గమనిస్తారు. ఇప్పుడు మీరు ఆ వృత్తాన్ని పూర్తిచేసారు. అలా చేయటం వలన శక్తి వృథా కాదు. అది మీలోకే ప్రవేశిస్తుంది. మీలోని శక్తిని మీ కోసం ఆదా చేసుకున్నారు.

ఈ పద్ధతిని కొన్ని రోజులు సాధన చేయండి. మీలో కచ్చితమైన మార్పు వస్తుంది. మీరు చాలా శక్తితో ఉంటారు. మీలో కేంద్రీకృతమైన ప్రశాంతతతో ఉంటారు. ఈ పద్ధతిని మీరు రోజంతా సాధన చేయవచ్చు. అద్దంలోని ప్రతిబింబంతోనే కాకుండా, ఎవరి మీద అయినా, దేని మీద అయినా మీ ఏకాగ్రత నిలిపి చేయవచ్చు. మీ శక్తి ఎదుటివారికి వెళ్ళినప్పుడు, అది తిరిగి మీకు వస్తుంది అని ఊహించండి. శక్తి తిరిగి మీలోకి రావటాన్ని తెలుసుకోగలరు. అది మిమ్మల్ని సంతోషోత్సాహంలో ఉంచుతుంది. ఈ పద్ధతిని మీరు రోజంతా పని చేస్తున్న కంప్యూటర్‌తో కూడా చేయవచ్చు.

  1. శరీరభాగాలని రిలాక్స్ చేయటం : వెంటనే విశ్రాంతి, విరామం కావాలంటే ఇది మంచి పద్దతి.

సమయం : 2 నిమిషాలు, మీకు టైం ఉంటే ఇంకొంచెం సేపు చేయవచ్చు.

మీకు ప్రత్యేకంగా ఒక గది ఉంటే పడుకుని ఈ ధ్యానం చేయండి. లేకపోతే వీలైనంత సౌకర్యంగా ఉండండి.

కళ్ళు మూసుకొని లోతుగా శ్వాస తీసుకోండి. మీరు శ్వాసని పట్టి ఉంచాలి. అందుకే ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా శ్వాస తీసుకోండి. మీ లోపల శ్వాసని ఉంచి ఒకదాని తరువాత ఒకటిగా మీ శరీరభాగాల్ని బిగబట్టండి. పాదాల దగ్గర నుంచి ప్రారంభించి పైకి వెళ్ళండి. కాళ్ళు, మోకాళ్ళు, వీపు కింద – ఇలా బిగదీస్తూ వెళ్ళండి, పైకి వెళ్ళేటప్పుడు కింది భాగాలని వదులుచేయవద్దు.

ఇప్పుడు మీ నడుము దగ్గరికి, తరువాత కడుపు గట్టిగా బిగబట్టండి. తరువాత ఛాతీ, వీపు మొత్తం బిగబట్టండి. తరువాత చేతివేళ్ళు, చేతులు, భుజాలు, మెడ బిగించండి. ముఖ్యంగా మెడ కండరాల్ని పట్టి ఉంచండి.

తరువాత ముఖం దగ్గరికి వెళ్ళండి. ముక్కు, కళ్ళు, నుదురు బుగ్గలు బిగించండి. పళ్ళు బిగించండి. ముఖం గట్టిగా బిగించండి. శరీరంలో మిగిలిన భాగం అలా బిగించే ఉండాలి. అలా ఎంత సేపు ఉండగలరో అంత సేపు ఉండండి. ఇక శ్వాసని పట్టి ఉంచలేను

అనుకున్నప్పుడు దాన్ని గట్టిగా వదలటం ద్వారా శరీరాన్ని రిలాక్స్ చేయండి.

భౌతికంగా, మానసికంగా అదే విరామంలో ఉండండి. ఈ పద్ధతితో మీ శరీరం, మనస్సు రెండు నిమిషాలలో రిలాక్స్ అయ్యి, తాజాగా అవుతాయి. మీకు టైం దొరికితే దీన్నే తిరిగి మూడుసార్లు చేయండి.

  1. నేను : మీ లోపలికి మీరు వెళ్ళండి–నిజమైన మిమ్మల్ని క్షణకాలం దర్శించండి.

సమయం : ఎప్పుదైనా, ఎక్కడైనా.

ఈ పద్ధతిలో |పతిక్షణం మీ మీద మీకు ఏకా|గత ఉంటుంది. మీరు చేయవలసినది మిమ్మల్ని మీరు గురు చేసుకోవటం. మీరు తినేటప్పుడు, నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, 'నేను' అని అనుకోగలగాలి. 'నేను' ని తెలుసుకుంటూ ఉండాలి. మీ లోపల జీవించి ఉన్న శాశ్వతమైన చైతన్యాన్ని కనుగొనండి. మీ వినోదకార్యక్రమాలు ఏమిటి? మిమ్మల్ని మీరు మరచిపోవద్దు. మిమ్మల్పి మీరు మరచిపోవటానికి [పయత్నిస్తే జీవితంలో మరిన్ని సమస్యలు వస్తాయి.

మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో, మీ గురించి మీకు ఏం చెప్పారో, వాటినన్నింటినీ వదిలేసి, కేవలం నేనుని గురుంచుకోండి. మిమ్మల్ని మీరు గురుచేసుకోవటం ఆలోచించటం కాదు. మీరు 'నేను' అని ఆలోచిస్తే పాయింట్ మిస్పయినట్లే. అందుకే చివరికి నేను, నేను అంటూ ముగిస్తాం. మాటలు అనుభవం కాదు. మాటలు అనకండి. నేనుని 'ఫీల్' అవ్వండి. నేనుని అనుభూతితో తెలుసుకోండి. మీ శరీరం గురించి మనస్సు గురించి, మీ స్టేటస్ గురించి ఏమీ ఆలోచించవద్దు.

మీరు నడుస్తున్నప్పుడు ఒక్కసారి ఆగి, మీరు ఉన్నారు అని తెలుసుకోండి. మీరు దేన్నెనా పట్టుకున్నా, ఆ స్పర్శని తెలుసుకోండి. ఎవరైనా మిమ్మల్ని తాకితే ఆ స్పర్శని తెలుసుకోండి. ఆ స్పర్శ మిమ్మల్ని తాకింది అని తెలుసుకోండి. మీ చేతనస్థితి పదునుగా అవుతుంది.

ఈ తెలుసుకునే తత్వాన్ని మీరు ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకువెళ్ళండి. సూర్యరశ్మి మీకు తగిలినప్పుడు, మీ జుట్టులోకి గాలి వెళ్ళినప్పుడు ఆ అనుభవం పొందేది ఎవరో తెలుసుకోండి. అది నేను అనుకోండి. ఒక్క క్షణం మీరు లోపలికి, మీ అంతరంగంలోకి నెట్టబడతారు. మీరు ఒక్క క్షణం లోతైన నిశ్శబ్దాన్ని, సత్యాన్ని చూడగలుగుతారు.

10. కేవలం కూర్చోండి : ఆలోచనలు లేని స్థితి తాలూకు క్షణదర్శనం.

సమయం : 21 నిమిషాలు.

ఈ ధ్యానాన్ని జెన్ నుంచి తీసుకున్నారు. జాజెన్ అంటే కేవలం కూర్చోవటం. అన్నింటి కంటే కష్టమెంది ఏమీ చేయకుండా కూర్చోవటం. మీ మనస్సు చాలా వాదాలతో మీ ముందుకి వస్తుంది. ఈ ధ్యానం చేయకుండా ఉండగల చాలా కారణాలతో మీ ముందుకి వస్తుంది. అది మీతో ఇదంతా టైమ్ వేస్ట్ అని చెబుతుంది. మీరు పట్టించుకోకపోతే, మనస్సు నిద్ర పోతుంది. పగటి కలల్లో, ఊహల్లో ఉంటుంది.

ధ్యానం ఉద్దేశం మనస్సుని తనకి ఇష్టం వచ్చిన ట్రిక్కులతో ఆడుకోనీయకపోవటమే. ఏదో ఒక రోజు మనస్సుకి మీ మీద ఆడే ఆటల పట్ల చికాకు వస్తుంది. అది మిమ్మల్ని తన ఆటలతో [ప్రభావితం చేయలేనని తెలుసుకుంటుంది. తరువాత అది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది.

ఈ ధ్యానం చేయటానికి మీకు ప్రశాంతంగా ఉన్న చోట కూర్చోండి. మీ నిశ్చలత్వం, నిశ్శబ్ధం, భంగం కలగకుండా ఉండే చోటు ఎంచుకోండి. మీరు కదలకుండా ఉండగలిగే పద్ధతిలో సౌకర్యంగా కూర్చోండి. మీరు కదలకుండా కనీసం అరగంటెనా కూర్చోగలగాలి. చాప గాని, కుషన్ గాని ఉపయోగించవచ్చు. ఎప్పుడెతే శరీరం కదలదో అప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుంది.

నిటారుగా కూర్చోండి. అవసరమైతే దేన్నెనా ఆనుకోండి. వీలైనంత వరకూ ఆనుకోకుండా ఉండే విధంగా కూర్చోండి. అరచేతులు ఒక దానిలో ఒకటి ఉంచి రెండు బొటన వేళ్ళూ కలపండి. అది ఒక వృత్తంలా ఉంటుంది.

కళ్ళు సగం మూయండి. దేని పైనా చూపును ఏకాగ్రతతో నిలపవద్దు. మీ దృష్టి సున్నితంగా ఏదైనా దూరం దాని మీద ఉండాలి. అది మీకు విరామాన్ని ఇస్తుంది. మీ శ్వాస విరామంగా సహజంగా ఉంచండి. తెలుసుకునే తత్వంతో పరాకు లేకుండా ఉండండి. దేని మీదా ఏకాగ్రత నిలపకుండా స్వీకరించే స్థితిలో ఉండండి. ప్రతిక్షణం ఆ క్షణంలోనే ఉండండి.

కొన్ని రోజులు గడిచాక ఇది మీకు చాలా బాగుంటుంది. పొరలు పొరలుగా మీ మనస్సు పడిపోవటం తెలుస్తుంది. చివరికి ఒక రోజు మనస్సు పూర్తిగా పోతుంది. మీరు ఆలోచనలు లేని స్థితి అనుభవం పొందుతారు.

11. తెలుసుకునే తత్వంతో తినటం, తాగటం : మీ తెలుసుకునే తత్వం విస్తృతం అవుతుంది.

సమయం : తినేటప్పుడు, తాగేటప్పుడు.

సాధారణంగా దేన్నెనా మనం నమిలి తినం, మనం దాన్ని నోట్లోకి తోసేస్తాం. ఆహారాన్ని, దాని రుచిని ఆనందించం.

ఇప్పుడు మీరు ఏది తిన్నా, ఎక్కడ తిన్నా తెలుసుకుంటూ పూర్తి తెలుసుకునే తత్త్వంతో తినండి. దాని రుచిని పూర్తిగా తెలుసుకోండి. ఆహారంలో రుచిని మీరు తెలుసుకున్నప్పుడు, అది కేవలం నాలుక మీదే కాదు, మీ శరీరవ్యవస్థ మొత్తంలో తెలుస్తుంది. మంచి నీళ్ళు తాగేటప్పుడు, నీళ్ళ చల్లదనం మీ గొంతు లోంచి కడుపులోనికి వెళ్ళటాన్ని గమనించండి. కళ్ళు మూసుకొని నెమ్మదిగా ప్రతి గుటకా ఎంజాయ్ చేస్తూ తాగండి. ఆ చల్లదనాన్ని పూర్తిగా అనుభవించండి. మీ నాలుక మీదే కాదు, మీ శరీరం మొత్తానికీ ఆ చల్లదనం తెలియాలి.

13. 'సరే, ఔను' అని చెప్పండి : సున్నితంగా కరిగిపోయి అత్యున్నతవిశ్వమేధకి అధీనమవటం.

సమయం : ఎప్పుడెనా, ఎక్కడెనా.

మీరు గమనించే ప్రతి దానికీ 'కాదు, లేదు' అని చెబుతారు. అలా చెబితే మీ అహంకారం మరింత గట్టిపడుతుంది. కాదు అని చెబితే మీరు ప్రత్యేకమైన వ్యక్తి అని అనుకుంటారు. సరే అని చెబితే మీ అహంకారం తక్కువైనట్టు అవుతుంది. ఎవరికో తల వంచినట్లు అవుతుంది.

ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా చేయండి. తరువాత 24 గంటలు ప్రతి దానికీ సరే అని చెప్పండి. కాదు అనేది పైకి వస్తుంది. ఏ స్థితిలోనైనా కాదు అని చెప్పటానికి మీ మనస్సు ముందుకి వస్తుంది. అది పైకి వచ్చి పడిపోతుంది. చేతనస్థితిలో సరే అని చెప్పండి.

మీకు మీరు సున్నితంగా కరిగిపోతున్నట్లు తెలుసుకుంటారు. మీతో మీరు కొత్త రకమైన సౌకర్యాన్ని అనుభవిస్తారు. ఎదుటివాళ్ళు మీలోని సున్నితత్వాన్ని, విప్పారి ఉన్న మీ తత్వాన్ని తెలుసుకుంటారు.

14. మీ శరీరాన్ని, మనస్సుని గమనించండి. – రిలాక్స్ : మీ టెన్షన్ నుంచి బయటకి రండి. మీరు చేస్తున్న ప్రతి పనినీ ప్రేమించండి.

సమయం : ఎప్పుదైనా, ఎక్కడెనా

మీరు ప్రతి రోజూ చేసే అన్ని పనులనీ పూర్తిగా తెలుసుకునే తత్వంతో చేయండి. మీరు ఏ పని చేస్తున్నా, చేతనస్థితిలో విరామంగా ఉండి ఆ పని చేయండి. మీకు ఉన్న టెన్షన్ నుంచి చేతనస్థితిలో బయటకి రండి. మిమ్మల్ని మీరుగా స్వీకరించండి. ప్రతిక్షణాన్ని జీవితం మీకు ఇచ్చే బహుమతిగా స్వాగతిస్తూ దాన్ని స్వీకరించండి. మీరు ఏ పని చేసినా ప్రేమతో, సంతోషంతో చేయండి. మీరు చేసే దాన్ని సంపూర్ణంగా, స్వచ్ఛంగా చేయండి. అప్పుడు మీరు, మీరు చేస్తున్న పని మారిపోతాయి.

15. మీరు అక్కడ ఉన్నారా? : వర్తమానంలోకి దూకండి.

సమయం : నిద్ర పోయేటప్పుడు లేదా ఎప్పుడెనా, ఎక్కడెనా

మిమ్మల్ని మీరు అడగండి. 'నీవు అక్కడ ఉన్నావా?' అని. ఈ [పశ్నని చేతనస్థితిలో అడిగితే ఆలోచనలు ఆగిపోతాయి. ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వండి 'అవును' అని. అది మీ తెలుసుకునే తత్వాన్ని సూటిగా వర్తమానంలోకి తీసుకువస్తుంది. మీరు నిద్ర పోవటానికి ముందు దీన్ని ప్రయత్నించండి. లేకపోతే ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రయత్నించవచ్చు.

16. మాటలకి అతీతంగా : మాటలు వివరించేదానికి అతీతంగా అనుభవం పొందటాన్ని నేర్చుకోండి. అప్పుడు మీరు స్పష్టి అందాలని అనుభవంతో తెలుసుకుంటారు. అప్పుడు జీవితం నిత్యానందం.

సమయం : ఎప్పుడైనా ఎక్కడెనా.

దేన్నెనా ఎటువంటి మాటల్నీ తీసుకురాకుండా చూడాలి. మీరు ఒక పూవుని చూస్తే, కేవలం చూడండి. పైకి కాని, లోపల కాని ఏమీ మాట్లాడవద్దు. 'ఆహా! చాలా బాగుంది. అందమైన గులాబి' ఇలా ఏమీ అనవద్దు. పూర్తి తెలుసుకునే తత్వంతో దాని వైపు చూడండి. అదే నిజంగా గులాబి వైపు చూడండి. అప్పుడే మీరు గులాబీతో అనుబంధాన్ని ఏర్పరచుకోగలరు. అప్పుడే గులాబీ తానేమిటో మీకు వెల్లడి చేసుకోగలదు.

రాత్రి పూట ఆకాశంలో చంద్రుడిని చూడండి. అందులో నిమగ్నమవ్వండి. కేవలం చూడండి. అది ఎంత అందంగా ఉందో అని కాని, అది చంద్రుడు అని నాకు తెలుసు అని కాని ఆలోచించవద్దు. అటువంటివి అనవద్దు.

కొన్ని సార్లు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. అద్దంలో మీ వైపు లోతుగా గాఢతతో చూడండి. కేవలం చూడండి. గమనించండి. సర్వాంతర్యామి సృష్టి అయిన మీరు ఆ సర్వాంతర్యామి ఎంత అందమైన వారో కదా! మీరు మాటలు ఉపయోగిస్తే ఈ మొత్తాన్ని ప్రాపంచికస్థితికి కిందికి తేవటమే అవుతుంది.

17. విమర్శించటం : సరైన విధంగా విమర్శించండి

సమయం : ఎప్పుడైనా, ఎక్కడైనా.

