1. Ananda Spurana
అనాహత చక్రం
అనాహత చక్రం గుండె ఉండే ప్రాంతంలో ఉంటుంది. సంస్కృతంలో అనాహత అంటే 'సృష్టించలేనిది' లేదా 'పుట్టించలేనిది' అని అర్ధం. అనాహత చక్రం ప్రేమ, భావోద్వేగం, మనోభావాలకు సంబంధించినది. మీరు ఎదుటివారి శ్రద్ధ, ప్రేమ మీకు కావాలి అని అనుకున్నప్పుడు ఈ చక్రం బంధింపబడుతుంది. అదే మీరు స్వార్ధం లేని ప్రేమని పంచినప్పుడు, మీరు షరతులు నిబంధనలు లేకుండా ప్రేమించినప్పుడూ ఈ చక్రం వికసించుతుంది. దీని అర్ధం ఏమిటి అంటే నిజమయిన ప్రేమని బయట పుట్టించి మీలో నింపుకోలేరు అని. అది కేవలం మీలోనే ఉదయించాలి. అంతే
ఇది మీ లోతయిన అంతరంగాన్ని తెలుసుకున్నప్పుపు జరుగుతుంది. మనలో నిజమయిన ప్రేమ ఉంటే మనం బయట ప్రేమని, ఎదుటి వారి శ్రద్ధని ఆశించము. మన అంతరంగంలో ప్రేమ మనకి గొప్పశక్తి అవుతుంది.
మహా మంత్ర ధ్యాన పద్ధతి
మహామంత్ర ధ్యాన పద్ధతి ప్రాచీన టిబెటియన్ బౌద్ధుల ధ్యానపద్ధతి. ఇది గుండె ప్రాంతంలో ఉండే అనాహత చక్రాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఈ ధ్యానం చేస్తే మీ మైండ్ స్పష్టంగా, దృఢంగా ఉంటుంది. ఈ ధ్యానం చేసినప్పుడు మీలో శక్తి ప్రవహించుతుంది. మీలో పొంగి ప్రవహించే శక్తిని ప్రేమని ఇతరులకి ఇవ్వగలుగుతారు.
ఈ ధ్యానం చేయటానికి మొత్తం 30 నిముషాలు టైం పడుతుంది. దీనిని ఖాళీ కడుపుతో చేయాలి. ఉదయం పూట చేస్తే బాగుంటుంది. భోజనం చేసాక రెండు గంటలు ఆగి ధ్యానం చేయండి. ఈ ధ్యానాన్ని ఒంటరిగా అయినా చేయవచ్చు లేదా సమూహంగా చేయవచ్చు. మీరు ధ్యానం చేసిన ప్రదేశం శక్తితో నిండుతుంది.
మీరు నేల మీద కూర్చొని కళ్ళు మూసుకొని, పెదాలు దగ్గరగా మూసి మ్….మ్….. అనే శబ్దం చేయండి. ఇది మీ లోపలి నుంచి, నాభి ప్రాంతం నుంచి రావాలి. ఇది కేవలం మ్…… శబ్దం హం కాదు ఓం కాదు. మ్ అనే శబ్దాన్ని ఎంత లోతుగా, గట్టిగా చేయగలిగితే అంతసేపు చేయండి. మ్ అనే శబ్దాన్ని ఎంత సేపు చేయగలిగితే అంతసేపు చేయండి. అలా 20 నిముషాలు చేసాక ఆపండి. అలా 10 నిముషాలు నిశ్శబ్దంగా ఉండండి. చిరునవ్వు ముఖంతో ఉండండి. ఏవయినా ఆలోచనలు వస్తే రానీయండి. వాటిని ఆపటానికి ప్రయత్నించకండి.
ఈ ధ్యానం ప్రతిరోజు సాధన చేయటానికి అనువయినది. దీనిని ముందుగా ధ్యానపీఠంలో శిక్షణపొంది, వారిచే నియమించబడిన ఆచార్యుల పర్యవేక్షణలో చేయాలి. మీ అంతట మీరు చేయవద్దు.
వ్యధ, బాధ, దుఃఖం లేని జీవితం
ప్రతి వ్యక్తిలో సామాన్యంగా, తప్పనిసరిగా ఉండే ఒక భావం బాధ. బాధలు అనేవి ప్రతివ్యక్తిలో ఉంటాయి. అన్ని వయస్సుల వారిలో, అన్ని సంస్కృతీ సంప్రదాయాల వారిలోనూ, ధనవంతులు పేదలు, పండితులు, పామరులు అందరిలోనూ బాధ అనేది ఉంటుంది.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM బాధల గురించి చాలా చక్కగా చెబుతారు. 'అందరికీ బాధలు ఉంటాయి. ఎవరికైనా బాధలు లేకపోతే, అది వారికి మరీ బాధాకరం. అలా బాధపడటానికి బాధలు లేనివారు అభద్రదతా భావంతో విలవిలలాడతారు. దేనిగురించి బాధపడాలా అని ఆలోచిస్తారు'.
స్వామీజీ ఈ విషయం గురించి చాలా వివరాలు ఇస్తారు. బాధలుపడే వారంతా ప్రతి విషయానికి బయట ప్రపంచాన్ని, అందులోని వ్యక్తులని లేదా సంఘటనలని తప్పుపడతారు. మనలోని బాధలకి బయట ప్రపంచం కారణమయితే కనీసం ఒక వ్యక్తి అయినా దానిని ఛేదించి బాధల నుంచి విముక్తి పొందరా? అంటే మన బాధలకి బయట ప్రపంచం కారణం కాదు. మనమే బాధ్యులము అని చెబుతారు.
బాధ అంటే ఏమిటో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ విధంగా చెబుతారు "బాధ అనేది ఏదైనా ఒక సంఘటనకి మీ నుంచి వచ్చే స్పందన" ఏ విషయమయినా మిమ్మలని బాధించాలి అంటే ఆ సంఘటనకి మీరు ఎలా స్పందించాలి అని నిర్ణయించుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది.
అయితే ఈ స్పందన అనేది ఆ సంఘటన జరిగినప్పుడు దాని గురించి మన లోపల మనం అర్థం లేకుండా మాట్లాడుకోవడం వలన జరుగుతుంది. అంటే అసలు ఈ బాధ అనేది నిరంతరం మీ లోపల మీరు మాట్లాడుకునే అర్ధంలేని మాటలు సమూహం. ఉదాహరణకి మీ స్నేహితునికి చాలా మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పారనుకోండి. వెంటనే మీరు ఇలా ఆలోచించారనుకోండి, "అతనికి చాలా మంచి ఉద్యోగం వచ్చింది. జీతం అలవెన్సులు చాలా ఎక్కువ. కానీ నా పరిస్థితి ఏమిటి ఈ సంగతి నా భార్యకి తెలిస్తే ఏమనుకుంటుంది. నేను కూడా ఒక కొత్త ఉద్యోగం వెతుక్కోవాలా? కానీ నేను దురదృష్ణవంతుడిని. నాకు ఏదీ కలసిరాదు"…. ఇలా అంతులేని ఆలోచనలతో నిండిపోతారు. ఇలా ఎన్నో మాటలు వస్తాయి. దీనినే బాధ అంటారు. మిమ్మలని మీరు బయట ప్రపంచంతో పోల్చుకోవటమే బాధపడటం అంటే. అందుకే నిరంతరం 'అయ్యో వాళ్ళు' ఏమనుకుంటారో అని బాధపడుతుంటాము.
ఈ సందర్శంగా మనకి తెలియని రహస్యమొకటి స్వామి చెబుతారు. బాధపడటం మైండ్‌కి ఆహారం లాంటిది, అహంకారానికి ఆధారం లాంటిది. అందుకే అందరూ సమస్యలలో ఉండటానికి ఇష్టపడతారు. అలా ఉన్నప్పుడే
మీరు సంపూర్ణమయిన వ్యక్తిని అని అనుకుంటారు. అందుకే అందరూ నిజంగా బాధలని ప్రేమిస్తారు.
బాధ అంటే మన మనస్సులో నిరంతరం సాగే అంతరంగపు మాటల ప్రవాహం. వీటినే మనం ఆలోచనలు అంటాము. ఈ ఆలోచనలు అన్ని కలిపితే అది మన మానసిక స్థితి అవుతుంది. అదే మన మనస్సు లేదా మైండ్. ఇవే మన జీవితాలని నిర్దేశించుతాయి. ఈ విధంగా మీ మనస్సే మీ జీవితాన్ని తాను జీవిస్తుంది.
ఈ బాధల నుంచి బయటపడాలి అంటే, మీరు మీ బాధలని అంగీకరించాలి. మీరు వాటిలోపలికి లోతుగా వెళ్ళగలగాలి. అప్పుడు ఈ సమస్యలన్నీ మీరు సృష్టించుకున్నవే అని మీకు అర్ధమవుతుంది. మీరు సచేతన స్థితిలో ఉండగలిగితే మీరు మీ మైండ్‌ని మీ ఇష్టప్రకారం ఉపయోగించకోవచ్చు
ముందుగా మీరు మీతో మంచి సంబంధాన్ని ఏర్పరుచుకోండి. అప్పుడు మీకు బయటవారితో అవసరం ఉండదు. మీ మైండ్ వెనుకకి ధైర్యంగా వెళ్ళండి. మీకు అపాయింట్‌మెంట్ ఇచ్చుకోండి. అప్పుడు మీరు మీ ఆలోచనలని తెలుసుకునే తత్వంలో గమనించండి. క్రమంగా మీ ప్రతి ఆలోచనని పరిశీలించండి. మీకు వచ్చే వ్యతిరేకపు ఆలోచనలని చిరునవ్వుతో చూడండి. మీకు కలిగే వ్యతిరేక సంఘటనలని చూసి, "నీవు నన్ను ఏమీ చేయలేవు" అని చెప్పండి. అప్పుడు ఆ వ్యర్థపు ఆలోచనలు మీలో బాధని సృష్టించవు.
మీరు బాధపడటానికి మరొక కారణం మీరు నిరంతరం జరిగిపోయిన విషయల గురించి అపరాధభావంతో అయినా ఉంటారు లేదా జరగబోయే విషయాల గురించి ఆతృతతో అయినా ఉంటారు. ఈ విధంగా ఇటువంటి ఆతృత, అపరాధ భావాలతో మిమ్మలని మీరు బరువుగా చేసుకుంటారు. మీలో
80% శక్తి కేవలం దీనికే ఖర్చు చేసారు. మీరు బాధల నుంచి స్వేచ్ఛ పొందాలి అంటే పూర్తిగా వర్తమానంలోనే ఉండండి.
మీలో ప్రవాహంలా వచ్చే ఆలోచనలని ఒక పరిశీలకుడిగా గమనించండి. కానీ వాటిని ఆపటానికి ప్రయత్నించటం వలన మీరు మీకు ఉన్న బాధలకు మరొక బాధను కలుపుతున్నారు. అది బాధలని ఎలా ఆపాలి అనేది. వాటిని అణచకండి. అవి మరింత విజృంభిస్తాయి.