మీరు ఎప్పుడైనా, ఎవరినైనా విమర్శించాలి అనుకుంటే, ఈ పద్దతిని ప్రయత్నించండి. ఆ వ్యక్తిని విమర్శించే ముందు, అనుకూలంగా మరేదైనా అనవచ్చునేమో కనుక్కోండి. మీకు అలా అనుకూలమైనవి దొరకనప్పుడు, ఎదురు చూడండి. ఉపయోగం లేని, నిర్మాణాత్మకం కాని విమర్శ వల్ల [ప్రయోజనం లేదు. అనుకూలమైన మాటలు దొరికాక, సమస్యకి పరిష్కారాన్ని ఇస్తూ మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి. అప్పుడే మీ విమర్శ నిర్మాణాత్మకంగా ఉండి, ఉపయోగపడుతుంది.

18. బయటా – లోపలా తిరగటం : తిరగటాన్ని గమనించండి, నిజమైన మీలో విరామంతో స్థిరపడండి.

సమయం : 21 నిమిషాలు.

కళ్ళు మూసుకొని విరామంగా కూర్చోండి. మనస్సుని నియంత్రించవద్దు.

మీ మనస్సు (ఆలోచనలు) మీ లోపల ఉండకుండా వేరే విషయాల మీద ఉంటే దాన్ని బయట తిరగటం అంటాను. ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఇక్కడ ఉంటారు. మీ మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు గుర్తుంచుకుంటారో మీ పేరు, మీ గురించి, మీ స్టేటస్ ఇలా అనుకుంటే అది లోపల తిరగటం.

బయట తిరగటం, లోపల తిరగటం – ఈ రెండింటినీ గమనించండి. మీ గురించి ఏదైనా ఒక భావన వస్తే అది లోపల తిరగటం. ఈ తిరగటాన్ని గమనించండి. వాటి నుంచి రిలాక్స్ అవ్వండి. మీరు ఆలోచనలతో డిస్టర్బ్ అయితే వెనక్కి వచ్చేయండి. మళ్ళా బయట తిరగటం, లోపల తిరగటం అనే వాటిని గుర్తు చేసుకోండి. రిలాక్స్ అవ్వండి. బయట తిరిగేదాన్ని, లోపల తిరిగేదాన్ని విరామంతో తెలుసుకోండి.

మీరు కానిదాని దగ్గరకి తెలుసుకునే తత్వాన్ని తీసుకువస్తుంటే మీ నిజమైన మీరు ఏమిటో మీకు తెలుస్తుంది. అదే విశ్వం.

19. అన్నింటినీ బయట ఉంచండి : మీ జ్ఞానాన్ని ఒక పక్కన పెట్టండి – అంతిమస్వేచ్ఛని అనుభవించండి.

సమయం : 10 నిమిషాలు.

మీరు చదివినవి, విన్నవి, చూసినవి – వీటినన్నింటినీ మీ అంతరంగం నుంచి బయటికి తీసేయండి. అన్నింటినీ బయటికి తీసేసి చూడండి. అప్పుడు మీ అంతరంగానికి ఏమౌతుందో తెలుసుకోండి. ఏదైనా ఒక ఆలోచన వస్తే అది మీ అంతరంగానికి సంబంధించింది కాదు అనుకోండి. ఆలోచన ఎవరో ఒక వ్యక్తి వల్ల కాని లేదా అంతకు ముందు మీ అంతరంగంలో ఉన్న ఒక ఆలోచన వల్ల కాని వచ్చి ఉంటుంది. బోధనలు, భావనలు, విషయాలు ఇలా మీరు ఏం విన్నారో వాటినన్నింటినీ బయట పెట్టేసేయండి. మీ అంతరంగాన్ని ఖాళీగా ఉంచండి. ఈ పద్ధతిని కొన్ని నిమిషాలు సాధన చేసాక, ఈ పద్ధతిని ఎలా చేయాలనే క్రూని, నైపుణ్యాన్ని పట్టుకోగలుగుతారు.

ప్రతి రోజూ కనీసం ఒక 10 నిమిషాల పాటు మీ అంతరంగంలోని అన్నింటినీ బయట పెట్టేసేయండి. అప్పుడు మీలో అద్భుత మైన లోతైన నిశ్శబ్దాన్ని అనుభవించగలుగుతారు.

మీ అంతరంగంలోని అన్ని విషయాల్ని, బోధనల్ని, మాటల్ని, ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాల్ని అన్నింటినీ బయట పెట్టాలి అనే స్పష్టమైన ఉద్దేశంతో సాధన చేయండి. మాటల్ని, బోధనల్ని, విషయాల్ని, సత్యాలని–దేన్నీ మీ అంతరంగంలో ఉంచవద్దు. మీరు అంతిమస్వేచ్ఛలో ఉండండి. మీరు ఒత్తిడి నుంచి, ఇంత వరకూ విన్న విషయాల నుంచి స్వేచ్ఛని పొందండి. నిశ్శబ్దాన్ని కనుక్కోండి. ఖాళీ అనేది మీ సహజలక్షణం. మీరు దాన్ని పోగొట్టుకున్నారు.

20. శత్రువులతో వ్యవహరించటం : శత్రువుల చేత ఆటంకపరచబడకుండా నిశ్చలంగా ఉండండి.

సమయం : 24 గంటలు.

మీ శత్రువుల రూపాల్ని మీ మనస్సులోకి తెచ్చుకోండి. వాళ్ళ రూపం మనస్సులోకి రాగానే ద్వేషం కలుగుతుంది. చాలా మాటలు ఏవైతే వారికి చెప్పాలనుకున్నారో, అవి చెప్పటానికి అవకాశం లేదు, లేదా ధైర్యం లేదు, ఆ మాటలన్నీ బయటికి వస్తాయి. ఒక వేళ అవకాశం దొరికినా, చాలా మాటలు చెప్పవలసివచ్చి కొన్ని మీరు కోపంలో మరిచిపోయి ఉంటారు.

మీ శత్రువుల రూపాల్ని మీ ముందుకు తీసుకురండి. ఆ మాటలు, భావాలు మీలోకి రాగానే లోతుగా శ్వాస తీసుకొని, స్థిరపడండి. తరువాత రిలాక్స్ అవ్వండి. ఆ రూపాలని మీ అంతరంగంలో ఉంచండి, మీ మనస్సు ఎలా అరవాలి అని ఉంటే అలా అరవనీయండి. కొంత సేపయ్యాక మీరు అరవాలి అని అనుకున్న మాటల సంఖ్య తగ్గుతుంది. మీరు మీ సమస్యలోకి స్పష్టతో చూడటం ప్రారంభిస్తారు. మీరు ద్వేషించే వ్యక్తి రూపాన్ని, మీ అంతరంగంలో నిశ్శబ్దంగా ఉంచితే ఆ వ్యక్తి పట్ల మీకున్న ద్వేషం, శత్రుత్వం, పగ, హింస, అన్నీ తగ్గిపోతాయి.

అకస్మాత్తుగా మీలో హింస తగ్గిపోవటం చూస్తారు. ఆ వ్యక్తిని నిజంగా చూసినా మీకు భయం అనిపించదు. కోపంతో మండిపోరు. మీరు రిలాక్స్ అవుతారు. విషయాలతో ప్రశాంతంగా వ్యవహరించగలుగుతారు. ఒక వ్యక్తి పట్ల తీవ్రమైన శత్రుత్వం, ద్వేషం ఉన్నప్పుడు దాని లోంచి నిశ్శబ్దంగా బయటకి రావటానికి ఇది మంచి పద్ధతి.

మిగిలిన రోజంతా మీరు ఎవరిని చూసినా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ లోపల ఆలోచనల సంఖ్య అదే విధంగా ఉండేలా చూడండి. రిలాక్స్ అవ్వండి. కోపం తెచ్చుకోవద్దు. మీ లోపల కేంద్రీకృతమవ్వండి. మీ లోపల చాలా కొత్త కోణాలు ఆవిష్కృతం కావటం చూస్తారు. మీ లోపల లోతైన నిశ్శబ్దాన్ని రోజంతా అనుభవిస్తారు. ధ్యానంలో మీరు పొందిన నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు.

బంధాలకి, స్వేచ్ఛకి అతీతంగా

ఒక సూర్యుడు నీళ్ళలో చాలా సూర్యులుగా కనిపించినట్టే ఒక నిజమైన మూలాధారాన్ని చూడండి. అన్ని రకాల బంధాల నుంచీ స్వేచ్ఛని పొందండి.

సమయం : 11 నిమిషాలు.

సూర్యునికి ఎదురుగా పది కుండలు నీటితో పెడితే పది కుండలలో సూర్యుని ప్రతిబింబాలు కనిపిస్తాయి. మీరు ఆ పది కుండల్ని ఒక దాని తరువాత ఒకటిగా పగులకొడితే సూర్యుల సంఖ్య తగ్గుతుంది. చివరి కుండ కూడా పగలకొట్టేశాక, సూర్యుని [ప్రతిబింబాలు ఉండవు. కేవలం సూర్యుడు మాత్రమే ఉంటాడు. సూర్యుడు ఒక్కడే కాని ప్రతిబింబాలు చాలా ఉంటాయి. అదే విధంగా అత్యుత్తమ చేతనస్థితి ఒక్కటే మూలం. మనందరిలో ఉండేది ఆ చేతనస్థితి [ప్రతిబింబమే. కాబట్టి నీళ్ళలో చాలా సూర్యులు కనపడతారు. దాని మూలం వైపు చూసే సూర్యుడు ఒక్కడే. ఇవన్నీ కేవలం ఒక సూర్యుడి బింబాలే. ఒక ప్రతిబింబాన్ని మీరు పరిశోధించి, వెనక్కి తిరిగి అది ఎక్కడి నుంచి వస్తుందో చూస్తే మీ అసలు మూలాధారం కనిపిస్తుంది.

మీరు అందరూ [ప్రతిబింబాలే. మీ శరీరం – మనస్సు అద్దం లాంటివి. సర్వాంతర్యామి అత్యుత్తమ చేతనస్థితి. ఆ అత్యుత్తమ చేతనస్థితి సరిగ్గా మీ లోపల, మీ శరీరం – మనస్సు లోపల ఎక్కడ తగులుతుందో అదే మీ చేతనస్థితి. ఇక్కడ చాలా చేతనస్తితులు ఉండవచ్చు. కానీ అన్నింటికీ మూలం ఏదీ అని చూస్తే, మీరు అత్యుత్తమ చేతనస్థితికి చేరతారు.

ఈ విశ్వం అంతా చాలా శరీరం – మనస్సుల పైన ఉన్న ప్రతిబింబాలే. వాటికన్నింటికీ మూలం ఒక్కటే. ఎపుడెతే ఈ విశ్వం అంతా శరీరం – మనస్సుల [ప్రతిబింబాలే అని మీకు అర్ధమవుతుందో, మీరు ఏదైనా చేయాలన్న మీ ఉద్దేశం మాయం అవుతుంది. ఎప్పుడైతే అన్ని [ప్రతిబింబాలకీ మూలం ఒకటే అని తెలుసుకుంటారో, మీరు [ప్రశాంతంగా, విరామంగా ఉండగలరు.

22. మీరు గ్రహించగలదానికి అతీతంగా ఆలోచించండి : ఆలోచనలు లేని పరమానందాన్ని అనుభవించండి.

సమయం : 10 నిమిషాలు.

మీరు దేన్నెనా అనుకుని, ఆ క్షణంలో దాని గురించి ఆలోచిస్తే అదే గతం అయిపోతుంది.

ఉదాహరణకి ప్రారంభంలో మీ ఆలోచనలకి అతీతమైనదాని గురించి ఆలోచించమంటే మీరు సౌరకుటుంబం గురించి ఆలోచించారు. ఎప్పుడైతే సౌరకుటుంబం గురించి ఆలోచించగానే అది మీలో ఒక ఆలోచన అయ్యింది. కాబట్టి ఇప్పుడు దాన్ని వదిలేయండి. తరువాత దానికి అతీతంగా ఆలోచించండి. మీరు నిరంతరం ఆ విధంగా ఉన్నదాన్ని వదిలి, దానికి అతీతంగా ఆలోచించండి. మీరు నిరంతరం ఆ విధంగా ఉన్నదానికి అతీతంగా వెళుతుంటే, మీ మనస్సుని విస్తృతం చేస్తూ వెళితే, మీరు వర్తమానంలో ఉంటారు. ఈ క్షణంలో ఉంటారు.

అర్థం చేసుకోండి; మీరు దేన్నైనా గ్రహించి, దాని గురించి ఆలోచిస్తే, అది గతం అయిపోతుంది. అది మీ గతం తాలూకు ఆస్తి అవుతుంది. అక్కడ మీ మనస్సు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దానికి అతీతంగా, ఇంకా ముందుకి ఇంకా వెళ్ళండి. నేను ఇంకా ఏమీ ఆలోచించలేకపోతున్నాను అనుకుంటే దాన్ని కూడా వదిలేయండి. మనస్సు నిరంతరం అన్నింటినీ గ్రహించి మీ లోపల నిలువ చేస్తుంది. దాన్ని నెమ్మదిగా తిని ఆవులా నెమరువేస్తుంది. కాబట్టి వాటిని తిరిగి తీసుకురావద్దు. నిరంతరం వాటిని వదిలేస్తూ ఉండండి.

ఏదైతే అంతిమ ఆలోచన అనుకుంటారో దాన్ని వదిలేయండి. మీ ఆలోచనని ఇంకా పెద్ద విషయానికి విస్తృతపరచండి. తరువాత మీ మనస్సు మరొక దాన్ని గ్రహిస్తుంది. మీ మనస్సును దేన్నీ పట్టుకొని ఉండనీయకండి. దాన్ని వదిలేయండి. అప్పుడు మీ మనస్సు అంటుంది. 'ఇలా అన్నీ వదిలేస్తే నాకు ఏం జరుగుతుంది. నా ముగింపు ఎక్కడ?' అని. ఈ ముగింపుల సంగతి పట్టించుకోవద్దు. ఈ [ప్రశ్న అడగటం ద్వారా మీ మనస్సు మరి దేన్నో గ్రహించాలి అని చూస్తుంది, మీరు సాధన [ప్రారంభించకముందే ఫలితాలని నిరూపించమని అడుగుతుంది. దాన్ని అలా ముందుకు రానీయవద్దు. అక్కడే మీరు మోసపోతారు. మీరు నిరంతరం వెళుతున్నారు.

నిజమైన గురువుల మీద, దేవుడి మీద, నిజమైన విశ్వం మీద ధ్యానం చేయండి. భగవంతుడిని, ఆ సారాంశాన్ని తెలుసుకున్నాను అనుకుంటారు. కాని అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మీ మనస్సు నిజమైన భగవంతుడు అంటే ఏమిటో గ్రహించలేదు. అది గ్రహించింది అంటే మీ మనస్సు భగవంతుడి కంటే గొప్పది అని అర్థం. కాబట్టి మీకు తెలిసింది భగవంతుడు కాదు, కేవలం భగవంతుడు అంటే మీకు ఉండే ఒక ఐడియా, ఒక అభిప్రాయం, ఆ భావాన్ని వదిలేయండి. మళ్ళా ప్రయత్నించండి. అంత కంటే పెద్దదాన్ని గ్రహించండి.

నిరంతరం అంతిమసత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నించండి. ఒక విషయం అర్థం చేసుకోండి. మీ మనస్సు లోంచి ఒక భావనని బయట పారేస్తే దానితో పాటు మీ మానసికవ్యవస్థలోని ఒక భాగాన్ని, ఒక ఎముకని బయట పారేసినట్లే. ప్రతిసారీ మీ మనస్సులోంచి ఒక ఆలోచనని తీసుకొని దాన్ని బయటికి పారేస్తారు. దానితో పాటు మీ మనస్సు తాలూకు ఎముకల వ్యవస్థ నుంచి ఒక భాగాన్ని కూడా పారేసారు. అలా పారేసి, పారేసి, చివరికి అసలు ఆ వ్యవస్థ అనేది లేకుండా చేసారు. అకస్మాత్తుగా మనస్సు (ఆలోచనల వ్యవస్త) మొత్తాన్నీ బయట పారేసినట్టు తెలుసుకుంటారు. అప్పుడు మీరు ఆలోచనలు లేని స్థితిలో పరమానందస్థితి అయిన నిత్యానందాన్ని అనుభవిస్తారు.

23. మీ జ్ఞానేంద్రియాలని ఉపసంహరించుకోండి : మీ అంతరంగాన్ని అనుభవించండి

సమయం : రోజుకి 5 నిమిషాలు లేదా 1– 2 నిమిషాలు ఐదుసార్లు.

ఈ ధ్యానాన్ని మీరు ఎప్పుడైనా చేయవచ్చు. ప్రారంభంలో ఈ ధ్యానాన్ని మీరు ఒకేసారి ఐదు నిమిషాలు చేయలేరు. దీన్ని రోజులో ఒకటి నుంచి రెండు నిమిషాలు ఐదుసార్లు చేయండి. దీన్ని మీరు ఒకసారి ఉదయం టిఫిన్ చేసే ముందు, మధ్యాహ్నం భోజనానికి ముందు, రాత్రి భోజనానికి ముందు, రెండు భోజనాలకి మధ్య రెండు సార్లు చేయవచ్చు.