మీరు మీ భావావేశాలలో ఎంతగా చిక్కుకుపోయారంటే, మీరు వాటి నుంచి వేరుపడటం ఎలాగో తెలియనంతగా. ఎప్పుడయితే ఈ ఆలోచనలని పరిశీలించటం మొదలుపెడతారో అవి క్రమంగా మాయం అయిపోతాయి. క్రమంగా మీలో మార్పు వచ్చి మీరు ఒక కొత్త వ్యక్తిగా రూపాంతరం చెందుతారు. అప్పుడు మీలో బాధలు, కష్టాలు ఉండవు. ఏ వ్యక్తీ ఏ సంఘటన మిమ్మలని ప్రభావితం చేయవు. ఎందుకంటే వాటిని చూసి చిరునవ్వు నవ్వితే, అవి ఏమనుకుంటాయి, 'అబ్బే నేను ఈ వ్యక్తిని ఏమీ చేయలేను. నాకు ఇక ఇక్కడ పనిలేదు', అని మిమ్మలని వదిలి వెళ్ళిపోతాయి. యోగులు ఉండేది ఈ స్థితిలోనే.
మణిపూరక చక్రం :
మణిపూరక చక్రం నాభిస్థానంలో ఉంటుంది. సంస్కృతంలో మణిపూరక అంటే మణుల పట్టణం అని అర్ధం.
మనం నిరంతరం బాధపడుతుంటే ఈ చక్రం బంధింపబడుతుంది. బాధల గురించి బాధ పడటం మానేస్తే ఈ చక్రం వికసించి చైతన్యవంతమవుతుంది.
బాధలు మణిపూరక చక్రంతో దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. వ్యతిరేకపు ఆలోచనలు, వ్యతిరేకపు భావాలు సరాసరి వెళ్ళి మణిపూరక చక్రాన్ని ప్రభావితం చేస్తాయి. మనం జాగ్రత్తగా గమనించితే మనలోని వ్యతిరేకపు ఆలోచనలు నాభిప్రాంతం నుంచి రావటం తెలుస్తుంది.
స్వామిజీ, ఈ చక్రం గురించి చెప్పేటప్పుడు స్పష్టంగా ఒక విషయాన్ని వివరించుతారు :
మీకు సమస్యలు ఉన్నప్పుడు, మీరు నియంత్రించలేని, పరిష్కరించలేని కష్టం కలిగినప్పుడు మొట్టమొదటి మీ నాభి ప్రాంతం ప్రభావితం అవుతుంది. అప్పుడు మీ కడుపు భాగంలో బరువుగా అవుతుంది. అందుకే అంటారు 'బాధని నేను జీర్ణించుకోలేకపోతున్నాను' అని. నిరంతరం బాధలు ఉంటే మణిపూరక చక్రం బంధింపబడుతుంది.
మణిపూరక శుద్ధిక్రియ ధ్యానం :
దీనిని ప్రాచీన క్రైస్తవం నుంచి తీసుకొని సూఫీలు జిబ్బరీష్‌గా అభివృద్ధి చేసారు. ఈ ధ్యానం మీలో లోతుగా నాటుకుపోయిన బాధలను బయటకి తీసి మణిపూరక చక్రాన్ని శుభ్రం చేస్తుంది. ఈ ధ్యానాన్ని ఖాళీ కడుపుతో చేయాలి.
నిలబడి కళ్ళు మూసుకోండి. మీ మణిపూరక ప్రాంతంలోనికి బాగా లోతుగా వెళ్ళండి. అక్కడ ఎంత బరువుగా ఉంటుందో ఒక్కసారి అనుభూతితో తెలుసుకోండి. అక్కడ మీ ఏకాగ్రతని నిలపండి. అక్కడ వున్న కోపాన్ని బాధలని గుర్తు చేసుకోండి.
ఇప్పుడు మీరు ఏవైనా అర్ధం లేని శబ్దాలని ఎంత గట్టిగా చేయగలిగితే అంత గట్టిగా చేయండి. ఈ శబ్దాలు మీ నాభిప్రాంతం నుంచి రావాలి. అలా అరవటానికి మీకు తెలిసిన భాషని, అందులో పదాలని వాడవద్దు. మీకు మీ శక్తి కొద్దీ మీలోని వ్యతిరేక భావాలని బయటకి రప్పించండి. పూర్తిగా దీనిలో నిమగ్నమవ్వండి. ఇంకేమీ ఆలోచించవద్దు.
20 నిముషాలు అయ్యాక ఆపండి. 10 నిముషాలు నిశ్శబ్దంగా కూర్చొండి. మీ ఆలోచనలని గమనించండి. మీ మణిపూరక ప్రాంతం తేలికగా అయిన అనుభవం పొందుతారు. మీరు ఇప్పుడు తేలికగా సంపూర్ణమయిన ఆనందలో ఉంటారు.
ఈ ధ్యానం ఖాళీ కడుపుతో చేయాలి. ధ్యానపీఠం ఆచార్యుల పర్యవేక్షణలో నేర్చుకున్న తరువాత మాత్రమే ఈ ధ్యానం చేయాలి.
కల్పనలని, ఊహలని వదిలివేయటం :
మనం పరిపూర్ణమయిన స్వచ్ఛమయిన ఆనందస్ధితిని చేరటానికి ఉండే మరొక అడ్డంకు మనలో ఉండే కల్పనలు ఊహలు. ఇవి ముఖ్యంగా భార్యభర్తల విషయంలో, ఇతర సంబంధ బాంధవ్యాలలో చాలా ప్రభావాన్ని చూపించుతాయి.
అన్నింటికంటే మన సంబంధ బాంధవ్యాలలో ముఖ్యమైన సమస్య లైంగిక సంబంధమైన సమస్య. నిజానికి ఇది ఒక సమస్య కాదు. కొన్ని భావాలు చిన్నతనం నుంచి మన లోపల నిలువ అయిపోయి దానితో సమస్యలు వస్తుంటాయి.
ఈ సమస్య గురించి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చాలా చక్కగా స్పష్టంగా వివరించుతారు. జీవశాస్త్రం ప్రకారం స్త్రీ పూర్తిగా స్త్రీ కాదు ఆమె 51 % స్త్రీ, 49% పురుషుడు. అదేవిధంగా పురుషుడు 51% పురుషుడు, 49% స్త్రీ అయితే సమాజం చిన్నతనం నుంచి మనలో ఆ రెండవ భాగాన్ని, ఆ లక్షణాలని ప్రదర్శించనీయకుండా అణచివేస్తుంది. పురుషుడు స్త్రీ లక్షణాలని చూపించటానికి ఒప్పుకోదు. అదే విధంగా స్త్రీని పురుష లక్షణాలని చూపనీయదు.
వారిలోని అర్ధ భాగం అణిచివేయబడటంతో తాము పోగొట్టుకున్నభాగం కోసం బయట ప్రపంచంలో వెతకటం ప్రారంభిస్తారు. అక్కడ అందుబాటులో ఉండే మాస్ మీడియా అయిన సినిమాలు, టి. విలు, ఎడ్వటైజ్‌మెంట్లు ద్వారా ఒక అందమైన రూపాన్ని తమ మైండ్‌లో తయారు చేసుకుంటారు. ఆ రూపానికి తోడు ఇలా ఉండాలి అలా ఉండాలి అనే అభిప్రాయలు ఏర్పరచుకుంటారు. ఆ విధమయిన అభిప్రాయంతో జీవితభాగస్వామిని చూసారు. అప్పుడు తన భాగస్వామితో తన ఊహలలోని వ్యక్తితో పోల్సి చూస్తే ఎక్కడా సంబంధం ఉండదు. అసలు అలా జరగటం అసంభవం. ఎందుకంటే ఊహలలోని వ్యక్తి కల్పన, నిజ జీవితంలోని వ్యక్తి సత్యం. ఇప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి.
ఇప్పుడు ఏమి చేస్తారంటే తమ భార్య/ భర్తని తమ ఊహలలోని రూపంలా మార్చాలని ప్రయత్నాలు మొదలుపెడతారు. భార్య, భర్త తమ చేతిలో ఒక ఉలిని సుత్తిని పట్టుకొని తన ఊహలకి అనుగుణంగా ఎదుటి వ్యక్తిని చెక్కటం ప్రారంభించుతారు. అందుకే ఏ ఇంటిని గమనించినా మనకు వినపడేది ఆ చెక్కుడు శబ్దాలే. ఈ విషయాలు చెబుతూ సరదాగా మనకి చురుక్కుమనే నిజాన్ని స్వామి ఇలా చెబుతారు " వివాహంలో తాళిబొట్టు ఇచ్చే బదులు సుత్తి, ఉలి ఇస్తే ఇటువంటి వారికి బాగుంటుందేమో!" అని.
చెక్క లేదా రాతిని చెక్కితే అందమయిన బొమ్మలు, విగ్రహాలు వస్తాయి. కానీ మనిషిని చెక్కితే మిగిలేది బాధ. అది ఒకరకమయిన హింసలాంటిదే. ఇటువంటి చెక్కుడు వలననే ధర్మక్షేతాలుగా ఉండే గృహాలు కురుక్షేత్రాలుగా మారిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధం వ్యధా పూరితం అవుతుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ నమ్మకం అనేవి లేకుండా పోతున్నాయి.
ఇదేవిధంగా తల్లితండ్రులు పిల్లలను చెక్కుతారు. తమ జీవితాలని పిల్లలద్వారా జీవించాలని చూస్తారు. స్వామీజీ ఈ సందర్భంగా ఇలా చెప్పారు. 'నేను ఒకసారి కొంతమంది పిల్లలని కలసినప్పుడు వాళ్ళు నాతో, మా నాన్నగారు నేను ఇంజనీర్ మాత్రమే అవ్వాలి అంటున్నారు, మా తల్లితండ్రులు నన్ను మెడిసన్ చదవమంటున్నారు….. ఇలా ఉన్నాయి వారి మాటలు ఇది కూడా హింస పెట్టటమే' అని అన్నారు.
ఒక విషయాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. స్వామీజీ చాలా గట్టిగా ఇలా చెబుతారు. జీవించి ఉన్న ఏ వ్యక్తీ ఊహలలో ఉన్నట్లు జీవించలేరు. ఎందుకంటే ఊహలలోని రూపం నిజాల నుంచి తయారయినది కాదు. మీరు నిజాల నుంచి, మీ చుట్లు ప్రక్కల ఉన్న వ్యక్తుల నుంచి ఊహలతో రూపాన్ని తయారు చేసుకుంటే పరవాలేదు. కానీ మీరు సినిమాల నుంచి, అడ్వటైజ్‌మెంట్స్ నుంచి తయారు చేసుకుంటారు. అందుకే చివరిలో మీకు మిగిలేది ప్రేమ కాదు, వ్యధ, బాధ.
అయితే మనం ఏమి చేయాలి. స్వామీజీ దీనికి ఒక చక్కని పరిష్కారం చెప్పారు. మీరు మీ మైండ్‌లో మీ భార్య లేదా భర్త పట్ల ఏర్పరచుకున్న అభిప్రాయాలని అదేవిధంగా మీ ఊహలలోని రూపాన్ని ఒక ప్రక్కన పెట్టండి. మీ భార్యని ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చూదండి. అదే ఆమెని మొదటిసారి చూస్తున్నాను అన్నట్టు చూదండి. ఆమె ప్రతి మాట, చేసే ప్రతి పనినీ కొత్త విషయంలా గమనించండి. అసలు ఎటువంటి అభిపాయానికీ రావద్దు. ఆమెపై ప్రేమతో ఉండండి. ఆమె మాటలు రెచ్చగొట్టే విధంగా ఉన్నా మీరు తెలుసుకునే తత్త్వంతో వినండి. వాధించవద్దు. అలా 24 గంటలు ఉండండి. అప్పుడు మీకు ఉన్న సమస్యలకి మీ ధృక్పధమే కారణం అని తెలుస్తుంది.