మీ శరీరాన్ని అంటుకున్నట్లుగా లేని వదులు దుస్తులు వేసుకోండి. మీ కళ్ళు, నోరు గట్టిగా మూసుకోండి. మీ చేతులతో చెవులు మూసుకోండి. మీ కళ్ళ నుంచి, చెవుల నుంచి, నాలుక నుంచి, స్పర్శ నుంచి వచ్చే అన్ని స్పర్శలని ఆపేయండి. అప్పుడు సహజంగా మీ లోపల ఉన్న ఆలోచనలు పైకి రావటం ప్రారంభిస్తాయి. నిన్న ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుంది, రేపు ఏం పని చేయాలి – ఈ ఆలోచనలన్నీ మీ మనస్సు నుంచి వస్తాయి. వాటిని పట్టించుకోవద్దు. వాటికి మూడు క్షణాల కంటే జీవితం ఉండదు. క్షణం అంటే ఒక ఆలోచనకి, మరొక ఆలోచనకి మధ్య ఉన్న సమయం. నేను మళ్ళా చెబుతున్నాను, ఆలోచనల జీవితం మూడు క్షణాలు.

మీ జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం వెళ్ళకపోతే, ఆ ఆలోచనల క్రమం మూడు క్షణాల కంటే ఎక్కువ సేపు ఉండదు. మీరు అనుకోవచ్చు, నేను కూర్చొని ఎంత కాలమైనా ఊహిస్తూ కొత్తవి చూడగలను అని. అది సాధ్యం కాదు. అలా చేసారు అంటే జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం మీ లోపలికి వెళుతూంది అని అర్థం. మీ జ్ఞానేంద్రియాలనన్నింటినీ ఆపేయాలి. మీ నాలుకని అంగిటికి అదిమి కదపకుండా ఉంచాలి. మూడు క్షణాలలో మూడు – నాలుగు ఆలోచనలు మాత్రమే వస్తాయి. ఐదవది రాదు.

ముఖ్యసూచన: మీ శ్వాస సహజంగా, మామూలుగా ఉండాలి. ఆ విధంగా కొంచెం సేపు ఉంటే అకస్మాత్తుగా ఆలోచనలు లేని ప్రదేశాన్ని చూడగలుగుతారు. ఆలోచనలు లేని స్థితి రెండు – మూడు సెకండ్లు ఉన్నా మీలో చాలా శక్తి వస్తుంది. అది మీకు ఎనిమిది నుంచి పది గంటల నిద్రకి సమానంగా ఉంటుంది.

ఇది చాలా శక్తిమంతమైన ధ్యానపద్ధతి. దీన్ని రోజుకి ఐదుసార్లు సాధన చేయండి. ఐదారు రోజులలో ఆ అనుభవాన్ని పట్టుకోగలుగుతారు. అంతరంగంతో బంధాన్ని ఏర్పరచటం అంత కష్టం కాదు. అది మీ అంతరంగం. మనకి సరైన పద్ధతి తెలియక, ఆ ఓపిక లేకపోవటం వలన, ఆ ఏర్పరచుకోలేకపోతున్నామంతే. అందుకే సత్యం గురించి జ్ఞానం ఉంటే సగం పని అయిపోయినట్లే. మిగిలిన సగం రిలాక్స్ అవటం, అనుభవాన్ని పొందటమే.

శబ్దం

సృష్టిలోకి వ్యాపించి ఉండే సంగీతనాదం ఉన్నది. అదే అనాహతధ్వని. ఆ శబ్దాన్ని వినటానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ శబ్దాన్ని వినగలిగితే, మీరు సర్వసృష్టి సంగీతాన్నీ వినగలరు.

  1. శబ్దానికి మూలాలని అనుసరించండి : ప్రతిదాని మూలాల్తో ఐక్యమైపోండి

మొత్తం సమయం : 20 నిమిషాలు.

కళ్ళు మూసుకుని చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుని వదలండి.

  • స్టెప్ 1 : సమయం 5 నిమిషాలు. ఇప్పుడు ఓమ్ అనే శబ్దాన్ని చేయండి. గట్టిగా అవసరం లేదు. అది నాభిప్రాంతం నుంచి రావాలి.

  • స్టెప్ 2 : సమయం 5 నిమిషాలు. అదే శబ్దాన్ని చేయండి, కాని దాని మూలం ఎక్కడో కనుక్కోండి. దాని ప్రకంపనలు ఎక్కడ మొదలవుతున్నాయో ఆ మూలాన్ని కనుక్కోంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోండి. దాని మూలల్లోకి వెళ్ళండి.

  • స్టెప్ 3 : సమయం 5 నిమిషాలు. ఆ శబ్దంలోకి ప్రవేశించండి. అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ మూలం దగ్గరకి ప్రవేశించండి. నెమ్మదిగా శబ్దాన్ని తగ్గించండి. ఆపవద్దు, శబ్దాన్ని తగ్గించండి. ఆ శబ్దం వచ్చే స్థావరంలోకి ప్రవేశించేటప్పుడు శబ్దాన్ని తగ్గించండి. మీరే ఆ శబ్దం అయిపోవాలి.

  • స్టెప్ 4 : సమయం 5 నిమిషాలు. కళ్ళు మూసుకునే ఉండండి. రిలాక్స్ అవ్వండి. ఎటువంటి శబ్దాన్నీ చేయవద్దు. ఆ శబ్దం వచ్చే మూలాలకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఆ శబ్దం జ్ఞాపకాల్లో ఉండండి.

    1. సంగీతం : అనాహతధ్వనిని వినండి మార్పు పొందండి. సమయం : 21 నిమిషాలు

ఈ ధ్యానపద్ధతికి సున్నితమైన సంగీతం కావాలి. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ కూర్చోండి. (సంగీతం పెట్టుకోండి)

మీ తలలో ఎక్కడ ఈ శబ్దాన్ని అనుభవిస్తారో అక్కడ ఏకాగ్రతని నిలపండి. సంగీతం బయటి నుంచి వస్తుంది కాని, దాని అనుభవం మీ తలలో ఉంటుంది. వినటం అనేది మీ తలలో జరుగుతుంది. ఆ పాయింట్‌ని గుర్తుంచుకోండి. మీరు ఎక్కడైతే ఆ అనుభవాన్ని పొందుతారో ఆ ప్రదేశాన్ని గుర్తుంచుకోండి. ఆ ప్రదేశంలో పూర్తి ఏకాగ్రతతో ఉండండి. మీరు వినే ఆ పాయింట్‌ని ఫీల్ అవ్వండి. తెలుసుకోండి. అక్కడ వినిపిస్తున్న సంగీతం మీ లోపల ఎక్కడ వినపడుతుందో అక్కడ ఏకాగ్రతని నిలపండి.

సంగీతం పట్ల ఎటువంటి అభిప్రాయమూ ఏర్పరచుకోకండి. అది బాగుందా, లేదా అనుకోవద్దు. మీరు అంతకు ముందు విన్న సంగీతం గురించి ఆలోచించవద్దు. మీకు తెలిసినదాంతో దీన్ని పోల్చవద్దు. మీకు తెలిసిన సంగీతవిద్వాంసుల్ని గుర్తుచేసుకోవద్దు.

మిగిలిన జ్ఞానేందియాలని మరిచిపోండి. చూడటం, వినటం, రుచి, సుర్తు అన్నీ మరిచిపోండి. కేవలం వినటం అనేదాంతో నిండి ఉందండి. మీ తలలో వినే ప్రదేశంలో ఆ అనుభవంతో ఉండండి.

ఆ సంగీతాన్ని బయటి నుంచి వినవద్దు. మీ తల లోపలి నుంచి వినండి. ఆ ప్రదేశంలోనే ఉండి ఆ సంగీతం అనుభూతిని పొందండి. ఎటువంటి ఆలోచననీ రానీయొద్దు.

సంగీతంలో మునిగిపోవద్దు. సంగీతం లోపలికి వెళ్ళండి. ఆ శబ్దంలో ఒక కేంద్రబిందువు ఉంటుంది. ఆ లయ, ఆ కేంద్రబిందువే సంగీతానికి వెన్నెముక. ఆ సంగీతంలోని కేంద్రలయలో విరామంగా ఉండండి. ప్రతిక్షణం ఆ కేంద్రం దగ్గర వినండి. వెన్నెముక లాంటి ఆ ప్రధానసూత్రాన్ని పట్టుకోండి. దానిలోనికి వెళ్ళండి.

మీ తలలో ఆ సంగీతప్రకంపనల్ని వినండి. ఆలోచనలని రానీయొద్దు. వర్తమానం నుంచి, ఈ క్షణం నుంచి కదిలిపోవద్దు. వర్తమానంలో ఉందండి, సంగీతంలో ఉండండి. ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఈ ధ్యానపద్ధతితో సరదాగా ఆడుకోండి. ఏదైనా సంగీతాన్ని పెట్టుకొని, అందులోకి వెళ్ళండి. ఆలోచించవద్దు. సంగీతానికి మీ మొత్తం ఏకాగ్రతని ఇవ్వండి. అప్పుడు మీకు సంగీతాన్ని మామూలుగా వినటానికి, సంగీతాన్ని ధ్యానంలా వినటానికి తేడా తెలుస్తుంది. ఒక నెల రోజులు సరదాగా ఆడుకుంటున్నట్లు ఈ పద్ధతిని సాధన చేయండి. అది మీలో బలమైన మార్పుని తెస్తుంది.

  1. ఓం కారం : ఆలోచనలు లేని ప్రదేశంలోకి ప్రవేశించండి.

సమయం : 21 నిమిషాలు.

కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ కూర్చోండి.

స్టెప్ 1 : సమయం 11 నిమిషాలు

నాభిప్రాంతంలో ఉన్న మణిపూరకచక్రం మీద ఏకాగ్రతని నిలపండి. కొంత సమయాన్ని తీసుకొని మీ తెలుసుకునే తత్త్వాన్ని పూర్తిగా మణిపూరకం పైన ఉండే విధంగా చూడండి. మీ శరీరంలో మిగతా భాగాల్ని పూర్తిగా మరిచిపోండి. కేవలం నాభిప్రాంతంలోని మణిపూరకం మీద మాత్రమే ఏకాగ్రత ఉండాలి. నాభిప్రాంతం నుంచి ఓంకారశబ్దాన్ని చేయండి. నాభిప్రాంతం నుంచి ఎంత లోతుగా ఓంకారం చేయగలిగితే అంత లోతుగా చేయండి. మనస్సుని ఎక్కడికీ వెళ్ళనీయవద్దు. ఆ శబ్దంలో పూర్తిగా కేంద్రీకృతమై ఉందండి.

స్టెప్ 2 : సమయం 10 నిమిషాలు

ఆపేయండి. కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చోండి. మీరు ఓంకారం చేయకుండా ఆ శబ్దాన్ని మీలోపల వినటానికి ప్రయత్నించండి. రిలాక్స్, కళ్ళు తెరవండి. ఈ ధ్యానం పది రోజులు చేయండి. మీరు ఆలోచనలు లేకుండా కూర్చోగలుగుతారు. మీరు ఆ శబ్దంతో నింపబడి ఉంటారు. ఆ శబ్దం సృష్టించిన ప్రకంపనలు మీ మనస్సుని ఎటూ వెళ్ళనీయవు.

  1. అనాహత ధ్వని : మీ శరీరంలో శక్తి ప్రవహించటాన్ని అనుభూతి చెందండి. పూర్తిగా శక్తిమంతులవటం

సమయం 21 నిమిషాలు

కళ్ళు మూసుకొని, చేతి బొటన వేళ్ళతో చెవులు మూయండి. చెవులు పూర్తిగా మూయండి. అప్పుడు మీ లోపల అనాహతధ్వనిని వింటారు. అది సృష్టించని శబ్దం, విశ్వం తాలూకు శబ్దం. కేవలం ధ్యానం చేసేవారు మాత్రమే వినగల శబ్దం. మీ అంతరంగమంతా ఆ శబ్దంతో నిండిపోవాలి. మీ శరీరమంతా ఆ శబ్దంతో నిండిపోయిందని అనుకున్నప్పుడు, వెన్నెముక కింది భాగాన్ని మొత్తం బిగబట్టండి. అన్ని కదలికల్నీ అపేయండి. అలా మీరు ఎంత సేపు ఉండగలిగితే అంత సేపు ఉండండి.

మీ శరీరం రిలాక్స్ కాగానే, చేతులు చెవుల దగ్గరి నుంచి తీసేసి రిలాక్స్ అవ్వండి. మీ శరీరం పూర్తిగా రిలాక్స్ అయ్యేవరకూ చేయండి. మీరు ఎంత సేపు బిగబట్టి ఉంచగలరో అంత సేపు ఉంచండి. మీ శరీరం రిలాక్స్ అయిన తరువాత మళ్ళా చెవులు మూసుకొని, అనాహతధ్వనిని విని దాన్ని మీ అంతరంగమంతా నిండేలా చేసి, వెన్నెముక కింది భాగం ముఖ్యంగా రెక్టమ్ ప్రాంతాన్ని బిగబట్టండి. తరువాత రిలాక్స్ అవ్వండి.

దీన్ని ఐదుసార్ల కంటే ఎక్కువ చేయవద్దు. ప్రతిసారీ 40 సెకండ్లు రిలాక్స్ కావాలి. మీరు రిలాక్స్ అయ్యే సమయంలో కూడా కళ్ళు మూసి ఉంచండి. ధ్యానం ఐదుసార్లు చేసాక, కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ శరీరం అంతా శక్తి ప్రవహించటం గమనించండి. రిలాక్స్ అవ్వండి.

  1. మీ పేరు తాలూకు శబ్దం : జ్ఞానోదయస్థితిలోకి ప్రవేశించండి.

సమయం : పది నిమిషాలు

కళ్ళు మూసుకుని కూర్చోండి. ముందు ఒక పదాన్ని ఎంచుకోండి. ఆ పదంతో మీరు ధ్యానం చేయబోతున్నారు. మీకు గురువులు ఇచ్చిన ఆధ్యాత్మికనామం ఉంటే అది మంచిది. లేకపోతే గురువుల పేరు లేదా మీరు ఏ దేవుడితో అయితే లోతుగా అనుబంధాన్ని ఏర్పరచుకున్నారో ఆ పేరు తీసుకోండి.

మీకు సంస్కృత ఆధ్యాత్మికనామం ఉంటే మంచిది. అది చాలా శక్తిమంతంగా పని చేస్తుంది. సంస్కృతశబ్దానికి చాలా ప్రాముఖ్యం ఉన్నది. సంస్కృతం మాటలు మాట్లాడేవారిని, వినేవారిని స్వచ్ఛంగా చేస్తాయి. మీ పేరు ఒక ప్రత్యేకమైన మంత్రం. ఆ మంత్రాన్ని జపించినా, విన్నా, జ్ఞానోదయమైన గురువు సృష్టించిన ఆ మంత్రం, ఆ పేరు దేని కోసమైతే చేసారో ఆ ప్రభావం మీ మీద ఉంటుంది.

మీరు ఎంచుకున్న పేరు తాలూకు శబ్దంలోకి ప్రవేశించండి. పేరుని గట్టిగా బయటికి అనవద్దు. అంతరంగంలోనే జపించండి. ఆ జపం చేసే శబ్దంలోకి ఆ ప్రకంపనలోకి ప్రవేశించండి. నాలుక కదలకూడదు. ఆ పేరు శబ్దతరంగాలని స్పృశించి దాన్ని మళ్ళా మళ్ళా మీ అంతరంగంలో జపించండి. ఆ శబ్దంతో మీ అంతరంగం నిండిపోవాలి. మీ అంతరంగం మొత్తం శబ్దంతో నిండిపోవాలి. ఆ శబ్దాన్ని గాఢంగా, తీవ్రంగా జపించండి. వేగంగా జపించండి. మీలో మరే ఆలోచనా ఉండకూడదు. అకస్మాత్తుగా మీరు శబ్దం లేని ప్రదేశంలో ఉండటాన్ని గమనిస్తారు. మీరు మాటలు లేని స్థితిలో ఉంటారు.

ఒక నెల రోజులు ఈ పద్ధతితో ఆడుకోండి. ప్రతి రోజూ ఉదయం పది నిమిషాలు, సాయంత్రం పది నిమిషాలు సాధన చేయండి. మీరు డ్రైవ్ చేసేటప్పుడు కళ్ళు తెరచి కూడా సాధన చేయవచ్చు. మీరు నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు సాధన చేయండి. మీ ప్రత్యేకమైన ఈ మంత్రానికి ఎంత శక్తి ఉందో మీకు అర్థం అవుతుంది. మీ చేతనస్థితికి కొత్త ద్వారాలు తెరవబడతాయి. మీరు శబ్దాలు లేని స్థితికి, జ్ఞానోదయస్థితికి చేరతారు.

  1. శబ్దాల తుఫాను మధ్యలో కేంద్రీకృతమవ్వండి : మీలోని శబ్దాలన్నింటికీ మధ్య పాయింట్‌ని కనుక్కోండి. ఆ శబ్దాన్ని మార్చండి.