మీరు అనవచ్చు, మరి నా భార్య మారనవసరం లేదా? ఆమె ఎలా స్పందించుతుందో కదా! అని. ఈ ప్రశ్నకు స్వామీజీ కచ్చితమయిన జవాబు ఇస్తారు, "మీ లోపల ఎదుటివారిని మార్చగల శక్తి ఉన్నది. మీలో మార్పు రాగానే మీ భార్య అప్రయత్నంగా మారిపోతుంది. మీరు ఈ విధంగా చేయగలిగితే మీరు మీ భార్య ఇద్దరూ వికసించటానికి తోడ్పడినవారవుతారు. మీకు ఒక్కసారి ఒక 24 గంటలు ఇలా ప్రయత్నించి చూదండి మీ ఇద్దరూ వికసించటానికి మార్గం అదే ఏర్పడుతుంది".
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఇక్కడ ఒక అద్భుతమయిన సూక్ష్మసత్యాన్ని చెబుతారు,"మీరు చేసే సృష్టి భగవంతుని సృష్టితో పోటీకి వెళ్ళగలదా? మీ సృష్టి అంతకంటే గొప్పగా ఉంటుందా?"
మీ భార్య, భర్త, పిల్లలూ ఇలా అందరూ ఆ భగవంతుని సృష్టి. మనం ఆ సృష్టిని మార్చి ఇంకా అద్భుతంగా చేయగలమా? కచ్ఛితంగా చేయలేము. మరి ఎందుకు ఈ తాపత్రయం. వ్యక్తిని వ్యక్తిగా మీ జీవితంలోనికి ఆహ్వానించగలిగితే జీవితం ఆనందమయంగా ఉంటుంది.
మీ కోరిక స్వచ్చమయినది అయితే, అందులో మీకు అత్యాశలు అపరాధ భావాలు లేకపోతే అప్పుడు మీరు అందులో లోతుగా వెళ్ళగలగుతారు మీరు అందులోంచి బయటకి వచ్చి వికసించగలుగుతారు. ముందు మీరు మీ శరీరాన్ని, ఎదుటివారి శరీరాన్ని ప్రేమించటం నేర్చుకోండి. మీ శరీరంలో పరమానందం నిరంతరం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు దానిని బయటకి రానీయటం లేదు. ఎందుకంటే మీరు మీ ఊహలలో చిక్కుకుపోయారు. ఎప్పుడయితే మీరు ఊహలని వదిలివేస్తారో, అప్పుడు మీరు ఆనందాన్ని తెలుసుకోగలరు.
మూలాధార చక్రం :
మూలాధార చక్రం వెన్నుముక క్రింది భాగంలో ఉంటుంది. సంస్కృతంలో మూలాధార అంటే అనంతసృష్టికి ఆధారమయిన అని అర్ధం. మూల అంటే వేర్లు, ఆధార అంటే ఆధారం. అంటే సమస్త సృష్టికి ఆధారమయినది అని అర్ధం.
మనం కల్పనలు, ఊహలలో ఉంటే ఈ చక్రం బంధింపబడుతుంది.
కల్పనలు వదిలివేసి సత్యాన్ని గ్రహించినప్పుడు ఈ చక్రం వికసించి చైతన్యవంతమవుతుంది. ఇది లైంగిక పరమయిన విషయాలకి సంబంధించిన చక్రం. మనలోని 80% శక్తి మూలాధారం చక్రంలో ఉంటుంది. ఈ చక్రాన్ని మనం ప్రత్యేకంగా శక్తివంతం చేయనవసరం లేదు. అందులో శక్తిని సరియైన పద్ధతిలో ఉపయోగించగలిగితే మన జీవితం మరింత నాణ్యతతో ఉంటుంది.
దుఃఖహరణ ధ్యానం :
ఈ ధ్యాన పద్ధతిని కాలార్నవ తంత్రం నుంచి తీసుకున్నారు. దీనిని 30 నిముషాలు చేసే విధంగా స్వామి రూపొందించారు. ఈధ్యానం ఉదయం ఖాళీ కడుపుతో చేయాలి. ఈ ధ్యానాన్ని 21 రోజులు చేస్తే మీలో స్పష్టమయిన మార్పు కనిపిస్తుంది. మీకు తెలియని అందమయిన ప్రకాశం మీలో కలుగుతుంది. ఈ ధ్యానం ఒక మానసిక స్నానం లాంటిది.
దుఃఖహరణ ధ్యానాన్ని మూడు దశలలో చేయాలి మొదటిదశ 10 నిముషాలు. ఈ దశలో లయబద్ధంగా, లోతుగా శ్వాసతీసుకోవాలి. అలా శ్వాస తీసుకోవటానికి అనువుగా మీరు నిలబడి పైకి కిందకి మోకాళ్ళు వంచుతూ, చేతులు పైకి క్రిందకీ కుంగుతూ పక్షి ఎగురుతున్న విధంగా చేయాలి. మీరు శ్వాస తీసుకునేటప్పుడు కిందికి వంగాలి. శ్వాస వదిలేటప్పుడు పైకి లేవాలి. ఆ తరువాత పది నిముషాలు మీ శరీరంలోని ప్రతి భాగం కాలి వేళ్ళ దగ్గర నుంచి తల వరకూ ఒకదాని తరువాత ఒకదానిని టెన్స్ చేయాలి. అంటే బిగదీసి తరువాత వదుల చేయాలి. అలా పది నిముషాలు చేయాలి.
తరువాత పది నిముషాలు కూర్చొని హూ అనే శబ్దాన్ని చేయాలి. అది కేవలం హూ అనే శబ్దం. మీరు విరామంగా నవ్వు ముఖంతో ఉండాలి.
హెచ్చరిక : ఈ ధ్యాన పద్ధతిని మొదటసారి ధ్యానపీఠం ఆచార్యుల పర్యవేక్షణలో మాత్రమే నేర్చుకొని చేయాలి. మీ అంతట మీరు చేయకూడదు. ఏవయినా శారీరక, మానసిక సమస్యలు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి.
భయాన్ని ఎదుర్కొనటం :
మనలో ప్రతి ఒక్కరికీ రకరకాలు భయాలు ఉంటాయి. చీకటంటే భయం, ఒంటరిగా వెళ్ళాలంటే, క్రొత్తవారంటే, సాహసం చేయాలి అంటే, పైకి ఎక్కాలి అంటే, నీరు అంటే ఇలా చాలా భయాలు ఉంటాయి. ఈ సందర్శంలో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఒక చిన్న సత్యాన్ని మనముందు ఉంచుతారు. 'మనకి ఉన్న భయాలన్నీ మరణానికి సంబంధించిన భయాలే. కాకపోతే వేరువేరు రూపాలలో ఉంటాయి. అయితే అవి ప్రత్యక్షంగా ఉండవు' అని చెబుతారు.
అసలు మరణం అంటే ఏమిటి? మనం ఏమని జవాబు ఇస్తాము? మరణం అంటే జీవితం చివరలో జరిగేది అని. కాని THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఇది మన జీవితంలో ప్రతిక్షణం జరుగుతుంది అని చెబుతారు. మన జీవితం మొత్తాన్ని మరణం అనే విషయం నియంత్రిస్తుంది. మరణం మన జీవితానికి పరాకాష్ట. మన జీవితం అంతా దీనివైపు నిర్దేశింపబడి ఉన్నది.
మనం మరణం గురించి లోతుగా అర్ధం చేసుకుంటే అందులో రహస్యాలని, అద్భుతాలని తెలుసుకోగలిగితే మన జీవిత రహస్యాలని తెలుసుకోగలం. మరణం అంటే మరొక రూపంలోనికి కొనసాగింపులా దీనిని చూడాలి. లేకపోతే జీవితాన్ని పొగొట్టుకుంటాము. మరణం మనకి గొప్ప గురువు.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కఠోపనిషత్‌లోని నచికేత కధ చెబుతూ మరణం గురించి నాలుగు అద్భుతమయిన అమృతవాక్కులు చెబుతారు.
మనం మరణాన్ని వెతుకుతూ వెళితే అక్కడ మరణం ఉండదు.
ఒక వేళ మరణం అక్కడ ఉన్నా మనని భయపెట్టదు.అది మనని ప్రేమిస్తుంది.
మరణం గొప్ప గురువు.
మరణం మనకి అంతిమ బహుమతి ఇస్తుంది.అదే జ్ఞానం.
మనిషి తన భౌతిక రూపాన్ని అతిగా ప్రేమించుతాడు.అందుకే అంత బాధ పడతాడు.కాని ఈ శరీరం ఆత్మకి ఒక వాహనం లాంటిది.
మీరు మరణ భయాన్ని జయించితే మరణాన్ని జయించినట్లే. ఎందుకంటే మరణం మరోక ఊహ మాత్రమే. మరణం అంటే మరోక రూపం లోనికి మారే ప్రక్రియ అని అర్ధం చేసుకోవాలి.అప్పుడు జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.
మనకి ఉన్న కొన్ని భయాలు,మన ఐశ్వర్య,పేరుప్రతిష్ఠలు పోతాయనే భయం. మన ఆరోగ్యం పాడవుతుందేమో అనే భయం మానసిక స్థిరత్వం పోతుందేమో అన్న భయం. తెలియని భగవంతుడు అంటే భయం.దెయ్యాలు భూతాలు అంటే భయం అయితే ఇవన్నీ కూడా మరణభయం యొక్క వివిధ రూపాలే అంటారు స్వామీజీ.
స్వామీజీ మన జీవితం పూర్తిగా జీవించాలి అని చెబుతారు. పూర్తిగా జీవించటమంటే మీ నిజమయిన కోరికలని స్పష్టతతో తెలుసుకునే తత్వంతో గుర్తించి ఆ కోరికలని మాత్రం తృప్తి పరుచుకోవాలి. అప్పుడు జీవితంలో పరిపూర్ణతని అనుభవించుతారు. మరణించాలి అంటే భయపడరు.
మీరు మీ అంతరంగ లోతుల్లోనికి చూడగలిగితే మనకి ఉండేది మరణ భయం కూడా కాదు. జీవితాన్ని సరిపడా జీవించలేదు అన్న భయం. అబద్ధపు జీవితాన్ని గడిపాము అన్న భయం.పరిపూర్ణత పొందలేదు అన్న భయం.ఇక్కడే మరణ భయం ప్రారంభమవుతుంది.
స్వామీ ఈవిధంగా కూడా చెబుతారు, లోతయిన వ్యక్తిత్వంతో మీరు జీవించగల స్థాయిలో జీవించండి. మీరు స్పష్టతతో పూర్తి సంతృప్తి పొందే విధంగా జీవించండి. అప్పుడు మీకు మరణం అంటే భయం ఉండదు.
మన భయాలన్నీ కూడా మనం పోగొట్టుకోవటానికి అక్కడ ఏమిలేదు అనే విషయం స్పష్టంగా మనకి తెలియకపోవటమే.మరణాన్ని దగ్గరగా ఎదుర్కున్న వారికి అక్కడ పోగొట్టుకోవాటానికి ఏమిలేదు అని తెలుసు.
మీకు ఉన్న భయాలన్నీ కూడా 'భయం అంటే ఉండే భయాలే?. మీరు తెలివితేటలతో వాటిని దులిపివేస్తే,అవి ఆధారంలేని నీడలని మీకర్తమవుతుంది.
అదే విధంగా కీర్తి ప్రతిష్ణలు,అధికారం,పరువు ఇవన్నీ మీరు కల్పించుకున్న ఊహలే. మీరే వాటికి ప్రాణం ఇచ్చి అభివృద్ధి చేసి,అవి పోతాయేమో అని భయపడుతూ ఉంటారు వాటికి నిరంతరం కాపలా కాసుంటారు.ఇదంతా మీ అహంకారానికి కాపలాకాసే పద్ధతి.