సమయం : 21 నిమిషాలు

మనం నిరంతరం శబ్దాల తుఫానులో ఉంటాము. శబ్దాలు నిరంతరం మన వైపు దూసుకువస్తుంటాయి. మనని చుట్టముడుతుంటాయి. ఆ శబ్దాల మధ్యలో మనం వినని నిశ్శబ్దం ఉంటుంది. ఈ ధ్యానం, శబ్దాల తుఫాను మధ్యలో ఉన్న నిశ్శబ్దాన్ని తెలుసుకునేలా చేస్తుంది.

ఎక్కడైనా సౌకర్యంగా కూర్చోండి. బాగా శబ్దాలు వచ్చే ప్రదేశం అయితే చాలా మంచిది. అక్కడ శబ్దాలు నిరంతరం వస్తుండాలి. అది సహజమైన శబ్దమైతే మంచిది. లేదా రైల్వే స్టేషన్, మార్కెట్, ఏదైనా పరవాలేదు. నిశ్శబ్దంగా కూర్చోండి. శబ్దతరంగాలు ఆ శబ్దాల నుంచి మీ వైపు అన్ని దిశల్లో వస్తున్నట్లు భావించండి. అన్ని వైపుల నుంచీ వచ్చే శబ్దాల తుఫానులో మీరు మధ్య ఉన్నాను అనుకోండి. మీరు మధ్యలో ఉన్నారు, శబ్దాలు అన్ని వైపుల నుంచీ వస్తున్నాయి.

ఆ శబ్దాలకి మధ్యలో ఉన్న మీ దగ్గర శబ్దాలు లేకపోవటాన్ని అనుభూతి పొందండి. మీ దగ్గర, అంటే మధ్యలో శబ్దాలు ఉంటే బయటి నుంచి వచ్చే శబ్దాలని మీరు వినలేరు. ఆ శబ్దాలు మీ వైపు చొచ్చుకొని వస్తున్నాయి. కాని మధ్య పాయింట్ దగ్గర ఆగిపోతున్నాయి.

మీ లోపల ఒక పాయింట్ దగ్గర శబ్దాలు అన్నీ ఆగిపోతున్నాయి. ఆ పాయింట్ దగ్గర నుంచి మీరు అన్ని శబ్దాలూ వినగలుగుతున్నారు. ఆ మధ్య పాయింట్‌ని పట్టుకోవటానికి ప్రపంచంలోని శబ్దాల నుంచి లోపలికి వెళతారు. మీరు నిశ్శబ్దంగా ఉంటే మధ్య పాయింట్ దగ్గర ఉంటారు. ఆ పాయింట్ దగ్గరకి ఏ శబ్దమూ ప్రవేశించలేదు. అదీ మీ లోపలి మీ కేంద్రం. మీరు ఒక్కసారి ఆ నిశ్శబ్దాన్ని వింటే, మీరు మరే శబ్దం చేతా డిస్టర్బ్ కారు. మిమ్మల్ని ఏ శబ్దమూ తాకలేదు, మీ మీద ప్రభావాన్ని చూపలేదు.

మనం ఏమనుకుంటామంటే, మన చెవులతో శబ్దాలు వింటాం అనుకుంటాం. ఈ ధ్యానం చేసాక శబ్దాలు చెవులతో కాని, తలతో కాని వినం. శబ్దాలని నాభి ప్రాంతంలో వింటాం. అదే శబ్దాలకి కేంద్రబిందువు.

ఈ ధ్యానాన్ని పాటలతో సాధన చేయలేరు. ఎందుకంటే పాటల్లో అర్థాలు ఉంటాయి. మీరు అర్థాల మీద ఏకాగ్రత పెడతారు. కాబట్టి ఏదైనా శబ్దం కావాలి.

  1. శబ్దం నుంచి అనుభూతికి : శబ్దం ద్వారా ఆనందాన్ని పొందండి.

సమయం : 21 నిమిషాలు

కళ్ళు మూసుకొని విరామంగా కూర్చోండి.

స్టెప్ 1 : సమయం 10 నిమిషాలు

మీరు ధ్యానం చేయబోయే శబ్దాన్ని ఎంచుకోండి. అది ఏదైనా పరవాలేదు. ఆ శబ్దం మీకు ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చేదై ఉండాలి. ఆ శబ్దాన్ని గట్టిగా చేయండి, ఆ శబ్దానికి సంతోషంగా ఉండండి. ఆ శబ్దాన్ని సున్నితంగా చేయాలి, దాన్ని విని సంతోషపడాలి. అలా ఆ శబ్దాన్ని చేస్తూ అందులో సంతోషపడండి. ఆ సంతోషభావంలో కేంద్రీకృతమవ్వండి.

స్టెప్ 2 : సమయం 11 నిమిషాలు

శబ్దాన్ని పెంచవద్దు, బయటికి అనవద్దు. మీ లోపలే ఆ శబ్దం చేయండి. నాలుకని నెమ్మదిగా కదపండి. అంతరంగంలోనే ఆ శబ్దాన్ని చేయండి. ఆ అనుభూతిని తెలుసుకోండి. ఆ భావంలో స్థిరపడండి. ఆ శబ్దం ఇచ్చిన ఉత్సాహంలో స్థిరపడండి.

మనస్సులో దృశ్యాన్ని ఏర్పరచటం

  1. కాంతిదృశ్యాన్ని ఏర్పరచండి

మరణభయానికి అతీతంగా వెళ్ళండి. నిత్యానందస్థితిలో జీవించండి

సమయం ; రోజులో 24 గంటలూ, 21 రోజులు

మిమ్మల్ని మీరు వెలుగులా ఊహించుకోండి. మీ బయటా, లోపలా ఏమీ లేదు, కాంతి తప్ప ఎవరూ లేరు. ప్రపంచం లేదు. అంతా ప్రకాశవంతమైన కాంతి తప్ప, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర పోయేవరకూ, మీరు ఏ పని చేస్తున్నా ఇదే విధంగా అనుకోండి.

కొన్ని రోజులు గడిచాక ఈ భావం మీ స్వప్నస్థితిలోకి, గాఢనిద్రాస్థితిలోకి చొచ్చుకొని పోతుంది. కలలో కూడా మిమ్మల్ని కాంతిగానే చూస్తారు. గాఢనిద్రలో కూడా కాంతినే చూస్తారు. మీరు నిత్యం ప్రకాశించే కాంతిలా ఉంటారు.

ఇది చాలా శక్తిమంతమైన ధ్యానపద్ధతి. ఈ ధ్యానం మీకు మరణం లేదు – అనే అనుభవాన్ని ఇస్తుంది. కాంతికి మరణం లేదు. మీరు పదార్ధం అని అనుకుంటే ఏదో ఒక రోజు ముగిసిపోతాం – అనే భయం ఉంటుంది. మీరు కాంతి అని తెలుసుకుంటే మీలో మరణభయం ఉండదు.

  • జ్ఞానోదయమైన యోగీశ్వరుని స్పర్శానుభూతిని పొందండి
  • నిత్య ఆధ్యాత్మికచికిత్స– మీరు కూడా చికిత్స చేయవచ్చు

నిత్య ఆధ్యాత్మికచికిత్స జీవన్ముక్తికి

నిత్య స్పిరిచువల్ హీలింగ్, నిత్య ఆధ్యాత్మికచికిత్స (హీలింగ్) నేను జ్ఞానోదయంతో పాటు పొందిన ఒక బహుమతి. అది నేను మీకు ఇస్తున్నాను. ఇది ధ్యానకార్యక్రమం కాదు. ఇది గురువు ఇచ్చే దీక్ష. ఆ దీక్ష మిమ్మల్ని విశ్వశక్తికి అనుగుణంగా చేస్తుంది. అది మీకు హీల్ చేయగల శక్తినిస్తుంది.

హీలింగ్ అంటే ఏమిటి?

జ్ఞానోదయమైన గౌతమబుద్ధుడు హీలింగ్‌కి చక్కని నిర్వచనాన్ని ఇచ్చాడు. హీలింగ్ అంటే మనలోని కరుణని, ఎదుటివారి పట్ల మనకి ఉన్న శ్రద్ధని, ఎదుటివారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనే శ్రద్ధని, మన పద్ధతిలో వెల్లడి చేయటమే. హీలింగ్ అంటే ఒక వ్యక్తి తిరిగి శారీరక, మానసిక, భావాత్మక ఆరోగ్యాన్ని పొందటానికి చేసే సహాయం.

ఆరోగ్యం

మంచి ఆరోగ్యం అంటే అనారోగ్యం లేకపోవటం కాదు. మనం సౌకర్యంగా హాయిగా దృఢంగా ఉండగలగటమే ఆరోగ్యం. అనారోగ్యం తెచ్చుకొని, దాన్ని బాగుచేసుకునే మామూలు మనుషులం కాదు. మనం పరమానందరూపాలం. మనని నిరంతరం పరమానందంలో, ఆత్మస్థాయిలో జీవించే విధంగా సృష్టించారు. అదే మంచి ఆరోగ్యస్థితి అంటే.

చక్రాలు, హీలింగ్ శాస్త్రం

పతంజలి మనలో అత్యంతసూక్ష్మమైన ఏడు శక్తికేంద్రాలు లేదా చక్రాలు ఉన్నాయి అని చెప్పారు. ఈ ఏడు చక్రాలు మనలో భౌతిక, మానసిక, భావాత్మక, అంతరాత్మచర్యలని ప్రభావితం చేస్తాయి. అవి మనలోనే ఉన్నాయి. అవి మనలో అతికీలకమైన గ్లాండ్స్ దగ్గర ఉన్నాయి. అవి వాటి సమీపంలోని గ్లాండ్స్ పని తీరు పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

మనలోని ప్రతి చక్రం ఒక భావావేశానికి సంబంధించి ఉంటుంది. ఉదాహరణకి ప్రేమ, అనాహతచక్రానికి వ్యధ నాభిప్రాంతంలోని మణిపూరకచక్రానికి సంబంధించి ఉంటాయి. మనం ఏదైనా ఒక చెడ్డ వార్త వింటే అది పొట్ట ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే మనం 'అమ్మో! ఈ వార్తని జీర్ణించుకోలేకపోతున్నాను' అంటాం. ఇది అన్ని భాషల్లోనూ ఉన్న ఒక మాట.

కిర్లియాన్ ఫోటోగ్రఫీ, ఈ చక్రాల మీద భావావేశాల ప్రభావాన్ని రికార్డు చేయగలిగింది. ఒక భావావేశాన్ని జాగ్రత్తగా సంబాళించగలిగితే, దానికి సంబంధించిన చక్రం బాగా పని చేస్తుందని, అది చాలా విస్తృతమై బండి చక్రమంత అవుతుందనీ నిరూపించారు. భావావేశాన్ని సరిగా నియంత్రించకపోతే, దాంతో సరిగా వ్యవహరించకపోతే, దానికి సంబంధించిన చక్రం చిన్నదిగా కుంచించుకుపోయి షర్టు బటన్ సైజు అవుతుంది. దానితో మన వ్యవస్థలో శక్తిప్రవాహం తగ్గిపోతుంది. ఆ స్థితి చాలా రకాల శారీరక, మానసిక అనారోగ్యాలకి కారణం అవుతుంది.

చక్రాలలో శక్తిప్రవాహానికి చాలా విషయాలు అడ్డంకులుగా ఉంటాయి. అవి చిన్నతనంలోని సమస్యలు, సమాజనిబంధనలు, ఒక పద్ధతి లేని అలవాట్లు, శారీరక – మానసికగాయాలు, ఎవరూ వారిపై శ్రద్ధ చూపించకపోవటం – ఇవన్నీ చక్రాల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఎప్పుడైతే చక్రాలు ప్రభావితం అవుతాయో, ఆ చక్రానికి సంబంధించిన అనారోగ్యం కలుగుతుంది. మన శరీరం, మనస్సు ఒక దాంతో ఒకటి సౌకర్యంగా అమరితే, అదే ఆరోగ్యం చక్కగా ఉన్న స్థితి. అలా లేనప్పుడే అనారోగ్యాలు కలుగుతాయి. చక్రాల స్థితి ఆరోగ్యస్థితిని సూచిస్తుంది.

శరీరంపై మనస్సు ప్రభావం

శరీరం హార్డ్‌వేర్ అయితే మనస్సు సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్‌తో సమస్య ఉన్నప్పుడు హార్డ్‌వేర్‌ని పెడతాం. సాఫ్ట్‌వేర్ చెడిపోయినప్పుడు, అది నిరంతరం హార్డ్‌వేర్‌కి తప్పు సూచనల్ని ఇస్తుంది. ఒక విషయం అర్థం చేసుకోండి. మనలోని అనారోగ్యాలకి కారణం మన మానసిక వ్యవస్థ. శారీరక – మానసికవ్యవస్థలు సమతుల్యతతో లేనప్పుడు అనారోగ్యం కలుగుతుంది.

శక్తితో చికిత్స (హీలింగ్)

అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి శక్తిని ఇచ్చే శాస్త్రమే హీలింగ్ అంటే. శక్తిని చక్రాలో దేనికి శక్తి అవసరమో దానికి ఇవ్వాలి. అప్పుడు చుక్రం స్పందిస్తుంది. మనకి సరైన పద్ధతి తెలిస్తే, దాన్ని ఉపయోగించే సమయం ఉంటే, మన అనారోగ్యాన్ని మనం బాగుచేసుకోవచ్చు. తిరిగి చక్రాన్ని శక్తిమంతం చేయవచ్చు. మనం అన్ని సార్లూ ఆ విధంగా చేసుకోలేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. మనకి సరైన పద్ధతి తెలియకపోవచ్చు. ధ్యానం చేసే సమయం లేకపోవచ్చు. ఆరోగ్యం బాగా లేదు కాబట్టి మనం ధ్యానం చేయలేం, ఆధ్యాత్మికసాధనలు చేయలేం. అటువంటి సందర్భాల్లో, ఎవరైతే ధ్యానంలో ఉంటారో, ఎవరైతే ధ్యానం చేసారో అటువంటివారు ఆ శక్తిని మనకి పంపి చక్రాల్ని శక్తిమంతం చేయవచ్చు. ఇదే శక్తితో చికిత్స అంటే.

నిత్యా ఆధ్యాత్మికచికిత్స అంటే ఏమిటి?

నిత్యా ఆధ్యాత్మికచికిత్స లేదా హీలింగ్ అంటే విశ్వశక్తితో హీల్ చేయటం. విశ్వశక్తి, మనకి తెలిసిన శక్తికి చాలా తేడా ఉంది. మామూలు శక్తి అయిన ఎలక్ట్రిక్ శక్తికి మేధ ఉండదు. ప్లగ్‌లో బల్బ్ పెడితే అందులోనికి కరెంటు వెళ్ళి వెలుగుతుంది. మీ చేయి పెట్టినా కరెంటు వెళ్ళి షాక్ కొడుతుంది. కరెంటుకి నిర్ణయించే మేధ లేదు. విశ్వశక్తి స్వచ్చమైన మేధ. చాలాసార్లు విశ్వశక్తిని కరెంటుతో పోల్చినా, ఆ రెండూ వేరు వేరు శక్తులు. విశ్వశక్తి పొరపాటు చేయదు. ఎందుకంటే దానికి స్వతంత్రమైన మేధ ఉన్నది.

ఎవరు శక్తిని పొందగలరు? ఎవరైతే విప్పారిన హృదయంతో, మనస్సుతో ఉంటారో వారే.

ఎవరు శక్తిని పొందవచ్చు? ఎవరికి అవసరమైతే వారు పొందవచ్చు. దీనికి నిబంధనలు లేవు. ఆ శక్తిని చక్కగా పొందటానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఎవరైతే విప్పారిన హృదయం, మనస్సుతో ఉంటారో అటువంటివారు త్వరగా, సులభంగా శక్తిని పొందుతారు. (ప్రశ్నలు, అనుమానాలు ఉంటే ఆలస్యం అవుతుంది.

చాలామంది నన్ను అడుగుతుంటారు, 'హీలింగ్‌కి నమ్మకం ఉండాలా?' అని. నేను చెబుతాను అది అవసరం లేదు. మామిడిపండు రుచిగా ఉంటుంది అని తెలుసుకోవటానికి మీకు నమ్మకం అవసరం లేదు. దాన్ని కొంచెం తిని రుచి చూసి తెలుసుకోండి అంతే! సూర్యోదయం తూర్పున జరుగుతుంది అని చెబితే మీరు నమ్మనవసరం లేదు. కళ్ళు తెరిచి చూడండి, మీకే తెలుస్తుంది. మీరు గుడ్డిగా నమ్మనవసరం లేదు. హీలింగ్ తీసుకోవటానికి మీకు నమ్మకం అవసరం లేదు. మీకు ఉండవలసింది కేవలం విప్పారిన మనస్సు, తీసుకోవాలనే కోరిక అంతే. అప్పుడు మీలోకి ప్రవహించే శక్తిని ఆపరు. ఈ విషయాన్ని అర్ధం చేసుకొని, పూర్తి నిజాయితీతో దీనిలోకి ప్రవేశించండి అది చాలు. దీన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకునే ధైర్యం, వికసించిన మనస్సు ఉంటే చాలు. మీలోని ఆలోచనలని, తెలివిని, భావాలని, ఆత్మని ఈ విషయంతో ఏకీకృతం చేయండి.

నిత్యా ఆధ్యాత్మిక హీలర్స్ దీక్ష

నిత్య ఆధ్యాత్మిక హీలర్స్ దీక్ష అనేది సూటిగా జ్ఞానోదయానికి సంబంధించింది. ఇతరులకు హీలింగ్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ మాత్రమే. దాని ప్రధానప్రభావం వల్ల మీరు హీలింగ్ చేసే సమయంలో మీ అంతరాత్మ లోతుల్లోకి వెళ్ళగలుగుతారు.

ఉదాహరణకి ఆనందస్సురణ కార్యక్రమంలో మీరు ఆనందంగా జీవించే ఒక క్షణకాల దర్శన అనుభవం జరుగుతుంది. నిత్యానందస్సురణ కార్యక్రమంలో శక్తి పట్ల మీ చేతనస్థితిలో క్షణకాల దర్శన అనుభవం జరుగుతుంది. నిత్యా ఆధ్యాత్మిక హీలింగ్‌లో హీలర్‌గా మీరు ఎప్పుడూ ఆనందస్థితిలో ఉండగలరు. ఎందుకంటే ఒకసారి మీకు దీక్షని ఇస్తే, విశ్వశక్తి మీలో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మీరు మీ అంతరాత్మతో నిరంతరం అనుబంధంతో ఉంటారు. హీలింగ్ అంటే చేతనస్థితిలో ఉన్న ప్రేమ. ఆ శక్తి ఎదుటివారిని హీల్ చేస్తుంది.

ఒకసారి ఇలా ఊహించుకోండి. మీరు ఒక చిన్న చీమలా ఉండి, చాలా పెద్ద ఐస్ బర్డ్‌కి కింద నీళ్ళ వరకూ బోరులా రంధ్రాన్ని చేయాలనుకోండి, దానికి ఎన్ని జన్మల సమయం పడుతుంది? అది జరుగుతుంది అని మీరు అనుకోలేరు. కాని గురువులు ఆ నీటిలో అడుగున ఉండి, ఒక్క క్షణంలో రంధ్రాన్ని వేసి మిమ్మల్ని నీళ్ళ దగ్గరికి క్షణంలో తెస్తారు. మీరు కూడా నీళ్ళలోకి వచ్చి సంతోషంగా ఉండవచ్చు. నిత్యా హీలర్ దీక్షలో జరిగేది ఇదే. నిత్యా ఆధ్యాత్మిక హీలర్ దీక్షలో గురుదేవులు ఆ శక్తి అయిన ఆనందగంధకి ద్వారాన్ని తెరుస్తారు.

ఆనందగంధ చక్రం

ఆనందగంధ మనలో ఒక శక్తికేంద్రం, ఒక చక్రం. ఈ చకంలో మనలోని ఏడు చుక్రాలు, ఐదు కోశాలు కలసిపోతాయి. ఈ పాయింట్ దగ్గర పదార్థం, శక్తి కలసిపోతాయి. ఇది ఎటువంటి దశ అంటే ఐస్ బర్గ్, నీరు కలిసే స్థితి. ఈ శక్తి ప్రదేశంలో జ్ఞానోదయమైన గురువులు, యోగులు ఉంటారు. మనందరిలో శక్తికి మూలం ఆనందగంధ. ఇది విశ్వశక్తితో ప్రత్యక్షానుభవాన్ని కలిగిఉంటుంది. ఆనందగంధ భౌతికశరీరంలో ఉండదు. ఇది ఆధిభౌతికస్థితి.

ఏ వ్యక్తి అయినా జ్ఞానోదయమైన చేతనస్థితిలో ఉండి హీలర్ దీక్షని ఇస్తే, ఆయన ఆ దీక్షాపరునిలో ఆనందగంధకి ద్వారాన్ని తెరుస్తారు. దానితో ఆ వ్యక్తి విశ్వశక్తికి ప్రతిక్షణం అందుబాటులో ఉండి, ఆ శక్తిని పొందగలడు. మీరు ఆనందగంధలో ఉన్నప్పుడు జ్ఞానోదయస్థితిలో ఉంటారు. ఎందుకంటే అప్పుడు మీరు విశ్వశక్తితో ఉంటారు కాబట్టి. గురువులు ఆనందగంధలో ఉంటారు. మనం ఆనందగంధలో ఉన్నప్పుడు అదే శక్తితో అనుబంధం ఉంటుంది. అందుకే హీలింగ్ శక్తి కొత్త జీవితాల్ని ఇస్తుంది. కొత్త శక్తినిస్తుంది. వ్యాధులకి చికిత్స చేసి బాగు చేస్తుంది.

నేను ఇంతకు ముందు చెప్పాను, ఆనందగంధలో ఏడు చక్రాలు కలసిపోతాయి. ఆనందగంధ చక్రానికి దారి మణిపూరక, అనాహత మధ్యభాగం. ఆనందగంధ చక్రం అక్కడ ఉండదు, అది దారి మాత్రమే. నిత్యా స్పిరిచువల్ హీలింగ్ కార్యక్రమంలో మీరు చేతనస్థితిలో ఆనందగంధలోకి వెళతారు. మిగతా చక్రాలని ధ్యానం ద్వారా చైతన్యపరచవచ్చు కాని ఆనంద గంధ చక్రాన్ని కేవలం జ్ఞానోదయమైన గురువు మాత్రమే విప్పారేట్లు చేయగలరు.

మనకి ఏడు శక్తి శరీరాలు ఉన్నాయి. అవి భౌతిక, ప్రాణ, మానసిక, ఆకాశ, కారణ, విశ్వ, నిర్వాణ శరీరాలు. ఆనందగంధ చక్రం, లోపలి పొర అయిన నిర్వాణశరీరంలో ఉంటుంది. ఒకసారి అది వికసిస్తే శక్తి మీలో ప్రవహిస్తూ ఉంటుంది.

మనలో ఐదు కోశాలు ఉన్నాయి. అవి కూడా శకివ్యవస్థలో ఒక భాగం. అవి అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయకోశం. ఆనందమయకోశం ఆత్మని తగిలే చోట ఆనందగంధ చక్రం ఉంటుంది.

ఆనందగంధస్థితిలో ఉండటం అంటే ఆలోచనలు లేని స్థితి. దీన్నే సమాధి స్థితి, విర్వాణ నిత్యానందస్థితి లేదా జ్ఞానోదయస్థితి అంటారు. ఆనందగంధ చక్రం ప్రపంచానికి అంతా కలిపి ఒక పాయింట్ దగ్గర ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర పొడవు, వెడల్పు, ఎత్తు అనేవి మాయం అవుతాయి. ఆ పాయింటునే ఆనందగంధ అంటారు. ఏ పాయింట్ దగ్గరెతే కాలం అనేది పడిపోతుందో అదే ఆనందగంధ. ఎక్కడైతే గురుత్వాకర్షణశక్తి మాయం అవుతుందో అదే ఆనందగంధ. ఆనందగంధ గురించి ఈ వివరాలన్నీ మీకు అర్ధం కావాలంటే చేతనస్థితి తాలూకు క్షణకాల దర్శనానుభవమైనా జరగాలి.

ఆనందగంధ ధ్యానం – ఉపయోగాలు

మీరు ప్రతి రోజూ నిరంతరం ఆనందగంధధ్యానం చేస్తే బయటి ప్రపంచంలోని ఏ విషయమూ మీ మీద ప్రభావాన్ని చూపించలేదు. మీ చుట్టూ అన్నీ అపజయాలు ఉన్నా, మీరు బలంగా, నిశ్చలంగా ఉండగలరు. త్వరలో మీరు ధ్యానం అనే మీ సహజస్థితికి వెళ్ళగలరు. మీరు శాశ్వతంగా ఆనందగంధలో ఉండగలరు.

ఈ ధ్యానం మీకు ఇచ్చే ప్రయోజనాలు:

సత్: ప్రతి విషయంలో స్పష్టత

మీరు ఏ విషయాన్నెనా ఆశ, భయం అనేవి లేకుండా దాన్ని దానిలాగానే చూడగలుగుతారు. అందుకే మీకు స్పష్టత వస్తుంది.

చిత్: చేతనస్థితి

మీరు చేసే ప్రతి పని మీదా కుతూహలం ఉంటుంది. మీలో ప్రతి కణం శక్తిని, కుతూహలాన్ని ప్రతిబింబిస్తూ, నలుదిశలా వెదజల్లుతుంటాయి. అలసిపోకుండా, అదే కుతూహలంతో, వివేకంతో ఎన్ని పనులనైనా చక్కగా చేయగలుగుతారు.

ఆనంద : కారణం లేని ఆనందస్థితి

బయటి ప్రపంచంలో ఏం జరుగుతున్నా, మీరు నిశ్చలమైన ఆనందస్థితిలో ఉండగలరు. నిరంతరం ఆనందగంధలో ఉండగలిగితే మీ శారీరక, మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉండటమే కాదు, బయట ప్రపంచంలో ఏది జరిగినా దాన్ని స్పష్టతతో వ్యవహరించగలరు.

నిత్య ఆధ్యాత్మికచికిత్స– మీరు కూడా చికిత్స చేయవచ్చు

ఉదాహరణకి మీకు ఒక వ్యక్తి మీద కోపం వస్తే, ఆ వ్యక్తిని తిట్టాక, అదే కోపపు మంట ఆ వ్యక్తిని ఎంత కాల్చిందో, ఎంత బాధపెట్టిందో అంతే మంటని, బాధని మీలో కూడా కలిగిస్తుంది. ఆ వ్యక్తి ఎంత ప్రశాంతత పోగొట్టుకుంటాడో మీరు కూడా అంతే డిస్ట‌ర్బ్ అవుతారు. అదే మీరు ఆనందగంధలో ఉంటే, ఎంత కోపం వెల్లడి చేయాలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. అంతే కోపం చూపించగలుగుతారు. అనవసరంగా ఎక్కువ కోపాన్ని ఉపయోగించరు. అప్పుడు ఆ కోపం మీ లోపల మిమ్మల్ని కాల్చదు. మీలో అపరాధభావం కలగదు. దాని ప్రభావం మీ మీద అసలు ఉండదు. అవతల వ్యక్తి ఎంత కోపాన్ని మీ నుంచి తీసుకోవాలో అంతే వెళుతుంది. దానితో అతను ఎక్కువ బాధపడడు.

ఎవరైనా ఒక పని చేసినందుకు ఇరవై రూపాయలు ఇవ్వాలనుకోండి. మీరు నలభై ఇస్తారా? లేదు. అలా ఇవ్వరు అంతే కదా! అదే విధంగా ఒక వ్యక్తి పట్ల ఎంత కోపాన్ని చూపాలో అంతే చూపించాలి. మీరు ఎందుకు ఎక్కువ కోపాన్ని చూపాలి? ఎంత అవసరమో అంతే చూపించండి. అప్పుడు మీకు, ఆ వ్యక్తికి, ఎవరికీ బాధ ఉండదు. ఈ స్పష్టత మీరు ఆనందగంధలో ఉన్నప్పుడు ఉంటుంది.

నిత్యా స్పిరిచువల్ హీలింగ్‌లో రెండు అంశాలు ఉంటాయి. హీలర్‌గా మీరు ఆనందంలో ఉంటారు. మీ నుంచి హీలింగ్ పొందిన వ్యక్తి ఆరోగ్యవంతుడవుతాడు. అందుకే ఇది అంతిమపద్ధతి.

నిత్యా స్పిరిచువల్ హీలింగ్ ప్రయోజనాలు

  • రకరకాల అనారోగ్యాలు - ఇలా చాలా రకాల సమస్యల నుంచి బయటికి రావచ్చు.
  • మానసిక ఒత్తిడి, డిప్రెషన్, భయాల నుంచి బయటికి రావచ్చు.
  • గాయాలు, నొప్పులు త్వరగా తగ్గుతాయి.
  • గర్భాశయసమస్యలకి పరిష్కారం.

సేవలు

నిత్యా స్పిరిచువల్ హీలింగ్ అనేది ఉచిత హీలింగ్ సేవ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని నిత్యానంద మిషన్ సెంటర్ల ద్వారా ఈ హీలింగ్ క్యాంపులు జరుగుతుంటాయి. విశ్వశక్తితో హీలింగ్ అనే ప్రత్యేకపద్ధతి ఒక ధ్యానం. ఇందులో హీలర్‌కి గాని, హీలింగ్ చేయించుకునే వ్యక్తికి కాని ఎటువంటి దుష్పరిణామాలూ ఉండవు.

అపెండిక్స్

The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam పైన, ధ్యానం, హీలింగ్ పైన జరిగిన శాస్త్రపరిశోధనలు

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMపై ధ్యానంలో ఉన్నప్పుడు, ఆయన మెదడులో జరిగిన మార్పుల పైన శాస్త్రపరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనల ఉద్దేశం జ్ఞానోదయమైన మనుషులకు, యోగులకు ఏం జరిగిందో దాన్ని కొలవటం, ఆ రహస్యాన్ని తెలుసుకోవటం. అనుభవం ఉన్న డాక్టర్స్, న్యూరోసైకాలజిస్ట్, ఈ పరిశోధనని THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM పైన అమెరికాలోని ఓక్షహామాలో చేసారు.

పి.ఇ.టి. స్కాన్ పరిశోధన

పాజిట్రాన్ ఎమిషన్ టొమోగ్రఫీ అనేది మెదడులో చైతన్యవంతమైన భాగాల్ని స్కాన్ ద్వారా చూపిస్తుంది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM పి.ఇ.టి. స్కాన్ రిపోర్ట్‌లో, ఆయన ధ్యానం చేసే సమయంలో మెదదులోని ముందు భాగాలు చాలా ప్రకాశవంతంగా ఉండటాన్ని గమనించారు. మెదడులోని పని తీరు సాధారణమానవుల మెదడు కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండటాన్ని గమనించారు. మెదడులోని ముందు భాగం మేధకి, నిర్ణయాలకి, జ్ఞానానికి సంబంధించింది. ఆయన లోతైన ధ్యానస్థితిలో ఉన్నప్పుడు రెండు అత్యంత్యపత్యేకమైన విషయాల్ని గమనించారు. అందులో మొదటిది ఆయన మెదడులో తొంబై శాతం నిశ్శబ్దంగా అయిపోయింది. రెండవ విషయం మెదడు ముందు, కింది భాగం చాలా ప్రకాశవంతంగా ఉంది. అది మూడవ కన్ను ఉండే భాగం.

క్యు. ఇ. ఇ. జి పరిశోధన

కాంంటిటేటివ్ ఎలక్ట్రో ఎన్‌సెఫాలో గ్రూప్, మెదడులోని తరంగాల్ని కొలుస్తుంది. మెదడులోని తరంగాలు రకరకాల బాండ్ విడ్త్‌తో ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్థితిని తెలియచేస్తాయి. బీటా తరంగాలు చిన్నవిగాను, చాలా చైతన్యవంతంగా ఉంటాయి. అవి తెలుసుకునే తత్త్వానికి, చైతన్యానికి సంబంధించి ఉంటాయి. ఆల్ఫా తరంగాలు నెమ్మదిగా పెద్దదిగా ఉంటాయి. అవి ఆరోగ్యంగా, బాగా ఉన్నాను అనుకునే దానికి, నిద్రకి, నిశ్శబ్దానికి, నిశ్చలతానికి సంబంధించినవి.

ఒక రోజులో సాధారణవ్యక్తులు ఈ తరంగాల అనుభవం పొందుతారు. వాటి వేగం, ఒక దాని నుంచి మరొక తరంగపు బ్రాండ్‌విడ్త్ అనేవి వారి నియంత్రణలో ఉండవు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMపై జరిగిన పరిశోధనలో ఈ తరంగాలు పూర్తిగా ఆయన నియంత్రణలో ఉన్నట్లు తెలిసింది. ఆయన లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన మెదడు చాలా సున్నితంగా ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారింది.

నిత్య ఆధ్యాత్మికచికిత్స– మీరు కూడా చికిత్స చేయవచ్చు

నిత్యా స్పిరిచ్యువల్ హీలింగ్

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మరొక వ్యక్తికి హీలింగ్ చేసే సమయంలో ఆయన మెదడు తరంగాలు, గుండె కొట్టుకోవటంలో వేగం, ఆయన చర్మం పైన పరిశోధన చేసారు. ఆయన హీలింగ్ చేసే వ్యక్తి హార్ట్ బీట్ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM హార్ట్ బీట్‌కి అనుగుణంగా ఉందని తెలిసింది.

  • పతంజలి మనలో అత్యంతసూక్ష్మమైన ఏడు శక్తికేంద్రాలు లేదా చక్రాలు ఉన్నాయని చెప్తారు.
  • అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి శక్తిని ఇచ్చే శాస్త్రమే హీలింగ్ అంటే.
  • మనకు ఏడు శరీరాలు, ఐదుకోశాలు ఉన్నాయి.