చీకటిని చూసి ఎందుకు భయపడతారు. చీకటి చాలా అందంగా ఉంటుంది. మీరు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు అక్కడ అంతా చీకటే. ఈ ప్రపంచంలోనికి వచ్చాక మీకు చీకటితో సంబంధం తెగిపోయింది. చీకటిని గాఢమయిన ప్రేమతో చూడగలిగితే,అమ్మ గర్బం అనే అనుభూతితో చూస్తే చీకటి అంటే భయం అనిపించదు.
భయాన్ని ఎలా అదిగమించాలో చెబుతూ స్వామీజీ ఇలా అంటారు:భయం మిమ్ములను గుడ్డి వాళ్ళని చేస్తుంది. అది మీలో వివేకాన్ని,ఆలోచనా శక్తిని మాయం చేస్తుంది.అందుకే భయాన్ని లోతుగా అర్ధం చేసుకోండి. అలా తెలుసుకోగలిగినప్పుడు మీలో ఉండే మామూలు శక్తి ఉన్నతమైన శక్తిగా మారుతుంది. మీలో వివేకం పెరుగుతుంది. దానిని అణచటానికి ప్రయత్నించకూడదు.దానిని తెలుసుకోగలగటం ఒక్కటే దారి. మీరు భయాన్ని అణచివేసే దానిని పోగొట్టుకునే అవకాశం కోల్పోతారు.భయాన్ని తెలుసుకోగలిగితే మరణం సంభవించినా దానివైపు చూడగలుగుతారు,దానిని స్వాగతిస్తారు. ఎప్పుడయితే మరణ భయం పోతుందో మిగతా భయాలు కూడా పోతాయి.
స్వాధిష్ఠాన చక్రం:
స్వాధిష్ఠాన చక్రం నాభికి రెండు అంగుళాల దిగువున ఉంటుంది. స్వాధిష్ఠాన అంటే మీ ఉనికి ఎక్కడ స్థిరపరచుకున్నదో అని అర్ధం. భయం ఈ చక్రాన్ని బంధిస్తుంది. భయాన్ని,మరణ భయాన్ని అంగీకరించటం ద్వారా ఈ చక్రాన్ని వికసింపచేయవచ్చు.
నిర్యయధ్యానం (చీకటి ధ్యానం) :
నిర్యయధ్యాన పద్ధతిని వేదాంతం నుంచి తీసుకున్నారు. ఈ ధ్యానం మీ శరీరానిని దాటిన అనుభవాన్ని ఇస్తుంది. దీనిని క్రమంగా చేస్తుంటే చీకటిలో ఉండే విశ్వశక్తి మిమ్ములను శక్తివంతం చేస్తుంది. ఇది స్వాధిష్ఠాన చక్రకాన్ని శకితో నింపుతుంది. ఇది 30 నిముషాలు ధ్యానం.
నేలమీద కాని కుర్చీలో కాని సౌకర్యంగా కూర్చోని కళ్ళుమూసుకొని మీరు దట్టమయిన అడవిలో ఒక చీకటి గుహలోనికి ప్రవేశించి అక్కడ కూర్చున్నారు అనుకోండి.అక్కడ ఎంత చీకటిగా ఉన్నది అంటే మీరు స్పర్శ ద్వారా తప్ప మీకు మీ శరీరం కనిపించనంత చీకటిగా ఉన్నది.
మీరు ఆ చీకటిని శ్వాసించండి.నెమ్మదిగా మీ శరీరం ఆ చీకటిలో కరగిపోవటాన్ని అనుభవించండి.మీ శరీరం చీకటిలా అయిపోయింది అనుకోండి.
చివర ఐదునిమిషాలలో, మీ శరీరాన్ని అన్ని స్పర్శలతో ఉన్నట్టు అనుభూతి పొందండి.మీ శరీరాన్ని నెమ్మదిగా కూర్చున్న పద్ధతికి కదిలించండి. మీరు గుహలోంచి బయటకి వచ్చి,అడవి బయటకి వచ్చి,మెడిటేషన్ హాలుకి వచ్చేయండి.
హెచ్చరిక ఈధ్యానం ఆచార్యుల పర్యవేక్షణలో చేయాలి.మీరు ఒంటరిగా ఈ ధ్యానం చేయవద్దు.
అసూయనుంచి స్వేచ్చ పొందటం:
అసూయ గురించి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ విధంగా చెబుతారు. మనం ఎప్పుడయితే ఇతరుల ఉన్నతిని చూసి భరించలేమో అప్పుడు మనలో అసూయ పుడుతుంది. పోల్చుకోవటం విత్తనమయితే అసూయ దాని ఫలం.పోల్సుకోవటం అసూయ అనేవి ఏమి లేవు. మనమే వాటిని సృష్టించుతాము.
మనం పోల్చుకోవటంలో ఎంత బిజీగా ఉంటామంటే,అందులో పడిపోయి అసలు విషయాలని వాటిలా చూడము.దాంతో చాలా విషయాలు మిస్ అయిపోతున్నాము. పోలికకి నిశ్చయమయిన ఉనికి లేదు. అర్ధం చేసుకోవటమనే ధృక్పదాన్ని మీ మైండ్ లోనికి ప్రవేశపెడితే పోలికని అధిగమించగలరు. అది ఎలా అంటే చీకటిని బయటకి పంపటానికి దీపాన్నివెలుతురునిఎలా తెస్తారో ఇది కూడా అంతే.
మీరు పోల్సుకోవటం అసూయ అనే విషయాలని లోతుగా చూడగలిగినట్లయితే అవన్ని మీ మైండ్ ఆదే ఆటలు అని మీకు తెలుస్తుంది. మీరు మీవి కాని కోరికలవెంట పరిగెత్తవద్దు. మీకు ఏదైనా కావాలి అనిపించినప్పుడు మీతో మీరు కూర్చోని అది నిజంగా మీకు అవసరమా అని ఆలోచించండి. మీరు కేవలం మీ కోరికలతోనే జీవించగలిగితే మీరు ప్రశాంతంగా మరణించగలుగుతారు.
స్వామి చాలా స్పష్టంగా ఇలా చెబుతారు: 'నా అనుభవం' నుంచి మీకు చెబుతున్నాను. ఈ అనంత చైతన్య సృష్టి మీకు అన్నింటినీ ఇస్తుంది కానీ
మనం అసంత్సపికి అలవాటుపడి మనం పొందిన వాటి అనుభూతిని పొందే సున్నితత్వాన్ని పోగొట్టుకున్నాము. నిరంతరం ఇంకా కావాలి ఇంకా కావాలి అంటున్నాము. అందుకే మన అంతరాత్మలోనికి దృష్టిని నిలిపి సఫలమయిన జీవితం జీవించటం లేదు.
నిర్మాణాత్మక పోలికలో మీరు మీకు తెలియని విషయాలని ఇతరులనుంచి తెలుసుకుంటారు.అది పోలిక కాదు జ్ఞానాన్ని సంపాదించటం. అది మంచి పద్ధతి.
ఈ రోజులలో మరొక కుంగుబాటుని చూస్తున్నాము. జీవితంలో సాధించవలసిన ఐశ్వర్యం, పేరు[పతిష్టలు అన్నీ సాధించి, సంపాదించవల సినదంతా సంపాదించుతారు. కాని వాళ్ళలో సాధించామన్న తృప్తి ఉండదు. వాళ్ళలో పెద్ద శూన్యం ఏర్పడుతుంది. నేను ఎందుకు ఇంతకాలం ఇలా పరిగెడుతున్నాను అని బాధ పడతారు. దీనినే స్వామీజీ విజయపు కుంగుబాటు తనం అంటారు. ఇది చివరికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. దీనికి కారణం వారికి కాని కోరికల వెంట పరిగెతారు. ఈ స్థితినుంచి బయటకి రావాటానికి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది, అని స్వామీజీ చెబుతారు.
మానసిక కుంగుబాటు నుంచి బయటపడాలి అంటే ఆ విషయాన్ని లోతుగా అర్ధం చేసుకోవాలి మీరు చేసే పనులు చేతనస్థితిలో చేయాలి. ప్రతి పనినీ తెలుసుకునే తత్వంతో చేయాలి.
అసూయ విషయంలో స్వామీజీ చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతారు. అసూయ అనేది ఒకరితో పోల్సుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఎవరయినా మీకంటే అందంగా ఉంటే బాధపడవద్దు. భగవంతుడు కళాకారుడు కాని ఇంజనీరు కాదు. ఆయన సృష్టిలో ప్రతి వ్యక్తి అందమయిన వాడే, ప్రత్యేకమయినవాడే. అందంగా ఉన్నారు, లేదు అని అనుకోవటం కేవలం మీ కలను. మీకు ఎంతకావాలో అంత అందంగా ఉంటారు. మీకు తెలుసా, ఏ కళ్ళు అయితే మరొకరి మీద ఉండవో ఆ కళ్ళలో అందం, అమాయకత్వం ఉంటాయి. భగవంతుడు మీకు ఇచ్చిన దాని మీద నమ్మకం పెంచుకోండి. మిమ్మలని మీరు పూర్తిగా స్వీకరించినపుడు మీలో అద్భుతమయిన స్వేచ్ఛ, మీ మీద మీకు అంతులేని నమ్మకం ఏర్సదుతుంది.
ఒక విషయం నమ్మండి. అసూయ మీరు కాదు. మీరు ఎప్పుడయితే దానిని చూసి నవ్వగలరో అప్పుడు దానిని గమనించగలుగుతారు కాని దానిలో నిమగ్నమవ్వరు. మీరు ఈ ప్రపంచంలో చాలా ప్రత్యేకమయిన వ్యక్తి. మీలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా లేరు అని తెలుసుకోండి.
మీరు ధ్యానం చేస్తే మీలో వాస్తవాన్ని తెలుసుకునే శక్తి వృద్ధి అవుతుంది. మీరు పూర్తి అంకితభావంతో ఉన్నప్పుడే మీ గమ్యాన్ని చేరటానికి ఎంత కష్టమయినా భరించుతారు. దానికి తోడు ధైర్యం కూడా ఉంటే మీరు మీ లక్ష్యం వైపు ఒక పెద్ద అడుగు వేయగలుగుతారు. మీకు దైర్యం రావాలి అంటే మీరు బయటవారి వైపు చూడకుండా, కేవలం మీ లోపలికే చూడండి. మీ అంతరంగంలో మార్పులు జరుగుతాయి.
మీరు మీకున్న శక్తిలో 80% ఇతరులతో పోల్చుకోవటానికి అసూయ చెందటానికి ఖర్చు చేస్తున్నారు. ఆ శక్తిని కూడా మీ అభివృద్ధి కే ఉపయోగించగలిగితే మీ పనులలో సామర్థ్యం పెరుగుతుంది. మీ జీవన ప్రమాణంలో నాణ్యత ఉంటుంది. మీరు అంతరంగ ప్రపంచంలో ఆనందంగాను, బయట ప్రపంచంలో రారాజుగా బతకగలరు.
మీలోపలి అంతులేని వివేకాన్ని కనుక్కోవటమే జీవితమంటే. అందుకే పోల్చుకోవటం ఆపివేసి మీలోని అంతరంగాన్ని కనుక్కోండి. అదే మీకు నిజమైన అభివృద్ధికి ఆధారం. మీ అంతరంగం వైపు తిరగండి. అందులోని శాశ్వతమయిన పరమానందాన్ని, నిత్యానందాన్ని కనుగొనండి.