ఆనందదర్శనం

ఆనందదర్శనసమయంలో మీరు గురుదేవుల నుంచి పొంగి ప్రవహించే శక్తివాహినిలో ఉంటారు. మీరు ఆయన దగ్గరకి వెళ్ళినప్పుడు ఆయన మీ ఆజ్ఞాచుక్రాన్ని స్పృశిస్తారు. అప్పుడు జ్ఞానోదయశక్తి, అనుభవం మీలోకి బదిలీ అవుతాయి.

దర్శనం అంటే దర్శించటం లేదా చూడటం. ఇక్కడ ఒక దివ్యత్వాన్ని చూడటం. ఆనందదర్శనం అంటే పరమానందాన్ని దర్శించటం. ఎప్పుడెతే విశ్వశక్తి మానవరూపంలో అవతరిస్తుందో, అప్పుడు మీ కళ్ళు ఆ శక్తిని చూడగలుగుతాయి. మీ చేతనస్థితి ఆ శక్తిని గ్రహించగలుగుతుంది. అది మీలో మార్పు జరిగే విధంగా చేయగలుగుతుంది. అదే ఆనందదర్శనం అంటే. మీరు చూస్తున్న రూపం భూమి మీద మళ్ళా మళ్ళా అవతరించే జ్ఞానోదయం అయిన యోగీశ్వరుడు.

కొంత మంది అడుగుతుంటారు, 'అసలు విశ్వశక్తి అనేది ఉందా'? అని. అవును! ఉంది. అది మీలోని జ్ఞానానికి అతీతమైంది. మనం జ్ఞానంలో అత్యున్నతశిఖరాలకి చేరగలిగినప్పుడు, ఆ జ్ఞానానికి అతీతమైనది ఏదో ఉంది అని తెలుసుకుంటాం. ఈ జ్ఞానంతో దాన్ని తెలుసుకోలేం. చాలామంది శాస్త్రవేత్తలు తమ విజ్ఞానంలో అత్యున్నతస్థాయికి చేరినప్పుడు వారికి ఆ విజ్ఞానానికి అతీతమైన, అంతు లేని విశ్వశక్తిని చూడగలిగారు. అది వారి జ్ఞానానికి తరువాత ఉండే మరొక శిఖరం అని అర్ధమైంది. సున్నితత్వం ఉన్నప్పుడు, ఆ శక్తి ఉనికిని చూడగలుగుతాం.

కొంత మంది ఈ విధంగా అంటుంటారు, 'విశ్వం అంటే విశ్వశక్తి అదే ఒక దివ్యమైన ఆట మాత్రమే' అని. మరి కొంత మంది అది కేవలం ఒక యాదృచ్ఛికసంఘటన మాత్రమే అని. కానీ దీని వెనుక వివేకం, శక్తి అనేవి ఏవీ లేవు అంటారు. ఈ రెండవ రకం మనుషులు చాలా సౌలభ్యంతో వారి భావాల్ని ఉపయోగించి మారణాయుధాల్ని తయారుచేసి ఈ ప్రపంచంలో ఎన్నో ప్రమాదాల్ని సృష్టిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ విశ్వం ఒక యాదృచ్చికసంఘటన, అనుకోని సంఘటన అంటారో, అటువంటివారు విశ్వంతో ఎటువంటి సున్నితమైన స్పందననీ కలిగి ఉండరు. వారు కేవలం అత్యల్పస్టాయిలోనే ఉండగలుగుతారు.

మీరు గనుక మొదటి తరగతికి చెందినవారైతే మీరు ఒక సూక్ష్మస్థాయికి చేరి, ఈ విశ్వంలో ప్రతిదాని పట్ల ఎంతో గౌరవాన్ని చూపగలుగుతారు. మీరు ప్రతి రాయిని, చెట్లుని గౌరవించగలరు. మీ నుంచి లోతైన భక్తిభావం పొంగి పొర్లుతుంది. అప్పుడు మీ జీవితం ఒక అందమైన ప్రవాహంతో పాటు సాగుతుంది. అప్పుడు జీవితం విశ్వసాగరంలో ఉవ్వెత్తున లేచిన అద్భుతతరంగంలా ఉంటుంది.

ఒక విషయం అర్థం చేసుకోండి; ఎవరైతే ఇదంతా ఒక గొప్ప మేధాశకి నడిపే దివ్యనాటకం అన్న విషయాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోగలరో, ఆ వ్యక్తి తన జీవితాన్ని, విశ్వశక్తితో ఈ విశ్వశక్తి ఆడే దివ్యనాటకానికి అనుగుణంగా మలచుకోగలడు.

సర్వశక్తిమయమైన సృష్టి ప్రతి మాటకి, భావానికి, ప్రార్ధనకి స్పందిస్తుందని అర్ధం చేసుకోండి. ఆ శక్తిని ప్రజలు సరైన పద్ధతిలో చూడటానికి, వినటానికి, అర్థం చేసుకోవటానికి ఆ శక్తి జ్ఞానోదయమైన యోగీశ్వరుల రూపాన్ని పొందుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది చేసే ప్రార్థనలు, వారి కోరిక, ఆ శక్తిని జ్ఞానోదయమైన యోగీశ్వరుల రూపంలో భూమి మీదికి బలంగా లాగుతాయి. ఇది ఏ విధంగా ఉంటుందంటే అల్పపీదనం తుఫానుల్ని ఆకర్షిస్తుంది. ఇది కూడా అంతే.

గురుదేవుల దర్శనం అంటే ఆ సాగరంలోని ఒక పెద్ద అల పైకి లేచినట్లే. ఆ అల సాగరం నుంచి ఎప్పటికీ వేరుపడదు. అదే సమయంలో తనలోని అంతు లేని చైతన్యశక్తిని వెల్లడి చేస్తుంది. ఒక విషయం తెలుసుకోండి. నది కూడా సముద్రంతో సంబంధం కలిగి ఉంటుంది. కానీ దానిలో అలలో ఉండే చైతన్యశక్తి ఉండదు. అది నెమ్మదిగా మామూలుగా అల. అది ఈ అంతరంగాన్ని చిలికి మీలో కావలసిన మార్చుని తెస్తుంది.

ఇప్పుడు అర్ధం చేసుకోండి; ఆ అలలో ఒక ఇసుక రేణువు ఉంటే అది అలని ఏమైనా కల్మషం చేస్తుందా? లేదు! అల సంపూర్ణమైన స్వచ్చతతో ఉంటుంది. ఎందుకంటే ఆ ఇసుక చెతన్యశక్తి లోపల ఉంది కాబట్టి. అదే విధంగా మీరు దర్శనానికి వచ్చినప్పుడు మీరు బయట, లోపల ఆ చైతన్యశక్తి ద్వారా పరిశుభ్రమై స్వచ్చంగా అవుతారు. ఆనందదర్శనసమయంలో మీరు విశ్వశక్తిలో ఉంటారు. సూర్యకాంతికి పద్మం ఏ విధంగా వికసిస్తుందో అదే విధంగా గురుదేవుల సమక్షంలో మనలోని చేతనస్థితి వికసిస్తుంది.

మీరు చేయవలసింది కేవలం సహకరించటమే. మీరు సహకరించకపోయినా ఆ శక్తి మీ లోపలికి చొచ్చుకొని పోతుంది. ఇది ఎలా ఉంటుందంటే, సముద్రంలో అలిచిప్ప కెరటంతో సహకరించినా సహకరించకపోయినా, కెరటం అలిచిప్పని తనతో పాటు తీసుకువెళుతుంది. అదే విధంగా మీరు సహకరించినా సహకరించకపోయినా, ఆ శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. అది చేయవలసిన పనిని చేసుకు వెళుతుంది. అయితే ఆ కెరటంతో సహకరించే అలిచిప్ప ఆడుతూ పాడుతూ ఆ కెరటపు ఆనందడోలికలలో ఊగుతూ తనని తాను స్వచ్ఛం చేసుకుంటుంది. చివరికి ఆ సాగరంలో ఐక్యమైపోతుంది.

మరొక విధంగా ఎలా ఉంటుందంటే, ఆ ఆలిచిపు కెరటంతో, నిన్ను నేను అంత త్వరగా నమ్మను అని కొన్ని గులకరాళ్ళని పోగుచేసుకొని, తన చుట్టూ గోడ కట్టుకొని ఆ క్రమంలో బాధకి గురి అవుతుంది. కాని కరుణామూరి అయిన ఆ కెరటం ఆలిచిపుని తనతో ఆనందసాగరంలోకి తీసుకువెళుతుంది.

ఎవరైతే ఆ కెరటానికి ఆనందంగా అధీనమవుతారో వారి జీవితం ఆనందదర్శనం, అంతే కాని ఏదో కొన్ని క్షణాల దర్శనం కాదు. ఒక విషయం అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీ చేతనస్థితి సర్వాంతర్యామి అయిన గురువు వైపు ఆనందానుభూతితో తిరుగుతుందో అప్పుడు ఆనందదర్శనం మీలో జరుగుతుంది. మీరు భౌతికంగా గురువుల సమక్షంలో ఉండనవసరం లేదు. మీ చేతనస్థితిని నిరంతరం ఆ శక్తి మీద ఉంచగలిగితే, మీ జీవితం ఆనందదర్శనం అవుతుంది. అలా కాకుండా ఆ శక్తిలో ఐక్యమవ్వటానికి ఎవరైతే ఆగుతారో, ఆ ఉత్తేజాన్ని పోగొట్టుకుంటారో వాళ్ళు అంతిమంగా అందులోనే ఐక్యమవుతారు.

ఆనందదర్శనసమయంలో గురుదేవుల నుంచి అంతు లేని శక్తి అన్ని వైపులా ప్రసరిస్తూ ఉంటుంది. ఆయన దగ్గర ఒక పసిబిడ్డలా అమాయకత్వంతో, చక్కని కుతూహలంతో, లోతైన భక్తిభావంతో, విప్పారి, ఉప్పొంగి కరిగే హృదయంతో ఉంటే చాలు. ప్రార్థనలో ఉన్న శక్తిని సంఘం నాశనం చేసింది. నీవు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మార్చగల శక్తి ప్రార్థనకి ఉంది.

ప్రార్థన అంటే ఏమిటి? మీరు దేన్నైనా సాధించాలని అనుకున్నప్పుడు మీరు మీ ఉద్దేశాన్ని, తీవ్రతని కేవలం దాని మీద కేంద్రీకరిస్తారు. దీన్నే ప్రపూణం అంటారు. కానీ మీకు వెంటనే ఈ విషయాన్ని సాధించాలి అంటే ఉన్నతమైన శక్తి సహాయం అవసరమని తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ విషయం మీకు తెలుస్తుందో మీ ప్రమాణం ప్రార్థన అవుతుంది. అప్పుడు మీరు ఆ శక్తిని నాకు అతీతమైన శక్తి కరుణ కావాలి అనుకోవటం ప్రార్థన. కాబట్టి అటువంటి ప్రార్థనస్థితిలోకి రండి.

మీరు గురుదేవుల సమక్షంలో విప్పారి ఉండగలిగితే, మీ భావాల్ని తెరచి ఉంచితే అవి పదుతుంది. అదే విధంగా మీలోని కోరిక, మీకు మంచి చేయటానికి ఉన్న కోరిక, అందరికీ మంచి చేసే కోరిక, అయితే తీరుతుంది. మీకు అవసరం లేని కోరిక మండి మాయమైపోతుంది. దానితో పాటు ఆ కోరిక తీరలేదనే అసంతృప్తి కూడా మాడిపోతుంది. కాబట్టి గురుదేవుల సమక్షంలో మీ కోరిక తీరుతుంది. లేదా మీ మనస్సు ఆ కోరికని మరిచిపోతుంది. కోరిక అనే విత్తనం మొలకెత్తుతుంది లేదా మాడిపోతుంది. రెండు విధాలా మీరు తృప్తిని పొందుతారు.

జ్ఞానోదయమైన యోగీశ్వరుని స్పర్శానుభూతిని పొందండి

ఒక విషయం అర్థం చేసుకోండి. మీలో చాలా కోరికలు ఉంటాయి. అన్ని కోరికలూ తీరాలని లేదు. ఈ విషయాలతో వ్యవహరించగల నేర్చుని గురుదేవుల శక్తి మీకు ఇస్తుంది.

ఒక చిన్న కథ : అడవిలో వెళుతున్న ఒక బాటసారి బాగా అలసిపోయి చెట్లు కింద విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటాడు. ఆ చెట్లు దగ్గర ఏమనుకుంటే అవి జరుగుతాయి. అతను ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ 'మంచి భోజనం ఉంటే బాగుండును' అనుకుంటాడు. ఆ విధంగా అనుకోగానే మంచి భోజనం ఉన్న పళ్ళెం అతని ముందు ప్రత్యక్షమవుతుంది. అతను చాలా సంతోషపడి తృప్తిగా భోజనం చేసాడు. భోజనం చేసాక, 'మంచి పడక ఉంటే బాగుండు' అనుకుంటాడు. వెంటనే అత్యంతవిలాసవంతమైన మంచం ప్రత్యక్షమవుతుంది. అతను ఆశ్చర్యపోయి హాయిగా దాని మీద విశ్రాంతి తీసుకుంటాడు. అతను తలని తలగడ మీద పెట్టగానే ఎవరైనా విసనకుర్రతో విసిరితే బాగుండు అనుకుంటాడు. వెంటనే ఒక అందమైన అమ్మాయి విసనకురతో ప్రత్యక్షమవుతుంది.

అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన వస్తుంది, 'అమ్మో, ఈ అడవిలో ఏదైనా పెద్ద పులి వస్తే ఎలా?' అనుకుంటాడు. వెంటనే అక్కడికి ఒక పెద్దపులి వచ్చి అతన్ని చంపి తినేస్తుంది.

కోరిక తీరాలి అని అనుకునే ముందు ఆ కోరికని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరు గురుదేవుల సమక్షంలో కోరికల్ని చెబితే, అవి మీకు స్పష్టంగా తెలుస్తాయి. అందుకు కల్పతరు కార్యక్రమంలో మీ కోరికల్ని చెప్పమని మీతో అంటాను. ఆ విధంగా చెబుతున్నప్పుడు మీకు నిజంగా ఏ కోరిక అవసరం, ఏది కాదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదే వెల్లడి చేసే శక్తి తాలూకు మేధ. కల్పతరుదర్శనం మీలో కొన్ని విత్తనాలను నాటుతుంది.

  • శక్తి : మీలో మార్పు రావలసిన వాటిని మార్చే శక్తి
  • బుద్ధి : మార్పు చేయలేని విషయాల్ని స్వీకరించే బుద్ధి.
  • యుక్తి : మారిపోయే ఒక స్వప్నం

ముక్తి, స్వేచ్ఛ, పై మూడింటినీ జీవితంలో అనుభవించి పరమానందంలో జీవించటం.

మీరు మారగల విషయాల్లో, అవి చిన్నవైనా, అందులో మీ శక్తిని ఉంచండి. 'అయ్యో! నేను రెండు అలవాట్లనే మార్చగలిగాను. మిగిలినవాటి సంగతి ఎలా?' అని ఆలోచించవద్దు. మీరు మార్చగలిగినవి మార్చండి. మీరు మార్చలేనివాటిని స్వీకరించండి. ఎప్పుడైతే మీ శక్తిని వెల్లడి చేసారో మేధ మీలో వికసిస్తుంది.

మేధ అంటే మీరు మార్చలేనివాటిని స్వీకరించటమే. అయితే మీరు మార్చగలవాటి విషయంలో శక్తిని వెల్లడి చేయనంతవరకూ మార్చలేని వాటిని స్వీకరించే మేధ మీలో కలగదు. ముందు మీరు మార్చగలవాటితో ప్రయత్నించండి. అప్పుడు మార్చలేనివాటిని స్వీకరించే గొప్ప సమర్ధత మీలో కలుగుతుంది.

మూడవ విత్తనం సృష్టత. మీరు విషయాల్ని ఏ విధంగా మార్చినా, ఎంత మార్చినా, మీరు మార్చగలవాటిని మార్చినా, ఈ ప్రపంచమంతా నిరంతరం మారుతూ ఉందే ఒక సత్యం, ఇది మారుతూ ఉన్న ఒక కల. కారణం లేకుండా నిరంతరం మారుతూ ఉండే కల ఈ కల్లోలం అనవచ్చు. ఎవరైతే దీన్ని కారణం లేని మంగళకరశక్తి అంటారో వారు థీస్ట్ అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మేవారు, సత్యాన్వేషకులు. ఎవరైతే ఇది కారణం లేని కల్లోలం అంటాడో అతను వస్తుప్రపంచానికి సంబంధించిన ఆశావాది.

ఈ విశ్వమంతా ఒక అద్భుతంలా కనపడవచ్చు లేదా ఒక శాపంలా కనపడవచ్చు. ఇది కారణం లేని మంగళత్వం అనుకుంటే ఇది అద్భుతంలా, నిరంతరం జరిగే మహాద్యుతంలా కనిపిస్తుంది. లేకపోతే ఒక శాపంలా ఉంటుంది.