విశుద్ధి చక్రం:
విశుద్ధి చక్రం గొంతుక దగ్గర ఉంటుంది. సంస్కృతంలో విశుద్ధి అంటే శుద్ధికి అశుద్ధికి అతీతమయినది. మనం ఒకరితో పోల్సుకుని అసూయ చెందినప్పుడు ఈ చక్రం బంధింపబడుతుంది. మనం ఎప్పుడయితే మన వ్యక్తిత్వాన్ని, మన పూర్తి సృజనాత్మకతని వెల్లడి చేస్తామో అప్పుడు ఈ చక్రం వికసించుతుంది. విశుద్ధి అంటే స్వచ్ఛమయినది. అంటే విశుద్ధి చక్రం ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది. దీనికి కళంకం అంటదు. కాబట్టి ఈ చక్రాన్ని శుభం చేయవలసిన అవసరం లేదు. అందుకే పోల్సుకోవటం అనేది కేవలం ఈ చక్రాన్ని కమ్మే ఒక నీడ మాత్రమే. ఆ నీడ కూడా ఆధారం లేనిది.
విశుద్ధి చక్రం సృజనాత్మకతకి గొప్పపీఠం. ఈ చక్రంలో శక్తివిడుదల అయితే మీలో అద్భుతమయిన సృజనాత్మకత యొక్క ప్రవాహం మీకు అందుతుంది.
శక్తి సాగర ధ్యానం:
శక్తి సాగర ధ్యాన పద్ధతి జెన్‌బౌద్ధుల నుంచి తీసుకోబడినది. ఈ ధ్యానం విశ్వశక్తిని పొందటానికి ఉపయోగపడుతుంది. ఈ ధ్యానంలో ముఖ్యాంశం మీ శరీరం కదిలేటప్పుడు కూడా మీ ఏకాగ్రతని విశుద్ధి చక్రం మీద నిలపటం.
మీరు నిలబడి విశుద్ధి చక్రం మీద ఏకాగ్రతని నిలపండి. మీరు నిలబడ్డ దగ్గరే నడవటం మొదలుపెట్టండి. క్రమంగా వేగం పెంచండి. మీకు అసౌకర్యంలేనంత వరకూ నడవండి. నిరంతరం మీ ఏకాగ్రత విశుద్ధి మీద ఉండాలి. అలా 20 నిముషాల చేసాక ఆపండి. ఆ తరువాత పదినిముషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. విశుద్ధి చక్రం మీద ఏకాగ్రతని నిలపండి. మీరు నడచేటప్పుడు వచ్చిన శక్తిని ఇప్పుడు మీ శరీరం గ్రాహించుతుంది.
హెచ్చరిక: మొదటసారి ఈ ధ్యాన పద్ధతి చదివినవారు దీనిని ప్రయత్నించవద్దు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానపీఠం వారి ఆచార్యుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మీకు గుండె సంబంధమయిన, మరే విధమయిన సమస్యలు ఉన్నా మీరు ఈ ధ్యానం చేసే ముందు డాక్టర్ని సంప్రదించాలి.
ఈ ధ్యానం ఖాళీకడుపుతో ఉదయాన్నే చేస్తే మంచిది. భోజనం చేసాక రెండు గంటల తరువాత మాత్రమే చేయాలి.
అహంకారాన్ని వదిలివేయటం:
మనం పరమానంద స్థితిని తెలుసుకునే మార్గంలో ఉండే అతి పెద్ద అడ్డంకు, అతి పటిష్టమయిన గోడ అహంకారం, గంభీరత లేదా సీరియస్‌నెస్. ఇలాంటి వాళ్ళు జీవితాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఏదైనా ఒక విషయానికి అత్యధికమయిన ప్రాధాన్యతని ఇస్తారు. ఇటువంటివారు జీవితం నుంచి ఏదో ఒకదానిని అధికంగా ఆశించే తత్వం కలిగిఉంటారు.
ఈ విషయాన్ని వివరించుతూ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM గంభీరంగా ఉండటం అనేది అనారోగ్య చిహ్నం అంటారు. అంతేకాకుండా మనకి వచ్చే చాలా రకాల అనారోగ్యాలకి కారణం కూడా ఈ సీరియస్‌నెస్ అని స్వామీజీ చెబుతారు. స్వామీజీ మరొక ముఖ్యమయిన విషయం కూడా చెబుతారు. ఏదయినా ఒక పనిని మనస్ఫూర్తిగా, నిమగ్నమయి చేయటం అంటే సీరియస్‌నెస్ కాదు. మీరు మీ శక్తికొద్దీ పని చేయాలి కాని ఫలితాల గురించి సీరియస్‌గా పట్టించుకోకూడదు. ఏ పని అయినా సీరియస్‌గా చేస్తే ఆ పనిలో ఆనందాన్ని పొందలేరు. అలాంటి వాళ్ళు నవ్వలేరు. ఎందుకంటే గంభీరంగా ఉన్నవాళ్ళు నవ్వలేరు. మీరు మనస్ఫూర్తిగా, కుతూహలంతో ఆనందంగా పనిచేయగలిగితే, ఆడుతూపాడుతూ పనిచేస్తారు. అప్పుడు మీకు సమస్యలు ఉండవు.
సామాన్యంగా సీరియస్‌గా ఉండే వారిలో అహంకారం ఉంటుంది. వారికి వారిపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. అలాంటివారు నిరంతరం సీరియస్‌గా ఉండి ఆ తరువాత సంతోషపడవచ్చులే అనుకుంటారు. వాళ్ళు ఆ తరువాత కూడా సంతోషంగా ఉండలేరు.
అదే విధంగా పనులు ఖచ్చితంగా చేయాలి అని హడావుడి పడకూడదు. కచ్చితంగా (పర్ఫెక్ట్‌గా) అనే విషయం మిమ్మలని మానసికంగా కుంగదీస్తుంది. మీరు కచ్చితంగా చేయాలి అని చూడవద్దు. సంపూర్ణంగా చేయటానికి ప్రయత్నించండి. కచ్చితం, సామర్థ్యం అనే మాటల్ని పట్టించుకోవద్దు. ఇవన్నీ మెండ్ ఆడే ఆట.
అందుకే కచ్చితము అనేది మీకు ఆనందాన్ని ఇవ్వదు కాని మీ అహంకారానికి తృప్తిని ఇస్తుంది. కాని ఇది ఆత్మ తృప్తి కాదు. అందుకే కచ్చితమయిన వాళ్ళు అహంకారులు. వీళ్ళు తప్పు చేస్తామేమో అని భయపడుతుంటారు. వారి శ్రద్ధ అంతా తప్పు మీద మాత్రమే ఉంటుంది అంటే ఫలితం మీద మాత్రమే ఉంటుంది కానీ చేసే పని మీద ఉండదు.
ఇటువంటి అహంకారం ఉన్నవాళ్ళు నిరంతరం తప్పు చేస్తామేమో అనే భయంలో ఉంటారు. అలా ఎవరయినా వారి తప్పుని ఎత్తి చూపించితే వాళ్ళు అహంకారం దెబ్బతింటుంది. అది వాళ్ళు భరించలేరు. వాళ్ళు నిరంతరం అహంకారానికి ఎటువంటి దెబ్బ తగలకుండా కాపాడుకోవటానికి వాళ్ళు శక్తిని మొత్తం ఉపయోగించుతారు.
తప్పు చేసామేమో అని భయపడే వారికి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ విధంగా చెబుతారు. తప్పు చేయటం తప్పు కాదు. అలా తప్పు చేసినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. తప్పులు చేయకూడదని అతి జాగ్రత్తగా ఉన్నవాళ్ళు అసలు తప్పు చేయకూడని స్థితిలో తప్పు చేస్తారు. అది సరిదిద్దుకోలేనిది అవుతుంది.
కాని ఒక ముఖ్యవిషయం. కావాలని తప్పు చేయవద్దు అలాగే చేసిన తప్పు మళ్ళీ చేయవద్దు. ఈ విషయం బాగా అర్ధం చేసుకొని ముందుకి సాగండి చేసిన తప్పు చేయటం, కావాలని తప్పు చేయటం పూర్తిగా తెలివి తక్కువతనమే.
జీవితాన్ని బరువుగా సీరియస్‌గా గడపవద్దు. తేలికగా హాయిగా సంతోషంగా, ఉత్సాహంగా, కుతూహలంతో గడపండి. మీరు గడచిపోయిన కాలం యొక్క అపరాధభావాలతో, భవిష్యత్ కాలపు ఆతృతలు వీటినన్నింటినీ మీ మెండ్‌లో మోస్తూ బరువుగా, గంభీరంగా ఉంటారు. మీరు భూత భవిష్యత్‌లని మోయనవసరం లేదు. మీరు వర్తమానంలో ఉండండి అది చాలు హాయిగా తేలికగా ఉండగలరు.
హాయిగా నవ్వండి. అహంకారులు మనస్ఫూర్తిగా, హాయిగా నవ్వలేరు. ఎవరూ ఏదీ మాన్పలేనంతగా మనలోని బాధలని నవ్వు మాన్పగలుగుతుంది. నవ్వు ఒక శక్తివంతమైన ధ్యానం. నిష్కపటం, నవ్వు కలిసి ఉంటాయి. కానీ గంభీరత (అహంకారం) నవ్వు కలిసి ఉండవు.
నవ్వు పరిపూర్ణమయినది. నవ్వినప్పుడు ఆ శక్తి అన్ని వైపులా వ్యాపించుతుంది. అది అందరికీ అంటుకునే లక్షణం కలిగి ఉంటుంది. నవ్వుతూ ఎవరయిన ఒక సమూహంలోనికి వస్తే అందరూ ఆహ్లాదంగా అయిపోతారు.
స్వామీజీ ఒక విషయం గట్టిగా చెబుతారు. మీరు అహంకారంతో నిండిపోయినప్పుడు మీరు అంతరాత్మకి చాలా దూరం అయిపోతారు. ఎప్పుడయితే మీలోని అహంకారం కరిగిపోతుందో అప్పుడు మీరు సర్వ చైతన్యంలో సర్వాంతర్యామిలో ఒకటిగా అయిపోగలుగుతారు. మీరు ఈ అనంత చైతన్య సృష్టితో పాటు సాగిపోతే,మీ జీవితంలో
గడపగలుగుతారు. మీరు సున్నితంగా సహజంగా జీవించగలుగుతారు. మీరు అహంకారంతో ఉంటే సహజంగా, సున్నితంగా, సృజనాత్మకంగా ఉండలేరు.
అహంకారం చాలా రకాలుగా ఉంటుంది.అది నెమ్మదిగా తెలుసుకోలేని విధంగా ఉందవచ్చు. ఉదాహరణకి వినయంగా ఉంటూ నిరంతరం అహంకారాన్ని కాపాడుకుంటారు.అది చాలా ప్రమాదకరమయినది. దానిని త్వరగా గుర్తించలేము. దానిని తొలగించటం కూడా చాలా కష్టం. ఇంకొకరకమయిన అహంకారం చురుకుగా ఉంటుంది. దానిని గుర్తించటం తేలిక,అదే విధంగా సమాజ పరమయిన అహంకారం విజ్ఞానంతో వచ్చేది. మీరు పెద్ద అయ్యేకొద్దీ పుస్తకాల ద్వారా,మరొక విధంగా పోగుచేసుకున్న జ్ఞానం మీలోపల ఒక మానసిక రూపంలా అవుతుంది. అప్పుడు మీరు దేనిని చూసిన ఆ మానసిక రూపం ద్వారనే చూస్తారు.దాంతో ఈ సృష్టిలోని అద్భుతాలని చూడలేరు. క్రమంగా ఈ జ్ఞానంలో స్థిరపడిపోతారు. అది మరీ ప్రమాదకరం.
స్వామీజీ ఈ విధంగా కూడా చెబుతారు. మీరు మీలోని అబద్ధపు గుర్తింపులు, సమాజం అంటించిన ముద్రలు తొలగించండి. మీ అహంకారం ఆడే ఆటలు గుర్తించండి. అహంకారాన్ని, ఆ గుర్తింపులను వదిలివేయటమే ఆధ్యాత్మికత. మిమ్ములను భగవంతుడి నుంచి వేరు చేసేది అహంకారం మాత్రమే. అహంకారం ఉన్నప్పుడు మీరు స్థిరంగా ప్రేమించలేరు.
స్వామీజీ ఎప్పుడు ఒక విషయం స్పష్టంగా చెబుతుంటారు, మీరు సృష్టిని జయించలేరు. సృష్టి మిమ్మలని జయించుతుంది. మీరు అహంకారాన్ని వదిలివేస్తే మిమ్ములని మీరు జయించుకుంటారు. మీరు ఈ అనంత సృష్టితో, భగవంతునితో కలిసిపోయి జీవితాన్ని ఒక శాశ్వత ఉత్సవంలా జరుపుకుంటారు.
ఆజ్ఞాచక్రం:
ఆజ్ఞ చక్రం రెండు కనుబొమ్మలు ముక్కు కలిసే ప్రదేశంలో ఉంటుంది. సంస్కృతంలో ఆజ్ఞ అంటే ఆజ్ఞాపించటం లేదా శాసించటం అని అర్ధం. ఆజ్ఞ చక్రాన్ని చక్రాలన్నింటిలోనూ ప్రధాన చక్రంగా వర్ణించవచ్చు,
సీరియస్‌గా ఉన్నప్పుడు, అహంకారంతో ఉన్నప్పుడు ఈచక్రం బంధింపబడుతుంది. అమాయకత్వంతో సామాన్యంగా ఉండటం, అహంకారాన్ని వదిలివేయటం వలన ఈచుక్రం వికసించుతుంది.
ఆజ్ఞాచక్రాన్ని చక్రాలలో రాజా చక్రంగా వర్ణించుతారు. అన్ని మతాలలోనూ ఈచక్రం గురించి కొంత సమాచారం ఉంటుంది. ఆజ్ఞాచక్రం వికసించితే మనం ఒక కొత్త పరిధిలో ప్రవేశించుతాము. అపుడు మనలోని మనఃశక్తి, బుద్ధి పూర్తిగా వికసించుతాయి. చాలా దేవుడి చిత్రాలలో మూడవకన్ను చూపించుతారు. మూడవ కన్ను అంటే పూర్తిగా వికసించిన ఆజ్ఞా చక్రం మనలోని అహంకారానికి, తీవ్రతకి, గంభీరతకి, మనగురించి మనం అతిగా ఆలోచించుకునే తత్వానికి సంబంధించిన చక్రం.
దివ్యనేత్ర ధ్యానం:
దివ్యనేత్ర ధ్యానం ఆజ్ఞా చక్రాన్ని వికసింపచేస్తుంది. ఆజ్ఞా చక్రాన్ని వికసింపచేసే అది మీకు విశ్వ వివేకానికి సంబంధాన్ని నెలకొల్పుతుంది.
దివ్యనేత్ర ధ్యానం జొరాస్ట్రియన్ నుంచి తీసుకొనబడినది. దీనిలో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఆజ్ఞా చక్రాన్ని శుభ్రం చేస్తుంది. రెండవ భాగం దానిని శక్తివంతం చేసుంది.
మీరు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి దాని ఎదురుగా కూర్చోండి. కళ్ళు మూసుకొని ఐదు నిముషాలు ఆజ్ఞ చక్రం మీద ఏకాగ్రతని నిలపండి. మీరు మీ మూడవ కన్ను లోపల నుంచి బయటకి చొచ్చుకు వచ్చినట్లుగా చూడాలి. అది మీ ఆజ్ఞ చక్రం నుంచి బయటకు డ్రిల్లింగ్ చేస్తూ చొచ్చుకు వచ్చినట్టుగా చూడాలి. ఆ తరువాత కళ్ళు తెరిచి దీపం వైపు చూడండి. దీపాన్ని మీ మూడవ కంటితో చూస్తున్నట్టు చూడాలి. కళ్ళు కొంచం మూసినట్టు అవుతుంది. కళ్ళలో నీరు కారవచ్చు. అలా జరగనీయండి. అలా ఐదు నిముషాలు చూడండి.
కళ్ళు మూసుకొని ఆజ్ఞ చక్రం మీద ఏకాగ్రతని నిలపండి. మళ్ళీ మీ మూడవ కన్ను ద్వారా దీపాన్ని చూడండి. 5 నిముషాల తరువాత కళ్ళు మూసుకోండి. ఆజ్ఞ చక్రం మీద ఏకాగ్రత నిలపవద్దు. రిలాక్స్ అయినట్టు కూర్చోండి. ఆ తరువాత మెల్లగా కళ్ళు తెరవండి.
మొదటిసారి ఈ ధ్యానం చేసేవారు ధ్యానపీఠం ఆచార్యుల పర్యవేక్షణలో చేయాలి. మీ అంతట మీరు మొదటిసారి ప్రయత్నించవద్దు.
అసంతృప్తి నుంచి కృతజ్ఞతకి:
సంతృప్తి, కృతజ్ఞత అనేవి ఆనందమయిన జీవితానికి అద్భుతమయిన మార్గాలు. మనలో నిక్షిప్తమయిన పరమానంద స్థితిని చేరే దారిలో ఉండే మరొక అడ్డంకు అసంతృప్తి, కృతజ్ఞతా భావం లేకపోవటం.
కానీ మనం మన జీవితంలో ఈ రెండింటినీ వదిలేసాము. ఎన్ని కోరికలు తీరినా అసంతృప్తి అలాగే ఉంటుంది. భగవంతుడు మనకు ఎన్నో అద్భుతమయిన వరాలు ఇచ్చాడు. అందమయిన జీవితం, మనని ఆనందపరచే ప్రకృతి ఇలా ఎన్నో వరాలు కానీ మనం ఏమి చేస్తాం. పొందిన అద్భుత వరాలను మర్చిపోతున్నాము. తీరిన కోరికలకి అసలు ఆనందపడము. ఒక వరం లభించగానే, ఒక కోరిక తీరగానే, ఆ తరువాత ఏమిటి: తరువాత.... తరువాత…. మనం ఈ విధంగా ఆ తరువాత కోరికల కోసం ప్రార్ధించుతాము. అంత అద్భుత వరాలు పొందినందుకు కనీసం ఒక్కసారి కూడా భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేయము. అసలు అప్పుడు భగవంతుడు గురురాదు. మనకు భగవంతుడు ఎప్పుడు గురుకు వస్తాడు. మనకి ఏదయినా అవసరమయినపుడో, ఏదయినా కష్టం కలిగినప్పుడో అప్పుడు మాత్రమే భగవంతుడిని గుర్తు చేసుకుంటాము.
మనం చేసే పూజగాని ప్రార్ధన కాని భగవంతుణ్ణి ఇది కావాలి అది కా వాలి అని అడగటమే. స్వామీజీ ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెబుతారు. మనం భగవంతుణ్ణి ఇది కావాలి అని అడగటమే కాదు బేరాలాడుతాము కూడా. నీవు నాకు ఇది చేస్తే నీకు ఇంత ఇస్తాను లేదా నీకు అది చేస్తాను అంటాము. భగవంతుణ్ణి తిన్నగా మన వ్యాపారాలలోకి దింపేస్తాము.
ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి అని THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చెపుతున్నారు. భగవంతుడు మనం కోరిన కోరికలన్ని తీర్చటం మనకు మంచిది కాదు. భగవంతుడికి అద్భుత శక్తులే కాదు, అద్భుతమైన బుద్ధి కూడా ఉంటుంది. మనకు నిజంగా ఏమి కావాలో, ఏది అవసరం లేదో, భగవంతుడికి చాలా బాగా తెలుసు. ఏ కోరిక తీర్చితే మనం అభివృద్ధి పొందగలమో, ఆనందంగా ఉండగలమో, ఆ కోరికలు మాత్రమే తీర్చుతాడు. దీని కోసం మనం ప్రత్యేకంగా భగవంతుని కోరనవసరం లేదు. ఆయన మన తల్లి తండ్రి. ఆయన కంటే మన మంచి చెడు ఆలోచించగల శక్తి ఎవరికి ఉన్నది. ఈ విషయం అర్ధం చేసుకొని నిరంతరం భగవంతుని పట్ల కృతజ్ఞతతో ఉండాలి.
ప్రపంచంలో రెండురకాల మతాలు ఉన్నాయి. కృతజ్ఞత ఆధారంగా ఉండే మతాలు అలాగే ప్రార్ధన ఆధారంగా ఉండే మతాలు. ప్రార్ధనల మతాలు కేవలం ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటుంది. మనకి చిన్నతనం నుంచి ప్రార్ధన లేదా పూజ అంటే అడగటమనే నేర్పించుతారు. ప్రార్ధన చేయటం తప్పుకాదు. కానీ అసలు సమస్య ప్రార్ధన రూపంలో ఇది కావాలి, ఆ తరువాత…. ఆ తరువాత ఇలాగే సాగిపోతుంది. ప్రార్ధన మనని ధ్యానంలోనికి తీసుకెళ్ళగలగాలి. ధ్యానం అంటే కృతజ్ఞత చూపించటం. ధ్యానంలో కృతజ్ఞత ప్రార్ధన అవుతుంది. అప్పుడు మీ అంతరాత్మ పరమానందాన్ని పొందుతుంది.
మనం నిరంతరం ఈ సర్వాంతర్యామికి కృతజ్ఞులమై ఉండాలి. సదా మనలని రక్షిస్తూ, మనకి సమస్తం సమకూర్చుతున్న ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలపాలి. మీరు తనకి కావాలి అనే ఆ సర్వాంతర్యామి మిమ్మలని కాపాడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకొని కృతజ్ఞత చూపించాలి. మీరు ఆ విషయం తెలుసుకోలేకపోతే మీరు నిరుత్సాహంగా, కుంగుబాటు తనంతో ఉంటారు. మీరు ఈ ప్రపంచంలో సర్వం పోగొట్టుకున్న వ్యక్తిలా అయిపోతారు. మీరు సర్వాంతర్యామి పట్ల కృతజ్ఞతతో ఉండగలిగితే మీరు మీ చుట్టూ అద్భుతాలు చూడగలుగుతారు.
కొందరు భగవంతుణ్ణి భయంతో ప్రార్ధించుతారు. అలా చేయటం ద్వారా చిన్నతనం నుంచి భగవంతుడు అంటేనే తప్పు అర్ధాన్ని వారి మనసులో పెంచుతున్నారు. స్వామీజీ ఎంతో అందంగా ఇలా చెబుతారు: పిల్లలకి భగవంతుడు అనే ఈ అనంత చైతన్య సృష్టిని ప్రేమించమని చెప్పండి. భగవంతుణ్ణి ఆనందంతో ప్రేమతో కౌగించుకోమని చెప్పండి. వారిని భయం పేరుతో గౌరవం పేరుతో భగవంతుడికి దూరం చేయకండి.