ఆనందదర్శనసమయంలో చాలా మంచి అనుభవాలు కలుగుతాయి. హీలింగ్ అనుభవాలు, కారణం లేని పరమానంద అనుభవాలు జరుగుతాయి. అంతే కాదు, ఆ శక్తి తరంగం పైకి లేచినప్పుడు అది తెలియని భయాల్ని అచేతనస్థితిలో స్పష్టిస్తుంది. భయంతో పాటు అపరాధభావం, కోరికలూ పైకి వస్తాయి. కొంత మంది లోతైన నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతారు. కొందరు కన్నీటితో నిండిపోతారు. వీటి అన్నింటికీ కారణం ఏమిటో మీకు తెలియదు. ఎందుకంటే అవి లోతుగా మీ అచేతనస్థితి నుంచి వస్తాయి. మీలో లోతుగా నాటుకుపోయిన ఈ సంస్కారాల నుంచి స్వేచ్ఛని పొందటానికి దర్శనసమయం ఒక అపురూపమైన అవకాశం. ఆ సమయంలో పొంగి పొర్లే శక్తితో ఈ భావాలు కొట్టుకుపోతాయి.

దర్శనసమయంలో మీ ఆత్మ చైతన్యంతో ఉంటుంది. అది విశ్వశక్తి. మీ తండ్రి మీకు ఇచ్చే ఐశ్వర్యం లాంటిది. దాన్ని ఆనందించే అవకాశం పోగొట్టుకోవద్దు. సర్వాంతర్యామికి 'సరే' అని చెప్పి అందులోకి ప్రవేశించండి. ఒక పసిబిడ్డలా ప్రవేశించండి.

మీ అకౌంటు లోంచి డబ్బు తీసుకోవాలంటే మీరు చెక్కు మీద సంతకం చేయాలి. అదే విధంగా విశ్వశక్తి నుంచి శక్తిని పొందాలి అంటే మీరు తెరవబడిన అంతరంగంతో ఉండాలి అంతే.

ఒక విషయం గుర్తుంచుకోండి; వర్షం కోసం తెరుచుకున్న ముత్యపుచిప్ప వర్షం చినుకుని పొంది దాన్ని ఆణిముత్యంలా మార్చగలుగుతుంది. మీరు గురుదేవుల సమక్షంలో మీ అంతరంగం పూర్తిగా విప్పారి ఉంటే, ఆయన నుంచి వచ్చే ఒక్క మాట చాలు, అది ముత్యపుచిప్పలో పడ్డ వర్షబిందువు ముత్యంగా మారినట్లు మారుతుంది.

గురుదేవుల సమక్షం మీ మీద పనిచేయాలంటే, అది జరిగే విధంగా మీరు ఉండాలి. కంగారు పడవద్దు. విసుగు చెందవద్దు. దేన్నీ ఆశించవద్దు. ఏది జరిగితే దాన్ని జరగనీయండి. ఆ ఆనందతరంగం మీద నాట్యం చేసే నాట్యమయూరిలా పరమానందాన్ని పొందండి.

చికిత్సానుభవాలు

చికిత్స

  • హెపటైటిస్ బి. వ్యాధిసోకి నేను బాధపడ్డాను. అది కాలేయానికి సంబంధించిన తిరుగులేని వ్యాధిగా భావిస్తారు. ఆసుపత్రులన్నీ లాభం లేదని చెప్పేసాయి. కేవలం ద్రవపదార్థాలనే ఆహారంగా స్వీకరిస్తూ ఆరు సంవత్సరాలు పడివుండి, మృత్యువు చుట్టపక్కలనే కాచుకొని ఉందని తెలుసుకున్నాను. నా మిత్రుని సలహా మేరకు నేను THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వారు దక్షిణభారతదేశంలోని తమిళనాడులోని ఈరోదులో ఉన్నారు. తనను దర్శించిన ప్రజలకు చికిత్స చేస్తూ ఉన్నారు. వారు కొంత పవిత్రభస్మాన్ని నాకిచ్చారు. దాన్ని మూడు రోజుల వరకు నేను స్వీకరించే అన్నపానీయాల్లో కలపమన్నారు. వారి సూచనని నేను అనుసరించాను. మూడవరోజునే నా ఉదరం ఆరు సంవత్సరాల తరువాత నెమ్మదిగా ఉన్నట్లు భావించాను. ఆరు సంవత్సరాల సుదీర్ఘకాలం తరువాత నేను మొదటిసారిగా వారి ఆదేశానుసారంగా మసాలాలు కలిపిన ఆహారాన్ని స్వీకరించాను. అప్పట్నించి నేను ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. నా ఆధ్యాత్మిక గురువుకి సేవ చేయటానికి సంసిద్ధంగా ఉన్నాను.

– శ్రీ, నిత్యసదానంద నిత్యానంద పరంపరలో సీనియర్ స్వామి.

  • నేను పోలిసిస్టిక్ ఒవరియన్ సిండ్రోమ్ (PCOS) తో బాధపడుతున్నట్లుగా వ్యాధి నిర్దారణ జరిగింది. అది తీవ్రమైన హార్మోన్ల సమస్యలకు కారణమయ్యింది. అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా అది కనుక్కోబడింది. నా అండకోశములో పెద్ద కంతులతో కప్పబడినట్లుగా తెలిసింది. నేను THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలవారి ఒక ధ్యానసంబంధ కార్యక్షమంలో పాల్గొన్నాను. నేను నా సమస్యని వారికి చెప్పకముందే వారు నాకు చికిత్స చేయబడుతుందని చెప్పారు. సుమారు నెల తరువాత, నేను ముప్పయి పౌండ్ల బరువుని కోల్పోయినట్లు తెలుసుకున్నాను. రెండు వందల పౌండ్ల బరువుని ఆహారపానీయాలద్వారా, వ్యాయామం ద్వారా ప్రయత్నం చేసి కూడా తగ్గించుకోలేకపోయాను. నా బరువు ఎంత భావోద్యేగంతో కూడుకొని వుందో నేను తెలుసుకున్నాను. అలవాట్లు మన భావనల్ని తృపి పరుస్తాయనుకుంటాం కాని అలాజరగదు. సుమారు ఒక సంవత్సరం తరువాత నేను అల్లాసౌండ్ చెకప్‌కి వెళ్లినప్పుడు. నాలో వున్న కంతులన్నీ మాయమైనట్లు తెలుసుకున్న డాక్టర్లు ఆశ్చర్యచకితులైనారు.

– రోషిని నంబియార్

  • నా అత్తమామలు నన్ను చూడటానికి సింగపూర్ వచ్చినప్పుడు వాళ్లు మలేసియా లోని టెయోమన్ ఐలాండ్స్‌ని చూద్దానికి వెళ్లారు. వాళ్లు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వారిద్దరి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు. సముద్రతీర వాతావరణం వారికి సరిపడలేదు. సముద్రపు నీటిలో ఈదులాడుతున్నప్పుడు వాళ్లు సముద్రపునీటిని పెద్ద మొత్తంలో తాగటం జరిగింది. తిరిగి వచ్చిన తరువాత కూడా వాళ్లు తీవ్ర ఆందోళనకి గురయ్యారు. మామగారు తీవ్రమైన జ్వరంతో వణకిపోసాగారు. నేనాయనకు పడుకోమని నిత్యా ఆధ్యాత్మిక చికిత్సను చేశాను. పదినిముషాల్లో ఆయన గాఢనిద్రలోకి జారుకున్నారు. మరునాడు ఉదయం, ఏమీ జరగనట్టు మామూలుగా నిద్రలేచారు. శ్రీ నిత్యానంద అర్పణ, నిత్యాస్సెరిచువల్ హీలర్, మలేసియా.

  • నా అమెరికన్ మితురాలు ఒకామె, తను చాలాకాలంగా, మానసిక భావోద్వేగంతో బాధపడుతున్నాననీ, తరచూ దానికి లోనవుతుంటాననీ చెప్పింది. నిత్యా ఆధ్యాత్మిక చికిత్స, మానసిక సమస్యలకూ పనిచేస్తుందా అనుకుంది. ఆ చికిత్సాశక్తి అన్ని స్థాయుల్లోనూ ఎలా పని చేస్తుందో నేనామెకు వివరించాను. తరువాత పావుగంటపాటు ఆమెకు చికిత్స చేశాను. మరునాడు ఆమె, నాకు ఫోన్ చేసి, చికిత్స చేసిన సమయంలోనూ, తరువాత, తనకెంతో ప్రశాంతంగా తేలికగా అనిపించిందనీ, నాలుగేళ్ల తరువాత, ఎంతో హాయిగా క్రితం రాత్రి తిని పోగలిగాననీ చెప్పింది. ఆమెలోని ఆ భావోద్యేగానికి కారణం. ఆమె జీవితంలో ఒకానొక దుర్ఘటన జరగడమే! ప్రేమేశ్వరి, నిత్యా ఆధ్యాత్మిక చికిత్సకురాలు, మిచిబిగన్, యుఎస్ఎ.

  • నేను స్త్రీ రోగ నిపుణురాలిని. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలవారి స్పర్శతో నా దగ్గరికి వచ్చే రోగులెందరో అద్భుతానుభవాలు పొందారు. ఇటీవలే నా దగ్గరికి వచ్చిన ఒకామె, ట్యూబర్‌కులోసిస్‌తో బాధపడుతూంది. ఆమె గర్భాశయం లోపలి పొర పలుచబడి, గర్భకోశం పొర అంతా బాగా దెబ్బతిన్నది. మేమెన్నో రకాల వైద్యాలు చేసినా ఏవీ పని చేయలేదు. సరోగెట్ మదర్‌ను సూచించామని అందరమూ అనుకుంటున్న తరుణంలో, నేనామెకు, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM వారితో చికిత్స పొందమని సలహా ఇచ్చాను. ఆమె అలాగేవెళ్లి ఆయన చేత చికిత్స చేయించుకుని, సంతానవతి అయ్యే భాగ్యాన్ని దీవెనగా పొందింది. ఆమె గర్భవతి అయి, మామూలుగా ప్రసవించటం, వైద్య చరిత్రలోనే అద్భుతం!

డాక్టర్ నిర్మల, గైనకాలజిస్ట్, అడ్వన్స్‌డ్ ఫెర్టిలిటీ, సెంటర్, బెంగుళూరు.

ధ్యానకార్యక్రమాలు

  • నా ఎంఎన్‌సి కార్పొరేట్ కెరీర్‌లో నాకొక గొప్ప స్థానం ఉంది. నేను ఎన్నో సంస్థలు నడిపించి, కోట్లతో వ్యాపారాలు చేస్తూ నా స్వప్నాలు సాకారం చేసుకోసాగాను. కాని నాకెప్పుడూ సంతృప్తి కలగలేదు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM దర్శనం తరువాత, బయటి ప్రపంచంలో విజయాలు సాధించడంతోపాటు లోపలి ప్రపంచంలో విజయవంతం కావడమూ నేర్చుకున్నాను. రామ్ ఎస్.రామ్, వ్యాపారవేత్త, సింగపూర్.

  • ఐదేళ్లక్షితం నేనొక పెద్ద సంస్థకు ఉపాధ్యక్షుణ్ని. 32 ఏళ్లకే నాకు మధుమేహం వచ్చింది. నా తల్లిదండ్రుల కుటుంబాల్లో చాలామందికి ఈ వ్యాధి ఉండేదట. నేనొక సందర్భంలో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMను కలిసినప్పుడు, ఈ సమస్య గురించి చెప్పాను. ఇది జరిగి నాలుగున్నరేళ్లయింది. నేటి వరకూ నా రక్తంలో చక్కెరస్తాయి మామూలుగానే ఉంది నేనెటువంటి ఆహారపు అలవాట్లూ మార్చుకోనప్పటికీ. వ్యాధి లక్షణాలు కూడా కనబడలేదు. నేనొక అడ్వాన్స్‌డ్ ధ్యాన కార్యక్రమానికి, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMతో పాటు హాజరయ్యాను. అందులోని ఒక అంశం, మేము జ్ఞానానందంతో ఎందుకు జీవించలేకపోతున్నామో అందరూ చెప్పాలి. ఆ మాటలు చెప్పగానే మాలోని భయం తొలగిపోయింది. ఆ క్షణంలో ఒక బలమైన రసమేదో భౌతికంకాని కాల్పనిక సమతలంలో ప్రవహించి నట్లయింది! మేము చెబుతున్న ప్రతిమాటనూ, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM సృష్టించిన అగ్నిలో శాశ్వతంగా కాలిపోయినట్లు అనుభూతి చెందాం. ఇప్పుడు నాలో ఎటువంటి భావాత్మక అసంతులనమూ లేదు. నేను అన్ని రంగాల్లోనూ ఆనందంగానూ, నిమగ్నతతో పనిచేయగలుగుతున్నాను. నేను చెప్పగలిగేదల్లా స్వామి ప్రేమనూ, సానుభూతినీ మాపై వర్షించి, మేము పునర్జన్మించేలా చేశారని!

శ్రీ, నిత్యాసచ్చిదానంద, అంతర్జాతీయ సంవిధానకర్త, సీనియర్, స్వామి, నిత్యానంద ఆర్ధర్, లాస్ ఏంజెలిస్, యుఎస్ఎ.

  • కష్టం లేకుండా పనిచేయడం అనేది నేనెప్పుడూ ఊహించనిది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానకార్యక్రమాల్లో పనిలోని ఆనందాన్ని తెలుసుకున్నాను. అటుపైన సులువుగా ఫలితాలు సాధించగలుగుతున్నాను. అదీ సృజనాత్మకతతోనూ, సంతృప్తిగానూ చేయగలుగుతున్నాను. అపూర్వి షేథ్, మార్కెటింగ్ డైరెక్టర్, సింగపూర్.

  • THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM నన్ను తొలిసారి తాకినప్పటినుంచీ నాశక్తిలో అద్భుతమైన పెరుగుదల ఏర్పడింది. నా వ్యాపారమూ వర్ధిల్లింది. వ్యాపారంలో నేను తీసుకునే నిర్ణయాలు కొత్త కోణాల్లో సాగుతున్నాయి. ఇంట్లోనూ, బయటా నా సంబంధాలు మెరుగయ్యాయి. మా అమ్మాయి బెంగుళూరులోని నిత్యానంద గురుకులంలో ఉంది. ఒక ఆత్మవిశ్వాసంగల, తెలివిగల, సంతృప్తి గల వ్యక్తిగా ఆమె ఎదుగుతున్నది. చరణప్రియ, వ్యాపారవేత్త, పాండిచేరి.

అరుణాచల పర్వతమున్న తిరువణ్ణామలై పుణ్యక్షేత్రం

రఘుపతియోగి పరమహంసకు అనేక అతిమానుష మహిమలను చూపించినప్పటికీ ఇవేవీ అంతిమసత్యాన్ని చేరుకోవడానికి కానీ ఆధ్యాత్మిక వికాసానికి కానీ ఉపయోగపడవని కూడా బోధించారు.

యోగి రామ్‌సూరత్ కుమార్‌తో – ఒక ఆధ్యాత్మికబంధం. యోగి రామ్‌సూరత్ కుమార్ లేదా విసిరి స్వామిగళ్ జ్ఞానోదయం పొందిన గురువు. ఈయన తిరువణ్ణామలై భగవాన్ శ్రీరమణమహర్షి సమకాలికుడు. తిరువణ్ణామలైలో ఈయన సుప్రసిద్ధుడు, ప్రియతముడు. పరమహంస ఈయనను తరచుగా కలుస్తుంటారు.

చిన్న వయసునుండే THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యాన, యోగాలతో సహా అనేకరకాల ఆధ్యాత్మిక ప్రక్రియలలో నిమగ్నమయ్యారు.

మాతాజీ కుప్పమ్మాళ్ ఒక గొప్ప ప్రేరణ. అరుణాచలంలో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఆధ్యాత్మిక వికాసం జరుగుతూ వున్న తొలినాళ్లలో ఆయనకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం వహించి ఆయన బాగోగులు చూసినవారు బ్రహ్మయోగిని విబుధానంద దేవి మాతాజీ కుప్పమ్మాళ్. 12 ఏళ్ల లేత వయసులోనే THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM లోతైన ఆధ్యాత్మిక అనుభవాలు పొందుతున్నప్పుడు భవిష్యత్తును ముందుగానే దర్శించిన కుప్పమ్మాళ్ ఆయన బాధ్యతలను తీసుకొని వివిధ ఆధ్యాత్మిక విధానాలలో ఆయనకు శిక్షణ ఇచ్చారు.