మతాన్ని భయంతో అనుసరించితే అది మిమ్మలని ఎక్కడికీ తీసుకెళ్ళదు. అది మీలో ఎటువంటి వృద్ధికి సహాయం చేయదు. భగవంతునికి లోతైన ప్రేమ కృతజ్ఞతాభావాలు చూపుతూ మతాన్ని అనుసరించాలి. భగవంతుణ్ణి నిరంతరం ప్రేమతో కృతజ్ఞతతో పూజించండి.
మీ మెండ్ మీకు భగవంతునికి మధ్య ఉండి భగవంతునితో మాట్లాడనీయదు. మీరు మీ మైండ్‌కి అతీతంగా వెళ్ళగలిగితే ఈ అనంత చైతన్యంలోని అందాలని చూడగలుగుతారు. మీ అంతరాత్మ నిత్యానందంతో నిండిపోతుంది. అప్పుడు మీరు స్వేచ్ఛని, పరమానందాన్ని అనుభవించగలరు.
భగవంతుడు మనం అడగకుండా మనకి ఎన్నో వరాలు కురిపించాడు. కాని మనం, మనం పొందిన వరాల గురించి మర్చిపోయి ఇంకా ఇది కావాలి అది కావాలి అని అంటుంటాము. ఒక్కసారి ఆలోచించండి మనకి చక్కని శరీరం, ప్రపంచాన్ని చూడగలిగే కళ్ళు, ఎక్కడికైనా తీసుకెళ్ళగల కాళ్ళు, ఏపని అయినా చేయగల చేతులు, గొప్ప సూపర్ కంప్యూటర్ కంటే వందరెట్టు శక్తివంతమయిన మెదడు, ఇన్ని వరాలని ఆ దేవుడు మనకి ఇచ్చాడు కదా. వేలుకి డైమండ్ ఉంగరం లేదు అని బాధపడతాం కాని ఆ రింగ్ పెట్టుకునే అద్భుతమయిన వేలు ఇచ్చినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పం.
కేవలం కోరికలతో నిండిపోయిన వ్యక్తికి ఎన్ని కోరికలు తీరినా తృప్తి ఉండదు. కృతజ్ఞతా భావం ఉండదు. ఒక కోరిక తీరగానే, 'ఆ తరువాత' 'ఆ తరువాత' అనటమే సరిపోతుంది. మనకు తీరిన కోరికలతో ఆనందాన్ని పొందలేడు. కోరిక, కృతజ్ఞత కలిసి ఉండవు. మీరు కోరికలతో జీవిస్తుంటే కృతజ్ఞతతో జీవించలేరు. మీరు ఎప్పుడయితే కృతజ్ఞతతో జీవిస్తారో అప్పుడు మీకు కోరికలు ఉండవు. మీకు ఏదయితే లభిస్తుందో అది ఆ సమయానికి మీకు ఉండే అవసరాలని తీర్చుతుంది. మీరు అడిగే లోపలే మీకు అన్ని దొరుకుతాయి. అప్పుడు అడగవలసిన అవసరం ఉండదు.
మనం ఏ పనినైనా ప్రేమతో కృతజ్ఞతతో చేస్తే, అందులో పరిపూర్ణత ఉంటుంది. మీరు భగవంతుడిని నమ్మి, ఆ విశ్వశక్తి మీద నమ్మకం ఉంచగలిగితే ఆ సర్వాంతర్యామి మిమ్మల్ని ఈ భూమి మీద దేవుడిగా చేసాడు. మరొక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడూ ఇలా అనుకుంటారు. నేను సంతోషంగా ఉండాలి అంటే కష్టపడాలి. కష్టపడటం మంచిదే కాని కష్టపడటానికి సంతోషానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ విశ్వశక్తి మీకు నిరంతరం ఇస్తూ ఉంటుంది. మీరు ఆనందంగా ఉండాలా వద్దా అనేది మీ నిర్ణయం.
మీరు మరొక విషయం అర్ధం చేసుకోవాలి. మీకు జరిగే ఏ విషయానికైనా, ఎవరూ బాధ్యులు కారు. అంతాకూడా మీరు చేసుకున్న నిర్ణయాలే. అయితే ఆ విషయం మీకు తెలియదు. అందుకే బయటవారిని నిందిస్తారు. చివరికి జీవితాన్ని నిందిస్తారు.
మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ జీవితంలో ఇంతవరకూ పొందినవన్నీ ఒక లిస్టు, మీరు ఇంకా కావాలి అని అనుకున్నవి మరొక లిస్తు తయారు చేయండి. వీటిలో ఏ లిస్టు చూడాలి అన్నది మీ నిర్ణయం. మనం పొందిన లిస్టు మాత్రమే చూసే జీవితం సంతోషంగా ఉత్సాహంగా ఉంటుంది. పొందాలి అని అనుకున్న లిస్టు చూస్తే నిరాశగా అసంతృప్తిగా ఉంటుంది.
నిజమయిన కృతజ్ఞత అన్నది మీ అంతరంగం లోతుల నుంచి పొంగి ప్రవహించే ఒక భావన. ఈ కృతజ్ఞతకి దేనితో సంబంధం ఉండదు. అత్యాశ ప్రేమ ద్వేషం ఏవీ ఈ కృతజ్ఞతా భావాన్ని కదిలించలేవు. మీరు ఎప్పుడయితే సర్వాంతర్యామితో సంబంధాన్ని నెలకొల్పగలుగుతారో అప్పుడు నిజమయిన కృతజ్ఞత అన్నది మీ లోపల ఉదయిస్తుంది. అప్పుడు అప్రయత్నంగానే కృతజ్ఞత అంటే ప్రార్ధన అని తెలుస్తుంది.
ధ్యానం మీలో కృతజ్ఞతా భావాన్ని, తృప్తిని కలిగిస్తుంది. మీరు నిరంతరం ధ్యానం చేస్తుంటే మీ చేతన స్థితి విశాలమవటం తెలుసుకుంటారు. మీరు సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటే మీలో పొంగిపొరలే శక్తిని మాటలలో వర్ణించలేము. అదే కృతజ్ఞతాభావంలో ఉండే గొప్పదనం, అందం.
సహస్రార చక్రం :
సహస్రార చక్రం తలపై భాగంలో ఉంటుంది. సంస్కృతంలో సహస్రార అంటే వేయిరేకులు అని అర్థం. ఈ చక్రం వికసించినప్పుడు వేయిరేకుల పద్మంలా ఉంటుంది. యోగులకు, గురువులకు ఈ చక్రం వికసించినపుడు వాళ్ళ తల మీద వేయి రేకుల పద్మం వికసించినట్లుగా ఉంటుంది అని అంటారు. అందుకే ఈ చక్రానికి ఆ పేరు వచ్చింది.
అసంతృప్తి, జీవితాన్ని తేలికగా యథాలాపంగా తీసుకునే తత్వం ఈ చక్రాన్ని బంధించుతుంది. కృతజ్ఞతాభావం, ఆత్మతృప్తి ఉన్నప్పుడు ఈ చక్రం వికసించుతుంది.
సహస్రార ధ్యానం :
దీనిని సుఫీయిల ధ్యానపద్ధతి నుంచి తీసుకున్నారు. చేతితో పూలు పట్టుకొని సహస్రార చక్రం మీద ఏకాగ్రతని నిలిపి చేసే ధ్యానం. మీ శరీరంలో మిగతా భాగాలని మర్చిపోవాలి. తలమీద ఏకాగ్రత నిలిపి విరామంగా చిరునవ్వుతో ఉండండి.
మీ అంతరంగం నుంచి అందరికీ కృతజ్ఞతలు తెలియచేయండి. మీ తల్లిదండ్రులకి గురువులకి అన్నతమ్ములకి, బంధువులకి భార్యా, భర్తకి పిల్లలకి మీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి, స్నేహితులకి అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేయండి. మీ శరీరానికి అందులో ప్రతి భాగానికి కృతజ్ఞతలు తెలపండి. మిమ్మలని పటిష్టంగా చేసిన మీ శత్రువులకి కృతజ్ఞత చెప్పండి. గురుదేవులకి, సర్వాంతర్యామి అయిన భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేయండి.
మీరు సరిపడా సమయం తీసుకొని అందరికీ పేరుపేరున కృతజ్ఞత తెలియజేయండి. మీ లోపలి నుంచి, లోతయిన అనుభూతి నుంచి కృతజ్ఞతలు తెలపండి. మీరు కృతజ్ఞతగా మారండి.
మెల్లగా కళ్ళు తెరచి ఆ పూలని భగవంతుని పాదాల దగ్గర ఉంచండి.
ఆనంద స్పురణ కార్యక్రమం (Asp) (రెండురోజుల శిక్షణా కార్యక్రమం)
ఆనంద స్పురణ కార్యక్రమం అనేది ఒక అద్భుతమయిన శిక్షణా కార్యక్రమం. దీనిని THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, ధ్యానం ఆధారంగా మనలోని ఏడు శక్తి కేంద్రాలయిన ఏడు చక్రాలని శక్తివంతం చేసి వాటిని వికసించేయటానికి రూపొందించారు. ఆధునిక మానవుల అవసరాలకి అనుగుణంగా, నేటి కాలంలోని సాంఘిక ఆర్థిక జీవన సరళికి సరిపడే విధంగా, నేటి మానవుల మానసిక ఆధ్యాత్మిక అవసరాలను వారి పంధాలో తీర్చగలిగే విధంగా ఒక చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఎంతో నైపుణ్యంతో తయారు చేసారు. ఈ కార్యక్రమానికి ఆయన 'ఆనందస్సురణ' అనే పేరు పెట్టారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని అమెరికా, కెనడా మొదలయిన దేశాలలో 'లైఫ్ బ్లిస్ ప్రోగ్రాం' (Life Bliss Program) అంటారు.
సేలమ్ (తమిళనాడు)లో 2004 సం။లో ఆనంద స్పురణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూన్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఆనందస్పురణ అంటే ఏమిటి?
ఈ కార్యక్రమానికి ఆనందస్సురణ అనేపేరు స్వామి ఎందుకు పెట్టారు అంటే, మన లోపల నిజమయిన ఆనందం నిక్షిప్తమయి ఉన్నది. అంటే మనం బయట ప్రపంచంలో ఏ ఆనందం కొరకు వెతుకుతున్నామో అది మనలోనే ఉన్నది. కానీ ఆ విషయం మనకు తెలియదు. మనం ఆనందం అనేది ప్రాపంచిక విషయాలలోనే ఉన్నది అనే తప్పుడుభావనన మనలో లోతుగా నాటుకుపోయేలా చేసాము. దీనిని ఒక గాఢమయిన నమ్మకంలా ఈ సమాజం మార్చివేసింది.
మనలోని ఆనందాన్ని తెలుసుకోలేకపోవటానికి ఉన్న మరొక కారణం, మనలోపల ఉన్న అసలయిన ఆనందాన్ని మన లోపలికి ప్రవాహంలా వచ్చే భావావేశాలు, వ్యతిరేకపు ఆలోచనలు ఆ ఆనందం పైన ఒక గట్టి పొరలా ఏర్పడిపోయాయి. వయస్సు పెరిగే కొద్ది ఆ అనందం, పొరల అడుగుకి అణగుదొక్కబడినది. చివరికి అది అహంకారం అనే ఒక బలమయిన కవచం క్రిందికి వెళ్ళిపోయింది. ఒక్కసారి మనం మన ఆలోచనలని, మనలోని అహంకారాన్ని వదిలితే మనలో ఆనందం అనేది బయటికి వస్తుంది.
పిల్లలలో అనందం చూడండి. వారికి అనందానికి కారణం ఉండదు. వారు వారితో సౌకర్యంగా, ఆనందంగా ఉండగలుగుతారు. వారి మీద సమాజపు నిబంధనలు, అహంకారం, భావావేశాలు అనే పొరలు ఇంకా ఏర్పడలేదు. అదే వారి ఆనందానికి కారణం. ఇప్పుడు మన పరిసితి ఏమిటి?
మరి మనలోని ఆనందాన్ని మనం కనుగొన లేకపోతే ఏమవుతుంది? దానిని కనుగొనే అవసరం ఉన్నదా?
ఈ ప్రశ్నకి సమాధానం 'ఇది చాలా అవసరం' ఆ ఆనందాన్ని తెలుసుకోలేకపోయినందుకే ఎంత సంపాదించినా, ఏమి సాధించినా మనలోని లోతయిన అసంతృప్తి మాత్రమే మనకి మిగులుతున్నది. ఎంత చదువుకున్నా, ఏమి సాధన చేసినా అశాంతి అలానే ఉంటున్నది. మన మీద మనలోని భావావేశాలయిన కోపం, అత్యాశ, కోరిక, అసంతృప్తి, మొదలయనవి దాడి చేసి మనని తమ అదుపులో ఉంచగలుగుతున్నాము. మన మనస్సు, అహంకారం మన మీద అధికారాన్ని చెలాయిస్తున్నాయి. ఏ చిన్న పని చేసినా మనం శక్తిలేని వారిగా బలహీనపడిపోతున్నాయి.
మనలోని అశాంతి, అసంతృప్తిని శాశ్వతంగా పోగొట్టగలమా? అసలు మనం తృప్తిగా, ప్రశాంతంగా నిత్యం పరమానందంలోనే ఉండలేమా? అసలు మనకి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఆనందంగా ఎలా ఉండగలం? మన మీద ఒత్తిడి ఏవిధంగా తగ్గుతుంది?
పై ప్రశ్నలకి, అనుమానాలకి సమాధానమే THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM రూపొందించిన ఆనందస్పురణ శిక్షణా కార్యక్రమం.
ఆనందస్సురణ అంటే మనలో ఎక్కడో నిక్రియామయిపోయిన ఆనందాన్ని వికసింపచేసి దానిని మన స్పురణకి, మన అందుబాటులోనికి తెచ్చే శిక్షణా కార్యక్రమం ఇది. అందుకే THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM దీనిని ఆనందస్సురణ అని అంటారు.
ఈ శిక్షణని ఎవరు ఇస్తారు?
ఆనందస్సురణ అనే రెండురోజుల కార్యక్రమం నిరంతరం ప్రపంచంలో మొదలయిన దేశాలలో ప్రతి శని, ఆదివారాలలో జరుగుతాయి.
ఈ కార్యక్రమాలు నిత్యానంద ధ్యానపీఠం వారి ఆచార్యులు నిర్వహించుతారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ప్రత్యక్ష పర్యవేక్షణలో, ఆయన చేత శిక్షణ పొంది ఆయనచే నియమించబడిన ఆచార్యులు మాత్రమే ఈ ఆనందస్సురణ కార్యక్రమాన్ని నిర్వహించుతారు. ఈ విధంగా స్వామీజీ చేత నియమించబడిన ఆచార్యులు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఏమి నేర్పిస్తారు :
ఈ కార్యక్రమం మొత్తం రెండు ముఖ్య అంశాల మీద ఎక్కువ ఏకాగ్రాతని నిలుపుతుంది. అవి 1) ధ్యానపద్ధతులు 2) మన శరీరంలోని ఏడు ప్రముఖ శక్తి కేంద్రాలు అయిన ఏడు చక్రాలని శుభ్రపరచి, శక్తిని నింపి వాటిని చైతన్యపరచటం. ఈ చక్రాలు వికసించటానికి ఉపయోగపడే విధంగా ఏడు ధ్యానపద్ధతులని నేర్పిస్తారు. ఈ ఏడు ధ్యానపద్దతులు మన దైనందిన జీవితానికి కావలసిన ప్రాధమికమయిన ధ్యానపద్ధతులు.
వీటితో పాటు శిక్షణనిచ్చే ఆచార్యులు, చక్రాలు శక్తి హీనమయినప్పుడు మనలో కలిగే భావావేశాలని, అవి మన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక అభివృద్దికి ఏవిధంగా అవరోధాలని కల్పించుతాయో ఉదాహరణలతో చిన్న చిన్న కధలతో వివరించుతారు. అదేవిధంగా ధ్యానం ద్వారా ఆ శక్తి కేంద్రాలని వికసింపచేస్తే మనలోని ఆధ్యాత్మిక ప్రగతి మన జీవితంలోని నాణ్యతని ఏవిధంగా అభివృద్ధి పరుస్తుందో కూడా వివరించుతారు. ఈ రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని పూరిచేసుకున్న తరువాత మనలో ఉండే చాలా అనుమానాలు నివృతి అవుతాయి. అదేవిధంగా మన శారీరక, మానసిక సమస్యలు చాలా వరకు మాయం అవుతాయి.
తైవాన్‌లో జరిగిన ఒక ఆనందస్పురణ కార్యక్రమం
కెనడాలో జరిగిన ఒక ఆనందస్పురణ కార్యక్రమం
బెజిల్‌లో జరిగిన ఒక ఆనందస్పురణ కార్యక్రమం
ఆనందస్సురణ
ఈ కార్యక్రమం చేయాలి అంటే ఏమి చేయాలి?
ఎవరయినా ఒక ప్రాంతం లేదా ఒక ఊరులో ఉండే 25 లేదా అంతకంటే ఎక్కువమంది ఈ కార్యక్రమం కావాలి అని వారికి దగ్గరలోని ఏ నిత్యానందా ధ్యానపీఠం వారికి ఫోను ద్వారా లేదా మీరు వెళ్ళి చెప్పినా వారు ఆచార్యులని మీ దగ్గరకే పంపించుతారు. ఆచార్యులు మీ దగ్గరకి వచ్చి మీకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని అందించుతారు.
అంతేకాకుండా పెద్ద పెద్ద సంస్థలు, ఆఫీసులు, బ్యాంకులు, కాలేజీలు స్కూల్స్, ధ్యానం ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఏవయనా సంస్థలలో కూడా వారి సమయానికి అనుగుణంగా శిక్షణని ఇస్తారు. ఈ విధంగా ప్రపంచంలోని అన్ని పెద్ద పెద్ద సంస్థలలో వీరి శిక్షణా కార్యక్రమాలు జరిగాయి.
ఆనందస్సురణ కార్యక్రమంలో శిక్షణ పొందినవారంతా ఎంతో తృప్తిని ఆనందాన్ని పొందుతారు. కార్యక్రమం అయ్యాక వారు అందరూ చెప్పే మాట "మేము ఇంతకాలానికి అసలు ధ్యానం అంటే ఏమిటో తృప్తి కలిగే విధంగా తెలుసుకున్నాము". అని హైదరాబాదు, విశాఖపట్టణం, విజయవాడలలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలు గ్రామాలలో కూడా ఈ కార్యక్రమం చేయటానికి నిత్యానంద ధ్యానపీఠం వారు సంకల్పించారు.
ఆనందస్సురణ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో కొంతమంది అనుభవాలు :
- ఈ కార్యక్రమము నా జీవితాన్ని మార్చివేసింది. దీని వలన వచ్చినంత మార్పు నాకు ఎన్నడూ కలగలేదు. ఒక యోగ టీచర్‌గా నాకు చక్రాలతో పరిచయము ఉంది, కాని ఈ కార్యక్రమంలో చక్రాలను శుభ్రపరచి చైతన్యవంతం చేసినంతగా నాకు ఎప్పుడు అనుభవములోకి రాలేదు.
కెసాం।డ వాలిక్
యోగా టీచర్.
ఫినిక్స్, ఆరిజోనా, అమెరికా.
- ఆనందస్పురణ శిక్షణా కార్యక్రమం రెండురోజులలో నేను పొందిన అనుభూతి అద్భుతం. ప్రతి ధ్యానం నాలో చాలా ప్రభావాన్ని చూపాయి. ఈ కార్యక్రమం నాకు చక్కటి ప్రశాంతతని ఇచ్చింది. దీనిని నేను తప్పనిసరిగా సాధన చేస్తాను. ఈ శిక్షణా కార్యక్రమం అందరూ చేయాలనేది నా లక్ష్యం.
హరి రామలింగయ్య
రైల్వేస్, విజయవాడ, భారత్.
- ఈ కార్యక్రమంలో నేను మంచి ధ్యానమే కాకుండా జీవితములో ఉపయోగపడే మంచి జ్ఞానాన్ని కూడా నేర్చుకున్నాను.
నాట్ నటరాజన్
డెరెక్షర్, మెక్రోసాఫ్ట్ సియాటిల్, వాషింగ్‌టన్, అమెరికా.
- ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న తరువాత నేను ఒక దీర్ఘకాలిక నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా అనిపించింది.
కార్‌మెన్ మరాసొవిచ్
గాఫిక్ డిజైనర్, లాస్‌యాంజిల్స్, కాలిఫోర్సియా, అమెరికా.
- ఈ కార్యక్రమంలో నేర్పించిన ధ్యానాలు అత్యంత కొద్ది కాలంలోనే నాలో వినూత్నమైన మార్పును తీసుకువచ్చాయి. ఈ ధ్యానాల వలన నాకు చాలా ఆనందం కలిగి నేను అంధకారంలో నుంచి వెలుతురు లోనికి వచ్చినట్టుగా ఉన్నది.
హేమ యాంగిలికా బర్న్స్
ఫీనిక్స్, ఆరిజోనా, అమెరికా.
- ఈ కార్యక్రమములో నేర్చుకున్న జ్ఞానం వలన నా జీవితంలో ఇప్పటివరకు ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ఈ కార్యక్రమములో పాల్గొన్న తరువాత నా మిత్రులు చాలా మంది నన్ను అడిగారు నేను ఎందుకు ఆనందంగా ఉన్నాను అని.
సంధ్య గోడె
వ్యాపారవేత్త, విశాఖపట్నం, భారత్.
మనలో ప్రతి ఒక్కరూ నిరంతరం వెతికేది ఆనందం కోసమే. అది ఐశ్వర్యంతో, అధికారంతో సంబంధబాంధవ్యాలతో మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన ద్వారా మనం వెతికేది కేవలం ఆనందం కోసమే. అయితే మనకి ఆ విషయం తెలియదు.
మనం ఎంత అభివృద్ధి సాధించినా, ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా, ఎన్ని అత్యుత్తమ అవార్డులు పొందినా, ఎంత ఐశ్వర్యం సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు పొందినా చివరికి మనలో శూన్యం ఏర్పడుతుంది. ఆనందం ఉండదు. ఎందుకు?
ఎందుకు మన సంతోషం తాత్కాలికంగా, చంచలంగా ఉంటుంది? ఎందుకు మనం ఎప్పటికీ శాశ్వతంగా ఆనందస్థితిలో ఉండలేకపోతున్నాము?
ఇంత విశాలమయిన ప్రపంచం, ఇన్ని రకాల వస్తువులు, సౌఖ్యాలు, విలాసాలు, ఆకర్షణ, చదువు, జ్ఞానం, మేధస్సు ..... ఎందుకు మనస్సు శాశ్వత ఆనందస్థితిలో ఉంచలేకపోతున్నాయి?