పరివ్రాజకుడై THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM భారత్ దేశమంతా దర్శించినప్పటి దృశ్యం

జ్ఞానోదయం పొందాక... THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానపీఠం ప్రారంభించేముందు

జ్ఞానకాంతులు విరజిమ్ముతూ…

The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam గురించి

భారతదేశానికి చెందిన గురువు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, ప్రతివ్యక్తిలోనూ ఆత్మసాక్షాత్కారం జరగాలనే ఉత్తమోద్దేశంతో పర్యటిస్తున్నారు. నిత్యజీవితంలోని బాధలు, చింతలు, మానసిక పరమైన ఒత్తిడులకు కచ్చితమైన పరిష్కారాలను ఈ 'జీవన్ముక్తి'తో సూచించవచ్చునంటారు, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM వారు. విశాల దృక్పథం, హాస్య స్ఫూర్తి, విషయ పరిజ్ఞానం, చెప్పగలిగే సమర్థత, వైదిక విషయాలను నిత్యజీవితంలో ఆనందకరంగా ఉపయోగించగలిగే నేర్పుతో ఆయన చేసే బోధలు, సాంఘిక, సాంస్కృతిక, భాషా, వయో, లింగ భేదాలను దాటి, దేశవిదేశాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

కార్యకమాలు, వర్క్‌షాపులు

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది జనానికి శరీరం, మనస్సు, ఆధ్యాత్మికపరంగా లాభదాయకంగా ఉండాలని ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలకు కొందరిని ఈ పీఠం ఎంపిక చేసుకుంది. వారు:

అంతశ్చేతన్యం

అంతరంగాన్ని మేలుకొలిపే ఈ కార్యక్రమం, వ్యక్తుల్లో మార్పు తీసుకువస్తుంది. 21 రోజులపాటు జరిగే ఈ కార్యక్షమం, మానవుణ్ని ఇహం నుంచి పరానికి తీసుకుపోతుంది. ఇందులో గురువు సత్యాన్వేషకులకు దగ్గరుండి మరీ మార్గదర్శనం చేస్తారు. మరో విశేషం, ఈ కార్యక్రమం సందర్భంలో, బెంగుళూరులోని ఆశ్రమంలో 21 రోజులపాటూ ఉంటే సదవకాశమూ కలుగుతుంది.

స్వామి, "[ప్రతి వారిలోనూ ఈ జీవన్ముక్తిని కలిగించడమే అంతశ్చితన్యం. నా ప్రతికార్యకమమూ, మీకు, నాలోని ఒక కోణాన్ని, ఒక అంశాన్ని చూపుతుంది. ఉదాహరణకు, ఎల్‌బిపి" అనేది. 'ఆనందంగా జీవించడం' అనే అంశాన్ని చూపుతుంది. ఎన్ఎస్‌పి అనేది 'మరణాన్ని ఆనందంగా స్వీకరించడం' అనే అంశాన్ని చెబుతుంది. నిత్యయోగ కార్యక్రమం, 'యోగశరీరాన్ని' కలిగి ఉండడాన్ని వివరిస్తుంది. ప్రతి కార్యక్రమమూ, జీవన్ముక్తిలోని వేర్వేరు అంశాలను తెలుపుతుంది.

"ఒక్కొక్క కోణాన్నీ అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు, ఒక స్ఫూర్తిని, మరింత లోతుల్లోకి వెళ్లడానికి ఒక ద్వారం తెరుచుకోవడాన్ని పొందుతారు. ఒక అనుభవం లేదా ఒక ద్వారం తెరుచుకోవడం జీవన్ముక్తి పూర్తిగా పొందేందుకు సరిపోదు. మరో స్ఫురణ కావాలనిపిస్తుంది.

"అంతశ్చేతన్యం సంపూర్ణమూ, సమగ్రమూ అయిన మార్గం – THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, నిత్యయోగ వంటిది. అన్నిటినీ కలిపింది, ఇంకా ఏదో ఉందనిపించేది. జీవన్ముక్తిలోకి చేర్చేది. నాలో ఉన్నది, మీలో ఉన్నది జీవన్ముక్తే.

"ఇదంతా మీకు ఒకేచోట లభిస్తుంది.

"జీవన్ముక్తి అంటే ప్రతి క్షణమూ అవగాహనతో, బ్రహ్మాండంలోని కొత్త కోణాలను ఆవిష్కరించే అద్భుతం" అంటారు.

కల్పతరు

'కల్పతరు' అనేది జీవన్ముక్తి బీజాలను మీలో నాటే ఒకరోజు ధ్యానకార్యక్రమం.

ఇందులో భక్తులకు –

  • మీ జీవితంలో కావలసిన వాటిని మార్చుకునే శక్తి.
  • బుద్ధి : జీవితంలో మార్చదగనివాటిని అర్థం చేసుకునే తెలివి.
  • యుక్తి : సత్యం అనుకున్న, ప్రతిదీ నిరంతరమూ మారిపోతుందనే విషయాన్ని మీరెంత మారినా అర్థం చేసుకునే స్పష్టత.
  • భక్తి భావన. ఆరాధన : ఎప్పటికీ మారని, శాశ్వత, అంతిమమైన దానితో (భగవంతుడు)గా సంబంధాలున్న భక్తి భావన. ఆరాధన
  • ముక్తి : పై చెప్పుకున్న నాలుగూ సంపూర్ణంగా మీలో కలిగితే, చిట్ట చివరి విముక్తి, జీవన్ముక్తి కలుగుతాయి.

ఈ కార్యక్రమం, మీ అభిప్రాయాలను, చర్చలతో సమీకరించి, విజయాలు సాధిస్తూ, ఆత్మానందంతో ముందుకు సాగే శక్తిని కలిగిస్తుంది.

ఎల్‌బిపి లెవెల్

మిమ్మల్ని మీరు శక్తిమంతం చేసుకోవడం.

మీ శరీరంలోని ఏడు చక్రాలనూ శక్తిమంతం చేసి తేలికపరిచే చక్రాధార ధ్యానం ఇది. ఇది మీ దురాశ, భయం, చింత, పట్టించుకోవాలనే కోరిక, ఒత్తిడి, అసూయ, అహంకారం, అసంతృప్తి వంటి మనోభావాలను, అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చేస్తుంది. మీలోని ఆనందాన్ని అనుభవంలోకి తీసుకువచ్చే హామీ ఇవ్వగల జీవితపరిష్కారం. ఒక భావం నుంచి విముక్తి కలిగితే మీకు ఒక కొత్త ప్రపంచం, కొత్త శక్తి అనుభూతిలోకి వస్తుంది. విశ్వవ్యాప్తంగా లక్షలాది మందికి ఈ కార్యక్రమం ఎన్నో విషయాలను అనుభవంలోకి తెచ్చింది.

ఎల్‌బిపి లెవెల్ 2

మరణరహస్యం బట్టబయలు!

మరణించే ప్రతి క్షణాన్నీ జీవనకళతో అనుభవంలోకి తెచ్చే ధ్యానకార్యక్రమం. అంతిమ భయమైన 'మృత్యువు' కారణంగా మనలో ఏర్పడి నిద్రాణంగా ఉండే భావాలైన అపరాధభావన, సంతోషం, నొప్పి వంటి వాటి నుంచి వైదొలగడం నేర్చుతుంది. సమయస్ఫూర్తితో కూడిన కుతూహలాన్నీ, సహజమైన తెలివితేటలతో సరికొత్త జీవితానికి మార్గదర్శనం చేసే కార్యక్రమం.

ఎల్‌బిపి లెవెల్ 3 – ఆత్మస్సురణ కార్యక్రమం

మీతో మీరే సంబంధం ఏర్పరచుకోండి :

మనసు చేత ఆదేశాలు పొంది దానికి లొంగి ఉండక, దాని మాయల ఆటలు కట్టించి, దానిమీద ఆధిపత్యం పొందే కార్యక్రమం. క్షణ స్ఫూర్తినీ, సమగ్రతనూ పొందేందుకు, అద్భుతమైన ధ్యాన కార్యక్రమం.

ఎల్‌బిపి లెవెల్ – 3 – భక్తిస్పురణకార్యక్రమం

మీ భక్తికి సమగ్రతను ఆపాదించుకోండి.

మీతోటీ, ఇతరులతోటీ సముగ్రతను వ్యవహరించే కోణాలను ఆవిష్కరించే కార్యక్రమం. మీలోనే మీకు తెలియని కోణాలను పురికొల్పి, తెలియజేస్తుంది. సంబంధాల నిర్వచనాలు చెబుతుంది. జీవితంలోని ఎటువంటి సంబంధాన్నెనా గాఢంగానూ, సంతోషకరంగానూ అనుభవించే విధానాలు నేర్పుతుంది.

ఎల్‌బిటి

గృహజీవితశాస్త్ర కార్యక్రమం

అనుబంధం

ప్రపంచంలోని యువత అందరికీ నిర్వహించే కార్యక్రమం. ఆనందంగా జీవించడం అనే అంశం ప్రధానంగా, మూడునెలలు లేదా రెండేళ్లు జరిగే ఈ కార్యకమంలో, ప్రాచీన కాలంలోని జీవన్ముక్తిని, నేటి ఆధునిక యువతకు అందిస్తూ, శారీరక, మానసిక, భావనాత్మక ఆరోగ్యాలు, దైనందిన జీవన కళలు నేర్చుతారు. సృజనాత్మక మేధనూ, సమయస్ఫూర్తినీ, జీవనకళలనూ బోధించడమే కాక, ఆర్థికంగా ఆత్మసంతృప్తితోనూ, ఆధ్యాత్మికంగా బలంగానూ ఉండేలా యువతను తీర్చిదిద్దుతారు. అన్నిటినీ మించి, జీవితకాలం మహానుభావులైన గురువుల సంరక్షణలో జీవితకాలం ఉండి నేర్చుకోగలిగే మహత్తర అవకాశం ఇది!

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

అన్వేషకులు గురువు సమక్షంలో ఉండి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM – శాశ్వతానందాన్ని – పొందే కార్యక్రమం. శక్తిమంతమైన గురువు సన్నిధిలో ఉపస్థితులై, ధ్యాన విధానాల నుంచి సేవలు చేసే సదవకాశం.

నిత్యా ఆధ్యాత్మిక చికిత్స

శారీరక, మానసిక రోగాలకు అద్భుతంగా శక్తిమూలకవైద్యాలు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM పీఠం అందిస్తుంది. నిత్యా ఆధ్యాత్మిక చికిత్స పద్ధతుల స్వామి, జనాన్ని చైతన్య పరచి, చికిత్సకులను తయారుచేసారు. ఈ ఉచిత సేవాకార్యక్రమంలో ఈ చికిత్సకులు, ప్రతిరోజూ జనానికి సేవలందిస్తారు, ప్రపంచ వ్యాప్తంగా.

The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ధ్వానపీఠం ముఖ్యాంశాలు

  • నేటి వరకూ లక్షల మందికి పైగానే ప్రభావితులయ్యారు.
  • నిత్యా ఆధ్యాత్మిక చికిత్స : వేలమంది చికిత్సకుల ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఆశ్రమాలు, కేంద్రాల్లో జనానికి రోజూ, శారీరక, మానసిక చికిత్సలు ఉచితంగా అందిస్తున్నారు.
  • అన్నదానం : పలు రకాల పోషకాలు గల ఆహారాన్ని ప్రతివారమూ అన్ని ఆశ్రమాలలో అన్నమందిరాల్లో, వచ్చినవారికి, భక్తులకు, శిష్యులకు ఉచితంగా అందిస్తారు.
  • THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM శిక్షణ : ఆధ్యాత్మిక అభ్యర్థులకు సన్యాసులు, బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులుగా శిక్షణ ఇస్తారు. వీరికి తీవ్రస్థాయిలో యోగం, ధ్యానం, ఆధ్యాత్మిక అభ్యాసం, సంస్కృతం, వేదమంత్రోచ్ఛారణ, జీవనకళలు నేర్పి, నూటికి నూరు శాతమూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఆశ్రమాల్లో, స్వచ్ఛందంగా అన్ని కార్యక్రమాలకూ తమసేవలు అందిస్తారు.
  • నిత్యయోగా : ప్రపంచ వ్యాప్తంగా పతంజలి యోగ సూతాలను విప్లవాత్మక ధోరణిలో బోధించడం.
  • THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM వేదాలయాలు, ఆశ్రయాలు : ప్రపంచవ్యాప్తంగా వేదాలయాలు, ఆశ్రమాలు స్థాపించారు.
  • కారాగారాల్లో ధ్యానకార్యక్రమాలు : కారాగారాల్లోనూ, అప్రౌఢుల శిబిరాల్లోనూ తీవ్రవాదుల ధోరణులను మార్చటానికి నిర్వహిస్తారు. వారిలో కలిగిన మార్పులు ఆశ్చర్య జనకం.
  • వైద్య శిబిరాలు : అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, ఆక్యుపంక్చర్, నేత్ర పరీక్షలు, నేత్రశస్త్రచికిత్సలు, కృత్రిమ అవయవాల దానశిబిరాలు, క్షయ వ్యాధులు, తదితరాలకు ఉచితంగా చికిత్సలు చేస్తారు.
  • గ్రామీణ బాలబాలికలకు ఆసరా : గ్రామీణ బాలబాలికలకు పాఠశాల భవనాలు, యూనిఫారాలు, విద్యాపరికరాలు ఉచితంగా అందిస్తారు.
  • THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM విద్యాలయం : ప్రాచీన వేదపద్ధతులను ఆధునిక సాంకేతిక విద్యతో జోడించి పిల్లల్లో అణచివేతను, భయాన్ని తొలగించే జీవన్ముక్తి ఆధార విద్యను నేర్పడం.
  • కార్పొరేట్ ధ్యాన కార్యక్రమం : ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్, ఏటి&టి క్వాల్మం, జెపిమార్దన్, పెట్రోబ్‌స్, పెప్పీ, ఒరాకిల్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ Hindu ఆరిజిన్‌లతో సహా కార్పొరేట్ సంస్థల వారికి మేనేజ్‌మెంట్, నాయకత్వ నైపుణ్యాలు, కలిసి పనిచేయటం, నేర్పడం.
  • ఉపాధ్యాయ శిక్షణకు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM సంస్థ : ఉపాధ్యాయులకు శిక్షణ : మార్పు తెచ్చే ధ్యానం, సంపూర్ణ జ్ఞాపకశక్తి, నిత్యయోగ, ఆరోగ్యం, చికిత్స కార్యక్రమాలు, ఆధ్యాత్మిక అభ్యాస కార్యక్రమాలు, ఇంకా ఎన్నో.
  • మీడియా : జాతీయ అంతర్జాతీయ దినపత్రికలు, పత్రికల్లో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM సందేశాలను అందించే వ్యాసాల ప్రచురణ.
  • THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ప్రచురణ కర్తలు : గంటలకు పైగా THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM వారి ఉపన్యాసాలు రాయించి ప్రచురించారు. అవి, పుస్తకాలుగా, డివిడిలు, సీడీలుగా లభిస్తున్నాయి.
  • లైఫ్ బ్లిస్ గ్యాలరీస్ : THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM పుస్తకాలు, నిత్యకీర్తనలు రికార్డింగులు భాషల్లో ఉన్న దుకాణాలు, సంచార దుకాణాలు.
  • THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యాన, చికిత్సా శిబిరాలు : ప్రపంచవ్యాప్తంగా ధ్యానం, చికిత్స సేవలు అందిస్తాయి.
  • THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM సంగీత అకాదమీ : సంగీత నాట్యాలు, కళల ఇతర రూపాలు యువతకు నేర్చుతూ ప్రోత్సహిస్తారు. యువతకేకాక, పెద్దలకూ ఇంటర్నెట్ ద్వారా నేర్పుతారు.
  • యుట్యూబ్‌లో ఉచిత ఉపన్యాసాలు : కు పైగా ఉచితంగా సులువుగా గ్రహించగలిగే ఉపన్యాసాలు లభిస్తాయి. ఇది అత్యధిక వీక్షకులున్న వాటిలో తొలిస్థానంలో ఉంది.
  • శాస్త్రవేత్తలకూ, పరిశోధకులకూ ఆసరా : విజ్ఞానశానానికీ, ఆధ్యాత్మికతకూ పరిశోధకుల ద్వారా ఆధ్యాత్మికశక్తి, చికిత్సలు అనే వారధిని నిరంతరం నిర్మిస్తుంది.
  • THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM అంతర్జాతీయ యువసంస్థ (ఎన్ఐవెఎఫ్) : దైనిక, క్రియాన్నుఖమైన సమాజనిర్మాణానికి శాంతి, జ్ఞానాలతో కూడిన ఆదర్శాలు గల స్ఫూర్తి పొందిన యువకుల సమూహం.
  • సీ శక్తి : జీవన్ముక్తి కోసం పాటుపడే క్రియాన్నుఖ స్త్రీల సమూహం. వీరు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక స్థాయిలో సమాజసేవ చేస్తారు.
  • నిత్యధీర సేవాసేన : తమలో మార్పు తెచ్చుకోవడం ద్వారా, ఆనందసేవకులుగా పేరుపడిన ఈ బృందం, మానవతకు సేవచేయడం, తోడ్పడటం, ప్రకృతి వైపరీత్యాలు బాధితులు కోలుకోవడం నిర్వహిస్తుంది.

వారి ఇతర ప్రచురణలు :

  1. తలుపు తెరవండి... చల్లనిగాలిని లోనకి రానివ్వండి
  2. ఆయన పేరు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
  3. సత్యం సూటిగా
  4. ఆనంద స్పురణ
  5. గురుదేవు
  6. ఉవాచ శ్రీ ఆనందేశ్వర దేవాలయం & ఆరోగ్య ప్రదాయిని మర్రి వృక్షం
  7. మరణం జీవించటం నేర్పించే గురువు
  8. చెప్పని చిన్న కథలు పెద్ద సత్యాలు
  9. నిత్యధ్వానం గణపతి